[50 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
ఖురాన్ మెయిన్ పేజీ
https://teluguislam.net/quran
2. సూరా అల్ బఖర (ఆయతులు 72 – 86)
72 وَإِذْ قَتَلْتُمْ نَفْسًا فَادَّارَأْتُمْ فِيهَا ۖ وَاللَّهُ مُخْرِجٌ مَّا كُنتُمْ تَكْتُمُونَ
(జ్ఞాపకం చేసుకోండి.) మీరు ఒక వ్యక్తిని హత్య చేసి, ఆ విషయంలో పరస్పరం విభేదించుకోసాగారు. కాని మీ గుట్టును అల్లాహ్ రట్టు చేయాలనే నిర్ణయించుకున్నాడు.
2:73 فَقُلْنَا اضْرِبُوهُ بِبَعْضِهَا ۚ كَذَٰلِكَ يُحْيِي اللَّهُ الْمَوْتَىٰ وَيُرِيكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ
కనుక, “ఈ ఆవు (మాంసపు) ముక్క నొకదాన్ని హతుని దేహానికేసి కొట్టండి (అతడు లేచి నిలబడతాడు)” అని మేము అన్నాము. ఈ విధంగా అల్లాహ్ మృతులను బ్రతికించి తన నిదర్శనాలను చూపుతున్నాడు – మీరు ఇకనయినా బుద్ధిగా మసలుకోవాలని!
2:74 ثُمَّ قَسَتْ قُلُوبُكُم مِّن بَعْدِ ذَٰلِكَ فَهِيَ كَالْحِجَارَةِ أَوْ أَشَدُّ قَسْوَةً ۚ وَإِنَّ مِنَ الْحِجَارَةِ لَمَا يَتَفَجَّرُ مِنْهُ الْأَنْهَارُ ۚ وَإِنَّ مِنْهَا لَمَا يَشَّقَّقُ فَيَخْرُجُ مِنْهُ الْمَاءُ ۚ وَإِنَّ مِنْهَا لَمَا يَهْبِطُ مِنْ خَشْيَةِ اللَّهِ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ
కాని ఆ తరువాత మీ హృదయాలు కఠినమైపోయాయి. రాళ్ళ మాదిరిగా, కాదు – వాటికంటే కూడా కఠినం అయిపోయాయి. కొన్ని రాళ్ళల్లోనుంచైతే సెలయేళ్ళు ప్రవహిస్తాయి. మరి కొన్ని రాళ్ళు పగలగా వాటి నుంచి నీరు చిమ్ముతుంది. మరికొన్ని అల్లాహ్ భయంతో (కంపించి) క్రిందపడి పోతాయి. మీ కార్యకలాపాల పట్ల అల్లాహ్ పరధ్యానంలో ఉన్నాడని అనుకోకండి.
2:75 أَفَتَطْمَعُونَ أَن يُؤْمِنُوا لَكُمْ وَقَدْ كَانَ فَرِيقٌ مِّنْهُمْ يَسْمَعُونَ كَلَامَ اللَّهِ ثُمَّ يُحَرِّفُونَهُ مِن بَعْدِ مَا عَقَلُوهُ وَهُمْ يَعْلَمُونَ
(ముస్లిములారా!) వారు మీ మాటను నమ్ముతారనే (ఇప్పటికీ) మీరు ఆశపడ్తున్నారా? వాస్తవానికి వారిలో, అల్లాహ్ వాక్కును విని, అర్థం చేసుకుని కూడా ఉద్దేశపూర్వకంగా దాన్ని మార్చి వేసేవారు ఉన్నారు.
2:76 وَإِذَا لَقُوا الَّذِينَ آمَنُوا قَالُوا آمَنَّا وَإِذَا خَلَا بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ قَالُوا أَتُحَدِّثُونَهُم بِمَا فَتَحَ اللَّهُ عَلَيْكُمْ لِيُحَاجُّوكُم بِهِ عِندَ رَبِّكُمْ ۚ أَفَلَا تَعْقِلُونَ
వారు విశ్వాసులను కలుసుకున్నప్పుడు తమ విశ్వాసాన్ని వెల్లడిస్తారు. తమ వర్గానికి చెందినవారిని ఏకాంతంలో కలుసుకున్నప్పుడు, “అల్లాహ్ మీకు తెలియజేసిన విషయాలను మీరు వీరికి ఎందుకు చేరవేస్తున్నారు? తద్వారా మీ ప్రభువు సమక్షంలో వారు మీపై వాదనకు బలం పొందగలరనే సంగతిని విస్మరించారా ఏమి?” అని అంటారు.
2:77 أَوَلَا يَعْلَمُونَ أَنَّ اللَّهَ يَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ
వారు దాచేదీ, బహిర్గతం చేసేదీ – అంతా అల్లాహ్‌కు తెలుసన్న సంగతి వారికి తెలియదా?!
2:78 وَمِنْهُمْ أُمِّيُّونَ لَا يَعْلَمُونَ الْكِتَابَ إِلَّا أَمَانِيَّ وَإِنْ هُمْ إِلَّا يَظُنُّونَ
వారిలో చదువురాని వారు కొందరున్నారు – వారికి గ్రంథ జ్ఞానం లేదు. వారు కేవలం ఆశల్ని నమ్ముకొని ఉన్నారు. లేనిపోని అంచనాలు వేసి, ఊహల్లో విహరిస్తూ ఉంటారు.
2:79 فَوَيْلٌ لِّلَّذِينَ يَكْتُبُونَ الْكِتَابَ بِأَيْدِيهِمْ ثُمَّ يَقُولُونَ هَٰذَا مِنْ عِندِ اللَّهِ لِيَشْتَرُوا بِهِ ثَمَنًا قَلِيلًا ۖ فَوَيْلٌ لَّهُم مِّمَّا كَتَبَتْ أَيْدِيهِمْ وَوَيْلٌ لَّهُم مِّمَّا يَكْسِبُونَ
తమ స్వహస్తాలతో లిఖించిన గ్రంథాన్ని దైవగ్రంథమని చెప్పి, ప్రాపంచిక తుచ్ఛ ప్రయోజనాన్ని పొందజూసే వారికి ‘వినాశం’ కలదు. వారి ఈ స్వహస్త లిఖిత రచన కూడా వారి వినాశానికి దారితీస్తుంది. వారి ఈ సంపాదన కూడా వారి నాశనానికి కారణ భూతం అవుతుంది.
2:80 وَقَالُوا لَن تَمَسَّنَا النَّارُ إِلَّا أَيَّامًا مَّعْدُودَةً ۚ قُلْ أَتَّخَذْتُمْ عِندَ اللَّهِ عَهْدًا فَلَن يُخْلِفَ اللَّهُ عَهْدَهُ ۖ أَمْ تَقُولُونَ عَلَى اللَّهِ مَا لَا تَعْلَمُونَ
పైగా, “మేము నరకాగ్నిలో కొన్ని రోజులు మాత్రమే ఉంటాము” అని వారంటున్నారు. వారిని అడుగు: మీరు ఆ మేరకు అల్లాహ్ నుండి పొందిన వాగ్దానం ఏదన్నా మీ వద్ద ఉందా? ఒకవేళ ఉంటే అల్లాహ్ ముమ్మాటికీ తన వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించడు. (అసలు అలా జరగనే లేదు) అసలు మీరు మీకు తెలియని విషయాలను అల్లాహ్‌కు ఆపాదిస్తున్నారు.
2:81 بَلَىٰ مَن كَسَبَ سَيِّئَةً وَأَحَاطَتْ بِهِ خَطِيئَتُهُ فَأُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
నిస్సందేహంగా – ఎవడు పాపకార్యాలకు ఒడిగట్టాడో, అతని పాపాలు అతన్ని చుట్టుముట్టాయో అలాంటివారే నరకవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.
2:82 وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَٰئِكَ أَصْحَابُ الْجَنَّةِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
మరెవరు విశ్వసించి, మంచి పనులు చేస్తారో వారు స్వర్గవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.
2:83 وَإِذْ أَخَذْنَا مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ لَا تَعْبُدُونَ إِلَّا اللَّهَ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا وَذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَقُولُوا لِلنَّاسِ حُسْنًا وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ ثُمَّ تَوَلَّيْتُمْ إِلَّا قَلِيلًا مِّنكُمْ وَأَنتُم مُّعْرِضُونَ
మేము ఇస్రాయీల్ వంశస్థుల నుండి వాగ్దానం తీసుకున్నాము (దాన్ని గుర్తుకు తెచ్చుకోండి) : “అల్లాహ్‌ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా మెలగాలి. అలాగే బంధువులను, అనాధలను, అగత్యపరులను (ఆదరించాలి). ప్రజలతో మర్యాదగా మాట్లాడాలి. నమాజును నెలకొల్పుతూ ఉండాలి, జకాత్ ఇస్తూ ఉండాలి.” అయితే మీలో కొద్దిమంది తప్ప అందరూ మాట తప్పారు, ముఖం తిప్పుకున్నారు.
2:84 وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ لَا تَسْفِكُونَ دِمَاءَكُمْ وَلَا تُخْرِجُونَ أَنفُسَكُم مِّن دِيَارِكُمْ ثُمَّ أَقْرَرْتُمْ وَأَنتُمْ تَشْهَدُونَ
పరస్పరం రక్తం చిందించరాదనీ (చంపుకోరాదని), తోటి వారిని వారి నివాసస్థలాల నుంచి బహిష్కరించరాదనీ మీనుండి వాగ్దానం తీసుకున్నప్పుడు, దానికి మీరు అంగీకరించారు. ఆ విషయానికి స్వయంగా మీరే సాక్షులు.
2:85 ثُمَّ أَنتُمْ هَٰؤُلَاءِ تَقْتُلُونَ أَنفُسَكُمْ وَتُخْرِجُونَ فَرِيقًا مِّنكُم مِّن دِيَارِهِمْ تَظَاهَرُونَ عَلَيْهِم بِالْإِثْمِ وَالْعُدْوَانِ وَإِن يَأْتُوكُمْ أُسَارَىٰ تُفَادُوهُمْ وَهُوَ مُحَرَّمٌ عَلَيْكُمْ إِخْرَاجُهُمْ ۚ أَفَتُؤْمِنُونَ بِبَعْضِ الْكِتَابِ وَتَكْفُرُونَ بِبَعْضٍ ۚ فَمَا جَزَاءُ مَن يَفْعَلُ ذَٰلِكَ مِنكُمْ إِلَّا خِزْيٌ فِي الْحَيَاةِ الدُّنْيَا ۖ وَيَوْمَ الْقِيَامَةِ يُرَدُّونَ إِلَىٰ أَشَدِّ الْعَذَابِ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ
కాని మీరు పరస్పరం చంపుకున్నారు. మీలోని ఒక వర్గం వారిని ఇండ్ల నుంచి బహిష్కరించటం కూడా చేశారు. పాపానికి, దౌర్జన్యానికి పాల్పడుతూ మీరు వారికి వ్యతిరేకంగా-ఇతరులను సమర్థించారు. మరి వారు బందీలుగా పట్టుబడి మీ వద్దకు వచ్చినప్పుడు మీరు వారికోసం నష్టపరిహారం ఇచ్చిన మాట వాస్తవమే. కాని మీరు వారిని వెళ్ళగొట్టడమే అధర్మం (అప్పుడు మీరు దాన్ని అస్సలు లెక్కచేయలేదు). ఏమిటీ? మీరు కొన్ని ఆజ్ఞలను విశ్వసించి, మరికొన్నింటిని తిరస్కరిస్తున్నారా? మీలో ఇలా చేసేవారికి ప్రపంచ జీవితంలో అవమానం తప్ప ఇంకేం ప్రతిఫలం ఉంటుంది? ఇక ప్రళయ దినాన వారు మరింత కఠినమైన శిక్ష వైపు మరలించబడతారు. అల్లాహ్‌కు మీ చేష్టలు తెలియకుండా లేవు.
2:86 أُولَٰئِكَ الَّذِينَ اشْتَرَوُا الْحَيَاةَ الدُّنْيَا بِالْآخِرَةِ ۖ فَلَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنصَرُونَ
పరలోకానికి బదులుగా ప్రాపంచిక జీవితాన్ని కొనుక్కున్న వారు వీరే. వీరికి విధించబడే శిక్షల్లో తగ్గింపూ ఉండదు, వారికి సహాయపడటమూ జరగదు.
ఖురాన్ వ్యాఖ్యానం : అహ్సనుల్ బయాన్
You must be logged in to post a comment.