ఇస్మాయిల్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో]

ఇస్మాయిల్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో]
https://www.youtube.com/watch?v=Irj32QUFtXs [32 నిముషాలు]
ముహమ్మద్ సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ప్రవక్త ఇస్మాయీల్ (అలైహిస్సలాం)

పలస్తీనాలో ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) సందేశాన్ని కొందరు విశ్వసించారు. సత్య సందేశాన్ని స్వీకరించారు.

సారాకు సంతానం కలుగలేదు. ఆమెకు వయసు పైబడింది. పిల్లలు కలిగే వయసు దాటిపోయింది. తన భర్తకు ఒక పిల్లవాడిని ఇవ్వలేకపోయానని ఆమె బాధపడేవారు. అందువల్ల తమ సేవకురాలు హాజిరాను పెళ్ళి చేసుకోవలసిందిగా ఆమె భర్తను కోరారు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఈ సలహా మన్నించారు. హాజిరాను వివాహం చేసుకున్నారు. హాజిరాకు ఒక కుమారుడు, ఇస్మాయీల్ (అలైహిస్సలాం) జన్మిం చారు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) చాలా సంతోషించారు. ఇస్మాయీల్ (అలైహిస్సలాం)ను అమి తంగా ప్రేమించారు.

ఈసా (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియోలు]

యూట్యూబ్ ప్లే లిస్ట్: https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3jl6Yyjn-7Kld6W0Y3xa-s

ఈసా (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – పార్ట్ 1 
ఈసా (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – పార్ట్ 2 
ఈసా (అలైహిస్సలాం) జీవిత చరిత్ర నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు 
యేసు (ఈసా అలైహిస్సలాం) అద్భుతాలు, మహిమలు

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ప్రవక్త ఈసా (అలైహిస్సలామ్)

మర్యమ్ కుమారుడైన మసీహ్ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు. ఆయనకు మునుపు కూడా ఎంతో మంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి సద్వర్తను రాలు. ఆ తల్లీ కొడుకులిరువురూ అన్నం తినేవారే. (ఖుర్ఆన్ 5: 75)

మర్యమ్ దైవగృహంలో ఆరాధనలో ఉన్నప్పుడు ఒక దైవదూత పురుషుని రూపంలో ఆమె ముందు ప్రత్యక్ష మయ్యాడు. ఆమె భయంతో వణుకుతూ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. “నీవే గనుక అల్లాహ్ కు భయపడే వానివైతే (ఇక్కణ్ణుంచి వెళ్ళిపో), నేను నీ నుంచి అల్లాహ్ శరణు కోరుతున్నాను” అంటూ అల్లాహ్ ను ప్రార్థించింది. దైవదూత ఆమెను ఉద్దేశించి మాట్లాడుతూ, “భయపడవద్దు. నీకెలాంటి ప్రమాదమూ లేదు. నేను నీ ప్రభువు పంపగా వచ్చిన దూతను మాత్రమే. నన్ను ప్రభువు నీ వద్దకు పంపాడు. నీకు సన్మార్గుడైన ఒక కుమారుణ్ణి ప్రసాదించడానికి” అన్నాడు. ఈ మాటలు విని మర్యమ్ నిర్ఘాంత పోయింది. ఆమె దైవదూత చెప్పిన మాటలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, “నాకు కుమారుడు ఎలా పుడతాడు. నన్ను ఏ పురుషుడూ తాకలేదే. నేను శీలం లేని దాన్ని కాదు” అన్నారు. దైవ దూత ఆమెకు సమాధానమిస్తూ, “అలాగే అవు తుంది. నీ ప్రభువుకు ఇది చాలా తేలిక. ఆయన నీ కుమారుడిని మానవాళికి ఒక నిదర్శనంగా, అల్లాహ్ తరఫున కారుణ్యంగా తయారు చేస్తాడని” చెప్పాడు. ఈ మాటలు పలికిన దైవదూత అదృశ్య మయ్యాడు.

ప్రవక్త ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో]

యూట్యూబ్ ప్లే లిస్ట్ – ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2lMvZtpD3RlAERoC9GN_WL

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ప్రవక్త ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)

فَجَعَلَهُمْ جُذَاذًا إِلَّا كَبِيرًا لَّهُمْ لَعَلَّهُمْ إِلَيْهِ يَرْجِعُونَ

“ఆ తరువాత ఇబ్రాహీమ్ ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు ముక్కలుగా పగులగొట్టాడు. అయితే పెద్ద విగ్రహాన్ని మాత్రం విడిచి దానివైపు పెట్టాడు. వారంతా మరలటానికే (అలా చేశాడు). ” (ఖుర్ఆన్ 21: 58)

ప్రవక్త సాలిహ్ (అలైహిస్సలాం) – సమూద్ జాతి ప్రజలు వారి విశిష్ట ఒంటె [వీడియో]

ప్రవక్త సాలిహ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో]
https://youtu.be/cbP4rt3rO4Q [43 నిముషాలు]
ముహమ్మద్ సలీం జామిఈ (హఫిజహుల్లాహ)

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ప్రవక్త సాలిహ్ (అలైహిస్సలాం) (సమూద్ జాతి ప్రజలు వారి విశిష్ట ఒంటె)

సమూదు (జాతి) వారు తమ పొగరు మూలంగా (వారి ప్రవక్తను) ధిక్కరించారు…… “మీరు దేవుని ఈ ఆడ ఒంటె విషయంలో, దాని నీళ్ల వంతు విషయంలో జాగ్రత్తగా ఉండండి” అని దైవప్రవక్త వారిని హెచ్చరించాడు. కాని వారు మాత్రం తమ ప్రవక్త (మాటల)ను త్రోసిపుచ్చి, దాని గిట్టెలను నరికి(చంపేశారు). (ఖుర్ఆన్ 91 : 11-14).

91:11 كَذَّبَتْ ثَمُودُ بِطَغْوَاهَا
91:12 إِذِ انبَعَثَ أَشْقَاهَا
91:13 فَقَالَ لَهُمْ رَسُولُ اللَّهِ نَاقَةَ اللَّهِ وَسُقْيَاهَا
91:14 فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمْدَمَ عَلَيْهِمْ رَبُّهُم بِذَنبِهِمْ فَسَوَّاهَا

సమూదు (జాతి) వారు తమ పొగరు మూలంగా (వారి ప్రవక్తను) ధిక్కరించారు. అప్పుడు వారిలోని ఒక పెద్ద దౌర్భాగ్యుడు (వారి తలబిరుసుపోకడలకు సారధిగా) నిలబడ్డాడు. “మీరు అల్లాహ్ యొక్క ఈ ఆడ ఒంటె విషయంలో, దాని నీళ్ళ వంతు విషయంలో జాగ్రత్తగా ఉండండి” అని దైవప్రవక్త వారిని హెచ్చరించాడు..కాని వారు మాత్రం తమ ప్రవక్త (మాటల)ను త్రోసిపుచ్చి, దాని గిట్టెలను నరికి (చంపేశారు). అంతే! వారి ప్రభువు వారి దురాగతాల కారణంగా వారిపై వినాశాన్ని పంపాడు. వారందరినీ సమానం (నేలమట్టం) చేశాడు.

ప్రవక్త హూద్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో]

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

69:6 وَأَمَّا عَادٌ فَأُهْلِكُوا بِرِيحٍ صَرْصَرٍ عَاتِيَةٍ

69:7 سَخَّرَهَا عَلَيْهِمْ سَبْعَ لَيَالٍ وَثَمَانِيَةَ أَيَّامٍ حُسُومًا فَتَرَى الْقَوْمَ فِيهَا صَرْعَىٰ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ خَاوِيَةٍ

ఆద్ వారు ప్రచండమైన పెనుగాలుల ద్వారా నాశనం చేయబడ్డారు. వాటిని అల్లాహ్ వారిపై నిరంతరం ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్ళు విధించాడు. (నీవు గనక అక్కడ ఉండి ఉంటే) వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు బొద్దులవలే నేలకొరిగి పడి ఉండటం చూసేవాడివి. (ఖుర్ఆన్ 69 : 6-7)

యూసుఫ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో]

యూసుఫ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో]
వక్త: సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/3aASE6ZWQGQ [40 నిముషాలు]

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ప్రవక్త యూసుఫ్(అలైహిస్సలాం)
(క్రీ.పూ. 1700 నుంచి క్రీ.పూ.1680 వరకు)

యూసుఫ్ (అలైహిస్సలాం) పద్ధెనిమిది సంవత్సరాల వయసులో ఉన్నారు. ఆయన దృఢమైన, అందమైన యువకునిగా ఎదిగారు. చాలా నమ్రత కలిగిన వారిగా పేరుపడ్డారు. ఆయన గౌరవంగా వ్యవహరించే వారు. దయ సానుభూతులతోప్రవర్తించేవారు. ఆయన సోదరుడు బినామిన్ కూడా అలాంటి గుణగణాలు కలిగినవాడే. వీరిద్దరూ ఒకే తల్లి రాకెల్ కుమారులు. సుగుణ సంపన్నులైన ఈ ఇరువురు కుమారుల పట్ల తండ్రి యాఖూబ్ (అలైహిస్సలాం) ఎక్కువ ఇష్టం ప్రదర్శించేవారు. వీరిద్దరిని తన దృష్టి నుంచి పక్కకు వెళ్ళనిచ్చే వారు కాదు. వారిని పరిరక్షించడానికిగాను ఇంటి తోటలోనే వారిని పనిచేసేలా నిర్దేశించారు.

సోదరుల కుట్ర (అలైహిస్సలాం) అసూయ అగ్ని వంటిది. అది సోదరుల గుండెల్లో పొగలు గ్రక్కడం ప్రారంభించింది. విద్వేషంగా మారింది. ఒక సోదరుడు మిగిలిన వారితో, “నాన్నగారు మనందరికన్నా యూసుఫ్, బిన్ యామిన్ల పట్ల ఎక్కువ ప్రేమ చూపుతున్నారు.నిజానికి వారిద్దరి కన్నా మనం బలంగా ఉన్నాం. మన అమ్మలకన్నా వారిద్దరి అమ్మనే ఆయన ఎక్కువ ప్రేమిస్తారు. ఇది న్యాయం కాదు” అన్నాడు. వారందరూ తమకు అన్యాయం జరిగి పోతోందని భావించారు.

ప్రవక్త ఇద్రీస్ (అలైహిస్సలాం) – ప్రవక్తల చరిత్ర [వీడియో]

ప్రవక్త ఇద్రీస్ (అలైహిస్సలాం) | ప్రవక్తల చరిత్ర [వీడియో]
https://youtu.be/aog37XDhX8c [33 నిముషాలు]
వక్త: సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ఇద్రీస్ ప్రవక్త (అలైహిస్సలాం) బాబిలోనియాలో జన్మించారు. అక్కడే పెరిగి పెద్దవారయ్యారు. ఇద్రీస్ ప్రవక్త గురించి ఖుర్ఆన్ గ్రంధంలో ఈ విధంగా ప్రస్తావితమయింది.

“ఈ గ్రంథంలో ఇద్రీస్ ను గురించి ప్రస్తావించు. అతను ఒక నిజాయితీ పరుడైన మనిషి, ఒక ప్రవక్త. మేము అతనిని ఉన్నతస్థాయికి లేపాము.” (దివ్య ఖుర్ఆన్ 19:56-57)

ప్రవక్త ఆదం (అలైహిస్సలాం) బోధనలను, ఆయన అనుసరించిన మతధర్మాన్ని ప్రవక్త ఇద్రీస్ (అలైహిస్సలాం) అనుసరించారు.ప్రవక్త ఆదం (అలైహిస్సలాం) తర్వాత అయిదవ తరంలోని వారు ప్రవక్త ఇద్రీస్ (అలైహిస్సలాం).ఆయన ప్రజలను ఆదం (అలైహిస్సలాం) పాటించిన మతధర్మం వైపునకు పిలిచారు.కొందరు ఆయన మాటలను విశ్వసించారు. కాని చాలా మంది ఆయన్ను తిరస్కరించారు.

ఇద్రీస్ ప్రవక్త (అలైహిస్సలాం), ఆయన అనుచరులు బాబిలోనియా వదలి ఈజిప్టుకు వెళ్ళారు. అక్కడ ఆయన తన సత్య సందేశ ప్రచారాన్ని కొనసాగించారు.ప్రజలకు సత్యాన్ని, న్యాయాన్ని బోధించ సాగారు. వారికి సరియైన ప్రార్థనారీతులు నేర్పసాగారు. కొన్ని నిర్ధారితరోజుల్లో ఉపవాసాలు పాటించాలనిప్రోత్సహించసాగారు. తమ సంపదలో కొంత భాగాన్ని బీదలకు ఇవ్వాలని బోధించ సాగారు. వ్రాతకు సంబంధించిన ప్రారంభ రూపాన్ని కనిపెట్టింది ఇద్రీస్ (అలైహిస్సలాం) అని తెలుస్తోంది.

ఆయన బోధనల్లో కొన్ని :

  • తన ఆచరణలను సమీక్షించుకునే వ్యక్తి సంతోషాన్ని పొందుతాడు.అలాగే తన ప్రభువు వద్ద తన తరపున వాదించడానికి తన ఆచరణలను ఏర్పరచుకున్న వ్యక్తి కూడా నిజమైన సంతోషాన్ని పొందుతాడు.
  • అల్లాహ్ అనుగ్రహాలను ఇతరులతో పంచుకోవడాన్ని మించి ఆయన పట్ల కృతజ్ఞత చూపే మార్గం మరొకటి లేదు.
  • ప్రజలకు ఉన్న భాగ్యాన్ని చూసి అసూయపడరాదు. ఎందుకంటే వారుఆ భాగ్యాన్ని కొంతకాలం మాత్రమే అనుభవిస్తారు.
  • అతిశయానికి పాల్పడే వ్యక్తి దాని వల్ల ఎలాంటి లాభం పొందలేడు.
  • వివేశాన్ని కలిగి ఉండడమే జీవితంలోని నిజమైన ఆనందం.

ప్రవక్తలు (మెయిన్ పేజీ):
https://teluguislam.net/prophets

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో]

ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో]
వక్త: ముహమ్మద్ సలీం జామిఈ హఫిజహుల్లాహ్
https://www.youtube.com/watch?v=QSCd4zG7zUQ [47 నిముషాలు]

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

తుదకు మా ఆదేశం వచ్చి, పొయ్యిపొంగినప్పుడు, “ఈ ఓడలోకి ప్రతి (జీవ)రాసి మంచి రెండేసి (ఒకటి ఆడ, ఇంకొకటి మగ జంతువ) చొప్పున ఎక్కించుకో.నీ ఇంటివారలను కూడాతీసుకో. ఇంకా విశ్వాసులందరిని కూడా ఎక్కించుకో” అని మేము నూహ్ కు చెప్పాము.(ఖుర్ఆన్ 11 : 40).

ప్రవక్త షుఐబ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో]

ప్రవక్త షుఐబ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో]
https://youtu.be/f3JxMD2bySA [33 నిముషాలు]
వక్త: సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

మదయన్ ప్రాంత వాసులు అరబ్బులు. వారు మఆన్ రాజ్యంలో నివసించే వారు. నేడు ఇది సిరియాలో ఒక భాగంగా ఉంది. వారు అత్యాశ పరులైన ప్రజలు. వారికి అల్లాహ్ ఉనికి పట్లఎలాంటి నమ్మకం ఉండేది కాదు. అన్ని విధాల చెడులతో నిండిన జీవితాన్ని వారు గడిపేవారు. తూనికలు కొలతలో మోసాలు చేసేవారు. తాము అమ్మే వస్తువులలోని లోపాలు దాచి చాలా గొప్ప వస్తువులుగా పొగిడే వారు. వినియోగదారులకు అబద్దాలు చెప్పి మోసగించే వారు.

వారి వద్దకు అల్లాహ్ తన ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త షుఐబ్ (అలైహిస్సలాం).ఆయనకు అల్లాహ్ కొన్ని మహత్తులు కూడా ఇచ్చి పంపాడు. షుఐబ్ (అలైహిస్సలాం) వారికి హితబోధ చేయడం ప్రారంభించారు. అల్లాహ్ అనుగ్రహాలను ఎల్లప్పుడుగుర్తుంచుకోవాలని, దుర్మార్గానికి పాల్పడితే తీవ్రమైన ఫలితాలు చవి చూడవలసి వస్తుందని వారికి బోధించారు. కాని వారు ఆయన్ను ఎగతాళి చేశారు. అపహసించారు. షుఐబ్ (అలైహిస్సలాం) సహనంగా, తనకు వారితో ఉన్న బంధుత్వాన్ని గుర్తు చేస్తూ, తాను చేస్తున్నది తన స్వంత ప్రయోజనంకో సం కాదని వారికి నచ్చజెప్పడానికిప్రయత్నించారు.

వారు ఆగ్రహించి షుఐబ్ (అలైహిస్సలాం),ఆయన అనుచరుల వస్తు సంపద మొత్తం లాక్కున్నారు. వారిని పట్టణం నుంచి బయటకు తరిమి వేశారు. ప్రవక్త షుఐబ్ (అలైహిస్సలాం) దేవుని సహాయం కోసం ప్రార్థించారు. ఆయన ప్రార్థనకు జవాబు లభించింది. అల్లాహ్ ఆ పట్టణం పైకి బొబ్బలెక్కించే వేడిని పంపాడు. ఈ వేడికి వారు అల్లాడి పోయారు. ఆకాశంలో ఒక మేఘాన్ని చూసి హమ్మయ్య ఇక చల్లగా వర్షం పడుతుందని భావించారు.కాని ఆ మేఘం తీవ్ర గర్జనలతో పిడుగులు కురిపించింది. పైనుంచి గుండెలవిసే ఉరుములు వినబడ్డాయి. వాటి శబ్దానికి వారి కాళ్ళ క్రింది భూమి కంపించింది. భయభీతులతో దుర్మార్గులు నాశనమయ్యారు. దుర్మార్గుల అంతాన్ని దూరంగా నిలబడి షుఐబ్ (అలైహిస్సలాం) చూశారు.

ఓ ప్రజలారా! ప్రభువు సందేశాన్ని నేను మీకు చేరవేశాను. మీకు మంచిసలహాలు ఇచ్చాను. సత్యాన్ని తిరస్కరించిన ప్రజల పట్ల నేను ఎలాసానుభూతి చూపగలను” అన్నారు.

(ఇంకా చదవండి దివ్యఖుర్ఆన్: 7:85-93, 11:84-95, 26-176-191, 29:36-37)

(1) సంస్కరణ కర్త ఎల్లప్పుడు ప్రజలకు నచ్చజెబుతూ ఉండాలి. హోదా, పదవి, సంపద వగైరాలు పొందాలన్న ఉద్దేశ్యాలు అతనిలో ఉండరాదు.కేవలం అల్లాహ్ కోసం మాత్రమే పనిచేయాలి.

(2) తూనికలు కొలతల్లో ప్రజలు మోసాలు చేయకుండా వారిని మార్చడానికి షుఐబ్ (అలైహిస్సలాం) చాలా ప్రయత్నించారు. వస్తువులను వాటి వాస్తవ పరిస్థితికి మించి పొగడడాన్ని ఇస్లామ్ అంగీకరించదు. వాటిలో లోపాలను స్పష్టంగా తెలియ జేయాలని ఆదేశిస్తుంది. నిజాయితీ అన్నది ఇస్లామ్ లో ఒక విధానం మాత్రమే కాదు, అన్ని వ్యవహారాల్లోనూ ఇదే ముఖ్యమైన సూత్రం.

(3) అవినీతికరమైన వ్యవహారాల్లో అల్లాహ్ తన అనుగ్రహాన్ని చూపడు.నేరస్తులను తీవ్రంగా శిక్షిస్తాడు. అల్లాహ్ యొక్క శిక్ష విభిన్న విధాలుగా ఉంటుంది.

ప్రవక్త లూత్ (అలైహిస్సలాం) – ప్రవక్తల జీవిత చరిత్ర [వీడియో]

లూత్ (అలైహిస్సలాం) – ప్రవక్తల జీవిత చరిత్ర
https://youtu.be/lQwtCpQfvi4 [29 నిముషాలు]
వక్త: సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ప్రవక్త ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఈజిప్టును వదలి తన సోదరుని కుమారునితో సహా పలస్తీనా వచ్చి అక్కడ స్థిరపడ్డారు. ఆ సోదర కుమారుడే లూత్ (అలైహిస్సలాం). ఆ పిదప లూత్(అలైహిస్సలాం) సదూమ్ పట్టణానికి వెళ్ళి పోయారు. ఈ పట్టణం మృత సముద్రానికి పశ్చిమ తీరాన ఉంది. ఈ పట్టణంలో అనేక చెడులు వ్యాపించి ఉండేవి. అక్కడి ప్రజలు ప్రయాణీకులను దోచుకునేవారు. బాటసారులను దోచుకుని హతమార్చే వారు. మరో పెద్ద చెడు స్వలింగ సంపర్కం. పురుషులు తమ భార్యలతో కాక పురుషులతోనే కామ వాంఛలు తీర్చుకునే వారు. ఈ అసహజ లైంగిక క్రియకు తర్వాత ‘సోడోమి‘ అనే పేరుపడింది. (సదూమ్ పట్టణం పేరు వల్ల). అక్కడ స్వలింగ సంపర్కం నిర్లజ్జగా బాహాటంగా జరిగేది.

ఈ చెడులు పెట్రేగిపోయినప్పుడు అల్లాహ్ వారి వద్దకు లూత్ (అలైహిస్సలాం)ను పంపాడు. ఈ చెడులను వదలుకోవలసినదిగా ఆయన వారికి బోధించారు. కాని వారు తమ చెడులలో పూర్తిగా కూరుకు పోయారు. లూత్ (అలైహిస్సలాం) బోధనల పట్ల వారు ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. అల్లాహ్ శిక్ష గురించి లూత్ (అలైహిస్సలాం) వారిని హెచ్చరించినప్పటికీ వారు తమ చెడుల్లో మునిగిపోయి ఆయన మాటల్ని ఏ మాత్రం లక్ష్యపెట్టలేదు. ఇలాంటి బోధనలు కొనసాగిస్తే పట్టణం నుంచి తరిమేస్తామని ఆయన్ను బెదిరించారు. వారి చెడులు ఇతర పట్టణాలకు కూడా వ్యాపిస్తాయని లూత్ (అలైహిస్సలాం) భయపడ్డారు. వారిపై చర్య తీసుకోవాలని అల్లాహ్ ను వేడుకున్నారు.