కరోనా వైరస్ & ఇస్లాం బోధనలు [వీడియో]

బిస్మిల్లాహ్

వ్యవధి: 45 నిముషాలు 

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

అబ్దుర్-రెహ్మాన్ బిన్` ఔఫ్ (రదియల్లాహు అన్ హు) వారు ఇలా అన్నారు: మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా బోధించారు:

“ఒక దేశంలో ప్లేగు వ్యాధి వ్యాపించిందని మీరు విన్నట్లయితే, అక్కడికి వెళ్లవద్దు. కానీ మీరు ఉన్న దేశంలో అది విచ్ఛిన్నమైతే దాని నుండి తప్పించుకొని బయటకు వెళ్లవద్దు.” (సహీహ్ బుఖారి 5730)


హజ్రత్‌ అనస్‌ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రార్థించేవారు:

Allahumma inni a'udhu bika minal-barasi, wal- jununi, wal-judhami, wa sayyi'il-asqami

‏اللهم إني أعوذ بك من البرص والجنون، والجذام، وسيئ الأسقام

అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక మినల్ బరసి, వల్ జునూని, వల్ జుదామి, వ సయ్యిఇల్ అస్కామ్ 

ఓ అల్లాహ్‌! తెల్లమచ్చల రోగం నుండి, పిచ్చితనం నుండి, కుష్టు వ్యాధి నుండి, ఇతర హీనమైన రోగాల నుండి నేను నీ శరణు వేడుతున్నాను.

(ముస్నద్‌ ఆహ్మద్‌: 12592, అబూ దావూద్‌: 1554, సునస్‌ నసాయీ: 5493, అల్లామా అల్బానీ ఈ హథీసు సహీహ్ అని ధృవీకరించారు)


 

అన్ని రకాల రోగాల నుండి అల్లాహ్ శరణు కోరండి [దుఆ]

1485. హజ్రత్‌ అనస్‌ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రార్థించేవారు:

Allahumma inni a'udhu bika minal-barasi, wal- jununi, wal-judhami, wa sayyi'il-asqami

‏اللهم إني أعوذ بك من البرص والجنون، والجذام، وسيئ الأسقام

అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక మినల్ బరసి, వల్ జునూని, వల్ జుదామి, వ సయ్యిఇల్ అస్కామ్ 

ఓ అల్లాహ్‌! తెల్లమచ్చల రోగం నుండి, పిచ్చితనం నుండి, కుష్టు వ్యాధి నుండి, ఇతర హీనమైన రోగాల నుండి నేను నీ శరణు వేడుతున్నాను.

(అబూదావూద్‌ 1557. దీనిని దృఢమైన ఆధారాలతో వెలికితీశారు)

250. ప్రార్ధన విశిష్టత [pdf]
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – 2 వ భాగము – ఇమామ్ నవవి

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (30 సెకనులు)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

వస్త్ర ధారణ ఆదేశాలు

బిస్మిల్లాహ్

ఇస్లాం ధర్మం పరిశుభ్రత మరియు సౌందర్యాలను ప్రేమించు, ప్రోత్సహించు ధర్మం. ప్రతి ముస్లింకి (హద్దు లోపల ఉండి) అంద సౌందర్యాలను ప్రదర్శించే వస్త్రాలు ధరించే అనుమతిచ్చింది, ప్రోత్సహించింది. మర్మావయవాలను కప్పి ఉంచడానికి, అలంకరణగా ఉపయోగించుకోడానికి అల్లాహ్‌ వస్త్రాలను (తయారు చేసుకునే సాధానాలను) సృష్టించాడు. ఆయన ఆదేశం ఇలా వుంది:

يَا بَنِي آدَمَ قَدْ أَنزَلْنَا عَلَيْكُمْ لِبَاسًا يُوَارِي سَوْآتِكُمْ وَرِيشًا

“ఓ ఆదము సంతానమా! మేము మీపై దుస్తులను అవతరింపజేశాము. అవి మీరు సిగ్గుపడే మీ శరీర భాగాలను కప్పుతాయి. మీ శరీర రక్షణకు, శోభకు సాధనంగా ఉంటాయి.” (ఆరాఫ్‌ 7: 26).


వస్త్రధారణ విషయంలో ఏవి నిషిద్ధం అని స్పష్టమైన ఆధారం గలదో అవి తప్ప మిగతా వన్నియూ ధర్మసమ్మతమే. అలాగే ఇస్లాం వస్త్రధారణకు సంబంధించిన ఏదైనా ఒక ప్రత్యేక విధానాన్ని పరిమితం చేయలేదు. అయితే కొన్ని నియమ నిబంధనలు మాత్రం తెలిపింది. ప్రతీ ముస్లిం వస్త్రాలు ధరించినప్పుడు వాటిని ఆచరణలో ఉంచడం తప్పనిసరి. అవి ఈ విధంగా ఉన్నాయి:

1- శరీరంలో తప్పనిసరిగా దాచి ఉంచవలసిన భాగం మొత్తంపై వస్త్రం ఉండాలి. ధరించినప్పటికీ శరీరం కనబడునటువంటి పలచగా ఉండకూడదు. శరీరావయవాల పరిమాణాన్ని తెలుపునటువంటి ఇరుకుగా ఉండకూడదు.

2- ముస్లిమేతరుల ప్రత్యేక వస్త్రాల మాదిరిగా ఉండకూడదు. అలాగే సమాజంలో చెడు కార్యాలకు పాల్పడే వారికి ప్రత్యేక చిహ్నంగా ఉండే దుస్తుల మాదిరిగా కూడా ఉండకూడదు. (వారు హీరో, హీరోయిన్ల పేరుతో పిలువబడేవారయినా, వేశ్యావృత్తి అవలంభించువారైనా, మరెవరైనా సరే).

3- వృధా ఖర్చులతో కూడినవై ఉండకూడదు.


పై నియమాలను పాటిస్తూ మనిషి తనకిష్టమైన తనకు అవసరమైన, తన సమాజంలో వాడుకలో ఉన్న ఏ దుస్తులు ధరించినా మంచిదే. దుస్తుల విషయంలో వచ్చిన నివారణలు, నిషిద్ధతలకు సంబంధించిన వివరాలు క్రింద తెలుపబడుతున్నవి:

1- పురుషుల కొరకు బంగారం, పట్టు వస్త్రాలు నిషిద్ధం. అయితే అవి స్త్రీల కొరకు ధర్మసమ్మతమే. అలీ బిన్‌ అబూ తాలిబ్‌ (రజియల్లాహు అన్హు)  హదీసులో ఉంది:

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్టు వస్త్రాన్ని తమ కుడి చెయిలో, బంగారాన్ని తమ ఎడమ చెయిలో తీసుకొని ఇలా చెప్పారు: 

“ఇవి రెండూ నా అనుచర సమాజంలోని పురుషుల కొరకు నిషేధించబడ్డాయి” అని చెప్పారు. (అబూ దావూద్‌/ ఫిల్‌ హరీరి లిన్నిసా 4057, నసాయి/ తహ్రీముజ్జహబి అలర్రిజాల్‌ 5053).

కాని పురుషులు వెండితో లేదా వెండి కలిపి మరేదానితోనైనా చేయబడిన ఉంగరం తమ అలవాటు ప్రకారం తొడగడంలో అభ్యంతరం లేదు.

2- ప్రాణం గల చిత్రం ఉన్న వస్త్రాలు: అంటే మనుషులు, జంతువుల చిత్రాలు గల వస్తువులు ధరించడం యోగ్యం కాదు. అవి దుస్తులయినా, నగలయినా మరేవైనా సరే.

dress-rulings-2

ఆయిషా (రజియల్లాహు అన్హా)  ఉల్లేఖనం ప్రకారం, ఆమె బొమ్మలు గీసి యున్న ఒక దిండు కొన్నది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బయటి నుండి వచ్చి దానిని చూడగానే తలుపు దగ్గరే ఆగిపోయారు. లోపలికి ప్రవేశించలేదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముఖంలో ఏదో ఇష్టం లేని చిహ్నాలు చూసి, ప్రవక్తా! నేను అల్లాహ్‌ వైపునకు తర్వాత ఆయన ప్రవక్త వైపునకు మరలుతున్నాను (క్షమాపణ కోరుకుంటున్నాను). నాతో జరిగిన తప్పేమిటో సెలవియ్యండి అని అన్నాను. అందుకు ఆయన “ఈ దిండు సంగతేమిటి?” అని మందలించారు. దీనికి మీరు ఆనుకొని కూర్చుంటారనే ఉద్దేశంతో నేను కొన్నాను అని చెప్పాను. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:

“ఈ బొమ్మలు, చిత్రాలు చిత్రించేవారు ప్రళయదినాన శిక్షించబడుతారు. మీరు సృష్టించిన వాటిలో ప్రాణం పోయండి అని వారితో అనబడుతుంది”.

మళ్ళీ చెప్పారు:

“ఏ ఇంట్లో బొమ్మలు, చిత్రాలు ఫోటోలు ఉంటాయో ఆ ఇంట్లో దైవదూతలు ప్రవేశించరు”.

(బుఖారి/అత్తిజారతు. ఫీమా యుక్రహు లుబ్సుహు… 2105, ముస్లిం/తహ్రీము తస్వీరి సూరతిల్‌ హైవాన్‌… 2107).

3- పురుషులపై నిషిద్ధమున్న మరో విషయం వారు తమ వస్త్రాలను చీలమండలం క్రిందికి తొడగుట.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారని అబూ హురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

dress-rulings-3

“చీలమండలానికి క్రింద ఉన్న లుంగి (వస్త్రం) వారి ఆ భాగం నరకంలో ఉండును”. (బుఖారి/మా అస్ఫల మినల్‌ కాబైని… 5787).

అది పైజామా, పైంటు, దుప్పటి తదితర ఏ వస్త్రం అయినా సరే. కొందరి భ్రమ ప్రకారం ‘గర్వంతో తొడిగే వారికి ఈ శిక్ష’ అన్న మాట సరికాదు. గర్వం లేకుండా తొడిగే వారికే ఈ శిక్ష. గర్వంతో తొడిగే వారికి ఇంతకంటే మరీ ఘోరమైన శిక్ష గలదు. అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు:

dress-rulings-4

“అహంకారంతో తన వస్త్రాన్ని (లుంగి, పైంటు వగైరాలు) ఈడుస్తూ నడిచే వ్యక్తిని అల్లాహ్‌ పరలోకంలో కన్నెత్తి కూడా చూడడు”.

(బుఖారి/మన్‌ జర్ర సౌబహు మినల్‌ ఖయలా 5791, ముస్లిం/తహ్రీము జర్రిస్పౌబి ఖుయలా… 2085).

కాని స్త్రీలు తమ వస్త్రాలను క్రింది వరకు వ్రేలాడదీయాలి. పాదాలు కూడా కనబడకుండా ఉండాలి.

4- తొడిగి కూడా నగ్నంగా కన్పించేటటువంటి పలచని, సన్నటి వస్త్రాలు యోగ్యం కావు. అలాగే శరీరావయవాల పరిమాణాన్ని వర్ణించే విధంగా ఇరుకుగా తొడుగుట యోగ్యం కాదు. ఈ ఆదేశం స్త్రీ పురుషులందరికీ వర్తిస్తుంది.ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

“ధరించికూడా నగ్నంగా కన్పించే దుస్తులు ధరించే స్త్రీలు స్వర్గంలో ప్రవేశించరు, దాని సువాసన కూడా పొందరు”. (ముస్లిం 2128).

5-. పురుషులు స్త్రీల లాంటి మరియు స్త్రీలు పురుషుల్లాంటి బట్టలు తొడుగుట నిషేధం.

ఇబ్ను అబ్బాస్‌ (రజియల్లాహు అన్హు) ఇలా చెప్పారు:

dress-rulings-5

“స్త్రీల వేషాధారణ వేసుకునే పురుషులను, పురుషుల వేషాధారణ వేసుకునే స్త్రీలను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శపించారు”. (బుఖారి/అల్‌ ముతషబ్బిహూన బిన్నిసా… 5885).

6- అవిశ్వాసులు తమ ధార్మిక చిహ్నంగా ప్రత్యేకించుకున్న వేషాధారణ ముస్లిం ధరించడం నిషిద్ధం.

అబ్దుల్లాహ్‌ బిన్‌ అమ్ర్ బిన్‌ ఆస్‌ (రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు:

dress-rulings-6

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా ఒంటిపై కాషాయ రంగుతో కూడిన రెండు బట్టలు చూసి, “ఇవి అవిశ్వాసులు ధరించే బట్టల్లో ఒక రకమైనవి, నీవు వీటిని ధరించకు” అని చెప్పారు. (ముస్లిం/ అన్నహ్‌ యు అన్‌ లుబ్బిర్రజులి… 2077).


వస్త్రధారణ ధర్మములు

1- ముస్లిం పాటించవలసిన ధర్మాల్లో ఒకటి, కొత్త బట్టలు ధరించేటప్పుడు ఈ దుఆ చదవడం.

అబూ సఈద్‌ ఖుద్రీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొత్త బట్టలు ధరించేటప్పుడు చొక్కా, తలపాగ మరేదైనా దాని పేరు చెప్పి ఈ దుఆ చదివేవారు:

dress-rulings-7

అల్లాహుమ్మ లకల్‌ హందు అంత కసౌతనీహి అస్‌అలుక మిన్‌ ఖైరిహీ వ ఖైరి మా సునిఅ లహూ వఅఊజు బిక మిన్‌ షర్రిహీ వషర్రి మా సునిఅ లహూ (*).

(భావం: ఓ అల్లాహ్‌! నీకే సర్వ స్తోత్రములు, నీవే నాకు ఈ బట్టలు ధరింపజేశావు. దీనిలోని మేలును మరియు దేని కొరకు అది నేయబడిందో దాని మేలును నీతో కోరుతున్నాను. దాని కీడు నుండి మరియు దేని కొరకు అది నేయబడిందో దాని కీడు నుండి నీ శరణు జొచ్చుచున్నాను). (అబూ దావూద్‌ 4020, తిర్మిజి 1767).

(*)  పైన ఇవ్వబడిన దుఆ కొత్త బట్టలు ధరించేటప్పుడు చదివేది. అయితే రోజువారి బట్టలు ధరించేటప్పుడు “అల్‌ హందు లిల్లాహిల్లజీ కసానీ హజస్‌ సౌబ వరజఖనీహి మిన్‌ ఘైరి హౌలిమ్‌ మిన్నీ వలా ఖువ్వహ్‌” చదివే వారి పూర్వపు పాపాలన్నీ మన్నించబడతాయి. (అబూ దావూదు 4023).

2- బట్టలు తొడుక్కునేటప్పుడు కుడి వైపు నుండి తొడగడం ధర్మం.

ఆయిష (రజియల్లాహు అన్హా)  చెప్పారు:

dress-rulings-8

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాధ్యమైనంత వరకు మంచి కార్యాలు కుడి వైపు నుండి చేయడం మరియు మొదలు పెట్టటం ఇష్టపడేవారు. అది వుజూలోనైనా, తల దువ్వుకునేటప్పడైనా మరియు చెప్పులు తొడిగేటప్పుడైనా”. (బుఖారి 426, ముస్లిం 268).

చెప్పులు తొడిగేటప్పుడు ముందు కుడి కాలులో తొడగాలి కాని తీసేటప్పుడు ముందు ఎడమ కాలి నుండి తీయాలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఆదేశించారని, అబూ హురైర (రజియల్లాహు అన్హు)  ఉల్లేఖించారు:

dress-rulings-9

“మీలో ఎవరయినా చెప్పులు తొడిగేటప్పుడు కుడి కాలు నుండి తొడగాలి. తీసేటప్పుడు ఎడమ కాలు నుండి తీయాలి. తొడిగితే రెండూ తొడగాలి. తీస్తే రెండూ తీయాలి”. (ముస్లిం 2097, బుఖారి 5856).

మరొక హదీసులో ఒక చెప్పు తొడిగి నడవడం నుండి నివారించబడింది. (బుఖారి 5855).

3- ప్రతీ ముస్లిం తన శరీరాన్ని, దుస్తులను పరిశుభ్రంగా, అశుద్ధతకు దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి. పరిశుభ్రత ప్రతి అలంకారాణికి, అందానికి మూలం లాంటిది.ఇస్లాం పరిశుభ్రత గురించి ప్రోత్సహించడంతో పాటు శరీర, దుస్తుల శుభ్రతపై శ్రద్ధ చూపాలని కూడా చాలా ప్రోత్సహించింది.

తెల్లని బట్టలు ధరించడం మంచిది. ఇబ్ను అబ్బాస్‌ (రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖించిన హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:

dress-rulings-10

“మీరు తెల్లని దుస్తులు ధరించండి. మీ దుస్లులలోకెల్లా అతి ఉత్తమమైనవి ఇవే. మీ మృతులకు కూడా ఈ తెల్లని వస్త్రాలతోనే కఫన్‌ ఏర్పాటు చేయండి”. (అబూ దావూద్‌/అత్తిబ్‌/ ఫిల్‌ అమ్రి  బిల్‌ కొహ్‌ లి 3878, తిర్మిజి/మా యుస్తహబ్బు మినల్‌ అక్సాన్‌ 994).

ఇతర రంగులు యోగ్యమే.

5- దుస్తులు ఇతర అలంకరణ వస్తువుల ఖరీదులో దుబార ఖర్చులు చేయకుండా, మరీ పిసినారితనం వహించకుండా మధ్యేమారాన్ని అవలంబించాలి. అల్లాహ్‌ ఇలా ఆదేశించాడు:

وَالَّذِينَ إِذَا أَنفَقُوا لَمْ يُسْرِفُوا وَلَمْ يَقْتُرُوا وَكَانَ بَيْنَ ذَٰلِكَ قَوَامًا

“వారు తమ సంపద వినియోగిస్తున్నప్పుడు దుబారా ఖర్చు చేయరు. ఇటు పిసినారితనం కూడా వహించరు. వారి ఖర్చు ఆ రెండు అతిచర్యలకు మధ్యస్తంగా ఉంటుంది.” (ఫుర్ఖాన్  25: 67).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:

dress-rulings-11

“తినండి, త్రాగండి, ధరించండి మరియు దాన దర్మాలు చేయండి. అయితే దుబారా ఖర్చులు చేయకండి. అహంకారానికి గురికాకండి”. (బుఖారి/ కితాబుల్లిబాస్‌).


ధర్మ శాస్త్ర శాసనాలు (Fiqhiyyah) – పుస్తకం – పేజీలు 24-31 నుండి

అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్

దుఆ అంగీకార సమయాలు

బిస్మిల్లాహ్

దుఆ అంగీకార ఘడియలు

"తన ప్రభువుతో దాసుడు అత్యంత సమీపంలో ఉండేది సజ్దా లోనే. గనుక మీరు ఈ స్థితిలో అధికంగా దుఆ చేస్తూ ఉండండి" అని ప్రవక్త మహానీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ముస్లిం).

తన ప్రభువుతో దాసుడు అత్యంత సమీపంలో ఉండేది సజ్దా లోనే. గనుక మీరు ఈ స్థితిలో అధికంగా దుఆ చేస్తూ ఉండండి” అని ప్రవక్త మహానీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించారని, అబూ హురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (ముస్లిం).


అనస్‌ రజియల్లాహు అన్హు ఉల్లేఖనంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: "అజాన్‌ మరియు ఇఖామత్‌ మధ్యలో చేసిన దుఆ రద్దుకాదు". (తిర్మిజి).

అనస్‌ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “అజాన్‌ మరియు ఇఖామత్‌ మధ్యలో చేసిన దుఆ రద్దుకాదు“. (తిర్మిజి).


"రెండు సమయాల్లో దుఆ తిరస్కరించబడదు. లేక తిరస్కరించబడే అవకాశం ఆతి తక్కువ. ఒకటి: అజాన్‌ వేళలో చేసే దుఆ. రెండవది: జిహాద్‌ లో ఒకరిపై నొకరు విరుచుకుపడినప్పుడు చేసే దుఆ". (అబూ దావూద్‌).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించినట్లు సహల్‌ బిన్‌ సఅద్‌ ఉల్లేఖించారు:

“రెండు సమయాల్లో దుఆ తిరస్కరించబడదు. లేక తిరస్కరించబడే అవకాశం అతి తక్కువ. ఒకటి: అజాన్‌ వేళలో చేసే దుఆ. రెండవది: జిహాద్‌ లో ఒకరిపై నొకరు విరుచుకుపడినప్పుడు చేసే దుఆ”. (అబూ దావూద్‌).


"అల్లాహు తఆల ప్రతి రాత్రి (మూడు భాగాల్లోని) చివరి భాగంలో ఈ ప్రపంచ ఆకాశానికి దిగివచ్చి "నాతో మొరపెట్టుకునే వారెవరు, నేను వారి దుఆలను స్వీకరిస్తాను. నన్ను అర్థించే వారెవరు, నేను వారికి ప్రసాదిస్తాను. నాతో క్షమాపణ వేడుకునేదెవరు, నేను వారిని క్షమిస్తాను" అని అంటాడు. (బుఖారి: 1145. ముస్లిం: 758)

అబూహురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనంలో, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:

“అల్లాహు తఆల ప్రతి రాత్రి (మూడు భాగాల్లోని) చివరి భాగంలో ఈ ప్రపంచ ఆకాశానికి దిగివచ్చి “నాతో మొరపెట్టుకునే వారెవరు, నేను వారి దుఆలను స్వీకరిస్తాను. నన్ను అర్థించే వారెవరు, నేను వారికి ప్రసాదిస్తాను. నాతో క్షమాపణ వేడుకునేదెవరు, నేను వారిని క్షమిస్తాను” అని అంటాడు. (బుఖారి: 1145. ముస్లిం: 758)


"నిశ్చయంగా రాత్రి వేళ ఓ గడియ ఉంది. అందులో ఏ ముస్టిమయితే అల్లాహ్‌ తో ఇహపరలోకాల మేలు కోరుకుంటాడో అల్లాహ్‌ అతనికి అది ప్రసాదిస్తాడు. ఇలా ప్రతి రాత్రి జరుగుతుంది" అని ప్రవక్త చెబుతుండగా నేను విన్నానని జాబిర్‌ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు.

“నిశ్చయంగా రాత్రి వేళ ఓ గడియ ఉంది. అందులో ఏ ముస్లిమయితే అల్లాహ్‌ తో ఇహపరలోకాల మేలు కోరుకుంటాడో అల్లాహ్‌ అతనికి అది ప్రసాదిస్తాడు. ఇలా ప్రతి రాత్రి జరుగుతుంది” అని ప్రవక్త చెబుతుండగా నేను విన్నానని జాబిర్‌ (రజియల్లాహు అన్హు ) ఉల్లేఖించారు. (ముస్లిం).


విశేషాలు:

1- కొన్ని ప్రత్యేక సమయాలున్నవి వాటిలో దుఆ స్వీకరణపు నమ్మకం ఇతర సమయాలకంటే ఎక్కువగా ఉంటుంది.

2- ఆ సమయాలను అదృష్టంగా భావించాలని ప్రోత్సహించబడింది. ఆ సమయాల్లో అధికంగా దుఆ చేయుటకు ప్రయాస పడాలి.

3- ఆ సమయాల్లో కొన్ని ఇవి: సజ్దాలో, అజాన్‌ ఇఖామత్‌ ల మధ్యలో, రాత్రి చివరి గడియలో, జీహాద్ లో శత్రువులతో భేటి జరిగినప్పుడు.


దిన చర్యల పాఠాలు పుస్తకం నుండి
ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

మహా ప్రవక్త జీవిత చరిత్ర: అర్రహీఖుల్‌ మఖ్ తూమ్ (పూర్తి పుస్తకం)

బిస్మిల్లాహ్

ప్రవక్త జీవిత చరిత్ర: అర్రహీఖుల్‌ మఖ్ తూమ్ (పూర్తి పుస్తకం)

[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి] [PDF]
[ఫైల్ సైజు 135.5 MB]

విషయసూచిక

 • అరేబియా నైసర్గిక స్వరూపం – జాతులు
 • అరబ్బు రాజ్యాలు – నాయకత్వాలు
 • అరేబియా మతాలు – ధర్మాలు
 • అజ్ఞాన కాలంనాటి అరబ్బుల సామాజిక తీరుతెన్నులు
 • ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వంశావళి, జననం, నలబై ఏండ్ల పవిత్ర జీవని
 • శుభ జననం-నలబై ఏళ్ళ పవిత్ర జీవితం
 • దైవదైత్య శకం
 • సందేశ ప్రచారాదేశం – దాని అంతరార్థం
 • ప్రథమ దశ – దైవసందేశ ప్రచార యత్నం
 • బహిరంగ దైవసందేశ ప్రచారం
 • సంపూర్ణ సంఘ బహిష్కరణ
 • అబూ తాలిబ్‌ను కలసిన ఖురైష్‌ చిట్టచివరి ప్రతినిధి బృందం
 • శోక సంవత్సరం
 • ప్రప్రథమంగా ఇస్లాం స్వీకరించిన వారి సహన సంయమనాలను పురికొల్పిన కారణాలు
 • తృతీయ దశ – మక్కాకు వెలుపల ఇస్లామ్‌ సందేశ ప్రచారం
 • ప్రముఖ వ్యక్తులు, వివిధ తెగల్లో ఇస్లామ్‌ ధర్మ ప్రచారం
 • ఇస్రా మరియు మేరాజ్‌
 • ప్రథమ బైతె అఖబా
 • ద్వితీయ బైతె అఖబా
 • హిజ్రత్‌కు ఉపక్రమించిన ప్రథమ బృందాలు
 • దారున్నద్వాలో ఖురైషుల సమావేశం
 • హిజ్రత్‌ చేసి మక్కాను వీడిన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)
 • మదీనాలో గడిపిన పవిత్ర జీవితం
 • హిజ్రత్‌ నాటి మదీనా పరిస్థితులు
 • నవ సమాజ నిర్మాణం
 • యూదులతో జరిగిన ఒప్పందం
 • సాయుధ పోరాటాలు
 • బద్ర్ సంగ్రామం
 • బద్ర్ తరువాయి యుద్ద సన్నాహాలు
 • ఉహద్‌ పోరాటం (గజ్వయె ఉహద్‌)
 • ఉహద్‌ పోరాటం తరువాతి సైనిక చర్యలు
 • గజ్వయె అహఁఖాబ్  (అగడ్త యుద్ధం)
 • అహఁఖాబ్ మరియు ఖురైజా పోరాటాల తదుపరి సైనిక చర్యలు
 • గజ్వయె బనీయిల్‌ ముస్తలిక్‌
 • గజ్వయెబనీ ముస్తలిక్‌ తరువాత చేపట్టిన సైనిక చర్యలు
 • హుదైబియా ఒప్పందం
 • హిజ్రత్‌ చేసి వచ్చిన మహిళల అప్పగింతను నిరాకరించడం
 • క్రొత్త మార్పు
 • హుదైబియా ఒప్పందం తరువాతి సైనిక చర్యలు
 • గజ్వయె ఖైబర్‌; గజ్వయె వాదియిల్‌ ఖురా
 • గజ్వయె జాతుర్రిఖాఖ్‌ (జాతుర్రిఖాఖ్‌ యుద్ధం- హి.శ. 7)
 • ఉమ్రయె ఖజా
 • ‘మూతా’ పోరాటం
 • మక్కా విజయం
 • మూడవ దశ –
 • గజ్వయె హునైన్‌ (హునైన్‌ యుద్ధం)
 • మక్కావిజయం తరువాతి సైనిక చర్యలు –
 • ప్రభుత్వాధికారుల నియామకం
 • గజ్వయె తబూక్‌ (తబూక్‌ పోరాటం)
 • హిజ్రీ శకం 9 లో జరిగిన హజ్‌
 • గజ్వాల (యుద్ధాల)పై ఓ సమీక్ష
 • దైవధర్మంలో తండోపతండాలుగా ప్రజల ప్రవేశం
 • ఇస్లామ్‌ ధర్మప్రచార సాఫల్యం – దాని ప్రభావాలు
 • హజ్జతుల్‌ విదా (చివరి హజ్‌)
 • చిట్టచివరి సైనిక యాత్ర
 • పరమాప్తుని వైపునకు ప్రస్థానం [PDF]
 • మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుటుంబం
 • పరిపూర్ణ మూర్తిమత్వం

విధివ్రాత పై సహనం వహించుట కూడా అల్లాహ్ పై విశ్వాసంలో ఒక భాగం – ఇమామ్ అస్-సాదీ

బిస్మిల్లాహ్

35 వ అధ్యాయం
విధివ్రాత పై సహనం వహించుట కూడా అల్లాహ్ పై విశ్వాసంలో ఒక భాగం
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


అల్లాహ్ ఆదేశం: “ఎవడు అల్లాహ్ ను విశ్వసిస్తాడో, అల్లాహ్ అతని హృదయానికి మార్గదర్శకత్వం ప్రసాదిస్తాడు” (తగాబున్‌ 64:11).

పై ఆయతులో ప్రస్తావించబడిన వ్యక్తి ఎవరు అనేది “అల్‌ ఖమ” ఇలా ప్రస్తావించారు: “అతనిపై ఏదైనా ఆపద వస్తే, అది అల్లాహ్ తరఫు నుండి అని  అతను తెలుసుకొని, సంతోషిస్తాడు, మనఃపూర్వకంగా ఒప్పుకుంటాడు”.

అబు హురైరా (రది అల్లాహు అన్హు) కథనం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు: “కుఫ్ర్ కు (సత్యతిరస్కారానికి) సంబంధించిన రెండు గుణాలు ప్రజల్లో ఉన్నాయి. ఒకటి: ఒకరి వంశపరంపరను నిందించుట. రెండవది: చనిపోయినవారిపై శోకము చేయుట”.

అబ్దుల్లా బిన్‌ మస్ ఊద్‌ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు: “చెంపలను బాదుకుంటూ, దుస్తులు చించుకుంటూ అజ్ఞాన కాలపు అరుపులు పలుకులు పలికేవాడు మన (సంప్రదాయము అనుసరించే) వాడుకాడు”. (బుఖారి,ముస్లిం).

అనసు (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు: “అల్లాహ్ ఏ మానవునికి మేలు చేయగోరుతాడో, అతని పాపాలకు బదులు శిక్ష ఇహలోకంలోనే తొందరగా ఇచ్చేస్తాడు. ఏ మానవునికి మేలు చేయగోరడో, అతని పాపాలకు బదులు శిక్షను ప్రళయం వరకు వేచి ఉంచి అక్కడ ఇస్తాడు”. (తిర్మిజి).

మరో సారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో ప్రతిఫలం కూడా అంతే గొప్పగా ఉంటుంది. అల్లాహ్ ఏ సమాజం, సంఘాన్ని ప్రేమస్తాడో, దానిని పరీక్షకు గురి చేస్తాడు. ఎవరు దానిని సహనంతో (సహిస్తారో), వారిని అల్లాహ్ ఇష్టపడుతాడు.ఎవరు అసహనము చూపుతారో, అల్లాహ్ వారిపై ఆగ్రహస్తాడు”. (తిర్మిజి).

ముఖ్యాంశాలు:

1. తగాబున్‌ ఆయతు యొక్క భావం.

2. సహనం అల్లాహ్ పై విశ్వాసంలో ఒక భాగం.

3. వంశపరంపర లోని లోపాలను ఎంచుట మంచిది కాదు.

4.చెంపలు బాదుకుంటూ, దుస్తులు చించుకుంటూ, అజ్ఞానకాలపు పలుకులు పలికేవాని గురించి కఠినంగా హెచ్చరించబడింది.

5. అల్లాహ్ మేలు కోరిన వ్యక్తి లక్షణం తెలిసింది.

6. అల్లాహ్ మేలు కోరని వ్యక్తి లక్షణం తెలిసింది.

7. అల్లాహ్  ప్రేమించిన వ్యక్తి చిహ్నం.

8. పరీక్ష ఆపదపై అసంతృప్తి వ్యక్తం చేయుట నిషిద్ధం.

9. వాటిపై సహనం వహించుట వలన పుణ్యం లభిస్తుంది.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) 

ఓపికతో అల్లాహ్ కు విధేయులగుట, పాపం నుండి దూరంగా ఉండి సహనం వహించుట – ఇవి రెండూ విశ్వాసంలో లెక్కించబడుతాయి. అంతే కాదు అవి దాని పునాది. దాని భాగాలే. అల్లాహ్ ప్రేమించేవాటిని, ఆయనకు ఇష్టమున్న, ఆయన సన్నిధిలో చేర్పించేవాటిని ఓపికతో (ఆచరించుట), ఆయన నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండి సహనం వహించుటయే విశ్వాసం.

ఇస్లాం పునాది మూడు సూత్రాల పై ఉంది.

 1. అల్లాహ్ , ఆయన ప్రవక్త తెలిపిన వాటిని సత్యం అని నమ్ముట.
 2. అల్లాహ్ , ఆయన ప్రవక్త ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించుట.
 3. అల్లాహ్ , ఆయన ప్రవక్త నిషేధించినవాటి నుండి దూరంగా ఉండుట.

అల్లాహ్ వ్రాసిన విధివ్రాత బాధాకరమైనప్పటికి దానిపై ఓపిక వహించుట ఇందులోనే వస్తుంది. కాని దాన్ని తెలుసుకొనుట, ఆచరించుట చాలా అవసరం కాబట్టి దానిని ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది.

ఆపద, కష్టం అల్లాహ్ తరఫు నుండియే వస్తుంది అని, అల్లాహ్ దాన్ని నిర్ణయించడంలో సంపూర్ణ వివేచణాపరుడని, దానిని మానవునిపై నిర్ణయించడం కూడా ఆయన సంపూర్ణ వరమేనని తెలుసుకున్న వ్యక్తి అల్లాహ్ వ్రాసిన విధివ్రాతతో సంతోషించి, దాన్ని మనఃపూర్వకంగా ఒప్పుకొని, అసంతృప్తికరమైన వాటిపై అల్లాహ్ సన్నిధానం కోరుతూ, పుణ్యాన్ని ఆశిస్తూ, ఆయన శిక్షతో భయపడుతూ మరియు సత్ప్రవర్తన అవలంబించే సమయం వచ్చిందని భావిస్తూ సహనం వహించాలి. అప్పుడు అతని హృదయానికి తృప్తి  శాంతి కలుగుతుంది. అతని విశ్వాసం, ఏకత్వంలో బలం వస్తుంది.


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]  

జుమా రోజు స్నానం చేయడం, సువాసన పూసుకోవడం ధర్మం [ఆడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (8 నిముషాలు)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇతరములు:

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి

జుమా (శుక్ర వారం)
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

హస్తాన్ని పరిశీలించి లేదా తారాబలాన్ని చూసి అగోచర  జ్ఞానం ఉందని చెప్పటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

అగోచరం అంటే .. :

భూత భవిష్యత్ కాలాలకు చెందిన ఏ విషయాలైతే  జనుల దృష్టికి రావో – కంటికి కానరావో – వాటిని అగోచరాలని అంటారు.

అగోచర జ్ఞానాన్ని అల్లాహ్‌ తన కొరకు ప్రత్యేకించుకున్నాడు. ఆయన ఇలా సెలవిచ్చాడు :

قُل لَّا يَعْلَمُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ الْغَيْبَ إِلَّا اللَّهُ

“అల్లాహ్  తప్ప ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారెవరికీ అగోచర జ్ఞానం లేదు.” (అన్‌ నమ్ల్‌ 27: 65)

అల్లాహ్ కొన్ని సందర్భాలలో దైవప్రవక్తలలో కొందరికి, కొన్ని పరమార్థాల దృష్ట్యా తన అగోచర జ్ఞానంలోని కొన్ని విషయాలను తెలియజేస్తాడు. ఆ విషయాన్నే ఇక్కడ ప్రస్తావించటం జరిగింది.

عَالِمُ الْغَيْبِ فَلَا يُظْهِرُ عَلَىٰ غَيْبِهِ أَحَدًا إِلَّا مَنِ ارْتَضَىٰ مِن رَّسُولٍ

“ఆయన అగోచర జ్ఞానం కలవాడు. తన అగోచర విషయాలను ఆయన ఎవరికీ తెలుపడు – తాను ఇష్టపడిన ప్రవక్తకు తప్ప!” (అల్‌ జిన్న్‌ : 26, 27)

అంటే, అల్లాహ్ తనకు స్వంతమైన అగోచర జ్ఞానంలోని కొంత భాగాన్ని తన ప్రవక్తలలో తాను కోరిన వారికి, కొన్ని పరమార్థాల దృష్ట్వా తెలియపరచటం సంభవమే. ఎందుకంటే అతను (ఆ ప్రవక్త) ఆ అద్భుతాలను తన దైవదౌత్యానికి నిదర్శనంగా చూపుతాడు. ఇలాంటి అద్భుతాలలో, అగోచర విషయాలను (భవిష్యవాణి) తెలుపటం కూడా ఒకటి. ఈ అగోచర జ్ఞానంలో మానవ సందేశహరునికి, దైవదూతల సందేశవాహకునికి మాత్రమే ప్రమేయం ఉంటుంది. మూడో వ్యక్తికి ఇందులో ఎలాంటి దఖలు ఉండదు. ఎందుకంటే అల్లాహ్ అగోచర జ్ఞానాన్ని వారిరువురికే పరిమితం చేశాడు. కాబట్టి అల్లాహ్‌ దృష్టిలో మినహాయింపుకు నోచుకున్న ఆ సందేశహరులు తప్ప వేరెవరయినా తనకు అగోచర జ్ఞానం ఉందని అంటే అతను అసత్యవాది, అవిశ్వాసానికి ఒడిగట్టిన వాడవుతాడు. అతను హస్త సాముద్రికం ఆధారంగా చెప్పినా, తారాబలం చూసి చెప్పినా, క్షుద్రవిద్యలను ఆశ్రయించినా, జ్యోతిష్కం ద్వారా చెప్పినా, మరే వనరుల ఆధారంగా చెప్పినా అతను అబద్ధీకుడే. ఈ యుగంలో కూడా ఇలాంటి నయవంచకులు, మోసగాళ్లకు కొదువలేదు. వారు తమ వాక్చాతుర్యంతో, మాయమాటలతో అమాయక జనులను బుట్టలో వేసుకుని పోగొట్టుకున్న వస్తువుల ఆచూకీ తెలుపుతామని, రోగ కారణాలను తెలుపుతామని అంటుంటారు. ఫలానా వ్యక్తి నీకేదో చేసేశాడని, అందుకే నీవు ఈ విధంగా మంచాన పడ్డావని చెబుతుంటారు. ఈ విషయాలను వారు జిన్నాతుల నుండి, షైతానుల నుండి సేకరిస్తారు. అందుకోసం వారు ఆ పైశాచిక శక్తులను ప్రసన్నుల్ని చేస్తుంటారు. ఎవరయినా మీ వద్దకు క్షుద్రవిద్యను పొందిన మాటలంటే ఖచ్చితంగా వారు మాయలమారులని, మోసగాళ్లని గ్రహించాలి.

షేఖుల్‌ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు : “భవిష్యవాణి (సోదె) చెప్పేవారి పరిస్థితి ఎటువంటిదంటే, వారి వద్ద షైతాన్‌ సహచరుడు ఉంటాడు. ఆకాశాలలో దొంగచాటుగా. విన్న విషయాలను వాడు వారికి తెలియజేస్తుంటాడు. వాటిలో వారు మరికొన్ని అబద్ధాలను (మిర్చిమసాలాను) జోడించి వివరిస్తారు.”

ఆయన ఇంకా ఇలా అంటున్నారు : “ఈ సోదె చెప్పటంలో కొందరు ఆరితేరిన వారుండేవారు. వారి దగ్గరకు షైతానులు తినే త్రాగే పదార్థాలను కూడా తెచ్చేవారు. ఆ ప్రదేశాలలో లభ్యంకాని పండ్లను, మిఠాయిలను కూడా తెచ్చేవారు. వాటిలో కొన్నింటిని జిన్ను మక్కా లేదా బైతుల్‌ మఖ్దిస్ లేదా వేరే ఇతర స్థలాలకు తరలించేవాడు.” (మజ్మూ అత్ తౌహీద్ – పేజీ : 797, 801)

అగోచరాలకు సంబంధించి వారు జ్యోతిష్యశాస్త్రం ద్వారా కొన్ని విషయాలు అందజేస్తుంటారు. నక్షత్రాలను, రాసులను చూసి వారు భూమండలంపై సంభవించబోయే దానిని సూచిస్తుంటారు. గాలులు ఎంతవేగంగా వీస్తాయి, వర్షం ఎప్పుడు ఎక్కడ కురుస్తుంది తదితర విషయాలను అంచనా వేస్తారు. నక్షత్రాలు తమ తమ కక్ష్యల్లో చేసే పరిభ్రమణం, వాటి కలయిక, విడిపోవటాలను బట్టి జరిగే సంఘటనలను నిర్ధారిస్తారు. వారిలా అంటారు: ఇతను గనక ఫలానా నక్షత్రం సంచరించే సమయంలో వివాహమాడితే అతనికి ఈ ఈ సమస్యలు ఎదురవుతాయి. అతను గనక ఫలానా నక్షత్రం పొడసూపినపుడు ప్రయాణం చేస్తే ఫలానా ఫలానా గండాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అతను ఫలానా నక్షత్రం సమయంలో పుట్టాడు కనుక ఫలానా భాగ్యం వరిస్తుంది లేదా ఫలానా దరిద్రం చుట్టుకుంటుంది. ప్రస్తుతం కొన్ని చవుకబారు పత్రికలు సయితం ఇలాంటి రాశి ఫలాలను ముద్రించి మనుషుల జీవితాలలో సంభవించబోయే వాటిని గురించి విచ్చలవిడి రాతలు రాస్తున్నాయి.

కొంతమంది అజ్ఞానులు, బలహీన విశ్వాసులు జ్యోతిష్కుల వద్దకు వెళుతుంటారు. వారు తమ జీవితాలలో యెదురు కానున్న సంఘటనలను గురించి, ముఖ్యంగా వివాహాది శుభకార్యాల గురించి దర్యాప్తు చేస్తుంటారు.

ఎవడయితే తనకు అగోచర జ్ఞానముందని అంటాడో, మరెవరయితే అలాంటి వారిని సత్యవంతులని ధృవీకరిస్తాడో అతను ముష్రిక్కు, కాఫిర్‌ అవుతాడు. ఎందుకంటే వాడు అల్లాహ్  యొక్క ప్రత్యేక గుణాలలో తనకు భాగస్వామ్యం ఉందని దావా చేస్తున్నాడు. నిజానికి నక్షత్రాలు అల్లాహ్ కు సంపూర్ణ విధేయతను ప్రకటించే సృష్టితాలు. వాటి అధీనంలో ఏ శక్తీ లేదు. ఒకరి భాగ్యాన్నిగానీ, దరిద్రాన్ని గానీ శాసించే అధికారం వాటికి లేదు. జీవన్మరణాలతో కూడా వాటికి ఎలాంటి సంబంధం లేదు. ఇవన్నీ పైశాచిక చేష్టలు. ఆకాశాలలో దొంగచాటుగా విన్న విషయాలను అవి చేరవేస్తుంటాయి.


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది (పేజీలు 120 – 121)

సోదరులారా! ఇలాంటి స్థలం (సమాధి) కోసం సన్నాహాలు చేసుకోండి!

బిస్మిల్లాహ్

grave

పచ్చని ప్రపంచంలో భోగభాగ్యాలతో కూడిన జీవితం గడుపుతున్నవారలారా! తియ్యటి, మధురమైన ప్రపంచపు సుఖాలు అనుభవిస్తున్న వారలారా! రంగు రంగుల మనోహర ప్రపంచపు ఎండమావుల్లో తచ్చాడుతున్నవారలారా! అందమైన ప్రపంచ అందచందాల ఆహూతుల్లారా! శాశ్వతలోకాన్ని విడిచిపెట్టి క్షణభంగుర లోకం కోసం వెంపర్లాడుతున్న వారలారా!

అతి త్వరలోనే మనం ఓ దుర్భేద్యమైన కనుమ… మరణం… గుండా వెళ్ళి ఒక సుదీర్గమైన అత్యంత ప్రమాదకరమైన లోయ గుండా ప్రయాణించబోతున్నాం.

ఈ ప్రమాదకర లోయలో రేచీకటి లాంటి అంధకారం ఉంటుంది. సూర్య కిరణాలు ఉండవు, చంద్రుని వెన్నెల ఉండదు, నక్షత్రాల కాంతి ఉండదు, దీపాల వెలుతురూ ఉండదు, ఆఖరికి మిణుగురు పురుగుల మిణుకు కూడా కనిపించదు.

ఈ ప్రమాదకరలోయ భయంకర అడవిలాగా నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడ తల్లిదండ్రులు ఉండరు, భార్యా పిల్లలు ఉండరు, దుఃఖాల్లో పాలుపంచుకునేవాడు, దుఃఖాన్ని ఓదార్చేవాడు ఎవడూ ఉండడు. పీర్లు, ముర్షిద్‌లు ఉండరు. ఆపదలు తొలగించేవాడు, అవసరాలు తీర్చేవాడు, అంగరక్షకులు, బాడీగార్డులు ఎవరూ ఉండరు. పార్టీలు, పార్టీ నాయకులూ ఉండరు. అధ్యక్షత, మంత్రిత్వం లాంటి ఉన్నత పదవుల పలుకుబడులూ ఉండవు. సెనెట్‌, అసెంబ్లీల డాబు దర్పాలూ ఉండవు, కోర్టు బోనుల కోలాహలం ఉండదు. పోలీసు పదవీ పందేరాల గర్వమూ ఉండదు. సైనిక సత్కారాలు, నక్షత్రాల వైభవాలూ ఉండవు. ప్రభుత్వ ఉన్నత పదవుల హంగామా ఉండదు. విశాల జాగీరుల ప్రభుత్వం ఉండదు. కబ్జా దారుల ఆక్రమణ హస్తాలు ఉండవు. కిరాయి హంతకుల ఉగ్రవాద చర్యలు ఉండవు. రికమండేషను చేయటానికి బాబాయి మామయ్యలు ఉండరు. లంచం ఇవ్వటానికి అధర్మ సొమ్ము చెలామణి ఉండదు.

ఈ ప్రమాదకర లోయలో భయంకర క్రూరమృగాల భయం ఉంటుంది.

మట్టి ఇల్లు, మట్టి పాన్పు, మట్టి పడక ఉంటాయి. భయాందోళనలు కలుగుతుంటాయి. పురుగులు పాములు ఉంటాయి. విషపూరితమైన సర్పాలు, తేళ్లు ఉంటాయి. గుడ్డి, చెవిటి దూతలు గదలతో నించొని ఉంటారు. అక్కడి నుంచి పారిపోవటానికీ అవకాశం ఉండదు. నిలకడగా నించోవటానికీ వీలు పడదు!

అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను విశ్వసించిన వారలారా!

శుభ వార్తాహరుడుగా, హెచ్చరికలు చేసేవాడిగా పంపబడిన దైవప్రవక్త… ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి మాట కాస్త జాగ్రత్తగా వినండి!

“నేను సమాధికంటే తీవ్ర భయాందోళనకరమైన చోటు మరొకటి చూడలేదు.” (తిర్మిజీ)

ఓ బుద్దీ జ్ఞానాలు కలవారలారా!

మనోమస్తిష్కాలు కలవారలారా!

ఒంటరితనం, అంధకారం, ప్రమాదకరమైన నిర్మానుష్య లోయలోకి అడుగు పెట్టబోతున్న వారలారా!

వినండి! నిరాధార, నిస్సహాయ ప్రమాదకర ఈ లోయ ప్రయాణంలో విశ్వాసం మరియు సత్కర్మలు.. నమాజ్‌, జకాత్‌, ఉపవాసాలు, హజ్‌, ఉమ్రా, ఖుర్‌ఆన్‌ పారాయణం, దుఆలు సంకీర్తనలు, దానధర్మాలు, నఫిల్‌ సత్కార్యాలు, తల్లిదండ్రులపట్ల విధేయత, బంధువులతో సత్సంబంధాలు, అనాథులు, వితంతువుల పట్ల సత్ప్రవర్తన, న్యాయం, ధర్మం, మంచిని గురించి ప్రబోధించటం, చెడుల నుంచి నిరోధించటం మొదలగు సత్కర్మలే ప్రయాణ సామగ్రి. ఇవి భయాందోళనలు దూరం చేస్తాయి, వెలుతురునూ ప్రసాదిస్తాయి. ఇవి చేసుకుంటే ఒంటరితనమూ ఉండదు. ప్రాణానికి హాయిగానూ ఉంటుంది.

కనుక ప్రమాదకర లోయ ప్రయాణీకుల్లారా!

బయలుదేరేముందు మానవ మహోపకారి, దయామయుడు, అతి గొప్ప శ్రేయోభిలాషి అందరికంటే పెద్ద సానుభూతిపరుడు అయిన కారుణ్య ప్రవక్త  హితవును ఒకసారి శ్రద్ధగా వినండి…!

ఒకసారి ఆయన ఈ ప్రమాదకర లోయ అంచున కూర్చొని విలపించసాగారు. ఆయన సమాధి మట్టి సయితం తడిచిపోయింది. ఆ సందర్భంలో ఆయన తన అనుచరులను ఉద్దేశించి ఇలా అన్నారు:

“సోదరులారా! ఇలాంటి ప్రదేశం (సమాధి) కోసం సన్నాహాలు చేసుకోండి” (ఇబ్నెమాజా),

మరి మనలో కారుణ్య ప్రవక్త మాట విని…

ఆయన పిలుపుకు హాజరు పలికి…

ఈ అపాయకరమైన లోయ గుండా ప్రయాణించటం కోసం సన్నాహాలు చేసుకునేవారెవరండీ?!

వసల్లల్లాహు అలా నబియ్యినా ముహమ్మదిం వ్వ ఆలిహీ వ సహ్‌బిహీ అజ్‌మయీన్‌.


ఇది క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:

“సమాధి సంగతులు” [పుస్తకం] పరిచయ వాక్యాలు
కూర్పు : మౌలానా ముహమ్మద్‌ ఇఖ్‌బాల్‌ కైలానీ 
ప్రకాశకులు : హదీస్‌ పబ్లికేషన్స్‌. హైద్రాబాద్‌, ఏ.పి. ఇండియా

మృతులు (చనిపోయిన వారు) వింటారా? [ఆడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (51:35 నిముషాలు)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇతరములు: