
[2:32 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
అపశకునాల నమ్మకాలు ఇస్లాంలో నిషిద్ధం
https://teluguislam.net/2019/08/07/belief-in-omens-telugu-islam
తెలుగుఇస్లాం.నెట్ * తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద *
[2:32 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
అపశకునాల నమ్మకాలు ఇస్లాంలో నిషిద్ధం
https://teluguislam.net/2019/08/07/belief-in-omens-telugu-islam
అపశకునాల నమ్మకాలు కలిగిన ప్రజలు పూర్వపు కాలం నుండి ఈ రోజు వరకు ఉన్నారు. వారిలో ఒక్కొక్కరికి ఒక్కొ విధమైన నమ్మకం. కనుక కొంత మంది రాహు కాలాన్ని నమ్ముతారు. ఆ కాలానికి అనుగుణంగా తమ జీవితాలను గడుపుతారు. ఇంకా కొంత మంది గర్బవతి చనిపోతే అపశకునంగా భావించి, ఆమె అంతక్రయలు జరపకుండా కాకులు, గద్దలు పెక్కు తినుట కొరకు ఊరు బయట ఆమె దేహాన్ని పడేసిన సంఘటనలు ఉన్నాయి. మరియు కొంత మంది ప్రజలు ఉదయాన్నే వితంతువు ఎదురుపడితే అపశకునంగా భావిస్తారు. ఒకవేళ తమ అమ్మ లేక చెల్లి లేక కూతురు విధవరాలు ఉంటే, వారిని కూడా ఎదురుగా రాకూడదని నివారిస్తారు. మరియు కొందరు వారి నివాసాలను ఇంటి వరండాలకే పరిమితం చేస్తారు.
మరియు కొందరు ఇంటి నుండి బయలదేరేటప్పుడు పిల్లి గనుక ఎదురు వస్తే, లేక ఎవరైనా వారి ముందు తుమ్మినట్లయితే అపశకునంగా భావిస్తారు. తిరిగి ఇంట్లోకి పోయి కొన్ని నిమిషాలు కూర్చొన్న తరువాత తమ పనిపై బయలదేరుతారు. మరియు వీధికి ఎదురుగా ఇల్లు ఉంటే “వీధి పోటు” అని అపశకునంగా భావించేవారు కూడా ఉన్నారు. మరి కొంత మంది తమ ఇంటి వాస్తు సరిలేక పోతే, దానిని అపశకునంగా భావించి కట్టిన ఇల్లును కూలదీసిన సంఘటనలు లేకపోలేదు.
సూర్య గ్రహణాన్ని, చంద గ్రహణాన్ని కూడా అపశకునంగా నమ్ముతారు. గర్భిణీలపై వాటి ఛాయ పడితే పుట్టబోయే పిల్లలు గుడ్డివారిగానో, కుంటివారిగానో పుట్టుతారని భావిస్తారు. మరియు ఫలానా తేదిలలో లేక సమయాలలో పిల్లలు జన్మిస్తే భాగ్యవంతులు కారని, కాన్పు కాక మునుపే సిజేరియన్ చేసి కడుపులో నుండి పిల్లలను బయటకు తీసిన సంఘటనలు కూడా ఉన్నాయి. మరియు గ్రహణాల ప్రభావం దేవాలయాలపై ఉంటుందని పూజారులు నమ్ముతారు. కనుక వారు దేవాలయాలను సైతం మూసివేస్తారు.
మరియు కొంత మంది ప్రజలు పక్షులను ఎగురవేసి అవి కుడి దిశకు లేక ఎడమ దిశకు పోవటాన్నిబట్టి వారు శకునాలుగా నమ్ముతారు. తాము అనుకున్న దిశలో గాకుండా పక్షులు మరొక వైపు ఎగిరిపోతే దాన్ని అపశకునంగా భావిస్తారు. లేక అనుకున్న దిశలో ఎగిరిపోతే మంచి శకునంగా భావిస్తారు. ఇలా రక రకాల శకునాల నమ్మకాలు దేశ విదేశాల సమాజ ప్రజలలో విస్తరించి ఉన్నాయి.
ఇస్లామీయ ధర్మం ప్రకారం అపశకునం అనేది లేనే లేదు. మరియు లాభ నష్టాల అధికారం అల్లాహ్‌కు తప్ప మరెవరికీ లేదు. కనుక అల్లాహ్ ఇలా తెలియజేసాడు:
ఓ ప్రవకా! ఇలా అను: “మరియు అల్లాహ్ నీకు ఏదైనా హాని కలిగిస్తే! ఆయన తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు. మరియు ఆయన నీకు మేలు చేస్తే! ఆయనే ప్రతిది చేయగల సమర్థుడు.”(సూరతుల్ అన్ఆమ్:17)
మరొకచోట ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:
“ఒక వేళ అల్లాహ్ నీకు ఏదైన ఆపద కలిగించదలిస్తే ఆయన తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు. మరియు ఆయన నీకు మేలు చేయదలిస్తే, ఆయన అను(గహాన్ని ఎవ్వడూ మళ్ళించలేడు” (సూరత్ యూనుస్:107)
మరొకచోట ఇలా ఉంది:
“అల్లాహ్ నాకు కీడు చేయదలుచుకుంటే – ఆయన కీడు నుండి, నన్ను తప్పించగలవా? లేక ఆయన (అల్లాహ్) నన్ను కరుణించగోరితే ఇవి ఆయన కారుణ్యాన్ని ఆపగలవా?” వారితో ఇంకా ఇలా అను: “నాకు కేవలం అల్లాహ్ చాలు! ఆయన (అల్లాహ్)ను నమ్మేవారు (విశ్వాసులు), కేవలం ఆయన మీదే నమ్మకముంచుకుంటారు.” (సూరతు జుమర్:38)
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రధియల్లాహు అన్హు) కథనం: నేను ఒక రోజు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి వాహనంపై ఆయన వెనుక కూర్చుని ఉన్నాను. అప్పుడు ఆయన నాతో ఇలా అన్నారు:
“ఓ అబ్బాయి! నేను నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పుతాను. నీవు అల్లాహ్‌ను గుర్తుంచుకో (అల్లాహ్ ఆదేశాలకు అనుగుణంగా కట్టుబడి ఉండు) అల్లాహ్ నిన్ను గుర్తుంచుకుంటాడు. నీవు అల్లాహ్‌ను గుర్తుంచుకో, ఆయన నీ ముందున్నట్లే గ్రహిస్తావు (అల్లాహ్ సహాయం నీ కొరకు నిత్యం ఉంటుంది). నీవు అర్ధించ దలుచుకున్నప్పుడు అల్లాహ్‌నే అర్థించు. నీవు సహాయం కోరాలనుకుంటే, అల్లాహ్‌నే సహాయం కోసం అర్ధించు. జా(గత్త! లోకమంతా ఏకమై నీకు మేలు చేకూర్చాలనుకున్నా అల్లాహ్ నీ కోసం వ్రాసి పెట్టిన దానికంటే ఎక్కువేమీ అది నీకు మేలు చేకూర్చజాలదు. ఒక వేళ నీకు కీడు తలపెట్టాలన్న ఉద్దేశ్యంతో ఏకమైనా కూడా అల్లాహ్ నీ కోసం వ్రాసి ఉంచిన దానికంటే ఎక్కువ నష్టమేమి అది కలిగించజాలదు. ఎందుకంటే కలములు పైకి లేపుకోబడ్డాయి. (విధివ్రాత (వాయటం అయిపోయింది.) పత్రాల సిరా ఆరిపోయింది.”
(తిర్మిజీ: 2516, సహీహుల్ జామీ : 7957)
హజత్ బురైదా (రధియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) : “దుశ్శకునాలు చూసేవారు కాదు” (అబూదావూద్:3920).
శకునమైనా అపశకునమైనా, దౌర్చాగ్యమైనా, కలిమి అయినా- లేమి అయినా అంతా అల్లాహ్ చేతుల్లోనే ఉన్నాయనీ, అమాయుకులను, అన్యం పుణ్యం తెలియని జంతువులను, నెలలను, దినాలను లేక సమయాలను దోషులుగా నిలబెట్టడం అర్ధం పర్ధం లేని విషయమేననీ మనం తెలుసుకోవాలి.
ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 75 -78). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ
You must be logged in to post a comment.