రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) [వీడియో పాఠాలు]

బిస్మిల్లాహ్

పూర్తి పుస్తకం ఇక్కడ చదవవచ్చు
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి (Riyadh-us-Saaliheen)

యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0e89U9Un_2Pz0UCxHKXiS7

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

అధ్యాయాలు

హదీత్ అంటే ఏమిటి? హదీత్ ఖుద్సీ అని దేన్ని అంటారు? [ఆడియో]

బిస్మిల్లాహ్

[11:20 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఇతరములు:

జుమా (శుక్ర వారం) – మిష్కాతుల్ మసాబీహ్ [హదీసులు]

బిస్మిల్లాహ్

క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీరు హదీసులు చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి

జుమా (శుక్ర వారం) – మిష్కాతుల్ మసాబీహ్ [హదీసులు]
[PDF] [19 పేజీలు]
మూలం: మిష్కాతుల్ మసాబీహ్ నుండి

సంకలనం: ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అల్ ఖతీబ్ అత్ తబ్రీజీ
హదీసుల పరిశీలన: షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ అల్ – అల్బానీ
తెలుగు అనువాదం: డా. అబ్దుర్రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా

ఇతరములు :

ఖురాన్ మహాత్యాల పుస్తకం – మిష్కాతుల్ మసాబీహ్ [హదీసులు]

బిస్మిల్లాహ్

క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీరు పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి

08. ఖురాన్ మహాత్యాల పుస్తకం (కితాబ్  ఫధాయిల్ అల్ -ఖురాన్)
[హదీసులు] [PDF] [47 పేజీలు]

1. ఖుర్‌ఆన్‌ పారాయణ నియమాలు
2. ఖుర్‌ఆన్‌ పారాయణ రకాలు, దాని సంకలనం

మూలం: మిష్కాతుల్ మసాబీహ్ నుండి

సంకలనం: ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అల్ ఖతీబ్ అత్ తబ్రీజీ
హదీసుల పరిశీలన: షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ అల్ – అల్బానీ
తెలుగు అనువాదం: డా. అబ్దుర్రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా

ఉపవాసం పుస్తకం (కితాబుల్ సౌమ్) – మిష్కాతుల్ మసాబీహ్ [హదీసులు]

బిస్మిల్లాహ్

క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీరు పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి

07. ఉపవాసం పుస్తకం (కితాబుల్ సౌమ్)
[హదీసులు] [PDF] [41 పేజీలు]
మూలం: మిష్కాతుల్ మసాబీహ్ నుండి

సంకలనం: ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అల్ ఖతీబ్ అత్ తబ్రీజీ
హదీసుల పరిశీలన: షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ అల్ – అల్బానీ
తెలుగు అనువాదం: డా. అబ్దుర్రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా

విషయ సూచిక

1. రమ’దాన్‌ నెలవంక చూడటం – హదీస్ 1969 | పేజీ 620
2. ఉపవాసం గురించి వివిధ విషయాలు – హదీస్ 1982 | పేజీ 625
3. ఉపవాసాన్ని శుద్ధిపరచటం – హదీస్ 1999 | పేజీ 629
4. ప్రయాణికుని ఉపవాసం – హదీస్ 2019 | పేజీ 633
5. తప్పిన ఉపవాసాలు పూర్తి చేసుకోవటం – హదీస్ 2030 | పేజీ 636
6. అదనపు ఉపవాసాలు – హదీస్ 2036 | పేజీ 638
7. అదనపు (నఫిల్‌) ఉపవాసాల విరమణ – హదీస్ 2076|పేజీ 647
8. ఘనతగల రాత్రి (లైలతుల్‌ ఖద్‌ర్‌) – హదీస్ 2083 | పేజీ 649
9. ఏ’తెకాఫ్‌ – హదీస్ 2097|పేజీ 653

ఇతరములు:

జాగ్రత్తగా వినండి! ఈ ఐహిక జీవితం శాపభూయిష్టమైనది

బిస్మిల్లాహ్

అబూ హురైరహ్‌ (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనం:

జాగ్రత్తగా వినండి! ఈ ఐహిక జీవితం శాపభూయిష్టమైనది. అంటే అల్లాహ్‌ కారుణ్యానికి దూరం చేస్తుంది. ఈ ఐహిక జీవితంలో నిమగ్నమై, పరలోకాన్ని మరచి పోయినవాడు అల్లాహ్‌ (త’ఆలా) కారుణ్యానికి దూరమై పోతాడు. ఇంకా ఈ ప్రపంచంలో ప్రతి వస్తువూ శపించదగినదే. ఎందుకంటే అల్లాహ్‌ కారుణ్యానికి దూరం చేస్తుంది. అయితే అల్లాహ్‌ ధ్యానం, మరియు అల్లాహ్‌ సాన్నిహిత్యం పొందినవారు తప్ప. ఈ రెంటిలో అన్ని రకాల మేళ్ళూ ఉన్నాయి. ఇంకా ధార్మిక పండితుడైనా, ధార్మిక విద్యను అభ్యసించే వాడయినా వీరంతా అల్లాహ్‌ కారుణ్యం హక్కుగలవారు.”

(తిర్మిజి, ఇబ్నె మాజహ్‌).

[5176. (22) [3/143 1-ప్రామాణికం]మిష్కాతుల్ మసాబీహ్ [హదీసులు]

మిష్కాతుల్ మసాబీహ్ [హదీసులు]

బిస్మిల్లాహ్

సంకలనం: ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అల్ ఖతీబ్ అత్ తబ్రీజీ
పరిశీలన: షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ అల్ – అల్బానీ 

తెలుగు అనువాదం: డా. అబ్దుర్రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా 

మిష్కాతుల్ మసాబీహ్ [హదీసులు]

అల్లాహ్‌ (త’ఆలా) స్తోత్రం తర్వాత ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను పూర్తిగా అనుసరించనంత వరకు విశ్వాస మాధుర్యాన్ని చవిచూడలేము. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ‘హదీసు‘లను పూర్తిగా అనుసరించినంత వరకే విధేయతా వాగ్దానం నెరవేరుతుంది. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వివరణల ద్వారానే ఖుర్‌ఆన్‌ను అనుసరించటం జరుగుతుంది. వీటిని గురించి వ్రాయబడిన పుస్తకాల్లో “మిష్కాతుల్‌ మ’సాబీ’హ్‌” ప్రముఖమైనది. ఇందులో వివిధ ‘హదీసు’లను చేర్చడం జరిగింది. దీన్ని సమకూర్చి, ప్రవక్త సాంప్రదాయాలను వ్యాపింపజేస్తూ, బిద్‌’అత్‌లను రూపుమాపడానికి ప్రయత్నించిన వారు, అబూ ము’హమ్మద్‌ ‘హుసైన్‌ బిన్‌ మస్‌’ఊద్‌ బిన్‌ ముహమ్మద్‌ అల్‌ ఫరాఅ’ అల్‌ బ’గవీ (రహిమహుల్లాహ్). అల్లాహ్‌ (త’ఆలా) అతని తరగతులను అధికం చేయుగాక. అతడు దీన్ని సమకూర్చినప్పుడు. ‘హదీసు’ల పరంపరల ధృవీకరణ, ఉల్లేఖకుల పేర్లను ప్రస్తావించలేదు. ఈ కారణంగా కొందరు ‘హదీసు’ వేత్తలు దీన్ని విమర్శించారు.

తరువాత ము’హమ్మద్‌ బిన్‌ అబ్దుల్లాహ్ అల్‌ ఖ’తీబ్‌ అత్‌ తబ్రే’జీ (రహిమహుల్లాహ్) గారు. బ’గవీ గారి మ’సాబీహ్‌లో గుర్తుల్లేని ‘హదీసు’లకు గుర్తింపుపెట్టారు. అంటే ‘హదీసు’వేత్తల, వారి పుస్తకాల పేర్లను పేర్కొన్నారు. ‘హదీసు’ ప్రారంభంలో ‘హదీసు’లను ఉల్లేఖించిన ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అనుచరుని పేరును, చివరలో ‘హదీసు’ను వ్రాసిపెట్టిన ‘హదీసు’వేత్తల పేర్లను, వారి పుస్తకాల పేర్లను కూడా పేర్కొనడం జరిగింది. బ’గవీ గారు సమకూర్చిన ఈ “అల్‌ మ’సాబీ’హ్” కు, ‘తబ్రీ’జీ గారు “మిష్కాతుల్‌ మసాబీహ్‌” అని పేరు పెట్టారు.

ఏవిధంగా బ’గవీ గారు తమ గ్రంథాన్ని 30 పుస్తకాలలో సమకూర్చారో తబ్రే’జీ గారు కూడా అలాగే చేసారు. బ’గవీ గారు ప్రతి అధ్యాయాన్ని 2 విభాగాలలో విభజించారు. మొదటి విభాగంలో బు’ఖారీ, ముస్లిమ్‌లు పేర్కొన్న ‘హదీసు’లను లేదా వారిద్దరిలో ఒక్కరు పేర్కొన్న ‘హదీసు’లను పెట్టారు. రెండవ విభాగంలో వీరిద్దరితో పాటు ఇతరులు కూడా ఉల్లేఖించిన ‘హదీసు’లను పేర్కొన్నారు. తబ్రే’జీ గారు మూడవ విభాగం అధికం చేసి ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అనుచరులు, తాబయీన్లు పేర్కొన్న ‘హదీసు’లను కూడా చేర్చారు.

“మిష్కాతుల్‌ మ’సాబీ’హ్‌” ప్రపంచంలో ఎన్నో ఇస్లామీ ధార్మిక పాఠశాలలో ముఖ్య ‘హదీసు’ అభ్యాస గ్రంథంగా బోధించబడుతుంది. కాబట్టి దీన్ని ఎన్నో భాషలలోనికి అనువాదాలు చేయబడ్డాయి.

దీని ఉర్దూ అనువాదం చాలామంది చేసారు. వారిలో ‘అబ్దుస్సలాం బస్తవీ (రహిమహుల్లాహ్) ఒకరు. వారు దీనికి మంచి అనువాదం మరియు వ్యాఖ్యానం వ్రాసారు. బస్తవీ గారు సందర్భాన్నిబట్టి ‘హదీసు’లను ఉల్లేఖించిన ప్రముఖ ప్రవక్త సహచరుల జీవిత విశేషాలను మరియు చారిత్రక విషయాలను కూడా వ్యాఖ్యానాలలో వివరించారు.

ఇతర భాషలలో ఎంత నేర్పున్నా, ఒక పుస్తకాన్ని – తమ మాతృభాషలో చదివితే కలిగే సంతృప్తి – ఇతర భాషలలో చదివితే దొరుకదు. కాబట్టి మేము ఈ “మిష్కాతుల్‌ మ’సాబీ’హ్‌” ను బస్తవీ గారి వ్యాఖ్యానంతో సహా సులభమైన తెలుగు భాషలో అందజేయటానికి ప్రయత్నించాము.

ఏవిషయానికి గురించయిన ‘హదీసు’ చూడాలనుకుంటే, ఈ “మిష్కాతుల్‌ మసాబీహ్‌” చాలు. ఎందుకంటే ఇందులో 13 మంది ‘హదీసు’వేత్తలు ప్రోగుపరచిన, అనేక విషయాలకు సంబంధించిన ‘హదీసు’లున్నాయి. వాటిని, ఆ ‘హదీసు’వేత్తలదే కాక అల్బానీగారి ధృవీకరణ కూడా ‘హదీసు’ మొదటలో పేర్కొనబడింది.

“మిష్కాతుల్‌ మసాబీహ్‌” యొక్క 6294 ‘హదీసు’లు రెండు సంపుటాలలో విభజించబడ్డాయి. మొదటి సంపుటంలో 11 పుస్తకాలు (1012 పేజీలు), రెండవ సంపుటంలో 19 పుస్తకాలు (1019 పేజీలు) ఉన్నాయి.

విషయ సూచిక

మొదటి సంపుటం అధ్యాయాలు 

అధ్యాయ సూచిక – సంపుటం-1 : అధ్యాయాలు 1-11 (4 పేజీలు)

రెండవ సంపుటం అధ్యాయాలు

అధ్యాయ సూచిక – సంపుటం-2 : అధ్యాయాలు 12-30 (4 పేజీలు)

క్లుప్తంగా ఇమామ్ బుఖారీ (రహమతుల్లా అలై) మరియు ఇమామ్ ముస్లిం (రహమతుల్లా అలై) గురుంచి

nature-bukhari-muslimBrief Biography of Imam Bukhari & Imam Muslim
రచయిత :సయ్యిద్ షబ్బీర్ అహ్మద్
మూలం:మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) గ్రంధ పరిచయం నుండి

[ఇక్కడ చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]

రెండు ఉత్తమ వచనాలు (సుబహానల్లహి వబిహందిహీ, సుబహనల్లహిల్ అజీం)

subahanallahరెండు ఉత్తమ వచనాలు (సుబహానల్లహి వబిహందిహీ, సుబహనల్లహిల్ అజీం)
పుస్తకం నుండి:  కలామే హిక్మత్ – 1(వివేక వచనం)
రచన: సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు: జమీ అతే అహ్ లె హదీస్, ఆంధ్రప్రదేశ్

[ఇక్కడ చదవండి / డౌన్ లోడ్ చేసుకోండి]

అల్లాహ్ అర్ష్ నీడలో.. (In the Shade of Allah’s Throne)

shade-of-allah

దైవ సింహాసనపు నీడలో..
పుస్తకం నుండి:  కలామే హిక్మత్ – 1(వివేక వచనం)
రచన: సఫీ అహ్మద్ మదనీ,
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు: జమీ అతే అహ్ లె హదీస్, ఆంధ్రప్రదేశ్

[ఇక్కడ చదవండి / డౌన్ లోడ్ చేసుకోండి]

English version of this hadeeth:

The Prophet said: “There are seven whom Allah will shade in His Shade on the Day when there is no shade except His Shade: a just ruler; a youth who grew up in the worship of Allah, the Mighty and Majestic; a man whose heart is attached to the mosques; two men who love each other for Allah’s sake, meeting for that and parting upon that; a man who is called by a woman of beauty and position [for illegal intercourse], but be says: ‘I fear Allah’, a man who gives in charity and hides it, such that his left hand does not know what his right hand gives in charity; and a man who remembered Allah in private and so his eyes shed tears.”

Narrated by Abu Hurairah & collected in Saheeh al-Bukhari (english trans.) vol.1, p.356, no.629 & Saheeh Muslim (english trans.) vol.2, p.493, no.2248