అస్మా బిన్తె అబూబకర్ ఉల్లేఖనం ప్రకారం: ఒక స్త్రీ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సన్నిధికి వచ్చి “ప్రవక్తా! నా కూతురికి చర్మవ్యాది సోకింది. దాని మూలంగా ఆమె తలవెంట్రుకలు రాలిపోయాయి. నేనామెకు పెళ్ళి చేశాను. మరి నేను ఆమెకు సవరం పెట్టవచ్చా?” అని అడిగింది. దానికి ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) “సవరం పెట్టుకునే స్త్రీని మరియు పెట్టుకోవటానికి తాపత్రయపడే స్త్రీని అల్లాహ్ శపించాడు” అని అన్నారు. (ముస్లిం 2123, బుఖారి 5941).
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ ఉల్లేఖించారు: “స్త్రీ తన శిరోజాల్లో సవరం పెట్టుకొనుటను ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గట్టిగా వారించారు”. (ముస్లిం 2126).
ఈ రోజుల్లో “విగ్” రూపంలో ఇది చెలామణిలో ఉంది. ఈ నిషిద్ధ కార్యం జరిగే బ్యూటిపార్లర్లలో ఇంకా చెప్పరాని దుష్కా ర్యాలు జరుగుతాయి.
దీనికి సంబంధించిన మరో నిషిద్ధత ఎరువిచ్చుకునే వెంట్రుకలు. డ్రామాల్లో, ఫిల్ములో పనిచేసేవాళ్ళు, (వాళ్ళను అనుకరించేవాళ్ళు) వీటిని ఉపయోగీస్తారు. ఇలాంటి వారికి పరలోక సాఫల్యంలో ఓ భాగమైనా లభించదు.
[ఇది ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన “ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు”అను పుస్తకం నుంచి తీసుకుబడింది. ]
మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/