[3 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
Category: Home
ఇస్లాంలో ఇంటి పేరు (surname) పెట్టుకోవచ్చా? [వీడియో]

[7:41 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
కొత్త ఇల్లు కట్టుకొనే ముందు ఏమి చెయ్యాలి? [వీడియో]

[7:05 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫోన్ చేసినప్పుడు ముందు ఎవరు “అస్సలాము అలైకుం” చెప్పాలి? [వీడియో]

[3:05 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
బయటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ప్రవేశించినపుడు చెడు, కీడు నుండి రక్షణ కొరకు
عَنْ أَبِي هُرَيْرَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ
” إِذَا خَرَجْتَ مِنْ مَنْزِلِكَ فَصَلِّ رَكْعَتَيْنِ تَمْنَعانِكَ مَخْرَجَ السَّوْءِ، وَإِذَا دَخَلْتَ مَنْزِلَكَ فَصَلِّ رَكْعَتَيْنِ تَمْنَعانِكَ مَدْخَلَ السَّوْءِ “
అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
“నీవు ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు రెండు రకాతుల నమాజు చేయి, ఆ రెండు రకాతుల వల్ల అల్లాహ్ నిన్ను బయటి చెడుల, కీడుల నండి కాపాడుతాడు. అలాగే ఇంట్లో ప్రవేశించావంటే రెండు రకాతుల నమాజు చేయి, వాటి మూలంగా అల్లాహ్ నిన్ను ఇంట్లోని చెడు, కీడు నుండి కాపాడతాడు.”
[సహీహా 1323. సహీహుల్ జామి 505]
కూర్పు, తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
కరోనా వైరస్ కారణంగా మస్జిదులు మూతపడటం మరియు ఇంట్లోనే నమాజులు చేసుకొనడం [ఆడియో]
ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [14:47 నిమిషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఇతరములు:
తిన్న తర్వాత, త్రాగిన తర్వాత అల్హందు లిల్లాహ్ అనండి
ఇంట్లో ప్రవేశిస్తూ సలాం చేయు ఘనత!
అల్ హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్! అమ్మా బ’అద్
అల్లాహ్ (సుబహాన వ త’ఆలా) ఆదేశం చదవండి:
يَٰأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَدْخُلُوا۟ بُيُوتًا غَيْرَ بُيُوتِكُمْ حَتَّىٰ تَسْتَأْنِسُوا۟ وَتُسَلِّمُوا۟ عَلَىٰٓ أَهْلِهَا ۚ ذَٰلِكُمْ خَيْرٌۭ لَّكُمْ لَعَلَّكُمْ تَذَكَّرُونَ
ఓ విశ్వాసులారా! మీరు మీ ఇళ్లల్లోకి తప్ప ఇతరుల ఇళ్లల్లోకి వారి అనుమతి పొందనంతవరకూ, అక్కడున్న వారికి ‘సలామ్’ చేయనంతవరకూ ప్రవేశించకండి. ఇదే మీ కొరకు మేలైన పద్ధతి. మీరు గుర్తుంచుకునేందుకుగాను (ఈ విధంగా బోధపరచ బడింది). (ఖుర్’ఆన్ 24 : 27)
ఇంట్లో ప్రవేశిస్తూ సలాం చేయుట వలన హదీసులలో మంచి ప్రతిఫలం మరియు ఉన్నతమైన ప్రయోజనాలు కలిగివున్నాయి.
దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి భోదనలు చదవండి:
عَنْ أَبِي أُمَامَةَ رَضِيَ اللهُ عَنْهُ: أَنَّ رَسُولَ اللهِ – صلى الله عليه وسلم – قَالَ: «ثَلاثَةٌ كُلُّهُمْ ضَامِنٌ عَلَى اللهِ إِنْ عَاشَ رُزِقَ وَكُفِي، وَإِنْ مَاتَ أَدْخَلَهُ اللهُ الْجَنَّة، مَنْ دَخَلَ بَيْتَهُ فَسَلَّمَ فَهُوَ ضَامِنٌ عَلَى اللهِ …»
హజ్రత్ అబూ ఉమామా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:
ముగ్గురు; వారిలో ప్రతి ఒక్కరి గురించి అల్లాహ్ పూచి (జమానత్) తీసుకున్నాడు, వారు బ్రతికి ఉంటే అల్లాహ్ ఉపాధి ప్రసాదిస్తాడు, అల్లాహ్ వారికి సరిపోతాడు. ఒకవేళ చనిపోతే అల్లాహ్ వారిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. ఆ ముగ్గురిలో ఒకరు: తన ఇంట్లో ప్రవేశిస్తూ సలాం చేసే వ్యక్తి గురించి అల్లాహ్ పూచి తీసుకున్నాడు. [సహీ ఇబ్ను హిబ్బాన్ 499, సహీహుత్ తర్గీబ్ 321]
عَنْ أَنَسِ بْنِ مَالِكٍ، قَالَ: قَالَ لِي رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: «يَا بُنَيَّ إِذَا دَخَلْتَ عَلَى أَهْلِكَ فَسَلِّمْ يَكُونُ بَرَكَةً عَلَيْكَ وَعَلَى أَهْلِ بَيْتِكَ»
హజ్రత్ అనస్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకు ఇలా తెలిపారు:
“ఓ సుపుత్రుడా! నీవు ఇంట్లో ప్రవేశిస్తూ ఇంటివారికి సలాం చేయి, ఇందులో నీ కొరకు మరియు నీ ఇంటి వారి కొరకు శుభము గలదు.”
(తిర్మిజి 2698, సహీహుత్ తర్గీబ్ 1608).
సారాంశం:
- 1- ఇంట్లో ప్రవేశిస్తూ సలాం చేయాలి.
- 2- ప్రవేశించు వ్యక్తి చేయాలి, అతను చిన్నవాడైనా, పెద్దవాడైనా, పురుషుడైనా, స్త్రీ అయినా ఎవరైనా సరే.
- 3- సలాం చేసే వారు అల్లాహ్ పూచిలోకి వస్తారు.
- 4- బ్రతికి ఉంటే ఉపాధి, అల్లాహ్ రక్షణ పొందుతారు.
- 5- సలాం చేసేవారికి, ఇంటి వారికి శుభం ప్రాప్తమవుతుంది.
- 6- మరణిస్తే స్వర్గంలో ప్రవేశిస్తారు.
- 7- సహీ హదీసులో వచ్చిన సలాం పదాలు: అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరుకాతుహు.
- 8- అస్సలాము అలైకుం అంటే పది (10) పుణ్యాలు.
- 9- అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అంటే ఇరువై (20) పుణ్యాలు
- 10- అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు అంటే ముప్పై (30) పుణ్యాలు.
- 11- అస్సలాము అలైకుం…. తప్ప గుడ్ మార్నింగ్ అని లేదా వేరే పదాలు పలకుతూ ఇంట్లో ప్రవేశించడం ముస్లింలకు తగదు.
అల్లాహ్ మనందరికీ సధ్బుధ్ధిని మరియు సంపూర్ణ ఇస్లామ్ ఙ్ఞానాన్ని మరియు దాని మీద జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.
మీసోదరుడు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
![తిన్నత్రాగిన తర్వాత అల్ హందులిల్లాహ్ అనండి: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారని అనస్ బిన్ మాలిక్ ఈ ఉల్లేఖించారు: “మానవుడు ఏదైనా తిన్న తర్వాత లేదా ఏదైనా త్రాగిన తర్వాత అల్ హందు లిల్లాహ్ అనడం అల్లాహ్కు చాలా ఇష్టం. (ముస్లిం 2734). [పుణ్యఫలాలు| ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ].](https://i0.wp.com/teluguislam.net/wp-content/uploads/2019/12/after-eating-drinking-say-alhamdulillaah.jpg?resize=300%2C400&ssl=1)
You must be logged in to post a comment.