రేయింబవళ్ళ ముఖ్యమైన దుఆలు [పుస్తకం]

బిస్మిల్లాహ్

రేయింబవళ్ళ ముఖ్యమైన దుఆలు
(పగలు రాత్రి దుఆలు)
కూర్పు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ 

ఉన్నత చదులు ఎన్ని  చదివినా  ఫలితము ఉండబోదురా !
సృష్టికర్తను గ్రహించలేని డిగ్రీలన్నీ వ్యర్ధమురా!

మానువుడు దాసుడు, అల్లాహ్‌ యజమాని, దాసుడు ఎల్లవేళల్లో తన యజమాని ఆజ్ఞాపాలనలో, ఆయనను స్మరిస్తూ, స్తుతిస్తూ ఉండాలి.

 • ఈనాడు శాంతి ఎందుకు కరువైపోయింది?
 • జీవితాలు ఎందుకు దుర్భరమైపోయాయి?
 • సుఖపరమైన నిద్ర ఎందుకు కోల్పాయాము?
 • పరస్పరంలో ప్రేమలు ఎందుకు లోపించాయి?
 • భూతపిశాచుల భయం ఎలా అధికమయ్యింది?

వీటన్నిటికి ఒకే సమాధానం: మనం ఎప్పుడు అల్లాహ్‌ ను ఎలా స్మరించాలో, అప్పుడు అలా స్మరించడం మరచిపోయాము. మరియు సామాన్యుల ఆలోచన ఏమిటంటే; అల్లాహ్‌ స్మరణ చేస్తూ ఉండడం అనేది మనపని కాదు, మౌల్వీ సాబులు, సమాధికి అతిచేరువులో ఉన్న వృద్ధుల పని అని. (నఊజుబిల్లాహ్‌). అల్లాహ్‌ స్మరణలోని ప్రయోజనాలు తెలియుటకు ఈ చిరుపుస్తకం చదివి చూడండి.

ఈ చిరుపుస్తకాన్ని మీరు ఎల్లవేళల్లో మీ వెంటే ఉంచుకొని ఏ సందర్భంలో ఏ దుఆ చదవాలో ఆ దుఆ చూచి చదవండి. ఇలా కొద్ది రోజుల్లో అనేక దుఆలు మీరు కంఠస్తం చేసుకోగల్గుతారు. వేరే ప్రత్యేక సమయం కేటాయించే అవసరమే ఉండదు. ఇన్నీ దుఆలను ఎప్పుడు కంఠస్తం చేయాలి? అని దీనిని మూలకు పడేయంకండి, ఇలా ఎన్నో మేళ్లను కోల్పోతారు.

ఇది చిరుపుస్తకం గనక ప్రతి దుఆ యొక్క ఆధారం సంక్షిప్తంగా ఇవ్వబడింది. మరిన్ని ఎక్కువ దుఆలతో, సంపూర్ణ ఆధారాలతో మరో పుస్తకం తయారు చేసే భాగ్యం అల్లాహ్‌ ప్రసాదించుగాక! ఆమీన్‌.

[ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [63 పేజీలు]

విషయ సూచిక 

 • నిద్ర నుండి మేల్కొని
 • కాలకృత్వాలు తీర్యుకునే ముందు, తర్వాత
 • వుజూకు ముందు, తర్వాత
 • దుస్తులు ధరిస్తూ, తీస్తూ
 • ఇంటి నుండి వెళ్తూ / ఇంట్లో ప్రవేశిస్తూ
 • మస్జిద్ వైపునకు వెళ్తూ / మస్జిద్లో ప్రవేశిస్తూ
 • అజాన్‌ సమాధానం, దుఆలు
 • తక్బీరే  తహ్రీమ తర్వాత దుఆలు
 • రుకూలో/ రుకూ నుండి నిలబడి
 • సజ్డాలో
 • రెండు సజ్డాల మధ్య
 • సజ్డాయె తిలావత్‌ లో
 • తషహ్హుద్‌ లో
 • సలాంకు ముందు
 • సలాం తర్వాత
 • ఇస్తిఖారా నమాజులో
 • ఉదయసాయంకాలపు జిక్ర్‌, వాటి లాభాలు
 • పడుకునే ముందు
 • రాత్రి వేళ ప్రక్క మారుస్తూ
 • నిద్రలో భయాందోళన…, చెడు కల  చూస్తే….?
 • విత్ర్ నమాజులో/ విత్ర్ నమాజ్‌ తర్వాత
 • జనాజా నమాజులో
%d bloggers like this: