
[1: 00 :14 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]
నమాజ్ విధానం:
నమాజ్ చేసేటప్పుడు నియ్యత్ (సంకల్పం) తప్పనిసరిగా చేయాలి. అలాగే ఇతర ఆరాధనల్లో కూడా చేయాలి. అయితే నియ్యత్ మనుస్సులో చేయాలి. నోటితో కాదు.
నమాజ్ చిత్రాలు చూడండి:

ఇక నమాజ్ పద్ధతి ఇలా వుందిః
1- పూర్తి శరీరము మరియు పూర్తి శ్రద్ధాభక్తుల తో ఖిబ్లా దిశలో నిలబడాలి. చూపులు, శరీరము అటూ ఇటూ ఉండకూడదు. (చూపులు సజ్దా చేసే చోట కేంద్రికరించాలి).
2- ‘తక్బీరె తహ్రీమ’ అల్లాహు అక్బర్ అంటూ
రెండు చేతులు భుజాల వరకు లేదా చెవుల వరకు ఎత్తాలి. చూడండి (చిత్రం1)
3- కుడి అర చెయ్యిని ఎడమ చెయ్యిపై పెట్టి ఛాతిపై కట్టుకోవాలి. (చిత్రం2)
4- దుఆయె ఇస్తిఫ్ తాహ్ చదవాలిః
అల్ హందులిల్లాహి హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్. (ముస్లిం 600).
(الْحَمْدُ لله حَمْدًا كَثِيرًا طَيِّبًا مُبَارَكًا فِيهِ).
(శుభాలు గల, అనేకానేక మంచి స్తోత్రములన్నీ అల్లాహ్ కే చెందును).
సుబ్ హానకల్లాహుమ్మ వబిహమ్దిక వతబార కస్ముక వతఆల జద్దుక వలాఇలాహ గైరుక.
سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ وَتَبَارَكَ اسْمُكَ وَتَعَالَى جَدُّكَ وَلَا إِلَهَ غَيْرُكَ
ఓ అల్లాహ్ నీవు పరమ పవిత్రునివి, నీకే సర్వ స్తోత్రములు, నీ నామము శుభం గలది. నీ మహిమ చాలా ఘనమయినది. నీవు తప్ప ఆరాధ్యుడెవడు లేడు.
ఇవి రెండే గాకుండా ఇతర దుఆలు కూడా చదవవచ్చును. ఎల్లప్పుడూ ఒకే దుఆ కాకుండా వేరు వేరు సమయాల్లో వేరు వేరు దుఆలు చదవడం ఉత్తమం. ఇలా నమాజులో నమ్రత, శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది.
5- అఊజు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్,
6- బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్ చదివి, సూరె ఫాతిహ చదవాలిః అల్ హమ్ దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్రహ్మా నిర్రహీమ్, మాలికి యౌమిద్దీన్, ఇయ్యాక నఅ బుదు వఇయ్యాక నస్త ఈన్, ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్, సిరాతల్లజీన అన్అమ్ త అలైహిం, గైరిల్ మగ్ జూబి అలైహిమ్ వలద్జాల్లీన్. (ఆమీన్).
بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ* الْحَمْدُ للهِ رَبِّ العَالَمِينَ* الرَّحْمَنِ الرَّحِيمِ* مَالِكِ يَوْمِ الدِّينِ* إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ* اهْدِنَا الصِّرَاطَ المُسْتَقِيمَ*صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ المَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ
అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో * ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు, * అపార కరుణా మయుడు, పరమ కృపాశీలుడు. * ప్రతిఫల దినానికి (అంటే ప్రళయ దినానికి) యజమాని. * మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్ధిస్తున్నాము. * మాకు రుజుమార్గం (సన్మార్గం) చూపించు. * నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోనుకాని వారి మార్గం.
7- కంఠస్తం చేసి ఉన్న ఖుర్ఆనులోని ఏదైనా సూరా లేదా కొన్ని ఆయతులు పఠించాలి.
8- చేతులు భుజాల వరకు ఎత్తి, అల్లాహు అక్బర్ అంటూ రుకూ చేయాలి. రుకూలో అరచేతుల తో మోకాళ్ళను పట్టుకోవాలి. వ్రేళ్ళు దగ్గరదగ్గరగా కాకుండా విడిగా ఉండాలి. సుబ్ హాన రబ్బియల్ అజీం మూడు సార్లు చదువుట సున్నత్. అంతకంటే ఎక్కువ చదవవచ్చు. ఒక్క సారి చదివినా సరిపోవును. చూడండి (చిత్రం3)
9- ఒంటరి నమాజ్ చేయు వ్యక్తి మరి ఇమాం రుకూ నుండి తల లేపుతూ సమిఅల్లాహు లిమన్ హమిద అంటూ భుజాల వరకు చేతులెత్తాలి. ముఖ్తదీ సమిఅల్లాహు లిమన్ హమిదహ్ కు బదులుగా రబ్బనా వలకల్ హమ్ ద్ అనాలి. ఈ స్థితిలో కుడి చెయి ఎడమ చెయిపై పెట్టి ఛాతిపై కట్టుకోవాలి.
10- రుకూ తర్వాత నిలబడి ఉన్నప్పుడు ఈ దుఆ కూడా చదవవచ్చునుః అల్లాహుమ్మ రబ్బనా లకల్ హమ్ దు మిల్ఉస్ సమావాతి వ మిల్ఉల్ అర్జి వ మిల్ఉ మాషిఅత మిన్ షైఇమ్ బఅదు.
اللَّهُمَّ رَبَّنَا لَكَ الْـحَمْدُ مِلْءُ السَّمَاوَاتِ وَمِلْءُ الْأَرْضِ وَمِلْءُ مَا شِئْتَ مِنْ شَيْءٍ بَعْدُ
ఓ అల్లాహ్, మా ప్రభువా! నీకే ఆకాశముల నిండుగాను, భూమి నిండుగాను, అవి గాకా నీవు కోరిన వస్తువుల నిండుగాను స్తుతి గలదు. (ముస్లిం 476).
11- అల్లాహు అక్బర్ అంటూ మొదటి సజ్దాలో వెళ్ళాలి. ఏడు అంగములపై సజ్దా చేయాలిః (1) నొసటి, ముక్కు. (2,3) రెండు అరచేతులు. (4,5) రెండు మోకాళ్ళు. (6,7) రెండు పాదముల వ్రేళ్ళు. చేతులను పక్కల నుండి దూరముంచాలి. కాళ్ళ వ్రేళ్ళను ఖిబ్లా దిశలో ఉంచి, సజ్దాలో సుబ్ హాన రబ్బియల్ అఅలా మూడు సార్లు పలుకుట సున్నత్. ఎక్కువ పలు- కుట మంచిదే. ఒక్క సారి చదివినా సరిపోతుంది. ఈ స్థితిలో ఎక్కువ దుఆ చేయాలి. ఎందుకనగా ఇది దుఆ అంగీకార స్థితుల్లో ఒకటి. చిత్రం4
12- అల్లాహు అక్బర్ అంటూ సజ్దా నుండి తలెత్తి ఎడమ పాదముపై కూర్చోవాలి. కుడి కాలు పాదమును నిలబెట్టాలి. కుడి చెయ్యి కుడి మోకాలుకు దగ్గరగా తోడపై, ఎడమ చెయ్యి ఎడమ మోకాలుకు దగ్గరగా తోడపై పెట్టాలి. చేతి వ్రేళ్ళను విడిగా పరచి ఉంచాలి. రబ్బిగ్ ఫిర్లీ రబ్బిగ్ ఫిర్లీ అని చదవాలి. (చిత్రం5,6,7)
13- రెండవ సజ్దా మొదటి సజ్దా మాదిరిగా చేసి, సజ్దాలో అదే దుఆ చదవాలి.
14- అల్లాహు అక్బర్ అంటూ రెండవ సజ్దా నుండి లేస్తూ నిటారుగా నిలబడాలి.
15- రెండవ రకాత్ మొదటి రకాత్ మాదిరిగా చేయాలి. అందులో చదివిన దుఆలే ఇందులో చదవాలి. దుఆయె ఇస్తిఫ్ తాహ్ మరియు అఊజు బిల్లాహి…. తప్ప. ఈ రెండవ రకాత్ లోని రెండవ సజ్దా నుండి అల్లాహు అక్బర్ అంటూ లేచి రెండు సజ్దాల మధ్యలో కూర్చున్న విధంగా కూర్చోని, కుడి చెయి వ్రేళ్ళను ముడుచుకొని నడిమి వ్రేళిని బొటన వ్రేళి మధ్యలో పెట్టి, చూపుడు వ్రేళితో సైగా చేస్తూ, కదలిస్తూ తషహ్హుద్ చదవాలిః
అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు అస్సలాము అలైక అయ్యుహన్ నబియ్యు వరహ్మతుల్లాహి వబరకా తుహూ అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లా హిస్సాలి హీన్ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహు. (బుఖారి 831).
التَّحِيَّاتُ لله وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ الله وَبَرَكَاتُهُ السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ الله الصَّالِحِينَ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه
నా వాక్కు, దేహా, ధన సంబంధమైన ఆరాధన లన్నియూ అల్లాహ్ కొరకే ఉన్నవి. ఓ ప్రవక్తా! మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆయన శుభాలు కురువుగాకా. అల్లాహ్ తప్ప వేరు ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు, సందేశహరుడని సాక్ష్యమిస్తున్నాను.
ఇక్కడి వరకు చదివిన తరువాత, చేతులు భుజాల వరకు ఎత్తుతూ అల్లాహు అక్బర్ అంటూ నిలబడాలి, ఒక వేళ మగ్రిబ్ లాంటి మూడు రకాతుల నమాజ్ లేదా జొహ్ర్, అస్ర్ మరియు ఇషా లాంటి నాలుగు రకాతుల నమాజ్ చేస్తుంటే, రెండవ రకాతు మాదిరిగా మిగిత నమాజ్ పూర్తి చేయాలి. అయితే ఖియామ్ (నిలబడి ఉన్న స్థితి)లో కేవలం సూరె ఫాతిహ చదువుతే సరిపోతుంది. చివరి రకాతు రెండవ సజ్దా నుండి లేచి కూర్చోని తషహ్హుద్, దరూద్ ఇబ్రాహీమ్ మరియు ప్రవక్త నేర్పిన తనికిష్టమైన దుఆలు అధికంగా చదవడం మంచిది. (ఇది కూడా దుఆ అంగీకార సందర్భాల్లో ఒకటి). క్రింద దరూద్ మరియు ఒక దుఆ ఇవ్వబడుతుంది.
అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ అజాబిల్ ఖబ్రి వమిన్ అజాబిన్నారి వమిన్ ఫిత్నతిల్ మహ్ యా వల్ మమాతి వమిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాల్.
اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ اللَّهُمَّ بَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا بَارَكْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ ، اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ وَمِنْ عَذَابِ النَّارِ وَمِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ وَمِنْ فِتْنَةِ الْمَسِيحِ الدَّجَّالِ.
ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీంను, వారి కుటుంబీకులను కరుణించినట్లు ముహమ్మద్ మరియు వారి కుటుంబీకులను కరుణించు. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి. ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీం, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేసినట్లు ముహమ్మద్, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేయుము. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి. ఓ అల్లాహ్ నేను సమాధి శిక్షల నుండి, నరక యాతన నుండి, జీవన్మరణ పరీక్షల నుండి మరియు దజ్జాల్ మాయ నుండి రక్షణకై నీ శరణు కోరుతున్నాను
16- అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అంటూ కుడి వైపున మెడ త్రిప్పాలి. అలాగే అంటూ ఎడమ వైపున మెడ త్రిప్పాలి. చూడండి (చిత్రం8,9)
17- జొహ్ర్, అస్ర్, మగ్రిబ్, ఇషా నమాజుల్లోని చివరి తషహ్హుద్ లో కూర్చుండే పద్ధతి ఇలా ఉండాలి. కుడి పాదాన్ని నిలబెట్టి ఎడమ పాదాన్ని కుడి కాలి పిక్క క్రింది నుంచి బైటికి తీయాలి. ఎడమ పిరుదును భూమిపై ఆనించాలి. కుడి చెయ్యి కుడి తోడపై, ఎడమ చెయ్యి ఎడమ తోడపై మోకాలుకు దగ్గరగా పెట్టాలి. చూడండి (చిత్రం10)
నమాజ్ తర్వాత జిక్ర్:
సలాం తింపిన తరువాత ఈ దుఆలు చదవాలి.
అస్తగ్ ఫిరుల్లాహ్, అస్తగ్ ఫిరుల్లాహ్, అస్తగ్ ఫిరుల్లాహ్, అల్లాహుమ్మ అంతస్సలాం వ మిన్ కస్సలాం తబారక్ త యాజల్ జలాలి వల్ ఇక్రాం. లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్లాహుమ్మ లా మానిఅ లిమా అఅతైత వలా ముఅ తియ లిమా మనఅత వలా యన్ ఫఉ జల్ జద్ది మిన్ కల్ జద్ద్. లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, లాఇలాహ ఇల్లల్లా హు వలా నఅబుదు ఇల్లా ఇయ్యాహు లహున్నిఅమతు వలహుల్ ఫజ్లు వలహుస్సనా ఉల్ హసన్, లాఇలాహ ఇల్లల్లాహు ముఖ్లిసీన లహుద్దీన వలౌ కరిహల్ కాఫిరూన్.
أَسْتَغْفِرُ الله (3). اَللهُمَّ أَنْتَ السَّلامُ ومِنْكَ السَّلامُ تَبَارَكْتَ يَا ذَا الجَلالِ وَ الإكْرَام. لا إله إلا الله وَحْدَهُ لا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيءٍ قَدِير. اَللهُمَّ لا مَانِعَ لِمَا أعْطَيْتَ وَلا مُعْطِيَ لِمَا مَنَعْتَ وَلا يَنْفَعُ ذَا الجَدِّ مِنْكَ الْجَدُّ. لا حَوْلَ وَلا قُوَّةَ إِلاَّ بِاللهِ، لاَ إِلهَ إِلاَّ اللهُ وَلاَ نَعْبُدُ إِلاَّ إِيَّاهُ، لَهُ النِّعْمَةُ وَلَهُ الْفَضْلُ وَلَهُ الثَّنـاءُ الْحَسـَن، لاَ إلَهَ إِلاَّ اللهُ مُخْلِصِينَ لَه الدِّينَ وَلَوكَرِهَ الكَافرون.
అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుచున్నాను (3). ఓ అల్లాహ్ నీవు ఏలాంటి లోపాలు లేనివాడవు. నీవే రక్షణ నొసంగువాడవు. ఓ ఘనుడవు, పరమదాతయువు నీవు శుభములు గలవాడవు. అల్లాహ్ దప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన అద్వితీయుడు. ఆయనకు సాటి మరొకడు లేడు. ఆయనకే అధికారము చెల్లును. ఆయనకే సర్వ స్తోత్రములు గలవు. ఆయనే సర్వ శక్తుడు. ఓ అల్లాహ్ నీవు నొసంగిన వరాలను ఎవడు అడ్డగింపజాలడు. నీవు ఇవ్వని దానిని ఎవ్వడూ ఇవ్వజాలడు. ధనికుడు తన ధనముతో నీ శిక్షల నుండి తప్పించుకు- పోజాలడు. పాపాములను వదులుకొనుట మరియు పుణ్యాలు చేయుట అల్లాహ్ దయవలననే కలుగును. అల్లాహ్ దప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన్నే మేము ఆరాధించుచున్నాము. ఆయనే సర్వ అనుగ్రహాలు దయ చేయువాడు. ఆయనకే ఘనత, మంచి స్తోత్రములు గలవు. అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యు డెవ్వడూ లేడు. చిత్తశుద్ధితో మేము ఆయన్నే ఆరాధించుచున్నాము. ఈ విషయము సత్య తిరస్కారులకు నచ్చకున్నా సరే. (ముస్లిం 591, 593, 594, బుఖారి 844).
తరువాత సుబ్ హానల్లాహ్ 33, అల్ హందు లిల్లాహ్ 33, అల్లాహు అక్బర్ 33 సార్లు చదివి, లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ తో 100 పూర్తి చేయాలి. (ముస్లిం 597).
తరువాత ఆయతుల్ కుర్సీ([1]) ఒకసారి.
ఖుల్ హువల్లాహు అహద్(5), ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్(5), ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్([2]) సూరాలు ఫజ్ర్ మరియు మగ్రిబ్ తరువాత మూడేసి సార్లు మిగిత నమాజుల తరువాత ఒక్కొక్క సారి చదవాలి.
మస్బూఖ్:
ఎవరైనా జమాఅతుతో ఒకటి లేదా కొన్ని రకాతులు తప్పి పోతే (మస్బూఖ్) ఇమాం రెండవ సలాం తింపిన తర్వాత వాటిని పూర్తి చేసుకోవాలి. అతను ఇమాంతో ఏ రకాతులో కలిసాడో అదే అతని మొదటి రకాతు. ఇమాంను రుకూ స్థితిలో పొందినవాని ఆ రకాతు అయినట్లే. ఇమాంను రుకూలో పొందకుంటే ఆ రకాత్ తప్పిపోయి నట్లే లెక్క.
జమాఅతు నిలబడిన తర్వాత వచ్చేవారు జమాఅతును ఏ స్థితిలో చూసినా అదే స్థితిలో కలవాలి. వారు రుకూ, లేదా సజ్దా ఇంకే స్థితిలో ఉన్నా సరే. వారు మరో రకాతు కొరకు నిలబడే వరకు నిరీక్షించవద్దు. నిలబడి తక్బీరె తహ్రీమ అల్లాహు అక్బర్ అనాలి. రోగి లాంటి ఏదైనా ఆటంకం ఉన్నవారు కూర్చుండి అల్లాహు అక్బర్ అంటే ఏమీ తప్పు లేదు.
నమాజును భంగపరుచు కార్యాలు:
- 1- తెలిసి, కావాలని మాట్లడడం, అది కొంచమైనా సరే.
- 2- పూర్తి శరీరముతో ఖిబ్లా దిశ నుండి పక్కకు మరలడం.
- 3- వుజూను భంగపరిచే కారణాల్లో ఏ ఒకటైనా సంభవించడం.
- 4- అనవసరంగా ఎడతెగకుండా ఎక్కువ చలనము చేయడం.
- 5- కొంచం నవ్వినా నమాజ్ వ్యర్థమవుతుంది.
- 6- తెలిసి కూడా ఎక్కువ రుకూ, సజ్దాలు, ఖియాం, జుల్సాలు చేయడం.
- 7- తెలిసి కూడా (రుకూ, సజ్దా వగైరా) ఇమాంకు ముందు చేయడం.
నమాజ్ యొక్క వాజిబులు:
- 1- మొదటి తక్బీరె తహ్రీమ తప్ప మిగితావన్నీ.
- 2- రుకూలో కనీసం ఒక్కసారైనా సూబ్ హాన రబ్బియల్ అజీం అనడం.
- 3- రుకూ నుండి లేస్తూ ఇమాం మరియు ఒంటరి నమాజి సమిఅల్లాహు లిమన్ హమిదహ్ అనడం.
- 4- రుకూ నుండి నిలబడి రబ్బనా వలకల్ హంద్ అనడం.
- 5- సజ్దాలో కనీసం ఒక్కసారైనా సుబ్ హాన రబ్బియల్ అఅలా అనడం.
- 6- రెండు సజ్దాల మధ్యలో రబ్బిగ్ ఫిర్లీ అనడం.
- 7- మొదటి తషహ్హుద్ చదవడం.
- 8- మొదటి తషహ్హుద్ చదవడానికి కూర్చోవడం.
నమాజ్ యొక్క రుకున్ లు:
- 1- ఫర్జ్ నమాజులో శక్తి ఉన్నప్పుడు నిలబడటం. నఫిల్ నమాజులో నిలబడటం ముఖ్యం లేదు. కాని కూర్చుండి నమాజ్ చేసేవానికి, నిలబడి చేసేవానికంటే సగం పుణ్యం తక్కువ.
- 2- తక్బీరె తహ్రీమ.
- 3- ప్రతి రకాతులో సూరె ఫాతిహ పఠించడం.
- 4- ప్రతీ రకాతులో రుకూ చేయడం.
- 5- రుకూ నుండి లేచి నిటారుగా నిలబడటం.
- 6- ప్రతీ రకాతులో రెండు సార్లు ఏడు అంగములపై సజ్దా చేయడం.
- 7- రెండు సజ్దాల మధ్య కూర్చోవడం.
- 8- నమాజులోని రుకూ, సజ్దా మొదలైన అంశాలన్నిటినీ నింపాదిగా, శాంతిగా నెరవేర్చడం.
- 9- చివరి తషహ్హుద్.
- 10- దాని కొరకు కోర్చోవడం.
- 11- దరూదె షరీఫ్ (అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మది…..)
- 12- సలాం తింపడం.
- 13- ప్రతి రుకున్ నెరవేర్చడంలో క్రమ పద్దతిని పాటించడం
[1])اللهُ لَا إِلَهَ إِلَّا هُوَ الحَيُّ القَيُّومُ لَا تَأْخُذُهُ سِنَةٌ وَلَا نَوْمٌ لَهُ مَا
فِي السَّمَاوَاتِ وَمَا فِي الأَرْضِ مَنْ ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ إِلَّا بِإِذْنِهِ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالأَرْضَ وَلَا يَئُودُهُ حِفْظُهُمَا وَهُوَ العَلِيُّ العَظِيمُ] {البقرة:255}
[2]) قُلْ هُوَ اللهُ أَحَدٌ(1) اللهُ الصَّمَدُ(2) لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ(3)
وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ(4) قُلْ أَعُوذُ بِرَبِّ الفَلَقِ(1) مِنْ شَرِّ مَا خَلَقَ(2) وَمِنْ شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ(3) وَمِنْ شَرِّ النَّفَّاثَاتِ فِي العُقَدِ(4) وَمِنْ شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ(5). قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ(1) مَلِكِ النَّاسِ(2) إِلَهِ النَّاسِ(3) مِنْ شَرِّ الوَسْوَاسِ الخَنَّاسِ(4) الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ(5) مِنَ الجِنَّةِ وَالنَّاسِ أَجْمَعِينَ(6)
ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు
You must be logged in to post a comment.