మిష్కాతుల్ మసాబీహ్ [హదీసులు]

బిస్మిల్లాహ్

సంకలనం: ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అల్ ఖతీబ్ అత్ తబ్రీజీ
పరిశీలన: షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ అల్ – అల్బానీ 

తెలుగు అనువాదం: డా. అబ్దుర్రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా 

మిష్కాతుల్ మసాబీహ్ [హదీసులు]

అల్లాహ్‌ (త’ఆలా) స్తోత్రం తర్వాత ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను పూర్తిగా అనుసరించనంత వరకు విశ్వాస మాధుర్యాన్ని చవిచూడలేము. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ‘హదీసు‘లను పూర్తిగా అనుసరించినంత వరకే విధేయతా వాగ్దానం నెరవేరుతుంది. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వివరణల ద్వారానే ఖుర్‌ఆన్‌ను అనుసరించటం జరుగుతుంది. వీటిని గురించి వ్రాయబడిన పుస్తకాల్లో “మిష్కాతుల్‌ మ’సాబీ’హ్‌” ప్రముఖమైనది. ఇందులో వివిధ ‘హదీసు’లను చేర్చడం జరిగింది. దీన్ని సమకూర్చి, ప్రవక్త సాంప్రదాయాలను వ్యాపింపజేస్తూ, బిద్‌’అత్‌లను రూపుమాపడానికి ప్రయత్నించిన వారు, అబూ ము’హమ్మద్‌ ‘హుసైన్‌ బిన్‌ మస్‌’ఊద్‌ బిన్‌ ముహమ్మద్‌ అల్‌ ఫరాఅ’ అల్‌ బ’గవీ (రహిమహుల్లాహ్). అల్లాహ్‌ (త’ఆలా) అతని తరగతులను అధికం చేయుగాక. అతడు దీన్ని సమకూర్చినప్పుడు. ‘హదీసు’ల పరంపరల ధృవీకరణ, ఉల్లేఖకుల పేర్లను ప్రస్తావించలేదు. ఈ కారణంగా కొందరు ‘హదీసు’ వేత్తలు దీన్ని విమర్శించారు.

తరువాత ము’హమ్మద్‌ బిన్‌ అబ్దుల్లాహ్ అల్‌ ఖ’తీబ్‌ అత్‌ తబ్రే’జీ (రహిమహుల్లాహ్) గారు. బ’గవీ గారి మ’సాబీహ్‌లో గుర్తుల్లేని ‘హదీసు’లకు గుర్తింపుపెట్టారు. అంటే ‘హదీసు’వేత్తల, వారి పుస్తకాల పేర్లను పేర్కొన్నారు. ‘హదీసు’ ప్రారంభంలో ‘హదీసు’లను ఉల్లేఖించిన ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అనుచరుని పేరును, చివరలో ‘హదీసు’ను వ్రాసిపెట్టిన ‘హదీసు’వేత్తల పేర్లను, వారి పుస్తకాల పేర్లను కూడా పేర్కొనడం జరిగింది. బ’గవీ గారు సమకూర్చిన ఈ “అల్‌ మ’సాబీ’హ్” కు, ‘తబ్రీ’జీ గారు “మిష్కాతుల్‌ మసాబీహ్‌” అని పేరు పెట్టారు.

ఏవిధంగా బ’గవీ గారు తమ గ్రంథాన్ని 30 పుస్తకాలలో సమకూర్చారో తబ్రే’జీ గారు కూడా అలాగే చేసారు. బ’గవీ గారు ప్రతి అధ్యాయాన్ని 2 విభాగాలలో విభజించారు. మొదటి విభాగంలో బు’ఖారీ, ముస్లిమ్‌లు పేర్కొన్న ‘హదీసు’లను లేదా వారిద్దరిలో ఒక్కరు పేర్కొన్న ‘హదీసు’లను పెట్టారు. రెండవ విభాగంలో వీరిద్దరితో పాటు ఇతరులు కూడా ఉల్లేఖించిన ‘హదీసు’లను పేర్కొన్నారు. తబ్రే’జీ గారు మూడవ విభాగం అధికం చేసి ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అనుచరులు, తాబయీన్లు పేర్కొన్న ‘హదీసు’లను కూడా చేర్చారు.

“మిష్కాతుల్‌ మ’సాబీ’హ్‌” ప్రపంచంలో ఎన్నో ఇస్లామీ ధార్మిక పాఠశాలలో ముఖ్య ‘హదీసు’ అభ్యాస గ్రంథంగా బోధించబడుతుంది. కాబట్టి దీన్ని ఎన్నో భాషలలోనికి అనువాదాలు చేయబడ్డాయి.

దీని ఉర్దూ అనువాదం చాలామంది చేసారు. వారిలో ‘అబ్దుస్సలాం బస్తవీ (రహిమహుల్లాహ్) ఒకరు. వారు దీనికి మంచి అనువాదం మరియు వ్యాఖ్యానం వ్రాసారు. బస్తవీ గారు సందర్భాన్నిబట్టి ‘హదీసు’లను ఉల్లేఖించిన ప్రముఖ ప్రవక్త సహచరుల జీవిత విశేషాలను మరియు చారిత్రక విషయాలను కూడా వ్యాఖ్యానాలలో వివరించారు.

ఇతర భాషలలో ఎంత నేర్పున్నా, ఒక పుస్తకాన్ని – తమ మాతృభాషలో చదివితే కలిగే సంతృప్తి – ఇతర భాషలలో చదివితే దొరుకదు. కాబట్టి మేము ఈ “మిష్కాతుల్‌ మ’సాబీ’హ్‌” ను బస్తవీ గారి వ్యాఖ్యానంతో సహా సులభమైన తెలుగు భాషలో అందజేయటానికి ప్రయత్నించాము.

ఏవిషయానికి గురించయిన ‘హదీసు’ చూడాలనుకుంటే, ఈ “మిష్కాతుల్‌ మసాబీహ్‌” చాలు. ఎందుకంటే ఇందులో 13 మంది ‘హదీసు’వేత్తలు ప్రోగుపరచిన, అనేక విషయాలకు సంబంధించిన ‘హదీసు’లున్నాయి. వాటిని, ఆ ‘హదీసు’వేత్తలదే కాక అల్బానీగారి ధృవీకరణ కూడా ‘హదీసు’ మొదటలో పేర్కొనబడింది.

“మిష్కాతుల్‌ మసాబీహ్‌” యొక్క 6294 ‘హదీసు’లు రెండు సంపుటాలలో విభజించబడ్డాయి. మొదటి సంపుటంలో 11 పుస్తకాలు (1012 పేజీలు), రెండవ సంపుటంలో 19 పుస్తకాలు (1019 పేజీలు) ఉన్నాయి.

విషయ సూచిక

మొదటి సంపుటం అధ్యాయాలు 

అధ్యాయ సూచిక – సంపుటం-1 : అధ్యాయాలు 1-11 (4 పేజీలు)

రెండవ సంపుటం అధ్యాయాలు

అధ్యాయ సూచిక – సంపుటం-2 : అధ్యాయాలు 12-30 (4 పేజీలు)

%d bloggers like this: