మగవారు దుస్తులు చీలమండలం (ankles) క్రిందికి ధరించడం

బిస్మిల్లాహ్

 

దుస్తులు చీలమండలం క్రిందికి ఉంచుట men wearing below ankles

ప్రజలు దీన్ని చిన్న విషయంగా, విలువలేనిదిగా భావిస్తారు. కాని ఇది అల్లాహ్‌ దృష్టిలో పెద్ద పాపాల్లో ఒకటి. అంటే లుంగి, ప్యాంట్‌ వగైరా చీల మండలం క్రిందికి ఉంచుట. కొందరి దుస్తులు నేలకు తాకుతూ ఉంటాయి. మరికొందరివి భూమిమీద  వ్రేలాడుతూ ఉంటాయి.

అబూజర్‌ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసులో ఇలా ఉంది:

“మూడు రకాల వ్యక్తులున్నారు. అల్లాహ్‌ వారితో సంభాషించడు. దయాభావంతో కన్నెత్తి చూడడు. వారిని పరిశుద్ధ పరచడు. వారికి తీవ్రమైన శిక్ష విధిసాడు. తన లుంగి (ప్యాంటు…) ను చీలమండలానికి క్రింది వరకు ఉంచేవాడు. ఉపకారం చేసి మాటిమాటికి చెప్పుకునేవాడు. దెప్పి పొడిచేవాడు. తన సరుకును అసత్య ప్రమాణాలతో అమ్మేవాడు” (ముస్లిం 106).

కొందరు, నేను గర్వకారణంగా తొడగడం లేదు అని చెప్పి తన పవిత్రతను చాటుకుంటాడు. కాని అతని మాట చెల్లదు. గర్వం ఉద్దేశ్యం ఉన్నా లేకపోయినా అన్ని స్దితుల్లో అది నిషిద్ధం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఈ హదీసును గమనించండి:

“ఎవరి లుంగి (ప్యాంటు వగైరా) చీలమండలానికి క్రిందికి ఉండునో అది అగ్నికి ఆహుతి అవుతుంది”. (నిసాయీ 5330, ముస్నద్‌ అహ్మద్‌ 6/254).

ఒకవేళ గర్వంతో క్రిందికి వదిలితే. దాని శిక్ష ఇంకా పెద్దది, భయంకర మైనది. ఇదే తరహా స్పష్టీకరణ ప్రవక్తగారి ఈ ప్రవచనంలో ఉన్నది:

“ఎవరైతే తన వస్త్రాన్ని గర్వంతో వ్రేలాడ దీస్తాడో ప్రళయదినాన అల్లాహ్‌ అతని వైపు కన్నెత్తి చూడడు’. (బుఖారి 3665, ముస్లిం 2085).

ఎందుకనగా అందులో రెండురకాల నిషిద్ధతలున్నాయి. ఒకటి గర్వం, రెండవది చీలమండలం క్రిందికి ధరించడం.

చీలమండలానికి క్రింద ధరించే నిషిద్ధత అన్ని రకాల దుస్తులపై ఉంది. అబ్దుల్లాహ్ బిన్‌ ఉమర్‌ (రజియల్లాహు అన్హు)  ప్రవక్తతో ఉల్లేఖించారు:

“లుంగీని, చొక్కాను మరియు తలపాగను (చీలమండలానికి క్రిందకి) వ్రేలాడదీయుట (ఘోరపాపం). అయితే ఎవరైతే వీటిలో ఏ ఒక్కటినైనా గర్వంతో వ్రేలాడతీస్తాడో, ప్రళయ దినాన అల్లాహ్‌ అతనివైపు కన్నెత్తి చూడడు ‘. (అబూదావూద్‌ 4094, సహీహుల్‌ జామి 2770).

ఈ నిషిద్ధత స్త్రీలకు కూడా వర్తిస్తుంది. అయితే వారి శరీరంలో ఏ కొంత భాగం కూడా పరపురుషులకు కనబడకుండా ఉండుట తప్పనిసరి గనక ఆమె తన పాదాలు కనబడకుండా ఒక జానెడు లేదా రెండు జానలు క్రిందికి వ్రేలాడదీయవచ్చును. కాని అంతకంటే ఎక్కువ వ్రేలాడదీయుట యోగ్యం కాదు. దీని గురించి తిర్మిజి (1731) మరియు నిసాయి (5336)లో ఉమ్మెసల్మా (రజియల్లాహు అన్హా)  సంఘటన చదవండి.

కొందరు పెళ్ళికూతుళ్ళు ధరించే దుస్తులు మీటర్‌ కంటే ఎక్కువ క్రిందికి ఉంటాయి. ఒక్కోసారి అంతకంటే పొడుగ్గా ఉంటాయి, వెనక ఉన్నవారు ఎత్తిపట్టుకోవాల్సి వస్తుంది. ఇలా యోగ్యం కాదు.


[ఇది ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన “ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలుఅను పుస్తకం నుంచి తీసుకుబడింది. ]

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/

%d bloggers like this: