విశ్వాస పాఠాలు [పుస్తకం]

బిస్మిల్లాహ్
Aqeedah Lessons
విశ్వాసానికి సంభందించి 91 హదీసులు

[ఇక్కడ పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి ] [PDF] [129 పేజీలు]

సంకలనం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

విశ్వాస పాఠాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3zyecdeAcRg4nd8ZRnA2Uw

వీడియో పాఠాలు:

విషయ సూచిక:

క్రింది చాప్టర్ లింకు పై క్లిక్ చేసి PDF చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి.

1. ఆచరణలు కేవలం మనో సంకల్పంపై ఆధారపడి ఉంటాయి ( హదీసు #1) [PDF లింక్] [4p]

2. ఇస్లాం మరియు ఈమాన్‌ రెండిటి భావాలు ఒక్కటే ( హదీసులు 2 – 4) [PDF లింక్] [8p]

3. ఇస్లాం ప్రచారం చేయండి ( హదీసులు 5 – 7) [PDF లింక్] [4p]

4. ఇస్లాం ఘనత ( హదీసులు 8 – 17) [PDF లింక్] [12p]

5. ఇస్లాం పునాదులు ( హదీసు 18 ) [PDF లింక్] [2p]

6. ఇస్లామీయ చిహ్నాలు ( హదీసులు 19-22) [PDF లింక్] [4p]

7. తౌహీద్‌ వైపు పిలుచుట ( హదీసులు 23,34) [PDF లింక్] [7p]

8. తౌహీద్‌ ఘనత ( హదీసులు 25,26) [PDF లింక్] [3p]

9. తౌహీదుపై స్థిరంగా ఉండే పాపాత్ములు శాశ్వతంగా నరకంలో ఉండరు ( హదీసులు 27, 28) [PDF లింక్] [3p]

10. షిర్క్‌ నుండి హెచ్చరిక ( హదీసులు 29-32) [PDF లింక్] [6p]

11. విశ్వాస శ్రేష్ఠత ( హదీసులు 33, 34) [PDF లింక్] [3p]

12. విశ్వాస గుణాలు, దాని చిహ్నాలు ( హదీసులు 35-43) [PDF లింక్] [10p]

13. విశ్వాసం తరుగుట, పెరుగుట ( హదీసులు 44-47) [PDF లింక్] [4p]

14. లాఇలాహ ఇల్లల్లాహ్‌ యొక్క షరతులు ( హదీసులు 48-51) [PDF లింక్] [7p]

15. లాఇలాహ ఇల్లల్లాహ్‌ ఘనత ( హదీసులు 52-53) [PDF లింక్] [4p]

16. అల్లాహ్‌ యొక్క మంచి నామములు, ఉత్తమ గుణాలు ( హదీసులు 54-72) [PDF లింక్] [19p]

17. అల్లాహ్‌ గురించి ఏ విషయాన్ని నిరాకరించుట విధిగా ఉంది ( హదీసులు 73-75) [PDF లింక్] [4p]

18. దైవదూతల గురించి ( హదీసు 76 ) [PDF లింక్] [2p]

19. ప్రవక్త వద్దకు వహీ (దైవవాణి) ఎలా వచ్చేది? ( హదీసు 77 ) [PDF లింక్] [3p]

20. ప్రవక్త వద్దకు తొలిసారి వహీ ఎలా వచ్చింది? ( హదీసులు 78,79) [PDF లింక్] [8p]

21. వహీ అవతరించునప్పుడు ప్రవక్త పరిస్టితి? ( హదీసులు 80, 81) [PDF లింక్] [4p]

22. నిఫాఖ్‌ చిహ్నాలు ( హదీసులు 82-84) [PDF లింక్] [4p]

23. ‘కుఫ్ర్’ అన్న పదానికి వేరు వేరు అర్దాలు గలవు ( హదీసు 85 ) [PDF లింక్] [2p]

24. ఘోరపాపానికి పాల్పడిన ముస్లింను కాఫిర్‌ అనరాదు ( హదీసులు 86, 87) [PDF లింక్] [5p]

25. సిఫారసు (షఫాఅత్‌) ( హదీసు 88 ) [PDF లింక్] [2p]

26. స్వర్గంలో విశ్వాసులకు అల్లాహ్‌ దర్శనం లభించును ( హదీసులు 89-91) [PDF లింక్] [12p]

[క్రింద పూర్తి పుస్తకం చదవండి]

విశ్వాస పాఠాలు

[آَمَنَ الرَّسُولُ بِمَا أُنْزِلَ إِلَيْهِ مِن رَبِّهِ وَالمُؤْمِنُونَ كُلٌّ آَمَنَ بِاللهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِنْ رُسُلِهِ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ المَصِيرُ] {البقرة: 285}

{ప్రవక్త తనపై తన ప్రభువు నుండి అవతరించిన దానిని విశ్వసించాడు. ఈ ప్రవక్తను విశ్వసించిన వారు కూడా దానిని హృదయ పూర్వకంగా విశ్వసించారు. వారంతా అల్లాహ్ నూ, ఆయన దూతలనూ, ఆయన గ్రంథాలనూ, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. వారు ఇలా అంటారు: “మేము అల్లాహ్ పంపిన ప్రవక్తలలోని ఏ ఒక్కరినీ భేదభావంతో చూడము. మేము ఆదేశం విన్నాము, శిరసావహించాము. ప్రభువా! క్షమాభిక్ష పెట్టుమని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరకు మేమంతా నీవద్దకే మరలివస్తాము}.(సూరె బఖర 2:285).

[1] ఆచరణలు కేవలం మనో సంకల్పంపై ఆధారపడి ఉంటాయి

عَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: (إِنَّمَا الْأَعْمَالُ بِالنِّيَّاتِ وَإِنَّمَا لِكُلِّ امْرِئٍ مَا نَوَى فَمَنْ كَانَتْ هِجْرَتُهُ إِلَى اللهِ وَرَسُولِهِ فَهِجْرَتُهُ إِلَى اللهِ وَرَسُولِهِ وَمَنْ كَانَتْ هِجْرَتُهُ لِدُنْيَا يُصِيبُهَا أَوْ امْرَأَةٍ يَتَزَوَّجُهَا فَهِجْرَتُهُ إِلَى مَا هَاجَرَ إِلَيْهِ).

1- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “ఆచరణలు కేవలం మనోసంకల్పంపై ఆధారపడి ఉంటాయి. మనిషి దేని సంకల్పం చేసుకుంటాడో, అతనికి అదే ప్రాప్తమవుతుంది. (ఉదాహరణకు:) ఎవరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు వలసపోతారో అతని వలస మాత్రమే నిజమయినది. ఎవరు ప్రపంచం కొరకు లేదా ఏదైనా స్త్రీని వివాహమాడటానికి వలసపోతారో, అతని వలస ప్రపంచం కొరకు లేదా స్త్రీ కొరకుగానే పరిగణించబడుతుంది”. (బుఖారి 1, ముస్లిం 1907).

ఈ హదీసులో:

ఈ హదీసు ప్రతి ఆచరణకు పునాది లాంటిది. కర్మల అంగీకారం, తిరస్కారం మరియు అవి మంచివా లేదా చెడ్డవా అన్న విషయం మనోసంకల్పంపై ఆధారపడి ఉంటుంది. ఎవరు ఏ సంకల్పం చేస్తారో అతనికి అదే ప్రాప్తమవుతుంది. ఒక్కోసారి ఆచరణ బాహ్యంగా (చూడటానికి) చాలా మంచిగా ఉండవచ్చు. కాని సత్సంకల్పం లేని కారణంగా అది చేసిన వానికి ఏ లాభమూ దొరక్కపోవచ్చు. దీనికి సంబంధించిన నిదర్శనాలు ఖుర్ఆనులో మరీ స్పష్టంగా ఉన్నాయి:

[أَلَا للهِ الدِّينُ الخَالِصُ] {الزُّمر:3} [مُخْلِصِينَ لَهُ الدِّينَ] {البيِّنة:5} [لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ] {الزُّمر:65}

{జాగ్రత్తా! ధర్మం ప్రత్యేకంగా అల్లాహ్ కు చెందిన హక్కు మాత్రమే}. (జుమర్ 39:3). {పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్ని అల్లాహ్ కే ప్రత్యేకించుకోవాలి}. (బయ్యినహ్ 98: 5). {మీరు షిర్క్ చేస్తే మీ కర్మలన్నీ వ్యర్థమైపోతాయి}. (జుమర్ 39: 65).

ఈ హదీసులో తెలిసిన మరో విషయం ఏమనగా: మనస్సు కార్యమే (సంకల్పశుద్ధియే) అన్నిటికీ మూలం. మనిషి తాను చేసే ప్రతీ కార్యం తన ప్రభువు కొరకే ప్రత్యేకించి చేయుటకు, దాన్ని షిర్క్ దరిదాపులకు, ఇతర ఉద్దేశాలకు దూరంగా ఉంచుటకు ప్రయత్నం చేయాలి. ఆ కార్యం ద్వారా అల్లాహ్ సంతృప్తి మరియు స్వర్గంలో ఆయన దర్శన భాగ్యం పొందే ఉద్దేశ్యం మాత్రమే ఉంచాలి.

సర్వకార్యాలు, వాటి ఉద్దేశ్యాల్ని బట్టి ఉంటాయి తప్ప బాహ్యరూపంతో కాదు. ఎవరూ మరొకరి బాహ్యరూపం, బాహ్యాచరణలతో మోసపోకూడదు. అతని మనస్సులో కీడు చోటు చేసుకోవచ్చు. కానీ ప్రజల పట్ల సదుద్దేశం కలిగి ఉండటమే అసలైన విషయం.

ఆరాధనలు చేసేవారి పుణ్యాల్లో వ్యత్యాసం వారి మనస్సంకల్పాన్ని బట్టి ఉంటుంది అని కూడా తెలుస్తుంది.

ప్రమాణం, మ్రొక్కుబడి, విడాకులు, అలాగే షరతులు, వాగ్థానం, ఒప్పందాల్లాంటి విషయాల్లో సంకల్పం (నియ్యత్) తప్పనిసరిగా ఉండాలి. మరచిపోయేవాడు, బలవంతం చేయబడినవాడు, అజ్ఞాని, పిచ్చివాడు మరియు చిన్న పిల్లలు చేసే పనులు (ఉద్దేశపూర్వకంగా ఉండవు గనక) వారిపై ఇస్లామీయ ఆదేశాలు విధిగా లేవు. ఎవరు ఏ సంకల్పంతో చేస్తారో అతనికి అదే ప్రాప్తమవుతుంది. వేరేది కూడా లభించవచ్చునా లేదా అన్న విషయం అల్లాహ్ యే ఎరుగును. కాబట్టి మనుషుల సంకల్పాలను అల్లాహ్ తప్ప మరెవరూ ఎరుగరు.

ప్రదర్శనాబుద్ధి, పేరుప్రఖ్యాతులు పొందే సంకల్పం చాలా చెడ్డదని ఈ హదీసు ద్వారా తెలుస్తుంది. అది అల్లాహ్ యేతరులతో ఏదైనా పొందే ఉద్దేశ్యం క్రింద లెక్కించబడుతుంది. సత్సంకల్పం లేనిదే ఏ కార్యాలూ, సత్కార్యాలుగా పరిగణింపబడవు. ఎవరైతే ప్రాపంచిక లాభానికి ప్రాముఖ్యతనిచ్చి పరలోక లాభాన్ని విస్మరిస్తారో అతను పరలోక లాభాన్ని కోల్పోతాడు. మరెవరైతే పరలోక లాభానికి ప్రాముఖ్యతనిచ్చి, దానితో పాటు ప్రాపంచిక ప్రయోజనం కూడా పొందాలనుకుంటాడో అతనికి ప్రాపంచిక లాభం లభిస్తుంది మరియు పరలోకంలో కూడా సత్ఫలితం ప్రాప్తిస్తుంది. ఎవరైతే తాను చేసే ఆచరణ ద్వారా ప్రజల ప్రసన్నత పొందాలని ఉద్దేశిస్తాడో అతడు షిర్క్ చేసినవాడవుతాడు.

అల్లాహ్ చాలా సూక్ష్మజ్ఞాని అని మరియు అతి రహస్య విషయాలు కూడా ఎరుగువాడని ఈ హదీసు ద్వారా తెలుస్తుంది. ఇంకా దుష్టులను వారి దుష్సంకల్పం వల్ల హీనపరచకుండా వారి విషయం దాచి ఉంచి అల్లాహ్ తన దాసులపై చేసిన మేలు కూడా ఈ హదీసు ద్వారా తెలుస్తుంది.

సాఫల్యం పొందాలంటే ఆచరణలు ఎక్కువయి ఉంటే సరిపోదు. అవి సత్కార్యాలు అయి ఉండటం తప్పనిసరి. ఇఖ్లాస్ (అల్లాహ్ సంతృప్తి కొరకు, ఆయనకే ప్రత్యేకించి) మరియు ప్రవక్త పద్ధతి ప్రకారం చేయబడినప్పుడే ఏదైనా ఆచరణ సత్కార్యం అవుతుంది. చిన్న కార్యమైనా సరే ఇఖ్లాస్ తో కూడుకుంటే అదే చాలా గొప్పది. దీనికొక హదీసు కూడా సాక్ష్యముంది. మనిషి ఏదైనా కార్యం మొదలుపెట్టే ముందు తన నియ్యత్ (సంకల్పాన్ని) నిర్థారణ చేసుకోవాలి. ఫర్జ్ అయినా, నఫిల్ అయినా, ఏ కార్యమైనా నియ్యత్ లేనిదే అంగీకరింపబడదు. నియ్యత్ కొరకు నోటితో పదాలు ఉచ్చరించాల్సిన అవసరం లేదు. దేని విషయంలో స్పష్టమైన నిదర్శనం ఉందో అది తప్ప.

[2] ఇస్లాం మరియు ఈమాన్ రెండింటి భావాలు ఒక్కటే

عَن ابْنِ عَبَّاسٍ { قَالَ إِنَّ وَفْدَ عَبْدِ الْقَيْسِ لَـمَّا أَتَوْا النَّبِيَّ ﷺ قَالَ: (مَنْ الْقَوْمُ أَوْ مَنْ الْوَفْدُ) قَالُوا: رَبِيعَةُ قَالَ: (مَرْحَبًا بِالْقَوْمِ أَوْ بِالْوَفْدِ غَيْرَ خَزَايَا وَلَا نَدَامَى) فَقَالُوا: يَا رَسُولَ اللهِ إِنَّا لَا نَسْتَطِيعُ أَنْ نَأْتِيكَ إِلَّا فِي الشَّهْرِ الْحَرَامِ وَبَيْنَنَا وَبَيْنَكَ هَذَا الْحَيُّ مِنْ كُفَّارِ مُضَرَ فَمُرْنَا بِأَمْرٍ فَصْلٍ نُخْبِرْ بِهِ مَنْ وَرَاءَنَا وَنَدْخُلْ بِهِ الْجَنَّةَ وَسَأَلُوهُ عَنْ الْأَشْرِبَةِ فَأَمَرَهُمْ بِأَرْبَعٍ وَنَهَاهُمْ عَنْ أَرْبَعٍ أَمَرَهُمْ بِالْإِيمَانِ بِاللهِ وَحْدَهُ قَالَ: (أَتَدْرُونَ مَا الْإِيمَانُ بِاللهِ وَحْدَهُ) قَالُوا: اللهُ وَرَسُولُهُ أَعْلَمُ قَالَ: (شَهَادَةُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ وَإِقَامُ الصَّلَاةِ وَإِيتَاءُ الزَّكَاةِ وَصِيَامُ رَمَضَانَ وَأَنْ تُعْطُوا مِنْ الْمَغْنَمِ الْخُمُسَ) وَنَهَاهُمْ عَنْ أَرْبَعٍ عَنْ الْحَنْتَمِ وَالدُّبَّاءِ وَالنَّقِيرِ وَالْمُزَفَّتِ وَرُبَّمَا قَالَ الْمُقَيَّرِ وَقَالَ: (احْفَظُوهُنَّ وَأَخْبِرُوا بِهِنَّ مَنْ وَرَاءَكُمْ).

2- హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు ప్రకారం: అబ్దుల్ ఖైస్ మనుషులు కొందరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “మీరెవరు, ఏ తెగకు చెందినవారు?” అని అడిగారు. దానికి వారు ‘మేము రబీఅ తెగకు చెందిన వాళ్ళము’ అని అన్నారు. “ఓహో! మీరా, స్వాగతం! గౌరవనీయులారా!” ఏలాంటి సిగ్గు, అవమానం లేకుండా రావచ్చు!” అని ప్రవక్త అన్నారు. వారన్నారుః “ప్రవక్తా! మాకూ, మీకూ మధ్య సత్యతిరస్కారి అయిన ఈ ముజర్ తెగ అడ్డు గోడగా ఉంది. అందువల్ల మేము పవిత్ర మాసాల్లో తప్ప ఇతర సమయాల్లో మీ వద్దకు రాలేము. ఇప్పుడు మాకేమైనా స్వర్గ ప్రవేశానికి ఉపయోగపడే విషయాలు, స్పష్టమైన గీటురాయి ఆదేశాలు ఇవ్వండి. వీటిని మేము మాతో పాటు మీ దగ్గరికి రానటువంటి వారికి కూడా వినిపిస్తాము. అంతే కాదు, పానీయాలను గురించి కూడా వారు ప్రవక్తని అడిగారు.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాలుగు విషయాలను ఆచరించాలని, నాలుగు విషయాలను మానుకోవాలని వారికి ఆదేశించారు. ఏకైక అల్లాహ్ ను విశ్వసించాలని చెబుతూ “ఏకైక అల్లాహ్ ను విశ్వసించాలంటే ఏమిటో మీకు తెలుసా?” అని అడిగారు. దానికి వారు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు మాత్రమే బాగా తెలుసు. (మాకు తెలియదు) అని అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా విశదపరిచారు: “ఏకైక అల్లాహ్ ను విశ్వసించటమంటే అల్లాహ్ తప్ప సత్యమైన ఆరాధ్యుడు లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనచేత నియమించబడిన ప్రవక్త అని సాక్ష్యమివ్వాలి. నమాజు వ్యవస్థను నెలకొల్పాలి, జకాత్ (పేదల ఆర్థిక హక్కు) చెల్లించాలి, రమజాను ఉపవాసాలు పాటించాలి, యుద్ధ ప్రాప్తిలో ఐదవ వంతు సొమ్ము ప్రభుత్వ ధనగారానికి ఇవ్వాలి”. ఆ తర్వాత, హన్తమ్, దుబ్బా, నఖీర్, ముజఫ్ఫత్([1]). అనే నాలుగు రకాల పాత్రలలో నీళ్ళు ఉంచడాన్ని, త్రాగడాన్ని వారించారు. హదీసు ఉల్లేఖకులు ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఒక్కోసారి ముజఫ్ఫత్ అనడానికి బదులు ముఖయ్యర్ అని పలికేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాలు బోధిస్తూ “ఈ ఆదేశాలను బాగా గుర్తుంచుకోండి. మీతో పాటు ఇక్కడికి రాని మీ ప్రాంతం వాళ్ళకు కూడా తెలియజేయండి” అని అన్నారు. (బుఖారి 53, ముస్లిం 17).

ఈ హదీసులో:

ఆచరణలు విశ్వాసములో ఓ భాగము. గురువు ఒక విషయాన్ని ముందు సంక్షిప్తంగా చెప్పి, తర్వాత దానిని వివరించడం అభిలషణీయం. అందువల్ల అతని మాట అర్థమవుతుంది. గురువు హితబోధ చేస్తున్నప్పుడు ‘మూలజ్ఞానం మరియు అతిముఖ్యమైన విషయాలు ముందుగా చెప్పాలని మరియు అర్థమగుటకు సంగ్రహముగా చెప్పాలని కూడా ఈ హదీసు సూచిస్తుంది. చూడడానికి ఇందులో ఐదు ఆదేశాలు కనబడుతున్నాయి. అయితే యుద్ధప్రాప్తిలోని ఐదో వంతు విషయం జకాత్ పరిధిలోనే వస్తుంది. ఎందుకనగా అది ధనం, సొమ్ముకు సంబంధించినదే కదా. ఇలా ఆదేశాలు నాలుగే అవుతాయి.

కొందరు హదీసువేత్తల అభిప్రాయ ప్రకారం పైన చెప్పబడిన నాలుగు నివారణలు రద్దయినాయి. అంటే ఇతర సహీ హదీసుల ఆధారంగా ఆ పాత్రలు ధర్మసమ్మతమైన పానీయాలు త్రాగడానికి ఉపయోగించవచ్చు.

(మదిలో, ఆచరణ రూపంలో) విద్యను భద్రపరచి, ఇతరులకు అందజేయడం గురించి ఈ హదీసులో ప్రోత్సహించబడింది. విద్యాభ్యాసం క్రమపద్ధతిలో ఉండడం మంచిదని చెప్పబడింది.

ఇందులో హజ్ ప్రస్తావన రాలేదు. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆదేశాలు ఇచ్చేటప్పడు హజ్ యాత్ర విధిగా నిర్ణయించబడలేదు అని కొందరు పండితులు చెప్పారు.

వచ్చేవారితో వారి పేరు, వంశం గురించి అడగడం జరిగింది. ఇది సున్నత్ (ప్రవక్తవారి సత్సంప్రదాయం). వచ్చే అతిథుల మనుసు చూరగొని, ఒంటరితన భావాన్ని దూరం చేయుటకు మంచి పద్ధతిలో స్వాగతం పలకాలని ఈ హదీసులో ఉంది.

ఈ హదీసులో ఇస్లాం యొక్క అర్కాన్ (మౌలిక విషయా)లను ఈమాన్ యొక్క వ్యాఖ్యానంలో తెలుపడం జరిగింది. దీనితో తెలిసిందేమిటంటే ఇస్లాం మరియు ఈమాన్ ప్రస్తావన విడివిడిగా వచ్చినప్పుడు ప్రతి దాంట్లో ఇస్లాం మరియు ఈమాన్ రెండింటికి సంబంధించిన అర్కానులు వస్తాయి. మరెప్పుడైతే రెండింటి ప్రస్తావన ఒకచోట వస్తుందో దేని భావం దానికే ఉంటుంది.

عَنِ الْبَرَاءِ بْنِ عَازِبٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: كُنَّا جُلُوسًا عِنْدَ النَّبِيِّ ﷺ فَقَالَ: (أَيُّ عُرَى الْإِسْلَامِ أَوْسَطُ) قَالُوا: الصَّلَاةُ قَالَ: (حَسَنَةٌ وَمَا هِيَ بِهَا) قَالُوا: الزَّكَاةُ قَالَ: (حَسَنَةٌ وَمَا هِيَ بِهَا) قَالُوا: صِيَامُ رَمَضَانَ قَالَ: (حَسَنٌ وَمَا هُوَ بِهِ) قَالُوا: الْحَجُّ قَالَ: (حَسَنٌ وَمَا هُوَ بِهِ) قَالُوا: الْجِهَادُ قَالَ: (حَسَنٌ وَمَا هُوَ بِهِ) قَالَ: (إِنَّ أَوْسَطَ عُرَى الْإِيمَانِ أَنْ تُحِبَّ فِي اللهِ وَتُبْغِضَ فيِ اللهِ).

3- బరా బిన్ ఆజిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో కూర్చొని ఉండగా “ఇస్లాం యొక్క గట్టి, బలమైన కంకనం ఏది?” అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు. నమాజ్ అని మేమన్నాము. ప్రవక్త చెప్పారు: “అది మంచిదే. కాని నేను కోరిన సమాధానం అది కాదు”. జకాత్ కావచ్చు అని మేమన్నాము. ప్రవక్త అన్నారు: “అది మంచిదే. కాని నా ప్రశ్నకు జవాబు అది కాదు”. అయితే రమజాను ఉపవాసాలు అయి యుండాలి అని మేమన్నాము. ప్రవక్త అన్నారు: “అది మంచిదే. కాని నేను కోరిన సమాధానం కాదు”. హజ్ కావచ్చునా అని అడిగాము. “అది మంచిదే. కాని నేను అడిగింది అది కాదు” అన్నారాయన. అయితే అది జిహాద్ అయి యుండాలి అని అన్నాము. దానికి కూడా ప్రవక్త చెప్పారు: “అదీ మంచిదే. కాని నేను కోరిన సమాధానం అది కాదు”. తర్వాత ఆయనే దాని సమాధానం ఇలా చెప్పారుః “నీవు ఒకరిని ప్రేమించినా అల్లాహ్ కొరకే ప్రేమించాలి. ద్వేషించినా అల్లాహ్ కొరకే ద్వేషించాలి. ఇది ఈమాన్ యొక్క బలమైన కంకనం”. (అహ్మద్ 4/286. సహీహుత్ తర్ఘీబ్ 3030).

ఈ హదీసులో:

ఇస్లామీయ పరంగా పరస్పర బంధాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి, వాటిలో చాలా బలమైన బంధం: ఎవరితోనైనా ప్రేమించుట, ద్వేషించుట కేవలం అల్లాహ్ కొరకే ఉండాలి. స్నేహం, శతృత్వం మరియు ప్రేమ, ద్వేషాలు అల్లాహ్ కొరకే చేయుట ధర్మంగా పరిగణించబడతాయి. అల్లాహ్ యొక్క విధేయులను ప్రేమించుట, అవిధేయులను ద్వేషించుట ముస్లింపై విధిగా ఉంది. రక్త సంబంధం వల్ల గాని మరే ఇతర ప్రాపంచిక సంబంధాల వల్ల గాని ఉండే ప్రేమల కంటే అధికంగా అల్లాహ్ కొరకు ప్రేమ ఉండాలి. ప్రతి మనిషితో అతనిలో ఎంత విధేయత ఉంటుందో అంతే ప్రేమ, ఎంత అవిధేయత ఉంటుందో అంతే ద్వేషం ఉండాలి. ఒకే మనిషితో కొంత ప్రేమ, కొంత ద్వేషం రెండూ ఉండవచ్చు. అది అతనిలో ఉన్న విధేయత మరియు అవిధేయతలను బట్టి. ఒక మనిషి ఎవరితో ప్రేమించినా, ద్వేషించినా అది ధార్మిక పునాదిపై ఉండాలి.

{ఈ సంచార అరబ్బులు, “మేము విశ్వసించాము” అని అంటారు. వారితో ఇలా చెప్పండి: “మీరు విశ్వసించలేదు. మేము లొంగిపోయాము” అని అనండి. విశ్వాసం ఇంకా మీ హృదయాలలోకి ప్రవేశించలేదు}. (హుజురాత్ 49: 14).

عَنْ سَعْدِ بْنِ أَبِي وَقَّاصٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ أَنَّ رَسُولَ اللهِ ﷺ أَعْطَى رَهْطًا وَسَعْدٌ جَالِسٌ فَتَرَكَ رَسُولُ اللهِ ﷺ رَجُلًا هُوَ أَعْجَبُهُمْ إِلَيَّ فَقُلْتُ: يَا رَسُولَ اللهِ مَا لَكَ عَنْ فُلَانٍ فَوَاللهِ إِنِّي لَأَرَاهُ مُؤْمِنًا فَقَالَ: (أَوْ مُسْلِمًا) فَسَكَتُّ قَلِيلًا ثُمَّ غَلَبَنِي مَا أَعْلَمُ مِنْهُ فَعُدْتُ لِمَقَالَتِي فَقُلْتُ: مَا لَكَ عَنْ فُلَانٍ فَوَاللهِ إِنِّي لَأَرَاهُ مُؤْمِنًا فَقَالَ: (أَوْ مُسْلِمًا) ثُمَّ غَلَبَنِي مَا أَعْلَمُ مِنْهُ فَعُدْتُ لِمَقَالَتِي وَعَادَ رَسُولُ اللهِ ﷺ ثُمَّ قَالَ: (يَا سَعْدُ إِنِّي لَأُعْطِي الرَّجُلَ وَغَيْرُهُ أَحَبُّ إِلَيَّ مِنْهُ خَشْيَةَ أَنْ يَكُبَّهُ اللهُ فِي النَّارِ).

4- సఅద్ బిన్ అబీ వఖ్ఖాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ఓసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొంత మందికి ధనం పంచి పెట్టారు. కాని నాకు ఇష్టమయిన ఒక వ్యక్తికి మాత్రం ఏమీ ఇవ్వకుండా వదిలేశారు. అప్పుడు నేను (ఆశ్చర్యపోతూ) ప్రవక్తా! మీరు ఈ వ్యక్తి పట్ల ఇలా ఎందుకు వ్యవహరించారు? అల్లాహ్ సాక్షి! నేను మాత్రం ఇతడ్ని మోమిన్ (విశ్వాసి)గా భావిస్తున్నాను అని అన్నాను. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఏమిటి, మోమినా లేక ముస్లిమా? అని అడిగారు. ఆయన మాటలు విని నేను కాస్సేపు మౌనంగా ఉండిపోయాను. కాని ఆ తర్వాత ఆ వ్యక్తి గురించి నాకు తెలిసిన విషయాలు నన్ను మరోసారి ఈ సంగతి అడిగేందుకు ఒత్తిడి చేశాయి. నేను సంగతిని తిరిగి ప్రస్తావిస్తూ మీరు ఈ మనిషి పట్ల ఇలా ఎందుకు వ్యవహరించారు? అల్లాహ్ సాక్షిగా! నా దృష్టిలో ఇతను మోమినే అని అన్నాను. దానికి ప్రవక్త “ఏమిటి, మోమినా లేక ముస్లిమా?” అని అన్నారు. దాంతో నేను మరోసారి మౌనంగా ఉండిపోయాను. అయితే కాస్సేపటి తర్వాత అతడ్ని గురించి నేనెరిగిన విశేషాలు నన్ను మళ్ళీ ప్రశ్నించేలా చేశాయి. నేనా సంగతిని మళ్ళీ ప్రస్తావించాను. ప్రవక్త కూడా తిరిగి అదే సమాధానమిచ్చి ఊరుకున్నారు. ఆ తర్వాత కాస్సేపటికి ఇలా అన్నారుః “సఅద్! ఒక్కోసారి నేను నాకెంతో ఇష్టుడయిన మనిషిని వదిలేసి అంతకంటే తక్కువ ఇష్టుడైన మరొకతనికి ఇస్తుంటాను. (అలా ఇవ్వని పక్షంలో అతను ఇస్లాంకు దూరమయిపోవచ్చు తత్ఫలితంగా) అల్లాహ్ అతడ్ని నరకంలోకి విసిరి బోర్లా పడవేస్తాడేమోనన్న భయంతో నేనతనికి ధనం ఇస్తుంటాను”. (బుఖారి 27, ముస్లిం 150).

ఈ హదీసులో:

ఈమాన్, ఇస్లాం కంటే గొప్పది. ప్రతి మోమిన్ ముస్లిం, కాని ప్రతి ముస్లిం, మోమిన్ కాడు. సందేహం తొలిగిపోవుట కోసం, గురువు ఆపనంతవరకు, దండించనంతవరకు అడిగిన (చెప్పిన) విషయమే తిరిగి అడగవచ్చు/ చెప్పవచ్చు. ప్రజల్లో ఎక్కువ విశ్వాసం గలవారికే ఎక్కువ ధనం లభించాలన్నదేమి నియమం లేదు. ధనం ద్వారా ఇస్లామీయ ప్రచారం ముందుకు సాగించవచ్చు దాని ద్వారా హృదయాలు చూరగొనవచ్చు. తమ అనుచరులు సన్మార్గంపై ఉండాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతగా కాక్షించేవారో మరియు వారి పట్ల ఆయన ఎంత కనికరం గలవారో తెలిసింది. గురువు తన శిష్యులను సందిగ్థంలో పడవేసే విషయాల్ని విశదపరచడం, తమ ఉద్దేశ్యాన్ని స్పష్టం చేయడం ధర్మం అని తెలిసింది. తమ మనుస్సులో ఏ విషయం గురించి కలత, సందేహముందో దాన్ని గురువు ముందు ప్రస్తావిస్తే ఆయన అది తొలిగిపోయే మార్గం చూపించవచ్చు. నాయకుడు ప్రజల ధనాన్ని ధర్మాభివృద్ధి ఉద్దేశ్యంతో అవసరం గల ప్రజలకు ఇవ్వచ్చును.

[3] ఇస్లాం ప్రచారం చేయండి

{విశ్వసించిన ప్రజలారా! మీరు పూర్తిగా ఇస్లాంలో ప్రవేశించండి. షైతాను అడుగుజాడలను అనుసరించకండి. అతడు మీకు బహిరంగ శత్రువు}. (సూరె బఖర 2: 208).

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ عَنْ رَسُولِ اللهِ ﷺ أَنَّهُ قَالَ: (وَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ لَا يَسْمَعُ بِي أَحَدٌ مِنْ هَذِهِ الْأُمَّةِ يَهُودِيٌّ وَلَا نَصْرَانِيٌّ ثُمَّ يَمُوتُ وَلَمْ يُؤْمِنْ بِالَّذِي أُرْسِلْتُ بِهِ إِلَّا كَانَ مِنْ أَصْحَابِ النَّارِ).

5- “ముహమ్మద్ ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా! యూదుడైనా, క్రైస్తవుడైనా మరింకెవరైనా నా గురించి విని, నాతో పంపబడిన ధర్మాన్ని విశ్వసించకుండానే మరణిస్తే అతడు నరకవాసుల్లో చేరిపోతాడ” నిప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ముస్లిం 153).

ఈ హదీసులో:

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చిన ధర్మం ప్రజలందరికి, అన్ని మతాలవారికి మార్గదర్శకత్వం. ఈ ధర్మం వచ్చాక పూర్వ మతాలన్నియూ రద్దయినాయి. మాకు ఇస్లాం గురించి ఎవరూ తెలుపలేదు అన్న సాకులు ప్రళయదినాన ప్రజలు చెప్పకూడదంటే ఇస్లాం యొక్క సత్యసందేశం వారికి అందజేయుట మన కర్తవ్యం.

ప్రమాణం చేయమని కోరడం జరుగకున్నా తన మాటను బలపరచడం కొరకు ప్రమాణం చేయవచ్చు.

అల్లాహ్ కు చేయి ఉందని తెలిసింది. అది అల్లాహ్ కు తగిన రీతిలో ఉందని నమ్మాలి. కాని సృష్టిరాసుల చేతులతో పోల్చకూడదు.

ఇస్లాం సందేశం ఎవరి వరకు చేరలేదో వారి విషయం అల్లాహ్ యే చూసుకుంటాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆగమనం తర్వాత ఇస్లాం తప్ప ఏ ఇతర ధర్మమూ చెల్లదు. ఇదే విషయాన్ని అల్లాహ్ ఇలా తెలిపాడు:

{ఎవరైనా ఈ విధేయతా విధానం (ఇస్లాం) కాక మరొక మార్గాన్ని అవలంబించదలిస్తే, ఆ మార్గం ఎంతమాత్రం ఆమోదించబడదు. అతడు పరలోకంలో విఫలుడౌతాడు, నష్టపోతాడు}. (సూరె ఆలి ఇమ్రాన్ 3: 85).

عَنْ ابْنِ عُمَرَ { أَنَّ رَسُولَ اللهِ ﷺ قَالَ: (أُمِرْتُ أَنْ أُقَاتِلَ النَّاسَ حَتَّى يَشْهَدُوا أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ وَيُقِيمُوا الصَّلَاةَ وَيُؤْتُوا الزَّكَاةَ فَإِذَا فَعَلُوا ذَلِكَ عَصَمُوا مِنِّي دِمَاءَهُمْ وَأَمْوَالَهُمْ إِلَّا بِحَقِّ الْإِسْلَامِ وَحِسَابُهُمْ عَلَى اللهِ).

6- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారని ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారుః “అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త అని ప్రజలు సాక్ష్యమిచ్చి, నమాజు స్థాపించి, విధి దానం చెల్లించనంత వరకు వారితో యుద్ధం చేస్తూ ఉండాలని నాకు ఆజ్ఞ లభించింది. వారు ఈ విధులు పాటిస్తే వారి ధనప్రాణాలకు నా నుండి రక్షణ ఉంది ధర్మ రీత్యా తప్ప. మరియు వారి లెక్క అల్లాహ్ చూసుకుంటాడు”. (బుఖారి 25, ముస్లిం 22).

ఈ హదీసులో:

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ పని చేసినా అల్లాహ్ ఆదేశంతోనే చేసేవారు. ఆయన అల్లాహ్ సందేశాన్ని అందజేసేవారు. దాన్ని ఆచరణలోకి తెచ్చే, తెప్పించే ప్రయత్నం చేసేవారు. ఆచరణలు కూడా ఈమానులోనే వస్తాయి. నమాజు మరియు జకాతు విధులను నెరవేర్చనివాడు అవిశ్వాసానికి ఒడిగట్టినవాడవుతాడు. అన్ని కార్యాల్లో తౌహీదే మొదటి స్థానంలో ఉంది. ఇందులో “ఆచరణలు ఈమాన్(విశ్వాసం)లో లెక్కించబడవు” అని వాదించే “ముర్జియ” అనబడే వర్గం వారిని ఖండించబడినది. నమాజు, జకాత్ విధులను పాటించనివారితో రాజ్యం పోరాడాలని ఉంది. నమాజు మరియు జకాతులో వ్యత్యాసం పాటించరాదు. ధర్మభ్రష్టతకు గురైన వారితో యుద్ధం చేయుటకు అబూ బక్ర్ రజియల్లాహు అన్హు ఇదే హదీసును ఆధారంగా తీసుకున్నారు. బాహ్యంగా తనకు తాను ముస్లిమునని ప్రకటించినవాని ధనప్రాణాలకు రక్షణ గలదు. అతని ఆంతర్య విషయం అల్లాహ్ యే ఎరుగును. మునాఫిఖ్ (కపటవిశ్వాసి) ఇస్లామీయ బాహ్యకార్యాలు ఆచరిస్తాడు, కనుక అతనితో యుద్ధం చేయరాదు. అతని విషయం అల్లాహ్ యే చూసుకుంటాడు. “పవిత్ర వచనం” (“లాఇలాహ ఇల్లల్లాహ్” ముహమ్మదుర్ రసూలుల్లాహ్) పఠించిన వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం “రిసాలత్” (ప్రవక్త తత్వాన్ని) నమ్మినట్లే.

عَنْ أَنَسٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ أَنَّ رَسُولَ اللهِ ﷺ قَالَ لِرَجُلٍ: (أَسْلِمْ) قَالَ: أَجِدُنِي كَارِهًا قَالَ: (أَسْلِمْ وَإِنْ كُنْتَ كَارِهًا).

7- అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తికి ఇస్లాం ధర్మం గురించి బోధిస్తూ “నీవు ఇస్లాం స్వీకరించు” అని చెప్పారు. (ఇస్లామంటే నాకు అసహ్యమేమీ లేదు కానీ) ఇప్పుడు స్వీకరించాలన్న ఇష్టం నాకు లేదు అని చెప్పాడు. “నీకు ఇష్టం లేకున్నా సరే నీవు ఇస్లాం స్వీకరించు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు. (అహ్మద్ 3/109, 181. సహీహ 1454).

ఈ హదీసులో:

మంచి పనులు చేయుటకు మనిషి తన మనస్సును ఒప్పించాలి. మనస్సుకు భారం ఏర్పడినా సత్కార్యాలు చేయుటకు ముందడుగు వేయాలి. ప్రతీ కార్యం యొక్క సమాప్తం సంపూర్ణంగా ఉందా లేదా చూడబడుతుంది. కాని ఆరంభంలో ఉన్న కొరతను కాదు. పరిశీలన, యోచనకు ముందే ఇస్లాం స్వీకరించాలి. మనస్సు తృప్తికరంగా లేనప్పుడు చేసిన సత్కార్యం కూడా స్వీకరించబడవచ్చు.

[4] ఇస్లాం ఘనత

عَنْ ابْنِ شِمَاسَةَ الْمَهْرِيِّ قَالَ حَضَرْنَا عَمْرَو بْنَ الْعَاصِ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ وَهُوَ فِي سِيَاقَةِ الْمَوْتِ فَبَكَى طَوِيلًا وَحَوَّلَ وَجْهَهُ إِلَى الْجِدَارِ فَجَعَلَ ابْنُهُ يَقُولُ يَا أَبَتَاهُ أَمَا بَشَّرَكَ رَسُولُ الله ﷺ بِكَذَا أَمَا بَشَّرَكَ رَسُولُ الله ﷺ بِكَذَا قَالَ فَأَقْبَلَ بِوَجْهِهِ فَقَالَ إِنَّ أَفْضَلَ مَا نُعِدُّ شَهَادَةُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ إِنِّي كُنْتُ عَلَى أَطْبَاقٍ ثَلَاثٍ لَقَدْ رَأَيْتُنِي وَمَا أَحَدٌ أَشَدَّ بُغْضًا لِرَسُولِ الله ﷺ مِنِّي وَلَا أَحَبَّ إِلَيَّ أَنْ أَكُونَ قَدْ اسْتَمْكَنْتُ مِنْهُ فَقَتَلْتُهُ فَلَوْ مُتُّ عَلَى تِلْكَ الْحَالِ لَكُنْتُ مِنْ أَهْلِ النَّارِ فَلَمَّا جَعَلَ اللهُ الْإِسْلَامَ فِي قَلْبِي أَتَيْتُ النَّبِيَّ ﷺ فَقُلْتُ ابْسُطْ يَمِينَكَ فَلْأُبَايِعْكَ فَبَسَطَ يَمِينَهُ قَالَ فَقَبَضْتُ يَدِي قَالَ: (مَا لَكَ يَا عَمْرُو؟) قَالَ: قُلْتُ أَرَدْتُ أَنْ أَشْتَرِطَ قَالَ: (تَشْتَرِطُ بِمَاذَا؟) قُلْتُ: أَنْ يُغْفَرَ لِي قَالَ: (أَمَا عَلِمْتَ أَنَّ الْإِسْلَامَ يَهْدِمُ مَا كَانَ قَبْلَهُ وَأَنَّ الْهِجْرَةَ تَهْدِمُ مَا كَانَ قَبْلهَا وَأَنَّ الْحَجَّ يَهْدِمُ مَا كَانَ قَبْلَهُ). وَمَا كَانَ أَحَدٌ أَحَبَّ إِلَيَّ مِنْ رَسُولِ الله ﷺ وَلَا أَجَلَّ فِي عَيْنِي مِنْهُ وَمَا كُنْتُ أُطِيقُ أَنْ أَمْلَأَ عَيْنَيَّ مِنْهُ إِجْلَالًا لَهُ وَلَوْ سُئِلْتُ أَنْ أَصِفَهُ مَا أَطَقْتُ لِأَنِّي لَمْ أَكُنْ أَمْلَأُ عَيْنَيَّ مِنْهُ وَلَوْ مُتُّ عَلَى تِلْكَ الْحَالِ لَرَجَوْتُ أَنْ أَكُونَ مِنْ أَهْلِ الْجَنَّةِ ثُمَّ وَلِينَا أَشْيَاءَ مَا أَدْرِي مَا حَالِي فِيهَا فَإِذَا أَنَا مُتُّ فَلَا تَصْحَبْنِي نَائِحَةٌ وَلَا نَارٌ فَإِذَا دَفَنْتُمُونِي فَشُنُّوا عَلَيَّ التُّرَابَ شَنًّا ثُمَّ أَقِيمُوا حَوْلَ قَبْرِي قَدْرَ مَا تُنْحَرُ جَزُورٌ وَيُقْسَمُ لَحْمُهَا حَتَّى أَسْتَأْنِسَ بِكُمْ وَأَنْظُرَ مَاذَا أُرَاجِعُ بِهِ رُسُلَ رَبِّي).

8- ఇబ్ను షిమాస అల్ మహ్రీ ఉల్లేఖించారు: మేము అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు మరణ సమీపాన అతని వద్ద కూర్చొని ఉండగా, అతను చాలా సేపు ఏడ్చి తన ముఖాన్ని గోడ వైపు త్రిప్పుకున్నాడు. అప్పుడే అతని కుమారుడు నాన్నా! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీకు ఫలానా, ఫలానా శుభవార్తలు ఇవ్వలేదా? అని తృప్తినిచ్చారు. ఇది విని అతను తన ముఖాన్ని (మావైపు) త్రిప్పి ఇలా చెప్పారు: “లాఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లాహ్” సాక్ష్యాన్ని అన్నిటి కంటే అతిఉత్తమముగా భావించేవారము. విషయమేమిటంటే, నా జీవితంలో మూడు దశలు గడిచాయి. ప్రవక్తకంటే ఎక్కువ ద్వేషం మరెవ్వరితో లేని రోజులు గడిచాయి. అప్పట్లో నాకు మరీ ఇష్టమైన కార్యం ఏదైనా ఉంటే ఆయన్ను వశపరుచుకొని హతమార్చాలన్నదే. కాని ఒకవేళ నేను ఆ స్థితిలో చనిపోయి ఉంటే నరకవాసుల్లో చేరేవాడ్ని. కాని అల్లాహ్ దయ తలచాడు, ఇస్లాం కొరకు నా హృదయాన్ని తెరిచాడు. నేను ప్రవక్త వద్దకు వచ్చి, ప్రవక్తా! మీ కుడి చేతిని చాపండి. నేను ఇస్లాం స్వీకరిస్తూ శపథం చేస్తాను అని అన్నాను. ప్రవక్త తమ చెయ్యి చాపారు. కాని నేను వెంటనే నా చేతిని వెనక్కి తీసుకున్నాను. “నీకేమయింది, అమ్ర్!” అని ప్రవక్త ఆశ్చర్యంతో అడిగారు. నేను ఒక షరతు పెట్టదలుచుకున్నాను అని చెప్పాను. “నీ షరతు ఏమిటి?” అని ప్రవక్త అడిగారు. నా పాపాలన్నీ మన్నింపబడాలని నేను చెప్పాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తృప్తి పరిచారుః “ఏమీటి, నీకు తెలియదా? ఇస్లాం (స్వీకరణ) గత పాపాలన్నిటినీ తుడిచిపెడుతుంది. హిజ్రత్ (ధర్మ రక్షణకై వలసపోవుట) పూర్వ పాపాలన్నిటినీ తుడిచిపెడుతుంది. మరియు హజ్ కూడా పూర్వ తప్పిదాలను తుడిచిపెడుతుంది”. (ఆ పిదప నేను ఇస్లాం స్వీకరించాను).

ఆ నాటి నుండి నాకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ప్రియమైనవారు, మరియు నా దృష్టిలో ఆయనకంటే గొప్పవారు మరెవ్వరూ లేరు. వారి ఔన్నత్యపు గాంభీర్యం వల్ల నేను వారిని నా కళ్ళారా చూడగలిగేవాణ్ణి కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రూపు రేఖల్ని వర్ణించమని ఎవరైనా నన్ను అడిగితే నేను వర్ణించలేను. ఎందుకనగ నేను ఎన్నడూ వారిని నా కళ్ళారా చూడనేలేదు. ఇదే స్థితిలో గనక నేను చనిపోతే నిశ్చయంగా స్వర్గవాసుల్లో ఒకడిని అని ఆశించేవాడిని.

ఆ తర్వాత నాపై (ప్రభుత్వపరంగా) ఎన్నో బాధ్యతలు మోపబడ్డాయి. వాటి గురించి (నేను ప్రశ్నింపబడినప్పుడు) నా పరిస్థితి ఏమవుతుందో తెలియదు?

నేను చనిపోయిన తర్వాత నా జనాజ వెంటరోదించే, కేకలు పెట్టే స్త్రీలుగాని, అగ్నిగాని రాకూడదు. నన్ను ఖననం చేస్తున్నప్పుడు నా సమాధిపై కొద్ది కొద్దిగా మట్టి పోయండి. ఒంటెను కోసి దాని మాంసం పంచిపెట్టినంత సేపు మీరు నా సమాధి వద్దనే నిలిచి ఉండండి. నేను ధైర్యం, తృప్తి పొందుతాను. నా ప్రభువు పంపే దూతలకు నేనేమి సమాధానం చెబుతానో చూస్తాను. (ముస్లిం 121).

ఈ హదీసులో:

ఇస్లాం స్వీకరణ గత పాపాల విమోచనానికి మంచి సబబు. ఎవరు ఇస్లాంపై స్థిరంగా ఉంటాడో అతను పూర్వ పాపాల గురించి పట్టుబడడు. అలాగే హిజ్రత్ మరియు హజ్ కూడా పూర్వ పాపాల మన్నింపులకు కారణమవుతాయి.

గమనికః ఇస్లాం స్వీకరణ వల్ల చిన్నవి, పెద్దవి అన్ని పాపాల ప్రక్షాళన జరుగుతుంది. కాని హిజ్రత్ మరియు హజ్ వల్ల చిన్నవి, పెద్దవి అన్ని పాపాల మన్నింపు విషయంలో భేదాభిప్రాయం ఉంది. ఎందుకనగా పెద్ద పాపాల మన్నింపుకై స్వచ్ఛమైన తౌబా తప్పనిసరి. సత్కార్యాలు కూడా పాపాల మన్నింపుకై కారణమవుతాయి. ఎంత పెద్ద సత్కార్యముండునో అంతే పాపాలు మన్నించబడుతాయి. (ఖనన సంస్కారాలు పూర్తైన తర్వాత సమాధి వద్ద కొంత సేపు ఉండి దైవదూతలు వచ్చి అడిగే ప్రశ్నలకు అతను సరియైన సమాధానం చెప్పగలగాలని అల్లాహ్ తో అతని కొరకు దుఆ చేయాలని ఇతర హదీసుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పి ఉన్నారు. ఉః అబూదావూద్, కితాబుల్ జనాయిజ్, బాబుల్ ఇస్తిగ్ఫారి ఇందల్ ఖబ్రి లిల్ మయ్యిత్… -అనువాదకుడు-).

عَنِ ابْنِ عَبَّاسٍ { قَالَ: قِيلَ لِرَسُولِ اللهِ ﷺ: أَيُّ الْأَدْيَانِ أَحَبُّ إِلَى اللهِ قَالَ: (الْحَنِيفِيَّةُ السَّمْحَةُ).

9 ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం ప్రకారం, ధర్మాల్లో ఏ ధర్మం అల్లాహ్ కు చాలా ప్రియమైనదని ప్రవక్త వద్దకు వచ్చిన ప్రశ్నకు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ” షిర్క్ కు దూరమైన, అతిసులభమైన ఇస్లాం ధర్మం” అని సమాధానమిచ్చారు. (అహ్మద్ 1/236. హాఫిజ్ ఇబ్ను హజర్ రహిమహుల్లాహ్ ఫత్హుల్ బారి (హ. 38 తర్వాత) లో ఈ హదీసును “హసన్” అని చెప్పారు).

ఈ హదీసులో:

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పంపబడిన ఇస్లాం ధర్మం, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం కు ఇవ్వబడిన సవ్యమైన ధర్మమే. అది చాలా సులభమైనది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజల పట్ల సున్నితంగా ప్రవర్తించుటకు, వారిపై మోపబడిన భారాన్ని తగ్గించుటకు, వారి శృంఖలాలను తెంచుటకు పంపబడ్డారు. అల్లాహ్ ప్రేమిస్తాడని తెలిసింది. కాని అది ఆయనకు తగిన రీతిలో అని నమ్మాలి. సృష్టిరాసుల పరస్పర ప్రేమతో పోల్చరాదు.

ఘనత పరంగా ధర్మాల్లో వ్యత్యాసం గలదు. ఇబ్రాహీం అలైహిస్సలాంకు అతి చేరువుగా ఉన్నవారు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సున్నితంగా ప్రవర్తించుట, శుభవార్త వినిపిస్తూ మెలగుట మంచిదని, కష్టం కలిగించకుండా, విరక్తి కలిగించకుండా ఉండాలని చెప్పబడింది. ఈ విషయంలో ఈ హదీసు చాలా స్పష్టంగా ఉంది: “సున్నితంగా మెలగండి, కఠినంగా మెలగకండి. సంతోషం, సంతృప్తి కలిగించండి. విరక్తి కలిగించకండి”. (బుఖారి 69, ముస్లిం 1732).

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ عَنْ النَّبِيِّ ﷺ قَالَ: (إِنَّ الدِّينَ يُسْرٌ وَلَنْ يُشَادَّ الدِّينَ أَحَدٌ إِلَّا غَلَبَهُ فَسَدِّدُوا وَقَارِبُوا وَأَبْشِرُوا وَاسْتَعِينُوا بِالْغَدْوَةِ وَالرَّوْحَةِ وَشَيْءٍ مِنْ الدُّلْجَةِ).

10- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “నిశ్చయంగా ధర్మం సులువైనది. ఏ వ్యక్తి అయినా ధర్మం అనుసరణలో కాఠిన్య వైఖరి అవలంబిస్తే ధర్మమే అతనిపై ఆధిక్యత సాధిస్తుంది. (హెచ్చుతగ్గులు లేకుండా) సంపూర్ణ విధానాన్ని అవలంభించండి. లేదా దాని (సంపూర్ణతకు) సమీపాన చేరండి. (మీకు లభించే ప్రతిఫలంతో) సంబరపడండి. ఉదయం సాయంకాలం, మరికొంత రాత్రి సమయాల్లో (ఆరాధన చేయటం) ద్వారా సహాయాన్ని అర్థించండి”. (బుఖారి 39).

ఈ హదీసులో:

దీర్ఘ కాలం వరకు అల్లాహ్ ఆరాధన చేస్తూ ఉండడానికి మనిషి చురుకుగా ఉండే సమయాల సహాయం తీసుకోవాలి. అంటే ఆ సమయాల్లో ఆరాధనలు పాటించాలి. ఎల్లప్పుడూ చేస్తూ ఉండే అల్పమైన ఆచరణలు కొంత కాలం చేసి వదిలేసే అధిక ఆచరణల కంటే మేలైనవి. ఇస్లాం ధర్మం ప్రత్యేకతల్లో ఒకటి ఏమిటంటే అది చాలా సులభమైన ధర్మం. దాని ఆదేశాలు, నివారణలు మనిషి పాటించగలిగినవే. (అంటే మనిషి శక్తికి మించినవి కావు). శక్తికి మించిన శ్రమ భారాన్ని, ప్రవక్త సాంప్రదాయానికి భిన్నంగా అదనపు ఆరాధనల పాటింపును నెత్తిన వేసుకోవడం నివారించబడినది. ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా మధ్యేమార్గాన్ని అవలంభించాలన్న తాకీదు ఉంది. అదే రుజుమార్గం. మనిషి తన ఆరాధనలో పరిపూర్ణతకు చేరుకోలేక పోయినా దాని సమీపానికి చేరుకునే ప్రయత్నం చేయాలి. ఉదయం చేసే ఆరాధన, సత్కార్యాల ఘనత తెలిసింది. ఆ సమయం సత్కార్యాల అంగీకార రీత్యా, మరియు వాటిని పాటించుట కూడా చాలా అనుకూలమైనది. రాత్రిపూట కొంత సమయం తహజ్జుద్ నమాజులో గడిపే ఘనత కూడా తెలిసింది. అది అల్లాహ్ దయతో సదుద్దేశాలు సంపూర్ణమగుటకు ఆయన సహాయం లభించును. అస్ర్ అయిన వెంటనే మరియు మగ్రిబ్ కు ముందు ఖుర్ఆన్ పారాయణం, అల్లాహ్ స్మరణ (జిక్ర్)లో ఉండుట అభిలషణీయం. మధ్యేమార్గంలో ఉండి, అల్లాహ్ ప్రసన్నత పొందే సత్కార్యాలు చేస్తూ, ప్రవక్త సంప్రదాయాన్ని ఖచ్చితంగా అనుసరిస్తున్న విశ్వాసునికి మంచి శుభవార్తలు ఇవ్వబడ్డాయి.

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ أَنَّ رَسُولَ اللهِ ﷺ قَالَ: (يَا أَبَا سَعِيدٍ! مَنْ رَضِيَ بِاللهِ رَبًّا وَبِالْإِسْلَامِ دِينًا وَبِمُحَمَّدٍ نَبِيًّا وَجَبَتْ لَهُ الْجَنَّةُ).

11- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని, అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఓ అబూ సఈద్! అల్లాహ్ ను తన పోషకునిగా విశ్వసించి, ఇస్లాంను తన ధర్మంగా స్వీకరించి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తన ప్రవక్తగా నమ్మినవాడు తప్పక స్వర్గంలో ప్రవేశిస్తాడు”. (ముస్లిం 1884).

ఈ హదీసులో:

ఈ మూడింటిని ఎవరైతే పూర్తి విశ్వాసముతో, స్వచ్ఛత, సంకల్పశుద్ధితో నోటి ద్వారా పలుకుతాడో తప్పక అల్లాహ్ అతనిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. ఎందుకనగా మూడు విషయాల్ని అతడు వాస్తవం చేసిచూపాడు. మరియు ధర్మానికి సంబంధించిన ముఖ్య పునాదుల్ని నమ్మాడు. అవి: అల్లాహ్ పట్ల విశ్వాసం. సత్యధర్మ స్వీకారం. సత్యవంతులైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై నమ్మకం.

عَنْ عَائذِ بنِ عَمرو أَنَّهُ جَاءَ يَومَ الْفَتحِ مَعَ أبِي سُفيانَ بنِ حَربٍ وَرَسُولُ اللهِ ﷺ حَولَه أصْحَابُهُ فَقَالُوا: هَذَا أبُو سُفيانَ وَعَائِذُ بنُ عَمرو فَقَالَ رَسُولُ اللهِ ﷺ: (هَذَا عَائِذُ بنُ عَمرو وَأبو سُفيَانَ ، الإسْلاَمُ أَعَزُّ مِنْ ذَلِكَ، الإسلاَمُ يَعْلُو وَلاَ يُعلى).

12- ఆయిజ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, మక్కా జయింపబడిన రోజు అతను అబూ సుఫ్యాన్([2])తో కలసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చాడు. ఆయన చుట్టూ కూర్చొని ఉన్న సహచరులు (వీరు వస్తున్నది చూసి) అదిగో అబూ సుఫ్యాన్ మరియు ఆయిజ్ బిన్ అమ్ర్ అని అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “వీరు ఆయిజ్ బిన్ అమ్ర్ మరియు అబూ సుఫ్యాన్. ఇస్లాం ధర్మం ఇతనికంటే గౌరవనీయమైనది, గొప్పది. ఇస్లాం ధర్మం ఎన్నటికీ అగ్రస్థానం లో ఉంటుంది తప్ప క్రిందికి వంగి ఉండదు సుమా”. (సునన్ దార్ ఖుత్నీ, సుననుల్ కుబ్రా బైహఖీ. అల్ ఇర్వా 1268).

ఈ హదీసులో:

సర్వ మతాల్లోకెల్లా ఇస్లాం మాత్రమే అల్లాహ్ యొక్క సత్య ధర్మం. విశ్వాసి, అవిశ్వాసికన్నా ఎక్కువ గౌరవ, మర్యాదలకు అర్హుడు. ఆ అవిశ్వాసి ఎంత గొప్ప స్థానం, హోదా అంతస్తులు కలిగి ఉన్నవాడైనా సరే. ఎందుకంటే ఇస్లాం వీటన్నిటికంటే గొప్పది. గౌరవం, ప్రతిష్ట, ప్రేమ మర్యాదల్లో విశ్వాసి, అవిశ్వాసులు సమానులు కాజాలరు. ముస్లిం వద్ద ఇస్లాం ఉన్నందువల్ల అతని మాటే వేరు.

విశ్వాసి, అవిశ్వాస బంధువుల ఆస్తిలో హక్కుదారుడవుతాడు కాని అవిశ్వాసి, తన విశ్వాస బంధువుల ఆస్తిలో హక్కుదారుడు కాడని కొందరు పండితులు సిద్ధాంతీకరించారు. కాని నిజమైన మాటేమిటంటే విశ్వాసి, అవిశ్వాసులిద్దరూ పరస్పరం ఆస్తిలో హక్కుదారులు కాజాలరు.

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: (إِذَا أَسْلَمَ الْعَبْدُ فَحَسُنَ إِسْلَامُهُ كَتَبَ اللهُ لَهُ كُلَّ حَسَنَةٍ كَانَ أَزْلَفَهَا وَمُحِيَتْ عَنْهُ كُلُّ سَيِّئَةٍ كَانَ أَزْلَفَهَا ثُمَّ كَانَ بَعْدَ ذَلِكَ الْقِصَاصُ الْحَسَنَةُ بِعَشْرَةِ أَمْثَالِهَا إِلَى سَبْعِ مِائَةِ ضِعْفٍ وَالسَّيِّئَةُ بِمِثْلِهَا إِلَّا أَنْ يَتَجَاوَزَ اللهُ عَزَّ وَجَلَّ عَنْهَا)

13- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “ఏ దాసుడు ఇస్లాం స్వీకరించి, దాని ప్రకారం ఆచరిస్తాడో అతను గతంలో చేసిన ప్రతి పుణ్యాన్ని అల్లాహ్ వ్రాసి పెడతాడు. గతంలో చేసిన అతని ప్రతి పాపం మన్నించబడుతుంది. ఆ తర్వాత పుణ్యపాపాల ఫలితాల లెక్క కొత్తగా మొదలవుతుంది. ఒక సత్కార్య పుణ్యం పది రెట్ల నుండి ఏడువందల వరకు లభిస్తుంది. దుష్కార్య పాపము దానంతే లభిస్తుంది. అల్లాహ్ దయతలుస్తే మన్నించనూవచ్చు”. (నిసాయీ 4912).

ఈ హదీసులో:

కొందరు సంపూర్ణంగా ఇస్లాం ప్రకారం నడిచేవారుంటే మరికొందరు అసంపూర్ణంగా నడిచేవారుంటారు. అందుచేత వారిలో ఒకరిపై మరొకరికి ఘనత ఉంటుంది. అందుకే అది (ఇస్లాం, ఈమాన్) తరుగుతుంది, పెరుగుతుంది. ఇస్లాంలో ప్రవేశం ద్వారా పూర్వ పాపాలన్నీ మన్నించబడతాయి. అలాగే తౌబా (నిజమైన పశ్చాత్తాపంతో కూడిన క్షమాభిక్ష) ద్వారా పాపాలు మన్నించబడతాయి. అంతేకాదు సంకల్పశుద్ధి మరియు ప్రవక్త పద్ధతిని అనుసరించి చేసిన సత్కార్యాలు కూడా దుష్కార్యాలకు పరిహారమవుతాయి.

అల్లాహ్ కారుణ్యం చాలా విశాలమైనది. అందుకే సత్కార్య పుణ్యాన్ని పది రెట్ల నుండి ఏడువందల రెట్ల వరకు పెంచాడు. దుష్కార్య పాపం దానంతే ఉంచాడు. ఒక్కోసారి అల్లాహ్ దయతలచి సత్కార్యాలకు బదులుగా కాకుండా తనిష్టంతో పాపాల్ని మన్నిస్తాడు. కాని పెద్ద పాపాల మన్నింపుకై తప్పనిసరిగా తౌబా చేయవలసిందేనని ఆధారాలుగలవు. అవిశ్వాసుని ఏ ఒక్క కార్యం స్వీకరించబడదు అన్న విషయం తెలిసినదే. అయినా ఈ హదీసు ద్వారా కూడా తెలిసింది. ఈ హదీసులో దాసుడు అని సాధారణంగా చెప్పబడినది, అయితే స్త్రీలకు కూడా ఇదే పద్ధతి వర్తిస్తుంది.

عَنْ ابْنِ مَسْعُودٍ ﷺ قَالَ: قَالَ رَجُلٌ: يَا رَسُولَ اللهِ ﷺ أَنُؤَاخَذُ بِمَا عَمِلْنَا فِي الْجَاهِلِيَّةِ؟ قَالَ: (مَنْ أَحْسَنَ فِي الْإِسْلَامِ لَمْ يُؤَاخَذْ بِمَا عَمِلَ فِي الْجَاهِلِيَّةِ وَمَنْ أَسَاءَ فِي الْإِسْلَامِ أُخِذَ بِالْأَوَّلِ وَالْآخِرِ).

14- ఇబ్ను మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ‘ప్రవక్తా! మేము అజ్ఞాన కాలంలో (ఇస్లాం స్వీకరించక ముందు) చేసిన దుష్కార్యాల గురించి పట్టుబడతామా?’ అని ఒక వ్యక్తి ప్రశ్నించాడు. “ఎవరు ఇస్లాం స్వీకరించి తర్వాత సత్కర్మలు ఆచరిస్తూ ఉంటాడో, అతను అజ్ఞాన కాలంలో చేసిన దుష్కర్మల గురించి నిలదీయడం జరగదు. అయితే ఇస్లాం స్వీకరించిన తర్వాత కూడా దుష్కార్యాలు చేస్తూ ఉంటే, అతను గతంలో చేసినవాటితో పాటు మొత్తం పాపకార్యాల విషయంలో పట్టుబడిపోతాడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బదులిచ్చారు. (బుఖారి 6921, ముస్లిం 120).

ఈ హదీసులో:

ఎవరైతే సత్కర్మలు చేస్తూ, ఇస్లాంపై స్థిరంగా ఉంటారో వారి గత పాపాలకే ఇస్లాం పరిహారమవుతుంది. పాపాల పరిహారానికి ఇస్లాంలో వట్టి ప్రవేశం సరిపోదు. ఇస్లాంపై నిలకడ చూపి, సర్వ వ్యవహారాల్లో సత్యవంతునిగా మెలగాలి.

ఇస్లాం స్వీకరించిన తర్వాత కూడా దుష్కర్మలు చేస్తూ, దుర్మార్గ జీవితం గడుపుతూ ఉండేవారి పూర్వ పాపాలు కూడా అలాగే ఉంటాయని తెలిసింది. పాపం యొక్క నష్టము, ప్రభావము ఎలా ఉంటుందనేది తెలిసింది. పాపాల్లో మునిగియుండుట ఎంత భయంకర విషయమో కూడా తెలిసింది.

عَن حَكِيم بْن حِزَامٍ أَنَّهُ قَالَ لِرَسُولِ اللهِ ﷺ أَيْ رَسُولَ اللهِ أَرَأَيْتَ أُمُورًا كُنْتُ أَتَحَنَّثُ بِهَا فِي الْجَاهِلِيَّةِ مِنْ صَدَقَةٍ أَوْ عَتَاقَةٍ أَوْ صِلَةِ رَحِمٍ أَفِيهَا أَجْرٌ؟ فَقَالَ رَسُولُ اللهِ ﷺ: (أَسْلَمْتَ عَلَى مَا أَسْلَفْتَ مِنْ خَيْرٍ).

15- హకీం బిన్ హిజాం ఉల్లేఖించారుః నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడుతూ ‘ప్రవక్తా! నేను నా అవిశ్వాస జీవితంలో దానధర్మాలు, బానిసల విముక్తి, బంధువుల పట్ల దయాదాక్షిణ్యాలు మొదలైన సత్కార్యాలు చేశాను. మరి నాకు వాటి సత్ఫలం లభిస్తుందా? అని అడిగాను. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానం ఇచ్చారుః “నీవు ఇస్లాం స్వీకరించిన కారణంగా నీ గత సత్కార్యాలకు కూడా ఇప్పుడు పుణ్యఫలం లభిస్తుంది”. (బుఖారి 1436, ముస్లిం 123).

ఈ హదీసులో:

ఇస్లాంలో అడుగు పెట్టిన వ్యక్తి, గతంలో చేసిన సత్కర్మలు అల్లాహ్ దయతో సత్కర్మల జాబితాలో లిఖించబడతాయి. ఇస్లాం సత్కర్మల గురించి బోధిస్తుంది, దుష్కర్మలను వారిస్తుంది. సత్కర్మల, సద్వచనాల స్థాపనకు, దుష్కర్మల, దుర్వచనాల నిర్మూలానికే ఇస్లాం ధర్మం వచ్చింది. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓ సందర్భంలో ఇలా చెప్పారుః “నన్ను ఉత్తమ నైతిక ప్రమాణాల పరిపూర్ణతకై పంపడం జరిగింది”. (సుననుల్ కుబ్రా బైహఖి 10/192).

عَنْ أَبِى هُرَيرَةَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (مَنْ أسْلَمَ عَلَى شَئ فَهُوَ لَهُ).

16- “ఒక వ్యక్తి ఇస్లాం స్వీకరించినప్పుడు అతనిది ఏదైనా హక్కు ఉంటే ఆ హక్కు అతనికి లభించును” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ముస్నద్ అబూ యఅలా. ఇర్వాఉల్ గలీల్ 1716).

ఈ హదీసులో:

ఆస్తి, భూమి, ధనం మొదలైన వాటిలో ఏదైనా హక్కు ఒక వ్యక్తికి రావలసిన సందర్భంలో అతను ఇస్లాం స్కీకరిస్తే ఆ వ్యక్తి తనకు చెందిన (యోగ్యమైన) హక్కును గురించి అడగవచ్చు, అది లభించినప్పుడు నిస్సంకోచంగా తీసుకోవచ్చు. కాని అది అతనిది కాదు అని ఏదైనా బలమైన ఆధారం ఉంటే తప్ప. ఇస్లాం అన్ని రకాల యోగ్యమైన హక్కులను కాపాడుటకు, యోగ్యమైన ఒప్పందాలు నెరవేర్చుటకు వచ్చింది.

عَن صَخْرِ بْنِ عَيْلَةَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ أَنَّ قَوْمًا مِنْ بَنِي سُلَيْمٍ فَرُّوا عَنْ أَرْضِهِمْ حِينَ جَاءَ الْإِسْلَامُ فَأَخَذْتُهَا فَأَسْلَمُوا فَخَاصَمُونِي فِيهَا إِلَى النَّبِيِّ ﷺ فَرَدَّهَا عَلَيْهِمْ وَقَالَ: (إِذَا أَسْلَمَ الرَّجُلُ فَهُوَ أَحَقُّ بِأَرْضِهِ وَمَالِهِ).

17- సఖ్ర్ బిన్ ఐలా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఇస్లాం వచ్చిన రోజుల్లో ‘బనూ సులైమ్’ తెగకు చెందినవారు కొందరు తమ భూములను వదిలేసి పారిపోయారు. నేను వాటిని కాజేసుకున్నాను. వారు ఇస్లాం స్వీకరించిన తర్వాత వాటి విషయంలో నాతో వాదించి, నన్ను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీసుకెళ్ళారు. ప్రవక్త వారి భూములు వారికి ఇప్పించి ఇలా చెప్పారు: “ఎవరైనా ఇస్లాం స్వీకరించారంటే అతనికి చెందిన భూమి, సొమ్ము అతనిదే అవుతుంది”. (వాటిని ఆక్రమించుకునే హక్కు ఇతరులకు ఉండదు). (అహ్మద్. సహీహ 1230).

ఈ హదీసులో:

ఎవరైనా ఇస్లాం స్వీకరిస్తే వారికి చెందిన భూములు, ఆస్తులకు వారే అర్హులు. వారి నుండి లాగుకునే హక్కు ఎవరికీ ఉండదు. ఏ ఆస్తి ఒప్పందాలు ఇస్లాంకు వ్యతిరేకంగా లేవో ఆ ఆస్తికి హక్కు దారుడైన ఒక వ్యక్తి ఇస్లాం స్వీకరించినచో అవి అతని సొత్తే.

[5] ఇస్లాం పునాదులు

عَنِ ابْنِ عُمَرَ { قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: (بُنِيَ الْإِسْلَامُ عَلَى خَمْسٍ شَهَادَةِ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ وَإِقَامِ الصَّلَاةِ وَإِيتَاءِ الزَّكَاةِ وَحَجِّ الْبَيْتِ وَصَوْمِ رَمَضَانَ).

18- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని, అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు: “ఇస్లాం పునాది ఐదు విషయాలపై ఉంది: అల్లాహ్ తప్ప ఆరాధ్యుడు మరొక్కడు లేడు అని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దాసుడు మరియు ప్రవక్త అని సాక్ష్యమిచ్చుట. నమాజ్ స్థాపించుట. జకాత్ చెల్లించుట. హజ్ చేయుట. రమజాను మాసమెల్లా ఉపవాసముండుట”. (ముస్లిం 16, బుఖారి 8).

ఈ హదీసులో:

సత్కార్యాల్లో కొన్నిటికి మరికొన్నిటిపై ఘనత గలదు. అందులో కొన్ని ముఖ్యమైనవి అయితే మరికొన్ని అతిముఖ్యమైనవి. అందులో పునాదులు (మౌలిక విషయాలు), విధులు, సున్నతులు కూడా ఉన్నాయి. అయితే ఇస్లామీయ పునాదులు ఐదున్నాయి. కొందరు ఐదుకంటే ఎక్కువ అని, మరి కొందరు అంతకు తక్కువ అని చెప్పారు. (కాని నిజమైన మాట ఐదే). ఆచరణలు విశ్వాసములో పరిగణించబడతాయి. ‘ముర్జియా’ పేరుగల ఓ వర్గం యొక్క అభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. కాని వారి అభిప్రాయం తప్పు. పవిత్ర వచనం (లాఇలాహ ఇల్లల్లాహ్) యొక్క సాక్ష్యం పలకడంలో తటపటాయించడంగాని, ఆలోచనలుగాని ఉండకూడదు. ఇస్లామీయ పునాదులను పాటించువాడు ముస్లిమనబడును. అతడు వాటిని (మనస్ఫూర్తిగా కాకుండా) బాహ్యరూపంలో పాటిస్తే అతడు బాహ్యరూపంలో ముస్లిం అగును. మనస్ఫూర్తిగా పాటిస్తే బాహ్యాంతరంగా నిజమైన ముస్లిం అగును. కొందరు ఉల్లేఖకులు హదీసు భావాన్ని దృష్టిలో ఉంచుకొని ఉల్లేఖిస్తారు. అందుకే కొన్ని ఉల్లేఖనాల్లో ఉపవాస ప్రస్తావన హజ్ కు ముందు ఉంది. అయితే మొదటి పునాది “లాఇలాహ ఇల్లల్లాహ్” ముహమ్మదుర్ రసూలుల్లాహ్” సాక్ష్యం పలకనిదే ఇతర ఏ ఆచరణ నిజము కాదు. అంగీకారయోగ్యం పొందదు.

[6] ఇస్లామీయ చిహ్నాలు

عَن أَبِي هُرَيرَةَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ عَنِ النَّبِي ﷺ أَنَّهُ قَالَ : «إِنَّ لِلإسْلَامِ صُوًى وَمَنَارًا كَمَنَارِ الطَّرِيقِ ، مِنهَا : أنْ تُؤمِنَ بِالله ، وَلاَ تُشرِكَ بِهِ شَيئًا ، وَإِقَامَةِ الصَّلاَةِ ، وَإِيتَاءِ الزَّكَاةِ ، وَصَومِ رَمَضَانَ ، وَحَجِّ الْبَيْتِ ، وَالْأَمرِ بِالمَعْرُوفِ ، وَالنَّهْيِ عَنِ المُنكَرِ، وَأَنْ تُسَلِّمَ عَلَى أَهْلِكَ إِذَا دَخَلْتَ عَلَيهِم ، وَأَنْ تُسَلِّمَ عَلَى الْقَومِ إِذَا مَرَرتَ بِهِمْ، فَمَنْ تَرَكَ مِنْ ذَلِكَ شَيئًا فَقَدْ تَرَكَ سَهْمًا مِنَ الْإِسْلَامِ ، وَمَنْ تَرَكَهُنَّ فَقَدْ وَلَّى الْإِسْلَامَ ظَهْرَهُ ».

19– “మైలురాయి లాంటివి ఇస్లాంలో కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇవి: అల్లాహ్ ను విశ్వసించుట, ఆయనతో పాటు ఎవ్వరినీ సాటి కల్పించకపోవుట, నమాజు స్థాపించుట, జకాత్ చెల్లించుట, రమజాన్ ఉపవాసాలు పాటించుట, హజ్ చేయుట. మంచిని బోధించుట. చెడును ఖండించుట. ఇంకా నీవు ఇంట్లో ప్రవేశించినప్పుడు ఇంట్లో ఉన్న వారికి సలాం చేయుట. ఎవరి ముందునుండైనా నీవు వెళ్తున్నప్పుడు వారికి సలాం చేయుట. వీటిలో ఏ ఒక్కదానిని విడనాడినా ఇస్లాంలోని ఒక భాగాన్ని విడనాడినట్లే. వీటన్నిటినీ విడనాడినవాడు ఇస్లాం నుండి విముఖుడైనట్లే” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ఖాసిం బిన్ సల్లామ్ “ఈమాన్” పుస్తకంలో ఉల్లేఖించారు. సహీహ 333).

ఈ హదీసులో:

ఇస్లాం పరిచయం, దాని కొన్ని లక్షణాలు ఇందులో తెలుపబడ్డాయి. ఇస్లాంలో కొన్ని స్పష్టమైన ఆచరణలున్నాయి ఉదా: నమాజ్, ఉపవాసాలు, దానధర్మాలు మొదలైనవి. వీటి ద్వారా మనిషి ముస్లిం అని గుర్తింపబడతాడు. ఇంకా ఇవి ముస్లిం మరియు ముస్లిమేతరుల మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని తెలుపుతాయి. ఇందులో ఇస్లాం గొప్పతనం తెలిసింది. ఇతర మతాలకంటే విలక్షణమైన ధర్మం ఇది. ఇస్లాం ధర్మానికి ఇతర మతాలపై గొప్పతనం, గౌరవస్థానాల ప్రత్యేకతలు గలవు.

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: (مَنْ صَلَّى صَلَاتَنَا وَاسْتَقْبَلَ قِبْلَتَنَا وَأَكَلَ ذَبِيحَتَنَا فَذَلِكَ الْمُسْلِمُ الَّذِي لَهُ ذِمَّةُ اللهِ وَذِمَّةُ رَسُولِهِ فَلَا تُخْفِرُوا اللهَ فِي ذِمَّتِهِ).

20- “మాలాంటి నమాజు చేసేవాడు, మా ఖిబ్లా దిశకు అభిముఖం అయ్యేవాడు, మా చేత జిబహ్ చేయబడిన దాన్ని తినేవాడు ముస్లిం. ఇలాంటి ముస్లింకు అల్లాహ్ మరియు ప్రవక్త తరపున రక్షణ గలదు. అయితే మీరు అల్లాహ్ మరియు (ఆయన ప్రవక్త) తరఫున ఇవ్వబడిన రక్షణలో ఏలాంటి మోసం చేయకుండా జాగ్రత్తగా ఉండండి” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు.(బుఖారి 391).

ఈ హదీసులో:

నమాజు విడనాడేవాడు ముస్లిం కాడని, అతనికి అల్లాహ్ మరియు ప్రవక్త తరపున రక్షణ ఉండదని తెలిసింది. ఇస్లాం యొక్క బాహ్యచిహ్నమే నమాజ్. నమాజుతో పాటు జిబహ్ (బలిదానం)ను జోడించి చెప్పే మర్మం ఏమిటంటే అవి రెండూ తౌహీద్ కు సంబంధించిన చిహ్నాలు. దీనికి సాక్ష్యాధారమైన అల్లాహ్ ఆదేశాలు ఇవి:

[قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي للهِ رَبِّ العَالَمِينَ]

ఇలా చెప్పండి: నా నమాజులు, నా జంతుబలి, నా జీవనం, నా మరణం సమస్తమూ సకల లోకాలకూ ప్రభువైన అల్లాహ్ కొరకే[. (అన్ఆమ్ 6: 162).

فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ] {الكوثر:2}

నీవు నీ ప్రభువు కొరకే నమాజు చెయ్యి. ఖుర్బానీ కూడా ఇవ్వు[. (కౌసర్ 108: 2).

బహుదైవారాధకులు పాల్పడిన షిర్క్ (బహుదైవారాధన) రకాల్లో అధిక శాతం అల్లాహ్ యేతరులకు సజ్దా చేయడం, మరియు జంతు బలిదానాలు ఇవ్వడం. అయితే ఇవి ఏకైకుడైన అల్లాహ్ కొరకు మాత్రమే చేయాలని దైవఏకత్వపు సందేశంలో చెప్పబడినది. నమాజీయులు ఏ రక్షణలో ఉన్నారో అందులో ఏలాంటి మోసం చేయుట ఏ ముస్లింకూ యోగ్యం కాదు. ముస్లిములతో సామూహికంగా నమాజు పాటించు వ్యక్తి యొక్క ధన, ప్రాణానికి రక్షణ గలదు, హక్కుపరమైనది తప్ప. ఇంకా ప్రజల బాహ్యాన్ని బట్టే వారితో ప్రవర్తించబడును.

عَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو { أَنَّ رَجُلًا سَأَلَ النَّبِيَّ ﷺ أَيُّ الْإِسْلَامِ خَيْرٌ؟ قَالَ: (تُطْعِمُ الطَّعَامَ وَتَقْرَأُ السَّلَامَ عَلَى مَنْ عَرَفْتَ وَمَنْ لَمْ تَعْرِفْ).

21అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఒక వ్యక్తి ‘ఇస్లాంలో ఎటువంటి పనులు చాలా ఉత్తమమైనవ’ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “భోజనం పెట్టడం మరియు పరిచితుడు, అపరిచితుడు (ప్రతి ముస్లిం)కు సలాం చేయడం” అని చెప్పారు. (బుఖారి 12, ముస్లిం 39).

ఈ హదీసులో:

ఇస్లాంలో కొన్ని పనులకు మరికొన్ని పనులపై శ్రేష్ఠత ఉన్నది. ఈ హదీసులో భోజనం పెట్టాలని, దానం చేయాలని ప్రోత్సహించబడింది. అది సర్వ కార్యాల్లో చాలా శ్రేష్ఠమైనది. ప్రవక్తగారి సమాధానం పరిస్థితులను, ప్రజలను బట్టి భిన్నంగా ఉండవచ్చు. పరిచితులకే కాదు అపరిచితులకు కూడా సలాం చేయుట ధర్మమని, సలాంను చాలా విస్తృతం చేయాలని ఉంది. సత్కర్మలు, సద్వర్తనలు ఇస్లాంలో లెక్కించబడతాయి. నియ్యత్ (సంకల్పం) మంచిగా ఉండి, ప్రవక్త పద్ధతిని అనుసరించి చేసిన చిన్నపాటి సత్కార్యం కూడా గొప్ప విలువగలది. సలాం చేయడంలో ముందంజవేసిన వారి ఘనత తెలుస్తుంది.

عَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو { عَنْ النَّبِيِّ ﷺ قَالَ: (الْمُسْلِمُ مَنْ سَلِمَ الْمُسْلِمُونَ مِنْ لِسَانِهِ وَيَدِهِ وَالْمُهَاجِرُ مَنْ هَجَرَ مَا نَهَى اللهُ عَنْهُ).

22ప్రవక్త మహానీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “ముస్లిం అంటే: తన నాలుక మరియు చేతులతో ఇతర ముస్లిములకు హాని కలుగనివ్వనివాడు. ముహాజిర్ అంటే: అల్లాహ్ వారించిన వాటికి దూరమున్నవాడు”. (బుఖారి 10).).

ఈ హదీసులో:

ముస్లిం సోదరులకు హాని కలుగనివ్వనివాడే నిజమైన ముస్లిం. ఇతరులకు హాని కలిగించడంలో ఎక్కువగా ఉపయోగపడే అవయవాలు చేయి మరియు నాలుక. ముస్లింకు హాని కలిగించడం పెద్ద పాపాల్లో లెక్కించబడుతుంది. సమన్వయ పద్ధతి ద్వారా ముస్లిం సోదరులతో మెలుగుట ఉత్తమ ముస్లిముల గుణం.

(ధర్మాన్ని కాపాడుకొనుటకు స్వదేశాన్ని వదలి వలసపోవుటయే కాకుండా) నిషిద్ధకార్యాలను విడనాడుట, వారించిన వాటికి దూరముండుట, పాపాలను మానుకొనుట, అవిధేతయకు గురికాకుండా ఉండుట, పాపాల నుండి తౌబా చేయుట. ఇవన్నియు కూడా ‘హిజ్రత్’ భావంలో వస్తాయని ఈ హదీసు తెలుపుతుంది.

[7] తౌహీద్ వైపునకు పిలుచుట

عَنِ الْحَارِثِ الْأَشْعَرِيِّ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ أَنَّ نَبِيَّ اللهِ ﷺ قَالَ: (إِنَّ اللهَ عَزَّ وَجَلَّ أَمَرَ يَحْيَى بْنَ زَكَرِيَّا عَلَيْهِمَا السَّلَام بِخَمْسِ كَلِمَاتٍ أَنْ يَعْمَلَ بِهِنَّ وَأَنْ يَأْمُرَ بَنِي إِسْرَائِيلَ أَنْ يَعْمَلُوا بِهِنَّ وَكَادَ أَنْ يُبْطِئَ فَقَالَ لَهُ عِيسَى إِنَّكَ قَدْ أُمِرْتَ بِخَمْسِ كَلِمَاتٍ أَنْ تَعْمَلَ بِهِنَّ وَتَأْمُرَ بَنِي إِسْرَائِيلَ أَنْ يَعْمَلُوا بِهِنَّ فَإِمَّا أَنْ تُبَلِّغَهُنَّ وَإِمَّا أَنْ أُبَلِّغَهُنَّ فَقَالَ يَا أَخِي إِنِّي أَخْشَى إِنْ سَبَقْتَنِي أَنْ أُعَذَّبَ أَوْ يُخْسَفَ بِي قَالَ فَجَمَعَ يَحْيَى بَنِي إِسْرَائِيلَ فِي بَيْتِ الْمَقْدِسِ حَتَّى امْتَلَأَ الْمَسْجِدُ فَقُعِدَ عَلَى الشُّرَفِ فَحَمِدَ اللهَ وَأَثْنَى عَلَيْهِ ثُمَّ قَالَ إِنَّ اللهَ عَزَّ وَجَلَّ أَمَرَنِي بِخَمْسِ كَلِمَاتٍ أَنْ أَعْمَلَ بِهِنَّ وَآمُرَكُمْ أَنْ تَعْمَلُوا بِهِنَّ:

أَوَّلُهُنَّ أَنْ تَعْبُدُوا اللهَ لَا تُشْرِكُوا بِهِ شَيْئًا فَإِنَّ مَثَلَ ذَلِكَ مَثَلُ رَجُلٍ اشْتَرَى عَبْدًا مِنْ خَالِصِ مَالِهِ بِوَرِقٍ أَوْ ذَهَبٍ فَجَعَلَ يَعْمَلُ وَيُؤَدِّي غَلَّتَهُ إِلَى غَيْرِ سَيِّدِهِ فَأَيُّكُمْ سَرَّهُ أَنْ يَكُونَ عَبْدُهُ كَذَلِكَ وَإِنَّ اللهَ عَزَّ وَجَلَّ خَلَقَكُمْ وَرَزَقَكُمْ فَاعْبُدُوهُ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا

وَآمُرُكُمْ بِالصَّلَاةِ فَإِنَّ اللهَ عَزَّ وَجَلَّ يَنْصِبُ وَجْهَهُ لِوَجْهِ عَبْدِهِ مَا لَمْ يَلْتَفِتْ فَإِذَا صَلَّيْتُمْ فَلَا تَلْتَفِتُوا

وَآمُرُكُمْ بِالصِّيَامِ فَإِنَّ مَثَلَ ذَلِكَ كَمَثَلِ رَجُلٍ مَعَهُ صُرَّةٌ مِنْ مِسْكٍ فِي عِصَابَةٍ كُلُّهُمْ يَجِدُ رِيحَ الْمِسْكِ وَإِنَّ خُلُوفَ فَمِ الصَّائِمِ عِنْدَ اللهِ أَطْيَبُ مِنْ رِيحِ الْمِسْكِ

وَآمُرُكُمْ بِالصَّدَقَةِ فَإِنَّ مَثَلَ ذَلِكَ كَمَثَلِ رَجُلٍ أَسَرَهُ الْعَدُوُّ فَشَدُّوا يَدَيْهِ إِلَى عُنُقِهِ وَقَدَّمُوهُ لِيَضْرِبُوا عُنُقَهُ فَقَالَ هَلْ لَكُمْ أَنْ أَفْتَدِيَ نَفْسِي مِنْكُمْ فَجَعَلَ يَفْتَدِي نَفْسَهُ مِنْهُمْ بِالْقَلِيلِ وَالْكَثِيرِ حَتَّى فَكَّ نَفْسَهُ

وَآمُرُكُمْ بِذِكْرِ اللهِ عَزَّ وَجَلَّ كَثِيرًا وَإِنَّ مَثَلَ ذَلِكَ كَمَثَلِ رَجُلٍ طَلَبَهُ الْعَدُوُّ سِرَاعًا فِي أَثَرِهِ فَأَتَى حِصْنًا حَصِينًا فَتَحَصَّنَ فِيهِ وَإِنَّ الْعَبْدَ أَحْصَنُ مَا يَكُونُ مِنْ الشَّيْطَانِ إِذَا كَانَ فِي ذِكْرِ اللهِ عَزَّ وَجَلَّ).

قَالَ: فَقَالَ رَسُولُ اللهِ ﷺ: (وَأَنَا آمُرُكُمْ بِخَمْسٍ اللهُ أَمَرَنِي بِهِنَّ بِالْجَمَاعَةِ وَالسَّمْعِ وَالطَّاعَةِ وَالْهِجْرَةِ وَالْجِهَادِ فِي سَبِيلِ اللهِ فَإِنَّهُ مَنْ خَرَجَ مِن الْجَمَاعَةِ قِيدَ شِبْرٍ فَقَدْ خَلَعَ رِبْقَةَ الْإِسْلَامِ مِنْ عُنُقِهِ إِلَّا أَنْ يَرْجِعَ وَمَنْ دَعَا بِدَعْوَى الْجَاهِلِيَّةِ فَهُوَ مِنْ جُثَاءِ جَهَنَّمَ) قَالُوا: يَا رَسُولَ اللهِ وَإِنْ صَامَ وَإِنْ صَلَّى قَالَ: (وَإِنْ صَامَ وَإِنْ صَلَّى وَزَعَمَ أَنَّهُ مُسْلِمٌ فَادْعُوا الْمُسْلِمِينَ بِأَسْمَائِهِمْ بِمَا سَمَّاهُمْ اللهُ عَزَّ وَجَلَّ الْمُسْلِمِينَ الْمُؤْمِنِينَ عِبَادَ اللهِ عَزَّ وَجَلَّ).

23ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని, హారిస్ అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “యహ్యా బిన్ జక్రియా అలైహిమస్సలాంకు అల్లాహ్ ఐదు విషయాల గురించి ఆదేశించి, వాటిని తాను స్వయంగా ఆచరించి, బనీ ఇస్రాఈల్ కూడా వాటిని ఆచరణలో తీసుకురావాలని ఆదేశించాలని తెలిపాడు. అయితే ఆయనతో ఈ విషయంలో కొంచెం ఆలస్యం జరగబోతుండగా, ఈసా అలైహిస్లలాం “ఐదు విషయాలను నీవు అచరిస్తూ బనీ ఇస్రాఈల్ ను కూడా ఆదేశించాలని నీకు ఆదేశమివ్వబడింది కదా?” అయితే నీవు ఈ బాధ్యత నెరవేరుస్తావా, లేదా? నేను నెరవేర్చబోతున్నాను అని గుర్తుచేశారు. హజ్రత్ యహ్యా చెప్పారుః సోదరా! నీవు గనక నాకంటె ముందు ఈ పని చేశావా, నాపై ఏదైనా విపత్తు వచ్చి పడుతుందని, లేదా నేను భూమిలో అణగద్రొక్కబడతానని భయపడుతున్నాను. ఆ తర్వాత యహ్యా అలైహిస్సలాం బనీ ఇస్రాయీల్ ను బైతిల్ మఖ్దిసులో సమకూర్చారు. మస్జిద్ నిండిపోయింది. ఆయన కూర్చుండుటకు ఒక ఎత్తైన ప్రదేశం ఏర్పాటు చేయబడింది. దానిపై కూర్చుండి ఆయన అల్లాహ్ స్తోత్రము పఠించి ఇలా అన్నారు: ఐదు విషయాలు, వాటిపై నేను ఆచరిస్తూ వాటి గురించి మీకు ఆదేశించాలని అల్లాహ్ నాకు ఆదేశించాడు:

మొదటి ఆదేశం: అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. ఆయనతో ఎవ్వరినీ సాటి కల్పించకండి. దీని ఉదాహరణ ఎలాంటిదంటే: ఒక వ్యక్తి తన స్వంత సొమ్మైన బంగారం లేదా వెండితో బానిసను కొన్నాడు. బానిస కష్టము చేసి, తన యజమానికి ఇవ్వవలసిన కష్టార్జితం ఇతరులకు ఇస్తాడు. ఇలాంటి బానిస మీలోని ఒకని వద్ద ఉండడం మీకు ఇష్టమేనా? మిమ్మల్ని సృష్టించింది, మీకు ఆహారం నొసంగేది అల్లాహ్ మాత్రమే. అందుకు మీరు ఆయన్ని మాత్రమే ఆరాధించండి. ఆయనకు ఎవ్వరినీ సాటి కల్పించకండి.

(రెండవ ఆదేశం:) నేను నమాజు గురించి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను. (మీరు దాన్ని స్థాపించండి). దాసుడు తన దృష్టిని అటూ, ఇటూ మల్లించనంతవరకూ నిశ్చయంగా అల్లాహ్ కూడా తన దృష్టి తన దాసునిపైనే ఉంచుతాడు. అందుకు మీరు నమాజ్ చేస్తున్నప్పుడు మీ చూపులను అటూ, ఇటూ త్రిప్పకండి.

(మూడవ ఆదేశం:) నేను మీకు ఉపవాసాల ఆదేశమిస్తున్నాను. దాని ఉదాహరణ ఏలాంటి- దంటే: సమూహంలో ఒక వ్యక్తి వద్ద కస్తూరి ఉంది. వారందరూ దాని నుండే సువాసన పీలుస్తూ ఉంటారు. ఉపవాసమున్న వ్యక్తి నోటి నుండి వెళ్ళే వాసన అల్లాహ్ కు కస్తూరి సువాసన కంటే ఉత్తమ సువాసన లాంటిది.

(నాల్గవ ఆదేశం:) నేను మీకు దానధర్మాల ఆదేశమిస్తున్నాను. దీని ఉదాహరణ ఏలాంటిదంటే: కొందరు శత్రువులు ఒక వ్యక్తిని పట్టుకొని అతని చేతులను మెడకు కట్టేసి అతన్ని నరికివేయడానికి తీసుకొని వెళ్తుండగా ఆ వ్యక్తి నా ప్రాణానికి బదులు ఏదైనా పరిహారం ఇస్తే నన్ను వదిలేస్తారా? అని అడిగాడు. ఇలా తన ప్రాణానికి బదులు కొంచమో, ఎక్కువనో పరిహారం చెల్లించి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు.

(ఐదవ ఆదేశం:) మీరు అల్లాహ్ స్మరణ అధికంగా చేయండని ఆదేశిస్తున్నాను. దీని దృష్టాంతం ఇలా ఉంది: శత్రువులు ఒక మనిషి వెనుక పరుగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఆ మనిషి దృఢమైన కోటలో ప్రవేశించి (వారి చేతికి చిక్కకుండా భద్రంగా దాగి ఉంటాడు). అలా మానవుడు అల్లాహ్ ను స్మరిస్తున్నంత కాలం షైతాన్ (చేతిలో చిక్కకుండా) అతి భద్రంగా ఉంటాడు”.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు: “నేను మీకు ఐదు విషయాల గురించి ఆదేశిస్తున్నాను. వాటిని అల్లాహ్ నాకు ఆదేశించాడు. సంఘాన్ని (జమాఅత్) విడనాడకుండా ఐక్యంగా ఉండండి. మీలోని నాయకుని మాట విని, అతని ఆజ్ఞ పాలించండి. సమయం వచ్చినప్పుడు హిజ్రత్ (వలస) చేయండి, అల్లాహ్ మార్గంలో యుద్ధం (జిహాద్) చేయండి. (ధర్మంపై ఐక్యంగా ఉన్న) సంఘాన్ని వదలి ఒక జానెడు దూరమైన వ్యక్తి తిరిగి అందులో చేరనంతవరకూ ఇస్లాం బంధాన్ని తన మెడ నుండి తీసిపారేసిన వాడవుతాడు. మూఢకాలపునాటి పలుకులు పలికేవాడు (మోకాళ్ళ మీద/ నరకవాసులతో కలసి) నరకంలో పడతాడు”. ‘ప్రవక్తా! అతడు నమాజు, ఉపవాసాలు పాటించినప్పటికీ నరకం లో పడతాడా?’ అని మేము అడిగినందుకు ఇలా సమాధానమిచ్చారుః “అవును, అతడు నమాజు, ఉపవాసాలు పాటించినా తాను ముస్లిం అని భావించినా అందులో పడతాడు. అయితే మీరు ముస్లిములను ‘ముస్లిమీన్’, ‘మూమినీన్’, ‘ఇబాదల్లాహ్’ అని అల్లాహ్ నామకరణం చేసిన పేర్లతోనే పిలవండి”. (అహ్మద్ 4/130. తిర్మిజి 2863. సహీహుల్ జామి 2604).

ఈ హదీసులో:

పూర్వ జాతుల, ప్రవక్తల ప్రస్తావన వచ్చింది. వారి సంఘటనలు గుణపాఠం కొరకు ప్రజలకు తెలుపాలి. మనిషి మంచి పనులు చేయుటకు తొందరపడాలి. రేపు మాపు అని వాయిదాలు వేసుకోకూడదు. ప్రవక్తలు అల్లాహ్ కు చాలా భయపడేవారని తెలిసింది. విద్య నేర్పుటకు ప్రజల్ని ప్రోగుచేయవచ్చని తెలిసింది. మాట ఆరంభం అల్లాహ్ స్తోత్రముతో కావాలి. మంచిని ఆదేశించి, చెడును ఖండించే వ్యక్తి స్వయంగా మంచి చేయాలి. చెడుకు దూరంగా ఉండాలి. అప్పుడే లాభం ఉంటుంది. విద్యలో మొట్టమొదటిది తౌహీద్. సులభంగా బోధపడేందుకు సామెతలు, ఉదాహరణలు ఇవ్వవచ్చును. పాపాల్లో అతి ఘోరమైనది షిర్క్ (అల్లాహ్ కు భాగస్వామిని కల్పించడం). అనవసరంగా నమాజులో అటూ, ఇటూ చూడవద్దు. ఎక్కువసార్లు అలా చేస్తే నమాజే భంగమయిపోతుంది. కర్మల ప్రకారం ఫలితముంటుంది. ఉపవాసమున్న వ్యక్తి ఆకలి, దాహాన్ని భరించినందున అతని నోటి వాసన మారుతుంది. కాని అది అల్లాహ్ కు కస్తూరి కంటే మరీ ఇష్టమైనది. దానధర్మాలు మనిషిని పాపాల బంధనం నుండి విముక్తినిస్తాయి. ముస్లిం తనకు తాను షైతాన్ నుండి కాపాడుకొనుటకు గొప్ప సాధనం అల్లాహ్ స్మరణ. ముస్లిం తన సంఘంతో ఐక్యంగా ఉండుట తప్పనిసరి. ముస్లిం నాయకుడు అల్లాహ్ అవిధేయతకు గురికాని ఆదేశాలు ఇవ్వనంత వరకు అతనికి విధేయులై ఉండాలి. (ఒకవేళ అవిధేయతకు గురిచేసే ఆదేశమిస్తే దానిని పాటించకూడదు, కాని అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకూడదు). మూఢకాలపునాటి పలుకులు పలకడం నిషిద్ధం. అవి ఇస్లాంకు బద్ధ విరుద్ధం.

عَنِ الْمُغِيرَةِ بْنِ سَعْدٍ عَنْ أَبِيهِ أَوْ عَنْ عَمِّهِ قَالَ أَتَيْتُ النَّبِيَّ ﷺ بِعَرَفَةَ فَأَخَذْتُ بِزِمَامِ نَاقَتِهِ أَوْ بِخِطَامِهَا فَدَفَعْتُ عَنْهُ فَقَالَ: (دَعُوهُ فَأَرَبٌ مَا جَاءَ بِهِ) فَقُلْتُ نَبِّئْنِي بِعَمَلٍ يُقَرِّبُنِي إِلَى الْجَنَّةِ وَيُبْعِدُنِي مِن النَّارِ قَالَ: فَرَفَعَ رَأْسَهُ إِلَى السَّمَاءِ ثُمَّ قَالَ: (لَئِنْ كُنْتَ أَوْجَزْتَ فِي الْخُطْبَةِ لَقَدْ أَعْظَمْتَ أَوْ أَطْوَلْتَ تَعْبُدُ اللهَ لَا تُشْرِكُ بِهِ شَيْئًا وَتُقِيمُ الصَّلَاةَ وَتُؤْتِي الزَّكَاةَ وَتَحُجُّ الْبَيْتَ وَتَصُومُ رَمَضَانَ وَتَأْتِي إِلَى النَّاسِ مَا تُحِبُّ أَنْ يُؤْتُوهُ إِلَيْكَ وَمَا كَرِهْتَ لِنَفْسِكَ فَدَعِ النَّاسَ مِنْهُ ، خَلِّ عَنْ زِمَامِ النَّاقَةِ).

24ముఘీరా బిన్ సఅద్ తన తండ్రి లేక పినతండ్రి రజియల్లాహు అన్హుం ద్వారా ఉల్లేఖిస్తున్నాడు. నేను అరఫ ప్రాంతములో ప్రవక్త వద్దకు వచ్చి, ఆయన ఒంటె కళ్ళాన్ని లేక త్రాడును పట్టుకున్నాను. వెంటనే నేను అక్కడి నుండి నెట్టేయ్యబడ్డాను. ఇది చూసిన ప్రవక్త “అతన్ని వదలండి. ఏదైనా అవసరంతో రావచ్చు” అని అన్నారు. ‘స్వర్గంలో చేర్చే మరియు నరకం నుండి దూరముంచే కార్యాలు నాకు తెలుపండి అని నేను విన్నవించుకున్నాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన తలను ఆకాశం వైపునకు ఎత్తారు. మళ్ళీ ఇలా అన్నారుః “నీవు సంక్షిప్త మాటల్లో గొప్ప విషయం అడిగావు. అయితే విను: అల్లాహ్ ను మాత్రమే ఆరాధించు. ఆయనతో మరెవ్వరినీ సాటికల్పించకు. నమాజ్ స్థాపించు. జకాత్ చెల్లించు. హజ్ చేయు. రమజాను ఉపవాసాలు పాటించు. ప్రజలు నీతో ఎలా వ్యవహరించడం నీకు ఇష్టమో అలాగే నీవు వారితో మసలుకో. నీ కొరకు నీవు ఏది ఇష్టపడవో దాన్ని ప్రజలకు దూరముంచు”. ఇక నా ఒంటె కళ్ళెం వదులు”. (అహ్మద్ 4/77. సహీహ 1477).

ఈ హదీసులో:

కర్మలు విశ్వాసంలో లెక్కించబడుతాయి. తౌహీద్ తర్వాత అన్నిట్లో గొప్పది, ప్రాముఖ్యత గలది నమాజ్. ఫర్జ్ నమాజులు తప్ప మిగిలినవన్నీ నఫిల్ క్రింద లెక్కించబడతాయి, ‘వాజిబ్’ క్రింద కాదు. సద్వర్తన విశ్వాసంలో ఒక భాగమే. ప్రజలతో ఉత్తమ వైఖరిని అవలంబించడం శ్రేష్ఠమైన గుణం. ఇందులో ఉపదేశం సంక్షిప్తంగా ఉన్నా, అతిముఖ్యమైన పెద్ద విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఇస్లాం ధర్మం విశ్వాసం, వాచాకర్మలకు అన్నిటికి సంబంధించినది.

[8] తౌహీద్ ఘనత

عَنْ عُبَادَةَ بنِ الصَّامتِ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ عَنْ النَّبِيِّ ﷺ قَالَ: (مَنْ شَهِدَ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ وَأَنَّ عِيسَى عَبْدُ اللهِ وَرَسُولُهُ وَكَلِمَتُهُ أَلْقَاهَا إِلَى مَرْيَمَ وَرُوحٌ مِنْهُ وَالْجَنَّةُ حَقٌّ وَالنَّارُ حَقٌّ أَدْخَلَهُ اللهُ الْجَنَّةَ عَلَى مَا كَانَ مِنْ الْعَمَلِ).

25- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని, ఉబాదా బిన్ సామిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు మరొకడు లేడని, ఆయన ఒక్కడేనని, ఆయనకు మరెవరూ భాగస్వామి లేరని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అని, ఈసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క దాసుడు, ఆయన ప్రవక్త అనీ, కాకపోతే ఆయన హజ్రత్ మర్యం (గర్భం)లో అవతరించిన అల్లాహ్ వాక్కు, ఆయన వైపు నుండి పంపబడిన ఆత్మ అని, స్వర్గనరకాలు ఉన్నాయి అన్నది యదార్థమని ఎవరైతే సాక్ష్యమిస్తారో ఆ వ్యక్తి కర్మలు ఏలాంటివయినా సరే అల్లాహ్ అతడ్ని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు”. (బుఖారి 3435, ముస్లిం 28)

ఈ హదీసులో:

తౌహీదె ఖాలిస్ (స్వచ్ఛమైన ఏకదైవారాధన)కి సంబంధించిన కొన్ని విషయాలు ఇందులో తెలుపబడ్డాయి:

ఈసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క దాసుడు, ఆయన ప్రవక్త అని విశ్వసించాలి. ఎందుకనగా త్రిత్వాన్ని (Trinity) నమ్మే క్రైస్తవులు ఈ గొప్ప విషయంలో అల్లాహ్ ను తిరస్కరించారు.

ఏకైకుడైన అల్లాహ్ ఈసా అలైహిస్సలాంను తన వాక్కుతో సృష్టించాడని, ఆ వాక్కును మర్యం గర్భంలో పంపాడని మరియు ఆయన అల్లాహ్ వైపు నుండి పంపబడిన ఆత్మ అని విశ్వసించాలి. ఇలా విశ్వసించిన భక్తుడు క్రైస్తవులకు భిన్నంగా ఏ సందేహమూ లేని సత్యాన్ని నమ్మినవాడవుతాడు.

స్వర్గనరకాలు ఇప్పుడున్నాయని మరియు చనిపోయిన తర్వాత తిరిగి లేపబడుట సత్యం అని విశ్వసించాలి. పై విషయాల్ని విశ్వసించిన వ్యక్తికి స్వర్గ ప్రవేశం లభిస్తుంది. అతని నుండి కొన్ని పాపాలు జరిగినప్పటికీ ఏదైనా ఒకరోజు కలకాలం ఉండే మహాభాగ్యాలతో నిండిఉన్న స్వర్గంలో చేరుతాడు. మరొక హదీసులో స్వర్గానికి ఎనిమిది ద్వారాలని ఉంది.

عَن أَنَسِ بْنِ مَالِكٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ أَنَّ النَّبِيَّ ﷺ قَالَ: (مَنْ لَقِيَ اللهَ لَا يُشْرِكُ بِهِ شَيْئًا دَخَلَ الْجَنَّةَ).

26- అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ఏ మాత్రం షిర్క్ చేయకుండా అల్లాహ్ తో కలుసుకున్న వ్యక్తి స్వర్గంలో చేరుతాడు”. (బుఖారి 129).

ఈ హదీసులో:

మనిషి ప్రళయదినాన అల్లాహ్ ను నిర్మల హృదయంతో కలుసుకొనుటకు ఎల్లప్పుడూ తన విశ్వాసంలో వచ్చే లోపాల్ని దూరం చేస్తూ, షిర్క్ యొక్క కాలుష్యం నుండి తౌహీదును పరిశుద్ధపరుస్తూ ఉండుటకు ప్రయత్నించాలి. నిశ్చయంగా అల్లాహ్ ముష్రిక్ పై స్వర్గాన్ని నిషేధించాడు.

[9] తౌహీదుపై స్థిరంగా ఉండే పాపాత్ములు శాశ్వతంగా నరకంలో ఉండరు

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ عَنْ النَّبِيِّ ﷺ قَالَ: (يَدْخُلُ أَهْلُ الْجَنَّةِ الْجَنَّةَ وَأَهْلُ النَّارِ النَّارَ ثُمَّ يَقُولُ اللهُ تَعَالَى أَخْرِجُوا مِنْ النَّارِ مَنْ كَانَ فِي قَلْبِهِ مِثْقَالُ حَبَّةٍ مِنْ خَرْدَلٍ مِنْ إِيمَانٍ فَيُخْرَجُونَ مِنْهَا قَدْ اسْوَدُّوا فَيُلْقَوْنَ فِي نَهَرِ الْحَيَا أَوْ الْحَيَاةِ فَيَنْبُتُونَ كَمَا تَنْبُتُ الْحِبَّةُ فِي جَانِبِ السَّيْلِ أَلَمْ تَرَ أَنَّهَا تَخْرُجُ صَفْرَاءَ مُلْتَوِيَةً).

27- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారని, అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “పరలోకంలో కర్మల విచారణ ముగిసిన తర్వాత స్వర్గవాసులు స్వర్గంలో, నరకవాసులు నరకంలో ప్రవేశిస్తారు. ఆ తర్వాత హృదయంలో ఆవగింజంత విశ్వాసమున్న వారిని నరకం నుండి బయటకు తీయండి అని అల్లాహ్ ఆజ్ఞాపిస్తాడు. ఈ ఆజ్ఞతో చాలా మంది బయటపడతారు. వారిలో కొందరు (బాగా కాలిపోయి బొగ్గులా) నల్లగా మారిపోతారు. అలాంటి వారిని వర్షపునది లేక జీవనదిలో పడవేస్తారు. దాంతో వారు యేటి ఒడ్డున ధాన్యపు విత్తనం మొలకెత్తినట్లు మొలకెత్తుతారు. ఆ మొక్క పసిమి వన్నెతో ఎంత అందంగా ముస్తాబయి మొలకెత్తుతుందో మీరు చూడలేదా?”. (బుఖారి 22, ముస్లిం 184).

ఈ హదీసులో:

విశ్వాస పరంగా ప్రజలు వేరువేరు స్థానాల్లో ఉంటారు. తౌహీద్ పై స్థిరంగా ఉన్నవారు నరకంలో శాశ్వతంగా ఉండరు. విశ్వాసి తన పాపాల కారణంగా నరకంలో ప్రవేశించవచ్చు. కర్మలు విశ్వాసంలో లెక్కించబడతాయి. విశ్వాసం పెరుగుతూ తరుగుతూ ఉంటుంది. సత్కార్యం ఎంత చిన్నదైనా మానవుడు దానిని విలువలేనిదిగా భావించరాదు. ప్రళయదినాన కర్మలు తూకం చేయబడుతాయి. ప్రజలకు అవగాహనమున్న విషయాల ద్వారా ఉదాహరణ ఇవ్వాలి. నరకాగ్ని శిక్ష చాలా కఠినమైనది. -అల్లాహ్ మనందరిని దాని నుండి కాపాడుగాక! ఆమీన్- ప్రజలకు పరిచయం ఉన్నవాటి ద్వారా ఉదాహరణలు ఇవ్వాలని తెలిసింది. ఇందులో అల్లాహ్ యొక్క విశాల కారుణ్యం కనబడుతుంది. ఆయన తన దాసుల్లో కొందర్ని, వారి వద్ద సత్కార్యాలు తక్కువ ఉన్నప్పటికీ (తౌహీద్ పై స్థిరంగా ఉన్నందువల్ల) నరకం నుండి బయటకు తీస్తాడు.

عَنْ أَنَسٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ عَنْ النَّبِيِّ ﷺ قَالَ: (يَخْرُجُ مِنَ النَّارِ مَنْ قَالَ لَا إِلَهَ إِلَّا اللهُ وَفِي قَلْبِهِ وَزْنُ شَعِيرَةٍ مِنْ خَيْرٍ وَيَخْرُجُ مِنْ النَّارِ مَنْ قَالَ لَا إِلَهَ إِلَّا اللهُ وَفِي قَلْبِهِ وَزْنُ بُرَّةٍ مِنْ خَيْرٍ وَيَخْرُجُ مِنْ النَّارِ مَنْ قَالَ لَا إِلَهَ إِلَّا اللهُ وَفِي قَلْبِهِ وَزْنُ ذَرَّةٍ مِنْ خَيْرٍ).

28-అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం ప్రవచించారు: “లాఇలాహ ఇల్లల్లాహ్” పఠించిన వ్యక్తి హృదయంలో జొన్న గింజంత విశ్వాసమున్నా నరకం నుండి వెలికి వస్తాడు. ఏ వ్యక్తి “లాఇలాహ ఇల్లల్లాహ్” చదివాడో అతని హృదయంలో గోధుమ గింజంత విశ్వాసమున్నా నరకం నుండి వెలికి వస్తాడు. అలాగే ఎవరు లాఇలాహ ఇల్లల్లాహ్ చదివాడో అతని మనుస్సులో రవ్వంత విశ్వాసమున్నా అతనూ నరకం నుండి వెలికి వస్తాడు”. (బుఖారి 44, ముస్లిం 193).

ఈ హదీసులో:

తౌహీద్ పై స్థిరంగా ఉన్న పాపాత్ములు నరకం నుండి వెలికి వస్తారు. ఘోరపాపాలు (కబీరా గునాహ్) చేయువాడు నరకశిక్షకు గురవుతాడు. అయితే “ముర్జియా” వర్గంవారి విశ్వాసం దీనికి భిన్నంగా ఉంది. వారి విశ్వాసం ఈ హదీసుకు విరుద్ధం. అలాగే ఘోరపాపానికి గురైన (తౌహీద్ గల) వ్యక్తి నరకం నుండి వెలికి వస్తాడు. అయితే “ఖవారిజ్” వర్గంవారి విశ్వాసం దీనికి భిన్నంగా ఉంది. వారి విశ్వాసం ఈ హదీసుకు విరుద్ధం. (పై రెండు వర్గాలవారు సన్మార్గం నుండి వైదొలిగినవారు). ఈమాన్ అన్నది నోటిపలుకు, (ఆచరణ) మరియు హృదయవిశ్వాసానికి మారుపేరు. ఎలా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “లాఇలాహ ఇల్లల్లాహ్” అని పఠించడం మరియు దాని విశ్వాసం జొన్న గింజంతైనా హృదయంలో ఉండడం, ఈ రెండిటిని కలిపి చెప్పారు. ఏదైనా విషయం సులభంగా అర్థం అవడానికి ఉదాహరణలు ఇవ్వవచ్చు అని తెలిసింది. అల్లాహ్ యొక్క విశాల కారుణ్యం తెలిసింది. ఆయన తన దాసుని సత్కార్యాలను వ్యర్థపరచడు. విశ్వాసం తరుగుతుంది, పెరుగుతుంది అని కూడా తెలిసింది.

[10] షిర్క్ నుండి హెచ్చరిక

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ ۚ وَمَن يُشْرِكْ بِاللَّهِ فَقَدِ افْتَرَىٰ إِثْمًا عَظِيمًا (నిసా 4: 48)

]నిశ్చయంగా అల్లాహ్ తనకు భాగస్వామిని కల్పించటాన్ని క్షమించడు. అది తప్ప ఏ పాపాన్ని అయినా ఆయన తాను ఇష్టపడిన వారి కొరకు క్షమిస్తాడు. ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసేవాడు, ఎంతో ఘోరమైన అబద్ధాన్ని కల్పించాడు అన్నమాట. ఎంతో తీవ్రమైన పాపపు మాటలు అన్నాడని భావం[.

وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ

నీ వద్దకూ, నీకు పూర్వం గతించిన ప్రవక్తల వద్దకూ ఇలా వహీ (దివ్యవాణి) పంపబడింది. ఒక వేళ మీరు షిర్క్ (బహుదైవారాధన) చేస్తే, మీ కర్మలన్నీ వ్యర్థమైపోతాయి మరియు మీరు నష్టానికి గురవుతారు[. (జుమర్ 39: 65).

إِنَّهُ مَن يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ ۖ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ

ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసేవారికి అల్లాహ్ స్వర్గాన్ని నిషిద్ధం చేశాడు. వారి నివాసం నరకం. అటువంటి దుర్మార్గులకు సహాయం అందించువారెవరూ లేరు. (5: 72).

وَمَن يُشْرِكْ بِاللَّهِ فَكَأَنَّمَا خَرَّ مِنَ السَّمَاءِ فَتَخْطَفُهُ الطَّيْرُ أَوْ تَهْوِي بِهِ الرِّيحُ فِي مَكَانٍ سَحِيقٍ

]ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసేవాడు, ఆకాశం నుండి క్రింద పడిపోయినట్లే. అతనిని, ఇక పక్షులైనా తన్నుకు పోతాయి, లేదా గాలి ముక్కలు ముక్కలయ్యే ప్రదేశానికైనా విసరివేస్తుంది[. (హజ్ 22: 31).

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ عَنْ النَّبِيِّ ﷺ قَالَ: (اجْتَنِبُوا السَّبْعَ الْمُوبِقَاتِ) قَالُوا: يَا رَسُولَ اللهِ وَمَا هُنَّ؟ قَالَ: (الشِّرْكُ بِاللهِ وَالسِّحْرُ وَقَتْلُ النَّفْسِ الَّتِي حَرَّمَ اللهُ إِلَّا بِالْحَقِّ وَأَكْلُ الرِّبَا وَأَكْلُ مَالِ الْيَتِيمِ وَالتَّوَلِّي يَوْمَ الزَّحْفِ وَقَذْفُ الْمُحْصَنَاتِ الْمُؤْمِنَاتِ الْغَافِلَاتِ).

29- అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరుల్ని ఉద్దేశించిః “మిమ్మల్ని సర్వనాశనం చేసే ఏడు పనులకు మీరు దూరంగా ఉండండి” అని హెచ్చరించారు. ఆ పనులేమిటి ప్రవక్తా?’ అని సహచరులు అడిగారు. అప్పుడాయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “అల్లాహ్ కు సాటి కల్పించడం, చేతబడి చేయడం, ధర్మయుక్తంగా తప్ప అల్లాహ్ హతమార్చకూడదని నిషేధించిన ప్రాణిని హతమార్చడం, వడ్డీ తినడం, అనాథల సొమ్మును హరించివేయడం, ధర్మయుద్ధంలో వెన్నుజూపి పారిపోవడం, ఏ పాపమెరగని (సద్వర్తనులైన) అమాయక ముస్లిం స్త్రీలపై అపనింద మోపడం”. (బుఖారి 2767, ముస్లిం 6857).

ఈ హదీసులో:

పాపాల్లో వ్యత్యాసం గలదు. కొన్ని పాపాలు, వాటికి పాల్పడిని వానిని వినాశనానికి గురి చేస్తాయి. షిర్క్ అన్నిట్లోకెల్లా అతిఘోరమైన పాపం. అది సత్యధర్మానికి విరుద్ధం. అల్లాహ్ యొక్క ఉలూహియత్ (నిజఆరాధన)లో లోపం కల్గించినట్లగును.

చేతబడి. దీనిని వినాశనానికి గురిచేసే వాటిలో లెక్కించే కారణం ఏమంటే: అందులో అగోచరజ్ఞానపు ఆరోపణ ఉంది. ప్రజలకు నష్టముంది.

ఏ మనిషినైనా హతమార్చడం. ఎందుకనగ రక్తం చిందించి, ప్రాణం తీయడం మరియు మానవజాతి పెరుగుదలకు అడ్డు కలిగించడం ఎంత మాత్రం సమంజసం కాదు. అయితే హత్యా ప్రతీకారం మరియు ధర్మపరమైన హత్యల విషయం వేరు. వాటి హక్కు స్వయంగా అల్లాహ్ ఇచ్చాడు.

అశక్తుడైన అనాథ సొమ్మును హరించివేయడం.వడ్డీ సొమ్ము తినడం. ఎందుకనగా వడ్డీని ఉపయోగించుట అల్లాహ్ తో పోరాటానికి దిగినట్లు, మరియు ధనంలో అల్లాహ్ నిర్ణయించిన హద్దలను మితిమీరనట్లగును.

ధర్మయుద్ధం నుండి వెన్నుజూపి పారిపోవడం. ఎందుకనగా దీని వల్ల తన ధర్మాన్ని, దాని అనుయాయులను కించపరచి, బలహీనతకు గురిచేసి, అధర్మమార్గంలో ఉన్నవారికి సహాయపడి, బలాన్నిచ్చినట్లగును.

పాపం, దాని మార్గాలు ఎరుగని, తమ శీలాన్ని కాపాడుకుంటూ ఉండే అమాయక ముస్లిం స్త్రీలపై అపనిందమోపడం కూడా నిషిద్ధం.

ఈ హదీసులో ఏడింటిని మాత్రమే ప్రస్తావించే కారణం ఏమిటంటే అవి సర్వ పాపాలకు మూలం లాంటివి కావడం. అయితే ఇలాంటి పాపాలు ఏడింటికంటే ఎక్కువ ఉన్నాయని కూడా కొందరు పండితులు చెప్పారు.

عَنْ أَبِي هُرَيرَةَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: قَالَ الله تعالى: (أَنَا أَغْنَى الشُّرَكَاءِ عَنِ الشِّرْكِ مَنْ عَمِلَ عَمَلًا أَشْرَكَ فِيهِ مَعِي غَيْرِي تَرَكْتُهُ وَشِرْكَهُ).

30- “ఇతర భాగస్వాములకంటే అధికంగా నేనే షిర్క్ (భాగస్వామ్యాని)కి అతీతుడిని, ఎవరైనా ఒక పని చేసి, అందులో నాతో ఇతరుల్ని భాగస్వామిగా చేస్తాడో నేను అతడ్ని, అతని ఆ పనిని స్వీకరించను”. అని అల్లాహ్ చెప్పినట్లు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ముస్లిం 2985).

ఈ హదీసులో:

షిర్క్ చేయువాని ఏ సత్కార్యమూ స్వీకరించబడదు. విధేయతలో సంకల్పశుద్ధి తప్పనిసరి. ప్రదర్శనాబుద్ధి షిర్క్ లో పరిగణించ బడుతుంది. ప్రదర్శనాబుద్ధితో చేసిన పుణ్యం అంగీకరింపబడదు. అతను చేసే సత్కార్యంలో కొంత స్వీకరించబడి మరి కొంత రద్దు కావడం జరగదు. పూర్తి సత్కార్యం రద్దగును. మనిషి తాను చేసే కార్యంలో అల్లాహ్ సంతృప్తిని కోరుకోవాలి. తన సంకల్పాన్ని షిర్క్ నుండి దూరముంచాలి.

عَن أَبِي الدَّرْدَاءِ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ يَقُولُ سَمِعْتُ رَسُولَ اللهِ ﷺ يَقُولُ: (كُلُّ ذَنْبٍ عَسَى اللهُ أَنْ يَغْفِرَهُ إِلَّا مَنْ مَاتَ مُشْرِكًا أَوْ مُؤْمِنٌ قَتَلَ مُؤْمِنًا مُتَعَمِّدًا).

31- “ప్రతి పాపాన్ని అల్లాహ్ క్షమించగలడు. కాని షిర్క్ చేస్తూ చనిపోయినవానిని మరియు ముస్లింను హతమార్చిన ముస్లింను క్షమించడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా తాను విన్నట్లు అబూ దర్దా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (అబూ దావూద్ 4270, సహీహ 5110).

ఈ హదీసులో:

ముష్రిక్ ని అల్లాహ్ క్షమించడు. అతని ఏ కార్యమూ అంగీకరించబడదు. ఏ సత్కార్యం లాభాన్నివ్వదు.

ఘోరపాపాలు చేసిన వ్యక్తి తౌబా చేయకున్నట్లయితే, అల్లాహ్ ఇష్టముంటే అతడిని మన్నించవచ్చు లేదా శిక్షించవచ్చు. ఉద్దేశపూర్వకంగా విశ్వాసిని వధించడం నరకంలో శాశ్వత స్థానానికి కారణం. అయితే విశ్వాసిని వధించడం ధర్మసమ్మతమే (నిశిద్ధం కాదు) అని భావించి హత్యకు పాల్పడేవానికే శాశ్వత స్థానం అని (ఇలా భావించని వానికి శాశ్వత స్థానం కాదు అని) కొందరు ధర్మవేత్తల అభిప్రాయం.

سعَنْ أَبِي الدَّرْدَاءِ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ أَوْصَانِي خَلِيلِي ﷺ : (أَنْ لَا تُشْرِكْ بِالله شَيْئًا وَإِنْ قُطِّعْتَ وَحُرِّقْتَ وَلَا تَتْرُكْ صَلَاةً مَكْتُوبَةً مُتَعَمِّدًا فَمَنْ تَرَكَهَا مُتَعَمِّدًا فَقَدْ بَرِئَتْ مِنْهُ الذِّمَّةُ وَلَا تَشْرَبْ الْخَمْرَ فَإِنَّهَا مِفْتَاحُ كُلِّ شَرٍّ).

32- నా ప్రాణమిత్రులైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ఇలా తాకీదు చేశారని అబూ దర్దా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “నిన్ను ముక్కలు ముక్కలు చేయడం జరిగినా, నీవు అగ్నిలో వేయబడినా సరే అల్లాహ్ కు ఇతరులను భాగస్వామిగా చేయకు. తెలిసి కూడా ఫర్జ్ నమాజు వదలకు. కావాలని దాన్ని వదలిన వారి కొరకు అల్లాహ్ తరఫున రక్షణ ఉండదు. మత్తు సేవించకు అది సర్వ పాపాలకు తాళంచెవి (మూలకారణం) లాంటిది”. (ఇబ్ను మాజ 4034).

ఈ హదీసులో:

పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నా, విశ్వాసాన్ని విడనాడడం నిషిద్ధం. భరించలేని యాతనలకు గురవుతున్నప్పుడు నోటితో ఏదైనా అవిశ్వాసపు పలుకు వచ్చినా, హృదయం విశ్వాసం పట్ల తృప్తికరంగా ఉండడం తప్పనిసరి. మనఃపూర్వకంగా అవిశ్వాసానికి పాల్పడడం నిషిద్ధం. నమాజు విడనాడిన వ్యక్తి సత్యతిరస్కారులకు పోలినవాడు, ధర్మాన్ని తన వీపు వెనక విసిరినవాడవుతాడు. విశ్వమంతటిలో ప్రతి చెడుకు మూలం మత్తు పదార్థాలే. ఎలా అనగా దాన్ని సేవించినవాడి బుద్ధిజ్ఞానాలపై పొర(పరదా)లు పడిపోతాయి, (విచక్షణా బుద్ధి కోల్పోతాడు) పిదప అతడు ప్రతి పాపానికి, చెడుకు ఒడిగడతాడు.

[11] విశ్వాస శ్రేష్ఠత

عَن عُمَرَ بْنِ الْخَطَّابِ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: لَمَّا كَانَ يَوْمُ خَيْبَرَ أَقْبَلَ نَفَرٌ مِنْ صَحَابَةِ النَّبِيِّ ﷺ فَقَالُوا: فُلَانٌ شَهِيدٌ فُلَانٌ شَهِيدٌ حَتَّى مَرُّوا عَلَى رَجُلٍ فَقَالُوا: فُلَانٌ شَهِيدٌ فَقَالَ رَسُولُ الله ﷺ : (كَلَّا إِنِّي رَأَيْتُهُ فِي النَّارِ فِي بُرْدَةٍ غَلَّهَا أَوْ عَبَاءَةٍ) ثُمَّ قَالَ رَسُولُ اللهِ ﷺ: (يَا ابْنَ الْخَطَّابِ اذْهَبْ فَنَادِ فِي النَّاسِ أَنَّهُ لَا يَدْخُلُ الْجَنَّةَ إِلَّا الْمُؤْمِنُونَ قَالَ فَخَرَجْتُ فَنَادَيْتُ أَلَا إِنَّهُ لَا يَدْخُلُ الْجَنَّةَ إِلَّا الْمُؤْمِنُونَ)

33- ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఖైబర్ యుద్ధం జరిగిన రోజున కొందరు ప్రవక్త సహచరులు ఒక వ్యక్తిని ఉద్దేశించి “ఫలానా వ్యక్తి షహీద్” అని అన్నారు. మరో వ్యక్తి నుండి దాటుతూ “ఫలానా వ్యక్తి షహీద్” అని చెప్పారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ఎంత మాత్రం కాదు. అతడు యుద్ధ ధనం నుండి దొంగలించిన దుప్పటి, లేదా చాదరు కారణంగా నేను అతడ్ని నరకంలో చూశాను”. మళ్ళీ ప్రవక్త ఇలా చెప్పారు: “ఖత్తాబ్ కుమారుడా! వెళ్ళి ప్రజల్లో ఇలా ప్రకటన చేయి: స్వర్గంలో విశ్వాసులు తప్ప మరెవ్వరూ ప్రవేశించలేరు”. అయితే నేను వెళ్ళి “వినండీ! స్వర్గంలో విశ్వాసులు తప్ప మరెవ్వరూ ప్రవేశించలేరు” అని ప్రకటన చేశాను.

ఈ హదీసులో:

ఈ చాటింపు ద్వారా ఉమర్ రజియల్లాహు అన్హు ఘనత తెలిసింది. లాభకరమైన విద్య ప్రజలకు అందజేయాలని తెలిసింది. బాధ్యత భారం దించుకొనుటకు, ప్రజల వద్ద మాకు తెలియదన్న సాకు మిగలకుండా, అజ్ఞానం తొలిగిపోవుటకు. పండితుడు మూల విద్యను, ముఖ్యమైన విషయాల్ని ముందు ప్రస్తావించాలి.

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ أَنَّ رَسُولَ الله ﷺ سُئِلَ أَيُّ الْعَمَلِ أَفْضَلُ فَقَالَ: (إِيمَانٌ بِالله وَرَسُولِهِ) قِيلَ: ثُمَّ مَاذَا قَالَ: (الْجِهَادُ فِي سَبِيلِ الله) قِيلَ: ثُمَّ مَاذَا قَالَ: (حَجٌّ مَبْرُورٌ).

34- అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “సత్కార్యాల్లో అతిశ్రేష్ఠమైనది ఏది” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక ప్రశ్న వచ్చింది. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించుట” అని చెప్పారు. మళ్ళీ ఏది? అని ప్రశ్న వచ్చినప్పుడు “అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయుట” అని జవాబిచ్చారు. ఆ తర్వాత ఏది? అని అడగ్గా “అంగీకారయోగ్యం పొందే హజ్” అని సమాధానం ఇచ్చారు. (బుఖారి 26).

ఈ హదీసులో:

విశ్వాసము (ఈమాన్) యొక్క శాఖలలో ఘనత పరంగా వ్యత్యాసం గలదు. విశ్వాసుల్లో ఘనత, వారి కర్మల ప్రకారం గలదు. కర్మలు విశ్వాసంలో లెక్కించబడవు అని వాదించే ‘ముర్జియా’ వర్గం యొక్క ఖండన ఇందులో ఉంది. ప్రశ్నించేవారిని బట్టి సమాధానం ఉంటుంది. అల్లాహ్, ఆయన ప్రవక్తపై విశ్వాసం లేనిదే ఏ సత్కార్యమూ స్వీకరించబడదు. ఇందులో జిహాద్ ఘనత ఉంది. అది అల్లాహ్ సాన్నిధ్యం పొందే కార్యాల్లో గొప్ప కార్యం. శ్రేష్ఠమైన కార్యాల్లో పాపాలకు దూరంగా ఉండి చేసిన హజ్జె మబ్రూర్ కూడా ఉంది. అధిక విద్యాభ్యాసన కోరికతో మరీమరి ప్రశ్నించడం మంచిదే కాని మీతిమీరడం మంచిది కాదు.

[12] విశ్వాస గుణాలు, దాని చిహ్నాలు

لَّيْسَ الْبِرَّ أَن تُوَلُّوا وُجُوهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَلَٰكِنَّ الْبِرَّ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَالْمَلَائِكَةِ وَالْكِتَابِ وَالنَّبِيِّينَ وَآتَى الْمَالَ عَلَىٰ حُبِّهِ ذَوِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينَ وَابْنَ السَّبِيلِ وَالسَّائِلِينَ وَفِي الرِّقَابِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَالْمُوفُونَ بِعَهْدِهِمْ إِذَا عَاهَدُوا ۖ وَالصَّابِرِينَ فِي الْبَأْسَاءِ وَالضَّرَّاءِ وَحِينَ الْبَأْسِ ۗ أُولَٰئِكَ الَّذِينَ صَدَقُوا ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُتَّقُونَ

సత్కార్యం అంటే మీరు మీ ముఖాలను తూర్పుకో పడమరకో త్రిప్పటం కాదు. సత్కార్యం అంటే మనిషి అల్లాహ్ ను, అంతిమ దినాన్నీ, దూతలను, అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాన్నీ, ఆయన ప్రవక్తలను హృదయపూర్వకంగా విశ్వసించటం. ఇంకా ధనప్రేమ కలిగిఉండి కూడా, దానిని బంధువుల, అనాథల, యాచించని పేదల, బాటసారుల, యాచకుల కొరకూ మరియు ఖైదీలను విడుదల చెయ్యటానికీ వ్యయపరచటం. ఇంకా నమాజును స్థాపించటం, జకాత్ ఇవ్వటం, వాగ్దానం చేస్తే దానిని పూర్తిచేసేవారూ, కష్టకాలంలో, లేమిలో సత్యాసత్యాల మధ్య జరిగే పోరాటంలో స్థైర్యం చూపేవారూ సత్పురుషులు. వాస్తవంగా సత్యసంధులు, అల్లాహ్ ఎడల భయభక్తులు కలవారు వీరే. (బఖర 2: 177).

قَدْ أَفْلَحَ الْمُؤْمِنُونَ الَّذِينَ هُمْ فِي صَلَاتِهِمْ خَاشِعُونَ وَالَّذِينَ هُمْ عَنِ اللَّغْوِ مُعْرِضُونَ وَالَّذِينَ هُمْ لِلزَّكَاةِ فَاعِلُونَ وَالَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَافِظُونَ
إِلَّا عَلَىٰ أَزْوَاجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ فَمَنِ ابْتَغَىٰ وَرَاءَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْعَادُون وَالَّذِينَ هُمْ لِأَمَانَاتِهِمْ وَعَهْدِهِمْ رَاعُونَ وَالَّذِينَ هُمْ عَلَىٰ صَلَوَاتِهِمْ يُحَافِظُونَ أُولَٰئِكَ هُمُ الْوَارِثُونَ الَّذِينَ يَرِثُونَ الْفِرْدَوْسَ هُمْ فِيهَا خَالِدُون

నిశ్చయంగా సాఫల్యం పొందే విశ్వాసులు తమ నమాజులో వినమ్రతను పాటించువారు, వ్యర్థవిషయాల జోలికిపోనివారు, జకాత్ విధానాన్ని ఆచరించువారు, తమ మర్మాంగాలను పరిరక్షించువారు, -తమ భార్యల, తమ ఆధీనంలో ఉన్న స్త్రీల విషయంలో తప్ప. అలాంటప్పుడు వారు నిందార్హులు కారు. కాని ఎవరైనా దీనిని మించి కోరుకుంటే వారే హద్దులను దాటేవారు- తమ అమానతుల(అప్పగింతల)కు, తమ వాగ్దానాలకు కట్టుబడి ఉండేవారు. తమ నమాజులను శ్రద్ధగా కాపాడుకునేవారు. వారే స్వర్గాన్ని వారసత్వంగా పొందేవారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. (మూమినూన్ 23: 1-11)

عَنْ أَبِي هُرَيْرَةَ عَنْ النَّبِيِّ قَالَ: (الْإِيمَانُ بِضْعٌ وَسَبْعُونَ شُعْبَةً فَأَفْضَلُهَا قَوْلُ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَدْنَاهَا إِمَاطَةُ الْأَذَى عَنْ الطَّرِيقِ وَالْحَيَاءُ شُعْبَةٌ مِنْ الْإِيمَانِ).

35- “విశ్వాసానికి చెందిన శాఖలు డెబ్బైకి పైగా ఉన్నాయి. అందులో శ్రేష్ఠమైనది: “లాఇలాహ ఇల్లల్లాహ్”. చివరి శాఖ: దారి నుండి ఇబ్బందికర వస్తువును ప్రక్కకు జరుపుట. బిడియం (సిగ్గు) కూడా విశ్వాసానికి చెందిన శాఖయే” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ముస్లిం 35, బుఖారి 9).

ఈ హదీసులో:

విశ్వాస శాఖలున్నాయని తెలిసింది. వాటిలో కొన్నింటికి మరి కొన్నింటిపై ఘనత గలదు. అందులో ఉత్తమమైనది, గొప్పదిః “లాఇలాహ ఇల్లల్లాహ్”. ఆచరణ విశ్వాసంలో లెక్కించబడుతుంది. అలాగే ప్రవర్తన కూడా. విశ్వాస శాఖల్లో కొన్ని ఎక్కువ ఘనత గలవి మరి కొన్ని తక్కువ ఘనత గలవైనప్పుడు అది (విశ్వాసం) తరుగుతూ పెరుగుతూ ఉందని అట్లే తెలుస్తుంది. ఏ చిన్న సత్కార్యమైనా మనిషి దాన్ని తక్కువైనదిగా చూడగూడదు. కనీసం, అది దారి నుండి ఇబ్బందికర వస్తువు తీసిపడేయడమైనా సరే. ఏ సత్కార్యమూ తౌహీద్ లేనిదే సంపూర్ణం కాదు.

عَن الْعَبَّاسِ بْنِ عَبْدِ الْمُطَّلِبِ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ أَنَّهُ سَمِعَ رَسُولَ الله ﷺ يَقُولُ: (ذَاقَ طَعْمَ الْإِيمَانِ مَنْ رَضِيَ بِالله رَبًّا وَبِالْإِسْلَامِ دِينًا وَبِمُحَمَّدٍ رَسُولًا). (ముస్లిం 34)

36- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఎవరయితే అల్లాహ్ ను ప్రభువుగా, ఇస్లాంను ధర్మంగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రవక్తగా స్వీకరించి ఆనందానుభవం పొందాడో ఆ వ్యక్తి విశ్వాస రుచిని ఆస్వాదించాడు”.

ఈ హదీసులో:

ఒక విషయాన్ని బోధించడానికి అనుకూలమైన మంచి పోలిక ఇవ్వడం జరిగింది. పైన చెప్పబడిన మూడు మూల సూత్రాలు ఇస్లాం ధర్మానికి పునాది లాంటివి. దీని భావం రీత్యా ముస్లిముల మధ్య వ్యత్యాసం గలదు. విశ్వాస ఆనందానుభవం పొందుట హృదయం పని. తౌహీద్ పై నిలకడ, విశ్వాసంలో స్వచ్ఛత ఏ మనిషిలో ఎంత పరిమాణంలో ఉంటుందో అతడు అంతే విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడు.

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ عَنْ النَّبِيِّ ﷺ قَالَ: (ثَلَاثٌ مَنْ كُنَّ فِيهِ وَجَدَ حَلَاوَةَ الْإِيمَانِ أَنْ يَكُونَ اللهُ وَرَسُولُهُ أَحَبَّ إِلَيْهِ مِمَّا سِوَاهُمَا وَأَنْ يُحِبَّ الْمَرْءَ لَا يُحِبُّهُ إِلَّا لِله وَأَنْ يَكْرَهَ أَنْ يَعُودَ فِي الْكُفْرِ كَمَا يَكْرَهُ أَنْ يُقْذَفَ فِي النَّارِ).

37- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారని అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మూడు లక్షణాలు ఎవరిలో ఉన్నాయో అతను విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదించినట్లేః (1) అందరికంటే ఎక్కువ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను ప్రేమించాలి. (2) ఎవరిని ప్రేమించినా కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం ప్రేమించాలి. (3) అగ్నిలో పడటానికి మనిషి ఎంత అసహ్యించుకుంటాడో, అవిశ్వాస స్థితి వైపుకు మరలిపోవడానికి కూడా అతను అంతగా అసహ్యించుకోవాలి”. (బుఖారి 16, ముస్లిం 43).

ఈ హదీసులో:

విశ్వాసానికి మాధూర్యముంటుందని, తన విశ్వాసాన్ని సంపూర్ణ స్థితికి చేర్పించే వ్యక్తి ఆ మాధూర్యాన్ని పొందుతాడని తెలిసింది. అల్లాహ్ మరియు ప్రవక్త పట్ల ప్రేమ కలిగియుండుట, మరియు వారి ప్రేమ అందరి పట్ల ఉండే ప్రేమలకంటే ఎక్కువగా ఉండుట కూడా విధిగా ఉంది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంపై ప్రేమ, అల్లాహ్ ప్రేమలో ఇమిడి యుంది. అల్లాహ్ కొరకు ఇతరులను ప్రేమించుట విశ్వాసంలో ఓ భాగమే. అలాగే దీని భిన్న భావమేమిటంటే అవిశ్వాసులతో ద్వేషం కూడా విశ్వాసంలో ఓ భాగమే. అవిశ్వాసాన్ని, అవిశ్వాసుల చేష్టలను అసహ్యించుకొనుట కూడా విధిగా ఉంది. ఇస్లాంను విడనాడడం మరియు మతభ్రష్టతకు గురి కావడం నుండి హెచ్చరించబడింది. అల్లాహ్ మరియు ప్రవక్త ప్రేమను వదలి ఇతరులను అధికంగా ప్రేమించడం నిషిద్ధం. చదవండి అల్లాహ్ ఆదేశం: ]ఒక వేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ బంధువులు, మీ ఆప్తులు, మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు, మందగిస్తాయేమోనని మీరు భయపడే మీ వ్యాపారాలు, మీరు ఇష్టపడే మీ గృహాలు అల్లాహ్ కంటే ఆయన ప్రవక్త కంటే ఆయన మార్గంలో జిహాద్ కంటే మీకు ఎక్కువ ప్రీతికరమైతే, అల్లాహ్ తన తీర్పును మీ ముందుకు తీసుకువచ్చే వరకు నిరీక్షించండి. అల్లాహ్ అవిధేయులకు మార్గం చూపడు[. (తౌబా 9: 24).

عَنْ جَابِرٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قِيلَ: يَا رَسُولُ الله! أَيُّ الإيمانِ أَفْضَلُ؟ قَالَ: (الإيمانُ: الصَّبرُ وَالسَّمَاحَةُ).

38- జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ఎలాంటి విశ్వాసం అతి ఉత్తమమైనదని వచ్చిన ప్రశ్నకు “సహనం మరియు ఉదార గుణాలతో కూడి ఉన్న విశ్వాసం” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానమిచ్చారు. (ఇబ్ను షైబా ‘ఈమాన్’లో, షేఖ్ అల్బానీ ‘సహీహా’ 1495లో).

ఈ హదీసులో:

ఇందులో విశ్వాస వ్యాఖ్యానం దాని స్పష్టమైన, గొప్ప గుణాలతో చేయబడింది. అవి: సహనం, దాతృత్వం. సహనం విశ్వాసం యొక్క శిఖరం. అది ఉంటెనే ఆదేశాల పాలన జరుగుతుంది. వారింపులను త్యజించడం జరుగుతుంది. విధివ్రాతే ప్రకారం వచ్చే ఆపదలపై ఓపిక వహించడం జరుగుతుంది. దాతృత్వం వల్ల అల్లాహ్ వద్ద ఉన్న గొప్ప పుణ్యం పట్ల నమ్మకం పెరుగుతుంది. ఆయన చేసిన వాగ్దానాలతో మనస్సుకు తృప్తి లభిస్తుంది. ఈమాన్ అన్న పదంలో విశ్వాసాలు, ఆచరణలు మరియు ప్రవర్తనలన్నీ వస్తాయి.

عَنْ أَبِي أُمَامَةَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ أَنَّ رَجُلًا سَأَلَ رَسُولَ الله ﷺ مَا الْإِيمَانُ؟ قَالَ: (إِذَا سَرَّتْكَ حَسَنَتُكَ وَسَاءَتْكَ سَيِّئَتُكَ فَأَنْتَ مُؤْمِنٌ) قَالَ يَا رَسُولَ الله فَمَا الْإِثْمُ قَالَ: (إِذَا حَاكَ فِي نَفْسِكَ شَيْءٌ فَدَعْهُ)

39- అబూ ఉమామ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ‘విశ్వాసమంటే ఏమిటి?’ అని ఒక వ్యక్తి ప్రవక్తను అడిగాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “నీవు చేసిన సత్కార్యం నీకు సంతోషం కలిగించినప్పుడు, నీవు చేసిన పాపం నిన్ను బాధించినప్పుడు నీవు విశ్వాసివి” అని సమాధానమిచ్చారు. ‘పాపమంటేమిటి?’ అని అతను మళ్ళీ అడిగాడు. “ఏ పని చేయుటకు నీవు జంకుతున్నావో దాన్ని వదిలేయి. అదే పాపం” అని చెప్పారు. (అహ్మద్. సహీహ 550).

ఈ హదీసులో:

విశ్వాసికి అతని సత్కార్యం సంతోషాన్ని, విధేయత ఆనందాన్ని ఇస్తుంది. పాపం చింతకు గురి చేస్తుంది. కాని కపట విశ్వాసి మరియు పాపాత్ముడు పుణ్యకార్యాలతో ఆనందించడు. వాటి ద్వారా ఏ మాధుర్యమూ పొందడు. పాపంతో అతని మనస్సు జంకదు. పాపం అతనికి చేదుగా అనిపించదు. సత్కార్యంతో సంతోషించుట పుణ్యఫల రెట్టింపుకు, పాపంతో భయపడుట, దిగులు చెందుట శిక్షలో తగ్గింపుకు మంచి సబబు. విశ్వాసి వద్ద హృదయపు గీటురాయి ఉంటుంది. దాని ద్వారా అతను తన విశ్వాస పరిణామాన్ని తెలుసుకుంటాడు.

عَنْ فَضَالَةَ بْنِ عُبَيْدٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ فِي حَجَّةِ الْوَدَاعِ:(أَلَا أُخْبِرُكُمْ بِالْمُؤْمِنِ مَنْ أَمِنَهُ النَّاسُ عَلَى أَمْوَالِهِمْ وَأَنْفُسِهِمْ وَالْمُسْلِمُ مَنْ سَلِمَ النَّاسُ مِنْ لِسَانِهِ وَيَدِهِ وَالْمُجَاهِدُ مَنْ جَاهَدَ نَفْسَهُ فِي طَاعَةِ الله وَالْمُهَاجِرُ مَنْ هَجَرَ الْخَطَايَا وَالذُّنُوبَ).

40- ఫజాలా బిన్ ఉబైద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: హజ్జతుల్ విదాఅ సందర్భంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: “విశ్వాసి ఎవరో మీకు తెలుపనా? ప్రజలు ఎవరి నుండి తమ ధనప్రాణాలకు రక్షణ ఉందని నమ్ముతారో అతనే విశ్వాసి. ప్రజలు ఎవరి నోటి మరియు చేతుల ద్వారా బాధింపబడరో అతనే ముస్లిం. అల్లాహ్ కు విధేయునిగా ఉండడానికి తన మనోవాంఛలతో పోరాడే వ్యక్తియే ముజాహిద్. పాపాలను, అవిధేయతా విధానాన్ని విడనాడే వ్యక్తియే ముహాజిర్”. (అహ్మద్. సహీహ 549).

ఈ హదీసులో:

ఇందులో విశ్వాసిని అతని ఉత్తమ గుణం, ఉన్నత సద్వర్తన ద్వారా నిర్వచించడం జరిగింది: అల్లాహ్ దాసులను కష్టపెట్టక పోవడం. అతని కీడు నుండి ప్రజలు సురక్షితంగా ఉండడం. వారి ధన ప్రాణాలు అతని నుండి భద్రంగా ఉండడం. అలాగే ముహాజిర్ యొక్క వివరణ కూడా అతి గొప్ప విషయంతో ఇవ్వడం జరిగింది: అవిధేయతా విధానాన్ని, పాపాల్ని వదులుకొనడం, అగోచర జ్ఞానం గల ప్రభువుతో స్వచ్ఛమైన తౌబా చేయడం.

عَنْ سُفْيَانَ بْنِ عَبْدِ الله الثَّقَفِيِّ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قُلْتُ: يَا رَسُولَ الله! قُلْ لِي فِي الْإِسْلَامِ قَوْلًا لَا أَسْأَلُ عَنْهُ أَحَدًا بَعْدَكَ قَالَ: (قُلْ آمَنْتُ بِالله فَاسْتَقِمْ)

41- సుఫ్యాన్ బిన్ అబ్దుల్లాహ్ సఖఫీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ‘ప్రవక్తా! ఇస్లాంలో ఒక మాట నాకు తెలుపండి దాని గురించి మళ్ళీ నేను ఎవరినీ అడగను’ అని విన్నవించుకున్నాను. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఆమన్తు బిల్లాహ్ (నేను అల్లాహ్ ను మాత్రమే విశ్వసించాను) అని పలికిన తర్వాత ఆ విషయం లో స్థిరంగా నిలబడి ఉండు” అని చెప్పారు. (ముస్లిం 38).

ఈ హదీసులో:

ఈ సద్వచనమే ఇస్లాం ధర్మం యొక్క సారాంశం. మరియు ముస్లిముల ఐక్యతకు మూలం. దాని భావం: దానిని మనసా, వాచా, కర్మా విశ్వసించడం మరియు ఎల్లప్పుడూ దానిపై స్థిరంగా ఉండడం. “ఆమంతు బిల్లాహ్” అన్న పదంలో అల్లాహ్ యొక్క రుబూబియత్, ఉలూహియత్, అస్మా వ సిఫాతుల([3])ను మరియు ఆయన పంపిన ప్రవక్తలను, అవతరింపజేసిన గ్రంథాలను విశ్వసించడం కూడా వస్తాయి. “దానిపై స్థిరంగా ఉండు” అంటే సర్వ ధర్మాజ్ఞలు ఉత్తమ రీతిలో పాటించు. (సర్వ వారింపులకు దూరంగా ఉండు). ఇదే సంపూర్ణ ధర్మం.

عَنْ أَنَسٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ النَّبِيُّ ﷺ: (لَا يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّى أَكُونَ أَحَبَّ إِلَيْهِ مِنْ وَالِدِهِ وَوَلَدِهِ وَالنَّاسِ أَجْمَعِينَ).

42- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని, అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “తన తండ్రి, తన బిడ్డ, ప్రపంచంలోని ఇతర మానవులందరికన్నా ఎక్కువగా నన్ను ప్రేమించనంత వరకూ మీలో ఏ ఒక్కడూ నిజమైన విశ్వాసి కాజాలడు”. (బుఖారి 15, ముస్లిం 44).

ఈ హదీసులో:

ఇందులో “మీలో” అనగా సహాబా (ప్రవక్త సహచరులు) మాత్రమే కాదు. విశ్వాసులందరూ అని భావం. ప్రేమ, ద్వేషం హృదయానికి సంబంధించిన పనులు. అవి ధర్మానికి సంబంధించినవే. విశ్వాసపరంగా విశ్వాసులందరూ సమానంగా ఉండరు. విశ్వాసం పెరుగుతుంది మరియు తరుగుతుంది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమ అనుచరులపై విధిగా ఉంది. బలమైన ధర్మ కంకణాల్లో ఆయన పట్ల ప్రేమ కూడా ఒకటి. తండ్రి, కొడుకు మరియు తదితరుల ప్రేమలు ఆయన పట్ల గల ప్రేమ కంటే ఎక్కువగా ఉండుట నిషిద్ధం.

عَنْ أَنَسٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ عَنْ النَّبِيِّ ﷺ قَالَ: (لَا يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّى يُحِبَّ لِأَخِيهِ مَا يُحِبُّ لِنَفْسِهِ).

43- “తన కోసం ఇష్టపడిన దానిని తన సోదరుని కోసం కూడా ఇష్టపడనంత వరకూ మీలో ఏ ఒక్కడూ నిజమైన విశ్వాసి కాజాలడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని, అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (బుఖారి 13, ముస్లిం 45).

ఈ హదీసులో:

ఒక ముస్లిం తనకు తాను కోరుకున్నటువంటి మేలే తన ముస్లిం సోదరుని కోసం కూడా కోరుట ఒక ముస్లింకు మరో ముస్లింపై ఉన్న హక్కుల్లో ఒకటి. అలాగే తన కొరకు దేనిని ఇష్టపడడో తన సోదరుని కొరకు కూడా దానిని ఇష్టపడకూడదు. ఇలా ముస్లిములు పరస్పరం మోసం చేసుకొనుట తగదు అని చెప్పబడింది. మోసం చేయుట విశ్వాసుల గుణం కాదు అని అర్థం.

[13] విశ్వాసం తరుగుట, పెరుగుట

عَنْ حَنْظَلَةَ الْأُسَيِّدِيِّ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (وَالَّذِي نَفْسِي بِيَدِهِ إِنْ لَوْ تَدُومُونَ عَلَى مَا تَكُونُونَ عِنْدِي وَفِي الذِّكْرِ لَصَافَحَتْكُمْ الْمَلَائِكَةُ عَلَى فُرُشِكُمْ وَفِي طُرُقِكُمْ وَلَكِنْ يَا حَنْظَلَةُ سَاعَةً وَسَاعَةً) ثَلَاثَ مَرَّاتٍ.

44- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని హంజలా ఉసయ్యిదీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షి! నా వద్ద ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటారో అలాగే ఎల్లప్పుడూ ఉన్నట్లయితే మరియు అల్లాహ్ స్మరణలోనే ఉన్నట్లయితే, మీరు మీ పడకలపై ఉండగా, దారిలో నడుస్తుండగా దైవదూతలు వచ్చి మీతో కరచాలనం చేసేవారు. కాని ఓ హంజలా! కొంత అల్లాహ్ ధ్యానం మరికొంత ఆలుపిల్లల భాధ్యత భారం తప్పదు”. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ చివరి మాట మూడు సార్లు అన్నారు. (ముస్లిం 2750).

ఈ హదీసులో:

విశ్వాసుని స్థితి అన్ని వేళల్లో ఒకేరకంగా ఉండదు. అప్పుడప్పుడు అశ్రద్ధ ఏర్పడుతుంది. సహచరుల అతి ఉత్తమ సందర్భం ప్రవక్త సన్నిధిలో ఉన్నప్పటిది. మనిషి నుండి పాపం జరుగుట తప్పనిసరే. ఇలా స్వాతిశయం, అహంభావం దూరమయి, దైవదాస్యం లో ఉన్నత స్థానం లభించుటకు మరియు మనిషి అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుతూ ఉండుట కోసం. తాను కోరిన దానిని సృష్టించడం, లేదా నశింపజేయడం అల్లాహ్ కు చాలా సులువు.

عَنْ عَبْدِ الله بْنِ عَمْرِو بْنِ الْعَاصِ { قَالَ : قَالَ رَسُولُ الله ﷺ: (إِنَّ الإِيمَانَ لَيُخْلَقُ فِي جَوفِ أَحَدِكُمْ كَمَا يُخْلَقُ الثَّوبُ الخَلقُ ، فَاسْأَلُوا اللهَ أَنْ يُجَدِّدَ الْإِيمَانَ فِي قُلُوبِكُم) .

45- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “నిశ్చయంగా మీ దుస్తులు పాతబడినట్లు మీలోని మీ విశ్వాసం కూడా పాతబడుతుంది. అందుచేత అల్లాహ్ మీ విశ్వాసాన్ని నూతనంగా, తాజాగా ఉంచాలని మీరు ఆయన్ని ప్రార్థిస్తూ ఉండండి”. (ముస్తద్రక్ హాకిం 5. సహీహ 1585).

ఈ హదీసులో:

పాపంతో విశ్వాసం బలహీనపడుతుంది. అశ్రద్ధ వల్ల అది హృదయంలో పాతబడుతుంది. బట్టను ఉతికి కొత్తదనానికి తీసుకొచ్చే పద్ధతిలో, అల్లాహ్ స్మరణం (జిక్ర్), దుఆ, ఖుర్ఆన్ పారాయణం, సత్కర్మల ద్వారా దానిని పునరుద్ధరించాలి. విశ్వాసంపై నిలకడగా ఉండుటకు, అది పెరుగుతూ ఉండుటకు, చివరి శ్వాస వరకు అదే స్థితిలో ఉండుటకు అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉండాలి.

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ يَقُولُ: قَالَ رَسُولُ الله ﷺ: (إِذَا زَنَى الرَّجُلُ خَرَجَ مِنْهُ الْإِيمَانُ كَانَ عَلَيْهِ كَالظُّلَّةِ فَإِذَا انْقَطَعَ رَجَعَ إِلَيْهِ الْإِيمَانُ).

46- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తున్నప్పుడు అతని నుండి విశ్వాసం బయటకు వెళ్ళి, అతనిపై నీడ మాదిరిగా ఉండిపోతుంది. ఆ దుష్కార్యం వదలినప్పుడు విశ్వాసం తిరిగి అతని వైపు వచ్చేస్తుంది”. (అబూ దావూద్ 4690, తిర్మిజి 2625. సహీహ 509).

ఈ హదీసులో:

పాపాల నష్టం తెలుపబడింది. దాని వలన సంపూర్ణ విశ్వాసం లో కొరత ఏర్పడుతుంది. ఒక్కోసారి విశ్వాసం ప్రక్కకు జరిగిపోతుంది. ‘పాపం వల్ల విశ్వాసానికి ఏ నష్టం వాటిల్లద’ని చెప్పే “ముర్జియా” వర్గం వారి సిద్ధాంతాల ఖండన ఇందులో జరిగింది. “నీడ మాదిరిగా ఉండిపోతుంది” అని సులభంగా అర్థమయ్యే మంచి ఉదాహరణ ఇవ్వబడింది. పాపకార్యాల్లో వ్యభిచారం అతినీచమైనది, చెడ్డది. పాపాల నుండి దూరముంటూ, స్వచ్ఛమైన తౌబా చేస్తూ విశ్వాసం కోల్పోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి.

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (لَا يَزْنِي الزَّانِي حِينَ يَزْنِي وَهُوَ مُؤْمِنٌ وَلَا يَشْرَبُ الْخَمْرَ حِينَ يَشْرَبُ وَهُوَ مُؤْمِنٌ وَلَا يَسْرِقُ السَّارِقُ حِينَ يَسْرِقُ وَهُوَ مُؤْمِنٌ وَلَا يَنْتَهِبُ نُهْبَةً يَرْفَعُ النَّاسُ إِلَيْهِ فِيهَا أَبْصَارَهُمْ وَهُوَ مُؤْمِنٌ).

47- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “వ్యభిచారి వ్యభిచారం చేస్తున్నప్పుడు విశ్వాసిగా ఉండడు. త్రాగుబోతు మద్యం సేవిస్తున్నప్పుడు విశ్వాసిగా ఉండడు. దొంగ దొంగతనం చేస్తున్నప్పుడు విశ్వాసిగా ఉండడు. ప్రజలు కళ్ళారా చూస్తుండగా దోపిడి దొంగ పెద్ద ఎత్తున లూటీ చేస్తున్నప్పుడు విశ్వాసిగా ఉండడు”. (బుఖారి 5578, ముస్లిం 57).

ఈ హదీసులో:

ఘోరపాపాలు సంపూర్ణ విశ్వాసంలో లోటు కలుగజేస్తాయి. సంపూర్ణ విశ్వాసంగల వ్యక్తిని అతని విశ్వాసం పాపాల నుండి, అవిధేయత నుండి కాపాడుతుంది. ఘోరపాపాలకు సమీపించే వారికి ఇందులో కఠినంగా హెచ్చరిక ఉంది. పాపాలు రెండు రకాలుగా ఉంటాయి: చిన్నవి మరియు పెద్దవి.

[14] లాఇలాహ ఇల్లల్లాహ్ యొక్క షరతులు

عن أَبِي هُرَيْرَةَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: كُنَّا قُعُودًا حَوْلَ رَسُولِ اللهِ ﷺ مَعَنَا أَبُو بَكْرٍ وَعُمَرُ فِي نَفَرٍ فَقَامَ رَسُولُ اللهِ ﷺ مِنْ بَيْنِ أَظْهُرِنَا فَأَبْطَأَ عَلَيْنَا وَخَشِينَا أَنْ يُقْتَطَعَ دُونَنَا وَفَزِعْنَا فَقُمْنَا فَكُنْتُ أَوَّلَ مَنْ فَزِعَ فَخَرَجْتُ أَبْتَغِي رَسُولَ اللهِ ﷺ حَتَّى أَتَيْتُ حَائِطًا لِلْأَنْصَارِ لِبَنِي النَّجَّارِ فَدُرْتُ بِهِ هَلْ أَجِدُ لَهُ بَابًا فَلَمْ أَجِدْ فَإِذَا رَبِيعٌ يَدْخُلُ فِي جَوْفِ حَائِطٍ مِنْ بِئْرٍ خَارِجَةٍ وَالرَّبِيعُ الْجَدْوَلُ فَاحْتَفَزْتُ كَمَا يَحْتَفِزُ الثَّعْلَبُ فَدَخَلْتُ عَلَى رَسُولِ اللهِ ﷺ فَقَالَ: (أَبُو هُرَيْرَةَ) فَقُلْتُ: نَعَمْ يَا رَسُولَ اللهِ قَالَ: (مَا شَأْنُكَ؟) قُلْتُ كُنْتَ بَيْنَ أَظْهُرِنَا فَقُمْتَ فَأَبْطَأْتَ عَلَيْنَا فَخَشِينَا أَنْ تُقْتَطَعَ دُونَنَا فَفَزِعْنَا فَكُنْتُ أَوَّلَ مِنْ فَزِعَ فَأَتَيْتُ هَذَا الْحَائِطَ فَاحْتَفَزْتُ كَمَا يَحْتَفِزُ الثَّعْلَبُ وَهَؤُلَاءِ النَّاسُ وَرَائِي فَقَالَ: (يَا أَبَا هُرَيْرَةَ) وَأَعْطَانِي نَعْلَيْهِ قَالَ: (اذْهَبْ بِنَعْلَيَّ هَاتَيْنِ فَمَنْ لَقِيتَ مِنْ وَرَاءِ هَذَا الْحَائِطِ يَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ مُسْتَيْقِنًا بِهَا قَلْبُهُ فَبَشِّرْهُ بِالْجَنَّةِ) فَكَانَ أَوَّلَ مَنْ لَقِيتُ عُمَرُ فَقَالَ مَا هَاتَانِ النَّعْلَانِ يَا أَبَا هُرَيْرَةَ فَقُلْتُ هَاتَانِ نَعْلَا رَسُولِ اللهِ ﷺ بَعَثَنِي بِهِمَا مَنْ لَقِيتُ يَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ مُسْتَيْقِنًا بِهَا قَلْبُهُ بَشَّرْتُهُ بِالْجَنَّةِ فَضَرَبَ عُمَرُ بِيَدِهِ بَيْنَ ثَدْيَيَّ فَخَرَرْتُ لِاسْتِي فَقَالَ ارْجِعْ يَا أَبَا هُرَيْرَةَ فَرَجَعْتُ إِلَى رَسُولِ اللهِ ﷺ فَأَجْهَشْتُ بُكَاءً وَرَكِبَنِي عُمَرُ فَإِذَا هُوَ عَلَى أَثَرِي فَقَالَ لِي رَسُولُ اللهِ ﷺ (مَا لَكَ يَا أَبَا هُرَيْرَةَ؟) قُلْتُ: لَقِيتُ عُمَرَ فَأَخْبَرْتُهُ بِالَّذِي بَعَثْتَنِي بِهِ فَضَرَبَ بَيْنَ ثَدْيَيَّ ضَرْبَةً خَرَرْتُ لِاسْتِي قَالَ: ارْجِعْ، فَقَالَ لَهُ رَسُولُ اللهِ: (يَا عُمَرُ! مَا حَمَلَكَ عَلَى مَا فَعَلْتَ) قَالَ: يَا رَسُولَ اللهِ! بِأَبِي أَنْتَ وَأُمِّي أَبَعَثْتَ أَبَا هُرَيْرَةَ بِنَعْلَيْكَ مَنْ لَقِيَ يَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ مُسْتَيْقِنًا بِهَا قَلْبُهُ بَشَّرَهُ بِالْجَنَّةِ قَالَ:(نَعَمْ) قَالَ: فَلَا تَفْعَلْ فَإِنِّي أَخْشَى أَنْ يَتَّكِلَ النَّاسُ عَلَيْهَا فَخَلِّهِمْ يَعْمَلُونَ قَالَ رَسُولُ اللهِ: ﷺ (فَخَلِّهِمْ).

48- అబూ హురైర రజియల్లాహు అన్హుఉల్లేఖనం ప్రకారం: అబూ బక్ర్, ఉమర్ రజియల్లాహు అన్హుమాతో సహా మేము కొంత మంది ప్రవక్త చుట్టూ కూర్చొనియుండగా, హఠాత్తుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా మధ్య నుండి వెళ్ళిపోయారు. చాలా సమయం గడిచినప్పటికీ రానందుకు శత్రువుల నుండి ఏదైనా అపాయం కలిగిందా అన్న భయం మాకు కలిగి మేము నిలబడ్డాము. అందరికంటే ముందు నాకు ఈ భయం కలిగింది. ప్రవక్త జాడ కనుగొనుటకు నేను బయలుదేరి అన్సారులోని బనీ నజ్జార్ కు చెందిన ఒక తోట వద్దకు చేరుకొని, అందులో ప్రవేశించడానికి ద్వారమును వెతుకుతూ దాని చుట్టూ తిరిగాను. కాని ద్వారము చూడలేదు. అయితే ఆ తోటకు కొంత దూరములో ఉన్న ఒక బావి నుండి చిన్న కాలువ ప్రవహిస్తూ ఆ తోటలో చేరుతుంది. దాని గుండా నక్క మాదిరిగా నేను ముడుచుకొని లోపలికి వెళ్ళాను. అక్కడ ప్రవక్త కనబడ్డారు. (నా రాకను గమనించిన ప్రవక్త) “అబూ హురైరా?” అని అడిగారు. ‘అవును’ అని నేనన్నాను. “ఎందుకొచ్చావు?” అని అడిగారు. ‘మీరు మా మధ్య కూర్చున్నవారు హఠాత్తుగా వెళ్ళి ఆలస్యం చేసినందుకు, మీరు ఏదైనా అపాయంలో చిక్కుకున్నారా అని మాకు ఆందోళన కలిగింది. అందరికంటే ముందు నేను కంగారుపడి, నక్క ముడుచుకొని వచ్చినట్లు ఈ తోటలో ప్రవేశించాను. నా వెనక సహచరులు మీ కొరకు వేచియున్నారు అని చెప్పాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ పాదరక్షలను నాకు ఇస్తూ “అబూ హురైర! ఇదిగో నా చెప్పులు తీసుకు వెళ్ళి, ఈ తోట ఆవల నీకు కలసినవారిలో సంపూర్ణ హృదయాంతర నమ్మకంతో “లాఇలాహ ఇల్లల్లాహ్” సాక్ష్యం ఇచ్చినవారికి స్వర్గం శుభవార్త ఇవ్వు” అని ఆదేశించారు. నేను వెళ్ళాను. ఎదురుగా నాకు ఉమర్ రజియల్లాహు అన్హు కలసి, ఈ చెప్పులేమిటి అబూ హురైర అని మందలించారు. ఇవి ప్రవక్త గారి చెప్పులు. ఆయన ఇవి నాకు ఇచ్చి, సంపూర్ణ హృదయాంతర నమ్మకంతో “లాఇలాహ ఇల్లల్లాహ్” సాక్ష్యం పలికిన వారికి స్వర్గం శుభవార్త ఇవ్వుమని చెప్పారు అని అన్నాను. ఇది విన్న ఉమర్ నా ఛాతిపై గుద్దారు. నేను వెల్లకిలా పడ్డాను. ‘అబూ హురైర! ప్రవక్త వద్దకు వెనక్కి తిరుగు’ అని ఉమర్ అన్నారు. నేను ఏడుపు ముఖముతో ప్రవక్త వద్దకు వచ్చాను. నా వెనకే ఉమర్ వచ్చారు. “అబూ హురైర! నీకు ఏమైనది?” అని ప్రవక్త మందలించారు. అప్పుడు నేను చెప్పానుః ‘బయటికి వెళ్ళే సరికి ఉమర్ కలిశారు. మీరు ఇచ్చిన సందేశాన్ని నేను వారికి తెలిపాను. అందుకు ఆయన నా ఛాతిపై పిడికిలితో గట్టి దెబ్బ కొట్టారు. అందువల్ల నేను వెల్లకిలా పడ్డాను. ఆ తర్వాత ‘తిరిగి వెళ్ళు’ అని కూడా చెప్పారు. “ఉమర్! నీవు ఇతనితో ఇలా ఎందుకు ప్రవర్తించావు” అని ప్రవక్త మందలించారు. దానికి ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా సమాధానమిచ్చారు: ‘ప్రవక్తా! నా తల్లిదండ్రులు మీకై అర్పితమవుగాక! సంపూర్ణ హృదయాంతర విశ్వాసంతో “లాఇలాహ ఇల్లల్లాహ్” యొక్క సాక్ష్యం ఇచ్చినవారు కలసినచో వారికి స్వర్గం శుభవార్త ఇవ్వమని, మీరు తమ పాదరక్షలు అబూ హురైరకు ఇచ్చి పంపారా?. “అవును” అని ప్రవక్త అన్నారు. ‘అయితే అలా ఆదేశమివ్వకండి ప్రవక్తా! ప్రజలు దానిపై మాత్రమే నమ్మకముంచుకొని (ఆచరణ వదిలేస్తారని) నాకు భయంగా ఉంది. అందుచేత వారిని సత్కార్యాలు చేస్తూ ఉండనివ్వండి’ అని ఉమర్ చెప్పారు. అప్పుడు ప్రవక్త ﷺ “సరే అలాగే ఉండనివ్వండి” అని అన్నారు. (ముస్లిం 31).

ఈ హదీసులో:

తను చెప్పే మాట నిజమని తెలియడానికి ఒక గుర్తు ఇచ్చి పంపడం మంచిది. సంతోషవార్త అందరికీ తెలియజేయాలి. అది ప్రజల్లో ఎవరైనా సందేహాలకు గురికాకుండా, ఆచరణ వదలుకోరని నమ్మకం ఉన్నప్పుడు. ఉమర్ అబూ హురైరను నెట్టేసి, ప్రవక్త వద్దకు వచ్చి ప్రజలు దీని ఆధారంగా ఆచరణ వదులుకుంటారని చెప్పడం, ప్రవక్త దాన్ని అంగీకరించడం ద్వారా ఉమర్ రజియల్లాహు అన్హు ఘనత తెలిసింది.

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنِّي رَسُولُ الله لَا يَلْقَى اللهَ بِهِمَا عَبْدٌ غَيْرَ شَاكٍّ فِيهِمَا إِلَّا دَخَلَ الْجَنَّةَ).

49- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు మరియు నేను అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యమిచ్చుచున్నాను. ఏ వ్యక్తి రెండు సాక్ష్యాలను (లాఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్) ఏలాంటి సందేహం లేకుండా పలుకుతాడో అతను అల్లాహ్ తో కలసిన తర్వాత స్వర్గంలోకే వెళ్తాడు”. (ముస్లిం 27).

ఈ హదీసులో:

పై రెండు విషయాల సాక్ష్యం ఇవ్వనిదే ఎవడూ విశ్వాసి కాడు. ఆ రెండింటిని కలిపి, రెండింటి గురించి సాక్ష్యమివ్వాలి. అందులో ఏ ఒక్క దానిని వదలినా ఆ సాక్ష్యం సంపూర్ణం కాదు. దాని సాక్ష్యమిచ్చువాడు సంపూర్ణ నమ్మకంతో సాక్ష్యమివ్వాలి. ఏ కొంచెం అనుమానం, సందేహానికి గురైనా సాక్ష్యమివ్వనట్లే. ఈ విధంగా సాక్ష్యమిచ్చినవారి స్థానం స్వర్గం. “లాఇలాహ ఇల్లల్లాహ్” ను పూర్తి నమ్మకంతో విశ్వసించాలి అంటే దాని ప్రకారం జీవితం గడపాలి అని అర్థం. హృదయాంతరంతో విశ్వసించడం సత్కార్యాల్లో వస్తుంది. కేవలం నోటితో పలుకుట సరిపోదు.

عَنْ أَبِي مُوسَى الأشعري رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: أَتَيْتُ النَّبِيَّ ﷺ وَمَعِي نَفَرٌ مِنْ قَوْمِي فَقَالَ: (أَبْشِرُوا وَبَشِّرُوا مَنْ وَرَاءَكُمْ إِنَّهُ مَنْ شَهِدَ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ صَادِقًا بِهَا دَخَلَ الْجَنَّةَ) فَخَرَجْنَا مِنْ عِنْدِ النَّبِيِّ ﷺ نُبَشِّرُ النَّاسَ فَاسْتَقْبَلَنَا عُمَرُ بْنُ الْخَطَّابِ فَرَجَعَ بِنَا إِلَى رَسُولِ الله ﷺ فَقَالَ عُمَرُ يَا رَسُولَ الله إِذَنْ يَتَّكِلَ النَّاسُ قَالَ فَسَكَتَ رَسُولُ الله

50- అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: నేను నా జాతివారితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో హాజరయ్యాను. అప్పుడు ఆయన ఇలా ఆదేశించారుః “శుభవార్త వినండి! మీ వెనక ఉన్నవారికి ఈ శుభవార్త ఇవ్వండిః ఎవరు పూర్తి (హృదయాంతర) సత్యాలతో లాఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యం పలుకుతాడో అతడు తప్పక స్వర్గంలో ప్రవేశిస్తాడు”. మేము ప్రవక్త వద్ద నుండి బయలుదేరి ప్రజలకు ఈ శుభవార్త ఇస్తూ వెళ్లాము. అంతలో ఉమర్ రజియల్లాహు అన్హు మాకు కలిశారు. మమ్మల్ని ప్రవక్త వద్దకు తీసుకొచ్చి, ‘ప్రవక్తా! ఇక ప్రజలు దీనిపైనే ఆధారపడి పోతారు. (సత్కార్యాలు చేయడం మానుకుంటారు) అని అన్నారు. దానికి ప్రవక్త మౌనం వహించారు. (అహ్మద్. సహీహ 712).

ఈ హదీసులో:

మంచి విషయాల శుభవార్త ఇవ్వాలి. మనస్పూర్వకంగా తౌహీద్ ను నమ్మి, దాని ప్రకారం ఆచరించే వారికి స్వర్గం అన్నది అతి గొప్ప శుభవార్త. “లాఇలాహ ఇల్లల్లాహ్” హృదయంతో, సంపూర్ణ విశ్వాసంతో, నోటితో పలకడంలో పూర్తి సత్యతను పాటించి, చిత్తశిద్ధితో అల్లాహ్ సంతృప్తి కొరకు దాని ప్రకారం ఆచరించినచో అది ఆ వ్యక్తికి లాభాన్నిస్తుంది. దానితో ఈవిధంగా వ్యవహరించినవారి స్థానం భోగభాగ్యాలతో నిండి ఉన్న స్వర్గవనాలు. కేవలం “లాఇలాహ ఇల్లల్లాహ్” సాక్ష్యం ఇచ్చుట సరిపోదు. “ముహమ్మదుర్ రసూలుల్లాహ్” సాక్ష్యం కూడా ఇవ్వాలి. సర్వపనుల్లో ఉత్తమమైనది “లాఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అని సాక్ష్యం ఇచ్చుట. ప్రవక్తలందరూ తమ జాతి వారిని ఈ సాక్ష్యం ఇవ్వాలనే బోధించారు.

عَنْ عُثْمَانَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (مَنْ مَاتَ وَهُوَ يَعْلَمُ أَنَّهُ لَا إِلَهَ إِلَّا اللهُ دَخَلَ الْجَنَّةَ).

51- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని ఉస్మాన్ బిన్ అఫ్పాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరొకడు లేడని తెలుసుకున్న వ్యక్తి చనిపోయిన తర్వాత స్వర్గంలో చేరుకుంటాడు”. (ముస్లం 26).

ఈ హదీసులో:

తెలుసుకొనుట అంటే అల్లాహ్ ఏకత్వాన్ని, ఆయనే ఆరాధ్యుడని తెలుసుకొని పూర్తి నమ్మకంతో విశ్వసించుట. ఈ విశ్వాసం చిత్తశుద్ధితో ఉండాలి. నోటితో పలుకుటలో సత్యవంతులై ఉండాలి. అల్లాహ్ సంతోషం కోసం, స్వర్గం పొందడానికి ఇతరులకు దానిని భోధించాలి. “లాఇలాహ ఇల్లల్లాహ్”లో రెండు విషయాలున్నాయి. 1. నిరాకరించుట. అంటే ఆరాధనలకు అర్హులు ఇతరులు ఎవ్వరూ లేరని నమ్ముట. 2. అంగీకరించుట. అంటే అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు అర్హుడని నమ్ముట.

[15] లాఇలాహ ఇల్లల్లాహ్ ఘనత

عَن عَبْدِ اللهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ { يَقُولُ: قَالَ رَسُولُ اللهِ ﷺ: (إِنَّ اللهَ عَزَّ وَجَلَّ يَسْتَخْلِصُ رَجُلًا مِنْ أُمَّتِي عَلَى رُءُوسِ الْخَلَائِقِ يَوْمَ الْقِيَامَةِ فَيَنْشُرُ عَلَيْهِ تِسْعَةً وَتِسْعِينَ سِجِلًّا كُلُّ سِجِلٍّ مَدَّ الْبَصَرِ ثُمَّ يَقُولُ لَهُ أَتُنْكِرُ مِنْ هَذَا شَيْئًا أَظَلَمَتْكَ كَتَبَتِي الْحَافِظُونَ قَالَ لَا يَا رَبِّ فَيَقُولُ أَلَكَ عُذْرٌ أَوْ حَسَنَةٌ فَيُبْهَتُ الرَّجُلُ فَيَقُولُ لَا يَا رَبِّ فَيَقُولُ بَلَى إِنَّ لَكَ عِنْدَنَا حَسَنَةً وَاحِدَةً لَا ظُلْمَ الْيَوْمَ عَلَيْكَ فَتُخْرَجُ لَهُ بِطَاقَةٌ فِيهَا أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ فَيَقُولُ أَحْضِرُوهُ فَيَقُولُ يَا رَبِّ مَا هَذِهِ الْبِطَاقَةُ مَعَ هَذِهِ السِّجِلَّاتِ فَيُقَالُ إِنَّكَ لَا تُظْلَمُ قَالَ فَتُوضَعُ السِّجِلَّاتُ فِي كَفَّةٍ قَالَ فَطَاشَتْ السِّجِلَّاتُ وَثَقُلَتْ الْبِطَاقَةُ وَلَا يَثْقُلُ شَيْءٌ بِسْمِ الله الرَّحْمَنِ الرَّحِيمِ).

52-ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “నా అనుచర సంఘంలోని ఒక వ్యక్తిని ప్రళయదినాన ప్రజలందరి ముందు అల్లాహ్ తీసుకొస్తాడు. తొంబైతొమ్మిది కర్మపత్రాల (Files)ను అతని ముందు పరుస్తాడు. ప్రతి ఫైల్ పొడవు దృష్టి పడేంత దూరం ఉంటుంది. అప్పుడు ‘ఇందులో నీవు చేసిన పాపాలన్నీ ఉన్నాయి. ఇందులో దేనినైనా నీవు తిరస్కరిస్తావా? కాపాలాదురులుగా ఉన్న నా లేఖకులైన దైవదూతలు నీపై ఏదైనా అన్యాయం చేశారా?’ అని అల్లాహ్ అడుగుతాడు. ‘లేదు ప్రభువా!’ అని అతడు జవాబిస్తాడు. “నీ వద్ద ఏదైనా సాకు, లేదా పుణ్యం ఉందా” అని అల్లాహ్ ప్రశ్నిస్తాడు. ఆ మనిషి బిత్తరపోయి ‘లేదు ప్రభువా’ అని విన్నవించుకుంటాడు. “ఎందుకు లేదు, మా వద్ద నీదొక పుణ్యం ఉంది. నీపై ఈ రోజు ఏలాంటి అన్యాయం జరగదు” అని అల్లాహ్ అంటాడు. అప్పుడు ఒక్క చిన్న ముక్క తీయబడుతుంది. అందులో “అష్ హదు అల్లాఇలాహ ఇల్లల్లాహు వఅన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహు” అని వ్రాసి ఉంటుంది. “ఆ వ్యక్తిని ఇక్కడికి తీసుకురండి” అని అల్లాహ్ ఆజ్ఞ ఇస్తాడు. ఆ వ్యక్తి ముక్కను చూసి, అల్లాహ్! ఈ ఫైళ్ళ ముందు ఇంతటి చిన్న ముక్కది ఏమి లెక్క? అని అంటాడు. “నీపై ఎంత మాత్రం అన్యాయం జరగదు అని అనబడుతుంది. తర్వాత త్రాసు యొక్క ఒక పళ్ళెములో ఫైళ్ళు, మరో పళ్ళెంలో ఆ ముక్క పెట్టబడుతాయి. ముక్క ఉన్న పళ్ళం బరువుతో వంగిపోతూ ఉంటుంది. ఫైళ్ళు ఉన్న పళ్ళెం తేలికగాఉండి పైకి లేస్తుంది. కరుణామయుడు, కృపాశీలుడైన అల్లాహ్ పేరుగల వస్తువే చాలా బరువుగా ఉంటుంది”. (అహ్మద్. తిర్మిజి 2639, ఇబ్నుమాజ 4300. సహీహ 135).

ఈ హదీసులో:

“లాఇలాహ ఇల్లల్లాహ్” యొక్క ఘనత మరియు అది త్రాసులో చాలా బరువుగా ఉంటుందని తెలిసింది. సర్వ పుణ్యాల్లో అది ఎక్కువ బరువు గలది. సర్వ సత్కార్యాల్లో అతి పెద్దది. విధేయతల్లో అతిగొప్పది. “లాఇలాహ ఇల్లల్లాహ్” వాస్తవికతను తెలుసుకొని, స్వచ్ఛంగా దానిని పలికి, సంకల్పశుద్ధితో విశ్వసించిన వారికి మేలే మేలు. దాని ప్రకారంగా తమ జీవితాన్ని మలచుకున్నవారి పాపాలు మన్నించబడతాయి. ఈ హదీసులో అల్లాహ్ దయ, కరుణా విశాలత తెలుస్తుంది. దాసుడు ఎల్లవేళల్లో అల్లాహ్ పై నమ్మకం సవ్యంగా ఉంచాలి. ఆయన కరుణను ఆశించాలి. ఆయన మన్నింపు పట్ల నిరాశ చెందరాదు. ఆయన క్షమించువాడు, మన్నింపు గుణం గలవాడు.

ప్రళయదినాన కొందరి లెక్కల తీర్పు ప్రజల ముందు ప్రత్యక్షంగా జరుగును. అల్లాహ్ తన దాసులపై ఎంత మాత్రం అన్యాయం చేసేవాడు కాడు. అల్లాహ్ ప్రళయదినాన తన దాసునితో స్వయంగా లెక్క తీసుకుంటాడు. అల్లాహ్ కు మరియు దాసునికి మధ్య అనువాదకుడు ఉండడు. సత్కార్యాలు, దుష్కార్యాలు వ్రాయబడతాయి. పాపపుణ్యాల ఫైళ్ళు హాజరు చేయబడతాయి. ఇందులో తౌహీద్ ఘనత ఉంది. కాపాలాదారులుగా, కర్మలు వ్రాయడానికి నియమింపబడిన దైవదూతలను నమ్మాలి. సత్కార్యాలు దుష్కార్యాల్ని తుడిచివేస్తాయి.

عَنْ أُسَامَةَ بْنِ زَيْدٍ قَالَ: بَعَثَنَا رَسُولُ الله ﷺ فِي سَرِيَّةٍ فَصَبَّحْنَا الْحُرَقَاتِ مِنْ جُهَيْنَةَ فَأَدْرَكْتُ رَجُلًا فَقَالَ لَا إِلَهَ إِلَّا اللهُ فَطَعَنْتُهُ فَوَقَعَ فِي نَفْسِي مِنْ ذَلِكَ فَذَكَرْتُهُ لِلنَّبِيِّ ﷺ فَقَالَ رَسُولُ الله ﷺ: (أَقَالَ لَا إِلَهَ إِلَّا اللهُ وَقَتَلْتَهُ) قَالَ: قُلْتُ: يَا رَسُولَ الله إِنَّمَا قَالَهَا خَوْفًا مِنْ السِّلَاحِ قَالَ: (أَفَلَا شَقَقْتَ عَنْ قَلْبِهِ حَتَّى تَعْلَمَ أَقَالَهَا أَمْ لَا) فَمَا زَالَ يُكَرِّرُهَا عَلَيَّ حَتَّى تَمَنَّيْتُ أَنِّي أَسْلَمْتُ يَوْمَئِذٍ.

53- ఉసామా బిన్ జైద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి మమ్మల్ని ఒక సైనిక దళంలో పంపారు. మేము (మరునాడు) ఉదయాన్నే ‘జుహైనాకు’ సంబంధించిన ‘హురఖాత్’ తెగపై దాడి చేశాము. నేను ఒక వ్యక్తిని పట్టుకున్నాను. అప్పుడు అతడు “లాఇలాహ ఇల్లల్లాహ్” చదివాడు. నేను ఈటె విసరి అతడ్ని కడతేర్చాను. కాని నాకు మనుస్సులో ఒక ఆవేదన కలిగింది. అందుకే ప్రవక్త ముందు ఈ విషయాన్ని ప్రస్తావించాను. “అతను లాఇలాహ ఇల్లల్లాహ్ అన్నప్పటికీ నీవు అతన్ని నరికావా?” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలదీశారు. ‘అవును. కాని అతడు ఆయుధ భయంతో చదివాడు’ అని నేనన్నాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాధతో “అతని గుండె సయితం చీరి చూడకపోతివి, అతడు మనస్పూర్తిగా అన్నాడా లేదా తెలిసిపోవును” అని అన్నారు. ఈ మాటలు ఆయన మాటి మాటికి అంటూ నన్ను నిలదీశారు. దాంతో నేను (భయపడిపోయి) నేను ఈ రోజే ముస్లిమయి ఉంటే ఎంత బాగుండేది అని నా మనుసులో కోరుకున్నాను. (ముస్లిం 96, బుఖారి 4269).

ఈ హదీసులో:

“లాఇలాహ ఇల్లల్లాహ్” అన్నవారి ప్రాణానికి రక్షణ ఉంది. వారి మిగిలిన విషయాల సంగతి అల్లాహ్ చూసుకుంటాడు. సద్వచనం పఠించిన వ్యక్తిపై ఆయుధం ఎత్తరాదు. ఇహలోకంలో మునాఫిఖు (కపటవిశ్వాసి)తో అవిశ్వాసి మాదిరిగా వ్యవహరించరాదు, అతనితో ఒకప్పుడు ఏదైనా నష్టం వాటిల్లినా సరే. ఎందుకనగా అతను లోలోపల అవిశ్వాసాన్ని దాచి ఉంచినా బాహ్యంగా ఇస్లాం ప్రకారం జీవిస్తున్నట్లు వ్యవహరిస్తున్నాడు గనక. “లాఇలాహ ఇల్లల్లాహ్” సంకల్ప శుద్ధితో పలికినవానికి ప్రళయదినాన లాభం చేకూరుతుంది. యుద్ధమైదానంలో వీరుడు అన్యంపుణ్యం తెలియనివారి రక్తాలు చిందించడం, విశ్వసించిన ప్రజల్ని చంపుట లాంటి విషయాల నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివాడు మనసారా విశ్వసించాడా లేదా పరిశీలించే, అన్వేషించే పని ఏ మనిషిది కాదు. దాన్ని అల్లాహ్ చూసుకుంటాడు.

[16] అల్లాహ్ యొక్క మంచి నామములు, ఉత్తమ గుణాలు

[هُوَ اللهُ الَّذِي لَا إِلَهَ إِلَّا هُوَ عَالِمُ الغَيْبِ وَالشَّهَادَةِ هُوَ الرَّحْمَنُ الرَّحِيمُ، هُوَ اللهُ الَّذِي لَا إِلَهَ إِلَّا هُوَ المَلِكُ القُدُّوسُ السَّلَامُ المُؤْمِنُ المُهَيْمِنُ العَزِيزُ الجَبَّارُ المُتَكَبِّرُ سُبْحَانَ اللهِ عَمَّا يُشْرِكُونَ، هُوَ اللهُ الخَالِقُ البَارِئُ المُصَوِّرُ لَهُ الأَسْمَاءُ الحُسْنَى يُسَبِّحُ لَهُ مَا فِي السَّمَاوَاتِ وَالأَرْضِ وَهُوَ العَزِيزُ الحَكِيمُ].

ఆయనే అల్లాహ్; ఆయన తప్ప ఆరాధ్యుడెవడూ లేడు. దృశ్యాదృశ్య విషయాలన్నీ ఎరిగినవాడు. కరుణామయుడు, కృపాశీలుడు. ఆయనే అల్లాహ్; ఆయన తప్ప ఆరాధ్యుడెవడూ లేడు. ఆయన చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు, సురక్షితం, శాంతి ప్రధాత, సంరక్షకుడు, సర్వాధికుడు, తన ఉత్తర్వులను తిరుగులేని విధంగా అమలు పరచేవాడు, ఎల్లప్పుడూ గొప్పవాడుగానే ఉండేవాడు. ప్రజలు కల్పించే దైవత్వపు భాగస్వామ్యం వర్తించని పరిశుద్ధుడు. అల్లాహ్ సృష్టివ్యూహాన్ని రచించేవాడు, దానిని చక్కగా అమలుపరచేవాడు. ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు. ఆయనకు మంచి పేర్లు ఉన్నాయి. ఆకాశాలలోను, భూమిలోనూ ఉన్న ప్రతి వస్తువూ ఆయనను స్మరిస్తోంది. ఆయన సర్వాధికుడు, వివేకవంతుడూను. (హష్ర్ 59: 22-24).

وَللهِ الأَسْمَاءُ الحُسْنَى فَادْعُوهُ بِهَا وَذَرُوا الَّذِينَ يُلْحِدُونَ فِي أَسْمَائِهِ سَيُجْزَوْنَ مَا كَانُوا يَعْمَلُونَ]

అల్లాహ్ మంచి పేర్లకు అర్హుడు. ఆయనను మంచి పేర్లతోనే వేడుకోండి. ఆయనను మంచి పేర్లతో పిలిచే విషయంలో సత్యం నుండి వైదొలిగే వారిని వదలిపెట్టండి. వారు తాము చేస్తున్న దానికి ప్రతిఫలం పొంది తీరుతారు[. (ఆరాఫ్ 7: 180).

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ عَنْ النَّبِيِّ ﷺ قَالَ: (إِنَّ لِله تِسْعَةً وَتِسْعِينَ اسْمًا مِائَةً إِلَّا وَاحِدًا مَنْ أَحْصَاهَا دَخَلَ الْجَنَّةَ ، إِنَّهُ وِتْرٌ يُحِبُّ الْوِتْرَ)

54-ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అల్లాహ్ కు 99 తొమ్మిది పేర్లున్నాయి. అంటే ఒకటి తక్కువ వంద పేర్లు. ఈ పేర్లను జ్ఞాపకం చేసుకునేవాడు (అంటే ఈ పేర్లను స్మరించేవాడు) స్వర్గానికి వెళ్తాడు. నిశ్చయంగా అల్లాహ్ విత్ర్ (ఏకైకుడు, అద్వితీయుడు). విత్ర్ (బేసి)ని ప్రేమిస్తాడు”. (ముస్లిం 2677, బుఖారి 2736).

ఈ హదీసులో:

ఆయన ఏకత్వములో అద్వితీయుడు. భాగస్వామి లేనివాడు. ప్రేమ అల్లాహ్ గుణాల్లో ఒక గుణం. ఆయన మనుషుల్లో, మాటల్లో, పనుల్లో, స్థలాల్లో, కాలాల్లో కొన్నింటిని ప్రేమిస్తాడు. బేసి సంఖ్యను ప్రేమిస్తాడు. అనేక ధార్మిక పనులు బేసి సంఖ్యలో గలవు. పగలు సమాప్తమవుతుంది బేసి సంఖ్య గల మగ్రిబ్ నమాజుతో. రాత్రి యొక్క చివరి నమాజు విత్ర్ బేసి సంఖ్యంలో ఉంది. కాబా ప్రదక్షిణం, సఫామర్వాల మధ్య పరుగులు (సఈ) ఏడు సార్లు. తస్బీహాత్ 33సార్లు.

عَنْ أَنَسٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ : قَالَ رَسُولُ الله ﷺ: « إِنَّ السَّلَامَ اسْمٌ مِنْ أَسْمَاءِ الله تَعَالَى، وُضِعَ فِي الْأرْضِ ، فَأَفْشُوا السَّلَامَ بَينَكُم »

55- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “నిశ్చయంగా సలాం అల్లాహ్ పేర్లలో ఒక పేరు. అది భూమి మీద ఉంచబడింది. మీరు పరస్పరం సలాంను విస్తృతపరచండి”. (అదబుల్ ముఫ్రద్. సహీహ 184).

ఈ హదీసులో:

సలాం అల్లాహ్ పేర్లలో ఒక పేరు. ఆయనకు అనేక పేర్లు గలవు. ఖుర్ఆన్, హదీసులో ప్రస్తావించబడిన విధంగానే ఆయన పేర్లను నమ్మాలి. అల్లాహ్ యొక్క గుణనామముల ప్రభావం ఎలా ఉంటుంది చదివి తెలుసుకోవాలి. ప్రతి పేరుకుగల భావాన్ని బట్టి మనిషి మసలుకోవాలి. ఉదాహరణకు: సలాం, రహ్మాన్, కరీం, హలీం. ముస్లిములు పరస్పరం సలాంను విస్తృతం చేసుకోవాలి. దాని వలన సోదరభావం, ప్రేమ, అప్యాయతలు పెరుగుతాయి. సలాం ఉద్దేశమేమిటంటే విశ్వాసులు పరస్పరం ఒకరికొకరు ఏ నష్టం కలిగించకుండా ఉండాలి. ధర్మం యొక్క ఉద్దేశం కూడా ఇదే. తన నాలుక, చేతుల ద్వారా ఇతర ముస్లిములకు హాని కలగనివ్వనివాడే నిజమైన ముస్లిం.

عَنْ يَعْلَى رَضِيَ ٱللَّٰهُ عَنْهُ أَنَّ رَسُولَ الله ﷺ رَأَى رَجُلًا يَغْتَسِلُ بِالْبَرَازِ بِلَا إِزَارٍ فَصَعَدَ الْمِنْبَرَ فَحَمِدَ الله وَأَثْنَى عَلَيْهِ ثُمَّ قَالَ ﷺ: «إِنَّ اللهَ عَزَّ وَجَلَّ حَيِيٌّ سِتِّيرٌ يُحِبُّ الْحَيَاءَ وَالسَّتْرَ فَإِذَا اغْتَسَلَ أَحَدُكُمْ فَلْيَسْتَتِرْ».

56-యఅలా బిన్ ఉమయ్య రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఒక వ్యక్తి బహిరంగ ప్రదేశంలో ఏ అడ్డు లేకుండా స్నానం చేసింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు. ఆ తర్వాత (మస్జిదులోకి వచ్చి) మింబర్ (ప్రసంగ పీఠం)పై ఎక్కి, అల్లాహ్ స్తోత్రములు పఠించి, ఇలా బోధించారుః “నిశ్చయంగా అల్లాహ్ “హయియ్య్” మరియు “సిత్తీర్”. అంటే బిడియం గలవాడు మరియు కప్పిఉంచడాన్ని ఇష్టపడువాడు. అందుచేత మీలో ఎవరైనా స్నానం చేయదలచినప్పుడు నాలుగు గోడల మధ్యలో స్నానం చేయాలి”. (అబూ దావూద్ 4012, సహీహుల్ జామి).

ఈ హదీసులో:

“హయియ్య్” (సిగ్గు, బిడియం గలవాడు), “సిత్తీర్” (కప్పిఉంచేవాడు) అల్లాహ్ పేర్లలో రెండు పేర్లు. చదవండి అల్లాహ్ ఆదేశం:

[إِنَّ اللَّهَ لَا يَسْتَحْيِي أَنْ يَضْرِبَ مَثَلًا مَا بَعُوضَةً فَمَا فَوْقَهَا]

దోమ, లేక దానికంటే మరీ అల్పమైన వస్తువును దృష్టాంతంగా చెప్పటానికి అల్లాహ్ ఎంత మాత్రం సిగ్గుపడడు. (బఖర 2: 26).

అల్లాహ్ బిడియం గలవాడు. కాని అది ఆయన గౌరవానికి తగినట్లు, మానవులకు ఉన్నట్లు కాదు.

ప్రతి ముస్లిం స్నానం చేయునప్పుడు, మలమూత్ర విసర్జన చేయునప్పుడు ప్రజల చూపులకు దూరంగా వెళ్ళాలి. లేదా నాలుగు గోడల మధ్యలో ఆ అవసరాన్ని తీర్చుకోవాలి. సిగ్గుపడుటు విశ్వాసుల గుణం. అది విశ్వాస భాగాల్లో ఒకటి. సిగ్గు సర్వ మేళ్ళను సమకూరుస్తుంది.

عَنْ سَلْمَانَ الْفَارِسِيِّ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ عَنْ النَّبِيِّ ﷺ قَالَ: (إِنَّ اللهَ حَيِيٌّ كَرِيمٌ يَسْتَحْيِي إِذَا رَفَعَ الرَّجُلُ إِلَيْهِ يَدَيْهِ أَنْ يَرُدَّهُمَا صِفْرًا خَائِبَتَيْنِ).

57- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “నిశ్చయంగా అల్లాహ్ బిడియం గలవాడు, దాతృత్వుడు. ఒక వ్యక్తి తన రెండు చేతులు ఎత్తి (ఏదైనా అడిగినప్పుడు) ఆ రెండు చేతులను ఏమీ ప్రసాదించకుండా త్రిప్పడాన్ని అల్లాహ్ ఇష్టపడడు”. (తిర్మిజి 3556. సహీహుల్ జామి).

ఈ హదీసులో:

అల్లాహ్ “హయా” (సిగ్గు), “కర్మ్” (దయ, దాతృత) గుణాలు గలవాడు. కాని ఆయనకు తగినరీతిలో. మానవుల గుణాల మాదిరిగా కాదు. ఎందుకనగా అల్లాహ్ గుణాలు మానవ గుణాల్లాంటివి ఎంత మాత్రం కావు. దుఆ పద్దతుల్లో ఒకటి దుఆ సందర్భంలో చేతులు ఎత్తడం. దుఆ చేస్తూ ఉండడం ఎంత శుభప్రదమో తెలుస్తుంది. ఎప్పుడూ అల్లాహ్ దయ పట్ల నిరాశ చెందవద్దు. ఆయన దయ, దాతృతము చాలా విశాలమైనది అంతటిని ఆవరించి ఉంది.

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: غَلَا السِّعْرُ عَلَى عَهْدِ رَسُولِ الله ﷺ فَقَالُوا: يَا رَسُولَ اللهِ لَوْ سَعَّرْتَ فَقَالَ: (إِنَّ اللهَ هُوَ الْخَالِقُ الْقَابِضُ الْبَاسِطُ الرَّازِقُ الْمُسَعِّرُ وَإِنِّي لَأَرْجُو أَنْ أَلْقَى اللهَ وَلَا يَطْلُبُنِي أَحَدٌ بِمَظْلَمَةٍ ظَلَمْتُهَا إِيَّاهُ فِي دَمٍ وَلَا مَالٍ)

58- అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయి. ఈ విషయం గురించి ప్రజలు, ‘దైవప్రవక్తా! (ధరలు చాలా పెరిగిపోయాయి) తమరు మా కొరకు ధరలు నిర్ధారించండి’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారుః “నిశ్చయంగా అల్లాహ్ యే సృష్టికర్త, పరిమితంగా ఇచ్చేవాడు, పుష్కలంగా ఇచ్చేవాడు, జీవనోపాధి ప్రసాదించేవాడు మరియు ధరలు నిర్ధారించేవాడు. మీలో ఏ ఒక్కరూ రక్తం మరియు ఆస్తి విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ నాపై నిందమోపని స్థితిలో నేను సర్వోన్నతుడైన అల్లాహ్ ను కలుసుకోగోరుతున్నాను”. (అబూ దావూద్ 3451, తిర్మిజి 1314, ఇబ్నుమాజ 2200).

ఈ హదీసులో:

ఈ హదీసులో వచ్చిన అల్లాహ్ యొక్క గుణాలను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లు నమ్మాలి. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సృష్టిలోకెల్లా అందరికంటే ఎక్కువగా అల్లాహ్ గురించి తెలిసినవారు. ప్రజలకు వారి ఆస్తిలో అన్యాయం చేయుట, వారికి నష్టపరచుట నుండి హెచ్చరించబడింది. వ్యాపారస్తుల లాభాలు, ధరల నిర్థారణలు సాంప్రదాయ ప్రకారంగా ఉండి, వారు ఏలాంటి స్పష్టమైన మోసాలు చేయనప్పుడు వారిని ఇబ్బందులకు గురి చేయడం నుండి దూరముండాలని తాకీదు చేయబడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పట్ల ఎంత భయభీతిగలవారో, ప్రజల కొరకు ఏ విధంగా న్యాయం కోరేవారో తెలిసింది.

عَنْ هَانِئٍ بنِ يَزِيد رَضِيَ ٱللَّٰهُ عَنْهُ أَنَّهُ لَمَّا وَفَدَ إِلَى رَسُولِ الله ﷺ مَعَ قَوْمِهِ سَمِعَهُمْ يَكْنُونَهُ بِأَبِي الْحَكَمِ فَدَعَاهُ رَسُولُ الله ﷺ فَقَالَ: (إِنَّ الله هُوَ الْحَكَمُ وَإِلَيْهِ الْحُكْمُ فَلِمَ تُكْنَى أَبَا الْحَكَمِ) فَقَالَ إِنَّ قَوْمِي إِذَا اخْتَلَفُوا فِي شَيْءٍ أَتَوْنِي فَحَكَمْتُ بَيْنَهُمْ فَرَضِيَ كِلَا الْفَرِيقَيْنِ فَقَالَ رَسُولُ الله ﷺ: (مَا أَحْسَنَ هَذَا فَمَا لَكَ مِنَ الْوَلَدِ) قَالَ: لِي شُرَيْحٌ وَمُسْلِمٌ وَعَبْدُ الله قَالَ: (فَمَنْ أَكْبَرُهُمْ) قُلْتُ: شُرَيْحٌ قَالَ: (فَأَنْتَ أَبُو شُرَيْحٍ).

59-హానీ బిన్ యజీద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ఆయన ఒకసారి తమ తెగవారితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చారు. అప్పుడు ఆయన తమ విశేషనామము (Surname) ‘అబుల్ హకం’తో పిలువబడేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ఇలా ఉపదేశించారు: “నిశ్చయంగా హకం అల్లాహ్ మాత్రమే. హుకుం (ఆజ్ఞ, ఆదేశం, తీర్పు) కూడా ఆయనది మాత్రమే చెల్లుతుంది. సరే! నీ విశేషనామం ‘అబుల్ హకం’ అని ఎలా పడింది?” అని అడిగారు. అందుకు ఆయన ఇలా చెప్పారుః ‘నా తెగవారు విభేదాల్లో పడినప్పుడు నా వద్దకు వచ్చేవారు. నేను వారి మధ్య తీర్పు చేసేవాడ్ని. ఇరువర్గాలు నాతీర్పుతో తృప్తి పడేవి’. “ఇది చాలా మంచి విషయమే. నీకేమైనా సంతానం ఉందా?” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు. ‘షురైహ్, ముస్లిం, అబ్దుల్లాహ్’ అని ఆయన చెప్పారు. “వారిలో పెద్ద ఎవరు?” అని ప్రవక్త అడిగారు. ‘షురైహ్’ అని ఆయన చెప్పారు. “అయితే నీవు ఈ నాటి నుండి అబూ షురైహ్” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. (అబూ దావూద్ 4955, నిసాయి 5292).

ఈ హదీసులో:

హుకుం, అల్లాహ్ గుణం. అందరి హకంలోకెల్లా గొప్ప హకం అల్లాహ్ మాత్రమే. అల్లాహ్ ఆదేశం చదవండిః ]అల్లాహ్ పై నమ్మకం గలవారి దృష్టిలో అల్లాహ్ కంటే మంచి తీర్పు చెయ్యగలవాడెవడు?[. (5: 50). అల్లాహ్ తన మాటల్లో, పనుల్లో, తీర్పుల్లో, కర్మ నిర్ణయాల్లో న్యాయంగా తీర్పు చేయువాడు. సర్వ వ్యవహారాలు చేరుకునేది ఆయన వద్దకే. చివరి తీర్పు (అంతిమ జడ్జిమెంట్) ఆయన వద్దే జరుగుతుంది. ప్రళయదినాన ప్రజల మధ్య తీర్పు ఇచ్చువాడు ఆయన మాత్రమే. అప్పుడు ఆయన బాధితునికి బాధించినవాని నుండి న్యాయం కచ్చితంగా ఇప్పిస్తాడు. రవ్వంత అన్యాయం లేకుండా, ఎవరి ఇసుమంత పుణ్యం వృధాపోకుండా ప్రజల లెక్క తీసుకుంటాడు. ఆయన వచనాలు సత్యమైనవి. ఆదేశాలు న్యాయంతో కూడినవి. ]సత్యం రీత్యా, న్యాయం రీత్యా నీ ప్రభువు వాక్కు పరిపూర్ణమైనది[. (6: 115). ఒక దుఆలో ఈ పదాలు వచ్చాయిః (వబిక ఖాసమ్తు వఇలైక హాకమ్తు) అంటే; నా సర్వ వ్యవహారాలు నీ ముందే ఉంచుతున్నాను. న్యాయ తీర్పు కొరకై నీవైపే వస్తున్నాను. న్యాయంగా తీర్పు చేసేవాడు అల్లాహ్, చాలా పరిశుద్ధుడు. ఆయన తీర్పు, నిర్ణయాలను పునఃపరిశీలించగలిగే వాడెవడూ లేడు. ఆయన వినేవాడు, అన్నీ తెలిసినవాడు.

నోట్: హుక్మ్ అనగా ఆదేశం లేదా తీర్పు. హకం అనగా ఆదేశించువాడు లేదా తీర్పునిచ్చువాడు.

عَن النَّوَّاسِ بْنِ سَمْعَانَ الْكِلَابِيِّ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: (الْمِيزَانُ بِيَدِ الرَّحْمَنِ يَرْفَعُ أَقْوَامًا وَيَخْفِضُ آخَرِينَ إِلَى يَوْمِ الْقِيَامَةِ)

60- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని నవాస్ బిన్ సమ్ఆన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “ప్రళయదినాన త్రాసు రహ్మాన్ చేతిలో ఉంటుంది. ఆయన దాని ద్వారా కొందరికి ఉన్నత స్థానం ప్రసాదిస్తే మరి కొందరిని పతనానికి గురిచేస్తాడు”. (ఇబ్ను మాజ 199. సహీహుల్ జామి 5747).

ఈ హదీసులో:

అల్లాహ్ యొక్క చేయి మరియు త్రాసు విషయం ఖుర్ఆన్, హదీసులో వచ్చిన రీతిలో నమ్మాలి. అల్లాహ్ చేతిని మానవుల చేతులతో పోల్చవద్దు. అబద్ధాలు పలికే, నిందలు మోపేవారి చేష్టలకు అల్లాహ్ అతీతుడు, ఉన్నతుడు. ఉన్నత స్థానం ప్రసాదించడం, పతనానికి గురి చేయడం అల్లాహ్ తరఫున జరుగుతుంది. అల్లాహ్ ఎవరికి ఉన్నతం ప్రసాదించాలనుకుంటాడో అతడ్ని ప్రజలు ఛీ అని దూరము చేసినా, అల్లాహ్ వాస్తవ రూపంలో అతనికి ఉన్నతం ప్రసాదిస్తాడు. ఎవరిని పతనానికి గురిచేయాలనుకుంటాడో, ప్రజలందరూ కలసి అతన్ని పైకి లేపినా, అల్లాహ్ అతడ్ని పతనానికి గురి చేసే తీరుతాడు.

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ عَنْ النَّبِيِّ ﷺ قَالَ: (إِنَّ يَمِينَ الله مَلْأَى لَا يَغِيضُهَا نَفَقَةٌ سَحَّاءُ اللَّيْلَ وَالنَّهَارَ أَرَأَيْتُمْ مَا أَنْفَقَ مُنْذُ خَلَقَ السَّمَوَاتِ وَالْأَرْضَ فَإِنَّهُ لَمْ يَنْقُصْ مَا فِي يَمِينِهِ وَعَرْشُهُ عَلَى الْمَاءِ وَبِيَدِهِ الْأُخْرَى الْقَبْضُ يَرْفَعُ وَيَخْفِضُ)

61- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “అల్లాహ్ చేయి (సకల విధాల సిరిసంపదలతో) నిండుగా ఉంది. దాన్ని రేయింబవళ్ళు నిర్విరామంగా ఖర్చు చేసినా తరగదు. అల్లాహ్ భూమ్యాకాశాలను సృష్టించినప్పటి నుండి ఎంత ఖర్చు చేశాడో మీరెప్పుడైనా ఆలోచించా- రా? ఇంత ఖర్చు చేసినా ఆయన చేతిలో ఉన్న నిధి నిక్షేపాలలో రవ్వంత కూడా తగ్గలేదు. ఆయన సింహాసనం నీళ్ళ మీద ఉంది. ఆయన మరో చేతిలో త్రాసు ఉంది. ఆయన తలచుకుంటే ఎవరినైనా ఉచ్ఛస్థాయికి తీసుకు రాగలడు అలాగే ఎవరినైనా అధోగతిపాలు చేయగలడు”. (బుఖారి 7419, ముస్లిం 993).

ఈ హదీసులో:

అల్లాహ్ కు రెండు చేతులన్నాయని, అవి ఆయనకు తగిన రీతిలో ఉన్నాయని నమ్మాలి. ఏ మాత్రం ‘తహ్ రీఫ్’, ‘తఅతీల్’, ‘తక్ యీఫ్’, ‘తమ్ సీల్’([4]) లేకుండా నమ్మాలి. అవి రెండూ కుడి చేతులే. వాటిలో అంతంకాని మేళ్ళున్నాయి. ఈ హదీసులో పరమపవిత్రుని అపార దాన గుణం, మహాదయాదాక్షిణ్యాల ప్రస్తావన ఉంది. ఆయన నిధి నిక్షేపాలు ఎల్లప్పుడూ నిండే ఉన్నాయి. ఎప్పుడూ అంతం కావు. ఆయన సింహాసనం నీళ్ళపై ఉందని నమ్మాలి. కర్మ, అదృష్టం, సత్కార్యాలు, దుష్కార్యాల త్రాసు ఆయన వద్ద ఉంది. ఆయన తాను కోరిన జాతులను, దాసులను ఉచ్ఛస్థాయికి తీసుకువెళ్తాడు. కోరినవారిని అధోగతిపాలు చేస్తాడు. ఉన్నతానికి చేర్చుట, అధోగతిపాలు చేయుట మరియు పట్టుకొనుట ఇవన్నీ అల్లాహ్ పనుల్లో లెక్కించ బడుతాయి. అల్లాహ్ ఆదేశం:

وَاللهُ يَقْبِضُ وَيَبْسُطُ وَإِلَيْهِ تُرْجَعُونَ] {البقرة:245}

అల్లాహ్ యే తగ్గిస్తాడు (కుదిస్తాడు), అధికం (వికసింప) చేస్తాడు. ఆయన వైపునకే మీరంతా మరలించబడతారు[. (2: 245).

عَنْ أَنَسٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ عَنْ النَّبِيِّ ﷺ قَالَ: (لَا يَزَالُ يُلْقَى فِيهَا [وَتَقُولُ هَلْ مِنْ مَزِيدٍ]. {ق:30} حَتَّى يَضَعَ فِيهَا رَبُّ الْعَالَمِينَ قَدَمَهُ فَيَنْزَوِي بَعْضُهَا إِلَى بَعْضٍ ثُمَّ تَقُولُ قَدْ قَدْ بِعِزَّتِكَ وَكَرَمِكَ وَلَا تَزَالُ الْجَنَّةُ تَفْضُلُ حَتَّى يُنْشِئَ اللهُ لَهَا خَلْقًا فَيُسْكِنَهُمْ فَضْلَ الْجَنَّةِ)

62- “నరకవాసులు నరకంలో వేయబడుతూ ఉంటారు, నరకం “ఇంకేమయినా ఉంటే తెచ్చి పడేయండి” అని అంటుంది. చివరికి సర్వలోకాల ప్రభువు తన కాలును దాని మీద పెడతాడు. నరకం తనంతటతానే సంకోచించి పోతుంది. ఇంకా ఇలా అంటుందిః “నీ గౌరవప్రతిష్ఠల సాక్ష్యం! చాలు, చాలు”. స్వర్గంలో స్థలం ఎల్లప్పుడూ ఖాళీగానే ఉంటుంది. అల్లాహ్ దాని కొరకు కొత్తగా కొందరిని సృష్టిస్తాడు. ఆ ఖాళీ స్థలంలో వారిని నివసింపజేస్తాడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (బుఖారి 7384, ముస్లిం 1185).

ఈ హదీసులో:

అల్లాహ్ కు కాలు ఉన్నదని తెలిసింది. అది ఆయనకు తగినట్లుగా ఉంటుంది, మానవుల కాళ్ళతో పోల్చరాదు.

[لَيْسَ كَمِثْلِهِ شَيْءٌ وَهُوَ السَّمِيعُ البَصِيرُ] {الشُّورى:11}

ఆయనను పోలినది ఏదీ లేదు. ఆయన వినేవాడు. చూసేవాడు[. (42: 11).

ఈ హదీసులో ఆ పరమపవిత్రుని ఔన్నత్యం, ప్రాబల్యం తెలుపబడింది. ఆయన పట్టు చాలా పఠిష్టంగా ఉంటుంది. అల్లాహ్ అనుమతితో నరకం మాట్లాడుతుంది. అల్లాహ్ యొక్క కారుణ్యం ఆయన కోపంపై గెలుపొందింది. అందుకే నరకంలో ఎక్కువ అయినవారిని కూడా తీశాడు. స్వర్గంలో ఖాళీ స్థలం ఉన్నందుకు మరి కొందర్ని సృష్టించాడు. ఇందులో నరకం ఎంత భయంకర స్థలమో తెలిసింది. అల్లాహ్ మనల్ని దాని నుండి కాపాడుగాక! ఆమీన్! అల్లాహ్ గుణనామముల గురించి మరియు అగోచర విషయాల గురించి వచ్చిన హదీసులను ప్రవక్త సహచరులు విని విశ్వసించారు. వాటిని తు.చ. తప్పకుండా నమ్మారు. వాటిని సత్యం అని తృప్తి చెందారు. వాటి ప్రకారం ఆచరించారు. వాటిని తిరస్కరించలేదు. వాటి పోలిక ఇతరులతో ఉంది అని చెప్పలేదు.

عَنْ عَدِيِّ بْنِ حَاتِمٍ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (مَا مِنْكُمْ أَحَدٌ إِلَّا سَيُكَلِّمُهُ رَبُّهُ لَيْسَ بَيْنَهُ وَبَيْنَهُ تُرْجُمَانٌ فَيَنْظُرُ أَيْمَنَ مِنْهُ فَلَا يَرَى إِلَّا مَا قَدَّمَ مِنْ عَمَلِهِ وَيَنْظُرُ أَشْأَمَ مِنْهُ فَلَا يَرَى إِلَّا مَا قَدَّمَ وَيَنْظُرُ بَيْنَ يَدَيْهِ فَلَا يَرَى إِلَّا النَّارَ تِلْقَاءَ وَجْهِهِ فَاتَّقُوا النَّارَ وَلَوْ بِشِقِّ تَمْرَةٍ).

63-ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారని అదీ బిన్ హాతిం రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అతి త్వరలోనే అల్లాహ్ ప్రళయదినాన మీలోని ప్రతి వ్యక్తితో ప్రత్యక్షంగా మాట్లాడతాడు. ఆ రోజు అల్లాహ్ కు, దాసునికి మధ్య ఎలాంటి అనువాదకుడు ఉండడు. దాసుడు తన కుడి వైపు చూస్తాడు. అక్కడ తను ఆచరించిన కర్మలు తప్ప మరేమీ కనబడదు. ఎడమ వైపు చూస్తాడు. అక్కడా తాను ముందుకు పంపుకున్న కర్మలు తప్ప మరేది చూడడు. తన ముందు చూస్తాడు. అచ్చట అతన్ని ఆహ్వానిస్తున్నటువంటి అగ్ని కన్పిస్తుంది. అందువల్ల మీలో ఎవరైనా ఓ ఖర్జూరపు ముక్కయినా సరే దానం చేసి తననుతాను నరకం నుండి కాపాడుకో గలిగితే కాపాడుకోవాలి”. (బుఖారి 7512, ముస్లిం 1016).

ఈ హదీసులో:

అల్లాహ్ మాట్లాడుతాడు. అది ఆయన గౌరవానికి తగినట్లు. ప్రళయదినాన తన దాసునితో అనువాదకుని సహాయం లేకుండా మాట్లాడుతాడు. తీర్పుదినాన నరకం మానవుని ముందుకు తీసుకురాబడుతుంది. ఆనాటి కఠినమైన శిక్ష నుండి తప్పించుకునే ఒక గొప్ప మార్గం అపారంగా దానధర్మాలు చేయడం. మనిషి ఏ చిన్న సత్కార్యాన్ని కూడా విలువలేనిదని భావించవద్దు. సత్కార్యాలు మనిషి మోక్షానికి గొప్ప సబబు అవుతాయి.

عَن عَائِشَةَ < قَالَتْ: يَا رَسُولَ الله إِنْ وَافَقْتُ لَيْلَةَ الْقَدْرِ فَبِمَ أَدْعُو قَالَ: قُولِي: (اللَّهُمَّ إِنَّكَ عَفُوٌّ تُحِبُّ الْعَفْوَ فَاعْفُ عَنِّي).

64-ఆయిష రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం: ఒకసారి నేను ‘ప్రవక్తా! నేను లైలతుల్ ఖద్ర్ ను పొందిన యడల ఏ దుఆ చదవాలి?’ అని అడిగాను. అందుకు ఆయన “అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వ, ఫఅఫు అన్నీ” చదవమని చెప్పారు. అంటే ఓ అల్లాహ్ నీవు అమితంగా మన్నించువానివి. మన్నింపు గుణాన్ని ప్రేమించువానివి. నన్ను మన్నించుము.

ఈ హదీసులో:

మన్నించుట, ప్రేమించుట ఇవి రెండు అల్లాహ్ గుణాలని, అవి ఆయనకు తగిన రీతిలో ఉన్నాయని నమ్మాలి. ప్రజలతో మన్నింపు వైఖరి అవలంభించువారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. అల్లాహ్ ఇష్టపడే సద్గుణాలను మనిషి అవలంబించే ప్రయత్నం చేయాలి. మనిషి ఆచరణకు తగినట్లు ఫలితం ఉండును. ప్రజల్ని మన్నించినవాడిని అల్లాహ్ మన్నిస్తాడు. అల్లాహ్ మన్నింపు పొందుటకు మనిషి చాలా కాంక్షించాలి. అల్లాహ్ తన తప్పిదాలను క్షమించి, పాపాల ప్రక్షాళనం చేయాలని ఆయన్ని వేడుకోవాలి.

عَن جَابِرٍ قَالَ: قَالَ النَّبِيُّ ﷺ: (يَتَجَلَّى لَنَا رَبُّنَا ضَاحِكًا يَومَ الْقِيَامَةِ).

65- “ప్రళయదినాన మన ప్రభువు నవ్వుకుంటూ మనముందు ప్రత్యక్షమవుతాడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (సహీహుల్ జామి 8018).

ఈ హదీసులో:

ఈ హదీసులో తెలుపబడిన అల్లాహ్ యొక్క రెండు గుణాలను ఆయనకు తగినరీతిలో నమ్మాలి. ఒకటి: ప్రత్యక్షమగుట. రెండవది: నవ్వుట. పుణ్యాత్ములకు ఇది అల్లాహ్ యొక్క గొప్ప వరం. అల్లాహ్ వారి ముందు ప్రళయదినాన ప్రత్యక్షమవుతాడు. వారు అల్లాహ్ ను చూస్తారు. వారిని చూసి అల్లాహ్ నవ్వుతాడు. అవిశ్వాసులు అల్లాహ్ ను చూడలేరు. (అల్లాహ్ మనందరికీ తన దర్శన భాగ్యం ప్రసాదించుగాక! ఆమీన్!!).

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (يَضْحَكُ اللهُ إِلَى رَجُلَيْنِ يَقْتُلُ أَحَدُهُمَا الْآخَرَ كِلَاهُمَا يَدْخُلُ الْجَنَّةَ).

66- “అల్లాహ్ ఇద్దరు మనుషులను చూసి (సంతోషంతో) నవ్వుతాడు. వారిలో ఒకడు మరొకడ్ని వధిస్తాడు. అయినప్పటికీ ఇద్దరూ స్వర్గానికి వెళ్తారు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లఖించారు. (బుఖారి 2826, ముస్లిం 1890).

ఈ హదీసులో:

నవ్వుట అల్లాహ్ గుణం అని, అది అల్లాహ్ కు తగినరీతిలో ఉంటుందని నమ్మాలి. ప్రవక్త సహచరులు విశ్వసించారు. ఎలా? ఎందుకు? అని వాదించలేదు. దానికి తప్పుడు భావాలు వెతకలేదు. అల్లాహ్ నవ్వు మానవుల నవ్వు లాంటిది కాదు. ]ఆయనను పోలినది ఏదీ లేదు. ఆయన వినువాడు, అన్నీ చూచువాడు[. (42: 11).

ఈ హదీసులో అల్లాహ్ యొక్క విశాలమైన కరుణ, తౌబా చేయువానిని మన్నిస్తాడన్న శుభవార్త ఉంది. హంతకుడు సయితం తౌబా చేసి, సత్కార్యాలు చేసినచో అల్లాహ్ అతని తౌబాను స్వీకరిస్తాడు. అతన్ని క్షమించి స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు.

عَن أَبِي هُرَيْرَةَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ يَقُولُ: سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: (عَجِبَ رَبُّنَا عَزَّ وَجَلَّ مِنْ قَوْمٍ يُقَادُونَ إِلَى الْجَنَّةِ فِي السَّلَاسِلِ).

67- “సంకెళ్ళలో బంధింపబడి స్వర్గంలో పంపబడేవారిని చూసి మన ప్రభువు ఆశ్చర్యపోయాడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా తాను విన్నట్లు అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (అబూ దావూద్ 2677, బుఖారి 3010).

ఈ హదీసులో:

ఆశ్చర్యం పడుట కూడా అల్లాహ్ గుణం అని అది ఆయనకు తగినరీతిలో ఉంటుందని నమ్మాలి. మానవుల్లో ఉండే ఆశ్చర్య గుణం రీతిలో ఉంటుందని భావించనూ వద్దు. ]ఆయనను పోలినది ఏదీ లేదు. ఆయన వినువాడు, అన్నీ చూచువాడు[. (42: 11). మనిషి తన అల్ప దృష్టి, ఆలోచన వలన ఇతరుల సలహా, అభిప్రాయం లేనిది స్వయంగా మంచిని ఎన్నుకోలేడు. సత్యం స్వీకరించమని, దుష్కార్యం త్యజించమని ఒక వ్యక్తికి మాటిమాటికి చెప్పడం వల్ల అతనికి ప్రయోజనం కలుగవచ్చు. అతని వల్ల బోధకునికి ఏదైనా బాధ కలిగినా సరే. ఎంతైనా మనస్సు చెడుకై ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇందులో సద్గుణసంపన్నుడైన మిత్రుడు, సద్బోధచేసే స్నేహితుడు మరియు పుణ్యకార్యాల్లో సహాయపడేవారి ఘనత ఉంది. అల్లాహ్ ఆదేశం:

وَتَعَاوَنُوا عَلَى البِرِّ وَالتَّقْوَى وَلَا تَعَاوَنُوا عَلَى الإِثْمِ وَالعُدْوَانِ] {المائدة:2}

మంచి, దైవభక్తి విషయాల్లో పరస్పరం సహకరించుకోండి. పాపకార్యాల్లో, అత్యాచారాలలో ఎవరితోనూ సహకరించకండి[. (మాఇద 5: 2).

కొందరు సత్కార్యాలు చేయుటకు బలవంతము చేయబడుతారు. అలా వారి మనస్సు మెత్తబడి ఆ పని చేస్తారు. స్వర్గం మనస్సుకు రుచించని విషయాలతో కప్పబడి ఉంది. సత్కార్యం మొదటిసారి చేసినప్పుడు మనస్సుకు భారం ఏర్పడుతుంది. ప్రజలు సత్యం స్వీకరించి, నరకం నుండి రక్షణ పొందుటకు, వారిపై కొంచెం బలవంతం చేయవచ్చును. వారు తమ ఇష్టంతో చెడును ఎన్నుకుంటే, వారి ఇష్టం వారిది అని మౌనం వహించరాదు. ఆ చెడు నుండి వారిని ఆపాలి. ఈ హదీసులో ప్రవక్త అనుచర సంఘం ఘనత తెలుపబడింది. వారు స్వర్గంలో చేరడానికి పరస్పరం సహాయపడతారు.

عَنْ عَبْدِ الله بْنِ الشِّخِّيرِ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ ﷺ فَقَالَ أَنْتَ سَيِّدُ قُرَيْشٍ فَقَالَ النَّبِيُّ ﷺ: (السَّيِّدُ اللهُ) قَالَ أَنْتَ أَفْضَلُهَا فِيهَا قَوْلًا وَأَعْظَمُهَا فِيهَا طَوْلًا فَقَالَ رَسُولُ الله ﷺ: (لِيَقُلْ أَحَدُكُمْ بِقَوْلِهِ وَلَا يَسْتَجِرُّهُ الشَّيْطَانُ)

68- అబ్దుల్లాహ్ బిన్ షిఖ్ఖీర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, ‘మీరు ఖురైషుల సయ్యిద్’ అని అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “సయ్యిద్ అల్లాహ్ మాత్రమే” అని చెప్పారు. అయితే ‘మాట రీత్యా మీరు ఖురైషులో అందరికన్నా ఎక్కువ ఘనతగలవారు. వారిలో ఎక్కువ గౌరవ, మర్యాదలు గలవారు’ అని ఆ వ్యక్తి చెప్పాడు. అప్పుడు ప్రవక్త చెప్పారుః “మీలో ఎవరైనా ఈ వ్యక్తి చెప్పినటువంటి మాట చెప్పవచ్చు. కాని అతడ్ని షైతాన్ తన వలలో చిక్కించకుండా జాగ్రత్త పడాలి”. (అహ్మద్. సహీహుల్ జామి 3700).

ఈ హదీసులో:

‘సయ్యిద్’ అను పదం సామాన్యంగా అల్లాహ్ కొరకే ఉపయోగ పడుతుంది. నాయకత్వం, గౌరవంలో అగ్రస్థానం గలవాడు. దాతృత్వములో హద్దులు అధిగమించినవాడు, ఎవరి అమితమైన దయ అందరికి ఆవరించి ఉందో, ఎవని భయం అందరికి ఉందో అతడు ‘సయ్యిద్’. ఇలాంటి గుణాలన్నియూ అల్లాహ్ తప్ప ఎవరికి లేవు. మానవుడు ‘సయ్యిద్’ అని అనబడతాడు. కాని అతనికి ఇలాంటి గుణాలు లేవు, ఉండవు.

قَالَ الشَّيْخُ مِنْ بَنِي غِفَارٍ سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: (إِنَّ اللهَ عَزَّ وَجَلَّ يُنْشِئُ السَّحَابَ فَيَنْطِقُ أَحْسَنَ الْمَنْطِقِ وَيَضْحَكُ أَحْسَنَ الضَّحِكِ)

69- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా తాను విన్నట్లు బనీ ఘిఫార్ లోని ఒక షేఖ్ ఉల్లేఖించారు: “అల్లాహ్ మేఘాన్ని సృష్టించాడు. అది చక్కగా మాట్లాడుతుంది. అందంగా నవ్వుతుంది”. (అహ్మద్. సహీహుల్ జామి)

ఈ హదీసులో:

ఈ హదీసులో తెలుపబడిన విషయాల్ని ఎలా తెలుపబడ్డాయో అలాగే నమ్మాలి. ఏలాంటి సందేహం, అనుమానాలకు గురి కాకూడదు. మేఘాన్ని సృష్టించడం, అది మాట్లాడడం, నవ్వడం అల్లాహ్ శక్తి మరియు ఆయన సంపూర్ణ వివేచనకు సూచనాలు. ‘ఉరుము’ మేఘాల మాట, ‘మెరుపు’ దాని నవ్వు అని కొందరన్నారు. మేఘాల ప్రస్తావన ఖుర్ఆనులో ఇలా ఉందిః ]ఆయనే నీళ్ళతో బరువెక్కిన మేఘాలను సృష్టిస్తాడు. ఉరుము (మేఘాల గర్జన) ఆయనను స్తోత్రం చేస్తూ ఆయన పవిత్రతను కొనియాడుతొంది. దైవదూతలు ఆయన భయం వల్ల వణికిపోతూ ఆయనను కీర్తిస్తూ ఉంటారు. ఆయన ఫెళఫెళమనే పిడుగులను పంపుతాడు. (తరచుగా) వాటిని తాను కోరినవారిపై పడవేస్తాడు. అయినా వీరు అల్లాహ్ ను గురించి ఘర్షణపడుతున్నారు. వాస్తవంగా ఆయన యుక్తి అతిశక్తివంతమైనది[. (13: 12,13).

عَنِ ابْنِ عُمَرَ { قَالَ: قاَلَ رَسُولُ الله ﷺ: (أَنَّ لُقْمَانَ الْحَكِيمَ كَانَ يَقُولُ: إِنَّ اللهَ إِذَا اسْتُوْدِعَ شَيْئًا حَفِظَهُ)

70- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారని ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారుః “లుఖ్మాన్ హకీం ఇలా చెప్పేవారుః అల్లాహ్ కు ఏదైనా అప్పగించినచో అల్లాహ్ దాన్ని కాపాడుతాడు”. (అహ్మద్. సహీహుల్ జామి).

ఈ హదీసులో:

అల్లాహ్ గుణాల్లో ఒకటి కాపాడుట కూడా. మనిషి చేసే ప్రతి దానిని అల్లాహ్ భద్రపరుచుతాడు. అందుకు మానవుడు తన ధర్మం, అప్పగింత మరియు ఆచరణల ముగింపును అల్లాహ్ కు అప్పగించాలి. ప్రయాణికుడ్ని సాగనంపేటప్పుడు చదవవలసిన దుఆ సహీ హదీసులో ఇలా ఉందిః “అస్తౌదిఉల్లాహ దీనక వ అమానతక వ ఖవాతీమ ఆమాలిక”. (భావం: నేను నీ ధర్మం, అప్పగింత మరియు నీ ఆచరణల ముగింపును అల్లాహ్ కు అప్పగిస్తున్నాను). అల్లాహ్ కు సర్వమూ తెలుసు. ఏ చిన్న విషయం కూడా ఆయనకు దాగిలేదు. అల్లాహ్ ఆదేశం ఇలా ఉందిః ]నీవు నీ మాటను బిగ్గరగా పలికినా పరవాలేదు. ఆయన మెల్లగా పలికిన మాటను మాత్రమే కాదు, దానికంటే అతి గోప్యమైన మాటను సైతమూ ఎరుగును[. (20: 7).

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ وَأَبِي هُرَيْرَةَ { قَالَا: قَالَ رَسُولُ الله ﷺ: (الْعِزُّ إِزَارُهُ وَالْكِبْرِيَاءُ رِدَاؤُهُ فَمَنْ يُنَازِعُنِي عَذَّبْتُهُ).

71- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు మరియు అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “గౌరవం అల్లాహ్ వస్త్రం, అహంకారం ఆయన దుప్పటి”. (అల్లాహ్ ఇలా చెప్పాడుః) “ఈ రెండిట్లో ఏ ఒకదానిలోనైనా నాతో గొడవకు దిగినవాడిని నేను శిక్షిస్తాను”. (ముస్లిం 2620).

ఈ హదీసులో:

అన్ని రకాల గౌరవం, అధికారం మరియు గొప్పతనం, అహంకారం అల్లాహ్ కే తగునని రుజువవుతుంది. ఈ రెండు గుణాల్లో మానవుడు తన ప్రభువుతో పోరాటానికి (పోటికి) దిగవద్దు. అవి ఆయనకు ప్రత్యేకమైనవి. అల్లాహ్ ఎల్లవేళల్లో సర్వాధికారం, ప్రాబల్యం గలవాడయి, పరాజితుడు కానివాడయి ఉండుట ఆయన రుబూబియత్, ఉలూహియత్ యొక్క హక్కు. మానవుడు ఈ రెండిట్లో ఏ ఒక్క గుణం అయినా అతనిలో ఉందన్న భావనలో పడితే అల్లాహ్ తో ఆయన గుణగణాల్లో పోటిపడినట్లే, అల్లాహ్ గొప్పతనంలో భాగస్వామ్య వాదన చేసినట్లే. అందుచేత తన యజమాని ఎదుట వినయ వినమ్రత చూపి, తల వొగ్గి ఉండుట దాసునిపై తప్పనిసరి. ఈ దాస్యత్వ, వినయవినమ్రత గుణమే తన దాసుల్లో ఉండాలని అల్లాహ్ కోరాడు. దానిని విధిగా చేశాడు. అహంకారభావానికి గురి అయ్యేవారికి తప్పనిసరిగా శిక్షిస్తానని హెచ్చరించాడు.

قَالَ عَبْدُ الله بْنُ قَيْسٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ رَسُولُ الله ﷺ: (مَا أَحَدٌ أَصْبَرَ عَلَى أَذًى يَسْمَعُهُ مِنَ اللهِ تَعَالَى إِنَّهُمْ يَجْعَلُونَ لَهُ نِدًّا وَيَجْعَلُونَ لَهُ وَلَدًا وَهُوَ مَعَ ذَلِكَ يَرْزُقُهُمْ وَيُعَافِيهِمْ وَيُعْطِيهِمْ)

72- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “కష్టం కలిగించే మాటలు విని సహనం వహించడంలో అల్లాహ్ కు మించిన వాడెవడూ లేడు. మానవులు ఇతరులను ఆయనకు సాటి కల్పిస్తారు. ఆయనకు సంతానం ఉందని ఆరోపిస్తారు. అయినా అల్లాహ్ వారిని వెంటనే శిక్షించకుండా వారికి ఉపాధినిస్తాడు, అనుగ్రహాలు ప్రసాదిస్తాడు”. (ముస్లిం 2804, బుఖారి 6099).

ఈ హదీసులో:

అల్లాహ్ వహించే సహనం ఆయన గౌరవానికి తగినట్లుంది. మానవుల్లాంటి సహనం కాదు. అల్లాహ్ శక్తిసంపన్నుడు, కఠినంగా శిక్షించువాడయినప్పటికీ, తన దాసుల పట్ల నిగ్రహం చూపుతున్నాడు. ఎందుకనగా ఆయన కరుణ, ఆయన కోపంపై ఆధిక్యత పొందింది. పాపాల్లో అతిఘోరమైనది అల్లాహ్ కు సాటి కల్పించుట. ఆయనకు భార్యా, సంతానాలున్నాయని భావించుట. అల్లాహ్ అవిశ్వాసుడ్ని, అతను అవిశ్వాసుడైనప్పటికీ దయ చూపి, ఇహలోకంలో ఉపాధినిస్తున్నాడు. శిక్షించకుండా వ్యవధినిస్తున్నాడు. పరలోకంలో సంపూర్ణ శిక్ష ఇస్తాడు. ఈ హదీసులో అల్లాహ్ తన దాసుల మాటను వినువాడు అని రుజువవుతుంది. వినడంలో ఆయనకు పోలినవాడెవడు లేడు. ]ఆయనకు పోలినది ఏదీ లేదు. ఆయన వినువాడు, చూచువాడు[.

[17] అల్లాహ్ గురించి ఏ విషయాన్ని నిరాకరించుట విధిగా ఉంది

عَنْ وَالِدِ أَبِي الْمَلِيحِ قَالَ: قَالَ النَّبِيُّ ﷺ: (لَيْسَ لِلهِ شَرِيكٌ).

73- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారని అబూ ములైహ్ తండ్రి ఉల్లేఖించారుః “అల్లాహ్ కు ఎవరూ సాటి లేరు”. (అబూ దావూద్ 3933. సహీహుల్ జామి).

ఈ హదీసులో:

ప్రవక్తలు మరియు ఆకాశ గ్రంథాలు హెచ్చరించిన దాని సారంశమే పై హదీస్. అంటే అల్లాహ్ ఒక్కడే, అద్వితీయుడు. ఆయనకు సాటి లేడు. “లాఇలాహ ఇల్లల్లాహ్” అర్థమే ఇది. ఆరాధనలకు అర్హుడు ఆయనే. ఉలూహియతులో అద్వితీయుడు ఆయనే. రుబూబియతులో అద్వితీయుడు ఆయనే. తన గుణగణాల్లో, నామ స్వరూపాల్లో అన్ని రకాల లోటుపాట్లకు అతీతుడు ఆయనే.

عَنْ ابْنِ عَبَّاسٍ { عَنْ النَّبِيِّ ﷺ قَالَ: (قَالَ اللهُ كَذَّبَنِي ابْنُ آدَمَ وَلَمْ يَكُنْ لَهُ ذَلِكَ وَشَتَمَنِي وَلَمْ يَكُنْ لَهُ ذَلِكَ فَأَمَّا تَكْذِيبُهُ إِيَّايَ فَزَعَمَ أَنِّي لَا أَقْدِرُ أَنْ أُعِيدَهُ كَمَا كَانَ وَأَمَّا شَتْمُهُ إِيَّايَ فَقَوْلُهُ لِي وَلَدٌ فَسُبْحَانِي أَنْ أَتَّخِذَ صَاحِبَةً أَوْ وَلَدًا).

74- అల్లాహ్ ఇలా సెలవిచ్చాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలుపుతున్నట్లు అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మానవుడు నన్ను తిరస్కరించాడు, అది అతనికి తగదు. నన్ను దూషించాడు, అదీ అతనికి తగదు. నేను అతన్ని తిరిగి జీవింపజేయలేనని భావించుట నన్ను తిరస్కరించినట్లు. నాకు సంతానం ఉందని భావించుట నన్ను దూషించినట్లు. నేను పరిశుద్ధుణ్ణి. భార్య సంతానాల అవసరం నాకు ఎంత మాత్రం లేదు. (బుఖారి 4482).

ఈ హదీసులో:

తన దాసులపై అల్లాహ్ కారుణ్యం, సహనం అపారమైనవి. కష్టం కలిగించే మాటలు విని సహించువారిలో అల్లాహ్ కు మించినవారు ఎవరూ లేరు. అల్లాహ్ కు భార్య, సంతానం లేరు. ఆయన ఏకైకుడు, అద్వితీయుడు, ఏ అవసరం లేనివాడు, ఎవరినీ కనలేదు, ఎవరికీ పుట్టలేదు, ఆయనకు సమానుడు, సాటిగలవాడు లేడు. విశ్వాసి, మానవుల నుండి కలిగే కష్టాలపై సహనం వహించాలి. సృష్టికర్త, పోషణకర్త అయిన మహోన్నతుడు, మహోపకారి, దూషణలకు గురి అవుతున్నప్పుడు అశక్తుడు, లోపభూయిష్టుడైన మానవుని మాటేమిటి?

عَنْ أَبِي مُوسَى رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَامَ فِينَا رَسُولُ الله ﷺ بِخَمْسِ كَلِمَاتٍ فَقَالَ: (إِنَّ الله عَزَّ وَجَلَّ لَا يَنَامُ وَلَا يَنْبَغِي لَهُ أَنْ يَنَامَ يَخْفِضُ الْقِسْطَ وَيَرْفَعُهُ يُرْفَعُ إِلَيْهِ عَمَلُ اللَّيْلِ قَبْلَ عَمَلِ النَّهَارِ وَعَمَلُ النَّهَارِ قَبْلَ عَمَلِ اللَّيْلِ حِجَابُهُ النُّورُ لَوْ كَشَفَهُ لَأَحْرَقَتْ سُبُحَاتُ وَجْهِهِ مَا انْتَهَى إِلَيْهِ بَصَرُهُ مِنْ خَلْقِهِ)

75- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా మధ్య నిలబడి ఐదు విషయాలు తెలిపారని అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “నిస్సందేహంగా అల్లాహ్ నిద్రపోడు. నిద్రపోవుట ఆయనకు తగదు. (త్రాసు ఆయన చేతులో ఉంది.) ఆయనే దాన్ని పైకి లేపుతాడు. క్రిందికి దించుతాడు. రాత్రి ఆచరణలు పగటి ఆచరణల కంటే ముందు ఆయన వైపుకు లేపబడతాయి. పగటి ఆచరణలు రాత్రి ఆచరణలకంటే ముందు ఆయన వైపుకు లేపబడతాయి. ఆయన తెరలు కాంతివంతమైనవి. ఆయన దాన్ని తెరచాడంటే ఆయన చూపు ఎంత వరకు వెళ్తుందో అంత దూరం వరకు ఆయన పవిత్ర ముఖ ప్రజ్వల కాంతులు కాల్చేస్తాయి”. (ముస్లిం 179).

ఈ హదీసులో:

విశ్వ వ్యవస్థకు సంపూర్ణ ఆధారము అల్లాహ్ యే. ఆ నిత్యుడు, సజీవుడు సృష్టికి మూలాధారుడైన అల్లాహ్! నిదురపోడు, ఆయనకు కునుకురాదు. నిద్ర ఒక లోపం. అల్లాహ్ ఈ లోపానికి అతీతుడు. కాంతుల తెరలున్నవని దీని ద్వారా రుజువవుతుంది. త్రాసులు ఆయన వద్ద ఉన్నాయి. కోరిన వారికి వృద్ధి పరుస్తాడు. కోరిన వారికి తగ్గిస్తాడు. ప్రతి రాత్రి మరియు పగల్లో ఆచరణలు ఆయన వద్దకు లేపబడతాయి (చేరుతాయి). ప్రతి దానికి రక్షకుడు ఆయనే. ]యధార్థమేమిటంటే ఆకాశాలను, భూమిని (తమ స్థానాల నుండి) తొలిగిపోకుండా ఆపి ఉంచినవాడు అల్లాహ్ యే. ఒకవేళ అవి తొలగిపోతే, అల్లాహ్ తరువాత వాటిని నిలిపి ఉంచేవాడు మరొకడెవడూ లేడు. నిస్సందేహంగా అల్లాహ్ సహనశీలుడు, క్షమించేవాడు[. (35: 41). అల్లాహ్ స్వయంగా తన గురించి మరియు ప్రవక్త అల్లాహ్ గురించి తెలిపిన గుణగణాలను తు.చ. తప్పకుండా ఏ మాత్రం ‘తహ్ రీఫ్’, ‘తఅతీల్’, ‘తక్ యీఫ్’, ‘తమ్ సీల్ లేకుండా నమ్మాలి.

[18] దైవదూతల గురించి

عَنْ ابْنِ مَسْعُودٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (رَأَيْتُ جِبْرِيلَ وَلَهُ سِتُّ مِائَةِ جَنَاحٍ) {رواه البخاري ومسلم} وزاد أحمد: (يَنْتَثِرُ مِنْ رِيشِهِ التَّهَاوِيلُ: الدُّرُّ وَالْيَاقُوتُ). {قال ابن كثير: إسناده جيد قوي}.

76- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “నేను జిబ్రీల్ ను చూశాను. ఆయనకు ఆరు వందల రెక్కలున్నాయి”. (బుఖారి 3232, ముస్లిం 174). అహ్మద్ లో ఈ విషయం అదనంగా ఉందిః “ఆయన అందమైన రెక్కల నుండి ముత్యాలు, పగడాలు రాలుతుంటాయి”. (దీని సనద్ మంచిది, బలమైనదని ఇబ్ను కసీర్ చెప్పారు).

ఈ హదీసులో:

జిబ్రీల్ అలైహిస్సలాంకు ఎక్కువ రెక్కలు ఉండడం అల్లాహ్ సూచనల్లో ఒక సూచన. బహుశా జిబ్రిల్ ను అల్లాహ్ పుట్టించింది ఇదే రూపంలో కావచ్చు. ఖుర్ఆనులో ఉందిః ఆయన దైవదూతలను సందేశహరులుగా నియమిస్తాడు. వారికి రెండేసి, మూడేసి, నాలుగేసి రెక్కలు ఉంటాయి. జిబ్రీల్ ఘనత ఇతర దూతల కంటే ఎక్కువ ఉంది. కనుక అతనికి రెక్కలు కూడా అధిక సంఖ్యలో ఉండవచ్చు.

[19] ప్రవక్త వద్దకు వచ్చే వహీ (దైవవాణి) విధానాలు

عَنْ عَائِشَةَ أُمِّ الْمُؤْمِنِينَ < أَنَّ الْحَارِثَ بْنَ هِشَامٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ سَأَلَ رَسُولَ الله ﷺ فَقَالَ: يَا رَسُولَ الله! كَيْفَ يَأْتِيكَ الْوَحْيُ؟ فَقَالَ رَسُولُ الله : (أَحْيَانًا يَأْتِينِي مِثْلَ صَلْصَلَةِ الْجَرَسِ وَهُوَ أَشَدُّهُ عَلَيَّ فَيُفْصَمُ عَنِّي وَقَدْ وَعَيْتُ عَنْهُ مَا قَالَ وَأَحْيَانًا يَتَمَثَّلُ لِي الْمَلَكُ رَجُلًا فَيُكَلِّمُنِي فَأَعِي مَا يَقُولُ) قَالَتْ عَائِشَةُ <: وَلَقَدْ رَأَيْتُهُ يَنْزِلُ عَلَيْهِ الْوَحْيُ فِي الْيَوْمِ الشَّدِيدِ الْبَرْدِ فَيَفْصِمُ عَنْهُ وَإِنَّ جَبِينَهُ لَيَتَفَصَّدُ عَرَقًا.

77- ఆయిష రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం: ‘ప్రవక్తా! మీపై వహీ (దైవవాణి) ఎలా వస్తుంది’? అని హారిస్ బిన్ హిషాం రజియల్లాహు అన్హు అడిగారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు: “వహీ అవతరించినప్పుడు ఒక్కోసారి అది నాకు గంట మోతలా విన్పిస్తుంది. ఈ పరిస్థితి నాకు చాలా కష్టతరంగా ఉంటుంది. ఆ పరిస్థితి తొలిగి పోగానే నాకు చెప్పబడిన విషయాలు నా మెదడులో నిక్షిప్తమయి పోతాయి. ఒక్కొక్కసారి వహీ తీసుకువచ్చే దూత నా వద్దకు మానవాకరంలో వచ్చి నాతో సంభాషిస్తారు. ఆయన చెప్పినది నేను గుర్తుంచుకుంటాను”. పిదప ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు: ఒకసారి తీవ్రమైన చలి ఉన్న రోజున ఆయనపై వహీ అవతరిస్తుండగా చూశాను, వహీ అవతరణ పూర్తి అయిన తర్వాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నుదుటి నుండి స్వేద బిందువులు రాలసాగాయి”. (బుఖారి 22, ముస్లిం 2333).

ఈ హదీసులో:

మన ప్రవక్తపై వహీ రెండు రకాలుగా అవతరించేది. ఆ సందర్భంలో ఆయనకు చాలా కష్టం కలిగేది. అది దాని భారం, దాని విలువ మరియు గౌరవం కారణంగా. అల్లాహ్ ఖుర్ఆనులో ఇలా తెలిపాడు: ]ఒకవేళ మేము ఈ ఖుర్ఆన్ ను ఏ పర్వతంపైనైనా అవతరింపజేస్తే, అది అల్లాహ్ భయం వల్ల క్రుంగిపోయి బ్రద్ధలైపోవటాన్ని నీవు చూస్తావు[. (హష్ర్ 59: 21).

ఏదైనా పోలిక కారణంగా చెడ్డ విషయాన్ని ఉపమానంగా ఇచ్చుట యోగ్యమైనదే. ఎలా అనగా గంట చెడ్డది అయినా కేవలం దాని శబ్దం ఉదాహరణ ఇవ్వబడింది.

దైవదూతలు అల్లాహ్ అనుమతితో మానవ రూపం దాల్చుతారని తెలిసింది. ఈ హదీసులో దైవదూత అంటే జిబ్రీల్ అలైహిస్సలాం .

వహీ అవతరణ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు శరీరం బరువు పెరిగినట్లు ఏర్పడేది. అది గొప్ప సంబోధన, గౌరవ వాక్యం మరియు వహీ భారం వల్ల మరియు ఆయన దాని పట్ల చూపే అధిక శ్రద్ధ వల్ల అలా ఏర్పడేది. ఇంత ఏర్పడినా అల్లాహ్ తమ ప్రవక్తపై కరుణ చూపి, సహాయం అందించి వహీ భారాన్ని మోయడాన్ని సులభం చేశాడు. లేకున్నట్లయితే దాని భారం ఎంతటిదో ఈ క్రింది ఆయతులో తెలుపబడింది. కాస్త గమనించండిః

[لَوْ أَنْزَلْنَا هَذَا القُرْآَنَ عَلَى جَبَلٍ لَرَأَيْتَهُ خَاشِعًا مُتَصَدِّعًا مِنْ خَشْيَةِ اللهِ …]. {الحشر:21}

ఒకవేళ మేము ఈ ఖుర్ఆన్ ను ఏ పర్వతంపైనైనా అవతరింప జేస్తే, అది అల్లాహ్ భయం వల్ల క్రుంగిపోయి బ్రద్ధలైపోవటాన్ని నీవు చూస్తావు. (హష్ర్ 59: 21).

[20] ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్సలం వద్దకు తొలిసారి వహీ ఎలా వచ్చింది?

78- ఆయిషా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ప్రారంభంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు కొన్ని నిజమైన కలలు వచ్చేవి. అవి పగటి వెల్తురులా స్పష్టంగా ఉండేవి. ఈ విధంగా ఆయనపై వహీ అవతరించడం మొదలయింది. దాంతో ఆయన ఏకాంతం, ఏకాగ్రతలను కోరుకొని ‘హిరా’ అను పేరుగల కొండ గుహలో ఒంటరిగా గడపనారంభించారు. ఆ గుహలో ఆయన రోజుల తరబడి ఇంటికి వెళ్ళకుండా అల్లాహ్ ఆరాధనలో నిమగ్నులయి ఉండేవారు. ఈ పని కోసం ఆయన అన్నపానీయాలు కూడా వెంట తీసుకెళ్ళి పెట్టుకునేవారు. అవి అయిపోయిన తర్వాత (ఇంటికి అంటే తన సతీమణి అయిన) హజ్రత్ ఖదీజ రజియల్లాహు అన్హా దగ్గరకు వచ్చేవారు. అయితే మళ్ళీ ఆయన అదే విధంగా అన్నపానీయాలు తీసుకొని గుహకు తిరిగి వెళ్ళిపోయేవారు.

ఇలా కొన్నాళ్ళు గడిచాక, ఓ రోజు ఉన్నట్టుండి ఆ కొండ గుహలో హఠాత్తుగా సత్యం (వహీ) సాక్షాత్కరించింది. ఆయన దగ్గరకు ఓ దైవదూత (జిబ్రీల్) వచ్చి “చదువు” అన్నాడు. దానికి ప్రవక్త తాను చదువురాని వాడినని సమాధానమిచ్చారు. ఆయన ఈ సంఘటనను ప్రస్తావిస్తూ ఇలా తెలియజేశారుః-

“అప్పుడు దైవదూత నన్ను పట్టుకొని గట్టిగా అదిమి వదలి పెట్టారు. ఆ సమయంలో నాకు శ్వాస ఆగినంత పనయింది. తరువాత ఆయన “చదువు” అన్నారు. నేను తిరిగి “నాకు చదువురాదు” అన్నాను. దైవదూత నన్ను మరోసారి పట్టుకొని గట్టిగా అదిమి వదిలేశారు. నాకు మళ్ళీ శ్వాస ఆగిపోయినంత బాధ కలిగింది. దైవదూత మళ్ళీ “చదువు” అన్నారు. నేను యథా ప్రకారం నాకు చదువు రాదని చెప్పాను. దైవదూత నన్ను మూడోసారి పట్టుకొని గట్టిగా అదిమి వదలి పెట్టారు. దాంతో నాకు మళ్ళీ శ్వాస ఆగిపోయినంత బాధవేసింది. ఆ తర్వాత అతను “పఠించు! సర్వ సృష్టికర్త అయిన నీ ప్రభువు పేరుతో. ఆయన మానవుడ్ని నెత్తుటి ముద్దతో సృష్టించాడు. చదువు! నీ ప్రభువు ఎంతో అనుగ్రహశాలి” అని అన్నాడు. (సూర అలఖ్ 96: 1-3).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భయకంపితులయి (ఎలాగో) ఈ మాటలు ఉచ్ఛరించారు. ఆ తరువాత ఆయన (తన ఇంటికి అంటే) హజ్రత్ ఖదీజ బిన్తె ఖువైలిద్ రజియల్లాహు అన్హా దగ్గరకు వచ్చారు. వచ్చీ రాగానే (పడక మీద పడి) “దుప్పటి కప్పండి, దుప్పటి కప్పండి” అన్నారు. హజ్రత్ ఖదీజ తొందరగా దుప్పటి తెచ్చి కప్పారు. దాంతో కాస్సేపటికి ఆయనకు ఆవహించిన భయాందోళనలు కాస్త తగ్గు ముఖం పట్టాయి. అప్పుడాయన హజ్రత్ ఖదీజకు జరిగిన వృత్తాంతం పూస గుచ్చినట్లు చెప్పి, తన ప్రాణానికేదో ముప్పు వాటిల్లినట్లు అనిపిస్తుందని అన్నారు. హజ్రత్ ఖదీజ రజియల్లాహు అన్హా ఆయనకు ధైర్యం చెబుతూ “అల్లాహ్ సాక్షిగా! అలా ఎన్నటికీ జరుగదు. మీరు బంధువుల్ని ఆదరిస్తారు, అభిమానిస్తారు. ఇతరుల బరువు బాధ్యతలను మోస్తారు. ఆపదల్లో ఉన్నవారిని ఆదుకుంటారు. సంపాదించలేని వారికి సంపాదించిపెడ్తారు. అతిథుల్ని సత్కరిస్తారు. సత్యమార్గంలో ఎదురయ్యే కష్టనష్టాలను భరిస్తారు. ఈ విషయంలో ఇతరులక్కూడా సహాయం చేస్తారు. అలాంటి మిమ్మల్ని అల్లాహ్ ఎన్నటికీ అవమానపర్చడు” అని అన్నారు.

ఆ తర్వాత హజ్రత్ ఖదీజ రజియల్లాహు అన్హా ప్రవక్తను తన పెద నాన్న కొడుకు అయిన వరఖ బిన్ నౌఫల్ బిన్ అసద్ బిన్ అబ్దుల్ ఉజ్జా దగ్గరకు తీసుకువెళ్ళారు. ఈయన పూర్వం అజ్ఞాన కాలంలో క్రైస్తవ మతస్థుడిగా ఉండేవాడు. హెబ్రూ భాష మాట్లాడటం, చదవడం వ్రాయడం ఆయనకు బాగా తెలుసు. హెబ్రూ భాషలో ఆయన ఇంజీల్ రాస్తుండేవారు. చాలా వృద్ధుడయిపోయాడు. కళ్ళు కూడా కానరాకుండా పోయాయి.

ఖదీజ రజియల్లాహు అన్హా ఆయన దగ్గరకు చేరుకొని “అన్నా! మీ అబ్బాయి చెప్పే మాటలు కాస్త వినండి” అన్నారు. అప్పుడు వరఖా ప్రవక్తను ఉద్దేశించి “అబ్బాయి! నువ్వేమి చూశావో చెప్పు” అన్నారు. ప్రవక్త తాను కన్నది, విన్నది అంతా వివరంగా ఆయనకు తెలియజేశారు. వరఖా ఈ మాట విని ఇలా అన్నారు: “అయితే అతను (దైవదూత జిబ్రీల్) మూసా ప్రవక్త దగ్గరకు అల్లాహ్ వహీనిచ్చి పంపిన దైవదూతే. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే నీ జాతి ప్రజలు నిన్ను (మక్కా నుండి) బహిష్కరించేనాటికి నేను బ్రతికి ఉంటే ఎంత బాగుండేది!”.

ఈ మాటలకు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆశ్చర్యపోతూ “ఏమిటి, ప్రజలు నన్ను ఇక్కడ్నుంచి వెళ్ళగొడ్తారా?” అన్నారు. దానికి వరఖ అన్నారుః “ఔను నాయనా! నీవు ఈనాడు చెబుతున్నటువంటి విషయాలే గతంలో కూడా కొందరు ప్రవక్తలు చెప్పారు. వారిలో ప్రతీ ఒక్కర్నీ ఈ లోకం విరోధించింది. అప్పటి దాకా నేను జీవించి ఉంటే నా శక్తి వంచన లేకుండా నీకు సహాయపడతా”. వరఖ ఆ తర్వాత ఎక్కువ రోజులు బ్రతకలేదు, పరమపదించారు. అటు ప్రవక్త వద్దకు వహీ రావడం కొద్ది రోజుల వరకు ఆగిపోయింది. (ఆ తర్వాత మళ్ళీ రాసాగింది). (బుఖారి 3, ముస్లిం 160).

ఈ హదీసులో:

ప్రవక్తల కలలు నిజమౌతాయి. అల్లాహ్, ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఆయన కుమారుడు (ఇస్మాఈల్ అలైహిస్సలాం)ల విషయం ఇలా తెలిపాడుః [إِنِّي أَرَى فِي المَنَامِ أَنِّي أَذْبَحُكَ] ]నేను నిన్ను జిబహ్ చేస్తున్నట్లు కలలో చూశాను[.(సాఫ్ఫాత్ 37: 102).

సమాజంలో చెడు ప్రబలినప్పుడు, లేదా ఏదైనా కారణంగా ఉదాహరణకు ఏకాగ్రతతో అల్లాహ్ ఆరాధన కొరకు, లేదా ప్రజల కీడు నుండి రక్షణ కొరకు ఏకాంతంలో ఉండవచ్చును.

ప్రయాణం మరియు ఇతర సందర్భాల్లో అన్నపానీయాలు వెంట తీసుకువెళ్ళాలి. ఇది అల్లాహ్ పై నమ్మకానికి వ్యతిరేకమేమీకాదు. ఒక సాధనం లాంటిది.

ఖుర్ఆనులో మొదటిసారిగా అవతరించిన సూరా, సూర అలఖ్.

విద్య, జ్ఞానం మరియు ధర్మవగాహన పొందాలని ప్రోత్సహించ బడింది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఉమ్మీ” అంటే చదవడం, వ్రాయడం తెలియనివారు.

శిష్యుడు విషయాన్ని గ్రహించుటకు అతని శరీరం యొక్క ఓ భాగాన్ని పండితుడు పట్టుకొని బోధించవచ్చు.

మొదటి వహీ హిరా గుహలో వచ్చింది. అదే: సూర అలఖ్ లోని తొలి ఆయతులు.

ఇందులో ఖదీజ రజియల్లాహు అన్హా ఘనత కూడా ఉంది.

ప్రవక్తలు కూడా ఒక్కోసారి భయకంపితులు అవుతారు.

ప్రవక్త మానవుడేనన్న ఆధారం ఇందులో ఉంది.

మనిషి తన అలసట, భయం గురించి భార్యకు చెప్పుకోవచ్చునని ఉంది.

ఇందులో ఖదీజ రజియల్లాహు అన్హా తెలివి, చైతన్యం, సరైన సలహాసూచన గలవారని తెలిసింది.

మంచి కార్యాలు కష్ట సమయాల్లో పనికొస్తాయి. సత్పురుషుల పట్ల అల్లాహ్ పద్ధతి ఏమిటంటే ఆయన వారిని కాపాడుతాడు, ఉత్తమ మరియు అంతిమ ఫలితం వారిదే అవుతుంది. అల్లాహ్ పట్ల మంచి నమ్మకం ఉంచాలని ఉంది. ఆయనే తన భక్తులను కాపాడువాడు. తన దాసుల సహాయకుడు. అవమానం, దుష్ఫలితం అల్లాహ్ శతృవులకు. అది వారు చేసే కర్మలకు సంపూర్ణ ఫలితం.

బంధువులతో కలిసి, వారికి మేలు చేయాలని ఉంది. ఇది అల్లాహ్ పంపిన ప్రవక్తల ఉత్తమ గుణం. మోక్షానికి మరియు ఇహపరాల సంక్షేమానికి కారణం.

నిరాధారులైన బలహీనులకు సహాయపడుతూ, వారికి తోడుగా నిలిచి, ఉపకారం చేస్తూ ఉండాలని, బీదవాళ్ళు, నిరుపేదలతో సానుభూతి చూపించాలని, వారికి మేలు చేయాలని ఉంది. ఇది ప్రవక్త సద్గుణమని తెలిసింది. అతిథులకు మర్యాదనిచ్చి, వచ్చిపోయేవాళ్ళకు దానాలు, బహుమానాలు ఇవ్వాలని ఉంది. అల్లాహ్ యొక్క ప్రత్యేక దాసుల గుణాలివి. బాధితులను ఆదుకొని, వారి కష్టాలు తగ్గించే ప్రయత్నం చేయాలి.

మాటల్లో సత్యం పాటించడం పుణ్యకార్యం. సత్యం ప్రవక్త గుణాల్లో అతి ఉత్తమ గుణం.

అమానతులను (అప్పగింతలను) వారిహక్కుదారులకు అప్పగించాలని, వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ఉంది. దాసులతో ఉదారగుణంగా మెలిగే వారితో అల్లాహ్ కూడా అలాగే మెలుగుతాడు. ఆపదలో ఉన్నవారిని ఓదార్చి, ఆపద భారం సాధ్యమైనంత వరకు తగ్గించడం అభిలషణీయం. ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే దాని గురించి మేధావులకు (పండితులకు) తెలియజేయడం మంచిది. సహాయపరంగానైనా, మంచి సలహా ఇవ్వడంలోనైనా ఉత్తమ భార్య ప్రభావం చాలా ఉంటుంది. అతని వద్ద ఏ విషయముందో తెలుసుకొనుటకు గ్రంథ జ్ఞానం గలవారి (పండితుల) మాట వినవచ్చు.

ప్రవక్తలందరి పిలుపు (సందేశం) ఒక్కటే. పరస్పరం ఒకరినొకరు ధృవీకరించేవారు. ప్రవక్త అనుయాయులతో శతృత్వం జరగడం పూర్వం నుంచి వస్తున్న సంప్రదాయమే. అలాగే జరుగుతూ ఉంటుంది.

అల్లాహ్ తన ప్రవక్తల, భక్తుల విధివ్రాతలో కష్టాలు వ్రాసాడు. వారిని పరీక్షించాలని. అయితే అంతిమ విజయం వారిదే అగును.

అనుభవజ్ఞుల అనుభవాల్ని వినాలని, వివేక విషయాల్ని తీసుకోవాలని ప్రోత్సహించబడింది. పూర్వ ఆకాశ గ్రంథాలన్నింటిలో లేదా కొన్నింటిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భరించిన కష్టాల ప్రస్తావన ఉంది.

మన ప్రవక్త వద్దకు వచ్చిన రీతిలోనే దైవదూత జిబ్రీల్, ప్రవక్త మూసా అలైహిస్సలాం వద్దకు కూడా వచ్చేవారు.

عن جَابِر بْن عَبْدِ اللهِ الْأَنْصَارِيِّ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ وَهُوَ يُحَدِّثُ عَنْ فَتْرَةِ الْوَحْيِ قَالَ فِي حَدِيثِهِ: (فَبَيْنَا أَنَا أَمْشِي سَمِعْتُ صَوْتًا مِنَ السَّمَاءِ فَرَفَعْتُ رَأْسِي فَإِذَا الْمَلَكُ الَّذِي جَاءَنِي بِحِرَاءٍ جَالِسًا عَلَى كُرْسِيٍّ بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ قَالَ رَسُولُ اللهِ فَجُئِثْتُ مِنْهُ فَرَقًا فَرَجَعْتُ فَقُلْتُ زَمِّلُونِي زَمِّلُونِي فَدَثَّرُونِي فَأَنْزَلَ اللهُ تَبَارَكَ وَتَعَالَى [يَا أَيُّهَا الْمُدَّثِّرُ قُمْ فَأَنْذِرْ وَرَبَّكَ فَكَبِّرْ وَثِيَابَكَ فَطَهِّرْ وَالرُّجْزَ فَاهْجُرْ] وَهِيَ الْأَوْثَانُ قَالَ: ثُمَّ تَتَابَعَ الْوَحْيُ).

79- హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వహీ తాత్కాలికంగా నిలిచిపోయిన రోజులను గురించి మాట్లాడుతూ (ప్రవక్త ఇలా తెలిపారని) చెప్పారుః “ఓ రోజు నేను నడిచి వెళ్తుంటే (దారిలో ఓ చోట) హఠాత్తుగా నాకు ఆకాశం నుండి ఓ (కంఠ) స్వరం విన్పించింది. నేను వెంటనే తల పైకెత్తి చూశాను. చూస్తే ఇంకేముంది, హిరా గుహలో నా దగ్గరకు వచ్చి వెళ్ళిన దైవదూతే భూమ్యాకాశాల మధ్య ఓ కుర్చీ మీద కూర్చొని ఉన్నాడు. అతడ్ని అతని మహాకాయం, గాంభీర్యతను చూడగానే నా గుండె ఝల్లుమంది. నేను భయంతో వణికిపోతూ ఇంటికి తిరిగి వచ్చాను. పడక మీద మేను వాల్చి “దుప్పటి కప్పండి, నాకు దుప్పటి కప్పండి” అన్నాను. సరిగ్గా అదే సమయంలో ]దుప్పటి కప్పి పడుకున్నవాడా! లే, లేచి ప్రజలను హెచ్చరించు, నీ ప్రభువు ఘనతను చాటి చెప్పు, నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో, మాలిన్యానికి (అంటే విగ్రహాలకు) దూరంగా ఉండు[. (సూర ముద్దస్సిర్ 74: 1-5). అన్న ఆయతులు నాపై అవతరించాయి. ఆ తరువాత వహీ నిరాఘాటంగా రావడం మొదలయింది”. (బుఖారి 4925, ముస్లిం 161).

ఈ హదీసులో:

భూమ్యాకాశాల మధ్యలో కూర్చున్నవారు జిబ్రీల్ అలైహిస్సలాం. ఇంతకు ముందు అతను వచ్చినట్లు ఇదే హదీసులో ఆధారం ఉంది. దైవదూతలను వివిధ ఆకారాల్లో మార్చే శక్తి అల్లాహ్ కు ఉంది.

ప్రవక్తల గుండెల్లో కూడా భయం చోటు చేసుకుంటుంది.

(ఖుర్ఆన్ ప్రవక్తపై ఒకేసారి అవతరించలేదు) దశలవారీగా అవతరించింది. బాహుల్యం మరియు క్రమం పరంగా ఒక్కోసారి ఎక్కువగా అవతరించేది.

ఇందులో దుస్తులను మాలిన్యానికి దూర- ముంచాలని ఉంది. దీని ఆధారంగానే కొందరు పండితులు నమాజులో దుస్తులు శుభ్రంగా ఉండడం ఒక షరతుగా సిద్ధాంతీకరించారు. ఇది వాస్తవానికి దూరమేమి లేదు.

(పై హదీసు, ఈ హదీసు మరియు బుఖారిలోని 4922వ హదీసుల ద్వారా తెలిసిన ఒక విషయం ఏమిటంటే) సహాబీల మధ్య “మసాఇలె ఫురూఇయ్యా” (చర్చనీయాంశా)లో బిన్నాభిప్రాయం ఉండింది. ఆయిషా రజియల్లాహు అన్హా మరి కొందరు సహాబీల అభిప్రాయ ప్రకారం తొలిసారిగా అవతరించిన సూర, సూర అలఖ్. అయితే జాబిర్ రజియల్లాహు అన్హు అభిప్రాయ ప్రకారం సూర ముద్దసిర్.

“లే, లేచి హెచ్చరించు” అంటే నిన్ను విశ్వసించని ప్రజల్ని అల్లాహ్ యొక్క శిక్ష నుండి హెచ్చరించు అని భావము.

[21] వహీ అవతరించునప్పుడు ప్రవక్త పరిస్థితి?

عَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ كَانَ نَبِيُّ اللهِ إِذَا أُنْزِلَ عَلَيْهِ كُرِبَ لِذَلِكَ وَتَرَبَّدَ لَهُ وَجْهُهُ.

80- ఉబాద బిన్ సామిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై వహీ అవతరించే సందర్భంలో ఆయనకు చాలా కష్టం ఏర్పడేది. ముఖ కవళికలు పూర్తిగా మారిపోయేవి. (ముస్లిం 1630, 2334).

ఈ హదీసులో:

ఇందులో “కరబ” అన్న పదం వచ్చింది. అంటే వహీ పట్ల పూర్తి శ్రద్ధ వల్ల ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు చాలా కష్టం, బాధ కలిగేది. మరియు “తరబ్బద వజ్ హుహు” అంటే ముఖం ఎరుపుగా మారిపోయేది. అవతరించే విషయం మహా గొప్పది గనుక. ఎలా అనగా వహీ అల్లాహ్ వాక్యం. అందులో ఆదేశాలు, వారింపులు, గద్దింపులు, సమాచారాలు ఉంటాయి. అవి విన్నారంటే బాలల తలల్లో కూడా ముసలితనం వచ్చేస్తుంది. శరీరం కంపిస్తుంది. స్పృహ గలవారు స్పృహ తప్పిపోయేటంత పనవుతుంది. అల్లాహ్ సహాయమే శరణం.

عَنْ ابْنِ عَبَّاسٍ ﷠ فِي قَوْلِهِ تَعَالَى [لَا تُحَرِّكْ بِهِ لِسَانَكَ لِتَعْجَلَ بِهِ] قَالَ كَانَ رَسُولُ اللهِ يُعَالِجُ مِنْ التَّنْزِيلِ شِدَّةً وَكَانَ مِمَّا يُحَرِّكُ شَفَتَيْهِ فَقَالَ ابْنُ عَبَّاسٍ فَأَنَا أُحَرِّكُهُمَا لَكُمْ كَمَا كَانَ رَسُولُ اللهِ يُحَرِّكُهُمَا فَحَرَّكَ شَفَتَيْهِ فَأَنْزَلَ اللهُ تَعَالَى [لَا تُحَرِّكْ بِهِ لِسَانَكَ لِتَعْجَلَ بِهِ ، إِنَّ عَلَيْنَا جَمْعَهُ وَقُرْآنَهُ] قَالَ جَمْعُهُ لَكَ فِي صَدْرِكَ وَتَقْرَأَهُ [فَإِذَا قَرَأْنَاهُ فَاتَّبِعْ قُرْآنَهُ] قَالَ فَاسْتَمِعْ لَهُ وَأَنْصِتْ [ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُ] ثُمَّ إِنَّ عَلَيْنَا أَنْ تَقْرَأَهُ فَكَانَ رَسُولُ اللهِ بَعْدَ ذَلِكَ إِذَا أَتَاهُ جِبْرِيلُ اسْتَمَعَ فَإِذَا انْطَلَقَ جِبْرِيلُ قَرَأَهُ النَّبِيُّ كَمَا قَرَأَهُ).

81- హజ్రత్ ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు సూర ఖియామలోని ఆయతు [لَا تُحَرِّكْ بِهِ لِسَانَكَ لِتَعْجَلَ بِهِ] “ప్రవక్తా! ఈ వహీని జ్ఞాపకముంచుకోవడానికి తొందరతొందరగా నాలుక తిప్పకు” యొక్క వ్యాఖ్యానం చేస్తూ ఇలా చెప్పారుః ఖుర్ఆన్ అవతరణ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ పెదవులను కదిలించేవారు. దానివల్ల ఆయనకు చాలా బాధ కలిగేది. ప్రవక్త కదిలించే విధంగా నేను కదిలిస్తాను చూడండని ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు తమ పెదవులను కదిలించారు. అప్పుడు అల్లాహ్ [لَا تُحَرِّكْ بِهِ لِسَانَكَ لِتَعْجَلَ بِهِ ، إِنَّ عَلَيْنَا جَمْعَهُ وَقُرْآنَهُ] “ప్రవక్తా! ఈ వహీని జ్ఞాపకముంచుకోవడానికి తొందరతొందరగా నాలుక తిప్పకు. దాన్ని నీకు గుర్తు చేయించడం, నీ చేత చదివించడం మా పని”అనే ఆయతులను అవతరింపజేశాడు. అంటే మీ హృదయంలో సమకూర్చడం మా పని, ఆ తర్వాత మీరు అట్లే చదవగలరు. [فَإِذَا قَرَأْنَاهُ فَاتَّبِعْ قُرْآنَهُ] “అంచేత మేము పఠిస్తున్నప్పుడు నీవు దాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ ఉండు చాలు”.అంటే మీరు నిశ్శబ్దంగా ఉండి, శ్రద్ధగా వినండి. [ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُ] “ఆ తరువాత మీకు దాని భావం తెలియజేయడం కూడా మా బాధ్యతే”. అంటే మీరు చదివే విధంగా మీకు సులభం చేయడం మా బాధ్యత. అప్పటి నుంచి జిబ్రీల్ అలైహిస్సలాం వహీ తీసుకొని వచ్చినప్పుడల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శ్రద్ధగా ఆలకించేవారు. జిబ్రీల్ వెళ్ళిపోయాక ఆయన చదివినట్లే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చదివేవారు. (అంటే జిబ్రీల్ నోట ఒక్కసారి వినగానే ప్రవక్తకు గుర్తిండిపోయేది).

ఈ హదీసులో:

ఖుర్ఆన్ పారాయణం నెమ్మదిగా ఆగిఆగి చేయాలి. వహీ అవతరణ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అధిక శ్రద్ధ వల్ల చాలా బాధ, భారం కలిగేది. హేళన, పరిహాసం లాంటి ఉద్దేశం లేనప్పుడు ప్రవక్త ఇలా చేసేవారని ఏదైనా చలనం చేసి చూపించడం తప్పు కాదు.

తన పవిత్ర గ్రంథం వృధా కాకుండా కాపాడే పూచి అల్లాహ్ తీసుకున్నాడు. ప్రవక్త తమ హృదయంలో అల్లాహ్ గ్రంథాన్ని భద్రపరుచుకొనుట కూడా ఒక మహత్యం. ఎందుకనగా ఆయన “ఉమ్మీ”.

సంభాషణ సమయంలో వివరణ ఇవ్వకుండా ఆలస్యం చేయవచ్చునని తెలిసింది. ఖుర్ఆన్ అవగాహన, అందులో యోచించటానికి దాని పారాయణ సందర్భంలో మౌనం వహించి, శ్రద్ధగా వినడం ధర్మం.

శిష్యుడు పండితుని ముందున్నప్పుడు శ్రద్ధగా వింటూ, నిశ్శబ్దంగా ఉండాలని, ఆయన మాట మధ్యలో ఆపకూడదని తెలిసింది.

విద్య మరచిపోకుండా మరియు వృధా కాకుండా ఉండడానికి దాన్ని కంఠస్తం చేసుకొనుట, లిఖితపూర్వకంగా భద్రపరచుట, దాని పట్ల ఎల్లప్పుడూ శ్రద్ధ వహించుటలో మనస్సు లగ్నం చేసి ఉండాలి.

పండితుడు చదివినట్లు అతనివెంట వెంటనే చదువుతూ పారాయణంలో ఆయన్ను అనుసరిస్తూ ఉండాలి.

పండితుల ద్వారా విద్యనభ్యసించే పద్ధతి ఏమిటంటే, వారు చెబుతున్న విషయాన్ని తొందరగా గుర్తుంచుకోవాలి. వ్రాసుకోవాలి.

క్రమంగా, కొంచెం కొంచెం విద్య నేర్చుకోవాలి. ఒకేసారి అధిక భాగంలో తీసుకున్న వ్యక్తి, అంతే భాగంలో పోగుట్టుకుంటాడు.

విద్య స్థిరంగా ఉండడానికి అడపాదడపా దాన్ని నెమరవేస్తూ (review చేస్తూ) ఉండాలి. ఈ విషయానికి ఆధారం “జిబ్రీల్ వెళ్ళి పోయాక ఆయన చదివినట్లే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చదివేవారు”, అన్న హదీసు భాగం.

విద్యభ్యాసంలో కష్టపడుట, అందులో కలిగే ఆపదలపై ఓపిక వహించుట చాలా అవసరం. ధర్మవిద్య అంతటి గొప్పది గనుక.

[22] నిఫాఖ్ చిహ్నాలు

[إِنَّ المُنَافِقِينَ يُخَادِعُونَ اللهَ وَهُوَ خَادِعُهُمْ وَإِذَا قَامُوا إِلَى الصَّلَاةِ قَامُوا كُسَالَى يُرَاءُونَ النَّاسَ وَلَا يَذْكُرُونَ اللهَ إِلَّا قَلِيلًا] {النساء:142}

]ఈ కపటులు (మునాఫిఖులు) అల్లాహ్ ను మోసం చేస్తున్నారు. వాస్తవానికి అల్లాహ్ యే వారిని మోసంలో పడవేశాడు. వారు నమాజ్ కొరకు లేస్తే, బద్ధకంగా, కేవలం ప్రజలకు చూపేందుకే లేస్తారు. అల్లాహ్ ను చాలా తక్కువగా స్మరిస్తారు[. (నిసా 4: 142).

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ عَنْ النَّبِيِّ ﷺ قَالَ: (آيَةُ الْمُنَافِقِ ثَلَاثٌ: إِذَا حَدَّثَ كَذَبَ وَإِذَا وَعَدَ أَخْلَفَ وَإِذَا اؤْتُمِنَ خَانَ).

82- “మునాఫిఖు చిహ్నాలు మూడుః మాట్లాడితే అబద్ధం పలుకుతాడు. వాగ్దానం చేస్తే వ్యతిరేకమే చేస్తాడు. అతన్ని నమ్మి ఏదైనా అమానతు (అప్పగింత) అతని వద్ద పెడితే దాన్ని కాజేస్తాడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (బుఖారి 33, ముస్లిం 59).

ఈ హదీసులో:

నిఫాఖ్ రెండు రకాలుః- ఒకటిః విశ్వాసానికి సంబంధించినది, రెండవదిః కర్మలకు సంబంధించినది. ఇక్కడ కర్మలకు సంబంధిం- చినదే ఉద్ధేశింపబడినది. ముస్లింలో నిఫాఖ్ కు సంబంధించిన ఒక భాగం లేదా అనేక భాగాలు ఉండవచ్చు. నిఫాఖ్ భాగాలు అనేకం. అందులో కొన్ని, మరి కొన్నిటి కన్నా ఎక్కువ భయంకర మైనవి. ఎవరు నిఫాఖ్ గుణం అవలంబించి దాన్ని విడనాడకుండా ఉంటాడో అలాంటి వ్యక్తి మునాఫిఖ్ లో లెక్కించబడతాడు. నిఫాఖ్ యొక్క చిహ్నాలున్నాయి. ఎవరిలో అవి ఉన్నాయో అంత మేరకు అతనిలో నిఫాఖ్ ఉన్నట్లు.

అబద్ధం మాట్లాడడం నిషిద్ధం అని, అది మునాఫిఖుల గుణం అని తెలిసింది. వాగ్దాన వ్యతిరేకం నిషిద్ధం. అది విశ్వాసి గుణం కాదు. అమానతులో మోసం చేయడం నిషిద్ధం. అలా చేయువానిలో నిఫాఖ్ ఉన్నట్లు. విశ్వాస సంబంధమైన నిఫాఖ్ ఇస్లాం నుండి బహిష్కరణకు కారణం అవుతుంది. కాని క్రియ సంబంధమైన నిఫాఖ్ అలా కాదు. అందువల్ల మనిషి ఇస్లాం నుండి బహిష్కరింపబడడు. అది కబీర గునాహ్ (ఘోరపాపాల్లో) లెక్కించబడుతుంది.

عَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو { أَنَّ النَّبِيَّ ﷺ قَالَ: (أَرْبَعٌ مَنْ كُنَّ فِيهِ كَانَ مُنَافِقًا خَالِصًا وَمَنْ كَانَتْ فِيهِ خَصْلَةٌ مِنْهُنَّ كَانَتْ فِيهِ خَصْلَةٌ مِنَ النِّفَاقِ حَتَّى يَدَعَهَا إِذَا اؤْتُمِنَ خَانَ وَإِذَا حَدَّثَ كَذَبَ وَإِذَا عَاهَدَ غَدَرَ وَإِذَا خَاصَمَ فَجَرَ).

83- “ఏ వ్యక్తిలో ఈ నాలుగు గుణాలుంటాయో అతను అసలైన మునాఫిఖ్. ఒక వేళ అతనిలో వీటిలోని ఒక్క గుణం ఉన్నా అతను దానిని వదలనంత వరకు అతనిలో నిఫాఖ్ కు సంబంధించిన ఒక గుణం ఉన్నట్లే. ఆ నాలుగు గుణాలు ఇవిః అతన్ని నమ్మి ఏదయినా అమానతు అప్పగించినప్పుడు అతను దాన్ని కాజేస్తాడు. నోరు విప్పితే అబద్ధం పలుకుతాడు. మాటిస్తే దాన్ని నిలబెట్టుకోడు. ఎవరితోనయినా జగడం జరిగితే అన్యాయానికి దిగుతాడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారనిఅబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ ఉల్లేఖించారు. (బుఖారి 34, ముస్లిం 58).

ఈ హదీసులో:

నిఫాఖ్ గుణాలు బాహుళ్యంగా, నానారకాలుగా ఉన్నాయి. ఈ హదీసులో చెప్పబడిన సంఖ్య వాటి పరిమితం తెలుపుటకు కాదు. అవే కాకుండా మునాఫిఖుల గుణాలు ఇంకెన్నో ఉన్నవి. నిఫాఖ్ గుణాలు ప్రజల్లో విభిన్న రీతుల్లో ఉన్నాయి. కొందరిలో చాలా తక్కువ, మరికొందరిలో చాలా ఎక్కువ, కొందరిలో ఏ మాత్రం లేవు.

వాగ్దనం చేసి భంగపరచకూడదని ఇందులో తెలిసింది. ఇది మునాఫిఖుల ప్రత్యేక గుణం. జగడములాడినప్పుడు ధర్మం నుండి వైదొలుగుట నిషిద్ధం. ఇలా చేయువాడు మునాఫిఖని, ధర్మం పట్ల హేళన చేయువాడని నిదర్శనం.

عن أَنَسٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ عَنْ النَّبِيِّ ﷺ قَالَ: (آيَةُ الْإِيمَانِ حُبُّ الْأَنْصَارِ وَآيَةُ النِّفَاقِ بُغْضُ الْأَنْصَارِ).

84- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అన్సారులను ప్రేమించడం విశ్వాస చిహ్నం (నిదర్శనం). అన్సారులను అసహ్యించుట నిఫాఖ్ చిహ్నం”. (బుఖారి 17, ముస్లిం 74).

ఈ హదీసులో:

అన్సార్ -రజియల్లాహు అన్హుం-ల ఘనత ఉంది. విశ్వాసానికి చిహ్నాలు, నిదర్శనాలు ఉంటాయి. అలాగే నిఫాఖ్ కు కూడాను. ‘అన్సార్’ ఖుర్ఆన్, హదీసులో వచ్చిన ధార్మిక పేరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీన నగరానికి వలస వచ్చాక ఆయనకు అన్ని విధాలుగా సహాయపడినవారి పేరు ఇది. వారి వారి కర్మలు, ఇస్లాంలో వారి త్యాగాల పరంగా ప్రజలు వేరు వేరు స్థానాల్లో ఉంటారు. అన్సార్ ఈ శ్రేష్ఠ నామాన్ని ప్రవక్తకు సహాయం చేసి పొందారు. దీన్ని బట్టి తెలిసే ఒక విషయం ఏమిటంటే ధర్మానికి సహాయపడ్డ ప్రతీవానితో ప్రేమించడం కూడా విశ్వాసమే. అలాగే హృద- యానికి సంబంధించిన కర్మలు కూడా విశ్వాసంలో లెక్కించబడతాయి. స్వయంగా విశ్వాసం కూడా ఒక కర్మయే. అందరిలో విశ్వాసం ఒకే రకంగా ఉండదు. తరుగుతుంది, పెరుగుతుంది. ప్రేమ, అసహ్యం కూడా కర్మలే. వాటిపై కూడా మనిషికి సత్ఫలితం, దుష్ఫలితాలు లభిస్తాయి.

[23] ‘కుఫ్ర్’ అన్న పదానికి వేరు వేరు అర్థాలు గలవు

عن عَبْدِ اللهِ أَنَّ النَّبِيَّ ﷺ قَالَ: (سِبَابُ الْمُسْلِمِ فُسُوقٌ وَقِتَالُهُ كُفْرٌ).

85- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “సాటి ముస్లింని దూషించడం “ఫిస్ఖ్” (దుర్మార్గం, కడుహేయమైన విషయం), అతనితో పోరాడటం “కుఫ్ర్”తో సమానం”.

ఈ హదీసులో:

తనకు తెలియకుండానే తన కర్మలు వృధా అవుతాయని విశ్వాసి భయపడతాడు.

కొందరు పండితులు చెప్పారుః ఇందులో ఉపయోగ పడిన “కుఫ్ర్” పదం వాస్తవ కుఫ్ర్ కాదు. అంటే ఇస్లాం నుండి బహిష్కరణకు కారణమయ్యే కుఫ్ర్ కాదు. అలాంటి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండడానికి ఈ విధంగా హెచ్చరించడం జరిగింది. మరి కొందరు ఇమాములు ఇలా చెప్పారుః ముస్లింతో పోరాడటాన్ని ధర్మసమ్మతంగా భావించేవారు కుఫ్ర్ కు పాల్పడినట్లు.

కబీర గునాహ్ (ఘోర పాపా)లు, వాటికి పాల్పడిన వ్యక్తిని ఫాసిఖ్ (దుర్మాగుడిని)గా చేసేస్తాయి. అతడు ముస్లిమయితే ఆ కబీర గునాహ్ వల్ల అతడు ఫాసిఖ్ అయినట్లు.

ముస్లిం గౌరవం, మానం గలవాడు, గనుక అతన్ని దూషించడం నిషిద్ధం. ఇందులోనే పరోక్షనింద, తిట్లు, శాపనాలు, అవహేళనలన్నీ వస్తాయి. ముస్లింను హత్య చేయడం నిషిద్ధమని, అతని హత్యను ధర్మసమ్మతంగా భావించేవాడు కాఫిరవుతాడని తెలిసింది. ఈ హదీసు ప్రవక్తగారికి నొసంగబడిన “జవామిఉల్ కలిమ్”లో పరిగణించబడుతుంది. అంటే సంక్షిప్త పదాల్లో అధిక భావాలు, అర్థాలుంటాయని అర్థం. ఇందులో రెండు వేర్వేరు మాటలు చెప్పబడ్డాయి. కాని అందులో అనేకాదేశాలున్నాయి.

[24] ఘోరపాపానికి పాల్పడిన ముస్లింను కాఫిర్ అనరాదు

عن عُبَادَةَ بْنِ الصَّامِتِ ﷜هُ وَكَانَ شَهِدَ بَدْرًا وَهُوَ أَحَدُ النُّقَبَاءِ لَيْلَةَ الْعَقَبَةِ أَنَّ رَسُولَ اللهِ ﷺ قَالَ وَحَوْلَهُ عِصَابَةٌ مِنْ أَصْحَابِهِ: (بَايِعُونِي عَلَى أَنْ لَا تُشْرِكُوا بِاللهِ شَيْئًا وَلَا تَسْرِقُوا وَلَا تَزْنُوا وَلَا تَقْتُلُوا أَوْلَادَكُمْ وَلَا تَأْتُوا بِبُهْتَانٍ تَفْتَرُونَهُ بَيْنَ أَيْدِيكُمْ وَأَرْجُلِكُمْ وَلَا تَعْصُوا فِي مَعْرُوفٍ فَمَنْ وَفَى مِنْكُمْ فَأَجْرُهُ عَلَى اللهِ وَمَنْ أَصَابَ مِنْ ذَلِكَ شَيْئًا فَعُوقِبَ فِي الدُّنْيَا فَهُوَ كَفَّارَةٌ لَهُ وَمَنْ أَصَابَ مِنْ ذَلِكَ شَيْئًا ثُمَّ سَتَرَهُ اللهُ فَهُوَ إِلَى اللهِ إِنْ شَاءَ عَفَا عَنْهُ وَإِنْ شَاءَ عَاقَبَهُ) فَبَايَعْنَاهُ عَلَى ذَلِك

86- ఉబాద బిన్ సామిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు -అతను బద్ర్ యుద్ధంలో పాల్గొనడమేగాకుండా రెండవ అఖబా ప్రమాణ స్వీకారంలోనూ పాల్గొన్న ప్రతినిధులలో ఒకరు-: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ అనుచరుల మధ్య ఉన్నప్పుడు ఇలా అన్నారు: “ఈ విషయాలను గురించి మీరు నా ముందు ప్రమాణం చేయండి; మీరు ఏ విధంగానూ అల్లాహ్ కు సాటికల్పించరు. దొంగతనం చేయరు. వ్యభిచారానికి పాల్పడరు. సంతానాన్ని చంపరు. ఎవరిమీద అపనిందలను మోపరు. ధర్మసమ్మతమైన ఏ ఆదేశాన్ని శిరసావహించడానికీ నిరాకరించరు. ఈ ప్రమాణంపై మీలో స్థిరంగా ఉన్నవాడు అల్లాహ్ వద్ద సత్ఫలితం పొందుతాడు. ఇక మీలో ఎవరైనా వాటిలో ఏ ఒక్కదానికి పాల్పడి, దానికి ఇహలోకంలోనే శిక్ష అనుభవిస్తే, ఆ శిక్ష అతని పాపానికి పరిహారమవుతుంది. ఒకవేళ అతను నేరం చేసినప్పటికీ (ఇహలోకంలో శిక్షకు గురికాకుండా) అల్లాహ్ అతని నేరాన్ని కప్పి పుచ్చడం జరిగితే అతని వ్యవహారం అల్లాహ్ చేతిలో ఉంటుంది. అల్లాహ్ తలచుకుంటే అతడ్ని క్షమించవచ్చు లేదా శిక్షించవచ్చు”. ఈ విషయాలను అంగీకరిస్తూ మేమంతా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతిలో చేయి వేసి ప్రమాణం చేశాము.

ఈ హదీసులో:

అవసరమున్నప్పడల్లా, వేర్వేరు సందర్భాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రమాణ స్వీకారాలు తీసుకున్నారు. అతి ముఖ్యమైన విషయం తౌహీద్. పాపాల్లో మహాఘోరమైనది అల్లాహ్ కు ఇతరలను భాగస్వామిగా కల్పించుట (షిర్క్). దొంగతనం నిషిద్ధం. అది ఘోరపాపాల్లో ఒకటి. వ్యభిచారం నిషిద్ధం. అది అతి చెడ్డ పాపం. వారిపై ఖర్చు చేయవలసి వస్తుందన్న భయంతో సంతానాన్ని హతమార్చడం నిషిద్ధం. అది పూర్వపు అజ్ఞాన కాలం నాటి ఆచారం. అబద్ధం, నింద మరియు అపవాదాలు నిషిద్ధం. ధర్మసమ్మతమైన ఆదేశాల పట్ల శిరసా వహించాలి. వాటి పట్ల అవిధేయత చూపుట నిషిద్ధం. సత్కార్యాల పుణ్యం అల్లాహ్ తో మాత్రమే కోరాలి. ఇతరులతో కాదు. అల్లాహ్ వద్ద ఉన్నవాటిని మనిషి తన సత్కర్మల ద్వారా అడగాలి. అల్లాహ్ కు సాటి కల్పించుట ఒక కర్మగా పరిగణించబడుతుంది. ఎవడు పాపాలకు దూరంగా ఉంటాడో, అతడు వాటికి దూరంగా ఉన్నందుకు, అందుకై ఓపిక వహించినందుకు అల్లాహ్ అతనికి సత్ఫలితం ఇస్తాడు. హద్దులు (అంటే కొన్ని పాపాలకు నిర్ణీత శిక్షలు) పాపాల ప్రక్షాళన, మరియు పరిహారమవుతాయి. అలాగే ఆపదలు కూడాను. హద్దుకు గురి చేసే పాపం ఎవడైనా చేస్తే ముందుకు వచ్చి తెలియజేయడం తప్పనిసరేమీ కాదు. దాన్ని తెలియకుండా ఉంచి, తౌబా చేస్తే సరిపోతుంది. ఘోరపాపానికి పాల్పడినవారు అల్లాహ్ ఇష్టం మీద ఆధారపడి ఉంటారు. అల్లాహ్ ఇష్టపడితే శిక్షిస్తాడు. ఇష్టముంటే మన్నిస్తాడు. ఘోరమైనపాపం చేసినవాడు ముస్లిమే అనబడుతాడు. అందువల్ల కాఫిర్ కాడు. దాన్ని హలాల్ (ధర్మసమ్మతం)గా భావిస్తే తప్ప. ఘోరపాపానికి పాల్పడిన వ్యక్తి నరకంలో ప్రవేశించవచ్చు. అయితే తౌహీద్ కారణంగా మళ్ళీ దాని నుండి బయటకు తీయబడతాడు. కర్మలు విశ్వాసంలో వస్తాయి. విశ్వాసం సత్కర్మల ద్వారా పెరుగుతుంది. దుష్కర్మల ద్వారా తరుగుతుంది. కొందరు దీనికి భిన్నాభిప్రాయంలో పడిఉన్నారు. కాని వారు తప్పులో ఉన్నారు.

عن أَبِي ذَرٍّ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: أَتَيْتُ النَّبِيَّ ﷺ وَهُوَ نَائِمٌ عَلَيْهِ ثَوْبٌ أَبْيَضُ ثُمَّ أَتَيْتُهُ فَإِذَا هُوَ نَائِمٌ ثُمَّ أَتَيْتُهُ وَقَدْ اسْتَيْقَظَ فَجَلَسْتُ إِلَيْهِ فَقَالَ: (مَا مِنْ عَبْدٍ قَالَ لَا إِلَهَ إِلَّا اللهُ ثُمَّ مَاتَ عَلَى ذَلِكَ إِلَّا دَخَلَ الْجَنَّةَ) قُلْتُ: وَإِنْ زَنَى وَإِنْ سَرَقَ قَالَ: (وَإِنْ زَنَى وَإِنْ سَرَقَ) قُلْتُ: وَإِنْ زَنَى وَإِنْ سَرَقَ قَالَ: (وَإِنْ زَنَى وَإِنْ سَرَقَ) ثَلَاثًا ثُمَّ قَالَ فِي الرَّابِعَةِ: (عَلَى رَغْمِ أَنْفِ أَبِي ذَرٍّ).

87- అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః నేనొకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళాను. ఆ సమయంలో ఆయన తెల్లదుప్పటి కప్పుకొని గాఢంగా నిద్రపోతున్నారు. నేను మళ్ళీ వచ్చి చూస్తే ఆయన పడుకునే ఉన్నారు. మళ్ళీ వచ్చి చూశాను ఆయన మేల్కొని ఉన్నారు. నేను ఆయన సమక్షంలో కూర్చున్నాను. అప్పుడాయన (నన్ను చూసి) “అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని సాక్ష్యమిచ్చి, అదే మాటపై చనిపోయే దాకా నిలకడగా ఉండేవారు తప్పకుండా స్వర్గానికి వెళ్తారు” అని అన్నారు. “వ్యభిచారం చేసినా, దొంగతనానికి పాల్పడినా (వారు స్వర్గానికి వెళ్తారా?)” అని నేనడిగాను. “ఔను, వ్యభిచారం చేసినా, దొంగతనానికి ఒడిగట్టినా సరే వెళ్తారు” అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. నేను ఆశ్చర్యపోతూ “ఏమిటీ, వ్యభిచారం, దొంగతనం లాంటి నేరాలు చేసి ఉన్నా (స్వర్గానికి వెళ్తారా?)” అని అడిగాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “వ్యభిచారం, దొంగతనం చేసి ఉన్నా సరే” అని మూడు సార్లు చెప్పి నాల్గవ సారి చెప్పారుః “అబూ జర్ర్ తన ముక్కుకు మన్ను తగిలించుకున్నా సరే!” (అంటే ఈ విషయాలు అబూ జర్ర్ కు ఎంత ఆందోళన కలిగిస్తున్నా సరే) అని చెప్పారు.

ఈ హదీసులో:

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ అనుచర సంఘం పట్ల చాలా ప్రేమ, వాత్సల్యం గలవారు.

ఘోరపాపానికి పాల్పడిన వ్యక్తి దాన్ని హలాల్ గా నమ్మితే తప్ప కాఫిర్ కాడు. మువహ్హిద్ (ఏ మాత్రం అల్లాహ్ కు భాగస్వామి కల్పించని ఏకదైవారాధకుడు) పాపాత్ముడు, ఎన్నటికైనా స్వర్గంలో చేరి తీరుతాడు. తౌహీద్ పాపాల పరిహారంలో అతి గొప్పది. ఇస్లాం ధర్మాన్ని త్యజించినవాని సర్వ సత్కార్యాలు వ్యర్థమవుతాయి.

అంతిమ క్రియను బట్టి లెక్క ఉంటుంది. ఏదైనా సమస్యకు పరిష్కారం ఆలింతో కోరడం, సందిగ్ధంగా ఉన్న విషయాన్ని మరీ తెలుసుకోవడం మంచిది. శిష్యుడి ఉద్దేశ్యాన్ని గ్రహించుటకు గద్దించనూవచ్చు.

[25] సిఫారసు (షఫాఅత్)

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ أَنَّهُ قَالَ: قُلْتُ: يَا رَسُولَ اللهِ! مَنْ أَسْعَدُ النَّاسِ بِشَفَاعَتِكَ يَوْمَ الْقِيَامَةِ فَقَالَ ﷺ: (لَقَدْ ظَنَنْتُ يَا أَبَا هُرَيْرَةَ أَنْ لَا يَسْأَلَنِي عَنْ هَذَا الْحَدِيثِ أَحَدٌ أَوَّلُ مِنْكَ لِمَا رَأَيْتُ مِنْ حِرْصِكَ عَلَى الْحَدِيثِ أَسْعَدُ النَّاسِ بِشَفَاعَتِي يَوْمَ الْقِيَامَةِ مَنْ قَالَ لَا إِلَهَ إِلَّا اللهُ خَالِصًا مِنْ قِبَلِ نَفْسِهِ).

88- అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ప్రవక్తా! ప్రళయదినాన మీ సిఫారసుకు అర్హత పొందే మహా అదృష్టవంతుడెవడు? అని నేనడిగాను. దానికాయన ఇలా చెప్పారుః “ఈ విషయం గురించి నీకంటే ముందు మరెవ్వరు అడగరు అని నేననుకున్నాను. ఎందుకంటే నీలో హదీసుల పట్ల కాంక్ష, శ్రద్ధ ఎక్కువ ఉంది. (అయితే వినుః) ప్రళయదినాన నా సిఫారసును పొందే అదృష్టవంతుడు తన హృదయాంతర స్వచ్చతతో “లాఇలాహ ఇల్లల్లాహ్” చదివినవాడు”. (బుఖారి 99).

ఈ హదీసులో:

మువహ్హిదీన్లకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు లభించును. వారిలో ఘోరపాపాలకు పాల్పడిన వారికి కూడా లభించును. మునాఫిఖులకు ఈ అదృష్టం లభించదు. వారు “లాఇలాహ ఇల్లల్లాహ్” పలికినా, అందులో సత్యత మరియు స్వచ్ఛత ఉండదు గనుక. ప్రవక్త అనుచరలకు ఆయన సిఫారసు లభించునని ఈ హదీసు గొప్ప ఆధారం. ఇందులో “లాఇలాహ ఇల్లల్లాహ్” ఘనత తెలిసింది. అది సర్వ కర్మలకు మూలమైనది. హదీసుల, ధర్మ విద్య కాంక్ష యొక్క ఘనత తెలిసింది. అబూ హురైర రజియల్లాహు అన్హు ఘనత మరియు హదీసులో ఆయనకు ఉన్న అధిక కాంక్ష గురించి తెలిసింది.

[26] స్వర్గంలో విశ్వాసులకు అల్లాహ్ దర్శనం లభించును

عَنْ جَرِيرِ بْنِ عَبْدِ اللهِ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ: قَالَ النَّبِيُّ ﷺ: (إِنَّكُمْ سَتَرَوْنَ رَبَّكُمْ كَمَا تَرَوْنَ هَذَا الْقَمَرَ لَا تُضَامُّونَ فِي رُؤْيَتِهِ فَإِنْ اسْتَطَعْتُمْ أَنْ لَا تُغْلَبُوا عَلَى صَلَاةٍ قَبْلَ طُلُوعِ الشَّمْسِ وَقَبْلَ غُرُوبِهَا فَافْعَلُوا).

89- జరీర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: “ఇప్పుడు మీరు చంద్రుడ్ని ఎలా స్పష్టంగా చూస్తున్నారో అదే విధంగా త్వరలోనే (ప్రళయదినాన) మీ ప్రభువుని చూస్తారు. ఆయన్ని చూడడంలో మీకు ఎలాంటి ఆటంకం ఉండదు. అందువల్ల మీరు సూర్యోదయానికి ముందు ఉన్న (ఫజ్ర్) నమాజును, సూర్యాస్తమ- యానికి ముందు ఉన్న (అస్ర్) నమాజును చేయడంలో వీలయినంత వరకు మీ ముందు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా ఉండేలా కృషి చేయండి (అశ్రద్ధ, అలసత్వాలకు ఏ మాత్రం తావీయకండి)”. (బుఖారి 554, ముస్లిం633).

ఈ హదీసులో:

ప్రళయదినాన విశ్వాసులకు అల్లాహ్ దర్శనం లభించునని ఇందులో ఆధారం ఉంది. వారు తమ ప్రభువును ఎంత స్పష్టంగా చూస్తారో దాని ఉదాహరణ చంద్ర దర్శనం ద్వారా ఇవ్వబడింది. చంద్రుని ఉదాహరణ అల్లాహ్ తో ఇవ్వబడుతుందన్న భావం కాదు. అల్లాహ్ దర్శనానికి తోడ్పడు సాధనాల్లో ఒకటి నమాజు. వాటిలో ఫజ్ర్ మరియు అస్ర్ నమాజులు అతి ముఖ్యమైనవి. ఈ చల్లని వేళలో గల నమాజులను కాపాడినవాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. చల్లని వేళల్లో గల నమాజులంటే ఫజ్ర్ మరియు అస్ర్. ఎందుకనగా అవి నిద్ర మరియు అలసట వేళలు. సత్కార్యాలు సర్వ మేళ్ళకు ముఖ్య సబబు. అల్లాహ్ దర్శన భాగ్యం సర్వానుగ్రహాల్లో అతి గొప్పది. అల్లాహ్ మనందరికీ తన దర్శనం ప్రసాదించుగాక. ఆమీన్!

عَنْ عُبَادةَ بن الصَّامت قَالَ: قَالَ النَّبِيُّ ﷺ: (إنَّكُمْ لَنْ تَرَوْا رَبَّكُمْ عَزَّ وَجَلَّ حَتَّى تَمُوتُوا).

90- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని ఉబాద బిన్ సామిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “నిశ్చయంగా మీరు మరణించిన తర్వాత గాని మీ ప్రభువును చూడలేరు”. (నిసాయి కుబ్రా, సహీహుల్ జామి 2459).

ఈ హదీసులో:

అల్లాహ్ ను ఇహలోకంలో చూడలేము అనడానికి ఇది గొప్ప నిదర్శనం. ఆయన దర్శనం పరలోకంలోనే సాధ్యం. ఆయనను విశ్వాసులు మాత్రమే చూడగలుగుతారు. ఆయనకు శత్రువులుగా, అవిశ్వాసులుగా ఉన్నవారికి ఈ భాగ్యం లభించదు. ప్రళయదినాన అల్లాహ్ దర్శనాన్ని నమ్మని కొందరి బిద్అతీల ఖండన కూడా ఇందులో ఉంది. ఎలా అనగా విశ్వాసులు చనిపోయాక, వారికి అల్లాహ్ దర్శనం కల్గునని ఇందులో రుజువైంది.

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ أَنَّ نَاسًا فِي زَمَنِ رَسُولِ اللهِ ﷺ قَالُوا: يَا رَسُولَ اللهِ! هَلْ نَرَى رَبَّنَا يَوْمَ الْقِيَامَةِ؟ قَالَ رَسُولُ اللهِ ﷺ: (نَعَمْ) قَالَ: (هَلْ تُضَارُّونَ فِي رُؤْيَةِ الشَّمْسِ بِالظَّهِيرَةِ صَحْوًا لَيْسَ مَعَهَا سَحَابٌ؟ وَهَلْ تُضَارُّونَ فِي رُؤْيَةِ الْقَمَرِ لَيْلَةَ الْبَدْرِ صَحْوًا لَيْسَ فِيهَا سَحَابٌ؟) قَالُوا: لَا يَا رَسُولَ اللهِ قَالَ: (مَا تُضَارُّونَ فِي رُؤْيَةِ اللهِ تَبَارَكَ وَتَعَالَى يَوْمَ الْقِيَامَةِ إِلَّا كَمَا تُضَارُّونَ فِي رُؤْيَةِ أَحَدِهِمَا. إِذَا كَانَ يَوْمُ الْقِيَامَةِ أَذَّنَ مُؤَذِّنٌ: لِيَتَّبِعْ كُلُّ أُمَّةٍ مَا كَانَتْ تَعْبُدُ. فَلَا يَبْقَى أَحَدٌ كَانَ يَعْبُدُ غَيْرَ اللهِ سُبْحَانَهُ مِنْ الْأَصْنَامِ وَالْأَنْصَابِ إِلَّا يَتَسَاقَطُونَ فِي النَّارِ. حَتَّى إِذَا لَمْ يَبْقَ إِلَّا مَنْ كَانَ يَعْبُدُ اللهَ مِنْ بَرٍّ وَفَاجِرٍ وَغُبَّرِ أَهْلِ الْكِتَابِ. فَيُدْعَى الْيَهُودُ فَيُقَالُ لَهُمْ: مَا كُنْتُمْ تَعْبُدُونَ؟ قَالُوا: كُنَّا نَعْبُدُ عُزَيْرَ ابْنَ اللهِ. فَيُقَالُ: كَذَبْتُمْ مَا اتَّخَذَ اللهُ مِنْ صَاحِبَةٍ وَلَا وَلَدٍ. فَمَاذَا تَبْغُونَ؟ قَالُوا: عَطِشْنَا. يَا رَبَّنَا! فَاسْقِنَا. فَيُشَارُ إِلَيْهِمْ. أَلَا تَرِدُونَ؟ فَيُحْشَرُونَ إِلَى النَّارِ كَأَنَّهَا سَرَابٌ يَحْطِمُ بَعْضُهَا بَعْضًا. فَيَتَسَاقَطُونَ فِي النَّارِ. ثُمَّ يُدْعَى النَّصَارَى فَيُقَالُ لَهُمْ: مَا كُنْتُمْ تَعْبُدُونَ؟ قَالُوا: كُنَّا نَعْبُدُ الْمَسِيحَ ابْنَ اللهِ. فَيُقَالُ لَهُمْ: كَذَبْتُمْ مَا اتَّخَذَ اللهُ مِنْ صَاحِبَةٍ وَلَا وَلَدٍ. فَيُقَالُ لَهُمْ: مَاذَا تَبْغُونَ؟ فَيَقُولُونَ: عَطِشْنَا. يَا رَبَّنَا! فَاسْقِنَا. قَالَ: فَيُشَارُ إِلَيْهِمْ. أَلَا تَرِدُونَ؟ فَيُحْشَرُونَ إِلَى جَهَنَّمَ كَأَنَّهَا سَرَابٌ يَحْطِمُ بَعْضُهَا بَعْضًا فَيَتَسَاقَطُونَ فِي النَّارِ. حَتَّى إِذَا لَمْ يَبْقَ إِلَّا مَنْ كَانَ يَعْبُدُ اللهَ تَعَالَى مِنْ بَرٍّ وَفَاجِرٍ أَتَاهُمْ رَبُّ الْعَالَمِينَ سُبْحَانَهُ وَتَعَالَى فِي أَدْنَى صُورَةٍ مِنْ الَّتِي رَأَوْهُ فِيهَا. قَالَ: فَمَا تَنْتَظِرُونَ؟ تَتْبَعُ كُلُّ أُمَّةٍ مَا كَانَتْ تَعْبُدُ. قَالُوا: يَا رَبَّنَا! فَارَقْنَا النَّاسَ فِي الدُّنْيَا أَفْقَرَ مَا كُنَّا إِلَيْهِمْ وَلَمْ نُصَاحِبْهُمْ. فَيَقُولُ: أَنَا رَبُّكُمْ. فَيَقُولُونَ: نَعُوذُ بِاللهِ مِنْكَ. لَا نُشْرِكُ بِاللهِ شَيْئًا {مَرَّتَيْنِ أَوْ ثَلَاثًا} حَتَّى إِنَّ بَعْضَهُمْ لَيَكَادُ أَنْ يَنْقَلِبَ. فَيَقُولُ: هَلْ بَيْنَكُمْ وَبَيْنَهُ آيَةٌ فَتَعْرِفُونَهُ بِهَا؟ فَيَقُولُونَ: نَعَمْ. فَيُكْشَفُ عَنْ سَاقٍ. فَلَا يَبْقَى مَنْ كَانَ يَسْجُدُ لِلهِ مِنْ تِلْقَاءِ نَفْسِهِ إِلَّا أَذِنَ اللهُ لَهُ بِالسُّجُودِ. وَلَا يَبْقَى مَنْ كَانَ يَسْجُدُ اتِّقَاءً وَرِيَاءً إِلَّا جَعَلَ اللهُ ظَهْرَهُ طَبَقَةً وَاحِدَةً كُلَّمَا أَرَادَ أَنْ يَسْجُدَ خَرَّ عَلَى قَفَاهُ. ثُمَّ يَرْفَعُونَ رُءُوسَهُمْ وَقَدْ تَحَوَّلَ فِي صُورَتِهِ الَّتِي رَأَوْهُ فِيهَا أَوَّلَ مَرَّةٍ. فَقَالَ: أَنَا رَبُّكُمْ. فَيَقُولُونَ: أَنْتَ رَبُّنَا. ثُمَّ يُضْرَبُ الْجِسْرُ عَلَى جَهَنَّمَ. وَتَحِلُّ الشَّفَاعَةُ. وَيَقُولُونَ: اللَّهُمَّ! سَلِّمْ سَلِّمْ). قِيلَ: يَا رَسُولَ الله! وَمَا الْجِسْرُ؟ قَالَ: (دَحْضٌ مَزِلَّةٌ فِيهِ خَطَاطِيفُ وَكَلَالِيبُ، وَحَسَكٌ تَكُونُ بِنَجْدٍ فِيهَا شُوَيْكَةٌ يُقَالُ لَهَا: السَّعْدَانُ. فَيَمُرُّ الْمُؤْمِنُونَ كَطَرْفِ الْعَيْنِ وَكَالْبَرْقِ وَكَالرِّيحِ وَكَالطَّيْرِ وَكَأَجَاوِيدِ الْخَيْلِ وَالرِّكَابِ. فَنَاجٍ مُسَلَّمٌ. وَمَخْدُوشٌ مُرْسَلٌ. وَمَكْدُوسٌ فِي نَارِ جَهَنَّمَ. حَتَّى إِذَا خَلَصَ الْمُؤْمِنُونَ مِنْ النَّارِ، فَوَالَّذِي نَفْسِي بِيَدِهِ! مَا مِنْكُمْ مِنْ أَحَدٍ بِأَشَدَّ مُنَاشَدَةً لِلهِ فِي اسْتِقْصَاءِ الْحَقِّ، مِنْ الْمُؤْمِنِينَ لِلهِ يَوْمَ الْقِيَامَةِ لِإِخْوَانِهِمْ الَّذِينَ فِي النَّارِ يَقُولُونَ: رَبَّنَا! كَانُوا يَصُومُونَ مَعَنَا وَيُصَلُّونَ وَيَحُجُّونَ. فَيُقَالُ لَهُمْ: أَخْرِجُوا مَنْ عَرَفْتُمْ. فَتُحَرَّمُ صُوَرُهُمْ عَلَى النَّارِ. فَيُخْرِجُونَ خَلْقًا كَثِيرًا قَدْ أَخَذَتْ النَّارُ إِلَى نِصْفِ سَاقَيْهِ وَإِلَى رُكْبَتَيْهِ. ثُمَّ يَقُولُونَ: رَبَّنَا! مَا بَقِيَ فِيهَا أَحَدٌ مِمَّنْ أَمَرْتَنَا بِهِ. فَيَقُولُ: ارْجِعُوا فَمَنْ وَجَدْتُمْ فِي قَلْبِهِ مِثْقَالَ دِينَارٍ مِنْ خَيْرٍ فَأَخْرِجُوهُ. فَيُخْرِجُونَ خَلْقًا كَثِيرًا. ثُمَّ يَقُولُونَ: رَبَّنَا! لَمْ نَذَرْ فِيهَا أَحَدًا مِمَّنْ أَمَرْتَنَا. ثُمَّ يَقُولُ: ارْجِعُوا. فَمَنْ وَجَدْتُمْ فِي قَلْبِهِ مِثْقَالَ نِصْفِ دِينَارٍ مِنْ خَيْرٍ فَأَخْرِجُوهُ. فَيُخْرِجُونَ خَلْقًا كَثِيرًا. ثُمَّ يَقُولُونَ: رَبَّنَا! لَمْ نَذَرْ فِيهَا مِمَّنْ أَمَرْتَنَا أَحَدًا. ثُمَّ يَقُولُ: ارْجِعُوا. فَمَنْ وَجَدْتُمْ فِي قَلْبِهِ مِثْقَالَ ذَرَّةٍ مِنْ خَيْرٍ فَأَخْرِجُوهُ. فَيُخْرِجُونَ خَلْقًا كَثِيرًا. ثُمَّ يَقُولُونَ: رَبَّنَا! لَمْ نَذَرْ فِيهَا خَيْرًا). وَكَانَ أَبُو سَعِيدٍ الْخُدْرِيُّ يَقُولُ إِنْ لَمْ تُصَدِّقُونِي بِهَذَا الْحَدِيثِ فَاقْرَءُوا إِنْ شِئْتُمْ إ[ِنَّ اللَّهَ لَا يَظْلِمُ مِثْقَالَ ذَرَّةٍ وَإِنْ تَكُ حَسَنَةً يُضَاعِفْهَا وَيُؤْتِ مِنْ لَدُنْهُ أَجْرًا عَظِيمًا]. (فَيَقُولُ اللهُ عَزَّ وَجَلَّ: شَفَعَتِ الْمَلَائِكَةُ وَشَفَعَ النَّبِيُّونَ وَشَفَعَ الْمُؤْمِنُونَ وَلَمْ يَبْقَ إِلَّا أَرْحَمُ الرَّاحِمِينَ. فَيَقْبِضُ قَبْضَةً مِنْ النَّارِ فَيُخْرِجُ مِنْهَا قَوْمًا لَمْ يَعْمَلُوا خَيْرًا قَطُّ. قَدْ عَادُوا حُمَمًا. فَيُلْقِيهِمْ فِي نَهَرٍ فِي أَفْوَاهِ الْجَنَّةِ يُقَالُ لَهُ نَهَرُ الْحَيَاةِ. فَيَخْرُجُونَ كَمَا تَخْرُجُ الْحِبَّةُ فِي حَمِيلِ السَّيْلِ. أَلَا تَرَوْنَهَا تَكُونُ إِلَى الْحَجَرِ أَوْ إِلَى الشَّجَرِ مَا يَكُونُ إِلَى الشَّمْسِ أُصَيْفِرُ وَأُخَيْضِرُ وَمَا يَكُونُ مِنْهَا إِلَى الظِّلِّ يَكُونُ أَبْيَضَ). فَقَالُوا: يَا رَسُولَ اللهِ! كَأَنَّكَ كُنْتَ تَرْعَى بِالْبَادِيَةِ؟ قَالَ: فَيَخْرُجُونَ كَاللُّؤْلُؤِ فِي رِقَابِهِمْ الْخَوَاتِمُ. يَعْرِفُهُمْ أَهْلُ الْجَنَّةِ هَؤُلَاءِ عُتَقَاءُ اللَّهِ الَّذِينَ أَدْخَلَهُمْ اللَّهُ الْجَنَّةَ بِغَيْرِ عَمَلٍ عَمِلُوهُ وَلَا خَيْرٍ قَدَّمُوهُ. ثُمَّ يَقُولُ: ادْخُلُوا الْجَنَّةَ فَمَا رَأَيْتُمُوهُ فَهُوَ لَكُمْ. فَيَقُولُونَ: رَبَّنَا أَعْطَيْتَنَا مَا لَمْ تُعْطِ أَحَدًا مِنْ الْعَالَمِينَ. فَيَقُولُ: لَكُمْ عِنْدِي أَفْضَلُ مِنْ هَذَا. فَيَقُولُونَ: يَا رَبَّنَا! أَيُّ شَيْءٍ أَفْضَلُ مِنْ هَذَا؟ فَيَقُولُ: رِضَايَ. فَلَا أَسْخَطُ عَلَيْكُمْ بَعْدَهُ أَبَدًا)

91- అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కొంత మంది “దైవ ప్రవక్తా! ప్రళయదినాన మేము మన ప్రభువును చూస్తామా?” అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అవును” అని సమాధానం ఇచ్చి ఇలా ఎదురు ప్రశ్న వేశారుః “మిట్ట మధ్యాహ్నం ఏ మాత్రం మేఘం లేని వేళ సూర్యుడిని చూడడంలో మీకేమైనా ఇబ్బంది కలుగుతుందా? అలాగే మేఘాలు లేని పౌర్ణమి రాత్రి చంద్రుడ్ని చూడడంలో మీకేమైనా ఇబ్బందా?” “లేదు ప్రవక్తా!” అని వారు సమాధానం పలికారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “ప్రళయదినాన శుభప్రదుడైన, మహోన్నతుడైన అల్లాహ్ ను దర్శించడంలో ఏ ఇబ్బందీ ఉండదు. ఏదైనా ఉంటే ఆ రెండిట్లో ఒకదాన్ని చూడడంలో కలిగినంత ఇబ్బంది మాత్రమే ఉంటుంది. (మళ్ళీ ఇలా చెప్పారుః) ప్రళయదినాన ఒక ప్రకటనకర్త (దైవదూత) “ఏ వర్గం వారు ఎవరిని ఆరాధిస్తూ ఉండేవారో వారంతా అతని వెనుక ఉండండి” అని ప్రకటిస్తాడు. పరిశుద్ధుడైన అల్లాహ్ ను కాకుండా ఇతరులను అంటే విగ్రహాలను, మూర్తులను పూజించేవారిలో ఏ ఒక్కడు మిగలకుండా అందరూ నరకంలో పడిపోతారు. చివర్లో సదాచారులు, దురాచారులైన అల్లాహ్ ను ఆరాధించేవారు మరియు గ్రంథప్రజలలో కూడా కొందరు మిగిలిపోతారు. అప్పుడు యూదులను పిలవడం జరుగుతుంది. “మీరు ఎవరిని ఆరాధిస్తూ ఉండేవారు?” అని ప్రశ్నించబడుతుంది. “మేము ఉజైరును అల్లాహ్ కుమారుడిగా (విశ్వసిస్తూ) ఆయన్నే పూజిస్తూ ఉండేవారం” అని వారంటారు. వారికి ఇలా సమాధానం ఇవ్వబడుతుందిః “మీరు అబద్ధం పలికారు. అల్లాహ్ ఎవరినీ భార్యాగాగానీ, సంతానంగాగానీ చేసుకోలేదు. సరే మీరేం కోరుతున్నారు?” అని అడగబడుతుంది. “మాకు దాహం కలుగుతుంది”, ఓ మా ప్రభూ! త్రాగడానికేదైనా మాకు ప్రసాదించు” అని కోరుతారు. “(త్రాగడానికి) రేవు వద్దకు వెళ్ళరేమిటి అని వారికి సైగ చేయబడుతుంది. మళ్ళీ వారిని నరకం వైపునకు పోగు చేయబడుతుంది. అది (చూసేవారికి) ఎండమావులా (కనిపిస్తుంది). నరకంలోని ఒక భాగం మరొక భాగాన్ని నుజ్జు నుజ్జు చేసేస్తుంది. వారు అందులో పడిపోతారు. మళ్ళీ క్రైస్తవులను పిలువడం జరుగుతుంది. “మీరు ఎవరిని ఆరాధిస్తూ ఉండేవార”ని ప్రశ్నించ బడుతుంది. “మేము (యేసు) మసీహ్ ని అల్లాహ్ కుమారునిగా విశ్వసిస్తూ ఆయన్నే ఆరాధిస్తూ ఉండేవారము” అని వారు సమాధానమిస్తారు. “మీరు అసత్యం పలికారు. అల్లాహ్ ఎవరినీ తనకు భార్యగా, సంతానంగా చేసుకోలేదు”. “సరే మీరేమి కోరుతున్నారు” అని అడిగినప్పుడు, “మాకు దాహం కలుగుతుంది. ఓ మా ప్రభూ! త్రాగడానికి మాకేదైనా ప్రసాదించు” అని వారంటారు. (త్రాగడానికి) రేవు మీదికి వెళ్ళరేమిటి అని వారికి సైగ చేయబడుతుంది. మళ్ళీ వారిని నరకం వైపునకు పోగు చేయడం జరుగుతుంది. అది చూసేవారికి ఎండమావులా కనిపిస్తుంది. దాని ఒక భాగం మరో భాగాన్ని నుజ్జు నుజ్జు చేసేస్తుంది. అందులో వారు పడిపోతారు. ఆ తర్వాత అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తూ ఉండేవారు మిగిలిపోతారు. వారిలో సజ్జనులూ ఉంటారు, దుర్జనులూ ఉంటారు. పరిశుద్ధుడైన, మహోన్నతుడైన సర్వలోకాల ప్రభువు, వారు ఇంతకు ముందు చూసిన రూపానికి (భిన్నంగా, కాని దానికి) ఇంచుమించు రూపంలో వారి ముందు ప్రత్యక్షమయి, “మీరు దేనికై వేచి ఉన్నారు, ప్రతి వర్గం, వారు ఆరాధించే దాని వెంట వెళ్ళారు కదా?” అని మందలిస్తాడు. వారంటారుః “ఓ ప్రభూ! మేము ప్రపంచంలో అందరికంటే ఎక్కువ అవసరం గలవారము అయినప్పటికీ ఆ ప్రజల్ని విడనాడాము. వారి వెంట ఉండలేదు”. (ఇప్పుడు ఎందుకని మేము వారి వెంట వెళ్తాము). “నేనే మీ ప్రభువుని” అని అంటాడు అల్లాహ్. “నీ నుండి మేము అల్లాహ్ శరణు కోరుతాము. మేము ఎవరినీ అల్లాహ్ కు సాటి కల్పము” అని రెండు లేక మూడు సార్లు అంటారు వారు. కొందరైతే తిరుగు ముఖం పెట్టబోతారు. అప్పడు అల్లాహ్ “ఆయన పరిచయానికి మీకు ఆయనకు మధ్య ఏదైనా గుర్తు ఉందా” అని అడుగుతాడు. వారంటారుః “అవును”. అప్పుడు కాలి పిక్క చూపించబడుతుంది. (దాన్ని చూసి) తనకు తాను (ఇష్టపూర్వకంగా ప్రపంచంలో) సజ్దా చేస్తూ ఉండేవారిలో ఏ ఒక్కడు మిగలకుండా అందరూ అల్లాహ్ అనుమతితో సజ్దా చేస్తారు. పేరు కొరకు మరియు తప్పించుకొనుటకు (ప్రపంచంలో) సజ్దా చేస్తూ ఉండేవారి నడుములను అల్లాహ్ బల్ల మాదిరిగా చేసేస్తాడు. వారు సజ్దా చేయడానికి వంగినప్పుడల్లా వెనకకు పడిపోతారు. మళ్ళీ తమ తల లేపుతారు. అప్పటికీ అల్లాహ్ రూపం మారిపోయి వారు మొదటిసారి దర్శించినట్లుగా అయిపోతుంది. “నేను మీ ప్రభువుని” అని అంటాడు. “(అవును) నీవు మా ప్రభువు” అని వారంటారు. ఆ తరువాత నరకం మీద వంతెన నిర్మించబడుతుంది. సిఫారసు చేయుటకు అనుమతి లభిస్తుంది. (వంతెనను చూసి ప్రవక్తలు) “అల్లాహ్ రక్షించు, రక్షించు” అని అంటారు. “ప్రవక్తా! వంతెన సంగతేమిటి? అని అక్కడున్నవారు అడిగారు. దానికి ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారుః “అదొక (భయంకరమైన) జారుడు చోటు. దాని మీద మొనదేలిన కొండీలు వంటి పెద్ద పెద్ద ముళ్ళు లేచి ఉంటాయి. ఇవి నజ్ద్ ప్రాంతంలో ఉండే సాదాన్ చెట్ల ముండ్ల మాదిరిగా చాలా పొడవుగా, లావుగా లేచి ఉంటాయి. విశ్వాసులు రెప్ప పాటులో, మెరుపు వేగంతో, తూఫాను వేగంతో, వేగంగా పరుగెత్తే గుర్రాల్లా, వాహనాల్లా దాటిపోతారు. వారిలో కొందరు ఎలాంటి ప్రమాదం లేకుండా క్షేమంగా బయటపడతారు. మరికొందరు తీవ్రంగా గాయపడి నరకంలో పడకుండా దాటిపోతారు. ఇంకొందరు తీవ్ర గాయాలకు గురై నరకంలో పడిపోతారు. చివరికి నరకంలో పడకుండా మిగిలేది విశ్వాసులే. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షి! మీకు ఒకరి నుండి రావలసిన హక్కును గురించి ఎంత గట్టిగా అడుగుతారో, అంతకంటే మరీ ఎక్కువగా నరకంలో పడిపోయిన తమ విశ్వాస సోదరుల్ని కాపాడేందుకు (స్వర్గంలో ఉన్న) విశ్వాసులు ప్రళయదినాన అల్లాహ్ తో పరివిధాలా ప్రార్థిస్తారు. వారు ఇలా అంటారుః “ప్రభువా! వారు మాతో పాటు ఉపవాసాలు పాటించేవారు, నమాజు చేసేవారు మరియు హజ్ చేసేవారు”. “మీకు గుర్తున్నవారిని తీయండి” అని ఆదేశం వస్తుంది. అప్పుడు వారు అనేక మందిని నరకం నుండి బైటికి తీస్తారు. అప్పటికీ నరకాగ్ని వారిని పిక్కల వరకు మరియు మొకాళ్ళ వరకు పట్టి ఉంటుంది. కాని వారి ముఖాల వైపు అగ్ని నిషేధించబడుతుంది. (అది వారి ముఖాలను కాల్చదు). మళ్ళీ వారంటారుః “ప్రభువా! ఎవరి గురించి నీ ఆదేశముండెనో వారిలో ఏ ఒక్కరూ మిగల లేదు”. అల్లాహ్ అంటాడుః “తిరిగి వెళ్ళండి, ఎవరి హృదయంలో ఒక దీనారు విలువంత విశ్వాసముందో వారిని నరకం నుండి తీయండీ”. వారు చాలా మందిని వెలికి తీసి, మళ్ళీ అల్లాహ్ వద్దకు వచ్చి “ప్రభువా! నీవు ఆదేశించినవారిలో ఏ ఒక్కరినీ వదలకుండా అందర్నీ వెలికి తీశాము” అని విన్నవించుకుంటారు. “సరే వెళ్ళండి, ఎవరి హృదయంలో అర్థ దీనారంత విశ్వాసముందో వారిని కూడా బయటికి తీయండి” అని అల్లాహ్ ఆదేశిస్తాడు. వారు అనేక మందిని బైటికి తీసి, “ప్రభువా! నీవు ఆదేశించిన- వారిలో అందర్నీ తీసేశాము. ఏ ఒక్కడూ మిగలలేదు” అని విన్నవించుకుంటారు. అప్పడు కూడా “మీరు తిరిగి వెళ్ళండి, హృదయంలో అణుమాత్రం విశ్వాసమున్నవారిని కూడా నరకం నుండి వెలికితీయండ”ని అల్లాహ్ ఆదేశమిస్తాడు. వారు చాలా మందిని దాని నుండి వెలికితీసి, “ప్రభువా! ఇక ఏ ఒక్క విశ్వాసి కూడా అందులో మిగిలిలేడు” అని వారు విన్నవించుకుంటారు. అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు చెప్పారుః “మీరు ఈ మాటను నమ్మలేకపోయినట్లయితే, ఖుర్ఆనులోని ఈ వాక్యం చదవండిః అల్లాహ్ ఎవరి పట్లా అణు మాత్రం అన్యాయం కూడా చెయ్యడు. ఎవరైనా ఒక మంచి పని చేస్తే, దానిని అల్లాహ్ రెండింతలు చేస్తాడు. ఇంకా తన తరఫు నుండి పెద్ద ప్రతిఫలం కూడా ప్రసాదిస్తాడు[. (4: 40). అప్పడు అల్లాహ్ అంటాడుః దైవదూతలు సిఫారసు చేశారు, ప్రవక్తలు సిఫారసు చేశారు మరియు విశ్వాసులు కూడా సిఫారసు చేశారు. ఇక అనంత కరుణామయుడు మాత్రం మిగిలి- యున్నాడు. అప్పుడు అల్లాహ్ ఒక గుప్పెడు మందిని నరకం నుండి బైటికి తీస్తాడు. వారు ఎప్పుడూ ఏ సత్కార్యం చేసి ఉండరు. నరకంలో కాలి కాలి బొగ్గుగా మారిపోతారు. వారిని తీసి స్వర్గం అంచున ఉన్న ఒక సెలయేరులో పడవేస్తాడు. దానిని “జీవన నది” అనబడుతుంది. ఆ సెలయేరులో పడగానే, నది ఒడ్డు మీద విత్తనాలు మొలకెత్తి సస్యశ్యామలమైనట్లు వారు (నూతన శక్తి సౌందర్యాలతో నవనవలాడుతూ లేస్తారు). చెట్ల ప్రక్కనో, రాళ్ళ ప్రక్కనో విత్తనాలు మొలకెత్తడాన్ని మీరు చూడలేదా? అలా మొలకెత్తే మొక్కల్లో ఎండ తగిలే మొక్కలు పచ్చగా ఉంటాయి. ఎండ తగలకుండా నీడ పడే మొక్కలు పాలిపోతాయి”. ప్రవక్తా! మీరు పచ్చికబయలల్లో మేపుటకు వెళ్ళినట్లుంది? అని సహచరులు అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “వారు సెలయేరు నుండి ముత్యాల్లా మెరిసిపోతూ బయటికి వస్తారు. వారి మెడల మీద ముద్ర ఉంటుంది. “అల్లాహ్ నుండి విముక్తి పొందిన వారు వీరే, వీరు ఏ సత్కార్యం చేయకపోయినా, ఏ మంచి చేసి ముందుకు పంపించుకోకపోయిన అల్లాహ్ వీరిని స్వర్గంలో ప్రవేశింపజేశాడు” అని స్వర్గవాసులు గుర్తు పడతారు. మళ్ళీ అల్లాహ్ ఇలా అంటాడుః మీరు స్వర్గంలో ప్రవేశించండి. మీరు చూస్తున్నదంతా మీదే. వారంటారుః “ప్రభూ! మీరు మాకొసంగినంత సర్వలోకాల్లో ఎవరికీ నొసంగలేదు”. “మీ కొరకు దీనికంటే మరీ ఉత్తమమైనది నా వద్ద ఉంది” అని అల్లాహ్ అంటాడు. “ఇంతకంటే ఉత్తమమైనది మరేముంటుంది, ప్రభూ!” అని వారంటారు. “అది నా సంతోషం. ఇక నుండి నేను ఎన్నడూ మీ మీద ఆగ్రహించను” అని అల్లాహ్ అంటాడు”. (ముస్లిం 183, బుఖారి 7439).

ఈ హదీసులో:

ప్రళయదినాన విశ్వాసులకు అల్లాహ్ దర్శనం లభించునన్న గొప్ప నిదర్శనం ఉంది. అల్లాహ్ యొక్క కాలి పిక్క చూపించబడునని రుజువైనది. ఇందులో ఎలా వచ్చి ఉందో అలాగే విశ్వసించడం మన కర్తవ్యం. ఎలాంటి తష్ బీహ్, తమ్ సీల్ లేకుండా నమ్మాలి. ]ఆయనను పోలినది ఏదీ లేదు. ఆయన వినువాడు, అన్నీ చూచువాడు[. (42: 11).

అల్లాహ్ ను గాకుండా ఇతరులను ఆరాధ్యదైవంగా చేసుకున్న వారి తప్పు, దుర్మార్గం స్పష్టంగా తెలిసింది.

తౌహీదును పాటించిన (ఏ మాత్రం షిర్క్ చేయని) పాపాత్ములు శాశ్వతంగా నరకంలో ఉండరు. ఘోరపాపాలకు పాల్పడినవారిని అల్లాహ్ క్షమించకున్నట్లయితే వారు శిక్షించబడుతారు.

ప్రదర్శనాబుధ్ధి భయంకరమైనదని, అది చిన్నపాటి నిఫాఖ్ (మునాఫిఖుల గుణం) అని తెలిసింది. ప్రదర్శనా బుద్ధితో చేసిన ప్రతి సత్కార్యం వ్యర్థమవుతుంది. అది నమాజు, రోజా మరియు హజ్ లాంటి ఏ ఆరాధనైనా సరే. బాహ్య కర్మలను బట్టే ప్రపంచంలో వ్యవహారం ఉండును, కాని వారి అంతర్యాలు అల్లాహ్ గుర్తెరుగును.

దైవదూతలు, ప్రవక్తలు మరియు విశ్వాసులు సిఫారసు చేస్తారని రుజువైనది. అల్లాహ్ సంతృప్తి చెందుతాడు. ఆగ్రహపడు తాడు. అంటే అల్లాహ్ తన స్నేహితులతో సంతృప్తి చెందుతాడు. తన శత్రువులతో ఆగ్రహించుకుంటాడు. ఈ రెండు గుణాలు కూడా అల్లాహ్ గౌరవానికి తగినట్లుగా ఉంటాయని విశ్వసించాలి.

నరకంపై వంతెన వేయబడునని నమ్మాలి. కర్మల ప్రకారం దాని నుండి దాటడం జరుగుతుంది.

పవిత్రుడు, పరిశుద్ధుడయిన అల్లాహ్ కు ముఖము ఉందని రుజువైనది. అది ఆయన గౌరవానికి తగినట్లుగా ఉంటుంది. సృష్టిరాసుల ముఖాల మాదిరిగా కాదు.

అగోచర మరియు పరలోక విషయాలు సరిగ్గా అర్థం కావడానికి ప్రజలు తమ జీవితంలో గోచరించే వాటితో పోలిక ఇవ్వడం కూడా రుజువైంది.

వసల్లల్లాహు వసల్లమ అలల్ మబ్ఊసి రహ్మతల్ లిల్ ఆలమీన్, వల్ హందు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్


([1]) హన్తమ్:- పచ్చ లేక ఎర్ర రంగు మట్టి కడవను అంటారు. దీనికి మూతి పై భాగాన కాకుండా ప్రక్క భాగాన ఉంటుంది. మట్టిలో రక్తం, వెండ్రుకలు కలిపి ఈ కడవను తయారు చేస్తారు. లేదా లక్క, గాజు కలిపిన ఎరుపు రంగు పూయబడిన కడవను కూడా అంటారు. దుబ్బా:- పాత్రగా ఉపయోగించే గుండ్రని సొరకాయ. నఖీర్:- ఖర్జూరపు చెట్టు వేరులో గుంట చేసి దాన్ని మధుపాత్రగా ఉపయోగిస్తారు. ముజఫ్ఫత్:- ఉమ్మినీటితో పూత పూసి చేసిన మట్టి పాత్ర. ముఖయ్యర్:- చర్మాన్ని ఎండబెట్టి, కాల్చి ఒక విధమైన పూతను తయారు చేస్తారు, ఆ పూతతో చేయబడిన పాత్రను ముఖయ్యర్ అంటారు.

([2]) ఆ సమయాన అబూ సుఫ్యాన్ ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. కాని ఆయిజ్ బిన్ అమ్ర్ అప్పటికే ఇస్లాం స్వీకరించిఉన్నారు.

([3]) “రుబూబియత్” అంటే అల్లాహ్ మాత్రమే సృష్టికర్త, పోషకుడు, జీవన్మరణాల ప్రధాత, సర్వ జగత్తు నిర్వాహకుడు అని, “ఉలూహియత్” అంటే సర్వ ఆరాధనలకు అల్లాహ్ మాత్రమే అర్హుడు అని, “అస్మా వసిఫాత్” అంటే ఆయనకు ఉత్తమ పేర్లు, ఉన్నత గుణముల గలవని విశ్వసించాలి.

([4]) ‘తహ్ రీఫ్’ అంటేః ఏ ఆధారము లేకుండా నామగుణాల భావాన్ని మార్చుట. తారుమారు చేయుట. ‘తఅతీల్’ అంటేః అల్లాహ్ గుణనామాలన్నిటిని లేదా కొన్నిటిని తిరస్కరించుట. అల్లాహ్ ను నిరాకారునిగా నమ్ముట. ‘తక్ యీఫ్’ అంటేః అల్లాహ్ గుణాలను మాట, ఊహ ద్వారా ఏదైనా ఒక రూపం ఇచ్చే ప్రయత్నం చేయుట. అల్లాహ్ చేయి అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని అనుట. ‘తమ్ సీల్‘ అంటేః అల్లాహ్ గుణాలను సృష్టి గుణాలతో పోల్చుట. లేదా సృష్టి గుణాల మాదిరిగా ఉంటాయని విశ్వసించుట.

%d bloggers like this: