ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) గారు సమాధి దగ్గర ఎంతలా ఏడ్చే వారంటే ఆయన గడ్డం తడిసిపోయేది

عَنْ هَانِئٍ مَوْلَى عُثْمَانَ قَالَ كَانَ عُثْمَانُ بْنُ عَفَّانَ إِذَا وَقَفَ عَلَى قَبْرٍ يَبْكِي حَتَّى يَبُلَّ لِحْيَتَهُ فَقِيلَ لَهُ تَذْكُرُ الْجَنَّةَ وَالنَّارَ وَلَا تَبْكِي وَتَبْكِي مِنْ هَذَا قَالَ إِنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ إِنَّ الْقَبْرَ أَوَّلُ مَنَازِلِ الْآخِرَةِ فَإِنْ نَجَا مِنْهُ فَمَا بَعْدَهُ أَيْسَرُ مِنْهُ وَإِنْ لَمْ يَنْجُ مِنْهُ فَمَا بَعْدَهُ أَشَدُّ مِنْهُ قَالَ وَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مَا رَأَيْتُ مَنْظَرًا قَطُّ إِلَّا وَالْقَبْرُ أَفْظَعُ مِنْهُ

ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) గారు బానిసత్వం నుండి విడిపించిన హానీ బర్’బరీ (రహిమహుల్లాహ్) ఉల్లేఖనం:

ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) గారు ఒక్కోసారి సమాధి దగ్గర ఉన్నప్పుడు ఎంతలా ఏడ్చే వారంటే ఆయన గడ్డం తడిసిపోయేది, అడిగే వాడు ఆయనతో అడిగినప్పుడు , (ఓ ఉస్మాన్) మీరు స్వర్గ నరకాల ప్రస్తావన వచ్చినప్పుడు ఏడ్వరు, కానీ సమాధిని చూసి ఎందుకు ఇంతలా ఏడుస్తున్నారు?

ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా బోధించారు: “సమాధి పరలోక మజలీలలో మొదటి మజిలీ ఎవరు ఇక్కడ సాఫల్యం పొందుతారో వారు తరువాత మజిలీలలో సాఫల్యాన్ని సులభతరాన్ని పొందుతారు, మరియు ఒకవేళ ఎవరైతే ఇక్కడ విఫలమవుతారో వారు తరువాత మజిలీలలో కూడా విఫలమవుతారు, ఇంకా ఎక్కువ కష్టాలకు లోనవుతారు, మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: “నేను ఏదైతే విషయాలు చూసానో వాటిలో సమాధి యాతన అన్నిటికి మించింది”

(హదీస్ సునన్ ఇబ్నెమాజ 4267) ( షేక్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీ అన్నారు)

మరణం, సమాధి శిక్షలు , అనుగ్రహాలు

కోవిడ్ 19 మరియు తెరచాటు లోకం (బర్-జఖ్, సమాధి లోకం) [ఆడియో]

బిస్మిల్లాహ్

[42:15 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

కరోనా వైరస్: https://teluguislam.net/corona/

సోదరులారా! ఇలాంటి స్థలం (సమాధి) కోసం సన్నాహాలు చేసుకోండి!

బిస్మిల్లాహ్

grave

పచ్చని ప్రపంచంలో భోగభాగ్యాలతో కూడిన జీవితం గడుపుతున్నవారలారా! తియ్యటి, మధురమైన ప్రపంచపు సుఖాలు అనుభవిస్తున్న వారలారా! రంగు రంగుల మనోహర ప్రపంచపు ఎండమావుల్లో తచ్చాడుతున్నవారలారా! అందమైన ప్రపంచ అందచందాల ఆహూతుల్లారా! శాశ్వతలోకాన్ని విడిచిపెట్టి క్షణభంగుర లోకం కోసం వెంపర్లాడుతున్న వారలారా!

అతి త్వరలోనే మనం ఓ దుర్భేద్యమైన కనుమ… మరణం… గుండా వెళ్ళి ఒక సుదీర్గమైన అత్యంత ప్రమాదకరమైన లోయ గుండా ప్రయాణించబోతున్నాం.

ఈ ప్రమాదకర లోయలో రేచీకటి లాంటి అంధకారం ఉంటుంది. సూర్య కిరణాలు ఉండవు, చంద్రుని వెన్నెల ఉండదు, నక్షత్రాల కాంతి ఉండదు, దీపాల వెలుతురూ ఉండదు, ఆఖరికి మిణుగురు పురుగుల మిణుకు కూడా కనిపించదు.

ఈ ప్రమాదకరలోయ భయంకర అడవిలాగా నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడ తల్లిదండ్రులు ఉండరు, భార్యా పిల్లలు ఉండరు, దుఃఖాల్లో పాలుపంచుకునేవాడు, దుఃఖాన్ని ఓదార్చేవాడు ఎవడూ ఉండడు. పీర్లు, ముర్షిద్‌లు ఉండరు. ఆపదలు తొలగించేవాడు, అవసరాలు తీర్చేవాడు, అంగరక్షకులు, బాడీగార్డులు ఎవరూ ఉండరు. పార్టీలు, పార్టీ నాయకులూ ఉండరు. అధ్యక్షత, మంత్రిత్వం లాంటి ఉన్నత పదవుల పలుకుబడులూ ఉండవు. సెనెట్‌, అసెంబ్లీల డాబు దర్పాలూ ఉండవు, కోర్టు బోనుల కోలాహలం ఉండదు. పోలీసు పదవీ పందేరాల గర్వమూ ఉండదు. సైనిక సత్కారాలు, నక్షత్రాల వైభవాలూ ఉండవు. ప్రభుత్వ ఉన్నత పదవుల హంగామా ఉండదు. విశాల జాగీరుల ప్రభుత్వం ఉండదు. కబ్జా దారుల ఆక్రమణ హస్తాలు ఉండవు. కిరాయి హంతకుల ఉగ్రవాద చర్యలు ఉండవు. రికమండేషను చేయటానికి బాబాయి మామయ్యలు ఉండరు. లంచం ఇవ్వటానికి అధర్మ సొమ్ము చెలామణి ఉండదు.

ఈ ప్రమాదకర లోయలో భయంకర క్రూరమృగాల భయం ఉంటుంది.

మట్టి ఇల్లు, మట్టి పాన్పు, మట్టి పడక ఉంటాయి. భయాందోళనలు కలుగుతుంటాయి. పురుగులు పాములు ఉంటాయి. విషపూరితమైన సర్పాలు, తేళ్లు ఉంటాయి. గుడ్డి, చెవిటి దూతలు గదలతో నించొని ఉంటారు. అక్కడి నుంచి పారిపోవటానికీ అవకాశం ఉండదు. నిలకడగా నించోవటానికీ వీలు పడదు!

అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను విశ్వసించిన వారలారా!

శుభ వార్తాహరుడుగా, హెచ్చరికలు చేసేవాడిగా పంపబడిన దైవప్రవక్త… ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి మాట కాస్త జాగ్రత్తగా వినండి!

“నేను సమాధికంటే తీవ్ర భయాందోళనకరమైన చోటు మరొకటి చూడలేదు.” (తిర్మిజీ)

ఓ బుద్దీ జ్ఞానాలు కలవారలారా!

మనోమస్తిష్కాలు కలవారలారా!

ఒంటరితనం, అంధకారం, ప్రమాదకరమైన నిర్మానుష్య లోయలోకి అడుగు పెట్టబోతున్న వారలారా!

వినండి! నిరాధార, నిస్సహాయ ప్రమాదకర ఈ లోయ ప్రయాణంలో విశ్వాసం మరియు సత్కర్మలు.. నమాజ్‌, జకాత్‌, ఉపవాసాలు, హజ్‌, ఉమ్రా, ఖుర్‌ఆన్‌ పారాయణం, దుఆలు సంకీర్తనలు, దానధర్మాలు, నఫిల్‌ సత్కార్యాలు, తల్లిదండ్రులపట్ల విధేయత, బంధువులతో సత్సంబంధాలు, అనాథులు, వితంతువుల పట్ల సత్ప్రవర్తన, న్యాయం, ధర్మం, మంచిని గురించి ప్రబోధించటం, చెడుల నుంచి నిరోధించటం మొదలగు సత్కర్మలే ప్రయాణ సామగ్రి. ఇవి భయాందోళనలు దూరం చేస్తాయి, వెలుతురునూ ప్రసాదిస్తాయి. ఇవి చేసుకుంటే ఒంటరితనమూ ఉండదు. ప్రాణానికి హాయిగానూ ఉంటుంది.

కనుక ప్రమాదకర లోయ ప్రయాణీకుల్లారా!

బయలుదేరేముందు మానవ మహోపకారి, దయామయుడు, అతి గొప్ప శ్రేయోభిలాషి అందరికంటే పెద్ద సానుభూతిపరుడు అయిన కారుణ్య ప్రవక్త  హితవును ఒకసారి శ్రద్ధగా వినండి…!

ఒకసారి ఆయన ఈ ప్రమాదకర లోయ అంచున కూర్చొని విలపించసాగారు. ఆయన సమాధి మట్టి సయితం తడిచిపోయింది. ఆ సందర్భంలో ఆయన తన అనుచరులను ఉద్దేశించి ఇలా అన్నారు:

“సోదరులారా! ఇలాంటి ప్రదేశం (సమాధి) కోసం సన్నాహాలు చేసుకోండి” (ఇబ్నెమాజా),

మరి మనలో కారుణ్య ప్రవక్త మాట విని…

ఆయన పిలుపుకు హాజరు పలికి…

ఈ అపాయకరమైన లోయ గుండా ప్రయాణించటం కోసం సన్నాహాలు చేసుకునేవారెవరండీ?!

వసల్లల్లాహు అలా నబియ్యినా ముహమ్మదిం వ్వ ఆలిహీ వ సహ్‌బిహీ అజ్‌మయీన్‌.


ఇది క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:

“సమాధి సంగతులు” [పుస్తకం] పరిచయ వాక్యాలు
కూర్పు : మౌలానా ముహమ్మద్‌ ఇఖ్‌బాల్‌ కైలానీ 
ప్రకాశకులు : హదీస్‌ పబ్లికేషన్స్‌. హైద్రాబాద్‌, ఏ.పి. ఇండియా

ఇస్లాంలో సమాధి శిక్ష లేదా? [ఆడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి: [ 10 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

సమాధిలో అనుగ్రహాలు అనుభవించడం, లేదా శిక్షలు చవిచూడడం తిరస్కరించడానికి ఏ తావు లేని సత్యం అయినా కొందరు ఈ రోజుల్లో తిరస్కరించడానికి ఎలా సాహసిస్తున్నారో ఆశ్చర్యం కలుగుతుంది. సమాధి శిక్షల గురించి ఖుర్ఆన్, హదీసుల సంక్షిప్త సమాచారం తెలుగులో ఈ ఆడియోలో వినండి.


ఒక సందర్భంలో షేఖ్ బిన్ బాజ్ (సఊదీ Ex గ్రాండ్ ముఫ్తీ) రహిమహుల్లాహ్ గారితో ప్రశ్నించడం జరిగింది ‘కొందరు సమాధి శిక్షలను నమ్మట్లేదు, ఎందుకనగా దాని ప్రస్తావన ఖుర్ఆనులో లేదట? వారికి ఏదైనా ఉపదేశం చేయండి!‘

అందుకు షేఖ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ ఇలా జవాబిచ్చారు:

సమాధి శిక్ష సత్యం, “తవాతుర్” (అంటే అసత్యం అన్న సందేహం లేని) సంఖ్యలో హదీసులున్నాయి, దీనిపై ముస్లిములందరీ ఏకాభిప్రాయం ఉంది. ఖుర్ఆనులో దీని గురించి ఆధారాలున్నాయి. ఉదాహరణకు చూడండి:

النَّارُ يُعْرَضُونَ عَلَيْهَا غُدُوًّا وَعَشِيًّا ۖ وَيَوْمَ تَقُومُ السَّاعَةُ أَدْخِلُوا آلَ فِرْعَوْنَ أَشَدَّ الْعَذَابِ

(ఇదిగో) అగ్ని – దాని ఎదుట వారు ప్రతి ఉదయం, సాయంత్రం రప్పించబడుతుంటారు. (ఇది సమాధి శిక్ష) మరి ప్రళయం సంభవించిననాడు, “ఫిరౌను జనులను దుర్భరమైన శిక్షలో పడవేయండి” (అని సెలవీయబడుతుంది). (దివ్య ఖురాన్ 40:46)

అల్లాహ్ సమాధి మరియు నరక శిక్షల నుండి రక్షించుగాక.

చెప్పే విషయం ఏమిటంటే: సమాధి శిక్షలను తిరస్కరించే వ్యక్తికి తౌబా చేయమని చెప్పాలి.అతను తౌబా చేయడానికి ఒప్పుకోక పోతే (ఇస్లామీయ ప్రభుత్వంలో) అతడ్ని కాఫిర్ గా డిక్లేర్ చేసి చంపేసెయ్యాలి. (అతని దుర్మార్గం ప్రబలకుండా). అల్లాహ్ ఇలాంటి దుర్గతి నుండి కాపాడుగాక.

https://binbaz.org.sa/fatwas/9795/حكم-من-ينكر-عذاب-القبر-لانه-لم-يذكر-في-القران

మరణం మరియు సమాధి శిక్షల వివరాలు, సందేహ సమాధానాలు [ఆడియో]

బిస్మిల్లాహ్

[వీడియో: 14 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

%d bloggers like this: