https://youtu.be/6jFp9k6LsDc [2 నిమిషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
తెలుగుఇస్లాం.నెట్ * తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద *
మరణాంతర జీవితం – పార్ట్ 26 D నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[6 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ప్రవక్త ﷺ చెప్పగా విన్నానంటూ ఆయిషా (రదియల్లాహు అన్హా)ఉల్లేఖించారు:
إِنَّ الْـمُؤْمِنَ لَيُدْرِكُ بِحُسْنِ خُلُقِهِ دَرَجَاتِ قَائِمِ اللَّيْلِ، صَائِمِ النَّهَارِ
“నిశ్చయంగా విశ్వాసుడు తన ఉత్తమ నడవడిక ద్వారా రాత్రంతా ఆరాధన చేసే, పగలంతా ఉపవాసముండే వారి స్థానాలకు చేరుకుంటాడు”.
(ముస్నద్ అహ్మద్ పదాలు 24355, అబూదావూద్ 4798, అల్బానీ సహీహుల్ జామి 1620లో సహీ అన్నారు).
దీని వ్యాఖ్యానంలో అబుత్తయ్యిబ్ షమ్సుల్ హఖ్ అజీమాబాదీ (రహిమహుల్లాహ్) ఔనుల్ మఅ’బూద్ లో ఇలా చెప్పారుః
ఉత్తమ నడవడిక గల వ్యక్తికి ఇంతటి గొప్ప ఘనత ఎందుకు ఇవ్వబడిదంటే; ‘సాయిమ్’ (ఉపవాసం ఉండేవాడు), ‘ఖాయిమ్’ (రాత్రి నమాజు చేసేవాడు), తమ మనోవాంఛలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు, కాని ఉత్తమ నడవడిక అవలంబించే వ్యక్తి విభిన్న తత్వాలు, గుణాలు గల ప్రజలతో పోరాడుతూ ఉంటాడు అందుకే అతను సాయిమ్, ఖాయిమ్ ల స్థానాలను అందుకుంటాడు. ఇలా వారు స్థానంలో సమానులవుతారు, ఒకప్పుడు వీరే ఎక్కువ స్థానం పొందుతారు.
(ఔనుల్ మఅ’బూద్ షర్హు సునన్ అబీ దావూద్ 13/ 154, హదీసు నంబర్ 4798).
ప్రజలతో మంచి విధంగా వ్యవహరించడం, వారికి ఏ కష్టం కలిగించకుండా ఉండడమే ఉత్తమ నడవడిక, సద్వర్తన.
నిశ్చయంగా మనిషికి విశ్వాసం తర్వాత సద్వర్తన కంటే ఉత్తమమైన మరే విషయం ఇవ్వబడలేదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ ప్రభువుతో ఉత్తమ నడవడిక ప్రసాదించమని అర్థించేవారు. జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)అలైహి వసల్లం అల్లాహు అక్బర్ అని నమాజు ప్రారంభించాక ఇలా చదివేవారు:
إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لله رَبِّ الْعَالَمِينَ لَا شَرِيكَ لَهُ، وَبِذَلِكَ أُمِرْتُ وَأَنَا مِنَ الْـمُسْلِمِينَ. اللَّهُمَّ اهْدِنِي لِأَحْسَنِ الْأَعْمَالِ وَأَحْسَنِ الْأَخْلَاقِ لَا يَهْدِي لِأَحْسَنِهَا إِلَّا أَنْتَ، وَقِنِي سَيِّئَ الْأَعْمَالِ وَسَيِّئَ الْأَخْلَاقِ لَا يَقِي سَيِّئَهَا إِلَّا أَنْتَ
ఇన్న సలాతీ వ నుసుకీ వ మహ్ యాయ వ మమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, లాషరీక లహూ వ బిజాలిక ఉమిర్తు వ అన మినల్ ముస్లిమీన్, అల్లాహుమ్మహ్ దినీ లిఅహ్సనిల్ అఅ’మాలి వ అహ్సనిల్ అఖ్లాక్, లా యహ్ దీ లి అహ్సనిహా ఇల్లా అంత, వ ఖినీ సయ్యిఅల్ అఅమాలి వ సయ్యిఅల్ అఖ్లాక్, లా యఖీ సయ్యిఅహా ఇల్లా అంత.
(భావం: నిశ్చయంగా నా నమాజ్, నా ఖుర్బానీ (బలిదానం), నా జీవన్మరణాలు సర్వ లోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే, ఆయనకు ఎవడూ భాగస్వామి లేడు. ఈ ఆదేశమే నాకు ఇవ్వబడినది, నేను ముస్లిములోని వాడిని. ఓ అల్లాహ్! నాకు సత్పవర్తన మరియు సదాచరణ వైపునకు మార్గదర్శకత్వం చేయు, వాటి వైపునకు మార్గదర్శకత్వం చూపేవాడు నీ తప్ప ఎవ్వడూ లేడు. నన్ను దుష్పవర్త మరియు దుష్కార్యాల నుండి కాపాడు. నన్ను వాటి నుండి కాపాడేవాడు నీ తప్ప ఎవ్వడూ లేడు).
(ముస్లిం 771, తిర్మిజి 3421, నిసాయి 897 హదీసు పదాలు).
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అద్దంలో చూసినప్పుడల్లా ఇలాగే దుఆ చేసేవారు. ఇబ్ను మస్ఊద్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః ప్రవక్త ﷺ అద్దంలో చూసినప్పుడల్లా ఇలా అనేవారుః
اللَّهُمَّ كَمَا حَسَّنْتَ خَلْقِي فَحَسِّنْ خُلُقِي
అల్లాహుమ్మ కమా హస్సన్ త ఖల్కీ హస్సిన్ ఖులుకీ
“ఓ అల్లాహ్! నీవు నా సృష్టిని (ఆకారాన్ని) సరిదిద్దినట్లు నా నడవడికను కూడా సరిదిద్దు”.
(ఇబ్ను హిబ్బాన్ 959, అహ్మద్ 1/ 403, అబూ యాలా 5075, తయాలిసి 374, తబ్రానీ ఫిద్దుఆ 368, అఖ్లాఖున్నబీః అబుష్షేఖ్ అల్ అస్బహానీ 493, సహీహుల్ జామిః అల్బానీ 1307).
సద్వర్తన గల వ్యక్తి ప్రజల్లో ప్రవక్తకు అతిప్రియుడైనవాడు మరియు ప్రళయదినాన ఆయనకు సమీపాన కూర్చుండేవాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారని జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
إِنَّ مِنْ أَحَبِّكُمْ إِلَيَّ وَأَقْرَبِكُمْ مِنِّي مَجْلِسًا يَوْمَ القِيَامَةِ أَحَاسِنَكُمْ أَخْلَاقًا
“నిశ్చయంగా మీలో నాకు అతి ప్రియమైనవాడు మరియు ప్రళయదినాన మీలో నాకు అతి సమీపంగా కూర్చుండేవాడు మీలో అందరికన్నా ఉత్తమ నడవడిక గలవాడు”.
(తిర్మిజి 2018, తబ్రానీ కబీర్ 10424, అదబుల్ ముఫ్రద్: బుఖారీ 272, అల్బానీ సహీహుత్తర్గబ్ 2649లో సహీ అన్నారు).
అల్లాహ్ ఉత్తమ నడవడిక గల వ్యక్తికి, సత్ఫలితార్థం మరియు గౌరవార్థం ఉన్నతస్వర్గంలో ఒక కోట (మంచి ఇల్లు) ప్రసాదిస్తాడు. ప్రవక్త ﷺ సెలవిచ్చారని అబూ ఉమామ బాహిలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
أَنَا زَعِيمٌ بِبَيْتٍ فِي رَبَضِ الْجَنَّةِ لِمَنْ تَرَكَ الْمِرَاءَ وَإِنْ كَانَ مُحِقًّا، وَبِبَيْتٍ فِي وَسَطِ الْجَنَّةِ لِمَنْ تَرَكَ الْكَذِبَ وَإِنْ كَانَ مَازِحًا وَبِبَيْتٍ فِي أَعْلَى الْجَنَّةِ لِمَنْ حَسَّنَ خُلُقَهُ
“నేను బాధ్యత వహిస్తున్నాను స్వర్గం పరిసరాల్లో ఒక గృహం ఇప్పించాడానికి ఎవరైతే ధర్మం తన వైపు ఉన్నప్పటికి వివాదాన్ని విడనాడుతాడో మరియు స్వర్గం మధ్యలో ఒక గృహం ఇప్పంచడానికి ఎవరైతే పరిహాసానికైనా అబద్ధం పలకనివానికి. ఇంకా స్వర్గంలో ఎత్తైన ప్రదేశంలో ఒక గృహం ఇప్పించడానికి ఎవరైతే తమ నడవడికను సరిదిద్దుకుంటారో”.
(అబూదావూద్ పదాలు 4800, బైహఖీ 20965, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 1464లో హసన్ అన్నారు).
నీ ఉత్తమ నడవడిక అనేది నీకు దూర సంబంధికులైన వారి వరకే పరిమితమయి, నీ దగ్గరి సంబంధికులను మరచిపోవడం సమంజసం కాదు. అది నీ తల్లిదండ్రులు, నీ కుటుంబికులకు వ్యాపించి ఉండాలి. కొందరు ప్రజల పట్ల ఉల్లాసంగా, విశాల హృదయం మరియు సద్వర్తనతో ఉంటారు, అదే వారి భార్య పిల్లలతో వాటికి భిన్నంగా ఉంటారు.
—
తహజ్జుద్ కు సరిసమానమైన సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1yihDY9sySKSVkKwefBXfS
త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం & ముందు వీడియో పాఠాలు ]
https://teluguislam.net/books/deeds-heavy-meezan
త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://bit.ly/3xYzpbN
మరణానంతర జీవితం – యూట్యూబ్ – ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3hWrEGNnzcmMZV3PtDByJH
మరణాంతర జీవితం – పార్ట్ 26 C నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[5 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
2:285 آمَنَ الرَّسُولُ بِمَا أُنزِلَ إِلَيْهِ مِن رَّبِّهِ وَالْمُؤْمِنُونَ ۚ كُلٌّ آمَنَ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّن رُّسُلِهِ ۚ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا ۖ غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ الْمَصِيرُ
ఆమనర్రసూలు బిమా ఉన్‌జిల ఇలైహి మిర్రబ్బీహీ్ వల్ మువ్ మి నూన్ కుల్లున్ ఆమన బిల్లాహి వమలాయికతిహీ వకుతుబిహీ వరుసులిహ్ లా నుఫర్రిఖు బైన అహది మ్మిర్రుసులిహ్ వఖాలూ సమిఅ్ నా వఅతఅ్ నా గుఫ్‌రానక రబ్బనా వ ఇలైకల్ మసీర్
తన ప్రభువు తరఫున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా (సత్యమని నమ్మారు). వారంతా అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. “మేము ఆయన (పంపిన) ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణను, భేదభావాన్నీ పాటించము” (అని వారు చెబుతారు). “మేము విన్నాము. విధేయులం అయ్యాము. మా ప్రభూ! మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము. కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే” అని అంటారు.
2:286 لَا يُكَلِّفُ اللَّهُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۚ لَهَا مَا كَسَبَتْ وَعَلَيْهَا مَا اكْتَسَبَتْ ۗ رَبَّنَا لَا تُؤَاخِذْنَا إِن نَّسِينَا أَوْ أَخْطَأْنَا ۚ رَبَّنَا وَلَا تَحْمِلْ عَلَيْنَا إِصْرًا كَمَا حَمَلْتَهُ عَلَى الَّذِينَ مِن قَبْلِنَا ۚ رَبَّنَا وَلَا تُحَمِّلْنَا مَا لَا طَاقَةَ لَنَا بِهِ ۖ وَاعْفُ عَنَّا وَاغْفِرْ لَنَا وَارْحَمْنَا ۚ أَنتَ مَوْلَانَا فَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ
లాయుకల్లిఫుల్లాహు నఫ్ సన్ ఇల్లా వుస్ అహా లహా మా కసబత్ వ అలైహా మక్‌తసబత్ రబ్బనా లాతు ఆఖిజ్‌నా ఇన్నసీనా అవ్ అఖ్‌తానా రబ్బనా వలా తహ్‌మిల్ అలైనా ఇస్‌రన్ కమా హమల్ తహూ అలల్లజీన మిన్ ఖబ్‌లినా రబ్బనా వలా తుహమ్మిల్‌నా మాలా తాఖతలనా బిహ్ వఅ్ ఫు అన్నా వగ్‌ఫిర్ లనా వర్‌హమ్‌నా అంత మౌలానా ఫన్‌సుర్‌నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్
అల్లాహ్ ఏ ప్రాణిపైనా దాని శక్తికి మించిన భారం వేయడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవి చూస్తుంది. (ఇలా ప్రార్థిస్తూ ఉండండి): “ఓ మా ప్రభూ! మేము మరచిపోయినా, లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు. మా ప్రభూ! మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. మా ప్రభూ! మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదలిపెట్టు. మాకు క్షమాభిక్ష పెట్టు. మాపై దయజూపు. నీవే మా సంరక్షకుడవు. అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు.”
ప్రవక్త ﷺ ఇలా తెలిపారని అబూ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః
مَنْ قَرَأَ بِالْآيَتَيْنِ مِنْ آخِرِ سُورَةِ البَقَرَةِ فِي لَيْلَةٍ كَفَتَاهُ
“ఎవరు రాత్రి వేళ సూర బఖరలోని చివరి రెండు ఆయతులు పఠిస్తారో అతనికి అవే చాలు”.
(బుఖారి 5010 పదాలు, ముస్లిం 807).
ఇమాం నవవీ (రహిమహుల్లాహ్) చెప్పారుః అవి సరిపోతాయి అంటే తహజ్జుద్ కు బదులుగా సరిపోతాయి అని భావం. షైతాన్ నుండి, ఆపదల నుండి రక్షణకై అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా కావచ్చు. (సహీ ముస్లిం షర్హ్ నవవీ 6/ 340, హ.న. 807)
ఇబ్ను హజర్ (రహిమహుల్లాహ్) పై అభిప్రాయాలకు/ భావాలకు మద్దతు ఇస్తూ ఇలా చెప్పారుః దీనిపై నేను ఇలా అంటానుః పైన పేర్కొనబడిన భావాలన్నియు సరియైనవి కావచ్చు. – అల్లాహ్ యే అందరికంటే ఎక్కువ తెలిసినవాడు- కాని మొదటి భావం గురించి మరో స్పష్టమైన ఉల్లేఖనం ఉంది, అది ఆసిం ద్వారా, అల్ ఖమాతో, ఆయన అబూ మస్ఊద్ తో, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పినట్లు తెలిపారు.
مَن قَرَأخَاتِمة الْبَقَرَةِ أَجْزَأَتْ عَنْهُ قِيَامَ لَيْلَةٍ
“ఎవరు సూర బఖరలోని చివరి ఆయతులు పఠిస్తారో అవి అతని వైపు నుండి తహజ్జుద్ కు బదులుగా సరిపోతాయి”.
(ఫత్హుల్ బారీ బిషర్హి సహీహిల్ బుఖారిః ఇబ్ను హజ్ర్ అస్ఖలానీ 8/ 673, హ.న. 5010).
ఈ రెండు ఆయతుల పారాయణం చాలా సులువైన విషయం, అనేక మంది వాటిని కంఠస్తం చేసి ఉంటారు అల్ హందులిల్లాహ్. ముస్లిం వ్యక్తి ప్రతి రాత్రి వాటిని క్రమం తప్పకుండా చదివే ప్రయత్నం చేయాలి. ఇవి సులువుగా ఉన్నాయని కేవలం వీటినే పట్టుకొని, తహజ్జుద్ కు ఉన్నటువంటి పుణ్యం గల ఇతర సత్కార్యాలను వదలకూడదు. ఎందుకనగా విశ్వాసి సాధ్యమైనంత వరకు ఎక్కువ పుణ్యాలు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఏ సత్కార్యం అంగీకరించబడుతుందనేది కూడా అతనికి తెలియదు.
అబ్దుల్లాహ్ బిన్ ఉమైర్ (రహిమహుల్లాహ్) చెప్పారుః అల్లాహ్ విధేయతకు సంబంధించిన విషయాల్లో, ఏదో అతి నీచమైన పని చేస్తున్నట్లుగా అతి సులువైన విషయాలతోనే సరిపుచ్చుకోకు. అలా కాకుండా ఎంతో ఆనందంతో, సంపూర్ణ కాంక్షతో కఠోరంగా శ్రమించే ప్రయత్నం చేయి. (హిల్యతుల్ ఔలియా…: అబూ నుఐమ్ 3/ 354).
—
తహజ్జుద్ కు సరిసమానమైన సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1yihDY9sySKSVkKwefBXfS
త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం & ముందు వీడియో పాఠాలు ]
https://teluguislam.net/books/deeds-heavy-meezan
త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://bit.ly/3xYzpbN
మరణానంతర జీవితం – యూట్యూబ్ – ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3hWrEGNnzcmMZV3PtDByJH
మరణాంతర జీవితం – పార్ట్ 26 B నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ప్రవక్త ﷺ ప్రవచించారని తమీమ్ అద్దారీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః
مَنْ قَرَأَ بِمِائَةِ آيَةٍ فِي لَيْلَةٍ، كُتِبَ لَهُ قُنُوتُ لَيْلَةٍ
“ఎవరు ఒక రాత్రిలో వంద ఆయతుల పారాయణం చేస్తారో అతనికి రాత్రంతా తహజ్జుద్ చేసినంత పుణ్యం లిఖించబడుతుంది”.
(అహ్మద్ –అల్ ఫత్ హుర్రబ్బానీ- 8/11, దార్మీ 3450, అల్బానీ సహీహుల్ జామి 6468 లో సహీ అన్నారు).
వంద ఆయతుల పారాయణం చాలా సులువు, నీ సమయంలో నుండి కేవలం పది నిమిషాల పాటు మాత్రమే గడుస్తుంది. నీ వద్ద సమయం మరీ తక్కువగా ఉంటే, ఈ ఘనతను పొందాలనుకుంటే సూర సాఫ్ఫాత్ (సూర నం. 37), లేదా సూర ఖలమ్ (68) మరియు సూర హాఖ్ఖా (69) పారాయణం చేయవచ్చు.
ఒకవేళ ఈ వంద ఆయతుల పారాయణం రాత్రి వేళ తప్పిపోతే ఫజ్ర్ మరియు జొహ్ర్ నమాజుల మధ్య పారాయణం చేయు, ఇందులో బద్ధకం వహించకు, ఇన్ షా అల్లాహ్ నీవు దాని పుణ్యం పొందగలవు. ఎలా అనగా ప్రవక్త ﷺ ఇలా శుభవార్త ఇచ్చారని హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః
مَنْ نَامَ عَنْ حِزْبِهِ، أَوْ عَنْ شَيْءٍ مِنْهُ، فَقَرَأَهُ فِيمَا بَيْنَ صَلَاةِ الْفَجْرِ، وَصَلَاةِ الظُّهْرِ، كُتِبَ لَهُ كَأَنَّمَا قَرَأَهُ مِنَ اللَّيْلِ
“ఎవరైనా తాను రోజువారీగా పారాయణం చేసే ఖుర్ఆనులోని కొంత ప్రత్యేక భాగం, లేదా ఏదైనా వేరే ఆరాధన చేయలేక నిద్రపోతే, మళ్ళీ దానిని ఫజ్ర్ మరియు జొహ్ర్ నమాజుల మధ్య పూర్తి చేసుకుంటే అతనికి రాత్రివేళ చేసినంత పుణ్యం లిఖించబడుతుంది”. (ముస్లిం 747).
ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) గారి ఈ ఉల్లేఖనం యొక్క వ్యాఖ్యానంలో ముబారక్ పూరి (రహిమహుల్లాహ్) ఇలా చెప్పారుః
ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే రాత్రిపూట (నమాజ్, ఖుర్ఆన్ పారాయణం లాంటి) ఏదైనా సత్కార్యం చేయుట, మరియు నిద్ర వల్ల లేదా మరే కారణంగా తప్పిపోతే ‘ఖజా’ చేయుట ధర్మసమ్మతమైనది. ఫజ్ర్ మరియు జొహ్ర్ నమాజుల మధ్య దానిని చేసినవాడు రాత్రి చేసినవానితో సమానం.
ముస్లిం (746), తిర్మిజి (445) మొదలైనవాటిలో హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా ద్వారా రుజువైన విషయం ఏమిటంటేః నిద్ర లేదా ఏదైనా అవస్త కారణంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తహజ్జుద్ నమాజ్ చేయలేకపోతే పగటి పూట పన్నెండు రకాతులు చేసేవారు.
(తొహ్ఫతుల్ అహ్వజీ షర్హ్ జామి తిర్మిజిః ముబారక్ పూరీ 3/ 185, హ.న. 851).
బహుశా ఈ హదీసు ప్రతి రోజు ఖుర్ఆనులో ఓ ప్రత్యేక భాగ పారాయణం ఉండాలని, ప్రత్యేకంగా రాత్రి వేళ అని నిన్ను ప్రోత్సహిస్తుంది. ఏమీ! మనము అశ్రద్ధవహుల్లో లిఖించబడకుండా ఉండుటకు రాత్రి కనీసం పది ఆయతులైనా పారాయణం చేయాలని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రోత్సహించిన విషయం మీకు తెలియదా?
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారుః
مَنْ قَامَ بِعَشْرِ آيَاتٍ لَمْ يُكْتَبْ مِنَ الغَافِلِينَ، وَمَنْ قَامَ بِمِائَةِ آيَةٍ كُتِبَ مِنَ القَانِتِينَ، وَمَنْ قَامَ بِأَلْفِ آيَةٍ كُتِبَ مِنَ المُقَنْطِرِينَ
“పది ఆయతులతో తహజ్జుద్ చేయువారు అలక్ష్యపరుల్లో వ్రాయబడరు. మరెవరయితే వంద ఆయతులతో తహజ్జుద్ చేస్తాడో వినయ విధేయుల్లో వ్రాయబడుతాడు. ఇంకా ఎవరయితే వెయ్యి ఆయతులతో తహజ్జుద్ చేస్తారో ‘ముఖంతిరీన్’లో వ్రాయబడుతాడు”. (ముఖంతిరీన్ అన్న పదం ఖింతార్ నుండి వచ్చింది. ఖింతార్ భావం పై హదీసులో చూడండి).
(అబూదావూద్ 1398, ఇబ్ను హిబ్బాన్ 2572, ఇబ్ను ఖుజైమా 1144, అల్బానీ సహీహుత్తర్గీబ్ 639లో హసన్, సహీ అని అన్నారు).
ఇకనైనా మనం ఖుర్ఆన్ పారాయణం చేయడానికి అడుగు ముందుకు వేద్దామా? మన ఖుర్ఆన్ సంపూర్ణం చేయడమనేది కేవలం రమజాను వరకే పరిమితమయి ఉండకూడదు, సంవత్సరమెల్లా ఉండాలి. తహజ్జుద్ పుణ్యం పొందుటకు ప్రతి రోజు వంద ఆయతుల పారాయణ కాంక్ష అనేది అల్లాహ్ గ్రంథాన్ని బలంగా పట్టుకొని ఉండడానికి శుభప్రదమైన అవకాశం కావచ్చు.
—
త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం & ముందు వీడియో పాఠాలు ]
https://teluguislam.net/books/deeds-heavy-meezan
త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://bit.ly/3xYzpbN
మరణానంతర జీవితం – యూట్యూబ్ – ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3hWrEGNnzcmMZV3PtDByJH
మరణాంతర జీవితం – పార్ట్ 26 A నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
అబూ జర్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం, మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రమజానులో ఉపవాసమున్నాము. ఆయన ﷺ ఈ మాసంలో సామూహికంగా తరావీహ్ చేయించలేదు. అయితే (ఈ నెల సమాప్తానికి) ఏడు రోజులు మిగిలి ఉండగా, రాత్రి మూడవ వంతు వరకు మాకు తరావీహ్ చేయించారు, మళ్ళీ (నెల చివరి నుండి) ఆరవ రోజు తరావీహ్ చేయించలేదు, ఐదవ రోజు చేయించారు, అందులో అర్థ రాత్రి గడసిపోయింది. అప్పుడు సహచరులు ‘ప్రవక్తా! మిగిలిన రాత్రంతా మాకు ఈ నఫిల్ చేయిస్తే బావుండును’ అని విన్నవించుకున్నారు. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారుః
إِنَّ الرَّجُلَ إِذَا صَلَّى مَعَ الْإِمَامِ حَتَّى يَنْصَرِفَ حُسِبَ لَهُ قِيَامُ لَيْلَةٍ
“ఎవరైనా ఇమాం నమాజు సమాప్తం చేసే వరకు అతనితో నమాజు చేస్తాడో అతనికి పూర్తి ఒక రాత్రి తహజ్జుద్ చేసినంత పుణ్యం లిఖించబడుతుంది”.
(అబూ దావూద్ 1375, తిర్మిజి 806, నిసాయి 1364, ఇబ్ను మాజ 1327, అల్బానీ సహీహుల్ జామి1615లో సహీ అన్నారు).
మస్జిదులలో చాలా మంది ఇమాములు రమజాను మాసములో ఈ విషయం బోధిస్తూ ఉంటారు, ఇమాంతో తరావీహ్ నమాజు సంపూర్ణంగా చేయాలని ప్రోత్సహిస్తున్నది నీవు చూడగలవు. కాని కొందరు బద్ధకం వహించేవారు, అలక్ష్యపరులు, ఇతర మాసాలకు మరియు రమజానుకు మధ్య వ్యత్యాసం చూపే ఈ గొప్ప చిహ్నాన్ని వదులుకుంటున్నారు. దాని గురించే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా శుభవార్త ఇచ్చారుః
مَنْ قَامَ رَمَضَانَ إِيمَانًا وَاحْتِسَابًا، غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ
“ఎవరు సంపూర్ణ విశ్వాసం మరియు పుణ్యఫలాపేక్షతో రమజానులో నిలబడతారో (తరావీహ్ చేస్తారో), అతని పూర్వ పాపాలు మన్నించబడతాయి”. (బుఖారీ 37, ముస్లిం 759).
అలాగే లైలతుల్ ఖద్ర్ (ఘనమైన రాత్రి), అందులో సరియైన విధంగా అల్లాహ్ ఆరాధన చేయడం వెయ్యి నెలల ఆరాధన కంటే ఉత్తమం.
అల్లాహ్ ఇలా తెలిపాడు :
لَيْلَةُ الْقَدْرِ خَيْرٌ مِنْ أَلْفِ شَهْرٍ
“ఘనమైన రేయి వెయ్యి నెలల కంటే శ్రేష్ఠమైనది”. (ఖద్ర్ 97: 3).
ఇంతటి ఘనమైన రాత్రిని గుర్తించక అశ్రద్ధగా గడిపేవారి విషయం చాలా విచారకరమైనది.
—
త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం & ముందు వీడియో పాఠాలు ]
https://teluguislam.net/books/deeds-heavy-meezan
త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://bit.ly/3xYzpbN
మరణానంతర జీవితం – యూట్యూబ్ – ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3hWrEGNnzcmMZV3PtDByJH
మరణాంతర జీవితం – పార్ట్ 25 నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం & ముందు వీడియో పాఠాలు ]
https://teluguislam.net/books/deeds-heavy-meezan
[10 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://bit.ly/3xYzpbN
తహజ్జుద్ నమాజు యొక్క విలువ అల్లాహ్ వద్ద చాలా గొప్పగా ఉంది. ఫర్జ్ నమాజుల తర్వాత ఎక్కువ శ్రేష్ఠతగల నమాజు తహజ్జుదే. దాని ప్రత్యేకతల్లో: అది కేవలం పాపాలను హరించి వేయడమే గాకుండా; దానిని పాటించేవారిని పాపంలో పడకుండా కాపాడుతుంది. ప్రవక్త ﷺ ఇలా తెలిపారని అబూ ఉమామా బాహిలీ t ఉల్లేఖించారుః
عَلَيْكُمْ بِقِيَامِ اللَّيْلِ فَإِنَّهُ دَأَبُ الصَّالِحِينَ قَبْلَكُمْ، وَهُوَ قُرْبَةٌ إِلَى رَبِّكُمْ، وَمَكْفَرَةٌ لِلسَّيِّئَاتِ، وَمَنْهَاةٌ لِلإِثْمِ
“మీరు తహజ్జుద్ నమాజు చేయండి, అది మీకంటే ముందు పుణ్యాత్ముల సద్గుణం, మీ ప్రభువు సాన్నిధ్యానికి చేర్చునది, పాపాలకు పరిహారం మరియు అపరాధాల నుండి వారిస్తుంది”.
(తిర్మిజి 3549, ఇబ్ను ఖుజైమా 1135, సహీహుత్తర్గీబ్ 624లో హసన్ లిగైరిహి అని ఉంది).
పూర్వ పుణ్యపురుషులు రహిమహుముల్లాహ్ యే కాదు, గత సమీప కాలాల్లో మన తాతముత్తాతలు తహజ్జుద్ నమాజులో ఏ కొరతా చూపేవారుకాదు. కాని ఈ కాలంలో అనేక మంది రాత్రులు పగల్లో, నిద్రలు జాగారాల్లో మారిపోయి, రాత్రి వేళల్లో అల్లాహ్ ను వేడుకునే మాధుర్యాన్ని కోల్పోయారు. మరికొందరు ఎంతటి అలసత్వానికి గురి అయ్యారంటే ఫజ్ర్ నమాజు సైతం వదిలేస్తున్నారు.
తన దాసులపై ఉన్న అల్లాహ్ యొక్క గొప్ప కరుణ ఏమిటంటే; ఆయన వారికి చిన్నపాటి కొన్ని కార్యాలు ప్రసాదించాడు, వాటి పుణ్యఫలితం తహజ్జుద్ కు సమానంగా ఉంది. ఎవరికైనా తహజ్జుద్ తప్పిపోతే లేదా ఎవరైనా తహజ్జుద్ చేయలేక పోతే కనీసం ఇలాంటి సత్కార్యాలు తప్పిపోకూడదు, వాటి ద్వారా తన త్రాసు బరువును పెంచుకోవచ్చును. ఇది తహజ్జుద్ చేయలేకపోయినా పరవా లేదు అన్న మాట కాదు, మన పూర్వ పుణ్యపురుషులు ఎన్నడూ అలా భావించలేదు, వారైతే ప్రతి పుణ్య కార్యంలో ముందంజవేసి, చురుకుగా పాల్గొనేవారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరులకు కొన్ని సులువైన ఆచరణల గురించి తెలిపారు, ప్రత్యేకంగా ఎవరైతే తమకు తాము కొంత శ్రమ పడి తహజ్జుద్ చేయలేకపోతారో అలాంటి వారి గురించి, ఇలా మనల్ని కూడా సత్కార్యాలు చేసుకొని మన పుణ్యాలను పెంచుకోవాలని ప్రోత్సహించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారని అబూ ఉమామా బాహిలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
مَنْ هَالَهُ اللَّيْلُ أَنْ يُكَابِدَهُ، وَبَخِلَ بِالْمَالِ أَنْ يُنْفِقَهُ، وَجَبُنَ عَنِ الْعَدُوِّ أَنْ يُقَاتِلَهُ،
فَلْيُكْثِرْ أَنْ يَقُولَ: سُبْحَانَ اللهِ وَبِحَمْدِهِ، فَإِنَّهَا أَحَبُّ إِلَى اللهِ مِنْ جَبَلِ ذَهَبٍ وَفِضَّةٍ يُنْفَقَانِ فِي سَبِيلِ اللهِ عَزَّ وَجَلَّ
“ఎవరు రాత్రి వేళ మేల్కొని (తహజ్జుద్ కై) శ్రమ పడుటకు భయపడ్డాడో, ధనాన్ని (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేయుట నుండి పిసినారితనం వహించాడో మరియు శతృవుతో పోరాడడానికి పిరికితనం వహించాడో అతను అధికంగా సుబ్ హానల్లాహి వబిహందిహీ అనాలి. ఈ పదాలు అల్లాహ్ కు ఆయన మార్గంలో ఖర్చుపెట్టబడ్డ వెండి, బంగారాల కంటే ఎక్కువగా ఇష్టమైనవి, ప్రియమైనవి”. (తబ్రానీ కబీర్ 7795, అల్బానీ సహీహుత్తర్గీబ్ 1541లో సహీ లిగైరిహీ అని అన్నారు).
ఇతర లింకులు:
మరణాంతర జీవితం – పార్ట్ 24 నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం & ముందు వీడియో పాఠాలు ]
https://teluguislam.net/books/deeds-heavy-meezan
[3:34 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://bit.ly/3xYzpbN
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారని, ఫుజాలా బిన్ ఉబైద్ మరియు తమీమ్ అద్దారీ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారుః
مَنْ قَرَأَ عَشْرَ آيَاتٍ فِي لَيْلَةٍ، كُتِبَ لَهُ قِنْطَارٌ، وَالْقِنْطَارُ خَيْرٌ مِنَ الدُّنْيَا وَمَا فِيهَا
“ఎవరు ఒక రాత్రిలో పది ఆయతులు పఠిస్తాడో అతని (కర్మల పత్రంలో) ‘ఖింతార్’ వ్రాయబడుతుంది, ‘ఖింతార్’ అన్నది ఈ ప్రపంచం మరియు అందులో ఉన్న సమస్తానికంటే మేలైనది”. (తబ్రానీ కబీర్ 1253, సహీహుత్తర్గీబ్ లో అల్బానీ హసన్ అని అన్నారు).
పైన పేర్కొనబడిన పది ఆయతుల ప్రస్తావన, ఆ ఆయతులు తహజ్జుద్ నమాజులో పఠించాలి. –వాస్తవ జ్ఞానం అల్లాహ్ కే ఉంది- కాని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారుః
مَنْ قَامَ بِعَشْرِ آيَاتٍ لَمْ يُكْتَبْ مِنَ الغَافِلِينَ، وَمَنْ قَامَ بِمِائَةِ آيَةٍ كُتِبَ مِنَ القَانِتِينَ، وَمَنْ قَامَ بِأَلْفِ آيَةٍ كُتِبَ مِنَ المُقَنْطِرِينَ
“పది ఆయతులతో తహజ్జుద్ చేయువారు అలక్ష్యపరుల్లో వ్రాయబడరు. మరెవరయితే వంద ఆయతులతో తహజ్జుద్ చేస్తాడో వినయ విధేయుల్లో వ్రాయబడుతారు. ఇంకా ఎవరయితే వెయ్యి ఆయతులతో తహజ్జుద్ చేస్తారో ‘ముఖంతిరీన్’లో వ్రాయబడుతాడు”. (ముఖంతిరీన్ అన్న పదం ఖింతార్ తో వచ్చింది. ఖింతార్ భావం పై హదీసులో చూడండి). (అబూదావూద్ 1398, ఇబ్ను హిబ్బాన్ 2572, ఇబ్ను ఖుజైమా 1144, దార్మి 3444, హాకిం 2041, అల్బానీ సహీహుత్తర్గీబ్ 639లో హసన్, సహీ అని అన్నారు).
ఇషా తర్వాత చేయబడే ప్రతి నఫిల్ నమాజ్ తహజ్జుద్ లో లెక్కించబడుతుంది. ఈ నమాజు నీవు రాత్రి వేళ ఎంత ఆలస్యం చేస్తే అంతే ఎక్కువ పుణ్యం. ఈ గొప్ప ఘనత, చిన్నపాటి సత్కార్యాన్ని నీవు కోల్పోకు. కనీసం ఇషా తర్వాత రెండు రకాతుల సున్నత్ మరియు విత్ర్ నమాజు అయినా సరే.
ఇతర లింకులు:
[24 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7
జకాతు & సదఖా (మెయిన్ పేజీ)
https://teluguislam.net/five-pillars/zakah
[30 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7
[24 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7
You must be logged in to post a comment.