
[01:03:56 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
అంశాలు: వుజూ ఘనత, వుజూ విధానం
ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]
వుజూ :
వుజూ లేని నమాజ్ అంగీకరింపబడదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారని అబూ హురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
لَا يَقْبَلُ اللهُ صَلَاةَ أَحَدِكُمْ إِذَا أَحْدَثَ حَتَّى يَتَوَضَّأَ
“మీలో ఎవనికైనా అపానవాయువు జరిగితే అతను వుజూ చేసుకోనంత వరకు అల్లాహ్ అతని నమాజును అంగీకరించడు”. (బుఖారి 6954).
వుజూ ఘనతలు చాలా ఉన్నాయి. వుజూ సందర్భంలో అవి గుర్తుకు తెచ్చుకోవడం మంచిది. వాటిలో కొన్ని ఇవి: ముస్లిం 245లో ఉంది:.
مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ خَرَجَتْ خَطَايَاهُ مِنْ جَسَدِهِ حَتَّى تَخْرُجَ مِنْ تَحْتِ أَظْفَارِهِ
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శుభవార్త ఇచ్చారని, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“ఎవరు వుజూ చేసినప్పుడు పూర్తి శ్రద్ధతో మంచి విధంగా చేస్తారో అతని శరీరం నుండి అతని పాపాలన్నీ రాలిపోతాయి. చివరికి గోళ్ళ నుండి కూడా వెళ్ళిపోతాయి”.
مَنْ أَتَمَّ الْوُضُوءَ كَمَا أَمَرَهُ اللهُ تَعَالَى فَالصَّلَوَاتُ الْـمَكْتُوبَاتُ كَفَّارَاتٌ لِمَا بَيْنَهُنَّ
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారని, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“అల్లాహ్ ఆదేశించిన విధంగా సంపూర్ణంగా వుజూ చేసేవారు, వారి ఫర్జ్ నమాజులు వాటి మధ్య జరిగే పాపాల ప్రక్షాళనకు కారణభూతమవుతాయి”. (ముస్లిం 231).
వుజూ విధానం :
* వుజూలో ఒక అవయవం తర్వాత మరో అవయవం క్రమ ప్రకారంగా మరియు వెంటవెంటనే కడుగుట తప్పనిసరి ([1]).
[1] క్రమ ప్రకారంగా వుజూ చేయాలి. అంటే: 1 నుండి 8 వరకు ఉన్న క్రమం ప్రకారం వీటిలో వెనకా ముందు చేయకూడదు. వెంటవెంటనే చేయాలి. అంటేః పై క్రమం ప్రకారం, ఒక అవయవం కడిగాక, దాని తడి ఆరక ముందే వెంటనే దాని వెనక అవయవం కడగాలి. మరీ ఆలస్యం చేయవద్దు.
1- వుజూ నియ్యత్ (సంకల్పం) నోటితో పలుకకుండా మనుసులోనే చేయాలి. ఒక పని చేయుటకు మనుసులో నిర్ణయించుకోవడమే ‘నియ్యత్’.
మళ్ళీ బిస్మిల్లాహ్ అనాలి. (క్రింది వుజూ చిత్రాలు చూడండి).

2- రెండు అరచేతులను మణికట్ల వరకు మూడు సార్లు కడగాలి. (చిత్రం2).
3- మూడు సార్లు నోట్లో నీళ్ళు తీసుకొని పుక్కిలించి, ముక్కులో నీళ్ళు ఎక్కించి శుభ్రం చేయాలి. (చిత్రాలు 3, 4).
4- మూడు సార్లు ముఖము కడగాలి. అడ్డంలో కుడి చెవి నుండి ఎడమ చెవి వరకు. నిలువులో నొసటి పై భాగం నుండి గదువ క్రింది వరకు. (చి.5)
5- రెండు చేతులు మూడేసి సార్లు కడగాలి. వ్రేలు మొదటి భాగము నుండి మోచేతుల వరకు. ముందు కుడి చెయ్యి, తరువాత ఎడమ చెయ్యి. (చి.6)
6- ఒక సారి తల ‘మసహ్’ చేయాలి. అంటే రెండు చేతులను తడి చేసి తల మొదటి (నుదుటి) భాగము నుండి వెనక మెడ వరకు తీసుకెళ్ళి మళ్ళీ వెనక నుండి మొదటి వరకు తలను స్పర్శిస్తూ తీసుకురావాలి. (చూడండి చిత్రం 7 మరియు దాని తర్వాత చిత్రం).
7- ఒక సారి రెండు చెవుల ‘మసహ్’ చేయాలి. అంటే రెండు చూపుడు వ్రేళ్ళతో చెవి లోపలి భాగాన్ని, బొటన వ్రేళ్ళతో పై భాగాన్ని స్పర్శించాలి. (చిత్రం 8.)
8- రెండు కాళ్ళను వ్రేళ్ళ నుండి చీలమండల వరకు మూడేసి సార్లు కడగాలి. ముందు కుడి కాలు తరువాత ఎడమ కాలు.
9- తర్వాత దుఆ చదవాలి: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారని, ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “మీలో ఎవరైనా సంపూర్ణంగా వుజూ చేసుకొని ‘అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహ్’ చదువుతారో అతని కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి, ఎందులో నుండి ప్రవేశించ గోరినా అతని ఇష్టం“. (ముస్లిం 234).
أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ
(నేను సాక్ష్యమిస్తున్నాను; అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడని, ఆయన ఏకైకుడు భాగస్వామీ లేనివాడని మరియు సాక్ష్యమిస్తున్నాను; ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త).
ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు
- ఫిఖ్ హ్ (తహారా,శుద్ధి – నమాజు) – పార్ట్ 01 [వీడియో] [51:22 నిముషాలు]
పరిశుభ్రత, అపరిశుభ్రత, నజాసత్ (అశుద్దత) రకాలు, నజాసత్ (అశుద్దత) ఆదేశాలు - ఫిఖ్ హ్ (శుద్ధి,నమాజు) – పార్ట్ 02: మల మూత్ర విసర్జన పద్ధతులు [వీడియో]
You must be logged in to post a comment.