వడ్డీ తినుట

బిస్మిల్లాహ్

అల్లాహ్‌ తన దివ్య గ్రంథంలో వడ్డీ తినేవారితో తప్ప మరెవ్వరితోనూ యుద్ధ  ప్రకటన చేయలేదు.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَذَرُوا مَا بَقِيَ مِنَ الرِّبَا إِن كُنتُم مُّؤْمِنِينَ فَإِن لَّمْ تَفْعَلُوا فَأْذَنُوا بِحَرْبٍ مِّنَ اللَّهِ وَرَسُولِهِ

“విశ్వసించిన ప్రజల్లారా! మీరు నిజంగా విశ్వాసులే అయితే, అల్లాహ్‌కు భయపడండి, ఇంకా మీకు ప్రజల నుండి రావలసిన వడ్డీని విడిచి పెట్టండి. ఒకవేళ మీరు అలా చెయ్యకపోతే, మీపై అల్లాహ్‌ తరపున ఆయన ప్రవక్త తరపున యుద్ధ ప్రకటన ఉంది అనే విషయం తెలుసుకోండి.” (సూరహ్ బఖర 2: 278, 279).

ఇది అల్లాహ్‌ వద్ద ఎంత చెడ్డ పాపమో తెలియుటకు పై ఆయతులే చాలు.

ప్రజలు, ప్రభుత్వాలు వడ్డీ కారణంగా వినాశపు చివరి హద్దులోకి చేరుకున్నాయన్న నిజాన్ని వాటిపై దృష్టిసారించిన వ్యక్తి గమనించగలడు. వడ్డీ వ్యవహారాల వలన దారిద్య్రం, మార్కెట్లో సరుకు రాకపోవుట, ఆర్ధిక దివాలా , అప్పులు చెల్లించే స్థోమత లేకవోవుట, జీవనాభివృద్ధిలో ఆటంకాలు, నిరుద్యోగ సమస్యలు పెరుగుట, అనేక కంపెనీలు, ఆర్ధిక సంస్థలు మూతబడుట, ఇంకా రోజువారి కష్టార్జితము, చెమట ధారాపోసి సంపాదించే సంపాదన కూడా వడ్డీ తీర్చడానికి సరిపడకపోవుట చూస్తునే ఉన్నాము. లెక్కలేనంత ధనం కొందరి చేతుల్లో తిరగటం వలన సమాజంలో వర్గాల తారతమ్యం ఉత్పన్నమవుతుంది. వడ్డీ వ్యవహారంలో పాల్గొన్న వారికి అల్లాహ్‌ హెచ్చరించిన యుధ్ధ రూపాలు బహుశా ఇవేకావచ్చు.

ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఏవిధంగానైనా వడ్డీ వ్యవహారం చేసే వారినీ, అందుకు సహాయం చేసే వారినీ (దలాలి, ఏజెంట్‌) అందరినీ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శపించారు:

వడ్డీ

“వడ్డీ తినేవారిని, తినిపించే వారినీ, ఆ వ్యవహారాలు వ్రాసేవారినీ, అందులో సాక్ష్యం పలికేవారందరినీ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శపించారు. ఆ పాపంలో వీరందరూ సమానమే” అని చెప్పారు. (ముస్లిం 1598).

ఈ హదీసు ఆధారంగా వడ్డీ ఇచ్చిపుచ్చుకొనుట, వడ్డీ బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్‌ చేయుట, వడ్డీ వ్యవహారాల్లో క్లర్కుగా, దాని లావాదేవీలు రిజిస్టర్‌ చేయుటకు, మరియు అందులో వాచ్‌ మేన్‌గా ఉద్యోగం చేయుట యోగ్యం కాదు. వాస్తవం ఏమిటంటే వడ్డీకి సంబంధించిన ఏ వ్యవహారంలో కూడా, ఏ విధంగానైనా పాల్గొనుట నిషిద్ధం.

ఘోరపాపంతో కూడిన ఈ చెడును ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఎంత స్పష్టంగా చెప్పారో, అబ్దుల్లాహ్ బిన్‌ మస్ఊద్‌ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

వడ్డీ

“వడ్డీలో 73 స్థాయిలున్నాయి. వాటిలో అత్యంత హీనమైన స్థాయి (దశ) యొక్క పాపం; ఒక వ్యక్తి తన కన్న తల్లిని పెళ్ళాడటం వంటిది. వడ్డీ యొక్క అత్యంత తీవ్రస్థాయి పాపం ఒక ముస్లిం పరువు ప్రతిష్టలను మంటగలపటం”. (ముస్తద్రక్‌ హాకిం: 2/37, సహీహుల్‌ జామి: 3533. ).

ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పినట్లు అబ్దుల్లాహ్ బిన్‌ హంజలా (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

వడ్డీ

బుద్ధిపూర్వకంగా ఒక దిర్హం వడ్డీ తినడం 36 సార్లకంటే ఎక్కువ వ్యభిచారం చేసినదానితో సమానం”. (అహ్మద్‌: 5/225, సహీహుల్‌ జామి:3375).

వడ్డీ అందరిపై నిషిద్ధం. బీదవాళ్ళ, ధనికుల మధ్య ఏలాంటి తేడా లేదు. తేడా ఉంది అని కొందరనుకుంటారు. కాని అది తప్పు. అందరిపై, అన్ని పరిస్థితుల్లోనూ నిషిద్ధం. పెద్ద పెద్ద వ్యాపారులు, ధనికులు దీని వల్లే దీవాలా తీస్తున్నారు. ఎన్నో సంఘటనలు దీనికి సాక్ష్యాలుగా ఉన్నాయి.

వడ్డీ ద్వారా వచ్చే ధనం చూడడానికి ఎక్కువ కనబడినా ఆ ధనంలో బర్కత్‌ (శుభం) అనేది నశించిపోతుంది. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

వడ్డీ

“వడ్డీ ద్వారా ఎంత ధనం వచ్చినా దాని అంతం అల్పంతోనే అవుతుంది”. (అహ్మద్‌: 2/37, సహీహుల్‌ జామి: 3542.)

వడ్డీశాతం పెరిగినా లేక తరిగినా, ఎక్కువ ఉన్నా లేక తక్కువ ఉన్నా తీసుకోవడం, తినడం ఎట్టిపరిస్థితుల్లోనూ యోగ్యం కాదు. అన్ని విధాలుగా నిషిద్ధం. వడ్డీ తినే వ్యక్తి ఉన్మాది వలే ప్రళయదినాన నిలబడతాడు. ఇది ఎంత చెడు అయినప్పటికి అల్లాహ్‌ తౌబా చేయమని ఆజ్ఞాపించి, దాని విధానం కూడా స్పష్టం చేశాడు. వడ్డీ తినేవారిని ఉద్దేశించి ఇలా ఆదేశించాడు:

فَإِن لَّمْ تَفْعَلُوا فَأْذَنُوا بِحَرْبٍ مِّنَ اللَّهِ وَرَسُولِهِ ۖ وَإِن تُبْتُمْ فَلَكُمْ رُءُوسُ أَمْوَالِكُمْ لَا تَظْلِمُونَ وَلَا تُظْلَمُونَ

ఇప్పుడైనా మీరు పశ్చాత్తాప పడి (వడ్డీని వదులుకుంటే) అసలు సొమ్ము తీసుకోవటానికి హక్కుదారులవుతారు. మీరూ అన్యాయం చెయ్యకూడదు. మీకూ అన్యాయం జరగకూడదు. (సూరహ్ బఖర 2: 279).

ఇదే వాస్తవ న్యాయం.

విశ్వాసుని మనుస్సు ఈ ఘోరపాపాన్ని అసహ్యించుకొనుట, దాని చెడును గ్రహించుట తప్పనిసరి. దొంగలించబడే లేక నష్టమయ్యే భయం లాంటి గత్యంతరంతో వడ్డీఇచ్చే బ్యాంకుల్లో తమ సొమ్మును డిపాజిట్‌ చేసే వాళ్ళు, వారి గత్యంతరం ఎంతమటుకు ఉంది, గత్యంతరంలేక మరణించిన జంతువును తినువారి లాంటి లేదా అంతకంటే కఠిన స్ధితిలో ఉన్నారా? అనేది గ్రహించాలి. అందుకు అల్లాహ్‌ క్షమాపణ కోరుతూ ఉండాలి. ఎంత సంభవమైతే అంత వరకు (దాని నుండి దూరమై) దాని స్థానంలో వేరే (ధర్మ సమ్మతమైన) ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం తమ సొమ్ము ఉన్న బ్యాంకుల నుండి తమ సొమ్ముపై రావలసిన వడ్డీని వారితో అడగకూడదు. వారు స్వయంగా తన అకౌంటులో జమ చేస్తే దాన్ని దానం ఉద్దేశంతో కాకుండా ఆ పాపపు సొమ్ముతో తన ప్రాణం వదులుకొనుటకు (కడు బీదవారికి) ఇచ్చేయాలి. నిశ్చయంగా అల్లాహ్‌ పవిత్రుడు. పవిత్రమైన వాటినే స్వీకరి స్తాడు. దాని నుండి స్వలాభం పొందడం ఎంత మాత్రం యోగ్యం కాదు. తినుత్రాగు, ధరించు ప్రయాణ ఖర్చు రూపంలో గాని లేక గృహనిర్మాణం లేక అతనిపై విధిగా ఉన్న భార్యబిడ్డల, తల్లిదండ్రుల ఖర్చు రూపంలోగాని లేక అందులో నుంచి జకాత్‌, ట్యాక్స్‌ వగైరా చెల్లించడానికిగాని లేక కనీసం తనపై జరిగిన అన్యాయాన్ని దూరం చేయడానిక్కూడా దాన్ని ఉపయోగించరాదు. కేవలం అల్లాహ్‌ యొక్క బహుగట్టి పట్టు నుండి తప్పించుకోడానికి ఎవరికైనా ఇచ్చివేయాలి.

[ఇది ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన “ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు” అను పుస్తకం నుంచి తీసుకుబడింది]

దీనికి సంబంధించిన  పోస్టులు:

 

%d bloggers like this: