షిర్క్ నాలుగు సూత్రాలు | అల్ ఖవాఇదుల్ అర్బఅ్ | పుస్తక అధ్యయనం

ఇస్లాం ధర్మం యొక్క నాలుగు నియమాలు
(అల్ ఖవాఇద్ అల్ ఆర్బా)
షిర్క్ నాలుగు సూత్రాలు

షేఖుల్ ఇస్లాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ (రహమతుల్లాహ్ అలై)

అల్-ఖవాఇద్-ఉల్-అర్బాహ్” [షిర్క్ గురించిన నాలుగు నియమాలు] పుస్తకం ముస్లిం ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందినది కనుక దీనికి పరిచయం అవసరం లేదు. ఇది షిర్క్‌కు సంబంధించిన మౌలిక సూత్రాలను అందించే ప్రాథమిక చర్చ. పరిమాణంలో చిన్నది అయినప్పటికీ, ఇది చాలా విలువైన విజ్ఞాన మూలం మరియు ఇస్లాం గురించి మరింత అవగాహన పెంచుకోవాలనుకునే విద్యార్థులందరూ తప్పనిసరిగా చదవాల్సిన చిరుపుస్తకం.

దీనిని “అల్ ఖవాఇదుల్ అర్బఅ్” (నాలుగు నియమాలు) అని పిలువబడుతుంది, ఎందుకంటే ఇందులో విశ్వాసిని అవిశ్వాసి నుండి, ఏకదైవారాధకుడిని బహుదైవారాధకుడి నుండి వేరు చేయడానికి ఉపయోగించే నాలుగు మౌలిక అంశాలను కలిగి ఉన్నాయి. ఇది ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దల్ వహ్హాబ్ తమీమీ గారి అత్యంత ముఖ్యమైన రచనలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది ఆయన ఇతర రచనల కంటే చాలా సంక్షిప్తంగా ఉన్నప్పటికీ, కవర్ చేయబడిన సమాచారం మరియు చర్చించిన ప్రయోజన అంశాల పరంగా చాలా సమగ్రమైనది.

షేక్ సాలిహ్ అల్-ఫౌజాన్ ఇలా చెప్పారు: “మీరు ఈ నియమాలను నేర్చుకొని, అర్థం చేసుకుంటే, అల్లాహ్ తన దూతల ద్వారా మరియు గ్రంథాలలో వెల్లడించిన తౌహీద్‌ను అర్థం చేసుకోవడం మీకు సులభం అవుతుంది. అలాగే అల్లాహ్ హెచ్చరించిన షిర్క్ మరియు ఇహలోకంలో మరియు పరలోకంలో దాని యొక్క అపాయం మరియు హాని గురించి అర్థం చేసుకోవడం మీకు సులభం అవుతుంది.”

[మూల అరబిక్ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
MS Word (మైక్రోసాఫ్టు వర్డ్ డాక్యుమెంట్) – 8 పేజీలు

పుస్తక అనువాదాలు

షిర్క్ నాలుగు సూత్రాలునసీరుద్దీన్ జామియీ
జుల్ఫీ దావహ్ పబ్లికేషన్స్ – [PDF] [11 పేజీలు]

షిర్క్ నాలుగు సూత్రాలు – ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
ఇస్లాం మూల సూత్రాలు పుస్తకం నుండి – హదీసు పబ్లికేషన్స్

వీడియో పాఠాలు