స్త్రీ సుగంధం పూసుకొని బైటికి వెళ్ళుట

బిస్మిల్లాహ్

స్త్రీ సుగంధం పూసుకొని బైటికి వెళ్ళుట

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎంతో కఠినంగా హెచ్చరించినప్పటికీ స్త్రీలు సువాసనలు రుద్దుకొని ఇంటి బైటికి వెళ్ళుట, పురుషుల ముందు నుండి దాటుట ఈ కాలంలో ప్రబలిపోతుంది. ఆయన ఆదేశం ఇలా ఉంది:స్త్రీ సుగంధం పూసుకొని బైటికి వెళ్ళుట

“ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని ఆమె సువాసన పురుషులు ఆఘ్రాణించాలని వారి ముందు నుండి దాటుతుందో ఆమె వ్యభిచారిణి “ (ముస్నద్‌ అహ్మద్‌ 4/418, సహీహుల్‌ జామి 105).

కొందరు స్త్రీలు నిర్లక్ష్యపు భావనతో దీనిని చాలా చిన్న విషయం అనుకొని డ్రైవరు, సేల్స్‌మేన్‌ మరియు పాఠశాలల వాచ్‌ మేన్‌ల ముందు నుండి వెళ్తారు. అయితే సువాసన పూసుకున్న స్త్రీ బైటికి వెళ్ళదలచినప్పుడు, అది మస్దిద్‌ లాంటి పవిత్ర స్థలానికైనా సరే గుసుల్ జనాబత్‌ (స్వప్నస్ఖలనం వల్ల లేదా భార్యభర్తలు కలుసుకున్నందు వల్ల స్నానం) చేసినట్లు స్నానం చేసిన తర్వాతే వెళ్ళాలని కఠినంగా ఆదేశం ఇచ్చింది ఇస్లాం.స్త్రీ సుగంధం పూసుకొని బైటికి వెళ్ళుట

“ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని అక్కడ ఉన్నవారు ఆమె సువాసన ఆఘ్రాణించాలని మస్టిద్‌ వస్తుందో, ఆమె జనాబత్‌ వల్ల చేసే విధంగా స్నానం చేసిరానంత వరకు ఆమె నమాజు అంగీకరింపబడదు”. (ముస్నద్‌ అహ్మద్‌ 2/444, సహీహుల్‌ జామి 2703).

ఈ రోజుల్లో స్త్రీలు ఉపయోగించే క్రింద తెలుపబడే రకరకాల సుగంధాల విషయంలో ఇక అల్లాహ్‌తోనే మొరపెట్టుకోవాలి. ఆయనే మనకు మార్గం చూపువాడు. ఎందుకనగా ఈ నాటి స్త్రీలు పెళ్ళిల్లో, ఉత్సవాల్లో వెళ్ళే ముందు ఉపయోగించే సాంబ్రాణిధూపమలు, అదే విధంగా బజారుల్లో, వాహనాల్లో, అందరూ ఏకమై కలసే చోట చివరికి రమాజాను మాసములో, ఇతర రోజుల్లో మస్జిద్లో వెళ్ళేటప్పుడు కూడా చాలా సేపటి వరకు మరియు దూరం వరకు ఆఘ్రాణించగల సుగంధములు వాడుతుంటారు. అయితే పై సందర్భాల్లో అలాంటి సువాసనలు వాడడం నిషిద్ధం అని వారు తెలుసుకోవడం లేదు. ధర్మపరంగా స్త్రీలు ఉపయోగించవలసిన పరిమళాల్లో వాటి రంగు కానరావాలి. కాని సువాసన రాకూడదు. అల్లాహ్‌! మాలోని కొందరు మూఢ స్త్రీ పురుషులు చేసిన తప్పుల వల్ల మాలోని పుణ్యాత్ములైన స్త్రీ పురుషులను శిక్షించకు. మా అందరికీ సన్మార్గం ప్రసాదించుము ఓ ప్రభువా!

[ఇది ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన “ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలుఅను పుస్తకం నుంచి తీసుకుబడింది]

%d bloggers like this: