ధర్మపరమైన నిషేధాలు (Prohibitions in Sharia)
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
[ఇక్కడ చదవండి] – [ఇక్కడ Download PDF]
ధర్మపరమైన నిషేధాలు (భాగాలు) – యూట్యూబ్ ప్లేలిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2ipsEd3T9LtuCJ3_1vELEu
ధర్మపరమైన నిషేధాలు (పాయింట్స్ క్లిప్స్) – యూట్యూబ్ ప్లేలిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0PzbYW7saGrZ3TYVB51Rtb
వీడియోలు చూడండి:
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఆడియో విడి భాగాలు (MP3)
భాగం 01 – 02 – 03 – 04 – 05 – 06 – 07 – 08 – 09 – 10 – 11 – 12 – 13 – 14 – 15 – 16 – 17
వీడియో విడి భాగాలు (యూట్యూబ్ లింకులు)
- భాగం 01 (21:02 నిముషాలు) (నిషేధాలు 1 -4 )
- భాగం 02 (34:18 నిముషాలు) (నిషేధాలు 5 – 9 )
- భాగం 03 (29:08 నిముషాలు) (నిషేధాలు 10 – 15)
- భాగం 04 (28:51 నిముషాలు) (నిషేధాలు 16- 22)
- భాగం 05 (27:12 నిముషాలు) ( నిషేధాలు 23 -25)
- భాగం 06 (21:15 నిముషాలు) (నిషేధాలు 26 – 32)
- భాగం 07 (30:41 నిముషాలు) (నిషేధాలు 33 – 36)
- భాగం 08 (37:10 నిముషాలు) (నిషేధాలు 37 -40)
- భాగం 09 (17:39 నిముషాలు) (నిషేధాలు 41 – 44)
- భాగం 10 (1:09:47 నిముషాలు) (నిషేధాలు 45 -56)
- భాగం 11 (25:51 నిముషాలు) (నిషేధాలు 57 -60)
- భాగం 12 (49:46 నిముషాలు) (నిషేధాలు 61 – 69)
- భాగం 13 (32:16 నిముషాలు) (నిషేధాలు 70 -75)
- భాగం 14 (43:47 నిముషాలు) (నిషేధాలు 76 -82)
- భాగం 15 (26:17 నిముషాలు) (నిషేధాలు 83 -87)
- భాగం 16 (37:47 నిముషాలు) (నిషేధాలు 88 -92)
- భాగం 17 (19:53 నిముషాలు) (నిషేధాలు 93 -95)
- భాగం 18 (30:00 నిముషాలు) (నిషేధాలు 96 -98)
ఈ వీడియోలలో నుండి పోస్ట్ చేసిన పాయింట్స్:
- 00. అల్లాహ్ మరియు ప్రవక్త వారించిన మరియు హెచ్చరించిన వాటికి దూరంగా ఉండుట కూడా ఆరాధనలో భాగమే[వీడియో]
- 01. దేని కొరకు నీవు పుట్టించబడ్డావో దాని నుండి నిర్లక్ష్యంగా ఉండకు[వీడియో]
- 02. ఆరాధనలో ఏ ఒక్క భాగం కూడా అల్లాహ్ యేతరుల కొరకు చేయకు[వీడియో]
- 03. అల్లాహ్ ను ప్రేమించు విధంగా లేదా అంతకు మించి మరెవరినీ ప్రేమించకు[వీడియో]
- 04. అల్లాహ్ తప్ప మరెవ్వరితో భయపడకు[వీడియో]
- 05. అల్లాహ్ తప్ప మరెవ్వరితో దుఆ చెయ్యకు (అర్థించకు)[వీడియో]
- 06. అల్లాహ్ తప్ప మరెవ్వరితో మొరపెట్టుకోకు[వీడియో]
- 07. అల్లాహ్ యేతరుల శరణు కోరకు[వీడియో]
- 08. కాబా తప్ప మరేదాని ప్రదక్షిణం (తవాఫ్) చేయకు[వీడియో]
- 09. దేని విషయంలో ధార్మిక ఆధారం ఉందో దానితో తప్ప రాయి రప్పలు, చెట్లు చేమలు, సమాధులు మజారులు మరేదానితో శుభాలు కోరవద్దు[వీడియో]
- 10. ఎట్టిపరిస్థితిలో అల్లాహ్ తప్ప మరెవ్వరితో సిఫారసు కోరకు[వీడియో]
- 11. అల్లాహ్ తప్ప మరెవ్వరిపై భారం మోపకు, నమ్మకం ఉంచకు[వీడియో]
- 12. ఈ సృష్టిని నడపడంలో, కష్టాలు తొలగించడంలో, కోరింది ఇప్పించడంలో ప్రవక్తలు మరియు అల్లాహ్ సన్నిహితు(వలీ) లకు ఏ కొంచమైనా అధికారం ఉందని నమ్మకు[వీడియో]
- 13. అల్లాహ్ తప్ప వేరెవరికైనా అగోచర జ్ఞానం గలదని నమ్మకు[వీడియో]
- 14.ఏదైనా లాభం పొందుటకు, మరేదైనా నష్టాన్ని తొలగించుటకు కడము, దారము మరేదైనా వస్తువు తొడిగించకు, తగిలించకు[వీడియో]
- 15. ఆపద దూరమగుటకు, లేదా అది రాకుండా తాయత్తులు, పూసలు మరియు గవ్వలు వేసుకోకు[వీడియో]
- 16. షిర్క్ సాధనాలను అంతమొందించుటకు సమాధి ఉన్న మస్జిదులో నమాజు చేయకు[వీడియో]
- 17. బర్కత్ (శుభం) కలిగే ఉద్దేశంతో సమాధుల మీద, దాని చుట్టు ప్రక్కలో ఎక్కడా నమాజు, దుఆ, ఇతర ఆరాధనలు చేయకు[వీడియో]
- 18. నమాజు వదలకు[వీడియో]
- 19. ఆరాధన ఉద్దేశంతో మూడు మసీదులు తప్ప మరెక్కడికీ ప్రయాణం చేయకు[వీడియో]
- 20. అల్లాహ్ ను వదలి సమాధిలో ఉన్నవారితో దుఆ చేసే, లేదా వారిని అల్లాహ్ ముందు మధ్యవర్తిగా నిలబెట్టే ఉద్దేశ్యంతో సమాధులను దర్శించకు[వీడియో]
- 21. సమాధుల మీద గుమ్మటం కట్టబోకు[వీడియో]
- 22. మనిషి, జంతువు, పక్షి, చేప లాంటి ప్రాణం ఉన్న వాటి చిత్రాలు చిత్రించకు[వీడియో]
- 23. అల్లాహ్ యేతరుల కొరకు జంతు బలి చేయకు[వీడియో]
- 24. ఎక్కడ అల్లాహ్ యేతరుల కొరకు జంతుబలి జరుగుతుందో అక్కడ అల్లాహ్ కొరకు జంతుబలి చేయకు[వీడియో]
- 25. ఆచరణ, ధన సంబంధమైన మరియు ఇతరత్రా మ్రొక్కుబడులన్నీ కేవలం అల్లాహ్ కొరకే నెరవేర్చాలి[వీడియో]
- 26. అల్లాహ్ ను, ఆయన సృష్టిరాసులలో ఏ ఒకరితోను సమానము చేయకు [వీడియో]
- 27. అల్లాహ్ ఉనికిని గురించి ఆలోచించకు[వీడియో]
- 28. అల్లాహ్ తన ఉనికితో మన వెంట ఉన్నాడని విశ్వసించకు[వీడియో]
- 29. అల్లాహ్ తన కొరకు ఖుర్ఆనులో, ప్రవక్త ముహమ్మ ద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ కొరకు సహీ హదీసుల్లో తెలిపిన గుణనామాలే తప్ప మరే గుణనామాలు అల్లాహ్ కు అంకితం చేయకు [యూట్యూబ్ వీడియో]
- 30. అల్లాహ్ గుణనామాల్లో తప్పుడు మార్గాన్ని అవలంబించకు [యూట్యూబ్ వీడియో]
- 31. మాటిమాటికీ అల్లాహ్ యొక్క పేరు చెప్పుకొని ప్రజలను అడుగుతూ ఉండటం మంచి విషయం కాదు[వీడియో]
- 32. నిషిద్ధమైన మరియు అధర్మ మాధ్యస్థం (వసీలా)తో, అల్లాహ్ కు దుఆ చేయకు [యూట్యూబ్ వీడియో]
- 33. నీ పాపాలు ఎంత ఉన్నా సరే అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకు[వీడియో]
- 34. నీవు ఎంత పుణ్యాత్ముడివైనా అల్లాహ్ ఎత్తుగడల నుండి నిర్భయంగా ఉండకు[వీడియో]
- 35. అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండకు[వీడియో]
- 36. అల్లాహ్ ఆరాధన కేవలం ప్రేమతో, లేదా కేవలం ఆశతో, లేదా కేవలం భయంతో చేయకూడదు[వీడియో]
- 37. సత్కార్యాలు చేయకుండానే అల్లాహ్ కారుణ్యం పట్ల ఆశ ఉంచకు[వీడియో]
- 38. ఖుర్ఆన్, ప్రవక్త, ధర్మం మరియు ధర్మ విషయాలతో పరిహాసమాడకు, ఎగతాళి చేయకు[వీడియో]
- 39. అల్లాహ్ ఆయతులతో వేళాకోళం చేస్తున్నవారితో నీవు కూర్చోకు[వీడియో]
- 40. అల్లాహ్ అవతరించిన దానిని వదలి, వేరే వాటితో తీర్పు చేయకు[వీడియో]
- 41. అల్లాహ్ తన గ్రంథం ద్వారా లేదా ప్రవక్త ద్వారా పంపిన ఏ ఒక్క విషయాన్నీ అసహ్యించుకోకు[వీడియో]
- 42. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశాల్లో ఏ ఒక్క దాని పట్ల నీ హృదయంలో కల్మషం ఉండ కూడదు[వీడియో]
- 43. అల్లాహ్ హలాల్ (ధర్మసమ్మతం) చేసిన దానిని నీవు హరాం (నిషిద్ధం) చేయకు. లేదా అల్లాహ్ హరాం చేసిన దానిని నీవు హలాల్ చేయకు[వీడియో]
- 44. హలాల్ ను హరాం మరియు హరాం ను హలాల్ చేసే వ్యక్తి (ఏలాంటి వాడైనా సరే అతని)ని అనుసరించకు[వీడియో]
- 45. ఇస్లాం క్షీణత్వాన్ని & షిర్క్ చేయువారి ఉన్నత స్థితిని చూసి సంతోషించవద్దు [యూట్యూబ్ వీడియో]
- 46. అవిశ్వాసులతో మరీ సన్నిహితంగా ఉండకు, వారిని అమితంగా ప్రేమించకు [యూట్యూబ్ వీడియో]
- 47. అవిశ్వాసుల ధార్మిక / వారికి సంబంధించిన ప్రత్యేకతల్లో వారిని అనుసరించకు [యూట్యూబ్ వీడియో]
- 48. ధర్మ విషయంలో ఎప్పుడూ నీచ వ్యవహారం వహించకు. కృంగిపోకు, బాధపడకు [యూట్యూబ్ వీడియో]
- 49. ముష్రికుల షిర్క్ గురించి సందేహంలో పడకు. వారి ధర్మాన్ని సత్యధర్మంగా నమ్మకు [యూట్యూబ్ వీడియో]
- 50. అవిశ్వాసుల పండుగల్లో లేదా వారి ధార్మిక ఉత్స వాల్లో పాల్గొనకు [యూట్యూబ్ వీడియో]
- 51. ఇస్లాం ధర్మం పట్ల విముఖత చూపకు [యూట్యూబ్ వీడియో]
- 52. చేతబడి వ్యవహారాల్లో ఏ రవ్వంత జోక్యం చేసుకోకు [యూట్యూబ్ వీడియో]
- 53. భవిష్యం చెప్పేవాళ్ళ (జాతకుడు) వద్దకు వెళ్ళకు [యూట్యూబ్ వీడియో]
- 54. భవిష్యత్తు (జాతకం) చెప్పే వారి మాటను నమ్మకు, సత్యపరచకు [యూట్యూబ్ వీడియో]
- 55 & 56. తారల ద్వారా వర్షం కోరకు. ఫలాన నక్షత్రం వల్ల వర్షం కురిసింది అని అనకు [యూట్యూబ్ వీడియో]
- 57. అపశకునం పాటించకు [యూట్యూబ్ వీడియో]
- 58. మంచి, చెడు తక్దీర్ (విధివ్రాత)ను తిరస్కరించకు [యూట్యూబ్ వీడియో]
- 59. అల్లాహ్ వ్రాసిన విధి వ్రాత పట్ల అయిష్టత, కోపం ప్రదర్శించకు [యూట్యూబ్ వీడియో]
- 60. పాపాలు, దోషాలు, తప్పిదాలకు పాల్పడి, నా విధి వ్రాతే ఇలా ఉంది అని వాదించకు [యూట్యూబ్ వీడియో]
- 61. “ఇలా చేస్తే అలా అయి ఉండేది” అని అనకు [యూట్యూబ్ వీడియో]
- 62. “ఇన్ షాఅల్లాహ్” అనకుండానే నేను రేపు ఫలాన పని చేస్తాను అని అనకు [యూట్యూబ్ వీడియో]
- 63. అల్లాహ్ నీకు కాకుండా ఇతరులకు ఏదైతే ప్రసాదించాడో దాని గురించి ఆశించకు. అల్లాహ్ నీకు ఇచ్చిన వాటలో నీవు సంతోషంగా ఉండు [యూట్యూబ్ వీడియో]
- 64. అల్లాహ్ అనుగ్రహాన్ని తిరస్కరించి, అది వేరెవరైనా ప్రసాదించారని ఆరోపించి కృతఘ్నతకు పాల్పడకు. మరియు ఆ అనుగ్రహం యొక్క హక్కు, ఏ కృతజ్ఞత, అల్లాహ్ స్మరణ రూపంలో చెల్లించాలో దానిని విస్మరించకు [యూట్యూబ్ వీడియో]
- 65. అల్లాహ్ తప్ప మరెవ్వరీ మీద ప్రమాణం చేయకు [యూట్యూబ్ వీడియో]
- 66. అమానత్ (అప్పగింత) పేర ప్రమాణం చేయకూడదు [యూట్యూబ్ వీడియో]
- 67. అనవసరంగా అధికంగా అల్లాహ్ నామ ప్రమాణం చేయకు [యూట్యూబ్ వీడియో]
- 68. పుస్తకంలో 68 వ నిషేధం పాయింట్ ఏమీ లేదు
- 69. నీ కొరకు అల్లాహ్ నామ ప్రమాణం చేసిన వాని ప్రమాణాన్ని తిరస్కరించకు [యూట్యూబ్ వీడియో]
- 70. ఎంత గొప్ప వస్తువైనా ప్రసాదించడం అల్లాహ్ కు కష్టతరమైన పని కాదు [వీడియో]
- 71. ఏ ఒక్క ముస్లింని కూడా అతను చేసిన ఏదైనా అపరాదం వల్ల అతన్ని కాఫిర్ (అవిశ్వాసి) అని అనకు [యూట్యూబ్ వీడియో]
- 72. అల్లాహ్ మీద ప్రమాణం చేసి ఫలాన వ్యక్తి స్వర్గవాసి, ఫలాన నరకవాసి అని తీర్పులు చేయకు [యూట్యూబ్ వీడియో]
- 73. ప్రవక్త సహచరు (సహాబా)లను దూషించకు [యూట్యూబ్ వీడియో]
- 74. ప్రవక్త కుటుంబీకుల్లోని పుణ్యాత్ములను ద్వేషించకు [యూట్యూబ్ వీడియో]
- 75. అల్లాహ్ వైపు నుండి నీ వద్ద స్పష్టమైన ఆధారం లేనంత వరకు ఏ ముస్లింపై అపరాధ నింద వేయకు [యూట్యూబ్ వీడియో]
- 76. ఏ ముస్లింని కూడా ఓ అల్లాహ్ శత్రువా! అని అనకు [యూట్యూబ్ వీడియో]
- 77. అలా జరుగుతే నేను ఇస్లాం నుండి వైదొలిగిపోతాను అని అనకూడదు [యూట్యూబ్ వీడియో]
- 78. అవిశ్వాసి, వంచకుడు, ఫాసిఖ్, మరియు బహిరంగంగా పాపానికి ఒడిగట్టేవారిని సయ్యిద్, మిస్టర్ లాంటి గౌరవపరమైన పదాలతో పిలవకండి [యూట్యూబ్ వీడియో]
- 79. అల్లాహ్ ధర్మంలో కొంగ్రొత్త విషయాలు పుట్టించకు [యూట్యూబ్ వీడియో]
- 80. అల్లాహ్ ధర్మంలో లేని ఏదైనా చెడు సంప్రదాయాన్ని నీవు ఆరంభించకు [యూట్యూబ్ వీడియో]
- 81. జ్ఞానం లేకుండా కేవలం తన అభిఫ్రాయ ఆధారంగా ఖుర్ఆన్, హదీసుల పట్ల వాదించకు [యూట్యూబ్ వీడియో]
- 82. తెలియని విషయంలో చెప్పవలసి వచ్చినప్పుడు ఎంతో గొప్పగా తెలిసినట్లు చెప్పే ప్రయత్నం చేయకు [యూట్యూబ్ వీడియో]
- 83. అల్లాహ్ పై అభాండాలు, అసత్యాలు మోపకండి [యూట్యూబ్ వీడియో]
- 84. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అసత్యం ఆపాదించకు. ఆయన చెప్పనిది, చేయనిది ఆయనకు ఆపాదించకు [యూట్యూబ్ వీడియో]
- 85. అల్లాహ్, ఆయన ప్రవక్త ఆదేశానికి ముందే నీవు నీ తీర్పు, నీ అభిప్రాయం, నీ మాట, నీ బుద్ధీజ్ఞానాలు ఉంచబోకు [యూట్యూబ్ వీడియో]
- 86. అల్లాహ్ ధర్మంలో, ఆయన ఆదేశాల్లో నీ వాంఛలకు అనుకూలమైనవి, నీ కోరికలకు తగినవి తీసుకొని ఇతరవాటిని తోసిపుచ్చడం లాంటి చేష్టలు చేయకు [యూట్యూబ్ వీడియో]
- 87. నీ అల్ప బుద్ధి వల్ల లేదా అవాస్తవిక సిద్ధాంతాల కార- ణంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ వైపు నుండి తీసుకొచ్చిన ధర్మవిషయాల్లో ఏ ఒక్క దానిని కూడా తిరస్కరించకు [యూట్యూబ్ వీడియో]
- 88. ధర్మం విషయంలో మితిమీరి ప్రవర్తించకు [యూట్యూబ్ వీడియో]
- 89. ధర్మం విషయంలో మరీ కఠినంగా ప్రవర్తించి లేదా దాని ఆచరణలో చెడుగా మసలుకొని ప్రజల్ని ధర్మం అంటే విసుగు చెందే మాదిరిగా చేయకు [యూట్యూబ్ వీడియో]
- 90. కాలాన్ని దూషించకు. ఇది అల్లాహ్ ను బాధ కలిగించినట్లగును [వీడియో]
- 91. బహుదైవారాధకులు దేవుళ్ళుగా పూజించేవారిని దూషించకండి. ప్రతికారంగా వారు అల్లాహ్ ను దూషించవచ్చు [యూట్యూబ్ వీడియో]
- 92. అజ్ఞానపు పక్షపాతం పిలుపులు పిలువకూడదు [యూట్యూబ్ వీడియో]
- 93. ఇక ఇస్లాం సమాప్తమైనట్లే అని, అది నశించిపోతుంది అని భావించకు [యూట్యూబ్ వీడియో]
- 94. ఇస్లాం అనుసరణ వల్లనే ముస్లింలు వెనకబడి ఉన్నారని అనుకోకు [యూట్యూబ్ వీడియో]
- 95. అల్లాహ్ యొక్క ఔలియా (సన్నిహితుల)ని, అల్లాహ్ ధర్మం వైపు పిలిచేవారిని మరియు ఈ ధర్మానికి రక్షకులుగా నిలబడిన- వారిని ద్వేషించకు [యూట్యూబ్ వీడియో]
- 96. పుణ్యాత్ముల చేత ఏ కరామతులు ప్రత్యక్షమవుతాయో వాటిని తిరస్కరించకూడదు [యూట్యూబ్ వీడియో]
- 97. ఏ ఒక్క ముస్లిం పట్ల నీవు నీ మనస్సులో ద్వేషం, కపటం కలిగి ఉండకు. అతడేదైనా పాపం చేస్తే దాని పట్ల ద్వేషం ఉండడం తప్పనిసరి [యూట్యూబ్ వీడియో]
- 98. ముస్లిములతో పోరాడకు. వారిపై ఆయుధాన్ని లేపకు. వారిలో ఎవరైనా దౌర్జన్యానికి దిగి వారిని అనచడానికి పోరాడం తప్ప వేరే ఏ పద్ధతీ సఫలం కానప్పుడు తప్ప [యూట్యూబ్ వీడియో]
[క్రింద పూర్తి పుస్తకం చదవండి]
అల్ హందులిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅదహ్, వఅష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహ్, వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహ్. అమ్మా బఅద్!
మీరు ఈ పుస్తకాన్ని సంపూర్ణంగా చదవనిదే తీసి పక్కకు పెట్టకండి. ఇది మీ కొరకే, ఇతరులకు కాదు. నేను దీనిని ప్రేమ సిరా (Ink)తో వ్రాసాను. హృదయ ఏకాగ్రత, స్వచ్ఛతతో లిఖించాను.
దానిని ప్రేమ పోస్ట్ మరియు ఆకాంక్ష రాయబారి ద్వారా పంపాను. నీ చక్షువులకు ముందు నీ హృదయం; నీ కళ్ళకు ముందు నీ మనస్సులో అది నాటుకుపోవాలని.
ప్రియ సోదరా… ప్రియ సోదరి…
ఇస్లాం ధర్మం యొక్క పునాది బలమైన విశ్వాసముపై ఉన్నది. విశ్వాస ఆవశ్యకతా నివేదనలో ఆదేశాలను పాటించడం మరియు నివారణల నుండి దూరంగా ఉండడం తప్పనిసరి. ఇస్లాం ధర్మం యొక్క విసరురౌతు ఈ రెండు తిరుగలిరాయిల మీదే తిరుగుతుంది. అల్లాహ్ ఆదేశం చదవండిః
[وَمَا آَتَاكُمُ الرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَاكُمْ عَنْهُ فَانْتَهُوا]
దైవప్రవక్త మీకు ఇచ్చిన దానిని తీసుకోండి, ఆయన మిమ్మల్ని నిషేధించిన దాని జోలికిపోకండి. (సూరె హష్ర్ 59: 7).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు
(فَإِذَا نَهَيْتُكُمْ عَنْ شَيْءٍ فَاجْتَنِبُوهُ وَإِذَا أَمَرْتُكُمْ بِأَمْرٍ فَأْتُوا مِنْهُ مَا اسْتَطَعْتُمْ
“నేను దేని నుండి మిమ్మల్ని వారిస్తానో దాని జోలికిపోకుండా ఉండండి, దేని గురించి నేను మిమ్మల్ని ఆదేశిస్తానో సాధ్యమైనంత వరకు దానిని నెరవేర్చండి”. (బుఖారి, అల్ ఇఖ్తిదాఉ బిసునని రసూలిల్లాహ్, 7288. ముస్లిం, తౌఖీరిహీ వ తర్కి ఇక్సారి సుఆలిహీ… 1337).
అల్లాహ్ ఏ దాని ఆదేశం ఇచ్చి, అది తప్పనిసరిగా చేయాలని విధించాడో మరియు దానిని నెరవేర్చాలని ప్రోత్సహించాడో విశ్వాసుడు దానిని నెరవేరుస్తూ ప్రేమ, ఆశతో మరియు ఆయన సన్నిధానం పొందుటకు తన పరమ- పవిత్రుడైన ప్రభువును ఆరాధిస్తాడు. అలాగే వినయవినమ్రతతో, భయభక్తులతో మరియు ఆజ్ఞాపాలన భావంతో అల్లాహ్ వారించిన మరియు హెచ్చరించిన వాటికి దూరంగా ఉండుట కూడా అతనిపై విధిగా ఉంది.
ఈ విధంగా చూస్తే ఇస్లాం ధర్మం “చేయండి”, “చేయకండి” అనే రెండిటి మధ్యలో ఉంది. దేనిని ఎంపిక చేసుకోవాలనే స్వేచ్ఛ మనిషిలో ఉంది. దారి స్పష్టంగా తన ముందు ఉంది. సత్ఫలితమో, దుష్ఫలితమో ప్రళయదినాన దొరకనుంది. అల్లాహ్ ఇలా ఆదేశించాడుః
[إِنَّا هَدَيْنَاهُ السَّبِيلَ إِمَّا شَاكِرًا وَإِمَّا كَفُورًا]
మేము అతనికి మార్గం చూపాము. ఇక అతను కృతజ్ఞుడు కావచ్చు లేదా కృతఘ్నుడూ కావచ్చు. (సూరె దహ్ర్ 76: 3).
అయితే మనము దాసులం. కనుక దాసుడు తన యజమాని ఆధీనంలో ఉంటాడు. యజమాని ఆదేశిస్తాడు, వారిస్తాడు. దాసుడు సంతోషంగా శిరసావహిస్తాడు మరియు శ్రద్ధభక్తులతో విధేయత చూపుతాడు. మనం ఏకైక అల్లాహ్ కు దాసులమయి ఉండడంలో ఉన్న కీర్తి మనకు చాలు.
ప్రియ పాఠకులారా, లేదా శ్రోతల్లారా! నేను నా కొరకు మరియు మీ కొరకు విశ్వాసానికి మరియు దైవఏకత్వానికి సంబంధించిన కొన్ని వారింపులను సమకూర్చాను. వాటి ప్రస్తావన దివ్య ఖుర్ఆనులో లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల్లో ఉంది. మన విశ్వాసం అన్ని రకాల లోటుపాట్లకు, కొరత తగ్గింపులకు దూరంగా ఉండాలని మరియు అజ్ఞానంగా వాటిలో చిక్కుకోకుండా, వాటిని తెలుసుకొనుటకు మరియు వాటిలో చిక్కుకుపోయిన ముస్లింలను హెచ్చరించి, హెచ్చరిక బాధ్యత పూర్తి చేయుటకు లేదా అల్లాహ్ కాపాడేవారిని దాని కీడు నుండి దూరముంచుటకు (ఇవి నేను సమకూర్చాను).
ఆయన మంచి నామముల, ఉత్తమ సద్గుణాల ఆధారంతో, ఆయన కారుణ్యాన్ని ఆశిస్తూ ఈ పనిలో శుభం కలుగజేయాలని, ఏలాంటి కొరతా, దోషం లేకుండా చేయాలని, కేవలం ఆయన సంతృప్తి కొరకు, ఆయన దర్శన భాగ్యం కలిగే కొరకు చేయాలని అల్లాహ్ ను వేడుకుంటున్నాను. మరియు దీనిని సమకూర్చిన, సరిచేసిన, ప్రచురించిన మరియు పంపిణీ చేసిన వారందరికీ అల్లాహ్ సత్ఫలితం ప్రసాదించుగాక! ఆమీన్. వల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తాము, ఆయనపై మాత్రమే నమ్మకం ఉంచుతాము మరియు ఆయన సహాయం మాత్రమే కోరుతాము.
1- దేని కొరకు నీవు పుట్టించబడ్డావో దాని నుండి నిర్లక్ష్యంగా ఉండకు:
[وَمَا خَلَقْتُ الجِنَّ وَالإِنْسَ إِلَّا لِيَعْبُدُونِ] {الذاريات:56}
అల్లాహ్ ఆదేశం: ]నేను జిన్నాతులను మరియు మానవులను కేవలం నన్ను ఆరాధించుటకే పుట్టించాను. (జారియాత్ 52: 56).
అంటే ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ నే పూజించాలి. ఆయన ఏ ఆదేశమిచ్చినా పాలించాలి. దేనిని నిషేధించినా దానికి దూరంగా ఉండాలి.
2- ఆరాధనలో ఏ ఒక్క భాగం కూడా అల్లాహ్ యేతరుల కొరకు చేయకు: ఆయన ఆరాధనలో ఆయనతో పాటు మరెవ్వరినీ భాగస్వామి చేయకు.
మౌలికంగా ‘ఇబాదత్’ (ఆరాధన) అంటే తనకు తాను అల్లాహ్ యదుట అధమునిగా, ధీనుడిగా భావించి, ఆయన ముందు అణుకువతోట. అల్లాహ్ యేతరుల ఆరాధన హృదయము, నాలుక మరియు అవయవాలతో జరుగుతుంది. అల్లాహ్ ఇలా ఆదేశించాడుః
[وَاعْبُدُوا اللهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا] {النساء:36}
మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి, ఆయనకు ఎవ్వరినీ భాగస్వామిగా చేయకండి. (సూరె నిసా 4: 36).
3- అల్లాహ్ ను ఏ గౌరవభావంతో ప్రేమించాలో అదే విధంగా లేదా అంతకు మించి మరెవరినీ ప్రేమించకు:
ప్రేమ అనేది అల్లాహ్ తప్ప మరెవరితో ఉండకూడదు. ఎవరితోనైనా ఉంటే అది అల్లాహ్ కొరకే ఉండాలి. మరియు అల్లాహ్ ప్రేమించువాటినే ప్రేమించాలి. ప్రపంచంలో ఉన్న ప్రేమ అల్లాహ్ పట్ల మరియు అల్లాహ్ కొరకు ఉంటే అది అల్లాహ్ ప్రేమలో ఓ భాగమే([1]).
[وَمِنَ النَّاسِ مَنْ يَتَّخِذُ مِنْ دُونِ الله أَنْدَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ الله وَالَّذِينَ آَمَنُوا أَشَدُّ حُبًّا لله] {البقرة:165}
కొందరు అల్లాహ్ ను కాదని ఇతరులను ఆయనకు ప్రత్యర్థులుగా నిలబెట్టి, అల్లాహ్ పట్ల కలిగి వుండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు. కాని విశ్వాసులు అన్నిటికంటే అధికంగా అల్లాహ్ నే ప్రేమిస్తారు. (సూరె బఖర 2: 165).
4- అల్లాహ్ తప్ప మరెవ్వరితో భయపడకు:
అల్లాహ్ ఆరాధన సంబంధమైన భయంలో, లేదా మృత్యువునిచ్చుట, ఏదైనా పాపం పై పట్టి శిక్షించుట లాంటివి కేవలం అల్లాహ్ శక్తిలోనే ఉన్న వాటి గురించి అల్లాహ్ తప్ప ఇతరులతో భయపడకూడదు.
[فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِي وَلِأُتِمَّ نِعْمَتِي عَلَيْكُمْ وَلَعَلَّكُمْ تَهْتَدُونَ] {البقرة:150}
అందుకని వారికి భయపడకండి, నాకు భయపడండి. ఇంకా నేను మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేస్తాను. మీరు నా ఆజ్ఞాపాలన ద్వారా సాఫల్యం పొందే అవకాశం ఉంది. (సూరె బఖర 2: 150).
5- అల్లాహ్ తప్ప మరెవ్వరితో దుఆ చెయ్యకు (అర్థించకు)([2]):
చనిపోయినవారితో, దైవ దూతలతో, ప్రవక్తలతో, జిన్నాతులతో మరియు దూరంలో ఉన్నవారితో దుఆ చేయకు. వారిని అర్థించకు.
[وَمَنْ أَضَلُّ مِمَّنْ يَدْعُو مِنْ دُونِ اللهِ مَنْ لَا يَسْتَجِيبُ لَهُ إِلَى يَوْمِ القِيَامَةِ وَهُمْ عَنْ دُعَائِهِمْ غَافِلُونَ ،وَإِذَا حُشِرَ النَّاسُ كَانُوا لَهُمْ أَعْدَاءً وَكَانُوا بِعِبَادَتِهِمْ كَافِرِينَ]. {الأحقاف:5،6}
అల్లాహ్ ను కాదని, ప్రళయదినం వరకు అతనికి సమాధాన మైనా ఇవ్వలేని వారిని, తమను వేడుకుంటున్నారనే విషయం కూడా ఎరుగనివారిని వేడుకునేవాడికంటే పరమ భ్రష్టుడైన వాడు ఎవడు ఉంటాడు. (అంతేకాదు) మానవులందరినీ సమావేశపరచినప్పుడు, వారు తమను వేడుకున్న వారికి విరోధులైపోతారు, వారి ఆరాధన (వేడుకోలు)ను తిరస్కరిస్తారు. (సూరె అహ్ ఖాఫ్ 46: 5,6).
6- అల్లాహ్ ను వదలి మరెవ్వరితో మొరపెట్టుకోకు.
అంటే నీవు కష్టంలో ఉన్నా, ఆపదలో ఉన్నా లేదా సుఖసంతోషాల్లో ఉన్నా అల్లాహ్ శక్తిలో మాత్రమే ఉన్నవాటి విషయంలో నీవు ఇతరులతో మొరపెట్టుకోకు. అవి ఉపాధి, సంతానాలకైనా, స్వస్థత లేదా పాపాల మన్నింపుకైనా, వర్షం కురువాలని మరియు ప్రజలకు సన్మార్గం లభించాలని అయినా, బాధలు తోలగించాలని మరియు శత్రువులపై విజయం పొందాలని అయినా (అల్లాహ్ తప్ప ఇతరులతో మొరపెట్టుకోవడం షిర్క్ అవుతుంది.).
అయితే సజీవంగా మరియు దగ్గర ఉన్న వ్యక్తితో అతని శక్తిలో ఉన్నదేదైనా అడగడంలో అభ్యంతరం ఏమి లేదు. కాని మనసు నమ్మకం అన్నది అతని మీదే ఉండకూడదు. అల్లాహ్ పై ఉండాలి.
[وَلَا تَدْعُ مِنْ دُونِ اللهِ مَا لَا يَنْفَعُكَ وَلَا يَضُرُّكَ فَإِنْ فَعَلْتَ فَإِنَّكَ إِذًا مِنَ الظَّالِمِينَ] {يونس:106}
అల్లాహ్ ను వదలి నీకు నష్టాన్నిగానీ లాభాన్నిగానీ కలిగించ లేనివాడిని వేడుకోకు (మొరపెట్టుకోకు). ఒకవేళ అలాచేస్తే నీవూ దుర్మార్గుడవై పోతావు. (సూరె యూనుస్ 10: 106).
7- అల్లాహ్ యేతరుల శరణు కోరకు.
నీవు ఏదైనా ప్రాంతము లో మజిలీ చేసినప్పుడు అక్కడ నీలో భయం జనించినప్పుడు అల్లాహ్ తో మాత్రమే శరణు వేడుకో. అల్లాహ్ నే గట్టిగా పట్టుకో, ఆయన శరణే వేడుకో, మరియు అక్కడ ఈ దుఆ చదువుః “అఊజు బికలిమాతిల్లాహిత్తామ్మాతి మిన్ షర్రి మాఖలఖ వ జరఅ వ బరఅ”.
(أَعُوذُ بِكَلِمَاتِ الله التَّامَّاتِ مِنْ شَرِّ مَا خَلَقَ وَذَرَأَ وَبَرَأَ)
అనువాదం: నేను అల్లాహ్ యొక్క సంపూర్ణ వచనాలతో, అల్లాహ్ శరణలో వచ్చుచున్నాను అల్లాహ్ పుట్టించిన, సృజించిన వాటిలోని కీడు నుండి.
శత్రువు మరియు క్రూర జంతువులతో ప్రకృతి పరమైన భయం వల్ల విశ్వాసంలో ఏ లోపం ఏర్పడదు.
[وَأَنَّهُ كَانَ رِجَالٌ مِنَ الإِنْسِ يَعُوذُونَ بِرِجَالٍ مِنَ الجِنِّ فَزَادُوهُمْ رَهَقًا]
మానవులలో కొందరు జిన్నాతులలోని కొందరిని శరణు వేడుతుండేవారు. ఈ విధంగా వారు జిన్నాతుల గర్వాన్ని మరింత అధికం చేశారు. (సూరె జిన్న్ 72: 6).
8- కాబా తప్ప మరేదాని ప్రదక్షిణం (తవాఫ్) చేయకు.
మక్క ముకర్రమ, మస్జిదె హరాంలో ఉన్న కాబా ప్రదక్షిణం ఆల్లాహ్ యొక్క ఆరాధన మరియు ఆయన సన్నిధానంలో చేర్పించే ఉత్తమ కార్యం. దానిని వదలి లేదా దానితో పాటు ఏదైనా సమాధి, రాయి, మరేదాని ప్రదక్షిణం పుణ్యోద్దేశంతో, శిక్షకు భయపడుతూ చేయకు([3]).
[وَإِذْ جَعَلْنَا البَيْتَ مَثَابَةً لِلنَّاسِ وَأَمْنًا وَاتَّخِذُوا مِنْ مَقَامِ إِبْرَاهِيمَ مُصَلًّى وَعَهِدْنَا إِلَى إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ أَنْ طَهِّرَا بَيْتِيَ لِلطَّائِفِينَ وَالعَاكِفِينَ وَالرُّكَّعِ السُّجُودِ] {البقرة:125}
ఈ గృహాన్ని (కాబా) మేము మానవులందరికీ కేంద్రంగాను, శాంతి నిలయంగానూ చేశాము. ఇబ్రాహీము నిలబడిన ప్రదేశాన్ని నమాజు స్థలంగా చేసుకోండి. ఇంకా ఈ నా గృహాన్ని, దానికి ప్రదక్షిణం చేసేవారి కొరకు, దానిలో ఏతెకాఫ్ పాటించేవారి కొరకు, రుకూ, సజ్దాలు చేసేవారి కొరకు పరిశుద్ధంగా ఉంచవలసిందని ఇబ్రాహీమును, ఇస్మాఈలును నిర్దేశించాము. (బఖర 2: 125).
9- దేని విషయంలో ధార్మిక ఆధారం ఉందో దానితో తప్ప రాయి రప్పలు, చెట్లు చేమలు, సమాధులు మజారులు మరేదానితో శుభాలు కోరవద్దు([4]).
عَنْ أَبِي وَاقِدٍ اللَّيْثِيِّ > قَالَ: خَرَجْنَا مَعَ رَسُولِ الله @ إِلَى حُنَيْنٍ وَنَحْنُ حُدَثَاءُ عَهْدٍ بِكُفْرٍ، ولِلْمُشْرِكِينَ سِدْرَةٌ يَعْكُفُونَ عِنْدَهَا، ويَنُوطُونَ بِهَا أَسْلِحَتَهُمْ يُقَالُ لَهَا : ذَاتُ أَنْوَاطٍ ، قَالَ : فَمَرَرْنَا بِالسِّدْرَةِ ، فَقُلْنَا : يَا رَسُولَ الله! اجْعَلْ لَنَا ذَاتَ أَنْوَاطٍ كَمَا لَـهُمْ ذَاتُ أَنْوَاطٍ ، فَقَالَ رَسُولُ الله @ : (اللهُ أَكْبَرُ ، إِنَّهَا السُّنَنُ ، قُلْتُمْ وَالَّذِي نَفْسِي بِيَدِهِ كَمَا قَالَتْ بنو إِسْرَائِيلَ: [اجْعَلْ لَنَا إِلَهًا كَمَا لَـهُمْ آلِهَةٌ قَالَ إِنَّكُمْ قَوْمٌ تَجْهَلُونَ] {الأعراف 138} ، لَتَرْكَبُنَّ سُنَنَ مَنْ كَانَ قَبْلَكُمْ).
అబూ వాఖిద్ లైసి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట హునైన్ యుద్ధానికి బయలుదేరాము. అప్పుడు మేము కొత్తగా ఇస్లాంలో చేరియుంటిమి. దారిలో ముష్రికులది ఒక రేగు చెట్టు ఉండింది. వారు శుభం కలుగుతుందన్న ఉద్దేశ్యంతో దాని క్రింద కూర్చుండేవారు, తమ ఆయుధాలు దానికి తగిలించేవారు. దానిని ‘జాతు అన్వాత్’ అనబడేది. మేము ఆ చెట్టు నుండి దాటుతూ, ‘ప్రవక్తా! వారికి ఉన్నటువంటి జాతు అన్వాత్ మాకు కూడా ఒక్కటి నిర్ణయించండి అని అన్నాము. ప్రవక్త చెప్పారుః “అల్లాహు అక్బర్! ఇవే పద్ధతులు. నా ప్రాణం ఎవ్వని చేతులో ఉందో ఆయన సాక్షి! బనీ ఇస్రాఈల్ వారు ప్రవక్త మూసా అలైహిస్సలాంతో అన్నటువంటి మాటే మీరన్నారుః ]మూసా! వాళ్ళ దేవుళ్ళవంటి ఒక దేవుణ్ణి మాకు కూడా చేసి పెట్టు. మూసా ఇలా అన్నాడుః “మీరు చాలా అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నారు. మీకు పూర్వికులు అవలంభించిన పద్ధతులు మీరూ అవలంభిస్తారు”. (అల్ మొఅజముల్ కబీర్ లిత్తబ్రానీ, సహీహ్ సునన్ తిర్మిజి 1771, ముస్నద్ అహ్మద్ 2/285).
10- అల్లాహ్ వద్ద ప్రయోజనం లభించాలన్న ఉద్దేశ్యంతో ఎట్టిపరిస్థితిలో అల్లాహ్ తప్ప మరెవ్వరితో సిఫారసు కోరకు.
నిశ్చయంగా సిఫారసు యొక్క సంపూర్ణ అధికారం అల్లాహ్ వద్దనే ఉంది. అందుకు ఎవ్వరితో సిఫారసు కోరకు. అల్లాహ్ కు అతిసమీపంలో ఉన్న దూత అయినా, ఏ ప్రవక్త అయినా మరియు ఏ పుణ్యపురుషుడైనా సరే.
[وَيَعْبُدُونَ مِنْ دُونِ اللهِ مَا لَا يَضُرُّهُمْ وَلَا يَنْفَعُهُمْ وَيَقُولُونَ هَؤُلَاءِ شُفَعَاؤُنَا عِنْدَ اللهِ قُلْ أَتُنَبِّئُونَ اللهَ بِمَا لَا يَعْلَمُ فِي السَّمَاوَاتِ وَلَا فِي الأَرْضِ سُبْحَانَهُ وَتَعَالَى عَمَّا يُشْرِكُونَ] {يونس:18}
ఈ ప్రజలు అల్లాహ్ ను కాదని తమకు నష్టాన్నిగానీ లాభాన్ని గానీ కలిగించలేనివారిని పూజిస్తున్నారు. పైగా ఇలా అంటున్నారుః వారు అల్లాహ్ వద్ద మా కొరకు సిఫారసు చేస్తారు. ప్రవక్తా! వారితో ఇలా అనుః ఆకాశాలలోగానీ, భూమిలోగానీ అల్లాహ్ ఎరుగని విషయాన్ని గురించి ఆయనకు మీరు తెలుపుతున్నారా? ఆయన పరిశుద్ధుడు. ఈ ప్రజలు చేసే షిర్కుకు ఆతీతుడూ, ఉన్నతుడూ. (సూరె యూనుస్ 10: 18).
11- అల్లాహ్ తప్ప మరెవ్వరిపై భారం మోపకు, నమ్మకం ఉంచకు. నీ వ్యవహారాన్ని ఆయన తప్ప మరెవ్వరికీ అప్పగించకు.
అల్లాహ్ ఆదేశాలు చదవండిః
[أَلَيْسَ اللهُ بِكَافٍ عَبْدَهُ] {الزُّمر:36}
అల్లాహ్ తన దాసునికి సరిపోడా?. (సూరె జుమర్ 39: 36).
[وَعَلَى اللهِ فَتَوَكَّلُوا إِنْ كُنْتُمْ مُؤْمِنِينَ] {المائدة:23}
మీరు నిజంగానే విశ్వాసులైతే అల్లాహ్ పై నమ్మకం ఉంచండి([5]). (సూరె మాఇద 5: 23)..
12- ఈ సృష్టిని నడపడంలో, కష్టాలు తొలగించడంలో, కోరింది ఇప్పించడంలో ప్రవక్తలు మరియు అల్లాహ్ సన్నిహితు(వలీ)లకు ఏ కొంచమైనా అధికారం ఉందని అనుకోకు/నమ్మకు.
సృష్టించే మరియు సృష్టిని నడిపించే అధికారమంతయూ ఆది నుండి అంతం వరకు అల్లాహ్ చేతులోనే ఉంది. ఈ సృష్టిలో అల్లాహ్ కోరింది, నిర్ణయించింది, తలచింది మరియు ఆయన సులభతరం చేసింది మాత్రమే సంభవిస్తుంది. (ఇతరులకు అందులో ఏ అణువంత అధికారమే కాదు, భాగస్వామ్యమే లేదు).
[قُلْ مَنْ يُنَجِّيكُمْ مِنْ ظُلُمَاتِ البَرِّ وَالبَحْرِ تَدْعُونَهُ تَضَرُّعًا وَخُفْيَةً لَئِنْ أَنْجَانَا مِنْ هَذِهِ لَنَكُونَنَّ مِنَ الشَّاكِرِينَ ، قُلِ اللهُ يُنَجِّيكُمْ مِنْهَا وَمِنْ كُلِّ كَرْبٍ ثُمَّ أَنْتُمْ تُشْرِكُونَ] {الأنعام:63، 64}
ప్రవక్తా! వారిని ఇలా అడుగుః భూ సముద్రాల చీకట్లలోని ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడేది ఎవరు? మీరు (ఆపద సమయంలో) కడుదీనంగా విలపిస్తూ, అతిగోప్యంగా వేడుకునేది ఎవరిని? ఈ ఉపద్రవం నుండి ఆయన గనక మమ్మల్ని రక్షిస్తే, మేము తప్పకుండా కృతజ్ఞులం అవుతాము అని మీరు అనేది ఎవరితో? ఇలా అనుః అల్లాహ్ మీకు దాని నుండీ మరియు ప్రతి బాధ నుండి విముక్తి కలిగిస్తాడు. తరువాత మీరు ఇతరులను ఆయనకు భాగస్వాములుగా నిలబెడతారు. (అన్ఆమ్ 6: 63,64).
13- అల్లాహ్ తప్ప వేరెవరికైనా అగోచర జ్ఞానం గలదని నమ్మకు.
రహస్య, బహిరంగ విషయాలన్నిటినీ ఎరిగేవాడు అల్లాహ్ ఒక్కడే. భూమ్యాకాశాల్లో ఏ చిన్న వస్తువు అతనికి మరుగుగా లేదు.
[قُلْ لَا يَعْلَمُ مَنْ فِي السَّمَاوَاتِ وَالأَرْضِ الغَيْبَ إِلَّا اللهُ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ] {النمل:65}
వారితో ఇలా అనుః ఆకాశాలలోనూ, భూమిలోనూ అల్లాహ్ తప్ప అగోచర జ్ఞానం కలవాడు మరెవ్వడూ లేడు. (మీరు ఆరాధిస్తున్న)వారికి తాము ఎప్పుడు లేపబడతారో కూడా తెలియదు. (సూరె నమ్ల్ 27: 65).
14- ఏదైనా లాభం పొందుటకు, మరేదైనా నష్టాన్ని తొలగించుటకు నీవు నీపై , నీ సంతానానికి, నీ వాహానానికి. నీ ఇంటి వగైరాలకు కడము, దారము మరేదైనా వస్తువు తొడిగించకు, తగిలించకు ([6]).
عن أَبِي بَشِيرٍ الْأَنْصَارِيِّ > أَنَّهُ كَانَ مَعَ رَسُولِ الله ^ فِي بَعْضِ أَسْفَارِهِ فَأَرْسَلَ رَسُولُ الله ^ رَسُولًا (أَنْ لَا يَبْقَيَنَّ فِي رَقَبَةِ بَعِيرٍ قِلَادَةٌ مِنْ وَتَرٍ أَوْ قِلَادَةٌ إِلَّا قُطِعَتْ).
అబూ బషీర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, అతను ఏదో ఒక ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉండగా ప్రవక్త ఒక వ్యక్తిని ఇలా చెప్పి పంపారుః “ఏ ఒంటె మెడలో కూడా నరంతో చేసిన పట్టా ఉండ కూడదు. లేదా ఏదైనా పట్టా ఉంటే దానిని తీసెయ్యాలి”. (బుఖారి/ బాబు మా ఖీల ఫిల్ జరసి…/ 3005, ముస్లిం/ బాబు కరాహతు ఖిలాదతిల్ విత్రి ఫీ రఖబతిల్ బఈర్/ 3115).
15- ఆపద దూరమగుటకు, లేదా అది రాకుండా తాయత్తులు, పూసలు మరియు గవ్వలు వేసుకోకు.
عن عَبْدِ الله بْنِ عُكَيْمٍ أَبِي مَعْبَدِ الْجُهَنِيِّ > قَال: قَالَ النَّبِيُّ ^: (مَنْ تَعَلَّقَ شَيْئًا وُكِلَ إِلَيْهِ).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబ్దుల్లాహ్ బిన్ ఉకైమ్ అబూ మఅబద్ అల్ జుహనీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఏదైనా వస్తువు తగిలించుకున్న వారు దాని వైపే అప్పగించబడుతారు”. (అంటే వారికి అల్లాహ్ రక్షణ, సహాయం ఉండదు). (తిర్మిజి/ మా జాఅ ఫీ కరాహియతిత్ తాలీఖ్/ 2072, నిసాయి/ బాబుల్ హుక్ మి ఫిస్సహర/ 4011). మరో ఉల్లేఖనంలో ఉందిః
(إِِنَّ الرُّقَى وَالتَّمَائِمَ وَالتِّوَلَةَ شِرْكٌ )
“మంత్రం, తావీజులు, మరియు ‘తివల’ ఇవన్నియు షిర్క్”. ‘తివల’ అనగా భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుటకు చేతబడి చేయడం. (అబూ దావూద్/ బాబు ఫీ తాలీఖిత్ తమాయిమ్/ 3883, ఇబ్ను మాజ/ బాబు తాలీఖిత్ తమాయిమ్/ 3530, అహ్మద్).
16- షిర్క్ సాధనాలను అంతమొందించుటకు సమాధి ఉన్న మస్జిదులో నమాజు చేయకు ([7])
[وَأَنَّ المَسَاجِدَ للهِ فَلَا تَدْعُوا مَعَ اللهِ أَحَدًا] {الجنّ:18}
మసీదులు అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కనుక వాటిలో అల్లాహ్ తో పాటు ఇతరులెవ్వరినీ ప్రార్థించకండి. (జిన్ 72: 18).
17- బర్కత్ (శుభం) కలిగే ఉద్దేశంతో సమాధుల మీద, దాని చుట్టు ప్రక్కలో ఎక్కడా నమాజు చేయకు.
అక్కడ దుఆ చేయుట ఘనత గల విషయమని భావించకు. అక్కడ నమాజు చేయుట సంపూర్ణత్వానికి ఓ నిదర్శనం అని భావించకు. ఇవన్నియూ షిర్కులో లేదా దాని దరిదాపులకు చేరుకుండా ఉండటానికి పాటించవలసిన ముఖ్య పనులు([8]).
عَنْ عَائِشَةَ < قَالَتْ: قَالَ رَسُولُ الله ^: (لَعْنَةُ اللهِ عَلَى الْيَهُودِ وَالنَّصَارَى اتَّخَذُوا قُبُورَ أَنْبِيَائِهِمْ مَسَاجِدَ)
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారుః “యూదులు మరియు క్రైస్తవులపై అల్లాహ్ శాపం కురువుగాక! వారు తమ ప్రవక్తల సమాధులను ప్రార్థనస్థలం(మస్జిదులు)గా చేసుకున్నారు”. (బుఖారి/ అస్సలాతు ఫిల్ బీఅతి/ 436, ముస్లిం/ 531). మరో ఉల్లేఖనంలో ఉందిః
(أَلَا وَإِنَّ مَنْ كَانَ قَبْلَكُمْ كَانُوا يَتَّخِذُونَ قُبُورَ أَنْبِيَائِهِمْ وَصَالِحِيهِمْ مَسَاجِدَ أَلَا فَلَا تَتَّخِذُوا الْقُبُورَ مَسَاجِدَ إِنِّي أَنْهَاكُمْ عَنْ ذَلِكَ).
“మీకు పూర్వం గడచిపోయినవారు తమ ప్రవక్తల మరియు పుణ్యాత్ముల సమాధులను మస్జిదులుగా చేసుకునేవారు, వినండి! మీరు అలా సమాధులను మస్జిదులుగా చేయబోకండి. నేను మిమ్మల్ని దీని నుండి నిషేధిస్తున్నాను. (ముస్లిం 532).
18- నమాజు వదలకు. మానవుల మరియు ప్రభువు మధ్య అది పటిష్ఠ సంబంధం.
అది ధర్మానికి మూల స్థూపం. నమాజు వదలిన వానికి ఇస్లాంలో ఏ వాటా లేనట్లే.
عَنْ جَابِرٍ > قَالَ: سَمِعْتُ النَّبِيَّ ^ يَقُولُ: (إِنَّ بَيْنَ الرَّجُلِ وَبَيْنَ الشِّرْكِ وَالْكُفْرِ تَرْكَ الصَّلَاةِ)
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నట్లు జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “నిశ్చయంగా ఒక మనిషి మరియు షిర్క్ (బహుదైవారాధన), కుఫ్ర్ (సత్యతిరస్కారా)లకు మధ్య ఉన్న వ్యత్యాసం నమాజు పాటించకపోవడం”. (ముస్లిం/ బయాను ఇత్ లాఖి ఇస్మిల్ కుఫ్రి అలా మన్ తరకస్సలా/ 82).
19- ఆరాధన ఉద్దేశంతో మూడు మసీదులు తప్ప మరెక్కడికీ ప్రయాణం చేయకు.
1. మక్కాలో ఉన్న మస్జిదుల్ హరాం. 2. మదీనలో ఉన్న మస్జిదె నబవి([9]). 3. ఫాలస్తీనలోని ఖుద్స్ లో ఉన్న మస్జిదె అఖ్సా. ఇవి గాకుండా వేరే మస్జిదుల వైపునకు వాటిని ఉద్దేశించి ప్రయాణం చేయరాదు.
عَنْ أَبِي هُرَيْرَةَ > عَنِ النَّبِيِّ ^ قَالَ: (لَا تُشَدُّ الرِّحَالُ إِلَّا إِلَى ثَلَاثَةِ مَسَاجِدَ الْـمَسْجِدِ الْحَرَامِ وَمَسْجِدِ الرَّسُولِ @ وَمَسْجِدِ الْأَقْصَى)
“మస్జిదె హరాం, మస్జిదె నబవి మరియు మస్జిదె అఖ్సా. ఈ మూడు మస్జిదులు తప్ప మరే చోట (పుణ్యాన్ని ఆశించి) ప్రయాణించవద్దు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః (బుఖారి/ బాబు ఫజ్లిస్ సలాతి ఫీ మస్జిది మక్కా వ మదీన/ 1189, ముస్లిం/ బాబు లా తుషద్దుర్ రిహాలు ఇల్లా…/ 1397).
20- అల్లాహ్ ను వదలి సమాధిలో ఉన్నవారితో దుఆ చేసే, లేదా వారిని అల్లాహ్ ముందు మధ్యవర్తిగా నిలబెట్టే ఉద్దేశ్యంతో సమాధులను దర్శించకు.
అక్కడ వారి స్థితిగతులను, వారి పర్యవసానాన్ని గ్రహించి, గుణపాఠం నేర్చుకునే ఉద్దేశ్యం ఉండాలి. (ప్రవక్త నేర్పిన ప్రకారం) వారికి సలాం చేయుటకు, వారి కొరకు అల్లాహ్ తో దుఆ చేయుటకు వెళ్ళుట మంచిదే.
[ذَلِكُمُ اللهُ رَبُّكُمْ لَهُ المُلْكُ وَالَّذِينَ تَدْعُونَ مِنْ دُونِهِ مَا يَمْلِكُونَ مِنْ قِطْمِيرٍ، إِنْ تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ
وَيَوْمَ القِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ وَلَا يُنَبِّئُكَ مِثْلُ خَبِيرٍ] {فاطر:13، 14}
ఆ అల్లాహ్ యే మీ ప్రభువు. సామ్రాజ్యాధికారం ఆయనదే. ఆయనను కాదని మీరు పిలిచే ఇతరులు కనీసం ఒక గడ్డిపోచకు కూడా యజమానులు కారు. వారిని వేడుకుంటే, వారు మీ అర్థింపులను వినలేరు. ఒకవేళ విన్నా వాటికి ఏ సమాధానమూ మీకు ఇవ్వలేరు. మీరు కల్పించిన దైవత్వపు భాగస్వామ్యాన్ని వారు ప్రళయం నాడు తిరస్కరిస్తారు. సత్యాన్ని గురించిన ఈ సరైన సమాచారాన్ని తెలిసిన వాడు తప్ప మరొకడెవ్వడూ మీకు అందజేయలేడు. (ఫాతిర్ 35: 13,14).
21- సమాధుల మీద గుమ్మటం కట్టబోకు.
సమాధి భూమి లేవల్ కు మించి మరీ ఎక్కువ ఎత్తుగా ఉండకూడదు. దానిని సున్నపు రౌతు, ఇటుక, బండలతో కట్టకూడదు. దానిపై వ్రాయకూడదు. చిత్రాలు, బొమ్మలు దించకూడదు. దాని మీద దీపాలు పెట్టకూడదు. ఒక రకంగా ఇవన్నీ వృధా ఖర్చులే కాకుండా, మరో రకంగా అంతకు మించి షిర్క్ కు సాధనాలవుతాయి. సమాధుల పట్ల గౌరవభావం ఎక్కువయిపోతుంది. చివరికి విగ్రహాలకు పాటించబడే గౌరవం లాంటి పరిస్థితి వస్తుంది.
عَنْ أَبِي الْهَيَّاجِ الْأَسَدِيِّ قَالَ قَالَ لِي عَلِيُّ بْنُ أَبِي طَالِبٍ أَلَا أَبْعَثُكَ عَلَى مَا بَعَثَنِي عَلَيْهِ رَسُولُ الله ^: (أَنْ لَا تَدَعَ تِمْثَالًا إِلَّا طَمَسْتَهُ وَلَا قَبْرًا مُشْرِفًا إِلَّا سَوَّيْتَهُ)
అబుల్ హయ్యాజ్ రహిమహుల్లాహ్ ఇలా చెప్పారుః ఒకాసారి అలీ రజియ-ల్లాహు అన్హు నన్ను పిలిచి ఇలా చెప్పారుః ‘ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను ఏ కార్యనిర్వహణకు పంపారో, దానిగ్గానూ నేను నిన్ను పంపుతున్నాను. “నీవు ఎక్కడ ఏ బొమ్మను చూసినా దానిని చెరిపివెయ్యి. ఎక్కడ ఏ ఎత్తయిన గోరిని చూసినా దానిని నేలమట్టం చెయ్యి”. (ముస్లిం 969).
22- మనిషి, జంతువు, పక్షి, చేప లాంటి ప్రాణం ఉన్న వాటి చిత్రాలు చిత్రించకు([10]).
గుర్తింపు కార్డు మరియు పాస్ పోర్టు లాంటి అత్యవసర విషయాలకు తప్ప. (ఇది యోగ్యమని భావించకు).
عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: سَمِعْتُ رَسُولَ الله ^ يَقُولُ: (كُلُّ مُصَوِّرٍ فِي النَّارِ يُجْعَلُ لَهُ بِكُلِّ صُورَةٍ صَوَّرَهَا نَفْسًا فَتُعَذِّبُهُ فِي جَهَنَّمَ)
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నట్లు ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ప్రతి చిత్రకారుడు నరకంలో ఉంటాడు. తాను చిత్రించిన ప్రతి చిత్రపటంలో ప్రాణం పోయబడుతుంది. అది అతనిని నరకంలో శిక్షిస్తూ ఉంటుంది”. (ముస్లిం 2110).
23- అల్లాహ్ యేతరుల కొరకు జంతు బలి చేయకు.
అది వారి సన్నిధానం పొందుటకుగాని, లేదా వారితో భయం చెంది, లేదా వారేమైనా ఇస్తారని ఆశించి. ఉదాహరణకుః జిన్నాతుల నుండి ఏ హానీ కలగకూడదని లేదా మృతుల నుండి ఏదైనా లాభం కలగాలని వారి కొరకు బలి ఇచ్చుట([11]).
[قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي للهِ رَبِّ العَالَمِينَ ، لَا شَرِيكَ لَهُ وَبِذَلِكَ أُمِرْتُ وَأَنَا أَوَّلُ المُسْلِمِينَ] {الأنعام:163}
ఇలా అనుః నా నమాజ్, నా బలి (ఖుర్బానీ), నా జీవనం, నా మరణం, సమస్తమూ సకలలోకాలకూ ప్రభువైన అల్లాహ్ కొరకే, ఆయనకు ఏ భాగస్వామీ లేడు. ఈ ఆజ్ఞయే నాకు ఇవ్వబడింది. (అన్ఆమ్ 6: 163,164).
24- ఎక్కడ అల్లాహ్ యేతరుల కొరకు జంతుబలి జరుగుతుందో అక్కడ అల్లాహ్ కొరకు జంతుబలి చేయకు.
عَن ثَابِتِ بْنِ الضَّحَّاكِ قَالَ: نَذَرَ رَجُلٌ عَلَى عَهْدِ رَسُولِ الله ^ أَنْ يَنْحَرَ إِبِلًا بِبُوَانَةَ فَأَتَى النَّبِيَّ ^ فَقَالَ: إِنِّي نَذَرْتُ أَنْ أَنْحَرَ إِبِلًا بِبُوَانَةَ فَقَالَ النَّبِيُّ ^: (هَلْ كَانَ فِيهَا وَثَنٌ مِنْ أَوْثَانِ الْجَاهِلِيَّةِ يُعْبَدُ؟) قَالُوا: لَا قَالَ: (هَلْ كَانَ فِيهَا عِيدٌ مِنْ أَعْيَادِهِمْ؟) قَالُوا: لَا قَالَ: رَسُولُ الله ^: (أَوْفِ بِنَذْرِكَ فَإِنَّهُ لَا وَفَاءَ لِنَذْرٍ فِي مَعْصِيَةِ اللَّهِ وَلَا فِيمَا لَا يَمْلِكُ ابْنُ آدَمَ).
సాబిత్ బిన్ జహ్హాక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒక వ్యక్తి ‘బువాన’ అనే చోట ఒంటె బలి ఇవ్వాలని మ్రొక్కుకున్నాడు. అతను ప్రవక్త వద్దకు వచ్చి “నేను ‘బువాన’ అనే చోట ఒంటె బలి ఇవ్వాలని మ్రొక్కుకున్నాను. (నా మ్రొక్కును పూర్తి చేయాల వద్దా అని ప్రశ్నించాడు). “అజ్ఞాన కాలం నాటి ఏదైనా విగ్రహ పూజ అక్కడ జరుగుతుందా?” అని ప్రవక్త అడిగారు. ‘లేదు’ అని ప్రజలన్నారు. “అయితే వారి పండుగ, ఉత్సవాలు ఏమైనా అక్కడ జరుగుతాయా?” అని ప్రవక్త అడిగారు. ‘లేదు’ అని వారన్నారు. అప్పుడు ప్రవక్త చెప్పారుః “నీ మ్రొక్కును పూర్తి చేయి. అల్లాహ్ కు అవిధేయతలో ఉన్న ఏ మ్రొక్కూ పూర్తి చేయవద్దు. అలాగే మనిషి అధికారంలో లేని మ్రొక్కు కూడా పూర్తి చేయకూడదు”. (అబూ దావూద్/ బాబు మా యుఅమరు బిహీ మినల్ వఫాఇ… 3313).
25- ఆచరణ, ధన సంబంధమైన మరియు ఇతరత్రా మ్రొక్కుబడులన్నీ కేవలం అల్లాహ్ కొరకే నెరవేర్చాలి([12]).
సమాధుల కొరకు, బాబాలకు, సాయబులకు లేదా మజారుల వద్ద మ్రొక్కుబడులు నెరవేర్చరాదు.
عَنْ عَائِشَةَ > عَنِ النَّبِيِّ ^ قَالَ: (مَنْ نَذَرَ أَنْ يُطِيعَ اللهَ فَلْيُطِعْهُ وَمَنْ نَذَرَ أَنْ يَعْصِيَهُ فَلَا يَعْصِهِ)
“అల్లాహ్ విధేయత పాటించాలని మ్రొక్కుకున్న వ్యక్తి తన మ్రొక్కును నెరవేర్చాలి. మరెవరయితే అల్లాహ్ కు అవిధేయత పాటించాలని మ్రొక్కుకున్నాడో అతను అవిధేయత పాటించ కూడదు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారు. (బుఖారి/ బాబున్నజ్రి ఫిత్తాఅ/ 6696).
26- అల్లాహ్ ను, ఆయన సృష్టిరాసులో ఏ ఒకరితోను సమానము చేయకు.
[فَلَا تَجْعَلُوا للهِ أَنْدَادًا وَأَنْتُمْ تَعْلَمُونَ] {البقرة:22}
మీరు తెలిసి కూడా ఇతరులను అల్లాహ్ కు సమానముగా నిలబెట్టకండి. (బఖర 22).
عَنِ ابْنِ عَبَّاسٍ { أَنَّ رَجُلًا قَالَ لِلنَّبِيِّ ^: مَا شَاءَ اللهُ وَشِئْتَ فَقَالَ لَهُ النَّبِيُّ ^: (أَجَعَلْتَنِي وَاللهَ عَدْلًا بَلْ مَا شَاءَ اللهُ وَحْدَهُ)
ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ‘అల్లాహ్ మరియు మీరు తలచినట్లు’ అని అన్నాడు. ప్రవక్త చెప్పారుః “ఏమీ! నీవు నన్ను మరియు అల్లాహ్ ను సమానంగా చేశావా?. కేవలం ఏకైక అల్లాహ్ తలచినట్లు అని పలుకు”. (అహ్మద్ 1/214. సహీహ 1093).
దీని ఉదాహరణలుః నాకు అల్లాహ్ మరియు నీవు తప్ప ఇంకెవరు. నా కొరకు ఆకాశంలో అల్లాహ్ ఉంటే భూమి మీద నీవున్నావు. అల్లాహ్ మరియు నీపై నమ్మకం కలిగి ఉన్నాను.
27- అల్లాహ్ ఉనికిని గురించి ఆలోచించకు.
నిశ్చయంగా అల్లాహ్ కు సరిసమానులెవ్వరూ లేరు. ఆయన గురించి ఏ బుద్ధి గ్రహించలేదు. ఇహలోకంలో ఆయన్ను ఏ కన్ను చూడలేదు. ప్రేరేపణలకు అంకితం కాకు. ప్రేరేపణల నుండి అల్లాహ్ శరణు వేడుకో. వాటిని మానుకో. నేను అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను విశ్వసించాను అని పలుకు.
عَنِ ابْنِ عُمَرَ > قَالَ : قَالَ رَسُولُ الله ^ : تَفَكَّرُوا فِي آلاءِ الله ، وَلا تَتَفَكَّرُوا فِي الله .
“అల్లాహ్ సృష్టిలో ఆలోచించండి. కాని స్వయం అల్లాహ్ ఉనికి లో ఆలోచించకండి” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (తబ్రాని అల్ ఔసత్. సహీహ లిల్ అల్బానీ 1788).
28- అల్లాహ్ తన ఉనికితో మన వెంట ఉన్నాడని విశ్వసించకు.
అల్లాహ్ మన వెంట ఉన్నాడన్న దానికి అర్ధం ఏమిటంటే; ఆయన ఎల్లవేళల్లో మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన సహాయం మనకు అందుతూ ఉంటుంది. కాని ఆయన తన సృష్టిలో లీనము కాకుండా వేరుగా అర్ష్ (సింహాసనం) మీద తన గౌరవానికి తగినరీతిలో ఉన్నాడు. ఆయనకు పోలినది, సమతూలినది ఏది లేదు. ఆయన సర్వమూ తెలిసినవాడు. అల్లాహ్ ఆదేశం:
[وَهُوَ القَاهِرُ فَوْقَ عِبَادِهِ وَهُوَ الحَكِيمُ الخَبِيرُ] {الأنعام:18}
ఆయన తన దాసులపై సంపూర్ణమైన అధికారాలు కలిగి ఉన్నాడు. ఇంకా అత్యంత వివేకవంతుడు, అన్నీ తెలిసినవాడు. (అన్ఆమ్ 6: 18).
29- అల్లాహ్ తన కొరకు ఖుర్ఆనులో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ కొరకు సహీ హదీసుల్లో తెలిపిన గుణనామాలే తప్ప మరే గుణనామాలు అల్లాహ్ కు అంకితం చేయకు.
మనకు నచ్చిన పేర్లతో అల్లాహ్ ను పిలుచుకుందాము అన్న ప్రసక్తే లేదు. ఎందుకనగా మన బుద్ధిజ్ఞానాలకు కాదు విలువ ఇవ్వవలసినది, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తెలిపిన విషయాలకు విలువ ఇవ్వాలి.
[قُلِ ادْعُوا اللهَ أَوِ ادْعُوا الرَّحْمَنَ أَيًّا مَا تَدْعُوا فَلَهُ الأَسْمَاءُ الحُسْنَى] {الإسراء:110}
ఇలా చెప్పండిః అల్లాహ్ అని అయినా పిలవండి, లేదా రహ్మాన్ అని అయినా సరే. ఏ పేరుతో అయినా పిలవండి. ఆయనకు గల పేర్లు అన్నీ చక్కనివే. (బనీ ఇస్రాఈల్ 17: 110).
30- అల్లాహ్ గుణనామాల్లో తప్పుడు మార్గాన్ని అవలంభించకు.
వాటిని నిరాకరించి, లేదా వాటి వాస్తవ భావంలో మార్పు చేసి, లేదా వాటిలో కొన్ని ఆయన సృష్టిరాసుల్లో ఎవరికైనా అంకితం చేసి, లేదా అవి ఏదైనా సృష్టిరాసుల గుణనామాల మాదిరిగా ఉన్నాయని, లేదా ఆయనకు లేని గుణనామములు ఆయనకు అంకితం చేసి. ఏ విధంగానైనా సరే తప్పుడు మార్గం అవలంభించవద్దు.
[وَللهِ الأَسْمَاءُ الحُسْنَى فَادْعُوهُ بِهَا وَذَرُوا الَّذِينَ يُلْحِدُونَ فِي أَسْمَائِهِ سَيُجْزَوْنَ مَا كَانُوا يَعْمَلُونَ] {الأعراف:180}
అల్లాహ్ మంచి పేర్లకు అర్హుడు. ఆయనను మంచి పేర్లతోనే వేడుకోండి. ఆయనను మంచి పేర్లతో పిలిచే విషయంలో సత్యం నుండి వైదొలగేవారిని వదలి పెట్టండి. వారు తాము చేస్తున్న దానికి ప్రతిఫలం పొంది తీరుతారు. (ఆరాఫ్ 7: 180).
31- గొప్పవాడైన అల్లాహ్ ఉనికిని ప్రస్తావించి ఏదీ అడగకు. అల్లాహ్ తో అడిగినప్పుడు ఆయన ఉత్తమ నామాల మరియు గుణవిశేషాల ఆధారంతో అడగాలి.
عَنْ أَبِي مُوسَى الأشعَرِيِّ > أّنَّهُ سَمِعَ رَسُولَ اللهِ ^ يَقُولُ: مَلْعُونٌ مَنْ سَأَلَ بِوَجْهِ الله وَمَلْعُونٌ مَنْ سُئِلَ بِوَجهِ الله ثُمَّ مَنَعَ سَائِلَهُ مَا لَم يُسأَلْ هُجرا
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నట్లు అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అల్లాహ్ ఉనికిని ప్రస్తావించి అడిగినవాడు శపింపబడ్డాడు. అలాగే అల్లాహ్ అస్తిత్వ ఆధారంతో అడగబడినవాడు కూడా శపింపబడ్డాడు, ఒక వేళ అతను అడిగిన వ్యక్తిని నెట్టేసి అతనికి ఏమీ ఇవ్వకుంటే. అయితే అనవసరమైన, వృధా విషయం అడిగినవాడికి ఇవ్వకపోవడం వల్ల ఈ శాపం పడదు”. (అల్ ముఅజముల్ కబీర్ లిత్తబ్రానీ. సహీహా 2290).
32- నిశిద్ధమైన మరియు అధర్మ మాధ్యస్థంతో, అల్లాహ్ తో దుఆ చేయకు.
ఉదాః అల్లాహ్! ఫలాన వ్యక్తి ఉన్నత స్థానం యొక్క మాధ్యస్థంతో నేను నిన్ను అడుగుతున్నాను. లేదా ఫలాన వ్యక్తి హక్కు మాధ్యస్థంతో. అయితే ఎవరైనా ప్రాణంతో ఉన్న విశ్వాసులైన, పుణ్యాత్ముల దుఆ యొక్క మాధ్యస్థం యోగ్యమే([13]).
[يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا اتَّقُوا اللهَ وَابْتَغُوا إِلَيْهِ الوَسِيلَةَ وَجَاهِدُوا فِي سَبِيلِهِ لَعَلَّكُمْ تُفْلِحُونَ] {المائدة:35}
విశ్వాసులారా! అల్లాహ్ కు భయపడండి. ఆయన సాన్నిధ్యానికి చేరే మార్గాన్ని అన్వేషించండి. ఆయన మార్గంలో నిరంతర కృషి చెయ్యండి. బహుశా మీకు సాఫల్య భాగ్యం లభించవచ్చు. (5: 35).
33- నీ పాపాలు ఎంత ఉన్నా సరే అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకు.
సూర యూసుఫ్ 12: 87లో ఉంది:
[إِنَّهُ لَا يَيْأَسُ مِنْ رَوْحِ اللهِ إِلَّا القَوْمُ الكَافِرُونَ] {يوسف:87}
ఆయన కారుణ్యం పట్ల కేవలం అవిశ్వాసులే నిరాశ చెందుతారు.
34- నీవు ఎంత పుణ్యాత్ముడివైనా అల్లాహ్ ఎత్తుగడల నుండి నిర్భయంగా ఉండకు.
[أَفَأَمِنُوا مَكْرَ اللهِ فَلَا يَأْمَنُ مَكْرَ اللهِ إِلَّا القَوْمُ الخَاسِرُونَ] {الأعراف:99}
ఏమిటీ? ఈ ప్రజలు అల్లాహ్ ఎత్తుగడ అంటే నిర్భయంగా ఉన్నారా? వాస్తవానికి నాశనం కాబోయే జాతి మాత్రమే అల్లాహ్ ఎత్తుగడ అంటే నిర్భయంగా ఉంటుంది. (ఆరాఫ్ 7: 99).
35- అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండకు.
మనిషి ఎలాంటి తలంపు అల్లాహ్ పట్ల ఉంచుతాడో దాని ప్రకారమే అతనికి అల్లాహ్ తోడు లభిస్తుంది.
عَنْ جَابِرِ بْنِ عَبْدِ الله الْأَنْصَارِيِّ { قَالَ: سَمِعْتُ رَسُولَ الله ^ قَبْلَ مَوْتِهِ بِثَلَاثَةِ أَيَّامٍ يَقُولُ: (لَا يَمُوتَنَّ أَحَدُكُمْ إِلَّا وَهُوَ يُحْسِنُ الظَّنَّ بِالله عَزَّ وَجَلَّ).
“మీలో ప్రతి వ్యక్తి అల్లాహ్ పట్ల మంచి తలంపు ఉంచుతూ మరణించాలి” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ మరణానికి మూడు రోజుల ముందు చెప్పగా నేను విన్నాను అని జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ముస్లిం 2877).
36- అల్లాహ్ ఆరాధన కేవలం ప్రేమతో, లేదా కేవలం ఆశతో, లేదా కేవలం భయంతో చేయకూడదు.
ఆశ, భయం పక్షికి ఉండే రెండు రెక్కల్లాంటివి. పక్షి ఒక రెక్కతో పైకి ఎగర లేదు కదా? అందుకే విశ్వాసులైన పుణ్యాత్ములు ఆశ, భయం ఈ రెండిటి ద్వారా అల్లాహ్ ను ఆరాధించేవారుః
[أُولَئِكَ الَّذِينَ يَدْعُونَ يَبْتَغُونَ إِلَى رَبِّهِمُ الوَسِيلَةَ أَيُّهُمْ أَقْرَبُ وَيَرْجُونَ رَحْمَتَهُ وَيَخَافُونَ عَذَابَهُ] {الإسراء:57}
ఈ ప్రజలు మొరపెట్టుకుంటున్న వారే స్వయంగా తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు, ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. వారు ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు. ఆయన శిక్షకు భయపడుతున్నారు. (బనీ ఇస్రాఈల్ 17: 57). ఇంకా సూర హిజ్ర్ 15: 49,50లో ఇలా ఆదేశించాడుః
[نَبِّئْ عِبَادِي أَنِّي أَنَا الغَفُورُ الرَّحِيمُ ، وَأَنَّ عَذَابِي هُوَ العَذَابُ الأَلِيمُ]
నేను చాలా క్షమించేవాణ్ణి అనీ, కరుణించేవాణ్ణి అనీ, దీనితోపాటు, నా శిక్ష కూడా చాలా బాధాకరమైన శిక్షే అనీ నా దాసులకు చెప్పు.
37- సత్కార్యాలు చేయకుండానే అల్లాహ్ కారుణ్యం పట్ల ఆశ ఉంచకు.
మంచి కార్యాలు చేయడమే అల్లాహ్ పట్ల మంచి తలంపు ఉంచినట్లు నిదర్శనం. అలసట, అలక్ష్యం ద్వారా అల్లాహ్ కారుణ్యం లభించదు. సత్యవిశ్వాసం, సత్కార్యాల ద్వారానే లభిస్తుంది. వాస్తవానికి అల్లాహ్ కారుణ్యం పుణ్యాత్ములకు సమీపంలో ఉంది. అల్లాహ్ ఆదేశం:
[إِنَّ الَّذِينَ آَمَنُوا وَالَّذِينَ هَاجَرُوا وَجَاهَدُوا فِي سَبِيلِ اللهِ أُولَئِكَ يَرْجُونَ رَحْمَةَ اللهِ وَاللهُ غَفُورٌ رَحِيمٌ] {البقرة:218}
నిశ్చయంగా విశ్వసించి, అల్లాహ్ మార్గంలో తమ ఇల్లూ వాకిలీ సహితం విడిచి జిహాద్ చేసేవారు అల్లాహ్ కారుణ్యం ఆశించటానికి అన్ని విధాలా అర్హులు. అల్లాహ్ వారి తప్పులను క్షమించి వారిని కరుణిస్తాడు. (బఖర 2: 218).
38- పరిహాసమాడకు; ఖుర్ఆన్, ప్రవక్త, ధర్మం మరియు ధర్మవిషయాలతో పరిహాసమాడకు, ఎగతాళి చేయకు, హీనపరచకు([14]). అది (వేరే దురుద్దేశం లేకుండా) కేవలం నవ్వు పుట్టించుటకైనా సరే.
ధర్మవిద్యతో లేదా ధార్మిక విద్యార్థులతో పరిహాసమాడుట([15]). మంచిని ఆదేశించి, చెడును నివారించే వారితో పరిహాసమాడుట. గడ్డం, మిస్వాక్ మరియు తదితర ధర్మవిషయాలతో పరిహాసమాడుట అల్లాహ్డతో కుఫ్ర్ చేసినట్లగును. సూర తౌబా (9:65,66)లో అల్లాహ్ ఆదేశం:
[وَلَئِنْ سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ قُلْ أَبِاللهِ وَآَيَاتِهِ وَرَسُولِهِ كُنْتُمْ تَسْتَهْزِئُونَ ، لَا تَعْتَذِرُوا قَدْ كَفَرْتُمْ بَعْدَ إِيمَانِكُمْ]. {التوبة 65، 66}.
మీరు చెప్పుకుంటూ ఉన్న విషయం ఏమిటి? అని ఒకవేళ వారిని అడిగితే, మేము సరదాగా వేళాకోళంగా మాట్లాడుకుంటున్నాము అని తక్షణం బదులు చెబుతారు. వారితో ఇలా అనుః మీ వేళాకోళం, అల్లాహ్ తోనా ఆయన ఆయతులతోనా, ఆయన ప్రవక్తతోనా? ఇక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి పాల్పడ్డారు.
39- అల్లాహ్ ఆయతులతో వేళాకోళం చేస్తున్నవారితో నీవు కూర్చోకు.
వారిని ఆ పని నుండి నివారించే ఉద్దేశ్యం ఉంటే కూర్చోవచ్చు. అల్లాహ్ ఆదేశం ఇలా ఉందిః
[وَقَدْ نَزَّلَ عَلَيْكُمْ فِي الكِتَابِ أَنْ إِذَا سَمِعْتُمْ آَيَاتِ اللهِ يُكْفَرُ بِهَا وَيُسْتَهْزَأُ بِهَا فَلَا تَقْعُدُوا مَعَهُمْ حَتَّى يَخُوضُوا فِي حَدِيثٍ غَيْرِهِ إِنَّكُمْ إِذًا مِثْلُهُمْ إِنَّ اللهَ جَامِعُ المُنَافِقِينَ وَالكَافِرِينَ فِي جَهَنَّمَ جَمِيعًا] {النساء:140}
అల్లాహ్ ఈ గ్రంథంలో మీకు ఇదివరకే ఈ ఉత్తరువు ఇచ్చి ఉన్నాడుః అల్లాహ్ ఆయతులకు వ్యతిరేకంగా తిరస్కారవచనాలు వాగటాన్ని, వాటిని పరిహసించటాన్ని మీరు విన్నట్లైయితే, అలా చేసేవారు (ఆ సంభాషణ వదలి) వేరే మాట ప్రారంభించనంత వరకు మీరు వారితో కలసి కూర్చోకండి. ఇప్పుడు మీరు గనక అలా చేస్తే మీరూ వారి లాంటి వారే. అల్లాహ్ కపటులనూ, అవిశ్వాసులనూ నరకంలో ఒకచోట పోగుచెయ్య- బోతున్నాడనే విషయం నిశ్చయమని తెలుసుకోండి. (నిసా 4: 140).
40- అల్లాహ్ అవతరించిన దానిని వదలి, వేరేవాటితో తీర్పు చేయకు([16]).
లేదా అందులోని తీర్పుల్లో అన్యాయం, నిరంకుశత్వం, నిర్దాక్షిణ్యం మరియు కఠినాలు ఉన్నాయని, లేదా సంపూర్ణంగా కాకుండా లోపం ఉందని, లేదా వేరే చట్టాలు, తీర్పులు దానికంటే మేలైనవి అని, లేదా దాని లాంటివే మరియు ప్రజలకు ఉత్తమం అయినవని, లేదా అవి ఈ కాలానికి చెల్లవని భావించకు. ఇలాంటి నమ్మకాలన్నియూ అల్లాహ్ తో కుఫ్ర్ (తిరస్కారం) మరియు ధర్మభ్రష్టతకు కారణం అవుతాయి. అల్లాహ్ ఆదేశం చదవండిః
[وَمَنْ لَمْ يَحْكُمْ بِمَا أَنْزَلَ اللهُ فَأُولَئِكَ هُمُ الكَافِرُونَ]. {المائدة:44}
అల్లాహ్ అవతరించిన చట్టం ప్రకారం తీర్పు చేయనివారే అవిశ్వాసులు. (మాఇద 5: 44).
41- అల్లాహ్ తన గ్రంథం ద్వారా లేదా ప్రవక్త ద్వారా పంపిన ఏ ఒక్క విషయాన్నీ అసహ్యించుకోకు.
ఉదాః బహుభార్యత్వం, వడ్డి నిశిద్ధత, జకాత్ (విధిదానం) లాంటివి.
[وَالَّذِينَ كَفَرُوا فَتَعْسًا لَـهُمْ وَأَضَلَّ أَعْمَالَـهُمْ ، ذَلِكَ بِأَنَّهُمْ كَرِهُوا مَا أَنْزَلَ اللهُ فَأَحْبَطَ أَعْمَالَـهُمْ] {محمد:8، 9}
ఎవరైతే అవిశ్వాసానికి ఒడిగట్టారో వారికి వినాశం తప్పదు. అల్లాహ్ వారి కర్మలను తోవ తప్పించాడు. ఎందుకంటే వారు అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకున్నారు. కనుక అల్లాహ్ వారి కర్మలను వ్యర్థపరిచాడు. (ముహమ్మద్ 47: 8,9).
42- అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశాల్లో ఏ ఒక్కదాని పట్ల నీ హృదయంలో కల్మషం ఉండ కూడదు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువు వద్ద నుండి తీసుకువచ్చిన దానికనుగుణంగా నీ వాంఛలు కానంత వరకు నీ విశ్వాసం పరిపూర్ణం కాదు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆజ్ఞలను శ్రద్ధగా విని అనుసరించేవానిగా ఉండు.
[فَلَا وَرَبِّكَ لَا يُؤْمِنُونَ حَتَّى يُحَكِّمُوكَ فِيمَا شَجَرَ بَيْنَهُمْ ثُمَّ لَا يَجِدُوا فِي أَنْفُسِهِمْ حَرَجًا مِمَّا قَضَيْتَ وَيُسَلِّمُوا تَسْلِيمًا] {النساء:65}
నీ ప్రభువు సాక్షిగా! వారు పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయనిర్ణేతగా స్వీకరించనంత వరకు, ఇంకా నీవు ఏ నిర్ణయం చేసినా దాని గురించి వారి మనస్సులలో కూడా ఏ మాత్రం సంకోచం లేకుండా దానిని యథాతథంగా శిరసా వహించనంత వరకు వారు నిజమైన విశ్వాసులు కాలేరు. (నిసా 4: 65).
43- అల్లాహ్ హలాల్ (ధర్మసమ్మతం) చేసిన దానిని నీవు హరాం (నిశిద్ధం) చేయకు. లేదా అల్లాహ్ హరాం చేసిన దానిని నీవు హలాల్ చేయకు.
ఇంకా ప్రసిద్ధ, ప్రాముఖ్యమైన ధర్మ విషయాలను తిరస్కరించకు. ఉదాహరణకుః మత్తు నిశిద్ధత, నమాజు విధితము, తదితరాలు.
[وَلَا تَقُولُوا لِمَا تَصِفُ أَلْسِنَتُكُمُ الكَذِبَ هَذَا حَلَالٌ وَهَذَا حَرَامٌ لِتَفْتَرُوا عَلَى اللهِ الكَذِبَ إِنَّ الَّذِينَ يَفْتَرُونَ عَلَى اللهِ الكَذِبَ لَا يُفْلِحُونَ] {النحل:116}
మీరు ఇట్లే నోటికొచ్చినట్లు ‘ఇది ధర్మసమ్మతమైనది, అది అధర్మమైనది’ అని అబద్ధాలు పలకకండి. ఇందువల్ల మీరు అల్లాహ్ పై అసత్యాన్ని మోపినవాళ్ళవుతారు. అల్లాహ్ పై అసత్యారోపణలు చేసేవారు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు. (నహల్ 16: 116).
44- హలాల్ ను హరాం మరియు హరాం ను హలాల్ చేసే వ్యక్తి (ఏలాంటి వాడైనా సరే అతని)ని అనుసరించకు.
ఈ హక్కు కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది. అల్లాహ్ హలాల్ చేసినదే హలాల్. అల్లాహ్ హరాం చేసినదే హరాం. దేనిని ఆయన ధర్మంగా చేశాడో అదే ధర్మం.
[اتَّخَذُوا أَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ أَرْبَابًا مِنْ دُونِ الله] {التوبة:31}
వారు అల్లాహ్ ను కాదని తమ పండితులను, సాధువులను తమ ప్రభువులుగా చేసుకున్నారు. (తౌబా 9: 31).
عَنْ عَدِىِّ بْنِ حَاتِمٍ > قَالَ : أَتَيْتُ النَّبِىَّ ^ وَفِى عُنُقِى صَلِيبٌ مِنْ ذَهَبٍ قَالَ فَسَمِعْتُهُ يَقُولُ [اتَّخَذُوا أَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ أَرْبَابًا مِنْ دُونِ الله] قَالَ قُلْتُ يَا رَسُولَ الله إِنَّهُمْ لَمْ يَكُونُوا يَعْبُدُونَهُمْ. قَالَ: «أَجَلْ وَلَكِنْ يُحِلُّونَ لَهُمْ مَا حَرَّمَ اللهُ فَيَسْتَحِلُّونَهُ وَيُحَرِّمُونَ عَلَيْهِمْ مَا أَحَلَّ اللهُ فَيُحَرِّمُونَهُ فَتِلْكَ عِبَادَتُهُمْ لَهُمْ». {السنن الكبرى للبيهقي، كتاب آداب القاضي ، باب ما يقضي به القاضي… ، 10/198}
అదీ బిన్ హాతిం రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చాను. అప్పుడు నా మెడలో బంగారు శిలువ ఉండింది. నేను చేరుకునే సరికి ప్రవక్త ]వారు అల్లాహ్ ను కాదని తమ పండితులను, సాధువులను తమ ప్రభువులుగా చేసుకున్నారు. (తౌబా 9: 31). అన్న ఆయతు పఠిస్తున్నారు. ‘ప్రవక్తా! యూదులు, క్రైస్తవులు తమ పండితుల, సన్యాసుల పూజా, ఆరాధనలు చేసేవారు కాదు కదా?’ అని నేనడిగాను. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అవును, కాని అల్లాహ్ హరాం చేసిన వాటిని పండితులు హలాల్ చేస్తే వారు దానిని హలాల్ గానే భావించేవారు. అలాగే అల్లాహ్ హలాల్ చేసిన వాటిని వారు హరాం చేస్తే వారు దానిని హరాంగానే భావించేవారు. ఇదే వారి ఆరాధన చేసినట్లు” అని విశదపరిచారు. (బైహఖీ ‘సునన్ కుబ్రా’లో, కితాబు ఆదాబిల్ ఖాజి, బాబు మా యఖ్ జీ బిహిల్ ఖాజీ…, 10/198).
45- ధార్మిక మరియు ప్రాపంచిక ఏ విషయంలోనైనా ఇస్లాం, ముస్లిముల క్షీణత్వాన్ని మరియు షిర్క్, షిర్క్ చేయువారి ఉన్నత స్థితిని చూసి సంతోషించవద్దు.
మునాఫిఖుల విషయం అల్లాహ్ ఇలా తెలిపాడుః
[إِنْ تُصِبْكَ حَسَنَةٌ تَسُؤْهُمْ وَإِنْ تُصِبْكَ مُصِيبَةٌ يَقُولُوا قَدْ أَخَذْنَا أَمْرَنَا مِنْ قَبْلُ وَيَتَوَلَّوْا وَهُمْ فَرِحُونَ] {التوبة:50}
మీకు మేలు కలిగితే వారికి బాధ కలుగుతుంది. ఏదైనా ఆపద మీ మీదకు వచ్చిపడినప్పుడు వారు ముఖాన్ని త్రిప్పుకొని సంతోషంతో పొంగిపోతూ మరలిపోతారు. ఇలా అంటూ పోతారుః మేము ముందే మా వ్యవహారాన్ని సరిచేసు కోవటం మంచిదయింది. (తౌబా 9: 50).
46- అవిశ్వాసులతో మరీ సన్నిహితంగా ఉండకు, వారిని అమితంగా ప్రేమించకు, వారి ధార్మిక విషయాల్లో డబ్బు ధనంతో, హోదా అంతుస్తులతో, సలహా మరియు శక్తి సామర్థ్యాలతో తోడు ఇవ్వకు.
అలా చేసితివా వారిలోనే కలసిపోతావు, ప్రళయదినాన వారితోనే లేపబడుతావు.
[يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا لَا تَتَّخِذُوا عَدُوِّي وَعَدُوَّكُمْ أَوْلِيَاءَ تُلْقُونَ إِلَيْهِمْ بِالمَوَدَّةِ]
విశ్వసించిన ఓ ప్రజలారా! నాకూ, మీకూ శత్రువులైనవారితో స్నేహం చేయకండి. మీరు ప్రేమపూర్వకంగా కలుస్తారా?. (ముమ్ తహిన 60: 1).
47- అవిశ్వాసుల ధార్మిక లేదా వారికి సంబంధించిన ప్రత్యేకతల్లో లేదా దేనిలో వారు ఇతరులకు భిన్నంగా ఉంటారో అలాంటి పోలికలు నీవు పాటించకు.
عَن ابْنِ عُمَرَ > قَالَ: قَالَ رَسُولُ الله ^: (مَنْ تَشَبَّهَ بِقَوْمٍ فَهُوَ مِنْهُمْ).
“ఎవరు ఏ జాతివారి పోలిక అవలంబిస్తారో అతడు వారిలోనివాడే అయిపోతాడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (అబూ దావూద్/ బాబు ఫీ లుబ్సిష్ షుహ్ ర/ 4031).
48- ధర్మ విషయంలో ఎప్పుడూ నీచ వ్యవహారం వహించకు. కృంగిపోకు, బాధపడకు.
వాస్తవానికి గౌరవం అనేది అల్లాహ్ కూ, ఆయన ప్రవక్తకూ మరియు విశ్వాసులకే చెందుతుంది.
[وَلَا تَهِنُوا وَلَا تَحْزَنُوا وَأَنْتُمُ الأَعْلَوْنَ إِنْ كُنْتُمْ مُؤْمِنِينَ] {آل عمران:139}
కృంగిపోకండి, దుఃఖపడకండి, మీరు నిజమైన విశ్వాసులయితే తప్పక ప్రాబల్యం పొందుతారు. (ఆలె ఇమ్రాన్ 3: 139).
49- ముష్రికుల షిర్క్ గురించి సందేహంలోపడకు. వారి ధర్మాన్ని సత్యధర్మంగా నమ్మకు.
వారి ధర్మపురోగతికై తోడ్పడకు, లేదా వారి ధర్మ రక్షణకై పాటుపడకు. ఇలా చేసితివా, నీవు వారిలోనే కలసిపోయే భయం ఉంటుంది.
[أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِنَ الكِتَابِ يُؤْمِنُونَ بِالجِبْتِ وَالطَّاغُوتِ وَيَقُولُونَ لِلَّذِينَ كَفَرُوا هَؤُلَاءِ أَهْدَى مِنَ الَّذِينَ آَمَنُوا سَبِيلًا ، أُولَئِكَ الَّذِينَ لَعَنَهُمُ اللهُ وَمَنْ يَلْعَنِ اللهُ فَلَنْ تَجِدَ لَهُ نَصِيرًا] {النساء:51، 52}
గ్రంథ జ్ఞానంలో కొంత భాగం ఇవ్వబడిన వారిని నీవు చూడలేదా? వారు భ్రష్టాచారాలను మరియు మిథ్యాదైవాలను నమ్ముతారు. ఇంకా వారు అవిశ్వాసులను గురించి, ‘విశ్వాసుల కంటే వీరే చాలా వరకు సరైన మార్గంలో ఉన్నారు’ అని అంటారు. ఇటువంటి వారినే అల్లాహ్ శపించింది. అల్లాహ్ శపించినవాడికి సహాయం చేసేవాడెవ్వడూ నీకు దొరకడు. (నిసా 4: 51,52).
50- అవిశ్వాసుల పండుగల్లో లేదా వారి ధార్మిక ఉత్సవాల్లో పాల్గొనకు. వారికి శుభకాంక్షలు తెలియజేయకు.
లేదా అందులో వారికి సహాయం చేయకు. ఇలా చేసితివా, ఇది నీ వైపున వారి (ధర్మమును)ని ఒప్పుకున్నట్లు అగును.
عَن ابْنِ عُمَرَ > قَالَ: قَالَ رَسُولُ الله ^: (مَنْ تَشَبَّهَ بِقَوْمٍ فَهُوَ مِنْهُمْ).
“ఎవరు ఏ జాతివారి పోలిక అవలంబిస్తారో అతడు వారిలోనివాడే అయిపోతాడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (అబూ దావూద్ 4031).
51- ఇస్లాం ధర్మం పట్ల విముఖత చూపకు.
అయితే దానిని నేర్చుకోకుండా, దానిపై ఆచరించకుండా ఉండడం దాని పట్ల విముఖత చూపినట్లే.
[وَمَنْ أَظْلَمُ مِمَّنْ ذُكِّرَ بِآَيَاتِ رَبِّهِ ثُمَّ أَعْرَضَ عَنْهَا إِنَّا مِنَ المُجْرِمِينَ مُنْتَقِمُونَ]
తన ప్రభువు ఆయతుల ద్వారా హితబోధ చేయబడినప్పుడు, వాటిపట్ల విముఖుడయ్యే వానికంటే పరమ దుర్మార్గుడెవడు?. అటువంటి అపరాధులకు మేము తప్పనిసరిగా ప్రతీకారం చేసితీరుతాము. (సజ్దా 32: 22).
52- చేతబడి వ్యవహారాల్లో ఏ రవ్వంత జోక్యం చేసుకోకు.
అదో భూతవైద్యం మరియు విశ్వాసానికి వ్యతిరేకమైన అవిశ్వాస మార్గం.
[وَاتَّبَعُوا مَا تَتْلُو الشَّيَاطِينُ عَلَى مُلْكِ سُلَيْمَانَ وَمَا كَفَرَ سُلَيْمَانُ وَلَكِنَّ الشَّيَاطِينَ كَفَرُوا يُعَلِّمُونَ النَّاسَ السِّحْرَ وَمَا أُنْزِلَ عَلَى المَلَكَيْنِ بِبَابِلَ هَارُوتَ وَمَارُوتَ وَمَا يُعَلِّمَانِ مِنْ أَحَدٍ حَتَّى يَقُولَا إِنَّمَا نَحْنُ فِتْنَةٌ فَلَا تَكْفُرْ فَيَتَعَلَّمُونَ مِنْهُمَا مَا يُفَرِّقُونَ بِهِ بَيْنَ المَرْءِ وَزَوْجِهِ وَمَا هُمْ بِضَارِّينَ بِهِ مِنْ أَحَدٍ إِلَّا بِإِذْنِ اللهِ وَيَتَعَلَّمُونَ مَا يَضُرُّهُمْ وَلَا يَنْفَعُهُمْ وَلَقَدْ عَلِمُوا لَمَنِ اشْتَرَاهُ مَا لَهُ فِي الآَخِرَةِ مِنْ خَلَاقٍ وَلَبِئْسَ مَا شَرَوْا بِهِ أَنْفُسَهُمْ لَوْ كَانُوا يَعْلَمُونَ] {البقرة:102}
వారు సులైమాను రాజ్యకాలమున షైతానులు పఠించే దానిని (జాలవిద్యను) అనుసరించారు. సులైమాను అవిశ్వాసి కాలేదు. కాని షైతానులు అవిశ్వాసులయ్యారు. వారు జనులకు ‘జాల’ విద్యను నేర్పేవారు. వారు బాబిలోన్ నగరమందు హారూతు మారూతు అన్న దైవదూతలకు నొసంగబడిన దానిని అనుసరించిరి. ఆ ఇద్దరు దూతలు మేము పరీక్షకు ఉన్నాము కావున మీరు (ఈ జాలవిద్యను నేర్చుకొని) అవిశ్వాసులు కాకండి అని చెప్పనంత వరకు ఎవరికి నేర్పకుండిరి. ఆ పిదప వారు ఆ ఇద్దరి నుండి భార్యాభర్తలకు ఎడబాటు కలిగించునట్టి జాలవిద్య నేర్చుకొనుచుండిరి. వారు దాని వలన అల్లాహ్ సెలవు లేక (అల్లాహ్ ఆజ్ఞ లేనిది) ఎవరికిని నష్టము కలిగింపజాలరు. కాని వారు నేర్చుకున్నది వారికి నష్టం కలిగించేదే కాని లాభం కలిగించేది ఎంతమాత్రం కాదు. ఈ విద్యను కొనేవారికి పరలోక సౌఖ్యాలలో ఏ మాత్రం భాగం లేదనే విషయం వారికి బాగా తెలుసు. ఎంత తుచ్ఛమైన సొమ్ముకు బదులుగా వారు తమ ఆత్మలను అమ్ముకున్నారో వారికి తెలిస్తే ఎంత బాగుండేది. (బఖర 2: 102).
53- పంచాంగకర్త, గారడీవాడు, మాంత్రికుడు, అగోచర విషయాల గురించి చెప్పువాడు, భూశకున వైదాంతి, గ్రహాల ఆధారంగా, హస్తం చూసి మరియు గవ్వల ద్వారా భవిష్యం చెప్పేవాళ్ళ (జాతకుడు) వద్దకు వెళ్ళకు.
عَنْ بَعْضِ أَزْوَاجِ النَّبِيِّ ^ عَنْ النَّبِيِّ ^ قَالَ (مَنْ أَتَى عَرَّافًا فَسَأَلَهُ عَنْ شَيْءٍ لَمْ تُقْبَلْ لَهُ صَلَاةٌ أَرْبَعِينَ لَيْلَةً).
ప్రవక్త ఇలా సెలవిచ్చారని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం భార్యల్లో ఒకరు ఉల్లేఖించారుః “ఎవరు పంచాంగకర్త వద్దకు వచ్చి అతన్ని ఏదైనా విషయం అడుగుతాడో అతని నలబై రోజుల నమాజు అంగీకరింపబడదు”. (ముస్లిం/తహ్రీముల్ కహాన… 2230).
54- పైన పేర్కొన్నవారిలో ఏ ఒక్కడిని సత్యవంతునిగా భావించకు.
వారి వద్దకు వచ్చుట మరియు వారిని సత్యముగా భావించుట ప్రవక్తపై అవతరించిన సత్య ధర్మాన్ని తిరస్కరించినట్లు([17]).
عَنْ أَبِي هُرَيْرَةَ > عَنْ النَّبِيِّ ^ قَالَ: (مَنْ أَتَى كَاهِنًا أَوْ عَرَّافًا فَصَدَّقَهُ بِمَا يَقُولُ فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ ^).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఎవరు పంచాంగకర్త లేదా అగోచర విషయాలు తెలిపేవాని వద్దకు వెళ్ళి అతను చెప్పిన మాటల్ని సత్యముగా నమ్ముతాడో అతడు ప్రవక్తపై అవతరించిన దానిని తిరస్కరించినవాడవుతాడు”. (అహ్మద్ 2/429, అబూ దావూద్, తిర్మిజి, ఇబ్ను మాజ).
55- తారల ద్వారా వర్షం కోరకు. నక్షత్రరాశుల, కక్ష్యల మరియు గ్రహాల ప్రభావం ఉంటుందని నమ్మకు([18]).
أَنَّ أَبَا مَالِكٍ الْأَشْعَرِيَّ > حَدَّثَهُ أَنَّ النَّبِيَّ ^ قَالَ: أَرْبَعٌ فِي أُمَّتِي مِنْ أَمْرِ الْجَاهِلِيَّةِ لَا يَتْرُكُونَهُنَّ الْفَخْرُ فِي الْأَحْسَابِ وَالطَّعْنُ فِي الْأَنْسَابِ وَالْاسْتِسْقَاءُ بِالنُّجُومِ وَالنِّيَاحَةُ
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ మాలిక్ అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “నా అనుచర సంఘం లోని కొందరిలో అజ్ఞానకాలానికి సంబంధించిన నాలుగు విషయాలు ఉంటాయి. వారు వాటిని వదులుకోరుః వంశగర్వం, వంశానికి సంబంధించిన దూషణలు, తారల ద్వారా వర్షం కోరడం([19]) మరియు శోకం”. (ముస్లిం/ అత్తష్దీదు ఫిన్నియాహ/ 394).
56- ఫలాన నక్షత్రం వల్ల వర్షం కురిసింది అని అనకు([20]). ఇలా వర్షం, దాని కురువడాన్ని వాటికి అంకితం చేసినట్లవుతుంది.
عَنْ زَيدِ بنِ خَالِدِ الجُهَنِي > قَالَ: صَلَّى لَنَا رَسُولُ الله ^ صَلاَةَ الصُّبحِ بِالحُدَيبِيةِ عَلَى إِثرِ سَمَاءٍ كَانَتْ مِنَ اللَّيلِ فَلَمَّا انْصَرَفَ النَّبِيُّ ^ أَقْبَلَ عَلَى النَّاسِ فَقَالَ: (هَلْ تَدْرُونَ مَاذَا قَالَ رَبُّكُم؟) قَالُوا: اللهُ وَرَسُولُهُ أَعْلَم. قَالَ: قَالَ: (أصْبَحَ مِنْ عِبَادِي مُؤمِنٌ بِي وَكَافِر، فَأمَّا مَنْ قَالَ: مُطِرنَا بِفَضلِ الله وَرَحْمَتِهِ فَذَلِكَ مُؤْمِنٌ بِي وَكَافِرٌ بِالكَوكَب، وَأمَّا مَنْ قَالَ: بِنَوءِ كَذَا وَكَذَا فَذَلِكَ كَافِرٌ بِي مُؤمِنٌ بِالكَوكَب).
జైద్ బిన్ ఖాలిద్ అల్ జుహ్నీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: హుదైబియ ప్రాంతంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఫజ్ర్ నమాజ్ చేయించారు. ఆ గడిచిన రాత్రి వర్షం కురిసింది. నమాజ్ అయిన తరువాత ఆయన అనుచరుల వైపు తిరిగి “మీ ప్రభువు ఏమన్నాడో మీకు తెలుసా?” అని అడిగారు. అల్లాహ్ కు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు, మాకు తెలియదు అని వారన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ఇలా చెప్పాడని తెలిపారు. “ఈ రోజు ఉదయం నా దాసుల్లో కొందరు నన్ను విశ్వసిస్తూ, మరికొందరు తిరస్కరిస్తూ లేచారు. అల్లాహ్ దయ వల్ల మనకు వర్షం కురిసింది అని అన్నవారు తారాబలాన్ని నిరాకరించి, నన్ను విశ్వసించిన వారయ్యారు. దీనికి భిన్నంగా ఫలానా నక్షత్ర ప్రభావంతో వర్షం కురిసిందని అన్నవారు నక్షత్ర విశ్వాసులయి, నన్ను తిరస్కరించిన వారయ్యారు. (బుఖారి/వతజ్అలూన రిజ్ఖకుం… 1038, ముస్లిం 71).
57- అపశకునం పాటించకు, ఏ దానిని కూడా చెడుదృష్టితో చూడకు.
పక్షులు, మనుషులు, పేర్లు, పదాలు, స్థలం, సంఘటనలు, సంఖ్యలు, రంగులు, నెలలు, రోజులు మరియు గంటలు ఎందులో కూడ ఏలాంటి లాభనష్టాలు లేవు. కేవలం అల్లాహ్ తప్ప.
عَنْ أَبِي هُرَيْرَةَ > أَنَّ رَسُولَ الله ^ قَالَ: (لَا عَدْوَى وَلَا هَامَةَ وَلَا نَوْءَ وَلَا صَفَرَ) {مسلم 2220}. و في رواية جَابِرٍ > أن النبي ^ قال: (وَلَا طِيَرَةَ وَلَا غُولَ). {مسلم 2222}
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అంటు వ్యాది సరైనది కాదు. గుడ్లగూబ అరుపులో నష్టమేమీ లేదు. తారాబలం కూడా నమ్మదగినది కాదు. ‘సఫర్’లో నిజం లేదు([21])”. (ముస్లిం 2220). జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసు లో మరో రెండు విషయాలు అదనంగా ఉన్నాయిః “అపశకునం మరియు దయ్యాల నమ్మకం సరైనది కాదు”. (ముస్లిం 2222).
58- మంచి, చెడు తక్దీర్ (విధివ్రాత)ను తిరస్కరించకు.
తక్దీర్ అన్నది అల్లాహ్ సృష్టిలో ఒక రహస్యం. ఈ జగత్తులో ఏది జరిగినా అది అల్లాహ్ కు తెలిసినదే, కోరినదే, వ్రాసినదే మరియు సృష్టించినదే జరుగుతుంది.
عَن زَيدِ بْنِ ثَابِتٍ > قَال: قَالَ رَسُولُ الله ^: (لَوْ أَنَّ اللهَ عَذَّبَ أَهْلَ سَمَاوَاتِهِ وَأَهْلَ أَرْضِهِ عَذَّبَهُمْ وَهُوَ غَيْرُ ظَالِمٍ لَهُمْ وَلَوْ رَحِمَهُمْ كَانَتْ رَحْمَتُهُ خَيْرًا لَهُمْ مِنْ أَعْمَالِهِمْ وَلَوْ أَنْفَقْتَ مِثْلَ أُحُدٍ ذَهَبًا فِي سَبِيلِ اللهِ مَا قَبِلَهُ اللهُ مِنْكَ حَتَّى تُؤْمِنَ بِالْقَدَرِ وَتَعْلَمَ أَنَّ مَا أَصَابَكَ لَمْ يَكُنْ لِيُخْطِئَكَ وَأَنَّ مَا أَخْطَأَكَ لَمْ يَكُنْ لِيُصِيبَكَ وَلَوْ مُتَّ عَلَى غَيْرِ هَذَا لَدَخَلْتَ النَّارَ).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అల్లాహ్ భూమ్యాకాశాల వారందరిని శిక్షించదలిస్తే, శిక్షించగలుగుతాడు, అయినా అతడు వారిపై అన్యాయం, దౌర్జన్యం చేసినవాడు కాడు. ఒకవేళ వారిని కరుణించదలిస్తే, ఆయన కరుణ వారికి వారి కర్మల కంటే ఎంతో మేలైనది. నీవు ఉహుద్ పర్వతమంతటి ధనం అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టినా, తక్దీర్ ను విశ్వసించనంత వరకు అల్లాహ్ దానిని అంగీకరించడు. నీకు ప్రాప్తమయ్యేది నీ నుండి తప్పిపోయేది కాదని మరియు నీ నుండి తప్పిపోయేది నీకు ప్రాప్తమయ్యేది కాదని తెలుసుకో!. దీనికి విరుద్ధమైన పద్ధతిలో నీకు చావు వచ్చిందంటే నీవు నరకం పాలవుతావు”. (అబూ దావూద్/ ఫిల్ ఖద్ర్ 4699).
59- అల్లాహ్ వ్రాసిన విధి వ్రాత పట్ల అయిష్టత, కోపం ప్రదర్శించకు([22]).
నీకు చేకూరేది నీ నుండి తప్పిపోయేది కాదని మరియు నీ నుండి తప్పిపోయేది నీకు చేకూరేది కాదని తెలుసుకో!. అల్లాహ్ తన తక్దీర్ మరియు తద్బీర్ (ఉపాయము, నిర్వహణము) లో చాలా వివేకవంతుడు([23]).
عَنْ أَنَسٍ > عَنِ النَّبِيِّ ^ قَالَ: (إِنَّ عِظَمَ الْجَزَاءِ مَعَ عِظَمِ الْبَلَاءِ وَإِنَّ اللهَ إِذَا أَحَبَّ قَوْمًا ابْتَلَاهُمْ فَمَنْ رَضِيَ فَلَهُ الرِّضَا وَمَنْ سَخِطَ فَلَهُ السَّخَطُ).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అనస్ రజియ ల్లాహు అన్హు ఉల్లేఖించారుః “పరీక్ష ఎంత పెద్దగా ఉంటుందో అంతే గొప్ప పుణ్యఫలం ఉంటుంది. అల్లాహ్ ఎవరిని ప్రేమిస్తాడో వారిని పరీక్షకు గురి చేస్తాడు. ఎవరు సంతోషంగా మసలుకుంటారో వారికి అల్లాహ్ సంతృష్టి లభిస్తుంది. ఎవరు అయిష్టత, కోపానికి గురి అవుతాడో అతడు అల్లాహ్ ఆగ్రహానికి గురి అవుతాడు”. (తిర్మిజి/ ఫిస్సబ్రి వల్ బలా/ 2396).
60- పాపాలు, దోషాలు, తప్పిదాలకు పాల్పడి, నా విధి వ్రాతే ఇలా ఉంది అని వాదించకు.
“దేవుడు నాకు సన్మార్గం ప్రాప్తిస్తే నేను భయభీతి గలవారిలో ఒకడిని అయ్యేవాడిని” అని సాకులు పలకకు. అయితే కష్టాలు, ఆపదలు వచ్చినప్పు డు నా తక్దీరులో ఉన్నట్లు జరిగింది అని అనవచ్చు.
[أَنْ تَقُولَ نَفْسٌ يَا حَسْرَتَا عَلَى مَا فَرَّطْتُ فِي جَنْبِ اللهِ وَإِنْ كُنْتُ لَمِنَ السَّاخِرِينَ * أَوْ تَقُولَ لَوْ أَنَّ اللهَ هَدَانِي لَكُنْتُ مِنَ المُتَّقِينَ * أَوْ تَقُولَ حِينَ تَرَى العَذَابَ لَوْ أَنَّ لِي كَرَّةً فَأَكُونَ مِنَ المُحْسِنِينَ * بَلَى قَدْ جَاءَتْكَ آَيَاتِي فَكَذَّبْتَ بِهَا وَاسْتَكْبَرْتَ وَكُنْتَ مِنَ الكَافِرِينَ *]. {الزُّمر 56-59}.
ఏ వ్యక్తి అయినా ఇలా అనే పరిస్థితి రాకూడదు సుమాః “అల్లాహ్ విషయంలో నేను చూపిన నిర్లక్ష్యతకు నేను ఎంతో చింతిస్తున్నాను. పైగా నేను ఎగతాళి చేసే వారిలో చేరిపోయాను”. లేదా “అయ్యో! అల్లాహ్ నాకు సన్మార్గం చూపి ఉంటే, నేను కూడ భయభక్తులు కలవారిలో చేరిపోయేవాణ్ణి”. లేదా శిక్షను చూసి, “అయ్యో! నాకు మరొక అవకాశం దొరికితే ఎంత బాగుండును. నేను కూడ సత్కార్యాలు చేసే వారిలో కలిసిపోతాను”. (అప్పుడు అతనికి ఈ జవాబు దొరకకూడదు) “లేదు. నా ఆయతులు నీ వద్దకు వచ్చాయి. కాని నీవు వాటిని తిరస్కరించావు; విర్రవీగావు, నీవు అవిశ్వాసులలోని వాడవు”. (జుమర్ 39: 56-59).
61- “ఇలా చేస్తే అలా అయి ఉండేది” అని అనకు.
عَنْ أَبِي هُرَيْرَةَ > قَالَ: قَالَ رَسُولُ الله ^: (احْرِصْ عَلَى مَا يَنْفَعُكَ وَاسْتَعِنْ بِاللهِ وَلَا تَعْجَزْ وَإِنْ أَصَابَكَ شَيْءٌ فَلَا تَقُلْ لَوْ أَنِّي فَعَلْتُ كَانَ كَذَا وَكَذَا وَلَكِنْ قُلْ قَدَرُ اللهِ وَمَا شَاءَ فَعَلَ فَإِنَّ لَوْ تَفْتَحُ عَمَلَ الشَّيْطَانِ).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ప్రయోజనకరమైన దానినే ఆశించు, అభిలషించు; కష్టాల్లో సహాయం కొరకు అల్లాహ్ ను మాత్రమే అర్థించు; ధైర్యాన్ని వీడకు; ఆపదలు ఆసన్నమైనప్పుడు ‘ఒకవేళ నేను ఆ విధంగా చేసి ఉంటే మరో విధంగా జరిగి ఉండేది’ అని తలపోయకు. దానికి బదులుగా, ఇదంతా అల్లాహ్ నిర్ణయం, ఆయన తనకు ఇష్టమైన దానినే చేశాడు అని పలుకు. ఎందుకంటే ‘ఒకవేళ’ అన్న పదం షైతాను చర్యల ద్వారాల్ని తెరుస్తుంది”. (ముస్లిం/ ఫిల్ అమ్రి బిల్ ఖువ్వ… 2664).
62- ఇన్ షా అల్లాహ్ అనకుండానే నేను రేపు ఫలాన పని చేస్తాను అని అనకు.
[وَلَا تَقُولَنَّ لِشَيْءٍ إِنِّي فَاعِلٌ ذَلِكَ غَدًا * إِلَّا أَنْ يَشَاءَ اللهُ].
ఏ విషయాన్ని గురించియైనా, ఎన్నడూ ‘నేను ఈ పనిని రేపు చేస్తాను’ అని అనకు. అల్లాహ్ కోరితేనే తప్ప (నీవు ఏమీ చేయ లేవు). (కహఫ్ 18: 23,24).
63- అల్లాహ్ నీకు కాకుండా ఇతరులకు ఏదైతే ప్రసాదించాడో దాని గురించి ఆశించకు.
అల్లాహ్ నీకు ఇచ్చిన వాటలో నీవు సంతోషంగా ఉండు.
[وَلَا تَتَمَنَّوْا مَا فَضَّلَ اللهُ بِهِ بَعْضَكُمْ عَلَى بَعْضٍ لِلرِّجَالِ نَصِيبٌ مِمَّا اكْتَسَبُوا وَلِلنِّسَاءِ نَصِيبٌ مِمَّا اكْتَسَبْنَ وَاسْأَلُوا اللهَ مِنْ فَضْلِهِ إِنَّ اللهَ كَانَ بِكُلِّ شَيْءٍ عَلِيمًا] {النساء:32}
అల్లాహ్ మీలో ఎవరికైనా ఇతరులకు ఇచ్చినదానికంటే ఎక్కువగా ప్రసాదించివుంటే మీరు దానికి ఆశపడకండి. పురుషులకు వారు సంపాదించుకున్న దానికి తగిన ప్రతిఫలం ఉంది. అలాగే స్త్రీలకు కూడా వారు సంపాదించుకున్న దానికి తగినట్లే ప్రతిఫలం లభిస్తుంది. అయితే అల్లాహ్ ను ఆయన అనుగ్రహం కొరకు ప్రార్థిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ సకల విషయ పరిజ్ఞానం కలవాడు. (నిసా 4: 32).
64- అల్లాహ్ అనుగ్రహాన్ని తిరస్కరించి, అది వేరెవరైనా ప్రసాదించారని ఆరోపించి కృతఘ్నతకు పాల్పడకు.
మరియు ఆ అనుగ్రహం యొక్క హక్కు, ఏ కృతజ్ఞత, అల్లాహ్ స్మరణ రూపంలో చెల్లించాలో దానిని విస్మరించకు.
[وَإِذْ تَأَذَّنَ رَبُّكُمْ لَئِنْ شَكَرْتُمْ لَأَزِيدَنَّكُمْ وَلَئِنْ كَفَرْتُمْ إِنَّ عَذَابِي لَشَدِيدٌ]
మీ ప్రభువు ఇలా హెచ్చరిక చేశాడుః మీరు గనక కృతజ్ఞులైతే, నేను మిమ్మల్ని ఇంకా ఎక్కువగా అనుగ్రహిస్తాను. ఒకవేళ కృతఘ్నతకు పాల్పడితే నా శిక్ష చాలా కఠినముగా ఉంటుంది. (ఇబ్రాహీం 14: 7).
65- అల్లాహ్ తప్ప మరెవ్వరీ ప్రమాణం చేయకు.
ఉదాహరణకుః కాబా, ప్రవక్త, గౌరవమానవ ప్రమాణం అనీ, లేదా నీ జీవిత ప్రమాణం, తల మీద చెయ్యి వేసి ప్రమాణం వగైరాలు చేయుట నిశిద్ధం.
عَنْ ابْنِ عُمَرَ { قَالَ: قَالَ رَسُولُ اللهِ ^: (أَلَا إِنَّ اللهَ يَنْهَاكُمْ أَنْ تَحْلِفُوا بِآبَائِكُمْ فَمَنْ كَانَ حَالِفًا فَلْيَحْلِفْ بِاللهِ وَإِلَّا فَلْيَصْمُتْ)
“వినండి! మీరు మీ తాతముత్తాతల పేర్లతో ప్రమాణం చేయుట నుండి అల్లాహ్ వారించాడు. ఎవరైనా ప్రమాణం చేయదలిచితే కేవలం అల్లాహ్ ప్రమాణమే చేయాలి. లేదా మౌనం వహించాలి” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారని ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు. (బుఖారి/మల్లమ్ యర ఇక్ఫార… 6108, ముస్లిం/అన్నహ్ యు అనిల్ హల్ఫి… 1646).
66- అమానత్ (అప్పగింత) పేర ప్రమాణం చేయకూడదు.
عَنْ بُرَيْدَةَ > قَالَ: قَالَ رَسُولُ الله ^: (مَنْ حَلَفَ بِالْأَمَانَةِ فَلَيْسَ مِنَّا)
“అమానత్ ప్రమాణం చేయువారు మాలోని వారు కారు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని బురైద రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (అబూ దావూద్/కరాహియతుల్ హల్ఫి 3253).
67- అనవసరంగా అధికంగా అల్లాహ్ నామ ప్రమాణం చేయకు.
చివరికి ఇది (నీ ఈ చేష్ట) నిన్ను అల్లాహ్ నామముల పట్ల అవహేళన, అవమర్యాదకు గురి చేసే ప్రమాదం ఉంటుంది
[وَاحْفَظُوا أَيْمَانَكُمْ]. {المائدة:89}
మీరు మీ ప్రమాణాలను కాపాడండి. (మాఇద 5: 89).
69- నీ కొరకు అల్లాహ్ నామ ప్రమాణం చేసిన వాని ప్రమాణాన్ని తిరస్కరించకు.
అల్లాహ్ పట్ల ఉండవలసిన గౌరవమర్యాదలను బట్టి అతని ప్రమాణాన్ని స్వీకరించు. అతను తన ప్రమాణం ద్వారా ఏదైనా పాపం కోరితే, లేదా నీ శక్తిలో లేని దానిని కోరితే నీవు తిరస్కరించవచ్చు.
عَنْ ابْنِ عُمَرَ { قَالَ سَمِعَ النَّبِيُّ ^ رَجُلًا يَحْلِفُ بِأَبِيهِ فَقَالَ: (لَا تَحْلِفُوا بِآبَائِكُمْ مَنْ حَلَفَ بِالله فَلْيَصْدُقْ وَمَنْ حُلِفَ لَهُ بِالله فَلْيَرْضَ وَمَنْ لَمْ يَرْضَ بِالله فَلَيْسَ مِن الله).
ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ఒక వ్యక్తి తన తండ్రి ప్రమాణం చేస్తున్నది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విని ఇలా బోధించారుః “మీ తండ్రుల ప్రమాణం చేయకండి. అల్లాహ్ ప్రమాణం చేసిన వ్యక్తి తన ప్రమాణంలో సత్యవంతునిగా ఉండాలి. ఎవరి గురించి అల్లాహ్ ప్రమాణం చేయబడిందో అతను దానితో రాజీ పడాలి. అల్లాహ్ ప్రమాణంతో రాజీ పడని వ్యక్తి అల్లాహ్ వాడు కాడు”. (ఇబ్ను మాజ/మన్ హులిఫలహూ… 2101).
70- ఎంత గొప్ప వస్తువైనా ప్రసాదించడం అల్లాహ్ కు కష్టతరమైన పని కాదు.
సృష్టిరాసుల అవసరాలు పూర్తి చేయకుండా ఆయన్ని అడ్డుకునేవాడెవడూ లేడు. వారి అవసరాలు పూర్తి చేయటకు ఆయన్ని బలవంతం చేయువాడెవడూ లేడు.
عَن أَبِي هُرَيْرَةَ > عَنْ النَّبِيِّ ^ قَالَ: (لَا يَقُلْ أَحَدُكُمْ اللَّهُمَّ اغْفِرْ لِي إِنْ شِئْتَ ارْحَمْنِي إِنْ شِئْتَ ارْزُقْنِي إِنْ شِئْتَ وَليَعْزِمْ مَسْأَلَتَهُ إِنَّهُ يَفْعَلُ مَا يَشَاءُ لَا مُكْرِهُ لَهُ). وفي رواية: (وَلْيُعَظِّمْ الرَّغْبَةَ فَإِنَّ اللهَ لَا يَتَعَاظَمُهُ شَيْءٌ أَعْطَاهُ)
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మీరు అల్లాహ్ తో దుఆ చేస్తున్నప్పుడు “అల్లాహ్! నీవు కోరితే నన్ను క్షమించు, అల్లాహ్! నీవు కోరితే నన్ను కరుణించు, అల్లాహ్! నీవు కోరితే నాకు ఆహరం ప్రసాదించు” అని దుఆ చేయవద్దు. దానికి బదులుగా దృఢ నమ్మకంతో దుఆ చేయాలి. ఆయన తాను కోరింది చేయగలవాడు. ఆయన్ని ఎవరూ బలవంతం పెట్ట లేరు”. (బుఖారి/ఫిల్ మషీఅతి వల్ ఇరాద 7477, ముస్లిం/ అల్ అజ్మ్ బిద్దుఆ…2678). మరో ఉల్లేఖనంలో ఉందిః “తన కోరికను చాలా స్పష్టంగా తెలుపాలి. నిశ్చయంగా అల్లాహ్ ప్రాసదించేవాటిలో ఆయనకు కష్టతరమైనదేదీ లేదు”. (ముస్లిం 2679).
71- ఏ ఒక్క ముస్లింని కూడా అతను చేసిన ఏదైనా అపరాదం వల్ల అతన్ని కాఫిర్ (అవిశ్వాసి) అని అనకు. అతడు దానిని ధర్మసమ్మతం అని భావిస్తే అది వేరే విషయం.
عَن ابْنِ عُمَرَ > يَقُولُ: قَالَ رَسُولُ الله ^: (أَيُّمَا امْرِئٍ قَالَ لِأَخِيهِ يَا كَافِرُ فَقَدْ بَاءَ بِهَا أَحَدُهُمَا إِنْ كَانَ كَمَا قَالَ وَإِلَّا رَجَعَتْ عَلَيْهِ)
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఒక ముస్లిం తన సాటి ముస్లిం సోదరుడ్ని అవిశ్వాసి అని పిలిస్తే ఆ మాట ఇద్దరిలో ఏ ఒక్కరిపై అయినా పడుతుంది. పిలువబడే వ్యక్తి దానికి అర్హుడైతే అతని మీద పడుతుంది. లేదా చెప్పిన వానిపై (అంటే ఇతను అవిశ్వాసి అవుతాడు). (ముస్లిం/బయాను హాలి ఈమాని… 60, బుఖారి/మన్ కఫ్ఫర అఖాహు బిగైరి తావిల్ 6104).
72- అల్లాహ్ మీద ప్రమాణం చేసి ఫలాన వ్యక్తి స్వర్గవాసి, ఫలాన నరకవాసి అని తీర్పులు చేయకు. ఎవరి గురించి వహీ ద్వారా స్పష్టంగా చెప్పబడిందో వారు తప్ప.
عَنْ جُنْدَبٍ > أَنَّ رَسُولَ الله ^ حَدَّثَ أَنَّ رَجُلًا قَالَ وَاللهِ لَا يَغْفِرُ اللهُ لِفُلَانٍ وَإِنَّ اللهَ تَعَالَى قَالَ مَنْ ذَا الَّذِي يَتَأَلَّى عَلَيَّ أَنْ لَا أَغْفِرَ لِفُلَانٍ فَإِنِّي قَدْ غَفَرْتُ لِفُلَانٍ وَأَحْبَطْتُ عَمَلَكَ
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని జుందుబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఒక వ్యక్తి “అల్లాహ్ సాక్షిగా! అల్లాహ్ ఫలాన వ్యక్తిని క్షమించడు” అని అన్నాడు. అప్పుడు అల్లాహ్ అన్నాడుః “నేను ఫలాన వ్యక్తిని క్షమించనని నా మీద ప్రమాణం చేసేవాడెవడు? నిశ్చయంగా నేను అతన్ని క్షమించాను మరి నీ కర్మలన్నిటినీ వృధా పరిచాను”. (ముస్లిం/అన్నహ్ యు అన్ తఖ్నీతిల్ ఇన్సాన్ మిన్ రహ్మతిల్లాహ్ 2621).
73- ప్రవక్త సహచరు (సహాబా)లను దూషించకు.
అల్లాహ్ వారందరితో తృప్తి చెందుగాక! మనల్ని ప్రళయదినాన వారితో లేపుగాక! ఎవరు వారిని శపిస్తారో అల్లాహ్ వారిని శపిస్తాడు. వారిలో ఏ ఒక్కరినైనా తిట్టినవారిపై మరియు వారిలోని తప్పులు తీయువానిపై అల్లాహ్ ఆగ్రహం కురుస్తుంది. సర్వ ప్రవక్తల తర్వాత వారు సర్వ మానవుల్లో శ్రేష్ఠులు. అల్లాహ్ తన జ్ఞానంతో వారికి ప్రవక్త సహచర భాగ్యం ప్రసాదించాడు.
عَنْ أَبِي هُرَيْرَةَ > قَالَ: قَالَ رَسُولُ الله ^: (لَا تَسُبُّوا أَصْحَابِي لَا تَسُبُّوا أَصْحَابِي فَوَالَّذِي نَفْسِي بِيَدِهِ لَوْ أَنَّ أَحَدَكُمْ أَنْفَقَ مِثْلَ أُحُدٍ ذَهَبًا مَا أَدْرَكَ مُدَّ أَحَدِهِمْ وَلَا نَصِيفَهُ)
“నా అనుచరుల గురించి చెడుగా మాట్లాడకండి. నా అనుచరుల గురించి చెడుగా మాట్లాడకండి. ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షిగా! మీలో ఏ ఒక్కడూ ఉహుద్ పర్వతమంత బంగారం ఖర్చు పెట్టినా అది నా అనుచరులు ఖర్చు పెట్టిన ఒక ముద్ లేదా సగం ముద్ ధాన్యపు పుణ్యాలకు సాటిరాదు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ముస్లిం/తహ్రీము సబ్బిస్సహాబ 2540, బుఖారి/ఖౌలున్నబీ లై కుంతు ముత్తఖిజన్ ఖలీల 3673).
74- ప్రవక్త కుటుంబీకుల్లోని పుణ్యాత్ములను ద్వేషించకు.
వారిని ప్రేమించడం ధర్మంలో ఓ భాగమైతే, వారిని గౌరవించడం మన విశ్వాసంలోని ఓ భాగం. పోతే హద్దులు మీరరాదు. మరియు వారికి ఉన్న స్థానం నుంచి క్రింద పడవేయరాదు.
عن أبي سعيد الخدري > قال : قال رسول الله ^: (وَالَّذِي نَفسِي بِيَدِهِ لاَ يُبْغِضُنَا أَهْلَ الْبَيتِ رَجُلٌ إِلاَّ أَدْخَلَهُ اللهُ النَّار ).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఏ వ్యక్తి మా కుటుంబీకుల్లోని (పుణ్యాత్ములను) ద్వేషిస్తాడో అల్లాహ్ అతడ్ని తప్పక నరకంలో పడవేస్తాడు”. (సహీ ఇబ్ను హిబ్బాన్ 15/435, సహీహ 2488).
75- అల్లాహ్ వైపు నుండి నీ వద్ద స్పష్టమైన ఆధారం లేనంత వరకు ఏ ముస్లింపై అపరాధ నింద వేయకు.
عَنْ أَبِي ذَرٍّ > أَنَّهُ سَمِعَ النَّبِيَّ ^ يَقُولُ: (لَا يَرْمِي رَجُلٌ رَجُلًا بِالْفُسُوقِ وَلَا يَرْمِيهِ بِالْكُفْرِ إِلَّا ارْتَدَّتْ عَلَيْهِ إِنْ لَمْ يَكُنْ صَاحِبُهُ كَذَلِكَ).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నట్లు అబూ జర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఏ వ్యక్తి మరో వ్యక్తిపై అపరాధ, అవిశ్వాస నింద వేయకూడదు. నిందింపబడిన వ్యక్తి అలా కాకుంటే ఆ మాట చెప్పిన వానిపై తిరుగుతుంది”. (బుఖారి/మా యున్హా మినస్సిబాబి వల్లఅన్ 6045).
76- ఏ ముస్లింని కూడా “ఓ అల్లాహ్ శత్రువా!” అని అనకు.
و عن أبى ذر > سمع النبي ^ يقول : (مَن ادَّعَى لِغير أَبيهِ وهُو يَعلم فَقد كَفر، ومَن ادَّعى قوماً ليسَ هُو مِنهُم فَليتَبَوأ مَقعده مِن النَّار، ومَن دَعا رَجُلاً بِالكُفر أَو قَال عَدو الله وليسَ كَذلكَ إلا حَارت عَليه).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబూ జర్ రజియల్లాహు అన్హు విని ఉల్లేఖించారుః “ఏ మనిషి తెలిసి కూడా తండ్రి కాని వ్యక్తిని తన తండ్రి అని ఆరోపిస్తాడో అతడు అవిశ్వాసానికి పాల్పడినట్లే. తాను ఏ జాతి వంశం నుండి లేడో దాని వైపు తన్ను ఆరోపించుకుంటే ఆ వ్యక్తి తన స్థానం అగ్నిలో చేసుకోవాలి. ఏ వ్యక్తి మరో వ్యక్తిని “ఓ అవిశ్వాసి” లేదా “ఓ అల్లాహ్ శత్రువుడా!” అని పిలుస్తారో అతను అలా కానిచో అది చెప్పినవానిపై పడుతుంది”. (సహీహుల్ అదబిల్ ముఫ్రద్ 336).
77- అలా జరుగుతే నేను ఇస్లాం నుండి వైదొలిగిపోతాను అని అనకూడదు.
కొందరు ఇలా అంటారుః ఒకవేళ ఇట్లు జరుగుతే నేను యూదున్ని లేదా క్రైస్తవున్ని అయిపోతాను. (ఇలా అనకూడదు).
عَن بُرَيْدَةَ > قَالَ: قَالَ رَسُولُ الله ^: (مَنْ حَلَفَ فَقَالَ إِنِّي بَرِيءٌ مِنْ الْإِسْلَامِ فَإِنْ كَانَ كَاذِبًا فَهُوَ كَمَا قَالَ وَإِنْ كَانَ صَادِقًا فَلَنْ يَرْجِعَ إِلَى الْإِسْلَامِ سَالِمًا).
“ఎవరైనా ప్రమాణం చేసి నేను ఇస్లాం నుండి విసుగు చెందాను అని అంటే, ఆ ప్రమాణంలో అతడు అసత్యుడైతే అన్నట్లే అయి పోతాడు. ఒకవేళ సత్యవంతుడైతే మళ్ళీ ఇస్లాం వైపునకు క్షేమంగా మరలిరాలేడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని బురైదా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (అబూ దావూద్/ఫిల్ హల్ఫి బిల్ బరాఅ…. 3258, నిసాయి 3772, ఇబ్ను మాజ 2100).
78- అవిశ్వాసి, వంచకుడు, ఫాసిఖ్, మరియు బహిరంగంగా పాపానికి ఒడిగట్టేవారిని సయ్యిద్, మిస్టర్ లాంటి గౌరవపరమైన పదాలతో పిలవకండి.
عَن بُرَيْدَةَ > قَالَ: قَالَ رَسُولُ الله ^: (لَا تَقُولُوا لِلْمُنَافِقِ سَيِّدٌ فَإِنَّهُ إِنْ يَكُ سَيِّدًا فَقَدْ أَسْخَطْتُمْ رَبَّكُمْ عَزَّ وَجَلَّ).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారని బురైదా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “వంచకుడిని సయ్యిద్ (మిస్టర్) అని అనకండి. ఒకవేళ అతడు సయ్యిద్ అయితే మీరు మీ ప్రభువును అసంతృప్తి పరచినట్లే”. (అబూ దావూద్/లాయఖూలుల్ మమ్ లూకు రబ్బీ వ రబ్బతీ 4977).
79- అల్లాహ్ ధర్మంలో కొంగ్రొత్త విషయాలు పుట్టించకు.
ఇబాదత్ (ఆరాధన)ల్లో మౌలిక విషయం: “ఖుర్ఆన్, హదీసు ఆధారాలతో రుజువైన దానినే చేయుట, దేని ప్రస్తావన లేదో దానిని మానుకొనుట”. అందుకు నీవు కొత్త విషయం పుట్టించకు. కేవలం ధర్మాన్ని అనుసరించు. అదే నీకు సరిపోతుంది. ప్రవక్త మార్గాన్ని అనుసరించు. అదే ఉత్తమమైన మార్గం. ప్రతి క్రొత్త విషయం బిద్అత్. ప్రతి బిద్అత్ దుర్మార్గం. ప్రతి దుర్మార్గం నరకం పాలౌతుంది.
عَنْ عَائِشَةَ < قَالَتْ: قَالَ رَسُولُ الله ^: (مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنه فَهُوَ رَدٌّ).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారుః “మా ఈ ధర్మంలో లేని విషయాన్ని ఎవరైనా అందులో పుట్టిస్తే అది రద్దు చేయబడుతుంది”. (ముస్లిం/నఖ్జుల్ అహ్కామిల్ బాతిల… 1718, బుఖారి/ ఇజస్తలహూ అలా సుల్ హిన్ జౌరిన్… 2697).
80- అల్లాహ్ ధర్మంలో లేని ఏదైనా చెడు సంప్రదాయాన్ని నీవు ఆరంభించకు. నీకు దాని పాపమే కాకుండా ప్రళయం వరకు దానిని పాటించేవారి పాపం నీపై పడుతుంది.
عَن جَرير > قَالَ: قَالَ رَسُولُ الله ^: (مَن سَنَّ فِي الإسلَامِ سُنَّةً
حَسَنةً فَلَهُ أَجرُهَا وَأَجرُ مَنْ عَمِلَ بَعْدَهُ مِنْ غَيرِ أَنْ يُنْقَصَ مِن أُجُورِهِم شَيءٌ، وَمَنْ سَنَّ فِي الإسلَامِ سُنَّةً سَيِّئَةً كَانَ عَلَيهِ وِزرُهَا وَوِزرُ مَنْ عَمِلَ بِها مِن بَعْدِهِ ِمن غَيرِ أَن يُنقصَ مِن أَوزَارِهِم شيءٌ).
“ఏ వ్యక్తి ఇస్లాంలోని (ప్రజలు విడనాడిన) ఒక సత్సంప్రదాయాన్ని ఆచరించడం మొదలెడతాడో, అతనికి తాను ఆచరించిన పుణ్యం, ఇంకా అతని తర్వాత దానిని ఆచరించేవారి పుణ్యం లభించును. అయితే వారి పుణ్యాల్లో ఏలాంటి కొరత జరగదు. మరెవడయితే ఇస్లాంలో ఒక దుష్సంప్రదాయాన్ని ప్రారంభిస్తాడో అతనిపై తాను చేసిన పాప భారం, ఇంకా అతని తర్వాత దానిని ఆచరించేవారి పాప భారము వేయబడును. అయితే వారి పాపాల్లో ఏలాంటి తగ్గింపు జరగదు”. (ముస్లిం/అల్ హస్సు అలస్సదఖ… 1017).
81- జ్ఞానం లేకుండా కేవలం తన అభిఫ్రాయ ఆధారంగా ఖుర్ఆన్, హదీసుల పట్ల వాదించకు.
వాటి అర్థభావాల లోతు మరియు వాటి గురించి సలఫె సాలిహీను (పూర్వ ధర్మవేత్త)ల వ్యాఖ్యానాలు తెలియనిదే స్వయంగా వాటి భావం చెప్పే ప్రయత్నం చేయకు.
عَنْ أَبِي هُرَيْرَةَ > عَنْ النَّبِيِّ ^ قَالَ: (الْمِرَاءُ فِي الْقُرْآنِ كُفْرٌ).
“ఖుర్ఆనులో వాదోపవాదన చేయుట కుఫ్ర్ (అవిశ్వాసం, సత్యతిరస్కారం)తో సమానం” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (అబూ దావూద్/ అన్నహ్ యు అనిల్ జిదాలి ఫిల్ ఖుర్ఆన్ 4603).
82- తెలియని విషయంలో చెప్పవలసి వచ్చినప్పుడు ఎంతో గొప్పగా తెలిసినట్లు చెప్పే ప్రయత్నం చేయకు.
ఇలా అన్యాయంగా అల్లాహ్ పై అపనింద మోపినవాళ్ళల్లో కలుస్తావు.
[وَلَا تَقْفُ مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ إِنَّ السَّمْعَ وَالبَصَرَ وَالفُؤَادَ كُلُّ أُولَئِكَ كَانَ عَنْهُ مَسْئُولًا] {الإسراء:36}
నీకు తెలియని విషయం వెంట పడకు. నిశ్చయంగా కళ్ళూ, చెవులూ, మనస్సూ అన్నింటి విషయంలోనూ విచారణ జరుగుతుంది. (బనీ ఇస్రాఈల్ 17: 36).
83- అల్లాహ్ పై అభాండాలు, అసత్యాలు మోపకండి. అల్లాహ్ పై అభాండాలు మోపేవారు అవిశ్వాసులే.
[وَيَوْمَ القِيَامَةِ تَرَى الَّذِينَ كَذَبُوا عَلَى اللهِ وُجُوهُهُمْ مُسْوَدَّةٌ أَلَيْسَ فِي جَهَنَّمَ مَثْوًى لِلْمُتَكَبِّرِينَ] {الزُّمر:60}
అల్లాహ్ కు అసత్యాలు ఆపాదించినవారి ముఖాలు, ప్రళయంనాడు నల్లగా మారిపోవటాన్ని నీవు చూస్తావు. నరకంలో గర్విష్టులకు సరిపోయే స్థలం లేదా?. (జుమర్ 39: 60).
84- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అసత్యం ఆపాదించకు. ఆయన చెప్పనిది, చేయనిది ఆయనకు ఆపాదించకు.
عَنْ أَبِي هُرَيْرَةَ > عَنْ النَّبِيِّ ^ قَالَ: (مَنْ كَذَبَ عَلَيَّ مُتَعَمِّدًا فَلْيَتَبَوَّأْ مَقْعَدَهُ مِنْ النَّارِ).
“తెలిసి కూడా నాపై అసత్యం మోపినవాడు తన స్థానం నరకంలో సిద్ధపరుచుకోవాలి” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (బుఖారి/ఇస్ము మన్ కజబ అలన్నబి 110, ముస్లిం/తగ్లీజుల్ కజిబి అలా రసూలిల్లా 3).
85- అల్లాహ్, ఆయన ప్రవక్త ఆదేశానికి ముందే నీవు నీ తీర్పు, నీ అభిప్రాయం, నీ మాట, నీ బుద్ధీజ్ఞానాలు ఉంచబోకు.
ఆది నుండి అంతం వరకు అధికారం ఏకైక అల్లాహ్ కు మాత్రమే ఉంది. ఆయన తాను చేసే పనులకు (ఎవరి ముందూ) జవాబు దారి కాడు. కాని అందరూ (ఆయన ముందు) జవాబుదారులే.
[يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا لَا تُقَدِّمُوا بَيْنَ يَدَيِ اللهِ وَرَسُولِهِ وَاتَّقُوا اللهَ إِنَّ اللهَ سَمِيعٌ عَلِيمٌ] {الحجرات:1}
విశ్వాసులారా! అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (అనుమతి)కి ముందే నిర్ణయలాకు దిగకండి. అల్లాహ్ కు భయపడండి. అల్లాహ్ సమస్తమూ వినేవాడు, సర్వమూ ఎరిగినవాడూ. (హుజురాత్ 49: 1).
86- అల్లాహ్ ధర్మంలో, ఆయన ఆదేశాల్లో నీ వాంఛలకు అనుకూలమైనవి, నీ కోరికలకు తగినవి తీసుకొని ఇతరవాటిని తోసిపుచ్చడం లాంటి చేష్టలు చేయకు.
ధర్మం సంపూర్ణమైనది. అందులో భాగాలు చేయుట సమంజసం కాదు. ఈ విధంగా కొన్నిటిని నమ్మి మరికొన్నిటిని తిరస్కరించే వారిలో కలవకు.
[يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا ادْخُلُوا فِي السِّلْمِ كَافَّةً وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُبِينٌ] {البقرة:208}
విశ్వాసులారా! మీరు పూర్తిగా ఇస్లాంలో ప్రవేశించండి. షైతాను అడుగుజాడలు త్రొక్కకండి. అతడు మీకు బహిరంగ శత్రువు. (బఖర 2: 208).
87- నీ అల్ప బుద్ధి వల్ల లేదా అవాస్తవిక సిద్ధాంతాల కారణంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ వైపు నుండి తీసుకొచ్చిన ధర్మవిషయాల్లో ఏ ఒక్క దానిని కూడా తిరస్కరించకు;
వాస్తవానికి నిజమైన ధర్మం మరియు సరియైన మేధ పరస్పరం విరుద్ధమేమీ కావు. అయినా ఎప్పుడైనా వాటి మధ్యలో ఎవరికైనా విరుద్ధం అన్న సందేహం తలెత్తుతే ధర్మాన్ని ముందు ఉంచాలి.
[ذَلِكَ بِأَنَّ اللهَ هُوَ الحَقُّ وَأَنَّ مَا يَدْعُونَ مِنْ دُونِهِ هُوَ البَاطِلُ وَأَنَّ اللهَ هُوَ العَلِيُّ الكَبِيرُ] {الحج:62}
వాస్తవానికి అల్లాహ్ యే సత్యమూ. అల్లాహ్ ను కాదని వారు వేడుకునేవన్నీ అసత్యం. అల్లాహ్ యే ఆధిక్యం గలవాడు. మరియు మహోన్నతుడు. (హజ్ 22: 62).
88- ధర్మం విషయంలో మితిమీరి ప్రవర్తించకు. నీ శక్తిలో లేని భారాన్ని నీపై వేసుకోకు. ధర్మం చాలా సులువైన విషయం. మృదువుగా దానిని పాటించు.
قَالَ ابْنُ عَبَّاسٍ >: قَالَ لِي رَسُولُ الله ^: (وَإِيَّاكُمْ وَالْغُلُوَّ فِي الدِّينِ فَإِنَّمَا أَهْلَكَ مَنْ كَانَ قَبْلَكُمْ الْغُلُوُّ فِي الدِّينِ)
“ధర్మం విషయంలో మితిమీరుట నుండి దూరముండండి. మితిమీరి ప్రవర్తించుటయే మీకంటే ముందువారిని నాశనము చేసింది” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (నిసాయి/ ఇల్తికాతుల్ హసా 3057, ఇబ్ను మాజ/ఖద్రు హసర్రమ్ యి 3029).
89- ధర్మం విషయంలో మరీ కఠినంగా ప్రవర్తించి లేదా దాని ఆచరణలో చెడుగా మసలుకొని ప్రజల్ని ధర్మం అంటే విసుగు చెందే మాదిరిగా చేయకు.
عَنْ أَبِي مُوسَى > قَالَ: كَانَ رَسُولُ الله ^ إِذَا بَعَثَ أَحَدًا مِنْ أَصْحَابِهِ فِي بَعْضِ أَمْرِهِ قَالَ: بَشِّرُوا وَلَا تُنَفِّرُوا وَيَسِّرُوا وَلَا تُعَسِّرُوا
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరుల్లో ఎవరినైనా ఏదైనా పని మీద పంపినప్పుడు “శుభవార్త ఇవ్వండి, అసహ్యత, విసుగు కలిగించకండి. సులభంగా మసలుకోండి. కఠినత్వాన్ని మానుకోండి” అని చెప్పినట్లు అబూ మూసా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ముస్లిం/ఫిల్ అమ్రి బిత్తైసీర్… 1732, బుఖారి 69).
90- కాలాన్ని దూషించకు([24]). ఇది అల్లాహ్ ను బాధ కలిగించినట్లగును([25]).
కాలాన్ని సృష్టించి, దానిని నియమ బద్ధంగా చేసింది అల్లాహ్ యే. కాలంలోనే విధివ్రాత అమలు జరిగే విధంగా చేశాడు.
عَنْ أَبِي هُرَيْرَةَ > عَنْ النَّبِيِّ ^ قَالَ: (لَا تَسُبُّوا الدَّهْرَ فَإِنَّ اللهَ هُوَ الدَّهْرُ)
“కాలాన్ని దూషించకండి, నిశ్చయంగా అల్లాహ్ యే కాలం” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ముస్లిం/అన్నహ్ యు అన్ సబ్బిద్దహ్ ర్ 2246).
మరో ఉల్లేఖనంలో ఉందిః
عَنْ أَبِي هُرَيْرَةَ > قَالَ: قَالَ رَسُولُ الله ^: (قَالَ اللهُ عَزَّ وَجَلَّ يُؤْذِينِي ابْنُ آدَمَ يَسُبُّ الدَّهْرَ وَأَنَا الدَّهْرُ بِيَدِي الْأَمْرُ أُقَلِّبُ اللَّيْلَ وَالنَّهَارَ)
అల్లాహ్ చెప్పాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు అబూ హురైరా > ఉల్లేఖించారుః “మానవూడు నన్ను బాధిస్తున్నాడు. అతడు కాలాన్ని దూషిస్తున్నాడు. వాస్తవానికి నేనే కాలం. అధికారమంతయూ నా చేతిలోనే ఉంది. రేయింబవళ్ళను మార్చేవాడిని నేనే”. (బుఖారి/వమా యుహ్ లికునా ఇల్లద్దహ్ ర్ 4826).
91- బహుదైవారాధకులు దేవుళ్ళుగా పూజించేవారిని దూషించకండి. ప్రతికారంగా వారు అల్లాహ్ నూ దూషించవచ్చు
[وَلَا تَسُبُّوا الَّذِينَ يَدْعُونَ مِنْ دُونِ اللهِ فَيَسُبُّوا اللهَ عَدْوًا بِغَيْرِ عِلْمٍ …].
(ముస్లిములారా!) వారు అల్లాహ్ ను కాదని వేడుకునే వారిని మీరు దూషించకండి. ఎందుకంటే, వారు మితిమీరి అజ్ఞానం చేత అల్లాహ్ ను దూషిస్తారేమో. (అన్ఆమ్ 6: 108).
92- అజ్ఞానపు పిలుపులు పిలువకూడదు.
ఉదాః కులపరమైన పక్షపాతం, పార్టీ పరమైన పక్షపాతం, జాతీయపరమైన పక్షపాతం, వంశపరమైన పక్షపాతం. ఈ అజ్ఞాన పార్టీల వైపునకు అంకితమై వర్గీకర నినాదాలను ఇస్లాం నిషేధించింది.
عَنْ جُبَيْرِ بْنِ مُطْعِمٍ > أَنَّ رَسُولَ الله ^ قَالَ: لَيْسَ مِنَّا مَنْ دَعَا إِلَى عَصَبِيَّةٍ وَلَيْسَ مِنَّا مَنْ قَاتَلَ عَلَى عَصَبِيَّةٍ وَلَيْسَ مِنَّا مَنْ مَاتَ عَلَى عَصَبِيَّةٍ)
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని జుబైర్ బిన్ ముత్ఇమ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “పక్షపాతం వైపునకు పిలిచేవాడు మాలోనివాడు కాడు. పక్షపాతంతో పోరాడేవాడు మాలోనివాడు కాడు. పక్షపాతం పై మరణించినవాడు మాలోనివాడు కాడు”. (అబూ దావూద్/ ఫిల్ అసబియ్యహ్ 5121).
93- ఇక ఇస్లాం సమాప్తమైనట్లే అని, అది నశించిపోతుంది అని భావించకు.
నిశ్చయంగా అల్లాహ్ సహాయంతో ఒక వర్గం బలమైన ఆధారం మీద ఉంటుంది. ఆ వర్గాన్ని వదలినవారు దానిని ఏ విధంగా నష్టపరచలేరు. రాత్రి పగలు ఉన్నంత వరకు ఈ ధర్మం చేరుతుంది. అల్లాహ్ తప్పక తన ధర్మానికి ప్రాబల్యత ప్రసాదించి ఉంటాడు. విశ్వాసుల్లో ఎవరైతే అల్లాహ్ ధర్మానికి సహాయకులుగా నిలుస్తారో అల్లాహ్ వారికి సహాయపడతాడు. అంతిమ సాఫల్యం భక్తిపరులకే ఉంటుంది.
عَنْ ثَوْبَانَ > قَالَ: قَالَ رَسُولُ الله ^: (إِنَّ اللهَ زَوَى لِي الْأَرْضَ فَرَأَيْتُ مَشَارِقَهَا وَمَغَارِبَهَا وَإِنَّ أُمَّتِي سَيَبْلُغُ مُلْكُهَا مَا زُوِيَ لِي مِنْهَا).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని సౌబాన్ > ఉల్లేఖించారుః “అల్లాహ్ నా కొరకు భూమండలాన్ని చేరదీసాడు. నేను దాని తూర్పు పడమరలను చూశాను. ఎంత వరకు చేరదీయబడిందో అంత వరకు నా అనుచర సంఘం యొక్క ప్రభుత్వం వ్యాపిస్తుంది”. (ముస్లిం/ హలాకు హాజిహిల్ ఉమ్మతి… 2889).
94- ఇస్లాం అనుసరణ వల్లనే ముస్లింలు వెనకబడి ఉన్నారని అనుకోకు.
వాస్తవమేమిటంటే వారు ఇస్లాం ధర్మానికి దూరమై, తమ ప్రభువు మార్గాన్ని విడనాడినందున మరియు ఏ సాధనాల వల్ల బలం, కొత్త పరిశీలన మరియు రాజ్యాధికారాలు లభిస్తాయో వాటిని సమాకూర్చుకోక పోవడం వల్లనే వెనకబడి ఉన్నారు. పూర్వపు ముస్లిముల బాగోగులు ఎందులో ఉండిందో ఈ కాలం ముస్లిముల బాగోగులు అందులోనే ఉంది. చదవండిః
[وَعَدَ اللهُ الَّذِينَ آَمَنُوا مِنْكُمْ وَعَمِلُوا الصَّالِحَاتِ لَيَسْتَخْلِفَنَّهُمْ فِي الأَرْضِ كَمَا اسْتَخْلَفَ الَّذِينَ مِنْ قَبْلِهِمْ وَلَيُمَكِّنَنَّ لَهُمْ دِينَهُمُ الَّذِي ارْتَضَى لَهُمْ وَلَيُبَدِّلَنَّهُمْ مِنْ بَعْدِ خَوْفِهِمْ أَمْنًا يَعْبُدُونَنِي لَا يُشْرِكُونَ بِي شَيْئًا وَمَنْ كَفَرَ بَعْدَ ذَلِكَ فَأُولَئِكَ هُمُ الفَاسِقُونَ] {النور:55}
మీలో విశ్వసించి మంచి పనులు చేసేవారికి అల్లాహ్ చేసిన వాగ్దానం ఏమిటంటే, ఆయన వారిని, వారికి పూర్వం గతించిన ప్రజలను చేసిన విధంగా, భూమిపై ఖలీఫాలుగా చేస్తాడు, అల్లాహ్ వారికై అంగీకరించిన వారి ధర్మాన్ని వారికొరకు పటిష్ఠమైన పునాదుల పై స్థాపిస్తాడు. వారి యొక్క భయస్థితిని శాంతి భద్రతలతో కూడిన స్థితిగా మార్సుతాడు. కనుక వారు నాకు దాస్యం చేయాలి, ఎవరినీ నాకు భాగస్వాములుగా చేయకూడదు. దీని తరువాత ఎవరైనా అవిశ్వాసానికి పాల్పడితే, అటువంటి వారే హద్దులు మీరినవారు. (నూర్ 24: 55).
95- అల్లాహ్ యొక్క ఔలియా (సన్నిహితుల)ని, అల్లాహ్ ధర్మం వైపు పిలిచేవారిని మరియు ఈ ధర్మానికి రక్షకులుగా నిలబడినవారిని ద్వేషించకు.
عَنْ أَبِي هُرَيْرَةَ > قَالَ: قَالَ رَسُولُ الله ^: (إِنَّ الله قَالَ مَنْ عَادَى لِي وَلِيًّا فَقَدْ آذَنْتُهُ بِالْحَرْبِ).
అల్లాహ్ ఇలా చెప్పాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లు అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఎవరు నా వలీతో శతృత్వం వహిస్తాడో అతడు నాతో యుద్ధానికి సిధ్ధం కావాలి”. (బుఖారి/ అత్తవాజుఅ 6502).
96- పుణ్యాత్ముల చేత ఏ కరామతులు([26]) ప్రత్యక్షమవుతాయో వాటిని తిరస్కరించకూడదు. అయితే అవి ధర్మానికి అనుగుణంగా ఉండాలి.
మరియు షైతాన్ పనులతో మోసబో కుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కరామతు మరియు దుర్మా ర్గులు, దురాచారులు, సత్యధర్మానికి అతిదూరంగా ఉన్నవారు చూపించే మోసపు గారడి ఆటల మధ్య వ్యత్యాసాన్ని గమనించాలి.
[أَلَا إِنَّ أَوْلِيَاءَ اللهِ لَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ] {يونس:62}
వినండి! అల్లాహ్ కు స్నేహితులైనవారికీ ఆయనను విశ్వసించి భయభక్తుల వైఖరిని అవలంబించిన వారికీ ఏ విధమైన భయం కానీ, విషాదం కానీ కలిగే అవకాశం లేదు. (యూనుస్ 10: 62).
97- ఏ ఒక్క ముస్లిం పట్ల నీవు నీ మనస్సులో ద్వేషం, కపటం కలిగి ఉండకు. అతడేదైనా పాపం చేస్తే దాని పట్ల ద్వేషం ఉండడం తప్పనిసరి.
عَنْ أَنَسٍ > قَالَ: قَالَ رَسُولُ الله ^: (لَا تَقَاطَعُوا وَلَا تَدَابَرُوا وَلَا تَبَاغَضُوا وَلَا تَحَاسَدُوا وَكُونُوا عِبَادَ الله إِخْوَانًا وَلَا يَحِلُّ لِمُسْلِمٍ أَنْ يَهْجُرَ أَخَاهُ فَوْقَ ثَلَاثٍ).
“పరస్పరం సంబంధాలు తెంచుకోకండి. ఒకర్నొకరు మాట్లాడు కోవడం మానెయ్యకండి. ఒకరు మరొకరిని ద్వేషించుకోకండి. ఒకరు మరొకరి మీద అసూయ చెందకండి. మీరంతా అల్లాహ్ దాసులుగా పరస్పరం అన్నదమ్ములుగా జీవితం గడపండి. మూడు రోజులకు మించి తన తోటి సోదరునితో, సంబంధాలు త్రెంచి ఉండటం లేదా పరస్పరం మాట్లాడుకోకుండా ఉండటం ఏ ముస్లింకూ ధర్మసమ్మతం కాదు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హితువు చేశారని అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (తిర్మిజి/ మాజాఅ ఫిల్ హసద్ 1935, బుఖారి 6065, ముస్లిం 2559).
98- ముస్లిములతో పోరాడకు. వారిపై ఆయుధాన్ని లేపకు. వారిలో ఎవరైనా దౌర్జన్యానికి దిగి వారిని అనచడానికి పోరాడం తప్ప వేరే ఏ పద్ధతీ సఫలం కానప్పుడు తప్ప.
عن عَبْد الله > أَنَّ النَّبِيَّ ^ قَالَ: (سِبَابُ الْمُسْلِمِ فُسُوقٌ وَقِتَالُهُ كُفْرٌ)
“ముస్లింను దూషించడం ఫిస్ఖ్ (అపరాధం). అతనితో పోరాడటం కుఫ్ర్ (సత్యతిరస్కారం)తో సమానం” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (బుఖారి/ఖౌఫుల్ మోమిని మిన్ అయ్ యహ్ బత అమలుహు వహువ లాయష్ఉర్ 48, ముస్లిం 64).
99- ముస్లిం నాయకుడు, మరియు ముస్లిం ఐక్య సంఘంతో విడిపోకూడదు. ఐక్యత, కలసి ఉండడం దైవకరుణం అయితే అనైక్యత, విడిపోవడం శిక్ష.
عَنْ أَبِي هُرَيْرَةَ > عَنْ النَّبِيِّ ^ أَنَّهُ قَالَ: (مَنْ خَرَجَ مِنْ الطَّاعَةِ وَفَارَقَ الْجَمَاعَةَ فَمَاتَ مَاتَ مِيتَةً جَاهِلِيَّةً).
“నాయకుని విధేయతా పరిధి నుండి బయటికి పోయి, సంఘ ఐక్యతను విడనాడి అదే స్థితిలో చనిపోయినవాడు అజ్ఞానపు చావును కొని తెచ్చుకున్నట్లే” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ముస్లిం/ వుజూబు ములాజమతి జమాఅతిల్ ముస్లిమీన్… 1848).
100- ముస్లిముల నాయకునికి వ్యతిరేకంగా తిరుగబడకు. అతనిలో అతిస్పష్టమైన అవిశ్వాసానికి సంబంధించిన ఏదైనా విషయం నీవు చూస్తే తప్ప. అది ఏదైనా దుష్భావంతో లేదా మనోతిరస్కారంతో కూడినదై ఉండకూడదు. అల్లాహ్ వైపు నుండి నీ వద్ద బలమైన ఆధారం ఉండాలి. మరియు ఏలాంటి రక్తపాతం, కల్లోలం జరగకుండా నీ తిరుగుబాటు సఫలీకృతం అయ్యే అంతటి శక్తి నీలో ఉండాలి.
عَن عُبَادَةَ بْنِ الصَّامِتِ > قال: (بَايَعَنَا رسول الله ^ عَلَى السَّمْعِ وَالطَّاعَةِ فِي مَنْشَطِنَا وَمَكْرَهِنَا وَعُسْرِنَا وَيُسْرِنَا وَأَثَرَةً عَلَيْنَا وَأَنْ لَا نُنَازِعَ الْأَمْرَ أَهْلَهُ إِلَّا أَنْ تَرَوْا كُفْرًا بَوَاحًا عِنْدَكُمْ مِنْ اللَّهِ فِيهِ بُرْهَانٌ). {البخاري 7056}. وفي رواية: (وَأَن نَقُولَ بِالْحَقِّ حَيْثُمَا كُنَّا لَا نَخَافُ فِي اللهِ لَوْمَةَ لَائِمٍ). {البخاري 7199}.
ఉబాద బిన్ సామిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మేము ప్రవక్తతో ఈ విషయాలపై శపథం చేశాము. మాట విని వాటిని పాటిస్తామని, అవి మాకు నచ్చినా నచ్చక పోయినా, కలిమిలోనూ, లేమిలోనూ, మా హక్కులు కాలరాయబడినా సరే. ఇంకా ప్రభుత్వ వ్యవహారాలను గురించి అధికారులతో తగవుపడమని. అయితే పాలకులు బహిరంగంగా సత్యవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినప్పుడు మీ దగ్గర అల్లాహ్ వైపు నుండి బలమైన ఆధారం ఉంటే తప్ప”. (బుఖారి/సతరౌన బఅదీ ఉమూరన్ తున్కిరూనహా 7056). మరో ఉల్లేఖనంలో ఉందిః “ఎక్కడ ఉన్నా సత్యమే పలకాలని మరియు అల్లాహ్ విషయంలో నిందించేవారి నిందలకు భయపడమని”. (బుఖారి/కైఫ యుబాయిఉల్ ఇమామున్నాస 7199).
101- అల్లాహ్ అవిధేయత జరుగుతున్న విషయంలో ఎవ్వరి విధేయత పాటించరాదు. మంచి విషయాల్లోనే విధేయత పాటించాలి.
عَنْ عَبْدِ الله > عَنْ النَّبِيِّ ^ قَالَ: (السَّمْعُ وَالطَّاعَةُ عَلَى الْمَرْءِ الْمُسْلِمِ فِيمَا أَحَبَّ وَكَرِهَ مَا لَمْ يُؤْمَرْ بِمَعْصِيَةٍ فَإِذَا أُمِرَ بِمَعْصِيَةٍ فَلَا سَمْعَ وَلَا طَاعَةَ)
“తనకు నచ్చిన మరియు నచ్చని ప్రతి విషయం విని విధేయత చూపుట ప్రతి ముస్లింపై విధిగా ఉన్న ధర్మం. అల్లాహ్ అవిధేయతకు గురి చేసే ఆదేశాలు తప్ప. అలాంటి ఆదేశం గనక ఇవ్వబడితే వాటిని పాటించవద్దు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (బుఖారి/అస్సమ్ఉ వత్తాఅతు… 7144, ముస్లిం/వుజూబు తాఅతుల్ ఉమరా ఫీగైరి మఅసియ… 1839).
102- పేరు ప్రఖ్యాతుల ఉద్దేశంతో సత్కర్మలు చేయకు. అల్లాహ్ కాకుండా వారితో నీకు ఏ ప్రయోజనం లేదు. దీని వల్ల చేసిన కర్మ వృధా అవడంతో పాటు దాని పుణ్యము నీకు దక్కదు, పాపం పెరుగును. కేవలం అల్లాహ్ సంతృప్తి కోసం మరియు ప్రవక్త అడుగుజాడలో చేసిన కర్మలనే అల్లాహ్ అంగీకరిస్తాడు.
…فَمَنْ كَانَ يَرْجُوا لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا]. {الكهف:110}
తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి, ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ భాగస్వామిగా చేయకూడదు. (కహఫ్ 18: 110).
103- నలుగురి ముందు దుష్కార్యానికి ఒడిగట్టకు.
అల్లాహ్ మరుగుపరచి ఉంచిన దానిని నీవు కూడా మరుగుగానే ఉండనీయు. ప్రతి తప్పు, దోషాల నుండి అల్లాహ్ సన్నిధిలో తౌబా చేయు, క్షమాపణ కోరు.
عن أَبي هريرة > عن النَّبيّ ^ قَالَ: ( كُلُّ أُمَّتِي مُعَافى إلاَّ المُجَاهِرِينَ، وَإنّ مِنَ المُجَاهَرَةِ أنْ يَعْمَلَ الرَّجُلُ باللَّيلِ عَمَلاً ، ثُمَّ يُصْبحُ وَقَدْ سَتَرَهُ اللهُ عَلَيهِ ، فَيقُولُ : يَا فُلانُ ، عَمِلت البَارِحَةَ كَذَا وَكَذَا ، وَقَدْ بَاتَ يَسْتُرُهُ رَبُّهُ ، وَيُصبحُ يَكْشِفُ ستْرَ اللهِ عَنْه)
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “నా అనుచర సంఘంలోని ప్రతి ఒక్కడూ క్షమార్హుడే, బహిరంగంగా పాపకార్యాలకు పాల్పడేవారు తప్ప. మనిషి రాత్రి పూట ఏదైనా (తప్పు) చేసి, తెల్లవారిన తర్వాత తాను చేసిన పాపాన్ని అల్లాహ్ మరుగుపరచి ఉంచినప్పటికీ తాను మాత్రం (సిగ్గులేకుండా) ‘ఒరేయ్! రాత్రి నేను ఈ పని చేశాన్రా’ అంటూ (నలుగురిలో) చెప్పుకోవటం కూడా బహిరంగ పాపమే అవుతుంది. అతని ప్రభువు అతని పాపాన్ని తెరమరుగున ఉంచగా, తెల్లవారాక అతనే స్వయంగా ఆ తెరను తొలగించటానికి ప్రయత్నిస్తున్నాడు”. (బుఖారి/సిత్రుల్ ముఅమిని అలా నఫ్సిహీ 6069, ముస్లిం/ అన్నహ్ యు అన్ హత్కిల్ ఇన్సాని… 2990).
104- అల్లాహ్ నిన్ను అంతగా గమనించిలేడని మరియు నీ గురించి అంతగా ఏమీ ఎరగడని తక్కువ అంచన వేయకు. అల్లాహ్ తో సిగ్గుపడు. వాస్తవానికి అల్లాహ్ సర్వమూ తెలిసినవాడు.
عَنْ ثَوْبَانَ > عَنْ النَّبِيِّ ^ أَنَّهُ قَالَ: (لَأَعْلَمَنَّ أَقْوَامًا مِنْ أُمَّتِي يَأْتُونَ يَوْمَ الْقِيَامَةِ بِحَسَنَاتٍ أَمْثَالِ جِبَالِ تِهَامَةَ بِيضًا فَيَجْعَلُهَا اللهُ عَزَّ وَجَلَّ هَبَاءً مَنْثُورًا قَالَ ثَوْبَانُ يَا رَسُولَ الله صِفْهُمْ لَنَا جَلِّهِمْ لَنَا أَنْ لَا نَكُونَ مِنْهُمْ وَنَحْنُ لَا نَعْلَمُ قَالَ أَمَا إِنَّهُمْ إِخْوَانُكُمْ وَمِنْ جِلْدَتِكُمْ وَيَأْخُذُونَ مِنْ اللَّيْلِ كَمَا تَأْخُذُونَ وَلَكِنَّهُمْ أَقْوَامٌ إِذَا خَلَوْا بِمَحَارِمِ الله انْتَهَكُوهَا)
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని సౌబాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ” ప్రళయదినాన తిహామ తెల్లని కొండల్లాంటి సత్కార్యాలతో వచ్చే నా అనుచర సమాజంలోని కొందరు నాకు తెలుసు. అల్లాహ్ వారి సత్కార్యాలను దుమ్ము మాదిరిగా ఎగరవేస్తాడు”. అప్పుడు ‘ప్రవక్తా! వారెవరు? వారి గుణగణాలేమిటో స్పష్టంగా చెప్పండి, మాకు తెలియకుండానే మేము వారిలో అయిపోతామేమో?’ అని సౌబాన్ విన్నవించుకోగా, ప్రవక్త ఇలా చెప్పారుః “వారు మీ సోదరులే, మీ దేశం, గ్రామంవారే మీ లాగ రాత్రి వేళ ఎక్కువగా ప్రార్థనలు చేస్తూ ఉండేవారే, కాని ఏకాంతంలో ఉన్నప్పుడు అల్లాహ్ నిశిద్ధతాలను ఉల్లంఘించేవారు”. (ఇబ్నుమాజ / జిక్రుజ్జనూబ్ 4245).
105- అల్లాహ్ ను అసంతృప్తి పరచి ప్రజల సంతృప్తి కోరకు. ఇతరుల కోరికలపై అల్లాహ్ ఆజ్ఞకు ప్రాధన్యతనివ్వు. అల్లాహ్ నిన్ను ఎవ్వరీ అవసరం లేకుండా చేయగలడు కాని ఏ ఒక్కడు అల్లాహ్ అవసరం లేకుండా చేయలేడు.
عَن عَائِشَةَ < قَالَت: سَمِعْتُ رَسُولَ الله ^ يَقُولُ: (مَنْ الْتَمَسَ رِضَا الله بِسَخَطِ النَّاسِ كَفَاهُ اللهُ مُؤْنَةَ النَّاسِ وَمَنْ الْتَمَسَ رِضَا النَّاسِ بِسَخَطِ الله وَكَلَهُ اللهُ إِلَى النَّاسِ).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా తాను విన్నట్లు ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారుః “ప్రజలు ఇష్టపడకపోయినా అల్లాహ్ ఇష్టాన్ని మాత్రమే కోరే మనిషికి ప్రజల అవసరం పడినప్పటికీ అల్లాహ్ యే సరిపోతాడు. మరెవడైతే అల్లాహ్ ను అసంతృప్తి పరచి ప్రజల మెప్పును కోరుతాడో అల్లాహ్ అతడ్ని వారి వైపే వదలుతాడు”. (అంటే అతనికి అల్లాహ్ సహాయం ఉండదు). (తిర్మిజి/కితాబుజ్జుహ్ ద్ లోని చివరి హదీసు. 2414).
106- పాపం చిన్నదే కదా అని చూడకు. ఏ మహానుభావుని పట్ల అవిధేయత పాటించబోతున్నావో గమనించు. ఆయనే సర్వలోకాల ప్రభువు అల్లాహ్!
[مَا لَكُمْ لَا تَرْجُونَ للهِ وَقَارًا] {نوح:13}
మీకేమయిది, అల్లాహ్ కై మీరు ఎలాంటి గౌరవాన్నీ ఎందుకు ఆశించరు?. (నూహ్ 71: 13).
107- నీ జీవిత ఉద్దేశ్యం, సంకల్పం ప్రపంచమే ప్రపంచం ఉండకూడదు. చివరికి అదే ఉన్నతాశయంగా, విద్యార్జనకు గమ్యంగా కాకూడదు.
[مَنْ كَانَ يُرِيدُ الحَيَاةَ الدُّنْيَا وَزِينَتَهَا نُوَفِّ إِلَيْهِمْ أَعْمَالَهُمْ فِيهَا وَهُمْ فِيهَا لَا يُبْخَسُونَ ، أُولَئِكَ الَّذِينَ لَيْسَ لَهُمْ فِي الآَخِرَةِ إِلَّا النَّارُ وَحَبِطَ مَا صَنَعُوا فِيهَا وَبَاطِلٌ مَا كَانُوا يَعْمَلُونَ] {هود: 15، 16}
కేవలం ఈ ప్రాపంచిక జీవితాన్నీ, దాని ఆకర్షకాలనూ కోరుకునే వారు చేసిన పనులకు పూర్తి ప్రతిఫలాన్ని మేము వారికి ఇక్కడనే ఇచ్చేస్తాము. ఇందులో వారికి తక్కవ చెయ్యటం అంటూ జరగదు. అయితే పరలోకంలో అటువంటివారికి అగ్ని తప్ప మరేమీ ఉండదు. (అక్కడ తెలిసిపోతుంది) వారు ప్రపంచంలో చేసినదంతా మట్టిలో కలసిపోయింది అనీ, వారు చేసినదంతా కేవలం మిథ్య అనీ. (హూద్ 11: 15,16).
108- ప్రళయదినాన్ని మరచిపోకు. దాని కొరకు సంసిద్ధమవడం మరచిపోకు.
నీవు అల్లాహ్ వైపునకే పోవలసి ఉంది. ఆయన ముందు నిలబడవలసి ఉంది. ప్రతి చిన్నది, పెద్దది మరియు గొప్పది అల్పమైనది ప్రతీదాని గురించి నీ ప్రభువు నిన్ను అడగనున్నాడు.
[فَوَرَبِّكَ لَنَسْأَلَنَّهُمْ أَجْمَعِينَ ، عَمَّا كَانُوا يَعْمَلُونَ] {الحجر:92، 93}
కనుక నీ ప్రభువు సాక్షిగా! మేము తప్పకుండా వారందరినీ వారు చేస్తూ ఉండిన దాని గురించి అడుగుతాము. (హిజ్ర్ 15: 92,93).
ఓ సోదురులారా!
[وَاتَّقُوا يَوْمًا تُرْجَعُونَ فِيهِ إِلَى اللهِ ثُمَّ تُوَفَّى كُلُّ نَفْسٍ مَا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ] {البقرة:281}
మీరంతా అల్లాహ్ సన్నిధికి చేరుకోవలసిన దినం గురించి భయపడండి. (ఆ రోజు) ప్రతి వ్యక్తికీ అతను చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు. (బఖర 2: 281).
కావలసిన సామాగ్రి, పరలోక సద్ధి సిద్ధం చేసుకో!
[وَتَزَوَّدُوا فَإِنَّ خَيْرَ الزَّادِ التَّقْوَى] {البقرة:197}
ప్రయాణసామాగ్రిని తీసుకువెళ్ళండి. భయభక్తులు అన్నిటికంటే ఉత్తమమైన సామాగ్రి. (బఖర 2: 197).
సమాప్తం
ఇప్పుడు మనం ఈ భాగం యొక్క చివరిలో ఉన్నాము. ఇందులో విశ్వాసానికి సంబంధించిన కొన్ని మినుకుమినుకుమనే మెరుపుల్లాంటి విషయాలు ప్రస్తావించాను. దీనిని సులభ పదాలతో, సరళ శైలిలో, మంచి రూపంలో తీసుకువచ్చే ప్రయత్నం చేశాను. దీనిపై దృష్టి సారించి, చదివి, ప్రచారం చేసి, ప్రచురించడంలో సహాయపడి నన్ను గౌరవించే, ప్రోత్సహించే వారందిరికీ అల్లాహ్ ప్రశాంతంగా చల్లనీ జీవితం ప్రసాదించుగాక!
ఇందులో ఏ మంచి విషయమున్నా అది అల్లాహ్ వైపు నుండి. ఆయనే దాని భాగ్యం కలగజేసి దానిపై స్థిరంగా ఉంచువాడు.
ఏదైనా తప్పు, దోషం ఉంటే నా వైపు నుండి మరియు షైతాన్ నుండి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వాటికి అతి దూరంగా ఉన్నారు.
నేను ప్రతి తప్పిదం నుండి అల్లాహ్ క్షమాపణ కోరుతున్నాను. నా లోపాలు నాకు చూపిన వానిపై అల్లాహ్ కరుణ వర్షాలు కురిపింపజేయుగాక!
ఎవరు మరింత ఎక్కువగా, లాభదాయకమైన విషయం కోరుతారో వారు ఈ శీర్షికకు సంబంధించిన పండితుల రచనలు చదవాలి. ఇలాంటి పుస్తకాల అవసరం మనకు ఈ రోజు అన్నపానీయాలు చివరికి మన శ్వాస కంటే మరీ ముఖ్యమైపోయాయి.
అవును, ఎందుకు లేదు? దాని ఫలితం భుమ్యాకాశాలంత విశాలమైన స్వర్గం. అందులో ఎన్నడూ అంతం కాని వరాలున్నాయి. వాటి గురించి ఏ మనసు ఊహించలేదు. ఇదంతా అల్లాహ్ యొక్క దయ, అనుగ్రహం.
దానికి విరుద్ధమైనదే వీడని దురదృష్టం, పట్టుకొని ఉండే భయంకర శిక్ష. ప్రజ్వలించే అగ్ని; సత్యాన్ని తిరస్కరించి, ముఖం త్రిప్పుకున్న పరమ దౌర్భాగ్యుడు తప్ప మరెవ్వరూ అందులో ప్రవేశించరు. ఇది అల్లాహ్ యొక్క న్యాయం, వివేకం.
ఓ అల్లాహ్ నీ సంతృష్టి మరియు నీ స్వర్గాన్నీ అడుగుతున్నాము. నీ నరకం మరియు నీ శిక్ష నుండి నీ శరణు వేడుకుంటున్నాము.
ఆదంతములో, బాహ్యాంతరంలో సర్వ స్తోత్రాలు అల్లాహ్ కే. ప్రవక్త పై, ఆయన కుటుంబీకులు, సహచరులపై అల్లాహ్ యొక్క అనేకాకనేక కరుణ, శాంతులు కురుయుగాక.
పాద సూచికలు (Footnotes)
([1]) అల్లాహ్ పట్ల ప్రేమ రకాలుః
1- దయ, జాలితో కూడిన ప్రేమ. ఇది సంతానం, చిన్న పిల్లవాళ్ళు మరియు వారి లాంటివారితో ఉంటుంది.
2- గౌరవ మర్యాద, సేవసత్కార్యాలతో కూడిన ప్రేమ. ఈ రకమైన ప్రేమ తండ్రి, శిక్షకుడు మరియు వారి స్థానంలో ఉన్నవారితో ఉంటుంది.
3- కామం, వాత్సల్యంతో కూడిన ప్రేమ. ఇది భార్యతో ఉంటుంది.
4- ఆరాధన, విధేయత భావంతో కూడిన ప్రేమ. అల్లాహ్ పట్ల విధేయత భావంతో కూడిన ప్రేమలో విశ్వాసుల్లో గల పుణ్యపురుషుల ప్రేమ కూడా వస్తుంది. (అంటే వారిని ప్రేమించుట అల్లాహ్ ఆరాధన పాటించినట్లు. ఎందుకనగా వారిని ప్రేమించాలని స్వయంగా అల్లాహ్ యే ఆదేశించాడు).
([2]) అల్లాహ్ తన కొరకు ప్రత్యేకించుకున్న దుఆః
1- ఆరాధన, ప్రశంస పరమైన దుఆః ‘యా జవ్వాద్, యా కరీమ్ (ఓ దాతృతుడా, అనుగ్రహించువాడా)’, ‘సుబ్ హానల్లాహిల్ అజీమ్ (పవిత్రుడైన గొప్పవాడు అల్లాహ్)’, ‘సుబ్ హానక లా ఇలాహ ఇల్లా అంత (నీవు పవిత్రునివి, నీ తప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు’.
2- ప్రశ్నార్థమైన దుఆః ‘యా రహీమ్ నన్ను కరుణించు’. ఓ అల్లాహ్ నన్ను మన్నించు
([3]) సమాధుల, మజారుల వద్ద ప్రదక్షిణం మరియు జిబహ్ (జంతువు బలి) యొక్క రకాలు క్రింది విధంగా ఉన్నాయిః
1- సమాధిలో ఉన్నవారి గురించి ప్రదక్షిణం, జిబహ్ చేస్తే, అతడు తౌహీద్ (దైవఏకత్వం)కు వ్యతిరేకమైన పెద్ద షిర్క్ చేసినవాడౌతాడు.
2- ఒకవేళ అతని ప్రదక్షిణం అల్లాహ్ కొరకే కాని సమాధివారు లాభ నష్టాలు చేకూర్చే శక్తిగలవారని నమ్మితే అతడు కూడా తౌహీద్ కు వ్యతిరేకమైన, ధర్మ భ్రష్టతకు కారణమయ్యే పెద్ద షిర్క్ చేసినవాడు అవుతాడు.
3- ఒకవేళ అతని ప్రదక్షిణం అల్లాహ్ కొరకే ఉండి సమాధివారి గురించి ఏ ప్రభావ విశ్వాసం లేకుండా ‘ఆ సమాధి వారిది ఉన్నత స్థానం, ఆయన ఆ స్థానం లాభనష్టాలకు కారణం’ అని నమ్మితే, అప్పుడు ఇది షిర్క్ సంబంధిత బిద్అత్ (దురాచారం) అవుతుంది. కాని ధర్మ భ్రష్టతకు కారణమయ్యే పెద్ద షిర్క్ కాదు. పోతే అల్లాహ్ యూదులను, క్రైస్తవులను శపించినట్లు అతను కూడా శాపగ్రస్తుడు అవుతాడు. అలాగే సమాధిని మస్జిదుగా చేసుకున్నవారు కూడా శాపగ్రస్తులు.
1- ధార్మిక ఆధారం మూలంగా శుభం కోరడం. ఉదాః అల్లాహ్ యొక్క గ్రంథ (పారాయణం చేసి). అందులో అభ్యంతరం లేదు.
2- స్పృహగల విషయాల ద్వారా. ఉదాః ధార్మిక విద్య. స్వయం తమ కొరకు లేదా ఇతరులకు దుఆ. విద్యగల పుణ్యపురుషుని విద్య ద్వారా, అతని వద్ద కూర్చుండి, లేదా అతని దుఆ ద్వారా. అంతేకాని అతని వ్యక్తిత్వం వల్ల అని కాదు.
3- షిర్క్ సంబంధమైన శుభం. ఇది సమాధులతో, మజారులతో కోరడం. వాటిలో ఏలాంటి శుభం లేదు. దానికి ధార్మిక, లౌకిక ఏ ఆధారము లేదు. ఇందులో కొన్ని రకాలు గలవుః
A. ఆరాధనలో ఏ ఒక్క భాగమైన సమాధుల కోసం చేస్తే ఇది తౌహీద్ కు వ్యతిరేకమైన పెద్ద షిర్క్ అవుతుంది.
B. ఆ సమాధులు అతని మరియు అల్లాహ్ మధ్యలో మధ్యవర్తిగా అని నమ్ముతే ఇది కూడా తౌహీద్ కు వ్యతిరేకమైన పెద్ద షిర్క్.
C. అవి మధ్యవర్తిగా కావు, కేవలం శుభం ఉద్దేశం ఉంటే ఇది షిర్క్ సంబంధమైన బిద్అత్. ఇది విధిగా ఉన్న సంపూర్ణ తౌహీద్ కు వ్యతిరేకమైనది.
([5]) ఆయనపై నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి మంచివాటిని పొందుటకు, చెడుల నుండి దూరముండుటకు యోగ్యమైన సాధనాలు ఉపయోగించడం కూడా అల్లాహ్ పై సంపూర్ణ నమ్మకంలో వస్తాయి.
([6]) కడాలు, దారాలు తొడిగి, లాభనష్టాలు అందులో ఉన్నవని విశ్వసిస్తే, ఇది తౌహీదు మరియు సత్య విశ్వాసానికి విరుద్ధం (పెద్ద షిర్క్). ఒకవేళ వాటిని లాభనష్టాలకు ‘సాధనం’ అని నమ్మితే, ఇది ఏకత్వ విశ్వాస సంపూర్ణతకు విరుద్ధం మరియు చిన్న షిర్క్. ఇందువల్ల విశ్వాసంలో కొరత ఏర్పడుతుంది. ఎందుకనగా అది ‘సాధనం’ అని అతని మనస్సులో నాటుకుంది. అయితే నియమం ఏమంటుందంటే: “ఏది ‘సాధనం’ కాదో దానిని ‘సాధనం’ చేసుకొనుట షిర్క్”. అందుకే ధార్మిక నిదర్శనతో ‘సాధనం’ యొక్క రుజువు కావాలి. ఉదాః అసూయపరుని స్నానం నీళ్ళు తీసుకొనుట. లేదా శాస్త్రీయంగా రుజువై యుండాలి. ఉదాః విరిగిన ఎముకను వెదురుబద్దతో నిలపడం, మందుల ఉపయోగం మరియు ధర్మసమ్మతమైన మంత్రం చేయడం. ఈ యోగ్యమైన సాధనాలు ఉపయోగిస్తున్నప్పటికీ మనస్సు మాత్రం అల్లాహ్ పట్ల లగ్నం అయి ఉండాలి. సాధనాలు ఎంత గొప్పవి, బలమైనవిగా ఉన్నా అవి అల్లాహ్ నిర్ణయించిన అదృష్టం, విధివ్రాతకు కట్టుబడి ఉంటాయి.
([7]) సమాధిపై మస్జిద్ నిర్మిచబడితే దానిని పడగొట్టుట లేదా మస్జిదులో సమాధి చేయబడితే శవాన్ని అందులో నుండి తీసి స్మశానం(ఖబ్రిస్తాన్)లో సమాధి చేయుట విధిగా ఉంది. ఇలాగే షిర్క్ ఉపద్రవాల నుండి రక్షణ పొందగలుగుతాము.
([8]) సమాధి వద్ద నమాజు స్థితులుః
1- సమాధి వద్ద నమాజు చేయు వ్యక్తి సమాధి మరియు అందులో ఉన్న వారి గురించి ఏ ప్రత్యేక నమ్మకం లేకుండా, అల్లాహ్ ప్రసన్నత కొరకే, కాని అక్కడ చేయుట ఎక్కువ ఘనత అని భావిస్తే అతను షిర్క్ కు సంబంధించిన బిద్అత్ (దురాచారం) చేసినవాడు, శాపగ్రస్తుడు మరియు సృష్టిలో అతి నీచుడవుతాడు. కాని పెద్ద షిర్క్ కు పాల్పడిన, ఇస్లాం నుండి వైదొలిగినవాడు కాడు.
2- సమాధి వద్ద నమాజు చేయు వ్యక్తి అందులో ఉన్నవారి గురించి లాభాలు చేకూర్చే, నష్టాన్ని తొలిగించేవారని నమ్మి, వారితో మొర పెట్టుకుంటే, వేడుకుంటే అలాంటి వ్యక్తి పెద్ద షిర్క్ కు పాల్పడి, ఇస్లాం నుండి దూరమై, తౌహీద్ కు వ్యతిరేకమైన కార్యం చేసినవాడవుతాడు.
3- ఎవరైతే అజ్ఞానంతో సమాధి వద్ద నమాజ్ చేశాడో, అక్కడ సమాధి ఉన్నదని కూడా అతనికి తెలియదో అతని ఆ నమాజ్ సహీ అగును. అతడు పాపాత్ముడు కాడు.
([9]) ప్రవక్త సమాధినుద్దేశించి మదీన ప్రయాణం చేయుట నిషిద్ధము. స్వయంగా ప్రవక్తయే దీనిని నిషేధించారు. ఇలా చేయుట ఒక పండుగగా, ఉత్సవంగా అయిపోతుంది. ఇలా చేయువాడు హదీసు ఆధారంగా శాపగ్రస్తుడవుతాడు.
([10]) చిత్రాలు చిత్రించడం అల్లాహ్ రుబూబియత్ లో జుల్మ్ (అన్యాయం, దౌర్జన్యాని)కి పాల్పడినట్లగును. సృష్టించుట, ఆదేశించుటలో అల్లాహ్ ఏకైకుడు, ఆయనకు ఎవ్వరూ భాగస్వామి లేరు. ]వినండి! సృష్టించుట, ఆదేశించుట ఆయన పనియే. సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ చాలా శుభము గలవాడు. (ఆరాఫ్ 7: 54).
([11]) అల్లాహ్ యేతరుల కొరకు చేసే జంతు బలి రెండు రకాలుగా ఉంటుందిః
1- సన్నిధానం పొందుటకు, గౌరవభావంతో, ఆరాధన ఉద్దేశంతో చేయుట. అందులో అతని నుండి ఎదైనా మేలు ఆశిస్తూ, లేదా అతని నుండి కీడు కలగవద్దన్న భయంతో చేయుట. ఇది పెద్ద షిర్క్. ఇస్లాం నుండి బహిష్కరణకు కారణం. తౌహీద్ కు వ్యతిరేకం. ఉదాహరణకుః ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత జంతు బలి ఇచ్చి, దానిని ఇంట్లో ఉంచుట, జిన్, షైతానుల కీడు నుండి రక్షణ ఉద్దేశంతో దాని రక్తాన్ని గోడలకు పూయుట.
2- ఎవరైనా అతిథి, బందువు వచ్చినప్పుడు అల్లాహ్ ప్రసన్నత ఉద్దేశంతో జంతువును కోయుట ఇది ధర్మసమ్మతం.
1- అల్లాహ్ కొరకు ఆయన విధేయతలో ఉన్న మ్రొక్కుబడిని నెరవేర్చాలి. కాని అల్లాహ్ కొరకే అయినప్పటికీ అది ఆయన అవిధేయతలో ఉన్న దానిని నెరవేర్చరాదు.
2- అల్లాహ్ యేతరుల కొరకు మ్రొక్కుకున్న మ్రొక్కుబడి విధేయతలో ఉన్నా అవిధేయతలో ఉన్నా నెరవేర్చరాదు. ఇది షిర్క్ అవుతుంది. ఎలా అనగ మ్రొక్కుబడి ఆరాధన (ఇబాదత్). దానిని కేవలం అల్లాహ్ కు మాత్రమే చేయాలి.
([13]) ఆపదలు దూరమగటకు, సుఖాలు ప్రాప్తించుటకు ధర్మపరమైన మాధ్యస్థములు మూడు రకాలుగా ఉన్నాయిః
1- అల్లాహ్ యొక్క శుభ నామములు, ఉత్తమ గుణాలు. ఉదాహరణకుః ఓ కరుణామయా! నన్ను కరుణించు. ఓ పాపాలను క్షమించేవాడా! నన్ను క్షమించు.
2- నిజ విశ్వాసం మరియు సత్కార్యాలు. ఉదాహరణకుః ఓ అల్లాహ్! నేను నిన్ను విశ్వసించాను కనుక నీవు నాపై దయతలచు. ఓ అల్లాహ్ నీ ప్రవక్త పట్ల నాకు ప్రేమ ఉంది కనుక నీవు నన్ను క్షమించు.
3- పుణ్యపురుషుడైన ముస్లిం వ్యక్తి దుఆ.
([14]) పరిహాసమాడుతూ తిరస్కరించుట, విడనాడి తిరస్కరించుటకంటే మరీ చెడ్డది. ఉదాః నమాజు వదిలే వ్యక్తి, లేదా విగ్రహానికి సాష్టాంగపడే వ్యక్తి కేవలం తిరస్కారానికి గురవుతాడు. కాని పరిహసించే వ్యక్తి తిరస్కారంతో పాటు పరిహాసానికి గురవుతాడు.
([15]) ధర్మవేత్తలతో, ధర్మంపై నడిచేవారితో మరియు ధర్మం వైపునకు పిలిచేవారితో పరిహాసమాడేవారు రెండు రకాల భ్రష్టత్వానికి గురి అవుతారు.
1- అతని ఉద్దేశ్యంలో నేరుగా ధర్మాన్ని, రుజువైన ప్రవక్త సంప్రదాయాల్ని; ఉదాః గడ్డం ఉంచడం, లుంగీ, లాగు చీలమండలానికి పైకి ధరించడం లాంటివి ఉంటే ఇది కుఫ్ర్ (సత్యతిరస్కారం) అవుతుంది. అంతే గాకుండా ఒక ముస్లిం సోదరుడ్ని హీనపరచడం అన్నది అతను (హీనపరిచేవాడు) చెడు అన్నదానికి నిదర్శనం.
2- అతడు వారి ధార్మిక జీవన శైలిని గాకుండా వారిని, వారి కొన్ని చేష్టల్ని ఉద్దేశించి పరిహసిస్తే పాపాత్ముడవుతాడు కాని కాఫిర్ కాడు.
([16]) అల్లాహ్ అవతరించినది కాకుండా ప్రజా నిర్మిత చట్టాలు అవలంబించేవారివి మూడు స్థితులుః
1- అల్లాహ్ యేతరుల చట్టాలతో తీర్పు చేసేవాడు అల్లాహ్ అవతరించిన చట్టం ఈ కాలంలో చెల్లదని, లేదా అది గాకుండా వేరేటివే ఉత్తమం అని, లేదా అది అసంపూర్ణమైనది, అన్యాయం, కఠినత్వంతో కూడినది అని నమ్మితే అతడు అవిశ్వాసి అయినట్లే, ఇస్లాం నుండి వైదొలగినట్లే, ధర్మభ్రష్టతకు గురి అయినట్లే. ఇంకా అతడు ఘోర విచ్ఛిన్నకారుడు మరియు అల్లాహ్ తో పోరాటానికి దిగినవాళ్ళల్లో అతి నీచుడు.
అల్లాహ్ అవతరించిన చట్టం ప్రకారం తీర్పు చేయనివారే అవిశ్వాసులు. (మాఇద 5: 44). [وَمَنْ لَمْ يَحْكُمْ بِمَا أَنْزَلَ اللهُ فَأُولَئِكَ هُمُ الكَافِرُونَ].
2- ఎవరైతే అల్లాహ్ అవతరించిన చట్టమే అతిఉత్తమమైనదని, సంపూర్ణమైనదని నమ్మి కూడా తన కోరిక తీర్చుకొనుటకు లేదా ఏదైనా వాంఛకు లోనై, వేరే చట్ట ప్రకారం తీర్పు చేస్తే అతడు అవిశ్వాసి కాడు, ధర్మభ్రష్తతకైతే అంతకూ గురికాడు. పోతే అల్పవిశ్వాసిగా మరియు అల్లాహ్ ఇష్టానికి వ్యతిరేక మార్గాన్ని అవలంబించినవాడవుతాడు.
అల్లాహ్ అవతరించిన చట్టం ప్రకారం తీర్పు చేయనివారే దుర్మార్గులు. (మాఇద 5: 47). [وَمَنْ لَمْ يَحْكُمْ بِمَا أَنْزَلَ اللهُ فَأُولَئِكَ هُمُ الفَاسِقُونَ].
3- అల్లాహ్ అవతరించినదానితో తీర్పు చేయుటయే విధిగా అని నమ్మి కూడా దౌర్జన్యపరుడైన అధికారి, రాజుకు లేదా కరడుగట్టిన శత్రువులకు భయపడి వేరే చట్టాల ప్రకారం తీర్పు చేస్తే అతడు తన పట్ల అన్యాయం చేసుకున్నవాడు మరియు అసంపూర్ణ విశ్వాసిగా పరిగణింపబడతాడు.
అల్లాహ్ అవతరించిన చట్టం ప్రకారం తీర్పు చేయనివారే దౌర్జన్యపరులు, అన్యాయులు.(మాఇద 5: 45).[وَمَنْ لَمْ يَحْكُمْ بِمَا أَنْزَلَ اللهُ فَأُولَئِكَ هُمُ الظَّالِـمُونَ].
([17]) పంచాంగకర్తలను సత్యపరచువాడు అవిశ్వాసుడవుతాడు. ఎందుకనగా ఏ అగోచరజ్ఞానం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకముగా ఉందో, అందులో ఏ ఒక్కరికి రవ్వంత జోక్యం లేదని వచ్చిన స్పష్ట మైన ఆయతుల మరియు సహీ హదీసులను వ్యతిరేకిస్తున్నట్లు జరుగుతుంది. అగోచరజ్ఞానం అల్లాహ్ కు తప్ప ఎవ్వరికీ లేదు. అలాగే పంచాంగకర్త సత్యవంతుడా, అబద్ధాలకోరుడా అని అనుమానించేవాడు కూడా అవిశ్వాసానికి పాల్పడుతాడు. ఎలా అనగా అగోచరజ్ఞాన బీగములు అల్లాహ్ తప్ప ఇతరుల వద్ద ఉన్నాయని అనుమానించాడు గనక.
([18]) కక్ష్యల మరియు గ్రహాల విద్యభ్యాసం రెండు రకాలుగా ఉంటుందిః
1- విత్తనాలు చల్లే కాలం, రుతువుల ఆరంభం తెలియుటకు. అయితే అందులో వాటి ప్రభావం ఉందన్న నమ్మకం ఉండకూడదు. అల్లాహ్ ఆజ్ఞతో వాటిని ఒక గుర్తు, చిహ్నంగా భావించాలి. ఈ ఉద్దేశ్యంతో అభ్యాసంలో ఏ అభ్యంతరం లేదు.
2- భూసంఘటనలపై వాటి ప్రభావం ఉంటుందని, లేదా గ్రహాల స్థితిగతులు సయితం వాటితో ముడిపడి ఉన్నాయని నమ్ముట. ఉదాహరణకుః ‘ఫలాన తారలో మీ వివాహంలో శుభం కలగదు’ లేదా ‘ఫలాన తారలో మీ వ్వాపారంలో శుభం కలుగుతుంది’ అని. అయితే ఇలాంటివి అవిశ్వాసం క్రింద లెక్కించబడతాయి. ఎందుకనగా అల్లాహ్ కు ప్రత్యేకముగా ఉన్న అగోచరజ్ఞానంలో దౌర్జన్యమగును.
([19]) తారల ద్వారా వర్షం కోరడం ఈ రకంగా ఉంటుందిః
1- తారల ద్వారానే వర్షం కోరడం. ఇది రుబూబియత్ మరియు ఉలూహియత్ లో షిర్క్ అవుతుంది. ఎలా అనగా సృష్టించే మరియు ఉనికిలోకి తెచ్చే శక్తి అల్లాహ్ కే కాకుండా ఇతరులలో ఉంది అని నమ్మడం వల్ల. ఇది తౌహీద్ కు బద్ధ విరుద్ధం.
2- వర్షం కుర్పించే కార్యాన్ని అల్లాహ్ వైపు కాకుండా తారల వైపే అంకితం చేయడం. ఇది తౌహీద్ కు వ్యతిరేకమైన ఘోరమైన షిర్క్.
3- వాటి వల్లనే వర్షం కురిసిందని, వర్షం కురువడానికి అవి సబబు అని అనడం. అయితే అల్లాహ్ దేనిని కారణం, సబబుగా చేయలేదో దానిని సబబుగా నమ్మడం క్రింద లెక్కించబడుతుంది. ఇలా అల్లాహ్ పై దౌర్జన్యం చేసినట్లవుతుంది. అయినా ఇది చిన్న షిర్క్. తౌహీద్ సంపూర్ణతకు వ్యతిరేకం కాని ధర్మభ్రష్టతకు కారణం కాదు.
([20]) నక్షత్రం వైపు వర్షం అంకితం మూడు రకాలుగా ఉంటుంది.
1- సృష్టించే, ఉనికిలోకి తెచ్చేది ఆ నక్షత్రం అని. ఇది పెద్ద షిర్క్.
2- కారణ సంబంధమైనది. ఇది చిన్న షిర్క్.
3- కాలం, సమయం తెలుపునది. ఇది యోగ్యం. అయితే ఫలాన నక్షత్రం “వల్ల” అనే బదులు “ఫలాన నక్షత్రం పొడిసినప్పుడు” అని అనాలి.
([21]) మనిషి ఆకలిగా ఉన్నప్పుడు అతని కడుపులో ఒక పురుగు దూరి తీవ్ర క్షోభకలిగిస్తుంది అన్న మూఢ నమ్మకాన్ని ఇస్లాం కొట్టి పారేసింది. అయితే ఈ మూఢనమ్మకాన్నే వారు ‘సఫర్’ అని అనేవారు.
([22]) అల్లాహ్ నిర్ణయించిన దాని ప్రకారం ఏవైనా ఆపదలు వస్తే అయిష్టత, కోపం ప్రదర్శించుట సంపూర్ణ తౌహీద్ కు విరుద్ధం. ఒక్కోసారి ఇదే స్థితిలో మనిషి ఏదైనా కుఫ్ర్ మాట (అవిశ్వాస పలుకులు) పలికితే లేదా కుఫ్ర్ (అవిశ్వాసానికి గురి చేసే) పని చేస్తే, ఈ చేష్టే తౌహీద్ పునాదినే కూల్చేస్తుంది.
([23]) ఆపద వచ్చినప్పుడు విధిగా పాటించవలసిన విషయాలు ఇవిః
1- కంగారుపడకుండా, ఆందోళన చెందకుండా తనకుతాను సహనం వహించాలి.
2- కోపం, అయిష్టత వ్యక్త పరచకుండా నాలుకను అదుపులో ఉంచుకోవాలి.
3- తన శరీరఅవయవాలను కూడా అదుపులో ఉంచుకోవాలి. చెంపలు బాదుకోరాదు. దుస్తులు చించుకోరాదు. వెండ్రుకలు పీక్కోరాదు. తలపై దుమ్మెత్తి పోసుకోరాదు. ఇంకా ఇలాంటి ఏ పని చేయకూడదు.
([24]) కాలాన్ని దూషించడం మూడు రకాలుగా ఉంటుందిః
1- తౌహీద్ కు వ్యతిరేకమైన ఘోరమైన షిర్క్. కొందరు ఇలా అంటారుః ‘కాలం పాడుగాను’, ‘ఈ రాత్రి విపరీతమైన వేడి గలది’, ‘మహా చల్లని రాత్రి’, ఇలాంటి మాటలు అన్నప్పుడు వేడి, చలిను పుట్టించేది
కాలం, రాత్రి అని నమ్మితే ఇదే ఘోరమైన షిర్క్.
2- కాలం సృష్టికర్త అల్లాహ్ అని నమ్మినప్పటికీ విపరీతమైన వేడి, లేదా చలి ఉన్నప్పుడు యమకోపంతో, ఓపిక లేకుండా, దానిని భరించడం లో పుణ్యం అన్న విషయం మరచి, అల్లాహ్ వ్రాసిన విధివ్రాత మీద ఆగ్రహంతో ప్రవర్తించుట లేదా దాని వార్త ఇతరులకు ఇచ్చుట. ఈ ప్రవర్తన సరియైనది కాదు. ఇందువల్ల మనిషి పాపానికి గురవుతాడు.
3- మంచి విశ్వాసం మరియు సదుద్దేశంతో ఎలా ఉంది వాతవరణం అంటే సమాధానంగా చలి ఉంది అని వేడి ఉంది అని ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉంది అని తెలుపుతే ఈ పద్ధతి సరైనది. ఇందులో ఏలాంటి పాపము లేదు.
([25]) కాలాన్ని, భూమిని, జడపదార్థాల్ని మరియు ఇతర సృష్టిని దూషించుట అల్లాహ్ ను దూషించినట్లు. ఎందునగా అది వాస్తవానికి వాటిని ఉనికిలోకి తెచ్చినవారిని దూషించినట్లు. ఉదాహరణకుః నీవు ఒక ఇల్లును దాని బలహీన నిర్మాణం వల్ల లేదా ఏదైనా వాహనాన్ని అది మంచిగా లేనందుకు దూషించావంటే వాస్తవానికి దానిని చేసినవానిని దూషించినట్లు. అందుకే ఈ చేష్టకు దూరంగా ఉండి భయపడాలి.
([26]) సామాన్య రీతికి భిన్నంగా వెలువడే కొన్ని పనులు, కొందరి పుణ్యాత్ముల ద్వారా అల్లాహ్ ప్రత్యక్షపరుస్తాడు. అయితే ప్రవక్తలతో సంభవించిన మహిమలకు సమానమైనవి అవి ఎంతమాత్రం కావు. మహిమల్లో ఛాలెంజ్ ఉంటుంది. కాని కరామతులో ఉండదు.
You must be logged in to post a comment.