ఇరుగు పొరుగు వారి హక్కులు – సలీం జామి’ఈ [వీడియో]

ఇరుగు పొరుగు వారి హక్కులు – సలీం జామి’ఈ [వీడియో]
https://youtu.be/a1a481jkb_M [27 నిముషాలు]

ఈ వీడియోలో గమనించవలసిన విషయాలు:

1- ఇల్లు కొనే ముందు పొరుగు వారిని చూడండి అని ఎందుకు అనబడింది ?
2- పొరుగు వారు చెడ్డ వారు కాకుండా ఉండేలా చూడమని ప్రవక్త (స) అల్లాహ్ తో చేసిన దువా ఏమిటి ?
3- కూర వండేటప్పుడు కొద్దిగా నీళ్ళు ఎక్కువగా పోసి వండండి అని ప్రవక్త (స) ఆజ్ఞాపించారు కారణం ఏమిటి ?
4- నమాజులు, ఉపవాసాలు ఆచరించి దాన ధర్మాలు చేసినా ఒక మహిళ నరకానికి వెళ్ళింది కారణం తెలుసా ?
5- తమ పొరుగు వారు ఆకలితో ఉన్నారని తెలిసి కూడా పట్టించుకోని వారికి ఏమవుతుంది ?
6- పొరుగింటి మహిళతో వ్యభిచారం చేస్తే ఎంత పాపము మూటగట్టుకుంటారో తెలుసా ?
7- పొరుగింటిలో దోంగతనం చేస్తే ఎంత పాపము మూటగట్టుకుంటారో తెలుసా ?
8- అల్లాహ్ సాక్షిగా ఆ వ్యక్తి విశ్వాసి కాజాలడు అంటూ ప్రవక్త (స) మూడు సార్లు ప్రమాణం చేసి ఎవరి గురించి చెప్పారు ?
9- పొరుగు వారిని ఇబ్బంది పెట్టిన వ్యక్తి స్వర్గానికి వెళ్ళగలడా ?
10- పొరుగు వారు ఆస్తిలో హక్కుదారులుగా నిర్ణయించబడుతారేమో అని ప్రవక్త (స) కు అనుమానం ఎందుకు కలిగింది ?

క్రింది లింకులు దర్శించి ఇరుగు పొరుగు వారి హక్కుల గురుంచి మరింత జ్ఞానం సంపాదించండి:

మీ పొరుగువారి హక్కులను కనిపెడుతూ ఉండండి | బులూగుల్ మరాం | హదీసు 1262 [వీడియో ]

మీ పొరుగువారి హక్కులను కనిపెడుతూ ఉండండి | బులూగుల్ మరాం | హదీసు 1262
https://youtu.be/4Wat6gesVDA [4 min]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1262. ఈయనగారే చేసిన మరొక కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉద్భోధించారు:

మీరు చారులాంటిది వండినపుడు అందులో కాస్త నీరు ఎక్కువగా పోయండి. మీ పొరుగువారిని కనిపెడుతూ ఉండండి”(ఈ రెండు హదీసులనూ ‘ముస్లిం’ పొందుపరచారు)

సొరాంశం:

ఈ హదీసులో ఇరుగు పొరుగు వారి హక్కును నొక్కి చెప్పటం జరిగింది. కూర వండేటప్పుడు, మాంసాహారం తయారు చేసేటప్పుడు రోస్ట్, ఇగురు వంటివి చేసేబదులు షేర్వా, సూప్ లాంటివి తయారు చేసుకోవాలనీ, అయితే పొరుగింటి వారిని మాత్రం విస్మరించరాదని దీని భావం. అందునా ఇరుగు పొరుగువారు పేదవారైనపుడు వారికి కానుకగా పంపటం తప్పనిసరి. ఒకవేళ పొరుగింటివారు ధనవంతులై ఉంటే అప్పుడప్పుడూ సత్సంబంధాల కోసమైనా సరే పంపుతూ ఉండాలి.

వేరొక హదీసులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :

దైవదూత జిబ్రయీల్ నా వద్దకు వచ్చినప్పుడల్లా పొరుగువారి హక్కును గురించి గట్టిగా నొక్కి చెబుతుండేవారు. ఆయన నొక్కి వక్కాణిస్తున్న తీరునుబట్టి బహుశా పొరుగువారిని (ఆస్తిలో) వారసులుగా ప్రకటించటం జరుగుతుందా! అని నాకు ఒకింత సందేహం కలిగేది

యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

విశ్వాసి తన కోసం ఇష్టపడే వస్తువునే తన తోటి సోదరుల కోసం కూడా ఇష్టపడాలి [వీడియో]

విశ్వాసి తన కోసం ఇష్టపడే వస్తువునే తన తోటి సోదరుల కోసం కూడా ఇష్టపడాలి | బులూగుల్ మరాం | హదీసు 1256
https://youtu.be/aWHz-iM7Tq4 [12 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1256. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ప్రవచించారు:

“ఎవరి అధీనంలో నా ప్రాణముందో ఆ పవిత్రమూర్తి సాక్షిగా చెబుతున్నాను తన స్వయం కొరకు ఇష్టపడేదే తన ఇరుగు పొరుగు లేక తన సోదరుని కోసం కూడా ఇష్టపడనంత వరకూ ఏ దాసుడూ విశ్వాసి (మోమిన్) కాలేడు.” (బుఖారీ, ముస్లిం)

సారాంశం:

ఈ హదీసులో విశ్వాస పరిపూర్ణత కొరకు ఒక షరతు విధించబడింది. అదేమంటే విశ్వాసి అయినవాడు తన కోసం ఇష్టపడే వస్తువునే తన పొరుగువారి కోసం లేదా తన తోటి సోదరుల కోసం కూడా ఇష్టపడాలి. సమాజంలో తన గౌరవ ప్రతిష్ఠలు ఇనుమడించాలని అతను కాంక్షిస్తున్నపుడు ఇతరులు కూడా అలాగే కోరుకుంటారని అతడు తలపోయాలి. కనుక ఇతరుల గౌరవ ప్రతిష్ఠలకు తన తరపున విఘాతం కలగకుండా చూసుకోవాలి. తనకు శాంతీ సౌఖ్యాలు ప్రాప్తించాలని కోరుకున్నప్పుడు సాటి వ్యక్తుల కోసం కూడా అదేవిధంగా ఆలోచించాలి. వ్యక్తుల్లో ఇలాంటి సకారాత్మక ఆలోచనలున్నప్పుడు సమాజమంతా సుఖశాంతులకు నిలయమవుతుంది. ప్రగతి పథంలో సాఫీగా సాగిపోతుంది. అశాంతి అలజడులుండవు. ఒకరింకొకరి శ్రేయస్సును అభిలషించే వారుగా, ఒండొకరి యెడల సానుభూతి పరులుగా ఉంటారు. ఒక సత్సమాజానికి ఉండవలసిన ప్రధాన లక్షణమిదే.

యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

ఇరుగు పొరుగు (పొరుగింటి) వారి హక్కులు (Rights of neighbours)

హదీథ్׃ 09

ఇరుగు పొరుగు (పొరుగింటి) వారి హక్కులు حق الجار على الجار

حَدَّثَنَا أَبُو بَكْرِ بْنُ أَبِي شَيْبَةَ: حَدَّثَنَا أَبُو الأَحْوَصِ عَنْ أَبِي حَصِينٍ عَنْ أَبِي صَالِحٍ عَنْ أَبِي هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُولُ اللّهِ:  ” مَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الآخِرِ فَلاَ يُؤْذِ جَارَهُ. وَمَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الآخِرِ فَلْيُكْرِمْ ضَيْفَهُ.  وَمَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الآخِرِ فَلْيَقُلْ خَيْراً أَوْ لِيَسْكُتْ “ رواة صحيح مسلم

హద్దథనా అబుబక్రిబ్ను అబి షైబత, హద్దథనా అబు అల్అహ్వశి అన్ అబిహశీనిన్ అన్ అబిశాలిహిన్ అన్ అబిహురైరత ఖాల, ఖాల రసూలిల్లాహి మన్ కాన యుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి ఫలా యూది జారహు, వమన్ కాన యుఁమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి ఫల్ యుక్రిమ్ దైఫహు, వమన్ కాన యుఁమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి ఫల్ యఖుల్ ఖైరన్ అవ్ లియస్కుత్ రవాహ్ సహీ ముస్లిం.

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీ ముస్లిం హదీథ్ గ్రంధంకర్త   ← అబుబక్రిబ్ను అబిషైబత ← అబు అల్అహ్వశి ← అబిహశీనిన్ ← అబిశాలిహిన్ ← అబిహురైరత (రదియల్లాహుఅన్హు) ← ప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం హితోపదేశం.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు. ఎవరైతే అల్లాహ్ పై మరియు ప్రళయదినం పై విశ్వాసము ఉంచుతారో వారు తమ యొక్క పొరుగు వారికి కష్టము కలిగించ కూడదు. మరియు ఎవరైతే అల్లాహ్ పై మరియు ప్రళయదినం పై విశ్వాసము ఉంచుతారో వారు తమ ఇంటికి వచ్చిన అతిధులకు మంచి ఆతిధ్యముతో గౌరవిచవలెను. ఎవరైతే అల్లాహ్ మీద మరియు ప్రళయదినం పై విశ్వాసము ఉంచుతారో వారు వీలైతే మంచి మాటలు చెప్పవలెను లేకుంటే మౌనము వహించవలెను. సహీ ముస్లిం హదీథ్ గ్రంధం.

హదీథ్ వివరణ

ఇరుగు పొరుగు వారి హక్కులను కాపాడటం కూడా దైవ విశ్వాసం లోని ఒక ముఖ్యమైన భాగమని మరియు వారికి హాని కలిగించటం కూడా ఒక ఘోరమైన మహాపాపమని  ఈ హదీథ్ ప్రకటిస్తున్నది. ఇతర పొరుగింటి వారి కంటే సత్యసంధులైన, ధర్మాత్ములైన పొరుగింటి వారి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపవలెను. ఇంకా ముస్లిం పొరుగింటి వారినందరికీ మంచి చేయవలెను, దయతో మంచి సలహాలివ్వవలెను, వారు సరైన మార్గాన్ని అనుసరించేటట్లుగా ప్రార్థించ వలెను, మరియు వారికి హాని కలిగించకూడదు.

ఉల్లేఖకుని పరిచయం: అబు హురైరా రదియల్లాహు అన్హు పూర్తి పేరు అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసీ. ఆయన 7వ హిజ్రీలో ఖైబర్ విజయం సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్యంలోనికి చేరినారు. ఎక్కువ హదీథ్ లను జ్ఞాపకం చేసినవారిలో సహచరులలో (సహాబాలలో) ఒకరు.

ఈ హదీథ్ యొక్క ప్రయోజనాలు (లాభాలు):

  1. పరస్పరం ప్రేమ మరియు సహాయసహకారాలు పెంపొందుకునే దిశగా ప్రజలను ఇస్లాం ప్రోత్సహిస్తుంది.
  2. ఇరుగు పొరుగు వారి మధ్య సహాయసహకారాలు వారి మధ్య బంధుత్వాన్ని పటిష్టపరుస్తాయి.
  3. పొరుగింటి పిల్లలను మాటలతో లేదా చేతలతో (పనులతో) నొప్పించకుండా ఉండటం ద్వారా వారిపై దయ చూపినట్లవుతుంది.
  4. ఇంటి కప్పు పై నుండి లేదా తలుపు రంధ్రాల నుండి పొరుగింటిలోనికి తొంగిచూడటం నిషేధించబడినది.
  5. పొరుగువారికి ఎలాంటి అపకారం, కీడు, హాని కలిగించటం నిషేధించబడినది.
  6. అతిథులను మర్యాదపూర్వకంగా సత్కరించడం ప్రతి ఒక్కరి బాధ్యత.
  7. అనవసరపు సంభాషణలు సంపూర్ణమైన దైవవిశ్వాసం (ఈమాన్) నుండి దూరం చేస్తాయి.

ప్రశ్నలు

  1. తప్పక చేయమని దైవప్రవక్త ఆదేశించిన మూడుపనులు వ్రాయండి.
  2. పొరుగువారి హక్కులు ఏవి?
  3. పొరుగువారి పిల్లలతో ఎలా మెలగాలి?
  4. దేని వలన దైవ విశ్వాసానికి (ఈమాన్) దూరమవుతారు.
  5. పొరుగువారితో ఎలా ప్రవర్తించ వలెను?

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్

%d bloggers like this: