రెండు తోటల యజమాని కధ: అహంకారానికి అంతం వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/Z07VIyo51W0 [27 నిముషాలు]
ఈ ప్రసంగంలో, సూరత్ అల్-కహఫ్‌లో ప్రస్తావించబడిన “రెండు తోటల యజమాని” కథ ద్వారా అహంకారం (కిబ్ర్) యొక్క వినాశకరమైన పర్యవసానాలను వివరించబడింది. సంపద మరియు సంతానం అనేవి అల్లాహ్ నుండి వచ్చిన పరీక్షలని, వాటి పట్ల గర్వపడకుండా, ‘మాషా అల్లాహ్’ అంటూ వినమ్రతతో కృతజ్ఞత చూపాలని ఈ కథ ద్వారా నేర్చుకోవచ్చు. సత్యాన్ని తిరస్కరించడం మరియు ఇతరులను తక్కువగా చూడటమే అహంకారం అని, దీనికి ఉదాహరణగా ఇబ్లీస్ మరియు ఖారూన్‌ల కథలు చెప్పబడ్డాయి. అహంకారం మనిషిని స్వర్గానికి దూరం చేస్తుందని హదీసుల ద్వారా హెచ్చరించబడింది. దీనికి విరుద్ధంగా, వినమ్రత అల్లాహ్ దృష్టిలో ఒక వ్యక్తి స్థాయిని పెంచుతుంది. చివరగా, అల్లాహ్‌ను స్మరించడం, పేదలతో గడపడం, మరియు వినమ్రతను అలవర్చుకోవడం ద్వారా అహంకారం నుండి రక్షణ పొందవచ్చని సూచించబడింది.
అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్ వలా ఉద్వాన ఇల్లా అలజ్జాలిమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బాద్.
సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సకల ప్రశంసలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్‌కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.
రెండు తోటల యజమాని అహంకారం
అభిమాన సోదరులారా, రెండు తోటల యజమాని: అహంకారానికి అంతం.
ఈ రెండు తోటల యజమాని అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరత్ కహఫ్‌లో ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఈ రెండు తోటల అతని గురించి సూరత్ కహఫ్‌లో ఆయత్ 32 నుంచి 44 వరకు ఆ ప్రస్తావన ఉంటుంది.
(ఓ ప్రవక్తా!) వారికి ఆ ఇద్దరు వ్యక్తుల ఉదాహరణను కూడా వినిపించు – వారిలో ఒకతనికి మేము రెండు ద్రాక్ష తోటలను ఇచ్చాము. వాటి చుట్టూ ఖర్జూరపు చెట్ల కంచెను నిర్మించాము. ఆ రెంటికీ మధ్య పచ్చని పంట పొలాలను కూడా వొసగాము. (18:32)
ఈ విధంగా ఈ ప్రస్తావన ఆయత్ 44 వరకు ఉంటుంది.
అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఉద్దేశించి ఈ ఉదాహరణ వినిపించు అని అంటున్నాడు. అంటే ఏంటి ఈ ఉదాహరణ? దీంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తికి రెండు అందమైన తోటలు ఉన్నాయి. ద్రాక్ష తోటలు, ఖర్జూరపు వృక్షాలు. మధ్యలో పంట పొలాలు, నీరు ప్రవహించే నదులు. అతనికి అపారమైన సంపద, కుటుంబ బలం ఉంది.
ఈ కారణంగా ఈ వ్యక్తి తన స్నేహితునితో గర్వంగా ఇలా అన్నాడు, “నా సంపద నీకంటే ఎక్కువ. నా కుటుంబ బలం నీకంటే ఎక్కువ. ఈ తోట ఎప్పటికీ నశించదు, ఖియామత్ రోజు కూడా రాదు.” ఒకపక్కన ఈ తోట మూలంగా గర్వపడుతున్నాడు. ఎప్పటికీ ఇలాగే ఈ తోటలు, ఈ ధనం ఇలాగే ఉండిపోతుంది అనే ఒక పక్కన గర్వపడతా ఉంటే, అదే గర్వంతో “ఖియామత్ కూడా రాదు. వచ్చినా కూడా నేను ఇక్కడి కంటే మంచి ఫలమే పొందుతాను” అని గర్వంలో ఉప్పొంగిపోతున్నాడు.
ఇది స్పష్టమైన అహంకారం, కిబ్ర్, మరియు అల్లాహ్‌పై అవిశ్వాసం. ఈ ధనవంతుడు ఇలా చెప్పాడు తన స్నేహితునితో, ఆ స్నేహితుడు పేదవాడు. ఈ ఉదాహరణలో ఇద్దరు వ్యక్తుల ఉదాహరణ, ఒక వ్యక్తి ఈ అహంకారి, గర్విష్ఠి, ఇంకో వ్యక్తి పేదవాడు కానీ విశ్వాసి, అల్లాహ్‌పై నమ్మకం గలవాడు.
ఈ గర్విష్ఠి చెప్పిన మాటలు విని తన స్నేహితుడు ఇలా అన్నాడు. వినమ్రంగా హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడు? “నీకు ఈ తోట ఇచ్చింది ఎవరు? అల్లాహ్ మాత్రమే కదా? మరి
مَا شَاءَ اللَّهُ لَا قُوَّةَ إِلَّا بِاللَّهِ (మాషా అల్లాహ్ లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్) ‘అల్లాహ్ తలచినదే అవుతుంది. అల్లాహ్ ద్వారా లభించే శక్తి తప్ప వేరే శక్తి ఏదీ లేదు’(18:39)
అని చెప్పాలి కదా? అల్లాహ్ చిత్తమే, శక్తి అంతా ఆయనదే, అల్లాహ్ తలిస్తేనే జరిగింది, అల్లాహ్ ఇవ్వకపోతే ఎవ్వరూ ఇవ్వలేరు అని ఎందుకు చెప్పలేదు? నేను పేదవాడిని కావచ్చు, కానీ అల్లాహ్ నిన్ను శిక్షించవచ్చు, నీ గర్వానికి, నీ అహంకారానికి, నీ తిరస్కారానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా శిక్షించవచ్చు” అని ఆ పేద స్నేహితుడు వినమ్రంగా అతనికి తెలియపరిచాడు.
కానీ ఏమైంది? అహంకారానికి అంతమైంది. కొద్ది కాలంలోనే ఒక విపత్తు వచ్చింది, ఆ తోటలు పూర్తిగా నాశనం అయ్యాయి, చెట్లు పడిపోయాయి, పంటలు కాలిపోయాయి. అప్పుడు ఆ రెండు తోటల యజమాని ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోటలను నాశనం చేశాడో, చెట్లను ఇది చేసేసాడో, పంటలు కాల్చేశాడో, ఆ తర్వాత కుమిలిపోతూ, చేతులు మలుచుకుంటూ, పశ్చాత్తాపంతో ఇలా అన్నాడు:
يَا لَيْتَنِي لَمْ أُشْرِكْ بِرَبِّي أَحَدًا (యా లయ్తనీ లమ్ ఉష్రిక్ బిరబ్బీ అహదా) “అయ్యో! నేను నా ప్రభువుకు సహవర్తులుగా ఎవరినీ నిలబెట్టకుండా ఉంటే ఎంత బావుండేది!” (18:42)
ఇది కథ, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరత్ కహఫ్‌లో ప్రస్తావించిన కథ ఇది. రెండు తోటల యజమాని, అహంకారంతో విర్రవీగిపోయాడు, నాకు ఎప్పుడూ పేదరికం రాదు, ఇలాగే ధనవంతుడినిగానే నేను ఉంటాను, నా ధనం నాతోనే ఉంటుంది, నా పంటలు, నా పొలము ఇవన్నీ నాతోపాటే ఉంటాయి, ఇంకో పక్క ఖియామత్ అనేది ఏమీ లేదు అని చెప్పిన అహంకారి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొద్ది కాలం తర్వాత, నసీహత్ చేసేప్పుడు కూడా అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు, అతను నసీహత్ కూడా చేశాడు, మంచి మాటలు చెప్పాడు. అయినా కూడా అతని అహంకారానికి ఎటువంటి ఇది రాలేదు కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతని తోటలను పూర్తిగా నాశనం చేశాడు. అప్పుడు ఆయన నేను షిర్క్ చేయకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది అని బాధపడుతూ కుమిలిపోయాడు. కానీ ఆలస్యమైపోయింది.
ఈ కథలోని ప్రధాన పాఠాలు
[1] అహంకారం పెద్ద పాపం: మొదటి విషయం, ఇస్లాం ధర్మంలో అహంకారం పెద్ద పాపం.
మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:
అంటే స్వర్గ ప్రవేశానికి అర్హులు ఎవరు? ఆవగింజంతైనా కూడా కిబ్ర్, గర్వం అనేది ఉండనివాడు. కొంచెమైనా కిబ్ర్, గర్వం, అహంకారం ఉంటే అటువంటి వ్యక్తి స్వర్గానికి అర్హుడు కాదు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అహంకారం అంటే సత్యాన్ని తిరస్కరించడం, ఇతరులను తక్కువగా చూడటం, చిన్నచూపు చూడటం.
[2] సంపద ఒక పరీక్ష మాత్రమే: రెండవ విషయం ఏమిటి ఈ కథలో, ఈ ఉదాహరణలో? సంపద అనేది ఒక పరీక్ష మాత్రమే.
అల్లాహ్ సంపదను అనుగ్రహంగా ఇస్తాడు, కానీ అది పరీక్ష కూడా అవుతుంది.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు సూరత్ అన్ఫాల్‌లో:
وَاعْلَمُوا أَنَّمَا أَمْوَالُكُمْ وَأَوْلَادُكُمْ فِتْنَةٌ (వ’లమూ అన్నమా అమ్వాలుకుమ్ వ అవ్లాదుకుమ్ ఫిత్నహ్) మీ సిరిసంపదలు, మీ సంతానం మీ పాలిట ఒక పరీక్ష అన్న సంగతిని తెలుసుకోండి. (8:28)
సంపద ఉండటం తప్పు కాదు, సంపద మీద గర్వం చేసి అల్లాహ్‌ను మరిచిపోవడం తప్పు. ఇది గమనించాల్సిన విషయం.
[3] ‘మాషా అల్లాహ్’ అనే సంస్కారం:
మూడో విషయం ఏమిటి? అల్లాహ్ తక్కువ ప్రసాదించినా, ఎక్కువ ప్రసాదించినా, మరీ ఎక్కువ ప్రసాదించినా ‘మాషా అల్లాహ్’ అనే చెప్పే సంస్కారం కావాలి.
మాషా అల్లాహ్ అంటే కేవలం నాలుకతో కాదు, దాని అర్థాన్ని తెలుసుకుంటూ, దాని భావాన్ని తెలుసుకుంటూ, దానిని నిజాయితీగా నమ్ముతూ ఉండే ఆ సంస్కారం కలిగి ఉండాలి. మనకు ఏదైనా మంచి ఉన్నప్పుడు, మంచి జరిగినప్పుడు, ఇల్లు, వ్యాపారం, పిల్లలు, ఆరోగ్యం, అంతస్తు, హోదాలు, పదవులు, సంతోషాలు, సుఖాలు ఏవైనా సరే, అవి జరిగినప్పుడు ‘మాషా అల్లాహ్, ఇది అల్లాహ్ తరఫు నుంచే’. మనలో వినమ్రత పెంచుతుంది. ఇలా జరిగితే అల్లాహ్ దయను గుర్తు చేస్తుంది ఇటువంటి భావన. అంటే ఈ సంపాదన అల్లాహ్ నాకు ప్రసాదించాడు, ఈ జ్ఞానం అల్లాహ్ నాకు ప్రసాదించాడు, సంతానం అల్లాహ్ నాకు ప్రసాదించాడు, ఈ హోదా అల్లాహ్ నాకు ఇచ్చాడు, ఈ పదవి అల్లాహ్ నాకు ఇచ్చాడు, ఇంత బంగారం, ఇంత ధనం, ఇంత పదవులు ఇవన్నీ అల్లాహ్ నాకు ఇచ్చాడు. కొంచెం కూడా గర్వం రాకూడదు. ఇటువంటి భావన ఉంటే, ఇది మనలో వినమ్రత పెంచుతుంది, అల్లాహ్ దయను గుర్తు చేస్తుంది.
[4] ప్రాపంచిక జీవితం తాత్కాలికం:
నాలుగో విషయం ఏమిటి ఈ కథలో? ప్రాపంచిక జీవితం తాత్కాలికం. ఈ దునియా తాత్కాలికం.
ఈ కథ మనకు చెబుతోంది, దునియా జీవితం, ప్రాపంచిక జీవితం ఒక తోట లాంటిది. ఈ రోజు పచ్చగా ఉంటుంది, రేపు ఎండిపోతుంది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దీని గురించి ఖురాన్‌లో తెలియజేశాడు, ప్రపంచపు జీవితం వర్షం లాంటిది. كَمَثَلِ غَيْثٍ (క-మసలి గైసిన్) సూరత్ హదీద్‌లో ఉంది. ఇది వర్షం లాంటిది, పంటలు పుష్కలంగా పెరుగుతాయి, తర్వాత ఎండిపోతాయి. కొన్ని రోజుల జీవితం కోసం గర్వపడకూడదు, అల్లాహ్‌ని మరిచిపోకూడదు, అహంకారంలో విర్రవీగకూడదు.
కావున, అభిమాన సోదరులారా, అహంకారం మహా పాపం, కిబ్ర్ చాలా చెడు, అల్లాహ్‌కు అసలు ఇష్టం ఉండదు.
వినమ్రత యొక్క గొప్పతనం
మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:
مَنْ تَوَاضَعَ لِلَّهِ رَفَعَهُ اللَّهُ (మన్ తవాద’అ లిల్లాహి రఫ’అహుల్లాహ్) ఎవరైతే వినమ్రతతో ఉంటారో అల్లాహ్ వారిని ఉన్నత స్థాయికి తీసుకు వెళ్తాడు.
అలాగే, అసలైన ధనవంతుడు డబ్బు ఉన్నవాడు కాదు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:
لَيْسَ الْغِنَى عَنْ كَثْرَةِ الْعَرَضِ، وَلَكِنَّ الْغِنَى غِنَى النَّفْسِ (లైసల్ గినా అన్ కసరతిల్ ‘అరది, వలాకిన్నల్ గినా గినన్-నఫ్స్) సంపద ఎక్కువ ఉండటం ధనికత కాదు, కానీ నిజమైన ధనికత హృదయ సంతృప్తి.
కావున ప్రియ సోదర సోదరీమణులారా, రెండు తోటల యజమాని కథ మనందరికీ ఇది ఒక హెచ్చరిక. అహంకారం నాశనానికి దారి తీస్తుంది. అల్లాహ్‌ను మరచిన సంపద నిలవదు. వినమ్రతే నిజమైన మహిమ. ఈ ప్రాపంచిక జీవితం తాత్కాలికం, ఆఖిరత్, పరలోకం అది శాశ్వతం. మనకు ఉన్న ప్రతి అనుగ్రహానికి ‘అల్హమ్దులిల్లాహ్‘ అని చెప్పాలి, అది చిన్నదైనా పెద్దదైనా. మన హృదయంలో అహంకారం తొలగించాలి, అల్లాహ్ ముందు వినమ్రంగా జీవించాలి, ఇలా ఉండాలి ఒక విశ్వాసి.
అహంకారం అంటే ఏమిటి?
అభిమాన సోదరులారా, సత్యాన్ని తిరస్కరించడం, ఇతరులను తక్కువగా చూడటం, ఇది ఎప్పుడు అవుతుంది? ఇదే కదా కిబ్ర్ అనేది, గర్వం అనేది, అహంకారం అనేది ఇదే కదా? నాకు ఉంది, అతనికి లేదు, నేను గొప్పవాడు, వాడు చిన్నవాడు, లేనివాడు, పేదవాడు అనేది ఈ ఒక రకమైన భావన కలిగి ఉండటమే అహంకారం, కిబ్ర్ అంటారు.
దీనికి ఉదాహరణ చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇబ్లీసును ఆదం అలైహిస్సలాం ముందు సజ్దా చేయమని ఆజ్ఞాపించినప్పుడు ఇబ్లీస్ తిరస్కరించాడు. కారణం ఏమిటి? అహంకారం.
أَنَا خَيْرٌ مِنْهُ (అన ఖైరున్ మిన్హు) నేను అతనికంటే శ్రేష్ఠుణ్ణి (7:12)
అన్నాడు. కానీ ఏం జరిగింది? ఇబ్లీస్ పతనానికి కారణం అహంకారం.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు అహంకారులు ఇష్టం ఉండరు.
إِنَّهُ لَا يُحِبُّ الْمُسْتَكْبِرِينَ (ఇన్నహూ లా యుహిబ్బుల్ ముస్తక్బిరీన్) నిశ్చయంగా ఆయన అహంకారులను ఇష్టపడడు. (16:23)
అల్లాహ్ ముందు వినమ్రత ఈమాన్ యొక్క లక్షణం.
అలాగే ఖారూన్ ఉదాహరణ ఉంది ఖురాన్‌లో. అతను ఏమన్నాడు ఖారూన్? “ఇన్నమా ఊతీతుహు అలా ఇల్మిన్ ఇందీ” అన్నాడు. నా దగ్గర ఉండే ఈ హోదా, ఈ ఆస్తిపాస్తులు, ఈ ఆనందాలు, ఈ భోగభాగ్యాలు, ఈ ధనం, ఈ ధనికత ఇదంతా నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ‘అలా ఇల్మిన్ ఇందీ’, నా జ్ఞానం వల్ల నాకు లభించింది అని అన్నాడు. ఎందుకు అన్నాడు? గర్వం, అహంకారం. నాకు ఎవ్వరూ ఇవ్వలేదు, నా జ్ఞానం ఇది, నా శక్తి ఇది, నా ప్లాన్ ఇది, నేను చేశాను, నేను సంపాదించాను, నాది మాత్రమే అని అహంకారంతో అతను విర్రవీగాడు. ఫలితం ఏమైంది? అతను తన సంపదతో పాటు నేలలో ముంచబడ్డాడు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దానికి కూడా నాశనం చేసేశాడు.
మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, అహం ఉన్నవాడు, గర్వం గలవాడు, కిబ్ర్ ఉన్నవాడు స్వర్గంలో ప్రవేశించలేడు. హృదయంలో రాయిగింజంత అహంకారం ఉన్నవాడు జన్నత్‌లో ప్రవేశించడు. (బుఖారీ మరియు ముస్లింలో హదీస్ ఉంది ఇది). ఒక సహాబీ ఈ హదీస్ విని ప్రవక్త గారిని అడిగారు, “ఓ దైవ ప్రవక్త, మనకు మంచి దుస్తులు, మంచి చెప్పులు ఇష్టం ఉండటం కూడా అహంకారమా?”. మంచి తొడగాలి అని మంచి దుస్తులు వేసుకున్నాము, మంచి చెప్పులు వేసుకున్నాము, ఇది కూడా అహంకారం కిందికి వస్తుందా? అని అడిగారు. దానికి సమాధానంగా మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు, “అల్లాహ్ అందమైనవాడు, అందాన్ని ఇష్టపడతాడు”. అన్నారు. అంటే ఇది అహంకారం కాదు. అంటే మంచి దుస్తులు వేసుకోవడం ఇది అహంకారం కాదు, దాని మూలంగా ఇతరులను చిన్నచూపు చూడటం అది అహంకారం కిందికి వస్తుంది. అహంకారం అంటే సత్యాన్ని తిరస్కరించడం మరియు ప్రజలను, ఇతరులను తక్కువగా చూడటం.
రెండవది వినమ్రత, దీనికి విరుద్ధం. ‘మన్ తవాద అలిల్లాహ్’ – ఎవరైతే అల్లాహ్ కోసం వినమ్రత చూపుతాడో, ‘రఫాహుల్లాహ్’ – అల్లాహ్ వారిని ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు.
మూడవది, ఖియామత్ రోజున పరిస్థితి ఏంటి? అహంకారులు ఖియామత్ రోజు చిన్న చీమల వలె లేవనెత్తబడతారు. అంటే అక్కడ వారికి ఆ గౌరవం, ఎటువంటి గౌరవం ఉండదు కదా.
ఇస్లాంలో అహంకారం, కిబ్ర్ అంటే సత్యాన్ని తిరస్కరించడం, ఇతరులను తక్కువగా తృణీకరించడం. ఇది అత్యంత నిషిద్ధమైన పాపం. ఖురాన్ మరియు హదీసుల ప్రకారం హృదయంలో అణుమాత్రం గర్వం ఉన్నా స్వర్గ ప్రవేశం లభించదు. ఎందుకంటే గొప్పతనం అనేది అది అల్లాహ్‌కు మాత్రమే సొంతం.
“అహంకారంతో ప్రజల నుండి ముఖం తిప్పుకోకు. భూమిపై గర్వంతో నడవకు. అహంకారానికి, గొప్పలు చెప్పుకునేవాడిని అల్లాహ్ ప్రేమించడు” అని అల్లాహ్ సూరత్ లుఖ్మాన్‌లో తెలియజేశాడు.
అలాగే సూరత్ అన్-నిసాలో ఉంది, అహంకారంతో భూమిపై గర్వంగా నడిచేవారికి కఠినమైన శిక్ష ఉంటుందని ఖురాన్ హెచ్చరించింది (సూరత్ అన్-నిసా, ఆయత్ 173లో). అలాగే సూరత్ ఆరాఫ్‌లో ఉంటుంది, అహంకారులకు స్వర్గ ద్వారాలు తెరవబడవు (సూరత్ ఆరాఫ్, ఆయత్ 40).
అలాగే సహీహ్ ముస్లింలో హదీస్ ఉంది, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, హృదయంలో అణుమాత్రం అహంకారం ఉన్నవాడు స్వర్గములో ప్రవేశించడు.
కావున, అహంకారం యొక్క పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి.
స్వర్గం నుండి దూరం: గర్వం ఉన్నవారు స్వర్గం పొందలేరు, అంటే స్వర్గం నుంచి దూరం.
నరక శిక్ష: అహంకారుల నివాసం నరకం.
దైవ ప్రేమకు దూరం: అల్లాహ్ అహంకారులను ఇష్టపడడు.
అహంకారం ఎందుకు ప్రమాదం అంటే, అది ఈమాన్‌ను బలహీనపరుస్తుంది, కంజోర్ చేస్తుంది. దుఆ అంగీకారం తగ్గుతుంది, దుఆ స్వీకరించబడటం తగ్గిపోతుంది. మనుషుల మధ్య విభేదాలు పెరుగుతాయి. అల్లాహ్ కోపానికి కారణం అవుతుంది.
ఇక్కడ మనము ఒక విషయం గమనించాలి, అది ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఒక వ్యక్తికి ఈ ప్రాపంచిక జీవితంలో అన్నీ ఇచ్చాడు. ప్రతీదీ ప్రసాదించాడు. అందం, ఐశ్వర్యం, హోదా, పదవులు, డబ్బులు, ధనం, రాజకీయం, రాజ్యం, ప్రతీదీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి జ్ఞానం, బలం, శక్తి అన్నీ అల్లాహ్ ఇచ్చాడు, ఈమాన్ తప్ప. ఒక వ్యక్తికి ప్రపంచంలో ప్రతి వస్తువు దక్కింది, ప్రతి సంతోషం దక్కింది ప్రాపంచిక పరంగా, ప్రతి విషయం దక్కింది, అల్లాహ్ అన్నీ ఇచ్చేశాడు. అతనికి కష్టమే తెలీదు, బాధే తెలీదు, అంత బాగుంది. ఈమాన్ అల్లాహ్ అతనికి ఇవ్వలేదు.
ఇంకో వైపు అల్లాహ్ ఒక వ్యక్తికి ఏదీ ఇవ్వలేదు. డబ్బు లేదు, అందం లేదు, ధనం లేదు, హోదా లేదు, పదవి లేదు, ఇంకా సమస్యలు, అనారోగ్యం, బలహీనత, ఆర్థిక సమస్యలు, శారీరక సమస్యలు, మానసిక సమస్యలు చాలా ఉన్నాయి. కానీ అల్లాహ్ అతనికి ఈమాన్ ఇచ్చాడు, విశ్వాసాన్ని ఇచ్చాడు, హిదాయత్ ప్రసాదించాడు.
మరి ఈ ఇద్దరి వ్యక్తులలో గొప్పవాడు ఎవరు? ధనికుడు ఎవరు? సాఫల్యం పొందేవాడు ఎవడు? రెండవ వ్యక్తే. ఈ ప్రాపంచిక జీవితంలో డబ్బు లేకపోయినా, సుఖం లేకపోయినా, తాత్కాలిక సుఖం లేకపోయినా, అందం ఐశ్వర్యం లేకపోయినా, ధనం, బలం ఇది లేకపోయినా కానీ అల్లాహ్ ఈ ప్రాపంచిక జీవితంలో విశ్వాసాన్ని ఇచ్చాడు, ఈమాన్‌ను ఇచ్చాడు, హిదాయత్ ప్రసాదించాడు. ఇదే అసలైన సంపద, ఇదే అసలైన బలం, ఇదే అసలైన వస్తువు. ఎందుకు? ఇదే మనకు పనికి వచ్చేది మరణానంతర జీవితంలో, పరలోకములో, శాశ్వతమైన జీవితంలో. ఎందుకు? ఇక్కడ ఉన్నా లేకపోయినా మరణం తప్పదు. మరణం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? చెప్పలేము. ఈ రోజు రావచ్చు, రాత్రి రావచ్చు, రేపు రావచ్చు, ఒక రోజులో రావచ్చు, నెలలో రావచ్చు, ఎప్పుడు వస్తుందో తెలీదు. కొందరు పూర్తి జీవితం 20-30 సంవత్సరాలు స్వయంగా అనుభవించకుండా బాగా కష్టపడి, త్యాగాలు చేసి, రాత్రి పగలు అనకుండా త్యాగాలు చేసి సంపాదించి కూడా పెట్టారు భార్యాపిల్లల కోసం, హఠాత్తుగా మరణించారు. సంపాదించింది ఎవరు? అనుభవిస్తుంది ఎవరు? ఇది జీవితం. ఇక్కడ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇక్కడ అసలు ఏది కావాలి? అసలు ఈమాన్ కావాలి. దాని మూలంగా మరణానంతర జీవితం, పరలోకంలో శాశ్వతంగా సుఖంగా ఉంటాము.
అందుకోసం, రెండూ ఇస్తే అల్హమ్దులిల్లాహ్, ‘దాలిక ఫద్లుల్లాహి యు’తీహి మయ్యషా’ – అల్లాహ్ కొందరికి ఈమాన్‌తో పాటు ప్రపంచాన్ని, ప్రపంచంతో పాటు దీన్‌ను కూడా అల్లాహ్ ఇస్తాడు. అది ‘దాలిక ఫద్లుల్లాహ్’, అల్హమ్దులిల్లాహ్. కానీ అల్లాహ్ పరీక్ష నిమిత్తము, ఇంకో కారణము, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రాపంచిక జీవితంలో, ఇది పరీక్షతో కూడిన జీవితం కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అందం విషయంలో, బలం విషయంలో, ధనం విషయంలో, ఆర్థిక విషయంలో, కుటుంబ విషయంలో, సమాజ విషయంలో, ఉద్యోగ విషయంలో, రాజకీయ విషయంలో అనేక సందర్భాలలో, అనేక విషయాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరీక్ష పెడుతూ ఉంటాడు. అది మనము సహనంతో, ఓర్పుతో మనము దానిని పరీక్షగా తీసుకుని విధేయతగా మనము జీవించే ప్రయత్నం చేయాలి.
అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరీక్ష నిమిత్తం మనకు డబ్బు ఇచ్చాడు, హోదా ఇచ్చాడు, అందం ఇచ్చాడు, పదవిని ఇచ్చాడు, అల్హమ్దులిల్లాహ్ బాగా ప్రసాదించాడు. గర్వపడకూడదు, కొంచెం కూడా మన మనసులో గర్వం రాకూడదు. అల్లాహ్ ప్రసాదించిన వాటిని మన మనసులో ఉండే భావన ఏమిటి? ఇది అల్లాహ్ ఇచ్చాడు, పరీక్ష కోసం ఇచ్చాడు. అందుకు దానధర్మాలు చేయాలి, ఫర్జ్ జకాత్ కాక ఇంకా నఫిల్ సదకాత్‌ను కూడా చేస్తూ ఉండాలి.
అహంకారం నుండి రక్షణ మార్గాలు
అభిమాన సోదరులారా, అహంకారం నుండి రక్షణ మార్గాలు:
అల్హమ్దులిల్లాహ్, మాషా అల్లాహ్ ఎక్కువగా చెప్పడం.
“మాషా అల్లాహ్ లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అనే అలవాటు చేసుకోవడం.
సజ్దా ఎక్కువగా చేయటం.
పేదవాళ్ళతో కూర్చోవడం.
మనకు ఉన్నది అన్నీ అల్లాహ్ దయ అని గుర్తుపెట్టుకోవడం.
ఇవి మనము ఈ లక్షణాలు, గుణాలు కలిగి ఉండాలి. అభిమాన సోదరులారా, అహంకారం మనిషిని ఇబ్లీస్ స్థాయికి తీసుకువెళ్తుంది, వినమ్రత మనిషిని అల్లాహ్‌కు దగ్గర చేస్తుంది. మన హృదయంలో కిబ్ర్ లేకుండా తఖ్వా, వినమ్రతతో జీవిద్దాం.
అల్లాహ్ మన హృదయాలను శుద్ధి చేసి అహంకారం నుండి రక్షించుగాక. ఆమీన్.
వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగం ఖురాన్‌లో ప్రస్తావించబడిన గాథల (కథల) యొక్క లోతైన ఉద్దేశ్యాలను వివరిస్తుంది. ఈ గాథలు కేవలం వినోదం కోసం కాదని, అవి తౌహీద్ (అల్లాహ్ ఏకత్వం) యొక్క విశ్వాసాన్ని స్థాపించడానికి మరియు బలపరచడానికి ఉద్దేశించబడ్డాయని వక్త స్పష్టం చేశారు. అంతేకాకుండా, విశ్వాసులకు పరీక్షలు ఎదురైనప్పటికీ, వారికి అల్లాహ్ సహాయం మరియు అంతిమ విజయం ఖాయమనే భరోసాను ఈ కథలు ఇస్తాయని, ప్రవక్త మూసా (అలైహిస్సలాం ఉదాహరణతో సహా వివరించారు. తిరస్కరించిన వారి పర్యవసానాల నుండి గుణపాఠం నేర్చుకోవడం, ధర్మంపై స్థిరంగా ఉండటానికి ప్రేరణ పొందడం వంటి ఇతర ముఖ్యమైన పాఠాలు కూడా ఈ చారిత్రక సంఘటనలలో ఉన్నాయని నొక్కిచెప్పారు.
అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.
ప్రియ విద్యార్థులారా, సోదర సోదరీమణులారా, వాస్తవానికి మనం అల్లాహ్‌కు ఎంత కృతజ్ఞత తెలుపుకున్నా, అల్లాహ్ యొక్క ప్రశంసలు, స్తోత్రములు, పొగడ్తలు ఎన్ని చెప్పుకున్నా చాలా చాలా తక్కువ. ఎందుకంటే రమదాన్ లాంటి మాసాన్ని పొందే కాంక్ష కలిగి ఉండటం కూడా అల్లాహ్ యొక్క అనుగ్రహం. రమదాన్‌ని పొందుతూ, రమదాన్ మాసంలో మనం ఏం చేయాలి, ఎలా అల్లాహ్‌కు ఇష్టమైన రీతిలో గడపాలి అన్నటువంటి విషయాలు ఖురాన్ హదీస్ ద్వారా నేర్చుకోవడానికి ఇలాంటి సమావేశాల్లో పాల్గొనడం కూడా అల్లాహ్ యొక్క చాలా చాలా గొప్ప అనుగ్రహం. అందుకొరకు, ఈ అనుగ్రహం పొందిన మీరు ఇక ఏ ఆలస్యం చేయకుండా శ్రద్ధగా వినడంతో పాటు మీకు తెలిసిన వారందరినీ కూడా హాజరుపరచండి. దీని ద్వారా మీకు సదకయే జారియా, మినలేని ఎన్నటికీ అంతం కాని పుణ్యం లభిస్తుంది. ఈ పుణ్యం లభించడంతో పాటు మీకు ఇహపరాల ఎన్నో రకాల మేళ్లు, శుభాలు కలుగుతూ ఉంటాయి.
అల్హందులిల్లాహ్, ఈరోజు మొదటి ఈ క్లాస్‌లో అంశం ఏమిటో మీరు విన్నారు. ఏమిటి ఆ అంశం? అల్లాహ్ త’ఆలా ఖురాన్‌లో ఎన్నో రకాల గాథలు, ప్రవక్తల యొక్క గాథలు, పుణ్యాత్ముల యొక్క గాథలు, అంతేకాకుండా అవిశ్వాసులు, అవిశ్వాసుల నాయకులు వారు నశించిపోయినటువంటి విషయాల వివరాలు ఏదైతే తెలిపాడు, వాటి యొక్క ఉద్దేశాలు ఏమిటి? వాటి యొక్క ఉద్దేశాలు ఏమిటి మనం తెలుసుకోబోతున్నాము.
అయితే అల్లాహ్ త’ఆలా మనకు ఇలాంటి ఈ అంశంపై వినే భాగ్యం కలుగజేసినందుకు అల్లాహ్‌కు కృతజ్ఞత తెలుపుకుంటూ, మొదటి శుభవార్త మీకు ఇస్తున్నది ఏమిటంటే ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం మాదిరిగా మూడు అంశాలపై మన ప్రతి రోజు క్లాస్ ఉంటుంది. అయితే అందులో మొదటి అంశం ఖురాన్ యొక్క గాథలు. వివిధ పండితులు వస్తారు, అల్హందులిల్లాహ్ వారు ఖురాన్‌లో నుండి ఏ గాథలైతే అల్లాహ్ ప్రస్తావించాడో వాటిని మీ ముందు ఎంతో వివరంగా తెలియజేస్తారు. అయితే మనం ఈ గాథలు ఏవైతే వింటామో వాటికి సంబంధించి కారణాలు స్వయంగా అల్లాహ్ త’ఆలా ఖురాన్‌లో ఏం తెలిపాడో రండి, ఇప్పుడు నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను.
ఖురాన్‌లోని గాథల ఉద్దేశ్యం
వాటిలో ప్రప్రధమంగా మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఖురాన్ ఒక కథల పుస్తకం కాదు. ఖురాన్ ఏదో స్టోరీ, నావల్స్ లాంటి బుక్ ఎంత మాత్రం కాదు. ఈ ఖురాన్ గ్రంథం మానవాళికి మార్గదర్శకం చూపడానికి.
إِنَّ هَٰذَا الْقُرْآنَ يَهْدِي لِلَّتِي هِيَ أَقْوَمُ (ఇన్న హాదల్ ఖుర్ఆన యహ్దీ లిల్లతీ హియ అఖ్వమ్) నిశ్చయంగా ఈ ఖుర్‌ఆన్ అత్యంత సరైన మార్గాన్ని చూపుతుంది. (17:9)
మానవుల జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురవుతాయో ప్రతి సమస్యకు అతి ఉత్తమమైన పరిష్కారం చూపడానికి ఖురాన్ వచ్చింది.
సర్వ మానవాళి మార్గదర్శకత్వం కొరకు అల్లాహ్ పంపాడు. కనుక ఈ ఖురాన్ గ్రంథం ఇంత మంచి ఉద్దేశంతో అవతరించినప్పుడు ఇందులో అల్లాహ్ త’ఆలా మనకు ఎన్నో ఆదేశాలు ఇచ్చి ఉన్నాడు. మనకు ఎన్నో రకాల పనుల నుండి, మాటల నుండి ఆపి ఉన్నాడు, అవి చేయకూడదు అని. అయితే ఎవరైతే అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని విశ్వసించి, అల్లాహ్ ఇష్టప్రకారంగా వారి వారి కాలాల్లో వచ్చిన ప్రవక్తలను అనుసరించి జీవితం గడిపారో, అలాంటి వారి కొరకు ఎలాంటి శుభాలు, ఎలాంటి అనుగ్రహాలు లభించాయి ఇహలోకంలో మరియు స్వర్గంలో లభించనున్నాయి, ఆ గాథలు ఇందులో ఉన్నాయి.
ఎవరైతే అల్లాహ్ ఏకత్వాన్ని నమ్మినట్లుగా నటించారో, మనస్ఫూర్తిగా నమ్మలేదో లేదా కేవలం నోటితో నమ్మి ఆచరణా పరంగా అల్లాహ్‌కు విధేయులు కాలేదో, జీవించలేదో వారికి ఏమి నష్టాలు? వారికి ఎలాంటి ఇహలోకంలో పరాభావం, అవమానం కలిగినది మరియు పరలోకంలో వారికి ఎలాంటి భయంకరమైన శిక్షలు ఉన్నాయో అవి కూడా ఖురాన్ తెలిపినది. ఇంకా ఎవరైతే అల్లాహ్ ఏకత్వాన్ని మొత్తానికే తిరస్కరించారో, లేదా పరలోక దినాన్ని మొత్తానికే తిరస్కరించారో, అలాంటి వారి పట్ల వారికి నచ్చజెప్పడానికి ప్రవక్తలను పంపితే ఆ ప్రవక్తలను సైతం ఏదైతే ధిక్కరించారో వారికి ఎలాంటి గడ్డు పరిస్థితి వచ్చింది? ఎలా నాశనమయ్యారు ఈ లోకంలో చూడడానికి వారికి ఈ లోకంలో ఎన్నో రకాల సౌకర్యాలు, ఈ లోకంలో వారికి అల్లాహ్ త’ఆలా ధన ఐశ్వర్యం ఎంతో ప్రసాదించినా, వారు బలపరంగా అండబలం, దండబలం, జనబలం, ప్రజల యొక్క సహాయం ఏమీ ఉన్నా గానీ అల్లాహ్ శిక్ష వచ్చినప్పుడు ఎవరి ఏ శక్తి, ఏ బలం పనికి రాకుండా ఎలా నాశనమయ్యారో పరలోక దినాన వారికి ఎలాంటి శిక్షలు పడనున్నాయో అవి కూడా అల్లాహ్ తెలిపాడు.
అయితే ఇప్పుడు నేను సంక్షిప్తంగా ముఖ్యమైన కొన్ని ఉద్దేశాలు, కారణాలు, మర్మాలు, ఔచిత్యాలు, లాభాలు ఈ ఖురాన్‌లోని గాథల ద్వారా మనకు ఏం కలుగుతాయో టు ద పాయింట్ కొన్ని విషయాలు ఖురాన్ హదీస్ ఆధారంగా తెలుసుకుందాము.
తౌహీద్‌ను బలపరచడం
మొట్టమొదటి విషయం, ఖురాన్‌లో అల్లాహ్ త’ఆలా ఎన్నో గాథలు ఏదైతే తెలిపాడో వాటి ద్వారా తౌహీద్‌ను బలపరచడం, తౌహీద్ విశ్వాసాన్ని బలపరచడం. తౌహీద్‌పై ఉన్నవారికి ఎలాంటి లాభాలు కలిగాయి, తిరస్కరించిన వారికి ఎలాంటి నష్టాలు కలిగాయి తెలపడం ద్వారా మనం ఎలా బలంగా తౌహీద్ యొక్క విశ్వాసంపై చాలా గట్టిగా నమ్మకంగా ఉండాలో ఇది బోధపడుతుంది. ఈ విషయం మనకు ఖురాన్‌లోని ఎన్నో ఆయతుల ద్వారా తెలుస్తుంది. ప్రత్యేకంగా మీరు చూడాలనుకుంటే ఒక దృష్టి వేస్తూ అనువాదంపై పోయినా గానీ సూరతుల్ ఆరాఫ్, సూరతుల్ హూద్, సూరతుల్ అంబియా, సూరతుష్ షుఅరాలో చాలా స్పష్టంగా మీకు కనబడుతుంది. అల్లాహ్ త’ఆలా ఈ విషయాలన్నిటినీ ఒక ఆయత్‌లో ఎలా ఇమిడి, ఎలా జోడించి చెప్పాడో గమనించండి సూరతున్ నహ్ల్ ఆయత్ 16.
وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولًا أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ (వ లఖద్ బ’అస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్రసూలన్ అని’బుదుల్లాహ వజ్తనిబుత్తాఘూత్) మేము ప్రతి సమాజంలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. (అతను ప్రజలకు) “మీరు అల్లాహ్‌నే ఆరాధించండి, ఆయనకు బదులుగా ఇతర ఆరాధ్య దైవాలను త్యజించండి” (అని బోధించాడు). (16:36)
మేము ప్రతి జాతిలో ఒక ప్రవక్తను పంపాము. ఆ ప్రతి ప్రవక్త తమ జాతి వారికి ఏం చెప్పేవారు? మీరు కేవలం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి, అల్లాహ్ తప్ప ఇక వేరే ఎవరినీ కూడా ఆరాధించకండి. అల్లాహ్‌ను వదిలి లేదా అల్లాహ్‌ను ఇతరులతో ఏ భాగస్వామ్యం చేస్తున్నారో వాటిని వదులుకోండి అని చెప్పడానికే అల్లాహ్ త’ఆలా ప్రత్యేకంగా పంపించి ఉన్నాడు.
సోదర మహాశయులారా, సోదరీమణులారా, సూరతుల్ అంబియాలో కూడా అల్లాహ్ త’ఆలా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలిపాడు.
وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رَّسُولٍ إِلَّا نُوحِي إِلَيْهِ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا أَنَا فَاعْبُدُونِ (వమా అర్సల్నా మిన్ ఖబ్లిక మిర్రసూలిన్ ఇల్లా నూహీ ఇలైహి అన్నహూ లా ఇలాహ ఇల్లా అన ఫ’బుదూన్) నీకు పూర్వం మేము పంపిన ప్రతి ప్రవక్త వద్దకూ, “నేను తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. కనుక మీరు నన్నే ఆరాధించండి” అనే సందేశాన్నే (వహీని) పంపాము. (21:25)
మేము మీ కంటే ముందు ఏ ప్రవక్తను పంపినా వారి వైపునకు ఇదే వహీ చేశాము. ఏమని?
لَا إِلَٰهَ إِلَّا أَنَا (లా ఇలాహ ఇల్లా అన) అల్లాహ్ అంటున్నాడు, నా తప్ప సత్య ఆరాధ్యుడు మరొకడు లేడు. (21:25)
فَاعْبُدُونِ (ఫ’బుదూన్) కనుక మీరు నన్ను మాత్రమే ఆరాధించండి, (21:25) నా యొక్క ఇబాదత్ మాత్రమే చేయండి.
ఇది మొట్టమొదటి ఉద్దేశం. మనం అల్లాహ్ యొక్క తౌహీద్‌ను మంచిగా అర్థం చేసుకోవాలి. ఇక సూరతుల్ ముఅమినూన్, సూరతుల్ అన్‌కబూత్ ఇంకా వేరే సూరాలలో ఈ విషయాలు మరింత స్పష్టంగా చెప్పబడినవి. ఎవరైతే అల్లాహ్ ఏకత్వాన్ని స్పష్టంగా నమ్మారో లేదా అల్లాహ్‌ను సృష్టికర్తగా, పోషణకర్తగా నమ్మారు కానీ నిజమైన ఏకైక ఆరాధ్య దైవం అని నమ్మలేదు, అల్లాహ్‌ను మాత్రమే ఎలాంటి షిర్క్ లేకుండా ఆరాధించలేదు, అలాంటి వారికి ఏం నష్టం కలిగింది, అవన్నీ కూడా అందులో చాలా చాలా స్పష్టంగా ఉన్నాయి.
ఇది మొట్టమొదటి ఉద్దేశం. అయితే, ఇంకా రెండో ఉద్దేశం నేను చెప్పబోయే ముందు, సూరత్ యూసుఫ్‌లోని ప్రారంభంలోని ఒక ఆయత్ ముక్క మరియు చివరిలోని ఒక ఆయత్ ముక్క ద్వారా ఒక ముఖ్యమైన సందేశం ఇవ్వదలుచుకుంటున్నాను. శ్రద్ధగా వినండి. అదేమిటి? ఖురాన్‌లోని ప్రతి అక్షరం, ఖురాన్‌లోని ప్రతి మాట, చివరికి ఖురాన్‌లో చెప్పబడిన ప్రతి గాథ అత్యంత సత్యమైనది, ఇందులో ఎలాంటి శంకించడానికి, సందేహపడడానికి అవకాశం లేదు. అల్లాహ్ ఏమన్నాడు?
نَحْنُ نَقُصُّ عَلَيْكَ أَحْسَنَ الْقَصَصِ بِمَا أَوْحَيْنَا إِلَيْكَ هَٰذَا الْقُرْآنَ (నహ్ను నఖుస్సు అలైక అహసనల్ ఖససి బిమా అవ్‌హైనా ఇలైక హాదల్ ఖుర్ఆన్) (ఓ ప్రవక్తా!) మేము ఈ ఖుర్‌ఆన్‌ను నీపై అవతరింపజేసి, దాని ద్వారా నీకు ఒక అత్యుత్తమ గాథను వినిపిస్తున్నాము. (12:3)
ఈ ఖురాన్‌ను వహీ ద్వారా మీకు పంపుతూ, మీకు చాలా అత్యుత్తమమైన, స్వచ్ఛమైన, సత్యమైన గాథలను మేము మీకు తెలుపుతున్నాము. మరియు ఇదే సూరత్‌లో, సుమారు ఆయత్ నంబర్ ఏడులో అల్లాహ్ తెలిపాడు.
لَّقَدْ كَانَ فِي يُوسُفَ وَإِخْوَتِهِ آيَاتٌ لِّلسَّائِلِينَ (లఖద్ కాన ఫీ యూసుఫ వ ఇఖ్వతిహీ ఆయాతుల్లిస్సాయిలీన్) యూసుఫ్, అతని సోదరుల వృత్తాంతంలో అడిగేవారి కొరకు ఎన్నో సూచనలున్నాయి. (12:7)
యూసుఫ్ అలైహిస్సలాం గురించి, ఆయన జీవిత సంఘటన గురించి ఎవరైతే ప్రశ్నించారో, నిజంగా ఆ ప్రశ్నించే వారి కొరకు ఇందులో ఆయాత్, ఎన్నో రకాల సూచనలు, ఎన్నో రకాల నిదర్శనలు చాలా స్పష్టంగా ఉన్నాయి.
ఇక సూర యూసుఫ్ మీరు శ్రద్ధగా చదివారంటే, ఇందులో కూడా:
يَا صَاحِبَيِ السِّجْنِ أَأَرْبَابٌ مُّتَفَرِّقُونَ خَيْرٌ أَمِ اللَّهُ الْوَاحِدُ الْقَهَّارُ (యా సాహిబయిస్సిజ్ని అ అర్బాబుమ్ ముతఫర్రిఖూన ఖైరున్ అమిల్లాహుల్ వాహిదుల్ ఖహ్హార్) ఓ నా చెరసాల మిత్రులారా! విడివిడిగా ఉన్న ఎందరో ప్రభువులు శ్రేష్ఠులా? లేక అద్వితీయుడు, తిరుగులేని శక్తి సంపన్నుడైన అల్లాహ్ శ్రేష్ఠుడా? (12:39)
అని ఆయత్ కనబడుతుంది. చాలా స్పష్టమైన ఆయత్. యూసుఫ్ అలైహిస్సలాం స్వయంగా తమ జాతి వారికి ఇచ్చినటువంటి సందేశం కానీ ఆయత్ క్రమంలో మనకు ఏం తెలుస్తుంది? ఆయనకు ఎవరైతే వచ్చి అడిగారో, వారు చూసినటువంటి స్వప్న యొక్క జవాబ్, వారికి:
يَا صَاحِبَيِ السِّجْنِ أَأَرْبَابٌ مُّتَفَرِّقُونَ خَيْرٌ أَمِ اللَّهُ الْوَاحِدُ الْقَهَّارُ (యా సాహిబయిస్సిజ్ని అ అర్బాబుమ్ ముతఫర్రిఖూన ఖైరున్ అమిల్లాహుల్ వాహిదుల్ ఖహ్హార్) ఓ నా చెరసాల మిత్రులారా! విడివిడిగా ఉన్న ఎందరో ప్రభువులు శ్రేష్ఠులా? లేక అద్వితీయుడు, తిరుగులేని శక్తి సంపన్నుడైన అల్లాహ్ శ్రేష్ఠుడా? (12:39)
مَا تَعْبُدُونَ مِن دُونِهِ إِلَّا أَسْمَاءً سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا أَنزَلَ اللَّهُ بِهَا مِن سُلْطَانٍ (మా త’బుదూన మిన్ దూనిహీ ఇల్లా అస్మాఅన్ సమ్మైతుమూహా అన్తుమ్ వ ఆబావుకుమ్ మా అన్జలల్లాహు బిహా మిన్ సుల్తాన్) ఆయన్ని వదలి మీరు పూజిస్తున్నవన్నీ కేవలం కొన్ని పేర్లు మాత్రమే. వాటిని మీరూ, మీ తాతముత్తాతలూ పెట్టుకున్నారు. వాటి ప్రామాణికతకు అల్లాహ్ ఎలాంటి నిదర్శనాన్నీ పంపలేదు. (12:40)
సూర యూసుఫ్ లోని 39 మరియు 40 ఆయత్, ఇందులో చాలా స్పష్టంగా తౌహీద్ గురించి ఉంది. అంతేకాకుండా ఇంకా మన జీవిత సమస్యల్లో పరస్పర సోషల్ లైఫ్, సోదర సోదరుల మధ్య జీవితం, తల్లిదండ్రుల మరియు సంతానం మధ్యలోని జీవితం, మరియు ఒక పాలకునికి, పాలకులు, పాలకుడు మరియు ప్రజలు వారి మధ్యలోని సంబంధాలు, అన్నిటి గురించి చాలా ఉత్తమమైన ఇందులో మనకు హితోపదేశాలు, బోధనలు ఉన్నాయి. అయితే ఇంకా ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి కదా, చివరిలో వచ్చేసి అల్లాహ్ త’ఆలా ఇందులో ఏమంటున్నాడు? అల్లాహ్ త’ఆలా ఈ విషయాన్ని సూర యూసుఫ్ లోని సుమారు చివరి ఆయత్ లో తెలిపాడు.
لَقَدْ كَانَ فِي قَصَصِهِمْ عِبْرَةٌ لِّأُولِي الْأَلْبَابِ (లఖద్ కాన ఫీ ఖససిహిమ్ ఇబ్రతుల్లి ఉలిల్ అల్బాబ్) వారి వృత్తాంతాలలో బుద్ధిమంతుల కొరకు ఒక గుణపాఠం ఉంది. (12:111)
బుద్ధిమంతులకు, జ్ఞానవంతులకు వీరి యొక్క ఈ గాథల్లో ఎన్నో రకాల గొప్ప నిదర్శనలు, గుణపాఠాలు ఉన్నాయి. ఇబ్రా, నసీహా.
مَا كَانَ حَدِيثًا يُفْتَرَىٰ (మా కాన హదీసయ్యుఫ్తరా) ఇది కల్పించిన గాథ ఎంతమాత్రం కాదు. (12:111)
ఇది ఏదో కల్పితమైన విషయం ఏ మాత్రం కావు. మీకంటే ముందు జరిగినటువంటి సత్యమైన సంఘటనలు. ఆ తర్వాత ఏమంటున్నాడు?
وَتَفْصِيلَ كُلِّ شَيْءٍ وَهُدًى وَرَحْمَةً لِّقَوْمٍ يُؤْمِنُونَ (వ తఫ్సీల కుల్లి షైఇన్ వహుదన్ వ రహ్మతల్లిఖవ్మియ్యుమినూన్) ప్రతి విషయాన్ని వివరంగా తెలియజేస్తుంది. విశ్వసించే జనుల కొరకు ఇది మార్గదర్శకత్వం, కారుణ్యం. (12:111)
విశ్వసించిన వారి కొరకు ఈ గాథల్లో ఎన్నో రకాల కరుణ సంఘటనలు, మార్గదర్శకత్వాలు ఉన్నాయి. అందుకొరకే మనం ఖురాన్‌లోని గాథలు చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు ఏదో ఫిలింలలో స్టోరీలు, సీరియళ్లు, ఏదో సీన్ చూసినట్లు, విన్నట్లు ఎంత మాత్రం భావించకూడదు. వాటి ద్వారా విశ్వాసాలు పాడైపోతాయి, సంబంధాలు తెగిపోతాయి, అందులో సమాజం పాడవుతుంది. కానీ ఖురాన్ గాథల ద్వారా, ఖురాన్ యొక్క సంఘటనల ద్వారా విశ్వాసం పెరుగుతుంది, అల్లాహ్ పై నమ్మకం పెరుగుతుంది, పరస్పర సంబంధాలు బలపడతాయి, ఖురాన్ సంఘటనల ద్వారా విశ్వాసులకు వారి జీవితాల్లో ఎన్నో రకాల మేళ్లు, శుభాలు కలుగుతాయి.
ఇమామ్ ఇబ్ను తైమియా రహిమహుల్లాహ్ ఒక సందర్భంలో చెప్పారు,
عامة قصص القرآن متضمنة تقرير التوحيد وإبطال الشرك ఆమ్మతు ఖససిల్ ఖురాన్ ముతదమ్మినతున్ తఖ్రీరత్తౌహీది వ ఇబ్తాలష్షిర్క్. “ఖురాన్‌లోని సర్వసామాన్యంగా వచ్చినటువంటి సంఘటనలు తౌహీద్‌ను బలపరచడానికి, షిర్క్‌ను ఖండించడానికి చాలా స్పష్టంగా ఉన్నాయి.“
విశ్వాసులకు అల్లాహ్ సహాయం
ఇక సోదర మహాశయులారా, సోదరీమణులారా, ఈ ఖురాన్‌లో అల్లాహ్ త’ఆలా గాథలు ఏవైతే తెలిపాడో వాటి ద్వారా మరొక ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, విశ్వాసులపై ఇహలోకంలో ఏ పరీక్షలు ఎదురైనా అల్లాహ్ యొక్క సహాయం విశ్వాసులకే లభిస్తుంది మరియు పరలోక సాఫల్యం, సమాధిలో కూడా శిక్షలు లేకుండా అనుగ్రహాల జీవితం నిజమైన, సత్యమైన విశ్వాసులకే కలుగుతుంది. అవును, అల్లాహ్ త’ఆలా సూరత్ గాఫిర్ లో తెలిపాడు.
إِنَّا لَنَنصُرُ رُسُلَنَا وَالَّذِينَ آمَنُوا (ఇన్నా లనన్సురు రుసులనా వల్లదీన ఆమనూ) నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు, విశ్వసించిన వారికి సహాయం చేస్తాము. (40:51)
నిశ్చయంగా మేము తప్పకుండా మా ప్రవక్తలను మరియు విశ్వాసులను ఆదుకుంటాము, వారికి సహాయాన్ని అందజేస్తాము. ఇక మూసా అలైహిస్సలాం గాథలో లో చూస్తే చాలా స్పష్టంగా. ఇంకా వేరే ప్రవక్తల సంఘటనలో కూడా. గమనించండి, వెనక ఫిరౌన్ యొక్క సైన్యం ఉన్నది. ముందు సముద్రం ఉన్నది. ఇక మేము ఇక్కడే నాశనమైపోయాము అని అరుస్తారు బనీ ఇస్రాయిల్. కానీ మూసా అలైహిస్సలాం ఎంత బలమైన నమ్మకంతో, పటిష్టమైన, ప్రగాఢమైన విశ్వాసంతో ఏమంటారు?
మనము ముందుకు వెళ్లి సముద్రంలో మునగము, వెనక నుండి ఫిరౌన్ చేతికి చిక్కము. ముమ్మాటికీ అలా జరగదు. కల్లా!
إِنَّ مَعِيَ رَبِّي سَيَهْدِينِ (ఇన్న మ’ఇయ రబ్బీ సయహ్దీన్) నిశ్చయంగా నా ప్రభువు నాతో ఉన్నాడు. ఆయనే నాకు మార్గం చూపుతాడు” అని. (26:62)
నిశ్చయంగా నాకు నా ప్రభువు ఉన్నాడు. అతి త్వరలోనే నాకు ఒక మంచి మార్గం చూపి మమ్మల్ని కాపాడుకుంటాడు. అల్లాహు అక్బర్. ఎవరి ఊహల్లో లేని రీతిలో అల్లాహ్ త’ఆలా పెద్ద పెద్ద సముద్రంలోని అలలు ఆ పెద్ద నదిలో నడుస్తున్నటువంటి, పారుతున్నటువంటి ఆ నీళ్లను ఎక్కడికక్కడ ఆపేసి పన్నెండు మార్గాలు అందులో పొడిగా, తడిగా కూడా కాదు, చేసి వారు హాయిగా నడుచుకుంటూ వెళ్లే విధంగా అల్లాహ్ సహాయం అందించాడు అంటే, ప్రతి కాలంలో అల్లాహ్ సహాయం చేస్తాడు విశ్వాసులకు. కానీ అంతకు ముందు కొంచెం ఒక పరీక్ష మాదిరిగా ఉండవచ్చు. అందుకని మనం అల్లాహ్ పై మన విశ్వాసం, మన నమ్మకం చాలా బలంగా ఉండాలి.
నా సమయం అంతమవుతుంది అని ఇప్పుడే నేను గమనించాను. అందుకొరకు అల్లాహ్ యొక్క దయ కలిగితే ఒక సుమారు ఏడు, ఎనిమిది, తొమ్మిది, పాయింట్స్ నేను జమా చేశాను. వాటికి సంబంధించి ఆయతులు, హదీసులు రాతపూర్వకంగా నేను మీకు పంపే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోండి.
గాథల యొక్క ఇతర ఉద్దేశ్యాలు
కానీ నేను సమాప్తం చేసేకి ముందు కేవలం హింట్స్ మాదిరిగా ఒక కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను శ్రద్ధగా వినండి. అల్లాహ్ ఖురాన్‌లో గాథలు ఏవైతే తెలిపాడో వాటి ఉద్దేశాలు, వాటి లాభాల్లో ఒకటి తౌహీద్‌ను బలపరచడం. రెండవది, విశ్వాసులకు సహాయపడతాడు అన్నటువంటి నమ్మకం. విశ్వాసుల యొక్క హృదయాలు ధర్మంపై నిలకడగా ఉండాలి అని. మరియు నాలుగవది, గుణపాఠం నేర్చుకోవాలి అని. ఐదవది, తిరస్కరిస్తే ఆచరించకుంటే శిక్షలు ఏమున్నాయో వాటి పట్ల భయం చెందాలి అని. ఇంకా అల్లాహ్ సత్య ధర్మం వైపునకు పిలిచే వారు, ధర్మాన్ని ప్రజల వరకు మంచి జ్ఞానం నేర్పే వారికి కూడా ఇందులో ఎన్నో రకాల సాబిత్ కదమీ, నిలకడ, స్థిరత్వం యొక్క సంఘటనలు ఉన్నాయి. మరియు అల్లాహ్ ఎంతో గొప్ప న్యాయశీలి మరియు సర్వ ప్రవక్తల సందేశం ఒకటి అన్నటువంటి ఇంకా ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి.
తెలుసుకున్న కొన్ని విషయాలను అర్థం చేసుకుని ఆచరించేటటువంటి భాగ్యం అల్లాహ్ నాకు, మీకు అందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (వ ఆఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్) “సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు” అని మా చివరి మాట. (10:10)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
జ్ఞానం (ilm) లేకపోతే ఫిత్నాలు (పరీక్షలు) సంభవిస్తాయి. ఈ విషయం అబ్దుల్ ఖాదిర్ జీలానీ గారి జీవిత సంఘటన ల ద్వారా మనకు అర్థమవుతుంది.
అబ్దుల్ ఖాదిర్ జీలానీ ఎవరో మీకు తెలుసా? ఆయన హన్బలీ పండితులలో ఒకరు మరియు అబూ బకర్ అస్-సిద్దిక్ వంశానికి చెందిన గొప్ప సజ్జనుడు. ఇస్లాం చరిత్రలో సహచరులు (సహాబాలు) మరియు వారి అనుచరుల (తాబియీన్) తర్వాత, అబ్దుల్ ఖాదిర్ జీలానీ గారి గురించి చెప్పబడినన్ని కరామత్ లు (అద్భుతాలు) మరెవరి గురించీ చెప్పబడలేదని ఇబ్న్ తైమియా పేర్కొన్నారు. ఆయన ఫిఖ్ మరియు ఇతర రంగాలలో రచనలు చేసిన గొప్ప పండితుడు మరియు పుణ్యాత్ముడు.
ఒకసారి ఆయన ఎడారిలో నడుచుకుంటూ వెళ్ళారు. ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఆయన ఆధ్యాత్మిక విహారం కోసం వెళ్ళారు. సజ్జనులు మరియు మంచివారు కేవలం విశ్రాంతి కోసం మాత్రమే ఎడారికి లేదా సముద్రానికి వెళ్ళరు; వారు విశ్రాంతి తీసుకున్నప్పటికీ, ముఖ్యంగా అల్లాహ్ సృష్టి గురించి ఆలోచించడానికి అక్కడికి వెళ్తారు.
ఆయన ఎడారిలో ఉండగా, ఆకాశం నిర్మలంగా ఉన్నప్పటికీ ఒక మేఘం ఆయన ముందు ప్రత్యక్షమైంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం! అప్పుడు ఆ మేఘంలో ఒక ఆకారం కనిపించి, ఆయన్ను పేరుతో పిలుస్తూ ఇలా అంది: “ఓ అబ్దుల్ ఖాదిర్, నేను నీ ప్రభువును (రబ్), నేను ఇతరులకు నిషిద్ధం (హరామ్) చేసిన వాటిని నీకు అనుమతించాను (హలాల్ చేశాను).”
ఇది విన్న వెంటనే, ఆయన తన ఉమ్మిని కూడగట్టుకుని దానిపై ఉమ్మివేసి ఇలా అన్నారు: “పో ఇక్కడి నుండి, ఓ అల్లాహ్ శత్రువా! నువ్వు ఇబ్లీస్ (షైతాన్) తప్ప మరెవరో కాదు!” ఈ సన్నివేశం యొక్క తీవ్రతను ఒక్కసారి ఆలోచించండి. మనలో ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు తమ కారు పొరపాటున శుభ్రం చేయబడి ఉంటే, “ఇది ఒక కరామత్ (అద్భుతం)! దీని వెనుక మరేమీ లేదు” అని అంటారు. కానీ ఈయన మేఘాన్ని, అందులో ఆకారాన్ని చూసి, అది తన పేరుతో పిలవడం విన్నప్పటికీ, అది మోసమని గ్రహించారు. దానిపై ఉమ్మివేసి, అల్లాహ్ శత్రువును వెళ్ళిపోమని ఆజ్ఞాపించారు.
అప్పుడు ఆ స్వరం ఆయనతో ఇలా అంది, “ఓ అబ్దుల్ ఖాదిర్, నీకంటే ముందు డెబ్బై మంది ఆరాధకులను నేను దారి తప్పించాను. మరి నువ్వు నన్ను దేని ద్వారా గుర్తుపట్టావు?” ఆ డెబ్బై మంది ఆరాధకులు తమ భక్తితో ఎడారి గుండా వెళ్ళినప్పుడు వారిని షైతాన్ తప్పుదోవ పట్టించాడు. అప్పుడు అబ్దుల్ ఖాదిర్ ఇలా జవాబిచ్చారు, “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి అల్లాహ్ ఏవైతే నిషిద్ధం చేశారో, వాటిని అల్లాహ్ అబ్దుల్ ఖాదిర్ కోసం అనుమతించడని నాకు తెలుసు కాబట్టి నేను నిన్ను గుర్తుపట్టాను.” చూశారా జ్ఞానం యొక్క గొప్పతనం!
కాబట్టి, ప్రజలలో మతం స్థిరంగా ఉండటం, దాని బలం, వారి నుండి కష్టాలు తొలగిపోవడం మరియు ఐక్యత, సమాజంతో కలిసి ఉండటం, సోదరభావం, ప్రేమ మరియు దయ – ఇవన్నీ జ్ఞానంలోనే ఉన్నాయి . ఈ జ్ఞానమే వారికి అల్లాహ్ ధర్మాన్ని మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నత్ ను వివరిస్తుంది. కాబట్టి, ఈ బాధ్యతను నెరవేర్చాలని గుర్తుంచుకోండి, ప్రత్యేకించి ప్రజలకు జ్ఞానాన్ని మరియు ధర్మాన్ని వివరించే వారు తక్కువగా ఉన్న ఈ కాలంలో. ప్రజల మధ్య జ్ఞానం ఉన్నంత కాలం మంచి ఉంటుంది. కానీ ప్రజల నుండి జ్ఞానం దూరమైతే, మంచి కూడా దూరమవుతుంది.
ఈ విషయాన్ని ఇబ్న్ అల్-ఖయ్యిమ్ ‘ఇలామ్ అల్-మువక్కియిన్’లో మరియు మా గురువుల గురువు ఇబ్న్ బులైహిద్ తన ‘మన్సక్’లో పేర్కొన్నారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీనార్ అల్-అయార్ గురించి ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. దీనార్‌కు ఒక పుణ్యాత్మురాలైన తల్లి ఉండేది. ఆమె ఎప్పుడూ తన పాపపు జీవితం గురించి, దారి తప్పిన ప్రవర్తన గురించి పశ్చాత్తాపపడమని అతనికి సలహా ఇస్తూ ఉండేది. ఆమె ఎంత ప్రయత్నించినప్పటికీ, ఆమె మాటలు అతనిపై ఎటువంటి ప్రభావం చూపలేదు.
ఒకరోజు, అతను ఒక స్మశానం గుండా వెళుతుండగా, ఒక ఎముకను తీయడానికి ఆగాడు. ఆ ఎముక అతని చేతిలోనే పొడిపొడిగా మారి మట్టిలో కలిసిపోవడం చూసి అతను దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఆ దృశ్యం దీనార్‌పై తీవ్ర ప్రభావం చూపింది. అతను తన జీవితం మరియు తన గత పాపాల గురించి ఆలోచించడం ప్రారంభించాడు. అప్పుడు అతను ఇలా అన్నాడు, “ఓ దీనార్, నీకు వినాశనం తప్పదు! నువ్వు కూడా ఈ నలిగిపోయిన ఎముకలాగే అంతం కాబోతున్నావు, నీ శరీరం మట్టిలో కలిసిపోతుంది.” అతని గత పాపాలన్నీ అతని కళ్ళ ముందు కదిలాయి, అతను పశ్చాత్తాపపడాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆకాశం వైపు చూసి, “ఓ నా ప్రభూ, నేను ఇప్పుడు నీకు పూర్తిగా లొంగిపోతున్నాను (శరణు కోరుతున్నాను), కాబట్టి నన్ను స్వీకరించు మరియు నాపై దయ చూపించు” అని వేడుకున్నాడు.
పూర్తిగా మారిన హృదయంతో మరియు మానసిక స్థితితో, దీనార్ తన తల్లి దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు, “అమ్మా, తన నుండి పారిపోయిన బానిసను పట్టుకున్నప్పుడు యజమాని ఏం చేస్తాడు?” ఆమె, “[శిక్షించడానికి] ఆ యజమాని అతనికి ముతక బట్టలు మరియు నాసిరకం ఆహారాన్ని ఇస్తాడు; అతను మళ్ళీ పారిపోవడానికి ప్రయత్నించకుండా అతని కాళ్ళు చేతులు కట్టేస్తాడు” అని చెప్పింది. అప్పుడు దీనార్, “అయితే నాకు ముతక ఉన్నితో చేసిన వస్త్రం, నాసిరకం బార్లీ మరియు రెండు గొలుసులను ఇవ్వు. అమ్మా, పారిపోయిన బానిసకు చేసినట్లే నాకూ చెయ్యి. బహుశా నా ప్రభువు, నా అవమానం మరియు వినయాన్ని చూసి, నాపై దయ చూపిస్తాడేమో.” తన కొడుకు పట్టుదలగా మరియు నిశ్చయంగా ఉండటం చూసి, ఆమె అలాగే చేసింది.
ప్రతి రాత్రి ప్రారంభంలో, దీనార్ ఆగకుండా ఏడవడం మరియు రోధించడం మొదలుపెట్టేవాడు. అతను తనలో తాను ఇలా అనుకునేవాడు, “ఓ దీనార్, నీకు వినాశనం! నరకపు మంటలను తట్టుకోగల శక్తి నీకు ఉందా? సర్వశక్తిమంతుడైన దేవుని ఆగ్రహానికి అర్హులయ్యేలా నువ్వు ఎంత తెగించి జీవించావు!” అతను ఉదయం వరకు ఆ స్థితిలోనే ఉండేవాడు.
దీనార్ శరీరం మెల్లగా చిక్కిపోయి, పాలిపోయింది. అతన్ని ఆ దయనీయ స్థితిలో చూడలేక, అతని తల్లి, “నా కొడుకా, నీపై నువ్వు కాస్త దయ చూపించుకో,” అని చెప్పింది. అతను ఇలా బదులిచ్చాడు, “అమ్మా, నన్ను కొద్దిసేపు ఇలాగే కట్టివేయనివ్వు, బహుశా తర్వాత నేను దీర్ఘకాలిక సుఖాన్ని పొందే అవకాశం ఉంది. రేపు నేను నా మహోన్నత ప్రభువు ముందు చాలా సేపు వేచి ఉండాల్సి ఉంటుంది, ఆయన నన్ను అందమైన నీడ ఉండే ప్రదేశాలకు వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడో లేక వర్ణించలేని భయానక ప్రదేశాలకు (నరకానికి) పంపుతాడో నాకు తెలియదు.”
ఆమె, “నా కొడుకా, కనీసం కాసేపు విశ్రాంతి తీసుకో,” అని చెప్పింది. అతను, “నేను వెతుకుతున్నది ఇప్పటి విశ్రాంతి లేదా సౌకర్యం కాదు. అమ్మా, రేపు నువ్వు మరియు ఇతర ప్రజలు స్వర్గం వైపు వెళుతున్నట్లు, నేను మరియు నరకవాసులు నరకాగ్ని వైపు వెళుతున్నట్లు నాకు కనిపిస్తోంది,” అని అన్నాడు. ఆమె అతన్ని వదిలేసింది, అతను ఏడుస్తూ, ఆరాధన చేస్తూ, ఖురాన్ పఠించడంలో మునిగిపోయాడు. ఒక రాత్రి, అతను ఖురాన్ పఠిస్తుండగా, ఈ వచనాలు వచ్చాయి:
فَوَرَبِّكَ لَنَسْأَلَنَّهُمْ أَجْمَعِين عَمَّا كَانُوا يَعْمَلُونَ َ “కావున, నీ ప్రభువు సాక్షిగా [ఓ ముహమ్మద్], వారు చేసిన పనులన్నింటి గురించి మేము వారిని తప్పక విచారిస్తాము.” [అల్-హిజ్ర్ : 92-93]
ఈ వచనాల అర్థాలు మరియు భావాలను అతను ఆలోచిస్తుండగా, అతను ఎంతగా ఏడ్చాడంటే సొమ్మసిల్లి పడిపోయాడు. అతని తల్లి పరుగున వచ్చి అతన్ని లేపడానికి చాలా ప్రయత్నించింది, కానీ అతను స్పందించలేదు. అతను చనిపోయాడని ఆమె భావించింది. తన కొడుకు ముఖం వైపు చూసి, “ఓ నా ప్రియమైన వాడా, నా హృదయ ఆనందమా, మనం మళ్ళీ ఎప్పుడు కలుస్తాం?” అని అన్నది. వాస్తవానికి, దీనార్‌లో ఇంకా కొంచెం ప్రాణం మిగిలి ఉంది, తన తల్లి మాటలు విని, అతను బలహీనమైన గొంతుతో, “అమ్మా, తీర్పు దినాన విశాలమైన మైదానాల్లో నేను నీకు కనిపించకపోతే, నా గురించి నరకపు రక్షకుడైన ‘మాలిక్’ను అడుగు,” అని అన్నాడు. ఆ తర్వాత అతను గొంతులో నుండి ఒక శబ్దం చేస్తూ (తుది శ్వాస విడిచి) మరణించాడు.
అతని మృతదేహాన్ని శుభ్రం చేసిన తర్వాత, దీనార్ తల్లి అతని అంత్యక్రియలకు సిద్ధం చేసింది. ఆమె బయటకు వెళ్లి, “ఓ ప్రజలారా, నరకాగ్ని భయంతో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి అంత్యక్రియల ప్రార్థనకు రండి,” అని ప్రకటన చేసింది. అన్ని దిశల నుండి ప్రజలు రావడం ప్రారంభించారు. ఆ కాలంలో, అంతకంటే గొప్ప జనసమూహం ఎప్పుడూ రాలేదని మరియు ఆ రోజు చిందించినంత కన్నీళ్లు మరే రోజు చిందించలేదని చెబుతారు.
అతని అంత్యక్రియలు జరిగిన రాత్రే, దీనార్ స్నేహితుల్లో ఒకరు అతన్ని కలలో చూశారు. దీనార్ ఆకుపచ్చని వస్త్రాలు ధరించి ఉన్నాడు. అతను స్వర్గంలో ఆనందంగా విహరిస్తూ ఈ వచనాన్ని పఠిస్తున్నాడు:
فَوَرَبِّكَ لَنَسْأَلَنَّهُمْ أَجْمَعِين عَمَّا كَانُوا يَعْمَلُونَ َ “కావున, నీ ప్రభువు సాక్షిగా [ఓ ముహమ్మద్], వారు చేసిన పనులన్నింటి గురించి మేము వారిని తప్పక విచారిస్తాము.”
ఆ కలలో, అతను ఇలా చెప్పడం స్నేహితుడు విన్నాడు: “ఆయన శక్తి మరియు గొప్పతనం సాక్షిగా, ఆయన నన్ను [నా కర్మల గురించి] అడిగాడు. నాపై దయతో, ఆయన నన్ను క్షమించాడు మరియు నా పాపాలను మన్నించాడు. ఇదిగో! ఈ వార్తను మా అమ్మకు చేరవేయ్యి.”
మూలం: పైన పేర్కొన్న కథ దారుస్సలాం ప్రచురించిన “Stories of Repentance” (పశ్చాత్తాప కథలు) పుస్తకం నుండి తీసుకోబడింది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఒక రాత్రి, ఒక దొంగ మాలిక్ బిన్ దినార్ ఇంటి ప్రహరీ గోడ దూకి, చాలా సులభంగా లోపలికి ప్రవేశించాడు. ఇంటి లోపలికి వెళ్ళిన ఆ దొంగ, అక్కడ దొంగిలించడానికి విలువైనది ఏమీ లేకపోవడం చూసి నిరాశ చెందాడు. ఆ సమయంలో ఇంటి యజమాని (మాలిక్ బిన్ దినార్) లోపలే ఉన్నారు, ఆయన ప్రార్థన (నమాజ్) చేసుకోవడంలో నిమగ్నమై ఉన్నారు. తాను ఒంటరిగా లేనని గ్రహించిన మాలిక్, వెంటనే తన ప్రార్థనను ముగించి, వెనక్కి తిరిగి ఆ దొంగ వైపు చూశారు. ఎలాంటి భయం గానీ, ఆశ్చర్యం గానీ కనబరచకుండా, మాలిక్ ప్రశాంతంగా అతనికి సలామ్ తెలిపి ఇలా అన్నారు, “నా సోదరుడా, అల్లాహ్ నిన్ను క్షమించు గాక. నువ్వు నా ఇంట్లోకి ప్రవేశించావు కానీ తీసుకువెళ్ళడానికి ఏమీ దొరకలేదు, అయినా సరే, నువ్వు ఎటువంటి ప్రయోజనం పొందకుండా నా ఇంటి నుండి వెళ్ళడం నాకు ఇష్టం లేదు.”
ఆయన లేచి, గదిలో వేరే వైపుకు వెళ్ళి, ఒక జగ్గు నిండా నీళ్లు తీసుకొని తిరిగి వచ్చారు. ఆయన ఆ దొంగ కళ్ళలోకి చూస్తూ, “వుజూ (శుద్ధి) చేసుకుని రెండు రకాతుల ప్రార్థన చెయ్యి. నువ్వు అలా చేస్తే, నువ్వు ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆశించిన దానికంటే గొప్ప నిధితో బయటకు వెళ్తావు,” అని అన్నారు.
మాలిక్ ప్రవర్తనకు మరియు మాటలకు ఎంతగానో కదిలిపోయిన ఆ దొంగ, “అవును, ఇది నిజంగా చాలా గొప్ప అవకాశం,” అని అన్నాడు.
వుజూ చేసుకుని రెండు రకాతుల ప్రార్థన పూర్తి చేసిన తర్వాత, ఆ దొంగ, “ఓ మాలిక్, నేను మరో రెండు రకాతుల ప్రార్థన చేయాలనుకుంటున్నాను, కాబట్టి నేను ఇంకా సేపు ఇక్కడే ఉండవచ్చా?” అని అడిగాడు.
దానికి మాలిక్, “అల్లాహ్ నీకు ఎంత ప్రార్థన విధించారో, అంత వరకు నువ్వు ఇక్కడే ఉండు,” అని అన్నారు.
ఆ దొంగ ఆ రాత్రంతా మాలిక్ ఇంట్లోనే గడిపాడు. ఉదయం వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అప్పుడు మాలిక్, “ఇక వెళ్ళు, మంచి మార్గంలో నడువు,” అని అన్నారు.
కానీ వెళ్ళడానికి బదులుగా, ఆ దొంగ, “నేను ఈ రోజు ఉపవాసం (రోజా) ఉండాలని నిశ్చయించుకున్నాను, కాబట్టి ఈ రోజు మీతో పాటు ఇక్కడే ఉండవచ్చా?” అని అడిగాడు.
“నీకు ఇష్టమైనంత కాలం ఉండు,” అని మాలిక్ అన్నారు.
ఆ దొంగ కొన్ని రోజుల పాటు అక్కడే ఉండిపోయాడు. ప్రతి రోజూ రాత్రి వేళ ప్రార్థనలు చేస్తూ, పగలు అంతా ఉపవాసం ఉండేవాడు. చివరికి అతను వెళ్ళడానికి నిర్ణయించుకున్నప్పుడు, ఆ దొంగ ఇలా అన్నాడు, “ఓ మాలిక్, నా పాపాలకు మరియు నా గత జీవన విధానానికి నేను పశ్చాత్తాప పడాలని గట్టిగా నిర్ణయించుకున్నాను.”
మాలిక్, “నిజమే, అది అల్లాహ్ చేతుల్లో ఉంది,” అని బదులిచ్చారు.
ఆ వ్యక్తి తన పద్ధతులను మార్చుకొని, అల్లాహ్ పట్ల విధేయత మరియు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత, అతనికి తెలిసిన మరో దొంగ అతనికి ఎదురయ్యాడు. [అతని స్నేహితుడు] అతనితో, “నీకు నీ నిధి దొరికిందా?” అని అడిగాడు.
అందుకతను ఇలా అన్నాడు, “నా సోదరుడా, నాకు దొరికింది మాలిక్ బిన్ దినార్. నేను ఆయన దగ్గర దొంగలించడానికి వెళ్ళాను, కానీ ఆయనే నా మనసును దోచుకున్నారు. నేను నిజంగా అల్లాహ్ ముందు పశ్చాత్తాప పడ్డాను, మరియు ఆయన విధేయులైన, ప్రేమించే భక్తులు సాధించినది నేను సాధించే వరకు, నేను ఆయన [కరుణ మరియు క్షమాభిక్ష] ద్వారం దగ్గరే ఉంటాను.”
[అల్-మవాఇద్ వల్-మజాలిస్: 85]
మూలం: పైన పేర్కొన్న కథ దారుస్సలాం ప్రచురించిన “Stories of Repentance” (పశ్చాత్తాప కథలు) పుస్తకం నుండి తీసుకోబడింది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“(ఇస్రాయీల్ జాతివారు) శనివారం నాటి విషయంలో హద్దుమీరి ప్రవర్తించేవారు. మరి ఆ శనివారం నాడే చేపలు పైపైకి తేలియాడుతూ వారి ముందుకు వచ్చేవి. శనివారం కాని దినాలలో అవి వారి ముందుకు వచ్చేని కావు, వారి అవిధేయత మూలంగా మేము వారిని ఈ విధంగా పరీక్షకు గురి చేసేవారము.” (7:163)
ఇస్రాయీల్ ప్రజలు వారంలో ఒక రోజు తమ పనులన్నింటినీ మానుకోవాలని ప్రవక్త మూసా (అలైహిస్సలాం) బోధించారు. అలా పనులన్నింటినీ మానుకునే రోజును ‘సబ్బత్’ అంటారు. సబ్బత్ రోజున అన్ని పనులు మానుకుని కేవలం అల్లాహ్ ను ఆరాధించవలసి ఉంది. అల్లాహ్ తమపై కురిపించిన అనుగ్రహాలకు కృతజ్ఞతలు చెల్లించవలసి ఉంది. ఈ విధంగా చేయడం వల్ల వారి హృదయాలు పరిశుద్ధమవుతాయని ఆయన బోధించారు. యూదులు శనివారాన్ని తమ సబ్బత్ రోజుగా ఎన్నుకున్నారు. ఈ సంప్రదాయాన్ని అనేక తరాలు ఆచరించాయి.
ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) కాలంలో ఎలాత్ ప్రాంతంలో కొందరు ఇస్రాయీల్ ప్రజలు నివసించేవారు. ఎలాత్ ఎర్ర సముద్ర తీరాన ఉన్న ఒక పట్టణం. వారంతా చేపలు పట్టే జాలర్లు. సబ్బత్ రోజున సముద్రంలో చేపలు రెండు శిలల మధ్య గుమిగూడి గుంపులు గుంపులుగా కనబడడాన్ని వాళ్ళు చూశారు.
సబ్బత్ రోజున జాలర్ల వలలు తమను ఏమీ చేయవన్న విషయం వాటికి తెలిసినట్లు, ఆ రోజునే అవి తీరానికి వచ్చి ఊరించేవి. వాటిని చూసి కొందరు జాలర్లు నిగ్రహాన్ని కోల్పోయారు. అత్యా శతో చివరకు వాళ్ళు సబ్బత్ నియమాన్ని అతిక్రమించాలని నిర్ణయించుకున్నారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/mEfcvGUoA-Y [48 నిముషాలు]
ఈ ప్రసంగంలో, ప్రవక్త మూసా (అలైహిస్సలాం) తరువాత బనీ ఇస్రాయీల్ ప్రజల చరిత్రను వివరించబడింది. యూషా బిన్ నూన్, ఇల్యాస్ మరియు యసా (అలైహిముస్సలాం) వంటి ప్రవక్తల తరువాత, బనీ ఇస్రాయీల్ ప్రజలు ఒక రాజును కోరగా, అల్లాహ్ తాలూత్‌ను నియమించాడు. జాలూత్ (గొలియత్)తో జరిగిన యుద్ధంలో, యువకుడైన దావూద్ (అలైహిస్సలాం) విజయం సాధించి, కాలక్రమేణా రాజుగా మరియు ప్రవక్తగా నియమితులయ్యారు. ఆయనకు “జబూర్” గ్రంథం ఇవ్వబడింది మరియు ఆయనకు పర్వతాలు, పక్షులతో పాటు అల్లాహ్‌ను కీర్తించే అద్భుతమైన స్వరం, ఇనుమును మెత్తగా చేసే శక్తి వంటి మహిమలు ప్రసాదించబడ్డాయి. దావూద్ (అలైహిస్సలాం) ప్రవక్త మరియు రాజుగా న్యాయాన్ని ఎలా స్థాపించారో, ఒక సంఘటనలో తొందరపాటు తీర్పు ఇచ్చి ఎలా పశ్చాత్తాపపడ్డారో కూడా వివరించబడింది. ఆయన కుమారుడు సులేమాన్ (అలైహిస్సలాం) యొక్క జ్ఞానం, దావూద్ (అలైహిస్సలాం) యొక్క ఆరాధన, ఉపవాస పద్ధతి మరియు ఆయన మరణం గురించి కూడా చర్చించబడింది. ఈ ప్రసంగం నుండి న్యాయం, పశ్చాత్తాపం మరియు అల్లాహ్‌పై ఆధారపడటం వంటి గుణపాఠాలను నేర్చుకోవచ్చు.
అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్.
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి.
ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు
ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర
ఈనాటి ప్రసంగంలో మనము, ప్రవక్త దావూద్ అలైహిస్సలాం జీవిత చరిత్ర తెలుసుకోబోతున్నాము. ఇంతకు ముందు ప్రసంగాలలో, ప్రవక్త మూసా అలైహిస్సలాం జీవిత చరిత్ర వివరంగా తెలుసుకొని ఉన్నాము. మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ముగిసే సమయానికి బనీ ఇస్రాయీల్ ప్రజలు 40 సంవత్సరాల కొరకు తీహ్ మైదానంలో మార్గభ్రష్టులై తిరుగుతూ ఉన్నారు. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి కోసము ఆకాశం నుండి మన్ సల్వా ఆహారము దింపుతున్నాడు, రాతి నుండి నీటి ఊటను ఉభకింపజేశాడు, మేఘాల నుండి నీడ ఏర్పాటు చేశాడు, ఆ విధంగా వారు ఆ మైదానంలో ఉంటున్నారు అనే విషయం వరకు మనకు తెలియజేయడం జరిగింది.
ఆ తర్వాత జరిగిన విషయాలు తెలుసుకుంటూ ఇన్ షా అల్లాహ్ దావూద్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలోకి మనము ప్రవేశిద్దాం. తీహ్ మైదానంలో ఉన్నప్పుడే మూసా అలైహిస్సలాం వారు మరణించారు. ఆ తీహ్ మైదానంలో ఉన్నప్పుడే హారూన్ అలైహిస్సలాం వారు కూడా మరణించారు. మూసా అలైహిస్సలాం వారు, హారూన్ అలైహిస్సలాం వారిద్దరి మరణం తర్వాత బనీ ఇస్రాయీల్ వారికి యూషా బిన్ నూన్ అలైహిస్సలాం వారు ప్రవక్తగా, బోధకునిగా దైవ వాక్యాలు బోధించుకుంటూ, వారి సమస్యలు పరిష్కరించుకుంటూ, వారిని సంస్కరించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. 40 సంవత్సరాల గడువు పూర్తి అయ్యింది. తర్వాత ఆ మూర్ఖులు ఎవరైతే “యుద్ధంలో మేము ప్రవేశించలేము” అని వెనకడుగు వేశారో, “నీవు నీ ప్రభువు వెళ్లి యుద్ధం చేసుకోండి మేము ఇక్కడే కూర్చుని ఉంటాము” అని మూర్ఖత్వం ప్రదర్శించారో, వారందరూ కూడా మరణించారు. వారి బిడ్డలు ఇప్పుడు పెరిగి పెద్దవారై యువకులై ఉన్నారు. అంటే పూర్తిగా ఒక తరము గడిచిపోయింది. కొత్త తరము, ఉడుకు రక్తము ఎవరి శరీరాలలో ప్రవేశించి ఉందో, అలాంటి ఒక కొత్త తరము ఇప్పుడు ప్రపంచంలోకి ఉనికిలోకి వచ్చి ఉంది.
అలాంటి వారిని తీసుకుని యూషా బిన్ నూన్ అలైహిస్సలాం వారు మళ్లీ అల్-ఖుద్స్, పాలస్తీనా వైపుకి ప్రయాణం ప్రారంభించారు. ఈసారి వారు దారి తప్పలేదు, ఎందుకంటే వారి మీద పెట్టబడిన ఆ 40 సంవత్సరాల గడువు పూర్తి అయిపోయింది కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి మార్గం చూపించాడు. వారు ఏకంగా పాలస్తీనా దేశానికి అల్-ఖుద్స్ అనే నగరానికి వచ్చి చేరారు. ఇక, మాషా అల్లాహ్, యువకులు, ఉడుకు రక్తం, యుద్ధం కోసం సిద్ధమైపోండి అనగానే వారందరూ యుద్ధం కోసం సిద్ధంగా ఉన్నారు. అయితే అల్-ఖుద్స్ నగరంలో ఉన్న ప్రజలు లోపలే ఉండి చాలా రోజుల వరకు వారి సహనాన్ని పరీక్షించారు. అయినా గానీ వీరు వెనకాడగలేదు. చివరికి ఆ నగరము బనీ ఇస్రాయీల్ వారి చేతికి వచ్చేసింది. ఆ విధంగా బనీ ఇస్రాయీల్, ఇస్రాయీల్ సంతతి వారు అల్-ఖుద్స్ అనే నగరంలోకి ప్రవేశించారు. అప్పటి నుండి మళ్లీ ఆ నగరము వారి సొంతమయ్యింది, వారి వశమయ్యింది.
యూషా (అలైహిస్సలాం) తరువాత బనీ ఇస్రాయీల్
ఆ తర్వాత యూషా బిన్ నూన్ అలైహిస్సలాం వారు అక్కడ ఉన్నన్ని రోజులు వారికి దైవ వాక్యాలు, బోధనలు బోధించుకుంటూ జీవితం కొనసాగించారు. ఆ తర్వాత ఆయన మరణించారు. యూషా బిన్ నూన్ అలైహిస్సలాం మరణించిన తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఈ లోపు మళ్లీ బనీ ఇస్రాయీల్ ప్రజలలో అవకతవకలు వచ్చేసాయి, వారు మళ్లీ మార్గభ్రష్టత్వానికి గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా లబ్నాన్ దేశంలో, ఇదే బనీ ఇస్రాయీల్ కు చెందిన కొంతమంది మళ్లీ మూర్ఖత్వం ప్రదర్శిస్తూ అక్కడ బాల్ అనే ఒక విగ్రహాన్ని సిద్ధం చేసుకుని దాన్ని పూజించడం ప్రారంభించారు. ఆ విధంగా మళ్లీ బహుదైవారాధన, షిర్క్, విగ్రహారాధన ప్రారంభం చేసేశారు.
అప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇల్యాస్ అలైహిస్సలాం వారిని వారి వద్దకు ప్రవక్తగా పంపించాడు. ఇల్యాస్ అలైహిస్సలాం లబ్నాన్ దేశంలో బనీ ఇస్రాయీల్ ప్రజల వద్దకు వెళ్లి మళ్లీ వారిని సంస్కరించారు, అల్లాహ్ వైపు, అల్లాహ్ ఏకత్వం వైపు, తౌహీద్ వైపు వారిని పిలుపునిచ్చారు. ఇల్యాస్ అలైహిస్సలాం వారి తర్వాత యసా అలైహిస్సలాం అనే మరో ప్రవక్త బనీ ఇస్రాయీల్ వైపుకి ప్రవక్తగా పంపించబడ్డారు. అయితే యూషా బిన్ నూన్ అలైహిస్సలాం వారి గురించి, ఇల్యాస్ అలైహిస్సలాం వారి గురించి, యసా అలైహిస్సలాం వారి గురించి ఎక్కువగా ప్రస్తావన లేదు కాబట్టి, నేను వారి గురించి ప్రత్యేకంగా ప్రసంగము చేయట్లేదు. ముఖ్యంగా వారి పేరు, వారు ఎవరి వైపుకి ప్రవక్తగా పంపించబడ్డారు, ఏ సందర్భంలో పంపించబడ్డారు అనే విషయం వరకు మాత్రమే చెప్పేసి మాటలు ముందుకు సాగిస్తున్నాను. ఈ విషయాన్ని మన మిత్రులు గమనించాలి.
అయితే ఇల్యాస్ అలైహిస్సలాం వారి తర్వాత యసా అలైహిస్సలాం వారికి బనీ ఇస్రాయీల్ ప్రజల పగ్గాలు ఇవ్వబడ్డాయి. యసా అలైహిస్సలాం వారు కూడా చాలా చక్కగా దైవ వాక్యాలు బనీ ఇస్రాయీల్ వారికి బోధించుకుంటూ ముందుకు సాగారు. యసా అలైహిస్సలాం వారు మరణించిన తర్వాత, అప్పుడు బనీ ఇస్రాయీల్ మీద అల్లాహ్ తరపు నుంచి పెద్ద పెద్ద పరీక్షలు వచ్చి పడ్డాయి. ఎందుకంటే యసా అలైహిస్సలాం వారి మరణం తర్వాత మళ్ళీ మరో ప్రవక్త వచ్చే లోపు ఈ మధ్య ఏ గ్యాప్ అయితే ఉందో, ఈ గ్యాప్ లో మళ్ళీ బనీ ఇస్రాయీల్ ప్రజలు మార్గభ్రష్టత్వానికి గురయ్యారు. అంతే కాదండి, వారు పరస్పరం విభేదించుకుని గొడవలకు దిగారు. ఆ విధంగా పాపాల్లో మునిగిపోయారు, విభేదించుకుని గొడవలు పెట్టుకున్నారు. అలా చేసిన కారణంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్ళీ బుఖ్తె నసర్ అనే ఒక దౌర్జన్య పరిపాలకుడిని వారి మీదికి పంపించగా, ఆ బుఖ్తె నసర్ వచ్చి ఖుదుస్ మీద దండయాత్ర చేసి బనీ ఇస్రాయీల్ వారిని చాలా కఠినంగా అక్కడి నుంచి కొట్టి, చంపి తరిమేశాడు. అల్లాహు అక్బర్.
చరిత్ర చదువుతూ ఉంటే కన్నీళ్లు కారుతాయండి, అంత కఠినంగా, అంత విచక్షణ రహితంగా బుఖ్తె నసర్ మరియు అతని సైన్యమైన అమాలిఖా ప్రజలు ఈ బనీ ఇస్రాయీల్ మీద విరుచుకుపడ్డారు. నలుమూలల నుండి వారి మీద విరుచుకుపడి వారిని అల్-ఖుదుస్ నుండి తరిమి తరిమి, వారిని చంపారు. ఆ విధంగా వారిని అక్కడి నుంచి తరిమి తరిమి వెళ్ళగొట్టారు. ఆ విధంగా బనీ ఇస్రాయీల్ ప్రజలు అల్-ఖుదుస్ ప్రదేశాన్ని మళ్ళీ కోల్పోయారు, ప్రపంచంలో వేరే వేరే ప్రదేశాలకు పారిపోయారు.
అయితే ఎప్పుడైతే ఈ బుఖ్తె నసర్ అనే రాజు వచ్చి బనీ ఇస్రాయీల్ ప్రజల మీద దండయాత్ర చేసాడో, అల్-ఖుదుస్ నగరాన్ని సర్వనాశనం చేసాడో, బనీ ఇస్రాయీల్ ప్రజల్ని చెల్లాచెదురుగా తరిమేశాడో, ఆ సందర్భంలోనే బనీ ఇస్రాయీల్ ప్రజల వద్ద పవిత్రమైన జ్ఞాపకాలు, గుర్తులు కొన్ని ఉండేవి. ఒక పెట్టె ఉండేది వారి వద్ద, దానిని తాబూత్ అని అరబీలో అంటూ ఉంటారు. అందులో పవిత్రమైన కొన్ని గుర్తులు ఉండేవి. ఏముండేవి అంటే మూసా అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చిన ఫలకాలు ఉండేవి, మూసా అలైహిస్సలాం వారి చేతి కర్ర, కింద పడేస్తే సర్పం లాగా మారుతుంది, తర్వాత ముట్టుకుంటే మళ్ళీ కర్ర లాగా మారిపోతుంది అని విన్నాము కదా, ఆ కర్ర ఉండేది. హారూన్ అలైహిస్సలాం వారికి కూడా కొన్ని గుర్తులు అందులో ఉండేవి. అలాంటి ప్రవక్తల పవిత్రమైన కొన్ని గుర్తులు అందులో ఉండేవి. ఆ తాబూత్ పెట్టెను కూడా ఈ బుఖ్తె నసర్, అమాలిఖా ప్రజలు పట్టుకెళ్ళిపోయారు.
అయితే అలా జరిగిన తర్వాత మళ్లీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా షమ్వీల్ అలైహిస్సలాం అనే ఒక ప్రవక్తను పంపించాడు. షమ్వీల్ అలైహిస్సలాం అనే ప్రవక్త ప్రభవించబడిన తర్వాత ఆయన మళ్ళీ ప్రజలలో ఉన్న వారి మార్గభ్రష్టత్వాన్ని దూరం చేశారు, వారి లోపాలను వారు మళ్ళీ పరిష్కరించారు, సంస్కరించారు. ఆ తర్వాత బనీ ఇస్రాయీల్ ప్రజలు ఎవరెవరు ఎక్కడెక్కడ అయితే విడిపోయి దూరదూరంగా ఉంటున్నారో వారందరినీ మళ్ళీ ప్రోగవ్వాలని పిలుపునిచ్చారు. షమ్వీల్ అలైహిస్సలాం వారి పిలుపుని ఆమోదిస్తూ బనీ ఇస్రాయీల్ వారు మళ్ళీ వచ్చి ఒకచోట ప్రోగయ్యారు.
తాలూత్ ను రాజుగా నియమించడం
వాళ్ళు మళ్ళీ వచ్చి ప్రోగైన తర్వాత, రాను రాను వారి సంఖ్య పెరుగుతూ పోయింది. లక్షల్లో మళ్ళీ వారి సంఖ్య అక్కడ ఏర్పడిపోయింది. అప్పుడు బనీ ఇస్రాయీల్ ప్రజలకు ఒక ఆలోచన తట్టింది. అదేమిటి? మనకు బోధించడానికి, దైవ వాక్యాలు వినిపించి నేర్పించడానికి ప్రవక్త అయితే ఉన్నారు. కానీ మనకు ఒక రాజు కూడా ఉంటే బాగుండేది. ఆ రాజు సారధ్యంలో మేము యుద్ధాలు చేయగలము, మా ప్రాపంచిక సమస్యలను అతను బాగా చక్కగా పరిష్కరించగలడు, అలాగే మేము కోల్పోయిన ఆ పవిత్రమైన గుర్తులు, తాబూత్ పెట్టె, మళ్ళీ మనము తిరిగి సొంతం చేసుకోగలము అనే ఉద్దేశంతో షమ్వీల్ అలైహిస్సలాం వారి వద్దకు వెళ్లి, ఓ దైవ ప్రవక్త వారు, మా కోసము ఒక రాజుని నియమించండి. మీరైతే దైవ వాక్యాలు బోధిస్తున్నారు కానీ, ఒక రాజుని నియమిస్తే ఆ రాజు సారధ్యంలో మేము ప్రాపంచిక సమస్యలు పరిష్కరించుకుంటాము, కోల్పోయిన గౌరవాన్ని మళ్ళీ పొందుతాము, కోల్పోయిన తాబూత్ పెట్టెను కూడా మళ్ళీ తిరిగి వశపరుచుకుంటాము అని కోరినప్పుడు, షమ్వీల్ అలైహిస్సలాం వారు బనీ ఇస్రాయీల్ ప్రజలతో ఏమన్నారంటే, చూడండి మీరు పెద్ద కోరిక కోరుతున్నారు. రాజును నియమించటం, ఆ తర్వాత జిహాద్ చేయటం మీ మీద విధి చేయటం జరిగితే మళ్ళీ మీరు మాట తప్పరాదు. ఒకవేళ మీరు మాట తప్పితే మళ్ళీ మీ మీద కఠినమైన శిక్షలు పడతాయి, జాగ్రత్త, మాట మార్చరు కదా అని అడిగారు. బనీ ఇస్రాయీల్ ప్రజలు లేదండి, మీరు రాజుని నియమించండి. యుద్ధం మా మీద విధి చేయండి చాలు, చూడండి మేము యుద్ధాలు ఎలా చేస్తామో అని పగడ్బాలు పలికారు. షమ్వీల్ అలైహిస్సలాం అల్లాహ్ తో దుఆ చేశారు.
అల్లాహ్ తో దుఆ చేయగా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యుద్ధాన్ని విధి చేసేసాడు, ఫర్జ్ చేసేసాడు. ఆ తర్వాత వారి కోసము తాలూత్ ను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రాజుగా విధించాడు. అయితే ఈ తాలూత్ ఎవరు అంటే, యాకూబ్ అలైహిస్సలాం వారి కుమారులలో బిన్యామీన్ అనే ఒక కుమారుడు ఉండేవాడు కదండీ, ఆ బిన్యామీన్ సంతానానికి చెందిన వ్యక్తి ఈ తాలూత్.
షమ్వీల్ అలైహిస్సలాం ప్రజల ముందరకు వచ్చి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మీ మీద యుద్ధం విధి చేసేసాడు, ఇక మీరు యుద్ధము చేయవచ్చు, అలాగే తాలూత్ ని అల్లాహ్ మీ కొరకు రాజుగా నియమించాడు. మీరు తాలూత్ ని రాజుగా ఎన్నుకోండి అన్నారు. అయితే బనీ ఇస్రాయీల్ ప్రజలు షమ్వీల్ అలైహిస్సలాం వారి వద్దకు వెళ్లి, ఇదేమిటండి, మీరు తాలూత్ ని మనకు రాజుగా నియమించారు? బిన్యామీన్ వంశానికి చెందిన వ్యక్తి ఎప్పుడూ మనకు రాజుగా నియమింపబడలేదే? మన యహూదా సంతానికి చెందిన వ్యక్తులే ఎప్పుడూ ఇప్పటివరకు కూడా రాజులుగా నియమించబడుతూ వచ్చారు అని అడిగారు. అంటే యాకూబ్ అలైహిస్సలాం వారి మరొక కుమారుని పేరు యహూదా. ఆ యహూదా సంతానానికి చెందిన వ్యక్తులే ఇప్పటివరకు రాజులుగా నియమించబడుతూ వస్తూ ఉండేవారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఈ యహూదా సంతానానికి చెందిన వ్యక్తి కాకుండా, బిన్యామీన్ సంతానానికి చెందిన వ్యక్తి ఎప్పుడైతే రాజుగా నియమించబడ్డాడో, బనీ ఇస్రాయీల్ వారికి ఆశ్చర్యం కలిగింది. వెళ్లి షమ్వీల్ అలైహిస్సలాం వారి ముందర వారి ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. అప్పుడు షమ్వీల్ అలైహిస్సలాం వారు అన్నారు, లేదండీ ఇది నా నిర్ణయము, నా ఎన్నిక కాదండీ, ఇది అల్లాహ్ యొక్క ఎన్నిక. అల్లాహ్ ఆయనను రాజుగా ఎన్నుకోవాలని, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వయంగా ఆయనను ఎన్నుకోమని ఆదేశాలు ఇచ్చి ఉన్నాడు అని చెప్పారు.
అయితే బనీ ఇస్రాయీల్ ప్రజలు నమ్మలేదు. మేము ఎలా నమ్మాలండి? ఇప్పటివరకు వస్తున్న పరంపరను కాకుండా వేరే కొత్త విషయాన్ని మీరు ప్రవేశపెడుతున్నారు. మేము ఎలా నమ్మాలి? ఏదైనా నిదర్శనము మాకు చూపించండి అని అడిగారు. అప్పుడు షమ్వీల్ అలైహిస్సలాం వారు అన్నారు, ఇది దైవ నిర్ణయము అని మీకు తెలియజేయడానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దూతల ద్వారా మీరు కోల్పోయిన ఆ తాబూత్ పెట్టెను మళ్ళీ మీ వద్దకు తిరిగి వచ్చేటట్టు చేస్తాడు, చూడండి అన్నారు. అదేవిధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశంతో దైవదూతలు ఆ అమాలిఖా ప్రజలు పట్టుకెళ్ళిపోయిన ఆ తాబూత్ పెట్టెను తిరిగి తీసుకుని వచ్చి బనీ ఇస్రాయీల్ ప్రజల చేతికి అప్పగించారు. ఇంతకుముందు చెప్పాను కదండీ, ఆ తాబూత్ పెట్టెలో తౌరాత్ ఫలకాలు, మూసా అలైహిస్సలాం వారి చేతి కర్ర, హారూన్ అలైహిస్సలాం వారి గుర్తులు ఇలా పవిత్రమైన విషయాలు అందులో భద్రపరచబడి ఉండేవి. ఆ తాబూత్ పెట్టె వారి వద్ద ఉంటే వారికి మనశ్శాంతి కూడా లభించేది. ఆ తాబూత్ పెట్టెను వెంటపెట్టుకుని వెళ్లి వారు యుద్ధాలు కూడా చేసేవారు.
ఇలా ఎప్పుడైతే ఆ తాబూత్ పెట్టె తిరిగి మళ్ళీ వారి వద్దకు వచ్చిందో, అప్పుడు వారు అర్థం చేసుకున్నారు ఇది దైవ నిర్ణయం ప్రకారమే జరిగింది అని. తర్వాత సంతోషంగా వారు తాలూత్ ని తమ నాయకునిగా, తమ రాజుగా ఎన్నుకున్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మా కోసం యుద్ధం విధి చేయండి, మేము యుద్ధము చేస్తాము, యుద్ధాలలో పాల్గొంటాము అని కోరిన వారు, ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యుద్ధము విధి చేసేసాడో, లక్షల్లో ఉన్న వారి సంఖ్యలో నుంచి కేవలం 80,000 వ్యక్తులు మాత్రమే యుద్ధానికి సిద్ధమయ్యారు. మిగతా వారందరూ కూడా మాట మార్చేశారు.
ఎలాంటి ప్రజలు ఈ బనీ ఇస్రాయీల్ ప్రజలు ఒకసారి ఆలోచించండి. కొద్దిసేపు క్రితమే పగడ్బాలు పలికారు, గొప్పలు పలికారు, మేము యుద్ధాలు చేస్తాము అని. యుద్ధం విధి చేసేసిన తర్వాత, మేము యుద్ధము చేయము అని చేతులు దులుపుకున్నారు. వెళ్ళిపోయిన వారి సంఖ్య లక్షల్లో ఉంది. కానీ, మాట మీద నిలబడిన వారు 80,000 మాత్రమే. అయితే ఆ 80,000 లో నుంచి కూడా ఎంతమంది చిత్తశుద్ధితో ఉంటున్నారు, చిత్తశుద్ధితో నిలబడుతున్నారు అనేది లెక్క తేలలేదు. అయినా గానీ, తాలూత్ రాజు ఆ 80,000 మందిని వెంటపెట్టుకుని యుద్ధము కోసము బయలుదేరారు.
అయితే మనిషి లోపల ఎక్కడో ఒకచోట ఒక ఆలోచన, కంగారు అనేది ఉంది. లక్షల్లో బనీ ఇస్రాయీల్ ప్రజలు యుద్ధము చేయము అని వెనకడుగు వేసేశారు, వెనక్కి వెళ్ళిపోయారు. ఈ 80,000 లో నుంచి కూడా ఎంతమంది చిత్తశుద్ధితో ఉన్నారు అనేది లెక్క తేలలేదు. అయితే ఆ 80,000 లో నుంచి ఎంతమంది చిత్తశుద్ధి కలిగిన వారు ఉన్నారు అనేది తేల్చడానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి ఒక పెద్ద పరీక్ష పెట్టాడు. వారు యుద్ధము కోసము తాలూత్ రాజుతో పాటు ప్రయాణం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. వెళుతూ వెళుతూ ఉంటే దారిలో ఒక నది వచ్చింది. ఆ నది పేరు నెహ్రె ఉర్దున్, జోర్డాన్ నది. ఆ నది దాటుతున్నప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరీక్ష పెట్టాడు. ఆ నది నీరు ఎవరూ కడుపునిండా తాగరాదు. ఒక గుడికెడు నీళ్లు తాగాలనుకుంటే తాగవచ్చు గానీ, అసలు తాగకుండా ఉంటేనే మంచిది. కడుపు నిండా అయితే అస్సలు తాగనే రాదు అని అల్లాహ్ పరీక్ష పెట్టేశాడు.
చూడండి, ప్రయాణంలో ఉన్నారు, బాగా దప్పిక, ఆకలితో ఉన్నారు. అలాంటప్పుడు మంచి నీరు కనిపించాయి. ఆ మంచి నీరు తాగవద్దు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నిబంధన పెట్టాడు, పరీక్షించడానికి. అయితే నది దిగి నది అవతల వైపు దాటేసరికి 80,000 లో నుంచి కేవలం 313 వ్యక్తులు మాత్రమే నీళ్లు తాగలేదు, మిగతా వారందరూ కూడా కడుపు నిండా నీళ్లు తాగేశారు. దీని ద్వారా అర్థమైన విషయం ఏమిటంటే, ఆ 80,000 లో నుంచి కూడా చిత్తశుద్ధి కలిగిన వారు కేవలం 313 మంది మాత్రమే. మిగతా వారందరూ కూడా మాట మీద, చిత్తశుద్ధితో ఉన్నవారు కాదు అని తేలిపోయింది.
నది దాటిన తర్వాత, ఎప్పుడైతే వారు నది అవతల వైపుకి చేరుకున్నారో, అక్కడికి వెళ్ళగానే వాళ్ళు కాళ్లు చేతులు నిరసించిపోయాయి. వారు కూర్చుండిపోయారు. రాజుతో, మహారాజా, ఇప్పుడు మేము యుద్ధంలో పాల్గొనలేము, మా శరీరంలో శక్తి లేకుండా పోయింది అని చేతులెత్తేశారు.
జాలూత్ తో యుద్ధం
ఒక్కసారి ఆలోచించి చూడండి. 80,000 లో నుంచి కేవలం 313 మంది మాత్రమే నీళ్ళు తాగకుండా ఉన్నారు. ఆ 313 మందిని తీసుకుని వెళ్లి ఇప్పుడు పెద్ద సైన్యంతో యుద్ధం చేయాలంటే మామూలు విషయమా? ఆ 313 మంది ఎంత కంగారు పడిపోతారు అలాంటి సందర్భంలో? కానీ చిత్తశుద్ధి కలిగిన ఆ 313 మంది ఒకరినొకరు ఏమని మాట్లాడుకున్నారంటే, చూడండి మనము అల్లాహ్ మీద నమ్మకం కలిగి ఉన్నాము. మనకు పూర్వము కూడా తక్కువ సంఖ్యలో ఉన్న వారు అల్లాహ్ మీద నమ్మకంతో యుద్ధాలలో పాల్గొన్నప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని ఆదుకుని విజయాల వరకు చేర్చాడు కాబట్టి, మనము కూడా అల్లాహ్ మీద భారం వేసి, అల్లాహ్ మీద నమ్మకంతో ముందుకు సాగుదాము, పదండి. వీళ్ళు రాకపోయినా పర్వాలేదు, మాకు అల్లాహ్ సహాయకుడిగా ఉన్నాడు, మేము ఇన్ షా అల్లాహ్ తప్పనిసరిగా విజయము సాధిస్తాము అని ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని అక్కడి నుంచి ముందుకు సాగారు.
అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో బద్ర్ యుద్ధంలో పాల్గొన్న సహాబాల సంఖ్య 313 మంది. అదే విధంగా ఇక్కడ తాలూత్ రాజుతో పాటు చిత్తశుద్ధి కలిగి యుద్ధంలో పాల్గొనడానికి ముందుకు వెళుతున్న వారి సంఖ్య కూడా 313. ఆ 313 మందిని తీసుకుని తాలూత్ రాజు యుద్ధం చేయడానికి ముందుకు వెళ్లారు. ముందుకు వెళ్ళిన తర్వాత శత్రు సైన్యం ఎదురుపడింది. ఎప్పుడైతే శత్రు సైన్యము ఎదురుపడిందో, అక్కడ చూస్తే శత్రు సైన్యంలో సైన్యము సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వారి సైన్యాధిపతి, అతని అరబీ భాషలో జాలూత్ అంటారు, తెలుగులో గొలియత్ మరియు అలాగే ఆంగ్లంలో కూడా గొలియత్ అని అనువాదం చేసి ఉన్నారు. అరబీలో అయితే, ఉర్దూలో అయితే జాలూత్ అని అతని పేరు తెలపబడింది. అతను యుద్ధ వస్త్రాలు ధరించి, కత్తి పట్టుకుని, పెద్ద శరీర దేహము కలిగిన వాడు, ముందుకు వచ్చాడు. అతని దేహాన్ని, అతని ఎత్తును చూసి ఏ ఒక్కరూ కూడా అతని ముందుకు వెళ్ళటానికి సాహసించలేకపోతున్నారు. అతను ముందుకు వచ్చి సవాలు విసిరాడు. మీ 313 మందిలో నుంచి నన్ను ఎదుర్కొనే మొనగాడు ఎవరైనా ఉన్నాడా? ఉంటే రండి ముందుకు చూద్దాము అని బిగ్గరగా సవాలు విసురుతూ ఉన్నాడు. ఎంతో గర్వాన్ని, ఎంతో అహంకారాన్ని ప్రదర్శిస్తూ, మీలో ఎవరైనా ఉన్నాడా, ఎవరికైనా దమ్ము ఉందా నన్ను ఎదుర్కోవడానికి అని సవాలు విసురుతూ ఉంటే, ఈ 313 మందిలో నుంచి 16 సంవత్సరాల ఒక కుర్రాడు ముందుకు వచ్చాడు. అతను ఎలాంటి యుద్ధ యుద్ధ వస్త్రాలు ధరించి లేడు. అతని చేతిలో చివరికి ఖడ్గము, కత్తి కూడా లేదు. చేతిలో ఒక తాడు ఉంది, మరొక చేతిలో కొన్ని రాళ్లు మాత్రమే ఉన్నాయి.
ఆ రాళ్లు, ఆ తాడు పట్టుకుని ముందుకు వస్తే, ఆ కుర్రాడిని చూసి ఆ జాలూత్ సేనాధిపతి పకపక నవ్వేసాడు. ఒరేయ్ బచ్చా, నీవు నన్ను ఎదుర్కొంటావా? నీ సైన్యంలో నీకంటే గొప్ప పెద్ద మొనగాడు ఎవడూ లేడా నన్ను ఎదుర్కోవడానికి? అని హేళన చేశాడు. అతను హేళన చేస్తూ ఉంటే, అతని వెనుక ఉన్న అతని సైన్యము నవ్వుతూ ఉంటే, అప్పుడు ఆ 16 ఏళ్ల కుర్రాడు తాడులో ఆ రాళ్లు పెట్టి గిరగిరా తిప్పి వేగంగా విసిరాడు. అవి ఎంత వేగంగా వచ్చి తగిలాయి అంటే చరిత్రకారులు తెలియజేశారు, మెరుపు వేగంతో ఆ రాళ్లు వచ్చి ఆ జాలూత్ నుదుటను బలంగా తాకాయి. ఒకదాని వెనుక ఒకటి వచ్చి తాకగానే ఆ గర్విస్తున్న ఆ జాలూత్ ఒక్కసారిగా వెనక్కి కూలి పడిపోయాడు. అలాగే ప్రాణాలు వదిలేశాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆ జాలూత్ సైన్యం మొత్తము భయపడిపోయింది, బిత్తరపోయింది. ఆ తర్వాత అకస్మాత్తుగా రెండు వర్గాల మధ్య యుద్ధం ప్రారంభమైపోయింది. చూస్తూ ఉండంగానే కంగారు పడిపోయిన, బిత్తరపోయిన, భయపడిపోయిన జాలూత్ సైన్యము పరాజయం పాలయ్యి పారిపోయారు. ఈ 313 మంది గెలుపు పొందారు, విజయము ఈ భక్తులకు, చిత్తశుద్ధి కలిగిన వారికి దక్కింది. అయితే ఆ 16 సంవత్సరాల కుర్రాడు ఎవరైతే జాలూత్ ని రాళ్లతో కొట్టి చంపేశాడో, అతను ఎవరంటే, ఆయనే దావూద్ అలైహిస్సలాం. అల్లాహు అక్బర్.
చూశారా? ఆయన పేరే దావూద్ అలైహిస్సలాం. దావూద్ అలైహిస్సలాం వారి చేతిలో ఆ జాలూత్ అనే సేనాధికారి మరణించాడు. విజయము ముస్లింలకు, చిత్తశుద్ధి కలిగిన ఈ భక్తులకు వరించింది అల్ హందులిల్లాహ్. అది చూసిన ఈ తాలూత్ రాజు, 313 మందిని వెనక పట్టుకుని వచ్చిన ఈ తాలూత్ రాజు, దావూద్ అలైహిస్సలాం వారిని మెచ్చుకుని ఆ తర్వాత తన కుమార్తెను దావూద్ అలైహిస్సలాం వారికి ఇచ్చి వివాహం జరిపించేశాడు. ఆ విధంగా దావూద్ అలైహిస్సలాం రాజకుమార్తెతో వివాహం చేసుకున్నారు, రాజుకి అల్లుడైపోయారు. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత రాజు తన రాజ్యాన్ని కూడా దావూద్ అలైహిస్సలాం వారి చేతికి అప్పగించేశాడు. ఆ విధంగా దావూద్ అలైహిస్సలాం వారు బనీ ఇస్రాయీల్ వారికి దావూద్ అలైహిస్సలాం వారు రాజయ్యారు.
దావూద్ (అలైహిస్సలాం) ప్రవక్తగా మరియు రాజుగా
రాజైపోయిన తర్వాత కొద్ది సంవత్సరాలకి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దావూద్ అలైహిస్సలాం వారికి ప్రవక్త పదవి కూడా ఇచ్చేశాడు. ఆ విధంగా దావూద్ అలైహిస్సలాం ఆయనే ప్రవక్త, ఆయనే రాజు. అంటే ప్రజల ప్రాపంచిక వ్యవహారాలు కూడా ఆయనే పరిష్కరిస్తారు. అలాగే ప్రజల ధార్మిక విషయాలు కూడా ఆయనే బోధిస్తారు, పరిష్కరిస్తారు. ఆ విధంగా దావూద్ అలైహిస్సలాం ప్రవక్త కూడా, దావూద్ అలైహిస్సలాం బనీ ఇస్రాయీల్ ప్రజలకి రాజు కూడా. అయితే దావూద్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొన్ని మహిమలు ఇచ్చాడు. ఏంటి ఆ మహిమలు? ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.
దావూద్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ గ్రంథం పేరు జబూర్. ఖురాన్ లోని సూరా నిసా 165 వ వాక్యంలో ఆ జబూర్ గ్రంథం ప్రస్తావన వచ్చి ఉంది. ప్రపంచంలో నాలుగు గ్రంథాలు బాగా ప్రసిద్ధి చెంది ఉన్నాయి: తౌరాత్, జబూర్, ఇంజీల్, ఖురాన్. ఈ ప్రసిద్ధి చెందిన నాలుగు గ్రంథాలలో జబూర్ గ్రంథము కూడా ఉంది. ఆ జబూర్ గ్రంథము దావూద్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది అల్లాహ్ తరపున.
దావూద్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మంచి కంఠము ఇచ్చాడు, మంచి స్వరంతో ఆయన ఆ జబూర్ గ్రంథాన్ని చదువుతూ ఉండేవారు. ఆయన ఆ జబూర్ గ్రంథాన్ని మంచి స్వరంతో, కంఠంతో చదువుతూ ఉంటే, పర్వతాలు కూడా ఆయన చదువుతున్న ఆ జబూర్ గ్రంథ వాక్యాలు చాలా చిత్తశుద్ధితో వినేవి, అవి కూడా వెంట వెంటనే ఆ పలుకులు పలికే ప్రయత్నము చేసేవి. అంతే కాదండీ, పక్షులు సైతము దావూద్ అలైహిస్సలాం వారు జబూర్ వాక్యాలు పఠిస్తూ ఉంటే మంచి స్వరంతో, వచ్చి చుట్టూ కూర్చుని మెడలు కిందికి వంచుకుని చాలా చక్కగా, శ్రద్ధగా వినేవి. అంత మంచి స్వరంతో ఆయన ఆ జబూర్ వాక్యాలు పఠించేవారు.
అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దావూద్ అలైహిస్సలాం వారికి ఇచ్చిన మరొక మహిమ ఏమిటంటే, లోహాన్ని ఆయన కోసము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మెత్తదిగా మార్చేశాడు. లోహము చాలా గట్టిది. దాన్ని మెత్తదిగా మార్చాలంటే అగ్నిలో చాలా సేపు బాగా ఎర్రగా కాల్చాల్సి వస్తుంది. ఆ తర్వాత అది మెత్తబడుతుంది. ఆ తర్వాత దాన్ని కావలసిన ఆకారంలో ప్రజలు మలుచుకుంటూ ఉంటారు. కానీ దావూద్ అలైహిస్సలాం లోహాన్ని ముట్టుకుంటే చాలు, అది మెత్తగా మారిపోతుంది. ఆ తర్వాత దావూద్ అలైహిస్సలాం ఆయనకు తోచినట్టుగా ఆ లోహాన్ని కావలసిన ఆకారంలో మలుచుకునేవారు. ఆ విధంగా దావూద్ అలైహిస్సలాం కొరకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా లోహాన్ని మెత్తదిగా చేసేసాడు. దావూద్ అలైహిస్సలాం ఆ లోహంతో యుద్ధ వస్త్రాలు తయారు చేసేవారు, కత్తులు తయారు చేసేవారు, అలాగే కవచాలు, వేరే విషయాలు కూడా ఆయన తయారు చేసేవారు.
దావూద్ అలైహిస్సలాం వారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఆయన రాజు అయ్యి ఉండి కూడా బైతుల్ మాల్ నుండి, రాజు ఖజానా నుండి సొమ్ము తీసుకునే వారు కాదు. లోహాన్ని కరిగించి, ఆ లోహం నుండి తయారు చేసిన కవచాలు, కత్తులు ఇంకా వేరే విషయాలను అమ్మి, వాటితో వచ్చే సొమ్ముతో ఆయన అవసరాలు తీర్చుకునేవారు. ఎంత చిత్తశుద్ధి కలిగినవారో చూడండి.
అలాగే దావూద్ అలైహిస్సలాం వారి యొక్క అలవాటు ఏమిటంటే, ఆయన ఉదయం పూట ప్రజల సమస్యలను పరిష్కరించేవారు. గొడవ పడిన వాళ్లకు తీర్పులు ఇచ్చేవారు. రాత్రి పూట మాత్రము అల్లాహ్ ఆరాధనలో నిమగ్నమైపోయేవారు. రాత్రి పూట ఆయన వద్దకు రావడానికి ఎవరికీ అనుమతి ఉండేది కాదు.
అలాగే దావూద్ అలైహిస్సలాం వారు ఒకరోజు ఉపవాసం ఉండి, ఒకరోజు మానేసి, మళ్ళీ ఒకరోజు ఉపవాసం ఉండి, ఒకరోజు మానేసేవారు. అంటే రోజు తర్వాత రోజు ఆయన ఉపవాసము ఉండటాన్ని ఇష్టపడేవారు, రోజు మార్చి రోజు ఆయన ఉపవాసం ఉండేవారు కాబట్టి, ఆ ఉపవాసానికే సౌమె దావూద్ అని పేరు పడిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేశారు, ఎవరైనా ఉపవాసాలు ఉండాలనుకుని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటే, వారు సౌమె దావూద్ పాటించవచ్చు. దావూద్ అలైహిస్సలాం ఒకరోజు ఉపవాసం ఉండి, ఒకరోజు ఉపవాసముని మానేసేవారు. రోజు తర్వాత రోజు ఉపవాసం ఉండేవారు, అంతవరకు మాత్రమే ఉపవాసం ఉండటానికి అనుమతి ఉంది అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేసి ఉన్నారు.
అలాగే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో అబూ మూసా అనే ఒక శిష్యుడు ఉండేవారు. ఆయనకు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మంచి కంఠము, మంచి స్వరము ఇచ్చి ఉంటే, ఆయన ఖురాన్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే, ఖురాన్ వాక్యాలు పఠిస్తూ ఉంటే, ఆ శబ్దాన్ని విని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన వద్దకు వెళ్లి మెచ్చుకుంటూ, ఓ అబూ మూసా, నీకు అల్లాహ్ ఎంత మంచి కంఠము, స్వరము ఇచ్చాడంటే, దావూద్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడిన స్వరాలలో ఒక స్వరము నీకు ఇవ్వబడింది అనిపిస్తుంది నాకు అని చెప్పారు. ఆ విధంగా ఖురాన్ గ్రంథాన్ని, అలాగే ఆకాశ గ్రంథాన్ని మంచి స్వరంతో పఠించటము కూడా అల్లాహ్ తరపున దక్కిన గొప్ప అనుగ్రహం అని ప్రజలు అర్థం చేసుకోవాలి.
ఇద్దరు గొర్రెల కాపరుల తీర్పు
అయితే దావూద్ అలైహిస్సలాం వారి జీవితంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక సంఘటన ఏమిటంటే, దావూద్ అలైహిస్సలాం వారు రాత్రిపూట ఆరాధనలో నిమగ్నమైపోయేవారు, రాత్రిపూట ఆయన వద్దకు ఎవరికీ వెళ్లడానికి అనుమతి ఉండేది కాదు అని మనం ఇంతకు ముందే విన్నాం. సమస్య ఏమీ అయినా, గొడవ ఏమీ అయినా, ఉదయం పూట మాత్రమే ఆయన వద్దకు వెళ్లి పరిష్కరించుకోవాలి. అయితే ఆయన రాత్రి పూట ఏకాంతంలో అల్లాహ్ ను ఆరాధించుకుంటూ ఉంటున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు గొడవ పడి పరిష్కారం కోసం వచ్చారు. అయితే ఆయన ఆరాధనలో నిమగ్నమై ఉన్నారు, ఇప్పుడు కలవడానికి కుదరదు, ఉదయము కలవవచ్చు అని తెలుసుకుని వారు ఉదయం వరకు మేము ఓపిక పట్టేదానికి లేదు అని గోడ దూకి లోపలికి ప్రవేశించారు.
ఆరాధనలో ఉన్న దావూద్ అలైహిస్సలాం వారు కంగారుపడిపోయారు. ఇదేమిటి? ఎవరైనా దాడి చేయడానికి వచ్చాడేమో అని కంగారుపడిపోయారు. కానీ ఆ తర్వాత వారిద్దరూ వెళ్లి దావూద్ అలైహిస్సలాం వారితో మేము గొడవ పడటానికి, దాడి చేయడానికి రాలేదండీ. మా ఇద్దరి మధ్య ఒక వ్యవహారంలో భేదాభిప్రాయము కలిగింది. కాబట్టి తీర్పు కోసము మీ వద్దకు వచ్చాము అని చెప్పారు. సమస్య ఏంటి అని దావూద్ అలైహిస్సలాం వారు అడిగితే, అప్పుడు ఒక వ్యక్తి ఏమన్నాడంటే, అయ్యా నా వద్ద ఒకే ఒక గొర్రె ఉంది. ఈ నా సోదరుని వద్ద 99 గొర్రెలు ఉన్నాయి. ఇతను 99 గొర్రెలు మేపుకోవడానికి వెళుతూ వెళుతూ, నా మీద సానుభూతి చూపి, అయ్యా నీ వద్ద ఒకే ఒక గొర్రె ఉంది, ఆ ఒక గొర్రెను మేపడానికి నీవు వెళ్లి కష్టపడటం ఎందుకు? ఆ ఒక గొర్రెను కూడా నా గొర్రెలతో పాటు పంపించేయి, నేనే ఆ 99 గొర్రెలతో పాటు నీ ఒక గొర్రెను కూడా మేపుకొని వస్తాను అని చెబితే, నా సోదరుడు నా మీద సానుభూతి చూపిస్తున్నాడులే అనుకుని నేను నా గొర్రెను అతని గొర్రెలతో పాటు మేపడానికి పంపించేశాను. కొద్ది రోజులు గడిచిన తర్వాత నా గొర్రె అతని గొర్రెలతో పాటు వెళ్ళటము, మేసి తిరిగి రావటము, దానికి అలవాటు పడిపోయింది. ఇప్పుడు ఇతను నా సోదరుడు, ఆ గొర్రె నాదే అని ప్రకటిస్తున్నాడు. ఇలా చేయటము న్యాయమేనా మీరు చెప్పండి అని అడిగారు.
అప్పుడు దావూద్ అలైహిస్సలాం వారు వెంటనే, అయ్యో 99 గొర్రెలు పెట్టుకుని ఇంకా నీ మనిషికి కోరిక తీరలేదా? ఆ ఒక్క గొర్రె కూడా నీవు తీసుకోవాలని చూస్తావా? ఎంత దురాశ నీకు? ఇలా అతను చేయటము దౌర్జన్యము, అలా చేయరాదు అని వెంటనే దావూద్ అలైహిస్సలాం వారు మాట్లాడేశారు. ఎప్పుడైతే ఆ మాట మాట్లాడేశారో, అప్పుడు ఆ 99 గొర్రెల వ్యక్తి దావూద్ అలైహిస్సలాం వారితో, అయ్యా మీరు కేవలం అతని మాట మాత్రమే విన్నారు, నా మాట విన్నారా? సమస్య ఏంటో నా నోట మీరు తెలుసుకున్నారా? నా నోట మీరు సమస్య అడిగి తెలుసుకోకుండానే ఒక వ్యక్తి మాట విని వేసి వెంటనే తీర్పు చెప్పేటం ఏమిటయ్యా ఇది? నా మాట కూడా మీరు వినాలి కదా. నా మాట, ఆయన మాట, ఇద్దరి మాటలు విని, సత్యం ఎవరి వైపు ఉంది అనేది మీరు అప్పుడు చూడాలి కదా. నా మాట వినకుండానే మీరు తీర్పు ఇచ్చిస్తున్నారు ఏమిటయ్యా ఇది? అని ఆయన అడిగేశాడు. అప్పుడు దావూద్ అలైహిస్సలాం వారికి తప్పు తెలిసింది. వెంటనే దావూద్ అలైహిస్సలాం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో మన్నింపు కోరుకున్నారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనను మన్నించాడు. ఈ ప్రస్తావన ఖురాన్ గ్రంథంలో సూరా సాద్ 21 నుండి 24 వాక్యాల వరకు ఉంది.
అలాగే దావూద్ అలైహిస్సలాం వారు అటు ఉదయం పూట ప్రజల ప్రాపంచిక వ్యవహారాలు చక్కదిద్దుకుంటూ, రాత్రి పూట అల్లాహ్ ను ఆరాధించుకుంటూ, ప్రజలకు జబూర్ గ్రంథంలోని దైవ వాక్యాలు బోధించుకుంటూ జీవితం కొనసాగిస్తూ ఉంటే, దావూద్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆయన పేరు సులేమాన్. ఇన్ షా అల్లాహ్, సులేమాన్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర వచ్చే వారం మనం తెలుసుకుందాం. ఈ ప్రసంగంలో సులేమాన్ అలైహిస్సలాం వారి యొక్క జీవిత చరిత్ర ఉండదు కానీ, దావూద్ అలైహిస్సలాం వారి జీవితంలో చోటు చేసుకున్న ఒక సంఘటన మాత్రము తెలుపుతాను.
దావూద్ అలైహిస్సలాం వారి కుమారుడు సులేమాన్ అలైహిస్సలాం పెరిగి పెద్దవారయ్యారు. ఈలోపు దావూద్ అలైహిస్సలాం వారి జీవితంలో మరొక సంఘటన చోటు చేసుకుంది. మరొకసారి ఇద్దరు వ్యక్తులు దావూద్ అలైహిస్సలాం వారి వద్దకు తీర్పు కోసం వచ్చారు. సమస్య ఏంటంటే, ఒక వ్యక్తి వద్ద చేను ఉంది, అందులో అతను పంట పండిస్తూ ఉంటే, పంట కొద్ది రోజుల్లో ఇన్ షా అల్లాహ్ ఇప్పుడు కోతకు వస్తుంది అన్నప్పుడు, మరొక వ్యక్తి వద్ద ఉన్న పశువులు వచ్చి ఆ చేనులోకి దూరి పూర్తి పంటను నాశనం చేసేసాయి, మేసేసి. ఇప్పుడు ఆ చేను కలిగిన వ్యక్తి దావూద్ అలైహిస్సలాం వారి వద్దకు వచ్చి, కొద్ది రోజుల్లో కోతకు సిద్ధంగా ఉన్న నా పంట మొత్తము ఈ వ్యక్తి పశువులు వచ్చి నాశనం చేసేసాయి. ఈ వ్యక్తి ఇతని పశువుల్ని జాగ్రత్తగా కట్టుకుని బంధించుకొని ఉంచాల్సింది. నా చేనులోకి అతను ఎలాంటి భద్రత లేకుండా నిర్లక్ష్యంగా పశువుల్ని వదిలేసిన కారణంగా నా పంట మొత్తం నాశనమైపోయింది కాబట్టి నాకు నష్టపరిహారము ఇప్పించండి అని ఆ చేను కలిగిన వ్యక్తి అడగగా, దావూద్ అలైహిస్సలాం వారు తీర్పు ఇస్తూ, అతని వద్ద ఉన్న పశువులన్నీ నీవు తీసుకో అని చెప్పేశారు.
ఆ తీర్పు చెప్పగా ఆ పశువుల యజమాని అసహనం వ్యక్తపరుస్తూ అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటే, సులేమాన్ అలైహిస్సలాం వారు ఎదురుపడ్డారు. ఏంటయ్యా విషయం అని అడిగితే, చూడండి నా పశువులు వెళ్లి అతని చేనులో మేసాయి, అతని పంటకు నష్టం కలిగించాయి. అది నిజమే. అయితే నష్టపరిహారంగా నా పూర్తి పశువుల్ని అతనికి ఇచ్చేయమని మీ నాన్నగారు చెప్పేశారు. ఇదేంటయ్యా ఇది, ఏం న్యాయమయ్యా ఇది అని ఆయన అడుగుతూ ఉంటే, అసహనం వ్యక్తపరుస్తూ ఉంటే, సులేమాన్ అలైహిస్సలాం వారు ఆ ఇద్దరు వ్యక్తుల్ని మళ్లీ వెంటపెట్టుకుని, పదండి నేను నాన్నతో మాట్లాడతాను అని మళ్లీ పిలుచుకుని వచ్చారు. నాన్నగారి వద్దకు వచ్చి, నాన్నగారు, మీరు తీర్పు ఇచ్చారు సరే, కానీ ఈ సమస్యకు మరొక తీర్పు కూడా ఉంటుంది. మీరు అనుమతి ఇస్తే నేను చెప్తాను, ఇన్ షా అల్లాహ్ ఆ తీర్పు మీకు నచ్చుతుంది అని చెప్పారు. దావూద్ అలైహిస్సలాం, సరే చెప్పు నాయనా చూద్దాము అని సులేమాన్ అలైహిస్సలాం వారికి అనుమతి ఇవ్వగా, సులేమాన్ అలైహిస్సలాం వారు అన్నారు, చూడండి చేతికి వచ్చిన పంట నాశనమైపోయింది. అతనికి తప్పనిసరిగా నష్టం వాటిల్లింది. అయితే ఈ పశువులు ఉన్న వ్యక్తికి ఇప్పుడు బాధ్యత ఏమిటంటే, అతను కొద్ది నెలల కోసము కష్టపడి ఆ చేనులో మళ్ళీ అదే పంట వేసి, పంట చేతికి వచ్చినంత వరకు దాన్ని బాగా జాగ్రత్తగా చూసుకుని, పంట చేతికి వచ్చిన తర్వాత ఆ పంట ఆ చేను యజమానికి మళ్ళీ అప్పగించాలి. అప్పటివరకు ఆ చేను యజమాని నీ పశువుల్ని తన వద్ద ఉంచుకుని వాటి పాలతో, ఇతర వేరే విషయాలతో లబ్ధి పొందుతూ ఉంటాడు. ఎప్పుడైతే నీవు ఆ చేనులో పంట పండించి అతనికి ఆ పంట అప్పగిస్తావో, ఆ రోజు అతను నీ పశువులన్నీ కూడా నీకు అప్పగించేస్తాడు. అప్పటివరకు నీ పశువులు అతని వద్ద ఉంటాయి అని తీర్పు ఇవ్వగా, దావూద్ అలైహిస్సలాం వారు విని చాలా మెచ్చుకున్నారు. మాషా అల్లాహ్, ఈ తీర్పు చాలా బాగుంది. దీని ద్వారా ఇద్దరిలో ఏ ఒక్కరికి నష్టము ఉండదు, ఇద్దరూ లాభపడతారు, ఇద్దరికీ లబ్ధి చేకూరుతుంది. చాలా మంచి తీర్పు అని దావూద్ అలైహిస్సలాం వారు మెచ్చుకున్నారు.
దావూద్ (అలైహిస్సలాం) మరణం
అయితే మిత్రులారా, ఆ విధంగా దావూద్ అలైహిస్సలాం వారు జీవితం కొనసాగిస్తూ ఉన్నారు. దావూద్ అలైహిస్సలాం వారి వయస్సు 100 సంవత్సరాలకు చేరింది. ఇంతకుముందు మనము ప్రవక్త ఆదమ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో దావూద్ అలైహిస్సలాం వారి ప్రస్తావన విని ఉన్నాం. ఎవరికైనా గుర్తుందా? ఏంటి ఆ విషయము?
ఆదమ్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సృష్టించినప్పుడు, ఆదమ్ అలైహిస్సలాం వారి సంతానాన్ని కూడా ఆదమ్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చూపించాడు. అప్పుడు ఆదమ్ అలైహిస్సలాం వారి సంతానాన్ని చూస్తూ చూస్తూ ఒక ఆత్మ వద్ద కాంతి ఎక్కువగా కనిపిస్తూ ఉంటే, ఎవరిది ఈ ఆత్మ, ఎవరు ఈయన అని అడిగినప్పుడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇతను మీ కుమారుడు దావూద్, మీ తర్వాత చాలా సంవత్సరాలకు ప్రపంచంలో పుడతాడు అని అల్లాహ్ తెలియజేస్తే, అతని ఆయుష్షు ఎంత అని ఆదమ్ అలైహిస్సలాం వారు అడిగినప్పుడు, 60 సంవత్సరాలు అని అల్లాహ్ తెలియజేయగా, నా ఈ బిడ్డకు 60 సంవత్సరాలేనా ఆయుష్షు? నా ఆయుష్షులో నుంచి ఒక 40 సంవత్సరాలు అతని ఆయుష్షులోకి వేసేసి 100 సంవత్సరాలు చేయండి అని ఆదమ్ అలైహిస్సలాం వారు అల్లాహ్ తో కోరగా, అల్లాహ్ ఆదేశంతో అలాగే దావూద్ అలైహిస్సలాం వారి ఆయుష్షు 100 సంవత్సరాలుగా మార్చబడింది అని ఆ రోజు మనము ఆదమ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో విని ఉన్నాము గుర్తుందా కదా అండి?
అలాగే దావూద్ అలైహిస్సలాం వారి ఆయుష్షు 60 ప్లస్ 40 మొత్తం కలిపి 100 సంవత్సరాలు పూర్తి అయ్యింది. 100 సంవత్సరాలు పూర్తి అయినప్పుడు, దావూద్ అలైహిస్సలాం వారు ఒకరోజు బయటకు వెళ్ళేటప్పుడు ఇంటిని తలుపులు వేసేసి, బయట నుండి తాళం వేసేసి వెళ్లిపోయారు. ఆయన వెళ్ళిన కొద్దిసేపు తర్వాత కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నారు. అనుకోకుండా ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు అక్కడ. అది చూసి దావూద్ అలైహిస్సలాం కుటుంబ సభ్యులు కంగారుపడిపోయారు. అయ్యో పరాయి వ్యక్తి తలుపులు, గదులు వేసి ఉన్నా గానీ, గదులు మూసేసి ఉన్నా, తలుపులు మూసేసి ఉన్నా, ఎలా వచ్చేసాడు గదిలోకి, లోపలికి? అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. దావూద్ అలైహిస్సలాం వారు వచ్చి చూస్తే, మనమంతా అప్పుడు ఆయన దృష్టిలో కలంకితులమైపోతామేమో కదా, ఎలా వచ్చాడు ఈ వ్యక్తి? అని వారు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. అందులోనే దావూద్ అలైహిస్సలాం వారు తిరిగి తలుపులు తెరుచుకుని ఇంట్లోకి ప్రవేశించి చూస్తే, కుటుంబ సభ్యులు ఉన్నారు, పక్కన మరొక వ్యక్తి కూడా ఉన్నాడు.
దావూద్ అలైహిస్సలాం వారికి కోపం వచ్చింది. పరాయి వ్యక్తి నేను లేనప్పుడు నా ఇంట్లోకి ఎలా వచ్చాడు? అది నేను బయట నుండి తాళం వేసి వెళ్ళినప్పుడు? అని కోపంగా ఎవరయ్యా నువ్వు? అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఏ తాళాలు, ఏ తలుపులు నన్ను ఆపలేవు, అంతెందుకు ఏ రక్షక భటులు కూడా నన్ను ఆపలేరు. నేను ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా వెళ్ళగలను అని చెబుతూ ఉంటే, వెంటనే దావూద్ అలైహిస్సలాం వారు అర్థం చేసుకున్నారు. తలుపులు మూసివేసి ఉన్నా, నువ్వు లోపలికి రాగలిగినావు అంటే, నీవు మానవుడివి కావు, నీవు దైవదూతవు, అవునా? అన్నారు. అప్పుడు ఆయన, అవునండి, నేను దైవదూతనే, ఇప్పుడు మీ మరణ సమయము సమీపించింది, మీ ఆయుష్షు పూర్తి అయ్యింది, మీ ప్రాణము తీసుకుని వెళ్ళవలసి ఉంది అని చెప్పగా, దావూద్ అలైహిస్సలాం వారు మరణానికి సిద్ధమయ్యారు. అప్పుడు దావూద్ అలైహిస్సలాం వారి ప్రాణాలు ఆ దైవదూత తీసుకుని వెళ్ళిపోయారు. 100 సంవత్సరాల వయస్సులో దావూద్ అలైహిస్సలాం వారి మరణము సంభవించింది. దావూద్ అలైహిస్సలాం వారి మరణానంతరం ప్రవక్త పదవి మరియు రాజ్యాధికారము ఆయన కుమారుడైన సులేమాన్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది.
సులేమాన్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ఇన్ షా అల్లాహ్ మనము వచ్చే ఆదివారము ఇన్ షా అల్లాహ్ వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఇక్కడితో దావూద్ అలైహిస్సలాం వారి చరిత్ర తెలియజేసి నా మాటను నేను ముగిస్తూ ఉన్నాను.
అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రవక్తల జీవిత చరిత్ర తెలుసుకుని, వాటి ద్వారా బోధపడే విషయాలు అర్థం చేసుకుని, మన విశ్వాసాన్ని పెంచుకుని, మన పాపాలను అలాగే మార్గభ్రష్టత్వాన్ని సంస్కరించుకుని అల్లాహ్ తో క్షమాపణ వేడుకుంటూ ధర్మం మీద స్థిరంగా నడుచుకునే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్.
اَلسَلامُ عَلَيْكُم وَرَحْمَةُ اَللهِ وَبَرَكاتُهُ (అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
ప్రశ్న మరియు జవాబు
ప్రియ ప్రేక్షకులారా, విద్యార్థులారా, షేక్ గారు ప్రసంగించిన ఈ అంశానికి సంబంధించి మీ వద్ద ఏమైనా ప్రశ్న ఉంటే త్వరగా మీ ఎలక్ట్రానిక్ చేయిని ఎత్తండి, మీకు ప్రశ్నించే అవకాశం ఇవ్వబడుతుంది.
దావూద్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో ఏమి గుణపాఠం నేర్చుకోవాలి అతని ద్వారాగా?
ఆ దావూద్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, తీర్పు ఇచ్చే వారు ఒక వ్యక్తి మాటలే విని వేసి వెంటనే తీర్పు ఇవ్వరాదు. ఇద్దరినీ, ప్రత్యర్థులు ఇద్దరినీ కూడా కూర్చోబెట్టి వీరి వాదనలు కూడా వినాలి, వారి వాదనలు కూడా వినాలి. ఇరువైపుల నుండి వాదనలు విని, ఆ తర్వాత ఎవరి పక్షంలో న్యాయం ఉంది అనేది గ్రహించి ఆ తర్వాత తీర్పు ఇవ్వాలి. కేవలం ఒక వర్గం మాటలే విని వేసి, ఆ వర్గం మాటల్నే సత్యమని నమ్మేసి వెంటనే తీర్పు ఇవ్వరాదు అనేది ఒక విషయం.
అలాగే ప్రవక్త దైవ వాక్యాలు బోధించటంతో పాటు, ప్రాపంచిక ప్రజల ప్రాపంచిక సమస్యలు పరిష్కరించడానికి అతను ప్రజల రాజు కూడా అవ్వగలడు. ఒక ప్రవక్త ప్రవక్త పదవితో పాటు రాజుగా ఆ బాధ్యతలు కూడా నెరవేర్చగలడు. రాజులు ప్రవక్తలుగా, ప్రవక్తలు రాజులుగా ఉండటము నేరము కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే, ప్రవక్తలు కేవలము ధార్మిక విషయాలు బోధించేంత వరకు మాత్రమే పరిమితమై ఉండాలి, వారికి రాజ్యంతో ఎలాంటి సంబంధం ఉండకూడదు. రాజులు పరిపాలన చేసుకుంటూ ఉండాలి, వారికి ధార్మిక విషయాలలో జోక్యము తగదు అని డివైడ్ చేస్తూ ఉంటారు. కానీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దావూద్ అలైహిస్సలాం మరియు సులేమాన్ అలైహిస్సలాం వారి ప్రస్తావన చేసి, ఒకే వ్యక్తి ప్రవక్తగా కూడా ధార్మిక విషయాలు బోధించగలడు, ఒకే వ్యక్తి రాజుగా కూడా ప్రజలకు నాయకత్వం వహించగలడు అనే విషయాలు కూడా తెలియజేసి ఉన్నారు.
అలాగే ఆకాశ గ్రంథాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చాలా మంది ప్రవక్తలకు ఇచ్చి ఉన్నాడు. అందులో నాలుగు ఆకాశ గ్రంథాలు ప్రసిద్ధి చెందినవి. అందులో ఒక గ్రంథము జబూర్ గ్రంథము దావూద్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది. అయితే ఇప్పుడు అది అసలు రూపంలో ప్రపంచంలో లేదు. ఖురాన్ గ్రంథము అవతరించబడిన తర్వాత మిగతా గ్రంథాలు అన్నీ కూడా మన్సూఖ్ (రద్దు) అయిపోయాయి. ఇప్పుడు ప్రపంచంలో చలామణిలో మరియు చెల్లుబాటులో ఉన్న ఆకాశ గ్రంథము ఖురాన్ గ్రంథము అని కూడా మనము గ్రహించాలి.
అలాగే ప్రవక్త ఎంత గొప్ప రాజు అయినా, ఎంత గొప్ప దైవభక్తుడు అయినా మరణము తప్పదు, తప్పనిసరిగా మరణం సంభవిస్తుంది. మనిషి ఎక్కడ ఉన్నా, దైవదూతలు అక్కడికి వెళ్లి అతని ప్రాణాలు తీయగలరు. అతను తలుపులు వేసుకుని గది లోపల ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే మరణం సమీపించినప్పుడు దైవదూతలు వెళ్లి అతన్ని అక్కడి నుంచి ప్రాణాలు తీయగలరు. ఇలాంటి కొన్ని విషయాలు మనకు దావూద్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా బోధపడతాయి.
గురువుగారు, ఇక్కడ ఆదమ్ అలైహిస్సలాం గారు తమ ఆయుష్షు నుంచి 40 సంవత్సరాలు దావూద్ అలైహిస్సలాం గారికి ప్రసాదిస్తారు కదా, ప్రసాదించిన 40 సంవత్సరాలను కలుపుకుని పూర్తి ఎన్ని సంవత్సరాలు వారు, వారికి ఆయుష్షు కలిగింది దావూద్ అలైహిస్సలాం కి? రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ 40 సంవత్సరాలు వారు, ఆదమ్ అలైహిస్సలాం వారు దావూద్ అలైహిస్సలాం గారికి గిఫ్ట్ గా ఇచ్చిన 40 సంవత్సరాలు ఈ రివాయత్ అంటే ఆధారం ఇది, ఇది ఇజ్రాయెలీ రివాయతా లేకపోతే హదీస్ పరంగానండి ఇది? దీని ఆధారం?
రెండు విషయాలు అడిగారండి మీరు. అవునండి. ఒకటి, ఆదమ్ అలైహిస్సలాం వారు దావూద్ అలైహిస్సలాం వారికి 40 సంవత్సరాల ఆయుష్షు ఇచ్చిన తర్వాత, దావూద్ అలైహిస్సలాం వారి పూర్తి ఆయుష్షు ఎంత? అని అడిగారు. ఇది మొదటి ప్రశ్న కదండీ. దాని సమాధానం ఏమిటంటే, దావూద్ అలైహిస్సలాం వారి అసలు ఆయుష్షు 60 సంవత్సరాలు, ఆదమ్ అలైహిస్సలాం వారి ఆయుష్షులో నుంచి పొందిన 40 సంవత్సరాలు. 60 మరియు 40, రెండు కలిపి మొత్తం 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు ఆయన ఆయుష్షు అని మనకు ఇస్లామీయ గ్రంథాల ద్వారా, ఖురాన్ మరియు హదీస్ గ్రంథాల ద్వారా తెలపబడింది. వేరే గ్రంథాల వారు ఆయన ఆయుష్షు 77 సంవత్సరాలు అని కూడా చెబుతూ ఉంటారు. కాకపోతే అవన్నీ నేను ప్రస్తావించలేదు. ఎందుకంటే ఆ విషయాల మీద మనము నిజము అని చెప్పడానికి లేదు, అబద్ధము అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అవి మన్సూఖ్ (రద్దు) అయిపోయిన గ్రంథాలు. మనకు ఖురాన్ మరియు హదీస్ గ్రంథాలలో ఉన్న విషయాలే ప్రామాణికమైనవి కాబట్టి నేను ఇవి మాత్రమే ప్రస్తావించాను, వాటి జోలికి నేను వెళ్ళలేదు. ఇది మొదటి విషయము. ఆయన ఆయుష్షు పూర్తి 100 సంవత్సరాలు అనేది మీ మొదటి ప్రశ్నకు సమాధానం. ఇక రెండవ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, ఆదమ్ అలైహిస్సలాం వారి ఆయుష్షులో నుంచి 40 సంవత్సరాలు ఆయనకు ఇవ్వబడటము, ఇది ఇస్రాయీలీ ఉల్లేఖనమా లేదా ప్రవక్త వారి ఖురాన్ లేదా హదీస్ ఉల్లేఖనాలా అని విధంగా మీరు అడిగారు. దాని సమాధానం ఏమిటంటే, ఇవి ఇస్రాయీలీ ఉల్లేఖనాలు కావండి. ఇవి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వచనాలలో నుంచి వచ్చిన ఒక విషయం అండి. ముస్నద్ అహ్మద్ అనే ఒక హదీస్ గ్రంథం ఉంది. అందులో దీని ప్రస్తావన వచ్చి ఉంది.
[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
తాలూత్ – మహారాజుగా మారిన పశువులకాపరి (1030-1010 క్రీ.పూ)
“అల్లాహ్ తాలూత్‌ను మీ రాజుగా నియమించాడని” వారి ప్రవక్త వారికి తెలియజేసినప్పుడు, “అతని అధికారం మాపై ఎలా నడుస్తుంది? రాజ్యాధికారానికి అతనికన్నా ఎక్కువ హక్కు దారులము మేమాయె! కనీసం అతనికి సిరిసంపదల్లో కూడా విస్తృతి వొసగబడలేదు” అని (సాకులు) చెప్పసాగారు. ప్రవక్త వారికి ఇలా నచ్చజెప్పాడు: “(చూడండి!) అల్లాహ్ అతన్నే మీపై (నాయకునిగా) ఎన్నుకున్నాడు. జ్ఞానపరంగా, శారీరకంగా కూడా అతనికి ఆధిక్యతను ప్రసాదించాడు. అల్లాహ్ తాను కోరిన వారికి రాజ్యాధికారం ఇస్తాడు. అల్లాహ్ విశాల సంపన్నుడు, జ్ఞాన సంపన్నుడు కూడా!” (2:247)
ఇ స్రాయీల్ ప్రజలు తమ వద్ద ఉన్న పవిత్ర పెట్టె (మూసా కాలానికి చెందిన కొన్ని పవిత్రమైన వస్తువులు కలిగి ఉన్న బంగారు తాపడం ఉన్న పెట్టె టాబర్నికల్) చాలా పవిత్రమైనదని, తమ చరిత్రకు సంబంధించి చాలా ముఖ్యమైన చిహ్నమని భావించేవారు. చివరకు యుద్ధాలలోను దానిని తీసుకుని వెళ్ళేవారు. దాని వల్లనే అల్లాహ్ తమను కాపాడుతున్నాడని నమ్మేవారు. ఈ నమ్మకం వల్ల వారికి మానసిక శాంతి, అపార ధైర్యసాహసాలు లభించేవి. దీని వల్ల వారి శత్రువులు కూడా భయ భీతులయ్యేవారు. దానికి అల్లాహ్ ప్రత్యేకమైన శక్తులు ప్రసాదించాడని వారి శత్రువులు భావించేవారు.
క్రమేణా ఇస్రాయీల్ ప్రజలు అల్లాహ్ ఆదేశాలను, చట్టాలను విస్మరించడం ప్రారంభించారు. చెడులు, దుర్నడతలు వారి జీవితాల్లో భాగాలుగా మారిపోయాయి. అల్లాహ్ వారిపై వారి శత్రువులను (పలస్తీనులను) పంపించాడు. ఇస్రాయీల్ ప్రజలను పలస్తీనులు ఓడించారు. వారి పవిత్ర పెట్టెను స్వాధీనం చేసుకున్నారు. వారిని వారి ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టారు. వారి సంతానాన్ని నిర్బంధించి బానిసలుగా మార్చారు. ఇస్రాయీలీల అధికారం ,ప్రాబల్యం అంతా అంతరించింది. వారు ఒకరికి ఒకరు కాకుండాపోయారు. నిరాశా నిస్పృహలకు గురయ్యారు.
అప్పుడు ప్రవక్త శామ్యూల్ (అలైహిస్సలాం) వారి వద్దకు వచ్చారు. ఆయన రాకతో వారికి కాస్త ఉపశమనం లభించింది. తమకు ఒక బలమైన నాయకుడి అవసరం ఉందని, అందుకు ప్రవక్త సహకరించాలని వారు ఆయన్ను కోరారు. ఒక బలమైన నాయకుని పర్యవేక్షణలో తాము శత్రువులతో పోరాడాల్సి ఉందని చెప్పారు. కాని ప్రవక్త శామ్యూల్ (అలైహిస్సలాం)కు వారి బలహీనతలు బాగా తెలుసు. అందువల్ల ఆయన వారితో, “పోరాడవలసిన సమయం వచ్చినప్పుడు మీరు వెనక్కి తగ్గుతారు” అన్నారు. కాని వారు ఆయనతో, తాము చాలా పరాభవాలు సహించామని, ఇప్పుడు అల్లాహ్ మార్గంలో పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని, తమ ప్రాణాలు పోయినా ఫర్వాలేదని అన్నారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇస్లాం ధర్మం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ధర్మమని తరచుగా వార్తలలో వస్తూ ఉంటుంది. ఇస్లాం స్వీకరించిన ప్రతి వ్యక్తి వెనుక ఒక ప్రత్యేకమైన గాథ మరియు ప్రత్యేక కారణాలు ఉంటాయి. ఇస్లాంలో స్త్రీల గురించిన అపోహలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నప్పటికీ, ఇస్లాం ధర్మమే నిజమైన ధర్మమనీ మరియు ఉత్తమ జీవన విధానమనీ విశ్వసించే మహిళల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఆన్ రోనైన్ (Ann Ronayne) కథ క్రింద పేర్కొనబడింది.
“నేనా? కువైట్లో ఉండేందుకు వెళ్లాలా? అస్సలు ఆ ప్రశక్తే లేదు!” నా మేనేజర్ నన్ను కువైట్లో ఉద్యోగం చేయమని ఒప్పించేందుకు ప్రయత్నించినప్పుడు నా స్పందన అది. కానీ నా విధివ్రాతలో మరో విధంగా ఉంది, {… మరియు అల్లాహ్ ఆజ్ఞ, నిర్దేశింపబడిన (తిరుగులేని) శాసనం: (ఖుర్ఆన్ 33: 38)
నేను వాషింగ్టన్, D.C. నగర పరిసర ప్రాంతాలలో ఒక కాథలిక్ కుటుంబంలో పుట్టి పెరిగాను మరియు క్యాథలిక్ పాఠశాలలకు హాజరయ్యాను. 1960వ దశకంలో, మరింత ఆధునికంగా ఉండాలనే ప్రయత్నంలో కాథలిక్ చర్చి తన బోధనలలో పెద్ద మార్పులు చేసింది; ఇది సానుకూల అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టడానికి మరియు ప్రతికూల అంశాలను విడిచి పెట్టడానికి ప్రయత్నించింది: ఉదారహణకు శిక్షలు, నిబంధనలు, నిర్దిష్ట సమయాల్లో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మొదలైనవి. (అదలా ఉన్నప్పటికీ, ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లోని కాథలిక్కులు ఉనికిలో ఉన్న గర్భనిరోధకాలపై నిషేధం వంటి అనేక నియమాలను విస్మరించింది.) లాటిన్లో ఎప్పుడూ చెప్పబడే ‘ప్రార్థనకు’కు బదులుగా ఇప్పుడు ఆంగ్లంలో చెప్పబడుతున్నది. చిన్నప్పుడు మాకు మత బోధనలు నేర్పిన క్రైస్తవ సన్యాసినులు (నన్సు) వారి అలవాట్లను (ధర్మపరమైన దుస్తులను) ఆధునిక దుస్తులతో మార్చుకున్నారు. మా ధార్మిక తరగతులలో ఎప్పుడూ బైబిల్ పఠనం జరగ లేదు, ఇప్పుడైతే వారు మత విశ్వాసాలపై దృష్టి సారించే బదులు, సామాజిక సమస్యలపై దృష్టి సారిస్తున్నారు. కొత్త జనాల మాదిరిగానే చాలా వరకు సమకాలీన జానపద పాటలతో కాలం గడుపు తున్నారు. మా కాలంలో బోధించ బడిన సత్యం ఇప్పుడు పూర్తిగా మారిపోవడం వింతగా అనిపించింది. ఏదేమైనప్పటికీ, మేము మా మొదటి హోలీ కమ్యూనియన్కు సిద్ధమైనప్పుడు, పూజారి (Priest) మా నోటిలో పెట్టే రొట్టె యేసు యొక్క అసలు శరీరమని మాకు బోధించబడింది (అది మనం కొరికితే రక్తస్రావం అవుతుంది). దీని వలన మరియు ఇలాంటి అనేక ఇతర కారణాల వలన, నేను నా మతంపై సందేహాలు పెంచుకున్నాను మరియు చిన్నప్పటి నుండి అలాంటి క్రైస్తవ మత విశ్వాసాలను తిరస్కరించాను.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మరి అయ్యూబు (స్థితిని గురించి కూడా ఓసారి మననం చేసుకోండి). అతను “నాకు ఈ వ్యాధి సోకింది. నువ్వు కరుణించే వారందరిలోకీ అపారంగా కరుణించే వాడవు” అని తన ప్రభువును మొరపెట్టుకున్నప్పుడు, మేము అతని ప్రార్థనను ఆలకించి, ఆమోదించాము. అతని బాధను దూరం చేశాము. (ఖుర్ ఆన్ 21: 83, 84)
కొందరు దైవదూతలు అల్లాహ్ సృష్టి లోని కొన్ని ప్రాణుల గురించి మాట్లాడు కోసాగారు. విధేయత చూపి అల్లాహ్ ప్రసన్నతను పొందిన వారి గురించి వారు చర్చించుకోసాగారు. అలాగే అహంభావంతో విర్రవీగి అల్లాహ్ ఆగ్రహాన్ని కొని తెచ్చుకున్న వారి గురించి సంభాషిస్తుండగా ఒక దైవదూత, “ప్రస్తుతం భూమిపై ఉన్న వారిలో అత్యుత్తముడు అయ్యూబ్. ఆయన ఉన్నత వ్యక్తిత్వం కలిగినవాడు. గొప్ప సహనశీలి. ఎల్లప్పుడూ అపార కరుణా మయుడైన విశ్వప్రభువును స్మరిస్తూ ఉంటాడు. అల్లాహ్ ను ఆరాధించే వారికి ఆయన గొప్ప ఆదర్శం. అందుకు ప్రతిఫలంగా అల్లాహ్ ఆయనకు దీర్ఘాయుష్షు ప్రసాదించాడు. అపార సంపదలు ఇచ్చాడు. అయ్యూబ్ ఎన్నడూ అహంభావానికి పాల్పడలేదు. స్వార్థం ఆయనలో లేనేలేదు. ఆయన కుటుంబం, ఆయన సేవకులు, అవసరార్థులు, బీదలు అందరూ ఆయన సంపదలో భాగం పొందుతున్నారు. ఆయన బీదలకు అన్నం పెడతారు. వారికి దుస్తులు ఇస్తారు. బానిసలకు స్వేచ్ఛ ప్రసాదించడం కోసం వారిని కొంటారు. తన నుంచి దానధర్మాలు పొందేవారు తనకు ఉపకారం చేస్తున్నట్లుగా ఆయన వ్యవహరిస్తారు. ఆయన చాలా ఉదార స్వభావి, చాలా మంచి వాడు” అంటూ ప్రశంసించారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[క్రింది విషయం ఖురాన్ కథామాలికఅనే పుస్తకం నుండి తీసుకోబడింది]
ఈజిప్టును పరిపాలించిన ఫిరౌన్ పరమ నియంత. యాకూబ్ (అలైహిస్సలాం) సంతానంపై (అంటే బనీ ఇస్రాయీల్ పై) ఫిరౌన్ అతి దారుణంగా అణచివేతలు, అత్యాచారాలకు పాల్పడ్డాడు. వారిని పరాభవించడానికి, వారిని అన్ని విధాలుగా త్రొక్కి వేయడానికి అతడు అన్ని మార్గాలన్నింటినీ ఉపయోగించాడు. వారిని బానిసలుగా చేసుకున్నాడు. నామ మాత్రంగా జీతభత్యాలు ఇస్తూ, కొన్ని సందర్భాల్లో అస్సలు ఏమీ ఇవ్వకుండా వారితో బండచాకిరి చేయించుకునే వాడు. ఫిరౌన్ ఒంటరిగా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడడం సాధ్యం కాదు, అతడితోపాటు అతని అనుచరులు అనేక మంది ఈ దౌర్జన్యాలలో పాలు పంచుకునేవారు. వీరంతా కలసి అణగారిన బనీ ఇస్రాయీల్ ప్రజల పై దౌర్జన్యాల పరంపర కొనసాగించే వారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.