
[3 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
తెలుగుఇస్లాం.నెట్ * తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద *
[3 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[13 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[2 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[3:43 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[13:34 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
22- ఇస్లాం ధర్మానికి సంబంధంలేని కొన్ని పండుగలు
నేటి సమాజంలో రోజు రోజుకు మనిషి నాగరికతకు సంబంధించిన ఏదోఒక పేరుతో పండుగలను జరుపుకునే సంస్కృతి వచ్చింది. మరియు ఆ పండుగలు జరిపే విధానం అధర్మ రీతిలోనే కాకుండా, మానవ నైతిక గుణాలకు పూర్తిగా వ్యతిరేకంగా కూడా ఉన్నాయి. కనుక అలాంటి పండుగలను ముస్లిం సమాజం నిర్వహించరాదని ఇస్లామీయ పండితులు ఫత్వాలు జారి చేసారు. ఆ పండుగలలో నుండి ఒక పండుగ వాస్తవాన్ని ఇక్కడ మేము తెలియజేస్తున్నాము. కనుక మన ముస్లిం సమాజం అధర్మమైన సంస్కృతి నుండి అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము.
ప్రేమికుల రోజు
వాలెంటైన్స్ డే అంటే…?
ప్రేమానురాగాలు పరిమళించే, ప్రేమ కుసుమాలు గుభాళించే శుభ దినం అని అంటారు కొందరు. అయితే ఈ రోజు వెనుక గల కథనాలేమిటో తెలుసా?
1) రోమ్ దేశస్తులు ప్రతి ఏటా పిబ్రవరి 14వ తేదీని (యూనొ) అనే స్త్రీ దేవత కొరకు మహత్తరమైన శుభ దినంగా భావిస్తారు. వారు ఆమెను తమ దేవీలకు రాణిగా ఆరాధిస్తారు. వివాహం చేసుకునేవారి కోసం శుభ సూచకం అని నమ్ముతారు.
2) క్లోడియస్ 11వ పరిపాలన కాలంలో వాలెంటైన్ అనే వ్యక్తి ఉండేవాడు. పెళ్ళి, పిల్లలు, సంసారం మనిషిని పిరికివాణ్ణి చేశాయి అని తలచిన అప్పటి రాజు యుద్ధం నిమిత్తం సైనికులు పెళ్ళి చేసుకోకూడదన్న ఆజ్ఞ జారీ చేశాడు. వాలెంటైన్ అనే వ్యక్తి రాజుకి తెలియకుండా రహస్య పెళ్ళిళ్ళు జరిపించేవాడు. అది తెలుసుకున్న రాజు అతన్ని పట్టుకొని క్రీశ. 270వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేది లూబెర్ కీలియా అనే రోము దేశస్థులు పండుగ రాత్రి ఉరి తీయించాడు. అప్పటి నుండి వాలెంటైన్ పేరుతో పండుగ జరుపుకోవడం పరిపాటయింది. ఆ తర్వాత 1996 లో స్వయంగా చర్చి గురువులే ఈ పండుగ అశ్లీలతను, నీతిబాహ్యతను పెంపొందించే విధంగా ఉందని భావించి బహిష్కరించారు కూడా.
అయితే నేడు అనేక దేశాలలో ముస్లింలు సైతం ఈ పండుగ సంబరాల్లో పాల్గొనడం మనం చూస్తాం. ఇతర మతాలు ఈ పండుగను ఏ దృష్టితో చూస్తున్నాయి అన్న విషయం అప్రధానం. ఇస్లాం మాత్రం ఇటువంటి నీతికి అనుమతించదు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి వెకిలి చేష్టలు, వెర్రి పోకడలు ముస్లిం సమాజానికే మాయని మచ్చ.
ముస్లింలు వాలెంటైన్స్ డే ఎందుకు చేయకూడదు?
ఇస్లాంలో పర్వదినం అంటే ఆరాధన, పుణ్యార్జన మార్గం, పవిత్ర భావాల సమ్మేళనం. దైవ ప్రసన్నత కోసం, స్వర్గ ప్రాప్తి కోసం, పవిత్ర లక్ష్యంతో పర్వదినం జరుపుకోవాల్సి ఉంటుంది. పిచ్చిగా త్రాగి, పశువుల్లా ప్రవర్తించడం ఇస్లాం సంస్కృతి కానేకాదు. అదో పాశ్చాత్య దురాచారం. ఆ మాటకొస్తే ముస్లిం పండుగలు మూడే. రమజాన్ పండుగ, ఖుర్బానీ పండుగ, శుక్రవారం. వీటిని మినహాయించి, స్వయంగా ముస్లింలలో ప్రాచుర్యంలో ఉన్న మీలాదున్ నబీగానీ, షబెబరాత్‌గానీ, పీనుగుల పండుగ (ముర్దోంకి ఈద్) గానీ, ఇతరత్రా ఉత్సవాలు, ఉరుసులుగానీ, ఇస్లాం ప్రభోదించని వింత పోకడలే. మరలాంటప్పుడు సరదా కోసం, సహజీవనం (వివాహేతర సంబంధం) కోసం నిర్వహించబడే పండుగలకు ఎలా వీలుంటుంది?
కొందరు ముస్లింలు – మేము ఈ ఉత్సవంలో, ఇది ఇస్లామీయ పండుగ అన్న భావంతో పాల్గొనడం లేదు. పరస్పరం ప్రేమాభిమానాలను పంచుకునేందుకు పాల్గొంటున్నాము అంతే అని అంటారు. వారి ఈ వాదన పస లేనిది. ఎందుకంటే? ఈ పండుగ ముమ్మాటికి రోమ్ దేశానికి చెందిన విగ్రహారాధకులది, యూద, క్రైస్తవులది అన్న విషయం తెలిసిందే. ఇందులో ముస్లింలు వెళ్ళి పాల్గొనడం ఎంత వరకు సహేతుకం? మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రభోదించారు:
“ఎవడు ఏ జాతి వేషధారణను (విధానాన్ని) అవలంబిస్తాడో వాడు వారిలో ఒకడుగా పరిగణించబడతాడు.” (అబూదావూద్: 2831)
ప్రేమంటే ఇదేనా…?
పసుపు ఎరుపు గులాబీలు పట్టుకొని రోడ్లపై పడి తిరగడమా ప్రేమంటే…? అశ్లీల భావాలను రేకెత్తించేలా ప్యాషన్ దుస్తులు ధరించి కుర్రకారును రంజింపజేయడమా ప్రేమంటే…? బోయ్/గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి కామోన్మాదంతో రగిలిపోతూ చిందులు తొక్కడమా ప్రేమంటే…? ఇంట్లో నుంచి పారిపోయి సహజీవనం (అక్రమ సంబంధం) సాగించడమా ప్రేమంటే…? ఇది ప్రేమంటే ‘ప్రేమ పవిత్రమైనది’ అని చెప్పడమైనా మానుకోవాలి. లేదా ఇలాంటి నీచ నికృష్ట చేష్టల్ని కూకటి వేళ్ళతో పెకళించాలి. నిజంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా సిగ్గూ, లజ్జ, అభిమానాన్ని, నీతిని తగులుబెడుతున్న సినిమాల చేదు ఫలం మాత్రమే. షైతాన్, షైతాన్ మనస్తత్వం గల మనుషులు, ‘మీరెప్పుడైనా లవ్‌లో పడ్డారా” అని కవ్విస్తారు. ఈ మాయదారి ట్రిక్కుల్ని అందిపుచ్చుకోమని మనల్ని ఉసిగొల్పుతారు. తల్లిదండ్రులు చూడటం లేదు లేదా వారే దీనికి ఆజ్యం పోస్తున్నారు అన్న అంశాన్ని ప్రక్కనబెడితే – అల్లాహ్ చూస్తున్నాడన్న భయం కలగటం లేదా? రేపు దేవుడు ఖచ్చితంగా దీని గురించి నిలదీస్తాడన్న ఆలోచన రావడం లేదా?
హజ్రత్ అబూ హురైరా (రజియల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హితోపదేశం చేశారు:
“గతించిన జాతులు చేసిన నీతిమాలిన పోకడలకు నా ఉమ్మత్ (సముదాయం) జానెడుకు జాన, మూరకు మూర అలవాటుపడనంత వరకు ప్రళయం సంభవించదు.” అది విన్న మేము (సహాబాలు) “యా రసూలుల్లాహ్! ఏమిటి మేము ‘రోమ్’ మరియు ‘ఈరాన్’ ప్రజలను అనుసరిస్తామా?” అని అన్నాము. అందుకు “వారు తప్ప మరెవర్ని అనుకుంటున్నారు?” అని సమాధానమిచ్చారు. (బుఖారి: 6774)
పరమ పవిత్రుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“అల్లాహ్‌ను పరలోకాన్ని విశ్వసించినవారు అల్లాహ్‌పై, ఆయన ప్రవక్తపై తిరుగుబాటు చేస్తున్నవారిని ఎన్నటికి ప్రేమించరు. చివరికి వారు తమ తండ్రులైనా, కొడుకులైనా, సోదరులైనా లేదా తమ కుటుంబసభ్యులైనా సరే, ససేమిరా ప్రేమించరు. అలా ప్రేమించడాన్ని నీవు ఎన్నటికీ చూడలేవు”. (సూరతుల్ ముజాదిలా:22)
మానవుల్లో ఒండొకరి పట్ల ప్రేమ, అభిమానం, గౌరవం ఉండవచ్చు. ఆ మాటకొస్తే పశువుల్ని, ఇతరత్రా జీవరాసుల్ని సైతం ప్రేమించమంటుంది ఇస్లాం. అలా ప్రేమించలేనివారు పరిపూర్ణ విశ్వాసులు కారు అని కూడా ఖరారు చేస్తుంది. కానీ నిజమైన ప్రేమ, అభిమానం మాత్రం మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్ మీదే ఉండాలి. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:
“మరియు మీరు అల్లాహ్‌నే ఆరాధించండి. మరియు ఎవ్వరినీ ఆయనకు భాగస్వాములుగా సాటి కల్పించకండి. మరియు తల్లిదండ్రులతో, దగ్గరి బంధువులతో, అనాథులతో, నిరుపేదలతో, బంధువులైన పొరుగు వారితో, అపరిచితులైన పొరుగు వారితో ప్రక్కనున్న మిత్రులతో, బాటసారులతో మరియు మీ ఆధీనంలో ఉన్న బానిసలతో అందరితోనూ ఉదార స్వభావంతో వ్యవహరించండి. నిశ్చయంగా అల్లాహ్ గర్విష్టిని, బడాయిలు చెప్పుకునే వాణ్ని ప్రేమించడు” (సూరతున్ నిసా: ౩6)
మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
“మీరు పరస్పరం కరుణతో మెలగనంత వరకు విశ్వాసులు కాలేరు” అది విన్న సహచరులు ‘యా రసూలుల్లాహ్! మేమందరం పరస్పరం కరుణతోనే మసులుకుంటున్నాము కదా! అన్నారు. అప్పుడు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “మీ ఈ పరస్పర కరుణవాత్సల్యాలు కేవలం మీ ఆప్తుల వరకే పరిమితం కాకూడదు. “రహ్మతన్నాసి” సమస్త మానవుల పట్ల కనికరం కలిగి ఉండాలి. “రహ్మతన్ ఆమ్మహ్” విశ్వమంతటి ప్రాణుల పట్ల సాత్విక కరుణతో మెలగాలి” అన్నారు. (సహిహ్ తర్గీబ్:2253)
మరో హదీసులో ఇలా ఉంది: “ఒక బంధువు ఉపకారం చేస్తే ప్రతిగా ఉపకారం చేసేవాడు (నిజమైన) బంధు ప్రియుడు కాడు. తెగతెంపులు చేసుకున్నప్పటికీ వారితో సత్సంబంధాన్ని కొనసాగించే వాడే (సిసలైన) బంధు ప్రియుడు.” (బుఖారి)
అల్లాహ్ పట్ల ప్రేమంటే…?
ఒక సారి ఒక పల్లెవాసి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పవిత్ర సన్నిధికి వచ్చి – “ప్రళయం ఎప్పుడొస్తుంది?” అని అడిగాడు. “దాని కోసం నువ్వు ఏమి ఏర్పాట్లు చేసుకున్నావు?” అని అడిగారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). దానికా వ్యక్తి “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త గారిని ప్రేమించడం అన్నాడు”. అతని సమాధానం విని “అయితే నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో వారితోనే ఉంటావు” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు. (బుఖారి, ముస్లిం)
ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: (ఓ ప్రవక్తా!) ఇలా అను: “మీకు (నిజంగా) అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (అప్పుడు) అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మరియు మీ పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ గొప్ప క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. (సూరతు ఆల ఇమ్రాన్:31)
మనకు ఏది మంచిదో, ఏది చెడ్డదో మనల్ని పుట్టించిన, 70 తల్లులకన్నా ఎక్కువ ప్రేమ గల పరమోన్నత ప్రభువుకి బాగా తెలుసు. మనం ఉత్తమ రీతిలో జీవితం గడపడానికి, ఇంకా ఇహపరాల్లో సాఫల్యం పొందడానికే ఆయన మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. ఒక వేళ మనం వాటిని నిర్లక్ష్యం చేస్తే దాని దుష్ఫలితాలను తప్పకుండా మనం అనుభవించాల్సి ఉంటుంది.
ఈనాడు మనం….
పాశ్చాత్య సంస్కృతి వెర్రి తలలు వేస్తున్నది. సమాజమంతా కలుషితమై పోతున్నది. విచిత్రమేమిటంటే మన ఇళ్ళకు మనమే నిప్పు పెట్టి మనమే ఆనందిస్తున్నాము. ఎంత విడ్డూరం!
పాశ్చాత్య దేశాలు దైవాజ్ఞల్ని ఉల్లంఘించి తమ సొంత జీవన విధానాలను అనుసరించాయి. దాని దుష్పరిణామాలను నేడు తమ కళ్ళారా చూస్తున్నారు. వారు మాత్రమే కాదు మొత్తం ప్రపంచం దాని దుష్ఫలితాలను చూస్తోంది.
నా ప్రియ సోదర సోదరిమణులారా! మనం స్తుతిని మాని ఆత్మ విమర్శ చేసుకోవలసిన తరుణమిది. మనం దేవుని చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే దాని చేదు ఫలాలు మన ముందు రాకుండా ఉంటాయా?
మనం దేవుని చట్టాలను ఉల్లంఘించి ఈ రోజు దాని దుష్పలితం ఏయిడ్స్ అనే ఒక పెద్ద రూపంలో చూస్తున్నాం. ఇదంతా కూడా నీతిబాహ్యత, అశ్లీలం లాంటి వ్యర్థ విషయాలతో నిండిన సంస్కృతిని ఆదరించిన పాప ఫలితమే.
మొత్తానికి చెప్పొచ్చేటేమిటంటే మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టయితే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పినట్టు మనం దైవాజ్ఞలకనుగుణంగా జీవితం గడపాలి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల మన ఈ నిజమైన ప్రేమే మనల్ని ఇహలోకంలోనూ, పరలోకంలోనూ సఫలీకృతుల్ని చేయగలదు.
అదే విధంగా మరి కొన్ని పండుగలు కూడా మన సమాజంలో వ్యాపించి ఉన్నాయి, వీటిలో నుండి ఏ ఒక్కటిని కూడా జరుపుకోవడం ధర్మం కాదు.
1- జన్మదిన వేడుకలు: తమ పేరున లేక తమ పిల్లల పేరున లేక ఇతరుల పేరున జన్మదిన వేడుకలు నిర్వహించడం ఇస్లాం సంప్రదాయం కాదు. ఆ రోజు చేసే పార్టీలు, మరియు సంతోషాలు అంతా క్రైస్తవులు మరియు ధర్మేతరుల కార్యాలు.
2- జనవరి ఫస్ట్: జనవరి మొదటి తేదిన లేక డిసెంబర్ 31 రాత్రిని పండుగ దినంగా చేసుకోవడం, లేక ఒకరికొకరు ఆ రోజున విష్ చెయ్యడం వంటి కార్యాలన్ని నిషేధించబడ్డాయి.
3- “మదర్స్ డే” లేక “ఫాదర్స్ డే“ (అమ్మా లేక నాన్న పండుగ) అనే పండుగలు మరియు వారికి విష్ చేసే విధానాలన్ని అధర్మమైనవి.
4- “మ్యారేజ్ డే“ కొంత మంది ప్రజలు ప్రతి ఏట ‘మ్యారేజ్ డే’ (పెళ్ళి దినోత్సవం) చేసుకుంటారు. ఆ రోజు ఒకరికొకరు బహుమానాలతో విష్ చేసుకుంటారు. మరియు కొంత మంది పార్టీలు కూడా చేస్తారు.
5- ‘ఏప్రిల్ ఫూల్’ ఈ పదంలోనే ఫూల్ అని పేర్కొనబడినది. ఆ రోజున ఇతరులతో అబద్దాలు పలికి మోసగించడం, ఆ రోజున ఎగతాళిగా జరుపుకోవడం పూర్తిగా అధర్మమైనది. ఇలాంటి అబద్ధమైన మాటలకు మరియు నవ్వులాటలకు ఇస్లామీయ ధర్మంలో ఎలాంటి స్థానం లేదు.
ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 129-137). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)
వేలంటైన్ డే (ప్రేమికుల రోజు)
Valentine’s Day – ఫిబ్రవరి 14
ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (43:35 నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఇక్కడ వినండి లేదా ఆడియో డౌన్లోడ్ చేసుకోండి [9 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
You must be logged in to post a comment.