ఉసూల్ అస్ సలాస (త్రి సూత్రాలు) – పుస్తక అధ్యయనం

నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఒక్కరు సమాధి ప్రశ్నలకు జవాబు ఇచ్చేదుంది.
సరియైన జవాబు ఇవ్వనివారికి శిక్షలు మొదలవుతాయి
సమాధిలో వెళ్ళాక జవాబు సిద్ధపరుచుకునే అవకాశం ఉండదు
కనుక ఇహలోకంలోనే సరియైన జవాబు నేర్చుకోవాలి, ఆచరించాలి

పుస్తక పరిచయం

పరలోక సాఫల్యం పొందాలంటే ఇహలోకంలో విశ్వాసాల పునాదులు పటిష్టంగా ఉండాలి. మన కర్మలు ఆ పునాదులపై ఆధారపడి వుంటాయి. అందువలన విశ్వాసాల పటిష్టతకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా దీని పై శ్రద్ధ వహించని వారి శాతమే ఎక్కువ. అనువదించబడిన ఈపుస్తకం విశ్వాసాల పటిష్టతకు ఒక మైలురాయి. 

పాఠకులారా.. 

12వ శతాబ్ధము నాటికి ముస్లింల ధార్మిక జీవనశైలి చెదిరిపోయింది. ఏధర్మం మూలంగా వారికి సన్మార్గము లభించిందో ఆదే ధర్మంలో షైతాన్ తన సమూహంతో విశ్వాసాల రూపురేఖలను మార్చి ముస్లింల హృదయాలను అనాచారాల (ఇస్లాం అనుసరణాచారాలకు వ్యతిరేకంగా) కు లోబరుచుకున్నాడు. పుణ్యాత్ములను ఆరాధించటం, సమాధులను దర్శించటం (ప్రార్ధించడం), వేడు కోవటం, బలిదానాలు చేయటం, మొక్కుతీర్చటం, లేని పక్షంలో వారి ప్రతాపానికి గురి అయ్యే భయం, తాయత్తుల మహిమలు, దైవ సందేశహరుల విలువలను అగౌరవ పర్చటం, ఇష్టానుసారంగా దిద్దుకున్న ఆచారాలను ఇస్లాం ధర్మంలో కల్పితంచేసి ప్రజలను వక్రమార్గానికి మళ్ళించటం జరిగింది. 

ఈ తరుణంలో ఇస్లాం ధార్మిక వాస్తవ రూపురేఖలను వెలికి తీసి ప్రజలకు సన్మార్గం చూపించటానికి అహోరాత్రులు శ్రమించిన వ్యక్తే… “ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్”. 

‘ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హబ్’ హిజ్రి శకం 1115 సంవత్సరంలో “ నజ్ద్” దేశంలోని “ఉయ్యైనా” పట్టణంలో జన్మించారు. నాడు విద్యా, జ్ఞానాలకు నెలవుగా గుర్తింపు పొందిన ‘బసర’ నగరానికి పయనించి విద్యా విజ్ఞాలలో ప్రావీణ్యం పొందారు. ధర్మప్రచారానికి నడుం బిగించిన సందర్భములో “ముహమ్మద్ బిన్ సఊద్” వెన్నుతట్టి తన వంతు సహాయాన్ని అందించారు. అనతి కాలంలోనే ఈ ప్రచారం విస్తృతమై ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. 

మీ ముందు వున్న ఈ చిరు పుస్తకం “అల్ ఉసూలు స్సలాసతి వ అదిల్లతిహా” అనే పేరుతో అరేబియా (అరబ్బి) భాషలో లిఖించబడింది. ఈ మహోన్నత పుస్తకాన్ని ప్రపంచంలోని అన్నీ భాషల్లో అనువాదం చేసి ప్రచురించడం జరిగింది. దీని వలన ఎంతో మంది ప్రజలు ‘షిర్క్’ (బహుదైవారాధన), ‘బిద్అత్’లను విడనాడి అల్లాహ్ సమక్షంలో పశ్చాత్తాపపడి సన్మార్గము వైపుకు మళ్ళారు. ఇదే సంకల్పముతో దీనిని తెలుగుభాషలో అనువదించటం జరిగింది. దీని లోని ముఖ్యాంశం ఏమిటంటే మరణాంతరం సమాధిలో ప్రతి మానవునికి (విశ్వాసి, అవిశ్వాసి తేడా లేకుండా) ఈ 3 ప్రశ్నలు ప్రశ్నించబడతాయి. 

1. నీ ఆరాధ్య దేవుడు ఎవరు? 
2. నీ ధర్మం ఏది? 
3. నీ ప్రవక్త ఎవరు? 

పై ప్రశ్నలకు ఏ అల్ప విశ్వాసము కలిగియున్న వ్యక్తి కూడా జవాబు ఇవ్వగలడు. ఇందుకు సంబంధించి మనలో చోటుచేసుకున్న కలుషితమైన విశ్వాసాలను దైవగ్రంధము పవిత్ర ఖుర్ఆన్, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసుల ఆధారంగా అసత్య, అవాస్తవ విశ్వాసాలను బహిర్గతం చేయడం జరిగింది. అంతే కాకుండా ధర్మానికి సంబంధించి ఏ అంశమైనా సాక్ష్యాధారాలతోనే అంగీకరించాలనే గీటురాయి కల్పించబడింది.

పుస్తక అనువాదాలు

ఉసూల్ అత్ తలాత (త్రి సూత్రాలు) – జుల్ఫీ దావహ్ – నసీరుద్దీన్ జామియీ [పుస్తకం & వీడియో పాఠాలు] 

త్రి సూత్రాలు (మూడు మౌలిక సూత్రాలు) – ఉసూల్ అత్ తలాత  – మర్కజ్ దారుల్ బిర్ర్ పబ్లికేషన్స్
[47 పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

ఉసూల్ అత్ తలాత – ప్రశ్నలు & జవాబుల రూపంలో – హదీసు పబ్లికేషన్స్
[32 పేజీలు] [PDF][మొబైల్ ఫ్రెండ్లీ]

ఆడియో & వీడియో పాఠాలు

ఉసూల్ అత్ తలాత (త్రి సూత్రాలు) – జుల్ఫీ దావహ్ – నసీరుద్దీన్ జామియీ [పుస్తకం & వీడియో పాఠాలు] 
[డిటైల్డ్ పాఠాలు] [23 వీడియోలు]- తప్పక వినండి!

ఉసూలె సలాస (త్రి సూత్రాలు) – సమాధిలో అడిగే మూడు ప్రశ్నలు : క్లుప్త వివరణ [వీడియో]
[40 నిముషాలు] – ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) వీడియో పాఠాలు – షార్ట్ క్లిప్స్ – 10 వీడియోలు యూట్యూబ్ ప్లే లిస్ట్

షేఖ్ డా. సఈద్ అహ్మద్ మదనీ వీడియో పాఠాలు

%d bloggers like this: