సుత్రా (అడ్డంకి) లేకుండా నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుండి ఎలా వెళ్ళాలి?

షేక్ అరఫాత్ ఇబ్న్ హసన్ అల్-ముహమ్మదీ:

సున్నత్ ఏమిటంటే, మీరు నమాజులో నిలబడి ఉన్నప్పుడు, మీకు మరియు సుత్రాకు మధ్య మూడు మూరల దూరం ఉండాలి. మరియు మీరు సజ్దా (సాష్టాంగం) లో ఉన్నప్పుడు, మీ తలకు మరియు సుత్రాకు మధ్య ఒక గొర్రె దాటి వెళ్ళడానికి సరిపడేంత ఖాళీ స్థలం ఉండాలి.

ఉదాహరణకు, సుత్రా ఇక్కడ ఉండి, నమాజు చేసే వ్యక్తి ఇక్కడ ఉంటే, అతను ఫలానా చోట సజ్దా చేస్తాడు. కాబట్టి సజ్దా స్థితిలో అతని తలకు మరియు సుత్రాకు మధ్య ఒక గొర్రె లేదా మేక వెళ్ళడానికి సరిపడేంత ఖాళీ స్థలం మిగిలి ఉండాలి.

కాబట్టి, మీరు (నమాజు చేసే వ్యక్తి ముందు నుండి) దాటి వెళ్ళాలనుకుంటే, సుత్రా ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశానికి అవతలి వైపు (వెలుపల) నుండి వెళ్ళాలి. ఉదాహరణకు, ఆ వ్యక్తి సజ్దా లో ఉన్నట్లయితే, ఒక గొర్రె వెళ్ళడానికి ఎంత స్థలం పడుతుందో అంచనా వేయండి, ఆ తర్వాత సుత్రా ఎక్కడ ఉంటుందో (అది ఒక చిన్న వస్తువు అయినప్పటికీ) అంచనా వేసి, దానికి ఆవల (వెనుక) నుండి వెళ్ళండి. ఇది మాత్రమే అనుమతించబడినది. ఈ స్థితిలో మీరు ఆ విధంగా దాటి వెళ్ళడం మీకు అనుమతించబడుతుంది.

అరబీ మూలం: https://t.me/Arafatbinhassan/9848
ఆంగ్లానువాదం: యాసీన్ ఇబ్న్ జమాల్ (Yāsīn ibn Jamāl)
https://salafitranslations.com/how-to-pass-in-front-of-someone-praying-without-sutrah-barrier

లుఖ్మాన్ (అలైహిస్సలాం) ఉపదేశాలు: జీవన విద్య – హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

లుఖ్మాన్ (అలైహిస్సలాం) ఉపదేశాలు: జీవన విద్య
హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/H-0-b8o_u2M [30 నిముషాలు]

ఈ ప్రసంగంలో సురయే లుఖ్మాన్ ఆధారంగా ‘జీవన విద్య’ గురించి వివరించారు. లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి ఇచ్చిన ఎనిమిది ముఖ్యమైన ఉపదేశాలను ఈ క్రింది విధంగా చర్చించారు: అల్లాహ్ పట్ల ఏకత్వాన్ని కలిగి ఉండటం (తౌహీద్), తల్లిదండ్రుల పట్ల గౌరవం మరియు విధేయత చూపడం, అల్లాహ్ యొక్క సర్వవ్యాప్త జ్ఞానాన్ని గుర్తించి తఖ్వాతో జీవించడం, నమాజును నిలబెట్టడం, సమాజంలో మంచిని ప్రబోధించి చెడును నిరోధించడం, కష్ట సమయాల్లో సహనం (సబర్) పాటించడం, అహంకారాన్ని వీడి వినయాన్ని అలవరచుకోవడం మరియు మాట తీరులో, నడకలో మర్యాదను పాటించడం. చివరగా ఈ ఐదు సూత్రాలు—తౌహీద్, నమాజ్, అఖ్లాక్, సబర్, వినయం—మానవ జీవితానికి మరియు సమాజ శ్రేయస్సుకు పునాదులని ఆయన సారాంశం ఇచ్చారు.

అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

إِنَّ الْحَمْدَ لِلَّهِ ، نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ ، وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا ، وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا ، مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ ، وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ.

(ఇన్నల్ హమ్దలిల్లాహి నహ్మదుహు వ నస్తయీనుహు వ నస్తగ్ఫిరుహు, వ నవూజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా, వ మిన్ సయ్యిఆతి ఆ’మాలినా, మన్ యహదిహిల్లాహు ఫలా ముజిల్ల లహు, వ మన్ యుజ్లిల్ ఫలా హాదియ లహు, వ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు.)

అల్లాహుమ్మ సల్లి వసల్లిమ్ వ బారిక్ అలా అబ్దిక వ రసూలిక ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సకల ప్రశంసలు సర్వలోక ప్రభువైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తన అనుగ్రహాలను కురిపించు గాక.

అభిమాన సోదరులారా! ఈ రోజు మనం పరిశీలించబోయే విషయం: లుఖ్మాన్ అలైహిస్సలాం ఉపదేశాలు – జీవన విద్య. మన జీవితాన్ని సన్మార్గంలో నడిపించే అమూల్యమైన మార్గదర్శకత్వం లుఖ్మాన్ అలైహిస్సలాం వారి ఉపదేశాలలో ఉంది. ఖురాన్ లో ఒక సూరా పేరే ‘లుఖ్మాన్’. ఇందులో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి ఇచ్చిన ఉపదేశాలను పేర్కొన్నాడు. కానీ ఆ ఉపదేశాలు కేవలం ఒక తండ్రి సలహాలు కాదు, ఇవి సమగ్ర జీవన విద్య.

అన్నిటికంటే ముఖ్యమైనది తౌహీద్. ఇస్లాం యొక్క మొదటి మరియు అత్యంత ముఖ్యమైన బోధన తౌహీద్. ఇదే విషయం ముస్లిములు మరియు ముష్రికుల మధ్య స్పష్టమైన తేడాను ఏర్పరుస్తుంది. దీనిని నిరాకరించే వ్యక్తి ముష్రిక్ అవుతాడు. అలాంటి వ్యక్తికి లోకంలోనూ, పరలోకంలోనూ అవమానం మరియు అపకీర్తి తప్పదు. ఎందుకంటే షిర్క్ చేయడం అంటే ఒకే ఒక్క దేవుడైన అల్లాహ్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, ఆయన అస్తిత్వాన్ని నిరాకరించడం అవుతుంది. మరోవైపు షిర్క్ చేసే వ్యక్తి తనలాంటి లేదా తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న సృష్టుల ముందు తల వంచి, తనను తాను అవమానించుకుంటాడు మరియు హీన స్థితికి దిగజారుతాడు.

లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి ఇచ్చిన మొదటి హితబోధ, మొదటి నసీహత్ ఇదే తౌహీద్ గురించి, షిర్క్ ఖండన గురించి:

وَإِذْ قَالَ لُقْمَانُ لِابْنِهِ وَهُوَ يَعِظُهُ يَا بُنَيَّ لَا تُشْرِكْ بِاللَّهِ ۖ إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ
(వ ఇజ్ కాల లుఖ్మాను లిబ్నిహీ వహువ యఇజుహు యా బునయ్య లా తుష్రిక్ బిల్లాహి ఇన్నష్షిర్క లజుల్మున్ అజీమ్)

లుఖ్మాన్‌ తన కుమారునికి హితబోధ చేస్తూ ఇలా అన్నాడు: “ఓ నా ముద్దుల పుత్రుడా! అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించకు. నిస్సందేహంగా అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించటం (షిర్క్‌ చేయటం) ఘోరమైన అన్యాయం.”(31:13)

లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి చేసిన మొట్టమొదట ఉపదేశం షిర్క్ నుండి వారించడం. దీనిని బట్టి విదితమయ్యేదేమిటంటే, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎప్పుడు హితోపదేశం చేసినా ప్రధాన స్థానంలో షిర్క్ ఖండన, తౌహీద్ అంగీకారం గురించే అయి ఉండాలి. షిర్క్ నుండి వారించే మాటలు తప్పకుండా చెప్పాలి. తమ పిల్లలలో అల్లాహ్ ఏకత్వాన్ని నూరిపోయాలి.

జీవన విద్యలో మొదటి పాఠం తౌహీద్. ఇది మనం బాగా తెలుసుకోవాలి. విశ్వాసం సరిగ్గా ఉంటే జీవితం సరిగ్గా ఉంటుంది. మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు: “ఎవరైతే షిర్క్ చేయకుండా చనిపోతారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు.” అందుకే మనము చదివే, పఠించే కలిమా – ‘కలిమతుత్ తౌహీద్’ – లా ఇలాహ ఇల్లల్లాహ్ లో మొదటి భాగం ఏమిటి? షిర్క్ ఖండన. రెండవ భాగం తౌహీద్ అంగీకారం ఉంటుంది. నఫీ – ఇస్ బాత్. లా ఇలాహ (దేవుడు లేడు), ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప). అంటే మొదటి భాగం ఏమి ఉంది? షిర్క్ ఖండన ఉంది. రెండవ భాగంలో తౌహీద్ అంగీకారం గురించి ఉంటుంది.

కావున లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి బోధించిన మొదటి విషయం, నసీహత్ చేసిన మొదటి నసీహత్ అది తౌహీద్ గురించి, షిర్క్ ఖండన గురించి ఉంది. ఎందుకంటే ఇది జీవితంలో అన్నిటికంటే ప్రధానమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది. దీనికి మించినది ఏదీ లేదు.

ఇక రెండో విషయానికి వస్తే, తౌహీద్ తర్వాత అమ్మ నాన్న గురించి ఉంటుంది, తల్లిదండ్రుల గురించి ఉంటుంది. ఇస్లాం ధర్మంలో తల్లిదండ్రుల గౌరవానికి అత్యున్నత స్థానం ఉంది. అల్లాహ్ ఆరాధన తర్వాత వెంటనే తల్లిదండ్రుల పట్ల దయ, విధేయతను ఖురాన్ ఆదేశిస్తుంది. లుఖ్మాన్ సూరాలో, ఆయత్ 14 లో ఇలా ఉంటుంది:

وَوَصَّيْنَا الْإِنْسَانَ بِوَالِدَيْهِ حَمَلَتْهُ أُمُّهُ وَهْنًا عَلَىٰ وَهْنٍ وَفِصَالُهُ فِي عَامَيْنِ أَنِ اشْكُرْ لِي وَلِوَالِدَيْكَ إِلَيَّ الْمَصِيرُ

(వ వస్సైనల్ ఇన్ సాన బివాలిదైహి హమలత్ హు ఉమ్ముహు వహ్నన్ అలా వహ్నిన్ వ ఫిసాలుహు ఫీ ఆమైని అనిష్కుర్ లీ వ లివాలిదైక ఇలయ్యల్ మసీర్)

మరి మేము మానవునికి అతని తల్లిదండ్రుల విషయంలో గట్టిగా తాకీదు చేశాము- అతని తల్లి అతన్ని ప్రయాసపై ప్రయాసకు ఓర్చుకుంటూ తన గర్భంలో మోసింది. మరి అతని పాలను విడిపించటానికి రెండు సంవత్సరాలు పట్టింది. (కనుక ఓ మానవుడా!) నువ్వు నాకూ, నీ తల్లిదండ్రులకూ కృతజ్ఞుడవై ఉండు. (ఎట్టకేలకు మీరంతా) మరలి రావలసింది నా వద్దకే.(31:14)

ఈ ఆయతులు తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత, సహనం, దయ చూపాలని స్పష్టంగా బోధిస్తాయి.

మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు: “అల్లాహ్ సంతృప్తి తల్లిదండ్రుల సంతృప్తిలో ఉంది. అల్లాహ్ అసంతృప్తి తల్లిదండ్రుల అసంతృప్తిలో ఉంది.”

ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ని అడిగాడు: “నా మంచి సహవాసానికి ఎవరు ఎక్కువ అర్హులు?” మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “నీ తల్లి“. అతను మూడు సార్లు అడిగితే, మూడు సార్లు కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నీ తల్లి” అని చెప్పారు. నాలుగవ సారి “నీ తండ్రి” అని సమాధానం ఇచ్చారు.

అంటే తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, వారితో మృదువుగా మాట్లాడాలి, వారి అవసరాలు తీర్చాలి, వారి కోసం దుఆ చేయాలి. ఈ విధంగా రెండవ విషయం లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి చేసింది అది తల్లిదండ్రుల గురించి.

ఖురాన్ మరియు హదీసు ప్రకారం తల్లిదండ్రుల గౌరవం ఒక మహత్తర ఇబాదత్. వారిని సంతోషపరచడం ద్వారా అల్లాహ్ సంతోషాన్ని పొందవచ్చు. అందుకే ప్రతి ముస్లిం తన తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం, విధేయతతో ఉండాలి. ఇది రెండవ విషయం. లుఖ్మాన్ అలైహిస్సలాం యొక్క ఉపదేశాల విషయంలో ‘వ వస్సైనల్ ఇన్ సాన బివాలిదైహి’ అని ఉంటుంది.

మొదటిది ఏంటి? తౌహీద్, నమ్మకం, విధేయత, ఆజ్ఞాపాలన. రెండవది ఏమిటి? తల్లిదండ్రుల గురించి. అంటే తల్లి కష్టాలు, తండ్రి పోషణ – ఇది మనకు ఏమి నేర్పుతుంది? కుటుంబ విలువలు సమాజానికి పునాది.

ఇక మూడవ విషయానికి వస్తే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సర్వజ్ఞుడు. బాధ్యతా భావం కలుగుతుంది దీనివల్ల. అంటే లుఖ్మాన్ అలైహిస్సలాం చేసిన మూడవ హితోపదేశం:

يَا بُنَيَّ إِنَّهَا إِن تَكُ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ فَتَكُن فِي صَخْرَةٍ أَوْ فِي السَّمَاوَاتِ أَوْ فِي الْأَرْضِ يَأْتِ بِهَا اللَّهُ ۚ إِنَّ اللَّهَ لَطِيفٌ خَبِيرٌ

(యా బునయ్య ఇన్నహా ఇన్ తకు మిస్ ఖాల హబ్బతిమ్ మిన్ ఖర్దలిన్ ఫతకున్ ఫీ సఖ్రతిన్ అవ్ ఫిస్ సమావాతి అవ్ ఫిల్ అర్జి యాతి బిహల్లాహు ఇన్నల్లాహ లతీఫున్ ఖబీర్)

(లుఖ్మాన్‌ తన కుమారునికి ఇలా బోధపరిచాడు) “నాయనా! ఏదైనా వస్తువు ఆవగింజంత ఉన్నా, అది ఏదైనా రాతి బండలో ఉన్నా, లేక అది ఆకాశాలలో ఉన్నా లేదా భూమిలో ఉన్నా దాన్ని అల్లాహ్‌ తప్పకుండా తీసుకువస్తాడు. నిశ్చయంగా అల్లాహ్‌ సూక్ష్మ విషయాలను ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు. (31:16)

అంటే ఒక ఆవగింజంత పని అయినా అల్లాహ్ గమనిస్తాడు. రహస్య జీవితంలో కూడా తఖ్వా కలిగి ఉండాలి అన్న మాట. సమాజంలో ఉన్నా, సమూహంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఏకాంతంలో ఉన్నా ఎలాగైనా సరే, రాత్రి పగలు ఎక్కడైనా సరే అల్లాహ్ గమనిస్తున్నాడు. ఏదీ కూడా అల్లాహ్ తో గోప్యంగా లేదు. ప్రతి విషయం అల్లాహ్ కు తెలుసు. రహస్య జీవితంలో కూడా తఖ్వా కలిగి ఉండాలి అని బోధపడుతుంది మనకు.

ఈ కాలంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉపయోగించేది మొబైల్. కావున అల్లాహ్ చూస్తున్నాడని గుర్తుంచుకోవాలి. హరామ్ కంటెంట్ చూడకూడదు, చెడు చాటింగ్ చేయకూడదు, చెడు సంబంధాలు నివారించాలి. రహస్యంగా చేసిన పాపం కూడా అల్లాహ్ కు చాలా బాగా తెలుసు. ఇది మనలో తఖ్వా పెంచుతుంది ఈ భావన. ఈ హితోపదేశం ఆవగింజంత కూడా అల్లాహ్ కు తెలుసు అంటే నేను ఏది చేసినా, నేను ఏది ఊహించినా అల్లాహ్ ఎరుగుతాడు. అన్ని విషయాలు అల్లాహ్ కు తెలుసు. కావున ఈ భావన కలిగి ఉంటే ఏమవుతుంది? తఖ్వా పెరుగుతుంది, దైవభీతి పెరుగుతుంది.

ఇక నాలుగవ ఉపదేశం లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి చేసిన ఉపదేశం నాలుగవది: నమాజ్ స్థాపన.

يَا بُنَيَّ أَقِمِ الصَّلَاةَ…
(యా బునయ్య అఖిమిస్ సలాత…)

“ఓ నా కుమారా! నమాజును స్థాపించు…” (31:17)

ఇస్లాం ధర్మంలో సలాహ్ (నమాజు) అత్యంత ముఖ్యమైన ఇబాదత్. ఇది ఇస్లాం యొక్క ఐదు స్తంభాలలో ఒక స్తంభం. అర్కానుల్ ఇస్లాం లోని ఒక రుకున్. అల్లాహ్ పై విశ్వాసం తర్వాత అత్యంత ప్రధానమైన కర్తవ్యం అస్సలాహ్.

నమాజ్ గురించి ఖురాన్ లో అనేక చోట్ల ప్రస్తావించబడింది. “నమాజ్ ను స్థాపించండి, జకాత్ ఇవ్వండి” – సూరయే బఖరాలో, సూరయే అన్కబూత్ లో, సూరయే తాహాలో అనేక సూరాలలో ఉంది. నమాజ్ అసభ్య కార్యాల నుండి, చెడు పనుల నుండి నివారిస్తుంది. అంటే ఈ ఆయత్ కి చాలా వివరంగా చెప్పవచ్చు – ‘ఇన్నస్ సలాత తన్ హా అనిల్ ఫహ్ షాయి వల్ మున్ కర్’. నమాజ్, నమాజ్ చేసే వ్యక్తిని చెడు పని నుండి, పాపం నుండి, ఫహ్ షా నుండి, మున్ కర్ నుండి కాపాడుతుంది అని ఇది ఖురాన్ వాక్యం, ఖురాన్ ఆయత్. మరి ఇప్పుడు మనం సమాజంలో గమనిస్తున్నాము – నమాజులు చేస్తున్నాము, పాపాలు చేస్తున్నాము. నమాజులు చేస్తున్నాము, సినిమాలు చూస్తున్నాము. నమాజ్ చేస్తున్నాము, బూతులు మాట్లాడుతున్నాము. నమాజ్ చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు. నమాజులు చేస్తున్నారు, అనేక పాపాలకి పాల్పడుతున్నారు. అంటే మరి అల్లాహ్ వాగ్దానం కదా అది ఖురాన్ లో, ఆయత్ లో ఉంది కదా! ప్రతి ప్రవక్త నమాజ్ గురించి హెచ్చరించారు. మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రాణం పోయే ఆ సమయంలో కూడా ‘అస్సలాత్ అస్సలాత్’ అని చెప్పారు. మరి ఇటువంటి నమాజ్ మరి నమాజ్ చేసే వ్యక్తిని పాపాల నుండి, దుర్మార్గాల నుండి, మోసాల నుండి, చెడు నుండి ఎందుకు కాపాడటం లేదు అంటే – నమాజ్ చేసే రీతిలో, ఏ విధానంలో నమాజ్ చేయాలో, ఏ హక్కులతో నమాజ్ చేయాలో, ఏ రీతిలో నమాజ్ చేయాలో, ఏ భక్తితో, ఏ భావనతో నమాజ్ చేయాలో, ఎటువంటి విశ్వాసంతో నమాజ్ చేయాలో, ఏ విధానంతో నమాజ్ చేయాలో ఆ విధానం లేదు కాబట్టి. “నన్ను స్మరించుటకై నమాజ్ స్థాపించు”. ఈ ఆయతులు నమాజ్ మనిషిని పాపాల నుండి దూరంగా ఉంచి అల్లాహ్ స్మరణలో ఉంచుతుందని తెలియజేస్తాయి.

మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా నమాజ్ గురించి అనేక సందర్భాలలో అనేక విధాలుగా తెలియజేసి ఉన్నారు. “మన మధ్య మరియు కుఫ్ర్ మధ్య తేడా అనేది నమాజ్.” రేపు ప్రళయ దినాన మనిషి నుండి మొదట అడగబడేది నమాజ్ గురించే.

ఈ విధంగా నమాజ్ గురించి చాలా విషయాలు ఉన్నాయి. నమాజ్ వల్ల కలిగే ప్రయోజనాలలో అల్లాహ్ కు దగ్గరవ్వడం, హృదయానికి శాంతి, పాపాల క్షమాపణ, క్రమశిక్షణ మరియు సమయపాలన, సమాజంలో ఐక్యత (జమాత్ నమాజ్ ద్వారా). ఈ విధంగా నమాజ్ గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఖురాన్ మరియు హదీసు ప్రకారం నమాజ్ ముస్లిముల జీవితానికి ఆధారం. ఇది కేవలం ఆచారం కాదు, ఇది అల్లాహ్ తో నేరుగా సంబంధాన్ని బలపరిచే పవిత్రమైన మార్గం. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. నమాజ్ అనేది కేవలం ఆచారం కాదు. ఇది అల్లాహ్ తో నేరుగా సంబంధాన్ని బలపరిచే పవిత్రమైన మార్గం. క్రమంగా ఖుషూ (భక్తి), వినయంతో నమాజ్ ఆచరించడం ద్వారా ఈ లోకంలో శాంతి, పరలోకంలో విజయం లభిస్తాయి.

ఇక ఐదవ హితోపదేశం: మంచి ఆజ్ఞాపన, చెడు నిరోధం – అమర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్ కర్. మంచిని పెంపొందించడం, చెడును నిర్మూలించడం.

…وَأْمُرْ بِالْمَعْرُوفِ وَانْهَ عَنِ الْمُنكَرِ…
(…వ ముర్ బిల్ మ’రూఫి వన్ హ అనిల్ మున్కరి…)

“…మంచిని ఆదేశించు, చెడును వారించు…” (31:17)

అంటే సమాజ బాధ్యత అని అర్థం దీనికి. సమాజ బాధ్యత ప్రతి ముస్లింకి ఉంది. అమర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్ కర్ వలన ఏం జరుగుతుంది? సమాజంలో న్యాయం జరుగుతుంది, సమాజంలో శాంతి ఉంటుంది, సమాజంలో సమానత్వం ఉంటుంది.

ఇస్లాం ధర్మంలో వ్యక్తిగత భక్తితో పాటు సామాజిక బాధ్యత, సమాజం పట్ల కర్తవ్యం కూడా అత్యంత ముఖ్యమైనది. ముస్లిం కేవలం తన కోసం మాత్రమే కాకుండా సమాజ మేలు కోసం జీవించాలని ఖురాన్ మరియు హదీసులు బోధిస్తాయి.

ఖురాన్ లో సూరయే మాయిదాలో ఉంది: “నీతి, భయభక్తుల విషయాల్లో పరస్పరం సహకరించండి. పాపం, దుర్మార్గంలో సహకరించవద్దండి.” ‘తఆవనూ అలల్ బిర్రి వత్ తఖ్వా, వ లా తఆవనూ అలల్ ఇస్మి వల్ ఉద్వాన్’. మంచి విషయాలలో, పుణ్యానికి సంబంధించిన విషయాలలో, సత్కార్యాలలో ఒకరికొకరు సహాయంగా, తోడుగా ఉండాలి. పాపంతో కూడిన విషయాలలో సహాయం చేయకూడదు. ఈ విధంగా నిజమైన నీతి అనేది తన సంపదను బంధువులకు, అనాధలకు, నిరుపేదలకు ఇవ్వడం. అలాగే సూరయే ఆలి ఇమ్రాన్ లో ఉంటుంది: “మీరు ఉత్తమ సమాజం, మీరు మంచి పనులను ఆజ్ఞాపించి చెడు పనులను నిరోధిస్తారు.” ఈ ఆయతులు సమాజంలో న్యాయం, దయ, సహాయం, ధర్మం స్థాపించాల్సిన బాధ్యతను గుర్తు చేస్తాయి.

మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేశారు: “మీలో ఎవరికైనా తన సోదరుడికి ఇష్టమైనదే తనకూ ఇష్టమైతే అతడు నిజమైన విశ్వాసి.” తన కోసం ఏది ఇష్టపడతాడో, సోదరుని కోసం కూడా అదే ఇష్టపడాలి. అటువంటి వ్యక్తే నిజమైన విశ్వాసి.

ప్రజలకు అత్యంత మేలు చేసేవారే ఉత్తములు. ఇంకా మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ఎవరు చెడు చూడగలిగితే దానిని చేతితో ఆపాలి. సాధ్యం కాకపోతే మాటతో ఆపాలి. ఇది కూడా సాధ్యం కాకపోతే హృదయంలో అసహ్యించుకోవాలి. ఇది ఈమాన్ లో అత్యంత బలహీనమైన స్థాయి.”

ముస్లిముల సామాజిక కర్తవ్యాలలో జకాత్, సదఖా ఇవ్వడం, పేదలు, అనాధలు, వితంతువులకు సహాయం చేయడం, నిజాయితీతో వ్యాపారం చేయడం, పొరుగువారిని గౌరవించడం, అన్యాయాన్ని వ్యతిరేకించడం, సమాజంలో శాంతి ఐక్యత పెంపొందించడం. ఇవన్నీ అమర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్ కర్ ద్వారా జరుగుతాయి. ఖురాన్ మరియు హదీసు ప్రకారం ప్రతి ముస్లిం వ్యక్తి సమాజానికి మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. సమాజ సేవ కూడా ఒక ఇబాదత్. దయ, న్యాయం, సహకారం, సత్యం – ఇవే ఇస్లాం బోధించే సామాజిక బాధ్యతల మూల సూత్రాలు.

ఇక ఆరవ ఉపదేశం: సబర్, సహనం.

…وَاصْبِرْ عَلَىٰ مَا أَصَابَكَ…
(…వస్ బిర్ అలా మా అసాబక…)

“…మరియు నీపై వచ్చి పడే (కష్టాలను) సహనంతో భరించు…” (31:17)

జీవితం అంటే సమస్యలు, కష్టాలు, బాధలు, రోగాలు, ఇష్టం లేని విషయాలు చాలా వస్తా ఉంటాయి. వాటిలో సహనం వహించాలి. పరీక్షలు ఉంటాయి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పాపాల మూలంగానో లేకపోతే పరీక్ష నిమిత్తమో పరీక్షిస్తాడు. పరీక్షలు అంటే జీవితంలో భాగమే అవి. సబర్ విజయానికి మార్గం. సహనం ఇస్లాం ధర్మంలో అత్యున్నత గుణాలలో ఒకటి. కష్టకాలంలో స్థిరంగా ఉండటం, పాపాల నుండి దూరంగా ఉండటం, అల్లాహ్ పై నమ్మకంతో ఉండటం ఇవన్నీ సబర్ లోని భాగాలు.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ లో ఇలా తెలియజేశాడు: “ఓ విశ్వాసులారా! సహనం మరియు నమాజ్ ద్వారా సహాయం కోరండి. నిజంగా అల్లాహ్ సహనంతో ఉన్నవారితో ఉంటాడు.” ఇంకా సూరయే ఆలి ఇమ్రాన్ లో ఇలా ఉంటుంది: “ఓ విశ్వాసులారా! సహనం పాటించండి, స్థిరంగా ఉండండి.” సూరయే జుమర్ లో ఉంటుంది: “సహనం పాటించే వారి ప్రతిఫలం లెక్క లేనిది.”

ఈ ఆయతులు సబర్ ఉన్న వాడికి అల్లాహ్ ప్రత్యేకత ప్రతిఫలం ఇస్తాడని తెలియజేస్తున్నాయి. ఈ విధంగా సబర్ గురించి చాలా విషయాలు ఖురాన్ మరియు హదీసులో ఉన్నాయి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేశారు: “నిజమైన సహనం కష్టం మొదటి దెబ్బలోనే కనిపిస్తుంది.” అంటే సహనం యొక్క రకాలు అనేక రకాలుగా ఉంటాయి: ఆజ్ఞాపాలనలో సబర్ (ఇబాదత్ లో సబర్ – నమాజ్, ఉపవాసం వంటి ఇబాదత్ లో స్థిరంగా ఉండటం), పాపాల నుండి దూరంగా ఉండటంలో సబర్, అలాగే కష్టకాలంలో సహనం (అనారోగ్యం, నష్టం, పరీక్షలు వచ్చినప్పుడు అల్లాహ్ పై నమ్మకం కలిగి ఉండటం). ఖురాన్ మరియు హదీసు ప్రకారం సహనం ఒక విశ్వాసి యొక్క బలమైన ఆయుధం. సబర్ ద్వారా మనం అల్లాహ్ కు దగ్గరవుతాము, ఈ లోకంలో శాంతిని పరలోకంలో విజయాన్ని పొందుతాము.

ఇక ఏడవ ఉపదేశం: అహంకారం, దాన్ని విడిచిపెట్టడం.

وَلَا تُصَعِّرْ خَدَّكَ لِلنَّاسِ وَلَا تَمْشِ فِي الْأَرْضِ مَرَحًا…
(వ లా తుసఇ’ర్ ఖద్దక లిన్నాసి వ లా తమ్ షి ఫిల్ అర్జి మరహన్…)

జనుల ముందు (గర్వంతో) మొహం తిప్పుకొని మాట్లాడకు. భూమిపై నిక్కుతూ నడవకు…” (31:18)

ఓ నా కుమారా! అహంకారం – కిబ్ర్ – ఇస్లాం ధర్మంలో తీవ్రంగా నిషేధించబడిన దోషం. మనిషి తనను తాను గొప్పవాడిగా భావించి ఇతరులను తక్కువగా చూడటం ఇది అల్లాహ్ కు ఇష్టం లేని గుణం. వినయం మాత్రమే విశ్వాసి యొక్క లక్షణం. ప్రజల పట్ల నీ చెంపను తిప్పవద్దు, గర్వంగా చూడవద్దు, భూమిపై అహంకారంగా నడవవద్దు. అల్లాహ్ గర్విష్టులను ఇష్టపడడు అని లుఖ్మాన్ అలైహిస్సలాం బోధించిన విషయం ఇది.

ఇంకా వేరే చోట్ల ఉంది ఖురాన్ లో: “నిస్సందేహంగా అల్లాహ్ అహంకారులను ఇష్టపడడు.” ఇంకో చోట ఇలా ఉంది: “భూమిపై అన్యాయంగా అహంకారం ప్రదర్శించే వారిని నా ఆయతుల నుండి తిప్పివేస్తాము.” ఈ ఆయతులు అహంకారం మనిషిని సత్యం నుండి దూరం చేస్తుందని స్పష్టం చేస్తాయి.

మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా దీని గురించి అనేక సందర్భాలలో అనేక విషయాలు చెప్పారు. “ఎవరి హృదయంలో ఆవగింజంత అహంకారం ఉన్నా అతడు స్వర్గంలో ప్రవేశించడు.” సహాబాలు అడిగారు: “ఓ ప్రవక్తా! ఒక మనిషి తన దుస్తులు చెప్పులు అందంగా ఉండాలని కోరుకోవడం కూడా అహంకారమేనా?” దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానం ఇచ్చారు: “అల్లాహ్ సుందరుడు, సౌందర్యాన్ని ఇష్టపడతాడు. అహంకారం అనేది సత్యాన్ని తిరస్కరించడం మరియు ప్రజలను తక్కువగా చూడడం.” కావున అహంకారం వల్ల కలిగే నష్టాలలో ఒకటి సత్యాన్ని అంగీకరించకపోవడం, అలాగే ఇతరులను తక్కువగా చూడడం, సమాజంలో విభేదాలు ఏర్పరచడం. ఇవన్నీ అల్లాహ్ కోపానికి గురవడం అవుతుంది. దానికి విరుద్ధంగా కిబ్ర్ కి విరుద్ధంగా వినయం – వినయం ఉన్న వారిని అల్లాహ్ ఉన్నత స్థాయికి చేరుస్తాడు. వినయం విశ్వాసిని ప్రజల హృదయాల్లో ప్రియంగా చేస్తుంది. ఇది ప్రవక్తల లక్షణం. ఖురాన్ మరియు హదీసు ప్రకారం అహంకారం ఒక ప్రమాదకరమైన పాపం. మనిషి తన సంపద, జ్ఞానం, స్థానం వల్ల గర్వపడకూడదు. అన్నీ అల్లాహ్ అనుగ్రహమే అని గుర్తించి వినయంతో జీవించడం నిజమైన విశ్వాసి లక్షణం.

అలాగే ఎనిమిదవది: మిత భాషణ. మాట్లాడే తీరు, మాట్లాడే విధానం, బాడీ లాంగ్వేజ్.

وَاقْصِدْ فِي مَشْيِكَ وَاغْضُضْ مِن صَوْتِكَ ۚ إِنَّ أَنكَرَ الْأَصْوَاتِ لَصَوْتُ الْحَمِيرِ
(వక్ సిద్ ఫీ మష్ యిక వగ్ జుజ్ మిన్ సౌతిక ఇన్న అన్ కరల్ అస్వాతి లసౌతుల్ హమీర్)

“నీ నడకలో మధ్యేమార్గం అవలంబించు. నీ కంఠ స్వరాన్ని కాస్త తగ్గించు. నిశ్చయంగా స్వరాలన్నింటిలోకీ అత్యంత కఠోరమైనది గాడిదల స్వరం.” (31:19)

నడకలో మధ్యేమార్గం అవలంబించు. నీ కంఠ స్వరాన్ని కాస్త తగ్గించు. నిశ్చయంగా స్వరాలన్నింటిలోకి అత్యంత కఠోరమైనది గాడిద స్వరం. మిత భాషణ అంటే మన మాటల్లో నియంత్రణ, దయ, నిజాయితీ మరియు మర్యాదతో మాట్లాడటం. ఖురాన్ మరియు హదీసు ప్రకారం మాటల శక్తి సమాజంలో శాంతి మరియు ఐక్యతకు మూలం. నిజమైన ముస్లిం – మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పిన మాట – నిజమైన ముస్లిం వ్యక్తి తన చేతులతో మరియు తన భాషతో ఇతరులకు హాని చేయడు. ‘అల్ ముస్లిము మన్ సలీమల్ ముస్లిమూన మిన్ లిసానిహి వ యదిహి’. ఒక ముస్లిం అనేవాడు తన చేతి ద్వారా, తన బిహేవియర్ ద్వారా, మాటల ద్వారా ఇతరులకు హాని కల్పించడు. అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తే నిజమైన ముస్లిం అని మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేశారు. అలాగే సదా మంచి మాట చెప్పడం కూడా సదఖా. మంచి మాట – అది కూడా సదఖా కిందకు వస్తుందని మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు.

ఖురాన్ మరియు హదీసు ప్రకారం మిత భాషణ ఒక మహత్తర మానవ గుణం. మాటల ద్వారా హాని కలిగించకుండా సమాజంలో శాంతి మరియు ఐక్యతను కొనసాగించడం ప్రతి ముస్లిం యొక్క కర్తవ్యం. మంచి మాటలు వాడటం కూడా ఒక ఇబాదత్ మరియు అది మన వ్యక్తిత్వానికి మెరుగుపరుస్తుంది. అంటే బాడీ లాంగ్వేజ్ కూడా బాగుండాలి.

అభిమాన సోదరులారా! ఈ విధంగా లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి చేసిన ఉపదేశాలు దానికి వివరంగా చెప్పుకుంటూ పోతే చాలా సమయం అవసరం పడుతుంది. క్లుప్తంగా దీని యొక్క సారాంశం లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి ఇచ్చిన ఉపదేశాలలోని సారాంశం ఐదు పదాలలో చెప్పాలంటే:

  1. తౌహీద్ (అల్లాహ్ పట్ల నమ్మకం, విధేయత, ఆజ్ఞాపాలన)
  2. నమాజ్ (క్రమశిక్షణ)
  3. అఖ్లాక్ (వ్యక్తిత్వం)
  4. సహనం (స్థిరత్వం)
  5. వినయం (గొప్పతనం)

ఇదే జీవన విద్య. అంటే మూడు ముక్కల్లో చెప్పాలంటే:

  • అల్లాహ్ తో సంబంధం
  • కుటుంబంతో సంబంధం
  • సమాజంతో సంబంధం

ఇదే కదా ప్రపంచం, ప్రాపంచిక జీవితం. అంటే పూర్తి జీవితం దీంట్లో ఇమిడిపోయింది. ఈ విధంగా జీవితం గడిపితే ప్రపంచంలో, సమాజంలో, కుటుంబంలో, స్నేహితుల్లో, బంధువుల్లో అన్ని చోట్ల, అన్ని ప్రాంతాల్లో, అన్ని సమయాల్లో శాంతి ఉంటుంది, న్యాయం ఉంటుంది, భద్రత ఉంటుంది, సమానత్వం ఉంటుంది, హాయిగా జీవితం గడుపుతుంది.

అల్లాహ్ తో సంబంధం ఎలా ఉండాలి, కుటుంబంతో సంబంధం ఎలా ఉండాలి, సమాజంతో సంబంధం ఎలా ఉండాలి. ఇదే ఈ ఉపదేశాలకి సారాంశం, ఇదే జీవన విద్య.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ ఈ విలువలను మన కుటుంబాల్లో ఈ విధంగా అమలు చేసి జీవించే సద్బుద్ధిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ ప్రసాదించు గాక. లుఖ్మాన్ అలైహిస్సలాం కు ఇచ్చిన హిక్మత్ తో హిక్మత్ లో మాకు భాగం ఇవ్వు, ప్రసాదించు గాక. మన పిల్లలను సాలిహీన్లుగా చేయు గాక. మన జీవితాలను ఖురాన్ తో అలంకరించు గాక. ఆమీన్ యా రబ్బిల్ ఆలమీన్.

اللَّهُمَّ اغْفِرْ لِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ وَالْمُسْلِمِينَ وَالْمُسْلِمَاتِ الأَحْيَاءِ مِنْهُمْ وَالأَمْوَاتِ ، اللَّهُمَّ أَصْلِحْ شَبَابَ الْمُسْلِمِينَ وَارْزُقْنَا التَّوْحِيدَ الْخَالِصَ ، وَأَعِنَّا عَلَى إِقَامَةِ الصَّلاةِ وَاجْعَلْنَا مِنَ الصَّابِرِينَ الْمُتَوَاضِعِينَ ، آمِين يَا رَبَّ الْعَالَمِينَ.

వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=46052

అత్-తహియ్యాత్ (తషహ్హుద్) గురుంచి ఒక లోతైన పరిశీలన – షేక్ అబ్దుర్రజ్జాక్ అల్-బద్ర్

Reflecting Over the Tahiyyāt (Tashahud)
Shaykh ‘Abdurrazzāq al Badr حفظه الله
https://youtu.be/Vqy0FWKrsSU [35 min]

షేక్ అబ్దుర్రజ్జాక్ అల్-బద్ర్:

గౌరవనీయులైన నా ప్రియ సోదరులారా! ఈ రాత్రి మన సమావేశపు ప్రసంగానికి నేను ‘అత్తహియ్యాత్ (తషహ్హుద్) – ఒక లోతైన పరిశీలన’ అని పేరు పెట్టాను.

ఒక ముస్లిం తన నమాజులో ఖియామ్ (నిలబడటం), రుకూ (వంగడం) మరియు సజ్దాలు చేసిన తరువాత, నమాజు ముగింపు దశలో సమస్త లోకాల ప్రభువైన అల్లాహ్ ఎదుట అత్యంత భక్తిశ్రద్ధలతో కూర్చుంటాడు. ఆ గొప్ప స్థితిలో కూర్చుని చదివే ప్రార్థననే ‘తహియ్యాత్’ అంటారు. ఆ కూర్చోవడాన్ని అతను ‘అత్తహియ్యాతు లిల్లాహి…’ అనే వాక్యంతో ప్రారంభించి దాని చివరి వరకు చదువుతాడు.

ఈరోజు ‘అత్తహియ్యాత్’ గురించి నేను మీతో పంచుకోబోయే విషయాలు మీకు ఏదో కొత్తగా బోధించాలన్న ఉద్దేశ్యంతో చెబుతున్నవి కావు; కేవలం ఒక మంచి విషయాన్ని మీకు గుర్తుచేయాలన్న (రిమైండర్) ఉద్దేశ్యంతో మాత్రమే చెబుతున్నాను.

నేను ఇక్కడ ఒక ఉపాధ్యాయుడిలా కాకుండా, కేవలం ఒక గుర్తుచేసేవాడిగా ఉంటూ… ముందుగా నాకై నేను గుర్తుచేసుకుంటూ, ఆ తర్వాత వింటున్న నా సోదరులందరికీ ఈ విషయాలను గుర్తుచేస్తున్నాను. అల్లాహ్ మనందరినీ ఆశీర్వదించుగాక! సకల సత్కార్యాలలో అల్లాహ్ మనకు సాఫల్యాన్ని (విజయాన్ని), సన్మార్గాన్ని ప్రసాదించాలని నేను హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను.

సహీహైన్‌లో అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) హదీసులో ఇలా ఉంది, ఆయన అన్నారు:

(كُنَّا إِذَا صَلَّيْنَا خَلْفَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قُلْنَا: السَّلَامُ عَلَى اللَّهِ مِنْ عِبَادِهِ، السَّلَامُ عَلَى جِبْرِيلَ وَمِيكَائِيلَ، السَّلَامُ عَلَى فُلَانٍ وَفُلَانٍ، فَقَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: لَا تَقُولُوا السَّلَامُ عَلَى اللَّهِ، فَإِنَّ اللَّهَ هُوَ السَّلَامُ، وَلَكِنْ قُولُوا: التَّحِيَّاتُ لِلَّهِ وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ، السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ، السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللَّهِ الصَّالِحِينَ، فَإِنَّكُمْ إِذَا قُلْتُمُوهَا أَصَابَتْ كُلَّ عَبْدٍ لِلَّهِ صَالِحٍ فِي السَّمَاءِ وَالْأَرْضِ، أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ)

“మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక నమాజు చేస్తున్నప్పుడు ఇలా అనేవాళ్ళము: ‘ఆయన దాసుల తరపున అల్లాహ్‌కు శాంతి కలుగుగాక, జిబ్రీల్ మరియు మీకాయీల్‌పై శాంతి కలుగుగాక, ఫలానా ఫలానా వ్యక్తులపై శాంతి కలుగుగాక.’

అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “మీరు ‘అల్లాహ్‌కు శాంతి కలుగుగాక’ అని అనకండి, ఎందుకంటే అల్లాహ్ స్వయంగా ‘అస్-సలామ్’ (శాంతికి మూలం / శాంతి ప్రదాత). దానికి బదులుగా మీరు ఇలా చదవండి:

‘అత్-తహియ్యాతు లిల్లాహి వస్-సలవాతు వత్-తయ్యిబాత్, అస్సలాము అలైక అయ్యుహన్-నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలై‌నా వ అలా ఇబాదిల్లాహిస్-సాలిహీన్’

(అర్థం: సకల మౌఖిక, శారీరక, ఆర్థిక ఆరాధనలు మరియు పవిత్రమైన మాటలన్నీ అల్లాహ్‌కే చెందినవి. ఓ ప్రవక్తా! మీపై శాంతి, అల్లాహ్ కారుణ్యం మరియు ఆయన శుభాలు కురియుగాక. మాపై మరియు అల్లాహ్ యొక్క సజ్జనులైన (పుణ్యాత్ములైన) దాసులందరిపై శాంతి కలుగుగాక).

ఎందుకంటే, మీరు ఇలా అన్నప్పుడు, ఆకాశంలో మరియు భూమిపై ఉన్న అల్లాహ్ యొక్క ప్రతి పుణ్యాత్ముడైన దాసుడికి అది (ఈ శాంతివచనం) చేరుతుంది.

(తరువాత ఇలా చదవండి): ‘అష్-హదు అల్-లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్-హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు’
(అర్థం: అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన వారు మరెవరూ లేరని నేను సాక్ష్యమిస్తున్నాను, మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన దాసుడు, సందేశహరుడు (ప్రవక్త) అని నేను సాక్ష్యమిస్తున్నాను).”

ప్రవక్త ﷺ తన ఉమ్మత్ (సమాజం)కి నేర్పించిన ఈ గొప్ప తహియ్యాత్‌ను పేర్కొనడంలో ఇది ఒక అద్భుతమైన హదీసు. దీని నుండి మనం ఒక ముఖ్యమైన ప్రయోజనాన్ని పొందుతాము.

అజ్కార్ చదవడంలో తొందరపడే వారికి సలహా – షేక్ అల్-అల్బానీ

Advice To Those Who Rush Their Adhkār
By Shaykh Muḥammad Nāṣiruddin al Albānī رحمه الله
https://youtu.be/gUvqx7zOpDA
[6 min] [Arabic | English Subtitles]

షేక్ అల్-అల్బానీ (రహిమహుల్లాహ్):

చాలా మంది ప్రజలు, కేవలం ఫరాయిద్ (తప్పనిసరి చర్యలు) మాత్రమే కాకుండా నవాఫిల్ (ఐచ్ఛిక చర్యలు) మరియు ముస్తహబ్ (సిఫార్సు చేయబడినవి) విషయాలలో కూడా కట్టుబడి ఉండడాన్ని నేను గమనిస్తున్నాను. ఉదాహరణకు, నమాజు తర్వాత చేసే జిక్ర్, తస్బీహ్ (సుబ్ హా నల్లాహ్), తహ్మీద్ (అల్ హమ్ దు లిల్లాహ్), తక్బీర్ (అల్లాహు అక్బర్) మరియు ఇలాంటివి. కాబట్టి, వారిలో కొందరు ప్రవక్త (ﷺ) గారి ఈ మాటను ఆచరించాలనుకున్నప్పుడు నేను గమనించినదేమిటంటే,

“من سبح الله دبر كل صلاة ثلاثا وثلاثين وحمد الله ثلاثا وثلاثين وكبر الله ثلاثا وثلاثين ثم قال تمام المائة لا إله إلا الله وحده لا شريك له، له الملك وله الحمد وهو على كل شيء قدير غفرت له ذنوبه وإن كانت مثل زبد البحر”

(“ప్రతి నమాజు తర్వాత ఎవరైతే 33 సార్లు ‘సుబ్ హా నల్లాహ్’, 33 సార్లు ‘అల్ హమ్ దు లిల్లాహ్’, మరియు 33 సార్లు ‘అల్లాహు అక్బర్’ అని చదివి, ఆ తర్వాత వంద పూర్తి చేయడానికి ‘లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్’ (అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులైన వారు ఎవరూ లేరు, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. సార్వభౌమాధికారం ఆయనదే, సర్వ స్తోత్రాలు ఆయనకే మరియు ఆయన ప్రతిదానిపై పూర్తి అధికారం కలిగినవాడు) అని అంటారో, వారి పాపాలు సముద్రపు నురగ అంత ఉన్నప్పటికీ క్షమించబడతాయి.“)

ఈ హదీసు ప్రామాణికమైనది (సహీహ్), దీనిని ఇమామ్ ముస్లిం తన సహీహ్‌లో ఉల్లేఖించారు.

వారు ఈ హదీసును ఆచరించాలనుకున్నప్పుడు, వారిలో కొందరు ‘సుబ్ హా నల్లాహ్’, ‘అల్ హమ్ దు లిల్లాహ్’, మరియు ‘అల్లాహు అక్బర్’ అని తమ నాలుకతో కనీసం స్పష్టంగా పలకకపోవడాన్ని మీరు చూస్తారు. మరి మీరు ఏమి వింటారు?… మీరు చూసినట్లే నేను కూడా చూశానని అనుకుంటున్నాను. ఈ వాదనలో నేను ఒంటరిని కాదు. దీనిని మనం ఏమని పిలుస్తాము?… అప్పుడు… ఇది తస్బీహ్ (సుబ్ హా నల్లాహ్) కాదు, తహ్మీద్ (అల్ హమ్ దు లిల్లాహ్) కాదు… కొన్ని క్షణాల్లో లేదా కొన్ని సెకన్లలోనే వంద పూర్తి చేసేస్తారు.

ఈ వంద, ఎవరైతే (సరైన విధంగా) చేస్తారో, దానికి ప్రతిఫలం ఏమిటి? వారి పాపాలు సముద్రపు నురగ అంత ఉన్నప్పటికీ అల్లాహ్ క్షమిస్తాడు. ఒకవేళ ఎవరైనా ఈ విధంగా (అజ్కార్‌ను చాలా వేగంగా) చేస్తే, అల్లాహ్ రక్షించుగాక! దీన్ని నెమ్మదిగా, సమయం తీసుకుని చేయడం తప్పనిసరి. కాబట్టి చివర వరకు ‘సుబ్ హా నల్లాహ్’, ‘సుబ్ హా నల్లాహ్’, ‘సుబ్ హా నల్లాహ్’, ‘అల్ హమ్ దు లిల్లాహ్’, ‘అల్ హమ్ దు లిల్లాహ్’ అంటూ స్పష్టంగా చదవాలి.

నా తదుపరి మాటల ద్వారా, ప్రజలు 33 సార్లు తస్బీహ్ చేయడం మరియు హదీసులో మిగిలిన దానిని ఆచరించడం నుండి వారిని దూరం చేయాలని నేను అనుకోవడం లేదు. ఇస్లామీయ చట్టం ప్రకారం వారికి ఏది ఉత్తమమో మరియు ఏది చేయడానికి సులభమో దానికి వారిని చేరువ చేయాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను.

మీరందరూ లేదా మీలో కనీసం కొందరైనా ఈ హదీసును మొదటిసారిగా వింటారని నేను భావిస్తున్నాను, ఇది చాలా ముఖ్యమైన హదీసు. ఇది కూడా ఇమామ్ నసాయి, ఇమామ్ హాకిమ్ మరియు ఇతరులచే ఉల్లేఖించబడిన ప్రామాణికమైన (సహీహ్) హదీసు. ఇది సహాబాల (ప్రవక్త అనుచరుల) నుండి రెండు ప్రామాణికమైన ఉల్లేఖన గొలుసుల (సనద్‌ల)తో వచ్చింది.

“أن رجلا من أصحاب النبي صلى الله عليه وآله وسلم رأى في المنام شخصا يسأله ما الذي علمكم الرسول عليه السلام قال علمنا سبحان الله وذكر هذا العدد الذي سبق بيانه في الحديث السابق فقال ذلك الشخص للرائي في المنام قال اجعلوهن خمسا وعشرين اجعلوهن خمسا وعشرين”

(“ప్రవక్త (ﷺ) గారి సహచరులలో ఒకరు కలలో ఒక వ్యక్తి తనను ఇలా అడగడం చూశారు, ‘దైవప్రవక్త (ﷺ) మీకు ఏమి నేర్పించారు?’ దానికి అతను, ‘ఆయన మాకు సుబ్ హా నల్లాహ్ నేర్పించారు’ అని చెప్పి, మునుపటి హదీసులోని సంఖ్యను పేర్కొన్నాడు. అప్పుడు కలలోని ఆ వ్యక్తి, ‘వాటిని 25 చేయండి’ అని అన్నాడు. అంటే: సుబ్ హా నల్లాహ్, అల్ హమ్ దు లిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, మరియు అల్లాహు అక్బర్ అని (ప్రతిదీ 25 సార్లు) చెప్పండి.“)

కాబట్టి వంద వరకు లెక్కించే దానిని ఇరవై ఐదుకు మార్చండి. ఇరవై ఐదు సార్లు నెమ్మదిగా మరియు శ్రద్ధగా చదవాలి, మనం తీవ్రంగా వ్యతిరేకించే ఆదుర్దా మరియు వేగంతో కాదు. కాబట్టి అతను సుబ్ హా నల్లాహ్ మరియు అల్ హమ్ దు లిల్లాహ్ చెప్పడంలో తొందరపడడు. అతను తొందరపడడు, మరియు అతను చదవడం మీరు వింటే.. సుబ్ హా నల్లాహ్, సుబ్ హా నల్లాహ్, సుబ్ హా నల్లాహ్… లా ఇలాహ ఇల్లల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్… అని వేగంగా చదవడం కంటే ఇది మరింత పరిపూర్ణంగా ఉంటుంది.. ఎందుకంటే వేగంగా చదివేవారి నుండి తర్వాత మీరు అల్లాహ్, అల్లాహ్, అల్లాహ్.. అని మాత్రమే వింటారు.

మొదటి హదీసులో పేర్కొన్న తస్బీహ్ మరియు తహ్మీద్ విషయంలో, నమాజు తర్వాత తొందరపడే వారికి ఇది ఒక రక్షణ. వారు ఈ నాలుగింటిని (సుబ్ హా నల్లాహ్, అల్ హమ్ దు లిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, మరియు అల్లాహు అక్బర్) కలిపి 25 సార్లు చదవాలి. సుబ్ హా నల్లాహ్, అల్ హమ్ దు లిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, 25 సార్లు.

ఆ వ్యక్తి తన కలలో చూసిన పూర్తి హదీసును సాక్ష్యంగా తీసుకుంటే, ఇది మరింత ఉత్తమమైనది. కలలను అర్థం చేసుకోవడంలో మనకు నైపుణ్యం లేదు కాబట్టి, అది కలగలిపిన అబద్ధపు కల కావచ్చు మరియు వివరణ (తఫ్సీర్) కాకపోవచ్చు అని ఎవరైనా అనుకోవచ్చు.

“لكن هذا الرجل الرائي للرؤيا قصها على النبي صلى الله عليه وسلم فكان جوابه فافعلوا إذن”
(“అయితే, కల కన్న ఈ వ్యక్తి దానిని ప్రవక్త (ﷺ) కు వివరించగా, ఆయన ఇచ్చిన సమాధానం, ‘అలాగే, దానిని ఆచరించండి’ అనేది.“)

ఇక్కడ మనకు ఫిఖ్హ్ కు సంబంధించిన ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇది మొదటి హదీసును రద్దు చేస్తుందా? తస్బీహ్ (సుబ్ హా నల్లాహ్) 33 సార్లు, తహ్మీద్ (అల్ హమ్ దు లిల్లాహ్) 33 సార్లు, తక్బీర్ (అల్లాహు అక్బర్) 33 సార్లు మరియు తహ్లీల్ (లా ఇలాహ ఇల్లల్లాహ్) 1 సారి. కాదు! ఇది దానిని రద్దు చేయదు. ఇది కేవలం ప్రాధాన్యత మాత్రమే.

నమాజు చేసే వ్యక్తి తన నమాజు తర్వాత అజ్కార్‌ను 33 సార్లు ఎలాంటి తొందర లేకుండా ప్రశాంతంగా, నెమ్మదిగా చేస్తే, అందులో ఎలాంటి సమస్య లేదు. అయితే, మరింత ఉత్తమమైనది ఏమిటంటే ఈ నాలుగింటిని (సుబ్ హా నల్లాహ్, అల్ హమ్ దు లిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, మరియు అల్లాహు అక్బర్) కలిపి 25 సార్లు చదవడం. మునుపటి హదీసు ప్రకారం ఆచరించడం కంటే ఇది అతనికి మరింత ఉత్తమమైనది.

నమాజు తర్వాత అజ్కార్ చదవడంలో తొందరపడే వారికి షేక్ అల్-అల్బానీ గారి సలహా సారాంశం:

సమస్య: నమాజు తర్వాత చదివే అజ్కార్ (సుబ్ హా నల్లాహ్ 33 సార్లు, అల్ హమ్ దు లిల్లాహ్ 33 సార్లు, అల్లాహు అక్బర్ 33 సార్లు) చదవడంలో చాలా మంది ప్రజలు తీవ్రంగా తొందరపడుతున్నారని షేక్ అల్-అల్బానీ గారు గమనించారు. వారు పదాలను స్పష్టంగా పలకకుండా, కేవలం 100 సంఖ్యను వేగంగా పూర్తి చేయాలనే ఆరాటంలో ధ్వనులను మింగేస్తూ తప్పుగా చదువుతున్నారు.

సరైన విధానం: వాస్తవానికి అల్లాహ్ స్మరణను ఎలాంటి తొందర లేకుండా, నెమ్మదిగా, భక్తితో మరియు అక్షరాలు స్పష్టంగా పలికేలా చదవాలి.

ప్రత్యామ్నాయ పరిష్కారం (హదీసు ఆధారంగా): ఇలా తొందరపడే వారిని సరైన మార్గంలో పెట్టడానికి ఆయన ఒక ప్రామాణికమైన (సహీహ్) హదీసును సూచించారు. ఒక సహాబీ కన్న కలను ప్రవక్త (ﷺ) ఆమోదించిన ఈ విధానం ప్రకారం: ‘సుబ్ హా నల్లాహ్, అల్ హమ్ దు లిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్’ – ఈ నాలుగింటిని కలిపి ఒకేసారి 25 సార్లు చదవాలి (అప్పుడు మొత్తం 100 అవుతుంది).

దీని ప్రయోజనం: ఇలా 25 సార్లు చదవడం వల్ల వేగంగా, అర్థం లేకుండా పలికే అవకాశం ఉండదు. ప్రతి పదాన్ని స్పష్టంగా, నెమ్మదిగా మరియు శ్రద్ధగా చదవడానికి ఇది సహాయపడుతుంది.

ఫిఖ్హ్ ముగింపు: ఈ 25 సార్ల విధానం, మునుపటి 33 సార్ల విధానాన్ని రద్దు చేయదు. ఎవరైతే ఎలాంటి తొందర లేకుండా ప్రశాంతంగా 33 సార్లు చదువుతారో వారు ఆ పద్ధతినే పాటించవచ్చు, అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ, తొందరపడే అలవాటు ఉన్నవారికి ఈ 25 సార్ల పద్ధతి మరింత ఉత్తమమైనది మరియు వారి అజ్కార్ వృధా కాకుండా కాపాడే ఒక రక్షణ లాంటిది.

ఈ పోస్ట్ లింక్:
https://teluguislam.net/?p=45644

ప్రవక్త ﷺ వివరించిన ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ యొక్క తఫ్సీర్ | షేఖ్ అబ్దుర్రజ్జాఖ్ అల్-బద్ర్

The Prophet’s ﷺ Tafsir of لا اله الا الله
Shaykh Abdurrazzaq al-Badr حفظه الله [Video|Ar-En Subtitles]
https://www.youtube.com/watch?v=WRtUo9PZ5Q8 [15 min]

‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ (لا إله إلا الله) యొక్క సరైన అర్థం విషయంలో ప్రజలు దారితప్పితే, వారి ధర్మంలో ఎలాంటి మార్గభ్రష్టత్వం చోటుచేసుకుంటుందో ఊహించండి. అందువల్ల, ప్రతి ముస్లిం ఈ మహత్తరమైన వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవడం అనేది అత్యంత ముఖ్యమైన విధులలో మరియు ప్రాధాన్యత గల వ్యవహారాలలో ఒకటి.

ఒక వ్యక్తి ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ ను సరిగ్గా అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు, అందుకు సహాయపడే ఒక అద్భుతమైన మార్గాన్ని నేను మీకు సూచిస్తాను. ఇందులో అపారమైన ప్రయోజనం ఉందని నేను నమ్ముతున్నాను. ప్రత్యేకించి ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే క్రమంలో, ఆ మార్గాన్ని మీరు ఆచరించడమే కాకుండా ఇతరులకు కూడా తెలియజేయాలని నేను సలహా ఇస్తున్నాను.

‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ ను అర్థం చేసుకోవడంలో జరిగే పొరపాట్ల వల్ల కలిగే ప్రమాదాలు మరియు ప్రజల వద్ద ఉన్న కొన్ని పుస్తకాలలోని తప్పుడు వివరణల గురించి మనం మాట్లాడుకుంటున్న ఈ తరుణంలో, దీనిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక చక్కని మార్గాన్ని నేను మీకు చూపుతాను. మన ప్రవక్త ﷺ నుండి ఉల్లేఖించబడిన ఒక సున్నత్ ద్వారా ఈ సరైన అవగాహనను మనం ప్రతిరోజూ గుర్తుచేసుకోవచ్చు.

నేను ఇక్కడ నా సొంత మాటలనో, లేదా ఏదైనా పండితుని మాటలనో మీకు చెప్పడం లేదు. బదులుగా, మీరు ప్రతిరోజూ ఆచరించే ఒక దానికి సంబంధించి స్వయంగా అల్లాహ్ సందేశహరుని మాటలనే మీకు వివరిస్తున్నాను. ఇది మన హృదయాలలో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ పట్ల సరైన అవగాహనను పెంపొందిస్తుంది. దీని ప్రాముఖ్యత ఎంతో అద్భుతమైనది, సుబ్ హానల్లాహ్ (سبحان الله). అసలు సున్నత్‌లో ఉన్న ప్రతి ఒక్కటీ శుభప్రదమైనదే (ఆశీర్వాదకరమైనదే).

మన ప్రవక్త ﷺ సున్నత్‌ను కాపాడుకుంటూ, దానిని ఆచరించే భాగ్యం పొందిన వారిపై ఖచ్చితంగా దాని సత్ప్రభావం ఉంటుంది. మరీ ముఖ్యంగా, ప్రవక్త ﷺ నేర్పిన జిక్ర్ (స్మరణల) ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ముగీరా మరియు అబ్దుల్లాహ్ ఇబ్న్ జుబైర్ (రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖించిన హదీసుల ఆధారంగా, ప్రతి నమాజ్ పూర్తయిన తర్వాత చదివే ప్రామాణికమైన జిక్ర్‌ను మీరందరూ కంఠస్థం చేసి, ఆచరిస్తూనే ఉన్నారు. ఈ హదీసులో తెలుపబడిన విషయంపై మీరందరూ పూర్తి ఏకాగ్రత పెట్టాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే, ఒక ముస్లిం శ్రద్ధ వహించాల్సిన అత్యున్నతమైన మరియు అత్యంత మహత్తరమైన విషయాలలో ఇది కూడా ఒకటి.

మీరు ఆ హదీసును పరిశీలిస్తే, అందులో మూడు తహ్లీలాత్ (‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అనే ఉచ్చారణ) పేర్కొనబడ్డాయి. ప్రతి నమాజు తర్వాత వీటిని పఠించడం మీ కోసం ధర్మసమ్మతం చేయబడింది.

لَا إِلَهَ إِلَّا اللهُ، وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ، وَلَهُ الْحَمْدُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ
లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్దహూ లా షరీక లహూ, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు, వ హువ అలా కుల్లి షైయిన్ ఖదీర్
(అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన ఏకైకుడు, సాటిలేనివాడు. విశ్వసామ్రాజ్యం ఆయనదే. స్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయన సర్వాధికారుడు. పుణ్యాలు చేసే, పాపాల నుండి దూరముండే భాగ్యం అల్లాహ్ యే ప్రసాదించువాడు)

لَا إِلَهَ إِلَّا اللهُ، وَلَا نَعْبُدُ إِلَّا إِيَّاهُ، لَهُ النِّعْمَةُ، وَلَهُ الْفَضْلُ، وَلَهُ الثَّنَاءُ الْحَسَنُ
లా ఇలాహ ఇల్లల్లాహు వలా నఅబుదు ఇల్లా ఇయ్యాహు, లహున్నిఅమతు, వ లహుల్ ఫజ్లు, వ లహుస్-సనావుల్ హసన్
(ఆ అల్లాహ్ తప్ప వెరొక ఆరాధ్యుడు లేడు. మేము ఆయన్నే ఆరాధిస్తాము. వరాలు, అనుగ్రహాలు ఆయన ప్రసాదించినవే. మంచి స్తోత్రాలు ఆయనకే శోభిస్తాయి)

لَا إِلَهَ إِلَّا اللهُ، مُخْلِصِينَ لَهُ الدِّينَ، وَلَوْ كَرِهَ الْكَافِرُونَ
లా ఇలాహ ఇల్లల్లాహు ముఖ్లిసీన లహుద్దీన వలౌ కరిహల్ కాఫిరూన్
(అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. సత్యతిరస్కారులకు ఎంత అయిష్టకరంగా ఉన్నా సరే మేము మా ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకున్నాము).

ప్రతిరోజూ ప్రతి నమాజ్ తర్వాత ఈ మూడు తహ్లీలాత్‌లను పఠించడం మన ధర్మంలో నిర్దేశించబడింది. ఓ ముస్లిం! ఇలా వీటిని పదే పదే పఠించడం అనేది ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ ను అర్థం చేసుకోవడానికి, దాని భావాన్ని మీ హృదయంలో స్థిరపరచుకోవడానికి ఒక పోషణ లాంటిది. ధర్మసమ్మతమైన ఈ జిక్ర్ (స్మరణల) అసలు ఉద్దేశ్యం కూడా ఇదే. ఇవి కేవలం నోటితో పలికే పదాలు మాత్రమే కావు, మన హృదయానికి అవసరమైన పోషణను (శక్తిని) అందించేవి. కాబట్టి, ప్రతిరోజూ ప్రతి నమాజ్ ముగింపులో, నిర్దేశించిన విధంగా మీరు ఈ స్మరణలను పూర్తి ఏకాగ్రతతో (స్పృహతో) చదివినప్పుడు, మీ హృదయంలోని తౌహీద్‌ను (ఏకేశ్వరోపాసనను) మరియు ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ పై ఉన్న మీ విశ్వాసాన్ని మీరు పునరుద్ధరించుకుంటున్నారన్నమాట.

لَا إِلَهَ إِلَّا اللهُ، وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ، وَلَهُ الْحَمْدُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ
లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్దహూ లా షరీక లహూ, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు, వ హువ అలా కుల్లి షైయిన్ ఖదీర్

لَا إِلَهَ إِلَّا اللهُ (లా ఇలాహ ఇల్లల్లాహ్) (అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన దేవుడు ఎవరూ లేరు) – ఇందులో ఒక సాధారణ తిరస్కరణ మరియు ఒక నిర్దిష్ట ధృవీకరణ (నఫీ మరియు ఇస్బాత్) ఉన్నాయని మనం చెప్పుకున్నాము.

وَحْدَهُ لَا شَرِيكَ لَهُ (ఆయన ఒక్కడే, ఆయనకు ఎలాంటి భాగస్వామి లేడు) – ఇది ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అనే వాక్యం మార్గనిర్దేశం చేసే తిరస్కరణకు మరియు ధృవీకరణకు మరింత నొక్కి చెబుతుంది. وحده (ఆయన ఒక్కడే) అనే పదం: إلا الله (అల్లాహ్ తప్ప) అని నొక్కి చెబుతుంది. మరియు لا شريك له (ఆయనకు ఎలాంటి భాగస్వామి లేడు) అనే వాక్యం: لا إله (ఆరాధనకు అర్హుడైన దేవుడు ఎవరూ లేరు) అని నొక్కి చెబుతుంది. తౌహీద్ యొక్క స్థాయిని మరియు దాని అత్యున్నత ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, ఇది ఒక నొక్కి చెప్పే వాక్యంగా పేర్కొనబడింది. ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ వాక్యం మార్గనిర్దేశం చేసే తిరస్కరణ మరియు ధృవీకరణలను ఇది స్పష్టం చేస్తుంది.

لَا إِلَهَ إِلَّا اللهُ، وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ – ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ లోని అర్థాన్నే మీరు ఇక్కడ మళ్లీ దృఢపరుస్తున్నారు.

ఆ తరువాత: لَهُ الْمُلْكُ، وَلَهُ الْحَمْدُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ (సామ్రాజ్యమంతా ఆయనదే మరియు సర్వ స్తోత్రాలు ఆయనకే, మరియు ఆయన ప్రతికార్యము చేయుటకు సమర్థుడు.) – ఇవి తౌహీద్ కు ఆధారాలు. మీరు అల్లాహ్ ను ఆరాధిస్తారు మరియు ఆయననే ఏకైకుడిగా ప్రకటిస్తారు, ఎందుకంటే అధికారం అంతా ఆయనది మాత్రమే! ఇవన్నీ తౌహీద్ కు ఆధారాలు. దీనిని పోలి ఉన్నదే ఈ వాక్యం కూడా: الله لا إله إلا هو (అల్లాహ్! ఆయన తప్ప ఆరాధనకు అర్హుడు మరొకరు లేరు)… ఇది తౌహీద్. الحي القيوم لا تأخذه سنة ولا نوم (ఆయన సజీవుడు, విశ్వ వ్యవస్థను నడిపేవాడు. ఆయనకు కునుకు రాదు, నిద్ర పట్టదు)… ఈ ఆయత్ చివరి వరకు ఉన్నదంతా తౌహీద్ యొక్క ఆధారాలే.

[2] لا إله إلا الله، ولا نعبد إلا إياه،
(అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన దేవుడు ఎవరూ లేరు మరియు మేము ఆయనను తప్ప మరెవరినీ ఆరాధించము…)

ولا نعبد إلا إياه (మరియు మేము ఆయనను తప్ప మరెవరినీ ఆరాధించము…) ఇది ఒక వివరణ. మీరు తౌహీద్ వాక్యాన్ని చదివి, దాని వాస్తవిక అర్థాన్ని దాని తర్వాత తీసుకువస్తున్నారు.

ولا نعبد إلا إياه (మరియు మేము ఆయనను తప్ప మరెవరినీ ఆరాధించము…) అనేది ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ యొక్క అసలు అర్థం, అనగా మేము అల్లాహ్ ను తప్ప మరెవరినీ ఆరాధించము అని.

له النعمة، وله الفضل، وله الثناء الحسن
(వరాలు, అనుగ్రహాలు ఆయన ప్రసాదించినవే. మంచి స్తోత్రాలు ఆయనకే శోభిస్తాయి) – ఇవి తౌహీద్ యొక్క ఆధారాలు.

దాని తర్వాత మీరు పఠించే చివరి తహ్లీల్:

لا إله إلا الله، مخلصين له الدين، ولو كره الكافرون
అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. సత్యతిరస్కారులకు ఎంత అయిష్టకరంగా ఉన్నా సరే మేము మా ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకున్నాము

ఇది దేనిని చూపిస్తుందంటే, ధర్మాన్ని చిత్తశుద్ధితో కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించడం కూడా ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ లో ఇమిడి ఉంది. సర్వోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చినట్లు:

ألا لله الدين الخالص
జాగ్రత్త! నిష్కల్మషమైన ఆరాధన మాత్రమే అల్లాహ్‌కు చెందుతుంది..﴾ అజ్-జుమర్ 39: 3 ﴿

وما أمروا إلا ليعبدوا الله مخلصين له الدين
మరియు వారు ఆజ్ఞాపించబడినది ఒక్కటే, వారు తమ ధర్మాన్ని కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించి, ఏకాగ్రచిత్తులై ఆయన్నే ఆరాధించాలి…﴾ అల్-బయ్యినహ్ 98:5 ﴿

فادعوه مخلصين له الدين
కాబట్టి మీరు ధర్మాన్ని (ఆరాధనను) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించి ఆయనను మాత్రమే ప్రార్థించండి…﴾ గాఫిర్: 65 ﴿

పరిశుద్ధమైనది (నిష్కల్మషమైనది) అనగా ఎలాంటి కల్తీ లేనిది. ధర్మం కూడా ఈ విధంగానే ఉండాలి, చిత్తశుద్ధితో, స్వచ్ఛంగా, దానిలో అల్లాహ్ ప్రసన్నత తప్ప మరే ఇతర ఉద్దేశ్యం లేకుండా ఉండాలి.

మనలో ఎవరినైనా “లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క అర్థం ఏమిటి?” అని అడిగితే, ఏ పుస్తకానికీ వెళ్లకండి. మీరు నిరంతరం పఠించే ఈ జిక్ర్ (స్మరణ) నుండే ఆ వివరణను తీసుకోండి. అత్యంత ముఖ్యమైన ఈ మహత్తర విషయాన్ని మీలో పెంపొందించడానికి స్వయంగా మీ ప్రవక్త ఈ జిక్ర్ ను మీకు నేర్పించారు.

కాబట్టి “లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క వివరణ ఏమిటి? దాని అర్థం ఏమిటి?” అని మిమ్మల్ని అడిగితే, ఈ మూడు తహ్లీలాత్‌ల కలయిక ద్వారా ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ యొక్క వివరణను మీరు సులభంగా సారాంశం చేయగలరు.

ఈ మూడు వాక్యాల నుండి ఆ వివరణను వినండి మరియు రాసుకోండి. ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ యొక్క అర్థం ఏమిటంటే: మేము ఆయనను తప్ప మరెవరినీ ఆరాధించము, ఆయన ఒక్కడే, ఆయనకు ఎలాంటి భాగస్వామి లేడు, ధర్మాన్ని (ఆరాధనను) కేవలం ఆయనకే ప్రత్యేకించి చిత్తశుద్ధితో ఆరాధిస్తాము… ఇది ఎవరి వివరణ? ఇది ప్రవక్త వివరణ! ఇది మీరు విశ్వసించే ఏ పండితుని వివరణో కాదు, ఫలానా విధంగా ఉండొచ్చు అని ఊహించడానికి… ప్రతిరోజూ ఐదు సార్లు ఈ తహ్లీలాత్‌లను తనను అనుసరిస్తూ పునరావృతం చేయాలని మిమ్మల్ని ఆదేశించిన దైవప్రవక్త యొక్క వివరణ ఇది.

ఈ విషయాన్ని స్థాపించడంలో మరియు దాసుల హృదయాలలో దానిని సుస్థిరం చేయడంలో అపారమైన ప్రయోజనం ఉంది. కాబట్టి ఎవరైనా ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అర్థం ఏమిటి అని అడిగితే, ఈ హదీసులో ఉన్న దైవప్రవక్త మాటలతోనే దానిని వివరించండి. మరోసారి, ప్రతిరోజూ పునరావృతం చేసే ఈ జిక్ర్ (స్మరణల) వెలుగులో దాని వివరణ: ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ యొక్క అర్థం: ‘మేము ఆయనను తప్ప మరెవరినీ ఆరాధించము‘. (ఇది రెండవ తహ్లీల్ నుండి). ‘ఆయన ఒక్కడే, ఆయనకు ఎలాంటి భాగస్వామి లేడు’. (ఇది మొదటి తహ్లీల్ నుండి). ‘ధర్మాన్ని కేవలం ఆయనకే ప్రత్యేకించి చిత్తశుద్ధితో ఆరాధించడం…‘ (ఇది మూడవ తహ్లీల్ నుండి).

ఈ రోజు నుండి, మీరు ఈ తహ్లీలాత్‌లను చదివిన ప్రతిసారీ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది ప్రతి ముస్లింకి ప్రయోజనకరమైనది మరియు ముఖ్యమైనది అని నేను నమ్ముతున్నాను. ఎవరైనా కొన్ని సందిగ్ధతలతో పరీక్షింపబడి, అది అతని అవగాహనను మళ్లించినా, లేదా అతనికి వేరే ఏదైనా అర్థం చెప్పబడినా, అతడు ఇలా అనాలి: “ఇతరులందరి మాటల కంటే అల్లాహ్ యొక్క సందేశహరుని మాట మాకు సరిపోతుంది!” ‘అల్లాహ్ నది ప్రవహిస్తున్నప్పుడు, జైద్ మరియు అమర్ (సాధారణ వ్యక్తుల) కాలువలు పనికిరావు.’ (అరబిక్ నానుడి). మనకు వాటి అవసరం లేదు. ఇది దైవప్రవక్త యొక్క మాట.

ఖురాన్‌లో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ ను ఇదే అర్థంతో మీకు వివరించే అనేక ఆయత్‌లు ఉన్నాయి. మీరు చదివినప్పుడు:

واعبدوا الله ولا تشركوا به شيئا
మరియు మీరు అల్లాహ్ నే ఆరాధించండి. మరియు ఆయనకు దేనినీ సాటి కల్పించకండి…﴾ అన్-నిసా: 36 ﴿

وقضى ربك ألا تعبدوا إلا إياه
మరియు మీ ప్రభువు (ఇలా) తీర్పు చేశాడు: మీరు ఆయనను తప్ప మరెవరినీ ఆరాధించకూడదు…﴾ అల్-ఇస్రా: 23 ﴿

وما أمروا إلا ليعبدوا الله مخلصين له الدين
మరియు వారు ఆజ్ఞాపించబడినది ఒక్కటే, వారు తమ ధర్మాన్ని కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించి, ఏకాగ్రచిత్తులై ఆయన్నే ఆరాధించాలి…﴾ అల్-బయ్యినహ్: 5 ﴿

إنني براء مما تعبدون إلا الذي فطرني فإنه سيهدين وجعلها كلمة باقية في عقبه
నిశ్చయంగా మీరు ఆరాధించే వాటికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను పుట్టించినవాడు తప్ప, నిశ్చయంగా ఆయనే నాకు సన్మార్గం చూపుతాడు. మరియు అతడు దానిని (ఈ వాక్యాన్ని) తన సంతానంలో నిలిచి ఉండే వాక్యంగా చేశాడు.﴾ అజ్-జుఖ్రుఫ్: 26-28 ﴿

ఇవన్నీ ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ ను వివరించే వాక్యాలే. అందుకే, ఇమామ్, పునరుద్ధారకులు మరియు సంస్కర్త అయిన షైఖ్-ఉల్-ఇస్లామ్ ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహ్హాబ్, తన గ్రంథం “కితాబ్ అత్-తౌహీద్” పరిచయంలో అధ్యాయాలను కూర్చినప్పుడు, అదంతా తౌహీద్ యొక్క సరైన అవగాహనను నొక్కిచెప్పడానికే. ఆయన తౌహీద్ మరియు ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ యొక్క వివరణ కోసం ఒక అధ్యాయాన్ని పొందుపరిచారు. ఆయన తన సొంతగా దేనినీ తీసుకురాలేదు. బదులుగా ఆయన ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అర్థాన్ని వివరించే ఖురాన్ ఆయత్ లను మరియు హదీసులను తీసుకువచ్చారు. మీరు వాటిని చదివి, వాటి ద్వారా తౌహీద్ యొక్క అర్థాన్ని అర్థం చేసుకుంటారు,,,.

ఈ రోజు తర్వాత, వారిలో ఎవరైనా వచ్చి ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అంటే “అల్లాహ్ తప్ప మరెవరూ సృష్టించలేరు” అని అర్థం చెబితే, లేదా ఆయన ఆరాధనను ప్రత్యేకించడం అంటే “ఆయనను మాత్రమే సృష్టికర్తగా గుర్తించడం” అని వివరిస్తే… ఇది ఒక చిన్న విషయంగా ఎవరూ తేలికగా తీసుకోకూడదు. ఇది ఎంతో నష్టం! ఇది ప్రజల ధర్మానికే నష్టం తీసుకువస్తుంది.

ధర్మం దేనిపై నిర్మించబడిందో ఆ మూల వాక్యాన్ని ఎవరైనా తీసుకువచ్చి, సామాన్య ప్రజలకు దానిని తప్పుగా అర్థమయ్యేలా చేసినప్పుడు, దీని వల్ల ఆ ప్రజలలో ఎలాంటి మార్గభ్రష్టత్వం కలుగుతుందని మీరు అనుకుంటున్నారు? అందువల్ల, సామాన్య ప్రజలలో కొందరు ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ ను పఠిస్తారు, కానీ అదే సమయంలో వారు దానిని రద్దు చేసే (భంగం కలిగించే) చర్యలకు కూడా పాల్పడడం మీరు గమనిస్తారు. కానీ వారికి దానిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల, ఆ చర్యలు ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ ను భంగపరుస్తాయని వారు నమ్మరు. ఎందుకంటే ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ పట్ల వారికి ఉన్నది ఒక తప్పుడు అవగాహన. అందుకే ఈ విషయం అల్లాహ్ ధర్మానికి సంబంధించి అత్యంత గొప్ప మరియు ప్రాముఖ్యత కలిగిన వ్యవహారాలలో ఒకటిగా మరియు గొప్ప సలహాగా పరిగణించబడుతుంది.

దైవసందేశహరులు తమ ప్రజలకు చేసిన పిలుపు (దావాహ్) ప్రారంభం నుండి ఖురాన్‌ను చదవండి. మరియు ఆద్ జాతి వైపునకు వారి సహోదరుడు హూద్ ను (మేము పంపాము)… మరియు సమూద్ జాతి వైపునకు వారి సహోదరుడు సాలిహ్ ను (పంపాము)… మరియు మద్యాన్ వైపునకు వారి సహోదరుడు షుఐబ్ ను (పంపాము)… వీరందరూ ఒకే మాట చెప్పారు:

يا قوم اعبدوا الله ما لكم من إله غيره
ఓ నా జనులారా! అల్లాహ్ నే ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం (ఇలాహ్) లేడు

ఇదే ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ యొక్క వివరణ. కాబట్టి ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ యొక్క అర్థం అల్లాహ్ గ్రంథం మరియు ప్రవక్త సున్నత్‌లో స్పష్టంగా ఉంది, ఆధారాలలో కూడా స్పష్టంగా ఉంది. అయితే, ఈ తప్పుడు వివరణలు ఎక్కడైతే ఉంటాయో, అక్కడ ఖచ్చితంగా నష్టం వాటిల్లుతుంది.

అలాగే, నేను మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా ప్రస్తావిస్తాను. మార్గభ్రష్టమైన నమ్మకాలు (అఖీదా) ఉన్న ప్రజలు… ఒక సామెత ఉంది కదా, “ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉన్నదానినే ఇస్తారు.” కాబట్టి వారి మనస్సులు ఒక తప్పుడు అఖీదా (నమ్మకం) తో నిండిపోయినప్పుడు, వారు ఒక ధార్మిక వాక్యాన్ని, అనగా అత్యంత గొప్ప వాక్యమైన ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ ని తీసుకువచ్చి వివరించినప్పుడు, వారి హృదయాలలో నాటుకుపోయిన ఆ తప్పుడు అఖీదా వెలుగులోనే దానిని వివరిస్తారు.

మరియు ఈ వ్యవహారంలో ఉన్న లోపం దాగి ఉండే చోటు ఇదే. కాబట్టి ఈ శ్రేయస్సును ప్రసాదించినందుకు అల్లాహ్‌ను స్తుతించండి. ఎందుకంటే ఈ శ్రేయస్సు (రక్షణ) అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహాలలో ఒకటి. మరియు ఈ మార్గభ్రష్టత్వం మరియు ఈ అబద్ధాల బారి నుండి సురక్షితంగా ఉండటమే నిజమైన శ్రేయస్సు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=45374

వస్వాస్ (షైతాన్ యొక్క గుసగుసలు) తో బాధపడేవారికి సలహా – షేఖ్ సులైమాన్ అర్-రుహైలీ

“వస్వాస్ ఖహ్రీ” అంటే — వ్యక్తి ఎంత ప్రయత్నించినా దూరం చేసుకోలేని, పదే పదే మనసులోకి బలవంతంగా వచ్చే చెడు ఆలోచనలు, సందేహాలు లేదా శంకలు.

ఆధునిక వైద్య పరిభాషలో దీనిని OCD (Obsessive-Compulsive Disorder / అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్) అని పిలుస్తారు — అంటే ఒక వ్యక్తికి కొన్ని ఆలోచనలు పదే పదే వస్తుండడం, వాటిని తొలగించుకోవడానికి కొన్ని పనులను బలవంతంగా చేయవలసి రావడం (ఉదా: పదే పదే వుజూ చేయడం, నమాజ్ తిరిగి తిరిగి చదవడం, పరిశుభ్రత గురించి అతి ఆందోళన పడడం మొదలైనవి).

ఇస్లామిక్ సందర్భంలో, ఇది ఎక్కువగా ఇబాదత్ (ఆరాధన), తహారత్ (పరిశుభ్రత), అఖీదా (విశ్వాసం), లేదా తలాఖ్ (విడాకులు) వంటి విషయాలలో కనిపిస్తుంది.

వస్వాస్ (షైతాన్ యొక్క గుసగుసలు) తో బాధపడేవారికి సలహా – షేఖ్ సులైమాన్ అర్-రుహైలీ
Advice to those afflicted with Waswaas (whisperings) – Shaykh Sulaymaan ar-Ruhaylee
https://abdurrahman.org/?p=44410
ఇంగ్లీష్ అనువాదం: యాసీన్ అబూ ఇబ్రాహీం
తెలుగు అనువాదం : teluguislam.net

ఒక వ్యక్తి వస్వాస్ ఖహ్రీ (Waswaas Qahree) తో బాధపడుతున్నాడు. దీనికి మీ సలహా ఏమిటి? అల్లాహ్ మిమ్మల్ని రక్షించుగాక.

ఇది ఇబ్లీస్ (షైతాన్) పన్నాగాలలో ఒక మార్గం. వస్వాస్ (Waswaas) గురించి ఉన్న ప్రధాన సూత్రం ఏమిటంటే, అది ఒక దాసుని యొక్క ధర్మబద్ధతకు మరియు అతని హృదయ స్వచ్ఛతకు నిదర్శనం. ఎందుకంటే, ఒక దాసుడు ధర్మబద్ధంగా ఉన్నాడని మరియు సత్కార్యాల ద్వారా అతనిని ఓడించడం తన వల్ల కాదని షైతాన్ కు అర్థమైనప్పుడు, అతనికి (చెడు) గుసగుసలు చెప్పడం ప్రారంభిస్తాడు. అందుకే ప్రవక్త – సల్లల్లాహు అలైహి వ సల్లంకు ఈ (వస్వాస్ విషయం) ప్రస్తావించబడినప్పుడు ఆయన ఇలా అన్నారు: “షైతాన్ కుట్రను కేవలం అల్-వస్వసహ్ (al-Waswasah – గుసగుసలు) స్థాయికి తగ్గించిన అల్లాహ్ కే సర్వ ప్రశంసలు.” వాడు మనల్ని జయించలేకపోయాడు, అందుకే వస్వాస్ తో మన వద్దకు వచ్చాడు. మరియు ఆయన (ప్రవక్త) ఇలా అన్నారు: “అది విశ్వాసానికి స్పష్టమైన సంకేతం.” ఇది వస్వాస్ యొక్క సారాంశం. అంటే: వస్వాస్ కలుగుతోందంటే, దానికి ఇదే నిదర్శనం.

అయితే దీని అర్థం వస్వాస్ బారిన పడిన వారిని మనం ప్రశంసిస్తామని కాదు. ఎందుకంటే, వస్వాస్ కు ప్రతిస్పందించడం ఒక చెడు. దాన్ని నివారించడం మరియు దానికి దూరంగా ఉండటం విధి. మరియు వస్వాస్ బారిన పడిన వారు రెండు రకాలుగా ఉంటారు.

మొదటి రకం: వస్వాస్ అతనిని పూర్తిగా లోబరుచుకోలేకపోవడం. బదులుగా అది వస్తుంది మరియు వెళ్లిపోతుంది. ఎక్కువగా ఇస్తిఆజహ్ (isti’aadhah – అల్లాహ్ శరణు కోరడం) చేయడం ద్వారా దీనిని నయం చేయవచ్చు. అతడు దాని నుండి రక్షణ కోసం అల్లాహ్ శరణు కోరుతాడు మరియు తన ఎడమ వైపున ఉమ్మివేసినట్లు చేస్తాడు. మరియు అతడు ఖుర్ఆన్ మరియు హదీసులు పఠిస్తాడు.

రెండవ రకం: వస్వాస్ చాలా ఎక్కువగా ఉండి అతనిని పూర్తిగా అదుపులోకి తీసుకోవడం. దీనిని ఏ ఆచరణ ద్వారానూ నయం చేయలేము, ఎందుకంటే అతడు ఎన్ని ఆచరణలు చేస్తే, అతని వస్వాస్ అంతగా పెరుగుతుంది. అతడు ఖుర్ఆన్ చదివినా సరే, అతని వస్వాస్ పెరుగుతుంది! కాబట్టి ఇది ఎలా నయమవుతుంది? దీని నుండి పూర్తిగా ముఖం తిప్పుకోవడం (పూర్తిగా పట్టించుకోకపోవడం) ద్వారానే ఇది నయమవుతుందని ఫుకహా (Fuqahaa’ – ఇస్లామిక్ న్యాయవేత్తలు) చెబుతారు. దీని అర్థం ఏమిటి? దాని (వస్వాస్) కారణంగా మీరు ఏ పని చేయకూడదు లేదా దాని కారణంగా దేనినీ వదిలిపెట్టకూడదు. ఒకవేళ అది మీ వద్దకు వచ్చినా, అది మీకు ఎలాంటి హాని చేయదని మీకు కచ్చితంగా తెలిసిన ఒక పిచ్చివాడు మీ వెనుక నుండి మాట్లాడుతున్నట్లుగా భావించండి. మరియు దాని కారణంగా ఏ పని చేయకండి లేదా దాని కారణంగా దేనినీ వదిలివేయకండి.

కొందరు వ్యక్తులు, తమకు వస్వాస్ వచ్చినప్పుడు, చదవడానికి ఖుర్ఆన్ తెరుస్తారు. అప్పుడు ఇబ్లీస్ అతనిని లొంగదీసుకోవడంలో మరింత ఆసక్తి చూపుతాడు, కాబట్టి ఖుర్ఆన్ కు సంబంధించి అతనికి గుసగుసలు చెప్పడం ప్రారంభిస్తాడు. అతడు లేచి ప్రార్థన (నమాజ్) చేస్తాడు, అప్పుడు వాడు (షైతాన్) అతని ప్రార్థనలో కూడా గుసగుసలు చెబుతాడు.

అందుకే దాని (వస్వాస్) కారణంగా మీరు దేనినీ వదిలిపెట్టవద్దు! మీరు ఖుర్ఆన్ చదువుతున్నప్పుడు షైతాన్ మీకు గుసగుసలు పెడుతూ వస్తే, మీరు ఖుర్ఆన్ పఠించడం ఆపవద్దు, దాన్ని కొనసాగించండి! మీ అంతట మీరుగా దానిని ఆపాలనుకున్నప్పుడే ఆపండి. వస్వాస్ వస్తుందన్న కారణంతో మాత్రం దాన్ని మానుకోవద్దు. మీరు ఇలా చేసి, సహనంతో ఉంటే… ఈ విషయానికి సహనం అవసరమని తెలుసుకోండి, ఎందుకంటే వస్వాస్ కు గురైన వ్యక్తి వద్దకు ఇబ్లీస్ ఒక సలహాదారుని వలె, జాలిపడే వాడి వలె వస్తాడు. నమాజులో (షైతాన్ ఇలా అంటాడు): “ఇది నమాజు! నమాజు అనేది ఒక దాసునికి మరియు అతని ప్రభువుకి మధ్య ఉన్న అనుసంధానం! నీ నమాజు రద్దైపోతే, నీకు ఇక మిగిలేది ఏమిటి? జాగ్రత్త! ప్రార్థన వదిలేసి వెళ్లి వుజూ చేసుకో!” అతని నమాజును పాడు చేయడానికే (వాడు అలా చేస్తాడు). కానీ వాడు సలహాదారుడు కాడు, వాడు ఇబ్లీస్! కాబట్టి దీనికి ఓపిక అవసరం. సహనంతో ఉండండి!

మీరు వుజూ చేసేటప్పుడు మీకు వస్వాస్ వస్తే, మీ వుజూ పూర్తి చేసి వెళ్లిపోండి. ఆ తర్వాత ఇబ్లీస్ మీ వద్దకు వచ్చి, “ఇంకా ఏదో మిగిలిపోయింది!” అని అంటే, అప్పుడు: “ఏమీ మిగిలిలేదు” అని చెప్పండి. వాడిని పట్టించుకోకండి! వెళ్లి నమాజు చేసుకోండి! అల్లాహ్ సాక్షిగా, అది మీకు ఎలాంటి హాని చేయదు! అల్లాహ్ సాక్షిగా, అది మీకు హాని చేయదు. మీరు ఖుర్ఆన్ పఠిస్తున్నప్పుడు ఇబ్లీస్ మీకు గుసగుసలు చెబుతూ వస్తున్నాడా? పఠనం కొనసాగించండి! మరియు వాడిని (ఇబ్లీస్ ను) వదిలేయండి! పఠించడం కొనసాగించండి! అల్లాహ్ సాక్షిగా, అది మీకు హాని చేయదు! నిజానికి, దానికి మీకు ప్రతిఫలం లభిస్తుంది! ఎందుకంటే మీరు ఇబ్లీస్ కి వ్యతిరేకంగా జిహాద్ చేస్తున్నారు. అప్పుడు ఇబ్లీస్ మీ విషయంలో నిరాశ చెంది, ఈ తలుపు (వస్వాస్ మార్గం) వదిలేసి, మరో తలుపు వెతుక్కోవడం మొదలుపెడతాడు.

కాబట్టి, ఓ సోదరులారా, వస్వాస్ ఖహ్రీ (Waswaas Qahree) ఉందని చెప్పబడుతున్న ఈ సోదరుడికి, అంటే వస్వాస్ ఎవరినైతే పూర్తిగా లోబరుచుకుందో అతనికి ఉన్న ఏకైక నివారణ మార్గం – పూర్తిగా ముఖం తిప్పుకోవడమే. మరియు పూర్తిగా ముఖం తిప్పుకోవడం అంటే, అది తనకు ఎలాంటి హాని చేయదని, అల్లాహ్ అపార కరుణామయుడని, మరియు దీని కారణంగా అల్లాహ్ తన దాసులను శిక్షించడం అసాధ్యమని, మరియు ఇది మతంలో (ధర్మంలో) భాగం కాదని అతను కచ్చితమైన నమ్మకాన్ని కలిగి ఉండాలి!

అల్లాహ్ ఇలా అంటున్నాడు: “మరియు ఆయన మతంలో మీపై ఎలాంటి కష్టాన్నీ మోపలేదు…” (22:78). ఒక వ్యక్తి డెబ్భై సార్లు వుజూ చేయాలనేది మతంలో భాగం ఎలా అవుతుంది?! కాబట్టి మీరు దీనిని తెలుసుకోవాలి మరియు దానిపై పూర్తి నమ్మకంతో ఉండాలి, అంతే! ప్రజలు సాధారణంగా ఏమి చేస్తారో మీరూ అదే చేయండి, మరియు (ఆ ఆలోచనల నుండి) ముఖం తిప్పుకోండి. మీరు మీ పనిని కొనసాగించండి, వస్వాస్ కారణంగా దానిని వదిలిపెట్టవద్దు. మరియు వస్వాస్ కారణంగా ఏ పనీ చేయకండి. అల్లాహ్ సాక్షిగా, అల్లాహ్ అనుమతితో అతడు నయమవుతాడు. మరియు ఇది మాకు అనుభవం ద్వారా తెలుసు.

అల్లాహ్ సాక్షిగా, ఓ సోదరులారా. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు, తన భార్యకు సంబంధించి, అతను ఆమెకు విడాకులు ఇస్తున్నాడని షైతాన్ ఎప్పుడూ అతనికి గుసగుసలు చెబుతూ ఉండేవాడు. అతను ఆమెతో కలిసి ఆమె కుటుంబం దగ్గరికి వెళ్ళి, “నీ కుటుంబం దగ్గరికి వెళ్ళు” అని ఆమెతో చెబితే, ఇబ్లీస్ అతని దగ్గరికి వచ్చి, “నువ్వు ఇప్పుడే ఆమెకు విడాకులు ఇచ్చేశావు” అని చెప్పేవాడు. కొన్నిసార్లు అతను రాత్రి రెండు గంటలకు మరియు మూడు గంటలకు నాకు ఫోన్ చేసి, “ఓ షేక్, ప్రస్తుతం ఆమె నా పక్కన మంచంపై ఉంది, ఆమె నా భార్యా లేక నేను ఆమెకు విడాకులు ఇచ్చేశానా?” అని అడిగేవాడు. మొదట్లో మేము అతనికి ఇలా చెప్పాము: “నీవు ఈ విషయాన్ని వదిలేసే వరకు నిన్ను నీవు అల్లాహ్ స్మరణలో (జిక్ర్ లో) బిజీగా ఉంచుకో.” అప్పుడు అతను తనను తాను అల్లాహ్ స్మరణలో బిజీగా ఉంచుకోవడం ప్రారంభించాడు, ఆ తర్వాత ఇబ్లీస్ అతని దగ్గరకు రావడం మొదలుపెట్టాడు; అతడు “సుబ్ హా నల్లాహ్ ” అన్నప్పుడల్లా ఇబ్లీస్, “లేదు! నువ్వు ఆమెకు విడాకులు ఇచ్చావని పరోక్షంగా చెబుతున్నావు” అని చెప్పేవాడు. అతడు “అల్లాహు అక్బర్ అన్నప్పుడల్లా ఇబ్లీస్, “నువ్వు ఆమెకు విడాకులు ఇచ్చావని పరోక్షంగా చెబుతున్నావు! మరియు ఇది పరువుకు సంబంధించిన విషయం!” అని చెప్పేవాడు. ఈ వ్యవహారం తీవ్రంగా మారిందని మేము చూసినప్పుడు, దీనిని పూర్తిగా పట్టించుకోవద్దని (ఈ వస్వాస్ నుండి ముఖం తిప్పుకోమని) అతనికి సలహా ఇచ్చాము. అప్పుడు అతను కొంతకాలం దానిని పట్టించుకోకుండా ఉండేవాడు, కానీ మళ్ళీ (తన పాత వస్వాస్ స్థితికి) తిరిగి వచ్చేవాడు. అతను కొన్నిసార్లు నా ఇంటికి వచ్చేవాడు, నేను అతన్ని నా ఇంటి నుండి బయటికి పంపించేసేవాడిని. ఎందుకంటే అతనికి ఊరటనిచ్చే వారు ఎవరో ఒకరు ఉన్నారని వాడికి తెలిసినంత కాలం, అతను తన వస్వాస్ ను కొనసాగిస్తూనే ఉంటాడు. కానీ మేము అతనికి ఒక సూత్రాన్ని నేర్పాము. కొంతకాలం తర్వాత, సర్వ ప్రశంసలు మరియు ఆశీర్వాదాలు అల్లాహ్ కే చెందుతాయి, అతని జీవితం స్థిరంగా మారింది మరియు ఈ వస్వాస్ అతని నుండి పూర్తిగా వెళ్లిపోయింది, ఎందుకంటే అతను ఆ సూత్రంపై స్థిరంగా ఉన్నాడు. మరియు నాకు చాలా మంది తెలుసు, వారిలో ఒకరికి ఇరవై ఏళ్ళకు పైగా వస్వాస్ ఉంది! అతను మా దగ్గరకు వచ్చాడు, మేము అతనికి సలహా ఇచ్చాము మరియు కొంతకాలం అతని పట్ల సహనంతో వ్యవహరించాము, ఆ తర్వాత అల్లాహ్ ఈ విధానం ద్వారా అతనికి నయం చేశాడు. కాబట్టి ఆ సోదరుడికి నా సలహా ఏమిటంటే, నేను పేర్కొన్న విధంగా అతను ఆచరించాలి, మరియు అల్లాహ్ కే బాగా తెలుసు.

Advice to those afflicted with Waswaas (whisperings) – Shaykh Sulaymaan ar-Ruhaylee
https://www.youtube.com/watch?v=nz0fxK7KRkU [5 min]

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=45331

మీ రంజాన్ ను ఎలా సద్వినియోగం చేసుకోవాలి? – షేఖ్ అబ్దుస్సలాం అల్ షువైర్

మీ రంజాన్ ను ఎలా సద్వినియోగం చేసుకోవాలి?
షేక్ అబ్దుస్సలాం అల్ షువైర్ హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=qtVtAPC4gJI
[Arabic | English sibtitles] Noor Translations

బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం.

సర్వలోక ప్రభువైన అల్లాహ్‌కే సకల స్తుతులు, ఆరాధనలకు అర్హుడు అల్లాహ్ తప్ప మరెవరూ లేరని, ఆయనకు సాటి ఎవరూ లేరని నేను సాక్ష్యమిస్తున్నాను. అలాగే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ దాసుడు మరియు ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను. అల్లాహ్ యొక్క దీవెనలు మరియు శాంతి ప్రవక్తపై, వారి కుటుంబంపై మరియు వారి సహచరులందరిపై తీర్పు దినం వరకు ఉండుగాక.

ఇకపోతే… ఈ ప్రసంగం ఎక్కువ సేపు పొడిగించనని ఇన్షా అల్లాహ్ ఆశిస్తున్నాను. రమదాన్ మాసం సమీపిస్తున్న ఈ సమయానికి ఇది సరైనది, ఎందుకంటే ఈ పవిత్ర మాసం ప్రారంభం కావడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి.

అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన దాని ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సహచరులకు రమదాన్ రాక గురించి శుభవార్త తెలియజేస్తూ, “ఒక గొప్ప మాసం మీ ముందుకు వచ్చింది,” అని చెప్పేవారు. అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసు యొక్క స్పష్టమైన అర్థం ఏమిటంటే, మాసం ప్రారంభం కాకముందే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాటలు చెప్పి, ఆ మాసం యొక్క గొప్పతనాన్ని మరియు అందులో చేయవలసిన సత్కార్యాలను వారికి గుర్తుచేసేవారు.

ఒక ముస్లిం రమదాన్ మాసానికి ముందున్న ఈ రోజుల్లో, రెండు ప్రాథమిక విషయాలతో రమదాన్ ప్రారంభానికి సిద్ధపడాలి. ఈ రెండింటిలో మొదటిది అల్లాహ్‌కు విధేయత చూపాలని నిశ్చయించుకోవడం మరియు సంకల్పించడం (నియ్యత్). అందుకే ఇమామ్ అహ్మద్ తన కుమారుడు అబ్దుల్లా “నాకు సలహా ఇవ్వండి” అని అడిగినప్పుడు, “ఓ నా కుమారా, మంచిని సంకల్పించు, ఎందుకంటే నువ్వు మంచిని సంకల్పించినంత కాలం క్షేమంగా ఉంటావు,” అని చెప్పారు.

ఇబ్ను ముఫ్లిహ్, ఇమామ్ అహ్మద్ మాటలను ఉటంకిస్తూ ఇలా అన్నారు: “ఒక దయగల తండ్రి తన కుమారుడికి ఇచ్చిన ఎంత గొప్ప సలహా ఇది! ఇందులో ఇహపరలోకాల మేలు దాగి ఉంది.” ఒక వ్యక్తి మంచిని సంకల్పించి, దానిని చేయడానికి నిశ్చయించుకుంటాడు. కొన్ని ఉల్లేఖనాల్లో, విశ్వాసి యొక్క సంకల్పం (నియ్యత్) అతని పని కంటే ముఖ్యమని చెప్పబడింది. కాబట్టి, ఎవరైనా ఒక మంచి, పుణ్యకార్యం చేయాలని సంకల్పించి, అనారోగ్యం, వైకల్యం, పని లేదా మరేదైనా కారణం వల్ల దానిని చేయలేకపోతే, అల్లాహ్ అతను ఆ పని చేయనప్పటికీ అతని సంకల్పానికి ప్రతిఫలం ఇస్తాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి సహీహ్ (ధృవీకరించబడిన) హదీసులో ఇలా ఉంది: “ఒక దాసుడు అనారోగ్యం పాలైనా లేదా ప్రయాణంలో ఉన్నా, అతను ఆరోగ్యంగా మరియు తన నివాసంలో ఉన్నప్పుడు చేసే పనుల ప్రతిఫలమే అతనికి లిఖించబడుతుంది.” ఇది ప్రత్యేకంగా ఈ ఉమ్మత్ (సమాజం) పై అల్లాహ్ చూపిన కరుణ, వారి సంకల్పాలకు కూడా ప్రతిఫలం లభిస్తుంది.

మన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ఎవరైతే ఒక మంచి పని చేయాలని సంకల్పించి దానిని చేయలేకపోతారో, వారికి ఒక పూర్తి మంచి పని (పుణ్యం) లిఖించబడుతుంది. మరియు ఎవరైతే ఒక మంచి పని చేయాలని సంకల్పించి దానిని పూర్తి చేస్తారో, వారికి 10 రెట్లు లేదా అంతకంటే ఎక్కువ ప్రతిఫలం లిఖించబడుతుంది.” ఇది ఈ ఉమ్మత్ పట్ల అల్లాహ్ దయ, ఎందుకంటే వీరి శరీరాలు బలహీనమైనవి మరియు ఆయుష్షు తక్కువ. మీకు తెలిసినట్లుగా, మునుపటి జాతులతో పోలిస్తే ఈ ఉమ్మత్ ఆయుష్షు తక్కువ. నూహ్ (అలైహిస్సలాం) తన ప్రజలను తౌహీద్ వైపు 1000 సంవత్సరాలకు 50 ఏళ్లు తక్కువ (950 సంవత్సరాలు) పిలిచారు. దానికి ముందు ఆయనకు కొంత ఆయుష్షు ఉంది మరియు తుఫాను తర్వాత కూడా ఆయనకు ఆయుష్షు ఉంది. కాబట్టి, నూహ్ (అలైహిస్సలాం) ఆయుష్షు 1050 సంవత్సరాలు అని చెప్పబడింది (ఇది ప్రామాణికమైతే).

దీని ఉద్దేశ్యం ఏమిటంటే, ఒక వ్యక్తి మంచిని సంకల్పించాలి, కేవలం మంచిని సంకల్పించి, చేయడానికి సిద్ధపడితే, ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చి ఆ పని చేయలేకపోయినా, అతని నియ్యత్ కారణంగా అతనికి ప్రతిఫలం లభిస్తుంది.అయితే ఈ నియ్యత్ (సంకల్పం) కోసం, రెండవ విషయం తప్పక తెలుసుకోవాలి. దేనిని సంకల్పించాలి? ప్రతి విషయాన్ని సంకల్పించకూడదు, కేవలం అనుమతించబడిన (హలాల్) విషయాలనే సంకల్పించాలి.

మనం ఈ పవిత్ర మాసానికి సమీపిస్తున్నందున, ముస్లింలు ఈ మాసంలో సూచించబడిన విధులను తెలుసుకోవడం సముచితం. తద్వారా వారు నియమాలను నేర్చుకుని, వాటిని సరిగ్గా పాటించగలరు. ఒకవేళ వారు చేయగలిగితే వాటిని చేయాలని సంకల్పించాలి, చేయలేకపోతే అల్లాహ్ ఎంతో దయామయుడు, ఉన్నతుడు.

రమదాన్ మాసంలో చేసే పనులలో మొదటిది మరియు మనందరికీ తెలిసినది ఉపవాసం (సౌమ్) ఉండటం విధి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “రమదాన్ మాసంలోనే ఖురాన్ అవతరించింది.” మరియు ఆయన ఇలా అన్నారు: “మీకు పూర్వీకులపై విధిగావించబడినట్లే మీపై కూడా ఉపవాసం విధిగావించబడింది.” ముస్లింలు బాధ్యతాయుతంగా మరియు ఉపవాసం ఉండగలిగే స్థితిలో ఉంటే రమదాన్ మాసంలో ఉపవాసం ఉండాలని ఇది సూచిస్తుంది. ఇది స్పష్టమైనది మరియు ఇందులో ఎటువంటి సందేహం లేదు.

రెండవ విషయం, ఈ పవిత్ర మాసంలో అత్యంత దృఢమైన మరియు సిఫార్సు చేయబడిన చర్యలలో ఒకటి రాత్రి పూట నమాజ్ (ఖియామ్) చేయడం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ఎవరైతే రమదాన్ మాసంలో విశ్వాసంతో (ఈమాన్) మరియు ప్రతిఫల ఆశతో (ఇహ్తిసాబ్) రాత్రి నమాజ్ (తరావీహ్) చేస్తారో, వారి గత పాపాలు క్షమించబడతాయి.” మరియు మరొక హదీసులో ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ఎవరైతే లైలతుల్ ఖద్ర్ రాత్రి విశ్వాసంతో మరియు ప్రతిఫల ఆశతో నమాజ్ చేస్తారో, వారి గత పాపాలు క్షమించబడతాయి.”

కొంతమంది వ్యాఖ్యాతలు ఇలా పేర్కొన్నారు: రమదాన్‌లో నమాజ్ చేసేవారి పాపాలు రెండు కారణాల వల్ల క్షమించబడతాయి: ఒకటి, వారు నెల మొత్తం రాత్రి నమాజ్ చేస్తారు కాబట్టి, మరియు రెండు, వారు లైలతుల్ ఖద్ర్ రాత్రి నమాజ్ చేస్తారు కాబట్టి (ఎందుకంటే లైలతుల్ ఖద్ర్ ఈ పవిత్ర మాసంలోని రాత్రులలో ఒకటి). కాబట్టి, ముస్లింలు ఈ పవిత్ర మాసంలో రాత్రి నమాజ్ చేయడానికి ఆసక్తి చూపడం మంచిది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాత్రి నమాజ్ చేసేవారు, వారి తర్వాత సహచరులు (సహాబా) అలా చేసేవారు, మరియు ముస్లింలు తరావీహ్ నమాజ్‌లో వ్యక్తిగతంగా మరియు సమూహాలుగా నమాజ్ చేయడం కొనసాగిస్తున్నారు.

మరియు మనపై అల్లాహ్ యొక్క అపారమైన దయ ఏమిటంటే, కేవలం తప్పనిసరి (ఫర్జ్) నమాజులు తప్ప రాత్రిపూట వేరే నమాజులు చేయని వ్యక్తికి కూడా అల్లాహ్ రాత్రి నమాజ్ ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) మరియు ఇతరుల హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెప్పినట్లు పేర్కొనబడింది: “ఎవరైతే ఇషా నమాజ్‌లో పాల్గొంటారో (జమాత్‌తో), అది సగం రాత్రి నమాజ్ చేసినట్లు లెక్క. మరియు ఎవరైతే ఫజర్ నమాజ్‌లో పాల్గొంటారో (కొన్ని హదీసుల్లో ఇషా మరియు ఫజర్ రెండింటిలోనూ పాల్గొంటే అని ఉంది), అది రాత్రంతా నమాజ్ చేసినట్లు లెక్క.” దీనిని బట్టి ముస్లింలు ఈ రెండు నమాజులను, ఇషా మరియు ఫజర్, జమాత్‌తో (సమూహంతో) ఇమామ్ వెనుక చేయడానికి ఆసక్తి చూపాలని అర్థమవుతుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసు ప్రకారం, ఎవరైతే ఈ నమాజులను ఇమామ్‌తో కలిసి చేస్తారో, వారికి రాత్రంతా నమాజ్ చేసిన ప్రతిఫలం లిఖించబడుతుంది. తరావీహ్ వంటి ఇతర నమాజులు చేయలేని పరిస్థితిలో ఉన్న ముస్లిం కనీసం దీనిపై అయినా శ్రద్ధ వహించాలి.

రమదాన్ మాసంలో సూచించబడిన రెండవ ఆరాధన ఖురాన్ పఠనం (తిలావత్). పండితులు రమదాన్‌లో ప్రత్యేకంగా ఖురాన్ చదవాలని సిఫార్సు చేశారు, ఎందుకంటే అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “రమదాన్ మాసంలోనే ఖురాన్ అవతరించింది, ఇది మానవాళికి మార్గదర్శకత్వం మరియు సన్మార్గం మరియు సత్యాసత్యాల విచక్షణకు స్పష్టమైన రుజువు.” ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు జిబ్రీల్ (అలైహిస్సలాం) వచ్చేవారు మరియు ప్రవక్త మరణించిన సంవత్సరం వరకు ప్రతి రమదాన్‌లో ఆయనతో ఖురాన్ పఠించేవారు. ప్రవక్త మరణించిన సంవత్సరంలో జిబ్రీల్ (అలైహిస్సలాం) ఆయనతో రెండుసార్లు ఖురాన్ పఠించారు. ఈ హదీసు నుండి పండితులు మరియు వ్యాఖ్యాతలు ముస్లింలు రమదాన్‌లో కనీసం ఒక్కసారైనా ఖురాన్ పూర్తి చేయడం మంచిదని గ్రహించారు. కాబట్టి ఈ పవిత్ర మాసంలో ఒక్కసారైనా ఖురాన్ పూర్తి చేయడానికి ప్రయత్నించండి, అల్లాహ్ యొక్క దయ చాలా విశాలమైనది మరియు గొప్పది, ఈ గొప్ప పుణ్యాన్ని కోల్పోకండి.

ఈ పవిత్ర మాసంలో చేయవలసిన మూడవ విషయం మస్జిద్‌లతో అనుబంధం కలిగి ఉండటం. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క సహచరులు రమదాన్ మాసం వచ్చినప్పుడు ఇలా చెప్పేవారు: “మేము మస్జిద్‌లలో ఉంటాము మరియు మా ఉపవాసాలను కాపాడుకుంటాము.” మస్జిద్‌లలో తరచుగా ఉండటం, నమాజ్ తర్వాత లేదా ముందు కొన్ని నిమిషాలైనా సరే, అల్లాహ్ నుండి గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తుందని ఇది సూచిస్తుంది. ఒక వ్యక్తి నమాజ్ కోసం వేచి ఉన్నంత సేపు నమాజ్‌లో ఉన్నట్లే పరిగణించబడతాడు మరియు అతను తన “వుదూ” భంగం చేసుకోనంత వరకు లేదా మాట్లాడనంత వరకు దేవదూతలు అతని కోసం స్తుతిస్తూనే ఉంటారు. ఇది ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి ఉల్లేఖించబడిన అనేక హదీసులలో ఒకటి. మీరు మస్జిద్‌లో ఒక్క నిమిషం ఉన్నా సరే, మీకు ప్రతిఫలం లభిస్తుంది, ముఖ్యంగా రమదాన్‌లో.

అబ్దుల్లా బిన్ ఉనైస్ అల్-జుహానీ తన తండ్రి ఉనైస్ అల్-జుహానీ (రదియల్లాహు అన్హు) నుండి ఉల్లేఖించారు. ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి, “ఓ అల్లాహ్ ప్రవక్తా, నా కోసం ఒక రాత్రిని కేటాయించండి, నేను ఎడారిలో నా జాతికి నాయకుడిని, కాబట్టి నేను మీ మస్జిద్‌కు రావడానికి ఒక రాత్రిని నిర్ణయించండి,” అని అడిగారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనితో, “23వ రాత్రి రండి,” అని చెప్పారు. అతని కుమారుడు అబ్దుల్లా ఇలా అన్నారు, “23వ రాత్రి వచ్చినప్పుడు, మా నాన్న తన వాహనాన్ని ప్రవక్త మస్జిద్ తలుపు దగ్గర కట్టేసి, తెల్లవారుజాము (ఫజర్) తర్వాత వరకు బయటకు వచ్చేవారు కాదు.” అందువల్ల, ఈ హదీసులో ఉనైస్ (రదియల్లాహు అన్హు) సూచించినట్లుగా, కనీసం ఒక రాత్రి లేదా ఒక పగలు పూర్తిగా ఇతికాఫ్ ఉండటం కనీస పరిపూర్ణత అని పండితులు చెబుతారు. ఇక అత్యంత పరిపూర్ణమైన విషయం ఏమిటంటే, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేసినట్లుగా 10 రోజులు ఇతికాఫ్ ఉండటం: ఇది మస్జిద్‌లతో అనుబంధం పెంచుకోవడంలో భాగం.

రమదాన్ మాసంలో చేసే నాలుగవ విషయం. వారు చెప్పినదాని ప్రకారం, దానధర్మాలు (సదకా) చేయడం మరియు వాటిని పెంచడం, అది విధిగా ఇవ్వవలసిన జకాత్ అయినా సరే లేదా స్వచ్ఛంద దానమైనా సరే. ఇబ్ను అబ్బాస్ (రదియల్లాహు అన్హు) నుండి ఉల్లేఖించబడింది: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజలందరిలో అత్యంత దాతృత్వం గలవారు, మరియు జిబ్రీల్ (అలైహిస్సలాం) ఖురాన్ పఠించడానికి వచ్చే రమదాన్ మాసంలో ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మరింత దాతృత్వం చూపేవారు. వీస్తున్న గాలి కంటే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎక్కువ దాతృత్వం చూపేవారు. రమదాన్‌లో దాతృత్వానికి సంబంధించిన ఒక ముఖ్య విషయం విధిగా ఇవ్వవలసిన జకాత్. ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ముస్లింలతో ఇలా చెప్పేవారు: “ఓ ముస్లింలారా, ఈ మాసం మీ జకాత్ మాసం. మీ అప్పులు తీర్చండి మరియు మీ జకాత్ ఇవ్వండి.” ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఉద్దేశించిన మాసం రమదాన్ అని కొందరు, మొహర్రం అని కొందరు అన్నారు, అల్లాహ్‌కే బాగా తెలుసు.

ముఖ్య విషయం ఏమిటంటే, సాధారణంగా దానధర్మాలు చేయడం, మరియు ఇతర నెలల్లో జకాత్ ఇవ్వని వారు ఈ పవిత్ర మరియు గొప్ప మాసంలో తప్పనిసరి జకాత్ ఇవ్వడం ధృవీకరించబడింది. గొప్ప దానాలలో పేదలకు అన్నదానం చేయడం ఒకటి. రమదాన్ మాసంలో పేదలకు అన్నదానం చేయడంలో సహచరులు (సహాబా) పోటీపడేవారని ఉల్లేఖించబడింది. దీనికి ఆధారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి ఉల్లేఖించబడిన ఈ మాట కావచ్చు: “ఎవరైతే ఉపవాసకుని చేత ఉపవాసం విరమింపజేస్తారో (ఇఫ్తార్), వారికి ఆ ఉపవాసకునికి లభించినంత పుణ్యమే లభిస్తుంది.” మరియు ఉపవాసం విరమింపజేయడం అంటే రాత్రి ప్రారంభంలో ఆహారం ఇవ్వడం కావచ్చు లేదా ఏ ఆహారమైనా కావచ్చు. కొంతమంది వ్యాఖ్యాతలు ఇలా మరియు అలా చెప్పారు, కానీ అల్లాహ్ యొక్క దయ అపారమైనది మరియు ఒక వ్యక్తి అల్లాహ్ పట్ల మంచి ఆలోచన కలిగి ఉండాలి ఎందుకంటే అల్లాహ్ దయామయుడు.

మరియు ఈ పవిత్ర మాసానికి సంబంధించిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి తన నాలుకను అదుపులో ఉంచుకోవాలి (జాగ్రత్త వహించాలి), ఎందుకంటే సహచరులు తమ నాలుకలను అదుపులో ఉంచుకునేవారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇద్దరు స్త్రీలతో మాట్లాడారు, వారు మాట్లాడుతూ ఉపవాసం పాటించలేదు (అంటే చెడు మాటలు మాట్లాడారు), ఈ హదీసు బలహీనమైనది అయినప్పటికీ జ్ఞానులు దీనిని ఒక గుణపాఠంగా మరియు హెచ్చరికగా ప్రస్తావిస్తారు. అందువల్ల ముస్లింలు రమదాన్ పగలు మరియు రాత్రి వేళల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పగలు మరియు రాత్రి సమానమే. అతను తిట్టకుండా తన నాలుకను కాపాడుకోవాలి, ఎవరినీ దూషించకూడదు, ఎవరినీ అవమానించకూడదు, మరియు చాడీలు (గీబత్) చెప్పకూడదు; చిన్నవారి గురించి గానీ, పెద్దవారి గురించి గానీ, దగ్గరి వారి గురించి గానీ, దూరపు వారి గురించి గానీ చెడుగా మాట్లాడకూడదు. అతను తన నాలుకను కాపాడుకోవాలి ఎందుకంటే జ్ఞానాన్ని ఆర్జించే విద్యార్థి (తాలిబ్ అల్-ఇల్మ్) జాగ్రత్త వహించాల్సిన ముఖ్యమైన విషయాలలో నాలుకను అదుపులో ఉంచుకోవడం ఒకటి. నాలుకను కాపాడుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే చాలా మంది రోడ్డుపై ఏదైనా సంఘటన జరిగినప్పుడు కోపానికి గురై తిట్టడం లేదా శపించడం చేస్తారు, లేదా ఇంట్లో ఏదైనా కోపం తెప్పించే విషయం జరిగితే తమ కొడుకు లేదా కూతురిని అసభ్య పదజాలంతో దూషించవచ్చు.

కానీ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పినట్లుగా, ఎవరైనా అతనిని తిట్టినా లేదా అతనితో “ఖాతల” (గొడవ/వాదన) చేసినా... ఖాతల అంటే వాదించాలనుకోవడం. కొందరు ఇక్కడ పోరాటం అంటే వాదన అని, మరికొందరు పోరాటం అంటే వేరేదని అంటారు. ఎవరైనా అతనిని అవమానించినా లేదా వాదించినా, అతను “ఇన్నీ సాయిమ్” (నేను ఉపవాసంతో ఉన్నాను/నేను రోజా ఉన్నాను) అని చెప్పాలి. ఆ వ్యక్తికి ఉపవాసం గురించి మరియు “నేను ఉపవాసంతో ఉన్నాను” అని చెప్పడం గురించి గుర్తుచేయబడుతుంది. ఉపవాసం తప్పనిసరి (ఫర్జ్) అయినప్పుడు ఇలా చెప్పడం మంచిదని వారు అంటారు, ఎందుకంటే ప్రజలందరూ ఉపవాసంతో ఉంటారు కాబట్టి “నేను ఉపవాసంతో ఉన్నాను” అని చెప్పాలి. ఒకవేళ అది స్వచ్ఛంద (నఫిల్) ఉపవాసం అయితే, కొందరు ఉపవాసకుడినే పైకి చెప్పమంటారు, మరికొందరు తమలో తాము చెప్పుకోవాలని అంటారు. ఇది సులభమైన విషయం మరియు దీని జ్ఞానం అల్లాహ్ వద్ద ఉంది.

అందువల్ల, ముస్లిం ఇటువంటి రోజుల్లో మంచిని సంకల్పించి, దాని నియమాలను నేర్చుకుంటాడు. అతను నేర్చుకుంటే, మంచిని సంకల్పించి, దానిని చేయడానికి నిశ్చయించుకుంటాడు. ఒకవేళ అతనికి ప్రయాణం లేదా ఏదైనా ఆటంకం ఎదురైతే, లేదా బిజీగా ఉండి లేదా అనారోగ్యంతో ఉండి చేయలేకపోతే, అల్లాహ్ తన దయ మరియు దాతృత్వంతో, ఆ దాసుడు నిజాయితీగా, దృఢంగా సంకల్పించినందుకు అతనికి ప్రతిఫలం ఇస్తాడు.

మనందరికీ సన్మార్గం మరియు భయభక్తులు (తక్వా) ప్రసాదించమని, ఉపయోగకరమైన జ్ఞానాన్ని మరియు “ఖుషూ” (వినయం/భక్తి) గల హృదయాన్ని ప్రసాదించమని గొప్ప సింహాసనానికి (అర్ష్) అధిపతి అయిన అల్లాహ్‌ను కోరుతున్నాను. మన పట్ల మరియు మన తల్లిదండ్రుల పట్ల అల్లాహ్ సంతోషంగా ఉండాలని, మన పాపాలను క్షమించాలని, మన లోపాలను కప్పిపుచ్చాలని మరియు మన తప్పులను మన్నించాలని నేను ఆయనను వేడుకుంటున్నాను. వారికి మతం పట్ల అవగాహన కల్పించమని నేను ఆయనను కోరుతున్నాను. ఖురాన్ నుండి మనం మరచిపోయిన వాటిని గుర్తుచేయమని మరియు మనకు తెలియని వాటిని నేర్పించమని నేను ఆయనను అడుగుతున్నాను. మన దేశాన్ని అన్ని రకాల చెడు మరియు ప్రలోభాల (ఫిత్రాల) నుండి రక్షించమని, దాని భద్రత మరియు విశ్వాసాన్ని కాపాడమని, మరియు దాని శ్రేయస్సును శాశ్వతం చేయమని నేను ఆయనను కోరుతున్నాను. మన నాయకులకు విజయాన్ని, ఆశీర్వాదాలను మరియు రక్షణను ప్రసాదించమని, వారి వ్యవహారాలను మరియు అభిప్రాయాలను సరైన మార్గంలో నడిపించమని, మరియు మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), వారి కుటుంబం మరియు వారి సహచరులందరిపై అల్లాహ్ యొక్క శాంతి మరియు దీవెనలు ఉండాలని నేను అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నాను.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44920

రమదాన్ (Main Page):
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/

మాలిక్ బిన్ దినార్ మరియు దొంగ

ఒక రాత్రి, ఒక దొంగ మాలిక్ బిన్ దినార్ ఇంటి ప్రహరీ గోడ దూకి, చాలా సులభంగా లోపలికి ప్రవేశించాడు. ఇంటి లోపలికి వెళ్ళిన ఆ దొంగ, అక్కడ దొంగిలించడానికి విలువైనది ఏమీ లేకపోవడం చూసి నిరాశ చెందాడు. ఆ సమయంలో ఇంటి యజమాని (మాలిక్ బిన్ దినార్) లోపలే ఉన్నారు, ఆయన ప్రార్థన (నమాజ్) చేసుకోవడంలో నిమగ్నమై ఉన్నారు. తాను ఒంటరిగా లేనని గ్రహించిన మాలిక్, వెంటనే తన ప్రార్థనను ముగించి, వెనక్కి తిరిగి ఆ దొంగ వైపు చూశారు. ఎలాంటి భయం గానీ, ఆశ్చర్యం గానీ కనబరచకుండా, మాలిక్ ప్రశాంతంగా అతనికి సలామ్ తెలిపి ఇలా అన్నారు, “నా సోదరుడా, అల్లాహ్ నిన్ను క్షమించు గాక. నువ్వు నా ఇంట్లోకి ప్రవేశించావు కానీ తీసుకువెళ్ళడానికి ఏమీ దొరకలేదు, అయినా సరే, నువ్వు ఎటువంటి ప్రయోజనం పొందకుండా నా ఇంటి నుండి వెళ్ళడం నాకు ఇష్టం లేదు.”

ఆయన లేచి, గదిలో వేరే వైపుకు వెళ్ళి, ఒక జగ్గు నిండా నీళ్లు తీసుకొని తిరిగి వచ్చారు. ఆయన ఆ దొంగ కళ్ళలోకి చూస్తూ, “వుజూ (శుద్ధి) చేసుకుని రెండు రకాతుల ప్రార్థన చెయ్యి. నువ్వు అలా చేస్తే, నువ్వు ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆశించిన దానికంటే గొప్ప నిధితో బయటకు వెళ్తావు,” అని అన్నారు.

మాలిక్ ప్రవర్తనకు మరియు మాటలకు ఎంతగానో కదిలిపోయిన ఆ దొంగ, “అవును, ఇది నిజంగా చాలా గొప్ప అవకాశం,” అని అన్నాడు.

వుజూ చేసుకుని రెండు రకాతుల ప్రార్థన పూర్తి చేసిన తర్వాత, ఆ దొంగ, “ఓ మాలిక్, నేను మరో రెండు రకాతుల ప్రార్థన చేయాలనుకుంటున్నాను, కాబట్టి నేను ఇంకా సేపు ఇక్కడే ఉండవచ్చా?” అని అడిగాడు.

దానికి మాలిక్, “అల్లాహ్ నీకు ఎంత ప్రార్థన విధించారో, అంత వరకు నువ్వు ఇక్కడే ఉండు,” అని అన్నారు.

ఆ దొంగ ఆ రాత్రంతా మాలిక్ ఇంట్లోనే గడిపాడు. ఉదయం వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అప్పుడు మాలిక్, “ఇక వెళ్ళు, మంచి మార్గంలో నడువు,” అని అన్నారు.

కానీ వెళ్ళడానికి బదులుగా, ఆ దొంగ, “నేను ఈ రోజు ఉపవాసం (రోజా) ఉండాలని నిశ్చయించుకున్నాను, కాబట్టి ఈ రోజు మీతో పాటు ఇక్కడే ఉండవచ్చా?” అని అడిగాడు.

“నీకు ఇష్టమైనంత కాలం ఉండు,” అని మాలిక్ అన్నారు.

ఆ దొంగ కొన్ని రోజుల పాటు అక్కడే ఉండిపోయాడు. ప్రతి రోజూ రాత్రి వేళ ప్రార్థనలు చేస్తూ, పగలు అంతా ఉపవాసం ఉండేవాడు. చివరికి అతను వెళ్ళడానికి నిర్ణయించుకున్నప్పుడు, ఆ దొంగ ఇలా అన్నాడు, “ఓ మాలిక్, నా పాపాలకు మరియు నా గత జీవన విధానానికి నేను పశ్చాత్తాప పడాలని గట్టిగా నిర్ణయించుకున్నాను.”

మాలిక్, “నిజమే, అది అల్లాహ్ చేతుల్లో ఉంది,” అని బదులిచ్చారు.

ఆ వ్యక్తి తన పద్ధతులను మార్చుకొని, అల్లాహ్ పట్ల విధేయత మరియు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత, అతనికి తెలిసిన మరో దొంగ అతనికి ఎదురయ్యాడు. [అతని స్నేహితుడు] అతనితో, “నీకు నీ నిధి దొరికిందా?” అని అడిగాడు.

అందుకతను ఇలా అన్నాడు, “నా సోదరుడా, నాకు దొరికింది మాలిక్ బిన్ దినార్. నేను ఆయన దగ్గర దొంగలించడానికి వెళ్ళాను, కానీ ఆయనే నా మనసును దోచుకున్నారు. నేను నిజంగా అల్లాహ్ ముందు పశ్చాత్తాప పడ్డాను, మరియు ఆయన విధేయులైన, ప్రేమించే భక్తులు సాధించినది నేను సాధించే వరకు, నేను ఆయన [కరుణ మరియు క్షమాభిక్ష] ద్వారం దగ్గరే ఉంటాను.”

[అల్-మవాఇద్ వల్-మజాలిస్: 85]

సలాత్ అద్-దుహా (చాష్త్, ఇష్రాఖ్ నమాజ్) – హబీబుర్రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

సలాతుజ్జుహా (చాష్త్ నమాజు)
వక్త: హబీబుర్రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/SZeHU5ws1ic [12 నిముషాలు]

ఈ ప్రసంగంలో, సలాతుద్ దుహా (చాష్త్ నమాజ్ లేదా ఇష్రాఖ్ నమాజ్ అని కూడా పిలుస్తారు) యొక్క ప్రాముఖ్యత, దానిని ఆచరించే విధానం మరియు దాని గొప్ప ప్రతిఫలాల గురించి వివరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసుల ఆధారంగా, మానవ శరీరంలోని 360 కీళ్ల తరపున ప్రతిరోజూ ధర్మం (సదఖా) చేయవలసిన బాధ్యత ఉందని, అయితే కేవలం రెండు రకాతుల దుహా నమాజ్ ఆచరించడం ద్వారా ఆ బాధ్యత నెరవేరుతుందని స్పష్టం చేయబడింది. అంతేకాకుండా, ఫజ్ర్ నమాజ్‌ను జమాఅత్‌తో ఆచరించి, సూర్యోదయం వరకు అదే స్థలంలో కూర్చుని అల్లాహ్‌ను స్మరించి, ఆ తర్వాత రెండు రకాతుల దుహా నమాజ్ చేసినవారికి ఒక సంపూర్ణ హజ్ మరియు ఉమ్రా చేసినంత పుణ్యం లభిస్తుందని కూడా వివరించబడింది.

అ’ఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, అమ్మా బాద్.

అభిమాన సోదరులారా, కారుణ్య వర్షిణి రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ప్రియ వీక్షకులారా, ఈరోజు మనం సలాతుద్ దుహా, చాష్త్ నమాజ్ గురించి తెలుసుకుందాం. చాష్త్ నమాజ్, ఇష్రాఖ్ నమాజ్, సలాతుద్ దుహా ఇవన్నీ ఒకే పేర్లు. అరబీలో సలాతుద్ దుహా అని, అలాగే ఇష్రాఖ్ నమాజ్ అని లేదా చాష్త్ నమాజ్ అని అంటారు.

ఈ నమాజ్ ఎప్పుడు చేస్తారు? సూర్యుడు ఉదయించి బాగా ప్రొద్దెక్కిన తర్వాత చేయబడే నమాజ్ ఇది సలాతుద్ దుహా.

ఇవి ఎన్ని రకాతులు చేయాలి? రెండు రకాతులు చేయవచ్చు, నాలుగు రకాతులు చేయవచ్చు, ఎనిమిది రకాతులు కూడా చేయవచ్చు. ప్రతి రెండు రకాతులకి సలాం చెప్పాలి. రెండు రకాతులు చేయవచ్చు, నాలుగు రకాతులు చేయవచ్చు ప్రతి రెండుకి సలాం చెప్పాలి, ఎనిమిది కూడా చేయవచ్చు ప్రతి రెండు రకాతులకి సలాం చెప్పాలి.

ఈ నమాజ్ గురించి, సలాతుద్ దుహా గురించి, ఇష్రాఖ్ లేదా చాష్త్ నమాజ్ గురించి అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు. అబూజర్ రదియల్లాహు అన్హు కథనం,

قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
(కాలన్ నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం)
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు,

يُصْبِحُ عَلَى كُلِّ سُلاَمَى مِنْ أَحَدِكُمْ صَدَقَةٌ
(యుస్బిహు అలా కుల్లి సులామా మిన్ అహదికుం సదఖహ్)
మీలో ప్రతి కీళ్ళు తరఫు నుంచి ప్రతిరోజూ ఒక సదఖా ఇవ్వాలి.

కీళ్ళు అంటే మనిషి శరీరంలో కీళ్ళు ఉంటాయి కదా. ప్రతి కీళ్ళు తరపున సదఖా ఇవ్వాలి.

فَكُلُّ تَسْبِيحَةٍ صَدَقَةٌ
(ఫకుల్లు తస్బీహతిన్ సదఖహ్)
ప్రతి ‘సుబ్ హా నల్లాహ్’ అని చెప్పడం కూడా సదఖా కిందికే వస్తుంది.

وَكُلُّ تَحْمِيدَةٍ صَدَقَةٌ
(వకుల్లు తహ్మీదతిన్ సదఖహ్)
‘అల్ హమ్దులిల్లాహ్’ అనటం కూడా సదఖాయే.

وَكُلُّ تَهْلِيلَةٍ صَدَقَةٌ
(వకుల్లు తహ్లీలతిన్ సదఖహ్)
‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అని స్మరించటం కూడా సదఖా అవుతుంది.

وَكُلُّ تَكْبِيرَةٍ صَدَقَةٌ
(వకుల్లు తక్బీరతిన్ సదఖహ్)
‘అల్లాహు అక్బర్’ అని చెప్పటం కూడా సదఖా అవుతుంది.

وَأَمْرٌ بِالْمَعْرُوفِ صَدَقَةٌ
(వ అమ్రున్ బిల్ మ’రూఫి సదఖహ్)
మంచిని ఆజ్ఞాపించటం, మంచి పని చేయండి అని చెప్పటం, ఇది కూడా సదఖా కిందికే వస్తుంది.

وَنَهْيٌ عَنِ الْمُنْكَرِ صَدَقَةٌ
(వ నహ్యున్ అనిల్ మున్కరి సదఖహ్)
చెడుని ఆపటం కూడా సదఖా కిందికే వస్తుంది.

وَيُجْزِئُ مِنْ ذَلِكَ رَكْعَتَانِ يَرْكَعُهُمَا مِنَ الضُّحَى
(వ యుజ్జిఉ మిన్ జాలిక రక’ఆతాని యర్క’ఉహుమా మినద్ దుహా)
వీటన్నిటికంటే సలాతుద్ దుహా రెండు రకాతులు చేయటం ఉత్తమం అన్నారు, మంచిది అన్నారు.

అంటే సుబ్ హా నల్లాహ్, అల్ హమ్దులిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ ఎన్నిసార్లు చెప్తామో అన్నిసార్లు సదఖా ఇచ్చినట్టు సమానం అవుతుంది. వీటన్నిటికంటే చాష్త్ రెండు రకాతులు సరిపోతుంది అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది.

ఇంకో హదీస్ లో కొంచెం వివరంగా ఉంది. దాంట్లో అది ఏముందంటే, అబూ దావూద్ లో ఉంది హదీస్ అది. బురైదా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం,

ఈ హదీస్ లో చాష్త్ నమాజ్, సలాతుద్ దుహా, ఈ నమాజ్ యొక్క ప్రాముఖ్యత, గొప్పతనం, ఘనత ఏమిటో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది.

قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
(కాలన్ నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం)
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు,

فِي الإِنْسَانِ ثَلاَثُمِائَةٍ وَسِتُّونَ مَفْصِلاً
(ఫిల్ ఇన్సాని సలాసు మిఅతిన్ వ సిత్తూన మిఫ్సలన్)
మనిషి యొక్క శరీరంలో 360 కీళ్ళు ఉన్నాయి, జాయింట్లు.

ఇలా జాయింట్లు, కీళ్ళు, మనిషి యొక్క శరీరంలో 360 ఉన్నాయి.

فَعَلَيْهِ أَنْ يَتَصَدَّقَ عَنْ كُلِّ مَفْصِلٍ مِنْهُ بِصَدَقَةٍ
(ఫ’అలైహి అన్ యతసద్దఖ అన్ కుల్లి మిఫ్సలిన్ బి సదఖహ్)
కావున, ప్రతి జాయింట్ కి బదులుగా సదఖా చేయటం తప్పనిసరి ప్రతిరోజూ.

అంటే మనిషి యొక్క శరీరంలో 360 జాయింట్లు ఉన్నాయి. ప్రతి జాయింట్ కి బదులుగా ప్రతిరోజూ ఒక సదఖా ఇవ్వాలి. అంటే ప్రతిరోజూ 360 జాయింట్లకి బదులుగా 360 సదఖాలు చేయాలి, ప్రతిరోజూ చేయాలి. ఇది తప్పనిసరి. ఇది విని సహాబాలు ఆశ్చర్యంతో,

قَالُوا وَمَنْ يَسْتَطِيعُ يَا رَسُولَ اللَّهِ
“ఖాలూ వ మన్ యస్తతీ యా రసూలల్లాహ్” అన్నారు.
“ఓ రసూలల్లాహ్, ఈ స్థోమత ఎవరికి ఉంటుంది? ఎవరు చేయగలరు?”

ధనవంతులు, కోటీశ్వరులు వారైతే చేయగలరేమో, కానీ సాధారణమైన మనుషులు, మాలాంటి వారు, పేదవాళ్ళు ప్రతిరోజూ 360 సదఖాలు… ఆ స్థోమత మనకి ఎక్కడి నుంచి వస్తుంది? చేయలేము కదా, అని అడిగితే అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే,

النُّخَاعَةُ فِي الْمَسْجِدِ تَدْفِنُهَا
(అన్నుఖాఅతు ఫిల్ మస్జిది తద్ఫినుహా)
మస్జిద్ లో ఏమైనా గలీజ్ ఉంటే, ఏమైనా హానికరమైన వస్తువు ఉంటే తొలగించండి.

అది సదఖాతో సమానం అవుతుంది.

وَالشَّىْءُ تُنَحِّيهِ عَنِ الطَّرِيقِ
(వష్ షైఉ తునహ్హీహి అనిత్ తరీఖ్)
దారిలో ఏమైనా హాని కలిపించే వస్తువు, ముళ్ళు ఉంది, గలీజ్ ఉంది, వాటిని తొలగించండి. అది కూడా సదఖా కిందికే వస్తుంది.

فَإِنْ لَمْ تَجِدْ فَرَكْعَتَا الضُّحَى تُجْزِئُكَ
(ఫఇల్లమ్ తజిద్ ఫ రక’అతద్ దుహా తుజ్జిఉక)
అలా కుదరకపోతే, సలాతుద్ దుహా (చాష్త్ నమాజ్) ఈ 360 జాయింట్లకి సదఖాకి సరిపోతుంది అన్నారు.

అంటే ఎవరైతే సలాతుద్ దుహా చదువుతాడో, ఆ వ్యక్తి 360 సార్లు సదఖా ఇస్తున్నాడు అని దానికి సరిపోతుంది. అంటే ఈ హదీస్ ద్వారా మనకు ఏం బోధ పడుతుంది? ప్రతి మనిషి యొక్క శరీరంలో 360 జాయింట్లు ఉన్నాయి. ప్రతి జాయింట్ కి బదులుగా ఒక సదఖా ప్రతిరోజూ తప్పనిసరిగా ఇవ్వాలి. ఆ స్థోమత లేదు కాబట్టి అటువంటి వారు వేరే పుణ్యాల ద్వారా, సదఖా, దానధర్మాల ద్వారా, దారిలో నుంచి చెడుని దూరం చేయటం ద్వారా, అలాగే తస్బీహ్‌ల ద్వారా, జిక్ర్ ద్వారా (సుబ్ హా నల్లాహ్, అల్ హమ్దులిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్) ద్వారా, అలాగే సలాతుద్ దుహా ద్వారా సరిపోతుంది అన్నారు.

అభిమాన సోదరులారా, సలాతుద్ దుహా గురించి ఒక్క హదీస్ చెప్పి నేను ముగిస్తాను. దాని ప్రాముఖ్యత ఏమిటి, ఘనత ఏమిటి అనేది. అనస్ రదియల్లాహు త’ఆలా అన్హు కథనం ప్రకారం,

قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
(కాలన్ నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం)
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు,

مَنْ صَلَّى الْغَدَاةَ فِي جَمَاعَةٍ ثُمَّ قَعَدَ يَذْكُرُ اللَّهَ حَتَّى تَطْلُعَ الشَّمْسُ ثُمَّ صَلَّى رَكْعَتَيْنِ كَانَتْ لَهُ كَأَجْرِ حَجَّةٍ وَعُمْرَةٍ تَامَّةٍ تَامَّةٍ تَامَّةٍ
(మన్ సల్లల్ ఫజర ఫీ జమాఅతిన్, సుమ్మ ఖ’అద యద్కురుల్లాహ హత్తా తత్లు’అష్ షమ్సు, సుమ్మ సల్లా రక’అతైని, కానత్ లహు క అజ్రి హజ్జతిన్ వ ఉమ్రతిన్ తామ్మతిన్, తామ్మతిన్, తామ్మతిన్)

“ఎవడైతే ఫజ్ర్ నమాజ్ జమాఅత్‌తో చేశాడో, ఆ ఫర్ద్ నమాజ్ తర్వాత ఎక్కడికీ పోకుండా అక్కడే కూర్చుని అల్లాహ్‌ను స్మరిస్తున్నాడో (జిక్ర్ చేసుకుంటున్నాడో), సూర్యుడు ఉదయించే వరకు, ఆ తర్వాత రెండు రకాతులు చేశాడో (అంటే సలాతుద్ దుహా, ఇష్రాఖ్ నమాజ్, చాష్త్ నమాజ్), ఆ వ్యక్తికి ఒక సంపూర్ణ హజ్ మరియు ఉమ్రా పుణ్యం లభిస్తుంది.”

అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మూడుసార్లు నొక్కి చెప్పారు.

అల్లాహు అక్బర్! సలాతుద్ దుహా, ఇష్రాఖ్ నమాజ్, చాష్త్ నమాజ్ యొక్క ప్రతిఫలం, ఘనత ఏమిటి? ఫజ్ర్ నమాజ్ జమాఅత్‌తో చేసి, నమాజ్ తర్వాత ఆ స్థలంలోనే కూర్చుని, అల్లాహ్‌ను స్మరిస్తూ, జిక్ర్ చేసుకుంటూ, సూర్యుడు ఉదయించిన తర్వాత రెండు రకాతుల దుహా నమాజ్ చేస్తే, ఒక సంపూర్ణ హజ్ మరియు ఉమ్రా అంత పుణ్యం లభిస్తుందని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ తిర్మిజీ గ్రంథంలో ఉంది.

అభిమాన సోదరులారా, ఈ సలాతుద్ దుహా గురించి రెండు విషయాలు తెలుసుకోవాలి. మొదటి విషయము, సలాతుద్ దుహా, ఇష్రాఖ్ లేదా చాష్త్ నమాజ్, ఇది మస్జిద్ లో, ఇంట్లో ఎక్కడైనా చేయవచ్చు. కండిషన్ ఏమీ లేదు. ఫజ్ర్ నమాజ్ చేసుకున్నాము, కాసేపు పడుకున్నాము, ఏదో పని చేసుకున్నాము, తర్వాత సూర్యుడు ఉదయించిన తర్వాత చేసుకున్నాము. అలాగే ఫజ్ర్ నమాజ్ తర్వాత ఇంటికి వచ్చేసాము, ఇంట్లో చేసుకున్నాము. ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. సదఖా అంత పుణ్యం వస్తుంది, ఎక్కువ పుణ్యం అల్లాహ్ ప్రసాదిస్తాడు. కాకపోతే, సంపూర్ణ హజ్ మరియు ఉమ్రా అంత పుణ్యం రావాలంటే కండిషన్ ఏమిటి? ఫజ్ర్ నమాజ్ తర్వాత ఆ స్థలంలోనే కూర్చుని అల్లాహ్‌ను స్మరిస్తూ, జిక్ర్ చేసుకుంటూ, సూర్యుడు ఉదయించిన తర్వాత రెండు రకాతుల ఈ దుహా నమాజ్ చేసుకుంటే సంపూర్ణ హజ్ మరియు ఉమ్రా పుణ్యం లభిస్తుంది.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనమందరికీ నఫిల్ నమాజ్‌లు, సున్నత్ నమాజ్‌లు, ఈ దుహా, ఇష్రాఖ్ నమాజ్ పాటించే, ఆచరించే సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆదర్శంగా తీసుకొని మనము జీవితం గడిపే సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక. ఇహపరలోకాలలో సాఫల్యాన్ని అల్లాహ్ ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44390

ఇష్రాఖ్ / చాష్త్ నమాజు (దుహా /అవ్వాబీన్)

ఇస్లాంలో మస్జిదుల స్థానం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో , టెక్స్ట్ ]

ఇస్లాం లో మస్జిదుల స్థానం
వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=gNBBOGOFaVM [26 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో మస్జిద్ (మసీదు) యొక్క ఉన్నతమైన స్థానం మరియు ప్రాముఖ్యత గురించి వివరించబడింది. మస్జిద్ కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదని, అది విశ్వాసం, శాంతి, ఐక్యత మరియు విద్యకు కేంద్రమని వక్త నొక్కిచెప్పారు. మస్జిద్ లు ఇస్లామీయ కోటలని, అక్కడి నుండే ఇస్లాం వెలుగు ప్రపంచమంతటా వ్యాపించిందని తెలిపారు. ప్రవక్త ముహమ్మద్ (స) కాలంలో, సహాబాలు మస్జిద్ ను ఒక విశ్వవిద్యాలయంగా, శిక్షణా కేంద్రంగా ఎలా ఉపయోగించుకున్నారో ఉదాహరణలతో వివరించారు. అబూ హురైరా (ర) వంటి సహాబాలు మస్జిద్ లోనే ఉంటూ జ్ఞానాన్ని ఎలా సంపాదించారో పేర్కొన్నారు. మస్జిద్ లను నిర్మించడం, వాటిని ఆబాద్ (సజీవంగా) చేయడం, మరియు వాటి పట్ల గౌరవం చూపడం యొక్క పుణ్యఫలాలను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో విశదీకరించారు. చివరగా, మస్జిద్ లో ప్రవేశించేటప్పుడు, ఉన్నప్పుడు మరియు బయటకు వెళ్ళేటప్పుడు పాటించవలసిన నియమాలు, మర్యాదల గురించి ప్రస్తావించారు.


مَنْ يَهْدِهِ اللهُ فَلَا مُضِلَّ لَهُ وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ
[మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహూ వమన్ యుద్లిల్ ఫలా హాదియ లహూ]
ఎవరికైతే అల్లాహ్ మార్గదర్శకత్వం చూపాడో అతన్ని ఎవరూ త్రోవ తప్పించలేరు. మరియు ఎవరినైతే అల్లాహ్ త్రోవ తప్పించాడో అతనికి ఎవరూ మార్గదర్శకత్వం చూపలేరు.

وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ
[వ అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ]
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవరూ లేరు. ఆయన ఏకైకుడు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు.

وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ
[వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ]
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త.

أَمَّا بَعْدُ فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللهِ وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ
[అమ్మా బ’అదు ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహి వ ఖైరల్ హద్యి హద్యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం]
ఇక విషయానికొస్తే, నిశ్చయంగా అన్ని మాటలలో ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం. మరియు అన్ని మార్గాలలో ఉత్తమమైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం.

وَشَرَّ الْأُمُورِ مُحْدَثَاتُهَا وَكُلَّ مُحْدَثَةٍ بِدْعَةٌ وَكُلَّ بِدْعَةٍ ضَلَالَةٌ وَكُلَّ ضَلَالَةٍ فِي النَّارِ
[వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా వ కుల్ల ముహ్దసతిన్ బిద్’అతున్ వ కుల్ల బిద్’అతిన్ దలాలతున్ వ కుల్ల దలాలతిన్ ఫిన్నార్]
మరియు అన్ని విషయాలలో చెడ్డవి కొత్తగా కల్పించబడినవి. మరియు ప్రతీ కొత్తగా కల్పించబడినది బిద్’అత్. మరియు ప్రతీ బిద్’అత్ మార్గభ్రష్టత్వం. మరియు ప్రతీ మార్గభ్రష్టత్వం నరకానికి దారితీస్తుంది.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడతలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయు గాక.

అభిమాన సోదరులారా, ఈరోజు మనం ఇన్షా అల్లాహ్, ఇస్లాంలో మస్జిదుల స్థానం అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మస్జిద్ అంటే సజ్దా చేసే చోటు అని అర్థం. ప్రత్యేకంగా అల్లాహ్ ఆరాధన కోసం నిర్మించబడిన ఆలయాన్ని మస్జిద్ అంటారు.

మస్జిద్ కి గౌరవప్రదమైన, ఉన్నతమైన, పవిత్రమైన స్థానం ఉంది. ఇది ఈమాన్ మరియు శాంతికి మూలం. ప్రార్థనలు జరుపుకునే ప్రదేశం. ఇక్కడ ప్రార్థనలు స్వీకరించబడతాయి. ఉమ్మతి యొక్క ఐక్యతకు ఇదొక శీర్షిక. హిదాయత్, మంచితనం, స్థిరత్వానికి చిహ్నం. శాస్త్రీయపరమైన, ఆచరణాత్మకమైన, ఆధ్యాత్మికమైన గృహం మస్జిద్.

ఇది ధృడమైన శిక్షణా కేంద్రం. ఈ కేంద్రం నుంచే ఏమీ తెలియని ప్రజలు, గొర్రెలు మేపే సహాబాలు, ప్రపంచ ప్రతినిధులుగా తయారయ్యారు. దీని ఆధారంగానే రాగ ద్వేషాలలో రగిలే ప్రజలు ప్రేమానురాగాలకు ప్రతిరూపాలయ్యారు. ఈ కేంద్రం నుంచే సహాబాలు ఆ తరువాత వారు దీన్, దునియా, పరలోకం యొక్క శాస్త్రాలలో అత్యంత ప్రముఖులు, పట్టభద్రులయ్యారు.

ఇదొక పాఠశాల. దీనిలో విశ్వాసాల శిక్షణ జరుగుతుంది. హృదయాలు ఆధ్యాత్మికంగా శుద్ధి చేయబడతాయి. గొప్ప నాయకులు తయారవుతారు. ఇది ఒక న్యాయ వ్యవస్థ మరియు ఫత్వాలను జారీ చేసే ఓ మండలి. ఆశ్రయం లేని వారికి ఇదొక ఆశ్రయం. దాని మిహరాబు నుంచి అల్లాహ్ యొక్క స్పష్టమైన ఆయతులు పఠించబడతాయి. దీని మింబర్ నుంచి ప్రభావంతమైన ఖుత్బాలు, ఉపన్యాసాలు ఇవ్వబడతాయి.

మస్జిద్ అంటే కేవలం ఆరాధన ఆలయం మాత్రమే కాదు. వాస్తవానికి, మస్జిదులు ఇస్లామీయ కోటలు, ఇస్లాం ధర్మం కేంద్రాలు. ఇక్కడి నుండే ఇస్లాం వెలుగు ప్రపంచంలోని నలుదిశలూ వ్యాపించి విశ్వాన్నంతటినీ జ్యోతిర్మయం చేస్తుంది. ఈ మస్జిద్ల నుంచే సరైన ఇస్లామీయ బోధనలు జనబాహుళ్యంలో ప్రచారం చెందుతాయి. స్వచ్ఛమైన ఏక దైవోపాసనకు ప్రాచుర్యం లభిస్తుంది.

అభిమాన సోదరులారా, ఇక్కడ ముస్లింలందరూ తమ తమ భేదాలన్నీ కట్టిపెట్టి పాలు నీళ్ళల్లా కలిసిపోతారు. అల్పుడు, అధికుడు, పేదవాడు, ధనికుడు, అరబ్బుడు, అరబ్బేతరుడు, నల్లవాడు, తెల్లవాడు అనే భేద భావాలన్నీ మరచి ఒకే వరుసలో నిలుచుంటారు. అటువంటి స్థలం, కేంద్రం మస్జిద్.

మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, “మీరు ఒక వ్యక్తిని మస్జిద్ కు వస్తూ పోతూ ఉండగా చూస్తే అతని విశ్వాసం గురించి సాక్ష్యం ఇవ్వండి” అన్నారు. ఇది మస్జిద్ యొక్క మహత్యం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో మస్జిద్ గురించి ఏమన్నాడు?

فِي بُيُوتٍ أَذِنَ اللَّهُ أَن تُرْفَعَ وَيُذْكَرَ فِيهَا اسْمُهُ يُسَبِّحُ لَهُ فِيهَا بِالْغُدُوِّ وَالْآصَالِ
(ఏ గృహాల గౌరవ ప్రతిపత్తిని పెంచాలని, మరి వేటిలో తన నామస్మరణ చేయాలని అల్లాహ్‌ ఆజ్ఞాపించాడో వాటిలో ఉదయం సాయంత్రం అల్లాహ్‌ పవిత్రతను కొనియాడుతుంటారు, (24:36)

ఇక్కడ గృహాలు అంటే మస్జిద్. అంటే అర్థమేమిటి? విశ్వాసులు, అల్లాహ్ విధేయులు ఉదయం సాయంత్రం మస్జిదులలో అల్లాహ్ ప్రీతి కోసం నమాజులు చేస్తారు, కడు దీనంగా అల్లాహ్ ను వేడుకుంటారు.

అలాగే,

رِجَالٌ لَّا تُلْهِيهِمْ تِجَارَةٌ وَلَا بَيْعٌ عَن ذِكْرِ اللَّهِ وَإِقَامِ الصَّلَاةِ وَإِيتَاءِ الزَّكَاةِ ۙ يَخَافُونَ يَوْمًا تَتَقَلَّبُ فِيهِ الْقُلُوبُ وَالْأَبْصَارُ
(కొందరు) పురుషులు. వర్తకంగానీ, క్రయవిక్రయాలుగానీ అల్లాహ్‌ నామస్మరణ, నమాజు స్థాపన, జకాత్‌ చెల్లింపు విషయంలో వారిని పరధ్యానానికి లోను చేయలేవు. ఏ రోజున హృదయాలు తలక్రిందులై, కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడుతూ ఉంటారు.(24:37)

ఈ ఆయత్ యొక్క అర్థాన్ని మనం గమనించాలి. కొంతమంది ఎలా ఉంటారు? వారిని వారి వర్తకం గానీ, వ్యాపారం, క్రయ విక్రయాలు గానీ అల్లాహ్ నామ స్మరణ, నమాజు స్థాపన, జకాత్ చెల్లింపు విషయంలో పరధ్యానానికి లోను చేయలేవు. అంటే మనిషి చేసే వ్యాపారాలు, క్రయ విక్రయాలు, ఉద్యోగాలు అతని జీవితంలో వస్తూ పోయే సమస్యలు, బాధ్యతలు ఇవన్నీ ఆ విశ్వాసిని, ఆ వ్యక్తుల్ని మస్జిద్ కి పోయి జమాత్ తో నమాజ్ చేయటం లేదా జిక్ర్ చేయటం, అల్లాహ్ ను ఆరాధించటం, జకాత్ ఇవ్వటం వీటిని వారి జీవన సమస్యలు ఆపలేవు. ఎందుకు? ఏ రోజున హృదయాలు తలక్రిందులై కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడతారు. అంటే ప్రళయం గురించి, అల్లాహ్ శిక్ష గురించి వారు భయపడతారు.

لِيَجْزِيَهُمُ اللَّهُ أَحْسَنَ مَا عَمِلُوا وَيَزِيدَهُم مِّن فَضْلِهِ ۗ وَاللَّهُ يَرْزُقُ مَن يَشَاءُ بِغَيْرِ حِسَابٍ
తమ సత్కార్యాలకు అల్లాహ్‌ ఉత్తమ ప్రతిఫలం ఇవ్వటానికి, అల్లాహ్‌ తన కృపతో మరింత అధికంగా వొసగటానికి (వారు ఈ విధంగా మసలుకుంటారు). అల్లాహ్‌ తాను తలచిన వారికి లెక్క లేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు.(24:38)

అభిమాన సోదరులారా, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ గురించి ఇంకా ఇలా సెలవిచ్చారు,

وَمَا اجْتَمَعَ قَوْمٌ فِي بَيْتٍ مِنْ بُيُوتِ اللهِ يَتْلُونَ كِتَابَ اللهِ وَيَتَدَارَسُونَهُ بَيْنَهُمْ إِلاَّ نَزَلَتْ عَلَيْهِمُ السَّكِينَةُ وَغَشِيَتْهُمُ الرَّحْمَةُ وَحَفَّتْهُمُ الْمَلاَئِكَةُ وَذَكَرَهُمُ اللهُ فِيمَنْ عِنْدَهُ
[వ మజ్ తమ’అ ఖౌమున్ ఫీ బైతిన్ మిన్ బుయూతిల్లాహ్, యత్లూన కితాబల్లాహ్, వ యతదారసూనహూ బైనహుమ్, ఇల్లా నజలత్ అలైహిముస్ సకీనతు, వ గషియతుహుముర్ రహ్మతు, వ హఫ్ఫత్ హుముల్ మలాఇకతు, వ దకరహుముల్లాహు ఫీమన్ ఇందహ్]

అల్లాహ్ గృహాలలోని ఏదైనా ఒక గృహంలో కొంతమంది గుమికూడి దైవ గ్రంథాన్ని పారాయణం చేస్తూ, దాని గురించి పరస్పరం చర్చించుకుంటూ ఉంటే, అల్లాహ్ తరపున నుండి వారి మీద ప్రశాంతత, సకీనత్, ఆవరిస్తుంది. అలాగే రహ్మత్, దైవ కారుణ్యం వారిని కమ్ముకుంటుంది. అలాగే దైవదూతలు వారిని చుట్టుముడతారు. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన ఆస్థానములోని అంటే దైవదూతల మధ్య వారిని పరిచయం చేస్తాడు” (ముస్లిం)

ఇది ఎవరైతే మస్జిద్ లో ఖురాన్ పఠిస్తారో, ఖురాన్ నేర్చుకుంటారో, ఖురాన్ గురించి చర్చించుకుంటారో, దీన్ గురించి నేర్చుకుంటారో, నేర్పుతారో అటువంటి వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ గొప్ప ప్రతిఫలం ఇస్తున్నాడు. ఈ ఆయత్ లో నాలుగు విషయాలు ఉన్నాయి. ఒకటి వారి జీవితాలలో వారికి ప్రశాంతత. ఇది డబ్బుతో కొనలేము. ప్రశాంతత ఇది విలువైన, గొప్ప వరం ఇది. రెండవది ఏమిటి? కారుణ్యం. అల్లాహ్ కరుణ లేకపోతే మన జీవితం దుర్భరమైపోతుంది. ఇహము పోతుంది పరము పోతుంది. మూడవది ఏమిటి? దైవదూతలు ప్రేమిస్తారు. నాలుగవది ఏమిటి? సకల లోకాలకు సృష్టికర్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రబ్బుల్ ఆలమీన్ ఆయన దైవ దూతల మధ్య వారి పరిచయం చేస్తాడు. ఎంత అదృష్టవంతులు వారు.

ఇంకా అల్లాహ్ యే ఇలా సెలవిచ్చాడు, మస్జిద్ లను ఆబాద్ చేయాలి. అంటే మస్జిద్ లు ఆబాద్ చేయటం అంటే ఏమిటి? మస్జిద్ లు నిర్మించాలి. య’అముర్ అంటే మస్జిద్ ను ఆబాద్ చేయటం, మస్జిద్ ని నిర్మించటం. దానికి అసలు అర్థం ఏమిటి స్వయంగా అల్లాహ్ సెలవిచ్చాడు.

إِنَّمَا يَعْمُرُ مَسَاجِدَ اللَّهِ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَلَمْ يَخْشَ إِلَّا اللَّهَ ۖ فَعَسَىٰ أُولَٰئِكَ أَن يَكُونُوا مِنَ الْمُهْتَدِينَ
అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ విశ్వసిస్తూ, నమాజులను నెలకొల్పుతూ, జకాత్‌ను విధిగా చెల్లిస్తూ, అల్లాహ్‌కు తప్ప వేరొకరికి భయపడనివారు మాత్రమే అల్లాహ్‌ మస్జిదుల నిర్వహణకు తగినవారు. సన్మార్గ భాగ్యం పొందినవారు వీరేనని ఆశించవచ్చు.(9:18)

అంటే మస్జిదుల నిర్వహణకి తగిన వారు, మస్జిదులను ఆబాద్ చేసే వారు ఎవరు? ఈ గుణాలు అల్లాహ్ సెలవిచ్చాడు. అంటే సన్మార్గ భాగ్యం పొందిన వారు కూడా వీళ్ళే అని అల్లాహ్ అంటున్నాడు. అంటే ఈ ఆయత్ లో మస్జిదులను ఆబాద్ చేసే వారి గుణాలు అల్లాహ్ తెలియజేశాడు.

మొదటి గుణం ఏమిటి? వారు అల్లాహ్ ను విశ్వసిస్తారు. అల్లాహ్ పట్ల దృఢమైన, నిజమైన, వాస్తవమైన విశ్వాసం కలిగి ఉంటారు. రెండవది ఏమిటి? వారు అంతిమ దినాన్ని విశ్వసిస్తారు. ఒక రోజు నేను చనిపోవాల్సిందే, ఈ ప్రపంచం అంతం అవ్వాల్సిందే, చనిపోయిన తరువాత అల్లాహ్ కు లెక్క చూపించాల్సిందే, లెక్కల గడియ వస్తుంది, తీర్పు దినం వస్తుంది, ఆ అంతిమ దినం పట్ల విశ్వసిస్తాడు రెండవది. మూడవది ఏమిటి? నమాజులు చేస్తారు, నమాజులు పాటిస్తారు. నాలుగోది జకాత్ విధిగా చెల్లిస్తారు. ఐదవది ఏమిటి? అల్లాహ్ కు మాత్రమే భయపడతారు. ఇది గమనించాల్సిన విషయం ఇది. జీవితం, ప్రాపంచిక జీవితం యొక్క ప్రేమలో పడిపోయి చాలామంది అల్లాహ్ కు తప్ప ప్రతి ఒక్కరితో భయపడుతున్నారు. మనలో చాలా మంది జీవితం ఇలా అయిపోయింది ప్రతిదానికి భయపడటం అల్లాహ్ కు తప్ప. అల్లాహ్ ఏమంటున్నాడు? అల్లాహ్ కు మాత్రమే భయపడండి, వేరే వారితో భయపడకండి. మస్జిద్ ను ఆబాద్ చేసేవారు ఎవరు? నాలుగవ వారు అల్లాహ్ ను మాత్రమే భయపడతారు. వ లమ్ యఖ్ష ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప ఎవ్వరికీ భయపడరు.

ఈ గుణాలు కలిగిన వారికి అల్లాహ్ ఏమంటున్నాడు? య’అమురు మసాజిదల్లాహ్. వీళ్లే మసాజిద్ లను ఆబాద్ చేసేవారు, నిర్వహణకు తగిన వారు. ఇంకా చివరి వాక్యంలో అల్లాహ్ ఏమన్నాడు? ఫ’అసా ఉలాఇక అన్ యకూనూ మినల్ ముహ్తదీన్. సన్మార్గ భాగ్యం, హిదాయత్ ప్రసాదించబడిన వారు వీరేనని ఆశించవచ్చు. ఇది అసలైన అర్థం మస్జిదులను ఆబాద్ చేయటం అంటే.

ఇక అభిమాన సోదరులారా, ఇప్పుడు వరకు మనం మస్జిద్ గురించి, మస్జిద్ స్థానం గురించి, మస్జిద్ నిర్వహణ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మన జీవన విధానం అలా ఉందా? మస్జిదుల విషయంలో. మస్జిదులు ఎలా ఉండాలి, ఎలా ఉన్నాయి? వాస్తవంగా మస్జిదులను మనం ఆబాద్ చేస్తున్నామా? మస్జిదులకు సంబంధించిన ఆదాబులు పాటిస్తున్నామా? మస్జిదుల హక్కులు పూర్తి చేస్తున్నామా? మనలోని ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

ను వేరే విషయానికి వస్తున్నాను, మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు,

مَنْ بَنَى مَسْجِدًا لِلَّهِ بَنَى اللَّهُ لَهُ فِي الْجَنَّةِ مِثْلَهُ
“మన్ బనా లిల్లాహి మస్జిదన్, బనల్లాహు లహూ బైతన్ ఫిల్ జన్నహ్.”
ఎవరైనా అల్లాహ్ కోసం మస్జిద్ ను నిర్మిస్తే, అల్లాహ్ అతని కోసం స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు.

ఇక్కడ ఒక ప్రశ్న మనసులో రావచ్చు, ప్రతి ఒక్కరికీ ఒక మస్జిద్ నిర్మించే స్తోమత ఉంటుందా? ఆర్థికపరంగా. ఇన్నమల్ అ’అమాలు బిన్నియ్యాత్. కర్మల పరంగా అల్లాహ్ ప్రతిఫలం ప్రసాదిస్తాడు. కర్మలు సంకల్పాలపై ఆధారపడి ఉన్నాయి. అందుకు ప్రతి వ్యక్తికి ఈ స్తోమత ఉండదు. కానీ ప్రతి వ్యక్తి మస్జిద్ నిర్మాణంలో పాలు పంచుకొనవచ్చు, తన శక్తి ప్రకారం.

అలాగే, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

أَحَبُّ الْبِلَادِ إِلَى اللَّهِ مَسَاجِدُهَا، وَأَبْغَضُ الْبِلَادِ إِلَى اللَّهِ أَسْوَاقُهَا
“అహబ్బుల్ బిలాది ఇలల్లాహి మసాజిదుహా వ అబ్గదుల్ బిలాది ఇలల్లాహి అస్వాకుహా.”
అల్లాహ్ దృష్టిలో అన్ని చోట్లలలో కెల్లా అత్యంత ప్రీతికరమైన, శ్రేయస్కరమైన చోటు మస్జిద్. అలాగే అల్లాహ్ దృష్టిలో అన్ని చోట్లలలో కెల్లా అత్యంత హానికరమైన చోటు బజారు

ఈ హదీస్ మనం మనసులో ఉంచుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు మన మస్జిదులు అలా ఉన్నాయా? అత్యంత శ్రేష్టకరమైన, పవిత్రమైన, ప్రీతికరమైన ఉన్నాయా? అల్లాహ్ దృష్టిలో ఉంది, అల్లాహ్ అంటున్నాడు అన్నిటికంటే శ్రేష్టమైన, శ్రేయస్కరమైన, ప్రీతికరమైన, పవిత్రమైన చోటు, స్థలం, కేంద్రం మస్జిద్ అని. కానీ ఇప్పుడు మన మస్జిదులు గీబత్ కి కేంద్రం, చాడీలకి కేంద్రం, ఖియానత్ కి కేంద్రం, లావాదేవీలకి కేంద్రం, రాజకీయాలకు కేంద్రం, ఇలా మారిపోయినాయి. కానీ అత్యంత హానికరమైన, మంచిది కాని స్థలం బజారు. కానీ మనము సహాబాలు, తాబయీన్లు, మన పూర్వీకుల జీవితాలు మనము వారి చరిత్ర చదివితే, వారు బజార్లను, అస్వాఖ్ లను, మస్జిదులుగా మార్చేసేవారు. వారి జీవన విధానం అలా ఉండేది. కొంతమంది సహాబాలు బజార్ కి సోదరులు, ముస్లిములు, తెలిసిన వారు, తెలియని వారు, ఇరుగు పొరుగు వారు కనపడతారేమో, సలాం చెప్దామన్న ఉద్దేశంతో పోయేవారు. అంటే మన పూర్వీకులు హానికరమైన స్థలాన్ని పవిత్రంగా చేసేసారు, అనగా మస్జిద్ గా చేసేసారు, పవిత్రంగా చేసేసేవారు. ఇప్పుడు మనం మస్జిద్ ని సూఖ్ లాగా, బజార్ లాగా చేసేస్తున్నాము. ఈ విషయంలో మనము పరిశీలించాలి, జాగ్రత్తగా ఉండాలి.

అభిమాన సోదరులారా, అలాగే రేపు ప్రళయ దినాన – ఈ హదీస్ మనందరం ఎన్నోసార్లు విన్నాము,

 سَبْعَةٌ يُظِلُّهُمُ اللَّهُ فِي ظِلِّهِ يَوْمَ لاَ ظِلَّ إِلاَّ ظِلُّهُ
సబ్’అతున్ యుదిల్లుహుముల్లాహు ఫీ దిల్లిహీ యౌమ లా దిల్లా ఇల్లా దిల్లుహ్
రేపు ప్రళయ దినాన ఏడు రకాల వ్యక్తులకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన నీడను ప్రసాదిస్తాడు. ఆ రోజు అల్లాహ్ నీడ తప్ప ఏ నీడా ఉండదు.

ఆ ఏడు రకాల వ్యక్తులలో ఒకరు ఎవరు?

رَجُلٌ قَلْبُهُ مُعَلَّقٌ فِي الْمَسَاجِدِ
రజులున్ ఖల్బుహూ ము’అల్లఖున్ ఫిల్ మసాజిద్.
ఏ వ్యక్తి యొక్క హృదయం, ఏ వ్యక్తి యొక్క మనసు మస్జిద్ లో ఉంటుందో, అంటే వారి మనసు మస్జిద్ లోకి నిమగ్నులై ఉంటాయి.

ఇది మస్జిద్ అంటే.

అలాగే, మనిషి తన ఇంట్లో లేక వీధిలో చేసే నమాజ్ కన్నా జమాఅత్ తో చేసే నమాజుకు పాతిక రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది అని హదీస్ లో ఉంది. ఈ విధంగా ఎక్కువ రెట్లు పుణ్యం లభించడానికి కారణం ఏమిటంటే, మనిషి చక్కగా వుజూ చేసుకొని, కేవలం నమాజు చేసే ఉద్దేశ్యంతో వెళ్తుంటే, ఆ సమయంలో అతను వేసే ప్రతి అడుగుకు అల్లాహ్ ఒక్కొక్కటి చొప్పున అతని అంతస్తులను పెంచుతాడు. అంతే కాదు, అతని వల్ల జరిగే పాపాలను కూడా ఒక్కొక్కటిగా తుడిచి పెట్టేస్తాడు. అతను నమాజ్ చేస్తూ వుజూతో ఉన్నంత వరకు దైవదూతలు అతని మీద శాంతి కురవాలని ప్రార్థిస్తూ, ఓ అల్లాహ్ ఇతనిపై శాంతి కురిపించు, ఓ అల్లాహ్ ఇతన్ని కనికరించు అని అంటూ ఉంటారు.

మస్జిద్ లో ప్రవేశించిన తర్వాత జమాత్ నమాజు కోసం అతను ఎంతసేపు నిరీక్షిస్తాడో, ఎదురు చూస్తూ ఉంటాడో, అంతసేపు అతను నమాజులో ఉన్నట్లుగానే పరిగణించబడతాడు. అల్లాహు అక్బర్. ఒక వ్యక్తి అరగంట ముందు మస్జిద్ కి పోయాడు, ఇరవై నిమిషాల ముందు మస్జిద్ కి పోయాడు, నమాజ్ కోసం వేచి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు జమాత్ కోసం, అంటే ఈ ఎంత సేపు అతను ఎదురు చూస్తున్నాడో అంత సేపు అతను ఎక్కడ ఉన్నాడు? నమాజ్ లోనే ఉన్నాడు. నమాజ్ చేస్తున్నాడు. ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు.

ఈ విధంగా మస్జిద్, మస్జిద్ స్థానం, మరియు మన పూర్వీకులు దాని గురించి చాలా వివరాలు ఉన్నాయి. మనము సహాబాల, తాబయీన్ ల చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది. ఉదాహరణగా ఒక్క విషయం చెబుతున్నాను. అన్నిటికంటే అత్యధికంగా హదీసులు చెప్పిన వారు, రివాయత్ చేసిన వారు, అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు. ఆయన పాఠశాల ఏది? మస్జిద్. ఆయన చదువుకున్న యూనివర్సిటీ ఏది? మస్జిద్. ఆయనకి తినటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఒకసారి ఆయన వారి రోషం ఎటువంటిది అంటే అవసరం ఉన్నా కూడా చెయ్యి చాపేవారు కాదు. రెండు మూడు రోజులు అయిపోయింది, అన్నం తినలేదు. అడగటానికి బుద్ధి పుట్టటం లేదు. ఆయన మస్జిద్ బయట వీధిలో ఏ ఉద్దేశంతో పోయారు? సహాబాలు కనపడతారు, వారికి సలాం చెప్తే నన్ను చూసి, నా ముఖాన్ని చూసి వారు అర్థం చేసుకుంటారు అని ఉద్దేశంతో వీధిలో పోయి నిలబడితే అబూబకర్ రదియల్లాహు అన్హు వచ్చారు. ఇది నేను పూర్తి వివరంగా చెప్పదలచలేదు సమయం లేదు. అబూబకర్ కి ఆయన సలాం చెప్తే అబూబకర్ రదియల్లాహు అన్హు వఅలైకుం సలాం చెప్పి ముందుకు సాగిపోయారు. ఆయన బాధపడ్డారు మనసులో. ఆ తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ వచ్చారు రదియల్లాహు అన్హు. ఆయన కూడా వఅలైకుం సలాం చెప్పి ముందుకు సాగిపోయారు. ఈయన మనసులో కుమిలిపోతున్నారు, బాధపడిపోతున్నారు. నా ముఖం వారు గమనించలేదా? నన్ను వారు పట్టించుకోవటం లేదా? అని చెప్పి. ఆ తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు. చిరునవ్వుతో వఅలైకుం సలాం చెప్పి తోడుగా తీసుకుపోయారు. తీసుకుని పోయి ఇంట్లో ఏముంది అని అడిగితే కొంచెం పాలు ఉంది. అబూ హురైరా మనసులో సంతోషం. పండగ మనసులో. ఈరోజు నాకు పండగ, పాలు దక్కింది అని చెప్పి. అప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ అబూ హురైరా, ఇంకా మస్జిద్ లో ఎంత మంది ఉన్నారు అని అడిగారు. అబూ హురైరా రదియల్లాహు అన్హు మనసులో కొంచెం పాలు, ప్రవక్త గారు ఇలా అడుగుతున్నారు ఇంత మంది వచ్చేస్తే నాకు ఏం మిగులుతుంది అని మనసులో బాధ. పోయి పిలుచుకొని రా. దాదాపు ఒక 20, 30 మంది వచ్చారు. ఇప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హు ఓకే అల్హందులిల్లాహ్ కొంచెమైనా సరే వస్తుంది అనుకున్నారు. అప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హుతో, అందరికీ పంచు అని చెప్పారు. అప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హు మనసు, అందరికీ నేను పంచాలా? అంటే లాస్ట్ లో ఎవరు తాగాలి నేను. మిగులుతుందా మిగలదా? ఆ తర్వాత అందరికీ పంచారు. అందరూ కడుపు నిండా తాగారు. ఓ అబూ హురైరా, ఇంకా ఎవరున్నారు? ఓ ప్రవక్త నేను మీరు ఇద్దరే ఉన్నాం ప్రవక్త అంటే, నువ్వు తాగు అని చెప్పారు. అబూ హురైరా తాగారు. ప్రవక్రా నేను తాగేసాను. ఇంకోసారి తాగు. ఇంకోసారి తాగు. మూడు సార్లు తాగారు. నాలుగోసారి, దైవప్రవక్త ఇంకా ఇంకోసారి తాగండి అంటే, ఓ దైవప్రవక్త, ఇక్కడ వరకు వచ్చేసింది, ఇప్పుడు తాగలేను. ఆ తర్వాత ప్రవక్త గారు తాగారు. ఇది మోజిజా (మహిమ) . చెప్పటం ఏమిటంటే అటువంటి సహాబీ, ఇల్లు లేని సహాబీ, గృహం లేని సహాబీ, ఆర్థిక పరంగా ఏమీ లేని సహాబీ, వారి విశ్వవిద్యాలయం మస్జిద్, వారి పాఠశాల మస్జిద్, వారి శిక్షణా కేంద్రం మస్జిద్. అందరికంటే అత్యధికంగా హదీసులు రివాయత్ చేశారు అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు. అంత పేదరికంలో ఒకసారి ప్రవక్త గారు వరాన్ని ప్రసాదించారు. ఏం కోరుకుంటావు కోరుకో అని. అప్పుడు ఆయన జ్ఞానాన్ని కోరుకున్నారు. మెమరీ శక్తిని కోరుకున్నారు. ప్రపంచాన్ని కోరుకోలే, ఇల్లుని కోరుకోలే, ధనాన్ని కోరుకోలే. ఇల్లు లేదు ఉండటానికి, దుస్తులు లేవు. అటువంటి స్థితిలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇమాముల్ అంబియా, ఎన్నో వందల గొర్రెలు దానం చేసిన వారు. అడిగిన వారికి ఇచ్చేసేవారు. అటువంటి ఇమామ్-ఏ-కాయినాత్ అడుగుతున్నారు, ఓ అబూ హురైరా ఏం కావాలా అని చెప్పి. దానికి అబూ హురైరా, ఆ పేదవాడు ఏం కోరుకున్నారు? జ్ఞానం కోరారు, ఇల్మ్ కోరారు, జ్ఞాపక శక్తి కోరారు. అందుకోసమే ఆయన ఏమి రాసినా, ఏమి విన్నా ఆయన మనసులో అలాగే ఉండిపోయేది. అందరికంటే ఎక్కువగా హదీసులు ఆయనే రివాయత్ చేశారు.

కావున అభిమాన సోదరులారా సమయం అయిపోయింది, మస్జిద్ కి సంబంధించిన కొన్ని ఆదాబులు తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి.

ఒకటి, దుఆ చేస్తూ సలాం చెబుతూ మస్జిద్ లోకి ప్రవేశించాలి (అల్లాహుమ్మఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక్). రాని వారు నేర్చుకోవాలి. తహియ్యతుల్ మస్జిద్ చేసుకోవాలి పోయిన తర్వాత. అలాగే ఉల్లిపాయలు, తెల్ల ఉల్లిపాయలు, ఇంకా ఏ పదార్థాల వల్ల తినటం వల్ల నోటిలో దుర్వాసన వస్తుందో వాటిని తిని రాకూడదు. ఒకవేళ తిన్న యెడల బ్రష్ చేసుకొని ముఖంలో ఎటువంటి దుర్వాసన లేకుండా చూసుకొని ఆ తర్వాత మస్జిద్ కి రావాలి. ఎందుకంటే ప్రవక్తగారు సెలవిచ్చారు, దేని వల్ల మనిషి బాధపడతాడో, దేని వల్లకి మనిషికి కష్టం కలుగుతుందో, దైవదూతలు కూడా బాధపడతారు అని చెప్పారు. అలాగే మస్జిద్ ను పరిశుభ్రంగా ఉంచాలి, నిశ్శబ్దంగా కూర్చొని భయభక్తులు గలవారై అల్లాహ్ స్మరణ చేయాలి. ప్రశాంతంగా కూర్చోవాలి. గోల చేయడం, పరిహాసాలాడటం, లావాదేవీలు జరపటం, మస్జిద్ ని అగౌరవపరిచినట్లు అవుతుంది. మస్జిద్ ను వచ్చిపోయే మార్గంగా చేసుకోకూడదు. ప్రవేశించాక నమాజ్ చేయడమో, పారాయణం చేయడమో, జిక్ర్ చేయడమో, ఆరాధించడం చేయాలే గానీ, ఇదే మస్జిద్ కి హక్కు. అలాగే మస్జిద్ నుంచి పోయేటప్పుడు అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫద్లిక్ అనే దుఆ చేసుకుంటూ పోవాలి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించు గాక. ఆమీన్. వా ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42432