ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) – పార్ట్ 04: మేజోళ్ళ (సాక్సులు) పై ‘మసహ్‌’ QA [వీడియో]

బిస్మిల్లాహ్

[42:19 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

అంశాలు: మేజోళ్ళ (సాక్సులు) పై ‘మసహ్‌’

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

మేజోళ్ళ పై ‘మసహ్’

ఇస్లాం ధర్మం యొక్క సులువైన, ఉత్తమ విషయం ఒకటి: మేజోళ్ళపై ‘మసహ్‘ చేసే అనుమతివ్వడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ‘మసహ్’ చేసేవారని రుజువైనది:

عَنْ عَمْرِو بْنِ أُمَيَّةَ t قَالَ: رَأَيْتُ النَّبِيَّ يَمْسَحُ عَلَى عِمَامَتِهِ وَخُفَّيْهِ.

అమ్ర్ బిన్ ఉమయ్య చెప్పారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ తలపాగ మరియు మేజోళ్ళపై ‘మసహ్’ చేస్తున్నది నేను చూశాను. (బుఖారి 205).

عَنِ المُغِيرَةِ  بِن شُعْبَةِ t قَالَ: بَيْنَا أَنَا مَعَ رَسُولِ الله ذَاتَ لَيْلَةٍ إِذْ نَزَلَ فَقَضَى حَاجَتَهُ ثُمَّ جَاءَ فَصَبَبْتُ عَلَيْهِ مِنْ إِدَاوَةٍ كَانَتْ مَعِي فَتَوَضَّأَ وَمَسَحَ عَلَى خُفَّيْهِ.

ముగీర బిన్ షొఅబ చెప్పారుః ఒక రాత్రి నేను ప్రవక్తతో ఉండగా, ఆయన ఒక చోట మజిలీ చేసి (ఓ చాటున) కాలకృత్యాలు తీర్చుకొని వచ్చారు, అప్పుడు నా వద్ద ఉన్న చెంబుతో నీళ్ళు పోశాను ఆయన వుజూ చేశారు. చివరిలో తమ మేజోళ్ళపై ‘మసహ్’ చేశారు. (బుఖారి 203, ముస్లిం 274).

వాటి పై ‘మసహ్’ చేయుటకు నిబంధనలు ఏమిటంటే అవి వుజూ చేసిన తర్వాత తొడిగి యుండాలి. పై భాగాన ‘మసహ్’ చేయాలి, క్రింది భాగాన కాదు.

‘మసహ్’ గడువు

స్థానికులు ఒక పగలు ఒక రాత్రి, ప్రయాణికులు (ఏ ప్రయాణంలో నమాజ్ ఖస్ర్ చేయవచ్చునో ఆ ప్రయాణంలో) మూడు రేయింబవళ్ళు మేజోళ్ళపై ‘మసహ్’ చేయవచ్చును. (వుజూ చేసి తొడిగిన తరువాత వుజూ భంగమయిన క్షణం నుంచీ గడువు మొదలవుతుంది).

‘మసహ్’ భంగమయే కారణాలు

గడువు ముగిసిన మరుక్షణం నుంచే ‘మసహ్’ భంగమైపోతుంది. ‘మసహ్’ చేసిన తరువాత కనీసం ఒకసారైనా తీసినట్లయితే ‘మసహ్’ భంగమవుతుంది. లేదా మనిషి (స్వప్నస్ఖలనం లేదా భార్యభర్తల సంభోగం కారణంగా) అశుద్ధతకు లోనైతే ‘మసహ్’ భంగమవుతుంది. స్నానం చేయుటకై అవి తీయడం కూడా తప్పనిసరి.


ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు

%d bloggers like this: