
[31 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఇస్లాం మరియు ఈమాన్ రెండిటి భావాలు ఒక్కటే
عَن ابْنِ عَبَّاسٍ { قَالَ إِنَّ وَفْدَ عَبْدِ الْقَيْسِ لَـمَّا أَتَوْا النَّبِيَّ ﷺ قَالَ: (مَنْ الْقَوْمُ أَوْ مَنْ الْوَفْدُ) قَالُوا: رَبِيعَةُ قَالَ: (مَرْحَبًا بِالْقَوْمِ أَوْ بِالْوَفْدِ غَيْرَ خَزَايَا وَلَا نَدَامَى) فَقَالُوا: يَا رَسُولَ اللهِ إِنَّا لَا نَسْتَطِيعُ أَنْ نَأْتِيكَ إِلَّا فِي الشَّهْرِ الْحَرَامِ وَبَيْنَنَا وَبَيْنَكَ هَذَا الْحَيُّ مِنْ كُفَّارِ مُضَرَ فَمُرْنَا بِأَمْرٍ فَصْلٍ نُخْبِرْ بِهِ مَنْ وَرَاءَنَا وَنَدْخُلْ بِهِ الْجَنَّةَ وَسَأَلُوهُ عَنْ الْأَشْرِبَةِ فَأَمَرَهُمْ بِأَرْبَعٍ وَنَهَاهُمْ عَنْ أَرْبَعٍ أَمَرَهُمْ بِالْإِيمَانِ بِاللهِ وَحْدَهُ قَالَ: (أَتَدْرُونَ مَا الْإِيمَانُ بِاللهِ وَحْدَهُ) قَالُوا: اللهُ وَرَسُولُهُ أَعْلَمُ قَالَ: (شَهَادَةُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ وَإِقَامُ الصَّلَاةِ وَإِيتَاءُ الزَّكَاةِ وَصِيَامُ رَمَضَانَ وَأَنْ تُعْطُوا مِنْ الْمَغْنَمِ الْخُمُسَ) وَنَهَاهُمْ عَنْ أَرْبَعٍ عَنْ الْحَنْتَمِ وَالدُّبَّاءِ وَالنَّقِيرِ وَالْمُزَفَّتِ وَرُبَّمَا قَالَ الْمُقَيَّرِ وَقَالَ: (احْفَظُوهُنَّ وَأَخْبِرُوا بِهِنَّ مَنْ وَرَاءَكُمْ).
2- హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు ప్రకారం: అబ్దుల్ ఖైస్ మనుషులు కొందరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “మీరెవరు, ఏ తెగకు చెందినవారు?” అని అడిగారు. దానికి వారు ‘మేము రబీఅ తెగకు చెందిన వాళ్ళము’ అని అన్నారు. “ఓహో! మీరా, స్వాగతం! గౌరవనీయులారా!” ఏలాంటి సిగ్గు, అవమానం లేకుండా రావచ్చు!” అని ప్రవక్త అన్నారు. వారన్నారుః “ప్రవక్తా! మాకూ, మీకూ మధ్య సత్యతిరస్కారి అయిన ఈ ముజర్ తెగ అడ్డు గోడగా ఉంది. అందువల్ల మేము పవిత్ర మాసాల్లో తప్ప ఇతర సమయాల్లో మీ సన్నిధికి రాలేము. ఇప్పుడు మాకేమైనా స్వర్గ ప్రవేశానికి ఉపయోగపడే విషయాలు, స్పష్టమైన గీటురాయి ఆదేశాలు ఇవ్వండి. వీటిని మేము మాతో పాటు మీ దగ్గరికి రానటువంటి వారికి కూడా వినిపస్తాము. అంతే కాదు, పానీయాలను గురించి కూడా వారు ప్రవక్తని అడిగారు.
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నాలుగు విషయాలను ఆచరించాలని, నాలుగు విషయాలను మానుకోవాలని ఆదేశించారు. ఏకైక అల్లాహ్ ను విశ్వసించాలని చెబుతూ “ఏకైక అల్లాహ్ ను విశ్వసించాలంటే ఏమిటో మీకు తెలుసా?” అని అడిగారు. దానికి వారు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు మాత్రమే బాగా తెలుసు. (మాకు తెలియదు) అని అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా విశదపరిచారుః “ఏకైక అల్లాహ్ ను విశ్వసించటమంటే అల్లాహ్ తప్ప సత్యమైన ఆరాధ్యుడు లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనచేత నియమించబడిన ప్రవక్త అని సాక్ష్యమివ్వాలి. నమాజు వ్యవస్థను నెలకొల్పాలి, జకాత్ (పేదల ఆర్థిక హక్కు) చెల్లించాలి, రమజాను ఉపవాసాలు పాటించాలి, యుద్ధ ప్రాప్తిలో ఐదవ వంతు సొమ్ము, ప్రభుత్వ ధనగారానికి ఇవ్వాలి”. ఆ తర్వార, హన్తమ్, దుబ్బా, నఖీర్, ముజఫ్ఫత్([1]). అనే నాలుగు రకాల పాత్రలలో నీళ్ళు ఉంచడాన్ని, త్రాగడాన్ని వారించారు. హదీసు ఉల్లేఖకులు ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఒక్కోసారి ముజఫ్ఫత్ అనడానికి బదులు ముఖయ్యర్ అని పలికేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాలు బోధిస్తూ “ఈ ఆదేశాలను బాగా గుర్తుంచుకోండి. మీతో పాటు ఇక్కడికి రాని మీ ప్రాంతం వాళ్ళకు కూడా తెలియజేయండి” అని అన్నారు. (బుఖారి 53, ముస్లిం 17).
ఈ హదీసులో:
ఆచరణలు విశ్వాసములో ఓ భాగము. గురువు, మొదట సంక్షిప్తంగా చెప్పిన మాటను తర్వాత వివరించి చెప్పుట అభిలషణీయం. అందువల్ల అతని మాట అర్థమవుతుంది. గురువు హితబోధ చేస్తున్నప్పుడు ‘మూలజ్ఞానం మరియు అతిముఖ్యమైన విషయాలు ముందుగా చెప్పాలని మరియు అర్థమగుటకు సంగ్రహముగా చెప్పాలని కూడా ఈ హదీసు సూచిస్తుంది. చూడడానికి ఇందులో ఐదు ఆదేశాలు కనబడుతున్నాయి. అయితే యుద్ధప్రాప్తిలోని ఐదో వంతు విషయం జకాత్ పరిధిలోనే వస్తుంది. ఎందుకనగా అది ధనం, సొమ్ముకు సంబంధించినదే కదా. ఇలా ఆదేశాలు నాలుగే అవుతాయి.
కొందరు హదీసువేత్తల అభిప్రాయ ప్రకారం పైన చెప్పబడిన నాలుగు నివారణలు రద్దయినాయి. అంటే ఇతర సహీ హదీసుల ఆధారంగా ఆ పాత్రలు ధర్మసమ్మతమైన పానీయాలు త్రాగడానికి ఉపయోగించవచ్చు.
(మదిలో, ఆచరణ రూపంలో) విద్యను భద్రపరచి, ఇతరులకు అందజేయడం గురించి ఈ హదీసులో ప్రోత్సహించబడింది. విద్యభ్యాసం క్రమపద్ధతిలో ఉండడం మంచిదని చెప్పబడింది.
ఇందులో హజ్ ప్రస్తావన రాలేదు. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆదేశాలు ఇచ్చేటప్పడు హజ్ యాత్ర విధిగా నిర్ణయించబడలేదు అని కొందరు పండితులు చెప్పారు.
వచ్చేవారితో వారి పేరు, వంశం గురించి అడగడం జరిగింది. ఇది సున్నత్ (ప్రవక్తవారి సత్సంప్రదాయం). వచ్చే అతిథుల మనుసు చూరగొని, ఒంటరితన భావాన్ని దూరం చేయుటకు మంచి పద్ధతిలో స్వాగతం పలకాలని ఈ హదీసులో ఉంది.
ఈ హదీసులో ఇస్లాం యొక్క అర్కాన్ (మౌలిక విషయా)లను ఈమాన్ యొక్క వ్యాఖ్యానంలో తెలుపడం జరిగింది. దీనితో తెలిసిందేమిటంటే ఇస్లాం మరియు ఈమాన్ ప్రస్తావన విడివిడిగా వచ్చినప్పుడు ప్రతి దాంట్లో ఇస్లాం మరియు ఈమాన్ రెండింటికి సంబంధించిన అర్కానులు వస్తాయి. మరెప్పుడైతే రెండింటి ప్రస్తావన ఒకచోట వస్తుందో దేని భావం దానికే ఉంటుంది
([1]) హన్తమ్:- పచ్చ లేక ఎర్ర రంగు మట్టి కడవను అంటారు. దీనికి మూతి పై భాగాన కాకుండా పార్శ్వ భాగాన ఉంటుంది. మట్టిలో రక్తం, వెండ్రుకలు కలిపి ఈ కడవను తయారు చేస్తారు. లేదా లక్క, గాజు కలిపిన ఎరుపు రంగు పూయబడిన కడవను కూడా అంటారు. దుబ్బాః- పాత్రగా ఉపయోగించే బోలు సోరకాయను దుబ్బా అంటారు. నఖీర్:- ఖర్జూరపు చెట్టు వేరులో గుంట చేసి దాన్ని మధుపాత్రగా ఉపయోగిస్తారు. ముజఫ్ఫత్:- ఉమ్మి నీటితో లేపనం చేసిన మట్టి పాత్రను అంటారు. ముఖయ్యర్:- చర్మాన్ని ఎండబెట్టి, కాల్చి ఒక విధమైన లేపనం తయారు చేస్తారు. దాంతో లేపనం చేయబడిన పాత్రను అంటారు. ఈ లేపనాన్ని ఓడలక్కూడా ఉపయోగిస్తారు.
విశ్వాస పాఠాలు [పుస్తకం] & వీడియో పాఠాలు:
https://teluguislam.net/2019/11/14/aqeeda-lessons/
You must be logged in to post a comment.