The Correct Belief and what Opposes It – Imaam ibn Baaz (rahimahullah)
రచయిత : అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్)
తెలుగు అనువాదం: islamhouse
- తొలి పలుకులు
- మహోన్నతుడైన అల్లాహ్ పై విశ్వాసం చూపటం
- దైవదూతల పట్ల విశ్వాసం
- దైవగ్రంధాల పట్ల విశ్వాసం
- దైవ సందేశహరుల పట్ల విశ్వాసం
- పరలోకం పట్ల విశ్వాసం
- విధి వ్రాత పట్ల విశ్వాసం
- విశ్వాసం అన్నది పలకటం మరియు ఆచరించటం. అది విధేయత చూపటం వలన అధికమగును మరియు అవిధేయత చూపటం వలన తరుగును.
- అల్లాహ్ కొరకు ప్రేమించటం, అల్లాహ్ కొరకు ద్వేషించటం, అల్లాహ్ కొరకు స్నేహం చేయటం
- ఈ విశ్వాసం నుండి మరలిపోయి దానికి వ్యతిరేకంగా నడిచేవారి ప్రస్తావన
- అల్లాహ్ ఒక్కడి ఆరాధన చేయటం తప్పనిసరి అవటం
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం
తొలి పలుకులు
అల్హమ్దులిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాం అలా మన్లా నబియ్యబఅదహ్ వఅలా ఆలిహి వసహబిహి. అమ్మాబాద్
సరియైన విశ్వాసము ఇస్లాం ధర్మము యొక్క మూలము మరియు ధర్మము యొక్క పునాది. అందుకనే నేను ప్రసంగము యొక్క అంశము దానిపై ఉండాలని నేను భావించాను. మరియు ఖుర్ఆన్ హదీసు ధార్మిక ఆధారాల ద్వారా తెలిసేదేమిటంటే ఆచరణలు మరియు మాటలు సరియైన విశ్వాసముతో జరిగి ఉంటే సరిఅవుతాయి మరియు స్వీకరించబడుతాయి. ఒక వేళ విశ్వాసము సరి కాకపోతే ఆ ఆచరణలు, మాటలు నిర్వీర్యమైపోతాయి. అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:
وَمَن يَكْفُرْ بِالْإِيمَانِ فَقَدْ حَبِطَ عَمَلُهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
ఎవడు విశ్వాస మార్గాన్ని తిరస్కరిస్తాడో అతడి కర్మలు వ్యర్థమవుతాయి. మరియు అతడు పరలోకంలో నష్టం పొందేవారిలో చేరుతాడు. [అల్ మాయిద 5:5]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
మరియు వాస్తవానికి! నీకూ మరియు నీకంటే ముందు వచ్చిన (ప్రతి ప్రవక్తకూ) దివ్యజ్ఞానం (వహీ) ద్వారా ఇలా తెలుపబడింది: “ఒకవేళ నీవు బహుదైవారాధన (షిర్కు) చేసినట్లైతే నీ కర్మలన్నీ వ్యర్థమై పోతాయి మరియు నిశ్చయంగా, నీవు నష్టానికి గురి అయిన వారిలో చేరిపోతావు”. [జుమర్ 39:65]
ఈ అర్థములో చాలా ఆయతులు కలవు. అల్లాహ్ యొక్క స్పష్టమైన గ్రంధము మరియు నీతిమంతుడైన ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ తెలియపరచిన సరిఅయిన అఖీదా ఏమిటంటే అల్లాహ్ పై, ఆయన దూతలపై, ఆయన గ్రంధములపై, ఆయన ప్రవక్తలపై, అంతిమ దినముపై మరియు మంచి, చెడు విధివ్రాతపై విశ్వాసం చూపటంలో ఇమిడి ఉంది. ఈ ఆరు విషయాలు సరైన అఖీదా యొక్క పునాదులు. వీటిని తీసుకుని సర్వ శక్తిమంతుడైన అల్లాహ్ గ్రంధం అవతరించింది. మరియు అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంనకు వాటిని ఇచ్చి పంపించాడు. మరియు అగోచర విషయాలు వేటిని విశ్వసించటం తప్పనిసరో మరియు వేటి గురించి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియపరచారో అన్ని ఈ పునాదుల నుండి ఉధ్భవించినవి. ఈ ఆరు పునాదుల యొక్క ఆధారాలు గ్రంధములో మరియు సున్నతులో చాలా ఉన్నవి. వాటిలో నుంచి అల్లాహ్ సుబహానహు వతఆలా యొక్క ఈ వాక్కు:
لَّيْسَ الْبِرَّ أَن تُوَلُّوا وُجُوهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَلَٰكِنَّ الْبِرَّ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَالْمَلَائِكَةِ وَالْكِتَابِ وَالنَّبِيِّينَ وَآتَى الْمَالَ عَلَىٰ حُبِّهِ ذَوِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينَ وَابْنَ السَّبِيلِ وَالسَّائِلِينَ وَفِي الرِّقَابِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَالْمُوفُونَ بِعَهْدِهِمْ إِذَا عَاهَدُوا ۖ وَالصَّابِرِينَ فِي الْبَأْسَاءِ وَالضَّرَّاءِ وَحِينَ الْبَأْسِ ۗ أُولَٰئِكَ الَّذِينَ صَدَقُوا ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُتَّقُونَ
మీరు మీ ముఖములను తూర్పు దిక్కుకో, పడమర దిక్కుకో తిప్పటమే సదాచరణ కాదు. సదాచరణ అంటే అల్లాహ్ ను, అంతిమ దినాన్నీ, దైవదూతలనూ, దైవగ్రంధాన్ని, దైవప్రవక్తలనూ విశ్వసించటం. [అల్ బఖర 2: 177]
మరియు పరిశుద్ధుడైన అల్లాహ్ వాక్కు:
آمَنَ الرَّسُولُ بِمَا أُنزِلَ إِلَيْهِ مِن رَّبِّهِ وَالْمُؤْمِنُونَ ۚ كُلٌّ آمَنَ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّن رُّسُلِهِ ۚ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا ۖ غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ الْمَصِيرُ
ఈ ప్రవక్త తన ప్రభువు తరుపు నుండి, తనపై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాడు మరియు (అదే విధంగా) విశ్వాసులు కూడా (విశ్వసించారు). వారంతా అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు. (వారంటారు :) మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావాలను చూపము. [అల్ బఖర 2: 285]
మరియు పరిశుద్ధుడైన ఆయన వాక్కు:
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا آمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَالْكِتَابِ الَّذِي نَزَّلَ عَلَىٰ رَسُولِهِ وَالْكِتَابِ الَّذِي أَنزَلَ مِن قَبْلُ ۚ وَمَن يَكْفُرْ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ وَالْيَوْمِ الْآخِرِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا
ఓ విశ్వాసులారా! అల్లాహ్ ను, ఆయన సందేశహరుణ్ణి, ఆయన తన సందేశహరుని పై (ముహమ్మద్ పై) అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు ఆయన ఇంతకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలన్నింటినీ విశ్వసించండి. అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించినవాడు, వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయాడు. [నిసా 5: 136]
మరియు పరిశుద్ధుడైన ఆయన వాక్కు:
أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ يَعْلَمُ مَا فِي السَّمَاءِ وَالْأَرْضِ ۗ إِنَّ ذَٰلِكَ فِي كِتَابٍ ۚ إِنَّ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ
ఏమీ? నీకు తెలియదా? ఆకాశంలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసని! నిశ్చయంగా, ఇదంతా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది. నిశ్చయంగా ఇదంతా అల్లాహ్ కు చాలా సులభమైనది. [హజ్ 22: 70]
ఈ పునాదులపై సూచించే సహీహ్ హదీసులు చాలా ఉన్నవి. వాటిలో నుంచి ప్రసిద్ధిచెందిన హదీసు దాన్ని ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) అమీరుల్ మూమినీన్ హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు నుండి తన జామె సహీహ్ లో ఉల్లేఖించారు.
“జిబ్రయీల్ అలైహిస్సలాం గారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఈమాన్ గురించి అడిగారు. ఆయనకు సమాధానమిస్తూ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియపరచారు: ఈమాన్ అంటే నీవు అల్లాహ్ పై, ఆయన దూతల పై, ఆయన గ్రంథముల పై, ఆయన ప్రవక్తల పై మరియు అంతిమ దినం పై విశ్వాసమును చూపటం మరియు నీవు విధివ్రాత పై దాని మంచి, చెడు పై విశ్వాసము చూపటం[1]. .
మరియు ఈ హదీసును ఇమామ్ బుఖారీ మరియు ఇమామ్ ముస్లిం రహిమహుమల్లాహ్ అబూహురైరా రజియల్లాహు అన్హు హదీసు నుండి ఉల్లేఖించారు. ఈ ఆరు నియమాలు: వాటి నుండి అల్లాహ్ హక్కు విషయంలో మరియు పరలోక విషయంలో మరియు ఇతర అగోచర విషయాలలో ఒక ముస్లిం విశ్వసించవలసిన విషయాలన్నీ ఉద్భవించాయి.
You must be logged in to post a comment.