వుదూకు ముందు మేకప్‌ను తప్పనిసరిగా తొలగించాలా? – షేఖ్ ఇబ్న్ బాజ్

ప్రశ్న:

జవాబు (షేఖ్ ఇబ్న్ బాజ్):

మేకప్‌లో ఏదైనా పదార్థం ఉండి, అది చర్మానికి నీరు చేరకుండా అడ్డుకునే ఒక పొర (layer) వలె ఏర్పడితే, దానిని తప్పనిసరిగా తొలగించాలి. కానీ దానికి ఎలాంటి పొర లేదా పదార్థం లేకుండా, భౌతికంగా ఎలాంటి ఆనవాలు లేని కేవలం రంగు మాత్రమే అయితే, దానిని తొలగించాల్సిన అవసరం లేదు.

చర్మానికి నీరు చేరకుండా నిరోధించే భౌతికమైన పొర ఏదైనా సరే, దానిని ముఖంపై నుండి తప్పనిసరిగా తొలగించాలి. చేతులపై కూడా పిండి లాంటిదేదైనా అంటుకొని ఉంటే దానికి కూడా ఇదే నియమం వర్తిస్తుంది—దానిని తప్పక తొలగించాలి. అదేవిధంగా, ముఖంపై లేదా పాదాలపై పిండి అంటుకొని ఉంటే, దానిని కూడా తొలగించాలి. అయితే ఎలాంటి భౌతికమైన పదార్థం లేదా పొర లేకుండా కేవలం రంగు మాత్రమే అయితే, దానిని తొలగించాల్సిన అవసరం లేదు. అవును.

మూలం: binbaz.org.sa
ఇంగ్లీష్ అనువాదం: యాసీన్ ఇబ్న్ జమాల్
https://salafitranslations.com/must-makeup-be-removed-before-wudu

రంజాన్ నెలలో ముస్లిం మహిళ తన ప్రభువును ఆరాధించడానికి మరియు తన కుటుంబానికి సేవ చేయడానికి ఎటువంటి ప్రణాళికను కలిగి ఉండాలి? – షేఖ్ సులైమాన్ అల్-రుహైలీ

షేఖ్ సులైమాన్ అల్-రుహైలీ (హఫిజహుల్లాహ్):

ముస్లిం మహిళ యొక్క ప్రణాళిక కూడా పురుషుడి ప్రణాళిక లాంటిదే అని మేము చెబుతాము. అయితే, ముస్లిం మహిళ ఆరాధన పెరుగుతుంది. ఎందుకంటే స్త్రీ తన భర్తకు మరియు తన కుటుంబ సభ్యులకు సేవ చేయడానికి కష్టపడి, వారికి సరిపడా ఆహారాన్ని సిద్ధం చేసినప్పుడు, ఆమె అల్లాహ్ నుండి ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఆ పని చేస్తే, ఆమె అల్లాహ్ ను ఆరాధిస్తున్నట్లే!

కాబట్టి ఇది ఆమెకు ఒక ప్రతిఫలం మరియు ఆమె సత్కార్యాలలో పెరుగుదల. కాబట్టి, స్త్రీ ఆహారాన్ని సిద్ధం చేస్తున్నప్పుడు, ఆమె అల్లాహ్ నామస్మరణలో (జిక్ర్) తనను తాను నిమగ్నం చేసుకోవాలి. కాబట్టి, ఆమె “సుబ్ హానల్లాహ్” అని పలుకుతూ వంట చేస్తుంది! “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని పలుకుతూ వంట చేస్తుంది! అల్లాహ్ స్మరణలో ఉంటూ వంట చేస్తుంది. ఇలా చేయడం ద్వారా ఆమెకు గొప్ప ప్రతిఫలం లభిస్తుంది!

కాబట్టి, రంజాన్ రోజులలో ఇతరులకు ఆహారం అందించే ఆరాధన, ఆమెను అల్లాహ్ ఆరాధన (ఆయన స్మరణ) నుండి పక్కదారి పట్టించదు. కాబట్టి అల్లాహ్ ప్రతిఫలాన్ని ఆశిస్తూ, తనకంటే తన భర్తకు మరియు కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చే ముస్లిం మహిళకు శుభవార్త. ఆమె అల్లాహ్ స్మరణలో అశ్రద్ధ వహించదు. మరియు రంజాన్ పగటిపూట తన శక్తి మేరకు ఆరాధనలను ఆచరిస్తుంది. అప్పుడు ఆమె నిజంగా గొప్ప విజయాన్ని సాధించినట్లే!

అల్లాహ్ తన అందమైన పేర్లు మరియు ఉన్నతమైన గుణాల ద్వారా ముస్లింలందరి అంతర్దృష్టిని ప్రకాశింపజేయాలని, మరియు మంచి పనులకు త్వరపడే తన నీతిమంతులైన దాసులుగా, స్వర్గం కోసం పోటీపడే వారిగా మనల్ని తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను.

అల్లాహ్ మనల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించుగాక. అల్లాహ్ కు అంతా తెలుసు!

మన ప్రవక్త ముహమ్మద్, ఆయన కుటుంబం మరియు ఆయన సహచరులపై అల్లాహ్ శాంతి మరియు ఆశీర్వాదాలు కురిపించుగాక.

The Muslim Woman In Ramadhān – Shaykh Sulaymān al Ruhaylī [Video|Ar-En Subtitles]
https://abdurrahman.org/2023/04/07/the-muslim-woman-in-ramadhan/

అరబ్బీ / ఇంగ్లీష్ తెలిసిన వారు క్రింది వీడియో చూడండి:

The Muslim Woman In Ramadhān – Shaykh Sulaymān al Ruhaylī [Video|Ar-En Subtitles]
https://www.youtube.com/watch?v=4IlZMBSMe40 [2 min]

స్త్రీలలో వారసులు ఎవరు? & నిర్ణీత వాటాలు [వీడియో & టెక్స్ట్]

స్త్రీలలో వారసులు ఎవరు?
వక్త: సయీద్ అహ్మద్ నజీరి (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=zR-PiLE-C_s [13 నిముషాలు]

ఈ ఆడియోలో ప్రసంగీకులు ఇస్లాంలో వారసత్వపు హక్కులు, ముఖ్యంగా స్త్రీల వాటాలు మరియు ఖుర్ఆన్ లో నిర్ణయించబడిన నిర్దిష్ట వాటాల (అల్ ఫురూజుల్ ముఖద్దర) గురించి వివరిస్తున్నారు. గత పాఠంలో పురుష వారసుల గురించి చర్చించిన తర్వాత, ఇందులో స్త్రీలలో వారసులుగా ఎవరు ఉంటారో (కూతురు, మనవరాలు, తల్లి, అమ్మమ్మ/నానమ్మ, సోదరీమణులు, భార్య తదితరులు) పది రకాల వారిని పేర్కొన్నారు. అలాగే, అల్లాహ్ ఖుర్ఆన్ లో ఆరు రకాల నిర్ణీత వాటాలను (సగం, పావు వంతు, ఎనిమిదవ వంతు, 2/3 వంతు, 1/3 వంతు, ఆరవ వంతు) విధించారని, వీటిని ఎవరికి ఎలా పంచుతారో క్లుప్తంగా పరిచయం చేశారు. చివరగా, కొడుకుకు నిర్ణీత వాటా ఉండదని, అతను ‘అసబ’ (మిగిలిన ఆస్తిని తీసుకునేవాడు) అని వివరించారు.


[Source of the image: Inheritance Regulations &. Exhortations – English , by Muhammad al-Jilbaly)

గత పాఠంలో మనం పురుషులలో ఎవరెవరు వారసులవుతారో తెలుసుకున్నాం. మనం చూసిన జాబితా ప్రకారం.. కొడుకు, తండ్రి, తాత, సోదరుడు, బాబాయ్ (పినతండ్రి) వంటి బంధుత్వాలు ఇందులో ఉన్నాయి. ఈ బంధుత్వాలన్నీ మరణించిన వ్యక్తితో ముడిపడి ఉండాలి. అంటే మరణించిన వ్యక్తికి తండ్రి, మరణించిన వ్యక్తికి కొడుకు, లేదా మరణించిన వ్యక్తికి సోదరుడు అయి ఉండాలి. మరణించిన వ్యక్తితో ఈ సంబంధాలు ఉన్న పురుషులు మాత్రమే వారసులుగా పరిగణించబడతారు.

ఇప్పుడు మనం ‘అల్ వారిసాతు మినన్ నిసా’ (స్త్రీలలో వారసులు) గురించి చర్చించుకుందాం.

الْوَارِثَاتُ مِنَ النِّسَاءِ
(అల్ వారిసాతు మినన్ నిసా)
స్త్రీలలో వారసులు

అంటే చనిపోయిన వ్యక్తికి ఏయే బంధుత్వాలు కలిగిన స్త్రీలు ఆస్తిలో వారసులు అవుతారో మనం తెలుసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా, జాబితాలో ఉన్న బంధువులందరూ ఒకేసారి వారసులు కాలేరు. ప్రతి సందర్భంలోనూ అందరికీ వాటా దొరకదు. కానీ ఈ బంధుత్వాలన్నింటికీ వారసత్వపు అర్హత ఉంటుంది. కొన్నిసార్లు ఒక వారసుడు ఉండటం వల్ల వేరొకరికి వాటా దక్కకపోవచ్చు, లేదా వాటా తగ్గిపోవచ్చు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే.. మరణించిన వ్యక్తి ఆస్తిలో వారసత్వపు హక్కు కేవలం ఈ నిర్దిష్ట బంధుత్వాలకు మాత్రమే ఉంటుంది.

పురుషులలో 15 రకాల వారసులు ఉన్నట్లే, స్త్రీలలో 10 రకాల వారసులు ఉంటారు. ఆ పది మంది వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

  1. అల్ బింత్ (Al-Bint): కూతురు.
  2. బింతుల్ ఇబ్న్ (Bint al-Ibn): మనవరాలు (కొడుకు యొక్క కూతురు).
  3. అల్ ఉమ్ (Al-Umm): తల్లి.
  4. అమ్మమ్మ: తల్లి యొక్క తల్లి.
  5. నానమ్మ: తండ్రి యొక్క తల్లి.
  6. అల్ ఉఖ్త్ అష్-షకీఖ (Al-Ukht ash-Shaqiqah): సొంత సోదరి (అక్క లేదా చెల్లి).
  7. అల్ ఉఖ్త్ లి-అబ్ (Al-Ukht li-Ab): తండ్రి తరఫు సోదరి (సవతి తల్లి కూతురు – తండ్రి ఒక్కడే కానీ తల్లులు వేరు).
  8. అల్ ఉఖ్త్ లి-ఉమ్ (Al-Ukht li-Umm): తల్లి తరఫు సోదరి (తల్లి ఒక్కటే కానీ తండ్రులు వేరు).
  9. అజ్-జౌజ (Az-Zawjah): భార్య.
  10. అల్ ముఅతిఖ (Al-Mu’tiqah): బానిసత్వాన్ని విముక్తి చేసిన యజమానురాలు.

పురుషులలో 15 మంది, స్త్రీలలో 10 మంది వారసులు ఉంటారు అనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి.

మనం వారసులెవరో తెలుసుకున్నాం, ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు:

  • ఎవరెవరు వారసులవుతారు?
  • ఎవరు ఏ పరిస్థితుల్లో వారసులు అవుతారు?
  • ఖుర్ఆన్ లో అల్లాహ్ ఎవరికి ఎన్ని వాటాలను నిర్ణయించాడు?

ఒక వ్యక్తి వారసుడయ్యాడంటే అతనికి ఆస్తిలో ఎంత భాగం వస్తుంది అనేది ముఖ్యం. నాకు ఎంత వస్తుంది? నా సోదరుడికి ఎంత వస్తుంది? తల్లిదండ్రుల వాటా ఎంత? అనే విషయాలను అల్లాహ్ ఖుర్ఆన్ లో స్పష్టంగా వివరించాడు.

ఖుర్ఆన్ లో అల్లాహ్ తబారక వ తాలా వారసత్వ పంపిణీ కోసం ఆరు రకాల నిర్దిష్ట వాటాలను నిర్ణయించారు. వీటిని అరబ్బీలో ‘అల్ ఫురూజుల్ ముఖద్దర’ అంటారు (నిర్ణీత వాటాలు). ఏ వారసుడికైనా సరే, ఈ ఆరు వాటాలలో ఏదో ఒక వాటా లభిస్తుంది. ఆ ఆరు వాటాలు ఇవే:

  1. అన్-నిస్ఫ్ (An-Nisf – 1/2): సగం వాటా. అంటే ఆస్తిని రెండు సమాన భాగాలు చేసి, అర్హులైన వారికి ఒక భాగం ఇవ్వడం.
  2. అర్-రుబుఅ (Ar-Rubu’ – 1/4): నాలుగవ వంతు. అంటే ఆస్తిని నాలుగు భాగాలు చేసి ఒక భాగం ఇవ్వడం.
  3. అస్-సుమున్ (Ath-Thumun – 1/8): ఎనిమిదవ వంతు. అంటే ఆస్తిని ఎనిమిది భాగాలు చేసి, అర్హులైన వారికి ఒక భాగం ఇవ్వడం.
  4. అస్-సులుసాన్ (Ath-Thuluthan – 2/3): మూడింట రెండు వంతులు. అంటే ఆస్తిని మూడు భాగాలు చేసి, అందులో రెండు భాగాలు ఇవ్వడం.
  5. అస్-సులుస్ (Ath-Thuluth – 1/3): మూడవ వంతు. అంటే ఆస్తిని మూడు భాగాలు చేసి, ఒక భాగం ఇవ్వడం.
  6. అస్-సుదుస్ (As-Sudus – 1/6): ఆరవ వంతు. అంటే ఆస్తిని ఆరు భాగాలు చేసి, ఒక భాగం ఇవ్వడం.

ఖుర్ఆన్ ప్రకారం వారసత్వ విద్యలో ఈ ఆరు వాటాలే ప్రధానమైనవి. ఎవరికి పంపిణీ చేసినా ఈ భిన్నాల (Fractions) ప్రకారమే వాటాలు వెళ్తాయి.

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఖుర్ఆన్ లో ‘కొడుకు’ (Son) కోసం పైన పేర్కొన్న విధంగా 1/2 లేదా 1/3 వంటి నిర్ణీత వాటా ఏదీ విధించబడలేదు. కొడుకును ‘అసబ’ (Asaba) అంటారు.

عَصَبَة
(అసబ)
మిగిలిన ఆస్తికి వారసుడు

అసబ అంటే.. నిర్ణీత వాటాలు కలిగిన వారసులకు (ఉదాహరణకు భార్య, తల్లిదండ్రులు వంటి వారికి) వారి వాటాలు ఇచ్చేసిన తర్వాత, మిగిలిన ఆస్తి ఎంతైతే ఉంటుందో, ఆ మొత్తాన్ని తీసుకునేవాడు అని అర్థం.

అల్లాహ్ కొడుకుకి “ఇంతే ఇవ్వాలి” అని నిర్దిష్టంగా చెప్పలేదు. మిగిలినదంతా కొడుకుకే చెందుతుంది. దీని గురించి ముందు ముందు పాఠాలలో మరింత వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఖుర్ఆన్ మరియు హదీసుల ప్రకారం ఈ ఆరు రకాల వాటాలు మాత్రమే ప్రామాణికం.

—

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44685

వారసత్వపు విద్య – మెయిన్ పేజీ
https://teluguislam.net/2026/01/27/laws-of-inheritance/

యూట్యూబ్ ప్లే లిస్ట్ :
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3vXEPX1zXyjGB6v0YY4opo

మహ్రమ్ లేకుండా స్త్రీ ఒంటరిగా ప్రయాణించడం [వీడియో , టెక్స్ట్]

మహ్రమ్ లేకుండా స్త్రీ ఒంటరిగా ప్రయాణించడం
https://youtu.be/C3dCKJ4yoEo [5 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

మహ్రమ్ (వివాహం నిషిద్ధమైన దగ్గరి బంధువు లేదా భర్త) లేకుండా స్త్రీలు ఒంటరిగా ప్రయాణించకూడదని ఇస్లాం స్పష్టంగా బోధిస్తోంది. అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని విశ్వసించే స్త్రీలు తండ్రి, కొడుకు, సోదరుడు లేదా భర్త వంటి మహ్రమ్ తోడు లేకుండా చేయకూడదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. ఇది హజ్ యాత్రకు కూడా వర్తిస్తుంది; భార్య హజ్ కు వెళ్తుంటే, భర్త జిహాద్ నుండి పేరు వెనక్కి తీసుకొని ఆమెతో వెళ్లాలని ప్రవక్త ఆదేశించారు. ఈ నిబంధన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం స్త్రీల రక్షణ, గౌరవం మరియు భద్రత. విమాన ప్రయాణాలైనా, బస్సు ప్రయాణాలైనా, తోడు లేకుండా వెళ్లడం వల్ల అనుకోని ఆటంకాలు, పరాయి పురుషుల సాహచర్యం వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. మహ్రమ్ గా ఉండేవారికి ముస్లిం అయి ఉండటం, యుక్తవయసు, మానసిక స్థితి సరిగ్గా ఉండటం మరియు పురుషుడై ఉండటం అనే నాలుగు షరతులు తప్పనిసరి అని ఈ ప్రసంగం వివరిస్తుంది.

మహ్రమ్ లేకుండా స్త్రీ ఒంటరిగా ప్రయాణించడం. మహ్రమ్ అంటే ఎవరు? భర్త లేదా వివాహ నిషిద్ధమైన బంధువు. వివాహం ఏ స్త్రీ అయితే ఏ పురుషునితో వివాహం చేసుకోరాదో, అలాంటి పురుషుడు ఆ స్త్రీకి మహ్రమ్ అవుతాడు. ఉదాహరణకు తండ్రి, కొడుకు, సోదరుడు, పెదనాన్న, చిన్నాన్న ఈ విధంగా ఇలాంటి బంధువులు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

لَا يَحِلُّ لِامْرَأَةٍ تُؤْمِنُ بِالله وَالْيَوْمِ الْآخِرِ تُسَافِرُ مَسِيرَةَ يَوْمٍ إِلَّا مَعَ ذِي مَحْرَمٍ
(లా యహిల్లు లిమ్ర అతిన్ తు’మిను బిల్లహి వల్ యౌమిల్ ఆఖిరి తుసాఫిరు మసీరత యౌమిన్ ఇల్లా మఅ జీ మహ్రమ్)

“అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని విశ్వసించే ఏ స్త్రీ కూడా తనవెంట ఆమె మహ్రమ్ లేనిదే ఒక రోజు జరిగే ప్రయాణం చేయుట యోగ్యం కాదు”. (ముస్లిం 1339, బుఖారి 1088).

ఈ ఆదేశం అన్ని రకాల ప్రయాణాలకు వర్తిస్తుంది. చివరికి హజ్ ప్రయాణం అయినా సరే.

హజ్ కు సంబంధించిన హదీస్ కూడా చాలా ఫేమస్ గా ఉంది. హజ్ కు సంబంధించిన హదీస్ ఏమిటంటే, ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో అడుగుతారు, “ప్రవక్తా! నేను ఫలానా కొందరితో కలిసి జిహాద్ కొరకు వెళ్తున్నాను మరియు నా భార్య హజ్ కొరకు వెళ్తుంది.” అప్పుడు ప్రవక్త చెప్పారు, “ఆ ముజాహిదీన్ ల టీమ్ నుండి నీ యొక్క పేరును తీసేసి, వారికి చెప్పేసి, నీవు నీ భార్యతో పాటు కలిసి హజ్ కొరకు వెళ్ళు.” ఆమెను ఒంటరిగా వెళ్లనివ్వకు.

అదే విషయం, చివరికి హజ్ ప్రయాణం అయినా సరే, మహ్రమ్ లేకుండా స్త్రీ ప్రయాణం దుర్మార్గులను ఆమె పట్ల ప్రేరేపణకు గురి చేస్తుంది. అందుకు వారు ఆమెను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. మరియు ఆమె స్వాభావికంగా బలహీనురాలు గనుక వారి వలలో చిక్కుకుపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఆమె తన అతి విలువైన గౌరవ మానాన్ని కోల్పోతుంది, కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. లేదా కనీసం ఆమె పరువు ప్రతిష్ఠలపై ఒక మచ్చయినా పడవచ్చు.

అదే విధంగా విమానంలో ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. ఒక వైపు మహ్రమ్ వీడ్కోలు తెలిపి మరో వైపు ఆమెను రిసీవ్ చేసుకోవడానికి మరో మహ్రమ్ వచ్చినా సరే. ఆమె పక్క సీటులో కూర్చునే వారు ఎవరై ఉంటారు? లేదా ఒకవేళ ఏదైనా ఆటంకం కలిగి విమానం వేరే విమానాశ్రయంలో దిగితే, లేదా ఆలస్యం అయి సమయం తప్పి వస్తే, ఆమె ఎలాంటి ఇబ్బందులకు గురవుతుందో ఆలోచించండి. ఇలా జరగవచ్చు అని కాదు, వాస్తవంగా జరిగిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అందుకే వివాహ నిషిద్ధమైన ఏ బంధువైనా ఒకరు ఆమెకు తోడుగా ఉండాలి.

అయితే ఆ మహ్రమ్ లో ఈ నాలుగు షరతులు ఉండడం తప్పనిసరి:

  1. అతడు ముస్లిం అయి ఉండాలి.
  2. అతడు యుక్త వయసు గలవాడై ఉండాలి, పిల్లవాడు కాదు.
  3. జ్ఞాని అయి ఉండాలి, అజ్ఞానుడై (మతిస్థిమితం లేనివాడై) మొత్తానికే కాదు.
  4. పురుషుడు అయి ఉండాలి.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారని అబూసఈద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

لَا يَحِلُّ لِامْرَأَةٍ تُؤْمِنُ بِالله وَالْيَوْمِ الْآخِرِ أَنْ تُسَافِرَ سَفَرًا يَكُونُ ثَلَاثَةَ أَيَّامٍ فَصَاعِدًا إِلَّا وَمَعَهَا أَبُوهَا أَوْ ابْنُهَا أَوْ زَوْجُهَا أَوْ أَخُوهَا أَوْ ذُو مَحْرَمٍ مِنْهَا

(లా యహిల్లు లిమ్ర అతిన్ తు’మిను బిల్లహి వల్ యౌమిల్ ఆఖిర్ అన్ తుసాఫిర సఫరన్ యకూను సలాసత అయ్యామిన్ ఫ సాఇదన్ ఇల్లా వ మఅహా అబూహా ఔ ఇబ్నుహా ఔ జౌజుహా ఔ అఖూహా ఔ జూ మహ్రమిన్ మిన్ హా)

“అల్లాహ్ మరియు పరలోకదినాన్ని విశ్వసించే ఏ స్త్రీ అయినా మూడు, అంతకంటే ఎక్కువ రోజుల ప్రయాణం ఒంటరిగా చేయడం యోగ్యం కాదు. ఆమెతో అతని తండ్రి, లేదా కొడుకు, లేదా భర్త, లేదా సోదరుడు, లేదా మరెవరైనా మహ్రమ్ తప్పక ఉండాలి”. (ముస్లిం 1340).

అల్లాహ్ మరియు పరలోక దినాన్ని విశ్వసించే ఏ స్త్రీ అయినా.. (గమనించండి అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని.. ఇలాంటి మాట ఎన్నో సందర్భాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తారు. అందుకొరకే మనం ఇలాంటి విషయాలకు వ్యతిరేకంగా చేస్తున్నామంటే ఈ విశ్వాసం మనది తగ్గిపోతుంది అని కూడా మనం గ్రహించాలి.)

ఇవన్నీ కూడా ఎందుకు మీరు గమనిస్తున్నారు కదా,

لا تَتَّبِعُوا خُطُواتِ الشَّيْطانِ
(లా తత్తబిఉ ఖుతువాతిష్ షైతాన్)
షైతాన్ అడుగుజాడలను అనుసరించకండి.

షైతాన్ అడుగుజాడలు ఇవన్నీ కూడా. ఒకవేళ వీటి నుండి మనం జాగ్రత్త పడకుంటే.., ఇలా మనం చూస్తూనే ఉన్నాము. చూడడానికి కాలేజీ మంచిది అయి ఉండవచ్చు, అక్కడ శిక్షణ ఇచ్చేవారు, టీచర్లు అందరూ చాలా మంచివారు అయి ఉండవచ్చు. పదిహేను నిమిషాలు, అరగంట ఇంటి నుండి అక్కడి వరకు బస్సులో, లేదా ఆటో లేదా చిన్న ఏదైనా బస్సులో వెళ్లడం రావడం, పోవడం రావడం పోవడం.. ఇలా ప్రయాణంలో ఎవరెవరు కలుస్తూ ఉంటారో, ప్రతి రోజు చూస్తూ ఉంటారు. ఈ విధంగా ఎన్ని చెడులకు దారి తీస్తుందో ఈ విషయం, గమనిస్తున్నారా?

స్త్రీలకు సంభందించిన మూడు విషయాలు (హైజ్, ఇస్తిహాజా, నిఫాస్) [వీడియో, టెక్స్ట్ ]

స్త్రీలకు సంభందించిన మూడు విషయాలు (హైజ్, ఇస్తిహాజా, నిఫాస్)
వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/TUhsPXUH9zw [10 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో మహిళలకు సంబంధించిన మూడు ముఖ్యమైన అంశాల గురించి వివరించబడింది: హైజ్ (రుతుస్రావం), ఇస్తిహాజా (అనారోగ్య రక్తస్రావం), మరియు నిఫాస్ (ప్రసూతి రక్తస్రావం). హైజ్ అనేది ప్రతి నెలా ఆరోగ్యకరమైన స్త్రీ గర్భాశయం నుండి వచ్చే సాధారణ రక్తస్రావం. దాని కాలపరిమితి, వయస్సు, మరియు ఆ సమయంలో పాటించాల్సిన నిషిద్ధాలు (నమాజ్, ఉపవాసం, సంభోగం వంటివి), అనుమతించబడిన పనుల గురించి చర్చించబడింది. ఇస్తిహాజా అనేది అనారోగ్యం కారణంగా నరాల నుండి వచ్చే అసాధారణ రక్తస్రావం, దీనికి హైజ్ నియమాలు వర్తించవు మరియు ఆరాధనలు కొనసాగించాలి. నిఫాస్ అనేది ప్రసవానంతరం వచ్చే రక్తం, దీనికి గరిష్టంగా 40 రోజుల పరిమితి ఉంటుంది మరియు హైజ్‌కు సంబంధించిన నియమాలే వర్తిస్తాయి. ఈ మూడు స్థితుల మధ్య తేడాలను, వాటికి సంబంధించిన ధార్మిక విధులను మరియు మినహాయింపులను స్పష్టంగా తెలియజేయడం ఈ ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్)
శపించబడిన షైతాన్ నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ وَمَنْ تَبِعَهُمْ بِإِحْسَانٍ إِلَى يَوْمِ الدِّينِ أَمَّا بَعْدُ
(అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్, అమ్మా బాద్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు. దైవభీతిపరులకే శుభపరిణామం. ప్రవక్తలలో శ్రేష్ఠుడైన ఆయనపై, ప్రళయదినం వరకు ఉత్తమరీతిలో వారిని అనుసరించేవారిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.

అభిమాన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ రోజు మనం స్త్రీలకి సంబంధించిన మూడు విషయాలు, హైజ్, ఇస్తిహాజా మరియు నిఫాస్ గురించి కొన్ని వివరాలు తెలుసుకోబోతున్నాం.

హైజ్ అంటే స్త్రీలకు ప్రతినెలా జరిగే రక్తస్రావాన్ని హైజ్ అంటారు. హైజ్ రక్తం నలుపు రంగులో, చిక్కగా ఎరుపు రంగు ఆవరించినట్లుగా ఉంటుందని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హైజ్ రక్తం స్త్రీ గర్భాశయం నుండి వెలువడుతుంది. అంటే హైజ్ అనేది గర్భం నుంచి వస్తుంది గనక ఇది ఆరోగ్యానికి చిహ్నం. ఆరోగ్యవంతులకు ఆరోగ్యంగా ఉన్నవారికి ప్రతి నెలా ఇది గర్భం నుండి వచ్చే రక్తం.

ఇస్తిహాజా అంటే నిరంతర రక్తస్రావం. ఈ రక్తపు రంగు, వాసన హైజ్ రక్తానికి భిన్నంగా ఉంటుంది. అంటే స్త్రీకి బహిష్టు కాలం తర్వాత కూడా స్రవిస్తూ ఉండే రక్తాన్ని ఇస్తిహాజా అని అంటారు. ఇస్తిహాజా రక్తం నరాల నుండి వస్తుంది, గర్భం నుండి కాదు.

ఇక మూడవది నిఫాస్. నిఫాస్ అంటే పురిటి రక్తస్రావం. గర్భిణి ప్రసవించినప్పుడు లేక దానికంటే ముందు వెలువడే రక్తాన్ని నిఫాస్ అంటారు.

ఇప్పుడు మనం హైజ్ అంటే ఏమిటి, ఇస్తిహాజా అంటే ఏమిటి, నిఫాస్ అంటే ఏమిటి, వాటి యొక్క నిర్వచనాలు తెలుసుకున్నాం.

హైజ్ సమయం. సాధారణంగా హైజ్ తొమ్మిది సంవత్సరాల వయసు నుండి ప్రారంభమై 50 సంవత్సరాల వరకు అవుతూ ఉంటుంది.

దీని వ్యవధి, అంటే ప్రతి నెలా ఎన్ని రోజులు వస్తుందంటే, అల్పంగా ఒక్క పగలు, ఒక్క రాత్రి అంటే 24 గంటలు అన్నమాట. సాధారణంగా ఐదు లేక ఆరు లేక ఏడు రోజులు. ఇది సాధారణమైన వ్యవధి. అధికంగా 15 రోజులు వస్తుంది. ఒకవేళ ఎవరికైనా 15 రోజుల కంటే ఎక్కువగా వస్తే అది ఇస్తిహాజాగా పరిగణించబడుతుంది. అది ఇస్తిహాజా అయిపోతుంది, హైజ్ అవ్వదు. 15 కంటే ఎక్కువ అయితే అది ఇస్తిహాజా.

నిషిద్ధాలు ఏమిటి? హైజ్ ఆ స్థితిలో, హైజ్ వచ్చే సమయంలో నిషిద్ధాలు ఏమిటి? నమాజ్ చేయకూడదు, ఉపవాసం ఉండకూడదు, తవాఫ్ చేయకూడదు, మస్జిద్ లో ఉండకూడదు, సంభోగం చేయకూడదు, ఖురాన్ ని ముట్టుకోకూడదు. దేనిలోనైనా చుట్టి ఉన్నట్లయితే పట్టుకోవచ్చు. ఈ ఆరు విషయాలు నిషిద్ధం. ఇక ఏడవది కూడా ఉంది, ఒకవేళ భర్త విడాకులు ఇవ్వాలనుకుంటే హైజ్ సమయంలో విడాకులు ఇవ్వటం ధర్మసమ్మతం కాదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖండించారు.

ఇక హైజ్‌కి సంబంధించిన నియమ నిబంధనలు. ఈ హైజ్ అనేది విడాకుల ఇద్దత్ సమయం, గడువు, భర్త చనిపోయిన స్త్రీల ఇద్దత్ సమయం నిర్ధారించబడుతుంది ఈ హైజ్ వలన. ఈ నెలసరి క్రమం వలన. అలాగే దినచర్యలు కొనసాగించాలి. సంభోగం తప్ప ప్రతి పని చేయవచ్చు. సంభోగం తప్ప ప్రతి పని చేయవచ్చు. ముట్టుకోవటం, పట్టుకోవటం, పక్కన కూర్చోవటం, కలిసి పడుకోవటం భర్తతో, ఇవన్నీ చేయవచ్చు. ఇస్లాంలో ఎటువంటి ఇది పట్టింపులు లేవు. ఆ సమయంలో దూరంగా ఉండాలి, పట్టుకోకూడదు, ముట్టుకోకూడదు, తాకకూడదు, హీనంగా చూడాలి, ఇది ఇస్లాం ఖండిస్తుంది. సంభోగం తప్ప అన్ని పనులు చేయవచ్చు. మాట్లాడటం, భర్త అయితే ముద్దు పెట్టుకోవటం, పట్టుకోవటం, కలిసి మెలిసి పడుకోవటం, భోజనం వంట తయారు చేయటం, కలిసి భుజించటం, అన్ని పనులు చేసుకోవటం, ఇవన్నీ చేయవచ్చు. నిషిద్ధాలు ఏమిటి? ఆరాధన నిషిద్ధం. నమాజు, తవాఫ్, ఖురాన్ పట్టుకోవటం,మస్జిద్ లో ఉండటం ఇవి నిషిద్ధాలు. అయితే జికర్ చేయవచ్చు, దుఆ చేయవచ్చు.

ఇవి హైజ్‌కి సంబంధించిన కొన్ని విషయాలు.

ఇక ఇస్తిహాదా ఇది హైజ్ కాదు కదా. హైజ్ గర్భం నుంచి వస్తుంది, ఇస్తిహాజా నరం నుంచి వస్తుంది. అంటే ఇస్తిహాదా ఒక రకంగా అనారోగ్యానికి సంబంధించిన రక్తం. అనారోగ్యం మూలంగా వచ్చే రక్తం ఇస్తిహాజా. అందుకు ఇస్తిహాజా వలన ఎటువంటి నియమాలు లేవు. ఇస్తిహాజాకి సమయం కూడా లేదు. ఏ సమయంలో వస్తుంది, తెలియదు, ఎప్పుడైనా రావచ్చు. అలాగే ప్రత్యేక వ్యవధి కూడా లేదు. ఎన్ని రోజులు వస్తుంది తెలియదు, ఒక రోజు రావచ్చు, 20 రోజులు రావచ్చు, 10 రోజులు రావచ్చు. దీనికి ఏ కట్టుబాట్లు లేవు. అన్ని ఇస్లామీయ చర్యలకు అనుమతి ఉంది. నమాజ్ చేయాలి, ఉపవాసం కూడా పాటించాలి, సంభోగం కూడా చేసుకోవచ్చు భర్తతో. అన్నీ. ఎందుకంటే ఇస్తిహాదా హైజ్ కాదు. హైజ్‌కే అవి నిషిద్ధాలు. ఆ సమయంలో సంభోగం చేయకూడదు. అప్పుడు నమాజ్ చేయకూడదు, ఉపవాసం ఉండకూడదు. ఇవన్నీ హైజ్‌కి సంబంధించిన విషయాలు, ఆదేశాలు, నియమ నిషిద్ధాలు. ఎందుకంటే హైజ్ గర్భం నుంచి వస్తుంది. కానీ ఇస్తిహాజా నరాల నుంచి వస్తుంది గనుక అది అనారోగ్యం గనుక దీనికి హైజ్‌కి సంబంధం లేదు. నమాజు చేయాలి, ఉపవాసం పాటించాలి, అన్నీ చేయవచ్చు. ఎటువంటి కట్టుబాట్లు ఉండవు. కాకపోతే ప్రతి నమాజ్ కోసం ప్రత్యేకంగా వుజూ చేసుకోవాలి.

ఇక చివరిది నిఫాస్. దీని సమయం బిడ్డ పుట్టినప్పుడు లేదా దానికి ఒకటి, రెండు, మూడు రోజుల ముందు నుండి ప్రారంభమయ్యే రక్తస్రావాన్ని నిఫాస్ అంటారు.

దీని వ్యవధి ఏమిటి? అధికంగా 40 రోజులు. అంతకంటే ఎక్కువ రోజులు వస్తే అది ఇస్తిహాజా. అల్పంగా వ్యవధి లేదు. ఒక రోజు రావచ్చు, ఒక వారం రావచ్చు, 10-15 రోజుల్లో రావచ్చు ఆ తర్వాత ఆగిపోవచ్చు. అధికంగా 40 రోజులు. ఆ తర్వాత కూడా కంటిన్యూ వస్తే అది ఇస్తిహాజా అవుతుంది. అల్పంగా దానికి వ్యవధి లేదు, ఎప్పుడైనా ఆగిపోవచ్చు.

నిషిద్ధాలు ఏమిటి? హైజ్‌కి సంబంధించిన నిషిద్ధాలే నిఫాస్‌కి కూడా వర్తిస్తాయి. ఏ నిషిద్ధాలు హైజ్‌లో ఉన్నాయో అంటే నమాజ్ చేయకూడదు, ఉపవాసం ఉండకూడదు, తవాఫ్ చేయకూడదు, మస్జిద్‌లో ఉండకూడదు, సంభోగం చేయకూడదు, ఖురాన్‌ని ముట్టుకోకూడదు, ఈ నిషిద్ధాలే నిఫాస్‌కి కూడా వర్తిస్తాయి.

నిబంధనలు ఏమిటి? తన దినచర్యలు చేసుకోవాలి, సంభోగం తప్ప అన్నీ చేయవచ్చు.

అభిమాన సోదర సోదరీమణులారా, ఇవి కొన్ని విషయాలు హైజ్, ఇస్తిహాదా మరియు నిఫాస్‌కి సంబంధించిన.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ సున్నత్ విధానంగా, ఇస్లామీయ ఆరాధనలు, ఇస్లామీయ జీవన విధానం, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశాలు, ప్రవచనాలు, ఆయన సున్నత్ విధానాన్ని పాటిస్తూ జీవించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరికీ మరింత జ్ఞానం ప్రసాదించుగాక. ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా ఆఖరి ప్రార్థన, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు.

అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

—

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42414

విశ్వాసుల మాతృమూర్తుల యొక్క ఘనత, విశిష్టత – హబీబుర్రహన్ జామి’ఈ [వీడియో | టెక్స్ట్]

విశ్వాసుల మాతృమూర్తుల యొక్క ఘనత, విశిష్టత
హబీబుర్రహన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=j3mXasfRBgo [14 నిముషాలు]

ఈ ప్రసంగంలో, వక్త ఉమ్మహాతుల్ ము’మినీన్ (విశ్వాసుల మాతృమూర్తులు), ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భార్యల యొక్క ఉన్నత స్థానం మరియు ప్రత్యేకతలను వివరిస్తారు. సాధారణ స్త్రీల కంటే వారి స్థాయి ఎంతో ఉన్నతమైనదని, అల్లాహ్ వారిని ప్రత్యేకంగా ప్రవక్త కోసం ఎంపిక చేశారని ఖురాన్ ఆయతుల ఆధారంగా తెలియజేస్తారు. వారు విశ్వాసులందరికీ తల్లులని, ప్రవక్త మరణానంతరం వారిని వివాహం చేసుకోవడం నిషిద్ధమని స్పష్టం చేస్తారు. వారి సత్కార్యాలకు రెండింతల పుణ్యం లభిస్తుందని మరియు అల్లాహ్ వారిని అన్ని రకాల మాలిన్యాల నుండి పరిశుభ్రపరిచాడని వివరిస్తారు. ఈ ప్రపంచంలోనే కాక, స్వర్గంలో కూడా వారు ప్రవక్త భార్యలుగానే ఉంటారనే గౌరవాన్ని కూడా ప్రస్తావించారు.

అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, వమన్ తబిఅహుమ్ బిఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్, అమ్మా బాద్.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.

ఉమ్మహాతుల్ ము’మినీన్ అందరి ఘనత, ప్రత్యేకత. ఉమ్మహాతుల్ ము’మినీన్ ఖదీజా రదియల్లాహు అన్హా నుంచి మైమూనా రదియల్లాహు అన్హా వరకు, వారందరి విశిష్టతలు, ఘనతలు, ప్రత్యేకతలు.

ఉమ్మహాతుల్ ము’మినీన్, వారందరూ సాధారణ స్త్రీల వంటి వారు కాదు. వారి ప్రత్యేకత ఇది. ఉమ్మహాతుల్ ము’మినీన్ల ప్రత్యేకత ఏమిటి? వారందరూ సాధారణ స్త్రీల వంటి వారు కారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉమ్మహాతుల్ ము’మినీన్ల గురించి ఖురాన్ గ్రంథంలో అనేక చోట్ల ప్రస్తావించాడు. ముఖ్యంగా సూరతుల్ అహ్జాబ్ లో కొంచెం వివరంగా ఉంటుంది.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

يَا نِسَاءَ النَّبِيِّ لَسْتُنَّ كَأَحَدٍ مِّنَ النِّسَاءِ
(యా నిసాఇన్ నబియ్యి లస్తున్న కఅహదిమ్ మినన్ నిసా)
ఓ ప్రవక్త సతీమణులారా! మీరు సాధారణ స్త్రీల వంటి వారు కారు. (33:32)

గౌరవంలో, మర్యాదలో, ఘనతలో, విశిష్టతలో, మంచి విషయాలలో, అన్ని విషయాలలో మీరు సాధారణమైన స్త్రీలు కారు , వారు ఎవ్వరైనా సరే, గొప్ప గొప్ప సహాబియాతులు అయినా, గొప్ప ప్రముఖ సహాబాల సతీమణులైనా, తాబయీన్లు, ముహద్దసీన్లు, సామాన్య ప్రజలు, ఎవరైనా సరే, ఉమ్మహాతుల్ ము’మినీన్ల ప్రత్యేకత, అలాగే ఇతరుల వారు సమానులు కారు. ఇది వారి ప్రత్యేకత.

అలాగే రెండవ విషయం, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని, ఉమ్మహాతుల్ ము’మినీన్లని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకై ఎంపిక చేశాడు.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

لَّا يَحِلُّ لَكَ النِّسَاءُ مِن بَعْدُ وَلَا أَن تَبَدَّلَ بِهِنَّ مِنْ أَزْوَاجٍ وَلَوْ أَعْجَبَكَ حُسْنُهُنَّ
ఇక దీని తరువాత, వేరితర స్త్రీలు నీ కొరకు ధర్మసమ్మతం కారు. వీరికి బదులుగా ఇతర స్త్రీలను భార్యలుగా చేసుకోవటం కూడా నీకు సమ్మతం కాదు – వారి అందచందాలు నీకు ఎంత నచ్చినాసరే! (33:52)

ఓ ప్రవక్తా! ఇక, అంటే మైమూనా రదియల్లాహు అన్హా వివాహం తర్వాత, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సతీమణులు, ఉమ్మహాతుల్ ము’మినీన్, 11 మంది. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరిగా వివాహం చేసుకునింది మైమూనా బిన్తె హారిత్ రదియల్లాహు అన్హాని. మైమూనా రదియల్లాహు అన్హా వివాహం తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆదేశం ఇచ్చాడు. ఓ ప్రవక్తా! ఇక నుంచి ఇంకో వివాహం చేసుకోవటం నీకు సమ్మతం కాదు, ఇక నువ్వు చేసుకోలేవు. ఈ 11 మంది మాత్రమే నీ కోసం ఎంపిక చేశాను, ఇక నీకు అనుమతి లేదు. ఇక తర్వాత ఏ స్త్రీని అయినా నువ్వు వివాహం చేసుకోలేవు. ఒక సతీమణిని విడాకులు ఇచ్చి దానికి బదులుగా కూడా నువ్వు చేసుకోలేవు. ఈ ప్రత్యేకత, ఈ గౌరవం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి ప్రసాదించాడు.

మూడవది, వారు ఉమ్మహాతుల్ ము’మినీన్ల స్థానం అల్లాహ్ తెలియపరుస్తున్నాడు. విశ్వాసుల కొరకు తల్లులు. మూడవ ప్రత్యేకత.

النَّبِيُّ أَوْلَىٰ بِالْمُؤْمِنِينَ مِنْ أَنفُسِهِمْ ۖ وَأَزْوَاجُهُ أُمَّهَاتُهُمْ
దైవ ప్రవక్తకు విశ్వాసులపై స్వయంగా వారి ఆత్మల కన్నా ఎక్కువ హక్కు ఉంది. అతని భార్యలు విశ్వాసుల కొరకు తల్లులు.  (33:6)

దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విశ్వాసులపై స్వయంగా వారి ఆత్మల కన్నా ఎక్కువగా హక్కు ఉంది. ఆయన భార్యలు విశ్వాసుల కొరకు తల్లులు. అంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ స్థానం, ఆ గౌరవం వారికి ప్రసాదించాడు.

ఏ గొప్ప సహాబీ సతీమణి అయినా, భర్త మరణించిన తర్వాత ఇంకో వివాహం చేసుకునే అనుమతి ఉంది. కానీ, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ అనుమతి ఉమ్మహాతుల్ ము’మినీన్లకి ప్రసాదించలేదు. ఎందుకు? వారు తల్లులు మనకు. ప్రళయం వరకు వచ్చే విశ్వాసులందరికీ ఉమ్మహాతుల్ ము’మినీన్ తల్లులు. ఆ గౌరవం అల్లాహ్ వారికి ప్రసాదించాడు.

నాలుగవ ప్రత్యేకత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత వారు వివాహమాడడం ధర్మసమ్మతం కాదు, ఈ విషయం చెప్పింది ఇప్పుడు.

وَلَا أَن تَنكِحُوا أَزْوَاجَهُ مِن بَعْدِهِ أَبَدًا
(వలా అన్ తన్కిహు అజ్వాజహూ మిమ్ బ’అదిహీ అబదా)
అతని తదనంతరం అతని భార్యలను వివాహమాడటంగానీ ఎన్నటికీ మీకు ధర్మసమ్మతం కాదు. (33:53)

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, ఉమ్మహాతుల్ ము’మినీన్ ఇంకో వివాహం చేసుకోలేరు, సమ్మతం లేదు. వారి ప్రత్యేకత ఇది.

ఐదవది, వారు ఈ ప్రపంచంలోనే కాదు, స్వర్గంలో కూడా ప్రవక్త గారికి భార్యలుగానే ఉంటారు, సతీమణులుగానే ఉంటారు.

ఆరవ ప్రత్యేకత, ఆయతె తఖ్ఈర్, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉమ్మహాతుల్ ము’మినీన్లను ఒక సందర్భంలో రెండు అవకాశాలు ఇచ్చాడు. ఈ రెండింటిలో ఒకటి మీరు నిర్ణయించుకోండి అన్నాడు. ప్రాపంచిక జీవితమా, పరలోక నిలయమా? ఈ రెండింటిని ఏదో ఒకటి ఎన్నుకోండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి ఈ ఆప్షన్ ఇచ్చాడు. ఈ ప్రాపంచిక జీవితం కావాలా? పరలోకం కావాలా? ప్రాపంచిక జీవితమా, పరలోక నిలయమా?

అల్లాహ్ ఈ ఆయతును సెలవిచ్చాడు సూరహ్ అహ్జాబ్ లోనే.

يَا أَيُّهَا النَّبِيُّ قُل لِّأَزْوَاجِكَ إِن كُنتُنَّ تُرِدْنَ الْحَيَاةَ الدُّنْيَا وَزِينَتَهَا فَتَعَالَيْنَ أُمَتِّعْكُنَّ وَأُسَرِّحْكُنَّ سَرَاحًا جَمِيلًا
ఓ ప్రవక్తా! నీ భార్యలకు ఇలా చెప్పు: “మీరు గనక ప్రాపంచిక జీవితాన్ని, దాని తళుకు బెళుకులను కోరుకుంటూ ఉన్నట్లయితే, రండి, నేను మీకు ఎంతో కొంత ఇచ్చి, మిమ్మల్ని ఉత్తమరీతిలో సాగనంపుతాను –(33:28)

ప్రపంచం కోరుకుంటే, ఈ ప్రాపంచిక జీవితం కోరుకుంటే మీకు ఎంతో కొంత మొత్తం నేను ఇచ్చేస్తాను, ప్రపంచానికి సంబంధించిన విషయాలు, ధనము, ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే.

وَإِن كُنتُنَّ تُرِدْنَ اللَّهَ وَرَسُولَهُ وَالدَّارَ الْآخِرَةَ فَإِنَّ اللَّهَ أَعَدَّ لِلْمُحْسِنَاتِ مِنكُنَّ أَجْرًا عَظِيمًا
“కాని ఒకవేళ అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను, పరలోక నిలయాన్ని పొందాలన్నదే మీ లక్ష్యమైతే, మీలోని సద్వర్తనుల కోసం అల్లాహ్‌ గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.” (33:29)

ఒకవేళ మీకు అల్లాహ్ కావాలా, ఆయన ప్రవక్త కావాలా, పరలోకం ఎన్నుకుంటారా, అటువంటి స్థితిలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సద్వర్తనుల కొరకు గొప్ప ప్రతిఫలం ప్రసాదించి ఉంచాడు, సిద్ధం చేసి ఉంచాడు. అంటే, ఉమ్మహాతుల్ ము’మినీన్లలో అందరూ, ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ రెండు విషయాలు అవకాశాలు ఇచ్చాడో, ప్రాపంచిక జీవితం కావాలా, పరలోకం కావాలా అంటే, ఉమ్మహాతుల్ ము’మినీన్లో అందరూ ఉమ్మడిగా, సంతోషంగా, హృదయపూర్వకంగా వారు ఎన్నుకునింది ఏమిటి? పరలోక జీవితమే.

ఉమ్మహాతుల్ ము’మినీన్లను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని షిర్క్ నుండి, షైతాన్ నుండి, చెడు పనుల నుండి, అన్ని కీడుల నుండి అన్ని అశుద్ధతల నుండి అల్లాహ్ వారిని పరిశుద్ధం చేశాడు, పవిత్రులుగా చేశాడు.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

إِنَّمَا يُرِيدُ اللَّهُ لِيُذْهِبَ عَنكُمُ الرِّجْسَ أَهْلَ الْبَيْتِ وَيُطَهِّرَكُمْ تَطْهِيرًا
ఓ ప్రవక్త ఇంటివారలారా! మీ నుండి (అన్ని రకాల) మాలిన్యాన్ని దూరం చేయాలన్నది, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలన్నది అల్లాహ్‌ అభిలాష.(33:33)

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అన్ని రకాల మాలిన్యం దూరం చేయాలన్నది, ఉమ్మహాతుల్ ము’మినీన్ల నుండి షిర్క్ యొక్క మాలిన్యం, చెడు మాలిన్యం, అన్ని రకాల మాలిన్యం దూరం చేయాలన్నది అల్లాహ్ అభిలాష. కావున అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉమ్మహాతుల్ ము’మినీన్ల నుండి అన్ని రకాల మాలిన్యాన్ని దూరం చేశాడు. ఇది వారి ప్రత్యేకత.

ఇక ఎనిమిదవది, వారు ఏ సదాచరణ చేసినా, ఏ మంచి పని చేసినా, ఏ సద్వర్తన, ఏ పుణ్య కార్యం ఏది చేసినా వారికి రెండింతల పుణ్యం ప్రసాదించబడుతుంది. ఇది వారి ప్రత్యేకత. రెండింతల పుణ్యం.

అల్లాహ్ సెలవిచ్చాడు:

وَمَن يَقْنُتْ مِنكُنَّ لِلَّهِ وَرَسُولِهِ وَتَعْمَلْ صَالِحًا نُّؤْتِهَا أَجْرَهَا مَرَّتَيْنِ وَأَعْتَدْنَا لَهَا رِزْقًا كَرِيمًا
మరి మీలో ఎవరు అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయత కనబరుస్తారో, సదాచరణ చేస్తారో ఆమెకు మేము రెండింతల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాము. ఆమె కోసం మేము గౌరవప్రదమైన ఉపాధిని సిద్ధం చేసి ఉంచాము.(33:31)

మీలోని వారు అల్లాహ్ కు విధేయత చూపుతారో, అల్లాహ్ ప్రవక్తకు విధేయత చూపుతారో, మంచి పనులు చేస్తారో, సదాచారాలు చేస్తారో, సత్కార్యాలు చేస్తారో, మేము రెండింతల పుణ్యాన్ని ప్రసాదిస్తాము. గౌరవప్రదమైన ఉపాధిని సిద్ధం చేసి ఉంచాము. ఇది ఉమ్మహాతుల్ ము’మినీన్ల ప్రత్యేకత ఏమిటంటే, వారు చేసే సదాచరణకి బదులుగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెండింతల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. ఇది వారి ప్రత్యేకత.

అలాగే, వారి ఇండ్ల ప్రస్తావన పారాయణం మరియు హిక్మత్ తో చేశాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. వారి ఇండ్ల ప్రస్తావన అల్లాహ్ ఖురాన్ పారాయణంతో, హిక్మత్ తో చేశాడు. అదే సూరా 34వ ఆయత్.

وَاذْكُرْنَ مَا يُتْلَىٰ فِي بُيُوتِكُنَّ مِنْ آيَاتِ اللَّهِ وَالْحِكْمَةِ ۚ إِنَّ اللَّهَ كَانَ لَطِيفًا خَبِيرًا
మీ ఇండ్లలో పారాయణం చేయబడే అల్లాహ్‌ ఆయతులను, ప్రవక్త ప్రవచనాలను స్మరించుకుంటూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ మృదుస్వభావి, అన్నీ తెలిసినవాడు.(33:34)

మీ ఇండ్లలో పారాయణం చేయబడే అల్లాహ్ ఆయతులను, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలను స్మరించుకుంటూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మృదు స్వభావి, అన్నీ ఎరిగినవాడు, తెలిసినవాడు. అంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉమ్మహాతుల్ ము’మినీన్ల ఇండ్ల ప్రస్తావన ఖురాన్ పారాయణం మరియు హిక్మత్, ప్రవక్త గారి ప్రవచనాలతో, వహీ జలీ అయినా, వహీ ఖఫీ అయినా, ఖురాన్ మరియు హిక్మత్ తో వారి ఇండ్ల ప్రస్తావన అల్లాహ్ చేశాడు, ఇది వారి ప్రత్యేకత.

అలాగే, స్వర్గంలో కూడా వీరు ప్రవక్తకి భార్యలుగానే ఉంటారు అని ఇంతకుముందే తెలుసుకున్నాము. ఒకసారి ఆయిషా రదియల్లాహు అన్హా కథనం, ఈ ఉల్లేఖనం, ఈ హదీస్ ఇబ్నె హిబ్బాన్, హాకిమ్ మరియు తబరానీలో ఉంది. ఆయిషా రదియల్లాహు అన్హా ఒక సందర్భంలో అడిగారు. ఓ దైవ ప్రవక్తా, స్వర్గంలో ఏ సతీమణి మీ తోడుగా ఉంటారు అని ప్రశ్న. ఉమ్ముల్ ము’మినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా అడిగిన ప్రశ్న ఏమిటి? ఓ దైవ ప్రవక్తా, ఏ సతీమణి స్వర్గంలో మీకు తోడుగా ఉంటారు అని అడిగితే, దానికి సమాధానంగా మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఓ ఆయిషా, వారిలో నువ్వు కూడా ఉన్నావు. ఇంకా ఇతర రివాయతుల ఆధారంగా, ఉమ్మహాతుల్ ము’మినీన్ ఈ ప్రాపంచిక జీవితంలో ఎలాగైతే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి సతీమణులుగా, భార్యలుగా ఉన్నారో, స్వర్గంలో కూడా వారు మహా ప్రవక్తకి సతీమణులుగానే ఉంటారు.

అభిమాన సోదరులారా! ఇంతవరకు మనము ఉమ్మడిగా ఉమ్మహాతుల్ ము’మినీన్లకు సంబంధించిన ఘనత తెలుసుకున్నాము.

—

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41386

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) & కుటుంబం
https://teluguislam.net/muhammad/

స్త్రీ యొక్క అసలైన పురోగతి ఎందులో ఉంది? [వీడియో]

స్త్రీ యొక్క అసలైన పురోగతి ఎందులో ఉంది?
https://youtu.be/CUe9Npet1FQ [68 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

గీరా (غيرة) – ప్రవక్త ﷺ కాలం నాటి ఐదు సంఘటనలు [ఆడియో]

గీరా (غيرة) – ప్రవక్త ﷺ కాలం నాటి ఐదు సంఘటనలు
https://youtu.be/i_W5twsAUhU [25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

గీరా (غيرة) అంటే గౌరవాన్ని, పవిత్రతను, ఇజ్జత్‌ను కాపాడాలన్న ఒక రక్షణాత్మక భావన.
ఆడియో లో “గీరా” అనే పదానికి బదులుగా రేషం/రోషం అనే పదం వాడబడింది గమనించగలరు, బారకల్లాహు ఫీకుం

చాలా ముఖ్యమైన ఆడియో , తప్పక వినండి. లాభం పొందండి మరియు మీ బంధుమిత్రులకు ఫార్వర్డ్ చేసి లాభం చేకూర్చండి ఇన్ షా అల్లాహ్.

ఇస్లాం మెచ్చిన మహిళలు [పుస్తకం]

ఇస్లాం మెచ్చిన మహిళలు [పుస్తకం]
సంకలనం: మౌలానా ముహమ్మద్ తఖీయుద్దీన్(రహిమహుల్లాహ్)
అనువాదం: ఇఖ్బాల్ అహ్మద్
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్,  హైదరాబాద్ -500059.

సంకలనం: మౌలానా ముహమ్మద్ తఖీయుద్దీన్(రహిమహుల్లాహ్)
అనువాదం: ఇఖ్బాల్ అహ్మద్
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్ -500059.

[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [80 పేజీలు]

కట్నం కోసం అమ్ముడుపోయే మగాళ్ళు [పుస్తకం]

కట్నం కోసం అమ్ముడుపోయే మగాళ్ళు [పుస్తకం] Dowry - Vara Katnam

దివ్యఖుర్ఆన్, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనాల వెలుగులో వరకట్నం నిషేధం…
వరకట్న దురాచారాన్ని నిరోధించే పద్ధతులు.

కట్నం కోసం అమ్ముడుపోయే మగాళ్ళు
[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [36 పేజీలు]

దివ్యఖుర్ఆన్, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసులు, ఉలమాల వ్యాఖ్యానాల వెలుగులో పుస్తకం ద్వారా క్రింది విషయాలను నిరూపించే ప్రయత్నం జరిగింది.

1. వరకట్నం సంతోషంగా ఇచ్చినా, ఆచారంగా ఇచ్చినా, డిమాండ్ చేసి తీసుకున్నా మగవాడికి ఇది హరామ్. ఎందుకంటే ఇది ఒక లంచం, ఇది సామాజిక బ్లాక్ మెయిల్, ఒక బిచ్చం, ఒక ఉపద్రవం. ఇలాంటి పెళ్ళిళ్ళలో పాల్గొనకుండా బాయ్ కాట్ చేయడం ప్రతి ముస్లిమ్ కు ధార్మిక, నైతిక బాధ్యత.

2. వధువు వీడ్కోలు సందర్భంగా వధువు కన్నవాళ్ళపై వీడ్కోలు విందు భోజనాల భారం వేయడం, ఇది సంతోషంగా జరిగినా, డిమాండ్ వల్ల జరిగినా లేక ఆచారం కారణంగా అయినా గాని ఇది నేటి అతి పెద్ద బిద్అత్. ఇది దుబారా ఖర్చు. అవసరం లేకపోయినా సృష్టించిన దుబారా ఖర్చు (ఇస్రాఫ్). ఇది కూడా హరామ్ అవుతుంది. ఇలాంటి విందుల్లో పాల్గొనడం హరామ్ పనులను ప్రోత్సహించడమే అవుతుంది. ఇలాంటి విందుభోజనాలను బాయ్ కాట్ చేయడం గౌరవోన్నతులకు నిదర్శనం.

3. వరుడి తరపు వాళ్ళు వీడ్కోలు రోజునే భోజనాలు చేయించడంలో ఎలాంటి తప్పు లేదని చాలా మంది ఉలమాల అభిప్రాయం. ఈ పద్దతి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సంప్రదాయాల్లో కనబడుతుంది. అరబ్బు ప్రపంచంలోని ఉలమాలు ఈ పద్ధతిని బలపరుస్తున్నారు. వలీమా వీడ్కోలు రోజున కూడా తినిపించవచ్చని అంటారు. ఎందుకంటే వలీమా నిజానికి ఒక ప్రకటన మాత్రమే. అది నికాహ్ జరిగిన తర్వాత ఆ రోజునే చేయవచ్చు. దీనివల్ల లక్షలాది తల్లిదండ్రులపై ఆర్థికభారం తగ్గుతుంది. అనేకమందికి కాలం ,ధనం వ్యర్ధం కాకుండా ఉంటుంది. కొందరు వలీమా చేయడానికి ఒక ప్రత్యేక నిబంధన పూర్తికావడం తప్పనిసరని చెబుతుంటారు. అలాంటి వాళ్ళు వలీమాకు అడ్వాన్సుగా ఆహ్వానాలు ఎలా ఇస్తారు. వలీమాకు ఆహ్వానాలు ఎలా అడ్వాన్సుగా ఇవ్వవచ్చో అదేవిధంగా వలీమా లేదా రిసెప్షన్ కూడా నికాహ్ రోజునే అడ్వాన్సుగా చేయవచ్చు. కాబట్టి నికాహ్ రోజునే వలీమాగా ఒకే విందు జరిగే పెళ్ళిళ్ళను ప్రోత్సహించాలి. పురుషుడు తన ఖర్చుతో భోజనాలు పెట్టించాలి. అంతేకాని వధువు కన్నవాళ్ళపై తన అతిథుల భారం వేయరాదు.