శుద్ధి & నమాజు అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ ఇక్కడ చదవండి & డౌన్లోడ్ చేసుకోండి [PDF][49 పేజీలు]
‘నజాసత్’ అంటేమిటి? దేనితోనయితే ఒక ముస్లిం దూరంగా ఉండి, అది ఏ చోటనైనా అంటినచో కడుగుట విధిగా ఉందో దానినే ‘నజాసత్’ (అశుధ్ధత) అంటారు. రక్తం లాంటి కనబడే మలినమేదైనా శరీరానికి లేదా బట్టలకు అంటినచో దానిని కడుగుట తప్పనిసరి. కడిగిన తర్వాత దాని మర్క కనబడితే, అది తొలగడం కూడా కష్టంగా ఉంటే పాపం లేదు. ఒక వేళ మలినం కానరానిదై ఉంటే దాన్ని ఒక్కసారి కడిగినా సరిపోతుంది.
ఇక నేలపై ఏదైనా మలినం పడిపోతే అక్కడ నీళ్ళు పారబోస్తే అది శుభ్రమవుతుంది. మలినం పలుచగా పారునటువంటిదైతే అది ఎండిపోయిన- చో నేల పరిశుభ్రమవుతుంది. ఒక వేళ పారనిదిగా ఉంటే దాన్ని తీసిపడేసిన తరువాతనే అది శుభ్రమవుతుంది.
పరిశుభ్రత కొరకు మరియు అశుద్ధతను దూరము చేయుటకు నీళ్ళు ఉపయోగించబడ- తాయి. అవి వర్షపు మరియు సముద్రపు నీళ్ళు లాంటివి వగైరా. అలాగే ఎవరైనా ఉపయోగించిన తరువాత మిగిలిన నీళ్ళు ఉపయోగించవచ్చును. ఇంకా శుభ్రమైన ఏదైనా వస్తువు నీళ్ళలో కలిసి అందులో ఏలాంటి మార్పు రాకుండా దాని అసలు రూపములో ఉండిపోతే అవి కూడా ఉపయోగించవచ్చును. కాని ఏదైనా అపరిశుభ్ర- మైన వస్తువు అందులో కలుషితమై దాని అసలు రూపములో లేనిచో అవి ఉపయోగించకూడదు. అపరిశుభ్రమైన వస్తువు ఏదైనా కలుషితమై నీళ్ళ రంగు, రుచి, వాసనలో మార్పు వస్తే అవి ఉపయోగించరాదు. మార్పు రాని యెడల అవి ఉపయోగించవచ్చును.
అలాగే మనుషులు త్రాగిన తర్వాత మిగిలిన నీళ్ళు శుభ్రత పొందుటకు, వజూ చేయుటకు ఉపయోగించవచ్చును. కాని కుక్క లేక పంది ఎంగిలి చేసిన నీళ్ళు వాడరాదు. అవి అశుద్ధం.
‘నజాసత్’ రకాలు
(1,2) మలమూత్రం.
(3) ‘వదీ’: అది తెల్లటి చిక్కని ద్రవ పదార్థం. అది మూత్రము తరువాత వెలువడుతుంది.
(4) ‘మజి’: అది తెల్లటి జిగటగల పదార్థం. అది భార్యభర్తల సరసాలాడడముతో, లేదా మనిషి కామాలోచనలో పడినప్పుడు వెల్తుంది.
*’మనీ’ (ఇంద్రియం, వీర్యం) శుభ్రమైనదే. అయినా అది పచ్చిగా ఉన్నప్పుడు కడుగుట, ఎండిపోయినప్పుడు నలుచుట అభిలషణీయం.
(5) తినుట యోగ్యం కాని జంతువుల మలమూత్రం అపరిశుభ్రం. తినుట యోగ్యమైన జంతువుల మలమూత్రం అపరిశుభ్రం కాదు.
పైన చెప్పబడిన మలినాలు శరీరానికి, లేదా దుస్తులకు అంటినచో వాటిని తీసేసి కడగాలి. అయితే కేవలం ‘మజి’ విషయంలో ఓ రాయితీ ఏమిటంటే: అది అంటిన చోట కడగకుండా నీళ్ళు చల్లినా సరిపోవును. *’మనీ’ కామంతో వెళ్ళినచో స్నానం చేయుట విధియగును.
(6) బహిష్టు మరియు బాలింత రక్తస్రావం.
‘నజాసత్’ ఆదేశాలు
1- మనిషికి ఏదో ఒక పదార్థం అంటింది, కాని అది నజాసతేనా కాదా అనే నిర్థారణ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, దాని గురించి పరిశోధన చేసే అక్కర లేదు. అలాగే దాన్ని కడిగే అవసరం కూడా లేదు.
2- ఒక మనిషి నమాజ్ చేసిన తరువాత శరీరం లేదా తన దుస్తుల్లో నజాసత్ చూశాడు. దాని గురించి నమాజ్ కు ముందు తెలియదు, లేదా తెలిసు కాని మరచిపోయాడు. అలాంటప్పుడు అతని నమాజ్ అయినట్లే.
3- దుస్తుల్లో నజాసత్ పడిన స్థలం తెలియ కుంటే, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏ స్థలం అన్న అధిక అనుమానం కలుగునో దాన్నే కడగాలి. ఎందుకనగా మలినాన్ని దాని రంగు, రుచి లేదా వాసనతో పసిగట్టవచ్చును.
మలమూత్ర విసర్జన
మలమూత్ర విసర్జన పద్దతులు ఇలా ఉన్నాయి:
1- మరుగుదొడ్డిలో ఎడమ కాలుతో ప్రవేశిస్తూ, ప్రవేశముకు ముందే చదవాలి: బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ ఖుబుసి వల్ ఖబాఇసి
بسم الله اَللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْـخُبُثِ وَالْـخَبَائِثِ
(అల్లాహ్ పేరుతో, ఓ అల్లాహ్ నేను దుష్ట జిన్నాతు స్త్రీ పురుషుల నుండి నీ శరణు జొచ్చుచున్నాను). (బుఖారి 142, ముస్లిం 375).
మరుగుదొడ్డి నుండి కుడి కాలు ముందు వేస్తూ బయటకు వచ్చి చదవాలిః గుఫ్రానకغُفْرَانَكَ
నీ మన్నింపుకై అర్థిస్తున్నాను. (తిర్మిజి 7).
2- అల్లాహ్ పేరుగల ఏ వస్తువూ మరుగుదొడ్డిలోకి తీసుకెళ్ళకూడదు. కాని దాన్ని తీసి పెట్టడంలో ఏదైనా నష్టం ఉంటే వెంట తీసుకెళ్ళవచ్చును.
3- ఎడారి ప్రదేశంలో కాలకృత్యాలు తీర్చుకునే- టప్పుడు ఖిబ్లా వైపున ముఖము, వీపు గానీ పెట్టి కూర్చోకూడదు. నాలుగు గోడల మధ్య కూడా మంచిది కాదు కాని అభ్యంతరము లేదు.
4- సతర్ పరిధిలోకి వచ్చే శరీర భాగాన్ని ప్రజల
చూపులకు మరుగు పరచాలి. ఇందులో ఏ కొంచ మైనా అశ్రద్ధ వహించకూడదు. పురుషుల సతర్ నాభి నుండి మోకాళ్ళ వరకు. స్త్రీ యొక్క పూర్తి శరీరం, నమాజులో కేవలం ముఖము తప్ప. స్త్రీ నమాజులో ఉన్నప్పుడు పరపురుషులు ఎదురౌతే ముఖముపై ముసుగు వేసుకోవాలి.
5- శరీరం లేక దుస్తులపై మలమూత్ర తుంపరులు పడకుండా జాగ్రత్త వహించాలి.
6- మలమూత్ర విసర్జన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. నీళ్ళు లేనప్పుడు నజాసత్ మర్కలను దూరము చేయుటకు రాళ్ళు, కాగితము లాంటివి ఉపయోగించవచ్చును. పరిశుభ్రత కొరకు ఎడమ చెయ్యి మాత్రమే ఉపయోగించాలి.
వుజూ
వుజూ లేని నమాజ్ అంగీకరింపబడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చారని, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఎవరు వుజూ చేసినప్పుడు పూర్తి శ్రద్ధతో మంచి విధంగా చేస్తారో అతని శరీరం నుండి అతని పాపాలన్నీ రాలిపోతాయి. చివరికి గోళ్ళ నుండి కూడా వెళ్ళిపోతాయి”.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అల్లాహ్ ఆదేశించిన విధంగా సంపూర్ణంగా వుజూ చేసేవారు, వారి ఫర్జ్ నమాజులు వాటి మధ్య జరిగే పాపాల ప్రక్షా- ళనకు కారణభూతమవుతాయి”.(ముస్లిం 231).
వుజూ విధానం
*వుజూలోఒకఅవయవం తర్వాత మరో అవయవం క్రమ ప్రకారంగా మరియు వెంటవెంటనే కడుగుట తప్పనిసరి([1]).
1- వుజూ నియ్యత్ (సంకల్పం) నోటితో పలుకకుండా మనుసులోనే చేయాలి. ఒక పని చేయుటకు మనుసులో నిర్ణయించుకోవడమే ‘నియ్యత్’. మళ్ళీ బిస్మిల్లాహ్ అనాలి. (పేజి 13లో వుజూ చిత్రాలు చూడండి).
2- రెండు అరచేతులను మణికట్ల వరకు మూడు సార్లు కడగాలి. చిత్రం2.
3- మూడు సార్లు నోట్లో నీళ్ళు తీసుకొని పుక్కిలించి, ముక్కులో నీళ్ళు ఎక్కించి శుభ్రం చేయాలి. చిత్రాలు 3, 4.
4- మూడు సార్లు ముఖము కడగాలి. అడ్డంలో కుడి చెవి నుండి ఎడమ చెవి వరకు. నిలువులో నొసటి పై భాగం నుండి గదువ క్రింది వరకు. చి.5
5- రెండు చేతులు మూడేసి సార్లు కడగాలి. వ్రేలు మొదటి భాగము నుండి మోచేతుల వరకు. ముందు కుడి చెయ్యి, తరువాత ఎడమ చెయ్యి. చి.6
6- ఒక సారి తల ‘మసహ్’ చేయాలి. అంటే రెండు చేతులను తడి చేసి తల మొదటి (నుదుటి) భాగము నుండి వెనక మెడ వరకు తీసుకెళ్ళి మళ్ళీ వెనక నుండి మొదటి వరకు తలను స్పర్శిస్తూ తీసుకురావాలి. చూడండి చిత్రం 7 మరియు దాని తర్వాత చిత్రం.
7- ఒక సారి రెండు చెవుల ‘మసహ్’ చేయాలి. అంటే రెండు చూపుడు వ్రేళ్ళతో చెవి లోపలి భాగాన్ని, బొటన వ్రేళ్ళతో పై భాగాన్ని స్పర్శించాలి. చిత్రం 8.
8- రెండు కాళ్ళను వ్రేళ్ళ నుండి చీలమండల వరకు మూడేసి సార్లు కడగాలి. ముందు కుడి కాలు తరువాత ఎడమ కాలు. చిత్రం 9.
9- తర్వాత దుఆ చదవాలిః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని, ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా సంపూర్ణంగా వుజూ చేసుకొని ‘అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహ్’ చదువుతారో అతని కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి, ఎందులో నుండి ప్రవేశించ గోరినా అతని ఇష్టం”. (ముస్లిం 234).
(నేను సాక్ష్యమిస్తున్నాను; అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడని, ఆయన ఏకైకుడు భాగస్వామీ లేనివాడని మరియు సాక్ష్యమిస్తున్నాను; ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త).
మేజోళ్ళ పై ‘మసహ్’
ఇస్లాం ధర్మం యొక్క సులువైన, ఉత్తమ విషయం ఒకటిః మేజోళ్ళపై ‘మసహ్’ చేసే అనుమతివ్వడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ‘మసహ్’ చేసేవారని రుజువైనది:
ముగీర బిన్ షొఅబ చెప్పారుః ఒక రాత్రి నేను ప్రవక్తతో ఉండగా, ఆయన ఒక చోట మజిలీ చేసి (ఓ చాటున) కాలకృత్యాలు తీర్చుకొని వచ్చారు, అప్పుడు నా వద్ద ఉన్న చెంబుతో నీళ్ళు పోశాను ఆయన వుజూ చేశారు. చివరిలో తమ మేజోళ్ళపై ‘మసహ్’ చేశారు. (బుఖారి 203, ముస్లిం 274).
వాటి పై ‘మసహ్’ చేయుటకు నిబంధనలు ఏమిటంటే అవి వుజూ చేసిన తర్వాత తొడిగి యుండాలి. పై భాగాన ‘మసహ్’ చేయాలి, క్రింది భాగాన కాదు.
‘మసహ్’ గడువు: స్థానికులు ఒక పగలు ఒక రాత్రి, ప్రయాణికులు (ఏ ప్రయాణంలో నమాజ్ ఖస్ర్ చేయవచ్చునో ఆ ప్రయాణంలో) మూడు రేయింబవళ్ళు మేజోళ్ళపై ‘మసహ్’ చేయవచ్చును. (వుజూ చేసి తొడిగిన తరువాత వుజూ భంగమయిన క్షణం నుంచీ గడువు మొదలవుతుంది).
‘మసహ్’ భంగమయే కారణాలుః గడువు ముగిసిన మరుక్షణం నుంచే ‘మసహ్’ భంగమైపోతుంది. ‘మసహ్’ చేసిన తరువాత కనీసం ఒకసారైనా తీసినట్లయితే ‘మసహ్’ భంగమవుతుంది. లేదా మనిషి (స్వప్నస్ఖలనం లేదా భార్యభర్తల సంభోగం కారణంగా) అశుద్ధతకు లోనైతే ‘మసహ్’ భంగమవుతుంది. స్నానం చేయుటకై అవి తీయడం కూడా తప్పనిసరి.
వుజూను భంగపరిచే విషయాలు
1- మలమూత్రపు దారుల నుండి ఏదీ వెలువడినా సరే అందు వలన వుజూ భంగమవుతుంది. ఉదాః మలము, మూత్రము, అపానవాయువు (పిత్తు), ‘మనీ’, ‘మజీ’, ‘వదీ’ రక్తము. (‘మనీ’ వలన స్నానం చేయడం విధి అవుతుంది).
2- నిద్ర.
3- మర్మాంగ స్థలాన్ని ఏ అడ్డు లేకుండా ముట్టుకోవడం.
4- ఒంటె మాంసం తినడం.
5- స్పృహ తప్పుట వల్ల కూడా వుజూ భంగమవుతుంది.
గుస్ల్ (స్నానం)
శుద్ధి పొందే ఉద్దేశం (నియ్యత్)తో పూర్తి శరీరంపై నీళ్ళు పోసుకొనుటనే గుస్ల్ అంటారు. పూర్తి శరీరం కడగడం, అందులో పుక్కిలించడం మరియు ముక్కులో నీళ్ళు ఎక్కించడం కూడా తప్పనిసరి. అప్పుడే గుస్ల్ అగును. (ప్రవక్త గుస్ల్ పద్థతి ఇదిః ముందు మర్మాంగ భాగాన్ని శుభ్ర- పరుచుకోవాలి. పిదప నమాజుకు చేయునటు- వంటి వుజూ చేయాలి. అరచేతిలో నీళ్ళు తీసుకొని తల మీద పోసి రుద్దాలి. ఇలా మూడు సార్లు చేయాలి. మళ్ళీ పూర్తి శరీరము పై నీళ్ళు పోసుకొని స్నానం చేయాలి).
ఐదు సందర్భాల్లో గుస్ల్ చేయడం విధిగా ఉంది
1- స్త్రీలకు గానీ పురుషులకు గానీ నిద్రలో ఉన్నా లేక మేల్కొని ఉన్నా కామము (షహ్వత్)తో ‘మనీ’ ఉబికిపడితే గుస్ల్ విధి అవుతుంది. కామము లేకుండా ఏదైనా వ్యాది, లేదా విపరీతమైన చలి కారణంగా వెలువడితే గుస్ల్ విధి కాదు. అలాగే స్ఖలనమైనట్లు కలగని ‘మనీ’ లేదా దాని మర్కలేమీ చూడకుంటే గుస్ల్ విధి కాదు. ఎప్పుడు ‘మనీ’ లేక దాని మర్కలు కనబడునో అప్పుడే గుస్ల్ విధి అవుతుంది. స్ఖలమైనట్లు అతనికి గుర్తు లేకున్నా పరవాలేదు.
2- మర్మాంగాల కలయిక. అంటే భర్త మర్మాంగం భార్య మర్మాంగంలో ప్రవేశించినప్పుడు వీర్యం పడకపోయినా స్నానం చేయుట విధియగును.
3- రుతు స్రావం, ప్రసవ స్రావం ముగిసిన తరువాత గుస్ల్ విధియగును.
4- శవానికి గుస్ల్ చేయించడం విధిగా ఉంది.
5- అవిశ్వాసుడు ఇస్లాం స్వీకరించినపుడు.
‘జునుబీ’ పై నిషిద్ధ విషయాలు
(స్వప్నస్ఖలనం వల్ల, లేదా భార్యభర్తల సంభోగం కారణంగా అశుద్ధతకు లోనయిన వ్యక్తిని ‘జునుబీ’ అంటారు).
1- నమాజ్.
2- తవాఫ్.
3- దివ్య ఖుర్ఆనును ముట్టుకోవడం, మెల్లగ, శబ్దముగా, చూసీ, చూడక ఏ స్థితిలోగాని చదవడం నిషిధ్ధం.
4- మస్జిదులో నిలవడం. కాని మస్జిదులో నుండి దాటి పోవడంలో తప్పేమీ లేదు. మస్జిదులో నిలువవలసినప్పుడు వుజూ చేసుకున్నా (మలినం కొంత వరకు తగ్గును, కనుక అది) సరిపోవును.
తయమ్ముమ్
క్రింద తెలుపబడే కారణాలు సంభవించి నప్పుడు ప్రయాణికులు, స్థానికులు ఎవరైనా సరే వుజూ మరియు గుస్ల్ కు బదులుగా తయమ్ముమ్ చేయవచ్చును.
1- అతికష్టంగా వెతికినప్పటికీ నీళ్ళు దొరకనప్పు డు, లేదా ఉండికూడా వుజూకు సరిపడనప్పుడు తయమ్ముమ్ చేయవచ్చును. కొంత దూరములో నీళ్ళు ఉన్నా అక్కడికి వెళ్ళి తీసుకోవడంలో అతనికి ధన, ప్రాణ నష్టమున్నప్పుడు కూడా తయమ్ముమ్ చేయవచ్చును.
2- వుజూ అవయవాల్లో ఏ ఒకదానికైనా గాయమయితే దాన్ని కడిగే ప్రయత్నం చేయాలి. కడగడం వల్ల నష్టం ఉంటే మసహ్ చేయాలి, అంటే చేయి తడి చేసి దాని మీద తుడువాలి. మసహ్ వల్ల కూడా హాని కలిగే భయం ఉంటే తయమ్ముమ్ చేయవచ్చును.
3- నీళ్ళు లేదా వాతవరణం మరీ చల్లగా ఉండి నీళ్ళ ఉపయోగం హానికరంగా ఉంటే తయమ్ముమ్ చేయవచ్చును.
4- నీళ్ళు కేవలం త్రాగడానికి మాత్రమే ఉన్నప్పుడు కూడా తయమ్ముమ్ చేయవచ్చును.
తయమ్ముమ్ విధానం
మనుసులో నియ్యత్ /సంకల్పం చేసుకొని రెండు అరచేతులు ఒక సారి భూమిపై తట్టి ముఖముపై మళ్ళీ మణికట్ల వరకు రెండు చేతులపై మసహ్ చేయాలి. (కొందరు వుజూ చేసినట్లుగా మోచేతుల వరకు, కాళ్ళు సయితం మసహ్ చేస్తారు ఇది ప్రవక్త పద్దతి ఎంతమాత్రం కాదు). వుజూను భంగపరిచే విషయాలే తయ మ్ముమ్ ను భంగపరుస్తాయి. నమాజుకు ముందు లేదా నమాజ్ మధ్యలో నీళ్ళు లభిస్తే తయమ్ముం భంగమవుతుంది. నమాజ్ పూర్తి చేసుకున్న తరువాత నీళ్ళు లభిస్తే ఆ నమాజ్ అయినట్లే. తిరిగి మళ్ళీ చేయవలసిన అవసరం లేదు.
బహిష్టు, బాలింత స్త్రీలు
స్త్రీలు తమ ఋతుస్రావము మరియు బాలింత గడువులో ఉన్నప్పుడు నమాజ్, ఉపవాసాలు పాటించకూడదు. హజ్రత్ ఆయిషా రజియల్లా- హు అన్హా ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః
“నీవు ఋతువు గడువు దినాల్లో నమాజ్ చేయడం మానేయి. ఋతు స్రావం ముగిసాక నీ వొంటి మీది రక్తాన్ని కడిగి (తలంటు స్నానం చేసి) నమాజ్ చేస్తూ ఉండు”. (బుఖారి 331, ముస్లిం 333).
తప్పి పోయిన నమాజులు తిరిగి చేయకూ- డదు. కాని తప్పి పోయిన ఉపవాసాలు మాత్రం పూర్తి చేయాలి. అలాగే వీరు కాబా ప్రదక్షిణం (తవాఫ్) కూడా చేయకూడదు. ఈ గడువులో భర్త తన భార్యతో సంభోగించడం కూడా నిషిధ్ధం. అయితే రమించడం తప్ప పరస్పరం ఏ రకమైన ఆనందం పొందినా తప్పు లేదు. ఈ స్థితిలో స్త్రీ ఖుర్ఆనును తాక వద్దు.
రక్త స్రావం ఆగిన తరవాత స్నానం చేయడం విధిగా ఉంది([2]). స్నానం తర్వాత వారి గడువులో నిశిద్ధంగా ఉన్నవన్నీ ధర్మ సమ్మతం అవుతాయి.
నమాజ్ సమయం ప్రవేశించిన తరువాత, ఆ నమాజ్ చేయక ముందే ఏ స్త్రీకైనా ఋతు స్రావం మొదలవుతే, లేదా ప్రసవిస్తే ఆమె పరిశుద్ధురా- లయిన తరువాత ఆ నమాజును తిరిగి చేయాలి. (ఉదాః జొహ్ర్ నమాజ్ వేళ ఆరంభమయింది పగలు పన్నెండు గంటల నలబై నిమిషాలకు, ఒక స్త్రీ ఒకటింటి వరకు కూడా జొహ్ర్ నమాజ్ చేసుకోలేక పోయింది. అప్పుడే ఋతు స్రావం మొదలయింది, లేదా ప్రసవించింది. అలాంట- ప్పుడు ఆ స్త్రీ పరిశుద్ధురాలయిన తరువాత జొహ్ర్ నమాజ్ చేయాలి). ఒక రకాతు మాత్రమే చేయునంత సమయం ఉన్నప్పుడు పరిశుద్ధుమైన స్త్రీ గుస్ల్ చేసిన తరువాత ఆ నమాజ్ చేసుకోవాలి. ఒక వేళ అది అస్ర్ లేదా ఇషా నమాజ్ అయితే అస్ర్ తో పాటు జొహ్ర్, మగ్రిబ్ తో పాటు ఇషా కూడా చేయుట అభిలషణీయం. ఉదాః సూర్యాస్తమయానికి ఒక రకాత్ చేయునంత ముందు పరిశుద్ధమైతే అస్ర్ నమాజ్ మాత్రం తప్పక చేయాలి. అయితే జొహ్ర్ కూడా ఖజా చేస్తే మంచిది. అర్థ రాత్రికి కొంచెం ముందు పరిశుద్ధురాలయితే ఇషా మాత్రం చేయవలసిందే, అయితే మగ్రిబ్ కూడా చేయడం మంచిది.
నమాజ్ ఆదేశాలు
నమాజ్ ఇస్లాం మూల స్థంబాలలో రెండవది. అది ప్రతీ ప్రాజ్ఞ, ఈడేరిన స్త్రీ పురుషునిపై విధిగా ఉంది. నమాజ్ విధిని తిరస్కరించే వాడు కాఫిర్ (సత్యతిరస్కారి) అవుతాడని ఏకాభిప్రాయం ఉంది. ఇక బద్ధకం, నిర్లక్ష్యంతో మొత్తానికే నమాజ్ చేయనివాడు కూడా కాఫిర్ అవుతాడని అధిక సంఖ్యలో ప్రవక్త సహచరులు ఏకీభవిం- చారు. ప్రళయదినాన మానవునితో తొలి లెక్క నమాజ్ గురించే జరుగును. నమాజుకు సంబంధించిన ఖుర్ఆన్ ఆదేశం చదవండిః
“ఇస్లాం పునాది ఐదు విషయాలపై ఉందిః 1- అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరొకడు లేడు, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యమిచ్చుట. 2- నమాజు స్థాపించుట. 3- జకాత్ (విధిదానం) చెల్లించుట. 4- హజ్ చేయుట. 5- రమజాను ఉపవాసాలు పాటించుట”. (బుఖారి 8, ముస్లిం 16).
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం ప్రకారం, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నానుః “ఒక మనిషి మరియు షిర్క్, కుఫ్ర్ (బహుదైవారాధన, సత్యతిరస్కారం) మధ్య ఉన్న వ్యత్యాసం నమాజును విడనాడడం”. (ముస్లిం 82).
నమాజ్ పాటించడంలో చాలా గొప్ప ఘనతలున్నాయి, వాటిలో కొన్ని:
عَنْ أَبِي هُرَيْرَةَ t قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (مَنْ تَطَهَّرَ فِي بَيْتِهِ ثُمَّ مَشَى إِلَى بَيْتٍ مِنْ بُيُوتِ الله لِيَقْضِيَ فَرِيضَةً مِنْ فَرَائِضِ الله كَانَتْ خَطْوَتَاهُ إِحْدَاهُمَا تَحُطُّ خَطِيئَةً وَالْأُخْرَى تَرْفَعُ دَرَجَةً).
ప్రవక్త e ఉపదేశించారని, అబూ హురైర t ఉల్లేఖించారుః “ఎవరైనా తన ఇంట్లో వుజూ చేసుకొని, అల్లాహ్ యొక్క విధుల్లో ఒక విధి నిర్వహించుటకు అల్లాహ్ గృహాల్లోని ఒక గృహం (మస్జిద్)లో ప్రవేశిస్తే, అతను వేసే అడుగుల్లో ఒక దానికి బదులుగా ఒక పుణ్యం లభిస్తే, మరో దానికి బదులుగా ఒక స్థానం పెరుగుతుంది”. (ముస్లిం 666).
అబూహురైర t ఉల్లేఖనం ప్రకారం: మహానీయ ప్రవక్త e ఇలా అడిగారుః “పరమ ప్రభువైన అల్లాహ్ ఏ విషయాల ఆధారంగా అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో అలాంటి విషయాలు మీకు తెలుపనా?” దానికి సహచ- రులు ‘దైవప్రవక్తా తప్పక సెలవీయండి‘ అని బదులిచ్చారు. అప్పుడాయన ఇలా బోధించారుః “ వాతవరణం, పరిస్థితులూ అనుకూలంగా లేనప్పటికీ వుజూ పూర్తిగా చెయ్యటం. మస్జిద్ వైపునకు అధికంగా అడుగులు వెయ్యడం. ఒక నమాజ్ తరువాత మరో నమాజ్ కొరకు నిరీక్షించడం, ఇది రిబాత్ తో సమానం([3])“. (ముస్లిం 251).
ప్రవక్త e ఉపదేశించారని అబూ హురైర t ఉల్లేఖించారుః “ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నమాజ్ చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తి కోసం అల్లాహ్ స్వర్గంలో విందు ఏర్పాటు చేస్తాడు”. (బుఖారి 662. ముస్లిం 669).
నమాజుకు సంబంధించిన ముఖ్య విషయాలు
1- సామూహికంగా నమాజ్ చేయడం పురుషుల పై విధిగా ఉంది, ఈ హదీసు ఆధారంగా:
“నమాజ్ చేయించడానికి ఒకరిని ఆదేశించి, సామూహిక నమాజులో పాల్గొనని వారి వైపుకు తిరిగి వారు ఇండ్లల్లో ఉండగా వారి గృహాలను తగలబెడదామని ఎన్నో సార్లు అనుకున్నాను”.
(బుఖారి 2420, ముస్లిం 651).
2- శాంతి, నిదానంగా త్వరగా మస్జిదుకు రావడం చాలా మంచిది.
3- మస్జిదులో ప్రవేశిస్తూ కుడి కాలు ముందు వేసి అల్లా హుమ్మఫ్ తహ్లీ అబ్వాబ రహ్మతిక చదవండి. (ముస్లిం 713).
اللهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ
(ఓ అల్లాహ్ నా కొరకు నీ కరుణ ద్వారాలు తెరువు).
4- కూర్చునే ముందు రెండు రకాతులు తహియ్యతుల్ మస్జిద్ చేసుకోవడం సున్నత్.
عَنْ أَبِي قَتَادَةَ السَّلَمِيِّ t أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (إِذَا دَخَلَ أَحَدُكُمْ الْمَسْجِدَ فَلْيَرْكَعْ رَكْعَتَيْنِ قَبْلَ أَنْ يَجْلِسَ).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారని, అబూ ఖతాద రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా మస్జిదులో ప్రవేశిస్తే కూర్చునే ముందు రెండు రకాతుల నమాజ్ చేసుకోవాలి”. (బుఖారి 444, ముస్లిం 714).
5- నమాజులో సతర్ (శరీరంలో కప్పి ఉంచే భాగం) తప్పనిసరి. పురుషుల సతర్ నాభి నుండి మోకాళ్ళ వరకు, స్త్రీల పూర్తి శరీరమే సతర్, నమాజులో కేవలం ముఖము తప్ప.
6- కాబా వైపునకు అభిముఖమై ఉండుట తప్పనిసరి. నమాజ్ అంగీకారానికి ఇది ఒక షరతు. ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప. ఉదాః వ్యాది లేదా మరేదైనా కారణం.
7- ప్రతీ నమాజ్ దాని సమయములో చేయాలి. సమయానికి ముందు చేయుట సమ్మతం కాదు. సమయం దాటి చేయడం నిషిద్ధం.
8- నమాజుకై శీఘ్రముగా సమయంలో రావడం, తొలి పంక్తిలో చేరుకోవడం, నమాజ్ కొరకు వేచించడం, ఇవన్నియూ చాలా గొప్ప ఘనతగల కార్యాలు.
ప్రవక్త e బోధించారని, అబూ హురైర t ఉల్లేఖించారుః “అజాన్ పలకడం మరియు మొదటి పంక్తిలో చేరడం ఎంత పుణ్యకార్యమో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు చీటి (ఖుర్అ) పద్దతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, వారు తప్పకుండా పరస్పరం చీటి వేసుకొందురు. అలాగే వేళ కాగానే తొలి సమయంలో నమాజుకు రావడంలో ఎంత పుణ్యముందో తెలిస్తే, అందులో కూడా ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటిపడుదురు. …..”. (బుఖారి 615, ముస్లిం 437).
عَنْ أَبِي هُرَيْرَةَ t أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (لَا يَزَالُ أَحَدُكُمْ فِي صَلَاةٍ مَا دَامَتْ الصَّلَاةُ تَحْبِسُهُ).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “నమాజ్ కొరకు వేచిస్తూ ఉన్న వ్యక్తికి నమాజ్ చేస్తున్నంత పుణ్యం లభిస్తుంది”. (బుఖారి 659, ముస్లిం 649).
నమాజ్ సమయాలు
* జొహ్ర్ నమాజ్ నమయం: తల నుండి పొద్దు వాలినప్పటి నుండి ప్రతీ వస్తువు నీడ దానంత అయ్యే వరకు.
* అస్ర్ నమాజ్ సమయం: ప్రతీ వస్తువు నీడ దానంత అయినప్పటి నుండి సూర్యాస్తమయం వరకు.
* మగ్రిబ్ నమాజ్ సమయం: సూర్యాస్తమయం నుండి ఎర్రని కాంతులు కనుమరుగయ్యే వరకు.
* ఇషా నమాజ్ సమయం: ఎర్రని కాంతులు మరుగైన మరుక్షణం నుండీ అర్థ రాత్రి వరకు.
* ఫజ్ర్ నమాజ్ సమయం: ఉషోదయము నుండి సూర్యోదయము వరకు.
నమాజ్ చేయరాని స్థలాలు
1- ఖననవాటికః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః
“గొరీలు ఎదురుగా ఉండగా నమాజ్ చేయడం గానీ, వాటిపై కూర్చోవటం గానీ చేయకండి”. (ముస్లిం 972).
3- ఒంటెశాల అంటే ఒంటెలు కట్టే చోటు. అలాగే అశుద్ధ స్థలాల్లో నమాజ్ చేయరాదు.
నమాజ్ విధానం
నమాజ్ చేసేటప్పుడు నియ్యత్ (సంకల్పం) తప్పనిసరిగా చేయాలి. అలాగే ఇతర ఆరాధనల్లో కూడా చేయాలి. అయితే నియ్యత్ మనుస్సులో చేయాలి. నోటితో కాదు. పేజి 43లో నమాజ్ చిత్రాలు చూడండి.
ఇక నమాజ్ పద్ధతి ఇలా వుందిః
1- పూర్తి శరీరము మరియు పూర్తి శ్రద్ధాభక్తుల తో ఖిబ్లా దిశలో నిలబడాలి. చూపులు, శరీరము అటూ ఇటూ ఉండకూడదు. (చూపులు సజ్దా చేసే చోట కేంద్రికరించాలి).
2- ‘తక్బీరె తహ్రీమ’ అల్లాహు అక్బర్ అంటూ
రెండు చేతులు భుజాల వరకు లేదా చెవుల వరకు ఎత్తాలి. చూడండి చిత్రం1
3- కుడి అర చెయ్యిని ఎడమ చెయ్యిపై పెట్టి ఛాతిపై కట్టుకోవాలి. చిత్రం2
4- దుఆయె ఇస్తిఫ్ తాహ్ చదవాలిః
అల్ హందులిల్లాహి హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్. (ముస్లిం 600).
ఓ అల్లాహ్ నీవు పరమ పవిత్రునివి, నీకే సర్వ స్తోత్రములు, నీ నామము శుభం గలది. నీ మహిమ చాలా ఘనమయినది. నీవు తప్ప ఆరాధ్యుడెవడు లేడు.
ఇవి రెండే గాకుండా ఇతర దుఆలు కూడా చదవవచ్చును. ఎల్లప్పుడూ ఒకే దుఆ కాకుండా వేరు వేరు సమయాల్లో వేరు వేరు దుఆలు చదవడం ఉత్తమం. ఇలా నమాజులో నమ్రత, శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది.
అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో * ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు, * అపార కరుణా మయుడు, పరమ కృపాశీలుడు. * ప్రతిఫల దినానికి (అంటే ప్రళయ దినానికి) యజమాని. * మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్ధిస్తున్నాము. * మాకు రుజుమార్గం (సన్మార్గం) చూపించు. * నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోనుకాని వారి మార్గం.
7- కంఠస్తం చేసి ఉన్న ఖుర్ఆనులోని ఏదైనా సూరా లేదా కొన్ని ఆయతులు పఠించాలి.
8- చేతులు భుజాల వరకు ఎత్తి, అల్లాహు అక్బర్ అంటూ రుకూ చేయాలి. రుకూలో అరచేతుల తో మోకాళ్ళను పట్టుకోవాలి. వ్రేళ్ళు దగ్గరదగ్గరగా కాకుండా విడిగా ఉండాలి. సుబ్ హాన రబ్బియల్ అజీం మూడు సార్లు చదువుట సున్నత్. అంతకంటే ఎక్కువ చదవవచ్చు. ఒక్క సారి చదివినా సరిపోవును. చూడండి చిత్రం3
9- ఒంటరి నమాజ్ చేయు వ్యక్తి మరి ఇమాం రుకూ నుండి తల లేపుతూ సమిఅల్లాహు లిమన్ హమిద అంటూ భుజాల వరకు చేతులెత్తాలి. ముఖ్తదీ సమిఅల్లాహు లిమన్ హమిదహ్ కు బదులుగా రబ్బనా వలకల్ హమ్ ద్ అనాలి. ఈ స్థితిలో కుడి చెయి ఎడమ చెయిపై పెట్టి ఛాతిపై కట్టుకోవాలి.
10- రుకూ తర్వాత నిలబడి ఉన్నప్పుడు ఈ దుఆ కూడా చదవవచ్చునుః అల్లాహుమ్మ రబ్బనా లకల్ హమ్దు మిల్ఉస్ సమావాతి వ మిల్ఉల్ అర్జి వ మిల్ఉ మాషిఅత మిన్ షైఇమ్ బఅదు.
ఓ అల్లాహ్, మా ప్రభువా! నీకే ఆకాశముల నిండుగాను, భూమి నిండుగాను, అవి గాకా నీవు కోరిన వస్తువుల నిండుగాను స్తుతి గలదు. (ముస్లిం 476).
11- అల్లాహు అక్బర్ అంటూ మొదటి సజ్దాలో వెళ్ళాలి. ఏడు అంగములపై సజ్దా చేయాలిః (1) నొసటి, ముక్కు. (2,3) రెండు అరచేతులు. (4,5) రెండు మోకాళ్ళు. (6,7) రెండు పాదముల వ్రేళ్ళు. చేతులను పక్కల నుండి దూరముంచాలి. కాళ్ళ వ్రేళ్ళను ఖిబ్లా దిశలో ఉంచి, సజ్దాలో సుబ్ హాన రబ్బియల్ అఅలా మూడు సార్లు పలుకుట సున్నత్. ఎక్కువ పలు- కుట మంచిదే. ఒక్క సారి చదివినా సరిపోతుంది. ఈ స్థితిలో ఎక్కువ దుఆ చేయాలి. ఎందుకనగా ఇది దుఆ అంగీకార స్థితుల్లో ఒకటి. చిత్రం4
12- అల్లాహు అక్బర్ అంటూ సజ్దా నుండి తలెత్తి ఎడమ పాదముపై కూర్చోవాలి. కుడి కాలు పాదమును నిలబెట్టాలి. కుడి చెయ్యి కుడి మోకాలుకు దగ్గరగా తోడపై, ఎడమ చెయ్యి ఎడమ మోకాలుకు దగ్గరగా తోడపై పెట్టాలి. చేతి వ్రేళ్ళను విడిగా పరచి ఉంచాలి. రబ్బిగ్ ఫిర్లీ రబ్బిగ్ ఫిర్లీఅని చదవాలి. చిత్రం5,6,7
13- రెండవ సజ్దా మొదటి సజ్దా మాదిరిగా చేసి, సజ్దాలో అదే దుఆ చదవాలి.
14- అల్లాహు అక్బర్ అంటూ రెండవ సజ్దా నుండి లేస్తూ నిటారుగా నిలబడాలి.
15- రెండవ రకాత్ మొదటి రకాత్ మాదిరిగా చేయాలి. అందులో చదివిన దుఆలే ఇందులో చదవాలి. దుఆయె ఇస్తిఫ్ తాహ్ మరియు అఊజు బిల్లాహి…. తప్ప. ఈ రెండవ రకాత్ లోని రెండవ సజ్దా నుండి అల్లాహు అక్బర్ అంటూ లేచి రెండు సజ్దాల మధ్యలో కూర్చున్న విధంగా కూర్చోని, కుడి చెయి వ్రేళ్ళను ముడుచుకొని నడిమి వ్రేళిని బొటన వ్రేళి మధ్యలో పెట్టి, చూపుడు వ్రేళితో సైగా చేస్తూ, కదలిస్తూ తషహ్హుద్ చదవాలిః
నా వాక్కు, దేహా, ధన సంబంధమైన ఆరాధన లన్నియూ అల్లాహ్ కొరకే ఉన్నవి. ఓ ప్రవక్తా! మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆయన శుభాలు కురువుగాకా. అల్లాహ్ తప్ప వేరు ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు, సందేశహరుడని సాక్ష్యమిస్తున్నాను.
ఇక్కడి వరకు చదివిన తరువాత, చేతులు భుజాల వరకు ఎత్తుతూ అల్లాహు అక్బర్ అంటూ నిలబడాలి, ఒక వేళ మగ్రిబ్ లాంటి మూడు రకాతుల నమాజ్ లేదా జొహ్ర్, అస్ర్ మరియు ఇషా లాంటి నాలుగు రకాతుల నమాజ్ చేస్తుంటే, రెండవ రకాతు మాదిరిగా మిగిత నమాజ్ పూర్తి చేయాలి. అయితే ఖియామ్ (నిలబడి ఉన్న స్థితి)లో కేవలం సూరె ఫాతిహ చదువుతే సరిపోతుంది. చివరి రకాతు రెండవ సజ్దా నుండి లేచి కూర్చోని తషహ్హుద్, దరూద్ ఇబ్రాహీమ్ మరియు ప్రవక్త నేర్పిన తనికిష్టమైన దుఆలు అధికంగా చదవడం మంచిది. (ఇది కూడా దుఆ అంగీకార సందర్భాల్లో ఒకటి). క్రింద దరూద్ మరియు ఒక దుఆ ఇవ్వబడుతుంది.
ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీంను, వారి కుటుంబీకులను కరుణించినట్లు ముహమ్మద్ మరియు వారి కుటుంబీకులను కరుణించు. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి. ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీం, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేసినట్లు ముహమ్మద్, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేయుము. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి. ఓ అల్లాహ్ నేను సమాధి శిక్షల నుండి, నరక యాతన నుండి, జీవన్మరణ పరీక్షల నుండి మరియు దజ్జాల్ మాయ నుండి రక్షణకై నీ శరణు కోరుతున్నాను
16- అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అంటూ కుడి వైపున మెడ త్రిప్పాలి. అలాగే అంటూ ఎడమ వైపున మెడ త్రిప్పాలి. చూడండి చిత్రం8,9
17- జొహ్ర్, అస్ర్, మగ్రిబ్, ఇషా నమాజుల్లోని చివరి తషహ్హుద్ లో కూర్చుండే పద్ధతి ఇలా ఉండాలి. కుడి పాదాన్ని నిలబెట్టి ఎడమ పాదాన్ని కుడి కాలి పిక్క క్రింది నుంచి బైటికి తీయాలి. ఎడమ పిరుదును భూమిపై ఆనించాలి. కుడి చెయ్యి కుడి తోడపై, ఎడమ చెయ్యి ఎడమ తోడపై మోకాలుకు దగ్గరగా పెట్టాలి. చూడండి చిత్రం10
أَسْتَغْفِرُ الله (3). اَللهُمَّ أَنْتَ السَّلامُ ومِنْكَ السَّلامُ تَبَارَكْتَ يَا ذَا الجَلالِ وَ الإكْرَام. لا إله إلا الله وَحْدَهُ لا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيءٍ قَدِير. اَللهُمَّ لا مَانِعَ لِمَا أعْطَيْتَ وَلا مُعْطِيَ لِمَا مَنَعْتَ وَلا يَنْفَعُ ذَا الجَدِّ مِنْكَ الْجَدُّ. لا حَوْلَ وَلا قُوَّةَ إِلاَّ بِاللهِ، لاَ إِلهَ إِلاَّ اللهُ وَلاَ نَعْبُدُ إِلاَّ إِيَّاهُ، لَهُ النِّعْمَةُ وَلَهُ الْفَضْلُ وَلَهُ الثَّنـاءُ الْحَسـَن، لاَ إلَهَ إِلاَّ اللهُ مُخْلِصِينَ لَه الدِّينَ وَلَوكَرِهَ الكَافرون.
అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుచున్నాను (3). ఓ అల్లాహ్ నీవు ఏలాంటి లోపాలు లేనివాడవు. నీవే రక్షణ నొసంగువాడవు. ఓ ఘనుడవు, పరమదాతయువు నీవు శుభములు గలవాడవు. అల్లాహ్ దప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన అద్వితీయుడు. ఆయనకు సాటి మరొకడు లేడు. ఆయనకే అధికారము చెల్లును. ఆయనకే సర్వ స్తోత్రములు గలవు. ఆయనే సర్వ శక్తుడు. ఓ అల్లాహ్ నీవు నొసంగిన వరాలను ఎవడు అడ్డగింపజాలడు. నీవు ఇవ్వని దానిని ఎవ్వడూ ఇవ్వజాలడు. ధనికుడు తన ధనముతో నీ శిక్షల నుండి తప్పించుకు- పోజాలడు. పాపాములను వదులుకొనుట మరియు పుణ్యాలు చేయుట అల్లాహ్ దయవలననే కలుగును. అల్లాహ్ దప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన్నే మేము ఆరాధించుచున్నాము. ఆయనే సర్వ అనుగ్రహాలు దయ చేయువాడు. ఆయనకే ఘనత, మంచి స్తోత్రములు గలవు. అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యు డెవ్వడూ లేడు. చిత్తశుద్ధితో మేము ఆయన్నే ఆరాధించుచున్నాము. ఈ విషయము సత్య తిరస్కారులకు నచ్చకున్నా సరే. (ముస్లిం 591, 593, 594, బుఖారి 844).
తరువాత సుబ్హానల్లాహ్ 33, అల్ హందు లిల్లాహ్ 33, అల్లాహు అక్బర్ 33 సార్లు చదివి, లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్‌తో 100 పూర్తి చేయాలి. (ముస్లిం 597).
ఖుల్ హువల్లాహు అహద్(5), ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్(5), ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్([5]) సూరాలు ఫజ్ర్ మరియు మగ్రిబ్ తరువాత మూడేసి సార్లు మిగిత నమాజుల తరువాత ఒక్కొక్క సారి చదవాలి.
మస్బూఖ్:
ఎవరైనా జమాఅతుతో ఒకటి లేదా కొన్ని రకాతులు తప్పి పోతే (మస్బూఖ్) ఇమాం రెండవ సలాం తింపిన తర్వాత వాటిని పూర్తి చేసుకోవాలి. అతను ఇమాంతో ఏ రకాతులో కలిసాడో అదే అతని మొదటి రకాతు. ఇమాంను రుకూ స్థితిలో పొందినవాని ఆ రకాతు అయినట్లే. ఇమాంను రుకూలో పొందకుంటే ఆ రకాత్ తప్పిపోయి నట్లే లెక్క.
జమాఅతు నిలబడిన తర్వాత వచ్చేవారు జమాఅతును ఏ స్థితిలో చూసినా అదే స్థితిలో కలవాలి. వారు రుకూ, లేదా సజ్దా ఇంకే స్థితిలో ఉన్నా సరే. వారు మరో రకాతు కొరకు నిలబడే వరకు నిరీక్షించవద్దు. నిలబడి తక్బీరె తహ్రీమ అల్లాహు అక్బర్ అనాలి. రోగి లాంటి ఏదైనా ఆటంకం ఉన్నవారు కూర్చుండి అల్లాహు అక్బర్ అంటే ఏమీ తప్పు లేదు.
నమాజును భంగపరుచు కార్యాలు
1- తెలిసి, కావాలని మాట్లడడం, అది కొంచమైనా సరే.
2- పూర్తి శరీరముతో ఖిబ్లా దిశ నుండి పక్కకు మరలడం.
3- వుజూను భంగపరిచే కారణాల్లో ఏ ఒకటైనా సంభవించడం.
4- అనవసరంగా ఎడతెగకుండా ఎక్కువ చలనము చేయడం.
5- కొంచం నవ్వినా నమాజ్ వ్యర్థమవుతుంది.
6- తెలిసి కూడా ఎక్కువ రుకూ, సజ్దాలు, ఖియాం, జుల్సాలు చేయడం.
7- తెలిసి కూడా (రుకూ, సజ్దా వగైరా) ఇమాంకు ముందు చేయడం.
నమాజ్ యొక్క వాజిబులు
1- మొదటి తక్బీరె తహ్రీమ తప్ప మిగితావన్నీ.
2- రుకూలో కనీసం ఒక్కసారైనా సూబ్హాన రబ్బియల్ అజీం అనడం.
3- రుకూ నుండి లేస్తూ ఇమాం మరియు ఒంటరి నమాజి సమిఅల్లాహు లిమన్ హమిదహ్ అనడం.
4- రుకూ నుండి నిలబడి రబ్బనా వలకల్ హంద్ అనడం.
5- సజ్దాలో కనీసం ఒక్కసారైనా సుబ్హాన రబ్బియల్ అఅలా అనడం.
6- రెండు సజ్దాల మధ్యలో రబ్బిగ్ ఫిర్లీ అనడం.
7- మొదటి తషహ్హుద్ చదవడం.
8- మొదటి తషహ్హుద్ చదవడానికి కూర్చోవడం.
నమాజ్ యొక్క రుకున్ లు
1- ఫర్జ్ నమాజులో శక్తి ఉన్నప్పుడు నిలబడటం. నఫిల్ నమాజులో నిలబడటం ముఖ్యం లేదు. కాని కూర్చుండి నమాజ్ చేసేవానికి, నిలబడి చేసేవానికంటే సగం పుణ్యం తక్కువ.
2- తక్బీరె తహ్రీమ.
3- ప్రతి రకాతులో సూరె ఫాతిహ పఠించడం.
4- ప్రతీ రకాతులో రుకూ చేయడం.
5- రుకూ నుండి లేచి నిటారుగా నిలబడటం.
6- ప్రతీ రకాతులో రెండు సార్లు ఏడు అంగములపై సజ్దా చేయడం.
7- రెండు సజ్దాల మధ్య కూర్చోవడం.
8- నమాజులోని రుకూ, సజ్దా మొదలైన అంశాలన్నిటినీ నింపాదిగా, శాంతిగా నెరవేర్చడం.
9- చివరి తషహ్హుద్.
10- దాని కొరకు కోర్చోవడం.
11- దరూదె షరీఫ్ (అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మది…..)
12- సలాం తింపడం.
13- ప్రతి రుకున్ నెరవేర్చడంలో క్రమ పద్దతిని పాటించడం
నమాజులో మరచిపోవుట
ఎవరైనా నమాజులో మరచిపోతే, అంటే; నమాజులో ఏదైనా అదనపు కార్యం లేదా ఏదైనా కొరత జరుగుతే, లేదా అలాంటి అనుమానం ఏదైనా కలుగుతే రెండు సజ్దాలు చేయాలి. వీటిని సహు సజ్దా అంటారు.
మరచిపోయి నమాజులో ఏదైనా హెచ్చింపు జరిగినప్పుడు, అంటే; ఖియాం, లేదా రుకూ, లేదా సజ్దా లాంటిదేదైనా అదనంగా చేసినప్పుడు సలాం త్రిప్పిన తరువాత రెండు సహ్ వ్ సజ్దాలు చేయాలి.
ఒకవేళ మరచిపోయి నమాజులో ఏదైనా కొరత జరిగినప్పుడు అంటే; నమాజులో చేయవలసిన ఏదైనా కార్యం చేయక, చదవ వలసినా ఏదైనా దుఆ, సూరా చదవక కొరత జరుగుట. ఒకవేళ అది ‘రుకున్’ అయితే, దాని రెండు స్థితులుః ఆ ‘రుకున్’ ఏ రకాతులో మరచిపోయాడో దాని తరువాత రకాతు ఆరంభానికి ముందు ఆ విషయం గుర్తుకు వస్తే, వెంటనే ఆ ‘రుకున్’ నెరవేరుస్తూ, ఆ రకాతులో దాని తరువాత ఉన్నవాటిని పూర్తి చేయాలి([6]). సలాం తిప్పేకి ముందు సజ్దా సహ్ వ్ చేయాలి. ఆ ‘రుకున్’ ఏ రకాతులో మరచిపోయాడో దాని తరువాత రకాతు ఆరంభానికి ముందు ఆ విషయం గుర్తుకు రాకుంటే ఆ రకాత్ కానట్లే లెక్క. ఇప్పుడు చేస్తున్న రకాతే దాని స్థానం తీసుకుంటుంది([7]).
మరచిపోయిన రుకున్ సలాం తరువాత కొద్ది క్షణాలకే గుర్తుకు వస్తే, పూర్తి ఒక రకాత్ చేసి, సలాంకు ముందు సజ్దా సహ్ వ్ చేయాలి. తొందరగా గుర్తుకు రాలేదు, లేదా వుజూ భంగమయితే తిరిగి పూర్తి నమాజ్ చేయాలి.
మొదటి తషహ్హుద్ లాంటి వాజిబ్ మరచిపోయినప్పుడు సలాంకు ముందు సజ్దా సహ్ వ్ చేస్తే సరిపోతుంది.
ఇక అనుమాన స్థితికి గురైనప్పుడు; ఈ అనుమానం రకాతుల సంఖ్యలో ఉంటే, ఉదాః రెండు రకాతులు చదివానా లేదా మూడా? అని సందేహం కల్గితే, తక్కువ సంఖ్యపై నమ్మకం ఉంచుకొని, మిగిత రకాతులు పూర్తి చేసుకోవాలి. సలాంకు ముందు సజ్దా సహ్ వ్ చేయాలి. ఒకవేళ రుకున్ విషయంలో సందేహం కలుగుతే, దాన్ని చేయలేని కింద లెక్క కట్టి, దాన్ని నెరవేర్చాలి. దాని తరువాత రకాతులు చేసుకోవాలి. సజ్దా సహ్ వ్ చేయాలి.
సున్నతె ముఅక్కద
స్థానికులైన ప్రతి ముస్లిం స్త్రీ పురుషులు పన్నెండు రకాతులు పాటించడం ఎంతో పుణ్యకార్యం. అవి జొహ్ర్ కు ముందు 4, దాని తరువాత 2, మగ్రిబ్ తరువాత 2, ఇషా తరువాత 2, ఫజ్ర్ కు ముందు 2 రకాతులు. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సున్నతులు పాటించేవారు. ఇంకా ఆయన ఇలా శుభవార్త ఇచ్చారని ఉమ్మె హబీబ రజియల్లాహు అన్హా తెలిపారు:
“ఏ ముస్లిం భక్తుడు రాత్రి పగల్లో ఫర్జ్ కాకుండా పన్నెండు రకాతుల అదనపు (నఫిల్) నమాజ్ చేస్తూ ఉంటాడో అతనికి వాటికి బదులుగా అల్లాహ్ ఒక గృహము స్వర్గంలో నిర్మిస్తాడు, లేదా ఒక గృహం స్వర్గంలో నిర్మించచబడును”. (ముస్లిం 728).
సున్నతె ముఅక్కద మరియు సాధరణంగా నఫిల్ నమాజ్ లన్నియూ ఇంట్లో చేయడం చాలా ఉత్తమం. ప్రవక్త ﷺ ప్రబోధించారని, జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
“మీలోనెవరైనా మస్జిదులో (ఫర్జ్) నమాజ్ నెరవేర్చుకున్నాక, తన ఇంటి కొరకు కూడా (సున్నతులు, నఫిల్లాంటి) నమాజుల యొక్క కొంత భాగాన్ని మిగిలించుకోవాలి. అల్లాహ్ అతని నమాజుకు బదులుగా అతని ఇంట్లో మేలే చేకూర్చుతాడు”. (ముస్లిం 778).
జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః
“మనిషి తనింట్లో చేసే నమాజ్ అతి ఉత్తమమైనది. కేవలం ఫర్జ్ నమాజ్ తప్ప”. (బుఖారి 6113).
విత్ర్ నమాజ్
అలాగే ముస్లిం విత్ర్ నమాజును పాటించుట ధర్మం. ఇది కూడా సున్నతె ముఅక్కద. దీని సమయం ఇషా తరువాత నుండి ఉషోదయం వరకు ఉంటుంది. అయితే రాత్రి చివరి గడియలో మేల్కొనగల వారికి ఆ సమయమే ఉత్తమం. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయాల్లో ఒకటి. ప్రవక్త మహా నీయులు విత్ర్ మరియు ఫజ్ర్ కు ముందు గల రెండు రకాతుల సున్నతులు ఎప్పుడూ విడనాడ లేదు. ప్రయాణంలో ఉన్నా, లేదా స్థానికంగా ఉన్నా. విత్ర్ యొక్క కనిష్ట సంఖ్య ఒక్క రకాతు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రుల్లో 11 రకాతులు చేసేవారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనంలో ఉందిః
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి పూట 11 రకాతులు చేసేవారు, అందులో ఒక రకాతు విత్ర్ చేసేవారు. (ముస్లిం 736).
రాత్రి నమాజ్ రెండేసి రకాతులు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం ప్రకారం, ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రాత్రి నమాజ గురించి ప్రశ్నించాడు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః
“రాత్రి వేళ నఫిల్ నమాజ్ రెండేసి రకాతుల చొప్పున చేయాలి. ఇక ఉషోదయం కావస్తోందని భావించినప్పుడు ఒక రకాతు చేయు. దీనివల్ల మొత్తం నమాజ్ విత్ర్ (బేసి సంఖ్య నమాజ్) అయిపోతుంది”. (బుఖారి 991, ముస్లిం 749).
అప్పుడప్పుడు విత్ర్ లో దుఆయె ఖునూత్ చేయడం మంచిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హసన్ బిన్ అలీ రజియల్లాహు అన్హు గారికి విత్ర్ లో చదివే దుఆ నేర్పారు. కాని ఎల్లప్పుడు చేయకూడదు. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ విధానం గురించి ఉల్లేఖించిన సహచరులు ఖునూత్ గురించి చెప్పలేదు.
రాత్రి నమాజ్ చేయలేకపోయినవారు మరుసటి రోజు రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పన్నెండు ఇష్టమున్నన్ని రకాతులు చేయుట మంచిది. ఎప్పుడైనా రాత్రి నమాజ్ తప్పి పోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగే చేసేవారు.
ఫజ్ర్ సున్నతులు
ప్రవక్త ﷺ పాబందీగా పాటించే సున్న తుల్లో ఫజ్ర్ సున్నతులు కూడా, వాటిని ఆయన ప్రయాణంలో ఉన్న, స్థానికంగా ఉన్నా విడనాడకపోయేది. ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం:
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నఫిల్ నమాజుల్లో ఫజ్ర్ సున్న తులను చేసేటంత ఎక్కువ పాబందీగా మరో నఫిల్ చేసేవారు కారు”. (బుఖారి 1163, ముస్లిం 724). వాటి ఘనత, ప్రాముఖ్యతలో ప్రవక్త ﷺ ఇలా చెప్పేవారుః لَـهُمَا أَحَبُّ إِلَيَّ مِنْ الدُّنْيَا جَمِيعًا.
“ఆ రెండు రకాతులు నాకు ప్రపంచం మరియు, అందులో ఉన్న వాటికన్నా చాలా ప్రియమైనవి”. (ముస్లిం 725).
మొదటి రకాతులో (సూర ఫాతిహా తర్వాత) సూర కాఫిరూన్ మరియు రెండవ రకాతులో (సూర ఫాతిహ తర్వాత) సూర ఇఖ్లాస్ చదువుట ధర్మం. ఒక్కోసారి మొదటి రకాతులో “ఖూలూ ఆమన్నా బిల్లాహి వమా ఉంజిల ఇలైనా….” (అల్ బఖర 2: 136) ఆయతులు మరియు రెండవ రకాతులో “ఖుల్ యా అహ్లల్ కితాబి తఆలౌ ఇలా కలిమతిన్ సవాఇమ్ బైననా వ బైనకుమ్….” (ఆలె ఇమ్రాన్ 3: 64) ఆయతులు పఠించుట మంచిది.
ప్రవక్త అనుసరణలో వాటిని సంక్షిప్తంగా చేయాలి. ఫర్జ్ నమాజుకు ముందు వాటిని చేయలేకపోయిన వ్యక్తి నమాజ్ తర్వాత కూడా చేయవచ్చును. అయితే సూర్యోదయం తర్వాత సూర్యుడు బల్లెమంత పైకి వచ్చాక చేయడం మరీ ఉత్తమం. దీని సమయం పగటిలి పొద్దు వాలేకి ముందు వరకు ఉంటుంది.
చాష్త్ నమాజ్
దీనినే సలాతుల్ అవ్వాబీన్ అంటారు. ఇది సున్నతె ముఅక్కద. అనేక హదీసుల్లో దీని గురించి ప్రోత్సహించబడింది. అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీస్ ముస్లిం 820లో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః
“మానవ శరీరంలో ఎన్ని కీళ్ళున్నాయో వాటి లో ప్రతి దానికీ ఒక దానం (సదఖా) విధి అయి ఉంది. అయితే ప్రతి సుబ్ హానల్లాహ్ ఒక సదఖా, ప్రతి అల్ హందులిల్లాహ్ ఒక సదఖా, లాఇలాహ ఇల్లల్లాహ్ ఒక సదఖా, అల్లాహు అక్బర్ ఒక సదఖా, ఒక మంచిని బోధించడం ఒక సదఖా, ఒక చెడును నివారించడం ఒక సదఖా, వీటన్నిటికీ బదులుగా చాష్త్ సమయం లో 2 రకాతులు సరిపోతాయి”.
హజ్రత్ అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: నా ప్రాణ స్నేహితులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు మూడు విషయాలను గురించి హితబోధ చేశారు. నేను వాటిని చని పోయేంత వరకు వదిలి- పెట్టను. అవిః 1. ప్రతి (ఇస్లామీయ) నెలలో మూడు రోజుల ఉపవాసం పాటించటం. 2. చాష్త్ నమాజ్ చేయడం. 3. విత్ర్ నమాజ్ చేసి నిద్ర పోవడం. (బుఖారి 1178, ముస్లిం 721).
దీని ఉత్తమ సమయం పొద్దెక్కి, ఎండ తాపం పెరిగిన తర్వాత. పొద్దు వాలిన వెంటనే దీని సమయం సమాప్తమవుతుంది. కనిష్ట సంఖ్య రెండు రకాతులు. గరిష్ట సంఖ్యకు హద్దు లేదు.
సామూహిక నమాజ్
ఫర్జ్ నమాజ్ యొక్క జమాఅతు నిలబడిన తరువాత మస్జిదులో ప్రవేశించినవారు నఫిల్ లేక సున్నతులు చేయుట ధర్మ సమ్మతం కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః
ఇమాం ఖిరాత్ ను వినాలి. కాని సూరె ఫాతిహ మాత్రం తప్పక పఠించాలి. ఎందుకనగా సూరె ఫాతిహ పఠించని వ్యక్తి నమాజ్ కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:
“సూరె ఫాతిహ చదవనివారి నమాజ్ కాదు”. (బుఖారి 756, ముస్లిం 394)
పంక్తుల విషయం:
ముఖ్తదీ పంక్తిలో స్థలము పొందనిచో పంక్తుల వెనక ఒంటరిగా నమాజ్ చేయుట ఎట్టి పరిస్థితిలో కూడా యోగ్యం కాదు. అతనితో ఏ ఒకరైనా పంక్తిలో ఉండి నమాజ్ చేయుటకు ఒక వ్యక్తిని చూడాలి లేక ఒక వ్యక్తి
వచ్చే వరకు వేచి ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః لاَ صَلاَةَ لِفَردٍ خَلفَ الصَّف
“పంక్తుల వెనక ఒంటరిగా చేయు వ్యక్తి నమాజ్ కాదు”. (సహీ ఇబ్ను ఖుజైమ 3/30. సహీ ఇబ్ను హిబ్బాన్ 5/579 ).
వేచి ఉన్నప్పటికీ ఏ ఒక్కరినీ పొందనిచో వీలుంటే ఇమాం కుడి వైపున నిలబడాలి. లేదా ఇమాం సలాం తిప్పే వరకు వేచించాలి. అప్పటి వరకూ ఎవరు రాని యడల ఇమాం సలాం తింపిన తరువాత ఒంటరిగా నమాజ్ చేసుకోవాలి. (కాని షేఖ్ ఇబ్ను ఉసైమీన్ ఫత్వా చాలా బాగుంది: ముందు పంక్తిలో ఏ కొంచం స్థలం దొరికే అవకాశం లేకుంటే అతను ఒంటరిగా నిలబడాలి. ఈ సందర్భంలో హదీసు వ్యతిరేకం అనబడదు, గత్యంతరం లేని పరిస్థితి అనబడుతుంది).
మొదటి పంక్తిలో ఉండి నమాజ్ చేయుట పుణ్యకార్యం. దాని కాంక్ష ఎక్కువగా ఉండాలి. ఎందుకనగా పురుషుల కొరకు మేలయిన పంక్తి మొదటిది. అదే విధంగా ఇమాంకు కుడి ప్రక్కన ఉండుటకు ప్రయత్నించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః
“మీరు మీ పంక్తులను సరి చేసుకోండి. పంక్తులను సరిచేసుకొనుట నమాజ్ పరిపూర్ణతలో ఒక భాగం”. (ముస్లిం 433).
ఖస్ర్:
ఖస్ర్ అనగా నాలుగు రకాతుల నమాజ్ రెండు రకాతులు చేయుట. ప్రతి రకాతులో సూరె ఫాతిహ చదవాలి. దానితో పాటు మరో సూర లేదా ఖుర్ఆనులోని సులభంగా జ్ఞాపకమున్న కొన్ని ఆయతులు చదవాలి. మగ్రిబ్ మరియు ఫజ్ర్ మాత్రం ఖస్ర్ చేయరాదు.
ప్రయాణంలో ఉన్న వారు నమాజ్ ఖస్ర్ చేయుటయే ధర్మం. అంతే కాదు; ప్రయాణికుడు నమాజును ఖస్ర్ చేయుటయే ఉత్తమం. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణం చేసినప్పుడల్లా ఖస్ర్ చేశారు. 80 కిలోమీటర్లకు పైగా ఎవరైనా ప్రయాణము చేస్తే దానినే ప్రయాణమనబడును. అల్లాహ్ అవిధేయతకు గాకుండా విధేయత కొరకు ప్రయాణం చేసినప్పుడు ఖస్ర్ చేయుట ధర్మం.
స్వనగర గృహాలను దాటిన తరువాత ఖస్ర్ ప్రారంభించి, తమ నగరానికి తిరిగి వచ్చేంత వరకు ఖస్ర్ చేయవచ్చును. ఇలా ప్రయాణం ఎన్ని రోజులయినా సరే. కాని ఒక వేళ ప్రయాణం చేసిన ఊరిలో నాలుగు లేక అంతకంటే ఎక్కువ రోజులు నిలవాలని ముందే నిశ్చయించుకుంటే ఖస్ర్ చేయకూడదు. పూర్తి నమాజ్ చేయాలి.
ప్రయాణంలో సున్నత్, నఫిల్ నమాజులు చేయనవసరం లేదు. కాని ఫజ్ర్ సున్నత్ లు మరియు విత్ర్ తప్పకుండా చేయాలి. వాటిని విడనాడకూడదు.
జమ్అ:
జొహ్ర్ మరియు అస్ర్ నమాజులు రెండిట్లో ఏదైనా ఒక సమయంలో, అలాగే మగ్రిబ్ మరియు ఇషా నమాజులు రెండిట్లో ఏదైనా ఒక సమయంలో చేయుటనే జమఅ అంటారు. అయితే జొహ్ర్, అస్ర్ జొహ్ర్ సమయంలో మరియు మగ్రిబ్, ఇషా మగ్రిబ్ సమయంలో చేస్తే జమఅతఖ్ దీమ్ అంటారు. ఒకవేళ జొహ్ర్, అస్ర్ అస్ర్ సమయంలో మరియు మగ్రిబ్, ఇషా ఇషా సమయంలో చేస్తే జమఅ తాఖీర్ అంటారు. ప్రయాణికుడు జమఅతఖ్ దీమ్ లేక జమఅతాఖీర్ చేయుట ధర్మమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తబూక్ నగరానికి ప్రయాణించినప్పుడు ఇలా చేశారని రుజువయినది. (బుఖారి, ముస్లిం).
ప్రయాణికుడు ఖస్ర్ చేయవచ్చనే విషయం పైన చదివారు, అయితే ఖస్ర్ తో పాటు జమఅ కూడా చేయవచ్చును. జమఅ తఖ్ దీమ్ చేయాలనుకున్నప్పుడు ఇఖామత్ చెప్పి జొహ్ర్ సమయంలో జొహ్ర్ యొక్క రెండు రకాతులు చేసి సలాం తింపిన తరువాత మళ్ళీ ఇఖామత్ చెప్పి అస్ర్ యొక్క రెండు రకాతులు చేయాలి. మగ్రిబ్ సమయంలో ఇఖామత్ చెప్పి మగ్రిబ్ యొక్క మూడు రకాతులు చేసి సలాం తింపిన తరువాత మళ్ళీ ఇఖామత్ చెప్పి ఇషా యొక్క రెండు రకాతులు చేయాలి.
అదే విధంగా స్థానికులు కూడా జమఅచేయవచ్చును. కాని ఖస్ర్ చేయరాదు. జమఅ చేయు సందర్భాలుః వర్షం కురిసినప్పుడు, లేదా చలి ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా తూఫాను గాలి ఉండి నమాజీలకు మస్జిద్ వెళ్ళడం కష్టంగా ఉన్నప్పుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి వర్షం కురిసిన రాత్రి మగ్రిబ్ మరియు ఇషా నమాజులు కలిపి చేశారు.
అదే విధంగా వ్యాదిగ్రస్తుడు ప్రతి నమాజ్ దాని సమయాన పాటించుట కష్టంగా ఉన్నప్పుడు రెండు నమాజులు కలిపి చేయవచ్చును.
వ్యాదిగ్రస్తుని నమాజ్:
నిలబడి నమాజ్ చేసే శక్తి రోగిలో లేనప్పుడు దేనికయినా ఆనుకొని నమాజ్ చేయాలి. ఈ శక్తి లేనప్పుడు కూర్చుండి చేయాలి. ఈ శక్తి కూడా లేనప్పుడు ప్రక్కన పడుకొని చేయాలి. ఈ శక్తి కూడా లేనప్పుడు వెల్లకిల పడుకొని పాదములను ఖిబ్లా వైపున ఉంచి నమాజ్ చేయాలి. సజ్దాలో రుకూ కంటే కొంచము ఎక్కువ తలను వంచాలి. రుకూ, సజ్దా చేయు శక్తి లేనప్పుడు తలతో సైగ చేయాలి. ఏ పరిస్థితిలోనయినా నమాజ్ విడనాడకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః
{విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజుకై పిలిచినప్పుడు, అల్లాహ్ సంస్మరణ వైపునకు పరుగెత్తండి; క్రయవిక్రయాలను వదలండి. మీరు గ్రహించగలిగితే, ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది}. (62: జుముఅహ్: 9).
జుమా ప్రత్యేకతలు:
స్నానం చేయుట, శుభ్రమైన మంచి దుస్తులు ధరించుట, దుర్వాసన నుండి అతి దూరంగా ఉండుట ఈ నాటి పత్యేక ధర్మాలు.
జుమా ప్రత్యేకతల్లోః జుమా నమాజ్ కొరకు మస్జిద్ కు శీఘ్రముగా వెళ్ళి, ఇమాం వచ్చే వరకు నఫిల్ నమాజులు, ఖుర్ఆన్ పారాయణం, అల్లాహ్ స్మరణాల్లో గడుపుట. ఇమాం ఖుత్బ (జుమా ప్రసంగం) ఇస్తున్నప్పుడు ఏ పని చేయకుండా, నిశబ్దంగా ఉండి ఖుత్బ వినుట. నిశబ్దంగా ఉండనివారు వృధా పని చేసిన వారవుతారు. వృధా పని చేసిన వారికి జుమా ఫలితం లభించదు. ఖుత్బ సందర్భంలో మాట్లాడ్డం నిషిద్ధం.
జుమా ప్రత్యేకతల్లోః ఈ రోజు సూరె కహఫ్ పారాయణం పుణ్యకార్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః
“ఎవరు సూరె కహఫ్ పఠిస్తారో వారికి తనున్న ప్రాంతం నుండి మక్కా వరకు మరియు ప్రళయం నాటికీ కాంతియే కాంతి ఉండును. ఎవరు దాని చివరి పది ఆయతులు పఠిస్తారో వారికి దజ్జాల్ వచ్చినప్పటికీ ఏమి నష్టం జరగదు”.(అల్ ముఅజముల్ ఔసత్: తబ్రానీ 2/123).
ఇమాం ఖుత్బ ఇస్తుండగా మస్జిదులో ప్రవేశించువారు రెండు రకాతులు తహియ్యతుల్ మస్జిద్ సంగ్రహంగా చేసుకోవాలి. అప్పటి వరకు కూర్చోకూడదు.
“మీలో ఎవరైనా మస్జిదులో ప్రవేశించినప్పుడు ఇమాం ఖుత్బా ఇస్తున్నచో రెండు రకాతులు సంగ్రహముగా చేసుకోవాలి” అని ప్రవక్త ఖుత్బ ఇస్తూ చెప్పారు.(ముస్లిం 875).
ఎవరికీ సలాం చేయకుండా నిదానంగా కూర్చోని ఖుత్బ వినాలి. ఖుత్బ తనకు తెలిసిన భాషలో కానప్పటికీ మౌనంగా ఉండాలి. ప్రక్కలో కూర్చున్న వారితో ముసాఫహ (కరచాలణం) చేయకూడదు.
ఇమాంతో జూమా నమాజ్ యొక్క ఒక రకాతు పొందినవారు జుమాను పొందినట్లే. అబూ హురైర ఉల్లేఖించిన హదీసులో ఇలా వచ్చిందిః “జుమా యొక్క ఒక రకాతును పొందినతను జుమాను పొందినాడు”. (బైహఖి). ఒక రకాతు కంటే తక్కువ పొందినతను అనగా ఇమాంతో రెండవ రకాతులోని రుకూ పొందనివాని జుమా కానట్లే. అతను జొహ్ర్ నమాజ్ నియ్యతుతో ఇమాం వెనక నమాజులో పాల్గొని ఇమాం సలాం తింపిన తరువాత జొహ్ర్ నమాజ్ పూర్తి చేసుకోవాలి.
పండుగ నమాజ్
పొద్దు పొడిసి సూర్యుడు బల్లెమంత (బారెడంత) పొడుగులో పైకి వచ్చిన తరువాత పండుగ నమాజ్ సమయం ప్రారంభం అవుతుంది. ఈదుల్ అజ్ హా (బక్రీద్ పండుగ) కొంచము ముందుగా మరియు ఈదుల్ ఫిత్ర్ (రమజాను పండుగ) కొంచము ఆలస్యంగా చేయుట మంచిది. ఈదుల్ ఫిత్ర్ కు వెళ్ళే ముందు ఖర్జూరపు పండ్లు తిని వెళ్ళుట, ఈదుల్ అజ్ హాకు వెళ్ళే ముందు ఏమీ తినకుండా వెళ్ళుట ధర్మం. బురైద రజియల్లాహు అన్హు కథనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ కొంచమైనా భుజించని వరకు ఈదుల్ ఫిత్ర్ కు వెళ్ళకపోయేవారు. ఈదుల్ అజ్ హా చేసుకునెంత వరకు ఏమీ తినక పోయేవారు”. (అహ్మద్). పండుగ రోజు మంచి దుస్తులు ధరించుట అభిలషణీయం.
పండుగ నమాజ్ రెండు రకాతులు. ఇవి ఖుత్బకు ముందు చేయాలి. అందులో ఇమాం బిగ్గరగా ఖుర్ఆను పఠించాలి. పండుగ నమాజుకు అజాను, ఇఖామతు ఏదీ లేదు. ముందు తక్బీరె తహ్రీమ చెప్పి సనా చదవాలి. తరువాత ఏడు సార్లు అల్లాహు అక్బర్ అనాలి. ప్రతీ సారి చేతులు భుజాల వరకు ఎత్తాలి. తరువాత అఊజు బిల్లాహి మినష్షైతా నిర్రజీం, బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం మరియు సూరె ఫాతిహ, దాని తరువాత ఏదైన సూర చదవాలి. మొదటి రకాతు యొక్క రెండవ సజ్దా నుండి అల్లాహు అక్బర్ అంటూ నిలబడిన తరువాత ఐదు సార్లు అల్లాహు అక్బర్ అనాలి. ప్రతీ సారి చేతులు భుజాల వరకు ఎత్తాలి. సూరె ఫాతిహ మరో సూర చదివి రెండవ రకాతు పూర్తి చేయాలి. (మొదటి రకాతులో సూరె ఖాఫ్ లేదా సూరె అఅలా రెండవ రకాతులో సూరె ఖమర్ లేదా సూరె గాషియ చదవడం సున్నత్. (ముస్లిం 878, 891). (మొదటి రకాతులో ఏడు, రెండవ రకాతులో ఐదు తక్బీరుల విషయం అబూదావూదు 1149లో ఉంది).
పండుగ నమాజుకు ముందూ, వెనకా సున్నుతుగానీ, నఫిల్ గానీ ఏమీ లేవు. ఇమాంతో ఒక రకాతు పొందనివారు ఇమాం సలాం తింపిన తరువాత పూర్తి చేసుకోవాలి. ఇమాం ఖుత్బ ఇస్తున్న సమయంలో వచ్చినవారు కూర్చుండి ఖుత్బ వినాలి. ఖుత్బ ముగిసిన తరువాత పైన తెలిపిన విధానంలోనే నమాజ్ చేసుకోవాలి. ఒకరుంటే ఒంటరిగానే చేసుకోవాలి. ఇద్దరు ఇద్దరికంటే ఎక్కువ మంది ఉంటే జమాఅతుతో (సామూహికంగా) చేసుకోవాలి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారుః “ఎవరైతే జనాజలో హాజరై నమాజ్ చేసే వరకు ఉంటాడో అతనికి ఒక ఖీరాత్ పుణ్యం లభించును. మరెవరైతే ఖననం చేయబడే వరకు ఉంటాడో అతనికి రెండు ఖీరాతుల పుణ్యం లభించును”. రెండు ఖీరాతులంటే ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానంగా “రెండు పెద్ద కొండలు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. (బుఖారి 1325, ముస్లిం 945).
జనాజ నమాజ్ యొక్క నిబంధనలు:
నియ్యత్ (సంకల్పం). ఖిబ్లా దిశలో నిలబడుట. సత్ర్ (అచ్ఛాదన). వుజూ.
జనాజ నమాజ్ విధానం:
ఇమాం (నమాజ్ చేయించు వ్యక్తి) పురుషుని శవము యొక్క తలకు ఎదురుగా నిలబడాలి. స్త్రీ శవము యొక్క మధ్యలో నిలబడాలి. ఇతర నమాజీలు ఇమాం వెనక నిలబడాలి. అల్లాహు అక్బర్ అని అఊజు బిల్లా…. బిస్మిల్లా….. మరియు సూరె ఫాతిహ చదవాలి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని తషహ్హుద్ లో చదివే దరూదె ఇబ్రాహీం (అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్…) చదవాలి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని శవము కొరకు దుఆ చేయాలిః అల్లా హుమ్మగ్ ఫిర్ లిహయ్యినా వ మయ్యితినా వ షాహిదినా వ గాయిబినా వసగీరినా వకబీరినా వ జకరినా వ ఉన్ సానా, అల్లాహుమ్మ మన్ అహ్ యయ్ తహూ మిన్నా ఫ అహ్ యిహీ అలల్ ఇస్లామ్ వమన్ తవఫ్ఫైతహూ మిన్నా ఫతవఫ్ఫహూ అలల్ ఈమాన్, అల్లాహుమ్మ లా తహ్ రిమ్ నా అజ్రహూ వలా తుజిల్లనా బఅదహూ. మళ్ళీ అల్లాహు అక్బర్ అని కొన్ని సెకండ్లు నిలిచి సలాం తింపాలి.
భావం : ఓ అల్లాహ్ మాలో బ్రతికున్న వారిని, మరణించిన వారిని, హాజరుగా ఉన్నవారిని, దూరముగా ఉన్నవారిని, చిన్నలను, పెద్దలను, పురుషులను, స్త్రీలను క్షమింపుము. ఓ అల్లాహ్ మాలో ఎవరిని సజీవంగా ఉంచదలుచుకున్నావో వారిని ఇస్లాంపై స్థిరముగా ఉంచుము. మాలో ఎవరిని మరణింపజేయదలిచావో వారిని విశ్వాసముపై మరణింపజేయుము. ఓ అల్లాహ్ అతని చావుపై మేము వహించిన ఓపిక పుణ్యాలు మాకు లేకుండా చేయకుము. అతని చావు పిదప మమ్మల్ని ఉపద్రవం, సంక్షోభంలో పడవేయకుము.
ఎవరైనా గర్భిణీలకు పూర్తి నాలుగు నెలలు నిండిన తరువాత గర్భము పడిపోయి, చనిపోయినచో దాని యొక్క జనాజ నమాజ్ చదవాలి. నాలుగు నెలలు పూర్తి కాక ముందు గర్భము పడిపోయి, చనిపోయినచో నమాజ్ చేయకుండా దానము చేయాలి.
నమాజ్ చేయరాని వేళలు:
కొన్ని సమయాల్లో నమాజ్ చేయుట యోగ్యం లేదు. అవిః
1- ఫజ్ర్ నమాజ్ తర్వాత నుండి సూర్యోదయం తర్వాత సూర్యుడు బారెడంత పైకి వచ్చే వరకు.
2- మిట్ట మధ్యానం, సూర్యుడు నడి ఆకాశంలో, తలకు సమానంగా ఉన్నప్పుడు. అది పశ్చిమాన వాలే వరకు.
3- అస్ర్ నమాజ్ తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు.
కాని ఈ సందర్భాల్లో కొన్ని నమాజులు చేయవచ్చును. ఉదాః తహియ్యతుల్ మస్జిద్ (మస్జిదులో ప్రవేశించిన వెంటనే చేయు నమాజ్). జనాజా నమాజ్. సూర్య గ్రహ నమాజ్. తవాఫ్ సున్నతులు. తహియ్యతుల్ వుజూ లాంటివి.
అలాగే తప్పిపోయిన నమాజులు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీసు ఆధారంగాః
“ఎవరైనా ఏదైనా నమాజ్ మరచిపోతే, లేదా దాని సమయంలో నిద్రపోతే గుర్తు వచ్చిన వెంటనే దాన్ని నెరవేర్చడమే దాని ప్రాయశ్చితం”. (ముస్లిం 684, బుఖారి 597).
وصلى الله وسلم على نبنيا محمد وعلى آله و صحبه أجمعين والحمد لله رب العالمين
[1]క్రమ ప్రకారంగావుజూ చేయాలి. అంటేః 1 నుండి 8 వరకు ఉన్న క్రమం ప్రకారం వీటిలో వెనకా ముందు చేయకూడదు.
వెంటవెంటనేచేయాలి. అంటేః పై క్రమం ప్రకారం, ఒక అవయవం కడిగాక, దాని తడి ఆరక ముందే వెంటనే దాని వెనక అవయవం కడగాలి. మరీ ఆలస్యం చేయవద్దు.
[2] కొందరు బాలింత స్త్రీలు 15, లేదా 20, 25 రోజుల్లో రక్త స్రావం నిలిచిపోయినా 40 రోజుల తరువాతే గుస్ల్ చేస్తారు. ఆ తరువాతే నమాజు ఆరంభిస్తారు. వారు ఇలా చేసేది చాలా ఘోరమైన తప్పు. ఎప్పుడు రక్త స్రావం నిలిచినదో అప్పుడే గుస్ల్ చేయాలి. నమాజు మొదలెట్టాలి.
[3] రిబాత్ అంటే సత్యాసత్యాల మధ్య పోరాటం సాగే రోజుల్లో రాత్రిళ్ళు పహరా కాయడం అన్న మాట. శాంతి కాలంలో నమాజ్ పట్ల మక్కువ, పోరాటపు రోజుల్లో ప్రాణాలొడ్డి పహరాకాయడంతో సమానమని అర్థం.
[6]) దీని ఉదాహరణః ఒక వ్యక్తి మొదటి రకాతులో ఖిరాత్ తర్వతా రుకూ మరచిపోయి రెండు సజ్దాలు కూడా చేశాడనుకుందాము. రుకూ నమాజు ‘రుకున్’లలో ఒకటి. ఇక అతడు రెండవ రకాతు కొరకు నిలబడ్డాడు కాని ఖిరాత్ ఆరంభానికి ముందే అతనికి మరచిపోయిన రుకూ విషయం గుర్తొచ్చింది. అప్పుడు అతను రుకూ చేయాలి, రెండు సజ్దాలు చేయాలి. మళ్ళీ రెండవ రకాతు కొరకు నిలబడి యథా ప్రకారంగా నమాజు పూర్తి చేయాలి.
[7]) దీని ఉదాహరణః ఒక వ్యక్తి మొదటి రకాతులో ఖిరాత్ తర్వతా రుకూ మరచిపోయి రెండు సజ్దాలు కూడా చేశాడనుకుందాము. రుకూ నమాజు ‘రుకున్’లలో ఒకటి. ఇక అతడు రెండవ రకాతు కొరకు నిలబడి, ఖిరాత్ ఆరంభించిన తర్వాత గుర్తుకు వస్తే అతని ఆ రకాతు, ఎందులో అతను రుకూ మరచిపోయాడో అది కానట్లే. అందుకు ఈ రెండవ రకాతు మొదటి రకాతు స్థానంలో ఉంటుంది.
[8]) జహరీ నమాజు అంటే శబ్దంగా ఖుర్ఆను పారాయణం జరిగే ఫజ్ర్, మగ్రిబ్, ఇషా నమాజులు.
[9]) ముఖ్తదీ అంటే సామూహిక నమాజులో ఇమాం వెనక నమాజు చేయువారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ.
అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడని ఆయన ఏకైకుడని, ఆయనకు ఎవరు భాగస్వాములు లేరని సాక్ష్యమిచ్చుచున్నాను. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అని కూడా సాక్ష్యమిచ్చుచున్నాను. (ముస్లిం 234).
అజాన్ విన్నప్పుడు ముఅజ్జిన్ అన్నట్లు మీరు అనండి, కాని అతను “హయ్య అలస్సలాహ్, హయ్య అలల్ ఫలాహ్” అన్నప్పుడు మాత్రం “లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” (పుణ్యం చేసే మరియు పాపల నుండి దూరం ఉండే భాగ్యం అల్లాహ్ యే ప్రసా దించువాడు) అనండి. ఆ తర్వాత దరూదె ఇబ్రాహీం చదవండి. ఆ తర్వాత ఈ దుఆ కూడా చదవండిః
ఈ పరిపూర్ణ ఆహ్వానం మరియు స్థాపించబడే నమాజు యొక్క ప్రభువైన అల్లాహ్! ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు వసీల మరియు ఘనతలు ప్రసాదించు. మరియు నీవు వాగ్దానం చేసిన ‘మఖామె మహ్మూద్’ (ప్రశంసనీయమైన స్థానం) ప్రతిష్ఠింప జేయి).
పై దుఆలో పరిపూర్ణ ఆహ్వానం అంటే అజాన్ అని, వసీల అంటే స్వర్గంలో ఓ ఉన్నత స్థానం అని, అల్లాహ్ దాసుల్లో కేవలం ఒక్కడే దానికి అర్హుడు అని అర్థం. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు: “ఆ ఒక్కణ్ణి నేనే అవుతానని ఆశిస్తున్నాను.”
(ఓ అల్లాహ్ నా హృదయంలో వెలుగు ప్రసాదించు, నా నాలుకలో వెలుగు ప్రసాదించు, నా చెవిలో వెలుగు ప్రసాదించు, నా కళ్ళలో వెలుగు ప్రసా- దించు, నా వెనక వెలుగు ప్రసాదించు, నా ముందు వెలుగు ప్రసాదించు, నా పైన వెలుగు ప్రసాదించు, నా క్రింద వెలుగు ప్రసాదించు. ఓ అల్లాహ్ నాకు (ప్రళయ దినాన) వెలుగు ప్రసాదించు).
వెలుగు అంటే ధర్మం మరియు సత్యాన్ని స్పష్ట పరచడం అని భావం.
(ఓ అల్లాహ్ తూర్పు పడమరల మధ్య ఎంత దూరం ఉంచావో నన్ను పాపాలకు అంతే దూరంగా ఉంచు. ఓ అల్లాహ్ మాసిన బట్ట తెల్లనిబట్టలా ఎలా శుభ్రమవుతుందో నా పాపాలను అలా శుద్ధి చెయ్యి. నా పాపాలను నీరు, మంచు, వడగండ్లతో కడిగివెయ్యి). (బుఖారి 744, ముస్లిం 598).
2- సుబ్ హానకల్లాహుమ్మ వ బిహమ్దిక వ తబార కస్ముక వ తఆలా జద్దుక వ లాఇలాహ ఘైరుక.
(అల్లాహ్ నీవు అన్ని రకాల లోపాలకు అతీతునివి, నీకే సర్వ స్తోత్రములు, నీ నామమే శుభము గలది. నీ ఔన్నత్యం, అనుగ్రహం ఉన్నతమైనది. నీవు తప్ప సత్యమైన ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. (అబూదావూద్ 775, తిర్మిజి 242. అల్బానీ సహీ అని అన్నారు).
3- అల్ హందులిల్లాహి హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్.
(ఓ అల్లాహ్! జిబ్రాఈల్, మీకాఈల్ మరియు ఇస్రాఫీల్ యొక్క ప్రభువా! భూమ్యాకాశాల సృష్టికర్తా! గోచర అగోచరాల జ్ఞానీ! నీవే నీ దాసుల మధ్య ఉన్న విభేదాలను గురించి తీర్పు చేయువానివి. ఏ సత్య విషయంలో విభేదించడం జరిగినదో అందులో నీ దయతో నాకు మార్గం చూపుము, నిశ్చయంగా నీవు కోరినవారికి సన్మార్గం చూపుతావు). (ముస్లిం 770).
6- వజ్జహ్ తు వజ్ హియ లిల్లజీ ఫతరస్సమావాతి వల్ అర్ జ హనీఫవ్ వమా అన మినల్ ముష్రికీన్ ఇన్న సలాతీ వ నుసుకీ వ మహ్ యాయ వ మమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ లా షరీక లహూ వ బిజాలిక ఉమిర్తు వ అన అవ్వలుల్ ముస్లిమీన్ అల్లా హుమ్మ అంతల్ మలికు లాఇలాహ ఇల్లా అంత, అంత రబ్బీ వ అన అబ్దుక జలంతు నఫ్సీ వఅతరఫ్ తు బిజంబీ ఫగ్పిర్ లీ జునూబీ జమీఅన్ ఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత వహ్ దినీ లిఅహ్ సనిల్ అఖ్లాఖి లా యహ్ దీ లిఅహ్ సనిహా ఇల్లా అంత వస్రిఫ్ అన్నీ సయ్యిఅహా లా యస్రిఫ్ అన్నీ సయ్యిఅహా ఇల్లా అంత లబ్బైక వ సఅదైక వల్ ఖైరు కుల్లుహూ ఫీ యదైక వష్షర్రు లైస ఇలైక అన బిక వ ఇలైక తబారక్త వ తఆలైత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక.
(నేను నా ముఖాన్ని ఏకాగ్రచిత్తంతో భూమ్యాకాశాలను సృష్టించిన వాని వైపునకు త్రిప్పుకుంటున్నాను. నేను బహుదైవారాధకులలోని వాడిని కాను. నా నమాజ్, నా ఖుర్బానీ, నా జీవనం మరియు నా మరణం సర్వ లోక ప్రభువైన అల్లాహ్ కే అంకితం. ఆయన సహవర్తులెవరూ లేనివాడు. నాకు దీని గురించిన ఆజ్ఞే ఇవ్వబడింది. నేను ముస్లింలలోని వాడిని. ఓ అల్లాహ్! నీవే యజమానివి. నీవే ఆరాధ్యుడవు. నీవు తప్ప మరో ఆరాధ్యుడు లేడు. నీవే నా ప్రభువువి. నేను నీ దాసుడిని. నేను నా ఆత్మకు అన్యాయం చేసుకున్నాను. నేను నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను. కనుక నా పాపాలన్నింటినీ మన్నించు. నీవు తప్ప పాపాలను మన్నిం చగల వాడెవడూ లేడు. నన్ను సêత్పవర్తన వైపునకు నడిపించు, సêత్పవర్తన వైపునకు మార్గదర్శకత్వం చూపేవాడు నీవు తప్ప ఎవ్వడూ లేడు. నా దుర్గుణాలను నా నుండి దూరం చెయ్యి. నన్ను దుర్గుణాల నుండి దూరం చేయువాడు నీ తప్ప ఎవ్వడూ లేడు. నీ సమక్షంలో హాజరవుతున్నాను. దీనిని నా అదృష్టంగా భావిస్తున్నాను. సర్వ మేళ్ళు నీ స్వాధీనంలో ఉన్నాయి. నీ తరఫు నుండి ఎన్నటికీ కీడు ఉండదు. నేను నీ వల్లనే ఉన్నాను. నీ వైపే మరలుతాను. నీవు శుభప్రదమైనవాడివి, ఉన్నతుడివి. పాపాల మన్నింపుకై నిన్నే వేడుకుంటున్నాను. పశ్చాత్తాప భావంతో నీ వైపునకే మరలుతున్నాను. (ముస్లిం 771).
(అల్లాహ్ నీ కొరకు రుకూ చేశాను. నిన్ను విశ్వసిం చాను. నీకే శిరసవహించాను. నా చెవులు, కళ్ళు, మెదడు, ఎముక మరియు నరాలు నీ కొరకే నమ్రత చూపుతున్నాయి). (ముస్లిం 771).
(మా ప్రభువైన ఓ అల్లాహ్! ఆకాశాలు నిండిపోయేంత, భూమి నిండి పోయేంత, భూమ్యాకాశాల మధ్య నిండిపోయేంత మరియు ఆ తర్వాత నీవు కోరిన ప్రతీది నిండిపోయేంత ప్రశంసలు నీ కొరకే). (ముస్లిం 476).
3- రబ్బనా లకల్ హందు మిల్ఉస్సమావాతి వల్ అర్జి వ మిల్ఉ మా షిఅత మిన్ షైఇమ్ బఅదు అహ్ లస్సనాఇ వల్ మజ్ది అహఖ్ఖు మా ఖాలల్ అబ్దు వ కుల్లునా లక అబ్దున్, అల్లాహుమ్మ లా మానిఅ లిమా అఅతైత వ లా ముఅతియ లిమా మనఅత వలా యన్ ఫఉ జల్ జద్ది మిన్కల్ జద్దు. (ముస్లిం 477).
(భూమ్యాకాశాలు నిండిపోవునంత, ఆ తర్వాత నీవు కోరిన ప్రతీది నిండి- పోవునంత ప్రశంసలు నీ కొరకే ఓ మా ప్రభువా! ఘనతలకు, పొగడ్తలకు అధిపతి అయిన, దాసుడు పొగిడే దానికి నీవు అర్హుడవైనవాడా!. మేమందరమూ నీకే దాసులం. ఓ అల్లాహ్! నీవు ప్రసాదించే దానిని అడ్డుకునేవాడెవడూ లేడు. నీవు ఇవ్వని దానిని ఇచ్చేవాడూ లేడు. ఎవరి పెద్దరికం, ఐశ్వర్యం నీ శిక్ష ముందు వారికి లాభం చేకూర్చ లేవు).
(ఉన్నతుడైన నా ప్రభువు పరిశుద్ధుడు). (ముస్లిం 772). ఒక్కసారి చదవడం విధిగా ఉంది. ఎక్కువ సార్లు చదవడం చాలా మంచిది.
2- సుబ్ హానకల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దిక అల్లాహుమ్ మగ్ఫిర్లీ.
سُبْحَانَكَ اللَّهُمَّ رَبَّنَا وَبِحَمْدِكَ اللَّهُمَّ اغْفِرْلِي (మా ప్రభువైన ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధునివి, నీకే స్తోత్రములు, ఓ అల్లాహ్ నన్ను మన్నించు). (బుఖారి 794, ముస్లిం 484).
سُبْحَانَ ذِي الجَبَرُوتِ وَالمَلَكُوتِ وَالْكِبرِيَاءِ وَالْعَظْمَةِ (సార్వభౌమాధికారి, సర్వాధిపతి, గొప్పవాడు మరియు ఘనుడు అయిన అల్లాహ్ ఎంతో పరిశుద్ధుడు (అబూదావూద్ 873, నిసాయి 1049. అల్బానీ ఈ హదీసు సహీ అని అన్నారు).
5- అల్లాహుమ్మగ్ఫిర్లీ జంబీ కుల్లహూ దిఖ్ఖహూ వ జిల్లహు వ అవ్వలహూ వ ఆఖిరహూ వ అలానియతహూ వ సిర్రహూ.
6- అల్లాహుమ్మ లక సజత్తు వ బిక ఆమంతు వ లక అస్లమ్ తు సజద వజ్ హియ లిల్లజీ ఖలకహు వ సవ్వరహు వ షక్క సమ్అహు వ బసరహు తబారకల్లాహు అహ్ సనుల్ ఖాలికీన్.
اللَّهُمَّ لَكَ سَجَدْتُ وَبِكَ آمَنْتُ وَلَكَ أَسْلَمْتُ سَجَدَ وَجْهِي لِلَّذِي خَلَقَهُ وَصَوَّرَهُ وَشَقَّ سَمْعَهُ وَبَصَرَهُ تَبَارَكَ اللَّهُ أَحْسَنُ الْخَالِقِينَ (ఓ అల్లాహ్ నేను నీ కొరకు సజ్దా చేశాను, నిన్ను విశ్వసించాను, నీకే శిరసవహించాను, నా ముఖం దానిని సృష్టించిన, ఆకారం ఇచ్చిన, చెవి, కళ్ళు ఇచ్చిన అల్లాహ్ కు సజ్దా చేసింది. అతి ఉత్తమ సృష్టికర్త అయిన అల్లాహ్ చాలా శుభాలు కలవాడు). (ముస్లిం 771).
7- అల్లాహుమ్మ అఊజు బిరిజాక మిన్ సఖతిక వ బిముఆఫాతిక మిన్ ఉఖూబతిక వ అఊజు బిక మిన్క లా ఉహ్ సీ సనాఅన్ అలైక అంత కమా అస్నైత అలా నఫ్సిక.
اللَّهُمَّ أَعُوذُ بِرِضَاكَ مِنْ سَخَطِكَ وَبِمُعَافَاتِكَ مِنْ عُقُوبَتِكَ وَأَعُوذُ بِكَ مِنْكَ لَا أُحْصِي ثَنَاءً عَلَيْكَ أَنْتَ كَمَا أَثْنَيْتَ عَلَى نَفْسِكَ (ఓ అల్లాహ్! నీ అప్రసన్నత నుండి నీ ప్రసన్నత శరణు, నీ శిక్ష నుండి నీ మన్నింపు శరణు కోరుతున్నాను. నిన్ను నీవు ఎలా స్తుతించుకున్నావో అలా నేను నీ స్తోత్రాలను లెక్కించలేను).(ముస్లిం 486).
సజ్దాలో ఉన్నప్పుడు ఎక్కువగా దుఆ చేయడం మంచిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం ఈ హదీసు ఆధారంగాః “దాసుడు తన ప్రభువుకు అత్యంత సమీపంగా ఉండేది సజ్దా స్థితిలో. అందుకు మీరు అందులో దుఆ ఎక్కు వగా చేయండి”. (ముస్లిం 482).
اللَّهُمَّ اغْفِرْلِي وَارْحَمْنِي وَعَافِنِي وَاهْدِنِي وَارْزُقْنِي (ఓ అల్లాహ్ నన్ను క్షమించు, కరుణించు, నాకు స్వస్తత, సన్మార్గం మరియు ఆహారం ప్రసాదించు). (అబూదావూద్ 850).
(నా వాక్కు, దేహా, ధన సంబంధమైన ఆరాధనలన్ని యూ అల్లాహ్ కొరకే ఉన్నవి. ఓ ప్రవక్తా! మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆయన శుభాలు కురువుగాకా. అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు, సందేశహరుడని సాక్ష్యమిస్తున్నాను).
అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రా హీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదు మ్మజీద్. (బుఖారి 3370).
(ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీంను, వారి కుటుంబీకులను కరుణించినట్లు ముహమ్మద్ మరియు వారి కుటుంబీకులను కరుణించు. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి. ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీం, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేసినట్లు ముహమ్మద్, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేయుము. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి.).
(ఓ అల్లాహ్! సమాధి శిక్ష నుండి, నరక యాతన నుండి, జీవన్మర ణాల విపత్తు నుండి మరియు మసీహుద్దజ్జాల్ ఉపద్రవం నుండి నీ శరణు వేడుచున్నాను.) (బుఖారి 1377, ముస్లిం 588).
(ఓ అల్లాహ్ నా ఆత్మకు నేను చాలా అన్యాయం చేసు కున్నాను. నీవు తప్ప పాపాలను క్షమించేవారు మరెవ్వరూ లేరు. నీవు నీ ప్రత్యేక అనుగ్రహంతో నన్ను క్షమించు, నా మీద దయచూపు, నిశ్చ యంగా నీవు క్షమించే- వాడవు, కరుణామయుడవు). (బుఖారి 834).
3- అల్లాహుమ్ మగ్ఫిర్లీ మా ఖద్దమ్తు వమా అఖ్ఖర్తు వమా అస్ రర్తు వమా అఅలన్తు వమా అస్ రఫ్తు వమా అంత అఅలము బిహీ మిన్నీ అంతల్ ముఖద్దిము వ అంతల్ ముఅఖ్ఖిరు లా ఇలాహ ఇల్లా అంత.
(అల్లాహ్! నా పూర్వ పాపాలను, జరగబోయే పాపాలను, రహస్యంగా చేసిన పాపాలను, బహిరంగంగా చేసిన పాపాలను మరియు నా మితిమీరినతనాన్ని కూడా క్షమించు. మరికొన్ని పాపాలు ఉండవచ్చు, వాటి గురించి నా కంటే ఎక్కువ నీకే బాగా తెలుసు, వాటిని కూడా నీవు క్షమించు. ముందుకు నడిపించేవాడివి, వెనక్కి నెట్టేవాడివి నీవే. నీవు తప్ప వెరొక ఆరాధ్యుడు లేడు).
(ఓ అల్లాహ్ (మంచి పనులు) చేయలేకపోవటం నుంచి, శక్తి ఉండ కూడా సోమరితనానికి లోనవటం నుంచి, పిరికితనం నుంచి, నికృష్టమైన వృద్ధాప్యం నుంచి నీ శరణు కోరుతున్నాను. ఇంకా సమాధి శిక్ష నుండి మరియు జీవన్మరణాల ఉపద్రవం నుంచి నీ శరణు కోరుతున్నాను). (ముస్లిం 2706, బుఖారి 2823).
అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఓ హదీసులో తషహ్హుద్ దుఆ నేర్పుతూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: “ఆ తర్వాత తనకిష్టమైన దుఆ చేసుకోవాలి”. (బుఖారి 835).
اَسْتَغْفِرُ الله ، اَسْتَغْفِرُ الله ، اَسْتَغْفِرُ الله ، اَللهُمَّ أَنْتَ السَّلامُ ومِنْكَ السَّلامُ تَبَارَكْتَ يَا ذَا الجَلالِ وَ الإكْرَام.
(అల్లాహ్ నీ క్షమాభిక్ష కోరుతున్నాను… అల్లాహ్ నీవే సలాం. శాంతి నీ నుండి లభిస్తుంది. ఔన్నత్యం, గొప్ప దనాలు గలవాడా నీవు గొప్ప శుభాలు కలవాడివి). (ముస్లిం 592).
(అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన ఏకైకుడు, సాటిలేనివాడు. విశ్వసామ్రాజ్యం ఆయనదే. స్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయన సర్వాధికారుడు. ఓ అల్లాహ్! నీవు ప్రసాదించే దానిని అడ్డుకునే- వాడెవడూ లేడు. నీవు ఇవ్వని దానిని ఎవ్వడూ ఇవ్వలేడు. ఎవరి పెద్దరికం, ఐశ్వర్యం నీ శిక్ష ముందు వారికి లాభం చేకూర్చ లేవు). (ముస్లిం 593).
(అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన ఏకైకుడు, సాటిలేనివాడు. విశ్వసామ్రాజ్యం ఆయనదే. స్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయన సర్వాధికారుడు. పుణ్యాలు చేసే, పాపాల నుండి దూరముండే భాగ్యం అల్లాహ్ యే ప్రసాదించువాడు, ఆ అల్లాహ్ తప్ప వెరొక ఆరాధ్యుడు లేడు. మేము ఆయన్నే ఆరాధిస్తాము. వరాలు, అనుగ్రహాలు ఆయన ప్రసాదించినవే. మంచి స్తోత్రాలు ఆయనకే శోభిస్తాయి. అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. సత్యతిరస్కారులకు ఎంత అయిష్టకరంగా ఉన్నా సరే మేము మా ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకున్నాము).
ఆ తర్వాత సుబ్ హానల్లాహ్ 33 సార్లు, అల్ హందులిల్లాహ్ 33 సార్లు, అల్లాహు అక్బర్ 33 సార్లు అనాలి. వంద పూర్తి చేయుటకు ఒక్కసారి అనాలిః “లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్“. (ముస్లిం 597).
(అల్లాహ్ ఇతడ్ని క్షమించు, ఇతనిని కరుణించు, శిక్ష నుండి కాపాడు, మన్నించు, ఇతడ్ని ఆదరించి మర్యాద చెయ్యి, ఇతని సమాధిని విశాల పరచు, ఇతడ్ని నీళ్ళతో, మంచుతో, వడగళ్ళతో కడిగి తెల్లని వస్త్రాన్ని మురికి లేకుండా శుభ్రం చేసినట్లు పాపాల నుండి ఇతన్ని పరిశుభ్రం చెయ్యి. ఇతనికి ఇహలోకపు ఇల్లు కన్నా మంచి ఇల్లునీ, ఇహలోకపు పరివారంకన్నా ఉత్తమ పరివారాన్నీ, ఇహలోకపు జంటకంటే మంచి జంట ఇవ్వు. ఇతన్ని స్వర్గంలోకి ప్రవేశింపజెయ్యి. సమాధి శిక్ష నుండి, అగ్ని శిక్ష నుండి కాపాడు).
(ఏదైనా పని గురించి ఆలోచించి, ఎలా చేస్తే మేలుంటుంది అనుకున్నప్పుడు ఏ ఒక నిర్ణయానికి రాక ముందు ఫర్జ్ నమాజు కాకుండా రెండు రకాతుల నఫిల్ నమాజు చేసి సలాంకు ముందు తషహ్హుద్ చివరిలో లేదా సలాం తింపిన తర్వాత ఈ క్రింది దుఆ చేయవలెను. అయితే “అన్న హాజల్ అమ్ర” అన్న చోట తన అవసరాన్ని గురించి ఆలోచించుకోవాలి, లేదా అవసరాన్ని ప్రస్తావించాలి).
అల్లాహుమ్మ ఇన్నీ అస్తఖీరుక బిఇల్మిక వ అస్తఖ్దిరుక బి ఖుద్రతిక వ అస్అలుక మిన్ ఫజ్లికల్ అజీం ఫఇన్నక తఖ్దిరు వలా అఖ్దిరు వ తఅలము వలా అఅలము వ అంత అల్లాముల్ గుయూబ్, అల్లాహుమ్మ ఇన్ కుంత తఅలము అన్న హాజల్ అమ్ర ఖైరుల్లీ ఫీ దీనీ వ మఆషీ వ ఆఖిబతి అమ్రీ ఔ ఖాల ఆజిలి అమ్రీ వ ఆజిలిహీ ఫఖ్దుర్ హు లీ వ యస్సిర్ హు లీ సుమ్మ బారిక్ లీ ఫీహి వ ఇన్ కుంత తఅలము అన్న హాజల్ అమ్ర షర్రుల్లీ ఫీ దీనీ వ మఆషీ వ ఆఖిబతి అమ్రీ ఔ ఖాల ఫీ ఆజిలి అమ్రీ వ ఆజిలిహీ ఫస్రిఫ్ హు అన్నీ వస్రిఫ్ నీ అన్హు వఖ్ దుర్ లియల్ ఖైర హైసు కాన సుమ్మ అర్జినీ బిహీ.
(అల్లాహ్! నీ జ్ఞానంతో నేను శుభాలను అడుగుతున్నాను. నీ అధికార సాయంతో శక్తిని ప్రసాదించమని కోరుతున్నాను. మహోత్తరమైన నీ అనుగ్రహాన్ని ప్రసాదించమని అభ్యర్తిస్తున్నాను. నిశ్చయంగా నువ్వు అధికారం గలవాడివి. నాకు ఎలాంటి అధికారమూ లేదు. నీకు అన్నీ తెలుసు, నాకు ఏమీ తెలియదు. అగోచర జ్ఞానివి నీవే. అల్లాహ్! నీ జ్ఞానం ప్రకారం ఈ పని ధార్మి కంగా, ప్రాపంచికంగా, పరలోక పరిణామం రీత్యా (లేదా) త్వరగా లేక ఆలస్యంగా నాకు ప్రయోజనకరమైతే దాన్ని నా అదృష్టంలో ఉంచు. దాని సాధనను నా కొరకు సులభతరం చెయ్యి. దాన్ని నా కొరకు శుభప్రదమైనదిగా చెయ్యి. కాని ఒకవేళ నీ జ్ఞానం ప్రకారం ఈ పని ధార్మికంగా, ప్రాపంచికంగా, పరలోక పరిణామం రీత్యా (లేదా) త్వరగా గానీ, ఆలస్యంగా గానీ నాకు నష్టం కలిగించేదయితే దాన్ని నా నుండి దూరంగా ఉంచు. దాని బారి నుండి నన్ను కాపాడు. సాఫల్యం ఎక్కడున్నాసరే దాన్ని నా అదృష్టంగా మలచు. ఆ తర్వాత నా మనసు దానిపై కుదుటపడేలా చెయ్యి) (బుఖారి 1166).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఉన్నత చదులు ఎన్ని చదివినా ఫలితము ఉండబోదురా ! సృష్టికర్తను గ్రహించలేని డిగ్రీలన్నీ వ్యర్ధమురా!
మానువుడు దాసుడు, అల్లాహ్ యజమాని, దాసుడు ఎల్లవేళల్లో తన యజమాని ఆజ్ఞాపాలనలో, ఆయనను స్మరిస్తూ, స్తుతిస్తూ ఉండాలి.
ఈనాడు శాంతి ఎందుకు కరువైపోయింది?
జీవితాలు ఎందుకు దుర్భరమైపోయాయి?
సుఖపరమైన నిద్ర ఎందుకు కోల్పాయాము?
పరస్పరంలో ప్రేమలు ఎందుకు లోపించాయి?
భూతపిశాచుల భయం ఎలా అధికమయ్యింది?
వీటన్నిటికి ఒకే సమాధానం: మనం ఎప్పుడు అల్లాహ్ ను ఎలా స్మరించాలో, అప్పుడు అలా స్మరించడం మరచిపోయాము. మరియు సామాన్యుల ఆలోచన ఏమిటంటే; అల్లాహ్ స్మరణ చేస్తూ ఉండడం అనేది మనపని కాదు, మౌల్వీ సాబులు, సమాధికి అతిచేరువులో ఉన్న వృద్ధుల పని అని. (నఊజుబిల్లాహ్). అల్లాహ్ స్మరణలోని ప్రయోజనాలు తెలియుటకు ఈ చిరుపుస్తకం చదివి చూడండి.
ఈ చిరుపుస్తకాన్ని మీరు ఎల్లవేళల్లో మీ వెంటే ఉంచుకొని ఏ సందర్భంలో ఏ దుఆ చదవాలో ఆ దుఆ చూచి చదవండి. ఇలా కొద్ది రోజుల్లో అనేక దుఆలు మీరు కంఠస్తం చేసుకోగల్గుతారు. వేరే ప్రత్యేక సమయం కేటాయించే అవసరమే ఉండదు. ఇన్నీ దుఆలను ఎప్పుడు కంఠస్తం చేయాలి? అని దీనిని మూలకు పడేయంకండి, ఇలా ఎన్నో మేళ్లను కోల్పోతారు.
ఇది చిరుపుస్తకం గనక ప్రతి దుఆ యొక్క ఆధారం సంక్షిప్తంగా ఇవ్వబడింది. మరిన్ని ఎక్కువ దుఆలతో, సంపూర్ణ ఆధారాలతో మరో పుస్తకం తయారు చేసే భాగ్యం అల్లాహ్ ప్రసాదించుగాక! ఆమీన్.
ఈ దుఆ చదివిన వెంటనే ‘అల్లాహ్ నన్ను క్షమించు’ అని లేదా మరేదైనా దుఆ చేస్తే స్వీకరించ బడుతుంది. ఒకవేళ వుజూ చేసుకొని నమాజు చేస్తే అదీ అంగీకరింపబడుతుంది. (బుఖారి 1154)
2- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి మేల్కొన్నప్పుడు సూర ఆలె ఇమ్రాన్ యొక్క చివరి పది ఆయతులు (3: 190-200) పారాయణం చేసేవారు. (ముస్లిం 763, బుఖారి 183).
(అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు వెరొకడు లేడని, ఆయన ఏకైకుడని, ఆయనకు ఎవరూ భాగస్వాములు లేరని సాక్ష్యమిచ్చుచున్నాను. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అని కూడా సాక్ష్యమిచ్చుచున్నాను).
పై దుఆ చదివినవారి కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి. అతను ఎందులో నుండైనా ప్రవేశించవచ్చు. మరో హదీసులో ఈ పదాలు అదనంగా ఉన్నాయిః
అల్లాహుమ్మజ్అల్ నీ మినత్తవ్వాబీన వజ్ అల్ నీ మినల్ ముతతహ్హిరీన్. (తిర్మిజి 55).
(ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధునివి, నీకే సర్వస్తోత్రములు, నీవు తప్ప సత్యమైన ఆరాధ్యుడు వేరొకడు లేడని నేను సాక్ష్యమిచ్చుచున్నాను. నీ వైపునకే మరలుచున్నాను మరియు నా పాపాల మన్నింపుకై నిన్నే వేడుకుంటున్నాను).
వుజూ తర్వాత పై దుఆ చదివినవారి పేరు తోలు పత్రంపై వ్రాయబడుతుంది. ముద్ర వేయబడుతుంది. ప్రళయదినం వరకు తీయబడదు. (నిసాయీ ఫిల్ కుబ్రా 9909. 6/25. సహీహుత్తర్గీబ్ 225. సహీహుల్ జామిఅ’ 6170.).
దుస్తులు ధరిస్తూ
అల్ హందులిల్లాహిల్లజీ కసానీ హాజస్సౌబ వ రజఖనీహి మిన్ గైరి హౌలిమ్ మిన్నీ వలా ఖువ్వహ్.
(ఓ అల్లాహ్! సర్వ స్తోత్రములు నీకే, నీవే నాకు ఈ దుస్తులు తొడిగించావు, ఇందులో ఉన్న మేలు మరియు దేని కొరకు ఇది తయారు చేయబడిందో ఆ మేలును నీతో కోరుతున్నాను, ఇందులోని కీడు మరియు దేని కొరకు తయారు చేయబడిందో ఆ కీడు నుండి నీ శరణులో వస్తున్నాను).
కొత్త వస్త్రాలు తొడిగిన వ్యక్తిని చూసి
తుబ్లీ వ యుఖ్లిఫుల్లాహు తఆలా
تُبْلِى وَيُخْلِفُ اللهُ تَعَالَى
(నీవు దీనిని పాతబడే వరకు తొడుగు, అల్లాహ్ దానికి బదులుగా మరొకటి ప్రసాదిస్తాడు). (అబూదావూద్ 4020).
(నేను స్వయంగా మార్గం తప్పడం నుండి, లేదా తప్పించబడటం నుండి, జారటం నుండి లేదా జారింపబడుట నుండి, నేను ఎవరినైనా బాధించడం నుండి లేదా ఎవరిచేతనైనా బాధింపబడటం నుండి, నేను ఎవరితోనైనా అసభ్యంగా, మూర్ఖంగా ప్రవర్తించుట నుండి లేదా ఎవరైనా నాతో అలా ప్రవర్తించుట నుండి నేను నీ శరణు కోరుతున్నాను ఓ అల్లాహ్!).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు తమ దృష్టి ఆకాశం వైపు సారించి పై దుఆ పఠించేవారు. (అబూ దావూద్ 5094).
ఇంట్లో ప్రేవేశిస్తూ
అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఖైరల్ మౌలజి వ ఖైరల్ మఖ్రజి బిస్మిల్లాహి వలజ్నా వ బిస్మిల్లాహి ఖరజ్నా వఅలల్లాహి రబ్బినా తవక్కల్నా. (అబూదావూద్ 5096).
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ خَيْرَ الْمَوْلَجِ وَخَيْرَ الْمَخْرَجِ بِسْمِ الله وَلَجْنَا وَبِسْمِ الله خَرَجْنَا وَعَلَى الله رَبِّنَا تَوَكَّلْنَا
(ఓ అల్లాహ్! నేను ఇంట్లో ప్రవేశిస్తూ, బయటికి వెళ్తూ శుభం కలగాలని నిన్నే వేడుకుంటున్నాను. అల్లాహ్ పేరుతో ప్రవేశించాము, అల్లాహ్ పేరుతోనే బైటికి వెళ్ళాము, మా ప్రభువైన అల్లాహ్ పై నమ్మకం ఉంచాము).
మనిషి ఇంట్లో ప్రవేశిస్తూ, భోజనం చేస్తూ అల్లాహ్ ను స్మరిస్తే, షైతాన్ తన తోటివాళ్ళతో ఈ ఇంట్లో మీకు నివాస స్థలం లేదు, భోజనం లేదు అని అంటాడు. (ముస్లిం 2018).
(ఓ అల్లాహ్ నా హృదయంలో వెలుగు ప్రసాదించు, నా నాలుకలో వెలుగు ప్రసాదించు, నా చెవిలో వెలుగు ప్రసాదించు, నా కళ్ళలో వెలుగు ప్రసాదించు, నా వెనక వెలుగు ప్రసాదించు, నా ముందు వెలుగు ప్రసాదించు, నా పైన వెలుగు ప్రసాదించు, నా క్రింద వెలుగు ప్రసాదించు. ఓ అల్లాహ్ నాకు (ప్రళయ దినాన) వెలుగు ప్రసాదించు).
ఇందులో వెలుగు అంటే ధర్మం, సత్యం స్పష్టపరచడం అని భావం.
మస్జిదులో ప్రవేశించినప్పుడు
[1] అఊజు బిల్లాహిల్ అజీం వ బివజ్ హిహిల్ కరీం వ సుల్తానిహిల్ ఖదీం మినష్షైతానిర్రజీం.
(ఓ అల్లాహ్! నా పాపాలు క్షమించు మరియు నా కొరకు నీ కృప, దయ ద్వారాలను తెరుచు).
అజాన్ సమాధానం, దాని పిదప దుఆ
మనస్ఫూర్తిగా అజాన్ యొక్క జవాబిచ్చిన వారికి స్వర్గం లభించును. కాని “హయ్య అలస్సలాహ్, హయ్య అలల్ ఫలాహ్” విన్నప్పుడు “లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” (పుణ్యం చేసే మరియు పాపల నుండి దూరం ఉండే భాగ్యం అల్లాహ్ యే ప్రసాదించువాడు) అనాలి. దాని తర్వాత దరూదె ఇబ్రాహీం చదివిన వారిపై అల్లాహ్ యొక్క పది కరుణలు కురుస్తాయి. ఆ తర్వాత క్రింది దుఆ చదివిన వారికి ప్రళయదినాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు లభిస్తుంది. (ముస్లిం 385, 384.).
(ఈ పరిపూర్ణ ఆహ్వానం మరియు స్థాపించబడే నమాజు యొక్క ప్రభువైన అల్లాహ్! ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు వసీల మరియు ఘనతలు ప్రసాదించు. మరియు నీవు వాగ్దానం చేసిన ‘మఖామె మహ్మూద్’ (ప్రశంసనీయమైన స్థానం) ప్రతిష్ఠంపజేయి).
పై దుఆలో పరిపూర్ణ ఆహ్వానం అంటే అజాన్ అని, ‘వసీల’ అంటే స్వర్గంలో ఓ ఉన్నత స్థానం అని, అల్లాహ్ దాసుల్లో కేవలం ఒక్కడే దానికి అర్హుడు అని అర్థం. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారుః ఆ ఒక్కణ్ణి నేనే అవుతానని ఆశిస్తున్నాను.
2- వ అన అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహూ వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ, రజీతు బిల్లాహి రబ్బా వబి ముహమ్మదిర్ రసూలా వబిల్ ఇస్లామి దీనా.
(అల్లాహ్ తప్ప సత్యమైన ఆరాధ్యుడు వేరొకడు లేడని, ఆయన ఏకైకుడని, ఆయనకు ఎవరూ సాటి లేరని నేను సాక్ష్యమిచ్చుచున్నాను. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ప్రవక్త అని సాక్ష్యమిస్తున్నాను. అల్లాహ్ నా ప్రభువు అని, ముహమ్మద్ (అల్లాహ్ యొక్క) ప్రవక్త అని మరియు ఇస్లాం నా ధర్మం అని ఇష్టపడ్డాను). (ముస్లిం 386).
పై దుఆ చదివిన వారి పాపాలు మన్నించబడతాయి.
తక్బీరె తహ్రీమ తర్వాత ఈ క్రింది దుఆల్లో ఏదైనా ఒకటి చదవండి
ఓ అల్లాహ్ తూర్పు పడమరల మధ్య ఎంత దూరం ఉంచావో నన్ను పాపాలకు అంతే దూరంగా ఉంచు. ఓ అల్లాహ్ మాసిన బట్ట తెల్లనిబట్టలా ఎలా శుభ్ర మవుతుందో నా పాపాలను అలా శుద్ధి చెయ్యి. నా పాపాలను నీరు, మంచు, వడగండ్లతో కడిగివెయ్యి.
2- సుబ్ హానకల్లాహుమ్మ వ బిహందిక వ తబార కస్ముక వ తఆలా జద్దుక వ లాఇలాహ ఘైరుక.
(అల్లాహ్ నీవు అన్ని రకాల లోపాలకు అతీతునివి, నీకే సర్వ స్తోత్రములు, నీ నామమే శుభము గలది. నీ ఔన్నత్యం, అనుగ్రహం ఉన్నతమైనది. నీ తప్ప సత్యమైన ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. (తిర్మిజి 242. షేఖ్ అల్బానీ సహీ అన్నారు).
3- అల్ హందులిల్లాహి హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్.
(ఎనలేని ఉత్తమమైన, శుభప్రదమైన స్తోత్రములు అల్లాహ్ కొరకే).
పై పదాలు వ్రాయడానికి 12 దైవదూతలు పరస్పరం పోటిపడ్డారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. (ముస్లిం 600).
4- అల్లాహు అక్బరు కబీరా వల్ హందు లిల్హాహి కసీరా వ సుబ్ హానల్లాహి బుక్రతవ్ వ అసీలా.
اللهُ أَكْبَرُ كَبِيرًا وَالْحَمْدُ لِله كَثِيرًا وَسُبْحَانَ الله بُكْرَةً وَأَصِيلًا
(అల్లాహ్ చాలా గొప్పవాడు, ఎనలేని స్తోత్రములు అల్లాహ్ కొరకే, ఉదయం, సాయంత్రం ఆయనకే పవిత్రతలు).
పై పదాల వల్ల నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకనగ వాటి వల్ల ఆకాశ ద్వారాలు తెరువబడ్డాయి అని ప్రవక్త చెప్పారు. ఇబ్ను ఉమర్ ప్రవక్తగారి ఈ మాట విన్నప్పటి నుండి ఎన్నడూ వీటిని చదవడం మానుకోలేదు. (ముస్లిం 601). మరో ఉల్లేఖనంలో ఉందిః పై దుఆ మూడు సార్లు చదివి, తర్వాత ఇది చదవాలి అనిః అఊజు బిల్లాహి మినష్షైతాని మిన్ నఫ్ ఖిహీ వ నఫ్ సిహీ వ హంజిహీ. أَعُوذُ بِالله مِنَ الشَّيْطَانِ مِنْ نَفْخِهِ وَنَفْثِهِ وَهَمْزِهِ (అబూ దావూద్/ మా యుస్తఫ్తహు బిహిస్సలాతు… 764).
(జిబ్రాఈల్, మీకాఈల్ మరియు ఇస్రాఫీల్ యొక్క ప్రభువైన ఓ అల్లాహ్! భూమ్యాకాశాల సృష్టికర్త, గోచర అగోచరాల జ్ఞాని, నీవే నీ దాసుల మధ్య ఉన్న విభే దాలను గురించి తీర్పు చేయువానివి. ఏ సత్య విష- యంలో విభేదం ఉందో అందులో నీ దయతో నాకు సన్మార్గం చూపుము, నిశ్చయంగా నీవు కోరినవారికి సన్మార్గం చూపుతావు.
6- వజ్జహ్ తు వజ్ హియ లిల్లజీ ఫతరస్సమావాతి వల్ అర్ జ హనీఫవ్ వమా అన మినల్ ముష్రికీన్ ఇన్న సలాతీ వ నుసుకీ వ మహ్ యాయ వ మమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ లా షరీక లహూ వ బిజాలిక ఉమిర్తు వ అన అవ్వలుల్ ముస్లిమీన్ అల్లాహుమ్మ అంతల్ మలికు లాఇలాహ ఇల్లా అంత, అంత రబ్బీ వ అన అబ్దుక జలంతు నఫ్సీ వఅ’తరఫ్ తు బిజంబీ ఫగ్పిర్ లీ జునూబీ జమీఅన్ ఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత, వహ్ దినీ లిఅహ్ సనిల్ అఖ్లాఖి లా యహ్ దీ లిఅహ్ సనిహా ఇల్లా అంత, వస్ రిఫ్ అన్నీ సయ్యిఅహా లా యస్ రిఫ్ అన్నీ సయ్యిఅహా ఇల్లా అంత, లబ్బైక వ సఅ’దైక వల్ ఖైరు కుల్లుహూ ఫీ యదైక వష్షర్రు లైస ఇలైక, అన బిక వ ఇలైక, తబారక్త వ తఆలైత, అస్తగ్ఫి- రుక వ అతూబు ఇలైక. (ముస్లిం 771).
(నేను నా ముఖాన్ని ఏకాగ్రచిత్తంతో భూమ్యాకాశాలను సృష్టించిన ప్రభువు వైపునకు త్రిప్పుకున్నాను. నేను బహు- దైవారాధకులలోనివాడిని కాను. నా నమాజ్, నా ఖుర్బానీ, నా జీవనం మరియు నా మరణం సర్వ లోక ప్రభువైన అల్లాహ్ కే అంకితం. ఆయనకు ఏ భాగస్వామీ లేడు. నాకు దీని గురించిన ఆజ్ఞే ఇవ్వబడింది. నేను ముస్లింలలోని వాణ్ణి. ఓ అల్లాహ్! నీవే యజమానివి. నీవే ఆరాధ్యుడవు. నీవు తప్ప మరో ఆరాధ్యుడు లేడు. నీవే నా ప్రభువువి. నేను నీ దాసుణ్ణి. నేను నా ఆత్మకు అన్యాయం చేసుకున్నాను. నేను నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను. కనుక నా పాపాలన్నింటినీ మన్నించు. నీవు తప్ప పాపాలను మన్నించగల వాడెవడూ లేడు. నన్ను సత్పవర్తన వైపునకు నడిపించు, సత్పవర్తన వైపునకు మార్గదర్శకత్వం చూపేవాడు నీ తప్ప ఎవ్వడూ లేడు. నా దుర్గుణాలను నా నుండి దూరం చెయ్యి. నన్ను దుర్గుణాల నుండి దూరం చేయువాడు నీ తప్ప ఎవ్వడూ లేడు. నీ సమక్షంలో హాజరవుతున్నాను. దీనిని నా అదృష్టంగా భావిస్తున్నాను. సర్వ మేళ్ళు నీ స్వాధీనంలో ఉన్నాయి. నీ తరఫు నుండి ఎన్నటికీ కీడు ఉండదు. నేను నీ వల్లనే ఉన్నాను. నీ వైపే మరలుతాను. నీవు శుభప్రదమైన వాడివి, ఉన్నతునివి. పాపాల మన్నింపుకై నిన్నే వేడుకుంటు- న్నాను. పశ్చాత్తాప భావంతో నీ వైపునకే మరలుతున్నాను.
7-అల్లాహుమ్మ లకల్ హందు అంత ఖయ్యిము స్సమావాతి వల్ అర్జి వమన్ ఫీహిన్న వలకల్ హందు లక ముల్కుస్సమావాతి వల్ అర్జి వమ న్ ఫీహిన్న వలకల్ హందు అంత నూరుస్సమావాతి వల్ అర్జి వమన్ ఫీహిన్న వలకల్ హందు అంత మలికుస్సమా- వాతి వల్ అర్జి వలకల్ హందు అంతల్ హఖ్కు వ వఅ’దుకల్ హఖ్ఖు వలిఖాఉక హఖ్ఖున్ వకౌలుక హఖ్ఖున్ వల్ జన్నతు హఖ్ఖున్ వన్నారు హఖ్ఖున్ వన్నబియ్యూన హఖ్ఖున్ వ ముహమ్మదున్ సల్లల్లాహు అలైహి వసల్లం హఖ్ఖున్ వస్సాఅతు హఖ్ఖ్. అల్లాహుమ్మ లక అస్లమ్తు వ బిక ఆమంతు వ అలైక తవక్కల్తు వ ఇలైక అనబ్తు వ బిక ఖాసంతు వ ఇలైక హాకమ్తు ఫగ్ఫిర్లీ మా ఖద్దమ్తు వ మా అఖ్ఖర్తు వ మా అస్రర్తు వ మా అఅ’లంతు అంతల్ ముఖద్దిము వ అంతల్ ముఅ- ఖ్ఖిరు లాఇలాహ ఇల్లా అంత. (బుఖారి 1120).
(మా ప్రభువైన ఓ అల్లాహ్! ఆకాశాలు నిండిపోయేంత, భూమి నిండిపోయేంత, భూమ్యాకాశాల మధ్య నిండిపోయేంత మరియు ఆ తర్వాత నీవు కోరిన ప్రతీది నిండిపోయేంత ప్రశంసలు నీ కొరకే).
3- రబ్బనా లకల్ హందు మిల్ఉస్సమావాతి వల్ అర్జి వ మిల్ఉ మా షిఅ’త మిన్ షైఇమ్ బఅ’దు అహ్ లస్సనాఇ వల్ మజ్ది అహఖ్ఖు మా ఖాలల్ అబ్దు వ కుల్లునా లక అబ్దున్, అల్లాహుమ్మ లా మానిఅ లిమా అఅ’తైత వ లా ముఅ’తియ లిమా మనఅ’త వలా యన్ ఫఉ జల్ జద్ది మిన్కల్ జద్దు. (ముస్లిం 477).
(భూమ్యాకాశాలు నిండిపోయేంత, ఆ తర్వాత నీవు కోరిన ప్రతీది నిండిపోయేంత ప్రశంసలు నీ కొరకే మా ప్రభువా! ఓ ఘనతకు, పొగడ్తలకు అధిపతి, దాసుడు పొగిడే దానికి నీవు అర్హుడవు. మేమందరం నీకే దాసులం. అల్లాహ్! నీవు ప్రసాదించే దానిని అడ్డుకునేవాడెవడూ లేడు. నీవు ఇవ్వని దానిని ఎవ్వడూ ఇవ్వలేడు. ఎవరి పెద్దరికం, ఐశ్వర్యం నీ శిక్ష ముందు వారికి లాభం చేకూర్చ లేవు).
1-సుబ్ హాన రబ్బియల్ అఅ’లా. (ముస్లిం 772). سُبْحَانَ رَبِّيَ الأعلَى (ఉన్నతుడైన నా ప్రభువు పరిశుద్ధుడు). ఒక్కసారి చదవడం విధిగా ఉంది. ఎక్కువ సార్లు చదవడం చాలా మంచిది.
2- సుబ్ హానకల్లాహుమ్మ రబ్బనా వ బిహందిక అల్లాహుమ్ మగ్ఫిర్లీ. (బుఖారి 794, ముస్లిం 484). سُبْحَانَكَ اللَّهُمَّ رَبَّنَا وَبِحَمْدِكَ اللَّهُمَّ اغْفِرْلِي (మా ప్రభువైన ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధునివి, నీకే స్తోత్రములు, ఓ అల్లాహ్ నన్ను మన్నించు).
6- అల్లాహుమ్మ లక సజత్తు వ బిక ఆమంతు వ లక అస్లమ్ తు సజద వజ్ హియ లిల్లజీ ఖలకహు వ సవ్వరహు వ షక్క సమ్అహు వ బసరహు తబారకల్లాహు అహ్ సనుల్ ఖాలికీన్. (ముస్లిం 771).
اللَّهُمَّ لَكَ سَجَدْتُ وَبِكَ آمَنْتُ وَلَكَ أَسْلَمْتُ سَجَدَ وَجْهِي لِلَّذِي خَلَقَهُ وَصَوَّرَهُ وَشَقَّ سَمْعَهُ وَبَصَرَهُ تَبَارَكَ اللهُ أَحْسَنُ الخَالِقِينَ (ఓ అల్లాహ్ నేను నీ కొరకు సజ్దా చేశాను, నిన్ను విశ్వసించాను, నీకే శిరసవహించాను, నా ముఖం దానిని సృష్టించిన, ఆకారం ఇచ్చిన, చెవి, కళ్ళు ఇచ్చిన అల్లాహ్ కు సజ్దా చేసింది. అతి ఉత్తమ సృష్టికర్త అయిన అల్లాహ్ చాలా శుభాలు కలవాడు).
7- అల్లాహుమ్మ అఊజు బిరిజాక మిన్ సఖతిక వ బిముఆఫాతిక మిన్ ఉఖూబతిక వ అఊజు బిక మిన్క లా ఉహ్ సీ సనాఅన్ అలైక అంత కమా అస్నైత అలా నఫ్సిక. (ముస్లిం 486).
اللَّهُمَّ أَعُوذُ بِرِضَاكَ مِنْ سَخَطِكَ وَبِمُعَافَاتِكَ مِنْ عُقُوبَتِكَ وَأَعُوذُ بِكَ مِنْكَ لَا أُحْصِي ثَنَاءً عَلَيْكَ أَنْتَ كَمَا أَثْنَيْتَ عَلَى نَفْسِكَ (ఓ అల్లాహ్! నీ అప్రసన్నత నుండి నీ ప్రసన్నత శరణు, నీ శిక్ష నుండి నీ మన్నింపు శరణు కోరుతున్నాను. నిన్ను నీవు ఎలా స్తుతించుకున్నావో అలా నేను నీ స్తోత్రాలను లెక్కించలేను).
సజ్దాలో ఉన్నప్పుడు ఎక్కువగా దుఆ చేయడం మంచిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం ఈ హదీసు ఆధారంగాః “దాసుడు తన ప్రభువుకు అత్యంత సమీపంగా ఉండేది సజ్దా స్థితిలో. అందుకు మీరు అందులో దుఆ ఎక్కు వగా చేయండి. (ముస్లిం 482).
اللَّهُمَّ اغْفِرْلِي وَارْحَمْنِي وَعَافِنِي وَاهْدِنِي وَارْزُقْنِي (ఓ అల్లాహ్ నన్ను క్షమించు, కరుణించు, నాకు స్వస్తత, సన్మార్గం మరియు ఆహారం ప్రసాదించు).
సజ్దయే తిలావత్ చేయునప్పుడు
ఖుర్ఆనులో 15 సజ్దా ఆయతులున్నాయి, ఖుర్ఆన్ పారాయణ సందర్భంగా వాటిలో ఏ ఒక్క ఆయతు వచ్చినా అచ్చట ఆగి సజ్దా చేయాలి. అప్పుడు ఈ క్రింది దుఆ చదవాలి.
1-సజద వజ్ హియ లిల్లజీ ఖలకహూ వ షక్క సమ్అహూ వ బసరహూ బిహౌలిహీ వ కువ్వతిహీ [ఫతబారకల్లాహు అహ్ సనుల్ ఖాలిఖీన్]. (తిర్మిజి 580 [హాకిం 802]).
سَجَدَ وَجْهِي لِلَّذِي خَلَقَهُ وَشَقَّ سَمْعَهُ وَبَصَرَهُ بِحَوْلِهِ وَقُوَّتِهِ {فَتبَارَك اللهُ أَحسَنَ الخَالِقِين} (నా ముఖం, తన శక్తి సామర్థ్యాలతో దానిని సృష్టించిన, చెవి, కళ్ళు ఇచ్చిన అల్లాహ్ కు సజ్దా చేసింది. అతి ఉత్తమ సృష్టి కర్త అయిన అల్లాహ్ చాలా శుభాలు కలవాడు). 2- అల్లాహుమ్మక్ తుబ్ లీ బిహా ఇందక అజ్రా, వ జఅ’ అన్నీ బిహా విజ్రా, వజ్అల్ హా లీ ఇందక జుఖ్రా, వ తఖబ్బల్ హా మిన్నీ కమా తఖబ్బల్ తహా మిన్ అబ్దిక దావూద్. (తిర్మిజి 579, 3424).
اللَّهُمَّ اكْتُبْ لِي بِهَا عِنْدَكَ أَجْرًا وَضَعْ عَنِّي بِهَا وِزْرًا وَاجْعَلْهَا لِي عِنْدَكَ ذُخْرًا وَتَقَبَّلْهَا مِنِّي كَمَا تَقَبَّلْتَهَا مِنْ عَبْدِكَ دَاوُدَ (ఈ సజ్దాకు బదులుగా నీ వద్ద నా కొరకు పుణ్యం వ్రాసి పెట్టు, నాపై ఉన్న పాపాల భారం దించిపెట్టు, పుణ్యఫలం భద్రంగా స్టోర్ చేసిపెట్టు మరియు నీ (ప్రియ)దాసుడైన దావూద్ అలైహిస్సలాం నుండి అంగీకరించినట్లు నాతో అంగీకరించు).
(నా వాక్కు, దేహా, ధన సంబంధమైన ఆరాధనలన్నియూ అల్లాహ్ కొరకే ఉన్నవి. ఓ ప్రవక్తా! మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆయన శుభాలు కురువుగాకా. అల్లాహ్ తప్ప వేరు ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు, సందేశహరుడని సాక్ష్యమిస్తున్నాను).
ప్రవక్తపై దరూద్
అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. (బుఖారి 3370).
(ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీం అలైహిస్సలాంను, వారి కుటుంబీ- కులను కరుణించినట్లు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు వారి కుటుంబీకులను కరుణించు. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి, ఘనుడివి. ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీం అలైహిస్సలాం, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేసినట్లు ముహమ్మ ద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేయుము. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి, ఘనుడివి.).
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ وَأَعُوذُ بِكَ مِنْ فِتْنَةِ الْمَسِيحِ الدَّجَّالِ وَأَعُوذُ بِكَ مِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْمَأْثَمِ وَالْمَغْرَمِ (ఓ అల్లాహ్! సమాధి శిక్ష నుండి నీ శరణులోకి వస్తున్నాను, మసీహుద్దజ్జాల్ ఉపద్రవము నుండి నీ శరణులోకి వస్తున్నా- ను, జీవన్మరణాల విపత్తు నుండి నీ శరణులోకి వస్తున్నాను, పాపం మరియు అప్పు నుండి నీ శరణులోకి వస్తున్నాను).
اللَّهُمَّ إِنِّي ظَلَمْتُ نَفْسِي ظُلْمًا كَثِيرًا وَلَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ فَاغْفِرْ لِي مَغْفِرَةً مِنْ عِنْدِكَ وَارْحَمْنِي إِنَّك أَنْتَ الْغَفُورُ الرَّحِيمُ (ఓ అల్లాహ్ నా ఆత్మకు నేను చాలా అన్యాయం చేసు కున్నాను. నీవు తప్ప పాపాలను క్షమించేవారు మరెవ్వరూ లేరు. నీవు నీ ప్రత్యేక అనుగ్రహంతో నన్ను క్షమించు, నా మీద దయచూపు, నిశ్చయంగా నీవు క్షమించేవాడవు, కరుణామయుడవు). (బుఖారి 834).
(అల్లాహ్! నా పూర్వ పాపాలను, జరగబోయే పాపాలను, రహస్యంగా చేసిన పాపాలను, బహిరంగంగా చేసిన పాపాలను మరియు నా మితిమీరినతనాన్ని కూడా క్షమించు. మరికొన్ని పాపాలు ఉండవచ్చు, వాటి గురించి నా కంటే ఎక్కువ నీకే బాగా తెలుసు, వాటిని కూడా నీవు క్షమించు. ముందుకు నడిపించేవాడివి, వెనక్కి నెట్టేవాడివి నీవే. నీవు తప్ప వెరొక ఆరాధ్యుడు లేడు).
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ الْعَجْزِ وَالْكَسَلِ وَالْجُبْنِ وَالْهَرَمِ وَالْبُخْلِ وَأَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ وَمِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ (ఓ అల్లాహ్ (మంచి పనులు) చేయలేకపోవటం నుంచి, శక్తి ఉండి కూడా సోమరితనానికి లోనవటం నుంచి, పిరికితనం నుంచి, నికృష్టమైన వృద్ధాప్యం నుంచి నీ శరణు కోరుతున్నాను. ఇంకా సమాధి శిక్ష నుండి మరియు జీవన్మరణాల ఉపద్రవం నుంచి నీ శరణు కోరుతున్నాను).
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ يَا أَللهُ الْأَحَدُ الصَّمَدُ الَّذِي لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ أَنْ تَغْفِرَ لِي ذُنُوبِي إِنَّكَ أَنْتَ الْغَفُورُ الرَّحِيمُ (అద్వితీయునివి, నిరపేక్షాపరునివి, సంతానము, తల్లి దండ్రులు లేని మరియు ఏ ఒక్కరికి సరిసమానము కాని ఓ అల్లాహ్! నీవు నా పాపాల ప్రక్షాలనం చేయా లని కోరుతున్నాను. నిశ్చయంగా నీవు క్షమించే, కరుణించేవానివి).
ఒక వ్యక్తి తషహ్హుద్ లో ఈ దుఆ చదువుతున్నది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విని ఇతడు క్షమించబడ్డాడు అని శుభవార్త ఇచ్చారు.
6- అల్లాహుమ్మ బిఇల్మికల్ గైబ వ ఖుద్రతిక అలల్ ఖల్ఖ్, అహ్ యినీ మా అలిమ్ తల్ హయాత ఖైరల్లీ వ తవఫ్ఫనీ ఇజా అలిమ్ తల్ వఫాత ఖైరల్లీ, వ అస్అలుక ఖష్ యతక ఫిల్ గైబి వష్షహాద, వ కలిమతల్ ఇఖ్లాసి ఫిర్రిజా వల్ ఘజబ్, వ అస్అలుక నఈమల్ లా యన్ ఫద్, వ ఖుర్రత ఐనిల్ లా తన్ ఖతిఅ’, వఅస్అలుకర్ రిజా బిల్ ఖజా, వ బర్దల్ ఐషి బాదల్ మౌత్, వ లజ్జతన్ నజరి ఇలా వజ్ హిక వ ష్షౌఖ ఇలా లిఖాఇక్, వ అఊజు బిక మిన్ జర్రాఅ ముజిర్రతిన్ వ ఫిత్నతిమ్ ముజిల్లహ్, అల్లాహుమ్మ జయ్యిన్నా బిజీనతిల్ ఈమాన్, వజ్అల్నా హుదాతమ్ ముహ్తదీన్.
(ఓ అల్లాహ్! నీవు అగోచర జ్ఞానంగలవానివి, నీ సృష్టిపై సంపూర్ణ అధికారంగలవానివి కనుక, జీవితం నా కొరకు ఎంత వరకు మేలు అని నీకు తెలియునో అంత వరకు నన్ను సజీవంగా ఉంచు, మరెప్పుడైతే మరణం నా కొరకు మేలు అని నీకు తెలియునో అప్పుడే నాకు మరణం ప్రసాదించు, గోచర (బాహ్యం) మరియు అగోచర (అంతర్యం) సర్వ స్థితుల్లో నీ భయం ఉండాలని కోరుతున్నాను, కోపం, ప్రశాంతం అన్ని వేళల్లో సత్యంపలికాలని వేడుకుంటున్నాను, కలిమిలోనైనా, లేమిలోనైనా (హెచ్చుతగ్గులకు గురి కాకుండా) మధ్యేమార్గంలో ఉండాలని కోరుతున్నాను, ఎన్నడూ నశించని అనుగ్రహం నీతో కోరుతున్నాను, ఎన్నాడూ అంతంకాని కంటి చలువ నీతో కోరుతు- న్నాను, నీ నిర్ణయాలపై తృప్తి చెందే భాగ్యం నీతో తలుస్తున్నాను, మరణం తర్వాత చల్లని/సుఖమయ జీవితం నీతో కోరుతున్నాను, నీ ముఖదర్శనభాగ్య ఆనందం మరియు నిన్ను కలుసుకునే కాంక్ష నీతో కోరుతున్నాను, ఇవి ఎలాంటి బాధకరమైన కష్టంతో మరియు మార్గభ్రష్టతకు గురి చేయని ఉపద్రవంతో ప్రాప్తించు. ఓ అల్లాహ్! మమ్మల్ని విశ్వాస అంకరణతో అలంకరించు, మమ్మల్ని సన్మార్గగామి మరియు మార్గదర్శిగా చేయు.
అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఓ హదీసులో తషహ్హుద్ దుఆ నేర్పుతూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారుః “ఆ తర్వాత తనకిష్టమైన దుఆ చేసుకోవాలి”. (బుఖారి 835).
اَسْتَغْفِرُ الله ، اَسْتَغْفِرُ الله ، اَسْتَغْفِرُ الله ، اَللهُمَّ أَنْتَ السَّلامُ ومِنْكَ السَّلامُ تَبَارَكْتَ يَا ذَا الجَلالِ وَ الإكْرَام. (అల్లాహ్ నీ క్షమాభిక్ష కోరుతున్నాను… అల్లాహ్ నీవే సలాం. శాంతి నీ నుండి లభిస్తుంది. ఔన్నత్యం, గొప్పదనాలు గలవాడా నీవు గొప్ప శుభాలు కలవాడివి).
2- లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ అల్లా హుమ్మ లా మానిఅ లిమా అఅ’తైత వలా ముఅ’తియ లిమా మనఅ’త వలా యన్ ఫఉ జల్ జద్ది మిన్కల్ జద్దు. (బుఖారి 844, ముస్లిం 593).
(అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన ఏకైకుడు, సాటిలేనివాడు. విశ్వసామ్రాజ్యం ఆయనదే. స్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయన సర్వాధికారుడు. ఓ అల్లాహ్! నీవు ప్రసాదించే దానిని అడ్డుకునేవాడెవడూ లేడు. నీవు ఇవ్వని దానిని ఎవ్వడూ ఇవ్వలేడు. ఎవరి పెద్దరికం, ఐశ్వర్యం నీ శిక్ష ముందు వారికి లాభం చేకూర్చ లేవు).
(అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన ఏకైకుడు, సాటిలేనివాడు. విశ్వసామ్రాజ్యం ఆయనదే. స్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయన సర్వాధికారుడు. పుణ్యాలు చేసే, పాపాల నుండి దూరముండే భాగ్యం అల్లాహ్ యే ప్రసాదించువాడు, ఆ అల్లాహ్ తప్ప వెరొక ఆరాధ్యుడు లేడు. మేము ఆయన్నే ఆరాధిస్తాము. వరాలు, అనుగ్రహాలు ఆయన ప్రసా దించినవే. మంచి స్తోత్రాలు ఆయనకే శోభిస్తాయి. అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. సత్యతిరస్కారులకు ఎంత అయిష్టకరంగా ఉన్నా సరే మేము మా ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకున్నాము.).
4-సుబ్డహానల్లాహ్ 33 సార్లు, అల్ హం దులిల్లాహ్ 33 సార్లు, అల్లాహు అక్బర్ 33 సార్లు అనాలి. వంద పూర్తి చేయుటకు ఒక్క సారి అనాలిః “లాఇ లాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్”. (ముస్లిం 597).
పై జిక్ర్ వంద లెక్క పూర్తి చేసినవారి పాపాలు సముద్రపు నురగంత ఉన్నా మన్నించబడతాయి. (ముస్లిం 597).
5-అల్లాహుమ్మ అఇన్నీ అలా జిక్రిక వ షుక్రిక వ హస్ని ఇబాదతిక. (అబూదావూద్ 1522).
اللَّهُمَّ أَعِنِّي عَلَى ذِكْرِكَ وَشُكْرِكَ وَحُسْنِ عِبَادَتِك (అల్లాహ్! నేను నీ ధ్యానం చేయటానికి, నీకు కృతజ్ఞతలు తెలుపుకోటానికి, తగురీతిలో నిన్ను ఆరాధించటానికి నాకు సహాయం చెయ్యి).
6-అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ జుబ్ని వఅఊజు బిక మిన్ అన్ అరుద్ద ఇలా అర్జలిల్ ఉమురి వ అఊజు బిక మిన్ ఫిత్నతిద్దున్యా వ అఊజు బిక మిన్ అజాబిల్ ఖబ్ర్. (బుఖారి 2822).
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ الْجُبْنِ وَأَعُوذُ بِكَ أَنْ أُرَدَّ إِلَى أَرْذَلِ الْعُمُرِ وَأَعُوذُ بِكَ مِنْ فِتْنَةِ الدُّنْيَا وَأَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ (అల్లాహ్! పిరికితనం నుండి నీ శరణు వేడుతున్నాను. నికృష్టమైన వృద్ధాప్యానికి చేరుకోవటం నుండి నీ శరణు కోరుతున్నాను. ప్రాపంచిక ఉపద్రవాల నుండి నీ శరణు వేడుతున్నాను. సమాధి యాతనల నుండి నీ శరణు వేడుతున్నాను).
((1) ఇలా అనుః ఆయనే అల్లాహ్, ఏకైకుడు, అల్లాహ్ ఎవరి అక్కరా లేనివాడు, ఆయనకు సంతానం లేదు మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ కాడు, ఆయనకు సరిసమానుడు ఎవడూ లేడు. (2) ఇలా అనుః నేను ఉదయ కాలపు ప్రభువు శరణులోకి వస్తున్నాను, ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి, చిమ్మచీకటి కీడు నుండి ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో, ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి, మరియు అసూయపరుడి కీడు నుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో. (3) ఇలా అనుః నేను మానవుల ప్రభువు, మానవుల సార్వభౌముడు, మానవుల ఆరాధ్య దైవం యొక్క శరణులోకి వస్తున్నాను, కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి, ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో, వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు).
(అల్లాహ్! ఆయన తప్ప మరొక సత్యఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. ఆయన నిత్యుడు, విశ్వవ్యవస్థకు ఆధారభూతుడు, ఆయనకు కునుకురాదు మరియు నిదురరాదు. భూమ్యా- కాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే, ఆయన సమ్ముఖంలో -ఆయన అనుజ్ఞ లేకుండా- సిఫారసు చేయగలవాడెవడు? వారి ముందున్నదీ మరియు వారి వెనుక ఉన్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు, మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానవిశేషాలలో ఏ విషయమునూ వారు గ్రహించజాలరు, ఆయన కుర్సీ ఆకాశాలనూ మరియు భూమినీ పరివేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన అత్యున్నతుడు, సర్వోత్తముడు).
ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత ఆయతుల్ కుర్సీ చదివిన వారు స్వర్గంలో ప్రవేశించడానికి చావు మాత్రమే అడ్డు ఉంటుంది. (సహీహ 972).
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ عِلْمًا نَافِعًا وَرِزْقًا طَيِّبًا وَعَمَلًا مُتَقَبَّلًا (ఓ అల్లాహ్! నేను నీతో ప్రయోజనకరమైన జ్ఞానం, పవిత్ర ఆహారం మరియు అంగీకరింపబడే ఆచరణ కోరుతున్నాను).
నమాజు తర్వాతగల దుఆల మరికొన్ని ఘనతలు తెలుసుకొనుటకు “నమాజు నిధులు” అన్న మా పుస్తకం చదవండి.
ఇస్తిఖార నమాజులో
(ఏదైనా పని గురించి ఆలోచించి, ఎలా చేస్తే మేలుంటుంది అనుకున్నప్పుడు ఏ ఒక నిర్ణయానికి రాక ముందు ఫర్జ్ నమాజు కాకుండా రెండు రకాతుల నఫిల్ నమాజు చేసి సలాంకు ముందు లేదా సలాం తింపిన తర్వాత ఈ క్రింది దుఆ పఠించాలి. అయితే “అన్నహాజల్ అమ్ర” అన్న చోట తన అవసరాన్ని గురించి ఆలోచించుకోవాలి, లేదా అవసరాన్ని ప్రస్తావించాలి. దుఆ ఇలా ఉందిః)
అల్లాహుమ్మ ఇన్నీ అస్తఖీరుక బిఇల్మిక వ అస్తఖ్దిరుక బి ఖుద్రతిక వ అస్అలుక మిన్ ఫజ్లికల్ అజీం ఫఇన్నక తఖ్దిరు వలా అఖ్దిరు వ తఅ’లము వలా అఅ’లము వ అంత అల్లా ముల్ గుయూబ్, అల్లాహుమ్మ ఇన్ కుంత తఅ’లము అన్న హాజల్ అమ్ర ఖైరుల్లీ ఫీ దీనీ వ మఆషీ వ ఆఖిబతి అమ్రీ ఔ ఖాల ఆజిలి అమ్రీ వ ఆజిలిహీ ఫఖ్దుర్ హు లీ వ యస్సిర్ హు లీ సుమ్మ బారిక్ లీ ఫీహి వ ఇన్ కుంత తఅ’లము అన్న హాజల్ అమ్ర షర్రుల్లీ ఫీ దీనీ వ మఆషీ వ ఆఖిబతి అమ్రీ ఔ ఖాల ఫీ ఆజిలి అమ్రీ వ ఆజిలిహీ ఫస్రిఫ్ హు అన్నీ వస్రిఫ్ నీ అన్హు వఖ్ దుర్ లియల్ ఖైర హైసు కాన సుమ్మ అర్జినీ బిహీ. (బుఖారి 1166).
(అల్లాహ్! నీ జ్ఞానంతో నేను శుభాలను అడుగుతున్నాను. నీ అధికార సాయంతో శక్తిని ప్రసాదించమని కోరుతున్నాను. మహోత్తరమైన నీ అనుగ్రహాన్ని ప్రసాదించమని అభ్యర్తి- స్తున్నాను. నిశ్చయంగా నువ్వు అధికారం గలవాడివి. నాకు ఎలాంటి అధికారమూ లేదు. నీకు అన్నీ తెలుసు, నాకు ఏమీ తెలియదు. అగోచర జ్ఞానివి నీవే. అల్లాహ్! నీ జ్ఞానం ప్రకారం ఈ పని ధార్మికంగా, ప్రాపంచికంగా, పరలోక పరిణామం రీత్యా (లేదా) త్వరగా లేక ఆలస్యంగా నాకు ప్రయోజనకరమైతే దాన్ని నా అదృష్టంలో ఉంచు. దాని సాధనను నా కొరకు సులభతరం చెయ్యి. దాన్ని నా కొరకు శుభప్రదమైనదిగా చెయ్యి. కాని ఒకవేళ నీ జ్ఞానం ప్రకారం ఈ పని ధార్మికంగా, ప్రాపంచికంగా, పరలోక పరిణామం రీత్యా (లేదా) త్వరగా గానీ, ఆలస్యంగా గానీ నాకు నష్టం కలిగించేదయితే దాన్ని నా నుండి దూరంగా ఉంచు. దాని బారి నుండి నన్ను కాపాడు. సాఫల్యం ఎక్కడున్నాసరే దాన్ని నా అదృష్టంగా మలచు. ఆ తర్వాత నా మనసు దానిపై కుదుటపడేలా చెయ్యి).
ఉదయసాయంకాలపు జిక్ర్ ఘనత
“నేను, ఫజ్ర్ నమాజ్ తర్వాత నుండి సూర్యోదయం వరకు అల్లాహ్ స్మరణ చేస్తూ ఉండేవారితో కూర్చుండడం ఇస్మాఈల్ అలైహిస్సలాం సంతానంలోని నలుగురు బానిసలను విడుదల చేయుటకంటే ఎక్కువ ఇష్టం, మరియు అస్ర్ నమాజు తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు అల్లాహ్ స్మరణ చేస్తూ ఉండేవారితో కూర్చుండడం ఇస్మాఈల్ అలైహిస్సలాం సంతానంలోని నలుగురు బానిసలను విడుదల చేయుటకంటే ఎక్కువ ఇష్టం” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. (అబూదావూద్ 3667). షొఅబుల్ ఈమాన బైహఖీ (556)లో ఎనిమిది మంది బానిసల ప్రస్తావన ఉంది. అలాగే ప్రపంచం అందులో ఉన్న సర్వానికంటే ఎక్కువ ఇష్టం అని కూడా ఉంది. (555).
“ఎవరైనా సామూహికంగా ఫజ్ర్ నమాజు చేసిన తర్వాత అల్లాహ్ ను స్మరిస్తూ ఉండి, సూర్యోదయం తర్వాత రెండు రకాతులు చేస్తాడో అతనికి ఒక ఉమ్రా, ఒక హజ్ చేసినంత సంపూర్ణ పుణ్యం లభిస్తుంది” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (తిర్మిజి 586).
“ఫజ్ర్ నమాజ్ చేసి అదే స్థలంలో కూర్చొని ఉండే వ్యక్తిపై ‘అల్లాహ్ ఇతడిని క్షమించు, ఇతడిని కరుణించు’మని దైవ దూతలు దుఆ చేస్తారు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (అహ్మద్ 1/144).
నోట్: అల్లాహ్ స్మరణ అంటే క్రింద తెలుపబడిన దుఆలు, ఖుర్ఆన్ పారాయణం, సుబ్ హానల్లాహ్, అల్ హందులిల్లాహ్, అల్లాహు అక్బర్, లాఇలాహ ఇల్లల్లాహ్, దరూదె ఇబ్రాహీం వైగారాలు చదవడం.
ఉదయం మరియు సాయంకాలం చదవండి
1- ఆయతుల్ కుర్సీ.
ఉదయం ఆయతుల్ కుర్సీ చదివినవారు సాయం- కాలం వరకు మరియు సాయంకాలం చదివినవారు ఉదయం వరకు షైతానుల నుండి రక్షింపబడతారు. (హాకిం 2064).
(మేము మరియు అల్లాహ్ యొక్క రాజ్యము సాయంకాలానికి చేరుకున్నాము. సర్వస్తోత్రములు అల్లాహ్ కొరకే, అల్లాహ్ తప్ప సత్యఆరాధ్యుడు ఎవ్వడూ లేడు, ఆయన ఏకైకుడు, ఆయనకు భాగస్వామి లేడు, రాజ్యమంతా అయనదే, స్తోత్రము- లన్నియూ అయనకే, ఆయన సర్వముపై అధికారంగలవాడు. ప్రభువా! ఈ రాత్రిలోని మేలును దీని తర్వాత వచ్చే మేలును నీతో కోరుతున్నాను. ఈ రాత్రిలోని కీడు మరియు దీని తర్వాత వచ్చే కీడు నుండి నీ శరణు కోరుతున్నాను. ప్రభువా! బద్ధకం మరియు చెడు వృద్ధాప్యం నుండి నీ శరణు కోరుతున్నాను. నరక శిక్ష మరియు సమాధి శిక్ష నుండి నీ శరణు కోరుతున్నాము).
నోట్: పైన ఇవ్వబడిన దుఆ సాయంకాలము చదివినప్పుడు బ్రాకెట్లోని పదాలు చదవకూడదు. ఉదయం చదివినప్పుడు గీత మీద ఉన్న పదాలు చదవకూడదు
4- అల్లాహుమ్మ బిక అస్ బహ్ నా వ బిక అమ్ సైనా వబిక నహ్ యా వ బిక నమూతు వ ఇలైకన్నుషూర్. (అదబుల్ ముఫ్రద్ 1199). اللَّهُمَّ بِكَ أّصْبَحْنَا وَبِكَ أَمْسَينَا وَبِكَ نَحْيَا وَبِكَ نَمُوتُ وَإِلَيكَ النُّشُور
సాయంకాలం చదివినప్పుడు ఇలా చదవండిః
అల్లాహుమ్మ బిక అమ్ సైనా వ బిక అస్ బహ్ నా వబిక నహ్ యా వ బిక నమూతు వ ఇలైకల్ మసీర్.
اللَّهُمَّ بِكَ أَمْسَينَا وَبِكَ أّصْبَحْنَا وَبِكَ نَحْيَا وَبِكَ نَمُوتُ وَإِلَيكَ الْـمَصِير (ఓ అల్లాహ్! నీ రక్షణలోనే మేము ఉదయానికి చేరాము, నీ రక్షణలోనే మేము సాయంకాలానికి చేరాము, నీ పేరుతోనే మేము జీవించి ఉన్నాము, నీ పేరుతోనే మేము మరణిస్తాము, మళ్ళీ నీ వైపే తిరిగి రానున్నాము).
5- అల్లాహుమ్మ ఇన్నీ అస్ బహ్ తు ఉష్ హిదుక వ ఉష్ హిదు హమలత అర్షిక వ మలాఇకతక వ జమీఅ ఖల్ ఖిక అన్నక అంతల్లాహు లా ఇలాహ ఇల్లా అంత వ అన్న ముహమ్మదన్ అబ్దుక వ రసూలుక.
(ఓ అల్లాహ్! నిశ్చయంగా నేను ఉదయానికి చేరాను. నిన్ను సాక్షిగా పెడుతున్నాను మరియు నీ సింహాసన పీఠాన్ని ఎత్తి ఉన్నవారిని, దైవ దూతలందరిని ఇంకా సర్వసృష్టిని సాక్షిగా పెడుతున్నాను; నీవు మాత్రమే అల్లాహ్ అని, నీ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడని, మరియు ముహమ్మద్ సల్లల్లా- హు అలైహి వసల్లం నీ దాసుడు మరియు నీ ప్రవక్త అని).
పై దుఆ ఉదదయం, సాయంకాలం నాలుగు సార్లు చదివిని వారిని అల్లాహ్ నరకాగ్ని నుండి రక్షిస్తాడు. (అబూదావూద్ 5069).
6- అల్లాహుమ్మ మా అస్బహబీ మిన్ నిఅ’మతిన్ ఫమిన్క వహ్ దక లా షరీక లక ఫలకల్ హందు వలకష్షుక్ర్.
(మేము ఉదయానికి చేరాము స్వభావిక ధర్మం అయిన ఇస్లాంపై, చిత్తశుద్ధితో కూడి ఉన్న వచనంపై, మా ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ధర్మంపై, మా పితామూర్తులైన ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క మతముపై, ఆయన ఏకాగ్రులు, విశ్వాసులు, ముష్రికులలోని వారు కారు).
నోట్:పై దుఆ ఉదయం చదవాలి. సాయంకాలం చదివినప్పుడు “అస్బహ్నా” ఉన్న చోట “అమ్ సైనా” అని చదవాలి.
حَسْبِيَ الله لاَ إِلهَ إلاَّ هُوَ عَلَيهِ تَوَكَّلْتُ وَهُوَ رَبُّ الْعَرْشِ الْعَظِيم (నాకు అల్లాహ్ యే చాలు, ఆయన తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు, ఆయనపైనే నేను నమ్మకం ఉంచాను, ఆయన గొప్ప సింహాసనం యొక్క ప్రభువు).
11- అల్లాహుమ్మ అంత రబ్బి లా ఇలాహ ఇల్లా అంత ఖలక్ తనీ వ అనా అబ్దుక వఅన అలా అహ్దిక వ వఅదిక మస్తతఅతు అఊజు బిక మిన్ షర్రి మా సనఅతు అబూఉ లక బినిఅమతిక అలయ్య వఅబూఉ లక బిజంబీ ఫగ్ఫిర్లీ ఫఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత.
(ఓ అల్లాహ్! నీవు నా ప్రభువు, నీ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు, నీవే నన్ను సృష్టించావు, నేను నీ దాసుడ్ని, నేను నీతో చేసిన ఒడంబడిక, వాగ్దానంపై స్థిరంగా ఉన్నాను, నేను పాల్పడిన పాపాల కీడు నుండి నీ శరణులో వచ్చు- చున్నాను, నాపై ఉన్న నీ అనుగ్రహాలను నేను అంగీకరిస్తు- న్నాను, నా పాపాలను కూడా ఒప్పుకుంటున్నాను, నీవు నన్ను క్షమించు, పాపాలను క్షమించేవాడు నీ తప్ప ఎవడూ లేడు).
పై దుఆ పూర్తి విశ్వాసంతో ఉదయం చదివిన వ్యక్తి సాయంకాలముకు ముందే మరణిస్తే స్వర్గంలో చేరుతాడు, ఒకవేళ సాయంకాలం పూర్తి నమ్మకంతో చదవి ఉదయించేకి ముందే మరణిస్తే స్వర్గంలో చేరుతాడు. (బుఖారి 6306).
(ఓ అల్లాహ్! నా శరీరంలో నాకు స్వస్థత ప్రసాదించు, ఓ అల్లాహ్! నా చెవిలో స్వస్థత ప్రసాదించు, ఓ అల్లాహ్! నా దృష్టిలో స్వస్థత ప్రసాదించు, నీవు తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. ఓ అల్లాహ్! సత్యతిరస్కారం మరియు బీదరికం నుండి నీ శరణు వచ్చాను, ఓ అల్లాహ్! సమాధి శిక్ష నుండి నీ శరణులో వచ్చాను. నీవు తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు).
13- అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ ఆఫియత ఫిద్దున్యా వల్ ఆఖిర, అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్వ వల్ ఆఫియత ఫీ దీనీ వ దున్యాయ వ అహ్లీ వ మాలీ, అల్లాహుమ్మస్ తుర్ ఔరాతీ వ ఆమిన్ రౌఆతీ అల్లాహుమ్మహ్ ఫజ్నీ మిన్ బైని యదయ్య వ మిన్ ఖల్ఫీ వ అన్ యమీనీ వ అన్ షిమాలీ వ మిన్ ఫౌకీ వ అఊజు బిఅజ్మతిక అన్ ఉగ్ తాల మిన్ తహ్ తీ.
(ఓ అల్లాహ్! నేను నీతో ఇహపరాల క్షేమాన్ని కోరుతున్నాను, ఓ అల్లాహ్! నేను నీతో నా ధర్మం, ప్రపంచం, ఇల్లాలు, ఆస్తుల్లో మన్నింపు మరియు క్షేమాన్ని కోరుతున్నాను. ఓ అల్లాహ్! నా లోటుపోట్లను కప్పిఉంచు, నా భయాన్ని దూరం చేయి, ఓ అల్లాహ్! నన్ను నా ముందు నుండి, నా వెనక నుండి, నా కుడి, ఎడమ నుండి మరియు పై నుండి కాపాడు. నేను క్రింది నుండి కూడా ఏ కీడుకు గురి కాకుండా నీ ఔన్నత్యంతో నీ శరణులో వచ్చాను).
14- అల్లాహుమ్మ ఫాతిరస్సమావాతి వల్ అర్జి ఆలిమల్ గైబి వష్షహాదతి రబ్బ కుల్లి షైఇన్ వ మలీకహు అష్ హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అఊజు బిక మిన్ షర్రి నఫ్సీ వ షర్రిష్ షైతాని వ షిర్కిహీ, వఅన్ అక్తరిఫ అలా నఫ్సీ సూఅన్ ఔ అజుర్రహూ ఇలా ముస్లిమ్.
(ఓ అల్లాహ్! భూమ్యాకాశాల సృష్టికర్తా! గోచర అగోచరాల జ్ఞానీ! ప్రతీ వస్తువు ప్రభువా! మరియు యజమానీ! నీ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవడూ లేడని నేను సాక్ష్యమిస్తున్నాను, నేను నీ శరణులో వచ్చాను; నా ఆత్మ కీడు నుండి, షైతాన్ కీడు నుండి, అతని షిర్క్, ప్రేరేపణల నుండి, అలాగే నేను నా పట్ల- గాని లేదా ఎవరైనా ముస్లింను చెడుకు గురి చేయుట నుండి.).
15- యా హయ్యు యా ఖయ్యూమ్ బిక అస్తగీస్, ఫఅస్లిహ్ లీ షఅనీ వలా తకిల్నీ ఇలా నఫ్సీ తర్ఫత ఐన్. (అబూ దావూద్ 5090).
يَا حَيُّ يَا قَيُّومُ بِكَ اَسْتَغِيثُ فَأَصْلِحْ لِيْ شَأْنِي وَلاَ تَكِلْنِي إِلَى نَفْسِي طَرْفَةَ عَيْن (ఓ సజీవుడా, విశ్వవ్యవస్థకు ఆధారభూతుడా! నీతోనే నేను మొరపెట్టుకుంటున్నాను. అందుకని నా ప్రతి కార్యాన్ని సజావుగా చేయు, కనురెప్ప కొట్టే అంత కూడా నన్ను నాకై అప్పగించకు).
16- లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్.
పై జిక్ర్ ఉదయం పది సార్లు చదివినవారికి పది పుణ్యాలు అల్లాహ్ వ్రాస్తాడు, పది పాపాలు మన్నిస్తాడు, పది స్థానాలను పెంచుతాడు, నాలుగు బానిసలకు విముక్తి కలిగించినంత పుణ్యం ఉంటుంది మరియు సాయంకాలం వరకు షైతాన్ నుండి కాపాడబడతాడు. సాయంకాలం పది సార్లు చదివితే అలాంటి ఘనతే ఉంది. (ఇబ్నుహిబ్బాన్ 2021, సహీహుత్ తర్గీబ్ 474). బద్ధకం ఉంటే ఒకసారైనా చదవాలి. (అబూదావూద్ 5077).
పై జిక్ర్ 100 సార్లు చదివితే పది బానిసలను విడుదల చేసినంత పుణ్యం లభిస్తుంది, 100 పుణ్యాలు వ్రాయబడతాయి, 100 పాపాలు తొలగించబడతాయి, సాయంకాలం వరకు షైతాన్ నుండి రక్షింపబడతాడు, అతనికంటే ఎక్కువ చదివినవాడు తప్ప మరెవ్వడూ అతనికంటే ఉత్తముడు కాడు. (బుఖారి 6403, ముస్లిం 2691).
15- సుబ్ హానల్లాహి వబిహందిహీ.
سُبْحَانَ اللهِ وَ بِحَمْدِهِ (100 مرة)
పై జిక్ర్ ఉదయం 100 సార్లు, సాయంకాలం 100 సార్లు చదివినవారికంటే ఉత్తములు ప్రళయదినాన మరెవరూ ఉండరు, కేవలం అతని పరిమాణంలో, లేదా అతని కంటే ఎక్కువ చదివిన వ్యక్తి తప్ప. (ముస్లిం 2692).
పై జిక్ర్ ఉదయం, సాయంకాలం వంద, వంద సార్లు చదివిన వారి పాపాలు సముద్రపు నురుగుకు సమానమైనా క్షమించబడతాయి. (సహీహుత్ తర్గీబ్ 653).
16- అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఇల్మన్ నాఫిఆ, వ రిజ్ఖన్ తయ్యిబా, వ అమలమ్ ముతకబ్బలా. (కేవలం ఫజ్ర్ నమాజు తర్వాత). (ఇబ్ను మాజ 925)
(అల్లాహ్ స్తోత్రముతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు తున్నాను, ఆయన సృష్టి పరిమాణంలో, ఆయనకు ఇష్టమైనంత, ఆయన సింహాసనంత బరువులో మరియు ఆయన పవిత్ర వచనాలు వ్రాయబడే సిరా అంత పరిమాణంలో).
పై దుఆ ఫజ్ర్ తర్వాత 3 సార్లు చదివితే, ఫజ్ర్ నుండి చాష్త్ వరకు చేసే జిక్ర్ కు సమానమైన పుణ్యం లభిస్తుంది. (ముస్లిం 2726).
18- అఊజు బికలిమాతిల్లాహిత్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్.
أَعُوذُ بِكَلِمَاتِ الله التَّامَّاتِ مِن شَرِّ مَا خَلَق (అల్లాహ్ సంపూర్ణ వచనాలతో నేను శరణు కోరుతున్నాను, ఆయన సృష్టిలో ఉన్న సర్వ కీడుల నుండి).
పై దుఆ సాయంకాలం 3 సార్లు చదివినవారికి ఆ రాత్రి ఏ విషపురుగు హాని కలిగించదు. (ముస్లిం 2709).
19- అస్తగ్ ఫిరుల్లాహ వ అతూబు ఇలైహ్.
ఈ జిక్ర్ ప్రవక్త సల్లల్లాహు అలైహివ వసల్లం ప్రతి రోజు వందసార్లు చదివేవారు. (ముస్లిం 2702).
20- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్.
ఉదయం 10 సార్లు, సాయంకాలం 10 సార్లు దరూద్ చదివినవారి పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేస్తారు. (సహీహుల్ జామి 6357).
21- సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి ముందు 100 సార్లు ‘సుబ్ హానల్లాహ్’, 100 సార్లు ‘అల్ హందులిల్లాహ్’, 100 సార్లు ‘అల్లాహు అక్బర్’.
అది (అల్లాహ్ మార్గంలో వదిలిన) 100 ఒంటెలకంటే ఉత్తమం. అది అల్లాహ్ మార్గంలో వదిలిన 100 గుర్రాల కంటే ఉత్తమం. అది 100 బానిసలను విముక్తి కలిగించుటకంటే ఉత్తమం. (సహీ తర్గీబ్ 658).
రెండు అరచేతులు కలిపి, పై మూడు సూరాలు చదివి, అందులో ఊదుకొని ముఖము, శరీర ముందు భాగం ఇంకా సాధ్యమైనంత వరకు మిగిత భాగంలో తుడుచు కోవాలి. ఇలా మూడు సార్లు చేయాలి. (బుఖారి 5018).
2- ఆయతుల్ కుర్సీ.
పడకపై వెళ్ళి ఆయతుల్ కుర్సీ చదివినవారి పై అల్లాహ్ ఒక రక్షకుడ్ని నియమిస్తాడు మరియు తెల్లారే వరకు షైతాన్ అతని దగ్గరికి రాడు. (బుఖారి 2311 తర్వాత).
3- ఆమనర్రసూలు బిమా ఉంజిల ఇలైహి మిర్ రబ్బిహీ వల్ ముఅ’మినూన్, కుల్లున్ ఆమన బిల్లాహి వమలాఇకతిహీ వకుతుబిహీ వ రుసులిహీ లా నుఫర్రిఖు బైన అహదిమ్ మిర్రుసులిహ్, వ ఖాలూ సమిఅ’నా వ అతఅ’నా గుఫ్రానక రబ్బనా వ ఇలైకల్ మసీర్. లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా వుస్అహా లహా మా కసబత్ వఅలైహా మక్తసబత్ రబ్బనా లా తుఆఖిజ్నా ఇన్నసీనా ఔ అఖ్ తఅ’నా రబ్బనా వలా తహ్ మిల్ అలైనా ఇస్రన్ కమా హమల్తహూ అలల్లజీన మిన్ ఖబ్లినా రబ్బనా వలా తుహమ్మిల్నా మాలా తాఖత లనా బిహీ వఅ’ఫు అన్నా వగ్ఫిర్ లనా వర్ హమ్నా అంత మౌలానా ఫన్సుర్నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్.
(ఈ ప్రవక్త తన ప్రభువు తరఫు నుండి అవతరించిన దానిని విశ్వసించాడు, విశ్వాసులు కూడా దానిని విశ్వసించారు. వారంతా అల్లాహ్ నూ, ఆయన దూతలనూ, ఆయన గ్రంథాలనూ, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. వారంటారుః మేము అల్లాహ్ ప్రవక్తలలో ఏ ఒక్కరినీ భేదభావంతో చూడము. మేము ఆదేశం విన్నాము, శిరసావహించాము, నీ క్షమాభిక్షకై అర్థిస్తున్నాము ఓ మా ప్రభువా! గమ్యస్థానం నీ వైపుకే ఉంది. అల్లాహ్ ఏ ప్రాణిపైననూ దాని శక్తికి మించిన భారం వేయడు, తాను సంపాదించిన పుణ్యానికి సత్ఫలితం, తాను చేసిన పాపానికి దుష్ఫలితం ప్రతివ్యక్తి అనుభవిస్తాడు. (మీరు ఇలా వేడుకోండిః) ఓ మా ప్రభువా! మేము మరచినా, లేక తప్పు చేసినా మమ్మల్ని పట్టకు. ఓ మా ప్రభువా! పూర్వం వారిపై మోపినటువంటి భారం మాపై మోపకు. ఓ మా ప్రభువా! మేము సహించలేని భారం మాపై వేయకు. మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు. నీవే మా సంరక్షకుడవు, కావున సత్యతిరస్కారులకు విరుద్ధంగా మాకు సహాయం నొసంగు).
పై ఆయతులు రాత్రి పడుకునే ముందు చదువు కునే వారికి అవి సరిపోతాయి. (బుఖారి 5040, ముస్లిం 807).
నిద్రించుటకు వెళ్ళినపుడు పడక బట్టల్ని బాగా దులుపుకోవాలి, అతను దాని నుండి దూరంగా ఉన్నపుడు అందులో ఏమి వచ్చి పడిందో అతనికి తెలియదు గనక, ఆ తర్వాత పై దుఆ చదవాలి
నా ప్రభూ! నీ పేరుతో (పడకపై) మేను వాల్చాను, తిరిగి నీ పేరుతోనే మేల్కొంటాను. (ఈ మధ్యలో) నీవు నా ప్రాణాన్ని (నీ వద్ద) ఆపుకుంటే దానిని క్షమించి కరుణించు. ఒకవేళ దానిని తిరిగి (నా శరీరంలో) విడిచిపెడితే సజ్జనులైన నీ దాసుల్ని రక్షించినట్లు దానిని రక్షించు.
5- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పడుకోవాలని ఉద్దేశించినప్పుడు తమ కుడి చేతిని కుడి చెంప క్రింద పెట్టుకొని ఈ దుఆ 3 సార్లు చదివేవారుః అల్లాహుమ్మ ఖినీ అజాబక యౌమ తబ్అసు ఇబాదక. (అబూ దావూద్ 5045).
اللَّهُمَّ قِنِي عَذَابَكَ يَوْمَ تَبْعَثُ عِبَادَكَ అల్లాహ్! నీవు నీ దాసుల్ని మరణించిన తర్వాత తిరిగి బ్రతికించే రోజున నన్ను నీ శిక్ష నుండి కాపాడు.
6- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పడకపై వచ్చి తమ చేతిని కుడి చెంప క్రింద పెట్టుకొని “అల్లాహుమ్మ బిస్మిక అమూతు వ అహ్ యా” చదివేవారు. (బుఖారి 6314).
اللَّهُمَّ بِاسْمِكَ أَمُوتُ وَأَحْيَا అల్లాహ్! నీ పేరుతోనే మృత్యు ఒడిలోకి పోతున్నాను మళ్ళీ నీ పేరుతోనే బ్రతుకుతున్నాను.
7- మీరు మీ పడకపై వచ్చి నిద్రపోయే ముందు అల్లాహు అక్బర్ 34 సార్లు, అల్ హందులిల్లాహ్ 33 సార్లు, సుబ్ హానల్లాహ్ 33 సార్లు చదవండి. ఇది మీ కొరకు బానిస కంటే ఎంతో ఉత్తమం. (బుఖారి 3113).
8- ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ లా అఅ’బుదు మా తఅ’బుదూన్, వలా అంతుమ్ ఆబిదూన మా అఅ’బుద్. వలా అనా ఆబిదుమ్ మాఅబత్తుమ్, వలా అంతుమ్ ఆబిదూన మా అఅ’బుద్, లకుమ్ దీనుకుమ్ వలియ దీన్.
(ఇలా అనుః ఓ సత్యతిరస్కారులారా! మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను. నేను ఆరాధించే ఆయన(అల్లాహ్) ను మీరు ఆరాధించేవారు కారు. మరియు మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను. నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు. మీ ధర్మం మీకు, నా ధర్మం నాకు).
పై సూరా పఠించి వెంటనే పడుకో, నీవు షిర్క్ నుండి దూరంగా ఉన్నావని ఇది ఒక నిరూపణ. (అబూ దావూద్ 5055).
9- నీవు నీ పడకపై వచ్చే ముందు నమాజు కొరకు చేసిన విధంగా వుజూ చేసి నీ కుడి ప్రక్కన పడుకొని ఈ దుఆ చదువుః అల్లాహుమ్మ అస్లమ్ తు వజ్ హీ ఇలైక వ ఫవ్వజ్ తు అమ్రీ ఇలైక వ అల్ జఅ’తు జహ్రీ ఇలైక రగ్బతౌఁ రహ్బతన్ ఇలైక లా మల్ జఅ వలా మంజా మిన్క ఇల్లా ఇలైక అల్లాహుమ్మ ఆమన్తు బికితాబికల్లజీ అంజల్త వ బినబియ్యికల్లజీ అర్సల్త.
(ఓ అల్లాహ్ నీ సమక్షంలో నన్ను నేను సమర్పించు- కున్నాను. నా వ్యవహారాలన్నీ నీకు అప్పగించాను. ఇక నిన్నే నమ్ముకొని ఉన్నాను. నీ అనుగ్రహ భాగ్యం పొందే ఆరాటంతో, నీ ఆగ్రహ భయంతో నీ సన్నిధిలో హాజరయ్యాను. నీ నుండి పారిపోయి నేనెక్కడా రక్షణ పొందలేను. నీ సన్నిధిలో తప్ప నాకు మరెక్కడా ఆశ్రయం లేదు. అల్లాహ్! నీవు అవతరింప జేసిన నీ (ఖుర్ఆను) గ్రంథాన్ని, నీవు ప్రభవింపజేసిన నీ ప్రవక్తను (మనస్ఫూర్తిగా) విశ్వసించాను). (బుఖారి 247).
ఇదే రాత్రి నీవు చనిపోయావంటే ఇస్లాం ధర్మంపై నీవు చనిపోతావు. ఈ దుఆ నీ తుది పలుకులు కావాలి. (అంటే ఈ దుఆ తర్వాత నీ నోట ఎలాంటి ప్రాపంచిక విషయాలు వెలువడ కూడదు).
10- అల్లాహుమ్మ రబ్బస్సమావాతి వ రబ్బల్ అర్జి వ రబ్బల్ అర్షిల్ అజీమ్, రబ్బనా వ రబ్బ కుల్లి షైఇన్ ఫాలిఖిల్ హబ్బి వన్నవా వ ముంజిలత్ తౌరాతి వల్ ఇంజీలి వల్ ఫుర్కాని అఊజు బిక మిన్ షర్రి కుల్లి షైఇన్ అంత ఆఖిజుమ్ బినాసియతిహీ, అల్లాహుమ్మ అంతల్ అవ్వలు ఫలైస ఖబ్లక షైఉన్ వ అంతల్ ఆఖిరు ఫలైస బఅ’దక షైఉన్ వ అంతజ్జాహిరు ఫలైస ఫౌఖక షైఉన్ వ అంతల్ బాతిను ఫలైస దూనక షైఉన్ ఇఖ్ జి అన్నద్దైన వ అగ్నినా మినల్ ఫఖ్ర్.
(భూమ్యాకాశాలకు, గొప్ప సింహాసనానికి ప్రభువైన అల్లాహ్! మాకు మరియు ప్రతీదానికి ప్రభువైన ఓ ప్రభువా! బీజాన్ని, విత్తనాన్ని చీల్చువాడా! తౌరాత్, ఇంజీల్ మరియు ఫుర్కాన్ (ఖుర్ఆన్) అవతరింప జేసినవాడా! నేను ప్రతీ కీడు నుండి నీ శరణులో వచ్చాను, దాని జుట్టు నీ చేతిలోనే ఉంది. ఓ అల్లాహ్! నీవే అందరికీ ప్రథమం, నీకంటే ముందు ఎవడూ లేడు, నీవే అంతం, నీ తర్వాత ఎవడూ లేడు, నీవే అందరిపై ఆధిపత్యం గలవానివి, నీపై ఎవరి ఆధిపత్యం చెల్లదు, నీవే అందరికీ పరోక్షంగా ఉన్నవానివి, నీకంటే మరుగగా ఎవడూ లేడు, మాపై ఉన్న అప్పును తేర్చు, బీదరికం నుండి బైటికి తీసి మమ్మల్ని సరిసంపదలు గలవానివిగా చేయు). (ముస్లిం 2713).
11- అల్ హందులిల్లాహిల్లజీ అత్అమనా వ సఖానా వ కఫానా వ ఆవానా ఫకమ్ మిమ్మల్ లా కాఫియ లహూ వలా ముఅవియ. (ముస్లిం 2715).
(సర్వ స్తోత్రములు అల్లాహ్ కొరకే! ఆయనే మాకు తినిపించాడు, త్రాగించాడు, సరిపోయాడు, నివాసమిచ్చాడు. లేకుంటే ఎంతో మందికి సరిపడు వాడు మరియు నివాసమిచ్చువాడు ఎవడూ లేడు).
12- అల్లాహుమ్మ ఫాతిరిస్సమావాతి వల్ అర్జి ఆలిమల్ గైబి వష్షహాదతి రబ్బ కుల్లి షైఇన్ వ మలీకహు అష్ హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అఊజు బిక మిన్ షర్రి నఫ్సీ వ షర్రిష్షైతాని వ షిర్కిహీ, వఅన్ అక్తరిఫ అలా నఫ్సీ సూఅన్ ఔ అజుర్రుహూ ఇలా ముస్లిమ్.
(ఓ అల్లాహ్! భూమ్యాకాశాల సృష్టికర్తా! గోచర అగోచరాల జ్ఞానీ! ప్రతి వస్తువు యొక్క ప్రభువా! మరియు వాటి యజమానీ! నీ తప్ప ఎవ్వరూ సత్య ఆరాధ్యుడు లేడు అని నేను సాక్ష్యమిచ్చు చున్నాను, నేను నీ శరణులో వచ్చాను; నా ఆత్మ కీడు నుండి, షైతాన్ కీడు నుండి, అతని షిర్క్, ప్రేరేపణల నుండి, అలాగే నేను నా పట్లగాని లేదా ఎవరైనా ముస్లింను చెడుకు గురి చేయుట నుండి.). (అబూదావూద్ 5083).
13- పడుకునే ముందు ఖుర్ఆనులోని సూర (32) అలిఫ్ లామ్ మీమ్ అస్సజ్దా మరియు సూర (67) ముల్క్ చదవాలి. (తిర్మిజి 3404).
(అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. ఆయన అద్వితీయుడు, సర్వాధికారుడు, భూమ్యాకాశాలకు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికి ప్రభువు, సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు).
నిద్రలో భయాందోళన కలిగినప్పుడు
అఊజు బికలిమాతిల్లాహిత్తామ్మాతి మిన్ గజబిహీ వ ఇఖాబిహీ వ షర్రి ఇబాదిహీ వ మిన్ హమజాతిష్ షయాతీని వ అఐఁ యహ్ జురూన్. (తిర్మిజి 3528).
(అల్లాహ్ యొక్క సంపూర్ణ వచనాల రక్షణలో వస్తున్నాను; ఆయన ఆగ్రహం నుండి, శిక్ష నుండి, ఆయన దాసుల కీడు నుండి మరియు షైతానుల ప్రేరేపణల నుండి ఇంకా అవి స్వయంగా దగ్గరకు రావడం నుండి).
చెడు స్వప్న చూస్తే ఏం చేయాలి?
ముడూ సార్లు తన ఎడమ ప్రక్కలో ఉమ్మి వేయాలి. ఆ చెడు కల మరియు షైతాన్ నుండి అల్లాహ్ శరణు వేడుకోవాలి. ప్రక్క మార్చాలి. ఆ కల గురించి ఎవరికీ తెలుపకూడదు. లేచి నమాజు చేసుకున్నా మంచిదే. పై పనులు చేసినవానికి ఆ కల ద్వారా ఏ హానీ, అపాయం కలుగదు ఇన్షాఅల్లాహ్. (ముస్లిం 2261-2263).
విత్ర్ నమాజులో
1- అల్లాహుమ్మహ్ దినీ ఫీమన్ హదైత వ ఆఫినీ ఫీమన్ ఆఫైత వతవల్లనీ ఫీమన్ తవల్లైత వ బారిక్ లీ ఫీమా అఅ’తైత వ ఖినీ షర్ర మా ఖజైత ఇన్న తఖ్ జీ వలా యుఖ్ జా అలైక వ ఇన్నహూ లా యజిల్లు మన్ వాలైత వలా యఇజ్జు మన్ ఆదైత తబారక్త రబ్బనా వ తఆలైత
(ఓ అల్లాహ్! నీవు సన్మార్గం ప్రసాదించిన వారిలో నన్ను చేర్చి నాకూ సన్మార్గం ప్రసాదించు, నీవు స్వస్థత ప్రసాదించిన వారిలో నన్ను చేర్చి నాకూ స్వస్థత ప్రసాదించు, నీ స్నేహితుల్లో చేర్చి నాకు నీ స్నేహం ప్రసాదించు, నీవు నాకొసంగిన దాంట్లో శుభం కలుగజేయి, నీవు నిర్ణయించిన కీడు నుండి నన్ను కాపాడుకో, నిర్ణయాలు చేసేవానివి నీవే, నీకు వ్యతిరేకమైన నిర్ణయం ఎవడూ చేయలేడు, నీవు మిత్రునిగా చేసుకున్నవాడు ఎన్నడూ అవమానం పాలుకాడు. నీవు ద్వేశించినవాడు ఎన్నటికీ గౌరవం పొందడు. ఓ మా ప్రభువా నీవు శుభాలుగల మహోన్నతునివి). (అబూదావూద్ 1425).
2- అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిరిజాక మిన్ సఖతిక వ బిముఆఫాతిక మిన్ ఉఖూబతిక వ అఊజు బిక మిన్క లా ఉహ్ సీ సనాఅన్ అలైక అంత కమా అస్నైత అలా నఫ్సిక.
(ఓ అల్లాహ్! నీ అప్రసన్నత నుండి నీ ప్రసన్నత శరణు, నీ శిక్ష నుండి నీ మన్నింపు శరణు కోరుతున్నాను. నిన్ను నీవు ఎలా స్తుతించు కున్నావో అలా నేను నీ స్తోత్రాలను లెక్కించలేను). (అబూదావూద్ 1427).
3- అల్లాహుమ్మ ఇన్నా నస్తఈనుక వ నస్తగ్ ఫిరుక వ నుస్నీ అలైకల్ ఖైర కుల్లహూ వ నష్కురుక వలా నక్ఫురుక వ నఖ్ లఉ వ నత్రుకు మన్ యఫ్ జురుక అల్లాహుమ్మ ఇయ్యాక నఅబుదు వలక నుసల్లీ వ నస్జుదు వఇలైక నస్ఆ వ నహ్ ఫిదు నర్జూ రహ్మతక వ నఖ్ షా అజాబక ఇన్న అజాబక బిల్ కుఫ్ఫారి ముల్ హిఖ్
(ఓ అల్లాహ్! నిశ్చయంగా మేము నీతో మాత్రమే సహాయం కోరుతాము, నీతోనే క్షమాభిక్ష అడుగుతాము, నీ సంపూర్ణ ఉత్తమ స్తోత్రములే స్తుతిస్తాము, నీ కృతజ్ఞత చెల్లిస్తాము, నీ కతఘ్నత పాటించము, నీతో పాపానికి ఒడిగట్టిన వారిని ఓ మానాన వదిలేస్తాము, ఓ అల్లాహ్! నిన్ను మాత్రమే ఆరాధిస్తూ ఉన్నాము, నీ కొరకే నమాజు, సజ్దాలు చేస్తాము, నీ వైపునకే పరుగిడుతాము, ప్రయత్నము చేస్తాము, నీ కరుణను ఆశిస్తూ, నీ శిక్షతో భయపడుతాము, నీ శిక్ష అవిశ్వాసులకు కలుగనుంది). (ఇర్వాఉల్ గలీల్ 425, 2/164).
విత్ర్ నమాజ్ తర్వాత
సుబ్ హానల్ మలికిల్ ఖుద్దూస్. (నిసాయీ 1729).
سُبْحَانَ المَلِكُ القُدُّوس (పరిశుద్ధుడైన చక్రవర్తి పరమపవిత్రుడు). ముడూ సార్లు అనాలి. మూడవసారి కొంచెం శబ్దం పెంచాలి.
జనాజ నమాజులో
జనాజ నమాజు పద్ధతిః అల్లాహు అక్బర్ అని సనా, సూరె ఫాతిహా చదవాలి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని దరూద్ చదవాలి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని ఈ క్రింది దుఆలు చదవాలి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని సలాం తింపాలి.
[1] అల్లాహుమ్ మగ్ఫిర్ లహూ వర్ హమ్ హు వ ఆఫిహీ వఅ’ఫు అన్ హు వ అక్రిమ్ నుజులహూ వ వస్సిఅ’ ముద్ ఖలహూ వగ్సిల్ హు బిల్ మాఇ వస్సల్జి వల్ బర్ది వ నఖ్ఖిహి మినల్ ఖతాయా కమా యునఖ్ఖస్ సౌబుల్ అబ్ యజు మినద్దనసి వ అబ్దిల్ హు దారన్ ఖైరమ్ మిన్ దారిహీ వ అహ్లన్ ఖైరమ్ మిన్ అహ్లిహీ వ జౌజన్ ఖైరమ్ మిన్ జౌజిహీ వ అద్ ఖిల్ హుల్ జన్నత వ అఇజ్ హు మిన్ అజాబిల్ ఖబ్రి వ అజాబిన్నార్.
(అల్లాహ్ ఇతడ్ని క్షమించు, ఇతనిని కరుణించు, శిక్ష నుండి కాపాడు, మన్నించు, ఇతడ్ని ఆదరించి మర్యాద చెయ్యి, ఇతని సమాధిని విశాల పరచు, ఇతడ్ని నీళ్ళతో, మంచుతో, వడగళ్ళతో కడిగి తెల్లని వస్త్రాన్ని మురికి లేకుండా శుభ్రం చేసినట్లు పాపాల నుండి ఇతన్ని పరిశుభ్రం చెయ్యి. ఇతనికి ఇహలోకపు ఇల్లు కన్నా మంచి ఇల్లు, ఇహలోకపు పరివారంకన్నా ఉత్తమ పరివారం, ఇహలోకపు జంటకంటే మంచి జంట ఇవ్వు. ఇతన్ని స్వర్గంలోకి ప్రవేశింపజెయ్యి. సమాధి శిక్ష నుండి, అగ్ని శిక్ష నుండి కాపాడు). (ముస్లిం 963).
[2] అల్లాహుమ్మగ్ఫిర్ లిహయ్యినా వ మయ్యితినా వ షాహిదినా వ గాయిబినా వ సగీరినా వ కబీరినా వ జకరినా వ ఉన్సానా అల్లాహుమ్మ మన్ అహ్ యైతహూ మిన్నా ఫఅహ్ యిహీ అలల్ ఇస్లామ్, వ మన్ తవఫ్ఫైతహూ మిన్నా ఫతవఫ్ఫహూ అలల్ ఈమాన్, అల్లాహుమ్మ లా తహ్రి మ్నా అజ్రహూ వలా తుజిల్లనా బఅ’దహ్. (ఇబ్ను మాజ 1498).
(అల్లాహ్! మాలోని బ్రతికి ఉన్నవారిని చనిపోయిన వారిని, హాజరున్నవారిని, దూరమున్నవారిని, చిన్న వారిని పెద్దవారిని, పురుషులను స్త్రీలను క్షమించు. అల్లాహ్ మాలో ఎవరిని బ్రతకనిచ్చినా ఇస్లాంపై బ్రతకనివ్వు, మాలో ఎవరికి మరణాన్ని ప్రసాదించినా విశ్వాస స్థితిలోనే మరణాన్ని ప్రసాదించు. అల్లాహ్! ఈ మరణించిన వ్యక్తి (విషయంలో సహనం వహించటం వల్ల లభించే) పుణ్యానికి మమ్మల్ని దూరం చేయకు. ఇతని తర్వాత మమ్మల్ని మార్గభ్రష్టత్వంలో పడవేయకు).
[3] అల్లాహుమ్మ ఇన్న ఫులానబ్న ఫులానిన్ ఫీ జిమ్మతిక వ హబ్లి జివారిక ఫఖిహీ ఫిత్నతల్ ఖబ్రి వ అజాబన్నారి వ అంత అహ్లుల్ వఫాఇ వల్ హంద్. అల్లాహుమ్మ ఫగ్ఫిర్లహూ వర్ హమ్ హు ఇన్నక అంతల్ గఫూరుర్రహీం. (అబూదావూద్ 3202).
(ఓ అల్లాహ్ ఫలాన వ్యక్తి కుమారుడు నీ రక్షణలో, నీ చెంత ఉన్నాడు, నీవు అతడ్ని సమాధి శిక్ష నుండి, అగ్ని శిక్ష నుండి కాపాడు. నీవు వాగ్దానాన్ని నెరవేర్చువాడవు, స్తుతి పాత్రుడవు. అల్లాహ్ ఇతడ్ని మన్నించు, ఇతనిపై దయ చూపు. నిస్సందేహంగా నీవు అమితంగా మన్నించేవాడవు, అత్యధికంగా కరుణించేవాడవు).
[4] అల్లాహుమ్మ అబ్జుక వబ్ను అమతిక ఇహ్ తాజ ఇలా రహ్మతిక వ అంత గనియ్యున్ అన్ అజాబిహీ ఇన్ కాన ముహ్ సినన్ ఫజిద్ ఫీ ఇహ్ సానిహీ వ ఇన్ కాన ముసీఅన్ ఫతజావజ్ అన్ హు. (హాకిం 1/359).
(అల్లాహ్! నీ దాసుడు, నీ దాసి కుమారుడు నీ కరుణ అవసరమైనవాడు. అతన్ని శిక్షించే అవసరం నీకు ఏ మాత్రం లేదు. అతడు పుణ్యాత్ముడై ఉంటే అతనికి పుణ్యఫలితాలు రెట్టింపుగా ప్రసాదించు. అతడు పాపా త్ముడై ఉంటే అతన్ని మన్నించు).
పిల్లల జనాజలో
అల్లాహుమ్మజ్అల్ హు లనా ఫరతౌఁ వ సలఫౌఁ వ అజ్రా. (బుఖారి 1335కు ముందు).
اللَّهُمَّ اجْعَلْهُ لَنَا فَرَطًا وَسَلَفًا وَأَجْرًا (ఓ అల్లాహ్! ఇతడ్ని మా కొరకు సారథిగా, ముందుగా ఉండి మా కొరకు ప్రతిఫల కారకునిగా చేయి).
కృతజ్ఞతలు స్తుతులకు పాత్రుడవు నీవే అల్లాహ్ ! కరుణామయుడా ఓ అల్లాహ్ !
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
{ప్రవక్త తనపై తన ప్రభువు నుండి అవతరించిన దానిని విశ్వసించాడు. ఈ ప్రవక్తను విశ్వసించిన వారు కూడా దానిని హృదయ పూర్వకంగా విశ్వసించారు. వారంతా అల్లాహ్ నూ, ఆయన దూతలనూ, ఆయన గ్రంథాలనూ, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. వారు ఇలా అంటారు: “మేము అల్లాహ్ పంపిన ప్రవక్తలలోని ఏ ఒక్కరినీ భేదభావంతో చూడము. మేము ఆదేశం విన్నాము, శిరసావహించాము. ప్రభువా! క్షమాభిక్ష పెట్టుమని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరకు మేమంతా నీవద్దకే మరలివస్తాము}.(సూరె బఖర 2:285).
1- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “ఆచరణలు కేవలం మనోసంకల్పంపై ఆధారపడి ఉంటాయి. మనిషి దేని సంకల్పం చేసుకుంటాడో, అతనికి అదే ప్రాప్తమవుతుంది. (ఉదాహరణకు:) ఎవరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు వలసపోతారో అతని వలస మాత్రమే నిజమయినది. ఎవరు ప్రపంచం కొరకు లేదా ఏదైనా స్త్రీని వివాహమాడటానికి వలసపోతారో, అతని వలస ప్రపంచం కొరకు లేదా స్త్రీ కొరకుగానే పరిగణించబడుతుంది”. (బుఖారి 1, ముస్లిం 1907).
ఈ హదీసులో:
ఈ హదీసు ప్రతి ఆచరణకు పునాది లాంటిది. కర్మల అంగీకారం, తిరస్కారం మరియు అవి మంచివా లేదా చెడ్డవా అన్న విషయం మనోసంకల్పంపై ఆధారపడి ఉంటుంది. ఎవరు ఏ సంకల్పం చేస్తారో అతనికి అదే ప్రాప్తమవుతుంది. ఒక్కోసారి ఆచరణ బాహ్యంగా (చూడటానికి) చాలా మంచిగా ఉండవచ్చు. కాని సత్సంకల్పం లేని కారణంగా అది చేసిన వానికి ఏ లాభమూ దొరక్కపోవచ్చు. దీనికి సంబంధించిన నిదర్శనాలు ఖుర్ఆనులో మరీ స్పష్టంగా ఉన్నాయి:
{జాగ్రత్తా! ధర్మం ప్రత్యేకంగా అల్లాహ్ కు చెందిన హక్కు మాత్రమే}. (జుమర్ 39:3). {పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్ని అల్లాహ్ కే ప్రత్యేకించుకోవాలి}. (బయ్యినహ్ 98: 5). {మీరు షిర్క్ చేస్తే మీ కర్మలన్నీ వ్యర్థమైపోతాయి}. (జుమర్ 39: 65).
ఈ హదీసులో తెలిసిన మరో విషయం ఏమనగా: మనస్సు కార్యమే (సంకల్పశుద్ధియే) అన్నిటికీ మూలం. మనిషి తాను చేసే ప్రతీ కార్యం తన ప్రభువు కొరకే ప్రత్యేకించి చేయుటకు, దాన్ని షిర్క్ దరిదాపులకు, ఇతర ఉద్దేశాలకు దూరంగా ఉంచుటకు ప్రయత్నం చేయాలి. ఆ కార్యం ద్వారా అల్లాహ్ సంతృప్తి మరియు స్వర్గంలో ఆయన దర్శన భాగ్యం పొందే ఉద్దేశ్యం మాత్రమే ఉంచాలి.
సర్వకార్యాలు, వాటి ఉద్దేశ్యాల్ని బట్టి ఉంటాయి తప్ప బాహ్యరూపంతో కాదు. ఎవరూ మరొకరి బాహ్యరూపం, బాహ్యాచరణలతో మోసపోకూడదు. అతని మనస్సులో కీడు చోటు చేసుకోవచ్చు. కానీ ప్రజల పట్ల సదుద్దేశం కలిగి ఉండటమే అసలైన విషయం.
ఆరాధనలు చేసేవారి పుణ్యాల్లో వ్యత్యాసం వారి మనస్సంకల్పాన్ని బట్టి ఉంటుంది అని కూడా తెలుస్తుంది.
ప్రమాణం, మ్రొక్కుబడి, విడాకులు, అలాగే షరతులు, వాగ్థానం, ఒప్పందాల్లాంటి విషయాల్లో సంకల్పం (నియ్యత్) తప్పనిసరిగా ఉండాలి. మరచిపోయేవాడు, బలవంతం చేయబడినవాడు, అజ్ఞాని, పిచ్చివాడు మరియు చిన్న పిల్లలు చేసే పనులు (ఉద్దేశపూర్వకంగా ఉండవు గనక) వారిపై ఇస్లామీయ ఆదేశాలు విధిగా లేవు. ఎవరు ఏ సంకల్పంతో చేస్తారో అతనికి అదే ప్రాప్తమవుతుంది. వేరేది కూడా లభించవచ్చునా లేదా అన్న విషయం అల్లాహ్ యే ఎరుగును. కాబట్టి మనుషుల సంకల్పాలను అల్లాహ్ తప్ప మరెవరూ ఎరుగరు.
ప్రదర్శనాబుద్ధి, పేరుప్రఖ్యాతులు పొందే సంకల్పం చాలా చెడ్డదని ఈ హదీసు ద్వారా తెలుస్తుంది. అది అల్లాహ్ యేతరులతో ఏదైనా పొందే ఉద్దేశ్యం క్రింద లెక్కించబడుతుంది. సత్సంకల్పం లేనిదే ఏ కార్యాలూ, సత్కార్యాలుగా పరిగణింపబడవు. ఎవరైతే ప్రాపంచిక లాభానికి ప్రాముఖ్యతనిచ్చి పరలోక లాభాన్ని విస్మరిస్తారో అతను పరలోక లాభాన్ని కోల్పోతాడు. మరెవరైతే పరలోక లాభానికి ప్రాముఖ్యతనిచ్చి, దానితో పాటు ప్రాపంచిక ప్రయోజనం కూడా పొందాలనుకుంటాడో అతనికి ప్రాపంచిక లాభం లభిస్తుంది మరియు పరలోకంలో కూడా సత్ఫలితం ప్రాప్తిస్తుంది. ఎవరైతే తాను చేసే ఆచరణ ద్వారా ప్రజల ప్రసన్నత పొందాలని ఉద్దేశిస్తాడో అతడు షిర్క్ చేసినవాడవుతాడు.
అల్లాహ్ చాలా సూక్ష్మజ్ఞాని అని మరియు అతి రహస్య విషయాలు కూడా ఎరుగువాడని ఈ హదీసు ద్వారా తెలుస్తుంది. ఇంకా దుష్టులను వారి దుష్సంకల్పం వల్ల హీనపరచకుండా వారి విషయం దాచి ఉంచి అల్లాహ్ తన దాసులపై చేసిన మేలు కూడా ఈ హదీసు ద్వారా తెలుస్తుంది.
సాఫల్యం పొందాలంటే ఆచరణలు ఎక్కువయి ఉంటే సరిపోదు. అవి సత్కార్యాలు అయి ఉండటం తప్పనిసరి. ఇఖ్లాస్ (అల్లాహ్ సంతృప్తి కొరకు, ఆయనకే ప్రత్యేకించి) మరియు ప్రవక్త పద్ధతి ప్రకారం చేయబడినప్పుడే ఏదైనా ఆచరణ సత్కార్యం అవుతుంది. చిన్న కార్యమైనా సరే ఇఖ్లాస్ తో కూడుకుంటే అదే చాలా గొప్పది. దీనికొక హదీసు కూడా సాక్ష్యముంది. మనిషి ఏదైనా కార్యం మొదలుపెట్టే ముందు తన నియ్యత్ (సంకల్పాన్ని) నిర్థారణ చేసుకోవాలి. ఫర్జ్ అయినా, నఫిల్ అయినా, ఏ కార్యమైనా నియ్యత్ లేనిదే అంగీకరింపబడదు. నియ్యత్ కొరకు నోటితో పదాలు ఉచ్చరించాల్సిన అవసరం లేదు. దేని విషయంలో స్పష్టమైన నిదర్శనం ఉందో అది తప్ప.
2- హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు ప్రకారం: అబ్దుల్ ఖైస్ మనుషులు కొందరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “మీరెవరు, ఏ తెగకు చెందినవారు?” అని అడిగారు. దానికి వారు ‘మేము రబీఅ తెగకు చెందిన వాళ్ళము’ అని అన్నారు. “ఓహో! మీరా, స్వాగతం! గౌరవనీయులారా!” ఏలాంటి సిగ్గు, అవమానం లేకుండా రావచ్చు!” అని ప్రవక్త అన్నారు. వారన్నారుః “ప్రవక్తా! మాకూ, మీకూ మధ్య సత్యతిరస్కారి అయిన ఈ ముజర్ తెగ అడ్డు గోడగా ఉంది. అందువల్ల మేము పవిత్ర మాసాల్లో తప్ప ఇతర సమయాల్లో మీ వద్దకు రాలేము. ఇప్పుడు మాకేమైనా స్వర్గ ప్రవేశానికి ఉపయోగపడే విషయాలు, స్పష్టమైన గీటురాయి ఆదేశాలు ఇవ్వండి. వీటిని మేము మాతో పాటు మీ దగ్గరికి రానటువంటి వారికి కూడా వినిపిస్తాము. అంతే కాదు, పానీయాలను గురించి కూడా వారు ప్రవక్తని అడిగారు.
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాలుగు విషయాలను ఆచరించాలని, నాలుగు విషయాలను మానుకోవాలని వారికి ఆదేశించారు. ఏకైక అల్లాహ్ ను విశ్వసించాలని చెబుతూ “ఏకైక అల్లాహ్ ను విశ్వసించాలంటే ఏమిటో మీకు తెలుసా?” అని అడిగారు. దానికి వారు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు మాత్రమే బాగా తెలుసు. (మాకు తెలియదు) అని అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంఇలా విశదపరిచారు: “ఏకైక అల్లాహ్ ను విశ్వసించటమంటే అల్లాహ్ తప్ప సత్యమైన ఆరాధ్యుడు లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనచేత నియమించబడిన ప్రవక్త అని సాక్ష్యమివ్వాలి. నమాజు వ్యవస్థను నెలకొల్పాలి, జకాత్ (పేదల ఆర్థిక హక్కు) చెల్లించాలి, రమజాను ఉపవాసాలు పాటించాలి, యుద్ధ ప్రాప్తిలో ఐదవ వంతు సొమ్ము ప్రభుత్వ ధనగారానికి ఇవ్వాలి”. ఆ తర్వాత, హన్తమ్, దుబ్బా, నఖీర్, ముజఫ్ఫత్([1]). అనే నాలుగు రకాల పాత్రలలో నీళ్ళు ఉంచడాన్ని, త్రాగడాన్ని వారించారు. హదీసు ఉల్లేఖకులు ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఒక్కోసారి ముజఫ్ఫత్ అనడానికి బదులు ముఖయ్యర్ అని పలికేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాలు బోధిస్తూ “ఈ ఆదేశాలను బాగా గుర్తుంచుకోండి. మీతో పాటు ఇక్కడికి రాని మీ ప్రాంతం వాళ్ళకు కూడా తెలియజేయండి” అని అన్నారు. (బుఖారి 53, ముస్లిం 17).
ఈ హదీసులో:
ఆచరణలు విశ్వాసములో ఓ భాగము. గురువు ఒక విషయాన్ని ముందు సంక్షిప్తంగా చెప్పి, తర్వాత దానిని వివరించడం అభిలషణీయం. అందువల్ల అతని మాట అర్థమవుతుంది. గురువు హితబోధ చేస్తున్నప్పుడు ‘మూలజ్ఞానం మరియు అతిముఖ్యమైన విషయాలు ముందుగా చెప్పాలని మరియు అర్థమగుటకు సంగ్రహముగా చెప్పాలని కూడా ఈ హదీసు సూచిస్తుంది. చూడడానికి ఇందులో ఐదు ఆదేశాలు కనబడుతున్నాయి. అయితే యుద్ధప్రాప్తిలోని ఐదో వంతు విషయం జకాత్ పరిధిలోనే వస్తుంది. ఎందుకనగా అది ధనం, సొమ్ముకు సంబంధించినదే కదా. ఇలా ఆదేశాలు నాలుగే అవుతాయి.
కొందరు హదీసువేత్తల అభిప్రాయ ప్రకారం పైన చెప్పబడిన నాలుగు నివారణలు రద్దయినాయి. అంటే ఇతర సహీ హదీసుల ఆధారంగా ఆ పాత్రలు ధర్మసమ్మతమైన పానీయాలు త్రాగడానికి ఉపయోగించవచ్చు.
(మదిలో, ఆచరణ రూపంలో) విద్యను భద్రపరచి, ఇతరులకు అందజేయడం గురించి ఈ హదీసులో ప్రోత్సహించబడింది. విద్యాభ్యాసం క్రమపద్ధతిలో ఉండడం మంచిదని చెప్పబడింది.
ఇందులో హజ్ ప్రస్తావన రాలేదు. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆదేశాలు ఇచ్చేటప్పడు హజ్ యాత్ర విధిగా నిర్ణయించబడలేదు అని కొందరు పండితులు చెప్పారు.
వచ్చేవారితో వారి పేరు, వంశం గురించి అడగడం జరిగింది. ఇది సున్నత్ (ప్రవక్తవారి సత్సంప్రదాయం). వచ్చే అతిథుల మనుసు చూరగొని, ఒంటరితన భావాన్ని దూరం చేయుటకు మంచి పద్ధతిలో స్వాగతం పలకాలని ఈ హదీసులో ఉంది.
ఈ హదీసులో ఇస్లాం యొక్క అర్కాన్ (మౌలిక విషయా)లను ఈమాన్ యొక్క వ్యాఖ్యానంలో తెలుపడం జరిగింది. దీనితో తెలిసిందేమిటంటే ఇస్లాం మరియు ఈమాన్ ప్రస్తావన విడివిడిగా వచ్చినప్పుడు ప్రతి దాంట్లో ఇస్లాం మరియు ఈమాన్ రెండింటికి సంబంధించిన అర్కానులు వస్తాయి. మరెప్పుడైతే రెండింటి ప్రస్తావన ఒకచోట వస్తుందో దేని భావం దానికే ఉంటుంది.
3-బరా బిన్ ఆజిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో కూర్చొని ఉండగా “ఇస్లాం యొక్క గట్టి, బలమైన కంకనం ఏది?” అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు. నమాజ్ అని మేమన్నాము. ప్రవక్త చెప్పారు: “అది మంచిదే. కాని నేను కోరిన సమాధానం అది కాదు”. జకాత్ కావచ్చు అని మేమన్నాము. ప్రవక్త అన్నారు: “అది మంచిదే. కాని నా ప్రశ్నకు జవాబు అది కాదు”. అయితే రమజాను ఉపవాసాలు అయి యుండాలి అని మేమన్నాము. ప్రవక్త అన్నారు: “అది మంచిదే. కాని నేను కోరిన సమాధానం కాదు”. హజ్ కావచ్చునా అని అడిగాము. “అది మంచిదే. కాని నేను అడిగింది అది కాదు” అన్నారాయన. అయితే అది జిహాద్ అయి యుండాలి అని అన్నాము. దానికి కూడా ప్రవక్త చెప్పారు: “అదీ మంచిదే. కాని నేను కోరిన సమాధానం అది కాదు”. తర్వాత ఆయనే దాని సమాధానం ఇలా చెప్పారుః “నీవు ఒకరిని ప్రేమించినా అల్లాహ్ కొరకే ప్రేమించాలి. ద్వేషించినా అల్లాహ్ కొరకే ద్వేషించాలి. ఇది ఈమాన్ యొక్క బలమైన కంకనం”. (అహ్మద్ 4/286. సహీహుత్ తర్ఘీబ్ 3030).
ఈ హదీసులో:
ఇస్లామీయ పరంగా పరస్పర బంధాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి, వాటిలో చాలా బలమైన బంధం: ఎవరితోనైనా ప్రేమించుట, ద్వేషించుట కేవలం అల్లాహ్ కొరకే ఉండాలి. స్నేహం, శతృత్వం మరియు ప్రేమ, ద్వేషాలు అల్లాహ్ కొరకే చేయుట ధర్మంగా పరిగణించబడతాయి. అల్లాహ్ యొక్క విధేయులను ప్రేమించుట, అవిధేయులను ద్వేషించుట ముస్లింపై విధిగా ఉంది. రక్త సంబంధం వల్ల గాని మరే ఇతర ప్రాపంచిక సంబంధాల వల్ల గాని ఉండే ప్రేమల కంటే అధికంగా అల్లాహ్ కొరకు ప్రేమ ఉండాలి. ప్రతి మనిషితో అతనిలో ఎంత విధేయత ఉంటుందో అంతే ప్రేమ, ఎంత అవిధేయత ఉంటుందో అంతే ద్వేషం ఉండాలి. ఒకే మనిషితో కొంత ప్రేమ, కొంత ద్వేషం రెండూ ఉండవచ్చు. అది అతనిలో ఉన్న విధేయత మరియు అవిధేయతలను బట్టి. ఒక మనిషి ఎవరితో ప్రేమించినా, ద్వేషించినా అది ధార్మిక పునాదిపై ఉండాలి.
{ఈ సంచార అరబ్బులు, “మేము విశ్వసించాము” అని అంటారు. వారితో ఇలా చెప్పండి: “మీరు విశ్వసించలేదు. మేము లొంగిపోయాము” అని అనండి. విశ్వాసం ఇంకా మీ హృదయాలలోకి ప్రవేశించలేదు}. (హుజురాత్ 49: 14).
4- సఅద్ బిన్ అబీ వఖ్ఖాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ఓసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొంత మందికి ధనం పంచి పెట్టారు. కాని నాకు ఇష్టమయిన ఒక వ్యక్తికి మాత్రం ఏమీ ఇవ్వకుండా వదిలేశారు. అప్పుడు నేను (ఆశ్చర్యపోతూ) ప్రవక్తా! మీరు ఈ వ్యక్తి పట్ల ఇలా ఎందుకు వ్యవహరించారు? అల్లాహ్ సాక్షి! నేను మాత్రం ఇతడ్ని మోమిన్ (విశ్వాసి)గా భావిస్తున్నాను అని అన్నాను. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఏమిటి, మోమినా లేక ముస్లిమా? అని అడిగారు. ఆయన మాటలు విని నేను కాస్సేపు మౌనంగా ఉండిపోయాను. కాని ఆ తర్వాత ఆ వ్యక్తి గురించి నాకు తెలిసిన విషయాలు నన్ను మరోసారి ఈ సంగతి అడిగేందుకు ఒత్తిడి చేశాయి. నేను సంగతిని తిరిగి ప్రస్తావిస్తూ మీరు ఈ మనిషి పట్ల ఇలా ఎందుకు వ్యవహరించారు? అల్లాహ్ సాక్షిగా! నా దృష్టిలో ఇతను మోమినే అని అన్నాను. దానికి ప్రవక్త “ఏమిటి, మోమినా లేక ముస్లిమా?” అని అన్నారు. దాంతో నేను మరోసారి మౌనంగా ఉండిపోయాను. అయితే కాస్సేపటి తర్వాత అతడ్ని గురించి నేనెరిగిన విశేషాలు నన్ను మళ్ళీ ప్రశ్నించేలా చేశాయి. నేనా సంగతిని మళ్ళీ ప్రస్తావించాను. ప్రవక్త కూడా తిరిగి అదే సమాధానమిచ్చి ఊరుకున్నారు. ఆ తర్వాత కాస్సేపటికి ఇలా అన్నారుః “సఅద్! ఒక్కోసారి నేను నాకెంతో ఇష్టుడయిన మనిషిని వదిలేసి అంతకంటే తక్కువ ఇష్టుడైన మరొకతనికి ఇస్తుంటాను. (అలా ఇవ్వని పక్షంలో అతను ఇస్లాంకు దూరమయిపోవచ్చు తత్ఫలితంగా) అల్లాహ్ అతడ్ని నరకంలోకి విసిరి బోర్లా పడవేస్తాడేమోనన్న భయంతో నేనతనికి ధనం ఇస్తుంటాను”. (బుఖారి 27, ముస్లిం 150).
ఈ హదీసులో:
ఈమాన్, ఇస్లాం కంటే గొప్పది. ప్రతి మోమిన్ ముస్లిం, కాని ప్రతి ముస్లిం, మోమిన్ కాడు. సందేహం తొలిగిపోవుట కోసం, గురువు ఆపనంతవరకు, దండించనంతవరకు అడిగిన (చెప్పిన) విషయమే తిరిగి అడగవచ్చు/ చెప్పవచ్చు. ప్రజల్లో ఎక్కువ విశ్వాసం గలవారికే ఎక్కువ ధనం లభించాలన్నదేమి నియమం లేదు. ధనం ద్వారా ఇస్లామీయ ప్రచారం ముందుకు సాగించవచ్చు దాని ద్వారా హృదయాలు చూరగొనవచ్చు. తమ అనుచరులు సన్మార్గంపై ఉండాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతగా కాక్షించేవారో మరియు వారి పట్ల ఆయన ఎంత కనికరం గలవారో తెలిసింది. గురువు తన శిష్యులను సందిగ్థంలో పడవేసే విషయాల్ని విశదపరచడం, తమ ఉద్దేశ్యాన్ని స్పష్టం చేయడం ధర్మం అని తెలిసింది. తమ మనుస్సులో ఏ విషయం గురించి కలత, సందేహముందో దాన్ని గురువు ముందు ప్రస్తావిస్తే ఆయన అది తొలిగిపోయే మార్గం చూపించవచ్చు. నాయకుడు ప్రజల ధనాన్ని ధర్మాభివృద్ధి ఉద్దేశ్యంతో అవసరం గల ప్రజలకు ఇవ్వచ్చును.
5-“ముహమ్మద్ ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా! యూదుడైనా, క్రైస్తవుడైనా మరింకెవరైనా నా గురించి విని, నాతో పంపబడిన ధర్మాన్ని విశ్వసించకుండానే మరణిస్తే అతడు నరకవాసుల్లో చేరిపోతాడ” నిప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ముస్లిం 153).
ఈ హదీసులో:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చిన ధర్మం ప్రజలందరికి, అన్ని మతాలవారికి మార్గదర్శకత్వం. ఈ ధర్మం వచ్చాక పూర్వ మతాలన్నియూ రద్దయినాయి. మాకు ఇస్లాం గురించి ఎవరూ తెలుపలేదు అన్న సాకులు ప్రళయదినాన ప్రజలు చెప్పకూడదంటే ఇస్లాం యొక్క సత్యసందేశం వారికి అందజేయుట మన కర్తవ్యం.
ప్రమాణం చేయమని కోరడం జరుగకున్నా తన మాటను బలపరచడం కొరకు ప్రమాణం చేయవచ్చు.
అల్లాహ్ కు చేయి ఉందని తెలిసింది. అది అల్లాహ్ కు తగిన రీతిలో ఉందని నమ్మాలి. కాని సృష్టిరాసుల చేతులతో పోల్చకూడదు.
ఇస్లాం సందేశం ఎవరి వరకు చేరలేదో వారి విషయం అల్లాహ్ యే చూసుకుంటాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆగమనం తర్వాత ఇస్లాం తప్ప ఏ ఇతర ధర్మమూ చెల్లదు. ఇదే విషయాన్ని అల్లాహ్ ఇలా తెలిపాడు:
{ఎవరైనా ఈ విధేయతా విధానం (ఇస్లాం) కాక మరొక మార్గాన్ని అవలంబించదలిస్తే, ఆ మార్గం ఎంతమాత్రం ఆమోదించబడదు. అతడు పరలోకంలో విఫలుడౌతాడు, నష్టపోతాడు}. (సూరె ఆలి ఇమ్రాన్ 3: 85).
6- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారని ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారుః “అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త అని ప్రజలు సాక్ష్యమిచ్చి, నమాజు స్థాపించి, విధిదానంచెల్లించనంతవరకువారితో యుద్ధం చేస్తూ ఉండాలని నాకుఆజ్ఞలభించింది.వారుఈ విధులు పాటిస్తే వారి ధనప్రాణాలకు నా నుండి రక్షణ ఉంది ధర్మ రీత్యా తప్ప. మరియు వారి లెక్క అల్లాహ్ చూసుకుంటాడు”.(బుఖారి 25, ముస్లిం 22).
ఈ హదీసులో:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ పని చేసినా అల్లాహ్ ఆదేశంతోనే చేసేవారు. ఆయన అల్లాహ్ సందేశాన్ని అందజేసేవారు. దాన్ని ఆచరణలోకి తెచ్చే, తెప్పించే ప్రయత్నం చేసేవారు. ఆచరణలు కూడా ఈమానులోనే వస్తాయి. నమాజు మరియు జకాతు విధులను నెరవేర్చనివాడు అవిశ్వాసానికి ఒడిగట్టినవాడవుతాడు. అన్ని కార్యాల్లో తౌహీదే మొదటి స్థానంలో ఉంది. ఇందులో “ఆచరణలు ఈమాన్(విశ్వాసం)లో లెక్కించబడవు” అని వాదించే “ముర్జియ” అనబడే వర్గం వారిని ఖండించబడినది. నమాజు, జకాత్ విధులను పాటించనివారితో రాజ్యం పోరాడాలని ఉంది. నమాజు మరియు జకాతులో వ్యత్యాసం పాటించరాదు. ధర్మభ్రష్టతకు గురైన వారితో యుద్ధం చేయుటకు అబూ బక్ర్ రజియల్లాహు అన్హు ఇదే హదీసును ఆధారంగా తీసుకున్నారు. బాహ్యంగా తనకు తాను ముస్లిమునని ప్రకటించినవాని ధనప్రాణాలకు రక్షణ గలదు. అతని ఆంతర్య విషయం అల్లాహ్ యే ఎరుగును. మునాఫిఖ్ (కపటవిశ్వాసి) ఇస్లామీయ బాహ్యకార్యాలు ఆచరిస్తాడు, కనుక అతనితో యుద్ధం చేయరాదు. అతని విషయం అల్లాహ్ యే చూసుకుంటాడు. “పవిత్ర వచనం” (“లాఇలాహ ఇల్లల్లాహ్” ముహమ్మదుర్ రసూలుల్లాహ్) పఠించిన వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం “రిసాలత్” (ప్రవక్త తత్వాన్ని) నమ్మినట్లే.
7- అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తికి ఇస్లాం ధర్మం గురించి బోధిస్తూ “నీవు ఇస్లాం స్వీకరించు” అని చెప్పారు. (ఇస్లామంటే నాకు అసహ్యమేమీ లేదు కానీ) ఇప్పుడు స్వీకరించాలన్న ఇష్టం నాకు లేదు అని చెప్పాడు. “నీకు ఇష్టం లేకున్నా సరే నీవు ఇస్లాం స్వీకరించు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు. (అహ్మద్ 3/109, 181. సహీహ 1454).
ఈ హదీసులో:
మంచి పనులు చేయుటకు మనిషి తన మనస్సును ఒప్పించాలి. మనస్సుకు భారం ఏర్పడినా సత్కార్యాలు చేయుటకు ముందడుగు వేయాలి. ప్రతీ కార్యం యొక్క సమాప్తం సంపూర్ణంగా ఉందా లేదా చూడబడుతుంది. కాని ఆరంభంలో ఉన్న కొరతను కాదు. పరిశీలన, యోచనకు ముందే ఇస్లాం స్వీకరించాలి. మనస్సు తృప్తికరంగా లేనప్పుడు చేసిన సత్కార్యం కూడా స్వీకరించబడవచ్చు.
8- ఇబ్ను షిమాస అల్ మహ్రీ ఉల్లేఖించారు: మేము అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు మరణ సమీపాన అతని వద్ద కూర్చొని ఉండగా, అతను చాలా సేపు ఏడ్చి తన ముఖాన్ని గోడ వైపు త్రిప్పుకున్నాడు. అప్పుడే అతని కుమారుడు నాన్నా! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీకు ఫలానా, ఫలానా శుభవార్తలు ఇవ్వలేదా? అని తృప్తినిచ్చారు. ఇది విని అతను తన ముఖాన్ని (మావైపు) త్రిప్పి ఇలా చెప్పారు: “లాఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లాహ్” సాక్ష్యాన్ని అన్నిటి కంటే అతిఉత్తమముగా భావించేవారము. విషయమేమిటంటే, నా జీవితంలో మూడు దశలు గడిచాయి. ప్రవక్తకంటే ఎక్కువ ద్వేషం మరెవ్వరితో లేని రోజులు గడిచాయి. అప్పట్లో నాకు మరీ ఇష్టమైన కార్యం ఏదైనా ఉంటే ఆయన్ను వశపరుచుకొని హతమార్చాలన్నదే. కాని ఒకవేళ నేను ఆ స్థితిలో చనిపోయి ఉంటే నరకవాసుల్లో చేరేవాడ్ని. కాని అల్లాహ్ దయ తలచాడు, ఇస్లాం కొరకు నా హృదయాన్ని తెరిచాడు. నేను ప్రవక్త వద్దకు వచ్చి, ప్రవక్తా! మీ కుడి చేతిని చాపండి. నేను ఇస్లాం స్వీకరిస్తూ శపథం చేస్తాను అని అన్నాను. ప్రవక్త తమ చెయ్యి చాపారు. కాని నేను వెంటనే నా చేతిని వెనక్కి తీసుకున్నాను. “నీకేమయింది, అమ్ర్!” అని ప్రవక్త ఆశ్చర్యంతో అడిగారు. నేను ఒక షరతు పెట్టదలుచుకున్నాను అని చెప్పాను. “నీ షరతు ఏమిటి?” అని ప్రవక్త అడిగారు. నా పాపాలన్నీ మన్నింపబడాలని నేను చెప్పాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తృప్తి పరిచారుః “ఏమీటి, నీకు తెలియదా? ఇస్లాం (స్వీకరణ) గత పాపాలన్నిటినీ తుడిచిపెడుతుంది. హిజ్రత్ (ధర్మ రక్షణకై వలసపోవుట) పూర్వ పాపాలన్నిటినీ తుడిచిపెడుతుంది. మరియు హజ్ కూడా పూర్వ తప్పిదాలను తుడిచిపెడుతుంది”. (ఆ పిదప నేను ఇస్లాం స్వీకరించాను).
ఆ నాటి నుండి నాకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ప్రియమైనవారు, మరియు నా దృష్టిలో ఆయనకంటే గొప్పవారు మరెవ్వరూ లేరు. వారి ఔన్నత్యపు గాంభీర్యం వల్ల నేను వారిని నా కళ్ళారా చూడగలిగేవాణ్ణి కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రూపు రేఖల్ని వర్ణించమని ఎవరైనా నన్ను అడిగితే నేను వర్ణించలేను. ఎందుకనగ నేను ఎన్నడూ వారిని నా కళ్ళారా చూడనేలేదు. ఇదే స్థితిలో గనక నేను చనిపోతే నిశ్చయంగా స్వర్గవాసుల్లో ఒకడిని అని ఆశించేవాడిని.
ఆ తర్వాత నాపై (ప్రభుత్వపరంగా) ఎన్నో బాధ్యతలు మోపబడ్డాయి. వాటి గురించి (నేను ప్రశ్నింపబడినప్పుడు) నా పరిస్థితి ఏమవుతుందో తెలియదు?
నేను చనిపోయిన తర్వాత నా జనాజ వెంటరోదించే, కేకలు పెట్టే స్త్రీలుగాని, అగ్నిగాని రాకూడదు. నన్ను ఖననం చేస్తున్నప్పుడు నా సమాధిపై కొద్ది కొద్దిగా మట్టి పోయండి. ఒంటెను కోసి దాని మాంసం పంచిపెట్టినంత సేపు మీరు నా సమాధి వద్దనే నిలిచి ఉండండి. నేను ధైర్యం, తృప్తి పొందుతాను. నా ప్రభువు పంపే దూతలకు నేనేమి సమాధానం చెబుతానో చూస్తాను. (ముస్లిం 121).
ఈ హదీసులో:
ఇస్లాం స్వీకరణ గత పాపాల విమోచనానికి మంచి సబబు. ఎవరు ఇస్లాంపై స్థిరంగా ఉంటాడో అతను పూర్వ పాపాల గురించి పట్టుబడడు. అలాగే హిజ్రత్ మరియు హజ్ కూడా పూర్వ పాపాల మన్నింపులకు కారణమవుతాయి.
గమనికః ఇస్లాం స్వీకరణ వల్ల చిన్నవి, పెద్దవి అన్ని పాపాల ప్రక్షాళన జరుగుతుంది. కాని హిజ్రత్ మరియు హజ్ వల్ల చిన్నవి, పెద్దవి అన్ని పాపాల మన్నింపు విషయంలో భేదాభిప్రాయం ఉంది. ఎందుకనగా పెద్ద పాపాల మన్నింపుకై స్వచ్ఛమైన తౌబా తప్పనిసరి. సత్కార్యాలు కూడా పాపాల మన్నింపుకై కారణమవుతాయి. ఎంత పెద్ద సత్కార్యముండునో అంతే పాపాలు మన్నించబడుతాయి. (ఖనన సంస్కారాలు పూర్తైన తర్వాత సమాధి వద్ద కొంత సేపు ఉండి దైవదూతలు వచ్చి అడిగే ప్రశ్నలకు అతను సరియైన సమాధానం చెప్పగలగాలని అల్లాహ్ తో అతని కొరకు దుఆ చేయాలని ఇతర హదీసుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పి ఉన్నారు. ఉః అబూదావూద్, కితాబుల్ జనాయిజ్, బాబుల్ ఇస్తిగ్ఫారి ఇందల్ ఖబ్రి లిల్ మయ్యిత్… -అనువాదకుడు-).
9– ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం ప్రకారం, ధర్మాల్లో ఏ ధర్మం అల్లాహ్ కు చాలా ప్రియమైనదని ప్రవక్త వద్దకు వచ్చిన ప్రశ్నకు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ” షిర్క్ కు దూరమైన, అతిసులభమైన ఇస్లాం ధర్మం” అని సమాధానమిచ్చారు. (అహ్మద్ 1/236. హాఫిజ్ ఇబ్ను హజర్ రహిమహుల్లాహ్ ఫత్హుల్ బారి (హ. 38 తర్వాత) లో ఈ హదీసును “హసన్” అని చెప్పారు).
ఈ హదీసులో:
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పంపబడిన ఇస్లాం ధర్మం, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం కు ఇవ్వబడిన సవ్యమైన ధర్మమే. అది చాలా సులభమైనది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజల పట్ల సున్నితంగా ప్రవర్తించుటకు, వారిపై మోపబడిన భారాన్ని తగ్గించుటకు, వారి శృంఖలాలను తెంచుటకు పంపబడ్డారు. అల్లాహ్ ప్రేమిస్తాడని తెలిసింది. కాని అది ఆయనకు తగిన రీతిలో అని నమ్మాలి. సృష్టిరాసుల పరస్పర ప్రేమతో పోల్చరాదు.
ఘనత పరంగా ధర్మాల్లో వ్యత్యాసం గలదు. ఇబ్రాహీం అలైహిస్సలాంకు అతి చేరువుగా ఉన్నవారు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సున్నితంగా ప్రవర్తించుట, శుభవార్త వినిపిస్తూ మెలగుట మంచిదని, కష్టం కలిగించకుండా, విరక్తి కలిగించకుండా ఉండాలని చెప్పబడింది. ఈ విషయంలో ఈ హదీసు చాలా స్పష్టంగా ఉంది: “సున్నితంగామెలగండి, కఠినంగామెలగకండి.సంతోషం, సంతృప్తికలిగించండి. విరక్తి కలిగించకండి”.(బుఖారి 69, ముస్లిం 1732).
10- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “నిశ్చయంగా ధర్మం సులువైనది. ఏ వ్యక్తి అయినా ధర్మం అనుసరణలో కాఠిన్య వైఖరి అవలంబిస్తే ధర్మమే అతనిపై ఆధిక్యత సాధిస్తుంది. (హెచ్చుతగ్గులు లేకుండా) సంపూర్ణ విధానాన్ని అవలంభించండి. లేదా దాని (సంపూర్ణతకు) సమీపాన చేరండి. (మీకు లభించే ప్రతిఫలంతో) సంబరపడండి. ఉదయం సాయంకాలం, మరికొంత రాత్రి సమయాల్లో (ఆరాధన చేయటం) ద్వారా సహాయాన్ని అర్థించండి”. (బుఖారి 39).
ఈ హదీసులో:
దీర్ఘ కాలం వరకు అల్లాహ్ ఆరాధన చేస్తూ ఉండడానికి మనిషి చురుకుగా ఉండే సమయాల సహాయం తీసుకోవాలి. అంటే ఆ సమయాల్లో ఆరాధనలు పాటించాలి. ఎల్లప్పుడూ చేస్తూ ఉండే అల్పమైన ఆచరణలు కొంత కాలం చేసి వదిలేసే అధిక ఆచరణల కంటే మేలైనవి. ఇస్లాం ధర్మం ప్రత్యేకతల్లో ఒకటి ఏమిటంటే అది చాలా సులభమైన ధర్మం. దాని ఆదేశాలు, నివారణలు మనిషి పాటించగలిగినవే. (అంటే మనిషి శక్తికి మించినవి కావు). శక్తికి మించిన శ్రమ భారాన్ని, ప్రవక్త సాంప్రదాయానికి భిన్నంగా అదనపు ఆరాధనల పాటింపును నెత్తిన వేసుకోవడం నివారించబడినది. ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా మధ్యేమార్గాన్ని అవలంభించాలన్న తాకీదు ఉంది. అదే రుజుమార్గం. మనిషి తన ఆరాధనలో పరిపూర్ణతకు చేరుకోలేక పోయినా దాని సమీపానికి చేరుకునే ప్రయత్నం చేయాలి. ఉదయం చేసే ఆరాధన, సత్కార్యాల ఘనత తెలిసింది. ఆ సమయం సత్కార్యాల అంగీకార రీత్యా, మరియు వాటిని పాటించుట కూడా చాలా అనుకూలమైనది. రాత్రిపూట కొంత సమయం తహజ్జుద్ నమాజులో గడిపే ఘనత కూడా తెలిసింది. అది అల్లాహ్ దయతో సదుద్దేశాలు సంపూర్ణమగుటకు ఆయన సహాయం లభించును. అస్ర్ అయిన వెంటనే మరియు మగ్రిబ్ కు ముందు ఖుర్ఆన్ పారాయణం, అల్లాహ్ స్మరణ (జిక్ర్)లో ఉండుట అభిలషణీయం. మధ్యేమార్గంలో ఉండి, అల్లాహ్ ప్రసన్నత పొందే సత్కార్యాలు చేస్తూ, ప్రవక్త సంప్రదాయాన్ని ఖచ్చితంగా అనుసరిస్తున్న విశ్వాసునికి మంచి శుభవార్తలు ఇవ్వబడ్డాయి.
11- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని, అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఓ అబూ సఈద్! అల్లాహ్ ను తన పోషకునిగా విశ్వసించి, ఇస్లాంను తన ధర్మంగా స్వీకరించి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తన ప్రవక్తగా నమ్మినవాడు తప్పక స్వర్గంలో ప్రవేశిస్తాడు”. (ముస్లిం 1884).
ఈ హదీసులో:
ఈ మూడింటిని ఎవరైతే పూర్తి విశ్వాసముతో, స్వచ్ఛత, సంకల్పశుద్ధితో నోటి ద్వారా పలుకుతాడో తప్పక అల్లాహ్ అతనిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. ఎందుకనగా మూడు విషయాల్ని అతడు వాస్తవం చేసిచూపాడు. మరియు ధర్మానికి సంబంధించిన ముఖ్య పునాదుల్ని నమ్మాడు. అవి: అల్లాహ్ పట్ల విశ్వాసం. సత్యధర్మ స్వీకారం. సత్యవంతులైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై నమ్మకం.
12- ఆయిజ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, మక్కా జయింపబడిన రోజు అతను అబూ సుఫ్యాన్([2])తో కలసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చాడు. ఆయన చుట్టూ కూర్చొని ఉన్న సహచరులు (వీరు వస్తున్నది చూసి) అదిగో అబూ సుఫ్యాన్ మరియు ఆయిజ్ బిన్ అమ్ర్ అని అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “వీరు ఆయిజ్ బిన్ అమ్ర్ మరియు అబూ సుఫ్యాన్. ఇస్లాం ధర్మం ఇతనికంటే గౌరవనీయమైనది, గొప్పది. ఇస్లాం ధర్మం ఎన్నటికీ అగ్రస్థానం లో ఉంటుంది తప్ప క్రిందికి వంగి ఉండదు సుమా”. (సునన్ దార్ ఖుత్నీ, సుననుల్ కుబ్రా బైహఖీ. అల్ ఇర్వా 1268).
ఈ హదీసులో:
సర్వ మతాల్లోకెల్లా ఇస్లాం మాత్రమే అల్లాహ్ యొక్క సత్య ధర్మం. విశ్వాసి, అవిశ్వాసికన్నా ఎక్కువ గౌరవ, మర్యాదలకు అర్హుడు. ఆ అవిశ్వాసి ఎంత గొప్ప స్థానం, హోదా అంతస్తులు కలిగి ఉన్నవాడైనా సరే. ఎందుకంటే ఇస్లాం వీటన్నిటికంటే గొప్పది. గౌరవం, ప్రతిష్ట, ప్రేమ మర్యాదల్లో విశ్వాసి, అవిశ్వాసులు సమానులు కాజాలరు. ముస్లిం వద్ద ఇస్లాం ఉన్నందువల్ల అతని మాటే వేరు.
విశ్వాసి, అవిశ్వాస బంధువుల ఆస్తిలో హక్కుదారుడవుతాడు కాని అవిశ్వాసి, తన విశ్వాస బంధువుల ఆస్తిలో హక్కుదారుడు కాడని కొందరు పండితులు సిద్ధాంతీకరించారు. కాని నిజమైన మాటేమిటంటే విశ్వాసి, అవిశ్వాసులిద్దరూ పరస్పరం ఆస్తిలో హక్కుదారులు కాజాలరు.
13- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “ఏ దాసుడు ఇస్లాం స్వీకరించి, దాని ప్రకారం ఆచరిస్తాడో అతను గతంలో చేసిన ప్రతి పుణ్యాన్ని అల్లాహ్ వ్రాసి పెడతాడు. గతంలో చేసిన అతని ప్రతి పాపం మన్నించబడుతుంది. ఆ తర్వాత పుణ్యపాపాల ఫలితాల లెక్క కొత్తగా మొదలవుతుంది. ఒక సత్కార్య పుణ్యం పది రెట్ల నుండి ఏడువందల వరకు లభిస్తుంది. దుష్కార్య పాపము దానంతే లభిస్తుంది. అల్లాహ్ దయతలుస్తే మన్నించనూవచ్చు”. (నిసాయీ 4912).
ఈ హదీసులో:
కొందరు సంపూర్ణంగా ఇస్లాం ప్రకారం నడిచేవారుంటే మరికొందరు అసంపూర్ణంగా నడిచేవారుంటారు. అందుచేత వారిలో ఒకరిపై మరొకరికి ఘనత ఉంటుంది. అందుకే అది (ఇస్లాం, ఈమాన్) తరుగుతుంది, పెరుగుతుంది. ఇస్లాంలో ప్రవేశం ద్వారా పూర్వ పాపాలన్నీ మన్నించబడతాయి. అలాగే తౌబా (నిజమైన పశ్చాత్తాపంతో కూడిన క్షమాభిక్ష) ద్వారా పాపాలు మన్నించబడతాయి. అంతేకాదు సంకల్పశుద్ధి మరియు ప్రవక్త పద్ధతిని అనుసరించి చేసిన సత్కార్యాలు కూడా దుష్కార్యాలకు పరిహారమవుతాయి.
అల్లాహ్ కారుణ్యం చాలా విశాలమైనది. అందుకే సత్కార్య పుణ్యాన్ని పది రెట్ల నుండి ఏడువందల రెట్ల వరకు పెంచాడు. దుష్కార్య పాపం దానంతే ఉంచాడు. ఒక్కోసారి అల్లాహ్ దయతలచి సత్కార్యాలకు బదులుగా కాకుండా తనిష్టంతో పాపాల్ని మన్నిస్తాడు. కాని పెద్ద పాపాల మన్నింపుకై తప్పనిసరిగా తౌబా చేయవలసిందేనని ఆధారాలుగలవు. అవిశ్వాసుని ఏ ఒక్క కార్యం స్వీకరించబడదు అన్న విషయం తెలిసినదే. అయినా ఈ హదీసు ద్వారా కూడా తెలిసింది. ఈ హదీసులో దాసుడు అని సాధారణంగా చెప్పబడినది, అయితే స్త్రీలకు కూడా ఇదే పద్ధతి వర్తిస్తుంది.
14- ఇబ్ను మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ‘ప్రవక్తా! మేము అజ్ఞాన కాలంలో (ఇస్లాం స్వీకరించక ముందు) చేసిన దుష్కార్యాల గురించి పట్టుబడతామా?’ అని ఒక వ్యక్తి ప్రశ్నించాడు. “ఎవరు ఇస్లాం స్వీకరించి తర్వాత సత్కర్మలు ఆచరిస్తూ ఉంటాడో, అతను అజ్ఞాన కాలంలో చేసిన దుష్కర్మల గురించి నిలదీయడం జరగదు. అయితే ఇస్లాం స్వీకరించిన తర్వాత కూడా దుష్కార్యాలు చేస్తూ ఉంటే, అతను గతంలో చేసినవాటితో పాటు మొత్తం పాపకార్యాల విషయంలో పట్టుబడిపోతాడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బదులిచ్చారు. (బుఖారి 6921, ముస్లిం 120).
ఈ హదీసులో:
ఎవరైతే సత్కర్మలు చేస్తూ, ఇస్లాంపై స్థిరంగా ఉంటారో వారి గత పాపాలకే ఇస్లాం పరిహారమవుతుంది. పాపాల పరిహారానికి ఇస్లాంలో వట్టి ప్రవేశం సరిపోదు. ఇస్లాంపై నిలకడ చూపి, సర్వ వ్యవహారాల్లో సత్యవంతునిగా మెలగాలి.
ఇస్లాం స్వీకరించిన తర్వాత కూడా దుష్కర్మలు చేస్తూ, దుర్మార్గ జీవితం గడుపుతూ ఉండేవారి పూర్వ పాపాలు కూడా అలాగే ఉంటాయని తెలిసింది. పాపం యొక్క నష్టము, ప్రభావము ఎలా ఉంటుందనేది తెలిసింది. పాపాల్లో మునిగియుండుట ఎంత భయంకర విషయమో కూడా తెలిసింది.
15- హకీం బిన్ హిజాం ఉల్లేఖించారుః నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడుతూ ‘ప్రవక్తా! నేను నా అవిశ్వాస జీవితంలో దానధర్మాలు, బానిసల విముక్తి, బంధువుల పట్ల దయాదాక్షిణ్యాలు మొదలైన సత్కార్యాలు చేశాను. మరి నాకు వాటి సత్ఫలం లభిస్తుందా? అని అడిగాను. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానం ఇచ్చారుః “నీవు ఇస్లాం స్వీకరించిన కారణంగా నీ గత సత్కార్యాలకు కూడా ఇప్పుడు పుణ్యఫలం లభిస్తుంది”. (బుఖారి 1436, ముస్లిం 123).
ఈ హదీసులో:
ఇస్లాంలో అడుగు పెట్టిన వ్యక్తి, గతంలో చేసిన సత్కర్మలు అల్లాహ్ దయతో సత్కర్మల జాబితాలో లిఖించబడతాయి. ఇస్లాం సత్కర్మల గురించి బోధిస్తుంది, దుష్కర్మలను వారిస్తుంది. సత్కర్మల, సద్వచనాల స్థాపనకు, దుష్కర్మల, దుర్వచనాల నిర్మూలానికే ఇస్లాం ధర్మం వచ్చింది. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓ సందర్భంలో ఇలా చెప్పారుః “నన్నుఉత్తమ నైతిక ప్రమాణాల పరిపూర్ణతకై పంపడం జరిగింది”. (సుననుల్ కుబ్రా బైహఖి 10/192).
16- “ఒక వ్యక్తి ఇస్లాం స్వీకరించినప్పుడు అతనిది ఏదైనా హక్కు ఉంటే ఆ హక్కు అతనికి లభించును” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ముస్నద్ అబూ యఅలా. ఇర్వాఉల్ గలీల్ 1716).
ఈ హదీసులో:
ఆస్తి, భూమి, ధనం మొదలైన వాటిలో ఏదైనా హక్కు ఒక వ్యక్తికి రావలసిన సందర్భంలో అతను ఇస్లాం స్కీకరిస్తే ఆ వ్యక్తి తనకు చెందిన (యోగ్యమైన) హక్కును గురించి అడగవచ్చు, అది లభించినప్పుడు నిస్సంకోచంగా తీసుకోవచ్చు. కాని అది అతనిది కాదు అని ఏదైనా బలమైన ఆధారం ఉంటే తప్ప. ఇస్లాం అన్ని రకాల యోగ్యమైన హక్కులను కాపాడుటకు, యోగ్యమైన ఒప్పందాలు నెరవేర్చుటకు వచ్చింది.
17- సఖ్ర్ బిన్ ఐలా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఇస్లాం వచ్చిన రోజుల్లో ‘బనూ సులైమ్’ తెగకు చెందినవారు కొందరు తమ భూములను వదిలేసి పారిపోయారు. నేను వాటిని కాజేసుకున్నాను. వారు ఇస్లాం స్వీకరించిన తర్వాత వాటి విషయంలో నాతో వాదించి, నన్ను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీసుకెళ్ళారు. ప్రవక్త వారి భూములు వారికి ఇప్పించి ఇలా చెప్పారు: “ఎవరైనా ఇస్లాం స్వీకరించారంటే అతనికి చెందిన భూమి, సొమ్ము అతనిదే అవుతుంది”. (వాటిని ఆక్రమించుకునే హక్కు ఇతరులకు ఉండదు). (అహ్మద్. సహీహ 1230).
ఈ హదీసులో:
ఎవరైనా ఇస్లాం స్వీకరిస్తే వారికి చెందిన భూములు, ఆస్తులకు వారే అర్హులు. వారి నుండి లాగుకునే హక్కు ఎవరికీ ఉండదు. ఏ ఆస్తి ఒప్పందాలు ఇస్లాంకు వ్యతిరేకంగా లేవో ఆ ఆస్తికి హక్కు దారుడైన ఒక వ్యక్తి ఇస్లాం స్వీకరించినచో అవి అతని సొత్తే.
18- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని, అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు: “ఇస్లాం పునాది ఐదు విషయాలపై ఉంది: అల్లాహ్ తప్ప ఆరాధ్యుడు మరొక్కడు లేడు అని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దాసుడు మరియు ప్రవక్త అని సాక్ష్యమిచ్చుట. నమాజ్ స్థాపించుట. జకాత్ చెల్లించుట. హజ్ చేయుట. రమజాను మాసమెల్లా ఉపవాసముండుట”. (ముస్లిం 16, బుఖారి 8).
ఈ హదీసులో:
సత్కార్యాల్లో కొన్నిటికి మరికొన్నిటిపై ఘనత గలదు. అందులో కొన్ని ముఖ్యమైనవి అయితే మరికొన్ని అతిముఖ్యమైనవి. అందులో పునాదులు (మౌలిక విషయాలు), విధులు, సున్నతులు కూడా ఉన్నాయి. అయితే ఇస్లామీయ పునాదులు ఐదున్నాయి. కొందరు ఐదుకంటే ఎక్కువ అని, మరి కొందరు అంతకు తక్కువ అని చెప్పారు. (కాని నిజమైన మాట ఐదే). ఆచరణలు విశ్వాసములో పరిగణించబడతాయి. ‘ముర్జియా’ పేరుగల ఓ వర్గం యొక్క అభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. కాని వారి అభిప్రాయం తప్పు. పవిత్ర వచనం (లాఇలాహ ఇల్లల్లాహ్) యొక్క సాక్ష్యం పలకడంలో తటపటాయించడంగాని, ఆలోచనలుగాని ఉండకూడదు. ఇస్లామీయ పునాదులను పాటించువాడు ముస్లిమనబడును. అతడు వాటిని (మనస్ఫూర్తిగా కాకుండా) బాహ్యరూపంలో పాటిస్తే అతడు బాహ్యరూపంలో ముస్లిం అగును. మనస్ఫూర్తిగా పాటిస్తే బాహ్యాంతరంగా నిజమైన ముస్లిం అగును. కొందరు ఉల్లేఖకులు హదీసు భావాన్ని దృష్టిలో ఉంచుకొని ఉల్లేఖిస్తారు. అందుకే కొన్ని ఉల్లేఖనాల్లో ఉపవాస ప్రస్తావన హజ్ కు ముందు ఉంది. అయితే మొదటి పునాది “లాఇలాహ ఇల్లల్లాహ్” ముహమ్మదుర్ రసూలుల్లాహ్” సాక్ష్యం పలకనిదే ఇతర ఏ ఆచరణ నిజము కాదు. అంగీకారయోగ్యం పొందదు.
19– “మైలురాయి లాంటివి ఇస్లాంలో కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇవి: అల్లాహ్ ను విశ్వసించుట, ఆయనతో పాటు ఎవ్వరినీ సాటి కల్పించకపోవుట, నమాజు స్థాపించుట, జకాత్ చెల్లించుట, రమజాన్ ఉపవాసాలు పాటించుట, హజ్ చేయుట. మంచిని బోధించుట. చెడును ఖండించుట. ఇంకా నీవు ఇంట్లో ప్రవేశించినప్పుడు ఇంట్లో ఉన్న వారికి సలాం చేయుట. ఎవరి ముందునుండైనా నీవు వెళ్తున్నప్పుడు వారికి సలాం చేయుట. వీటిలో ఏ ఒక్కదానిని విడనాడినా ఇస్లాంలోని ఒక భాగాన్ని విడనాడినట్లే. వీటన్నిటినీ విడనాడినవాడు ఇస్లాం నుండి విముఖుడైనట్లే” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ఖాసిం బిన్ సల్లామ్ “ఈమాన్” పుస్తకంలో ఉల్లేఖించారు. సహీహ 333).
ఈ హదీసులో:
ఇస్లాం పరిచయం, దాని కొన్ని లక్షణాలు ఇందులో తెలుపబడ్డాయి. ఇస్లాంలో కొన్ని స్పష్టమైన ఆచరణలున్నాయి ఉదా: నమాజ్, ఉపవాసాలు, దానధర్మాలు మొదలైనవి. వీటి ద్వారా మనిషి ముస్లిం అని గుర్తింపబడతాడు. ఇంకా ఇవి ముస్లిం మరియు ముస్లిమేతరుల మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని తెలుపుతాయి. ఇందులో ఇస్లాం గొప్పతనం తెలిసింది. ఇతర మతాలకంటే విలక్షణమైన ధర్మం ఇది. ఇస్లాం ధర్మానికి ఇతర మతాలపై గొప్పతనం, గౌరవస్థానాల ప్రత్యేకతలు గలవు.
20- “మాలాంటి నమాజు చేసేవాడు, మా ఖిబ్లా దిశకు అభిముఖం అయ్యేవాడు, మా చేత జిబహ్ చేయబడిన దాన్ని తినేవాడు ముస్లిం. ఇలాంటి ముస్లింకు అల్లాహ్ మరియు ప్రవక్త తరపున రక్షణ గలదు. అయితే మీరు అల్లాహ్ మరియు (ఆయన ప్రవక్త) తరఫున ఇవ్వబడిన రక్షణలో ఏలాంటి మోసం చేయకుండా జాగ్రత్తగా ఉండండి” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు.(బుఖారి 391).
ఈ హదీసులో:
నమాజు విడనాడేవాడు ముస్లిం కాడని, అతనికి అల్లాహ్ మరియు ప్రవక్త తరపున రక్షణ ఉండదని తెలిసింది. ఇస్లాం యొక్క బాహ్యచిహ్నమే నమాజ్. నమాజుతో పాటు జిబహ్ (బలిదానం)ను జోడించి చెప్పే మర్మం ఏమిటంటే అవి రెండూ తౌహీద్ కు సంబంధించిన చిహ్నాలు. దీనికి సాక్ష్యాధారమైన అల్లాహ్ ఆదేశాలు ఇవి:
ఇలా చెప్పండి: నా నమాజులు, నా జంతుబలి, నా జీవనం, నా మరణం సమస్తమూ సకల లోకాలకూ ప్రభువైన అల్లాహ్ కొరకే[. (అన్ఆమ్ 6: 162).
فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ] {الكوثر:2}
నీవు నీ ప్రభువు కొరకే నమాజు చెయ్యి. ఖుర్బానీ కూడా ఇవ్వు[. (కౌసర్ 108: 2).
బహుదైవారాధకులు పాల్పడిన షిర్క్ (బహుదైవారాధన) రకాల్లో అధిక శాతం అల్లాహ్ యేతరులకు సజ్దా చేయడం, మరియు జంతు బలిదానాలు ఇవ్వడం. అయితే ఇవి ఏకైకుడైన అల్లాహ్ కొరకు మాత్రమే చేయాలని దైవఏకత్వపు సందేశంలో చెప్పబడినది. నమాజీయులు ఏ రక్షణలో ఉన్నారో అందులో ఏలాంటి మోసం చేయుట ఏ ముస్లింకూ యోగ్యం కాదు. ముస్లిములతో సామూహికంగా నమాజు పాటించు వ్యక్తి యొక్క ధన, ప్రాణానికి రక్షణ గలదు, హక్కుపరమైనది తప్ప. ఇంకా ప్రజల బాహ్యాన్ని బట్టే వారితో ప్రవర్తించబడును.
21– అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఒక వ్యక్తి ‘ఇస్లాంలో ఎటువంటి పనులు చాలా ఉత్తమమైనవ’ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “భోజనం పెట్టడం మరియు పరిచితుడు, అపరిచితుడు (ప్రతి ముస్లిం)కు సలాం చేయడం” అని చెప్పారు. (బుఖారి 12, ముస్లిం 39).
ఈ హదీసులో:
ఇస్లాంలో కొన్ని పనులకు మరికొన్ని పనులపై శ్రేష్ఠత ఉన్నది. ఈ హదీసులో భోజనం పెట్టాలని, దానం చేయాలని ప్రోత్సహించబడింది. అది సర్వ కార్యాల్లో చాలా శ్రేష్ఠమైనది. ప్రవక్తగారి సమాధానం పరిస్థితులను, ప్రజలను బట్టి భిన్నంగా ఉండవచ్చు. పరిచితులకే కాదు అపరిచితులకు కూడా సలాం చేయుట ధర్మమని, సలాంను చాలా విస్తృతం చేయాలని ఉంది. సత్కర్మలు, సద్వర్తనలు ఇస్లాంలో లెక్కించబడతాయి. నియ్యత్ (సంకల్పం) మంచిగా ఉండి, ప్రవక్త పద్ధతిని అనుసరించి చేసిన చిన్నపాటి సత్కార్యం కూడా గొప్ప విలువగలది. సలాం చేయడంలో ముందంజవేసిన వారి ఘనత తెలుస్తుంది.
22– ప్రవక్త మహానీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “ముస్లిం అంటే: తన నాలుక మరియు చేతులతో ఇతర ముస్లిములకు హాని కలుగనివ్వనివాడు. ముహాజిర్ అంటే: అల్లాహ్ వారించిన వాటికి దూరమున్నవాడు”. (బుఖారి 10).).
ఈ హదీసులో:
ముస్లిం సోదరులకు హాని కలుగనివ్వనివాడే నిజమైన ముస్లిం. ఇతరులకు హాని కలిగించడంలో ఎక్కువగా ఉపయోగపడే అవయవాలు చేయి మరియు నాలుక. ముస్లింకు హాని కలిగించడం పెద్ద పాపాల్లో లెక్కించబడుతుంది. సమన్వయ పద్ధతి ద్వారా ముస్లిం సోదరులతో మెలుగుట ఉత్తమ ముస్లిముల గుణం.
(ధర్మాన్ని కాపాడుకొనుటకు స్వదేశాన్ని వదలి వలసపోవుటయే కాకుండా) నిషిద్ధకార్యాలను విడనాడుట, వారించిన వాటికి దూరముండుట, పాపాలను మానుకొనుట, అవిధేతయకు గురికాకుండా ఉండుట, పాపాల నుండి తౌబా చేయుట. ఇవన్నియు కూడా ‘హిజ్రత్’ భావంలో వస్తాయని ఈ హదీసు తెలుపుతుంది.
23– ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని, హారిస్ అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “యహ్యా బిన్ జక్రియా అలైహిమస్సలాంకు అల్లాహ్ ఐదు విషయాల గురించి ఆదేశించి, వాటిని తాను స్వయంగా ఆచరించి, బనీ ఇస్రాఈల్ కూడా వాటిని ఆచరణలో తీసుకురావాలని ఆదేశించాలని తెలిపాడు. అయితే ఆయనతో ఈ విషయంలో కొంచెం ఆలస్యం జరగబోతుండగా, ఈసా అలైహిస్లలాం “ఐదు విషయాలను నీవు అచరిస్తూ బనీ ఇస్రాఈల్ ను కూడా ఆదేశించాలని నీకు ఆదేశమివ్వబడింది కదా?” అయితే నీవు ఈ బాధ్యత నెరవేరుస్తావా, లేదా? నేను నెరవేర్చబోతున్నాను అని గుర్తుచేశారు. హజ్రత్ యహ్యా చెప్పారుః సోదరా! నీవు గనక నాకంటె ముందు ఈ పని చేశావా, నాపై ఏదైనా విపత్తు వచ్చి పడుతుందని, లేదా నేను భూమిలో అణగద్రొక్కబడతానని భయపడుతున్నాను. ఆ తర్వాత యహ్యా అలైహిస్సలాం బనీ ఇస్రాయీల్ ను బైతిల్ మఖ్దిసులో సమకూర్చారు. మస్జిద్ నిండిపోయింది. ఆయన కూర్చుండుటకు ఒక ఎత్తైన ప్రదేశం ఏర్పాటు చేయబడింది. దానిపై కూర్చుండి ఆయన అల్లాహ్ స్తోత్రము పఠించి ఇలా అన్నారు: ఐదు విషయాలు, వాటిపై నేను ఆచరిస్తూ వాటి గురించి మీకు ఆదేశించాలని అల్లాహ్ నాకు ఆదేశించాడు:
మొదటి ఆదేశం: అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. ఆయనతో ఎవ్వరినీ సాటి కల్పించకండి. దీని ఉదాహరణ ఎలాంటిదంటే: ఒక వ్యక్తి తన స్వంత సొమ్మైన బంగారం లేదా వెండితో బానిసను కొన్నాడు. బానిస కష్టము చేసి, తన యజమానికి ఇవ్వవలసిన కష్టార్జితం ఇతరులకు ఇస్తాడు. ఇలాంటి బానిస మీలోని ఒకని వద్ద ఉండడం మీకు ఇష్టమేనా? మిమ్మల్ని సృష్టించింది, మీకు ఆహారం నొసంగేది అల్లాహ్ మాత్రమే. అందుకు మీరు ఆయన్ని మాత్రమే ఆరాధించండి. ఆయనకు ఎవ్వరినీ సాటి కల్పించకండి.
(రెండవ ఆదేశం:) నేను నమాజు గురించి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను. (మీరు దాన్ని స్థాపించండి). దాసుడు తన దృష్టిని అటూ, ఇటూ మల్లించనంతవరకూ నిశ్చయంగా అల్లాహ్ కూడా తన దృష్టి తన దాసునిపైనే ఉంచుతాడు. అందుకు మీరు నమాజ్ చేస్తున్నప్పుడు మీ చూపులను అటూ, ఇటూ త్రిప్పకండి.
(మూడవ ఆదేశం:) నేను మీకు ఉపవాసాల ఆదేశమిస్తున్నాను. దాని ఉదాహరణ ఏలాంటి- దంటే: సమూహంలో ఒక వ్యక్తి వద్ద కస్తూరి ఉంది. వారందరూ దాని నుండే సువాసన పీలుస్తూ ఉంటారు. ఉపవాసమున్న వ్యక్తి నోటి నుండి వెళ్ళే వాసన అల్లాహ్ కు కస్తూరి సువాసన కంటే ఉత్తమ సువాసన లాంటిది.
(నాల్గవ ఆదేశం:) నేను మీకు దానధర్మాల ఆదేశమిస్తున్నాను. దీని ఉదాహరణ ఏలాంటిదంటే: కొందరు శత్రువులు ఒక వ్యక్తిని పట్టుకొని అతని చేతులను మెడకు కట్టేసి అతన్ని నరికివేయడానికి తీసుకొని వెళ్తుండగా ఆ వ్యక్తి నా ప్రాణానికి బదులు ఏదైనా పరిహారం ఇస్తే నన్ను వదిలేస్తారా? అని అడిగాడు. ఇలా తన ప్రాణానికి బదులు కొంచమో, ఎక్కువనో పరిహారం చెల్లించి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు.
(ఐదవ ఆదేశం:) మీరు అల్లాహ్ స్మరణ అధికంగా చేయండని ఆదేశిస్తున్నాను. దీని దృష్టాంతం ఇలా ఉంది: శత్రువులు ఒక మనిషి వెనుక పరుగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఆ మనిషి దృఢమైన కోటలో ప్రవేశించి (వారి చేతికి చిక్కకుండా భద్రంగా దాగి ఉంటాడు). అలా మానవుడు అల్లాహ్ ను స్మరిస్తున్నంత కాలం షైతాన్ (చేతిలో చిక్కకుండా) అతి భద్రంగా ఉంటాడు”.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు: “నేను మీకు ఐదు విషయాల గురించి ఆదేశిస్తున్నాను. వాటిని అల్లాహ్ నాకు ఆదేశించాడు. సంఘాన్ని (జమాఅత్) విడనాడకుండా ఐక్యంగా ఉండండి. మీలోని నాయకుని మాట విని, అతని ఆజ్ఞ పాలించండి. సమయం వచ్చినప్పుడు హిజ్రత్ (వలస) చేయండి, అల్లాహ్ మార్గంలో యుద్ధం (జిహాద్) చేయండి. (ధర్మంపై ఐక్యంగా ఉన్న) సంఘాన్ని వదలి ఒక జానెడు దూరమైన వ్యక్తి తిరిగి అందులో చేరనంతవరకూ ఇస్లాం బంధాన్ని తన మెడ నుండి తీసిపారేసిన వాడవుతాడు. మూఢకాలపునాటి పలుకులు పలికేవాడు (మోకాళ్ళ మీద/ నరకవాసులతో కలసి) నరకంలో పడతాడు”. ‘ప్రవక్తా! అతడు నమాజు, ఉపవాసాలు పాటించినప్పటికీ నరకం లో పడతాడా?’ అని మేము అడిగినందుకు ఇలా సమాధానమిచ్చారుః “అవును, అతడు నమాజు, ఉపవాసాలు పాటించినా తాను ముస్లిం అని భావించినా అందులో పడతాడు. అయితే మీరు ముస్లిములను ‘ముస్లిమీన్’, ‘మూమినీన్’, ‘ఇబాదల్లాహ్’ అని అల్లాహ్ నామకరణం చేసిన పేర్లతోనే పిలవండి”. (అహ్మద్ 4/130. తిర్మిజి 2863. సహీహుల్ జామి 2604).
ఈ హదీసులో:
పూర్వ జాతుల, ప్రవక్తల ప్రస్తావన వచ్చింది. వారి సంఘటనలు గుణపాఠం కొరకు ప్రజలకు తెలుపాలి. మనిషి మంచి పనులు చేయుటకు తొందరపడాలి. రేపు మాపు అని వాయిదాలు వేసుకోకూడదు. ప్రవక్తలు అల్లాహ్ కు చాలా భయపడేవారని తెలిసింది. విద్య నేర్పుటకు ప్రజల్ని ప్రోగుచేయవచ్చని తెలిసింది. మాట ఆరంభం అల్లాహ్ స్తోత్రముతో కావాలి. మంచిని ఆదేశించి, చెడును ఖండించే వ్యక్తి స్వయంగా మంచి చేయాలి. చెడుకు దూరంగా ఉండాలి. అప్పుడే లాభం ఉంటుంది. విద్యలో మొట్టమొదటిది తౌహీద్. సులభంగా బోధపడేందుకు సామెతలు, ఉదాహరణలు ఇవ్వవచ్చును. పాపాల్లో అతి ఘోరమైనది షిర్క్ (అల్లాహ్ కు భాగస్వామిని కల్పించడం). అనవసరంగా నమాజులో అటూ, ఇటూ చూడవద్దు. ఎక్కువసార్లు అలా చేస్తే నమాజే భంగమయిపోతుంది. కర్మల ప్రకారం ఫలితముంటుంది. ఉపవాసమున్న వ్యక్తి ఆకలి, దాహాన్ని భరించినందున అతని నోటి వాసన మారుతుంది. కాని అది అల్లాహ్ కు కస్తూరి కంటే మరీ ఇష్టమైనది. దానధర్మాలు మనిషిని పాపాల బంధనం నుండి విముక్తినిస్తాయి. ముస్లిం తనకు తాను షైతాన్ నుండి కాపాడుకొనుటకు గొప్ప సాధనం అల్లాహ్ స్మరణ. ముస్లిం తన సంఘంతో ఐక్యంగా ఉండుట తప్పనిసరి. ముస్లిం నాయకుడు అల్లాహ్ అవిధేయతకు గురికాని ఆదేశాలు ఇవ్వనంత వరకు అతనికి విధేయులై ఉండాలి. (ఒకవేళ అవిధేయతకు గురిచేసే ఆదేశమిస్తే దానిని పాటించకూడదు, కాని అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకూడదు). మూఢకాలపునాటి పలుకులు పలకడం నిషిద్ధం. అవి ఇస్లాంకు బద్ధ విరుద్ధం.
24– ముఘీరా బిన్ సఅద్ తన తండ్రి లేక పినతండ్రి రజియల్లాహు అన్హుం ద్వారా ఉల్లేఖిస్తున్నాడు. నేను అరఫ ప్రాంతములో ప్రవక్త వద్దకు వచ్చి, ఆయన ఒంటె కళ్ళాన్ని లేక త్రాడును పట్టుకున్నాను. వెంటనే నేను అక్కడి నుండి నెట్టేయ్యబడ్డాను. ఇది చూసిన ప్రవక్త “అతన్ని వదలండి. ఏదైనా అవసరంతో రావచ్చు” అని అన్నారు. ‘స్వర్గంలో చేర్చే మరియు నరకం నుండి దూరముంచే కార్యాలు నాకు తెలుపండి అని నేను విన్నవించుకున్నాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన తలను ఆకాశం వైపునకు ఎత్తారు. మళ్ళీ ఇలా అన్నారుః “నీవు సంక్షిప్త మాటల్లో గొప్ప విషయం అడిగావు. అయితే విను: అల్లాహ్ ను మాత్రమే ఆరాధించు. ఆయనతో మరెవ్వరినీ సాటికల్పించకు. నమాజ్ స్థాపించు. జకాత్ చెల్లించు. హజ్ చేయు. రమజాను ఉపవాసాలు పాటించు. ప్రజలు నీతో ఎలా వ్యవహరించడం నీకు ఇష్టమో అలాగే నీవు వారితో మసలుకో. నీ కొరకు నీవు ఏది ఇష్టపడవో దాన్ని ప్రజలకు దూరముంచు”. ఇక నా ఒంటె కళ్ళెం వదులు”. (అహ్మద్ 4/77. సహీహ 1477).
ఈ హదీసులో:
కర్మలు విశ్వాసంలో లెక్కించబడుతాయి. తౌహీద్ తర్వాత అన్నిట్లో గొప్పది, ప్రాముఖ్యత గలది నమాజ్. ఫర్జ్ నమాజులు తప్ప మిగిలినవన్నీ నఫిల్ క్రింద లెక్కించబడతాయి, ‘వాజిబ్’ క్రింద కాదు. సద్వర్తన విశ్వాసంలో ఒక భాగమే. ప్రజలతో ఉత్తమ వైఖరిని అవలంబించడం శ్రేష్ఠమైన గుణం. ఇందులో ఉపదేశం సంక్షిప్తంగా ఉన్నా, అతిముఖ్యమైన పెద్ద విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఇస్లాం ధర్మం విశ్వాసం, వాచాకర్మలకు అన్నిటికి సంబంధించినది.
25- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని, ఉబాదా బిన్ సామిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు మరొకడు లేడని, ఆయన ఒక్కడేనని, ఆయనకు మరెవరూ భాగస్వామి లేరని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అని, ఈసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క దాసుడు, ఆయన ప్రవక్త అనీ, కాకపోతే ఆయన హజ్రత్ మర్యం (గర్భం)లో అవతరించిన అల్లాహ్ వాక్కు, ఆయన వైపు నుండి పంపబడిన ఆత్మ అని, స్వర్గనరకాలు ఉన్నాయి అన్నది యదార్థమని ఎవరైతే సాక్ష్యమిస్తారో ఆ వ్యక్తి కర్మలు ఏలాంటివయినా సరే అల్లాహ్ అతడ్ని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు”. (బుఖారి 3435, ముస్లిం 28)
ఈ హదీసులో:
తౌహీదె ఖాలిస్ (స్వచ్ఛమైన ఏకదైవారాధన)కి సంబంధించిన కొన్ని విషయాలు ఇందులో తెలుపబడ్డాయి:
ఈసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క దాసుడు, ఆయన ప్రవక్త అని విశ్వసించాలి. ఎందుకనగా త్రిత్వాన్ని (Trinity) నమ్మే క్రైస్తవులు ఈ గొప్ప విషయంలో అల్లాహ్ ను తిరస్కరించారు.
ఏకైకుడైన అల్లాహ్ ఈసా అలైహిస్సలాంను తన వాక్కుతో సృష్టించాడని, ఆ వాక్కును మర్యం గర్భంలో పంపాడని మరియు ఆయన అల్లాహ్ వైపు నుండి పంపబడిన ఆత్మ అని విశ్వసించాలి. ఇలా విశ్వసించిన భక్తుడు క్రైస్తవులకు భిన్నంగా ఏ సందేహమూ లేని సత్యాన్ని నమ్మినవాడవుతాడు.
స్వర్గనరకాలు ఇప్పుడున్నాయని మరియు చనిపోయిన తర్వాత తిరిగి లేపబడుట సత్యం అని విశ్వసించాలి. పై విషయాల్ని విశ్వసించిన వ్యక్తికి స్వర్గ ప్రవేశం లభిస్తుంది. అతని నుండి కొన్ని పాపాలు జరిగినప్పటికీ ఏదైనా ఒకరోజు కలకాలం ఉండే మహాభాగ్యాలతో నిండిఉన్న స్వర్గంలో చేరుతాడు. మరొక హదీసులో స్వర్గానికి ఎనిమిది ద్వారాలని ఉంది.
26- అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ఏ మాత్రం షిర్క్ చేయకుండా అల్లాహ్ తో కలుసుకున్న వ్యక్తి స్వర్గంలో చేరుతాడు”. (బుఖారి 129).
ఈ హదీసులో:
మనిషి ప్రళయదినాన అల్లాహ్ ను నిర్మల హృదయంతో కలుసుకొనుటకు ఎల్లప్పుడూ తన విశ్వాసంలో వచ్చే లోపాల్ని దూరం చేస్తూ, షిర్క్ యొక్క కాలుష్యం నుండి తౌహీదును పరిశుద్ధపరుస్తూ ఉండుటకు ప్రయత్నించాలి. నిశ్చయంగా అల్లాహ్ ముష్రిక్ పై స్వర్గాన్ని నిషేధించాడు.
27- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారని, అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “పరలోకంలో కర్మల విచారణ ముగిసిన తర్వాత స్వర్గవాసులు స్వర్గంలో, నరకవాసులు నరకంలో ప్రవేశిస్తారు. ఆ తర్వాత హృదయంలో ఆవగింజంత విశ్వాసమున్న వారిని నరకం నుండి బయటకు తీయండి అని అల్లాహ్ ఆజ్ఞాపిస్తాడు. ఈ ఆజ్ఞతో చాలా మంది బయటపడతారు. వారిలో కొందరు (బాగా కాలిపోయి బొగ్గులా) నల్లగా మారిపోతారు. అలాంటి వారిని వర్షపునది లేక జీవనదిలో పడవేస్తారు. దాంతో వారు యేటి ఒడ్డున ధాన్యపు విత్తనం మొలకెత్తినట్లు మొలకెత్తుతారు. ఆ మొక్క పసిమి వన్నెతో ఎంత అందంగా ముస్తాబయి మొలకెత్తుతుందో మీరు చూడలేదా?”. (బుఖారి 22, ముస్లిం 184).
ఈ హదీసులో:
విశ్వాస పరంగా ప్రజలు వేరువేరు స్థానాల్లో ఉంటారు. తౌహీద్ పై స్థిరంగా ఉన్నవారు నరకంలో శాశ్వతంగా ఉండరు. విశ్వాసి తన పాపాల కారణంగా నరకంలో ప్రవేశించవచ్చు. కర్మలు విశ్వాసంలో లెక్కించబడతాయి. విశ్వాసం పెరుగుతూ తరుగుతూ ఉంటుంది. సత్కార్యం ఎంత చిన్నదైనా మానవుడు దానిని విలువలేనిదిగా భావించరాదు. ప్రళయదినాన కర్మలు తూకం చేయబడుతాయి. ప్రజలకు అవగాహనమున్న విషయాల ద్వారా ఉదాహరణ ఇవ్వాలి. నరకాగ్ని శిక్ష చాలా కఠినమైనది. -అల్లాహ్ మనందరిని దాని నుండి కాపాడుగాక! ఆమీన్- ప్రజలకు పరిచయం ఉన్నవాటి ద్వారా ఉదాహరణలు ఇవ్వాలని తెలిసింది. ఇందులో అల్లాహ్ యొక్క విశాల కారుణ్యం కనబడుతుంది. ఆయన తన దాసుల్లో కొందర్ని, వారి వద్ద సత్కార్యాలు తక్కువ ఉన్నప్పటికీ (తౌహీద్ పై స్థిరంగా ఉన్నందువల్ల) నరకం నుండి బయటకు తీస్తాడు.
28-అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం ప్రవచించారు: “లాఇలాహ ఇల్లల్లాహ్” పఠించిన వ్యక్తి హృదయంలో జొన్న గింజంత విశ్వాసమున్నా నరకం నుండి వెలికి వస్తాడు. ఏ వ్యక్తి “లాఇలాహ ఇల్లల్లాహ్” చదివాడో అతని హృదయంలో గోధుమ గింజంత విశ్వాసమున్నా నరకం నుండి వెలికి వస్తాడు. అలాగే ఎవరు లాఇలాహ ఇల్లల్లాహ్ చదివాడో అతని మనుస్సులో రవ్వంత విశ్వాసమున్నా అతనూ నరకం నుండి వెలికి వస్తాడు”. (బుఖారి 44, ముస్లిం 193).
ఈ హదీసులో:
తౌహీద్ పై స్థిరంగా ఉన్న పాపాత్ములు నరకం నుండి వెలికి వస్తారు. ఘోరపాపాలు (కబీరా గునాహ్) చేయువాడు నరకశిక్షకు గురవుతాడు. అయితే “ముర్జియా” వర్గంవారి విశ్వాసం దీనికి భిన్నంగా ఉంది. వారి విశ్వాసం ఈ హదీసుకు విరుద్ధం. అలాగే ఘోరపాపానికి గురైన (తౌహీద్ గల) వ్యక్తి నరకం నుండి వెలికి వస్తాడు. అయితే “ఖవారిజ్” వర్గంవారి విశ్వాసం దీనికి భిన్నంగా ఉంది. వారి విశ్వాసం ఈ హదీసుకు విరుద్ధం. (పై రెండు వర్గాలవారు సన్మార్గం నుండి వైదొలిగినవారు). ఈమాన్ అన్నది నోటిపలుకు, (ఆచరణ) మరియు హృదయవిశ్వాసానికి మారుపేరు. ఎలా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “లాఇలాహ ఇల్లల్లాహ్” అని పఠించడం మరియు దాని విశ్వాసం జొన్న గింజంతైనా హృదయంలో ఉండడం, ఈ రెండిటిని కలిపి చెప్పారు. ఏదైనా విషయం సులభంగా అర్థం అవడానికి ఉదాహరణలు ఇవ్వవచ్చు అని తెలిసింది. అల్లాహ్ యొక్క విశాల కారుణ్యం తెలిసింది. ఆయన తన దాసుని సత్కార్యాలను వ్యర్థపరచడు. విశ్వాసం తరుగుతుంది, పెరుగుతుంది అని కూడా తెలిసింది.
]నిశ్చయంగా అల్లాహ్ తనకు భాగస్వామిని కల్పించటాన్ని క్షమించడు. అది తప్ప ఏ పాపాన్ని అయినా ఆయన తాను ఇష్టపడిన వారి కొరకు క్షమిస్తాడు. ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసేవాడు, ఎంతో ఘోరమైన అబద్ధాన్ని కల్పించాడు అన్నమాట. ఎంతో తీవ్రమైన పాపపు మాటలు అన్నాడని భావం[.
నీ వద్దకూ, నీకు పూర్వం గతించిన ప్రవక్తల వద్దకూ ఇలా వహీ (దివ్యవాణి) పంపబడింది. ఒక వేళ మీరు షిర్క్ (బహుదైవారాధన) చేస్తే, మీ కర్మలన్నీ వ్యర్థమైపోతాయి మరియు మీరు నష్టానికి గురవుతారు[. (జుమర్ 39: 65).
ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసేవారికి అల్లాహ్ స్వర్గాన్ని నిషిద్ధం చేశాడు. వారి నివాసం నరకం. అటువంటి దుర్మార్గులకు సహాయం అందించువారెవరూ లేరు. (5: 72).
]ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసేవాడు, ఆకాశం నుండి క్రింద పడిపోయినట్లే. అతనిని, ఇక పక్షులైనా తన్నుకు పోతాయి, లేదా గాలి ముక్కలు ముక్కలయ్యే ప్రదేశానికైనా విసరివేస్తుంది[. (హజ్ 22: 31).
29- అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరుల్ని ఉద్దేశించిః “మిమ్మల్ని సర్వనాశనం చేసే ఏడు పనులకు మీరు దూరంగా ఉండండి” అని హెచ్చరించారు. ‘ఆ పనులేమిటి ప్రవక్తా?’ అని సహచరులు అడిగారు. అప్పుడాయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “అల్లాహ్ కు సాటి కల్పించడం, చేతబడి చేయడం, ధర్మయుక్తంగా తప్ప అల్లాహ్ హతమార్చకూడదని నిషేధించిన ప్రాణిని హతమార్చడం, వడ్డీ తినడం, అనాథల సొమ్మును హరించివేయడం, ధర్మయుద్ధంలో వెన్నుజూపి పారిపోవడం, ఏ పాపమెరగని (సద్వర్తనులైన) అమాయక ముస్లిం స్త్రీలపై అపనింద మోపడం”. (బుఖారి 2767, ముస్లిం 6857).
ఈ హదీసులో:
పాపాల్లో వ్యత్యాసం గలదు. కొన్ని పాపాలు, వాటికి పాల్పడిని వానిని వినాశనానికి గురి చేస్తాయి. షిర్క్ అన్నిట్లోకెల్లా అతిఘోరమైన పాపం. అది సత్యధర్మానికి విరుద్ధం. అల్లాహ్ యొక్క ఉలూహియత్ (నిజఆరాధన)లో లోపం కల్గించినట్లగును.
చేతబడి. దీనిని వినాశనానికి గురిచేసే వాటిలో లెక్కించే కారణం ఏమంటే: అందులో అగోచరజ్ఞానపు ఆరోపణ ఉంది. ప్రజలకు నష్టముంది.
ఏ మనిషినైనా హతమార్చడం. ఎందుకనగ రక్తం చిందించి, ప్రాణం తీయడం మరియు మానవజాతి పెరుగుదలకు అడ్డు కలిగించడం ఎంత మాత్రం సమంజసం కాదు. అయితే హత్యా ప్రతీకారం మరియు ధర్మపరమైన హత్యల విషయం వేరు. వాటి హక్కు స్వయంగా అల్లాహ్ ఇచ్చాడు.
అశక్తుడైన అనాథ సొమ్మును హరించివేయడం.వడ్డీ సొమ్ము తినడం. ఎందుకనగా వడ్డీని ఉపయోగించుట అల్లాహ్ తో పోరాటానికి దిగినట్లు, మరియు ధనంలో అల్లాహ్ నిర్ణయించిన హద్దలను మితిమీరనట్లగును.
ధర్మయుద్ధం నుండి వెన్నుజూపి పారిపోవడం. ఎందుకనగా దీని వల్ల తన ధర్మాన్ని, దాని అనుయాయులను కించపరచి, బలహీనతకు గురిచేసి, అధర్మమార్గంలో ఉన్నవారికి సహాయపడి, బలాన్నిచ్చినట్లగును.
పాపం, దాని మార్గాలు ఎరుగని, తమ శీలాన్ని కాపాడుకుంటూ ఉండే అమాయక ముస్లిం స్త్రీలపై అపనిందమోపడం కూడా నిషిద్ధం.
ఈ హదీసులో ఏడింటిని మాత్రమే ప్రస్తావించే కారణం ఏమిటంటే అవి సర్వ పాపాలకు మూలం లాంటివి కావడం. అయితే ఇలాంటి పాపాలు ఏడింటికంటే ఎక్కువ ఉన్నాయని కూడా కొందరు పండితులు చెప్పారు.
30- “ఇతర భాగస్వాములకంటే అధికంగా నేనే షిర్క్ (భాగస్వామ్యాని)కి అతీతుడిని, ఎవరైనా ఒక పని చేసి, అందులో నాతో ఇతరుల్ని భాగస్వామిగా చేస్తాడో నేను అతడ్ని, అతని ఆ పనిని స్వీకరించను”. అని అల్లాహ్ చెప్పినట్లు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ముస్లిం 2985).
ఈ హదీసులో:
షిర్క్ చేయువాని ఏ సత్కార్యమూ స్వీకరించబడదు. విధేయతలో సంకల్పశుద్ధి తప్పనిసరి. ప్రదర్శనాబుద్ధి షిర్క్ లో పరిగణించ బడుతుంది. ప్రదర్శనాబుద్ధితో చేసిన పుణ్యం అంగీకరింపబడదు. అతను చేసే సత్కార్యంలో కొంత స్వీకరించబడి మరి కొంత రద్దు కావడం జరగదు. పూర్తి సత్కార్యం రద్దగును. మనిషి తాను చేసే కార్యంలో అల్లాహ్ సంతృప్తిని కోరుకోవాలి. తన సంకల్పాన్ని షిర్క్ నుండి దూరముంచాలి.
31- “ప్రతి పాపాన్ని అల్లాహ్ క్షమించగలడు. కాని షిర్క్ చేస్తూ చనిపోయినవానిని మరియు ముస్లింను హతమార్చిన ముస్లింను క్షమించడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా తాను విన్నట్లు అబూ దర్దా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (అబూ దావూద్ 4270, సహీహ 5110).
ఈ హదీసులో:
ముష్రిక్ ని అల్లాహ్ క్షమించడు. అతని ఏ కార్యమూ అంగీకరించబడదు. ఏ సత్కార్యం లాభాన్నివ్వదు.
ఘోరపాపాలు చేసిన వ్యక్తి తౌబా చేయకున్నట్లయితే, అల్లాహ్ ఇష్టముంటే అతడిని మన్నించవచ్చు లేదా శిక్షించవచ్చు. ఉద్దేశపూర్వకంగా విశ్వాసిని వధించడం నరకంలో శాశ్వత స్థానానికి కారణం. అయితే విశ్వాసిని వధించడం ధర్మసమ్మతమే (నిశిద్ధం కాదు) అని భావించి హత్యకు పాల్పడేవానికే శాశ్వత స్థానం అని (ఇలా భావించని వానికి శాశ్వత స్థానం కాదు అని) కొందరు ధర్మవేత్తల అభిప్రాయం.
32-నా ప్రాణమిత్రులైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ఇలా తాకీదు చేశారని అబూ దర్దా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “నిన్ను ముక్కలు ముక్కలు చేయడం జరిగినా, నీవు అగ్నిలో వేయబడినా సరే అల్లాహ్ కు ఇతరులను భాగస్వామిగా చేయకు. తెలిసి కూడా ఫర్జ్ నమాజు వదలకు. కావాలని దాన్ని వదలిన వారి కొరకు అల్లాహ్ తరఫున రక్షణ ఉండదు. మత్తు సేవించకు అది సర్వ పాపాలకు తాళంచెవి (మూలకారణం) లాంటిది”. (ఇబ్ను మాజ 4034).
ఈ హదీసులో:
పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నా, విశ్వాసాన్ని విడనాడడం నిషిద్ధం. భరించలేని యాతనలకు గురవుతున్నప్పుడు నోటితో ఏదైనా అవిశ్వాసపు పలుకు వచ్చినా, హృదయం విశ్వాసం పట్ల తృప్తికరంగా ఉండడం తప్పనిసరి. మనఃపూర్వకంగా అవిశ్వాసానికి పాల్పడడం నిషిద్ధం. నమాజు విడనాడిన వ్యక్తి సత్యతిరస్కారులకు పోలినవాడు, ధర్మాన్ని తన వీపు వెనక విసిరినవాడవుతాడు. విశ్వమంతటిలో ప్రతి చెడుకు మూలం మత్తు పదార్థాలే. ఎలా అనగా దాన్ని సేవించినవాడి బుద్ధిజ్ఞానాలపై పొర(పరదా)లు పడిపోతాయి, (విచక్షణా బుద్ధి కోల్పోతాడు) పిదప అతడు ప్రతి పాపానికి, చెడుకు ఒడిగడతాడు.
33-ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఖైబర్ యుద్ధం జరిగిన రోజున కొందరు ప్రవక్త సహచరులు ఒక వ్యక్తిని ఉద్దేశించి “ఫలానా వ్యక్తి షహీద్” అని అన్నారు. మరో వ్యక్తి నుండి దాటుతూ “ఫలానా వ్యక్తి షహీద్” అని చెప్పారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ఎంత మాత్రం కాదు. అతడు యుద్ధ ధనం నుండి దొంగలించిన దుప్పటి, లేదా చాదరు కారణంగా నేను అతడ్ని నరకంలో చూశాను”. మళ్ళీ ప్రవక్త ఇలా చెప్పారు: “ఖత్తాబ్ కుమారుడా! వెళ్ళి ప్రజల్లో ఇలా ప్రకటన చేయి: స్వర్గంలో విశ్వాసులు తప్ప మరెవ్వరూ ప్రవేశించలేరు”. అయితే నేను వెళ్ళి “వినండీ! స్వర్గంలో విశ్వాసులు తప్ప మరెవ్వరూ ప్రవేశించలేరు” అని ప్రకటన చేశాను.
ఈ హదీసులో:
ఈ చాటింపు ద్వారా ఉమర్ రజియల్లాహు అన్హు ఘనత తెలిసింది. లాభకరమైన విద్య ప్రజలకు అందజేయాలని తెలిసింది. బాధ్యత భారం దించుకొనుటకు, ప్రజల వద్ద మాకు తెలియదన్న సాకు మిగలకుండా, అజ్ఞానం తొలిగిపోవుటకు. పండితుడు మూల విద్యను, ముఖ్యమైన విషయాల్ని ముందు ప్రస్తావించాలి.
34- అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “సత్కార్యాల్లో అతిశ్రేష్ఠమైనది ఏది” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక ప్రశ్న వచ్చింది. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించుట” అని చెప్పారు. మళ్ళీ ఏది? అని ప్రశ్న వచ్చినప్పుడు “అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయుట” అని జవాబిచ్చారు. ఆ తర్వాత ఏది? అని అడగ్గా “అంగీకారయోగ్యం పొందే హజ్” అని సమాధానం ఇచ్చారు. (బుఖారి 26).
ఈ హదీసులో:
విశ్వాసము (ఈమాన్) యొక్క శాఖలలో ఘనత పరంగా వ్యత్యాసం గలదు. విశ్వాసుల్లో ఘనత, వారి కర్మల ప్రకారం గలదు. కర్మలు విశ్వాసంలో లెక్కించబడవు అని వాదించే ‘ముర్జియా’ వర్గం యొక్క ఖండన ఇందులో ఉంది. ప్రశ్నించేవారిని బట్టి సమాధానం ఉంటుంది. అల్లాహ్, ఆయన ప్రవక్తపై విశ్వాసం లేనిదే ఏ సత్కార్యమూ స్వీకరించబడదు. ఇందులో జిహాద్ ఘనత ఉంది. అది అల్లాహ్ సాన్నిధ్యం పొందే కార్యాల్లో గొప్ప కార్యం. శ్రేష్ఠమైన కార్యాల్లో పాపాలకు దూరంగా ఉండి చేసిన హజ్జె మబ్రూర్ కూడా ఉంది. అధిక విద్యాభ్యాసన కోరికతో మరీమరి ప్రశ్నించడం మంచిదే కాని మీతిమీరడం మంచిది కాదు.
సత్కార్యం అంటే మీరు మీ ముఖాలను తూర్పుకో పడమరకో త్రిప్పటం కాదు. సత్కార్యం అంటే మనిషి అల్లాహ్ ను, అంతిమ దినాన్నీ, దూతలను, అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాన్నీ, ఆయన ప్రవక్తలను హృదయపూర్వకంగా విశ్వసించటం. ఇంకా ధనప్రేమ కలిగిఉండి కూడా, దానిని బంధువుల, అనాథల, యాచించని పేదల, బాటసారుల, యాచకుల కొరకూ మరియు ఖైదీలను విడుదల చెయ్యటానికీ వ్యయపరచటం. ఇంకా నమాజును స్థాపించటం, జకాత్ ఇవ్వటం, వాగ్దానం చేస్తే దానిని పూర్తిచేసేవారూ, కష్టకాలంలో, లేమిలో సత్యాసత్యాల మధ్య జరిగే పోరాటంలో స్థైర్యం చూపేవారూ సత్పురుషులు. వాస్తవంగా సత్యసంధులు, అల్లాహ్ ఎడల భయభక్తులు కలవారు వీరే. (బఖర 2: 177).
నిశ్చయంగా సాఫల్యం పొందే విశ్వాసులు తమ నమాజులో వినమ్రతను పాటించువారు, వ్యర్థవిషయాల జోలికిపోనివారు, జకాత్ విధానాన్ని ఆచరించువారు, తమ మర్మాంగాలను పరిరక్షించువారు, -తమ భార్యల, తమ ఆధీనంలో ఉన్న స్త్రీల విషయంలో తప్ప. అలాంటప్పుడు వారు నిందార్హులు కారు. కాని ఎవరైనా దీనిని మించి కోరుకుంటే వారే హద్దులను దాటేవారు- తమ అమానతుల(అప్పగింతల)కు, తమ వాగ్దానాలకు కట్టుబడి ఉండేవారు. తమ నమాజులను శ్రద్ధగా కాపాడుకునేవారు. వారే స్వర్గాన్ని వారసత్వంగా పొందేవారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. (మూమినూన్ 23: 1-11)
35- “విశ్వాసానికి చెందిన శాఖలు డెబ్బైకి పైగా ఉన్నాయి. అందులో శ్రేష్ఠమైనది: “లాఇలాహ ఇల్లల్లాహ్”. చివరి శాఖ: దారి నుండి ఇబ్బందికర వస్తువును ప్రక్కకు జరుపుట. బిడియం (సిగ్గు) కూడా విశ్వాసానికి చెందిన శాఖయే” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ముస్లిం 35, బుఖారి 9).
ఈ హదీసులో:
విశ్వాస శాఖలున్నాయని తెలిసింది. వాటిలో కొన్నింటికి మరి కొన్నింటిపై ఘనత గలదు. అందులో ఉత్తమమైనది, గొప్పదిః “లాఇలాహ ఇల్లల్లాహ్”. ఆచరణ విశ్వాసంలో లెక్కించబడుతుంది. అలాగే ప్రవర్తన కూడా. విశ్వాస శాఖల్లో కొన్ని ఎక్కువ ఘనత గలవి మరి కొన్ని తక్కువ ఘనత గలవైనప్పుడు అది (విశ్వాసం) తరుగుతూ పెరుగుతూ ఉందని అట్లే తెలుస్తుంది. ఏ చిన్న సత్కార్యమైనా మనిషి దాన్ని తక్కువైనదిగా చూడగూడదు. కనీసం, అది దారి నుండి ఇబ్బందికర వస్తువు తీసిపడేయడమైనా సరే. ఏ సత్కార్యమూ తౌహీద్ లేనిదే సంపూర్ణం కాదు.
36- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఎవరయితే అల్లాహ్ ను ప్రభువుగా, ఇస్లాంను ధర్మంగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రవక్తగా స్వీకరించి ఆనందానుభవం పొందాడో ఆ వ్యక్తి విశ్వాస రుచిని ఆస్వాదించాడు”.
ఈ హదీసులో:
ఒక విషయాన్ని బోధించడానికి అనుకూలమైన మంచి పోలిక ఇవ్వడం జరిగింది. పైన చెప్పబడిన మూడు మూల సూత్రాలు ఇస్లాం ధర్మానికి పునాది లాంటివి. దీని భావం రీత్యా ముస్లిముల మధ్య వ్యత్యాసం గలదు. విశ్వాస ఆనందానుభవం పొందుట హృదయం పని. తౌహీద్ పై నిలకడ, విశ్వాసంలో స్వచ్ఛత ఏ మనిషిలో ఎంత పరిమాణంలో ఉంటుందో అతడు అంతే విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడు.
37- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారని అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మూడు లక్షణాలు ఎవరిలో ఉన్నాయో అతను విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదించినట్లేః (1) అందరికంటే ఎక్కువ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను ప్రేమించాలి. (2) ఎవరిని ప్రేమించినా కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం ప్రేమించాలి. (3) అగ్నిలో పడటానికి మనిషి ఎంత అసహ్యించుకుంటాడో, అవిశ్వాస స్థితి వైపుకు మరలిపోవడానికి కూడా అతను అంతగా అసహ్యించుకోవాలి”. (బుఖారి 16, ముస్లిం 43).
ఈ హదీసులో:
విశ్వాసానికి మాధూర్యముంటుందని, తన విశ్వాసాన్ని సంపూర్ణ స్థితికి చేర్పించే వ్యక్తి ఆ మాధూర్యాన్ని పొందుతాడని తెలిసింది. అల్లాహ్ మరియు ప్రవక్త పట్ల ప్రేమ కలిగియుండుట, మరియు వారి ప్రేమ అందరి పట్ల ఉండే ప్రేమలకంటే ఎక్కువగా ఉండుట కూడా విధిగా ఉంది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంపై ప్రేమ, అల్లాహ్ ప్రేమలో ఇమిడి యుంది. అల్లాహ్ కొరకు ఇతరులను ప్రేమించుట విశ్వాసంలో ఓ భాగమే. అలాగే దీని భిన్న భావమేమిటంటే అవిశ్వాసులతో ద్వేషం కూడా విశ్వాసంలో ఓ భాగమే. అవిశ్వాసాన్ని, అవిశ్వాసుల చేష్టలను అసహ్యించుకొనుట కూడా విధిగా ఉంది. ఇస్లాంను విడనాడడం మరియు మతభ్రష్టతకు గురి కావడం నుండి హెచ్చరించబడింది. అల్లాహ్ మరియు ప్రవక్త ప్రేమను వదలి ఇతరులను అధికంగా ప్రేమించడం నిషిద్ధం. చదవండి అల్లాహ్ ఆదేశం: ]ఒక వేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ బంధువులు, మీ ఆప్తులు, మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు, మందగిస్తాయేమోనని మీరు భయపడే మీ వ్యాపారాలు, మీరు ఇష్టపడే మీ గృహాలు అల్లాహ్ కంటే ఆయన ప్రవక్త కంటే ఆయన మార్గంలో జిహాద్ కంటే మీకు ఎక్కువ ప్రీతికరమైతే, అల్లాహ్ తన తీర్పును మీ ముందుకు తీసుకువచ్చే వరకు నిరీక్షించండి. అల్లాహ్ అవిధేయులకు మార్గం చూపడు[. (తౌబా 9: 24).
38-జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ఎలాంటి విశ్వాసం అతి ఉత్తమమైనదని వచ్చిన ప్రశ్నకు “సహనం మరియు ఉదార గుణాలతో కూడి ఉన్న విశ్వాసం” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానమిచ్చారు. (ఇబ్ను షైబా ‘ఈమాన్’లో, షేఖ్ అల్బానీ ‘సహీహా’ 1495లో).
ఈ హదీసులో:
ఇందులో విశ్వాస వ్యాఖ్యానం దాని స్పష్టమైన, గొప్ప గుణాలతో చేయబడింది. అవి: సహనం, దాతృత్వం. సహనం విశ్వాసం యొక్క శిఖరం. అది ఉంటెనే ఆదేశాల పాలన జరుగుతుంది. వారింపులను త్యజించడం జరుగుతుంది. విధివ్రాతే ప్రకారం వచ్చే ఆపదలపై ఓపిక వహించడం జరుగుతుంది. దాతృత్వం వల్ల అల్లాహ్ వద్ద ఉన్న గొప్ప పుణ్యం పట్ల నమ్మకం పెరుగుతుంది. ఆయన చేసిన వాగ్దానాలతో మనస్సుకు తృప్తి లభిస్తుంది. ఈమాన్ అన్న పదంలో విశ్వాసాలు, ఆచరణలు మరియు ప్రవర్తనలన్నీ వస్తాయి.
39- అబూ ఉమామ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ‘విశ్వాసమంటే ఏమిటి?’ అని ఒక వ్యక్తి ప్రవక్తను అడిగాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “నీవు చేసిన సత్కార్యం నీకు సంతోషం కలిగించినప్పుడు, నీవు చేసిన పాపం నిన్ను బాధించినప్పుడు నీవు విశ్వాసివి” అని సమాధానమిచ్చారు. ‘పాపమంటేమిటి?’ అని అతను మళ్ళీ అడిగాడు. “ఏ పని చేయుటకు నీవు జంకుతున్నావో దాన్ని వదిలేయి. అదే పాపం” అని చెప్పారు. (అహ్మద్. సహీహ 550).
ఈ హదీసులో:
విశ్వాసికి అతని సత్కార్యం సంతోషాన్ని, విధేయత ఆనందాన్ని ఇస్తుంది. పాపం చింతకు గురి చేస్తుంది. కాని కపట విశ్వాసి మరియు పాపాత్ముడు పుణ్యకార్యాలతో ఆనందించడు. వాటి ద్వారా ఏ మాధుర్యమూ పొందడు. పాపంతో అతని మనస్సు జంకదు. పాపం అతనికి చేదుగా అనిపించదు. సత్కార్యంతో సంతోషించుట పుణ్యఫల రెట్టింపుకు, పాపంతో భయపడుట, దిగులు చెందుట శిక్షలో తగ్గింపుకు మంచి సబబు. విశ్వాసి వద్ద హృదయపు గీటురాయి ఉంటుంది. దాని ద్వారా అతను తన విశ్వాస పరిణామాన్ని తెలుసుకుంటాడు.
40-ఫజాలా బిన్ ఉబైద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: హజ్జతుల్ విదాఅ సందర్భంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: “విశ్వాసి ఎవరో మీకు తెలుపనా? ప్రజలు ఎవరి నుండి తమ ధనప్రాణాలకు రక్షణ ఉందని నమ్ముతారో అతనే విశ్వాసి. ప్రజలు ఎవరి నోటి మరియు చేతుల ద్వారా బాధింపబడరో అతనే ముస్లిం. అల్లాహ్ కు విధేయునిగా ఉండడానికి తన మనోవాంఛలతో పోరాడే వ్యక్తియే ముజాహిద్. పాపాలను, అవిధేయతా విధానాన్ని విడనాడే వ్యక్తియే ముహాజిర్”. (అహ్మద్. సహీహ 549).
ఈ హదీసులో:
ఇందులో విశ్వాసిని అతని ఉత్తమ గుణం, ఉన్నత సద్వర్తన ద్వారా నిర్వచించడం జరిగింది: అల్లాహ్ దాసులను కష్టపెట్టక పోవడం. అతని కీడు నుండి ప్రజలు సురక్షితంగా ఉండడం. వారి ధన ప్రాణాలు అతని నుండి భద్రంగా ఉండడం. అలాగే ముహాజిర్ యొక్క వివరణ కూడా అతి గొప్ప విషయంతో ఇవ్వడం జరిగింది: అవిధేయతా విధానాన్ని, పాపాల్ని వదులుకొనడం, అగోచర జ్ఞానం గల ప్రభువుతో స్వచ్ఛమైన తౌబా చేయడం.
41-సుఫ్యాన్ బిన్ అబ్దుల్లాహ్ సఖఫీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ‘ప్రవక్తా! ఇస్లాంలో ఒక మాట నాకు తెలుపండి దాని గురించి మళ్ళీ నేను ఎవరినీ అడగను’ అని విన్నవించుకున్నాను. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఆమన్తు బిల్లాహ్ (నేను అల్లాహ్ ను మాత్రమే విశ్వసించాను) అని పలికిన తర్వాత ఆ విషయం లో స్థిరంగా నిలబడి ఉండు” అని చెప్పారు. (ముస్లిం 38).
ఈ హదీసులో:
ఈ సద్వచనమే ఇస్లాం ధర్మం యొక్క సారాంశం. మరియు ముస్లిముల ఐక్యతకు మూలం. దాని భావం: దానిని మనసా, వాచా, కర్మా విశ్వసించడం మరియు ఎల్లప్పుడూ దానిపై స్థిరంగా ఉండడం. “ఆమంతు బిల్లాహ్” అన్న పదంలో అల్లాహ్ యొక్క రుబూబియత్, ఉలూహియత్, అస్మా వ సిఫాతుల([3])ను మరియు ఆయన పంపిన ప్రవక్తలను, అవతరింపజేసిన గ్రంథాలను విశ్వసించడం కూడా వస్తాయి. “దానిపై స్థిరంగా ఉండు” అంటే సర్వ ధర్మాజ్ఞలు ఉత్తమ రీతిలో పాటించు. (సర్వ వారింపులకు దూరంగా ఉండు). ఇదే సంపూర్ణ ధర్మం.
42- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని, అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “తన తండ్రి, తన బిడ్డ, ప్రపంచంలోని ఇతర మానవులందరికన్నా ఎక్కువగా నన్ను ప్రేమించనంత వరకూ మీలో ఏ ఒక్కడూ నిజమైన విశ్వాసి కాజాలడు”. (బుఖారి 15, ముస్లిం 44).
ఈ హదీసులో:
ఇందులో “మీలో” అనగా సహాబా (ప్రవక్త సహచరులు) మాత్రమే కాదు. విశ్వాసులందరూ అని భావం. ప్రేమ, ద్వేషం హృదయానికి సంబంధించిన పనులు. అవి ధర్మానికి సంబంధించినవే. విశ్వాసపరంగా విశ్వాసులందరూ సమానంగా ఉండరు. విశ్వాసం పెరుగుతుంది మరియు తరుగుతుంది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమ అనుచరులపై విధిగా ఉంది. బలమైన ధర్మ కంకణాల్లో ఆయన పట్ల ప్రేమ కూడా ఒకటి. తండ్రి, కొడుకు మరియు తదితరుల ప్రేమలు ఆయన పట్ల గల ప్రేమ కంటే ఎక్కువగా ఉండుట నిషిద్ధం.
43- “తన కోసం ఇష్టపడిన దానిని తన సోదరుని కోసం కూడా ఇష్టపడనంత వరకూ మీలో ఏ ఒక్కడూ నిజమైన విశ్వాసి కాజాలడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని, అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (బుఖారి 13, ముస్లిం 45).
ఈ హదీసులో:
ఒక ముస్లిం తనకు తాను కోరుకున్నటువంటి మేలే తన ముస్లిం సోదరుని కోసం కూడా కోరుట ఒక ముస్లింకు మరో ముస్లింపై ఉన్న హక్కుల్లో ఒకటి. అలాగే తన కొరకు దేనిని ఇష్టపడడో తన సోదరుని కొరకు కూడా దానిని ఇష్టపడకూడదు. ఇలా ముస్లిములు పరస్పరం మోసం చేసుకొనుట తగదు అని చెప్పబడింది. మోసం చేయుట విశ్వాసుల గుణం కాదు అని అర్థం.
44-ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని హంజలా ఉసయ్యిదీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షి! నా వద్ద ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటారో అలాగే ఎల్లప్పుడూ ఉన్నట్లయితే మరియు అల్లాహ్ స్మరణలోనే ఉన్నట్లయితే, మీరు మీ పడకలపై ఉండగా, దారిలో నడుస్తుండగా దైవదూతలు వచ్చి మీతో కరచాలనం చేసేవారు. కాని ఓ హంజలా! కొంత అల్లాహ్ ధ్యానం మరికొంత ఆలుపిల్లల భాధ్యత భారం తప్పదు”. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ చివరి మాట మూడు సార్లు అన్నారు. (ముస్లిం 2750).
ఈ హదీసులో:
విశ్వాసుని స్థితి అన్ని వేళల్లో ఒకేరకంగా ఉండదు. అప్పుడప్పుడు అశ్రద్ధ ఏర్పడుతుంది. సహచరుల అతి ఉత్తమ సందర్భం ప్రవక్త సన్నిధిలో ఉన్నప్పటిది. మనిషి నుండి పాపం జరుగుట తప్పనిసరే. ఇలా స్వాతిశయం, అహంభావం దూరమయి, దైవదాస్యం లో ఉన్నత స్థానం లభించుటకు మరియు మనిషి అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుతూ ఉండుట కోసం. తాను కోరిన దానిని సృష్టించడం, లేదా నశింపజేయడం అల్లాహ్ కు చాలా సులువు.
45-ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “నిశ్చయంగా మీ దుస్తులు పాతబడినట్లు మీలోని మీ విశ్వాసం కూడా పాతబడుతుంది. అందుచేత అల్లాహ్ మీ విశ్వాసాన్ని నూతనంగా, తాజాగా ఉంచాలని మీరు ఆయన్ని ప్రార్థిస్తూ ఉండండి”. (ముస్తద్రక్ హాకిం 5. సహీహ 1585).
ఈ హదీసులో:
పాపంతో విశ్వాసం బలహీనపడుతుంది. అశ్రద్ధ వల్ల అది హృదయంలో పాతబడుతుంది. బట్టను ఉతికి కొత్తదనానికి తీసుకొచ్చే పద్ధతిలో, అల్లాహ్ స్మరణం (జిక్ర్), దుఆ, ఖుర్ఆన్ పారాయణం, సత్కర్మల ద్వారా దానిని పునరుద్ధరించాలి. విశ్వాసంపై నిలకడగా ఉండుటకు, అది పెరుగుతూ ఉండుటకు, చివరి శ్వాస వరకు అదే స్థితిలో ఉండుటకు అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉండాలి.
46-ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తున్నప్పుడు అతని నుండి విశ్వాసం బయటకు వెళ్ళి, అతనిపై నీడ మాదిరిగా ఉండిపోతుంది. ఆ దుష్కార్యం వదలినప్పుడు విశ్వాసం తిరిగి అతని వైపు వచ్చేస్తుంది”. (అబూ దావూద్ 4690, తిర్మిజి 2625. సహీహ 509).
ఈ హదీసులో:
పాపాల నష్టం తెలుపబడింది. దాని వలన సంపూర్ణ విశ్వాసం లో కొరత ఏర్పడుతుంది. ఒక్కోసారి విశ్వాసం ప్రక్కకు జరిగిపోతుంది. ‘పాపం వల్ల విశ్వాసానికి ఏ నష్టం వాటిల్లద’ని చెప్పే “ముర్జియా” వర్గం వారి సిద్ధాంతాల ఖండన ఇందులో జరిగింది. “నీడ మాదిరిగా ఉండిపోతుంది” అని సులభంగా అర్థమయ్యే మంచి ఉదాహరణ ఇవ్వబడింది. పాపకార్యాల్లో వ్యభిచారం అతినీచమైనది, చెడ్డది. పాపాల నుండి దూరముంటూ, స్వచ్ఛమైన తౌబా చేస్తూ విశ్వాసం కోల్పోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి.
47-ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “వ్యభిచారి వ్యభిచారం చేస్తున్నప్పుడు విశ్వాసిగా ఉండడు. త్రాగుబోతు మద్యం సేవిస్తున్నప్పుడు విశ్వాసిగా ఉండడు. దొంగ దొంగతనం చేస్తున్నప్పుడు విశ్వాసిగా ఉండడు. ప్రజలు కళ్ళారా చూస్తుండగా దోపిడి దొంగ పెద్ద ఎత్తున లూటీ చేస్తున్నప్పుడు విశ్వాసిగా ఉండడు”. (బుఖారి 5578, ముస్లిం 57).
ఈ హదీసులో:
ఘోరపాపాలు సంపూర్ణ విశ్వాసంలో లోటు కలుగజేస్తాయి. సంపూర్ణ విశ్వాసంగల వ్యక్తిని అతని విశ్వాసం పాపాల నుండి, అవిధేయత నుండి కాపాడుతుంది. ఘోరపాపాలకు సమీపించే వారికి ఇందులో కఠినంగా హెచ్చరిక ఉంది. పాపాలు రెండు రకాలుగా ఉంటాయి: చిన్నవి మరియు పెద్దవి.
48-అబూ హురైర రజియల్లాహు అన్హుఉల్లేఖనం ప్రకారం: అబూ బక్ర్, ఉమర్ రజియల్లాహు అన్హుమాతో సహా మేము కొంత మంది ప్రవక్త చుట్టూ కూర్చొనియుండగా, హఠాత్తుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా మధ్య నుండి వెళ్ళిపోయారు. చాలా సమయం గడిచినప్పటికీ రానందుకు శత్రువుల నుండి ఏదైనా అపాయం కలిగిందా అన్న భయం మాకు కలిగి మేము నిలబడ్డాము. అందరికంటే ముందు నాకు ఈ భయం కలిగింది. ప్రవక్త జాడ కనుగొనుటకు నేను బయలుదేరి అన్సారులోని బనీ నజ్జార్ కు చెందిన ఒక తోట వద్దకు చేరుకొని, అందులో ప్రవేశించడానికి ద్వారమును వెతుకుతూ దాని చుట్టూ తిరిగాను. కాని ద్వారము చూడలేదు. అయితే ఆ తోటకు కొంత దూరములో ఉన్న ఒక బావి నుండి చిన్న కాలువ ప్రవహిస్తూ ఆ తోటలో చేరుతుంది. దాని గుండా నక్క మాదిరిగా నేను ముడుచుకొని లోపలికి వెళ్ళాను. అక్కడ ప్రవక్త కనబడ్డారు. (నా రాకను గమనించిన ప్రవక్త) “అబూ హురైరా?” అని అడిగారు. ‘అవును’ అని నేనన్నాను. “ఎందుకొచ్చావు?” అని అడిగారు. ‘మీరు మా మధ్య కూర్చున్నవారు హఠాత్తుగా వెళ్ళి ఆలస్యం చేసినందుకు, మీరు ఏదైనా అపాయంలో చిక్కుకున్నారా అని మాకు ఆందోళన కలిగింది. అందరికంటే ముందు నేను కంగారుపడి, నక్క ముడుచుకొని వచ్చినట్లు ఈ తోటలో ప్రవేశించాను. నా వెనక సహచరులు మీ కొరకు వేచియున్నారు అని చెప్పాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ పాదరక్షలను నాకు ఇస్తూ “అబూ హురైర! ఇదిగో నా చెప్పులు తీసుకు వెళ్ళి, ఈ తోట ఆవల నీకు కలసినవారిలో సంపూర్ణ హృదయాంతర నమ్మకంతో “లాఇలాహ ఇల్లల్లాహ్” సాక్ష్యం ఇచ్చినవారికి స్వర్గం శుభవార్త ఇవ్వు” అని ఆదేశించారు. నేను వెళ్ళాను. ఎదురుగా నాకు ఉమర్ రజియల్లాహు అన్హు కలసి, ఈ చెప్పులేమిటి అబూ హురైర అని మందలించారు. ఇవి ప్రవక్త గారి చెప్పులు. ఆయన ఇవి నాకు ఇచ్చి, సంపూర్ణ హృదయాంతర నమ్మకంతో “లాఇలాహ ఇల్లల్లాహ్” సాక్ష్యం పలికిన వారికి స్వర్గం శుభవార్త ఇవ్వుమని చెప్పారు అని అన్నాను. ఇది విన్న ఉమర్ నా ఛాతిపై గుద్దారు. నేను వెల్లకిలా పడ్డాను. ‘అబూ హురైర! ప్రవక్త వద్దకు వెనక్కి తిరుగు’ అని ఉమర్ అన్నారు. నేను ఏడుపు ముఖముతో ప్రవక్త వద్దకు వచ్చాను. నా వెనకే ఉమర్ వచ్చారు. “అబూ హురైర! నీకు ఏమైనది?” అని ప్రవక్త మందలించారు. అప్పుడు నేను చెప్పానుః ‘బయటికి వెళ్ళే సరికి ఉమర్ కలిశారు. మీరు ఇచ్చిన సందేశాన్ని నేను వారికి తెలిపాను. అందుకు ఆయన నా ఛాతిపై పిడికిలితో గట్టి దెబ్బ కొట్టారు. అందువల్ల నేను వెల్లకిలా పడ్డాను. ఆ తర్వాత ‘తిరిగి వెళ్ళు’ అని కూడా చెప్పారు. “ఉమర్! నీవు ఇతనితో ఇలా ఎందుకు ప్రవర్తించావు” అని ప్రవక్త మందలించారు. దానికి ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా సమాధానమిచ్చారు: ‘ప్రవక్తా! నా తల్లిదండ్రులు మీకై అర్పితమవుగాక! సంపూర్ణ హృదయాంతర విశ్వాసంతో “లాఇలాహ ఇల్లల్లాహ్” యొక్క సాక్ష్యం ఇచ్చినవారు కలసినచో వారికి స్వర్గం శుభవార్త ఇవ్వమని, మీరు తమ పాదరక్షలు అబూ హురైరకు ఇచ్చి పంపారా?. “అవును” అని ప్రవక్త అన్నారు. ‘అయితే అలా ఆదేశమివ్వకండి ప్రవక్తా! ప్రజలు దానిపై మాత్రమే నమ్మకముంచుకొని (ఆచరణ వదిలేస్తారని) నాకు భయంగా ఉంది. అందుచేత వారిని సత్కార్యాలు చేస్తూ ఉండనివ్వండి’ అని ఉమర్ చెప్పారు. అప్పుడు ప్రవక్త ﷺ “సరే అలాగే ఉండనివ్వండి” అని అన్నారు. (ముస్లిం 31).
ఈ హదీసులో:
తను చెప్పే మాట నిజమని తెలియడానికి ఒక గుర్తు ఇచ్చి పంపడం మంచిది. సంతోషవార్త అందరికీ తెలియజేయాలి. అది ప్రజల్లో ఎవరైనా సందేహాలకు గురికాకుండా, ఆచరణ వదలుకోరని నమ్మకం ఉన్నప్పుడు. ఉమర్ అబూ హురైరను నెట్టేసి, ప్రవక్త వద్దకు వచ్చి ప్రజలు దీని ఆధారంగా ఆచరణ వదులుకుంటారని చెప్పడం, ప్రవక్త దాన్ని అంగీకరించడం ద్వారా ఉమర్ రజియల్లాహు అన్హు ఘనత తెలిసింది.
49-ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు మరియు నేను అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యమిచ్చుచున్నాను. ఏ వ్యక్తి రెండు సాక్ష్యాలను (లాఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్) ఏలాంటి సందేహం లేకుండా పలుకుతాడో అతను అల్లాహ్ తో కలసిన తర్వాత స్వర్గంలోకే వెళ్తాడు”. (ముస్లిం 27).
ఈ హదీసులో:
పై రెండు విషయాల సాక్ష్యం ఇవ్వనిదే ఎవడూ విశ్వాసి కాడు. ఆ రెండింటిని కలిపి, రెండింటి గురించి సాక్ష్యమివ్వాలి. అందులో ఏ ఒక్క దానిని వదలినా ఆ సాక్ష్యం సంపూర్ణం కాదు. దాని సాక్ష్యమిచ్చువాడు సంపూర్ణ నమ్మకంతో సాక్ష్యమివ్వాలి. ఏ కొంచెం అనుమానం, సందేహానికి గురైనా సాక్ష్యమివ్వనట్లే. ఈ విధంగా సాక్ష్యమిచ్చినవారి స్థానం స్వర్గం. “లాఇలాహ ఇల్లల్లాహ్” ను పూర్తి నమ్మకంతో విశ్వసించాలి అంటే దాని ప్రకారం జీవితం గడపాలి అని అర్థం. హృదయాంతరంతో విశ్వసించడం సత్కార్యాల్లో వస్తుంది. కేవలం నోటితో పలుకుట సరిపోదు.
50-అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: నేను నా జాతివారితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో హాజరయ్యాను. అప్పుడు ఆయన ఇలా ఆదేశించారుః “శుభవార్త వినండి! మీ వెనక ఉన్నవారికి ఈ శుభవార్త ఇవ్వండిః ఎవరు పూర్తి (హృదయాంతర) సత్యాలతో లాఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యం పలుకుతాడో అతడు తప్పక స్వర్గంలో ప్రవేశిస్తాడు”. మేము ప్రవక్త వద్ద నుండి బయలుదేరి ప్రజలకు ఈ శుభవార్త ఇస్తూ వెళ్లాము. అంతలో ఉమర్ రజియల్లాహు అన్హు మాకు కలిశారు. మమ్మల్ని ప్రవక్త వద్దకు తీసుకొచ్చి, ‘ప్రవక్తా! ఇక ప్రజలు దీనిపైనే ఆధారపడి పోతారు. (సత్కార్యాలు చేయడం మానుకుంటారు) అని అన్నారు. దానికి ప్రవక్త మౌనం వహించారు. (అహ్మద్. సహీహ 712).
ఈ హదీసులో:
మంచి విషయాల శుభవార్త ఇవ్వాలి. మనస్పూర్వకంగా తౌహీద్ ను నమ్మి, దాని ప్రకారం ఆచరించే వారికి స్వర్గం అన్నది అతి గొప్ప శుభవార్త. “లాఇలాహ ఇల్లల్లాహ్” హృదయంతో, సంపూర్ణ విశ్వాసంతో, నోటితో పలకడంలో పూర్తి సత్యతను పాటించి, చిత్తశిద్ధితో అల్లాహ్ సంతృప్తి కొరకు దాని ప్రకారం ఆచరించినచో అది ఆ వ్యక్తికి లాభాన్నిస్తుంది. దానితో ఈవిధంగా వ్యవహరించినవారి స్థానం భోగభాగ్యాలతో నిండి ఉన్న స్వర్గవనాలు. కేవలం “లాఇలాహ ఇల్లల్లాహ్” సాక్ష్యం ఇచ్చుట సరిపోదు. “ముహమ్మదుర్ రసూలుల్లాహ్” సాక్ష్యం కూడా ఇవ్వాలి. సర్వపనుల్లో ఉత్తమమైనది “లాఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అని సాక్ష్యం ఇచ్చుట. ప్రవక్తలందరూ తమ జాతి వారిని ఈ సాక్ష్యం ఇవ్వాలనే బోధించారు.
51-ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని ఉస్మాన్ బిన్ అఫ్పాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరొకడు లేడని తెలుసుకున్న వ్యక్తి చనిపోయిన తర్వాత స్వర్గంలో చేరుకుంటాడు”. (ముస్లం 26).
ఈ హదీసులో:
తెలుసుకొనుట అంటే అల్లాహ్ ఏకత్వాన్ని, ఆయనే ఆరాధ్యుడని తెలుసుకొని పూర్తి నమ్మకంతో విశ్వసించుట. ఈ విశ్వాసం చిత్తశుద్ధితో ఉండాలి. నోటితో పలుకుటలో సత్యవంతులై ఉండాలి. అల్లాహ్ సంతోషం కోసం, స్వర్గం పొందడానికి ఇతరులకు దానిని భోధించాలి. “లాఇలాహ ఇల్లల్లాహ్”లో రెండు విషయాలున్నాయి. 1. నిరాకరించుట. అంటే ఆరాధనలకు అర్హులు ఇతరులు ఎవ్వరూ లేరని నమ్ముట. 2. అంగీకరించుట. అంటే అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు అర్హుడని నమ్ముట.
52-ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “నా అనుచర సంఘంలోని ఒక వ్యక్తిని ప్రళయదినాన ప్రజలందరి ముందు అల్లాహ్ తీసుకొస్తాడు. తొంబైతొమ్మిది కర్మపత్రాల (Files)ను అతని ముందు పరుస్తాడు. ప్రతి ఫైల్ పొడవు దృష్టి పడేంత దూరం ఉంటుంది. అప్పుడు ‘ఇందులో నీవు చేసిన పాపాలన్నీ ఉన్నాయి. ఇందులో దేనినైనా నీవు తిరస్కరిస్తావా? కాపాలాదురులుగా ఉన్న నా లేఖకులైన దైవదూతలు నీపై ఏదైనా అన్యాయం చేశారా?’ అని అల్లాహ్ అడుగుతాడు. ‘లేదు ప్రభువా!’ అని అతడు జవాబిస్తాడు. “నీ వద్ద ఏదైనా సాకు, లేదా పుణ్యం ఉందా” అని అల్లాహ్ ప్రశ్నిస్తాడు. ఆ మనిషి బిత్తరపోయి ‘లేదు ప్రభువా’ అని విన్నవించుకుంటాడు. “ఎందుకు లేదు, మా వద్ద నీదొక పుణ్యం ఉంది. నీపై ఈ రోజు ఏలాంటి అన్యాయం జరగదు” అని అల్లాహ్ అంటాడు. అప్పుడు ఒక్క చిన్న ముక్క తీయబడుతుంది. అందులో “అష్ హదు అల్లాఇలాహ ఇల్లల్లాహు వఅన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహు” అని వ్రాసి ఉంటుంది. “ఆ వ్యక్తిని ఇక్కడికి తీసుకురండి” అని అల్లాహ్ ఆజ్ఞ ఇస్తాడు. ఆ వ్యక్తి ముక్కను చూసి, అల్లాహ్! ఈ ఫైళ్ళ ముందు ఇంతటి చిన్న ముక్కది ఏమి లెక్క? అని అంటాడు. “నీపై ఎంత మాత్రం అన్యాయం జరగదు అని అనబడుతుంది. తర్వాత త్రాసు యొక్క ఒక పళ్ళెములో ఫైళ్ళు, మరో పళ్ళెంలో ఆ ముక్క పెట్టబడుతాయి. ముక్క ఉన్న పళ్ళం బరువుతో వంగిపోతూ ఉంటుంది. ఫైళ్ళు ఉన్న పళ్ళెం తేలికగాఉండి పైకి లేస్తుంది. కరుణామయుడు, కృపాశీలుడైన అల్లాహ్ పేరుగల వస్తువే చాలా బరువుగా ఉంటుంది”. (అహ్మద్. తిర్మిజి 2639, ఇబ్నుమాజ 4300. సహీహ 135).
ఈ హదీసులో:
“లాఇలాహ ఇల్లల్లాహ్” యొక్క ఘనత మరియు అది త్రాసులో చాలా బరువుగా ఉంటుందని తెలిసింది. సర్వ పుణ్యాల్లో అది ఎక్కువ బరువు గలది. సర్వ సత్కార్యాల్లో అతి పెద్దది. విధేయతల్లో అతిగొప్పది. “లాఇలాహ ఇల్లల్లాహ్” వాస్తవికతను తెలుసుకొని, స్వచ్ఛంగా దానిని పలికి, సంకల్పశుద్ధితో విశ్వసించిన వారికి మేలే మేలు. దాని ప్రకారంగా తమ జీవితాన్ని మలచుకున్నవారి పాపాలు మన్నించబడతాయి. ఈ హదీసులో అల్లాహ్ దయ, కరుణా విశాలత తెలుస్తుంది. దాసుడు ఎల్లవేళల్లో అల్లాహ్ పై నమ్మకం సవ్యంగా ఉంచాలి. ఆయన కరుణను ఆశించాలి. ఆయన మన్నింపు పట్ల నిరాశ చెందరాదు. ఆయన క్షమించువాడు, మన్నింపు గుణం గలవాడు.
ప్రళయదినాన కొందరి లెక్కల తీర్పు ప్రజల ముందు ప్రత్యక్షంగా జరుగును. అల్లాహ్ తన దాసులపై ఎంత మాత్రం అన్యాయం చేసేవాడు కాడు. అల్లాహ్ ప్రళయదినాన తన దాసునితో స్వయంగా లెక్క తీసుకుంటాడు. అల్లాహ్ కు మరియు దాసునికి మధ్య అనువాదకుడు ఉండడు. సత్కార్యాలు, దుష్కార్యాలు వ్రాయబడతాయి. పాపపుణ్యాల ఫైళ్ళు హాజరు చేయబడతాయి. ఇందులో తౌహీద్ ఘనత ఉంది. కాపాలాదారులుగా, కర్మలు వ్రాయడానికి నియమింపబడిన దైవదూతలను నమ్మాలి. సత్కార్యాలు దుష్కార్యాల్ని తుడిచివేస్తాయి.
53-ఉసామా బిన్ జైద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి మమ్మల్ని ఒక సైనిక దళంలో పంపారు. మేము (మరునాడు) ఉదయాన్నే ‘జుహైనాకు’ సంబంధించిన ‘హురఖాత్’ తెగపై దాడి చేశాము. నేను ఒక వ్యక్తిని పట్టుకున్నాను. అప్పుడు అతడు “లాఇలాహ ఇల్లల్లాహ్” చదివాడు. నేను ఈటె విసరి అతడ్ని కడతేర్చాను. కాని నాకు మనుస్సులో ఒక ఆవేదన కలిగింది. అందుకే ప్రవక్త ముందు ఈ విషయాన్ని ప్రస్తావించాను. “అతను లాఇలాహ ఇల్లల్లాహ్ అన్నప్పటికీ నీవు అతన్ని నరికావా?” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలదీశారు. ‘అవును. కాని అతడు ఆయుధ భయంతో చదివాడు’ అని నేనన్నాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాధతో “అతని గుండె సయితం చీరి చూడకపోతివి, అతడు మనస్పూర్తిగా అన్నాడా లేదా తెలిసిపోవును” అని అన్నారు. ఈ మాటలు ఆయన మాటి మాటికి అంటూ నన్ను నిలదీశారు. దాంతో నేను (భయపడిపోయి) నేను ఈ రోజే ముస్లిమయి ఉంటే ఎంత బాగుండేది అని నా మనుసులో కోరుకున్నాను. (ముస్లిం 96, బుఖారి 4269).
ఈ హదీసులో:
“లాఇలాహ ఇల్లల్లాహ్” అన్నవారి ప్రాణానికి రక్షణ ఉంది. వారి మిగిలిన విషయాల సంగతి అల్లాహ్ చూసుకుంటాడు. సద్వచనం పఠించిన వ్యక్తిపై ఆయుధం ఎత్తరాదు. ఇహలోకంలో మునాఫిఖు (కపటవిశ్వాసి)తో అవిశ్వాసి మాదిరిగా వ్యవహరించరాదు, అతనితో ఒకప్పుడు ఏదైనా నష్టం వాటిల్లినా సరే. ఎందుకనగా అతను లోలోపల అవిశ్వాసాన్ని దాచి ఉంచినా బాహ్యంగా ఇస్లాం ప్రకారం జీవిస్తున్నట్లు వ్యవహరిస్తున్నాడు గనక. “లాఇలాహ ఇల్లల్లాహ్” సంకల్ప శుద్ధితో పలికినవానికి ప్రళయదినాన లాభం చేకూరుతుంది. యుద్ధమైదానంలో వీరుడు అన్యంపుణ్యం తెలియనివారి రక్తాలు చిందించడం, విశ్వసించిన ప్రజల్ని చంపుట లాంటి విషయాల నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివాడు మనసారా విశ్వసించాడా లేదా పరిశీలించే, అన్వేషించే పని ఏ మనిషిది కాదు. దాన్ని అల్లాహ్ చూసుకుంటాడు.
ఆయనే అల్లాహ్; ఆయన తప్ప ఆరాధ్యుడెవడూ లేడు. దృశ్యాదృశ్య విషయాలన్నీ ఎరిగినవాడు. కరుణామయుడు, కృపాశీలుడు. ఆయనే అల్లాహ్; ఆయన తప్ప ఆరాధ్యుడెవడూ లేడు. ఆయన చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు, సురక్షితం, శాంతి ప్రధాత, సంరక్షకుడు, సర్వాధికుడు, తన ఉత్తర్వులను తిరుగులేని విధంగా అమలు పరచేవాడు, ఎల్లప్పుడూ గొప్పవాడుగానే ఉండేవాడు. ప్రజలు కల్పించే దైవత్వపు భాగస్వామ్యం వర్తించని పరిశుద్ధుడు. అల్లాహ్ సృష్టివ్యూహాన్ని రచించేవాడు, దానిని చక్కగా అమలుపరచేవాడు. ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు. ఆయనకు మంచి పేర్లు ఉన్నాయి. ఆకాశాలలోను, భూమిలోనూ ఉన్న ప్రతి వస్తువూ ఆయనను స్మరిస్తోంది. ఆయన సర్వాధికుడు, వివేకవంతుడూను. (హష్ర్ 59: 22-24).
అల్లాహ్ మంచి పేర్లకు అర్హుడు. ఆయనను మంచి పేర్లతోనే వేడుకోండి. ఆయనను మంచి పేర్లతో పిలిచే విషయంలో సత్యం నుండి వైదొలిగే వారిని వదలిపెట్టండి. వారు తాము చేస్తున్న దానికి ప్రతిఫలం పొంది తీరుతారు[. (ఆరాఫ్ 7: 180).
54-ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అల్లాహ్ కు 99 తొమ్మిది పేర్లున్నాయి. అంటే ఒకటి తక్కువ వంద పేర్లు. ఈ పేర్లను జ్ఞాపకం చేసుకునేవాడు (అంటే ఈ పేర్లను స్మరించేవాడు) స్వర్గానికి వెళ్తాడు. నిశ్చయంగా అల్లాహ్ విత్ర్ (ఏకైకుడు, అద్వితీయుడు). విత్ర్ (బేసి)ని ప్రేమిస్తాడు”. (ముస్లిం 2677, బుఖారి 2736).
ఈ హదీసులో:
ఆయన ఏకత్వములో అద్వితీయుడు. భాగస్వామి లేనివాడు. ప్రేమ అల్లాహ్ గుణాల్లో ఒక గుణం. ఆయన మనుషుల్లో, మాటల్లో, పనుల్లో, స్థలాల్లో, కాలాల్లో కొన్నింటిని ప్రేమిస్తాడు. బేసి సంఖ్యను ప్రేమిస్తాడు. అనేక ధార్మిక పనులు బేసి సంఖ్యలో గలవు. పగలు సమాప్తమవుతుంది బేసి సంఖ్య గల మగ్రిబ్ నమాజుతో. రాత్రి యొక్క చివరి నమాజు విత్ర్ బేసి సంఖ్యంలో ఉంది. కాబా ప్రదక్షిణం, సఫామర్వాల మధ్య పరుగులు (సఈ) ఏడు సార్లు. తస్బీహాత్ 33సార్లు.
55-ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “నిశ్చయంగా సలాం అల్లాహ్ పేర్లలో ఒక పేరు. అది భూమి మీద ఉంచబడింది. మీరు పరస్పరం సలాంను విస్తృతపరచండి”. (అదబుల్ ముఫ్రద్. సహీహ 184).
ఈ హదీసులో:
సలాం అల్లాహ్ పేర్లలో ఒక పేరు. ఆయనకు అనేక పేర్లు గలవు. ఖుర్ఆన్, హదీసులో ప్రస్తావించబడిన విధంగానే ఆయన పేర్లను నమ్మాలి. అల్లాహ్ యొక్క గుణనామముల ప్రభావం ఎలా ఉంటుంది చదివి తెలుసుకోవాలి. ప్రతి పేరుకుగల భావాన్ని బట్టి మనిషి మసలుకోవాలి. ఉదాహరణకు: సలాం, రహ్మాన్, కరీం, హలీం. ముస్లిములు పరస్పరం సలాంను విస్తృతం చేసుకోవాలి. దాని వలన సోదరభావం, ప్రేమ, అప్యాయతలు పెరుగుతాయి. సలాం ఉద్దేశమేమిటంటే విశ్వాసులు పరస్పరం ఒకరికొకరు ఏ నష్టం కలిగించకుండా ఉండాలి. ధర్మం యొక్క ఉద్దేశం కూడా ఇదే. తన నాలుక, చేతుల ద్వారా ఇతర ముస్లిములకు హాని కలగనివ్వనివాడే నిజమైన ముస్లిం.
56-యఅలా బిన్ ఉమయ్య రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఒక వ్యక్తి బహిరంగ ప్రదేశంలో ఏ అడ్డు లేకుండా స్నానం చేసింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు. ఆ తర్వాత (మస్జిదులోకి వచ్చి) మింబర్ (ప్రసంగ పీఠం)పై ఎక్కి, అల్లాహ్ స్తోత్రములు పఠించి, ఇలా బోధించారుః “నిశ్చయంగా అల్లాహ్ “హయియ్య్” మరియు “సిత్తీర్”. అంటే బిడియం గలవాడు మరియు కప్పిఉంచడాన్ని ఇష్టపడువాడు. అందుచేత మీలో ఎవరైనా స్నానం చేయదలచినప్పుడు నాలుగు గోడల మధ్యలో స్నానం చేయాలి”. (అబూ దావూద్ 4012, సహీహుల్ జామి).
ఈ హదీసులో:
“హయియ్య్” (సిగ్గు, బిడియం గలవాడు), “సిత్తీర్” (కప్పిఉంచేవాడు) అల్లాహ్ పేర్లలో రెండు పేర్లు. చదవండి అల్లాహ్ ఆదేశం:
దోమ, లేక దానికంటే మరీ అల్పమైన వస్తువును దృష్టాంతంగా చెప్పటానికి అల్లాహ్ ఎంత మాత్రం సిగ్గుపడడు. (బఖర 2: 26).
అల్లాహ్ బిడియం గలవాడు. కాని అది ఆయన గౌరవానికి తగినట్లు, మానవులకు ఉన్నట్లు కాదు.
ప్రతి ముస్లిం స్నానం చేయునప్పుడు, మలమూత్ర విసర్జన చేయునప్పుడు ప్రజల చూపులకు దూరంగా వెళ్ళాలి. లేదా నాలుగు గోడల మధ్యలో ఆ అవసరాన్ని తీర్చుకోవాలి. సిగ్గుపడుటు విశ్వాసుల గుణం. అది విశ్వాస భాగాల్లో ఒకటి. సిగ్గు సర్వ మేళ్ళను సమకూరుస్తుంది.
57-ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “నిశ్చయంగా అల్లాహ్ బిడియం గలవాడు, దాతృత్వుడు. ఒక వ్యక్తి తన రెండు చేతులు ఎత్తి (ఏదైనా అడిగినప్పుడు) ఆ రెండు చేతులను ఏమీ ప్రసాదించకుండా త్రిప్పడాన్ని అల్లాహ్ ఇష్టపడడు”. (తిర్మిజి 3556. సహీహుల్ జామి).
ఈ హదీసులో:
అల్లాహ్ “హయా” (సిగ్గు), “కర్మ్” (దయ, దాతృత) గుణాలు గలవాడు. కాని ఆయనకు తగినరీతిలో. మానవుల గుణాల మాదిరిగా కాదు. ఎందుకనగా అల్లాహ్ గుణాలు మానవ గుణాల్లాంటివి ఎంత మాత్రం కావు. దుఆ పద్దతుల్లో ఒకటి దుఆ సందర్భంలో చేతులు ఎత్తడం. దుఆ చేస్తూ ఉండడం ఎంత శుభప్రదమో తెలుస్తుంది. ఎప్పుడూ అల్లాహ్ దయ పట్ల నిరాశ చెందవద్దు. ఆయన దయ, దాతృతము చాలా విశాలమైనది అంతటిని ఆవరించి ఉంది.
58- అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయి. ఈ విషయం గురించి ప్రజలు, ‘దైవప్రవక్తా! (ధరలు చాలా పెరిగిపోయాయి) తమరు మా కొరకు ధరలు నిర్ధారించండి’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారుః “నిశ్చయంగా అల్లాహ్ యే సృష్టికర్త, పరిమితంగా ఇచ్చేవాడు, పుష్కలంగా ఇచ్చేవాడు, జీవనోపాధి ప్రసాదించేవాడు మరియు ధరలు నిర్ధారించేవాడు. మీలో ఏ ఒక్కరూ రక్తం మరియు ఆస్తి విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ నాపై నిందమోపని స్థితిలో నేను సర్వోన్నతుడైన అల్లాహ్ ను కలుసుకోగోరుతున్నాను”. (అబూ దావూద్ 3451, తిర్మిజి 1314, ఇబ్నుమాజ 2200).
ఈ హదీసులో:
ఈ హదీసులో వచ్చిన అల్లాహ్ యొక్క గుణాలను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లు నమ్మాలి. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సృష్టిలోకెల్లా అందరికంటే ఎక్కువగా అల్లాహ్ గురించి తెలిసినవారు. ప్రజలకు వారి ఆస్తిలో అన్యాయం చేయుట, వారికి నష్టపరచుట నుండి హెచ్చరించబడింది. వ్యాపారస్తుల లాభాలు, ధరల నిర్థారణలు సాంప్రదాయ ప్రకారంగా ఉండి, వారు ఏలాంటి స్పష్టమైన మోసాలు చేయనప్పుడు వారిని ఇబ్బందులకు గురి చేయడం నుండి దూరముండాలని తాకీదు చేయబడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పట్ల ఎంత భయభీతిగలవారో, ప్రజల కొరకు ఏ విధంగా న్యాయం కోరేవారో తెలిసింది.
59-హానీ బిన్ యజీద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ఆయన ఒకసారి తమ తెగవారితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చారు. అప్పుడు ఆయన తమ విశేషనామము (Surname) ‘అబుల్ హకం’తో పిలువబడేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ఇలా ఉపదేశించారు: “నిశ్చయంగా హకం అల్లాహ్ మాత్రమే. హుకుం (ఆజ్ఞ, ఆదేశం, తీర్పు) కూడా ఆయనది మాత్రమే చెల్లుతుంది. సరే! నీ విశేషనామం ‘అబుల్ హకం’ అని ఎలా పడింది?” అని అడిగారు. అందుకు ఆయన ఇలా చెప్పారుః ‘నా తెగవారు విభేదాల్లో పడినప్పుడు నా వద్దకు వచ్చేవారు. నేను వారి మధ్య తీర్పు చేసేవాడ్ని. ఇరువర్గాలు నాతీర్పుతో తృప్తి పడేవి’. “ఇది చాలా మంచి విషయమే. నీకేమైనా సంతానం ఉందా?” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు. ‘షురైహ్, ముస్లిం, అబ్దుల్లాహ్’ అని ఆయన చెప్పారు. “వారిలో పెద్ద ఎవరు?” అని ప్రవక్త అడిగారు. ‘షురైహ్’ అని ఆయన చెప్పారు. “అయితే నీవు ఈ నాటి నుండి అబూ షురైహ్” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. (అబూ దావూద్ 4955, నిసాయి 5292).
ఈ హదీసులో:
హుకుం, అల్లాహ్ గుణం. అందరి హకంలోకెల్లా గొప్ప హకం అల్లాహ్ మాత్రమే. అల్లాహ్ ఆదేశం చదవండిః ]అల్లాహ్ పై నమ్మకం గలవారి దృష్టిలో అల్లాహ్ కంటే మంచి తీర్పు చెయ్యగలవాడెవడు?[. (5: 50). అల్లాహ్ తన మాటల్లో, పనుల్లో, తీర్పుల్లో, కర్మ నిర్ణయాల్లో న్యాయంగా తీర్పు చేయువాడు. సర్వ వ్యవహారాలు చేరుకునేది ఆయన వద్దకే. చివరి తీర్పు (అంతిమ జడ్జిమెంట్) ఆయన వద్దే జరుగుతుంది. ప్రళయదినాన ప్రజల మధ్య తీర్పు ఇచ్చువాడు ఆయన మాత్రమే. అప్పుడు ఆయన బాధితునికి బాధించినవాని నుండి న్యాయం కచ్చితంగా ఇప్పిస్తాడు. రవ్వంత అన్యాయం లేకుండా, ఎవరి ఇసుమంత పుణ్యం వృధాపోకుండా ప్రజల లెక్క తీసుకుంటాడు. ఆయన వచనాలు సత్యమైనవి. ఆదేశాలు న్యాయంతో కూడినవి. ]సత్యం రీత్యా, న్యాయం రీత్యా నీ ప్రభువు వాక్కు పరిపూర్ణమైనది[. (6: 115). ఒక దుఆలో ఈ పదాలు వచ్చాయిః (వబిక ఖాసమ్తు వఇలైక హాకమ్తు) అంటే; నా సర్వ వ్యవహారాలు నీ ముందే ఉంచుతున్నాను. న్యాయ తీర్పు కొరకై నీవైపే వస్తున్నాను. న్యాయంగా తీర్పు చేసేవాడు అల్లాహ్, చాలా పరిశుద్ధుడు. ఆయన తీర్పు, నిర్ణయాలను పునఃపరిశీలించగలిగే వాడెవడూ లేడు. ఆయన వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
నోట్: హుక్మ్ అనగా ఆదేశం లేదా తీర్పు. హకం అనగా ఆదేశించువాడు లేదా తీర్పునిచ్చువాడు.
60- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని నవాస్ బిన్ సమ్ఆన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “ప్రళయదినాన త్రాసు రహ్మాన్ చేతిలో ఉంటుంది. ఆయన దాని ద్వారా కొందరికి ఉన్నత స్థానం ప్రసాదిస్తే మరి కొందరిని పతనానికి గురిచేస్తాడు”. (ఇబ్ను మాజ 199. సహీహుల్ జామి 5747).
ఈ హదీసులో:
అల్లాహ్ యొక్క చేయి మరియు త్రాసు విషయం ఖుర్ఆన్, హదీసులో వచ్చిన రీతిలో నమ్మాలి. అల్లాహ్ చేతిని మానవుల చేతులతో పోల్చవద్దు. అబద్ధాలు పలికే, నిందలు మోపేవారి చేష్టలకు అల్లాహ్ అతీతుడు, ఉన్నతుడు. ఉన్నత స్థానం ప్రసాదించడం, పతనానికి గురి చేయడం అల్లాహ్ తరఫున జరుగుతుంది. అల్లాహ్ ఎవరికి ఉన్నతం ప్రసాదించాలనుకుంటాడో అతడ్ని ప్రజలు ఛీ అని దూరము చేసినా, అల్లాహ్ వాస్తవ రూపంలో అతనికి ఉన్నతం ప్రసాదిస్తాడు. ఎవరిని పతనానికి గురిచేయాలనుకుంటాడో, ప్రజలందరూ కలసి అతన్ని పైకి లేపినా, అల్లాహ్ అతడ్ని పతనానికి గురి చేసే తీరుతాడు.
61-ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “అల్లాహ్ చేయి (సకల విధాల సిరిసంపదలతో) నిండుగా ఉంది. దాన్ని రేయింబవళ్ళు నిర్విరామంగా ఖర్చు చేసినా తరగదు. అల్లాహ్ భూమ్యాకాశాలను సృష్టించినప్పటి నుండి ఎంత ఖర్చు చేశాడో మీరెప్పుడైనా ఆలోచించా- రా? ఇంత ఖర్చు చేసినా ఆయన చేతిలో ఉన్న నిధి నిక్షేపాలలో రవ్వంత కూడా తగ్గలేదు. ఆయన సింహాసనం నీళ్ళ మీద ఉంది. ఆయన మరో చేతిలో త్రాసు ఉంది. ఆయన తలచుకుంటే ఎవరినైనా ఉచ్ఛస్థాయికి తీసుకు రాగలడు అలాగే ఎవరినైనా అధోగతిపాలు చేయగలడు”. (బుఖారి 7419, ముస్లిం 993).
ఈ హదీసులో:
అల్లాహ్ కు రెండు చేతులన్నాయని, అవి ఆయనకు తగిన రీతిలో ఉన్నాయని నమ్మాలి. ఏ మాత్రం ‘తహ్ రీఫ్’, ‘తఅతీల్’, ‘తక్ యీఫ్’, ‘తమ్ సీల్’([4]) లేకుండా నమ్మాలి. అవి రెండూ కుడి చేతులే. వాటిలో అంతంకాని మేళ్ళున్నాయి. ఈ హదీసులో పరమపవిత్రుని అపార దాన గుణం, మహాదయాదాక్షిణ్యాల ప్రస్తావన ఉంది. ఆయన నిధి నిక్షేపాలు ఎల్లప్పుడూ నిండే ఉన్నాయి. ఎప్పుడూ అంతం కావు. ఆయన సింహాసనం నీళ్ళపై ఉందని నమ్మాలి. కర్మ, అదృష్టం, సత్కార్యాలు, దుష్కార్యాల త్రాసు ఆయన వద్ద ఉంది. ఆయన తాను కోరిన జాతులను, దాసులను ఉచ్ఛస్థాయికి తీసుకువెళ్తాడు. కోరినవారిని అధోగతిపాలు చేస్తాడు. ఉన్నతానికి చేర్చుట, అధోగతిపాలు చేయుట మరియు పట్టుకొనుట ఇవన్నీ అల్లాహ్ పనుల్లో లెక్కించ బడుతాయి. అల్లాహ్ ఆదేశం:
62- “నరకవాసులు నరకంలో వేయబడుతూ ఉంటారు, నరకం “ఇంకేమయినా ఉంటే తెచ్చి పడేయండి” అని అంటుంది. చివరికి సర్వలోకాల ప్రభువు తన కాలును దాని మీద పెడతాడు. నరకం తనంతటతానే సంకోచించి పోతుంది. ఇంకా ఇలా అంటుందిః “నీ గౌరవప్రతిష్ఠల సాక్ష్యం! చాలు, చాలు”. స్వర్గంలో స్థలం ఎల్లప్పుడూ ఖాళీగానే ఉంటుంది. అల్లాహ్ దాని కొరకు కొత్తగా కొందరిని సృష్టిస్తాడు. ఆ ఖాళీ స్థలంలో వారిని నివసింపజేస్తాడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (బుఖారి 7384, ముస్లిం 1185).
ఈ హదీసులో:
అల్లాహ్ కు కాలు ఉన్నదని తెలిసింది. అది ఆయనకు తగినట్లుగా ఉంటుంది, మానవుల కాళ్ళతో పోల్చరాదు.
ఆయనను పోలినది ఏదీ లేదు. ఆయన వినేవాడు. చూసేవాడు[. (42: 11).
ఈ హదీసులో ఆ పరమపవిత్రుని ఔన్నత్యం, ప్రాబల్యం తెలుపబడింది. ఆయన పట్టు చాలా పఠిష్టంగా ఉంటుంది. అల్లాహ్ అనుమతితో నరకం మాట్లాడుతుంది. అల్లాహ్ యొక్క కారుణ్యం ఆయన కోపంపై గెలుపొందింది. అందుకే నరకంలో ఎక్కువ అయినవారిని కూడా తీశాడు. స్వర్గంలో ఖాళీ స్థలం ఉన్నందుకు మరి కొందర్ని సృష్టించాడు. ఇందులో నరకం ఎంత భయంకర స్థలమో తెలిసింది. అల్లాహ్ మనల్ని దాని నుండి కాపాడుగాక! ఆమీన్! అల్లాహ్ గుణనామముల గురించి మరియు అగోచర విషయాల గురించి వచ్చిన హదీసులను ప్రవక్త సహచరులు విని విశ్వసించారు. వాటిని తు.చ. తప్పకుండా నమ్మారు. వాటిని సత్యం అని తృప్తి చెందారు. వాటి ప్రకారం ఆచరించారు. వాటిని తిరస్కరించలేదు. వాటి పోలిక ఇతరులతో ఉంది అని చెప్పలేదు.
63-ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారని అదీ బిన్ హాతిం రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అతి త్వరలోనే అల్లాహ్ ప్రళయదినాన మీలోని ప్రతి వ్యక్తితో ప్రత్యక్షంగా మాట్లాడతాడు. ఆ రోజు అల్లాహ్ కు, దాసునికి మధ్య ఎలాంటి అనువాదకుడు ఉండడు. దాసుడు తన కుడి వైపు చూస్తాడు. అక్కడ తను ఆచరించిన కర్మలు తప్ప మరేమీ కనబడదు. ఎడమ వైపు చూస్తాడు. అక్కడా తాను ముందుకు పంపుకున్న కర్మలు తప్ప మరేది చూడడు. తన ముందు చూస్తాడు. అచ్చట అతన్ని ఆహ్వానిస్తున్నటువంటి అగ్ని కన్పిస్తుంది. అందువల్ల మీలో ఎవరైనా ఓ ఖర్జూరపు ముక్కయినా సరే దానం చేసి తననుతాను నరకం నుండి కాపాడుకో గలిగితే కాపాడుకోవాలి”. (బుఖారి 7512, ముస్లిం 1016).
ఈ హదీసులో:
అల్లాహ్ మాట్లాడుతాడు. అది ఆయన గౌరవానికి తగినట్లు. ప్రళయదినాన తన దాసునితో అనువాదకుని సహాయం లేకుండా మాట్లాడుతాడు. తీర్పుదినాన నరకం మానవుని ముందుకు తీసుకురాబడుతుంది. ఆనాటి కఠినమైన శిక్ష నుండి తప్పించుకునే ఒక గొప్ప మార్గం అపారంగా దానధర్మాలు చేయడం. మనిషి ఏ చిన్న సత్కార్యాన్ని కూడా విలువలేనిదని భావించవద్దు. సత్కార్యాలు మనిషి మోక్షానికి గొప్ప సబబు అవుతాయి.
64-ఆయిష రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం: ఒకసారి నేను ‘ప్రవక్తా! నేను లైలతుల్ ఖద్ర్ ను పొందిన యడల ఏ దుఆ చదవాలి?’ అని అడిగాను. అందుకు ఆయన “అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వ, ఫఅఫు అన్నీ” చదవమని చెప్పారు. అంటే ఓ అల్లాహ్ నీవు అమితంగా మన్నించువానివి. మన్నింపు గుణాన్ని ప్రేమించువానివి. నన్ను మన్నించుము.
ఈ హదీసులో:
మన్నించుట, ప్రేమించుట ఇవి రెండు అల్లాహ్ గుణాలని, అవి ఆయనకు తగిన రీతిలో ఉన్నాయని నమ్మాలి. ప్రజలతో మన్నింపు వైఖరి అవలంభించువారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. అల్లాహ్ ఇష్టపడే సద్గుణాలను మనిషి అవలంబించే ప్రయత్నం చేయాలి. మనిషి ఆచరణకు తగినట్లు ఫలితం ఉండును. ప్రజల్ని మన్నించినవాడిని అల్లాహ్ మన్నిస్తాడు. అల్లాహ్ మన్నింపు పొందుటకు మనిషి చాలా కాంక్షించాలి. అల్లాహ్ తన తప్పిదాలను క్షమించి, పాపాల ప్రక్షాళనం చేయాలని ఆయన్ని వేడుకోవాలి.
65- “ప్రళయదినాన మన ప్రభువు నవ్వుకుంటూ మనముందు ప్రత్యక్షమవుతాడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (సహీహుల్ జామి 8018).
ఈ హదీసులో:
ఈ హదీసులో తెలుపబడిన అల్లాహ్ యొక్క రెండు గుణాలను ఆయనకు తగినరీతిలో నమ్మాలి. ఒకటి: ప్రత్యక్షమగుట. రెండవది: నవ్వుట. పుణ్యాత్ములకు ఇది అల్లాహ్ యొక్క గొప్ప వరం. అల్లాహ్ వారి ముందు ప్రళయదినాన ప్రత్యక్షమవుతాడు. వారు అల్లాహ్ ను చూస్తారు. వారిని చూసి అల్లాహ్ నవ్వుతాడు. అవిశ్వాసులు అల్లాహ్ ను చూడలేరు. (అల్లాహ్ మనందరికీ తన దర్శన భాగ్యం ప్రసాదించుగాక! ఆమీన్!!).
66- “అల్లాహ్ ఇద్దరు మనుషులను చూసి (సంతోషంతో) నవ్వుతాడు. వారిలో ఒకడు మరొకడ్ని వధిస్తాడు. అయినప్పటికీ ఇద్దరూ స్వర్గానికి వెళ్తారు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లఖించారు. (బుఖారి 2826, ముస్లిం 1890).
ఈ హదీసులో:
నవ్వుట అల్లాహ్ గుణం అని, అది అల్లాహ్ కు తగినరీతిలో ఉంటుందని నమ్మాలి. ప్రవక్త సహచరులు విశ్వసించారు. ఎలా? ఎందుకు? అని వాదించలేదు. దానికి తప్పుడు భావాలు వెతకలేదు. అల్లాహ్ నవ్వు మానవుల నవ్వు లాంటిది కాదు. ]ఆయనను పోలినది ఏదీ లేదు. ఆయన వినువాడు, అన్నీ చూచువాడు[. (42: 11).
ఈ హదీసులో అల్లాహ్ యొక్క విశాలమైన కరుణ, తౌబా చేయువానిని మన్నిస్తాడన్న శుభవార్త ఉంది. హంతకుడు సయితం తౌబా చేసి, సత్కార్యాలు చేసినచో అల్లాహ్ అతని తౌబాను స్వీకరిస్తాడు. అతన్ని క్షమించి స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు.
67- “సంకెళ్ళలో బంధింపబడి స్వర్గంలో పంపబడేవారిని చూసి మన ప్రభువు ఆశ్చర్యపోయాడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా తాను విన్నట్లు అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (అబూ దావూద్ 2677, బుఖారి 3010).
ఈ హదీసులో:
ఆశ్చర్యం పడుట కూడా అల్లాహ్ గుణం అని అది ఆయనకు తగినరీతిలో ఉంటుందని నమ్మాలి. మానవుల్లో ఉండే ఆశ్చర్య గుణం రీతిలో ఉంటుందని భావించనూ వద్దు. ]ఆయనను పోలినది ఏదీ లేదు. ఆయన వినువాడు, అన్నీ చూచువాడు[. (42: 11). మనిషి తన అల్ప దృష్టి, ఆలోచన వలన ఇతరుల సలహా, అభిప్రాయం లేనిది స్వయంగా మంచిని ఎన్నుకోలేడు. సత్యం స్వీకరించమని, దుష్కార్యం త్యజించమని ఒక వ్యక్తికి మాటిమాటికి చెప్పడం వల్ల అతనికి ప్రయోజనం కలుగవచ్చు. అతని వల్ల బోధకునికి ఏదైనా బాధ కలిగినా సరే. ఎంతైనా మనస్సు చెడుకై ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇందులో సద్గుణసంపన్నుడైన మిత్రుడు, సద్బోధచేసే స్నేహితుడు మరియు పుణ్యకార్యాల్లో సహాయపడేవారి ఘనత ఉంది. అల్లాహ్ ఆదేశం:
కొందరు సత్కార్యాలు చేయుటకు బలవంతము చేయబడుతారు. అలా వారి మనస్సు మెత్తబడి ఆ పని చేస్తారు. స్వర్గం మనస్సుకు రుచించని విషయాలతో కప్పబడి ఉంది. సత్కార్యం మొదటిసారి చేసినప్పుడు మనస్సుకు భారం ఏర్పడుతుంది. ప్రజలు సత్యం స్వీకరించి, నరకం నుండి రక్షణ పొందుటకు, వారిపై కొంచెం బలవంతం చేయవచ్చును. వారు తమ ఇష్టంతో చెడును ఎన్నుకుంటే, వారి ఇష్టం వారిది అని మౌనం వహించరాదు. ఆ చెడు నుండి వారిని ఆపాలి. ఈ హదీసులో ప్రవక్త అనుచర సంఘం ఘనత తెలుపబడింది. వారు స్వర్గంలో చేరడానికి పరస్పరం సహాయపడతారు.
68-అబ్దుల్లాహ్ బిన్ షిఖ్ఖీర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, ‘మీరు ఖురైషుల సయ్యిద్’ అని అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “సయ్యిద్ అల్లాహ్ మాత్రమే” అని చెప్పారు. అయితే ‘మాట రీత్యా మీరు ఖురైషులో అందరికన్నా ఎక్కువ ఘనతగలవారు. వారిలో ఎక్కువ గౌరవ, మర్యాదలు గలవారు’ అని ఆ వ్యక్తి చెప్పాడు. అప్పుడు ప్రవక్త చెప్పారుః “మీలో ఎవరైనా ఈ వ్యక్తి చెప్పినటువంటి మాట చెప్పవచ్చు. కాని అతడ్ని షైతాన్ తన వలలో చిక్కించకుండా జాగ్రత్త పడాలి”. (అహ్మద్. సహీహుల్ జామి 3700).
ఈ హదీసులో:
‘సయ్యిద్’ అను పదం సామాన్యంగా అల్లాహ్ కొరకే ఉపయోగ పడుతుంది. నాయకత్వం, గౌరవంలో అగ్రస్థానం గలవాడు. దాతృత్వములో హద్దులు అధిగమించినవాడు, ఎవరి అమితమైన దయ అందరికి ఆవరించి ఉందో, ఎవని భయం అందరికి ఉందో అతడు ‘సయ్యిద్’. ఇలాంటి గుణాలన్నియూ అల్లాహ్ తప్ప ఎవరికి లేవు. మానవుడు ‘సయ్యిద్’ అని అనబడతాడు. కాని అతనికి ఇలాంటి గుణాలు లేవు, ఉండవు.
69- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా తాను విన్నట్లు బనీ ఘిఫార్ లోని ఒక షేఖ్ ఉల్లేఖించారు: “అల్లాహ్ మేఘాన్ని సృష్టించాడు. అది చక్కగా మాట్లాడుతుంది. అందంగా నవ్వుతుంది”. (అహ్మద్. సహీహుల్ జామి)
ఈ హదీసులో:
ఈ హదీసులో తెలుపబడిన విషయాల్ని ఎలా తెలుపబడ్డాయో అలాగే నమ్మాలి. ఏలాంటి సందేహం, అనుమానాలకు గురి కాకూడదు. మేఘాన్ని సృష్టించడం, అది మాట్లాడడం, నవ్వడం అల్లాహ్ శక్తి మరియు ఆయన సంపూర్ణ వివేచనకు సూచనాలు. ‘ఉరుము’ మేఘాల మాట, ‘మెరుపు’ దాని నవ్వు అని కొందరన్నారు. మేఘాల ప్రస్తావన ఖుర్ఆనులో ఇలా ఉందిః ]ఆయనే నీళ్ళతో బరువెక్కిన మేఘాలను సృష్టిస్తాడు. ఉరుము (మేఘాల గర్జన) ఆయనను స్తోత్రం చేస్తూ ఆయన పవిత్రతను కొనియాడుతొంది. దైవదూతలు ఆయన భయం వల్ల వణికిపోతూ ఆయనను కీర్తిస్తూ ఉంటారు. ఆయన ఫెళఫెళమనే పిడుగులను పంపుతాడు. (తరచుగా) వాటిని తాను కోరినవారిపై పడవేస్తాడు. అయినా వీరు అల్లాహ్ ను గురించి ఘర్షణపడుతున్నారు. వాస్తవంగా ఆయన యుక్తి అతిశక్తివంతమైనది[. (13: 12,13).
70-ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారని ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారుః “లుఖ్మాన్ హకీం ఇలా చెప్పేవారుః అల్లాహ్ కు ఏదైనా అప్పగించినచో అల్లాహ్ దాన్ని కాపాడుతాడు”. (అహ్మద్. సహీహుల్ జామి).
ఈ హదీసులో:
అల్లాహ్ గుణాల్లో ఒకటి కాపాడుట కూడా. మనిషి చేసే ప్రతి దానిని అల్లాహ్ భద్రపరుచుతాడు. అందుకు మానవుడు తన ధర్మం, అప్పగింత మరియు ఆచరణల ముగింపును అల్లాహ్ కు అప్పగించాలి. ప్రయాణికుడ్ని సాగనంపేటప్పుడు చదవవలసిన దుఆ సహీ హదీసులో ఇలా ఉందిః “అస్తౌదిఉల్లాహ దీనక వ అమానతక వ ఖవాతీమ ఆమాలిక”. (భావం: నేను నీ ధర్మం, అప్పగింత మరియు నీ ఆచరణల ముగింపును అల్లాహ్ కు అప్పగిస్తున్నాను). అల్లాహ్ కు సర్వమూ తెలుసు. ఏ చిన్న విషయం కూడా ఆయనకు దాగిలేదు. అల్లాహ్ ఆదేశం ఇలా ఉందిః ]నీవు నీ మాటను బిగ్గరగా పలికినా పరవాలేదు. ఆయన మెల్లగా పలికిన మాటను మాత్రమే కాదు, దానికంటే అతి గోప్యమైన మాటను సైతమూ ఎరుగును[.(20: 7).
71-ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు మరియు అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “గౌరవం అల్లాహ్ వస్త్రం, అహంకారం ఆయన దుప్పటి”. (అల్లాహ్ ఇలా చెప్పాడుః) “ఈ రెండిట్లో ఏ ఒకదానిలోనైనా నాతో గొడవకు దిగినవాడిని నేను శిక్షిస్తాను”. (ముస్లిం 2620).
ఈ హదీసులో:
అన్ని రకాల గౌరవం, అధికారం మరియు గొప్పతనం, అహంకారం అల్లాహ్ కే తగునని రుజువవుతుంది. ఈ రెండు గుణాల్లో మానవుడు తన ప్రభువుతో పోరాటానికి (పోటికి) దిగవద్దు. అవి ఆయనకు ప్రత్యేకమైనవి. అల్లాహ్ ఎల్లవేళల్లో సర్వాధికారం, ప్రాబల్యం గలవాడయి, పరాజితుడు కానివాడయి ఉండుట ఆయన రుబూబియత్, ఉలూహియత్ యొక్క హక్కు. మానవుడు ఈ రెండిట్లో ఏ ఒక్క గుణం అయినా అతనిలో ఉందన్న భావనలో పడితే అల్లాహ్ తో ఆయన గుణగణాల్లో పోటిపడినట్లే, అల్లాహ్ గొప్పతనంలో భాగస్వామ్య వాదన చేసినట్లే. అందుచేత తన యజమాని ఎదుట వినయ వినమ్రత చూపి, తల వొగ్గి ఉండుట దాసునిపై తప్పనిసరి. ఈ దాస్యత్వ, వినయవినమ్రత గుణమే తన దాసుల్లో ఉండాలని అల్లాహ్ కోరాడు. దానిని విధిగా చేశాడు. అహంకారభావానికి గురి అయ్యేవారికి తప్పనిసరిగా శిక్షిస్తానని హెచ్చరించాడు.
72-ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “కష్టం కలిగించే మాటలు విని సహనం వహించడంలో అల్లాహ్కు మించిన వాడెవడూ లేడు. మానవులు ఇతరులను ఆయనకు సాటి కల్పిస్తారు. ఆయనకు సంతానం ఉందని ఆరోపిస్తారు. అయినా అల్లాహ్ వారిని వెంటనే శిక్షించకుండా వారికి ఉపాధినిస్తాడు, అనుగ్రహాలు ప్రసాదిస్తాడు”. (ముస్లిం 2804, బుఖారి 6099).
ఈ హదీసులో:
అల్లాహ్ వహించే సహనం ఆయన గౌరవానికి తగినట్లుంది. మానవుల్లాంటి సహనం కాదు. అల్లాహ్ శక్తిసంపన్నుడు, కఠినంగా శిక్షించువాడయినప్పటికీ, తన దాసుల పట్ల నిగ్రహం చూపుతున్నాడు. ఎందుకనగా ఆయన కరుణ, ఆయన కోపంపై ఆధిక్యత పొందింది. పాపాల్లో అతిఘోరమైనది అల్లాహ్ కు సాటి కల్పించుట. ఆయనకు భార్యా, సంతానాలున్నాయని భావించుట. అల్లాహ్ అవిశ్వాసుడ్ని, అతను అవిశ్వాసుడైనప్పటికీ దయ చూపి, ఇహలోకంలో ఉపాధినిస్తున్నాడు. శిక్షించకుండా వ్యవధినిస్తున్నాడు. పరలోకంలో సంపూర్ణ శిక్ష ఇస్తాడు. ఈ హదీసులో అల్లాహ్ తన దాసుల మాటను వినువాడు అని రుజువవుతుంది. వినడంలో ఆయనకు పోలినవాడెవడు లేడు. ]ఆయనకు పోలినది ఏదీ లేదు. ఆయన వినువాడు, చూచువాడు[.
73-ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారని అబూ ములైహ్ తండ్రి ఉల్లేఖించారుః “అల్లాహ్ కు ఎవరూ సాటి లేరు”. (అబూ దావూద్ 3933. సహీహుల్ జామి).
ఈ హదీసులో:
ప్రవక్తలు మరియు ఆకాశ గ్రంథాలు హెచ్చరించిన దాని సారంశమే పై హదీస్. అంటే అల్లాహ్ ఒక్కడే, అద్వితీయుడు. ఆయనకు సాటి లేడు. “లాఇలాహ ఇల్లల్లాహ్” అర్థమే ఇది. ఆరాధనలకు అర్హుడు ఆయనే. ఉలూహియతులో అద్వితీయుడు ఆయనే. రుబూబియతులో అద్వితీయుడు ఆయనే. తన గుణగణాల్లో, నామ స్వరూపాల్లో అన్ని రకాల లోటుపాట్లకు అతీతుడు ఆయనే.
74-అల్లాహ్ ఇలా సెలవిచ్చాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలుపుతున్నట్లు అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మానవుడు నన్ను తిరస్కరించాడు, అది అతనికి తగదు. నన్ను దూషించాడు, అదీ అతనికి తగదు. నేను అతన్ని తిరిగి జీవింపజేయలేనని భావించుట నన్ను తిరస్కరించినట్లు. నాకు సంతానం ఉందని భావించుట నన్ను దూషించినట్లు. నేను పరిశుద్ధుణ్ణి. భార్య సంతానాల అవసరం నాకు ఎంత మాత్రం లేదు. (బుఖారి 4482).
ఈ హదీసులో:
తన దాసులపై అల్లాహ్ కారుణ్యం, సహనం అపారమైనవి. కష్టం కలిగించే మాటలు విని సహించువారిలో అల్లాహ్ కు మించినవారు ఎవరూ లేరు. అల్లాహ్ కు భార్య, సంతానం లేరు. ఆయన ఏకైకుడు, అద్వితీయుడు, ఏ అవసరం లేనివాడు, ఎవరినీ కనలేదు, ఎవరికీ పుట్టలేదు, ఆయనకు సమానుడు, సాటిగలవాడు లేడు. విశ్వాసి, మానవుల నుండి కలిగే కష్టాలపై సహనం వహించాలి. సృష్టికర్త, పోషణకర్త అయిన మహోన్నతుడు, మహోపకారి, దూషణలకు గురి అవుతున్నప్పుడు అశక్తుడు, లోపభూయిష్టుడైన మానవుని మాటేమిటి?
75-ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా మధ్య నిలబడి ఐదు విషయాలు తెలిపారని అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “నిస్సందేహంగా అల్లాహ్ నిద్రపోడు. నిద్రపోవుట ఆయనకు తగదు. (త్రాసు ఆయన చేతులో ఉంది.) ఆయనే దాన్ని పైకి లేపుతాడు. క్రిందికి దించుతాడు. రాత్రి ఆచరణలు పగటి ఆచరణల కంటే ముందు ఆయన వైపుకు లేపబడతాయి. పగటి ఆచరణలు రాత్రి ఆచరణలకంటే ముందు ఆయన వైపుకు లేపబడతాయి. ఆయన తెరలు కాంతివంతమైనవి. ఆయన దాన్ని తెరచాడంటే ఆయన చూపు ఎంత వరకు వెళ్తుందో అంత దూరం వరకు ఆయన పవిత్ర ముఖ ప్రజ్వల కాంతులు కాల్చేస్తాయి”. (ముస్లిం 179).
ఈ హదీసులో:
విశ్వ వ్యవస్థకు సంపూర్ణ ఆధారము అల్లాహ్ యే. ఆ నిత్యుడు, సజీవుడు సృష్టికి మూలాధారుడైన అల్లాహ్! నిదురపోడు, ఆయనకు కునుకురాదు. నిద్ర ఒక లోపం. అల్లాహ్ ఈ లోపానికి అతీతుడు. కాంతుల తెరలున్నవని దీని ద్వారా రుజువవుతుంది. త్రాసులు ఆయన వద్ద ఉన్నాయి. కోరిన వారికి వృద్ధి పరుస్తాడు. కోరిన వారికి తగ్గిస్తాడు. ప్రతి రాత్రి మరియు పగల్లో ఆచరణలు ఆయన వద్దకు లేపబడతాయి (చేరుతాయి). ప్రతి దానికి రక్షకుడు ఆయనే. ]యధార్థమేమిటంటే ఆకాశాలను, భూమిని (తమ స్థానాల నుండి) తొలిగిపోకుండా ఆపి ఉంచినవాడు అల్లాహ్ యే. ఒకవేళ అవి తొలగిపోతే, అల్లాహ్ తరువాత వాటిని నిలిపి ఉంచేవాడు మరొకడెవడూ లేడు. నిస్సందేహంగా అల్లాహ్ సహనశీలుడు, క్షమించేవాడు[. (35: 41). అల్లాహ్ స్వయంగా తన గురించి మరియు ప్రవక్త అల్లాహ్ గురించి తెలిపిన గుణగణాలను తు.చ. తప్పకుండా ఏ మాత్రం ‘తహ్ రీఫ్’, ‘తఅతీల్’, ‘తక్ యీఫ్’, ‘తమ్ సీల్ లేకుండా నమ్మాలి.
76-ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “నేను జిబ్రీల్ ను చూశాను. ఆయనకు ఆరు వందల రెక్కలున్నాయి”. (బుఖారి 3232, ముస్లిం 174). అహ్మద్ లో ఈ విషయం అదనంగా ఉందిః “ఆయన అందమైన రెక్కల నుండి ముత్యాలు, పగడాలు రాలుతుంటాయి”. (దీని సనద్ మంచిది, బలమైనదని ఇబ్ను కసీర్ చెప్పారు).
ఈ హదీసులో:
జిబ్రీల్ అలైహిస్సలాంకు ఎక్కువ రెక్కలు ఉండడం అల్లాహ్ సూచనల్లో ఒక సూచన. బహుశా జిబ్రిల్ ను అల్లాహ్ పుట్టించింది ఇదే రూపంలో కావచ్చు. ఖుర్ఆనులో ఉందిః ఆయన దైవదూతలను సందేశహరులుగా నియమిస్తాడు. వారికి రెండేసి, మూడేసి, నాలుగేసి రెక్కలు ఉంటాయి. జిబ్రీల్ ఘనత ఇతర దూతల కంటే ఎక్కువ ఉంది. కనుక అతనికి రెక్కలు కూడా అధిక సంఖ్యలో ఉండవచ్చు.
77-ఆయిష రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం: ‘ప్రవక్తా! మీపై వహీ (దైవవాణి) ఎలా వస్తుంది’? అని హారిస్ బిన్ హిషాం రజియల్లాహు అన్హు అడిగారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు: “వహీ అవతరించినప్పుడు ఒక్కోసారి అది నాకు గంట మోతలా విన్పిస్తుంది. ఈ పరిస్థితి నాకు చాలా కష్టతరంగా ఉంటుంది. ఆ పరిస్థితి తొలిగి పోగానే నాకు చెప్పబడిన విషయాలు నా మెదడులో నిక్షిప్తమయి పోతాయి. ఒక్కొక్కసారి వహీ తీసుకువచ్చే దూత నా వద్దకు మానవాకరంలో వచ్చి నాతో సంభాషిస్తారు. ఆయన చెప్పినది నేను గుర్తుంచుకుంటాను”. పిదప ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు: ఒకసారి తీవ్రమైన చలి ఉన్న రోజున ఆయనపై వహీ అవతరిస్తుండగా చూశాను, వహీ అవతరణ పూర్తి అయిన తర్వాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నుదుటి నుండి స్వేద బిందువులు రాలసాగాయి”. (బుఖారి 22, ముస్లిం 2333).
ఈ హదీసులో:
మన ప్రవక్తపై వహీ రెండు రకాలుగా అవతరించేది. ఆ సందర్భంలో ఆయనకు చాలా కష్టం కలిగేది. అది దాని భారం, దాని విలువ మరియు గౌరవం కారణంగా. అల్లాహ్ ఖుర్ఆనులో ఇలా తెలిపాడు: ]ఒకవేళ మేము ఈ ఖుర్ఆన్ ను ఏ పర్వతంపైనైనా అవతరింపజేస్తే, అది అల్లాహ్ భయం వల్ల క్రుంగిపోయి బ్రద్ధలైపోవటాన్ని నీవు చూస్తావు[. (హష్ర్ 59: 21).
ఏదైనా పోలిక కారణంగా చెడ్డ విషయాన్ని ఉపమానంగా ఇచ్చుట యోగ్యమైనదే. ఎలా అనగా గంట చెడ్డది అయినా కేవలం దాని శబ్దం ఉదాహరణ ఇవ్వబడింది.
దైవదూతలు అల్లాహ్ అనుమతితో మానవ రూపం దాల్చుతారని తెలిసింది. ఈ హదీసులో దైవదూత అంటే జిబ్రీల్ అలైహిస్సలాం .
వహీ అవతరణ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు శరీరం బరువు పెరిగినట్లు ఏర్పడేది. అది గొప్ప సంబోధన, గౌరవ వాక్యం మరియు వహీ భారం వల్ల మరియు ఆయన దాని పట్ల చూపే అధిక శ్రద్ధ వల్ల అలా ఏర్పడేది. ఇంత ఏర్పడినా అల్లాహ్ తమ ప్రవక్తపై కరుణ చూపి, సహాయం అందించి వహీ భారాన్ని మోయడాన్ని సులభం చేశాడు. లేకున్నట్లయితే దాని భారం ఎంతటిదో ఈ క్రింది ఆయతులో తెలుపబడింది. కాస్త గమనించండిః
78-ఆయిషా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ప్రారంభంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు కొన్ని నిజమైన కలలు వచ్చేవి. అవి పగటి వెల్తురులా స్పష్టంగా ఉండేవి. ఈ విధంగా ఆయనపై వహీ అవతరించడం మొదలయింది. దాంతో ఆయన ఏకాంతం, ఏకాగ్రతలను కోరుకొని ‘హిరా’ అను పేరుగల కొండ గుహలో ఒంటరిగా గడపనారంభించారు. ఆ గుహలో ఆయన రోజుల తరబడి ఇంటికి వెళ్ళకుండా అల్లాహ్ ఆరాధనలో నిమగ్నులయి ఉండేవారు. ఈ పని కోసం ఆయన అన్నపానీయాలు కూడా వెంట తీసుకెళ్ళి పెట్టుకునేవారు. అవి అయిపోయిన తర్వాత (ఇంటికి అంటే తన సతీమణి అయిన) హజ్రత్ ఖదీజ రజియల్లాహు అన్హా దగ్గరకు వచ్చేవారు. అయితే మళ్ళీ ఆయన అదే విధంగా అన్నపానీయాలు తీసుకొని గుహకు తిరిగి వెళ్ళిపోయేవారు.
ఇలా కొన్నాళ్ళు గడిచాక, ఓ రోజు ఉన్నట్టుండి ఆ కొండ గుహలో హఠాత్తుగా సత్యం (వహీ) సాక్షాత్కరించింది. ఆయన దగ్గరకు ఓ దైవదూత (జిబ్రీల్) వచ్చి “చదువు” అన్నాడు. దానికి ప్రవక్త తాను చదువురాని వాడినని సమాధానమిచ్చారు. ఆయన ఈ సంఘటనను ప్రస్తావిస్తూ ఇలా తెలియజేశారుః-
“అప్పుడు దైవదూత నన్ను పట్టుకొని గట్టిగా అదిమి వదలి పెట్టారు. ఆ సమయంలో నాకు శ్వాస ఆగినంత పనయింది. తరువాత ఆయన “చదువు” అన్నారు. నేను తిరిగి “నాకు చదువురాదు” అన్నాను. దైవదూత నన్ను మరోసారి పట్టుకొని గట్టిగా అదిమి వదిలేశారు. నాకు మళ్ళీ శ్వాస ఆగిపోయినంత బాధ కలిగింది. దైవదూత మళ్ళీ “చదువు” అన్నారు. నేను యథా ప్రకారం నాకు చదువు రాదని చెప్పాను. దైవదూత నన్ను మూడోసారి పట్టుకొని గట్టిగా అదిమి వదలి పెట్టారు. దాంతో నాకు మళ్ళీ శ్వాస ఆగిపోయినంత బాధవేసింది. ఆ తర్వాత అతను “పఠించు! సర్వ సృష్టికర్త అయిన నీ ప్రభువు పేరుతో. ఆయన మానవుడ్ని నెత్తుటి ముద్దతో సృష్టించాడు. చదువు! నీ ప్రభువు ఎంతో అనుగ్రహశాలి” అని అన్నాడు. (సూర అలఖ్ 96: 1-3).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భయకంపితులయి (ఎలాగో) ఈ మాటలు ఉచ్ఛరించారు. ఆ తరువాత ఆయన (తన ఇంటికి అంటే) హజ్రత్ ఖదీజ బిన్తె ఖువైలిద్ రజియల్లాహు అన్హా దగ్గరకు వచ్చారు. వచ్చీ రాగానే (పడక మీద పడి) “దుప్పటి కప్పండి, దుప్పటి కప్పండి” అన్నారు. హజ్రత్ ఖదీజ తొందరగా దుప్పటి తెచ్చి కప్పారు. దాంతో కాస్సేపటికి ఆయనకు ఆవహించిన భయాందోళనలు కాస్త తగ్గు ముఖం పట్టాయి. అప్పుడాయన హజ్రత్ ఖదీజకు జరిగిన వృత్తాంతం పూస గుచ్చినట్లు చెప్పి, తన ప్రాణానికేదో ముప్పు వాటిల్లినట్లు అనిపిస్తుందని అన్నారు. హజ్రత్ ఖదీజ రజియల్లాహు అన్హా ఆయనకు ధైర్యం చెబుతూ “అల్లాహ్ సాక్షిగా! అలా ఎన్నటికీ జరుగదు. మీరు బంధువుల్ని ఆదరిస్తారు, అభిమానిస్తారు. ఇతరుల బరువు బాధ్యతలను మోస్తారు. ఆపదల్లో ఉన్నవారిని ఆదుకుంటారు. సంపాదించలేని వారికి సంపాదించిపెడ్తారు. అతిథుల్ని సత్కరిస్తారు. సత్యమార్గంలో ఎదురయ్యే కష్టనష్టాలను భరిస్తారు. ఈ విషయంలో ఇతరులక్కూడా సహాయం చేస్తారు. అలాంటి మిమ్మల్ని అల్లాహ్ ఎన్నటికీ అవమానపర్చడు” అని అన్నారు.
ఆ తర్వాత హజ్రత్ ఖదీజ రజియల్లాహు అన్హా ప్రవక్తను తన పెద నాన్న కొడుకు అయిన వరఖ బిన్ నౌఫల్ బిన్ అసద్ బిన్ అబ్దుల్ ఉజ్జా దగ్గరకు తీసుకువెళ్ళారు. ఈయన పూర్వం అజ్ఞాన కాలంలో క్రైస్తవ మతస్థుడిగా ఉండేవాడు. హెబ్రూ భాష మాట్లాడటం, చదవడం వ్రాయడం ఆయనకు బాగా తెలుసు. హెబ్రూ భాషలో ఆయన ఇంజీల్ రాస్తుండేవారు. చాలా వృద్ధుడయిపోయాడు. కళ్ళు కూడా కానరాకుండా పోయాయి.
ఖదీజ రజియల్లాహు అన్హా ఆయన దగ్గరకు చేరుకొని “అన్నా! మీ అబ్బాయి చెప్పే మాటలు కాస్త వినండి” అన్నారు. అప్పుడు వరఖా ప్రవక్తను ఉద్దేశించి “అబ్బాయి! నువ్వేమి చూశావో చెప్పు” అన్నారు. ప్రవక్త తాను కన్నది, విన్నది అంతా వివరంగా ఆయనకు తెలియజేశారు. వరఖా ఈ మాట విని ఇలా అన్నారు: “అయితే అతను (దైవదూత జిబ్రీల్) మూసా ప్రవక్త దగ్గరకు అల్లాహ్ వహీనిచ్చి పంపిన దైవదూతే. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే నీ జాతి ప్రజలు నిన్ను (మక్కా నుండి) బహిష్కరించేనాటికి నేను బ్రతికి ఉంటే ఎంత బాగుండేది!”.
ఈ మాటలకు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆశ్చర్యపోతూ “ఏమిటి, ప్రజలు నన్ను ఇక్కడ్నుంచి వెళ్ళగొడ్తారా?” అన్నారు. దానికి వరఖ అన్నారుః “ఔను నాయనా! నీవు ఈనాడు చెబుతున్నటువంటి విషయాలే గతంలో కూడా కొందరు ప్రవక్తలు చెప్పారు. వారిలో ప్రతీ ఒక్కర్నీ ఈ లోకం విరోధించింది. అప్పటి దాకా నేను జీవించి ఉంటే నా శక్తి వంచన లేకుండా నీకు సహాయపడతా”. వరఖ ఆ తర్వాత ఎక్కువ రోజులు బ్రతకలేదు, పరమపదించారు. అటు ప్రవక్త వద్దకు వహీ రావడం కొద్ది రోజుల వరకు ఆగిపోయింది. (ఆ తర్వాత మళ్ళీ రాసాగింది). (బుఖారి 3, ముస్లిం 160).
ఈ హదీసులో:
ప్రవక్తల కలలు నిజమౌతాయి. అల్లాహ్, ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఆయన కుమారుడు (ఇస్మాఈల్ అలైహిస్సలాం)ల విషయం ఇలా తెలిపాడుః [إِنِّي أَرَى فِي المَنَامِ أَنِّي أَذْبَحُكَ] ]నేను నిన్ను జిబహ్ చేస్తున్నట్లు కలలో చూశాను[.(సాఫ్ఫాత్ 37: 102).
సమాజంలో చెడు ప్రబలినప్పుడు, లేదా ఏదైనా కారణంగా ఉదాహరణకు ఏకాగ్రతతో అల్లాహ్ ఆరాధన కొరకు, లేదా ప్రజల కీడు నుండి రక్షణ కొరకు ఏకాంతంలో ఉండవచ్చును.
ప్రయాణం మరియు ఇతర సందర్భాల్లో అన్నపానీయాలు వెంట తీసుకువెళ్ళాలి. ఇది అల్లాహ్ పై నమ్మకానికి వ్యతిరేకమేమీకాదు. ఒక సాధనం లాంటిది.
ఖుర్ఆనులో మొదటిసారిగా అవతరించిన సూరా, సూర అలఖ్.
విద్య, జ్ఞానం మరియు ధర్మవగాహన పొందాలని ప్రోత్సహించ బడింది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఉమ్మీ” అంటే చదవడం, వ్రాయడం తెలియనివారు.
శిష్యుడు విషయాన్ని గ్రహించుటకు అతని శరీరం యొక్క ఓ భాగాన్ని పండితుడు పట్టుకొని బోధించవచ్చు.
మొదటి వహీ హిరా గుహలో వచ్చింది. అదే: సూర అలఖ్ లోని తొలి ఆయతులు.
ఇందులో ఖదీజ రజియల్లాహు అన్హా ఘనత కూడా ఉంది.
ప్రవక్తలు కూడా ఒక్కోసారి భయకంపితులు అవుతారు.
ప్రవక్త మానవుడేనన్న ఆధారం ఇందులో ఉంది.
మనిషి తన అలసట, భయం గురించి భార్యకు చెప్పుకోవచ్చునని ఉంది.
ఇందులో ఖదీజ రజియల్లాహు అన్హా తెలివి, చైతన్యం, సరైన సలహాసూచన గలవారని తెలిసింది.
మంచి కార్యాలు కష్ట సమయాల్లో పనికొస్తాయి. సత్పురుషుల పట్ల అల్లాహ్ పద్ధతి ఏమిటంటే ఆయన వారిని కాపాడుతాడు, ఉత్తమ మరియు అంతిమ ఫలితం వారిదే అవుతుంది. అల్లాహ్ పట్ల మంచి నమ్మకం ఉంచాలని ఉంది. ఆయనే తన భక్తులను కాపాడువాడు. తన దాసుల సహాయకుడు. అవమానం, దుష్ఫలితం అల్లాహ్ శతృవులకు. అది వారు చేసే కర్మలకు సంపూర్ణ ఫలితం.
బంధువులతో కలిసి, వారికి మేలు చేయాలని ఉంది. ఇది అల్లాహ్ పంపిన ప్రవక్తల ఉత్తమ గుణం. మోక్షానికి మరియు ఇహపరాల సంక్షేమానికి కారణం.
నిరాధారులైన బలహీనులకు సహాయపడుతూ, వారికి తోడుగా నిలిచి, ఉపకారం చేస్తూ ఉండాలని, బీదవాళ్ళు, నిరుపేదలతో సానుభూతి చూపించాలని, వారికి మేలు చేయాలని ఉంది. ఇది ప్రవక్త సద్గుణమని తెలిసింది. అతిథులకు మర్యాదనిచ్చి, వచ్చిపోయేవాళ్ళకు దానాలు, బహుమానాలు ఇవ్వాలని ఉంది. అల్లాహ్ యొక్క ప్రత్యేక దాసుల గుణాలివి. బాధితులను ఆదుకొని, వారి కష్టాలు తగ్గించే ప్రయత్నం చేయాలి.
మాటల్లో సత్యం పాటించడం పుణ్యకార్యం. సత్యం ప్రవక్త గుణాల్లో అతి ఉత్తమ గుణం.
అమానతులను (అప్పగింతలను) వారిహక్కుదారులకు అప్పగించాలని, వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ఉంది. దాసులతో ఉదారగుణంగా మెలిగే వారితో అల్లాహ్ కూడా అలాగే మెలుగుతాడు. ఆపదలో ఉన్నవారిని ఓదార్చి, ఆపద భారం సాధ్యమైనంత వరకు తగ్గించడం అభిలషణీయం. ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే దాని గురించి మేధావులకు (పండితులకు) తెలియజేయడం మంచిది. సహాయపరంగానైనా, మంచి సలహా ఇవ్వడంలోనైనా ఉత్తమ భార్య ప్రభావం చాలా ఉంటుంది. అతని వద్ద ఏ విషయముందో తెలుసుకొనుటకు గ్రంథ జ్ఞానం గలవారి (పండితుల) మాట వినవచ్చు.
ప్రవక్తలందరి పిలుపు (సందేశం) ఒక్కటే. పరస్పరం ఒకరినొకరు ధృవీకరించేవారు. ప్రవక్త అనుయాయులతో శతృత్వం జరగడం పూర్వం నుంచి వస్తున్న సంప్రదాయమే. అలాగే జరుగుతూ ఉంటుంది.
అల్లాహ్ తన ప్రవక్తల, భక్తుల విధివ్రాతలో కష్టాలు వ్రాసాడు. వారిని పరీక్షించాలని. అయితే అంతిమ విజయం వారిదే అగును.
అనుభవజ్ఞుల అనుభవాల్ని వినాలని, వివేక విషయాల్ని తీసుకోవాలని ప్రోత్సహించబడింది. పూర్వ ఆకాశ గ్రంథాలన్నింటిలో లేదా కొన్నింటిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భరించిన కష్టాల ప్రస్తావన ఉంది.
మన ప్రవక్త వద్దకు వచ్చిన రీతిలోనే దైవదూత జిబ్రీల్, ప్రవక్త మూసా అలైహిస్సలాం వద్దకు కూడా వచ్చేవారు.
79- హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వహీ తాత్కాలికంగా నిలిచిపోయిన రోజులను గురించి మాట్లాడుతూ (ప్రవక్త ఇలా తెలిపారని) చెప్పారుః “ఓ రోజు నేను నడిచి వెళ్తుంటే (దారిలో ఓ చోట) హఠాత్తుగా నాకు ఆకాశం నుండి ఓ (కంఠ) స్వరం విన్పించింది. నేను వెంటనే తల పైకెత్తి చూశాను. చూస్తే ఇంకేముంది, హిరా గుహలో నా దగ్గరకు వచ్చి వెళ్ళిన దైవదూతే భూమ్యాకాశాల మధ్య ఓ కుర్చీ మీద కూర్చొని ఉన్నాడు. అతడ్ని అతని మహాకాయం, గాంభీర్యతను చూడగానే నా గుండె ఝల్లుమంది. నేను భయంతో వణికిపోతూ ఇంటికి తిరిగి వచ్చాను. పడక మీద మేను వాల్చి “దుప్పటి కప్పండి, నాకు దుప్పటి కప్పండి” అన్నాను. సరిగ్గా అదే సమయంలో ]దుప్పటి కప్పి పడుకున్నవాడా! లే, లేచి ప్రజలను హెచ్చరించు, నీ ప్రభువు ఘనతను చాటి చెప్పు, నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో, మాలిన్యానికి (అంటే విగ్రహాలకు) దూరంగా ఉండు[. (సూర ముద్దస్సిర్ 74: 1-5). అన్న ఆయతులు నాపై అవతరించాయి. ఆ తరువాత వహీ నిరాఘాటంగా రావడం మొదలయింది”. (బుఖారి 4925, ముస్లిం 161).
ఈ హదీసులో:
భూమ్యాకాశాల మధ్యలో కూర్చున్నవారు జిబ్రీల్ అలైహిస్సలాం. ఇంతకు ముందు అతను వచ్చినట్లు ఇదే హదీసులో ఆధారం ఉంది. దైవదూతలను వివిధ ఆకారాల్లో మార్చే శక్తి అల్లాహ్ కు ఉంది.
ప్రవక్తల గుండెల్లో కూడా భయం చోటు చేసుకుంటుంది.
(ఖుర్ఆన్ ప్రవక్తపై ఒకేసారి అవతరించలేదు) దశలవారీగా అవతరించింది. బాహుల్యం మరియు క్రమం పరంగా ఒక్కోసారి ఎక్కువగా అవతరించేది.
ఇందులో దుస్తులను మాలిన్యానికి దూర- ముంచాలని ఉంది. దీని ఆధారంగానే కొందరు పండితులు నమాజులో దుస్తులు శుభ్రంగా ఉండడం ఒక షరతుగా సిద్ధాంతీకరించారు. ఇది వాస్తవానికి దూరమేమి లేదు.
(పై హదీసు, ఈ హదీసు మరియు బుఖారిలోని 4922వ హదీసుల ద్వారా తెలిసిన ఒక విషయం ఏమిటంటే) సహాబీల మధ్య “మసాఇలె ఫురూఇయ్యా” (చర్చనీయాంశా)లో బిన్నాభిప్రాయం ఉండింది. ఆయిషా రజియల్లాహు అన్హా మరి కొందరు సహాబీల అభిప్రాయ ప్రకారం తొలిసారిగా అవతరించిన సూర, సూర అలఖ్. అయితే జాబిర్ రజియల్లాహు అన్హు అభిప్రాయ ప్రకారం సూర ముద్దసిర్.
“లే, లేచి హెచ్చరించు” అంటే నిన్ను విశ్వసించని ప్రజల్ని అల్లాహ్ యొక్క శిక్ష నుండి హెచ్చరించు అని భావము.
80- ఉబాద బిన్ సామిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై వహీ అవతరించే సందర్భంలో ఆయనకు చాలా కష్టం ఏర్పడేది. ముఖ కవళికలు పూర్తిగా మారిపోయేవి. (ముస్లిం 1630, 2334).
ఈ హదీసులో:
ఇందులో “కరబ” అన్న పదం వచ్చింది. అంటే వహీ పట్ల పూర్తి శ్రద్ధ వల్ల ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు చాలా కష్టం, బాధ కలిగేది. మరియు “తరబ్బద వజ్ హుహు” అంటే ముఖం ఎరుపుగా మారిపోయేది. అవతరించే విషయం మహా గొప్పది గనుక. ఎలా అనగా వహీ అల్లాహ్ వాక్యం. అందులో ఆదేశాలు, వారింపులు, గద్దింపులు, సమాచారాలు ఉంటాయి. అవి విన్నారంటే బాలల తలల్లో కూడా ముసలితనం వచ్చేస్తుంది. శరీరం కంపిస్తుంది. స్పృహ గలవారు స్పృహ తప్పిపోయేటంత పనవుతుంది. అల్లాహ్ సహాయమే శరణం.
81- హజ్రత్ ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు సూర ఖియామలోని ఆయతు [لَا تُحَرِّكْ بِهِ لِسَانَكَ لِتَعْجَلَ بِهِ] “ప్రవక్తా! ఈ వహీని జ్ఞాపకముంచుకోవడానికి తొందరతొందరగా నాలుక తిప్పకు”యొక్క వ్యాఖ్యానం చేస్తూ ఇలా చెప్పారుః ఖుర్ఆన్ అవతరణ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ పెదవులను కదిలించేవారు. దానివల్ల ఆయనకు చాలా బాధ కలిగేది. ప్రవక్త కదిలించే విధంగా నేను కదిలిస్తాను చూడండని ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు తమ పెదవులను కదిలించారు. అప్పుడు అల్లాహ్ [لَا تُحَرِّكْ بِهِ لِسَانَكَ لِتَعْجَلَ بِهِ ، إِنَّ عَلَيْنَا جَمْعَهُ وَقُرْآنَهُ] “ప్రవక్తా! ఈ వహీని జ్ఞాపకముంచుకోవడానికి తొందరతొందరగా నాలుక తిప్పకు. దాన్ని నీకు గుర్తు చేయించడం, నీ చేత చదివించడం మా పని”అనే ఆయతులను అవతరింపజేశాడు. అంటే మీ హృదయంలో సమకూర్చడం మా పని, ఆ తర్వాత మీరు అట్లే చదవగలరు. [فَإِذَا قَرَأْنَاهُ فَاتَّبِعْ قُرْآنَهُ] “అంచేత మేము పఠిస్తున్నప్పుడు నీవు దాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ ఉండు చాలు”.అంటే మీరు నిశ్శబ్దంగా ఉండి, శ్రద్ధగా వినండి. [ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُ] “ఆ తరువాత మీకు దాని భావం తెలియజేయడం కూడా మా బాధ్యతే”.అంటే మీరు చదివే విధంగా మీకు సులభం చేయడం మా బాధ్యత. అప్పటి నుంచి జిబ్రీల్ అలైహిస్సలాం వహీ తీసుకొని వచ్చినప్పుడల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శ్రద్ధగా ఆలకించేవారు. జిబ్రీల్ వెళ్ళిపోయాక ఆయన చదివినట్లే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చదివేవారు. (అంటే జిబ్రీల్ నోట ఒక్కసారి వినగానే ప్రవక్తకు గుర్తిండిపోయేది).
ఈ హదీసులో:
ఖుర్ఆన్ పారాయణం నెమ్మదిగా ఆగిఆగి చేయాలి. వహీ అవతరణ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అధిక శ్రద్ధ వల్ల చాలా బాధ, భారం కలిగేది. హేళన, పరిహాసం లాంటి ఉద్దేశం లేనప్పుడు ప్రవక్త ఇలా చేసేవారని ఏదైనా చలనం చేసి చూపించడం తప్పు కాదు.
తన పవిత్ర గ్రంథం వృధా కాకుండా కాపాడే పూచి అల్లాహ్ తీసుకున్నాడు. ప్రవక్త తమ హృదయంలో అల్లాహ్ గ్రంథాన్ని భద్రపరుచుకొనుట కూడా ఒక మహత్యం. ఎందుకనగా ఆయన “ఉమ్మీ”.
సంభాషణ సమయంలో వివరణ ఇవ్వకుండా ఆలస్యం చేయవచ్చునని తెలిసింది. ఖుర్ఆన్ అవగాహన, అందులో యోచించటానికి దాని పారాయణ సందర్భంలో మౌనం వహించి, శ్రద్ధగా వినడం ధర్మం.
శిష్యుడు పండితుని ముందున్నప్పుడు శ్రద్ధగా వింటూ, నిశ్శబ్దంగా ఉండాలని, ఆయన మాట మధ్యలో ఆపకూడదని తెలిసింది.
విద్య మరచిపోకుండా మరియు వృధా కాకుండా ఉండడానికి దాన్ని కంఠస్తం చేసుకొనుట, లిఖితపూర్వకంగా భద్రపరచుట, దాని పట్ల ఎల్లప్పుడూ శ్రద్ధ వహించుటలో మనస్సు లగ్నం చేసి ఉండాలి.
పండితుడు చదివినట్లు అతనివెంట వెంటనే చదువుతూ పారాయణంలో ఆయన్ను అనుసరిస్తూ ఉండాలి.
పండితుల ద్వారా విద్యనభ్యసించే పద్ధతి ఏమిటంటే, వారు చెబుతున్న విషయాన్ని తొందరగా గుర్తుంచుకోవాలి. వ్రాసుకోవాలి.
క్రమంగా, కొంచెం కొంచెం విద్య నేర్చుకోవాలి. ఒకేసారి అధిక భాగంలో తీసుకున్న వ్యక్తి, అంతే భాగంలో పోగుట్టుకుంటాడు.
విద్య స్థిరంగా ఉండడానికి అడపాదడపా దాన్ని నెమరవేస్తూ (review చేస్తూ) ఉండాలి. ఈ విషయానికి ఆధారం “జిబ్రీల్ వెళ్ళి పోయాక ఆయన చదివినట్లే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చదివేవారు”, అన్న హదీసు భాగం.
విద్యభ్యాసంలో కష్టపడుట, అందులో కలిగే ఆపదలపై ఓపిక వహించుట చాలా అవసరం. ధర్మవిద్య అంతటి గొప్పది గనుక.
]ఈ కపటులు (మునాఫిఖులు) అల్లాహ్ ను మోసం చేస్తున్నారు. వాస్తవానికి అల్లాహ్ యే వారిని మోసంలో పడవేశాడు. వారు నమాజ్ కొరకు లేస్తే, బద్ధకంగా, కేవలం ప్రజలకు చూపేందుకే లేస్తారు. అల్లాహ్ ను చాలా తక్కువగా స్మరిస్తారు[. (నిసా 4: 142).
82- “మునాఫిఖు చిహ్నాలు మూడుః మాట్లాడితే అబద్ధం పలుకుతాడు. వాగ్దానం చేస్తే వ్యతిరేకమే చేస్తాడు. అతన్ని నమ్మి ఏదైనా అమానతు (అప్పగింత) అతని వద్ద పెడితే దాన్ని కాజేస్తాడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (బుఖారి 33, ముస్లిం 59).
ఈ హదీసులో:
నిఫాఖ్ రెండు రకాలుః- ఒకటిః విశ్వాసానికి సంబంధించినది, రెండవదిః కర్మలకు సంబంధించినది. ఇక్కడ కర్మలకు సంబంధిం- చినదే ఉద్ధేశింపబడినది. ముస్లింలో నిఫాఖ్ కు సంబంధించిన ఒక భాగం లేదా అనేక భాగాలు ఉండవచ్చు. నిఫాఖ్ భాగాలు అనేకం. అందులో కొన్ని, మరి కొన్నిటి కన్నా ఎక్కువ భయంకర మైనవి. ఎవరు నిఫాఖ్ గుణం అవలంబించి దాన్ని విడనాడకుండా ఉంటాడో అలాంటి వ్యక్తి మునాఫిఖ్ లో లెక్కించబడతాడు. నిఫాఖ్ యొక్క చిహ్నాలున్నాయి. ఎవరిలో అవి ఉన్నాయో అంత మేరకు అతనిలో నిఫాఖ్ ఉన్నట్లు.
అబద్ధం మాట్లాడడం నిషిద్ధం అని, అది మునాఫిఖుల గుణం అని తెలిసింది. వాగ్దాన వ్యతిరేకం నిషిద్ధం. అది విశ్వాసి గుణం కాదు. అమానతులో మోసం చేయడం నిషిద్ధం. అలా చేయువానిలో నిఫాఖ్ ఉన్నట్లు. విశ్వాస సంబంధమైన నిఫాఖ్ ఇస్లాం నుండి బహిష్కరణకు కారణం అవుతుంది. కాని క్రియ సంబంధమైన నిఫాఖ్ అలా కాదు. అందువల్ల మనిషి ఇస్లాం నుండి బహిష్కరింపబడడు. అది కబీర గునాహ్ (ఘోరపాపాల్లో) లెక్కించబడుతుంది.
83- “ఏ వ్యక్తిలో ఈ నాలుగు గుణాలుంటాయో అతను అసలైన మునాఫిఖ్. ఒక వేళ అతనిలో వీటిలోని ఒక్క గుణం ఉన్నా అతను దానిని వదలనంత వరకు అతనిలో నిఫాఖ్ కు సంబంధించిన ఒక గుణం ఉన్నట్లే. ఆ నాలుగు గుణాలు ఇవిః అతన్ని నమ్మి ఏదయినా అమానతు అప్పగించినప్పుడు అతను దాన్ని కాజేస్తాడు. నోరు విప్పితే అబద్ధం పలుకుతాడు. మాటిస్తే దాన్ని నిలబెట్టుకోడు. ఎవరితోనయినా జగడం జరిగితే అన్యాయానికి దిగుతాడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారనిఅబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ ఉల్లేఖించారు. (బుఖారి 34, ముస్లిం 58).
ఈ హదీసులో:
నిఫాఖ్ గుణాలు బాహుళ్యంగా, నానారకాలుగా ఉన్నాయి. ఈ హదీసులో చెప్పబడిన సంఖ్య వాటి పరిమితం తెలుపుటకు కాదు. అవే కాకుండా మునాఫిఖుల గుణాలు ఇంకెన్నో ఉన్నవి. నిఫాఖ్ గుణాలు ప్రజల్లో విభిన్న రీతుల్లో ఉన్నాయి. కొందరిలో చాలా తక్కువ, మరికొందరిలో చాలా ఎక్కువ, కొందరిలో ఏ మాత్రం లేవు.
వాగ్దనం చేసి భంగపరచకూడదని ఇందులో తెలిసింది. ఇది మునాఫిఖుల ప్రత్యేక గుణం. జగడములాడినప్పుడు ధర్మం నుండి వైదొలుగుట నిషిద్ధం. ఇలా చేయువాడు మునాఫిఖని, ధర్మం పట్ల హేళన చేయువాడని నిదర్శనం.
84- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అన్సారులను ప్రేమించడం విశ్వాస చిహ్నం (నిదర్శనం). అన్సారులను అసహ్యించుట నిఫాఖ్ చిహ్నం”. (బుఖారి 17, ముస్లిం 74).
ఈ హదీసులో:
అన్సార్ -రజియల్లాహు అన్హుం-ల ఘనత ఉంది. విశ్వాసానికి చిహ్నాలు, నిదర్శనాలు ఉంటాయి. అలాగే నిఫాఖ్ కు కూడాను. ‘అన్సార్’ ఖుర్ఆన్, హదీసులో వచ్చిన ధార్మిక పేరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీన నగరానికి వలస వచ్చాక ఆయనకు అన్ని విధాలుగా సహాయపడినవారి పేరు ఇది. వారి వారి కర్మలు, ఇస్లాంలో వారి త్యాగాల పరంగా ప్రజలు వేరు వేరు స్థానాల్లో ఉంటారు. అన్సార్ ఈ శ్రేష్ఠ నామాన్ని ప్రవక్తకు సహాయం చేసి పొందారు. దీన్ని బట్టి తెలిసే ఒక విషయం ఏమిటంటే ధర్మానికి సహాయపడ్డ ప్రతీవానితో ప్రేమించడం కూడా విశ్వాసమే. అలాగే హృద- యానికి సంబంధించిన కర్మలు కూడా విశ్వాసంలో లెక్కించబడతాయి. స్వయంగా విశ్వాసం కూడా ఒక కర్మయే. అందరిలో విశ్వాసం ఒకే రకంగా ఉండదు. తరుగుతుంది, పెరుగుతుంది. ప్రేమ, అసహ్యం కూడా కర్మలే. వాటిపై కూడా మనిషికి సత్ఫలితం, దుష్ఫలితాలు లభిస్తాయి.
85- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “సాటి ముస్లింని దూషించడం “ఫిస్ఖ్” (దుర్మార్గం, కడుహేయమైన విషయం), అతనితో పోరాడటం “కుఫ్ర్”తో సమానం”.
ఈ హదీసులో:
తనకు తెలియకుండానే తన కర్మలు వృధా అవుతాయని విశ్వాసి భయపడతాడు.
కొందరు పండితులు చెప్పారుః ఇందులో ఉపయోగ పడిన “కుఫ్ర్” పదం వాస్తవ కుఫ్ర్ కాదు. అంటే ఇస్లాం నుండి బహిష్కరణకు కారణమయ్యే కుఫ్ర్ కాదు. అలాంటి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండడానికి ఈ విధంగా హెచ్చరించడం జరిగింది. మరి కొందరు ఇమాములు ఇలా చెప్పారుః ముస్లింతో పోరాడటాన్ని ధర్మసమ్మతంగా భావించేవారు కుఫ్ర్ కు పాల్పడినట్లు.
కబీర గునాహ్ (ఘోర పాపా)లు, వాటికి పాల్పడిన వ్యక్తిని ఫాసిఖ్ (దుర్మాగుడిని)గా చేసేస్తాయి. అతడు ముస్లిమయితే ఆ కబీర గునాహ్ వల్ల అతడు ఫాసిఖ్ అయినట్లు.
ముస్లిం గౌరవం, మానం గలవాడు, గనుక అతన్ని దూషించడం నిషిద్ధం. ఇందులోనే పరోక్షనింద, తిట్లు, శాపనాలు, అవహేళనలన్నీ వస్తాయి. ముస్లింను హత్య చేయడం నిషిద్ధమని, అతని హత్యను ధర్మసమ్మతంగా భావించేవాడు కాఫిరవుతాడని తెలిసింది. ఈ హదీసు ప్రవక్తగారికి నొసంగబడిన “జవామిఉల్ కలిమ్”లో పరిగణించబడుతుంది. అంటే సంక్షిప్త పదాల్లో అధిక భావాలు, అర్థాలుంటాయని అర్థం. ఇందులో రెండు వేర్వేరు మాటలు చెప్పబడ్డాయి. కాని అందులో అనేకాదేశాలున్నాయి.
86- ఉబాద బిన్ సామిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు -అతను బద్ర్ యుద్ధంలో పాల్గొనడమేగాకుండా రెండవ అఖబా ప్రమాణ స్వీకారంలోనూ పాల్గొన్న ప్రతినిధులలో ఒకరు-: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ అనుచరుల మధ్య ఉన్నప్పుడు ఇలా అన్నారు: “ఈ విషయాలను గురించి మీరు నా ముందు ప్రమాణం చేయండి; మీరు ఏ విధంగానూ అల్లాహ్ కు సాటికల్పించరు. దొంగతనం చేయరు. వ్యభిచారానికి పాల్పడరు. సంతానాన్ని చంపరు. ఎవరిమీద అపనిందలను మోపరు. ధర్మసమ్మతమైన ఏ ఆదేశాన్ని శిరసావహించడానికీ నిరాకరించరు. ఈ ప్రమాణంపై మీలో స్థిరంగా ఉన్నవాడు అల్లాహ్ వద్ద సత్ఫలితం పొందుతాడు. ఇక మీలో ఎవరైనా వాటిలో ఏ ఒక్కదానికి పాల్పడి, దానికి ఇహలోకంలోనే శిక్ష అనుభవిస్తే, ఆ శిక్ష అతని పాపానికి పరిహారమవుతుంది. ఒకవేళ అతను నేరం చేసినప్పటికీ (ఇహలోకంలో శిక్షకు గురికాకుండా) అల్లాహ్ అతని నేరాన్ని కప్పి పుచ్చడం జరిగితే అతని వ్యవహారం అల్లాహ్ చేతిలో ఉంటుంది. అల్లాహ్ తలచుకుంటే అతడ్ని క్షమించవచ్చు లేదా శిక్షించవచ్చు”. ఈ విషయాలను అంగీకరిస్తూ మేమంతా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతిలో చేయి వేసి ప్రమాణం చేశాము.
ఈ హదీసులో:
అవసరమున్నప్పడల్లా, వేర్వేరు సందర్భాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రమాణ స్వీకారాలు తీసుకున్నారు. అతి ముఖ్యమైన విషయం తౌహీద్. పాపాల్లో మహాఘోరమైనది అల్లాహ్ కు ఇతరలను భాగస్వామిగా కల్పించుట (షిర్క్). దొంగతనం నిషిద్ధం. అది ఘోరపాపాల్లో ఒకటి. వ్యభిచారం నిషిద్ధం. అది అతి చెడ్డ పాపం. వారిపై ఖర్చు చేయవలసి వస్తుందన్న భయంతో సంతానాన్ని హతమార్చడం నిషిద్ధం. అది పూర్వపు అజ్ఞాన కాలం నాటి ఆచారం. అబద్ధం, నింద మరియు అపవాదాలు నిషిద్ధం. ధర్మసమ్మతమైన ఆదేశాల పట్ల శిరసా వహించాలి. వాటి పట్ల అవిధేయత చూపుట నిషిద్ధం. సత్కార్యాల పుణ్యం అల్లాహ్ తో మాత్రమే కోరాలి. ఇతరులతో కాదు. అల్లాహ్ వద్ద ఉన్నవాటిని మనిషి తన సత్కర్మల ద్వారా అడగాలి. అల్లాహ్ కు సాటి కల్పించుట ఒక కర్మగా పరిగణించబడుతుంది. ఎవడు పాపాలకు దూరంగా ఉంటాడో, అతడు వాటికి దూరంగా ఉన్నందుకు, అందుకై ఓపిక వహించినందుకు అల్లాహ్ అతనికి సత్ఫలితం ఇస్తాడు. హద్దులు (అంటే కొన్ని పాపాలకు నిర్ణీత శిక్షలు) పాపాల ప్రక్షాళన, మరియు పరిహారమవుతాయి. అలాగే ఆపదలు కూడాను. హద్దుకు గురి చేసే పాపం ఎవడైనా చేస్తే ముందుకు వచ్చి తెలియజేయడం తప్పనిసరేమీ కాదు. దాన్ని తెలియకుండా ఉంచి, తౌబా చేస్తే సరిపోతుంది. ఘోరపాపానికి పాల్పడినవారు అల్లాహ్ ఇష్టం మీద ఆధారపడి ఉంటారు. అల్లాహ్ ఇష్టపడితే శిక్షిస్తాడు. ఇష్టముంటే మన్నిస్తాడు. ఘోరమైనపాపం చేసినవాడు ముస్లిమే అనబడుతాడు. అందువల్ల కాఫిర్ కాడు. దాన్ని హలాల్ (ధర్మసమ్మతం)గా భావిస్తే తప్ప. ఘోరపాపానికి పాల్పడిన వ్యక్తి నరకంలో ప్రవేశించవచ్చు. అయితే తౌహీద్ కారణంగా మళ్ళీ దాని నుండి బయటకు తీయబడతాడు. కర్మలు విశ్వాసంలో వస్తాయి. విశ్వాసం సత్కర్మల ద్వారా పెరుగుతుంది. దుష్కర్మల ద్వారా తరుగుతుంది. కొందరు దీనికి భిన్నాభిప్రాయంలో పడిఉన్నారు. కాని వారు తప్పులో ఉన్నారు.
87- అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః నేనొకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళాను. ఆ సమయంలో ఆయన తెల్లదుప్పటి కప్పుకొని గాఢంగా నిద్రపోతున్నారు. నేను మళ్ళీ వచ్చి చూస్తే ఆయన పడుకునే ఉన్నారు. మళ్ళీ వచ్చి చూశాను ఆయన మేల్కొని ఉన్నారు. నేను ఆయన సమక్షంలో కూర్చున్నాను. అప్పుడాయన (నన్ను చూసి) “అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని సాక్ష్యమిచ్చి, అదే మాటపై చనిపోయే దాకా నిలకడగా ఉండేవారు తప్పకుండా స్వర్గానికి వెళ్తారు” అని అన్నారు. “వ్యభిచారం చేసినా, దొంగతనానికి పాల్పడినా (వారు స్వర్గానికి వెళ్తారా?)” అని నేనడిగాను. “ఔను, వ్యభిచారం చేసినా, దొంగతనానికి ఒడిగట్టినా సరే వెళ్తారు” అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. నేను ఆశ్చర్యపోతూ “ఏమిటీ, వ్యభిచారం, దొంగతనం లాంటి నేరాలు చేసి ఉన్నా (స్వర్గానికి వెళ్తారా?)” అని అడిగాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “వ్యభిచారం, దొంగతనం చేసి ఉన్నా సరే” అని మూడు సార్లు చెప్పి నాల్గవ సారి చెప్పారుః “అబూ జర్ర్ తన ముక్కుకు మన్ను తగిలించుకున్నా సరే!” (అంటే ఈ విషయాలు అబూ జర్ర్ కు ఎంత ఆందోళన కలిగిస్తున్నా సరే) అని చెప్పారు.
ఈ హదీసులో:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ అనుచర సంఘం పట్ల చాలా ప్రేమ, వాత్సల్యం గలవారు.
ఘోరపాపానికి పాల్పడిన వ్యక్తి దాన్ని హలాల్ గా నమ్మితే తప్ప కాఫిర్ కాడు. మువహ్హిద్ (ఏ మాత్రం అల్లాహ్ కు భాగస్వామి కల్పించని ఏకదైవారాధకుడు) పాపాత్ముడు, ఎన్నటికైనా స్వర్గంలో చేరి తీరుతాడు. తౌహీద్ పాపాల పరిహారంలో అతి గొప్పది. ఇస్లాం ధర్మాన్ని త్యజించినవాని సర్వ సత్కార్యాలు వ్యర్థమవుతాయి.
అంతిమ క్రియను బట్టి లెక్క ఉంటుంది. ఏదైనా సమస్యకు పరిష్కారం ఆలింతో కోరడం, సందిగ్ధంగా ఉన్న విషయాన్ని మరీ తెలుసుకోవడం మంచిది. శిష్యుడి ఉద్దేశ్యాన్ని గ్రహించుటకు గద్దించనూవచ్చు.
88- అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ప్రవక్తా! ప్రళయదినాన మీ సిఫారసుకు అర్హత పొందే మహా అదృష్టవంతుడెవడు? అని నేనడిగాను. దానికాయన ఇలా చెప్పారుః “ఈ విషయం గురించి నీకంటే ముందు మరెవ్వరు అడగరు అని నేననుకున్నాను. ఎందుకంటే నీలో హదీసుల పట్ల కాంక్ష, శ్రద్ధ ఎక్కువ ఉంది. (అయితే వినుః) ప్రళయదినాన నా సిఫారసును పొందే అదృష్టవంతుడు తన హృదయాంతర స్వచ్చతతో “లాఇలాహ ఇల్లల్లాహ్” చదివినవాడు”. (బుఖారి 99).
ఈ హదీసులో:
మువహ్హిదీన్లకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు లభించును. వారిలో ఘోరపాపాలకు పాల్పడిన వారికి కూడా లభించును. మునాఫిఖులకు ఈ అదృష్టం లభించదు. వారు “లాఇలాహ ఇల్లల్లాహ్” పలికినా, అందులో సత్యత మరియు స్వచ్ఛత ఉండదు గనుక. ప్రవక్త అనుచరలకు ఆయన సిఫారసు లభించునని ఈ హదీసు గొప్ప ఆధారం. ఇందులో “లాఇలాహ ఇల్లల్లాహ్” ఘనత తెలిసింది. అది సర్వ కర్మలకు మూలమైనది. హదీసుల, ధర్మ విద్య కాంక్ష యొక్క ఘనత తెలిసింది. అబూ హురైర రజియల్లాహు అన్హు ఘనత మరియు హదీసులో ఆయనకు ఉన్న అధిక కాంక్ష గురించి తెలిసింది.
89- జరీర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: “ఇప్పుడు మీరు చంద్రుడ్ని ఎలా స్పష్టంగా చూస్తున్నారో అదే విధంగా త్వరలోనే (ప్రళయదినాన) మీ ప్రభువుని చూస్తారు. ఆయన్ని చూడడంలో మీకు ఎలాంటి ఆటంకం ఉండదు. అందువల్ల మీరు సూర్యోదయానికి ముందు ఉన్న (ఫజ్ర్) నమాజును, సూర్యాస్తమ- యానికి ముందు ఉన్న (అస్ర్) నమాజును చేయడంలో వీలయినంత వరకు మీ ముందు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా ఉండేలా కృషి చేయండి (అశ్రద్ధ, అలసత్వాలకు ఏ మాత్రం తావీయకండి)”. (బుఖారి 554, ముస్లిం633).
ఈ హదీసులో:
ప్రళయదినాన విశ్వాసులకు అల్లాహ్ దర్శనం లభించునని ఇందులో ఆధారం ఉంది. వారు తమ ప్రభువును ఎంత స్పష్టంగా చూస్తారో దాని ఉదాహరణ చంద్ర దర్శనం ద్వారా ఇవ్వబడింది. చంద్రుని ఉదాహరణ అల్లాహ్ తో ఇవ్వబడుతుందన్న భావం కాదు. అల్లాహ్ దర్శనానికి తోడ్పడు సాధనాల్లో ఒకటి నమాజు. వాటిలో ఫజ్ర్ మరియు అస్ర్ నమాజులు అతి ముఖ్యమైనవి. ఈ చల్లని వేళలో గల నమాజులను కాపాడినవాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. చల్లని వేళల్లో గల నమాజులంటే ఫజ్ర్ మరియు అస్ర్. ఎందుకనగా అవి నిద్ర మరియు అలసట వేళలు. సత్కార్యాలు సర్వ మేళ్ళకు ముఖ్య సబబు. అల్లాహ్ దర్శన భాగ్యం సర్వానుగ్రహాల్లో అతి గొప్పది. అల్లాహ్ మనందరికీ తన దర్శనం ప్రసాదించుగాక. ఆమీన్!
90- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని ఉబాద బిన్ సామిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “నిశ్చయంగా మీరు మరణించిన తర్వాత గాని మీ ప్రభువును చూడలేరు”. (నిసాయి కుబ్రా, సహీహుల్ జామి 2459).
ఈ హదీసులో:
అల్లాహ్ ను ఇహలోకంలో చూడలేము అనడానికి ఇది గొప్ప నిదర్శనం. ఆయన దర్శనం పరలోకంలోనే సాధ్యం. ఆయనను విశ్వాసులు మాత్రమే చూడగలుగుతారు. ఆయనకు శత్రువులుగా, అవిశ్వాసులుగా ఉన్నవారికి ఈ భాగ్యం లభించదు. ప్రళయదినాన అల్లాహ్ దర్శనాన్ని నమ్మని కొందరి బిద్అతీల ఖండన కూడా ఇందులో ఉంది. ఎలా అనగా విశ్వాసులు చనిపోయాక, వారికి అల్లాహ్ దర్శనం కల్గునని ఇందులో రుజువైంది.
91- అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కొంత మంది “దైవ ప్రవక్తా! ప్రళయదినాన మేము మన ప్రభువును చూస్తామా?” అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అవును” అని సమాధానం ఇచ్చి ఇలా ఎదురు ప్రశ్న వేశారుః “మిట్ట మధ్యాహ్నం ఏ మాత్రం మేఘం లేని వేళ సూర్యుడిని చూడడంలో మీకేమైనా ఇబ్బంది కలుగుతుందా? అలాగే మేఘాలు లేని పౌర్ణమి రాత్రి చంద్రుడ్ని చూడడంలో మీకేమైనా ఇబ్బందా?” “లేదు ప్రవక్తా!” అని వారు సమాధానం పలికారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “ప్రళయదినాన శుభప్రదుడైన, మహోన్నతుడైన అల్లాహ్ ను దర్శించడంలో ఏ ఇబ్బందీ ఉండదు. ఏదైనా ఉంటే ఆ రెండిట్లో ఒకదాన్ని చూడడంలో కలిగినంత ఇబ్బంది మాత్రమే ఉంటుంది. (మళ్ళీ ఇలా చెప్పారుః) ప్రళయదినాన ఒక ప్రకటనకర్త (దైవదూత) “ఏ వర్గం వారు ఎవరిని ఆరాధిస్తూ ఉండేవారో వారంతా అతని వెనుక ఉండండి” అని ప్రకటిస్తాడు. పరిశుద్ధుడైన అల్లాహ్ ను కాకుండా ఇతరులను అంటే విగ్రహాలను, మూర్తులను పూజించేవారిలో ఏ ఒక్కడు మిగలకుండా అందరూ నరకంలో పడిపోతారు. చివర్లో సదాచారులు, దురాచారులైన అల్లాహ్ ను ఆరాధించేవారు మరియు గ్రంథప్రజలలో కూడా కొందరు మిగిలిపోతారు. అప్పుడు యూదులను పిలవడం జరుగుతుంది. “మీరు ఎవరిని ఆరాధిస్తూ ఉండేవారు?” అని ప్రశ్నించబడుతుంది. “మేము ఉజైరును అల్లాహ్ కుమారుడిగా (విశ్వసిస్తూ) ఆయన్నే పూజిస్తూ ఉండేవారం” అని వారంటారు. వారికి ఇలా సమాధానం ఇవ్వబడుతుందిః “మీరు అబద్ధం పలికారు. అల్లాహ్ ఎవరినీ భార్యాగాగానీ, సంతానంగాగానీ చేసుకోలేదు. సరే మీరేం కోరుతున్నారు?” అని అడగబడుతుంది. “మాకు దాహం కలుగుతుంది”, ఓ మా ప్రభూ! త్రాగడానికేదైనా మాకు ప్రసాదించు” అని కోరుతారు. “(త్రాగడానికి) రేవు వద్దకు వెళ్ళరేమిటి అని వారికి సైగ చేయబడుతుంది. మళ్ళీ వారిని నరకం వైపునకు పోగు చేయబడుతుంది. అది (చూసేవారికి) ఎండమావులా (కనిపిస్తుంది). నరకంలోని ఒక భాగం మరొక భాగాన్ని నుజ్జు నుజ్జు చేసేస్తుంది. వారు అందులో పడిపోతారు. మళ్ళీ క్రైస్తవులను పిలువడం జరుగుతుంది. “మీరు ఎవరిని ఆరాధిస్తూ ఉండేవార”ని ప్రశ్నించ బడుతుంది. “మేము (యేసు) మసీహ్ ని అల్లాహ్ కుమారునిగా విశ్వసిస్తూ ఆయన్నే ఆరాధిస్తూ ఉండేవారము” అని వారు సమాధానమిస్తారు. “మీరు అసత్యం పలికారు. అల్లాహ్ ఎవరినీ తనకు భార్యగా, సంతానంగా చేసుకోలేదు”. “సరే మీరేమి కోరుతున్నారు” అని అడిగినప్పుడు, “మాకు దాహం కలుగుతుంది. ఓ మా ప్రభూ! త్రాగడానికి మాకేదైనా ప్రసాదించు” అని వారంటారు. (త్రాగడానికి) రేవు మీదికి వెళ్ళరేమిటి అని వారికి సైగ చేయబడుతుంది. మళ్ళీ వారిని నరకం వైపునకు పోగు చేయడం జరుగుతుంది. అది చూసేవారికి ఎండమావులా కనిపిస్తుంది. దాని ఒక భాగం మరో భాగాన్ని నుజ్జు నుజ్జు చేసేస్తుంది. అందులో వారు పడిపోతారు. ఆ తర్వాత అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తూ ఉండేవారు మిగిలిపోతారు. వారిలో సజ్జనులూ ఉంటారు, దుర్జనులూ ఉంటారు. పరిశుద్ధుడైన, మహోన్నతుడైన సర్వలోకాల ప్రభువు, వారు ఇంతకు ముందు చూసిన రూపానికి (భిన్నంగా, కాని దానికి) ఇంచుమించు రూపంలో వారి ముందు ప్రత్యక్షమయి, “మీరు దేనికై వేచి ఉన్నారు, ప్రతి వర్గం, వారు ఆరాధించే దాని వెంట వెళ్ళారు కదా?” అని మందలిస్తాడు. వారంటారుః “ఓ ప్రభూ! మేము ప్రపంచంలో అందరికంటే ఎక్కువ అవసరం గలవారము అయినప్పటికీ ఆ ప్రజల్ని విడనాడాము. వారి వెంట ఉండలేదు”. (ఇప్పుడు ఎందుకని మేము వారి వెంట వెళ్తాము). “నేనే మీ ప్రభువుని” అని అంటాడు అల్లాహ్. “నీ నుండి మేము అల్లాహ్ శరణు కోరుతాము. మేము ఎవరినీ అల్లాహ్ కు సాటి కల్పము” అని రెండు లేక మూడు సార్లు అంటారు వారు. కొందరైతే తిరుగు ముఖం పెట్టబోతారు. అప్పడు అల్లాహ్ “ఆయన పరిచయానికి మీకు ఆయనకు మధ్య ఏదైనా గుర్తు ఉందా” అని అడుగుతాడు. వారంటారుః “అవును”. అప్పుడు కాలి పిక్క చూపించబడుతుంది. (దాన్ని చూసి) తనకు తాను (ఇష్టపూర్వకంగా ప్రపంచంలో) సజ్దా చేస్తూ ఉండేవారిలో ఏ ఒక్కడు మిగలకుండా అందరూ అల్లాహ్ అనుమతితో సజ్దా చేస్తారు. పేరు కొరకు మరియు తప్పించుకొనుటకు (ప్రపంచంలో) సజ్దా చేస్తూ ఉండేవారి నడుములను అల్లాహ్ బల్ల మాదిరిగా చేసేస్తాడు. వారు సజ్దా చేయడానికి వంగినప్పుడల్లా వెనకకు పడిపోతారు. మళ్ళీ తమ తల లేపుతారు. అప్పటికీ అల్లాహ్ రూపం మారిపోయి వారు మొదటిసారి దర్శించినట్లుగా అయిపోతుంది. “నేను మీ ప్రభువుని” అని అంటాడు. “(అవును) నీవు మా ప్రభువు” అని వారంటారు. ఆ తరువాత నరకం మీద వంతెన నిర్మించబడుతుంది. సిఫారసు చేయుటకు అనుమతి లభిస్తుంది. (వంతెనను చూసి ప్రవక్తలు) “అల్లాహ్ రక్షించు, రక్షించు” అని అంటారు. “ప్రవక్తా! వంతెన సంగతేమిటి? అని అక్కడున్నవారు అడిగారు. దానికి ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారుః “అదొక (భయంకరమైన) జారుడు చోటు. దాని మీద మొనదేలిన కొండీలు వంటి పెద్ద పెద్ద ముళ్ళు లేచి ఉంటాయి. ఇవి నజ్ద్ ప్రాంతంలో ఉండే సాదాన్ చెట్ల ముండ్ల మాదిరిగా చాలా పొడవుగా, లావుగా లేచి ఉంటాయి. విశ్వాసులు రెప్ప పాటులో, మెరుపు వేగంతో, తూఫాను వేగంతో, వేగంగా పరుగెత్తే గుర్రాల్లా, వాహనాల్లా దాటిపోతారు. వారిలో కొందరు ఎలాంటి ప్రమాదం లేకుండా క్షేమంగా బయటపడతారు. మరికొందరు తీవ్రంగా గాయపడి నరకంలో పడకుండా దాటిపోతారు. ఇంకొందరు తీవ్ర గాయాలకు గురై నరకంలో పడిపోతారు. చివరికి నరకంలో పడకుండా మిగిలేది విశ్వాసులే. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షి! మీకు ఒకరి నుండి రావలసిన హక్కును గురించి ఎంత గట్టిగా అడుగుతారో, అంతకంటే మరీ ఎక్కువగా నరకంలో పడిపోయిన తమ విశ్వాస సోదరుల్ని కాపాడేందుకు (స్వర్గంలో ఉన్న) విశ్వాసులు ప్రళయదినాన అల్లాహ్ తో పరివిధాలా ప్రార్థిస్తారు. వారు ఇలా అంటారుః “ప్రభువా! వారు మాతో పాటు ఉపవాసాలు పాటించేవారు, నమాజు చేసేవారు మరియు హజ్ చేసేవారు”. “మీకు గుర్తున్నవారిని తీయండి” అని ఆదేశం వస్తుంది. అప్పుడు వారు అనేక మందిని నరకం నుండి బైటికి తీస్తారు. అప్పటికీ నరకాగ్ని వారిని పిక్కల వరకు మరియు మొకాళ్ళ వరకు పట్టి ఉంటుంది. కాని వారి ముఖాల వైపు అగ్ని నిషేధించబడుతుంది. (అది వారి ముఖాలను కాల్చదు). మళ్ళీ వారంటారుః “ప్రభువా! ఎవరి గురించి నీ ఆదేశముండెనో వారిలో ఏ ఒక్కరూ మిగల లేదు”. అల్లాహ్ అంటాడుః “తిరిగి వెళ్ళండి, ఎవరి హృదయంలో ఒక దీనారు విలువంత విశ్వాసముందో వారిని నరకం నుండి తీయండీ”. వారు చాలా మందిని వెలికి తీసి, మళ్ళీ అల్లాహ్ వద్దకు వచ్చి “ప్రభువా! నీవు ఆదేశించినవారిలో ఏ ఒక్కరినీ వదలకుండా అందర్నీ వెలికి తీశాము” అని విన్నవించుకుంటారు. “సరే వెళ్ళండి, ఎవరి హృదయంలో అర్థ దీనారంత విశ్వాసముందో వారిని కూడా బయటికి తీయండి” అని అల్లాహ్ ఆదేశిస్తాడు. వారు అనేక మందిని బైటికి తీసి, “ప్రభువా! నీవు ఆదేశించిన- వారిలో అందర్నీ తీసేశాము. ఏ ఒక్కడూ మిగలలేదు” అని విన్నవించుకుంటారు. అప్పడు కూడా “మీరు తిరిగి వెళ్ళండి, హృదయంలో అణుమాత్రం విశ్వాసమున్నవారిని కూడా నరకం నుండి వెలికితీయండ”ని అల్లాహ్ ఆదేశమిస్తాడు. వారు చాలా మందిని దాని నుండి వెలికితీసి, “ప్రభువా! ఇక ఏ ఒక్క విశ్వాసి కూడా అందులో మిగిలిలేడు” అని వారు విన్నవించుకుంటారు. అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు చెప్పారుః “మీరు ఈ మాటను నమ్మలేకపోయినట్లయితే, ఖుర్ఆనులోని ఈ వాక్యం చదవండిః అల్లాహ్ ఎవరి పట్లా అణు మాత్రం అన్యాయం కూడా చెయ్యడు. ఎవరైనా ఒక మంచి పని చేస్తే, దానిని అల్లాహ్ రెండింతలు చేస్తాడు. ఇంకా తన తరఫు నుండి పెద్ద ప్రతిఫలం కూడా ప్రసాదిస్తాడు[. (4: 40). అప్పడు అల్లాహ్ అంటాడుః దైవదూతలు సిఫారసు చేశారు, ప్రవక్తలు సిఫారసు చేశారు మరియు విశ్వాసులు కూడా సిఫారసు చేశారు. ఇక అనంత కరుణామయుడు మాత్రం మిగిలి- యున్నాడు. అప్పుడు అల్లాహ్ ఒక గుప్పెడు మందిని నరకం నుండి బైటికి తీస్తాడు. వారు ఎప్పుడూ ఏ సత్కార్యం చేసి ఉండరు. నరకంలో కాలి కాలి బొగ్గుగా మారిపోతారు. వారిని తీసి స్వర్గం అంచున ఉన్న ఒక సెలయేరులో పడవేస్తాడు. దానిని “జీవన నది” అనబడుతుంది. ఆ సెలయేరులో పడగానే, నది ఒడ్డు మీద విత్తనాలు మొలకెత్తి సస్యశ్యామలమైనట్లు వారు (నూతన శక్తి సౌందర్యాలతో నవనవలాడుతూ లేస్తారు). చెట్ల ప్రక్కనో, రాళ్ళ ప్రక్కనో విత్తనాలు మొలకెత్తడాన్ని మీరు చూడలేదా? అలా మొలకెత్తే మొక్కల్లో ఎండ తగిలే మొక్కలు పచ్చగా ఉంటాయి. ఎండ తగలకుండా నీడ పడే మొక్కలు పాలిపోతాయి”. ప్రవక్తా! మీరు పచ్చికబయలల్లో మేపుటకు వెళ్ళినట్లుంది? అని సహచరులు అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “వారు సెలయేరు నుండి ముత్యాల్లా మెరిసిపోతూ బయటికి వస్తారు. వారి మెడల మీద ముద్ర ఉంటుంది. “అల్లాహ్ నుండి విముక్తి పొందిన వారు వీరే, వీరు ఏ సత్కార్యం చేయకపోయినా, ఏ మంచి చేసి ముందుకు పంపించుకోకపోయిన అల్లాహ్ వీరిని స్వర్గంలో ప్రవేశింపజేశాడు” అని స్వర్గవాసులు గుర్తు పడతారు. మళ్ళీ అల్లాహ్ ఇలా అంటాడుః మీరు స్వర్గంలో ప్రవేశించండి. మీరు చూస్తున్నదంతా మీదే. వారంటారుః “ప్రభూ! మీరు మాకొసంగినంత సర్వలోకాల్లో ఎవరికీ నొసంగలేదు”. “మీ కొరకు దీనికంటే మరీ ఉత్తమమైనది నా వద్ద ఉంది” అని అల్లాహ్ అంటాడు. “ఇంతకంటే ఉత్తమమైనది మరేముంటుంది, ప్రభూ!” అని వారంటారు. “అది నా సంతోషం. ఇక నుండి నేను ఎన్నడూ మీ మీద ఆగ్రహించను” అని అల్లాహ్ అంటాడు”. (ముస్లిం 183, బుఖారి 7439).
ఈ హదీసులో:
ప్రళయదినాన విశ్వాసులకు అల్లాహ్ దర్శనం లభించునన్న గొప్ప నిదర్శనం ఉంది. అల్లాహ్ యొక్క కాలి పిక్క చూపించబడునని రుజువైనది. ఇందులో ఎలా వచ్చి ఉందో అలాగే విశ్వసించడం మన కర్తవ్యం. ఎలాంటి తష్ బీహ్, తమ్ సీల్ లేకుండా నమ్మాలి. ]ఆయనను పోలినది ఏదీ లేదు. ఆయన వినువాడు, అన్నీ చూచువాడు[. (42: 11).
అల్లాహ్ ను గాకుండా ఇతరులను ఆరాధ్యదైవంగా చేసుకున్న వారి తప్పు, దుర్మార్గం స్పష్టంగా తెలిసింది.
తౌహీదును పాటించిన (ఏ మాత్రం షిర్క్ చేయని) పాపాత్ములు శాశ్వతంగా నరకంలో ఉండరు. ఘోరపాపాలకు పాల్పడినవారిని అల్లాహ్ క్షమించకున్నట్లయితే వారు శిక్షించబడుతారు.
ప్రదర్శనాబుధ్ధి భయంకరమైనదని, అది చిన్నపాటి నిఫాఖ్ (మునాఫిఖుల గుణం) అని తెలిసింది. ప్రదర్శనా బుద్ధితో చేసిన ప్రతి సత్కార్యం వ్యర్థమవుతుంది. అది నమాజు, రోజా మరియు హజ్ లాంటి ఏ ఆరాధనైనా సరే. బాహ్య కర్మలను బట్టే ప్రపంచంలో వ్యవహారం ఉండును, కాని వారి అంతర్యాలు అల్లాహ్ గుర్తెరుగును.
దైవదూతలు, ప్రవక్తలు మరియు విశ్వాసులు సిఫారసు చేస్తారని రుజువైనది. అల్లాహ్ సంతృప్తి చెందుతాడు. ఆగ్రహపడు తాడు. అంటే అల్లాహ్ తన స్నేహితులతో సంతృప్తి చెందుతాడు. తన శత్రువులతో ఆగ్రహించుకుంటాడు. ఈ రెండు గుణాలు కూడా అల్లాహ్ గౌరవానికి తగినట్లుగా ఉంటాయని విశ్వసించాలి.
నరకంపై వంతెన వేయబడునని నమ్మాలి. కర్మల ప్రకారం దాని నుండి దాటడం జరుగుతుంది.
పవిత్రుడు, పరిశుద్ధుడయిన అల్లాహ్ కు ముఖము ఉందని రుజువైనది. అది ఆయన గౌరవానికి తగినట్లుగా ఉంటుంది. సృష్టిరాసుల ముఖాల మాదిరిగా కాదు.
అగోచర మరియు పరలోక విషయాలు సరిగ్గా అర్థం కావడానికి ప్రజలు తమ జీవితంలో గోచరించే వాటితో పోలిక ఇవ్వడం కూడా రుజువైంది.
([1]) హన్తమ్:- పచ్చ లేక ఎర్ర రంగు మట్టి కడవను అంటారు. దీనికి మూతి పై భాగాన కాకుండా ప్రక్క భాగాన ఉంటుంది. మట్టిలో రక్తం, వెండ్రుకలు కలిపి ఈ కడవను తయారు చేస్తారు. లేదా లక్క, గాజు కలిపిన ఎరుపు రంగు పూయబడిన కడవను కూడా అంటారు. దుబ్బా:-పాత్రగా ఉపయోగించే గుండ్రని సొరకాయ. నఖీర్:-ఖర్జూరపు చెట్టు వేరులో గుంట చేసి దాన్ని మధుపాత్రగా ఉపయోగిస్తారు. ముజఫ్ఫత్:-ఉమ్మినీటితో పూత పూసి చేసిన మట్టి పాత్ర. ముఖయ్యర్:-చర్మాన్ని ఎండబెట్టి, కాల్చి ఒక విధమైన పూతను తయారు చేస్తారు, ఆ పూతతో చేయబడిన పాత్రను ముఖయ్యర్ అంటారు.
([2]) ఆ సమయాన అబూ సుఫ్యాన్ ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. కాని ఆయిజ్ బిన్ అమ్ర్ అప్పటికే ఇస్లాం స్వీకరించిఉన్నారు.
([3]) “రుబూబియత్” అంటే అల్లాహ్ మాత్రమే సృష్టికర్త, పోషకుడు, జీవన్మరణాల ప్రధాత, సర్వ జగత్తు నిర్వాహకుడు అని, “ఉలూహియత్” అంటే సర్వ ఆరాధనలకు అల్లాహ్ మాత్రమే అర్హుడు అని, “అస్మా వసిఫాత్” అంటే ఆయనకు ఉత్తమ పేర్లు, ఉన్నత గుణముల గలవని విశ్వసించాలి.
([4])‘తహ్రీఫ్’ అంటేః ఏ ఆధారము లేకుండా నామగుణాల భావాన్ని మార్చుట. తారుమారు చేయుట. ‘తఅతీల్’ అంటేః అల్లాహ్ గుణనామాలన్నిటిని లేదా కొన్నిటిని తిరస్కరించుట. అల్లాహ్ ను నిరాకారునిగా నమ్ముట. ‘తక్యీఫ్’ అంటేః అల్లాహ్ గుణాలను మాట, ఊహ ద్వారా ఏదైనా ఒక రూపం ఇచ్చే ప్రయత్నం చేయుట. అల్లాహ్ చేయి అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని అనుట. ‘తమ్ సీల్‘ అంటేః అల్లాహ్ గుణాలను సృష్టి గుణాలతో పోల్చుట. లేదా సృష్టి గుణాల మాదిరిగా ఉంటాయని విశ్వసించుట.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. (అతడన్నాడు): “మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి, మిథ్యదైవా(తాగూత్)ల ఆరాధనను త్యజించండి”. (నహ్ల్ 16:36).
“(ప్రవక్తా వారికి చెప్పు): రండి, మీ ప్రభువు మీపై నిషేధించినవి ఏవో మీకు చదివి వినిపిస్తానుః మీరు ఆయనకు ఏలాంటి భాగస్వాములను కల్పించకండి”. (అన్ఆమ్ 6:151).
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారుః ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ ముద్ర వేసి ఇచ్చిన ఆదేశాలను చూడదలుచుకున్నవారు పైన పేర్కొనబడిన ఆయతును (6:151) చదవాలి.
హజ్రత్ ముఆజ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, నేను ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనక గాడిదపై ప్రయాణం చేస్తున్నాను. -ఆ గాడిద పేరు ‘ఉఫైర్’-అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఓ ముఆజ్! దాసుల మీద అల్లాహ్ హక్కు, అల్లాహ్ మీద దాసుల హక్కు ఏముందో నీకు తెలుసా?”అని అడిగారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అని నేను సమాధానం ఇచ్చాను. అప్పుడు ఆయన ఇలా అన్నారుః “దాసుల మీద ఉన్న అల్లాహ్ హక్కు ఏమిటంటే; వారు అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి, ఆయనకు ఎవరినీ భాగస్వామిగా కల్పకూడదు. మరియు అల్లాహ్ మీదున్న దాసుల హక్కు ఏమిటంటే; ఆయనకు ఎవరినీ భాగస్వామిగా కల్పనివారిని ఆయన శిక్షించకూడదు”. అయితే ప్రవక్తా! నేను ఈ శుభవార్త ప్రజలకు తెలియజేయనా? అని అడిగాను. దానికి ఆయన “ఇప్పుడే వారికీ శుభవార్త ఇవ్వకు, వారు దీని మీదే ఆధారపడిపోయి (ఆచనణ వదులుకుంటారేమో)”అని చెప్పారు. (ముస్లిం 30, బుఖారి 5967).
ముఖ్యాంశాలు
జిన్నాతులను, మానవులను ఉద్దేశపూర్వకంగా సృష్టించడం జరిగింది, హేతువురహితంగా కాదు.
తొలిఆయతులో ‘ఆరాధన’ అన్న పదానికి అర్థం తౌహీద్ (అంటే ఏ భాగస్వామ్యం లేకుండా ఏకైక అల్లాహ్ ను మాత్రమే ఆరాధించడం). ఎలా అనగా (ప్రవక్తలకు వారి జాతికి మధ్య వచ్చిన అసలు) వివాదం ఇందులోనే([1]).
ఏ భాగస్వామ్యం లేకుండా అల్లాహ్ ను మాత్రమే ఆరాధించనివాడు అల్లాహ్ ఆరాధన చేయనట్లు. ఈ భావమే ఈ ఆయతులో ఉందిః “నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు”. (కాఫిరూన్ 109:3).
ప్రవక్తలను ఉద్దేశపూర్వకంగా పంపడం జరిగింది.
ప్రతి సమూదాయంలోనూ ప్రవక్తలు వచ్చారు.
ప్రవక్తలందరి ధర్మం ఒక్కటే.
అతిముఖ్యవిషయం (దీని పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం), అదేమిటంటే: మిథ్యదైవా(తాగూత్)లను తిరస్కరించనిదే అల్లాహ్ ఆరాధన కానేకాదు. ఈ భావమే సూరె బఖర (2:256)లోని ఈ ఆయతులో ఉందిః “కనుక ఎవరయితే మిథ్యదైవా(తాగూత్)లను తిరస్కరించి అల్లాహ్ను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు”.
అల్లాహ్ తప్ప ఎవరెవరు పూజింపబడుతున్నారో (వారు దానికి ఇష్టపడి ఉన్నారో) వారందరూ తాగూత్ లో పరిగణింపబడతారు.
పూర్వీకుల వద్ద సూరె అన్ఆమ్ (6:151-153)లోని మూడు స్పష్టమైన (ముహ్కమ్) ఆయతుల ఘనత చాల ఉండింది. వాటిలో పది బోధనలున్నాయి. తొలి బోధన షిర్క్ (అల్లాహ్ కు ఇతరులను భాగస్వామిగా చేయడం) నుండి నివారణ.
సూరె బనీ ఇస్రాఈల్ (17:22-39)లో స్పష్టమైన పద్దెనిమిది బోధనలున్నాయి. అల్లాహ్ వాటి ఆరంభము ఇలా చేశాడుః
హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు గారి ఘనత కూడా తెలుస్తుంది.
తాత్పర్యం
ఈ అధ్యాయం పేరు ‘కితాబుత్ తౌహీద్’ (ఏకత్వపు అధ్యాయం). ఈ పేరు, మొదటి నుండి చివరి వరకు ఈ పుస్తకంలో ఏముందో దానిని తెలియపరుస్తుంది. అందుకే ప్రత్యేకంగా ‘ఖుత్బా[3]’ ప్రస్తావన రాలేదు. అంటే ఈ పుస్తకంలో ఏకదైవారాధన, దాని ఆదేశాలు, హద్దులు, షరతులు, ఘనతలు, ప్రమాణాలు, నియమాలు, వివరాలు, ఫలములు, కర్తవ్యములు, ఇంకా దానిని బలపరిచే, పటిష్టం చేసే, బలహీన పరిచే, సంపూర్ణం చేసే విషయాలన్నీ ప్రస్తావించబడ్డాయి.
తౌహీద్ అంటే ఏమిటో తెలుసుకోండిః సంపూర్ణ గుణాలు గల ప్రభువు (అల్లాహ్) ఏకైకుడు అని తెలుసుకొనుట, విశ్వసించుట ఇంకా వైభవం గల గొప్ప గుణాల్లో ఆయన అద్వితీయుడని మరియు ఆయన ఒక్కడే సర్వ ఆరాధనలకు అర్హుడని ఒప్పుకొనుట.
తౌహీద్ మూడు రకాలు
ఒకటి: తౌహీదుల్ అస్మా వ సిఫాత్
అల్లాహ్ ఘనమైన, మహా గొప్ప గుణాలుగల అద్వితీయుడు అని ఆయన గుణాల్లో ఎవనికి, ఏ రీతిలో భాగస్వామ్యం లేదు అని విశ్వసించుట. అల్లాహ్ స్వయంగా తన గురించి తెలిపిన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ గురించి తెలిపిన గుణనామములు, వాటి అర్థ భావాలు, వాటికి సంబంధించిన ఆదేశాలు ఖుర్ఆన్, హదీసులో వచ్చిన తీరు, అల్లాహ్ కు తగిన విధముగా నమ్మాలి. ఏ ఒక్క గుణనామాన్ని తిరస్కరించవద్దు, నిరాకరించవద్దు, తారుమారు చేయవద్దు, ఇతరులతో పోల్చవద్దు.
ఏ లోపాల, దోషాల నుండి పవిత్రుడని అల్లాహ్ స్వయం తన గురించి, లేదా ప్రవక్త అల్లాహ్ గురించి తెలిపారో వాటి నుండి అల్లాహ్ పవిత్రుడని నమ్మాలి.
రెంవది: తౌహీదుర్ రుబూబియత్
సృషించుట, పోషించుట, (సర్వజగత్తు) నిర్వహణములో అల్లాహ్ యే అద్వితీయుడని విశ్వసించుట. సర్వసృష్టిని అనేక వరాలు ఇచ్చి పోషించేది ఆయనే. ఇంకా తన సృష్టిలోని ప్రత్యేకులైన –ప్రవక్తలు, వారి అనుచరుల- వారికి నిజమైన విశ్వాసం, ఉత్తమ ప్రవర్తన, లాభం చేకూర్చే విద్య, సత్కార్యాలు చేసే భాగ్యాం ప్రసాదించి అనుగ్రహిస్తున్నది ఆయనే. ఈ శిక్షణయే హృదయాలకు, ఆత్మలకు ప్రయోజనకరమైనది, ఇహపరాల శుభాల కొరకు అనివార్యమైనది.
మూడవది: తౌహీదుల్ ఉలూహియ్యత్ (తౌహీదుల్ ఇబాదత్)
సర్వసృష్టి యొక్క పూజ, ఆరాధనలకు అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమేనని తెలుసుకోవాలి, నమ్మాలి. ప్రార్థనలన్నీ చిత్తశుద్ధితో, ఆయన ఒక్కనికే అంకితం చేయాలి. ఈ చివరి రకములోనే పైన తెలుపబడిన రెండు రకాలు ఆవశ్యకముగా ఇమిడి ఉన్నాయి. ఎందుకంటే తౌహీదుల్ ఉలూహియ్యత్ అన్న ఈ రకంలో తౌహీదుల్ అస్మా వస్సిఫాత్ మరియు తౌహీదుర్ రుబూబియత్ గుణాలు కూడా వచ్చేస్తాయి. అందుకే ఆయన అస్మా వ సిఫాత్ లో మరియు రుబూబియత్ లో అద్వితీయుడు, ఏకైకుడు అయినట్లు ఆరాధనలకు కూడా ఒక్కడే అర్హుడు.
మొదటి ప్రవక్త నుండి మొదలుకొని చివరి ప్రవక్త వరకు అందరి ప్రచార ఉద్దేశం తౌహీదుల్ ఉలూహియ్యత్ వైపునకు పిలుచుటయే.
‘అల్లాహ్ మానవులను ఆయన్ను ఆరాధించుటకు, ఆయన కొరకే చిత్తశుద్ధిని పాటించుటకు పుట్టించాడని మరియు ఆయన ఆరాధన వారిపై విధిగావించబడినది’ అని స్పష్టపరిచే నిదర్శనాలను రచయిత ఈ అధ్యాయంలో పేర్కొన్నారు.
ఆకాశ గ్రంథాలన్నియూ మరియు ప్రవక్తలందరూ ఈ తౌహీద్ (ఏకదైవత్వం) ప్రచారమే చేశారు. మరియు దానికి వ్యతిరేకమైన బహుదైవత్వం, ఏకత్వంలో భాగస్వామ్యాన్ని ఖండించారు. ప్రత్యేకంగా మన ప్రవక్త ముహమ్మ్దద్ సల్లల్లాహు అలైహి వసల్లం.
దివ్య గ్రంథం ఖుర్ఆన్ కూడా ఈ తౌహీద్ గురించి ఆదేశమిచ్చింది, దానిని విధిగావించింది, తిరుగులేని రూపంలో దానిని ఒప్పించింది, చాలా గొప్పగా దానిని విశదపరిచింది, ఈ తౌహీద్ లేనిదే మోక్షం గానీ, సాఫల్యం గానీ, అదృష్టం గానీ ప్రాప్తించదని నిక్కచ్చిగా చెప్పింది. బుద్ధిపరమైన, గ్రాంథికమైన నిదర్శనాలు మరియు దిజ్మండలంలోని, మనిషి ఉనికిలోని నిదర్శనాలన్నియూ తౌహీద్ (ఏకదైవత్వం)ను పాటించుట విధి అని చాటి చెప్పుతాయి.
తౌహీద్ మానవులపై ఉన్న అల్లాహ్ యొక్క హక్కు. అది ధర్మవిషయాల్లో అతిగొప్పది, మౌలిక విషయాల్లో కూడా మరీ మూలమైనది, ఆచరణకు పుణాది లాంటిది. (అంటే తౌహీద్ లేనివాని సదాచరణలు స్వీకరించబడవు).
[1] ప్రవక్తను తిరస్కరించిన మక్కా అవిశ్వాసులు నమాజులు చేసేవారు, హజ్ చేసేవారు, దానధర్మాలు ఇతర పుణ్యకార్యాలు చేసేవారు. కాని అల్లాహ్ కు ఇతరులను భాగస్వాములుగా చేసేవారు. అందుకే అది ఏకదైవారాధన అనబడదు.
[2] భావం ఏమిటంటే: హక్కుల్లోకెల్లా మొట్టమొదటి హక్కు అల్లాహ్ ది. ఏ భాగస్వామ్యం లేకుండా అల్లాహ్ ఆరాధన చేయనివాడు అల్లాహ్ హక్కును నెరవార్చనివాడు. ఈ హక్కు నెరవేర్చకుండా మిగితా హక్కులన్నీ నెరవేర్చినా ఫలితమేమీ ఉండదు.
[3] సామాన్యంగా ప్రతి ధార్మిక పుస్తక ఆరంభం ‘అల్ హందులిల్లాహి నహ్మదుహు….’ అన్న అల్లాహ్ స్తోత్రములతో చేయబడుతుంది
“ఎవరయితే విశ్వసించి, తమ విశ్వాసాన్ని “జుల్మ్” (షిర్క్) తో కలుషితం చేయలేదో, వారికే శాంతి ఉంది. వారు మాత్రమే రుజుమార్గంపై ఉన్నవారు.”(అన్ ఆమ్ 6 : 82).
ఉబాద బిన్ సామిత్ (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:
“(1) అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడని, ఆయన ఒక్కడేనని, 2) ఆయనకు మరెవ్వరూ సాటిలేరని మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన దాసుడు, ప్రవక్త అని; (3) అలాగే ఈసా (అలైహిస్సలాం) కూడా అల్లాహ్ దాసుడు, ఆయన ప్రవక్త అని, కాకపోతే ఆయన హజ్రత్ మర్యం (గర్భం)లో అవతరించిన అల్లాహ్ వాక్కు, అల్లాహ్ యొక్క ఆత్మ అని; (4,5) స్వర్గ నరకాలు ఉన్నాయి అన్నది యదార్ధమని, ఎవడైతే సాక్ష్యమిస్తాడో ఆ వ్యక్తి కర్మలు ఎలాంటివయినా సరే అల్లాహ్ అతడ్ని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు”. (బుఖారి, ముస్లిం).
ఇత్బాన్ (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలాసెలవిచ్చారు:
“అల్లాహ్ సంతృప్తి కొరకు “లాఇలాహ ఇల్లల్లాహ్” చదివే వారిపై అల్లాహ్ నరకం నిషేధించాడు”. (బుఖారి, ముస్లిం).
అబూ సఈద్ ఖుద్రీ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారని:
ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ తో ఇలా విన్నవించుకున్నారు: ‘ఓ అల్లాహ్! నాకు కొన్ని వచనాలు నేర్పు. వాటితో నేను నిన్ను స్మరిస్తాను. నీతో అర్ధిస్తాను”. “ఓ మూసా! “లాఇలాహ ఇల్లల్లాహ్” పలుకు” అని అల్లాహ్ నేర్పాడు. మూసా (అలైహిస్సలాం) అన్నారు: “అల్లాహ్! నీ దాసులందరూ ఇదే వచనముతో స్మరిస్తారు?” “ఓ మూసా! ఏడు ఆకాశాలు, నేను తప్ప అందులో ఉన్న సృష్టి, ఇంకా ఏడు భూములను త్రాసు యొక్క ఒక పళ్లెంలో, “లాఇలాహ ఇల్లల్లాహ్” ను ఇంకొక పళ్లెంలో ఉంచితే “లాఇలాహ ఇల్లల్లాహ్” ఉన్న పళ్లెం క్రిందికి వంగిపోవును” అని అల్లాహ్ (దాని విలువను) తెలిపాడు.
(ఇబ్ను హిబ్బాన్ మరియు హాకిం సేకరించారు. హాకిం నిజపరిచారు).
అల్లాహ్ ఇలా సెలవిచ్చారని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా నేను విన్నాను అని అనస్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“ఓ మానవుడా! నీవు భూమి నిండా పాపాలు చేసినప్పటికీ నాతో మరెవ్వరినీ సాటి కల్పించకుండా (చనిపోయి) నాతో కలిసినప్పుడు, ‘నేను అంతే (భూమి నిండా) క్షమాపణలతో నీతో కలుస్తాను (నిన్ను క్షమిస్తాను).(తిర్మిజి. ఈ హదీసు హసన్).
ముఖ్యాంశాలు:
1. అల్లాహ్ దయ, కరుణ చాలా విశాలమైనది.
2. తౌహీద్ యొక్క పుణ్యం అల్లాహ్ వద్ద చాలా ఎక్కువగా ఉంది.
3. దానితో పాటు అది పాపాలను తుడిచి వేయును.
4. సూరయే అన్‌ఆమ్ లోని ఆయతులో “జుల్మ్” అంటే షిర్క్ అని భావం.
5. ఉబాద బిన్ సామిత్ (రది అల్లాహు అన్హు) హదీసులో ఉన్న ఐదు విషయాల్ని గమనించండి.
6. ఉబాద హదీసు, ఇత్బాన్ హదీసు మరియు అబూ సఈద్ ఖుద్రీ (రది అల్లాహు అన్హుమ్) హదీసులను కలిపితే “లాఇలాహ ఇల్లల్లాహ్ ” యొక్క అసలు అర్ధం నీకు తెలుస్తుంది. మరియు దాని సరియైన భావాన్ని తెలుసు కొనక మోసబోయి తప్పులో పడియున్నవారి విషయం కూడా స్పష్టం అవుతుంది.
7. ఇత్బాన్ హదీసులో ఉన్న షరతు (అల్లాహ్ ఇష్టం కొరకు)పై చాలా శ్రద్ధ వహించాలి.
8. “లాఇలాహ ఇల్లల్లాహ్” ఘనత తెలుసుకునే అవసరం ప్రవక్తలకు సయితం ఉండేది.
9. “లాఇలాహ ఇల్లల్లాహ్” సర్వ సృష్టికన్నా ఎక్కువ బరువుగలదైనప్పటికీ, దాన్ని చదివేవారిలో చాలా మంది యొక్క త్రాసు తేలికగా (విలువలేనిదిగా) ఉండును.
10. ఆకాశాలు ఏడు ఉన్నట్లు భూములు కూడా ఏడు ఉన్నవని రుజువయింది.
11. అందులో కూడా నివసించువారున్నారు. (జీవించువారున్నారు).
12. అల్లాహ్ యొక్క అన్ని గుణగణాలను నమ్మాలని రుజువవుతుంది. కాని “అష్ ఆరీయ్యా” అను ఒక వర్గం వారు కొన్ని గుణగణాలను తిరస్కరిస్తారు.
13. అనస్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసును నీవు అర్థం చేసుకుంటే, ఇత్బాన్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసు: “అల్లాహ్ సంతృప్తి కొరకు “లాఇలాహ ఇల్లల్లాహ్ ” చదివే వారిపై అల్లాహ్ నరకం నిషేధించాడు” లో అది కేవలం నోటితో చదవటం కాదు షిర్కు వదులుకోవాలి అని కూడా అర్ధం చేసుకుంటావు.
14. ఉబాద (రది అల్లాహు అన్హు) హదీసులో ఈసా (అలైహిస్సలాం) మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇద్దరిని “అల్లాహ్ దాసులు, ప్రవక్తలు” అని చెప్పబడింది.
15. ప్రతీది అల్లాహ్ ఆజ్ఞ తోనే పుడుతుంది గనుక అది అల్లాహ్ వాక్కు. కాని ఇక్కడ ప్రత్యేకంగా ఈసా (అలైహిస్సలాం) ను అల్లాహ్ వాక్కు అని చెప్పబడింది .
16. (ఆత్మ అల్లాహ్ యొక్క సృష్టి అయినప్పటికీ) ప్రత్యేకంగా ఈసా (అలైహిస్సలాం) అల్లాహ్ యొక్క ఆత్మ అని చెప్పబడింది.
17. స్వర్గ నరకాలను విశ్వసించు ఘనత కూడా తెలిసింది.
18. ఉబాద హదీసులో “కర్మలు ఏలాంటివైనా సరే” అన్నదానితో (అతడు ఏక దైవోపాసకుడు అయి ఉండుట తప్పనిసరి అనే) భావం తెలుస్తుంది.
19. (ప్రళయదినాన కర్మలు తూకము చేయబడే) త్రాసుకు రెండు పళ్ళాలుండును అని తెలిసింది.
20. ఇత్బాన్ హదీసులో అల్లాహ్ కు “వజ్‌హ్” ఉంది అని వచ్చింది. దాని అర్ధం “ముఖం” (Face).
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ)
తౌహీద్ మానవులందరిపై విధిగా ఉన్నదని మొదటి అధ్యాయంలో తెలుపబడింది. ఇందులో దాని ఘనత, ఔన్నత్యం, దాని మంచి ప్రభావాన్ని మరియు దాని సత్ఫలితాన్ని తెలుపడం జరిగింది. తౌహీద్ లో ఉన్నటువంటి వివిధ ఘనతలు, మంచి ప్రభావాలు మరే దానిలో లేవు. ఇహపరాల మేళ్లు అన్నియూ తౌహీద్ ఫలితము, దాని ఘనత తోనే లభించును. పాపాల మన్నింపు, వాటి విమోచనం కూడా తౌహీద్ ఘనత వలనే. దానికి ఆధారం కూడా పైన తెలుపబడింది. (దాని అనేక ఘనతల్లో కొన్ని క్రింద చూడండి).
1. ఇహపరాల కష్టాలు, విపత్తులు దూరమగుటకు ఇది గొప్ప కారణం.
2.తౌహీద్ హృదయంలో ఆవగింజంత ఉన్నా, అది నరకాగ్నిలో శాశ్వతంగా ఉండకుండా కాపాడుతుంది.
3. అది సంపూర్ణంగా ఉంటే నరక ప్రవేశం నుండే కాపాడుతుంది.
4. తౌహీద్ గల వ్యక్తికి ఇహపర లోకాల్లో సంపూర్ణ సన్మార్గం, పూర్తి శాంతి ప్రాప్తి యగును.
5. అల్లాహ్ సంతృప్తి, దాని సత్ఫలితం పొందుటకు అది ఏకైక కారణం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సిఫారసుకు అర్హుడయ్యే అదృష్టవంతుడు “లాఇలాహ ఇల్లల్లాహ్” నిర్మలమైన మనుస్సుతో చదివేవాడు.
6. బాహ్య, ఆంతర్య, సర్వ మాటల, కర్మల అంగీకారం, వాటి సంపూర్ణత, వాటి సత్ఫలితం తౌహీద్ పై ఆధారపడియుంది. తౌహీద్ లో ఎంత బలం, స్వచ్ఛత ఉంటే, అంతగా ఆ విషయాలు సంపూర్ణం అవుతాయి.
7.సత్కార్యాలు చేయడం, దుష్కార్యాల నుండి దూరముండడం తౌహీద్ మూలంగా సులభమగును. బాధ కలిగినప్పుడు తృప్తి లభించును. తౌహీద్, విశ్వాసంలో అల్లాహ్ కొరకు స్వచ్ఛత చూపేవాడు సత్కార్యాలపై సత్ఫలితం, అల్లాహ్ ప్రసన్నతను ఆశిస్తాడు. కనుక అవి అతనికి చాలా తేలికగా ఏర్పడుతాయి. దుష్కార్యాలపై ఉన్న శిక్షతో భయపడుతాడు కనుక అవి వదలుకోవడం కూడా అతనికిచాలా తేలికగా ఉంటుంది.
8.హృదయాంతరంలో తౌహీద్ సంపూర్ణమయితే అల్లాహ్ వారికి విశ్వాసం పట్ల ప్రేమను కలుగజేస్తాడు, దాన్ని మనోరంజకమైనదిగా చేస్తాడు.అవిశ్వాసం, దుర్మార్గం, అవిధేయతల పట్ల అసహ్యం కలిగేలా చేస్తాడు. అతన్ని సన్మార్గం పొందువారిలో చేర్చుతాడు.
9.ఏ దాసునిలో తౌహీద్, విశ్వాసం సంపూర్ణంగా ఉంటుందో అతడు అసహ్యమైన సంఘటనలను, కష్ట బాధలను ఎంతో విశాలమైన, సంతృప్తికరమైన మనుస్సుతో సహిస్తాడు. అల్లాహ్ వ్రాసి ఉంచిన అదృష్టంపై సంతోషంగా ఉంటాడు.
10) ఇంకా దాని ఘనత: అది మానవ దాస్యం నుంచి అతన్ని విముక్తి కలిగిస్తుంది. అతడు అల్లాహ్ తప్ప ఇతరుల పై ఆధారపడి, వారితో భయపడుతూ ఉండడు. వారి దయదాక్షిణ్యాల వైపు కన్నెత్తి చూడడు. అతడు చేసేది వారి కొరకూ కాదు. వాస్తవానికి ఇదే నిజమైన పరువు ప్రతిష్ట, మాన్యత. దీనితో పాటు అతడు అల్లాహ్ నే ఆరాధిస్తాడు. ఆయనకు తప్ప మరెవ్వరికి భయపడడు. మరెవ్వరితో కరుణను ఆశించడు. ఇలా అతడు సంపూర్ణ సాఫల్యం పొందుతాడు.
11. తౌహీద్ తప్ప ఇంకే దానికీ లభించని ఘనత: అతని మనసులో తౌహీద్, ఇఖ్లాసు తో కూడుకొని సంపూర్ణం అయితే, అతని చిన్న కర్మ కూడా అసంఖ్యాక ఫలితాన్ని పొందుతుంది. అతని మాటల, చేష్టల ఫలితం లెక్క లేకుండా పెరుగుతుంది. అబూ సయీద్ (రది అల్లాహు అన్హు) హదీసులో వచ్చిన ప్రకారం “ఇఖ్లాసుతో కూడుకున్న అతని ఆ సద్వచనం (లాఇలాహ ఇల్లల్లాహ్) భూమ్యాకాశాలు, (అల్లాహ్ తప్ప) అందులో ఉన్న సర్వం కన్నా బరువుగా ఉంటుంది”. ఇలాంటి విషయమే “హదీసుల్ బితాఖ” అన్న పేరుతో ప్రసిద్ది చెందిన హదీసులో కూడా ఉంది: “లాఇలాహ ఇల్లల్లాహ్” వ్రాసి ఉన్న చిన్న ముక్క తొంభై తొమ్మిది రిజిస్టర్ల (Records) కంటే ఎక్కువ బరువు గలదై పోతుంది. అందులో ప్రతీ ఒక్క రిజిస్టర్ దాని పొడవు, మనిషి దృష్టి ఎంత దూరము చేరుకుంటుందో అంత దూరముంటుంది. మరో వైపు కొందరుంటారు; తౌహీద్, ఇఖ్లాసు మనసులో సంపూర్ణం లేనివారు. వారికి ఈ స్థానం, ఘనత ప్రాప్తి కాదు.
12) ఇహపరాల్లో తౌహీద్ వారలకు అల్లాహ్ విజయం, సహాయం, గౌరవం నొసంగుతాడు. సన్మార్గం ప్రసాదిస్తాడు. మంచి పనులు చేయుటకు సౌకర్యం కలుగజేస్తాడు. మాటలను, చేష్టలను సంస్కరించుకునే భాగ్యం ప్రసాదిస్తాడు.
13) విశ్వాసులైన తౌహీద్ వారల నుండి ఇహపరాల బాధలను దూరము చేసి, శాంతి, సుఖ ప్రదమైన జీవితం అనుగ్రహిస్తాడు. దీని ఉదాహరణలు, సాక్ష్యాలు ఖుర్ ఆన్, హదీసులో చాలా ఉన్నవి.
అల్లాహ్ (త’ఆలా) ఆదేశం: “నిజానికి ఇబ్రాహీమ్ తనకు తానే ఒక సంఘం (ఉమ్మహ్). అల్లాహ్ కు పరమ విధేయుడు. ఆయన యందే మనస్సు నిలిపినవాడు. అతను ఎన్నడూ ముష్రిక్ గా ఉండలేదు?” (సూరహ్ నహ్ల్ 16:120).
وَالَّذِينَ هُم بِرَبِّهِمْ لَا يُشْرِكُونَ
“… మరియు ఎవరు తమ ప్రభువునకు ఇతరులను భాగస్వామ్యులుగా చేయరో (వారే మేళ్ళ వైపునకు పరుగులు తీసేవారు)“ (సూరహ్ మూ’మినూన్ 23:59).
హుసైన్ బిన్ అబ్దుర్ రహ్మాన్ కథనం: నేను సఈద్ బిన్ జుబైర్ వద్ద ఉండగా “నిన్న రాత్రి రాలి పడిన నక్షత్ర చుక్కను ఎవరు చూశారు?” అని అడిగారాయన. “నేను చూశాను. అప్పుడు నేను నమాజులో లేను, కాని విషపురుగు కాటేసినందున బాధతో ఉన్నాను”. అని చెప్పాను. “అయితే నీవు ఏమి చేశావు ?” అని ఆయన ప్రశ్నించారు. “రుఖ్యా (మంత్రం) చదివాను” అని జవాబిచ్చాను. “ఎందుకు అలా చేశావు?” అని ఆయనడిగారు. “షాతబి మాకు ఒక హదీసు వినివించారు (దాని ఆధారంగా నేను చదివాను)” అనిచెప్పాను. “ఆయన ఏ హదీసు మీకు వినిపించారు” అని ఆయన అడిగారు. నేను చెప్పాను: “బురైద బిన్ హుసయ్యిబ్ ఉల్లేఖించిన ఒక హదీసు మాకు వినిపించారు. ఆయన చెప్పారు: “దిష్టి తగిలితే మరియు విషపురుగు కాటేస్తే తప్ప మంత్రించకూడదు” అని. “ఎవరు విన్న హదీసుపై ఆచరించారో వారు మంచి పని చేశారు” అని సఈద్ చెప్పి. మాకు ఇబ్నె అబ్బాసు (రది అల్లాహు అన్హు) ఈ హదీసు వినిపించారు ” అన్నారు. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “నాకు వివిధ అనుచర సమాజాలను చూపించడం జరిగింది. (వారికి సారథ్యం వహిస్తూ) ప్రవక్తలు నా ముందు నుంచి వెళ్ళసాగారు. అప్పుడు కొందరు ప్రవక్తల వెనక ఓ చిన్న సమూహం ఉంది. కొందరు ప్రవక్తల వెనక ఒక్కొక్క వ్యక్తి మాత్రమే ఉంటే, మరికొందరి ప్రవక్తల వెనక ఇద్దరేసి వ్యక్తులు ఉండేవారు. అసలు ఒక్క మనిషి కూడా తమ వెనుక లేని ప్రవక్తలు కూడా వారిలో ఉన్నారు. ఆ తరువాత నాకు ఒక పెద్ద జన సమూహము కన్పించింది. అది నా అనుచర సమాజం కావచ్చని భావించాను. కాని ఆ సమూహం హజ్రత్ మూసా (అలైహిస్సలాం), ఆయన అనుచర సమాజమని నాకు తెలియజేయబడింది. ఆ తరువాత జన సమూహం మరొకటి చూశాను. అప్పుడు ఈ జన సమూహం మీ అనుచర సమాజమే. వీరిలో డెబ్బయ్ వేల మంది ఎలాంటి విచారణ, శిక్ష లేకుండానే స్వర్గంలో ప్రవేశిస్తారు” అని తెలుపబడింది.
ఆ తరువాత ప్రవక్త లేచి వెళ్ళిపోయారు. (డెబ్బై వేల మంది ఎవరయి ఉంటారో) అని కొందరు అనుచరులు పరస్పరం మాట్లాడుకుంటూ “బహుశ వారు ప్రవక్త మైత్రిత్వం (స్నేహం) పొందిన వారు కావచ్చు” అన్నారు. మరి కొందరు “వారు ఇస్లాంలోనే పుట్టి ఏ మాత్రం షిర్క్ చేయని వారు కావచ్చు” అని అన్నారు. ఇలా చర్చించూకుంటూ ఉండగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వచ్చేశారు. వారందరూ చర్చించుకున్న విషయాలను ప్రవక్తకు తెలిపారు. అప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) “వారు మంత్రాలు చేయించుకునేవారు కారు, దుశ్శకునాలను పాటించరు, వాతలతో చికిత్స చేయించుకోరు. వారు తమ ప్రభువును మాత్రమే నమ్ముకొని (ఏ కష్టమొచ్చినా) ఆయన మీదే ఆధారపడతారు” అని విశదీకరించారు.
ప్రవక్త అనుచరుల్లో ఉక్కాషా బిన్ మిహ్సన్ లేచి నిలబడి “ప్రవక్తా! నేను వారిలో ఒకరిని కావాలని మీరు దుఆ చేయండి” అని కోరాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు: “నీవు వారిలో ఒకడివి”. ఇది చూసి మరో వ్యక్తి లేచి “ప్రవక్తా! నేను వారిలో ఒకరిని కావాలని మీరు దుఆ చేయండి” అన అడిగాడు. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారు: “ఉక్కాషా నీ కంటే ముందు ఈ సదవకాశాన్ని ఉపంయోగించుకున్నాడు”. (బుఖారి, ముస్లిం).
ముఖ్యాంశాలు:
1. తౌహీద్ విషయంలో ప్రజల స్థానాల్లో వ్యత్యాసం గలదు.
2. తౌహీద్ యొక్క భావం స్పష్టమయింది.
3. ప్రవక్త ఇబ్రాహీం ముష్రికులలోని వారు కారు అని అల్లాహ్ వారిని ప్రశంసించాడు.
4. షిర్క్ నుండి దూరమున్న ఔలియా అల్లాహ్ లను (అల్లాహ్ భక్తులను) ప్రశంసించబడింది.
5. మంత్రం చేయించుట, వాతలు వేయించుటను మానుకొనుట “తౌహీద్ యొక్క తహ్ఖీఖ్” చేసినట్టగును.
6. పై హదీసులో వచ్చిన గుణాలు అలవరచుకొనుట అల్లాహ్ పై “భరోసా” (నమ్మకం, ఆధారం) చాలా ఉన్నట్టు
7. ఈ హదీసు ద్వారా ప్రవక్త సహచరుల అపారవిద్య తెలుస్తుంది. (ఆ డెబ్బై వేల మంది అల్లాహ్ దయ తరువాత) వారి సత్కార్యాలతోనే (విచారణ, శిక్ష లేకుండా) స్వర్గ ప్రవేశానికి అర్హులవుతారు.
8. సహాబీలు మంచి విషయాల్లో మున్ముందుగా ఉండడానికి ఎంతగా కాంక్షించేవారో తెలుస్తుంది.
9. ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “ఉమ్మతీలు” (అనుచర సమాజం) ఉన్నత స్థానంలో, సంఖ్యలో ఇతర ప్రవక్తల “ఉమ్మతీల” (అనుచరుల) కంటే ఎక్కువగా, శ్రేష్ఠులుగా ఉన్నట్టు తెలుస్తుంది.
10. ప్రవక్త మూసా (అలైహిస్సలాం) “ఉమ్మతీల” ఘనత కూడ తెలుస్తుంది.
11. ప్రవక్త ఎదుట గత “ఉమ్మతీలందరు” ప్రత్యక్షమయ్యారు.
12. ప్రతీ “ఉమ్మత్” తమ ప్రవక్త వెంట వచ్చును.
13. ప్రవక్తలను అనుసరించిన ప్రజలు అల్ప సంఖ్యాకులు అని తెలుస్తుంది.
14. ఏ ప్రవక్తను విశ్వసించిన వారు ఎవరూ ఉండరో, ఆ ప్రవక్త ఒంటరిగా వచ్చును.
15. దీని వల్ల తెలిసిందేమిటంటే: మెజారిటి ఉన్నప్పుడు విర్రవీగ వద్దు. మైనారిటిగా ఉన్నప్పుడు చింతించవద్దు.
17. సఈద్ బిన్ జుబైర్ “ఎవరు విన్న హదీసుపై ఆచరించాలో వారు మంచి పని చేశారు” అని అన్న పదంతో పూర్వీకులు విద్యలో ఎంత ఆరితేరిన వారో తెలుస్తుంది. ఇంకా; వీరు చెప్పిన హదీసు మరియు హుసైన్ బిన్ అబ్దుర్ రహ్మాన్ చెప్పిన హదీసులో తేడా ఏ మాత్రం లేదు.
18. పూర్వ పండితులు అనవసర ప్రశంసల నుండి దూరంగా ఉుండేవారు.
19. ఉక్కాషాకు “నీవు వారిలో ఒకడివి అని ప్రవక్త చెప్పడం ప్రవక్త పదవి గుర్తుల్లో ఒకటి.
20. ఉక్కాషా ఘనత (అతడు స్వర్గవాసి అని తెలుపబడుట).
21. ఉక్కాషా తరువాత వ్యక్తికి ప్రవక్త చెప్పిన మాటల ద్వారా సందర్భాన్ని బట్టి స్పష్టంగా కాకుండా సైగల ద్వారా సంక్షిప్తంగా మాట్లాడడం యోగ్యం అని తెలుస్తుంది.
22. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నీతి, సత్ప్రవర్తన కూడా ఈ హదీసులో ఉట్టిపడుతుంది.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ)
ఈ అధ్యాయం దీనికంటే ముందు అధ్యాయాన్ని సంపూర్ణ పరుస్తుంది. ఇది దానికి సంబంధించినదే.
తౌహీద్ యొక్క “నిర్ధారణ” అంటే: పెద్ద షిర్క్, చిన్న షిర్క్ నుండి, వాక్కులోనూ, విశ్వాసంలోనూ, కర్మలలోనూ అన్ని బిద్‌అత్ (కల్పిత ఆచారా)ల నుండి, పాపాల నుండి తౌహీద్‌ను కాపాడుట, శుద్ది పరుచుట. ఇవన్నియు కేవలం అల్లాహ్ ప్రీతి కొరకు మాత్రమే చేయుట. ఎందుకనగా అత్యధికమైన షిర్క్ తౌహీద్‌కు విరుద్ధమైనది. అత్యల్పమైన షిర్క్ సంపూర్ణ తౌహీద్‌కు విరుద్దమైనది. బిద్‌అత్ , పాపాలు తౌహీద్‌ను కలుషితం చేసి, దాని సంపూర్ణత్వానికి అడ్డుపడతాయి. దాని లాభాల నుండి దూరం చేస్తాయి.
తౌహీద్ యొక్క నిర్ధారణ చేసిన వాని హృదయం విశ్వాసం, తౌహీద్, ఇఖ్లాస్ (సంకల్పశుద్ది)తో నిండిపోతుంది. తన ఆచరణ దాన్ని సత్యపరుస్తుంది. అది ఏ విధంగా అనగా: అల్లాహ్ యొక్క సమస్త ఆదేశాలకు అతడు శిరసావహిస్తాడు. అవిధేయతకు పాల్పడి విశ్వాసాన్ని నష్టపరుచుకోడు. అలాంటివాడే స్వర్గంలో విచారణ లేకుండా వెళ్లేవాడు. అందులో ప్రవేశించే మొదటి వ్యక్తి అయ్యేవాడు.
అల్లాహ్ కు పూర్ణ విధేయుడై, అల్లాహ్ పై ధృడమైన నమ్మకం ఉంచి, ఏ ఒక్క విషయంంలో కూడా అల్లాహ్ ను వదలి మానవుల వైపు మరలకుండా, వారిని అడగకుండా ఉండి, అతని బాహ్యం, ఆంతర్యం, మాటలు, చేష్టలు, ప్రేమ, ద్వేషం అన్నియు కేవలం అల్లాహ్ ప్రీతి కొరకే చేయుట , ప్రవక్త అడుగుజాడల్లో నడుచుట తౌహిద్ యొక్క నిర్దారణకు ప్రత్యేక నిదర్శనం.
ఇక్కడ ప్రజల స్థానాల్లో వ్యత్యాసం గలదు. “ప్రతి వ్యక్తి స్థానం అతడు చేసే పనులకు అనుగుణంగా ఉంటుంది.” (6: 132).
ఆశలతో, వాస్తవం లేని మాటలతో తౌహీద్ యొక్క నిర్ధారణ కాదు. మనస్సులో స్థిరమైన విశ్వాసం, ఇహ్సాన్ (ఆరాధనా సౌందర్యం) వాస్తవికతలతో, దానికి తోడుపడే సత్ప్రవర్తన, సత్కార్యాలతో అవుతుంది.
ఈ విధంగా తౌహీద్ యొక్క నిర్ధారణ చేసినవారు ఈ అధ్యాయంలో చెప్పబడిన ఘనతలకు అర్హులవుతారు.
“నన్ను, నా సంతానాన్ని విగ్రహారాధన నుండి కాపాడు” అని ఇబ్రాహీం (అలైహిస్సలాం) దుఆ చేశారు. (ఇబ్రాహీం 14:35).
“అతి ఎక్కువగా నేను మీ పట్ల భయం చెందేది “షిర్క్ అస్గర్” (చిన్న షిర్క్) కు మీరు పాల్పడుతారని” ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పినప్పుడు, సహచరులు “అదేమిటి” అని అడిగినందుకు “ప్రదర్శనాబుద్ధి” అని బదులిచ్చారు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం).
“అల్లాహ్ తో మరొకరిని సాటి కల్పించి, అర్ధించేవాడు అదే స్థితిలో చనిపోతే నరకంలో చేరుకుంటాడు” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారని ఇబ్ను మసూద్ (రది అల్లాహు అన్హు) తెలిపారు. (బుఖారి).
“అల్లాహ్ తో మరెవ్వరినీ సాటి కల్పించని స్థితిలో చనిపోయిన వ్యక్తి స్వర్గంలో చేరుకుంటాడు. అల్లాహ్ తో సాటి కల్పించి చనిపోయిన వ్యక్తి నరకంలో చేరుకుంటాడు” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారు.
ముఖ్యాంశాలు:
1. షిర్క్ నుండి భయపడుట.
2. ప్రదర్శనాబుద్ధి షిర్క్‌లో వస్తుంది.
3. అది “షిర్క్ అస్గర్” (చిన్న షిర్క్) లో వస్తుంది.
4. సత్కార్యాలు చేసేవారిలో అది చోటు చేసుకుంటుందన్న భయం ఎక్కువ ఉంటుంది.
5. స్వర్గనరకాలు సమీపములోనే ఉన్నాయని తెలిసింది.
6. ఒకే హదీసులో రెండిటిని కలిపి చెప్పడం జరిగింది.
7. షిర్క్ చేయకుండా చనిపోయి అల్లాహ్ తో కలసినవాడు స్వర్గంలో చేరుతాడు. షిర్క్ చేసి చనిపోయి అల్లాహ్ తో కలసినవాడు నరకంలో పోతాడు. అతడు అందరికన్నా ఎక్కువ ప్రార్థనలు చేసినవాడైనప్పటికినీ.
8. ముఖ్య విషయం: ఇబ్రాహీం (అలైహిస్సలాం) తమను, తమ సంతానాన్ని విగ్రహారాధన నుండి కాపాడమని అల్లాహ్ ను ప్రార్థించారు.
9. “ప్రభూ! ఈ విగ్రహాలు చాలా మందిని మార్గం తప్పించాయి” (14: 36). అంటూ (దుర్మార్గంలో పడుతున్న) అధికసంఖ్యాకులతో గుణపాఠం నేర్చుకొని “ఓ ప్రభూ! నా సంతానాన్ని విగ్రహారాధన నుండి కాపాడుము” అని అర్ధించారు.
10. ఇమాం బుఖారి (రహిమహుల్లాహ్) తెలిపిన ప్రకారం ఇందులో “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భావం ఉంది.
11. షిర్క్ నుండి దూరమున్నవారి ఘనత తెలిసింది.
తాత్పర్యం : (అల్లామా అల్ సాదీ)
షిర్క్ తౌహీద్ కు విరుద్ధం. దాని రెండు రకాలు: ఒకటి షిర్క్ అక్బర్ (జలి) (పెద్ద షిర్క్). రెండవది: షిర్క్ అస్గర్ (ఖఫి) (చిన్న షిర్క్)
షిర్క్ అక్బర్ అంటే: అల్లాహ్ తో ‘మొరపెట్టుకున్నట్లు, భయం చెందినట్లు, ప్రేమంచినట్లు ఇతరులతో మొరపెట్టుకొనుట. భయం చెందుట, ప్రేమించుట. సారాంశమేమనగా: అల్లాహ్ కు చేయవలసిన ప్రార్ధనలు, ఆరాధనలు ఇతరులకు చేయుట షిర్క్ అక్బర్. దీనికి పాల్పడినవానిలో ఏ మాత్రం తౌహీద్ లేనట్లే. అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించింది ఇలాంటి ముష్రికు పైనే. అతని నివాసం నరకం. ఇక ఏవైనా ఇలాంటి పనులు చేస్తూ దానిని “వసీల”, “పుణ్యపురుషుల ప్రేమ”, అన్న పేర్లతో నిజాన్ని వక్రీకరిస్తే అది కూడా షిర్క్ అవుతుంది.
షిర్క్ అస్గర్ అంటే: షిర్క్ అక్బర్ వరకు చేర్పించే సాధనాలు, కార్యాలు. ఉదాహరణకు: “గులువ్వు ” (అతిశయోక్తి. అంటే: పుణ్యపురుషుల విషయంలో హద్దులు మీరుట), అల్లాహ్ యేతరుల ప్రమాణం, చూపుగోలుతనం, ప్రదర్శనాబుద్ధి మొదలగునవి).
“ఇలా చెప్పండి! నా మార్గం ఇది. స్పష్టమగు సూచనను అనుసరించి నేను అల్లాహ్ వైపునకు పిలుస్తాను“. (యూసుఫ్ 12 : 108).
ఇబ్ను అబ్బాసు (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మఆజ్ (రదియల్లాహు అన్హు) ను యమన్ దేశానికి పంపుతూ ఇలా ఉపదేశించారు:
“నీవు గ్రంథమివ్వబడిన (క్రైస్తవుల) వైపునకు వెళ్తున్నావు. మొట్టమొదట నీవు వారిని “లాఇలాహ ఇల్లల్లాహ్” సాక్ష్యం ఇవ్వాలని ఆహ్వానించు”. మరో రివాయత్ లో ఉంది. “అల్లాహ్ ఏకత్వాన్ని నమ్మాలని చెప్పు. వారు నీ ఈ మాటకు విధేయులయితే, అల్లాహ్ వారికి రోజుకు (24 గంటల్లో) ఐదు సార్లు నమాజు చేయుట విధించాడని తెలుపు. నీ ఈ మాటకు కూడా విధేయత చూపితే, అల్లాహ్ వారిపై జకాత్ విధించాడని తెలియజేయి. అది వారి ధనికుల నుండి వసూలు చేసి, పేదలకు పంచబడుతుంది అని తెలుపు. నీ ఈ మాటను వారు అమలు పరుస్తే, (వారి నుండి జకాత్ వసూలు చేసినప్పుడు) వారి శ్రేష్ఠమైన వస్తువుల జోలికి పోకు. పీడితుని ఆర్తనాదాలకు భయపడు. పీడితుని ఆర్తనాదానికి, అల్లాహ్ కు మధ్య ఏలాంటి అడ్డుతెర ఉండదు”.
సహల్ బిన్ సఅద్ కథనం: ఖైబర్ యుద్ధం నాడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “నేను రేపు యుద్ధపతాకం ఎలాంటి వ్యక్తికి ఇస్తానంటే, అతను అల్లాహ్, ఆయన ప్రవక్తని ప్రేమిస్తాడు. అతన్ని అల్లాహ్, ఆయన ప్రవక్త ప్రేమిస్తారు. అల్లాహ్ అతని ద్వారా (ఖైబర్) విజయం చేకూరుస్తాడు“. ఆ పతాకం ఎవరికి దొరుకుతుందో అన్న ఆలోచనలోనే వారు రాత్రి గడిపి, తెల్లవారుకాగానే ప్రవక్త సమక్షంలో హాజరయి, తనకే ఆ పతాకం లభిస్తుందని ఆశించారు. అప్పుడు “అలీ బిన్ అబీ తాలిబ్ ఎక్కడున్నాడ“ని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అడిగారు. ఆయన కళ్ళలో ఏదో బాధగా ఉంది అని సమాధానమిచ్చారు ప్రజలు. ఎవరినో పంపి అతన్ని పిలిపించడం జరిగింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతని కళ్ళల్లో తమ లాలాజలాన్ని ఉమ్మినారు. తక్షణమే అలీ (రదియల్లాహు అన్హు) తనకసలు ఎలాంటి బాధే లేనట్లు పూర్తిగా ఆరోగ్య వంతులైపోయారు. యుద్ధ పతాకం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అలీ (రదియల్లాహు అన్హు) చేతికి ఇచ్చి, ఇలా బోధించారు: “నీవు నెమ్మదిగా, హుందాగా వెళ్ళి వారి మైదానంలో దిగు. ఆ తరువాత వారికి ముందుగా ఇస్లాం సందేశాన్ని అందజెయ్యి. వారు నిర్వహించవలసిన అల్లాహ్ హక్కులు వారిపై ఏమున్నాయో వారికి బోధించు. అల్లాహ్ సాక్షిగా! నీ ద్వారా ఏ ఒక్కనికి అల్లాహ్ రుజు మార్గం (ఇస్లాం) ప్రసాదించినా అది నీకోసం ఎరుపు రంగు ఒంటెల కంటే ఎంతో విలువైనది, శ్రేష్ఠమైనది“. (బుఖారి, ముస్లిం).
ముఖ్యాంశాలు:
1. అల్లాహ్ వైపునకు ఆహ్వానించుట (ప్రవక్త మరియు) ఆయన్ని అనుసరించిన వారి జీవితాశయం.
2. ‘ఇఖ్లాసు’ ఉండుట చాలా ముఖ్యం. ఎందుకనగా ధర్మం వైపు ఆహ్వానిస్తున్నామంటున్న అనేక మంది స్వయంగా తమ వైపునకు ప్రజల్ని ఆహ్వానిస్తున్నారు.
3. విద్య ఆధారంగా (ధర్మప్రచారం చేయుట) కూడా ఒక విధి.
4. అల్లాహ్ ను లోపాలు లేని పవిత్రుడని నమ్ముటమే ఉత్తమమైన తౌహీద్.
5. అల్లాహ్ లోపాలు గలవాడని భావించుట చాలా చెడ్డ షిర్క్.
6. ముస్లిం, ముష్రికులకు అతి దూరంగా ఉండాలి. ఎందుకనగా అతను షిర్క్ చేయనప్పటికి వారిలో కలసిపోయే ప్రమాదముంటుంది.
7. విధుల్లో మొట్టమొదటిది తౌహీద్.
8. అన్నిటికి ముందు, చివరికి నమాజుకన్నా ముందు తౌహీద్ ప్రచారం మొదలు పెట్టాలి.
9. మఆజ్ హదీసులో “అన్ యువహ్హిదుల్లాహ్” (అల్లాహ్ ఏకత్వాన్ని స్వీకరించుట) మరియు “లాఇలాహ ఇల్లల్లాహ్” రెండిటి భావం ఒక్కటే. .
10. మనిషి దైవ గ్రంథం పొందిన (యూదుడు, క్రైస్తవుడు లాంటి) వాడు అయి కూడా “లాఇలాహ ఇల్లల్లాహ్” అర్థం తెలుసుకోలేకపోవచ్చు, లేక తెలుసుకొని కూడా దాని ప్రకారం ఆచరించకపోవచ్చు.
11. విద్యను క్రమ క్రమంగా నేర్పాలని బోధపడింది.
12. ముఖ్యమైన విషయంతో ఆరంభించాలని తెలిసింది.
13. జకాత్ సొమ్మును ఎందులో ఖర్చు పెట్టాలో తెలిసింది.
14. (జకాత్ సొమ్ము ఎందులో ఖర్చు చెయ్యాలి తెలియక, మఆజ్ సందేహ పడకుండా ప్రవక్త ముందే వివరించినట్లు) శిష్యులను సందిగ్ధంలో పడవేసే విషయాలను పండితుడు ముందే విశదీకరించాలి.
15. (జకాత్ వసూలు చేసే అతను) కేవలం మంచి సొమ్ము మాత్రమే తీసుకొనుట నివారించబడింది.
16. పీడుతుని ఆర్తనాదానికి భయపడాలి.
17. అతని ఆర్తనాదం స్వీకరించబడటానికి ఏదీ అడ్డు పడదు అని తెలుపబడింది.
18. ప్రవక్త, సహాబీలు, ఇతర మహాభక్తులు (తౌహీద్ ప్రచారంలో) భరించిన కష్టాలు, ఆకలి, అంటు వ్యాధి బాధలు, తౌహీద్ యొక్క నిదర్శనాలు.
19. “నేను యుద్ధపతాకం ఇస్తాను” అన్న ప్రవక్త మాట, ఆయనకు ప్రసాదించబడిన అద్భుత సంకేతం (ము’అజిజ).
20. అలీ (రదియల్లాహు అన్హు) కళ్ళల్లో ఆయన లాలాజలం పెట్టడం కూడా ఒక అద్భుత సంకేతమే.
21. అలీ (రజియల్లాహు అన్హు) యొక్క ఘనత తెలిసింది.
22. ఇందులో సహాబాల ఘనత కూడా తెలుస్తుంది. ఎలా అనగా? యుద్ధ పతాకం ఏ అదృష్టవంతునికి లభిస్తుందో అని ఆలోచించడంలోనే నిమగ్నులయ్యారు, అతని ద్వారానే అల్లాహ్ విజయం ప్రసాదిస్తాడన్న విషయం వారు మరచిపోయారు.
23. అదృష్టంపై విశ్వాసం ఇందులో రుజువవుతుంది. అది ఎలా? యుద్ధ పతాకం కోరినవారికి లభించలేదు. కోరని, ఏ మాత్రం ప్రయత్నం చేయని వారికి లభించింది.
24. “నిదానంగా బయలుదేరు” అన్న ప్రవక్త మాటలో (యుద్ధ) శిక్షణ, పద్దతి బోధపడుతుంది.
25. ఎవరితో యుద్ధం చేయబోతున్నారో ముందు వారికి ఇస్లాం పిలుపు నివ్వా లి.
26. ఇంతకు ముందే పిలుపు ఇవ్వడం, లేక యుద్ధం జరిగియుంటే పరవా లేదు.
27. “వారిపై విధియున్న వాటిని వారికి తెలుపు” అనడంలో ధర్మ ప్రచార రంగంలో అవసరమైన వివేకం కానవస్తుంది.
28. ఇస్లాంలో అల్లాహ్ హక్కులు ఏమున్నవో వాటిని తెలుసుకొనుట ఎంతైనా అవసరం.
29. ఒక్క వ్యక్తి అయినా తమ ద్వారా రుజుమార్గం పొందుతే ఇది ఎంత పుణ్యకార్యమో తెలుస్తుంది. .
30. ఫత్వా ఇస్తున్నప్పుడు అవసర సందర్భంగా అల్లాహ్ నామముతో ప్రమాణం చేయవచ్చును.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :
ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ (రహిమహుల్లాహ్): ఈ గ్రంధంలోని అధ్యాయాల్లో ఏ క్రమాన్ని పాటించారో అది చాలా ఉత్తమమైనది. మొదట తౌహీద్ “విధి” అని తెలిపారు, తరువాత దాని ఘనత, సంపూర్ణత ప్రస్తావన తెచ్చి, పిదప బాహ్యంతర్యాల్లో దాని “నిర్ధారణ”, ఆ తరువాత దానికి విరుద్ధమైన షిర్క్ తో భయంను ప్రస్తావించారు. ఇలా మనిషి ఒక విధంగా తనకు తాను పరిపూర్ణుడవుతాడు. ఆ తరువాత “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క పిలుపునివ్వాలన్న అధ్యాయాన్ని చేర్చారు.
ఇది ప్రవక్తల విధానం. ఒకే అల్లాహ్ ఆరాధన చేయాలని వారు తమ జాతి వారికి పిలుపు ఇచ్చారు. ఇదే విధానం ప్రవక్తల నాయకులైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ది. ఆయన వివేకంతో, చక్కని హితబోధతో, ఉత్తమమైన రీతిలో వాదనతో ఈ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చారు. అందులో అలసిపోలేదు. బలహీనత చూపలేదు. అల్లాహ్ ఆయన ద్వారా ఇస్లాం ధర్మాన్ని స్థాపించాడు. అది తూర్పు, పశ్చిమాల్లో వ్యాపించింది. అనేక మంది ఋజుమార్గం పొందారు. ఆయన స్వయంగా ఈ బాధ్యతను నెరవేర్చుతూ, తమ అనుచరులను ప్రచారకులుగా తీర్చిదిద్ది ఇతర ప్రాంతాలకు పంపేవారు. మొట్ట మొదట తౌహీద్ గురించే బోధించాలని చెప్పేవారు. ఎందుకనగా సర్వ కర్మల అంగీకారం దానిపైనే ఆధారపడియుంది. ఇలాంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అందుకే మొదట తౌహీద్ గురించి తెలుసుకోవాలి. పిదప దాని ప్రచారం చేయాలి. ప్రతి ఒక్కరిపై తన శక్తి మేరకు ఈ బాధ్యత ఉంటుంది. పండితుడు తన విద్య తో ఈ బాధ్యతను నెరవేర్చాలి. ధన, ప్రాణ శక్తి గలవాడు, హోదా గలవాడు దాన్ని ఉపయోగించి ఈ బాధ్యతను నెరవేర్చాలి. కనీసం ఒక మాటతోనైనా ఈ బాధ్యతను నెరవేర్చినవానిని అల్లాహ్ కరుణించుగాక! శక్తి, సామర్థ్యాలు కలిగియుండి కూడా ఈ బాధ్యతను నెరవేర్చని వానికి వినాశము ఉంటుంది.
“ఇబ్రాహీం తన తండ్రి మరియు తన జాతి వారికీ ఇలా చెప్పిన ఆ సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. “మీరు పూజిస్తున్న వాటితో నాకు ఏ సంబంధమూ లేదు. నా సంబంధం కేవలం నన్ను సృష్టించినవానితోనే ఉన్నది… (జుక్రుఫ్ 43: 26).
“కొందరు అల్లాహ్ ను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా, ప్రత్యర్థులుగా భావిస్తారు. వారు అల్లాహ్ పట్ల కలిగి వుండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు…” (బఖర 2:165)
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారు:
‘ఎవడు “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్య దైవం మరొక్కడు లేడు) అని, అల్లాహ్ తప్ప ఆరాధింపబడే ఇతరుల్ని తిరస్కరిస్తాడో అతని ధనప్రాణం సురక్షితంగా ఉండును. అతని లెక్క (ఉద్దేశం) అల్లాహ్ చూసుకుంటాడు’. (ముస్లిం).
తరువాత వచ్చే పాఠాల్లో ఇదే వివరణ ఉంది.
ముఖ్యాంశాలు:
1. ఇందులో ముఖ్య విశేషం : తౌహీద్ (ఏక దైవ విశ్వాసం) మరియు షహాదత్ (లాఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యం) యొక్క వ్యాఖ్యానం ఉంది. దాన్ని అనేక ఆయతుల ద్వారా స్పష్టం చేయడం జరిగింది
2. బనీ ఇస్రాయీల్ లోని వాక్యం (17:57) – మహాపురుషులతో మొరపెట్టుకునే ముష్రికుల ఆ కార్యాన్ని రద్దు చేస్తూ, ఇదే షిర్క్ అక్బర్ (పెద్ద షిర్క్) అని చెప్పబడింది.
3. సూరె తౌబాలోని వాక్యం. “యూదులు, క్రైస్తవులు అల్లాహ్ ను గాక తమ పండితులను, సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారని అల్లాహ్ తెలిపాడు”. ఇంకా “కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించవలసిన ఆజ్ఞ వారికి ఇవ్వడం జరిగింద”నీ తెలిపాడు. అయితే వారు తమ పండితుల, సన్యాసులతో మొరపెట్టుకోలేదు. వారి పూజా చేయలేదు. కాని పాపకార్యాల్లో వారి విధేయత పాటించారు.
4. “మీరు ఆరాధిస్తున్న వాటితో నాకు ఏ సంబంధమూ లేదు. నా సంబంధం కేవలం నన్ను సృష్టించినవానితోనే ఉన్నది? అన్న అవిశ్వాసులకు ఇబ్రాహీం మాట. తమసత్య ప్రభువును ఇతర మిథ్య ఆరాధ్యులతో స్పష్టమైన పద్దతిలో వేరు జేరు.
ఇలా అవిశ్వాసులతో అసహ్యత, విసుగు మరియు అల్లాహ్ తో ప్రేమయే “లాఇలాహ ఇల్లల్లాహ్” యొక్క పరమార్థము అని అల్లాహ్ తెలిపాడు. అందుకే ఆ వాక్యం తరువాతనే ఈ వాక్యం ఉంది.
ఇబ్రాహీం ఈ వచనాన్నే తన తరువాత తన సంతానం కోసం విడిచి వెళ్ళాడు, బహుశా వారు దాని వైపునకు మరలుతారని. (జుఖ్ రుఫ్ 43: 28).
5. మరొకటి బఖరలోని వాక్యం. అందులో ప్రస్తాంవించబడిన అవిశ్వాసుల గురించి, “వారు నరకము నుండి బయటికి వెళ్ళేవారు కారు” అని అల్లాహ్ తెలిపాడు. వారు నియమించుకున్న వారిని అల్లాహ్ ను ప్రేమించవలసినట్లు ప్రేమిస్తారు. వారు అల్లాహ్ ను కూడా ప్రేమించువారు అని దీనితో తెలుస్తుంది. కాని వారి ఈ ప్రేమ వారిని ఇస్లాంలో ప్రవేశింపజేయలేకపోయింది. ఇది వీరి విషయం అయితే, ఎవరయితే తమ నియమించుకున్న వారిని అల్లాహ్ కంటే ఎక్కువ, లేక కేవలం వారినే ప్రేమించి, అల్లాహ్ ను ఏ మాత్రం ప్రేమించరో, వారి సంగతి ఎలా ఉంటుంది….? ఆలోచించండి!
6. “ఎవరు “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యదైవం మరొక్కడు లేడు) చదివి, అల్లాహ్ తప్ప పూజింపబడే ఇతరుల్ని తిరస్కరిస్తాడో అతని ధనప్రాణాలు సురక్షితంగా ఉండును. అతని వ్యవహారం అల్లాహ్ చూసుకుంటాడు” అన్న ప్రవక్త ప్రవచనం “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భావాన్ని తెలిపే దానిలో ముఖ్యమైనది. కేవలం నోటి పలుకుల ద్వారానే అతని ధన ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని చెప్పలేదు. ఆ పదాలు, దాని భావం తెలుసుకున్నవాని గురించే ఆ ఘనత లేదు. లేక దాన్ని కేవలం ఒప్పుకున్న వానికే రక్షణ లేదు. లేక అతడు కేవలం అల్లాహ్ తోనే మొరపెట్టుకుంటున్నందుకని కాదు. అతడు దాన్ని పలుకడంతో పాటు మిథ్యా దైవాలను తిరస్క.రించనంతవరకు అతని ధనప్రాణాలకు రక్షణ లేదు. ఇంకా అతడు అందులో సందేహపడితే, ఆలస్యం చేస్తే కూడా రక్షణ లేదు. ఈ విషయం ఎంతో ముఖ్యమైనది, గొప్పదైనది!. ఎంతో స్పష్టంగా తెలుపబడింది! వ్యెతిరేకులకు విరుద్ధంగా ఎంతో ప్రమాణికమైన నిదర్శన ఉంది.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :
వాస్తవానికి తౌహీద్ యొక్క భావం ఏమనగా: “అల్లాహ్ అద్వితీయుడని అతని గుణాలతో తెలుసుకొని, నమ్ముట. కేవలం అయన్ని మాత్రమే ఆరాధించుట.”
ఇది రెండు రకాలు:
ఒకటి: అల్లాహ్ యేతరుల ఉలూహియత్ (ఆరాధన)ను తిరస్కరించుట. అది ఎలా అనగా; సృష్టిలోని ప్రవక్త, దైవదూత, ఇంకెవరయినా ఆరాధనకు అర్హులు కారని, వారికి ఏ కొంత భాగం కూడా అందులో లేదని తెలుసుకొని విశ్వసించుట.
రెండవది: ఉలూహియత్ కు అర్హుడు అల్లాహ్ మాత్రమేనని, ఆయనకి సాటి మరొకడు లేడని విశ్వసించుట. కేవలం ఇంతే సరిపోదు. ధర్మాన్ని కేవలం అల్లాహ్ కే అంకితం చేసి, ఇస్లాం, ఈమాన్, ఇహాసాన్ ను పూర్తి చేసి, అల్లాహ్ హక్కులతో పాటు అల్లాహ్ దాసుల హక్కులను అల్లాహ్ సంతృప్తి, దాని ప్రతిఫలం పొందడానికే పూర్తి చేయుట.
దాని సంపూర్ణ భావంలో మరొకటి: అల్లాహ్ యేతరుల ఆరాధన నుండి అసహ్యత, విసుగు చెందుట. అల్లాహ్ ను గాక ఇతరులను అల్లాహ్ కు సమానులుగా నిలబెట్టి, అల్లాహ్ ను ప్రేమించినట్లు వారిని ప్రేమించుట, అల్లాహ్ కు విధేయత చూపినట్లు వారికి విధేయత చూపుట “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భావానికి విరుద్ధమైనది
“ఒక వేళ అల్లాహ్ నాకేదైనా నష్టాన్ని కలిగించగోరితే, మీరు అల్లాహ్ ను కాదని వేడుకునే దేవతలు, ఆయన కలిగించే నష్టం నుండి నన్ను కాపాడగలరా?” (జుమర్ 39: 38).
ఇమ్రాన్ బిన్ హుసైన్ కథనం: ఒక వ్యక్తి చేతిలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) రాగి కడం (bracelet) చూసి, “ఇది ఏమిటి?” అని అడిగారు. “వాహిన” [*] దూరము కావడానికి వేసుకున్నాను అని అతడు చెప్పాడు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “దాన్ని తీసివేయి. అది నీ “వాహిన” పెరుగుటకే కారణమవుతుంది. ఒక వేళ అది నీవు ధరించి ఉన్నప్పుడు మరణించావంటే ఎన్నటికీ సాఫల్యం పొందవు” అని హెచ్చరించారు. (అహ్మద్).
[*] భుజములోని ఒక నరం ఉబ్బి రోగము వస్తుంది. అది దూరము కావడానికి వారు అలాంటివి వేసుకునేవారు
ఉఖ్బా బిన్ ఆమిర్ కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశం: “తాయత్తు వేసుకున్నవారి ఉద్దేశాన్ని అల్లాహ్ పూర్తి చేయకుండుగాక. గవ్వ (సీపి) వేసుకున్న వానికి కూడా అల్లాహ్ స్వస్థత ప్రసాదించకుండా ఉండుగాక “. (అహ్మద్). మరో ఉల్లేఖనంలో ఉంది: “తాయత్తు వేసుకున్న వారు షిర్క్ చేయువారు“.
ఇబ్ను అబి హాతింలో ఉంది: హుజైఫా ఒక వ్యక్తి చేతిలో జ్వరం దూరం కావడానికి వేసుకున్న దారాన్ని చూసి తెంచారు. తరువాత ఈ ఆయతు చదివారు. “వారిలో చాలామంది అల్లాహ్ను విశ్వసిస్తూ కూడా ఆయనతో పాటు ఇతరులను భాగస్వాములుగా నిలబెడుతున్నారు.” (యూసూఫ్ 12 : 106).
2.”అతను అదే స్థితిలో చనిపోతే సఫలుడు కాడు” అన్న దానితో షిర్క్ అస్గర్ (చిన్న షిర్క్), కబీర గునాహ్ లో (ఘోర పాపాల్లో) పెద్దది అని తెలుస్తుంది.
3. తెలియక పోవడము ఒక సాకుగా పరిగణింపబడలేదు.
4. దాని వలన లాభం కలగదు. ప్రవక్త ఆదేశానుసారం: ‘దాని వలన “వహన్” ఇంకా పెరుగుతుంది.’
5. ఇలాంటి పని చేసిన వారిని కఠినంగా హెచ్చరించబడింది.
6. ఇలాంటివి వేసుకున్నవారు దాని వైపే అప్పగించబడుతారు.
7. తాయత్తు వేసుకున్న వారు షిర్క్ చేయువారు అని స్పష్టం అయింది.
8. జ్వరం దూరం కావడానికి దారం వేసుకొనుట కూడా ఇందులోనే పరిగణించబడుతుంది.
9. హుజైఫా పఠించిన ఆయతుతో తెలిసిందేమిటంటే; ప్రవక్త సహచరులు పెద్ద షిర్క్ ప్రస్తావించబడిన ఆయతులతో చిన్న షిర్క్ గురించి ప్రమాణంగా ప్రస్తావించేవారు. సూరె బఖర వాక్యంలో ఇబ్నె అబ్బాసు (రదియల్లాహు అన్హు) ఇలాగే తెలిపారు.
10. దిష్టి తగలకుండా గవ్వ (సీపి) వేసుకొనుట కూడా షిర్క్ అవుతుంది.
11. తాయత్తు వేసుకున్న వారిని, గవ్వ వేసుకున్న వారిని శపించబడింది. అంటే అల్లాహ్ వారిని తన సంరక్షణలో ఉంచడు.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :
నష్టం, కష్టం దూరం కావడానికి, లేక రాకుండా ఉండడానికి ఉపయోగించే సాధనాల (జరియ, అస్బాబ్)లో ఏవి యోగ్యం, ఏవి నిషేధం తెలుసుకొనటానికి, సాధనాల (జరీయ, అస్బాబ్)కు సంబంధించిన ఆదేశాల్ని తెలుసుకొనుట ఎంతయినా అవసరం. ఇందులో మూడు విషయాల్ని తెలుసుకొనుట చాలా ముఖ్యం.
1. ధార్మికంగా లేక శాస్త్రీయంగా లాభకరమయిన సాధనం అని రుజువైన వాటినే సాధనంగా ఉపయోగించాలి.
2. వాటిని ఉపయోగించే వ్యక్తి ఆధారం, భరోసా వాటిపై ఉండ కూడదు. వాటిని సాధనంగా చేసిన అల్లాహ్ పై నమ్మకం ఉండాలి.
3. సాధనాలు ఎంత గొప్పవి, శక్తి గలవైనా అల్లాహ్ వ్రాసి ఉంచిన విధి, (తఖ్ దీర్)కి అవి లోబడి ఉంటాయి. దానిని తప్పించుకోలేవు. అల్లాహ్ తాను కోరినట్లు వాటిలో మార్పు చేస్తాడు. అల్లాహ్ కోరితే అందులోని గుణాన్ని అలాగే ఉంచుతాడు. ఆయన దాసులు వాటిని తెలుసుకొని, ఉపయోగించి వాటిలో ఉన్నటువంటి అల్లాహ్ తత్వాన్ని గమనించగలరనీ. అతను కోరితే అందులోని గుణాన్ని మార్చనూవచ్చు. ఇలా దాసులు వాటిపైనే నమ్మకం ఉంచకూడదనీ, అల్లాహ్ శక్తిని అర్థం చేసుకోగలరనీ. మార్పు చేయు సర్వశక్తి, సర్వ ఇష్టం ఒకే ఒక్క అల్లాహ్ కు మాత్రమే ఉంది.
పై ముఖ్య విషయం తెలుసుకున్న తరువాత, ఇక వచ్చిన కష్టం తొలగడానికి, లేక కష్టం రాకుండా జాగ్రత్త పడడానికి దారం లేక కడం లాంటివి వేసుకున్న వాడు షిర్క్ చేసినట్లే కదా? ఎలా అనగా; అది కష్టం రాకుండా, లేక వచ్చిన తరువాత కాపాడునది అని విశ్వసిస్తే ఇది పెద్ద షిర్క్ అవుతుంది. అతడు అల్లాహ్ను గాక ఇతరులను స్వస్థత ఇచ్చేవాడుగా నమ్మినందుకు ఇది రుబూబియత్ కు సంబంధించిన షిర్క్. ఇంకా అతడు అందులో స్వస్థత ఉంది అని దానిపై భరోసా, నమ్మకం, ఆశ ఉంచినందుకు, ఇది ఉలూహియత్ కు సంబంధించిన షిర్క్ అవుతుంది.
ఒక వేళ అతడు అల్లాహ్ యే కష్టనష్టాలు రాకుండా, లేక వచ్చిన తరువాత కాపాడువాడు అని విశ్వసించి, అవి కేవలం సాధనం అని నమ్మినవాడు, ధార్మికంగా, శాస్త్రీయంగా సాధనం లేని దానిని సాధనంగా నమ్మినవాడవుతాడు. ఇది నిషిద్ధం (హరాం). మరియు ఇస్లాం పై, వైద్య శాస్త్రంపై ఒక అబద్దం మోపినవాడవుతాడు. ఎలా అనగా; ఇస్లామీయ ధర్మం దీనిని చాలా కఠినంగా నివారించింది. అది నివారించినవి లాభాన్నిచ్చేవి కావు.
శాస్త్రీయంగా కూడా ఇవి ఆమోదం పొందినవి కావు. లాభం చేకూర్చే ఔషదాల్లో లెక్కించబడవు.
అందుకే ఇవి షిర్క్ వైపునకు లాక్కొని వెళ్ళే సాధనాలు. వాటిని వేసుకున్న వాని మనుస్సు వాటిపై లగ్నం అయి ఉంటుంది. అందుకే అది షిర్క్ భాగాల్లో ఒక భాగం. లేక సాధనాల్లో ఒక సాధనం.
ఇది ధార్మికంగా, శాస్త్రీయంగా సాధనం కాదని తెలిసినప్పుడు, విశ్వాసుడు తన విశ్వాసం సంపూర్ణమగుటకు దానిని వదిలి వేయాలి. అతని తౌహీద్ సంపూర్ణం అయిందంటే నివారించబడిన వాటిపై అతని మనుస్సు లగ్నం కాదు. లాభం లేని వాటిపై మనుస్సు లగ్నం కావడం బుద్ధిహీనతకు నిదర్శనం. ఎలా అనగా మనిషి తనకు లాభం లేని వాటిని ఉపయోగించడు. అందులో నష్టమే ఉంది.
ఈ సత్య ధర్మం యొక్క పునాది: “ప్రజల నుండి విగ్రహారాధనను, సృష్టి రాసుల పైనుండి నమ్మకాన్ని దూరము చేసి, వారి ధర్మాన్ని దురాచారాల, దుష్చేష్టల నుండి దూరం చేసి వారి బుద్ధి జ్ఞానాలను సంపూర్ణం చేయుట. బుద్ధిని అభివృద్ధి పరిచే, ఆత్మలను పరిశుద్ధపరిచే, ధార్మిక, ప్రాపంచిక స్థితిగతులను సంస్కరించే లాభదాయకమయిన విషయాల గురించి కృషి చేయుట.”
అబూ బషీర్ అన్సారి (రదియల్లాహు అన్హు) కథనం; ఆయన ఓ ప్రయాణంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఉండగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక చాటింపు చేసే వ్యక్తిని ఈ వార్త ఇచ్చి పంపారు: “తమ ఒంటె మెడలో ఎవరు కూడా తీగతో తయారైన పట్టా ఉంచకూడదు. ఒక వేళ ఉంటే తెంపాలి“. (బుఖారి, ముస్లిం). .
ఇబ్ను మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం: నేను ప్రవక్త ఈ చెప్పగా విన్నాను. “మంత్రము, తాయత్తులు, తివల (భార్యభర్తల మధ్య ప్రేమ పెరుగుటకు చేతబడి చేయుట) షిర్క్“. (అహ్మద్, అబూ దావూద్).
అబుల్లాహ్ బిన్ ఉకైం ఉల్లేఖనలో ఉంది: “ఎవరు ఏదైనా వస్తువు వేసుకుంటే అతన్ని దాని వైపునకే అప్పగించబడుతుంది“. (అహ్మద్ , తిర్మిజి).
తాయత్తు అంటే: దిష్టి తగలకుండా తమ సంతానానికి ధరింపజేయబడే వస్తువులు. ఇది ఖుర్ఆన్ నుండి ఉంటే కొందరు పూర్వ ధర్మవేత్తలు యోగ్యమని చెప్పారు. మరి కొందరు యోగ్యం కాదని నివారించబడింది అని చెప్పారు. నివారించినవారిలో ఇబ్నె మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఉన్నారు.
మంత్రాలను “అజాయిం ” అని అంటారు. దిష్టి తగిలినప్పుడు, విష పురుగులు కాటేసినప్పుడు మంత్రిచవచ్చును కాని షిర్క్ అర్థమునిచ్చే పదాలు ఉండకూదడు.
తివల అంటే: భార్యభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుటకు చేయబడే ఇంద్రజాలం.
రువైఫిఅ యొక్క హదీసు అహ్మద్ ఉల్లేఖించారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీ ఆయనకి ఇలా తెలిపారు: “ఓ రువైఫిఅ ! నీవు దీర్ఘకాలం బ్రతుకవచ్చు. ఈ విషయం ప్రజలకు తెలియజేయి: గడ్డమును ముడి వేసేవారితో, లేక తీగలు మెడలో వేసుకునేవారితో, పశువుల పేడ, ఎముకలతో మలమూత్ర పరిశుద్ధి చేసేవారితో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కు ఏలాంటి సంబంధం లేదు“.
సఈద్ బిన్ జుబైర్ ఇలా చెప్పారు: ‘ఒక వ్యక్తి ధరించిన తాయత్తును తీసే వారికి ఒక బానిసను విడుదల చేసినంత పుణ్యం లభించును‘.
వాకీఅ, ఇబ్రాహీం నఖఈతో ఉల్లేఖించారు: “వారు అన్ని రకాల తాయుత్తులను నిషిద్ధంగా భావించేవారు. అవి ఖుర్ఆన్ కు సంబంధించినవైనా, లేదా ఖుర్ ఆన్ కు సంబంధం లేనివైనా.”
ముఖ్యాంశాలు:
1. మంత్రము (రుఖ్య) , తాయత్తు యొక్క వివరణ తెలిసింది.
2. తివల యొక్క భావం తెలిసింది.
3. ఏలాంటి వ్యత్యాసం లేకుండా పైన పేర్కొన్న మూడూ విషయాలు కూడా షిర్క్ గా పరిగణింపబడుతాయి.
4. దిష్టి తగలకుండా, విషపురుగు కాటేసినప్పుడు షిర్క్ పదాలు లేకుండా మంత్రించుట షిర్క్ కాదు.
5. ఖుర్ఆన్ ఆయతులతో వ్రాయబడిన తాయత్తు విషయములో పండితుల బేధాభిప్రాయం ఏర్పడినది. (వాస్తవమేమిటంటే అది కూడా యోగ్యం కాదు. ఎలా అనగా మంత్రం షిర్క్ అని తెలిపిన తరువాత యోగ్యమైనదేదో ప్రవక్త స్వయంగా తెలిపారు. కాని తాయత్తు విషయంలో అలా తెలుపలేదు).
6. పశువులకు దిష్టి తగలకుండా తీగలు, ఇంకేవైనా వేయుట కూడా షిర్క్ కు సంబంధించినవే.
7. అలాంటివి వేసినవారిని కఠినంగా హెచ్చరించబడింది.
8. ఒక వ్యక్తి మెడ నుండి తాయత్తు తీయుట ఎంత పుణ్యమో తెలిసింది.
9. ఇబ్రాహీం నఖఈ మాట, పైన తెలిపిన మాటకు విరుద్ధం ఏమి కాదు. ఎలా అనగా; ఈయన ఉద్దేశం అబుల్లాహ్ బిన్ మస్ ఊద్ శిష్యులు అని.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :
తాయత్తులు వేసుకొనుట షిర్క్ అని తెలిసింది. అయితే ఇందులో కొన్ని షిర్క్ అక్బర్ (పెద్ద షిర్క్). ఉదా: షైతాన్ తో లేక సృష్టిరాసులతో మొరపెట్టుకొనుట, అల్లాహ్ ఆధీనంలో ఉన్నదాని గురించి ఇతరులతో మొరపెట్టుకొనుట పెద్ద షిర్క్ లో పరిగణించబడుతుంది. ఈ విషయం మరీ వివరంగా తరువాత అధ్యాయాల్లో వస్తుంది. మరి కొన్ని నిషిద్ధమున్నవి. ఉదా: అర్ధం లేని పేర్లతో, పదాలతో. ఇవి షిర్క్ వైపునకు తీసుకెళ్తాయి.
ఇస్లాం ధర్మంలో అనుమతి లేదు గనుక, ఖుర్ఆన్ మరియు హదీసులో వచ్చిన దుఆలు వ్రాయబడిన తాయత్తులు విడనాడడమే ఉత్తమం. ఈ పద్ధతి నిషిద్ధమున్న వాటి ఉపయోగమునకు దారి తీస్తుంది. అపరిశుద్ధ స్థలాల్లో పోక తప్పదు గనక, వాటిని వేసుకున్నవాడు దాని గౌరవ మర్యాదను పాటించలేడు. (ఇవి పాటించినవానికి సయితం అనుమతి లభించదు. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతి ఇవ్వలేదు).
మంత్రం విషయంలో ఉన్న వివరాన్ని కూడా తెలుసుకోవాలి. అది ఖుర్ఆన్, హదీసు నుండి ఉంటే మంత్రించేవాని గురించి అభిలషనీయమే. ఎందుకనగా ఇది కూడా ఒక ఉపకారం, పుణ్యం క్రింద లెక్కించబడుతుంది గనుక యోగ్యం కూడా. కాని మంత్రం చేయించుకునే వ్యక్తి స్వయంగా అడగక ఉండడమే మంచిది. మంత్రించడమైనా లేక ఇంకేదైనా అడగక ఉండడం మానవుని సంపూర్ణ నమ్మకం, బలమైన విశ్వాసం యొక్క నిదర్శన. అడగడంలో అతనికి లాభం మరియు అది యోగ్యం అయినప్పటికీ అడగక పోవడం మంచిది అనబడుతుంది. ఇందులోనే వాస్తవ తౌహీద్ యొక్క రహస్యం ఉంది. ఈ విషయాన్ని గమనించి ఆచరించేవారు చాలా అరుదు. మంత్రంలో అల్లాహ్ యేతరులతో స్వస్థత కోరి, వారితో దుఆ చేయబడుతే అది పెద్ద షిర్క్. ఎందుకంటే: దుఆ, మొర అల్లాయేతరులతో చేయరాదు గనక. ఈ వివరాలన్ని జాగ్రత్తగా తెలుసుకో! అందులో ఉన్న సూక్ష్మ వ్యత్యాసాలను గమనించకుండా అన్నిటి గురించి ఒకే రకమైన తీర్పు చేయకు. జాగ్రత్తగా ఉండు!
అల్లాహ్ ఆదేశం: “ఈ లాత్, ఈ ఉజ్జా, మూడోది ఒక దేవత అయిన మనాత్‌ల వాస్తవికతను గురించి కాస్తయినా ఆలోచించారా?” (సూరా నజ్మ్ 53:19,20).
అబూ వాఖిద్ లైసీ (రది అల్లాహు అన్హు) కథనం: మేము ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) తో కలసి హునైన్ యుద్దానికి వెళ్ళాము. అప్పుడే మేము కొత్తగా ఇస్లాం స్వీకరించి యుంటిమి. (దారి మధ్యలో ఒక చోట) ముష్రిక్కుల ఒక ‘రేగు చెట్టు’ ఉండింది. అక్కడ వారు శుభం (తబర్రుక్) కలగాలని కూర్చుండేవారు, తమ ఆయుధాలను దానికి తగిలించేవారు. దానిని “జాతు అన్వాత్”” అనేవారు. ఆ రేగుచెట్టు దగ్గరి నుండి మేము వెళ్తూ “మాకు కూడా అలాంటి ఒక “జాతు అన్వాత్ ” నిర్ణయించండి ప్రవక్తా’ అని అన్నాము.
అప్పుడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అన్నారు: “అల్లాహు అక్బర్! ఇవే (గత జాతులు పాటించిన) పద్దతులు, మార్గాలు. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్ష్యం! బనీ ఇస్రాయీల్ “తమ ప్రవక్త మూసా (అలైహిస్సలాం) తో అన్న తీరే మీరన్నారు. “వాళ్ళ దేవుళ్ళ వంటి ఒక దేవుణ్ణి మాకు కూడా చేసి పెట్టు” (అని వారన్నప్పుడు), మూసా (అలైహిస్సలాం) ఇలా అన్నారు: “మీరు చాలా అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నారు”. (ఆరాఫ్ 7:138). తప్పకుండా మీకంటే ముందు గడిచిపోయినవారి మార్గాలను మీరు కూడా అనుసరిస్తారు”అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) హెచ్చరించారు.
(తిర్మిజీ ). సహీ అని నిరూపించబడిన హదీసు.
ముఖ్యాంశాలు
1. సూరె నజ్మ్ లోని ఆయత్ యొక్క వ్యాఖ్యానం తెలిసింది. (అదే మనగా: ఆ దేవతలు వారికి లాభనష్టాలు చేకూర్చేవి అని ముష్రికులు భావించేవారు. అందుకే వారితో మొరపెట్టుకునేవారు. అక్కడ జంతువులను బలిచ్చేవారు. వారి సాన్నిధ్యం కోరేవారు).
3. సహాబాలు (సహచరులు) కేవలం తమ కోరికను వెల్లడించారు తప్ప, దాన్ని ఆచరణ రూపంలోకి తీసుకురాలేదు.
4. కోరిక ఉద్దేశం కూడా అల్లాహ్ సాన్నిధ్యం పొందడానికే ఉండేది. ఎందుకనగా: అల్లాహ్ దానిని ప్రేమిస్తాడని వారనుకున్నారు.
5. ఇది షిర్క్‌కు సంబంధించినదని సహాబాలకు తెలియనప్పుడు ఇతరులకు తెలియకపోవడం సంభవం. (కాని తెలిసిన వెంటనే విడనాడడం కూడా తప్పనిసరి).
6. ప్రవక్త సహాబాలు (సహచరులు), తమ సత్కార్యాలకు బదులుగా పొందిన వాగ్దానం, క్షమాపణ శుభవార్త లాంటివి అంత సులభంగా ఇతరులు పొందలేరు.
7. వారికి తెలియదు కదా అని ప్రవక్త ఊరుకోలేదు. “అల్లాహు అక్బర్! ఇవే మార్గాలు. మీకంటే ముందు గతించిన వారి మార్గాలను మీరు అనుసరిస్తారు” అని మూడు సార్లు హెచ్చరించి, అలాంటి కోరికలు చెడు అని స్పష్టం చేసారు.
8. మరో ముఖ్య విషయం ప్రవక్త తమ సహచరులతో ఇలా అనడం: మీ ప్రశ్న, కోరిక బనీ ఇస్రాయీల్, మూసాతో ప్రశ్నించి, కోరినటువంటిదే. వారు: “వాళ్ళ దేవుళ్ళవంటి ఒక దేవుణ్ణి మాకు కూడా చేసిపెట్టు” అని కోరారు.
9. ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) వారిని నివారించడం “లాఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భావంలోనే వస్తుంది. ఇది చాలా సూక్ష్మమైనది. అందుకే సహచరులు కూడా అది “లాఇలాహ ఇల్లల్లాహ్” భావానికి విరుద్ధమైనదని ముందు గమనించలేక పోయారు.
10. ఇచ్చట కూడా ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం), అల్లాహ్ ప్రమాణం చేసి చెప్పారు. (మాటి మాటికి ప్రమాణం చేయటం ఆయన అలవాటు కాదు. కాని విషయం చాలా గంభీరమైనది గనుక ప్రమాణం చేసి చెప్పారు).
11. తమ కోరికను వెల్లడించినందుకు వారు మతభ్రష్టులు కాలేదు. దీనీతో తెలిసిందేమిటంటే షిర్క్ చిన్నదీ (కనబడనిది) ఉంటుంది, పెద్దదీ (కనబడునది) ఉంటుంది.
12 “మేము కొత్తగా ఇస్లాం స్వీకరించియుంటిమి” అన్న వారి మాటతో ఇతర సహచరులు దినిని షిర్క్‌గా భావించేవారు అని తెలుస్తుంది.
13. ఆశ్చర్యం కలిగినప్పుడు “అల్లాహు అక్బర్” అనవచ్చు అని తెలిసింది. ఇలా అనకూడదు అని అనేవారి మాట ప్రవక్త మాటకు విరుద్ధం అని స్పష్టమయింది.
14. (షిర్క్ మరియు బిద్ అత్ )కు చేర్పించే సాధనాలన్నిటినీ రద్దు చేయాలని తెలిసింది.
15. జాహిలియ్యత్ (అజ్ఞానకాలం) నాటి పోలికను అవలంబించుట నుండి నివారించబడింది.
16. విద్య నేర్పుతున్నప్పుడు అవసర సందర్భంగా ఆగ్రహించవచ్చును.
17. “ఇవే సాంప్రదాయాలు” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) ఒక నియమం తెలిపారు.
18. ప్రవక్త మహత్యాల్లో ఒకటి ఆయన భవిష్యసూచన ఇచ్చినట్టు సంభవించింది.
19. ఖుర్‌ఆన్‌లో యూదుల, క్రైస్తవుల ఏ విషయాల్ని చెడుగా ప్రస్తావించి వారిన హెచ్చరించబడిందో, అలాంటి పనుల నుండి మనము దూరముండాంలని మనకు కూడా హెచ్చరిక ఉంది.
20. పండితుల వద్ద ఉన్న ఒక నియమం వాస్తవమైనది. అది: ఆరాధనల (ఇబాదత్‌ల) పునాది ఆజ్ఞ (హుకుం) పై ఉంది. (మన ఇష్టానుసారం ఇబాదత్ చేయరాదు).
21. గ్రంథమవ్వబడిన వారి సాంప్రదాయాలు, అలవాట్లు ఎలా చెడ్డవో ముష్రికులవి కూడా అలాగే చెడ్డవి.
22. ఎవరైతే అధర్మం నుండి ధర్మంలో అడుగుపెడుతాలో వారిలో కొన్ని పాత అలవాట్లు ఉంటాయి అని తెలిసింది. అబూ వాఖిద్ లైసీ (రది అల్లాహు అన్హు) అదే చెప్పింది. “మేము కొత్తగా ఇస్తాం స్వీకరించియుంటిమి”.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ)
‘చెట్లతో, రాళ్ళతో శుభం కోరుట ముష్రిక్కుల పని. ‘చెట్లతో, రాళ్ళతో, సమాధులతో ఇంకేదానితోనైనా శుభం కోరుట ధర్మసమ్మతం కాదని పండితులు ఏకీభవించారు. ఇది “గులువ్వు” (అతిశయోక్తి). ఎవరితో, ఏ దానితో తబర్రుక్ కోరబడుతుంటో, వారి ఆరాధన, వారితో దుఆ (ప్రార్ధన) చేయడం లాంటి పనులకు ఇది గురి చేస్తుంది. అల్లాహ్ యేతరుల ఆరాధన, వారితో దుఆ షిర్క్ అక్బర్ (పెద్ద షిర్క్) అన్న విషయం తెలిసిందే. చివరికి ముఖామె ఇబ్రాహీం, ప్రవక్త యొక్క గృహం, బైతుల్ మఖ్డిస్, అక్కడ ఉన్న “సఖ్ర్” మొదలగు వాటితో తబర్రుక్ కోరుట కూడా తప్పు.
కాబతుల్లా లోని హజర్ అస్వద్ (నల్ల రాయి)ను ముట్టుకొనుట, చుంబించుట మరియు రుక్నె యమానిని ముట్టుకొనుట మొదలైనవి అల్లాహ్ కు విధేయత చూపుట. ఆయన ఔన్నత్యాల ముందు వినయ వినమ్రతతో మెలుగుటయే ఇబాదత్ యొక్క సారాంశము. దీనికున్న ఆదేశం ఇతర వాటికి లేదు.
ఇలా అను: “నా నమాజ్, నా ఖుర్బాని (జంతుబలి), నా జీవనం, నా మరణం సమస్తమూ సకల లోకాలకూ ప్రభువైన అల్లాహ్ కొరకే. ఆయనకు ఏ భాగస్వామీ లేడు.” (అన్ ఆమ్ 6: 162,163).
అలీ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకు నాలుగు మాటలు నేర్పారు:
(1) అల్లాహ్ తప్ప ఇతరులకు జిబహ్ చేసిన వానిని అల్లాహ్ శపించాడు.
(2) తన తల్లిదండ్రుల్ని శపించిన, దూషించిన వానిని అల్లాహ్ శపించాడు.
(3) “ముహాదిన్ ” (బిద్ అతి, దురాచారం చేయు వాని)ని అల్లాహ్ శపించాడు.
(4) భూమిలో తమ స్థలాల (ఆస్తుల) గుర్తుల్ని మార్చిన వానిని అల్లాహ్ శపించాడు.
(ముస్లిం).
తారిఖ్ బిన్ షిహాబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఈగ కారణంగా ఒక వ్యక్తి స్వర్గంలో ప్రవేశించాడు. మరొక వ్యక్తి నరకంలో చేరాడు“.
అది ఎలా? అని సహచరులు అడుగగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు:
“ఇద్దరు మనుషులు ఒక గ్రామం నుండి వెళ్తుండగా, అక్కడ ఆ గ్రామవాసుల ఒక విగ్రహం ఉండింది. అక్కడి నుండి దాటిన ప్రతి ఒక్కడు ఆ విగ్రహానికి ఏ కొంచమైనా బలి ఇవ్వనిదే దాటలేడు. (ఆ విగ్రహారాధకులు) ఒకనితో అన్నారు: ఏదైనా బలి ఇవ్వు. “నా వద్ద ఏమి లేదు” అని అతడన్నాడు. “దాటలేవు. కనీసం ఒక ఈగనైనా బలి ఇవ్వు”. అతడు ఒక ఈగను ఆ విగ్రహం పేరు మీద బలిచ్చాడు. వారు అతన్ని దాటనిచ్చారు. కాని అతడు నరకంలో చేరాడు. “నీవు కూడా ఏదైనా బలి ఇవ్వు” అని మరో వ్వక్తితో అన్నారు. “నేను అల్లాహ్ తప్ప ఇతరులకు ఏ కొంచెమూ బలి ఇవ్వను” అని అతడన్నాడు. వారు అతన్ని నరికేశారు. అతడు స్వర్గంలో ప్రవేశించాడు.”
(అహ్మద్).
ముఖ్యాంశాలు:
మొదటి ఆయతు యొక్క వ్యాఖ్యానం.
రెండవ ఆయతు యొక్క వ్యాఖ్యానం.
శాపం ఆరంభం అల్లాయేతరులకు జిబహ్ చేసినవారితో అయింది.
తల్లిదండ్రుల్ని దూషించిన, శపించినవానినీ శపించడమైనది. నీవు, ఒక వ్యక్తి తల్లిదండ్రుల్ని దూషించావంటే అది నీవు స్వయంగా నీ తల్లిదండ్రుల్ని దూషించినట్లే.
“ముహాదిన్”ని శపించడమైనది. ఏ పాపంపై శిక్ష ఇహంలోనే అల్లాహ్ విధించాడో, ఒక వ్యక్తి ఆ పాపం చేసి ఆ శిక్ష నుండి తప్పించుకోడానికి ఇతరుల శరణు కోరుతాడు. అతన్ని కూడా “ముహాదిన్ ” అనబడుతుంది.
భూమి గుర్తులను మార్చిన వానిని కూడా శపించబడినది. నీ భూమి, నీ పక్కవాని భూమి మధ్యలో ఉండే గుర్తుల్ని వెనుక, ముందు చేసి మార్చేయడం అని భావం.
ఒక వ్యక్తిని ప్రత్యేకించి శపించడంలో, పాపాన్ని ప్రస్తావించి అది చేసిన వారిని శపించడంలో ఉన్న వ్యత్యాసాన్ని గమనించాలి.
ఈగ కారణంగా ఒకతను నరకంలో మరొకతను స్వర్గంలో చేరిన హదీసు చాలా ముఖ్యమైనది.
అతడు తన ప్రాణం కాపాడుకునే ఉద్దేశంతో ఒక ఈగను బలి ఇచ్చాడు. కాని నరకంలో చేరాడు.
విశ్వాసుల వద్ద షిర్క్ ఎంత ఘోర పాపమో గమనించవచ్చు. తన ప్రాణాన్ని కోల్పోవడం సహించాడు. కాని షిర్క్ చేయడానికి ఒప్పుకోలేదు.
నరకంలో చేరినవాడు విశ్వాసుడే. అతను మొదటి నుండే అవిశ్వాసి అయితే ఈగ కారణంగా నరకంలో చేరాడు అని అనబడదు.
ఈ హదీసు మరో హదీసును బలపరుస్తుంది. అది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ ప్రవచనం: “స్వర్గం మీ చెప్పు యొక్క పట్టీ (గూడ) కంటే చేరువుగా ఉంది, నరకం కూడా అలాగే“. (బుఖారి).
ముస్లింలు, ముస్లిమేతరులు అందరి వద్ద మనఃపూర్వకంగా ఉన్న ఆచరణ చాలా ప్రాముఖ్యత గలది.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :
జిబహ్ కేవలం అల్లాహ్ కొరకే చేయాలి. పూర్తి చిత్తశుద్ధితో చేయాలి. నమాజు గురించి చెప్పబడినట్లే దీని గురించి ఖుర్ఆన్ లో స్పష్టంగా చెప్పబడింది. ఎన్నో చోట్ల దాని ప్రస్తావన నమాజుతో కలసి వచ్చింది. ఇక ఇది అల్లాహ్ యేతరుల కొరకు చేయుట షిర్క్ అక్బర్ (పెద్ద షిర్క్).
షిర్క్ అక్బర్ దేనినంటారో గుర్తుంచుకోండి: “ఆరాధనలోని ఏ ఒక భాగాన్ని అయినా అల్లాయేతరుల కొరకు చేయుట“. అయితే ఏ విశ్వాసం, మాట, కార్యాలు చేయాలని ఇస్లాం ధర్మం చెప్పిందో అది అల్లాహ్ కు చేస్తే అది తౌహీద్, ఇబాదత్, ఇఖ్లాసు. ఇతరల కొరకు చేస్తే షిర్క్, కుఫ్ర్ . ఈ షిర్క్ అక్బర్ యొక్క నియమాన్ని మీ మదిలో నాటుకొండి.
అదే విధంగా షిర్క్ అస్గర్ (చిన్న షిర్క్) అంటేమిటో తెలుసుకోండి. “షిర్క్ అక్బర్ వరకు చేర్పించే ప్రతీ సంకల్పం, మాట, పని. అది స్వయం ఇబాదత్ కాకూడదు“. షిర్క్ అక్బర్, షిర్క్ అస్గర్ యొక్క ఈ రెండు నియమాలను క్షుణ్ణంగా తెలుసుకుంటే, దీనికి ముందు, తరువాత అధ్యాయాలన్నింటిని మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇంకా సందేహమనిపించే విషయాల్లో ఇది మీకు స్పష్టమైన గీటురాయిగా ఉంటుంది.
لَا تَقُمْ فِيهِ أَبَدًۭا “నీవు ఎన్నడూ అందులో నిలబడకు“. (9: తౌబా: 108).
సాబిత్ బిన్ జహ్హాక్ రజియల్లాహు అన్హు కథనం: బువాన అనే స్థలంలో ఒక వ్యక్తి ఒంటె జిబహా చేయాలని మ్రొక్కుకున్నాడు. దాన్ని గురించి ప్రవక్త ﷺ తో ప్రశ్నించగా, “అక్కడ జాహిలియ్యత్ కాలంలోని విగ్రహాల్లో ఏదైనా విగ్రహం ఉందా? దాని పూజ జరుగుతూ ఉందా?” అని ఆయన అడిగారు. “లేదు” అని అతడు సమాధానం పలికాడు. “వారి పండుగలో (ఉర్సు, జాతరలలో) ఏదైనా పండుగ (ఉర్సు,జాతర) అక్కడ జరుగుతుందా?” అని అడిగారు. “లేదు” అని అతడు సమాధానం పలికాడు. అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారు: “నీ మ్రొక్కుబడిని పూర్తి చేయు. అల్లాహ్ అవిధేయతకు గురి చేసే మ్రొక్కుబడిని పూర్తి చేయరాదు. మానవుడు తన శక్తికి మించిన దాన్ని మ్రొక్కుకుంటే అది కూడా పూర్తి చేయరాదు”. (అబూ దావూద్).
ముఖ్యాంశాలు:
1. ఇందులోని ఆయతు యొక్క వ్యాఖ్యానం.
2. అల్లాహ్ విధేయత, అవిధేయత కొన్ని సందర్భాల్లో భూమి పై కూడా తన ప్రభావాన్ని చూపుతుంది. (అందుకే షిర్క్ జరిగే చోట జిబహ్ చేయవద్దు అని చెప్పబడింది).
3. కఠిన సమస్యను నచ్చజెప్పెటప్పుడు సులభరీతిలో ఏలాంటి చిక్కు లేకుండా స్పష్టపడునట్లు చెప్పాలి.
4. అవసర సందర్భంలో “ఫత్వా” ఇచ్చువారు వివరాన్ని కోరవచ్చు.
5. ఎలాంటి ధార్మిక అడ్డు, ఆటంకం లేనప్పుడు ప్రత్యేక చోటును మ్రొక్కుబడి కొరకు నిర్ణయించవచ్చును.
6. జాహిలియ్యత్ (మూఢవిశ్వాస) కాలంలో విగ్రహం ఉన్నచోట, దాన్ని తర్వాత తొలగించినప్పటికీ అచ్చట జిబహ్ చేయరాదు.
7. వారి పండుగ (ఉర్సు, జాత్ర) జరుగుతున్న స్థలం, అది ఇప్పుడు జరగనప్పటికీ అక్కడ కూడా జిబహ్ చేయరాదు.
8. ఇలాంటి స్థలాల్లో జిబహ్ చేయుటకు మ్రొక్కుకుంటే దానిని పూర్తి చే యకూడదు. అది పాపపు మ్రొక్కు అగును.
9. ఉద్దేశపూర్వకంగా కానప్పటికీ ముస్లింలు ముష్రికుల పండుగ (ఉర్సు, జాత్ర)ల పోలికల నుండి జాగ్రత్తగా వహించాలి.
10. అవిధేయతకు గురి చేసే మ్రొక్కుబడి చేయరాదు.
11. మనిషి తన శక్తికి మించిన దాని మ్రొక్కు చేయకూడదు.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :
దీనికి ముందు అధ్యాయం తరువాత, వెంటనే ఈ అధ్యాయాన్ని ప్రస్తావించడంలో ఉత్తమమైన ఔచిత్యం ఉంది. మొదటిది షిర్క్ అక్బర్ అయితే, ఇది దానికి వసీల (మార్గం, సాధనం). ఏ చోటనైతే అవిశ్వాసులు, ముష్రికులు తమ దేవతల (వలీల) సాన్నిధ్యం పొందుటకు అల్లాతో షిర్క్ చేస్తూ వారి కొరకు జిబహ్ చేస్తారో అవి షిర్క్ యొక్క చిహ్నాలు, గుర్తులు అయ్యాయి. అక్కడ ఎవరైనా ముస్లిం జిబహ్ చేస్తే, అతని ఉద్దేశం అల్లాహ్ కొరకే ఉన్నప్పటికీ అది బాహ్యంగా వారి విధంగనే ఏర్పడుతుంది. (అంటే చూసేవాళ్ళకు అల్లాహ్ యేతరలకు చేస్తున్నట్లే ఏర్పడుతుంది). ఇలా బాహ్య రూపంలో వారికి పోలిన పనులు చేస్తే, చివరికి ఆంతర్యం కూడా ఒకటి అయి పోయే భయం ఉంటుంది. (ఈ రోజుల్లో అయిపోయినట్లే కనబడుతుంది).
అందుకే ఇస్లాం వారి (అవిశ్వాసులు, ముష్రికులు) పోలికల నుండి దూరముండాలని హెచ్చరించింది. అది వారి పండుగలు, వారి లాంటి కార్యాలు, వారి లాంటి దుస్తులు ఇంకా వారికి ప్రత్యేకించిన ప్రతీ దానితో ముస్లిం దూరముండాలి. వాస్తవానికి ఇది వారిలో కలసిపోవుటకు ఒక సాధనంగా మారుతుంది. ముష్రికులు అల్లాహ్ యేతరులకు సజ్దా చేసే సమయంలో, ముస్లింలు నఫిల్ నమాజు చేయుట నివారించబడింది. ఈ నివారణ వచ్చింది వారి పోలిక నుండి దూరముంచుటకే.
وَمَآ أَنفَقْتُم مِّن نَّفَقَةٍ أَوْ نَذَرْتُم مِّن نَّذْرٍۢ فَإِنَّ ٱللَّهَ يَعْلَمُهُۥ “మీరేమి ఖర్చుపెట్టినదీ, మీరు మొక్కుబడి చేసుకున్నదీ, అంతా అల్లాహ్ కు తెలుసు“. (2: బఖర: 270).
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు: “అల్లాహ్ కు విధేయత చూపాలని మొక్కుబడి చేసిన వ్యక్తి విధేయత చూపాలి. కాని ఎవరు అల్లాహ్ కు అవిధేయత చూపాలని మొక్కుబడి చేస్తాడో అతడు అవిధేయత చూపకూడదు”. (బుఖారి).
ముఖ్యాంశాలు:
1. మొక్కుబడి చేస్తే దాన్ని పూర్తి చేయాలి. 2. మొక్కుబడి ఇబాదత్ (ఆరాధన) అని తెలిసింది, దాన్ని ఇతరుల కొరకు చేయుట షిర్క్. 3. పాపకార్యానికి, అవిధేయతకు మొక్కుబడి చేస్తే దాన్ని పూర్తి చేయకూడదు.
وَأَنَّهُۥ كَانَ رِجَالٌۭ مِّنَ ٱلْإِنسِ يَعُوذُونَ بِرِجَالٍۢ مِّنَ ٱلْجِنِّ فَزَادُوهُمْ رَهَقًۭا “మానవులలో కొందరు జిన్నాతులలో కొందరిని శరణు వేడుతుండేవారు. ఈ విధంగా వారు జిన్నాతుల గర్వాన్ని మరింత అధికం చేశారు“. (72: జిన్న్: 6).
ఖవ్ లా బిన్తె హకీం కథనం: ప్రవక్త ﷺ ఇలా ఆదేశించగా నేను విన్నాను:
“ఎవరైనా ఒక స్థలంలో చేరిన తరువాత “అఊజు బికలిమా తిల్లాహి త్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ” చదివినచో వారికి ఆ స్థలం నుండి వెళ్ళే వరకు ఏ హాని కలగదు“. (ముస్లిం).
ముఖ్యాంశాలు:
1. కొందరు మనుషులు జిన్నాతుల శరణు కోరేవారు అని సూరె జిన్న్ వాక్యంలో తెలిసింది.
2. అది షిర్క్ అని తెలిసింది.
3. పైన పేర్కొనబడిన హదీసుతో కూడా అల్లాహ్ తో మాత్రమే శరణు వేడాలని తెలిసింది. అల్లాహ్ వాక్కు (కలిమ), ఆయన గుణమని, సృష్టిరాశి కాదు అని తెలిసింది. ఒక వేళ సృష్టి అయి ఉంటే ప్రవక్త వాటిద్వారా శరణు కోరేవారు కాదు. ఎందుకనగా సృష్టితో శరణు కోరుట షిర్క్.
4. పైన తెలుపబడిన దుఆ చిన్నది అయినప్పటికి దాని ఘనత, లాభం చాలా వుంది.
ఓ సందర్భంలో ఒక క్రియ, పని ద్వారా ఏదైనా ప్రాపంచిక లాభం కలిగితే, లేక కష్టం, నష్టం దూరమైతే అది షిర్క్ కాదు అనటానికి అది ప్రమాణం కాదు. (దేనితో లాభం కలిగిందో అదే స్వయం షిర్క్ కావచ్చు. అందుకు ఏది షిర్కో, ఏది షిర్క్ కాదో అనేది ఖుర్ఆన్, హదీసుల ద్వారా తెలుసుకోవాలి).
“అల్లాహ్ ను వదలి నీకు నష్టాన్నిగాని లాభాన్నిగాని కలిగించ లేని ఏ శక్తిని వేడుకోకు. ఒక వేళ అలా చేస్తే నీవూ దుర్మార్గుడవై పోతావు. అల్లాహ్ గనక నిన్ను ఏదైనా ఆపదకు గురి చేస్తే స్వయంగా ఆయన తప్ప ఆ ఆపదను తొలగించేవారు ఎవ్వరూ లేరు“. (యూనుస్ 10 : 106,107).
“అల్లాహ్ ను కాదని, ప్రళయం వచ్చే వరకు అతనికి సమాధానమైనా ఇవ్వలేని వారిని, మొరపెట్టుకునే వారు తమకు మొరపెట్టుకుంటున్నారనే విషయం కూడా ఎరుగని వారిని వేడుకునే వాడికంటే పరమ మార్గభ్రష్టుడైన వాడు ఎవడు? మానవులందరిని సమావేశపరచినప్పుడు, వారు తమను వేడుకున్న వారికి విరోధులైపోతారు. వారి ఆరాధనను తిరస్కరిస్తారు.” (అహ్ ఖాఫ్ 46: 5,6).
“బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు, అతని మొరను ఆలకించి అతని బాధను తొలగించేవాడు ఎవడు?.” (నమ్ల్ 27: 62).
తబ్రానీలో ఉంది: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కాలంలో ఒక కపటవిశ్వాసి విశ్వాసులకు చాలా బాధకలిగించేవాడు. ఒకసారి సహచరులు “పదండి! మనం ప్రవక్తతో ఈ కపటవిశ్వాసి గురించి మొరపెట్టుకుందాము” అని అన్నారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు: “నాతో కాదు మొర పెట్టుకోవలసింది. అల్లాహ్ తో మొరపెట్టుకోవాలి“.
ముఖ్యాంశములు:
1. “దుఆ” (ప్రార్థన) సర్వ సామాన్యమైనది. కాని “ఇస్తిగాస” (మొర) ప్రత్యేకించబడినది.
2. సూరె యూనుస్ లోని ఆయత్ (అల్లాహ్ ను వదలి నీకు నష్టాన్ని గాని లాభాన్ని గాని కలిగించలేని ……….) యొక్క భావం తెలిసింది.
3. అదే షిర్క్ అక్బర్ .
4. పుణ్యపురుషుడు, మహాభక్తుడు అల్లాహ్ యేతరులతో వారి సంతృప్తి కొరకు మొరపెట్టుకుంటే అతడు కూడా దుర్మార్గులలో కలసిపోతాడు.
5. సూరె యూనుస్ లోని రెండవ ఆయతు (అల్లాహ్ గనక నిన్ను ఏదైనా ఆపదకు గురి చేస్తే …..) యొక్క భావం తెలిసింది.
6. అల్లాహ్ యేతరులతో మొరపెట్టుకుంటే వారు ఏ లాభమూ చేకూర్చలేరు. అది అవిశ్వాసం కూడాను.
7. అన్ కబూత్ లోని ఆయతు (అల్లాహ్ ను కాదని మీరు పూజిస్తున్నవి…….) యొక్క భావం కూడా తెలిసింది.
8. స్వర్గం అల్లాహ్ తో కోరినట్లు, ఉపాధి కూడా అల్లాహ్ తో మాత్రమే కోరాలి.
9. అహ్ ఖాఫ్ లోని ఆయతు (అల్లాహ్ ను కాదని, ప్రళయం వచ్చే వరకు అతనికి……..) యొక్క భావం తెలిసింది.
10. అల్లాహ్ ను వదలి ఇతరులతో దుఆ చేసిన వానికంటే ఎక్కువ దుర్మార్గుడు, భ్రష్టుడు మరొకడు లేడు.
11. ఎవరితోనైతే మొరపెట్టుకొనడం జరుగుతుందో వారు మొరపెట్టుకునే వారిని ఎరుగరు.
12. ఇహలోకంలో మొరపెట్టుకోవటం, పరలోకంలో వారి పరస్పర ద్వేషానికి, శతృత్వానికి కారణమగును.
13. అల్లాహ్ ను వదలి ఇతరులను మొరపెట్టుకొనుట వారి ఆరాధన చేసినట్లు అగును.
14. మొరపెట్టుకోబడినవాడు ఈ మొరను తిరస్కరిస్తాడు.
15. ఇదే పరమ మార్గభ్రష్టత్వానికి కారణం.
16. అహ్ ఖాఫ్ వాక్యం (బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు……….) యొక్క భావం తెలిసింది.
17. చాలా ఆశ్చర్యకరమైన విషయం: కష్ట కాలాలలో అల్లాహ్ తప్ప ఎవరూ వినరని విగ్రహరాధకులు సయితం ఒప్పుకుంటారు. అందుకే ఆ సమయాల్లో అల్లాహ్ తోనే చిత్త శుద్ధితో మొరపెట్టుకుంటారు. (కాని ఈనాటి సమాధి పూజారులైన ముస్లింల విషయం బాధకరమైనది. అల్లాహ్ వారికి తౌహీద్ మార్గం చూపుగాక!).
18. పై హదీసు ద్వారా తెలిసిందేమిటంటే; ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తౌహీద్ ను అన్ని రకాల షిర్క్ నుండి దూరముంచడానికి చాలా ప్రయత్నం చేశారు. అల్లాహ్ తో ఏలాంటి మర్యాద పాటించాలో నేర్పారు.
తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ) :
పదవ అధ్యాయం లోని తాత్పర్యంలో తెలుపబడిన షిర్క్ అక్బర్ యొక్క పరిచయాన్ని నీవు అర్థం చేసుకొనియుంటే 12, 13, 14వ అధ్యాయాలు కూడా అర్థం చేసుకోగలవు.
మొక్కుబడి ఒక ఆరాధన. దాన్ని పూర్తి చేసిన వారిని అల్లాహ్ ప్రశంసించాడు. అల్లాహ్ విధేయత కొరకు మొక్కుకున్న మొక్కు బడి పూర్తి చేయాలని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశించారు.
ఏ పని గురించి ధర్మం ఆదేశించిందో, లేక అది చేసినవారిని ప్రశంసించిందో అది ఇబాదత్. మరొకసారి ఇబాదత్ (ఆరాధన) పరిచయాన్ని (భావాన్ని) గుర్తుంచుకొండి: “అల్లాహ్, ఇష్టపడే, తృప్తి చెందే ప్రతీ బాహ్య, ఆంతర్య మాటలు, చేష్టలు“.
అన్ని రకాల కీడు నుండి అల్లాహ్ శరణు మాత్రం కోరాలని అల్లాహ్ ఆదేశించాడు. ఇది ఇబాదత్. అల్లాహ్ తో శరణు కోరితే దాన్ని తౌహీద్ , విశ్వాసం అంటారు. ఇతరులతో కోరితే షిర్క్ అంటారు.
దుఆ మరియు మొరపెట్టుకొనుటలో వ్యత్యాసం ఏమనగా: దుఆ అన్ని పరిస్థితులకు ఉపయోగపడుతుంది. కష్టకాలాల్లో మొరపెట్టుకోవడం జరుగుతుంది. ఇవన్నియు పూర్తి చిత్తశుద్ధితో అల్లాహ్ తోనే చేయాలి. ఆయనే దుఆలు వినేవాడు. అంగీకరించేవాడు. కష్టాలను తొలగించువాడు. శక్తి లేని దాని గురించి దైవదూత, వలీలతో మొరపెట్టుకునేవాడు ముష్రిక్, కాఫిర్ అవుతాడు. ధర్మభ్రష్టుడవుతాడు. సృష్టిలో ఎవరి వద్ద కూడా స్వయంగా తనకు, లేక ఇతరులకు లాభనష్టాలు చేకూర్చే ఏ శక్తి లేదు. అందరూ అన్ని విషయాల్లో అల్లాహ్ ఎదుట బీదవాళ్ళే.
“ఏ వస్తువునూ సృష్టించలేనివారిని, స్వయంగా తామే సృష్టింపబడ్డవారిని, ఎవరికీ సహాయం చేయలేనివారిని, స్వయంగా తమకు తామే సహాయం చేసుకోలేనివారిని వీరు అల్లాహ్ కు భాగస్వాములుగా చేస్తున్నారా?” (ఆరాఫ్ 7: 191, 192).
“అల్లాహ్ ను కాదని మీరు పిలిచే ఇతరులకు కనీసం ఖర్జూరం విత్తనం పై ఉండు పొర అంత అధికారం కూడా లేదు.” (ఫాతిర్ 35: 13).
అనస్ (రజియల్లాహు అన్హు) కథనం: ఉహద్ యుద్ధం నాడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గాయపడ్డారు. అందులో ఆయన నాలుగు పళ్ళు విరిగాయి. అప్పుడు ఆయన అన్నారు: “తమ ప్రవక్తను గాయపరచిన జాతి సాఫల్యం ఎలా పొందగలదు?” అప్పుడే ఈ వాక్యం అవతరించింది. “(ప్రవక్తా!) నిర్ణయాధికారాలలో నీకు పాత్ర ఏదీ లేదు“. (ఆలె ఇమ్రాన్ 3:128).
అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఫజ్ర్ నమాజులో, రెండవ రకాతులోని రుకూ నుండి తలెత్తి, “సమిఅల్లాహు లిమన్ హమిదహ్ రబ్బనా వలకల్ హందు” అన్న తరువాత “ఓ అల్లాహ్ ఫలాన, ఫలానను శపించు” అని అన్నది విన్నారు. అప్పుడే ఈ ఆయతు అవతరించింది: “(ప్రవక్తా!) నిర్ణయాధికారాలలో నీకు పాత్ర ఏదీ లేదు.” (ఆలె ఇమ్రాన్ 3:128). – (బుఖారి, నసాయీ).
మరో ఉల్లేఖనంలో ఉంది: సఫ్వాన్ బిన్ ఉమయ్యా, సుహైల్ బిన్ అమ్ర్, హారిస్ బిన్ హిషాంపై “బద్ దుఆ” చేస్తున్నప్పుడు (శపిస్తున్నప్పుడు) అవతరించింది: “(ప్రవక్తా!) నిర్ణయాధికారాలలో నీకు పాత్ర ఏదీలేదు.” (ఆలె ఇమ్రాన్ 3: 128). – (బుఖారి).
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: “నీ దగ్గరి బంధువులను భయపెట్టు.” (షుఅరా 26: 214). అన్న ఆయతు అవతరించిన తరువాత “ఓ ఖురైషులారా!” అని లేక ఇలాంటిదే ఒక పదముతో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అందరిని సమావేశపరచి ఇలా చెప్పారు: “మీ ప్రాణాలను మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి. అల్లాహ్ వద్ద నేను మీకు ఏ మాత్రం సహాయం చేయలేను. ఓ అబ్బాసు బిన్ అబ్దుల్ ముత్తలిబ్! అల్లాహ్ వద్ద నేను మీకు ఏ మాత్రం సహాయం చేయలేను. ప్రవక్త మేనత్త సఫియ్యా! నేను నీకు అల్లాహ్ వద్ద ఏ మాత్రం సహాయం చేయలేను. ముహమ్మద్ కుమార్తె ఫాతిమా! నీవు కోరినంత నా సొమ్ము అడుగు ఇచ్చేస్తా, కాని అల్లాహ్ వద్ద నేను నీకు ఏ మాత్రం సహాయం చేయలేను“. (బుఖారి).
ముఖ్యాంశాలు:
1. పై రెండు ఆయతుల భావం.
2. ఉహద్ యుద్ధం యొక్క సంఘటన.
3. సకల ప్రవక్తల నాయకులైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) “ఖునూత్ “లో దుఆ చేస్తు అంటున్నారు. (అలాంటి మహాపురుషులు తమ కష్ట కాలాల్లో అల్లాహ్ తో మొరపెట్టుకుంటే, సామాన్యులు తమ కష్ట కాలాల్లో అల్లాహ్ తో మొర పెట్టుకొనుట ఎక్కువ అవసరం).
4. ఎవరిని శపించబడినదో వారు అప్పుడు అవిశ్వాసులుగా ఉండిరి.
5. వీరు ఇతర అవిశ్వాసులు చేయని ఘోరకార్యాలు వారు చేశారు. ఉదా: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను గాయపరిచారు. ఆయన్ను హతమార్చడానికి ప్రయత్నించారు. అమర వీరులైన (హత్యచేయబడిన విశ్వాసుల) అవయవాలను సయితం కోశారు. వీరు (విశ్వాసులు) వారి (అవిశ్వాసుల) తండ్రి సంబంధిత దగ్గరి బంధువులే.
6. ఇంత జరిగినందుకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారిని శపించినప్పుడు పై వాక్యం “(ప్రవక్తా!) నిర్ణయాధికారాలలో నీకు పాత్ర ఏదీలేదు” ను అల్లాహ్ అవతరింపజేసాడు.
7. “వారిని క్షమించే, శిక్షించే అధికారం అల్లాహ్ కు మాత్రమే ఉంది“(ఆలె ఇమ్రాన్ 3:128). అన్న అల్లాహ్ ఆదేశం ప్రకారం, అల్లాహ్ వారిని క్షమించాడు. వారు ఇస్లాం స్వీకరించారు. .
9. ఎవరిని శపించబడుతుందో వారిని, వారి తండ్రుల పేరుతో కలిపి శపించ వచ్చును.
10. ఖునూత్ లో ప్రత్యేకించబడిన ఒక్కొక్క వ్యక్తిని పై ప్రవక్త శపించారు.
11. (షుఆరా:214) ఆయత్ అల్లాహ్ అవతరించినప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అందరిని సమూహపరచి తౌహీద్ పిలుపు ఇచ్చిన విషయం తెలిసింది.
12. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తౌహీద్ ప్రచారం చేయునప్పుడు, “పిచ్చివాడు” అని అవిశ్వాసుల ద్వారా పిలువబడ్డారు. ఈ రోజుల్లో ఎవరైనా ముస్లిం అదే పని చేస్తుంటే వారి తో కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు.
13. దగ్గరి, దూరపు బంధువులందరికి “నేను మీకు సహాయము చేయలేను” అని స్పష్టం చేశారు. స్వయం తమ కుమార్తె అయిన ఫాతిమాకు కూడా “ఓ ఫాతిమా! నేను నీకు సహాయము చేయలేను ” అని చెప్పారు. ఆయన ప్రవక్తల నాయకులై, స్త్రీల నాయకురాలైన ఫాతిమ (రజియల్లాహు అన్హా)కు ఏ మాత్రం పనికి రాను అని తెలిపారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సత్యం తప్ప మరేది పలకరు అని అందరి విశ్వాసం. అయినా ఈ రోజుల్లో ఈ రోగం సామాన్య ప్రజలకే కాక విద్యావంతులు కూడా అర్థం చేసుకోలేకున్నారు. తౌహీద్ , ధర్మం వారి వద్ద ఎంత విచిత్రమైందో అగపడుతుంది.
తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ) :
ఇక్కడి నుండి తౌహీద్ యొక్క నిదర్శనాలు ప్రారంభం అవుతున్నాయి. తౌహీద్ ను నిరూపించడానికి ఉన్నటువంటి గ్రాంధిక, జ్ఞాన సంబంధమైన నిదర్శనాలు మరేదానికి లేవు.
తౌహీద్ రుబూబియత్, ఉలూహియత్ స్వయంగా ఇవి రెండు పెద్ద నిదర్శనాలు. సృష్టి, నిర్వహణలో అద్వితీయుడైన, అన్ని విధాలుగా సర్వశక్తుడైన వాడే ఆరాధనలకు అర్హుడు. అతడు తప్ప మరెవ్వడూ ఆరాధనలకు అర్హుడు కాడు.
అదే విధంగా సృష్టిరాసుల గుణాలను పరిశీలిస్తే కూడా దాని నిదర్శనాలు కనబడుతున్నాయి. అల్లాహ్ యేతరులలో దైవదూత, మానవుడు, చెట్లు, గుట్టలు మొదలగు ఎవరెవరి పూజా చేయబడుతుందో వారందరూ/అవన్నియు అల్లాహ్ ఎదుట దీనులు, బలహీనులు, భిక్షకులు. లాభనష్టాలు చేకూర్చే రవ్వంత శక్తి కూడా లేనివారు. ఏ కొంచెమూ సృష్టించలేరు. వారే సృష్టింపబడ్డారు. లాభనష్టాలు, జీవన్మరణాలకు మరియు రెండవసారి పునరుత్తానానికి వారు అధికారులు కారు. అల్లాహ్ మాత్రమే సర్వ సృష్టికి సృష్టికర్త. పోషకుడు. నిర్వహకుడు. లాభనష్టాలు చేకూర్చే, కోరిన వారికి ప్రసాదించే, కోరనివారికి ప్రసాదించకుండా ఉండే అధికారం కలవాడు. సర్వశక్తి ఆయన చేతిలో ఉంది. ఇంతకు మించిన, మంచి నిదర్శనాలు ఇంకేం కావాలి. వీటి ప్రస్తావన అల్లాహు తఆలా, ఖుర్ఆన్ లో అనేక చోట్ల ప్రస్తావించాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అనేక సార్లు తెలిపారు. ఇది అల్లాహ్ ఒక్కడు, సత్యుడు, బహుదైవత్వం (షిర్క్) తుఛ్ఛం అనడానికి స్వాభావికమైన, జ్ఞాన సంబంధమైన నిదర్శనాలతో పాటు, గ్రాంధిక, ఎల్లవేళల్లో కనవినబడుతున్న నిదర్శనాలు కూడానూ.
సృష్టిలో కెల్ల అతి ఉన్నతుడైన ఒక మానవుడు (ప్రవక్త) స్వయం తన దగ్గరి బంధువునికి ఏ లాభం అందించలేక పోయినప్పుడు ఇతరులకు ఏమివ్వగలడు? ఇంతా తెలిసికూడా అల్లాహ్ తో షిర్క్ చేసినా, సృష్టిలో ఏ ఒక్కరిని అల్లాహ్ కు సమానంగా నిలబెట్టినవాడు నాశనమవుగాకా, అతడు ధర్మం కోల్పోయిన తరువాత, బుద్ధి జ్ఞానం కూడా కోల్పోయాడు.
అల్లాహ్ ను ఆ తరువాత సృష్టిని తెలుసుకున్నవాడు, అతని ఈ తెలివితో కేవలం అల్లాహ్ నే ఆరాధించాలి, ధర్మమును ఆయనకే ప్రత్యేకించాలి, ఆయన్ను మాత్రమే ప్రశంసించాలి, తన నాలుక, హృదయం, శరీరాంగాలతో ఆయనకే కృతజ్ఞత తెలుపాలి. సృష్టి రాసులతో భయం, ఆశ లాంటివేమి ఉండకూడదు.
అల్లాహ్ ఆదేశం: (చివరకు దైవదూతల హృదయాల నుండి భయం తొలగిపోయినపుడు, వారు “మీ ప్రభువు ఏమని పలికాడు?” అని అడుగుతారు. వారు, “సత్యం పలికాడు”, ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడు అని అంటారు). (సబా 34:23).
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెప్పారు:
“అల్లాహ్ ఆకాశంలో ఒక ఆదేశం జారి చేసినప్పుడు, ఆయన ఆజ్ఞకు (విధేయులై) దైవదూతలు తమ రెక్కలు కొడుతారు. దాని శబ్దం కొండరాతిపై గొలుసుతో కొట్టినట్లు ఉంటుంది. ఆయన ఆదేశం వారి వరకు చేరుతుంది. చివరకు వారి హృదయాల నుండి భయం తొలగిపోయినప్పుడు, వారు “మీ ప్రభువు ఏమని పలికాడు?” అని అడుగుతారు. వారు, “సత్యం పలికాడు”, ఆయన మహెూన్నతుడు, మహిమాన్వితుడు అని చెబుతారు. ఈ మాటను దొంగలించడానికి షైతాన్ వింటూ ఉంటాడు. షైతానులు ఒకరిపై ఒకరు ఇలా ఉంటారు అని (ఈ హదీసు ఉల్లేఖించేవారిలో ఒకరు) సుఫ్యాన్ బిన్ ఉమయ్య నా తమ అరచేతిని వంచి వ్రేళ్ళ మధ్య వ్యత్యాసముంచి వివరించారు. ఆ షైతాన్ ఒక్క మాట విని, అతని క్రింద ఉన్న షైతాన్ కు ఇస్తాడు. ఇలా ప్రతి ఒకడు తన క్రిందివానికి ఇస్తూ చివరివాడు మాంత్రికునికి, లేక జ్యోతిష్యునికి ఇస్తాడు. ఒకప్పుడు ఆ మాట క్రిందికి చేరక ముందే (అల్లాహ్ ఆకాశంలో నియమించిన) అగ్ని జ్వాల అతడ్ని పట్టుకొని (కాల్చేస్తుంది). ఒకప్పుడు ఆ అగ్నిజ్వాల పట్టుకోక ముందే ఆ మాటను అతడు పంపేస్తాడు. ఆ ఒక్క మాటలో మాంత్రికుడు, లేక జ్యోతిష్యుడు వంద అబద్దాలు కలిపి (ప్రజలకు చెబుతాడు). అతడు చెప్పింది నిజమయేదుంటే, ప్రజలు అతను (మాంత్రికుడు, జ్యోతిష్యుడు) అలా, అలా చెప్పలేదా అని అనుకుంటారు. కాని అందులో నిజమయేది ఆ ఆకాశం నుండి విన్న ఒక్క మాటే”. (బుఖారి).
నవాసుబ్ను సమ్ ఆన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
“అల్లాహ్ ఒక విషయం వహీ (దివ్య సందేశం) పంపాలని కోరినప్పుడు వహీ ద్వారా మాట్లాడుతాడు. అప్పుడు అల్లాహ్ భయంతో ఆకాశాలు కంపించిపోతాయి. ఆకాశవాసులు ఇది విన్నప్పుడు సొమ్మసిల్లి, సజ్దాలో పడిపోతారు. మొట్ట మొదట వారిలో జిబ్రీల్ తలెత్తుతారు. అల్లాహ్ తాను కోరింది వహీ ద్వారా అతనితో మాట్లాడుతాడు. తరువాత జిబ్రీల్ దైవదూతల ముందు వెళ్తారు. ప్రతీ ఆకాశం నుండి వెళ్తున్నప్పుడు ఆ ఆకాశ దైవదూతలు మీ ప్రభువు ఏమన్నాడు? అని అడుగుతారు. “సత్యం పలికాడు. ఆయన మహెన్నతుడు, మహిమాన్వితుడు” అని అతడంటాడు. వారందరు జిబ్రీల్ అన్నట్లు అంటారు. తరువాత జిబ్రీల్ ఆ విషయాన్ని ఎక్కడ చేరవేయాలని అల్లాహ్ చెప్పాడో అక్కడికి చేరవేస్తారు”.
ముఖ్యాంశాలు:
1. ఖుర్ ఆన్ ఆయతు యొక్క భావం (అల్లాహ్ వహీ చేసినప్పుడు దైవ దూతల భయ కంపనాల వివరణ ఉంది).
2. ఇందులో షిర్క్ కు విరుద్ధంగా బలమైన ఋజువు ఉంది. ప్రత్యేకంగా పుణ్యపురుషుల పేరు మీద జరిగే షిర్క్. ఈ ఆయత్ ఆంతర్యాల నుండి షిర్క్ పునాదులను బద్దలు చేస్తుంది అని అనబడింది.
3. “సత్యం పలికాడు, ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడూ” అన్న ఆయతు భావం.
4. వారు ప్రశ్నించింది ఎందుకు అన్నది కూడా తెలుస్తుంది. (అల్లాహ్ భయంతో).
5. ఆ తరువాత జిబ్రీల్ “అల్లాహ్ ఇలా ఇలా చెప్పాడు” అని వారికి బదులిస్తారు.
6. “మొదటిసారిగా తల ఎత్తేవారు జిబ్రీల్ ” అన్న ప్రస్తావన వచ్చింది.
10. అల్లాహ్ ఆదేశమిచ్చిన చోటకి వహీ తీసుకెళ్ళేవారు జిబ్రీలె.
11. షైతానులు మాటలను దొంగతనం చేసే ప్రయత్నాలు చేసేవారు.
12. షైతానులు ఒకరిపై ఒకరు ఎక్కుతారు, ఆకాశంలోని మాట అందుకోవటానికి.
13. వారిని తరిమి కొట్టడానికి అగ్నిజ్వాల పంపబడుతుంది.
14. ఒక్కప్పుడు అగ్నిజ్వాల అతన్ని అందుకొని కాల్చేస్తుంది. ఒకప్పుడు అతడు తప్పించుకొని ఆ మాట మాంత్రికుని, లేక జ్యోతిష్యునికి అందిస్తాడు.
15. ఒక్కోసారి మాంత్రికుని, జ్యోతిష్యుని మాట నిజమవుతుంది.
16. మాంత్రికుడు, జ్యోతిష్యుడు ఆ ఒక్క మాటకు వంద అబద్దాలు కలుపుతాడు.
17. అతని అసత్య మాటల్ని ప్రజలు నిజమనుకునేది ఆ ఒక్క ఆకాశ మాట నిజమయినందుకే.
18. అసత్యాన్ని, మిథ్యాన్ని మనుస్సు ఎంత తొందరగా ఒప్పుకుంటుందో చూడండి. ఒక్క మాటను చూస్తారు, కాని వంద అబద్దాలున్నాయని గమనించరు.
19. షైతానులు పరస్పరం ఆమాటను అందుకొని జ్ఞాపకముంచుకుంటారు. ఇతర మాటల్ని నిజమని భావింపజేసే ప్రయత్నం చేస్తారు.
20. ఇందులో అల్లాహ్ గుణవిశేషణాలు రుజువవుతున్నాయి. “అష అరియ్య, ముఅత్తిల” వర్గంవారు వాటిని తిరస్కరిస్తారు. (వాస్తవానికి తిరస్కరించ కూడదు).
21. కంపించుట, సొమ్మసిల్లుట అనేది అల్లాహ్ భయం వలన జరుగుతుంది.
22. దైవదూతలు అల్లాహ్ కు సజ్దా చేస్తారు.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ)
ఇందులో కూడా తౌహీద్ విధితం, షిర్క్ తుచ్ఛం అని చెప్పడానికి గొప్ప నిదర్శనం ఉంది. పై మూల వాక్యాల్లో అల్లాహ్ గొప్పతనం, ఔన్నత్యం ప్రస్తావించబడినది. ఆ గొప్పతనం, ఔన్నత్యం ముందు సర్వ సృష్టి యొక్క పెద్దరికాలు మట్టిలో కలిసిపోతాయి. అతని మాట వింటేనే భూమ్యాకాశాల్లో ఉన్న సర్వ దైవదూతల గుండెలు అదిరిపోతాయి. వారందరు ఆయన ఎదుట తల మోకరిల్లి, ఆయన గొప్పతనం, ఔన్నత్యాలను స్తుతిస్తారు. ఆయనతో భయపడుతారు. ఇలాంటి గొప్ప గుణం గల ప్రభువే, ఆరాధనకు అర్హుడు కాగలడు. ఆయన తప్ప మరెవ్వరూ ఆరాధనకు, పొగడ్తలకు, ప్రశంసలకు, కృతజ్ఞతకు అర్హులు కారు.
“ప్రవక్తా! తమ ప్రభువు ముందు ఆయన తప్ప తమకు అండగా నిలిచి, సహాయం చేసే (అధికారం గల) వాడుగానీ లేదా తమ కొరకు సిఫారసు చేసే వాడుగానీ ఎవడూ ఉండని స్థితిలో ఎప్పుడైనా హాజరు కావలసివస్తుందని భయపడుతూ ఉండేవారికి నీవు దీని (ఖుర్ఆన్) ద్వారా ఉపదేశించు.” (అన్ ఆమ్ 6:51).
قُل لِّلَّهِ الشَّفَاعَةُ جَمِيعًا
(ఓ ప్రవక్తా!) చెప్పు: “సిఫారసు అనేది పూర్తిగా అల్లాహ్ చేతిలోనే ఉంది.” (జుమర్ 39:44).
“ఆకాశాలలో ఎంతో మంది దైవదూతలు ఉన్నారు. కాని వారి సిఫారసు ఏ మాత్రం ఉపయోగపడదు. అల్లాహ్ తాను ఎవరిని గురించైతే ఏదైనా విన్నపం వినదలుస్తాడో, ఎవడైతే ఆయనకు ఇష్టమైనవాడో, అటువంటి వ్యక్తి విషయంలో దానికి (సిఫారసుకు) అనుమతి ఇస్తేనే తప్ప.” (నజ్మ్ 53:26).
(ప్రవక్తా! ఈ ముష్రికులతో) ఇలా అను, “అల్లాహ్ ను కాదని మీరు ఆరాధ్యులుగా భావించిన వారిని పిలిచి చూడండి. వారు ఆకాశాలలో గాని, భూమిలోగాని, రవ్వంత వస్తువుకు కూడా యజమానులుకారు” (సబా 34:.22-23).
షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియ (రహిమహుల్లాహ్) ఇలా చెప్పారు:
“తనలో తప్ప ముష్రికులు భావించే వారిలో ఏ శక్తి లేదని అల్లాహ్ స్పష్టం చేశాడు. ఆయన తప్ప మరెవ్వరికి (భూమ్యాకాశాల్లో దేనికీ) ఏలాంటి అధికారం లేదు. ఎవరూ అల్లాహ్ మద్దతుదారులూ కారు. కేవలం సిఫారసు మిగిలి ఉన్నది. దాన్ని స్పష్టం చేశాడు; ఆయన అనుమతి ఇచ్చిన వారికి తప్ప మరెవ్వరి సిఫారసు పనికిరాదు. అదే విషయం ఈ వాక్యంలో ఉంది.
وَلَا يَشْفَعُونَ إِلَّا لِمَنِ ارْتَضَىٰ
“వారు ఎవరిని గురించీ సిఫారసు చేయరు. సిఫారసు వినటానికి అల్లాహ్ ఇష్టపడిన వాని విషయంలో తప్ప.” (అంబియా 21:28).
ఏ సిఫారసు గురించి ముష్రికులు (పనికి వస్తుందన్నట్లు) ఇక్కడ భావిస్తున్నారో ప్రళయ దినమున అది కనబడదు, పనికిరాదు. ఖుర్ ఆన్ దానిని రద్దు చేసింది.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు: “ప్రళయదినాన అందరూ సమూహమైన చోట (మహ్-షర్ మైదానం లో) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ప్రభువు కొరకు దీర్ఘ సమయం వరకు సజ్దాలో ఉండి, ఆయన స్తోత్రములు పఠిస్తారు. వెంటనే సిఫారసు చేయరు. తరువాత ఇలా చెప్పబడుతుంది. “ఓ ముహమ్మద్ ! తల ఎత్తు, పలుకు, నీ మాట వినబడుతుంది. అడుగు, ఇవ్వబడుతుంది. సిఫారసు చేయి, అంగీక రించబడుతుంది“.
ఒక సారి అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో ఇలా ప్రశ్నించారు: “ప్రళయ దినాన మీ సిఫారసుకు అర్హులు ఎవరు కాగలరు?“. దానికి ఆయన “ఎవరు “లాఇలాహ ఇల్లల్లాహ్” హృదయాంతర సత్యత మరియు స్వఛ్ఛతతో అంటారో వారు” అని సమాధానమిచ్చారు. ఈ సిఫారసు, అల్లాహ్ అనుమతి తరువాత లభించేది సత్య విశ్వాసులకు. కానిఅల్లాహ్ తో షిర్క్ చేసినవారు దీనికి నోచుకోలేరు.
అల్లాహ్ అనుమతి ఇచ్చిన వారి సిఫారసు, దుఆతో సత్యవిశ్వాసులను క్షమించడం వాస్తవానికి ఇది వారికి అల్లాహ్ వైపు నుండి లభించే గౌరవం, ఘనత. మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు గౌరవం, ప్రసాదం, ఇలా ఆయన “మఖామె మహ్మూద్ ” (అత్యంత స్తుతింపబడిన మహోన్నత స్థానం) పొందుతారు.
ఖుర్ఆన్ రద్దు చేసిన సిఫారసు షిర్క్ తో కలుషితమైన సిఫారసు. అందుకే స్వయంగా ఆయన అనుమతితో చెల్లే సిఫారసును గురించి అనేక చోట్ల ప్రస్తావించాడు. దానికి అర్హులు తౌహీద్ ను విశ్వసించిన సత్య విశ్వాసులు అని ప్రవక్త స్పష్టం చేశారు.
(షేఖుల్ ఇస్లాం వివరణ సమాప్తమయింది).
ముఖ్యాంశాలు:
1. ఖుర్ ఆన్ ఆయతుల భావం తెలిసింది.
2. రద్దు చేయబడిన సిఫారసు వివరణ వచ్చింది.
3. చెల్లునటువంటి సిఫారసు వివరణ వచ్చింది.
4. మఖామె మహ్మూద్ ను షఫాఅతె కుబ్రా (పెద్ద సిఫారసు) అని అంటారు, దాని ప్రస్తావన వచ్చింది.
5. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ సిఫారసు సాధారణంగా చేయరు. ముందు దీర్ఘ సమయం వరకు సజ్దాలో ఉంటారు తరువాత అనుమతి లభిస్తుంది.
6. దాని అర్హులైన అదృష్టవంతులెవరో కూడా తెలిసింది.
7. అల్లాహ్ తో షిర్క్ చేసినవారికి అది ప్రాప్తం కాదు.
8. దాని వాస్తవికత కూడా తెలిసింది.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :
రచయిత (ముహమ్మద్ బిన్అబ్దుల్ వహ్హాబ్) రహిమహుల్లాహ్ సిఫారసుకు సంబంధించిన అధ్యాయాన్ని ఇచ్చట ప్రస్తావించడానికి కారణం ముష్రికుల భ్రమ, తప్పుడు ఆలోచనను దూరం చేయడానికి.
అది ఏమనగా: దైవదూతల, ప్రవక్తల, వలీల (ఔలియా అల్లాహ్)తో ముష్రికులు దుఆ చేస్తూ, మొరపెట్టుకుంటూ, తాము షిర్క్ కు అతీతులమని చెప్పుకుంటారు. అది ఎలా అనేది వారే స్వయంగా ఇలా తెలుపుతారు: “వారు మా లాంటి మనుషులని మాకు తెలిసినప్పటికీ మేము వారితో దుఆ చేస్తాము. ఎందుకనగా వారు అల్లాహ్ వద్ద ఉన్నత స్థానం గలవారు. మేము వారితో దుఆ చేస్తే, వారు మమ్మల్ని అల్లాహ్ వరకు చేర్పిస్తారు. అల్లాహ్ వద్ద మాకు సిఫారసు చేస్తారు. ఎలాగైతే రాజుల, అధికారుల వరకు చేరుకోవటానికి, వారి దగ్గర ఉండే కొందరు ప్రత్యేక సిఫారసు చేయువారు, సామాన్య ప్రజల అవసరాలు తీర్చుటకు గాను రాజుల, అధికారుల వద్ద సిఫారసు చేస్తారో“.
కాని ఇది అసత్యం, తుఛ్ఛం. సర్వ అధికారులకన్నా గొప్ప అధికారి అయిన, శక్తి సామర్థ్య వంతుడైన అల్లాహ్ యొక్క ఉదాహరణ భిక్షకుడైన, అసమర్ధుడైన రాజుతో ఇవ్వబడుతుంది. కొందరు మంత్రులతో కలసియే అతను రాజు అయినందుకు (అతని అసమర్థత అట్లే ఏర్పడుతుంది). ఈ అధ్యాయంలో ప్రస్తావించబడిన ఆయతులతో ఇలాంటి భ్రమ తొలిగిపోతుంది. సర్వ లోకాలకు అధికారి అయిన అల్లాహ్యే సిఫారసు యొక్క అధికారి అని అందులో స్పష్టంగా ఉంది. ఆయన అనుమతి లేనిదే ఎవ్వరూ ఎవ్వరికీ సిఫారసు చేయలేరు. ఎవని మాట, కర్మలతో అల్లాహ్ సంతృప్తి పడతాడో అతని కొరకే అనుమతి లభించేది. తౌహీద్, ఇఖ్లాస్ ఉన్న వ్యక్తి తోనే అల్లాహ్ ఇష్టపడతాడు. అయితే ముష్రిక్ (షిర్క్ చేసినవానికి) సిఫారసు ప్రాప్తం కాదు.
అల్లాహ్ ఆదేశం: “ఓ ప్రవక్తా! నీకు ఇష్టమైన వారికి నీవు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించలేవు“. (ఖసస్ 28:56).
ముసయ్యిబ్ (రదియల్లాహు అన్హు) కథనం: అబూ తాలిబ్ మరణ సమయంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చారు. అక్కడ అబుల్లా బిన్ అబీ ఉమయ్య, అబూ జహల్ ఇద్దరు అవిశ్వాసులున్నారు. ప్రవక్త అన్నారు: “చిన్నాన్నా! “లా ఇలాహ ఇల్లల్లాహ్” వచనం పలకండి, అల్లాహ్ వద్ద మీ పట్ల దాన్ని ఒక ఋజువుగా ఉంచి మాట్లాడతాను“.
అప్పుడు వారిద్దరు: “అబ్దుల్ ముత్తలిబ్ ధర్మంను విడనాడుతావా?” అని హెచ్చరించారు. ప్రవక్త మళ్ళీ చెప్పారు. వారిద్దరు అదే మాట అన్నారు. అబూ తాలిబ్ పలికిన చివరి మాట: “నేను అబ్దుల్ ముత్తలిబ్ ధర్మాన్నే విశ్వసిస్తున్నాను”, “లా ఇలాహ ఇల్లల్లాహ్”ను అతడు తిరస్కరించాడు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు: “అల్లాహ్ నన్ను నివారించని వరకు మీ కొరకు క్షమాపణ కోరుతూ ఉంటాను“. అప్పుడు అల్లాహ్ ఈ వాక్యం అవతరింప జేశాడు. “ముష్రికులను క్షమించవలసినదిగా ప్రార్థన చెయ్యటం ప్రవక్తకూ, విశ్వాసులకూ తగనిపని” (తౌబా 9:113). అబూ తాలిబ్ విషయంలో ఈ ఆయతు అవతరించింది. “ప్రవక్తా! నీకు ఇష్టమైన వారికి నీవు మార్గదర్శ కత్వాన్ని ప్రసాదించలేవు. కాని అల్లాహ్ తనకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వాన్ని ప్రసాదించగలడు”. (ఖసస్ 28: 56). (ఈ మొత్తం విషయం బుఖారి మరియు ముస్లిం హదీసులలో ఉల్లేఖించబడింది).
ముఖ్యాంశాలు:
1. మొదటి ఆయతు యొక్క భావం. (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ జీవిత కాలంలోనే స్వయంగా తన పినతండ్రికి ఏ లాభం చేయలేకపోతే, మరణించిన తర్వాత ఎవరికి ఏ సహాయం చేయగలరు?).
2. (ముష్రికులను క్షమించవలసినదిగా ప్రార్థన చెయ్యటం………. ) అన్న ఆయతు యొక్క భావం తెలిసింది.
3. ముఖ్యమైన విషయం ఇందులో “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భావం. అంటే కేవలం నోటితో పలికితే సరిపోదు, నిర్మలమైన మనస్సుతో సాక్ష్యం ఇచ్చుట తప్పనిసరి. నోటి మాటలు సరిపోవును అని చెప్పే కొందరి పండితులకు ఈ హదీసు విరుద్ధంగా ఉన్నది.
4. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చి “లాఇలాహ ఇల్లల్లాహ్” చదవమని అబూ తాలిబ్ తో అన్న ప్పుడు, ప్రవక్త ఉద్దేశం ఏమిటో అబూ జహల్, అతనితో ఉన్న ఇద్దరికి బాగా తెలుసు. (అందుకే వారు తాతముత్తాతల ధర్మాన్ని విడనాడకూడదని అతనికి చెప్పగలిగారు). అందరికంటే అబూ జహల్ ఎక్కువ ఇస్లాం మౌలిక విషయాన్ని తెలుసుకున్నప్పటికీ (ఇస్లాంలో చేరలేదు). వారిని అల్లాహ్ శపించుగాక!
5. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), తన పినతండ్రి ఇస్లాం స్వీకరించాలని చాలా ప్రయత్నం చేశారు.
6. అబ్దుల్ ముత్తలిబ్ మరియు అతని పూర్వీకులు ఇస్లాం స్వీకరించారు – అన్నవారి భ్రమ దీనిద్వారా దూరం కావాలి.
7. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతని కొరకు ఇస్తిగ్ఫార్ (క్షమించమని అల్లాహ్ తో ప్రార్థించుట) చేశారు. ఆయన పినతండ్రి క్షమించబడలేదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అలా ఇస్తిగ్ఫార్ చేయుటను అల్లాహ్ నివారించాడు.
8. దుష్ట స్నేహితుల దుష్ప్రభావం మనిషి పై పడుతుంది.
9. దుర్మార్గంపై ఉన్న పూర్వీకుల బాటను అనుసరించడం, గౌరవించడం కూడా హానికరం.
10. “మా పెద్దల ఆచారాన్ని ఎలా వదులుకోవాలి” అన్న సందేహంలో పడి ఉన్నవారు, వాస్తవానికి అబూజహల్ అన్నటువంటి మాటే అంటున్నారు.
11. మనిషి సఫలుడు అవుతాడు అన్నదానికి ఒక సాక్ష్యం అతని అంతిమ ఘడియల్లో ఉన్న ఆచరణ. అతడు (అబూ తాలిబ్) ఒకవేళ కలిమాహ్ పలికియుంటే అది అతనికి ఉపయోగపడేది.
12. దుర్మార్గుల మనుస్సులో ఉన్న (పెద్దల ఆచరణ విడనాడకూడదు అనే) భ్రమ ఎంత భయంకరమో గమనించాలి. ఎందుకనగా కొన్ని సంఘటనలలో వారికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనేకసార్లు చెప్పినను తిరస్కరించి వివాదానికి కూడా తయారయి వారు దాన్ని గౌరవిస్తూ, దాన్ని విడనాడడానికి సిద్ధంగా లేకపోవడమే.
తాత్పర్యం : (అల్లామా అల్ సాదీ)
ఈ అధ్యాయం కూడా దీనికంటే మునుపటి లాంటిదే. సృష్టిలో శ్రేష్ఠులైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ వద్ద ఉన్నత స్థానంగల వారు, సిఫారసు చేసేవారిలో ఎక్కువ అర్హత గలవారు, అయినా స్వయంగా తమ పినతండ్రికి ఋజుమార్గం ప్రసాదించలేక పోయారు. ఋజుమార్గం ప్రసాదించేవాడు అల్లాహ్ యే అయినప్పుడు ఇతరులు ఏమి చేయగలుగుతారు? అల్లాహ్ యే సత్యమైన ఆరాధ్యుడు అని తెలుస్తుంది. ఆయన సృష్టించటంలో అద్వితీయుడైతే, ఋజుమార్గం ప్రసాదించడంలో కూడా అద్వితీయుడు. మరెవ్వరి చేతిలో ఈ శక్తి లేదు. – “ప్రవక్త నీవు ఋజుమార్గం చూపుతావు” అని ఖుర్ఆన్ లో వచ్చిన దానికీ భావం: “ప్రవక్త అల్లాహ్ యొక్క వహీ (సందేశం) ప్రజలకు అందజేస్తారు. వారు దాని ద్వారా ఋజుమార్గం పొందుతారు” అని అర్థం.
يَـٰٓأَهْلَ ٱلْكِتَـٰبِ لَا تَغْلُوا۟ فِى دِينِكُمْ “గ్రంథ ప్రజలారా! మీ ధర్మ విషయాల్లో మీరు హద్దులు మీరకండి”.. (4: నిసా: 171).
అల్లాహ్ ఆదేశం:
وَقَالُوا۟ لَا تَذَرُنَّ ءَالِهَتَكُمْ وَلَا تَذَرُنَّ وَدًّۭا وَلَا سُوَاعًۭا وَلَا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًۭا “మీరు మీ ఆరాధ్య దైవాలను ఎంత మాత్రం విడిచి పెట్టకండి. వద్దా, సువాఅ లను విడిచిపెట్టకండి. యగూస్ ను, యఊఖ్ ను, నసర ను కూడ విడనాడకండి అని వారన్నారు“. (71: నూహా : 23)
ఇబ్ను అబ్బాసు పై ఆయత్ను వాఖ్యానిస్తూ ఇలా చెప్పారు: ఇవి నూహ్ ప్రవక్తకు ముందు ఉన్న పుణ్య పురుషుల పేర్లు. వారు చనిపోయిన తరువాత వారి వారసుల వద్దకు షైతాన్ వచ్చి, “వారి ఫోటోలను, ప్రతిమలను వారు కూర్చెండే స్థలాల్లో పెట్టండి. వాటికి పేర్లు కూడా నిర్ణయించండి” అని చెప్పాడు. వారు అలా చేశారు. ఈ దశలో ఇంకా వారి పూజా జరగలేదు. వారు కూడా చనిపొయిన తరువాత జ్ఞానం కొరత ఏర్పడింది. అప్పుడు వారి సంతానం ద్వారా పూజ మొదలయింది. (బుఖారీ).
“అనేక పూర్వ పండితులు ఇలా చెప్పారు: (పైన పేర్కొనబడిన) పుణ్యపురుషులు చనిపోయిన తరువాత, వారు తబర్రుక్ పొందే ఉద్దేశంతో వారి సమాధుల దగ్గర కూర్చునేవారు. తరువాత వారి విగ్రహాలు తయారు చేశారు. కొంత కాలం గడిచాక వాటి పూజ ప్రారంభం అయింది” అని ఇబ్ను ఖయ్యిం రహిమహుల్లాహ్ వివరించారు.
అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ ఉల్లేఖించారు: ప్రవక్త ఆదేశించారు: “క్రైస్తవులు ఈసా బిన్ మర్యమ్ విషయంలో మితిమీరి ప్రవర్తించినట్లు, మీరు నా విషయంలో మితిమీరి ప్రవర్తించకండి. నేను అల్లా దాసున్ని. అల్లాహ్ దాసుడు, ఆయన ప్రవక్త అని అనండి”. (బుఖారి, ముస్లిం). మరో సారి ఇలా చెప్పారు: “గులువ్వు (హద్దులు మీరుట) నుండి జాగ్రత్తగా ఉండండి. మీకంటే ముందువారిని నశింపచేసింది గలువ్వే”. (తిర్మిజి, ఇబ్ను మాజ, అహ్మద్). అబ్దుల్లాః బిన్ మన్ ఊద్ ఉల్లేఖించారు, ప్రవక్త ఇలా సెలవిచ్చారు: “మితి మీరే వాళ్ళు సర్వ నాశనమయ్యారు”. మూడు సార్లు ఇలా అన్నారు. (ముస్లీం).
ముఖ్యాంశాలు:
1. ఈ అధ్యాయం, దీని తరువాత రెండు అధ్యాయాలను గ్రహిస్తే, ఇస్లాం మరియు ఇతర మతాల్లో ఉన్న వ్యత్యాసం స్పష్టం అవుతుంది. (ఇస్లాం పునాది తౌహీద్ పై ఉంటే, ఇతరులు పునాది షిర్క్ పై ఉంది). మరియు అల్లాహ్ తన దాసుల హృదయాలను మార్చే అనేక విచిత్రాలు కనబడుతాయి.
2. మొదటి సారిగా భూభాగం పై షిర్క్ మొదలయింది పుణ్యపురుషుల విషయంలో (అతిశయోక్తిలో పడిపోయి) మోసబోయినందు వలన అని తెలిసింది.
3. ప్రవక్తల్ని అల్లాహ్ తౌహీద్ ప్రచారానికి పంపినప్పటికీ, వారు బోధించిన ధర్మంలో మార్పు వచ్చింది పుణ్యపురుషుల విషయంలో మితిమీరడం వల్లనే.
4. ధర్మం, స్వభావం వాటిని తిరస్కరించినప్పటికీ ప్రజలు బిద్ అతులను (దురాచారాలను) తొందరగా స్వీకరిస్తారు.
5. దానికి కారణం ధర్మాన్ని, అధర్మంతో, సత్యాన్ని అసత్యంతో కలుషితం చేసినందు వలన. అందులో మొదటిది: పుణ్యపురుషుల ప్రేమలో మితి మీరుట. రెండవది: జ్ఞానులు, విద్యావంతులు చేసిన కొన్ని పనులు, అవి సదుద్దేశంతో కూడి యుండగా వారి తరువాత వచ్చేవారు, వారి ఉద్దేశాన్ని వేరుగా అని భావించుట.
6. సూరె నూహ్ లోని ఆయతు యొక్క భావం.
7. ధర్మం మనుసులో తరుగుతూ ఉండుట, అధర్మం పెరుగుట మనిషి స్వభావంలోనే ఉంది.
8. కొందరు పూర్వ పండితులు చెప్పినదానికి ఇది సాక్ష్యంగా ఉంది. వారు చెప్పారు: బిద్ అత్, కుఫ్ర్ కు కారణం అవుతుంది. అది ఇబ్లీసుకు, పాపం కంటే ఎక్కువ ఇష్టం. ఎందుకనగా పాపం చేయువాడు తౌబా చేస్తాడు, కాని బిద్దత్ చేయువాడు తౌబా చేయడు.
9. చేసేవాడు ఎంత సదుద్దేశంతో చేసినా బిద్దత్ అతడిని ఎలా నశింప జేస్తుందో షైతాను బాగా తెలుసు.
10. దీనితో ఒక మౌలిక విషయం తెలుస్తుంది. అదేమనగా : బిద్ అత్ నుండి దూరముండాలి. అది ఎటు వైపు తీసుకెళ్తుందో గమనించాలి.
11. ఒక మంచి పని చేయుటకయినా సమాధి దగ్గర కూర్చుండటం (ముజావరి చేయుట) చాలా నష్టం.
12. ప్రతిమలు, ఫోటోలను ఉంచుటను నివారించడం, వాటిని తీసివేయడం లో ఉన్న లాభం, ఔచిత్యం తెలుస్తుంది.
13. పై సంఘటనను బాగుగా తెలుసుకొనుట చాలా అవసరం. కాని చాలా ముస్లిములు అశ్రద్ధలో ఉన్నారు.
14. చాలా విచిత్ర విషయం: బిద్ అతీలు ఈ సంఘటనను తఫ్సీర్, హదీసు గ్రంధాలల్లో చదువుతారు. వారు పుణ్యపురుషుల విషయంలో మితిమీరుట, వారు అక్కడ చేసే పనులు మంచివి, శ్రేష్ఠమైనవి అని అంటారు. ఇక అల్లాహ్, ఆయన ప్రవక్త నివారించినదానిని వ్యెతిరేకించుట ఏలాంటి కుఫ్ర్ అంటే దాని వలన వారి ధనప్రాణాలు కూడా స్వాధీనం చేసు కొనుట ధర్మమమని విశ్వసిస్తారు.
15. వారు ఆ పుణ్యపురుషుల సమాధుల దగ్గర చేసే ప్రార్థనల ఉద్దేశం కేవలం వారి సిఫారసు పొందడమే.
16. మా పూర్వికులు ప్రార్థన చేయుటకే వారి ప్రతిమలను తయారు చేశారు అని వెనుకటి వారు భావించారు.
17. (క్రైస్తవులు ఈసా బిన్ మర్యమ్ విషయంలో మితిమీరి ప్రవర్తించినట్లు, …….) అన్న హదీసు ద్వారా ఆ విషయాన్ని చాలా స్పష్టం చేశారు.
18. మితిమీరినవారు వినాశము పొందుగాక అని మనకు హితవు చేస్తున్నారు.
19. జ్ఞానం నశించిన తరువాతనే షిర్క్ మొదలయింది. దీని ద్వారా జ్ఞానం యొక్క విలువ, అది లేనిచో ఎంత నష్టం కలుగుతుందో అర్థం అవుతుంది.
20. విద్వాంసుల మరణంతో విద్య నశించిపోతుంది.
తాత్పర్యం : (అల్లామా అల్ సాదీ)
గులువ్వు అంటే హద్దు మీరటం. అది ఎలా అనగా: ఎవరూ సాటి లేని అల్లాహ్ యొక్క ప్రత్యేక హక్కుల్లో కొన్నింటిని పుణ్యపురుషుల్లో ఉన్నవి అని నమ్ముట. అల్లాహ్ అన్ని విధాలుగా సంపూర్ణుడు. అన్ని విధాలుగా అతీతుడు (ఎవరి అక్కర ఏ మాత్రం లేనివాడు). ఆయనే అన్ని విధాల నిర్వాహకుడు. ఆరాధనలకు అర్హతగలవాడు ఆయన తప్ప మరెవ్వడూ లేడు. ఇలా ఎవరైనా పై (అండర్ లైన్లో ఉన్న) గుణాలు ఇతరుల్లో ఉన్నాయని నమ్మితే, అతడు అతని విషయంలో హద్దు మీరిన వాడవుతాడు. అతణ్ణి అల్లాహ్కు సమానంగా నిలబెట్టిన వాడవుతాడు. ఇది పెద్ద షిర్క్.
హక్కులు మూడు రకాలు అన్న విషయం కూడా తెలుసుకోవాలి.
1) అల్లాహ్ యొక్క ప్రత్యేక హక్కు. అందులో ఆయనతో భాగస్వామి ఎవ్వడూ లేడు. అది ఆయన ఇబాదత్ (ఆరాధన). ఇందులో ఇతరులను అల్లాహ్ కు సాటి కల్పించకు. ప్రేమ, భయం, ఆశ అన్ని విధాలుగా ఆయన్నే వేడుకో. ఆయన వైపునకే మరలు.
2) ప్రవక్తల ప్రత్యేక హక్కు. అది వారిని గౌరవించడం, మర్యాద చేయడం.
3) “హఖ్హే ముష్తరక్“. అంటే అల్లాహ్, ఆయన ప్రవక్తలపై విశ్వాసం. అల్లాహ్ మరియు ప్రవక్తల విధేయత. అల్లాహ్, ఆయన ప్రవక్తల ప్రేమ. ఇది వాస్తవానికి అల్లాహ్ హక్కు. తరువాత దానికనుగుణంగా ప్రవక్తల హక్కు. సత్యవంతులు ఈ హక్కులను ఉత్తమరీతిలో తెలుసుకొని ఎవరి హక్కులు వారికి చెల్లి – స్తారు. వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మరచిపోరు.
ఆయిషా రజియల్లాహు అన్హా కథనం: ఒక సారి ఉమ్మె సల్మా రజియల్లాహు అన్హా ఆమె హబషా (నేటి ఇథోపియ దేశం)లో చూసిన చర్చి, అందులోని ఫోటోల విషయం ప్రస్తావించింది. అప్పుడు ప్రవక్త అన్నారు: “వారిలోని పుణ్యపురుషుడు చనిపోతే అతని సమాధిపై ఆలయం నిర్మించి, అందులో వారి ఫోటోలు పెట్టేవారు. అలాంటి వారు అల్లాహ్ వద్ద ఆయన సర్వ సృష్టిలో కెల్ల నీచులు”. (బుఖారీ, ముస్లిం). వారు రెండు ఉపద్రవాలను (ఫిత్న) ఒక చోట చేర్చారు. (1) సమాధులు. (2). ప్రతిమలు, ఫోటోలు.
ఆయిషా రజియల్లాహు అన్హా కథనం: ప్రవక్తకు మరణ సమయం ఆసన్నమయినప్పుడు ఆయన పరిస్థితి చాలా బాధాకరంగా మారిపోయింది. ఒక్కో సారి ఆయన తన దుప్పటిని ముఖం మీదికి లాక్కునేవారు. కాస్సేపటికి ఊపిరి ఆడకపోవడంతో ముఖం మీది దుప్పటిని తొలగించి వేసేవారు. అలాంటి స్థితిలో సయితం ఆయన (సమాధి పూజలను శపిస్తూ) “యూదులు, క్రైస్తవులు తమ ప్రవక్తల సమాధుల్ని ప్రార్థనా స్థలాలుగా చేసుకున్నారు. అల్లాహ్ వారిని శపించుగాక!” అని అన్నారు. ఈ విధంగా ప్రవచించి ఆయన ముస్లింలను ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని పరోక్షంగా హెచ్చరించారు. ఈ హదీసు తెల్పిన తరువాత హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా దానిపై ఇలా వ్యాఖ్యానించారు. “దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించి ఉండకపోతే ఆయన సమాధి (ప్రజల దర్శనార్థం) తెరచి ఉంచబడేది. అంతేకాదు అది కొంత కాలానికి ప్రార్థనా స్థలంగా కూడ మారిపోయేదని భయంగా ఉండేది. (అందుకే తెరచి ఉంచలేదు). (బుఖారి, ముస్లిం).
ప్రవక్త ﷺ తమ మరణానికి ఐదు రోజులు ముందు ఉపదేశించిన మాటల్ని నేను విన్నాను, అని జుందబ్ ఉల్లేఖించారు. “మీలో ఎవరినైనా నా స్నేహితుడ్నిగా (ఖలీల్) చేసుకొనుటకు నేను, అల్లాహ్ ముందు, ఇష్టపడను. ఎందుకనగా అల్లాహ్ ఇబ్రాహీంను “ఖలీల్” చేసుకున్నట్లు, నన్ను కూడా స్నేహితుడ్ని “ఖలీల్” చేసుకున్నాడు. నా అనుచర సంఘంలో ఎవరినైనా “ఖలీల్” చేసుకుంటే అబూ బకర్ ను చేసేవాణ్ణి. వినండి! మీకంటే ముందువారు, తమ ప్రవక్తల సమాధులను ప్రార్థనా స్థలంగా మార్చుకున్నారు. వినండి! మీరు సమాధులను ప్రార్థనా స్థలంగా చేసుకోకండి. నేను దాని నుండి మిమ్మల్ని నివారిస్తున్నాను“. (ముస్లిం).
ఇలాంటి సమాధి పూజల నుండి ప్రవక్త తమ జీవితంలోని చివరి ఘడియలలో నివారించారు. అలా చేసేవారిని శపించారు.
మస్జిద్ లేకున్ననూ సమాధి దగ్గర నమాజు చేయకూడదు. ఆయిషా రజియల్లాహు అన్హా చెప్పిన “అది కొంతకాలానికి ప్రార్థనా స్థలంగా కూడా మారిపోవచ్చని భయంగా ఉండేంది” అన్న మాటకు ఇదే భావం. లేకుంటే సహచరులు ప్రవక్త సమాధిని ప్రార్థన స్థలంగా మారుస్తారని భావించనూ- లేము. ఎందుకనగా ఎక్కడ నమాజు చేయనుద్దేశించబడిందో అదే మస్జిద్. అంతే కాదు నమాజు చేయబడే ప్రతి చోటను మస్జిద్ అనబడును. ప్రవక్త హదీసు భావం అదే: “నా కోసం, (నా అనుచరులకు) యావత్తు భూమండలం ప్రార్థనా స్థలంగా, పరిశుద్ధమైనదిగా చేయబడింది”.
ప్రవక్త చెప్పినట్లు ఇబ్ను మనోద్ ఉల్లేఖించారు: “ప్రజల్లో అత్యంత నీచమైన వాళ్ళుగా పరిగణించబడేవారు రెండు రకాలవారు: ఎవరు జీవించి యుండగా ప్రళయం సంభవిస్తుందో వారు. సమాధులపై ప్రార్థనా స్థలాలు నిర్మించేవారు”. (అహ్మద్, అబూ హాతిం).
ముఖ్యాంశాలు:
1. పుణ్యపురుషుని సమాధిపై ప్రార్థనాలయం నిర్మించి, అక్కడ అల్లాహ్ ఆరాధన చేయువానిని ప్రవక్తహెచ్చరించారు. అతని సంకల్పం (నియ్యత్) మంచిదైనప్పటికి.
2. ఫోటోలు, ప్రతిమల నుండి కఠినంగా నివారించారు.
3. ప్రవక్త 4 దాని గురించి అనేకసార్లు బోధించారు. దాని నుండి గుణపాఠం నేర్చుకోవాలి. తొలుత మాములుగా దానిని నివారించారు. తరువాత మరణానికి ఐదు రోజుల ముందు. మళ్ళీ పరలోక ప్రయాణానికి సిద్ధంగా ఉన్న చివరి ఘడియల్లో కూడా కఠినంగా నివారించారు.
4. తన సమాధి వద్ద అలా చేయకూడదని ప్రవక్త తన సమాధి తయారు కాక ముందే హెచ్చరించారు.
5. ఈ ఆచారం యూదులది, క్రైస్తవులది. వారు తమ ప్రవక్తల సమాధుల వద్ద అట్లే చేస్తారు.
6. వారి ఈ చర్యపై ప్రవక్త సల్లల్లాహు అలైపా వసల్లం వారిని శపించారు.
7. అందులో ఆయన ఉద్దేశం ఆయన సమాధి పట్ల మనల్ని హెచ్చరించడం.
8. ఆయన సమాధిని తెరచి ఉంచకపోవడానికి కారణము తెలిసింది.
9. సమాధులను ప్రార్థన స్థలం చేయడం అన్నదాని భావం తెలిసింది.
10. సమాధులపై ప్రార్థనాలయం నిర్మించేవారిని, ప్రళయం ఎవరిపై సంభవిస్తుందో వారిని కలిపి ప్రవక్త ఒకే హదీసులో చెప్పారు. ఇలా షిర్క్క ముందు సంభవించే దాని కారణాలు, సాధనాలు, మరియు దాని పర్యవసానం (Result) ను కూడా తెలిపారు.
11. మరణానికి ఐదు రోజుల ముందు ఇచ్చిన ప్రసంగంలో రెండు సంఘాల ఖండన చేశారు. బిన్అ అతి సంఘాల్లో ఇవి రెండు చాలా చెడ్డవి. కొందరు పండితులు వారిని 72 సంఘాల నుండి బహిష్కరించారు. ఒకటి: రాఫిజ. రెండవది: జహామియ్య. రాజీల కారణంగనే షిర్క్, సమాధుల పూజ మొదలయింది. మొదటి సారిగా సమాధులపై వీరే మస్జిద్ నిర్మించారు.
12. ప్రవక్తకు చివరి ఘడియల్లో (సక్రాత్ లో) చాలా బాధ గలిగింది
13. ఖలీల్ యొక్క గౌరవపదం ప్రవక్తకు లభించింది.
14. “ఖుల్లత్” (స్నేహం) ముహబ్బత్ కన్నా ఉన్నతమైనది.
15. అబూ బకర్ సిద్దీఖ్ ప్రవక్త వారి సహచరుల్లో శ్రేష్ఠులు అని తెలిసింది.
16. ప్రవక్త తరువాత ఖలీఫా ఆయనే అన్నట్లు సంకేతం ఉంది.
తాత్పర్యం : (అల్లామా అల్ సాదీ)
పుణ్యపురుషుల సమాధి వద్ద చేయబడే కార్యాలను గురించి కొంత వివరంగా తెలుసుకుందాము. రెండు రకాల కార్యాలు అక్కడ జరుగుతాయి. ఒకటి: యుక్తమైనది. రెండవది: యుక్తంకానిది.
యుక్తమైనది: దేనినైతే ధర్మం సమ్మతించిందో అది. ఉదా: సమాధుల దర్శనం. కాని దూర ప్రయాణం చేసి దర్శించకూడదు. (దగ్గరి శ్మశానంలో). ముస్లిం భక్తుడు ప్రవక్త సాంప్రదాయాన్ని అనుసరిస్తూ దర్శనానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి సామాన్యంగా అందరి కొరకు, ప్రత్యేకంగా తనవారి కొరకు అల్లాతో దుఆ చేస్తాడు. ఇలా వారి క్షమాపణ, మన్నింపులకు దుఆ చేసిన- వాడు, స్వయంగా పుణ్యం చేసినవాడవుతాడు. ప్రళయాన్ని జ్ఞప్తి చేసిన వాడు, గుణపాఠం నేర్చుకున్నవాడవుతాడు.
యుక్తం కానిది: ఒక విధంగా ఇది నిషిద్ధం. ఇది షిర్క్ కు ఒక మార్గం, సాధనం అవుతుంది. ఉదా: తబర్రుక్ (శుభం) కొరకు వాటిని ముట్టుకొనుట. వారిని వసీల (అల్లాహ్ వరకు చేర్పించేవారు)గా భావించుట. అక్కడ నమాజు చేయుట. దీపాలు వెలిగించుట. దానిపై గుమ్మటం, భవనం నిర్మించుట. దాని గురించి, అందులో ఉన్నవారి గురించి గులువ్వు చేయుట. ఇవి స్వయంగా ఇబాదత్ కావు. కాని షిర్క్ సాధనాలు.
రెండవ విధంగా ఇది షిర్క్ అక్బర్. ఉదా: వారితో దుఆ, మొరపెట్టుకొనుట. ఇహపర అవసరాలు వారితో కోరుట. విగ్రహపూజారులు విగ్రహాలతో ఇలాగే చేస్తారు. ఇవన్నియు వారు స్వయంగా పూర్తి చేస్తారు అని విశ్వసించినా, లేక వారు వసీల (అల్లాహ్ వరకు చేర్పించేవారు) అని విశ్వసించినా (రెండూ తప్పులే). ముష్రికులు కూడా ఇదే విధంగా అనేవారు. చదవండి ఖుర్ఆన్ ఆయతు: వారు మా కొరకు అల్లాహ్ వద్ద సిఫారసు చేస్తారు). (10: యూనుసు: 18).
మరోచోట ఉంది: వారంటారు: శ్రీవారు మమ్మల్ని అల్లాహ్ వద్దకు చేరుస్తారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము. (39: జుమర్ : 3).
సమాధిలో ఉన్నవారితో దుఆ చేయువారు, వారు లాభం చేకూర్చి, నష్టం, కష్టం దూరం చేయువారు అని విశ్వసించినవారు, అల్లాహ్ మాత్రమే అధికారం గలవాడు, కాని వారు మనకు మరియు అల్లాహ్ కు మధ్య రాయబారి (వసీల, వాస్త) లాంటివారు అని విశ్వసిస్తూ వారితో దుఆ, మొరపెట్టుకునేవారు ముష్రికులు, కాఫిర్లు. వీరు ముష్రికులు, కాఫిర్లు కారు అని నమ్మినవారు కూడ కాఫిర్లవుతారు. ఇంకా అతడు ఖుర్ఆన్, హదీసులను తిరస్కరించిన- వాడవుతాడు. అల్లాహ్ను గాక ఇతరులతో దుఆ చేసేవాడు, స్వయంగా వారిస్తారని విశ్వసించినా, లేక వారు వసీల అని విశ్వసించినా ముష్రికులు అని ప్రవక్త అనుచర సంఘం ఏకీభవించింది.
ప్రవక్త ఇలా సెలవిచ్చారు: “ఓ అల్లాహ్ నా సమాధిని పూజింపబడే విగ్రహంగా మార్చకు. ప్రవక్త సమాధులను ప్రార్థనా స్థలంగా మార్చుకున్న వారిపై అల్లాహ్ ఆగ్రహం అవతరించుగాక. (ముఅత్తా ఇమాం మాలిక్).
ఇబ్ను జరీర్ ఈ లాత్, ఈ ఉజ్జా వాస్తవికతను గురించి కాస్తయినా ఆలోచి ంచారా?) (53: నజ్: 25) అన్న వాక్యంలో ఇలా వ్యాఖ్యానించారు: లాత్ సత్తు కలిపేవాడు. (ఎండిన పిండి ముద్దలను నీటిలో కలిపి బాటసారులకు త్రాగించేవాడు). అతడు చనిపోయిన తరువాత అతని సమాధిపై కూర్చోవటం ప్రారంభించారు.
అబుల్ జౌజా కూడా ఇబ్ను అబ్బాసుతో ఉల్లేఖించిన దానిలో “అతను హజ్ కొరకు వచ్చేవారికి సత్తు తయారు చేసేవాడు అని అన్నారు”.
ఇబ్ను అబ్బాసు కథనం: సమాధుల దర్శనం చేసే స్త్రీలను, వాటిపై ప్రార్థనా- లయం కట్టి, దీపాలు వెలిగించేవారిని ప్రవక్త ఈ శపించారు. (అబూ దావూద్).
ముఖ్యాంశాలు:
1. అల్లాహ్ తప్ప పూజింపబడే ప్రతీ వస్తువు ను “వసన్” అంటారు.
2. ఇబాదత్ (ఆరాధన) యొక్క భావం తెలిసింది.
3. ఏది సంభవిస్తుందని ప్రవక్త భయంచెందారో దాని గురించి అల్లాహ్ శరణు కోరారు.
4. “శరణు కోరారు” అన్న దానిలోనే సమాధుల పై ప్రార్థనాలయం కట్టిన వారి విషయం చెప్పారు.
5. అల్లాహ్ ఆగ్రహం వారిపై కురుస్తుంది.
6. అరేబియలో కెల్ల పెద్ద విగ్రహంగా పేరుపొందిన “లాత్” పూజ ఎలా ప్రారంభమయిందో తెలిసింది.
“నిశ్చయంగా మీ వద్దకు ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన స్వయంగా మీలోనివాడే. మీరు నష్టానికి గురికావటం అనేది ఆయనకు బాధ కలిగిస్తుంది.” (తౌబా 9:128).
అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పారు:
“మీరు మీ ఇళ్ళను సమాధులుగా మార్చకండి. నా సమాధిని పండుగ కేంద్రం (ఉర్సు, జాతరగా) చేయకండి. నా కోసం దరూద్ చదవండి. మీరు ఎక్కడా ఉన్నా మీ దరూద్ నా వరకు చేరుతుంది”. (అబూ దావూద్).
అలీ బిన్ హుసైన్ కథనం: ఒక వ్యక్తి గోడలో ఉన్న ఒక రంద్రం నుండి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి వద్దకు వచ్చి అక్కడ దుఆ చేస్తుండగా, చూసి అతనిని నివారించారు. ఇంకా ఇలా చెప్పారు. నేను నీకు ఒక హదీసు వినిపిస్తాను, అది నేను నా తండ్రి (హుసైన్ రది అల్లాహు అన్హు)తో, అతను తన తండ్రి (అలీ రది అల్లాహు అన్హు)తో, అతను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో విన్నాడు. ప్రవక్త చెప్పారు:
“నా సమాధిని పండుగ కేంద్రంగా (ఉర్సు, జాతర) చేయకండి. మీరు మీ ఇళ్ళను సమాధులుగా మార్చకండి (నఫిల్ నమాజులు చదవకుండా). మీరు ఎక్కడ ఉండి నాపై సలాం పంపినా అది నా వరకు చేరుతుంది”. (రవాహు ఫిల్ ముఖ్ తార్ ).
ముఖ్యాంశాలు:
1. సూరయే తౌబా ఆయతు యొక్క భావం.
2. షిర్క్ దరిదాపులకు కూడా చేరకుండా దూరముండాలని ప్రవక్త యొక్క తాకీదు.
3. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనపై చాలా కనికరం, కారుణ్యం గలవారు. మన రుజుమార్గాన్ని అధికంగా కోరుకునేవారు.
4. ఆయన సమాధి దర్శనకు వెళ్ళుట ప్రత్యేకంగా నివారించారు. ఆయన సమాధి దర్శనం (అక్కడ ఉన్నవారికి ధర్మం పరిదిలో ఉండి చేయుట) చాలా పుణ్య కార్యం.
5. (అక్కడ నివసించే వారైనప్పటికీ) మాటికి మాటికి దర్శించుటను నివారించారు.
6. నఫిల్ నమాజులు ఇంట్లో చదవాలని ప్రోత్సహించారు.
7. స్మశానంలో నమాజ్ చదవకూడదన్పది సహాబాల (సహచరుల) వద్ద స్పష్టమయిన విషయం.
8. దరూద్, సలాం దూరంగా ఉండి పంపినా, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వరకు చేరుతుంది. అలాంటపుడు ప్రత్యేకంగా ఈ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళే అవసరం లేదు.
9. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి జీవితం (బర్ జఖ్)లో ఉన్నారు. ఆయన వరకు తన అనుచర సంఘం కర్మల నుండి కేవలం దరూద్, సలాం మాత్రమే చేర్చించ బడుతాయి.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ)
ఈ అధ్యాయంలో ప్రస్తావించబడిన వాక్యాలపై శ్రద్ధ చూపినవారు ఇందులో తౌహీద్‌ను బలపరిచే విషయాలపై ఆచరించాలని పోత్సహించబడింది. అల్లాహ్ వైపునకే మరలాలని, భయమూ మరియు ఆశతో అల్లాహ్ పై మాత్రమే నమ్మకం ఉంచాలని, ఆయన దయను కాంక్షించి, దాన్ని పొందే ప్రయత్నం చేయాలని, సృష్టి బానిసత్వ శృంఖలాలను తెంచేసి, ముక్తి పొందాలని, సృష్టిలో ఎవరి గురించి కూడా గులువ్వు (అతిశయోక్తి) చేయకూడదని, సర్వ బాహ్యాంతర కార్యాలు సంపూర్ణంగా నిర్వహించి, ప్రత్యేకంగా ఇబాదత్ కు ప్రాణమయినటువంటి చిత్తశద్ధి (ఇఖ్లాసు) ప్రతికార్యంలో ఉంచే ప్రయత్నం చేయాలని ప్రోత్సహించబడింది.
సృష్టరాసుల విషయంలో గులువ్వు (అతిశయోక్తి) అయ్యే ముష్రికులను పోలిన మాటలు, చేష్టలు చేయుట నివారించబడింది. ఇది వారిలో కలిసిపోవుటకు కూడా కారణం కావచ్చు. తౌహీద్ భద్రతకై షిర్క్ లోయలో పడవేసే మాటలు, చేష్టల నుండి కూడా నివారించబడింది. విశ్వాసులు ఏ ఉద్దేశంతో పుట్టించబడ్డారో దానిపై వారు స్థిరంగా ఉండుటకు ఇది వారిపై ఓ కరుణ, దయ. వారి సాఫల్యం కూడా అందులొనే ఉంది.
అల్లాహ్ ఆదేశం: “గ్రంథజ్ఞానంలో కొంత భాగం ఇవ్వబడిన వారిని నీవు చూడలేదా? వారి పరిస్థితి ఎలా వుందంటే, వారు “జిబ్త్ “ను “తాగూత్” ను నమ్ముతారు.” (నిసా 4:51).
మరో ఆదేశం: “అల్లాహ్ వద్ద ఎవరి ముగింపు అవిధేయుల ముగింపు కంటే కూడా హీనతరంగా ఉంటుందో వారిని గురించి తెలియజేయనా? వారు అల్లాహ్ శాపగ్రస్తులు. వారిపై ఆయన ఆగ్రహం విరుచుకు పడింది. వారు కోతులుగా, పందులుగా చెయ్యబడ్డారు. వారు తాగూత్ దాస్యం చేశారు.” (మాఇద 5:60).
మరో చోట: “కాని ఈ వ్యవహారంలో పై చేయిగా ఉన్నవారు, “మేము వారిమీద ఒక ఆరాధనా మందిరాన్ని నిర్మిస్తాము” అని అన్నారు.” (కహఫ్ 18:21).
అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు:
“మీరు తప్పకుండా పూర్వీకుల (అంటే గత మతస్థుల) జీవన విధానాలను బాణం, బాణంకు సమానం ఉన్నట్లు అనుసరిస్తారు. చివరికి వారు ఉడుము కన్నంలోకి దూరితే, వారి వెంట మీరు కూడా అందులోకి దూరుతారు”. సహచరులు ఈ మాట విని దైవప్రవక్తా! “ఏమిటీ మేము యూదుల్ని, క్రైస్తవుల్ని అనుసరిస్తామా?” అని అడిగారు (ఆశ్చర్యంతో). దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం): “మరి ఎవరు అనుకుంటుకున్నారు?” అని అన్నారు. (బుఖారి, ముస్లిం).
సౌబాన్ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు:
“అల్లాహ్ నా కొరకు భూమిని చుట్టి దగ్గరికి చేశాడు. నేను దాని తూర్పు పడమర అంతా చూశాను. నా ఎదుట చుట్టబడిన భూమి అంతటిలో నా అనుచర సంఘం చేరుకుంటుంది. నాకు ఎర్రని, తెల్లని రెండు ధన భండారాలు ఇవ్వబడినవి. నేను నా ప్రభువుతో ఇలా వేడుకున్నాను: “నా అనుచర సంఘాన్ని అనావృష్టి (ఖహత్) ద్వారా నశింపజేయకు. వారిపై గెలిచి, వారిని అణచివేసే ముస్లిమేతరులైన శత్రువులకు వారిపై విజయం ప్రసాదించకు”. అప్పుడు నా ప్రభువు అన్నాడు: “వారిని అనావృష్టితో నశింపజేయను. ముస్లిమేతరులైన శత్రవులకు వారిపై ఆధిపత్యం ఇవ్వను. వారంతా ఏకమై వచ్చినప్పటికీ. ఇది వారిలో ఒకడు మరొకడ్ని నాశనం జేసి, ఖైదీలుగా చేయకుండా అందరు ఏకమై ఉన్నంత వరకు”. (ముస్లిం).
ఇదే హదీసును బర్ ఖాని ఉల్లేఖించారు, అందులో ఇంకా ఇలా వుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు:
“నేను నా అనుచర సంఘం పట్ల వారిలోని దుర్మార్గులైన నాయకులు, పండితులతో భయపడుతున్నాను. వారిపై ఒకసారి కత్తి పడిందంటే ప్రళయం వరకు లేపబడదు. నా అనుచర సంఘంలోని ఒక చిన్న సమూహం ముష్రికులతో కలువని వరకు, మరొక సమూహం విగ్రహాలను పూజించని వరకు ప్రళయం సంభవించదు. నా అనుచర సంఘంలో 30 అసత్యవాదులు వస్తారు. వారిలో ప్రతి ఒక్కడు తనే ప్రవక్త అని అరోపణ చేస్తాడు. నేను చిట్టచివరి ప్రవక్తని. నా తరువాత ఏ ప్రవక్త రాడు. ఎల్లకాలం, ఎల్లవేళల్లో సత్యం, ధర్మంపై ఒక సంఘము ఉండే ఉంటుంది. వారికి దైవ సహాయం లభిస్తూనే ఉంటుంది. ఆ సంఘాన్ని వదలి వెళ్ళినవాడు దానిని ఏ మాత్రం హాని కలిగించలేడు. చివరికి ప్రళయం సంభవిస్తుంది”.
ముఖ్యాంశాలు:
1. సూరె నిసా ఆయతు భావం.
2. సూరె మాఇద ఆయతు భావం.
3. సూరె కహఫ్ ఆయతు భావం.
4. ఇది చాలా ముఖ్య విషయం : ఇందులో జిబ్త్, తాగూత్ పై విశ్వాసం అంటే ఏమిటి? అది హృదయాంతర విశ్వాసమా? లేక అది మిథ్యం , అసత్యం అని తెలిసి, దానితో ప్రేమ, ఇష్టం లేనప్పటికి కేవలం దాన్ని అనుసరించిన వారితో సంబంధమా?
5. అవిశ్వాసుల అవిశ్వాసం తెలిసి కూడా వారు విశ్వాసులకన్నా ఉత్తమమైన మార్గంపై ఉన్నారన్న యూదుల మాట కూడా తెలిసింది.
6. ఒక ముఖ్య విషయం అది ఈ అధ్యాయంలో ఉద్దేశించినది. అది అబూ సఈద్ హదీసులో వచ్చినది; ప్రవక్త అనుచర సంఘంలో కొంత మంది గత మతస్తులను అనుసరిస్తారు.
7. వీరిలో కొంత మంది విగ్రహ పూజారులు అవుతారు.
8. విచిత్రమైన విషయం : ప్రవక్తలు అని ప్రకటన చేసేవారు వస్తారు. ఉదా: ముఖ్తార్ అబూ ఉబైద్ సఖఫీ. అతడు “లా ఇలాహ ఇల్లల్లాహ్”ను చదివి, ప్రవక్త అనుచర సంఘంలోనివాడయి, ముహమ్మద్ ప్రవక్తను సత్యప్రవక్త, చివరి ప్రవక్త అని, ఖుర్ఆన్ సత్యం అని నమ్మి కూడా వాటికి వ్యెతిరేకించి తానే ప్రవక్త అని ప్రకటించుకున్నాడు. అతడు ప్రవక్త సహచరుల చివరి జీవితకాలంలో పుట్టినవాడు. అతన్ని చాలా మంది అనుసరించారు.
9. ఇంతకు ముందు కాలంలో జరిగినట్లు ఇస్లాం ధర్మం నశించిపోదు. ఎల్లప్పుడు దానిని అనుసరించేవారు కొందరు ఉంటారు అన్న శుభవార్త ఉంది.
10. వారు సంఖ్యలో అల్పులయినప్పటికీ వారిని విడనాడినవాడు, వ్యెతిరేకించినవాడు వారికి ఏ హానీ కలిగించలేడు అన్న గొప్ప సూచన ఉంది.
11. ఇది ప్రళయము వరకు ఉండును.
12. ఇందులో ఉన్న గొప్ప సూచనలు:
అల్లాహ్, ప్రవక్తకు తూర్పు, పడమర వరకు ఉన్న భూమిని దగ్గరికి చేశాడు. ప్రవక్త ఈ దాని గురించి తెలిపిన విషయం నిజమయింది. (అంటే తూర్పు, పడమరలో ఇస్లాం వ్యాపించింది). ఉత్తరం, దక్షిణం గురించి ఇలా ఏమి తెలుపలేదు.
రెండు ధనభండారాలు లభించాయి అని తెలిపారు.
ప్రవక్త చేసిన రెండు దుఆలు అల్లాహ్ స్వీకరించాడు.
పరస్పర యుద్ధాలకు, వినాశనాలకు గురికాకూడదు అన్న మూడవ దుఆ అల్లాహ్ స్వీకరించలేదు.
వారి పై కత్తి నడిచిందంటే అగదు అన్నది కూడా సత్యమైంది.
పరస్పరం హత్యయత్నాలు, ఖైదీలు చేయడం జరుగతుంది అన్న విషయం తెలిసింది.
అనుచర సంఘం పై భ్రష్టనాయకుల, పండితుల (మౌల్వీల) భయం ఉంది అని తెలిపారు.
వీరిలో తానే ప్రవక్త అని ఆరోపించేవారు వస్తారు అన్న సూచన ఉంది.
అల్లాహ్ సహాయం పొందే ఒక సమూహం ధర్మం వైపు ఎల్లప్పుడూ ఉంటుందన్న శుభవార్త ఇచ్చారు. ప్రవక్త తెలిపిన పై సూచనలు మన బుద్ధిజ్ఞానంతో ఆలోచిస్తే అసంభవం అని అంటామేమో, కాని అవి పూర్తిగా నిజమైనాయి.
13. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచర సంఘం పట్ల భయం మార్గభ్రష్టులైన పండితులతో మాత్రమే ఉంది అని తెలిపారు.
14. విగ్రహ పూజ యొక్క భావాన్ని వివరించారు. (అది అల్లాహ్ యేతరులకు రుకూ, సజా చేయడమే కాదు. వారు హలాల్ చేసినదాన్ని హలాల్, హరాం చేసినదాన్ని హరాంగా నమ్ముట కూడా).
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :
ఈ అధ్యాయం యొక్క ఉద్దేశం ముస్లిం సంఘంలో సంభవించిన షిర్క్ నుండి హెచ్చరించడం. ఇది ముస్లిం సమాజంలో వ్యాపించింది. అదే విధంగా “లాఇలాహ ఇల్లల్లాహ్” నోటితో పలికి, తనకు తాను ముస్లిం అని చాటుకున్న వ్యక్తి, దానికి వ్యెతిరేకమున్న: సమాధిలో ఉన్నవారితో దుఆ, మొరపెట్టు కొనుట లాంటి పనులు చేసి, దానికి వసీల అన్న పేరు పెడితే అతని తౌహీద్ లో ఏలాంటి తేడా ఉండదు అని అన్నవారి ఖండన కూడా ఇందులో ఉంది.
“వసన్” అంటే: అల్లాహ్ తప్ప పూజింపబడే వారు. అందులో పూజింపబడే చెట్లు, రాళ్ళు (సమాధులపై ఉన్న) నిర్మాణాలు. ఇంకా ప్రవక్తలు, పుణ్యాత్ములు,దుష్టులు అన్నీ వస్తాయి. ఇబాదత్ కేవలం అల్లాహ్ హక్కు. అల్లాహ్ తప్ప ఇతరులతో దుఆ చేయువాడు, లేక వారిని ఆరాధించేవాడు, వారిని “వసన్” (విగ్రహంగా, ఆరాధ్యదైవంగా) చేసుకున్నవాడయ్యాడు. అందువల్ల అతను ఇస్లాం నుండి దూరమవుతాడు. తనకు తాను ముస్లిం అని చెప్పుకున్నా లాభం లేదు. తమను తాము ఇస్లాం వైపుకు అంకితం చేసుకున్న అవిశ్వాసులు, నాస్తికవాదులు, తిరస్కారులు, కపట విశ్వాసులు (మునాఫిఖులు) ఎంత మంది లేరు. వాస్తవ ధర్మంతోనే స్వఛ్చమైన విశ్వాసుడు అనబడును. కేవలం పేరుతో, పదాలతో కాదు.
وَلَقَدْ عَلِمُوا۟ لَمَنِ ٱشْتَرَىٰهُ مَا لَهُۥ فِى ٱلْـَٔاخِرَةِ مِنْ خَلَـٰقٍۢ “ఈ విద్య కొనేవారికి పరలోక సౌఖ్యాలలో ఏమాత్రం భాగం లేదనే విషయం వారికి బాగా తెలుసు“. (2: బఖర: 102).
జిబ్తి అంటే: ఇంద్రజాలం, తాగూత్ అంటే షైతాన్ అని ఉమర్ రదియల్లాహు అన్హు చెప్పారు. తాగూత్ అంటే; జ్యోతిష్యులు. వారి వద్దకు షైతానులు వస్తారు. వారు ప్రతి వాడలో ఒకరుండేవారు అని జాబిర్ చెప్పారు.
అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ ఆదేశించారు: “నాశనం చేసే ఏడు విషయాల నుండి దూరముండండి“. ఏ విషయాలు ప్రవక్తా! అని సహచరులు అడిగినప్పుడు, “అల్లాహ్ తో షిర్క్ చేయుట. ఇంద్రజాలం. అల్లాహ్ నిషేధించిన ప్రాణాన్ని అన్యాయంగా హతమార్చుట. వడ్డి తినుట. అనాధుల సొమ్ము తినుట. రణరంగం నుండి వెనుదిరుగుట. అమాయకులు మరియు పవిత్రులైన ముస్లిం స్త్రీ పై అపనింద మోపుట” అని వివరించారు ప్రవక్త ﷺ.
జున్దుబ్, ప్రవక్త చెప్పినట్లు ఉల్లేఖించారు: “ఇంద్రజాలం చేయువాని శిక్ష ఖడ్గంతో నరకడం”. (తిర్మిజీ).
అబూ దావూద్ లో బజాల బిన్ అబ్ద ఉల్లేఖించారు: ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) గవర్నర్లకు ఇలా ఆదేశాలు వ్రాసారు: “ఇంద్రజాలం చేసే ప్రతి స్త్రీ పురుషున్ని నరికి వెయ్యండి“. మేము ముగ్గురు స్త్రీలను హతమార్చాము. హఫ్సా రజియల్లాహు అన్హా ఆమె పై ఇంద్రజాలం చేసిన ఆమె బానిసరాలును హతమార్చండి అని ఆదేశించారు. ఆ బానిసరాలు నరికివేయబడింది. అదే విధంగా జుందుబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనంలో ఉంది. మాంత్రికుణ్ణి హతమార్చే విషయం ముగ్గురి సహాబీలతో రుజువైనది అని ఇమాం అహ్మద్ రహిమహుల్లా చెప్పారు.
ముఖ్యాంశాలు:
1. సూరె బఖర ఆయతు యొక్క భావం. 2. సూరె నిసా ఆయతు యొక్క భావం. 3. జిబ్త్, తాగూత్ యొక్క భావం. అందులోని వ్యత్యాసం తెలిసింది. 4. తాగూత్, జిన్నాతులోని వాడు కావచ్చు, లేదా మనుష్యులలోనివాడు కావచ్చు. 5. ప్రత్యేకంగా నివారించబడిన, నాశనం చేసే ఏడు విషయాలను గుర్తుంచుకోవాలి. 6. ఇంద్రజాలం చేసేవాడు అవిశ్వాసుడవుతాడు. 7. అతని తౌబా స్వీకరించబడదు. అతన్ని హతమార్చాలి. 8. ఉమర్ రజియల్లాహు అన్హు వారి కాలంలోనే అలాంటి వాళ్ళున్నారంటే, ఆ తరువాతి కాలపు సంగతి ఏమి చెప్పనవసరం లేదు.
ఇమాం అహ్మద్ హదీసు ఉల్లేఖించారు ముహమ్మద్ బిన్ జఅఫర్ తో, ఆయన హదీసు ఉల్లేఖించారు ఔఫ్ తో , ఆయన హయ్యాన్ బిన్ అలాతో, ఆయన హదీసు ఉల్లేఖించారు ఖుత్నుబ్ను ఖబీసతో, ఆయన తన తండ్రితో, ఆయన ప్రవక్త ﷺ తో విన్నారు, ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారు:
ఇయాఫ అంటే: పక్షుల్ని ఎగరేసి శకునం పాటించటం. తర్ఖ్ అంటే: నేలపై గీతలు గీసి శకునం పాటించటం అని ఔఫ్ రహిమహుల్లా చెప్పారు. జిబ్త్ అంటే: షైతాన్ యొక్క ఈలలు, అరుపులు అని హసన్ బసరీ రహిమహుల్లాః అన్నారు. (దీని సనద్ సరియైనది).
ఇబ్ను అబ్బాసు రజియల్లాహు అన్హుమా కథనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: “ఏ వ్యక్తి ఎంత జ్యోతిష్య విద్య నేర్చుకుంటాడో, అతడు అంతే ఇంద్రజాలం నేర్చుకున్నట్లు. ఎంత నేర్చుకుంటే అంతే పాపం కూడా పెరుగుతూ ఉంటుంది“. (అబూ దావూద్. దీని సనద్ ఉత్తమమైనది).
అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ ఇలా ఆదేశించారు: “ఎవరు ముడి వేసి అందులో మంత్రిస్తారో అతడు ఇంద్రజాలం చేసినట్లే. ఇంద్రజాలం చేసినవాడు షిర్క్ చేసినట్లు. ఎవరు ఒక వస్తువును ధరిస్తారో అతను దాని వైపే అప్పగించబడుతాడు“. (నసాయి).
ఇబ్ను మస్ ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఒకసారి ప్రవక్త ﷺ “అజ్ హ్ ” అంటేమిటో మీకు తెలుపనా?” అని అడిగారు. మళ్ళీ ఆయనే “చాడీలు చెప్పడం, ప్రజల మధ్య జగడము వేయుట” అని విశదీకరించారు. (ముస్లిం).
ఇబ్ను ఉమర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ప్రవక్త చెప్పారు: “కొన్ని ప్రసంగాలలో కూడా మంత్రం లాంటి ప్రభావం ఉంటుంది“. (బుఖారీ, ముస్లిం).
ముఖ్యాంశాలు:
1. ఇయాఫ, తర్ఖ్ , అపశకునం ఇవన్నియు ఇంద్రజాలం రకాలు. 2. ఇయాఫ, తర్ఖ్ , తియర యొక్క అర్థం తెలిసింది. 3. జ్యోతిష్య విద్య ఇంద్రజాలం రకంలోనిదే. 4. ముడి వేసి మంత్రించుట కూడా ఆ రకానికి సంబంధించిందే. 5. చాడీలు చెప్పడం దాని రకాల్లోనే లెక్కించబడుతుంది. 6. ప్రసంగం కూడా ఒక్కోసారి దాని రకాల్లో వస్తుంది.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :
ఇంద్రజాలంకి సంబంధించిన పాఠాన్ని తౌహీద్ అధ్యాయాల్లో ప్రస్తావించడానికి కారణం ఏమనగా మాంత్రికుని ఉద్దేశం పూర్తికావటానికి అందులోని అనేక రకాలు షిర్క్ మరియు షైతాన్ యొక్క ఆత్మతో వసీల కోరుతూ చేయబడుతాయి. మానవుడు చిన్నవైనా, పెద్దవైనా అన్ని రకాల ఇంద్రజాలాన్ని వదులుకోనంత వరకు అతని తౌహీద్ సంపూర్ణం కాదు. అందుకే దాన్ని షిర్క్ తో కలిపి చెప్పబడింది. అది రెండు విధాలుగా షిర్క్లో చేరుతుంది.
ఒకటి: ఇందులో షైతానుల సహాయం కోరడం, వారితో సంబంధం ఉంచడం జరుగుతుంది. మాంత్రికులు తమ కోరికను వారితో పొందుటకు, వారి సేవలను అందుకొనుటకు వారు కోరునది వారి సన్నిధానంలో ఉంచుతారు.
రెండవది: అగోచర జ్ఞానం ఉన్నదన్న ఆరోపణ, అల్లాహ్ కు ఉన్న విద్య, జ్ఞానంలో భాగస్తుడు ఉన్నాడన్న ఆరోపణ ఉంది. ఈ ఆరోపణ నేరుగా చేయకున్నా దాని వరకు చేర్పించే బాటను వారు అనుసరిస్తారు. ఇది షిర్క్, కుఫ్ర్ యొక్క భాగాల్లో ఒక భాగం.
ఇంతేగాక అందులో నిషిద్ధమైన, చెడ్డ కార్యాలు జరుగుతాయి. ఉదా: హతమార్చడం, ప్రేమగా కలిసియున్నవారిని విడదీయడం, బుద్ధీ, జ్ఞానాన్ని మార్చి వేసే ప్రయత్నాలు. ఇది కఠినంగా నిషేధించబడినదానిలో ఒకటి. ఇంకా షిర్క్, దానికి సంబంధించిన మార్గాల్లో ఒకటి. అందుకే ఇంతటి ఘోరమైన నష్టాలను అడ్డుకొనటానికే మాంత్రికుణ్ణి హతమార్చాలని చెప్ప బడింది.
దాని రకాల్లో ఒకటి ఈ రోజుల్లో ప్రజల్లో చెలామణిలో ఉన్న చాడీలు. దాని వలన కూడా ప్రజల మధ్య బేధాన్ని ప్రేమగా ఉన్నవారిని విడదీయడం జరుగుతుంది. ఇంద్రజాలంలో అనేక రకాలు గలవు. ప్రతీ ఒక్కటి మరో దానికంటే చెడ్డది.
ప్రవక్త సతీమణుల్లో ఒకరు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: “ఎవరైనా “అర్రాఫ్” వద్దకు వెళ్ళి అతన్ని ఒక విషయం అడిగి అతను చెప్పిన సమాధానాన్ని సత్యం అని నమ్మితే, అతని నలుబై రోజుల నమాజు అంగీకరింపబడదు”. (ముస్లిం).
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారు: “ఎవరు “కాహిన్’ వద్దకు వచ్చి అతను చెప్పింది సత్యం అని నమ్ముతాడో అతను ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన దాన్ని (ఖుర్ఆన్ ను) తిరస్కరించినవాడవుతాడు”. (అబూ దావూద్ ).
అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ఎవరు “కాహిన్ లేక అర్రాఫ్” వద్దకు వచ్చి అతని మాటను సత్యపరుస్తాడో అతడు ముహమ్మద్ ప్రవక్త పై అవతరించినదానిని తిరస్కరించినవాడవుతాడు”. (అబూ దావూద్ ….).
ఇమ్రాన్ బిన్ హుసైన్ మహాప్రవక్త నుండి ఉల్లేఖించారు: “అపశకునం పాటించినవాడు లేక తన కొరకు అపశకునం పాటించువాణ్ణి (వెతికి, అతనితో తన అదృష్టం తెలుసుకున్నవాడు). “కహానత్” చేసినతడు లేక చేయించుకున్నతడు. ఇంద్రజాలం చేసినతడు లేక చేయించినవాడు. కాహిన్ మాటల్ని సత్యం అని భావించినతడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన దానిని తిరస్కరించినవాడవుతాడు”. (బజ్జార్ సరియైన సనద్ తో సేకరించారు).
గొప్ప వ్యాఖ్యానకర్త ఇమాం బగవి చెప్పారు: అర్రాఫ్ అంటే; కొన్ని మూల విషయాల అధారంతో దొంగలించబడిన వస్తువులను, కనబడని, తప్పిపోయిన వస్తువులను తెలుపుతానని అరోపించేవాడు. కాహిన్ అంటే కూడా అతడే అని కొందరున్నారు. మరి కొందరున్నారు: కాహిన్ అంటే; భవిష్యత్తులో సంభవించేవాటిని తెలిపేవాడు. మనుస్సులో ఉండేవాటిని తెలిపేవాడు అని కూడా అన్నారు.
షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియ్యా రహిమహుల్లాహ్ చెప్పారు: కాహిన్ ను, మునజ్జిం రమ్మాల్ లాంటి వారిని అర్రాఫ్ అంటారు. ఈ మార్గాల ద్వారా వారు కొన్ని విషయాలను తెలుపుతామని ఆరోపణ చేస్తారు.
“అబ్ జద్ ” అక్షరాలు వ్రాసి, నక్షత్రాల్లో చూసి (భవిష్యత్తు గురించి తెలుసుకునే) వారి గురించి ఇబ్న్ అబ్బాసు చెప్పారు: “ప్రళయదినాన వారికి ఎలాంటి పుణ్య ఫలము లభించదు.”
ముఖ్యాంశాలు:
1. ఖుర్ఆన్ పై విశ్వాసం, కాహిన్ మాటను సత్యమని నమ్ముట ఈ రెండు విషయాలు ఒక మనిషిలో కలిసి ఉండలేవు. 2. అది అవిశ్వాసం అని స్పష్టం అయింది. 3. కహానత్ చేయించేవారి ప్రస్తావన వచ్చింది. 4. అపశకునం పాటించువాని వద్దకు వెళ్ళినవాని ప్రస్తావన వచ్చింది. 5. ఇంద్రజాలం చేయించేవాని ప్రస్తావన వచ్చింది. 6. అబ్ జద్ (అక్షరాల జ్ఞానం) నేర్చుకునే వాని ప్రస్తావన వచ్చింది. 7. కాహిన్, అర్రాఫ్ మధ్య ఉన్న వ్యత్యాసం తెలిసింది.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :
అగోచర జ్ఞానంలో అద్వితీయుడు అల్లాహ్ మాత్రమే. ఇందులో తాను అల్లాహ్ తో భాగస్తుడు అని కహానత్, అర్రాఫ ఆధారంతో ఎవరు ఆరోపణ చేస్తాడో, లేక ఇలా ఆరోపణ చేసినవానిని నమ్ముతాడో అతడు అల్లాహ్ ప్రత్యేకతల్లో ఇతరులను సాటి కల్పించినవాడవుతాడు. అందుచేత అల్లాహ్ , ఆయన ప్రవక్తను తిరస్కరించినవాడవుతాడు.
అనేక కహానత్ లు షైతాన్ కు సంబంధించినవి. అవి షిర్క్ లేకుండా ఉండవు. ఇంకా అగోచర జ్ఞాన ఆరోపణకు సహాయపడే మార్గాల సన్నిధానం కోరడం కూడా జరగుతుంది. ఇలా ఇది రెండు విధాలుగా షిర్క్. ఒకటి: అల్లాహ్ కు ప్రత్యేకించిన అగోచరజ్ఞానంలో భాగస్తుడని అరోపణ చేసినందుకు. రెండవది: అల్లాహ్ యేతరుల సన్నిధానం కోరినందుకు.
ఇలా ధర్మాన్ని, బుద్ధి, జ్ఞానాన్ని నష్టము కలిగించే దురాచారాలు, దుష్కార్యాల నుండి ఇస్లాం ధర్మం ప్రజల్ని దూరంగా ఉంచింది.
జాబిర్ కథనం: ఇంద్రజాలం ద్వారా ఇంద్రజాలం చికిత్స చేయవచ్చునా? అని ప్రవక్త ﷺ ముందు ప్రశ్న వచ్చినప్పుడు “అది షైతాన్ పని” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. (అహ్మద్, అబూ దావూద్ ).
ఇందులో ఇంకా ఇలా ఉంది: అదే ప్రశ్న ఇమాం అహ్మద్ రహిమహుల్లాతో చేసినప్పుడు ఆయన “అబ్దులాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు వీటన్నిటితో ఇష్టపడేవారు కాదు” అని చెప్పారు. (అంటే నిషిద్ధం అని భావించేవారు).
బుఖారిలో ఖతాద కథనం: నేను ఇబ్ను ముసయ్యిబ్ తో అడిగాను: ఒక వ్యక్తిపై మంత్రం చేయబడింది. లేక అతను తన భార్య వద్దకు వెళ్ళకుండా మంత్రించారు. అయితే అది దూరం చేయవచ్చునా? లేక దాన్ని దూరము చేయుటకు మంత్రం చేయవచ్చునా? దానికి ఆయన “పరవాలేదు. వారు దాని ద్వారా మంచి చేయగోరుతున్నారు. లాభం కలిగే దాన్ని నివారించకూడదు” అని అన్నారు.
“ఇంద్రజాలం చేయబడిన వ్యక్తి నుండి దాని ప్రభావం దూరం చేసే విధానాలు రెండు: ఒకటి: అలాంటి ఇంద్రజాలం ద్వారానే దూరం చేయుట. ఇది షైతాన్ పని. హసన్ బస్రి చెప్పిన దానికి భావం అదే. ఇందులో అది చేసేవాడు, చేయబడేవారిద్దరూ షైతాన్కు ఇష్టమైన పనులు చేస్తారు, అతడు వారితో సంతోషపడి తన ప్రభావాన్ని దూరం చేసుకుంటాడు. రెండవది: దానిని దూరము చేయుటకు ధర్మసమ్మతమైన మంత్రాలు, ప్రవక్త నేర్పిన దుఆలు, వైద్యశాస్త్రం ద్వారా చికిత్స చేయుట. ఇది ధర్మసమ్మతమైనది.”
ముఖ్యాంశాలు:
1. ఇంద్రజాలం ద్వారా ఇంద్రజాలాన్ని దూరం చేయుట నివారించబడింది. 2. నివారించబడిన దానిలో, యోగ్యమైన దానిలో మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించాలి.
أَلَآ إِنَّمَا طَـٰٓئِرُهُمْ عِندَ ٱللَّهِ وَلَـٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ “అసలు వాస్తవానికి వారి అపశకునం అల్లాహ్ చేతులలో ఉంది. కాని వారిలో చాలా మంది జ్ఞానహీనులు“. (7: ఆరాఫ్: 131).
అల్లాహ్ పంపిన ప్రవక్తలు ఇలా అన్నారు:
قَالُوا۟ طَـٰٓئِرُكُم مَّعَكُمْ “మీ దుశ్శకునం స్వయంగా మీ వెంటనే ఉంది“. (36: యాసీన్: 19).
అబూ హురైరా రదియల్లాహు అన్హు కథనం: ప్రవక్త ﷺ చెప్పారు: “అస్పృశ్యత (అంటు వ్యాధి) సరైనది కాదు. అపశకునం పాటించకూడదు. గుడ్లగూబ (అరుపు, లేక ఒకరి ఇంటిపై వాలితే ఆ ఇంటివారికీ నష్టం కలుగుతుందని భావించుట) సరి కాదు. ఉదర వ్యాధితో(*) అపశకునం పాటించుట కూడా సరైనది కాదు“. (బుఖారీ, ముస్లిం). ముస్లిం హదీసు గ్రంథంలో “తారా బలం, దయ్యాల నమ్మకం కూడా సరైనది కాదు“. అని ఉంది.
(*) కొందరి నమ్మకం ప్రకారం రోగి కడుపులోకి ఒక జంతువు దూరి ఆకలిగా ఉన్నప్పుడు తీవ్రమైన దుఃఖం కలిగిస్తుంది. దీనివల్ల ఒక్కోసారి రోగి మృత్యువాతన కూడా పడతాడు. ఈ నమ్మకాన్ని అరబిలో “సఫర్” అంటారు.
అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ ఉపదేశించారు: “అస్పృశ్యతా పాటింపు లేదు. దుశ్శకునం పాటించడం ధర్మ సమ్మతం కాదు. అయితే శుభ శకునం (ఫాల్) (*) పాటించడమంటే నాకిష్టమే“”. అప్పుడు అనుచరులు “మంచి శకునం అంటే ఏమిటి?” అని అడిగారు. దానికి ప్రవక్త “(మంచి శకునం అంటే) మంచి మాట (సద్వచనం)” అని సమాధానమిచ్చారు.
(*) అకస్మాత్తుగా ఏదైనా మంచి మాట విని లేదా సందర్భోచితమైన మాట విని దాన్నుండి సకారాత్మక ఫలితం తీయడమే మంచి శకునం (ఫాల్). ఇది ధర్మసమ్మతమే.
ఉఖ్బా బిన్ ఆమిర్ రజియల్లాహు అన్హు కథనం: ప్రవక్త ﷺ దగ్గర దుశ్శకునం పాటించే ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఆయన “ఫాల్” మంచిది. అది ముస్లింను తన పనుల నుండి ఆపదు. మీలో ఎవరైనా తనకు ఇష్టం లేనిది చూస్తే ఇలా అనాలి: “అల్లాహుమ్మ లా యాతి బిల్ హసనాతి ఇల్లా అంత. వలా యద్ ఫఉస్సయ్యిఆతి ఇల్లా అంత. వలాహౌల వలాఖువ్వత ఇల్లా బిక” (అర్థం: ఓ అల్లాహ్ ! మంచిని ప్రసాదించేవాడివి నీవే. చెడును దూరము చేయువాడివి నీవే. మంచి చేయుటకు, చెడు నుండి దూరముంచుటకు నీకు తప్ప మరెవ్వరికి సాధ్యం కాదు). అని చెప్పారు. (అబూ దావూద్).
ఇబ్ను మస్ ఊద్, ప్రవక్త ﷺ చెప్పినట్లు ఉల్లేఖించారు: “దుశ్శకునం పాటించుట షిర్క్. దుశ్శకునం పాటించుట షిర్క్. మనలో ప్రతీ ఒకడు దానికి గురవుతాడు. కాని అల్లాహ్ పై ఉన్న నమ్మకం ద్వారా అల్లాహ్ దాన్ని దూరము చేస్తాడు“. (అబూ దావూద్, తిర్మిజి. తిర్మిజి చెప్పారు: చివరి పదాలు ఇబ్ను మన్ ఊద్ రజియల్లాహు అన్హు చెవితనవి).
ఇబ్ను ఉమర్ (రజియల్లాహు అన్హుమా) కథనం: “దుశ్శకునం తన పనికి అడ్డు పడిందని ఎవడు నమ్ముతాడో అతడు షిర్క్ చేసినట్లు“. దాని పరిహారం ఏమిటని అడిగినప్పుడు: “అల్లాహుమ్మ లా ఖైర ఇల్లా ఖైరుక. వలా తైర ఇల్లా తైరుక. వలాఇలాహ గైరుక” అనండి అని తెలిపారు. (అర్థం: నీ మంచి తప్ప మంచి ఎక్కడా లేదు. నీ శకునం తప్ప శకునం ఎక్కడా లేదు. నీ తప్ప సత్యమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు). (అహ్మద్).
“నిన్ను పని చేయనిచ్చేది లేక పనికి అడ్డుపడేది దుశ్శకునం” అని ఫజ్ ల్ బిన్ అబ్బాసు రజియల్లాహు అన్హు అన్నారు.
ముఖ్యాంశాలు:
1. ఖుర్ఆన్లోని పై రెండు ఆయతుల భావం తెలిసింది. “అసలు వాస్తవానికి వారి అపశకునం అల్లాహ్ చేతులలో ఉంది”. “మీ దుశ్శకునం స్వయంగా మీ వెంటనే ఉంది”.
2. అస్పృశ్యత పాటించడము సరికాదు.
3. దుశ్శకునం పాటించడం సరికాదు.
4. గుడ్లగూబ నష్టం కలిగిస్తుందని భావించుట సరికాదు.
5. సఫర్ కూడా సరైనది కాదు.
6. ఫాల్ అలాంటిది కాదు. అది మంచిది.
7. ఫాల్ అంటేమిటో కూడా తెలిసింది.
8. అది ఇష్టం లేనప్పటికి, ఒక్కోసారి మనుస్సులో అలాంటి భావం కలిగితే నష్టం లేదు. ఎందుకనగా అల్లాహ్ తనపై నమ్మకం ఉన్నవారి నుండి దాన్ని దూరము చేస్తాడు.
9. అలా మనుస్సులో కలిగినప్పుడు ఏమనాలో తెలిసింది.
10. దుశ్శకునం షిర్క్.
11. దుశ్శకునం అంటేమిటో కూడా తెలిసింది.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :
పక్షులతో, పేర్లతో, పదాలతో, స్థలము వగైరాలతో అపశకునం పాటించుటను అరబిలో “తియర” అంటారు. అల్లాహ్ అపశకునమును నివారించి, దాన్ని పాటించేవారిని కఠినంగా హెచ్చరించాడు. ప్రవక్త ఫాల్ అంటే ఇష్టపడేవారు. అపశకునమంటే అసహ్యించుకునేవారు.
అపశకునం మరియు ఫాల్లో వ్యత్యాసం ఏమనగా: ఫాల్ మానవుని విశ్వాసము, బుద్ధి, జ్ఞానములో లోపం కలుగచేయదు. అల్లాహ్ యేతరులపై మనస్సు లగ్నం వల్ల, విశ్వాసం, అల్లాహ్ పై నమ్మకముపై దెబ్బకొట్టింది. ఇలా (గీత గీయబడిన) రెండిట్లో లోపం కలుగ జేసింది అనడంలో ఏలాంటి సందేహం లేదు. ఆ తరువాత ఈ కారణంగా అతని మనస్సు బలహీనత, పిరికితనం, సృష్టిరాసులతో భయం ఎలా చోటు చేసుకుంటుందో అడుగకు. నిరాధారమైన వాటిని ఆధారంగా నమ్మి, అల్లాహ్ వైపు లగ్నం కాకుండా దూరమవుతాడు. ఇదంతయు ఏకత్వ విశ్వాస బలహీనత, అవనమ్మకము, షిర్క్ వాటి మార్గాల అనుసరణ, బుద్ధిని చెడగొట్టే దురాచారాల వలన కలుగుతుంది.
రెండవది: అతడు ఆ ప్రభావాన్ని స్వీకరించడు. కాని అది తన ప్రభావాన్ని చూపి బాధ, చింతకు గురి చేస్తుంది. ఇది చూడడానికి మొదటిదానికంటే చిన్నది అయినా, అది చెడు, మానవునికి నష్టం. అతని మనస్సు బలహీనతకు కారణం మరియు అల్లాహ్ పై ఉండే నమ్మకంలో కూడా బలహీనత వస్తుంది. ఒకప్పుడు ఏదైనా ఇష్టములేని సంఘటన జరిగితే అది ఈ కారణంగానే అని భావిస్తాడు. అపశకునం పై అతని నమ్మకం మరీ రెట్టింపవుతుంది. ఒకప్పుడు పైన వివరించిన భాగంలో చేరే భయం కూడా ఉంటుంది.
అపశకునమును ఇస్లాం అసహ్యించుకునేదీ, దాన్ని పాటించేవారిని హెచ్చరించేదీ, అది ఏకత్వ విశ్వాసం మరియు అల్లాహ్ పై నమ్మకమును ఎలా వ్యెతిరేకమో పైవివరణ ద్వారా మీకు తెలియవచ్చు. ఇలాంటిది ఎవరికైనా సంభవించి, స్వభావికమైన ప్రభావాలు అతని పై తమ ప్రభావాన్ని చూపుతే తను వాటిని దూరము చేయుటకు అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి. అల్లాహ్ తో సహాయము కోరాలి. ఆ చెడు అతని నుండి దూరము కావాలంటే, ఏ విధంగా కూడా దాని వైపునకు మ్రొగ్గు చూప కూడదు.
బుఖారిలో ఖతాద కథనం: అల్లాహ్ నక్షత్రాలను మూడు ఉద్దేశాలతో పుట్టించాడు. (1). ఆకాశ అలంకారానికి. (2) షైతానులను తరిమి కొట్టడానికి. (3). మార్గం పొందడానికి సంకేతాలుగా. ఇవి గాక వేరే భావించేవాడు తప్పులో పడి, తన భాగ్యాన్ని కోలిపోతాడు. తనకు తెలియనిదానిలో అడుగుపెట్టిన వాడవుతాడు.
చంద్రుని దశల విద్యను నేర్చుకొనుట ‘ఖతాద’ ఇష్టపడలేదు. ‘ఇబ్ను ఉయయన’ దీని అనుమతి ఇవ్వలేదు. ఈ రెండు రివాయతులను ‘హర్బ్’ ఉల్లేఖించారు.
ఇమాం అహ్మద్ మరియు ఇస్హాఖ్ అది నేర్చుకొనుట యోగ్యమే అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబూ మూసా రజియల్లాహు అను ఉల్లేఖించారు: “ముగ్గురు మనుషులు స్వర్గంలో ప్రవేశించరు. (1). మత్తు సేవించుటకు బానిస అయినవాడు. (2). రక్త సంబంధాలను తెంచువాడు. (3). ఇంద్రజాలాన్ని సత్యం అని నమ్మేవాడు. (అహ్మద్).
ముఖ్యాంశాలు:
1. నక్షత్రాల సృష్టిలో ఉన్న ఔచిత్యం.
2. అవి తప్ప వేరే భావంతో ఉన్నవాడు తప్పులో ఉన్నాడు.
3. చంద్రుని దశల విద్య నేర్చుకునే విషయంలో ఉన్న భిన్నాభిప్రాయం. (విషయం క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే బిన్నాభిప్రాయం దూరమవుతుంది. అదేమనగ: ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకొనుటకు ఆ విద్య నేర్చుకొనుట హరాం. ఎందుకనగా అది అల్లాహ్ తప్ప మరెవ్వరికి తెలియదు. కాని తేది, సంవత్సరాలు లాంటి విషయాలు తెలుసుకొనుటకు విద్య నేర్చుకోవచ్చు).
4. ఇంద్రజాలం మిథ్యం, తప్పు అని తెలిసి కూడా ఆ విషయాల్ని సత్యం అని నమ్మిన వారికి హెచ్చరించడమైనది.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :
జ్యోతిష్యశాస్త్రం రెండు రకాలు:
ఒకటి: “ఇల్మె తాసీర్” అంటారు. ఇందులో భూలోకములో సంభవించునవి ఖగోళ పరిస్థితులను బట్టి యున్నాయి అనుట. ఇది నిషిద్ధం. ఇంకా అగోచర జ్ఞానంలో అద్వితీయుడైన అల్లాహ్ తో పొత్తు కలసిన ఆరోపణ చేసినట్లు. లేక ఆరోపణ చేసినవాణ్ణి సత్యపరచినట్లగును. ఇందులో తుచ్ఛమైన ఆరోపణలు, అల్లాహ్ యేతరుల పై మనస్సు లగ్నం కావడం, బుద్ధిజ్ఞానాన్ని చెడగొట్టే విషయాలు ఉన్నవి గనుక తౌహీదు కు విరుద్ధం. ఎందుకనగా తుఛ్ఛమైన మార్గాలను అనుసరించుట. వాటిని నమ్ముట వలన ధర్మము. జ్ఞానము రెండూ పాడవుతాయి.
రెండవది: “ఇల్మె తైసీర్“: సూర్యచంద్రలు, నక్షత్రాలతో ఖిబ్లా, సమయాలు, దిశలు తెలుసుకొనుట. ఇందులో ఎలాంటి అభ్యంతరము లేదు. ఇందులో అనేకము లాభదాయకమైనవి. ప్రార్థనాసమయాలు, దిశలు తెలుసుకొనుటకు వాటిని ఉపయోగించాలని ఇస్లాం ప్రోత్సహించింది. ధర్మం నిషేధించినది, నివారించినది ఏమిటో, యోగ్యపరచినది, లేక విధి అని తెలిపినది ఏమీటో, రెంటిలోని వ్యత్యాసమును బాగుగా తెలుసుకొనుట చాలా అవసరం. మొదటిది తౌహీదకు విరుద్ధం. రెండవది విరుద్ధం కాదు.
అబూ మాలిక్ అష్ అరి (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారు:
“నా అనుచర సంఘంలోనివారు జాహిలియ్యత్ (అజ్ఞాన కాలాని)కి సంబంధించిన నాలుగు విషయాలను విడనాడరు.
(1) వంశంపై గర్వపడుట.
(2) ఇతర వంశాలను దూషించుట.
(3) నక్షత్రాల ప్రభావంతో వర్షం కురుస్తుందని తారాబలాన్ని నమ్ముట.
(4) శోకము చేయుట“.
ఇంకా ఇలా చెప్పారు: “శోకము చేయు స్త్రీ తౌబాచేయకుండా చనిపోతే ప్రళయదినాన లేపబడినప్పుడు ఆమెపై తార్ కోల్ (Tar coal) పైజామా, చిడుము (ఖారిష్) వ్యాధికి గురి చేసే కవచము ఉండును“.
జైద్ బిన్ ఖాలిద్ అల్ జుహ్నీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: హుదైబియ ప్రాంతములో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాకు ఫజర్ నమాజ్ చదివించారు. ఆ గడిచిన రాత్రి వర్షం కురిసింది. నమాజ్ అయిన తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరుల వైపు తిరిగి “మీ ప్రభువు ఏం సెలవిచ్చాడో మీకు తెలుసా?” అని అడిగారు. ‘అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకే బాగా తెలుసు, మాకు తెలియదు’ అని అన్నాము. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), అల్లాహ్ ఇలా చెప్పాడని తెలిపారు: “ఈ రోజు ఉదయం నా దాసుల్లో కొందరు విశ్వాసులయిపోయారు, మరికొందరు అవిశ్వాసులయ్యారు. అల్లాహ్ దయ వల్ల మనకు వర్షం కురిసింది” అన్నవారు తారాబలాన్ని నిరాకరించి, నన్ను విశ్వసించిన వారయ్యారు. దీనికి భిన్నంగా ఫలానా నక్షత్ర ప్రభావంతో వర్షం కురిసిందని అన్నవారు నక్షత్ర విశ్వాసులయి, నన్ను తిరస్కరించిన వారయ్యారు”. (బుఖారి, ముస్లిం).
ఇలాంటి హదీసు ఇబ్ను అబ్బాసు (రదియల్లాహు అన్హు) కూడా ఉల్లేఖించారు. అందులో ఇంకా ఈ విషయం ఉంది. అందులో కొందరున్నారు: ఫలాన, ఫలాన నక్షత్ర (ప్రభావం) నిజమయింది (అందుకే వర్షం కురిసింది). అప్పుడు అల్లాహ్ ఈ ఆయతులు అవతరింపజేసాడు;
“నక్షత్రాల స్థానాలు సాక్షిగా చెబుతున్నాను: మీరు తెలుసుకుంటే, ఇది చాలా పెద్ద ప్రమాణం: ఇది ఒక మహోన్నతమైన ఖురాన్; ఒక సురక్షితమైన గ్రంథంలో వ్రాయబడి ఉంది. దానిని పరిశుద్ధులు తప్ప మరెవరూ తాకలేరు. ఇది సకల లోకాల ప్రభువు అవతరింపజేసినటు వంటిది. అయినా మీరు ఈ వాణిని తేలిక విషయంగా తీసుకుంటారా? అల్లాహ్ మీకొసంగిన ఉపాధిని, ఆయన్ని తిరస్కరించుటకు ఉపయోగిస్తు న్నారా?” (వాఖిఅ 56: 75-82).
ముఖ్యాంశాలు:
1. సూరె వాఖిల ఆయతు యొక్క భావం. 2. జాహిలియ్యత్ (అజ్ఞాన కాలం)కు సంబంధించిన నాలుగు విషయాల ప్రస్తావన. 3. అందులో కొన్ని అవిశ్వాసం, తిరస్కారమునకు సంబంధించినవి. 4. తిరస్కారంలో కొన్ని రకాలు ధర్మభ్రష్టతకు కారణము కావు. 5.”నా దాసుల్లో కొందరు నన్ను విశ్వసించువారు, మరికొందరు నన్ను తిరస్కరించువారయ్యారు” అన్నది అల్లాహ్ కారుణ్యమైన వర్షం కురిసినప్పటి సంగతి. 6. ఇక్కడ విశ్వాసం యొక్క వాస్తవికతను గమనించాలి. (అల్లాహ్ కరుణ, దయ వలన అని చెబితే విశ్వాసం). 7. అవిశ్వాసం యొక్క వాస్తవికతనూ గమనించాలి. (ఫలాన, ఫలాన నక్షత్ర ప్రభావం అని చెప్పితే అది అవిశ్వాసం). 8. నక్షత్రం నిజమయింది అనుట కూడా అవిశ్వాసం గనుక దానిని గమనించాలి. 9. శిష్యులకు విషయం బాగుగా అర్థం కావడానికి ప్రశ్నించి మరీ జవాబు చెప్పాలి అని “మీ ప్రభువు ఏమన్నాడో మీకు తెలుసా?” అన్న వాక్యంలో తెలుస్తుంది. 10. శోకము చేసేవారికి ప్రళయము నుండే శిక్ష మొదలవుతుంది.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :
అనుగ్రహించువాడు, కష్టాలు తొలగించువాడు అల్లాహ్ మాత్రమేనని మనసా వాచా విశ్వసించి, వాటిని ఆయన విధేయత కొరకే ఉపయోగించుట తౌహీద్ అయినప్పుడు, “ఫలాన నక్షత్రం వలన వర్షం కురిసింది” అనుట ఆ తౌహీద్ విశ్వాసానికి చాలా విరుద్ధం. వర్షమూ, ఇతర వరాలు అల్లాహ్ యే ఇచ్చువాడనుట తప్పనిసరి. ఆయనే వాటిని తన దాసులకు ప్రసాదించాడు కనుక.
వర్షం కురువటానికి నక్షత్రాలు ఏ విధంగానూ కారణం కాజాలవు. అల్లాహ్ యొక్క దయ, కరుణా కటాక్షముల వలన, మానవుల అవసరము, వారు తమ వాజ్మూలిక, స్థితి భాషలో తమ ప్రభువుతో వేడుకొనుట ద్వారా అల్లాహ్ వారి అవసరాలను బట్టి తన వివేకము, కరుణతో వర్షం కురిపిస్తాడు.
మానవుడు తనపై, సర్వ సృష్టిపై ఉన్న అల్లాహ్ యొక్క బాహ్యాంతర సర్వ వరాలను విశ్వసించనంత వరకు అతని తౌహీద్ సంపూర్ణం కాదు. అనుగ్రహాలన్నిటిని అల్లాహ్ కు అంకితం చేయాలి. ఆయన్ను ఆరాధిస్తున్నప్పుడు, స్మరిస్తున్నప్పుడు, కృతజ్ఞత తెలుపుతున్నప్పుడు వాటి సహాయము, ఆధారము తీసుకోవాలి.
ఇలాంటి సందర్భములలోనే తౌహీద్ వాస్తవికత తెలుస్తుంది. దీనితోనే విశ్వాసం యొక్క పరిపూర్ణత మరియు కొరతా తెలుస్తుంది.
وَمِنَ النَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ اللَّهِ أَندَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللَّهِ ప్రజలలో కొందరు అల్లాహ్ ను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా, ప్రత్యర్థులుగా భావిస్తారు. వారు అల్లాహ్ పట్ల కలిగి వుండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు. (2: బఖర: 165).
ప్రవక్త ﷺ ఇలా చెప్పండి: ఒక వేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ బంధువులు, మీ ఆప్తులు, మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు, మందగిస్తాయేమో అని మీరు భయపడే మీ వ్యాపారాలు, మీరు ఇష్టపడే మీ గృహాలు అల్లాహ్ కంటే ఆయన ప్రవక్త కంటే ఆయన మార్గంలో శ్రమించటం (జిహాద్) కంటే మీకు ఎక్కువ ప్రియతరమైతే, అల్లాహ్ తన తీర్పును మీ ముందుకు తీసుకువచ్చే వరకు నిరీక్షించండి. అల్లాహ్ దోషులకు మార్గం చూపడు. (9: తౌబా: 24).
అనసు రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
“మీలో నెవరి దృష్టిలోనైనా, నేను అతని కుమారుని కన్నా, అతని తండ్రి కన్నా మరియు ప్రజలందరికన్నా, అధికంగా ప్రేమ పాత్రుణ్ణి కానంతవరకు మీలో ఎవడూ నిజమయిన విశ్వాసి కాలేడు”. (బుఖారి: 15, ముస్లిం: 70).
అనసు ఉల్లేఖనలో ప్రవక్త ﷺ చెప్పారు:
“ఈ క్రింది మూడు లక్షణాలు కలిగి ఉన్నవాడు విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడు. 1) అందరికంటే ఎక్కువ అల్లాహ్ ను, అల్లాహ్ ప్రవక్తను అభిమానించడం. 2) ఎవరిని ప్రేమించినా కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం ప్రేమించడం. 3) (నరక) అగ్నిలో పడటానికి ఎంతగా అసహ్యించుకుంటాడో, అవిశ్వాస స్థితి వైపునకు మరలిపోవడానికి కూడా అంతగా అసహ్యించుకోవడం”. (బుఖారీ, ముస్లిం).
మరో ఉల్లేఖనలో ఉంది:
“అందరికంటే ఎక్కువ అల్లాహ్ ను , అల్లాహ్ ప్రవక్తను అభిమానించనంత వరకు విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదించడు”.
అబ్ధుల్లాహ్ బిన్ అబ్బాసు రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:
“ఎవరైనా ఒకరితో ప్రేమ, ద్వేషము, స్నేహము, శతృత్వమూ అల్లాహ్ కొరకే కలిగి యుంటాడో, అల్లాహ్ యొక్క స్నేహం, సహాయం వీటి ద్వారానే లభిస్తుందని అతను తెలుసుకోవాలి. ఎవరు కూడా ఎంత గొప్ప నమాజు, రోజాలు పాటించేవాడైనా ఇవి లేకుండా విశ్వాస మాధుర్యాన్ని పొందలేడు. సామాన్య ప్రజల ప్రేమ, సోదర సంబంధాలు ఐహికంగా పరిమితమైనవి. ఇలాంటి ఉద్దేశం వారికి ఏ మాత్రం లాభం చేకూర్చదు”. (ఇబ్ను జరీర్).
ఇబ్ను అబ్బాసు రజియల్లాహు అన్హు సూరె బఖర యొక్క ఈ 166వవాక్యం: “వారి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలన్నీ తెగిపోతాయి“. ను వ్యాఖ్యానిస్తూ “అస్బాబ్” అంటే “ప్రేమ, (స్నేహం), సంబంధాలు” అని చెప్పారు.
తెలుగుఇస్లాం.నెట్ గమనిక: పై వాక్యం అర్ధం కావడానికి సూరె బఖర యొక్క ఈ 165, 166వ ఆయతులు క్రింద గమనించండి:
కాని అల్లాహ్‌ను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి, అల్లాహ్‌ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరు ఉన్నారు. అయితే విశ్వసించినవారు అల్లాహ్‌ను అంతకంటే ప్రగాఢంగా (అధికంగా) ప్రేమిస్తారు.సర్వశక్తులూ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయనీ, అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడన్న యదార్థాన్ని ముష్రిక్కులు, అల్లాహ్ విధించే శిక్షలను చూసిన తరువాత తెలుసుకునే బదులు, ఇప్పుడే తెలుసుకుంటే ఎంత బాగుంటుంది! (తెలుసుకుంటే వారు ఈ షిర్క్ పాపానికి ఒడిగట్టరు).
ఆ సమయంలో, వీళ్ళచేత అనుసరించబడిన నాయకులు తమ అనుచరులతో తమకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తారు. ఇంకా వారు శిక్షను కళ్ళారా చూసుకుంటారు. వారి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలన్నీ తెగిపోతాయి.
ముఖ్యాంశాలు:
1. సూరె బఖరలోని వాక్యం యొక్క వ్యాఖ్యానం తెలిసింది. (బహుదైవారాధకులకు అల్లాహ్ యేతరులతో ఉన్న ప్రేమ యొక్క ప్రస్తావన అందులో ఉంది).
2. సూరె తౌబాలొ ఉన్న వాక్యం యొక్క వ్యాఖ్యానం తెలిసింది. (అందులో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు బదులు ఇతరుల పట్ల ప్రేమ ఫలితం తెలుపబడింది).
3. ప్రవక్తపై ప్రేమ తమ ఆత్మ, సంతానం, ఆస్తిపాస్తుల కంటే ఎక్కువగా ఉండాలి.
4. కొన్ని సందర్భాల్లో విశ్వాసి కాడు అని అంటే మత భ్రష్టుడయ్యాడు అన్న భావం కాదు.
5. విశ్వాసంలో మాధుర్యం అనేది ఉంది. కాని మానవుడు ఒక్కొక్కప్పుడు దాన్ని ఆస్వాదిస్తాడు, ఒకప్పుడు ఆస్వాదించడు.
6. ఆత్మసంబంధమైన నాలుగు విషయాలున్నవి, అవి లేకుండా మానవుడు అల్లాహ్ స్నేహం, ఆయన వద్ద స్థానమూ పొందలేడు. అవి లేకుండా విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదించలేడు.
7. సామాన్య ప్రజల ప్రేమ, సోదరత్వం ఐహికంగా ఉందని ప్రవక్త అనుచరులు (సహాబా) కొన్ని పరిస్థితులను బట్టి తెలుసుకున్నారు.
8. సూరె బఖర 166వ ఆయతు యొక్క వ్యాఖ్యానం కూడా తెలిసింది.
9. కొందరు బహుదైవారాధకులు కూడా అల్లాహ్ తో చాలా ప్రేమ చూపే వారుంటారు.
10. సూరె తౌబాలో వచ్చిన ఎనిమిది వస్తువుల ప్రేమ, ఎవరికైతే తన ధర్మం కంటే ఎక్కువ ప్రియమైనవో వారికి శిక్షవార్త ఇవ్వబడింది.
11. ఎవరు అల్లాహ్ తో పాటు ఒక్క బాగస్వామిని నిర్ణయించుకొని, అల్లాహ్ తో ఉండవలసిన ప్రేమ వారితో కలిగియుంటే అతను పెద్ద షిర్క్ చే సినవాడవుతాడు.
తాత్పర్యం:
తౌహీద్ యొక్క మూలం, ప్రాణం “ప్రేమ కేవలం ఒకే ఒక అల్లాహ్ కు అంకితం చేయుట”. అదే ఆరాధన, ప్రార్థన యొక్క మూలం. ఇంకా చెప్పాలంటే అదే వాస్తవమైన ఆరాధన. మానవుని ప్రేమ తన ప్రభువుతో సంపూర్ణం కానంత వరకు, ఆ ప్రేమను అన్ని రకాల ప్రేమల పై ఆధిక్యత పొందనంత వరకు అతని తౌహీద్ సంపూర్ణం కాదు. అల్లాహ్ ప్రేమకే ఆధిక్యత ఇచ్చి, ఇతర ప్రేమలన్నిటిని దానికనుగుణంగా ఉంచాలి. ఇందులోనే సత్ఫలితము, మేలు ఉన్నాయి.
ఇందులోని ఒక భాగం, భాగమే కాదు దాని పరిపూర్ణత “అల్ హుబ్బు ఫిల్లాహ్ (అల్లాహ్ కొరకు ప్రేమించుట)లో ఉంది. అల్లాహ్ ఏ కార్యాలను, ఎవరెవరిని ప్రేమిస్తాడో మానవుడు వాటన్నిటిని ప్రేమించాలి. అల్లాహ్ కార్యాలను, ఎవరెవరిని ప్రేమించడో వారిని ప్రేమించకుండా ఉండాలి. అల్లాహ్ స్నేహితులతో స్నేహంగా, శత్రువులతో శతృత్వంగా మెలగాలి. ఈ విధంగా మానవుని ఏకత్వ విశ్వాసం సంపూర్ణమవుతుంది.
ఇతరులను అల్లాహ్ కు సమానులుగా చేసుకొని, అల్లాహ్ ను ప్రేమించునట్లు వారిని ప్రేమించుట, వారి విధేయతను అల్లాహ్ విధేయత పై ఆధిక్యం ఇచ్చుట, మరవకుండా ఎల్లప్పుడూ వారిని స్మరించుట, ప్రస్తావించట, వారితో దుఆ చేయుట ఇదే షిర్క్ అక్బర్ (పెద్ద షిర్క్). అల్లాహ్ వారిని క్షమించడు. అతను తన మనస్సును మహాశక్తిమంతుడు, సకల స్తోత్రాలకు తగినవానితో దూరము చేసి, ఏ శక్తిసామర్థ్యం లేని వాని వైపు లగ్నం చేశాడు. బహుదైవారాధకులు పట్టుకున్న దుర్భలమైన సాధనం, సంబంధం ప్రళయమున పనికి రాదు. తెగిపోతుంది. ఈ (బూటకపు ప్రేమ అక్కడ ద్వేషం, శతృత్వంలో మారిపోతుంది.
ప్రేమ మూడు రకాలుగా ఉంటుందన్నది కూడ తెలుసుకోండి!
1. అల్లాహ్ యొక్క ప్రేమ. ఇదే ఏకత్వం, విశ్వాసం యొక్క మూలం.
2. అల్లాహ్ కొరకు ప్రేమ. ప్రవక్తల, వారి అనుచరుల పట్ల ప్రేమ. ఇంకా అల్లాహ్ ప్రేమించు కార్యాలు, కాలాలు, స్థలాలు వగైరాల ప్రేమ. ఇది అల్లాహ్ ప్రేమకు అనుగుణంగా ఉంటుంది. దాన్ని సంపూర్ణం చేస్తుంది.
3. అల్లాహ్ తో ప్రేమ. ఇది బహుదైవారాధకుల్లో ఉంటుంది. వారు అల్లాహ్ తో పాటు, అల్లాహ్ కు సమానంగా నిలబెట్టుకున్న వారిని, చెట్లు, రాళ్ళు, మానవులు, దైవదూతల్లో నియమించుకున్న వారి బూటకపు దేవతలను ప్రేమిస్తారు. ఇది అసలైన షిర్క్ (బహుదైవారాధన).
నాలుగో రకం కూడా ఉంది. అది స్వాభావికమైన ప్రేమ. అది తినుత్రాగు వస్తువుల్లో, సంభోగంలో, దుస్తుల్లో, తమ భార్య/భర్తతో సత్సంబంధము కలిగి ఉండడంలో, మానవునికి నచ్చిన, ఇష్టమున్న దాన్ని ప్రేమిస్తాడు. వీటిని ఇస్లామియ పరిభాషలో “ముబాహ” అనవచ్చు. అవి అల్లాహ్ యొక్క ప్రేమ, ఆయన విధేయతకు సహాయపడితే ఇబాదత్ (ప్రార్థన)లో లెక్కించబడుతాయి. ఒక వేళ దానికి అడ్డుపడితే, అల్లాహ్ ప్రేమించని వాటి వైపుకు తీసుకెళ్తే నివారించబడిన వాటిలో లెక్కించబడుతాయి. లేకుంటే అవి “ముబాహా “గానే ఉంటాయి. (నిజం అల్లాహ్ కే తెలుసు).
إِنَّمَا ذَٰلِكُمُ ٱلشَّيْطَـٰنُ يُخَوِّفُ أَوْلِيَآءَهُۥ فَلَا تَخَافُوهُمْ وَخَافُونِ إِن كُنتُم مُّؤْمِنِينَ ١٧٥ వాస్తవానికి తన మిత్రులను గురించి ఊరకే మిమ్మల్ని భయపెట్టింది షైతానేనని ఇప్పుడు మీరు గ్రహించే ఉంటారు. కనుక మీరు నిజమైన విశ్వాసులే అయితే, ఇకముందు మానవులకు భయపడకండి, నాకు భయపడండి. (3: ఆలె ఇమ్రాన్: 175).
إِنَّمَا يَعْمُرُ مَسَـٰجِدَ ٱللَّهِ مَنْ ءَامَنَ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ وَأَقَامَ ٱلصَّلَوٰةَ وَءَاتَى ٱلزَّكَوٰةَ وَلَمْ يَخْشَ إِلَّا ٱللَّهَ ۖ فَعَسَىٰٓ أُو۟لَـٰٓئِكَ أَن يَكُونُوا۟ مِنَ ٱلْمُهْتَدِينَ ١٨ ‘అల్లాహ్ ను , అంతిమ దినాన్ని విశ్వసించి, నమాజును స్థాపించేవారు, జకాత్ ఇచ్చేవారు, అల్లాహ్ కు తప్ప మరెవరికి భయబడనివారు మాత్రమే అల్లాహ్ మసీదులకు సంరక్షకులూ, సేవకులూ కాగలుగుతారు. వారు సరియైన మార్గంలో నడుస్తారని ఆశించవచ్చు. (9: తౌబా: 18).
وَمِنَ ٱلنَّاسِ مَن يَقُولُ ءَامَنَّا بِٱللَّهِ فَإِذَآ أُوذِىَ فِى ٱللَّهِ جَعَلَ فِتْنَةَ ٱلنَّاسِ كَعَذَابِ ٱللَّهِ ప్రజలలో, “మేము అల్లాహ్ ను విశ్వసించాము” అని అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు, కాని అతడు అల్లాహ్ మార్గంలో హింసించబడినప్పుడు, లోకులు పెట్టిన పరీక్షను అల్లాహ్ విధించిన శిక్షగా భావిస్తాడు. (29: అన్కబూత్ : 10),
అబూ సఈద్ ఖుద్రీ ఉల్లేఖించారు. ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం ఉపదేశించారు:
“విశ్వాస బలహీనత, అపనమ్మకానికి చిహ్నాలు ఇవి: ప్రజల్ని సంతోష పరచడానికి నీవు అల్లాహ్ కు కోపం వచ్చినట్లు చేయుట, అల్లాహ్ ప్రసాదించిన ఆహారానికి బదులుగా ప్రజలకు కృతజ్ఞత తెలుపుట, వారిని పొగడుట. నొసంగని దానిపై ప్రజల్ని దూషించుట. అల్లాహ్ యొక్క ఆహారమును ఏ లోభి యొక్క లోభము తీసుకోలేదు. ఎవరి అయిష్టము దాన్ని ఆపలేదు“. (బ్రహఖి).
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు:
“ఎవరు అల్లాహ్ ను సంతోష పరచడానికి ప్రజల కోపాన్ని సహిస్తారో, అల్లాహ్ అతనితో సంతోషించి, ప్రజలు కూడ అతనితో సంతోషపడునట్లు చేస్తాడు. ఎవరు అల్లాహ్ ను అసంతృప్తి పరచి ప్రజల్ని సంతోష పరుస్తాడో, అల్లాహ్ అతనితో అసంతృప్తి చెంది. ప్రజలు కూడ అతనితో అసంతృప్తి చెందినట్లు చేస్తాడు“. (ఇబ్నుహిబ్బాన్ ).
ముఖ్యాంశాలు:
1. సూరె ఆలె ఇమ్రాన్ లోని ఆయతు యొక్క వ్యాఖ్యానం. (అందులో కేవలం అల్లాహ్ తో భయపడాలని బోధించబడింది).
2. సూరె తౌబా లోని ఆయతు యొక్క వ్యాఖ్యానం.
3. సూరె అన్ కబూత్ లోని ఆయతు యొక్క వ్యాఖ్యానం.
4. విశ్వాసం, నమ్మకం ఒకప్పుడు బలముగా ఉంటే, మరొకప్పుడు బలహీనమవుతుంది.
5. అది బలహీనమయినదనుటకు మూడు గుర్తులు. (అబూ సఈద్ ఖుద్రి హదీసులో తెలుపబడినవి).
6. కేవలం అల్లాహ్ తో భయపడుట కూడా ఇస్లామీయ విధుల్లో ఒక విధి.
“నిజమైన విశ్వాసుల హృదయాలు అల్లాహ్ ప్రస్తావన విన్నంతనే భయంతో కంపిస్తాయి. వారి సమక్షంలో అల్లాహ్ ఆయతులు పారాయణం చేయబడి నప్పుడు వారి విశ్వాసం పెరుగుతుంది. వారు తమ ప్రభువు పట్ల నమ్మకం కలిగివుంటారు.” (అన్ ఫాల్ 8:2)
وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ
“అల్లాహ్ ను నమ్ముకున్నవానికి అల్లాహ్ యే చాలు.” (తలాఖ్ 65:3).
ఇబ్ను అబ్బాసు (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “మాకు అల్లాహ్ చాలు. ఆయనే శ్రేష్టుడైన కార్యసాధకుడు“. అని ఇబ్రాహీం (అలైహిస్సలాం) అగ్నిలో వేయబడినప్పుడు అన్నారు.
అలాగే (ఉహద్ యుద్ధం తరువాత) ప్రజలు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి “మీకు వ్యతిరేకంగా పెద్ద సైన్యాలు మోహరించి ఉన్నాయి, వాటికి భయపడండి” అని అన్నప్పుడు, దానిని విని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా “మాకు అల్లాహ్ చాలు, ఆయనే శ్రేష్టుడైన కార్యసాధకుడు” అన్నారు. అందుచేత ప్రవక్త అనుచరులలో విశ్వాసము పెరిగినది.
ముఖ్యాంశాలు:
1. విధుల్లో తవక్కుల్ కూడా ఒకటి.. 2. అది విశ్వా స నిబంధనలలో ఒకటి. 3. సూరె అన్ ఫాల్ లోని ఆయత్ యొక్క వాఖ్యానం. 4. అదే ఆయతు చివరిలో ఇవ్వబడిన బోధ. 5. సూరె తలాఖ్ ఆయతు యొక్క వ్యాఖ్యానం. 6. “మాకు అల్లాహ్ చాలు…….” వచనముల యొక్క ప్రాముఖ్యత వివరించ బడింది. కష్టకాలాల్లో ఇబ్రాహీం మరియు ముహమ్మద్ ప్రవక్తలు దీనిని చదివారు.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :
అల్లాహ్ పై నమ్మకం తౌహీద్, విశ్వాసం యొక్క విధుల్లో చాలా ముఖ్య మైనది. నమ్మకం ఎంత ఎక్కువగా ఉండునో అంతే విశ్వాస బలం పెరుగును. తౌహీద్ సంపూర్ణం అగును. మానవుడు తన ఐహిక, ధార్మిక సంబంధమైన ఏ కార్యం చేయాలనుకున్నా, వదులు కోవాలనుకున్నా అల్లాహ్ పై నమ్మకం, ఆయన సహాయం కోరుట తప్పనిసరి. అది తప్ప వేరే మార్గం లేదు.
అల్లాహ్ పై నమ్మకం యొక్క వాస్తవికత: ఏ పని అయినా అది అల్లాహ్ తరుపునే అవుతుంది అని మానవుడు తెలుసుకోవాలి. అల్లాహ్ కోరునది అగును. కోరనిది కాదు. ఆయనే లాభనష్టాలు చేకూర్చేవాడు. ప్రసాదించువాడు, ప్రసాదమును ఆపుకునేవాడు. పుణ్యం చేయు శక్తి, పాపం నుండి దూరముండే భాగ్యం అల్లాహ్ తప్ప మరెవ్వరూ ప్రసాదించలేరు అని తెలుసుకోవాలి. ఈ విషయం తెలుసుకున్న తరువాత ఐహిక, ధార్మిక లాభాలు పొందుటకు, కష్టాలు తొలిగిపోవుటకు తన మనస్సులో ఆయనపై మాత్రమే ఆధారపడాలి. తను కోరునది పొందుటకు సంపూర్ణంగా అల్లాహ్ పై ఆధారపడాలి. దానితో పాటు తన శక్తి కొలది కృషి చేయాలి, వాటి సాధనాలను ఉపయోగించాలి.
ఏ మానవుడు, పైన తెలిపిన విషయాన్ని తెలుసుకొని, ఆ ప్రకారంగా అల్లాహ్ పై ఆధారం, నమ్మకం ఉంచుతాడో అతడు ఈ శుభవార్త తెలుసుకోవాలి: అలాంటివారికి అల్లాహ్ యే చాలు. వారి కొరకు అల్లాహ్ చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అల్లాహ్ యేతరులతో సంబంధం, నమ్మకం ఉంచినవాడు, వారిపై ఆధారపడేవాడు ముష్రిక్ అవుతాడు. అతని ఆశలన్నియు వృధా అవుతాయి.
أَفَأَمِنُوا۟ مَكْرَ ٱللَّهِ ۚ فَلَا يَأْمَنُ مَكْرَ ٱللَّهِ إِلَّا ٱلْقَوْمُ ٱلْخَـٰسِرُونَ “ఏమిటీ, ఈ ప్రజలు అల్లాహ్ యుక్తి అంటే నిర్భయంగా ఉన్నారా? వాస్తవానికి నాశనం కాబోయే జాతి మాత్రమే అల్లాహ్ ఎత్తుగడ అంటే నిర్భయంగా ఉంటుంది.” (7: ఆరాఫ్ : 99).
وَمَن يَقْنَطُ مِن رَّحْمَةِ رَبِّهِۦٓ إِلَّا ٱلضَّآلُّونَ “తమ ప్రభువు కారుణ్యం పట్ల, మార్గం తప్పినవారు మాత్రమే నిరాశ పడతారు“. (15: హిజ్ర్ : 56).
ఇబ్ను అబ్బాసు ఉల్లేఖన ప్రకారం, ప్రవక్త ﷺ ను ఘోరమైన పాపాల గురించి ప్రశ్నించబడినప్పుడు ఇలా చెప్పారు:
“అల్లాహ్ తో షిర్క్ చేయుట. (ఇతరులను సాటి కల్పించుట). అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశచెందుట. అల్లాహ్ యుక్తితో నిర్భయంగా ఉండుట“. (తబ్రాని, మజ్మఉ జ్జవాఇద్: 1/104).
ఇబ్ను మస్ ఊద్ చెప్పారు: అతిఘోరమైన పాపాలు ఇవి: అల్లాహ్ తో షిర్క్ చేయుట. అల్లాహ్ యుక్తితో నిర్భయంగా ఉండుట. అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందుట. అల్లాహ్ దయ పట్ల ఆశను వదులుకొనుట“. (ముసన్నఫు అబ్దిర్ రజాఖ్: 10/459. తబ్రాని ఫిల్ కబీర్ : 8783, 8784).
ముఖ్యాంశాలు:
1. సూరె ఆరాఫ్ ఆయతు యొక్క వ్యాఖ్యానం. (అందులో అల్లాహ్ ఎత్తుగడ నుండి నిర్భయంగా ఉండేవారి ప్రస్తావన ఉంది).
2. సూరె హిజ్ర్ ఆయతు యొక్క వ్యాఖ్యానం.
3. అల్లాహ్ ఎత్తుగడ పట్ల నిర్భయంగా ఉండే వారికి కఠిన హెచ్చరిక ఇవ్వబడింది.
4. నిరాశ చెందేవారికి కూడా కఠిన హెచ్చరిక ఇవ్వబడింది.
తాత్పర్యం:
ఈ అధ్యాయం యొక్క ఉద్దేశం: మానవుడు అల్లాహ్ కి భయపడుట, ఆయన పై ఆశ ఉంచుట చాలా ముఖ్యం. తన పాపాలను మరియు అల్లాహ్ న్యాయాన్ని, ఆయన కఠిన శిక్షను చూసి భయపడాలి. అల్లాహ్ యొక్క సామాన్య, ప్రత్యేక దయను, విశాలమైన క్షమాపణ చూసి ఆశించాలి. కొన్ని ఉదాహరణలు: పుణ్య కార్యం చేయుటకు భాగ్యం కలిగితే దాన్ని అల్లాహ్ స్వీకరించాలని ఆశిస్తూ, అందులో ఏదైనా లోపం వలన ఆ పుణ్య కార్యం రద్దు చేయబడుతుందేమోనని భయపడాలి.
ఏదైనా పాపం జరిగిన తరువాత తౌబా చేస్తూ, అది స్వీకరించబడాలని, ఆ పాపం మన్నించబడాలని ఆశిస్తూ, తౌబాలో ఏదైనా కొరత వలన, పాపం వైపున మ్రొగ్గినందుకు శిక్షకు గురి కావలసి వస్తుందేమోనని భయపడాలి. అనుగ్రహం, సౌలభ్యం వరించినప్పుడు అవి రెట్టింపు కావాలని, దీర్ఘకాలం ఉండాలని, దాని కృతజ్ఞత తెలుపుకునే భాగ్యం కలగాలని ఆశించాలి. కృతజ్ఞతలో లోపం వలన అవి నశిస్తాయని భయం చెందాలి.
బాధకరమైన సందర్భాల్లో అవి తొలిగిపోవాలని, సుఖం లభించాలని, వాటి పై సహనం వహిస్తూ అల్లాహ్ దానికి బదులుగా సత్ఫలితం ప్రసాదించాలని ఆశించాలి. సహనం వహించకున్నట్లయితే పుణ్యం వ్యర్థమయి, బాధకరమైన సంఘటనలు సంభవించి ఈ రెండూ ఒకేసారి ఏకమవుతాయేమోనని భయపడాలి.
భయం, ఆశ సంపూర్ణ విశ్వాసికి సర్వ పరిస్థితులలో తోడుగా ఉంటాయి. ఇవి తప్పనిసరి మరియు లాభదాయకమైనవి కూడాను. దీనితోనే సాఫల్యం ప్రాప్తమవుతుంది.
మానవుని పట్ల రెండు దుష్ప్రవర్తనల భయం చాలా ఉంటుంది.
1) భయానికి గురై అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశచెందుతాడు.
2) ఆశలు అధికమై అల్లాహ్ శిక్షను మరచిపోతాడు, ఎత్తుగడ పట్ల నిర్భయంగా ఉంటాడు. ఇలా ఈ రెండింటిలో మితిమీరడం వలన, భయం, ఆశ యొక్క విధిని, తౌహీద్ యొక్క ముఖ్య అంశాన్ని కోల్పోవలసి వస్తుంది.
అల్లాహ్ కారుణ్యం పట్ల రెండు కారణాల వల్ల నిరాశచెందుతారు.
1) మానవుడు తన ఆత్మపై అన్యాయం చేస్తూ, నిషిద్ధ కార్యాలకు పాల్పడి, కావాలని అవి చేస్తూ, వాటిని వదులుకోకుండా ఉంటాడు. అప్పుడు అల్లాహ్ కరుణ పై అతనికి ఆశ ఉండదు. ఎందుకనగా తను ఏ పాపాలకు పాల్పడ్డాడో అవి అతన్ని ఈ స్థితికి గురి చేస్తాయి. ఇక ఇదే అతని గుణంగా, ప్రవర్తనగా మారిపోతుంది. షైతాన్ మానవునితో కోరేది ఇదే. ఈ స్థితికి మానవుడు చేరుకున్నప్పుడు స్వచ్ఛమైన తౌబా చేసి (పశ్చాత్తాప పడి), ఆ స్థితి నుండి బయటికి రావాలి.
2) తాను చేసిన దుష్కార్యాలకు చాలా భయ పడుతూ, ఆ భయంతో అల్లాహ్ కారుణ్యం విశాలమైనదనే విషయాన్ని మరచిపోతాడు, తాను తౌబా చేసినా, అల్లాహ్ వైపునకు మరలినా అల్లాహ్ క్షమించడని తన మూర్ఖత్వం వలన భావిస్తాడు. ఇలా ఆయన కరుణ పట్ల నిరాశ చెందుతాడు. ఈ నిషిద్ధమైన మరియు నష్టానికి గురి చేసే స్థితి, తన ప్రభువు విషయంలో ఉండ వలసిన జ్ఞానం లేక పోవడం. ఏ హక్కులు పాటించాలో తెలుసుకోక పోవడం. మరియు స్వయంగా తన ఆత్మ బలహీనత వలన. అతను అల్లాహ్ ను సరియైన రీతిలో తెలుసుకొని, సోమరితనాన్ని వదలుకుంటే అతని చిన్న ప్రయత్నం వలన అల్లాహ్ యొక్క అనంత కరుణను నోచుకున్నట్లు తప్పక గమనిస్తాడు.
అల్లాహ్ ఎత్తుగడపట్ల నిర్భయంగా ఉండుటకు కూడా వినాశానికి గురి చేసే రెండు కారణాలు గలవు:-
1) మానవుడు ధర్మం పట్ల విముఖత చూపి, అల్లాహ్ గురించి ఏమి తెలుసుకోకుండా, అతనిపై ఆయన ఏ హక్కులు ఉన్నాయో తెలుసుకొనక యుండుట. ఇందు వల్ల అతను ఎల్లప్పుడూ విధియైన విషయాల్లో అశ్రద్ధ చూపుతూ, నిషిద్ధ కార్యాలకు పాల్పడుతాడు. చివరికి అతని హృదయంలో భయం, విశ్వాసమూ లేనట్లవుతుంది. ఎలా అనగా విశ్వాసమున్న వ్యక్తిలో అల్లాహ్ భయం, ఇహపరలోకాల శిక్ష భయం ఉంటుంది.
2) అజ్ఞానుడు ఇబాదత్ (ఆరాధన) చేస్తూ మురిసిపోయి, తను చేసిన కర్మలపై గర్వపడుతాడు. చివరికి భయం లేని వాడవుతాడు. అల్లాహ్ వద్ద అతనికి చాలా గొప్ప స్థానం ఉందని భ్రమ పడతాడు. ఇలా అల్లాహ్ ఎత్తుగడతో నిర్భయుడవుతాడు. తన నీచమైన, బలహీనమైన మనుసుపై నమ్మకం ఉంచుతాడు. అందుకే ఇది తౌహీద్ కు వ్యతిరేకమైనది.
“చెంపలను బాదుకుంటూ, దుస్తులు చించుకుంటూ అజ్ఞాన కాలపు అరుపులు పలుకులు పలికేవాడు మన (సంప్రదాయము అనుసరించే) వాడుకాడు”. (బుఖారి,ముస్లిం).
అనసు (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు:
“అల్లాహ్ ఏ మానవునికి మేలు చేయగోరుతాడో, అతని పాపాలకు బదులు శిక్ష ఇహలోకంలోనే తొందరగా ఇచ్చేస్తాడు. ఏ మానవునికి మేలు చేయగోరడో, అతని పాపాలకు బదులు శిక్షను ప్రళయం వరకు వేచి ఉంచి అక్కడ ఇస్తాడు”. (తిర్మిజి).
మరో సారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
“పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో ప్రతిఫలం కూడా అంతే గొప్పగా ఉంటుంది. అల్లాహ్ ఏ సమాజం, సంఘాన్ని ప్రేమస్తాడో, దానిని పరీక్షకు గురి చేస్తాడు. ఎవరు దానిని సహనంతో (సహిస్తారో), వారిని అల్లాహ్ ఇష్టపడుతాడు.ఎవరు అసహనము చూపుతారో, అల్లాహ్ వారిపై ఆగ్రహస్తాడు”. (తిర్మిజి).
ముఖ్యాంశాలు:
1. తగాబున్ ఆయతు యొక్క భావం.
2. సహనం అల్లాహ్ పై విశ్వాసంలో ఒక భాగం.
3. వంశపరంపర లోని లోపాలను ఎంచుట మంచిది కాదు.
4.చెంపలు బాదుకుంటూ, దుస్తులు చించుకుంటూ, అజ్ఞానకాలపు పలుకులు పలికేవాని గురించి కఠినంగా హెచ్చరించబడింది.
5. అల్లాహ్ మేలు కోరిన వ్యక్తి లక్షణం తెలిసింది.
6. అల్లాహ్ మేలు కోరని వ్యక్తి లక్షణం తెలిసింది.
7. అల్లాహ్ ప్రేమించిన వ్యక్తి చిహ్నం.
8. పరీక్ష ఆపదపై అసంతృప్తి వ్యక్తం చేయుట నిషిద్ధం.
9. వాటిపై సహనం వహించుట వలన పుణ్యం లభిస్తుంది.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ)
ఓపికతో అల్లాహ్ కు విధేయులగుట, పాపం నుండి దూరంగా ఉండి సహనం వహించుట – ఇవి రెండూ విశ్వాసంలో లెక్కించబడుతాయి. అంతే కాదు అవి దాని పునాది. దాని భాగాలే. అల్లాహ్ ప్రేమించేవాటిని, ఆయనకు ఇష్టమున్న, ఆయన సన్నిధిలో చేర్పించేవాటిని ఓపికతో (ఆచరించుట), ఆయన నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండి సహనం వహించుటయే విశ్వాసం.
ఇస్లాం పునాది మూడు సూత్రాల పై ఉంది.
అల్లాహ్ , ఆయన ప్రవక్త తెలిపిన వాటిని సత్యం అని నమ్ముట.
అల్లాహ్ , ఆయన ప్రవక్త ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించుట.
అల్లాహ్ , ఆయన ప్రవక్త నిషేధించినవాటి నుండి దూరంగా ఉండుట.
అల్లాహ్ వ్రాసిన విధివ్రాత బాధాకరమైనప్పటికి దానిపై ఓపిక వహించుట ఇందులోనే వస్తుంది. కాని దాన్ని తెలుసుకొనుట, ఆచరించుట చాలా అవసరం కాబట్టి దానిని ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది.
ఆపద, కష్టం అల్లాహ్ తరఫు నుండియే వస్తుంది అని, అల్లాహ్ దాన్ని నిర్ణయించడంలో సంపూర్ణ వివేచణాపరుడని, దానిని మానవునిపై నిర్ణయించడం కూడా ఆయన సంపూర్ణ వరమేనని తెలుసుకున్న వ్యక్తి అల్లాహ్ వ్రాసిన విధివ్రాతతో సంతోషించి, దాన్ని మనఃపూర్వకంగా ఒప్పుకొని, అసంతృప్తికరమైన వాటిపై అల్లాహ్ సన్నిధానం కోరుతూ, పుణ్యాన్ని ఆశిస్తూ, ఆయన శిక్షతో భయపడుతూ మరియు సత్ప్రవర్తన అవలంబించే సమయం వచ్చిందని భావిస్తూ సహనం వహించాలి. అప్పుడు అతని హృదయానికి తృప్తి శాంతి కలుగుతుంది. అతని విశ్వాసం, ఏకత్వంలో బలం వస్తుంది.
(ప్రవక్తా! ఇలా చెప్పండి: “నేను మీలాంటి మానవమాత్రుణ్ణే, నాకు వహీ ద్వారా ఇలా తెలుపబడింది. ‘మీ ఆరాధనలకు అర్హుడు కేవలం ఒకే ఒక్కడు. కనుక తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి, ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ చేర్చకూడదు”). (కహఫ్ 18:110).
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు,అల్లాహ్ ఇలా తెలిపాడని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు: “నేను ఇతర సహవర్తులకంటే అధికంగా “షిర్క్” కు అతీతుణ్ణి. ఎవరు ఒక పని చేసి, అందులో నాతో ఇతరుల్ని సాటికల్పిస్తారో నేను అతణ్ణీ, అతని ఆ పనిని స్వీకరించను“. (ముస్లిం).
అబూ సఈద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నేను మీకు మసీహుద్దజ్జాల్ కన్నా భయంకరమైన విషయము తెలపనా?” అని ప్రశ్నిస్తే ‘తప్పక తెలుపండని’ మేము విన్నవించుకోగా “గుప్తమైన షిర్క్, అదేమనగా: ఒక వ్యక్తి చూసినవారు నన్ను మెచ్చుకోవాలని అలంకరిస్తూ, ఎన్నలతో నమాజ్ చేస్తాడు”. (అలా స్తుతించబడటానికి, చూచిన వారు మెచ్చుకోవాలనే ఉద్దేశముతో చేయడం గుప్తమెన షిర్క్) అని చెప్పారు. (అహ్మద్,ఇబ్ను మాజ: 4204).
ముఖ్యాంశాలు:
1. సూరయే కహఫ్ ఆయతు యొక్క వ్యాఖ్యానం. (ప్రతి పని సంకల్ప శుద్ది (ఇఖ్లాస్)తో కూడుకొని యుండాలని చెప్పడం జరిగింది).
2. ఒక గొప్ప విషయం: సత్కార్యంలో అల్లాహ్ యేతరుల ఏ కొంచెం ప్రవేశమున్న (ఆ క్రియలో, లేక సంకల్పంలో) అది రద్దు చేయబడుతుంది.
3. అల్లాహ్ సంపూర్ణంగా అతీతుడు కనుక (ప్రదర్శనాబుద్ధితో కలుషితమైన) కార్యాన్ని స్వీకరించడు, (దానికి ఫలితం ప్రసాదించడు).
4. దానికి మరో కారణం ఏమనగా అల్లాహ్ అందరికన్నా ఘనతగలవాడు. (ఆయన్ని వదలి లేక ఆయనతో మరొకరిని సాటి కల్పించడం ఘోరమైన పాపం).
5. ప్రవక్త (సల్లల్లాహు అలైహివసల్లం) తమ అనుచరుల పట్ల ప్రదర్శనా బుద్ధి నుండి భయం చెంది (దాని నుండి దూరముండాలని తాకీదు చేసారు).
6. దాన్ని విశదీకరించి చెప్పారు: నమాజు చేసే వ్యక్తి, చూసేవారు మెచ్చుకోవాలని ఎంతో అందముగా చేసే ప్రయత్నం చేస్తాడు.
తాత్పర్యం:(అల్లామా అల్ సాదీ)
అల్లాహ్ కొరకు నిర్దుష్టమైన భక్తి / ఏకాగ్ర చిత్తం కలిగియుండుట ధర్మం యొక్క పునాది. మరియు అదే తౌహీద్‌కు ప్రాణం. నిర్దుష్టమైన భక్తి / ఏకాగ్రచిత్తం (ఇఖ్లాస్) అంటే మానవుడు తను చేసే ప్రతి పని ఉద్దేశం అల్లాహ్ సంతృప్తి, ఆయన నుండి పుణ్యం, ప్రళయమున సాఫల్యం పొందుట కొరకే ఉండాలి. ఇదే అసలైన తౌహీద్.
దీనికి బద్ద విరుద్ధం ప్రదర్శనాబుద్ధి. చూసినవారు మెచ్చుకోవాలని, పొగడాలని, హోదా, ప్రాపంచిక లాభం పొందుట దాని ఉద్దేశం ఉండకూడదు.
ప్రదర్శనా బుద్ది గురించి కొంచెం వివరంగా తెలుసుకోవాలి:-
ఒక వ్యక్తి ఏదైనా సత్కార్యం చేయునప్పుడు, దాని ఉద్దేశం ప్రజలు చూడాలి అని మనుసులో వచ్చినప్పుడు, ఆ ఆలోచనను దూరం చేయకుండా అలాగే ఉండిపోతే దాని వలన ఆ సత్కార్యం వృథా అవుతుంది (ఫలితం లభించదు). అది చిన్న షిర్క్ అవుతుంది. అలాగే పెద్ద షిర్క్‌కు కారణం అవుతుందను భయం కూడా ఉంటుంది.
సత్కార్యం చేసే ఉద్దేశం అల్లాహ్ సంతృప్తితో పాటు ప్రజలు చూడాలి అని కూడా మనుస్సులో వచ్చినప్పుడు, అతని ఆ సత్కార్యంలో ప్రదర్శనాబుద్ది ప్రవేశించింది కనుక అది కూడా వృథా అవుతుందని నిదర్శనాలున్నాయి. సత్కార్యం చేసే ఉద్దేశం కేవలం అల్లాహ్ సంతృప్తి అయినప్పటికీ, మధ్యలో ప్రదర్శనాబుద్ది ఉద్దేశం ప్రవేశించి, అతను దాన్ని తొలగించి ఏకాగ్రచిత్తం (ఇఖ్లాసు) పాటిస్తే అతనికి ఏలాంటి నష్టం ఉండదు. ఆ దురుద్దేశాన్ని అతను తొలగించకుంటే, ఎంత శాతం ప్రదర్శనాబుద్ధి ఉందో, అంతే ఆ సత్కార్యంలో కొరత ఏర్పడుతుంది.విశ్వాసం, ఇఖ్లాస్లలో బలహీనత వస్తుంది.
ప్రదర్శనాబుద్ధి మహాగండం. దానికి చికిత్స చాలా అవసరం. మనసుకు ఇఖ్లాసు యొక్క మంచి శిక్షణ ఇవ్వాలి. ప్రదర్శనాబుద్ధిని, నష్టం కలిగించే మనోవాంఛల్ని తొలగించుటకు తగిన ప్రయత్నం చేయాలి. అందుకు అల్లాహ్ సహాయం కోరాలి. అల్లాహ్ తన దయ మరియు కరుణతో ఇఖ్లాస్ భాగ్యం ప్రసాదించి, తౌహీద్ వాస్తవికత యొక్క జ్ఞానం కలిగిస్తాడు.
ప్రాపంచిక లాభం, మనోవాంఛల కొరకు సత్కార్యం చేయుట:
అల్లాహ్ సంతృప్తి ఉద్దేశం ఏ మాత్రం లేకుండా, కేవలం పై ఉద్దేశమే ఉంటే, అతనికి దానికి బదులు ఏ లాభమూ ఉండదు. ఇలా ఒక విశ్వాసి ప్రవర్తించుట సమంజసం కాదు. విశ్వాసి అతని విశ్వాసం ఎంత బలహీనంగా ఉన్నప్పటికి అతను అల్లాహ్ సంతృప్తి, పరలోక లాభం కోరుటయే చాలా అవసరం.
ఎవరు అల్లాహ్ సంతృప్తి, ప్రాపంచిక లాభం రెండు ఉద్దేశాలతో చేసినప్పుడు, రెండు ఉద్దేశాలు ఒకే పరిమాణంలో ఉంటే, అతను విశ్వాసి అయి ఉంటే, వాస్తవానికి అతని విశ్వాసంలో, ఇఖ్లాస్లో కొరత ఉన్నట్లే. ఇఖ్లాసులో కొరత ఉన్నప్పుడు అతని కార్యం కూడా సంపూర్ణం కాదు. (ఫలితం సంపూర్ణంగా ఉండదు).
ఎవరు కేవలం అల్లాహ్ సంతృప్తి కొరకు, సంపూర్ణ ఇఖ్లాస్ తో చేస్తారో, కాని అతను దానిపై వేతనము లేక బహుమానము పొందుతాడు. దానితో అతను తన పని, ధర్మంలో సహాయం తీసుకుంటాడు. ఉదా: ఎవరైనా ఒకమంచి పని, పుణ్యకార్యం చేసినందుకు ఏదైనా బత్తెం దొరికినట్టు. ముజాహిద్ జిహాద్ చేయుటకు వెళ్ళినప్పుడు యుద్ధఫలం (గనీమత్)పొందినట్లు. మస్జిద్, మద్‌రసా మరియు ధర్మకార్యాలు నిర్వహించే వారికి వక్ఫ్ బోర్డు ఇచ్చే వేతనాలు. ఇలాంటివి తీసుకొనుట వలన విశ్వాసం, తౌహీద్‌లో ఏలాంటి కొరత, నష్టం వాటిల్లదు.ఎందుకనగా అతని ఆ సత్కార్యం చేయు ఉద్దేశం ఉంటుంది. అతను పొందునది అతలధర్మం పై నిలకడ కొరకు సహాయము చేయును. అందుకే జకాత్ మరియు మాలె పై (యుధ్ధ ఫలం లాంటిది) లాంటి ధనంలో, ధార్మిక మరియు లాభదాయకమైన ప్రాపంచిక కార్యాలు నిర్వహించువారికి హక్కు ఉంది.
“ఎవరైతే కేవలం ఈ ప్రాపంచిక జీవితాన్ని, దాని ఆకర్షణాలనూ కోరుకునే వారు చేసిన పనులకు పూర్తి ప్రతి ఫలాన్ని మేము వారికి ఇక్కడనే ఇచ్చేస్తాము. ఇందులో వారికి లోటు చెయ్యటం అంటూ జరగదు. అయితే పరలోకంలో అటువంటి వారికి అగ్ని తప్ప మరేమి ఉండదు. (అక్కడ తెలిసిపోతుంది) వారు ప్రపంచంలో చేసినదంతా మట్టిలో కలసి పోయింది అనీ, వారు చేసినదంతా కేవలం మిథ్య అనీ“. (11: హూద్ : 15, 16).
ప్రవక్త ﷺ ఉపదేశించారని, అబూ హురైరా ఉల్లేఖించారు:
“దీనార్, దిర్హం, మంచి దుప్పట్ల దాసుడు నాశనమయ్యాడు. అవి దొరికితే అతడు సంతొషిస్తాడు, లేనిచో అసంతృప్తికి లోనవుతాడు. అతను నాశనమవుగాకా, నష్టంలో పడుగాకా!. అతనికి ముళ్ళు గుచ్చుకున్నా తీయరాకుండా అవుగాకా. గుఱ్ఱం కళ్ళెం పట్టుకొని అల్లాహ్ మార్గంలో (జిహాద్ లో) నిలబడిన వ్యక్తికి శుభవార్త! అతని తలవెట్రుకలు చిందరవందరై ఉన్నాయి. అతని పాదాలకు దుమ్ము ధూళి పట్టి ఉంది. అతడిని ప్రహరితిరుగుటకు నియమిస్తే దానిపైనే ఉంటాడు. సైన్యం వెనక ఉంచుతే అక్కడే ఉంటాడు. అనుమతి కోరితే అతనికి అనుమతి లభించదు. సిఫారసు చేస్తే అది స్వీకరించబడదు“. (బుఖారీ: 6435).
ముఖ్యాంశాలు:
1. ప్రళయమున లాభాన్నిచ్చే కార్యం చేస్తూ ప్రపంచాన్ని కూడా పొందాలని ఉద్దేశించుట (షిర్క్ వస్తుంది).
2. సూరె హూద్ ఆయతు యొక్క వ్యాఖ్యానం
3. (ప్రాపంచిక లాభంకోరు) ముస్లింను “దీనార్, దిర్హం, మంచి చాదర్లు, దుప్పట్ల దాసుడు” అని పిలవడం జరిగింది.
4. దాని వివరణ ఏమనగ అతనికి అది దొరికితే సంతొషిస్తాడు, దొరుకనిచో అసంతృప్తికి లోనవుతాడు.
5. అలాంటి వ్యక్తికి వినాశం ఉంది అని చెప్పబడింది.
6. అలాగే అతని ముళ్ళు గుచ్చుకున్నా తీయరాకుండా అవుగాకా అని శపించబడింది.
7. పై హదీసులో తెలుపబడిన గుణాలు ఉన్న ముజాహిద్ (ధర్మ యుద్ధవీరున్ని) ప్రశంసించడమైనది.
“సమీప కాలంలో మీపై ఆకాశం నుండి రాళ్ళ వర్షం కురుస్తుంది. ఎందుకనగా ప్రవక్త ఇలా చెప్పారు అని నేనంటుంటే, కాదు అబూ బకర్ మరియు ఉమర్ ఇలా చెప్పారు అని మీరు అంటున్నారు“. (అహ్మద్).
ఇమాం అహ్మద్ చెప్పారు:
సనద్ మరియు దాని సత్యతను తెలుసుకొని కూడా హదీసును వదలివేసి సుఫ్యాన్ (ఇస్లామీయ పండితులు) అభిప్రాయాన్ని తీసుకునేవారిని చూసి ఆశ్చర్యం ఏర్పడుతుంది. ఎందుకంటే అల్లాహ్ చెప్పాడు:
فَلْيَحْذَرِ ٱلَّذِينَ يُخَالِفُونَ عَنْ أَمْرِهِۦٓ أَن تُصِيبَهُمْ فِتْنَةٌ أَوْ يُصِيبَهُمْ عَذَابٌ أَلِيمٌ “దైవప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించేవారు, తాము ఏదైనా ఉపద్రవంలో చిక్కుకుపోతామేమో అనీ, తమ పై బాధాకరమైన శిక్ష ఏదైనా అవతరిస్తుందేమో అని భయపడాలి“. (24: నూర్ : 63). ఉపద్రవం అంటేమిటో తెలియునా? ఉపద్రవం అంటే షిర్క్. ఎవరైనా ప్రవక్త మాటను తిరస్కరిస్తే అతని హృదయములో వక్రత్వం చోటు చేసుకుంటుంది. అతను నాశనమవుతాడు.
అదీ బిన్ హాతిం ఉల్లేఖించారు, ప్రవక్త వారు “అల్లాహ్ ను కాదని తమ విద్వాంసులను, తమ సన్యాసులను, తమ ప్రభువులుగా చేసుకున్నారు“. (9: తౌబా: 31) అన్న ఖుర్ఆన్ వాక్యం చదవగా, ఆయన విని, ‘ప్రవక్తా! మేము వారిని పూజించలేదు కదా?’ అని ప్రశ్నించారు. “అల్లాహ్ హరాం చేసిన దానిని వారు హలాల్ చేస్తే మీరు కూడా దాన్ని హలాల్ అని నమ్మలేదా?, హలాల్ చేసిన దానిని వారు హరాం చేస్తే మీరు కూడా దాన్ని హరాం అల్లాహ్ అని నమ్మలేదా?” అని అడిగారు ప్రవక్త . ‘అవును’ అని అతనన్నాడు. చెప్పారు: “అదే వారి ఆరాధన”. (అహ్మద్, తిర్మిజి. అప్పుడు ప్రవక్త హదీసు “హసన్” స్థానములో ఉందని ఇమాం తిర్మిజి చెప్పారు).
ముఖ్యాంశాలు:
1. సూరె నూర్ ఆయత్ యొక్క వ్యాఖ్యానం.
2. సూరె తౌబా ఆయత్ యొక్క వ్యాఖ్యానం. (సంభాషణ ఆరంభంలో)
3. ఆరాధన యొక్క ఏ భావాన్ని అదీ తిరస్కరించారో దానిని గమనించాలి. (అది చాలా ముఖ్యం).
4. ఇబ్ను అబ్బాసు అబూ బకర్ మరియు ఉమర్ ల పేరు తీసుకొని, అలాగే ఇమాం అహ్మద్, సుఫ్యాన్ పేరు తీసుకొని చెప్పేదేమిటంటే ప్రవక్త ఆదేశం వచ్చిన తరువాత ఇతరుల మాట వినకూడదు.
5. ఈ రోజుల్లో పరిస్థితులు చాలా మారాయి. అనేక మంది సన్యాసులను ఆరాధించుటయే ఉత్తమమైన కర్మగా భావించి, దానికి “విలాయత్” అని నామకరణము చేస్తున్నారు. విద్యజ్ఞానాల పేరుతో విద్వాంసులు ఆరాధించబడుతున్నారు. పరిస్థితి మరింత భయంకరంగా మారి: ఎవరు పుణ్యపురుషుల్లో లెక్కించబడరో, అల్లాహ్ ను వదలి వారి ఆరాధన కూడా జరుగుతుంది. మరో విధంగా చెప్పాలంటే మూర్ఖుల పూజ జరుగుతుంది.
తాత్పర్యం:
రచయిత రహిమహుల్లాహ్ ఈ అధ్యాయాన్ని ఇందులో చేర్చడానికి కారణం స్పష్టంగా ఉంది. పోషకుడు, ఆరాధ్యుడు అయిన అల్లాహ్ కే ఖద్ రీ (స్వాభావిక), షర్ యీ (ధార్మిక) మరియు జజాఈ ఆదేశం (Criminal law) ఇచ్చే హక్కు ఉంది. కేవలం ఆయన ఆరాధనే జరగాలి. ఆయనతో మరొకరిని సాటి కల్పించరాదు. ఎల్లవేళల్లో ఆయన విధేయతయే పాఠించాలి. ఆయన అవిధేయతకు గురి కాకూడదు. ఆయన తప్ప (ఆయన ఆదేశించిన) ఇతురుల విధేయత ఆయన విధేయతకు అనుగుణంగా ఉండాలి. (ఒక వేళ ఈ విధంగా) విద్వాంసుల / పండితుల, అధికారుల విధేయత పాటిస్తే, ఇంకా అల్లాహ్ ఆయన ప్రవక్త విధేయతను వారి విధేయతకు అనుగుణంగా చేస్తే వాస్తవంగా అతను అల్లాహ్ ను కాదని వారిని “రబ్” చేసుకున్నవాడు, వారి పూజ చేయువాడు, వారితో తీర్పులు కోరినవాడు, వారి తీర్పును, అల్లాహ్ ఆయన ప్రవక్త తీర్పుపై ప్రాధాన్యత ఇచ్చినవాడవుతాడు. నిస్సందేహంగా ఇదే అవిశ్వాసం (కువ్). ఎలాగైతే ఆరాధనకు అల్లాహ్ అర్హుడో అలాగే ఆదేశం, తీర్పు కూడా ఆయనదే చెల్లును.
ప్రతి వ్యక్తిపై విధిగా ఉన్న విషయం ఏమనగా: ఏ ఒకరు కూడా అల్లాహ్ ను తప్ప ఇతరులను తీర్పు ఇచ్చేవానిగా (అల్లాహ్ ప్రవక్త ఆజ్ఞకు వ్యెతిరేకంగా తమ ఆజ్ఞను చెలాయించే వానిగా) నిర్ణయించుకోకూడదు. ప్రజల మధ్య ఏ సమస్యలోనైనా వివాదం తలెత్తితే (దాని తీర్పునకు) అల్లాహ్ (అంటే: ఖుర్ ఆన్ గ్రంథం) ఆయన ప్రవక్త (అంటే: సహీ హదీసుల) వైపు దాన్ని నివేదించాలి. ఈ విధంగా మానవుడు అల్లాహ్ ధర్మాన్ని అవలంబించినవాడు, ఆయన సంతృప్తి కొరకే ఏకాగ్రచిత్తంతో తౌహీద్ ను పాటించినవాడవుతాడు. అల్లాహ్ ఆయన ప్రవక్త (ఖుర్ఆన్, హదీసు)ను వదలి ఇతరులతో తీర్పు కోరేవాడు వాస్తవంగా “తాగూత్”తో తీర్పు కోరినవాడవుతాడు. ఇలా చేస్తూ తనకు తాను విశ్వాసి అని భావించినా అది అతని భ్రమ. అతడు అసత్యవాది.
ఇస్లాం ధర్మంలోని ప్రధానాంశాలు, దాని శాఖలన్నిట్లో అల్లాహ్, ఆయన ప్రవక్త తీర్పుకు ప్రాధాన్యత ఇవ్వనంత వరకు, (దాన్ని స్వీకరించనంత వరకు) ఏ వ్యక్తీ సరియైన, సంపూర్ణ విశ్వాసి కాజాలడు.
ప్రవక్తా! “నీ వద్దకు పంపబడిన గ్రంథాన్ని, నీకు పూర్వం పంపబడిన గ్రంథాలను మేము విశ్వసించాము” అని ప్రకటన అయితే చేసి, (తమ వ్యవహారాల) పరిష్కారం కొరకు ‘తాగూత్’ వద్దకు పోవాలని కోరేవారిని నీవు చూడలేదా? వాస్తవానికి ‘తాగూత్’ ను తిరస్కరించండి అని వారిని ఆదేశించటం జరిగింది. షైతాన్ వారిని పెడత్రోవ పట్టించి సన్మార్గానికి బహుదూరంగా తీసుకుపోవాలని చూస్తాడు. (4: నిసా: 60).
وَإِذَا قِيلَ لَهُمْ لَا تُفْسِدُوا۟ فِى ٱلْأَرْضِ قَالُوٓا۟ إِنَّمَا نَحْنُ مُصْلِحُونَ “భూమిపై కల్లోలాన్ని రేకిత్తించకండి” అని వారితో అన్నప్పుడల్లా వారు “మేము సంస్కర్తలము మాత్రమే” అని అంటారు. జాగ్రత్త! వాస్తవంగా వారే అసలు కల్లోలాన్ని సృష్టించేవారు. కాని వారు గ్రహించటం లేదు. (2: బఖర: 11).
وَلَا تُفْسِدُوا۟ فِى ٱلْأَرْضِ بَعْدَ إِصْلَـٰحِهَا “ధరణి సంస్కరణ జరిగిన తరువాత, దానిపై సంక్షోభాన్ని సృష్టించకండి“. (7: ఆరాఫ్: 56).
أَفَحُكْمَ ٱلْجَـٰهِلِيَّةِ يَبْغُونَ ۚ وَمَنْ أَحْسَنُ مِنَ ٱللَّهِ حُكْمًۭا لِّقَوْمٍۢ يُوقِنُونَ “(వారు అల్లాహ్ శాసనానికి విముఖులై) అజ్ఞానపు (జాహిలియ్యత్) తీర్పు కావాలని కోరుకుంటున్నారా?“. (5: మాఇద: 50).
అబ్దుల్లా బిన్ ఉమర్ ఉల్లేఖించారు. ప్రవక్త ﷺ ఉపదేశించారు: ” నేను తీసుకొని వచ్చిన ధర్మ సూత్రములకు మీ మనోవాంఛలు కట్టుబడి ఉండనంత వరకు మీలో ఎవరూ విశ్వాసులు కాజాలరు“. (ఇది సహీ హదీసు, మేము దీనిని సహీ సనద్ తో ‘కితాబుల్ హుజ్జు’లో ఉల్లేఖించాము అని ఇమాం నవవి రపామహుల్లాహ్ చెప్పారు).
షఅబి ఇలా పేర్కొన్నారు: కపట విశ్వాసి మరియు యూదుని మధ్య వివాదం జరిగింది. ముహమ్మద్ ప్రవక్త ﷺ లంచము తీసుకోరని యూదునికి తెలిసి, ఆయన వద్దకు (తీర్పు కొరకు) వెళ్తామని అతనన్నాడు. యూదులు లంచము తీసుకుంటారు అని కపట విశ్వాసికి తెలుసు గనుక, యూదుల వద్దకు వెళ్లామని అతనన్నాడు. చివరికి జుహైనా వంశానికి చెందిన ఒక జ్యోతిష్యుని వద్దకు వెళ్తామని ఇద్దరు ఒప్పుకున్నారు. అప్పుడే పై వాక్యం (4: నిసా: 60) అవతరించింది.
(పై వాక్యం అవతరణకు మరో కథనం కూడా ఉంది): ఇద్దరు జగడము చేసుకొని ఒకడన్నాడు – “ప్రవక్త ముహమ్మద్ వద్దకు వెళ్తాము”, మరొకడన్నాడు కఅబ్ బిన్ అష్రఫ్ (యూదుని) వద్దకు వెళ్లామని. చివరికి ప్రవక్త ﷺ వద్దకు వచ్చి అక్కడ తీర్పు అయిన తరువాత, వారిద్దరిలో ఒకడు ఆ తీర్పును అంగీకరించక ఉమర్ వద్దకు వచ్చారు. (ఎవరి వైపు తీర్పు అయినచో) అతను పూర్తి వివరాన్ని ఉమర్ ముందు పెట్టాడు. ప్రవక్త తీర్పును వ్యెతిరేకించిన వాడిని ఇది నిజమేనా? అని అడిగారు ఉమర్ . ‘ఔను’ అన్నాడతను. అప్పుడు ఉమర్ ఖడ్గముతో అతన్ని (ప్రవక్త ﷺ తీర్పును తిరస్కరించిన వాన్ని) హతమార్చారు.
ముఖ్యాంశాలు:
1. సూరె నిసా ఆయతు యొక్క భావం తెలిసింది. ‘తాగూత్’ యొక్క భావం కూడా తెలిసింది.
2. సూరె బఖరలోని వాక్యం యొక్క భావం కూడా తెలిసింది. (అల్లాహ్ అవతరింపజేయని దానితో తీర్పు కోరడం మహా ఉపద్రవం అని తెలుస్తుంది).
3. సూరె ఆరాఫ్ వాక్యం యొక్క వ్యాఖ్యానం.
4. సూరె మాఇద వాక్యం యొక్క వ్యాఖ్యానం.
5. మొదటి వాక్యం యొక్క వ్యాఖ్యానంలో షఅబి చెప్పిన విషయం అర్థమయింది.
6. సత్యవిశ్వాసం, అసత్య విశ్వాసం యొక్క తేడా తెలిసింది
7. ఉమర్ (ప్రవక్త మాటను వినని) వంచకునితో ఎలా వ్యవహరించారో తెలిసింది.
8. ప్రవక్త ﷺ తీసుకువచ్చిన ధర్మాన్ని తమ మనోవాంఛలు అనుసరించనంత వరకు ఏ వ్యక్తీ విశ్వాసి కాలేడు.
هُمْ يَكْفُرُونَ بِٱلرَّحْمَـٰنِ “వారు రహ్మాన్ ను తిరస్కరిస్తున్నారు“. (13: రఅద్: 30).
బుఖారిలో ఉంది. అలీ ఇలా చెప్పారు: “ప్రజలు అర్థం చేసుకోగల విషయాలే వారికి తెలుపండి. (ఊహజ్ఞానానికి అందని విషయం తెలిపి) అల్లాహ్ ఆయన ప్రవక్త తిరస్కరించబడాలని మీరు కోరుతున్నారా?“.
అబ్దుర్ రజాఖ్, మఅ మర్ తో, ఆయన ఇబ్ను తావూసుతో ఆయన ఇబ్ను అబ్బాసుతో ఉల్లేఖించారు: అల్లాహ్ గుణమునకు సంబంధించిన ఒక హదీసు విని అసహ్యంతో వణుకుతున్న ఒక వ్యక్తిని ఇబ్ను అబ్బాసు చూసి, ఇలా అన్నారు: “అదేమిటి? వీరి భయం, వణుకుట చాలా విచిత్రంగా ఉంది. అల్లాహ్ యొక్క “ముహ్ కమ్” వాక్యాలు విని అంగీకరిస్తారు. “ముతషాబహ్” వాక్యాలు విని (స్వీకరించక) నాశనమవుతారు“.
ప్రవక్త ﷺ రహ్మాన్ విషయం ఖురైషు సంఘము ముందు ప్రస్తావించినప్పుడు వారు తిరస్కరించారు. అప్పుడే అల్లాహ్, పై (13: రఅద్: 30) వాక్యం అవతరింపజేసాడు.
ముఖ్యాంశాలు:
1. అల్లాహ్ నామములను, గుణవిశేషణాలను తిరస్కరించువానిలో ఏ మాత్రం విశ్వాసం ఉండదు.
2. సూరె రఅద్ ఆయతు యొక్క వ్యాఖ్యానం.
3. శ్రోతలకు అర్థం కాని విషయాలు చెప్పకపోవడం మంచిది.
4. ఎందుకనగా, అందువలన అల్లాహ్ ఆయన ప్రవక్తను ఉద్దేశపూర్వకంగా కాకపోయినా అతను తిరస్కరిస్తాడేమో.
5. ఇబ్ను అబ్బాసు ఈ అభిప్రాయము కూడా తెలిసింది: ఎవరు అల్లాహ్ యొక్క గుణవిశేషణాలను తిరస్కరిస్తారో వారు నాశనమవుతారు.
తాత్పర్యం:
అందువలన అల్లాహ్ ను , ఆయన శుభనామములను మరియు గుణవిశేషణాలను విశ్వసించుట విశ్వాసానికి మూలం వంటిది. వాటి పట్ల మానవుని జ్ఞానం మరియు విశ్వాసం ఎంత వృద్ధి చెందునో, అతను అల్లాహ్ ఇబాదత్ లో ఎంత నిమగ్నుడగునో అంతే అతని తౌహీద్ కూడా వృద్ధి చెందును. సంపూర్ణ గుణాలు, మహోన్నతుడు, ఘననీయుడు అల్లాహ్ మాత్రమేనని తెలుసుకున్నవాడు, ఆయనే అసలైన ఆరాధ్యుడు, ఆయన తప్ప ఇతరులు తుచ్ఛము అని తెలుసుకొనుట తప్పనిసరి. అల్లాహ్ నామములు, గుణాల్లో ఏ ఒక్క దాన్ని తిరస్కరించినా అతడు తౌహీదు వ్యెతిరేకమైన దాన్ని నమ్మినవాడవుతాడు. ఇది అవిశ్వాస భాగాల్లో ఒకటి.
يَعْرِفُونَ نِعْمَتَ ٱللَّهِ ثُمَّ يُنكِرُونَهَا وَأَكْثَرُهُمُ ٱلْكَـٰفِرُونَ “వారు అల్లాహ్ ఉపకారాన్ని గుర్తిస్తారు. అయినా దాన్ని తిరస్కరిస్తారు”. (16:నహ్ల్ : 83).
పై ఆయుతు యొక్క వ్యాఖ్యానం ఇమాం ముజాహిద్ రహిమహుల్లాహ్ ఇలా తెలిపారు: “నేను నా తాతల నుండి పొందిన ఆస్తి. ఇది నా సొమ్ము” అని మనిషి చెప్పుకొనుట.
ఔన్ బిన్ అబ్దుల్లాహ్ చెప్పారు: “ఫలాన వ్యక్తి లేకుంటే ఇది నాకు లభించేది కాదు“. ఇబ్ను ఖుతైబ చెప్పారు: “ఇది మా దేవతల సిఫారసుతో దొరికినది” అని అనుట.
జైద్ బిన్ ఖాలిద్ ఉల్లేఖించిన హదీసు “నా దాసుల్లో కొందరు నన్ను విశ్వసించినవారు, మరి కొందరు నన్ను తిరస్కరించినవారున్నారు” (ఈ హదీసు 30వ అధ్యాయంలో గడిసింది). ఈ హదీసు వాఖ్యానంలో అబుల్ అబ్బాస్ (ఇబ్ను తైమియ) తెలిపారు:
“ఇలా అలాహ్ వరాలను అల్లాహ్ యేతరుల పేరున అంకితం చేసేవారిని, అల్లాహ్ కి సాటి కల్పించేవారిని అల్లాహ్ ఖుర్ ఆన్, హదీసులో అనేక చోట్ల అసహ్యించుకున్నట్లు తెలిపాడు.”
ఈ మాటను వివరిస్తూ కొందరు పండితులు చెప్పారు: “గాలి మంచిగా ఉంది. నావికుడు తెలివైనవాడు ఉన్నాడు” లాంటి పదాలు అనేక మంది అంటుంటారు. (ఇలా వారు అల్లాహ్ వరాల్ని తిరస్కరించి, వాటిని ప్రశంసిస్తారు).
ముఖ్యాంశాలు:
1. ఉపకారాన్ని గుర్తిస్తారు, మళ్ళి తిరస్కరిస్తారు అన్న దాని గురించి వివరించబడింది. 2. ఈ విధంగా ప్రజలు చాలా అంటుంటారు అని తెలిసింది. 3. ఈ విధంగా మాట్లాడటం వలన అల్లాహ్ ఉపకారాన్ని తిరస్కరించి నట్లగును. 4. ఒకే హృదయంలో (అల్లాహ్ వరాలను గుర్తించి, తిరస్కరించు వంటి) రెండు గుణాలు ఉంటాయి అని తెలిసింది.
తాత్పర్యం:
అన్ని రకాల ఉపకారాలు అల్లాహ్ యే చేయువాడు అని మనసా వాచా నమ్ముట సర్వ మానవులపై విధిగా ఉంది. దీనితోనే తౌహీద్ సంపూర్ణమవుతుంది. (ఈ విషయము ముందు వచ్చేసింది). అల్లాహ్ వరాలను మనసా వాచా తిరస్కరించువాడు అవిశ్వాసి అవుతాడు.
అవి అల్లాహ్ వైపు నుండి అని హృదయపూర్వకంగా విశ్వసించి, నోటితో ఒకప్పుడు అల్లాహ్ తరఫున అని విశ్వసించి, మరొకప్పుడు తన తరఫున లేక తన వృత్తి వలన లేక తన కష్టం వలన అని అనుట. ఇలాంటి గుణం ఈ రోజుల్లో ప్రజల్లో చెలామణి ఉంది. ఇలాంటివారు వెంటనే (పశ్చాత్తాపపడి) తౌబా చేయాలి. అన్ని విషయాలను అల్లాహ్ వైపునకే అంకితం చేయాలి. ఈ విధంగానే విశ్వాసం సంపూర్ణం అవుతుంది.
విశ్వాసానికి మూలమైన కృతజ్ఞత యొక్క మూడు స్థంబాలున్నవి:-
1- అతని పై మరియు ఇతరులపై ఉన్న అనుగ్రహాలు, సుఖసంతోషాలు అల్లాహ్ తరఫున అని హృదయపుర్వకంగా నమ్మాలి. 2- దాన్ని బహిర్గతం చేయాలి. అల్లాహ్ కు ప్రశంసలు, కృతజ్ఞత తెలుపాలి. 3- ఉపకారుని (అల్లాహ్) విధేయతలో, అతనిని ప్రార్థనలో వాటిని సహాయంగా తీసుకోవాలి.
فَلَا تَجْعَلُوا۟ لِلَّهِ أَندَادًۭا وَأَنتُمْ تَعْلَمُونَ “మీరు తెలిసికూడా ఇతరులను అల్లాహ్ కు సాటి కల్పించకండి” (2: బఖర: 22).
పై ఆయతులో “అన్ దాద్” అంటే షిర్క్ (అల్లాకు ఇతరులను సాటి కల్పించడం). అది (షిర్క్) కారు చీకటిలో నల్లటి రాతి బండపై నడిచే చీమ కన్నా మరీ గుప్తమైనది. ఇంకా ఇలాంటి పదాలు పలికినా అది షిర్క్ లో వస్తుంది:
“అల్లాహ్ ప్రమాణంగా మరియు నీ జీవన ప్రమాణంగా“. “ఓ వ్యక్తి! నా ప్రాణం సాక్షి“. “ఈ కుక్క లేకుంటే దొంగలు పడేవారు“. “ఇంట్లో ఈ బాతు లేకుంటే దొంగలు (ఇంటిని) దోచుకునేవారు“. “అల్లాహ్ కోరునది మరియు నీవు కోరునది (అగును)“. “అల్లాహ్ మరియు ఫలాన వ్యక్తి లేకుంటే...”
లాంటి మాటలు పలుకరాదు. ఇవన్నియు అల్లాహ్ తో సాటి కల్పించినట్లగును”. ఇది ఇబ్ను అబ్బాస్ వాఖ్యానం. (దీనిని ఇబ్ను అబీ హాతిం ఉల్లేఖించారు).
ప్రవక్త ప్రవచించారని, ఉమర్ ఉల్లేఖించారు:
“అల్లాహ్ యేతరుల ప్రమాణం చేసేవాడు “కుఫ్ర్” చేసినవాడు లేక “షిర్క్” చేసినవాడవుతాడు”. (తిర్మిజి).
ఇబ్ను మసూద్ ఇలా చెప్పారు:
“సత్య విషయంలో అల్లాహ్ యేతరుల ప్రమాణం కంటే అసత్య విషయం పై అల్లాహ్ ప్రమాణం చేయుట నాకు ఇష్టం“. (తబ్రాని).
ప్రవక్త ఉపదేశించారని, హుజైఫా ఉల్లేఖించారు:
“అల్లాహ్ మరియు ఫలానా కోరినట్లు అగును” అని చెప్పకండి. “అల్లాహ్ కోరినట్లు అగును. ఆ తరువాత ఫలానా కోరినట్లు అగును” అని పలుకకండి”. (అబూ దావూద్).
“అల్లాహ్ మరియు నీ శరణు కోరుచున్నాను” అని అనుటను ఇబ్రాహీం నఖఇ (ఇస్లామీయ పండితులు) ఇష్టపడేవారు కాదు. “అల్లాహ్ శరణు కోరుచున్నాను. మళ్ళీ ఫలాన వ్యక్తి శరణు” అనుట మంచిదే. “అల్లాహ్ లేకుంటే, మళ్ళీ ఆయన లేకుంటే” అనవచ్చును. కాని “అల్లాహ్ మరియు ఆయన లేకుంటే అనకూడదు“.
ముఖ్యాంశములు:
1- సూరె బఖరలోని “అన్ దాద్” యొక్క వ్యాఖ్యానం తెలిసింది.
2- షిర్క్ అక్బర్ గురించి అవతరించిన ఆయతు సంబధం షిర్క్ అస్గర్ తో ఉందని వ్యాఖ్యానించేవారు.
3- అల్లాహ్ యేతరుల ప్రమాణం చేయుట షిర్క్
4- సత్యమైన విషయంలో అల్లాహ్ యేతరుల ప్రమాణం చేయుట “యమీనె గమూసు” (అల్లాహ్ నామంతో చేసే అబద్ధపు ప్రమాణం) కంటే మహా పాపమైనది.
5– “మరియు”, “మళ్ళీ” పదాల్లో ఉన్న వ్యత్యాసం తెలిసింది.
తాత్పర్యం:
31వ అధ్యాయంలో అల్లాహ్ ఆదేశం “కొందరు అల్లాహ్ ను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా, ప్రత్యర్థులుగా భావిస్తారు. వారు అల్లాహ్ పట్ల కలిగి వుండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు“. ను ప్రస్తావించిన ఉద్దేశం ప్రార్థన, ప్రేమ, భయం మరియు ఆశ తదితర ప్రార్థనల్లో గల షిర్క్ అక్బర్ గురించి తెలుపడం జరిగింది.
అయితే ఈ అధ్యాయంలో అల్లాహ్ యేతరుల ప్రమాణం లాంటి వాజ్మూలిక షిర్క్, “అల్లాహ్ మరియు ఫలాన లేకుంటే…”, “ఇది అల్లాహ్ తరఫున మరియు నీ తరఫున”, “కాపాలాదారుడు లేకుంటే దొంగలు పడేవారు”, ఫలానా ఔషధము లేకుంటే నేను చనిపోయేవాడిని”, “ఫలాన సంపదలో ఫలాన అనుభవం, నైపుణ్యం లేకుంటే ఈ లాభం లభించేది కాదు” లాంటి మానవులను, అల్లాహ్ ను ఒకే స్థానంలో ఉంచే షిర్క్ అస్గర్ కు సంబంధించిన పదాలు తౌహీద్ కు వ్యెతిరేకమైనవి. సర్వ కార్యాల సంబంధం, అవి సంభవించుట మరియు సర్వ సాధనాల, కారణాల లాభం అల్లాహ్ తరఫునుండే, ఆయన తలచినప్పుడే జరుగును అని విశ్వసించుట తప్పనిసరి. ఆ తరువాత అవి ఏ కారణాల వల్ల సంభవించినవో వాటిని, వాటి లాభాల్ని ప్రస్తావించవచ్చును. ఇలా అనాలి: “అల్లాహ్ లేకుంటే, మళ్ళీ……. (కాని “మరియు” అనకూడదు). ఇలా ఎందుకనగా సర్వ కారణాలు సయితం అల్లాహ్ వ్రాసిన విధి ప్రకారం సంభవించును.
అల్లాహ్ నామ ప్రమాణంతో తృప్తి చెందని వ్యక్తి గురించి ఆదేశం ప్రవక్త ప్రవచించారని, ఇబ్ను ఉమర్ ఉల్లేఖించారు:
“మీరు మీ తాత ముత్తాతల నామములతో ప్రమాణాలు చేయకండి. అలాహ్ నామం ప్రమాణం చేయువాడు సత్యంపలకాలి. ఎవరి కొరకు అల్లాహ్ పేరున ప్రమాణం చేయబడిందో, అతను దాన్ని ఒప్పుకోవాలి. అతను దాన్ని ఒప్పుకొనక పోతే అల్లాహ్ తో అతనికి సంబంధం ఉండదు”. (ఇబ్ను మాజ)
ముఖ్యాంశాలు:
1- తాతముత్తాతల పేరున ప్రమాణం చేయుట నివారించబడింది. 2- ఎవరి ఎదుట (కోసం) అల్లాహ్ పేరున ప్రమాణం చేయబడిందో అతను దాన్ని ఒప్పుకోవాలి. 3- ఒప్పుకొననివారికి హెచ్చరించడమైనది.
తాత్పర్యం:
నీ ఎదుటివాడు సత్యవంతుడు, న్యాయశీలుడు మరియు మంచివాడు అని తెలిస్తే, అతను నీతో ఒక విషయంలో అల్లాహ్ పై ప్రమాణం చేస్తే నీవు తప్పక నమ్మాలి. ఎందుకనగా అతని సత్యతను తిరస్కరించడానికి నీ వద్ద ఏ ఆధారం లేదు.
ముస్లిములు అల్లాహ్ గౌరవమర్యాదను ఏ విధంగా నమ్ముతారో దాని ఆధారంగా చూస్తే అల్లాహ్ పేరున చేయబడిన ప్రమాణాన్ని వారు ఒప్పుకోవాలి. అల్లాహ్ పేరున ప్రమాణాన్ని స్వీకరించక తలాఖ్ (*), లేక బద్ దుఆ (శాపము) యొక్క షర్తు పెట్టువారికి కూడ పైన పేర్కొన్న హెచ్చరిక వర్తిస్తుంది. ఎందుకనగా అది అల్లాహ్ పట్ల ఉండవలసిన మర్యాదకు వ్యెతిరేకం. ఇంకా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశాల్లో జోక్యం చేసినవాడవుతాడు.
(*) అంటే ఒక విషయం పై నీవు ప్రమాణం చేస్తే, ఎదుటివాడు దాన్ని నమ్మక, లేదు “అల్లాహ్ ప్రమాణం! కాదు. ఈ మాట అబద్ధం అయితే నా భార్యకు విడాకులు, లేక నాపై శాపం కురుస్తుంది అని ప్రమాణం చేయు” అని అంటాడు. (ఇది తప్పుడు విధానం. ఇలాంటి వారి కొరకు పైన చెప్పబడిన హెచ్చరిక ఇవ్వబడింది).
ఎదుటివాడు అబద్ధములాడువాడు, పాపాత్ముడు అని స్పష్టం అయినప్పుడు అతని ప్రమాణాన్ని తిరస్కరించువానిపై ఆ హెచ్చరిక వర్తించదు. స్వయంగా అతని హృదయంలో అల్లాహ్ పట్ల గౌరవమర్యాదలు లేవు.
ఖుతైల ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త వద్దకు ఒక యూదుడు వచ్చి “మీరు “అల్లాహ్ కోరినట్లు మరియు నీవు కోరినట్లు” అని ఇంకా “కాబా ప్రమాణం” అని అల్లాతో షిర్క్ చేస్తారు అని అన్నాడు. అప్పుడు ప్రవక్త తమ సహచరులకు ఇలా ఆదేశించారు: “ప్రమాణం చేయదలిచినప్పుడు “వరబ్బిల్ కాబా” (కాబా యొక్క ప్రభువు సాక్షి) అనండి. ఇంకా (అల్లాహ్ కోరినట్లు మరియు నీవు కోరినట్లు అనకుండా) “అల్లాహ్ కోరినట్లు తరువాత నీవు కోరినట్లు” అనండి”.. (నసాయి).
ఇబ్ను అబ్బాస్ కథనం: ఒక వ్యక్తి ప్రవక్తతో “అల్లాహ్ కోరినట్లు మరియు మీరు కోరినట్లు” అని అన్నాడు. ప్రవక్త ఇది విని “ఏమిటి? నన్ను అల్లాతో సాటి కల్పిస్తున్నావా? అల్లాహ్ మాత్రమే కోరినట్లు అని పలుకు” అని బోధించారు. (నసాయి).
ఆయిష రజియల్లాహు అన్హా యొక్క (తల్లి తరఫున) సోదరుడు తుఫైల్ ఉల్లేఖించారు: “నేను యూదుల వద్దకు వచ్చినట్లు, ఈ విధంగా సంభాషించి నట్లు స్వప్నంలో చూసాను. “ఉజైర్ అల్లాహ్ కుమారుడు అని మీరు చెప్పక పోతే మీరు మంచివారు” అని అన్నాను. అప్పుడు వారన్నారు: “అల్లాహ్ కోరినట్లు, మరియు ముహమ్మద్ కోరినట్లు” అని మీరు చెప్పకపోతే మీరూ మంచివారు”. మళ్ళి నేను క్రైస్తవుల వద్దకు వెళ్ళాను. వారితో చెప్పాను: “యేసు అల్లాహ్ కుమారుడు” అని చెప్పకపోతే, మీరు మంచివారు. అప్పుడు వారన్నారు: “అల్లాహ్ కోరినట్లు, మరియు ముహమ్మద్ కోరినట్లు” అని మీరు చెప్పకపోతే మీరూ మంచివారు”. తెల్లవారిన తరువాత ఈ విషయం కొందరికి తెలిపి, మళ్ళి ప్రవక్త వద్దకు వచ్చి వారికీ తెలియజేసాను. “నీవు ఎవరికైనా ఈ విషయం చెప్పావా?” అని ఆయన అడిగారు. “అవును” అన్నాను. అప్పుడు ఆయన అల్లాహ్ స్తోత్రములు పఠించి, ఇలా చెప్పారు: తుఫైల్ ఒక స్వప్నం చూశాడు. మీలో కొందరికి తెలిపాడు. మీరు ఒక మాట అంటుంటారు. దాన్ని నివారించకపోవడానికి ఫలాన, ఫలాన కారణం ఉండింది. ఇప్పుడు నివారిస్తున్నాను. ఇక మీరు “అల్లాహ్ కోరినట్లు, మరియు ముహమ్మద్ కోరినట్లు” అని చెప్పకండి. “కేవలం అల్లా కోరినట్లు” అని చెప్పండి.
ముఖ్యాంశాలు:
1- యూదులకు చిన్న షిర్క్ గురించి తెలుసు.
2- మానవుడు తలచుకుంటే (సత్యం, అసత్యంలో) వ్యత్యాసం తెలుసుకోగలడు. 3- పై హదీసులో సహచరుడు అన్న మాటపై “ఏమిటి? నన్ను అల్లాతో సాటి కల్పుతున్నావా?” అని ప్రవక్త అన్నారు. అయితే “యా అక్రమల్ ఖలిఖి మాలీ మన్ అలూజు బిహీ సివాక” (ఓ మానవుల్లో శ్రేషులైనవాడా! నేను మిమ్మల్ని కాదని ఇంకెవరి శరణు కోరాలి? లాంటి పదాలు, కవిత్వాలు పాడువారిని వింటే ఇంకేమందురో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం!!.
4- “అల్లాహ్ కోరినట్లు మరియు మీరు కోరినట్లు” అనుట షిర్కె అక్బర్ కాదు అని తెలుస్తుంది. ఎలా అనగా (ఒక వేళ అది షిర్కె అక్బర్ అయి ఉంటే) “ఇది వరకే దాన్ని నివారించేవాడిని కాని ఫలాన ఫలాన ఆటంకము ఉండేది అని ప్రవక్త అనేవారు కాదు.
5- మంచి స్వప్నం కూడా వహీ భాగాల్లో ఒకటి.
6- మంచి స్వప్నం కూడా ఒక్కప్పుడు కొన్ని ధార్మిక ఆధారాలకు కారణం అవుతుంది. (కాని ఇది ప్రవక్త జీవిత కాలం వరకే పరిమితం).
వారు ఇలా అంటారు: “జీవితం అంటే కేవలం మన ఈ ప్రాపంచిక జీవితం మాత్రమే. ఇక్కడే మన మరణం, ఇక్కడే మన జీవితం. కాల పరిభ్రమణం తప్ప, మనలను ఏదీ చంపలేదు”. (జాసియ 45:24).
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: అల్లాహ్ ఇలా తెలిపాడని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు:
“ఆదము సంతానం (మానవులు) కాలాన్ని దూషిస్తూ నాకు బాధ కలిగిస్తున్నారు. నిజానికి కాలం కూడా నేనే. నేనే రాత్రిని, పగటిని ఒకదాని వెనుక మరొకటి వచ్చేలా త్రిప్పుతున్నాను“. (బుఖారి: 4826. ముస్లిం: 2985).
మరొక ఉల్లేఖనం లో ఇలా ఉంది:
“కాలాన్ని దూషించకండి. అల్లాహ్ యే కాలం (కాల చక్రం తిప్పువాడు)“.
ముఖ్యాంశాలు:
1- కాలాన్ని దూషించుట నివారించబడింది.
2. కాలాన్ని దూషించడాన్ని అల్లాహ్ ను బాధపెట్టడమే.
3- “అల్లాహ్ యే కాలాన్ని (త్రిప్పువాడు)” అన్న విషయం పై శ్రద్ధ చూపాలి.
4- ఉద్దేశపూర్వకంగా కానప్పటికీ కొన్ని సమయాల్లో మానవుని నోట తిట్లు వెలువడుతాయి. (అలక్ష్యంగా ఉండవదు).
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :
అజ్ఞాన కాలంలో ఇది చెలామణి ఉండినది. ఇప్పుడు అనేక పాపాత్ములు, బుద్ధిహీనులు, కాలం, వారి కోరికలకు వ్యెతిరేకంగా ఉన్నట్లు చూసి కాలాన్ని తిడతారు. ఒక్కోసారి శాపనార్థాలు పెడుతారు. ఇది వారి ధర్మలోపం, బుద్ధి తక్కువ తనం వల్ల జరుగుతుంది.
వాస్తవానికి “కాలం” చేతిలో ఏమీ లేదు. దానికి ఎలా ఆజ్ఞ అవుతుందో అలా నడుస్తుంది. దానిలో మార్పులు వివేకుడు, శక్తివంతుడైన అల్లాహ్ ఆజ్ఞ వల్ల సంభవిస్తాయి. అందుచేత ఇలా తిట్లు, దూషణలు దాన్ని త్రిప్పుతున్నవానికి బాధ కలిగించుతాయి.
ఇది ధర్మంలో లోటు, బుద్ధిలో కొరతకు నిదర్శనం. దీని వల్ల విషయం మరింత గంభీరం అవుతుంది. సహనం ద్వారాలు మూయబడుతాయి. ఇది తౌహీద్ కు వ్యెతిరేకం అవుతుంది.
అన్ని రకాల మార్పులు అల్లాహ్ నిర్ణయించిన, వ్రాసిన విధివ్రాత ప్రకారం సంభవిస్తాయని పూర్తి వివేకముతో విశ్వాసి గ్రహిస్తాడు. ఎందులో అల్లాహ్ ఆయన ప్రవక్త లోపము తెలుపలేదో అందులో అతను ఏ లోపము చూపడు. అల్లాహ్ యొక్క ప్రతి వ్యవహారంతో సంతృప్తి చెందుతాడు. ఆయన ఆజ్ఞను సంతోషంతో స్వీకరిస్తాడు. ఇలా అతడు మనశ్శాంతి, తృప్తి పొందుతాడు. అతని తౌహీద్ సంపూర్ణం అవుతుంది.
ప్రవక్త ﷺ ఉపదేశించారని, అబూ హురైరా ఉల్లేఖించారు: “ఎవరైనా “మలికుల్ అమ్లాక్” అని పేరు పెట్టుకుంటే అది అల్లాహ్ దృష్టిలో అతి నీచమైన పేరుగా పరిగణించబడుతుంది. అల్లాహ్ తప్ప మరెవ్వడు రాజు కాడు”. (బుఖారి. ముస్లిం).
“మలికుల్ అమ్లాక్” అంటే (రాజాధిరాజు) అని సుఫ్యాన్ అన్నారు. మరొక ఉల్లేఖనలో ఉంది: “ప్రళయదినాన అందరికన్నా ఎక్కువ అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యేవాడు, నీచుడు……….” అని అర్థము.
ముఖ్యాంశాలు:
1- ‘రాజాధిరాజు’ అని పేరు పెట్టుకొనుట నివారించబడింది. 2- సుఫ్యాన్ చెప్పిన ప్రకారం ‘రాజాధిరాజు’ లాంటి పదాలు కూడా ఉపయోగించకూడదు. 3- ఎంత కఠినంగా దీన్ని నివారించబడిందో దాన్ని గ్రహించాలి. మనుస్సులో ఆ భావం లేకున్నా దాన్ని ఉపయోగించరాదు. 4- ఇది అల్లాహ్ గౌరవ మర్యాదలకు వ్యెతిరేకముగా ఉన్నందున నివారించబడింది.
తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ):
ఇది మరియు దీని తరువాత ఆధ్యాయం, దీనికి ముందు అధ్యాయం యొక్క భాగమే. అదేమనగా మాటలు, చేష్టలు మరియు సంకల్పంలో ఎంత మాత్రం అల్లాహ్ తో ఇతరులను సాటి కల్పించవద్దు. ఏ ఒక్కరూ అల్లాహ్ నామాల్లో, గుణాల్లో భాగస్వామ్యం చూపునటువంటి పేరు పెట్టకూడదు. ఉదాహరణకు: న్యాయాధిపతి. రాజాధిరాజు. సార్వభౌముడు. అబుల్ హకం లాంటివి. ఇవన్నియు తౌహీద్ మరియు అల్లాహ్ నామాల, గుణాల రక్షణ కొరకు మరియు ఏ పదాల ద్వారా అల్లాహ్ హక్కుల్లో, ప్రత్యేకతల్లో ఇతరుల భాగస్వామ్యం ఉందని అనుమానం వస్తుందో అలాంటి షిర్క్ యొక్క సాధనాలను అంతమొందించుటకు చెప్పబడినవి.
అబూ షురైహ్ కథనం: అతను ‘అబుల్ హకం‘ అనే విశేష నామము (surname)తో పిలువబడేవారు. ప్రవక్త అతనికి ఇలా ఉపదేశించారు: “హకం అల్లాహ్ మాత్రమే. హుకుం (ఆజ్ఞ, ఆదేశం) అతనిది మాత్రమే నడుస్తుంది“. అప్పుడు అతనన్నాడు: “నా జాతివారు విబేధాల్లో పడినప్పుడు నా వద్దకు వచ్చేవారు. నేను వారి మధ్య తీర్పు చేసేవాణ్ణి. వారి రెండు వర్గములవారు నా తీర్పుతో సంతృప్తి పడేవారు. “ఇది చాలా మంచి విషయం. అయితే నీ సంతానం ఎవరెవరు?” అని అడిగారు ప్రవక్త. “షురైహ్”, “ముస్లిం”, “అబ్దుల్లా” అని నేను వివరించారు. “వారిలో పెద్ద ఎవరు?” అని అడిగారు ప్రవక్త. “షురైహ్” అని నేను చెప్పాను. “అయితే నీవు ” అబూ షురైహ్” అని ప్రవక్త చెప్పారు. (అబూ దావూద్).
ముఖ్యాంశాలు:
1- అల్లాహ్ నామములను, గుణాలను గౌరవించాలి. ఇతరుల కొరకు ఆ నామములను ఉపయోగించినప్పుడు ఆ భావం లేకున్నా సరే.
2- అల్లాహ్ గౌరవంలో భాగముగా ఉన్న పేర్లను మార్చవచ్చును.
3- surname (విశేష నామము) కొరకు పెద్ద కుమారుని పేరును ఎన్నుకోవాలి.
وَلَئِن سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ ۚ قُلْ أَبِٱللَّهِ وَءَايَـٰتِهِۦ وَرَسُولِهِۦ كُنتُمْ تَسْتَهْزِءُونَ “మీరు చెప్పుకుంటూ ఉన్న విషయం ఏమిటి? అని ఒకవేళ వారిని అడిగితే, మేము సరదాగా వేళాకోళంగా మాట్లాడుకుంటున్నాము అని తక్షణం బదులు చెబుతారు. వారితో ఇలా అను: “మీ వేళాకోళం, అల్లాహ్ తోనా? ఆయన ఆయతులతోనా? ఆయన ప్రవక్తతోనా? ఇక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి పాల్పడ్డారు”. (9: తౌబా: 65).
అబ్దులాహ్ బిన్ ఉమర్, ముహమ్మద్ బిన్ కఅబ్, జైద్ బిన్ అస్లం మరియు ఖతాద రజియల్లాహు అన్హుంల కథనం:- వారి హదీసు పదాలు వేరు వేరు ఉన్నాయి కాని భావం ఒకటే – అది :
“తబూక్ యుద్ధంలో ఒక కపటవిశ్వాసి ఇలా అన్నాడు: “మా ఈ ఖుర్ఆనేవేత్తల కంటే ఎక్కువ కడుపుగోరువారు, అసత్యులు మరియు యుద్ధ మైదానము నుండి వెనకుండే వారెవరినీ మేము చూడలేదు”. అంటే ప్రవక్త ఆయన సహచరులూ అని అతని ఉద్దేశం. ఇది విన్న వెంటనే ఔఫ్ బిన్ మాలిక్ “అలా కాదు! నీవు అబద్ధం పలుకుతున్నావు. నీవు మునాఫిఖ్ (కపటవిశ్వాసి). నీ ఈ విషయం తప్పక ప్రవక్తకు తెలుపతాను” అని ప్రవక్త ﷺ వద్దకు వెళ్ళారు. కాని ఆయనకు ముందే ప్రవక్త ﷺ వద్దకు వహీ వచ్చింది. (ఆ విషయం ప్రవక్తకు తెలిసింది). ఆ కపటవిశ్వాసి కూడ (సాకు చెప్పుటకు) వెనకే వచ్చాడు. అప్పుడే ప్రవక్త ప్రయాణ ఉద్దేశంతో ఓంటెపై ఎక్కారు. “ప్రవక్తా! మేము కేవలం ఉల్లాసానికి, ప్రయాణపు అవస్థ దూరుమగుటకు ఎగితాళి చేస్తుంటిమి” అని సాకులు చెప్ప సాగాడు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారు: ఇప్పటికీ ఆ సంఘటన నా కళ్ళలో మెదులుతూ ఉంది: అతను ప్రవక్త ఒంటె పల్లము యొక్క త్రాడు పట్టుకొని ‘మేము పరియాచకము చేస్తుంటిమి అని అంటున్నాడు. ప్రవక్త అతనికి జవాబులో “మీ వేళాకోళం, అల్లాహ్ తోనా, ఆయన ఆయతులతోనా, ఆయన ప్రవక్తతోనా?” ఈ వాక్యం మట్టుకు వినిపిస్తున్నారు. అతని వైపు తిరిగి చూడనూ లేదు. దానికి మించి ఒక్క అక్షరం పలుకనూ లేదు. (ఇబ్ను జరీర్: 10/119. ఇబ్ను అబీ హాతిం).
ముఖ్యాంశాలు:
1- ఇందులో తెలిసిన ముఖ్య విషయమేమనగా ఎవరు ఇస్లాంకు సంబంధిత విషయాలతో ఎగితాళి చేస్తాడో అతడు అవిశ్వాసుడవుతాడు.
2- ఎగితాళి చేయువారెవరైనా సరే, పై వాక్యం వెలుగులో అతను (అవిశ్వాసానికి ఒడిగట్టినట్లే).
3- చాడీలు చెప్పడం, మరియు అల్లాహ్ ఆయన ప్రవక్త పట్ల శ్రేయోభిలాష చూపడంలో చాలా వ్యత్యాసం ఉంది. (అంటే ఔఫ్ బిన్ మాలిక్, ఆ వంచకుని విషయం, ప్రవక్తకు తెలుపుట, చాడీల్లో లెక్కించబడదు).
4- స్వయం అల్లాహ్ ప్రేమించునటువంటి మన్నింపు, క్షమాపణ మరియు అల్లాహ్ శతృవులపై కఠినత్వం చూపుటలో చాలా తేడా ఉంది.
5- కొన్ని సందర్భాల్లో సాకులు ఒప్పుకోబడవు.
తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ):
ఖుర్ ఆన్, ప్రవక్త మరియు అల్లాహ్ నామ స్మరణ ఎందులో ఉందో వాటితో పరిహాసమాడటం విశ్వాసానికి వ్యెతిరేకం. ధర్మభ్రష్టతకు కారణం. అల్లాహ్ ను, ఆయన ప్రవక్తలను, గ్రంథాలను విశ్వసించడం, వాటిని గౌరవించడం మరియు మర్యాద చూపడం ధర్మం, మరియు విశ్వాస భాగమే. ఎగితాళి, పరిహాసం శుద్ధ అవిశ్వాసం కన్నా చాలా భయంకరమైనది. ఎందుకనగా ఇది అవిశ్వాసమే గాకుండా ధర్మంతో పరిహాసము చేయడం కూడా అవుతుంది. అవిశ్వాసులు రెండు రకాలు: (1). తిరస్కారులు. (2). అభ్యంతరము, ఆక్షేపము చేసేవారు.
ఇందులో రెండో రకంవారే అల్లాహ్ ఆయన ప్రవక్తతో యుధ్ధానికి సిద్ధమైనవారు. వారే అల్లాహ్ ధర్మంలో, ఆయన ప్రవక్త విషయంలో, అనవసర జోక్యం చేసుకుంటూ విమర్శలు, ఆక్షేపములు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారే కఠిన అవిశ్వాసులు, మహాకల్లోలం, కలతలు సృష్టించేవారు.
وَلَئِنْ أَذَقْنَـٰهُ رَحْمَةًۭ مِّنَّا مِنۢ بَعْدِ ضَرَّآءَ مَسَّتْهُ لَيَقُولَنَّ هَـٰذَا لِى కష్టకాలం తీరిపోయిన తరువాత, మేము అతనికి మా కారుణ్యాన్ని రుచి చూపినప్పుడు ఇలా అంటాడు, “నేను అసలు దీనికి అర్హుడనే “. (41: హామీ అస్సజ్దా: 50).
పై ఆయతులో “నేను అసలు దీనికి అర్హుడనే ” అనే పదాన్ని వ్యాఖ్యానిస్తూ ముజాహిద్ రహిమహుల్లాహ్ చెప్పారు: “ఇది నా కష్టార్జితం. దీనికి నేను అర్హుడను”.
ఇబ్ను అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఇలా వ్యాఖ్యానించారు: “ఈ సంపద నా దగ్గరిదే.”
సూరె ఖసస్ లోని వాక్యం : ఖారూన్ అన్నాడు: “నాకు లభ్యమైన జ్ఞానం మూలంగానే ఇదంతా నాకు ఇవ్వబడింది” (28: 78)ను వాఖ్యానిస్తూ ఖతాద రహిమహుల్లాహ్ చెప్పారు: “వ్యాపారంలో నాకున్న ప్రావీణ్యత, అనుభవం ద్వారా ఈ ధనం లభ్యమైంది.”
మరి కొందరు వ్యాఖ్యానికులు ఇలా చెప్పారు: నేను దీనికి అర్హుణ్ణి అని అల్లాహ్ కు తెలుసు కనుక ఇది నాకు లభించింది.
ముజాహిద్ రహిమహుల్లాహ్ చెప్పింది ఇదే భావం: నా ఉన్నతి, గౌరవాన్నిబట్టి ఇది నాకు ఇవ్వబడింది.
అబూ హురైర రజియల్లాహు అన్హు కథనం: ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నారు:
“పూర్వ ఇస్రాఈల్ సంతతిలో ఒక కుష్టు రోగి, ఒక అంధుడు మరియు ఒక బట్టతలవాడు ఉండేవారు. ఆ ముగ్గురిని పరీక్షించాలన్న ఉద్దేశంతో అల్లాహ్ వారివద్దకు ఒక దూతను పంపాడు. అతను కుష్టురోగి వద్దకు వచ్చి, “నీకు అతి ప్రియమైనదేమిటి?” అని అడిగాడు. దానికా కుష్టురోగి “అందమైన రంగు, చర్మం. ముందు ఈ వ్యాధిపోవాలి. దీని మూలంగానే జనం నన్ను అసహ్యించుకుంటున్నారు” అని అన్నాడు. దైవదూత అతని శరీరాన్ని స్పృశించాడు. దాంతో అతని కుష్టురోగం తొలిగిపోయి అందమైన చర్మం, ఆకర్షవంతమైన రంగు లభించాయి. అప్పుడు దైవదూత అతనితో “నీకెలాంటి సంపద అంటే ఇష్టం”? అని అడిగాడు మళ్ళీ. దానికా వ్యక్తి “నాకు ఒంటెలంటే ఇష్టం” అని అన్నాడు. వెంటనే అతనికి పది నెలల సూడి ఒంటె ప్రసాదించబడినది. దైవదూత అతడ్ని ఆశీర్వదిస్తూ “అల్లాహ్ నీ పశుసంపదలో శుభాభివృద్ధులు ప్రసాదించుగాక” అని అన్నాడు. ఆ తరువాత దైవదూత బట్టతలవాడి దగ్గరకు వెళ్ళి “నీకు అన్నిటికంటే ఎక్కువ ఏది ఇష్టం?” అని అడిగాడు. “నాకు అందమైన శిరోజాలంటే ఇష్టం. నా బట్టతలను చూసి జనం నన్ను అసహ్యించుకుంటున్నారు. అందుచేత ముందు ఈ బట్టతల తొలిగి పోయి మంచి వెంట్రుకలు రావాలి” అన్నాడు. దైవదూత తన చేతితో అతని తల నిమిరాడు. దానితో అతని బట్టతలపై అందమైన వెంట్రుకలు వచ్చేశాయి. “మరి నీకెలాంటి సంపదంటే ఇష్టం?” అని అడిగాడు దైవదూత మళ్ళీ దానికా వ్యక్తి “నాకు ఆవులంటే మహా యిష్టం” అన్నాడు. వెంటనే దైవదూత అతనికి సూడి ఆవు ఇచ్చేశాడు. పైగా “అల్లాహ్ నీ ఈ పశుసందపలో శుభాభివృద్ధులు కలిగించుగాకా” అని దీవించాడు. ఆ తరువాత దైవదూత అంధుడి దగ్గరకు వెళ్ళి “నీకు అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైన వస్తువేది?” అని అడిగాడు. దానికా వ్యక్తి “అల్లాహ్ నాకు దృష్టి ప్రసాదిస్తే లోకవాసులను చూడగలను” అని అన్నాడు. దైవదూత అతని కళ్ళపై చెయ్యి తిప్పాడు. అల్లాహ్ అతనికి దృష్టి ప్రసాదించాడు. అప్పుడు దైవదూత “సరే, నీకు ఎలాంటి సంపద అంటే ఇష్టం?’ అని అడిగాడు. దానికా వ్యక్తి “నాకు మేకలంటే ఇష్టం” అని అన్నాడు. దైవదూత అతనికి సూడి మేక ఇచ్చాడు.
కొంతకాలంలో దైవదూత ఇచ్చిన ఒంటె, ఆవు, మేక ప్రసవించి పశుసంపద వృద్ధి చెందింది. కుష్టురోగి దగ్గర ఒంటెల మంద, బట్టతల వాని దగ్గర ఆవుల మంద, అంధుని దగ్గర మేకల మందలు వృద్ధి చెందాయి.
కొంత కాలం గడిచిన తరువాత ఆ దైవదూత ఇది వరకటి లాగే మానవాకారంలో (ఒకప్పటి కుష్టురోగి దగ్గరకు వచ్చి “నేనొక పేదవాడ్ని, ప్రయాణంలో నా ప్రయాణసామాగ్రి అంతా ఖర్చు అయినది. ఇప్పుడు నేను అల్లాహ్ (దయ), తరువాత నీ సహాయం లేకుండా నా యింటికి కూడా చే రుకోలేని పరిస్థితి వచ్చింది. అందుచేత నీకు అందమైన దేహం, రూపం, సిరిసంపదలు ప్రసాదించిన అల్లాహ్ పేరుతో అర్థిస్తున్నాను. నాకొక ఒంటెను దానం చెయ్యి. దాని మీద సవారీ చేసి నేను నా ఇంటికి చేరుకుంటాను” అని అన్నాడు. దానికా కుష్టురోగి (తన గత జీవాతాన్ని విస్మరించి) ప్రస్తుతం నా బాధ్యతలు, ఖర్చులు బాగా పెరిగిపోయాయి (నేను నీకు ఎలాంటి సహాయం చేయలేను)” అని అన్నాడు. దైవదూత ఈ మాటలు విని “బహుశా నేను నిన్ను గుర్తుపట్టాననుకుంటా. నీవు గతంలో కుష్టరోగిగా ఉండేవాడివి కదూ?. దాని వల్ల జనం నిన్ను అసహ్యించుకునేవారు. నీవు పేదవాడిగా ఉంటే, అల్లాహ్ నీకు ఈ సంపద ప్రసాదించాడు. ఔను కదూ?” అని అన్నాడు. కుష్టురోగి (ఈ వాస్తవాలను అంగీకరించకుండా) ఈ సిరి సంపదలు తరతరాల నుంచి వస్తూ నాకు వారసత్వంలో లభించాయి” అని అన్నాడు. దానికి దైవదూత “నీవు చెప్పింది అబద్ధమయితే అల్లాహ్ నిన్ను తిరిగి పూర్వస్థితికి చేర్చుగాక!” అని శపించాడు.
ఆ తరువాత దైవదూత తన మొదటి రూపంలోనే బట్టతల వాని దగ్గరకు వెళ్ళి, కుష్టురోగితో అన్న మాటలే అతనితో కూడా అన్నాడు. దానికి బట్టతల వాడు కూడా కుష్టురోగి ఇచ్చినటువంటి సమాధానమే ఇచ్చాడు. దైవదూత అతడ్ని కూడా శపిస్తూ “నీవు చెప్పింది అబద్ధమయితే అల్లాహ్ నిన్ను పూర్వ స్థితికి తిరిగి చేర్చుగాక!” అని అన్నాడు.
అక్కడి నుండి దైవదూత తన మొదటి ఆకారంలోనే అంధుని దగ్గరకు వెళ్ళి “నేనొక నిరుపేదను, బాటసారిని, నా ప్రయాణ సామగ్రి అంతా అంతమయిపోయింది. ప్రస్తుతం నేను అల్లాహ్ (దయ), తరువాత నీ సహాయం లేకుండా నా ఇంటికి చేరుకోలేని పరిస్థితి వచ్చింది. అందుచేత నీకు దృష్టి ప్రసాదించిన అల్లాహ్ పేరుతో అర్థిస్తున్నాను. నాకొక మేకను ఇవ్వు. దాంతో నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను” అని అన్నాడు. దానికా అంధుడు సమాధానమిస్తూ “నిజమే, నేను అంధుడిగా ఉన్నప్పుడు అల్లాహ్ నాకు దృష్టి ప్రసాదించాడు. నేను పేదవాడిగా ఉన్నప్పుడు ఆయన నన్ను ధనికుడిగా చేశాడు. నేనాయన పట్ల కృతజ్ఞతగా నా ఆస్తిలో నీవు కోరుకున్నది తీసుకునే అధికారం నీకిస్తున్నాను. అల్లా సాక్షి! ఈ రోజు నీవు అల్లాహ్ పేరుతో (నా ఆస్తిలో) ఏది తీసుకున్నా దానికి నేనెలాంటి అభ్యంతరం చెప్పను (నీవు నిస్సంకోచంగా తీసుకో)” అని అన్నాడు. దైవదూత ఈ మాటలు విని “నీ సంపద నీకే శుభప్రదం (నాకేమీ అవసరం లేదు). ఇది ఒక పరీక్ష మాత్రమే. (ఇందులో నీవు నెగ్గావు) తత్ఫలితంగా అల్లాహ్ నీ పట్ల ప్రసన్నుడయ్యాడు. ఈ పరీక్షలో) నీ సహచరులిద్దరు (విఫలమయి) అల్లాహ్ ఆగ్రహానికి గురయిపోయారు” అని అన్నాడు. (బుఖారీ. ముస్లిం. లూలు వల్ మర్గాన్ 1868).
ముఖ్యాంశాలు:
1- ఈ అధ్యాయంలోని మొదటి వాక్యం యొక్క వ్యాఖ్యానం. 2- “నేను అసలు దీనికి అర్హుణ్ణి” యొక్క భావం. 3- “నాకు లభ్యమైన జ్ఞానం మూలంగానే ఇదంతా నాకు ఇవ్వబడింది” యొక్క భావం. 4- ఈ విచిత్రమైన వృత్తాంతములో చాలా గొప్ప గుణపాఠాలున్నవి.
తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ):
ఈ అధ్యాయం ద్వారా తెలిసేదేమిటంటే: ఏ వ్యక్తి తనకు లభించిన అనుగ్రహం, ఉపాధి స్వయంగా తన కృషి, జ్ఞానం, నైపుణ్యంతో లభించిందని భావిస్తాడో, లేక అతను దానికి అర్హుడని, తనకు ఇలా ప్రసాదించడం అల్లాహ్ విధి అని అనుకుంటాడో, ఇలా అనుకొనుట, భావించుట తౌహీదు కు వ్యెతిరేకం. ఎందుకనగా స్వచ్ఛమైన విశ్వాసి తనపై ఉన్న అల్లాహ్ యొక్క అన్ని అనుగ్రహాలను అవి బాహ్యంగా ఉన్నా, గుప్తంగా ఉన్నా, అవి అల్లాహ్ దయతో, ఆయన తరఫు నుండి అని విశ్వసించి, అందుకు అల్లాహ్ స్తోత్రము పఠిస్తాడు. అల్లాహ్ విధేయతలో వాటి సహకారం పొందుతాడు. ఇలా లభించడం అల్లాహ్ పై ఉన్న తన హక్కు అని భావించడు. అన్ని హక్కులు అల్లాహ్ కే ఉన్నాయి. అతడు కేవలం అల్లాహ్ దాసుడు. ఇలా తౌహీద్ విశ్వాసం పరిపూర్ణమవుతుంది. దీనికి వ్యెతిరేకమైనది కృతఘ్నత అవుతుంది. అహంకారం, మనోవాంఛల అనుసరణ తప్పుల్లో అతి చెడ్డది.
فَلَمَّآ ءَاتَىٰهُمَا صَـٰلِحًۭا جَعَلَا لَهُۥ شُرَكَآءَ فِيمَآ ءَاتَىٰهُمَا ۚ فَتَعَـٰلَى ٱللَّهُ عَمَّا يُشْرِكُونَ “అప్పుడు అల్లాహ్ వారికి ఒక చక్కని, ఏ లోపమూ లేనటువంటి పిల్లవాణ్ణి ప్రసాదించాడు. కాని వారు ఆయన ప్రసాదించిన ఈ కానుక విషయంలో ఇతరు లను ఆయనకు భాగస్వాములుగా చేయసాగారు”. (7: ఆరాఫ్: 190).
ఇబ్ను హజం చెప్పారు: ఏ పేరులో ‘అల్లాహ్ యేతరుల దాసుడు’ అన్న భావం వస్తుందో అది నిషిద్ధం అని ఏకీభవించబడినది. ఉదాహరణకు: అబ్దు అమర్, అబ్దుల్ కాబ మొదలైనవి. కాని ప్రవక్త తాత ‘అబ్దుల్ ముత్తలిబ్’ పేరు ఇలాంటిది కాదు. (అయినా ఎవరు ఆ పేరు పెట్టవద్దు).
ముఖ్యాంశాలు:
1- అల్లాహ్ యే తరులకు దాసుడు అన్న భావం గల పేరు చేర్చుట నిషిద్ధం. 2-పై వాక్యం యొక్క వ్యాఖ్యానం తెలిసింది. 3- అసలు భావం ఉద్దేశించక పోయినా కేవలం పేరు మూలంగా షిర్క్ అవుతుంది. 4- ఏ అంగవైకల్యం లేకుండా సంతానం కలగడం కూడా అల్లాహ్ యొక్క గొప్ప దయ. 5- విధేయతలో గల షిర్క్, ఆరాధనలో గల షిర్క్ మధ్య సలఫే సాలిహీన్ (సత్పురుషులైన పూర్వీకులు) వ్యత్యాసం పాటించేవారు.
وَلِلَّهِ ٱلْأَسْمَآءُ ٱلْحُسْنَىٰ فَٱدْعُوهُ بِهَا ۖ وَذَرُوا۟ ٱلَّذِينَ يُلْحِدُونَ فِىٓ أَسْمَـٰٓئِهِۦ ۚ سَيُجْزَوْنَ مَا كَانُوا۟ يَعْمَلُونَ “అల్లాహ్ మంచి పేర్లకు అర్హుడు. ఆయనను మంచి పేర్లతోనే వేడుకోండి. ఆయనను మంచి పేర్లతో పిలిచే విషయంలో సత్యం నుండి వైదొలగేవారిని వదలి పెట్టండి”. (7: ఆరాఫ్: 180).
పై ఆయతులో “వైదొలగేవారిని” అంటే షిర్క్ చేసేవారిని అని అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు చెప్పారని ఇబ్ను అబీ హాతిం తెలిపారు. ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు చెప్పారు: ముష్రికులు తమ దేవతల్లో ‘లాత్’ పేరు అల్లాహ్ తో, ‘ఉజ్జా’ పేరు ‘అజీజ్’తో పెట్టారు. (ఇది కూడ ఒక షిర్క్ లాంటి విషయమే).
అఅమష్ చెప్పారు: అల్లాహ్ తన కొరకు తెలుపని పేర్లు, ఆయనకున్నవని తెలుపుట కూడా సత్యం నుండి వైదొలగినవారిలో పరిగణించబడుతారు.
ముఖ్యాంశాలు:
1- అల్లాకు అనేక నామములు గలవు. 2- అల్లాకు గల నామములన్నియూ సుందరమైనవే. 3- ఆ నామములతో వేడుకోవాలని (ప్రార్థించాలని) ఆదేశించబడింది. 4- అందులో వక్ర మార్గాన్ని అవలంభించిన మూర్ఖుల నుండి దూరముండాలి. 5- అల్లాహ్ నామాల్లో సత్యం నుండి వైదొలగుట అంటేమిటో తెలిసింది. 6- అందులో సత్యం నుండి వైదొలగినవారికి కఠిన హెచ్చరిక గలదు.
తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ):
అల్లాహ్ స్వయంగా తన కొరకు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ కొరకు తెలిపిన మంచి నామములను విశ్వసించుటయే తౌహీద్ యొక్క మూలం. అదే విధంగా వాటి గొప్ప భావాల, అందులో ఉన్న సూక్ష్మ విషయాల జ్ఞానం తెలుసుకొనుట. వాటితో అల్లాహ్ ను వేడుకొనుట, ఆరాధించుట కూడా తప్పనిసరి.
మానవుడు ఎప్పుడు దుఆ చేసినా – అది తన ప్రాపంచిక, పరలోక (ఏ దాని గురించైనా) అల్లాహ్ నామాల్లో తన అవసరానికి తగిన నామము యొక్క ఆధారంతో దుఆ చేయాలి. ఉదాహరణకు: ఉపాధి కొరకు దుఆ చేయునప్పుడు “రజ్జాఖ్” (ఉపాధినిచ్చేవాడు) నామముతో, కరుణ, క్షమాపణ కోరినప్పుడు “రహీం” (నిరంతరం కనికరం చూపేవాడు), “రహ్మాన్” (అనంత కరుణ జూపేవాడు), “బర్ర్” (మహెూపకారి), “కరీం” (అనుగ్రహించేవాడు), “అఫువ్వ్” (అత్యధికంగా మన్నించేవాడు), “గపూర్” (అత్యధికంగా క్షమించేవాడు), “తవ్వాబ్” (పాపుల పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు) లాంటి నామములతో దుఆ చేయవలెను.
ఆరాధనా రీత్యా ఆయన నామములను, గుణవిశేషాలతో వేడుకొనుట మరీ ఉత్తమం. వేడుక సందర్భంలో నామముల భావాల్ని మనస్సులో తెచ్చుకోవాలి. హృదయాంతరంలో వాటి ప్రభావం దిగిపోవాలి. ఉదాహరణకు: మహత్యం, గౌరవం, ఘనత, వైభవం గల పేర్లతో ఆయన గౌరవం, మహత్యం మనస్సులో నిండిపోవాలి. ఉపకారం, కనికరం భావాలుగల ఆయన నామములతో ఆరాధించినప్పుడు మనస్సు ఆయన ప్రేమ, కృతజ్ఞతా భావంతో నిండిపోవాలి. విద్య, వివేకం, అధికారం, శక్తి భావంగల పేర్లతో మనస్సు ఆయన భయబీతి, ఆయన ఎదుట వినమ్రతతో నిండిపోవాలి. సూక్ష్మజ్ఞానం, దృష్టి భావంగల నామములతో మనస్సులో ఆయన తన చేష్టలను చూస్తున్నాడన్న, తన దుస్సంకల్పం, దురుద్దేశాన్ని గమనిస్తున్నాడన్న భయం కలగాలి. అక్కరలేనివాడు, ఇతర అవసరాలను తీర్చువాడు అన్న భావంగల నామములతో వేడుకుంటూ అన్ని సందర్భాల్లో ఆయన వైపునకు మరలే గుణం మనస్సులో కలగాలి. అల్లాహ్ నామగుణాలను తెలుసు కున్నప్పుడే హృదయానికి ఆ ప్రభావం కలుగుతుంది..
అల్లాహ్ నామగుణాల విషయంలో, సత్యం నుండి వైదొలుగుట, పైన తెలిపినవాటికి బద్ద విరుద్ధం. దాని రకాలు:-
వాటి అర్థాల్ని, భావాల్ని తిరస్కరించే ధైర్యం “జహ్ మియా” అను ఒక వర్గం చేసింది.
లేక సృష్టి గుణాలతో పోల్చటం. ఇలా “రాఫిధ”లోని ఒక వర్గం చేసింది. అందుకు వారిని “ముషబ్బిహ” అంటారు.
లేక సృష్టిలోని కొందరికి అలాంటి పేర్లు పెట్టుట. ఇలా ‘ముష్రికులు’ చేశారు. అల్లాహ్ యొక్క పేరు ఇలాహాతో లాత్, అజీజ్తో ఉజ్జా, మన్నాన్ తో మనాత్ అని తమ దేవతల పేర్లు పెట్టుకున్నారు. ఆ తరువాత అల్లా కు గల ప్రత్యేక హక్కులు వారికి ఇచ్చేశారు.
ఈ రూపాల్లో ఏ ఒక్కటి సంభవించినా అల్లాహ్ పేర్లలో సత్యం నుండి వైదొలిగినట్లే. పదాల్లో, వాటి భావంలో మార్పు చేయుట. దానికున్న సరియైన భావాన్ని వదలి వక్ర భావం తెలుపుట. ఇవన్నియు తౌహీదు వ్యెతిరేకం.
అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ రజియల్లాహు అన్హు కథనం: మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో నమాజు చేసినప్పుడు “తన దాసుల తరఫున అల్లాహ్ కు సలాం. ఫలాన వ్యక్తిపై సలాం” అని అనేవాళ్ళము. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “అల్లాహ్ కు సలాం అని చెప్పకండి. అల్లాహ్ స్వయముగా సలాం (శాంతినిచ్చువాడు)”. (బుఖారీ, ముస్లిం).
ముఖ్యాంశాలు:
1- సలాం యొక్క వివరం తెలిసింది. 2- ‘సలాం’ అనునది ఒక దుఆ, మరియు కానుక. 3- అల్లాహ్ కు సలాం అని పలుకుట యోగ్యం కాదు. 4- దాని కారణం కూడా తెలిసింది. 5- అల్లాహ్ కొరకు ఎలాంటి సలాం తగినదో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచరులకు నేర్పారు. (అదియే అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు…….).
తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ):
“అల్లాహ్ యే సలాం ప్రసాదించువాడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశదీకరించారు. అల్లాహ్ సుబ్హానహు వతఆలా అన్ని రకాల లోపాలకు, దోషాలకు అతీతుడు. ఆయన సృష్టిలో ఒకరితో పోలినవాడు కాడు. తన దాసులను ఆపదల, కష్టాల నుండి రక్షించేవాడు కూడా ఆయనే. మానవులు అతనిని ఏ మాత్రం నష్ట పరచలేరు. ఏదైనా లాభం చేకూర్చా లన్నా చేకూర్చలేరు. వారే అల్లాహ్ అవసరం కలవారు. వారి సర్వ వ్యవహారాల్లో ఆయన అక్కర కలవారు. కాని ఆయన మాత్రం సర్వసంపన్నుడు. స్వయంగానే స్తుతిపాత్రుడు, నిస్సహాయుడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని, అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “అల్లాహ్ నీవు కోరితే క్షమించు. నీవు కోరితే కరుణించు అని అనరాదు. అలా కాకుండా దృఢ నమ్మకంతో, స్పష్టంగా అర్థించండి. అల్లాహ్ ను ఎవరు బలవంతం పెట్టలేరు”. (బుఖారీ. ముస్లిం. లూలు: 1716).
మరొక ఉల్లేఖనలో ఉంది: “తన పెద్ద పెద్ద కోరికలను కూడా ఆయనతోనే కోరుకోవాలి. ఎందుకనగా అల్లాహ్ వద్ద ఏ వస్తువూ పెద్దదీ కాదు“.
ముఖ్యాంశాలు:
1- దుఆ చేస్తున్నప్పుడు “నీకు ఇష్టమైతే” అనకూడదు. 2- దాని నివారణకు కారణం కూడా తెలుపబడింది. 3- పూర్తి నమ్మకంతో దుఆ చేయాలని ఆదేశించబడింది. 4- పెద్ద పెద్ద కోరికలైనా ఆయన ముందే ఉంచాలని ఆదేశించబడింది. 5- దీని కారణం కూడా తెలియజేయబడింది.
తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ):
అన్ని పనులు, వ్యవహారాలు అల్లాహ్ కోరిన ప్రకారం, ఆయన ఇష్టంతోనే జరుగును. అయినా మానవుడు తన ధార్మిక సంబంధమైన కరుణ, క్షమాపణ లాంటివి, ధార్మిక విషయాల్లో సహాయపడే ఐహిక సంబంధమైన ఆరోగ్యం, ఉపాధి మొదలైనవి అల్లాతో పూర్తి నమ్మకం మరియు దృఢ నిశ్చయంతో అర్థించవలెను. ఇలాంటి వేడుకోలు, యాచన, అర్థింపుయే ఆరాధన, ఉపాసనకూ మూలం.
పెద్ద కోరికలను ఆయన ముందు ఉంచితే (నఊజుబిల్లా) ఆయన తీర్చలేడు అని కాదు. అందుకే చిన్నదైనా, పెద్దదైనా ఏ దానికైనా అల్లాహ్ నే వేడుకోవాలి. ఇందులో, మరియు కొన్ని దుఆలలో మానవుడు అల్లాహ్ ఇష్టం పై వదులుకునే విషయంలో చాలా వ్యత్యాసం ఉంది. ఉదాహరణకు: “ఓ అల్లాహ్ నాకు జీవితం మేలుంటేఅది ప్రసాదించు. చావు మేలుంటే అది ప్రాప్తిచేయు”. మరియు దుఆయే ఇస్తిఖారా లాంటివి.
ఇందులో ఉన్న వ్యత్యాసాన్ని జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయాలి. భవిష్యత్తులో మేలుంటుందా లేదా, మానవునికి తెలియదు. అందుకు దానికి సంబంధించినదేదైనా అర్ధించినప్పుడు అల్లాహ్ ఇష్టంపై వదలాలి. కాని మానవుడు తనకు లాభంగలదని నిశ్చయింగా తెలిసినది అడిగినప్పుడు పూర్తి నమ్మకంతో అడగాలి.
అబూ హురైర ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: “మీలోనెవరు (తన సేవకునితో) నీ ప్రభువుకు అన్నం వడ్డించు. నీ ప్రభువుకు వుజు చేయించు అని చెప్పకూడదు. దానికి బదులు మీ నాయకునికి లేక యజమానికి వడ్డించు, వుజు చేయించు అని చెప్పాలి. అలాగే మీలోనెవరు (తమ సేవకునితో) “నా దాసుడా, నా దాసి” అని పిలువరాదు. దానికి బదులు నా బాలుడా, నా సేవకుడా లేక నా బాలికా అని పిలవాలి”. (బుఖారి. ముస్లిం.).
ముఖ్యాంశాలు:
1- నా దాసుడా, నా దాసి అని చెప్పవద్దు. 2- సేవకుడు తన యజమానితో నా ప్రభువు అని చెప్పవద్దు. నీ ప్రభువుకు అన్నం వడ్డించు అని చెప్పవద్దు. 3- మొదటి దానికి బదులు నా బాలుడా లేక నా బాలికా లేక నా సేవకుడా అని పిలవాలి. 4- రెండవ దానికి బదులు నా నాయకుడు, నా యజమని అని చెప్పాలి. 5- ఈ హెచ్చరిక ఉద్దేశం ఏమనగా మనము ఉపయోగించే పదాలలో కూడా ‘తౌహీద్’ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ):
నా దాసుడా, నా దాసి అనే బదులు నా బాలుడా, నా బాలిక అనడం అభిలషణీయం. ఇది కేవలం సందేహం, అనుమానం నుండి దూరముండుటకు. అలా ఆనడం నిషిద్ధమేమి లేదు. కాని మర్యాద, పదాలు కూడా మంచివి ఉపయోగించడంలో ఉన్నది. మరియు పదాల్లో కూడా మర్యాద పాటించడం ఇఖ్లాస్ (స్వఛ్ఛత)కు నిదర్శనం. ఇలాంటి పదాల్లో ఈ జాగ్రత్త ఎంతైనా అవసరం.
ప్రవక్త ﷺ ప్రవచించారని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు: “అల్లాహ్ పేరుతో అడిగినవాడికి ఇవ్వండి. అల్లాహ్ పేరుతో శరణు కోరినవాడికి శరణు ఇవ్వండి. మిమ్మల్ని ఆహ్వానించినవారి ఆహ్వానాన్ని స్వీకరించండి. మీకు ఒకరు మేలు చేస్తే, మీరు తిరిగి వారికి అలాగే మేలు చేయండి. బదులు ఇవ్వడానికి మీ వద్ద ఏమి లేనిచో మీరు వారికి బదులు తీర్చినాము అన్నంత తృప్తి కలిగే వరకు వారి కోసం అల్లాహ్ తో దుఆ చేయండి“. (అబూ దావూద్..).
ముఖ్యాంశాలు:
1- అల్లాహ్ పేరుతో శరణు కోరువారికి శరణు ఇవ్వాలి. 2- అల్లాహ్ పేరుతో అడిగినవారికి ఇవ్వాలి. 3- ఆహ్వానం స్వీకరించాలి. 4- ఎవరైనా ఉపకారం చేస్తే వారికి బదులు ఇవ్వాలి. 5- బదులు ఇచ్చే శక్తి లేకుంటే వారి కొరకు దుఆ చేయాలి. 6- బదులు ఇచ్చినాము అన్నంత తృప్తి కలిగే వరకు దుఆ చేయాలి.
తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ):
అన్నిటిలో గొప్ప ఆధారం, అల్లాహ్ పేరుతో ఒకరు ఏదైనా అడిగినప్పుడు, అల్లాహ్ యొక్క గౌరవము, మర్యాద దృష్టిలో ఉంచుకొని, అడిగిన వాని హక్కు తనపై ఉన్నదన్న విషయం గమనించి, అతనికి ఇవ్వాలని ఈ అధ్యాయంలో హితువు చేయబడింది.
జాబిర్ రజియల్లాహు అన్హు కథనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు: “అల్లాహ్ సమ్ముఖమై ప్రార్థించి కేవలం స్వర్గమే అడగాలి”. (అబూ దావూద్).
ముఖ్యాంశాలు:
1- ప్రత్యేకంగా అల్లాహ్ ను ఉద్దేశించి అతి ముఖ్యమైన స్వర్గము తప్ప మరేదీ అడగరాదు. 2- అల్లాకు ముఖము ఉంది అన్న విషయం ఈ హదీసు ద్వారా రుజువవుతుంది.
తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ):
అర్థించే వ్యక్తి అల్లాహ్ శుభనామములను, విశేషణాలను గౌరవించాలి. ప్రత్యేకంగా అల్లాహ్ నుద్దేశించి (సమ్ముఖమై) ప్రాపంచిక విషయాల్ని అడగరాదు. స్వర్గం, అందులోని వరాలు, ఆయన సంతృష్టి, ఆయన గౌరవనీయ ముఖ దర్శనం, ఆయనతో సంభాషణ భాగ్యం తప్ప మరొకటి అర్థించ కూడదు.
يَقُولُونَ لَوْ كَانَ لَنَا مِنَ ٱلْأَمْرِ شَىْءٌۭ مَّا قُتِلْنَا هَـٰهُنَا “ఒకవేళ” మాకు అధికారం ఉండివున్నట్లయితే ఇక్కడ మేము చంపబడి ఉండే వాళ్ళము కాము. (3: ఆలె ఇమ్రాన్ : 154).
మరో చోట ఇలా చెప్పబడింది:
ٱلَّذِينَ قَالُوا۟ لِإِخْوَٰنِهِمْ وَقَعَدُوا۟ لَوْ أَطَاعُونَا مَا قُتِلُوا۟ వారు “గనక” మా మాటలు ఆలకించివున్నట్లయితే చంపబడి ఉండేవారు కారు” అని అన్నవారు వీరే . (3: ఆలె ఇమ్రాన్ : 168).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని, అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “నీకు లాభం చేకూర్చేవాటిపై శ్రద్ధ వహించు. అందులో సహాయం కొరకు అల్లాహ్ ను అర్థించు. (విధివ్రాత పై నమ్మకం ఉంచి) పని చేయకుండా ఉండకు. సోమరితనానికి గురికాకు. ఆ తరువాత ఏదైనా నష్టం, ఆపద కలిగితే “అయ్యో! ఒకవేళ నేను ఇలా చేస్తే, అలా జరిగి ఉండేది” అని చెప్పకు. కాని “ఖద్దరల్లాహు మా షాఅ ఫఅల” (అల్లాహ్ విధి వ్రాసాడు. ఆయన కోరినట్లే జరిగింది) అని అనండి. “ఒకవేళ ఇట్లు చేస్తే” అన్న పదం షైతాన్ ద్వారాలు తెరుస్తుంది. (షైతానీయ కర్మలకు నాంది పలుకుతుంది). (ముస్లిం).
ముఖ్యాంశాలు:
1- సూరె ఆలె ఇమ్రాన్ లోని రెండు వాక్యాల భావం తెలిసింది. (అందులో నిషేధించిన పదం ఉపయోగించువారి ప్రస్తావన ఉంది). 2- ఏదైనా ఆపద, కష్టం వచ్చినప్పుడు “ఒకవేళ ఇలా చేస్తే” లాంటి పదాల ఉపయోగాన్ని స్పష్టంగా నిషేధించడం జరిగింది. 3- అది షైతానీయ కర్మలకు ద్వారము తెరుస్తుందని కూడా తెలియజేయబడింది. 4- దానికి బదులు మంచి పదాలు బోధించబడ్డాయి.
తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ):
గమనిక: మానవుడు పైన నిషేధించిన పదం రెండు రకాలుగా ఉపయోగిస్తాడు. ఒకరకం మంచిదైతే. రెండవది మంచిది కాదు. మరో విధంగా చెప్పాలంటే ఒకటి ప్రశంసనీయమైనది. రెండవది దానికి విరుద్ధం. ప్రశంసనీయానికి విరుద్ధమైనది ఎలా?
తనకిష్టము లేని ఒక సంఘటన తన పై లేక తన ద్వారా జరుగుతుంది. అప్పుడు అతను “ఒకవేళ నేను ఇలా చేస్తే అలా అయిఉండేది” అని అంటాడు. ఇదే షైతాన్ పని. ఎందుకనగా ఇందులో రెండు విధాల నివారణలున్నాయి.
ఒకటి: పశ్చాత్తాపము, కోపం, నిరాశ పెరుగుతుంది. ఇది లాభం లేదు. అందుకే ఈ పరిస్థితి రానివ్వదు.
రెండు: అల్లాహ్ పట్ల, ఆయన వ్రాసి ఉంచిన విధివ్రాత పట్ల ఉండవలసిన మర్యాదకు వ్యెతిరేకమగును. అన్ని విషయాలు, సంఘటనలన్నియు అందులో వ్రాసి ఉన్నాయి. అందులోని ఏది సంభవించనుందో, అది తప్పక సంభవించవలసినదే. దాన్ని ఎవరూ ఆపలేరు. “ఒకవేళ నేను, ఇట్లు చేస్తే, అట్లు చేస్తే” అనడంలో ఒక వింధంగా అభ్యంతరం ఉంటుంది. విధివ్రాతపై విశ్వాసం బలహీన పడుతుంది.
కావున వీటిని మానవుడు వదలనంత వరకు అతని విశ్వాసం సంపూర్ణం కాదు.
ప్రశంసనీయమైనది: ఏదైనా మేలును కోరుతూ అనుట. ఇది ప్రశంసనీయమైనది.
ఉదాహరణకు; అతని వద్ద ఉన్నంత ధనం ఒకవేళ నా వద్ద ఉంటే, అతను (ధర్మమార్గంలో) ఖర్చు చేసినట్లు నేను కూడా చేసేవాడిని”. ఏదైనా చెడును కోరుతూ అన్నట్లైతే అది ప్రశంసనీయమైనది కాదు. ఈ పదం పలికే వ్యక్తి కోపం, చింత, విధివ్రాతపై బలహీన విశ్వాసంతో పలికినట్లైతే అది తప్పు. అలా చెప్పకూడదు. ఒకరికి బోధ, విద్య లాంటి మంచిని కోరుతూ చెప్పిన్నట్లైతే అదే ప్రశంసనీయమైనది.
ఉబై బిన్ కఅబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు:
“మీరు గాలిని దూషించకండి. ఏదైనా అసహ్యకరమైనది చూసినచో ఈ దుఆ చదవండి: అల్లాహుమ్మ ఇన్నా నస్ అలుక మిన్ ఖైరి హాజిహిర్రీహి, వ ఖైరి మా ఫీహా, వ ఖైరి మా ఉమిరత్ బిహీ. వ నఊజు బిక మిన్ షర్రి హాజిహిర్రీహి, వషర్రి మా ఫీహా, వషర్రి మా ఉమిరత్ బిహీ. (తిర్మిజి).
అర్థము: (ఓ అల్లాహ్ ! ఈ గాలి యొక్క మంచిని, అందులో ఉన్న మంచిని మరియు దానికి ఇవ్వబడిన ఆజ్ఞ యొక్క మంచిని కూడ నీతో కోరుచున్నాము. ఈ గాలి యొక్క చెడు నుండి, మరియు అందులో ఉన్న చెడు నుండి, మరియు దానికి ఇవ్వబడిన ఆజ్ఞ యొక్క చెడు నుండి నీ శరణు కోరుచున్నాము).
ముఖ్యాంశాలు:
1- గాలిని దూషించుట నివారించబడింది. 2- అసహ్యకరమైనదేదైనా చూసినచో మంచి దుఆ చదవాలని బోధించబడింది. 3- తనకు దొరికిన ఆజ్ఞ ప్రకారం అది నడుస్తుంది. 4. ఒకప్పుడు దానికి లాభకరమైన ఆదేశం లభిస్తుంది. ఇంకొక్కప్పుడు నష్టకరమైన ఆదేశం లభిస్తుంది.
తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ):
వెనుకటి అధ్యాయంలో కాలాన్ని దూషించకండి అని చదివారు. ఇది కూడ అలాంటిది. కాని అది కాలం, అందులో సంభవించే సంఘటనలను దూషించుట నిషేధించబడింది. ఇందులో ప్రత్యేకంగా గాలిని దూషించుట నిషేధించబడింది.
నిషేధంతో పాటు ఇది పిచ్చితనము మరియు బుద్ధితక్కువతనం కూడాను. అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం గాలి వీస్తుంది. దాన్ని దూషించువాడు వాస్తవంగా అల్లాహ్ ను దూషిస్తున్నాడు. అల్లాహ్ ను దూషించినట్లవుతుంది అని ఆ వ్యక్తి బహుశ గ్రహించడు. గ్రహించినట్లయితే ఇది మరీ ఘోరంగా ఉంటుంది. కాని విశ్వాసి తప్పక గ్రహించాలి.
وَطَآئِفَةٌۭ قَدْ أَهَمَّتْهُمْ أَنفُسُهُمْ يَظُنُّونَ بِٱللَّهِ غَيْرَ ٱلْحَقِّ ظَنَّ ٱلْجَـٰهِلِيَّةِ ۖ يَقُولُونَ هَل لَّنَا مِنَ ٱلْأَمْرِ مِن شَىْءٍۢ ۗ قُلْ إِنَّ ٱلْأَمْرَ كُلَّهُۥ لِلَّهِ అల్లాహ్ ను గురించి అజ్ఞాన భూయిష్టమైన, సత్య దూరమైన, అనుమానాలు వ్యక్తం చెయ్యసాగారు. వారు ఇప్పుడు ఏమంటారంటే: “ఈ వ్యవహారాన్ని నడపటంలో మాకూ ఏదైనా భాగం ఉందా?” వారికి ఇలా చెప్పు : “(ఎవరికి ఏ భాగమూ లేదు) ఈ వ్యవహారానికి సంబంధించిన సమస్త అధికారాలూ అల్లాహ్ చేతుల్లో ఉన్నాయి”. (3: ఆలె ఇమ్రాన్ : 154).
మరో ఆదేశం:
وَيُعَذِّبَ ٱلْمُنَـٰفِقِينَ وَٱلْمُنَـٰفِقَـٰتِ وَٱلْمُشْرِكِينَ وَٱلْمُشْرِكَـٰتِ ٱلظَّآنِّينَ بِٱللَّهِ ظَنَّ ٱلسَّوْءِ ۚ عَلَيْهِمْ دَآئِرَةُ ٱلسَّوْءِ అల్లాహ్ విషయంలో కుశంకలు (చెడు అనుమానాలు) గలవారే చెడుల వలయంలోకి స్వయంగా వచ్చిపడ్డారు. (48: ఫత్ హా : 6).
మొదటి వాక్యం గురించి ఇబ్న్ ఖయ్యిం ఇలా చెప్పారు: ఇందులో ఉన్న “అనుమానం” ఇలా వ్యాఖ్యానం చేయబడింది: “అల్లాహ్ తమ ప్రవక్తకు సహాయం చేయడు. ఈయన ధర్మ ప్రచారం ఇంతటితో సమాప్తం” అని కపటవిశ్వాసులు అనుమానించారు.
ఇలా కూడా ఉంది: “ఈ (ఉహద్ యుద్ధంలో) ముస్లింలకు ఏ నష్టం ఏ కలిగిందో, అది అల్లాహ్ యొక్క విధివ్రాత మరియు వివేకానికి విరుద్ధంగా జరిగింది” అని వారు అన్నారు. అంతే కాదు “వారు విధివ్రాతను, అల్లాహ్ వివేకాన్ని తిరస్కరించారు. ప్రవక్త ప్రచారం ముందుకు సాగుట, ఈ సత్యధర్మం ఇతర అసత్య మతాలపై ఆధిక్యం వహించుటను తిరస్కరించారు వంచుకులు” అని కూడా వ్యాఖ్యానించబడింది.
అవిశ్వాసుల, కపటవిశ్వాసులు ఈ కుశంకల, అనుమానాల ప్రస్తావన సూరె ఫత్ హా లో కూడా వచ్చింది. ఈ కుశంకలు, అనుమానాలు అల్లాహ్ మర్యాదకు, ఆయన వివేకానికి, స్తోత్రానికి, వాగ్దానాకి మరియు సహాయానికి విరుద్ధం కనుక దీనిని దురభిమానం, కుశంకలు అనబడింది.
(ఇబ్ను ఖయ్యిం తెలిపిన వ్యాఖ్యానంలో మూడు విషయాలు తెలిసినవి): అల్లాహ్ అసత్యానికి సత్యం పై శాశ్వత విజయం ఇస్తాడని, అందు వలన సత్యం మట్టిలో కలసిపోతుందని లేక అది (ముస్లింలకు కలిగిన నష్టం) అల్లాహ్ వ్రాసిన విధివ్రాత ప్రకారం జరగలేదని. లేక అల్లాహ్ విధివ్రాత ప్రశంసనీయమైన సంపూర్ణ వివేకముతో లేదు, అది కేవలం అతని ఇష్టం అని ఎవరు అనుమానిస్తారో వారి ఈ అనుమానం అవిశ్వాసుల్లాంటి అనుమానమే. అందుకు వారికి నరక శిక్ష ఉంది.
అనేక మంది స్వయంగా తమ, లేక ఇతరుల వ్యవహారాల్లో అల్లాహ్ పట్ల చెడు అనుమానము పాటిస్తారు. అల్లాహ్ ను, ఆయన నామగుణాలను తెలుసుకున్నవారు, ఆయన వివేకము, స్తోత్రము యొక్క కారణాలను గమనించిన వారే ఈ దురఅనుమానము నుండి దూరంగా ఉండ గలుగుతారు.
తమ కొరకు మేలు గోరే బుద్ధిగలవారు అల్లాహ్ వైపునకు మరలి, ఆయన పట్ల గల సందేహాలను గురించి ఆయనతో క్షమాపణ కోరాలి.
ప్రజల సంభాషణల పై నీవు కొంత శ్రద్ధ వహిస్తే, చాలా మందిని విధివ్రాత, కర్మ పై ఆక్షేపము, అభ్యంతరము చేస్తూ “అది ఇలా ఉంటే బాగుండు, ఇది అలా ఉంటే బాగుండు” అని అంటూ చూస్తావు. హాఁ! ఈ గుణం కొందరిలో ఎక్కువ ఉంటే, మరికొందరిలో తక్కువ ఉంటుంది. అందులో నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు అన్నది కూడా చూడు సుమా! అరబిలో ఒక పద్యం ఉంది. దాని భావం: “నీవు దాని నుండి దూరమున్నావంటే చాలా పెద్ద గండము నుండి రక్షణ పొందావు. లేకుంటే నీవు రక్షణ పొందిన వారిలో లేవన్న మాట”.
ముఖ్యాంశాలు:
1- ఆలె ఇమ్రాన్ ఆయతు యొక్క వ్యాఖ్యానం. 2- సూరె ఫత్ హా ఆయతు యొక్క వ్యాఖ్యానం. 3- దురఅనుమానము యొక్క రకాలు లెక్కలేనన్ని ఉన్నాయి. 4- ఎవరు అల్లాహ్ ను, ఆయన నామగుణాలను మంచి విధంగా అర్థం చేసుకున్నారో వారే దాని నుండి రక్షణ పొందగలుగుతారు.
తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ):
అల్లాహ్ తెలిపిన తన నామములను, గుణములను విశ్వసించాలి, సత్యం అని నమ్మాలి. అదే విధంగా ధర్మమునకు మద్దతిస్తానని, సత్యమును స్థాపించి అసత్యమును ఖండిస్తానని చేసిన వాగ్ధానాల్ని సత్యం అని నమ్మాలి. దాన్ని విశ్వసించుట, దానిపై తృప్తి పడుట కూడా విశ్వాసమే.
“ఇబ్ను ఉమర్ ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షి! ఒకరి వద్ద ఉహద్ కొండంత బంగారం ఉండి, దాన్ని అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టినా, అతను విధివ్రాతపై విశ్వసించనంత వరకు దాన్ని అల్లాహ్ స్వీకరించడు. మళ్ళీ దానికి ఆధారంగా ప్రవక్త హదీసును వినిపించారు. “ఈమాన్ (విశ్వాసం) అంటే: అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన పంపిన గ్రంథాల్ని, ప్రవక్తల్ని, ప్రళయదినాన్ని మరియు విధివ్రాత యొక్క మంచి చెడులను విశ్వసించుట”. (ముస్లిం).
ఉబాద్ బిన్ సామిత్ తన పుత్రునికి హితువు చేస్తూ చెప్పారు:
“నా కుమారుడా! ఏ నష్టం నీకు కలుగనుందో, అది కలుగక తప్పదు అని, ఏ నష్టం నీకు కలుగ లేదో, అది ఎన్నటికీ నీకు కలుగదు అని విశ్వసించనంత వరకు నీవు విశ్వాస మాధుర్యాన్ని పొందలేవు. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను: “మొట్టమొదటిసారి అల్లాహ్ కలమును సృష్టించాడు. ఆ పిదప “వ్రాయి” అని దాన్ని ఆదేశించాడు. “ఏమి వ్రాయాలి ప్రభువు?” అని అది విన్నవించుకోగా “ప్రళయము వరకు అన్నిటి విధి (కర్మ) వ్రాయు”. నా పుత్రుడా! నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో విన్నాను: “ఎవరు ఈ విశ్వాసంపై కాకుండా మరో విశ్వాసంపై చనిపోతాడో అతను నా అనుచర సంఘంలోనివాడు కాడు”. (అబూ దావూర్, తిర్మిజి).
ముస్నద్ అహ్మద్ ఒక ఉల్లేఖనం ఇలా ఉంది: “మొట్టమొదట అల్లాహ్ సృష్టించినది కలము. తరువాత “వ్రాయి” అని దానికి ఆజ్ఞ ఇచ్చాడు. అది అప్పుడు ప్రళయం వరకు సంభవించేవాటన్నిటిని వ్రాసేసింది“. (5/317). ఇబ్ను వహబ్ ఉల్లేఖనలో ఉంది: “విధివ్రాత యొక్క మంచి, చెడు (అన్నిరకములను) విశ్వసించనివారిని అల్లాహ్ అగ్నిలో కాలుస్తాడు”.
ముస్నద్ అహ్మద్, సునన్ అబీ దావూద్ లో ఉంది, ఇబ్ను దైలమి చెప్పారు: నేను ఉబై బిన్ కఅబ్ వద్దకు వచ్చి “విధి విషయంలో నాలో కొన్ని సందేహాలున్నాయి. మీరు ఏదైనా హదీసు వినిపించండి. దానివలన అల్లాహ్ వాటిని నా నుండి దూరము చేయుగాకా“. అప్పుడు ఆయన చెప్పారు: “నీవు ఉహద్ కొండంత బంగారం దానం చేసినా, నీ విధివ్రాతను విశ్వసించనట్లయితే అల్లాహ్ దాన్ని స్వీకరించడు. అదే విధంగా నీకు ఏ ఆపద రానుందో అది రాక తప్పదు. ఏది రానులేదో, అది రానేరాదు. ఈ విశ్వాసానికి విరుద్ధంగా మరేదైనా విశ్వాసం పై నీవు మరణిస్తే నీవు నరకవాసి అవుతావు“. ఇది విన్న తరువాత నేను అబ్దుల్లా బిన్ మస్ ఊద్ , హుజైఫ్ బిన్ యమాన్ మరియు జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హుం వద్దకు వెళ్ళి ప్రశ్నించగా వారందరు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇదే హదీసు వినిపించారు. ఇది సహీ హదీసు. దీన్ని హాకిం తన సహీ గ్రంథంలో వ్రాసారు.
ముఖ్యాంశాలు:
1- విధివ్రాత ను విశ్వసించడం తప్పనిసరి. 2- ఎలా విశ్వసించాలి అని తెలిసింది. 3- దాన్ని విశ్వసించని వాని కర్మలు వృధా అవుతాయి. 4- దాన్ని విశ్వసించనంత వరకు విశ్వాస మాధుర్యాన్ని పొందలేరని తెలిసింది. 5- మొట్టమొదటి సారి అల్లాహ్ సృష్టించిందేమిటో (కలము) దాని ప్రస్తావన వచ్చింది. 6- ప్రళయం వరకు సంభవించే విధి (అన్నివిషయాలు), అదే సందర్భంలో వ్రాయబడింది. 7- విశ్వసించనివారితో ప్రవక్తకు ఏలాంటి సంబంధం లేదు. 8- పూర్వ పుణ్య పురుషులు పండితులతో ప్రశ్నించి తమ సందేహాలను దూరము చేసుకునేవారు. 9- సందేహాలు దూరమగుటకు పండితులు ఇచ్చిన జవాబుల పద్దతేమిటి? వారు ఆ విషయానికి సంబంధించిన, ప్రవక్త ﷺ హదీసు వినిపించేవారు.
తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ):
విధివ్రాతపై విశ్వాసం విశ్వాస మూలసూత్రాల్లో ఒకటని, అల్లాహ్ కోరునదే సంభవించునని, కోరనిది సంభవించదని మరియు ఇలా విశ్వసించనివాడు వాస్తవంగా అల్లాహ్ నే విశ్వసించలేదని ఖుర్ఆను, హదీసు మరియు ఇజ్ మాఎ ఉమ్మత్ ద్వారా రుజువైనది.
విధికి సంబంధించిన అన్ని విషయాల్ని మనము విశ్వసించాలి. అల్లాహ్ సర్వము తెలిసినవాడు. ప్రళయం వరకు సంభవించునటు వంటివి అన్నిటిని సురక్షితమైన గ్రంథం (లౌహె మహ్ ఫూజ్)లో వ్రాసిఉంచాడు. ప్రతీది ఆయన సృష్టి, శక్తి మరియు నిర్వహణకు లోబడి యున్నాయని విశ్వసించాలి. విధిపై విశ్వాసం సంపూర్ణమయ్యేది ఈ విశ్వాసంతో:- అల్లాహ్ తన దాసులను బలవంతము చేయలేదని, వారికి విధేయత, అవిధేయత యొక్క స్వేఛ్ఛ అనేది ఉన్నదని నమ్మాలి.
అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు: “అల్లాహు తఆలా ఇలా చెప్పాడు: “నేను సృష్టించిన తీరులో సృష్టించదులుచుకున్న వారికంటే పరమ దుర్మార్గులు మరెవ్వరు?. (మహా శక్తి గలవారైతే) ఒక అణువు లేక ఒక విత్తనం లేక జొన్న తయారు చే సి చూపండి“. (బుఖారీ, ముస్లిం).
ప్రవక్త బోధించారని, ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారు:
“ప్రళయదినాన అందరి కంటే కఠినమైన శిక్ష అల్లాహ్ సృష్టిని పోలిన వాటిని సృష్టించిన వారికి విధించబడుతుంది“. (బుఖారి, ముస్లిం).
ఇబ్ను అబ్బాస్ కథనం: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను:
“ప్రతీ చిత్రకారుడు నరకములో యుండును. అతను చిత్రించిన ప్రతి చిత్రానికి బదులు ఒక ప్రాణం వేయబడుతుంది. దాని ద్వారా అతన్ని శిక్షించడం జరుగుతుంది“. (బుఖారీ, ముస్లిం).
ఆయన ఉల్లేఖనలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారు:
“ఇహములో బొమ్మలు గీసేవాడ్ని అల్లాహ్ ప్రళయదినాన నిలదీసి ఈ బొమ్మలకు ప్రాణం పొయ్యి అని ఆజ్ఞాపిస్తాడు. కాని అతను ఆ బొమ్మలకు ప్రాణం పొయ్యలేడు“. (బుఖారి, ముస్లిం, లూలు).
అలీ రజియల్లాహు అన్హు నన్ను ఉద్దేశించి ఇలా చెప్పారని అబుల్ హయ్యాజ్ ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను ఏ కార్యము పై పంపారో దానిపై నిన్ను పంపనా?
“నీవు ఏ చిత్రాన్ని చూసినా దాన్ని తడిచివేయుము. ఎత్తైన ఏ సమాధిని చూసినా దాన్ని నేలమట్టము చేయుము”. (ముస్లిం).
ముఖ్యాంశములు:
1- చిత్రకారులకు కఠిన శిక్ష యున్నదని తెలుపబడింది.
2- దాని కారణము తెలుపబడింది. దాని పై శ్రద్ధ వహించాలి: అది అల్లాహ్ పట్ల మర్యాదకు వ్యెతిరేకం. అందుకే అల్లాహ్ తెలిపాడు: “నేను సృష్టించిన తీరులో సృష్టించదులుచుకున్న వారికంటే పరమ దుర్మార్గులు మరెవ్వరు?.
3- అల్లాహ్ శక్తిగలవాడు. వారు అశక్తులు. “ఒక అణువు లేక ఒక విత్తనం లేక జొన్న తయారు చేసి చూపండి” అని చెప్పబడును కాని ఎవ్వరూ తయారు చేయలేరు.
4- అందరికన్నా కఠినమైన శిక్ష వారికే గలదు.
5- ప్రతి చిత్రానికి బదులు అల్లాహ్ ఒక ప్రాణం తయారు చేసి వాటి ద్వారా వారికి శిక్ష ఇచ్చును.
6- అందులో ప్రాణం పోయుము అని కూడా అతనికి శిక్షించబడును.
7- చిత్రాలను చూసినచో వాటిని తొలిగించాలని ఆదేశం.
తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ):
ఇది గత అధ్యాయం లాంటిది. సంకల్పం, మాటలు, చేష్టలు అన్నిట్లో అల్లాహ్ తో ఇతరులను భాగస్వాములు చేయుట ఎంత మాత్రం తగదు. ప్రాణులను చిత్రించుట అల్లాహ్ సృష్టించిన సృష్టితాలను పోలినట్లగును. (ప్రపంచంలో మొట్టమొదట షిర్క్ ప్రారంభమైంది ఈ చిత్రాల ద్వారానే). అందుకే ఇస్లాం దీన్ని కఠినంగా నివారించింది.
అబూ హురైర కథనం: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను:
“అసత్య ప్రమాణం చేయడం వల్ల సరుకు అమ్ముడు పోతుంది గాని, వ్యాపారంలోని శుభం తరిగిపోతుంది“. (లూలు: 1035).
సల్మాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు:
“మూడు రకాల మనుషులతో అల్లాహ్ సంభాషించడు. వారిని (పాపాల నుండి) పరిశుద్ధ పరచడు. వారికి కఠిన శిక్ష కలుగును: వృద్ధ వ్యభిచారుడు. అహంకారము గల యాచకుడు. అల్లాహ్ (పేరున ప్రమాణాన్ని) ఒక సరుకుగా చేసుకున్న వ్యక్తి. ఏది కొన్నా ప్రమాణం చేస్తాడు. ఏది అమ్మినా ప్రమాణం చేస్తాడు”. (తబ్రాని సహీ సనద్ తో ఉల్లేఖించారు).
ఇమ్రాన్ బిన్ హుసైన్ రజియల్లాహు అన్హు కథనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు:
“మీలో నా జీవితకాలంలో ఉన్నవారు అందరికంటే ఎంతో శ్రేష్ఠులు. ఆ తరువాత నా జీవిత కాలానికి సమీప కాలంలో ఉండేవారు (అందరికంటే శ్రేష్ఠులు). ఆ తరువాత వారి సమీప కాలంలో ఉండేవారు”.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ జీవిత కాలం తరువాత రెండు కాలాలను ప్రస్తావించారా లేక మూడు కాలాలను ప్రస్తావించారా అనే సంగతి నాకు తెలియదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా అన్నారు:
“ఆ తరువాత వచ్చేవారు తమంతట తామే (ఇతరులు అడగక పోయినా) సాక్ష్యమిస్తారు. ఎదైనా మొక్కుబడి చేసుకుంటే దాన్ని నెరవేర్చరు. వారిలో అత్యధిక మంది స్థూలకాయలుగా ఉంటారు“.(లూలు: 1647).
అబ్దుల్లా బిన్ మస్ ఊద్ కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
“నా జీవిత కాలంలో ఉండేవారు అందరికంటే ఎంతో శ్రేషులు. ఆ తరువాత నా జీవిత కాలానికి అతి సమీప కాలంలో ఉండేవారు ఎక్కువ శ్రేష్ఠులు. ఆ తరువాత వారి కాలానికి సమీప కాలంలో ఉండేవారు శ్రేషులు. ఆ తరువాత వచ్చేవారు (పనికి మాలినవారు) వారి సాక్ష్యం వారి ప్రమాణాన్ని, వారి ప్రమాణం వారి సాక్ష్యాన్ని మించిపోతాయి”. (లూలు: 1646).
ఇబ్రాహీం నఖ్ ఈ చెప్పారు :
“మా బాల్యంలో మా పెద్దలు సాక్ష్యం మరియు వాగ్దానం విషయంలో మమ్మల్ని అదుపులో ఉంచడానికి దండించేవారు“. (అహ్మద్: 1/378,417).
ముఖ్యాంశాలు:
1- ప్రమాణాలను కాపాడాలని హితువు చేయబడింది.
2- ప్రమాణంతో సరుకు అమ్ముడుపోతుంది, గాని వ్యాపారంలో శుభం ఉండదని తెలిసింది.
3- ప్రమాణంతో సరుకు అమ్మే, కొనే వారి గురించి కఠిన శిక్ష ఉంది.
4- పాప కారణాలు చిన్నవిగా ఉన్నప్పటికి, దాని శిక్ష పెద్దదిగా ఉండవచ్చును.
5- అడగక ముందే తమంతట తాము ప్రమాణం చేయువారు ప్రశంసించబడలేదు.
6- మొదటి మూడు కాలాలు లేక నాలుగు కాలాలను ప్రశంసించడమైనది. ఆ తరువాత ఏమి జరుగనుందో తెలుపబడింది.
7- అడగక ముందే సాక్ష్యం పలికే వారు ప్రశంసలకు అర్హులు కారు.
8- పూర్వకాలంలోని పుణ్యపురుషులు తమ సంతానానికి సాక్ష్యం, వాగ్దానం విషయంలో (మంచి శిక్షణ ఇవ్వడానికై) దండించేవారు.
తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ):
ఒక విషయాన్ని నొక్కి చెప్పటానికి ప్రమాణం చేయుట ధర్మసమ్మతం అని తెలుపబడింది. ఇంకా అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని పాటించుటకు. అందుకే అల్లాహ్ ప్రమాణం చేయుట మాత్రమే విధిగా నిలిచింది. అల్లాహ్ యే తరుల నామముతో ప్రమాణం చేయుట షిర్క్ అనబడింది.
ఈ మర్యాద యొక్క హక్కు ఏమనగా: సత్య విషయంలోనే ప్రమాణం చేయాలి. అధికంగా ప్రమాణం చేయకుండా అల్లాహ్ యొక్క గౌరవమును కాపాడాలి. అసత్య ప్రమాణం మరియు అధిక ప్రమాణం ఇవి రెండూ గౌరవ మర్యాదలు మరియు గొప్పతనానికి విరుద్ధం.
وَأَوْفُوا۟ بِعَهْدِ ٱللَّهِ إِذَا عَـٰهَدتُّمْ “మీరు అల్లాహ్ తో ఏదైనా వాగ్దానం చేసినప్పుడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చండి. (16: నహ్ల్ : 91).
బురైద రజియల్లాహు అన్హు కథనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరినైనా సైన్యాధిపతిగా నిర్ణయించినప్పుడు “అల్లాహ్ తో భయపడు, నీతో ఉన్న ముస్లింలతో మంచిగా ప్రవర్తించు” అని అతనికి హితవు చేసేవారు.
మళ్ళి (ఒకసారి) ఇలా చెప్పారు:
“అల్లాహ్ పేరుతో పోరాడండి. అల్లాహ్ ను తిరస్కరించినవానితో పోరాడండి. యుద్ధ ధనం దొంగలించకండి. వాగ్దాన వ్యెతిరేకం చేయకండి. హతుని అవయవాలను కోయకండి. బాలలను హతమార్చకండి. ముష్రికులైన (బహుదైవారాధకులైన) నీ శత్రువులు కలసినప్పుడు మూడు విషయాలు వారి ముందు ప్రస్తావించు: అందులో ఏ ఒక్కదాన్ని స్వీకరించినా, దాన్ని మీరు ఒప్పుకోండి. యుద్ధం నుండి దూరంగా ఉండండి. మొదట వారికి ఇస్లాం గురించి బోధించు.
వారు ఇస్లాం స్వీకరిస్తే, వారిని వారు ఉండే (దారుల్ కుఫ్ర్) ప్రాంతం నుండి ముస్లింలుండే (దారుల్ ఇస్లాం) ప్రాంతానికి వలస పోవాలని చెప్పు. వారు వలస వెళితే, ముందు నుండి అక్కడ (దారుల్ ఇస్లాంలో) ఉన్నవారికి లభించే లాంటి హక్కులు మీకు లభించును. వారి పై ఉన్నటువంటి బాధ్యతలు మీపై ఉండును(*).
వలస పోవుటకు నిరాకరిస్తే, వారితో ఎడారి అరబ్బుల తీరులో ప్రవర్తించ బడును. అనగా అల్లాహ్ ఆదేశాలు వారిపై జారి అగును. యుద్ధఫలంలో వారికి ఎలాంటి భాగం ఉండదు. వారు యుద్ధంలో పాల్గొంటే తప్ప. (అప్పుడు భాగం ఉండును). ఇస్లాం స్వీకరించకున్నట్లయితే పన్ను (కప్పం) చెల్లించండని తెలుపు. చెల్లిస్తామని ఒప్పుకుంటే, వారి మాటను నమ్ము. వారిపై యుద్ధానికి సిద్ధం కావద్దు. ఇది కూడా నిరాకరిస్తే, అప్పుడు అల్లాహ్ తో సహాయాన్ని అర్థించి, పోరాడు.
కోటలో ఉన్న (శత్రువులను) నీవు ముట్టడించినప్పుడు, అల్లాహ్ ఆయన ప్రవక్త పూచి మీద (వారితో సంధి చేయండని) నీతో వారు కోరితే, నీవు వారికి అల్లాహ్ ఆయన ప్రవక్త పూచి ఇవ్వకు. స్వయం నీ పూచి, నీస్నేహితుల పూచి మీద (సంధి చేయుము). అల్లాహ్ ఆయన ప్రవక్త పూచికి వ్యెతిరేకం చేయుటకన్నా మీ పూచి, మీ స్నేహితుల పూచికి వ్యెతిరేకము చేయుట సులభము. కోటలో ఉన్న శత్రువులను ముట్టడించినప్పుడు అల్లాహ్ యొక్క తీర్పు ప్రకారం (మీతో సంధి) కోరితే, అలా చేయకు. నీ తీర్పు ప్రకారం (సంధికి) సిద్ధం కావాలని చెప్పుము.. ఎందుకనగా నీవు అల్లాహ్ తీర్పు ప్రకారం (తీర్పు చేయగలవని) నీకు తెలుసా?. (ముస్లిం).
(*) (ఇది. సంపూర్ణ న్యాయం. స్వదేశియులకే అన్ని హక్కులు అనుట న్యాయం కాదు. స్వదేశియులకు లభించే యుద్ధ ఫలం వారికి లభిస్తుంది. స్వదేశియులు చేయునటివంటి యుద్ధం. అందులో సహాయం వారూ చేయాలి.
ముఖ్యాంశాలు:
1- అల్లాహ్ పూచి, ఆయన ప్రవక్త పూచి మరియు ముస్లిముల పూచి మధ్యలో వ్యత్యాసం ఉంది.
2- రెండు అపాయాలు ఎదురైనప్పుడు అందులో (ఏ ఒకటి చేయక తప్పనప్పుడు) తేలికైనదాన్ని చేసుకోవాలి.
3- అల్లాహ్ పేరుతో యుద్ధం చేయాలి.
4- అల్లాహ్ ను తిరస్కరించినవారితో పోరాడండి.
5- అల్లాహ్ సహాయాన్ని అర్థించి, వారితో పోరాడండి.
6- అల్లాహ్ తీర్పులో, పండితుల (నాయకుల) తీర్పులో వ్యత్యాసం ఉంది.
7- ప్రవక్త సహచరుడు కూడా ఏదైనా తీర్పు చేసినప్పుడు అది అల్లాహ్ తీర్పుకు అనుకూలంగా ఉంటుందా లేక ప్రతికూలంగా ఉంటుందా అన్న విషయం అతనికి తెలియదు.
తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ):
శత్రువులకు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పూచి ఇచ్చి, దానికి వ్యెతిరేకం చేయుట లాంటి పరిస్థితుల నుండి జాగ్రత్తగా ఉండాలన్నదే ఈ అధ్యాయం యొక్క ప్రస్తావన ఉద్దేశం. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి సంభవిస్తుందో, అప్పుడు ముస్లింలు అల్లాహ్, ఆయన ప్రవక్త పూచి విలువను కాపాడ లేదని, అల్లాహ్ గౌరవమును విడనాడారని మరియు రెండు అపాయాలు ఎదురైన సందర్భం లో (చిన్నదాన్ని ఎదురుకోవాలన్న హితువు మరచి) పెద్ద దానికి గురైన వారయ్యారన్న భావం. ఇంకా ఇది స్వయంగా మన ధర్మాన్ని మనం హేళన చేసినట్లు, మన ధర్మం పట్ల అవిశ్వాసులకు అసహ్యం కలిగించినట్లు అగును. అదే వాటిని పూర్తి చేయుట, ప్రత్యేకంగా మరీ దృఢముగా చేసిన ప్రమాణాలను తప్పక పూర్తి చేయుట వలన స్వయంగా మన ఇస్లాం యొక్క మంచితనాన్ని (మన ఆచరణ ద్వారా) వారి ముందు ఉంచిన వాళ్ళ మగుదుము. ఇలా వారిలోని న్యాయశీలురు ఇస్లాంను సరియైన పద్ధతిలో అర్థంచేసుకోగలరు. తదుపరి దాన్ని గౌరవించి, అనుసరించ గలరు.
జుందుబ్ బిన్ అబ్ధుల్లాహ్ రజియల్లాహు అన్హు కథనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: ఒక వ్యక్తి “అల్లాహ్ ప్రమాణంగా, అల్లాహ్ ఫలాన వ్యక్తిని క్షమించడు” అని అన్నాడు. అప్పుడు అల్లాహ్ అన్నాడు: “నేను ఫలాన వ్యక్తిని క్షమించనని నా పేరున, నాపై ప్రమాణం చేసేవాడెవడు ఇతను. నేను నిశ్చయంగా అతడ్ని (ఫలాన వ్యక్తిని) క్షమించాను. నీ (ప్రమాణం చేసినవాని) కర్మలను వ్యర్థం చేసాను. (ముస్లిం).
అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసులో ఉంది: ఆ పదాలు పలికినవాడు ఒక ఆబిద్. (నిరంతరం ఆరాధనలో ఉండేవాడు). మళ్ళి అబూ హురైరా చెప్పారు: “అతను పలికిన ఒక మాట, అది అతని ఇహ పర రెండు లోకాల్ని నాశనం చేసింది“. (అబూ దావూద్).
ముఖ్యాంశాలు:
1- అల్లాహ్ పై ప్రమాణం చేయుట నుండి హెచ్చరించబడింది.
2- నరకం మన చెప్పుల వారు కంటే దగ్గరగా ఉంది.
3- స్వర్గం కూడా అలాగే.
4- “కొన్ని సందర్భాల్లో మానవుడు మాట్లాడే మాట వల్ల, అతను నరకంలోని అతి క్రింది భాగంలో పడిపోతాడు” అని ఉల్లేఖించబడిన హదీసు యొక్క సాక్ష్యాధారం ఉంది ఈ అధ్యాయంలో.
5- ఒకప్పుడు మానవుడు ఏ విషయాన్ని అతి అసహ్యకరమైనదిగా, విలువలేనిదిగా భావిస్తాడో, దాని వలనే అతన్ని (అల్లాహ్) మన్నిస్తాడు.
తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ):
ఇది, దీని తరువాత అధ్యాయంలో వచ్చిన విషయం వాస్తవంగా అల్లాహ్ పట్ల ఉండవలసిన మర్యాదకు వ్యెతిరేకం. తౌహీదు విరుద్ధం కూడాను. అల్లాహ్ పై ప్రమాణం అనేది ఎక్కువశాతం మానవునిలో వచ్చేది, తన కర్మలపై తనకు తాను అధికంగా అనవసరంగా సంబర పడినప్పుడు. అహంకార భావానికి గురైనప్పుడు. ఇలాంటి వాటి నుండి జాగ్రత్త పడనంత వరకు విశ్వాసం సంపూర్ణం కాదు.
జుబైర్ బిన్ ముత్ ఇమ్ కథనం: ఒక ఎడారిలో ఉండే అరబ్బు వ్యక్తి (పల్లెటూరి మనిషి) ప్రవక్త వద్దకు వచ్చి “(పోయేవారి) ప్రాణాలు పోతున్నాయి. (ఉండేవారి) కడుపులు మండుతున్నాయి. ధనసంపద మట్టిలో కలసిపోతుంది. మీ ప్రభువుతో వర్షానికై అర్థించండి. మేము అల్లాహ్ ను మీ ఎదుటకు సిఫారసుగా ఉంచుతాము, మిమ్మల్ని అల్లాహ్ వద్ద సిఫారసుగా ఉంచుతాము” అని అన్నాడు. ఇది విన్న వెంటనే ప్రవక్త ﷺ “సుబ్ హానల్లాహ్, సుబ్ హానల్లాహ్ ” అని అంటూ పోయారు. దాని ప్రభావం చివరికి సహచరుల ముఖాల మీద ప్రతిబింబించింది. మళ్ళీ ప్రవక్త ﷺ “నీ పాడుగాను! అల్లాహ్ అంటే తెలుసా? ఇలాంటి మాటలకు (గీతపై ఉన్న పదాలు) అల్లాహ్ ఉన్నతుడు, గొప్పవాడు. అల్లాహ్ ను ఒకరి ఎదుట సిఫారసుగా ఉంచరాదు సుమా” అని బోధించారు. (అబూ దావూద్ ).
ముఖ్యాంశాలు:
1. అల్లాహ్ ను మీ వద్దకు సిఫారసిగా చేస్తున్నాము అన్న వ్యక్తి పట్ల (సుబ్ హానల్లాహ్ అంటూ) అది మంచిది కాదని వ్యక్తం చేశారు.
2- (ఆ ఎడారి అరబ్బు అన్న మాటకు ప్రవక్త ﷺ ముఖ ప్రతిబింబాలు మారాయి, మారినట్లు సహచరుల ముఖాల ద్వారా కూడా స్పష్టం అయ్యింది.
3- “మిమ్మల్ని అల్లాహ్ వద్ద సిఫారసుగా ఉంచుతాము” అన్న అతని మాటను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘తప్పు’ అని చెప్పలేదు. (ఎందుకనగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత కాలంలో అలా అనుట ధర్మసమ్మతమే).
4- ఈ సందర్భంలో ‘సుబ్ హానల్లాహ్’ అనుట ఎంత సమచితమో అర్థమయింది.
5- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత కాలంలో సహచరులు వర్షం కొరకు దుఆ చేయాలని ఆయనతో కోరేవారు.
తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ):
అల్లాహ్ చాలా గొప్పవాడు. ఆయన్ను సిఫారసు చేయుటకు ఆయన దాసుల ఎదుట ప్రస్తావించుట – ఇది ఆయన గొప్పతనానికి విరుద్ధం. సామాన్యంగా ఎవరి ఎదుట సిఫారసు చేయబడుతుందో అతను సిఫారసు చేసే వ్యక్తి కంటే ఉన్నత స్థానంలో ఉంటాడు. ఇలా అల్లాహ్ ను ఆయన దాసుల ఎదుట సిఫారసు కొరకు నిలబెట్టుట అల్లాహ్ అమర్యాద అగును. ఎప్పుడు అలా చేయకూడదు. సిఫారసు చేసేవారు అల్లాహ్ వద్ద ఆయన అనుమతి లేనిది సిఫారసు చేయలేరు. వారందరు భయపడుతుంటారు. ఇక అల్లాహ్ ను వారి ఎదుట సిఫారసిగా నిలబెట్టుట ఎలా సంభవం, అలోచించండి. ఆయన ఎంత గొప్ప వాడో తెలియదా? సర్వ జగత్తు ఆయన ముందు తలవంచి, విధేయత చూపుతుంది.
అబ్దుల్లా బిన్ షిబ్బీర్ కథనం: బనీ ఆమిర్ సంఘంతో నేను ప్రవక్త వద్దకు వెళ్ళాను. “మీరు మా సయ్యిద్” అని మేమన్నాము. అప్పుడు ప్రవక్త ఈ “శుభం గలవాడు, గొప్పవాడైన అల్లాహ్ యే సయ్యిద్” అని చెప్పారు. “మాలో మీరు ఎక్కువ ఘనత, ఉన్నత స్థానం గలవారు” అని వారన్నారు. “ఇలాంటి సముచితమైన పదాలు పలకండి పరవాలేదు. కాని షైతాన్ వలలో పడకుండా జాగ్రత్తగా ఉండండని” ప్రవక్త చెప్పారు. (అబూ దావూద్).
అనస్ రజియల్లాహు అన్హు కథనం: కొందరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, “మాలో శ్రేష్ఠులు, మాలో శ్రేష్ఠులైన వారి కుమారులు, మాలోని సయ్యిద్, మాలోని సయ్యిద్ యొక్క కుమారులైన ఓ ప్రవక్తా!” అని అన్నారు. అది విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఓ ప్రజలారా! మీరనే మాటలు అనండి. కాని షైతాన్ మిమ్మల్ని మనోవాంఛలకు గురి చేసి, దుర్మార్గంలో పడవేయకుండా జాగ్రత్త పడండి. నేను ముహమ్మద్. అల్లాహ్ దాసుడిని, ఆయన ప్రవక్తని. అల్లాహ్ నన్ను ఏ స్థానంలో ఉంచాడో, దానికి మీరు మితిమీరుట నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు“. (నసాయి).
ముఖ్యాంశాలు:
1- ‘గులువ్వు’ (మీతిమీరుట) నుండి హెచ్చరించబడింది. 2- ‘మీరు సయ్యిద్’ అని ఎవరిని అనబడిందో, అతను జవాబులో ఏమనాలనేది తెలిసింది. 3- వారు అన్న మాట తప్పేమి కాదు. అయినా షైతాన్ వలలో పడకుండా జాగ్రత్తగా ఉండండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. 4- అల్లాహ్ నాకు ప్రసాదించిన స్థానాని కంటే మీరు నన్ను ఇంకాపైకి ఎత్తకండి అన్న దాని భావం స్పష్టంగా ఉంది.
తాత్పర్యము:
ఇలాంటి అధ్యాయం వెనుకటి పేజిల్లో మీరు చదివారు. కాని సందర్భాన్ని బట్టి రచయితగారు మళ్ళీ ప్రస్తావించినారు. షిర్క్ వరకు చేర్పించే మార్గాలను మూసివేయనంత వరకు తౌహీద్ సంపూర్ణం కాదు. అది భద్రంగా ఉండదు. ఈ అధ్యాయం మరియు వెనక చదివిన ఇలాంటి అధ్యాయంలో తేడా ఏమనగా: అది షిర్క్ వరకు చేర్పించే కర్మలతో, చేష్టలతో తౌహీద్ ను కాపాడాలని. ఇది వాజ్మూలిక సంబంధమైన షిర్క్ తో తౌహీద్ ను కాపాడాలని. షిర్క్ లో పడవేసే ‘గులువ్వు’ వరకు చేర్పించే ప్రతి మాట/పలుకు నుండి దూరంగా ఉండనంత వరకు తౌహీద్ సంపూర్ణం కాదు.
సారాంశమేమనగా: తౌహీద్ దాని షరతులతో, పునాదులతో, దాన్ని సంపూర్ణం చేయు విషయాలతో కూడి ఉండనంత వరకు మరియు దానికి విరుద్ధమైనవాటి నుండి, లోపము కలిగించేవాటి నుండి, బాహ్యంగా, గోప్యంగా, మాటల, చేష్టల ద్వారా, మరియు దృఢసంకల్పంతో, నమ్మకంతో దూరముండనంత వరకు సంపూర్ణం కాదు.
وَمَا قَدَرُوا اللَّهَ حَقَّ قَدْرِهِ وَالْأَرْضُ جَمِيعًا قَبْضَتُهُ يَوْمَ الْقِيَامَةِ وَالسَّمَاوَاتُ مَطْوِيَّاتٌ بِيَمِينِهِ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ వారసలు అల్లాహ్ కు తగిన విధంగా విలువనివ్వలేదు. ప్రళయదినాన యావత్తు భూమండలం ఆయన పిడికిలిలో ఇమిడి ఉంటుంది. ఆకాశాలు ఆయన కుడి చేతిలో చుట్టబడి ఉంటాయి. వారు చేస్తున్న షిర్కు (బహుదైవారాధన)కు ఆయన ఎంతో అతీతుడు. (39: జుమర్ : 67).
అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ కథనం: యూద మత పండితుడొకడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి ఇలా అన్నాడు: “ముహమ్మద్! మా గ్రంథాలలో ఈ విధంగా వ్రాసి ఉంది – అల్లాహ్ ప్రళయదినాన ఒక వ్రేలిపై సప్తాకాశాలను, మరొక వ్రేలిపై భూమండలాలను, వేరొక వ్రేలిపై వృక్షాలను, ఇంకొక వ్రేలిపై నేలను, ఒక వ్రేలిపై నీటిని, మిగిలిన సమస్త సృష్టి రాసుల్ని ఒక వ్రేలిపై ఎత్తి పట్టుకొని “నేనే విశ్వ సామ్రాజ్యాధినేతను” అని అంటాడు”.
ప్రవక్త ﷺ అతని మాట విని వాటిని ధృవపరుస్తున్నట్లు ఉల్లాసంతో నవ్వారు. ఆ నవ్వులో ఆయన చిగుళ్ళు కుడా కన్పించాయి. ఆ తరువాత ప్రవక్త ﷺ ఈ ఆయతు పఠించారు: వారు అసలు అల్లాహ్ కు తగిన విధంగా విలువనివ్వలేదు. ప్రళయదినాన యావత్తు భూమండలం ఆయన పిడికిలిలో ఇమిడి ఉంటుంది. ఆకాశాలు ఆయన కుడి చేతిలో చుట్టబడి ఉంటాయి. వారు చేస్తున్న షిర్కు (బహుదైవారాధన)కు ఆయన ఎంతో అతీతుడు. (39: జుమర్ : 67). (లూలు: 1774).
ముస్లింలో ఉంది: “పర్వతాలు, వృక్షాలు ఒక వ్రేలిపై ఎత్తిపట్టుకుంటాడు. మళ్ళీ వాటిని గట్టిగా ఊపి, “నేనే విశ్వ సామ్రాజ్యాధినేతను, నేనే అల్లాహ్ ను” అని అంటాడు. బుఖారిలో ఉంది: “ఆకాశాల్ని ఒక వ్రేలిపై, నీటిని, నేలను ఇంకొక వ్రేలిపై, మిగిలిన సృష్టినంతా మరొక వ్రేలిపై తీసుకుంటాడు”.
ముస్లింలో ఇబ్ను ఉమర్ యొక్క ‘మర్ ఫూ’ ఉల్లేఖనం ఇలా ఉంది: “అల్లాహ్ ప్రళయదినాన ఆకాశాల్ని చుట్టి తన కుడి చేతిలో తీసుకుంటాడు. మళ్ళి “నేనే విశ్వసామ్రాజ్యాధినేతను. ప్రపంచంలో విర్రవీగే, అహంకారానికి గురైన రాజులు ఎక్కడున్నారు? అని ప్రశ్నిస్తాడు. తరువాత సప్త భూమండలాల్ని చుట్టి తన ఎడమ చేతిలో తీసుకుంటాడు. మళ్ళి “నేనే విశ్వసామ్రాజ్యాధినేతను (ప్రపంచంలో) విర్రవీగే, అహంకారానికి గురైన రాజులు ఎక్కడున్నారు? అని ప్రశ్నిస్తాడు.
ఇబ్ను జరీర్ కథనం: నాకు యూనుసు హదీసు వినిపించారు, మాకు ఇబ్ను వహబ్ తెలిపారు, ఇబ్ను జైద్ చెప్పారు, నాకు నా తండ్రి హదీసు వినిపించారు, ప్రవక్త ప్రవచించారు: “(అల్లాహ్ యొక్క) కుర్చీ ఎదుట సప్తాకాశాలు ఒక డాలులో ఏడు దిర్ హంలు వేసినట్లు“. (ఇబ్ను జరీర్: 317. ఇబ్ తాలుత్ తన్ దీద్: 170. ఫీహీ అబ్దుర్ రహ్మాన్ బిన్ జైద్ జఈఫ్).
అబూ జర్ గిఫారి కథనం: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను. “అర్ష్ (అల్లాహ్ సింహాసనము) ఎదుట కుర్చీ , ఒక విశాలమైన ఎడారి భూమిలో ఒక ఇనుప కడం (వ్రేళ్ళ మెట్ట) పడి ఉన్నట్లే“. (బైహఖి ఫిల్ అస్మా…: 404. ఇబ్ను కసీర్).
అబ్ధుల్లాహ్ బిన్ మస్ ఊద్ కథనం: “మొదటి ఆకాశం మరియు రెండవ ఆకాశం మధ్య ఐదు వందల సంవత్సరాల దూరముంది. అదే విధంగా ప్రతీ రెండు ఆకాశాల మధ్య. ఏడవ ఆకాశము మరియు కుర్చీ మధ్య ఐదు వందల సంవత్సరాల దూరము. కుర్సీ మరియు నీళ్ల మధ్య ఐదు వందల సంవత్సరాల దూరము. అర్ష్ నీళ్ళపై ఉంది. అల్లాహ్ అర్ష్ పై ఉన్నాడు. మీరు చేసే కర్మలు అల్లాహ్ కు గోప్యంగా ఏమి లేవు“. (ఈ హదీసు ఇబ్ను మహ్దీ , హమ్మద్ బిన్ సల్మాతో, ఆయన ఆసింతో, ఆయన జుర్ తో, ఆయన అబ్దుల్లాతో ఉల్లేఖించారు. అదే విధంగా మసూది, ఆసింతో, ఆయన అబూ వాయిల్తో, ఆయన అబ్దుల్లాతో ఉల్లేఖించారు. ఈ విషయం హాఫిజ్ జహ్ బి తెలుపుతూ, ఈ హదీసు ఉల్లేఖన పరంపరాలు ఇంకెన్నో ఉన్నాయి అని చెప్పాడు.
అబ్బాసుబ్ను అబ్దుల్ ముత్తలిబ్ కథనం: ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “భూమ్యాకాశాల మధ్య దూరము ఎంతో మీకు తెలుసా?” అని అడిగారు. “అల్లాహ్ ఆయన ప్రవక్తకే బాగా తెలుసు” అన్నాము. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: “వాటి మధ్య ఐదు వందల సంవత్సరాల దూరముంది. ప్రతి రెండు ఆకాశాల మధ్య అంతే దూరముంది. ప్రతి ఆకాశము యొక్క స్థూలము కూడా అంతే ఉంది. ఏడవ ఆకాశము మరియు అర్ష్ మధ్య సముద్రం ఉంది. సముద్రం పై భాగము మరియు క్రింది భాగము మధ్య దూరము భూమ్యాకాశాల మధ్య ఉన్నంత దూరము. అల్లాహ్ దానిపై ఉన్నాడు. మానవులు చేసే కర్మలు ఆయనకు గోప్యంగా లేవు“. (అహ్మద్ 1/206. అబూ దావూద్).
ముఖ్యాంశాలు:
1- భూమండలం ఆయన పిడికిలిలో ఉంది అనే వాక్యం యొక్క వివరణ తెలిసింది.
2- ఈ అధ్యాయంలో తెలుపబడిన విషయాలు యూదుల (మత గ్రంథాల్లో ) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కూడా ఉండినవి. వారు వాటిని తిరస్కరించనూ లేదు. దానికి వేరే భావం తెలుపనూ లేదు.
3- యూద మత పండితుడు ఆ విషయం ప్రస్తావించిన తరువాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాన్ని ధృవికరించారు. ఖుర్ఆన్ వాక్యాలు అవతరించాయి.
4- ఈ గొప్ప విషయం ఆ యూద మత పండితుడు చెప్పినందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నవ్వారు.
5- అల్లాహ్ కు రెండు చేతులున్నవని మరియు కుడి చేతిలో ఆకాశాలు, మరో చేతిలో భూమండలాలు ఉండునని తెలిసింది.
6- ఎడమ చేయి ఉంది అని కూడా తెలిసింది.
7- ప్రపంచంలో విర్రవీగిన, తలబిరుసుతనానికి, అహంకారానికి గురైనవారు ఎక్కడ ఉన్నారు? అని అప్పుడు అల్లాహ్ అంటాడు.
8- మనిషి చేతిలో రవ్వ గింజ ఉన్నట్లు, అల్లాహ్ చేతిలో భూమ్యాకాశాలు ఉండును.
9- కుర్సీ ఆకాశము కన్నా చాల పెద్దది.
10- అర్ష్ కుర్సీ కన్నా పెద్దది.
11- అర్ష్ వేరు, కుర్సీ మరియు నీళ్ళు వేరు.
12- ప్రతి రెండు ఆకాశాల మధ్య దూరము తెలుపబడింది.
13- ఏడవ ఆకాశం మరియు కుర్సీ మధ్య దూరము తెలుపబడింది.
14- కుర్సీ మరియు నీళ్ల మధ్య దూరము తెలుపబడింది.
15- అల్లాహ్ యొక్క అర్ష్ నీళ్ళపై ఉంది.
16- అల్లాహ్ అర్ష్ పై ఉన్నాడు.
17- భూమ్యాకాశాల మధ్య దూరము తెలిసింది.
18- ప్రతి ఆకాశము యొక్క స్థూలము (దొడ్డు) ఐదు వందల సంవత్సరాల దూరము.
19- ఏడవ ఆకాశము మరియు అర్ష్ మధ్యలో ఉన్న లోతు ఐదు వందల సంవత్సరాల దూరము.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సంకలనం: ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అల్ ఖతీబ్ అత్ తబ్రీజీ పరిశీలన: షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ అల్ – అల్బానీ
తెలుగు అనువాదం: డా. అబ్దుర్రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా
అల్లాహ్ (త’ఆలా) స్తోత్రం తర్వాత ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను పూర్తిగా అనుసరించనంత వరకు విశ్వాస మాధుర్యాన్ని చవిచూడలేము. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ‘హదీసు‘లను పూర్తిగా అనుసరించినంత వరకే విధేయతా వాగ్దానం నెరవేరుతుంది. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వివరణల ద్వారానే ఖుర్‌ఆన్‌ను అనుసరించటం జరుగుతుంది. వీటిని గురించి వ్రాయబడిన పుస్తకాల్లో “మిష్కాతుల్ మ’సాబీ’హ్” ప్రముఖమైనది. ఇందులో వివిధ ‘హదీసు’లను చేర్చడం జరిగింది. దీన్ని సమకూర్చి, ప్రవక్త సాంప్రదాయాలను వ్యాపింపజేస్తూ, బిద్’అత్‌లను రూపుమాపడానికి ప్రయత్నించిన వారు, అబూ ము’హమ్మద్ ‘హుసైన్ బిన్ మస్’ఊద్ బిన్ ముహమ్మద్ అల్ ఫరాఅ’ అల్ బ’గవీ (రహిమహుల్లాహ్). అల్లాహ్ (త’ఆలా) అతని తరగతులను అధికం చేయుగాక. అతడు దీన్ని సమకూర్చినప్పుడు. ‘హదీసు’ల పరంపరల ధృవీకరణ, ఉల్లేఖకుల పేర్లను ప్రస్తావించలేదు. ఈ కారణంగా కొందరు ‘హదీసు’ వేత్తలు దీన్ని విమర్శించారు.
తరువాత ము’హమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అల్ ఖ’తీబ్ అత్ తబ్రే’జీ (రహిమహుల్లాహ్) గారు. బ’గవీ గారి మ’సాబీహ్‌లో గుర్తుల్లేని ‘హదీసు’లకు గుర్తింపుపెట్టారు. అంటే ‘హదీసు’వేత్తల, వారి పుస్తకాల పేర్లను పేర్కొన్నారు. ‘హదీసు’ ప్రారంభంలో ‘హదీసు’లను ఉల్లేఖించిన ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అనుచరుని పేరును, చివరలో ‘హదీసు’ను వ్రాసిపెట్టిన ‘హదీసు’వేత్తల పేర్లను, వారి పుస్తకాల పేర్లను కూడా పేర్కొనడం జరిగింది. బ’గవీ గారు సమకూర్చిన ఈ “అల్ మ’సాబీ’హ్” కు, ‘తబ్రీ’జీ గారు “మిష్కాతుల్ మసాబీహ్” అని పేరు పెట్టారు.
ఏవిధంగా బ’గవీ గారు తమ గ్రంథాన్ని 30 పుస్తకాలలో సమకూర్చారో తబ్రే’జీ గారు కూడా అలాగే చేసారు. బ’గవీ గారు ప్రతి అధ్యాయాన్ని 2 విభాగాలలో విభజించారు. మొదటి విభాగంలో బు’ఖారీ, ముస్లిమ్‌లు పేర్కొన్న ‘హదీసు’లను లేదా వారిద్దరిలో ఒక్కరు పేర్కొన్న ‘హదీసు’లను పెట్టారు. రెండవ విభాగంలో వీరిద్దరితో పాటు ఇతరులు కూడా ఉల్లేఖించిన ‘హదీసు’లను పేర్కొన్నారు. తబ్రే’జీ గారు మూడవ విభాగం అధికం చేసి ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అనుచరులు, తాబయీన్లు పేర్కొన్న ‘హదీసు’లను కూడా చేర్చారు.
“మిష్కాతుల్ మ’సాబీ’హ్” ప్రపంచంలో ఎన్నో ఇస్లామీ ధార్మిక పాఠశాలలో ముఖ్య ‘హదీసు’ అభ్యాస గ్రంథంగా బోధించబడుతుంది. కాబట్టి దీన్ని ఎన్నో భాషలలోనికి అనువాదాలు చేయబడ్డాయి.
దీని ఉర్దూ అనువాదం చాలామంది చేసారు. వారిలో ‘అబ్దుస్సలాం బస్తవీ (రహిమహుల్లాహ్) ఒకరు. వారు దీనికి మంచి అనువాదం మరియు వ్యాఖ్యానం వ్రాసారు. బస్తవీ గారు సందర్భాన్నిబట్టి ‘హదీసు’లను ఉల్లేఖించిన ప్రముఖ ప్రవక్త సహచరుల జీవిత విశేషాలను మరియు చారిత్రక విషయాలను కూడా వ్యాఖ్యానాలలో వివరించారు.
ఇతర భాషలలో ఎంత నేర్పున్నా, ఒక పుస్తకాన్ని – తమ మాతృభాషలో చదివితే కలిగే సంతృప్తి – ఇతర భాషలలో చదివితే దొరుకదు. కాబట్టి మేము ఈ “మిష్కాతుల్ మ’సాబీ’హ్” ను బస్తవీ గారి వ్యాఖ్యానంతో సహా సులభమైన తెలుగు భాషలో అందజేయటానికి ప్రయత్నించాము.
ఏవిషయానికి గురించయిన ‘హదీసు’ చూడాలనుకుంటే, ఈ “మిష్కాతుల్ మసాబీహ్” చాలు. ఎందుకంటే ఇందులో 13 మంది ‘హదీసు’వేత్తలు ప్రోగుపరచిన, అనేక విషయాలకు సంబంధించిన ‘హదీసు’లున్నాయి. వాటిని, ఆ ‘హదీసు’వేత్తలదే కాక అల్బానీగారి ధృవీకరణ కూడా ‘హదీసు’ మొదటలో పేర్కొనబడింది.
“మిష్కాతుల్ మసాబీహ్” యొక్క 6294 ‘హదీసు’లు రెండు సంపుటాలలో విభజించబడ్డాయి. మొదటి సంపుటంలో 11 పుస్తకాలు (1012 పేజీలు), రెండవ సంపుటంలో 19 పుస్తకాలు (1019 పేజీలు) ఉన్నాయి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇన్నల్ హంద లిల్లాహి నహ్మదుహూ వ నస్తఈనుహూ వ నస్తగ్ఫిరుహూ వ నఊజుబిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అఅమాలినా, మఁయ్యహ్ దిహిల్లాహు ఫలా ముజిల్లలహ్, వ మఁయ్ యుజ్లిల్ ఫలా హాదియ లహ్, వ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహ్, అమ్మాబఅద్.
ప్రియ పాఠకులారా! నిశ్చయంగా అల్లాహ్ కొన్ని విధులను విధించాడు వాటిని వృధా చేయడం యోగ్యం కాదు. కొన్ని హద్దులు నిర్ణయించాడు. వాటిని మీరడము యోగ్యం కాదు. మరి కొన్నింటిని నిషేధించాడు వాటికి పాల్పడడం యోగ్యం కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉదేశించారుః
“అల్లాహ్ తన గ్రంథంలో దేనిని ధర్మసమ్మతం/హలాల్ చేశాడో అదే హలాల్. దేనిని నిషిద్ధం/హరాం చేశాడో అదే హరాం. మరి దేని గురించి ఊరుకున్నాడో అది మీ కొరకు కుశలం (ఆఫియత్), అల్లాహ్ తరఫున ఉన్న ఈ కుశలాన్ని స్వీకరించండి. అల్లాహ్ మరచిపోలేదు సుమా”. మళ్ళీ ప్రవక్త ఈ ఆయతు పఠించారుః ]నీ ప్రభువు ఎన్నడూ మరచిపోయేవాడు కాదు. (మర్యం 19: 64). (హాకిం 2/375. గాయతుల్ మరాం(14)లో షేఖ్ అల్బానీ దీనిని సహీ అని అన్నారు).
అల్లాహ్ నిషిద్ధపరిచినవన్నీ అల్లాహ్ యొక్క హద్దులు. ఇక ఎవడు అల్లాహ్ నిర్ణయించిన హద్దులను అతిక్రమిస్తాడో వాస్తవానికి అతడు తనకు తాను అన్యాయం చేసుకున్నట్లు. (తలాఖ్ 65: 1).
అతని హద్దులను మితిమీరేవారిని, నిషేధాలకు పాల్పడేవారిని అల్లాహ్ ఇలా హెచ్చరించాడుః
ఎవడు అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు అవిధేయత చూపుతూ, అల్లాహ్ హద్దులను ఉల్లంఘిస్తాడో అల్లాహ్ అతడిని అగ్నిలో పడవేస్తాడు. అందులో అతను సదా ఉంటాడు. మరియు అతనికి అవమానకరమైన శిక్ష ఉంటుంది. (నిసా 4: 14).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశానుసారం నిషేధాల నుండి దూరముండుట తప్పనిసరి విధి:
“నేను దేని నుండి మిమ్మల్ని నివారించానో దాని నుండి దూరముండండి, దేని గురించి ఆదేశించానో మీ శక్తానుసారం దానిని ఆచరించండి”. (ముస్లిం1337).
మనోవాంఛల్ని అనుసరించే, బలహీన హృదయులు, అల్పజ్ఞానులు కొందరు మాటిమాటికి నిషేధాల గురించి విని, ఉఫ్ అని విసుక్కుంటూ ‘ప్రతీది నిషిద్ధమా? మీరు నిషిద్ధ పరచని ఏ వస్తువు అంటూ లేదు, మీరు మా జీవితాలను పాడు చేశారు. మా హృదయాల్ని ఇరుకు చేశారు. మీ వద్ద అది నిషిద్ధం, ఇది నిషిద్ధం అనడం తప్ప మరేమీ లేదా? ధర్మం చాలా సులభమైనది. అందులో చాలా విశాలత్వం ఉంది. అల్లాహ్ క్షమించే, కరుణించేవాడూ’ అని అంటూ ఉంటారు.
ఓ సోదరులారా! ఇలాంటి వారికి సమాధానమిస్తూ మేము చెప్పేది ఇదే:
నిశ్చయంగా అల్లాహు తఆలా తాను కోరినట్లు ఆజ్ఞాపిస్తాడు. ఆయన ఆజ్ఞలను ఆక్షేపించేవాడు ఎవడూ లేడు. ఆయన వివేచనాపరుడు, సమస్తం తెలిసినవాడు. తాను కోరిన దానిని ధర్మంసమ్మతంగా చేస్తాడు. తాను కోరిన దానిని నిషిద్ధపరుస్తాడు. ఆయన సర్వ లోపాలకు అతీతుడు. అల్లాహ్ పట్ల మన దాస్యత్వ పునాదుల్లో ఒకటి ఏమిటంటే; ఆయన ఇచ్చే ప్రతి ఆజ్ఞను సంతోషంతో స్వీకరించి దానికి యథాతథంగా శిరసావహించాలి.
అల్లాహ్ ఆదేశాలు పూర్తి జ్ఞానం, వివేకం మరియు న్యాయంతో జారీ అవుతాయి. లక్ష్యరహితంగా, వృధాగా ఏ ఆదేశమూ జారీకాదు. అల్లాహ్ యొక్క ఈ ఆదేశం శ్రద్ధగా చదవండి:
ఆయన వారికోసం పరిశుద్ధ వస్తువులను ధర్మసమ్మతం చేస్తాడు. అశుద్ధ వస్తువుల్ని నిషేధిస్తాడు. (అఅరాఫ్ 7: 157).
ఏ దానినైనా హలాల్ లేదా హరాం అని నిర్ణయించే హక్కు అల్లాహ్ కు మాత్రమే ఉంది. ఈ హక్కు అల్లాహ్ కు గాకుండా తనకు ఉన్నదని ఆరో పించేవాడు మరియు ఇలా ఆరోపణ చేసేవాడిని నిజము అని నమ్మేవాడు ఇద్దరూ మహా ఘోరమైన అవిశ్వాసానికి పాల్పడి, ఇస్లాం నుండి బహిష్క రించబడతారు. అల్లాహ్ ఆదేశం చదవండి:
అల్లాహ్ అనుమతించనిదే, ఏదైనా ఓ ధర్మమార్గం వారి కోసం నిర్ణయించే వారి భాగస్వాములు ఎవరైనా ఉన్నారా?. (షూరా 42: 21).
ఏ దానినైనా హలాల్ మరియు హరాం అని చెప్పే హక్కు ఖుర్ఆన్, హదీసుల విద్యగలవారికి తప్ప మరెవ్వరికీ లేదు. ధార్మిక జ్ఞానం లేకుం- డానే హలాల్, హరాం అని చెప్పేవారి గురించి కఠినమైన హెచ్చరిక ఉందిః
ప్రవక్తా వారికి ఇలా చెప్పండి, మీ ప్రభువు మీపై నిషేధించిన వాటిని రండి మీకు వినిపిస్తానుః ‘ఎవరినీ ఆయనకు భాగస్వాములగా చేయకండి, తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి, పేదరికానికి భయపడి మీ సంతా నాన్ని హత్య చేయకండి. (అన్ఆమ్ 6: 151).
అలాగే హదీసులో కూడా అనేక నిషిద్ధముల ప్రస్తావన ఉంది. ఉదాహరణకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ ఆదేశం:
“నిశ్చయంగా మత్తుపదార్థాలు, మృతి చెందిన జంతువు, పంది మాంసం మరియు విగ్రహాల వ్యాపారాన్ని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషిధ్ధ పరిచారు”. (బుఖారి 2236, ముస్లిం 1581). మరో ఆదేశం:
“నిస్సందేహంగా అల్లాహ్ ఒక వస్తువును తినుట నిషిద్ధ పరిచినప్పుడు దాని వెలను కూడా నిషిద్ధ పరిచాడు“. (అహ్మద్, అబూదావూద్ 3488).
ఖుర్ఆన్ మరియు హదీసుల కొన్ని సూత్రాల్లో ప్రత్యేకమైన కొన్ని రకాల నిషిద్ధముల ప్రస్తావన కూడా ఉంది. ఉదాహరణకు ఆహార సంబంధమైన నిషిద్ధములను ప్రస్తావిస్తూ అల్లాహ్ ఇలా తెలిపాడుః
మరణించిన (పశుపక్షాదులు), రక్తం, పంది మాంసం, అల్లాహ్ తప్ప ఇత రుల పేరుతో వధింపబడినవి మీ కొరకు నిషిద్ధం చేయబడ్డాయి. ఇంకా ఊపిరాడక, దెబ్బతిని, ఎత్తు నుండి పడి, దేనినైనా ఢీ కొని, క్రూరమృగం దాడితో మరణించిన పశుపక్షాదులు కూడా నిషిద్ధం చేయబడ్డాయి. కాని (అవి చావక ముందు) మీరు జిబహ్ చేసినట్లైతే నిషిద్ధం కావు. అలాగే ఆస్తానాల వద్ద వధించబడినది నిషేధం. మరియు పాచికల ద్వార అదృష్టం తెలుసుకోవటం కూడా నిషేధం. (మాఇద 5: 3).
నిషిద్ధమైన వివాహ సంబంధాల గురించి అల్లాహ్ ఇలా తెలిపాడుః
మీకు ఈ స్త్రీలు నిషేధించబడ్డారుః మీ తల్లులు, కుమార్తెలు, సోదరీమ ణులు, మేనత్తలు, తల్లిసోదరీమణులు, సోదరుల కుమార్తెలు, మేనకోడళ్ళు, పాలిచ్చిన తల్లి, మీతో పాటు పాలు త్రాగిన సోదరీమణులు, మీ భార్యల తల్లులు. (నిసా 4: 23).
సంపాదన మార్గాల్లో నిషిద్ధమైనదానిని అల్లాహ్ ఇలా తెలిపాడుః
అల్లాహ్ వ్యాపారాన్ని హలాల్ చేశాడు, వడ్డీని హరాం చేశాడు. (2:275).
అల్లాహ్ తన దాసుల పట్ల కరుణామయుడు కనుక రకరకాల అనేక మంచి వాటిని మన కొరకు హలాల్ చేశాడు. వాటి వివరం తెలుపని కారణం ఏమనగా అవి లెక్కించబడలేవు. మరియు నిషిద్ధమైన వాటిని వివరంగా తెలుపడానికి కారణం అవి లెక్కించబడుతాయి మరియు వాటిని తెలుసుకొని దూరముండ గలగాలి. అల్లాహ్ ఆదేశం ఇలా ఉందిః
గత్యంతరం లేని పరిస్థితులలో తప్ప – మిగిత అన్ని పరిస్థితులలోనూ అల్లాహ్ ఏ వస్తువుల ఉపయోగాన్ని నిషేధించాడో వాటి వివరాలను మీకు ఆయన ఇది వరకే తెలియజేశాడు. (అన్ఆమ్ 6: 119).
ఇక మంచివి అన్నియూ హలాల్ అని సంక్షిప్తముగా తెలియజేశాడు. వాటి వివరాలు తెలుపలేదు. చదవండి అల్లాహ్ ఈ ఆదేశం:
ప్రజలారా! భూమిలోని ధర్మసమ్మతమైన, పరిశుభ్రమైన వాటినన్నింటిని మీరు తినండి. (బఖర 2: 168).
ఇది అల్లాహ్ యొక్క ఎంత గొప్ప కరుణ; దేని గురించి హరాం అన్న నిదర్శన, ప్రమాణాలు ఉన్నాయో అవి తప్ప ప్రతి దానిని ఆయన హలాల్ అని నిర్ణయం చేశాడు. వాస్తవానికి ఇది ఆ పరమ పవిత్రుడైన అల్లాహ్ యొక్క అనుగ్రహము, తన దాసులపై విశాల కరుణ. అందుకు ఆయన విధేయత, స్తోత్రం, కృతజ్ఞతలు పాటించడం మనపై విధిగా ఉంది.
ఏంటండీ మీరు ఎప్పుడు చూసిన ఇది హరామ్ అది హరామ్ అంటూ ఉంటారు?
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే; నిషిద్ధమైన వాటి వివరాల్ని, వాటి జాబితాలను చూచి కొందరి హృదయాలు ధర్మం పట్ల ఇరుకైపోతాయి. ఇది వారి బలహీన విశ్వాసం, ధర్మం పట్ల తక్కువ అవగాహన వల్ల జరుగుతుంది. ధర్మం చాలా సులభమైనదని తెలియుటకు ధర్మసమ్మత మైనవి ఏమిటో వాటిని కూడా వివరంగా ఒక్కొక్కటి లెక్కించమని కోరుతున్నారా? ధర్మం వారి జీవితాలను చేదు చేయదన్న నమ్మకం వారికి కలిగేలా సర్వ రకాల మంచివాటిని క్రమంగా తెలుపుమంటరా?
ఒంటె, ఆవు, మేక, కుందేలు, లేడి, కొండల్లో ఉండే మేక, కోడి, పావురం, బాతు, పెద్ద బాతు, నిప్పు కోడి జిబహ్ చేస్తే హలాల్ అని, మరియు చేప మరియు మిడతా చనిపోయినా హలాల్ అని ఒక్కొక్క దానిని లెక్కతో వివరంగా చెప్పాలా?
కూరగాయలు, శాఖహారాలు, ఫలాలు, గొదుమ, జొన్న లాంటి లాభదాయకమైన గింజలు హలాల్. నీళ్ళు, పాలు, తేనే, నూనే, వెనిగర్ హలాల్. ఉప్పు, మిరప్పొడి, మసాలాలు వగైరా హలాల్. కలప, కట్టే, ఇనుము, ఇసుక కంకర రాళ్ళు, ప్లాస్టిక్, గాజు మరియు రబ్బర్ల వినియోగం హలాల్.
ప్రయాణానికి ఉపయోగపడే జంతువుల మీద, వాహనాలలో, రెలు బండ్లల్లో, విమానాల్లో, స్టీమర్, పడవల్లో ప్రయాణించుట హలాల్.
ఏర్ కండీషన్, కూలర్, వాషింగ్ మిషిన్, డ్రై మిషిన్, పిండి చేసే మిషిన్, రొట్టె ముద్దలు చేసే మిషిన్, ఖీమా చేసే మిషిన్, రసములు తయారు చేసే మిషిన్ ల ఉపయోగం హలాల్.
అదే విధంగా మెడికల్ (వైద్యం), ఇంజనీరింగ్, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రంలో ఉపయోగపడే పరికరాలు. ఇంకా నీళ్ళు, చమురు, లోహములు వెలికి తీయుట, టెక్నాలజీ ఉపయోగం, ఉప్పు నీళ్ళు తీయగా చేయుట, ప్రింటర్లు, కంప్యూటర్లు, క్యాల్కులేటర్లు ఉపయోగించుట హలాల్.
నూలు, నార, ఉన్ని, పాలిస్టర్, నైలాన్ మరియు యోగ్యమైన చర్మముల వస్త్రాల ఉపయోగం హలాల్.
వడ్రంగం, వెల్డింగ్, రిపేరింగ్, మెకానిక్ మరియు పశువులను మేపుట లాంటి పనులన్నీ హలాల్.
ఇలా ఒక్కొక్కటి లెక్కించుకుంటూ వెళ్తే అంతమనేది ఉంటుందా? ఆక్షేపణ చేసేవారు ఎందుకు అర్థం చేసుకోరు??
అయితే ‘ధర్మం చాలా సులభమైనది’ అన్న వారి పలుకులు నిజమై నప్పటికీ వారు తీసుకుంటున్న భావం మాత్రం తప్పు. ఎందుకనగా ధర్మం సులభతరమైనది అన్న భావం ప్రజల మనోవాంఛల ప్రకారం కాదు ధర్మం తెలిపిన రీతిలో చూడాలి. ‘ధర్మంసులభతరం’ అన్న మాటతో వ్యర్థమైన ఆధారం తీసుకొని నిషిద్ధతాలకు పాల్పడుట మరియు ధర్మం స్వయంగా క్రింది విషయాల్లో ఇచ్చిన సౌకర్యాలను పాటించుటలో చాలా వ్యత్యాసం ఉంది. ఉదాహరణకుః ప్రయాణంలో ఉన్నప్పుడు నమాజు ఖస్ర్ చేయుట, కలిపి చేయుట, ఉపవాసాలు మానుకొనుట. స్థానికుడు రెయింబళ్ళు మరియు బాటసారి మూడు రోజులు సంపూర్ణం మేజోళ్ళపై మసా (స్పర్శ) చేయుట. నీళ్ళ ఉపయోగం హానికరంగా ఉంటే తయమ్ముం చేయుట. అనారోగ్యం మరియు వర్షం వల్ల రెండు నమాజులు కలిపి చేయుట. నిశ్చి తార్థుడు తనకు కాబోయే వధువును ఒకసారి చూచుట. ప్రమాణానికి వ్యతిరేకం జరిగినప్పుడు క్రింది మూడిట్లో ఏ ఒకటైనా చెల్లించుట: బానిసను విడుదల చేయుట. పది మంది పేదలకు అన్నం పెట్టుట. పది మంది పేదలకు బట్టలు పెట్టుట. గత్యంతరం లేని పరిస్థితిలో మృతమాంసం తినుట లాంటి ఇతర సౌకర్యాలు / సెలవులు ఇస్లాం ధర్మం తెలిపినవే.
కొన్నింటిని నిషిద్ధపరచడంలో ఎన్నో వివేచనతో కూడిన విషయాలు ఉన్నాయి. అందులో కొన్ని ఇవిః
1- వీటి ద్వారా అల్లాహ్ తన దాసులను పరీక్షిస్తాడు. ఎవరు వాటి పట్ల ఎలా ప్రవర్తిస్తారో చూస్తాడు.
2- ఈ పరీక్ష స్వర్గవాసులు మరియు నరకవాసుల్లో ఉన్న వ్యత్యాసాన్ని చూపుతుంది. నరకవాసులు తమ మనోవాంఛలు, కోరికలలో మునిగి ఉంటారు. వీటితోనే నరకం కప్పబడి ఉన్నది. స్వర్గవాసులు కష్టాల, ఆపదలపై సహనం వహిస్తారు. వీటితోనే స్వర్గం కప్పబడి ఉంది. ఈ పరీక్షయే గనక లేకుంటే అవిధేయుడు, విధయునితో వేరుగా స్పష్టంగా కనబడడు.
అల్లాహ్ విధించిన కట్టుబాట్లను విశ్వాసులు పుణ్యఫలాపేక్షతో స్వీకరి స్తారు, ఆయన సంతృష్టి పొందడానికే అల్లాహ్ ఆదేశాలను పాటిస్తారు. అందుకే ప్రతీ కష్టం చాలా తేలిగ్గా వారి మీది నుండి దాటిపోతూ ఉంటుంది. వీరికి భిన్నంగా కపట విశ్వాసులు (మునాఫిఖీన్) బాధ్యత భారాన్ని అవస్త, నొప్పి, ఏదో కోల్పోతున్నట్లు చూస్తారు. అందువల్ల వారిపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. విధేయత కష్టతరమవుతుంది.
నిషిద్ధతాలకు దూరంగా ఉండి విధేయుడు దాని మాధూర్యాన్ని ఆస్వాదిస్తాడుః ఎవరు అల్లాహ్ కొరకు ఒక వస్తువును వదులుకుంటాడో అల్లాహ్ అతనికి దానికంటే మేలైనదానిని ప్రసాదిస్తాడు. మరియు అతడు తన మనస్సులో విశ్వాసమాధూర్యన్ని పొందుతాడు.
ఈ పుస్తకంలో గౌరవనీయులైన పాఠకులు కొన్ని నిషిద్ధతాలు చదువబోతున్నారు. వాటి నిషిద్ధత ధర్మపరంగా రుజువైనది. ఖుర్ఆన్ మరియు హదీసుల ఆధారాలతో వాటిని స్పష్ట పరచడం జరిగింది([1]). ఈ నిషిద్ధతాలు చాలా ప్రబలిపోయాయి. అనేక మంది ముస్లిములు వాటికి పాల్పడుతున్నారు. అయితే వాటిని స్పష్టపరచి వాటికి దూరంగా ఉండమని ఉపదేశించడమే నా ముఖ్య ఉద్దేశ్యం. అల్లాహ్ నాకు, నా ముస్లిం సోదరులకు సన్మార్గం, సద్భాగ్యం, ఆయన కట్టుబాట్ల వద్ద ఆగిపోయే, నిషిద్ధతాలకు దూరంగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక. సర్వ చెడుల నుండి కాపాడుగాక. అల్లాహ్ యే ఉత్తమ రక్షకుడు. ఆయన గొప్ప కరుణామయుడు.
“ఘోరపాపాల్లోనే మరీ ఘోరమైన పాపం ఏదో తెలుపనా?” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సార్లు ప్రశ్నించారు. దానికి వారన్నారుః తప్పక తెలుపండి ప్రవక్త అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “అల్లాహ్ కు భాగస్వాములను కల్పిం చుట”. (బుఖారి 2654, ముస్లిం 87).
అల్లాహ్ షిర్క్ తప్ప ఏ పాపాన్నైనా క్షమించగలడు. దానికి ప్రత్యేకమైన పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కోరడం (తౌబా చేయడం) తప్పనిసరి. అల్లాహ్ ఇలా ఆదేశించాడుః
నిశ్చయంగా అల్లాహ్ తనకు భాగస్వామిని కల్పించటాన్ని ఏ మాత్రం క్షమించడు. అది తప్ప దేనినయినా తాను కోరినవారిని క్షమిస్తాడు. (నిసా 4: 48).
షిర్క్ లో ఒక రకం పెద్ద/ఘోరమైన షిర్క్ (షిర్కె అక్బర్). ఇది ఇస్లాం నుండి బహిష్కరణకు కారణమవుతుంది. తౌబా చేయకుండా అదే స్థితిలో మరణించేవాడు నరకంలో ప్రవేశించి అందులో శాశ్వతంగా ఉంటాడు. ముస్లిం సమాజంలో ప్రబలి ఉన్న ఈ రకమైన షిర్క్ యొక్క కొన్ని రూపాలు ఈ క్రింది విధంగా ఉన్నాయిః
సమాధులను పూజించడం, మరణించి సమాధుల్లో ఉన్న వలీలు (పుణ్యపురుషులు) అవసరాలను తీరుస్తారని, కష్టాలను తొలిగిస్తారని నమ్మడం మరియు అల్లాహ్ ఆధీనంలోనే ఉన్నదాని సహాయం వారితో కోరడం, వారితో మొరపెట్టుకోవడం లాంటివి పెద్ద షిర్క్ లో లెక్కించ బడతాయి. అల్లాహ్ ఆదేశం చదవండిః
మీ ప్రభువు తనను తప్ప ఇతరులను మీరు ఆరాధింపకూడదని ఆదేశించాడు. (బనీఇస్రాఈల్ 17: 23).
అదే విధంగా చనిపోయిన ప్రవక్తలతో, పుణ్యాత్ములతో ఇంకెవరితోనైనా వారి సిఫారసు పొందుటకు, తమ కష్టాలు దూరమగుటకు వారితో దుఆ చేయడం కూడా షిర్క్. చదవండి అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:
బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు అతని మొరలను ఆలకించి అతని బాధను తొలగించేవాడు ఎవడు? భూమిపై మిమ్మల్ని ప్రతినిధులుగా చేసినవాడు ఎవడు? అల్లాహ్ తో పాటు (ఈ పనులు చేసే) మరొక దేవుడు కూడ ఎవడైనా ఉన్నాడా?. (నమ్ల్ 27: 62).
కొందరు కూర్చున్నా, నిలబడినా, జారిపడినా తమ పీర్, ముర్షిదుల నామములను స్మరించుటయే తమ అలవాటుగా చేసుకుంటారు. ఎప్పుడు ఏదైనా క్లిష్టస్థితిలో, కష్టంలో, ఆపదలో చిక్కుకున్నప్పుడు ఒకడు యా ముహమ్మద్ అని, మరొకడు యా అలీ అని, ఇంకొకడు యా హుసైన్ అని, మరి కొందరు యా బదవీ, యా జీలానీ, యా షాజులీ, యా రిఫాఈ, యా ఈద్ రూస్, యా సయ్యద జైనబ్, యా ఇబ్ను ఉల్వాన్ అని, యా గౌస్ అల్ మదద్ అని, యా ముఈనుద్దీన్ చిష్తీ అని, యా గరీబున్నవాజ్ అని, నానా రకాలుగా పలుకుతారు. కాని అల్లాహ్ ఆదేశం ఏమిటని గమనించరుః
అల్లాహ్ ను వదలి మీరు వేడుకుంటున్న వారు మీ మాదిరిగానే కేవలం దాసులు. మీరు వారిని ప్రార్థించి చూడండి. మీకు వారి పట్ల ఉన్న భావాలు నిజమే అయితే మీ ప్రార్థనలకు వారు సమాధానం ఇవ్వాలి. (అఅరాఫ్ 7: 194).
కొందరు సమాధి పూజారులు సమాధుల ప్రదక్షిణం చేస్తారు. వాటి మూలమూలలను చుంబిస్తారు. చేతులు వాటికి తాకించి తమ శరీరంపై పూసుకుంటారు. వాటి గడపను చుంబిస్తారు. దాని మట్టిని తీసుకొని తమ ముఖాలకు రుద్దుకుంటారు. వాటిని చూసినప్పుడు సాష్టాంగ పడతారు (సజ్దా చేస్తారు). తమ అవసరాలను కోరతూ రోగాల నుండి స్వస్థత పొందు టకు, సంతానం కావాలని, అవసరం తీరాలని వాటి యదుట భయభీతితో, వినయవినమ్రతలతో నిలబడతారు. ఒక్కోసారి సమాధిలో ఉన్నవారిని ఉద్దేశించి ఇలా పిలుస్తారు కూడాః యా సయ్యిదీ! ఓ మేరే బాబా! నేను చాలా దూరం నుండి మీ సమక్షంలో హాజరయ్యాను, నాకు ఏమీ ప్రసాదించక వెనక్కు త్రిప్పి పంపుతూ అవమాన పరచకు. కాని అల్లాహ్ ఆదేశం ఏముందో గమనించారా?
అల్లాహ్ ను వదలి ప్రళయం వరకు తమ ప్రార్థనలను విని సమాధాన మివ్వలేనటువంటి వారిని ప్రార్థించే వారికంటే, ఎక్కువ మార్గభ్రష్టులెవరు? మరియు వారు వీరి (ప్రార్థించేవారి) ప్రార్థనలను ఎరుగకుండా ఉన్నారు. (అహ్ఖాఫ్ 46: 5).
ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారుః
(مَنْ مَاتَ وَهْوَ يَدْعُو مِنْ دُونِ الله نِدًّا دَخَلَ النَّارَ)
“ఎవరు అల్లాహ్ ను కాదని ఇతరులను ప్రార్థిస్తూ/దుఆ చేస్తూ చనిపోతాడో అతను నరకంలో ప్రవేశిస్తాడు”. (బుఖారి 4497).
కొందరు సమాధుల వద్ద తమ తల కొరిగించుకుంటారు. ‘సమాధుల హజ్ చేసే విధానం’ అన్న పేరుగల పుస్తకాలు కొందరి వద్ద లభిస్తాయి. విశ్వవ్యవస్థ నిర్వహణ శక్తి మరియు లాభనష్టాలు చేకూర్చే శక్తి వలీలకు ఉన్నదని కొందరు నమ్ముతారు. కాని అల్లాహ్ యొక్క ఈ ఆదేశం పట్ల వారు ఎలా అంధులైపోయారో గమనించండిః
ఒకవేళ అల్లాహ్ నిన్ను ఏదైనా ఆపదకు గురి చేస్తే స్వయంగా ఆయన తప్ప ఆ ఆపదను తొలగించేవారు ఎవరూ లేరు. ఇంకా ఆయన గనక నీ విషయంలో మేలు చేయాలని సంకల్పిస్తే ఆయన అనుగ్రాహన్ని మల్లించే వాడు కూడా ఎవడూ లేడు. (యూనుస్ 10: 107).
అల్లాహ్ ను కాకుండా ఇతరుల పేరున మొక్కుకొనుట షిర్క్ అవుతుంది. ఈ రోజుల్లో ప్రజలు సమాధిలో ఉన్నవారి పేరున దీపాలు, కొవ్వత్తులు, కోళ్ళు, ఆస్తులు మొదలగునవి ఇస్తానని మొక్కుకుంటారు. అయితే ఇది ఘోరమైన షిర్క్ అన్న విషయం మరచిపోతారు.
అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు జిబహ్ చేయుట (జంతువును బలి ఇచ్చుట) షిర్క్. అల్లాహ్ ఆదేశం చదవండిః
[فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ] {الكوثر:2}
నీ ప్రభువు కొరకే నమజు చేయు మరియు ఖుర్బానీ ఇవ్వు. (కౌసర్ 108: 2).
అంటే అల్లాహ్ కొరకు మరియు అల్లాహ్ పేరుతో మాత్రమే జిబహ్ చేయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారుః
لَعَنَ اللهُ مَنْ ذَبَحَ لِغَيْرِ الله
“అల్లాహ్ కు కాక ఇతరుల కోసం జిబహ్ చేయువానిపై అల్లాహ్ శపించాడు”. (ముస్లిం 1978).
జిబహ్ లో రెండు నిషేధాలు ఏకమవుతాయి. (1) అల్లాహ్ కు తప్ప ఇతరుల కోసం జిబహ్. (2) అల్లాహ్ పేరుతో కాకుండా ఇతరుల పేరుతో జిబహ్. ఈ రెండు కారణాల వల్ల ఆ జంతువు మాంసం తినడం యోగ్యం కాదు. ఈ రోజుల్లో జిన్నుల పేరు మీద జిబహ్ చేసే షిర్క్ ప్రభలి ఉంది. అదేమనగా; ఇల్లు కొనుగోళు చేసినా, నిర్మించినా అందులో ఎక్కడైనా లేదా ప్రత్యేకించి దాని గడప మీద, అలాగే బావి త్రవ్వినా, అక్కడే ఓ జంతువు జిబహ్ చేస్తారు. అది షైతాన్ (భూతాల)కు భయపడి, వాని నష్టం నుండి దూరముండుటకు వాని పేరు మీద జిబహ్ చేస్తారు. (వాస్త వేమిటంటే అల్లాహ్ ను కాక ఇతరులతో భయపడరాదు. ఇలాంటి జిబహ్ చేయరాదు). (తైసీరుల్ అజీజుల్ హమీద్ 158. దారుల్ ఇఫ్తా ముద్రణ).
అల్లాహ్ హరాం చేసినదానిని హలాల్ చేయుట, లేదా అల్లాహ్ హలాల్ చేసినదానిని హరాం చేయుట, లేదా ఇలాంటి హక్కు అల్లాహ్ తప్ప ఇత రులకు ఉంది అని నమ్ముట, లేదా సమస్యల తీర్పు కొరకు ఇస్లాం ధర్మం కాకుండా ఇతర న్యాయస్థానాలకు వెళ్ళుట, మరియు ఇస్లామీయ చట్టాలతో కాకుండా ఇతర చట్టాలతో తీర్పు కోరుట, లేదా అది యోగ్యమేనని సంతో షంగా నమ్ముట ఎంతటి భయంకరమైన అవిశ్వాసములోకి వస్తుందో ఈ ఆయతు ద్వారా తెలుసుకోండి.
వారు (యూదులుక్రైస్తవులు) అల్లాహ్ ను కాదని తమ పండితులను, తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు. (తౌబా 9: 31).
ఈ ఆయతు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పఠిస్తుండగా, అదీ బిన్ హాతిం రజియల్లాహు అన్హు విని, ప్రవక్తా! యూదులు, క్రైస్తవులు తమ పండితులను, సన్యాసులను ఆరాధించేవారు కారు కదా? అని చెప్పగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అవును, కాని అల్లాహ్ హరాం చేసిన దానిని వారి పండితులు, సన్యాసులు హలాల్ చేస్తే వారు దానిని హలాల్ గానే భావించేవారు. ఇంకా అల్లాహ్ హలాల్ చేసినదానిని వారి పండితులు, సన్యాసులు హరాం చేస్తే వారు దానిని హరాంగానే భావించేవారు. కనుక ఇది వారిని ఆరాధించినట్లు” అని సమాధానం చెప్పారు. (బైహఖీ ఫీ సుననిల్ కుబ్రా 10/116, తిర్మిజి 3095, ఇది హసన్ అని షేఖ్ అల్బానీ గాయతుల్ మరాం 19లో తెలిపారు).
నిషేధితాలను నిషేధంగా నమ్మనివారు యూదులు, క్రైస్తవులు మరియు బహుదైవారాధకులు అని అల్లాహ్ ఈ క్రింది ఆయతులలో స్పష్టం చేశాడుః
ఇలా అనుః మీరు ఆలోచించరా! అల్లాహ్ మీ కొరకు అవతరింపజేసిన జీవనోపాధిలో నుండి మీరు స్వయంగానే కొన్నింటిని హరాం చేసుకున్నారు. మరికొన్నింటిని హలాల్ చేసుకున్నారు. ఇలా అడుగుః ఇలా చేయడానికి అల్లాహ్ మీకు అనుమతించాడా? లేదా మీ బూటక కల్పనలను అల్లాహ్ కు అంటగట్టుతున్నారా?. (యూనుస్ 10: 59).
చేతబడి (చేయుట, చేయించుట, నేర్పుట, నేర్చుకొనుట) అవిశ్వాసం లో లెక్కించబడుతుంది. అది వినాశనానికి గురి చేసే ఏడు మహాపాపాల్లో ఒకటి. అది నష్టమే కలుగజేస్తుంది తప్ప ఏమీ లాభం కలగజేయదు. దానిని నేర్చుకొనుట గురించి అల్లాహ్ ఇలా తెలిపాడుః
సులైమాను ఎన్నడూ అవిశ్వాసానికి ఒడిగట్టలేదు. అసలు అవిశ్వాసానికి పాల్పడినది ప్రజలకు చేతబడిని బోధించే షైతానులే. వారు హారూత్, మారూత్ దేవదూతల ద్వారా (ఇరాఖ్ లోని) బాబీలోనియాలో అవతరింప జేసినదాని వెంట బడ్డారు. ఎవడికైనా ఆ విద్యను నేర్పినప్పుడు ఆ దేవ దూతలు స్పష్టంగా ఇలా హెచ్చరిక చేసేవారుః జాగ్రత్త! మేము (మానవు లకు) కేవలం ఒక పరీక్ష మాత్రమే. కనుక మీరు (జాలవిద్యను నేర్చుకొని) అవిశ్వాసులు కాకండి. (బఖర 2: 102).
మాంత్రికుని గురించిన ఆదేశమేమిటంటే అతడ్ని హతమార్చాలి. అతని సంపద కూడా నిషిద్ధమైన చెడు సంపద. అజ్ఞానులు, దుర్మార్గులు, బలహీన విశ్వాసులు మాంత్రికుల వద్దకు వెళ్ళి , ఇతురలపై అన్యాయం, దౌర్జన్యం చేయడానికి, లేదా ప్రతీకారం తీర్చుకోడానికి చేతబడి చేయిస్తారు. మరికొందరు తనపై చేయబడిన చేతబడిని దూరం చేయించుకోడానికి మాంత్రికుని వద్దకు వెళ్ళి ఓ నిషిద్ధ కార్యానికి పాల్పడతారు. ఇలాంటప్పుడు మాంత్రికుల వద్దకు వెళ్ళకుండా అల్లాహ్ వైపునకు మరలి, ‘ముఅవ్విజాత్’ వంటి అల్లాహ్ పవిత్రవచనాల ఆధారంగా అల్లాహ్ తో స్వస్థత కోరాలి. (ముఅవ్విజాత్ అంటే సూర ఫలఖ్, సూర నాస్ మరియు దీనికి సంబంధించిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన దుఆలు).
కహాన అంటే భవిష్యత్తులో సంభవించేవాటిని, మనుసులో ఉండేవాటిని తెలుపుట. ఇలా తెలిపేవాడు కాహిన్. అర్రాఫ అంటే కొన్ని మూల విషయాల ఆధారంగా దొంగలించబడిన, కనబడని, తప్పిపోయిన వస్తువులను తెలుపుతానని ఆరోపించుట. ఇలా ఆరోపించేవాడు అర్రాఫ్.
కాహిన్ మరియు అర్రాఫ్, వీరిద్దరూ అగోచర జ్ఞానం గలదని ఆరోపణ చేసినందుకు సర్వోత్తముడైన అల్లాహ్ పట్ల అవిశ్వాసానికి పాల్పడ్డారు. వాస్తవమేమిటంటే అగోచర జ్ఞానం అల్లాహ్ తప్ప ఎవరికీ లేదు. వీరు అమాయకుల నుండి సొమ్ము కాజేసుకొనుటకు వారిని తమ వలలో చిక్కించుకుంటారు. అందుకు ఎన్నో రకాల సాధనాలు ఉపయోగిస్తారు. ఉదాహరణకుః భూమిపై రేఖలు గీసి, గవ్వలకు రంద్రాలు చేసి తాయత్తు కట్టి, అరచేతిలో, పాత్ర అడుగులో, గాజులో, అద్దంలో చూసి మంత్రాలు చదివి (భవిష్యం తెలిపే ఆరోపణ చేస్తారు). వారు చెప్పే విషయాల్లో ఎప్పుడైనా ఒక్కసారి ఒక్కటి సత్యమైనా 99 సార్లు అబద్ధాలే ఉంటాయి. కాని ఈ అసత్యవాదులు ఒక్కసారి చెప్పే నిజాన్ని మాత్రమే అమాయకులు గుర్తు పెట్టుకొని తమ భవిష్యత్తు మరియు వివాహ, వ్యాపారాల్లో అదృష్టం – దురదృష్టం, ఇంకా తప్పిపోయిన వస్తువుల గురించి తెలుసుకోవడానికి వారి వద్దకు వెళ్తుంటారు. ఎవరు వారి మాటను సత్యం, నిజం అని నమ్ము తారో వారు అవిశ్వాసులవుతారు. ఇస్లాం నుండి బహిష్కరించబడతారు. దీని నిరూపణ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ హదీసుః
“ఎవడు కాహిన్ లేక అర్రాఫ్ వద్దకు వచ్చి అతను చెప్పినదానిని సత్యం అని నమ్ముతాడో అతడు ముహమ్మద్ ﷺ పై అవతరించినదానిని తిరస్క రించినవాడవుతాడు”. (ముస్నద్ అహ్మద్ 2/429, సహీహుల్ జామి 5939).
ఒకవేళ వారి వద్దకు వెళ్ళేవాడు వారికి అగోచర జ్ఞానం కలదని, వారి మాట సత్యం అని నమ్మక కేవలం చూడడానికి, అనుభవం కొరకు వెళ్తే అతడు అవిశ్వాసి కాడు. కాని అతని నలభై రోజుల నమాజు అల్లాహ్ వద్ద స్వీకరించబడదు. దీనికి నిరూపణ ప్రవక్త ﷺ యొక్క ఈ హదీసుః
జైద్ బిన్ ఖాలిద్ జుహనీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః హుదైబియా ప్రాంతంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు నమాజు చేయించారు. అదే రాత్రి వర్షం కురిసింది. నమాజు ముగించి ప్రజల వైపునకు తిరిగి “మీ ప్రభువు ఏమన్నాడో మీకు తెలుసా?” అని అడిగారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అని సహచరులు సమాధానం పలికారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ఇలా తెలిపాడని విశదీకరించారుః “ఈ రోజు ఉదయం నా దాసుల్లో కొందరు విశ్వాసులయ్యారు మరికొందరు అవిశ్వాసులయ్యారు. అల్లాహ్ దయవలన మాకు వర్షం కురిసింది అని అన్నవారు తారాబలాన్ని నిరాకరించి, నన్ను విశ్వసించిన వారయ్యారు. దీనికి భిన్నంగా ఫలాన నక్షత్ర ప్రభావంతో వర్షం కురిసింది అన్నవారు నక్షత్ర విశ్వాసులయి, నన్ను తిరస్కరించిన వారయ్యారు”. (బుఖారి 846, ముస్లిం 71).
అదే విధంగా పత్రిక, మ్యాగ్జిన్లలో వచ్చే రాశిచక్ర వివరాలను చదివి, అవి నక్షత్రాల ప్రభావంతోనే ఉంటాయని విశ్వసిస్తే అతను బహుదైవారాధ కుడవుతాడు. ఒకవేళ అతను తృప్తి కొరకు చదివితే పాపాత్ముడవుతాడు. ఎందుకనగా? షిర్క్ విషయాలను చదివి తృప్తి పొందడం యోగ్యం కాదు, దానిని విశ్వసించాలని షైతాన్ ప్రేరేపించవచ్చు కూడా, అప్పడు అది చదవడం ఒక షిర్క్ పని కోసం ఆధారంగా మారిపోతుంది.
అల్లాహ్ ఏ దానిలో లాభం తెలుపలేదో, అందులో లాభం ఉందని విశ్వసించుట కూడా షిర్క్ లోకి వస్తుంది. ఉదాహరణకుః కాహిన్, లేదా మాంత్రికుని మాటల్లో పడి లేదా తాతముత్తాతల ఆచారాన్ని అనుసరిస్తూ తాయత్తులు, దారాలు, గవ్వలు, కడాలు వగైరాలు తమ మెడలో, తమ సంతానానికి, బండ్లల్లో, ఇండ్లల్లో దిష్టి దూరం కావాలని ఉపయోగించట, వివిధ రకాల రత్నాలు గల ఉంగరాలు ఉపయోగించి కష్టాలు రావని, వచ్చినా దూరమవుతాయని విశ్వసించుట. ఇది అల్లాహ్ పై నమ్మకానికి వ్యెతిరేకం. దీని వలన మరింత బలహీనత, రోగం పెరుగుతుంది. అంతే కాదు ఇది నిషిద్ధమైన చికిత్స పద్ధతి. అనేక తాయత్తుల్లో స్పష్టమైన షిర్క్, షైతానుల సహాయం, అర్థం లేని గీతలు, వ్రాతలు ఉంటాయి. మరి కొందరు గారడీవాళ్లు (Juggers) ఖుర్ఆన్ ఆయతులతో షిర్క్ పదాలు కలిపి వ్రాస్తారు. ఇంకొందరు ఖుర్ఆన్ ఆయతులు బహిష్టు రక్తంతో, ఇతర మలినమైన వస్తువులతో వ్రాస్తారు. అందుకే పైన ప్రస్తావించబడిన వాటిని ఉపయోగించుట నిషిద్ధం. దీనికి నిరూపణ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీసుః
తాయత్తులు వగైరాలు ఉపయోగించేవారు లాభనష్టాలు చేకూర్చేవాడు అల్లాహ్ కాక, అవేనని నమ్మితే అతను ఘోరమైన పెద్ద షిర్క్ కు పాల్పడిన వాడవుతాడు. ఒకవేళ అవి లాభనష్టాలకు సాధనం అని నమ్మితే, అల్లాహ్ వాటిని సాధనంగా చేయలేదు గనక అతను చిన్న షిర్క్ కు పాల్పడినవా డవుతాడు. అప్పుడు ఇది కారణాలకు సంబంధించిన షిర్క్ అవుతుంది.
సత్కార్యం యొక్క షరతుల్లో; ప్రదర్శనాబుద్ధికి అతిదూరంగా మరియు ప్రవక్త పద్ధతికి అనుకూలంగా దానిని చేయుట తప్పనిసరి. ఏదైనా ఆరాధన ప్రజలు చూడడానికి చేసేవాడు షిర్క్ చేసినవాడవుతాడు. అతని ఆరాధన వ్యర్థం అవుతుంది. ఉదాహరణకుః ప్రజలు చూసి మెచ్చుకోవాలన్న ఉద్దే శ్యంతో నమాజు చేయు వ్యక్తి. అల్లాహ్ ఈ ఆదేశం చదవండిః
కపటవిశ్వాసులు అల్లాహ్ ను మోసగించుతున్నారు. కాని ఆయనే వారిని మోసంలో పడవేశాడు. వారు నమాజు కొరకు నిలుబడినా బద్ధకంగా, కేవలం ప్రజలకు చూపేందుకే నిలబడతారు. అల్లాహ్ ను అతి తక్కువగా స్మరిస్తారు. (నిసా 4: 142).
అదే విధంగా ఏదైనా గొప్ప కార్యం చేస్తున్నప్పుడు నలువైపుల దాని సమాచారం చేరాలని, ప్రజల్లో పేరుప్రఖ్యాతులు ప్రాప్తించాలని ఉద్దేశిస్తే షిర్క్ లో పడినట్లే. క్రింద ఇవ్వబడిన హెచ్చరికకు గురి అయినట్లే; ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసులో ఉందిః
“ఎవరు ప్రఖ్యాతి కొరకు (ఏ పని అయితే చేస్తాడో) అల్లాహ్ దాని వలన అతనికి ప్రఖ్యాతి ప్రసాదిస్తాడు. ఎవరు చూపుగోళు కొరకు (ఏ పనైతే చేస్తాడో) అల్లాహ్ దాని వలన అదీ అతనికి ప్రసాదిస్తాడు”. (కాని పరలోకసాఫల్యం ప్రాప్తించదు). (ముస్లిం 2986).
ఎవరైనా ఏదైనా ఆరాధన చేస్తూ అల్లాహ్ సంతృష్టితో పాటు ప్రజల నుండి కీర్తి పొందాలని ఆశిస్తాడో అతని ఆ ఆరాధన వ్యర్థం అవుతుంది. హదీసె ఖుదుసిలో ఇలా వచ్చిందిః
“నేను ఇతర సహవర్తులకంటే అధికంగా షిర్క్ కు అతీతుణ్ణి. ఎవరైతే మంచి పని చేసి అందులో మరెవరినైనా నాకు భాగస్వామిగా నిలబెడితే నేను అతన్ని అతని షిర్క్ తో పాటు వదిలేస్తాను”. (ముస్లిం 2985).
ఎవరైతే ఒక మంచి కార్యం కేవలం అల్లాహ్ సంతృష్టి ఉద్దేశంతోనే మొదలుపెట్టాడు, కాని ఆ తర్వాత ప్రదర్శనాబుద్ధి గుణం చోటు చేసుకుంది, అలాంటప్పుడు ఆ మనిషి దాన్ని అసహ్యించుకొని, పూర్తి ప్రయత్నంతో దాన్ని దూరం చేస్తే అతని ఆ పని సరియైనది. ఒకవేళ అతను దానితో తృప్తి పడి, అది అతని మనస్సులో స్థిరపడితే అధిక సంఖ్యాక ధర్మవేత్తల ప్రకారం ఆ పని వ్యర్థం.
ఆ పిదప వారికి మంచికాలం వచ్చినపుడు వారుః మేము దీనికే అర్హులం అని అనేవారు. కాని వారికి కష్టకాలం దాపురించినపుడు, వారు మూసా మరియు అతనితో పాటు ఉన్నవారిని తమకు అపశకునంగా పరిగణించేవారు. (అఅరాఫ్ 7: 131).
అరబ్బుల్లో ఎవరైనా ప్రయాణం లేదా మరేదైనా పని చేయదలినపుడు ఏదైనా పక్షిని వదిలేవాడు. అది కుడి వైపునకు ఎగిరిపోతే మంచి శకునంగా భావించి ఆ పని, ప్రయాణం చేసేవాడు. ఒకవేళ అది ఎడమ వైపునకు ఎగిరిపోతే అపశకునంగా భావించి ఆ పనిని మానుకునేవాడు. అయితే “అపశకునం పాటించుట షిర్క్” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టపరిచారు. (ముస్నద్ అహ్మద్ 1/389. సహీహుల్ జామి 3955).
తౌహీద్ కు వ్యతిరేకమైన ఈ నిషిద్ధ విశ్వాసంలో ఈ క్రింది విషయాలు కూడా వస్తాయిః
కొన్ని మాసాలను అపశకునంగా పరిగణించుట. ఉదాహరణకుః రెండవ అరబీ మాసం సఫర్ ను అపశకునంగా పరిగణించి అందులో వివాహం చేయక, చేసుకోకపోవుట. (మన దేశాల్లో కొందరు మొదటి నెల ముహర్రం ను అపశకునంగా పరిగణిస్తారు).
రోజులను అపశకునంగా పరిగణించుట. ఉదాహరణకుః ప్రతి నెలలోని చివరి బుధవారాన్ని పూర్తిగా అరిష్టదాయకమైనదిగా నమ్ముట.
నంబర్లలో 13వ నంబరును, పేర్లలో కొన్ని పేర్లను అపశకునంగా పరిగణించుట.
వికలాంగుడిని చూసి అపశకునంగా పరిగణించుట. ఉదాః దుకాణం తెరవడానికి పోతున్న వ్యక్తి దారిలో మెల్లకన్నువాడిని చూసి దుశ్శకునంగా పరిగణించి ఇంటికి తిరిగివచ్చుట. పై విషయాలన్ని నిషిద్ధమైన షిర్క్ పనులు. ఇలా అపశకునం పాటించేవారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసహ్యించుకున్నారు. ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనంలో ఉందిః
ఎవరికైనా దుశ్శకున భావం కలిగితే వారు దాని ప్రాయశ్చితం ఈ క్రింది హదీసు ఆధారంగా చెల్లించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
“అపశకునం ఎవరినైనా తన పని నుండి ఆపినదో అతను షిర్క్ చేసినట్లు”. ప్రవక్తా! అలాంటప్పుడు దాని ప్రాయశ్చితం ఏమిటి? అని సహచరులు అడి గారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “ఈ దుఆ చదవండిః అల్లాహుమ్మ లా ఖైర ఇల్లా ఖైరుక వలా తైర ఇల్లా తైరుక వ లా ఇలాహ గైరుక”. (నీ మంచి తప్ప ఎక్కడా మంచి లేదు. నీ శకునం తప్ప ఎక్కడా శకునం లేదు. నీవు తప్ప సత్యమైన ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు). (అహ్మద్ 2/220. సహీహ 1065).
అనుకోకుండా ఒక్కోసారి ఎక్కువనో, తక్కవనో అపశకున భావాలు మనస్సులో కలుగుతాయి, అలాంటప్పుడు అల్లాహ్ పై నమ్మకాన్ని దృఢ పరుచుకొనుటయే దాని యొక్క అతిముఖ్యమైన చికిత్స. అదే విషయాన్ని ఇబ్ను మస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారుః
“మనలో ప్రతి ఒక్కడు అపశకునానికి గురవుతాడు. కాని అల్లాహ్ పై గల దృఢ నమ్మకం ద్వారా అల్లాహ్ దానిని దూరం చేస్తాడు”. (అబూదావూద్ 3910, సహీహ 430).
అల్లాహ్ తన సృష్టిలో తాను కోరిన దాని ప్రమాణం చేస్తాడు. కాని ఆయన సృష్టి అయిన మనం మాత్రం ఆయన తప్ప మరెవ్వరీ ప్రమాణం చేయరాదు. అనేక మంది నోట అల్లాహ్ తప్ప ఇతరుల ప్రమాణం ఏదైతే వెలువడుతుందో అది సరియైనది కాదు. ఎవరి ప్రమాణం చేయబడుతుందో అతడిని గౌరవించబడుతుందన్న మాట. ఇలాంటి గౌరవం అల్లాహ్ తప్ప ఇతరులకు ఇవ్వడం తగదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించా రని ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
“వినండి! మీరు మీ తాత ముత్తాతల పేర ప్రమాణం చేయుట అల్లాహ్ వారించాడు. ఎవరైనా ప్రమాణం చేయదలిచితే కేవలం అల్లాహ్ ప్రమాణం మాత్రం చేయాలి. లేదా మౌనం వహించాలి”. (బుఖారి 6108).
ప్రవక్త ﷺ చెప్పగా విన్నట్లు ఇబ్ను ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః
مَنْ حَلَفَ بِغَيْرِ الله فَقَدْ أَشْرَكَ
“అల్లాహ్ తప్ప ఇతరుల ప్రమాణం చేసినవాడు షిర్క్ చేసినట్లు”. (అబూ దావూద్ 3251, అహ్మద్ 2/125, సహీహుల్ జామి 6204).
مَنْ حَلَفَ بِالْأَمَانَةِ فَلَيْسَ مِنَّا
“ఎవరైతే అమానతు (అప్పగింత) ప్రమాణం చేస్తారో వారు మాలోనివారు కారు”. (అబూదావూద్ 3253, సహీహ 94).
కాబా ప్రమాణం, అమానతు ప్రమాణం, గౌరవపు ప్రమాణం, మద్దతు ప్రమాణం, అతని శుభం, అతని జీవిత ప్రమాణం, ప్రవక్త ఉన్నత స్థాన ప్రమాణం, వలీల ఉన్నత స్థానం ప్రమాణం, తండ్రి ప్రమాణం, తల్లి ప్రమాణం మరియు సంతాన నెత్తి మీద చేయి పెట్టి ప్రమాణం. ఇలాంటి ఏ ప్రమాణం ధర్మసమ్మతమైనది కాదు. పైగా నిషిద్ధం కూడాను. ఎవరైనా ఇలాంటి ఏదైనా ప్రమాణం చేస్తే (నిషిద్ధ కార్యానికి ఒడిగడితే) దాని ప్రాయశ్చితం “లాఇలాహ ఇల్లల్లాహ్” చదవడం. దీనికి నిరూపణ ఈ హదీసుః
“ఎవరైనా ప్రమాణం చేస్తూ ‘లాత్, ఉజ్జా ప్రమాణంగా’ అని అంటే అతను వెంటనే లాఇలాహ ఇల్లల్లాహ్ అనాలి”. (బుఖారి 6650, ముస్లిం 1647).
ఈ కోవకు చెందిన కొన్ని షిర్క్ మరియు నిషిద్ధ పదాలు కొందరు ముస్లిముల నోట వెలవడుతూ ఉంటాయి. ఉదాహరణకుః అల్లాహ్ శరణు మరియు నీ శరణు కోరుతున్నాను – నాకు అల్లాహ్ పై మరియు నీపై నమ్మకం ఉంది – ఇది అల్లాహ్ మరియు నీ తరఫున – నాకు నీవు మరి యు అల్లాహ్ తప్ప ఇంకెవరున్నారు – నాకు ఆకాశంలో అల్లాహ్ ఉన్నాడు మరియు భూమిలో నీవు – అల్లాహ్ మరియు ఫలాన లేకుంటే… – నేను ఇస్లాంను అసహ్యించుకుంటున్నాను – అయ్యో కాలం పాడుగాను – అలాగే కాలాన్ని దూషించునట్లు సూచించే ప్రతి మాట, పలుకు కూడా నిషిద్ధం. ఉదాహరణకుః ఇది చెడ్డ కాలం – ఇది అశుభమయిన ఘడియ – కాలం మోసగించునది. ఇవి నిషిద్ధం ఎందుకనగ కాలాన్ని, సమయాన్ని దూషించడం వాస్తవానికి వాటిని పుట్టించిన అల్లాహ్ ను దూషించినట్లు. అలాగే ప్రకృతి కోరినట్లు అనడం మరియు అల్లాహ్ తప్ప ఇతరుల దాస్యత్వం సూచించే పెర్లు కూడా నిషిద్ధం. ఉదాహరకుః అబ్దుల్ మసీహ్ – అబ్దున్ నబీ – అబ్దుర్ రసూల్ – అబ్దుల్ హుసైన్.
ఈ మాడ్రన్ కాలంలో కొన్ని కొంగ్రొత్త పదాలు పరిభాషికంగా ఉపయో గంలో ఉన్నాయి. అయితే ఇవి తౌహీద్ కు వ్యతిరేకమైనవి గనక వాటిని విడనాడాలి. ఉదాహరణకుః ఇస్లామీయ సోషలిజం – ఇస్లామీయ డెమక్రసీ – జనుల కోరిక అల్లాహ్ కోరికయే – ధర్మం అల్లాహ్ ది దేశం ప్రజలది – దేశ, భాష పరమైన వాదం- విప్లవం పేరుతో … లాంటివి.
అదే విధంగా నిషిద్ధ పలుకుల్లో మానవులను రాజాధిరాజు, మహా న్యాయాధిపతి అని పిలుచుట. అవిశ్వాసులను, కపట విశ్వాసుల (మునాఫిఖుల)ను ‘సయ్యద్’ అని లేదా దాని భావంలో ఏ భాషలోనైనా పిలవడం నిషిద్ధం. ‘ఒకవేళ’, ‘అట్లైనచో’ అన్న పదాలు అయిష్టంగా, పశ్చాత్తాపంగా, కోపంగా మరియు బాధతో అనడం మానుకోవాలి. లేనిచో వాటి ద్వారా మూసి ఉన్న చెడు ద్వారాలను షైతాన్ తెరుస్తాడు. అల్లాహ్ నీవు తలిస్తేనే నన్ను క్షమించు అని దుఆ చేయడం కూడా సరియైనది కాదు. (మరీ వివరాలకు అరబీ తెలిసినవారు బక్ర్ అబూ జైద్ రచనః ‘ముఅజముల్ మనాహిల్ లఫ్జియ్యహ్’ చదవండి).
ఎవరి హృదయాల్లో విశ్వాసం పటిష్టంగా స్థానం పొందలేదో వారు కపట విశ్వాసులతో, దుష్టులతో చనవుకోరుతూ, లేదా వారు తృప్తిపడడానికి వారితో కూర్చుంటూ ఉంటారు. ఒక్కోసారి అల్లాహ్ ధర్మంలో వంకలు చూపుతూ, సత్యధర్మంతో, దానిని అనుసరించే పుణ్యాత్ములతో పరిహాసా లాడుతూ, హేళన చేసేవారితో కూడా సమావేశమవుతారు. ఇలా వారితో సమావేశమగుట, వారితో కూర్చుండుట నిషిద్ధం. దీని వల్ల విశ్వాసంలో కూడా లోటు కలుగుతుంది. అల్లాహ్ ఆదేశాన్ని శ్రద్ధగా చదవండిః
మా ఆయతులను గురించి వారు ఆపహాస్యం చేస్తూ (తిరస్కరించడాన్ని) నీవు గమనిస్తే, వారు ఆ విషయాన్ని మానేసి మరో విషయం మాట్లాడుకునే వరకు వారి నుండి తొలగిపో. ఒకవేళ షైతాను నిన్ను మరపింపజేస్తే జ్ఞాపకం వచ్చిన తర్వాత అలాంటి దుర్మార్గులైన వారితో కలసి కూర్చోకు. (అన్ఆమ్ 6: 68).
వారు ఎంత దగ్గరి బంధువులైనా, వారి సహవాసం ఎంత ప్రేమ పూర్వ కమైనా, వారి మాటలు ఎంత తీపిగా ఉన్నా ధర్మం మరియు ధార్మికులతో వారి ఈ స్థితి ఉన్నంత వరకు వారితో కూర్చోవడం ధర్మసమ్మతం కాదు. కాని వారికి బోధచేయుటకు, వారి తప్పును ఖండించి వారికి నచ్చజెప్పుటకు వారితో కూర్చుండుట నిషిద్ధం కాదు. అయితే వారితో వారి చేష్టలతో సంతోషపడి కూర్చోవడం ఏ మాత్రం సమంజసం కాదు.
“నమాజులో దొంగతనం చేసేవాడు ప్రజల్లో అతి చెడ్డ దొంగ”. ప్రవక్తా! నమాజులో ఎలా దొంగతనం చేస్తాడు అని సహచరులు ప్రశ్నించారు. “తన రుకూ, సజ్దాలు పూర్తి చేయనివాడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశదీకరించారు. (ముస్నద్ అహ్మద్ 5/310, సహీహుల్ జామి 997).
నమాజులో నిదానాన్ని పాటించక, రుకూ, సజ్దాలో వీపును నిటారుగా ఉంచక, రుకూ నుండి నిటారుగా నిలబడక, రెండు సజ్దాల మధ్య నెమ్మదిగా చక్కగా కూర్చోకపోవుట లాంటి లోపాలన్నీ ఈ రోజుల్లో ప్రబలిపోయాయి. ఏ ఒక్క మస్జిదులో కూడా నిదానంగా నమాజు పాటించేవారు కనబడటం లేదు. నిదానం అన్నది నమాజులోని ఒక రుకున్ (ముఖ్య అంశం). అది లేనిది నమాజు కాదు. ఇది చాలా భయంకర విషయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారుః
“రుకూ, సజ్దాలో తన వీపును నిటారుగా, చక్కగా ఉంచనివారి నమాజు పూర్తి కాదు”. (అబూదావూద్ 855. సహీహుల్ జామి 7224).
నిశ్చయంగా ఇది తప్పు. అలా చేయువారిని హెచ్చరించాలి. అబూ అబ్దుల్లాహ్ అష్అరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నమాజు చేయించి, తమ సహచరులతో కూర్చున్నారు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి నమాజు ఆరంభిం చాడు. చుంచుఘట్టనం మాది రిగా రుకూ, సజ్దాలు చేయసాగాడు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారుః
“చూశారా ఇతడిని? ఎవరు ఈ స్థితిలో చనిపోతాడో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మంపై అతని చావు కాదు. కాకి, రక్తంలో తన చుంచువును కొట్టినట్లు ఈ వ్యక్తి నమాజులో తన చుంచువును కొడుతాడు. నమాజు చేస్తూ రకూ చేయకుండా, సజ్దాలో చుంచువుకొట్టే వ్యక్తి పోలిక ఆకలిగల వాని లాంటిది. ఆ వ్యక్తి ఒకటో రెండో ఖర్జూరపు ముక్కలు తింటే ఏమి లాభం”. (సహీ ఇబ్ను ఖుజైమా 1/332, సిఫతు సలాతిన్నబీ లిల్ అల్బానీ 131).
జైద్ బిన్ వహబ్ ఉల్లేఖించారుః ఒకసారి హుజైఫా (రదియల్లాహు అన్హు) ఒక వ్యక్తిని రుకూ, సజ్దాలు సరిగ్గా చేయనిదిగా చూసి, ‘నీవు నమాజు చేయలేదు, నీవు గనక ఇదే స్థితిలో చనిపోతే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను అల్లాహ్ ఏ స్వభావంపై పుట్టించాడో దానిపై నీ చావు కానట్లే’. (బుఖారి 791).
నిదానం పాటించకుండా నమాజు చేసిన వ్యక్తికి నిదానం విధి అన్న విషయం తెలిసిన వెంటనే, చేసిన నమాజు సమయం ఇంకా ఉంటే ఆ నమాజును తిరిగి మరోసారి నిదానంగా చేయాలి. దాని గురించి తెలియక ముందు చేసిన నమాజుల గురించి అల్లాహ్ తో స్వచ్ఛమైన తౌబా చేసుకో వాలి. అయితే వాటిని తిరిగి మరోసారి చేయనక్కర లేదు. దీనికి నిరూపణ “తిరిగి మళ్ళీ నమాజు చేయి నీవు నమాజు చేయలేదు” అని వచ్చిన బుఖారి గ్రంథంలోని (757) హదీసు.
“నీవు నమాజులో ఉన్నప్పుడు తొలగించకు. ఒకవేళ నీవు తప్పనిసరిగా తొలగించదలచితే ఒక్కసారి మాత్రమే అచ్చటి రాళ్ళను తొలగించు”. (అబూదూవూద్ 946, సహీహుల్ జామి 7452).
అనవసరంగా, ఎడతెగకుండా, అధిక చలనం, కదలికల వల్ల నమాజు వ్యర్థమవుతుందని ధర్మవేత్థలు ప్రస్తావించారు. ఇక ఎవరైతే తమ నమా జులోనే అల్లాహ్ ముందు నిలబడి వ్యర్థ పనులు చేస్తూ ఉంటారో వారి సంగతేమిటి? ఒకడు తన గడియారంలో టైం చూసుకుంటే, మరొకడు దుస్తులను సరిచేస్తూ ఉంటాడు, ఇంకొకడు వ్రేళ్ళు విరుచుకుంటూ ఉంటాడు. మరొకడు కుడి, ఎడమ ప్రక్కల్లో, ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. అతని చూపులు తీసుకోబడవచ్చు అన్న భయమే అతనికి ఉండదు. ఈ విధంగా షైతాన్ తన నమాజులో భాగం కల్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని భావించడు.
التَّأّنِّي مِنَ الله وَالْعُجْلَةُ مِنَ الشَّيْطَان
“నెమ్మది అల్లాహ్ వైపు నుండి మరియు తొందరపాటు షైతాన్ తరఫు
నుండి ఉంటుంది”. (బైహఖీ కుబ్రా 10/104, సహీహ 1795).
సామూహిక నమాజులో ఉన్న వ్యక్తి తన కుడి, ఎడమ ప్రక్కన ఉన్న వారిలో, స్వయంగా తానే రుకూ, సజ్దాలో, అల్లాహు అక్బర్ అంటూ ఒక స్థితి నుండి రెండవ స్థితిలోకి వెళ్ళేటప్పుడు చివరికి సలాంలో కూడా ఇమాంకు ముందు పోవటాన్ని ఎన్నోసార్లు గమనించి ఉంటాడు. అనేక మంది దీనిని ఎంతో ముఖ్యం అన్న విషయం గమనించరు. కాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీని గురించి ఎలా హెచ్చరించారో చదవండిః
“ఇమాం కంటే ముందుగా తల పైకెత్తే వాడికి అల్లాహ్ తన తలను గాడిద తలగా మారుస్తాడని భయం వేయదా?”. (ముస్లిం 427, బుఖారి 691).
నమాజు కొరకు వచ్చే మనిషి నిదానంగా, హుందాతనంగా రావాలని చెప్పబడినప్పుడు స్వయం నమాజులో ఎంత నిదానం పాంటించాలో గమ నించండి. ‘ఇమాంకు ముందు’ మరియు ‘ఇమాంకు వెనక’ అనే ఈ రెండు వేరు వేరు విషయాల్లో కొందరు కన్ ఫ్యూసన్ లో పడి ఉన్నారు.
ఈ విషయంలో ధర్మశాస్త్రవేత్తలు సూచించిన ఓ నియమం తప్పక
తెలుసుకోవాలి. ముఖ్తదీ ఇమాంను అనుసరిస్తూ ఏ స్థితిలో వెళ్ళదలచినా, ఇమాం అల్లాహు అక్బర్ అన్న పదం పూర్తి చేసిన వెంటనే ముఖ్తదీ ఆ స్థితిలోకి వెళ్ళడం ఆరంభించాలి. అంటే అల్లాహు అక్బర్ యొక్క ‘ర్’ విన్న వెంటనే ముఖ్తదీ ఆరంభించాలి. దానికి ముందు చేయకూడదు. వెనక చేయకూడదు. ఇలా సరియైన పద్ధతి అనుసరించినట్లవుతంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు ప్రవక్తకు ముందు పోకుండా చాలా జాగ్రత్త పడేవారు. బరా బిన్ ఆజిబ్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారుః సహచరులు ప్రవక్త వెనక నమాజు చేస్తున్నప్పుడు ప్రవక్త రుకూ నుండి నిలబడినప్పుడు వారిలో ఏ ఒక్కరు కూడా సజ్దా కొరకు తమ వీపును వంచేవారు కాదు. ప్రవక్త సజ్దాలోకెళ్ళి తమ నుదుటిని భూమిపై ఆనించిన తర్వాతే వారు సజ్దా చేయుటకు వంగేవారు. (ముస్లిం 474).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కొంచం లావుగా అయిన తర్వాత ఆయన చలనంలో కొంత ఆలస్యం, దీర్ఘం అయ్యేది. అప్పుడు ఆయన ఓసారి ఇలా హెచ్చరించారుః
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు కొరకు నిలబడినప్పుడు అల్లాహు
అక్బర్ అనేవారు, రుకూ చేస్తున్నప్పుడు అల్లాహు అక్బర్ అనేవారు,… మళ్ళీ సజ్దా కొరకు వంగుతూ అల్లాహు అక్బర్ అనేవారు, సజ్దా నుండి తమ తల లేపుతూ అల్లాహు అక్బర్ అనేవారు, మళ్ళీ సజ్దా చేస్తూ అల్లాహు అక్బర్ అనేవారు, మళ్ళీ సజ్దా నుండి తల ఎత్తుతూ అల్లాహు అక్బర్ అనేవారు. నమాజు పూర్తి అయే వరకు ఇలాగే చేసేవారు. రెండవ రకాతు తషహ్హుద్ కొరకు కూర్చుని లేచేటప్పుడు కూడా అల్లాహు అక్బర్ అనేవారు. (బుఖారి 789, ముస్లిం 392).
ఇమాం చెప్పే తక్బీర్ తన కదలికకు అనుగుణంగా ఉంటే మరియు ముఖ్తదీలు పైన తెలిపిన ప్రకారం ఆచరించుటకు సంపూర్ణంగా ప్రయత్నిస్తే సామూహిక నమాజు స్థితి చాలా బాటుపడుతుంది.
“ఎవరు ఉల్లి, ఎల్లి, మరియు (Leek) తిన్నారో వారు మా మస్జిద్ కు సమీ పించకూడదు. నిశ్చయంగా ఆదం సంతతి దేనిని సంకటమని భావిస్తారో, దైవదూతలు కూడా దానిని సంకటంగా భావిస్తారు“. (ముస్లిం 564).
(లీక్ (Leek) అంటే ఉల్లి, ఎల్లి లాంటి దురవ్వాసన గల ఓ కూరగాయ).
ఉమర్ ఓసారి జూమా ఖుత్బా (ప్రసంగం) ఇస్తూ ఇలా చెప్పారుః
“ప్రజలారా! మీరు రెండు చెట్ల (ఫలాలు) తింటారు. అవి (వాసనపరంగా) చెడ్డవి అని భావిస్తాను. అవి ఉల్లి, వెల్లుల్లి. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను చూశాను. ఆయన ఎవరి దగ్గరి నుంచి అయినా వాటి వాసన వస్తే వారిని బయటికి పంపేయాలని ఆజ్ఞాపించేవారు. ఆయన ఆజ్ఞ మేరకు వారిని బఖీ శ్మశానవాటిక వరకు గెంటేయటం జరిగేది. కనుక చెబుతున్నాను, వాటిని తినాలనుకునే వారు వాటిని వండి వాటి వాసనని పోగొట్టి తినండి“. (ముస్లిం 567).
ఎవరైతే తమ పనుల నుండి నేరుగా మస్జిదులకు వచ్చేస్తారో మరి వారి చంకల నుండి, మేజోళ్ళ నుండి కంపు వాసన వస్తూ ఉంటుందో వారు కూడా ఇందులో పరిగణించబడతారు. (అంటే వారు కనీసం ఈ దుర్వాసన దూరం చేసుకొని వచ్చే ప్రయత్నం చేయాలి).
దీనికంటే మరీ చెడ్డవారు పొగతాగేవారు. ఎలా అంటే నిషిద్ధమైన (బీడి, సిగ్రేట్, గుట్కా, ఇతర పొగాకుకు సంబంధించిన) వస్తువులు సేవించి నేరుగా మస్జిదుకు వచ్చి అల్లాహ్ దాసులైన దైవదూతలకు మరియు నమాజీలకు బాధ కలిగిస్తారు.
ఇస్లాం ధర్మ ఉద్దేశాల్లో మానము, గౌరవముల రక్షణ మరియు సంతానోత్పత్తి రక్షణ చాలా ముఖ్యమైనవి. అందుకే ఇస్లాం వ్యభిచారాన్ని నిషేధించింది. అల్లాహ్ ఆదేశం చదవండిః
వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్ళకండి. అది అతిదుష్ట కార్యం. బహు చెడ్డ మార్గం. (బనీఇస్రాఈల్ 17: 32).
అంతే కాదు, దాని వరకు చేర్పించే మార్గాలను, సాధనాలను కూడా మూసివేసింది. అందుకే పర్దా పాటించాలని, చూపులు క్రిందికి ఉంచాలని ఆదేశించింది. పరస్త్రీలతో ఒంటరిగా, ఏకాంతంలో ఉండడం నిషేధించింది.
వివాహితుడైన వ్యభిచారికి అతికఠినమైన శిక్ష విధించింది; అతను చనిపోయే వరకు అతనిపై రాళ్ళు రువ్వబడును. ఎందుకంటే తాను చేసిన చెడు కార్యపు ఫలితాన్ని అతడు చవిచూడాలి. అతని శరీరము యొక్క ప్రతి భాగం/అంగం ఆ నిషిద్ధ కార్యం చేస్తూ ఎలా సుఖాన్ని అనుభవించినదో అలాగే బాధను/నొప్పిని అనుభవించాలి. వివాహం కాని వ్యభిచారిపై వంద కొరడా దెబ్బల శిక్ష విధించింది. ఇది ఇస్లామీయ శిక్షల్లో నియమించబడిన అతి ఎక్కువ శిక్ష. ఇంతే కాదు, విశ్వాసుల సమూహ సమక్షంలో అతనిపై ఈ శిక్ష విధించి, ఆ తర్వాత పూర్తి ఒక సంవత్సరం వరకు ఈ నేరానికి పాల్పడిన స్థలం నుండి దూరం చేసి మరింత అవమానం, అగౌరవం పాలు చేయాలి. (ఇది ప్రపంచ శిక్ష).
వారికి సమాధి శిక్ష: పైన ఇరుకుగా, క్రింద వెడల్పుగా ఉండే (కుండ లాంటి) ఆవంలో వారిని నగ్నంగా వేయబడును. దాని క్రింద అగ్ని మండు తుండును. అందులో జ్వాలలను ప్రజ్వలింపజేసినపుడల్లా వారు అరుస్తూ, దాని నుండి బైట పడడానికి పైకి వచ్చును. కాని అప్పుడే మంటలు చల్లారి వారు మళ్ళీ లోపలికి పడిపోవుదు. ఇలా ప్రళయం వరకు జరుగుతూ ఉండును.
పరిస్థితి మరింత ఘోరంగా మారేది; మనిషి వృద్ధాప్యానికి చేరుకొని, సమాధికి సమీపించే సమయం వచ్చినప్పుటికీ అల్లాహ్ శిక్షించకుండా అతనికిచ్చిన వ్యవధిని (దుర్వినియోగం చేసుకొని) వ్యభిచారంలోనే మునిగితేలాడుతున్నప్పుడుః ఆ విషయమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః
“ప్రళయదినాన ముగ్గురితో అల్లాహ్ మాట్లాడడు, వారిని శుద్ధపరచడు మరియు వారి వైపు చూడడు. వారికి కఠిన శిక్ష కలుగునుః వృద్ధ వ్యభి చారి. అబద్ధం పలికే రాజు. అహంకారం చూపే పేదవాడు”. (ముస్లిం 107).
సంపదల్లో అతి చెడ్డది వ్యభిచార సంపద. ఏ వ్యభిచారిణి తన వ్యభి చారం ద్వారా డబ్బు సంపాదిస్తుందో అర్థ రాత్రి ఆకాశ ద్వారాలు తెరువ బడే సమయాన ఆమె దుఆ స్వకరించబడదు. (సహీహుల్ జామి 2971).
పేదరికము మరియు ఆగత్యములు అల్లాహ్ హద్దులను మీరడానికి ఎంత మాత్రం ధార్మిక సబబులు కావు. వెనకటి సాత్రం ఎంత నిజం: “స్వతంత్రు రాలైన స్త్రీ ఆకలిగొన్నప్పుడు తన రొమ్ముల వ్యాపారం చేసి (పాలు అమ్మి) తినదు అలాంటప్పుడు తన మానాన్ని అమ్మి ఎలా తింటుంది“.
నేటి కాలంలో ఈ అశ్లీల కార్యానికి ప్రతి ద్వారము తెరువబడింది. షైతాన్ తన మరియు తన అనుచరుల కుట్రలలతో ఈ మార్గాలను సులభం చేశాడు. అవిధేయులు, దుష్టులు వానిని అనుసరించారు. ఇప్పుడు పర్దా లేకుండా తిరగడం, చూపులు నలువైపుల్లో లేపి నిషిద్ధమైన వాటిని చూడడం, స్త్రీపురుషులు విచ్చలవిడిగా కలసుకోవడం సర్వసాధారణమ య్యాయి. కామవాంఛల్ని రెకేత్తించే మ్యాగ్జిన్లు, నీల చిత్రాలు సర్వ సామా న్యమయ్యాయి. దుర్మార్గ ప్రదేశాలకు ప్రయాణాలు అధికమయ్యాయి. వేశ్యాగృహాలు తెరువబడుతున్నాయి. మానభంగాలు పెచ్చరిల్లుతున్నాయి. అసంఖ్యాక అక్రమ సంతానాలు కలుగుతున్నాయి. అబార్షన్ల ద్వారా పిండాలను హతమార్చడం జరుగుతుంది. అల్లాహ్! మేము నీ దయ, కరుణ ద్వారా మా దుష్కార్యాల నుండి దూరముండే భాగ్యం కోరుతున్నాము. ఇంకా మా హృదయాలను శుద్ధిపరచి, మా మానాలను కాపాడుము. మాకూ, నిషిద్ధ కార్యాలకూ మధ్య పఠిష్టమైన అడ్డు నిలుపుము. అమీన్!!
లూత్ తన జాతి ప్రజలతో ఇలా అన్నాడుః నిశ్చయంగా మీరు చాలా అశ్లీల కార్యం చేస్తున్నారు. మీకు పూర్వం లోకంలో ఎవ్వడూ ఇటువంటి పని చేయలేదు. ఇదేమిటి? (కామంతో) మీరు పురుషుల వద్దకు పోతున్నారు, దారి దోపిడీలు చేస్తున్నారు. మీ సభలో అసభ్యకరమైన పనులు చేస్తున్నారు. (అన్కబూత్ 29: 28, 29).
ఈ పాపం చాలా చెడ్డది, దుష్టమైనది మరియు భయంకరమైనది
కనుక దానికి పాల్పడిన వారిపై అల్లాహ్ నాలుగు రకాల శిక్షలు పంపాడు. మరే జాతిపై ఆ నాలుగు శిక్షలు కలిపి పంపలేదు. 1. వారి కంటి చూపులను పొగొట్టాడు. 2. వారి పట్టనాన్ని తలక్రిందులుగా చేశాడు. 3. దాని మీద కాల్చిన మట్టితో చేయబడిన రాళ్ళు ఎడతెగకుండా కురిపించాడు. 4. వారిపై ఒక ప్రేలుడును వదిలాడు.
ఇలాంటి దుష్కార్యం తన ఇష్టంతో చేసిన వ్యక్తి, చేయించుకున్న వ్యక్తి ఇద్దరినీ ఖడ్గంతో హతమార్చాలన్న శిక్ష విధించింది మన ధర్మం. ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ప్రవక్తతో ఉల్లేఖించిన హదీసులో ఇలా ఉందిః
“లూత్ అలైహిస్సలాం జాతివారు చేసినటువంటి పని ఎవరైనా చేస్తూ మీరు పట్టుకుంటే చేసుకున్నవాడు, చేయించుకున్నవాడు ఇద్దరినీ హత మార్చండి”. (అహ్మద్ 1/300. సహీహుల్ జామి 6565).
పూర్వకాలాల్లో లేని మహామారి (Plague), ఎయిడ్స్ తదితర రోగాలు ఈ రోజుల్లో ప్రబలిపోతున్నాయి అంటే ఇస్లాం ధర్మం విధించిన ఈ శిక్ష సమాజానికి ఎంత ప్రయోజనకరమో అర్థం అవుతుంది.
“భర్త తన భార్యను పడకపైకి పిలిచినప్పుడు ఆమె (అకారణంగా) రాకపోతే, దానికిగాను భర్త ఆమె మీద అసంతృప్తితో ఉంటే తెల్లారే దాకా దైవదూతలు ఆమెను శపిస్తూ ఉంటారు. (బుఖారి 3237, ముస్లిం 1436).
అనేక మంది స్త్రీలు భర్తకు, మరియు తన మధ్య ఏదైనా చిన్న తగాద జరిగినా తనపై ఉన్న భర్త పడక హక్కును నిరాకరించి శిక్షించాలన్నది ఆమె అభిప్రాయం. కాని ఇది ఎన్నో భయంకర చెడులకు దారితీయవచ్చు. భర్త ఏదైనా నిషిద్ధ కార్యంలో పడవచ్చు. లేదా ఈమె కుండ బోర్లపడవచ్చు అంటే భర్త మరో పెళ్ళి గురించి నిశ్చయించకోవచ్చు. అందుకే భార్య భర్త పిలుపును త్వరగా స్వీకరించాలి. ఇందులో కూడా ఆమెకు ప్రవక్త rను అనుసరించిన (పుణ్యం లభిస్తుందని ఆశించాలి). ప్రవక్త ఇలా ఆదేశించారుః
“భర్త తన భార్యను పడకపై పిలిచినప్పుడు ఆమె ఒంటె వీపుపై ఉన్నా రావాలి”. (జవాఈదుల్ బజ్జార్ 2/181, సహీహుల్ జామి 547).
భర్త భార్య స్థితిగతులను గమనించాలి. ఆమె రోగంతో, గర్భంతో లేదా ఏదైనా అవస్తతో ఉన్నప్పుడు జాగ్రత్తగా మెదులుకుంటూ ఉంటే వారి మధ్య ప్రేమ, ఐక్యత ఎల్లకాలం ఉండి, విచ్ఛిన్నానికి దూరంగా ఉండవచ్చు.
(కొన్ని సమాజాల్లో, కొన్ని దేశాల్లో) అనేక మంది స్త్రీలు తమ భర్తలతో ఏ చిన్న సమస్య ఎదురైనా, తాము కోరిన సొమ్ము భర్త ఇవ్వకపోయినా విడాకులు కోరుతారు. భర్తకు అసాధ్యమైన కోర్కెలు కోరాలని ఒకప్పుడు ఆమెకు ఆమె దగ్గరి బంధువు, లేదా పొరుగువాళ్ళు ప్రేరేపించి ఉంటారు. మరి కొందరు రెచ్చగొట్టే మాటలు ఛాలెంజీగా మాట్లాడతారు. ఉదాః నీవు మగాడివే అయితే నాకు విడాకులిచ్చి చూడు. విడాకుల వల్ల కుటుంబం విచ్ఛిన్నం కావడం, సంతానం అభాగ్యులవడం లాంటి అనేక ఉపద్రవాలు జనిస్తాయి. అప్పుడు బుద్ధి తెచ్చుకుంటే ఏమీ ప్రయోజనం. పై కారణాల మరియు ఇతర కారణాల వల్ల విడాకులు కోరడం నిషిద్ధమని వచ్చిన ఇస్లాం ఆదేశం ఎంత సముచితమో, వివేకముతో కూడినదో అర్థం అవు తుంది. సౌబాన్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో ఉల్లేఖించిన హదీసులో ఉందిః
“ఖులా మరియు విడాకులు కోరుతూ భర్తల నుండి దూరముండగోరే స్త్రీలే మునాఫిఖులు” (కపటవిశ్వాసినిలు). (తబ్రానీ కబీర్ 17/339, సహీ హుల్ జామి 1934).
ఏదైనా ధార్మిక కారణం ఉంటే, ఉదాః భర్త నమాజు చేయనివాడు, మత్తు సేవించేవాడు, లేదా నిషిద్ధ కార్యం చేయుటకు భార్యపై ఒత్తిడి చేసేవాడు, కొట్టి, బాధించి మరియు ధర్మ పరంగా ఉన్న ఆమె హక్కుల్లో అడ్డు పడి ఆమెపై దౌర్జన్యం చేసేవాడు అయి, ఏ ఉపదేశం కూడా అతని పట్ల ప్రయోజనకరంగా లేకుంటే, సంధి, సంస్కరణ యొక్క ఏ ప్రయత్నం సఫలం కాకుంటే అప్పుడు ఆమె తన ధర్మాన్ని, తననూ కాపాడుకొనుటకు అతనితో విడాకులు కోరవచ్చును. అందులో ఏలాంటి పాపం లేదు.
పూర్వపు అజ్ఞాన కాలానికి సంబంధించిన పద్ధతుల్లో కొన్ని ఇప్పటికీ ముస్లిం మాజాల్లో ఉండడం చాలా శోచనీయం. అందులో ఒకటి “జిహార్”. అంటే భర్త భార్యను “నీ వీపు నాకు నా తల్లి వీపు వంటిది”, లేదా “నా సోదరి మాదిరిగా నీవు నాపై నిషిద్ధం” లాంటి దుష్పదాలు పలకడం. ఇందులో స్త్రీలపై ఓ రకమైన అన్యాయం ఉంది గనక ఇస్లాం దీనిని ఇష్టపడలేదు. చాలా చెడ్డదిగా భావించింది. చదవండి అల్లాహ్ ఆదేశం:
మీలో ఎవరు తమ భార్యలను ‘జిహార్’ ద్వారా దూరం ఉంచుతారో వారికి వారి భార్యలు తల్లులు కాజాలరు. వారిని కన్నవారే వారి తల్లులు. వారు ఎంతో అనుచితమైన మరియు ఎంతో అసత్యమైన మాటను పలు కుతున్నారు. నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడు, క్షమాశీలుడు. (ముజాదలా 58: 2).
ఇస్లాం ధర్మం దాని ప్రాయశ్చితం చాలా కఠినంగా నిర్ణయించింది. అది పొరపాటుగా హత్యచేసినవానిపై విధించిన మరియు రమజాను నెలలో ఉపవాస స్థితిలో భార్యతో సంభోగం చేసినవారిపై విధించిన ప్రాయశ్చితాలతో సమానం. ఈ ప్రాయశ్చితం చెల్లించనంత వరకు జిహార్ చేసిన వ్యక్తి తిరిగి తన భార్యతో కలసుకోలేడు. దాని వివరణ ఈ క్రింది ఆయుతులో ఉందిః
ఎవరైతే తమ భార్యలను జిహార్ ద్వారా దూరం చేసి తర్వాత తమ మాటను వారు ఉపసంహరించుకోదలిస్తే వారిద్దరు కలుసుకోక ముందు ఒక బానిసను విడుదల చేయించాలి. ఈ విధంగా మీకు ఉపదేశమివ్వ బడుతుంది. మరియు మీరు చేస్తున్నదంతా అల్లాహ్ ఎరుగును. కాని ఎవడైతే ఇలా చేయలేడో, అతడు తన భార్యను కలుసుకోక ముందు రెండు నెలలు వరుసగా ఉపవాసముండాలి. ఇది కూడా చేయలేనివాడు, అరవైమంది నిరుపేదలకు భోజనం పెట్టాలి. ఇదంతా మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను దృఢంగా విశ్వసించటానికి. మరియు సత్య తిరస్కారులకు బాధాకరమైన శిక్ష పడుతుంది. (ముజాదల 58: 2,3).
రుతుస్రావానికి సంబంధించిన ఉత్తరువు ఏమిటి అని వారు నిన్ను అడుగుతున్నారు. నీవు వారికి ఇలా తెలుపు: అదొక అపరిశుద్ధ స్థితి. కనుక రుతుకాలంలో భార్యలతో (సంభోగానికి) దూరంగా ఉండండి. వారు పరిశుద్ధులు కానంత వరకు వారి వద్దకు పోకండి. (బఖర 2: 222).
రుతుస్రావంలో ఉన్న భార్య పరిశుద్ధురాలయి, స్నానం చేయనంత వరకు ఆమెతో కలుసుకోవడం భర్తకు ఏ మాత్రం యోగ్యం కాదు.
“రుతువుస్రావంలో ఉన్న భార్యతో సంభోగించువాడు, లేదా భార్యతో మల మార్గం ద్వారా సంభోగించువాడు మరియు జ్యోతిష్యుని వద్దకు వెళ్ళేవాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించినదానిని తిరస్క రించినవాడగును”. (తిర్మిజి 135, సహీహుల్ జామి 5918).
ఎవరైనా ఇది పాపమని తెలియక, తప్పుగా చేస్తే అతనిపై ఏ దోషం, ప్రాయశ్చితమూ లేదు. ఎవరైతే తెలిసి, కావాలని చేస్తాడో అతనిపై ప్రాయశ్చితము ఉంది అని దీనికి సంబంధించిన హదీసును సహీ అని తెలిపిన ధర్మవేత్తలు చెప్పారు. ఆ ప్రాయశ్చితం అనేది ఒక దీనార్ లేదా సగం దీనార్. అయితే మరికొందరి అభిప్రాయ ప్రకారం ఈ తప్పు చేసిన వ్యక్తి తనిష్ట ప్రకారం ఒక దీనార్ లేదా సగం దీనార్ దానం చేయాలని చెప్పారు. అయితే మరికొందరు ఇలా చెప్పారుః రుతుకాలం ఆరంభంలో రక్తం స్రవిస్తున్న సందర్భంలో సంభోగించినట్లైతే ఒక దీనార్, ఒక వేళ చివరి కాలంలో రక్తస్రావం తగ్గిపోయిన తర్వాత లేదా పూర్తిగా ఆగిపోయిన తర్వాతే కాని స్నానం చేసేకి ముందు సంభోగిస్తే సగం దీనార్ దానం చేయాలి అని. ఒక దీనారు నాలుగు గ్రాములు మరియు పావు గ్రాముల (4.25) బంగారానికి సమానం. అయితే బంగారం దానం చేసినా లేదా దాని విలువకు సమానమైన కరెన్సీ అంటే డబ్బు దానం చేసినా సరే.
కొందరు బలహీనవిశ్వాసులు తమ భార్యలతో మలమార్గం ద్వారా సంభోగించడంలో వెనకాడరు. ఇది ఘోరపాపాల్లో పరిగణించబడుతుంది. ఇలా చేసేవారిని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శపించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు.
“రుతువుస్రావంలో ఉన్న భార్యతో సంభోగించువాడు, లేదా భార్యతో మల మార్గం ద్వారా సంభోగించువాడు మరియు జ్యోతిష్యుని వద్దకు వెళ్ళేవాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించినదానిని తిరస్కరించినవాడగును“. (తిర్మిజి 135, సహీహుల్ జామి 5918).
స్వభావిక గుణంగల ఎందరో భార్యలు ఈ పద్ధతిని తిరస్కరిస్తారు కాని భర్తలే విడాకులిస్తానని బెదిరిస్తారు. పండితులతో ప్రశ్నించి తెలుసుకోవడా నికి సిగ్గుపడే తమ భార్యలను కొందరు భర్తలు మోసం చేసి, ఈ విధానం యోగ్యమని ఖుర్ఆన్ యొక్క ఈ ఆయతు చూపుతారు
మీ భార్యలు మీకు పంటపొలాల (వంటివారు), కావున మీ పొలాలకు మీరు కోరిన విధంగా పోవచ్చు. (బఖర 2: 223).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసులు ఖుర్ఆన్ ఆయతుల భావాన్ని విశదీకరిస్తాయి అన్న విషయం తెలిసినదే. నిశ్చయంగా దీని గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పారుః “భర్త తన భార్యతో సంభోగించడానికి ఆమె ముందు నుండి, వెనక నుండి ఎలా వచ్చినా సరే, కాని సంతానం కలిగే దారి నుండే సంభోగించాలి”. అయితే మలము వచ్చే దారి నుండి సంతానం కలగదు అన్న విషయం తెలియనిది కాదు.
ఇంతటి ఘోరపాపానికి ఒడిగట్టే కారణాలు ఏమిటంటే; పవిత్ర దాంపత్య జీవితంలో కాలు మోపే ముందు అజ్ఞానపు దుష్చేష్టలకు, నిషిద్ధమైన భిన్నమైన, అసాధారణ పద్ధతులకు అలవాటు పడి, లేదా నీలచిత్రాల్లోని కొన్ని సంఘటనలు జ్ఞాపకశక్తిలో నాటుకొని ఉన్న వాటిని వదులుకోరు, అల్లాహ్ తో స్వచ్ఛమైన తౌబా కూడా చేయరు.
భార్యభర్తలిద్దరూ ఏకమై ఇష్టపడి ఈ దుష్కారం చేసుకున్నా అది నిషి ద్ధమే ఉంటుంది. ఏదైనా నిషిద్ధ కార్యం ఇష్టపడి చేసినంత మాత్రాన ధర్మం సమ్మతం కాజాలదు.
మీరు ఎంత కోరినా, మీ భార్యల మధ్య పూర్తి న్యాయం చేయటం మీ చేతకాని పని. కనుక ఒక భార్య వైపునకు ఎక్కువగా మొగ్గి, మరొకామెను డోలాయమాన స్థితిలో వదలకండి. మీరు మీ ప్రవర్తనను సరిజేసుకొని దైవభీతి కలిగి ఉండండి! ఎందుకంటే నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. (నిసా 4: 129).
ఒకటి కంటే ఎక్కువ భార్యలుగల వ్యక్తి తన భార్యల పట్ల పాటించవల సిన న్యాయం ఇదిః వారితో రాత్రులు గడపడంలో, వారి తిండి, బట్టల్లో వారికి తగిన హక్కు ఇవ్వాలి. హృదయంలో ఉండే ప్రేమలో న్యాయం పాటించమని కాదు. ఎందుకనగా అది మనిషి ఆధినంలో లేదు. బహు భార్యలుగల కొందరు ఒక భార్య వైపు ఎక్కువ మొగ్గు చూపి, మరొకామె పట్ల శ్రద్ధ వహించరు. ఒక భార్య వద్ద ఎక్కువ రాత్రులు గడిపి, లేదా ఒకామెకు ఎక్కువ ఖర్చులు ఇచ్చి మరొకామెను వదిలేస్తారు. ఇలా చేయడం నిషిద్ధం. అలాంటి వ్యక్తి ప్రళయదినాన ఎలా వస్తాడో అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా హెచ్చరించారుః
“ఏ వ్యక్తికయినా ఇద్దరు భార్యలుండి భర్త ఒకే భార్య వైపునకు మొగ్గిపోతే ప్రళయదినాన అతడు ఒక పార్శ్వం పడిపోయిన స్థితిలో లేచి వస్తాడు“. (అబూదావూద్ 2133, సహీహుల్ జామి 6491).
షైతాన్ ఎల్లప్పుడూ మానవులను ఏదైనా ఉపద్రవంలో పడవేయడానికి మరియు నిషిద్ధ కార్యానికి గురిచేయడానికి పరితపిస్తూ ఉంటాడు. అందుకే అల్లాహ్ మనల్ని ఈ విధంగా జాగ్రత్తగా ఉండమని సూర నూర్ 24: 21 చెప్పాడు:
“విశ్వాసులారా! షైతాను అడుగుజాడలలో నడవకండి, ఎవడు షైతాన్ అడుగుజాడలలో నడుస్తాడో నిశ్చయంగా షైతాన్ అతనిని అశ్లీలమైన మరియు అసభ్యకరమైన పనులు చేయటానికి ప్రోత్సహిస్తాడు”.
మనిషి శరీరంలో రక్తం ఎలా ప్రవహిస్తుందో అలాగే షైతాన్ మానవ శరీరంలో తిరుగుతుంటాడు. మానవుణ్ణి అశ్లీల కార్యం (వ్యభిచారం)లో పడవేయడా నికి షైతాన్ మార్గాల్లో ఒకటి పరస్త్రీతో ఒంటరిగా ఉండడం. అందుకే ఇస్లాం ధర్మం ఆ మార్గాన్ని మూసివేసింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఆదేశించారుః
“ఈ రోజు తరువాత ఎవ్వరూ కుడా భర్త లేకుండా ఒంటరిగా ఉన్న స్త్రీ ఇంటిలో ప్రవేశించకూడదు. (ఏదైనా అవసరం ఉండి పోదలుచుకుంటే) అతనితో ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులు ఉండాలి”. (ముస్లిం 2173).
ఏ పురుషుడు కూడా ఇంటిలోగాని, గదిలోగాని, వాహనములోగాని ఎక్కడైనా పరస్త్రీతో ఏకాంతంలో ఉండకూడదు. ఆమె సోదరుని భార్య అయినా, సేవకురాలు, ఆడ పనిమనిషి అయినా, డాక్టర్ వద్ద ఆడరోగి అయినా ఎవరైనా సరే. అనేక మంది తమపై లేదా ఇతరులపై నమ్మకంతో ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తారు. అందువల్ల వ్యభిచారంలో లేదా దాని కారణంగల విషయాల్లో పడే భయం ఉంటుంది. తర్వాత వంశవృక్షంలో లోటు మరియు అక్రమ సంతానాలు అధికమవుతున్న విషాద వార్తలు వినవస్తాయి.
మన సమాజంలోని కొన్ని ఆచారాలు అల్లాహ్ ధర్మం యొక్క హద్దులను మీరాయి. ప్రజల అలవాట్లు, వారి అంధవైఖరి అల్లాహ్ ఆదేశాలకు వ్యెతిరేకంగా మితిమీరుతున్నాయి. చివరికి పరిస్థితి ఎంతవరకు చేరిందంటే నీవు వారిలోని ఏ ఒక్కరికైనా అల్లాహ్ ధర్మం ఆదేశం తెలిపి, దాని నిరూ పణాలు, నిదర్శనాలు చూపిస్తే వారు నిన్ను ప్రగతివిరోధి, సంకీర్ణవాది, బంధుత్వం తెంచువాడు మరియు సత్సంకల్పాల్లో అనుమానపడేవాడు అని నానారకాలుగా దూషిస్తారు. పినతండ్రి మరియు పెత్తండ్రి కూతుళ్ళతో, మేనత్త కూతుళ్ళతో, చిన్నమ్మ మరియు పెద్దమ్మ కూతుళ్ళతో, సోదరుల భార్యలతో, పినతండ్రి మరియు పెత్తండ్రి భార్యలతో మరియు మేనమామ భార్యలతో కరచాలనం చేయడం మన సమాజంలో నీళ్ళు త్రాగడం లాంటి తేలికగా మారింది. కాని ఇందులో ధార్మికంగా ఉన్న నష్టాలను తెలివైన దృష్టితో చూస్తే ప్రజలు అలా చేయడం మానుకుంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ హదీసు శ్రద్ధగా చదవండిః
لأن يُطْعَنَ فِي رَأسِ أحَدِكُم بِمَخِيطٍ مِنْ حَدِيدٍ خَيرٌ لَهُ مِن أن يَمُسَّ امْرَأةً لاَ تَحِلُّ لَه
“మీలో ఒకరి తలపై పెద్దసూది లేదా మొలతో గుచ్చడం పరస్త్రీని ముట్టు కునేదానికంటే ఎంతో మేలు”. (తబ్రానీ 20/212, సహీహుల్ జామి 4921).
ఇది చేతుల ద్వారా వ్యభిచారం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ ప్రవచనం చదవండిః
“రెండు కళ్ళు వ్యభిచారం చేస్తాయి. రెండు చేతులు వ్యభిచారం చేస్తాయి. రెండు కాళ్ళు వ్యభిచారం చేస్తాయి. మర్మాంగం వ్యభిచారం చేస్తుంది”. (అహ్మద్ 1/412, సహీహుల్ జామి 4126).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కన్నా పవిత్రహృదయం గలవాడు ఎవడైనా ఉన్నాడా? (సమాధానం లేడు అనే వస్తుంది.) అయన ఏమన్నారో చదవండిః
إنِّي لَا أُصَافِحُ النِّسَاء
“నేను స్త్రీలతో కరచాలనం చేయను”. (ముస్నద్ అహ్మద్ 6/357, సహీహుల్ జామి 2509). మరో సందర్భంలో ఇలా అన్నారుః
إِنِّي لاَ أَمُسُّ أَيدِي النِّساء
“నేను స్త్రీల చేతులకు తాకను”. (తబ్రానీ కబీర్ 24/342, సహీహుల్ జామి 7054. ఇంకా చూడండిః ఇసాబ 4/354, దారుల్ కితాబిల్ అరబీ ముద్రణ).
“ఎన్నడూ లేదు, అల్లాహ్ సాక్షిగా! ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హస్తం ఎన్నడూ ఏ పరస్త్రీ చేతిని కొంచమైనా తాకలేదు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారితో మాట ద్వారా బైఅత్ (విధేయత ప్రమాణం) చేసేవారు”. (ముస్లిం 1866, బుఖారి 5288).
జాగ్రత్తా! తమ సోదరులతో కరచాలనం చేయని భార్యలను విడాకుల బెదిరింపులు ఇచ్చే భర్తలు ఇకనైనా అల్లాహ్ తో భయపడాలి. అలాగే ఏదైనా వస్త్రము అడ్డుగా పెట్టి కరచాలనం చేయడం ఏ మాత్రం యోగ్యం కాదు. డైరక్ట్ కరచాలనం చేసినా, ఏదైనా అడ్డుగా పెట్టి చేసినా అన్ని స్థితుల్లో పరస్త్రీలతో కరచాలనం నిషిద్ధమే ఉంటుంది.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతో కఠినంగా హెచ్చరించినప్పటికీ స్త్రీలు సువాసనలు రుద్దుకొని ఇంటి బైటికి వెళ్ళుట, పురుషుల ముందు నుండి దాటుట ఈ కాలంలో ప్రబలిపోతుంది. ఆయన ఆదేశం ఇలా ఉందిః
“ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని ఆమె సువాసన పురుషులు ఆఘ్ర ణించాలని వారి ముందు నుండి దాటుతుందో ఆమె వ్యభిచారిణి”. (ముస్నద్ అహ్మద్ 4/418, సహీహుల్ జామి 105).
కొందరు స్త్రీలు నిర్లక్ష్యపు భావనతో దీనిని చాలా చిన్న విషయం అను కొని డ్రైవరు, సేల్స్ మేన్ మరియు పాఠశాలల వాచ్ మేన్ ల ముందు నుండి వెళ్తారు. అయితే సువాసన పూసుకున్న స్త్రీ బైటికి వెళ్ళదలచినప్పుడు, అది మస్జిద్ లాంటి పవిత్ర స్థలానికైనా సరే గుస్లె జనాబత్ (స్వప్నస్ఖలనం వల్ల లేదా భార్యభర్తలు కలుసుకున్నందు వల్ల స్నానం) చేసినట్లు స్నానం చేసిన తర్వాతే వెళ్ళాలని కఠినంగా ఆదేశం ఇచ్చింది ఇస్లాం.
“ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని అక్కడ ఉన్నవారు ఆమె సువాసన ఆఘ్రాణించాలని మస్జిద్ వస్తుందో, ఆమె జనాబత్ వల్ల చేసే విధంగా స్నానం చేసిరానంత వరకు ఆమె నమాజు అంగీకరింపబడదు”. (ముస్నద్ అహ్మద్ 2/444, సహీహుల్ జామి 2703).
ఈ రోజుల్లో స్త్రీలు ఉపయోగించే క్రింద తెలుపబడే రకరకాల సుగంధాల విషయంలో ఇక అల్లాహ్ తోనే మొరపెట్టుకోవాలి. ఆయనే మనకు మార్గం చూపువాడు. ఎందుకనగా ఈ నాటి స్త్రీలు పెళ్ళిల్లో, ఉత్సవాల్లో వెళ్ళే ముందు ఉపయోగించే సాంబ్రాణిధూపమలు, అదే విధంగా బజారుల్లో, వాహనాల్లో, అందరూ ఏకమై కలసే చోట చివరికి రమాజాను మాసము లో, ఇతర రోజుల్లో మస్జిదులో వెళ్ళేటప్పుడు కూడా చాలా సేపటి వరకు మరియు దూరం వరకు ఆఘ్రాణించగల సుగంధములు వాడుతుంటారు. అయితే పై సందర్భాల్లో అలాంటి సువాసనలు వాడడం నిషిద్ధం అని వారు తెలుసుకోవడం లేదు. ధర్మపరంగా స్త్రీలు ఉపయోగించవలసిన పరిమళాల్లో వాటి రంగు కానరావాలి. కాని సువాసన రాకూడదు.
అల్లాహ్! మాలోని కొందరు మూఢ స్త్రీపురుషులు చేసిన తప్పుల వల్ల మాలోని పుణ్యాత్ములైన స్త్రీపురషుల్లోను శిక్షించకు. మా అందరికీ సన్మార్గం ప్రసాదించుము ఓ ప్రభువా!
“అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని విశ్వసించే ఏ స్త్రీ కూడా తనవెంట ఆమె మహ్రమ్ లేనిదే ఒక రోజు జరిగే ప్రయాణం చేయుట యోగ్యం కాదు”. (ముస్లిం 1339, బుఖారి 1088).
ఈ ఆదేశం అన్ని రకాల ప్రయాణాలకు వర్తిస్తుంది. చివరికి హజ్ ప్రయాణం అయినా సరే. మహ్రమ్ లేకుండా స్త్రీ ప్రయాణం దుర్మార్గులను ఆమె పట్ల ప్రేరేపణకు గురి చేస్తుంది. అందుకు వారు ఆమెను ఎదురుకునే ప్రయత్నం చేస్తారు. ఆమె స్వభావికంగా బలహీనురాలు గనక వారి వలలో చిక్కుకుపోతుంది, అందువల్ల ఆమె తన అతివిలువైన గౌరవమానాన్ని కోల్పోతుంది, లేదా కనీసం ఆమె పరువుప్రతిష్టలపై ఒక మచ్చైనా పడవచ్చు.
అదే విధంగా విమానంలో ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. ఒక వైపు మహ్రమ్ వీడ్కోలు తెలిపి మరో వైపు ఆమెను రిసీవ్ చేసుకోడానికి మరో మహ్రమ్ వచ్చినా సరే. ఆమె ప్రక్క సీటులో కూర్చెండేవారు ఎవరై ఉంటారు? లేదా ఒకవేళ ఏదైనా ఆటంకం కలిగి విమానం వేరే విమానాశ్ర యంలో దిగితే, లేదా ఆలస్యం అయి సమయం తప్పి వస్తే ఆమె ఎలాంటి ఇబ్బందులకు గరవుతుందో ఆలోచించండి. ఇలా జరగవచ్చు అని కాదు, వాస్తవంగా జరిగిన ఎన్నో సంఘటనలున్నాయి. వివాహనిషిద్ధమైన ఏ బంధువులో క్రింది నాలుగు షరతులుంటాయో అతడే మహ్రం కాగలడుః 1- ముస్లిం. 2- యుక్తవయస్కుడు. 3- జ్ఞాని. 4- పురుషుడు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారని అబూసఈద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః
“అల్లాహ్ మరియు పరలోకదినాన్ని విశ్వసించే ఏ స్త్రీ అయినా మూడు, అంతకంటే ఎక్కువ రోజుల ప్రయాణం ఒంటరిగా చేయడం యోగ్య కాదు. ఆమెతో అతని తండ్రి, లేదా కొడుకు, లేదా భర్త, లేదా సోదరుడు, లేదా మరెవరైనా మహ్రమ్ తప్పక ఉండాలి”. (ముస్లిం 1340).
(ప్రవక్త! విశ్వసించిన పురుషులకు తమ చూపులను క్రిందికి దించుకోండి (అదుపులో ఉంచుకోండి) తమ మర్మాంగాలను రక్షించుకోండి అనీ చెప్పు, ఇది వారికి ఎంతో పరిశుధ్ధమైన పద్దతి. వారు చేసే దాని గురించి అల్లాహ్ కు బాగా తెలుసు). (నూర్ 24: 30).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారని బుఖారి (6243)లో ఉందిఃفَزِنَا الْعَيْنِ النَّظر
“(నిషిధ్ధమైన వాటి వైపు) చూచుట కళ్ళ వ్యభిచారం అవుతుంది”.
ధార్మిక అవసరంతో (పరస్త్రీని చూచుట తప్పుకాదు). ఉదా: పెళ్ళి చేసుకునే ఉద్దేశంతో మంగీతర్ (నిశ్చితార్థమైన స్త్రీ)ని చూచుట. లేక డాక్టర్ రోగినిని చూచుట.
స్త్రీలు పరపురుషుని వైపు దురెద్దేశంతో చూచుట కూడ నిషిధ్ధం. అల్లాహ్ ఇలా ఆదేశించాడు:
(ప్రవక్తా! విశ్వసించిన మహిళలకు ఇలా చెప్పు: తమ చూపులను క్రిందికి దించుకోండి (అదుపులో ఉంచుకోండి) తమ మర్మాంగాలను రక్షించుకోండి అనీ). (నూర్ 24: 31).
అదే విధంగా గడ్డం, మీసాలు మొలవని అందమైన నవయవకుని వైపు కామోద్దేశంతో చూచుట నిషిధ్ధం. ఇంకా పురుషుడు పురుషుని మర్మాం గాన్ని, స్త్రీ స్త్రీ మర్మాంగాన్ని చూచుట నిషిధ్ధం. ఏ మర్మాంగాన్నైతే చూచుట నిషిధ్ధమో దాన్ని ముట్టుకొనుట కూడా నిషిధ్ధం. అది ఏదైనా అడ్డు నుంచైనా సరే. కొందరు సంచికల్లో, మ్యాగ్జిన్లలో, ఫిల్మ్ లలో వచ్చే ఫోటోలను చుస్తూ ఉంటారు. అవి కేవలం బొమ్మలు వాస్తవికతలు కావు అన్న భ్రమలో షైతాన్ వారిని పడవేస్తున్నాడు. (నగ్న, అర్థ నగ్న ఫోటోలను మ్యాగ్జిన్లలో, టీ.వి. థేటర్లలో చూడటం వలన) భావోద్రేకాల్లో ఎలాంటి ఉత్తేజం కలుగుతుందో ప్రతి తెలివిగలవాడూ గ్రహించగలడు. అందుకు వాటికి దూరమే ఉండాలి.
“ముగ్గురి పై అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడు: (1) మత్తుపానియాలకు బానిస అయినవాడు. (2) తల్లిదండ్రులకు అవిధేయుడు. (3) తన ఇంట్లో అశ్లీలత, సిగ్గుమాలిన వాటిని సహించు ‘దయ్యూస్’”. (అహ్మద్: 2/69. సహీహుల్ జామి: 3047).
ఈ కాలంనాటి దయ్యూస రూపాల్లో ఒకటి: ఇంట్లో కూతురు లేక భార్య పరపురుషునితో టెలిఫోన్లలో సంభాషిస్తూ ఉండగా, అతను అలాంటి వాటిని సహించుట. తన ఇంట్లో ఉన్న స్త్రీలలో ఏ ఒకరైనా పరపురుషునితో ఏకాంతంలో గడుపుతూ ఉండడం చూచి ఊరుకుండుట. లేక ఆమె ఒంటరిగా మహ్రంకాని డ్రైవర్ తో వాహనంలో వెళ్ళుటను చూచి నిరాకరించకపోవుట. వారు ధార్మిక పర్దా లేకుండా బయటికి వెళ్ళి, ప్రతి వచ్చీ పోయే వాని విషచూపులకు గురి అవుతూ ఉండడం గమనించి సహించుట. ఇంకా అశ్లీలత, సిగ్గుమాలినతనాన్ని ప్రచారం చేసే ఫిల్మ్ (క్యాసెట్లు, డిష్ కేబుల్లు) మ్యాగ్జిన్లు ఇంట్లో తీసుకురావటాన్ని చూచి వారిని నిరాకరించకపోవుట.
ఎవరు అతని తండ్రి కాడో, అతన్ని తండ్రి అనుట, ఏ జాతి నుండి అతడు లేడో, ఆ జాతి నుండి అని అనుట ఒక ముస్లింకు ఎన్నడూ యోగ్యం కాదు. కొందరు డబ్బు, ధన ఆశలో అలా చేస్తారు. అఫీషియల్ డాక్యుమెంట్లలో (దస్తావేజుల్లో) అలా వ్రాయిస్తారు. మరి కొందరు తన తండ్రి చిన్న తనంలో అతన్ని వదిలేసినందుకు, ఆ ద్వేషంలో అలా చేస్తారు. ఇలాంటి వ్యవహారాలన్ని నిషిధ్ధం. ఇందువలన వివిధ రంగాలలో అనేక కలతలు తలెత్తుతాయి. ఉదా: మహ్రం, వివాహం మరియు ఆస్తి లాంటి విషయాల్లో.
సఅద్ మరియు అబూ బకర్ y ప్రవక్త తెలిపనట్లు ఉల్లేఖించారు:
“ఎవరయితే తెలిసి కూడా ఇతరులను తన తండ్రి అని ఆరోపణ చేస్తాడో, అతనిపై స్వర్గం నిషిధ్ధం”. (బుఖారి 4327, ముస్లిం 63).
వంశపరంపరలో మార్పు వచ్చే, లేక అబద్ధంతో కూడిన విషయాలన్నీ నిషిధ్ధం. కొందరు తమ భార్యతో గొడవ పెట్టుకొని, ఆమె దుష్కార్యానికి పాల్పడింది అని ఆమెపై అవనింద వేస్తారు. ఆమె గర్భంతో ఉండి, అందులో అతని సంతానమే ఉన్నప్పటికి దాన్ని (తన సంతానాన్ని) తిరస్కరస్తారు. మరి కొందరు స్త్రీలు తమ భర్తతో మోసం చేసి, వ్యభిచారానికి పాల్పడి, గర్భవతి అవుతారు. ఇలా తన భర్త వంశపరంపరలో ఇతరులను చేర్చు తారు. దీనిపై చాలా కఠినమైన హెచ్చరిక ఉంది. సూరె నూర్ (24) 3 నుండి 10 వరకు ములాఅన ఆదేశమునకు సంబంధించిన ఆయతులు అవత రించినప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పగా విన్నట్లు అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః
“ఏ స్త్రీ అయితే ఒక వంశంలో లేని అబ్బాయిని ఆ వంశంలో కలుపుతుందో (అంటే వ్యభిచారం ద్వారా వచ్చిన సంతానాన్ని తన భర్త వంశంలో కలుపు తుందో) అల్లాహ్ వద్ద ఆమె యొక్క విలువ ఏ మాత్రం లేదు. ఆయన ఆమెను తన స్వర్గంలో చేర్పించడు. ఏ వ్యక్తి అయితే తన వైపే చూస్తున్న తన సంతానాన్ని తిరస్కరిస్తాడో, అల్లాహ్ తనకూ మరియు అతనికి మధ్య అడ్డు ఉంచును. (అంటే కరుణ చూపుతో చూడడు). పూర్వికుల వెనుకటి వారందరి ఎదుట అతన్ని అవమానపరుచును” (అబూ దావూద్ 2263. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ ఈ హదీసును జఈఫ్ అని చెప్పారు. జఈఫా 1427, జఈఫుల్ జామి 2221.).
(విశ్వసించిన ప్రజల్లారా! మీరు నిజంగా విశ్వాసులే అయితే, అల్లాహ్ కు భయపడండి, ఇంకా మీకు ప్రజల నుండి రావలసిన వడ్డీని విడిచి పెట్టండి. ఒకవేళ మీరు అలా చెయ్యకపోతే, మీపై అల్లాహ్ తరపున ఆయన ప్రవక్త తరపున యుధ్ధ ప్రకటన ఉంది అనే విషయం తెలుసుకోండి). (బఖర 2: 278, 279).
ఇది అల్లాహ్ వద్ద ఎంత చెడ్డ పాపమో తెలియుటకు పై ఆయతులే చాలు.
ప్రజలు, ప్రభుత్వాలు వడ్డీ కారణంగా వినాశపు చివరి హద్దులోకి చేరు కున్నాయన్న నిజాన్ని వాటిపై దృష్టిసారించిన వ్యక్తి గమనించగలడు. వడ్డీ వ్వవహారల వలన దారిద్ర్యం, మార్కెట్లో సరుకు రాకపోవుట, ఆర్ధిక దీవాలా, అప్పులు చెల్లించే స్థోమత లేకవోవుట, జీవనాభివృధ్ధిలో ఆటంకాలు, నిరుద్యోగ సమస్యలు పెరుగుట, అనేక కంపనీలు, ఆర్ధిక సంస్థలు మూత బడుట, ఇంకా రోజువారి కష్టార్జితము, చెమట ధారాపోసి సంపాదించే సంపాదన కూడా వడ్డీ తీర్చడానికి సరిపడకపోవుట చూస్తునే ఉన్నాము. లెక్కలేనంత ధనం కొందరి చేతుల్లో తిరగటం వలన సమాజంలో వర్గాల తారతమ్యం ఉత్పన్నమవుతుంది. వడ్డీ వ్యవహారంలో పాల్గోన్నవారికి అల్లాహ్ హెచ్చరించిన యుధ్ధ రూపాలు బహుశా ఇవేకావచ్చు.
ప్రత్యంక్షంగా లేక పరోక్షంగా ఏవిధంగానైనా వడ్డీ వ్యవహారం చేసే వారినీ, అందుకు సహాయం చేసే వారినీ (దలాలి, ఏజెంట్) అందరినీ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శపించారు:
“వడ్డీ తినేవారిని, తినిపించే వారినీ, ఆ వ్వవహారాలు వ్రాసేవారినీ, అందులో సాక్ష్యం పలికేవారందరినీ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శపించారు. ఆ పాపంలో వీరందరూ సమానమే” అని చెప్పారు. (ముస్లిం 1598).
ఈ హదీసు ఆధారంగా వడ్డీ ఇచ్చిపుచ్చుకొనుట, వడ్డీ బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేయుట, వడ్డీ వ్యవహారాల్లో క్లర్కుగా, దాని లావాదేవీలు రిజిస్టర్ చేయుటకు, మరియు అందులో వాచ్ మేన్ గా ఉద్యోగం చేయుట యోగ్యం కాదు. వాస్తవం ఏమిటంటే వడ్డీకి సంబంధించిన ఏ వ్వవహారంలో కూడా, ఏ విధంగానైనా పాల్గొనుట నిషిధ్ధం.
ఘోరపాపంతో కూడిన ఈ చెడును ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంత స్పష్టంగా చెప్పారో, అబ్దుల్లాహ్ బిన్ మన్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“వడ్డీలో 73 స్థాయిలున్నాయి. వాటిలో అత్యంత హీనమైన స్థాయి (దశ) యొక్క పాపం; ఒక వ్యక్తి తన కన్న తల్లిని పెళ్ళాడటం వంటిది. వడ్డీ యొక్క అత్యంత తీవ్రస్థాయి పాపం ఒక ముస్లిం పరువు ప్రతిష్ఠలను మంటగలపటం”.(ముస్తద్రక్ హాకిం: 2/37, సహీహుల్ జామి: 3533.).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పినట్లు అబ్దుల్లాహ్ బిన్ హంజలా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“బుద్ధిపూర్వకంగా ఒక దిర్హం వడ్డీ తినడం 36 సార్లకంటే ఎక్కువ వ్యభిచారం చేసినదానితో సమానం”. (అహ్మద్: 5/225, సహీహుల్ జామి: 3375.).
వడ్డీ అందరిపై నిషిధ్ధం. బీదవాళ్ళ, ధనికుల మధ్య ఏలాంటి తేడా లేదు. తేడా ఉంది అని కొందరనుకుంటారు. కాని అది తప్పు. అందరిపై, అన్ని పరిస్థితుల్లోనూ నిషిధ్ధం. పెద్ద పెద్ద వ్యాపారులు, ధనికులు దీని వల్లే దీవాలా తీస్తున్నారు. ఎన్నో సంఘటనలు దీనికి సాక్ష్యాలుగా ఉన్నాయి. వడ్డీ ద్వారా వచ్చే ధనం చూడడానికి ఎక్కువ కనబడినా ఆ ధనంలో బర్కత్ (శుభం) అనేది నశించిపోతుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“వడ్డీ ద్వారా ఎంత ధనం వచ్చినా దాని అంతం అల్పంతోనే అవుతుంది”. (అహ్మద్: 2/37, సహీహుల్ జామి: 3542.).
వడ్డీ శాతం పెరిగినా లేక తరిగినా, ఎక్కువ ఉన్నా లేక తక్కువ ఉన్నా తీసుకోవడం, తినడం ఎట్టిపరస్థితుల్లోనూ యోగ్యం కాదు. అన్ని విధాలుగా నిషిధ్ధం. వడ్డీ తినే వ్యక్తి ఉన్మాది వలే ప్రళయదినాన నిలబడతాడు. ఇది ఎంత చెడు అయినప్పటికి అల్లాహ్ తౌబా చేయమని ఆజ్ఞాపించి, దాని విధానం కూడా స్పష్టం చేశాడు. వడ్డీ తినేవారనుద్దేశించి ఇలా ఆదేశించాడు:
(ఇప్పుడైనా మీరు పశ్చాత్తాప పడి (వడ్డీని వదులుకుంటే) అసలు సొమ్ము తీసుకోవటానికి హక్కుదారులవుతారు. మీరూ అన్యాయం చెయ్యకూడదు. మీకూ అన్యాయం జరగకూడదు). (బఖర 2: 279).
ఇదే వాస్తవ న్యాయం.
విశ్వాసుని మనుస్సు ఈ ఘోరపాపాన్ని అసహ్యించుకొనుట, దాని చెడును గ్రహించుట తప్పనిసరి. దొంగలించబడే లేక నష్టమయ్యే భయం లాంటి గత్యంతరంతో వడ్డీ ఇచ్చే భ్యాంకుల్లో తమ సొమ్మును డిపాసిట్ చేసే వాళ్ళు, వారి గత్యంతరం ఎంతమటుకు ఉంది, గత్యంతరంలేక మరణించిన జంతువును తినువారి లాంటి లేదా అంతకంటే కఠిన స్థితిలో ఉన్నారా? అనేది గ్రహించాలి. అందుకు అల్లాహ్ క్షమాపణ కోరుతూ ఉండాలి. ఎంత సంభవమైతే అంత వరకు (దాని నుండి దూరమై) దాని స్థానంలో వేరే (ధర్మ సమ్మతమైన) ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం తమ సొమ్ము ఉన్న బ్యాంకుల నుండి తమ సొమ్ముపై రావలసిన వడ్డీని వారితో అడగకూడదు. వారు స్వయంగా తన అకౌంటులో జమ చేస్తే దాన్ని దానం ఉద్దేశంతో కాకుండా ఆ పాపపు సొమ్ముతో తన ప్రాణం వదులుకొనుటకు (కడు బీదవారికి) ఇచ్చేయాలి. నిశ్చయంగా అల్లాహ్ పవిత్రుడు. పవిత్రమైన వాటినే స్వీకరి స్తాడు. దాని నుండి స్వలాభం పొందడం ఎంత మాత్రం యోగ్యం కాదు. తినుత్రాగు, ధరించు ప్రయాణ ఖర్చు రూపంలో గాని లేక గృహనిర్మాణం లేక అతనిపై విధిగా ఉన్న భార్యబిడ్డల, తల్లిదండ్రుల ఖర్చు రూపంలోగాని లేక అందులో నుంచి జకాత్, ట్యాక్స్ వగైరా చెల్లించడానికిగాని లేక కనీసం తనపై జరిగిన అన్యాయాన్ని దూరం చేయడానిక్కూడా దాన్ని ఉపయో గించరాదు. కేవలం అల్లాహ్ యొక్క బహుగట్టి పట్టు నుండి తప్పించుకో డానికి ఎవరికైనా ఇచ్చివేయాలి.
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ధాన్యాల కుప్ప నుండి దాటుతూ అందులోకి చెయ్యి పెట్టి చూశారు, వేళ్ళకు తడి అనిపించింది. “ఇదేమిటి ఓ ధాన్యం మనిషి? అని అడిగారు. అందుకతను ‘వర్షం కురిసి నందువల్ల తడిసినవి ప్రవక్తా’ అని జవాబిచ్చాడు. “మరయితే ప్రజలకు కనపడేలా పైన ఎందుకుంచలేదు. మోసము చేసేవాడు మాలోనివాడు కాదు” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హెచ్చరించారు. (ముస్లిం 102).
ఈ రోజుల్లో సరుకు అమ్మేవాళ్ళలో అల్లాహ్ భయభీతి లేని అనేకులు దానిపై ఒక ప్లాస్టిక్ కవర్ అంటించి, లేదా ఆ సరుకును పెట్టలో క్రింద పెట్టేసి, లేదా ఏదైనా కెమికల్ (రసాయనం) ఉపయోగించి దాన్ని అందమైన రూపం లో చూపించి దాని లోపాన్ని తెలియనివ్వరు. లేక ఎలక్ట్రానిక్ మిషిన్, ఇంజన్లు మొదటిసారి స్టాట్ చేసిన వెంటనే వచ్చే లోపంగల శబ్దాన్ని దాచి పెడతారు. అది కొన్నవాడు ఇంటికి తీసుకెల్లే సరికి లేక కొద్ది రోజుల తరువాత పాడైపోతుంది. మరి కొందరు సరుకు యొక్క చివరి తారీఖు (Expiry Date)ను మార్చేస్తారు. లేక సరుకు కొనేవారికి దాన్ని చూసి, చెక్ జేసి అవసరమైతే అనుభవించే అనుమతీ ఇవ్వరు. బండ్లు, వాహనాలు, మిషిన్లు అమ్మేవారు చాలా మంది అందులో ఉన్న లోపాన్ని స్పష్టం చేయరు. ఇది నిషిద్ధం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఆదేశించారుః
“ఒక ముస్లిం మరో ముస్లింకు సోదరుడు. ముస్లిం తన సోదరునికి ఒక
సరుకు అమ్మినప్పుడు అందులో ఏదైనా లోపం ఉంటే దాన్ని అతనికి తప్పక తెలుపాలి”. (ఇబ్ను మాజ 2246, సహీహుల్ జామి 6705).
బండ్లు అమ్మే వారు కొందరు వేలముపాట సందర్భంలో “ఇనుము భండారం”. “ఇనుము భండారం” అని అంటే సరిపోతుంది. కొనేవారు బండ్లంటారు. (అందులో ఉన్న లోపం చెప్పవలసిన అవసరం రాదు) అని భావిస్తారు. కాని ఈ వ్యాపారంలో బర్కత్ (శుభం) అనేది ఉండదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః
“కొనుగోలు చేయు వ్యక్తి మరియు అమ్మకం చేయు వ్యక్తి ఇద్దరికి (సరు కును) స్వీకరించే, నిరాకరించే హక్కు వారిద్దరూ విడిపోయేంతవరకూ ఉంటుంది. ఇద్దరూ సత్యం పై ఉండి (లోపం లేక మరేదైనా అవసరమైన విషయం) విస్పష్టం చేసుకుంటే ఆ ఇద్దరికీ తమ సరుకులో శుభం కలుగు తుంది. ఒకవేళ ఆ ఇద్దరూ అసత్య వ్యవహారం నడుపుకొని వాస్తవికతను కప్పి ఉంచితే ఇద్దరి సరుకుల్లో నుంచి శుభం నశించిపోతుంది”. (బుఖారి 2079, ముస్లిం 1532).
నజ్ ష్ అంటే సరుకు కొనే ఉద్దేశంలేకుడా, తొలి కొనుగోలుదారుడిని మోసగించడానికై అమ్మకానికి సిద్ధంగా ఉన్న వస్తువు ధరను పెంచుతూ పోవడం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారుః
“క్రయవిక్రయాల సమయంలో బేరం మీద బేరం చేస్తూ ధరను పెంచి మోసానికి పాల్పడకండి”. (బుఖారి 6066, ముస్లిం 2563).
ఇది మోసానికి సంబంధించిన ఓ రకం కావడంలో ఏలాంటి సందేహం లేదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉపదేశం బుఖారి, బాబున్ నజ్ ష్. సహీహ 1057లో ఉందిః
المَكْرُ وَالخَدِيعَةُ فِي النَّار
“పన్నాగం మరియు మోసం నరకంలోకి తీసుకువెళ్తుంది”.
అనేక మంది దళారులు వేలముల, కార్ షోరూంల ద్వారా సంపాదిస్తు న్నది అక్రమ సంపాదన. ఎందుకనగా వారు ఎన్నో నిషిద్ధ కార్యాలకు పాల్పడుతారు. అందులో పైన చెప్పిన నజష్ విక్రయం, మరియు కొనేవా రికి మోసం చేయుట. ఇంకా అమ్మటానికి వచ్చిన వ్యాపారి యొక్క సొమ్ము ధర తక్కువ చేసి మోసగించుట. ఒకవేళ సరుకు ఆ దళారిది అయితే, వారు వ్యాపారుల వేషం వేసుకుని వచ్చి ధరలు పెంచుతారు. ఇలా ప్రజలకు మోసం చేస్తారు. నష్టం కలుగజేస్తారు.
(విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజుకై పిలిచినప్పుడు. అల్లాః సంస్మరణ వైపునకు పరుగెత్తండి. క్రయవిక్రయాలను వదలిపెట్టండి. మీరు గ్రహించగలిగితే, ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది). (జుముఅ 62: 9).
కొందరు వ్యాపారులు రెండవ అజాన్ తరువాత కూడా తమ దుకాణా ల్లో లేక మస్జిద్ ముందు అమ్మకాల్లో నిమగ్నులయి ఉంటారు. అయితే వారితో కొనెవాడు కనీసం మిస్వాక్ కొన్నా వారితో పాపంలో పొత్తు కలిసి నట్లే. ఇలాంటి వ్యాపారం వ్యర్థము, తుచ్ఛము అన్నదే సత్యం. హోటల్, బేకరి మరియు ఫ్యాక్టరీల ఓనర్లు కొందరు జుమా సమయంలో కూడా పని చేయాలని తమ పనివాళ్ళపై ఒత్తిడి చేస్తారు. అలాంటి సంపాదనలో బాహ్యంగా ఎక్కువ లాభం ఏర్పడినా, వాస్తవానికి వారు నష్టంలో పడి ఉన్నారన్నది తెలుసుకోవాలి. ఇక పనివాళ్ళు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) యొక్క ఈ ఆదేశంపై నడవాలిః
لاَ طَاعَةَ لِبَشَرٍ فِي مَعْصِيةِ الله
“అల్లాహ్ అవిధేయతకు గురి చేసే ఏ వ్వక్తి మాటా వినకూడదు”. (ముస్నద్ అహ్మద్: 1/129. దీని సనద్ సహీ అని అహ్మద్ షాకిర్ చెప్పారు. 1065)
జోస్యం – ఇవన్నీ అసహ్యకరమైన షైతానులు. వాటిని విసర్జించండి. మీకు సాఫల్యభాగ్యం కలిగే అవకాశం ఉంది). (మాఇద 5: 90).
అజ్ఞానపు కాలంలో జూదం ఆడేవారు. వారిలో ప్రఖ్యాతి చెందిన జూదపు ఒక రూపం, పది మంది ఒక ఒంటెలో సమానంగా పొత్తు కలసి, పాచికల ద్వారా అదృష్టం చూసేవారు. అది వారిలో ఖుర్ఆ (చీటి) యొక్క రూపం. అందులో ఏడుగురికి విభిన్న వాటా లబించేది. ముగ్గురికి ఏమి దొరక్కపోయేది.
ఈ కాలంలో జూదం రూపాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని క్రింద ఇవ్వబడపతపన్నవి:
లాటరి: ఇది ఎన్నో రకాలుగా ఉంది. అందులో సామాన్యమైనది డబ్బు ఇచ్చి నంబర్లు కొనాలి. ఆ నంబర్లమీద లాటరి వెళ్తుంది. మొదటి బహుమతి. రెండవ బహుమతి అని ఇవ్వబడుతుంది. ఇలా అనేక విభిన్న బహుమతులు ఇవ్వబడుతాయి. దీనికి పాల్పడేవారు, ప్రజాసేవ లాంటి ఏ మంచిపేరు పెట్టుకున్నా అది నిషిద్ధం.
మరో రకం: లోపల ఏమున్నదో తెలియని ఓ వస్తువు కొనుట. లేక ఒక వస్తువు కొన్నప్పుడు ఒక నంబరు ఇచ్చి, తరువాత ఆ నంబర్లపై లాటరి తీసి బహుమతిపొందే వారిని నిర్ణయించుట.
ఇన్షూరెన్స్: ఇది కూడా జూదం యొక్క రూపమే. జీవన భీమ, వాహనాల భీమ, సరుకుల భీమ, అగ్నీ ప్రమాద భీమ, ఇతరులతో నష్టం కలిగితే భీమ, ఇలా ప్రతిదానికి భీమ చేయించుట నిషిద్దం. కొందరు గాయకులు తమ శబ్దం(గళం) యొక్క భీమ కూడ చేయిస్తారు.([3])
పైన తెలిపినవే గాక అన్ని రకాల పందెములు జూదంగానే లెక్కించ బడుతాయి. అభివృద్ధి చెందిన ఈ రోజుల్లోనైతే జూదమాడటానికి ప్రత్యేక క్లబ్బులు తెరువబడ్డాయి. ఈ పెద్దపాపం చేయడానికి అందులో గ్రీన్ టేబల్ పేరుతో ప్రత్యేకంగా ఒక స్థలం ఉంటుంది. అదే విధంగా ఫుట్ బాల్, క్రికెట్ వగైరా ఆటల మ్యాచ్ లలో కాసే పందెములు జూదం క్రిందికే వస్తాయి. ఇంకా కొన్ని ఆట ప్రదేశాల్లో, పార్కుల్లోనూ జూదానికి సంబంధిం చిన ఆటలుంటాయి. అవి కూడ నిషిధ్ధం.
కాంపిటీషన్లు, పోటీలు మూడు రకాలు:
1- ధార్మిక ఉద్దేశంగలవి: (యుద్దంలో ఉవయోగవడే) ఒంటెల, గుఱ్ఱాల మధ్య లేక ఇందులో విలువిద్యపోటీలు, గురిపోటీలు బహుమానాలతో నిర్ణయించవచ్చును. బహుమానాలు లేకుండానూ నిర్ణయించవచ్చును. అదే విధంగా ఖుర్ఆన్ కంఠస్తం చేసేలాంటి ధార్మికవిధ్య పోటీలు కూడా ఈ కోవకే చెందుతాయి.
2- ముబాహ్: ఉదా: నమాజ్ నుండి దూరం చేసే, దుస్తులతో దాచవలసిన భాగమును దాచలేనివంటి నిషిధ్ధ కార్యాలకు గురి కాకుండా ఫుట్ బాల్ మ్యాచ్ లేక పరుగుల పోటి లాంటి ముబాహ్([4]) క్రీడలు. ఇవి బహుమానాలు లేకుండా కూడా యోగ్యం.
3- స్వయంగా నిషిధ్ధమైనవి లేక నిషిధ్ధం వరకు చేర్పించునవి: ఉదా: అందాలపోటి, ఒకరినొకరు ముఖము పై కొట్టుకొనునటువంటి ముష్టి యుధ్ధం (బాక్సింగ్), కోళ్ళ, మేకల పోటీలు నిషిద్ధం.
(దొంగ – స్త్రీ అయినా పురుషుడైనా, ఉభయుల చేతులూ నరకండి. ఇది వారి సంపాదనకు ప్రతిఫలం. అల్లాహ్ తరఫునుండి గుణపాఠం నేర్పే శిక్ష. అల్లాహ్ సర్వశక్తిమంతుడు, అత్యంత వివేక సంపన్నుండు). (మాఇద 5: 38)
దొంగతనపు నేరాల్లోకెల్ల అతిచెడ్డది హజ్, లేక ఉమ్రా చేయుటకు కాబా వరకు వచ్చిన వారి నుండి దొంగలించడం. ఆ దొంగ భువిలో అతి ఉత్తమమైన, పవిత్ర క్షేత్రమైన, కాబా ఆవరణలో ఉండి దొంగలిస్తున్నా డంటే, అతను అల్లాహ్ యొక్క హద్దులను ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ఒకసారి సూర్యగ్రహణ సందర్బంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నరకం గురించి
“నేను వెనక్కి జరిగిన దృశ్యం మీరు చూశారు కదూ, అప్పుడు నా ముందు నరకాగ్నిని తీసుకురావడం జరిగింది, దాని దహించివేసే అగ్ని నాకు తాకు తుందన్న భయంతో నేను వెనక్ను జరిగాను. అందులో నేను వంకరకర్ర వ్యక్తిని చూశాను. తాను దానితో తన ప్రేవులను లాగుతున్నాడు. (అతని సంగతేమిటంటే) అతను (ప్రపంచములో) తన ఆ వంకరకర్రతో హజ్ కు వచ్చిన వారి సామానులను తటాలున అందుకునేవాడు. ఒకవేళ వారు గమనించి మందలిస్తే “(క్షమించండి) నా కర్ర మీ సామానులో తలబడింది అని” అనేవాడు. వారు గమనించకుంటే దొంగలించుకొని వెళ్ళేవాడు”. (ముస్లిం: 904).
అదే విధంగా అతి చెడ్డ దొంగతనాల్లో పబ్లిక్ (ప్రజల) సొమ్మును దోచు కొనుట. ఇలా దొంగలించేవారు కొందరు, ఇతరుల మాదిరిగా మేము దొంగ లిస్తున్నాము అని సాకు చెప్పుకుంటారు. కాని ఇది ముస్లింలందరి సొమ్ము అని గ్రహించరు. పబ్లిక్ ప్రాపర్టి (ఆస్తి) అన్నప్పుడు (ముస్లిం దేశాల్లో ముస్లింలందరిది, వివిధ మతాల దేశాల్లో) వారందరి ప్రాపర్టి అవుతుంది. అల్లాహ్ తో భయపడనివారెవరైనా దొంగలిస్తే అది ముమ్మాటికి ఆధారం, ప్రమాణం కాదు. వారిననుసరించి తానూ (పాపం నుండి, దాని శిక్ష నుండి) తప్పించుకోలేడు. మరి కొందరు (ముస్లింలు) ముస్లిమేతరుల సొమ్మును, వారు అవిశ్వాసులు కదా అన్న సాకుతో దొంగలిస్తారు. ఇది కూడా ఘోర మైన తప్పు. ఏ అవిశ్వాసులయితే ముస్లింలతో యుద్ధం చేస్తున్నారో, వారు వారి సొమ్ము తీసుకొనుట మాత్రమే యోగ్యమైనది. వేరే ముస్లిమే తరుల కంపనీ (ఫ్యాక్టరీ)ల నుండి లేక ప్రజల నుండి తీసుకోవడం ఎంత మాత్రం యోగ్యంకాదు.
మరి కొన్ని దొంగతనాలు ఇలా కూడా ఉంటాయి: ఇతరులకు తెలియ కుండానే వారి జేబులను ఖాలీ చేయడం. అతిథిగా ఒకరి ఇంటికి వెళ్ళి ఆతిథ్యమిచ్చినవారి ఇల్లు ఖాలీ చేయడం. కొందరు తమ అతిథుల బ్యాగ్ లను, (విలువైన వస్తువుల్ని) దొంగలిస్తారు. కొందరు స్త్రీ, పురుషులు దుకా ణాల్లోకెళ్లి ఏదో ఒక సామాను తీసుకొని తమ జేబులోనో లేక దుస్తుల్లోనో దాచిపెట్టుకుంటారు. కొందరు తక్కువ ధరగల, చిన్న సామాన్ల దొంగతనాన్ని దొంగతనంగా భావించరు. కాని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉపదేశమేమిటో చూడండి:
“దొంగతన చేసేవాడిని అల్లాహ్ శపించాడు. అతను కోడిగ్రుడ్డును దొంగలిం చినా అతని చేయి నరికివేయబడుతుంది. ఒక తాడు దొంగలించినా అతని చేయి నరికివేయబడుతుంది.” (బుఖారి 6783).
ఏదైనా వస్తువు దొంగలించిన వ్యక్తి అల్లాహ్ తో క్షమాపణ వేడుకోవాలి, మరియు తౌబా చేయాలి. ఆ వస్తువు (ఎవరి నుంచి దొంగలించాడో) అతనికి తిరిగిఇవ్వాలి. గుప్తంగానైనా, లేక నలుగురి ముందైనా, స్వయమైనా లేక ఇతరులతో పంపించి అయినా ఇవ్వాలి. తన శక్తిప్రకారం ప్రయత్నం చేసి నప్పటికీ, దాని హక్కుదారుడు లేదా అతని వారసులైనా కనిపించకుంటే దాన్ని దానం చేసి, పుణ్యం ఆ సొమ్ము హక్కుదారుడికే లభించాలని సంక ల్పించాలి. దుఆ చేయాలి.
(అన్యాయంగా ఒకరి) హక్కును తీసుకోవడానికి లేక సత్యాన్ని అసత్యంగా మార్చడానికి లేక అసత్యం యొక్క పైరవీలు చేయడానికి న్యాయాధిపతులకు, న్యాయవాదు(అడ్వకేట్)లకు లంచం ఇచ్చుట పెద్ద నేరం. ఇది హక్కుగలవానిపై అన్యాయం చేసినట్లు అవుతుంది. తీర్పులో అన్యాయం, అత్యాచారానికి మరియు అల్లకల్లోలానికి దారి తీస్తుంది. అందుకే అల్లాహ్ దీనిని నివారించాడు.
“తీర్పు విషయంలో లంచం తీసుకునేవాడు మరియు ఇచ్చేవాడు, ఇద్దరిని అల్లాహ్ శపించాడు”. (అహ్మద్: 2/387. సహీహుల్ జామి 5069).
ఒక వేళ తన హక్కు తీసుకునే విషయంలోనో, లేక తనపైన జరిగే అత్యాచారాన్ని రూపుమాపడానికో లంచం తప్ప వేరే దారి లేకుంటే అది ఈ హెచ్చరిక పరిధిలోకి రాదు.
నేటి కాలంలో ముడుపుల రోగం ఎంతగా ప్రబలి పోయిందంటే, కొందరు ఉద్యోగులు, వారు పుచ్చుకునే ముడుపులు వారి జీతాలకంటే మించి పోతాయి. కొన్ని కంపనీల బడ్జెట్ లో ఉండే పద్దులలో ఒక పద్దు గుప్తమైన పేరుతో ఉంటుంది. (అది ముడుపులు అని అందరు దాన్ని గమనించలేరు). చాలా వ్యవహారాల, పనుల ఆరంభం, సమాప్తం అది లేనిది జరగదు. దీని వలన పేదవాళ్ళు చాలా నష్టపోతున్నారు. దీని మూలంగానే అనేక సమా జాలు చెడిపోతున్నాయి. యజమానీ నౌకరుల మధ్య కలతలకు కారణం ఇదే అవుతున్నది. ఎవరయితే ముడుపులు చెల్లిస్తారో వారి పనులే సక్రమంగ, తొందరగా జరుగుతాయి. ఎవరయితే చెల్లించరో వారి పనులు సక్రమంగా జరగవు, ఆలస్యం అవుతుంది. ఒకవ్యక్తి లైన్ లో నిలబడే ఉంటాడు, ఇతని వెనుక వచ్చి, ముడుపులు చెల్లించినవారి పనులు ఇతని కంటే ముందే అయిపోయి ఉంటాయి. ఇంకా (కంపనీ, ఫ్యాక్టరిల) ఓనర్ల వరకు వచ్చే లాభంలో కొంత భాగం లంచం రూపంలో అతని ఏజెంట్, రెప్ర సెంటేటివ్ జేబుల్లోకి వెళ్తుంది. అందు వల్లనూ మరియు ఇతర కారణాల వల్లనూ ఇలాంటి నేరంలో పొత్తు కలిసేవారిని, అల్లా: తన కరుణ నుండి దూరముంచాలని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శపించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా శపించారుః
అల్లాహ్ యొక్క భయం లేనప్పడు మనిషి వద్ద ఉన్న శక్తి సామర్ధ్యం, బుద్ధిజ్ఞానాలు స్వయంగా అతని పైనే ఒక విపత్తు, ఆపదగా మారిపోతుం టాయి. అతను వాటిని ఇతరుల సొమ్ము కాజేసుకొనుటకు, ఇతరులపై దౌర్జన్యం, బలత్కారం చేయుటకు ఉపయోగిస్తాడు. వీటిలో ఒకటి ఇతరుల భూమిని అక్రమించుకొనుట కూడా. దీని శిక్ష చాలా కఠినమైనది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా హెచ్చరించారని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“ఏ వ్యక్తి ఒక జానెడు భూమిని అన్యాయంగా ఆక్రమించుకుంటాడో, అదే చోట మొత్తం ఏడు భూములను క్రింది వరకు త్రవ్వాలని అల్లాహ్ అతనికి శిక్షస్తాడు. మళ్ళీ అల్లాహ్ ప్రజల మధ్య తీర్పు పూర్తి చేసే అంత వరకు ఆ ఏడుభూములు అతని మెడలో బంధనంగా వేయబడుతాయి”. (తబ్రాని ఫిల్ కబీర్: 22/270. సరీహుల్ జామి: 2719.).
తన, మరియు తన పొరుగువాని భూముల మధ్య ఉన్న హద్దులను, గుర్తులను మార్చి, తన భూమిని పెంచుకొనుట కూడా భూమి ఆక్రమణ క్రిందికే వస్తుంది. దాని గురించే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పారు:
لَعَنَ اللهُ مَنْ غَيَّرَ مَنَارَ الْأَرْضِ
“భూమి గుర్తుల్ని మార్చినవానిని అల్లాహ్ శపించుగాకా”. (ముస్లిం 1978)
ఎవరైనా హోదా, అంతస్తు కలిగి, ప్రజల్లో గొప్ప స్థానం పొంది ఉన్నాడో, ఇవి అతనికి అల్లాహ్ ఇచ్చిన వరాలు. అతను వాటికి బదులుగా అల్లాహ్ కు కృతజ్ఞత తప్పక తెలుపాలి. అతను వాటిని ముస్లింలకు లాభం చేకూర్చు టకై ఉపయోగించుట కూడా అల్లాహ్ కు కృతజ్ఞత తెలిపనట్లు అవుతుంది. ఇదే విషయాన్ని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పారు:
“ఎవరు తన తోటి ముస్లింకు ఏ లాభం చేకూర్చ గలుగుతాడో, అ లాభం అతనికి చేకూర్చాలి”. (ముస్లిం 2199).
ఎవరు తనకున్న ఇలాంటి వరాలతో, సంకల్పశుద్ధితో అల్లాహ్ సంతృప్తి కోరుతూ తన ముస్లిం సోదరుల నుండి దౌర్జన్యాన్ని దూరం చేస్సాడో, లేక మరేదైనా లాభం వారికి చేకూర్చుతాడో – అది కూడా ఏలాంటి నిషిధ్ధ కార్యానికి పాల్పడకుండా, లేక ఇతరులను వారి హక్కు నుండి తొలగించ కుండా – వారు అల్లాహ్ వద్ద పుణ్యానికి అర్హులవుతారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారుః
اشْفَعُوا تُؤْجَرُوا
“సిఫారసు చేయండి, పుణ్యాలు సంపాదించండి”. (బుఖారి 1432, ముస్లిం 2627).
* ఇలాంటి సిఫారసులకు బదులుగా ఏమైనా తీసుకోవడం ఎంత మాత్రం యోగ్యం కాదు. దీనికి నిరూపణ అబూ ఉమామ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఉల్లేఖించిన ఈ హదీసు:
“ఎవరు ఒకరికి సిఫారసు చేసి, దానిపై అతను ఇచ్చే బహుమానం స్వీక రిస్తే, అతను వడ్డీకి సంబంధించిన భాగాల్లో ఒక పెద్దదానికి గురైనట్లు”. (అహ్మద్: 5/261. సహీహుల్ జామి: 6292).
ఒక వ్యక్తికి ఉద్యోగం ఇప్పించడం, లేక ఒక ఆఫిసు నుండి మరో ఆఫిసు కు లేక ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి బదిలీ చేయించడం లేక రోగుల కు చికిత్స వగైరాలు చేయించడానికి కొందరు తమకున్న హోదానూ, ఉన్నత స్థానాన్ని ఉపయోగించి దానికి బదులుగా కొంత డబ్బును ముడుపుగా నిర్ణయించుకుంటారు. (నీవు ఇంత డబ్బిస్తే నీ ఈ పని చేయిస్తాను అని). అబు ఉమామ యొక్క పై హదీసు ఆధారంగా నిశ్చయంగా ఇది నిషిద్ధం అని తెలుస్తుంది. ముందే నిర్ణయించుకోక పోయినాగాని డబ్బు తీసుకోవడం మాత్రం నిషిద్ధం అని కూడా హదీసు ద్వారా తెలుస్తుంది([5]). డబ్బును ఆశిం చక ఇలాంటి పుణ్యకార్యం చేసిన వ్యక్తికి ప్రళయదినాన అల్లాహ్ వద్ద పొందే ప్రతిఫలమే చాలు. ఒక వ్యక్తి హసన్ బిన్ సహల్([6]) వద్దకు వచ్చి తన ఓ అవసరంలో ఆయన సిఫారసు కోరాడు. ఆయన అతని పని పూర్తి చేయించిన తరువాత ఆ వ్యక్తి కృతజ్ఞతలు తెలుపబోయాడు. అప్పుడు హసన్ బిన్ సహల్ ఇలా చెప్పారు: “దేనికని నీవు నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నావు. ధనవంతుల ధనంలో జకాత్ ఉన్నట్లు మాకు ఉన్న హోదాలో కూడా జకాత్ ఉంది అని మేము భానిస్తాము”. (అదాబుష్ షర్ ఇయ్య: ఇబ్ను ముఫ్లిహ్ రచన: 2/176).
ఇక్కడ ఒక విషయం తెలుసుకోవడం మంచిది. అదేమనగా: తన పని చేయించుటకు, తన వ్యవహారాలను చూచుటకు, ఒక వ్యక్తిని కిరాయ పై నియమించుకోవడానికి అభ్యంతరం లేదు. ఇది “ఇజార” (కిరాయకు పని చేయించుకొనుట) పరిధిలోకి వస్తుంది. ధార్మిక షర్తులకు లోబడి ఉంటే యోగ్యమే. కాని తనకున్న హోదా, ఉన్నత స్ధనాన్ని ఉపయోగించి చేసి నందుకు బదులు తీసుకోవడం నిషిధ్ధం. (ఈ రెండింటిలోని వ్యత్యాసాన్ని గుర్తించడం చాలా అవసరం).
“పనివాళ్లకు వారి చెమట ఆరక ముందే వారి కూలి ఇచ్చేయండి”. (ఇబ్నుమాజ 2443. సహీహుల్ జామి: 1055).
కొన్ని ముస్లిం సమాజాల్లో ఉన్న చాలారకాల అన్యాయం, దౌర్జన్యాలలో తమ పనివాళ్ళకు, కూలివాళ్ళకు వారి హక్కు ఇవ్వక పోవుట కూడా ఒకటి. దాని వివిధ రకాలు ఇలా ఉన్నాయి.
– పనివాడి పూర్తి హక్కును తిరస్కరించడం. అప్పుడు కూలివాని వద్ద ఏ సాక్ష్యం, ప్రమాణం లేకపోవడం. అలాంటప్పుడు ఒక వేళ అతను తన హక్కును ఈ లోకంలో కోల్పొయినా ప్రళయదినాన అల్లాహ్ వద్ద ఏ మాత్రం కోల్పోడు. బాధితుని సొమ్ము తిన్న దౌర్జన్యుడు ప్రళయదినాన అల్లాహ్ వద్దకు వచ్చినప్పుడు అతని పుణ్యాలు బాధితునికి ఇవ్వబడుతాయి. ఒకవేళ అతని వద్ద పుణ్యాలు లేనిచో, బాధితుని పాపాలు అతనిపై మోప బడుతాయి. తరువాత అతన్ని నరకంలోనికి పంపించడం జరుగుతుంది.
– పనివాడికి అతని పూర్తి హక్కు ఇవ్వకుండా అన్యాయంగా అతని హక్కు లో కొరత చేసేవారి గురించి సూర ముతఫ్పిఫీన్ (83:1)లో అల్లాహ్ ఇలా తెలి పాడు: (తూనికలలో, కొలతలలో తగ్గించి ఇచ్చేవారికి వినాశం ఉన్నది).
దీనికి ఉదాహరణ: కొందరు యజమానులు పనివాళ్ళను వారి దేశం నుండి తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ వారితో జీతం నిర్ణయించుకొని, ఒప్పందం (అగ్రీమెంట్) వ్రాయించుకుంటారు. ఇక్కడికొచ్చి పని ప్రారంభిం చిన తరువాత ఆ అగ్రిమెంట్ ను మార్చి, అందులో ఉన్న దానికంటే తక్కువ జీతం నిర్ణయిస్తారు. పనివాళ్ళు అయిష్టంగానే దాన్ని సహిస్తారు. వారి వద్ద తమ హక్కును రుజువుపరచడానికి తగిన శక్తి ఉండదు. అలాంటప్పుడు వారు అల్లాహ్ తోనే మొరపెట్టుకుంటారు. ఒకవేళ దౌర్జన్యం చేసే యజమాని ముస్లిం అయి, పనివాడు అవిశ్వాసుడయితే, అతని యజమాని దుర్వ్య వహారం అతన్ని (పనివాని) ఇస్లాం నుండి దూరం చేస్తుంది. ఈ పాపం యజమాని పై పడుతుంది.
– అతనితో ఓవర్ టైం డ్యూటి తీసుకొని, లేక అతని డ్యూటి సమయం పెంచి. దానిపై కేవలం బేసిక్ (మూల) జీతం ఇస్తాడు. ఓవర్ టైం యొక్క కూలి ఇవ్వడు.
– కొందరు యజమానులు జీతం ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు. ఒక వేళ ఇచ్చినా ఎన్నో ఇబ్బందుల, ఆటంకాల, పిటీషన్ల, కోర్టుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగిన తరువాత. ఆలస్యం చేసే ఉద్దేశం ఏమనగా, పనివాడు అలసిపోయి, నిరాశ నిస్పృహలకు గురి అయి, స్వతహాగా తన హక్కునే వదులుకోవాలని, లేదా అడగటమే మానుకోవాలని, లేక పనివాని సొమ్ముతో తన వ్యాపారం మరింత అభివృధ్ధి చేసుకోవాలని. ఇంకొందరు తన పనిమనిషికి జీతాలు ఇవ్వక వాటితో వడ్డీ వ్యాపారాలు చేస్తారు. ఆ దిక్కుమాలిన పనివాని వద్ద ఒకరోజు ఖర్చు ఉండదు. ఏ ఖర్చుల కొరకు తన భార్యాపిల్లల్ని వదలి వచ్చాడో వారికి అది కూడా పంపలేక పోతాడు. ప్రళయదినాన కఠినశిక్షకు గురి అయ్యే ఇలాంటి దౌర్జన్యపరులకు వినాశమే కలుగుగాక!. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారని, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“అల్లాహ్ ఇలా తెలిపాడు: ప్రళయదినాన నేను ముగ్గురికి [(ఇబ్ను మాజ: 2442)లో ఈ పదాలు ఉన్నాయి. “నేను ఎవరికి ప్రత్యర్ధునిగా నిలబడ్డానో, అతను గెలవలేడు”] ప్రత్యర్ధిగా నిలబడతాను. నా పేరు మీద ఒకరికి శరణు ఇచ్చి, భంగపరిచేవాడు. స్వతంత్రముగా ఉన్న వ్యక్తిని బంధించి (బానిసగా) అమ్మి, దాని వెల తినేవాడు. ఒక పని మనిషిని పెట్టుకొని, అతనితో పూర్తి పని తీసుకొని, అతనికి కూలి ఇవ్వనివాడు”.(బుఖారి 2227).
కొందరు తమ సంతానంలో కొందరికి కానుక, బహుమానం ఇచ్చి మరి కొందరికి ఇవ్వరు. ఇలాంటి వ్యత్యాసం నిషిధ్ధం. ఒకవేళ ఏదైనా ధార్మిక కారణం ఉంటే అలా ఇవ్వచ్చును. ఉదా([7]).: ఒకరికి ఉన్న అవసరం మరొకరికి ఉండకపోవచ్చు. వారిలో ఒక్కడు అవస్థతకు గురి అయి, లేదా అప్పులో చిక్కుకుపోయి, లేదా ఖుర్ ఆన్ కంఠస్తం చేస్తూ, లేదా నిరుద్యోగుడై, లేదా అధిక సంతానం గలవాడై, లేదా విద్యభ్యాసం కొరకు పని వదిలి ఉండవచ్చు అలాంటి కుమారునికి అందరికన్న ఎక్కువ ఇచ్చినప్పుడు, ఇతర కుమారునికి కూడా అలాంటి అవసరం పడితే అలాగే ఇస్తాననే ఉద్దేశ్యం తండ్రిది ఉండాలి. దీనికి సర్వసాధారణమైన నిదర్శన అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:
నౌమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: అతని తండ్రి అతడ్ని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు తీసుకొచ్చి ప్రవక్తా “నేను నా ఈ కుమారునికి ఒక బానిసను కానుకగా ఇచ్చాను అని అన్నాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అది విని “మరి నీవు నీ కుమారులందరికీ ఇలాగే కానుక ఇచ్చావా?” అని అడిగారు, దానికి అతను లేదన్నాడు. “అయితే అతని నుండి కూడా వాపసు తీసుకో” అన్నారు ప్రవక్త e. (బుఖారి 2586, ముస్లిం 1623). మరో ఉల్లేఖనంలో ఉందిః “అల్లా:కు భయపడండి, మీ కుమారుల మధ్య న్యాయాన్ని పాటించండి”. దాంతో బషీర్ (రదియల్లాహు అన్హు) ఇంటికి తిరిగొచ్చి, కానుకను తనకొడుకు నుండి వాపసు తీసుకున్నారు. (బుఖారి 2587). మరో ఉల్లేఖనంలో ఉందిః బషీర్ తన కుమారునికి కానుక ఇచ్చి, ప్రవక్త వద్దకు వచ్చి దానికి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సాక్షిగా ఉండాలని కోరారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అన్నారుః “అలాంట ప్పుడు నన్ను సాక్షిగా నిలబెట్టకు. అన్యాయ సంబంధమైన వాటిపై నేను సాక్షిగా ఉండను”. (ముస్లిం 1623, బుఖారి 2650).
కొన్ని కుటుంబాల్లో అల్లాహ్ తో భయపడని తండ్రులు, తమ సంతానా నికి కానుకలు ఇవ్వడంలో వ్యత్యాసం పాటిస్తారు. ఈ విధంగా వారి మధ్య పరస్పర విరోధవిద్వేషాలను సృష్టిస్తారు. ఒకడు తన పినతండ్రి లాగే ఉన్నాడని అతనికిచ్చి, మరొకడు తన మేనమామల రూపంలో ఉన్నా డన్న సాకుతో దూరము చేస్తాడు. లేక ఒక భార్య సంతానానకి ఇస్తే మరో భార్య సంతానానికివ్వడు. ఒక భార్య పిల్లల్ని చక్కని ప్రైవేట్ ఫాఠశాలల్లో చేర్పిస్తే మరో భార్య పిల్లల్ని అందులో చేర్పించడు.
సంతానంలో ఇలాంటి అన్యాయాల ప్పతిఫలం తండ్రి తన కళ్లారా చూసే సమయం ఒకప్పుడు వస్తుంది. తన పితృప్రేమను నోచుకోని సంతానం రేపటి రోజు తమ తండ్రి సేవలో కూడా పాలుపంచుకోరు. తన సంతానంలో వ్యత్యాసం పాటించిన వ్యక్తికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా హెచ్చరించారు:
“తనకు సరిపడునంత ఉన్నవాడు భిక్షాటన చేస్తే వాస్తవానికి అతను నరక నిప్పులను కూడబెడుతున్నాడన్న మాట”. భిక్షాటన చేయకుండా ఉండుటకు సరిపడునది అంటే ఏమిటి? అని సహచరులు అడిగారు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారుః “పగలు, సాయంత్రం రెండు పూటల తిండికి సరిపడునది”. (అబూ దావూద్ 1629. సహీహుల్ జామి: 6280).
అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉపదేశించారు:
“తన వద్ద సరివడునది ఉండి కూడా యాచించువాడు ప్రళయదినాన వచ్చినప్పుడు అతని ముఖం మీద భిక్షంగుర్తులు గాయాల వలే స్పష్టంగా ఉంటాయి”. (అహ్మద్: 1/388. సహీహుల్ జామి: 6255).
“ధనాన్ని కూడబెట్టే ఉద్దేశ్యంతో అడుక్కునేవాడు వాస్తవానికి అగ్నిజ్వాలల్ని కోరుకుంటున్నాడు. కనుక అతను ఎక్కువ అడుక్కోవచ్చు లేదా తక్కువ అడుక్కోవచ్చు. (అది అతని ఇష్టం). ”. (ముస్లిం 1041).
కొందరు భిక్షకులు ప్రజల ముందు మస్జిద్ లో నిలబడి తమ అర్ధింపు లతో నమాజీలకు ఇబ్బంది కలుగ జేస్తారు. కొందరు అబద్ధం చెబుతారు. భూటకపు పేపర్లు, వాటిలో కొన్ని అసత్యపు సంఘటనలను వ్రాయించు కొని వస్తారు. కొందరు తమ కుటుంబంలోని కొందరిని ఇతర మస్జిద్ లలోకి పంపుతారు. అక్కడి నుండి తిరిగొచ్చి మళ్ళీ వేరే మస్జిద్ లలోకి వెళ్తారు. వారు ఎంత ధనికులో అల్లాహ్ తప్ప ఎవరికీ తెలియరాదు. వారు చనిపోయిన తరువాత వారి ఆస్తి ఎంత అనేది తెలుస్తుంది. సమాజంలో ఒక రకం ఇలాంటివారిదైతే, మరో వైపు వాస్తవిక బీదవాళ్ళుంటారు. వారు అవసరంగలవారు అని ఎరుగని మనిషి వారి ఆత్మాభిమానాన్ని చూసి వారు భాగ్యవంతులని భావిస్తాడు. వారు లోకుల వెంటపడి సహాయం చెయ్యండి అని బ్రతిమాలే మనుషులు కారు. వారు గుర్తింపబడరు గనుక వారికి ఏలాంటి దానమూ దొరకదు.
అల్లాహ్ వద్ద అల్లాహ్ దాసుల హక్కు చాలా గొప్పది. అల్లాహ్ హక్కులో లోపం జరిగితే అల్లాహ్ తో క్షమాపణ వేడుకొని ఆ పాపం నుండి రక్షణ పొందవచ్చు కాని మానవ హక్కులు చెల్లించడం తప్ప వేరే మార్గం లేదు. అది కూడా దిర్ హం, దినార్ లతో గాక పాపపుణ్యాలతో తీర్పు చేయబడే దినం రాకముందే చెల్లించాలి. అల్లాహ్ ఇలా ఆదేశించాడు:
(“అమానతులను (అప్పగింతలు) యోగ్యులైన వారికి అప్పగించండి” అని అల్లాహ్ మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు). (నిసా 4: 58).
అప్పు తిరిగిచ్చే విషయంలో అలక్ష్యం మన సమాజంలో సర్వసామాన్య మైపోయింది. కొందరు తమకు చాలా అవసరం ఉన్నందుకు కాదు, తమ జీవితం భోగభాగ్యాల్లో గడవడానికి మరియు ఇతరుల గుడ్డి అనుకరణలో పడి కొత్త బండ్లు, హౌస్ ఫర్నీచర్ లాంటి నశించిపోయేవాటిని కొనేందుకు అప్పు తీసుకుంటారు. అందుకని ఎక్కువ ఇన్స్టాల్ మెంట్స్ పై విక్రయించే దుకాణాల్లోకి వెళ్తారు. అయితే అనేక ఇన్స్టాల్ మెంట్స్ వ్యాపారాల్లో అను మానం, నిషిధ్ధం ఉంటుందన్న విషయాన్ని కూడా గ్రహించరు.
అత్యవసరమైన అక్కర లేకున్నా అప్పు తీసుకోవటం వలన, చెల్లించ వలసినప్పుడు ‘రేపుమాపు’ అని జాప్యం జరుగుతుంది. లేదా ఇచ్చిన వాడు నష్టపోవలసి వస్తుంది. దీని దుష్ఫలితం నుండి హెచ్చరిస్తూ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు:
“ఎవరయితే తిరిగి ఇచ్చే ఉద్దేశ్యంతో ఇతరుల నుండి (అప్పుగా) సొమ్ము తీసుకుంటాడో, అల్లాహ్ అతని తరఫున చెల్లిస్తాడు. (అంటే అల్లాహ్ సహాయం చేస్తాడు). ఎవరయితే ఇతరులను నష్టపరచాలన్న ఉద్దేశ్యంతో తీసుకుంటాడో, అల్లాహ్ అతన్నే నష్టపరుస్తాడు”. (బుఖారి 2387).
ప్రజలు అప్పు విషయంలో చాలా అశ్రధ్ధ వహిస్తున్నారు. దానిని తక్కువ విలువగలదని భావిస్తున్నారు. కాని అల్లాహ్ వద్ద అది చాలా పెద్ద విష యం. అంతేకాదు; షహీద్ (అల్లాహ్ మార్గంలో తన ప్రణాన్ని కోల్పోయిన వారి)కి చాలా ఘనత, లెక్కలేనన్ని పుణ్యాలు మరియు ఉన్నతస్థానం ఉన్నప్పటికీ అతను కూడా అప్పు చెల్లించని బాధ్యత నుండి తప్పించుకోలేడు. దీనికో నిదర్శనగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ ప్రవచనం చదవండిః
“సుబ్ హానల్లాహ్! అప్పు గురించి ఎంత కఠినమైన విషయం అవతరించింది?! నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో అతని సాక్షి! ఒక వ్వక్తి అల్లాహ్ మార్గంలో షహీద్ అయి, మళ్ళీ లేపబడి మళ్ళీ షహీద్ అయి, మళ్ళీ లేపబడి, మళ్ళీ షహీద్ అయినప్పటికీ ఒకవేళ అతనిపై ఏదైనా అప్పు ఉంటే, అది అతని వైపు నుండి చెల్లింపబడనంత వరకు అతను స్వర్గంలో ప్రవేశించలేడు”. (నసాయి ముజ్తబా 7/314. సహీహుల్ జామి: 3594).
అల్లాహ్ యొక్క భయం లేనివాడు ఎలా సంపాదించాలి, ఎందులో ఖర్చు చేయాలి అన్న విషయాన్ని గ్రహించడు. ఎలాగైనా తన బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలి. అది దొంగతనం, లంచం, అక్రమం, అపహరణ, అబద్ధం, నిషిద్ధ వ్యాపారం, వడ్డీ, అనాథల సొమ్ము తిని అయినా, లేదా జ్యోతిష్యం, వ్యభిచారం లాంటి నిషిధ్ధ పనులు చేసి వాటి బత్తెం తీసుకొని, లేదా బైతుల్ మాల్, పబ్లిక్ ప్రాపర్టీల నుండి అపహరణ చేసి, ఇతరులను ఇబ్బందికి గురి చేసి వారి సొమ్ముతిని, లేదా అనవసరంగా బిక్షమడిగి ఎలాగైనా డబ్బు కావాలన్న ఆశ. ఈ డబ్బుతో అతను తింటాడు, దుస్తులు ధరిస్తాడు, వాహానాల్లో పయనిస్తాడు, ఇల్లు నిర్మిస్తాడు, లేదా కిరాయికి తీసుకుంటాడు మరియు అందులో అన్ని రకాల భోగభాగ్యాలను సమకూర్చుకుంటాడు. ఇలా నిషిధ్ధమైన వాటిని తన కడుపులోకి పోనిస్తాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు:
“నిషిధ్ధమైన వాటితో పెరిగిన ప్రతి శరీరం నరకంలో చేరడమే మేలు”. (తబ్రాని కబీర్: 19/136. సహీహుల్ జామి: 4495).
అంతే కాదు, ప్రతి మనిషి, నీవు ఎలా సంపాదించావు? ఎందులో ఖర్చు చేశావు? అని ప్రళయదినాన ప్రశ్నించబడతాడు. అక్కడ వినాశమే వినాశం. కనుక ఎవరి వద్ద అక్రమ సంపద ఉందో, అతి తొందరగా దాని నుండి తన ప్రాణాన్ని విడిపించుకోవాలి. అది ఎవరిదైనా హక్కు ఉంటే తొందరగా అతనికి అప్పగించి, అతనితో క్షమాపణ కోరాలి. ఈ పని ప్రళయం రాక ముందే చేసుకోవాలి. ఎందుకనగ అక్కడ దిర్హం, దీనార్ లు చెల్లవు. కేవలం పుణ్యాలు, లేక పాపాల చెల్లింపులుంటాయి.
(విశ్వాసులారా! సారాయి, జూదం, విగ్రహాలు, పాచికల ద్వారా జోస్యం ఇవన్నీ అహస్యకరమైన షైతాను పనులు. వాటిని విసర్జించండి. మీకు సాఫల్య భాగ్యం కలిగే అవగాశం ఉంది). (మాఇద 5: 90).
సారాయి, మత్తు నిషిధ్ధమనడానికి “విసర్జించండి” అన్న ఆదేశం మరియు మత్తుపానీయాలను విగ్రహాలతో కలిపి చెప్పడం ఒక గట్టి నిదర్శనం. ఇక తరువాత ఈ ఆయతులో ‘విసర్జించండి’ అని వచ్చింది ‘నిషిధ్ధం’ అని రాలేదు’ అని సాకులు చెప్పి (దాన్ని ఉపయోగించేవారి వద్ద) ఏ నిదర్శనమూ ఉండదు.
మత్తుసేవించేవారిని హెచ్చరిస్తూ వచ్చిన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సూక్తులు ఈ క్రింది విదంగా ఉన్నాయి. జాబిర్ t, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నుండి ఉల్లేఖించారు:
“మత్తు సేవించినవానికి “తీనతుల్ ఖబాల్” త్రాగిస్తానని అల్లాహ్ నిశ్చ యించాడు”. “తీనతుల్ ఖబాల్” అంటేమిటి? ప్రవక్తా అని అక్కడున్నవారు అడిగారు. “నరకవాసుల చెమట మరియు చీము” అని జవాబిచ్చారు ప్రవక్త r. (ముస్లిం2002). ఇబ్ను అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ప్రవక్తతో ఉల్లేఖించారు:
“మత్తు సేవించుటకు అలవాటుపడినవాడు అదే స్థితిలో చనిపోతే, అల్లాహ్ తో కలసినప్పుడు విగ్రహాల పుజారిగా కలుస్తాడు”. (తబ్రానీ 12/45. సహీహుల్ జామి: 6525).
వివిధ పేర్లతో, అనేక రకాల మత్తుపానీయాలు ఈ రోజుల్లో ఉన్నాయి. ఉదా: భీర్ (Bear), హీర్ (Hear), బార్ బికాన్ (Barbican), బ్యాగ్ పైపర్ (Bagpiper), అల్ కోహల్ (Alcohol), అరక్ (Arack), వద్ కా (vodka), షాంపేన్ (champagne), విస్కీ, బ్రాండి మరియు రమ్ లాంటివి ఇంకా అనేక పేర్లతో మర్కెట్ లో ఉన్నాయి. ప్రవక్త తమ భవిష్యసూచనలో ఎవరి గురించి తెలిపారో వారు కూడా ఈరోజుల్లో ఉన్నారు.
“నా అనుచర సంఘంలోని కొందరు తప్పక మత్తుపానియాలు సేవిస్తారు. వాటి పేరు మార్చుకుంటారు”. (అహ్మద్ 5/342. సహీహుల్ జామి 5453).
వాస్తవాలపై ముసుగు వేసి దాన్ని ఆత్మశాంతినిచ్చు ‘టానిక్’ అని కొందరు భ్రమింపజేస్తుంటారు. (అల్లా:నూ, విశ్వాసులనూ వారు మోసం చేస్తున్నారు. కాని యథార్ధంగా వారు తమను తాము తప్ప మరెవ్వరినీ మోసం చెయ్యటం లేదు). (బఖర 2: 9).
ఇస్లాం ధర్మం ఒక నిష్కర్షమైన గొప్ప నియమాన్ని చూపింది. అందు వలన ధర్మంతో పరిహాసమాడేవారి పరిహాసం మట్టిలో కలసిపోతుంది. ముస్లిం గ్రంథం (2003)లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశం ఇలా ఉందిః
كُلُّ مُسْكِرٍ خَمْرٌ وَكُلُّ مُسْكِرٍ حَرَامٌ
“మైకానికి గురి చేసే ప్రతిదీ మత్తుపదార్థం. ప్రతి మత్తుపదార్థం నిషిధ్ధం”.
మత్తులో పడవేసే మరియు బుధ్దిని మాంద్యంచేసే ప్రతిదీ నిషిధ్ధం. అది కొంచెమైనా, ఎక్కువైనా. “ఏది ఎక్కువ ఉవయోగిస్తే నిషా (మైకం) వస్తుందో అది కొంచం ఉవయోగించుట కూడా నిషిధ్ధం”. (అబూ దావూద్ 3681).
పేర్లు ఎన్ని మారినా, మూలవస్తవు ఒక్కటే. అదే మత్తుపానీయం. అది నిషిధ్ధం.
చివరిలో మత్తు సేవించేవారికి ప్రవక్త హెచ్చరికను తెలుపుతున్నాము: (శ్రధ్దగా చదివి, అల్లాహ్ శిక్ష నుండి భయపడండి).
“మధ్యపానం, మత్తులో పడవేసే వాటిని ఉపయోగించేవాని 40 రోజుల నమాజు స్వీకరించబడదు. అతను అదే స్థితిలో చనిపోతే నరకం పాలవు తాడు. ఒక వేళ తౌబ చేస్తే అల్లా: తౌబను అంగీకరస్తాడు. అతను మళ్ళి దాన్ని ఉపయోగిస్తే, మళ్ళి 40 రోజుల నమాజు స్వీకరించబడదు. అదే స్థితిలో చనిపోతే నరకంలోకి చేరుకుంటాడు. ఒక వేళ క్షమాపణ వేడుకుంటే, అల్లాహ్ క్షమిస్తాడు. ఒక వేళ అతను మళ్ళి దాన్ని ఉపయోగిస్తే, మళ్ళి 40 రోజుల నమాజు స్వీకరించబడదు. అదే స్థితిలో చనిపోతే నరకంలోకి ప్రవేశిస్తాడు. ఒక వేళ తౌబ చేస్తే అల్లా: తౌబను అంగీకరస్తాడు. ఒక వేళ అతను మళ్ళీ అదే అలవాటుకు గురి అయ్యాడంటే, ప్రశయదినాన తప్పక అల్లాహ్ అతనికి “రద్ గతుల్ ఖబాల్” త్రాగిస్తాడు. “రద్ గతుల్ ఖబాల్” అంటేమిటి ప్రవక్తా? అని అడిగారు అనుచరులు. “అది నరకవాసుల చెమట, చీము, రక్తం” అని జవాబిచ్చారు ప్రవక్త e. (ఇబ్ను మాజ 3377. సహీహుల్ జామి 6313).
ప్రియ సోదరులారా! ఇప్పటి వరకు ఎన్ని సార్లు దాన్ని విడనాడి, తిరిగి మళ్ళీ దానికి బానిసయ్యారు. ఇప్పుడు ఈ భయంకరమైన శిక్షలు విన్న తరువాతైనా సంపూర్ణంగా విడనాడండి. అల్లాహ్ ఈ సద్భాగ్యం అందరికీ ప్రాసాదించుగాకా!.
మత్తు, మధ్యం సేవించేవారికి ఇంతటి శిక్ష ఉన్నప్పుడు ఇంతకంటే ఘోరమైన మాదకద్రవ్యాలు (చర్స్, ఓపియం, గాంజా లాంటివి) సేవించే వారి, దానికి అలవాటు పడువారి గతి ఏమవుతుందో విజ్ఞులు గ్రహించాలి.
ఈ రోజుల్లో గృహసామాగ్రి విక్రయించే దుకాణాల్లో వెండి, బంగారపు గృహసామాగ్రి లేక వెండి బంగారు వన్నె ఎక్కించిన సామాగ్రి లేని దుకాణమే లేకపోవచ్చు. అదే విధంగా ధనికుల గృహాలు, పెద్ద హోటళ్ళు. ఉత్సవాల్లో ఇలాంటి వస్తువులు పరస్పరం ఇచ్చుకొనుట విలువగల బహుమానంగా పేర్కొనబడుతుంది. కొందరు తమ ఇండ్లల్లో పెట్టుకోరు. కాని ఇతర ఇండ్లల్లో, ఆమంత్రణ, విందులో ఉవయోగిస్తారు. ఇవన్నియూ ఇస్లామీయ ధర్మంలో నిషిధ్ధం. వీటిని ఉపయోగించువారికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హెచ్చరిక చాలా కఠినంగా ఉంది. ఉమ్మె సల్మా రజియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించారు:
“వెండి, బంగార పాత్రల్లో తినుత్రాగువాడు తన కడుపులో నరకాగ్ని నింపుతున్నాడు”. (బుఖారి 5634, ముస్లిం 2065).
ఈ ఆదేశం ప్లేట్లు, గరిటెలు, ముళ్ళ గరిటెలు, కత్తులు మరియు అతిథుల ముందు పెట్టే ప్రత్యేక పాత్రలు, వివాహాల్లో బహుమానంగా ఇచ్చే స్వీట్ ప్యాకెట్లు ఇలాంటి అన్ని పాత్రల ప్రస్తావన ఇందులో ఉంది. అవన్నియు వెండి బంగారపు పాత్రలైతే నిషధ్ధమే.
మేము ఉవయోగించడం లేదు. అల్మారీల్లో, షోకేసుల్లో పెడుతాము అని కొందరు అంటారు. కాని ఇది కూడా ఒక రకమైన ఉపయోగమే గనక యోగ్యం కాదు. (ఈ పేరగ్రాఫ్ షేఖ్ బిన్ బాజ్ ~ తో విని వ్రాసినది).
(మీరు విగ్రహాల మాలిన్యానికి దూరంగా ఉండండి. అబధ్ధపు మాటలు పలక్కండి. ఏకాగ్రతతో అల్లాహ్ కు దాసులు అవండి. దైవత్వంలో ఆయనకు ఎవరినీ భగస్వాములుగా చేయకండి). (హజ్ 22: 30, 31).
అబూ బక్రా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: మేము ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్ద కూర్చోని ఉండగా ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “ఘోరపాపాలు ఏమిటో మీకు తెలుపనా? అని మూడు సార్లు అడిగారు. తెలుపండి ప్రవక్తా! అని సహచరులన్నారు. అప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “అల్లా:తో ఇతరులను భాగస్వాము లుగా చేయుట. తల్లిదండ్రులకు అవిధేయులగుట”. అప్పటివరకు ఆనుకొని ఉన్నవారల్లా కూర్చొని “వినండి! అబద్ధం పలుకుట” అని మాటిమాటికి అనసాగారు. ఇక ఊరుకుంటే బావుండు అని మేము మనుసులో అనుకున్నాము. (బుఖారి 2654, ముస్లిం 87).
ప్రజలు అబధ్ధసాక్ష్యం పలకడంలో అలక్ష్యం పరచడం, దాని వలన ఉత్పన్నమయ్యే ద్వేషం, శతృత్వం అధికమవడం, ఇంకా దీని వలన హక్కుదారుల హక్కు లభించకపోవడం, అమాయకులపై అన్యాయం జర గడం, లేక హక్కులేనివానికి హక్కు దొరకడం లేక ఒక వంశలో లేనివాన్ని ఆ వంశంలో కలపడం లాంటి ఎన్నో సంఘటనలు అసత్యసాక్ష్యం వలన జరుగుతూ ఉంటాయి. అందుకే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరీమరీ దాన్ని నొక్కి చెప్పారు.
మరో రకమైన నిర్లక్ష్యం ఇలాంటిది కూడా కొందరితో జరుగుతుంది; కోర్టులో ఒక వ్యక్తి మరో వ్యక్తితో కలసి నీవు నా విషయంలో సాక్ష్యం పలుకు నేను నీ విషయంలో సాక్ష్యం పలుకుతాను అని ఒక ఒప్పందం చేసుకుంటారు. అలాంటి సాక్ష్యంలో వాస్తవ పరిస్థితులన్నీ తెలుసకొనుట తప్పనిసరి. కాని ఇవి లేకుండానే సాక్ష్యం ఇస్తారు. ఆ సాక్ష్యం భూమి లేక ఇల్లు యొక్క పట్టా గురించి కావచ్చు. లేదా ఫలాన వ్యక్తి గుణవంతుడు అని తెలుపడానికి కావచ్చు. ఇలా కోర్టు గేట్ వద్ద, లేక దాని గడప వద్ద కలసిన వ్యక్తి ఏ వాస్తవం తెలియకుండానే సాక్ష్యం పలకడం అబధ్ధపు సాక్ష్యం క్రిందే వస్తుంది. ఖుర్ఆన్ లో అల్లాహ్ తెలిపిన విధంగా సాక్ష్యం పలకాలి:
“తప్పక నా అనుచరుల్లో ఒక సంఘం వ్యభిచారం, పట్టు దుస్తులు, మత్తు పానీయాలు మరియు సంగీత సామాగ్రి, వీటన్నింటినీ ధర్మసమ్మతం చేసుకుంటుంది”. (వాస్తవానికి అవి నిషిధ్ధం). (బుఖారి, కితాబుల్ అష్రిబ, బాబు మా జాఅ ఫీమన్ యస్తహిల్లుల్ ఖమ్ర…).
“ఈ అనుచర సంఘంలో ఇలాంటి విపత్తులు వచ్చి ఉంటాయి. అవేమనగా: భూమిలో అణగద్రొక్కబడుట. రాళ్ళ వర్షం కురియుట. ముఖాలను మార్చుట. ఎప్పుడైతే ఈ అనుచర సంఘంలో కొందరు మత్తు పానీయాలు సేవించడం, ఆట పాటకతైలను ఉంచుకొనడం, వాద్యం వాయించడం లాంటి అలవాట్లకు లోనవుతారో అప్పుడు వారిపై ఈ విపత్తులు కురుస్తాయి.” (సహీహ: 2203. ఈ భావం తిర్మిజిలో కూడా ఉంది 2212).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఢోల్ (డప్పు) వాయించడాన్ని నివారించారు. సంగీత సామాగ్రి దుర్మార్గుని, బుధ్ధిహీనుల ధ్వని అని తెలిపారు. ఇమాం అహ్మద్ రహిమ హుల్లాహ్ లాంటి పూర్వ పండితులు సితారు, వీణె, తంబురా లాంటి ఆటపాటలు, మ్యూజిక్ పరికరాలు నిషిధ్ధం అని స్పష్టంగా చెప్పారు. నిస్సందేహంగా ఇవన్నియు మ్యూజిక్ పరికరాల్ని నివారించిన ప్రవక్త హదీసులోనే వస్తాయి. ఇంకా పియానో (piano), గిటారు (guitar) వగైరా కూడా ఈ కోవలోకే వస్తాయి. ఏ పాత మ్యూజిక్ సాధనాల గురించి నిషిధ్ధత హదీసులో వచ్చిందో, వాటికంటే ఆధునిక సాధనాల ద్వారా వినువారిని మత్తులో పడవేసే ప్రభావం ఎక్కువ ఉంది. ఇబ్ను ఖయ్యిం లాంటి పండితుల కథనం మ్యూజిక్ యొక్క నిషా, మత్తు సారాయి మత్తుకంటే భయంకరమైనది.
మ్యూజిక్ తో పాట, పాటకతైల (గాయకురాలి) స్వరం కూడా కలసిందంటే నిషిధ్ధత మరీ పెరిగిపోతుంది. పాపం మరీ ఎక్కువవుతుంది. ఒకవేళ ప్రేమ, మోహం మరియు అందకతైల అందాలను వర్ణించే పాటలు ఉంటే నిషిధ్ధత సమస్య మరింత తీవ్రమౌతుంది. అందుకే పాట వ్యభిచారానికి ఒక సాధనం లాంటిదన్నారు పండితులు. ఇంకా అది హృదయంలో నిఫాఖ్ (వైరం) మొలకల్ని మొలకిస్తుంది. ఇక ఈ కాలంలో పాటలు, మ్యూజిక్ లు మహా అల్లకల్లోలాన్ని సృష్టించేవిగా తయారయినాయి. దానిపై మరో సమస్య ఏమనగా గడియారం, బెల్లు, అలారం, పిల్లవాళ్ళ ఆట వస్తువులు, కంప్యూటర్లు, మరియు సెల్ ఫోన్, టెలిఫోన్లో కాన్నుంచి మ్యూజిక్ రాగాలు ఉన్నాయి. ఇక దాని నుండి జాగ్రత్త పడుట ధైర్యవంతుల పనే.
ముస్లింలకు పరోక్షంగా నిందించుట, వారి గౌరవాభిమానాల్లో జోక్యం చేసుకోనుట అనేక సభల్లో ఒక షోకుగా, ఆనందంగానూ మారింది. అల్లాహ్ దాన్ని నివారించాడు. తన దాసులను దాని నుండి అసహ్యం కలిగించాడు. దాన్ని అసహ్యకరమైన దానితో పోల్చి చూపాడు.
(మీరు ఎవరూ ఎవరినీ పరోక్షంగా నిందించరాదు. మీలో ఎవరైనా మీ మృత సోదరుని మాంసం తినటానికి ఇష్టపడతారా? చూడండి, మీరే స్యయంగా దీనిని అసహ్యించుకుంటారు). (హుజురాత్ 49: 12).
పరోక్షనింద అంటేమిటో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివరంగా తెలిపారు. ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తమ సహచరులతో “పరోక్షనిందేమిటో మీకు తెలుసా?” అని అడిగారు. ‘అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు’ అని వారు చెప్పారు. “నీవు నీ సోదరుణ్ణి గురించి, అతనికి బాధకలిగే విధంగా ప్రస్తావించటం” అని ప్రవక్త చెప్పారు. దానికి వారు ఇలా అడిగారు: ‘ఒకవేళ నేను ప్రస్తా వించే విషయం నా సోదరునిలో ఉంటే, అప్పుడు మీరేమంటారు?’. దానికి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) “ఒకవేళ ఆ విషయం నీ సోదరునిలో ఉంటేనే, నీవు అతనిని పరోక్షంగా నిందించినట్లు. ఒకవేళ అది అతనిలో లేకపోతే, నీవు అతనిపై అభాండం వేసినట్లే” అని సెలవిచ్చారు. (ముస్లిం 2589).
సారాంశం ఏమనగా, నీ సోదరుడు అసహ్యించుకునే విధంగా నీవు ప్రస్తావించుట పరోక్షనింద. ఉదా: అతని శరీరం, ధర్మం, ప్రవర్తన వగైరాలో ఉన్న లోపాల్ని ప్రస్తావించుట. దానిలో వివిధ రకాలున్నవి. అందులో ఒకటి: అతని లోపాల్ని ప్రస్తావించుట లేక హాస్యంగా అతని ఏ ఒక చలనం యొక్క నకలు చేయుట.
కాని ప్రజలు దాని పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. అది అల్లాహ్ దృష్టిలో చాలా చెడ్డ విషయం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) యొక్క ఈ ఆదేశం గ్రహించండి.
“వడ్డిలో 72 స్థాయిలున్నాయి. వాటిలో మరీ చివరిదాని పాపం; కన్న తల్లితో వ్యభిచారానికి పాల్పడినట్లు. వడ్డీ యొక్క అత్యంత తీవ్రస్థాయి పాపం ఒక ముస్లిం సోదరుని పరువు ప్రతిష్టలలో జోక్యం చేసుకోవడం”. (అహ్మద్. సహీహుల్ జామి: 6238).
అలాంటి సభల్లో కూర్చున్న వ్యక్తి ఈ చెడు (పలికే వ్యక్తిని దాని) నుండి వారించాలి. పరోక్షనింద చేయబడే వ్యక్తి తరఫున సమాధానమివ్వాలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇందుకు చాలా ప్రోత్సహించారు.
పరస్పరం కలతలు సృష్టించే ఉద్దేశంతో ఒకరి మాటను మరొకరికి చెప్పుట అనేది సంబంధాలు దూరమవటానికి, ద్వేషం, కపటం పెరగటానికి ఒక పెద్ద కారణం. అలాంటి వారిని అల్లాహ్ ధూత్కరించాడు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మదీన నగరంలోని ఒక తోట నుండి వెళ్తుండగా ఇద్దరు మనుషు లకు వారి సమాధిలో శిక్ష పడుతున్నట్లు విన్నారు. అప్పుడు ఇలా చెప్పారు: “వారిద్దరు శిక్షించబడుతున్నారు, వారు శక్షించబడేది పెద్ద పాపం చేసినందుకు కాదు”. మళ్ళి చెప్పారు: “ఎందుకు కాదు. పెద్ద పాపం చేసి నందుకే. వారిలో ఒకడు తన మూత్రతుంపరల నుండి జాగ్రత్త పడేవాడు కాదు. రెండోవాడు, చాడీలు చెప్పుకుంటు తిరిగేవాడు. (బుఖారి 216, ముస్లిం 292).
* ఇందులో అతిచెడ్డ రకం భార్యభర్తల మధ్య కలతలు సృషించుటకు భార్యకు వ్యెతిరేకంగా భర్తకు చాడీలు చెప్పుట. మరియు భర్తకు వ్యెతిరేకంగా భార్యకు చాడీలు చెప్పుట. అదే విధంగా కొందరు ఉద్యోగులు, గుమాస్దాలు తమ తోటి వాళ్ళకు నష్టం చేకూర్చడానికి వారి మాటలు మేనెజర్, లేక పెద్ద పోస్టులో ఉన్నవానికి చాడీలు చెప్పుట. ఇవన్నీ నిషిధ్ధం.
(విశ్వసించిన ప్రజలారా! మీ ఇండ్లు తప్ప, ఇతరుల ఇండ్లలోనికి వారి అనుమతి లేకుండా మరియు ఆ ఇంటివారికి సలామ్ చేయకుండా ప్రవేశించకండి). (నూర్ 24: 27).
ఇంట్లో ప్రవేశించే ముందు అనుమతి కోరండి అనడానికి సబబు, ఆ ఇంటివారు దాచి ఉంచవలసిన వాటి మీద చూపు పడకూడదని, ఈ విషయాన్ని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా స్పష్టంచేశారు:
“దృష్టి పడరాదన్న ఉద్దేశ్యంతోనే అనుమతి తీసుకోవాలని ఆదేశించడం జరిగింది”. (బుఖారి 6241).
కాని ఈ రోజుల్లో బిల్డింగ్ లు దగ్గర దగ్గర ఉండి, అందులో తలుపులు, కిటికీలు ఎదురెదురుగా ఉన్నందు వల్ల (ఒకరు అవసరం ఉండి తన తలుపు తెరచినా) ఎదుటి వారి దృష్టి, మరియు (ఎదుటివారు తెరచినా) వీరి దృష్టి, ఇలా పరస్పరం ఒకరి దృష్టి మరొకరిపై వారు దాచి ఉంచవలసిన వాటిపై పడుతాయి. చాలా మంది తమ చూపులను క్రిందికి దించుకొని ఉండరు. మరికొందరు కావాలని ఉద్దేశపూర్వకంగా తమ, పై అంతస్తుల్లోకి ఎక్కి కిటికీల నుండే లేక పైనుండే, క్రిందఉన్న తమ పొరుగువారిని త్రొంగి చూస్తారు. ఇది వారిని అవమానపరచడంతో సమానం. ఇతర నిషిధ్ధ కార్యాలకు ఇది ఒక మార్గం అవుతుంది. ఇలాంటి సంఘటనల వలన ఎన్నో అల్లకల్లోలాలు, ఆపదలు విరుచుకు పడ్డాయి. ఈ దుష్చేష్ట యొక్క భయంకర రూపాన్ని తెలుసుకొనుటకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ ప్రవచనమే చాలు. త్రొంగి చూసేవాని కన్ను పగలగొట్టినా పాపం లేదని తెలిపారు.
ముస్లింల ఐక్యతను విఛ్ఛిన్న పరచడానికి, ఒకరి మనసులో మరొకరి పట్ల ద్వేషభావాలు పుట్టించడానికి సభల ఆపదల్లో, షైతాన్ మార్గాల్లో ఒకటి ఇదీ కూడ. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దాని కారణాలతో సహా దాని నివారణను స్పష్టంగా తెనిపారు.
“మీరు ముగ్గురున్నప్పుడు మూడో వ్యక్తిని వదలి ఇద్దరు రహస్యంగా మాట్లాడుకోవద్దు. అందరూ కలసి మాట్లాడుకోవాలి. దాని వలన మూడో వ్యక్తికి బాధ కలుగవచ్చును.”. (బుఖారి 6290, ముస్లిం 2184).
అదే విధంగా నలుగురు ఉన్నప్పుడు ముగ్గురు కలసి, నాలుగో వ్యక్తిని వదలి మాట్లాడుకొనుట. అలాగే పై వరకు. అదే విధంగా ముగ్గురు ఉన్న చోట ఇద్దరు మూడో వానికి తెలియని భాషలో మాట్లాడరాదు. ఇలా మూడో వ్యక్తి, తనకు విలువ ఇవ్వలేదని, లేక అతని గురించే మాట్టాడు కుంటున్నారనీ లేనిపోని అనుమానంలో పడవచ్చును.
ప్రజలు దీన్ని చిన్నదిగా, విలువలేనిదిగా భావిస్తారు. కాని ఇది అల్లాహ్ దృష్టిలో పెద్ద పాపాల్లో ఒకటి. అంటే లుంగి, ప్యాంట్ వగైరా చీల మండలం క్రిందికి ఉంచుట. కొందరి దుస్తులు నేలకు తాకుతూ ఉంటాయి. మరికొందరివి భూమిలో వ్రేలాడుతూ ఉంటాయి. అబూజర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసులో ఉందిః
ثَلاَثَةٌ لَا يُكَلِّمُهُمُ اللهُ يَومَ الْقِيَامَةِ وَلَا يَنْظُرُ إِلَيْهِمْ وَلاَ يُزَكِّيهِمْ وَلـهُمْ عَذَابٌ أَلِيمٌ : المُسْبِلُ ( وفي رواية : إِزَارَهُ ) وَالمَنَّانُ ( وفي رواية : الَّذِي لَا يُعطِي شَيْئًا إِلَّا مَنَّهُ) وَالمُنْفِقُ سِلْعَتَهُ بِالحَلْفِ الْكَاذِبِ
“మూడు రకాల వ్యక్తులున్నారు. అల్లాహ్ వారితో సంభాషించడు. దయా భావంతో కన్నెత్తి చూడడు. వారిని పరిశుధ్ధ పరచడు. వారికి తీవ్రమైన శిక్ష విధిస్తాడు. తన లుంగి (ప్యాంటు…) ను చీలమండలానికి క్రింది వరకు ఉంచేవాడు. ఉపకారం చేసి మాటిమాటికి చెప్పుకునేవాడు. దెప్పి పొడిచే వాడు. తన సరుకును అసత్య ప్రమాణాలతో అమ్మేవాడు.” (ముస్లిం 106).
కొందరు, నేను గర్వకారణంగా తొడగడం లేదు అని చెప్పి తన పవిత్ర తను చాటుకుంటాడు. కాని అతని మాట చెల్లదు. గర్వం ఉధ్ధేశ్యం ఉన్నా లేకపోయినా అన్ని స్థితుల్లో అది నిషిధ్ధం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) యొక్క ఈ హదీసును గమనించండి:
“లుంగీని, చొక్కాను మరియు తలపాగను వ్రేలాడదీయుట (ఘోరపాపం). అయితే ఎవరైతే వీటిలో ఏ ఒక్కటినైనా గర్వంతో వ్రేలాడతీస్తాడో, ప్రళయ దినాన అల్లాహ్ అతనివైపు కన్నెత్తి చూడడు”. (అబూదావూద్ 4094, సహీహుల్ జామి 2770).
ఈ నిషిద్ధత స్త్రీలకు కూడా వర్తిస్తుంది. అయితే వారి శరీరంలో ఏ కొంత భాగం కూడా పరపురుషులకు కనబడకుండా ఉండుట తప్పనిసరి గనక ఆమె తన పాదాలు కనబడకుండా ఒక జానెడు లేదా రెండు జానెడ్లు క్రిందికి వ్రేలాడదీయవచ్చును. కాని అంతకంటే ఎక్కువ వ్రేలాడదీయుట యోగ్యం కాదు. దీని గురించి తిర్మిజి (1731) మరియు నిసాయి (5336)లో ఉమ్మెసల్మా రజియల్లాహు అన్హా సంఘటన చదవండి.
కొందరు పెళ్ళికూతుళ్ళు ధరించే దుస్తులు మీటర్ కంటే ఎక్కువ క్రిందికి ఉంటాయి. ఒక్కోసారి అంతకంటే పొడుగ్గా ఉంటాయి, వెనక ఉన్నవారు ఎత్తిపట్టుకోవాల్సి వస్తుంది. ఇలా యోగ్యం కాదు.
బంగారం ఏ రూపంలో ఉన్నా, దానిని పురుషులు వాడుట నిషిద్ధం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో అబు మూసా అష్ అరి (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసులో ఉంది:
“బంగారం, పట్టు నా అనుచర సంఘంలోని స్త్రీలకు ధర్మసమ్మతం. పురు షులకు నిషిద్ధం”. (ముస్నద్ అహ్మద్: 4/393. సహీహుల్ జామి 207).
ఈ రోజూ మార్కెట్ లో గడియారాలు, అద్దాలు, బటన్లు, పెన్నులు, చైన్లు ఇంకా మెడల్ పేరుతో బంగారపు లేక బంగారు వన్నె ఎక్కించినవి చాలా ఉన్నవి. ఇంకా పురుషులకు స్వర్ణగడియారం అని కొన్ని కాంపిటి షన్లలో ప్రకటించబడుతుంది. అయితే ఇవి నిషిద్ధం అని తెలుసుకోవాలి.
అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన ప్రకారం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక వ్యక్తి చేతికి బంగారపు ఉంగరం చూశారు. ఆయన దానిని తీసిపారేశారు. మళ్ళీ ఇలా హెచ్చరించారు: “మీలో ఎవరికైనా నరకజ్వాల కావాలని ఉంటే దీనిని తన చేతిలో తొడగవచ్చు”. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నవారన్నారు: ‘నీ ఉంగరాన్ని తీసుకో, వేరే విధంగా దానితో ప్రయోజనం పొందవచ్చు’. అప్పుడు అతనన్నాడు: ‘లేదు. అల్లాహ్ సాక్షిగా! ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తీసిపారేసిన దాన్ని నేను ఎన్నడూ తీసుకోను’. (ముస్లిం 2090).
ఈకాలంలో మన శత్రువులు మనపై చేస్తున్న దాడుల్లో కొత్త, కొత్త ఫ్యాషన్ల డ్రెస్సులు, వివిధ రకాల దుస్తులు. ఇవి ముస్లిం సమాజంలో బాగా వ్యాపించిపోయాయి. అవి చిన్నగా, పలుచగా లేక ఇరుకుగా ఉన్నందు వలన తప్పనిసరిగా దాచి ఉంచవలసిన భాగాలను దాచలేక పోతున్నవి. అందులో కొన్ని రకాలైతే స్వయంగా స్త్రీల మరియు (కొడుకు, తండ్రి లాంటి) మహ్రంల ముందు ధరించుట యోగ్యం కాదు. ప్రళయానికి ముందు స్త్రీలు ఇలాంటి దుస్తులు ధరిస్తారని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) భవిష్యసూచన ఇచ్చారు. ఆ విష యమే అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనంతో ముస్లిం (2128) గ్రంథంలో ఉందిః
“నరకవాసుల్లో రెండు రకాలు. నేను వారిని చూడలేదు. వారిలో ఒక రకం వారి వద్ద ఆవు తోకల్లాంటి కొరడాలు ఉంటాయి. వారు వాటితో ప్రజల్ని కొడతారు. రెండవ రకంవారు స్త్రీలు. వీరు దుస్తులు ధరించి కూడా నగ్నంగానే ఉంటారు. ప్రజల్ని ఆకర్శిస్తారు. ప్రజలచేత ఆకర్శించబడతారు. వారి తలలు బుఖ్తీ (ఉబ్బి) ఒంటె మూపురాల మాదిరిగా ఉంటాయి. వీరు స్వర్గంలో చేరలేరు. అంతేకాదు, స్వర్గ పరిమళాన్ని కూడా ఆఘ్రాణించలేరు. వాస్తవానికి దాని పరిమళం అల్లంత దూరాన ఆఘ్రాణించవచ్చును”.
క్రిందినుంచి మధ్యలోకి తెరచి ఉన్నవి లేక వివిధ ప్రక్కల నుండి కత్తి రించి ఉన్న డ్రెస్సులు, కూర్చుంటే తమ మర్మాంగ ప్రదేశం బైటపడునటు వంటివి కూడా నివారించబడిన దుస్తులలో లెక్కించబడతాయి. అదీగాక దీనివలన అవిశ్వాసులను, వారి ఫ్యాషన్లను అనుసరించినట్లగును. ఇలాంటి అశ్లీల దుస్తుల నుండి అల్లాహ్ యే కాపాడుగాక!
అదే విధంగా అశ్లీల చిత్రాలు, మ్యూసిషియన్ల (సంగీతకారుల), గాయ కుల ఫోటోలు, మత్తు పదార్ధాల బాటిళ్ళపై ఉండే ఫోటోలు, జీవరాసుల ఫోటోలు, శిలువ గుర్తు, లేక వివిధ క్లబ్బులు, పార్టీల గుర్తులు గౌరవమా నాలకు మచ్చ లాంటి అశ్లీల పదాలుగల షర్టులు, టీషర్టులు ధరించుట కూడా చాలా గంభీరమైన విషయం. వాటిని ధరించకుండా వాటికి దూరం గానే ఉండాలి.
అస్మా బిన్తె అబూబకర్ ఉల్లేఖనం ప్రకారం: ఒక స్త్రీ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి వచ్చి “ప్రవక్తా! నా కూతురికి చర్మవ్యాది సోకింది. దాని మూలంగా ఆమె తలవెంట్రుకలు రాలిపోయాయి. నేనామెకు పెళ్ళి చేశాను. మరి నేను ఆమెకు సవరం పెట్టవచ్చా?” అని అడిగింది. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “సవరం పెట్టుకునే స్త్రీని మరియు పెట్టుకోవటానికి తాపత్రయపడే స్త్రీని అల్లాహ్ శపించాడు” అని అన్నారు. (ముస్లిం 2123, బుఖారి 5941).
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ ఉల్లేఖించారు: “స్త్రీ తన శిరోజాల్లో సవరం పెట్టుకొ నుటను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గట్టిగా వారించారు”. (ముస్లిం 2126).
ఈ రోజుల్లో “విగ్” రూపంలో ఇది చెలామణిలో ఉంది. ఈ నిషిధ్ధ కార్యం జరిగే బ్యూటిపార్లర్ లలో ఇంకా చెప్పరాని దుష్కా ర్యాలు జరుగుతాయి.
దీనికి సంబంధించిన మరో నిషిద్ధత ఎరువిచ్చుకునే వెంట్రుకలు. డ్రా మాల్లో, ఫిల్ములో వనిచేసేవాళ్ళు, (వాళ్ళను అనుకరించేవాళ్ళు) వీటిని ఉప యోగిస్తారు. ఇలాంటివారికి పరలోక సాఫల్యంలో ఓ భాగమైనా లభించదు.
పురుషులు తమ పురుషత్వాన్ని, స్త్రీలు తమ స్త్రీత్వాన్ని కాపాడుకోవాలి. ఇది అల్లాహ్ తన దాసుల్లో ఉంచిన స్వభావం. ఈ స్వభావమే లేకుంటే జీవన వ్యవస్థ దారి తప్పిపోతుంది. ఇక స్త్రీలు పురుషుల పోలిక, పురుషులు స్త్రీల పోలిక వహించుట మానవ స్వభావానికి బధ్ధవిరుధ్ధం. ఇందువలన ఎన్నో రకాల చెడులు ప్రబలి, సమాజాలను అధోగతి పాలు చేస్తాయి. అందుకే అపోసిట్ సెక్స్ పోలికలు వహించుట నిషిధ్ధం. పెద్ద (ఘోర) పాపం అని. ఇబ్ను అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ప్రవక్తతో ఉల్లేఖించారు:
పురుషులు, పురుషుల వేషాధారణ, అలవాట్లు అవలంభించే స్త్రీలను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శపించారు”. (బుఖారి 5886).
* పోలిక ఎన్నో రకాలుగా ఉంటుంది. కదలిక, చలనము, నడకలో. ఉదా హరణకు కొందరు పురుషులు తమ శరీరాన్ని స్త్రీల శరీరంలా, తమ మాటా, నడకా స్త్రీల వలే అవలంభిస్తారు.
* దుస్తులు ధరించడంలో కూడా పోలిక ఉంటుంది. పురుషుడు తన మెడలో గొలుసు, నెక్లేసు, చేతులలో గోట్లు, గాజులు, కాళ్ళల్లో పట్టీలు చెవు ల్లో రింగులు. ఇలాంటి రోగం పొడువైన శిరోజాలు వదలి, హిప్పి వెంట్రుకలు ఉంచేవారిలో అధికంగా కనబడుతుంది. అదే విధంగా పురషులకు ప్రత్యేక మైన సౌబ్ (అరబ్బులో చెలామణి ఉన్న తోప్), కమీజు స్త్రీలు ధరించుట యోగ్యం కాదు. డిజైన్, కుట్టులలో వాటికి భిన్నంగా ఉండుట తప్పనిసరి. ఇద్దరి దుస్తుల్లో భిన్నత్వం ఉండుట తప్పనిసరి అనుటకు నిదర్శనం అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన ఈ హదీసేః
“స్త్రీల దుస్తులు ధరించిన పురుషుణ్ణి, పురుషుల దుస్తులు ధరించిన స్త్రీని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శపించారు”. (అబూ దావూద్ 4098, సహీహుల్ జామి 5071).
“చివరి కాలంలో ఒక జాతివారు తమ శిరోజాలను పావురం గదువ క్రింద ఉన్నట్లు నల్లని రంగులో రంగరింస్తారు. వారు స్వర్గం యొక్క పరిమళాన్ని ఆఘ్రాణించలేరు.” (అబూ దావుద్ 4212).
తెల్ల వెంట్రుకలు వచ్చిన చాలా మంది నల్లని వన్నెతో రంగరిస్తారు. ఇది ఎన్నో చెడులకు దారి తీస్తుంది.
తన వాస్తవికత పై ముసుగు వేసి, ప్రజల్ని మోసగించి తనకు తాను బూటకపు తృప్తి పొందుట. వాస్తవంగా ఇది తన వ్యక్తితత్వం మరియు తన నడవడికపై చెడు ప్రభావం చూపుతుంది. తనకు తాను ఒకమోసం లో పడి ఉంటాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పసుపుపచ్చ లేక ఎర్ర లేక బ్రౌన్ కలర్ మైదాకు ఉపయోగించేవారు. మక్కాను జయించిన రోజు (అబూ బకర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు) తండ్రి అబూ ఖుహాఫా వచ్చారు. అతని తల మరియు గడ్డపు వెంట్రుకలు తెల్లగా ఉండి ఒక తెల్లనిపువ్వుల గుచ్చ మాదిరిగా ఏర్పడుతుండే. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతడ్ని చూసి “మీ శిరోజాలను (మైదాకుతో) రంగరించుకొండి. కాని నల్లని రంగుతో దూరముండండి.” అని సెలవిచ్చారు. (ముస్లిం 2102)
స్త్రీలు కూడా పురుషుల్లాగ నల్లని రంగులో రంగరించకూడదు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారని, అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
إِنَّ أَشَدَّ النَّاسِ عَذَابًا عِنْدَ الله يَوْمَ الْقِيَامَةِ الْمُصَوِّرُونَ
“ప్రళయదినాన అల్లాహ్ వద్ద అందరికన్న ఎక్కువ కఠినమైన శిక్ష పొందే వాడు, ఫోటోలు తీయువాడు, చిత్రాలు చిత్రించేవాడు”. (బుఖారి 5950, మస్లిం 2109). అల్లాహ్ ఆదేశించాడని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తెలిపినట్లు అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః
“నేను పుట్టించినట్లు పుట్టించే ప్రయత్నం చేసేవానికన్నా ఎక్కువ దుర్మా ర్గుడు మరెవ్వడు కాగలడు. అయితే ఒక్క ధాన్యపు గింజైనా మరియు ఒక్క రవ్వగింజైనా పుట్టించండి”. (బుఖారి 5953, ముస్లిం 2111).
ఇబ్ను అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారు: “ప్రతి ఫోటో గ్రాఫర్, చిత్రకారుడు నరకంపాలగును. అతను చిత్రీకరించిన ప్రతి ఫోటో, చిత్రంలో ప్రాణం పోసి, ఒక రూపం ఇవ్వబడును. అది నరకంలో అతన్ని శిక్షించును”. (మళ్ళి ఇబ్ను అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా చెప్పారు: “ఒకవేళ నీవు చిత్రం చిత్రించాలనుకుంటే చెట్లు మరియు ప్రాణం లేని వాటిని చిత్రించు”. (ముస్లిం 2110).
మానవులు, పశువులు మొ.న ప్రాణంగలదాన్ని చిత్రించుట నిషిధ్ధం అని పై హదీసుల ద్వారా స్పష్టం అవుతుంది. అది ప్రింటింగ్ ద్వారా, చేతుల నైపున్యంతో అయినా, లేదా ఏ దానిపైనైనా చెక్కి చేసినా, లేదా చిత్రలేఖనం ద్వారా, కత్తిరింపులు చేసైనా, అచ్చుల ద్వారా, ఏ విధంగ చిత్రించినా అది నిషిధ్ధమే.
ముస్లిం, విశ్వాసుడు అన్నప్పుడు ధర్మం ఆదేశం వచ్చిన వెంటనే శిరసావహించాలి. వ్యెతిరేకించవద్దు. ‘నేను దాన్ని పూజించడం లేదు. సాష్టాంగపడట లేదు’ అన్న సాకులు చెప్పవద్దు.
ఈ కాలంలో ఫోటోల వలన వ్యాపిస్తున్న కేవలం ఒక్క చెడును బుధ్ధి పూర్వికంగ, దూరపుదృష్టితో గ్రహిస్తే, ఇస్లాం దీన్ని నిషిధ్ధ పరచినందుకు ఎన్ని లాభాలున్నాయో స్వయంగా తెలుసుకుంటాడు. కామోద్రేకం నుండి మొదలుకొని వ్యభిచారంలో వరకు పడవేసే ముఖ్య సాధనం ఫోటోలు. అందుకే ఏ విశ్వాసుడు ప్రాణంగల ఫోటో తన ఇంట్లో ఉంచకూడదు. అది దైవదూతలు, మన ఇంట్లో ప్రవేశానికి ఆటంకం కలుగజేస్తాయి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “ఏ ఇంట్లో కుక్క, ఫోటోలు, చిత్రాలు గలవో ఆ ఇంట్లో దైవదూతలు ప్రవేశించరు”. (బూఖారి).
కొన్ని ముస్లిం ఇళ్ళల్లో విగ్రహాలు, అవిశ్వాసుల దేవీదేవతలుగా భావించ బడేవారి ఫోటోలు కూడా ఉంటాయి. ఇవి అలంకరణ కొరకు పెట్టాము, లేక బహుమానంగా పొందినవి గనక భద్రపరిచాము అని అంటారు. కాని వీటి నిషిధ్ధత మరీ కఠినంగా ఉంది. ఒకవేళ అవి తగిలించి, వ్రేలాడి ఉంటే, వాటి నిషిధ్ధత తగిలించి లేనివాటి కంటే ఎక్కువ ఉంటుంది. ఇలా వాటిని భద్రపరచడం, తగిలించడం వలననే, వాటిని పూజించడం జరుగుతుంది. వాటిని చూసి తమ దుఃఖాలు దూరము అవుతాయని భావించబడుతుంది. దీని వలన ఎందరో తమ తాతముత్తాతల పై బూటకపు గర్వంలో పడి, బడాయీలు కొడుతున్నారు. ఇవి జ్ఞాపకార్ధం కొరకు అని అనరాదు. ఎందుకనగా తమ ముస్లిం సోదరుల, బంధు మిత్రుల వాస్తవ జ్ఞాపకార్ధం మనుస్సులో ఉంటుంది. అది ఏమనగా వారిపై అల్లాహ్ యొక్క దయ, కరుణ క్షమాపణ కురువాలని దుఆ చేయుట.
అందుకే అన్ని ఫోటో, చిత్రాలను తీసేయాలి, చెరిపేయాలి. దేనిని తీయ డం, చెరపడంలో తీవ్ర కష్టమో దాన్ని అల్లాహ్ పై వదలాలి. ఉదా: వివిధ డబ్బులపై, నోట్లపై, డిక్షనరీల్లో, కొన్ని పుస్తకాల్లో ఉండేటివి. తమ శక్తిమేర ప్రయత్నించాలి. ప్రత్యేకంగా అశ్లీల చిత్రాలను చెరిపేయాలి. కాని పాస్పోర్ట్, ఐడింటికార్డ్ లాంటి తీవ్ర అవసరాలకు ఫోటోలను ఉపయోగించవచ్చును. కొందరు ధర్మవేత్తలు, పండితులు కాళ్ళ క్రింద వచ్చే (దిండ్లపై, పడకలపై ఉండే) చిత్రాలను చెరపకున్నా పరవాలేదు అని చెప్పారు. (ఎందుకనగా వాటిని గౌరవించడం జరుగదు). అయినా (మీకు సాధ్యమైనంత వరకు అల్లాహ్ తో భయపడుతూ ఉండండి). (64: తగాబున్: 16).
కొందరు సులభంగా ప్రఖ్యాతి పొందుటకు, పేరు తెచ్చుకొనుటకు, ఇత రుల సొమ్ము చేజిక్కించుకొనుటకు, లేక తన శతృవుల్ని భయపెట్టుటకు అసత్య కలల్ని వినిపిస్తారు. కొందరు మూర్ఖులు ఇలాంటి అసత్యస్వప్నా లను గాఢంగా విశ్వసిస్తారు. కనుక అలాంటి వారికి అసత్య కలల్ని విని పించి వారిని మోసగించడం జరుగుతుంది. ఇలా కలలు చూడకుండానే చూశానని చెప్పేవానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా హెచ్చరిక వినిపించారు.
“తనకు జన్మనిచ్చిన తండ్రిని గాక ఇతరుల్ని తండ్రి అనుట. చూడని స్వ ప్నాన్ని చూసినట్లు చెప్పుట, ప్రవక్త చెప్పని మాటను ఆయన చెప్పారని ఒక మాటను ఆయనవైపు ఆపాదించుట, ఇవన్నీ అసత్యాల్లో అతి పెద్ద అసత్యాలు”. (బూఖారి 3509). మరో హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు:
“మీలో ఒక వ్యక్తి నిప్పులపై కూర్చొని, ఆ నిప్పులు అతని బట్టలను కాల్చి దాని సెగ శరీరానికి కల్గినప్పటికినీ అది సమాధి పై కూర్చునే దానికంటే మేలు”. (ముస్లిం 971).
కొందరు శవాన్ని ఖననం చేయడానికి వెళ్ళినప్పుడు సమాధులపై నడుస్తారు. ఒక్కోసారి చెప్పులతో వాటిని త్రోక్కుకుంటూ వెళ్తారు, ముస్లిం శవం యొక్క గౌరవాన్ని కొంచెం కూడా పట్టించుకోరు. ఇది పెద్ద పాపం అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) భయకంపితుల్ని చేశారు:
“నిప్పులపై, లేక ఖడ్గం యొక్క చురుకుదనంపై నడుచుట, లేక నా చెప్పు ను పాదంతో సహా కుట్టుకొనుట ఒక ముస్లిం సమాధిపై నడుచుట కంటే ఇష్టమైనది”. (ఇబ్ను మాజ 1567, సహీహుల్ జామి 5038).
ప్రతి బుధ్ధిమంతుడు ఆలోచించదగ్గ విషయం! సమాధులపై కూర్చుం డుట, నడుచుట ఇంత పెద్ద పాపమైనప్పుడు, శ్మశాన భూమిని ఆక్రమిం చుకొని, దానిపై కమర్షియల్ లేక రెసిడిన్షియల్ స్కీంల ప్లాన్లు వేయుట ఎంత ఘోరమైన పాపం. మరి కొందరు దురదుష్టవంతులు శ్మశాన గోడలు కూడా దాటి తమ కాలకృత్యాలు తీర్చుకుంటారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారు:
“కాలకృత్యాలు శ్మశానంలో తీర్చుకొనుట, లేక నడి బజారులో తీర్చుకొ నుట రెండూ సమానమే”. (ఇబ్ను మాజ 1567).
దీని అర్ధమేమిటంటే నడి బజారులో తమ మర్మాంగాన్ని తెరచి, అవసరం తీర్చుకొనుట ఎంత అశ్లీలమో, చెడో, శ్మశానంలో చేయుట కూడ అంతే అశ్లీలం, చెడు. అదే విధంగా శ్మశానంలో చెత్తచెదారం వేయువారు కూడా, (ప్రత్యేకంగా ప్రహరి గోడలు లేని శ్మశానంలో) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇచ్చిన పై హెచ్చరికల పరిధిలోకే వస్తారు.
ఇస్లాం యొక్క గొప్పతనం ఏమనగా అది మానవునికి మేలు చేయు ప్రతి విషయం గురించి ఆదేశించింది. ఆ ఆదేశాల్లో మలినాన్ని, అపరిశుద్ధ తను దూరం చేసి, మలమూత్ర విసర్జన తరువాత నీళ్ళతో లేక మట్టి పెడ్డ లతో పరిశుధ్ధ పరచుకోవాలన్న ఆదేశం కూడా ఉంది. పరిశుధ్ధత పొందే విధానం సయితం స్పష్టంగా తెలుపబడినది. అయితే కొందరు అపరిశుభ్ర తను దూరం చేయడంలోనూ, సంపూర్ణ పరిశుధ్ధతలోనూ అలక్ష్యం చేస్తారు. ఆ కారణంగా వారి దుస్తులు, శరీరం అపరిశుభ్రంగా ఉండిపోతాయి. పైగా వారి నమాజు స్వీకరించబడదు. అది సమాధి శిక్షకు కూడా కారణం అవుతుందని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తెలిపినట్లు ఇబ్ను అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మదీన నగరంలోని ఒక తోట నుండి వెళ్తుండగా ఇద్దరు మనుషు లకు వారి సమాధిలో శిక్ష పడుతున్నట్లు విన్నారు. అప్పుడు ఇలా చెప్పారు: “వారిద్దరు శిక్షించబడుతున్నారు, వారు శక్షించబడేది పెద్ద పాపం చేసినందుకు కాదు”. మళ్ళి చెప్పారు: “ఎందుకు కాదు. పెద్ద పాపం చేసి నందుకే. వారిలో ఒకడు తన మూత్రతుంపరల నుండి జాగ్రత్త పడేవాడు కాదు. రెండోవాడు, చాడీలు చెప్పుకుంటు తిరిగేవాడు. (బుఖారి 216).
మరో హదీసులో ఉంది:
أَكْثَرُ عَذَابِ الْقَبْرِ فِي الْبَوْلِ
“అధిక శాతం సమాధి శిక్ష మూత్ర విషయంలోనే కలిగేది”. (అహ్మద్:2/326).
మూత్ర విసర్జన పూర్తిగాక ముందే నిలబడుట. మూత్ర తుంపరలు తనపై పడవచ్చని తెలిసి కూడా అదే చోట ముత్ర విసర్జన చేయుట. లేక నీళ్ళతో లేక మట్టి పెడ్డలతో పరిశుభ్ర పరుచుకోకపోవుట. ఇవన్నియూ మూత్ర విషయంలో జాగ్రత్త పడకపోవటం క్రిందే లెక్కించబడుతాయి.
ఈ రోజుల్లో ఇంగ్లీషువాళ్ల, అవిశ్వాసుల పోలిక ఎంత వరకు వచ్చేసిం దంటే, మూత్రశాలల్లో గోడలకు తగిలించి మూత్రపాత్రలు పెట్టబడ్డాయి. దాని నలువైపుల ఏ అడ్డూ ఉండదు. అందరు వచ్చిపోయేవారి ముందు, లజ్జా, సిగ్గు లేకుండా మనిషి వచ్చి అందులో మూత్రం చేస్తాడు. మళ్ళీ పరిశుభ్రం చేసుకోకుండానే తన బట్టను పైకి లాక్కుంటాడు. ఇలా ఒక్కసారి రెండు దుష్ట నిషిధ్ధాలకు గురి కావలసి వస్తుంది. ఒకటి: తన మర్మస్ధలాన్ని ప్రజల చూపుల నుండి కాపాడకపోవటం, రెండు: మూత్ర తుంపరల నుండి జాగ్రత్త వహించకపోవటం([8]).
“ఎవరు ఇతరుల మాటలను గుప్తంగా వింటాడో, అది వారికి ఇష్టం లేకున్నా అతని చెవిలో సీసం కరిగించి పోయబడును”. (తబ్రానీ ఫిల్ కబీర్: 11/248. సహీహుల్ జామి).
ఒకవేళ అతడు గుప్తంగా విన్న మాటల్ని వారికి తెలియకుండా ఇతరులకు చెప్పితే, రహస్యంగా విని సంపాదించిన పాపమే గాకా, చాడీలు చెప్పేవారి పాపంలో కూడా పడుతాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారు: “చాడీలు చెప్పేవాడు స్వర్గంలో చేరడు”. (బుఖారి).
(మీరంతా అల్లాహ్ కు దాస్యం చేయండి. ఎవరినీ ఆయనకు భాగస్వాము లుగా చేయకండి. తల్లిదండ్రుల యడల సద్భావంతో మెలగండి. బంధువులు, అనాధులు, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులయిన పొరుగువారు, ప్రక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ ఆధీనంలో ఉన్న దాసదాసీజనం పట్ల ఉదారబుద్ధితో వ్యవహరించండి. గర్వాతి శయంతో కన్నూమిన్నూ కాననివారు, తమ గొప్పతనం గురించి విర్రవీగేవారు అంటే అల్లాహ్ ఇష్టపడడు అని గట్టిగా నమ్మండి). (నిసా 4: 36).
పొరుగువారి హక్కు చలా గొప్పది కనుక వారికి బాధకలిగించుట నిషిధ్ధం. అబూ షురైహ్ ఉల్లేఖించిన హదీసులో ఉందిః
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “అతడు విశ్వాసుడు కాడు. అతడు విశ్వాసుడు కాడు. అతడు విశ్వాసుడు కాడు.” అని తెలిపారు. ‘ఎవరు? ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) !’ అని అడిగినప్పుడు “ఎవరు తన పొరుగువాడిని బాధపెట్టి, అతనికి శాంతి తృప్తి ఇవ్వటంలేదో” అని వివరించారు. (బుఖారి).
ఒక వ్యక్తి మంచివాడా? లేక చెడ్డవాడా? అన్నది తెలుసుకొనుటకు, అతని గురించి అతని పొరుగువాడు ఇచ్చే సాక్ష్యమే ప్రమాణం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. అబ్దుల్లా: బిన్ మన్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: ఒక వ్యక్తి వచ్చి, ప్రవక్త e! ‘నేను మంచి చేస్తున్నదీ, చెడు చేస్తున్నదీ నాకు ఎలా తెలియాలి’ అని అడిగితే, దానికి “నీవు మంచి చేశావు అని నీ పొరుగువారు అంటే నీవు మంచి చేసినట్లు, నీవు చెడు చేశావు అని వారంటే నీవు చెడు చేసినట్లు”. అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధానం పలికారు. (అహ్మద్: 1/402. సహీహుల్ జామి 623).
పొరుగువారికి పెట్టే బాధలు నానా రకాలుగా ఉంటాయి. ఇద్దరి భాగ స్వామ్యంలో ఉన్న గోడలో మొలకొట్టనివ్వక పోవుట, అతని అనుమతి లేకున్నా తన భవనం ఎత్తు (అంతస్తులు) లేపి, అతనికి సూర్య కిరణాలు, ప్రకృతి గాలి రాకుండా చేయుట. తన కిటికీలను అతని వైపు తెరచు కొనునట్లు ఉంచి, అందులో నుంచి వారి ఇంట్లోనికి త్రొంగి చూచుట. తలుపు తట్టి, లేక అల్లరి చేసి వారికి చికాకు, చింత కలిగించుట, ప్రత్యే కంగా పడుకునే లేక విశ్రాంతి సందర్భాల్లో. లేదా వారి పిల్లల్ని కొట్టుట, వారి తలుపు ముందు చెత్తచెదారము వేయుట. ఇలా తన ప్రక్కనే ఉన్న పొరుగువానితో వ్వవహరిస్తే పాపం మరీ రెట్టింపవుతుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) యొక్క ఈ హదీసునుగమనించండి:
“ఒక వ్యక్తి పది మంది ఆడవాళ్ళతో వ్యభిచారం చేసిన పాపం, తన ఒక పొరుగువారి స్త్రీతో వ్యభిచారం చేసిన పాపంకంటే తక్కువ. ఒక వ్యక్తి పది ఇండ్లల్లో దొంగతనం చేసిన పాపం, తన పొరుగువాని ఇంట్లో దొంగతనం చేసిన పాపం కంటే తక్కువ”. (అదబుల్ ముఫ్రద్: 103. సహీహ:65).
కొందరు మోసగాళ్ళు, అంతరాత్మ నామమాత్రం లేనివారు తన పొరు గువాడు నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు, అతని ఇంట్లో ప్రవేశించి, అతని (ఇంటి వారిపై అత్యాచారం జరిపి) గౌరవాభిమానాన్ని మట్టిలో కలిపి అల్లకల్లోలం సృష్టిస్తారు. కఠినమైన శిక్ష పడే రోజున అతనికి వినాశమే వినాశం.
ఇస్లాం సూత్రాల్లో ఒక సూత్రం: “స్వయంగా నష్టంలో పడవద్దు. ఇతరు లకు నష్టం కలిగించవద్దు”. అయితే ధార్మికంగా (ఆస్తిలో) హక్కు గలవారం దరికి లేక కొందరికి నష్టం చేకూర్చుట నిషిధ్ధం. అలా చేయువారు ముస్నద్ అహ్మద్ (3/453)లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నోట వచ్చిన ఈ హెచ్చరికను వినాలి:
“ఎవరు ఇతరులకు నష్టం చేకూరుస్తారో, అల్లాహ్ వారికి నష్టం చేకూరుస్తాడు. ఎవరు ఇతరులపై కష్టం వేస్తాడో, అల్లాహ్ అతనిపై కష్టం వేస్తాడు”.
వారసత్వంలో నష్టం కలిగించే వీలునామాల రూపాలుః ఏ ఒక్క వారసుడికైనా ధర్మపరంగా రావలసిన హక్కు లభించకుండా చేయుట. లేదా ధర్మం నిర్ణయించినదాని కంటే తక్కువ లేక ఎక్కువ వసియ్యత్ (వీలు) చేయుట.
ఇస్లామీయ న్యాయస్థానాలు లేనిచోట, (ఆస్తిలో) హక్కుగలవాడు అల్లాహ్ నిర్ణయించిన హక్కు పొందడం చాలా కష్టం. ఎందుకనగా అక్కడి న్యాయ స్థానాల్లో ఇస్లామేతర చట్టాల పాలన ఉంటుంది. చనిపోయే ముందు అడ్వు కేట్ (Lawyer) వద్ద వ్రాయించిన (ఫైల్ చేసిన) వీలు- నామానే అమలుపర చాలని అవి ఆదేశిస్తాయి. ఇలాంటి వీలునామాలు వ్రాసేవారికి, దాని నుండి సంపాదించేవారికి వినాశమున్నది.
ఈ రోజుల్లో ప్రజల మధ్య ప్రబలి ఉన్న ఆటల్లో నిషిధ్ధమైనవి చాలా ఉన్నాయి. ఇందులోనే పైన పేర్కొనబడిన ఆట. దీని వలన ఇతర వేరే నిషిధ్ధ ఆటల పట్ల మనిషి ఆకర్శితుడౌతాడు. జూదం లాంటి పాపంలో కూడా అతను ఇరుక్కుపోతాడు కనుక ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దీనిని నిషేధించారు:
కొందరు కోపం వచ్చినప్పుడు తమ నాలుకను అదుపులో ఉంచుకో కుండా శపించడం మొదలెడతారు. ఇక నోటికి వచ్చినట్లు మానవులను, పశువులను, జడపదార్ధాలను, రోజులను, గంటలను చివరికి కొందరు తమకు తాము, తన సంతానాన్ని శపిస్తారు. భార్యభర్తలు పరస్పరం శపించుకుంటారు. ఇది నిషిధ్ధం. చాలా భయంకరం. అబూ జైద్ సాబిత్ బిన్ జహ్హాక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా హెచ్చరించారు:
وَمَنْ لَعَنَ مُؤْمِنًا فَهُوَ كَقَتْلِهِ
“విశ్వాసుణ్ణి శపించుట, అతన్ని నరకడంతో సమానం”. (బుఖారి 6047).
ఎక్కువ శాతం స్త్రీలు శపిస్తుంటారు గనక వారి నరక ప్రవేశానికి కారణం అదే అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్పష్టం చేశారు. అలాగే శపించువారు ప్రళయదినాన ఎవరి సిఫారసు చేయలేరు. ఇంతకంటే భయంకర విషయం: అధర్మంగా, అన్యాయంగా ఇతరుల్ని శపించువాడు, ఆ శాపన అతనిపైనే పడుతుంది. ఇలా తనకుతాను స్వయంగా అల్లాహ్ కరుణకు దూరం చేసుకుంటాడు.
కొందరు స్త్రీలతో జరిగే ఒక ఘోర పాపం; కేకలు వేసి అరచుట, మర ణించినవాని ప్రశంసలు చేయుట మరియు తమ ముఖం పై కొట్టుకొనుట. ఇంకా వెంట్రుకలు పీక్కుంటూ, దుస్తులు చింపుకొనుట. ఇదంతా అల్లాహ్ వ్రాసిన విధివ్రాతపై విశ్వాసం లేనందున, దుఃఖసమయాన ఓర్పు వహించ లేనందు వల్ల జరుగుతుంది. ఇలాంటి వారిని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శపించారు. అబూ ఉమామ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం:
“తన ముఖాన్ని చెరుపుకొని, తన వక్షస్థల వస్త్రాన్ని చించుకుంటూ వినాశం, మృత్యువు అన్న కేకలు వేసే స్త్రీలను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శపించారు”. (ఇబ్ను మాజ 1585, సహీహుల్ జామి 5068).
అబ్దూల్లాహ్ బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశించారు:
“ముఖముపై కొట్టుట మరియు వాతలు పెట్టుట నుండి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నివారించారు”. (ముస్లిం).
* ముఖంపై కొట్టుట: కొందరు తండ్రులు, ఉపాధ్యాయులు / టీచర్లు,
పిల్ల లకు శిక్ష ఇచ్చెటప్పుడు, కొందరు యజమానులు తమ నౌకర్లను వారి ముఖంపై కొడుతారు. ఇలా చేస్తే అల్లాహ్ మానవునికి అనుగ్రహించిన ముఖానికి విలువ ఇవ్వనట్లు అవుతుంది. దాని వలన ముఖములో ఉన్నటువంటి శ్రోతేంద్రియం, దృగింద్రియము వగైరాలు చెడి పోవచ్చును. తరువాత పశ్చాత్తాప పడవలసి రావచ్చు. నష్టపరహారం చెల్లించవలసి ఉండవచ్చు.
* పశువుల ముఖాలపై వాతలు పెట్టుట: జంతువులు గల వ్యక్తి తన జంతువును గుర్తించడానికి, లేక తప్పిపోయినచో తిరిగి రావడానికీ వాతలు పెడుతాడు. ఇది నిషిధ్ధం, ఇది శిక్ష కూడా. మరెవరైనా ఇది మా వంశంలో ఉన్న ఆచారం అని అంటే, జంతుశరీరంలో ఎక్కడైనా వాత పెట్టాలి, కాని ముఖం పై పెట్టకూడదు.
ముస్లింల మధ్య విబేదాల్ని సృష్టించాలన్నది షైతాన్ ప్రయత్నం. షైతాన్ అడుగు జాడల్లో నడిచే అనేకులు ఏ ధార్మిక కారణం లేకున్నా తమ ముస్లిం సోదరులతో సంబంధాల్ని తెంచుకుంటారు. అది ధన, ఆస్తి గురించో, లేక తన వ్యర్ధమైన అభిప్రాయానికి భిన్నంగా తన సోదరుడిని చూసినచో జీవితాంతరం మాట్లాడకుండా ఉంటారు. కొందరు మాట్లాడనని ప్రమాణం చేస్తారు. అతని ఇంట్లో ప్రవేశించకూడదని మ్రొక్కు కుంటారు. అతను దారిలో కలిస్తే ముఖం ప్రక్కకు తిప్పుకుంటారు. ఏ సభలోనైనా కలిస్తే అందరితో కరచాలనం చేసి, అతన్ని చూసి చూడనట్లుగా వెళ్ళిపోతారు. వాస్తవానికి ఇది ముస్లిం సమాజాన్ని బలహీనపరుచు కారణాల్లో ఒకటి. అందుకే ఇలాంటివారి గురించి ఇస్లాం కఠినంగా ఆదేశిస్తూ, భయంకర శిక్ష ఉందని హెచ్చరించింది. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హెచ్చరించారు:
“ఏ ముస్లిం కూడా తన ముస్లిం సోదరునితో మూడు రోజులకు పైగా సంబంధాన్ని తెంచుకొనుట ఎంత మాత్రం యోగ్యం కాదు. ఎవరు మూడు రోజులకు పైగా సంబంధాన్ని తెంచుకొని, అదే స్థితిలో చనిపోతాడో అతను నరకంలో ప్రవేశిస్తాడు”. (అబూ దావూద్ 4914, సహీహుల్ జామి 7635).
అబూ ఖరాష్ అస్లమి (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హెచ్చరించారు:
مَنْ هَجَرَ أَخَاهُ سَنَةً فَهُوَ كَسَفْكِ دَمِه
“ఒక సంవత్సరం పాటు తన సోదరునితో సంబంధం తెంచుకున్నవాడు, అతన్ని హత్య చేసినట్లే”. (అబూదావూద్ 4915, అదబుల్ మఫ్రద్: 406, సహీహుల్ జామి 6557).
సంబంధాలు తెంచుకోవడం వలన జరిగే నష్టాలన్నింటినీ కాకున్నా కనీసం ఒక్క నష్టంపైనైనా దృష్టి సారిస్తే చాలు. అది సంబంధాలు తెంచు కున్న వ్యక్తిని అల్లాహ్ క్షమించడు అన్నది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని, అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు.
“ప్రజల కర్మలు ప్రతి వారంలో రెండు రోజులు; సోమవారం, గురువారం అల్లాహ్ ముందు ఉంచబడుతాయి. అప్పుడు ప్రతి విశ్వాసుడు క్షమించబ డతాడు, కాని ఎవరి మధ్య కపటం, ద్వేషం ఉందో వారు తప్ప. వారిద్దరినీ వదిలేయండి, లేక వారు తమ కపటం, ద్వేషం దూరం చేసుకునేంత వరకు వదిలేయండి అని చెప్పబడుతుంది”. (ముస్లిం 2565).
ఇద్దరిలో ఎవరు అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటాడో, అతను తన సోదరునితో కలవాలి, సలాం చేయాలి. ఇలా చేసినప్పటికీ ఎదుటివాడు నిరాకరించి దూరమవుతే, మొదటి వ్యక్తి తనపై ఉన్న భాధ్యతను పూర్తి చేసుకున్న వాడవుతాడు. తన నిరాకరణకు తానే బాధ్యుడవుతాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశాన్ని అబూ అయ్యుబ్ ఉల్లేఖించారు:
“ఏ ముస్లిం అయినా తన సోదరునితో మూడు రోజులకంటే ఎక్కువ సం బంధం తెంచుకొని యుండుట యోగ్యం కాదు. ఇద్దరు పరస్పరం కలుసు కుంటారు. కాని ఎడముఖం పెడముఖంతో, వారిద్దరిలో మంచివాడు ముందంజ వేసి సలాం చేసేవాడు”. (బుఖారి 6077, ముస్లిం 2560).
సంబంధం తెంచుకొనుటకు ఒకవేళ ధార్మిక కారణం ఉంటే పరవా లేదు. ఉదాహరణకు నమాజు చదవనివారితో, లేక దుష్కార్యం చేస్తున్న వారితో సంబంధం తెంచుకోవడం వలన దుష్కార్యం చేసేవారికి లాభం ఉండే ఆవకాశం ఉంటే, అనగా అతను సన్మార్సాన్ని అనుసరిస్తే, లేక తన తప్పు ను గ్రహించగలిగితే సంబంధం తెంచుకొనుట తప్పనిసరి. ఒకవేళ దీని వలన అతను తలబిరుసుతనానికి, తిరస్కారానికి, కపటానికి వడి గట్టి మరింత ఎక్కువ పాపంలో కాలు మోపుతాడనే భయం ఉంటే సంబంధం తెంచుకోకుండా మరీ మరీ ఉపదేశిస్తూ, ఉపకారం చేస్తూ ఉండాలి.
చివరిగా: సమాజంలో ప్రబలిఉన్న నిషిధ్ధ కార్యాల్లో కొన్నింటిని సమకూర్చగలిగినందుకు అల్లాహ్ కే కృతజ్ఞతలు. ఆయన పవిత్ర నామాల ‘వసీల’తో ఇలా దుఆ చేస్తున్నాను: ఓ అల్లా:! మా మధ్య మరియు పాపాల మధ్య అడ్డుగా ఉండునటువంటి నీ భయాన్ని మాకు ప్రసాదించు. నీ స్వర్గంలో చేర్పించునటువంటి నీ విధేయత మాకు నొసంగు. మా తప్పులను, పొరపాట్లను మన్నించు. మా పనులలో జరిగిన నీ హద్దుల అతిక్రమణను క్షమించు. హలాల్ ప్రసాదించి, హరాం నుండి దూరముంచు. నీ దయ మాపై అనుగ్రహించి ఇతరుల నుండి అతీతునిగా చేయు. మా క్షమాపణ, తౌబాను స్వీకరించి, మా పాపాల్ని కడుగు. (ఆమీన్). నీవే వినువాడివి, అంగీకరించవాడివి. చదవనూ వ్రాయనూ రాని ప్రవక్త ముహ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి సంతతిపై, వారి సహచరులందరిపై దయా, కరుణ, శాంతి కురిపించు. సర్వస్తోత్రాలు సర్వ లోకాల పోషకుడు అల్లాహ్ కే తగును.
పాదసూచిక (Footnotes)
([1]) కొందరు పండితులు నిషిద్ధతాలకు లేదా దాని కొంత భాగం; ‘ఘోర పాపాలు’ లాంటి కొన్ని పుస్తకాలు రచించారు. అయితే నిషిద్ధతాలకు సంబంధించిన మంచి పుస్తకాల్లో ఇబ్ను నుహాస్ దిమిష్ఖీ రహిమహుల్లాహ్ గారి రచన ‘తంబీహుల్ గాఫిలీన్ అన్ అఅమాలిల్ జాహిలీన్’ ఒకటి.
[2]కహాన అంటే భవిష్యత్తులో సంభవించేవాటిని, మనుసులో ఉండేవాటిని తెలుపుట. ఇలా తెలిపేవాడు కాహిన్. అర్రాఫ అంటే కొన్ని మూల విషయాల ఆధారంగా దొంగలించబడిన వస్తువులను, కనబడని, తప్పిపోయిన వస్తువులను తెలుపుతానని ఆరోపించుట. ఇలా ఆరోపించేవాడు అర్రాఫ్.
1- “ఇన్షురెన్స్ ఆదేశాలు. దాని స్థానంలో ఇస్లాంలో ఏముంది” అన్న వ్యాసం అరబి మ్యాగ్జిన్ “మజల్లతుల్ బుహుసిల్ ఇస్లామియ” 17, 19, 20 లో చూడవచ్చును. ఇది “రిఆసతుల్ ఆమ్మ లిఇదారతిల్ బూహూసిల్ ఇల్నియ్య” నుండి వెళ్తుంది.
2- చేయడం వల్ల పుణ్యంగాని, చేయకపోవడం వల్ల పాపంగాని లేని, ధర్మసమ్మ తమైన ప్రతి పనిని ‘ముబాహ్’ అంటారు.
1- ఈ విషయం షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ తో విన్నాను. (రచయిత).
2- పూర్తి పేరు హసన్ బిన్ సహల్ బిన్ అబ్దుల్లాహ్ సర్ ఖసీ, ఆయన తన కాలం లో ప్రసిధ్ధి చెందిన లీడర్, దాత, సాహిత్యకారుడు. అబ్బాసియ వంశపరి పాలనలోని మామూన్ రాజు కాలంలో మంత్రిగా ఉన్నారు. రాజు అతడిని చాలా గౌరవించేవాడు. హిజ్రి శకం 166లో జన్మించాడు. హిజ్రి శకం 238లో ఖూరాసాన్ లో సర్ ఖస్ నగరంలో మరణించారు. (అఅలాం: ఖైరుద్దీన్ జర్కలీ: 3/192).
1- ఇలాంటి మరే అవసరం అయినా ఉండి సంతానంలో ఏ ఒక్కడు సంపాదించే శక్తి లేనివాడై, తండ్రి ధనశక్తిగలవాడైతే తండ్రి అలాంటి సంతానం పై ప్రత్యేకంగా ఖర్చు చేయవచ్చును. (ఇబ్ను బాజ్).
1- ఇంతేగాకా, అతను మూత్ర విసర్జన తరువాత పరిశుభ్రం కాలేదు. అదే స్థితిలో బట్టను పైకి చేసుకున్నందుకు, అవి అపరిశుభ్రమైనవి. శరీరము అపరిశుభ్రంగానే ఉంది. అదే స్థితిలో చేయబడే నమాజూ అంగీకరింపబడదు. సమాధి శిక్షకు కూడా గురి కావలసివస్తుంది. అల్లాహ్ యే కాపాడాలి. కొంత అలసత్వం, అలక్ష్యం వలన ఎన్ని పాపాలు??.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
స్వర్గ స్త్రీలకు పుణ్యభర్త మరియు గొప్ప సౌందర్యం అనుగ్రహించబడును
స్వర్గవాసులకు ప్రాప్తమయ్యే శక్తి
స్వర్గవాసుల కొరకు సేవకులు
స్వర్గవాసులు అల్లాహ్‌ను దర్శించుకునే మహా భాగ్యం పొందుతారు
తస్‌బీహ్,తక్బీర్ స్వర్గం అనుగ్రహాలు
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇదియే ఇస్లాం (This is Islam) అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia) అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
మనిషి తను జీవిస్తున్న ఈ ధర్తి, సుందర విశాలమైన ఈ జగం, ఆశ్చర్యంలో పడవేసే నక్షత్రాలతో నిండియున్న ఆకాశం, అంతయూ పటిష్ఠమైన వ్యవస్థతో నడుస్తున్నదని ఆలోచిస్తాడు. భూమి, అందులో ఉన్న పర్వతాలు, లోయలు, సెలయేర్లు, చెట్లు, గాలి, నీరు, సముద్రం, ఎడారి మరియు రాత్రి పగలన్నిటిని చూసి వీటన్నిటిని సృష్టించినవాడెవడూ? అనే ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది.
ఈ నీరు లేనిది జీవిత భావమే శూన్యం, దీనిని ఆకాశం నుండి కుర్పించేదెవరు? దాని ద్వారా పంటలు, చెట్లు, పుష్పాలు, ఫలాలు వెలికి తీసేవాడెవడు? మనుషులకు, పశువులకు దానిని ఉపయోగకరమైనదిగా చేసినవాడెవడు? నీరును తన గర్భంలో భద్రపరిచే శక్తి భూమికిచ్చిందెవరు?
ప్రతి వస్తువును అవసరమున్నంత ప్రమాణంలో మాత్రమే ఆకర్షించుకునే శక్తి భూమికి ఇచ్చిందెవరు? అవసరానికి మించి ఆకర్షించదు, చలనమే కష్టం అవుతుంది గనక. అవసరానికంటే తక్కువ ఆకర్షిస్తే ప్రతి వస్తువు ఈదుతూ ఉంటుంది.
మనిషిని అందమైన ఆకారంలో సృష్టించినవాడెవడు?
అంతెందుకూ! మనిషి స్వయం తన ఆకృతి గురించి గమనిస్తే ఆశ్చర్యపడతాడు. నీ శరీరములో ఉన్న అవయవాలపై ఒకసారి దృష్టి సారించు, ఒక నిర్ధిష్టమైన పద్దతిలో అవి పని చేస్తున్నాయి. వాటి పని విధానం గురించి నీకు తెలియునది అతితక్కువ. అలాంటప్పుడు దాని గురించి ఖచ్చితమైన నిర్ణయం ఎలా చేయగలవు?
నీవు పీల్చుతున్న ఈ గాలిని గమనించు! అది ఒక క్షణమైనా ఆగితే నీ జీవితమే అంతమవుతుంది. అయితే దాన్ని ఉనికిలోకి తెచ్చిందెవరు?
నీవు త్రాగుతున్న నీరు, నీవు తింటున్న ఆహారం, నీవు నడుస్తున్న ఈ నేల, నీకు వెలుతురునిస్తున్న సూర్యుడు, ఇంకా నీవు తిలకిస్తున్న ఆకాశ చంద్రతారలన్నింటిని సృష్టించినవాడెవడు?
అల్లాహ్. నిశ్చయంగా అల్లాహ్ యే.
అవును, అల్లాహ్ యే ఈ జగమంతటినీ సృష్టించాడు. ఆయన ఒక్కడే దాన్ని నడుపుతున్నాడు. అందులో మార్పులు చేస్తున్నాడు. ఆయనే నీ ప్రభువు, నిన్ను సృజించాడు, ప్రాణం పోశాడు, ఆహారం ఇస్తున్నాడు, చివరికి మరణానికి గురిచేస్తాడు. ఆయనే నిన్ను, ఈలోకాన్ని సైతం శూన్యం నుండి ఉనికిలోకి తెచ్చినవాడు.
ఇదంతా తెలిసాక, ఎవరైనా బుద్ధిమంతుడు, ‘ఈ లోకమంతా వృధాగా పుట్టించబడిందని, మనుషులు జన్మిస్తున్నారు, కొంత కాలం జీవించి చనిపోతున్నారు, ఇలా అంతా సమాప్తమవుతుంది’ అని అనగలడా?
అయితే వాస్తవం ఏమిటంటే: మనం మానవులం ఎందుకు పుట్టించబడ్డాము? అనే ముఖ్య విషయాన్ని మనం తెలుసుకోవాలి.
అల్లాహ్ మనల్ని పుట్టించింది కేవలం ఆయనను ఆరాధించడానికే. ఆ ఆరాధన విధానం తెలియజేయడానికి ప్రవక్తల్ని పంపాడు. గ్రంథాల్ని అవతరింపజేశాడు. ఎవరయితే ఆయన్నే పూజించి, ఆయనకు విధేయులుగా ఉండి, ఆయన నివారించిన వాటి నుండి దూరంగా ఉంటాడో అతడే ఆయన సంతృష్టిని పొందినవాడు. మరెవరయితే ఆయన ఆరాధన నుండి విముఖుడై, ఆయన విధేయతను నిరాకరిస్తాడో అతడే ఆయన ఆగ్రహానికి, శిక్షకు గురైనవాడు.
అల్లాహ్ ఈ లోకాన్ని ఆచరణ మరియు పరీక్ష కొరకు పుట్టించాడు. మానవులు చనిపోతూ ఉంటారు. ఓ రోజు ప్రళయం సంభవిస్తుంది. అల్లాహ్ తీర్పు చేసి ఫలితాలు ఇవ్వడానికి మానవులను వెలికి తీస్తాడు. అల్లాహ్ అక్కడ వివిధ వరాలతో ఓ స్వర్గం సిద్ధపరిచాడు. దానిని ఏ కన్నూ చూడలేదు. ఏ చెవీ వినలేదు. అది ఊహలకూ అతీతమైనది. విశ్వసించి, ఆయన ఆజ్ఞా పాలన చేసినవారి కొరకు అల్లాహ్ దానిని సిద్ధపరిచాడు.
అలాగే మానవులు ఊహించని రకరకాల శిక్షలతో కూడిన నరకాన్ని తయారు చేశాడు. అల్లాహ్ ను తిరస్కరించి, ఇతరుల్ని పూజించి, ఇస్లామేతర మతాలను అవలంభించిన వారి కొరకు అది సిద్ధంగా ఉంది.
ఇస్లాం, అల్లాహ్ ఇష్టపడిన ధర్మం. అనగా అద్వితీయుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుట మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధేయతను పాటించుట. ఏ వ్యక్తి అయినా సరే ఇస్లాం తప్ప ఇతర ధర్మాన్ని అవలంభిస్తే దాన్ని అల్లాహ్ ఎన్నటికీ స్వీకరించడు. ఇది మానవ సమాజంలో ఏదో కొందరిది కాదు, సర్వ మానవులకు చెందినది.
అల్లాహ్ మానవులకు కొన్ని ఆదేశాలిచ్చాడు, మరికొన్ని విషయాలను నిషేధించాడు. ఎవడైతే ఇందులో అల్లాహ్ కు విధేయత చూపుతాడో అతడు సాఫల్యం మరియు (నరకం నుండి) రక్షణ పొందుతాడు. ఎవడైతే అవిధేయత చూపుతాడో అతడు విఫలుడౌతాడు మరియు నష్టపోతాడు.
ఇస్లాం కొత్త ధర్మం కాదు. మానవులు భూమి మీద జీవిస్తున్నప్పటి నుండీ అల్లాహ్ వారి కొరకు ఇష్టపడిన ధర్మం
ఈ గాథ ‘ఆదం’ (అలైహిస్సలాం) ను అల్లాహ్ పుట్టించినప్పటి నుండి ప్రారంభం అవుతుంది. అల్లాహ్ అతడ్ని మట్టితో పుట్టించి, అతనిలో ఆత్మను ఊదాడు. సర్వ వస్తువుల పేర్లు అతినికి నేర్పాడు. అతని గౌరవ, ప్రతిష్ఠల ఉన్నతి కొరకు అతని ముందు సాష్టాంగ పడాలని దైవదూతలను ఆదేశించాడు. అందరూ సజ్దా చేశారు, కాని ఇబ్లీసు ఆదంతో తనకున్న ఈర్ష్య వలన సజ్దా చేయుటకు నిరాకరించి, అహంభావానికి గురి అయ్యాడు. అందుకు అల్లాహ్ అతడ్ని ఆకాశాల్లో ఉన్నటువంటి సౌకర్యాల నుండి తరిమి, అవమానం పాలు జేసి, తన కారుణ్యానికి దూరం చేశాడు. అతనిపై శాపం, దౌర్భాగ్యం మరియు నరకం విధించాడు. అప్పుడు అతడు అల్లాహ్ తో ప్రళయం వరకు వ్యవధి కోరాడు. అల్లాహ్ అతనికి వ్యవధి ఇచ్చాడు. అక్కడే అతడు ఆదం సంతానాన్ని సన్మార్గం నుండి తప్పిస్తానని ప్రమాణం చేశాడు.
ఆదం చెలిమి, చనువు మరియు సుఖ, శాంతులు పొందుటకు అల్లాహ్ అతని నుండి అతని సహవాసి ‘హవ్వా’ను సృజించాడు. ఏ మానవుని ఊహలకు అందనటువంటి భోగభాగ్యాలతో నిండివున్న స్వర్గంలో ఉండాలని ఆదేశించాడు. వారిద్దరి శత్రువైన ‘ఇబ్లీసు’ గురించి తెలియజేశాడు. వారిద్దరిని పరీక్షించడానికి స్వర్గంలో ఉన్న వృక్షాల్లో ఒక వృక్షం నుండి తినుటను నివారించాడు. అప్పుడు ‘షైతాన్’ వారిని ప్రేరేపించి ఆ వృక్షం నుండి తినుట మనోహరమైనదిగా చేసి, ‘నేను మీ నిజమైన శ్రేయోభిలాషిని’ అని ప్రమాణం చేసి ఇలా అన్నాడుః మీరు ఈ వృక్షం నుండి తింటే మీకు శాశ్వతమైన జీవితం లభిస్తుంద’ని చెప్తూ వారిని అపమార్గం పట్టించే వరకు అతడు పట్టు విడవ లేదు. చివరికి వారు ఆ వృక్షం నుండి తినేశారు. తమ ప్రభువు యొక్క అవిధేయతకు పాల్పడ్డారు. పిదప తాము చేసినదానిపై పశ్చాత్తాప పడి, తమ ప్రభువుతో క్షమాపణ కోరారు, ఆయన వారిని క్షమించాడు. కాని వారిని స్వర్గము నుండి భూమిపైకి దించాడు. ఆదం (అలైహిస్సలాం) తన భార్యతో భూమిపై నివసించారు. అల్లాహ్ వారికి సంతానం ప్రసాదించాడు. సంతానం యొక్క సంతానం ఇలా ఇప్పటికీ పెరుగుతునే ఉన్నారు.
ఆదం సంతానాన్ని మార్గదర్శకత్వం నుండి తప్పించడానికి, సర్వ మంచితనాల నుండి అభాగ్యుల్ని చేయడానికి, చెడును మనోహరమైనది (ఆకర్షణీయమైనది)గా చేయడానికి, అల్లాహ్ కు ప్రియమైన వాటి నుండి దూరంగా ఉంచడానికి మరియు ప్రళయదినాన నరకం పాలు చేయడానికి ఇబ్లీసు మరియు అతని సంతానం ఎల్లవేళల్లో పోరాటానికి సిద్ధమైయున్నారు.
అయితే అల్లాహ్ మానవుల్ని నిర్లక్ష్యంగా వదలలేదు. ధర్మం, సత్యం అంటేమిటో స్పష్టపరచడానికి, వారి మోక్షం ఎందులో ఉందో తెలుపడానికి వారి వద్దకు ప్రవక్తల్ని పంపాడు.
ఆదం అలైహిస్సలాం చనిపోయిన తరువాత పది శతాబ్దాల వరకు వారి సంతానం ఏకత్వపు’ (తౌహీద్) సిధ్ధాంతం, అల్లాహ్ విధేయతపైనే ఉండిరి. ఆ తరువాత అల్లాహ్ తో పాటు అల్లాహ్ యేతరులను ఆరాధించడం మొదలై ‘షిర్క్’([1]) సంభవించింది. ప్రజలు విగ్రహాలను సయితం ఆరాధించడం మొదలెట్టారు. అప్పుడు ప్రజల్ని అల్లాహ్ వైపునకు పిలవడానికి, విగ్రహారాధన నుండి నిరోధించడానికీ తొలి ప్రవక్త ‘నూహ్’ uని అల్లాహ్ పంపాడు. ఆ తరువాత ప్రవక్తల పరంపర ఆరంభమయింది. వారు ప్రజల్ని (ఇస్లాం) వైపునకు అంటే ‘అల్లాహ్ అద్వితీయుని ఆరాధన చేయుట, ఇతరుల ఆరాధనను త్యజించుటకు’ ఆహ్వానిస్తుండేవారు.
అదే పరంపరలో హజ్రత్ ‘ఇబ్రహీం’ (అలైహిస్సలాం) ఒకరు. ఆయన కూడా తమ జాతి వారిని ‘విగ్రహారాధన వదలండనీ, అల్లాహ్ అద్వితీయున్నే ఆరాధించండని’ బోధించారు. ఆయన తరువాత ప్రవక్త పదవి ఆయన ఇద్దరు సుకుమారులైన ‘ఇస్మాఈల్’ (అలైహిస్సలాం) మరియు ‘ఇస్ హాఖ్’ uకు, వారి తరువాత మళ్ళీ ‘ఇస్ హాఖ్’ సంతానానికి లభించింది. ‘ఇస్ హాఖ్’ సంతానంలో గొప్ప స్థానం గలవారు: ‘యాఖూబ్’, ‘యూసుఫ్’, ‘మూసా’, ‘దావూద్’, ‘సులైమాన్’ మరియు ‘ఈసా’ అలైహిముస్సలాం. ‘ఈసా’ (అలైహిస్సలాం) తరువాత ‘ఇస్ హాఖ్’ (అలైహిస్సలాం) సంతానంలో ఏ ప్రవక్తా రాలేదు.
అక్కడి నుండి ప్రవక్త పదవి ‘ఇస్మాఈల్’ (అలైహిస్సలాం) సంతతికి మరలింది. అందులో ఏకైక ప్రవక్త ‘ముహమ్మద్’ సల్లల్లాహు అలైహి వసల్లం ను చిట్టచివరి ప్రవక్తగా, ప్రవక్తల అంతిమునకు ముద్రగా మరియు ఆయన తీసుకువచ్చిన ధర్మమే చివరి వరకు ఉండాలని అల్లాహ్ ఎన్నుకున్నాడు. ఆయనపై అవతరించిన దివ్యగ్రంథం ఖుర్ఆనే మానవులకు అల్లాహ్ యొక్క అంతిమ సందేశం. అందుకే అది అరబ్బులకు, అరబ్బేతరులకు అంతే కాదు సర్వ మానవులకు మరియు జిన్నాతుల కొరకు కూడా చెందినది. ప్రతి కాలానికి మరియు యుగానికి అనుకూలమైనది. ప్రతి మేలును గురించి ఆదేశించినది. ప్రతి చెడును నివారించినది.
ప్రవక్త ముహమ్మద్ ﷺ తీసుకువచ్చిన ఈ ధర్మం తప్ప, ఏ వ్యక్తి నుండీ మరే ధర్మాన్ని అల్లాహ్ స్వీకరించడు.
అల్లాహ్ అద్వితీయుని ఆరాధన గురించి ప్రజలకు మార్గదర్శకత్వం చేయడానికి, దీనికి విరుధ్ధంగా వారు పాటిస్తున్న విగ్రహాల ఆరాధనను ఖండించడానికి అల్లాహ్ ‘ముహమ్మద్’ సల్లల్లాహు అలైహి వసల్లంని అంతిమ ప్రవక్తగా పంపాడు. ఆయనతో అంతిమ సందేశాన్ని పంపాడు.
మక్కా నగరములో, నలబై సంవత్సరాల వయస్సులో ఉండగా ‘ముహమ్మద్’ సల్లల్లాహు అలైహి వసల్లంకు ప్రవక్త పదవి లభించినది. ప్రవక్త పదవికి ముందు నుంచే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తమ జాతివారిలోనే కాదు, సర్వ మానవుల్లోకెల్లా ఉత్తమ నడవడిక, సద్వర్తన కలిగి యున్నారు. సత్యాన్ని పాటించడం, అమానతులను కాపాడటంలో ఆయనకు ఆయనే సాటి. సభ్యతా, సంస్కారంలో కూడా ఉన్నత శిఖరాన్ని అందుకున్నవారు ఆయనే. అందుకే తమ జాతివారే ఆయనకు “అమీన్” (విశ్వసనీయుడు) అన్న బిరుదునిచ్చారు. ఆయన “ఉమ్మీ”. అంటే చదవడం, వ్రాయడం రానివారు. అటువంటి వారిపై అల్లాహ్ దివ్య ఖుర్ఆన్ అవతరింపజేసి, సర్వ మానవులు ఏకమై కూడా దీని వంటిది తీసుకురాలేరని ఛాలెంజ్ చేశాడు.
ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిం. ‘ఇస్మాఈల్’ బిన్ ‘ఇబ్రాహీం’ సంతతి. ప్రవక్త ﷺ తల్లి పరంపర ఇదిః ఆమిన బిన్తె వహబ్ బిన్ అబ్ది మునాఫ్ బిన్ జుహ్ రా. జుహ్ రా ప్రవక్త గారి తాత యొక్క సోదరుడు.
అబ్దుల్లాహ్ వివాహం ఆమినతో జరిగింది. మూడు మాసాలు దాంపత్య జీవితం గడిపారు. కొద్ది రోజులకే ఆమె గర్భం దాల్చింది. (తొమ్మిది మాసాలు ప్రవక్తను మోసింది, కాని) ఏ మాత్రం కష్టంగా భావించలేదు. చివరికి క్రీ.శ. 571 సంవత్సరం సొమవారం రోజున ఆమె సంపూర్ణ శరీరాకారముగల, అందమైన బాలుణ్ణి (ప్రవక్తను) జన్మనిచ్చింది. ఆయన ﷺ తమ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన తండ్రి పరమపదించారు. అందుకు ఆయన తాతగారు ఆయన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారు. ఆయన తల్లి మూడు రోజులు ఆయనకు పాలు త్రాగించింది. తరువాత పాలు త్రాగించడానికి ఒక గ్రామీణురాలైన హలీమ సఅదియకు ఆయన్ని అప్పగించడం జరిగింది. ఆ కాలంలో తమ చంటి పాపలను గ్రామాల్లో ఉంచి పాలు త్రాగించడం అరబ్బుల ఆనవాయితిగా ఉండేది. ఎందుకనగా అచ్చట శరీర ఆరోగ్యానికి మరియు పెరుగుదలకు తగినన్ని వసతులు లభించేవి గనక. హలీమ సఅదియ ఆ శిశువులో ఎన్నో వింత విషయాలు చూసింది. అందులో కొన్ని: హలీమ తన భర్తతో ఒక బక్కచిక్కిన, వేగం లేని గాడిదపై వచ్చింది. కాని మక్కా నుండి తిరిగిపోయే సందర్భంలో ప్రవక్త ఆమె ఒడిలో పాలు త్రాగుతున్నారు, అదే గాడిద వేగాన్నందుకొని ఇతర స్వారీలను వెనక వదలి ముందుకు సాగిపోయింది. దానికి హలీమ యొక్క తోటి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు.
స్వయంగా హలీమ కథనం ప్రకారం ఆమె రొమ్ముల్లో పాలు అతి తక్కువగా ఉండేవి, అవి ఆమె వద్ద ముందు నుండే ఉన్న ఓ పాలు త్రాగే శిశువుకు సరిపోక, అతడు ఆకలితో ఏడుస్తూ ఉండేవాడు. అవే రొమ్ములు ప్రవక్త తన నోట్లోకి తీసుకున్నాక పాలతో ఉట్టిపడ్డాయి. ఇద్దరు శిశువులూ కడుపు నిండా త్రాగేవారు.
బనూ సఅద్ ప్రాంత భూములు అనావృష్టి కారణంగా ఎండిపోయేవి. ఈ అదృష్టవంతుణ్ణి (ప్రవక్తను) పొందే భాగ్యం కలిగిన తరువాత అక్కడి భూములు పండుట మరియు పశు సంపదలో పెరుగుదల మొదలైంది. దౌర్భాగ్యం, పేదరికం అనేవి దూరమై సిరి సంపదలు, భోగభాగ్యాలు ఆవరించాయి.
రెండు సంవత్సరాల తరువాత హలీమ ప్రవక్తను ఆయన తల్లి, తాతల వద్ద మక్కాకు తీసుకు వచ్చింది. అయితే ఈ రెండు సంవత్సరాల్లో కలిగిన శుభాలను చూసి మరోసారి ప్రవక్తను తీసుకు పోవుటకు పట్టుదలతో ప్రాధేయపడింది. అందుకు ఆమిన ఒప్పుకుంది. అప్పుడు హృదయ- పూర్వకంగా సంతోషంతో అదృష్టవంతుడైన అబ్బాయిని తిరిగి తెచ్చుకుంది. ఆ రెండు సంవత్సరాలు కూడా గడిసాక హలీమ ప్రవక్తను ఆయన తల్లికి అప్పగించింది. అప్పుడు ప్రవక్త వయస్సు నాలుగు సంవత్సరాలు. ఇక తల్లి తను చనిపోయే వరకు పోషించింది. తల్లి చనిపోయేటప్పుడు ఆయన వయస్సు ఆరు సంవత్సరాలు. ఇక తాత తన వద్ద ఉంచుకొని రెండు సంవత్సరాల తరువాత ఈ లోకం వీడారు. అప్పుడు పినతండ్రి అబూ తాలిబ్ తన రక్షణలో తీసుకొని తన సంతానం కంటే ఎక్కువ ప్రేమ చూపారు. అతడు సిరిమంతుడు కాదు గనక ప్రవక్త ﷺ ఐహిక భోగభాగ్యాలను, సుఖాలను అనుభవించలేదు. ఆయన ﷺ బనూ సఅద్ గ్రామంలో ఉన్నప్పుడు తన పాల సంబంధ సోదరులతో మేకలు మేపిన అనుభవం పోందారు, కనుక ఇక్కడ మక్కావాసుల మేకలు మేపసాగారు. దాని నుండి పొందే వేతనం తన పినతండ్రి అబూ తాలిబ్ కు ఇస్తూ ఉండేవారు. పన్నెండు సంవత్సరాల వయస్సులో వ్యాపారనిమిత్తం అబూతాలిబ్ తో సీరియా దేశానికి వెళ్ళారు. మరొక సందర్భంలో ఖదీజ బిన్తె ఖువైలిద్ (ఆమె మక్కాలో పేరుగాంచిన ధనవంతురాలు) యొక్క సామాగ్రి వ్యాపారం కొరకు సీరియా తీసుకెళ్ళారు. అధిక రెట్ల లాభం (ఏలాంటి మోసం లేకుండా) ఆర్జించుకొని వచ్చారు. అందుకు ఆమె ఆయన ﷺకు ఇతరులకంటే ఎక్కువ వాటా ఇచ్చింది. ఈ సీరియా ప్రయాణంలో ఆమె యొక్క బానిస మైసర ఆయన ﷺతో ఉండి చూసిన ఆయన యొక్క ఉన్నత ప్రవర్తన, ఉత్తమ నడవడికను ఖదీజ విన్నాక ఆయన ﷺ ను తన సహవాసిగా చేసుకోవాలన్న కాంక్ష ఆమెకు మరింత అధికమైంది. -ఇంతకు ముందు ఆమె భర్త చనిపోయాడు-. పిదప పెద్దల సమక్షంలో శుభసంతోషాలతో ధర్మంగా వారి పెళ్ళి జరిగి- పోయింది. అప్పుడు ఆయన ﷺవయస్సు 25, ఖదీజ వయస్సు 40 సం.
ఎప్పుడైతే ప్రవక్త ﷺ తన జీవితపు నాలుగో దశాబ్దానికి చేరువయ్యారో ఏకాంతంలో ఉండడానికి ఇష్టపడేవారు. మక్కాకు బయట కొంత దూరంలో ఉన్న ‘హిరా’ గుహలో రోజుల తరబడి ఒంటరిగా ఉండి అల్లాహ్ ను ఆరాధిస్తూ ఉండేవారు. అన్నపానీయాలు ముగిసినప్పుడు అవి తీసుకొనుటకే ఇంటికి వెళ్ళేవారు. ఒక రాత్రి అదే గుహలో జిబ్రీల్ దూత ఆకాశం నుండి వచ్చి ((చదువు)) అన్నాడు. “నేను చదువరుణ్ణి కాను” అని సమాధానం పలికారు. అతడు మళ్ళీ ((చదువు)) అన్నాడు. “నేను చదువరుణ్ణి కాను” అని ప్రవక్త చెప్పారు. మళ్ళీ అతడు ((చదువు)) అని చెప్పాడు. “నేను చదువరుణ్ణి కాను” అని ప్రవక్త జవాబిచ్చారు. ప్రవక్త యొక్క ప్రతి జవాబు తరువాత జిబ్రీల్ ఆయన ﷺ ని తన ఛాతితో అదిమి వదిలేశేవాడు. అప్పుడు ప్రవక్తకు శ్వాస ఆగిపోయెంత బాధ అయ్యేది. మూడోసారి అదిమి విడిచాక మొదటిసారిగా దివ్యఖుర్ఆన్ యొక్క ఈ ఐదు (5) ఆయతులు అవతరించాయి. ((ఇఖ్ రఅ బిస్మి రబ్బికల్లజీ ఖలఖ్. ఖలఖల్ ఇన్ సాన మిన్ అలఖ్. ఇఖ్ రఅ వరబ్బుకల్ అక్ రమ్. అల్లజీ అల్లమ బిల్ ఖలమ్. అల్లమల్ ఇన్ సాన మాలమ్ యఅలమ్)). చదువు సర్వ సృష్టికర్త అయిన నీ ప్రభువు పేరుతో. ఆయన మానవుణ్ణి నెత్తుటి ముద్దతో సృష్టించాడు. చదువు నీ ప్రభువు ఎంతో అనుగ్రహశాలి. ఆయన కలం ద్వారా జ్ఞానం నేర్పాడు. మనిషి ఎరుగని జ్ఞానాన్ని అతనికి నేర్పాడు. (ఇవి సూర అలఖ్ (96)లోని మొదటి ఐదు ఆయతులు).
విద్యాజ్ఞానాల గురించి ఆదేశిస్తూ, మానవ పుట్టుక ఆరంభాన్ని తెలియజేస్తూ అవతరించిన గొప్ప ఆయతులు ఇవి. ఈ ఆయతుల ద్వారానే ప్రవక్తపై అల్లాహ్ యొక్క వహీ (దివ్యజ్ఞాన) అవతరణ ఆరంభమయ్యింది. ప్రవక్త భయకంపితులై ఖదీజ వద్దకు వచ్చారు. వచ్చీరాగానే (పడక మీద పడి) “దుప్పటి కప్పండి దుప్పటి కప్పండి” అన్నారు. ఇల్లాలు దుప్పటి తెచ్చి కప్పింది. కొంత సేపటికి భయం తొలిగిపోయాక, జరిగినదంతా తన ఇల్లాలి ఖదీజకు వర్ణిస్తూ, ‘తన ప్రాణానికేదో ముప్పు వాటిల్లనున్నట్లు అనిపిస్తుందని’ అన్నారు. అప్పుడు ఖదీజ ఓదార్చుతూ, “అల్లాహ్ సాక్షిగా! అలా జరగదు. అల్లాహ్ మిమ్మల్ని ఎన్నటికీ అవమానపరచడు. ఎందుకనగా మీరు బంధువుల్ని ఆదరిస్తారు. ఇతరుల బరువు బాధ్యతల్ని మోస్తారు. సంపాదించలేనివారికి సంపాదించి పెడ్తారు. అతిథుల్ని సత్కరిస్తారు. సత్యమార్గంలో ఎదురయ్యే కష్టనష్టాలలో సహకరిస్తారు” అని చెప్పింది.
మరో సారి జిబ్రీల్ ప్రవక్త ﷺ వద్దకు వచ్చిన విషయం గురించి స్వయంగా ప్రవక్త ﷺ ఇలా తెలిపారు: నేను నడుస్తూ ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం విన్నాను. కన్నెత్తి చూసే సరికి హిరా గుహలో వచ్చిన దూతయే అక్కడ ఉన్నాడు. ప్రవక్త ﷺ భయపడ్డారు. కాని మొదటి సారి భయం కన్నా తక్కువ. ఇంటికి చేరుకొని దుప్పటి కప్పండి, దుప్పటి కప్పండి అని చెప్పారు. ఆ తరువాత ఈ ఆయతులు అవతరించాయిః ((యా అయ్యుహల్ ముద్దస్సిర్. ఖుమ్ ఫ అన్ జిర్. వ రబ్బక ఫ కబ్బిర్. వ సియాబక ఫ తహ్హిర్. వర్రుజ్ జ ఫహ్ జుర్)). అనగా: వస్త్రం కప్పుకొని పడుకున్న మనిషీ లేచి నిలబడు. ఖుర్ఆన్ ద్వారా ప్రజల్ని హెచ్చరించు. అల్లాహ్ సందేశం వారికి అందజేయి. నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో. విగ్రహాలకు దూరంగా ఉండు. (ఇవి సూర ముద్దస్సిర్ (74)లోని మొదటి ఆయతులు). ఆ తరువాత ఎడతెగ కుండా వహీ రావడం మొదలైనది. అల్లాహ్ ముహమ్మద్ ﷺ కు ఆదేశించాడు: నీవు ప్రజల్ని అల్లాహ్ అద్వితీయుని ఆరాధన వైపునకు మరియు అల్లాహ్ ప్రజల కొరకు ఇష్టపడిన ఇస్లాం ధర్మం వైపునకు పిలువమని. ఈ ఆదేశానుసారం ప్రవక్త ﷺ వివేకం మరియు చక్కని హితబోధతో ప్రచార కార్యక్రమంలో నిమగ్నులయ్యారు.
మొట్టమొదటిసారిగా ఆయన ﷺ సందేశాన్ని అంగీకరించిన స్త్రీలలో ఆయన ﷺ పవిత్ర సతీమణి ఖదీజ రజియల్లాహు అన్హా, పురుషుల్లో ఆయన ﷺ ప్రాణమిత్రుడు అబూ బక్ర్ సిద్దీఖ్(రదియల్లాహు అన్హు), యువకుల్లో ఆయన ﷺ పినతండ్రి కుమారుడు అలీ బిన్ అబీ తాలిబ్(రదియల్లాహు అన్హు). తర్వాత ప్రజలు ఒకరి వెనుక మరొకరు ‘ఇస్లాం’ ధర్మాన్ని స్వీకరించగలిగారు. ఇస్లాం స్వీవకరించినవారు బహుదైవారాధకుల, అవిశ్వాసుల తరఫున కఠిన యాతనలకు గురయ్యారు. (అయినా ఇస్లాంను వీడలేదు). ఆ కష్టాలను సహిస్తూ ప్రవక్త ﷺ పదమూడు సంవత్సరాలు మక్కాలో ఇస్లాం ప్రచారం చేస్తూ పోయారు. దినదినానికి అవిశ్వాసుల హింసాదౌర్జన్యాలు స్వయం ప్రవక్త ﷺ మరియు ఆయన సహచరుల (ఇస్లాం స్వీకరించినవారి) పట్ల అధికమయ్యాయి. అప్పుడు ఆయన ﷺ మరియు ఆయన సహచరులు ‘మదీన’కు వలసపోయారు. అక్కడ సయితం ప్రచారంలోనే అహర్నిశలు శ్రమించారు. కొద్ది సంవత్సరాల్లో మక్కాలో విజయ పతాకం ఎగరవేస్తూ ప్రవేశించారు. అప్పుడు అక్కడి ప్రజలందరూ ఇస్లాంలో ప్రవేశించారు.
ఆయన ﷺ ప్రవక్త పదవికి ముందు నలబై, ఆ తరువాత ఇరవై మూడు ఇలా మొత్తం అరవై మూడు సంవత్సరాలు జీవించారు. తరువాత ఈ లోకాన్ని వీడి శాశ్వతమైన పరలోకానికి వెళ్ళారు.
ముహమ్మద్ ﷺ కు ఇచ్చిన సందేశాలతోటే ఆకాశ సందేశాల రాకను సమాప్తి చేశాడు అల్లాహ్. ఆయన ﷺ విధేయత సర్వమానవాళిపై విధిగా చేశాడు. ఆయన ﷺ విధేయత పాటించినవారు ఇహములో అదృష్టవంతులై పరలోకంలో స్వర్గంలో ప్రవేశిస్తారు. ఆయన ﷺ కు అవిధేయత చూపినవారు ఇహములో దురదృష్టవంతులై పరలోకంలో నరకంలో ప్రవేశిస్తారు.
ఆయన ﷺ మరణించాక ఆయన సహచరులు ఆయన అడుగుజాడలో నడచి, ఆయన సందేశాన్ని ఇతరులకు అందజేశారు. ఇస్లాంను నలుమూలలో వ్యాపింప జేశారు.
సర్వ మానవాళిలో అత్యుత్తమ నడవడిక గలవారు ప్రవక్త ముహమ్మద్ ﷺ. ఇది వారిలో ప్రవక్త పదవి లభించక ముందు నుంచే ఉండినది. అది లభించాక మరింత అధికమయింది. స్వయంగా అల్లాహ్ ఇలా తెలిపాడుః నీవు నిస్సందేహంగా మహోన్నతమైన శీలం కలవాడవు. (68: ఖలం: 4). ఆయన ﷺ ఇస్లాం ప్రచారం చేస్తూనే ఉత్తమ శీలం, మంచి నడవడికను గురించి బోధించి, ప్రోత్సహించేవారు. మరియు స్వయంగా తమ సహచరులకు బోధించే ప్రవర్తనకు గొప్ప నిదర్శనగా ఉండేవారు. సద్వర్తనను తమ సహచరుల మదిలో ఉపదేశాలతో నాటే ముందు తమ నడవడిక, ఆచరణలతో ఉన్నతమైన సద్ర్పవర్తన అంటేమిటో వారి మదిలో నాటేవారు. అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: నేను పది సంవత్సరాలు ప్రవక్త ﷺ సేవలో ఉన్నాను. అల్లాహ్ సాక్షి! ఒక్కసారి కూడా నన్ను హూఁ అని అన లేదు. ఇలా ఎందుకు చేశావు? అలా ఎందుకు చేయలేదు? అని ఏనాడూ నిలదీయలేదు. (ముస్లిం).
అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన ప్రకారం: నేనొక రోజు దైవప్రవక్త ﷺతో కలసి నడుస్తున్నాను. ఆ సమయంలో ఆయన నజ్రాన్ కండువ కప్పుకొని ఉన్నారు. దాని అంచులు లావుగా ఉండేవి. దారిలో ఓ పల్లెవాసి కలసి ప్రవక్త (కండువ)ను పట్టి గట్టిగా లాగాడు. అలా గట్టిగా లాగడం వల్ల ప్రవక్త ﷺ భుజం మీద కండువా అంచులు గీరుకుపోయి ఆ ప్రదేశం కందిపోయింది. (పల్లెవాసి అంతటితో ఊరుకోక కటువుగా మాట్లాడుతూ) ‘మీకు అల్లాహ్ ఇచ్చిన సొమ్ములో నుంచి నాకు కొంచెం ఇప్పించండి’ అని అన్నాడు. దైవప్రవక్త ﷺ అతని వైపు తిరిగి చూసి చిరునవ్వు నవ్వుతూ అతనికి కొంత ధనం ఇవ్వమని (సహచరుల్ని) ఆజ్ఞాపించారు. (బుఖారి 3149, ముస్లిం 1057).
ప్రవక్త ﷺ తమ ఇంట్లో ఉన్నప్పుడు ఏమి చేసేవారని ఆయన పవిత్ర భార్య ఆయిషా రజియల్లాహు అన్హాని ప్రశ్నించినప్పుడు ‘ఆయన తమ ఇల్లాలికి సహకరిస్తూ ఉండేవారు. నమాజు సమయమయిన వెంటనే వుజూ చేసుకొని నమాజు కొరకు బయలుదేరేవారు’ అని సమాధానమిచ్చారు. (బుఖారి 676).
ప్రవక్త ﷺ కంటే ఎక్కువ చిరునవ్వు నవ్వేవారిని నేను చూడలేదని అబ్దుల్లాహ్ బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు) తెలియజేస్తున్నారు. అందరికీ తెలిసిన ఆయన ఉత్తమ గుణాల్లో కొన్ని ఇవి: ఆయన దాత, ఎన్నడూ ఏ కొంచమైనా పిసినారితనం చూపలేదు. శూరుడు, సత్యం, ధర్మం నుండి ఎన్నడూ వెనక్కి తిరగలేదు. న్యాయశీలి, ఎన్నడూ తీర్పు చేయడంలో అన్యాయం చేయలేదు. పూర్తి జీవతంలో సంత్యవంతుడు, విశ్వసనీయుడు అనే ప్రఖ్యాతి చెందారు. (తిర్మిజి 3641).
జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం: ఎవరైనా, ఏదైనా అడిగితే ‘లేదు’ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నడూ అనలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరులతో పరిహాసములాడేవారు. (ధనిక, పేద బేధ లేకుండా) అందరితో కలసి ఉండేవారు. పిలవాళ్ళను తమ వడిలో కూర్చోబెట్టుకొని ఆడించేవారు. ఆహ్వానాన్ని అంగీకరించేవారు. వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించేవారు. (అపరాధుల సాకును) ఒప్పుకునేవారు. తమ సహచరులను వారికి నచ్చిన మంచి పేర్లతో సంబోధించేవారు. మాట్లాడుతున్నవారి మధ్య ఆటంకం కలిగించేవారుకారు. అబూ ఖతాద (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన ప్రకారం: ఒకసారి నజ్జాషి రాయబార బృందం ఒకటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినప్పుడు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సేవ చేయుటకు సిద్ధమయ్యారు. అప్పుడు సహచరులిలా అన్నారుః ప్రవక్తా! మేము ఉన్నాము కదా చాలు. “వీరు మా సహచరులకు తగిన విధంగా ఆదరించారు. ప్రతీకగా నేను కూడా మంచి ఆతిథ్యం ఇవ్వదలుచుకున్నాను” అని ప్రవక్త బదులిచ్చారు.
మరో సందర్భంలో ఇలా సంబోధించారుః “నేనొక దాసుణ్ణి, దాసుడు తినే విధంగా నేనూ తింటాను. దాసుడు కూర్చునే విధంగా నేనూ కూర్చుంటాను”. ఆయన గాడిదపై స్వారీ చేసేవారు. నిరుపేద, బీదవాళ్ళతో సమానంగా కూర్చునేవారు.
స్కాట్డలాండ్ కు చెందిన థామస్ కార్లిల్ అనే తత్వవేత్త (Scottish philosopher, Thomas Carlyle) నోబెల్ ప్రైజ్ పొందిన తన రచన “On Heroes, Heroworship, and the Heroic in History”లో తన క్రైస్తవ జాతిని సంబోధించి ప్రవక్త ﷺ గురించి చాలా విషయాలు వ్రాశాడు, అందులోని ఒక విషయం ఇది: ‘ఇస్లాం ధర్మం అసత్యం, ముహమ్మద్ మోసగాడు, అసత్యవాది అని వినబడే మాటలను చెవి యొగ్గి వినుట అతినీచ కార్యం అని ఈ కాలంలో చాలా స్పష్టం అయింది’.
ప్రవక్తకు లభించిన మహత్యాల్లో అతి గొప్పది ఖుర్ఆన్. అది భాషాప్రవీణులను
లొంగదీసింది. అందరూ కలసి అందులో ఉన్నటువంటి ఒక్క సూరానైనా తేగలరా అని అల్లాహ్ సవాలు చేశాడు. ఈ శక్తి తమకు లేదని ఆవిశ్వాసులు ఒప్పుకున్నారు. ఈ సవాలు ఇప్పటికీ ఉంది.
చంద్రుణ్ణి రెండు ముక్కలు చేసి చూపించండని మక్కా అవిశ్వాసులు ప్రవక్తతో ఛాలెంజ్ చేసినప్పుడు ప్రవక్త ﷺ అల్లాహ్ తో ప్రార్థించారు. ఆ తర్వాత చంద్రుడు రెండు ముక్కలైనది స్పష్టంగా కనిపించింది.
ఎన్నో సార్లు వ్రేళ్ళ మధ్య నుండి నీళ్ళ ఊటలు ప్రవహించాయి. ఆయన చేతిలో కంకర రాళ్ళు తస్బీహ్ (అల్లాహ్ పవిత్రత) పఠించాయి.
ప్రవక్తను హతమార్చడానికి ఒక యూదురాలు విషం కలిపి బహుకరించిన మాంసపు ముక్క ఆయన ﷺ తో మాట్లాడింది.
ఒక పల్లెవాసి ఒక మహత్యం చూపమని కోరాడు. ఆయన ﷺ ఒక చెట్టును ఆదేశించగా అది ఆయన వద్దకు వచ్చింది. మరలా ఆదేశించగా అది దాని చోటుకి వెళ్ళి పోయింది.
పాలు లేని ఒక మేక పొదుగును తమ శుభహస్తాలతో ముట్టుకోగా అందులో పాలు సమకూరాయి, దాని పాలు పితికి స్వయంగా తాగారు. తమ మిత్రుడు అబూ బక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) కు కూడా త్రాగించారు.
అలీ బిన్ ఆబీతాలిబ్ (రదియల్లాహు అన్హు) కళ్ళల్లో అవస్త ఉండగా ఆయన ﷺ ఆ కళ్ళల్లో తమ ఉమ్మి వేశారు. అవి అప్పటికప్పుడే బాగుపడ్డాయి.
ఒక సహచరుని కాలుకు అవస్త ఉండగా తమ చేతితో తుడువగానే అక్కడికక్కడే నయం అయింది.
అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు)కు దీర్ఘ ఆయుష్షు, అనేక ధన, సంతానం కలుగజేయు అని అల్లాహ్ ను ప్రార్థిస్తే ఆయన 120 సంవత్సరాలు జీవించారు. ఆయనకు కలిగిన సంతానం 120 మంది. ఆయన ఖర్జూరపు తోట సంవత్సరంలో రెండు సార్లు ఫలించేది. అయితే అది సంవత్సరానికి ఒక సారి మాత్రమే ఫలిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే.
మస్జిద్ లో మెంబర్ పై నిలబడి ప్రసంగిస్తున్నప్పడు ‘అనావృష్టి సంభవించి చాలా నష్టం కలుగుతున్నది’ అని ఒక వ్యక్తి చెప్పగా ఆయన ﷺ అల్లాహ్ ను ప్రార్థించారు. ఆకాశంలో ఎక్కడా లేని మేఘాలు, కొద్ది క్షణాల్లో పర్వతాల మాదిరిగా గుమిగూడి వారం రోజులు ఎడతెగకుండా వర్షం కురిసింది. మరోసారి వర్షాలు చాలా ఎక్కువయ్యాయి అని చెప్పగా, వర్షాలు ఆగిపోవాలని దుఆ చేసారు అప్పటికప్పుడే వర్షం నిలిచింది. ప్రజలు ఎండలో నడిచి వెళ్ళారు.
ఒక యుద్ధం (జంగె ఖందఖ్)లో రెండున్నర కిలోల జొన్న పిండితో చేసిన రొట్టెలు మరియు ఒక మేక మాంసం వెయ్యి మంది సహచరులతో కలిసి ఆయన ﷺ భుజించారు. ఆ రొట్టెలు, వండిన కూర మొత్తం అలాగే మిగిలింది.
వంద మంది అవిశ్వాసులు ఆయన ﷺ ను హతమార్చడానికి ఆయన గృహాన్ని చుట్టుముట్టారు. ఆయన ﷺ వారి ముఖాలపై మట్టి విసిరి వెళ్ళిపోయారు. వారు చూడలేకపోయారు.
సురాఖ బిన్ మాలిక్ ఆయన ﷺ ను చంపడానికి వెంటపడి దగ్గరికి రాగానే, ఆయన ﷺఅతనిపై శపించారు. అతని గుఱ్ఱపు మొదటి రెండు కాళ్ళు మొకాళ్ళ వరకు భూమిలోకి దిగిపోయాయి.
ఇవేగాక ఇంకా అనేక మహత్యాలున్నాయి. అన్నియు అల్లాహ్ తరఫు నుండి లభించినవే. ఎందుకనగా ఆయన అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త అని రుజువు పరచడానికి.
1- అల్లాహ్ పై విశ్వాసం: ఇది ఇస్లాం ధర్మం యొక్క అసలైన పునాది. అల్లాహ్ పై విశ్వాసం అంటేః అల్లాహ్ ఉన్నాడని, అతడే ప్రతిదానికి పోషకుడు, అధికారి, ఏకైక సృష్టికర్త మరియు సర్వ జగత్తును నడిపేవాడని గాఢంగా విశ్వసించుట. ఇంకా అతడొక్కడే సర్వ ఆరాధనలకు అర్హుడు, అతనికెవ్వడూ భాగస్వామి లేడు. సర్వ ఉత్తమ గుణాలు గలవాడు. ప్రతి లోపాలకు, దోషాలకు అతీతుడు. తన సృష్టిలో దేనికీ పోలినవాడు కాడు అని దృఢంగా విశ్వసించాలి.
ఈ లోకాన్ని, ఇందులో ఉన్న సృష్టిని గమనించేవాడు ఇవి తమంతట తామే ఉనికిలోకి రావడం అసాధ్యం అని నమ్ముతాడు. వీటన్నిటికి ఒక సృష్టకర్త లేనిదే ఉనికిలోకి రావడం కూడా అసాధ్యం అని నమ్ముతాడు. అయితే ఆ సృష్టికర్త ఎవరు?. అతడే అల్లాహ్.
2- దైవదూతలపై విశ్వాసం: వారు మన కళ్ళకు కనబడని ఒక సృష్టి. అల్లాహ్ యే వారిని పుట్టించాడు. వారికి పోషణ, అధికారం, లోక నిర్వహణ లాంటి ఏ ప్రత్యేకతలు లేవు. లేక వారు ఆరాధనలకు ఏ మాత్రం అర్హులు కారు. (ఇవి అల్లాహ్ ప్రత్యేకతలు మాత్రమే). అల్లాహ్ ఆదేశాల సంపుర్ణ పాలన గుణం మరియు బాధ్యతలను పూర్తిగా నెరవేర్చే గుణం అల్లాహ్ వారికి ప్రసాదించాడు.
ఒక ముస్లిం వారి ఉనికినీ మరియు వారి సరియైన సంఖ్య అల్లాహ్ కు తప్ప ఎవరికీ తెలియదని విశ్వసించాలి.
ఎవరి పేర్లు మనకు తెలియునో వారిని వారి పేర్లతోనే విశ్వసించాలి. ఉదా: జిబ్రీల్, మీకాఈల్ మరియు మాలిక్ తదితరులు.
ఎవరిది ఏ గుణం, ఏ పని ఉందో వారిని అలాగే విశ్వసించాలి.
3- గ్రంధాలపై విశ్వాసం: సత్యాన్ని స్పష్ట పరచుటకు మరియు ప్రజల్ని అల్లాహ్ వైపునకు పిలుచుటకు పూర్వ ప్రవక్తల్లో కొందరిపై అల్లాహ్ గ్రంథాలను అవతరింపజేశాడని ముస్లిం విశ్వసించాలి. ఉదాః తౌరాత్, ఇంజీల్, జబూర్. చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ ﷺ పై అల్లాహ్ ఖుర్ఆన్ అవతరింపజేశాడని విశ్వసించాలి.
ఖుర్ఆన్: సర్వమానవాళికి ఇది అల్లాహ్ యొక్క అంతిమ సందేశం.
ఖుర్ఆను తెచ్చిన దాని ప్రకారంగా ఉన్న ఆచరణలనే అల్లాహ్ అంగీకరిస్తాడు. ఇది పూర్వ గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ధ్రువీకరిస్తుంది మరియు పరిరక్షిస్తుంది. దీని ప్రత్యేకమైన ఒక విషయం: ‘దీనిని కాపాడే బాధ్యత స్వయంగా అల్లాహ్ తీసుకున్నాడు’; అందుకే ఇందులో మార్పులు చేర్పులు జరగలేవు. పూర్వ గ్రంథాలు మార్పు చేర్పులకు గురి అయ్యాయి; ఎందుకనగా అల్లాహ్ వాటి రక్షణా బాధ్యత తీసుకోలేదు.
ఖుర్ఆన్ అతి ఉత్తమ సాహిత్య శైలికి దర్పణం లాంటిది. దీనిలోని ధార్మిక శాసనాలు అతి ఉన్నతమైనవి. ఇందులో ఏ మానవునికీ తెలియని అల్లాహ్ కు సంబంధించిన విషయాలు, అగోచర విషయాలు తెలుపబడినవి. ఏ మనిషీ తన మేధను ఉపయోగించి కూడా వాటిని తెలుసుకోలేడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో, ఆ తరువాత కాలములో లేక ఆ తరువాత కాలాల్లో ఎవరికీ తెలియని నెచురల్ సైన్స్ (Natural scince)కు సంబంధించిన నియమాలను మరియు దృగ్గోచర విషయాలను (Phenomenon) సూచించింది. ఇంకా అందులో సూచించబడిన ఎన్నో విషయాలు ప్రవక్త ముహమ్మద్ ﷺ తరువాత పదమూడు వందల సంవత్సరాలకు కనిపెట్టబడినవి, స్పష్టమయినవి. ఇంకెన్నో ఇప్పటికీ స్పష్టం కాలేదు.
సర్వ మానవులు ఈ ఖుర్ఆన్ వంటిది, లేదా కనీసం దీనిలోని ఒక్క సూరా వంటిది తీసుకురాగలలేరని అల్లాహ్ సవాల్ చేశాడు. వారు లొంగిపోయారు. ఆ సవాల్ ఇప్పటికీ ఉంది. ప్రజల్లో బలహీనత కూడా ఉంది అంటే వారు ఇప్పడు కూడా దానిలాంటిది తేలేరు.
భాషాప్రవీణులను లొంగదీసే తత్వం కేవలం దాని పదాల్లోనే కాదు, లేక కేవలం అగోచర విషయాల గురించి చెప్పడంలోనే కాదు, లేక ధార్మిక శాసనాల్లోనే కాదు, అన్నింటిలోనూ కలిసి ఉంది.
4- ప్రవక్తలపై విశ్వాసం: ప్రజల్ని అల్లాహ్ వైపు ఆహ్వానించడానికి దానికి వ్యెతిరేకంగా ఉన్న దానిని ఖండించడానికి అల్లాహ్ ప్రవక్తలను పంపాడని ముస్లిం విశ్వసించాలి. వారు మానవులు. అల్లాహ్ వారిని సృష్టించాడు. వారికి పోషణ, అధికారం, లోక నిర్వహణ లాంటి ఏ ప్రత్యేకతలు లేవు. వారు ఆరాధనలకు ఏ మాత్రం అర్హులు కారు. (ఇవి అల్లాహ్ ప్రత్యేకతలు మాత్రమే). అన్నపానీయాలు, చావు బ్రతుకుల్లాంటి మానవ ఆవసరాలే వారికీ ఉన్నాయి. ప్రవక్తలు సర్వమానవుల్లో శ్రేష్ఠులు. అల్లాహ్ వారిని సందేశహరులుగా, ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. వారిని విశ్వసించుట అంటే వారికి ఇవ్వబడిన సందేశం సత్యం అని భావం. ఎవరి పేర్లు మనకు తెలియునో వారిని ఆ పేర్లతోనే విశ్వసించాలి. వారు ఇచ్చిన వార్తలను సత్యంగా నమ్మాలి. చివరి ప్రవక్త ముహమ్మద్ ﷺ తెచ్చిన ధర్మాన్ని ఆచరించాలి. ఆయన ﷺ తర్వాత ఇంకెవ్వరి ధర్మం కూడా చెల్లదు. అంగీకరించబడదు.
5-పరలోక విశ్వాసం: అది అంతిమదినం. ఆ రోజున పాపపుణ్యాల లెక్క తీసుకొని ప్రతి ఒక్కరికి తగిన ఫలితమిచ్చుటకు అల్లాహ్ అందరినీ సమాధుల నుండి లేపుతాడు. దానిని అంతిమ దినం అనడానికి హేతువు ఏమనగా ఆ తరువాత ఏ దినమూ ఉండదు. స్వర్గవాసులు తమ స్థానంలో మరియు నరకవాసులు తమ స్థానంలో ఉండిపోతారు.
పరలోక (అంతిమదిన) విశ్వాసం అంటే ఆ దినం ఖచ్చితంగా రానుందని దృఢంగా విశ్వసించాలి. దాని ప్రకారం ఆచరించాలి.
పరలోక విశ్వాసంలో మూడు విషయాలు వస్తాయిః
అ: మృతులను బ్రతికించడంపై విశ్వాసం. ఆ రోజు అల్లాహ్ చనిపోయినవారందరినీ సమాధుల నుండి నగ్న శరీరము, నగ్న పాదములతో మరియు శిశ్నాగ్రచర్మంతో (సున్నతీలేకుండా) నిలబెడతాడు.
ఆ: లెక్క, ప్రతిఫలం జరుగుననే విశ్వాసం. ఆ రోజు అల్లాహ్, ఇహలోకంలో ఏమి చేశావు అని ప్రతి మానవుడ్ని అడుగుతాడు. దాని ప్రకారం ఫలితమిస్తాడు. ఎవరైతే విశ్వసించి, విధేయత చూపి, సత్కార్యాలు చేయుదురో వారికి స్వర్గం లభించును. ఎవరైతే అవిశ్వాసానికి పాల్పడి అవిధేయతకు గురియగుదురో వారికి నరకం ప్రాప్తమగును. లెక్క, ప్రతిఫలం జరుగుట వివేకంతో కూడిన విషయం. ఎందుకనగా అల్లాహ్ గ్రంథాలను అవతరింపజేశాడు. ప్రవక్తల్ని పంపాడు. ప్రజలకు మంచి చెడులన్నియు స్పష్టపరచాడు. ఆ తరువాత ఆయన్ని ఆరాధించాలి, ఆయన ఆజ్ఞాపాలన చేయాలని ఆదేశించాడు. అయితే కొందరు విశ్వాసులయ్యారు మరికొందరు తిరస్కారులయ్యారు. ఇక వీరిద్దరినీ సమానంగా చూచుట అల్లాహ్ వివేకానికీ, న్యాయానికి తగినది కాదు. దివ్యగ్రంథంలో అల్లాహ్ ఇలా తెలిపాడు: ((మేము విధేయుల స్థితిని అపరాధుల స్థితి మాదిరిగా చేస్తామా? ఏమయింది మీకు, ఎలాంటి నిర్ణయాలు చేస్తున్నారు?)). (68:35,36).
ఇ: స్వర్గం, నరకం పట్ల విశ్వాసం. అది మానవుల శాశ్వత స్థానం. స్వర్గం భోగభాగ్యాలతో కూడుకున్న స్థానం. అది అల్లాహ్ విధించిన వాటిని విశ్వసించిన భక్తిపరులు, నిర్మలమైన భక్తితో అల్లాహ్ ఆయన ప్రవక్తకు విధేయులై, ప్రవక్త అడుగుజాడల్లో నడిచినవారి కొరకు సిధ్ధపరచబడింది. స్వర్గంలో చేరినవారు తమ సత్కర్మల ప్రకారం వివిధ అంతస్తుల్లో ఉంటారు.
నరకం శిక్షల స్థానం. అల్లాహ్ ను విశ్వసించని, ప్రవక్తకు విధేయత చూపని దుర్మార్గుల కొరకు సిద్ధపరచబడింది. నరకంలో వివిధ స్థానాలు, అంతస్తులున్నాయి. ఎవరి పాపాల తీరు వారు అందులో ఉంటారు.
6- విధివ్రాతపై విశ్వాసం: భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల జ్ఞానమంతయు అల్లాహ్ కు గలదు. అల్లాహ్ కోరినదే జరుగును, ఆయన కోరనిది జరగదు. ఏది సంభవించినా ఆయన జ్ఞానం, కోరిక లేనిదే సంభవించదు అని విశ్వసించుట.
ఇస్లాం ప్రకారం ‘ఆరాధన’ చిత్తశుద్ధితో అల్లాహ్ కు ప్రత్యేకించి చేస్తేనే తప్ప అంగీకరించబడదు. ప్రవక్త ﷺ పద్దతికి అనుగుణంగా ఉండడం కూడా తప్పనిసరి. ఉదాః నమాజ్ ఒక ఆరాధన. అది కేవలం అల్లాహ్ కొరకే చేయాలి. ప్రవక్త ﷺ చేసి చూపిన పద్దతిలోనే చేయాలి.
అది ఈ కారణంగాః
1- ఆరాధన చిత్తశుధ్ధితో ఏకైక అద్వీతీయుని కొరకే చేయాలని స్వయంగా అల్లాహ్ ఆదేశించాడు. ఆయనతో పాటు ఇతరుల ఆరాధన, ఆయనకు సాటి కల్పించినట్లగును. అల్లాహ్ ఆదేశం: ((అల్లాహ్ నే ఆరాధించండి. ఎవరినీ ఆయనకు భాగస్వాములుగా చేయకండి)). (4:36).
2- ధర్మం, షరియత్ కు సంబంధించిన ఆదేశాలిచ్చే హక్కు (Legislative power) కేవలం అల్లాహ్ కే ఉంది. ఇతరుల ఆరాధనను అల్లాహ్ ధర్మసమ్మతం చేయలేదు. అల్లాహ్ ధర్మ సమ్మతం చేయని ఆరాధన ఏ మనిషైతే చేస్తాడో అతడు Legislative power([2]) ను తన చేతిలోకి తీసుకున్నవాడవుతాడు.
3- మన కొరకు ధర్మాన్ని అల్లాహ్ సంపూర్ణం చేశాడు. అల్లాహ్ సంపూర్ణం చేసిన ధర్మంలో లేని ఆరాధన కనిపెట్టినవారు, ఆచరించినవారు సంపూర్ణ ధర్మంలో లోపం చూపినవారవుతారు.
4- మనిషి తనకు నచ్చిన ఆరాధన, తాను కోరిన విధంగా చేయుటయే సరిఅయినదై ఉంటే, విభిన్న అభిరుచుల కారణంగా ప్రతి మనిషికీ తనదైన ప్రత్యేక ఆరాధన ఉండేది.
1- (లాఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్రసూలుల్లాహ్) సాక్ష్యం యొక్క భావం ఏమనగా నోటితో పలికిన పదాలకు అనుగుణంగా ‘అల్లాహ్ యే సత్యమైన ఆరాధ్యుడు, అద్వితీయుడు, భాగస్వామి లేనివాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం , అల్లాహ్ యొక్క దాసుడు, ప్రవక్త, సందేశం అందజేయువారు అని దృఢంగా విశ్వసించాలి.
ఏ మనిషి అయినా, అతని ఇస్లాం మరియు కర్మల అంగీకారం అల్లాహ్ పట్ల ఉన్న అతని చిత్తశుద్ధి (ఇఖ్లాస్)పైనా మరియు ప్రవక్త ముహమ్మద్ ﷺ అనుసరణ, విధేయతపైనా ఆధారపడి ఉంది.
(లాఇలాహ ఇల్లల్లాహ్) యొక్క భావం: అల్లాహ్ యే సత్య ఆరాధ్య దైవం, ఆయన అద్వితీయుడు అన్న విశ్వాసంతో ఈ వచనం నోటితో పలకాలి. నోటితో పలకడం సరిపోదు, దాని ప్రకారం ఆచరించాలి. అల్లాహ్ ఆజ్ఞలకు సంపూర్ణ విధేయత చూపాలి. (ముహమ్మదుర్రసూలుల్లాహ్) యొక్క భావం: ప్రవక్త చెప్పిన మాటను సత్యపరచాలి. ఆయన ఆదేశాలను అనుసరించాలి. ఏ పనుల నుండి హెచ్చరించారో, నివారించారో వాటికి దూరంగా ఉండాలి. అల్లాహ్ యొక్క ఆరాధన ఆయన ﷺ చూపిన విధంగా చేయాలి.
3- జకాత్ చెల్లించుటః ధనంలోని ఒక నిర్ణీత ప్రమాణం అల్లాహ్ సూర తౌబా (9:60)లో తెలిపిన ప్రకారం పేదవారికి, అవసరార్థులకు, తదితరులకు ఇచ్చుట.
జకాత్ లాభాలుః ఆత్మశుద్ధి కలుగును. దురాశ మరియు పిసినారితనం దూరమగును. పేద ముస్లింల అవసరాలు తీరును. పేద, ధనవంతుని మధ్య ప్రేమ సంబంధాలు స్థిరపడును. స్వార్థం, ఈర్ష్య లాంటి దుర్గుణాలు దూరమగును. ఆప్యాయత, వినమ్రత మరియు ఇతరుల అవసరాల పట్ల అవగాహన కలుగును.
4- రమజాన్ ఉపవాసాలుః రమజాను మాసములో పగలంతా అల్లాహ్ యొక్క ఆరాధన ఉద్దేశంతో ఉపవాసం భంగము చేయు విషయాలకు దూరంగా ఉండుట. ప్రతి ముస్లిం రమజాను మాసమెల్ల ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు అల్లాహ్ యొక్క ఆరాధనోద్దేశంతో
అన్నపానీయాలు మరియు లైంగిక వాంఛలకు దూరంగా ఉండాలి.
ఉపవాసం యొక్క లాభాలుః ఆత్మశుద్ధి. అల్లాహ్ సంతృప్తి పొందే ఉద్దేశంతో ఇష్టమున్న వాటిని విడనాడే అలవాటు మనస్సుకు కల్గించుట. ఇంకా కష్టాలు భరించే, సహనం వహించే అలవాటు కల్గించుట. చేసే సత్కార్యాలు చిత్తశుద్ధితో అల్లాహ్ ప్రీతి కొరకే చేయుట. బాధ్యతలను నెరవేర్చుట. ఇతరుల ఆకలిదప్పులను గ్రహించుట. ఆరోగ్యవంతంగా ఉండుట మొదలగునవి.
5- హజ్: కాబా వరకు చేరుకునే శక్తిగలవారు జీవితంలో ఒక్కసారి అక్కడికి వెళ్ళి హజ్ కు సంబంధించిన కార్యాలు నెరవేర్చుట.
సర్వ మానవాళి కొరకు అల్లాహ్ ఇష్టపడిన ధర్మం ఇస్లాం. అది ప్రతి యుగానికి, ప్రతి సమాజానికి అనుకూలమైనది. ప్రతి మంచిని గురించి బోధించునది. ప్రతి చెడును గురించి నివారించునది. మానవులకు ఇహలోక సుఖం, పరలోక ముక్తి లభించాలంటే ఇస్లాం ధర్మాన్నే స్వీకరించాలి. దాన్ని మన జీవిత వివధ వ్యవహారాల్లో పాటించాలి. ఇస్లాం ధర్మం గొప్పతనాన్ని చాటి చెప్పుటకు ఇతర ధర్మాల్లో లేని, దాని ప్రత్యేకతలే సరిపోవును.
1- ఇది అల్లాహ్ తరఫున వచ్చిన ధర్మం. మానవుల అవసరాలను అల్లాహ్ యే బాగా ఎరుగును. అల్లాహ్ ఆదేశం: ((పుట్టించినవాడికే తెలియదా? వాస్తవానికి ఆయన సూక్ష్మగ్రాహి మరియు సమస్తమూ తెలిసినవాడు)). (67:14).
2- ఇది మానవ మొదటి స్థితిని, అంతిమ గతిని మరియు సృష్టి ఉద్దేశాన్ని స్పష్టంగా తెలుపుతుంది. ఇంకా మానవుడు ఇహలోకంలో విధిగా నడవవలసిన దారి ఏదో విశదపరుస్తుంది. విధిగా విడనాడవలసిన వాటిని సయితం వివరిస్తుంది. చదవండి ఈ క్రింది దివ్యగ్రంథ ఆయతులుః ((మానవులరా! మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. అదే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు. ఇంకా ఆ జంట ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను అవనిలో వ్యాపింపజేశాడు)). (4:1). ((ఈ నేల నుండే మేము మిమ్మల్ని సృష్టించాము. దానిలోనికే మేము మిమ్మల్ని తిరిగి తీసుకుపోతాము. దాని నుండే మిమ్మల్ని మళ్లీ వెలికి తీస్తాము)). (20:55). ((నేను జిన్నాతులనూ, మానవులనూ నా ఆరాధన కొరకు తప్ప మరిదేని కొరకూ సృష్టించలేదు)). (51:56). ((ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. మీ కొరకు ఇస్లాంను మీ ధర్మంగా అంగీకరించాను)). (5:3).
3- ఇది స్వభావిక ధర్మం. ప్రకృతి, స్వభావానికి విరుద్ధం కాదు. ((అల్లాహ్ మానవులను ఏ స్వభావం ఆధారంగా సృష్టించాడో దానిపై స్థిరంగా ఉండండి)). (30:30).
4- ఇది మేధ ప్రాముఖ్యతను కాదనదు. సవ్యమైన రీతిలో యోచించాలని ఆదేశిస్తుంది. మూర్ఖత్వం, అంధానుకరణకు అనుమతి ఇవ్వదు. అలాగే సవ్యమైన యోచన నుండి అశ్రద్ధను అసహ్యించుకుంటుంది. అల్లాహ్ ఆదేశం ఇలా వుందిః ((వీరిని అడగండి, తెలిసినవారూ, తెలియనివారూ ఇద్దరూ సమానులు కాగలరా? బుద్ధిమంతులు మాత్రమే హితబోధను స్వీకరిస్తారు)). (39:9). ((భూమి ఆకాశాల సృష్టిలో, రేయింబవళ్ళు ఒకదాని తరువాత ఒకటి రావడంలో, నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అన్ని వేళలా అల్లాహ్ ను స్మరించే, భూమి, ఆకాశాల నిర్మాణం గురించి చింతనచేసే వివేకవంతులకు ఎన్నో సూచనలున్నాయి. (వారు ఇలా అంటారుః) ప్రభూ! ఇదంతా నీవు వ్యర్థంగా, లక్ష్యరహితంగా సృష్టించలేదు. నీవు పరిశుద్ధుడవు కనుక ప్రభూ! మమ్మల్ని నరకబాధ నుండి కాపాడు)). (3:191,192).
5- ఇందులో విశ్వాసం మరియు ధర్మశాస్త్రం (జీవన విధానం) రెండూ సంపూర్ణంగా ఉన్నాయి. ఇది కేవలం ఊహగానాల వరకు పరిమితమైనది కాదు. నిజమైన విశ్వాసాలు, వివేకంతో కూడిన వ్యవహారాలు, సుందర ప్రవర్తన అన్నియూ ఇందులో ఉన్నాయి. ఇది వ్యక్తికీ మరియు సంఘానికీ, ఇహలోకానికీ మరియు పరలోకానికీ సంబంధించిన ధర్మం.
6- ఇది మనిషి భావాలకు (sentiments) ప్రాముఖ్యతనిస్తుంది. మంచికి, నిర్మాణ కార్యక్రమాలకు యంత్రంగా మలచుటకు ఇస్లాం మార్గదర్శకత్వం చేస్తుంది.
7- ఇది స్నేహితులు, శత్రువులు, తనవాళ్ళు, పరాయివాళ్ళు అందరితో న్యాయం చేయమని బోధిస్తుంది. అల్లాహ్ ఆదేశం: ((న్యాయం చేయండని అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు)). (16:90). ((పలికితే న్యాయమే పలకండి)). (6:152). ((ఏదైనా వర్గంతో ఉన్న వైరం కారణంగా మీరు ఆవేశానికి లోనయి న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చేయండి. ఇది దైవభక్తికి అత్యంత సమీపమైనది)). (5:8).
8- సత్యమైన సోదరభావంగల ధర్మం ఇస్లాం. ముస్లిములందరూ ధార్మిక సోదరులు. దేశాలు, జాతులు మరియు రంగులు వారిని విడదీయవు. ఇస్లాంలో కుల, వర్ణ ప్రాధాన్యతలు లేవు. ప్రాధాన్యతలకు గీటురాయి దైవభీతి. అల్లాహ్ ఆదేశం: ((వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవపాత్రుడు)). (49:13).
9- ఇది విద్య, విజ్ఞతలను పెంపొదిస్తుంది. ఇస్లాం తన అనుచరులను విద్యనభ్యసించాలని ఆదేశిస్తుంది. దానిపై గొప్ప ప్రతిఫల వాగ్దానం చేస్తుంది. చదవండి అల్లాహ్ ఆదేశం: ((మీలో విశ్వసించిన వారికి, జ్ఞానం ప్రసాదింపబడిన వారికి అల్లాహ్ ఉన్నత స్థానాలు ప్రసాదిస్తాడు)). (58:11). ((వీరిని అడగండి, తెలిసినవారూ, తెలియనివారూ ఇద్దరూ ఎప్పుడైనా సమానులు కాగలరా?)). (39:9). ప్రవక్త ముహమ్మద్ ﷺ ఇలా ప్రవచించారుః “విద్యనభ్యసించుట ప్రతి ముస్లింపై విధిగా ఉంది”.
10- ఎవరు ఇస్లాం స్వీకరించి, మంచిరీతిలో దాన్ని అనుసరించాడో -వ్యక్తి అయినా లేక సంఘం అయినా- అతనికి సౌభాగ్యం, గౌరవం ప్రసాదించే బాధ్యత అల్లాహ్ తీసుకున్నాడు. అల్లాహ్ ఆదేశం: ((మీలో విశ్వసించి మంచి పనులు చేసేవారికి అల్లాహ్ చేసిన వాగ్దానమేమిటంటే, ఆయన వారిని, వారికి పూర్వం గతించిన ప్రజలను చేసిన విధంగా, భూమిపై ఖలీఫాలు (ప్రతినిధులు)గా చేస్తాడు, అల్లాహ్ వారికై అంగీకరించిన వారి ధర్మాన్ని వారికొరకు పటిష్ఠమైన పునాదులపై స్థాపిస్తాడు. వారి యొక్క (ప్రస్తుత) భయస్థితిని శాంతిభద్రతలతో కూడిన స్థితిగా మారుస్తాడు. కనుక వారు నాకు దాస్యం చేయాలి, ఎవ్వరినీ నాకు భాగస్వాములుగా చేయకూడదు)). (24:55). ((పురుషుడైనా స్త్రీ అయినా సత్కర్మలు చేస్తే, విశ్వాసి అయిన పక్షంలో మేము అతనిని ప్రపంచంలో పరిశుద్ధ జీవితం గడిపేలా చేస్తాము. (పరలోకంలో) అటువంటి వారికి వారి ఉత్తమ కార్యాలకు అనుగుణంగా ప్రతిఫలాలను ప్రసాదిస్తాము)). (16:97).
11- ఇది పరస్పరం ప్రేమ, అప్యాయత, వాత్సల్యం మరియు దయ చూపవలసినదిగా బోధించే ధర్మం. మహానీయ ముహమ్మద్ ﷺ ఇలా ఉపదేశించారుః “ముస్లిముల ఉదాహరణ వారి పరస్పర దయాశీలత, ప్రేమ, మరియు అన్యోన్య అనురాగంలో ఒక దేహం లాంటిది. దేహంలో ఒక అవయవానికి ఏదయినా జబ్బు చేస్తే దేహంలోని ఇతర అవయవాలు కూడా విశ్రమాన్ని వదలి జ్వరంలో పాలు పంచుకుని దానికి తోడవుతాయి”. మరో సందర్భంలో ఇలా సెలవిచ్చారుః “కరుణించువారిపై కరుణామయుడైన అల్లాహ్ కరుణించును. అందుకు భువిలో ఉన్నవారిని మీరు కరుణించండి. దివిలో ఉన్నవాడు మిమ్మల్ని కరుణించును”. మరో సందర్భంలో ఇలా హెచ్చరించారుః “తన కొరకు ఇష్టపడిన దాన్ని తన సోదరుని కొరకు ఇష్టపడనంత వరకు మీలో ఏ వ్యక్తి కూడా నిజమయిన విశ్వాసి కాజాలడు”.
12- ఇస్లాం పని చేయాలని, కష్టపడాలని, ప్రోత్సహిస్తుంది. ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః “బలహీనుడయిన విశ్వాసికన్నా బలశాలి అయిన విశ్వాసి అల్లాహ్ దృష్టిలో ప్రియుడు, ఉత్తముడు. అయితే ప్రతి ఒక్కరిలోనూ ఏదో మంచి అన్నది ఉంటుంది. ఏ విషయమైతే నీకు లాభదాయకమైనదో దాని గురించి ఎక్కువ ఆశపడి (దాన్ని పొందే ప్రయత్నం చేయి). ధైర్యాన్ని కోల్పోకు. ఒకవేళ నీకు ఏదైనా నష్టం వాటిల్లితే, లేక కష్టం కలిగితే ‘నేను ఆ విధంగా చేసివుంటే మరో విధంగా జరిగి ఉండేది’ అని అనకుము. దానికి బదులుగా ‘అల్లాహ్ యే నిర్ణయం చేశాడు. తనకు కోరినట్లు జరిగింది’ అను”.
13- విరుద్ధ విషయాలు ఇందులో లేవు. అల్లాహ్ ఆదేశం: ((ఇది అల్లాహ్ తరఫునుండి కాక వేరొకరి తరఫునుండి వచ్చి ఉన్నట్లయితే ఇందులో ఎన్నో పరస్పర విరుద్ధమైన విషయాలు ఉండేవి)). (4:82).
14- ఇది స్పష్టంగా, సులభంగా ఉంది. ప్రతి ఒక్కరికీ తేలికగా అర్థమయ్యేటట్లు ఉన్నది. ((నిశ్చయంగా మేము ఖుర్ఆన్ ను అర్ధం చేసుకోవటానికి గాను సులభతరం చేశాము. మరి (దీనిద్వారా) హితబోధను గ్రహించేవాడెవడైనా ఉన్నాడా?)). (54:17).
15- దాని ద్వారాలు ప్రతి ఒక్కరి కొరకు తెరచి ఉన్నాయి. దాన్ని నేర్చుకోవాలన్న, దాన్ని స్వీకరించాలన్న వ్యక్తిని వద్దని వారించదు.
16- ఇది ఉత్తమ ప్రవర్తన, సత్కర్మల వైపునకు ఆహ్వానిస్తుంది. అల్లాహ్ ఆదేశం: ((మృదుత్వం, మన్నింపుల వైఖరిని అవలంభించు. మంచిని ప్రబోధించు. మూర్ఖులతో వాదానికి దిగకు)). (7:199). ((నీవు చెడును శ్రేష్ఠమైన మంచి ద్వారా తొలగించు. అప్పుడు నీ పట్ల శత్రుభావం కలవాడు నీకు ప్రాణస్నేహితుడై పోవటాన్ని నీవు గమనిస్తావు)). (41:34). ప్రవక్త ముహమ్మద్ ﷺ ఉపదేశించారుః “అనేక మందిని స్వర్గంలో ప్రవేశింపజేయునవిః అల్లాహ్ భయభీతి మరియు సద్వర్తన”. మరో సందర్భంలో ఇలా సెలవిచ్చారుః “ప్రజల్లో అల్లాహ్ కు అతిప్రియుడు వారికి లాభం చేకూర్చేవాడు. సత్కార్యాల్లో అల్లాహ్ కు చాలా ప్రియమైనవిః నీవు నీ తోటి ముస్లిములను సంతోషపరుచుట. లేక అతని ఒక ఆపదను దూరం చేయుట. లేక అతనిపై ఉన్న ఋణాన్ని తీర్చుట. లేక అతన్ని ఆకలి బాధ నుండి తప్పించుట. ఒక ముస్లిం వెంట ఉండి అతని అవసరాన్ని తీర్చడం, ఒక నెల మస్జిద్ లో ‘ఏతికాఫ్’ (ప్రార్థన చేస్తూ మస్జిద్ లో ఉండుట) కంటే నాకు ఎంతో ప్రియమైనది”.
17- ఇది బుద్ధీ జ్ఞానాలను కాపాడుతుంది. అందుకే మత్తుపదార్థాలను, డ్రగ్స్ మరియు బుద్ధిని చెడగొట్టే ప్రతిదానిని నిషేధించింది. అల్లాహ్ ఆదేశం ఇదిః ((మిమ్మల్ని మీరు చంపుకోకండి. అల్లాహ్ కు మీరంటే ఎంతో దయ అని నమ్మండి)). (4:29).
18- ఇస్లాం ధనసంపదలను రక్షిస్తుంది. అందుకే అమానతులను హక్కుదారులకు అప్పగించాలని ప్రోత్సహించింది. అలాంటి వారికి ఉత్తమ జీవనోపాధి మరియు స్వర్గ ప్రవేశం వాగ్దానాలు చేయబడ్డాయి. దొంగతనం నిషేధించబడింది. ప్రజల సొమ్ము దొంగలించే మరియు వారిని భయాంధోళనకు గురి చేసే ధైర్యం చేయకుండా ఉండుటకు, వారికి ఇహపరాల్లో శిక్ష గురించి హెచ్చరిక చేయబడింది.
19- ఇస్లాం ప్రాణాన్ని కూడా కాపాడుతుంది. అందుకే హత్యను నిషేధించింది. హంతకునికి ఇహంలో హతం మరియు పరంలో శాశ్వత నరకం శిక్ష తెలిపింది. ఏ ఇస్లామీయ దేశాల్లో ఈ చట్టం ఉందో అచ్చట హత్య సంఘటనలు కానరావడం చాలా అరుదు. ఒకర్ని హత్య చేస్తే తనూ చంపబడుతాడని తెలిసిన వ్యక్తి హత్యకు దూరంగానే ఉంటాడు. ఇలా నేరస్తుల నేరాల నుండి ప్రజలు నిర్భయంగా, శాంతిగా ఉంటారు.
20- ఇస్లాం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తుంది. అల్లాహ్ ఆదేశం: “తినండీ, త్రాగండీ, మితిమీరకండి”. (7:31). ఈ వాక్యంలో వైద్య శాస్త్ర మూలం తెలుపబడింది. అది ఎలా అనగా తినత్రాగడంలో మితిమీరకుండా జాగ్రత్తపడుటయే ఆరోగ్య రక్షణకు మూల కారణం. ఆరోగ్యాన్ని కాపాడుటకే మత్తు, డ్రగ్స్ లను ఇస్లాం నిషేధించింది. మరియు అవి ఆరోగ్యానికి ఎంత హానికరమైనవో తెలియనిది కాదు. అదేవిధంగా వ్యభిచారం, స్వలింగసంపర్కం (Sodomy)ను నిషేధించింది. వాటి వల్ల వ్యాపిస్తున్న సుఖవ్యాధులు, లైంగికవ్యాధులు (syphillis, gonorhoea) ఇప్పుడు గుప్తంగా ఏమాత్రం లేవు. ఉదాహరణకుః హెచ్.ఐ.వి./ఏయిడ్స్, herpes, venereal తదితర వ్యాధులు.
21- ఇస్లాం మనిషికి స్వాతంత్రం ప్రసాదిస్తుంది. కాని ఒక హద్దులో. మనిషి స్వేచ్ఛగా క్రయవిక్రయాలు, వ్యాపారము మరియు ప్రయాణాలు వగైరా చేయవచ్చు. కాని ఒకరికి మోసం, ద్రోహం, నష్టం చేయరాదు. అలాగే ఇస్లాంలో తినుట, త్రాగుట, ఆఘ్రాణించుట, పీల్చుట, ధరించుటలో పూర్తి స్వాతంత్రం ఉంది. అయితే స్వయంగా తనకు, లేదా ఇతరులకు నష్టం చేకూర్చే నిషిద్ధానికి పాల్పడకూడదు.
మనిషికి ఇహలోకములో అవసరమున్న మరియు ఇహపరాల సాఫల్యానికి తోడ్పడే ప్రతి ఒక్కటి నేర్పుటకు ఇస్లాం వచ్చింది. ఇస్లామీయ ఆదేశాలు మరియు నిషిద్ధతలపై దృష్టిసారిస్తే అందులోగల ఉత్తమ విషయాలు స్పష్టమవుతాయి.
1- మానవుడు పశువుల వలే కాకుండా, తన వాంఛలకు బానిస కాకుండా గౌరవస్థాయిలో ఉండుటకు, ఇంకా ఇతర సృష్టిరాసులను గొప్పగా భావించి, తన దైవాన్ని వదలి వారి ముందు నమ్రత చూపకుండా ఉచ్చస్థాయికి చేర్చునటువంటి ఆదేశాలిస్తుంది ఇస్లాం.
2- బుద్ధిజ్ఞానాలను, శరీర అవయవాలను, అవి ఇహపరాల ఏ సత్కార్యాలు చేయుటకు సృష్టించబడ్డాయో వాటినే చేయాలని ఇస్లాం ఆదేశిస్తుంది.
3- అద్వీతీయుడైన అల్లాహ్ యొక్క ఆరాధన చిత్తశుద్ధితో చేయాలని, అసత్య దైవాల ఆరాధన విడనాడాలని ఆదేశిస్తుంది.
4- ప్రజల అవసరాలు తీర్చాలని, వారికి సహాయసహకారాలు అందిస్తూ ఉండాలని ప్రోత్సహిస్తుంది.
5- రోగులను పరామర్శించాలని, శవాల వెంట శ్మశానం వరకు నడవాలని, (పరలోక జ్ఞప్తి కొరకు) శ్మశాన దర్శనకు వెళ్ళాలని మరియు వారి కొరకు దుఆ చేయాలని ఆదేశిస్తుంది.
6- ప్రజలకు న్యాయం చేయాలని, అన్యాయం చేయరాదని మరియు తనకు ఇష్టమైనదే, ఇతరులకై ఇష్టపడాలని ఆదేశిస్తుంది.
7- తన జీవనోపాధి సమకూర్చుటకు శ్రమించాలని, తన గౌరవాన్ని కాపాడుకుంటూ, యాచనకు, అగౌరవ చేష్టలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తుంది.
8- మానవుల పట్ల ప్రేమ, వాత్సల్యం చూపాలని, వారితో మంచి విధంగా వ్యవహరిస్తూ, వారి శ్రేయస్సుకు పాటుపడుతూ నష్టం కలిగించకుండా ఉండాలని ఆదేశిస్తుంది.
9- తల్లిదండ్రులకు విధేయులై, బంధుత్వం పెంచి, ఇరుగుపొరుగువారితో మంచిగా మెలగాలని మరియు పశువుల పట్ల సైతం మార్దవం / దయ చూపాలని ఆదేశిస్తుంది.
10- మిత్రుల పట్ల విశ్వాసం, నమ్మకం ఉంచాలి. భార్యాపిల్లలతో ప్రేమపూర్వకంగా ఉండాలని ఆదేశిస్తుంది.
11- అమానతులను అప్పగించాలని, వాగ్దానం పూర్తి చేయాలని, ఇతరుల గురించి మంచి అభిప్రాయం ఉంచాలని, సర్వ పనుల్లో మృదుత్వాన్ని పాటించాలని మరియు సత్కార్యాల్లో తొందరపడాలని ఆదేశిస్తుంది. ఇవే కాక ఇంకెన్నో ఉత్తమమైన ఆదేశాలిస్తుంది.
ఇస్లాం ధర్మంలోని ఉత్తమ విషయాల్లో మరీ గొప్పవి; నిషిద్ధతలు. అవి విశ్వాసిని చెడు కార్యాలకు పాల్పడకుండా నివారిస్తాయి, వాటి దుష్ఫలితాల నుండి కూడా హెచ్చరిస్తాయి, అందరూ సుఖంగా తమ జీవితం గడుపుకొనుటకు. దిగువ ఇవ్వబడిన ఇస్లాం నిషిద్ధపరిచిన విషయాలు చదవండి:
1- అవిశ్వాసానికి, సత్య తిరస్కారానికి పాల్పడుట మరియు అల్లాహ్ కు ఇతరుల్ని భాగస్వాములు చేయుట నిషిద్ధ పరుస్తుంది ఇస్లాం.
2- గర్వం, కపటం, ఆత్మ స్తుతి, ఈర్ష్య మరియు ఆపదలో ఉన్న వారిని చూసి నవ్వుట నివారిస్తుంది ఇస్లాం.
3- చెడు అభిప్రాయం, అపశకునం, నిరాశ నిస్పృహ, పిసినారితనం మరియు వృధా ఖర్చుల నుండి నివారిస్తుంది.
4- సోమరితనం, పిరికితనం, బలహీనత, మాంద్యం, తొందరపాటు, కఠినత్వం, నిర్లజ్జ, అసహనం, దౌర్బల్యం, కోపం, ఉద్రేకం మరియు పోగొట్టుకున్నదానిపై వ్యాకులతకు గురి కావడం నుండి నివారిస్తుంది.
5- బాధితుల, అగత్యపరుల సహాయానికి దూరముంచే రెండు దుర్గుణాల నుండి నివారిస్తుంది. (అ): పాశాన హృదయుడు కావడం. (ఆ): పెడసరితనం/ అహంకారం, అహంభావం.
6- పరోక్షంగా నిందించడం (అంటే ఒక వ్యక్తి ప్రస్తావన అతనికి నచ్చని విధంగా ఇతరుల ముందు చేయడం), చాడీలు చెప్పడం నుండి నివారిస్తుంది.
7- వృధాగా మాట్లాడ్డం, రహస్యాలను బహిరంగ చేయడం, ప్రజలతో హేళన, ఎగతాలి చేయుట నుండి నివారిస్తుంది.
8- దూషించడం, శపించడం, కించపరచడం మరియు చెడుబిరుదులతో పిలవడం నుండి నివారిస్తుంది ఇస్లాం.
9- గొడవ, వాదన, తగాదాలకు దిగుట, చెడు వైపునకు తీసుకెళ్లే హాస్యమాడుట (జోక్ చేయుట) నుండి నివారిస్తుంది.
10- అవసరమున్న చోట సాక్ష్యం ఇవ్వకపోవుట, అబద్ధపు సాక్ష్య-మిచ్చుట, అమాయక స్త్రీలపై అపనిందమోపుట, చనిపోయినవారిని దూషించుట, విద్యను బోధించకపోవుట నుండి నివారిస్తుంది ఇస్లాం.
11- అవివేకం, అశ్లీలం, ఉపకారం చేసి చెప్పుకోవడం, మేలు చేసినవారికి కనీసం ‘ధన్యవాదాలు’ తెలుపక పోవడం నుండి నివారిస్తుంది ఇస్లాం.
12- అపహరణం, మోసం, వాగ్దాన భంగాల నుండి నివారిస్తుంది.
13- తల్లిదండ్రుల అవిధేయత, బంధుత్వాన్ని త్రెంచుట మరియు సంతానానికి ఉత్తమ శిక్షణ ఇవ్వకపోవుట నుండి నివారిస్తుంది.
14- ఇతరుల రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం, లోపాలు వెతకడం నుండి నివారిస్తుంది.
15- పురుషులు స్త్రీల లాంటి, స్త్రీలు పురుషుల్లాంటి (వేషా, భాష, వస్త్రణ, ప్రవర్తన) అవలంభించుట నివారిస్తుంది.
17- అసత్య ప్రమాణాలతో సరుకు అమ్ముట, తూకము మరియు కొలతలలో తక్కువ చేసి ఇచ్చుట, నిషిద్ధ కార్యాల్లో ధనం వెచ్చించుట మరియు ఇరుగుపొరుగు వారిని బాధించుటను నివారిస్తుంది.
18- దొంగతనం, కోపం, భాగస్వామ్యంలో ఉన్న ఇద్దరిలో పరస్పరం మోసం, నష్టం చేయుట, పనివానికి/ సేవకునికి అతని మూల్యం ఇవ్వటంలో ఆలస్యం చేయుట లేక అతనితో పని చేయించుకొని బత్తెము ఇవ్వకపోవుట మొదలగున వాటిని నివారిస్తుంది.
19- ఆరోగ్యానికి హాని కలిగే విధంగా తినుటను నివారిస్తుంది.
20- పెడమొఖంగా ఉండుట, పరస్పరం ద్వేషాలు పెంచుకొనుట, పరస్పరం దూరమగుట నివారిస్తుంది. మూడు రోజుల కంటే ఎక్కువ పరస్పరం మాటలు విడనాడుట నుండి హెచ్చరిస్తుంది.
21- కారణం లేకుండా ఒకరిని కొట్టడం మరియు ఆయుధాలతో బెదిరించడాన్ని నివారిస్తుంది.
22- వ్యభిచారం, స్వలింగ సంపర్కం మరియు ఆత్మహత్యలను నిషేధిస్తుంది.
పరలోకం మరియు దానికి సంబంధించిన విషయాలను విశ్వసించనంత వరకు ఏ మనిషీ విశ్వాసి కాజాలడు. ఆ దినం ఎంత భయంకరమైనదో దివ్య ఖుర్ఆన్ ఇలా తెలిపిందిః “అది పిల్లలను వృద్ధులుగా చేసే దినం”. (72:17). ఆ నాడు సంభవించే వాటిలో కొన్ని దిగువ తెలుపుచున్నాము.
మృత్యువుః ఇది ఇహలోకంలో ప్రతి జీవికి అంతిమ విషయం. అల్లాహ్ ఆదేశాలు గమనించండి. “ప్రతి జీవి మరణాన్ని చవి చూస్తుంది”. (3: 185). “ఈ పుడమిపై ఉన్న ప్రతి వస్తువూ నాశనమైపోతుంది”. (55:26). “నీవూ మరణిస్తావు, వారూ మరణిస్తారు”. (39: 30). ఏ మానవునికీ ఇహలోకంలో శాశ్వత జీవితం లభించదు. “శాశ్వత జీవితాన్ని మేము నీకు పూర్వం కూడా ఏ మానవునికీ ప్రసాదించలేదు”. (21:34).
1- మరణం ఖచ్చితమైన విషయం. ఇందులో ఇసుమంత సందేహానికి తావు లేదు. మృతుడు తన వెంట ఏమీ తీసుకెళ్ళలేడు. అతని వెంట మిగిలేవి అతను చేసిన కర్మలే.
2- మనిషి చావు గురించి అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఎవడు ఎక్కడ, ఎప్పుడు ఎలా చనిపోతాడో ఎవ్వరికీ తెలియదు. ఎందుకనగా ఇది ఒక అగోచరజ్ఞానం. ఇది అల్లాహ్ అద్వితీయునికే తెలుసు.
3- చావు వచ్చాక ఆలస్యమో, లేక దాన్ని నెట్టేయడమో, లేక దాని నుండి పారిపోవడమో కాని పని. అల్లాహ్ ఆదేశం “ప్రతి జాతి వారికొక గడువు నియమించబడియున్నది. మరియు వారి గడువు వచ్చి-నప్పుడు ఒక గడియ వెనుకగాని ముందుగాని వారు కానేరరు”. (734).
4- విశ్వాసునికి మరణం సమీపించినప్పుడు యమదూత అందమైన ఆకారంలో అతని వద్దకు వస్తాడు. కరుణదూతలు కూడా స్వర్గ శుభ- వార్తలతో హజరవుతారు. చదవండి అల్లాహ్ ఆదేశం: “ఎవరైతే మా ప్రభువు అల్లాహ్ అని పలికిరో, మళ్ళీ అందు స్థిరముగా ఉండిరో వారి యొద్దకు దైవదూతలు దిగివచ్చి మీరు భయపడకండి, చింతపడకండి, మీతో వాగ్దానము చేయబడుతున్న స్వర్గముతో సంతోషపడండి అని పలుకుతారు”. (41:30).
అవిశ్వాసి వద్దకు భయంకరమైన మసిబూసిన ఆకారంలో యమదూత వస్తాడు. అతనితో శిక్షదూతలు శిక్ష దుర్వార్త ఇస్తూ హాజరవుతారు. చదవండి అల్లాహ్ ఆదేశం: “ఈ దుర్మార్గులు మరణవేదనలో మునిగి తేలుతూ ఉండగా, దైవదూతలు తమ హస్తాలను చాచి ఇటు తెండి, బయటకు తీయండీ మీ ప్రాణాలను, అల్లాహ్ పై అపనిందను మోపి అన్యాయంగా కూసిన కూతలకూ, ఆయన ఆయతుల పట్ల తలబిరుసుతనం ప్రదర్శించినందుకూ ఫలితంగా ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది అని అంటూ ఉండగా ఆ దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుంటుంది”. (6:93).
చావు వచ్చినప్పుడు వాస్తవము స్పష్టమయి అసలు విషయము ప్రతి ఒక్కరికీ తెలిసిపోతుంది. అల్లాహ్ ఇలా తెలిపాడుః “తుదకు వారిలో ఒకనికి చావు వచ్చినప్పుడు ‘ఓ నా ప్రభువా! నన్ను తిరిగి పంపివేయుము. నేను వదలి వచ్చిన దానిలో సత్కార్యము చేయుదును’ అని పలుకును. అట్లు కానేరదు. అది ఒక మాట, దానిని అతడు పలుకుచున్నాడు. వారు మరల సజీవులై లేచు దినము వరకు వారి ముందర అడ్డు ఉన్నది”. (23:99,100).
చావును చూసి అవిశ్వాసి మరియు పాపాత్ముడు ఇహలోకానికి తిరిగి వచ్చి సత్కార్యాలు చేయాలని కోరుదురు కాని అప్పుడు ఆ పశ్చాత్తాపము ఏమీ పనికి రాదు. అల్లాహ్ ఇలా తెలిపాడుః “నీవు పాపాత్ములను చూచెదవు. వారు బాధను చూచునప్పుడు తాము తిరిగి పోవుటకు మార్గము గలదా? అని పలుకుదురు”. (42:44).
సమాధిః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ప్రకారం: శవాన్ని సమాధిలో పెట్టి అతని బంధువులు తిరిగి పొయిన తరువాత ఇద్దరు దూతలు వచ్చి అతన్ని కూర్చోబెట్టి ‘నీ ప్రభువు ఎవరు?, నీ ధర్మం ఏది?, నీ ప్రవక్త ఎవరు?’ అని ప్రశ్నిస్తారు. ‘నా ప్రభువు అల్లాహ్, నా ధర్మం ఇస్లాం, నా ప్రవక్త ముహమ్మద్ ﷺ’ అని విశ్వాసి సమాధానమిస్తాడు. అప్పుడు వారిద్దరంటారుః ఇదిగో చూడు నరకంలో నీ స్థానం, అల్లాహ్ దానికి బదులుగా స్వర్గంలో నీకు ఈ స్థానం ప్రసాదించాడు. విశ్వాసి రెండు స్థనాలు చూస్తాడు. కాని అవిశ్వాసి లేక మునాఫిఖ్ (వంచకుడు) వారిద్దరు ప్రశ్నించబడినప్పుడు ‘అయ్యో! నాకు తెలియదు’ అని వాపోతాడు. అప్పుడు ఇద్దరు దూతలు ‘నీవు తెలుసుకోలేదు, దానికి ప్రయత్నమూ చేయలేదు’ అని అంటూ, ఇనుప సమ్మెటలతో కొడుతారు. అందుకు అతడు కేకలు వేసి అరుస్తాడు. అతని అరుపులు మానవులు, జిన్నాతులు తప్ప అందరూ వింటారు. సమాధి అతని కొరకు ఇరుకుగా ఉంటుంది. ఇద్దరు దూతలు అతనికి నరకంలో అతని స్థానం చూపిస్తారు. అక్కడి నుండి దాని తాపం, శిక్ష వస్తూ ఉంటుంది.
సమాధిలో ఉన్న శరీరములో ఆత్మను తిరిగి పంపడం పరలోక విషయాల్లో ఒకటి. దాన్ని మానవ మేధ ఇహలోకంలో ఉండి గ్రహించలేదు. మనిషి విశ్వాసి అయితే, అనుగ్రహాలకు అర్హుడయినచో సమాధిలో అనుగ్రహించబడుతాడు. శిక్షకు అర్హుడయినచో శిక్షింపబడుతాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః “సమాధి శిక్ష నుండి అల్లాహ్ శరణు కోరండి”. (అబూదావూద్). మంచి మనుస్సు దీన్ని తిరస్కరించదు. ఎందుకనగా దీనికి ఇంచుమించు పోలిన విషయం ఒకటి ఇహలోకంలో మనిషి చూస్తుంటాడు. పడుకున్న వ్యక్తి స్వప్నలో శిక్షకు గురి అయినట్లు చూస్తాడు. సహాయం కోరుతూ అరుస్తాడు. కాని అతని ప్రక్కనే మేలుకొని ఉన్న వ్యక్తి దాన్ని గ్రహించలేకపోతాడు. ఇక జీవన్మరణాల్లోని తేడా ఇంతకంటే గొప్పది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారుః “సమాధి పరలోక స్థానాల్లో మొదటి స్థానం. దాన్ని క్షేమంగా దాటినవారికి ఆ తరువాత స్థానాలు తేలికగా ఉంటాయి. దాన్ని క్షేమంగా దాటనివారికి దాని తరువాతవి కఠినంగా ఉంటాయి”. (తిర్మిజి).
సమాధి శిక్ష అని పేరు రావడానికి కారణం అనేక మందిని సమాధిలో పెట్టడం వల్లనే. కాలిపోయినవారు, మునిగిపోయినవారు మరియు కౄరజంతువులకు ఆహారమైనవారు ఇంకా ఎవరు ఎలా మరణించినా తమ కర్మల ప్రకారం శిక్షించబడుతారు లేక అనుగ్రహించబడుతారు. సమాధి శిక్షలు వివిధ రకాలుగా ఉంటాయిః ఇనుప సమ్మెటలతో కొట్టబడును. సమాధి చీకటితో నిండిపోవును. నరకంలోని పరుపు అతనికి వేయబడును. దాని తలుపు అతని వైపునకు తెరువబడును. అందులో నుండి వేడి గాలి వస్తూ ఉండును. అతని దుష్కార్యాలు, దుర్వాసన గల దుస్తులు ధరించిన అందవికారంగల వ్యక్తి రూపంలో అతనికి తోడుగా ఉండును. అవిశ్వాసి మరియు మునాఫిఖులకు ఎడతెగకుండా శిక్ష ఉండును. పాపాత్ముడైన విశ్వాసికి తన పాపాలకు తగినరీతిలో శిక్ష ఉండును. తర్వాత శిక్ష నుండి రక్షింపబడవచ్చును.
సమాధిలో వరాలుః విశ్వాసి కొరకు అతని సమాధి వెడల్పు చేయబడును. నూర్ (కాంతుల)తో నింపబడును. స్వర్గం యొక్క ద్వారము అతని వైపునకు తెరువబడును. అందులో నుండి పరిమళం మరియు గాలులు వీస్తూ ఉండును. స్వర్గపు పరుపులు పరచబడును. అతని సత్కార్యాలు అందమైన మనిషి రూపములో అతనికి తోడుగా ఉండును.
1- అల్లాహ్ ఈ సృష్టిని శాశ్వతంగా ఉండుటకు సృష్టించలేదు. తప్పక ఒక దినం రానుంది ఇది అంతము కానుంది. అదే ప్రళయం సంభవించే రోజు. సందేహం లేనటువంటి రోజు. “పునరుత్థాన దినం రానున్నది. అందెట్టి సందేహం లేదు”. (22:7). “మాకు ప్రళయకాలము రాదు అని అవిశ్వాసులు పలుకుదురు. నీవు చెప్పు ఎందుకు రాదు? నా ప్రభువు సాక్షిగా! అది తప్పక మీకు వచ్చును”. (34:3). ప్రళయదిన విషయం అగోచరమైనది. అది కేవలం అల్లాహ్ కే తెలుసు. దాన్ని ఆయన తన సృష్టిలో ఎవరికీ తెలుపలేదు. “ప్రళయ కాలమును గూర్చి నిన్ను అడుగుచున్నారు. దాని విషయం అల్లాహ్ కే తెలియును అని ఓ ప్రవక్తా! పలుకుము. దాని విషయము నీకేమి తెలుసు. ప్రళయ కాలము సమీపములోనే కావచ్చు”. (33:63).
2- ఈ ధరిణిపై దుష్టులు మాత్రమే మిగిలి యుండగా ప్రళయం సంభవించును. అది ఎలా అనగాః అది సంభవించేకి ముందు అల్లాహ్ ఒక మందమారుతమైన గాలిని పంపును. దానివలన విశ్వాసులు చనిపోతారు. ఇక అల్లాహ్ సృష్టినంతటిని నాశనము చేయాలనుకున్నప్పుడు, శంకు ఊదే దూతకు ఆదేశమిస్తాడు, అతడు శంకు ఊదగా ప్రజలందరు సొమ్మసిల్లిపోతారు. అదే విషయం అల్లాహ్ ఇలా తెలిపాడుః “శంకు ఊదబడును, కావున ఆకాశములలోనూ భూమిలోనూ ఉన్న వారందరూ మూర్ఛిల్లి పడిపోవుదురు. అల్లాహ్ కోరినవారు తప్ప”. (39:68). అది జుమా (శుక్రవారం) రోజగును. పిదప దైవదూతలు సయితం చనిపోవుదురు. అల్లాహ్ తప్ప మరెవ్వరూ మిగిలి ఉండరు.
3- సమాధుల్లో ఉన్న మానవ దేహాలను మట్టి తినేస్తుంది. కేవలం వెన్నెముకలో ఉండే బీజము తప్ప. కాని ప్రవక్తల దేహాలను మట్టి తినదు. తరువాత అల్లాహ్ వర్షం కుర్పిస్తాడు, దానితో దేహాలు తయారవుతాయి. వారిని లేపాలని అల్లాహ్ ఉద్దేశించినప్పుడు శంకు ఊదే దూత ఇస్రాఫీల్ ను జీవింపజేస్తాడు. అతడు రెండవసారి శంకు ఊదగా అల్లాహ్ అందరినీ జీవింపజేస్తాడు. వారందరూ మొదటిసారి అల్లాహ్ పుట్టించినట్లు నగ్నముగా, సున్నతి చేయబడకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా సమాధుల నుండి లేచి వస్తారు. అదే విషయం అల్లాహ్ ఇలా తెలిపాడుః “శంకు ఊదబడినప్పుడు వారంతా గోరీల నుండి లేచి తమ ప్రభువు వైపునకు పరుగెత్తుకుంటూ వస్తారు”. (36:51). అందరికంటె ముందు ప్రవక్త ముహమ్మద్ ﷺ భూమి నుండి వెలికి వస్తారు. తరువాత ప్రజలందరూ ‘మహ్ షర్’ మైదానము వైపునకు వెళ్తారు. అది చాలా విశాలమైన భూమి. అప్పుడు సూర్యుడు ప్రజలకు అతి సమీపంలో ఉంటాడు.
ఆ మైదానంలో ప్రజలు తమ లెక్క, తీర్పు కొరకు చాలా కాలం వేచి ఉంటారు. పిదప అల్లాహ్ వారి మధ్య తీర్పు కొరకు వస్తాడు. నరకంపై వంతెన వేయబడుతుంది. అది వెంట్రుక కన్నా సన్నగా, ఖడ్గం కన్నా పదునైనదిగా ఉంటుంది. దానిపై ప్రజలు తమ కర్మల ప్రకారంగా దాటుదురు. కొందరు కనురెప్ప పాటులో, మరికొందరు గాలి తీరుగా, ఇంకొందరు గుఱ్ఱపు రౌతుగా దాటుతే, అక్కడే కొందరు ప్రాకుచూ దాటుదురు. వంతెనకు కొండ్లుండును. అవి ప్రజలను పట్టి నరకంలో పడవేయును. అయితే అందులో పడువారు అవిశ్వాసులు మరియు పాపాలకు గురి అయిన విశ్వాసుల్లో అల్లాహ్ కోరినవారు. అవిశ్వాసులైతే శాశ్వతంగా అందులోనే పడి ఉంటారు. కాని పాపాలు చేసిన విశ్వాసులు అల్లాహ్ కోరినన్ని రోజులు శిక్షింపబడుతారు. తరువాత అందులో నుండి తీయబడి స్వర్గంలో ప్రవేశించబడుదురు.
స్వర్గవాసులు నరకంపై ఉన్న వంతెన క్షేమంగా దాటిన తరువాత స్వర్గం మరియు నరకం మధ్యలో ఉన్న వంతెనపైకి వచ్చి నిలుస్తారు. వారి పరస్పరం ఒకరిపై ఉండిన మరొకరి హక్కులు చెల్లించబడును. ఎవరైనా ఒకరిపై అన్యాయం చేసి ఉంటే, అతని నుండి పరిహారం బాధితునికి ఇవ్వబడి, వారి హృదయాల కల్ముషాలు దూరము కాక ముందు ఎవరూ స్వర్గంలో ప్రవేశించలేరు. స్వర్గవాసులు స్వర్గంలో, నరకవాసులు నరకంలో చేరిన పిదప మృత్యువును పొట్టేలు రూపంలో తీసుకు వచ్చి స్వర్గం మరియు నరకం మధ్యలో వారు చూస్తూ ఉండగా ‘జిబ్హ్’ చేయ(కోయ)బడును. స్వర్గవాసులారా! శాశ్వతంగా ఉండండి, ఇక మీకు మరణం లేదు. నరకవాసులారా! మీకూ శాశ్వతం ఇక మరణం లేదు అని అనబడుతుంది. ఒకవేళ మరణం అనేది ఉంటే సంతోషంతో చనిపోతే స్వర్గవాసులు చనిపోతారు. చింత, బాధతో చనిపోతే నరకవాసులు చనిపోతారు.
సృష్టికర్త అయిన అల్లాహ్ ఆదేశం: “ప్రజలు, రాళ్ళు ఇంధనం కాగల ఆ నరకాగ్ని నుండి భయపడండి. అది అవిశ్వాసుల కొరకు సిద్ధమైయున్నది“. (2:24).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి తమ సహచరులతో “నరకాగ్ని మీరు రాజేస్తున్న (ఇహలోక) అగ్నికి డెబ్బై రెట్ల ఎక్కువ తీవ్రంగా ఉంటుంది” అని చెప్పారు. అనుచరులు ఈ మాట విని ‘ప్రవక్తా! అల్లాహ్ సాక్షిగా! (కాల్చడానికి) ఈ అగ్నియే సరిపోతుంది కదా’ అని అన్నారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నరకాగ్నికి మీ (ప్రాపంచిక) అగ్నిపై అరవై తొమ్మిది రెట్ల ఆధిక్యత ఉంది. దాని డెబ్బై భాగాలలోని ప్రతి భాగం తీవ్రతలో మీ అగ్ని మాదిరిగా ఉంటుంది” అని సమాధానమిచ్చారు. (బుఖారి, ముస్లిం).
నరకంలో ఏడు అంతస్తులుంటాయి. ప్రతి అంతుస్తులో మరోదానికంటే ఎక్కువ శిక్ష ఉంటుంది. ఎవరి కర్మల ప్రకారం వారు అందులో ఉంటారు. మునాఫిఖులు (వంచకులు) నరకంలోని అతిక్రింది స్థానంలో, కఠిన శిక్షలో ఉంటారు. అవిశ్వాసులకు శిక్ష కలకాలం ఉంటుంది. అందులో కాలిపోయినపుడల్లా మరింత శిక్ష కలుగుటకు తిరిగి చర్మం మార్చబడును. అదే విషయం అల్లాహ్ ఇలా తెలిపాడుః
“వారి చర్మం కాలిపోయినపుడల్లా దానికి బదులుగా వేరే చర్మమును, వారు బాధ రుచి చూచుటకై, కల్పించుచుందుము”. (4:56).
“అవిశ్వాసానికి పాల్పడినవారికి నరకాగ్ని ఉన్నది. వారు చనిపోవాలనే తీర్పు ఇవ్వబడదు. వారి నరక యాతనను ఏ మాత్రం తగ్గించడమూ జరగదు. ఇలా మేము అవిశ్వాసానికి పాల్పడే ప్రతి వ్వక్తికీ ప్రతిఫలం ఇస్తాము”. (35:36).
నరకవాసులను సంకెళ్ళతో కట్టి, మెడలలో పట్టీలు వేయబడును. “ఆ రోజు నీవు దోషులను చూస్తావు. వారి చేతులూ, తాళ్ళూ బేడీలతో బంధించబడి ఉంటాయి. వారు తారు వస్త్రాలను ధరించి ఉంటారు. అగ్ని జ్వాలలు వారి ముఖాలను క్రమ్ముకుంటాయి”. (14: 49,50).
వారి తిండి విషయము ఇలా తెలుపబడిందిః
“నిశ్చయంగా జఖ్కూమ్ వృక్షం పాపాత్ములకు ఆహారం అవుతుంది. అది నూనె మడ్డిలా ఉంటుంది. సలసల కాగే నీరు మాదిరిగా అది కడుపులో మసలుతూ ఉంటుంది”. (4:43,46).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః
“జఖ్కూమ్ వృక్షం యొక్క ఒక చుక్క భూమిపై పడినచో భూనివాసుల జీవనోపాధి పాడయిపోతుంది. ఇక దాన్ని తినేవారి గతి ఏమవుతుందో?.
నరక శిక్ష యొక్క కఠినత్వాన్ని, స్వర్గం యొక్క భోగభాగ్యాల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీసు విశదీకరిస్తుందిః
“ఇహలోకంలో అత్యధిక సుఖాలను అనుభవించిన అవిశ్వాసిని ఒకసారి నరకంలో ముంచి తీసి, నీవు ఎప్పుడైనా సుఖాన్ని అనుభవించావా? అని ప్రశ్నిస్తే ‘లేదు, ఎప్పుడూ లేదు’ అని బదులిస్తాడు. ఒక్కసారి అందులో మునిగి లేచినందుకు సర్వ సుఖాలను మరచిపోయాడు. అదే విధంగా ప్రపంచంలో బీదరికాన్ని, కష్ట బాధలను అనుభవించిన విశ్వాసిని ఒకసారి స్వర్గంలో ప్రవేశింపజేసి, ఎప్పుడైనా నీవు బీదరికాన్ని కష్టాలను చూశావా? అని ప్రశ్నిస్తే, నేను ఎప్పుడూ చూడలేదని బదులిస్తాడు. ఒకసారి స్వర్గంలో మునిగి లేచినందుకు ఇహలోక బాధలు, కష్టాలు మరచిపోయాడు.”
స్వర్గం పుణ్యపురుషులకు సదా ఉండే గౌరవనీయమైన స్థానం. అందులో ఉన్న అనుగ్రహాలను ఏ కన్నూ చూడలేదు. ఏ చెవి వినలేదు. ఎవరి ఊహలకు అందలేదు. చదవండి దివ్యఖుర్ఆన్ సాక్ష్యం:
“వారి కర్మలకు ప్రతిఫలంగా, కళ్ళకు చలువ కలిగించే ఎటువంటి సామాగ్రి వారి కొరకు దాచి పెట్టబడి ఉందో ఆ సామాగ్రిని గురించి ఏ ప్రాణికి తెలియదు“. (32:17).
అందులో వేరు వేరు స్థానాలు గలవు. విశ్వాసులు తమ కర్మల ప్రకారం అందులో ఉందురు.
“అల్లాహ్ మీలో విశ్వాసులైన వారికి మరియు విద్యగల వారికి పదవులు ఉన్నతములుగా చేయును“. (58:11).
స్వర్గవాసులు తమ ఇష్టానుసారం తింటూ, త్రాగుతూ ఉందురు. అందులో నిర్మలమైన నీటి వాగులు, ఏ మాత్రం మారని రుచిగల పాల కాలువలు, పరిశుద్ధ తేనే కాలువలు, సేవించేవారికి మధురంగా ఉండే మద్య పానాలుండును. వారికివ్వబడే మద్యం ప్రపంచం లాంటింది కాదు. చదవండి దివ్య ఖుర్ఆన్:
“మద్యపు చెలమల నుండి పాత్రలు మాటిమాటికీ నింపబడి వారి మధ్య త్రిప్పబడుతాయి. మెరిసిపోతున్న మధువు, త్రాగేవారికి అది ఎంతో మధురం. దానివల్ల వారి శరీరానికి నష్టం ఉండదు. వారి బుద్ధీ చెడిపోదు“. (37:45-47).
అందులో వారి వివాహం అందమైన కళ్ళుగల సుందర స్త్రీలతో జరుగును. వారి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః
“స్వర్గంలో ఉన్నటువంటి స్త్రీ భూనివాసుల వైపునకు ఒకసారి తొంగి చూసినచో భూమ్యాకాశాల మధ్య కాంతులీనుతాయి. సువాసనతో నిండిపోతాయి“. (బుఖారి).
స్వర్గవాసులకు లభించే వరాల్లో అతి పెద్ద వరం అల్లాహ్ దర్శనం
వారికి అక్కడ మలమూత్రములు కలగవు. ఉమ్మి, చీమిడీలు ఉండవు. వారికి బంగారపు దువ్వెనలుండును. వారి చెమటలో కస్తూరి లాంటి సువాసన ఉండును. ఈ అనుగ్రహాలు కలకాలముంటాయి. ఇవి తరగవు, నశించవు. ప్రవక్త ﷺ ఉపదేశించారుః “స్వర్గంలో ప్రవేశించినవారికి అనుగ్రహాలు కలకాలముండును. ఏ కష్టమూ ఉండదు. దుస్తులు పాతబడవు. అందులో అతి తక్కువ అదృష్టవంతునికి లభించే వరం ఇహలోకం కంటే పది రెట్లు ఉత్తమమైనది”.
ఇస్లాం ధర్మంలో స్త్రీల స్థానం వారికున్న హక్కులను గురించి చదివే ముందు ఇస్లామేతర మతాల్లో వారికున్న స్థానం, స్త్రీల పట్ల ఉన్న ఆ మతాలవారి వ్యవహారం గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం.
గ్రీకుల వద్ద స్త్రీ అమ్మబడేది మరియు కొనబడేది. ఆమెకు ఏ హక్కూ లేకుండా ఉండేది. సర్వ హక్కులు పురుషునికే ఉండేవి. ఆస్తిలో వారసత్వము లేకుండా తన స్వంత సొమ్ములో ఖర్చు పెట్టే హక్కు కూడా ఉండేది కాదు. ప్రఖ్యాతిగాంచిన అచ్చటి తత్వవేత్త సుఖరాత్ (Socrates the philosopher) ఇలా అన్నాడుః ‘స్త్రీ జాతి ఉనికి ప్రపంచం యొక్క అధోగతి మరియు క్షీణత్వానికి ఒక మూలకారణం. స్త్రీ ఒక విషమాలిన చెట్టు లాంటిది, చూపుకు ఎంతో అందంగా ఉంటుంది కాని పక్షులు దాన్ని తిన్న వెంటనే చనిపోతాయి’.
రోమన్స్ వారు స్త్రీకి ఆత్మయే లేదనేవారు. వారి వద్ద స్త్రీకి ఏలాంటి విలువ, హక్కు లేకుండింది. ‘స్త్రీకి ఆత్మ లేదు’ అనడం వారి నినాదంగా ఉండేది. అందుకే వారిని స్తంభాలకు బంధించి కాగిన నూనె వారి దేహములపై పోసి వారిని బాధపెట్టేవారు. ఇంతకంటే ఘోరంగా నిర్దోషులైన స్త్రీలను గుఱ్ఱపు తోకతో కట్టి వారు చనిపోయేంత వరకు గుఱ్ఱాన్ని పరిగెత్తించేవారు.
మన భారత దేశంలో కూడా పరిస్థితి ఇలాగే ఉండేది. అంతేకాదు, దీనికి మరో అడుగు ముందు వేసి భర్త చనిపోతే భార్యను కూడా సతీసహగమనము చేయించేవారు. (స్త్రీలను దేవదాసీలుగా కూడా ఉపయోగించేవారు).
చైనీయులు స్త్రీలను ధనసంపదను మరియు సంతోషాన్ని నశింపజేసే నీటితో పోల్చేవారు. భార్యను అమ్మడము హక్కుగా భావించేవారు. అదే విధంగా ఆమెను సజీవంగా దహనం చేయుట కూడా ఒక హక్కుగా భావించేవారు.
ఇక యూదులు, హవ్వా, ఆదమును కవ్వించి చెట్టు నుంచి పండు తినిపించిందన్న అసత్య ఆరోపణతో స్త్రీ జాతినే శపించబడినదిగా భావించేవారు. స్త్రీ బహిష్టురాలయినప్పుడు తనుండే గృహము, తను ముట్టుకునే ప్రతి వస్తువు అపరిశుభ్రమవుతుందనేవారు. ఆమెకు సోదరులుంటే తన తండ్రి ఆస్తిలో వచ్చే భాగం తనకు ఇచ్చేవారు కారు.
క్రైస్తవులు స్త్రీని షైతాన్ (దయ్యం, పిశాచము) యొక్క ద్వారముగా భావించేవారు. ఒక క్రైస్తవ పండితుడు స్త్రీ విషయములో ఇలా ప్రస్తావించాడుః ‘స్త్రీ మానవ పోలిక గలది కాదు’. బోనావెన్తూర్ (Saint bona ventura: 1217- 1274) ఇలా చెప్పాడుః ‘మీరు స్త్రీని చూసి మానవురాలే కాదు, కౄరజంతువని కూడా అనుకోకండి. మీరు చూసేది షైతాన్ మరియు వినేది కేవలం పాము ఈలలు/బుసబుసలు’.
ఇంగ్లీషువారి చట్టం (Common Law) ప్రకారమయితే గత అర్థ శతాబ్దంలో ‘స్త్రీ’ పౌరుల తరగతులోని ఏ తరగతిలో కూడా లెక్కించబడేది కాదు, మరియు ఆమెకు స్వతహాగా ఏ హక్కు ఉండేది కాదు. చివరికి తను ధరించే దుస్తులు కూడా తన అధికారములో ఉండేవి కావు. క్రీ. శ. 1567న స్కాట్ ల్యాండ్ పార్లమెంటు (Scottish parliament)లో ఏ చిన్న అధికారము కూడా స్త్రీకి ఇవ్వకూడదన్న ఆదేశం జారిచేశారు. హెన్రి8th (Henry VIII) పరిపాలనలో బ్రిటిష్ పార్లమెంటు స్త్రీ అపరిశుభ్రత గలది గనుక బైబిల్ చదవకూడదని చట్టం జారి చేసింది. 1586వ సంవత్సరము ఫ్రాన్సులో ఒక సమ్మేళనం ఏర్పాటు చేసి స్త్రీ మనిషా కాదా అని చర్చించి చివరికి మనిషే కాని పురుషుని సేవ కొరకు పుట్టించబడిందన్న నిర్ణయానికి వచ్చారు. క్రీ. శ. 1805వ సంవత్సరము వరకు బ్రిటిషు చట్టం ‘భర్త తన భార్యను అమ్ముట యోగ్యమే’ అని ఉండింది. మరియు వారు భార్య యొక్క ధర ఆరు పెన్సులు (Six pence ie Half Schilling) నిర్ణయించారు.
అరబ్బులు కూడా ఇస్లాంకు ముందు స్త్రీని చాలా నీచంగా చూసేవారు. ఏ స్థాయి లేకుండా, ఆస్తిలో హక్కు లేకుండా ఉండేది. అనేక అరబ్బులు స్త్రీలను సజీవంగా దహనం చేసేవారు.
స్త్రీ జాతి భరించే ఈ అన్యాయాన్ని తొలగించుటకు, స్త్రీ పురుషులు ఒకటే మరియు పురుషులకున్న విధంగా వారికీ హక్కులున్నవి అని చాటి చెప్పుటకు ఇస్లాం ధర్మం వచ్చింది. ఇదే విషయాన్ని దివ్యగ్రంథం ఖుర్ఆన్ లో సృష్టికర్త అయిన అల్లాహ్ ఇలా తెలిపాడుః {మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి, ఒకే స్త్రీ నుండి సృజించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగానూ, తెగలుగానూ చేశాము. వాస్తవానికి మీలో అందరి కంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవపాత్రుడు}. (49:13). మరో చోట ఇలా సెలవియ్యబడిందిః {మంచి పనులు చేసేవారు పురుషులైనా, స్త్రీలైనా వారు గనుక విశ్వాసులైతే స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి రవ్వంత అన్యాయం కూడా జరగదు}. (4:124). మరొక చోట ఇలా ఆదేశమివ్వబడిందిః {తన తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగమని మేము మానవునికి ఉపదేశించాము}. (29:8). ప్రవక్త మహానీయ ముహమ్మద్ ﷺ ఇలా ఉపదేశించారుః “విశ్వాసులలో సంపూర్ణ విశ్వాసం గలవారు సద్ప్రవర్తన గలవారు. మీలో మంచివారు తమ భార్యల పట్ల మంచితనముతో మెలిగేవారు”. (తిర్మిజి). ‘నా సేవాసద్వర్తనలకు అందరికంటే ఎక్కువ అర్హులు ఎవరు?’ అని ఒక వ్యక్తి ప్రవక్తతో అడిగాడు, “నీ తల్లి” అని చెప్పారు మహాప్రవక్త ﷺ. ‘మళ్ళీ ఎవరు?’ అని అడిగాడు ఆ వ్యక్తి. “నీ తల్లి” అని చెప్పారు ప్రవక్త. ‘మళ్లీ ఎవరు’ అని అడిగాడు ఆ మనిషి. “నీ తల్లి” అని సమాధానమిచ్చారు. మరో సారి అడిగాడు ‘మళ్లీ ఎవరు’ అని, “నీ తండ్రి” అని బదులిచ్చారు మహానీయ ﷺ . (ముస్లిం).
ఇస్లాం దృష్టిలో స్త్రీ స్థానం ఎలా ఉందో సంక్షిప్తంగా పైన తెలుపబడినది.
1- స్వామ్యం (Ownership): బిల్డింగ్, పంటలు, పొలాలు, ఫ్యాక్టరీలు, తోటలు, బంగారం, వెండి మరియు అన్ని రకాల పశువులు. వీటన్నిట్లో స్త్రీ తను కోరినవి తన యజమాన్యంలో ఉంచుకోవచ్చును. స్త్రీ భార్య, తల్లి, కూతురు మరియు చెల్లి, ఏ రూపములో ఉన్నా, పై విషయాలు తన అధికారములో ఉంచ వచ్చును.
2- వివాహ హక్కు, భర్తను ఎన్నుకునే హక్కు, భర్తతో జీవితం గడపడంలో నష్టము ఏర్పడినప్పుడు వివాహ బంధమును తెంచుకొని విడాకులు కోరే హక్కు. ఇవి స్త్రీ యొక్క ప్రత్యేక హక్కులని రుజువైనది.
3- విద్యః తనపై విధిగా ఉన్న విషయాలను నేర్చుకునే హక్కు. ఉదాః అల్లాహ్ గురించి, తన ప్రార్థనలు మరియు వాటిని చేసే విధానం గురించి తెలుసుకొనుట తనపై విధియైఉన్న హక్కులు. తను ఎలాంటి ప్రవర్తనలు నేర్చుకోవాలి, ఏలాంటి సంస్కారము సభ్యత, పాటించాలి అనే విషయాలు తెలుసుకొనుట ప్రతి స్త్రీ యొక్క హక్కు. ఇవన్ని అల్లాహ్ యొక్క ఈ ఆదేశానుసారంగాః {అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైనవాడు ఎవడు లేడని బాగా తెలుసుకో}. (47:19). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారుః “విద్యనభ్యసించడం ప్రతి ముస్లింపై విధిగా యున్నది”.
4- తన స్వంత ధనము నుంచి తను కోరినట్లు తనపైగాని, ఇతరులపైగాని -వారు తన భర్త, సంతానము, తండ్రి లేక తల్లి ఎవరయినా సరే- ఖర్చు చేసే హక్కుంది. కాని హద్దులు మీరి, వ్యర్థమైన ఖర్చులు చేయకూడదు. (అలా చేసినచో, నిరోధించడం భర్త విధి). ఖర్చు చేయడంలో పురుషునికెంత అధికారముందో స్త్రీకి కూడా అంతే ఉంది.
5- తన స్వంత ధనము నుంచి తన జీవితములోనే మూడవ వంతు ధనము గురించి తను కోరినవారికి వసియ్యత్ (వీలునామా) చేయవచ్చును. తను చనిపోయిన తరువాత ఆమె ఆ వసియ్యత్ ను ఏలాంటి అభ్యంతరం లేకుండా జారి చేయించవచ్చును. ఎందుకనగా వసియ్యత్ ప్రతి ఒక్కరి స్వంత విషయము. పురుషులకున్న విధంగా స్త్రీలకు కూడా ఈ హక్కు ఉంది. కాని పురుషులైనా, స్త్రీలైనా తమ ఆస్తిలోని మూడవ వంతు కంటే ఎక్కువ వసియ్యత్ చేయకూడదు మరియు అల్లాహ్ నిర్ణయించిన వారసుని కొరకు వసియ్యత్ చేయకూడదు.
6- ధరించడంలో తాను కోరిన విధంగా పట్టు, బంగారం ఇంకేవైనా ధరించవచ్చును. -అయితే పట్టు, బంగారం పురుషుల కొరకు నిషిద్ధం.- కాని ధరించి కూడా నగ్నత్వాన్ని మరియు అర్థనగ్నత్వాన్ని కనబరచే దుస్తులు భర్త తప్ప ఇతరుల ఎదుట ధరించరాదు.
7- కంట్లో కాటిక, బుగ్గల మీద స్నో, పౌడరు పూసుకొని (ఇతరుల కొరకు కాదు) తన భర్త కొరకు సింగారించుకొనుట. ఇంకా సువాసనగల సుందర దుస్తులు ధరించుట స్త్రీ యొక్క హక్కు.
8- తనకిష్టమైన వస్తవులు తినే, త్రాగే హక్కు ఆమెకుంది. తినేత్రాగే విషయాల్లో స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసము లేదు. పురుషులకు యోగ్యమున్నవే స్త్రీలకూ యోగ్యం. ఇక నిషిద్ధమున్నవి ఇద్దరికీ నిషిద్ధం. మానవులదంరిని ఉద్దేశించి ఇచ్చిన అల్లాహ్ ఆదేశం చదవండిః {తినండి, త్రాగండి. మితిమీరకండి. అల్లాహ్ మితిమీరేవారిని ప్రేమించడు}. (7:31).
9- తన తండ్రి, భర్త, కొడుకు వగైరాల ఆస్తిలో ఆమెకు హక్కు గలదు. అలాగే ఆమె ఆస్తిలో వారి దగ్గరివారికి హక్కు గలదు.
స్త్రీ యొక్క ప్రత్యేక హక్కుల్లో భర్తపై ఉన్న తన భార్య హక్కులు.
అల్లాహ్ ఆదేశానుసారంగా ఇవి భర్తపై ఉన్న భార్య యొక్క హక్కులు. అల్లాహ్ ఆదేశం ఇదిః {మగవారికి మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా మగవారిపై ఉన్నాయి}. (2:228). భార్య యొక్క హక్కులను సంపూర్ణంగా నెరవేర్చుట భర్తపై విధిగా ఉంది. హాఁ ఆమె తనకుతానుగా, తనిష్టముతో కొన్ని హక్కులకు మినహాయింపు ఇస్తే అది ఆమె ఇష్టం.
1- భర్త తన శక్తికొలది కలిమిలో ఉన్నా, లేమిలో ఉన్నా భార్య యొక్క పోషణ, వస్త్ర, చికిత్స మరియు గృహ మొ!నవి వసతుల ఏర్పాటు చేయాలి.
2- తన భార్య యొక్క ధన, ప్రాణము, ధర్మం, మానమును కాపాడాలి.
3- ధర్మానికి సంబంధించిన అనివార్యమైన విషయాలు భార్యకు నేర్పాలి. ఆతను నేర్పలేకపోతే స్త్రీల విద్యాబోధన ప్రత్యేక సమావేశాల్లో, కేంద్రాల్లో, మసీదుకు వెళ్ళి అచ్చట నేర్చుకొనుటకు అనుమతివ్వాలి. అక్కడికి వెళ్ళడంలో ఏలాంటి కీడు జరగకుండా శాంతి ఉండాలి. ఇద్దరిలో ఏ ఒక్కరికీ ఏలాంటి నష్టము కలిగే భయం ఉండకూడదు.
4- {తమ భార్యలతో మంచివిధంగా మెలగండి}(4:19) అన్న అల్లాహ్ ఆదేశం ప్రకారం వారితో మంచి విధంగా మెలగాలి. అంటేః ఆమె యొక్క సంభోగ హక్కులో కొరత రానివ్వరాదు. తిట్టి, దూషించి, హీనపరచి బాధ కలిగించరాదు. ఏలాంటి నష్టము లేనప్పుడు తన బంధువులను దర్శించడం నుండి వారించరాదు. శక్తికి మించిన భారం ఆమెపై వేయరాదు. మనసా వాచా కర్మాన ఆమెకు మేలే చేయాలి. ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారుః “మీలో మంచివారు ఎవరయ్యా అంటేః తమ భార్యల పట్ల మంచితనముతో మెలిగేవారు. నేను నా భార్యల పట్ల మంచిగా మెలిగేవాణ్ణి”.
కుటుంబ జీవితం విఛ్చిన్నం కాకుండా, అధోగతి వైపునకు పోకుండా సురక్షితంగా ఉండాలని ఇస్లాం చాలా ప్రోత్సహించింది. మనిషి సుఖంగా ఉండి, సమాజం పరిశుద్ధంగా ఉండుటకు, దాన్ని మంచి సభ్యత, మంచి గుణాల బలమైన అడ్డుతో రక్షణ కల్పించి కాపాడింది. ఈ గుణాలను పాటిస్తే భావోద్రేకాలు ఉద్భవించవు. మనోవాంఛలకు తావు ఉండదు. ఉపద్రవాలకు తావు ఇచ్చే కోరికలను కూడా ఆపుటకు అడ్డు ఖాయం చేసి స్త్రీ పురుషులు తమ కంటి చూపులను క్రిందికి జేసుకోవాలని ఆదేశమిచ్చింది. దివ్య గ్రంథం ఖుర్ఆన్ లో సూర నూర్ (24:30-31) చదవండి.
స్త్రీ యొక్క గౌరవానికి, తాను అవమానము పాలు కాకుండా బంధ్రంగా ఉండుటకు, నీచ మనస్సుగలవారు మరియు అల్లకల్లోలం సృష్టించేవారు అమె నుంచి దూరముండుటకు, గౌరవమర్యాదల విలువ తెలియని మూర్ఖుల నుంచి భధ్రంగా ఉండుటకు, విషపూరితమైన చూపులకు కారణమగు ఉపద్రవాలను అడ్డుకొనుటకు, స్వయంగా స్త్రీ గౌరవము, తన మానము యొక్క బధ్రతకు అల్లాహ్ పర్ద యొక్క ఆజ్ఞ ఇచ్చాడు.
ఇస్లాం పర్దాను విధిగా చేసి స్త్రీలకు శాంతియుతమైన, గౌరవజీవితం ప్రసాదించింది. ఎందుకంటే స్త్రీ వయసుమల్లిన తరువాత కొంతవరకు అందాన్ని కోల్పోతుంది. ఇక పురుషుడు దారిన వెళ్ళినప్పుడు యౌవనంలో ఉన్న అందకత్తెలను చూసి, తన ఇంటికి తిరిగి వచ్చిన తరువాత తన ఇల్లాలిని వారితో పోలుస్తాడు. అక్కడి నుండే మొదలవుతాయి సంసార సాగరంలో తూఫానులు.
సుమారు మానవ చరిత్ర ఉన్నప్పటి నుండే బహుభార్యత్వం ఉంది. అందుకే యూద, క్రైస్తవ లాంటి పూర్వ ధర్మాల్లో, ప్రాచీన చైనా మరియు భారత సంస్కృతుల్లో కూడా ఉండినది. అయితే హద్దు లేకుండా భార్యలను ఉంచుకునేవారు. అందుకు స్త్రీ అన్యాయానికి గురి అవుతూ ఉండేది. ఇస్లాం వచ్చాక స్త్రీ జాతి భరిస్తున్న అన్యాయాన్ని తొలగించి నాలుగు భార్యల వరకు ఒకే సమయంలో ఉంచుకోవచ్చన్న హద్దు నిర్ణయించింది. ఇస్లాం దీని గురించి విచ్చలవిడిగా అనుమతించలేదు. ఒక షరతు విధించింది. అది వారి మధ్య న్యాయం పాటించటం. ఈ షరతును పాటించకుండా దీనికి పాల్పడేవాడికి కరకుగా హెచ్చరించింది. ఘోరశిక్ష ఉందని తెలిపింది.
ఒక్కోసారి కొన్ని కారణాల వల్ల పురుషుడు బహుభార్యత్వం వైపుకు మొగ్గు చూపుతాడు. ఉదాహరణకు భార్య గొడ్డురాలు కావచ్చు, లేదా ఏదైనా రోగానికి గురి కావచ్చు. లేక మరేదైనా కారణం కావచ్చు. ఇలాంటి స్త్రీ కొరకు ఆమె భర్త ఆమెకు విడాకులివ్వడం మంచిదా? లేక ఆమెను తన వివాహబంధంలో ఉంచుకొని మరొకామెను వివాహమాడడం మంచిదా?
బహుభార్యత్వం వలన మన సమాజానికి మేలే చేకూరుతుంది. ఎలా అనగా యుద్ధాలు తదితర కారణాల వల్ల స్త్రీల సంఖ్య పెరిగిపోతుంది. ఉదాహరణకు: ప్రపంచ యుద్ధంలో కేవలం యూరప్ లో 25మిలియన్ల స్త్రీలు విధవలు అయ్యారు. ఈ స్త్రీలు భర్తలు లేకుండా ఉండిపోవడం మంచిదా? లేక రెండవ భార్యగా ఒక భర్త ఛాయలో ఉండడం మేలా? రెండవ ప్రపంచ యుద్ధం తరువాత 1945లో స్వయంగా స్త్రీలు జర్మన్ లో ఒక ప్రదర్శన ఏర్పాటు చేసి ‘స్త్రీల మేలు కొరకు బహుభార్యత్వ చట్టాన్ని తీసుకురావాలని, లేనిచో తమ అతివిలువైన సొమ్మును (పరువు, మానమును) ఒక వృత్తిగా చేసుకోనున్నారు’ అని డిమాండ్ చేశారు.
ఇస్లాం ధర్మం యొక్క గొప్పతనాన్ని గమనించాక, అల్లాహ్ వద్ద ముక్తి పొందే మార్గం ఇదేనని గ్రహించిన ప్రతి ఒక్కరు అందులో ప్రవేశించుట తప్పనిసరి. దాన్ని అనుసరించకుండా ఏ మనిషికీ స్వర్గం ప్రాప్తికాదు. నరకం నుండి ముక్తి లభించదు. ఇందులో ప్రవేశ విధానం ఏమిటని నీవు అడగదలుచుకుంటే? ఇదిగో జవాబుః నీవు ఇస్లాంను స్వీకరించాలనుకుంటే నీవుః “లాఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్”ను (అంటే అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవడూ లేడు. ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త అని) సంపూర్ణ విశ్వాసంతో నోటితో పఠించు. పిదప ఇస్లాంకు సంబంధించిన విషయాలను నేర్చుకుంటూ ఉండు, ఒక్కో విషయాన్ని ఆచరించు. ఉదాహరణకుః నమాజ్ ఆచరించాలి, దాని విధానం నేర్చుకోవాలి. అలాగే ఇతర ఆదేశాలు. ఇస్లామీయ బోధనలను వివరించు లెట్రిచర్ / సాహిత్యం చాలా ఉన్నాయి. వాటిని చదవడం మరువకండి. మమ్మల్ని సంప్రదించండి.
[2] మానవుడు చేసే శాసన నిర్మాణాలు అల్లాహ్ శాసనాలకు విరుద్ధంగా లేనిచో వాటిని అమలు పరచుట తప్పేమి కాదు.
25.34980855.394526
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.