సుత్రా (అడ్డంకి) లేకుండా నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుండి ఎలా వెళ్ళాలి?

షేక్ అరఫాత్ ఇబ్న్ హసన్ అల్-ముహమ్మదీ:

సున్నత్ ఏమిటంటే, మీరు నమాజులో నిలబడి ఉన్నప్పుడు, మీకు మరియు సుత్రాకు మధ్య మూడు మూరల దూరం ఉండాలి. మరియు మీరు సజ్దా (సాష్టాంగం) లో ఉన్నప్పుడు, మీ తలకు మరియు సుత్రాకు మధ్య ఒక గొర్రె దాటి వెళ్ళడానికి సరిపడేంత ఖాళీ స్థలం ఉండాలి.

ఉదాహరణకు, సుత్రా ఇక్కడ ఉండి, నమాజు చేసే వ్యక్తి ఇక్కడ ఉంటే, అతను ఫలానా చోట సజ్దా చేస్తాడు. కాబట్టి సజ్దా స్థితిలో అతని తలకు మరియు సుత్రాకు మధ్య ఒక గొర్రె లేదా మేక వెళ్ళడానికి సరిపడేంత ఖాళీ స్థలం మిగిలి ఉండాలి.

కాబట్టి, మీరు (నమాజు చేసే వ్యక్తి ముందు నుండి) దాటి వెళ్ళాలనుకుంటే, సుత్రా ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశానికి అవతలి వైపు (వెలుపల) నుండి వెళ్ళాలి. ఉదాహరణకు, ఆ వ్యక్తి సజ్దా లో ఉన్నట్లయితే, ఒక గొర్రె వెళ్ళడానికి ఎంత స్థలం పడుతుందో అంచనా వేయండి, ఆ తర్వాత సుత్రా ఎక్కడ ఉంటుందో (అది ఒక చిన్న వస్తువు అయినప్పటికీ) అంచనా వేసి, దానికి ఆవల (వెనుక) నుండి వెళ్ళండి. ఇది మాత్రమే అనుమతించబడినది. ఈ స్థితిలో మీరు ఆ విధంగా దాటి వెళ్ళడం మీకు అనుమతించబడుతుంది.

అరబీ మూలం: https://t.me/Arafatbinhassan/9848
ఆంగ్లానువాదం: యాసీన్ ఇబ్న్ జమాల్ (Yāsīn ibn Jamāl)
https://salafitranslations.com/how-to-pass-in-front-of-someone-praying-without-sutrah-barrier

అవసరాలు తీరడానికి ప్రవక్తపై సలాహ్ (దరూద్) పంపడం గురించిన హదీసు

ఒక అవసరం తీరాలనే ఉద్దేశ్యంతో ప్రవక్త (ﷺ) పై సలాహ్ పంపితే, ఆ అవసరం నెరవేరుతుందనేది ప్రామాణికమైన (ఆథెంటిక్) విషయమేనా?

అవును. ఎవరైతే అల్లాహ్ తమ అవసరాన్ని తీర్చాలని కోరుకుంటారో, వారు ప్రవక్త (ﷺ) పై తరచుగా ఎక్కువగా సలాహ్ పంపాలి. దీనికి సంబంధించి ఒక ‘సహీహ్’ (ప్రామాణిక) హదీసు ఉంది.

ప్రవక్త (ﷺ) ఒకసారి ఉబయ్ ఇబ్న్ కఅబ్ (రజియల్లాహు అన్హు) తో మాట్లాడారు, ఆయన ఎక్కువగా ప్రార్థిస్తూ మరియు (ప్రవక్త పై) సలాహ్ పంపుతూ ఉండేవారు. ఆయన (ఉబయ్) ఇలా అడిగారు: “ఓ అల్లాహ్ ప్రవక్తా, నా దుఆ (ప్రార్థన) లో మీపై సలాహ్ పంపడానికి నేను ఎంత సమయాన్ని కేటాయించాలి?” ప్రవక్త (ﷺ) ఇలా బదులిచ్చారు: “నీ ఇష్టం (ఎంతైనా చేసుకోవచ్చు), కానీ నువ్వు ఇంకా ఎక్కువ చేస్తే అది నీకే మరింత మంచిది.” ఉబయ్ (రజియల్లాహు అన్హు) ఆ సమయాన్ని మరింత పెంచుకుంటూ పోయి చివరకు ఇలా అన్నారు: “ఓ అల్లాహ్ ప్రవక్తా, నేను నా ప్రార్థన (దుఆ) అంతటినీ మీపై సలాహ్ పంపడానికే కేటాయిస్తాను.” (అప్పుడు) ప్రవక్త (ﷺ) ఇలా అన్నారు: “అయితే నీ కష్టాలన్నీ (విచారాలు) తీర్చబడతాయి మరియు నీ పాపాలు క్షమించబడతాయి.”

ఈ హదీసు ఇమామ్ తిర్మిజీ ప్రకారం ‘హసన్’ (ఆమోదయోగ్యమైనది).

ఒక వ్యక్తి దుఆ చేస్తూ (ప్రవక్తపై సలాహ్ పంపినప్పుడు), అల్లాహ్ వారి అవసరాన్ని నెరవేరుస్తాడని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యమని పండితులు అన్నారు — ఎందుకంటే మనిషికి విచారం (కష్టం) అనేది ఒక అవసరం తీరకపోవడం (లేదా ఒక ఆవశ్యకత) వల్లే వస్తుంది.


అరబీ మూలం (Source): https://t.me/Arafatbinhassan/13511
ఇంగ్లీష్ అనువాదం: యాసీన్ ఇబ్న్ జమాల్ (గమనిక: ఈ హదీసులోని కొన్ని భాగాలను షేఖ్ ప్రస్తావించలేదు, కాబట్టి జవాబు పూర్తి స్థాయిలో ఉండటానికి వాటిని అనువాదంలో నేను అదనంగా చేర్చాను)
https://salafitranslations.com/sending-salah-on-the-prophet-to-fulfill-needs

క్రయవిక్రయాల ఆదేశాలు [1] – అమ్మడం కొనడం గురుంచిన ఆదేశం, ఔచిత్యం & అర్కాన్ [వీడియో & టెక్స్ట్]

Rules of Buying and Selling
క్రయవిక్రయాల ఆదేశాలు [1] – క్రయవిక్రయాల ఆదేశం, ఔచిత్యం & అర్కాన్
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/LLp42A0vsB8 [14 నిముషాలు]

ఈ ప్రసంగంలో వక్త ఇస్లాంలో క్రయ విక్రయాల (కొనుగోలు మరియు అమ్మకం) నియమాల గురించి వివరించారు. ముఖ్యంగా వ్యాపారం యొక్క ధార్మిక ఆదేశం (హుకుం), అందులోని మర్మం లేదా ఔచిత్యం (హిక్మత్), మరియు వ్యాపారం సక్రమంగా జరగడానికి కావలసిన ఐదు ప్రధాన మూలస్తంభాల (అర్కాన్) గురించి ఖురాన్ ఆయతులు మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి హదీసుల వెలుగులో విపులంగా తెలియజేశారు.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్.

ప్రియ వీక్షకులారా! మరో కొత్త శీర్షికతో మీ ముందుకు హాజరయ్యాను. ప్రారంభం నుండి చివరి ఎపిసోడ్ వరకు మీరు ఈ అంశాలన్నీ కూడా ఈ సిరీస్ లోని అన్ని ఎపిసోడ్లు కూడా తప్పకుండా చూడండి. ఏమిటి అది? క్రయ విక్రయాల ఆదేశాలు. అల్లాహు అక్బర్. అవును ఇస్లాం ధర్మం మన జీవితంలోని ప్రతి కోణానికి సంబంధించిన విషయంలో ఉత్తమ ఆదర్శం, చాలా మంచి స్పష్టమైన మనకు మార్గం చూపుతుంది. రోజువారి జీవితంలో పిల్లల నుండి పెద్దల వరకు, పురుషుల నుండి స్త్రీల వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక అవసరమైన వస్తువు కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ కొనడం, అమ్మడం, క్రయ విక్రయాల గురించి ఇస్లాం ఇచ్చినటువంటి స్పష్టమైన ఆదేశాలు మనం తెలుసుకోవడం చాలా అవసరం. అందుకే ఈరోజు మొదటి పాఠం మీ ముందుకు వస్తుంది. క్రయ విక్రయాలు అంటే అమ్మకం మరియు కొనుగోలు యొక్క ఆదేశం ఏమిటి? దాని యొక్క అంతరార్థం, హిక్మత్, ఔచిత్యం మరియు మర్మం ఏమిటి? దాని యొక్క అర్కాన్, పిల్లర్స్, మూల స్తంభాలు ఎన్ని ఉన్నాయి? రండి ముందు దాని యొక్క ఆదేశం గురించి హుకుం అనేది ఏమిటో తెలుసుకుందాం.

క్రయ విక్రయాలు చేయడం అంటే అమ్మడం మరియు కొనడం పవిత్ర ఖురాన్ ద్వారా ధృవీకరించబడినది. ఖురాన్ లో దీని గురించి అల్లాహ్ త’ఆలా మనకు అనుమతించాడు. కనుక సూరతుల్ బఖరా ఆయత్ నెంబర్ 275 లో తెలిపాడు:

وَأَحَلَّ ٱللَّهُ ٱلْبَيْعَ وَحَرَّمَ ٱلرِّبَوٰاْ
[వ అహల్లల్లాహుల్ బయ్య వ హర్రమర్రిబా]
కాని అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం (హలాల్) చేసి, వడ్డీని హరామ్ (నిషిద్ధం) చేశాడు. (2:275)

అల్లాహ్ త’ఆలా వ్యాపారాన్ని ధర్మసమ్మతం హలాల్ చేశాడు మరియు వడ్డీని నిషేధించాడు. కనుక వడ్డీ దగ్గరికి వెళ్ళకండి. అలాగే ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి బోధనలు మరియు ఆచరణ రెండూ కూడా దీనికి ఆధారంగా ఉన్నాయి. ప్రవక్త వారి వాచా, కర్మ సున్నతులు దీనికి అనుమతిస్తున్నాయి. కనుక ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా అమ్మారు, కొనుగోలు చేశారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ క్రయ విక్రయాల గురించి ఎన్నో ఆదేశాలు ఇచ్చారు. వాటిలో ఒకటి ఏమిటి? అబూ దావూద్ లో వచ్చినటువంటి హదీస్:

لَا يَبِيعُ حَاضِرٌ لِبَادٍ
[లా యబీఉ హాదిరున్ లి బాదిన్]
పట్టణవాసి గ్రామస్తుడి తరఫున (మధ్యవర్తిగా ఉండి) అమ్మకూడదు.

అంటే ఏమిటో తెలుసు కదా, ఎందరో పల్లెల్లో ఉన్నవారు, గ్రామాల్లో ఉన్నవారు, తోటలు ఉంటాయి వారికి వ్యవసాయాలు ఉంటాయి, వారు తమ యొక్క పంటను అమ్మడానికి నగరానికి వస్తారు, సిటీలోకి వస్తారు. అయితే అక్కడ రైతు బజార్ అని ఏదైతే ఉంటుందో అక్కడి యొక్క రేట్ తెలుసుకొని ఎవరి వద్ద ఎలా అమ్మితే మనకు మంచి లాభం ఉంటుందో వారు స్వయంగా వచ్చి అమ్ముకోవచ్చు. కానీ కొందరు దలాల్ అని అంటాము కదా వారు ఏం చేస్తారు దారిలో మధ్యలోకి వెళ్తారు లేదా మార్కెట్ కు ఆ పల్లెవాసి రాకముందే మధ్యలో కలిసి ఏదో ఒక తక్కువ రేట్లో వ్యాపారం చేసేసుకుంటారు. అలా చేయకండి, ప్రతి ఒక్కరికి వారి సొమ్ము వారి వాటా లభించనివ్వండి.

అలాగే మరొక హదీస్ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలిపారు, సహీహ్ బుఖారీలో ఉంది:

الْبَيِّعَانِ بِالْخِيَارِ مَا لَمْ يَتَفَرَّقَا
[అల్ బయ్యిఆని బిల్ ఖియారి మా లమ్ యతఫర్రఖా]
అమ్మేవారు మరియు కొనేవారు ఇరువురు విడిపోనంత వరకు (ఆ బేరాన్ని రద్దు చేసుకునే లేదా ఒప్పుకొని తీసుకునే) ఎంపిక వారికి ఉంటుంది.

అమ్మేవారు మరియు కొనేవారు ఇరువురు విడిపోనంత వరకు ఆ బేరాన్ని రద్దు చేసుకునే లేదా ఒప్పుకొని తీసుకునే అటువంటి ఖియార్, ఆ చాయిస్ వారికి ఉంటుంది. ఎప్పటి వరకైతే వారు కలిసి ఉంటారో. విడిపోయారు, ఎక్కడి వారు అక్కడ వెళ్ళిపోయారు, అమ్మేవారు వెళ్ళిపోయారు, కొనేవారు వెళ్ళిపోయారు, తర్వాత వచ్చి ఇది నాకు వద్దు అని అంటే ఆ చాయిస్ తీసుకోవాలా వద్దా అన్నటువంటి ఒక నిర్ణీత గడియ దానికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక హద్దు తెలిపారు. ఈ హదీసుల అసలు ఉద్దేశ్యం మీకు అర్థమైంది కదా, అంటే మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మాటల ద్వారా ఈ క్రయ విక్రయాలు అమ్మడం కొనడానికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వడమే కాకుండా స్వయంగా కొన్నారు, స్వయంగా అమ్మారు కూడా.

అయితే ఇక రండి, ఇప్పుడు ఈ క్రయ విక్రయాల, Buy and Sell, దీని యొక్క అంతరార్థం ఏమిటి? హిక్మత్ ఏమిటి? ఇందులో ఔచిత్యం, మర్మం ఏమున్నది? మనిషి ఇతరుల వద్ద ఉన్న తన అవసరాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి నష్టం వేరే వారికి చేకూర్చకుండా, స్వయం తాను నష్టంలో పడకుండా, సులభంగా తన ఆ అవసరాన్ని తీర్చుకోవడం. నాకు కావలసిన ఒక వస్తువు ఫలానా వ్యక్తి వద్ద ఉంది, అతడు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నేను వెళ్లి దానికి సంబంధించిన రుసుము, డబ్బు, ధర, వెల ఎంత ఉన్నదో ఇచ్చేసి అది తీసుకోవడం. ఈ విధంగా ప్రతి ఒక్కరు తమ అవసరాన్ని తీర్చుకుంటున్నారు. ఎవరికీ ఏ ఇబ్బంది కలిగించకుండా, ఎవరినీ ఏ నష్టంలో పడవేయుకుండా. హిక్మత్ తెలిసింది కదా, ఎన్నో హిక్మతులు ఉన్నాయి ఇది చాలా ముఖ్యమైనది. ప్రతి మనిషి జీవితంలో అవసరం ఉండేది.

ఇప్పుడు చాలా ముఖ్యమైన ఒక విషయం తెలుసుకోబోతున్నాము. అదేమిటి? ఈ క్రయ విక్రయాలకు సంబంధించిన అర్కాన్ ఎన్ని? అవి ఐదు. జాగ్రత్త సుమా, ఇస్లాం యొక్క అర్కాన్ ఐదు అని విన్నాము, షహాదతైన్, నమాజ్, రోజా, జకాత్, హజ్. అయితే అవి ఇస్లాం యొక్క అర్కాన్, ప్రతి బిల్డింగ్ కి ప్రతి వస్తువుకు పిల్లర్ అనేది పునాది అనేది దానికి సంబంధించిన మూల పిల్లర్లు అనేవి ఉంటాయి కదా, మూల స్తంభాలు, అలాగే ఈ క్రయ విక్రయాలకు సంబంధించి ఐదు ఉన్నాయి. బాయె, ముష్తరీ, మబీఈ, సీగతుల్ అఖ్ద్ మరియు అత్-తరాదీ.

ఏంటి వీటి భావం? బాయె అంటే అమ్మేవారు. అమ్మే వ్యక్తి తాను అమ్మే వస్తువుకు అసలు యజమాని అయి ఉండాలి లేదా దానిని అమ్మడానికి అతనికి అనుమతి లభించి ఉండాలి. అలాగే అమ్మే వ్యక్తి తెలివితేటలు కలిగి మతిస్థిమితం ఉన్న వాడు అయి ఉండాలి. అంటే అతను పిచ్చివాడు కానీ ఇంకా వేరే కొనడానికి అమ్మడానికి ఏ బుద్ధి జ్ఞానాలు అవసరమో అవి లేకుండా ఉంటే అతడు నష్టంలో పడిపోతాడు, బహుశా ఇతరులను కూడా నష్టంలో పడవేస్తాడు కావచ్చు. ఇది బాయె, అమ్మే వ్యక్తి.

ఇక ముష్తరీ, కొనే వ్యక్తి ఏంటి? రెండవ రుకున్, రెండవ పిల్లర్, రెండవ మూలస్థంభం కొనేవారు. లావాదేవీలు చేసే అటువంటి విచక్షణ కలిగి ఉండాలి. కొనే వ్యక్తి కూడా మతిస్థిమితం లేనివాడు లేదా పెద్దల అనుమతి లేని బాలుడు కాకూడదు. ఎవరైనా పిల్లవాడు ఒక ఐదు రూపాయలు తీసుకొచ్చేసి నాకు చాక్లెట్ ఐస్క్రీం ఇలాంటిది ఏదైనా కొనుక్కుంటున్నాడు అంటే బహుశా అది అంత పెద్ద సమస్య కాదు. చిన్న బాలుడు, పిల్లవాడు 1000 రూపాయలు, 2000 రూపాయలు ఇలా తీసుకొచ్చాడు, ఏదో నేను కొనాలి అనుకుంటున్నాను. ఏం కొంటావు బాబు? ఈ విధంగా చిన్న పిల్లలకు సరైన బుద్ధి జ్ఞానాలు ఉండవు. కనుక కొనే వ్యక్తి కూడా బుద్ధి జ్ఞానముడై మరీ పిల్లలు కాకుండా, ఒకవేళ పిల్లలు అయి ఉంటే పెద్దల అనుమతి అందులో ఉండి తప్పకుండా ఈ రెండు రుకున్లు పాటించాలి.

ఇక మూడవ రుకున్ వచ్చేసి ఏమిటి? మబీఈ అంటే ఆ వస్తువు ఏదైతే అమ్మడం జరుగుతుందో. ఆ వస్తువు ధర్మబద్ధమైనది, నాజాయజ్ కాకూడదు, జాయజ్ వస్తువై ఉండాలి. తాహిర్ అంటే పవిత్రమైనదిగా ఉండాలి, నాపాక్ వస్తువు ఉండకూడదు. అలాగే ఆ వస్తువును కొనే వారికి ఇచ్చే అటువంటి అవకాశం ఉండాలి. ఆ వస్తువు ఏదైతే అమ్మడం జరుగుతుందో కొనే వ్యక్తి ఆధీనంలో వచ్చే అటువంటి అవకాశం ఉండాలి. అంతే కాదు వాటి యొక్క అంటే ఏ వస్తువు కొనడం జరుగుతుందో దాని వివరాలు, దాని మంచి చెడులు కొనే వ్యక్తికి తెలిసి కూడా ఉండాలి. ఎవరైనా వ్యక్తి వచ్చాడు ఒక బాక్స్ మూసి ఉన్నది, నేను అమ్ముతున్నాను అని, అందులో ఏమున్నది, ఎలాంటిది ఏమీ తెలియకుండా ఇలా అమ్మడం ఇలా కొనడం సరైన విషయం కాదు. అర్థమైంది కదా.

ఇక నాలుగవ రుకున్, నాలుగవ మూలస్థంభం సీగయే అఖ్ద్, ఒప్పంద రూపం. అంటే ఏమిటి ఇది మాటల ద్వారా కావచ్చు, ప్రాక్టికల్ గా కూడా కావచ్చు. మాటల ద్వారా అంటే ఏమండీ ఇదిగోండి ఈ డబ్బులు తీసుకోండి నాకు ఆ వస్తువు కావాలి, సరే తీసుకోండి మీకు ఈ వస్తువు ఇచ్చేసాను. కొనే వ్యక్తి డబ్బులు ఇచ్చి నాకు ఇది కావాలి అన్నప్పుడు అమ్మే వ్యక్తి ఇదిగోండి మీరు తీసుకోండి నేను మీకు అమ్మేసాను అని ఇలా మాటల ద్వారా జరగడం కానివ్వండి. లేదా ప్రాక్టికల్ గా ఈ రోజుల్లో ఆన్లైన్ బిజినెస్ లు కానివ్వండి, లేదా డిమార్ట్ ఇంకా పెద్ద పెద్ద మాల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ సామాన్లు అన్నీ పెట్టి ఉంటాయి అల్మారాలలో రేట్లు రాసి ఉంటాయి, ర్యాకులలో పెట్టి ఉంటాయి కదా. మనిషి తనకు అవసరం ఉన్న వస్తువు చూస్తాడు, దాని రేటు చూస్తాడు, అనుకూలంగా ఉంటే తీసుకుంటాడు క్యాషియర్ వద్దకు వచ్చేసి డబ్బులు ఇచ్చేస్తాడు, లేదా కార్డు ద్వారా పే చేస్తాడు. ఇటు కొనే వ్యక్తి అటు అమ్మే వ్యక్తి ఏ ఒక్క మాట మాట్లాడకుండా వ్యాపారం పూర్తవుతుంది. ఏంటిది ప్రాక్టికల్. ఇలా ప్రాక్టికల్ గా లేదా మాట ద్వారా అది పూర్తి అవ్వడానికి అవకాశం ఉండాలి.

ఇక ఐదవది, ఇది చాలా ముఖ్యమైనది. క్రయ విక్రయాల అర్కాన్ మూల స్తంభాల్లో ఐదవది ఉభయ పక్షాల అంగీకారం, ఇష్టం, తరాదీ. అంటే ఏమిటి? ఇరు పక్షాలు, కొనేవారు మరియు అమ్మేవారు వారి ఇష్టపూర్వకంగా, వారి ఇష్టం ఉన్నప్పుడే అది చెల్లుతుంది. ఏ ఒక్కరి తరఫు నుండి ఎలాంటి బలవంతం అనేది జరగకూడదు. ఇదే విషయం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు:

إِنَّمَا الْبَيْعُ عَنْ تَرَاضٍ
[ఇన్నమల్ బయ్యు అన్ తరాదిన్]
వ్యాపారం అనేది ఇరు పక్షాల అంగీకారం మీదనే ఆధారపడి ఉన్నది.

వ్యాపారం అనేది కేవలం ఇరు పక్షాల అంగీకారం మీదనే ఆధారపడి ఉన్నది. దీనికి సంబంధించిన ఆయత్ కూడా ఉంది కదా ఖురాన్ లో, అన్ తరాదిమ్ మిన్కుమ్.

ఈ విధంగా సోదర మహాశయులారా, సోదరీమణులారా క్రయ విక్రయాల ఆదేశాలు, కొనే అమ్మే అటువంటి ఆదేశాలు ఈ మన సిరీస్ లో మొదటి పాఠం పూర్తిగా విన్నారు. మూడు విషయాలు ఇందులో వచ్చాయి. మొదటిది దాని ఆదేశం, రెండవది దాని హిక్మత్ అంతరార్థం, మూడవది దాని యొక్క ఐదు పిల్లర్లు. మంచిగా గుర్తుంచుకోండి ఈ విషయాలు ఇన్షాఅల్లాహ్ రెండవ పాఠంలో మళ్ళీ మనం కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాము. అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక.

వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

నరకవాసుల పడకలు మరియు ఇతర శిక్షలు [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

నరకం, నరకవాసులు, నరకం యొక్క శిక్షలు [పార్ట్ 7] – నరకంలో వారికి లభించే పడకలు, దుప్పట్లు
[మరణానంతర జీవితం – పార్ట్ 61 [21 నిముషాలు]
https://www.youtube.com/watch?v=jcQ-5KK6IMk
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[డౌన్లొడ్ పిడిఎఫ్]

ఈ ప్రసంగంలో నరకవాసుల గురించి తీవ్రమైన హెచ్చరికలు చేయబడ్డాయి. నరకంలో వారికి లభించే పడకలు, దుప్పట్లు నరకాగ్నితో కూడుకున్నవని, వారి తలల పైనుండి, పాదాల క్రింది నుండి శిక్ష కమ్ముకుంటుందని వివరించబడింది. నరకవాసులను బంధించే సంకెళ్లు, ఇనుప గదలు, వేడి నీటితో చర్మం కాలిపోవడం, తిరిగి కొత్త చర్మం రావడం వంటి భయంకరమైన శిక్షల గురించి ఖురాన్ ఆయతుల ద్వారా తెలపబడింది. ముఖం కిందికి లాగబడటం, గాడిదలా తిరగడం, పాములు, తేళ్లు కుట్టడం వంటి శిక్షలను వివరిస్తూ, ఈ నరక యాతనల నుండి ఏ విధంగానూ ఉపశమనం లేదా మరణం ఉండదని వక్త హెచ్చరించారు. చివరగా, అల్లాహ్ దయతో ఇహలోకంలో ప్రసాదించిన వరాన్ని సద్వినియోగం చేసుకుని నరక శిక్ష నుండి రక్షణ పొందాలని కోరారు.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు “మరణానంతర జీవితం” అనే అంశంలో స్వాగతం. నరక శిక్షలు, నరకవాసులకు ఇవ్వబడే ఆహారం, పానీయాలు, దుస్తులు వీటన్నిటి వివరాలు మనం తెలుసుకున్నాము.

ఇక ఈ రోజు మనం వారి గురించి ఎలాంటి పడక ఉంటుంది? ఎలాంటి పరుపు అనేది పడుకోవడానికి వారికి ఇవ్వడం జరుగుతుంది? ఈ విషయాలు మనం తెలుసుకుందాము. అయితే, నరకం అనేది విశ్రాంతి స్థలం కాదు కదా పడుకొని ఉండడానికి! నరకం అనేది ఏదైనా ఆనందకరమైన ప్రదేశం కాదు, అక్కడ మనిషి కొంతసేపటి గురించి ఏదైనా ఎంజాయ్మెంట్ చేసుకోవాలని. అది శిక్షలతో కూడిన స్థలం. అయినా, అక్కడ ఇవ్వబడే తిండి, పానీయం, దుస్తులు ఇవన్నీ శిక్షలతో కూడి ఉంటాయి. ఈ విధంగా వారి గురించి ఏ పరుపులైతే ఉంటాయో, అవి కూడా శిక్షలతో కూడి ఉంటాయి.

సూరహ్ అల్ ఆరాఫ్, ఆయత్ నంబర్ 41 లో అల్లాహ్ తెలిపాడు:

لَهُم مِّن جَهَنَّمَ مِهَادٌ وَمِن فَوْقِهِمْ غَوَاشٍ ۚ وَكَذَٰلِكَ نَجْزِي الظَّالِمِينَ
[లహుమ్ మిన్ జహన్నమ మిహాదువ్ వమిన్ ఫౌకిహిమ్ గవాష్. వ కజాలిక నజ్ జిజ్ జాలిమీన్]
వారి క్రింద నరకాగ్నితో చేయబడిన పాన్పుఉంటుంది. పైన దుప్పటి కూడా (దానితోనే తయారైనదయి ఉంటుంది). దుర్మార్గులకు మేము విధించే శిక్ష ఇలాగే ఉంటుంది. (7:41)

నరకమే నరకం. మరియు వారు కప్పుకోవడానికి పైనుండి ఏ దుప్పట్లయితే వేసుకుంటారో, అవి కూడా నరకానికి సంబంధించినవే,

సూరహ్ అన్ కబూత్, ఆయత్ నంబర్ 55 లో అల్లాహ్ తెలిపాడు:

يَوْمَ يَغْشَاهُمُ الْعَذَابُ مِن فَوْقِهِمْ وَمِن تَحْتِ أَرْجُلِهِمْ وَيَقُولُ ذُوقُوا مَا كُنتُمْ تَعْمَلُونَ
[యౌమ యగ్ షాహుముల్ అజాబు మిన్ ఫౌకిహిమ్ వమిన్ తహ్ తి అర్జులిహిమ్ వ యకూలు జూకూ మా కున్తుమ్ త’మలూన్]

ఆ రోజు శిక్ష వారి పైనుంచి, వారి పాదాల క్రింద నుంచి వారిని ఆక్రమించుకుంటూ ఉంటుంది. అప్పుడు (అల్లాహ్‌) వారితో “మీరు చేసుకున్న కర్మల రుచి చూడండి” అని అంటాడు. (29:55)

ఇక వారు ఆ నరకం నుండి పారిపోయి ఏ నీడ పొందాలని కోరుతారో, ఆ నీడ కూడా నరకం యొక్క నీడ! అందులో కూడా వారికి ఎలాంటి ప్రశాంతత అనేది, సౌఖ్యం అనేది ఉండదు. వారు నీడను చూసి, ఆ నీడలోకి వచ్చినప్పుడు, అక్కడ వారికి నరకం నుండి ఏదైతే పారిపోయి వచ్చారో, నరకాగ్ని నుండి రక్షణ పొందాము అన్నట్లుగా వారికి అర్థమవుతుందో, నీడలో వచ్చిన తర్వాత అక్కడ పెద్ద పెద్ద నిప్పులు వచ్చి పడుతూ ఉంటాయి. ఈ విధంగా పొగ వారిని కమ్ముకొని ఉంటుంది మరియు దుర్వాసన అనేది వారు భరించలేకపోతారు. అలాంటి ఆ స్థితిలో, నరకంలో నరకాగ్నిని భరిస్తూ ఏదైతే ఉన్నారో దానికంటే మరీ ఘోరమైన పరిస్థితి వారిది ఉంటుంది.

ఇంకా మహాశయులారా, నరకంలో ఇన్ని కష్టాలు వారు భరిస్తూ ఉంటారు, కానీ ఇంతటితో వారి యొక్క కష్టాలకు అంతం అనేది ఉండదు. నరకంలోనే ఇంకా ఎన్నో రకాల శిక్షలు ఉంటాయి. కొందరిని బందీలుగా ఖైదు చేయడం జరుగుతుంది. మరికొందరిని చాలా ఇరుకు ప్రదేశంలో వారిని వేయడం జరుగుతుంది. ఎంతటి ఇరుకు ప్రదేశం అంటే, వారు అక్కడ కదలడానికి కూడా అవకాశం ఉండదు.

وَإِذَا أُلْقُوا مِنْهَا مَكَانًا ضَيِّقًا مُّقَرَّنِينَ دَعَوْا هُنَالِكَ ثُبُورًا
[వ ఇజా ఉల్కూ మిన్హా మకానన్ దయ్యికమ్ ముఖర్రనీన దఅవ్ హునాలిక సుబూరా]

నరకంలోని ఒక ఇరుకైన స్థలంలో వారిని కాళ్ళూ, చేతులూ బంధింపబడిన స్థితిలో పడవేయబడినప్పుడు వారు చావు కోసం అరుస్తారు. (25:13)

అయితే వారికి సమాధానం ఇవ్వబడుతుంది: “ఏమిటి ఒక్క చావును? ఎన్నో చావులను మీరు పిలిచినా, కేకలు వేసినా ఏ ఒక్క చావు కూడా మీకు రాదు, మీరు అసలు అక్కడ చనిపోనే చనిపోరు.”

మరో రకమైన శిక్ష ఎలా ఉంటుందో సూరహ్ ఇబ్రాహీం ఆయత్ నంబర్ 49 లో తెలపడం జరిగింది:

وَتَرَى الْمُجْرِمِينَ يَوْمَئِذٍ مُّقَرَّنِينَ فِي الْأَصْفَادِ
[వతరల్ ముజ్రిమీన యౌమఇజిమ్ ముకర్రనీన ఫిల్ అస్ ఫాద్]
ఆ రోజు అపరాధులంతా ఒకచోట సంకెళ్ళతో బంధించబడి ఉండటం నువ్వు చూస్తావు. (14:49)

మరియు సూరహ్ ఇన్సాన్ ఆయత్ నంబర్ 4 లో ఉంది:

إِنَّا أَعْتَدْنَا لِلْكَافِرِينَ سَلَاسِلَ وَأَغْلَالًا وَسَعِيرًا
[ఇన్నా అఅతద్ నా లిల్ కాఫిరీన సలాసిల వ అగ్లాలవ్ వసయీరా]
అవిశ్వాసుల కోసం మేము సంకెళ్ళను, ఇనుప పట్టాలను, జ్వలించే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. (76:4)

అబూ లహబ్ యొక్క భార్య, ఆమె గురించి ప్రస్తావిస్తూ అల్లాహ్ ఏం చెప్పాడు?

فِي جِيدِهَا حَبْلٌ مِّن مَّسَدٍ
[ఫీ జీదిహా హబ్లుమ్ మిమ్ మసద్]
ఆమె మెడలో (ఖర్జూర ఆకుతో) గట్టిగా పేనిన ఒక త్రాడు ఉంటుంది (111:5)

మరియు సూరహ్ హాక్కా లో ఇంతకుముందే మీరు విని ఉన్నారు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, ఎడమ చేతిలో ఎవరైతే తమ కర్మపత్రాన్ని తీసుకుంటారో వారు ఎలా బాధపడుతూ అరుస్తారో, ఆ తర్వాత వారిని ఎలా బంధించడం జరుగుతుందో తెలియజేస్తూ:

ثُمَّ فِي سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًا فَاسْلُكُوهُ
[సుమ్మ ఫీ సిల్సిలతిన్ జర్ఉహా సబ్ ఊన జిరాఅన్ ఫస్లుకూహ్]
మరి వాణ్ణి డెభ్భై మూరల పొడవు గల సంకెళ్ళతో బిగించి కట్టండి. (69:32)

ఇంకా మహాశయులారా, మరో రకమైన శిక్ష అక్కడ ఏం జరుగుతుంది అంటే, పెద్ద పెద్ద ఇనుప గదలతో, ఇనుప రాళ్లతో, ఇనుప సలాకులతో నరకవాసులను కొట్టడం జరుగుతుంది.

وَلَهُم مَّقَامِعُ مِنْ حَدِيدٍ
[వలహుమ్ మకామిఉ మిన్ హదీద్]
ఇంకా, వారి కొరకు (వారిని చితక బాదటానికి) ఇనుప సుత్తులు కూడా ఉన్నాయి. (సూరహ్ హజ్ 22:21)

మరియు అక్కడి శిక్షల్లో ఒక రకమైన శిక్ష, నరకవాసుల తలల మీదుగా బాగా వేడిలో, మితిమీరి వేడిగల నీళ్లు వారిపై పోయడం జరుగుతుంది. ఆ నీళ్లు వారి శరీరంపై పడిన వెంటనే తోలు అంతా కాలిపోతూ కాలిపోతూ లోపల కడుపులోని ప్రేగులు కూడా ముక్కలు ముక్కలు అవుతూ ఉంటాయి.

ఇంకా నరకంలో ఒక రకమైన శిక్ష మరీ ఘోరంగా ఉంది. చూడడానికి అంతం సమాప్తం అని ఏర్పడుతుంది కానీ అలా జరగదు. ఒక హదీసులో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: ఎవరైతే మదీనా వాసుల పట్ల చెడుగా చూస్తాడో, చెడుగా ప్రవర్తిస్తాడో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నరకంలో అతన్ని ఎలాంటి శిక్షకు గురి చేస్తాడు అంటే, ఉప్పు నీళ్లలో ఎలా కరిగిపోతుందో అతడు అలా నరకంలో కరిగిపోతా ఉంటాడు. ఇలాంటి శిక్ష అతనికి జరుగుతూనే ఉంటుంది.

ఇంకా మహాశయులారా, అక్కడి శిక్షల్లో మరొక ఘోరమైన శిక్ష ఏమిటంటే, ఎప్పుడెప్పుడు శిక్షించబడి తోలు కాలిపోతూ ఉంటుందో, అప్పుడప్పుడు మరొక కొత్త తోలు వారిపై వేయడం జరుగుతుంది. వారికి కొత్త తోలు పుట్టుకొస్తుంది. మళ్లీ శిక్షించడం జరుగుతుంది. తోలు కాలిపోతుంది, మళ్లీ కొత్తగా వారికి తోలు వస్తూ ఉంటుంది.

كُلَّمَا نَضِجَتْ جُلُودُهُم بَدَّلْنَاهُمْ جُلُودًا غَيْرَهَا لِيَذُوقُوا الْعَذَابَ
[కుల్లమా నజిజత్ జులూదుహుమ్ బద్దల్నాహుమ్ జులూదన్ గైరహా లియజూకుల్ అజాబ్]
వారి చర్మాలు బాగా ఉడికిపోయినప్పుడల్లా, వాటికి బదులుగా, వారు శిక్ష యొక్క రుచి చూసేందుకు వేరే చర్మాలను సృష్టిస్తాము (4:56)

మరి ఈ రోజుల్లో సైంటిఫిక్ పరంగా కూడా, మనిషి యొక్క తోలులో కొన్ని కణాలు ఉన్నాయి, అవి మనిషికి కలిగే బాధను గ్రహించగలుగుతాయి. ఎప్పుడైతే అవి కాలిపోతూ ఉంటాయో, వాటిని మార్చడం జరుగుతూ ఉంటుంది.

ఇంకా సోదరులారా, నరకంలో వారిని ఎలా పడవేయడం జరుగుతుందో దాని ప్రస్తావన కూడా వచ్చి ఉంది మహాశయులారా.

తల క్రిందులుగా చేసి అవమానకరంగా వారిని నరకంలో వేయడం జరుగుతుంది.

يَوْمَ يُسْحَبُونَ فِي النَّارِ عَلَىٰ وُجُوهِهِمْ
[యౌమ యుస్ హబూన ఫిన్నారి అలా వుజూహిహిమ్]
వారిని ముఖం క్రిందులుగా చేసి నరకం వైపునకు లాగుతూ ఉండడం జరుగుతుంది. (54:48)

మరి కొందరికి శిక్ష అక్కడ ఎలా ఉంటుంది? బహుశా కొన్ని పల్లెటూర్లలో మనం చూసి ఉంటాము, నూనె తీయడానికి ఎద్దు గాని, గాడిద గాని గుండ్రంగా త్రిప్పుతూ ఉండడం జరుగుతుంది. అటు ఇటు చూసి అది తన పని వదలకూడదు అని కొన్ని సందర్భాల్లో దాని ముఖం మొత్తం కప్పి ఉంచడం కూడా జరుగుతుంది. కేవలం ఒక విషయం అర్థం కావడానికి మన గ్రామాల్లో జరిగే ఒక విషయం ఉదాహరణగా చెప్పాను. కానీ నవూజుబిల్లాహ్, నరకంలో ఉండే నరక శిక్షల యొక్క పోలిక కాదు ఇది. విషయం ఏంటంటే, నరకంలో కొందరికి శిక్ష ఈ విధంగా జరుగుతుంది.

ప్రళయ దినాన ఒక వ్యక్తిని తీసుకొచ్చి నరకంలో వేయడం జరుగుతుంది. నరకంలో అతను పడిన తర్వాత అతని పేగులన్నీ బయటికి వచ్చి ఉంటాయి. కడుపు చాలా పెద్దగా అయిపోతుంది. అతడు లేచి నిలబడాలి అనుకుంటాడు, కానీ నిలబడలేడు, తిరుగుతాడు. ఇలా ఆ గాడిద లేదా ఎద్దు తిరిగే విధంగా అలాగే అతనికి శిక్ష ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు అతన్ని చూసి, “నీవు మంచిని గురించి ఆదేశిస్తూ ఉండేవాడివి కదా! చెడు నుండి ఆపుతూ ఉండేవాడివి కదా! నీవు ఇలాంటి శిక్షకు ఎందుకు గురయ్యావు?” అని అంటే, అతను అంటాడు:

كُنتُ آمُرُكُم بِالْمَعْرُوفِ وَلَا آتِيهِ وَأَنْهَاكُمْ عَنِ الْمُنكَرِ وَآتِيهِ
[కున్తు ఆమురుకుమ్ బిల్ మఅరూఫి వలా ఆతీహి వ అన్హాకుమ్ అనిల్ మున్కరి వ ఆతీహ్]
“ఏ మంచిని గురించి మీకు ఆదేశిస్తూ ఉండేవాడినో, అది నేను పాటించేవాడిని కాదు. ఏ చెడు నుండి మిమ్మల్ని వారిస్తూ ఉండేవాడినో, ఆ చెడు నేను చేసేవాడిని.”

అందుకే ఇలాంటి శిక్ష జరుగుతుంది అని అంటాడు. అల్లాహ్ ఈ విధంగా మనకు చెప్పే బోధనలను స్వయంగా ఆచరించే భాగ్యం కలిగించు గాక. ఏ విషయాల నుండి మనం వారిస్తున్నామో వాటి నుండి స్వయంగా మనం ముందు దూరంగా ఉండే అటువంటి భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.

నరకంలోని శిక్షల్లో ఒక రకమైన శిక్ష ఏమిటంటే, ఆ శిక్షలను భరించలేక వారు పెడబొబ్బలు పెడతారు. ఏడుస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. కానీ ఎక్కడి నుండి ఏ సహాయం అందదు, ఎవరూ వారి యొక్క ఏడ్పుబొబ్బలను వినేవారు ఉండరు.

حَتَّىٰ إِذَا أَخَذْنَا مُتْرَفِيهِم بِالْعَذَابِ إِذَا هُمْ يَجْأَرُونَ
[హత్తా ఇజా అఖజ్ నా ముత్రఫీహిమ్ బిల్ అజాబి ఇజా హుమ్ యజ్ అరూర్]
ఆఖరికి మేము వారిలోని భోగలాలసులను శిక్షగా పట్టుకున్నప్పుడు, వారు ఆర్తనాదాలు చేయసాగారు.(23:64)

لَا تَجْأَرُوا الْيَوْمَ ۖ إِنَّكُم مِّنَّا لَا تُنصَرُونَ
[లా తజ్ అరుల్ యౌమ ఇన్నకుమ్ మిన్నా లా తున్సరూన్]
వారికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది: “మీరు ఈ రోజు ఎలాంటి సహాయానికై మీరు కేకలు వేయకండి, ఈ రోజు మా వైపు నుండి మీకు ఎలాంటి సహాయం అందదు.” (23:65)

నరకంలో ఒక రకమైన శిక్ష: మనిషి నరకాగ్నిలో ఉండి ఉండి, నీళ్లు త్రాగడానికి అని పక్కకు వస్తాడు, వేడి వేడి నీళ్లు, మితిమీరిన వేడి నీళ్లు!

يَطُوفُونَ بَيْنَهَا وَبَيْنَ حَمِيمٍ آنٍ
[యతూఫూన బైనహా వబైన హమీమిన్ ఆన్]
అటు అది త్రాగలేడు, ఇటు దీనిని భరించలేడు, ఈ విధంగా ఇటునుండి అటు, అటునుండి ఇటు తిరుగుతూనే ఉంటాడు. (55:44)

అంతేకాదు నరకంలో, నరకంలో ఇవ్వబడే శిక్షల్లో అక్కడ కూడా భయంకరమైన పాములు మరియు తేళ్లు ఉంటాయి. నరకవాసులకు అవి వాతలు పెడుతూ ఉంటాయి, కుడుతూ ఉంటాయి. ముస్నద్ అహ్మద్ మరియు సహీహ్ ఇబ్న్ హిబ్బాన్ లోని ఉల్లేఖనం, షేక్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహ్ అని ప్రస్తావించారు: నరకంలో పెద్ద పెద్ద పాములు ఉంటాయి. ఒక్కొక్క పాము “బుఖ్త్” ఒంటె (చాలా పెద్ద, ఎత్తుగా ఉండే ఒంటె) అలాంటి ఒంటెల మాదిరిగా పెద్ద పెద్ద పాములు ఉంటాయి.

ఒక్కసారి అది కాటు వేసిందంటే నలభై సంవత్సరాల వరకు దాని యొక్క బాధను మనిషి భరిస్తూనే ఉంటాడు అల్లాహు అక్బర్. మరియు నరకంలో సామానుతో ఎత్తుగా ఉన్నటువంటి కంచర గాడిద రూపంలో అంత పెద్ద పెద్ద తేళ్లు కూడా ఉంటాయి. ఆ తేళ్లు వాటి యొక్క విషం ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒక్కసారి అవి కాటు వేస్తే దాని యొక్క విషం, దాని యొక్క బాధ నలభై సంవత్సరాల వరకు భరిస్తూ ఉండవలసి ఉంటుంది.

ఇంకా సోదరులారా, సోదరీమణులారా, నరకంలో ఇవ్వబడే శిక్షల్లో ఒక రకమైన శిక్ష, పెద్ద పెద్ద పర్వతాల మీద ఎక్కడానికి బలవంతం చేయబడుతుంది. ఇది కూడా ఒక రకమైన వారికి శిక్ష ఉంటుంది.

سَأُرْهِقُهُ صَعُودًا
[స ఉర్హికహు సఊదా]
దానిని వారు ఎక్కలేరు, పడుతూ ఉంటారు, మళ్లీ ఎక్కడం జరుగుతుంది. త్వరలోనే నేను వాణ్ణి కఠినమైన ఎత్తుకు ఎక్కిస్తాను. (74:17)

అల్లాహ్ ఆయత్లలో తిరస్కరించి, ఖురాన్ గ్రంథాన్ని “ఓ మనిషి లాంటి మాటలే కదా ఇందులో ఉన్నవి” అన్నటువంటి ఎగతాళి చేసే వారి గురించి ఇలాంటి శిక్షలు కూడా జరుగుతాయి.

నరకంలో ఇవ్వబడే శిక్షల్లో ఒక రకమైన శిక్ష: నరకంలో ఉన్న వ్యక్తి ఏ శ్వాస పీలుస్తాడో, మళ్లీ వదులుతాడో, పీల్చుకునే, వదులుకునే ప్రతి ఒక్క శ్వాసకు మహా భయంకరమైన ధ్వని, చప్పుడు అనేది ఉంటుంది.

فَأَمَّا الَّذِينَ شَقُوا فَفِي النَّارِ لَهُمْ فِيهَا زَفِيرٌ وَشَهِيقٌ
[ఫఅమ్మల్ లజీన షకూ ఫఫిన్నారి లహుమ్ ఫీహా జఫీరువ్ వషహీక్]
ఎవరైతే దౌర్భాగ్యులో వారు నరకాగ్నిలో ఉంటారు. వారు అందులో విలపిస్తూ, కేకలు వేస్తూ (భయంకరమైన శ్వాసలు తీస్తూ) ఉంటారు. (11:106)

అది ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఒక సందర్భంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: ఈ మస్జిద్ లో లక్ష, లక్షకు పైగా మంది ఉన్నారంటే, వీరి మధ్యలో కేవలం ఒకే ఒక వ్యక్తి నరకవాసుల్లోని వ్యక్తి ఉండి అతను శ్వాస తీసుకుంటే, అతని శ్వాస ఏదైతే అతను బయటికి వదిలాడో దానివల్ల ఈ లక్ష, లక్షకు పైగా ఉన్న వారందరూ కాలిపోతారు, చనిపోతారు. అల్లాహు అక్బర్.

నరక వాసులకు ఇవ్వబడే శిక్షల్లో ఒక రకమైన శిక్ష, వారి ముఖాన్ని మరీ అంధకారంగా చేసి భయంకరమైనవిగా కూడా చేయబడతాయి. ఒక హదీసులో ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క తండ్రి ఆజర్ విషయంలో ఇలాంటి ప్రస్తావన ఒక సహీహ్ హదీసులో వచ్చి ఉంది.

అయితే మహాశయులారా, ఇంతటి ఘోరమైన శిక్షలు వారు అనుభవిస్తున్నప్పుడు వారికి అక్కడ చావు వస్తుందనా? వారి యొక్క శిక్షల్లో ఏదైనా తగ్గింపు జరుగుతుంది అనా? వారికి ఏదైనా సహాయం దొరుకుతుందా? ఇవన్నీ ఏమాత్రం అవకాశం లేదు. ఇవన్నీ కూడా అసంభవం.

فَلَا يُخَفَّفُ عَنْهُمُ
[ఫలా యుఖఫ్ఫఫు అన్హుము]
వారి యొక్క శిక్షల్లో ఎలాంటి తగ్గింపు జరగదు, అని ఎన్నో సందర్భాల్లో ఖురాన్ లో చెప్పడం జరిగింది. మరియు మీకు ఎలాంటి సహాయం అందించేవాడు కూడా అక్కడ ఎవరూ ఉండడు.

మరియు వారికి చావు వస్తుందా?

لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ
[లా యమూతు ఫీహా వలా యహ్యా]
అక్కడ చావు రాదు, హాయిగా బ్రతికినట్లు కూడా ఉండదు. (87:13)

గమనించండి, ఇహలోకంలో ఎంత పెద్ద శిక్ష జరిగినా కనీసం చచ్చిపోదాము అని భావిస్తాడు, మనిషి చనిపోతాడు, ఆత్మహత్య చేసుకుంటాడు, ఏదో జరుగుద్ది, కానీ అక్కడ నరకంలో చావు కూడా రాదు. నరకవాసులు అందరూ నరకంలో, స్వర్గవాసులు అందరూ స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత, స్వయంగా చావును అల్లాహ్ త’ఆలా ఒక పొట్టేలు రూపంలో తీసుకొస్తాడు. వారందరూ దానిని గుర్తుపడతారు, ఇది చావు అని ఒప్పుకుంటారు. అల్లాహ్ త’ఆలా ఆ చావుకే చావు ఇచ్చేస్తాడు. ఇక ఆ తర్వాత ఎవరికీ ఏ చావు అనేది ఉండదు.

అయితే నరకం నుండి ఏదైనా పారిపోవడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? అది కూడా ఉండదు.

كُلَّمَا أَرَادُوا أَن يَخْرُجُوا مِنْهَا أُعِيدُوا فِيهَا
[కుల్లమా అరాదూ అయ్ యఖ్ రుజూ మిన్హా ఉఈదూ ఫీహా]
ఎప్పుడెప్పుడు వారు బయటికి వెళ్ళాలని అనుకుంటారో, ఏదైనా కొంచెం పైకి వస్తారో, కొంచెం బయటికి రావాలనుకుంటారో, వారిని తిరిగి అందులోనే వేయడం జరుగుతుంది. (32:20)

మరియు వారు నరకం నుండి బయటికి వెళ్లడానికి ఏ అవకాశమూ లేదు అని కూడా అల్లాహ్ స్పష్టంగా తెలియజేశాడు.

మహాశయులారా, సమయం సమాప్తం కానుంది, ఇక్కడ ఒక హదీస్ తప్పకుండా మీరు వినండి. వాటిపై శ్రద్ధ వహించండి. అవకాశం అల్లాహ్ ఏదైతే మనకు ఇచ్చాడో దానిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. అల్లాహ్ ఈ భాగ్యం నాకు, మీకు మనందరికీ ప్రసాదించుగాక.

ప్రళయ దినాన అల్లాహ్ త’ఆలా ఒక వ్యక్తిని హాజరు పరుస్తాడు. అతనితో ప్రశ్నిస్తాడు:

أَلَمْ أَجْعَل لَّكَ سَمْعًا وَبَصَرًا وَمَالًا وَوَلَدًا
[అలమ్ అజ్ అల్ లక సమ్ అన్ వ బసరన్ వ మాలన్ వ వలదా]
“నేను నీకు చెవులు, కళ్లు, డబ్బు ధనం, సంతానం ఇవన్నీ ప్రసాదించలేదా?” ఆ మనిషి అంటాడు: “అవును ఓ అల్లాహ్! అన్నీ నీవే ప్రసాదించావు, ఇందులో ఏమాత్రం అనుమానం లేదు.”

وَسَخَّرْتُ لَكَ الْأَنْعَامَ وَالْحَرْثَ وَتَرَكْتُكَ تَرْأَسُ وَتَرْبَعُ
[వ సఖ్ఖర్తు లకల్ అన్ ఆమ వల్ హర్స వ తరకుక తర్ అసు వ తర్బఉ]
“నీకు పంటలు, పొలాలు, జంతువులు ఇంకా ఎన్నో రకాల వరాలు ప్రసాదించాను. వాటన్నిటిపై నీవు అధికారం కలిగి ఉన్నావు. వాటన్నిటితో ఎంజాయ్మెంట్ చేసుకుంటూ నీ జీవితం గడిపావు, అవునా?” అతను అంటాడు: “అవును ఓ అల్లాహ్!”

“అయితే ఈ రోజు వచ్చి నన్ను నీవు కలుసుకుంటావు అన్నటువంటి నమ్మకం నీకు ఉండెనా ఇహలోకంలో?” అని అడుగుతాడు.

అప్పుడు అతను అంటాడు: “లేదు ఓ అల్లాహ్! చనిపోయేది ఉంది, నీవు మళ్లీ నన్ను లేపుతావు, నేను వచ్చి నిన్ను కలుసుకుంటాను అన్నటువంటి నమ్మకం నాకు లేకుండినది.”

అప్పుడు అంటాడు అల్లాహ్:

الْيَوْمَ أَنْسَاكَ كَمَا نَسِيتَنِي
[అల్యౌమ అన్సాక కమా నసీతనీ]
“ఇహలోకంలో నీవు నన్ను ఎలా మర్చిపోయావో, ఇక ఈ రోజు కూడా నేను నిన్ను మర్చిపోతాను.”

అంటే ఏమిటి భావం? అల్లాహ్ యొక్క కరుణాకటాక్షాల్లో స్వర్గం, అక్కడి యొక్క వరాలు ఏమీ కూడా అతనికి లభించవు, నరకంలోనే ఉండవలసి వస్తుంది.

గమనించారా సోదరులారా? ఇహలోకంలోని వరాలన్నీ కూడా మనకు ఎలా లాభాన్ని తీసుకొచ్చాయి? ఒకవేళ మనం అల్లాహ్ ను తిరస్కరిస్తే, అల్లాహ్ చెప్పినట్లుగా అల్లాహ్ యొక్క ఆదేశం మేరకు మన జీవితం గడపకుంటే. అందుగురించి అల్లాహ్ ను విశ్వసించి, ప్రవక్తల్ని విశ్వసించి, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బాటను అనుసరించి జీవితం గడిపే ప్రయత్నం చేస్తూ, పరలోక దినాన్ని విశ్వసించాలి.

అల్లాహ్ త’ఆలా మనందరికీ కూడా అన్ని రకాల నరక శిక్షల నుండి రక్షణ పొందే భాగ్యం కలిగించు గాక.

వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=46128

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

యూట్యూబ్ – ప్లే లిస్ట్ (మరణానంతర జీవితం)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3hWrEGNnzcmMZV3PtDByJH

పవిత్ర మాసాలలో పాపాల ప్రమాదం – షేఖ్ హబీబుర్ రహ్మాన్ జామిఈ [వీడియో & టెక్స్ట్]

పవిత్ర మాసాలలో పాపాల ప్రమాదం
షేఖ్ హబీబుర్ రహ్మాన్ జామిఈ [వీడియో & టెక్స్ట్]
https://youtu.be/2Vh-tmsTEZc [38 నిముషాలు]
[డౌన్లోడ్ పిడిఎఫ్]

ఈ ప్రసంగం ఇస్లాంలోని పవిత్ర మాసాల (ముహర్రం, రజబ్, జుల్ ఖాదా మరియు జుల్ హిజ్జా) విశిష్టతను మరియు ఆ మాసాలలో పాపాలకు దూరంగా ఉండవలసిన ఆవశ్యకతను వివరిస్తుంది. అల్లాహ్ పన్నెండు నెలల్లో నాలుగింటిని ప్రత్యేకంగా పవిత్రమైనవిగా ప్రకటించారని, ఈ కాలంలో చేసే సత్కార్యాలకు ప్రతిఫలం పెరగడమే కాకుండా, చేసే పాపాల తీవ్రత మరియు వాటి శిక్ష కూడా ఇతర సమయాల కంటే అధికంగా ఉంటాయని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వివరించారు. పాపాలు సంఖ్యాపరంగా పెరగకపోయినా, పవిత్ర స్థలాలు మరియు కాలాల గౌరవాన్ని బట్టి వాటి ప్రభావం తీవ్రమవుతుందని, ఇవి హృదయాలకు తుప్పు పట్టించి మనిషిని అల్లాహ్ కరుణకు దూరం చేస్తాయని ఆయన హెచ్చరించారు.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అల్ హమ్దులిల్లాహి మలికిల్ ఖుద్దూసిస్సలాం, ముజ్రిల్లయాలి వల్ అయ్యాం, వ ముజద్దిదిష్ షుహూరి వల్ ఆవాం. వస్సలాతు వస్సలాము అలా నబియ్యినా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), వ అలా ఆలిహిల్ కిరాం, వ సహ్ బిహిల్ బరరాతిల్ ఆలాం, వత్తాబియీన లహుమ్ బి ఇహసాన్.

సర్వస్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సకల ప్రశంసలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన, ఏకైక సృష్టికర్త అయిన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణాశుభాలు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.

అభిమాన సోదరులారా! ఈరోజు అంశం మీకందరికీ తెలిసిందే, “పవిత్ర మాసాలలో పాపాల ప్రమాదం“. ఇస్లాంలో నాలుగు మాసాలను అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రత్యేక పవిత్రతతో గౌరవించాడు. అవి జుల్ ఖాదా, జుల్ హిజ్జా, ముహర్రం మరియు రజబ్. ఇందులో జుల్ ఖాదా, జుల్ హిజ్జా, ముహర్రం వరుసగా వచ్చే మూడు నెలలు. రజబ్ ఇది జుమాదా మరియు షాబాన్ మధ్యలో ఉంటుంది. దీని ప్రస్తావన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సూరహ్ తౌబా ఆయత్ 36 లో ఇచ్చాడు:

إِنَّ عِدَّةَ ٱلشُّهُورِ عِندَ ٱللَّهِ ٱثْنَا عَشَرَ شَهْرًا فِى كِتَٰبِ ٱللَّهِ يَوْمَ خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ مِنْهَآ أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ ٱلدِّينُ ٱلْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا۟ فِيهِنَّ أَنفُسَكُمْ

నిశ్చయంగా అల్లాహ్ వద్ద నెలల సంఖ్య పన్నెండు. ఆకాశాలనూ, భూమినీ సృష్టించిన రోజు నుండి అల్లాహ్ గ్రంథంలో అవి పన్నెండే. వాటిలో నాలుగు పవిత్రమైనవి. ఇదే సరైన ధర్మం. కాబట్టి ఆ నెలలలో మీరు మీపై అన్యాయం చేసుకోకండి. (9:36)

మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “సంవత్సరంలో పన్నెండు నెలలు ఉన్నాయి. వాటిలో నాలుగు పవిత్రమైనవి. వాటిలో మూడు వరుసగా వచ్చే జుల్ ఖాదా, జుల్ హిజ్జా, ముహర్రం. మరొకటి జుమాదా మరియు షాబాన్ మధ్యలో ఉన్న రజబ్ మాసం.” ఇది సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం లో ఉన్న హదీసు.

అభిమాన సోదరులారా! పవిత్ర మాసాలలో సత్కార్యాల ప్రతిఫలం మరియు పాపాల శిక్ష వాటి గొప్పతనం మరియు తీవ్రత పరంగా పెరుగుతాయని తెలుస్తుంది. అంటే పవిత్ర మాసాలలో పుణ్యాలు చేసినా వాటి ప్రతిఫలం ఎన్నో రెట్లు పెరుగుతుంది. అలాగే పాపాలు చేసినా పాపాల శిక్ష వాటి గొప్పతనం మరియు తీవ్రత పరంగా పెరుగుతాయని తెలుస్తుంది. కాబట్టి పవిత్ర మాసాలలో చేసే ఒక సత్కార్యం ఇతర సాధారణ కాలాలలో చేసే అదే సత్కార్యం కంటే అల్లాహ్ వద్ద మరింత గొప్పది. అలాగే పవిత్ర మాసాలలో చేసే ఒక పాపం ఇతర సాధారణ కాలాలలో చేసే అదే పాపం కంటే మరింత తీవ్రమైనది మరియు భారమైనది.

ఒక ప్రశ్న: పవిత్ర మాసాలలో పాపం రెట్టింపు అవుతుందా? అంటే ఒక పాపం రెండు పాపాలకి సమానంగా, నాలుగు పాపాలకి సమానంగా, పది పాపాలకి సమానంగా అవుతుందా? ఈ ప్రశ్న. దీనికి సమాధానం ధార్మిక పండితులు ఇలా వివరించారు: పవిత్ర మాసాలలో సత్కార్యాలు మరియు పాపాలు రెట్టింపు అవుతాయని స్పష్టంగా తెలిపే సహీహ్ మరియు స్పష్టమైన హదీసులు లేవు. అయితే కొందరు పండితులు అల్లాహ్ ఈ విధంగా చెప్పినందున ఈ మాసాలలో సత్కార్యాల ప్రతిఫలం మరియు పాపాల తీవ్రత పెరుగుతుందని పేర్కొన్నారు. సూరహ్ తౌబా ఆయత్ 36: “ఫలా తజ్లిమూ ఫీహిన్న అన్ఫుసకుమ్.” కాబట్టి ఆ పవిత్ర మాసాలలో మీపై మీరు అన్యాయం చేసుకోకండి.

ఈ ఆయత్ యొక్క తఫ్సీర్ ను వివరిస్తూ ఇబ్నె కసీర్ రహ్మతుల్లాహి అలైహి ఇలా పేర్కొన్నారు:

ఆ మాసాలలో మీపై మీరు అన్యాయం చేసుకోకండి అంటే ఈ పవిత్ర మాసాలలో పాపాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ మాసాలలో పాపం చేయడం ఇతర సమయాల్లో పాపం చేయడం కంటే మరింత తీవ్రమైనది మరియు ఎక్కువ భారమైనది. ఎలాగైతే పవిత్ర నగరమైన మక్కాలో చేసిన పాపాలు మరింత ఘోరమైనవిగా పరిగణించబడతాయో, అలాగే ఈ పవిత్ర మాసాలలో చేసిన పాపాలు కూడా మరింత తీవ్రమైనవిగా పరిగణించబడతాయి.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సూరహ్ హజ్ లో సెలవిచ్చాడు:

وَمَن يُرِدْ فِيهِ بِإِلْحَادٍۭ بِظُلْمٍ نُّذِقْهُ مِنْ عَذَابٍ أَلِيمٍ
(వ మయ్ యురిద్ ఫీహి బి ఇల్ హాదిమ్ బిజుల్మిన్ నుజిఖ్ హు మిన్ అజాబిన్ అలీమ్)

ఎవడు అందులో (మస్జిదే హరామ్ లో) అన్యాయపూర్వకంగా మార్గభ్రష్టతను కోరుకుంటాడో అతనికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపిస్తాము. (22:25)

అంటే పవిత్ర మాసాలలో పాపాల తీవ్రత, పాప భారం మరియు అల్లాహ్ దృష్టిలో వాటి ఘోరత పెరిగిపోతుంది. అందువల్ల ఈ మాసాలలో పాపాలకు దూరంగా ఉండి తౌబా, నమాజ్, ఖురాన్ పఠనం, జిక్ర్ మరియు ఇతర సత్కార్యాలను ఎక్కువగా చేయాలి.

హాఫిజ్ ఇబ్నె కసీర్ రహ్మతుల్లాహి అలైహి ఇలా వివరించారు: పవిత్ర మాసాలలో పాపాలు మరింత తీవ్రమవుతాయి. అందువల్ల ఇమామ్ షాఫీ రహ్మతుల్లాహి అలైహి మరియు అనేకమంది పండితుల అభిప్రాయం ప్రకారం, ఈ మాసాలలో హత్య జరిగినట్లయితే ‘దియత్’ (రక్త పరిహారం) మరింత కఠినంగా పరిగణించబడుతుంది. అలాగే హరమ్ ప్రాంతంలో హత్య చేసిన వారికి లేదా నిషిద్ధ బంధుత్వం (మహరమ్) కలిగిన వ్యక్తిని హత్య చేసిన వారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఆ తర్వాత ఆయన ఖతాదా గారి మాటలను ఉటంకించారు. అవేమిటి? పవిత్ర మాసాలలో జరిగే అన్యాయం ఇతర సమయాల్లో జరిగే అన్యాయం కంటే మరింత పెద్ద పాపం మరియు ఎక్కువ భారమైనది.

అయితే అన్యాయం ఎలాంటి పరిస్థితుల్లోనైనా గొప్ప పాపమే. అన్యాయం అన్యాయమే, ప్రతి సందర్భంలో ప్రతి పరిస్థితిలో అది గొప్ప పాపమే అవుతుంది, ఘోరమైన పాపమే అవుతుంది. కానీ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తన ఇష్టానుసారం కొన్ని విషయాలకు మరింత గొప్పతనాన్ని మరియు ప్రాముఖ్యతను ప్రసాదిస్తాడు. అలాగే ఈ ప్రత్యేకత ఈ నాలుగు మాసాలకు అల్లాహ్ ప్రసాదించాడు.

ఇమామ్ ఖుర్తుబీ రహ్మతుల్లాహి అలైహి ఇలా అన్నారు:

“ఈ పవిత్ర మాసాలలో పాపాలు చేసి మీరు మీపై అన్యాయం చేసుకోకండి. ఎందుకంటే అల్లాహ్ ఒక విషయాన్ని ఒక కోణం నుండి గౌరవప్రదంగా చేసినప్పుడు దానికి ఒక ప్రత్యేకత, పవిత్రత ఉంటుంది. కానీ రెండు లేదా అంతకంటే ఎక్కువ కోణాల నుండి దానిని గొప్పదిగా చేసినప్పుడు దాని పవిత్రత, దాని యొక్క గౌరవం మరింత పెరిగిపోతుంది. అందువల్ల అలాంటి సమయాల్లో లేదా ప్రదేశాల్లో చేసిన చెడు పనికి శిక్ష మరింత తీవ్రమైపోతుంది. అలాగే చేసిన సత్కార్యానికి ప్రతిఫలం కూడా మరింత గొప్పదిగా ఉంటుంది.”

అభిమాన సోదరులారా! పవిత్ర మాసంలో పవిత్ర స్థలమైన మక్కాలో అల్లాహ్ కు విధేయత చూపిన వారి ప్రతిఫలం సాధారణ నెలలలో అదే మక్కాలో విధేయత చూపిన వారి ప్రతిఫలంతో సమానం కాదు. అలాగే సాధారణ నెలలో మక్కాలో చేసిన సత్కార్యానికి లభించే ప్రతిఫలం, సాధారణ నెలలో సాధారణ ప్రదేశంలో చేసిన సత్కార్యానికి లభించే ప్రతిఫలంతో సమానం కాదు.

సారాంశం ఏమిటంటే పవిత్ర కాలాలు అంటే ఇది ముహర్రం, రజబ్, జుల్ ఖాదా, జుల్ హిజ్జా. పవిత్ర ప్రదేశాలు మక్కా, మదీనా వగైరా అల్లాహ్ వద్ద ప్రత్యేక గౌరవం కలిగినవి. అందువల్ల వాటిలో చేసే సత్కార్యాలకు మరింత గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. వాటిలో చేసే పాపాలు మరింత తీవ్రమైనవిగా పరిగణించబడతాయి. కాబట్టి ఈ పవిత్ర మాసాలలో ముస్లింలు పాపాలకు దూరంగా ఉండాలి. సత్కార్యాలలో అధికంగా పాల్గొనాలి. పాపం ఎప్పుడూ చేయకూడదు. పూర్తి సంవత్సరం పన్నెండు మాసాలు చేయకూడదు. ముఖ్యంగా, ప్రత్యేకంగా పవిత్ర మాసాలలో ఎందుకంటే దాని యొక్క తీవ్రత పెరిగిపోతుంది.

షరియత్ ఆధారాల ద్వారా నిరూపితమైన విషయం ఏమిటంటే పవిత్ర కాలాలలో మరియు పవిత్ర ప్రదేశాలలో సత్కార్యాల ప్రతిఫలం మరింత పెరుగుతుంది. ఉదాహరణకు రంజాన్ మాసం, జుల్ హిజ్జా మాసం అలాగే ఈ ముహర్రం మాసం వంటి పవిత్ర కాలాలలో సత్కార్యాల ప్రతిఫలం అధికంగా ఉంటుంది. అలాగే మస్జిదుల్ హరామ్ మక్కా, మస్జిద్ నబవీ మదీనా వంటి పవిత్ర ప్రదేశాలలో కూడా సత్కార్యాలకు ప్రత్యేకమైన గొప్ప ప్రతిఫలం లభిస్తుంది.

జాబిర్ రజియల్లాహు అన్హు ద్వారా వచ్చిన ఒక సహీహ్ హదీసులో ఇలా ఉంది: మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు: “నా మస్జిద్ అంటే మస్జిద్ నాబవి లో చేసిన ఒక నమాజ్, మస్జిదుల్ హరామ్ తప్ప ఇతర ఏ ప్రదేశంలో చేసిన వెయ్యి నమాజుల కంటే ఉత్తమమైనది. మరియు మస్జిదుల్ హరామ్ లో చేసిన ఒక నమాజ్ ఇతర ప్రదేశాలలో చేసిన లక్ష నమాజుల కంటే ఉత్తమమైనది.” ఈ హదీసును ప్రముఖ ముహద్దిసీన్లు సహీహ్ గా నిర్ధారించారు. ఈ హదీసు యొక్క సనద్ పరంపర సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.

అభిమాన సోదరులారా! పవిత్ర కాలాలలో సత్కార్యాల ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది, పవిత్ర ప్రదేశాలలో చేసిన ఆరాధనలు మరింత గొప్ప ఫలితాన్ని కలిగిస్తాయి. అందువల్ల రంజాన్ మాసం, జుల్ హిజ్జా ముఖ్యంగా జుల్ హిజ్జా మొదటి పది రోజులు, ముహర్రం వంటి పవిత్ర కాలాలను మరియు మక్కా మదీనా వంటి పవిత్ర ప్రదేశాలను సత్కార్యాలతో సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి చిన్న పెద్ద పాపం నుండి అవిధేయత నుండి దూరంగా ఉండాలి. దుష్ట క్రియలు పాపాలు గురించి పండితుల అభిప్రాయం ప్రకారం, ధార్మిక పండితుల అభిప్రాయం ప్రకారం మనం చేసే పాపాలు ఈ పవిత్ర కాలాలలో మాసాలలో అవి సంఖ్యాపరంగా పెరగవు. సంఖ్యాపరంగా పెరగవు అంటే ఒక పాపం పది పాపాలుగా లెక్కించబడవు. కానీ వాటి తీవ్రత లేదా స్వభావం పరంగా పెరుగుతాయి. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సూరహ్ అన్ ఆమ్ లో సెలవిచ్చాడు:

مَن جَآءَ بِٱلْحَسَنَةِ فَلَهُۥ عَشْرُ أَمْثَالِهَا ۖ وَمَن جَآءَ بِٱلسَّيِّئَةِ فَلَا يُجْزَىٰٓ إِلَّا مِثْلَهَا وَهُمْ لَا يُظْلَمُونَ

ఎవరైనా ఒక పుణ్యం చేస్తే అతనికి దాని పదింతల ప్రతిఫలం లభిస్తుంది. కానీ ఎవరైనా ఒక చెడు చేస్తే అతనికి దాని సమానమైన శిక్ష మాత్రమే ఇవ్వబడుతుంది. వారికి ఎటువంటి అన్యాయం చేయబడదు. (6:160)

కాబట్టి రంజాన్ మాసంలో గానీ, ముహర్రం మాసంలో గానీ లేదా మరెక్కడైనా గానీ పాపాలు సంఖ్యాపరంగా పెరగవు, పాపం ఎప్పుడూ ఒకటిగానే లెక్కించబడుతుంది. ఇది అల్లాహ్ యొక్క అపారమైన కరుణ మరియు అనుగ్రహం. అయితే, అయితే ఇది మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం. పాపం యొక్క తీవ్రత ప్రదేశం మరియు సమయాన్ని బట్టి మారుతుంది. సాధారణమైన మాసంలో చేసే పాపం, పవిత్ర మాసంలో చేసే పాపం సమానం కావు. తీవ్రత పెరిగిపోతుంది. దాని ప్రభావం పెరిగిపోతుంది. పవిత్ర స్థలాలు మక్కా హరమ్ లో చేసే పాపం ఇతర నగరాలలో చేసే పాపం కంటే చాలా తీవ్రమైనది, పెద్దది. అలాగే పవిత్ర మాసాలలో చేసే పాపం ఇతర నెలలలో చేసే పాపం కంటే అత్యంత ఘోరమైనది మరియు తీవ్రమైనది అని మనం మర్చిపోకూడదు.

పాపాలు మక్కాలో కూడా పుణ్యాల వలే రెట్టింపు మొత్తం పరంగా అవుతాయని సామాన్య ప్రజలు చెబుతుంటారు. ఈ మాట సరైనది కాదు. ఎందుకంటే పాపాలు రెట్టింపు కావడం ఖచ్చితంగా నిషిద్ధం. అల్లాహ్ ఎలా సెలవిచ్చాడు: “ఎవరైనా ఒక పాపం చేస్తే అతనికి దాని సమానమైన శిక్ష మాత్రమే ఇవ్వబడుతుంది.” ఇది పాపాలు రెట్టింపు కావు అని స్పష్టంగా చెబుతున్న ఖురాన్ ఆయత్. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే మక్కా వంటి పవిత్ర స్థలాల్లో పాపం యొక్క తీవ్రత పెరిగిపోతుంది. ఎందుకంటే సమయం మరియు స్థలం యొక్క పవిత్రతను బట్టి పాపం యొక్క తీవ్రత మారుతుంది. పాపం ఎంత తీవ్రమైతే శిక్ష కూడా అంత ఎక్కువగా ఉంటుంది. పాపం ఎంత చిన్నదైతే శిక్ష అంత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ శిక్ష పెరగడం అనేది పాపం యొక్క తీవ్రత పెరగడం వల్ల జరుగుతుంది.

అందుకే మక్కా హరమ్ గురించి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు – ఇది సూరహ్ హజ్ లో ఉంది ఆయత్ 25 లో: “మరియు ఎవరైనా అందులో అన్యాయంతో కూడిన ధర్మ విరుద్ధమైన పనిని చేయాలని సంకల్పిస్తే వారికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపిస్తాము.” అలాగే పవిత్ర మాసాల గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “ఫలా తజ్లిమూ ఫీహిన్న అన్ఫుసకుమ్.” కావున ఆ మాసాలలో మీరు మీకు అన్యాయం చేసుకోకండి. దీని అర్థం ఏమిటి? పవిత్ర మాసాలు కానీ ఇతర సమయాల్లో కూడా తమకు తాము అన్యాయం చేసుకోవడం, పాపం నిషిద్ధమే. కానీ పవిత్ర మాసాల్లో దాని తీవ్రత మరియు శిక్ష చాలా ఎక్కువగా ఉంటుంది.

అభిమాన సోదరులారా! షేక్ ఇబ్నె ఉసైమీన్ రహ్మతుల్లాహి అలైహి ఇలా అన్నారు: మక్కాలో చేసిన పాపాలు సంఖ్యాపరంగా పెరగవు అయితే వాటి తీవ్రత గొప్పతనం పరంగా పెరుగుతాయి. అంటే వాటికి విధించబడే శిక్ష మరింత కఠినంగా మరియు బాధాకరంగా ఉంటుంది. దీనికి ఆధారం అల్లాహ్ యొక్క ఈ ఆయత్ సూరహ్ అన్ ఆమ్ 160: “ఎవడు ఒక సత్కార్యం చేస్తాడో అతనికి దానికి పదిరెట్లు ప్రతిఫలం ఉంటుంది మరియు ఎవడు ఒక పాపం చేస్తాడో అతనికి దాని సమానమైన శిక్ష మాత్రమే ఇవ్వబడుతుంది. వారికి ఎటువంటి అన్యాయం చేయబడదు.” ఈ ఆయత్ స్పష్టంగా పాపాలు సంఖ్యాపరంగా రెట్టింపు కావు అని తెలియజేస్తుంది.

అయితే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మరొక చోట ఇలా సెలవిచ్చాడు: “వ మయ్ యురిద్ ఫీహి బి ఇల్ హాదిమ్ బిజుల్మిన్ నుజిఖ్ హు మిన్ అజాబిన్ అలీమ్.” ఎవడు హరమ్ ప్రాంతంలో అన్యాయపూర్వకంగా మార్గభ్రష్టతను కోరుకుంటాడో అతనికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపిస్తాము. అంటే మక్కాలో చేసిన పాపానికి వచ్చే శిక్ష అదే పాపాన్ని మక్కా వెలుపల చేసినప్పుడు వచ్చే శిక్ష కంటే మరింత కఠినంగా ఉంటుంది. ఇందులో మక్కాలో పాపాల నుండి దూరంగా ఉండాలని తీవ్రమైన హెచ్చరిక ఉంది. ఈ ఆయత్ ద్వారా తెలిసేది ఏమిటంటే హరమ్ లో చేసిన పాపం అత్యంత ఘోరమైనది. కేవలం పాపం చేయాలనే సంకల్పం లేదా ఉద్దేశం కూడా తీవ్రమైన హెచ్చరికకు కారణమవుతుంది. మరి వాస్తవంగా ఆ పాపాన్ని చేసిన ఆ వ్యక్తి యొక్క పాప భారం ఎంత తీవ్రమై ఉంటుందో ఊహించవచ్చు.

అభిమాన సోదరులారా! ఇక సారాంశం ఏమిటంటే మక్కా లేదా హరమ్ ప్రాంతంలో పాపాల యొక్క తీవ్రత పెరిగిపోతుంది. హరమ్ ప్రాంతంలో పాపం చేయాలనే ఆలోచనకే అల్లాహ్ తీవ్రమైన హెచ్చరిక చేశాడు. అలాగే పవిత్ర మాసాలలో కూడా పాపం చేస్తే దాని తీవ్రత, దాని ప్రభావం పెరిగిపోతుంది ఎక్కువగా ఉంటుంది. కావున మనము ఈ పవిత్ర మాసాలను గౌరవించాలి. పవిత్ర మాసాలను గౌరవించడం అంటే ఏంటి? ప్రతి చిన్న పెద్ద పాపం నుండి అవిధేయత నుండి తప్పుల నుండి దూరంగా ఉండాలి. సదాచారాలు, సత్కార్యాలు, పుణ్యకార్యాలు, మంచి పనులు ఎక్కువగా చేయాలి. దుఆ లు, జిక్ర్, నఫిల్ ఉపవాసాలు, ఖురాన్ పారాయణము వగైరా వగైరా.

“ఫలా తజ్లిమూ ఫీహిన్న అన్ఫుసకుమ్.” ఈ ఆయత్ లోని జుల్మ్ (దౌర్జన్యం) అంటే ఏమిటి? దౌర్జన్యం యొక్క అర్థం ఏమిటంటే ప్రత్యేకంగా ఈ నాలుగు మాసాలలో మీరు అల్లాహ్ అవిధేయతకు దూరంగా ఉండండి. ఎందుకంటే వీటిలో అవిధేయత పాపం ఎన్నో రెట్లు పెరిగిపోతుంది.

హాఫిజ్ ఇబ్నె కసీర్ రహ్మతుల్లాహి అలైహి హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనాన్ని హదీసును ఇలా తెలియజేశారు:

“అల్లాహ్ దౌర్జన్యాన్ని సంవత్సరపు పన్నెండు మాసాల్లోనూ నిషేధించాడు. తదుపరి నాలుగు మాసాలను వాటిలో ప్రత్యేకంగా ఖరారు చేశారు. ఎందుకంటే వీటిలో చెడు, అవిధేయతల పాపం పెరుగుతుంది మరియు మంచి సదాచారణల పుణ్యం కూడా ఎన్నో రెట్లు పెరుగుతుంది.”

ఇమామ్ ఖతాదా ఈ ఆయత్ గురించి వ్యాఖ్యానిస్తూ ఇలా వివరించారు: దౌర్జన్యం పాపం ఎల్లప్పుడూ ఎక్కువగా ఉన్నప్పటికీ, కానీ ప్రత్యేకంగా నిషిద్ధ మాసాలలో దీని పాపం మరియు బరువు ఇతర మాసాల కన్నా ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. తీవ్రత పెరిగిపోతుంది.

దైవదూతల్లో ఈ విధంగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దైవదూతల్లో కొందరిని ప్రత్యేకంగా సందేశహరులుగా చేశాడు. గ్రంథాలలో దివ్య ఖురాన్ ను, యావత్ భూమిలో మసీదులను, అలాగే మాసాల్లో రంజాన్ నెల మరియు నిషిద్ధ మాసాలతో పాటు అనుకున్నట్లే దినాలలో శుక్రవారాన్ని, రాత్రుల్లో లైలతుల్ ఖదర్ ను అల్లాహ్ అనుకున్నట్లే ఏ మాసంలో పాప ఫలాన్ని అధికం చేయాలో మరియు దేనికి గొప్పతనం ప్రసాదించాలో పూర్తిగా అల్లాహ్ ఇష్టం. అంటే ఏ విధంగానైతే అల్లాహ్ మాసాలలో రంజాన్ యొక్క ప్రత్యేకత ఎంచుకున్నాడో ఖురాన్ గురించి, అలాగే పవిత్ర నాలుగు మాసాలు అల్లాహ్ ఎంచుకున్నాడో, దైవదూతల్లో జిబ్రయీల్ ను అల్లాహ్ ఎంచుకున్నాడో ఆ విధంగా ఈ మాసాలలో. అల్లాహ్ తన ఇష్టానుసారం అది పూర్తిగా అతని ఇష్టం. అందుకే అల్లాహ్ దేన్నైతే గొప్పదిగా భావిస్తాడో మీరు కూడా దానిని గొప్పదిగా భావించండి అని ఖతాదా రహ్మతుల్లాహి అలైహి వివరించాడు. అల్లాహ్ దేనికి గొప్పదిగా భావించాడో మనం కూడా దానిని గొప్పదిగా భావించాలి. ఈ వివరం ఇబ్నె కసీర్ భాగం రెండులో ఉంది.

ప్రియ సోదరులారా! సంవత్సరం పొడుగునా ప్రత్యేకించి ఈ నాలుగు మాసాల్లో మనం అల్లాహ్ అవిధేయత నుండి దూరంగా ఉండాలి మరియు పాప కార్యాలను త్యజించాలి. ఎందుకంటే అవిధేయత మరియు పాప కార్యాల మూలంగా హృదయాలకు తుప్పు పడుతుంది. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సూరహ్ ముతఫ్ఫిఫీన్ లో సెలవిచ్చాడు:

كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا۟ يَكْسِبُونَ
(కల్లా బల్ రాన అలా ఖులూబిహిమ్ మా కానూ యక్ సిబూన్)
ఎంతమాత్రం కాదు! అసలు వారి హృదయాలకు వారు చేసిన దుష్కార్యాల తుప్పు పట్టింది. (83:14)

మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

“ఇన్నల్ ముఅమిన ఇజా అజ్ నబ జంబన్ కానత్ నుఖ్ తతన్ సౌదా ఫీ ఖల్ బిహి, ఫ ఇన్ తాబ వ నజఅ వస్తఘ్ ఫర సఖల మిన్ హా.” అంటే ఈ హదీసు తిర్మిజీ, నసాయి, ఇబ్నె మాజా లో ఉంది. దానికి అర్థం ఏమిటంటే: విశ్వాసి ఏదైనా దుష్కార్యం పాపం చేసినప్పుడు అతని హృదయంలో ఒక నల్లటి మచ్చ ఏర్పడుతుంది. తదుపరి ఒకవేళ అతను పశ్చాత్తాపం చెంది ఆ దుష్కార్యాన్ని త్యజించి పాపాన్ని వదిలి క్షమించమని అల్లాహ్ ను వేడుకుంటే అతని హృదయాన్ని శుభ్రం చేయడం జరుగుతుంది. ఆ నల్లటి మచ్చ అల్లాహ్ తీసేసి కడిగేస్తాడు హృదయం నుంచి. ఒకవేళ అతను ఒక దుష్కార్యం తర్వాత మరో దుష్కార్యం ఒక పాపం తర్వాత మరో పాపం ఈ విధంగా చేస్తూ పోతూ ఉంటే అతని హృదయంలో నల్లటి మచ్చ పెరుగుతూ పోయి చివరికి పూర్తి హృదయాన్ని ఆక్రమించుకుంటుంది. దీనినే అల్లాహ్ ఖురాన్ లో రాన్ అన్నాడు: “కల్లా బల్ రాన అలా ఖులూబిహిమ్.” హృదయాలకు తుప్పు పట్టడం.

అభిమాన సోదరులారా! ఇక పాపాల ప్రమాదం లేకపోతే ప్రభావం సాధారణంగా ఎప్పుడు చేసినా చాలా కఠినంగా ఉంటుంది. ఉదాహరణకు నేను ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను సారాంశంగా, వివరణకు పోకుండా. పాపాల మూలంగా అల్లాహ్ యొక్క ఆగ్రహానికి గురవుతాము ఎప్పుడు పాపం చేసినా. మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు: “ఇయ్యాక వల్ మాసియ ఫ ఇన్న బిల్ మాసియతి హల్ల సఖతుల్లాహి అజ్జ వజల్ల.” అల్లాహ్ కు అవిధేయత చూపకండి అంటే పాపం చేయకండి. ఎందుకు పాపాల వల్ల అల్లాహ్ ఆగ్రహానికి గురవుతాము. ఈ హదీసు ముస్నద్ అహ్మద్ లో ఉంది.

అలాగే అల్లాహ్ సెలవిచ్చాడు సూరహ్ హజ్ లో: అల్లాహ్ పరాభవం పాలుజేసిన వాడికి ఎవ్వరూ ఆదరించరు. అలాగే పాపాల మూలంగా దాసుడు సైతాన్ బందీ అయిపోతాడు సూరహ్ జుఖ్రుఫ్ ఆయత్ 36:

وَمَن يَعْشُ عَن ذِكْرِ ٱلرَّحْمَٰنِ نُقَيِّضْ لَهُۥ شَيْطَٰنًا فَهُوَ لَهُۥ قَرِينٌ
(వ మయ్ యఅషు అన్ జిఖ్రిర్ రహ్మాని నుఖయ్యిజ్ లహు షైతానన్ ఫహువ లహు ఖరీన్)
కరుణామయుని స్మరణ పట్ల గుడ్డిగా వ్యవహరించే వ్యక్తిపై మేము షైతానును నియమిస్తాము, ఇక వాడు అతనికి సహవాసిగా ఉండిపోతాడు. (43:36)

సైతాన్. అలాగే పాపాల వల్ల మనిషి తన్ను తానే మర్చిపోతాడు సూరహ్ హషర్ ఆయత్ 19:

وَلَا تَكُونُوا۟ كَٱلَّذِينَ نَسُوا۟ ٱللَّهَ فَأَنسَىٰهُمْ أَنفُسَهُمْ ۚ أُو۟لَٰٓئِكَ هُمُ ٱلْفَٰسِقُونَ
(వలా తకూనూ కల్లజీన నసుల్లాహ ఫ అన్సాహుమ్ అన్ఫుసహుమ్ ఉలాయిక హుముల్ ఫాసిఖూన్)
మరియు మీరు అల్లాహ్ ను మరిచిపోయిన వారి మాదిరిగా అయిపోకండి. వారి ఈ విస్మరణ కారణంగా అల్లాహ్ కూడా వారిని తమ ఆత్మలనే మరిచిపోయిన వారిగా చేసేశాడు. అలాంటి వారే పరమ అవిధేయులు. (59:19)

అలాగే పాపాల వల్ల జీవితం దుర్భరమైపోతుంది, మనశ్శాంతిని కోల్పోతాము. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు సూరహ్ తాహా లో:

وَمَنْ أَعْرَضَ عَن ذِكْرِى فَإِنَّ لَهُۥ مَعِيشَةً ضَنكًا وَنَحْشُرُهُۥ يَوْمَ ٱلْقِيَٰمَةِ أَعْمَىٰ
(వ మన్ ఆరజ అన్ జిక్రీ ఫ ఇన్న లహు మఈషతన్ జంకా వ నహ్ శురుహూ యౌమల్ ఖియామతి అమా)
మరియు ఎవడు నా స్మరణ (ఖురాన్) పట్ల వైముఖ్యత చూపుతాడో అతని బ్రతుకు దుర్భరమవుతుంది. మరియు ప్రళయ దినాన మేము అతన్ని గుడ్డివానిగా చేసి లేపుతాము. (20:124)

ప్రపంచంలో శిక్ష ఏమిటి? దుర్భరమైపోతుంది, అశాంతి ఉంటుంది, అలజడి ఉంటుంది, సమస్యలు ఉంటాయి, మనశ్శాంతి ఉండదు, టెన్షన్ లో ఉంటాము ఈ ప్రపంచంలో. పరలోకంలో గుడ్డివానిగా లేపుతాము. అప్పుడు ఆ వ్యక్తి అల్లాహ్ కు అడుగుతాడు:

قَالَ رَبِّ لِمَ حَشَرْتَنِىٓ أَعْمَىٰ وَقَدْ كُنتُ بَصِيرًا
(ఖాల రబ్బి లిమ హషర్ తనీ అమా వ ఖద్ కుంతు బసీరా)
“ప్రభూ! నన్ను గుడ్డివానిగా చేసి లేపారేమిటీ? నాకు చూపు ఉండేదికదా!” అని అతను అంటాడు (20:125)

అప్పుడు అల్లాహ్ సమాధానం ఇస్తాడు:

قَالَ كَذَٰلِكَ أَتَتْكَ ءَايَٰتُنَا فَنَسِيتَهَا ۖ وَكَذَٰلِكَ ٱلْيَوْمَ تُنسَىٰ
(ఖాల కజాలిక అతత్ క ఆయాతునా ఫనసీత హా వ కజాలికల్ యౌమ తున్ సా)

“జరగవలసిన విధంగానే జరిగింది. (ఒకప్పుడు) నీ వద్దకు వచ్చిన మా ఆయతులను (వచనాలను, సూచనలను, మహిమలను) నువ్వు విస్మరించావు. అందుకే ఈనాడు నువ్వు కూడా విస్మరించబడుతున్నావు” అని అనబడుతుంది. (20:126)

ఇది పాపాల ప్రభావం. పాపాల వల్ల ప్రస్తుతం అనుభవించే వరాలు అల్లాహ్ లాక్కుంటాడు. దీనికి ఉదాహరణ ఆదమ్ అలైహిస్సలాం హవ్వా అలైహిస్సలాం స్వర్గంలో ఉన్నారు. దీని వివరణ సూరహ్ బఖరా లో ఉంది ఆయత్ 30, 31, 32. అల్లాహ్ వరాలను అనుభవిస్తూ ఉన్నారు అల్లాహ్ నేమత్ లను సుఖంగా సంతోషంగా హాయిగా టెన్షన్ లేదు ఏమీ లేదు. అక్కడ తప్పు జరిగింది అల్లాహ్ ఆ వరం తీసేసుకున్నాడు భూమిపైన వేసేశాడు. అంటే ఇది ఉదాహరణ. అలాగే ఉహుద్ సంఘటన, ఉహుద్ లో కొంతమంది సహాబాలకి వారు చేసిన ఆ పొరపాటు మూలంగా ఇది అయిపోయింది మనకు తెలిసిన విషయమే. అభిమాన సోదరులారా చెప్పడం ఏమిటంటే పాపాల వల్ల ఉపాధిలో కొరత వస్తుంది. మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు: “వ ఇన్నర్ రజుల ల యుహ్రముర్ రిజ్ ఖ బి ఖతీఅతిన్ యఅ మలుహా.” అంటే మనిషి పాపం వల్ల అతనికి ఇవ్వబోయే ఆ రిజ్క్ కి మహ్రూమ్ అయిపోతాడు. అల్లాహు అక్బర్.

అభిమాన సోదరులారా ఇవి ఎప్పుడు పాపం చేసినా దాని ప్రభావం. మరి ఇటువంటి పాపాలు, ఇటువంటి అన్యాయాలు, ఇటువంటి దౌర్జన్యాలు, ఇటువంటి అవిధేయతలు, ఇటువంటి ఘోరాలు, ఇటువంటి నేరాలు పవిత్ర మాసాలలో చేస్తే దాని తీవ్రత ఎలా ఉంటుంది? మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు నేను పాపాల ప్రభావం ప్రభావాలు కొన్ని చెప్పాను కొన్ని మాత్రమే. పాపం వల్ల రిజ్క్ మహ్రూమ్ అవుతాము. పాపం వల్ల అల్లాహ్ మనకు ఇప్పుడు ఇచ్చిన వరం ఇవ్వబోయే వరం రెండింటికి అల్లాహ్ దూరం చేసేస్తాడు. మనశ్శాంతి ఉండదు, శాంతి తీసేస్తాడు. ఇలాంటివి ఉన్నాయి కదా ఈ లోకంలో కూడా పరలోకంలో కూడా ఇవి ఎప్పుడు పాపం చేసినా. ఇటువంటి పాపాలు పవిత్ర మాసాలలో చేస్తే దాని ప్రభావం, దాని తీవ్రత ఎలా ఉంటుంది? మనం ఊహించుకోగలము.

ఇప్పుడు సుకూన్ అనేది శాంతి అనేది సుఖమైన జీవితం అనేది టెన్షన్ లేని జీవితం అనేది సాధారణంగా లేదు. ఎందుకు? డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా పేదవారు ధనవంతులు, మంచి హోదాలో ఉన్నవారు హోదా లేని ఉద్యోగం లేని వారు – అంటే పేదవారు మిడిల్ క్లాస్ వారు ధనవంతులు అందరూ మనశ్శాంతి కోల్పోయారు. అంటే డబ్బు ఉన్న వారికి శాంతి లేదు, డబ్బు లేని వారికి శాంతి లేదు. ఉద్యోగం ఉన్న వారికి శాంతి లేదు, ఉద్యోగం లేని వారికి శాంతి లేదు. కారణం ఏమిటి? కారణం ఈ పాపాలే.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ నాకు చెప్పడం కంటే ఎక్కువగా మీకు వినడం కంటే ఎక్కువగా ఇస్లాంను అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో ప్రతి ప్రదేశంలో ప్రతి మాసంలో ముఖ్యంగా పవిత్ర మాసాలలో ప్రతి చిన్న పెద్ద పాపం నుండి మనల్ని అల్లాహ్ రక్షించుగాక. ఓ అల్లాహ్ అన్ని మాసాలలో ముఖ్యంగా ఈ పవిత్ర మాసాలలో మమ్మల్ని పాపాలు మరియు అవిధేయతల నుండి కాపాడు. నీ విధేయత మరియు నీ సంతృప్తిని పొందే సత్కార్యాలకు మాకు తౌఫీక్ ప్రసాదించు. మమ్మల్ని నీ సత్ ప్రవర్తన గల దాసులలో చేర్చు. ఆమీన్.

వ ఆఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

సుబ్ హానకల్లాహుమ్మ వ బి హమ్దిక అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ ఫిరుక వ అతూబు ఇలైక్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=46079


ఒకే ప్రయాణంలో అనేక ఉమ్రాలు చేసేవారికి – షేఖ్ అబ్దుర్రజ్జాఖ్ అల్-బద్ర్

To Those Who Perform Multiple Umrahs in One Journey
Shaykh Abdurrazzaq al-Badr [Video|Ar-En Subtitles]
https://youtu.be/40fnJJgrRBg [ 7 min]

ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా, హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఇతర భార్యల వలె ‘తమత్తు‘ (Tamattu’) ఉద్దేశ్యంతో మొదట ఉమ్రా కోసం ఇహ్రామ్ కట్టారు. అయితే ప్రయాణ సమయంలో ఆమెకు రుతుస్రావం మొదలైంది. దాంతో గుస్ల్ (స్నానం) ఆచరించి, హజ్ కోసం ఇహ్రామ్ కట్టాల్సిందిగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమెకు సూచించారు. ఆమె ‘దుల్-హులైఫా’ వద్ద సంకల్పించిన ఉమ్రా ఆమె హజ్‌లో కలిసిపోవడం వల్ల, ఆమె ఒక ‘ఖారిన్‘ (Qarin – ఉమ్రా మరియు హజ్ కలిపి చేసేవారు) అయ్యారు. ఆమె ఉమ్రా హజ్‌లోనే కలిసిపోయినందున, హజ్ పూర్తయిన తర్వాత ఇతర భార్యల వలె తాను కూడా ప్రత్యేకంగా ఒక ఉమ్రా చేస్తానని ఆమె ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అనుమతి అడిగారు. అప్పుడు ఆమె ఉమ్రా కోసం ఇహ్రామ్ కట్టడానికి వీలుగా, హరమ్ సరిహద్దుల వెలుపల ఉన్న ‘అల్-తన్ఈమ్’ ప్రాంతానికి ఆమె సోదరునితో కలిసి వెళ్లాలని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సూచించారు.

ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉమ్రా చేయాలని కోరినప్పుడు, ఆమె ఇహ్రామ్ కట్టడానికి వీలుగా పవిత్ర హరమ్ సరిహద్దులకు ఆవల ఉన్న ప్రదేశానికి ఆమెను తీసుకువెళ్లమని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమె సోదరుడు అబ్దుర్రహ్మాన్‌ను ఆదేశించారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి: ఆమె సోదరుడు అబ్దుర్రహ్మాన్ ఆమెకు తోడుగా వెళ్లి, తవాఫ్, సయీలలో ఆమెకు సహాయపడి, ఆ తర్వాత ఆమెతో పాటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు తిరిగి వచ్చారు. కానీ, ఆయన స్వయంగా ఇహ్రామ్ కట్టలేదు. పుణ్యకార్యాలు చేయాలనే బలమైన ఆసక్తి ఉన్నప్పటికీ, ఈ విషయం గురించి విన్న సహచరులు (సహాబా) (రదియల్లాహు అన్హుమ్) ఎవరూ కూడా, నేటి కాలంలో పదేపదే ఉమ్రా చేసే కొందరి వలె “హజ్ తర్వాత మరో ఉమ్రా చేయడానికి ఇదొక మంచి అవకాశం” అని భావించలేదు. అసలు సహచరులు (రదియల్లాహు అన్హుమ్) ఇలా పదేపదే ఉమ్రాలు చేసేవారే కాదు.

ఈ సంఘటన ద్వారా మనకొక విషయం స్పష్టమవుతోంది: సత్కార్యాలు చేయడంలో మనకంటే సహచరులకే (రదియల్లాహు అన్హా)ఎక్కువ ఆసక్తి ఉండేది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుమతితో ఆయిషా (రదియల్లాహు అన్హా)ఉమ్రాకు వెళ్లినప్పుడు, ఆమె సోదరుడు అబ్దుర్రహ్మాన్ ఆమెతో పాటు వెళ్లినా ఇహ్రామ్ కట్టలేదు. “ఎలాగూ వెళ్తున్నాను కదా, నేనూ ఒక ఉమ్రా చేసేస్తాను” అని ఆయన అనుకోలేదు. అలాగే, అక్కడ వేచి ఉన్న ఇతర సహచరులు కూడా “మనం ఎలాగూ ఇక్కడే ఉన్నాం కదా, మనమూ ఉమ్రా చేద్దాం” అని అనలేదు. నేడు కొందరు తమకోసం లేదా తమ తల్లిదండ్రులు, బంధువుల తరపున చేస్తున్నట్లుగా వారిలో ఎవరూ పదేపదే ఉమ్రా చేయలేదు. కాబట్టి, కొంతమంది యాత్రికులు హజ్ పూర్తయ్యాక రెండు, మూడు లేదా నాలుగుసార్లు పదేపదే ఉమ్రాలు చేయడం, ప్రతి ఉమ్రాకూ జుట్టును కొద్దికొద్దిగా కత్తిరించడం లాంటి ఆచరణలకు ఇస్లాంలో ఎలాంటి ఆధారం లేదు. ఒక వ్యక్తి ఒక ఉమ్రా కోసం తలలో సగం గుండు చేయించుకున్నాడని, మరో ఉమ్రా కోసం మిగిలిన సగం గుండు చేయించుకున్నాడని కూడా కొన్ని కథనాలు ఉన్నాయి—కానీ వాటి ప్రామాణికత సందేహాస్పదమే.

సరైన అవగాహన లేకపోవడం, అజ్ఞానంతో వ్యవహరించడం వల్ల హజ్ సమయంలో అనేక వింతైన, అసాధారణమైన ఆచరణలు మనకు కనిపిస్తుంటాయి. షేక్ (ఇబ్న్ బాజ్) (రహిమహుల్లాహ్) జీవించి ఉన్న కాలంలో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుంది. నేను ఒకసారి ఆయన వద్దకు వెళ్లినప్పుడు, నన్ను కలిసి సందేహం అడిగిన ఒక యాత్రికుడి గురించి షేక్ గారికి వివరించాలని కొందరు పండితులు నాతో అన్నారు. నేను మదీనాలోని మీఖాత్‌లో ఉన్నప్పుడు ఒక యాత్రికుడు నా వద్దకు వచ్చి, “నాకు సహజంగానే బట్టతల ఉంది, పైగా నేను ఎప్పుడూ గడ్డం కూడా గీసుకుంటాను” అని చెప్పాడు. అతను ఇంకా ఇలా అన్నాడు: “నేను అల్-మర్వాకు చేరుకుని ఉమ్రా పూర్తి చేసేసరికి నా తలపై జుట్టు ఏమీ లేదు. అప్పుడు నాకు ఒక వ్యక్తి కనిపించి, ‘నీ తల మీద జుట్టు లేదు కదా, ఇప్పుడు నువ్వు ఇహ్రామ్ నుండి ఎలా బయటపడతావు? వెళ్లి నీ మీసాలు గీసుకో‘ అని సలహా ఇచ్చాడు. దాంతో నేను మంగలి వద్దకు వెళ్లి నా మీసాలు గీసుకుని, తద్వారా ఇహ్రామ్ నుండి బయటపడ్డాను” అని చెప్పాడు. కొందరు పండితుల సూచన మేరకు ఈ విషయాన్ని నేను షేక్ ఇబ్న్ బాజ్‌తో ప్రస్తావించగా, ఆయన తీవ్ర ఆవేదన, కోపం వ్యక్తపరిచారు. సరైన జ్ఞానం లేకుండా యాత్రికులకు ఫత్వాలు (మతపరమైన తీర్పులు) ఇవ్వడానికి కొందరు చూపే సాహసమే ఆయన కోపానికి కారణం.

దీనికి సంబంధించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించిన ఒక హదీసు ఉంది: 

مَنْ أُرْشِدَ إِلَى غَيْرِ رُشْدٍ فَإِنَّمَا إِثْمُهُ عَلَى مَنْ أَرْشَدَهُ 
(ఎవరైనా మార్గభ్రష్టత్వం వైపు దారిచూపితే, దాని పాపం దారిచూపిన వారిపైనే పడుతుంది.)

కాబట్టి, సరైన జ్ఞానం లేకుండా “ఫలానా విధంగా చేయండి” అని సలహా ఇచ్చే వ్యక్తి, అల్లాహ్ పేరుతో తప్పుగా మాట్లాడినందుకు పాపభారాన్ని మూటగట్టుకుంటాడు. కొందరు వ్యక్తులు, సుబహానల్లాహ్ (అల్లాహ్ ఎంతో పవిత్రుడు), ఇలాంటి పరిస్థితుల్లో కేవలం భావోద్వేగాలకు లోనై “ఏమీ పర్వాలేదులే” అంటూ తప్పుడు సమాధానాలు ఇస్తుంటారు. ఇతరుల పట్ల దయ చూపడానికి ముందు, ఒకరు తమ పట్ల తాము దయ కలిగి ఉండాలి. ఇతరులపై జాలి చూపించే ముందు మీపై మీరు జాలి చూపించుకోండి—అంటే, జ్ఞానం లేకుండా అల్లాహ్ గురించి మాట్లాడి పాపాల్లో పడవద్దు. ఫత్వా (మతపరమైన తీర్పు) అనేది భావోద్వేగాలపై కాకుండా, పరిపూర్ణమైన జ్ఞానం, స్పష్టమైన అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. ఒకరికి సరైన జ్ఞానం ఉంటేనే వారు తీర్పు ఇవ్వాలి; లేదంటే, ఆ విషయమై జ్ఞానం ఉన్న పండితులను సంప్రదించమని ఇతరులకు సూచించాలి.

ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉమ్రా: హజ్రత్ ఆయిషా ఉమ్రా ఉద్దేశ్యంతో వెళ్ళినప్పుడు రుతుస్రావం మొదలవడంతో, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సూచన మేరకు ఆమె హజ్ మరియు ఉమ్రా రెండింటినీ కలిపి (ఖారిన్) చేశారు.

అల్-తన్ఈమ్ ప్రయాణం: హజ్ పూర్తయిన తర్వాత ఆమె కోరిక మేరకు, ప్రత్యేకంగా ఉమ్రా చేయడానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుమతించారు. ఇహ్రామ్ కట్టడం కోసం ఆమెను తన సోదరుడు అబ్దుర్రహ్మాన్‌తో కలిసి ‘అల్-తన్ఈమ్’ ప్రాంతానికి పంపారు.

పదేపదే ఉమ్రాలు చేయకపోవడం: ఆయిషా (రదియల్లాహు అన్హా) కి తోడుగా వెళ్లిన ఆమె సోదరుడు అబ్దుర్రహ్మాన్ (రదియల్లాహు అన్హు) స్వయంగా ఉమ్రా చేయలేదు. దీనిని బట్టి ఒకే ప్రయాణంలో పదేపదే ఉమ్రాలు చేసే ఆచారం సహాబాలలో (ప్రవక్త అనుచరులలో) లేదని స్పష్టమవుతుంది.

ఆధారం లేని ఆచరణలు: హజ్ తర్వాత రెండు మూడు సార్లు పదేపదే ఉమ్రాలు చేయడం, ప్రతి ఉమ్రాకు కొద్దికొద్దిగా జుట్టు కత్తిరించడం లాంటి నేటికాలపు ఆచరణలకు ఇస్లాంలో ఎలాంటి ఆధారం లేదు.

అజ్ఞానం వల్ల తప్పులు: సరైన జ్ఞానం లేకపోవడం వల్ల కొందరు వింతైన పనులు చేస్తుంటారు. ఉదాహరణకు, బట్టతల ఉన్న ఒక వ్యక్తి ఉమ్రా పూర్తి చేశాక ఇహ్రామ్ నుండి బయటపడటానికి మీసాలు గీసుకోమని ఒకరు తప్పుడు సలహా ఇచ్చారు.

జ్ఞానం లేకుండా ఫత్వా ఇవ్వరాదు: ఈ సంఘటన విన్న షేక్ ఇబ్న్ బాజ్, సరైన జ్ఞానం లేకుండా మతపరమైన తీర్పులు (ఫత్వాలు) ఇచ్చే వారి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తప్పుదారి పట్టిస్తే పాపం: హదీసు ప్రకారం, ఒకరికి మతపరంగా తప్పుడు మార్గం చూపితే దాని పాపం ఆ సలహా ఇచ్చిన వారిపైనే పడుతుంది. కాబట్టి, అవగాహన లేకుండా కేవలం భావోద్వేగాలతో ఫత్వాలు ఇవ్వకూడదు.

ఉమ్రహ్ మెయిన్ పేజీ :
https://teluguislam.net/umrah/

అయ్యాముత్ తష్రీఖ్ (హజ్జ్ మాసంలోని తష్రీఖ్ దినాల) ఘనత

అయ్యాముత్ తష్రీఖ్ ఘనత
కూర్పు: ముహమ్మద్ నసీర్పద్దీన్ జామిఈ

[పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి]


అయ్యాముత్ తష్రీఖ్ అనగా ఇస్లామీయ క్యాలెండర్ లోని 12వ నెల అయిన జుల్ హిజ్జా యొక్క 11, 12 మరియు 13 తేదీలు. ఇవి ఖుర్బానీ, అల్లాహ్ స్మరణ, తక్బీరాత్ మరియు అల్లాహ్ అనుగ్రహాలపై కృతజ్ఞత తెలిపే రోజులు. ఈ రోజులకు ఇస్లాంలో గొప్ప మహిమ ఉంది.

అల్లాహు తఆలా ఇలా సెలవిచ్చాడు:

وَاذْكُرُوا اللَّهَ فِي أَيَّامٍ مَعْدُودَاتٍ
గణించదగిన ఆ దినాలలో (తష్రీఖ్ దినాలలో) అల్లాహ్ ను స్మరించండి (సూరహ్ అల్-బఖరా: 203).

ముఫస్సిరీన్లలో (ఖుర్ఆన్ వ్యాఖ్యానకర్తలలో) ముఖ్యంగా అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్, అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా మరియు జుమ్హూర్ ఉలమా అభిప్రాయం ప్రకారం “అయ్యామిన్ మఅదూదాత్” అనగా అయ్యామె తష్రీఖ్.

అల్లాహు తఆలా ఇలా సెలవిచ్చాడు:

لِيَشْهَدُوا مَنَافِعَ لَهُمْ وَيَذْكُرُوا اسْمَ اللَّهِ فِي أَيَّامٍ مَعْلُومَاتٍ
వారు తమ ప్రయోజనాలు పొందటానికి (హజ్ కు) రావాలి. ఆ నిర్ణీత దినాలలో అల్లాహ్ నామాన్ని స్మరించాలి. (సూరహ్ అల్-హజ్: 28).

అధిక ముఫస్సిరీన్ల ప్రకారం “అయ్యామిమ్ మఅలూమాత్” అంటే జుల్ హిజ్జా మొదటి పది రోజులు; “అయ్యామిమ్ మఅదూదాత్” అంటే అయ్యాముత్ తష్రీఖ్. ఇక్కడ ఖుర్బానీ ప్రస్తావన వచ్చింది గనక, ఈ ఖుర్బానీ ఎన్ని రోజులు చేయవచ్చు అన్నది కూడా స్పష్టంగా తెలుసుకుందాం.

అయితే పండుగ రోజు (10వ జిల్ హిజ్జా) మరియు ఆ తర్వాత మూడు రోజులు, మొత్తం నాలుగు రోజులు ఖుర్బానీ చేయవచ్చు. దీనికి మొదటి ఆధారం ప్రవక్తవారి ఈ హదీసు «كُلُّ أَيَّامِ التَّشْرِيقِ ذَبْحٌ» అయ్యాముత్ తష్రీఖ్ యొక్క అన్ని రోజులు జిబహ్ చేయవచ్చును అంటే ఖుర్బానీ ఇవ్వవచ్చును. (ముస్నద్ అహ్మద్ 1651, సహీహ్ 2476).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు:

«إِنَّ يَوْمَ عَرَفَةَ وَيَوْمَ النَّحْرِ وَأَيَّامَ التَّشْرِيقِ عِيدُنَا أَهْلَ الْإِسْلَامِ ، وَهِيَ أَيَّامُ أَكْلٍ وَشُرْبٍ»
నిశ్చయంగా అరఫా రోజు, నహ్ర ఖుర్బానీ రోజు మరియు అయ్యాముత్ తష్రీఖ్ ముస్లింల పండుగ రోజులు మరియు తినే త్రాగే రోజులు. (అబూ దావూద్ 2419. చివరి పదాలు ముస్లిం 1141లోనివి).

ఇమాం ఇబ్నె తైమియా, ఇమాం ఇబ్నె ఖయ్యిమ్, ఇమాం షౌకానీ, షేఖ్ బిన్ బాజ్ మరియు షేఖ్ ఇబ్ను ఉసైమీన్ రహిమహుల్లాహ్ ఈ మాటనే బలపరిచారు, మరియు రాజిహ్ అని చెప్పారు. సూర బఖరలోని 203వ ఆయతు ద్వారా కూడా ఈ మాట గ్రహించడం జరిగినది. (వివరాలు ఆ ఆయతు వ్యాఖ్యానం మరియు హదీసుల్లో చూడవచ్చు).

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

أَيَّامُ التَّشْرِيقِ أَيَّامُ أَكْلٍ وَشُرْبٍ وَذِكْرِ اللَّهِ
అయ్యాముత్ తష్రీక్ అనేవి తినే, త్రాగే మరియు అల్లాహ్ స్మరణ చేసే రోజులు. (ముస్లిం: 1141).

ఈ హదీస్ స్పష్టంగా తెలియజేస్తుంది: ఈ రోజుల్లో అల్లాహ్ అనుగ్రహాలపై సంతోషం వ్యక్తం చేయడం షరియత్ లో సమ్మతం.

విశ్వాసులారా! లెక్కలేనన్ని సత్కార్యాలలో ఏదైనా సత్కార్యం గురించి అధికంగా చేయండి అని అల్లాహ్ చెప్పి ఉన్నాడా అంటే, అవును జిక్ర్ గురించి చెప్పి ఉన్నాడు. శ్రద్ధ వహించండి సురతుల్ జుముఅలోని ఈ ఆయత్:

﴿ وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا لَّعَلَّكُمْ تُفْلِحُونَ ﴾ [الجمعة ١٠]
ఎక్కువగా అల్లాహ్ ను స్మరిస్తూ ఉండండి.

పైన ఉన్న ఆయతు అనువాదం ఇంతేనా, కాదు. అల్లాహ్ మరో శుభవార్త ఇచ్చాడు. అదే: మీరు సాఫల్యం పొందవచ్చు. అల్లాహు అక్బర్! మనం అల్లాహ్ ను ఎక్కువగా, అధికంగా స్మరిస్తూ ఉంటే సాఫల్యం లభించేది మనకే.

﴿ وَالذَّاكِرِينَ اللَّهَ كَثِيرًا وَالذَّاكِرَاتِ أَعَدَّ اللَّهُ لَهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا ﴾
అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు – స్మరించే స్త్రీలు – వీరందరి కోసం అల్లాహ్ (విస్తృతమైన) మన్నింపును, గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు. (అహ్జాబ్ 33:35).

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఆదేశించారు:

لَا تَصُومُوا هَذِهِ الْأَيَّامَ
(అయ్యాముత్ తష్రీక్ లో) ఉపవాసం పాటించకండి. (సహీహ్ 3573).

అందువల్ల సాధారణ ముస్లింలకు 11, 12, 13 జుల్ హిజ్జా రోజుల్లో ఉపవాసం పాటించడం యోగ్యం కాదు. అయితే హజ్ తముత్తు లేదా ఖిరాన్ చేసిన హాజీలకు ఖుర్బానీ చేయలేని పరిస్థితిలో ఉపవాసం పాటించే అనుమతి ఉంది.

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

إِنَّ أَعْظَمَ الْأَيَّامِ عِنْدَ اللَّهِ يَوْمُ النَّحْرِ، ثُمَّ يَوْمُ الْقَرِّ
అల్లాహ్ వద్ద అత్యంత గొప్ప రోజు యౌమున్ నహర్ (10వ జుల్ హిజ్జా), తరువాత యౌముల్ ఖర్ర్ (11వ జుల్ హిజ్జా). (అబూ దావూద్: 1765.

ఇమామ్ అల్బానీ రహిమహుల్లాహ్ దీనిని సహీహ్ అన్నారు.) “యౌముల్ ఖర్ర్” అనగా అయ్యాముత్ తష్రీక్ మొదటి రోజు; ఈ రోజున హుజ్జాజ్ మినా లో నివసిస్తారు.

وَاذْكُرُوا اللَّهَ فِي أَيَّامٍ مَعْدُودَاتٍ
“గణించదగిన ఆ దినాలలో (తష్రీఖ్ దినాలలో) అల్లాహ్ ను స్మరించండి ” (సూరహ్ అల్-బఖరా: 203)

ఈ ఆయత్ ఆధారంగా సహాబాయె కిరామ్ రజియల్లాహు అన్హుమ్ అయ్యాముత్ తష్రీఖ్ రోజుల్లో గట్టిగా (బిగ్గరగా) తక్బీరాత్ పలికేవారు.

[1] హజ్రత్ ఇబ్ను ఉమర్ మరియు హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు అన్హుమా మార్కెట్ లోకి వెళ్లి తక్బీర్ పలికేవారు; వారిని విని ప్రజలు కూడా తక్బీర్లు పలికేవారు. (బుఖారీ, కితాబుల్ ఈదైన్, బాబ్ ఫజ్జుల్ అమల్ ఫీ అయ్యామిత్ తష్రీక్).

[2] హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు మినా లో తన గుడారంలో గట్టిగా తక్బీర్ పలికేవారు; అది మినాలోని మస్జిదె ఖైఫ్ లో ఉన్నవారికి వినబడేది, అప్పుడు వారు తక్బీర్ పలికేవారు. ఇలా మొత్తం మస్జిద్ తక్బీర్లతో మారుమ్రోగేది, తరువాత బజార్ల వరకు ఆ ధ్వని వినిపించేది. (బుఖారీ, కితాబుల్ ఈదైన్).

సహాబాయె కిరామ్ నుండి భిన్నమైన పదాలు మనకు లభించాయి. ప్రసిద్ధ పదాలు ఇవి:

الله أكبر الله أكبر لا إله إلا الله، والله أكبر الله أكبر ولله الحمد
(అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, వల్లాహు అక్బర్ , అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్ )

  1. అధికంగా జిక్ర్ చేయడం – తక్బీర్, తహ్లీల్, తహ్మీద్, తస్బీహ్, దురూద్ షరీఫ్.
  2. నమాజ్ ల తర్వాత తక్బీరాత్. (దీనినే తక్బీరె ముఖయ్యద్ అంటారు). ఉమ్మత్ యొక్క ఫుఖహా అభిప్రాయం ప్రకారం ఫర్జ్ నమాజ్ ల తరువాత తక్బీరాత్ పలకడం మష్రూ.
  3. ఖుర్బానీ మాంసం తినడం మరియు పంచడం.
  4. సంతోషం మరియు కృతజ్ఞత వ్యక్తం చేయడం.

ఈ రోజులు ఇబాదత్ తో పాటు ఆనందానికి కూడా సంబంధించినవి. ఇస్లాం సన్యాసాన్ని కాదు, షుక్ర్ మరియు జిక్ర్ తో కూడిన సమతుల్య జీవనాన్ని బోధిస్తుంది.

గౌరవనీయులైన ముస్లిములారా!

ఇమాం ఇబ్ను రజబ్ రహిమహుల్లాహ్ ఈ రోజుల గురించి తెలిపిన ఆణిముత్యాలు కొన్ని ఇలా ఉన్నాయి.

[1] అయ్యాముత్ తష్రీఖ్ లో విశ్వాసుల కొరకు శారీరక అనుగ్రహం మరియు మానసిక అనుగ్రహం రెండూ ఏకంగా లభిస్తాయి. శారీరక అనుగ్రహాలంటే తిను, త్రాగుట మరియు హృదయ అనుగ్రహాలంటే జిక్ర్ మరియు షుక్ర్.

فَأَيَّامُ التَّشْرِيقِ يَجْتَمِعُ فِيهَا لِلْمُؤْمِنِينَ نَعِيمُ أَبْدَانِهِمْ بِالْأَكْلِ وَالشُّرْبِ، وَنَعِيمُ قُلُوبِهِمْ بِالذِّكْرِ وَالشُّكْرِ.

[2] పండుగ రోజులలో తినడం, త్రాగడం అనేవి కేవలం ఆనందం కోసం మాత్రమే కాదు; వాటివల్ల మనకు శక్తి వచ్చి, ఆ శక్తితో అల్లాహ్ ను స్మరించడం మరియు ఆయన ఆజ్ఞలను పాటించడం. ఇదే నిజమైన కృతజ్ఞత. కానీ ఎవరు ఆ వరాలను పాపాలకు ఉపయోగిస్తారో, వారు అల్లాహ్ ఇచ్చిన అనుగ్రహం పట్ల కృతఘ్నత చూపినవారవుతారు. అలాంటి వారు ఆ అనుగ్రహాన్ని కోల్పోయే పరిస్థితికి చేరుకుంటారు.

أَنَّ الْأَكْلَ فِي أَيَّامِ الْأَعْيَادِ وَالشُّرْبِ إِنَّمَا يُسْتَعَانُ بِهِ عَلَى ذِكْرِ اللَّهِ تَعَالَى وَطَاعَتِهِ … فَمَنِ اسْتَعَانَ بِنِعَمِ اللَّهِ عَلَى مَعَاصِيهِ فَقَدْ كَفَرَ نِعْمَةَ اللَّهِ وَبَدَّلَهَا كُفْرًا، وَهُوَ جَدِيرٌ أَنْ تُسْلَبَ مِنْهُ

[3] మరో చోట చెప్పారు: ఈ రోజుల్లో మనం ఏ జంతువులను ఖుర్బానీ చేస్తామో అవి స్వయంగా అల్లాహ్ ను ఆరాధిస్తాయి, ఆయనకు విధేయులుగా ఉంటాయి. అయితే వాటి మాంసం తినడం ద్వారా మనలో విశ్వాసం పెరిగి, అల్లాహ్ ఆరాధన మరింత ఎక్కువగా చేసే బుద్ధి, ఎల్లవేళల్లో ఆయనకు విధేయులుగా ఉండే బుద్ధి కలగాలి. (ఇక్కడ అరబీ ఇవ్వలేకపోయాము మరీ సంక్షిప్తంగా చేసి అనువదించాము గనక).

[4] ఈ లోక జీవితం అంతా హజ్ యాత్ర రోజుల్లాంటిదే ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మోమిన్ (విశ్వాసి) అల్లాహ్ నిషేధించిన కోరికలు, పాపాల నుండి దూరంగా ఉండాలి; ఇది ఇహ్రామ్ లో ఉన్న హజ్ యాత్రికుడిలా ఉంటుంది.

ఎవరు తమ జీవిత ప్రయాణంలో సహనంతో ఉండి, తమ కోరికలను అదుపులో పెట్టుకుంటారో, వారు జీవిత యాత్ర ముగిసినప్పుడు తమ ఆశల గమ్యాన్ని చేరుకుంటారు. అప్పుడు వారు తమ బాధ్యతను పూర్తి చేసి, అల్లాహ్ కు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చినవారవుతారు. ఆ తర్వాత వారి రోజులు అన్నీ మినా రోజుల్లా మారిపోతాయి — ఆనందం, తినడం, త్రాగడం, మరియు అల్లాహ్ స్మరణతో నిండిన రోజులుగా.

كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا أَسْلَفْتُمْ فِي الْأَيَّامِ الْخَالِيَةِ
గత కాలంలో మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా హాయిగా తినండి, త్రాగండి” (అని వారితో అనబడుతుంది)“. (అల్ హాఖ్ఖహ్ 69:24).

فَإِنَّ الدُّنْيَا كُلَّهَا أَيَّامُ سَفَرٍ كَأَيَّامِ الْحَجِّ، وَهُوَ زَمَانُ إِحْرَامِ الْمُؤْمِنِ عَمَّا حُرِّمَ عَلَيْهِ مِنَ الشَّهَوَاتِ، فَمَنْ صَبَرَ فِي مُدَّةِ سَفَرِهِ عَلَى إِحْرَامِهِ وَكَفَّ عَنِ الْهَوَى، فَإِذَا انْتَهَى سَفَرُ عُمْرِهِ وَوَصَلَ إِلَى مِنَى الْمُنَى، فَقَدْ قَضَى تَفَثَهُ وَوَفَّى نَذْرَهُ، فَصَارَتْ أَيَّامُهُ كُلَّهَا كَأَيَّامِ مِنًى، أَيَّامَ أَكْلٍ وَشُرْبٍ وَذِكْرِ اللَّهِ عَزَّ وَجَلَّ. كما قال تعالى: كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا أَسْلَفْتُمْ فِي الْأَيَّامِ الْخَالِيَةِ

  1. అల్లాహ్ జిక్ర్ — మన నాలుక ఎల్లప్పుడూ తక్బీర్లతో తడిసి ఉండాలి.
  2. అల్లాహ్ అనుగ్రహాలపై షుక్ర్ — తినే, త్రాగే ప్రతి విషయంలో అల్లాహ్ ను స్మరించాలి.
  3. ఉమ్మత్ ఐక్యత — ప్రపంచవ్యాప్తంగా ముస్లింలంతా ఒకే జిక్ర్ మరియు ఒకే నినాదంతో ఏకమవ్వాలి.

سبحان ربك رب العزة عما يصفون وسالم على المرسلين والحمد لله رب العالمين

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధిని సందర్శించేవారికి ముఖ్యమైన సూచనలు – షేఖ్ అబ్దుర్రజ్జాఖ్ అల్-బద్ర్

Important notices for the visitor of the grave of the Prophet ﷺ
Shaykh Abdurrazzaq al-Badr [Video|Ar-En Subtitles]
https://youtu.be/ZJp6AFAGrWU [38 minutes]
https://abdurrahman.org/?p=435632

Explanation of The book Clarification and explanation of many issues related to Hajj, Umrah, and visitation in light of the Qur’an and the Sunnah by Shaykh Abdul-Aziz bin Abdullah bin Baz rahimahullah

సర్వ స్తోత్రాలు సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ కే శోభిస్తాయి. మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), వారి కుటుంబ సభ్యులు మరియు సహచరులందరిపై అల్లాహ్ శాంతి, శుభాలు వర్షించుగాక.

(اللَّهُمَّ اغْفِرْ لَنَا وَلِشَيْخِنَا وَلِجَمِيعِ الْمُسْلِمِينَ)
ఓ అల్లాహ్! మమ్మల్ని, మా షేఖ్ ను, అలాగే ముస్లింలందరినీ క్షమించు.

సుప్రసిద్ధ పండితులు ఇమామ్ అబ్దుల్ అజీజ్ ఇబ్న్ అబ్దుల్లాహ్ ఇబ్న్ బాజ్ (అల్లాహ్ వారిని కరుణించుగాక) ‘ఖురాన్, సున్నత్‌ల వెలుగులో హజ్, ఉమ్రా మరియు జియారత్‌కు సంబంధించిన పలు సమస్యల స్పష్టీకరణ మరియు వివరణ’ అనే తమ గ్రంథంలో ఈ విధంగా పేర్కొన్నారు:

అబ్దుల్-నబీ, గులామ్ అహ్మద్, గులామ్ ముస్తఫా వంటి పేర్లు ఉపయోగించడం నిషేధించబడినది

అల్లాహ్ సృష్టించిన ఏ ప్రాణినీ, అల్లాహ్ దాసులలో ఎవరినీ ఆయనకు (అల్లాహ్‌కు) కాకుండా ఇతరులకు దాసులుగా/బానిసలుగా చేయడం ఎవరికీ అనుమతించబడదు. అందువల్ల, ఎవరికైనా ‘అబ్దుల్-ఫదీల్, అబ్దుల్-నబీ, అబ్దుల్-రసూల్, అబ్ద్ అలీ, అబ్దుల్-హుసైన్, అబ్దుల్-జహ్రా, గులామ్ అహ్మద్, గులామ్ ముస్తఫా’ అని పేరు పెట్టడం లేదా ఒక సృష్టిని మరొక సృష్టికి దాసునిగా సూచించే ఏ ఇతర పేరునైనా పెట్టడం అనుమతించబడదు.

ఎందుకంటే ఇటువంటి పేర్లు భక్తులు మరియు ప్రముఖ వ్యక్తుల పట్ల మితిమీరిన భక్తిని/గౌరవాన్ని కలిగి ఉంటాయి, తద్వారా ఇది అల్లాహ్ (ఆయన మహోన్నతుడు) హక్కుల పట్ల అగౌరవానికి దారితీస్తుంది మరియు షిర్క్ (దైవత్వంలో లేదా ఆరాధనలో అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించడం) మరియు అతిక్రమణకు సాధనంగా మారుతుంది.

అంతేకాకుండా, అల్లాహ్ (ఆయన మహోన్నతుడు) కు కాకుండా ఇతరులకు ప్రజలను దాసులుగా సూచించే పేర్లను ఉపయోగించడాన్ని నిషేధించే విషయంలో పండితుల ఏకాభిప్రాయం ఉందని ఇబ్న్ హజ్మ్ ఉల్లేఖించారు.

శాశ్వత పండిత పరిశోధన మరియు ఫత్వా కమిటీ (సౌదీ అరేబియా)
(Permanent Committee for Scholarly Research and Ifta’)
అధ్యక్షుడు: ‘అబ్దుల్-అజీజ్ ఇబ్న్ అబ్దుల్లాహ్ ఇబ్న్ బాజ్
సభ్యులు: ‘అబ్దుల్లాహ్ ఇబ్న్ కవూద్, ‘అబ్దుల్లాహ్ ఇబ్న్ గుదయ్యన్, ‘అబ్దుల్-రజ్జాక్ అఫీఫీ

https://abdurrahman.org/2011/05/17/prohibition-of-using-names-like-abdul-naby-ghulam-ahmad-ghulam-mustafa/

బిదత్ వర్గాలు: జమాఅత్ అల్-ఇఖ్వాన్ అల్-ముస్లిమూన్ (Muslim Brotherhood) గురించి పది అంశాలు – షేక్ అహ్మద్ బిన్ యహ్యా అన్-నజ్మీ

ఇఖ్వాన్ అల్-ముస్లిమూన్ నిర్వచనం:

వీరు హసన్ అల్-బన్నా అనుచరులు. వారి విధానం (మన్హజ్) గురించి గమనించవలసిన అనేక అంశాలు ఉన్నాయి, వాటిలో అతి ముఖ్యమైనవి ఈ క్రిందివి:

[1] ఇస్లాంలో అత్యంత ముఖ్యమైన విషయమైన తౌహీద్ అల్-ఇబాదహ్ [1] కు వీరు ప్రాముఖ్యత ఇవ్వరు. ఇది లేకుండా ఏ వ్యక్తి ఇస్లాం కూడా చెల్లుబాటు కాదు.

[2] ప్రజలు పెద్ద షిర్క్ (బహుదేవతారాధన) చేస్తున్నప్పుడు, అల్లాహ్‌ను కాకుండా ఇతరులను ప్రార్థిస్తున్నప్పుడు, సమాధుల చుట్టూ తవాఫ్ (ప్రదక్షిణలు) చేస్తున్నప్పుడు, సమాధులలో ఉన్న మృతులకు మొక్కులు చెల్లిస్తున్నప్పుడు మరియు వారి పేర్లతో బలులు ఇస్తున్నప్పుడు వారు మౌనంగా ఉండి ఆమోదిస్తారు.

[3] ఈ విధాన స్థాపకుడు ఒక సూఫీ. అతనికి సూఫీయిజంతో ఎంత సంబంధం ఉందంటే, అతను అబ్దుల్-వహ్హాబ్ అల్-ఖుసాఫీకి, అతని ఖుసాఫీ షాద్-లీ తరీకా (మార్గం) అనుసరించడానికి బైఅత్ (విధేయత ప్రమాణం) చేశాడు.

[4] వారిలో బిదఅత్‌లు (నూతన ఆచారాలు) ఉండటం మరియు వాటి ద్వారా అల్లాహ్‌ను ఆరాధించడం జరుగుతుంది – ఎంతవరకు అంటే, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ జిక్ర్ (స్మరణ) సభలకు హాజరవుతారని మరియు వారు గతంలో చేసిన పాపాలను ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) క్షమిస్తారని ఈ విధాన స్థాపకుడు అంగీకరించాడు. ఇది అతని ఈ మాటల్లో కనిపిస్తుంది:

“లోకాలకు ఏ కాంతితో అయితే ఆయన కనిపించాడో ఆ వ్యక్తిని (ప్రవక్తను) అల్లాహ్ ఆశీర్వదించుగాక,
ఆయన సూర్యచంద్రులను మించిపోయాడు.
ఈ హబీబ్ (అనగా ముహమ్మద్) తన ప్రియమైన వారితో సమావేశమయ్యాడు.
మరియు వారు గతంలో చేసిన పాపాలన్నింటినీ క్షమించాడు.”

[5] వారు ఖిలాఫత్ (ఇస్లామిక్ పాలన) స్థాపనకు పిలుపునిస్తారు మరియు ఇది ఒక బిదఅత్ (నూతన కల్పన). ఎందుకంటే ప్రవక్తలు మరియు వారి అనుచరులకు తౌహీద్ (ఏకదైవారాధన) వైపు పిలవడం మినహా మరే బాధ్యత అప్పగించబడలేదు. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: “మరియు నిశ్చయంగా మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను పంపాము, (తన ప్రజలతో ఇలా చెప్పమని): ‘అల్లాహ్‌ను ఆరాధించండి మరియు తాగూత్ (మిథ్యా దైవాల)కు దూరంగా ఉండండి.’” [సూరా అన్-నహ్ల్: 36]

[6] వారికి వలా మరియు బరా (విధేయత మరియు నిరాకరణ) లేకపోవడం లేదా అది చాలా బలహీనంగా ఉండటం జరుగుతుంది. సున్నీలు మరియు షియాల మధ్య సామీప్యాన్ని తీసుకురావాలన్న వారి పిలుపులో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. మరియు వారి స్థాపకుడు ఇలా చెప్పినట్లు ఉటంకించబడింది: “మనం అంగీకరించే విషయాలలో ఒకరికొకరు సహకరించుకుంటాము మరియు మనం విభేదించే విషయాలలో ఒకరినొకరు క్షమించుకుంటాము.”

[7] వారు తౌహీద్ ప్రజలను మరియు సలఫీ మార్గానికి కట్టుబడి ఉన్నవారిని ద్వేషిస్తారు మరియు అసహ్యించుకుంటారు. సౌదీ రాజ్యం గురించి వారు మాట్లాడే మాటల్లో ఇది స్పష్టమవుతుంది. ఆ రాజ్యం తౌహీద్ పునాదిగా స్థాపించబడింది మరియు దాని పాఠశాలలు, విద్యాసంస్థలు మరియు విశ్వవిద్యాలయాలలో తౌహీద్‌ను బోధిస్తుంది. అంతేకాకుండా, జమీల్ అర్-రహ్మాన్ అల్-అఫ్ఘానీ కేవలం తౌహీద్ వైపు పిలిచినందుకు, తౌహీద్ బోధించే పాఠశాలలను కలిగి ఉన్నందుకే అతన్ని వారు చంపడంలో కూడా ఇది స్పష్టమైంది.

[8] వారు నాయకుల (పాలకుల) తప్పులను వెతుకుతారు మరియు వారి లోపాలను – అవి నిజమైనా లేదా అబద్ధమైనా – బహిర్గతం చేస్తారు. యువత దృష్టిలో నాయకులను అసహ్యులుగా చూపించడానికి మరియు వారి పట్ల యువత హృదయాల్లో ద్వేషాన్ని నింపడానికి వారు వీటిని వ్యాప్తి చేస్తారు.

[9] వారు తమను తాము ఆపాదించుకునే పార్టీ పట్ల హేయమైన పక్షపాత వైఖరిని కలిగి ఉంటారు. కాబట్టి వారు ఈ పార్టీ ఆధారంగానే స్నేహాన్ని కనబరుస్తారు మరియు ఈ పార్టీ ఆధారంగానే శత్రుత్వాన్ని ప్రదర్శిస్తారు.

[10] స్థాపకుడు నిర్దేశించిన పది షరతుల ప్రకారం ఇఖ్వానీ మన్హజ్ (విధానం) కోసం పని చేయడానికి వారు తమ విధేయతా ప్రమాణాన్ని (బైఅత్) ఇస్తారు. ఇంకా ఆందోళన కలిగించే ఇతర విషయాలు కూడా ఉన్నాయి, బహుశా వాటిని తర్వాత సమయంలో చర్చించవచ్చు.

[1] అనువాదకుని గమనిక: ఇది అల్లాహ్‌కు చేసే ఆరాధనలో ఆయన ఏకత్వానికి (ఒక్కడే అనడానికి) సంబంధించిన తౌహీద్ వర్గం. అనగా, మనం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధిస్తాము, మరెవరినీ ఆరాధించము అని దీని అర్థం.

Translated from English:
https://abdurrahman.org/2016/05/27/ten-points-about-jamaaat-ul-ikhwaan-al-muslimoon/

Posted from al-ibaanah eBook: Modern Day Deviant Groups – Shaikh Ahmad bin Yahyaa An-Najmee

ఈ వ్యాసంలో రచయిత, హసన్ అల్-బన్నా స్థాపించిన ‘ఇఖ్వాన్ అల్-ముస్లిమూన్’ (ముస్లిం బ్రదర్‌హుడ్) వర్గం యొక్క విధానంలోని (మన్హజ్ లోని) ప్రధాన లోపాలను విమర్శిస్తూ పది ముఖ్యమైన అంశాలను వివరించారు. వాటి సారాంశం క్రింది విధంగా ఉంది:

తౌహీద్ పట్ల నిర్లక్ష్యం & షిర్క్‌ను సహించడం: ఇస్లాంలో అత్యంత ముఖ్యమైన ‘తౌహీద్ అల్-ఇబాదహ్’ (కేవలం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించడం)కు వీరు ప్రాముఖ్యత ఇవ్వరు. ప్రజలు సమాధులను పూజించడం, మృతులను ప్రార్థించడం వంటి మహా షిర్క్ (బహుదేవతారాధన) చేస్తున్నా మౌనంగా ఆమోదిస్తారు.

సూఫీ ప్రభావం మరియు బిదఅత్ (నూతన ఆచారాలు): ఈ వర్గ స్థాపకుడికి సూఫీలతో సంబంధాలు ఉన్నాయి. వీరు తమ జిక్ర్ సభలకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా హాజరై తమ పాపాలను క్షమిస్తారని నమ్మడం వంటి తీవ్రమైన నూతన కల్పనలకు (బిదఅత్ లకు) పాల్పడతారు.

ఖిలాఫత్ స్థాపన అనే రాజకీయ లక్ష్యం: ప్రవక్తలు ప్రజలను కేవలం తౌహీద్ వైపు మాత్రమే పిలిచారు, కానీ వీరు మాత్రం రాజకీయ అధికారం (ఖిలాఫత్) కోసం పనిచేస్తారు. రచయిత దీనిని ఒక బిదఅత్‌గా పేర్కొన్నారు.

‘వలా మరియు బరా’ లోపం: ఇస్లామిక్ సిద్ధాంతమైన ‘వలా మరియు బరా’ (సత్యం పట్ల విధేయత, అసత్యం పట్ల నిరాకరణ) వీరికి లేదు. మౌలిక సిద్ధాంతాలలో తేడాలున్నా సున్నీలు మరియు షియాలను ఏకం చేయడానికి వీరు ప్రయత్నిస్తారు.

తౌహీద్ అనుచరుల పట్ల ద్వేషం (సలఫీ మన్హజ్ వ్యతిరేకత): సలఫీ మార్గంలో నడిచేవారిని, తౌహీద్‌ను బోధించేవారిని వీరు తీవ్రంగా ద్వేషిస్తారు. తౌహీద్‌ను ప్రచారం చేస్తున్నాడన్న ఒకే ఒక కారణంతో జమీల్ అర్-రహ్మాన్‌ను చంపడం మరియు సౌదీ రాజ్యం పట్ల వారికున్న వ్యతిరేకత దీనికి ఉదాహరణలు.

పాలకులపై తిరుగుబాటు ధోరణి: ముస్లిం పాలకుల తప్పులను వెతికి పట్టుకుని, వాటిని యువతలో ప్రచారం చేసి, పాలకులపై యువత హృదయాల్లో ద్వేషాన్ని మరియు విరోధాన్ని నింపుతారు.

గుడ్డి పక్షపాతం మరియు బైఅత్ (ప్రమాణం): ఇస్లాం కంటే తమ పార్టీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తమ పార్టీ ఆధారంగానే ఇతరులతో స్నేహం లేదా శత్రుత్వం నెరపుతారు. తమ ఇఖ్వానీ మన్హజ్ కోసం ప్రత్యేకంగా విధేయతా ప్రమాణం (బైఅత్) చేయించుకుంటారు.

ముగింపు: స్థూలంగా చెప్పాలంటే, ‘ఇఖ్వాన్ అల్-ముస్లిమూన్’ వర్గం ఇస్లాం యొక్క మూల సిద్ధాంతాలైన తౌహీద్ మరియు సున్నత్‌లకు బదులుగా రాజకీయ లక్ష్యాలకు, పార్టీ పక్షపాతానికి, మరియు బిదఅత్‌లకు ప్రాధాన్యత ఇస్తుందని షేక్ అహ్మద్ బిన్ యహ్యా అన్-నజ్మీ ఈ వ్యాసంలో స్పష్టం చేశారు.