విశ్వాన్ని ఎవరు సృష్టించారు? నన్ను ఎవరు సృష్టించారు? మరియు ఎందుకు? [పుస్తకం]

విశ్వాన్ని ఎవరు సృష్టించారు? నన్ను ఎవరు సృష్టించారు? మరియు ఎందుకు? – తెలుగు పుస్తకం ముఖచిత్రం

రచన: మస్జిదె హరామ్ మరియు మస్జిదె నబవీల ధార్మిక వ్యవహారాల విభాగానికి చెందిన శాస్త్రీయ కమిటీ
హరమైన్ షరీఫైన్ పుస్తకాలు (రిసాలతుల్ హరమైన్) | 37 పేజీలు

పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ :
విశ్వాన్ని ఎవరు సృష్టించారు? నన్ను ఎవరు సృష్టించారు? మరియు ఎందుకు? [డౌన్లోడ్ PDF]

మస్జిదె హరామ్ మరియు మస్జిదె నబవీల ధార్మిక వ్యవహారాల విభాగానికి చెందిన శాస్త్రీయ కమిటీ రూపొందించిన ఈ పుస్తకం, ప్రతి మనిషి మనస్సులో మెదిలే మూడు ప్రాథమిక ప్రశ్నలకు – విశ్వాన్ని ఎవరు సృష్టించారు? నన్ను ఎవరు సృష్టించారు? మరియు ఎందుకు? – ఖుర్ఆన్ ఆయతుల వెలుగులో, హేతుబద్ధమైన ఆధారాలతో సమాధానం ఇస్తుంది. సృష్టికర్త ఉనికి, ఆయన ఏకత్వం మరియు పరిపూర్ణ గుణాలు, మన సృష్టి యొక్క ఉద్దేశ్యం, ప్రవక్తల పంపకం, దివ్యఖుర్ఆన్, ఇస్లాం ధర్మం యొక్క వాస్తవికత, ఒక ముస్లిం పొందే ప్రయోజనాలు, ముస్లిమేతరుడు కోల్పోయేవి మరియు ఆరు విశ్వాస మూల స్తంభాలను ఈ పుస్తకం సరళంగా వివరిస్తుంది.

పాఠకులకు గమనిక: PDF లోని తెలుగు అనువాదంలో కనుగొన్న కొన్ని అనువాద పొరపాట్లను, అసలు అరబీ గ్రంథం «مَنْ خَلَقَ الكَوْنَ؟ وَمَنْ خَلَقَنِي؟ وَلِمَاذَا؟» (రిసాలతుల్ హరమైన్ అరబీ PDF) తో పోల్చి ఈ పోస్ట్‌లో సరిదిద్దాము. కాబట్టి, PDF కంటే ఈ పోస్ట్‌లోని పాఠాన్నే ప్రామాణికంగా పరిగణించవలసిందిగా మనవి.

విషయసూచిక

మంత్రజాలం (చేతబడి), జ్యోతిష్యానికి సంబంధించిన ఆదేశము – ఇమామ్ ఇబ్న్ బాజ్ [పుస్తకం]

మంత్రజాలం, జ్యోతిష్యం మరియు వాటికి సంబంధించిన వాటి ఆదేశము - షేఖ్ ఇబ్న్ బాజ్ పుస్తకం ముఖచిత్రం

రచయిత: షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్)
హరమైన్ షరీఫైన్ పుస్తకాలు (రిసాలతుల్ హరమైన్ – తొమ్మిదవ సందేశము) | 24 పేజీలు

పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ :
మంత్రజాలం, జ్యోతిష్యం మరియు వాటికి సంబంధించిన వాటి ఆదేశము – ఇమామ్ ఇబ్న్ బాజ్ [డౌన్లోడ్ PDF]

ప్రస్తుత కాలంలో మంత్రజాలం (చేతబడి) చేసేవారు, జ్యోతిష్కులు చాలా మంది కనబడుతున్నారు. వారు వైద్యం చేస్తున్నట్లు నటిస్తూ అజ్ఞానులైన ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సౌదీ అరేబియా మాజీ ముఫ్తీ షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్) రచించిన ఈ చిరుపుస్తకం, ఖుర్ఆన్ మరియు ప్రామాణిక హదీసుల వెలుగులో చేతబడి, జ్యోతిష్యం మరియు వాటికి సంబంధించిన విషయాల ఇస్లామీయ ఆదేశాన్ని స్పష్టంగా వివరిస్తుంది. జ్యోతిష్కుల, మాంత్రికుల వద్దకు వెళ్ళటం, వారిని ప్రశ్నించటం, వారి మాటలను నమ్మటం ఎంత ప్రమాదకరమో తెలియజేస్తూ, చేతబడి జరగక ముందు దాని నుండి రక్షణ పొందే మార్గాలను మరియు చేతబడి జరిగిన తరువాత షరీఅత్ సమ్మతమైన చికిత్సా పద్ధతులను కూడా ఈ పుస్తకం వివరిస్తుంది.

సంతోషకరమైన జీవితానికి ఉత్తమ మార్గాలు – ఇమామ్ అస్సఅదీ [పుస్తకం]

సంతోషకరమైన జీవితాన్ని అందించే ఉత్తమ మార్గాలు - ఇమామ్ అస్సఅదీ పుస్తకం ముఖచిత్రం

రచయిత: షేఖ్ అబ్దురహ్మాన్ బిన్ నాసిర్ అస్సఅదీ (రహిమహుల్లాహ్)
హరమైన్ షరీఫైన్ పుస్తకాలు

పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ :
సంతోషకరమైన జీవితాన్ని అందించే ఉత్తమ మార్గాలు – ఇమామ్ అస్ సాదీ [డౌన్లొడ్ PDF]

షేఖ్ అబ్దుర్ రహ్మాన్ బిన్ నాసిర్ అస్సఅదీ రచించిన సంతోషకరమైన జీవితానికి ఉత్తమ మార్గాలు అనే ఈ చిరుపుస్తకం నిజమైన సంతోషానికి దారి తీసే కారణాలను లోతైన ఈమాన్ దృష్టి కోణంతో పరిశీలిస్తున్నది. ఇది పాఠకుడిని దైవవిశ్వాసం, సత్కార్యాలు, అల్లాహ్ స్మరణ, సంతృప్తి, అనుగ్రహాలపై అల్లాహ్ కు కృతజ్ఞతలు, దయ, అల్లాహ్‌ పై ఆధారపడటం, సహనం మొదలైన విషయాల అర్థాన్ని గ్రహించడం ద్వారా మానసిక ప్రశాంతత వైపు దారి చూపుతుంది. అందమైన శైలిలో, ఈ చిరుపుస్తకం జీవితంలో సవాళ్ళు, కష్టసుఖాలు, ఎత్తుపల్లాలు ఉన్నప్పటికీ ప్రశాంతమైన, సమతుల్యమైన, ఆనందకరమైన జీవితాన్ని గడిపేందుకు ఒక ఉత్తమమైన మార్గాన్ని మీ చేతుల్లో ఉంచుతున్నది.

రచయిత పరిచయం: షేఖ్ అబ్దుర్రహ్మాన్ బిన్ నాసిర్ బిన్ అబ్దుల్లాహ్ అస్సఅదీ (రహిమహుల్లాహ్) బనూ తమీమ్ తెగకు చెందినవారు. ఆయన హిజ్రీ 1307 ముహర్రం 12వ తేదీన (క్రీ.శ. 1889) సౌదీ అరేబియాలోని ఉనైజా పట్టణంలో జన్మించారు. పదకొండు సంవత్సరాల వయస్సు రాకముందే ఖుర్ఆన్ ను కంఠస్థం చేశారు. షేఖ్ ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్-ఉసైమీన్ (రహిమహుల్లాహ్) వంటి గొప్ప పండితులు ఆయన శిష్యులు. ఆయన 40కి పైగా పుస్తకాలు రచించారు; వాటిలో ప్రసిద్ధ ఖుర్ఆన్ వ్యాఖ్యానం ‘తైసీర్ అల్-కరీమ్ అర్-రహ్మాన్‘ (తఫ్సీర్ అస్సఅదీ), ‘బహ్జతు ఖులూబిల్ అబ్రార్‘ మరియు ‘మిన్హాజుస్ సాలికీన్‘ ముఖ్యమైనవి. ఆయన హిజ్రీ 1376 జుమాదల్ ఆఖిరా 23వ తేదీన, 69 సంవత్సరాల వయస్సులో మరణించారు. అల్లాహ్ ఆయనను కరుణించుగాక. [మూలం: bakkah.net]

పాఠకులకు గమనిక: ఈ పోస్ట్‌లోని తెలుగు అనువాదాన్ని మేము అసలు అరబీ గ్రంథం «الوسائل المفيدة للحياة السعيدة» (రిసాలతుల్ హరమైన్ ప్రచురణ) తో పోల్చి సరిచూశాము. PDF లోని తెలుగు అనువాదంలో కనుగొన్న కొన్ని పొరపాట్లను ఈ పోస్ట్‌లో సరిదిద్దాము; సరిదిద్దిన భాగాలు ఈ నీలి రంగులో చూపబడ్డాయి. కాబట్టి, PDF కంటే ఈ పోస్ట్‌లోని పాఠాన్నే ప్రామాణికంగా పరిగణించవలసిందిగా మనవి.

విషయసూచిక

హదీసులు కూడా కేవలం అల్లాహ్ యొక్క వహీనే! [పుస్తకం]

హదీసులు కూడా కేవలం అల్లాహ్ యొక్క వహీనే!
తఖ్రీజ్: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ రహిమహుల్లాహ్, షోబా తహ్రీఖ్ వతాలీఫ్, దారుస్సలామ్, లాహోర్
తెలుగు అనువాదం, సమర్పణ: ఇక్రాముద్దీన్ ముహమ్మద్
పరిశీలన: షేఖ్ నసీరుద్దీన్ జామి’ ఈ మరియు సోదరులు అబ్దుల్ ఖాదిర్ హఫిజహుముల్లాహ్

[బుక్ డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [21 పేజీలు]

“హదీసులు కూడా కేవలం అల్లాహ్ యొక్క వహీనే!” అనే ఈ పుస్తకం, ముస్లింల జీవితంలో ఖురాన్‌తో పాటు దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి హదీసులు (సున్నత్) కూడా అల్లాహ్ చేత అవతరింపబడిన దివ్యజ్ఞానమే (వహీ) అని స్పష్టంగా నిరూపిస్తుంది. ప్రవక్త ధర్మవిషయంలో ఏదీ తన ఇష్టానుసారం చెప్పలేదని, అవన్నీ వహీ ద్వారానే వచ్చాయని ఖురాన్ ఆయతుల ఆధారంగా గ్రంథకర్త వివరించారు. ఖిబ్లా మార్పు, ముగ్గురు వ్యక్తుల పశ్చాత్తాపం, ఉపవాసం, జకాత్ మరియు నమాజు విధానాలు వంటి అనేక విషయాలు ఖురాన్‌లో ప్రస్తావించబడినప్పటికీ, వాటి పూర్తి వివరాలు కేవలం హదీసులలోనే లభిస్తాయని ఉదాహరణలతో సహా నిరూపించారు. కేవలం ఖురాన్‌ను మాత్రమే నమ్ముతాము అని చెబుతూ “హదీసులను తిరస్కరించే వారి” (మున్కిరీనె హదీసు) వాదనలను ఖండిస్తూ, హదీసుల ప్రామాణికత లేకుండా దైనందిన ఇస్లామిక్ విధులను ఆచరించడం అసాధ్యమని ఈ పుస్తకం ఉద్ఘాటిస్తుంది.

ఇదే మా పిలుపు (సలఫ్‌ల మార్గం) – ఇమామ్ అల్-అల్బానీ [పుస్తకం] రచయిత: ఇమామ్ ముహమ్మద్ నాసిరుద్దీన్ అల్-అల్బానీ ఆంగ్ల అనువాదం: అల్-ఇబానా బుక్ పబ్లిషింగ్ (Al-Ibaanah Book Publishing)

ఇదే మా పిలుపు (సలఫ్‌ల మార్గం) – ఇమామ్ అల్-అల్బానీ [పుస్తకం]

ఇదే మా పిలుపు (సలఫ్‌ల మార్గం)
This is Our Call (The Way of the Salaf) – Imaam Al-Albaanee
రచయిత: ఇమామ్ ముహమ్మద్ నాసిరుద్దీన్ అల్-అల్బానీ
ఆంగ్ల అనువాదం: అల్-ఇబానా బుక్ పబ్లిషింగ్ (Al-Ibaanah Book Publishing)
https://abdurrahman.org/?p=21224
తెలుగు అనువాదం : teluguislam.net

ఇది ఇమామ్ అల్-అల్బానీ (రహిమహుల్లాహ్) చేసిన ఒక ప్రసంగం యొక్క అనువదించబడిన లిఖిత రూపం (transcription). ఈ ప్రసంగం రికార్డ్ చేయబడి “హాదిహీ దఅవతునా” (ఇదే మా పిలుపు) అనే పేరుతో పంపిణీ చేయబడింది. ప్రస్తుత ఈ అనువాదం నేరుగా అరబిక్ ఆడియో నుండి అనువదించబడింది.

ఈ ప్రసంగంలో, సలఫీ మన్హజ్ (విధానం) యొక్క మూలాధారాన్ని ఇమామ్ అల్-అల్బానీ వివరించారు. ఆ విధానమేమిటంటే – సలఫ్‌ల (ముస్లింల మొదటి మూడు తరాల వారి) మార్గాన్ని, వారి అవగాహనను మరియు వారి ఆచరణను అనుసరించడం. ఆ మూడు తరాల వారు: సహాబాలు (ప్రవక్త అనుచరులు), తాబియీన్లు (సహాబాల అనుచరులు), మరియు అత్బాఉత్-తాబియీన్లు (తాబియీన్‌ల అనుచరులు). ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ క్రింది విధంగా చెప్పినప్పుడు సూచించింది వీరి గురించే: “మానవాళిలో అత్యుత్తమమైన వారు నా తరానికి చెందినవారు, ఆ తరువాత వచ్చే వారు, ఆ తరువాత వచ్చే వారు.”

ఇస్లాం వైపుకు పిలిచే సత్యమైన పిలుపును, ఇతర తప్పుడు మరియు దోషపూరితమైన పిలుపుల నుండి వేరుచేసే ప్రాథమిక ఆధారం ఇదే. ఇతర వర్గాల వారు తాము “ఖుర్ఆన్ మరియు సున్నత్‌ల పై ఉన్నాము” అని ఎంతగా దావా చేసినప్పటికీ సత్యం, అసత్యాల మధ్య అసలు భేదాన్ని ఈ ఆధారమే (సలఫ్‌ల మార్గమే) చూపుతుంది. ఈ వాస్తవాన్ని అల్-అల్బానీ (రహిమహుల్లాహ్) ఇందులో లోతుగా చర్చించారు, అదేమిటంటే – సలఫ్‌ల అవగాహన మరియు ఆచరణను అనుసరించనిదే ఎవరూ ఖుర్ఆన్ మరియు సున్నత్‌లను నిజంగా అర్థం చేసుకోలేరు మరియు ఆచరించలేరు. ఈ ప్రయత్నాన్ని అల్లాహ్ స్వీకరించి, దీని ద్వారా ముస్లింలకు ప్రయోజనం చేకూర్చాలని మేము దుఆ చేస్తున్నాము.

ప్రార్థనల (దుఆ) పుస్తకం (కితాబుద్దుఆ) – ముహమ్మద్ ఇక్బాల్ కీలానీ [పుస్తకం]

ప్రార్థనల పుస్తకం (కితాబుద్దుఆ)
సంకలనం: ముహమ్మద్ ఇక్బాల్ కీలానీ
అనువాదం: బద్రుల్ ఇస్లాం
ప్రకాశకులు:  హదీస్ పబ్లికేషన్స్, హైదరాబాద్, ఏ.పి.

ప్రార్థనల పుస్తకం (కితాబుద్దుఆ)
సంకలనం: ముహమ్మద్ ఇక్బాల్ కీలానీ
అనువాదం: బద్రుల్ ఇస్లాం
ప్రకాశకులు: హదీస్ పబ్లికేషన్స్, హైదరాబాద్, ఏ.పి.

[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [205 పేజీలు] [డెస్క్ టాప్ వెర్షన్ బుక్] [26.7 MB]

హదీసు విద్య పరిచయం – శాంతి మార్గం పబ్లికేషన్స్ [పుస్తకం]

హదీసు విద్య పరిచయం  (అమృత వచనాలు పుస్తకం లోని భాగం)

Introduction to Hadith Sciences in Telugu

హదీసు విద్య పరిచయం (అమృత వచనాలు పుస్తకం లోని భాగం)
Introduction to Hadith Sciences in Telugu

“హదీసు విద్య పరిచయం” పై తెలుగులో వెలువడుతున్న మొట్టమొదటి పుస్తకం
సంకలనం: ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ ముహమ్మద్ అహ్మద్ అలీ
శాంతిమార్గం పబ్లికేషన్ & చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్

[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [48 పేజీలు]
[7 MB]

హజ్ విధానం – షేక్ ముహమ్మద్ ఇబ్నె సాలిహ్ అల్ ఉసైమీన్ [పుస్తకం]

హజ్ విధానం - షేక్ ముహమ్మద్ ఇబ్నె సాలిహ్ అల్ ఉసైమీన్ [పుస్తకం]

Hajj Guide - Ibn Uthaymeen

హజ్ విధానం (Sifatul Hajj)
షేక్ ముహమ్మద్ ఇబ్నె సాలిహ్ అల్ ఉసైమీన్ [పుస్తకం]

Message of The Two Holy Mosques
Shar’i guidance content for the visitors of the Holy Mosque and the Prophet’s Mosque in languages

[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [50 పేజీలు]

  1. ప్రయాణానికి సంబంధించిన ఆదేశాలు
  2. హజ్ ఎప్పుడు విధి గావించబడింది?
  3. ప్ర: హజ్ లేదా ఉమ్రహ్ చేయాలనుకునే వారు ఎక్కడ నుండి ఇహ్రామ్ స్థితిలోనికి ప్రవేశించాలి?
  4. హజ్ పద్ధతులు మరియు వాటిలో ఉత్తమమైన పద్ధతి:
  5. తమత్తు హజ్ విధానం: ఉమ్రహ్ కొరకు ఇహ్రామ్ ధరించుట నుండి అంటే ప్రారంభం నుండి హజ్ ముగింపు వరకు సంక్షిప్తంగా
  6. తవాఫె విదా (వీడ్కోలు ప్రదక్షిణ)
  7. ఇహ్రామ్ స్థితిలో నిషిద్ధమైన విషయాలు
  8. ఈ నిషేధాలకు పాల్బడిన వ్యక్తిపై ఇస్లామీయ ధార్మిక తీర్పు
  9. మస్జిదె నబవీ సందర్శన

ఇస్లామీయ విశ్వాసం గురించి సారాంశము – షేఖ్ ముహమ్మద్ ఇబ్నె సాలిహ్ అల్ ఉసైమీన్ [పుస్తకం]

ఇస్లామీయ విశ్వాసం గురించి సారాంశము
షేఖ్ ముహమ్మద్ ఇబ్నె సాలిహ్ అల్ ఉసైమీన్ (రహిమహుల్లాహ్)

[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [67 పేజీలు]

  • ముందుమాట
  • ఇస్లాం ధర్మం
  • ఇస్లాం మూలస్తంభాలు
  • ఇస్లామీయ అఖీద పునాదులు
  • మహోన్నతుడైన అల్లాహ్ పై విశ్వాసం చూపటం.
  • దైవదూతల పట్ల విశ్వాసం
  • దైవగ్రంధాల పట్ల విశ్వాసం
  • దైవ సందేశహరుల పట్ల విశ్వాసం
  • పరలోకం పట్ల విశ్వాసం
  • విధివ్రాత పట్ల విశ్వాసం
  • ఇస్లామీయ అఖీద లక్ష్యాలు

దైవప్రవక్త యేసు (అలైహిస్సలాం) జీవిత గాధ [పుస్తకం]

Life History of Prophet Eesa
దైవప్రవక్త యేసు (అలైహిస్సలాం) జీవిత గాధ [పుస్తకం]

దైవప్రవక్త యేసు (ఆయనపై అల్లాహ్ శాంతి వర్షించుగాక) జీవిత గాధ
Life History of Prophet Esa (alaihissalam) (Telugu)
ఆధారం : ఖుర్ఆన్ కథామాలిక

కూర్పు : రచన అనువాద విభాగం, శాంతిమార్గం పబ్లికేషన్స్
శాంతిమార్గం పబ్లికేషన్స్ ట్రస్ట్, హైదరాబాద్

[పుస్తకము డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [మొబైల్ ఫ్రెండ్లీ] [56 పేజీలు] [ప్యాకెట్ సైజు]

  • మర్యమ్ ప్రవక్త ఈసా (అలైహిస్సలాం) గారి మాతృమూర్తి
  • దైవప్రవక్త ఈసా (అలైహిస్సలాం) జీవిత విశేషాలు
  • ఈనాటి క్రైస్తవ విశ్వాసం
  • క్రైస్తవ విశ్వాసం గురించి తలెత్తే ప్రశ్నలు
  • ఖుర్ఆన్ ను అడుగుదాం