పురుషులు బంగారం వేసుకొనుట

బిస్మిల్లాహ్

పురుషులు బంగారం వేసుకొనుట

బంగారం ఏ రూపంలో ఉన్నా దానిని పురుషులు వాడుట నిషిద్ధం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో అబు మూసా అష్‌అరి (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసులో ఉంది:

పురుషులు బంగారం వేసుకొనుట

“బంగారం, పట్టు నా అనుచర సంఘంలోని స్త్రీలకు ధర్మసమ్మతం. పురుషులకు నిషిద్ధం”.
(ముస్నద్‌ అహ్మద్‌: 4/393. సహీహుల్‌ జామి 207).

ఈ రోజు మార్కెట్లో గడియారాలు, అద్దాలు, బటన్లు, పెన్నులు, చైన్లు ఇంకా మెడల్‌ పేరుతో బంగారపు లేక బంగారు వన్నె ఎక్కించినవి చాలా ఉన్నవి. ఇంకా పురుషులకు స్వర్ణగడియారం అని కొన్ని కాంపిటిషన్లలో ప్రకటించబడుతుంది. అయితే ఇవి నిషిద్ధం అని తెలుసుకోవాలి.

పురుషులు బంగారం వేసుకొనుట

అబ్దుల్లాహ్ బిన్‌ అబ్బాస్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖన ప్రకారం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక వక్తి చేతికి బంగారపు ఉంగరం చూశారు. ఆయన దానిని తీసిపారేశారు. మళ్ళీ ఇలా హెచ్చరించారు: “మీలో ఎవరికైనా నరకజ్వాల కావాలని ఉంటే దీనిని తన చేతిలో తొడగవచ్చు”. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నవారన్నారు: “నీ ఉంగరాన్ని తీసుకో, వేరే విధంగా దానితో ప్రయోజనం పొందవచ్చు”. అప్పుడు అతనన్నాడు: “లేదు. అల్లాహ్‌ సాక్షిగా! ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తీసిపారేసిన దాన్ని నేను ఎన్నడూ తీసుకోను” (ముస్లిం 2090).

[ఇది ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన “ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు” అను పుస్తకం నుంచి తీసుకుబడింది]

%d bloggers like this: