ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ ‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ
ఖుత్బా అంశము: ఈదుల్ అద్హా (బక్రీద్)పండుగ –తెలుసుకోవలసిన విషయాలు
అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.
ఓ ముస్లిం లారా! ఒక గొప్ప దినము మనపై రాబోతున్నది. నిశ్చయంగా అది శుభకరమైనటువంటి ఖుర్బాని దినము. ఇది ఇస్లాం యొక్క గొప్ప విధి నెరవేర్చిన అనంతరం వస్తుంది. అనగా హజ్ తర్వాత వచ్చే పండుగ. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఈ విధంగా తెలియజేశారు: “అల్లాహ్ తఆలా దగ్గర అత్యంత ఘనత కలిగినటువంటి దినము – ఖుర్బానీ (నహ్ర్) దినము“. అనగా; జిల్ హిజ్జా మాసం యొక్క పదవరోజు. ఆ తరువాత يَوْمُ الْقَرَّ “ఖర్ర్ దినము” (స్థిరపడి ఉండే రోజు) అనగా; జిల్ హిజ్జ మాసం యొక్క పదకొండవ రోజు. ఈ రోజున హజ్ చేసే వారందరూ మినా ప్రదేశంలో ఆగుతారు.
1. ఈ ఖుర్బానీ పండుగ రోజుకు ఇతర దినాలపై ప్రాధాన్యతను ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే; హజ్ కు సంబంధించినటువంటి ఎక్కువ ఆచరణలు ఇదే రోజున పాటించబడతాయి, ఉదాహరణకు; హజ్ చేసేవారు ఆ రోజు జమ్రా ఉఖ్బా (పెద్దదాని)పై రాళ్లు కొట్టాలి, ఖుర్బానీ ఇవ్వాలి, శిరోముండన చేయాలి, తవాఫె ఇఫాదా చేయాలి, సయీ చేయాలి. మరియు హజ్ చేయనటువంటి వారు ఆ రోజున ఖుర్బానీ జంతువు బలి ఇస్తారు. ఈ ఆచరణలన్నీ అదే రోజు చేయబడతాయి. ఈ విధముగా ఆచరణలు అన్నీ ఏకం అయ్యే మరొక రోజు లేదు అందుకే ఆ రోజుకి ఇంత ప్రాధాన్యత లభించింది.
2. ఇస్లామీయ పండుగలకు వేరే ఇతర పండుగలపై ఇంత ప్రాధాన్యత లభించడానికి గల కారణం ఏమిటంటే; ఈ పండుగలు ఎంతో వివేకాన్ని మరియు గొప్ప లక్ష్యాలను తీసుకుని వస్తాయి. అందులో నుండి ముఖ్యంగా అల్లాహ్ యొక్క ఆచారాలను గౌరవించడం, మరియు విశ్వాసులకు సంతోషాన్ని కలుగ చేయడం. ఇస్లాం యొక్క అనుయాయులు ఈ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విధి విధానాలు, సౌలభ్యాలు గురించి ప్రజలకు తెలియపరచాలి.
అరఫా దినము (తొమ్మిదవ జిల్ హిజ్జా), ఖుర్బానీ దినం (పదవ జిల్ హిజ్జా), ఆ తరువాత “తష్ రీఖ్” దినాలు ఇస్లామియా పండుగ దినములు తిని త్రాగేటువంటి దినాలు (అబూ దావూద్)
3. ఓ విశ్వాసులారా! ఆ రోజు ఒక విశ్వాసి అల్లాహ్ యొక్క సామీప్యం పొందాలంటే దాని కొరకు అల్లాహ్ మార్గంలో ఖుర్బానీ ఇవ్వాలి. ఇది అల్లాహ్ యొక్క “ఖలీల్” స్నేహితులైనటువంటి ఇబ్రహీం మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సున్నత్ విధానము.
4. ఖుర్బానీ చేయడానికి కొన్ని మర్యాదలు మరికొన్ని పద్ధతులు ఉన్నాయి ఉదాహరణకు; జంతువుని ఖిబ్లా వైపు తిప్పి జుబహ్ చేయాలి, మరియు దానిపై అల్లాహ్ నామాన్ని పఠించాలి. ఈ విధంగా అనాలి:
اللهم هذا منك ولك، اللهم هذا عني وعن أهل بيتي، اللهم تقبل مني అల్లాహుమ్మ హాజా మిన్ క వలక్, అల్లాహుమ్మ హాజా అన్నీ వ అన్ అహ్ల్ బైతీ, అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్నీ (ఓ అల్లాహ్! ఖుర్బానీ చేయు భాగ్యం నీవే ప్రసాదించావు. ఇది నీ కొరకే ఖుర్బానీ చేయుచున్నాము. ఓ అల్లాహ్! నా వైపు నుండి మరియు నా కుటుంబం వైపు నుండి దీనిని స్వీకరించు)
5. ఖుర్బానీ ఇచ్చే వారు స్తోమత ఉంటే స్వయంగా జంతువుని జుబహ్ చేయాలి. దాని విధానం – నిర్ణీత స్థలం అంటే గొంతును కోయాలి; రక్తం వేగంగా ప్రవహించే రెండు రక్త నరాలు కోయాలి, ఇంకా శ్వాస నాళం మరియు ఆహారనాళం కోయాలి.
6. ఎవరైనా తన ఖుర్బానీ జంతువును వధించే బాధ్యతను మరొక వ్యక్తికి అప్పగిస్తే, దానిని వధించే వ్యక్తి అతని తరపున ఈ దువాను పఠించాలి:
اللهم هذا منك ولك، اللهم هذا عن فلان ، اللهم تقبل منه అల్లాహుమ్మ హాజా మిన్ క వలక్, అల్లాహుమ్మ హాజా అన్ ఫులాన్, అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్ హు (ఓ అల్లాహ్! ఖుర్బానీ చేయు భాగ్యం నీవే ప్రసాదించావు, ఇది నీ కొరకే ఖుర్బానీ చేయుచున్నాము, ఓ అల్లాహ్! ఇది ఫలానా (పేరు పలకాలి) వ్యక్తి తరుపు నుండి దీనిని స్వీకరించు).
7. కత్తిని లేక చాకుని ఖుర్బానీ జంతువు నుండి దాచి ఉంచాలి. దాని ముందు పదును పెట్టరాదు, మరియు ఇతర జంతువుల ముందు దానిని జబహ్ చేయరాదు. ఇందులో మనం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సూక్తిని అనుసరించాలి: అల్లాహ్ తఆలా ప్రతి దానిపట్ల ఉన్నతంగా వ్యవహరించాలని ఆజ్ఞాపించాడు. కాబట్టి మీరు దేనినైనా వధించ వలసి వచ్చినప్పుడు దానిని ఉన్నతంగా వధించండి మరియు తమ ఆయుధానికి బాగా పొద్దున పెట్టండి .ఎందుకంటే వధించబడే జంతువును బాధించరాదు. (ముస్లిం)
8. ఖుర్బానీ ఇచ్చేటువంటి సమయం నాలుగు రోజుల వరకు ఉంటుంది. పండుగ రోజు ఆ తర్వాత మూడు “తష్ రీఖ్” దినాలు. ఇందులో మొదటి రోజు ఖుర్బానీ ఇవ్వడం ఉత్తమం. ఎందుకంటే ఇది జిల్ హిజ్జా మాసం యొక్క మొదటి పది రోజులలో ఉంది.
9. మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు కొమ్ములు తిరిగిన తెల్లని రెండు పొట్టేళ్లను ఖుర్బానీగా ఇచ్చారు. మరియు ఎలాంటి జంతువుని ఖుర్బాని చేయకూడదో అది కూడా తెలియజేశారు. ఒంటి కన్ను కలిగిన దానిని ,రోగం ఉన్నట్లు స్పష్టంగా ఉన్న దానిని, కుంటిది, ఎముకల్లో సత్తువ లేని ముసలిది.(అహ్మద్)
10. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు పండగ రోజున ఖుర్బానీ మాంసం తోనే భోజనాన్ని ప్రారంభించే వారు.
11. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి కాలంలో ప్రజలు ఖుర్బానీ ఇవ్వడంలో ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు, మరియు ఉన్నవాటిలో అన్నింటికంటే మంచి జీవాలను కొనుగోలు చేసేవారు, ఎందుకంటే ఎంత దృఢంగా ఆరోగ్యంగా ఉంటే అది అల్లాహ్ వద్ద అంతే ప్రియమైనదిగా పరిగణించబడుతుంది, మరియు దాని ద్వారా ఖుర్బానీ చేసే వ్యక్తికి కూడా అంతే ప్రతిఫలం లభిస్తుంది. ఇమామ్ ఇబ్నే తైమియా (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేశారు: “సాదారణంగా ఖుర్బానీ యొక్క పుణ్యఫలం దాని ఖరీదును బట్టి ఉంటుంది”. (అల్ ఫతావా)
12. అల్లాహ్ దాసులారా! ఖుర్బాని జీవం పై ఖర్చు పెట్టడంలో ఎలాంటి పరిమితి లేదు. దాని మాంసం తినవచ్చు, ప్రయాణంలో తీసుకు వెళ్లొచ్చు ,మరియు పేదలలో పంచి పెట్టవచ్చు. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:
فَكُلُوا مِنْهَا وَأَطْعِمُوا الْقَانِعَ وَالْمُعْتَرَّ “వాటిని (మీరూ) తినండి, అడగని అభాగ్యులకు, అడిగే అగత్యపరులకు కూడా తినిపించండి” (సూరా అల్ హజ్ 22:36)
హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియచేశారు: (తినండి తినిపించండి మరియు దాచుకోండి) (ముస్లిం)
13. జంతువును జూబహ్ చేసిన తర్వాత, దానిలోని ఏ భాగాన్ని కానీ, మాంసాన్ని గానీ, చర్మాన్ని గానీ, మరేదైనా అమ్మడానికి అనుమతి లేదు.
14. అవిశ్వాసుల హృదయాలు ఇస్లాం వైపు మొగ్గడానికి వారికి ఖుర్బానీ మాంసాన్ని ఇవ్వచ్చు.
15. ఖుర్బానీ మాంసాన్ని కసాయి వానికి కూలీగా ఇవ్వరాదు. ఎందుకంటే ధర్మం దీనికి అంగీకరించలేదు. కనుక అతనికి కూలీగా డబ్బులు మాత్రమె ఇవ్వాలి.
16. ఓ అల్లాహ్ దాసులారా! ఈ గొప్ప పండుగ తర్వాత ఘనత కలిగినటువంటి దినాలు కూడా వస్తాయి. వాటిని “తష్రీఖ్” దినాలు అంటారు ఆ దినములలో అతి ఎక్కువగా” జిక్ర్ “స్మరణ చేయమని అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు:
وَاذْكُرُوا اللَّهَ فِي أَيَّامٍ مَّعْدُودَاتٍ (గణించదగిన ఆ దినాలలో (తష్రీఖ్ దినాలలో) అల్లాహ్‌ను స్మరించండి.) (సూరా అల్ బఖర 2:203)
ఈద్ రోజులలో చేయవలసిన ముఖ్యమైన ఆచరణ ఇక్కడ తెలపడం జరుగుతుంది: “తష్రీఖ్” యొక్క మూడు రోజులలో అన్ని సమయాలలో సంపూర్ణ తక్బీర్ పటించాలి. మరియు మూడవరోజు మగ్రిబ్ నమాజ్ వరకు తక్బీర్ చదువుతూ ఉండాలి. అలాగే “తష్రీఖ్” యొక్క మూడవ రోజున అసర్ వరకు రోజువారీ ప్రార్థనలలో ఐదు పూటల ఈ విధంగా తక్బీర్ పటించాలి:
(అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లాల్లాహ్, వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్) ఇందులో అల్లాహు అక్బర్ రెండుసార్లు లేదా మూడుసార్లు పటించవచ్చు
17. తష్రీఖ్” దినాలు వాస్తవానికి తిని త్రాగే మరియు అల్లాహ్ స్మరించుకునే రోజులు. ఈ రోజులలో ఉపవాసం ఉండడం అనుమతించబడలేదు, ఎందుకంటే అవి పండుగ రోజులు.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియజేశారు: “తష్రీఖ్” దినాలు తిని త్రాగేటువంటి రోజులు”. మరో హదీసులో ఉంది: “అల్లాహ్ ను స్మరించే రోజులు”.
18. ఈద్ గొప్ప ప్రయోజనాల్లో ఒకటి: ముస్లింల మధ్య సంబంధాన్ని నెలకొల్పడం, ఒకరినొకరు కలిసే సద్భావం కలిగి ఉండటం. హృదయాలలో సాన్నిహిత్యాన్ని ఏర్పరచుకోవడం, భయం మరియు పేదరికాన్ని తొలగించడం, మరియు ద్వేషం మరియు అసూయలను నివారించడం, మరియు హృదయాలలో రగులుతున్న అసూయ అనే అగ్నిని ఆర్పడం. ఈద్ ప్రార్థనను నిర్వహించడానికి ముస్లింలను ఒకే చోట సమీకరించగల ఇస్లాం యొక్క సామర్ధ్యం మనకు కనిపిస్తుంది. అంతేకాదు భక్తి ప్రాతిపదికన వారిని సత్యం పై స్థిరంగా వారి హృదయాలను మార్గనిర్దేశం చేస్తుందనడానికి సంకేతం.
నౌమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియజేశారు: “విశ్వాసుల ఉదాహరణ కరుణపరంగా, ఐక్యత పరంగా, ప్రేమ పరంగా ఒక శరీరం లాంటిది. కనుక శరీరంలో ఏదైనా భాగంలో నొప్పి కలిగితే దాని ద్వారా జ్వరం వస్తుంది. అప్పుడు శరీరంలో ఉన్న అవయవాలన్ని ఒకదానికి ఒకటి సహకరించుకుంటాయి”. (ముస్లిం)
పండగ రోజున చేసేటువంటి మరొక అభిలషనీయమైన పని ఏమిటంటే; ఆ రోజున బంధుత్వాలను కలుపుకోవాలి. ఎందుకంటే అల్లాహ్ తన దాసుడిపై దీనిని విధిగా చేశాడు. ముఖ్యంగా శుభ సందర్భాలలో కాబట్టి ఎవరైతే బంధుత్వాలను కలుపుకుంటారో అల్లాహ్ తఆల అతనికి దగ్గరవుతాడు, మరి ఎవరైతే బంధుత్వాన్ని తెంచుకుంటారో అలాంటి వారిని అల్లాహ్ తన కారుణ్యం నుండి దూరం చేస్తాడు,
అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఎలా తెలియజేశారు అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు: “నేను కరుణామయుడును నేనే బంధుత్వాన్ని పుట్టించాను. మరియు దాని పేరును నా పేరుతో జోడించాను. కాబట్టి ఎవరైతే నీతో సంబంధం పెట్టుకుంటాడో అతనితో నేను సంబంధం పెట్టుకుంటాను, మరియు ఎవరైతే త్రేగదెంపులు చేసుకుంటాడో అతనితో నేను త్రేగదెంపులు చేసుకుంటాను“. (ముస్లిం)
ఓ అల్లాహ్ దాసులారా! కనుక ఎవరైతే తమ బంధువులతో స్నేహితులతో పోట్లాట కారణంగా విడిపోయారో వారు మన్నింపుల వైఖరిని అవలంబించండి. ఎందుకంటే అల్లాహ్ ఇలా అంటున్నాడు:
فَمَنْ عَفَا وَأَصْلَحَ فَأَجْرُهُ عَلَى اللَّهِ కాని ఎవరయినా (ప్రత్యర్థిని) క్షమించి, సయోధ్యకు వస్తే అతనికి పుణ్య ఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్‌ది. ( సూరా ఆష్ షూరా 42:40)
మరొకచోట ఇలా అంటున్నాడు:
إِنَّمَا الْمُؤْمِنُونَ إِخْوَةٌ فَأَصْلِحُوا بَيْنَ أَخَوَيْكُمْ విశ్వాసులు (ముస్లింలు) అన్నదమ్ములు (అన్న సంగతిని మరువకండి). కనుక మీ అన్నదమ్ముల మధ్య సర్దుబాటుకు ప్రయత్నించండి. (సూరా అల్ హుజురాత్ 49:10)
19. ఓ అల్లాహ్ దాసులారా పండుగ శుభాకాంక్షలు తెలుపడం ఒక మంచి పని. ఇబ్నె తైమియా (రహిమహుల్లాహ్) ఇలా తెలియ చేస్తున్నారు: పండుగ నమాజ్ తరువాత ఒకరికి ఒకరు పండుగ శుభాకాంక్షలు (تقبل الله منا ومنكم، وأحاله الله عليك) తెలుపుకునే విధానం కొందరి సహాబాల ద్వారా మనకు తెలుస్తుంది. మరియు కొంత మంది ధర్మ పండితులు కూడా దీనిని సమ్మతించారు. (అల్ ఫతావా)
20. అల్లాహ్ దాసులారా! అల్లాహ్ యొక్క అనుగ్రహాలకు వ్యతిరేకంగా చట్ట విరుద్ధమైన నిషేధించబడిన విషయాలకు పాల్పడితే దానికి బదులుగా అల్లాహ్ యొక్క శిక్ష వచ్చి పడుతుంది అని భయపడండి.
చివరిగా నేను, నా కోసం మరియు మీ కోసం పాప క్షమాపణ కోసం అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నాను, ఖచ్చితంగా అతను క్షమించేవాడు మరియు దయగలవాడు.
రెండవ ఖుత్బా
స్తోత్రం మరియు దరూద్ తరువాత
ఓ విశ్వాసి స్త్రీలారా! అల్లాహ్ విశ్వాస మాతృమూర్తులకు ఆజ్ఞాపిస్తూ ఖురాన్ ఈ విధంగా అంటున్నాడు:
మీరు మీ ఇండ్లల్లోనే ఆగి ఉండండి. పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా మీ సింగారాన్ని చూపిస్తూ తిరగకండి. నమాజు చేస్తూ ఉండండి. జకాతు ఇస్తూ ఉండండి. అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతూ ఉండండి. (సూరా అల్ ఆహ్ జాబ్ 33:33)
అల్లాహ్‌ను తమ ప్రభువుగా, ఇస్లాంను తమ మతంగా మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ప్రవక్తగా అంగీకరించే ఓ ఇస్లాం మహిళ లా, తీర్పు దినం వరకు వారి అడుగుజాడల్లో నడిచే విశ్వాసుల తల్లులకు మరియు విశ్వాసులైన మహిళలకు ఈ దైవిక ఉపదేశం సాధారణంగా అందరికీ వర్తిస్తుంది, కాబట్టి అల్లాహ్ కు మరియు ప్రవక్త విధేయతకు కట్టుబడి ఉండాలి.
మానవులు మరియు జిన్నాతులు యొక్క చెడు విధానాల పట్ల తస్మాత్ జాగ్రత్త వహించాలి. నగ్నత్వం మరియు అశ్లీల ఉపద్రవం యొక్క ప్రలోభాలలో పడకండి. అల్లాహ్ ఇలా అంటున్నాడు;
وَلَا تَبَرَّجْنَ تَبَرُّجَ الْجَاهِلِيَّةِ الْأُولَىٰ పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా మీ సింగారాన్ని చూపిస్తూ తిరగకండి. (సూరా అల్ ఆహ్ జాబ్ 33:33)
భద్రతను, క్షేమాన్ని కోరుకునే స్త్రీ తనను తాను అవిస్వాసుల కార్యకలాపాలలో అనుసరించకూడదు, ఎందుకంటే వారిని అనుసరించడం వలన ఇది హృదయం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అప్పుడు మనలో కూడా ఆ అవలక్షణాలు చోటు చేసుకుంటాయి. అల్లాహ్ ఇలా అంటున్నాడు:
అల్లాహ్ మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాలని కోరుతున్నాడు. కాని, తమ మనోవాంఛలను అనుసరిస్తున్నవారు మాత్రం మీరు (దైవమార్గం నుంచి) పెడదారి తీసి చాలా దూరం వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. (సూరా అన్ నిసా 4:27)
మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు! అల్లాహ్ మీ అందరినీ ఎల్ల వేళలా సుఖ సౌఖ్యాలతో ఉంచుగాక. అందరి పై తన శుభాల వర్షాన్ని కురిపించు గాక. అందరి ఆరాధనలు స్వీకరించుగాక. పాపాలను మన్నించుగాక. అల్లాహ్ అందరి ధర్మ సమ్మతమైన కోరికలు తీర్చుగాక. సదా చరణ పై స్థిరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించు గాక!
చివరగా! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ పంపుతూ ఉండండి, ఎవరైతే ఒకసారి దరూద్ పంపుతారో అల్లాహ్ అతనిపై పది కారుణ్యాలు కురిపిస్తాడు.
اللهم صلِّ وسلِّم وبارك على عبدك ورسولك نبينا محمد، وعلى آله وصحبه أجمعين
—
ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ ‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ ‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ
ఖుత్బా అంశము: జిల్ హిజ్జా నెల పది రోజుల ప్రత్యేకతలు మరియు ఘనత
అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.
ఓ ముస్లింలారా! అల్లాహ్ దైవభీతిని కలిగి ఉండండి. ఎల్లవేళలా మనసులో ఆయన భయాన్ని సజీవంగా ఉంచండి. ఆయనకు విధేయత చూపండి. అవిధేయత నుండి జాగ్రత్త వహించండి. తెలుసుకోండి అల్లాహ్ తన సృష్టి రాశులలో కొన్నింటికి కొన్నింటిపై ప్రాధాన్యతను ఇచ్చాడు అవి మనుషులైనా, ప్రదేశమైనా, సమయమైనా లేదా ఏదైనా ఆరాధనైనా. దీని వెనుక వివేకాత్మకమైనటువంటి నిర్ణయం ఉంటుంది ఇది కేవలం అల్లాహ్ కి మాత్రమే తెలుసు! అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:
(وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَاءُ وَيَخْتَارُ مَا كَانَ لَهُمُ الْخِيَرَةُ) నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు. వారిలో ఎవరికీ ఎటువంటి అధికారం లేదు.
మనం ఈ ఉపన్యాసంలో జిల్ హిజ్జా మాసం యొక్క మొదటి పది దినాలకు ఉన్నటువంటి గొప్పదనం మరియు ప్రత్యేకతలను గురించి తెలుసుకుందాం!
మొదటి ప్రత్యేకత: ఏమిటంటే అల్లాహ్ తఆలా ఈ దినముల గురించి ప్రత్యేకంగా ఖురాన్ లో తెలియజేశాడు అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:
వారు తమ ప్రయోజనాలు పొందటానికి రావాలి. అల్లాహ్ తమకు ప్రసాదించిన తమ పెంపుడు పశువుల మీద ఆ నిర్ణీత దినాలలో అల్లాహ్ నామాన్ని స్మరించాలి (ఉచ్చరించాలి).
ఈ వాక్యంలో ఉన్న నిర్ణీత దినాలు అనగా జిల్ హిజ్జా మాసం యొక్క పది దినాలు. ఇబ్నే అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేశారు: “నిర్ణిత దినాలు అనగా జిల్ హిజ్జా మాసం యొక్క మొదటి పది దినాలు”
జిల్ హిజ్జా మాసం యొక్క మొదటి పది దినాలు ఘనత కలిగినటువంటివి అనడానికి మరొక ఆధారం ఏమిటంటే అల్లాహ్ తఆలా వాటి రాత్రుల యొక్క ప్రస్తావన చేస్తూ ఇలా అంటున్నాడు:
وَالْفَجْرِ وَلَيَالٍ عَشْرٍ ఉషోదయం సాక్షిగా! పది రాత్రుల సాక్షిగా!
ఇబ్నే కసీర్ (రహిమహుల్లాహ్) ఈ వాక్యం యొక్క వివరణలో పది రాత్రుల యొక్క ప్రస్తావన చేసి ఇవి జిల్ హిజ్జా మాసపు మొదటి పది రోజులే అని తెలియజేశారు. ఇబ్నే అబ్బాస్, ఇబ్నే జుబైర్, ముజాహిద్ మరియు ఇతర పండితుల యొక్క అభిప్రాయం కూడా ఇదే.
జిల్ హిజ్జా మాసం యొక్క పది రోజుల శ్రేష్టతకు గల మరో కారణం ఏమిటంటే ఆ దినాలలో చేసేటువంటి ఆచరణ పుణ్యఫలం రీత్యా సంవత్సరంలోని ఇతర రోజులు కంటే ఎక్కువగా ఉంటుంది హజ్రత్ ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:
జిల్ హిజ్జా మాసపు తొలి పదిరోజుల్లో చేయబడిన సత్కార్యాల కన్నా ఇతర దినాల్లో చేసిన సత్కార్యాలేవీ అల్లాహ్ దృష్టిలో అత్యంత ప్రియమైనవి కావు. అది విని సహచరులు సందేహ పడుతూ, “దైవప్రవక్తా! అల్లాహ్ మార్గంలో చేయబడే పోరాటం కూడా (దాని కన్నా ప్రియమైనది) కాదా?” అని అడిగారు. దానికి సమాధానమిస్తూ, “అల్లాహ్ మార్గంలో చేయబడిన పోరాటం కూడా (ప్రియమైనది) కాదు. ఒకవేళ ఎవరయినా ధన ప్రాణాలు సమేతంగా బయలుదేరి వాటిలో ఏదీ తిరిగిరాకపోతే (అంటే దైవమార్గంలో వీరమరణం పొందితే మాత్రం నిశ్చయంగా అతను శ్రేష్ఠుడే)” అని చెప్పారు. (బుఖారీ)
ఇబ్నే రజబ్ (రహిమహుల్లాహ్) ఈ హదీస్ యొక్క సారాంశాన్ని తెలియజేస్తూ ఇలా అంటున్నారు:
నిశ్చయంగా ఇది ఒక గొప్ప హదీస్. ఎందుకంటే ఏదైనా చిన్న ఆచరణ ఘనత కలిగినటువంటి సమయంలో చేయడం మూలంగా ఆ సమయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత రీత్యా ఆచరణ యొక్క ఘనత కూడా పెరుగుతుంది, అదే విధంగా జిల్ హిజ్జా యొక్క మొదటి పది రోజులలో చేసేటువంటి ఆచరణలు ఇతర దినాలలో చేసేటువంటి ఆచరణలు కంటే గొప్పవిగా పేర్కొనడం జరిగింది. అయితే అందులో కేవలం జిహాద్ కు మాత్రమే మినహాయింపు ఇవ్వబడింది అది కూడా ధన మన ప్రాణాలతో బయలుదేరి మళ్లీ తిరిగి రాకపోవడం.
అనగా ఈ హదీస్ ద్వారా వెలువడేటువంటి మరొక విషయం ఏమిటంటే జిల్ హిజ్జా యొక్క మొదటి దినాలలో చదివే నఫిల్ రంజాన్ యొక్క చివరి భాగంలో చదివే నఫీల్ కంటే ఉత్తమమైనవి. అదేవిధంగా జిల్ హిజ్జా యొక్క పది రోజులలో చేయబడే ఫరజ్ లు ఇతర దినాలలో చేయబడే ఫరజ్ ల కంటే గొప్పవి.
జిల్ హిజ్జా యొక్క పది దినాల యొక్క శ్రేష్టతకు గల మరొక కారణం: ఈ పది దినాలలో అరఫా దినము కూడా ఉంది. అల్లాహ్ తఆలా తన ధర్మాన్ని పరిపూర్ణంగావించిన రోజు మరియు ఈ వాక్యం అవతరణ కూడా జరిగింది:
الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీ పై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను
జిల్ హిజ్జా యొక్క పది దినాల యొక్క శ్రేష్టతకు గల మరొక కారణం: ఈ పది దినాలలో ఖుర్బాని దినం కూడా ఉంది. ఈ ఈ దినమునే పెద్ద హజ్ అని కూడా అంటారు. ఈ రోజున ఎన్నో ఆరాధనలు ఏకమవుతాయి. ఖుర్బానీ, తవాఫ్ కాబా (ప్రదక్షణ), సఫా, మర్వా కొండల మధ్య పరిగెత్తడం (సయీ చేయడం), శిరోముండనం, జమరాత్ (షైతాన్) కు రాళ్ళు విసరడం.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు హదీసులో ఇలా తెలియజేశారు: అల్లాహ్ తఆలా దగ్గర అత్యంత గొప్ప దినము ఖుర్బానీ దినము అనగా (జిల్ హిజ్జా మాసం పదవ దినం). ఆ తరువాత ఖుర్రా దినము, అనగా జిల్ హిజ్జా మాసం పదకొండవ దినము.(అబూ దావూద్). ఇక్కడ ఖుర్బానీ దినాన్ని ఖుర్రా దినముగా పేర్కొనడం జరిగింది దీనికి గల కారణం ఏమిటంటే ఆ రోజున హాజీలు మినా ప్రదేశంలో ఆగి ఉంటారు.
ఓ ముస్లిం లారా! ఈ పది దినాలలో చేసేటువంటి 6 గొప్ప ఆచరణలు ఉన్నాయి అవి:
1. అతి ఎక్కువగా అల్హందులిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ అని స్మరిస్తూ ఉండాలి అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియచేశారు: “అల్లాహ్ వద్ద ఈ పదిరోజుల్లో చేయబడిన సత్కార్యాల కన్నా ఇతర దినాల్లో చేసిన సత్కార్యాలేవీ అత్యంత ప్రియమైనవి కావు, కనుక ఈ పది రోజుల్లో లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్ అల్హందులిల్లాహ్ ను ఎక్కువగా స్మరిస్తూ ఉండండి” (అహ్మద్)
బుఖారి (రహిమహుల్లాహ్) వారు ఇలా అన్నారు: ఇబ్నే ఉమర్ మరియు అబూ హురైరా వారు ఈ పది దినాలలో బజారులోకి వెళ్లి అతి బిగ్గరగా తక్బీర్ పలికేవారు అది చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా వారితో పాటు తక్బీర్ పలికే వారు (బుఖారి)
తక్బీర్ ఇలా పలకాలి: (అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్)
కాబట్టి ఈ పది దినములలో అతి ఎక్కువగా అల్లాహ్ ని స్మరించడం ఉన్నతమైన ఆచరణగా తెలుపబడింది. ఇళ్లల్లో బజారుల్లో అల్లాహ్ స్మరణకు అనుమతించబడిన ప్రతి చోట ఈ విధంగా అల్లాహ్ ను స్మరించడం ఉత్తమం. దీని ద్వారా అల్లాహ్ యొక్క మహిమ ఆయన ఎంత గొప్పవాడో ప్రదర్శించబడుతుంది. మరియు వీటిని పఠించేటప్పుడు పురుషులు ఒకేసారి బిగ్గరగా పటించాలి. స్త్రీ ఎవరైనా ఉంటే ఆమె నెమ్మదిగా తక్బీర్ పట్టించాలి.
నేటి కాలంలో తక్బీర్ విధానాన్ని పూర్తిగా విడిచిపెట్టారు. చాలా కొద్ది మంది మాత్రమే దీనిపై ఆచరిస్తున్నారు కాబట్టి ఈ సున్నత్‌ను పునరుద్ధరించడానికి మరియు అజాగ్రత్తగా ఉన్నవారిని అప్రమత్తం చేయడానికి, తక్బీర్‌ను ఇతరులకు వినిపించేలా బిగ్గరగా చదవాలి. ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా తక్బీర్ చదవాలి, సమిష్టిగా తక్బీర్ పఠించడానికి ధర్మంలో అనుమతి లేదు. ఇది ధర్మానికి విరుద్ధమైన చర్య.
2. జిల్ హిజ్జా మొదటి పది దినాలలో చేయవలసిన మరొక పని: ఉపవాసాలు పాటించడం. కాబట్టి ఈనెలలో తొమ్మిది రోజులు ఉపవాసాలు పాటించడం అభిలషణీయంగా పరిగణించబడింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు కూడా జిల్ హిజ్జా యొక్క తొమ్మిది దినాలు ఉపవాసం పాటించేవారు.
హునైదా బిన్ ఖాలిద్ తన భార్య తో ఉల్లేఖిస్తున్నారు మరియు ఆమె ప్రవక్త గారి కొందరి సతీమణులతో ఉల్లేఖించారు: మహా ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం వారు జిల్ హిజ్జా మాసం యొక్క తొమ్మిది ఉపవాసాలు, ఆషురా ఉపవాసం, మరియు ప్రతి నెల మూడు ఉపవాసాలు, సోమ మరియు గురువారం ఉపవాసాలను పాటించేవారు. (అబూ దావూద్)
అబూ ఉమామ అల్ బాహిలి (రదియల్లాహు అన్హు) గారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని ఈ విధంగా ప్రశ్నించారు: ఓ మహా ప్రవక్తా! అల్లాహ్ నాకు లాభం చేకూర్చడానికి ఏదైనా ఆచరణ గురించి తెలియజేయండి. అప్పుడు ప్రవక్త వారు ఇలా సమాధానం ఇచ్చారు; “నువ్వు ఉపవాసం పాటించు ఎందుకంటే దానికి తగిన ఆచరణ మరొకటి లేదు“. (నసాయి)
3. ఈ పది దినములలో చేసేటువంటి ఆచరణలలో మరొకటి: అరఫా ఉపవాసం పాటించాలి. దీని ఆధారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని అరఫా నాటి ఉపవాసం గురించి విచారించడం జరిగింది. అందుకాయన సమాధానమిస్తూ “అది క్రితం యేడు మరియు వచ్చే యేటి పాపాలన్నింటినీ తుడిచి పెట్టేస్తుంది” అని వివరించారు. (ముస్లిం)
4. ఈ పది రోజులలో చేసే మరో ఆచరణ (ఈద్ నమాజ్) ప్రార్థన కూడా ఇది ప్రసిద్ధి చెందినది.
5. ఈ పది రోజులలో చేసేటువంటి మరో ఆచరణ: ఖుర్బానీ ఇవ్వడం. ఇది స్తోమత కలిగినటువంటి వారిపై తప్పనిసరి అవుతుంది. పండుగ రోజున ఖుర్బానీ ఇవ్వడం “తష్ రీఖ్” దినాలలో ఖుర్బానీ ఇవ్వడం కంటే ఉత్తమం, ఎందుకంటే పండుగ రోజు పది రోజులలో చివరి రోజు, మరియు ఈ పది రోజులు అన్నింటికంటే ఉత్తమమైన రోజు మరియు “తష్ రీఖ్” దినాలు ఈ పది రోజులలో చేర్చబడలేదు. కనుక పండుగ రోజు ఖుర్బానీ ఇవ్వడం సదాచరణలో త్వరపడడాన్ని సూచిస్తుంది. (తస్హీలుల్ ఫిఖ్హ్ )
6. జిల్ హిజ్జా మాసం యొక్క మొదటి పది రోజులలో చేయవలసిన మరొక ఆచరణ: హజ్ మరియు ఉమ్రా చేయడం.
ఇవి ఈ పది రోజులలో చేసేటువంటి అత్యుత్తమ కార్యాలు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు చూపించినటువంటి విధానం ప్రకారం హజ్ నెరవేర్చాలి మరియు అందులో వారించబడినటువంటి విషయాలకు దూరంగా ఉండాలి. అనగా అపసవ్యమైన చేష్టలకు, వ్యర్థ విషయాలకు, పోట్లాటలకు దూరంగా ఉంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు చేసినటువంటి వాగ్దానం ప్రకారం పుణ్యఫలం ప్రాప్తం అవుతుంది. అనగా ఆమోదముద్ర పడిన హజ్ ప్రతిఫలం స్వర్గము. (బుఖారి,ముస్లిం)
ఓ అల్లాహ్ దాసులారా! ఇవి ఆరు ఆచరణలు జిల్ హిజ్జా మాసం మొదటి పది దినములలో చేయవలసిన పది ఆచరణలు. ఈ ఆరాధనలు సంవత్సరం మొత్తంలో కంటే ఈ పది రోజులకు మాత్రమే ప్రత్యేకించబడ్డాయి. అందుకే ఈ పది రోజులు ఔన్నత్యం రీత్యా ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. మరియు మూల ఆరాధనలు అన్నీ కూడా ఇందులో మమేకమయ్యాయి ఉదాహరణకు నమాజ్, రోజా, సదఖా మరియు హజ్.
ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ప్రజలు రంజాన్ యొక్క చివరి భాగంలో అతి ఎక్కువగా కార్యాచరణను మరియు ఆరాధన లో పాల్గొంటారు. కానీ వాస్తవంగా జిల్ హిజ్జ మాసం యొక్క మొదటి పది దినాలు వాటికంటే ఎంతో ప్రాధాన్యత గలవి కనుక అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో ఈ దినాలలో ఆరాధన చేయాలి.
తాబయీ లలో గొప్ప వ్యక్తి అయిన సయీద్ బిన్ జుబైర్ (రహిమహుల్లాహ్) జిల్ హిజ్జా యొక్క పది రోజులు వచ్చినప్పుడు,వారు తమ ప్రాణాలను పణంగా పెట్టేంత వరకు తీవ్ర ప్రయత్నంతో మరియు అంకితభావంతో ఆరాధన చేసేవారు. (ఫత్ హుల్ బారి)
మరియు ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు: జిల్ హిజ్జా యొక్క రాత్రులలో దీపాన్ని సైతం ఆర్పకండి. అనగా అతి ఎక్కువగా ఆ రాత్రిల్లో ఖురాన్ పారాయణం మరియు తహజ్జుద్ చదువుతూ ఉండండి.
కాబట్టి! మనం ఈ రోజుల్లో అల్లాహ్ యొక్క సహాయం కోరుతూ ఉండాలి మరియు అనేక మంచి పనులు చేస్తూ ఉండాలి. ఆచరించడంలో ఒకరినొకరు అధిగమించడానికి ప్రయత్నించాలి. మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నుండి ఈ ఆచరణల ప్రతిఫలం ఆశించాలి. ఎందుకంటే ఈ రోజు ఆచరించే అవకాశం ఉంది రేపు లెక్క తీసుకోబడే రోజు(తీర్పు దినం) అక్కడ మనకు ఆచరించడానికి అవకాశం లభించదు.
అల్లాహ్ ఖుర్ఆన్ యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింప చేయుగాక. ఆయన వివేకం తో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరిని క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాత్తాపం చెందే వారిని తప్పక మన్నిస్తాడు.
రెండవ ఖుత్బా
స్తోత్రం మరియు దరూద్ తరువాత
ఓ విశ్వాసులారా! జిల్ హిజ్జా యొక్క పది రోజులు రంజాన్ చివరి పది రోజుల కంటే గొప్పవని తెలుసుకోవాలి. మరియు ఈ రోజుల్లో ఎంతో శ్రమతో మరియు అంకితభావంతో ఆరాధన చేయాలి.
ఇబ్నే కసీర్ (రహిమహుల్లాహ్) ఈ విధంగా వ్రాశారు: ఈ పది రోజులు అన్ని రోజుల్లో కెల్లా హదీసుల్లో వీటి ఘనత గురించి తెలుపబడింది. మరియు చాలామంది ధార్మిక పండితులు కూడా ఈ రోజులను రంజాన్ యొక్క చివరి భాగంపై ప్రాధాన్యతను ఇచ్చారు. ఎందుకంటే రమజాన్ చివరి భాగంలో ఉన్న ఆరాధనలే ఈ దినాల్లో కూడా ఆచరించబడతాయి. నమాజ్, రోజా, సదఖా మొదలైనవి. కానీ జిల్ హిజ్జా పది దినాలకు గల ప్రత్యేకత ఏమిటంటే అందులో హజ్ ఆరాధన ఉంది.
మరొక వాక్యంలో ఇలా ఉంది: రమజాన్ యొక్క చివరి పది రోజులు ఘనత కలిగినటువంటివి ఎందుకంటే అందులో లైలతుల్ ఖాదర్ రాత్రి ఉంది అది 1000 నెలల కంటే ఉన్నతమైనది.
మరొక వర్గం వారు మధ్యస్తంగా ఇలా తెలియజేశారు: జిల్ హిజ్జా యొక్క మొదటి పది దినములు మరియు రంజాన్ యొక్క చివరి పది రాత్రులు ఎంతో ఘనత కలిగినటువంటివి. (అల్లాహ్ కు బాగా తెలుసు)
మరియు మీరు తెలుసుకోండి! అల్లాహ్ మిమ్మల్ని కరుణించుగాక! ఖుర్బానీ ఇచ్చేటువంటి వ్యక్తి వెంట్రుకలను గోళ్లను తీయడం నుండి వారించబడింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఈ విధంగా తెలియజేశారు: మీరు జిల్ హిజ్జా మాసం నెలవంకను చూడగానే ఖుర్బానీ యొక్క సంకల్పం గనుక ఉంటే మీరు మీ వెంట్రుకలను మరియు గోళ్ళ ను తీయకండి. (ముస్లిం).
మరొక హదీసులో ఇలా ఉంది: ఎవరైతే ఖుర్బానీ యొక్క సంకల్పం చేశారో వారు జిల్ హిజ్జ మాసం ప్రారంభం అవగానే వెంట్రుకలను మరియు చర్మాన్ని కత్తిరించరాడు. (ముస్లిం)
ఓ ముస్లిం లారా! ఇస్లాం యొక్క ధర్మశాస్త్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రజలకు ఇబ్బంది కలిగించే వాటిని దూరం చేస్తుంది. కనుక ఏ వ్యక్తి అయినా వెంట్రుకలు గోళ్లు మరియు చర్మాన్ని తీసేటువంటి అవసరం వస్తే తీసేయవచ్చు ఇబ్నే ఉసైమీన్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఎవరికైనా వెంట్రుకలు గోళ్ళు మరియు చర్మం కత్తిరించేటువంటి అవసరం వస్తే వాళ్లు వాటిని తీయొచ్చు. ఉదాహరణకు; ఏదైనా గాయం కారణంగా వెంట్రుకలు తీయాల్సి వచ్చింది లేక గోరు ఊడిపోయింది లేక చర్మం తెగి వేలాడుతూ ఉంది ఆ సందర్భంలో కత్తిరించవచ్చు, అయితే ఇందులో వారిపై ఎటువంటి తప్పు ఉండదు.
ఓ ముస్లిం లారా! అదేవిధంగా ఒక హజీ ఖుర్బానీ చేసే సంకల్పం చేయగానే అతను కూడా ఇదే ఆజ్ఞ పరిధిలోకి వస్తాడు. ఉమ్రా పూర్తి చేసే వరకు వెంట్రుకలు చర్మం కత్తిరించరాదు ఒకవేళ ఉమ్రా పూర్తి చేస్తే అతను తన వెంట్రుకలు తప్పక తీయాలి (అతను ఖుర్బానీ ఇచ్చే సంకల్పం చేసుకున్నప్పటికీ) ఎందుకంటే ఉమ్రా తర్వాత వెంట్రుకలు తీయడం ఆరాధనలో భాగం. ఇది ఇబ్నే బాజ్ మరియు ఇబ్నే ఉసైమీన్ వారి మాట.
మరియు ఇది కూడా తెలుసుకోండి. అల్లాహ్ ఆయనపై తన కారుణ్యాన్ని కురిపించు గాక! అల్లాహ్ మీకు ఒక గొప్ప విషయం గురించి తెలియచేశాడు అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించాడు.
(నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.)
ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు ప్రేమించు.
ఓ అల్లాహ్! ఇస్లాం ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్ ,ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాం కు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి. మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు.
ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రత ను ప్రసాదించు మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు,సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారీగా చేయి.
ఓ అల్లాహ్! మాకు జిల్ హిజ్జా మాసం యొక్క పది దినాలను ప్రసాదించు. మరియు వాటిలో ఉపవాసం పాటించి నీ కొరకు తహజ్జుద్ నమాజ్ చదివే భాగ్యాన్ని ప్రసాదించు!
ఓ అల్లాహ్! మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు.
ఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకం లో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు.
ఓ అల్లాహ్! మేము నీతో స్వర్గం గురించి ప్రాధేయ పడుతున్నాము మరియు ఆ స్వర్గం లోకి ప్రవేశించేటువంటి ఆచరణని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము. మరియు ఆ నరకం నుండి నీ శరణు వేడుకుంటున్నాము. మరియు నరకానికి దగ్గర చేసేటువంటి ప్రతి పని నుండి నీ శరణు కోరుకుంటున్నాము.
ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ ‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
11వ అధ్యాయం: అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు జిబహ్ చేసే చోట, అల్లాహ్ కొరకు జిబహ్ చేయరాదు
అల్లాహ్ ఆదేశం:
لَا تَقُمْ فِيهِ أَبَدًۭا “నీవు ఎన్నడూ అందులో నిలబడకు“. (9: తౌబా: 108).
సాబిత్ బిన్ జహ్హాక్ రజియల్లాహు అన్హు కథనం: బువాన అనే స్థలంలో ఒక వ్యక్తి ఒంటె జిబహ్ చేయాలని మ్రొక్కుకున్నాడు. దాన్ని గురించి ప్రవక్త ﷺ తో ప్రశ్నించగా, “అక్కడ జాహిలియ్యత్ కాలంలోని విగ్రహాల్లో ఏదైనా విగ్రహం ఉందా? దాని పూజ జరుగుతూ ఉందా?” అని ఆయన అడిగారు. “లేదు” అని అతడు సమాధానం పలికాడు. “వారి పండుగలో (ఉర్సు, జాతరలలో) ఏదైనా పండుగ (ఉర్సు,జాతర) అక్కడ జరుగుతుందా?” అని అడిగారు. “లేదు” అని అతడు సమాధానం పలికాడు. అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారు: “నీ మ్రొక్కుబడిని పూర్తి చేయు. అల్లాహ్ అవిధేయతకు గురి చేసే మ్రొక్కుబడిని పూర్తి చేయరాదు. మానవుడు తన శక్తికి మించిన దాన్ని మ్రొక్కుకుంటే అది కూడా పూర్తి చేయరాదు”. (అబూ దావూద్).
ముఖ్యాంశాలు:
1. ఇందులోని ఆయతు యొక్క వ్యాఖ్యానం.
2. అల్లాహ్ విధేయత, అవిధేయత కొన్ని సందర్భాల్లో భూమి పై కూడా తన ప్రభావాన్ని చూపుతుంది. (అందుకే షిర్క్ జరిగే చోట జిబహ్ చేయవద్దు అని చెప్పబడింది).
3. కఠిన సమస్యను నచ్చజెప్పెటప్పుడు సులభరీతిలో ఏలాంటి చిక్కు లేకుండా స్పష్టపడునట్లు చెప్పాలి.
4. అవసర సందర్భంలో “ఫత్వా” ఇచ్చువారు వివరాన్ని కోరవచ్చు.
5. ఎలాంటి ధార్మిక అడ్డు, ఆటంకం లేనప్పుడు ప్రత్యేక చోటును మ్రొక్కుబడి కొరకు నిర్ణయించవచ్చును.
6. జాహిలియ్యత్ (మూఢవిశ్వాస) కాలంలో విగ్రహం ఉన్నచోట, దాన్ని తర్వాత తొలగించినప్పటికీ అచ్చట జిబహ్ చేయరాదు.
7. వారి పండుగ (ఉర్సు, జాత్ర) జరుగుతున్న స్థలం, అది ఇప్పుడు జరగనప్పటికీ అక్కడ కూడా జిబహ్ చేయరాదు.
8. ఇలాంటి స్థలాల్లో జిబహ్ చేయుటకు మ్రొక్కుకుంటే దానిని పూర్తి చే యకూడదు. అది పాపపు మ్రొక్కు అగును.
9. ఉద్దేశపూర్వకంగా కానప్పటికీ ముస్లింలు ముష్రికుల పండుగ (ఉర్సు, జాత్ర)ల పోలికల నుండి జాగ్రత్తగా వహించాలి.
10. అవిధేయతకు గురి చేసే మ్రొక్కుబడి చేయరాదు.
11. మనిషి తన శక్తికి మించిన దాని మ్రొక్కు చేయకూడదు.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :
దీనికి ముందు అధ్యాయం తరువాత, వెంటనే ఈ అధ్యాయాన్ని ప్రస్తావించడంలో ఉత్తమమైన ఔచిత్యం ఉంది. మొదటిది షిర్క్ అక్బర్ అయితే, ఇది దానికి వసీల (మార్గం, సాధనం). ఏ చోటనైతే అవిశ్వాసులు, ముష్రికులు తమ దేవతల (వలీల) సాన్నిధ్యం పొందుటకు అల్లాతో షిర్క్ చేస్తూ వారి కొరకు జిబహ్ చేస్తారో అవి షిర్క్ యొక్క చిహ్నాలు, గుర్తులు అయ్యాయి. అక్కడ ఎవరైనా ముస్లిం జిబహ్ చేస్తే, అతని ఉద్దేశం అల్లాహ్ కొరకే ఉన్నప్పటికీ అది బాహ్యంగా వారి విధంగనే ఏర్పడుతుంది. (అంటే చూసేవాళ్ళకు అల్లాహ్ యేతరలకు చేస్తున్నట్లే ఏర్పడుతుంది). ఇలా బాహ్య రూపంలో వారికి పోలిన పనులు చేస్తే, చివరికి ఆంతర్యం కూడా ఒకటి అయి పోయే భయం ఉంటుంది. (ఈ రోజుల్లో అయిపోయినట్లే కనబడుతుంది).
అందుకే ఇస్లాం వారి (అవిశ్వాసులు, ముష్రికులు) పోలికల నుండి దూరముండాలని హెచ్చరించింది. అది వారి పండుగలు, వారి లాంటి కార్యాలు, వారి లాంటి దుస్తులు ఇంకా వారికి ప్రత్యేకించిన ప్రతీ దానితో ముస్లిం దూరముండాలి. వాస్తవానికి ఇది వారిలో కలసిపోవుటకు ఒక సాధనంగా మారుతుంది. ముష్రికులు అల్లాహ్ యేతరులకు సజ్దా చేసే సమయంలో, ముస్లింలు నఫిల్ నమాజు చేయుట నివారించబడింది. ఈ నివారణ వచ్చింది వారి పోలిక నుండి దూరముంచుటకే.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు జిబహ్ చేయుట (జంతువును బలి ఇచ్చుట) షిర్క్ [వీడియో] https://youtu.be/fukQG2Jz7Tw [18 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
అల్లాహ్ ఆదేశం చదవండిః
[فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ] {الكوثر:2}
నీ ప్రభువు కొరకే నమజు చేయు మరియు ఖుర్బానీ ఇవ్వు. (కౌసర్ 108: 2).
అంటే అల్లాహ్ కొరకు మరియు అల్లాహ్ పేరుతో మాత్రమే జిబహ్ చేయి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారుః
لَعَنَ اللهُ مَنْ ذَبَحَ لِغَيْرِ الله
“అల్లాహ్ కు కాక ఇతరుల కోసం జిబహ్ చేయువానిపై అల్లాహ్ శపించాడు”. (ముస్లిం 1978).
జిబహ్ లో రెండు నిషేధాలు ఏకమవుతాయి. (1) అల్లాహ్ కు తప్ప ఇతరుల కోసం జిబహ్. (2) అల్లాహ్ పేరుతో కాకుండా ఇతరుల పేరుతో జిబహ్. ఈ రెండు కారణాల వల్ల ఆ జంతువు మాంసం తినడం యోగ్యం కాదు.
ఈ రోజుల్లో జిన్నుల పేరు మీద జిబహ్ చేసే షిర్క్ ప్రభలి ఉంది. అదేమనగా; ఇల్లు కొనుగోళు చేసినా, నిర్మించినా అందులో ఎక్కడైనా లేదా ప్రత్యేకించి దాని గడప మీద, అలాగే బావి త్రవ్వినా, అక్కడే ఓ జంతువు జిబహ్ చేస్తారు. అది షైతాన్ (భూతాల)కు భయపడి, వాని నష్టం నుండి దూరముండుటకు వాని పేరు మీద జిబహ్ చేస్తారు. (వాస్త వేమిటంటే అల్లాహ్ ను కాక ఇతరులతో భయపడరాదు. ఇలాంటి జిబహ్ చేయరాదు). (తైసీరుల్ అజీజుల్ హమీద్ 158. దారుల్ ఇఫ్తా ముద్రణ).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో వక్త ఇస్లాంలో ఖుర్బానీ యొక్క అర్థం, ప్రాముఖ్యత మరియు దానికి సంబంధించిన విధివిధానాలను వివరంగా తెలియజేశారు. ఖుర్బానీ ఎప్పుడు చేయాలి, అర్హమైన పశువులు మరియు వాటి వయస్సు, పశువులో భాగస్వామ్య పద్ధతులు వంటి నిబంధనలను ఖురాన్, హదీసుల ఆధారంగా స్పష్టం చేశారు. అలాగే, అఖీఖా మరియు ఖుర్బానీ కలిపి చేయవచ్చా, మరణించిన వారి పేరిట ఖుర్బానీ ఇవ్వవచ్చా, అప్పు చేసి ఖుర్బానీ చేయవచ్చా వంటి పలు సందేహాలను నివృత్తి చేశారు. ఖుర్బానీ పశువు మాంసాన్ని, చర్మాన్ని ఎలా పంపిణీ చేయాలో వివరిస్తూ, ఖుర్బానీ మాంసం, రక్తం కాకుండా కేవలం మనలోని భక్తి, చిత్తశుద్ధి మాత్రమే అల్లాహ్ కు చేరుతాయని ఉద్ఘాటించారు.
ఖుర్బానీ అనగానేమి?
అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతహు. ఈనాటి ప్రసంగంలో మనం ఖుర్బానీ ఆదేశాలు తెలుసుకుందాం. ముందుగా ఖుర్బానీ అంటే ఏమిటి? తెలుసుకుందాం.
ఖుర్బానీ అంటే జుల్ హిజ్జా నెల 10వ తేదీన పండుగ నమాజు తరువాత నుండి జుల్ హిజ్జా నెల 13వ తేదీన సూర్యాస్తమయానికి ముందు వరకు రేయింబవళ్ళలో ఎప్పుడైనా నిర్ధారిత పశువులను అల్లాహ్ ప్రసన్నత కోసం జిబాహ్ చేయడాన్ని ఖుర్బానీ అంటారు.
ఖుర్బానీ ప్రాముఖ్యత మరియు విశిష్టత
ఈ ఖుర్బానీకి ఉన్న ఘనత, విశిష్టత ఏమిటంటే… ఖురాన్ లోని 108వ అధ్యాయము రెండవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:
فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ (ఫసల్లి లిరబ్బిక వన్ హర్) కాబట్టి నువ్వు నీ ప్రభువు కోసమే నమాజు చెయ్యి, ఖుర్బానీ ఇవ్వు. (108:2)
అలాగే ఖురాన్ లోని 6వ అధ్యాయము 162వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా ఆదేశిస్తున్నాడు:
قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (ఖుల్ ఇన్న సలాతీ వ నుసుకీ వ మహ్యాయ వ మమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
ఓ ప్రవక్తా! ఈ విధంగా ప్రకటించు : “నిస్సందేహంగా నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం – ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే.(6:162)
ఈ రెండు ఆయతులలో ఒక విషయాన్ని గమనించారా? ఈ రెండు ఆయతులలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెండు ముఖ్యమైన ఆరాధనల ప్రస్తావన చేసి ఉన్నాడు. ఒకటి నమాజు అయితే, రెండవది ఖుర్బానీ. నమాజుతో పాటు ఖుర్బానీ ప్రస్తావన కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ రెండు ఆయతులలో చేసి ఉన్నాడు. నమాజ్ ఎంత గొప్ప ఆరాధన అన్న విషయము మనందరమూ తెలుసుకొని ఉన్నాము. అలాంటి గొప్ప ఆరాధనతో పాటు ఖుర్బానీ యొక్క ప్రస్తావన చేయడం వల్ల ఖుర్బానీ కూడా గొప్ప ఆరాధన, అల్లాహ్ కు ఇష్టమైన కార్యము అనే విషయము ఈ రెండు వాక్యాల ద్వారా మనము గ్రహించాలి.
ఖుర్బానీ యొక్క విశిష్టతను ఈ విధంగా కూడా మనము అర్థం చేసుకోవచ్చును. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో మనం చూచినట్లయితే, ఆయన ప్రతి సంవత్సరము ఖుర్బానీ చేశారు. ఆయన తన కుటుంబీకుల తరఫున ఖుర్బానీ చేయటమే కాకుండా, ఆయన అనుచర సమాజంలోని స్తోమత లేని వారికి కూడా ఖుర్బానీ పుణ్యము లభించేలాగా ఆయన అనుచర సమాజంలోని స్తోమత లేని వారి తరపు నుండి కూడా ఆయన ఖుర్బానీ చేసి ఉన్నారు. అల్లాహు అక్బర్. ఆయన ఆయన కుటుంబీకుల సభ్యుల తరపున ఖుర్బానీ చేసుకోవటంతో పాటు, అనుచర సమాజంలోని స్తోమత లేని వారి తరపు నుంచి కూడా ఖుర్బానీ చేశారు. అందరికీ ఖుర్బానీ పుణ్యము లభించేలాగా ఆయన కృషి చేశారు అంటే ఆ ఖుర్బానీ ఎంత విశిష్టమైనదో మనము ఇట్టే అర్థం చేసుకోవచ్చు మిత్రులారా.
అలాగే ఖుర్బానీ ఎంత ముఖ్యమైన ఆరాధన అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ ఉల్లేఖనం ద్వారా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిస్తూ ఇలా తెలియజేశారు: “స్తోమత ఉండి కూడా ఎవరైతే ఖుర్బానీ చేయుటలేదో, వారు మన ఈద్ గాహ్ పండుగ నమాజు ఆచరించే స్థలం దరిదాపులకు కూడా రావద్దు” అని చెప్పారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సాధారణంగా మామూలు విషయాల గురించి ఆయన ఆగ్రహించరు, వారించరు. ఆయన ఆగ్రహిస్తున్నారు, వారిస్తున్నారు అంటే అది చాలా ముఖ్యమైన విషయమై ఉంటుంది. ఆ ప్రకారంగా స్తోమత ఉండి కూడా ఖుర్బానీ చేయని వారు మన ఈద్ గాహ్ కు పండుగ నమాజు ఆచరిస్తున్న స్థలానికి, దాని దరిదాపులకు కూడా రావద్దు అని కఠినంగా ఆయన వారిస్తున్నారు అంటే ఖుర్బానీ ఎంత విశిష్టత గలదో ఎంత ముఖ్యమైన ఆరాధనయో మనము ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ద్వారా అర్థం చేసుకోవచ్చు.
ఖుర్బానీ అల్లాహ్ కు ఎంత ప్రియమైన కార్యము తెలుసుకోవాలంటే… ఖురాన్ లో 22వ అధ్యాయం 34వ వాక్యాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు:
“తమకు అల్లాహ్ ప్రసాదించివున్న పశువులపై అల్లాహ్ పేరును స్మరించటానికిగాను మేము ప్రతి అనుచర సమాజం కోసం ఖుర్బానీ ఆచారాన్ని నిర్థారించాము“. (22:34)
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రతి అనుచర సమాజానికి ఖుర్బానీ చేయమని ఆదేశించి ఉన్నాడు అంటే ప్రతి అనుచర సమాజానికి ఆ ఆరాధన చేయమని అల్లాహ్ ఆదేశించి ఉన్నాడు అంటే అది అల్లాహ్ కు ఎంత ప్రియమైన కార్యమై ఉంటే అల్లాహ్ ఆ విధంగా ఆదేశించి ఉంటాడు కదా?
మనం ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో కూడా విని ఉన్నాము. ఆదం అలైహిస్సలాం వారి ఇద్దరు కుమారులు హాబీల్ మరియు ఖాబీల్ వద్ద పెళ్లి విషయంలో గొడవ జరిగినప్పుడు, ఖుర్బానీ చేయమని తండ్రి ఆదేశించగా వారిద్దరూ ఖుర్బానీ సమర్పించారు. ఒకరి ఖుర్బానీ స్వీకరించబడింది, ఒకరి ఖుర్బానీ తిరస్కరించబడింది. అదంతా మనం ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో వివరంగా తెలుసుకొని ఉన్నాము ఇక్కడ అదంతా ప్రస్తావించే ఆస్కారము లేదు. కాకపోతే తద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆదం అలైహిస్సలాం, ఆదం అలైహిస్సలాం వారి కుమారులు ఈ ప్రపంచంలో ఈ భూమండలం మీద మానవుల చరిత్ర మొదలైన దశలో ప్రారంభంలో వారు ఈ భూమి మీద జీవించారు. ఆ ప్రకారంగా మానవులు ఈ భూమి మీద జీవించిన ప్రారంభము నుండే ఖుర్బానీ ఆదేశాలు మానవులకు ఇవ్వబడి ఉన్నాయి అన్న విషయం మనకు అక్కడ స్పష్టమవుతుంది. ఆ తర్వాత ప్రతి అనుచర సమాజానికి కూడా అల్లాహ్ ఖుర్బానీ చేయమని ఆదేశించి ఉన్నాడు అన్న విషయము కూడా మనకు బోధపడుతుంది.
ఈ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యాల ద్వారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రామాణికమైన హదీసుల ద్వారా ఖుర్బానీ యొక్క ప్రాముఖ్యత, విశిష్టత మనకు అర్థమవుతుంది. ఇవి కాక వేరే ఉల్లేఖనాలు ఉన్నాయి, అవి బలహీనమైనవి, కాబట్టి వాటి ప్రస్తావన నేను ఇక్కడ చేయుటలేదు. చాలామంది పండితులు బలహీనమైన వాక్యాలు, బలహీనమైన ఉల్లేఖనాలు కూడా ప్రస్తావిస్తూ ఉంటారు… ఖుర్బానీ చేయగానే ఆ ఖుర్బానీ రక్తము భూమి మీద పడకముందే అల్లాహ్ వద్ద ఆమోదం పొందుతుంది, ఆ రక్తపు చుక్క భూమి మీద పడకముందే ఖుర్బానీ ఇచ్చే వ్యక్తుల పాపాలు మన్నించబడతాయి, ఖుర్బానీ ఇచ్చే పశువు చర్మం మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని పుణ్యాలు ఖుర్బానీ ఇచ్చే వ్యక్తి ఖాతాలో లిఖించబడతాయి… ఇలాంటి ఉల్లేఖనాలు ఉన్నాయి కదండీ, అవన్నీ బలహీనమైన ఉల్లేఖనాలు అని ధార్మిక పండితులు నిర్ధారించి ఉన్నారు కాబట్టి వాటిని నేను ఇక్కడ ప్రస్తావించుటలేదు.
ఇస్లాంలో ఖుర్బానీ ఆదేశం (ఫర్జ్ లేదా సున్నత్?)
ఇక రండి, ఖుర్బానీ అంటే ఏమిటి, ఖుర్బానీ విశిష్టత ఏమిటి అని మనము తెలుసుకున్న తర్వాత, ఖుర్బానీ ఆదేశం ఏమిటి? ఇస్లామీయ శాసనంలో ఖుర్బానీకి ఉన్న విలువ ఏమిటి? అంటే అది ఫరజా లేదా సున్నతా?
ధార్మిక పండితులు రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తపరచి ఉన్నారు. కొంతమంది ధార్మిక పండితులు ఖుర్బానీ సున్నత్ అని తెలియజేసి ఉన్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆచరించారు కాబట్టి అది సున్నత్ అని కొంతమంది ధార్మిక పండితుల అభిప్రాయం.
మరి కొంతమంది ధార్మిక పండితులు ఏమంటున్నారంటే, స్తోమత ఉన్న వారిపై ఖుర్బానీ చేయటం విధి, తప్పనిసరి, వాజిబ్ అంటున్నారు. వారి ఈ వాదనకు ఆధారం ఏమిటంటే, ఖురాన్ లోని 108వ అధ్యాయము 2వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా “ఫసల్లి లిరబ్బిక వన్ హర్” (నీ ప్రభువు కొరకు నమాజు ఆచరించు, నీ ప్రభువు కొరకు ఖుర్బానీ చెయ్యి) ఖుర్బానీ చెయ్యి అని ఆదేశిస్తున్నాడు కాబట్టి, ఆయన ఆదేశం ప్రకారము స్తోమత ఉన్నవారు ఖుర్బానీ చేయటం తప్పనిసరి వాజిబ్.
అలాగే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్తోమత ఉండి కూడా ఖుర్బానీ చేయని వారు మన ఈద్ గాహ్ కు పండుగ నమాజు చేసే స్థలం దరిదాపులకు రావద్దు అని వారించారు అంటే, ఖుర్బానీ చేయటం స్తోమత ఉన్న వారిపై వాజిబ్, తప్పనిసరి అని ఆ వాక్యము మరియు ఉల్లేఖనం ద్వారా వారు ఆ విధంగా అభిప్రాయపడుతున్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.
ఖుర్బానీకి అర్హమైన పశువులు మరియు వాటి వయస్సు
ఇక రండి, ఏ ఏ పశువుల ఖుర్బానీ చెల్లుబాటు అవుతుంది? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలు, వాక్యాలు దృష్టిలో పెట్టుకుని చూచినట్లయితే, మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే…
పొట్టేలు, గొర్రె, మేక, మేకపోతు, ఆవు, ఎద్దు, ఒంటె (ఆడది అయినా మగది అయినా) – ఈ ఎనిమిది పశువుల ఖుర్బానీ మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
ఈ ఎనిమిది పశువులు కాకుండా వేరే పశువులు కూడా ఉన్నాయి, అవి కూడా హలాల్ ధర్మసమ్మతమే, అయినప్పటికినీ వాటి ఖుర్బానీ చెల్లదు అని ధార్మిక పండితులు తెలుపుతున్నారు. ఎందుకంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కానీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులలో సహాబాలు ఎవరైనా కానీ, ఈ ఎనిమిది పశువులు తప్ప వేరే పశువుల ఖుర్బానీ చేయలేదు. కాబట్టి మనము కూడా వారు చేసిన పశువులనే ఖుర్బానీ చేయాలి అని బోధిస్తూ ఉన్నారు. ఆ ప్రకారంగా ఈ ఎనిమిది పశువుల ఖుర్బానీ మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
అయితే, ఈ ఎనిమిది పశువులలో ఏ పశువు ఖుర్బానీ ఉత్తమమైనది? ఇక్కడ కూడా ధార్మిక పండితులు రెండు రకాల అభిప్రాయం వ్యక్తపరిచి ఉన్నారు.
కొంతమంది ఏమంటున్నారంటే పొట్టేలు ఖుర్బానీ ఉత్తమమైనది, ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి సంవత్సరము పొట్టేలు ఖుర్బానీ చేసి ఉన్నారు కాబట్టి పొట్టేలు ఖుర్బానీ ఉత్తమమైనది అని అంటున్నారు.
మరి కొంతమంది ధార్మిక పండితులు పశువు, ఖుర్బానీ రూపంలో ఇవ్వబడుతున్న పశువు, దాని మాంసము, తద్వారా ప్రజలకు చేకూరుతున్న ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒక లిస్ట్ వారు తెలియజేశారు. ఆ లిస్ట్ ప్రకారంగా:
ఒకటి, ఒంటె ఒక వ్యక్తి తరఫు నుంచి ఇవ్వబడుతూ ఉంటే ఆ ఖుర్బానీ ఉత్తమమైనది.
తరువాత ఆవు లేదా ఎద్దు ఒక వ్యక్తి తరఫున ఖుర్బానీ ఇవ్వబడుతూ ఉంటే అది రెండవ ఉత్తమమైన ఖుర్బానీ.
పొట్టేలు, గొర్రె, మేక, మేకపోతు ఇవి ఒక వ్యక్తి తరపున ఖుర్బానీ ఇవ్వబడుతూ ఉంటే అది మూడవ ఉత్తమమైన ఖుర్బానీ.
ఆ తర్వాత ఏడు వ్యక్తులు లేదా ఏడు కుటుంబాలు, పది వ్యక్తులు లేదా పది కుటుంబాలు ఒక ఒంటెలో భాగస్తులై ఖుర్బానీ చేస్తూ ఉంటే అది నాలుగవ ఉత్తమమైన ఖుర్బానీ.
ఏడు వ్యక్తులు లేదా ఏడు కుటుంబాలు కలిసి ఒక ఆవులో భాగస్తులై ఖుర్బానీ చేస్తూ ఉంటే అది ఐదవ ఉత్తమమైన ఖుర్బానీ అని ధార్మిక పండితులు అభిప్రాయపడి ఉన్నారు. ఇంక అసలు విషయము అల్లాహ్ కు తెలుసు.
ఇక రండి, ఖుర్బానీ పశువులో ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఖుర్బానీ పశువులో ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని ధార్మిక పండితులు తెలియజేసిన విషయం: ఖుర్బానీ కోసం ఇవ్వబడుతున్న పశువు తాజాగా, బాగా లావుగా, కొమ్ములు కలిగిన, ఖసీ చేయబడిన పశువు అయి ఉండటం మంచిది అని తెలియజేశారు.
అలాగే, ఖుర్బానీ ఇవ్వబడుతున్న పశువుల వయస్సు ఎంత ఉండాలి? ఎంత వయస్సు గల పశువుని ఖుర్బానీ ఇవ్వవచ్చు? అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాల ద్వారా మనకు స్పష్టమయ్యే విషయం చూడండి:
ఒంటె 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరము నడుస్తూ ఉండాలి, అలాంటి ఒంటె ఖుర్బానీ చెల్లుబాటు అవుతుంది.
ఆవు లేదా ఎద్దు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరము నడుస్తూ ఉండాలి, అలాంటి ఆవు లేక ఎద్దు ఖుర్బానీ చెల్లుబాటు అవుతుంది.
పొట్టేలు, గొర్రె విషయం గురించి చూడండి. పొట్టేలు మరియు గొర్రె పాల పళ్ళు ఊడిన తర్వాత వచ్చిన పళ్ళు ఉంటాయి కదండీ, అలా పళ్ళు వేసిన పొట్టేలు, గొర్రె అయి ఉండాలి. ఒకవేళ పళ్ళు వేసిన పొట్టేలు, గొర్రె దొరకని యెడల సంవత్సరము దాని దరిదాపుల వయస్సు కలిగిన పొట్టేలు, గొర్రె ఉన్నా గాని ఖుర్బానీ కోసం చెల్లుబాటు అవుతుంది.
ఆ తర్వాత మేక మరియు మేకపోతు విషయం గురించి దైవ ప్రవక్త వారు తెలియజేశారు. అది తప్పనిసరిగా పళ్ళు వేసినదై ఉండాలి. అంటే పాలు పళ్ళు ఊడిన తర్వాత వస్తాయి కదండీ పళ్ళు, ఆ పళ్ళు వేసినదై ఉండాలి మేక, మేకపోతు. పళ్ళు వేయని మేక, మేకపోతు అయితే ఖుర్బానీ ఎట్టి పరిస్థితిలో చెల్లదు. దొరకట్లేదు అని పళ్ళు ఊడని మేక, మేకపోతు ఖుర్బానీ మాత్రం చెల్లదు. అది పొట్టేలు, గొర్రెకు మాత్రమే ఆ నిబంధన వర్తిస్తుంది.
లోపాలు ఉన్న పశువుల ఖుర్బానీ చెల్లుతుందా?
ఇకపోతే, ఏ ఏ పశువుల ఖుర్బానీ చెల్లుబాటు కాదు? ఏ పశువుల ఖుర్బానీ చెల్లదు?
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు: కుంటి పశువు ఖుర్బానీ చెల్లదు. అలాగే ఒక కంటితో చూస్తున్న పశువు ఖుర్బానీ చెల్లదు. ఒక కన్ను కనిపించుటలేదు, ఒక కంటితోనే చూస్తూ ఉంది అంటే ఒంటికంటితో చూస్తున్న పశువు ఖుర్బానీ చెల్లదు. వ్యాధి బారిన పడిన పశువు ఖుర్బానీ చెల్లదు. ఒక పశువు వ్యాధి బారిన పడిపోయింది, అలా వ్యాధి బారిన పడిపోయిన పశువు ఖుర్బానీ కూడా చెల్లదు. అలాగే బాగా బలహీనమైపోయి, ఎముకలు కనిపిస్తున్న బలహీనమైన పశువు ఖుర్బానీ కూడా చెల్లదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాల ద్వారా స్పష్టమవుతుంది.
ఈ ఉల్లేఖనాలను దృష్టిలో పెట్టుకొని ధార్మిక పండితులు తెలియజేశారు, ఇవి కాకుండా వేరే ఏమైనా స్పష్టంగా కనిపించే లోపాలు ఉన్నా అలాంటి పశువు ఖుర్బానీ చెల్లదు అన్నారు. ఉదాహరణకు మనం చూచినట్లయితే కొన్ని పశువులకు తోక కత్తిరించేసి ఉంటారు. కొన్ని పశువులకు చెవులు కత్తిరించేసి ఉంటారు. అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది లోపము. అలా స్పష్టంగా కంటికి లోపం కనిపిస్తూ ఉంటే అలా లోపము ఉన్న పశువు ఖుర్బానీ చెల్లదు. చిన్న లోపం ఉంది అది కంటికి స్పష్టంగా కనిపించుటలేదు అంటే అది సమస్య కాదు, దాని ఖుర్బానీ చెల్లుతుంది. స్పష్టంగా కంటికి కనిపించే అంత పెద్ద లోపము ఉంటే అప్పుడు ఆ పశువు ఖుర్బానీ చెల్లదు అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు.
పశువులో భాగస్వామ్యం (ఎంతమంది పాల్గొనవచ్చు?)
ఇక రండి, ఏ పశువులో ఎంతమంది భాగస్తులు కాగలరు? అనే విషయాన్ని మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాల ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే…
ఒంటెలో 10 మంది భాగస్తులు కావచ్చు, 10 కుటుంబాలు కూడా భాగస్తులు కావచ్చు. ఆవు లేదా ఎద్దులో 7 వ్యక్తులు భాగస్తులు కావచ్చు లేదా 7 కుటుంబాలు భాగస్తులు కావచ్చు.
పొట్టేలు, గొర్రె, మేక, మేకపోతు… వీటిలో మాత్రము ఒక వ్యక్తి మాత్రమే ఖుర్బానీ ఇస్తాడు లేదా ఒక కుటుంబీకులు మాత్రమే (ఒక కుటుంబం తరఫున మాత్రమే) ఖుర్బానీ ఇవ్వబడుతుంది. పొట్టేలు, గొర్రె, మేక మరియు మేకపోతులో ఒకరికంటే ఎక్కువ కుటుంబాలు, ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు భాగస్తులు అవ్వడానికి అనుమతి లేదు.
“ఒక కుటుంబం తరపున ఒక పొట్టేలు, ఒక మేక సరిపోతుంది” అని చెబుతున్నారు, ఒక కుటుంబం అంటే ఎంతమంది? అనే సందేహం రావచ్చు. ఇక్కడ వివరణ ఈ విధంగా ధార్మిక పండితులు తెలియజేశారు: ఒకే వ్యక్తి సంపాదన మీద ఎంతమంది అయితే జీవితం గడుపుతూ ఉంటారో, ఒకే వ్యక్తి పోషణలో ఎంతమంది వ్యక్తులు అయితే ఉంటారో, వారందరూ కూడా ఒక కుటుంబంగా పరిగణించబడతారు. ఉదాహరణకు ఇంట్లో తండ్రి ఒక్కరు మాత్రమే సంపాదిస్తున్నారు, ఆ తండ్రి, భార్యలు, బిడ్డలు చాలా మంది ఉన్నారు. ఇతరులు ఎవరూ సంపాదించుటలేదు, తండ్రి ఒక్కరు మాత్రమే సంపాదిస్తున్నారు. అక్కడ ఉన్న కుటుంబంలో ఉన్న వారందరినీ పోషిస్తున్నారు, వారందరి బాధ్యత ఆయన ఒక్కరే మోస్తున్నారు అంటే వారు ఎంతమంది ఉన్నా సరే అప్పుడు ఆ ఒక్క పశువు తరపు నుండే ఆ పూర్తి కుటుంబం తరపున ఖుర్బానీ అయిపోతుంది.
కానీ, ఒకవేళ ఒకే తండ్రికి చెందిన ఇద్దరు లేకంటే ఎక్కువ మంది కుమారులు ఒకే ఇంట్లోనే ఉంటున్నారు, కానీ వేరువేరుగా సంపాదించుకుని, ఎవరి సంపాదన వారు వేరువేరుగానే ఉంచుకుంటున్నారు అనేటట్లయితే అప్పుడు అది ఒక కుటుంబంగా పరిగణించబడదు. సంపాదన ఎవరైతే వేరుగా పెట్టుకుంటున్నాడో అతను సపరేటుగా ఒక కుటుంబంగా పరిగణించబడతారు. ఒకే కుటుంబంలో ఉన్నప్పటికినీ సంపాదన వేరుగా ఉంచుకున్న వారందరూ కూడా వేరే వేరే కుటుంబీకులే, వారు ప్రతి ఒక్కరు ఎవరైతే సంపాదన వేరు వేరుగా ఉంచుకుంటున్నారో వారు వారు వేరువేరుగా ఖుర్బానీలు ఇచ్చుకోవలసి ఉంటుంది. ఈ విషయము మనము బాగా అర్థం చేసుకోవాలి.
మనం చూచినట్లయితే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన జీవిత కాలంలో ఖుర్బానీ చేసేటప్పుడు ఒక పశువుని జిబాహ్ చేస్తూ “ఓ అల్లాహ్ ఇది నా తరపున మరియు నా కుటుంబీకుల తరపున” అని ఖుర్బానీ చేసేవారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు సహాబాలు కూడా ఖుర్బానీ ఇచ్చేటప్పుడు “ఓ అల్లాహ్ ఇది నా తరపున నా కుటుంబీకుల తరపున” అని పూర్తి కుటుంబం తరపున ఒక పశువుని ఖుర్బానీ ఇచ్చేవారు.
అబూ అయ్యుబ్ అన్సారీ రజియల్లాహు అన్హు వారితో ఈ విధంగా అడగడం జరిగింది: “దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ప్రజలు ఏ విధంగా ఖుర్బానీలు చెల్లించుకునేవారు?” అంటే, అబూ అయ్యుబ్ అన్సారీ రజియల్లాహు అన్హు వారు తెలియజేశారు, “మనలోని ప్రతి వ్యక్తి తన తరపున తన కుటుంబం తరపున ఒక పశువుని జిబాహ్ చేసి స్వయంగా తినేవాడు ఇతరులకు కూడా తినిపించేవాడు” అని ఆయన బదులిచ్చారు. ఆ ప్రకారంగా ప్రవక్త మరియు సహాబాల విధానం ఏమిటంటే ఒక కుటుంబం తరఫున ఒక పశువుని జిబాహ్ చేసి వారు స్వయంగా మాంసం భుజించి ఇతరులకు కూడా తినిపించేవారు. ఆ ప్రకారంగా ఒక పశువు ఒక కుటుంబం తరపున ఖుర్బానీ ఇవ్వబడేది అనేది మనకు స్పష్టమవుతుంది.
ఖుర్బానీ మరియు అఖీఖా ఒకే పశువులో చేయవచ్చా?
మిత్రులారా, ఇక్కడ కొంతమంది అతి తెలివి ఉపయోగిస్తూ ఉంటారు. వారు ఏం చేస్తారంటే, బిడ్డలు పుట్టినప్పుడు ఏడు రోజులలో చేయవలసిన అఖీఖా ఏడు రోజులలో చేయకుండా, తరువాత ఖుర్బానీ సమయం వచ్చినప్పుడు ఒకే పశువులో ఖుర్బానీ మరియు అఖీఖా రెండు అయిపోయేలాగా ఉపాయము పన్నుతూ ఉంటారు. ఉదాహరణకు ఆవు లేక ఎద్దు ఉందనుకుందాం. అందులో ఏడు భాగాలు అవకాశం ఉంది కదండీ. ఒక భాగం ఖుర్బానీ కోసం, ఒక భాగం అఖీఖా కోసం తీసుకుంటూ ఉంటారు. అలా ఉపాయం పన్నిన వారు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఒకే పశువులో ఖుర్బానీ, ఒకే పశువులో అఖీఖా చెల్లదు. ఇది ఏ ప్రామాణికమైన ఆధారంలో కూడా లేదు. అఖీఖా కోసము ఒక ప్రత్యేకమైన పశువును జబాహ్ చేయవలసి ఉంటుంది. ఖుర్బానీ పశువులో అఖీఖాను తీసుకుని వచ్చి జొప్పించే ప్రయత్నము చేయరాదు, ఇది అతి తెలివి ఉపయోగించటము అలా చేయటం సమంజసము కాదు.
ఖుర్బానీకి బదులు దానం చేయవచ్చా?
అలాగే చాలామంది కొత్తగా వాదిస్తూ ఉంటారు. అంత డబ్బు పెట్టి పశువు తీసుకుని ఖుర్బానీ చేసి మాంసం మెక్కటం ఎందుకు, అదే డబ్బుతో పేదలకు దానం చేయొచ్చు కదా అని వాదిస్తూ ఉంటారు. వాళ్ళ వాదన వ్యర్థమైనది. ఇస్లాంలో అల్హమ్దులిల్లాహ్ ఫర్జ్ సదఖా, ఫర్జ్ దానం (జకాత్) అని ఒకటి ఉంది. అలాగే నఫిల్ సదఖా, నఫిల్ దానము కూడా ఉంది. వాటి గురించి ప్రత్యేకంగా అల్లాహ్ వాక్యాలు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలు ఉన్నాయి. ఆ ప్రకారంగా ముస్లింలు జకాత్ మరియు ఇతర సదఖాలు చేస్తూ ఉంటారు, నిరుపేదలకు అందిస్తూ ఉంటారు, అవి చేయమని ప్రోత్సహించాలి. ఖుర్బానీ ఆపి సదఖా చేయమని చెప్పాల్సిన అవసరము లేదు అన్న విషయం వారు గ్రహించాలి. ఖుర్బానీ ఒక ప్రత్యేకమైన ఆరాధన, సంవత్సరంలో ఒకసారి మాత్రమే చేయబడుతుంది. ఆ ప్రకారంగా ఖుర్బానీ చేసుకొని ఖుర్బానీ పుణ్యము మనము సపరేటుగా పొందాలి. ఆరాధనలు జీవితాంతము సంవత్సరము మొత్తము ఎప్పుడైనా ఎక్కడైనా మనము చేసుకొని పుణ్యం సంపాదించుకోవచ్చు ఆ విషయం కూడా వారు గ్రహించాలి.
ఖుర్బానీ పశువులో లోపం వస్తే లేదా దొంగిలించబడితే?
అలాగే ఒక వ్యక్తి బాగా చూసి ఎలాంటి లోపాలు లేని ఒక పశువుని కొన్నాడు. కొన్న తర్వాత కొద్ది రోజులకు ఏదో ఒక సంఘటన కారణంగా అందులో లోపం ఏర్పడింది. మరి అలాంటప్పుడు అతను ఏం చేయాలి అంటే, ధార్మిక పండితులు తెలియజేశారు: అతని వద్ద స్తోమత ఉంటే ఆ పశువు అమ్మేసి లోపము లేని మంచి సురక్షితమైన పశువుని ఒకటి కొని ఖుర్బానీ చేయటము ఉత్తమం. ఒకవేళ అతని వద్ద స్తోమత లేదు అంటే, సమయము లేదు లేదా ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయి, ఇక అతను ఆ పశువుని అమ్మి వేరే పశువు కొనలేడు అనేటట్లయితే, అదే పశువుని అతను జబాహ్ చేయవచ్చు, ఖుర్బానీ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే కొనేటప్పుడు అందులో ఎలాంటి లోపము లేదు కాబట్టి, అతని ఖుర్బానీ చెల్లుబాటు అవుతుంది అని తెలియజేసి ఉన్నారు. అలాగే ఖుర్బానీ కోసము పశువు కొన్న తర్వాత ఆ పశువు దొంగలించబడింది లేదా తప్పిపోయింది కనిపించనే లేదు ఆ తర్వాత. మరి అలాంటప్పుడు వారేం చేయాలి? స్తోమత ఉంటే మరొక పశువు కొని ఖుర్బానీ చేయాలి, స్తోమత లేకపోతే వారికి ఖుర్బానీ పుణ్యము ఇన్ షా అల్లాహ్ తప్పనిసరిగా దక్కుతుంది.
ఖుర్బానీ ఎప్పుడు, ఎలా చేయాలి?
అలాగే మిత్రులారా, ఇప్పుడు ఖుర్బానీ సమయం ఏమిటి, ఎప్పుడు ఖుర్బానీ చేయాలి? ఇది చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం.
ఖుర్బానీ ఎప్పుడు చేయాలి అంటే, పండుగ నమాజు తరువాత ఖుర్బానీ చేయాలి. జుల్ హిజ్జా నెల 10వ తేదీన పండుగ నమాజు తరువాత ఖుర్బానీ చేయాలి. ఒకవేళ తొందరపడి ఎవరైనా జుల్ హిజ్జా 10వ తేదీన పండుగ నమాజు కంటే ముందే జిబాహ్ చేసేస్తే, అది హలాల్ ధర్మసమ్మతమే కానీ అతనికి ఖుర్బానీ పుణ్యము దక్కదు. అతను మామూలు రోజుల్లో మాంసం కోసము పశువుని జిబాహ్ చేసుకొని మాంసం తింటారు కదండీ, అలా అతనికి అది ధర్మసమ్మతమైన మాంసం మాత్రమే అతనికి హలాల్ దక్కుతుంది. ఖుర్బానీ పుణ్యం మాత్రం అతనికి దక్కదు. అతను మళ్ళీ మరొక పశువుని కొని పండుగ నమాజు తర్వాత జిబాహ్ చేసుకుంటే అప్పుడే అతనికి ఖుర్బానీ పుణ్యము ప్రాప్తమవుతుంది.
ఒకవేళ ఎవరైనా మర్చిపోయి పండుగ నమాజు కంటే ముందే జిబాహ్ చేసేస్తే? అతనికి కూడా ఖుర్బానీ పుణ్యము దక్కదు. ఆ పశువు అతని కోసం హలాల్ ధర్మసమ్మతమే, అతను ఆ పశువు మాంసాన్ని తినవచ్చు. కానీ ఖుర్బానీ పుణ్యం మాత్రం అతనికి ఇవ్వబడదు. అతను మరొక పశువుని కొని పండుగ నమాజు తర్వాత మళ్ళీ జిబాహ్ చేసుకోవాలి, అప్పుడే అతనికి ఖుర్బానీ పుణ్యము ప్రాప్తమవుతుంది.
అయితే, జుల్ హిజ్జా నెల 10వ తేదీన పండుగ నమాజు తరువాత నుండి చేయబడే ఖుర్బానీ (ఆ రోజు, అంటే 10వ తేదీన చేయబడే ఖుర్బానీ) ఉత్తమమైనది. ఆ తర్వాత 11, 12, 13 తేదీలలో కూడా ఖుర్బానీ చేసుకోవచ్చు. 10వ తేదీన చేసే ఖుర్బానీ ఎక్కువ పుణ్యము మరియు ఎక్కువ గౌరవప్రదమైనది అని ధార్మిక పండితులు అభిప్రాయపడి ఉన్నారు.
ఖుర్బానీ చేసే విధానం మరియు దుఆలు
ఇక, ఖుర్బానీ చేసే విధానం ఏమిటి అంటే, పశువుని జిబాహ్ చేసే ముందు కత్తి బాగా పదును పెట్టుకోవాలి. పశువు ముందర కత్తి నూరరాదు. అలాగే పశువుని జిబాహ్ చేసేటప్పుడు ఎడమ వైపుకి పడుకోబెట్టి జిబాహ్ చేయాలి. ఆవు, ఎద్దు, పొట్టేలు, గొర్రె, మేక, మేకపోతు ఉంటే వాటిని పడుకోబెట్టి జిబాహ్ చేయాలి. ఒంటె అయితే నిలబెట్టి అతని గొంతు మరియు మునుపటి కాళ్ళ మధ్యలో ఒక ప్రదేశంలో నహర్ చేస్తారు. అలా నిల్చోబెట్టి ఒంటెకు మాత్రమే నహర్ చేయాలి. ఇతర పశువులకు మాత్రము పడుకోబెట్టి జిబాహ్ చేయాలి.
జిబాహ్ చేస్తున్నప్పుడు పశువు ముఖాన్ని కిబ్లా దిశలో ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఎవరైతే జిబాహ్ చేస్తున్నారో, ఖుర్బానీ చేస్తున్నారో వారు కూడా వారి ముఖాన్ని కిబ్లా దిశలో ఉండేటట్టుగా చూసుకోవాలి. జిబాహ్ చేస్తున్న వ్యక్తి అవసరార్థం తన కాలు పశువు శరీరం మీద ఉంచాలనుకుంటే ఉంచుకోవచ్చు. అలాగే జిబాహ్ చేస్తున్న వ్యక్తి పదునైన కత్తిని తీసుకొని తొందరగా జిబాహ్ చేయాలి.
ఎవరైతే ఖుర్బానీ ఇస్తున్నారో వారే స్వయంగా తమ స్వహస్తాలతో ఆ పశువుని జిబాహ్ చేయాలి. ఒకవేళ వారి వల్ల కావట్లేదు అనేటట్లయితే ఇతరులతో కూడా ఖుర్బానీ జిబాహ్ చేయించుకోవచ్చు. అలాగే మహిళలు కూడా వారి ఖుర్బానీ వారు వారి స్వహస్తాలతోనే జిబాహ్ చేసుకోవచ్చును. ఒకవేళ వారి వల్ల కుదరదు అనేటట్లయితే ఇతరుల చేత కూడా వారు ఖుర్బానీ జిబాహ్ చేయించుకోవచ్చును.
ఖుర్బానీ పశువుని జిబాహ్ చేసేటప్పుడు:
بِسْمِ اللَّهِ اللَّهُ أَكْبَرُ (బిస్మిల్లాహి అల్లాహు అక్బర్) అల్లాహ్ పేరుతో, అల్లాహ్ అందరికంటే గొప్పవాడు.
అని పఠించడంతో పాటు,
اللَّهُمَّ إِنَّ هَذَا مِنْكَ وَلَكَ، اللَّهُمَّ تَقَبَّلْ مِنَّا (అల్లాహుమ్మ ఇన్న హాజా మిన్ క వలక అల్లాహుమ్మ తకబ్బల్ మిన్నా) ఓ అల్లాహ్! ఇది నీ వైపు నుంచే, నీ కోసమే. ఓ అల్లాహ్! మా నుండి దీనిని స్వీకరించు. అని కూడా పఠించవచ్చును.
“నేను ఆకాశాలను, భూమిని సృష్టించినవాని వైపుకు ఏకాగ్రతతో నా ముఖాన్ని త్రిప్పుకుంటున్నాను. నేను షిర్క్ చేసేవారిలోని వాణ్ణి కాను.” (6:79)
అని ఒక దుఆ ఉంది కదండీ, ఆ పూర్తి దుఆ కూడా పఠించవచ్చును అని తెలుపబడింది.
జిబాహ్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో కొన్ని పశువులు బెదిరిపోయి తప్పించుకుని పారిపోతాయి. తర్వాత చేతికి చిక్కవు. అవి పారిపోతూ ఉంటే అలాంటప్పుడు ఏమి చేయాలంటే, ధార్మిక పండితులు తెలియజేశారు, ఎలాగైతే పశువుని షికారు చేస్తారో (వేటాడుతారో) బాణాల ద్వారా లేదా ఇతర పరికరాల ద్వారా, ఆ విధంగా పదునైన బాణంతో గాని లేదా వేరే పరికరాలతో గాని అల్లాహ్ నామము స్మరించి ఆ పారిపోతున్న పశువుని గాయపరచాలి. అదే గాయంలో ఒకవేళ అది మరణిస్తే, అతని ఖుర్బానీ అయిపోయినట్లే. ఒకవేళ అది మరణించకముందే చేతికి దక్కితే, అప్పుడు దాన్ని జిబాహ్ చేసేయాలి, తద్వారా అతని ఖుర్బానీ పూర్తి అవుతుంది అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు.
మాంసం మరియు చర్మం పంపిణీ నియమాలు
ఇక రండి, ముఖ్యమైన విషయం. ఖుర్బానీ చేసిన తర్వాత ఆ పశువు మాంసము మరియు చర్మము ఏమి చేయాలి? దీని సమాధానం ఏమిటంటే, ఖుర్బానీ చేయబడిన పశువు మాంసము వారు స్వయంగా తినవచ్చును, ఇతరులకు కూడా తినిపించవచ్చును, భవిష్యత్తు కోసము దాన్ని భద్రపరుచుకోవచ్చును (ఎండబెట్టి అయినా సరే వేరే విధంగానైనా సరే).
ఖురాన్ లో 22వ అధ్యాయము 36వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:
فَكُلُوا مِنْهَا وَأَطْعِمُوا الْقَانِعَ وَالْمُعْتَرَّ (ఫకులూ మిన్ హా వ అతయిముల్ ఖానిఅ వల్ ముఅ తర్) వాటి మాంసాన్ని (మీరూ) తినండి, అడగని అభాగ్యులకు, అడిగే అగత్యపరులకు కూడా తినిపించండి. (22:36)
అడిగేవారు అంటే ఎవరు? అడగని వారు అంటే ఎవరు? నిరుపేదలు చేతులెత్తి అడిగేవారు, వారికి ఇవ్వండి. ఇరుగు పొరుగు వారు, బంధుమిత్రులు, వారు చేతులెత్తి అడగరు, అలాంటి వారికి కూడా ఇవ్వండి అని అక్కడ పేర్కొనబడింది. ఆ ప్రకారంగా ఖుర్బానీ ఇవ్వబడిన పశువు మాంసము మన కోసము కూడా కొంచెం ఉంచుకుని, బంధుమిత్రులకు కొంచెం పంచి, నిరుపేదలకు కూడా పంచి ఆ విధంగా ఖుర్బానీ మాంసాన్ని మనము పంచుకొని మనం స్వయంగా కూడా తింటే మంచిది అని ధార్మిక పండితులు తెలియజేశారు.
అయితే, ఈ విధంగా మూడు భాగాలు చేయాలి, ఆ మూడు భాగాలు సరైన పరిమాణంలోనే ఉండాలి, కొంచెం కూడా హెచ్చుతగ్గులు అవ్వకూడదు అనే నిబంధనలు ఏమీ లేవు. ఎవరైనా పుణ్యం కోసము పూర్తి మాంసము అనాధలకు, పేదలకు లేదా ఇతరులకు పంచాలనుకుంటే పూర్తి మాంసము పంచేయవచ్చు, అందులో ఎలాంటి తప్పు లేదు. అలాగే ఎక్కువ మాంసము అవసరాల కోసం ఉంచుకుని కొద్ది మాంసం మాత్రము పంచాలనుకుంటే అనుమతి ఉంది, కానీ అది భక్తికి విరుద్ధమైన విషయం. ఎందుకంటే, మన కోసమే మనం ఆలోచించుకుంటున్నాం, ఇరుగు పొరుగు వారి గురించి ఆలోచించుటలేదు, పేదవారి గురించి మనం ఆలోచించటలేదు అంటే అది విశ్వాస లోపానికి నిదర్శనం, భక్తికి విరుద్ధమైన విషయం కాబట్టి అలా చేయటం సమంజసం కాదు. అందరి గురించి ఆలోచించాలి. బంధుమిత్రుల గురించి ఆలోచించాలి, పేదల గురించి ఆలోచించాలి, మన కుటుంబ సభ్యుల గురించి కూడా మనము శ్రద్ధ తీసుకోవాలి.
అలాగే ఖుర్బానీ పశువు మాంసము ముస్లిమేతరులకు ఇవ్వవచ్చునా అంటే, ఇవ్వవచ్చును. నా సలహా ఏమిటంటే ఈ రోజుల్లో ముస్లిమేతరులలో ముస్లింల పట్ల అపోహలు సృష్టిస్తున్నారు దుష్టశక్తులు. విషం కక్కి ముస్లింలకు వ్యతిరేకంగా వారి మెదడులలో బాగా నూరి పోస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అపోహలు తొలగిపోవడానికి, వారిలో ఉన్న అనుమానాలు దూరం అవ్వటానికి, మనము స్వయంగా రెండు అడుగులు ముందుకు వేసి మన సమీపంలో ఇరుగు పొరుగులో ఉంటున్న మన ముస్లిమేతర సోదరులకు వెళ్లి సగౌరవంగా ఆహ్వానించి ఈ ఖుర్బానీ పశువు మాంసము అందజేయాలి.
అలాగే మరొక ముఖ్యమైన విషయం, మనం ఏ ప్రదేశంలో అయితే ఉంటున్నామో ఆ ప్రదేశంలో ఉన్న ముస్లిమేతరుల సోదరుల మనోభావాలు గాయపడకుండా ఉండటానికి ఆ ప్రదేశంలో ఉన్న ధార్మిక పండితులు ఖుర్బానీ విషయంలో ఏ నియమాలు అయితే బోధిస్తున్నారో ఆ నియమాలకు అనుగుణంగా ఖుర్బానీ చేసుకోండి, ఇది శ్రేయస్కరమైన విధానము.
అలాగే మిత్రులారా, ఖుర్బానీ పశువు చర్మము ఏమి చేయాలి? ఆ చర్మము మనము స్వయంగా ఉపయోగించుకోవటానికి అవకాశము ఉంటే ఉపయోగించుకోవచ్చును. మనకు ఉపయోగించుకోవటం రాదు అంటే ఇతరులకు దానం చేసేయాలి. లేదా అమ్మేసి వచ్చిన సొమ్ముని దానం చేసేయాలి అంతేగాని పశువుని జిబాహ్ చేసిన తర్వాత ముక్కలు చేసి ఇవ్వటానికి వచ్చిన కసాయికి కూలీ రూపంలో మాత్రము ఇవ్వటానికి అనుమతి లేదు. కూలీ రూపంలో జేబు నుంచి డబ్బు చెల్లించండి, కానీ ఆ ఖుర్బానీ ఇవ్వబడిన పశువు చర్మాన్ని కూలీ రూపంలో కసాయికి ఇవ్వటానికి అనుమతి లేదు, ఇది జాగ్రత్తగా గమనించాల్సిన విషయం.
చనిపోయిన వారి తరపున ఖుర్బానీ ఇవ్వవచ్చా?
ఇక చివరిగా ఒక ముఖ్యమైన విషయం చెప్పిన మాటను ముగిస్తాను. అదేమిటంటే మరణించిన వారి తరపున ఖుర్బానీ ఇవ్వవచ్చునా లేదా? అంటే ధార్మిక పండితులు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు.
ఎవరైతే మరణించిన వారి తరపున ఖుర్బానీ ఇవ్వవచ్చును అని చెబుతూ ఆధారాలు చూపిస్తున్నారో వారు చూపిస్తున్న ఆధారాలన్నీ బలహీనమైనవి. ప్రామాణికమైన ఆధారాలలో ఎక్కడా ఆ విషయం బోధపడలేదు.
ఇక ఎవరైతే ఖుర్బానీ ఇవ్వటానికి అనుమతి ఉంది అని చెబుతూ వేరే మార్గాలు చూపిస్తున్నారో వారేమంటున్నారంటే, ఒకవేళ మరణించిన వ్యక్తి మరణించే ముందు “నేను మరణించిన తర్వాత నా తరపున ప్రతి సంవత్సరం ఖుర్బానీ చేస్తూ ఉండండి” అని వసీయత్ (హితవు) చేసి ఉంటే, అప్పుడు అతని తరపున ఖుర్బానీ చేయడానికి అనుమతి ఉంటుంది అని కొంతమంది ఒక రకమైన అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.
మరి కొంతమంది అయితే అది కూడా ఒక దానం కదండీ, అది చేయవచ్చును అంటున్నారు.
అయితే మనము తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మిత్రులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వారు మరణించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇద్దరు కుమారులు మరణించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుమార్తెలు మరణించారు. సొంత కుటుంబ సభ్యుల్లో ఇంతమంది మరణించి ఉన్నా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ సంవత్సరము కూడా “మరణించిన నా సతీమణి ఖదీజా పేరున నేను ఖుర్బానీ చేస్తున్నాను, మరణించిన నా కుమారుల పేరిట నేను ఖుర్బానీ చేస్తున్నాను, మరణించిన నా కుమార్తెల పేరిట నేను ఖుర్బానీ చేస్తున్నాను” అని చేయలేదు. కాబట్టి మరణించిన వ్యక్తుల పేరిట ప్రత్యేకంగా ఖుర్బానీ చేయడానికి అనుమతి లేదు.
కాకపోతే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాన్ని మనము పాటిస్తే, ఇన్ షా అల్లాహ్ బ్రతికి ఉన్న వారికి మరణించిన వారికి అందరికీ ఖుర్బానీ పుణ్యము ప్రాప్తమవుతుంది. అది ఎలాగంటే చూడండి: దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖుర్బానీ ఇచ్చేటప్పుడు ఏమని దుఆ పటించేవారు అంటే,
اللَّهُمَّ تَقَبَّلْ مِنْ مُحَمَّدٍ، وَآلِ مُحَمَّدٍ (అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్ ముహమ్మద్ వ ఆలి ముహమ్మద్) “ఓ అల్లాహ్! నేను ఇస్తున్న ఈ ఖుర్బానీ నా తరఫున మరియు నా కుటుంబ సభ్యుల తరఫున స్వీకరించు” అని దుఆ చేసి ఖుర్బానీ చేసేవారు.
ఇక ఆయన కుటుంబ సభ్యుల్లో జీవించి ఉన్నవారు ఉన్నారు, మరణించి ఉన్నవారు ఉన్నారు. ఆ ప్రకారంగా ఆయన తరఫున, ఆయన కుటుంబీకుల్లో బ్రతికి ఉన్న, మరణించిన వారందరి తరపున ఖుర్బానీ అయ్యింది, అందరికీ ఖుర్బానీ పుణ్యము బహుశా ప్రాప్తమయింది అని ధార్మిక పండితులు ఆశాభావం వ్యక్తపరుస్తూ ఏమంటున్నారంటే, మనము కూడా ఖుర్బానీ ఇచ్చేటప్పుడు “ఓ అల్లాహ్ ఇది నా తరఫున నా కుటుంబ సభ్యుల తరఫున స్వీకరించు” అని దుఆ చేసి ఖుర్బానీ చేసుకుంటే మన తరఫున ఖుర్బానీ అయిపోతుంది, మన కుటుంబ సభ్యుల్లో జీవించి ఉన్న, మరణించి ఉన్న వారందరి తరఫున కూడా ఖుర్బానీ అయిపోతుంది. అందరికీ కూడా ఇన్ షా అల్లాహ్ ఖుర్బానీ పుణ్యము ప్రాప్తమయ్యే అవకాశం ఉంది అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు.
అప్పు చేసి ఖుర్బానీ చేయవచ్చా?
చివరిలో ముఖ్యమైన సూచనలు ఏమిటంటే, అప్పు చేసి మరీ ఖుర్బానీ చేయవలసిందేనా? అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అప్పు చేసి మరి తప్పనిసరిగా ఖుర్బానీ చేయమని ఆదేశించలేదు కానీ, మనకు అల్లాహ్ శక్తి ఇచ్చి ఉంటే… ఖుర్బానీ ఒక మూడు నాలుగు రోజుల్లో మాత్రమే అవుతుంది, మిగతా రోజుల్లో ఖుర్బానీ అవ్వదు. అయితే అనుకోకుండా ఆ సమయానికి మన వద్ద డబ్బు లేదు అనేటట్లయితే అప్పటికప్పుడు ఎక్కడినుంచైనా డబ్బు తీసుకొని తర్వాత ఇన్ షా అల్లాహ్ మనము చెల్లించుకోగలము అనే ధైర్యము ఉంటే అప్పుడు అప్పు తీసుకుని ఖుర్బానీ చేసుకోవటం మంచిది, ఉత్తమం. చూడండి డబ్బులు లేకపోయినా స్నేహితులకు పార్టీలు ఇస్తాం బాకీలు చేసి, వేరే చాలా కార్యాలు చేస్తాం. మరి పుణ్యం ప్రాప్తమయ్యే విషయంలో ఎందుకు వెనకడుగు వేయాలి? బేకారు విషయాలలో ధైర్యము చేస్తాం పుణ్యం ప్రాప్తమయ్యే విషయంలో మాత్రము కంగారుపడతామంటే ఇది సరికాదు మిత్రులారా. కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నాకు ఇస్తాడు నేను బాకీ చెల్లించుకోగలను అని అల్లాహ్ మీద నమ్మకంతో అప్పు చేసి ఖుర్బానీ చేయాలనుకుంటే చేసుకోవచ్చును, అది మంచిదే అని ధార్మిక పండితులు అభిప్రాయపడి ఉన్నారు.
వెంట్రుకలు, గోర్లు, చర్మము కత్తిరించరాదు
అలాగే ఏ వ్యక్తి అయితే ఖుర్బానీ చేయాలని సంకల్పించుకున్నాడో అతను జుల్ హిజ్జా మాసం ప్రారంభము నుండి ఖుర్బానీ ఇచ్చేంత వరకు కూడా వెంట్రుకలు కత్తిరించరాదు, గోర్లు కత్తిరించరాదు, చర్మము కత్తిరించరాదు. ఒకవేళ మర్చిపోయి ఖుర్బానీ ఇవ్వాలని సంకల్పించుకున్న వ్యక్తి మధ్యలో గోర్లు కత్తిరించేసాడు లేదా చర్మం కత్తిరించేసాడు అంటే అతను అల్లాహ్ తో క్షమాపణ వేడుకోవాలి, ఎలాంటి కఫ్ఫారా పరిహారము చెల్లించాల్సిన అవసరమైతే లేదు.
అల్లాహ్ కు కావలసినది కేవలం భక్తి మాత్రమే
అలాగే ఖుర్బానీ కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసము ఇఖ్లాస్ తో చిత్తశుద్ధితో చేయాలి. ప్రదర్శనా బుద్ధి ఉండకూడదు. అలాగే పిసినారితనము కూడా ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం చూస్తూ ఉంటాం సమాజంలో చాలామంది ధనవంతులు, డబ్బు ఉన్నవాళ్లు, షావుకార్లు కూడా ఖుర్బానీ విషయంలో పిసినారితనము చూపిస్తూ ఏదో ఒక సాధారణమైన చిన్న పశువు తీసుకొని ఖుర్బానీ చేసేసి చెల్లించేద్దాము అని ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే వారు పిసినారితనం ప్రదర్శిస్తూ ఉంటారు, సంవత్సరంలో ఒక్కసారి చేయబడే ఖుర్బానీ విషయంలో పిసినారితనము ప్రదర్శించకండి.
సంతోషంగా అల్లాహ్ మార్గంలో ధనము ఖర్చు పెట్టండి. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మనము ఇస్తున్న ఖుర్బానీ పశువు యొక్క మాంసము అవసరము లేదు, రక్తము అవసరము లేదు, మనము అల్లాహ్ చిత్తము కోసము సంతోషంగా ఖుర్బానీ చేస్తామా లేదా అనేది అల్లాహ్ చూస్తున్నాడు.
لَن يَنَالَ اللَّهَ لُحُومُهَا وَلَا دِمَاؤُهَا وَلَٰكِن يَنَالُهُ التَّقْوَىٰ مِنكُمْ (లయ్యనాలల్లాహ లుహూముహా వలా దిమావుహా వలాకిన్ యనాలుహుత్ తఖ్వా మిన్ కుమ్) వాటి మాంసంగానీ, రక్తంగానీ అల్లాహ్‌కు చేరవు. అయితే మీలోని భక్తి పరాయణత (తఖ్‌వా) మాత్రం ఆయనకు చేరుతుంది. (22:37)
అని అల్లాహ్ తెలియజేసి ఉన్నాడు కాబట్టి, పిసినారితనము ప్రదర్శించకుండా సంతోషంగా పశువు కొని మంచి పశువు కొని అల్లాహ్ మార్గంలో ఖుర్బానీ చేయాలి.
అలాగే రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొంతమంది డబ్బు ఖర్చు చేస్తారు, మంచి పశువుని కొంటారు, కాకపోతే “నేను ఇంత మంచి పశువుని కొన్నాను” అని ఆ పశువు మెడలో దండలు వేసి ఊరిలో ఊరేగింపు చేస్తూ ఉంటారు, ప్రజలందరికీ చూపిస్తూ ఉంటారు. ఆ ప్రకారంగా ప్రదర్శనా బుద్ధితో అహంకారం ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో అయితే సోషల్ మీడియా వచ్చేసింది కాబట్టి ఫోటోలు దింపి, దండలు వేసి, ఇంకా ఏమేమో హంగులు చేసి ఆ ఫోటోలను ఫేస్ బుక్ లలో, వాట్సాప్ లలో, ఇంకా వీడియోలు తీసి యూట్యూబ్ లలో ఎక్కడెక్కడో వారు ప్రసారం చేస్తూ ఉంటారు. తద్వారా మనిషిలో చిత్తశుద్ధి అనేది లేకుండా పోతుంది. ప్రదర్శనా బుద్ధి అక్కడ వచ్చేస్తుంది, దీనినే ఇస్లామీయ పరిభాషలో రియాకారీ అంటారు. రియా ఉద్దేశంతో, ప్రదర్శనా ఉద్దేశంతో, ప్రదర్శనా బుద్ధితో చేసిన ఏ పుణ్యకార్యము అల్లాహ్ స్వీకరించడు, ఈ ఖుర్బానీ కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొద్ద స్వీకరించబడదు.
కాబట్టి ఖుర్బానీ చేస్తున్నవారు అటు పిసినారితనము ప్రదర్శించకుండా, ఇటు ప్రదర్శనా బుద్ధిని కూడా ప్రదర్శించకుండా చిత్తశుద్ధితో అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే ఖుర్బానీ చేయాలి. అలాగే ధర్మసమ్మతమైన హలాల్ సంపదతోనే ఖుర్బానీ పశువు కొని ఖుర్బానీ చేయాలి. హరామ్ సంపదతో పశువు కొని ఖుర్బానీ చేస్తే ఆ ఖుర్బానీ ఆమోదించబడదు. హరామ్ సంపదతో ఏ పుణ్యకార్యము చేసినా అది ఆమోదించబడదు, స్వీకరించబడదు.
ఇవి కొన్ని ముఖ్యమైన విషయాలు సూచనలు. నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని అందరికీ హలాల్ సంపదతో, చిత్తశుద్ధితో, సంతోషంగా మంచి పశువుని అల్లాహ్ ప్రసన్నత కోసం ఖుర్బానీ ఇచ్చే భాగ్యం అల్లాహ్ ప్రసాదించుగాక. ఎవరెవరికైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్తోమత ఇచ్చారో వారందరూ ఖుర్బానీ చేసుకునే భాగ్యం అల్లాహ్ అందరికీ ప్రసాదించుగాక. ఎవరికైతే స్తోమత లేదో వారందరికీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్బానీ చేయటానికి అర్హత, స్తోమత ప్రసాదించుగాక. ఆమీన్ తకబ్బలల్లాహు మిన్నా వమిన్ కుమ్ వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సాబిత్ బిన్ జహ్హాక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒక వ్యక్తి ‘బువాన’ అనే చోట ఒంటె బలి ఇవ్వాలని మ్రొక్కుకున్నాడు. అతను ప్రవక్త వద్దకు వచ్చి “నేను ‘బువాన’ అనే చోట ఒంటె బలి ఇవ్వాలని మ్రొక్కు- కున్నాను. (నా మ్రొక్కును పూర్తి చేయాల వద్దా అని ప్రశ్నిం- చాడు). “అజ్ఞాన కాలం నాటి ఏదైనా విగ్రహ పూజ అక్కడ జరుగుతుందా?” అని ప్రవక్త అడిగారు. ‘లేదు’ అని ప్రజలన్నారు. “అయితే వారి పండుగ, ఉత్సవాలు ఏమైనా అక్కడ జరుగు– తాయా?” అని ప్రవక్త అడిగారు. ‘లేదు’ అని వారన్నారు. అప్పుడు ప్రవక్త చెప్పారుః “నీ మ్రొక్కును పూర్తి చేయి. అల్లాహ్‌కు అవిధేయతలో ఉన్న ఏ మ్రొక్కూ పూర్తి చేయవద్దు. అలాగే మనిషి అధికారంలో లేని మ్రొక్కు కూడా పూర్తి చేయకూడదు”. (అబూ దావూద్/ బాబు మా యుఅమరు బిహీ మినల్ వఫాఇ… 3313).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[7:05 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[6:10 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ధర్మపరమైన నిషేధాలు – 8
8- కాబా తప్ప మరేదాని ప్రదక్షిణం (తవాఫ్) చేయకు. మక్క ముకర్రమ, మస్జిదె హరాంలో ఉన్న కాబా ప్రదక్షిణం ఆల్లాహ్ యొక్క ఆరాధన మరియు ఆయన సన్నిధానంలో చేర్పించే ఉత్తమ కార్యం. దానిని వదలి లేదా దానితో పాటు ఏదైనా సమాధి, రాయి, మరేదాని ప్రదక్షిణం పుణ్యోద్దేశంతో, శిక్షకు భయ- పడుతూ చేయకు [1]
ఈ గృహాన్ని (కాబా) మేము మానవులందరికీ కేంద్రంగాను, శాంతి నిలయంగానూ చేశాము. ఇబ్రాహీము నిలబడిన ప్రదేశాన్ని నమాజు స్థలంగా చేసుకోండి. ఇంకా ఈ నా గృహాన్ని, దానికి ప్రదక్షిణం చేసేవారి కొరకు, దానిలో ఏతెకాఫ్ పాటించేవారి కొరకు, రుకూ, సజ్దాలు చేసేవారి కొరకు పరిశుద్ధంగా ఉంచవలసిందని ఇబ్రాహీమును, ఇస్మాఈలును నిర్దేశించాము[. (బఖర 2: 125).
[1] సమాధుల, మజారుల వద్ద ప్రదక్షిణం మరియు జిబహ్ (జంతువు బలి) యొక్క రకాలు క్రింది విధంగా ఉన్నాయిః
1- సమాధిలో ఉన్నవారి గురించి ప్రదక్షిణం, జిబహ్ చేస్తే, అతడు తౌహీద్ (దైవఏకత్వం)కు వ్యతిరేకమైన పెద్ద షిర్క్ చేసినవాడౌతాడు.
2- ఒకవేళ అతని ప్రదక్షిణం అల్లాహ్ కొరకే కాని సమాధివారు లాభ నష్టాలు చేకూర్చే శక్తిగలవారని నమ్మితే అతడు కూడా తౌహీద్ కు వ్యెతిరేకమైన, ధర్మ భ్రష్టతకు కారణమయ్యే పెద్ద షిర్క్ చేసినవాడు అవుతాడు.
3- ఒకవేళ అతని ప్రదక్షిణం అల్లాహ్ కొరకే ఉండి నమాధివారి గురించి ఏ ప్రభావ విశ్వాసం లేకుండా ‘ఆ సమాధి వారిది ఉన్నత స్థానం, ఆయన ఆ స్థానం లాభనష్టాలకు కారణం’ అని నమ్మితే, అప్పుడు ఇది షిర్క్ సంబంధిత బిద్అత్ (దురాచారం) అవుతుంది. కాని ధర్మ భ్రష్టతకు కారణమయ్యే పెద్ద షిర్క్ కాదు. పోతే అల్లాహ్ యూదులను, క్రైస్తవులను శపించినట్లు అతను కూడా శాపగ్రస్తుడు అవుతాడు. అలాగే సమాధిని మస్జిదుగా చేసుకున్నవారు కూడా శాపగ్రస్తులు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[11:37 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ధర్మపరమైన నిషేధాలు – 23
23– అల్లాహ్యేతరుల కొరకు జంతు బలి చేయకు.అది వారి సన్నిధానం పొందుటకుగాని, లేదా వారితో భయం చెంది, లేదా వారేమైనా ఇస్తారని ఆశించి. ఉదాహరణకుః జిన్నాతుల నుండి ఏ హానీ కలగకూడదని లేదా మృతుల నుండి ఏదైనా లాభం కలగాలని వారి కొరకు బలి ఇచ్చుట([1]).
ఇలా అను: నా నమాజ్, నా బలి (ఖుర్బానీ), నా జీవనం, నా మరణం, సమస్తమూ సకలలోకాలకూ ప్రభువైన అల్లాహ్ కొరకే, ఆయనకు ఏ భాగస్వామీ లేడు. ఈ ఆజ్ఞయే నాకు ఇవ్వబడింది[. (అన్ఆమ్ 6: 163,164).
([1]) అల్లాహ్ యేతరుల కొరకు చేసే జంతు బలి రెండు రకాలుగా ఉంటుందిః
1- సన్నిధానం పొందుటకు, గౌరవభావంతో, ఆరాధన ఉద్దేశంతో చేయుట. అందులో అతని నుండి ఎదైనా మేలు ఆశిస్తూ, లేదా అతని నుండి కీడు కలగవద్దన్న భయంతో చేయుట. ఇది పెద్ద షిర్క్. ఇస్లాం నుండి బహిష్కరణకు కారణం. తౌహీద్ కు వ్యతిరేకం. ఉదాహ- రణకుః ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత జంతు బలి ఇచ్చి, దానిని ఇంట్లో ఉంచుట, జిన్, షైతానుల కీడు నుండి రక్షణ ఉద్దేశంతో దాని రక్తాన్ని గోడలకు పూయుట.
2- ఎవరైనా అతిథి, బందువు వచ్చినప్పుడు అల్లాహ్ ప్రసన్నత ఉద్దేశంతో జంతువును కోయుట ఇది ధర్మసమ్మతం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఖుర్బానీ ఆదేశాలు – ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ ఖుర్బానీ అసలు ఉద్దేశ్యం,ఖుర్బానీ ప్రాముఖ్యత, ఖుర్బానీ ఘనత, ఖుర్బానీ ఎవరి కొరకు?, కొన్ని ముఖ్య విషయాలు, ఖుర్బానీ నిబంధనలు, ఖుర్బానీ జంతువు లోపాలు, జిబహ్ షరతులు, తప్పులు సరిదిద్దుకుందాం, మృతుల వైపున ఖుర్బానీ.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.