[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [23 పేజీలు]
విషయ సూచిక
- 1. వుజూ కు ముందు
- 2. వుజూ తర్వాత దుఆ
- 3. అజాన్ సమాధానం, దాని పిదప దుఆ
- 4. మస్జిద్ వైపునకు వెళ్తూ చదవండి
- 5. మస్జిద్ లో ప్రవేశించినప్పుడు చదవండి
- 6. మస్జిద్ నుండి బైటికి వెళూ చదవండి
- 7. తక్బీరే తహ్రీమా తర్వాత చదవండి
- 8. రుకూలో చదవండి
- 9. రుకూ నుండి నిలబడి చదవండి
- 10. సజ్దాలో చదవండి
- 11. రెండు సజ్దాల మధ్యలో చదవండి
- 12. తషహ్హుద్లో చదవండి
- 13. తషహ్హుద్ తర్వాత చదవండి
- 14. సలాంకు ముందు ఎక్కువ దుఆ చేయాలి
- 15. నమాజ్ తర్వాత జిక్ర్
- 16. జనాజ నమాజులోని దుఆ
- 17. విత్ర్ నమాజు తర్వాత చదవండి
- 18. ఇస్తిఖార నమాజు యొక్క దుఆ
నమాజు యొక్క దుఆలు – స్మరణలు
1- వుజూకు ముందు పలకండి
బిస్మిల్లాహ్.
(అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను). (అబూ దావూద్ 101).
2- వుజూ తర్వాత చదవండి
أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ
అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ.
అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడని ఆయన ఏకైకుడని, ఆయనకు ఎవరు భాగస్వాములు లేరని సాక్ష్యమిచ్చుచున్నాను. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అని కూడా సాక్ష్యమిచ్చుచున్నాను. (ముస్లిం 234).
3- అజాన్ సమాధానం, దాని పిదప దుఆ
అజాన్ విన్నప్పుడు ముఅజ్జిన్ అన్నట్లు మీరు అనండి, కాని అతను “హయ్య అలస్సలాహ్, హయ్య అలల్ ఫలాహ్” అన్నప్పుడు మాత్రం “లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” (పుణ్యం చేసే మరియు పాపల నుండి దూరం ఉండే భాగ్యం అల్లాహ్ యే ప్రసా దించువాడు) అనండి. ఆ తర్వాత దరూదె ఇబ్రాహీం చదవండి. ఆ తర్వాత ఈ దుఆ కూడా చదవండిః
اللَّهُمَّ رَبَّ هَذِهِ الدَّعْوَةِ التَّامَّةِ وَالصَّلَاةِ الْقَائِمَةِ آتِ مُحَمَّدًا الْوَسِيلَةَ وَالْفَضِيلَةَ وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا الَّذِي وَعَدْتَهُ
అల్లాహుమ్మ రబ్బ హాజిహిద్ దఅవతిత్తామ్మతి వస్సలాతిల్ ఖాఇమతి ఆతి ముహమ్మదనిల్ వసీలత వల్ ఫజీలత వబ్అస్ హు మఖామమ్ మహ్మూద నిల్లజీ వఅత్తహూ. (బుఖారి 614).
ఈ పరిపూర్ణ ఆహ్వానం మరియు స్థాపించబడే నమాజు యొక్క ప్రభువైన అల్లాహ్! ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు వసీల మరియు ఘనతలు ప్రసాదించు. మరియు నీవు వాగ్దానం చేసిన ‘మఖామె మహ్మూద్’ (ప్రశంసనీయమైన స్థానం) ప్రతిష్ఠింప జేయి).
పై దుఆలో పరిపూర్ణ ఆహ్వానం అంటే అజాన్ అని, వసీల అంటే స్వర్గంలో ఓ ఉన్నత స్థానం అని, అల్లాహ్ దాసుల్లో కేవలం ఒక్కడే దానికి అర్హుడు అని అర్థం. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు: “ఆ ఒక్కణ్ణి నేనే అవుతానని ఆశిస్తున్నాను.”
4- మస్జిదు వైపునకు వెళ్తూ చదవండి
اللَّهُمَّ اجْعَلْ فِي قَلْبِي نُورًا وَفِي لِسَانِي نُورًا وَاجْعَلْ فِي سَمْعِي نُورًا وَاجْعَلْ فِي بَصَرِي نُورًا وَاجْعَلْ مِنْ خَلْفِي نُورًا وَمِنْ أَمَامِي نُورًا وَاجْعَلْ مِنْ فَوْقِي نُورًا وَمِنْ تَحْتِي نُورًا اللَّهُمَّ أَعْطِنِي نُورًا
అల్లాహుమ్మజ్అల్ ఫీ ఖల్ బీ నూరా, వ ఫీ లిసానీ నూరా, వజ్అల్ ఫీ సమ్ఈ నూరా, వజ్అల్ ఫీ బసరీ నూరా, వజ్అల్ మిన్ ఖల్ ఫీ నూరా, వ మిన్ అమామీ నూరా, వజ్అల్ మిన్ ఫౌఖీ నూరా, వమిన్ తహ్ తీ నూరా, అల్లాహుమ్మ అఅతినీ నూరా. (ముస్లిం 763, బుఖారి 6316).
(ఓ అల్లాహ్ నా హృదయంలో వెలుగు ప్రసాదించు, నా నాలుకలో వెలుగు ప్రసాదించు, నా చెవిలో వెలుగు ప్రసాదించు, నా కళ్ళలో వెలుగు ప్రసా- దించు, నా వెనక వెలుగు ప్రసాదించు, నా ముందు వెలుగు ప్రసాదించు, నా పైన వెలుగు ప్రసాదించు, నా క్రింద వెలుగు ప్రసాదించు. ఓ అల్లాహ్ నాకు (ప్రళయ దినాన) వెలుగు ప్రసాదించు).
వెలుగు అంటే ధర్మం మరియు సత్యాన్ని స్పష్ట పరచడం అని భావం.
5- మస్జిదులో ప్రవేశించినప్పుడు చదవండి
اللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ
అల్లాహుమ్మఫ్ తహ్ లీ అబ్వాబ రహ్మతిక.
(ఓ అల్లాహ్ నా కొరకు నీ కరుణ ద్వారాలను తెరుచు). (ముస్లిం 713).
6- మస్జిద్ నుండి బైటికి వెళ్తూ చదవండి
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ فَضْلِكَ
అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫజ్లిక.
(ఓ అల్లాహ్ నీతో నీ దయను కోరుతున్నాను.) (ముస్లిం 713).
7- తక్బీరె తహ్రీమ తర్వాత చదవండి
1- అల్లాహుమ్మ బాఇద్ బైనీ వ బైన ఖతాయాయ కమా బాఅత్త బైనల్ మష్రిఖి వల్ మఘ్రిబి అల్లాహుమ్మ నఖ్ఖినీ మినల్ ఖతాయా కమా యునఖ్ఖస్సౌబుల్ అబ్ యజు మినద్దనసి అల్లాహుమ్మగ్ సిల్ ఖతాయాయ బిల్ మాఇ వస్సల్ జి వల్ బరద్.
اللَّهُمَّ بَاعِدْ بَيْنِي وَبَيْنَ خَطَايَايَ كَمَا بَاعَدْتَ بَيْنَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ اللَّهُمَّ نَقِّنِي مِنْ الْخَطَايَا كَمَا يُنَقَّى الثَّوْبُ الْأَبْيَضُ مِنْ الدَّنَسِ اللَّهُمَّ اغْسِلْ خَطَايَايَ بِالْمَاءِ وَالثَّلْجِ وَالْبَرَدِ
(ఓ అల్లాహ్ తూర్పు పడమరల మధ్య ఎంత దూరం ఉంచావో నన్ను పాపాలకు అంతే దూరంగా ఉంచు. ఓ అల్లాహ్ మాసిన బట్ట తెల్లనిబట్టలా ఎలా శుభ్రమవుతుందో నా పాపాలను అలా శుద్ధి చెయ్యి. నా పాపాలను నీరు, మంచు, వడగండ్లతో కడిగివెయ్యి). (బుఖారి 744, ముస్లిం 598).
2- సుబ్ హానకల్లాహుమ్మ వ బిహమ్దిక వ తబార కస్ముక వ తఆలా జద్దుక వ లాఇలాహ ఘైరుక.
سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ وَتَبَارَكَ اسْمُكَ وَتَعَالَى جَدُّكَ وَلَا إِلَهَ غَيْرُكَ
(అల్లాహ్ నీవు అన్ని రకాల లోపాలకు అతీతునివి, నీకే సర్వ స్తోత్రములు, నీ నామమే శుభము గలది. నీ ఔన్నత్యం, అనుగ్రహం ఉన్నతమైనది. నీవు తప్ప సత్యమైన ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. (అబూదావూద్ 775, తిర్మిజి 242. అల్బానీ సహీ అని అన్నారు).
3- అల్ హందులిల్లాహి హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్.
الْحَمْدُ لِله حَمْدًا كَثِيرًا طَيِّبًا مُبَارَكًا فِيهِ
(ఎనలేని ఉత్తమమైన, శుభప్రదమైన స్తోత్రములు అల్లాహ్ కొరకే). (ముస్లిం 600).
4- అల్లాహు అక్బరు కబీరా వల్ హందు లిల్హాహి కసీరా వ సుబ్ హానల్లాహి బుక్రతవ్ వ అసీలా.
اللهُ أَكْبَرُ كَبِيرًا وَالْحَمْدُ لِله كَثِيرًا وَسُبْحَانَ الله بُكْرَةً وَأَصِيلًا
(అల్లాహ్ చాలా గొప్పవాడు, ఎనలేని స్తోత్రములు అల్లాహ్ కొరకే, ఉదయం, సాయంత్రం ఆయనకే పవిత్రతలు). (ముస్లిం 601).
5- అల్లాహుమ్మ రబ్బ జిబ్రాఈల వ మీకాఈల వ ఇస్రాఫీల ఫాతిరస్ సమావాతి వల్ అర్జి ఆలిమల్ గైబి వష్షహాదతి అంత తహ్ కుము బైన ఇబాదిక ఫీమా కానూ ఫీహి యఖ్తలిఫూన్ ఇహ్ దినీ లిమఖ్ తులిఫ ఫీహి మినల్ హఖ్ఖి బిఇజ్నిక ఇన్నక తహ్ దీ మన్ తషాఉ ఇలా సిరాతిమ్ ముస్తఖీం.
اللَّهُمَّ رَبَّ جَبْرَائِيلَ وَمِيكَائِيلَ وَإِسْرَافِيلَ فَاطِرَ السَّمَاوَاتِ وَالْأَرْضِ عَالِمَ الْغَيْبِ وَالشَّهَادَةِ أَنْتَ تَحْكُمُ بَيْنَ عِبَادِكَ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ اهْدِنِي لِمَا اخْتُلِفَ فِيهِ مِنْ الْحَقِّ بِإِذْنِكَ إِنَّكَ تَهْدِي مَنْ تَشَاءُ إِلَى صِرَاطٍ مُسْتَقِيمٍ
(ఓ అల్లాహ్! జిబ్రాఈల్, మీకాఈల్ మరియు ఇస్రాఫీల్ యొక్క ప్రభువా! భూమ్యాకాశాల సృష్టికర్తా! గోచర అగోచరాల జ్ఞానీ! నీవే నీ దాసుల మధ్య ఉన్న విభేదాలను గురించి తీర్పు చేయువానివి. ఏ సత్య విషయంలో విభేదించడం జరిగినదో అందులో నీ దయతో నాకు మార్గం చూపుము, నిశ్చయంగా నీవు కోరినవారికి సన్మార్గం చూపుతావు). (ముస్లిం 770).
6- వజ్జహ్ తు వజ్ హియ లిల్లజీ ఫతరస్సమావాతి వల్ అర్ జ హనీఫవ్ వమా అన మినల్ ముష్రికీన్ ఇన్న సలాతీ వ నుసుకీ వ మహ్ యాయ వ మమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ లా షరీక లహూ వ బిజాలిక ఉమిర్తు వ అన అవ్వలుల్ ముస్లిమీన్ అల్లా హుమ్మ అంతల్ మలికు లాఇలాహ ఇల్లా అంత, అంత రబ్బీ వ అన అబ్దుక జలంతు నఫ్సీ వఅతరఫ్ తు బిజంబీ ఫగ్పిర్ లీ జునూబీ జమీఅన్ ఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత వహ్ దినీ లిఅహ్ సనిల్ అఖ్లాఖి లా యహ్ దీ లిఅహ్ సనిహా ఇల్లా అంత వస్రిఫ్ అన్నీ సయ్యిఅహా లా యస్రిఫ్ అన్నీ సయ్యిఅహా ఇల్లా అంత లబ్బైక వ సఅదైక వల్ ఖైరు కుల్లుహూ ఫీ యదైక వష్షర్రు లైస ఇలైక అన బిక వ ఇలైక తబారక్త వ తఆలైత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక.
وَجَّهْتُ وَجْهِيَ لِلَّذِي فَطَرَ السَّمَاوَاتِ وَالْأَرْضَ حَنِيفًا وَمَا أَنَا مِنْ الْمُشْرِكِينَ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِله رَبِّ الْعَالَمِينَ لَا شَرِيكَ لَهُ وَبِذَلِكَ أُمِرْتُ وَأَنَا مِنْ الْمُسْلِمِينَ اللَّهُمَّ أَنْتَ الْمَلِكُ لَا إِلَهَ إِلَّا أَنْتَ أَنْتَ رَبِّي وَأَنَا عَبْدُكَ ظَلَمْتُ نَفْسِي وَاعْتَرَفْتُ بِذَنْبِي فَاغْفِرْ لِي ذُنُوبِي جَمِيعًا إِنَّهُ لَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ وَاهْدِنِي لِأَحْسَنِ الْأَخْلَاقِ لَا يَهْدِي لِأَحْسَنِهَا إِلَّا أَنْتَ وَاصْرِفْ عَنِّي سَيِّئَهَا لَا يَصْرِفُ عَنِّي سَيِّئَهَا إِلَّا أَنْتَ لَبَّيْكَ وَسَعْدَيْكَ وَالْخَيْرُ كُلُّهُ فِي يَدَيْكَ وَالشَّرُّ لَيْسَ إِلَيْكَ أَنَا بِكَ وَإِلَيْكَ تَبَارَكْتَ وَتَعَالَيْتَ أَسْتَغْفِرُكَ وَأَتُوبُ إِلَيْكَ
(నేను నా ముఖాన్ని ఏకాగ్రచిత్తంతో భూమ్యాకాశాలను సృష్టించిన వాని వైపునకు త్రిప్పుకుంటున్నాను. నేను బహుదైవారాధకులలోని వాడిని కాను. నా నమాజ్, నా ఖుర్బానీ, నా జీవనం మరియు నా మరణం సర్వ లోక ప్రభువైన అల్లాహ్ కే అంకితం. ఆయన సహవర్తులెవరూ లేనివాడు. నాకు దీని గురించిన ఆజ్ఞే ఇవ్వబడింది. నేను ముస్లింలలోని వాడిని. ఓ అల్లాహ్! నీవే యజమానివి. నీవే ఆరాధ్యుడవు. నీవు తప్ప మరో ఆరాధ్యుడు లేడు. నీవే నా ప్రభువువి. నేను నీ దాసుడిని. నేను నా ఆత్మకు అన్యాయం చేసుకున్నాను. నేను నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను. కనుక నా పాపాలన్నింటినీ మన్నించు. నీవు తప్ప పాపాలను మన్నిం చగల వాడెవడూ లేడు. నన్ను సêత్పవర్తన వైపునకు నడిపించు, సêత్పవర్తన వైపునకు మార్గదర్శకత్వం చూపేవాడు నీవు తప్ప ఎవ్వడూ లేడు. నా దుర్గుణాలను నా నుండి దూరం చెయ్యి. నన్ను దుర్గుణాల నుండి దూరం చేయువాడు నీ తప్ప ఎవ్వడూ లేడు. నీ సమక్షంలో హాజరవుతున్నాను. దీనిని నా అదృష్టంగా భావిస్తున్నాను. సర్వ మేళ్ళు నీ స్వాధీనంలో ఉన్నాయి. నీ తరఫు నుండి ఎన్నటికీ కీడు ఉండదు. నేను నీ వల్లనే ఉన్నాను. నీ వైపే మరలుతాను. నీవు శుభప్రదమైనవాడివి, ఉన్నతుడివి. పాపాల మన్నింపుకై నిన్నే వేడుకుంటున్నాను. పశ్చాత్తాప భావంతో నీ వైపునకే మరలుతున్నాను. (ముస్లిం 771).
8- రుకూలో చదవండి
1- సుబ్ హాన రబ్బియల్ అజీం سُبْحَانَ رَبِّيَ الْعَظِيم
(ఘనుడైన నా ప్రభువు పరిశుద్ధుడు).
పై దుఆ కనీసం ఒకసారైనా అనడం విధిగా ఉంది. అంతకు ఎక్కువగా అనడం ఉత్తమం.(ముస్లిం 773).
2- సుబ్ హానకల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దిక అల్లాహుమ్మగ్ ఫిర్లీ.
سُبْحَانَكَ اللَّهُمَّ رَبَّنَا وَبِحَمْدِكَ اللَّهُمَّ اغْفِرْلِي
(మా ప్రభువైన ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధునివి, నీకే స్తోత్రములు, ఓ అల్లాహ్ నన్ను మన్నించు). (బుఖారి 794, ముస్లిం 484).
3- సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలాఇకతి వర్రూహ్.
سُبُّوحٌ قُدُّوسٌ رَبُّ الْـمَلَائِكَةِ وَالرُّوحُ
(దైవదూతలు మరియు జిబ్రీల్ యొక్క ప్రభువు పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు). (ముస్లిం 487).
4- సుబ్ హాన జిల్ జబరూతి వల్ మలకూతి వల్ కిబ్రియాఇ వల్ అజమహ్.
سُبْحَانَ ذِي الجَبَرُوتِ وَالمَلَكُوتِ وَالْكِبرِيَاءِ وَالْعَظمَةِ
(సార్వభౌమాధికారి, సర్వాధిపతి, గొప్పవాడు మరియు ఘనుడు అయిన అల్లాహ్ ఎంతో పరిశుద్ధుడు).
(అబూదావూద్ 873, షేఖ్ అల్బానీ సహీ అని అన్నారు).
5- అల్లాహుమ్మ లక రకఅతు వ బిక ఆమంతు వ లక అస్లమ్ తు ఖషఅ లక సమ్ఈ వ బసరీ వ ముఖ్ఖీ వ అజమీ వ అసబీ.
اللَّهُمَّ لَكَ رَكَعْتُ وَبِكَ آمَنْتُ وَلَكَ أَسْلَمْتُ خَشَعَ لَكَ سَمْعِي وَبَصَرِيْ وَمُخِّي وَعَظَمِي وَعَصَبِي
(అల్లాహ్ నీ కొరకు రుకూ చేశాను. నిన్ను విశ్వసిం చాను. నీకే శిరసవహించాను. నా చెవులు, కళ్ళు, మెదడు, ఎముక మరియు నరాలు నీ కొరకే నమ్రత చూపుతున్నాయి). (ముస్లిం 771).
9- రుకూ నుండి నిలబడి చదవండి
1- రబ్బనా లకల్ హమ్ద్. رَبَّنَا لَكَ الحَمْد (బుఖారి 722).
లేదా – రబ్బనా వలకల్ హమ్ద్ رَبَّنَا وَلَكَ الحَمْد
(సర్వ స్తోత్రములు నీకే ఓ మా ప్రభువా). (బుఖారి 689, ముస్లిం 392).
లేదా – అల్లాహుమ్మ రబ్బనా లకల్ హమ్ద్. اللَّهُمَّ رَبَّنَا لَكَ الحَمْد (బుఖారి 796, ముస్లిం 404).
లేదా – అల్లాహుమ్మ రబ్బనా వలకల్ హమ్ద్. اللَّهُمَّ رَبَّنَا وَلَكَ الحَمْد
(ఓ అల్లాహ్! ఓ మా ప్రభువా! సర్వ స్తోత్రములు నీకే). (బుఖారి 795).
నోట్: కొందరు ‘రబ్బనా లకల్ హందు వష్షుక్ర్’ అని అంటారు. అయితే దీని ప్రస్తావన ఏ హదీసులో రాలేదు, (గనక దానిని వదలుకోవాలి).
2- అల్లాహుమ్మ రబ్బనా లకల్ హందు మిల్ అస్సమావాతి వ మిల్అల్ అర్జి వ మిల్అ మా బైనహుమా వ మిల్అ మా షిఅత మిన్ షైఇమ్ బఅదు.
اللَّهُمَّ رَبَّنَا لَكَ الْحَمْدُ مِلْءَ السَّمَاوَاتِ وَمِلْءَ الْأَرْضِ وَمِلْءَ مَا بَيْنَهُمَا وَمِلْءَ مَا شِئْتَ مِنْ شَيْءٍ بَعْدُ
(మా ప్రభువైన ఓ అల్లాహ్! ఆకాశాలు నిండిపోయేంత, భూమి నిండి పోయేంత, భూమ్యాకాశాల మధ్య నిండిపోయేంత మరియు ఆ తర్వాత నీవు కోరిన ప్రతీది నిండిపోయేంత ప్రశంసలు నీ కొరకే). (ముస్లిం 476).
3- రబ్బనా లకల్ హందు మిల్ఉస్సమావాతి వల్ అర్జి వ మిల్ఉ మా షిఅత మిన్ షైఇమ్ బఅదు అహ్ లస్సనాఇ వల్ మజ్ది అహఖ్ఖు మా ఖాలల్ అబ్దు వ కుల్లునా లక అబ్దున్, అల్లాహుమ్మ లా మానిఅ లిమా అఅతైత వ లా ముఅతియ లిమా మనఅత వలా యన్ ఫఉ జల్ జద్ది మిన్కల్ జద్దు. (ముస్లిం 477).
رَبَّنَا لَكَ الْحَمْدُ مِلْءُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمِلْءُ مَا شِئْتَ مِنْ شَيْءٍ بَعْدُ أَهْلَ الثَّنَاءِ وَالْمَجْدِ أَحَقُّ مَا قَالَ الْعَبْدُ وَكُلُّنَا لَكَ عَبْدٌ اللَّهُمَّ لَا مَانِعَ لِمَا أَعْطَيْتَ وَلَا مُعْطِيَ لِمَا مَنَعْتَ وَلَا يَنْفَعُ ذَا الْجَدِّ مِنْكَ الْجَدُّ
(భూమ్యాకాశాలు నిండిపోవునంత, ఆ తర్వాత నీవు కోరిన ప్రతీది నిండి- పోవునంత ప్రశంసలు నీ కొరకే ఓ మా ప్రభువా! ఘనతలకు, పొగడ్తలకు అధిపతి అయిన, దాసుడు పొగిడే దానికి నీవు అర్హుడవైనవాడా!. మేమందరమూ నీకే దాసులం. ఓ అల్లాహ్! నీవు ప్రసాదించే దానిని అడ్డుకునేవాడెవడూ లేడు. నీవు ఇవ్వని దానిని ఇచ్చేవాడూ లేడు. ఎవరి పెద్దరికం, ఐశ్వర్యం నీ శిక్ష ముందు వారికి లాభం చేకూర్చ లేవు).
4- రబ్బనా వలకల్ హందు హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్.
رَبَّنَا وَلَكَ الْحَمْدُ حَمْدًا كَثِيرًا طَيِّبًا مُبَارَكًا فِيهِ
(మా ప్రభువా! ఎనలేని ఉత్తమమైన, శుభప్రదమైన స్తోత్రములు నీకే).(బుఖారి 799).
10- సజ్దాలో చదవండి
1- సుబ్ హాన రబ్బియల్ అఅలా. سُبْحَانَ رَبِّيَ الأعلَى
(ఉన్నతుడైన నా ప్రభువు పరిశుద్ధుడు). (ముస్లిం 772).
ఒక్కసారి చదవడం విధిగా ఉంది. ఎక్కువ సార్లు చదవడం చాలా మంచిది.
2- సుబ్ హానకల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దిక అల్లాహుమ్ మగ్ఫిర్లీ.
سُبْحَانَكَ اللَّهُمَّ رَبَّنَا وَبِحَمْدِكَ اللَّهُمَّ اغْفِرْلِي
(మా ప్రభువైన ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధునివి, నీకే స్తోత్రములు, ఓ అల్లాహ్ నన్ను మన్నించు). (బుఖారి 794, ముస్లిం 484).
3- సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలా ఇకతి వర్రూహ్.
سُبُّوحٌ قُدُّوسٌ رَبُّ الْـمَلَائِكَةِ وَالرُّوحُ
(దైవదూతలు మరియు జిబ్రీల్ యొక్క ప్రభువు పరిశుద్ధుడు, పరమపవిత్రుడు). (ముస్లిం 487).
4- సుబ్ హాన జిల్ జబరూతి వల్ మలకూతి వల్ కిబ్రియాఇ వల్ అజమహ్
سُبْحَانَ ذِي الجَبَرُوتِ وَالمَلَكُوتِ وَالْكِبرِيَاءِ وَالْعَظْمَةِ
(సార్వభౌమాధికారి, సర్వాధిపతి, గొప్పవాడు మరియు ఘనుడు అయిన అల్లాహ్ ఎంతో పరిశుద్ధుడు
(అబూదావూద్ 873, నిసాయి 1049. అల్బానీ ఈ హదీసు సహీ అని అన్నారు).
5- అల్లాహుమ్మగ్ఫిర్లీ జంబీ కుల్లహూ దిఖ్ఖహూ వ జిల్లహు వ అవ్వలహూ వ ఆఖిరహూ వ అలానియతహూ వ సిర్రహూ.
اللَّهُمَّ اغْفِرْلِي ذَنْبِي كُلَّهُ دِقَّهُ وَجِلَّهُ وَأوَّلَهُ وَآخِرَهُ وَعَلَانِيَتَهُ وَسِرَّهُ
(ఓ అల్లాహ్! నా చిన్నా పెద్ద, ముందు వెనక, బహిర్గ తమైన, రహస్యమైన పాపాలన్నిటినీ క్షమించు). (ముస్లిం 483).
6- అల్లాహుమ్మ లక సజత్తు వ బిక ఆమంతు వ లక అస్లమ్ తు సజద వజ్ హియ లిల్లజీ ఖలకహు వ సవ్వరహు వ షక్క సమ్అహు వ బసరహు తబారకల్లాహు అహ్ సనుల్ ఖాలికీన్.
اللَّهُمَّ لَكَ سَجَدْتُ وَبِكَ آمَنْتُ وَلَكَ أَسْلَمْتُ سَجَدَ وَجْهِي لِلَّذِي خَلَقَهُ وَصَوَّرَهُ وَشَقَّ سَمْعَهُ وَبَصَرَهُ تَبَارَكَ اللَّهُ أَحْسَنُ الْخَالِقِينَ
(ఓ అల్లాహ్ నేను నీ కొరకు సజ్దా చేశాను, నిన్ను విశ్వసించాను, నీకే శిరసవహించాను, నా ముఖం దానిని సృష్టించిన, ఆకారం ఇచ్చిన, చెవి, కళ్ళు ఇచ్చిన అల్లాహ్ కు సజ్దా చేసింది. అతి ఉత్తమ సృష్టికర్త అయిన అల్లాహ్ చాలా శుభాలు కలవాడు). (ముస్లిం 771).
7- అల్లాహుమ్మ అఊజు బిరిజాక మిన్ సఖతిక వ బిముఆఫాతిక మిన్ ఉఖూబతిక వ అఊజు బిక మిన్క లా ఉహ్ సీ సనాఅన్ అలైక అంత కమా అస్నైత అలా నఫ్సిక.
اللَّهُمَّ أَعُوذُ بِرِضَاكَ مِنْ سَخَطِكَ وَبِمُعَافَاتِكَ مِنْ عُقُوبَتِكَ وَأَعُوذُ بِكَ مِنْكَ لَا أُحْصِي ثَنَاءً عَلَيْكَ أَنْتَ كَمَا أَثْنَيْتَ عَلَى نَفْسِكَ
(ఓ అల్లాహ్! నీ అప్రసన్నత నుండి నీ ప్రసన్నత శరణు, నీ శిక్ష నుండి నీ మన్నింపు శరణు కోరుతున్నాను. నిన్ను నీవు ఎలా స్తుతించుకున్నావో అలా నేను నీ స్తోత్రాలను లెక్కించలేను).(ముస్లిం 486).
సజ్దాలో ఉన్నప్పుడు ఎక్కువగా దుఆ చేయడం మంచిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం ఈ హదీసు ఆధారంగాః “దాసుడు తన ప్రభువుకు అత్యంత సమీపంగా ఉండేది సజ్దా స్థితిలో. అందుకు మీరు అందులో దుఆ ఎక్కు వగా చేయండి”. (ముస్లిం 482).
11- రెండు సజ్దాల మధ్యలో చదవండి
1- రబ్బిగ్ ఫిర్లీ, రబ్బిగ్ ఫిర్లీ. رَبِّ اغْفِرْ لِي ، رَبِّ اغْفِرْ لِي
(ప్రభువా నా పాపాలను మన్నించు). (అబూదావూద్ 874).
2- అల్లాహుమ్ మగ్ఫిర్లీ వర్ హమ్నీ వ ఆఫినీ వహ్ దినీ వర్ జుఖ్నీ
اللَّهُمَّ اغْفِرْلِي وَارْحَمْنِي وَعَافِنِي وَاهْدِنِي وَارْزُقْنِي
(ఓ అల్లాహ్ నన్ను క్షమించు, కరుణించు, నాకు స్వస్తత, సన్మార్గం మరియు ఆహారం ప్రసాదించు). (అబూదావూద్ 850).
12- తషహ్హుద్ లో చదవండి
అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వరహ్మతుల్లాహి వబరకాతుహూ అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహిస్సాలిహీన్ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహు. (బుఖారి 831).
التَّحِيَّاتُ لله وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ الله وَبَرَكَاتُهُ السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ الله الصَّالِحِينَ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه
(నా వాక్కు, దేహా, ధన సంబంధమైన ఆరాధనలన్ని యూ అల్లాహ్ కొరకే ఉన్నవి. ఓ ప్రవక్తా! మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆయన శుభాలు కురువుగాకా. అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు, సందేశహరుడని సాక్ష్యమిస్తున్నాను).
అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రా హీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదు మ్మజీద్. (బుఖారి 3370).
اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ اللَّهُمَّ بَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا بَارَكْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ
(ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీంను, వారి కుటుంబీకులను కరుణించినట్లు ముహమ్మద్ మరియు వారి కుటుంబీకులను కరుణించు. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి. ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీం, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేసినట్లు ముహమ్మద్, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేయుము. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి.).
13- తషహ్హుద్ తర్వాత చదవండి
1- అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ అజా బిల్ ఖబ్రి వమిన్ అజాబిన్నారి వమిన్ ఫిత్నతి ల్ మహ్ యా వల్ మమాతి వమిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాల్.
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ وَمِنْ عَذَابِ النَّارِ وَمِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ وَمِنْ فِتْنَةِ الْمَسِيحِ الدَّجَّالِ
(ఓ అల్లాహ్! సమాధి శిక్ష నుండి, నరక యాతన నుండి, జీవన్మర ణాల విపత్తు నుండి మరియు మసీహుద్దజ్జాల్ ఉపద్రవం నుండి నీ శరణు వేడుచున్నాను.) (బుఖారి 1377, ముస్లిం 588).
2- అల్లాహుమ్మ ఇన్నీ జలమ్తు నఫ్సీ జుల్మన్ కసీరవ్ వలా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత ఫగ్ఫిర్లీ మగ్ఫిరతమ్ మిన్ ఇందిక వర్ హమ్నీ ఇన్నక అంతల్ గఫూరుర్రహీం.
اللَّهُمَّ إِنِّي ظَلَمْتُ نَفْسِي ظُلْمًا كَثِيرًا وَلَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ فَاغْفِرْ لِي مَغْفِرَةً مِنْ عِنْدِكَ وَارْحَمْنِي إِنَّك أَنْتَ الْغَفُورُ الرَّحِيمُ
(ఓ అల్లాహ్ నా ఆత్మకు నేను చాలా అన్యాయం చేసు కున్నాను. నీవు తప్ప పాపాలను క్షమించేవారు మరెవ్వరూ లేరు. నీవు నీ ప్రత్యేక అనుగ్రహంతో నన్ను క్షమించు, నా మీద దయచూపు, నిశ్చ యంగా నీవు క్షమించే- వాడవు, కరుణామయుడవు). (బుఖారి 834).
3- అల్లాహుమ్ మగ్ఫిర్లీ మా ఖద్దమ్తు వమా అఖ్ఖర్తు వమా అస్ రర్తు వమా అఅలన్తు వమా అస్ రఫ్తు వమా అంత అఅలము బిహీ మిన్నీ అంతల్ ముఖద్దిము వ అంతల్ ముఅఖ్ఖిరు లా ఇలాహ ఇల్లా అంత.
اللَّهُمَّ اغْفِرْ لِي مَا قَدَّمْتُ وَمَا أَخَّرْتُ وَمَا أَسْرَرْتُ وَمَا أَعْلَنْتُ وَمَا أَسْرَفْتُ وَمَا أَنْتَ أَعْلَمُ بِهِ مِنِّي أَنْتَ الْمُقَدِّمُ وَأَنْتَ الْمُؤَخِّرُ لَا إِلَهَ إِلَّا أَنْتَ
(అల్లాహ్! నా పూర్వ పాపాలను, జరగబోయే పాపాలను, రహస్యంగా చేసిన పాపాలను, బహిరంగంగా చేసిన పాపాలను మరియు నా మితిమీరినతనాన్ని కూడా క్షమించు. మరికొన్ని పాపాలు ఉండవచ్చు, వాటి గురించి నా కంటే ఎక్కువ నీకే బాగా తెలుసు, వాటిని కూడా నీవు క్షమించు. ముందుకు నడిపించేవాడివి, వెనక్కి నెట్టేవాడివి నీవే. నీవు తప్ప వెరొక ఆరాధ్యుడు లేడు).
4- అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ అజ్ జి వల్ కసలి వల్ జుబ్ని వల్ హరమి వల్ బుఖ్ లి వ అఊజు బిక మిన్ అజాబిల్ ఖబ్రి వమిన్ ఫిత్నతిల్ మహ్ యా వల్ మమాత్.
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ الْعَجْزِ وَالْكَسَلِ وَالْجُبْنِ وَالْهَرَمِ وَالْبُخْلِ وَأَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ وَمِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ
(ఓ అల్లాహ్ (మంచి పనులు) చేయలేకపోవటం నుంచి, శక్తి ఉండ కూడా సోమరితనానికి లోనవటం నుంచి, పిరికితనం నుంచి, నికృష్టమైన వృద్ధాప్యం నుంచి నీ శరణు కోరుతున్నాను. ఇంకా సమాధి శిక్ష నుండి మరియు జీవన్మరణాల ఉపద్రవం నుంచి నీ శరణు కోరుతున్నాను). (ముస్లిం 2706, బుఖారి 2823).
14- సలాంకు ముందు ఎక్కువ దుఆ చేయాలి
అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఓ హదీసులో తషహ్హుద్ దుఆ నేర్పుతూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: “ఆ తర్వాత తనకిష్టమైన దుఆ చేసుకోవాలి”. (బుఖారి 835).
15- నమాజ్ తర్వాత జిక్ర్
1-అస్తగ్ ఫిరుల్లాహ్ , అస్తగ్ ఫిరుల్లాహ్, అస్తగ్ ఫిరుల్లాహ్, అల్లాహుమ్మ అంతస్సలాం వమిన్కస్స లాం తబారక్త యాజల్ జలాలి వల్ ఇక్రామ్.
اَسْتَغْفِرُ الله ، اَسْتَغْفِرُ الله ، اَسْتَغْفِرُ الله ، اَللهُمَّ أَنْتَ السَّلامُ ومِنْكَ السَّلامُ تَبَارَكْتَ يَا ذَا الجَلالِ وَ الإكْرَام.
(అల్లాహ్ నీ క్షమాభిక్ష కోరుతున్నాను… అల్లాహ్ నీవే సలాం. శాంతి నీ నుండి లభిస్తుంది. ఔన్నత్యం, గొప్ప దనాలు గలవాడా నీవు గొప్ప శుభాలు కలవాడివి). (ముస్లిం 592).
2- లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ అల్లాహుమ్మ లా మానిఅ లిమా అఅతైత వలా ముఅతియ లిమా మనఅత వలా యన్ ఫఉ జల్ జద్ది మిన్కల్ జద్దు. (బుఖారి 844).
لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ اللَّهُمَّ لَا مَانِعَ لِمَا أَعْطَيْتَ وَلَا مُعْطِيَ لِمَا مَنَعْتَ وَلَا يَنْفَعُ ذَا الْجَدِّ مِنْكَ الْجَدُّ
(అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన ఏకైకుడు, సాటిలేనివాడు. విశ్వసామ్రాజ్యం ఆయనదే. స్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయన సర్వాధికారుడు. ఓ అల్లాహ్! నీవు ప్రసాదించే దానిని అడ్డుకునే- వాడెవడూ లేడు. నీవు ఇవ్వని దానిని ఎవ్వడూ ఇవ్వలేడు. ఎవరి పెద్దరికం, ఐశ్వర్యం నీ శిక్ష ముందు వారికి లాభం చేకూర్చ లేవు). (ముస్లిం 593).
3- లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహి లాఇలాహ ఇల్లల్లాహు వలా నఅబుదు ఇల్లా ఇయ్యాహు లహున్నిఅమతు వలహుల్ ఫజ్లు వలహుస్స నాఉల్ హసన్ లా ఇలాహ ఇల్లల్లాహు ముఖ్లి సీన లహుద్దీన వలౌ కరిహల్ కాఫిరూన్. (ముస్లిం 594).
لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللَّهِ لَا إِلَهَ إِلَّا اللهُ وَلَا نَعْبُدُ إِلَّا إِيَّاهُ لَهُ النِّعْمَةُ وَلَهُ الْفَضْلُ وَلَهُ الثَّنَاءُ الْحَسَنُ لَا إِلَهَ إِلَّا اللهُ مُخْلِصِينَ لَهُ الدِّينَ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ
(అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన ఏకైకుడు, సాటిలేనివాడు. విశ్వసామ్రాజ్యం ఆయనదే. స్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయన సర్వాధికారుడు. పుణ్యాలు చేసే, పాపాల నుండి దూరముండే భాగ్యం అల్లాహ్ యే ప్రసాదించువాడు, ఆ అల్లాహ్ తప్ప వెరొక ఆరాధ్యుడు లేడు. మేము ఆయన్నే ఆరాధిస్తాము. వరాలు, అనుగ్రహాలు ఆయన ప్రసాదించినవే. మంచి స్తోత్రాలు ఆయనకే శోభిస్తాయి. అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. సత్యతిరస్కారులకు ఎంత అయిష్టకరంగా ఉన్నా సరే మేము మా ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకున్నాము).
ఆ తర్వాత సుబ్ హానల్లాహ్ 33 సార్లు, అల్ హందులిల్లాహ్ 33 సార్లు, అల్లాహు అక్బర్ 33 సార్లు అనాలి. వంద పూర్తి చేయుటకు ఒక్కసారి అనాలిః “లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్“. (ముస్లిం 597).
16- జనాజ నమాజులోని దుఆ
అల్లాహుమ్ మగ్ఫిర్ లహూ వర్ హమ్ హు వ ఆఫిహీ వఅఫు అన్ హు వ అక్రిమ్ నుజులహూ వ వస్సిఅముద్ ఖలహూ వగ్సిల్ హు బిల్ మాఇ వస్సల్జి వల్ బర్ది వ నఖ్ఖిహి మినల్ ఖతాయా కమా యునఖ్ఖస్ సౌబుల్ అబ్ యజు మినద్దనసి వ అబ్దిల్ హు దారన్ ఖైరమ్ మిన్ దారిహీ వ అహ్లన్ ఖైరమ్మిన్ అహ్లిహీ వ జౌజన్ ఖైరమ్మిన్ జౌజిహీ వ అద్ ఖిల్ హుల్ జన్నత వ అఇజ్ హు మిన్ అజాబిల్ ఖబ్రి వ అజాబిన్నార్. (ముస్లిం 963).
اللَّهُمَّ اغْفِرْ لَهُ وَارْحَمْهُ وَعَافِهِ وَاعْفُ عَنْهُ وَأَكْرِمْ نُزُلَهُ وَوَسِّعْ مُدْخَلَهُ وَاغْسِلْهُ بِالْمَاءِ وَالثَّلْجِ وَالْبَرَدِ وَنَقِّهِ مِنْ الْخَطَايَا كَمَا نَقَّيْتَ الثَّوْبَ الْأَبْيَضَ مِنْ الدَّنَسِ وَأَبْدِلْهُ دَارًا خَيْرًا مِنْ دَارِهِ وَأَهْلًا خَيْرًا مِنْ أَهْلِهِ وَزَوْجًا خَيْرًا مِنْ زَوْجِهِ وَأَدْخِلْهُ الْجَنَّةَ وَأَعِذْهُ مِنْ عَذَابِ الْقَبْرِ أَوْ مِنْ عَذَابِ النَّارِ
(అల్లాహ్ ఇతడ్ని క్షమించు, ఇతనిని కరుణించు, శిక్ష నుండి కాపాడు, మన్నించు, ఇతడ్ని ఆదరించి మర్యాద చెయ్యి, ఇతని సమాధిని విశాల పరచు, ఇతడ్ని నీళ్ళతో, మంచుతో, వడగళ్ళతో కడిగి తెల్లని వస్త్రాన్ని మురికి లేకుండా శుభ్రం చేసినట్లు పాపాల నుండి ఇతన్ని పరిశుభ్రం చెయ్యి. ఇతనికి ఇహలోకపు ఇల్లు కన్నా మంచి ఇల్లునీ, ఇహలోకపు పరివారంకన్నా ఉత్తమ పరివారాన్నీ, ఇహలోకపు జంటకంటే మంచి జంట ఇవ్వు. ఇతన్ని స్వర్గంలోకి ప్రవేశింపజెయ్యి. సమాధి శిక్ష నుండి, అగ్ని శిక్ష నుండి కాపాడు).
17- విత్ర్ నమాజ్ తర్వాత చదవండి
సుబ్ హానల్ మలికిల్ ఖుద్దూస్. سُبْحَانَ المَلِكُ القُدُّوس
(పరిశుద్ధుడైన చక్రవర్తి పరమపవిత్రుడు). (నిసాయీ 1729).
ముడూ సార్లు అనాలి. మూడవసారి శబ్దాన్ని కొంచెం పెంచాలి.
18- ఇస్తిఖార నమాజు యొక్క దుఆ
(ఏదైనా పని గురించి ఆలోచించి, ఎలా చేస్తే మేలుంటుంది అనుకున్నప్పుడు ఏ ఒక నిర్ణయానికి రాక ముందు ఫర్జ్ నమాజు కాకుండా రెండు రకాతుల నఫిల్ నమాజు చేసి సలాంకు ముందు తషహ్హుద్ చివరిలో లేదా సలాం తింపిన తర్వాత ఈ క్రింది దుఆ చేయవలెను. అయితే “అన్న హాజల్ అమ్ర” అన్న చోట తన అవసరాన్ని గురించి ఆలోచించుకోవాలి, లేదా అవసరాన్ని ప్రస్తావించాలి).
అల్లాహుమ్మ ఇన్నీ అస్తఖీరుక బిఇల్మిక వ అస్తఖ్దిరుక బి ఖుద్రతిక వ అస్అలుక మిన్ ఫజ్లికల్ అజీం ఫఇన్నక తఖ్దిరు వలా అఖ్దిరు వ తఅలము వలా అఅలము వ అంత అల్లాముల్ గుయూబ్, అల్లాహుమ్మ ఇన్ కుంత తఅలము అన్న హాజల్ అమ్ర ఖైరుల్లీ ఫీ దీనీ వ మఆషీ వ ఆఖిబతి అమ్రీ ఔ ఖాల ఆజిలి అమ్రీ వ ఆజిలిహీ ఫఖ్దుర్ హు లీ వ యస్సిర్ హు లీ సుమ్మ బారిక్ లీ ఫీహి వ ఇన్ కుంత తఅలము అన్న హాజల్ అమ్ర షర్రుల్లీ ఫీ దీనీ వ మఆషీ వ ఆఖిబతి అమ్రీ ఔ ఖాల ఫీ ఆజిలి అమ్రీ వ ఆజిలిహీ ఫస్రిఫ్ హు అన్నీ వస్రిఫ్ నీ అన్హు వఖ్ దుర్ లియల్ ఖైర హైసు కాన సుమ్మ అర్జినీ బిహీ.
اللَّهُمَّ إِنِّي أَسْتَخِيرُكَ بِعِلْمِكَ وَأَسْتَقْدِرُكَ بِقُدْرَتِكَ وَأَسْأَلُكَ مِنْ فَضْلِكَ الْعَظِيمِ فَإِنَّكَ تَقْدِرُ وَلَا أَقْدِرُ وَتَعْلَمُ وَلَا أَعْلَمُ وَأَنْتَ عَلَّامُ الْغُيُوبِ اللَّهُمَّ إِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الْأَمْرَ خَيْرٌ لِي فِي دِينِي وَمَعَاشِي وَعَاقِبَةِ أَمْرِي أَوْ قَالَ عَاجِلِ أَمْرِي وَآجِلِهِ فَاقْدُرْهُ لِي وَيَسِّرْهُ لِي ثُمَّ بَارِكْ لِي فِيهِ وَإِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الْأَمْرَ شَرٌّ لِي فِي دِينِي وَمَعَاشِي وَعَاقِبَةِ أَمْرِي أَوْ قَالَ فِي عَاجِلِ أَمْرِي وَآجِلِهِ فَاصْرِفْهُ عَنِّي وَاصْرِفْنِي عَنْهُ وَاقْدُرْ لِي الْخَيْرَ حَيْثُ كَانَ ثُمَّ أَرْضِنِي به
(అల్లాహ్! నీ జ్ఞానంతో నేను శుభాలను అడుగుతున్నాను. నీ అధికార సాయంతో శక్తిని ప్రసాదించమని కోరుతున్నాను. మహోత్తరమైన నీ అనుగ్రహాన్ని ప్రసాదించమని అభ్యర్తిస్తున్నాను. నిశ్చయంగా నువ్వు అధికారం గలవాడివి. నాకు ఎలాంటి అధికారమూ లేదు. నీకు అన్నీ తెలుసు, నాకు ఏమీ తెలియదు. అగోచర జ్ఞానివి నీవే. అల్లాహ్! నీ జ్ఞానం ప్రకారం ఈ పని ధార్మి కంగా, ప్రాపంచికంగా, పరలోక పరిణామం రీత్యా (లేదా) త్వరగా లేక ఆలస్యంగా నాకు ప్రయోజనకరమైతే దాన్ని నా అదృష్టంలో ఉంచు. దాని సాధనను నా కొరకు సులభతరం చెయ్యి. దాన్ని నా కొరకు శుభప్రదమైనదిగా చెయ్యి. కాని ఒకవేళ నీ జ్ఞానం ప్రకారం ఈ పని ధార్మికంగా, ప్రాపంచికంగా, పరలోక పరిణామం రీత్యా (లేదా) త్వరగా గానీ, ఆలస్యంగా గానీ నాకు నష్టం కలిగించేదయితే దాన్ని నా నుండి దూరంగా ఉంచు. దాని బారి నుండి నన్ను కాపాడు. సాఫల్యం ఎక్కడున్నాసరే దాన్ని నా అదృష్టంగా మలచు. ఆ తర్వాత నా మనసు దానిపై కుదుటపడేలా చెయ్యి) (బుఖారి 1166).
You must be logged in to post a comment.