ప్రవక్త ﷺ ఆదర్శవంతమైన జీవితంలోని 30 అంశాలు – ఇమాం ఇబ్నుల్ ఖయ్యిం గారి జాదుల్ మఆద్ లో నుండి [వీడియోలు]

ప్రవక్త ఆదర్శవంతమైన జీవితంలోని 30 అంశాలు – ఇమాం ఇబ్నుల్ ఖయ్యిం గారి జాదుల్ మఆద్ లో నుండి [వీడియోలు]
యూట్యూబ్ ప్లే లిస్ట్ – https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1vAdSpzam50Xb4BbeTxUTh
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

స్వచ్చమైన ఇస్లాం ఏమిటి? [పుస్తకం]

స్వచ్చమైన ఇస్లాం ఏమిటి? [పుస్తకం]

ఇటీవల కొందరు ముస్లింలు ఖుర్ఆన్, హదీసుల ప్రకారం ఆచరించే వారిని “కొత్త వర్గం, కొత్త ధర్మం” పేరుతో గుర్తు చేసుకుంటారు. దాన్ని కూడ అతిక్రమిస్తూ నలుగురు ఇమాములలోని ఎవరైనా ఒక్క ఇమామును కూడా అనుసరించని వారిని ‘గైర్ ముఖల్లిద్“లని, ఇస్లాం ధర్మానికి దూరమైన వారనీ, వివిధ బిరుదులతో సత్కరిస్తారు. ఇంకా ఏఏ పేర్లతో పిలుస్తారో కూడా తెలియదు. అసలు ఈ ఖుర్ఆన్, హదీస్లను ఆచరించడానికి ప్రామాణికత ఏమిటి?.

ప్రజల అవగాహన కోసం ప్రామాణిక ఆధారాల ద్వారా నిరూపితమైన సంవత్సరాలను ఈ పుస్తకంలో పొందుపరుస్తున్నాం. ఈ పుస్తకం అసలు ఉద్దేశం అన్ని రకాల ప్రారంభ సంవత్సరాలను తెలుపడం. ఖుర్ఆన్, హదీసులను ఎప్పటి నుండి ఆచరిస్తున్నారు?. వ్యక్తి అనుకరణమరియు నలుగురు ధార్మిక పండితుల అనుకరణ ఎప్పుడు మొదలైంది? ఇది ఇస్లాం ధర్మంలో ఎలా మొదలైంది ? హదీస్ మరియు ఫిఖాల్లో మార్పులు చేయడం ఎప్పటి నుండి జరుగుతుంది? అంతే కాకుండా నలుగురు ఇమాములు వ్యాఖ్యలను పేర్కొని వాటి వివరణ రాయడం జరిగింది. తద్వారా కొత్త, పాత విషయాలను తులనాత్మకంగా చూసుకోవడానికి.

[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [37 పేజీలు]

హదీసు 6 : దైవభీతి మరియు చిత్తశుద్ధి | అల్ అర్బయీన్ అన్నవవియ్యహ్

عَنْ أَبِي عَبْدِ اللَّهِ النُّعْمَانِ بْنِ بَشِيرٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا، قَالَ: سَمِعْت رَسُولَ اللَّهِ صلى الله عليه و سلم يَقُولُ: “إنَّ الْحَلَالَ بَيِّنٌ، وَإِنَّ الْحَرَامَ بَيِّنٌ، وَبَيْنَهُمَا أُمُورٌ مُشْتَبِهَاتٌ لَا يَعْلَمُهُنَّ كَثِيرٌ مِنْ النَّاسِ، فَمَنْ اتَّقَى الشُّبُهَاتِ فَقْد اسْتَبْرَأَ لِدِينِهِ وَعِرْضِهِ، وَمَنْ وَقَعَ فِي الشُّبُهَاتِ وَقَعَ فِي الْحَرَامِ، كَالرَّاعِي يَرْعَى حَوْلَ الْحِمَى يُوشِكُ أَنْ يَرْتَعَ فِيهِ، أَلَا وَإِنَّ لِكُلِّ مَلِكٍ حِمًى، أَلَا وَإِنَّ حِمَى اللَّهِ مَحَارِمُهُ، أَلَا وَإِنَّ فِي الْجَسَدِ مُضْغَةً إذَا صَلَحَتْ صَلَحَ الْجَسَدُ كُلُّهُ، وَإذَا فَسَدَتْ فَسَدَ الْجَسَدُ كُلُّهُ، أَلَا وَهِيَ الْقَلْبُ

[رَوَاهُ الْبُخَارِيُّ]، [وَمُسْلِمٌ] 

అనువాదం 

నోమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెబుతుండగా నేను విన్నాను: 

“నిశ్చయముగా ‘హలాల్’ (ధర్మ సమ్మతమైన) విషయాలు స్పష్టంగా తెలుపబడ్డాయి, ‘హరామ్’ (నిషేధిత) విషయాలు కూడా స్పష్టంగా తెలుపబడ్డాయి. అయితే ఆ రెండింటి మధ్య కొన్ని అస్పష్ట విషయాలు ఉన్నాయి. వాటి గురించి చాలా మంది ఎరుగరు. అయితే ఎవరైతే అస్పష్ట విషయాలకు దూరంగా ఉంటారో, వారు తమ ధర్మాన్ని, గౌరవాన్ని కాపాడుకున్న వారవుతారు. మరి ఎవరైతే అస్పష్ట విషయాల్లో పడిపోతారో వారు ‘హరాం’ నిషిద్ధ విషయాల్లో పడిపోతారు. పశువుల్ని మేపుకుంటున్న కాపరిలా, అతను గరిక గట్టుపై పశువుల్ని మేపు కుంటుంటాడు. అతని పశువులు ప్రక్కనున్న పొలములోకి చొరబడే అవకాశం అతి దగ్గరలోనే వుంది. గుర్తుంచుకోండి! నిశ్చయంగా ప్రతి రాజుకి కాపాడుకునే సరిహద్దులుంటాయి. గుర్తుంచుకోండి! మరి నిశ్చయంగా అల్లాహ్ (సామ్రాజ్య) సరిహద్దులంటే ఆయన నిషేధించి (హరాం చేసి)న విషయాలే. వినండి.! నిశ్చయంగా మానవ శరీరంలో ఒక మాంసపు ముద్ద ఉంది. అది క్షేమముగా వుంటే మొత్తం శరీరం క్షేమముగా వుంటుంది. ఒక వేళ అది చెడిపోతే మొత్తం మానవ శరీరమే చెడిపోతుంది. బాగా గుర్తుంచుకోండి! ఆ మాంసపు ముద్దే మానవ హృదయం”. 

పుస్తక సూచనలు

సహీహ్ బుఖారీ – 52, సహీహ్ ముస్లిం-1599.
తెలుగు రియాజుస్సాలిహీన్ 1 పేజి 780, హ588. 
(సహీహ్ బుఖారీ, విశ్వాస ప్రకరణం. సహీహ్ ముస్లిం, లావాదేవీల ప్రకరణం) 

హదీసు ప్రయోజనాలు 

1. ‘షరీఅత్’లో హలాల్ (సమ్మత), మరియు హరామ్ (అసమ్మత) విషయాలను వివరించబడింది. ఇక అస్పష్టమైన అంశాలు కొన్ని వున్నాయి, వాటి గురించి లోతైన అవగాహన కొందరికే ఉంటుంది. 

2. ప్రవక్త వారి ఉన్నతమైన బోధనా ఉదాహరణలతో కూడి ఉన్నది. 

3. బుద్ధి (ఆలోచన) అనేది హృదయంలో వుంటుంది. ప్రవక్త వారి అదేశం: వినండి.! నిశ్చయంగా మానవ శరీరంలో ఒక మాంసపు ముద్ద ఉంది. అది బాగుంటే మొత్తం శరీరం బాగుంటుంది. ఒకవేళ అది చెడిపోతే మొత్తం మానవ శరీరమే చెడిపోతుంది. బాగా గుర్తుంచుకోండి! అదే మానవ హృదయం”. 

4. అలజడి గాని, దిద్దుబాటు గాని, హృదయం చుట్టూ తిరుగుతుంటుంది. అందుకనే ప్రతి చక్కబెట్టే విషయంతో హృదయాన్ని చక్కబెట్టడానికి ప్రయత్నిస్తూవుండాలి. 

5 అన్ని అవయవాల కంటే హృదయం ఉన్నతమైనది. 

6. బాహ్య విషయాల్లో అలజడి అంతర విషయాల్లోని అలజడిని దృవీకరిస్తూంది. “వినండి.! నిశ్చయంగా మానవ శరీరంలో ఒక మాంసపు ముద్ద ఉంది. అది క్షేమముగా వుంటే మొత్తం శరీరం క్షేమముగా వుంటుంది. ఒకవేళ అది చెడిపోతే మొత్తం మానవ శరీరమే చెడిపోతుంది. బాగా గుర్తుంచుకోండి! అదే మానవ హృదయం”. 

7. అస్పష్ఠ విషయాల్లో పడకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే స్పష్టమైన (హరాం) విషయాలకు గురికాకుండ ఉండటానికి. 

8. ధార్మిక విషయాలను మరియు మానవాళికి సౌలభ్యం చేకూర్చె వాటిని కాపాడాలి. 

9. అనుమానాలు రేకెత్తించే విషయాలకు దూరంగా వుండాలి. 

10. ఎవరైతే అస్పష్ఠ విషయాలలో జాగ్రత్త వహించరో వారు తమకు తాము వాటితో మిళితం చేసుకుంటారు లేక హరాం (నిషేధిత) విషయాలకు లోనవుతారు. 

11. హరాం (నిషేధిత) విషయాల వైపుకు ప్రేరేపించే వాటికి అడ్డుకట్ట. ప్రవక్త ( సల్లల్లాహు అలైహి వసల్లం) వాక్యం: “గుర్తుంచుకోండి! నిశ్చయంగా ప్రతి రాజుకి ఒక కాపాడుకునే కంచె ఉంటుంది. గుర్తుంచుకోండి! మరి నిశ్చయంగా అల్లాహ్ (సామ్రాజ్య) సరిహద్దులంటే ఆయన నిషేధించి (హరాం చేసి)న విషయాలే”. 

12. మంచి వృత్తిని ఎన్నుకోవడంలో హృదయము యొక్క దిద్దుబాటు వుంటుంది. 

13. ధార్మిక జ్ఞానములో స్పష్టత సాధించాలని ప్రోత్సహించబడింది. 

14. ‘ముర్జియా’ (ఒక వర్గం పేరు) యొక్క విశ్వాస’ భావనలను ఖండించబడింది. వారి భావన: “ఈమాన్ ఉంటే పాపాలు (దుష్కార్యాలు) నష్టపర్చలేవు”. 

హదీసు ఉల్లేఖులు 

హజ్రత్ అబూ అబ్దుల్లాహ్ నౌమాన్ బిన్ బషీర్ (రజియల్లాహు అన్హు): 

నౌమాన్ బిన్ బషీర్ బిన్ సఅలబ బిన్ సఅద్ బిన్ ఖల్లాస్, అల్ అన్సారి, అల్ ఖజ్ రజి  పేరు. ‘కున్నియత్’ ‘అబూ అబ్దుల్లాహ్ ‘. వీరి తల్లి దండ్రులు ఇద్దరు సహాబీలుగా పేరుగావించినవారు. ‘హిజ్రత్’ యొక్క 14వ మాసములో జన్మించారు, మదీన అన్సారుల్లో వున్నందున అన్సారి మరియు మదనిగా పిలవబడ్డారు. ‘షామ్’ లో నివాసము ఏర్పర్చుకున్నారు. ‘ముఆవియహ్’ తరపున తొలుత ‘కూఫా’ తరువాత ‘హిమ్స్’ ప్రాంతాల యొక్క అధికారి, మరియు గవర్నరుగా నిర్ణయించబడ్డారు. 64వ హి.శ. లో ‘రాహిత్’ నాడు ‘ఖాలిద్ బిన్ ఖలీ, కలాయి’ చేతుల్లో ‘షహీద్’ (అమరగతులు) అయ్యారు. హదీసు గ్రంథాల్లో వారి ఉల్లేఖనాల సంఖ్య 114గా చెప్పబడుతుంది. 

(రి.సా. ఉర్దు – 1, పేజి:232) 

అల్ అర్బయీన్ అన్నవవియ్యహ్ – 40 హదీసుల సమాహారం (మెయిన్ పేజీ)
https://teluguislam.net/40h/

హదీసు 5: ‘బిద్అత్’ యొక్క నిరాకరణ | అల్ అర్బయీన్ అన్నవవియ్యహ్

عَنْ أُمِّ الْمُؤْمِنِينَ أُمِّ عَبْدِ اللَّهِ عَائِشَةَ رَضِيَ اللَّهُ عَنْهَا، قَالَتْ: قَالَ: رَسُولُ اللَّهِ صلى الله عليه و سلم : مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ فَهُوَ رَدٌّ [رَوَاهُ الْبُخَارِيُّ] ،[وَمُسْلِمٌ] وَفِي رِوَايَةٍ لِمُسْلِمٍ: مَنْ عَمِلَ عَمَلًا لَيْسَ عَلَيْهِ أَمْرُنَا فَهُوَ رَدٌّ

అనువాదం 

విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా ( రదియల్లాహు అన్హా) ఉల్లేఖిస్తున్నారు: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు: 

“ఎవరైతే మా ఈ ధర్మములో లేనటువంటి (విషయాలను) ఆరంభిస్తారో అవి తిరస్కరించబడతాయి (అవి అంగీకరించబడవు).”

సహీహ్ ముస్లిం ఉల్లేఖనంలో ఇలా పేర్కొనబడింది: 

“ఎవరైనా ఏదైన ఆచరణ చేస్తే, ఆఆచరణ పట్ల మా ఆజ్ఞా ఏమి లేనట్లైతే అది తిరస్కరించబడుతుంది (అంగీకరించబడదు).”

పుస్తక సూచనలు

సహీహ్ బుఖారీ-2697, సహీహ్ ముస్లిం-1718. 
తెలుగు రియాజుస్సాలిహీన్ 1 – పేజి 273, హ170. 
(సహీహ్ బుఖారి – ఒడంబడికల ప్రకరణం. సహీహ్ ముస్లిం – వ్యాజ్యాల ప్రకరణం). 

హదీసు ప్రయోజనాలు 

1. అన్ని రకాల ‘బిద్అత్’ లు ధూత్కరించబడుతాయి. చేసేవాడి ఉద్దేశము మంచిదైన సరే. దీనికి ఆధారం: ‘ఎవరైతే మా ఈ ధర్మములో లేనటువంటి విషయాలను) ఆరంభిస్తారో అవి తిరస్కరించ బడతాయి’. 

2. ‘బిద్అత్ ‘కి పాల్పడే వారికి దూరంగా వుండాలి. 

3. ధార్మిక పరమైన కార్యాలకు విరుద్ధమైనవి అంగీకరించబడవు. ప్రవక్త వాక్యము ప్రకారం: ఎవరైనా ఏదైన ఆచరణ చేస్తే, ఆ ఆచరణ పట్ల మా ఆజ్ఞా ఏమియు లేనట్లైతే అది తిరస్కరించబడుతుంది. దీనికై ఒక సంఘటన: ఒక సహాబి పండుగ రోజున నమాజుకు ముందే జిబహ్ చేసారు, అప్పుడు ప్రవక్త ( అతనికి ‘నీ మేక కేవలం మాంసపు మేకే’ అని చెప్పారు. 

4. ‘దీన్'(అల్లాహ్ ధర్మము) లో ‘బిద్అత్’ని ప్రారంభించటం ‘హరాం’ నిషిద్దం. వాక్య పరమైన ‘బిద్అత్’ పట్ల: “మన్ అహదస”, ఆచరణ పరమైన ‘బిద్అత్’ పట్ల “మన్ అమిల” అనే వాక్యాల ద్వారా వ్యక్తమవుతుంది. 

5. కర్మలు అంగీకరించబడటానికి అవి ‘సున్నత్’ ప్రకారమై ఉండాలి. 

6. గోప్యమైన విషయాలలో ఆదేశం మారదు. దీనికై : “ఆ ఆచరణ పట్ల మా ఆజ్ఞ ఏమియు లేదు”. అనే వాక్యంతో ఆధారం తీసుకొనబడింది. 

7. వారించడం అనేది అలజడిని అరికడుతుంది. వారించబడినవన్నీ ‘దీన్’ ధర్మములో లేనివే, దాన్ని తిరస్కరించాలి. 

8. సంతానము లేకపోయినా తన పేరును ‘కునియత్’ (అబ్బాయి పేరుతో జతపరిచి)తో పిలుచుకోవచ్చు. ఎందుకంటే ‘ఆయెషా (రదియల్లాహు అన్హా) ‘ కు ఎలాంటి సంతానము లేదు. 

9. ‘షరీఅత్’ ధర్మశాసనాన్ని అల్లాహ్ పరిపూర్ణం చేసాడు. 

10. తన సమాజం పట్ల ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తపన, వారి కర్మలు ధూత్కరించ బడతాయెమోనన్న భయముతో వాటికి దూరంగా వుండండి అని ఆదేశించారు. 

హదీసు ఉల్లేఖులు 

మోమినీన్ ల మాతృమూర్తి ఆయిషా సిద్దీఖ (రజియల్లాహు అన్హా) : 

మోమినీన్ల మాతృమూర్తి, ఉమ్మె అబ్దుల్లాహ్, ఆయిషా సిద్దీఖ బిన్తె అబు బక్ర్ (రదియల్లాహు అన్హు). వీరి తల్లి పేరు ఉమ్మె రొమాన్, ఆమిర్ బిన్ ఉవైమిర్ చెల్లెలు కనానియహ్ తెగ నుండి వున్నవారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హిజ్రత్ కంటే రెండు సంవత్సరాల ముందు ‘షవ్వాల్’ మాసములో ఆమెతో వివాహమాడారు. ఒక ఉల్లేఖనంలో 3 సంవత్సరాల ముందు అనే ప్రస్తావన దొరుకుతుంది. ఆయన పెళ్ళి చేసుకున్నప్పుడు ఆమె వయస్సు 6 లేక 7 సం||లు||. భర్త ఇంటికి వచ్చినప్పుడు ఆమె వయస్సు 9 సం||లు||. ఆమె యొక్క ‘కున్నియత్’ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఆమె అక్క కొడుకు అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ పేరు పై ఉమ్మె అబ్దుల్లాహ్ అని పెట్టారు. పొగడ్తలు మరియు విశిష్ఠతలతో అతీతులు. ఆమె పై నిందారోపణలు మోపినప్పుడు ఖుర్ఆన్ గ్రంధము ‘సూరె నూర్’లో అల్లాహ్ ఆమె పట్ల పవిత్రతను అవతరింపజేసాడు. హి.శ 57లేదా 58న రంజాన్ నెల 17వ తేదీన మంగళవారం నాడు మరణించారు. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారు జనాజ నమాజ్ చదివించారు. ‘బఖీ’ స్మశానంలో పాతి పెట్టడం జరిగింది. ఉర్వా వాక్కు ప్రకారం: అరబ్ కవితలు, ఫిఖ్ హ్, మరియు వైద్యశాస్త్రంలో ఆమె కంటే గొప్పగా తెలిసినవారు ఎవరూ లేరు. 

(రి. సా. ఉర్దు – 1, పేజి:36) 

అల్ అర్బయీన్ అన్నవవియ్యహ్ – 40 హదీసుల సమాహారం(మెయిన్ పేజీ)
https://teluguislam.net/40h/

ఇస్లాం ధర్మం సంపూర్ణమయింది, కొత్త పోకడలు , నూతన ఆచారాలను సృష్టించరాదు
https://youtu.be/s1wHqzntmgE – ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ [5 నిముషాలు]

బిద్అత్ (కల్పితాచారం) కు సంభందించిన మరింత సమాచారం, పుస్తకాలు , ఆడియో వీడియోల కొరకు క్రింది లింక్ నొక్కండి:
https://teluguislam.net/others/bidah/

హదీసు 4: పుట్టుక, మరణం, ఉపాధి  | అల్ అర్బయీన్ అన్నవవియ్యహ్

عَنْ أَبِي عَبْدِ الرَّحْمَنِ عَبْدِ اللَّهِ بْنِ مَسْعُودٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: حَدَّثَنَا رَسُولُ اللَّهِ صلى الله عليه و سلم -وَهُوَ الصَّادِقُ الْمَصْدُوقُ-: “إنَّ أَحَدَكُمْ يُجْمَعُ خَلْقُهُ فِي بَطْنِ أُمِّهِ أَرْبَعِينَ يَوْمًا نُطْفَةً، ثُمَّ يَكُونُ عَلَقَةً مِثْلَ ذَلِكَ، ثُمَّ يَكُونُ مُضْغَةً مِثْلَ ذَلِكَ، ثُمَّ يُرْسَلُ إلَيْهِ الْمَلَكُ فَيَنْفُخُ فِيهِ الرُّوحَ، وَيُؤْمَرُ بِأَرْبَعِ كَلِمَاتٍ: بِكَتْبِ رِزْقِهِ، وَأَجَلِهِ، وَعَمَلِهِ، وَشَقِيٍّ أَمْ سَعِيدٍ؛ فَوَاَللَّهِ الَّذِي لَا إلَهَ غَيْرُهُ إنَّ أَحَدَكُمْ لَيَعْمَلُ بِعَمَلِ أَهْلِ الْجَنَّةِ حَتَّى مَا يَكُونُ بَيْنَهُ وَبَيْنَهَا إلَّا ذِرَاعٌ فَيَسْبِقُ عَلَيْهِ الْكِتَابُ فَيَعْمَلُ بِعَمَلِ أَهْلِ النَّارِ فَيَدْخُلُهَا. وَإِنَّ أَحَدَكُمْ لَيَعْمَلُ بِعَمَلِ أَهْلِ النَّارِ حَتَّى مَا يَكُونُ بَيْنَهُ وَبَيْنَهَا إلَّا ذِرَاعٌ فَيَسْبِقُ عَلَيْهِ الْكِتَابُ فَيَعْمَلُ بِعَمَلِ أَهْلِ الْجَنَّةِ فَيَدْخُلُهَا”. [رَوَاهُ الْبُخَارِيُّ] ، [وَمُسْلِمٌ]

అనువాదం 

హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) – సత్యమూర్తి అని పిలిపించుకున్నవారాయన – ప్రభోదించారు: 

“మీలో ప్రతి ఒక్కరూ తన మాతృగర్భంలో (మొదట) నలభై రోజుల వరకు వీర్యపు బిందువు రూపంలో ఉంటారు. ఆ తరువాత అంతే కాలం (మరో నలభై రోజుల) పాటు పేరుకు పోయిన రక్తపు ముద్ద ఆకారములో ఉంటారు. ఆ తరువాత అంతే కాలం (మరో నలభై రోజుల) పాటు మాంసపు ముద్దలా ఉంటాడు. ఆ తరువాత అతని వద్దకు ఒక దైవదూతను పంపటం జరుగుతుంది. అతను ఆ పిండంలో “రూహ్”(ఆత్మ)ను ఉదుతాడు. మరియు అతనికి సంబంధించి నాలుగు విషయాలు వెల్లడించబడతాయి. అతని ఉపాధి, ఆచరణ, మరణం, అతను దురదృష్టవంతుడా లేక అదృష్టవంతుడా..? అనే విషయాలను వ్రాయమని. 

ఏకైక ఆరాధ్యదైవం సాక్షిగా చెబుతున్నాను… నిస్సందేహంగా మీలో ఒకడు స్వర్గవాసులు కర్మలు చేస్తూ ఉంటాడు. చివరికి అతనికి మరియు దాని(స్వర్గాని)కి మధ్య కేవలం అర్ధ గజము (దూరం) మాత్రమే మిగిలి ఉంటుంది. అంతలో విధివ్రాత అతన్ని మించిపోతుంది. దాంతో అతను నరకవాసుల కర్మలు చేసి నరకములో ప్రవేశిస్తాడు. 

(దీనికి భిన్నంగా) మీలో ఒకడు నరకవాసుల కర్మలు చేస్తుంటాడు. చివరికి అతనికి మరియు దాని (నరకానికి మధ్య కేవలం అర్ధ గజము (దూరం) మాత్రమే మిగిలి ఉంటుంది. అంతలో విధివ్రాత అతన్ని మించిపోతుంది. దాంతో అతను స్వర్గవాసుల కర్మలు చేసి స్వర్గములో ప్రవేశిస్తాడు”. 

పుస్తక సూచనలు

సహీహ్ బుఖారీ – 6594, సహీహ్ ముస్లిం- 2643. 
తెలుగు రియాజుస్సాలిహీన్ 1 – పేజి 568, హ 397. 
(సహీహ్ బుఖారీ, సృష్టి ఆరంభ ప్రకరణం. సహీహ్ ముస్లిం, విధివ్రాత ప్రకరణం) 

హదీసు ప్రయోజనాలు 

1. స్త్రీ గర్భాలపై దైవదూతలు నియమితులై వుంటారు. దీనికి ఆధారం: ‘మళ్ళీ వారి వైపుకు దైవదూతలు పంపబడతారు‘. అంటే గర్భముపై నియమితులైన దైవదూతలు. 

2. మనిషి స్థితులు తల్లి గర్భములో లిఖించబడుతాయి, ‘ప్రతి వస్తువు నిర్ధారిత సమయం ఆయన వద్ద నిర్దేశించబడి వుంది’ అనే వివరణ వుంది. 

3. అదృష్టవంతులు మరియు దురదృష్టవంతుల చిట్టా వారి యొక్క అంతిమ స్థితి ప్రకారం వుంటుంది. ఎందుకంటే మనిషి ‘ఫిత్రత్ ‘ సహజత్వం (ఇస్లాం) పై జన్మిస్తాడు. 

4. అంతిమ కర్మలే ప్రధానమైనవి. కనుక ఎల్లప్పుడు మనిషి భయభీతితోను మెలగాలి. 

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు: 

إِنَّ أَحَدَكُمْ لَيَعْمَلُ بِعَمَلِ أَهْلِ الْجَنَّةِ حَتَّى مَا يَكُونُ بَيْنَهُ وَبَيْنَهَا إِلَّا ذِرَاعٌ فَيَسْبِقُ عَلَيْهِ الْكِتَابُ فَيَعْمَلُ بِعَمَلِ أَهْلِ النَّارِ فَيَدْخُلُهَا. وَإِنَّ أَحَدَكُمْ لَيَعْمَلُ بِعَمَلِ أَهْلِ النَّارِ حَتَّى مَا يَكُونُ بَيْنَهُ وَبَيْنَهَا إِلَّا ذِرَاعٌ فَيَسْبِقُ عَلَيْهِ الْكِتَابُ فَيَعْمَلُ بِعَمَلِ أَهْلِ الْجَنَّةِ فَيَدْخُلُهَا”. 

నిస్సందేహంగా మీలో ఒకడు స్వర్గవాసుల పనులు చేస్తూ ఉంటాడు. చివరికి అతనికి మరియు దాని(స్వర్గాని)కి మధ్య కేవలం అర్ధ గజము మాత్రమే(దూరం) ఉంటుంది. అంతలో విధివ్రాత అతన్ని మించి పోతుంది. దాంతో అతను నరకవాసుల పనులు చేసి నరకములో ప్రవేశిస్తాడు.” 

5. చెడు కర్మలకు ఎల్లప్పుడు దూరంగా వుండాలి. ఎందుకంటే దానిపై మన అంతిమం కాకూడదు. 

6. అంతిమ కర్మలు విధిరాతతోను, పూర్వపు కర్మలతోను ముడిపడివుంటాయి. కనుక అంతిమ కర్మలు పూర్వకర్మల వారసత్వం అని చెప్పబడింది. 

7. మనిషి పుట్టుక గురించి తన తల్లి గర్భములోగల స్థితుల వివరణ. ఇంకా దాని పట్ల 

8. ఆత్మ ఊదటం అనేది 120 రోజుల తరువాత జరుగుతుంది. కనుక మనిషి దేహ జీవితం ఆత్మతోనే పూర్ణమవుతుంది. 

9. అల్లాహు తఆలా తన సృష్టి పట్ల శ్రద్ధవహిస్తున్నాడు. 

10. వినేవాడికి నొక్కి చెప్పటానికి ప్రమాణముతో చెప్పడం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సత్యమూర్తి అని పిలిపించుకున్నప్పటికీ ప్రమాణం చేసి చెప్పటం జరిగింది. దేనికంటే ఇవి అగోచర విషయాలు వాటి పట్ల ఆయనకు తెలియపర్చడం జరిగింది. అందుకనే నొక్కి చెప్పే అవసరము ఏర్పడింది. 

11. సతప్రవర్తనే స్వర్గములో ప్రవేశించటానికి మూలం. 

12. అల్లాహ్ తన దాసుడి భాగ్యములో ప్రసాదించిన ఉపాధిని సరిపెట్టుకోవాలి. అసూయ చెందకూడదు. ఉపాధి అనేది ఎల్లప్పుడు కర్మలతో ముడిపడి ఉంటుంది. 

13. ‘సహాబాలు’ (అనుచరులు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల చూపిన గౌరవ మర్యాదలు. 

14. పాపాత్ములకు ‘తౌబా’ (పశ్చాత్తాపం) చేయమని భయపెట్టడం. లేని పక్షంలో మనిషి అంతిమం గుణ పాఠం అవుతుంది. 

హదీసు ఉల్లేఖులు 

హజ్రత్ అబూ అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (రజియల్లాహు అన్హు):

అబూ అబ్దుర్రహ్మాన్ వీరి ‘కున్నియత్’. ఇస్లాం స్వీకరించిన పూర్వపు వ్యక్తుల్లో వీరిని గుర్తించడం జరుగుతుంది. అంతేకాక విద్యావేత్తల సహాబాల్లోని వారు. రెండు హిజ్రత్ ల విశిష్ఠత భాగ్యము కలిగియున్నవారు. ముందు ‘హబషా’ తరువాత ‘మదీన’ వైపుకు హిజ్రత్ చేసారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో కలిసి అన్ని యుద్ధాల్లో పాలుగొన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు వారిని చాలా గౌరవించేవారు. ‘ఉమర్’ (రజియల్లాహు అన్హు) సామ్రాజ్యపు కాలము మరియు ‘ఉస్మాన్’ (రజియల్లాహు అన్హు) సామ్రాజ్యపు తొలి దశల్లో ‘కూఫా’ ప్రాంతపు ‘ఖాజి‘, మరియు ‘బైతుల్మాల్‘ యొక్క కోశాధికారిగా వున్నారు. తరువాత ‘మదీన మునవ్వరహ్’ కి తిరిగి వచ్చేసారు. హి.శ 32వ సంవత్సరములో మరణించారు. 

(రి.సా. ఉర్దు – 1, పేజి:87) 

అల్ అర్బయీన్ అన్నవవియ్యహ్ – 40 హదీసుల సమాహారం(మెయిన్ పేజీ)
https://teluguislam.net/40h/

హదీసు 3: ఇస్లాం యొక్క మూల స్తంభాలు | అల్ అర్బయీన్ అన్నవవియ్యహ్

عَنْ أَبِي عَبْدِ الرَّحْمَنِ عَبْدِ اللَّهِ بْنِ عُمَرَ بْنِ الْخَطَّابِ رَضِيَ اللَّهُ عَنْهُمَا قَالَ: سَمِعْت رَسُولَ اللَّهِ صلى الله عليه و سلم يَقُولُ: ” بُنِيَ الْإِسْلَامُ عَلَى خَمْسٍ: شَهَادَةِ أَنْ لَا إلَهَ إلَّا اللَّهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللَّهِ، وَإِقَامِ الصَّلَاةِ، وَإِيتَاءِ الزَّكَاةِ، وَحَجِّ الْبَيْتِ، وَصَوْمِ رَمَضَانَ”. [رَوَاهُ الْبُخَارِيُّ] ، [وَمُسْلِمٌ].

పదాల విశ్లేషణ 

బునియ  بُنِيَ
(క్రియ): పునాది కట్టబడినది, నిర్మించబడినది 

عَلَى خَمْسٍ అలా ఖమ్ సిన్ : అయిదు స్తంభాల మీద 

إِقَامَ الصَّلَاةِ ఇఖామస్సలాతి:
నమాజుని వాటి షరతులతోపాటు ఎల్లప్పుడు ఆచరించుట 

إِيْتَاءِ الزَّكَاةِ ఈతాయిజ్జకాతి : జకాత్ ను హక్కుగల వారికి ఇవ్వుట 

بَيْتُ الله బైతుల్లాహ్ : అల్ కఅబతు 

అనువాదం 

హజ్రత్ ఇబ్నె ఉమర్(రదియల్లాహు అన్హు) ఉల్లేఖిస్తునారు: “నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ఇలా చెబుతుండగా విన్నాను:

ఇస్లాం ధర్మం ఐదింటి పై ఆధారపడి వుంది.
1. అల్లాహ్ తప్ప వేరొక (నిజమైన) ఆరాధ్యుడు లేడని, ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన (అల్లాహ్) దాసుడని, మరియు ఆయన ప్రవక్త అని సాక్ష్యం పలుకుట,
2. నమాజ్ స్థాపించుట,
3. జకాత్ చెల్లించుట,
4. అల్లాహ్ గృహము (కాబా) యొక్క “హజ్” యాత్ర చేయుట,
5.పవిత్ర రమదాన్ మాసపు ఉపవాసాలు పాటించుట”. 

హదీసు ప్రయోజనాలు 

1. ఐదు పూటల నమాజు యొక్క అవశ్యకత, దీనిపైనే ఇస్లాం నిలబడియున్నది. 

2. ఆలోచనల్లో చొచ్చుకుపోవటానికి జ్ఞానేంద్రియాల ద్వారా అర్ధమైయ్యే ఉపమానాలు ఇవ్వటం. ఇస్లాం మరియు దాని మౌలికల ఉపమానం పునాది పై నిర్మితమైయున్న ఇల్లు లాంటిది. 

3. ఐదు పూటల నమాజు చేయగలిగే శక్తి వున్న ప్రతి ఒక్కరిపై నమాజ్ పాటించుట విధి. ఎవరైతే షహాదతైన్, మరియు నమాజును విడనాడుతారో వారు ‘కుఫ్ర్’ చేసినట్లే (తిరస్కారానికి గురైనట్లై). 

4. ‘మాసము’ అనే పదము చెప్పకుండా కేవలం ‘రమదాన్’ పదము తోనే మాసము అని చెప్పుకోవచ్చు. 

5. ఇస్లాం అనేది అనేక రకాల విధులతో నిర్మితమైయున్నది. 

సూచనలు

సహీహ్ బుఖారీ-8, సహీహ్ ముస్లిం-16 
తెలుగు రియాజుస్సాలిహీన్ 2 – పేజి 72, హ1075.
(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం, విశ్వాస ప్రకరణలు) 

హదీసు ఉల్లేఖులు 

హజ్రత్ అబూ అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజియల్లాహు అన్హు): 

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ బిన్ నుఫైల్ బిన్ అబ్దుల్ ఉజ్జా అల్ ఖరషి, ‘అల్ అదవి’ అనేది పేరు. అబూ అబ్దుర్రహ్మాన్ కున్నియత్, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క సున్నతులను అందరికన్న ఎక్కువ అనుసరించే వారు. ఇందుకనే ఆయనకు ‘ముత్తబె సున్నత్‘ (సున్నత్ ను  అనుసరించేవారు) అనే బిరుదుతో గుర్తుచేయడం జరుగుతుంది. తమ తండ్రిగారుతోపాటు పిన్నతనంలోనే ఇస్లాం స్వీకరించి ముస్లిం అయ్యారు. ఆయన్ను ‘జాహిద్‘ (ప్రాపంచికతను విడనాడేవాడు), మరియు గట్టిజ్ఞానము గల సహాబాలో లెక్కించబడుతారు. మొదటి సారిగా ‘ఖన్ దఖ్‘ యుద్ధములో పాల్గున్నారు. పిన్న వయస్సు కారణంగా ‘బదర్’ యుద్ధములో అనుమతించబడలేదు. ‘ఖన్ దఖ్’ యుద్ధము తరువాత ఏ యుద్ధలములోనూ వెనుకవుండలేదు. ఎక్కువ హదీసులు ఉల్లేఖించే వారిలో వీరు కూడా వున్నారు. ఈయనతో హదీసు గ్రంధాల్లో దాదాపు 1630 హదీసులు ఉల్లేఖించిబడ్డాయి. 

(రి.సా. ఉర్దు – 1, పేజి:49)

అల్ అర్బయీన్ అన్నవవియ్యహ్ – 40 హదీసుల సమాహారం(మెయిన్ పేజీ)
https://teluguislam.net/40h/

అహ్లుస్ సున్నత్ వల్ జమాఅత్ అంటే ఎవరు? [పుస్తకం]

అహ్లుస్ సున్నత్ వల్ జమాఅత్ అంటే ఎవరు? [పుస్తకం]

Who is Ahlus Sunnah wal Jamah - Telugu Islam

[ఇక్కడ పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[మొబైల్ ఫ్రెండ్లీ] [PDF] [114 పేజీలు] [2.85 MB]

విషయసూచిక [డౌన్లోడ్]

ప్రవక్త ﷺ సున్నత్ అనుసరణ – ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]

ఉర్దూ మూలం : మౌలానా ముహమ్మద్ ఇక్బాల్ కీలానీ
తెలుగు అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
ప్రకాశకులు : హదీస్ పబ్లికేషన్స్

[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[మొబైల్ ఫ్రెండ్లీ బుక్ ][PDF] [120 పేజీలు] [5.13 MB]

విషయ సూచిక (డౌన్లోడ్)

  1. తొలి పలుకులు [13p]
  2. బిద్ అత్ (కొత్త పోకడలు) [22p]
  3. హదీసు వివరాల సంక్షిప్త బోధన [3p]
  4. సంకల్పం [1p]
  5. సున్నత్ నిర్వచనం [3p]
  6. సున్నత్ – ఖుర్ఆన్ వెలుగులో [6p]
  7. సున్నత్ మహత్తు [4p]
  8. సున్నత్ ప్రాముఖ్యం [9p]
  9. సున్నత్ యెడల భక్తి ప్రపత్తులు [3p]
  10. సున్నత్ వుండగా సొంత అభిప్రాయమా? [4p]
  11. ఖుర్ఆన్ అవగాహనకై సున్నత్ ఆవశ్యకత [8p]
  12. సున్నత్ను పాటించటం అవశ్యం [10p]
  13. ప్రవక్త సహచరుల దృష్టిలో సున్నత్ [8p]
  14. ఇమాముల దృష్టిలో సున్నత్ [4p]
  15. బిద్అత్ నిర్వచనం [2p]
  16. బిద్అత్ ఖండించదగినది [7p]
  17. బలహీనమైన, కాల్పనికమైన హదీసులు [2p]

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

హదీసు పబ్లికేషన్స్ వారు ప్రచురించిన పుస్తకాలు క్రింది లింక్ దర్శించి డౌన్లోడ్ చేసుకోగలరు.
https://teluguislam.net/hadith-publications-books/

అనుచర సమాజం (ఉమ్మత్)పై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హక్కులు | జాదుల్ ఖతీబ్

[ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/rights-of-the-prophet-on-ummah
[PDF [31 పేజీలు]

ఖుత్బా లోని ముఖ్యాంశాలు: 

తన అనుచర సమాజం (ఉమ్మత్) పై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హక్కులు: 

  • 1) అల్లాహ్ దాసుడిగా మరియు ప్రవక్తగా విశ్వసించడం. 
  • 2) తగిన విధంగా గౌరవించడం, 
  • 3) అల్లాహ్ తర్వాత, అత్యధికంగా ప్రేమించడం. 
  • 4) ఆదర్శాలను, సద్గుణాలను ఆచరించడం. 
  • 5) విధేయత చూపడం. 
  • 6) అభిప్రాయ భేదాలలో న్యాయనిర్ణేతగా స్వీకరించడం. 
  • 7) ఖుర్ఆన్ మరియు హదీసులకనుగుణంగా ఆచరించడం, 
  • 8) అత్యధికంగా దరూద్ పఠించడం. 

గడిచిన జుమా ఖుత్బాలో, మేము ప్రవక్తల నాయకుడైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్థాయి, మహత్యం, అద్భుతాలు మరియు ఆయన ప్రత్యేకతలలో కొన్నింటిని గూర్చి వివరించాము. మరి ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ప్రవక్తకు తన అనుచర సమాజం (ఉమ్మత్)పై ఉన్న హక్కులేంటి? రండి, ఖురాను మరియు హదీసుల వెలుగులో ఆ హక్కుల గురించి నేటి జుమా ఖుత్బాలో తెలుసుకుందాం. 

ముస్లిం సముదాయం మీద ప్రవక్త ﷺ వారి హక్కులు [వీడియో]

ముస్లిం సముదాయం మీద ప్రవక్త ﷺ వారి హక్కులు [వీడియో]
https://youtu.be/vCfZBWieaic [52 నిముషాలు]
వక్త:ముహమ్మద్ సలీం జామిఈ హఫిజహుల్లాహ్

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7