https://youtu.be/Hf6tdEiLp2I [68 నిముషాలు]
మోక్షానికి మార్గం – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో]
https://youtu.be/Hf6tdEiLp2I [68 నిముషాలు]
తెలుగుఇస్లాం.నెట్ * తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద *
సంకలనం: నసీమ్ గాజీ
[ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]
https://teluguislam.files.wordpress.com/2022/03/priyamaina-ammaku-teluguislam.net-mobile-friendly.pdf
[20 పేజీలు] [PDF]
అపార కృపాశీలుడు అనంత కరుణామయుడయిన అల్లాహ్ పేరుతో
ఈ ఉత్తరం ఇప్పటికి దాదావు ఇరవై సంవత్సరాల క్రితం వ్రాశాను. అప్పుడు నేను ఒక ధార్మిక పాఠశాల, జామియతుల్ ఫలాహ్, బిలేరియా గంజ్ (ఆజమ్‌గడ్ జిల్లా)లో విద్యనభ్య సిస్తున్నాను. ఆ కాలంలో అప్పుడప్పుడు ఇంటికి కూడా వెళ్ళేవాడిని. ఇస్లాం స్వీకారానికి పూర్వం నేను హిందూ సమాజంలోని అగర్వాల్ కుటుంబానికి చెందినవాడిని. మా నాన్నగారు మరణించినప్పుడు నా వయస్సు తొమ్మిది సంవత్సరాలు. ఒక రోజు ఇస్లాం స్వీకరించే భాగ్యం నాకు లభిస్తుందన్నది నా ఊహకు కూడా అందని విషయం. మా పెద్దన్నయ్య మా కుటుంబ పెద్ద. ఇస్లాం విషయంలో ఆయన నాతో ఏకీభవించేవారు గనక, ఆయన ద్వారా నాకు ప్రోత్సాహమే లభించింది కాని ప్రతికూలం ఎదురవ్వలేదు. అయితే అమ్మ విషయం మాత్రం అందుకు భిన్నంగా ఉండేది. నేను ఇస్లాం స్వీకరించడం ఆమె సుతరామూ ఇష్టపడలేదు. ఆమెను అన్నింటి కంటే ఎక్కువగా బాధించిన విషయం ఏమంటే నేనామెకు దూరంగా ఒక ధార్మిక పాఠశాలలో చేరాను. అప్పటికీ నేను తరచూ ఇంటికి వెళ్ళివచ్చేవాడిని. అమ్మ కూడా ఈ మహా వరప్రసాదాన్ని గ్రహించాలని సహజంగానే నేను మనసారా కోరుకునేవాణ్ణి. ఆమె మటుకు వీలయినంత త్వరగా నేను ఇస్లాంను వదిలేసి పాత ధర్మం వైవుకు తిరిగిరావాలని కోరుకునేది. వాస్తవానికి ఆమెకు నాపైగల అమితమైన మమతానురాగాల కారణంగా నా ఈ చేష్ట ఆమెకు నచ్చలేదు. ఆమె మానసికంగానూ, ఆధ్యాత్మికంగానూ ఆవేదనకు గురయింది. ఇది స్వాభావికమే. ఇస్లాం బోధనలు ఆమెకు విశదంగా తెలియవు. ముస్లిముల జీవితాలు ఇస్లామ్‌కు పూర్తిగా భిన్నంగానే కాక ఇస్లామ్ పట్ల ఏవగింపు కలుగజేసేవిగా కనిపిస్తున్నాయి. అందువల్ల అమె హృదయంలో ఇస్లామ్ కొరకు ఏ మాతం చోటు లేదు. నా గురించి ఆమెలో రకరకాల ఆలోచనలు తలెత్తేవి, ఇతరులూ బహు విధాలుగా రేకెత్తించేవారు. ఈ లేఖలో కొన్నింటిని పేర్కొన్నాను. నేను వీలైనంతవరకు ఆమె సందేహాలను, సంశయాలను దూరం చేయడానికి, ఇస్లాం బోధనల్ని, విశదపరచడానికి ప్రయత్నించేవాడిని. ఈ ప్రయత్నం ఒక్కో సారి సంభాషణ ద్వారాను, మరోసారి ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారాను కొనసాగేది.
నేను జన్మించిన తరువాత హైందవ ఆచారం ప్రకారంగా మా వంశ గురువులవారు, నా హస్తరేఖలు, నా జాతకం చూసి నా భవిష్యత్తు గురించి అనేక విషయాలు మా అమ్మకు చెప్పారు. ఆందులో ఒకటి, “నీ కొడుకు నీకు కాకుండా పోతాడ”న్నది. నేను ఇస్లాం స్వీకరించిన తరువాత ఆచార్యులవారు జోస్యం నిజమయినట్లుగా ఆమెకు అగుపడసాగింది. ఆ విషయాన్ని ప్రస్తావించి ఆవిడ నాకు నచ్చజెప్పడానికి ప్రయత్నించేది.
ఇస్లాంలో మంచి అన్నదేదీ లేకపోయినా, నా కొడుకు మౌలానాగారి వలలో చిక్కుకున్నాడు అనే విషయం ఆమె హృదయంలో బాగా నాటుకుపోయింది. ఈ లేఖలో ఆమెకున్న ఈ అపోహను దూరం చేయడానికీ ప్రయత్నించాను. దాంతో పాటు ఇస్లాం వైవుకు కూడా అమెను ఆహ్వానించాను. నా ఉద్ధేశ్యం, ఇస్లాం పట్లను , నా పట్లను కేవలం ఆమెకున్న అపోహల్ని, అపార్ధాలను దూరం చెయ్యడమే కాదు. ఈ సత్యాన్ని ఆమె కూడా స్వీకరించి, దైవ ప్రసన్నత పొంది, స్వర్గానికి అర్హురాలు కావాలని, నరకాగ్ని నుండి ఆమె రక్షింపబడాలి అన్నది నా ప్రగాఢ వాంఛ, కృషి కూడా.
ఈ లేఖ చదివిన తరువాత ఆమెలో భావ తీవ్రత కాస్త్ర తగ్గినా, తన పూర్వీకుల మతం వదలడానికి మాతం ఆమె సిద్ధం లేదు. నేను ఆమెకు నచ్చజెప్పడానికి సతతం ప్రయత్నం చేస్తుండేవాడిని. ఆమె హృదయ కవాటాలు సత్యం కొరకు తెరచుకోవాలని అల్లాహ్ ను వేడుకునే వాణ్ణి కూడా. దాదాపు మూడు సంవత్సరాల ఎడతెగని కృషి తరువాత అల్లాహ్ అనుగ్రహం కలిగింది. ఆమెకు సత్యధర్మానికి స్వాగతం పలికే బుద్ధి కలిగింది. తన పురాతన ప్రవర్తనకు పశ్చాత్తాప్పడింది. నా మాతృమూర్తి నేడు ఇస్లామ్ పై సుస్థిరంగా, సంతృప్తిగా ఉంది. ఆమెకు ఇస్లాం పట్ల కలిగిన అవ్యాజాభిమానానికి తార్కాణంగా అనేకసార్లు ఖురాన్ లాంటి ఉద్గ్రంధం, హిందీ అనువాదాన్ని అనేకసార్లు అధ్యయనం చేసింది. నేడు, ప్రజలు ఇస్లాం ను అర్ధం చేసుకునే ప్రయత్నం చెయ్యాలని, ముస్లిమ్‌లు తమ జీవితంలో ఇస్లాం ను పూర్తిగా అనుసరించాలని, ఇస్లామ్ పట్ట ప్రబలిపోయిన అపోహలను దూరం చేసి, ఇస్లామ్ బోధించే మహత్తర శిక్షణల్ని సామాన్య ప్రజలకు చేరవేయాలని ఆమె ఆవేదన చెందుతూ. ఉంటులది.
ఇదో వ్యక్తిగత లేఖ. దీన్ని ప్రచురించడం మూలాన సత్యప్రేమికుల ఆత్మలకు సన్మార్గ దర్శనం జరగాలని, మనం సత్యధర్మంపై స్ధిరంగా నిలబడగలగాలని, మృత్యువు సంభవించే వరకు ఇస్లామ్‌నే అనుసరించగలగాలని ఆకాంక్షిస్తూ అల్లాహ్‌ను వేడుకుంటున్నాను.
నసీమ్ గాజి
జూన్: 1980
సత్కార్య వనాలు – తొమ్మిదవ వనం
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
అల్లాహ్ సాక్షిగా ఇంతకంటే అందమైన తోట మరొకటి ఉండదు; రకరకాల ఫలాలు, ప్రభావితం చేసే పుష్పాలు, ఈ తోట దర్శనానికి వచ్చిన వాడు అలసిపోడు, దాని చెలమలు అంతం కావు. దాని ఛాయ ఎడతెగనిది. దాని ఊటలు లెక్కలేనివి. అందులో తన హృదయం, నోరు మరి ఆలోచనలతో పనితీసుకునువాడే విజయవంతుడు. తేనెటీగ మాదిరిగా; అది విసుగు, అలసట అంటే తెలియదు. రకారకాల రసాన్ని పీల్చుకుంటూ తేనె తయారు చేస్తుంది. ఈ (ప్రచార, శిక్షణ) తోటలో పని చేసేవాడు ప్రతిఫలం పొందుతాడు. దాని కోతకు సిద్ధమయ్యేవాడు లాభం మరియు సంతోషం పొందుతాడు.
ఒక మంచి మాట ద్వారా నీవు బోధన ఆరంభించు. ఎందుకనగా మంచి మాట ఒక సదకా (సత్కార్యం). ఒక చిరునవ్వు ద్వారా ప్రచారం ఆరంభించు. నీ తోటి సోదరునితో నీవు మందహాసముతో మాట్లాడడం కూడా సత్కార్యం. నీ ఉత్తమ నడవడిక ద్వారా నీవు ప్రచారకుడివయిపో. నీవు నీ ధనంతో ప్రజల్ని ఆకట్టుకోలేవు. నీ సద్వర్తనతో ఆకట్టుకోగలుగుతావు.
సోదరా! ప్రవక్తగారి ఒక వచనం అయినా సరే ఇతరుల వరకు చేరవేయి. నీ ప్రేమికుల గుండెల్లో ప్రవక్తి గారి ఒక సంప్రదాయ ప్రేమను కలిగించు. వారి హృదయాలను వారి ప్రభువు విధేయతతో అలంకరించు. వివేకము మరియు మంచి ఉపదేశం ద్వారా వారిని పిలువు. దూరం చేసే మాటలు, కఠోర పద్ధతి విడనాడు.
[فَبِمَا رَحْمَةٍ مِنَ اللهِ لِنْتَ لَهُمْ وَلَوْ كُنْتَ فَظًّا غَلِيظَ القَلْبِ لَانْفَضُّوا مِنْ حَوْلِكَ فَاعْفُ عَنْهُمْ وَاسْتَغْفِرْ لَهُمْ وَشَاوِرْهُمْ فِي الأَمْرِ فَإِذَا عَزَمْتَ فَتَوَكَّلْ عَلَى اللهِ إِنَّ اللهَ يُحِبُّ المُتَوَكِّلِينَ] {آل عمران:159}
(ప్రవక్తా!) అల్లాహ్ యొక్క అనంత కరుణ వల్లనే నీవు వారిపట్ల మృదు స్వభావుడవు అయ్యావు. నీవే గనక కర్కశుడవు కఠిన హృదయుడవు అయినట్లయితే వారందరూ నీ చుట్టు పక్కల నుండి దూరంగా పోయేవారు. (ఆలి ఇమ్రాన్ 3: 159).
నీ పట్ల తప్పు చేసిన వాడిని క్షమించి పిలుపునిచ్చావని ఆశించు. పాపంలో మునిగి ఉన్న నీ సోదరునికి సహాయం చేసి నీ చేత అతని సన్మార్గానికి మార్గం సుగమం చేయి. రుజుమార్గం నుండి దూరమైన ప్రతి ఒక్కరి పట్ల వాత్సల్య కాంతి ద్వారా నీ కళ్ళను ప్రకాశవంతం చేసుకో చివిరికి నీవు ఎవరెవరి కోసం సన్మార్గం కోరుతున్నావో వారికి ఈ కాంతి లభిస్తుంది.
నీ పొరుగువానికి ఒక క్యాసెట్ బహుకరించి, లేదా నీ మిత్రునికి ఓ పుస్తకం పంపి, ఇస్లాం వైపు స్వచ్ఛముగా పిలిచి అల్లాహ్ అతనికి సధ్బాగ్యం ప్రసాదించుగాక అని ఆశిస్తూ కూడా నీవు ప్రచారకునివి కావచ్చు.
నీకు ప్రసాదించబడిన సర్వ శక్తులను, ఉపాయాలను ఉపయోగించి ప్రచారకునివి కావచ్చు. నీవు కాలు మోపిన ప్రతి చోట శుభం కలగజేసేవానివిగా అయిపో. అడ్డంకులుంటాయని భ్రమ పడకు. చిన్నవాటిని మహా పెద్దగా భావించి (భయం చెందకు). విద్యావంతులు, గొప్ప ప్రచారకులతో సంప్రదించి నీ ప్రచారం ఆరభించు. ఇలా నీ ప్రచారం పరిపూర్ణజ్ఞానం మీద ఆధారపడి నడుస్తూ ఉంటుంది.
ادْعُ إِلَى سَبِيلِ رَبِّكَ بِالحِكْمَةِ وَالمَوْعِظَةِ الحَسَنَةِ وَجَادِلْهُمْ بِالَّتِي هِيَ أَحْسَنُ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَنْ ضَلَّ عَنْ سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِالمُهْتَدِينَ {النحل:125}
నీ ప్రభువు మార్గం వైపునకు పిలువు, వివేకంతో, చక్కని హితబోధతో. ఉత్తమోత్తమ రీతిలో వారితో వాదించు. నీ ప్రభువుకే బాగా తెలుసు; ఆయన మార్గం నుండి తప్పిపోయినవాడు ఎవడో, రుజు మార్గంపై ఉన్నవాడూ ఎవడో. (నహ్ల్ 16: 125).
నీ బాధ్యత సందేశం అందజెయ్యడమే.
وَمَا عَلَينَا إِلَّا الْبَلَاغُ الْـمُبِين. {يس 17}
స్పష్టమైన రీతిలో సందేశాన్ని అందజేయడమే మా బాధ్యత (యాసీన్ 36: 17).
హృదయాలకు మార్గం చూపే బాధ్యత, తాలాలు పడి ఉన్నవాటిలో తాను కోరేవారివి విప్పే బాధ్యత కూడా అల్లాహ్ దే.
ذَلِكَ هُدَى اللهِ يَهْدِي بِهِ مَنْ يَشَاءُ وَمَنْ يُضْلِلِ اللهُ فَمَا لَهُ مِنْ هَادٍ] {الزُّمر:23}
ఇది అల్లాహ్ మార్గదర్శకత్వం. దీని ద్వారా ఆయన తాను కోరిన వారిని సత్యమార్గంపైకి తీసుకువస్తాడు. స్వయంగా అల్లాహ్ మార్గం చూపనివాడికి, మరొక మార్గదర్శకుడు ఎవ్వడూ లేడు. (జుమర్ 39: 23).
నీ ప్రచారం ఫలించినది, దాని ఫలితంగా పండిన ఫలాలు చూసి సంతోషపడు. నీవు పొందే ప్రతి విజయాన్ని నీ కొరకు వేచి చూస్తున్న, నీ అడుగులు పడటానికి ఎదురుచూస్తున్న మరో విజయానికి మెట్టుగా ఉంచి ముందుకెదుగు.
ప్రవక్త ﷺ తమ జాతి వారి సన్మార్గంతో ఎంత సంతోషించారు? కాదు, అనారోగ్య యూదుని పిల్లవాని సన్మార్గంతో ప్రవక్త ﷺ చాలా సంతోషించారు. ఆ సంఘటనను అనస్ ( రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారుః
(كَانَ غُلَامٌ يَهُودِيٌّ يَخْدُمُ النَّبِيَّ ﷺ فَمَرِضَ فَأَتَاهُ النَّبِيُّ ﷺ يَعُودُهُ فَقَعَدَ عِنْدَ رَأْسِهِ فَقَالَ لَهُ أَسْلِمْ فَنَظَرَ إِلَى أَبِيهِ وَهُوَ عِنْدَهُ فَقَالَ لَهُ أَطِعْ أَبَا الْقَاسِمِ ﷺ فَأَسْلَمَ فَخَرَجَ النَّبِيُّ ﷺ وَهُوَ يَقُولُ الْحَمْدُ لِلَّهِ الَّذِي أَنْقَذَهُ مِنْ النَّارِ)
ఒక యూద బాలుడు ప్రవక్త సేవ చేస్తూ ఉండేవాడు. ఒకసారి అతని ఆరోగ్యం చెడిపోయింది. అతడ్ని పరామర్శించడానికి ప్రవక్త ﷺ వచ్చి, అతని తలాపున కూర్చున్నారు. కొంతసేపటికి “నీవు ఇస్లాం స్వీకరించు” అని అతనితో అన్నారు. అప్పుడు అతడు అక్కడే ఉన్న తన తండ్రి వైపు చూశాడు. దానికి అతను నీవు అబుల్ ఖాసిం ﷺ (అంటే ప్రవక్త) మాటను అనుసరించు అని అన్నాడు. అప్పుడు ఆ బాలుడు ఇస్లాం స్వీకరించాడు. (ఆ తర్వాత కొంత సేపటికి ఆ బాలుడు చనిపోయాడు. అప్పుడు ప్రవక్త) “అల్ హందులిల్లాహ్! అల్లాహ్ ఇతడిని నరకం నుండి కాపాడాడు” అన్నారు. (బుఖారి 1356).
తలతలలాడే ప్రవక్త మాటలను శ్రద్ధగా విను, అతిఉత్తమ, అతిఉన్నతమైన ప్రచారకులు (అంటే ప్రవక్త) తాను తయ్యారు చేసిన ప్రచారకుల్లో చిత్తశుద్ధిగల ఒకరైనా అలీ బిన్ అబీ తాలిబ్ ( రదియల్లాహు అన్హు) కు ఖైబర్ రోజున ఇలా చెప్పారు:
(ادْعُهُمْ إِلَى الْإِسْلَامِ وَأَخْبِرْهُمْ بِمَا يَجِبُ عَلَيْهِمْ فَوَالله لَأَنْ يُهْدَى بِكَ رَجُلٌ وَاحِدٌ خَيْرٌ لَكَ مِنْ حُمْرِ النَّعَمِ)
“వారిని ఇస్లాం వైపునకు పిలువు. వారిపై విధిగా ఉన్న విషయాల్ని వారికి తెలియజేయి. అల్లాహ్ సాక్షిగా! నీ ద్వారా ఒక్క మనిషికి కూడా సన్మార్గం ప్రాప్తమయ్యిందంటే అది నీకు మేలు జాతికి చెందిన ఎర్ర ఒంటెల కంటే ఎంతో ఉత్తమం”. (బుఖారి 2942).
ప్రచార కార్యం ద్వారా లేదా ఎవరికైనా ఒక ధర్మ విషయం నేర్పడం ద్వారా నీవెన్ని పుణ్యాలు పొందుతావు లెక్కించలేవు. నీవు ఇచ్చిన పిలుపు ప్రకారం ఆచరించే వారు, నీవు నేర్పిన విద్యకు క్రియరూపం ఇచ్చేవారు ఎంతమంది ఉంటారో అంతే పుణ్యం నీకు లభిస్తుంది. వారి పుణ్యాల్లో ఏలాంటి కొరత జరగదు. అల్లాహ్ గొప్ప దయగలవాడు.
ప్రచార కార్యం నీ నుండి, నీ ఇల్లాలు పిల్లలతో, నీ దగ్గరివారితో ఆరంభం చేయి. బహుశా అల్లాహ్ నీ శ్రమలో శుభం కలుగు జేయుగాక. నీ సత్కార్యాన్ని అంగీకరించుగాక. ఆయన చాలా దాతృత్వ, ఉదార గుణం గలవాడు.
అల్లాహ్ వైపు పిలుపుకు సంబంధించిన ఓ సత్కార్య సంఘటన శ్రద్ధగా చదువు. ఎవరితో ఈ సంఘటన జరిగిందో స్వయంగా అతడే చెప్పాడు. అతను ఇటాలీ దేశానికి సంబంధించిన అల్ బర్తో ఓ. పచ్చీని (Alberto O. Pacini).:- నాకు సత్య ధర్మం వైపునకు సన్మార్గం చూపిన అల్లాహ్ కే అనేకానేక స్తోత్రములు. అంతకు మునుపు నేను నాస్తికునిగా, విలాసవంతమైన జీవితం గడుపుతూ మనోవాంఛల పూజ చేసేవాడిని. జీవితం అంటే డబ్బు, పైసా అని. సంపాదనే పరమార్థం అని భావిస్తూ ఉండేవాడిని. ఆకాశ ధర్మాలన్నిటితో విసుగెత్తి పోయి ఉంటిని. ప్రథమ స్థానంలో ఇస్లామే ఉండినది. ఎందుకనగా మా సమాజంలో దానిని చరిత్రలోనే అతి చెడ్డ ధర్మంగా చిత్రీకరిస్తున్నారు. ముస్లిములు అంటే మా మధిలో విగ్రహాలను పూజించేవారు, సహజీవన చేయలేనివారు, ఏదో కొన్ని అగోచరాలను నమ్ముతూ వాటి ద్వారానే తమ సమస్యల పరిష్కారాన్ని కోరువారు. రక్తపిపాసులు, గర్వులు, కపటులు మరియు ఇతరులతో ప్రేమపూర్వకమైన వాతవరణంలో జీవితం గడిపే గుణం లేనివారు అని అనుకునేవాడిని. ఇస్లాంకు వ్యతిరేకమైన ఈ వాతావరణంలో నేను పెరిగాను. కాని అల్లాహ్ నా కొరకు మార్గదర్శకత్వం వ్రాసాడు, అది కూడా సంపాదన కొరకై ఇటాలీ వలస వచ్చిన ఓ ముస్లిం యువకుని ద్వారా. ఏ ఉద్దేశ్యం లేకుండానే నేను అతడిని కలిశాను. ఒక రాత్రి నేను చాలా సేపటి వరకు ఒక బార్ లో రాత్రి గడిపి తిరిగి వస్తున్నాను. మత్తు కారణంగా పూర్తి స్పృహ తప్పి ఉన్నాను. రోడ్ మీద నడుస్తూ వస్తున్నాను నాకు ఏదీ తెలియకుండా ఉంది పరిస్థితి. అకస్మాత్తుగా వేగంగా వస్తున్న ఓ కార్ నన్ను ఢీకొంది. నేలకు ఒరిగాను. నా రక్తంలోనే తేలాడుతుండగా, అప్పుడే ఆ ముస్లిం యువకుడు తారసపడి నా తొలి చికిత్సకు ప్రయత్నం చేశాడు. పోలీస్ కు ఖబరు ఇచ్చాడు. నేను కోలుకునే వరకు నన్ను చూసుకుంటూ నా సేవలో ఉన్నాడు. ఇదంతా నాకు చేసిన వ్యక్తి ఒక ముస్లిం అని నేను నమ్మలేక పోయాను. అప్పుడు నేను అతనికి దగ్గరయ్యాను. అతని ధర్మం యొక్క మూల విషయాలు తెలుపమని కోరాను. దేని గురించి ఆదేశిస్తుంది, దేని గురించి నివారిస్తుందో చెప్పుమన్నాను. అలాగే ఇతర మతాల గురించి నీ ధర్మ అభిప్రాయమేమిటి? ఈ విధంగా ఇస్లాం గురించి తెలుసుకొని, ఆ యువకుని సద్పర్తన వల్ల అతనితో ఉండసాగాను. చివరికి పూర్తి నమ్మకం కలిగింది; నేను అజ్ఞానంలో ఉండి నా ముఖంపై దుమ్ము రాసుకుంటుంటినీ అని, ఇస్లామే సత్యధర్మమని. వాస్తవానికి అల్లాహ్ చెప్పింది నిజమేననిః
وَمَنْ يَبْتَغِ غَيْرَ الإِسْلَامِ دِينًا فَلَنْ يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الآَخِرَةِ مِنَ الخَاسِرِينَ {آل عمران:85}
ఎవడైనా ఈ విధేయతా విధానాన్ని (ఇస్లాం) కాక మరొక మార్గాన్ని అవలంబించదలిస్తే, ఆ మార్గం ఎంతమాత్రం ఆమోదించ బడదు. అతడు పరలోకంలో విఫలుడౌతాడు, నష్టపోతాడు. (ఆలి ఇమ్రాన్ 3: 85).
అప్పుడు నేను ఇస్లాం స్వీకరించాను.
ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది. క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పూర్తి పుస్తకం చదవండి.
ఇతర లింకులు:
6 వ అధ్యాయం
తౌహీద్ మరియు “లాఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భాష్యము
అల్ ఖౌలుస్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Imam Muhammad ibn Abdul Wahhab.
అల్లాహ్ ఆదేశం:
أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ يَدْعُونَ يَبْتَغُونَ إِلَىٰ رَبِّهِمُ ٱلْوَسِيلَةَ أَيُّهُمْ أَقْرَبُ وَيَرْجُونَ رَحْمَتَهُۥ وَيَخَافُونَ عَذَابَهُۥٓ
“ఈ ప్రజలు మొర పెట్టుకుంటున్న వారే స్వయంగా తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు.”
(బనీ ఇస్రాయీల్ 17 : 57).
وَإِذْ قَالَ إِبْرَٰهِيمُ لِأَبِيهِ وَقَوْمِهِۦٓ إِنَّنِى بَرَآءٌۭ مِّمَّا تَعْبُدُونَ
“ఇబ్రాహీం తన తండ్రి మరియు తన జాతి వారికీ ఇలా చెప్పిన ఆ సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. “మీరు పూజిస్తున్న వాటితో నాకు ఏ సంబంధమూ లేదు. నా సంబంధం కేవలం నన్ను సృష్టించినవానితోనే ఉన్నది… (జుక్రుఫ్ 43: 26).
ٱتَّخَذُوٓا۟ أَحْبَارَهُمْ وَرُهْبَـٰنَهُمْ أَرْبَابًۭا مِّن دُونِ ٱللَّهِ وَٱلْمَسِيحَ ٱبْنَ مَرْيَمَ وَمَآ أُمِرُوٓا۟ إِلَّا لِيَعْبُدُوٓا۟ إِلَـٰهًۭا وَٰحِدًۭا ۖ لَّآ إِلَـٰهَ إِلَّا هُوَ ۚ سُبْحَـٰنَهُۥ عَمَّا يُشْرِكُونَ
“వారు అల్లాహ్ ను కాదని తమ పండితులను, తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు…” (తౌబా 9: 31).
وَمِنَ ٱلنَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ ٱللَّهِ أَندَادًۭا يُحِبُّونَهُمْ كَحُبِّ ٱللَّهِ ۖ ۗ
“కొందరు అల్లాహ్ ను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా, ప్రత్యర్థులుగా భావిస్తారు. వారు అల్లాహ్ పట్ల కలిగి వుండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు…” (బఖర 2:165)
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారు:
‘ఎవడు “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్య దైవం మరొక్కడు లేడు) అని, అల్లాహ్ తప్ప ఆరాధింపబడే ఇతరుల్ని తిరస్కరిస్తాడో అతని ధనప్రాణం సురక్షితంగా ఉండును. అతని లెక్క (ఉద్దేశం) అల్లాహ్ చూసుకుంటాడు’. (ముస్లిం).
తరువాత వచ్చే పాఠాల్లో ఇదే వివరణ ఉంది.
ముఖ్యాంశాలు:
1. ఇందులో ముఖ్య విశేషం : తౌహీద్ (ఏక దైవ విశ్వాసం) మరియు షహాదత్ (లాఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యం) యొక్క వ్యాఖ్యానం ఉంది. దాన్ని అనేక ఆయతుల ద్వారా స్పష్టం చేయడం జరిగింది
2. బనీ ఇస్రాయీల్ లోని వాక్యం (17:57) – మహాపురుషులతో మొరపెట్టుకునే ముష్రికుల ఆ కార్యాన్ని రద్దు చేస్తూ, ఇదే షిర్క్ అక్బర్ (పెద్ద షిర్క్) అని చెప్పబడింది.
3. సూరె తౌబాలోని వాక్యం. “యూదులు, క్రైస్తవులు అల్లాహ్ ను గాక తమ పండితులను, సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారని అల్లాహ్ తెలిపాడు”. ఇంకా “కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించవలసిన ఆజ్ఞ వారికి ఇవ్వడం జరిగింద”నీ తెలిపాడు. అయితే వారు తమ పండితుల, సన్యాసులతో మొరపెట్టుకోలేదు. వారి పూజా చేయలేదు. కాని పాపకార్యాల్లో వారి విధేయత పాటించారు.
4. “మీరు ఆరాధిస్తున్న వాటితో నాకు ఏ సంబంధమూ లేదు. నా సంబంధం కేవలం నన్ను సృష్టించినవానితోనే ఉన్నది? అన్న అవిశ్వాసులకు ఇబ్రాహీం మాట. తమసత్య ప్రభువును ఇతర మిథ్య ఆరాధ్యులతో స్పష్టమైన పద్దతిలో వేరు జేరు.
ఇలా అవిశ్వాసులతో అసహ్యత, విసుగు మరియు అల్లాహ్ తో ప్రేమయే “లాఇలాహ ఇల్లల్లాహ్” యొక్క పరమార్థము అని అల్లాహ్ తెలిపాడు. అందుకే ఆ వాక్యం తరువాతనే ఈ వాక్యం ఉంది.
ఇబ్రాహీం ఈ వచనాన్నే తన తరువాత తన సంతానం కోసం విడిచి వెళ్ళాడు, బహుశా వారు దాని వైపునకు మరలుతారని. (జుఖ్ రుఫ్ 43: 28).
5. మరొకటి బఖరలోని వాక్యం. అందులో ప్రస్తాంవించబడిన అవిశ్వాసుల గురించి, “వారు నరకము నుండి బయటికి వెళ్ళేవారు కారు” అని అల్లాహ్ తెలిపాడు. వారు నియమించుకున్న వారిని అల్లాహ్ ను ప్రేమించవలసినట్లు ప్రేమిస్తారు. వారు అల్లాహ్ ను కూడా ప్రేమించువారు అని దీనితో తెలుస్తుంది. కాని వారి ఈ ప్రేమ వారిని ఇస్లాంలో ప్రవేశింపజేయలేకపోయింది. ఇది వీరి విషయం అయితే, ఎవరయితే తమ నియమించుకున్న వారిని అల్లాహ్ కంటే ఎక్కువ, లేక కేవలం వారినే ప్రేమించి, అల్లాహ్ ను ఏ మాత్రం ప్రేమించరో, వారి సంగతి ఎలా ఉంటుంది….? ఆలోచించండి!
6. “ఎవరు “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యదైవం మరొక్కడు లేడు) చదివి, అల్లాహ్ తప్ప పూజింపబడే ఇతరుల్ని తిరస్కరిస్తాడో అతని ధనప్రాణాలు సురక్షితంగా ఉండును. అతని వ్యవహారం అల్లాహ్ చూసుకుంటాడు” అన్న ప్రవక్త ప్రవచనం “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భావాన్ని తెలిపే దానిలో ముఖ్యమైనది. కేవలం నోటి పలుకుల ద్వారానే అతని ధన ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని చెప్పలేదు. ఆ పదాలు, దాని భావం తెలుసుకున్నవాని గురించే ఆ ఘనత లేదు. లేక దాన్ని కేవలం ఒప్పుకున్న వానికే రక్షణ లేదు. లేక అతడు కేవలం అల్లాహ్ తోనే మొరపెట్టుకుంటున్నందుకని కాదు. అతడు దాన్ని పలుకడంతో పాటు మిథ్యా దైవాలను తిరస్క.రించనంతవరకు అతని ధనప్రాణాలకు రక్షణ లేదు. ఇంకా అతడు అందులో సందేహపడితే, ఆలస్యం చేస్తే కూడా రక్షణ లేదు. ఈ విషయం ఎంతో ముఖ్యమైనది, గొప్పదైనది!. ఎంతో స్పష్టంగా తెలుపబడింది! వ్యెతిరేకులకు విరుద్ధంగా ఎంతో ప్రమాణికమైన నిదర్శన ఉంది.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :
వాస్తవానికి తౌహీద్ యొక్క భావం ఏమనగా: “అల్లాహ్ అద్వితీయుడని అతని గుణాలతో తెలుసుకొని, నమ్ముట. కేవలం అయన్ని మాత్రమే ఆరాధించుట.”
ఇది రెండు రకాలు:
ఒకటి: అల్లాహ్ యేతరుల ఉలూహియత్ (ఆరాధన)ను తిరస్కరించుట. అది ఎలా అనగా; సృష్టిలోని ప్రవక్త, దైవదూత, ఇంకెవరయినా ఆరాధనకు అర్హులు కారని, వారికి ఏ కొంత భాగం కూడా అందులో లేదని తెలుసుకొని విశ్వసించుట.
రెండవది: ఉలూహియత్ కు అర్హుడు అల్లాహ్ మాత్రమేనని, ఆయనకి సాటి మరొకడు లేడని విశ్వసించుట. కేవలం ఇంతే సరిపోదు. ధర్మాన్ని కేవలం అల్లాహ్ కే అంకితం చేసి, ఇస్లాం, ఈమాన్, ఇహాసాన్ ను పూర్తి చేసి, అల్లాహ్ హక్కులతో పాటు అల్లాహ్ దాసుల హక్కులను అల్లాహ్ సంతృప్తి, దాని ప్రతిఫలం పొందడానికే పూర్తి చేయుట.
దాని సంపూర్ణ భావంలో మరొకటి: అల్లాహ్ యేతరుల ఆరాధన నుండి అసహ్యత, విసుగు చెందుట. అల్లాహ్ ను గాక ఇతరులను అల్లాహ్ కు సమానులుగా నిలబెట్టి, అల్లాహ్ ను ప్రేమించినట్లు వారిని ప్రేమించుట, అల్లాహ్ కు విధేయత చూపినట్లు వారికి విధేయత చూపుట “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భావానికి విరుద్ధమైనది
నుండి: ఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్) – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلّى اللهُ عليهِ وسلّم : (إِذَا أَسْلَمَ الْعَبْدُ فَحَسُنَ إِسْلَامُهُ كَتَبَ اللهُ لَهُ كُلَّ حَسَنَةٍ كَانَ أَزْلَفَهَا وَمُحِيَتْ عَنْهُ كُلُّ سَيِّئَةٍ كَانَ أَزْلَفَهَا ثُمَّ كَانَ بَعْدَ ذَلِكَ الْقِصَاصُ الْحَسَنَةُ بِعَشْرَةِ أَمْثَالِهَا إِلَى سَبْعِ مِائَةِ ضِعْفٍ وَالسَّيِّئَةُ بِمِثْلِهَا إِلَّا أَنْ يَتَجَاوَزَ اللهُ عَزَّ وَجَلَّ عَنْهَا)
13- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఏ దాసుడు ఇస్లాం స్వీకరించి, దాని ప్రకారం ఆచరిస్తాడో అతను గతంలో చేసిన ప్రతి పుణ్యాన్ని అల్లాహ్ వ్రాసి పెడతాడు. గతంలో చేసిన అతని ప్రతి పాపం మన్నించబడుతుంది. ఆ తర్వాత పుణ్యపాపాల ఫలితాల లెక్క కొత్తగా మొదలవుతుంది. ఒక సత్కార్య పుణ్యం పది రెట్ల నుండి ఏడువందల వరకు లభిస్తుంది. దుష్కార్య పాపము దానంతే లభిస్తుంది. అల్లాహ్ దయతలుస్తే మన్నించనూవచ్చు“. (నిసాయీ 4912).
عَنْ ابْنِ مَسْعُودٍ رضي الله عنه قَالَ: قَالَ رَجُلٌ: يَا رَسُولَ اللهِ صَلّى اللهُ عليهِ وسلّم أَنُؤَاخَذُ بِمَا عَمِلْنَا فِي الْجَاهِلِيَّةِ؟ قَالَ: (مَنْ أَحْسَنَ فِي الْإِسْلَامِ لَمْ يُؤَاخَذْ بِمَا عَمِلَ فِي الْجَاهِلِيَّةِ وَمَنْ أَسَاءَ فِي الْإِسْلَامِ أُخِذَ بِالْأَوَّلِ وَالْآخِرِ).
14- ఇబ్ను మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ‘ప్రవక్తా! మేము అజ్ఞాన కాలంలో (ఇస్లాం స్వీకరించక ముందు) చేసిన దుష్కార్యాల గురించి పట్టుబడతామా?’ అని ఒక వ్యక్తి ప్రశ్నించాడు. “ఎవరు ఇస్లాం స్వీకరించి తర్వాత సత్కర్మలు ఆచరిస్తూ ఉంటాడో, అతను అజ్ఞాన కాలంలో చేసిన దుష్కర్మల గురించి నిలదీయడం జరగదు. అయితే ఇస్లాం స్వీకరించిన తర్వాత కూడా దుష్కార్యాలు చేస్తూ ఉంటే, అతను గతంలో చేసినవాటితో పాటు మొత్తం పాపకార్యాల విషయంలో పట్టుబడిపోతాడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బదులిచ్చారు. (బుఖారి 6921, ముస్లిం 120).
عَن حَكِيم بْن حِزَامٍ أَنَّهُ قَالَ لِرَسُولِ اللهِ صَلّى اللهُ عليهِ وسلّم أَيْ رَسُولَ اللهِ أَرَأَيْتَ أُمُورًا كُنْتُ أَتَحَنَّثُ بِهَا فِي الْجَاهِلِيَّةِ مِنْ صَدَقَةٍ أَوْ عَتَاقَةٍ أَوْ صِلَةِ رَحِمٍ أَفِيهَا أَجْرٌ؟ فَقَالَ رَسُولُ اللهِ صَلّى اللهُ عليهِ وسلّم : (أَسْلَمْتَ عَلَى مَا أَسْلَفْتَ مِنْ خَيْرٍ).
15- హకీం బిన్ హిజాం ఉల్లేఖించారుః నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడుతూ ‘ప్రవక్తా! నేను నా అవిశ్వాస జీవితంలో దానధర్మాలు, బానిసల విముక్తి, బంధువుల పట్ల దయాదాక్షిణ్యాలు మొదలైన సత్కార్యాలు చేశాను. మరి నాకు వాటి సుకృతఫలం లభిస్తుందా? అని అడిగాను. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానం ఇచ్చారు: “నీవు ఇస్లాం స్వీకరించిన కారణంగా నీ గత సత్కార్యాలకు కూడా ఇప్పుడు పుణ్యఫలం లభిస్తుంది”. (బుఖారి 1436, ముస్లిం 123).
—
హదీసుల కూర్పు & తెలుగు అనువాదం:
ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
—
From Saheeh Muslim: Book of Emaan
https://abdurrahman.org/2014/09/04/sahih-muslim-book-001/
Chapter 54: WOULD (PEOPLE) BE HELD RESPONSIBLE FOR THE DEEDS COMMITTED DURING THE STATE OF IGNORANCE?
Book 001, Number 0217:
It is narrated on the authority of Abdullah b. Mas’ud that some people said to the Messenger of Allah (may peace be upon him): “Messenger of Allah, would we be held responsible for our deeds committed in the state of ignorance (before embracing Islam)?“
Upon his he (the Holy Prophet) remarked:
“He who amongst you performed good deeds in Islam, He would not be held responsible for them (misdeeds which he committed in ignorance) and he who committed evil (even after embracing Islam) would be held responsible or his misdeeds that he committed in the state of ignorance as well as in that of Islam.”
Book 001, Number 0218:
It is narrated on the authority of Abdullah b. Mas’ud: We once said: Messenger of Allah, would we be held responsible for our deeds committed in the state of ignorance? He (the Holy Prophet) observed:
“He who did good deeds in Islam would not be held responsible for what he did in the state of ignorance, but he who committed evil (after having come within the fold of Islam) would be held responsible for his previous and later deeds.”
[75 నిముషాలు]
షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)
[48:23 నిముషాలు]
షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)
దావా : ఇస్లాం ధర్మ ప్రచారం.
దాయీ : ధర్మ ప్రచార కర్త.
మద్ఊ : ధర్మ ప్రచారం ఎవరికీ చేయ బడుతుందో వారు.
ధర్మ ప్రచారం (దావా) (మెయిన్ పేజీ)
https://teluguislam.net/dawah/
[5:33 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ధర్మ ప్రచారం (దావా) (మెయిన్ పేజీ)
https://teluguislam.net/dawah/
[3:15 నిముషాలు]
షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)
దావా : ధర్మ ప్రచారం.
దాయీ : ధర్మ ప్రచార కర్త.
ధర్మ ప్రచారం (దావా) (మెయిన్ పేజీ)
https://teluguislam.net/dawah/
[4:36 నిముషాలు]
షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)
దావా : ధర్మ ప్రచారం.
దాయీ : ధర్మ ప్రచార కర్త.
మద్ఊ : ధర్మ ప్రచారం ఎవరికీ చేయ బడుతుందో వారు
ధర్మ ప్రచారం (దావా) (మెయిన్ పేజీ)
https://teluguislam.net/dawah/
You must be logged in to post a comment.