సూరహ్ అన్ నాస్ – ప్రతీ పదానికి అర్ధ భావాలు మరియు తఫ్సిర్ (Tafsir Surah An-Nas) [వీడియో]

[1/2] సూరహ్ అన్ నాస్ – ప్రతీ పదానికి అర్ధ భావాలు మరియు తఫ్సిర్ (Tafsir Surah An-Nas) – పార్ట్ 01
https://youtu.be/WDUnsY0M44c [40 నిముషాలు]
[2/2] సూరహ్ అన్ నాస్ – ప్రతీ పదానికి అర్ధ భావాలు మరియు తఫ్సిర్ (Tafsir Surah An-Nas) – పార్ట్ 02
https://youtu.be/p3lXJowIp0U [37 నిముషాలు]

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్
అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో

114:1  قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ
ఖుల్ అఊదు బిరబ్బిన్నాస్
(ఈ విధంగా) చెప్పు: “నేను మానవుల ప్రభువు రక్షణ కోరుతున్నాను.

114:2  مَلِكِ النَّاسِ
మలికిన్నాస్
మానవుల చక్రవర్తిని,

114:3  إِلَٰهِ النَّاسِ
ఇలాహిన్నాస్
మానవుల ఆరాధ్య దైవాన్ని (ఆశ్రయిస్తున్నాను) –

114:4  مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ
మిన్ షర్రిల్ వస్ వాసిల్ ఖన్నాస్
దురాలోచనలను రేకెత్తించే,తప్పించుకునే వాడి కీడు నుండి,

114:5  الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ
అల్లదీ యు వస్ విసు ఫీ శుదూరిన్నాస్
వాడు జనుల హృదయాలలో దురాలోచనలను రేకెత్తిస్తాడు –

114:6  مِنَ الْجِنَّةِ وَالنَّاسِ
మినల్ జిన్నతి వన్నాస్
వాడు జిన్ను వర్గానికి చెందినవాడైనా సరే, మానవ వర్గానికి చెందినవాడైనా సరే!

యూట్యూబ్ ప్లే లిస్ట్ – సూరహ్ ఫలఖ్, సూరహ్ నాస్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2HGHU2YlPz7otYjjkVQJDo

ఇస్లామీయ నిషిద్ధతలు 03: అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు జిబహ్ చేయుట, అల్లాహ్ హరాం చేసినదానిని హలాల్ చేయుట, లేదా హలాల్ చేసిన దానిని హరాం చేయుట, చేతబడి [వీడియో]

బిస్మిల్లాహ్

ఇస్లామీయ నిషిద్ధతలు (ముహర్రమాత్) – పార్ట్ 03 (23 జులై 2020)
[40:44 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [40:44 నిముషాలు]

ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]
https://teluguislam.net/2019/08/18/muharramat/

(3) జిబహ్ చేయుట

అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు జిబహ్ చేయుట (జంతువును బలి ఇచ్చుట) షిర్క్.

فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ

నీ ప్రభువు కొరకే నమజు చేయు మరియు ఖుర్బానీ ఇవ్వు. (కౌసర్ 108: 2).

అంటే అల్లాహ్ కొరకు మరియు అల్లాహ్ పేరుతో మాత్రమే జిబహ్ చేయి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఆదేశించారు:

لَعَنَ اللهُ مَنْ ذَبَحَ لِغَيْرِ الله

“అల్లాహ్ కు కాక ఇతరుల కోసం జిబహ్ చేయువానిపై అల్లాహ్ శపించాడు”. (ముస్లిం 1978).

జిబహ్ లో రెండు నిషేధాలు ఏకమవుతాయి. (1) అల్లాహ్ కు తప్ప ఇతరుల కోసం జిబహ్. (2) అల్లాహ్ పేరుతో కాకుండా ఇతరుల పేరుతో జిబహ్. ఈ రెండు కారణాల వల్ల ఆ జంతువు మాంసం తినడం యోగ్యం కాదు. ఈ రోజుల్లో జిన్నుల పేరు మీద జిబహ్ చేసే షిర్క్ ప్రభలి ఉంది. అదేమనగా; ఇల్లు కొనుగోళు చేసినా, నిర్మించినా అందులో ఎక్కడైనా లేదా ప్రత్యేకించి దాని గడప మీద, అలాగే బావి త్రవ్వినా, అక్కడే ఓ జంతువు జిబహ్ చేస్తారు. అది షైతాన్ (భూతాల)కు భయపడి, వాని నష్టం నుండి దూరముండుటకు వాని పేరు మీద జిబహ్ చేస్తారు. (వాస్త వేమిటంటే అల్లాహ్ ను కాక ఇతరులతో భయపడరాదు. ఇలాంటి జిబహ్ చేయరాదు). (తైసీరుల్ అజీజుల్ హమీద్ 158. దారుల్ ఇఫ్తా ముద్రణ).

(4) అల్లాహ్ హరాం చేసినదానిని హలాల్ చేయుట, లేదా హలాల్ చేసిన దానిని హరాం చేయుట

అల్లాహ్ హరాం చేసినదానిని హలాల్ చేయుట, లేదా అల్లాహ్ హలాల్ చేసినదానిని హరాం చేయుట, లేదా ఇలాంటి హక్కు అల్లాహ్ తప్ప ఇతరులకు ఉంది అని నమ్ముట, లేదా సమస్యల తీర్పు కొరకు ఇస్లాం ధర్మం కాకుండా ఇతర న్యాయస్థానాలకు వెళ్ళుట, మరియు ఇస్లామీయ చట్టాలతో కాకుండా ఇతర చట్టాలతో తీర్పు కోరుట, లేదా అది యోగ్యమేనని సంతోషంగా నమ్ముట ఎంతటి భయంకరమైన అవిశ్వాసంలోకి వస్తుందో ఈ ఆయతు ద్వారా తెలుసుకోండి:

اتَّخَذُوا أَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ أَرْبَابًا مِنْ دُونِ اللهِ

వారు (యూదులుక్రైస్తవులు) అల్లాహ్ ను కాదని తమ పండితులను, తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు. (తౌబా 9: 31).

ఈ ఆయతు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పఠిస్తుండగా, అదీ బిన్ హాతిం (రజియల్లాహు అన్హు) విని, ప్రవక్తా! యూదులు, క్రైస్తవులు తమ పండితులను, సన్యాసులను ఆరాధించేవారు కారు కదా? అని చెప్పగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అవును, కాని అల్లాహ్ హరాం చేసిన దానిని వారి పండితులు, సన్యాసులు హలాల్ చేస్తే వారు దానిని హలాల్ గానే భావించే వారు. ఇంకా అల్లాహ్ హలాల్ చేసినదానిని వారి పండితులు, సన్యాసులు హరాం చేస్తే వారు దానిని హరాంగానే భావించేవారు. కనుక ఇది వారిని ఆరాధించినట్లు” అని సమాధానం చెప్పారు. (బైహఖీ ఫీ సుననిల్ కుబ్రా 10/116, తిర్మిజి 3095, ఇది హసన్ అని షేఖ్ అల్బానీ గాయతుల్ మరాం 19లో తెలిపారు).

నిషిద్ధతలను నిషిద్ధంగా నమ్మనివారు యూదులు, క్రైస్తవులు మరియు బహుదైవారాధకులు అని అల్లాహ్ ఈ క్రింది ఆయతులలో స్పష్టం చేశాడు:

وَلَا يُحَرِّمُونَ مَا حَرَّمَ اللهُ وَرَسُولُهُ وَلَا يَدِينُونَ دِينَ الحَقِّ

అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషిద్ధంగా నిర్ణయించిన దానిని వారు నిషిద్ధంగా భావించరు. ఇంకా సత్యధర్మాన్ని వారు తమ ధర్మంగా చేసుకోరు. (తౌబా 9: 29).

قُلْ أَرَأَيْتُمْ مَا أَنْزَلَ اللهُ لَكُمْ مِنْ رِزْقٍ فَجَعَلْتُمْ مِنْهُ حَرَامًا وَحَلَالًا قُلْ آَللهُ أَذِنَ لَكُمْ أَمْ عَلَى اللهِ تَفْتَرُونَ

ఇలా అను: మీరు ఆలోచించరా! అల్లాహ్ మీ కొరకు అవతరింపజేసిన జీవనోపాధిలో నుండి మీరు స్వయంగానే కొన్నింటిని హరాం చేసు కున్నారు. మరికొన్నింటిని హలాల్ చేసుకున్నారు. ఇలా అడుగు: ఇలా చేయడానికి అల్లాహ్ మీకు అనుమతించాడా? లేదా మీ బూటక కల్పనలను అల్లాహ్ కు అంటగట్టుతున్నారా?. (యూనుస్ 10: 59).

(5) చేతబడి

చేతబడి (చేయుట, చేయించుట, నేర్పుట, నేర్చుకొనుట) అవిశ్వాసంలో లెక్కించ బడుతుంది. అది వినాశనానికి గురి చేసే ఏడు మహాపాపాల్లో ఒకటి. అది నష్టమే కలుగజేస్తుంది తప్ప ఏమీ లాభం కలగజేయదు. దానిని నేర్చుకొనుట గురించి అల్లాహ్ ఇలా తెలిపాడు:

وَيَتَعَلَّمُونَ مَا يَضُرُّهُمْ وَلَا يَنْفَعُهُم

వారు నేర్చుకునేది వారికి నష్టం కలిగించేదే కాని లాభం కలిగించేది ఎంత మాత్రం కాదు.  (బఖర 2: 102). మరో చోట ఇలా తెలిపాడు:

وَلَا يُفْلِحُ السَّاحِرُ حَيْثُ أَتَ

మాంత్రికుడు ఎన్నడూ సఫలుడు కానేరడు. వాడు ఎటు నుంచి, ఎలా వచ్చినా సరే. (తాహా 19: 69).

చేతబడి చేయువాడు అవిశ్వాసి. చదవండి అల్లాహ్ ఆదేశం:

وَمَا كَفَرَ سُلَيْمَانُ وَلَكِنَّ الشَّيَاطِينَ كَفَرُوا يُعَلِّمُونَ النَّاسَ السِّحْرَ وَمَا أُنْزِلَ عَلَى المَلَكَيْنِ بِبَابِلَ هَارُوتَ وَمَارُوتَ وَمَا يُعَلِّمَانِ مِنْ أَحَدٍ حَتَّى يَقُولَا إِنَّمَا نَحْنُ فِتْنَةٌ فَلَا تَكْفُرْ

సులైమాను ఎన్నడూ అవిశ్వాసానికి ఒడిగట్ట లేదు. అసలు అవిశ్వాసానికి పాల్పడినది ప్రజలకు చేతబడిని బోధించే షైతానులే. వారు హారూత్, మారూత్ దేవదూతల ద్వారా (ఇరాఖ్ లోని) బాబీలోనియాలో అవతరింప జేసినదాని వెంట బడ్డారు. ఎవడికైనా ఆ విద్యను నేర్పినప్పుడు ఆ దేవ దూతలు స్పష్టంగా ఇలా హెచ్చరిక చేసేవారుః జాగ్రత్త! మేము (మానవు లకు) కేవలం ఒక పరీక్ష మాత్రమే. కనుక మీరు (జాలవిద్యను నేర్చుకొని) అవిశ్వాసులు కాకండి. (బఖర 2: 102).

మాంత్రికుని గురించిన ఆదేశమేమిటంటే అతడ్ని హతమార్చాలి. అతని సంపద కూడా నిషిద్ధమైన చెడు సంపద. అజ్ఞానులు, దుర్మార్గులు, బలహీన విశ్వాసులు మాంత్రికుల వద్దకు వెళ్ళి , ఇతురలపై అన్యాయం, దౌర్జన్యం చేయడానికి, లేదా ప్రతీకారం తీర్చుకోడానికి చేతబడి చేయిస్తారు. మరికొందరు తనపై చేయబడిన చేతబడిని దూరం చేయించు- కోడానికి మాంత్రికుని వద్దకు వెళ్ళి ఓ నిషిద్ధ కార్యానికి పాల్పడతారు. ఇలాంటప్పుడు మాంత్రికుల వద్దకు వెళ్ళకుండా అల్లాహ్ వైపునకు మరలి, ‘ముఅవ్విజాత్’ వంటి అల్లాహ్ పవిత్రవచనాల ఆధారంగా అల్లాహ్ తో స్వస్థత కోరాలి. (ముఅవ్విజాత్ అంటే సూర ఫలఖ్, సూర నాస్ మరియు దీనికి సంబంధించిన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నేర్పిన దుఆలు).