నా సోదరిని జిన్ ఆవహించింది. ఆమె ఇప్పుడు దీర్ఘకాలిక ట్రామా (తీవ్ర మానసిక వేదన)తో బాధపడుతోంది, ఇంకా మాట్లాడలేకపోతోంది మరియు కదలలేకపోతోంది. మేమేమి చేయాలి?
షేక్ అరఫాత్ ఇబ్న్ హసన్ అల్-ముహమ్మదీ:
అది జిన్ వల్లే జరిగిందని మీకు ఎలా తెలుసు? ఏదేమైనా, భయపడకండి:
“షైతాన్ మాత్రమే తన మిత్రులను చూసి భయపడేలా మీ మనసుల్లో భయాన్ని పుట్టిస్తాడు. కాబట్టి మీరు విశ్వాసులైతే వారికి భయపడకండి, నాకు మాత్రమే భయపడండి.” (ఆల్ ఇమ్రాన్ 3:175)
ఈ సమస్య చాలా సులభమైనది.
ఆ సోదరికి మేము చెప్పేది ఇదే: ప్రతిరోజూ సూరతుల్ బఖరాను పఠించండి మరియు దీనిని క్రమం తప్పకుండా పఠించడానికి ప్రయత్నించండి. అలాగే అజ్కార్లను (అల్లాహ్ స్మరణలను) కూడా పాటిస్తూ ఉండండి: ఉదయం మరియు సాయంత్రం అజ్కార్, నిద్రపోయే ముందు మరియు మేల్కొన్న తర్వాత, మరుగుదొడ్డిలోకి ప్రవేశించేటప్పుడు మరియు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు చేసే అజ్కార్. ఇలా ఎన్నో అజ్కార్లు ఉన్నాయి, కాబట్టి వాటిని నిలకడగా పాటించండి.
ఒకవేళ ఆమెకు ఈ అజ్కార్లు కంఠస్థం లేకపోతే, ఆమె వాటిని కలిగి ఉన్న ‘హిస్నుల్ ముస్లిం‘ (ముస్లిం కోట) వంటి చిన్న పుస్తకాన్ని ఉపయోగించి, దాని నుండి అజ్కార్లను చదువుకోవచ్చు.
ఇంకా రుఖ్యా (Ruqyah): ఆమె తనకు తానే రుఖ్యా చేసుకోవాలి. దీనికి మరో గొప్ప మార్గం దుఆ (ప్రార్థన).
జిన్లు చాలా బలహీనమైనవి మరియు చేతగానివి; అవి భయపడే స్వభావం కలవి. అల్లాహ్ ఇలా సెలవిచ్చినట్లు:
{إِنَّ كَيْدَ الشَّيْطَانِ كَانَ ضَعِيفًا} “నిశ్చయంగా షైతాన్ కుట్ర ఎప్పుడూ బలహీనమైనదే.” (అన్-నిసా 4:76)
కాబట్టి, వాడు బలహీనుడు, మీరు అల్లాహ్ శరణు వేడినప్పుడు, వాడు భయపడి పారిపోతాడు.
జాదూ (చేతబడి), చెడు దృష్టి (దిష్టి) లేదా మరేదైనా కారణం వల్ల జిన్ ప్రవేశించినా సరే, ఈ సమస్య పరిష్కారం సులభమే. అయితే అసలు సమస్య ఏమిటంటే, రోగి తనకు తాను చికిత్స చేసుకోవాలనే దృఢ నిశ్చయం కలిగి ఉండడు. దానికి బదులుగా, వేరెవరో తమ కోసం రుఖ్యా చేస్తారని వారు ఎదురు చూస్తూ ఉంటారు: “నా కోసం రుఖ్యా చేసేవారిని తీసుకురండి” అని అంటారు. ఒకటి లేదా రెండు సెషన్ల తర్వాత ఈ జిన్ లేదా ఈ ఆవహన వదిలిపోతుందని వారు భావిస్తారు. కాదు, అది సరైనది కాదు.
మీ హృదయాన్ని అల్లాహ్తో అనుసంధానించండి, ఆయన సహాయం కోరండి మరియు ఎప్పటికీ ఆశ వదులుకోవద్దు. షరియత్ నిర్దేశించిన పద్ధతులను పాటించండి, వాటిలో అత్యంత ముఖ్యమైనవి సూరతుల్ బఖరా పఠించడం మరియు దుఆ (ప్రార్థన) చేయడం. ఆపై ఒకటి, రెండు లేదా మూడు నెలల తర్వాత మిమ్మల్ని మీరు గమనించుకోండి; మీరు ఎలా కోలుకుంటారో, మీ పరిస్థితి ఎంత మెరుగ్గా మారుతుందో మీకే అర్థమవుతుంది.
మేము ఇలాంటి ఎన్నో కేసులను పర్యవేక్షించాము. ఈ సలహాను పాటించిన వారు కోలుకున్నారు మరియు ప్రయోజనం పొందారు. అయితే దీనిని ఆచరించని వారు అలిసిపోయారు, వారి పరిస్థితి తీవ్రంగా దిగజారిపోయింది. వారు షైతాన్కు తమపై ఆధిపత్యం ఇచ్చారు కాబట్టి, చివరికి వారిలో కొందరు మంచానికే పరిమితమయ్యే స్థితికి చేరుకున్నారు.
ఒకవేళ మీరు ఖురాన్ పఠనాన్ని వదిలేస్తే, షైతాన్ మీ శరీరంతో తనకు ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటాడు: పైకి కిందికి కదులుతూ, చివరకు చంపేస్తాడు కూడా. వాడికి మీరే దారి (అవకాశం) ఇచ్చారు కాబట్టి వాడు మిమ్మల్ని చంపగలడు కూడా.
కానీ (ఖురాన్) పఠించండి, దుఆ చేయండి, అల్లాహ్కు చేరువకండి మరియు రక్షణ కోసం అల్లాహ్ వైపు మళ్లండి. అల్లాహ్ ﷻ మీకు తప్పక స్వస్థత చేకూరుస్తాడు.
“వస్వాస్ ఖహ్రీ” అంటే — వ్యక్తి ఎంత ప్రయత్నించినా దూరం చేసుకోలేని, పదే పదే మనసులోకి బలవంతంగా వచ్చే చెడు ఆలోచనలు, సందేహాలు లేదా శంకలు.
ఆధునిక వైద్య పరిభాషలో దీనిని OCD (Obsessive-Compulsive Disorder / అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్) అని పిలుస్తారు — అంటే ఒక వ్యక్తికి కొన్ని ఆలోచనలు పదే పదే వస్తుండడం, వాటిని తొలగించుకోవడానికి కొన్ని పనులను బలవంతంగా చేయవలసి రావడం (ఉదా: పదే పదే వుజూ చేయడం, నమాజ్ తిరిగి తిరిగి చదవడం, పరిశుభ్రత గురించి అతి ఆందోళన పడడం మొదలైనవి).
ఇస్లామిక్ సందర్భంలో, ఇది ఎక్కువగా ఇబాదత్ (ఆరాధన), తహారత్ (పరిశుభ్రత), అఖీదా (విశ్వాసం), లేదా తలాఖ్ (విడాకులు) వంటి విషయాలలో కనిపిస్తుంది.
వస్వాస్ (షైతాన్ యొక్క గుసగుసలు) తో బాధపడేవారికి సలహా – షేఖ్ సులైమాన్ అర్-రుహైలీ Advice to those afflicted with Waswaas (whisperings) – Shaykh Sulaymaan ar-Ruhaylee https://abdurrahman.org/?p=44410 ఇంగ్లీష్ అనువాదం: యాసీన్ అబూ ఇబ్రాహీం తెలుగు అనువాదం : teluguislam.net
ప్రశ్న అడిగే వ్యక్తి:
ఒక వ్యక్తి వస్వాస్ ఖహ్రీ (Waswaas Qahree) తో బాధపడుతున్నాడు. దీనికి మీ సలహా ఏమిటి? అల్లాహ్ మిమ్మల్ని రక్షించుగాక.
షేక్ సులైమాన్ బిన్ సలీముల్లాహ్ అర్-రుహైలీ :
ఇది ఇబ్లీస్ (షైతాన్) పన్నాగాలలో ఒక మార్గం. వస్వాస్ (Waswaas) గురించి ఉన్న ప్రధాన సూత్రం ఏమిటంటే, అది ఒక దాసుని యొక్క ధర్మబద్ధతకు మరియు అతని హృదయ స్వచ్ఛతకు నిదర్శనం. ఎందుకంటే, ఒక దాసుడు ధర్మబద్ధంగా ఉన్నాడని మరియు సత్కార్యాల ద్వారా అతనిని ఓడించడం తన వల్ల కాదని షైతాన్ కు అర్థమైనప్పుడు, అతనికి (చెడు) గుసగుసలు చెప్పడం ప్రారంభిస్తాడు. అందుకే ప్రవక్త – సల్లల్లాహు అలైహి వ సల్లంకు ఈ (వస్వాస్ విషయం) ప్రస్తావించబడినప్పుడు ఆయన ఇలా అన్నారు: “షైతాన్ కుట్రను కేవలం అల్-వస్వసహ్ (al-Waswasah – గుసగుసలు) స్థాయికి తగ్గించిన అల్లాహ్ కే సర్వ ప్రశంసలు.” వాడు మనల్ని జయించలేకపోయాడు, అందుకే వస్వాస్ తో మన వద్దకు వచ్చాడు. మరియు ఆయన (ప్రవక్త) ఇలా అన్నారు: “అది విశ్వాసానికి స్పష్టమైన సంకేతం.” ఇది వస్వాస్ యొక్క సారాంశం. అంటే: వస్వాస్ కలుగుతోందంటే, దానికి ఇదే నిదర్శనం.
అయితే దీని అర్థం వస్వాస్ బారిన పడిన వారిని మనం ప్రశంసిస్తామని కాదు. ఎందుకంటే, వస్వాస్ కు ప్రతిస్పందించడం ఒక చెడు. దాన్ని నివారించడం మరియు దానికి దూరంగా ఉండటం విధి. మరియు వస్వాస్ బారిన పడిన వారు రెండు రకాలుగా ఉంటారు.
మొదటి రకం: వస్వాస్ అతనిని పూర్తిగా లోబరుచుకోలేకపోవడం. బదులుగా అది వస్తుంది మరియు వెళ్లిపోతుంది. ఎక్కువగా ఇస్తిఆజహ్ (isti’aadhah – అల్లాహ్ శరణు కోరడం) చేయడం ద్వారా దీనిని నయం చేయవచ్చు. అతడు దాని నుండి రక్షణ కోసం అల్లాహ్ శరణు కోరుతాడు మరియు తన ఎడమ వైపున ఉమ్మివేసినట్లు చేస్తాడు. మరియు అతడు ఖుర్ఆన్ మరియు హదీసులు పఠిస్తాడు.
రెండవ రకం: వస్వాస్ చాలా ఎక్కువగా ఉండి అతనిని పూర్తిగా అదుపులోకి తీసుకోవడం. దీనిని ఏ ఆచరణ ద్వారానూ నయం చేయలేము, ఎందుకంటే అతడు ఎన్ని ఆచరణలు చేస్తే, అతని వస్వాస్ అంతగా పెరుగుతుంది. అతడు ఖుర్ఆన్ చదివినా సరే, అతని వస్వాస్ పెరుగుతుంది! కాబట్టి ఇది ఎలా నయమవుతుంది? దీని నుండి పూర్తిగా ముఖం తిప్పుకోవడం (పూర్తిగా పట్టించుకోకపోవడం) ద్వారానే ఇది నయమవుతుందని ఫుకహా (Fuqahaa’ – ఇస్లామిక్ న్యాయవేత్తలు) చెబుతారు. దీని అర్థం ఏమిటి? దాని (వస్వాస్) కారణంగా మీరు ఏ పని చేయకూడదు లేదా దాని కారణంగా దేనినీ వదిలిపెట్టకూడదు. ఒకవేళ అది మీ వద్దకు వచ్చినా, అది మీకు ఎలాంటి హాని చేయదని మీకు కచ్చితంగా తెలిసిన ఒక పిచ్చివాడు మీ వెనుక నుండి మాట్లాడుతున్నట్లుగా భావించండి. మరియు దాని కారణంగా ఏ పని చేయకండి లేదా దాని కారణంగా దేనినీ వదిలివేయకండి.
కొందరు వ్యక్తులు, తమకు వస్వాస్ వచ్చినప్పుడు, చదవడానికి ఖుర్ఆన్ తెరుస్తారు. అప్పుడు ఇబ్లీస్ అతనిని లొంగదీసుకోవడంలో మరింత ఆసక్తి చూపుతాడు, కాబట్టి ఖుర్ఆన్ కు సంబంధించి అతనికి గుసగుసలు చెప్పడం ప్రారంభిస్తాడు. అతడు లేచి ప్రార్థన (నమాజ్) చేస్తాడు, అప్పుడు వాడు (షైతాన్) అతని ప్రార్థనలో కూడా గుసగుసలు చెబుతాడు.
అందుకే దాని (వస్వాస్) కారణంగా మీరు దేనినీ వదిలిపెట్టవద్దు! మీరు ఖుర్ఆన్ చదువుతున్నప్పుడు షైతాన్ మీకు గుసగుసలు పెడుతూ వస్తే, మీరు ఖుర్ఆన్ పఠించడం ఆపవద్దు, దాన్ని కొనసాగించండి! మీ అంతట మీరుగా దానిని ఆపాలనుకున్నప్పుడే ఆపండి. వస్వాస్ వస్తుందన్న కారణంతో మాత్రం దాన్ని మానుకోవద్దు. మీరు ఇలా చేసి, సహనంతో ఉంటే… ఈ విషయానికి సహనం అవసరమని తెలుసుకోండి, ఎందుకంటే వస్వాస్ కు గురైన వ్యక్తి వద్దకు ఇబ్లీస్ ఒక సలహాదారుని వలె, జాలిపడే వాడి వలె వస్తాడు. నమాజులో (షైతాన్ ఇలా అంటాడు): “ఇది నమాజు! నమాజు అనేది ఒక దాసునికి మరియు అతని ప్రభువుకి మధ్య ఉన్న అనుసంధానం! నీ నమాజు రద్దైపోతే, నీకు ఇక మిగిలేది ఏమిటి? జాగ్రత్త! ప్రార్థన వదిలేసి వెళ్లి వుజూ చేసుకో!” అతని నమాజును పాడు చేయడానికే (వాడు అలా చేస్తాడు). కానీ వాడు సలహాదారుడు కాడు, వాడు ఇబ్లీస్! కాబట్టి దీనికి ఓపిక అవసరం. సహనంతో ఉండండి!
మీరు వుజూ చేసేటప్పుడు మీకు వస్వాస్ వస్తే, మీ వుజూ పూర్తి చేసి వెళ్లిపోండి. ఆ తర్వాత ఇబ్లీస్ మీ వద్దకు వచ్చి, “ఇంకా ఏదో మిగిలిపోయింది!” అని అంటే, అప్పుడు: “ఏమీ మిగిలిలేదు” అని చెప్పండి. వాడిని పట్టించుకోకండి! వెళ్లి నమాజు చేసుకోండి! అల్లాహ్ సాక్షిగా, అది మీకు ఎలాంటి హాని చేయదు! అల్లాహ్ సాక్షిగా, అది మీకు హాని చేయదు. మీరు ఖుర్ఆన్ పఠిస్తున్నప్పుడు ఇబ్లీస్ మీకు గుసగుసలు చెబుతూ వస్తున్నాడా? పఠనం కొనసాగించండి! మరియు వాడిని (ఇబ్లీస్ ను) వదిలేయండి! పఠించడం కొనసాగించండి! అల్లాహ్ సాక్షిగా, అది మీకు హాని చేయదు! నిజానికి, దానికి మీకు ప్రతిఫలం లభిస్తుంది! ఎందుకంటే మీరు ఇబ్లీస్ కి వ్యతిరేకంగా జిహాద్ చేస్తున్నారు. అప్పుడు ఇబ్లీస్ మీ విషయంలో నిరాశ చెంది, ఈ తలుపు (వస్వాస్ మార్గం) వదిలేసి, మరో తలుపు వెతుక్కోవడం మొదలుపెడతాడు.
కాబట్టి, ఓ సోదరులారా, వస్వాస్ ఖహ్రీ (Waswaas Qahree) ఉందని చెప్పబడుతున్న ఈ సోదరుడికి, అంటే వస్వాస్ ఎవరినైతే పూర్తిగా లోబరుచుకుందో అతనికి ఉన్న ఏకైక నివారణ మార్గం – పూర్తిగా ముఖం తిప్పుకోవడమే. మరియు పూర్తిగా ముఖం తిప్పుకోవడం అంటే, అది తనకు ఎలాంటి హాని చేయదని, అల్లాహ్ అపార కరుణామయుడని, మరియు దీని కారణంగా అల్లాహ్ తన దాసులను శిక్షించడం అసాధ్యమని, మరియు ఇది మతంలో (ధర్మంలో) భాగం కాదని అతను కచ్చితమైన నమ్మకాన్ని కలిగి ఉండాలి!
అల్లాహ్ ఇలా అంటున్నాడు: “మరియు ఆయన మతంలో మీపై ఎలాంటి కష్టాన్నీ మోపలేదు…” (22:78). ఒక వ్యక్తి డెబ్భై సార్లు వుజూ చేయాలనేది మతంలో భాగం ఎలా అవుతుంది?! కాబట్టి మీరు దీనిని తెలుసుకోవాలి మరియు దానిపై పూర్తి నమ్మకంతో ఉండాలి, అంతే! ప్రజలు సాధారణంగా ఏమి చేస్తారో మీరూ అదే చేయండి, మరియు (ఆ ఆలోచనల నుండి) ముఖం తిప్పుకోండి. మీరు మీ పనిని కొనసాగించండి, వస్వాస్ కారణంగా దానిని వదిలిపెట్టవద్దు. మరియు వస్వాస్ కారణంగా ఏ పనీ చేయకండి. అల్లాహ్ సాక్షిగా, అల్లాహ్ అనుమతితో అతడు నయమవుతాడు. మరియు ఇది మాకు అనుభవం ద్వారా తెలుసు.
అల్లాహ్ సాక్షిగా, ఓ సోదరులారా. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు, తన భార్యకు సంబంధించి, అతను ఆమెకు విడాకులు ఇస్తున్నాడని షైతాన్ ఎప్పుడూ అతనికి గుసగుసలు చెబుతూ ఉండేవాడు. అతను ఆమెతో కలిసి ఆమె కుటుంబం దగ్గరికి వెళ్ళి, “నీ కుటుంబం దగ్గరికి వెళ్ళు” అని ఆమెతో చెబితే, ఇబ్లీస్ అతని దగ్గరికి వచ్చి, “నువ్వు ఇప్పుడే ఆమెకు విడాకులు ఇచ్చేశావు” అని చెప్పేవాడు. కొన్నిసార్లు అతను రాత్రి రెండు గంటలకు మరియు మూడు గంటలకు నాకు ఫోన్ చేసి, “ఓ షేక్, ప్రస్తుతం ఆమె నా పక్కన మంచంపై ఉంది, ఆమె నా భార్యా లేక నేను ఆమెకు విడాకులు ఇచ్చేశానా?” అని అడిగేవాడు. మొదట్లో మేము అతనికి ఇలా చెప్పాము: “నీవు ఈ విషయాన్ని వదిలేసే వరకు నిన్ను నీవు అల్లాహ్ స్మరణలో (జిక్ర్ లో) బిజీగా ఉంచుకో.” అప్పుడు అతను తనను తాను అల్లాహ్ స్మరణలో బిజీగా ఉంచుకోవడం ప్రారంభించాడు, ఆ తర్వాత ఇబ్లీస్ అతని దగ్గరకు రావడం మొదలుపెట్టాడు; అతడు “సుబ్ హా నల్లాహ్ ” అన్నప్పుడల్లా ఇబ్లీస్, “లేదు! నువ్వు ఆమెకు విడాకులు ఇచ్చావని పరోక్షంగా చెబుతున్నావు” అని చెప్పేవాడు. అతడు “అల్లాహు అక్బర్ అన్నప్పుడల్లా ఇబ్లీస్, “నువ్వు ఆమెకు విడాకులు ఇచ్చావని పరోక్షంగా చెబుతున్నావు! మరియు ఇది పరువుకు సంబంధించిన విషయం!” అని చెప్పేవాడు. ఈ వ్యవహారం తీవ్రంగా మారిందని మేము చూసినప్పుడు, దీనిని పూర్తిగా పట్టించుకోవద్దని (ఈ వస్వాస్ నుండి ముఖం తిప్పుకోమని) అతనికి సలహా ఇచ్చాము. అప్పుడు అతను కొంతకాలం దానిని పట్టించుకోకుండా ఉండేవాడు, కానీ మళ్ళీ (తన పాత వస్వాస్ స్థితికి) తిరిగి వచ్చేవాడు. అతను కొన్నిసార్లు నా ఇంటికి వచ్చేవాడు, నేను అతన్ని నా ఇంటి నుండి బయటికి పంపించేసేవాడిని. ఎందుకంటే అతనికి ఊరటనిచ్చే వారు ఎవరో ఒకరు ఉన్నారని వాడికి తెలిసినంత కాలం, అతను తన వస్వాస్ ను కొనసాగిస్తూనే ఉంటాడు. కానీ మేము అతనికి ఒక సూత్రాన్ని నేర్పాము. కొంతకాలం తర్వాత, సర్వ ప్రశంసలు మరియు ఆశీర్వాదాలు అల్లాహ్ కే చెందుతాయి, అతని జీవితం స్థిరంగా మారింది మరియు ఈ వస్వాస్ అతని నుండి పూర్తిగా వెళ్లిపోయింది, ఎందుకంటే అతను ఆ సూత్రంపై స్థిరంగా ఉన్నాడు. మరియు నాకు చాలా మంది తెలుసు, వారిలో ఒకరికి ఇరవై ఏళ్ళకు పైగా వస్వాస్ ఉంది! అతను మా దగ్గరకు వచ్చాడు, మేము అతనికి సలహా ఇచ్చాము మరియు కొంతకాలం అతని పట్ల సహనంతో వ్యవహరించాము, ఆ తర్వాత అల్లాహ్ ఈ విధానం ద్వారా అతనికి నయం చేశాడు. కాబట్టి ఆ సోదరుడికి నా సలహా ఏమిటంటే, నేను పేర్కొన్న విధంగా అతను ఆచరించాలి, మరియు అల్లాహ్ కే బాగా తెలుసు.
—
అరబ్బీ / ఇంగ్లీష్ తెలిసిన వారు క్రింది వీడియో చూసి లాభం పొందండి :
వారు అల్లాహ్ను వదలి స్త్రీలను మొరపెట్టు కుంటున్నారు. వాస్తవానికి వారసలు పొగరుబోతు షైతానును మొరపెట్టు కుంటున్నారు.అల్లాహ్ వాణ్ణి శపించాడు. షైతాను ఇలా అన్నాడు: “నీ దాసుల నుండి నేను నిర్ణీత భాగాన్ని పొంది తీర్తాను. వారిని దారి నుంచి తప్పిస్తూ ఉంటాను. వారికి ఉత్తుత్తి ఆశలు చూపిస్తూ ఉంటాను. పశువుల చెవులు చీల్చమని వారికి పురమాయిస్తాను. అల్లాహ్ సృష్టిని మార్చమని వారిని ఆదేశిస్తాను.” వినండి! అల్లాహ్ను వదలి షైతానును తన స్నేహితునిగా చేసుకున్నవాడు స్పష్టంగా నష్టపోయినట్లే.వాడు వారికి వట్టి వాగ్దానాలు చేస్తూ ఉంటాడు. ఆశలు కలిగిస్తూ ఉంటాడు. కాని షైతాను వారితో చేసే వాగ్దానాలన్నీ మోసపూరితమైనవే.ఇటువంటి వారు చేరుకోవలసిన స్థలం నరకం. ఇక వారికి దాన్నుంచి తప్పించుకునే మార్గం ఏదీ ఉండదు. (దివ్యఖుర్ఆన్ 4: 117–121)
దైవేతరులను మొరపెట్టుకునేవారు వాస్తవానికి స్త్రీల పూజారులు. కొందరు నూకాలమ్మ, మర్యమ్మ, పోచమ్మ, ఉప్పలమ్మ, మైసమ్మ, కోటసత్తమ్మ, బషీరమ్మ, బతుకమ్మ, నంగాలమ్మ, సమక్క, సారలమ్మ ఇంకా ఎందరో దేవతలను, అమ్మవారిని మరియు కాళీని పూజిస్తుంటారు. ఇవన్నీ కేవలం కల్పితాలు మాత్రమే. వారికి ఎటువంటి వాస్తవం లేదు. అవన్నీ షైతాన్ కల్పించిన దురాలోచనలు మాత్రమే. వాటినే వారు దైవాలుగా భావిస్తున్నారు. ఈ కల్పిత దైవాలు చూపించేవి, చెప్పేవి అంతా షైతాన్ ఆడుతున్న నాటకం.
ముష్రిక్కులు (బహుదైవారాధకులు) చేస్తున్న ఆరాధనలన్నీ షైతాన్ కోసమే. వారు దేవతలను మొక్కుకుంటున్నామని అనుకుంటున్నారు. వాస్తవానికి వారు షైతాన్ ను మొక్కుకుంటున్నారు. ఈ విషయాల వల్ల ప్రాపంచిక ప్రయోజనం ఉండదు. ధార్మిక ప్రయోజనమూ ఉండదు. ఎందుకంటే షైతాన్ బహిష్కరించబడినవాడు. ఇతని వల్ల ధార్మిక ప్రయోజనం ఏ కోశానా లేదు. ఎందుకంటే షైతాన్ మానవుడి బద్ధ శత్రువు. అలాంటివాడు మానవుడికి మేలు జరగాలని ఎలా కోరుకుంటాడు? అతను అల్లాహ్ ముందు, ‘నేను నీ దాసులను దారి మళ్ళించి నా దాసులుగా చేసుకుంటాను, నన్నే విశ్వసించేలా వారి మనసుల్ని మార్చేస్తాను, వారు నా పేర జంతువులను జిబహ్ చేస్తారు. వారిపై నా కోసం మొక్కుకున్న గుర్తులుంటాయి. ఉదాహరణకు: జంతువుల చెవులను కోస్తారు. వారి మెడలో దండలేస్తారు. వారి నొసటిపై గోరింటాకు రాస్తారు. నోట్లో డబ్బు పెడతారు. వాటి వల్ల చాలా స్పష్టంగా అది మొక్కుకోబడిన జంతువని ఇట్టే అర్థమవుతుంది. నా ప్రభావం వల్ల నీవు ఇచ్చిన రూపాన్ని కూడా మార్చుకుంటారు. దేవతల పేర కేశాలు కత్తిరించకుండా అలాగే వదలిపెడతారు. చెవులు, ముక్కులు కుట్టించు కుంటారు. గడ్డాలు తీయించుకుంటారు. కనుబొమ్మలు తీయించుకుని నిరుపేదల్లా కనబడేలా చేస్తాను’ అన్నాడు.
ఇవన్నీ షైతాన్ కార్యాలే. ఇవన్నీ ఇస్లాం ధర్మానికి విరుద్ధం. కరుణామయుడైన అల్లాహ్ ను వదలి, శత్రువైన షైతాన్ మార్గాన్ని అవలంబించినవాడు స్పష్టమైన మోసంలో పడిపోయాడు. ఎందుకంటే షైతాన్ దురాలోచనలు రేపడం తప్ప మరేమీ చేయలేడు. అబద్ధాలతో, వాగ్దానాలతో మానవుణ్ణి మోసపుచ్చుతాడు. ఫలానా పని చేస్తే ఫలానా మంచి జరుగుతుంది. ఇన్ని డబ్బులుంటే చాలు అందమైన తోటను తయారు చేసుకోవచ్చు. సుందరమైన భవనాన్ని నిర్మించుకోవచ్చు అని ఆశలు రేకెత్తిస్తాడు. కాని ఆ కోరికలు తీరవు. కనుక మానవుడు ఆందోళన చెంది అల్లాహ్ ను విస్మరించి ఇతరులను మొరపెట్టుకుంటాడు. కాని అతని అదృష్టంలో ఉన్నదే జరుగుతుంది. వారిని నమ్మడం వల్ల ఒరిగేది ఏమీలేదు. ఇవన్నీ షైతాన్ రేపే కలతలు. ఇది అతని కుట్ర. అతని మాటలు విని మానవుడు షిర్క్ లో చిక్కుకుంటాడు. ఎంత ప్రయత్నించినా షైతాన్ ఉచ్చునుండి విముక్తి పొందలేకపోతాడు. చివరికి నరకానికి పాత్రుడవుతాడు. ఈ విషయాలు తెలిసిన తరువాత స్పృహ కలిగి తప్పించుకోనే ప్రయత్నం చేసి అల్లాహ్ అనుగ్రహంతో రక్షించబడిన వాడు తప్ప.
—
ఈ పోస్ట్ క్రింది పుస్తకం , 7 వ అధ్యాయం నుండి తీసుకోబడింది: విశ్వాస ప్రదాయిని(తఖ్వియతుల్ ఈమాన్) ఉర్దూ మూలం: హదీసు వేత్త షాహ్ ఇస్మాయీల్ (రహిమహుల్లాహ్)
11- శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉంటే అక్కడ చెయి పెట్టి, 3సార్లు బిస్మిల్లాహ్, 7 సార్లు అఊజు బిఇజ్జతిల్లాహి వఖుద్రతిహీ మిన్ షర్రి మా అజిదు వఉహాజిర్. (ముస్లిం 2202).
12- ఉదయం సాయంకాలం మరియు నిద్రించేకి ముందు దుఆలలో. … అఊజు బిక మిన్ షర్రి నఫ్సీ వషర్రిష్ షైతాని వ షిర్కిహీ. (అబూ దావూద్ 5067).
తన ప్రభువు వచనాల ద్వారా హితబోధ చేసినప్పటికీ, విముఖత చూపి, తన చేతులతో ముందుగా చేసి పంపుకున్న దానినే మరచిపోయిన వానికన్నా ఎక్కువ దుర్మార్గుడెవడుంటాడు? వారు దానిని (ఖుర్ఆనును) అర్థం చేసుకోకుండా మేము వారి హృదయాలపై తెరలు వేసేశాము. వారి చెవులకు చెవుడు కలిగించాము. నువ్వు సన్మార్గం వైపుకు వారిని పిలుస్తూ ఉన్నప్పటికీ, వారు ఎన్నటికీ సన్మార్గం పొందేవారు కారు
నీ ప్రభువు క్షమాగుణం కలవాడు, దయాశీలి. వారి చేష్టలకు శిక్షగా ఆయన గనక వారిని పట్టుకున్నట్లయితే, వారిని తొందరగానే శిక్షించి ఉండేవాడు. అసలు విషయం ఏమిటంటే వారి కోసం ఒక వాగ్దాన సమయం నిర్ధారితమై ఉంది. దాన్నుంచి తప్పించుకునిపోయే చోటేదీ వారికి దొరకదు.
ప్రజల వద్దకు మార్గదర్శకత్వం వచ్చేసిన తరువాత కూడా వారు విశ్వసించకుండా, క్షమాభిక్షకై తమ ప్రభువును వేడుకోకుండా వారిని ఆపిన విషయం ఒక్కటే – అదేమిటంటే, గత కాలంలోని ప్రజలకు ఎదురైన వ్యవహారమే తమకూ ఎదురవ్వాలనీ లేదా ప్రత్యక్షంగా తమ ముందుకు శిక్ష రావాలని వారు నిరీక్షించటం.
మేము ప్రవక్తలను శుభవార్తలను అందజేయటానికి, హెచ్చరికలు చేయటానికి మాత్రమే పంపిస్తాము. అవిశ్వాసులు అసత్యం ఆధారంగా వాదులాడతారు. దాని ద్వారా సత్యాన్ని ఖండించటానికి (ప్రయత్నిస్తారు.) వారు నా ఆయతులను, వారికి చేస్తున్న హెచ్చరికలను ఆషామాషీగా తీసుకున్నారు.
ఆదమ్ ముందు సాష్టాంగపడమని మేము దూతలకు ఆజ్ఞాపించినప్పుడు, ఒక్క ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. అతడు జిన్నాతుల కోవకు చెందినవాడు. వాడు తన ప్రభువు ఆజ్ఞను జవదాటాడు.అయినప్పటికీ మీరు నన్ను వదిలేసి, మీ అందరికీ శత్రువు అయినవాణ్ణీ, వాడి సంతానాన్నీ మీ స్నేహితులుగా చేసుకుంటున్నారా? ఇటువంటి దుర్మార్గులకు లభించే ప్రతిఫలం ఎంత చెడ్డది!
నేను భూమ్యాకాశాలను సృష్టించినప్పుడుగానీ, స్వయంగా వీళ్ళను పుట్టించినపుడుగానీ వారిని అక్కడ ఉంచలేదు. అపమార్గం పట్టించే వారిని నేను నా సహాయకులుగా చేసుకోను.
నాకు భాగస్వాములని మీరు భావించిన (వారెక్కడ?) వారిని పిలవండి” అని ఆయన చెప్పిన రోజున వారు (తమ మిధ్యా దైవాలను) పిలుస్తారు. కాని వారిలో ఏ ఒక్కరూ సమాధానం ఇవ్వరు. మేము వారి మధ్యన వినాశాన్ని ఏర్పరుస్తాము.
You must be logged in to post a comment.