అల్లాహ్ ను సిఫారసుదారునిగా చేయకండి

జుబైర్ బిన్ ముత్ ఇమ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు ఒక గ్రామస్తుడు వచ్చి ‘ప్రజలు ఆపదలో ఉన్నారు, పిల్లలు ఆకలితో నకనకలాడుతున్నారు. తగినంత ధనం లేదు, పశువులు చనిపోతున్నాయి, వర్షం పడాలని మీరు మా కోసం అల్లాహ్ ను దుఆ చేయండి. అల్లాహ్ వద్ద మేము మిమ్మల్ని సిఫారసు దారుడ్ని చేయాలను కుంటున్నాము, మీ వద్ద అల్లాహ్ ను సిఫారసుదారుడ్ని చేయాలనుకుంటున్నాము‘ అని విన్నవించుకున్నాడు. అందుకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), అల్లాహ్ పరమ పవిత్రుడు! అల్లాహ్ పరమ పవిత్రుడు! అని చాలా సేపు అల్లాహ్ పవిత్రతను చాటారు. సహాబాల ముఖాలపై దాని ప్రభావం పడటం గమనించారు. తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: “అమాయకుడా! అల్లాహ్ ఎవరి వద్దా సిఫారసు చేయడు. ఆయన గొప్పతనం వారి కంటే గొప్పది, ఉన్నతమైంది. అమాయకుడా! అల్లాహ్ అంటే ఎవరో నీకు తెలుసా? ఆయన సింహాసనం ఆకాశంపై ఎలాగుందంటే (వేళ్లను గోపురం మాదిరిగాచేసి) ఆయన వల్ల అది విలవిలలాడుతుంది. ఒంటె వీపుపై ప్రయాణించే వాని భారం వల్ల పల్లకి విలవిలలాడినట్టు”. (హదీసు గ్రంథం అబూదావూద్, హదీస్ నెం.: 4726) 

ఒకసారి అరేబియా దేశంలో క్షామం ఏర్పడింది. వర్షాలు పడటం ఆగిపోయాయి. ఒక గ్రామస్తుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వచ్చి ప్రజల దీనావస్థను వివరించాడు. అల్లాహ్ ను వేడుకోమని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను కోరాడు. అక్కడితో ఆగకుండా ‘మీరు అల్లాహ్ వద్ద సిఫారసు చేయాలని, అల్లాహ్ మీ వద్ద సిఫారసు చేయాలని కోరుకుంటున్నాం‘ అన్నాడు. ఆ మాట విని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ భీతితో, భయంతో కంపించిపోయారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) నోటిపై అల్లాహ్ కీర్తి వచనాలు వెలువడ్డాయి. అల్లాహ్ ఔన్నత్యం వల్ల సభికుల ముఖాలపై వస్తున్న మార్పు స్పష్టంగా కనిపించింది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ గ్రామస్తుడికి అర్థమయ్యేలా వివరించారు: “అధికారమంతా అల్లాహ్ చేతుల్లోనే ఉంది. ఒకవేళ అల్లాహ్ ఎవరి సిఫారసు అయినా స్వీకరిస్తే అది ఆయన అనుగ్రహమే. కాని ప్రవక్త వద్ద అల్లాహ్ ను సిఫారసు దారునిగా చేయడం అంటే ప్రవక్తకు అధికారం అంటగట్టడం, అతన్నే యజమానిగా భావించడం అన్నమాట. కాని అది అల్లాహ్ గొప్పతనం. ఇక ముందు ఇలాంటి మాటలు మాట్లాడకు.”

అల్లాహ్ ఔన్నత్యం అద్వితీయం. ప్రవక్తలు, ఔలియాలు ఆయన ముందు చాలా చిన్నవారు. ఆయన సింహాసనం భూమ్యాకాశాలను ఆవరించి ఉంది. సింహాసనం అంత పెద్దదయినప్పటికీ అల్లాహ్ ఔన్నత్యం వల్ల దాన్ని మోయలేక విలవిలలాడుతుంది. ఆయన ఔన్నత్యం సృష్టితాలు ఊహకు కూడా అందదు. తమ భావాల ద్వారా ఆయన ఔన్నత్యాన్నీ వివరించలేరు. ఆయన పనిలో జోక్యం చేసుకోలేరు. ఆయన సామ్రాజ్యంలో కూడా జోక్యం చేసుకోలేరు. సైన్యం, మంత్రులు, అధికారులు లేకుండానే ఆయన కోటానుకోట్ల పనులు చేస్తాడు. అలాంటప్పుడు ఆయన ఒకరి వద్దకు వచ్చి సిఫారసు ఎందుకు చేస్తాడు? ఆయన ముందు అధికారం చేసే ధైర్యం ఎవరికుంది? అల్లాహ్ పరమ పవిత్రుడు!

ఒక సామాన్య గ్రామస్తుడి నోటి నుండి వెలువడిన మాటవల్ల మానవులందరిలో అత్యున్నతుడు అయిన మానవులు, అల్లాహ్ ప్రియ దాసులైన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దైవభీతితో హడలెత్తి భూమ్యాకాశాల్లో ఉన్న అల్లాహ్ ఔన్నత్యాన్ని కీర్తించడం మొదలు పెట్టారు. అలాంటప్పుడు అల్లాహ్ తో స్నేహం, బంధుత్వం కలిపే వారి పరిస్థితిని, ఆలోచించకుండా మితిమీరి మాట్లాడేవారి గురించి ఏం చెప్పమంటారు? ఒకడు నేను దేవుణ్ణి ఒక రూపాయికి కొన్నాను అంటాడు, ఇంకొకడు నేను దేవుడికంటే రెండు సంవత్సరాలు పెద్దవాణ్ణి అంటాడు. నా దేవుడు నా కాలి రూపంలో కంటే వేరే రూపంలో వస్తే నేనెప్పుడూ అతణ్ణి చూడను అని మరొకడంటాడు. ఇంకొకడు నా హృదయం ముహమ్మద్ ప్రేమలో గాయమైంది. నేను నా ప్రభువుతో సాన్నిహిత్యాన్ని కలిగి వుంటాను అంటాడు. అల్లాహ్ ను ప్రేమించు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో జాగ్రత్తగా ఉండు అని మరొకడు. ఇంకొందరయితే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను దైవత్వం కంటే గొప్పగా చెబుతుంటారు.

అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను!! ఈ ముస్లిములకు ఏమయింది? పవిత్ర ఖుర్ఆన్ ఉన్నప్పటికీ వీరి బుద్ధులపై తెరలెందుకు పడ్డాయి? ఏమిటీ ఈ వక్ర మార్గాలు? అల్లాహ్ మమ్మల్ని అందర్నీ రక్షించుగాక. అల్లాహ్ మమ్మల్ని అందర్నీ రక్షించుగాక!! ఆమీన్.

ఎవరో చాలా చక్కగా పేర్కొన్నారు.

“మర్యాద ప్రసాదించమని మేము అల్లాహ్ ను కోరుతున్నాము. అమర్యాదస్థులు అల్లాహ్ అనుగ్రహాన్ని పొందలేరు”

కొందరు ఈ వాక్యం పలుకుతుంటారు. ” అబ్దుల్ ఖాదిర్ జీలానీ! అల్లాహ్ కోసం మా మొక్కుబడులను స్వీకరించు.” ఇలా అనడం స్పష్టమైన షిర్క్.

అల్లాహ్ ముస్లిములను ఇలాంటి వాటి నుండి రక్షించుగాక! ఆమీన్! షిర్క్ ప్రస్ఫుటమయ్యే, అమర్యాద కలిగించే మాటలు నోటి నుండి వెలువడనివ్వకండి. అల్లాహ్ ఎంతో గొప్పవాడు. నిత్యం ఉండే శక్తివంతుడైన చక్రవర్తి. చిన్న పొరపాటును పట్టుకోవడం లేదా క్షమించి వదలిపెట్టడం ఆయన చేతిలోనే ఉంది. అలాంటిది అమర్యాదగా మాట్లాడటం, ఆ తర్వాత అలా మాట్లాడలేదనడం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే అల్లాహ్ పొడుపు కథలకు అతీతుడు. ఎవరయినా పెద్దవారితో పరాచి కాలాడితే ఎంత చెడుగా భావిస్తాం? చక్రవర్తితో పరిహాసమాడడం సమంజసమా?

ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడినది:
విశ్వాస ప్రదాయిని (తఖ్వియతుల్ ఈమాన్) – షాహ్ ఇస్మాయీల్ [పుస్తకం]

మరణాంతర జీవితం – పార్ట్ 16: సిఫారసు కు సంబంధించిన మూఢ నమ్మకాలు, చెడు విశ్వాసాలు [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 16 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 16. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 21:24 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్.

ఈనాటి మన శీర్షిక సిఫారసుకు సంబంధించిన మూఢ నమ్మకాలు, దుర విశ్వాసాలు. ఈ రోజుల్లో కొన్ని సామెతలు, కొన్ని ఉదాహరణలు చాలా ప్రఖ్యాతిగాంచి ఉన్నాయి మన అనేక మంది ప్రజల మధ్యలో. అవేమిటంటే మనం ఇహలోకంలో చీఫ్ మినిస్టర్ వద్దకు పోవాలంటే, ప్రైమ్ మినిస్టర్ వద్దకు పోవాలంటే వారి యొక్క P.A లేదా వారి యొక్క సెక్రటరీ యొక్క సిఫారసు ద్వారా అక్కడికి చేరుకుంటాము. అలాగే అల్లాహ్ వద్దకు మనం డైరెక్టుగా చేరుకోలేము గనక మనం పాపాత్ములము, మనతో చాలా తప్పిదాలు, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మనం ఎలా అల్లాహ్ కు ముఖం చూపించుకొని ఆయన వద్దకు వెళ్తాము? అందు గురించి ఆయన పుణ్యదాసులు, భక్తులు, విశ్వాసులు, ప్రవక్తలు, దైవ దూతలు అలాంటి వారితో మనం మొర పెట్టుకుంటే, అలాంటి వారి యొక్క సిఫారసు గురించి వారిని మనం కోరుతూ ఉంటే వారు మనల్ని అల్లాహ్ వద్దకు చేర్పిస్తారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్. మహాశయులారా! ఇలాంటి విషయం చాలా వరకు మీరు వింటారా లేదా? వింటూ ఉంటారు కానీ ఒక్కసారి అల్లాహ్ మనందరినీ క్షమించు గాక! గమనించండి. ఈలోకంలో ఉన్న నాయకులు వారితో అల్లాహ్ ను మనం పోల్చుతున్నామా? అవూదు బిల్లాహ్. ఎవరైతే ఇలాంటి ఒక సామెత ప్రైమ్ మినిస్టర్ వరకు చీఫ్ మినిస్టర్ వరకు వెళ్ళాలంటే మనకు వారి యొక్క సెక్రటరీ కింది అధికారుల సిఫారసుతో వెళ్ళాలి అని అంటూ ఉంటారో అలాంటి వారిని మీరు కూడా ఒక చిన్న ప్రేమ పూర్వకమైన ప్రశ్న అడగండి. అదేమిటంటే ఒకవేళ చీఫ్ మినిస్టర్ మరియు ప్రైమ్ మినిస్టర్ మీ క్లాసుమేట్, మీ ఇంటి పక్కన ఉండేవాడు, మీ యొక్క వాడలో ఉండేవాడు, మీ యొక్క చిన్ననాటి స్నేహితుడు అయితే అతనితో నీవు డైరెక్ట్ గా నీ సమస్యను ముందు పెట్టి నువ్వు మాట్లాడుతావా? లేక వేరే వాళ్లను అతని వద్దకు సిఫారసుకు తీసుకెళ్తావా? ప్రతి బుద్ధిమంతుడు ఏమి సమాధానం ఇస్తాడు? ప్రైమ్ మినిస్టర్ నాకు తెలిసిన వాడై ఉంటే, నాకు దగ్గరి వాడై ఉంటే నేను ఇతరులను ఎందుకు సిఫారసుగా తీసుకెళ్తాను? నేనే డైరెక్ట్ గా అతనితో మాట్లాడుకుంటాను. అవునా లేదా? మరి అల్లాహ్. అవూదు బిల్లాహ్. నేను అల్లాహ్ కు ఎలాంటి పోలికలు ఇవ్వడం లేదు. ఎవరైతే ఇలాంటి పోలికలు ఇస్తున్నారో వారి యొక్క ఆ పోలికకు సమాధానంగా ఇలాంటి ఒక విషయం చెప్పి, అల్లాహ్ గురించి మన విశ్వాసం ఏమిటి? అల్లాహ్ గురించి మన నమ్మకమేమిటి? మనం ఎంత పాపాత్ములమైనా, ఎన్ని దుష్కార్యాల్లో పడి ఉన్నా, ఆ అల్లాహ్ మనల్ని ఎలా సంబోధిస్తున్నాడు?

۞ قُلْ يَـٰعِبَادِىَ ٱلَّذِينَ أَسْرَفُوا۟ عَلَىٰٓ أَنفُسِهِمْ لَا تَقْنَطُوا۟ مِن رَّحْمَةِ ٱللَّهِ ۚ إِنَّ ٱللَّهَ يَغْفِرُ ٱلذُّنُوبَ جَمِيعًا ۚ إِنَّهُۥ هُوَ ٱلْغَفُورُ ٱلرَّحِيمُ

(ఓ ప్రవక్తా! నా తరఫున వారికి ఇలా) చెప్పు: “తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా! మీరు అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్‌ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు. (సూరా అజ్-జుమర్ 39:53)

“ఓ నా దాసులారా!” గమనించండి ఎవరిని అంటున్నాడు? నా దాసులారా అని అల్లాహు తఆలా ఇక్కడ దైవదూతలను అంటున్నాడా? ప్రవక్తలను అంటున్నాడా? పుణ్యపురుషులను అంటున్నాడా? మహా భక్తులని అంటున్నాడా? ఔలియా అల్లాహ్ ఇంకా మంచి మంచి సత్కార్యాలు చేసేవారిని అంటున్నాడా? కాదు, ఎవరైతే పాపాల మీద పాపాలు చేసుకొని తమ ఆత్మల మీద అన్యాయం చేసుకున్నారో, అల్లాహ్ యొక్క కారుణ్యం నుండి మీరు ఏమాత్రం నిరాశ చెందకండి.

అల్లాహు అక్బర్. అల్లాహ్ మనకు ఎంత దగ్గర ఉన్నాడు. అల్లాహు తఆలా డైరెక్ట్ మనలో ఎవరు ఎంత పాపాత్ములు అయినా కానీ నా దాసుడా! నా కారుణ్యం పట్ల నిరాశ చెందకు.

وَقَالَ رَبُّكُمُ ٱدْعُونِىٓ أَسْتَجِبْ لَكُمْ ۚ إِنَّ ٱلَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِى سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ

మరి మీ ప్రభువు ఏమంటున్నాడంటే, “మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. నా దాస్యం పట్ల గర్వాహంకారం ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులై నరకంలో ప్రవేశించటం తథ్యం.” (సూరా అల్ మూమిన్ 40:60)

మీ ప్రభువు మీతో చెబుతున్నాడు. నాతో డైరెక్ట్ మీరు దువా చేయండి, నేను మీ దుఆను అంగీకరిస్తాను. ఖురాన్ యొక్క ఆయతులు కదా ఇవి శ్రద్ద వహించండి. వీటి యొక్క భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి.

మరో చిన్న ఉదాహరణ ఇస్తాను. ఈ ఉదాహరణ అల్లాహ్ విషయంలో కాదు, అల్లాహ్ గురించి కాదు. మన అల్ప జ్ఞానులకు మరియు మన బుర్రలో ఈ విషయాలు కొంచెం దిగి అర్థం చేసుకోవడానికి. ఇక్కడి నుండి వెయ్యి కిలోమీటర్ల దూరంలో నేను ఏ బాబాను, ఏ వలీని, ఏ పుణ్యాత్ముడ్ని నమ్ముకుంటున్నానో అతని యొక్క సమాధి అక్కడ ఉంది. నేను ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు అల్లాహ్ ను మొరపెట్టుకొని ఓ అల్లాహ్! నా ఈ కష్టాన్ని దూరం చెయ్యి అని పలకాలా? లేకుంటే నాకు ప్రియమైన ఫలానా బాబా, ఫలానా వలి మరియు నాకు నేను మీ యొక్క మురీద్ ని, నేను ఈ కష్టంలో ఉన్నాను. నా ఈ కష్టాన్ని మీరు దూరం చేయడానికి అల్లాహ్ ను మొరపెట్టుకోండి అని అనాలా?. ఎలా చెప్పాలి? ఆలోచించండి కొంచెం. మన ఈ కష్టాన్ని ఎవరు చూస్తున్నారు? అల్లాహ్ మంచిగా చూస్తున్నాడా లేక అతనా? నా కష్టం దూరం చెయ్యి అని మనం నోట ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ మాటను అల్లాహ్ స్పష్టంగా ఏ అడ్డు లేకుండా వింటున్నాడా? లేకుంటే మనకు ప్రియమైన ఆ పుణ్యాత్ముడా? గమనించండి. ప్రతి ఒక్కరి ద్వారా సమాధానం ఏం వస్తుంది? వెయ్యి కిలోమీటర్లు వదిలేయండి. మన పక్క సమాధిలో ఉన్నప్పటికీ మనం ఏ పుణ్యాత్మునికి మురీద్ గా, ఏ పుణ్యాత్మునికి శిష్యునిగా, ఏ పుణ్యాత్మునికి మనం ప్రియునిగా ఉంటిమో అతను అతని యొక్క సమాధి మన పక్కలో ఉన్నప్పటికీ అల్లాహ్ కంటే మంచి విధంగా నా కష్టాన్ని చూసేవారు ఎవరు లేరు, అల్లాహ్ కంటే మంచి విధంగా నేను నా కష్టాన్ని నోటితో చెప్పుకున్నప్పుడు వినేవారు అంతకంటే గొప్పవారు ఎవరూ లేరు. మరియు నా కష్టాన్ని తొలిగించే విషయంలో కూడా అల్లాహ్ కు ఉన్నటువంటి శక్తి ఎవరికీ లేదు. అలాంటప్పుడు ఎవరికి మనం మొరపెట్టుకోవాలి?

ఇంకా విషయం అర్ధం కాలేదా? ఉదాహరణకి 105 డిగ్రీలు నీకు జ్వరం ఉంది. నీ పక్కనే డాక్టర్ ఉన్నాడు. నీ చుట్టుపక్కల నీ భార్య లేదు, నీ పిల్లలు లేరు, ఎవరూ లేరు. నీవు ఒంటరిగా నీవు ఆ గదిలో ఉన్నావు. పక్క గదిలో డాక్టర్ ఉన్నాడు మరియు నీ కొడుకు లేదా నీ భార్య లేదా నీవు ఎవనికి శిష్యునివో ఆ పుణ్యాత్ముడు అతని యొక్క సమాధి ఎడమ పక్కన ఉంది. నువ్వు ఎవరిని పిలుస్తావు ఈ సందర్భంలో? ఓ డాక్టర్ సాబ్ వచ్చి నాకు ఇంజక్షన్ ఇవ్వు, నన్ను చూడు అని అంటావా? లేకుంటే ఓ పుణ్యాత్ములు, ఓ నా బాబా సాహెబ్ నాకు ఈ జ్వరం ఉన్నది. నా కష్టాన్ని దూరం చెయ్యి. నా జ్వరాన్ని దూరం చెయ్యి అని అంటామా? బహుశా ఈ చిన్నపాటి ఉదాహరణల ద్వారా మాట అర్థమైంది అనుకుంటాను.

విషయం ఏంటంటే సోదరులారా! సిఫారసు యొక్క సంపూర్ణ అధికారం అల్లాహ్ చేతిలో ఉందన్న విషయం మనం తెలుసుకున్నాం. అయితే ఇంకా ఎవరైనా మనకు సిఫారసు ప్రళయ దినాన చేయగలరు అని వారితో మొరపెట్టుకోవడం, వారితో సిఫారసు గురించి కోరడం, ఇది పాతకాలపు నుండి అవిశ్వాసులు, ముష్రికులు, బహు దైవారాధకులు పాటిస్తూ వస్తున్నటువంటి ఒక ఆచారం.

ఈ విషయాన్ని అల్లాహ్ (తఆల) సూరయే యూనుస్ ఆయత్ నెంబర్ 18 లో ఎంత స్పష్టంగా తెలిపాడో మీరు ఒకసారి గమనించండి.

وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ وَيَقُولُونَ هَٰؤُلَاءِ شُفَعَاؤُنَا عِندَ اللَّهِ ۚ قُلْ أَتُنَبِّئُونَ اللَّهَ بِمَا لَا يَعْلَمُ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ

వారు అల్లాహ్‌ను వదలి తమకు నష్టాన్నిగానీ, లాభాన్ని గానీ చేకూర్చలేని వాటిని పూజిస్తున్నారు. ఇంకా, “అల్లాహ్‌ సమక్షంలో ఇవి మాకు సిఫారసు చేస్తాయి” అని చెబుతున్నారు. “ఏమిటీ, ఆకాశాలలో గానీ, భూమిలో గానీ అల్లాహ్‌కు తెలియని దానిని గురించి మీరు ఆయనకు తెలియజేస్తున్నారా?” వారు కల్పించే భాగస్వామ్యాల నుంచి ఆయన పవిత్రుడు, ఉన్నతుడు అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. (సూరా యూనుస్ 10:18)

అల్లాహ్ ఆ ముష్రికుల విషయంలో తెలుపుతున్నాడు. “వారు అల్లాహ్ ను వదిలి వారికి ఏ మాత్రం లాభాన్ని చేకూర్చే లేదా వారికి ఏ మాత్రం నష్టాన్ని చేకూర్చ లేని వారిని ఆరాధిస్తున్నారు. వారు అల్లాహ్ ను వదిలి వారికి ఏ మాత్రం నష్టం గాని, లాభం కానీ చేకూర్చలేని వారిని ఆరాధిస్తున్నారు. ఇలా ఆరాధిస్తూ వారు వారి యొక్క నమ్మకాన్ని ఇలా తెలుపుతున్నారు: “మేము ఎవరినైతే ఆరాధిస్తున్నామో, ఎవరి వద్దకైతే వెళ్లి కొన్ని ఆరాధనకు సంబంధించిన విషయాలు పాటిస్తున్నామో వారు మా గురుంచి అల్లాహ్ వద్ద సిఫారసులు అవుతారు. వీరు అల్లాహ్ వద్ద మాకు సిఫారసులు అవుతారు”. వారికి చెప్పండి – ఏమిటి? అల్లాహ్ కు ఆకాశాలలో, భూమిలో తెలియని ఒక విషయాన్ని మీరు అల్లాహ్ కు తెలియపరుస్తున్నారా? ఇలాంటి సిఫారసులు చేసేవారితో, ఇలాంటి భాగస్వాములతో, అల్లాహ్ ఎంతో అతి ఉత్తముడు, పవిత్రుడు. వారు ఈ షిర్క్ పనిచేస్తున్నారు. ఇలాంటి షిర్క్ కు అల్లాహు (తఆలా) కు ఎలాంటి సంబంధం లేదు. అన్ని రకాల షిర్క్ పనులకు అతను ఎంతో ఉన్నతుడు”. గమనించారా? స్వయంగా అల్లాహ్ సూరయే యూనుస్ ఆయత్ నెంబర్ 18 లో ఇలాంటి ఎవరినైనా సిఫారసు చేస్తారు అని నమ్ముకొని వారి వద్ద ఏదైనా కొన్ని కార్యాలు చేస్తూ వారు మా గురించి అల్లాహ్ వద్ద సిఫారసు చేయాలి అని నమ్ముకోవడం ఇది షిర్క్ అని అల్లాహ్ ఎంత స్పష్టంగా తెలియ పరుస్తున్నాడు.

మరి కొన్ని ఆధారాలు, మరికొన్ని విషయాలు ఉన్నాయి. సూరతుల్ జుమర్ ఆయత్ నెంబర్ 3 ను కూడా .

 أَلَا لِلَّهِ الدِّينُ الْخَالِصُ ۚ وَالَّذِينَ اتَّخَذُوا مِن دُونِهِ أَوْلِيَاءَ مَا نَعْبُدُهُمْ إِلَّا لِيُقَرِّبُونَا إِلَى اللَّهِ زُلْفَىٰ إِنَّ اللَّهَ يَحْكُمُ بَيْنَهُمْ فِي مَا هُمْ فِيهِ يَخْتَلِفُونَ ۗ إِنَّ اللَّهَ لَا يَهْدِي مَنْ هُوَ كَاذِبٌ كَفَّارٌ

జాగ్రత్త! నిష్కల్మషమైన ఆరాధన మాత్రమే అల్లాహ్‌కు చెందుతుంది. ఎవరయితే అల్లాహ్‌ను గాకుండా ఇతరులను సంరక్షకులుగా ఆశ్రయించారో వారు, “ఈ పెద్దలు మమ్మల్ని అల్లాహ్‌ సాన్నిధ్యానికి చేర్చటంలో తోడ్పడతారని భావించి మాత్రమే మేము వీళ్లను ఆరాధిస్తున్నామ”ని అంటారు. ఏ విషయం గురించి వారు భేదాభిప్రాయానికి లోనై ఉన్నారో దానికి సంబంధించిన (అసలు) తీర్పు అల్లాహ్‌ (స్వయంగా) చేస్తాడు. అబద్ధాలకోరులకు, కృతఘ్నులకు అల్లాహ్‌ ఎట్టి పరిస్థితిలోనూ సన్మార్గం చూపడు. (సూరతుల్ జుమర్ 39:3

మీరు గమనిస్తే వారు ఇలాంటి మూడ నమ్మకాలకి గురి అయ్యి షిర్క్ చేస్తున్నారు అని అల్లాహ్ (తఆలా) మరి ఎంతో స్పష్టంగా తెలియ చేస్తున్నాడు. “ఎవరైతే అల్లాహ్ ను కాదని, ఇంకా వేరే ఔలియాలను నిలబెట్టుకున్నారో, ఎవరైతే అల్లాహ్ ను కాదని, ఇంకా వేరే ఔలియాలను నమ్ముతున్నారో, ఆ ఔలియాల వద్ద వారు సంతోషించడానికి ఏఏ కార్యాలు చేస్తున్నారో, దానికి ఒక సాకు తెలుపుకుంటూ ఏమంటారు వారు? మేము అక్కడ వారి యొక్క ఆరాధన ఏదైతే చేస్తున్నామో, ఆరాధనకు సంబంధించిన కొన్ని విషయాలు ఏదైతే వారి వద్ద పాటిస్తున్నామో, వారు మమ్మల్ని అల్లాహ్ కు చేరువుగా చేయాలని, అంటే మేము స్వయంగా అల్లాహ్ వద్ద చేరుకోలేము అందుకు గురించి వీరిని మధ్యలో సిఫారసుగా పెడుతున్నాము. వారు అల్లాహ్ వద్ద మాకు సిఫారసు చేసి మమ్మల్ని అల్లాహ్ కుదగ్గరగా చేస్తారు. అల్లాహు అక్బర్. అయితే అల్లాహ్ ఏమంటున్నాడు? ఇలాంటి విభేదాలకు వారు ఏదైతే గురి అయ్యారో, ప్రవక్తల అందరిని ఏదైతే మేము పంపామో, ఇలాంటి షిర్క్ నుండి ఆపడానికే పంపాము. కానీ వారు ఈ సరైన మార్గాన్ని వదిలి ఏదైతే భిన్నత్వానికి, విభేదానికి గురి అయ్యారో, దానికి సంబంధించిన తీర్పులు అన్నీ కూడా మేము సమీపంలో చేస్తాము ప్రళయ దినాన.

మళ్ళీ ఆ తర్వాత ఆయత్ యొక్క చివరి భాగం ఎలా ఉందో గమనించండి. “ఎవరైతే అబద్ధాలకు మరియు కృతఘ్నత, సత్య తిరస్కారానికి గురి అవుతారో, వారికి అల్లాహ్ సన్మార్గం చూపడు“.

అంటే మాట ఏంటి? అల్లాహ్ మధ్యలో ఎవరిని కూడా ఇలా మధ్యవర్తిగా నియమించలేదు. వారిని మనం సిఫారసులుగా చేసుకోవాలని అల్లాహ్ ఎవరిని కూడా నిర్ణయించలేదు. చివరికి ప్రవక్త మహానీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అందరికంటే శ్రేష్ఠులు గొప్పవారు. వారు కూడా ప్రళయ దినాన ఏ సిఫారసు అయితే చేస్తారో, దాని విషయంలో మనం హదీసులు విన్నాము. ఈ విషయం సహచరులకు కూడా తెలుసు. అయినప్పటికీ ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క సహాబి కూడా ప్రవక్తా! ప్రళయదినాన మాకు మీరు సిఫారసుగా నిలబడి మా పాపాలను క్షమించి, క్షమించడానికి అల్లాహ్ తో చెప్పుకొని, మమ్మల్ని అల్లాహ్ కు చేరువుగా చేయాలి అని ఈవిధంగా ఎప్పుడూ కూడా మొర పెట్టుకోలేదు.

అందుగురించి మహాశయులారా! ఇక్కడ సూరయే యాసీన్ లో ఒక పుణ్యాత్ముని సంఘటన అల్లాహ్ (తఆలా) ఏదైతే ప్రస్తావించాడో, అతను తౌహీదు పై ఉండి, షిర్క్ ని ఏదైతే విడనాడాడో మరియు అతని జాతివారు అతన్ని అందుకని హత్య చేశారో ఆ సంఘటన మొత్తం సూరయే యాసీన్ లో ఉంది. ఆ పుణ్యాత్ముడు ఏమంటాడు?

أَأَتَّخِذُ مِن دُونِهِ آلِهَةً إِن يُرِدْنِ الرَّحْمَٰنُ بِضُرٍّ لَّا تُغْنِ عَنِّي شَفَاعَتُهُمْ شَيْئًا وَلَا يُنقِذُونِ

అట్టి (నిజ) దైవాన్ని వదిలేసి నేను ఇతరులను ఆరాధ్యులుగా ఆశ్రయించాలా? ఒకవేళ కరుణామయుడు (అయిన అల్లాహ్‌) నాకేదైనా నష్టం కలిగించదలిస్తే వారి సిఫారసు నాకెలాంటి లాభమూ చేకూర్చదు. వారు నన్ను కాపాడనూ లేరు”. (36:23)

“ఏమిటి? అల్లాహ్, రహ్మాన్ ను కాదని ఇంకా వేరే వారు ఎవరినైనా నేను, నాకు ఆరాధ్యనీయునిగా చేసుకోవాలా? ఒకవేళ అల్లాహ్, రహ్మాన్ నాకు ఏదైనా నష్టం చేకూర్చాలని అంటే వారు ఆ నష్టాన్ని ఏమైనా దూరం చేయగలుగుతారా? ఆ సందర్భంలో వారి యొక్క ఏ సిఫారసు కూడా నాకు పని చేయదు. వారి యొక్క ఏ సిఫారసు నాకు లాభాన్ని చేకూర్చదు”.

ఈ విధంగా మహాశయులారా! ఇహలోకంలో ఎవరినీ కూడా మనం ఫలానా అతను నాకు సిఫారసు చేస్తాడు పరలోక దినాన అని భావించి వారి వద్ద ఏదైనా ఆరాధనకు సంబంధించిన విషయాలు పాటిస్తూ ఉండడం ఇది అల్లాహ్ కు ఎంత మాత్రం ఇష్టం లేదు.

ప్రళయదినాన నరకవాసులు నరకంలో పోయిన తర్వాత, స్వర్గవాసులు ఆ నరకవాసులను అడుగుతారు. మీరు ఎందుకు నరకంలో పడి ఉన్నారు? కారణం ఏంటి? ఏ పాపం వల్ల మీరు ఇక్కడ వచ్చి పడి ఉన్నారు? అని అంటే వారు స్వయంగా ఏ సత్కార్యాలని విడనాడినందుకు నరకంలో వచ్చి పడ్డారో, మరి ఏ మూఢనమ్మకాల వల్ల నరకంలో చేరవలసి వచ్చిందో స్వయంగా వారి నోట వారు తెలుపుతున్నారు. అల్లాహ్ ఈవిషయాన్ని సూరయే ముద్దస్సిర్ లో తెలిపాడు.

 مَا سَلَكَكُمْ فِي سَقَرَ قَالُوا لَمْ نَكُ مِنَ الْمُصَلِّينَ وَلَمْ نَكُ نُطْعِمُ الْمِسْكِينَ وَكُنَّا نَخُوضُ مَعَ الْخَائِضِينَ وَكُنَّا نُكَذِّبُ بِيَوْمِ الدِّينِ حَتَّىٰ أَتَانَا الْيَقِينُ فَمَا تَنفَعُهُمْ شَفَاعَةُ الشَّافِعِينَ

“ఇంతకీ ఏ విషయం మిమ్మల్ని నరకానికి తీసుకు వచ్చింది?” (అని ప్రశ్నిస్తారు). వారిలా సమాధానమిస్తారు : “మేము నమాజు చేసే వారము కాము. నిరుపేదలకు అన్నం పెట్టే వారమూ కాము. పైగా, మేము పిడివాదన చేసే వారితో (తిరస్కారులతో) చేరి, వాదోపవాదాలలో మునిగి ఉండేవారం. ప్రతిఫల దినాన్ని ధిక్కరించేవాళ్ళం. తుదకు మాకు మరణం వచ్చేసింది.” మరి సిఫారసు చేసేవారి సిఫారసు వారికి ఏమాత్రం ఉపయోగపడదు. (74:42-48)

వారు అంటారు. మేము నమాజ్ చేసే వారిలో కాకుంటిమి. నిరుపేదలకు అన్నం పెట్టే వారిమి కాకుంటిమి. అలాగే కాలక్షేపాలు చేసి సమయాన్ని వృధా చేసే వారిలో మేము కలిసి ఉంటిమి. మరియు మేము ఈ పరలోక దినాన్ని తిరస్కరిస్తుంటిమి. చివరికి మాకు చావు వచ్చేసింది. చావు వచ్చిన తర్వాత మేము సజీవంగా ఉన్నప్పుడు ఎవరెవరినైతే సిఫారసు చేస్తారు అని అనుకుంటూ ఉంటిమో, ఏ సిఫారసు చేసేవారి సిఫారసు మాకు ఏ లాభాన్ని చేకూర్చలేదు.

అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా! ఇలాంటి మూఢనమ్మకాల వల్ల ఎంత నష్టం చేకూరుస్తుందో, ఎలా నరకంలో పోవలసి వస్తుందో అల్లాహ్ ఎంత స్పష్టంగా మనకు తెలియపరిచాడో గమనించండి.

కొందరు మరో రకమైన తప్పుడు భావంలో పడి ఉన్నారు. ప్రళయదినాన ప్రజలందరూ కలిసి ప్రవక్తల వద్దకు సిఫారసు కోరుతూ ఏదైతే వెళ్తారో దాన్ని ఆధారంగా పెట్టుకున్నారు. దాన్ని ఆధారంగా పెట్టుకొని ఏమంటారు? ప్రళయదినాన ప్రవక్తల వద్దకు సిఫారసు కోరుతూ వెళ్తారు కదా! అయితే ఈ రోజు మేము ఇహలోకంలో ఇలా పుణ్యాత్ముల వద్దకు సిఫారసు కోరుతూ వెళ్తే ఏమి నష్టం అవుతుంది? అయితే మహాశయులారా! ఆ విషయం ఇక్కడ వీరు పాటిస్తున్న దానికి ఎంత మాత్రం ఆధారంగా నిలవదు. ఎందుకంటే ఇక్కడ సామాన్య ప్రజలు చనిపోయిన వారిని సిఫారసులుగా కోరుతున్నారు. సిఫారసులుగా వారికి నిలబెట్టుకొని వారి వద్ద కొన్ని ఆరాధనలు చేస్తున్నారు మరియు ఆరోజు ప్రవక్తలు సజీవంగా ఉండి వారితో మాట్లాడుతున్నారు. రెండవ విషయం అక్కడ ఏదైతే ప్రజలు సిఫారసు గురించి కోరుతున్నారో, దేని గురించి? మా పాపాలు క్షమించమని కాదు, మా కష్టాలు దూరం చేయమని కాదు, మేము మా ఇబ్బందులు మీరే డైరెక్టుగా దూరం చెయ్యాలి అని కాదు. దేని గురించి అల్లాహ్ తీర్పు చేయడానికి రావాలి. తీర్పు మొదలు కావాలి అని మీరు సిఫారసు చేయండి అంతే! కానీ ఈ రోజుల్లో దానిని సాకుగా పెట్టుకొని ఎవరినైతే సిఫారసు గా నిలబెట్టుకున్నారో వారితో అన్ని రకాల సంతానం లేకుంటే సంతానము కోరడం, అనారోగ్యాన్ని దూరం చేయడానికి వారితో కోరడం, ఇంకా ఎన్నో రకాల కష్టాలు దూరం చేయాలని వారితో డైరెక్టుగా దుఆ చేయడం ఇలాంటివన్నీ షిర్క్ పనులు జరుగుతున్నాయి కదా! మరి ఆ విషయం ఎలా ఆధారంగా ఉంటుంది? అగత్యపరుడు, మరీ కష్టంలో ఉన్నవాడు దుఆ చేసినప్పుడు దుఆను స్వీకరించి విని అతని కష్టాన్ని దూరం చేసేవాడు అల్లాహ్ తప్ప ఇంక ఎవరు లేరు.

అందుగురించి మహాశయులారా! ఇలాంటి మూఢనమ్మకాలను వదులుకోవాలి. కేవలం యోగ్యమైన రీతిలో అల్లాహ్ మరియు మనకు ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపిన రీతిలోనే సిఫారసు యొక్క మార్గాలను అవలంభించాలి. కానీ ఇలాంటి మూఢనమ్మకాలు, ఇలాంటి దురవిశ్వాసాలకు లోనైతే చాలా నష్టానికి కూరుకుపోతాము.

అయితే మహాశయులారా! ఇహలోకంలో మనం ఏ కష్టాల్లో, ఏ ఆపదలో, ఏ ఇబ్బందులు, ఎన్ని రకాల బాధలకు, చింతలకు మనం గురి అవుతామో వాటిలో మరి మనం ఏదైనా మధ్యవర్తిత్వాన్ని అవలంబించి దుఆలు చేయడానికి ఏదైనా ఆస్కారం ఉందా? అలాంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఇలా పుణ్యాత్ములని, మరి ఇంకా చనిపోయిన మహాపురుషులని మధ్యవర్తిత్వంగా పెట్టుకొని వారిని సిఫారసుగా నిలబెట్టుకొని వారితో ఎలాంటి దుఆలు చేయకూడదు అని అంటున్నారు కదా? మరి మనం ఏదైనా ఇబ్బంది లో ఉన్నప్పుడు ఏ మధ్యవర్తిత్వాన్ని అవలంబించి ఎలా దుఆ చెయ్యాలి? అనే విషయం ఇన్షా అల్లాహ్ దీని తరువాయి భాగంలో మనం తెలుసుకోబోతున్నాము. అల్లాహు తఆలా మనందరికీ సత్-భాగ్యం ప్రసాదించుగాక!

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

పరలోకం (The Hereafter) మెయిన్ పేజీ:
https://teluguislam.net/hereafter/

ధర్మపరమైన నిషేధాలు -10: ఎట్టిపరిస్థితిలో అల్లాహ్ తప్ప మరెవ్వరితో సిఫారసు కోరకు [వీడియో]

బిస్మిల్లాహ్

[5:11 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ధర్మపరమైన నిషేధాలు 10

10- అల్లాహ్ వద్ద ప్రయోజనం లభించాలన్న ఉద్దేశ్యంతో ఎట్టిపరిస్థితిలో అల్లాహ్ తప్ప మరెవ్వరితో సిఫారసు కోరకు.

నిశ్చయంగా సిఫారసు యొక్క సంపూర్ణ అధికారం అల్లాహ్ వద్దే ఉంది. అందుకు ఎవ్వరితో సిఫారసు కోరకు. అల్లాహ్ కు అతిసమీపంలో ఉన్న దూత అయినా, ఏ ప్రవక్త అయినా మరియు ఏ పుణ్యపురుషుడైనా సరే.

[وَيَعْبُدُونَ مِنْ دُونِ اللهِ مَا لَا يَضُرُّهُمْ وَلَا يَنْفَعُهُمْ وَيَقُولُونَ هَؤُلَاءِ شُفَعَاؤُنَا عِنْدَ اللهِ قُلْ أَتُنَبِّئُونَ اللهَ بِمَا لَا يَعْلَمُ فِي السَّمَاوَاتِ وَلَا فِي الأَرْضِ سُبْحَانَهُ وَتَعَالَى عَمَّا يُشْرِكُونَ] {يونس:18}

ఈ ప్రజలు అల్లాహ్ ను కాదని తమకు నష్టాన్నిగానీ లాభాన్ని గానీ కలిగించలేనివారిని పూజిస్తున్నారు. పైగా ఇలా అంటున్నారుః వారు అల్లాహ్ వద్ద మా కొరకు సిఫారసు చేస్తారు. ప్రవక్తా! వారితో ఇలా అను: ఆకాశాలలోగానీ, భూమిలోగానీ అల్లాహ్ ఎరుగని విషయాన్ని గురించి ఆయనకు మీరు తెలుపుతున్నారా? ఆయన పరిశుద్ధుడు. ఈ ప్రజలు చేసే షిర్కుకు ఆతీతుడూ, ఉన్నతుడూ.

(సూరె యూనుస్ 10: 18).


పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు

సిఫారసు (షఫా’అ)

  1. మరణాంతర జీవితం – పార్ట్ 13: పరలోక దినాన మహా మైదానంలో జరిగే అతి గొప్ప సిఫారసు [ఆడియో, టెక్స్ట్]
  2. మరణాంతర జీవితం – పార్ట్ 14: ప్రళయ దినాన సిఫారసు ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరికి లభిస్తుంది – పార్ట్ 01 [ఆడియో, టెక్స్ట్]
  3. మరణాంతర జీవితం – పార్ట్ 15: ప్రళయ దినాన సిఫారసు ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరికి లభిస్తుంది (పార్ట్ 02) & సిఫారసులు పొందడానికి, సిఫారసులు చేయడానికి గల కండిషన్స్ [ఆడియో, టెక్స్ట్]

మరణాంతర జీవితం – పార్ట్ 15: ప్రళయ దినాన సిఫారసు ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరికి లభిస్తుంది (పార్ట్ 02) & సిఫారసులు పొందడానికి, సిఫారసులు చేయడానికి గల కండిషన్స్ [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 15 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 15. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 23:16 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్.

ఈనాటి అంశం గత భాగం యొక్క తర్వాత విషయం. ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కాకుండా, ఇంకా వేరే ప్రవక్తలకు, దైవదూతలకు, విశ్వాసులకు సిఫారసు చేసే హక్కు ఏదైతే లభిస్తుందో, దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. దానితో పాటు వారి ఆ సిఫారసును పొందడానికి ఎలాంటి వారు అర్హులవుతారు? అనే విషయం కూడా మనం తెలుసుకుంటున్నాము.

అయితే ఇతర ప్రవక్తల మరియు పుణ్యాత్ముల సిఫారసు మరే సందర్భంలో వారికి లభిస్తుంది అంటే ఏ ప్రజల గురించి నరకంలో వారు పోవాలన్నటువంటి తీర్పు జరుగుతుందో, కానీ అల్లాహ్ యొక్క దయ తరువాత అల్లాహ్ కొందరు ప్రవక్తలకు, కొందరు విశ్వాసులకు సిఫారసు అధికారం ఇస్తాడు. వారు సిఫారసు చేస్తారు. ఆ తర్వాత అల్లాహు తఆలా వారిని నరకంలో ప్రవేశించకుండా నరకం నుండి తప్పించి స్వర్గంలో చేర్చుతాడు. అల్లాహు అక్బర్. ఇది కూడా చాలా గొప్ప విషయం.

సహీ ముస్లిం హదీత్ నెంబర్ 1577, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఒక ముస్లిం ఎవరైనా చనిపోయాడు అంటే అతని జనాజా నమాజ్ చేయడానికి నలబై మంది నిలబడ్డారు. ఎలాంటి వారు ఆ నలబై మంది? అల్లాహ్ తో ఎలాంటి షిర్క్ చెయ్యనివారు. అల్లాహ్ తో పాటు ఎలాంటి వేరే భాగస్వాములను నిలబెట్టని వారు. ఏ ముస్లిం జనాజా నమాజ్ లో నలబై మంది ఎలాంటి షిర్క్ చెయ్యనివారు నిలబడతారో అల్లాహ్ వారి సిఫారసును అతని గురించి స్వీకరిస్తాడు“. చూడడానికి హదీస్ ఇంతే ఉంది.

కానీ ఇందులో మనం గ్రహిస్తే, ఆలోచిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఒకటి, ఈ నలబై మంది ఎలాంటి వారు ఉండాలి? అల్లాహ్ తో పాటు ఇంకెవరిని కూడా అల్లాహ్ ఆరాధనలో భాగస్వామిగా చేయకూడదు. రెండో విషయం ఏం తెలుస్తుంది మనకు? సిఫారసు చేసేవారు షిర్క్ చేయకూడదు అని అన్నప్పుడు, ఎవరి గురించి సిఫారసు చేయడం జరుగుతుందో, అతను షిర్క్ చేసి ఉంటే వీరి సిఫారసు స్వీకరింప బడుతుందా అతని పట్ల? కాదు, అతను కూడా షిర్క్ చేయకుండా ఉండాలి. జనాజా నమాజ్ దీనిని “ఫర్ద్ యే కిఫాయా” అంటారు. అంటే ముస్లిం సముదాయంలో కొంతమంది చేసినా గాని అందరిపై నుండి పాపం అనేది లేపబడుతుంది. చదివిన వారికి పుణ్యం లభిస్తుంది. చదవని వారికి పాపం కలగదు. కానీ ఎవరూ చేయకుంటే అందరూ పాపాత్ములు అవుతారు. ఇలాంటి విషయాన్ని “ఫర్ద్ యే కిఫాయా” అంటారు. ఇది ఫర్ద్ యే కిఫాయా.

ఇక ఎవరైతే “ఫర్ద్ యే అయీన్” అంటే ఐదు పూటల నమాజ్ లు, ఫర్ద్ యే అయీన్ లో లెక్కించబడతాయి. ఫర్ద్ యే అయీన్ చేయకుండా కేవలం ఫర్ద్ యే కిఫాయా చేస్తే సరిపోతుందా? లేదు, చనిపోయిన ఆ ముసలి వ్యక్తి, అతను నమాజీ అయి ఉండాలి మరియు ఈ నలబై మంది కూడా కేవలం జనాజా లో హాజరైనవారు కాదు. ఐదు పూటల నమాజ్ లు చేస్తూ ఉండాలి. ఈ విధంగా మహాశయులారా! ఒక సిఫారసు ఈ రకంగా కూడా ఉంటుంది. అల్లాహు తఆలా దీనిని కూడా స్వీకరిస్తాడు. ఈ షరతు, ఈ కండిషన్ లతో పాటు.

మూడో రకమైన సిఫారసు స్వర్గంలో చేరిన వారు స్వర్గంలో వారి యొక్క స్థానాలు ఉన్నతం కావడానికి, వారు ఏ పొజిషన్ లో ఉన్నారో అంతకంటే గొప్ప స్థితికి వారు ఎదగడానికి సిఫారసు. ఇలాంటి ఒక సిఫారసు కూడా ఉంటుంది. అల్లాహు తఆలా మనకు కూడా అలాంటి సిఫారసు ప్రాప్తం చేయు గాక. ఒకవేళ మనం హదీతులు వింటూ, ఈ ధర్మ భోదనలు వింటూ సిఫారసు పొందే వారిలో మనం కలిసే ప్రయత్నం చేయడం కంటే, ఎవరికైతే సిఫారసు చేసే హక్కు లభిస్తుందో, అలాంటి గొప్ప విశ్వాసంలో మనం కలిస్తే ఇంకా ఎంత మంచిగా ఉంటుంది. ఇంకా ఎంత మన అదృష్టం పెరుగుతుందో ఒకసారి ఆలోచించండి.

ముస్లిం షరీఫ్ లో ఉంది. హదీత్ నెంబర్ 1528. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఎప్పుడైతే అబూ సలమా (రదియల్లాహు తఆలా అన్హు) మరణించారో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతని వద్దకు వచ్చారు. అతని గురించి ఇలా దుఆ చేశారు. ఓ అల్లాహ్! అబూ సలమాను క్షమించు, మన్నించు. సన్మార్గం పొందిన వారు ఎవరైతే ఉన్నారో, వారిలో ఇతని యొక్క స్థానం కూడా పెంచి, వారితో కలుపు. ఓ అల్లాహ్! అతని వెనక, అతని తరువాత ఎవరైతే మిగిలి ఉన్నారో, వారికి నీవే బాధ్యునిగా అయిపో. మమ్మల్ని మరియు అతన్ని మన్నించు ఓ సర్వ లోకాల ప్రభువా! ఆయన సమాధిని విశాలపరుచు మరియు అతని కొరకు అతని సమాధిని కాంతితో నింపు“.

గమనించారా! ఈవిధంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అబూ సలమా గురించి దువా చేశారు. మనం కూడా విశ్వాసులు మనలో ఎవరైనా చనిపోతే, “ఓ అల్లాహ్! ఇతనిని క్షమించు. ఇతని యొక్క స్థానం పెంచి, సన్మార్గం పొందిన వారిలో ఇతన్ని కలుపు మరియు అతని వెనక, అతని తర్వాత అతను వెనుక ఉన్న వారిలో నీవు వారికి ఒక బాధ్యునిగా అయిపో. అతన్ని మరియు మమ్మల్ని కరుణించు ఓ మా సర్వ లోకాల ప్రభువా! అతని సమాధిని విశాల పరుచు. అతని సమాధిని కాంతితో నింపు“. ఈ విధంగా దువా చేయాలి మనం. ఇది కూడా ఒక సిఫారసు. అల్లాహ్ దయతో స్వీకరించబడుతుంది.

ఈ విధంగా సోదరులారా! సిఫారసు ఏ ఏ సందర్బాలలో జరుగుతుందో, ఏ ఏ సందర్భాలలో సిఫారసు చేసేవారు సిఫారసు చేస్తూ ఉన్నారో, ఎవరి గురించి సిఫారసు చేయబడుతుందో వారిలో మనం కూడా కలవాలి. మన గురించి కూడా ఎవరైనా పుణ్యాత్ములు సిఫారసు చేయాలి, దైవ దూతలు సిఫారసు చెయ్యాలి, ప్రవక్తలు సిఫారసు చెయ్యాలి అన్నటువంటి ఈ కేటగిరీని మనం ఎన్నుకునే దానికి బదులుగా అంతకంటే గొప్ప స్థానం దైవదూతలు మరియు ప్రవక్తలతో పాటు ఏ విశ్వాసులకు ఇతరుల గురించి సిఫారసు చేసే హక్కు ఇవ్వబడుతుందో అలాంటి పుణ్యాత్ముల్లో మనం చేరేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇస్లాం నేర్పేది కూడా మనకు ఇదే.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక సందర్భంలో మనకు తెలిపారు. “మీరు అల్లాహ్ తో స్వర్గాన్ని కోరుకున్నప్పుడు ఫిరదౌస్ గురించి మీరు దుఆ చేయండి. దానిని కోరుకోండి. స్వర్గాలలో అన్ని స్వర్గాల కంటే శ్రేష్టమైనది, అన్ని స్వర్గాల కంటే అతి ఉత్తమ, ఉన్నత స్థానంలో ఉన్నది మరియు మధ్యలో ఉన్నది ఆ ఫిరదౌస్“.

ఈవిధంగా ఎప్పుడూ కూడా మనం టాప్ లో కాదు, హై టాప్ లో ఉండే ప్రయత్నం చేయాలి. మనం హై టాప్ కు చేరకపోయినా కనీసం దానికి దగ్గరలోనైనా చేరవచ్చు. కానీ ముందే మనం టార్గెట్ చాలా చిన్నది పెట్టుకుంటే హై స్టేజ్ వరకు ఎప్పుడు చేరుకుంటాము?

ఈ సిఫారసులు పొందడానికి, సిఫారసులు చేయడానికి ఎలాంటి అధికారం ఉండాలి? ఎలాంటి కండిషన్స్ ఉండాలి? అల్లాహు తఆలా ఖురాన్ లో, హదీతుల్లో ఎలాంటి కండీషన్స్ మనకు నిర్ణయించాడు? వాటిని తెలుసుకోవడం కూడా మనకు చాలా ముఖ్యం.

గత కార్యక్రమంలో మరియు కార్యక్రమంలో ముందు వరకు మనం ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కాకుండా వేరే ప్రవక్తలకు, దైవదూతలకు, విశ్వాసులకు ఏఏ సందర్భాలలో ఎలాంటి సిఫారసు చేసే హక్కు దొరుకుతుందో తెలుసుకోవడంతో పాటు ఆ సిఫారసును పొందడానికి ఏఏ సత్కార్యాలు పనికి వస్తాయో అవి కూడా మనం తెలుసుకున్నాము. అయితే సిఫారసు చేయడానికి, సిఫారసు పొందడానికి ఎలాంటి కండీషన్స్, నిబంధనలు అవసరమో అల్లాహు తఆలా వాటిని కూడా ఖురాన్ లో తెలిపి ఉన్నారు. ఆ కండీషన్స్, ఆ నిబంధనలు మనలో ఉన్నప్పుడే మనం ఒకరికి సిఫారసు చేయగలుగుతాము. ఆ కండీషన్స్ మనలో ఉన్నప్పుడే ఒకరి సిఫారసు మనం పొందగలుగుతాము. వాటిని తెలుసుకోవడం మనలో ఏదైనా ఒకటి దానిలో లేకుంటే అది మనలో వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయడం కూడా తప్పనిసరి.

అందులో మొట్ట మొదటి విషయం. సిఫారసు యొక్క సర్వాధికారం కేవలం అల్లాహ్ చేతిలో ఉన్నదన్న విషయాన్ని మనం దృఢంగా నమ్మాలి. ఎందుకంటే మహాశయులారా! నమ్మకం ఎంత బలహీనం అయిపోతుందో, అంతే పుణ్యాత్ములను, బాబాలను, దర్గాలను ఇంకా వేరే ఎవరెవరినో మనం ఆశించి వారు మనకు సిఫారసు చేస్తారు అని వారి వద్దకు వెళ్లి కొన్ని పూజ పునస్కారాలు, కొన్ని ఉపాసనాలు, కొన్ని ఆరాధనలు వారి సంతోషానికి అక్కడ చేసే ప్రయత్నాలు ఈ రోజుల్లో ప్రజలు చేస్తున్నారు. అయితే ఆ ప్రళయ దినాన ఎవరి సిఫారసు చెల్లదు. ఎవరు కూడా ఏ సిఫారసు చేయలేరు. ఎవరికీ కూడా ఏ అధికారం ఉండదు. సర్వాధికారం సిఫారసు గురించి, అన్ని రకాల సిఫారసులకు ఏకైక అధికారుడు కేవలం అల్లాహ్ మాత్రమే.

రెండవ విషయం మనం తెలుసుకోవలసినది ప్రళయ దినాన ఎక్కడా కూడా, ఏ ప్రాంతంలో కూడా అల్లాహ్ అనుమతి లేనిది ఏ ఒక్కరు నాలుక విప్పలేరు, మాట మాట్లాడలేరు. ఆయతల్ కుర్సీ అని ఏదైతే మనం ఆయత్ చదువుతామో సూరయే బకరా లో ఆయత్ నెంబర్ 255. అందులో చాలా స్పష్టంగా ఈ విషయం అల్లాహు తఆలా తెలియజేసాడు. مَن ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ إِلاَّ بِإِذْنِهِ మన్ జల్లజీ యష్ ఫవూ ఇన్ దహూ ఇల్లా బి ఇజ్నిహీ ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? .అరబీ గ్రామర్ ప్రకారంగా ఈ పదాల కూర్పును కూడా గమనించండి. చెప్పే విధానాన్ని కూడా గమనించండి. ఎవరు అతను? ఎవరికి అలాంటి అధికారం ఉన్నది? ఎవరు చేయగలుగుతారు ఈ కార్యం? అతని వద్ద సిఫారసు చేసేటటువంటి అధికారం ఎవరికి ఉన్నది? ఆయన అనుమతి లేకుండా, ఆయన పర్మిషన్ లేకుండా ఎవరు చేయగలుగుతారు? ఎవరికి అంతటి శక్తి, సామర్థ్యం ఉన్నది? రెండో విషయం ఏంటి? అల్లాహ్ అనుమతి లేనిది ఎవరు కూడా సిఫారసు చెయ్యలేరు, ఎవరు నోరు విప్పలేరు, మాట మాట్లాడలేరు.

మూడో విషయం మనం తెలుసుకోవలసినది. అల్లాహ్ అనుమతి ఇచ్చిన వారే సిఫారసు చేస్తారు అని కూడా మనకు రెండో విషయం ద్వారా తెలిసింది కదా! ఇక అల్లాహ్ ఎవరికి అనుమతి ఇస్తాడు? ఆయన ఇష్టపడిన వారికే సిఫారసు చేసే అనుమతి ఇస్తాడు. ఇక ఈ విషయము ఇహలోకంలో మనం ప్రత్యేకంగా ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), సామాన్యంగా ఇతర ప్రవక్తలు తప్ప పేరు పెట్టి ఫలాన వ్యక్తి కూడా సిఫారసు చేయగలుగుతాడు, అల్లాహ్ అతనికి అనుమతి ఇస్తాడు అని మనం చెప్పలేము. ఎందుకంటే అలాంటి ఏ ఆధారము ఖురాన్ మరియు హదీత్ లో లేదు. విషయాన్ని గమనిస్తున్నారా! మూడో విషయం ఏంటి? అల్లాహ్ ఎవరి పట్ల సంతోషంగా ఉంటాడో వారికే అనుమతిస్తాడు. ముందు దీని యొక్క ఆధారం వినండి.

۞ وَكَم مِّن مَّلَكٍۢ فِى ٱلسَّمَـٰوَٰتِ لَا تُغْنِى شَفَـٰعَتُهُمْ شَيْـًٔا إِلَّا مِنۢ بَعْدِ أَن يَأْذَنَ ٱللَّهُ لِمَن يَشَآءُ وَيَرْضَىٰٓ

సూరా నజ్మ్ ఆయత్ నెంబర్ 26. “ఆయన ముందు ఎవరు కూడా సిఫార్సు చేసే అధికారం కలిగిలేరు. ఆయన అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే ఎవరైనా సిఫారసు చేయగలుగుతారు. కానీ అల్లాహ్ ఎవరి పట్ల ఇష్టపడతాడో మరియు ఎవరి గురించి కోరుతాడో అతనికి మాత్రమే అల్లాహు తఆలా అనుమతి ఇస్తాడు“.

ఈ మూడో విషయం కూడా చాలా ముఖ్యమైనది. దీనిని తెలుసుకోకుంటే, దీనిని అర్థం చేసుకోకుంటే ఈరోజు చాలా నష్టం కలుగుతుంది. ప్రజలు తమ ఇష్టానుసారంగా ఇతను నాకు సిఫారసు చేస్తాడు. అంతే కాదు వారి యొక్క పేర్లతో వారి తాత ముత్తాతల పేర్లతో సంతకాలు చేయించుకొని, కాగితాలు భద్రంగా దాచుకొని సమాధుల్లో కూడా పెట్టుకుంటున్నారు. ఈవిధంగా మనకు వారి యొక్క సిఫారసు లభిస్తుంది అన్నటువంటివి ఇవన్నీ మూఢ నమ్మకాలు. అల్లాహ్ ఎవరిపట్ల ఇష్టపడతాడో, అల్లాహ్ ఎవరికి ఇష్టపడిన తర్వాత ఎవరిని కోరుతాడో వారికే అనుమతి ఇస్తాడు. ఈ ఆయత్ ద్వారా మనకు మరో విషయం కూడా బోధపడుతుంది. అల్లాహ్ ఎందరినో ఇష్టపడవచ్చు. కానీ సిఫారసు చేయడానికి అనుమతి కొందరికే ఇవ్వవచ్చు.

ఎందుకంటే నాలుగో కండీషన్, నాలుగో విషయం కూడా గుర్తుంచుకోండి. ఇప్పటివరకు ఏమి తెలుసుకున్నాం మనం? సిఫారసు చేయడానికి ఏదైతే అనుమతి కలగాలో, అల్లాహ్ ఇష్టపడిన వారికే అనుమతిస్తాడు. అయితే వీరు ఎవరి గురించి సిఫారసు చేయాలి? వారిపట్ల కూడా అల్లాహు తఆలా ఇష్టపడాలి. వారి యొక్క మాట, వారి యొక్క విశ్వాసం, వారి యొక్క జీవిత విధానం ఇదంతా కూడా అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో ఉన్నప్పుడే అల్లాహ్ తెలియపరుస్తాడు నీవు సిఫారసు చేయాలి, ఇతని గురించి చేయాలి అని.

ఉదాహరణకు అల్లాహ్ ఒక వ్యక్తికి అనుమతి ఇచ్చాడు అనుకోండి. నీవు సిఫారసు చెయ్యి అని. అయితే తాను కోరిన వారందరికీ సిఫారసు చేసే అధికారం ఉండదు. అల్లాహు తఆలా కొన్ని హద్దులు నిర్ణయిస్తాడు. కొన్ని షరతులు నిర్ణయిస్తాడు. నిబంధనలు పెడతాడు. వాటిలో ఒకటి ముఖ్యమైనది ఏమిటి? ఎవరి గురించి సిఫారసు చెయ్యాలో వారిపట్ల కూడా అల్లాహు తఆలా సంతోషంగా ఉండాలి.

సూరయే మర్యమ్ ఆయత్ నెంబర్ 87. “అల్లాహ్ వద్ద ఎవరైతే తన ఒడంబడికను నిలుపుకున్నారో అలాంటి వారికే సిఫారసు లభిస్తుంది“. సిఫారసు చేసే హక్కు గాని, మరియు సిఫారసు పొందే హక్కు గాని. ఎందుకంటే అల్లాహ్ తో ఏ వాగ్దానం ఉన్నదో ప్రత్యేకంగా “కలిమె తయ్యిబా” కు సంబంధించిన వాగ్దానం. అందులో మనిషి ఏమాత్రం వెనక ఉండకూడదు.

మరియు సూరా తాహా ఆయత్ నెంబర్ 109 లో “ఆ రోజు ఎవరి సిఫారసు ఎవరికీ ఎలాంటి లాభం చేకూర్చదు. కేవలం అల్లాహ్, రహ్మాన్ అనుమతించిన వారికి మరియు ఎవరి మాట, ఎవరి పలుకుతో అల్లాహ్ ఇష్టపడ్డాడో వారు మాత్రమే“.

ఈవిధంగా మహాశయులారా! ఈ ఆయతులు అన్నింటినీ పరిశీలించండి. ఈ రోజుల్లో ఈ విషయాలు, ఈ సత్యాలు తెలియక సిఫారసు కు సంబంధించిన పెడ మార్గంలో, తప్పుడు భావంలో ఏదైతే పడి ఉన్నారో, వాటి నుండి మనం బయటికి రావడం తప్పనిసరి. ఆ తప్పుడు మార్గాలు ఏమిటి? సిఫారసు కు సంబంధించిన దుర నమ్మకాలు, మూడనమ్మకాలు, దుర విశ్వాసాలు ఏమిటి? ఇన్షా అల్లాహ్ తరువాయి భాగంలో మనం తెలుసుకుందాం.

43:86  وَلَا يَمْلِكُ الَّذِينَ يَدْعُونَ مِن دُونِهِ الشَّفَاعَةَ إِلَّا مَن شَهِدَ بِالْحَقِّ وَهُمْ يَعْلَمُونَ

అల్లాహ్‌ను వదలి వీళ్లు ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో వారికి, సిఫారసుకు సంబంధించిన ఏ అధికారమూ లేదు. కాని సత్యం గురించి సాక్ష్యమిచ్చి, దానికి సంబంధించిన జ్ఞానమున్న వారు మాత్రం (సిఫారసుకు యోగ్యులు).” (సూరా అజ్ జుఖ్ రుఫ్ 43:86)

ఇక్కడ మనం సూరయే జుఖ్ రూఫ్ ఆయత్ నెంబర్ 86 లో కూడా పరిశీలించడం చాలా లాభదాయకం. “ఎవరైతే అల్లాహ్ ను వదిలి ఇతరులను పూజిస్తున్నారో, ఆరాధిస్తున్నారో, ఇతరులతో దుఆ చేస్తున్నారో, ఆరాధిస్తున్నారో వారు ఎలాంటి సిఫారసుకు అధికారులు కాజాలరు”. అల్లాహు అక్బర్.

సిఫారసుకు సంబంధించిన దురనమ్మకం, మూడ విశ్వాసం, ఎవరైతే అల్లాహ్ ను వదిలి అల్లాహ్ తో దుఆ చేయకుండా, ఇతరులతో దుఆ చేస్తున్నారో వారి యొక్క సిఫారసు పొందాలని కోరుతున్నారో వారికి ఎలాంటి సిఫారసు లభించదు. ఎవరైతే సత్యానికి సాక్ష్యం పలికి ఉంటారో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‘ కు సాక్ష్యం పలికి ఉంటారో, వారు దాని యొక్క భావాలను, అర్ధ భావాలను కూడా తెలుసుకొని ఉంటారో. లా ఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యం పలకడం ఏంటిది? దాని అర్థ భావాలను తెలుసుకోవడం ఏంటిది? సాక్ష్యం పలకటం అంటే నోటితో పలకడం అని సామాన్యంగా మనం అనుకుంటాము కదా! కానీ దాని యొక్క అర్ధ భావాలను తెలుసుకోవడం అంటే అల్లాహ్ కు ఎవరినీ భాగస్వామిగా కలపకపోవడం. దుఆ లో, మొక్కుబడులలో, సజ్దాలో, సాష్టాంగ పడటంలో, రుకూ చేయడంలో ఇంకా వేరే ఎన్ని ఆరాధనకు సంబంధించిన ఎన్ని రకాలు ఉన్నాయో వాటిలో అల్లాహ్ తో పాటు ఇంకా ఎవరిని కూడా మనం భాగస్వామిగా చెయ్యకూడదు. ఆరాధనకు సంబంధించిన ఏ ఒక్క భాగం కూడా అల్లాహ్ తప్ప ఇతరులకు చేయకూడదు.

ఈరకంగా ఎవరైతే తన విశ్వాసం మరియు ఏకేశ్వరోపాసన లో షిర్క్ లేకుండా నమాజ్ యొక్క పాబంది చేస్తూ తన నాలుకను కూడా కాపాడుకుంటూ ఉంటాడో, ప్రజల్ని దూషిస్తూ, ప్రజల యొక్క పరోక్ష నింద చేస్తూ, చాడీలు చెప్పుకుంటూ ఇతరులలో ఎలాంటి అల్ల కల్లోలం జరపకుండా నాలుకను కాపాడుకుంటాడో అలాంటి వారే సిఫారసును పొందగలుగుతారు.

చివరిలో ఒక హదీత్ కూడా వినండి ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “మాటిమాటికి ప్రజల్ని శపించేవారు, శాపనార్థాలు పెట్టేవారు ప్రళయ దినాన సాక్షానికి కూడా అర్హులు కారు, సిఫారసుకు కూడా అర్హులు కారు“. సహీ ముస్లింలోని హదీస్ నెంబర్ 4703. ఎంత గంభీర్యమైన విషయమో గమనించాలి. సిఫారసు ఎలాంటి వారు పొందలేరు అని ఇందులో తెలపడం జరుగుతుంది.

ఇన్షా అల్లాహ్ తరువాయి భాగంలో సిఫారసు కు సంబంధించిన మూడ నమ్మకాలు ఏంటి? దుర విశ్వాసాలు ఏంటి? మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

మరణాంతర జీవితం – పార్ట్ 14: ప్రళయ దినాన సిఫారసు ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరికి లభిస్తుంది – పార్ట్ 01 [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 14 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 14. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 21:21 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్.

ప్రళయ దినాన సిఫారసు ఎప్పుడు? ఏ సందర్భంలో? ఎవరికి లభిస్తుంది? అనే విషయాలు ఈనాటి శీర్షికలో మనం తెలుసుకుందాం.

మహాశయులారా! గత కార్యక్రమంలో మనం మహా మైదానంలో దీర్ఘ కాలాన్ని భరించలేక ప్రజలు అల్లాహ్ అతి త్వరలో తీర్పు చేయడానికి, రావడానికి సిఫారసు కోరుతూ ప్రవక్తల వద్దకు వెళ్తే చివరికి ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సిఫారసు చేయడానికి ఒప్పుకుంటారు అన్న విషయాల వివరాలు మనం తెలుసుకున్నాము. అయితే సిఫారసుల విషయం వచ్చింది కనుక సిఫారసుకు సంబంధించిన ఇతర విషయాలు కూడా మనం కొన్ని తెలుసుకొని ఉంటే చాలా బాగుంటుంది.

ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక సందర్భంలో తెలిపారు. “ప్రతి ప్రవక్తకు అల్లాహ్ (తఆలా) ఒక దుఆ చాన్సు ఇచ్చాడు. తప్పకుండా దానిని స్వీకరిస్తాను అని కూడా వారికి శుభవార్త తెలిపాడు. అయితే గత ప్రవక్తలందరూ కూడా ఆ దుఆ ఇహలోకంలోనే చేసుకున్నారు. అది వారికి స్వీకరించబడినది కూడా. అయితే ఇలాంటి దుఆ నాకు ఏదైతే ఇవ్వడం జరిగిందో నేను నా అనుచర సంఘం యొక్క సిఫారసు ప్రళయ దినాన చేయడానికి నేను అక్కడ గురించి దాచి ఉంచాను. ఇహలోకంలో ఆ దుఆ నేను చేసుకోలేదు. ప్రళయ దినాన నా అనుచర సంఘం యొక్క సిఫారసు చేయడానికి నేను దానిని అలాగే భద్రంగా ఉంచాను“. [సహీ బుఖారీ హదీస్ నెంబర్ 6305]

మహాశయులారా! అంతిమ ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి జీవితాన్ని చదవండి. ఆయన సర్వమానవాళి కొరకే కాదు, ఈ సర్వ లోకాల వైపునకు కారుణ్యమూర్తిగా ఏదైతే పంపబడ్డారో, ఆయన తన అనుచర సంఘం గురించి ఇహలోకం లోనే కాదు, పరలోకంలో కూడా ఎంతగా చింతిస్తారో, అక్కడ కూడా వారు నరకంలో పోకుండా ఉండడానికి సిఫారసులు చేయడానికి ఎలా సిద్దం అవుతున్నారో, ఆ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని ఈ రోజు ప్రజలు తెలుసుకోకుండా ఆయనపై బురద జల్లే ప్రయత్నము ఎందరో చేస్తున్నారు. కానీ మనం మన ముఖాన్ని మీదికి చేసి సూర్యుని వైపునకు ఉమ్మివేస్తే సూర్యునికి ఏదైనా నష్టం చేకూరుతుందా?

మహాశయులారా! ఇలాంటి దయామయ, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ని, ఆయన బాటను అనుసరించి, ఆయన చూపిన విధానాన్ని అనుసరించి మన జీవితం గడిపితే మనమే ధన్యులం అవుతాము. మరో సందర్భంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు – “ప్రళయ దినాన ఎవరైతే ఇహలోకంలో విశ్వాసం ఉండి, కొన్ని ఘోర పాపాలకు గురి అయ్యారో వారికి కూడా నా సిఫారసు లభిస్తుంది“. [సునన్ అబూదావూద్ హదీత్ నెంబర్ 4739]

అయితే ఎవరెవరికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి యొక్క సిఫారసు లభించవచ్చునో మరికొన్ని హదీసుల ఆధారంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రెండవ సందర్భం: సహీ ముస్లిం హదీత్ నెంబర్ 333 లో హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు – “ప్రళయదినాన తీర్పు మరియు ఆ మహా మైదానంలో జరిగే అటువంటి అన్ని మజిలీలు పూర్తి అయిన తర్వాత ఎప్పుడైతే స్వర్గంలోకి ప్రవేశం జరుగుతుందో, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు చెప్పారు: నేను స్వర్గం ద్వారానికి వస్తాను, స్వర్గము యొక్క ద్వారం తెరవండి అని అక్కడ నేను కోరతాను. అప్పుడు స్వర్గపు దారం పై ఉన్నటువంటి దాని యొక్క రక్షక భటుడు మీరు ఎవరు? అని అడుగుతాడు. నేను అంటాను “ముహమ్మద్”. అప్పుడు అతను అంటాడు – “నీ గురించే అందరికంటే ముందు ఈ ద్వారం తెరవాలి అని నాకు అనుమతించడం జరిగింది. నాకు చెప్పడం ఆదేశించడం జరిగింది. నీకంటే ముందు ఎవరికొరకు కూడా ఈ ద్వారం తెరవకూడదు“.

మరో ఉల్లేఖనంలో ఉంది. “స్వర్గ ప్రవేశానికై సిఫారసు చేసేవారిలో, అందరికంటే తొలిసారిగా నేనే సిఫారసు చేస్తాను”. ఈ విధంగా గొప్ప సిఫారసు కాకుండా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ప్రత్యేకంగా స్వర్గపు ద్వారం తెరవడానికి కూడా సిఫారసు చేస్తారు. ఆ తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అందరికంటే ముందు ప్రవేశిస్తారు. వారి తర్వాత వారి యొక్క అనుచరులు ప్రవేశిస్తారు.

మూడవ సందర్భం ఎక్కడైతే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు సిఫారసు చేస్తారో వాటిలో ఒకటి వారి యొక్క పినతండ్రి అబూ తాలిబ్ గురుంచి. వారి యొక్క పినతండ్రి అబూ తాలిబ్ చివరి ఘడియ వరకు కూడా, ఆయన మరణ వేదనకు గురి అయ్యే వరకు కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కి ఆయన తోడు లభించింది. కానీ ఆయన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు. ఇస్లాం ధర్మానికి సపోర్ట్ చేశారు. ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ని ఆదుకున్నారు. అల్లాహ్ దయ తర్వాత, ఆయన ఉన్నంత కాలం వరకు ఎన్నో సందర్భాలలో మక్కా యొక్క ముష్రికులు ప్రవక్త గారిని హత్య చేద్దాం అన్నటువంటి దురాలోచనకు కూడా వెనకాడలేదు. కానీ అబూతాలిబ్ ని చూసి వారు ధైర్యం చెయ్యలేక పోయేవారు.

అయితే అబూతాలిబ్ చివరి సమయంలో, మరణ వేదనలో ఉన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అప్పుడు కూడా పినతండ్రి వద్దకు వెళ్లి, మీరు తప్పకుండా ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‘ చదవండి. కనీసం ఒక్కసారైనా చదవండి. నేను అల్లాహ్ వద్ద నీ గురించి సిఫారసు చేసే ప్రయత్నం చేస్తాను. కానీ ఆయన శ్వాస వీడేకి ముందు “నేను నా తాత ముత్తాతల ధర్మంపై ఉన్నాను” అని అంటారు. అందువల్ల ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి చాలా బాధ కలుగుతుంది. అల్లాహ్ (తఆలా) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ఒక రకమైన ఓదార్పు ఇస్తారు. ఇది కూడా ఒక రకంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి గురించి ఒక గొప్ప విశిష్టత. అదేమిటంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి యొక్క సిఫారసు వల్ల అబూతాలిబ్ కి నరకంలోని శిక్షలో కొంచెం తగ్గింపు జరుగుతుంది కానీ నరకంలో నుండి మాత్రం బయటికి రాలేరు. ఆ తగ్గింపు ఏదైతే జరుగుతుందో, అది కూడా ఎంత ఘోరంగా ఉందో, ఒక్కసారి ఆ విషయాన్ని గమనించండి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన బంధువుల వారికి సిఫారసు చేసుకొని కాపాడుకున్నారు అన్నమాట కాదు, [అదే హదీస్ లో సహీ బుఖారీ హదీస్ నెంబర్ 1408 మరియు సహీ ముస్లిం 360] ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలిపారు. “నేను సిఫారసు చేసినందుకు అల్లాహ్ (తఆలా) ఆయన్ని నరకంలోని తక్కువ శిక్ష ఉండే అటువంటి భాగంలో ఏదైతే వేశాడో, ఆ శిక్ష ఎలాంటిది? ఆయన చీలమండలాల వరకు నరకం యొక్క అగ్ని చేరుకుంటే, దాని మూలంగా మెదడు ఉడుకుతున్నట్లుగా, వేడెక్కుతున్నట్లుగా ఆయన భరించలేక పోతారు“.

మహాశయులారా! నాలుగో సందర్భం, ప్రవక్త మహానీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ప్రత్యేకంగా ఒక సిఫారసు యొక్క హక్కు ఏదైతే ఇవ్వడం జరుగుతుందో, అది ఎలాంటి లెక్క, తీర్పు లేకుండా, శిక్ష లేకుండా స్వర్గంలో ప్రవేశించడానికి సిఫారసు చేయడం. దాని యొక్క వివరాలు సహీ బుఖారీ హదీత్ నెంబర్ 4343, సహీ ముస్లిం 287. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఆ రోజున నేను చాలా సేపటి వరకు సజ్దాలో పడి ఉంటాను. అల్లాహ్ (తఆలా) ఓ మహమ్మద్! నీ తల ఎత్తు అని అంటాడు. నేను తల ఎత్తుతాను. అప్పుడు అల్లాహ్ (తఆలా) ఇది మరోసారి నువ్వు అడుగు. నువ్వు అడుగుతున్న విషయం నీకు ఇవ్వబడుతుంది. మరి నీ సిఫారసు చెయ్యి నీ యొక్క సిఫారసు స్వీకరించబడుతుంది. అప్పుడు నేను నా తలెత్తి ఓ అల్లాహ్! ఓ నా ప్రభువా! నా అనుచర సంఘం, నా అనుచర సంఘం, నా అనుచర సంఘం అని నేను అంటాను. అప్పుడు ఓ మహమ్మద్! నీ అనుచర సంఘంలో ఇంత మందిని ఎలాంటి లెక్క తీర్పు, శిక్ష ఏమి లేకుండా స్వర్గపు యొక్క ద్వారాల్లోని కుడి ద్వారం గుండా వారిని ప్రవేశింప చేయి”. అల్లాహు అక్బర్. అల్లాహ్ నన్ను, మిమ్మల్ని, మనందరినీ కూడా ప్రవక్త సిఫారసు నోచుకొని ఆ స్వర్గములోని కుడివైపున ఉన్న మొదటి ద్వారం గుండా ప్రవేశించేటువంటి భాగ్యం ప్రసాదించు గాక.

మహాశయులారా! ఎంత గొప్ప విషయం. అయితే అక్కడే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మరో శుభవార్త ఇస్తాడు. అదేమిటంటే ఎలాంటి శిక్ష, తీర్పు లేకుండా ప్రవేశించేవారు వారికి ప్రత్యేకంగా ఈ ద్వారము, కానీ వారు తలచుకుంటే ఏ ద్వారం గుండానైనా వారు ప్రవేశించవచ్చు.”

ఈ విధంగా ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ప్రత్యేకంగా ఈ నాలుగు రకాల సిఫారసులు ఇవ్వబడతాయి.

ఇవే కాకుండా, ఇంకా వేరే ప్రవక్తలకు కూడా అల్లాహ్ (తఆలా) వేరే సందర్భాలలో సిఫారసు చేసేటటువంటి హక్కు ఇస్తాడు మరియు వారికి సిఫారసు విషయంలో ఒక హద్దును కూడా నిర్ణయించడం జరుగుతుంది. వారు సిఫారసు చేస్తారు, అల్లాహ్ వారి సిఫారసును అంగీకరిస్తాడు కూడా. అలాంటి సిఫారసుల్లో ఒకటి ఎవరైతే విశ్వాసం ఉండి, తౌహీద్ ఉండి మరియు నమాజ్ లు చేస్తూ ఉన్నారో, నమాజ్ ను వీడనాడలేదో, కానీ వేరే కొన్ని పాపాల వల్ల వారిని నరకంలో పడవేయడం జరిగిందో, అల్లాహ్ తలుచుకున్నన్ని రోజులు నరకంలో వారికి శిక్షలు పడిన తరువాత అల్లాహ్ ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి మరియు కొందరు ప్రవక్తలకు, మరికొందరు పుణ్యాత్ముల కు సిఫారసు హక్కు ఇస్తాడు. వారి సిఫారసు కారణంగా అల్లాహ్ (తఆలా) ఆ నరకవాసులను నరకం నుండి తీసి స్వర్గంలోకి పంపిస్తాడు. దీనికి సంబంధించిన హదీత్ లు ఎన్నో ఉన్నాయి.

కానీ సహీ ముస్లిం లో హదీత్ నెంబర్ 269, హజ్రత్ అబూ సయీద్ ఖుధ్రి (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. ప్రళయ దినాన సిఫారసు హక్కు ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి లభిస్తుంది. ప్రవక్తలకు లభిస్తుంది. అంతేకాకుండా పుణ్యాత్ములైన విశ్వాసులు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తో సిఫారసు చేస్తూ ఉంటారు. “ఓ అల్లాహ్! నరకంలో కొంతమంది పడి ఉన్నారు. వారు మాతో ఉపవాసాలు పాటించేవారు. మాతో పాటు వారు నమాజ్ చేసేవారు. మాతో పాటు వారు హజ్ చేసేవారు. కాని వేరే కొన్ని కారణాల వల్ల, వేరే కొన్ని పాపాల వల్ల నరకంలో వచ్చి పడిఉన్నారు. ఓ అల్లాహ్! వారిని కూడా నీవు నీ దయతో బయటికి తీసేయ్యి అల్లాహ్” అని వారు కోరుతారు. అప్పుడు వారితో చెప్పడం జరుగుతుంది – వారు నమాజ్ చేస్తూ ఉండేవారు గనుక వారు చేసే సజ్దాల యొక్క గుర్తు వారి నొసటిపై ఉంటుంది. ఆ నొసటి భాగాన్ని నరకాగ్నిలో ఏమాత్రం నష్టపరచదు. అల్లాహ్ ఆ సందర్భంలో మీరు ఎవరిని వారిలో గుర్తుపట్ట గలుగుతారో వారిని బయటికి తీయండి. అయితే వారు ఎలా గుర్తుపడతారు? నరకంలో కాలిన తరువాత వారు మారిపోతారు కదా? కానీ తౌహీద్ యొక్క శుభం వల్ల, నమాజు సరైన విధంగా పాటిస్తూ ఉన్నందువల్ల వారి ముఖాలను మాత్రం అగ్ని ఏమాత్రం కాల్చదు. వారి యొక్క ఆ ముఖాలను అగ్ని పై నిషేధింపబడినది గనుక అగ్ని ఆ ముఖాలకు ఎలాంటి నష్టం చేకూర్చలేదు గనుక, వారు తమ స్నేహితులను ఈ విధంగా గుర్తుపడతారు“. [సహీ బుఖారీ లోని హదీత్ లో ఉంది]

అంటే ఏం తెలుస్తుంది దీని ద్వారా? కేవలం కలిమా చదువుకుంటే సరిపోదు, ఏ ఒక్క నమాజ్ ను కూడా విడనాడకూడదు. నమాజ్ యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పగా ఉంది. అల్లాహ్ దయ తర్వాత, నమాజ్ యొక్క శుభాల వల్లనే వారి యొక్క ముఖాలు నరకములో కాలకుండా, నరకం అగ్నిలో ఉన్నా గానీ, నరక గుండంలో ఉన్నాగాని ఎలాంటి మార్పు అనేది వారి ముఖాల్లో రాదు. అల్లాహు అక్బర్.

ఈ విధంగా ప్రవక్తలు, పుణ్యాత్ములు, ఉత్తమ విశ్వాసులు వారందరూ కలిసి అల్లాహ్ తో సిఫారసు చేసి, ఎంతో పెద్ద సంఖ్యను నరకంలో నుండి బయటికి తీపిస్తారు. ఆ తర్వాత అల్లాహ్ అంటాడు – “దైవదూతలు సిఫారసు చేశారు. ప్రవక్తలు సిఫారసు చేశారు. విశ్వాసులు సిఫారసు చేశారు. ఇక మిగిలి ఉన్నది కేవలం ఆ కరుణామయుడైన, అందరికంటే ఎక్కువగా కరుణించే కృపాశీలుడు మాత్రమే మిగిలి ఉన్నాడు.” అప్పుడు అల్లాహ్ (తఆలా) తన పిడికిలిలో నరకంలో నుండి ఒక పెద్ద సంఖ్యను తీస్తాడు బయటికి. వారు వేరే ఇంకా ఏ సత్కార్యాలు చేయలేక ఉంటారు.

ఈ విధంగా మహాశయులారా! అల్లాహ్ (తఆలా) ప్రవక్తలకు, దైవదూతలకు, విశ్వాసులకు సైతం మిగతా విశ్వాసుల్లో ఎవరైతే పాపాలు చేసి ఉన్నారో వారికి సిఫారసు చేయడానికి అధికారం, హక్కు ఇచ్చి ఉంటాడు. మరియు వారి సిఫారసును స్వీకరించి ఎంతోమంది నరకవాసులను నరకం నుండి బయటికి తీస్తాడు. దీనికి సంబంధించిన మరొక హదీత్ మీరు గమనించండి అందులో ఎంత ముఖ్య విషయం ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించారో దానిపై దృష్టి వహించండి.

ఈ హదీత్ సునన్ తిర్మిదీ లో ఉంది. హదీస్ నెంబర్ 2441. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “నా ప్రభువు వైపు నుండి నా వద్దకు వచ్చే ఒక వ్యక్తి వచ్చాడు మరియు నాకు ఛాయస్ ఎన్నుకోండి అని చెప్పాడు. ఏమిటి? నీ అనుచర సంఘంలోని సగం మందిని స్వర్గం లో చేర్పిస్తానని లేదా నీకు సిఫారసు యొక్క హక్కు కావాలా? అని. అయితే నేను సిఫారసు యొక్క హక్కు లభిస్తే బాగుంటుంది అని దాన్ని ఎన్నుకున్నాను. ఆ తర్వాత ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు. అయితే ఈ నా సిఫారసు ఎవరికి లభిస్తుంది అంటే ఎవరైతే అల్లాహ్ తో పాటు ఎవరిని భాగస్వామిగా చేయకుండా ఉండే స్థితిలో చనిపోతాడో అలాంటి వానికే నా ఈ సిఫారసు ప్రాప్తమవుతుంది“. అల్లాహు అక్బర్.

ఇంతకు ముందు హదీస్ లో సహీ ముస్లిం లో గమనించారు కదా! వారి యొక్క ముఖాలను అగ్ని ఏమాత్రం కాల్చదు, మార్చదు అని. అది నమాజ్ యొక్క శుభం మరియు ఆ విశ్వాసులు అంటారు – “ఈ నరకవాసులు మాతో నమాజ్ చేసే వారు, హజ్ చేసేవారు, ఉపవాసాలు ఉండేవారు” అంటే ఈ ఇస్లాం యొక్క ఐదు పునాదులు ఏవైతే ఉన్నాయో “లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్” యొక్క సత్యమైన సాక్ష్యం నమాజ్ చేయడం, విధి దానం చెల్లించడం, ఉపవాసాలు పాటించడం, శక్తి ఉన్నవారు హజ్ చేయడం. ఇది ఎంత ప్రాముఖ్యత గల విషయమో గమనించండి.

ఈ శీర్షిక ఇంకా సంపూర్ణం కాలేదు. తర్వాత భాగంలో కూడా దీని కొన్ని మిగతా విషయాలు మనం విందాము. అల్లాహ్ (తఆలా) మనందరికీ ప్రవక్త సిఫారసు ప్రాప్తం చేయు గాక!

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

మరణాంతర జీవితం – పార్ట్ 13: పరలోక దినాన మహా మైదానంలో జరిగే అతి గొప్ప సిఫారసు [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 13 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 13. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 21:58 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్.

ఈనాటి మన శీర్షిక – పరలోక దినాన సిఫారసు అవసరం. మహాశయులారా! ఆ దినం యాభై వేల సంవత్సరాల పరిమాణం గల దినం. ప్రజలు అక్కడ ఒక మైలు దూరంలో ఉన్న సూర్యుని కింద ఉండి, పాపాల కారణంగా వారి చెమటలు కారుతూ, డెబ్బై గజాల దూరం వరకు కూడా వారి వెనక ఉండి, వారు స్వయంగా తమ చెమటల్లో కొందరు చీలమండలాల వరకు, మరి కొందరు మోకాళ్ళ వరకు, మరి కొందరు నడుము వరకు, మరికొందరు మెడ వరకు ఈ విధంగా ఏదైతే మునిగి ఉంటారో, కాలం చాలా దీర్ఘంగా గడుస్తూ పోతుంది. కొందరైతే ఈ దీర్ఘ సమయాన్ని భరించలేక మేము నరకంలో పోయినా, మా పట్ల తీర్పు నరకం గురించి అయినా సరే కానీ, ఇక్కడ ఏ కష్టాలు అయితే భరిస్తున్నామో ప్రభువు తీర్పు కొరకు రావాలి అని ఈ వేచించడం అనేది ఈ దీర్ఘకాలం అనేది భరించలేనిది అని కోరుకుంటారు.

ఆ సందర్భంలో ఎంతో మంది కలసి మనందరి తండ్రి, ఆదిమానవుడు ఆదం (అలైహిస్సలాం) వద్దకు వెళ్తారు. “ఓ నాన్న! అల్లాహ్ మిమ్మల్ని స్వయంగా తన శుభ హస్తాలతో పుట్టించాడు. ఆత్మ మీలో ఊదాడు. మరి నిన్ను స్వర్గంలో నివసింపచేశాడు. మేము ఈరోజు ఎంత కష్టతరం లో ఉన్నామో, ఈ దీర్ఘ కాలాన్ని భరించలేక నానా రకాల ఇబ్బందులకు గురి అవుతున్నాము. మీరు అల్లాహ్ ఎదుట సిఫారసు చేసి, అల్లాహ్ త్వరగా తీర్పు చేయడానికి రావాలి అన్నట్లుగా కోరండి.”

మహాశయులారా! గమనించండి. ఇది కూడా ఆ సమయంలో అల్లాహ్ యొక్క ఎంత గొప్ప కరుణ అది ఆలోచించండి. దీర్ఘకాలం ఉంది. ఇంకా వేరే రకాల కష్టాలు ఉన్నాయి. ఇవన్నీ విషయాలు ఏదైతే మనం గత భాగాల్లో విన్నామో అవన్నీ కూడా వాస్తవం. కానీ అల్లాహ్ కొందరికి ఇలాంటి ఆలోచన కలిగించి, వారు ప్రవక్తల వద్దకు వెళ్లి సిఫారసు గురించి కోరడం అనే విషయం కూడా అల్లాహ్ యొక్క గొప్ప కరుణ, గొప్ప దయ. కానీ ఆదం (అలైహిస్సలాం) “నేను దీనికి అర్హుడిని కాను. నాతో జరిగిన పొరపాటు గురించే నేను ఎంతో బాధ పడుతున్నాను. ఈరోజు అల్లాహ్ (తాఆలా) ఎంత ఆగ్రహం, ఎంత కోపంలో ఉన్నాడంటే నేను స్వయంగా నా గురించి తప్ప ఇంకా వేరే గురించి ఆలోచించలేను.” వాస్తవానికి ఆ జరిగిన పొరపాటు అది ఆయన యొక్క కర్మ పత్రంలో లేదు. అల్లాహ్ (తఆలా) ఎన్నడో క్షమించేశాడు, మన్నించేశాడు. ఆ తర్వాత ఆయన్ని ఎన్నుకున్నారు. కానీ ఆదం (అలైహిస్సలాం) గారికి ఆ యొక్క బాధ, ఆ యొక్క రంది ఎంత ఉంటుందంటే సిఫారసు చేయడానికి నేను ఎలా అర్హుడిని కాగలుగుతాను అని అంటారు.

ఇక్కడ గమనించండి! మనకు తండ్రి అయిన ఆదం (అలైహిస్సలాం) ఒక్క పొరపాటు జరిగింది చిన్న పాటిది. దానిని మన్నించి వేయడం కూడా జరిగింది. దాని వల్ల ఆయనకి ఏశిక్ష కూడా జరగదు. అయినా ఎంత భయపడుతున్నారు. మరి ఈ రోజుల్లో మన పరిస్థితి ఏమున్నది? పాపాల పై పాపాలు ఒక్క పాపం, ఒక్క తప్పు ఏంటి? ఎన్నో రకాల తప్పులు చేస్తున్నాము. అయినా మనకు ఎన్ని ఆశలు ఉన్నాయి? ఎంత ధైర్యంగా మనం ఉంటాము. మనకు అల్లాహ్ పట్ల భయం మనలో ఏదైనా ఉందా? స్వయంగా మనమే దాని గురించి అంచనా వేసుకోవాలి.

ఆదం (అలైహిస్సలాం) అంటారు – “నేను సిఫారసు చెయ్యలేను. కావాలంటే మీరు నూహ్ వద్దకు వెళ్ళండి. ఆయన తౌహీద్ ప్రచారం చేయడానికి, షిర్క్ నుండి ఆపడానికి పంపబడిన మొట్టమొదటి ప్రవక్త, మొట్టమొదటి రసూల్. ఆయన వద్దకు వెళ్ళండి. ఆయన్ని అల్లాహ్ (తఆలా) అబ్దన్ షకూరా అని పేర్కొన్నాడు. కృతజ్ఞతలు తెలిపే దాసుడు”.

అప్పుడు ప్రజలందరూ నూహ్ (అలైహిస్సలాం) వద్దకు వెళ్లి అల్లాహ్ ఆయనకు ప్రసాదించినటువంటి అనుగ్రహాల్ని ప్రస్తావించి “మేము ఏ కష్టంలో ఉన్నామో మీరు చూస్తున్నారు. ఈ దీర్ఘకాలాన్ని భరించలేక ఎంత ఇబ్బందికి గురి అవుతున్నామో మీరు చూస్తున్నారు. రండి అల్లాహ్ వద్దకు వచ్చి ఏదైనా మీరు సిఫారసు చేయండి” అని కోరుతారు. అల్లాహు అక్బర్. నూహ్ (అలైహిస్సలాం) రాత్రి అనకుండా, పగలు అనకుండా 950 సంవత్సరాలు ప్రజల్ని అల్లాహ్ వైపునకు ఆహ్వానించడంలో, ఏకేశ్వరోపాసన వైపునకు పిలవడంలో గడిపారు. అంత గొప్ప ప్రవక్త కూడా అల్లాహ్ ఎదుట సిఫారసు చేయడానికి ఒప్పుకోవడం లేదు. “నేను దానికి అర్హుడిని కాను. నాతో జరిగిన పొరపాటు వల్ల నాకు ఈ రోజు అల్లాహ్ యొక్క ఆగ్రహానికి గురి అవుతాను అన్న భయం ఉంది. ఈరోజు అల్లాహ్ (తఆలా) నన్ను క్షమించి, నన్ను మన్నించి, నేను సురక్షితంగా ఉన్నాను అంటే ఇదే ఎంత గొప్ప విషయం.” అని అంటారు. ఆనాటి భయం ఎలా ఉందో గమనించండి. మహాశయులారా!

“అయితే మీరు ప్రవక్త ఇబ్రాహీం వద్దకు వెళ్ళండి. అల్లాహ్ ఆయన్ని సన్నిహితులుగా చేశాడు. ఖలీల్ అన్న బిరుదు ప్రసాదించాడు”. ఆ తర్వాత ప్రజలు ఇబ్రాహీం (అలైహిస్సలాం) వద్దకు వస్తారు. ఇబ్రాహీం (అలైహిస్సలాం) కు అల్లాహ్ ప్రసాదించినటువంటి అనుగ్రహాలని గుర్తు చేస్తారు. మేము ఏ ఇబ్బంది లో ఉన్నామో మీరు చూస్తున్నారు. అల్లాహ్ (తఆలా) తీర్పు చేయడానికి రావాలని మీరు అల్లాహ్ ఎదుట సిఫారసు చేయండి అని కోరుతారు. కానీ ఇబ్రాహీం (అలైహిస్సలాం) ఆయన కూడా “సిఫారసు చేయడానికి నేను అర్హుడిని కాను” అని అంటారు. ఒప్పుకోరు. “నేను ఎలా సిఫారసు చేయగలను? మీరు కావాలంటే మూసా వద్దకు వెళ్ళండి.”

ప్రజలు మూసా (అలైహిస్సలాం) వద్దకు వస్తారు. “ఓ మూసా! అల్లాహ్ ఎలాంటి అడ్డూ లేకుండా డైరెక్టుగా మీతో మాట్లాడారు. అల్లాహ్ మీకు ఇంకా ఎన్నో అనుగ్రహాలు ప్రసాదించాడు వచ్చేసేయండి. కనీసం మీరైనా సిఫారసు చేయండి” అని అంటే, మూసా (అలైహిస్సలాం) కూడా తనతో జరిగిన ఒక చిన్న పొరపాటును గుర్తు చేసుకుంటారు. అది కూడా తప్పుగా జరిగింది. అల్లాహ్ (తఆలా) దానిని మన్నించివేశాడు. తర్వాత ఎన్నుకున్నాడు. ప్రవక్తగా చేశాడు. అయినా దాని పట్ల ఆయన ఎంత భయపడుతున్నారు అంటే “నేను సిఫారసు చేయడానికి అర్హుడిని కాను” అని అంటారు.

ఈ విధంగా మహాశయులారా! తరువాత మూసా (అలైహిస్సలాం) ఆ ప్రజలతో అంటారు: “మీరు ఈసా (అలైహిస్సలాం) వద్దకు వెళ్ళండి”. మూసా (అలైహిస్సలాం) అంటే ప్రవక్త మోషే అని, ఇబ్రాహీం (అలైహిస్సలాం) అంటే ప్రవక్త అబ్రహాం అని మరియు ఈసా (అలైహిస్సలాం) అంటే ప్రవక్త యేసు క్రీస్తు అని మీకు తెలిసే ఉండవచ్చు.

అయితే మహాశయులారా! ప్రజలు ఈసా (అలైహిస్సలాం) వద్దకు వస్తారు. అల్లాహ్ ఆయనపై కురిపించిన అనుగ్రహాల్ని గుర్తు చేసి సిఫారసు చేయడానికి ముందుకు రండి అని కోరుతారు. కానీ ఆయన కూడా సిఫారసు చేయడానికి ఒప్పుకోరు. ఇక ఏమిటి పరిస్థితి? మరి ఎవరు సిఫారసు చేయడానికి రావాలి? అల్లాహ్ (తఆలా) ప్రజల మధ్య లో తీర్పు చేయడానికి ఎప్పుడు వస్తారు? అయితే మహాశయులారా! ఆ సందర్భంలో ఈసా (అలైహిస్సలాం) చిట్ట చివరి ప్రవక్త, దయామయ, దైవప్రవక్త, సర్వ మానవాళి వైపునకు కారుణ్యమూర్తిగా పంపబడిన ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి వైపునకు పంపుతూ “మీరు ఆయన వద్దకు వెళ్ళండి. అల్లాహ్ (తఆలా) ఆయన పూర్వపు మరియు వెనకటి పాపాలు అన్నిటిని కూడా మన్నించేసాడు మరియు ఆయన్ని సర్వ ప్రవక్తలకు ముద్రగా చేసి, చిట్ట చివరి ప్రవక్తగా చేసి పంపారు. మీరు ఆయన వద్దకు వెళ్ళండి” అని అంటారు.

అప్పుడు ప్రజలు ఎక్కడికి వెళ్తారు? ఏమి జరుగుతుంది? ఇక ప్రజలందరూ ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వస్తారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి మాట విని, “సరే అల్లాహ్ నన్ను దానికి అర్హునిగా చేసాడు” అని అంటారు.

కానీ ఇక్కడ ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇక ముందుకు ఎలా చేస్తారు? ఈ విషయాలను చాలా శ్రద్ధగా వినండి. తర్వాత మనం విశ్వాసాల్లో ఏమైనా లోపాలు ఉంటే వాటిని మనం సరిచేసుకోవాలి. ఇక ఆ తరువాత ఆ ప్రళయదినాన మనము కూడా ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి యొక్క సిఫారసులు పొందడానికి ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలో వాటిని కూడా తెలుసుకొని వాటికి కూడా మనం సిద్ధం ఉండే ప్రయత్నం చేయాలి.

ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అంటారు: నేను దానికి అర్హుడుని. కానీ వెంటనే తన ఇష్టానుసారం సిఫారసు చెయ్యలేరు. ఎందుకంటే ఆనాటి పరిస్థితి ఎలాంటిది? దైవదూతలు, ప్రవక్తలు అందరూ ఆ మైదానంలో నిలబడి ఉన్నారు. ఏ ఒక్కరు కూడా నోరు విప్పి మాట్లాడలేరు. ఎప్పటివరకైతే కరుణామయుడైన అల్లాహ్ యొక్క అనుమతి రాదో. ఆ అనుమతి వచ్చిన తర్వాత కూడా సరియైన మాట, సత్యమైన మాట మాత్రమే వారి నోట వెళుతుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ తరువాత అల్లాహ్ అర్ష్ కింద సజ్దాలో పడిపోతారు.

సహీ బుఖారీ లో వచ్చిన హదీత్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలుపుతున్నారు. “చాలా దీర్ఘ సమయం వరకు నేను సజ్దాలో ఉంటాను. అల్లాహ్ యొక్క పొగడ్తలు, అల్లాహ్ యొక్క ప్రశంసలు, అల్లాహ్ యొక్క స్థుతులు స్తుతిస్తూ ఉంటాను. ఆ సందర్భంలో నేను అల్లాహ్ యొక్క స్థుతులు ఏఏ విధంగా స్తుతిస్తానో ఆ సందర్భంలో అల్లాహ్ నాకు వహీ ద్వారా తెలియజేస్తాడు. చాలా సేపటి వరకు సజ్దాలో ఉన్న తర్వాత యా మహమ్మద్! అని అల్లాహ్ వైపు నుండి మాట వినబడుతుంది. “ఓ మహమ్మద్! నీ తల ఎత్తు మరియు అడుగు. నీవు అడుగుతున్న విషయం నీకు ఇవ్వబడుతుంది. నీవు అడుగుతున్న విషయం మీకు ఇవ్వడం జరుగుతుంది మరియు నీవు సిఫారసు చెయ్యి. నీ సిఫారసు అంగీకరించబడింది”.

ఆ తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. ఒక హద్దు నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరోసారి సజ్దాలో పడిపోతారు. అల్లాహ్ యొక్క స్తుతులు స్తుతిస్తారు. ప్రశంసలు చెల్లిస్తారు. ఈ విధంగా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి యొక్క సిఫారసులు అంగీకరించి ప్రజల మధ్య తీర్పు చేయడానికి హాజరవుతారు. దైవ దూతలు అందరూ కూడా బారులుతీరి ఉంటారు. అల్లాహ్ కూడా ప్రజల మధ్యలో తీర్పు చేయడానికి హాజరు అవుతాడు.

అయితే ఈ సిఫారసు యొక్క సమస్య ఏదైతే ఉందో అల్లాహ్, కరుణామయుడైన అల్లాహ్ యొక్క గొప్ప కరుణ, గొప్ప దయ ఆ పరలోక దినాన ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి యొక్క సిఫారసు, ఇంకా ఇతర ప్రవక్తల సిఫారసు మరియు ఇంకా తర్వాత పుణ్యాత్ములు, మహా భక్తులు వారి యొక్క సిఫారసు కూడా స్వీకరించబతుంది. కానీ దానికి ఇంకా వేరే కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితే ఈ మైదానంలో అల్లాహ్ తీర్పు గురించి రావాలి అని ఏ సిఫారసు అయితే ప్రజలందరూ ఆదం, నూహ్, ఇబ్రాహీం, మూసా, ఈసా (అలైహిముస్సలాతు వ తస్లీమ్) వారితో కోరడం జరిగిందో వారు నిరాకరించారో తరువాత ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) “సరే మంచిది, నేను దాని అర్హుడ్ని, నేను అల్లాహ్ ఎదుట సిఫారసు చేస్తాను” అని అర్ష్ కింద సజ్దాలో పడిపోతారో, తర్వాత సిఫారసు గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కి అనుమతి లభిస్తుందో, ఈ సిఫారసులు ఎన్ని రకాలుగా ఉన్నాయో, ఎన్ని సందర్భాలలో ఉన్నాయో వాటన్నిటిలో అతి గొప్ప సిఫారసు. దీని యొక్క అర్హత ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు తప్ప ఇంకా వేరే ఎవరికీ లభించదు.

మరియు ఈ సందర్భంలో ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ఏ సిఫారసు ఇవ్వడం జరిగిందో, సిఫారసు స్వీకరించడం జరుగుతుందో దానినే ఖురానే మజీద్ లోని ఆయత్ సూరయే ఇస్రాలో మఖామమ్ మహ్మూద అని చెప్పడం జరిగింది. ఏంటి భావం?

సూరత్ బనీ ఇస్రాయిల్ ఆయత్ నెంబర్ 79 లో – “రాత్రి వేళ నిలబడి నిద్ర నుండి మేలుకొని తహజ్జుద్ నమాజ్ పాటించు. ఇది నీ కొరకు అదనపు నమాజ్, నఫీల్ నమాజ్. ఈవిధంగా అల్లాహ్ (తఆలా) మీకు ప్రశంసింప బడిన, ప్రశంసించదగిన ఆ గొప్ప స్థానానికి (మఖామమ్ మహ్మూద) నిన్ను చేర్చుతాడు“. మఖామమ్ మహ్ మూద అని ఏదైతే అనపడిందో, అంటే ప్రశంసించదగిన స్థానం అని.

దీని గురించి సహీ బుఖారీ లో హదీస్ ఉంది. హదీస్ నెంబర్ 1748. ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఆనాడు ప్రజలందరూ ప్రవక్తల వెంట వెళ్లి మీరు సిఫారసు చేయండి అని కోరుతారు. వారు దానిని ఒప్పుకోరు. చివరికి నా వద్దకు వస్తారు. అప్పుడు అల్లాహ్ (తఆలా) నన్ను మఖామే మహ్ మూద్ స్థానానికి చేర్చి నా యొక్క సిఫారసును అంగీకరిస్తాడు”.

సహీ బుఖారి లోని మరో ఉల్లేఖనంలో ఉంది. హదీస్ నెంబర్ 1475. “ఎప్పుడైతే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వస్తారో ప్రజలు అప్పుడు ప్రజలందరూ కూడా ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ని ప్రశంసించి, ఈయన దీనికి అర్హులు, ఈయన చేయగలుగుతారు అని చెప్పుకుంటూ ఉంటారు“.

ఈ విధంగా ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఈ తర్వాత వేరే సందర్భాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా సిఫారసు చేయడానికి వేరే సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రస్తావన మరి కొంత సేపటి తరువాత వస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనిస్తాము. అదేమిటి ఈ మఖామె మహ్ మూద్ లో, ఈ ప్రళయ దినాన, పరలోక దినాన ఆ మహామైదానం లో అల్లాహ్ ప్రజల మధ్య తీర్పు చేయడానికి రావాలి అని ఏదైతే ప్రజలు కోరుకుంటారో దీర్ఘ సమయాన్ని భరించలేక, ఆ సందర్భంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి యొక్క సిఫారసును పొందడానికి ఇహలోకంలో ఏదైనా సత్కార్యాలు ఉన్నాయా?

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ప్రళయ దినాన నా సిఫారసు పొందే అదృష్టవంతుల్లో ఒకరు – ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ తన మనుసుతో మరియు స్వచ్ఛమైన మనసుతో చదువుతారో ,అంటే ఏమిటి?, అల్లాహ్ తో పాటు ఇంకా ఎవరిని కూడా ఆయన ఆరాధనలో ఎలాంటి భాగస్వామిగా చెయ్యరు. ఆ తరువాత నమాజులను స్థాపించడం, నమాజ్ కంటే ముందు అజాన్ ఏదైతే అవుతుందో దాని యొక్క సమాధానం పలకడం“. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. సహీ బుఖారీ లోని హదీత్ “ఎవరైతే అజాన్ తర్వాత ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ చదువుతారో, ఆ తరువాత క్రింది దుఆ చదువుతారో ప్రళయ దినాన వారికి నా సిఫారసు లభిస్తుంది అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు”.

అల్లాహుమ్మ రబ్బ హాదిహిద్‌ దావతిత్‌ తామ్మతి వస్సలాతిల్‌ ఖాఇమతి ఆతి ముహమ్మదనిల్‌ వసీలత వల్‌ ఫదీలత వబ్‌అస్‌హు మఖామమ్‌ మహ్‌మూద నిల్లదీ వ అత్తహు

ఈ సంపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడు నమాజునకు ప్రభువైన ఓ అల్లాహ్‌! ముహమ్మద్‌ గారికి వసీలా మరియు ‘ఫజీలా’ అనుగ్రహాన్ని మరియు ఆయనకు వాగ్దానము చేసిన ఔన్నత్యము గల మఖామే మహ్‌మూద్‌ ప్రసాదించుము

(బుఖారీ, బైహఖి 1-410)

అయితే ఇలాంటి సత్కార్యాలు చేస్తూ ఉండే ప్రయత్నం చేయాలి. మరి కొన్ని విషయాల గురించి ఇన్షా అల్లాహ్ మనం వేరే సందర్భాలలో తెలుసుకుందాము. అల్లాహ్ (తఆలా) ఆ పరలోక దినాన దీర్ఘకాలంలో ఏ సిఫారసు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి చేయడానికి అనుమతించడం జరుగుతుందో, ఆ సిఫారసు మనం కూడా పొందేటువంటి సత్భాగ్యం ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి