
[44:53 నిముషాలు]
హైజ్ వ నిఫాస్ (బహిష్టు & పురిటి రక్తం) ఆదేశాలు & ప్రశ్నోత్తరాలు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]
బహిష్టు, బాలింత స్త్రీలు:
స్త్రీలు తమ ఋతుస్రావము మరియు బాలింత గడువులో ఉన్నప్పుడు నమాజ్, ఉపవాసాలు పాటించకూడదు. హజ్రత్ ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
«إِذَا أَقْبَلَتِ الحَيْضَةُ، فَدَعِي الصَّلاَةَ، وَإِذَا أَدْبَرَتْ، فَاغْسِلِي عَنْكِ الدَّمَ وَصَلِّي»
“నీవు ఋతువు గడువు దినాల్లో నమాజ్ చేయడం మానేయి. ఋతు స్రావం ముగిసాక నీ వొంటి మీది రక్తాన్ని కడిగి (తలంటు స్నానం చేసి) నమాజ్ చేస్తూ ఉండు”. (బుఖారి 331, ముస్లిం 333).
తప్పి పోయిన నమాజులు తిరిగి చేయకూడదు. కాని తప్పి పోయిన ఉపవాసాలు మాత్రం పూర్తి చేయాలి. అలాగే వీరు కాబా ప్రదక్షిణం (తవాఫ్) కూడా చేయకూడదు. ఈ గడువులో భర్త తన భార్యతో సంభోగించడం కూడా నిషిధ్ధం. అయితే రమించడం తప్ప పరస్పరం ఏ రకమైన ఆనందం పొందినా తప్పు లేదు. ఈ స్థితిలో స్త్రీ ఖుర్ఆనును తాక వద్దు.
రక్త స్రావం ఆగిన తరవాత స్నానం చేయడం విధిగా ఉంది([1]). స్నానం తర్వాత వారి గడువులో నిశిద్ధంగా ఉన్నవన్నీ ధర్మ సమ్మతం అవుతాయి.
నమాజ్ సమయం ప్రవేశించిన తరువాత, ఆ నమాజ్ చేయక ముందే ఏ స్త్రీకైనా ఋతు స్రావం మొదలవుతే, లేదా ప్రసవిస్తే ఆమె పరిశుద్ధురా- లయిన తరువాత ఆ నమాజును తిరిగి చేయాలి. (ఉదా: జొహ్ర్ నమాజ్ వేళ ఆరంభమయింది పగలు పన్నెండు గంటల నలబై నిమిషాలకు, ఒక స్త్రీ ఒకటింటి వరకు కూడా జొహ్ర్ నమాజ్ చేసుకోలేక పోయింది. అప్పుడే ఋతు స్రావం మొదలయింది, లేదా ప్రసవించింది. అలాంప్పుడు ఆ స్త్రీ పరిశుద్ధురాలయిన తరువాత జొహ్ర్ నమాజ్ చేయాలి). ఒక రకాతు మాత్రమే చేయునంత సమయం ఉన్నప్పుడు పరిశుద్ధుమైన స్త్రీ గుస్ల్ చేసిన తరువాత ఆ నమాజ్ చేసుకోవాలి. ఒక వేళ అది అస్ర్ లేదా ఇషా నమాజ్ అయితే అస్ర్ తో పాటు జొహ్ర్, మగ్రిబ్ తో పాటు ఇషా కూడా చేయుట అభిలషణీయం. ఉదాః సూర్యాస్తమయానికి ఒక రకాత్ చేయునంత ముందు పరిశుద్ధమైతే అస్ర్ నమాజ్ మాత్రం తప్పక చేయాలి. అయితే జొహ్ర్ కూడా ఖజా చేస్తే మంచిది. అర్థ రాత్రికి కొంచెం ముందు పరిశుద్ధురాలయితే ఇషా మాత్రం చేయవలసిందే, అయితే మగ్రిబ్ కూడా చేయడం మంచిది.
[1] కొందరు బాలింత స్త్రీలు 15, లేదా 20, 25 రోజుల్లో రక్త స్రావం నిలిచిపోయినా 40 రోజుల తరువాతే గుస్ల్ చేస్తారు. ఆ తరువాతే నమాజు ఆరంభిస్తారు. వారు ఇలా చేసేది చాలా ఘోరమైన తప్పు. ఎప్పుడు రక్త స్రావం నిలిచినదో అప్పుడే గుస్ల్ చేయాలి. నమాజు మొదలెట్టాలి.
ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు
- ఫిఖ్ హ్ (తహారా,శుద్ధి – నమాజు) – పార్ట్ 01 [వీడియో] [51:22 నిముషాలు]
- ఫిఖ్ హ్ (శుద్ధి,నమాజు) – పార్ట్ 02: మల మూత్ర విసర్జన పద్ధతులు [వీడియో]
- ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) – పార్ట్ 03: వుజూ ఘనత, వుజూ విధానం Q&A [వీడియో]
- ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) – పార్ట్ 04: మేజోళ్ళ (సాక్సులు) పై ‘మసహ్’ QA [వీడియో]
- ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) – పార్ట్ 05: వుజూను భంగపరిచే విషయాలు [వీడియో]
- ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) – పార్ట్ 06: గుసుల్ (శుద్ధి స్నానం) [వీడియో]
- ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) : పార్ట్ 7A – ‘జునుబీ’ (అశుద్ద స్థితిలో ఉన్నవారి) పై నిషిద్ధ విషయాలు [వీడియో]
- ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) – పార్ట్ 7B: తయమ్ముమ్ ఆదేశాలు [వీడియో]
హైజ్ (ముట్టు, బహిష్టు), నిఫాస్ (పురిటి రక్తం)
- శుచీశుభ్రత -4: హైజ్ (బహిష్టు), నిఫాస్ (పురిటి రక్తం) [వీడియో]
- రుతుస్రావానికి సంబంధించిన ఆదేశాలు– హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్)
- బహిస్టు ప్రకరణం – మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్)
- ముస్లిం వనిత – పార్ట్ 03: హైజ్ (బహిష్టు, రుతుస్రావం, ముట్టు) ఆదేశాలు [వీడియో]
- ముస్లిం వనిత – పార్ట్ 04: ఇస్తిహాజా (అసాధారణ రక్తస్రావం), నిఫాస్ (పురుటి రక్తస్రావం), బహిష్టు & కాన్పులను ఆపడం [వీడియో]
You must be logged in to post a comment.