సులభమైన పనులకు లభించే గొప్ప ప్రతిఫలాలు : సహీహ్ అల్-కలిమ్ అత్-తయ్యిబ్ | షేఖ్ ముహమ్మద్ నాసిరుద్దీన్ అల్-అల్బానీ [పుస్తకం]

హవిజ్ అలా జవాయిజ్ (ప్రతిఫలాల సముపార్జన)

సులభమైన పనులకు లభించే గొప్ప ప్రతిఫలాల కొరకు ఎంపిక చేయబడిన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసులు

షేఖుల్ ఇస్లాం ఇబ్న్ తైమియా రాసిన ‘అల్-కలిమ్ అత్-తయ్యిబ్’ నుండి తీసుకోబడిన సహీహ్ హదీసులు
పరిశీలన: షేఖ్ ముహమ్మద్ నాసిరుద్దీన్ అల్-అల్బానీ

సంకలనం: హజ్జాజ్ బిన్ అబ్దుల్లా అల్-అరీనీ
ఇంగ్లీష్ అనువాదం: అబ్బాస్ అబూ యహ్యా
https://abdurrahman.org/?p=21341
తెలుగు అనువాదం : teluguislam.net

సకల స్తోత్రాలు సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌కే చెందుతాయి. మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై, ఆయన కుటుంబంపై, ఆయన సహచరులపై మరియు తీర్పు దినం వరకు ఆయన మార్గదర్శకత్వాన్ని అనుసరించే వారందరిపై శాంతి మరియు శుభాలు కురియుగాక.

తదుపరి (Then to proceed), నిశ్చయంగా అల్లాహ్ తఆలా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అత్యంత అనర్గళమైన ప్రసంగంతో పంపాడు, అల్లాహ్ తఆలా ఇలా సెలవిస్తున్నాడు:

وَمَا يَنطِقُ عَنِ الْهَوَىٰ ، إِنْ هُوَ إِلَّا وَحْيٌ يُوحَىٰ
(వమా యన్ తిఖు అనిల్ హవా, ఇన్ హువ ఇల్లా వహ్యున్ యూహా)
“మరియు ఆయన తన మనోవాంఛను అనుసరించి మాట్లాడడు. అది (అతను మాట్లాడేదంతా) అతని వద్దకు పంపబడే దైవవాణి (వహీ) తప్ప మరేమీ కాదు.”(అన్-నజ్మ్ 53 : 3-4)

మరియు ఆయన ఇలా అన్నాడు:

وَمَا آتَاكُمُ الرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَاكُمْ عَنْهُ فَانتَهُوا
(వమా ఆతాకుముర్ రసూలు ఫఖుజూహు వమా నహాకుమ్ అన్హు ఫన్ తహూ)
“దైవప్రవక్త మీకు ఇచ్చిన దానిని (సంతోషంగా) పుచ్చుకోండి. ఆయన ఏ విషయం నుండైన మిమ్మల్ని వారిస్తే, దాన్ని వదిలిపెట్టండి.” (అల్-హష్ర్ 59 : 7)

మరియు ఆయన ఇలా అన్నాడు :

مَّن يُطِعِ الرَّسُولَ فَقَدْ أَطَاعَ اللَّهَ
(మన్ యుతిఇర్ రసూల ఫఖద్ అతాఅల్లాహ్)
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు విధేయత చూపినవాడు అల్లాహ్‌కు విధేయత చూపినట్లే.(అన్-నిసా: 80)

అల్లాహ్ ఈ ఉమ్మత్‌ను తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మార్గదర్శకత్వంతో అనుగ్రహించాడు. ఈ మార్గదర్శకత్వంలోని గొప్ప విశేషమేమిటంటే, ఆరాధనలు సులభంగా ఉండటమే కాకుండా, వాటిని ఆచరించినందుకు లభించే ప్రతిఫలాలు అత్యంత గొప్పవిగా ఉండటం.

సత్కార్యాల పట్ల ప్రజల్లో ఆసక్తిని పెంపొందించడానికి అల్లాహ్ యొక్క రసూల్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అనేక హదీసుల ద్వారా కొన్ని పనులను, ప్రార్థనలను మనకు తెలియజేశారు. వీటిని ఆచరించడం వల్ల గొప్ప మరియు సుపరిచితమైన ఫలితాలు లభిస్తాయి.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించిన అమూల్యమైన అణిముత్యాల వంటి కొన్ని ప్రార్థనలను ఈ హదీసుల సంకలనంలో చేర్చడం జరిగింది. అల్లాహ్ అనుగ్రహం పొందిన వారికి ఇవి చాలా సులభమైన పనులు అయినప్పటికీ, ఇవి ఇచ్చే ప్రతిఫలాలు మాత్రం అపారమైనవి.

నేను ఈ హదీసులను షేఖుల్ ఇస్లాం ఇబ్న్ తైమియా (రహిమహుల్లాహ్) రాసిన ‘అల్-కలిమ్ అత్-తయ్యిబ్‘ పుస్తకం నుండి ఎంపిక చేశాను. దీనిని షేఖ్ ముహమ్మద్ నాసిరుద్దీన్ అల్-అల్బానీ (రహిమహుల్లాహ్) పరిశోధించి, అందులోని ప్రామాణికమైన హదీసులను మాత్రమే సేకరించి ‘సహీహ్ అల్-కలిమ్ అత్-తయ్యిబ్‘గా రూపొందించారు. ఈ సంకలనంలో పేర్కొన్న హదీసులన్నీ షేఖ్ అల్-అల్బానీ గారి పరిశోధన ప్రకారం ప్రామాణికమైనవి (సహీహ్ లేదా హసన్).

విషయం క్లుప్తంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కరపత్రంలో కేవలం హదీసుల మూల పాఠ్యాన్నే అందించడం జరిగింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేసిన గొప్ప ప్రతిఫలాల ఆధారంగా, నేను ఈ సంకలనానికి ‘హవిజ్ అలా జవాయిజ్’ (ప్రతిఫలాల సముపార్జన) అని నామకరణం చేశాను.

అల్లాహ్ అనుమతితో ఇటువంటి పరిశోధనలు మరిన్ని జరిగితే అవి ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రజలకు సరైన జ్ఞానాన్ని, మార్గదర్శకత్వాన్ని అందించడానికి హదీసు గ్రంథాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ఎంతో అవసరం.

గమనిక: ప్రతి హదీసు యొక్క అరబీ మూల పాఠం షేఖ్ అల్-అల్బానీ (రహిమహుల్లాహ్) గారి ‘సహీహ్ అల్-కలిమ్ అత్-తయ్యిబ్’ (صَحِيحُ الْكَلِمِ الطَّيِّبِ) పుస్తకం నుండి తీసుకోబడింది. అరబీ పాఠం చివర ఉన్న సంఖ్య ఆ పుస్తకంలోని హదీసు సంఖ్య.

హదీసుల ఎంపిక గురించి (teluguislam.net గమనిక): షేఖ్ అల్-అల్బానీ గారి ‘సహీహ్ అల్-కలిమ్ అత్-తయ్యిబ్’ పుస్తకంలో మొత్తం 193 హదీసులు ఉన్నాయి. వాటిలో నుండి, ఒక సులభమైన పనికి స్పష్టమైన గొప్ప ప్రతిఫలం లేదా ఫలితం పేర్కొనబడిన 49 హదీసులను మాత్రమే సంకలనకర్త ఈ కరపత్రం కోసం ఎంచుకున్నారు. అవి ఇక్కడ 50 అంశాలుగా ఇవ్వబడ్డాయి (16 మరియు 17 అంశాలు ఒకే హదీసు యొక్క రెండు రివాయతులు). మిగిలిన హదీసులు – ప్రతిఫలం ప్రత్యేకంగా పేర్కొనబడని దుఆలు, అజ్కార్ మరియు ఇతర విషయాలు – ఈ కరపత్రం యొక్క ఉద్దేశానికి (సులభమైన పనులు – గొప్ప ప్రతిఫలాలు) సరిపోనందున చేర్చబడలేదు; అవి బలహీనమైనవని దీని అర్థం కాదు. అందుకే అరబీ పాఠం చివర ఉన్న పుస్తక సంఖ్యలు వరుసగా ఉండవు (ఉదా: 6, 7, 8, 9, 11, 15…).


1. రోజుకు వంద సార్లు “లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ…”
2. రోజుకు వంద సార్లు “సుబ్‌హానల్లాహి వ బిహమ్దిహీ”
3. నాలుకపై తేలికైన, త్రాసులో బరువైన రెండు వాక్యాలు
4. అల్లాహ్‌కు అత్యంత ప్రియమైన నాలుగు వాక్యాలు
5. ప్రతి రోజు వెయ్యి పుణ్యాలు
6. స్వర్గపు నిధి
7. ఉదయం, సాయంత్రం “సుబ్‌హానల్లాహి వ బిహమ్దిహీ”
8. ఉదయం, సాయంత్రం మూడు ఖుల్ సూరాలు
9. సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్
10. “బిస్మిల్లాహిల్లజీ లా యజుర్రు…” – ఏదీ హాని చేయదు
11. నిద్రకు ముందు ఆయతుల్ కుర్సీ
12. సూరా అల్-బఖరా చివరి రెండు ఆయతులు
13. నిద్రకు ముందు తస్బీహ్ – సేవకుని కంటే శ్రేష్ఠం
14. రాత్రి మేల్కొన్నప్పుడు
15. పరిశుద్ధ స్థితిలో నిద్రపోవడం
16. చెడు కల వచ్చినప్పుడు
17. మంచి కలలు, చెడు కలలు
18. రాత్రి చివరి మూడవ భాగంలో అల్లాహ్ దిగి వస్తాడు
19. ప్రతి రాత్రి స్వీకరించబడే ఒక ఘడియ
20. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు
21. ఇంట్లో ప్రవేశించేటప్పుడు, భోజనంలో అల్లాహ్ స్మరణ
22. ఇంట్లో ప్రవేశించేటప్పుడు సలాం చేయడం
23. మస్జిద్‌లో ప్రవేశించేటప్పుడు
24. అజాన్ మరియు మొదటి పంక్తి (సఫ్)
25. ముఅజ్జిన్ కొరకు సాక్షులు
26. అజాన్‌కు జవాబు, దరూద్ మరియు వసీలా
27. అజాన్ తర్వాత దుఆ
28. ముఅజ్జిన్ పలికినట్లే పలికి, ఆ తర్వాత అడగండి
29. అజాన్ మరియు ఇఖామత్ మధ్య దుఆ
30. తిరస్కరించబడని రెండు దుఆలు
31. ప్రతి నమాజ్ తర్వాత తస్బీహ్ – పేద ముహాజిర్లు
32. నమాజ్ తర్వాత తస్బీహ్ – వంద పూర్తి చేయడం
33. స్వర్గానికి చేర్చే రెండు సులభమైన అలవాట్లు
34. ఇస్తిఖారా – అల్లాహ్ ఎంపికను కోరడం
35. యూనుస్ (అలైహిస్సలాం) దుఆ
36. ఆందోళన, దుఃఖం కలిగినప్పుడు దుఆ
37. నమాజులో వస్వసా – ఖిన్‌జబ్
38. ఆపద కలిగినప్పుడు
39. అప్పులు తీరడానికి దుఆ
40. శరీరంలో నొప్పి కలిగినప్పుడు
41. రోగిని పరామర్శించేటప్పుడు
42. ఏదైనా ప్రదేశంలో దిగినప్పుడు
43. భోజనం తర్వాత
44. సలాంను వ్యాపింపజేయడం
45. సలాం యొక్క పుణ్యాలు
46. భార్యాభర్తల కలయికకు ముందు
47. కఫ్ఫారతుల్ మజ్లిస్ – సభ ముగింపులో
48. కోపం వచ్చినప్పుడు
49. ఆపదలో ఉన్నవారిని చూసినప్పుడు
50. బజారులో ప్రవేశించేటప్పుడు

సత్-సంకల్పం (హుస్నే-నియ్యత్): హజ్ పుణ్యానికి సమానమైన సత్కార్యాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[12:41 నిముషాలు]
ఈ వీడియో క్లిప్ క్రింది వీడియో నుండి తీసుకోబడింది:
హజ్ / ఉమ్రా పుణ్యానికి సమానమైన సత్కార్యాలు [వీడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

కేవలం దేవుని ప్రసన్నత కోసం ఎవరైనా మస్జిదు నిర్మిస్తే అతని కోసం దేవుడు అలాంటిదే ఒక ఇల్లు స్వర్గంలో నిర్మిస్తాడు

309. హజ్రత్ ఉబైదుల్లా ఖూలానీ (రధి అల్లాహు అన్హు) కధనం :-

హజ్రత్ ఉస్మాన్ (రధి అల్లాహు అన్హు) మస్జిదె నబవి (ప్రవక్త మస్జిదు) ని పునర్నిర్మించినపుడు ప్రజలు ఆయన్ని ఏవేవో మాటలు అన్నారు. హజ్రత్ ఉస్మాన్ (రధి అల్లాహు అన్హు) ఆ మాటలు విని ఇలా అన్నారు. “మీరు లేనిపోని మాటలు అంటున్నారు గాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏమన్నారో తెలుసా? ‘కేవలం దేవుని ప్రసన్నత కోసం ఎవరైనా మస్జిదు నిర్మిస్తే అతని కోసం దేవుడు అలాంటిదే ఒక ఇల్లు స్వర్గంలో నిర్మిస్తాడు’ అని అన్నారాయన.”

[సహీహ్ బుఖారీ  : 8 వ ప్రకరణం – సలాత్, 65 వ అధ్యాయం – మన్ బనా మస్జిద్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 4 వ అధ్యాయం – మస్జిదుల నిర్మాణం పట్ల ప్రోత్సాహం. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్