
[27:32 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]
తయమ్ముమ్:
క్రింద తెలుపబడే కారణాలు సంభవించి నప్పుడు ప్రయాణికులు, స్థానికులు ఎవరైనా సరే వుజూ మరియు గుస్ల్ కు బదులుగా తయమ్ముమ్ చేయవచ్చును.
1- అతికష్టంగా వెతికినప్పటికీ నీళ్ళు దొరకనప్పు డు, లేదా ఉండికూడా వుజూకు సరిపడనప్పుడు తయమ్ముమ్ చేయవచ్చును. కొంత దూరములో నీళ్ళు ఉన్నా అక్కడికి వెళ్ళి తీసుకోవడంలో అతనికి ధన, ప్రాణ నష్టమున్నప్పుడు కూడా తయమ్ముమ్ చేయవచ్చును.
2- వుజూ అవయవాల్లో ఏ ఒకదానికైనా గాయమయితే దాన్ని కడిగే ప్రయత్నం చేయాలి. కడగడం వల్ల నష్టం ఉంటే మసహ్ చేయాలి, అంటే చేయి తడి చేసి దాని మీద తుడువాలి. మసహ్ వల్ల కూడా హాని కలిగే భయం ఉంటే తయమ్ముమ్ చేయవచ్చును.
3- నీళ్ళు లేదా వాతవరణం మరీ చల్లగా ఉండి నీళ్ళ ఉపయోగం హానికరంగా ఉంటే తయమ్ముమ్ చేయవచ్చును.
4- నీళ్ళు కేవలం త్రాగడానికి మాత్రమే ఉన్నప్పుడు కూడా తయమ్ముమ్ చేయవచ్చును.
తయమ్ముమ్ విధానం:
మనుసులో నియ్యత్ /సంకల్పం చేసుకొని రెండు అరచేతులు ఒక సారి భూమిపై తట్టి ముఖముపై మళ్ళీ మణికట్ల వరకు రెండు చేతులపై మసహ్ చేయాలి. (కొందరు వుజూ చేసినట్లుగా మోచేతుల వరకు, కాళ్ళు సయితం మసహ్ చేస్తారు ఇది ప్రవక్త పద్దతి ఎంతమాత్రం కాదు). వుజూను భంగపరిచే విషయాలే తయ మ్ముమ్ ను భంగపరుస్తాయి. నమాజుకు ముందు లేదా నమాజ్ మధ్యలో నీళ్ళు లభిస్తే తయమ్ముం భంగమవుతుంది. నమాజ్ పూర్తి చేసుకున్న తరువాత నీళ్ళు లభిస్తే ఆ నమాజ్ అయినట్లే. తిరిగి మళ్ళీ చేయవలసిన అవసరం లేదు.
ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు
- ఫిఖ్ హ్ (తహారా,శుద్ధి – నమాజు) – పార్ట్ 01 [వీడియో] [51:22 నిముషాలు]
పరిశుభ్రత, అపరిశుభ్రత, నజాసత్ (అశుద్దత) రకాలు, నజాసత్ (అశుద్దత) ఆదేశాలు - ఫిఖ్ హ్ (శుద్ధి,నమాజు) – పార్ట్ 02: మల మూత్ర విసర్జన పద్ధతులు [వీడియో]
- ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) – పార్ట్ 03: వుజూ ఘనత, వుజూ విధానం Q&A [వీడియో]
- ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) – పార్ట్ 04: మేజోళ్ళ (సాక్సులు) పై ‘మసహ్’ QA [వీడియో]
- ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) – పార్ట్ 05: వుజూను భంగపరిచే విషయాలు [వీడియో]
- ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) – పార్ట్ 06: గుసుల్ (శుద్ధి స్నానం) [వీడియో]
- ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) : పార్ట్ 7A – ‘జునుబీ’ (అశుద్ద స్థితిలో ఉన్నవారి) పై నిషిద్ధ విషయాలు [వీడియో]