https://youtu.be/FyrhHcDJ_aw [22 నిముషాలు]
వక్త: సయ్యద్ అబ్దుస్సలామ్ ఉమ్రి (హఫిజహుల్లాహ్)
36:13 وَاضْرِبْ لَهُم مَّثَلًا أَصْحَابَ الْقَرْيَةِ إِذْ جَاءَهَا الْمُرْسَلُونَ
ఉదాహరణగా (నీవు) వారికి ఒక పట్టణవాసుల వద్దకు (అనేక మంది) ప్రవక్తలు వచ్చినప్పుడు జరిగిన దానిని వివరించు.
36:14 إِذْ أَرْسَلْنَا إِلَيْهِمُ اثْنَيْنِ فَكَذَّبُوهُمَا فَعَزَّزْنَا بِثَالِثٍ فَقَالُوا إِنَّا إِلَيْكُم مُّرْسَلُونَ
మేము వారి వద్దకు ఇద్దరిని (అంటే ఇద్దరు ప్రవక్తలను) పంపగా (మొదట) ఆ ఇద్దరినీ వారు ధిక్కరించారు. మరి వారికి (ఆ ఇద్దరికి) అండగా మేము మూడవ వానిని పంపగా, “మేము మీ దగ్గరకు ప్రవక్తలుగా పంపబడ్డాము” అని వారు (ఆ పట్టణ ప్రజలతో) అన్నారు.
36:15 قَالُوا مَا أَنتُمْ إِلَّا بَشَرٌ مِّثْلُنَا وَمَا أَنزَلَ الرَّحْمَٰنُ مِن شَيْءٍ إِنْ أَنتُمْ إِلَّا تَكْذِبُونَ
దానికి వారు “మీరు కూడా మాలాంటి మానవమాత్రులే. కరుణామయుడు అసలు దేనినీ అవతరింపజేయలేదు. మీరు చెప్పేదంతా పచ్చి అబద్ధం” అని సమాధానమిచ్చారు.
36:16 قَالُوا رَبُّنَا يَعْلَمُ إِنَّا إِلَيْكُمْ لَمُرْسَلُونَ
ప్రవక్తలు ఇలా అన్నారు : “మేము నిశ్చయంగా మీ వద్దకు ప్రవక్తలుగా పంపబడ్డామన్న సంగతి మా ప్రభువుకు తెలుసు.
36:17 وَمَا عَلَيْنَا إِلَّا الْبَلَاغُ الْمُبِينُ
“స్పష్టంగా విషయాన్ని అందజేయటం వరకే మా కర్తవ్యం.”
36:18 قَالُوا إِنَّا تَطَيَّرْنَا بِكُمْ ۖ لَئِن لَّمْ تَنتَهُوا لَنَرْجُمَنَّكُمْ وَلَيَمَسَّنَّكُم مِّنَّا عَذَابٌ أَلِيمٌ
దానికి వారు, “మేము మిమ్మల్ని దరిద్ర సూచకంగా భావిస్తున్నాము. మీరు గనక (ఈ పనిని) మానుకోకపోతే, మేము మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపేస్తాము. మా తరఫున మీకు బాధాకరమైన శిక్ష అంటుకుంటుంది” అని చెప్పారు.
36:19 قَالُوا طَائِرُكُم مَّعَكُمْ ۚ أَئِن ذُكِّرْتُم ۚ بَلْ أَنتُمْ قَوْمٌ مُّسْرِفُونَ
అప్పుడు ప్రవక్తలు ఇలా అన్నారు : “మీ దరిద్రమంతా మీ వెంటే ఉంది, ఏమిటీ, మీకు చేసే ఉపదేశాన్ని మీరు దరిద్రంగా తలపోస్తున్నారా? అసలు విషయం అదికాదు. మీరసలు బరితెగించి పోయారు.”
36:20 وَجَاءَ مِنْ أَقْصَى الْمَدِينَةِ رَجُلٌ يَسْعَىٰ قَالَ يَا قَوْمِ اتَّبِعُوا الْمُرْسَلِينَ
(అంతలోనే ఆ) నగరం చివరి వైపు నుంచి ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు : “ఓ నా జాతివారలారా! మీరు ప్రవక్తలను అనుసరించండి.
36:21 اتَّبِعُوا مَن لَّا يَسْأَلُكُمْ أَجْرًا وَهُم مُّهْتَدُونَ
“మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగని వారి, సన్మార్గాన ఉన్న వారి వెనుక నడవండి.”
36:22 وَمَا لِيَ لَا أَعْبُدُ الَّذِي فَطَرَنِي وَإِلَيْهِ تُرْجَعُونَ
“నన్ను పుట్టించిన వానిని నేను ఆరాధించకుండా ఉండటం ఎంతవరకు సమంజసం? మరి (నిజానికి) మీరంతా ఆయన వైపు మరలించబడేవారే.
36:23 أَأَتَّخِذُ مِن دُونِهِ آلِهَةً إِن يُرِدْنِ الرَّحْمَٰنُ بِضُرٍّ لَّا تُغْنِ عَنِّي شَفَاعَتُهُمْ شَيْئًا وَلَا يُنقِذُونِ
“అట్టి (నిజ) దైవాన్ని వదిలేసి నేను ఇతరులను ఆరాధ్యులుగా ఆశ్రయించాలా? ఒకవేళ కరుణామయుడు (అయిన అల్లాహ్) నాకేదైనా నష్టం కలిగించదలిస్తే వారి సిఫారసు నాకెలాంటి లాభమూ చేకూర్చదు. వారు నన్ను కాపాడనూ లేరు.
36:24 إِنِّي إِذًا لَّفِي ضَلَالٍ مُّبِينٍ
“మరి నేను స్పష్టమైన దుర్మార్గంలో పడిపోతాను.
36:25 إِنِّي آمَنتُ بِرَبِّكُمْ فَاسْمَعُونِ
“అందుకే నేను చెప్పేది వినండి! నేను మటుకు మీరందరి (ఏకైక) ప్రభువును విశ్వసించాను.”
36:26 قِيلَ ادْخُلِ الْجَنَّةَ ۖ قَالَ يَا لَيْتَ قَوْمِي يَعْلَمُونَ
“స్వర్గంలో చేరిపో” అని (అతనితో) అనబడింది. “నా జాతి వారికి ఇది తెలిస్తే ఎంత బావుండేది!” అని అతనన్నాడు.
36:27 بِمَا غَفَرَ لِي رَبِّي وَجَعَلَنِي مِنَ الْمُكْرَمِينَ
“నా ప్రభువు నన్ను క్షమించి, ఆదరణీయులలో నన్ను చేర్చిన సంగతి.”
36:28 وَمَا أَنزَلْنَا عَلَىٰ قَوْمِهِ مِن بَعْدِهِ مِن جُندٍ مِّنَ السَّمَاءِ وَمَا كُنَّا مُنزِلِينَ
అతని తరువాత మేము అతని జాతి వారిపై ఆకాశం నుంచి ఏ సైనిక దళాన్నీ దింపలేదు. దాని అవసరం మాకు లేదు కూడా.
36:29 إِن كَانَتْ إِلَّا صَيْحَةً وَاحِدَةً فَإِذَا هُمْ خَامِدُونَ
అది (ఆ శిక్ష) ఒకే ఒక్క కేక మాత్రమే! అంతే. వారంతా (ఆ దెబ్బకు) ఆరిపోయారు.
మరిన్ని కధలు:
https://teluguislam.net/category/stories-kadhalu/
You must be logged in to post a comment.