జుమా నమాజు (రెండవ) అజాన్ తరువాత విక్రయించటం
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا نُودِيَ لِلصَّلَاةِ مِن يَوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا إِلَىٰ ذِكْرِ اللَّهِ وَذَرُوا الْبَيْعَ ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ
విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజుకై పిలిచినప్పుడు, అల్లాహ్ సంస్మరణ వైపునకు పరుగెత్తండి. క్రయవిక్రయాలను వదలిపెట్టండి. మీరు గ్రహించగలిగితే, ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది! (జుముఅ 62: 9).
కొందరు వ్యాపారులు రెండవ అజాన్ తరువాత కూడా తమ దుకాణాల్లో లేక మస్టిద్ ముందు అమ్మకాల్లో నిమగ్నులయి ఉంటారు. అయితే వారితో కొనేవాడు కనీసం మిస్వాక్ కొన్నా వారితో పాపంలో పొత్తు కలిసి నట్లే. ఇలాంటి వ్యాపారం వ్యర్థము, తుచ్చము అన్నదే సత్యం.
హోటల్, బేకరి మరియు ఫ్యాక్టరీల ఓనర్లు కొందరు జుమా సమయంలో కూడా పని చేయాలని తమ పనివాళ్ళపై ఒత్తిడి చేస్తారు. అలాంటి సంపాదనలో బాహ్యంగా ఎక్కువ లాభం ఏర్పడినా, వాస్తవానికి వారు నష్టంలో పడి ఉన్నారన్నది తెలుసుకోవాలి. ఇక పనివాళ్ళు ప్రవక్త ఈ యొక్క ఈ ఆదేశంపై నడవాలి:
“అల్లాహ్ అవిధేయతకు గురి చేసే ఏ వ్వక్తి మాటా వినకూడదు”. (ముస్నద్ అహ్మద్: 1/129. దీని సనద్ సహీ అని అహ్మద్ షాకిర్ చెప్పారు. 1065)
[ఇది నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు (Muharramat) అనే పుస్తకం నుండి తీసుకోబడింది, చిన్న మార్పులు చేసాము]
గమనిక: రెండవ అజాన్ అంటే ఇమామ్ మింబర్ మీదికి ఎక్కి ఖుత్బా ఇవ్వడానికి ముందు ఇచ్చే అజాన్