అన్నదానం ఇస్లాంలో – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అన్నదానం ఇస్లాంలో – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/uwgWP1aKcjs [39 నిముషాలు]

76:5 إِنَّ الْأَبْرَارَ يَشْرَبُونَ مِن كَأْسٍ كَانَ مِزَاجُهَا كَافُورًا
నిశ్చయంగా సజ్జనులు (విశ్వాసులు) ‘కాఫూర్’ కలుపబడిన మధుపాత్రలను సేవిస్తారు.

76:6 عَيْنًا يَشْرَبُ بِهَا عِبَادُ اللَّهِ يُفَجِّرُونَهَا تَفْجِيرًا
అదొక సరోవరం. దైవదాసులు దాన్నుండి (తనివి తీరా) త్రాగుతారు. (తాము కోరిన చోటికి) దాని పాయలు తీసుకుపోతారు.

76:7 يُوفُونَ بِالنَّذْرِ وَيَخَافُونَ يَوْمًا كَانَ شَرُّهُ مُسْتَطِيرًا
వారు తమ మొక్కుబడులను చెల్లిస్తుంటారు. ఏ రోజు కీడు నలువైపులా విస్తరిస్తుందో ఆ రోజు గురించి భయపడుతుంటారు.

76:8 وَيُطْعِمُونَ الطَّعَامَ عَلَىٰ حُبِّهِ مِسْكِينًا وَيَتِيمًا وَأَسِيرًا
అల్లాహ్ ప్రీతికోసం నిరుపేదలకు, అనాధులకు, ఖైదీలకు అన్నం పెడుతుంటారు.

76:9 إِنَّمَا نُطْعِمُكُمْ لِوَجْهِ اللَّهِ لَا نُرِيدُ مِنكُمْ جَزَاءً وَلَا شُكُورًا
(పైగా వారిలా అంటారు) : “మేము కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే మీకు తినిపిస్తున్నాము. అంతేగాని మీ నుండి మేము ఎలాంటి ప్రతిఫలాన్ని గానీ, ధన్యవాదాలను గానీ ఆశించటం లేదు.”

76:10 إِنَّا نَخَافُ مِن رَّبِّنَا يَوْمًا عَبُوسًا قَمْطَرِيرًا
“నిశ్చయంగా మేము మా ప్రభువు తరఫున సంభవించే అత్యంత కఠినమైన, సుదీర్ఘమైన రోజు గురించి భయపడుతున్నాము.”

90:13 فَكُّ رَقَبَةٍ
ఏ (బానిస లేక బానిసరాలి) మెడనైనా (బానిసత్వం నుండి) విడిపించటం.

90:14 أَوْ إِطْعَامٌ فِي يَوْمٍ ذِي مَسْغَبَةٍ
లేదా ఆకలిగొన్న నాడు అన్నం పెట్టడం –

90:15 يَتِيمًا ذَا مَقْرَبَةٍ
బంధుత్వంగల ఏ అనాధకు గాని,

90:16 أَوْ مِسْكِينًا ذَا مَتْرَبَةٍ
మట్టిలో పడిఉన్న ఏ నిరుపేదకు గానీ (అన్నం పెట్టడం)!

90:17 ثُمَّ كَانَ مِنَ الَّذِينَ آمَنُوا وَتَوَاصَوْا بِالصَّبْرِ وَتَوَاصَوْا بِالْمَرْحَمَةِ
అటుపిమ్మట, విశ్వసించి పరస్పరం సహనబోధ చేసుకుంటూ, ఒండొకరికి దయాదాక్షిణ్యాల గురించి తాకీదు చేసుకునేవారైపోవాలి.

90:18 أُولَٰئِكَ أَصْحَابُ الْمَيْمَنَةِ
వీళ్ళే కుడిపక్షం వారు (భాగ్యవంతులు).

69:31 ثُمَّ الْجَحِيمَ صَلُّوهُ
“మరి వాణ్ణి నరకంలోకి త్రోసివేయండి.

69:32 ثُمَّ فِي سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًا فَاسْلُكُوهُ
“మరి వాణ్ణి డెభ్భై మూరల పొడవు గల సంకెళ్ళతో బిగించి కట్టండి.

69:33 إِنَّهُ كَانَ لَا يُؤْمِنُ بِاللَّهِ الْعَظِيمِ
“వాడు మహోన్నతుడైన అల్లాహ్ ను విశ్వసించేవాడూ కాదు,

69:34 وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ
“నిరుపేదకు అన్నం పెట్టమని (కనీసం) ప్రోత్సహించేవాడూ కాదు.

అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం | జాదుల్ ఖతీబ్

ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:-
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్

అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం: [ఇక్కడ డౌన్లోడ్ PDF]

ఖుత్బా యందలి ముఖ్యాంశాలు 

  • 1) ఖురాను హదీసుల వెలుగులో అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం ప్రాధాన్యత.
  • 2) అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం – మహత్యం మరియు లాభాలు.
  • 3) అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం- కొన్ని మహత్తరమైన ఉదాహరణలు.
  • 4) అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం – మర్యాదలు.
  • 5) అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం – కొన్ని రూపాలు.
  • 6) దానాల ద్వారా లభించిన పుణ్యాన్ని వ్యర్థం చేసే కొన్ని కార్యాలు.
  • 7) జకాత్ విధిత్వము – దాని అంశాలు.

తోట యజమాని గాధ (The Story of a garden owner)

తోట యజమాని గాధ (The tory of a garden owner)
https://youtu.be/1Yk-Zvq2sqg [6 నిముషాలు]
వక్త: సయ్యద్ అబ్దుస్సలామ్ ఉమ్రి (హఫిజహుల్లాహ్)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఒక వ్యక్తి ఓ మైదానం గుండా వెళ్తుండగా ఏదో ఓ మేఘం నుంచి “ఫలానా వ్యక్తి తోటలో వర్షం కురిపించు” అన్న శబ్దం వినపడింది. మళ్ళీ ఆ మేఘం పక్కకు జరిగి ఓ నల్లని రాతి నేలపై కురిసింది. (దాంతో చిన్న చిన్న కాల్వలు ఏర్పడ్డాయి) చివరకు ఒక (పెద్ద) కాలువ మిగతా కాలువలన్నిటిని తనలో కలుపుకొని ప్రవహించసాగింది. ఆయన కూడా ఆ ప్రవాహం వెంట నడవసాగాడు. అటు ఓ మనిషి పారతో తన తోటకు నీళ్ళు కడుతున్నాడు. ‘ఓ దైవ దాసుడా! నీ పేరేమిటి అని అతడ్ని అడిగాడు. ఫలాన పేరు అని ఇతను మేఘంలో విన్నపేరే అతడు చెప్పాడు. ‘ఓ దైవదాసుడా! నా పేరెందుకు అడుగుతున్నావు’ అని అతడడిగాడు. ఇతడన్నాడుః నీవు చెప్పిన పేరే చెబుతూ ఫలాన తోటలో వర్షం కురిపించు అని నేను ఏ మేఘంలో విన్నానో దాని నీళ్ళే ఇవి. అయితే అసలు నీవు చేస్తున్న పనేమిటి? అతడన్నాడుః నీవు అడిగావు గనక చెబుతున్నానుః పంట పండిన తర్వాత నేను దాని అంచనా వేసుకొని, మూడో వంతు భాగం దానం చేస్తాను. మరో మూడో వంతు నేను, నా ఆలుబిడ్డలు తినడానికి (ఉంచుకుంటాను). మరో మూడో వంతు తిరిగి విత్తనంగా వేయుటకు ఉపయోగిస్తాను”. మరో ఉల్లేఖనంలో ఉందిః “నేను మూడో వంతును పేదవాళ్ళల్లో, అడిగేవారిలో మరియు బాటసారుల్లో దానం చేస్తాను”. (ముస్లిం 2984).

మరిన్ని కధలు:
https://teluguislam.net/category/stories-kadhalu/

మేలుతో కూడుకున్న ప్రతి మంచి పనీ పుణ్యకార్యమే (సదఖాయే) | బులూగుల్ మరాం | హదీసు 1260 [వీడియో ]

మేలుతో కూడుకున్న ప్రతి మంచి పనీ పుణ్యకార్యమే (సదఖాయే) | బులూగుల్ మరాం | హదీసు 1260
‘సదఖా’ అంటే కేవలం ధనపరమైన దానమే కాదు, పరోపకారంతో కూడుకున్న ప్రతి మంచి పని సదఖాయే.
https://youtu.be/CiwhfXpxP9Q [4 min]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
  1. హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు:

“మేలుతో కూడుకున్న ప్రతి మంచి పనీ పుణ్యకార్యమే (సదఖాయే)”(బుఖారీ)

సారాంశం:

‘సదఖా’ అంటే కేవలం ధనపరమైన దానమే కాదనీ, పరోపకారంతో కూడుకున్న ప్రతి మంచి పని సదఖాయేననీ ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది.

తిర్మిజీ, ఇబ్నె హిబ్బాన్ లలో అబూదావూద్ చే ఉల్లేఖించబడిన హదీసు ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారు:

నీ సోదరుని సమక్షంలో చిరునవ్వును చిందించటం కూడా పుణ్య కార్యమే. ఒక మంచి పని వైపునకు అతనికి మార్గదర్శకత్వం చేయటం, అధర్మమైన ఒక పని నుండి అతణ్ణి ఆపటం కూడా పుణ్యకార్యమే. దారితప్పిన వాడికి దారి చూపించటం కూడా పుణ్యకార్యమే. ఆఖరికి; బాటసారుల బాధను తొలగించే సంకల్పంతో మార్గంలోని ఎముకలను, ముళ్ళను తొలగించటం కూడా పుణ్యకార్యమే. తన బొక్కెనతో తన సోదరుని బొక్కెనలో కొద్ది నీరు పోసినా, అదీ పుణ్యకార్యమే అవుతుంది.”


యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

పిసినారితనం నుండి మిమ్మల్ని కాపాడుకోండి [వీడియో]

పిసినారితనం నుండి మిమ్మల్ని కాపాడుకోండి | బులూగుల్ మరాం | హదీసు 1280
https://youtu.be/K3wcOKsHcp8 [ 9 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1280. హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రభోదించారు:

“అన్యాయానికి దూరంగా ఉండండి ఎందుకంటే అన్యాయం ప్రళయదినాన తమస్సుకు, చిమ్మచీకట్లకు కారణభూత మవుతుంది. ఇంకా పిసినారితనం నుండి నుండి మిమ్మల్ని కాపాడుకోండి. మీకు పూర్వం గతించినవారు దీని (పిసినిగొట్టు తనం) మూలంగానే నాశనమయ్యారు.”

సారాంశం:

ఈ హదీసులో అన్యాయంతో పాటు, పీనాసితనం పట్ల అప్రమత్తంగా ఉండాలని తాకీదు చేయబడింది. ‘అన్యాయం’ తీర్పుదినాన అన్యాయం చేసిన మనిషి పాలిట అంధకారబంధురంగా పరిణమిస్తుంది. అతనికి వెలుతురు , కాంతి కావలసిన తరుణంలో దట్టమైన చీకట్లు అతన్ని అలుముకుంటాయి పిసినారితనం కూడా ఒక దుర్గుణమే. పేరాశకు లోనైనవాడు, పిసినిగొట్టుగా తయారైన వాడు సమాజానికి మేలు చేకూర్చకపోగా, సమాజంలో అత్యంత హీనుడుగా భావించబడతాడు. పిసినారితనం నిత్యం మనస్పర్థలకు, కాఠిన్యానికి కారణభూతమవుతుంది, దుష్పరిణామాలకు దారితీస్తుంది.

యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

దాన ధర్మాలలో ఒక విషయానికి పూర్తిగా సహాయం చేయలేకపోయినా, మీకు చేయగలిగినంత అది కొంచెమైనా చేయండి [వీడియో]

బిస్మిల్లాహ్

దాన ధర్మాలలో ఒక విషయానికి పూర్తిగా సహాయం చేయలేకపోయినా , మీకు చేయగలిగినంత అది కొంచెమైనా చేయండి. చిన్న సహాయమైనా తక్కువ చేసి చూడకండి.

[2:43 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

సత్కార్యవనాలకు చేర్పించే ఐదు మార్గాలు

బిస్మిల్లాహ్

సత్కార్య వనాలు (పుస్తకం) నుండి
ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

సత్కార్యవనాలకు చేర్పించే ఐదు మార్గాలు

ఇవి సంక్షిప్త మార్గాలు. అల్లాహ్ దయతో వీటి ద్వారా నీవు నిన్ను మరియు నీవు చేసే సత్కార్యం వృధా కాకుండా కాపాడు కోవచ్చు.

1- నీవు చేసే ప్రతి కార్యంలో అల్లాహ్ సంతృప్తిని మాత్రమే కోరు. ప్రవక్త పద్ధతిని అనుసరించు. ఏ ఆచరణ అయినా ఈ రెండు షరతులు లేనివే సత్కార్యం కాదు.

[فَمَنْ كَانَ يَرْجُوا لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا] {الكهف:110}

కనుక తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కా- ర్యాలు చేయాలి. ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ చేర్చకూడదు[. (కహఫ్ 18: 110).

2- ఏ సత్కార్యం గురించి విన్నా దానిని ఆచరించడంలో ఆలస్యం చేయకు. సంతోషంతో, ఇష్టాపూర్వంగా సద్మనస్సుతో ముందడుగు వేయి. ఇది దైవభీతి చిహ్నం. అల్లాహ్ ఇలా ఆదేశించాడుః

[وَسَارِعُوا إِلَى مَغْفِرَةٍ مِنْ رَبِّكُمْ وَجَنَّةٍ عَرْضُهَا السَّمَوَاتُ وَالأَرْضُ أُعِدَّتْ لِلْمُتَّقِينَ] {آل عمران:133}

మీ ప్రభువు క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పోయే మార్గంలో పరుగెత్తండి. ఆ స్వర్గం భూమ్యాకాశాల అంత విశాలమై- నది. అది భయభక్తులు కలవారి కొరకు తయారు చెయ్య- బడింది. (ఆలి ఇమ్రాన్ 3: 133).

దైవాదేశాల పాలనకు త్వరపడే ఓ అరుదైన సంఘటన శ్రద్ధగా చదవండిః అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) నఫిల్ నమాజు చేస్తూ ఉన్నారు. నాఫిఅ అను ఆయన బానిస ప్రక్కనే కూర్చుండి, ఆయన ఏదైనా ఆదేశమిస్తే దాని పాలనకు వేచిస్తూ ఉన్నాడు. స్వయంగా నాఫిఅ ఓ గొప్ప పండితులు, ప్రఖ్యాతి గాంచిన హదీసు గ్రంథం మువత్త ఇమాం మాలిక్ యొక్క ఉల్లేఖకుల్లో ఒకరు. అతనిలో ఉన్న ఉన్నత గుణాల వల్ల అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ అతణ్ణి చాలా ప్రేమించేవారు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ నమాజులో ఖుర్ఆన్ పఠిస్తూ “మీరు అమితంగా ప్రేమించే వస్తువులను (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టనంత వరకు మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరు”. (ఆలిఇమ్రాన్ 3: 92). చదివినప్పుడు వెంటనే తన చెయితో సైగ చేశాడు. ఆదేశపాలనకై సిద్ధంగా ఉన్న నాఫిఅకు ఆయన ఎందుకు సైగ చేస్తున్నాడో అర్థం కాలేక పోయింది. అర్థం చేసుకొనుటకై ఎంతో ప్రయత్నం చేశాడు. ఫలితం లేకపోయింది. అందుకు ఆయన సలాం తిప్పే వరకు వేచించి, ఎందుకు సైగ చేశారు? అని అడిగాడు. దానికి అబ్దుల్లాహ్ ఇలా సమాధానం చెప్పారు “అమితంగా నేను ప్రేమించే వస్తువులు ఏమిటని ఆలోచిస్తే నీవు తప్ప నాకు ఏదీ ఆలోచన రాలేదు. అయితే నేను నమాజులో ఉండగానే నీకు స్వేచ్ఛ ప్రసాదించుటకు సైగ చేయడమే మంచిదిగా భావించాను. నమాజు అయ్యే వరకు వేచిస్తే బహుశా నా కోరిక, వాంఛ ఆధిక్యత పొంది ఈ నిర్ణయానికి వ్యతిరేకం జరుగుతుందని భయం అనిపించింది. అందుకే వెంటనే సైగ చేశాను. ఈ మాటను విన్న నాఫిఅ వెంటనే “మీ సహచర్యం లభిస్తుంది కదా”? అని అడిగాడు. అవును నీవు నాతో ఉండవచ్చు అన్న హామీ ఇచ్చారు అబ్దుల్లాహ్.

3- అల్లాహ్ నీకు ఏదైనా సత్కార్యం చేసే భాగ్యం నొసంగాడంటే దానిని మంచి విధంగా సంపూర్ణంగా చేయుటకు ప్రయత్నించు.

[لِلَّذِينَ أَحْسَنُوا الحُسْنَى وَزِيَادَةٌ وَلَا يَرْهَقُ وُجُوهَهُمْ قَتَرٌ وَلَا ذِلَّةٌ أُولَئِكَ أَصْحَابُ الجَنَّةِ هُمْ فِيهَا خَالِدُونَ] {يونس:26}

మంచి పనులు చేసే వారికి మంచి బహుమానాలు లభిస్తాయి. ఇంకా ఎక్కువ అనుగ్రహం లభిస్తుంది. వారి ముఖాలను నల్లదనం గానీ అవమానం గానీ కప్పివేయవు. వారు స్వర్గానికి అర్హులు, అక్కడే శాశ్వతంగా ఉంటారు. (యూనుస్ 10: 26).

నీ అవసరం ఎవరికి పడిందో అతని స్థానంలో నీవు నిన్ను చూసుకో, అప్పుడు ప్రవక్త ఈ ఆదేశాన్ని కూడా దృష్టికి తెచ్చుకోః

 (لَا يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّى يُحِبَّ لِأَخِيهِ مَا يُحِبُّ لِنَفْسِهِ)

“మీలో ఒకరు తాను తన గురించి కోరుకున్నట్లు తమ సోదరుని గురించి కోరనంత వరకు విశ్వాసి కాజాలడు”. (బుఖారి 13, ముస్లిం 45).

4- చేసిన పుణ్యాన్ని గుర్తు చేసుకోకు. ఎవరి పట్ల ఆ కార్యం చేశావో అతన్ని ఎత్తిపోడవకు, హెచ్చరించకు. దాని గురించి మరెవరికో చెప్పుకోబోకు. ఏదైనా ఔచిత్యం ఉంటే తప్ప. అల్లాహ్ ఆదేశం ఇలా ఉంది గమనించుః

[يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا لَا تُبْطِلُوا صَدَقَاتِكُمْ بِالمَنِّ وَالأَذَى] {البقرة:264}

“విశ్వాసులారా! మీరు దెప్పిపొడిచి, గ్రహీత మనస్సును గాయపరచి మీ దానధర్మాలను మట్టిలో కలపకండి.” (బఖర 2: 264).

నీవు చేసిన దాన్ని అల్లాహ్ వద్ద నీ త్రాసులో పెట్టడం జరుగుతుంది. ఎవరి పట్ల నీవు మేలు చేశావో వారు దాన్ని తిరస్కరించినా పరవా లేదు.

5- నీ పట్ల ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయి. అది కనీసం ఒక మంచి మాట ద్వారా అయినా సరే. అల్లాహ్ దయ తర్వాత నీవు సత్కార్యం చేయునట్లు ఇది నీకు తోడ్పడుతుంది. అల్లాహ్ ఆదేశం ఇలా ఉందిః

[وَلَا تَنْسَوُا الفَضْلَ بَيْنَكُمْ] {البقرة:237}

మీరు పరస్పర వ్వవహారాలలో ఔదార్యం చూపడం మరవకండి.” (బఖర 2: 237).


ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది. క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పూర్తి పుస్తకం చదవండి.

  • సత్కార్య వనాలు
    అంశాల నుండి
     : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
    అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

ఫిత్రా దానము (జకాతుల్ ఫిత్ర్) [ఆడియో]

బిస్మిల్లాహ్

చిన్న ఆడియో /వీడియో :

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి[6:26 నిముషాలు]

వివరమైన ఆడియో /వీడియో :

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [16:39 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

సత్కార్య వనాలు: ఉపవాస విరమణ (ఇఫ్తార్) చేయించుట

బిస్మిల్లాహ్

సత్కార్య వనాలు – దశమ వనం
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

ఉపవాస విరమణ (ఇఫ్తార్ చేయించుట)

కేవలం అల్లాహ్ సంతృష్టి కొరకు ఇందులో ఓ పాలు పంచుకున్నవారికి రెండింతల పంట, అంటే నీవు ఒక్క రోజులో రెండు ఉపవాసాలు ఉంటున్నావన్నమాట. అది ధర్మసంపద నుండి కొంత ఖర్చు పెట్టినంత మాత్రాన. దట్టమైన తోటల ఛాయలో నీవు ఛాయ పొందుతావు. ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:

(مَنْ فَطَّرَ صَائِمًا كَانَ لَهُ مِثْلُ أَجْرِهِ غَيْرَ أَنَّهُ لَا يَنْقُصُ مِنْ أَجْرِ الصَّائِمِ شَيْئًا)

ఎవరు ఉపవాసమున్నవారికి ఇఫ్తార్ చేయిస్తారో అతనికి ఉపవాసమున్నవారంత పుణ్యం లభించును. ఉపవాసమున్నవారి పుణ్యంలో ఏ కొరత జరగదు“. (తిర్మిజి 807. ఈ హదీసు హసన్ మరియు సహీ అని ఇమాం తిర్మిజి స్వయంగా చెప్పారు).

ఈ రోజుల్లో -అల్లాహ్ దయతో- కొన్ని స్వచ్ఛంద సేవ సంస్థలు ఎన్నో చోట్ల ఈ ఆరాధనను చాలా సులభమైనదిగా చేస్తున్నారు. కొన్ని (ఇఫ్తార్ చేయించే) మార్గాలు చూపిస్తారు. నీవు నీ కొంత సంపదతో అందులో పాల్గొనవచ్చు. వాస్తవానికి ఇది అగత్య పరులపై అల్లాహ్ కరుణ మరియు ఉపకారం చేసేవారికై రెట్టింపు పుణ్యాలకు మంచి దారి.

నీవు స్వయంగా ఈ దృశ్యాలు చూసి ఉంటావు. మస్జిదు ఆవరణలో మంచి మంచి ఆహారపదార్థాలతో విస్తరి వేయబడి ఉంటుంది. దాని చుట్టు దేశ, విదేశ బీద ముస్లింలు ఎంతో ప్రేమ, సంతోషంతో కూర్చుండి ఉంటారు. శ్రీమంతులు, ధనవంతులు స్వయంగా వారి సేవలో ఉండటాన్ని చూసి నీ నరనరాల్లో విశ్వాసం జీర్ణించుకుపోతుంది. వారు (శ్రీమంతులు) వారి(ఇఫ్తార్ చేయువారి)కిచల్లటి నీరు, వేడి వేడి జిలేబీలు, ఇతర తీపి పదార్థాలు అందిస్తూ ఉంటారు. సౌభ్రాత్వం, ప్రేమతో కూడిన చిరునవ్వు దాని మాధుర్యాన్ని మరింత పెంచుతుంది. ఇది ఓ చెప్పరాని విశ్వాసం. ఇది నిన్ను నీ ధర్మంపై గౌరవంగా ఉండే విధంగా చేస్తుంది. ఈ ధర్మమే ధనవంతుడిని పేదవాని పెదవుపై చిరునవ్వు తెప్పించే వానిగా చేస్తుంది. అంతే కాదు ధనవంతుడు స్వయంగా పేదలను వెతికి వారు సంతోషపడే వరకు వారికి ఇస్తూ ఉండే విధంగా చేస్తుంది.

వాస్తవానికి నేను ఆ సౌభ్రాత్రుత్వ దృశ్యాన్ని మరవలేను. నా కళ్ళారా నేను చూశాను (ఇఫ్తార్ సందర్భంలో) ఒక యజమాని తన చేతిలో ముద్ద తీసుకొని తన పనిమనిషి నోటిలో పెట్ట బోయాడు. ఆ పనిమనిషి సిగ్గుపడి తాను కూర్చున్న స్థలాన్ని వదలి పరిగెత్తాడు. యజమాని అతని వెంట పరుగిడుతూ చివరికి అతని నోట్లో ముద్ద పెట్టాడు. ఇది ఏదో ఒక నూతన సంఘటన కాదు. ప్రవక్త ﷺ ప్రవచనానికి ఆచరణ రూపం.

(إِذَا أَتَى أَحَدَكُمْ خَادِمُهُ بِطَعَامِهِ فَإِنْ لَمْ يُجْلِسْهُ مَعَهُ فَليُنَاوِلْهُ لُقْمَةً أَوْ لُقْمَتَيْنِ أَوْ أُكْلَةً أَوْ أُكْلَتَيْنِ فَإِنَّهُ وَلِيَ عِلَاجَهُ)

మీలో ఎవరి దగ్గరికైనా అతని సేవకుడు భోజనం తీసుకువస్తే, అతను సేవకుడ్ని తనతో పాటు భోజనానికి కూర్చోబెట్టుకోలేని స్థితిలో ఉంటే అందులో నుంచి ఒక రెండు ముద్దలయినా అతనికి తప్పకుండా పెట్టాలి. ఎందుకంటే అతను అన్నం వండే శ్రమ భరించాడు“. (బుఖారి 2557, ముస్లిం 1663).

ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది. క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పూర్తి పుస్తకం చదవండి.


ఇతరములు :

రమదాన్  మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/

సత్కార్య వనాలు: అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేయుట

బిస్మిల్లాహ్

సత్కార్య వనాలు – తృతీయ వనం
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేయుట

ప్రియ సోదరా! దైవ వాగ్దానాలు, అప్పులిచ్చేవారికి రెండితలు లభించే పుణ్యాలు, ఉత్తమ ఫలితాలు, ఎల్లకాలం ఉండే ఫలాలు, నీడలు గల స్వర్గాలు. ఎవరికీ? మనో తృప్తితో, ఆత్మసంతోషంతో, ఉదార గుణంతో దానం చేసేవారికి. అతని ముందు ఉత్తమ వాగ్దాన ఖుర్ఆన్ ఆయతులు అట్లే వచ్చేస్తాయి:

مَن ذَا الَّذِي يُقْرِضُ اللهَ قَرْضاً حَسَناً فَيُضَاعِفَهُ لَهُ وَلَهُ أَجْرٌ كَرِيمٌ

అల్లాహ్ కు రుణం ఇచ్చేవాడెవడైనా ఉన్నాడా? మేలైన రుణం: అటువంటి వానికి అల్లాహ్ దానిని ఎన్నో రెట్లు పెంచి తిరిగి ఇస్తాడు. అతనికి ఎంతో శ్రేష్ఠమైన ప్రతిఫలం లభిస్తుంది. (హదీద్ 57: 11).

الَّذِينَ يُنْفِقُونَ أَمْوَالَهُمْ بِاللَّيْلِ وَالنَّهَارِ سِرًّا وَعَلَانِيَةً فَلَهُمْ أَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ

తమ సంపదను రేయింబవళ్ళు బహిరంగంగానూ, రహస్యంగానూ ఖర్చు చేసే వారు తమ ప్రతిఫలాన్ని తమ ప్రభువు వద్ద పొందుతారు. (బఖర 2: 274).

దానధర్మాలు ఐశ్వర్యవంతమైన చెలమ. దాని ప్రవాహంతో జీవిత పాపాలు, కష్టాలన్నీ కొట్టుకపోతాయి. మంచి విషయాల్లో ఖర్చు పెట్టుట ఎన్నో పెద్ద రోగాలకు బల్సమ్ చికిత్స లాంటిది. గుప్తంగా ఖర్చు పెట్టుట వలన ధనంలో అభివృద్ధి, శుభాలు కలుగుతాయి. భూమ్యాకాశాల ప్రభువు వీటి వాగ్దానం చేశాడు.

قُلْ إِنَّ رَبِّي يَبْسُطُ الرِّزْقَ لِمَنْ يَشَاءُ مِنْ عِبَادِهِ وَيَقْدِرُ لَهُ وَمَا أَنْفَقْتُمْ مِنْ شَيْءٍ فَهُوَ يُخْلِفُهُ وَهُوَ خَيْرُ الرَّازِقِينَ

ఇలా చెప్పండి: నా ప్రభువు తన దాసులలో తన కిష్టమైన వారికి విస్తృతమైన ఉపాధిని ఇస్తాడు. తన కిష్టమైన వారికి ఆచితూచి ఇస్తాడు. మీరు దేనిని ఖర్చు చేసినప్పటికీ దాని స్థానంలో ఆయనే మీకు మరింత ఇస్తాడు. ఆయనే సర్వశ్రేష్ఠుడైన జీవనోపాధిప్రదాత. (సబా 34: 39).

ఔదార్యుడా! నీవు చేసే దానం ఒక బీజం లాంటిది. ఈ నేలపై కాలు మోపిన అతి ఉత్తమమైనవారు; అంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దాని బీజం నాటారు. వాస్తవానికి దానధర్మాలు చేయడంలో ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రభంజనం కన్నా చురుకుగా ఉండేవారు“. (బుఖారి 6, ముస్లిం 2308).

ఈ వనంలోని పూవుల్లో ఒక పూవును సమీపించడానికి ఈ పేజిలో ఈ సంఘటన చదువుదాము.

తెల్ల జాతివారి ఇంట్లోని ఓ వ్యక్తి మధ్యలో ఉన్న మంచం మీద సంపూర్ణ జడత్వానికి (కోమా) గురి అయిఉన్నాడు. అతని ప్రక్కనే ఉన్న నాడిమితి (Pulsimeter), శ్వాసను కంట్రోల్ చేసే యంత్రం మరియు మెడికల్ సొల్యూషన్ ట్యూబుల  గురించి అతనికి ఏమీ తెలియదు.

సంవత్సరం పైగా ఎడతెగ కుండా ప్రతి రోజు అతని భార్య మరియు 14 సంవత్సరాల ఓ కొడుకు అతని వద్దకు వచ్చి, ప్రేమ, వాత్సల్యంతో అతని వైపు చూసి, అతనికి బట్టలు మార్చి, అతని క్షేమ విషయాలు తెలుసుకుంటూ, అతని గురించి డాక్టర్ తో కూడా మరిన్ని వివరాలు తెలుసుకుంటూ ఉండేవారు. అతనిలో ఏ కొత్త మార్పు లేకుండా, ఎక్కువ తక్కువ కాకుండా అదే ఆరోగ్య స్థితిలో సంపూర్ణ జడత్వం (Coma)లో ఉన్నాడు. అల్లాహ్ తప్ప అతని స్వస్థత ఆశ ఎక్కడా లేకుండా అయిపోయింది. కాని ఓర్పుగల స్త్రీ మరియు యవ్వనారంభదశలో ఉన్న అబ్బాయి ఇద్దరూ వినయ నమ్రతతో తమ చేతులు అల్లాహ్ వైపు ఎత్తి అతని స్వస్తత, ఆరోగ్యం గురించి దుఆ చేయనిదే అక్కడి నుండి వెళ్ళేవారు కారు.

అదే రోజు మళ్ళీ తిరిగి రావడానికి హాస్పిటల్ నుండి వెళ్ళిపోయేవారు. ఇలా ఎడతెగకుండా చికాకు, అలసట లేకుండా ప్రతి రోజు వస్తూ ఉండేవారు. హృదయాలు ప్రేమతో ఏకమైనాయి, సత్యంతో కలసిపోయాయి, కష్టాల్లో ఓర్పు, సానుభూతి, జాలి లాంటి పూర్ణసౌందర్య పుష్పాలు పుష్పించాయి.

ఏ కొత్త మార్పు లేని ఈ శవం లాంటి రోగి దర్శనానికి వస్తున్న స్త్రీ మరియు అబ్బాయిని చూసి పేషెంట్లు, నర్సులు, డాక్టర్లే ఆశ్చర్యపోయేవారు. అల్లాహ్! అల్లాహ్!! ఎంతటి విచిత్రమైన సందర్భం! తన ప్రక్కన ఏముందో తెలియని రోగి దర్శనం రోజుకు రెండు సార్లా? డాక్టర్లు మరియు వారి అసిస్టెంటులు వారిద్దరిపై జాలి, దయ చూపుతూ “అతని దర్శనమవసరం లేదు. వారంలో ఒకసారి రండి చాలు” అని స్పష్టం చేశారు. అప్పుడు “అల్లాహుల్ ముస్తఆన్, అల్లాహుల్ ముస్తఆన్” (సహాయం కోసం అర్థింపదగిన వాడు అల్లాహ్ మాత్రమే) అన్న పదాలే ఆ శ్రేయోభిలాష గుణం గల ఆడపడచు నోట వెళ్లేవి.

ఒకరోజు … భార్య, కొడుకుల దర్శానినికి కొంచెం ముందు ప్రభావితమైన ఓ వింత సంఘటన సంభవించింది; కోమాలో ఉన్న మనిషి తన మంచంలో కదులుతున్నాడు, ప్రక్క మార్చుతున్నాడు, క్షణాలు గడవక ముందే కళ్ళూ తెరుస్తున్నాడు, ఆక్సిజన్ యంత్రాన్ని తన నుండి దూరం జేస్తూ, సరిగ్గా కూర్చుంటున్నాడు, నర్సును పిలుస్తూ ఓ కేక వేస్తున్నాడు. ఆమె బిత్తరపోయి వెంటనే హాజరయింది. అతడు ఆమెతో వైద్య యంత్రాలన్నిటి (Medical equipments)ని తీయమని కోరాడు. ఆమె నిరాకరించి వెంటనే డాక్టర్ ను పిలిచింది. అతడు దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే ఎన్నో రకాల చెకప్ లు చేశాడు. కాని ఆ మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు. అప్పుడు డాక్టర్ అవును ఈ యంత్రాలన్నిటిని తీసేసి అతని శరీరాన్ని శుభ్రపరచండని ఆదేశించాడు.

నిష్ఠగల భార్య దర్శన సమయం సమీపించింది. భార్య మరియు కొడుకు తమ ప్రియమైనవారి వద్దకు వచ్చారు. నేను ఏ విధంగా ఆ దయార్థ క్షణాలను వర్ణించాలో, ఏ పదాలను కూర్చి నీ ముందు ఉంచాలో, వాస్తవానికి (వర్ణనాతీతమైన ఘడియ అది) చూపులు చూపులను కౌగలించుకుంటున్నాయి, అశ్రువులు అశ్రువుల్లో మిశ్రమం అయిపోతున్నాయి. చిరునవ్వులు పెదవులపై నివ్వెర పరుస్తున్నాయి. అనుభూతులు నోరుమూతపడవేశాయి. కేవలం అమిత దయాలుడు, మహోపకారుడైన అల్లాహ్ స్తోత్రములు తప్ప. ఆయనే ఆమె భర్తకు స్వస్థత వరం ప్రసాదించాడు.

ఓ పుణ్యాత్ములారా ఈ సంఘటన ఇక్కడికే అంతం కాలేదు. ఇందులో ఓ గొప్ప రహస్యం ఉంది. అది స్పష్టమయ్యే వరకు డాక్టర్ కే ఓపిక లేదు. వెంటనే అతని భార్యను ‘నీవెప్పుడైనా ఇతడ్ని ఈ స్థితిలో చూడగలుతావని ఆశించావా?’ అని ప్రశ్నించాడు. ఆమె చెప్పింది: ‘అవును, అల్లాహ్ సాక్షిగా! ఒక రోజు తప్పక రానుంది ఆయన మా రాక గురించి కూర్చుండీ వేచిస్తారు’ అని నేను ఆశించాను’.

డాక్టర్ చెప్పాడు: అతను ఈ స్థితికి రావడానికి ఎదో విషయముంది. అందులో వైద్యశాలకే గాని లేదా వైద్యులకే గాని ఏ ప్రమేయం, ఏ పాత్ర లేదు. అల్లాహ్ సాక్షిగా అడుగుతున్నాను నీవు తప్పక చెప్పే తీరాలి. అవును? రోజుకు రెండేసి సార్లు నీవు ఎందుకని వస్తూ ఉంటివి? నీవు ఏమి చేస్తూ ఉంటివి?

ఆమె చెప్పింది: నీవు నాపై అల్లాహ్ పేరున ప్రమాణం చేసి అడగావు గనక చెబుతున్నాను: నేను మొదటి దర్శనానికి ఆయన తృప్తి మరియు ఆయన గురించి దుఆ చేయుటకు వచ్చేదానిని. మళ్ళీ నేను, నా కొడుకు అల్లాహ్ సామీప్యం కోరుతూ, అల్లాహ్ ఆయనకు స్వస్థత ప్రసాదించాలని బీదవాళ్ళ మరియు నిరుపేదల వద్దకు వెళ్ళి దానధర్మాలు చేసేవాళ్ళము.

అల్లాహ్ ఆమె ఆశను, దుఆను నిరాశగా చేయలేదు. ఆమె చివరి దర్శనానికి వచ్చి, ఆయన రాక కొరకు వేచిస్తూ ఉన్న ఆమె, ఆయన్ని తన వెంట తీసుకువెళ్ళసాగింది. ఆమె, ఆమె ఇంటి వారి కొరకు చిరునవ్వులు, సంతోషాలు తిరిగి రాసాగాయి.

ఎంత పరిపక్వమైన ఫలము అది. మరెంత రుచిగల పండు.

الَّذِينَ يُنْفِقُونَ أَمْوَالَهُمْ بِاللَّيْلِ وَالنَّهَارِ سِرًّا وَعَلَانِيَةً فَلَهُمْ أَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ]

తమ సంపదను రేయింబవళ్ళు బహిరంగంగానూ, రహస్యంగానూ ఖర్చు చేసేవారు తమ ప్రతిఫలాన్ని తమ ప్రభువు వద్ద పొందుతారు. వారికి ఏ విధమైన భయంగాని, దు:ఖంగాని కలిగే అవకాశం లేదు. (బఖర 2: 274).

ఈ సంఘటనను గౌరవనీయులైన అధ్యాపకులు అహ్మద్ సాలిమ్ బా దువైలాన్ “లా తయ్అస్” అన్న తన రచనలో పేర్కొన్నారు. అల్లాహ్ వారికి మరింత సద్భాగ్యం ప్రసాదించుగాక. మరియు మా వైపున ఉత్తమ ఫలితం నొసంగుగాక.

అల్లాహ్ దయ చాలా గొప్పది. ఆయనే ఇలా ఆదేశించాడు:

لَنْ تَنَالُوا البِرَّ حَتَّى تُنْفِقُوا مِمَّا تُحِبُّونَ

మీరు అమితంగా ప్రేమించే వస్తువులను (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టనంత వరకు మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరు. (ఆలిఇమ్రాన్ 3: 92).

దానధర్మాలు ఏ చోట చేస్తే చాలా మేలు ఉందో వెతకాలి. అయితే అన్నిట్లో కెల్లా అతిఉత్తమమైన స్థానం అల్లాహ్ వద్ద అతి చేరువ స్థానం పొందుటకు ఇల్లాలు, పిల్లలకు మరియు బంధువులపై ఖర్చు చేయాలి.

عَنْ أُمِّ سَلَمَةَ ﷝ قُلْتُ يَا رَسُولَ الله ﷺ هَلْ لِي مِنْ أَجْرٍ فِي بَنِي أَبِي سَلَمَةَ أَنْ أُنْفِقَ عَلَيْهِمْ وَلَسْتُ بِتَارِكَتِهِمْ هَكَذَا وَهَكَذَا إِنَّمَا هُمْ بَنِيَّ قَالَ: (نَعَمْ لَكِ أَجْرُ مَا أَنْفَقْتِ عَلَيْهِمْ).

ఉమ్మె సల్మా (రదియల్లాహు అన్హా) ప్రవక్త ﷺ వద్దకు వచ్చి ‘ప్రవక్తా! నేను అబూ సలమ సంతానం కొరకు ఖర్చు చేస్తే నాకు పుణ్యం లభిస్తుందా? నేను వారిని (దీన స్థితిలో చూస్తూ) వదలలేను. వాళ్ళు కూడా నా పిల్లలే కదా?’ అని అడిగింది. దానికి ప్రవక్త ﷺ చెప్పారుః అవును, నీవు వారి కొరకు ఖర్చు చేస్తున్నదాని ప్రతిఫలం నీకు తప్పక లభిస్తుంది“. (బుఖారి 5369, ముస్లిం 1001).

మనం మన భార్యపిల్లలపై ఖర్చు చేయని రోజంటు ఏదైనా ఉంటుందా? కావలసిందేమిటంటే మనం సర్వ లోకాల ప్రభువైన అల్లాహ్ తో పుణ్యాన్ని  ఆశించాలి. ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారు:

إِنَّكَ لَنْ تُنْفِقَ نَفَقَةً تَبْتَغِي بِهَا وَجْهَ الله إِلَّا أُجِرْتَ عَلَيْهَا حَتَّى مَا تَجْعَلُ فِي فَمِ امْرَأَتِكَ

నీవు అల్లాహ్ ప్రసన్నత కోరుతూ ఖర్చు చేసే ప్రతీదానికి నీకు తప్పకుండా పుణ్యం లభిస్తుంది. చివరికి నీవు నీ భార్య నోటికందించే దాని(ముద్ద, గుటక)పై కూడా నీకు పుణ్యం దొరుకుతుంది“. (బుఖారి 56, ముస్లిం 1628).

అల్లాహ్ నీ ఉపాధిలో వృద్ధి చేసి ఉంటే నీవు స్వయం నీపై మరియు దేశ, విదేశాల్లో ఉన్న నీ సోదరులపై ఎక్కువైనా, తక్కువైనా శుభప్రదమైన ఖర్చు చేస్తూ ఉండడంలో పిసినారితనం వహించకు.

తక్కువ దానం, దాని ఉదాహరణ ఒక మస్జిద్ ఇమాం ఇలా ప్రస్తావించాడు: మస్జిద్ శుభ్రపరిచే పనిమనుషుల్లో ఒకరి విషయం చాలా గొప్పగా ఉంది; అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయుటకు ఎప్పుడు చెప్పినా వెంటనే అంగీకరించి, తాను స్వయంగా ఆర్థికంగా బలహీనుడు, దీనుడయినప్పటికీ వెనకాడకుండా అతని శక్తి ప్రకారంగా అర్థ రూపాయి దానం చేసేవాడు. కేవలం అర్థ రూపాయి!! జాగ్రత్త! చాలా తక్కువే కదా అన్న హీనభావం నీలో కలగకూడదు. నిశ్చయంగా అల్లాహ్ వద్ద దాని విలువ చాలా గొప్పగా ఉంది. ఎందుకో నీకు తెలుసా? ఎందుకనగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వస్లలం) ఇలా చెప్పారు:

 مَنْ تَصَدَّقَ بِعَدْلِ تَمْرَةٍ مِنْ كَسْبٍ طَيِّبٍ وَلَا يَقْبَلُ اللهُ إِلَّا الطَّيِّبَ وَإِنَّ اللهَ يَتَقَبَّلُهَا بِيَمِينِهِ ثُمَّ يُرَبِّيهَا لِصَاحِبِهِ كَمَا يُرَبِّي أَحَدُكُمْ فَلُوَّهُ حَتَّى تَكُونَ مِثْلَ الْجَبَلِ

అల్లాహ్ ధర్మసమ్మతమైన సంపాదన (నుండి ఇచ్చే దానాల్ని) మాత్రమే స్వీకరిస్తాడు. అందుకే ఎవరైనా ధర్మసమ్మతమైన సంపాదన నుండి ఖర్జూరపుటంత వస్తువేదైనా దానం చేస్తాడో అల్లాహ్ దానిని కుడి చేత్తో అందుకొని మీరు గుర్రపు పిల్లను పెంచి పెద్ద చేసినట్లుగా దానిని దానం చేసినవాడి కోసం పెంచుతాడు. అలా పెరుగుతూ చివరకు అది పర్వతమంత పెద్దదిగా అయిపోతుంది“. (బుఖారి 1410).

అది అర్థ రూపాయి మాత్రమే.. కాని అల్లాహ్ ఆజ్ఞతో నరకాగ్ని నుండి రక్షణకై గొప్ప కారణం కావచ్చు. నాతో పాటు మీరు కూడా ప్రవక్త ఈ ప్రవచనం గుర్తు చేసుకోలేరా?

اتَّقُوا النَّارَ وَلَوْ بِشِقِّ تَمْرَةٍ

మిమ్మల్ని మీరు నరకం నుండి కాపాడుకోండి, ఒక ఖర్జూరపు ముక్క (దానం)తో నైనా సరే“. (బుఖారి 1417).

మనం నింపాదిగా అడుగులు ముందుకేస్తూ ఒక స్వచ్ఛంద సేవ సంస్థ వైపుకెళ్దాము, అక్కడ ఓ దాతృత్వ దృశ్యాన్ని వీక్షిద్దాము: పండుగకు ఒకరోజు ముందు రాత్రి వేళ అక్కడి ఒక అధికారి వద్దకు పది సంవత్సరాలు కూడా దాటని ఒక అబ్బాయి వచ్చి సుమారు రెండు వందల రూపాలు దానం చేస్తాడు. ఎంతో ఆశ్చర్యంతో ‘నీకీ డబ్బలు ఎక్కడివి, మేము వీటిని ఏమి చేయాలి’ అని అతను అడుగుతాడు. అబ్బాయి ఇలా సమాధానమిస్తాడు: ఈ డబ్బులు నాకు నా తండ్రి పండుగ కొరకు బట్టలు కొనుక్కోమని  ఇచ్చాడు. అయితే ఈ డబ్బులతో అనాధ అబ్బాయి ఎవరైనా పండుగ సందర్భంగా తన కొరకు కొత్త బట్టలు కొన్నుకుంటే బాగుంటుందని నా కోరిక. ఇక పోతే నాకు నా శరీరంపై ఉన్న ఈ బట్టలే చాలు అని అన్నాడు.

అల్లాహ్ మరింత సద్భాగ్యం ప్రసాదించుగాక ఆ ఇంటివారికి ఎందులోనైతే నీవు పెరుగుతున్నావో ఎవరి ఒడిలో నీవు పెద్దగవుతున్నావో! అల్లాహ్ ఇహపరాల్లో నిన్ను వారి కళ్ళకు చల్లదనంగా చేయుగాక.

ప్రియపాఠకుడా! ఒకవేళ నీవు ఎక్కువ ధనం గలవాడివై ఉంటే అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన సంఘటనను గుర్తు చేసుకో:

كَانَ أَبُو طَلْحَةَ أَكْثَرَ الْأَنْصَارِ بِالْمَدِينَةِ مَالًا مِنْ نَخْلٍ وَكَانَ أَحَبُّ أَمْوَالِهِ إِلَيْهِ بَيْرُحَاءَ وَكَانَتْ مُسْتَقْبِلَةَ الْمَسْجِدِ وَكَانَ رَسُولُ الله ^ يَدْخُلُهَا وَيَشْرَبُ مِنْ مَاءٍ فِيهَا طَيِّبٍ قَالَ أَنَسٌ فَلَمَّا أُنْزِلَتْ هَذِهِ الْآيَةُ [لَنْ تَنَالُوا الْبِرَّ حَتَّى تُنْفِقُوا مِمَّا تُحِبُّونَ] قَامَ أَبُو طَلْحَةَ إِلَى رَسُولِ الله ^ فَقَالَ يَا رَسُولَ الله إِنَّ اللهَ تَبَارَكَ وَتَعَالَى يَقُولُ [لَنْ تَنَالُوا الْبِرَّ حَتَّى تُنْفِقُوا مِمَّا تُحِبُّونَ] وَإِنَّ أَحَبَّ أَمْوَالِي إِلَيَّ بَيْرُحَاءَ وَإِنَّهَا صَدَقَةٌ لِله أَرْجُو بِرَّهَا وَذُخْرَهَا عِنْدَ الله فَضَعْهَا يَا رَسُولَ الله حَيْثُ أَرَاكَ اللهُ قَالَ: فَقَالَ رَسُولُ الله ^: (بَخٍ ذَلِكَ مَالٌ رَابِحٌ ذَلِكَ مَالٌ رَابِحٌ وَقَدْ سَمِعْتُ مَا قُلْتَ وَإِنِّي أَرَى أَنْ تَجْعَلَهَا فِي الْأَقْرَبِينَ) فَقَالَ أَبُو طَلْحَةَ: أَفْعَلُ يَا رَسُولَ الله فَقَسَمَهَا أَبُو طَلْحَةَ فِي أَقَارِبِهِ وَبَنِي عَمِّهِ.

మదీనాలోని అన్సార్ ముస్లిములలో అందరికంటే ఎక్కవ ఖర్జూరపు తోటల సంపద కలిగి ఉన్న వ్యక్తి అబూ తల్హాయే ఉండిరి. తన సంపదలో ఆయనకు ‘బైరుహా’ అనే తోటంటే చాలా ఇష్టం. అది మస్జిదె నబవికి ఎదురుగా ఉండింది. ప్రవక్త ﷺ కూడా ఆ తోటలోకి వెళ్తుండేవారు. అక్కడ లభించే మంచి నీళ్ళు త్రాగేవారు. “మీకు అత్యంత ప్రీతికరమైన దానిని మీరు దానం చేయనంత వరకు మీరు పుణ్య స్థాయికి చేరుకోలేరు” అనే అల్లాహ్ ఆయతు అవతరించినప్పుడు అబూ తల్హా లేచి, ‘ప్రవక్తా! “మీకు అత్యంత ప్రీతికరమైన దానిని మీరు దానం చేయనంత వరకు మీరు పుణ్య స్థాయికి చేరుకోలేరు” అనే ఆయతు అల్లాహ్ మీపై అవతరింప జేశాడు. నా సంపద మొత్తంలో ‘బైరుహా’ తోట నాకు అత్యంత ప్రీతికరమైనది. అందుకు నేను దానిని అల్లాహ్ కోసం దానం చేస్తున్నాను. దానిపై నాకు పుణ్యం లభిస్తుందని, అల్లాహ్ వద్ద అది నిలువచేసి ఉంచబడుతుందని ఆశిస్తున్నాను. కనుక ప్రవక్తా! మీరు దీనిని అల్లాహ్ మీకు చూపిన పద్దుల్లో వినియోగించండి’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త ﷺ “ఓహో! ఇదెంతో లాభదాయకమైన సంపద, నిజంగా ఇది ఎంతో లాభదాయకమైన సంపద. ఇప్పుడు నువ్వన్న మాటలన్నీ నేను విన్నాను. అయితే నీవు దానిని నీ బంధువుల్లో పంచిపెడితే బాగుంటుందని నేను భావిస్తున్నాను” అని అన్నారు. దానికి అబూ తల్హా ‘నేను అలాగే చేస్తాను ప్రవక్తా!’ అని అన్నారు. అన్న ప్రకారమే ఆయన దానిని తన బంధువులకు, పెద్దనాన్న, చిన్నాన్న పిల్లలకు పంచిపెట్టారు”. (బుఖారి 1461).

ప్రియసోదరా! దైవదూతలు ఎవరి కొరకు దుఆ చేస్తారో వారిలో ఒక్కనివి నీవు అయిపో:

اللَّهُمَّ أَعْطِ مُنْفِقًا خَلَفًا

ఓ అల్లాహ్! నీ (మార్గంలో) దానం చేసేవారికి నీవు వెంటనే మరింత ప్రసాదించు“. (బుఖారి 1442, ముస్లిం 1010).

ప్రియసోదరా! అల్లాహ్ ఎవరిపై ఖర్చు చేస్తాడో వారిలో ఒకనివి నీవు ఐపో, ఆయనే స్వయంగా ఒక హదీసె ఖుదుసిలో ఇలా చెప్పాడు:

أَنْفِقْ يَا ابْنَ آدَمَ أُنْفِقْ عَلَيْكَ

ఆదము కుమారా నీవు ఖర్చు చేయి నేను నీపై ఖర్చు చేస్తాను“. (బుఖారి 5352).

ప్రియసోదరా! నీవు దానం చేసిందే నీ కొరకు మిగిలి ఉండేది. అది అంతం అయ్యేది కాదు. ఏదైతే నీవు ఖర్చు చేయకుండా ఆపి ఉంచుతావో అదే నిజానికి నీకు కానిది అని నమ్ము.

عَنْ عَائِشَةَ ﷝ أَنَّهُمْ ذَبَحُوا شَاةً فَقَالَ النَّبِيُّ ^: (مَا بَقِيَ مِنْهَا؟) قَالَتْ: مَا بَقِيَ مِنْهَا إِلَّا كَتِفُهَا قَالَ: (بَقِيَ كُلُّهَا غَيْرَ كَتِفِهَا).

ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం: వారు ఓ మేకను కోశారు. (దాని మాంసంలో చాలా భాగం ప్రజలకు పంచి పెట్టారు). ఆ సందర్భంగా ప్రవక్త ﷺ ఆయిషా (రదియల్లాహు అన్హా)తో “ఆ మాంసంలో ఇంకా ఎంత మిగిలి ఉంది? అని అడిగారు. ‘అంతా అయిపోయింది, ఒక్క భుజ భాగం మాత్రమే మిగిలి ఉంది అని చెప్పారామె. దానికాయన “(కాదు) ఆ భుజ భాగం తప్ప తతిమ్మా మాంసమంతా మిగిలి ఉంది” అని చెప్పారు. (ఇమాం తిర్మిజి దీనిని ఉల్లేఖించి ఇది సహీ హదీసు అని చెప్పారు).

అంతే కాదు.. మనం దానం చేసింది మిగిలి ఉండడమే కాదు. అది పెరుగుతూ ఉంటుంది. ప్రవక్త ﷺ చెప్పారుః

مَا نَقَصَتْ صَدَقَةٌ مِنْ مَالٍ

దానధర్మాలు ఎప్పుడూ సంపదలో లోటు ఏర్పరచవు“. (ముస్లిం 2588).

ధర్మప్రచారంలో ఉన్న నా సోదరుడు డా. ఖాలిద్ బిన్ సఊద్ అల్ హులైబీ తెలిపాడు: దాతృత గుణంగల ఒక పెద్ద వ్యాపారి అహ్ సా పట్టణంలోని గొప్ప ధనవంతుల్లోని ఒకరు షేఖ్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ అజీజ్ అన్నుఐమ్ ~ ఇలా చెప్పేవారు: నేను అల్లాహ్ మార్గంలో ఏది ఖర్చు చేసినా, దాని ఘనత వల్ల అందులో చాలా శుభం నా కళ్ళార చూసేవాడిని.

ఈ హదీసుపై శ్రద్ధ వహించు, ఇది ఈ సుందర వనం ఫలాల్లోని ఓ ఫలాన్ని నీకు అతి చేరువుగా చేస్తుంది:

عَنْ أَبِي هُرَيْرَةَ ﷜ عَنْ النَّبِيِّ ^ قَالَ: (بَيْنَا رَجُلٌ بِفَلَاةٍ مِنْ الْأَرْضِ فَسَمِعَ صَوْتًا فِي سَحَابَةٍ اسْقِ حَدِيقَةَ فُلَانٍ فَتَنَحَّى ذَلِكَ السَّحَابُ فَأَفْرَغَ مَاءَهُ فِي حَرَّةٍ فَإِذَا شَرْجَةٌ مِنْ تِلْكَ الشِّرَاجِ قَدْ اسْتَوْعَبَتْ ذَلِكَ الْمَاءَ كُلَّهُ فَتَتَبَّعَ الْمَاءَ فَإِذَا رَجُلٌ قَائِمٌ فِي حَدِيقَتِهِ يُحَوِّلُ الْمَاءَ بِمِسْحَاتِهِ فَقَالَ لَهُ يَا عَبْدَ الله مَا اسْمُكَ قَالَ فُلَانٌ لِلِاسْمِ الَّذِي سَمِعَ فِي السَّحَابَةِ فَقَالَ لَهُ يَا عَبْدَ اللهِ لِمَ تَسْأَلُنِي عَنْ اسْمِي فَقَالَ إِنِّي سَمِعْتُ صَوْتًا فِي السَّحَابِ الَّذِي هَذَا مَاؤُهُ يَقُولُ اسْقِ حَدِيقَةَ فُلَانٍ لِاسْمِكَ فَمَا تَصْنَعُ فِيهَا قَالَ أَمَّا إِذْ قُلْتَ هَذَا فَإِنِّي أَنْظُرُ إِلَى مَا يَخْرُجُ مِنْهَا فَأَتَصَدَّقُ بِثُلُثِهِ وَآكُلُ أَنَا وَعِيَالِي ثُلُثًا وَأَرُدُّ فِيهَا ثُلُثَهُ) و في رواية: (وَأَجْعَلُ ثُلُثَهُ فِي الْمَسَاكِينِ وَالسَّائِلِينَ وَابْنِ السَّبِيلِ)

ప్రవక్త ﷺ తెలిపారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః ఒక వ్యక్తి ఓ మైదానం గుండా వెళ్తుండగా ఏదో ఓ మేఘం నుంచి “ఫలానా వ్యక్తి తోటలో వర్షం కురిపించు” అన్న శబ్దం వినపడింది. మళ్ళీ ఆ మేఘం పక్కకు జరిగి ఓ నల్లని రాతి నేలపై కురిసింది. (దాంతో చిన్న చిన్న కాల్వలు ఏర్పడ్డాయి) చివరకు ఒక (పెద్ద) కాలువ మిగతా కాలువలన్నిటిని తనలో కలుపుకొని ప్రవహించసాగింది. ఆయన కూడా ఆ ప్రవాహం వెంట నడవసాగాడు. అటు ఓ మనిషి పారతో తన తోటకు నీళ్ళు కడుతున్నాడు. ఓ దైవ దాసుడా! నీ పేరేమిటి అని అతడ్ని అడిగాడు. ఫలాన పేరు అని ఇతను మేఘంలో విన్నపేరే అతడు చెప్పాడు. ఓ దైవదాసుడా! నా పేరెందుకు అడుగుతున్నావు అని అతడడిగాడు. ఇతడన్నాడుః నీవు చెప్పిన పేరే చెబుతూ ఫలాన తోటలో వర్షం కురిపించు అని నేను ఏ మేఘంలో విన్నానో దాని నీళ్ళే ఇవి. అయితే అసలు నీవు చేస్తున్న పనేమిటి? అతడన్నాడుః నీవు అడిగావు గనక చెబుతున్నానుః పంట పండిన తర్వాత నేను దాని అంచనా వేసుకొని, మూడో వంతు భాగం దానం చేస్తాను. మరో మూడో వంతు నేను, నా ఆలుబిడ్డలు తినడానికి (ఉంచుకుంటాను). మరో మూడో వంతు తిరిగి విత్తనంగా వేయుటకు ఉపయోగిస్తాను“. మరో ఉల్లేఖనంలో ఉందిః నేను మూడో వంతును పేదవాళ్ళల్లో, అడిగేవారిలో మరియు బాటసారుల్లో దానం చేస్తాను“. (ముస్లిం 2984).

దానధర్మాలు చేయడం కూడా ఓ సద్గుణమే. ఎక్కడైతే అవసరం, బీదరికం ఉందో అక్కడ దాని అందం మరీ పెరుగుతుంది. అందులో దాతృత్వం మరియు ప్రాధాన్యత గుణాలు కలసి ఏకమవుతాయి. అత్యంత దాతృతుడు, మహోపకారుడైన అల్లాహ్ స్వయంగా ఆశ్చర్య(సంతోష)పడ్డాడన్న హదీసు ఒకటి శ్రద్ధగా చదువు: అబూ హురైరా (రదియల్లాహు అన్హు) దానిని ఉల్లేఖించారు:

ఒక వ్యక్తి ప్రవక్త ﷺ వద్దకు వచ్చి ‘నేను తిండి లేక పరితపిస్తున్నాను’ అని చెప్పాడు. అందుకు ప్రవక్త ﷺ తమ ఒక భార్యకు ఈ వార్త పంపారు. ‘మిమ్మల్ని సత్య ధర్మం ఇచ్చిపంపిన అల్లాహ్ సాక్షిగా! నా దగ్గర నీళ్ళు తప్ప మరేమీ లేదు” అని ఆమె చెప్పంపింది. తర్వాత మరో భార్య వద్దకు పంపారు. ఆమె కూడా అలాగే జవాబు చెప్పింది. చివరికి ఆయన భార్యలందరూ “మిమ్మల్ని సత్యధర్మం తో పంపిన అల్లాహ్ సాక్షిగా! నా దగ్గర నీళ్ళు తప్ప మరేమీ లేదు” అనే చెప్పారు. అప్పుడు ప్రవక్త ﷺ తమ సహచరులనుద్దేశించి “ఈ రాత్రి ఇతనికి ఆతిథ్యమిచ్చే వారెవరైనా మీలో ఉన్నారా” అని అడిగారు. ఒక అన్సార్ వ్యక్తి లేచి, నేను ఇస్తాను ప్రవక్తా! అని అన్నారు. ఆయన అతడ్ని తనింటికి తీసుకెళ్ళాడు. తన భార్యతో ‘ఇతను ప్రవక్తగారి అతిథి, ఇతనికి మంచి ఆతిథ్యమివ్వాలి’ అని చెప్పాడు. మరో ఉల్లేఖనంలో ఉంది: ‘ఇంట్లో భోజనానికి ఏదైనా ఉందా’ అని తన భార్యను అడిగారు. దానికి ఆమె ‘పిల్లలకు సరిపోయేంత మాత్రమే ఉంది’ అని చెప్పింది. అప్పుడాయన చెప్పారు: రాత్రి భోజనం నుండి పిల్లవాళ్ళ మనస్సు మళ్ళించు. ఎప్పుడు వారు రాత్రి భోజనం కోరుతారో అప్పుడు వారిని పడుకోబెట్టు. ఇక అతిథి ఇంట్లోకి రాగానే (అన్నం వడ్డించి, తినేముందు) దీపం ఆర్పెయ్యి. ఆయన ముందు మనం కూడా అన్నం తిన్నట్లు నటిద్దాం. అందరూ భోజనానికి కూర్చున్నారు. (ఆమె దీపం ఆర్పేసింది) వచ్చిన అతిథి (కడుపునిండా) భోజనం చేశాడు. కాని ఆ దంపతులు మాత్రం పస్తుండిపోయారు. ఆ అన్సార్ సహచరుడు మరునాడు ఉదయం ప్రవక్త ﷺ వద్దకు వెళ్ళగా ఆయన ﷺ ఇలా చెప్పారు:

قَدْ عَجِبَ اللهُ مِنْ صَنِيعِكُمَا بِضَيْفِكُمَا اللَّيْلَةَ

నిశ్చయంగా రాత్రి మీరు మీ అతిథికి చేసిన సేవ చూసి అల్లాహ్ చాలా సంతోషించాడు“. (ముస్లిం 2054).

ఈ సమాజం ప్రవక్త ﷺ చూపిన సద్గుణాలపై శిక్షణపొందిన, స్వచ్చమైన చెలమ నుండి ఆస్వాదించిన సమాజం. అహం, స్వార్థం అంటే తెలియని సమాజం. ఇదిగో; సమాజంలో ఒక రకమైన సమాజాన్ని వారిలో ఉన్న ఆదర్శవంతమైన ఉత్తమ గుణాన్ని ప్రవక్త ﷺ ప్రశంసించారు. ఆ మనుగడపై గనక నేటి అనుచర సంఘం నడిచి ఉంటే వారిలో ఒక్క బీదవాడు అంటూ ఉండడు. వారు అష్అరీ తెగకు చెందినవారు. వారి గురించే ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః

إِنَّ الْأَشْعَرِيِّينَ إِذَا أَرْمَلُوا فِي الْغَزْوِ أَوْ قَلَّ طَعَامُ عِيَالِهِمْ بِالْمَدِينَةِ جَمَعُوا مَا كَانَ عِنْدَهُمْ فِي ثَوْبٍ وَاحِدٍ ثُمَّ اقْتَسَمُوهُ بَيْنَهُمْ فِي إِنَاءٍ وَاحِدٍ بِالسَّوِيَّةِ فَهُمْ مِنِّي وَأَنَا مِنْهُمْ

అష్అరీ తెగవాళ్ళు యుద్ధరంగంలో ఉన్నప్పుడు వారి ఆహార పదార్థాలు అయిపోవస్తే లేదా (స్వస్థలం) మదీనాలో ఉన్నప్పుడు తమ ఆలుబిడ్డల ఆహారపదార్థాల్లో కొరత ఏర్పడితే ఎవరి వద్ద ఏ కొంత ఆహారం ఉన్నా వారు దాన్ని ఒక వస్త్రంలో పోగుచేస్తారు. మళ్ళీ ఒక పాత్రతో అందరూ సమానంగా వాటిని పంచుకుంటారు. అందుకే వారు నాతో పాటు ఉన్నారు. నేను వారితో పాటు ఉన్నాను“. (బుఖారి 2486, ముస్లిం 2500).

జాగ్రత్తా! ఓ ఉదారుడా! నిరాశ నిస్పృహలు నీపై తిష్టవేయకుండా జాగ్రత్తగా ఉండు. ఇప్పటికీ ఈ అనుచర సంఘంలో ప్రవక్త అడుగుజాడల్లో, పూర్వపు పుణ్యపురుషుల బాటలో నడిచే ఉపకారులున్నారు. ప్రతి చోట మన బలహీన సోదరుల కొరకు విరాళాల మరియు దానాల ఉద్యమాలు మనం ఎన్నటికీ మరవలేము. విరాళాల, దానాల ఈ రకాల్ని చూసి మనస్సు సంతోషిస్తుంది, హృదయం ఆనందిస్తుంది. వీటిని చూసేవాడు, వాస్తవానికి ఇవి భూమ్మీద ఓ మంచి రక్షక విధానం అని మరియు భూవాసుల శాంతి క్షేమాల రహస్యమని గ్రహించగలుగుతాడు. అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు, కృతజ్ఞతలు.

రెండు సంఘటనలు నన్ను చాలా ఆశ్చర్యపరచాయి. వాటిని షేఖ్ అలీ తంతావీ ~ “జిక్రయాత్” అన్న తన రచనలోని భూమికలో ప్రస్తావించాడు: మా తండ్రిగారి అధ్యాపకులు షేఖ్ సలీమ్ అల్ మసూతీ ~ స్వయంగా ఎంతో బీదవారైనప్పటికీ ఏ ఒక్క బీదవాడిని ఎప్పుడూ నెట్టలేదు. అతను ఓ చొక్కా ధరించి బైటికి వెళ్ళేవారు, దారిలో చలితో వణికిపోతున్న ఓ మనిషిని చూసి ఆ చొక్కా అతనికి ఇచ్చేసి, తాను కేవలం లాగు మీద ఇంటికి తిరిగి వచ్చేవారు. ఒక్కోసారి తన ఆలుబిడ్డలతో కలసి భోజనం చేస్తుండగా వారు తింటూ ఉన్న ఆహారపదార్థాలు తీసి ఇంటి ముందు వచ్చిన భిక్షకునికి ఇచ్చేవారు. ఒకసారి రమజానులో ఇఫ్తార్ గురించి తినుత్రాగు పదార్థాలు (దస్తర్ ఖ్వాన్ మీద) పెట్టి సైరన్ గురించి వేచిస్తుండగా ఒక భిక్షకుడు వచ్చి తనకు తన ఆలుబిడ్డలకు తినడానికి ఏమీ లేదు అని ప్రమాణాలు చేశాడు. షేఖ్ తన ఆవిడ అశ్రద్ధను గమనించి ఇఫ్తార్ గురించి వడ్డించిన మొత్తం ఆహారం అతనికిచ్చేశారు. కాని ఆవిడ చూసి అరవడం, విలపించడం మొదలెట్టి, నీ దగ్గరే కూర్చోను పో! అని ప్రమాణం చేసింది. ఆయన గారు మౌనంగా ఉన్నారు. అర్థ గంట కూడా గడవక ముందే ఎవరో తలుపు తట్టుతున్న శబ్దం విన్నారు. చూసే సరికి ఒక వ్యక్తి పెద్ద పళ్ళం ఎత్తుకువస్తున్నాడు. అందులో ఎన్నో రకాల తినుభంఢారాలు, స్వీట్లు, ఫలాలున్నాయి. ఏమిటి? అని అడిగితే, ఇక్కడి మన నగర పాలకుడు కొంతమంది పెద్దమనుషులను ఆహ్వానించాడు. వారు రానట్లుగా విన్నవించుకోగా, ఆయన కోపంతో నేనూ తినను అని ప్రమాణం చేసి ఇదంతా షేఖ్ సలీం అల్ మసూతీ ఇంటికి తరలించండని ఆదేశించాడు అని వారు చెప్పారు.

రెండవ సంఘటన: ఒక ఆడపడచు సంఘటన. ఆమె కొడుకు ఏదో ప్రయాణానికి వెళ్ళాడు. ఒకరోజు ఆమె తినడానికి కూర్చుంది. ఆమె ముందు ఓ రొట్టె ముక్క, దానికి సరిపడు కొంత కూర ఉంది. అంతలోనే ఒక భిక్షకుడు వచ్చాడు. అందుకు ఆమె తన నోట్లోకి తీసుకుపోయే ముద్దను ఆపేసి, అతనికిచ్చేసింది. తాను పస్తుండి పోయింది. ఆమె కొడుకు ప్రయాణం నుండి తిరిగి వచ్చాక ప్రయాణంలో చూసిన విషయాల్ని చెప్పసాగాడు. అన్నిట్లోకెల్ల చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటేమిటంటే: ఒక దారిలో ఓ పులి నన్ను ఒంటరిగా చూసి వెంబడించింది. నేను పరుగులు తీశాను. ఒక్కసారి కొంచెం దగ్గరున్నప్పుడు అమాంతం దూకి నా మీద పడింది. ఇక నేను దాని నోట్లో పోయానని భావిస్తున్న వేళ ఒక మనిషి తెల్లని దుస్తుల్లో నా ముందుకు వచ్చి నన్ను పులి నుండి విడిపించి “ముద్దకు బదులు ముద్ద” అన్నాడు. కాని ఏమిటుద్దేశ్యం నాకు అర్థం కాలేదు. అప్పుడే అతని తల్లి సంఘటన జరిగిన రోజు, సమయం అడిగింది. అదే సమయానికి ఇక్కడ తల్లి బీదవానికి దానం చేసిన వేళ. తన నోట్లోకి పోయే ముద్దను వెనక్కి తీసుకొని అల్లాహ్ మార్గంలో దానం చేసింది. ఇలా తన కొడుకు పులి నోట్లో నుండి బయటికి తీయబడ్డాడు. ఇక్కడికి షేఖ్ తంతావీ మాట సమాప్తమయింది.

ఓ! ఇంతనా పిసినారితనం? పిసినారితనం, పిసినారిని అవమానం, అవహేళన పాలు జేస్తుంది. దాని పర్యవసానం వినాశకరం. దాని వాసన దుర్గంధమైనది. వ్యక్తిగతంగాగాని, జాతియపరంగాగాని అది వినాశనం పాలుజేస్తుంది. సత్యసంధులైన ప్రవక్త మహానీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:

 اتَّقُوا الشُّحَّ فَإِنَّ الشُّحَّ أَهْلَكَ مَنْ كَانَ قَبْلَكُمْ حَمَلَهُمْ عَلَى أَنْ سَفَكُوا دِمَاءَهُمْ وَاسْتَحَلُّوا مَحَارِمَهُمْ

పిసినారితనానికి బహుదూరంగా ఉండండి. ఈ పిసినారితనమే మీకు పూర్వం గతించినవారిని సర్వనాశనం చేసింది. తమవారి రక్తం చిందించేందుకు, నిషిద్ధ విషయాల్ని ధర్మసమ్మతం(హలాల్) గా చేసుకోవడానికి ప్రేరేపించింది“. (ముస్లిం 2578).


ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది. క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పూర్తి పుస్తకం చదవండి.

  • సత్కార్య వనాలు (Hadayiq)
    అంశాల నుండి
     : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
    అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
%d bloggers like this: