సరియైన విశ్వాసం, దానికి విరుద్ధమైన విషయాలు & ఇస్లాంను భంగపరిచే విషయాలు – ఇమాం ఇబ్నె బాజ్ [పుస్తకం]

The Correct Belief and what Opposes It – Imaam ibn Baaz (rahimahullah)
రచయిత
: అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్)
తెలుగు అనువాదం: islamhouse

 1. తొలి పలుకులు
 2. మహోన్నతుడైన అల్లాహ్ పై విశ్వాసం చూపటం
 3. దైవదూతల పట్ల విశ్వాసం
 4. దైవగ్రంధాల పట్ల విశ్వాసం
 5. దైవ సందేశహరుల పట్ల విశ్వాసం
 6. పరలోకం పట్ల విశ్వాసం
 7. విధి వ్రాత పట్ల విశ్వాసం
 8. విశ్వాసం అన్నది పలకటం మరియు ఆచరించటం. అది విధేయత చూపటం వలన అధికమగును మరియు అవిధేయత చూపటం వలన తరుగును.
 9. అల్లాహ్ కొరకు ప్రేమించటం, అల్లాహ్ కొరకు ద్వేషించటం, అల్లాహ్ కొరకు స్నేహం చేయటం
 10. ఈ విశ్వాసం నుండి మరలిపోయి దానికి వ్యతిరేకంగా నడిచేవారి ప్రస్తావన
 11. అల్లాహ్ ఒక్కడి ఆరాధన చేయటం తప్పనిసరి అవటం

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం

తొలి పలుకులు

అల్హమ్దులిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాం అలా మన్లా నబియ్యబఅదహ్ వఅలా ఆలిహి వసహబిహి. అమ్మాబాద్

సరియైన విశ్వాసము ఇస్లాం ధర్మము యొక్క మూలము మరియు ధర్మము యొక్క పునాది.  అందుకనే నేను ప్రసంగము యొక్క అంశము దానిపై ఉండాలని నేను భావించాను. మరియు ఖుర్ఆన్ హదీసు ధార్మిక ఆధారాల ద్వారా తెలిసేదేమిటంటే ఆచరణలు మరియు మాటలు సరియైన విశ్వాసముతో జరిగి ఉంటే సరిఅవుతాయి మరియు స్వీకరించబడుతాయి. ఒక వేళ విశ్వాసము సరి కాకపోతే ఆ ఆచరణలు, మాటలు నిర్వీర్యమైపోతాయి.  అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:

وَمَن يَكْفُرْ بِالْإِيمَانِ فَقَدْ حَبِطَ عَمَلُهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ 

ఎవడు విశ్వాస మార్గాన్ని తిరస్కరిస్తాడో అతడి కర్మలు వ్యర్థమవుతాయి.  మరియు అతడు పరలోకంలో నష్టం పొందేవారిలో చేరుతాడు.  [అల్ మాయిద 5:5]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

  وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ

మరియు వాస్తవానికి! నీకూ మరియు నీకంటే ముందు వచ్చిన (ప్రతి ప్రవక్తకూ) దివ్యజ్ఞానం (వహీ) ద్వారా ఇలా తెలుపబడింది: “ఒకవేళ నీవు బహుదైవారాధన (షిర్కు) చేసినట్లైతే నీ కర్మలన్నీ వ్యర్థమై పోతాయి మరియు నిశ్చయంగా, నీవు నష్టానికి గురి అయిన వారిలో చేరిపోతావు”.  [జుమర్ 39:65]

ఈ అర్థములో చాలా ఆయతులు కలవు.  అల్లాహ్ యొక్క స్పష్టమైన గ్రంధము మరియు నీతిమంతుడైన ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ తెలియపరచిన సరిఅయిన అఖీదా ఏమిటంటే అల్లాహ్ పై, ఆయన దూతలపై, ఆయన గ్రంధములపై, ఆయన ప్రవక్తలపై, అంతిమ దినముపై మరియు మంచి, చెడు విధివ్రాతపై విశ్వాసం చూపటంలో ఇమిడి ఉంది.  ఈ ఆరు విషయాలు సరైన అఖీదా యొక్క పునాదులు.  వీటిని తీసుకుని సర్వ శక్తిమంతుడైన అల్లాహ్ గ్రంధం అవతరించింది.  మరియు అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంనకు వాటిని ఇచ్చి పంపించాడు.  మరియు అగోచర విషయాలు వేటిని విశ్వసించటం తప్పనిసరో మరియు వేటి గురించి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియపరచారో అన్ని ఈ పునాదుల నుండి ఉధ్భవించినవి.  ఈ ఆరు పునాదుల యొక్క ఆధారాలు గ్రంధములో మరియు సున్నతులో చాలా ఉన్నవి.  వాటిలో నుంచి అల్లాహ్ సుబహానహు వతఆలా యొక్క ఈ వాక్కు:

  لَّيْسَ الْبِرَّ أَن تُوَلُّوا وُجُوهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَلَٰكِنَّ الْبِرَّ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَالْمَلَائِكَةِ وَالْكِتَابِ وَالنَّبِيِّينَ وَآتَى الْمَالَ عَلَىٰ حُبِّهِ ذَوِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينَ وَابْنَ السَّبِيلِ وَالسَّائِلِينَ وَفِي الرِّقَابِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَالْمُوفُونَ بِعَهْدِهِمْ إِذَا عَاهَدُوا ۖ وَالصَّابِرِينَ فِي الْبَأْسَاءِ وَالضَّرَّاءِ وَحِينَ الْبَأْسِ ۗ أُولَٰئِكَ الَّذِينَ صَدَقُوا ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُتَّقُونَ

మీరు మీ ముఖములను తూర్పు దిక్కుకో, పడమర దిక్కుకో తిప్పటమే సదాచరణ కాదు.  సదాచరణ అంటే అల్లాహ్ ను, అంతిమ దినాన్నీ, దైవదూతలనూ, దైవగ్రంధాన్ని, దైవప్రవక్తలనూ విశ్వసించటం.  [అల్ బఖర 2: 177]

మరియు పరిశుద్ధుడైన అల్లాహ్ వాక్కు:

 آمَنَ الرَّسُولُ بِمَا أُنزِلَ إِلَيْهِ مِن رَّبِّهِ وَالْمُؤْمِنُونَ ۚ كُلٌّ آمَنَ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّن رُّسُلِهِ ۚ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا ۖ غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ الْمَصِيرُ

ఈ ప్రవక్త తన ప్రభువు తరుపు నుండి, తనపై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాడు మరియు (అదే విధంగా) విశ్వాసులు కూడా (విశ్వసించారు).  వారంతా అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు.  (వారంటారు :) మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావాలను చూపము.  [అల్ బఖర 2: 285]

మరియు పరిశుద్ధుడైన ఆయన వాక్కు:

  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا آمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَالْكِتَابِ الَّذِي نَزَّلَ عَلَىٰ رَسُولِهِ وَالْكِتَابِ الَّذِي أَنزَلَ مِن قَبْلُ ۚ وَمَن يَكْفُرْ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ وَالْيَوْمِ الْآخِرِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا

ఓ విశ్వాసులారా! అల్లాహ్ ను, ఆయన సందేశహరుణ్ణి, ఆయన తన సందేశహరుని పై (ముహమ్మద్ పై) అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు ఆయన ఇంతకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలన్నింటినీ విశ్వసించండి.  అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించినవాడు, వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయాడు.  [నిసా 5: 136]

మరియు పరిశుద్ధుడైన ఆయన వాక్కు:

  أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ يَعْلَمُ مَا فِي السَّمَاءِ وَالْأَرْضِ ۗ إِنَّ ذَٰلِكَ فِي كِتَابٍ ۚ إِنَّ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ

ఏమీ? నీకు తెలియదా? ఆకాశంలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసని! నిశ్చయంగా, ఇదంతా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది.  నిశ్చయంగా ఇదంతా అల్లాహ్ కు చాలా సులభమైనది.  [హజ్ 22: 70]

ఈ పునాదులపై సూచించే సహీహ్ హదీసులు చాలా ఉన్నవి.  వాటిలో నుంచి ప్రసిద్ధిచెందిన హదీసు దాన్ని ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) అమీరుల్ మూమినీన్ హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు నుండి తన జామె సహీహ్ లో ఉల్లేఖించారు. 

జిబ్రయీల్ అలైహిస్సలాం గారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఈమాన్ గురించి అడిగారు.  ఆయనకు సమాధానమిస్తూ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియపరచారు: ఈమాన్ అంటే నీవు అల్లాహ్ పై, ఆయన దూతల పై, ఆయన గ్రంథముల పై, ఆయన ప్రవక్తల పై మరియు అంతిమ దినం పై విశ్వాసమును చూపటం మరియు నీవు విధివ్రాత పై దాని మంచి, చెడు పై విశ్వాసము చూపటం[1].  . 

మరియు ఈ హదీసును ఇమామ్ బుఖారీ మరియు ఇమామ్ ముస్లిం రహిమహుమల్లాహ్ అబూహురైరా రజియల్లాహు అన్హు హదీసు నుండి ఉల్లేఖించారు.  ఈ ఆరు నియమాలు: వాటి నుండి అల్లాహ్ హక్కు విషయంలో మరియు పరలోక విషయంలో మరియు ఇతర అగోచర విషయాలలో ఒక ముస్లిం విశ్వసించవలసిన విషయాలన్నీ ఉద్భవించాయి. 

మహోన్నతుడైన అల్లాహ్ పై విశ్వాసం చూపటం

అల్లాహ్ యే సత్య ఆరాధ్య దైవమని, వేరే వారు కాకుండా ఆయనే ఆరాధనకు హక్కుదారుడని విశ్వసించటం. 

అల్లాహ్ (సుబ్ హానహు వతఆలా) పై విశ్వాసం చూపటం అంటే ఆయనే సత్య ఆరాధ్య దైవము, ఇతరులు కాకుండా ఆరాధనకు హక్కు దారుడు.  ఎందుకంటే ఆయనే దాసులను సృష్టించి వారిపై ఉపకారము చేసినవాడు, వారికి ఆహారోపాధిని కలిగించే వాడు.  మరియు వారి రహస్యాలను, వారి బాహ్య కార్యాలను తెలిసినవాడు.  మరియు వారిలో నుండి విధేయత చూపేవారికి ప్రతిఫలం ప్రసాదించటంపై మరియు వారిలో నుండి అవిధేయత చూపిన వారిని శిక్షించటంపై సామర్ధ్యం కలవాడు.  ఈ ఆరాధన కొరకే అల్లాహ్ మానవులను మరియు జిన్నులను సృష్టించాడు.  మరియు వారిని దాని గురించి ఆదేశించాడు.  అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَمَا خَلَقْتُ ٱلْجِنَّ وَٱلْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ

మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాధించటానికే! [జారియాతు 51: 56]

مَآ أُرِيدُ مِنْهُم مِّن رِّزْقٍ وَمَآ أُرِيدُ أَن يُطْعِمُونِ

నేను వారి నుండి ఎలాంటి జీవనోపాధిని కోరటం లేదు మరియు వారు నాకు ఆహారం పెట్టాలని కూడా కోరటం లేదు.  [జారియాతు 51: 57]

إِنَّ ٱللَّهَ هُوَ ٱلرَّزَّاقُ ذُو ٱلْقُوَّةِ ٱلْمَتِينُ

నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే ఉపాధి ప్రధాత, మహా బలవంతుడు, స్థైర్యం గలవాడు.  [జారియాతు 51: 58]

అల్లాహ్ సెలవిచ్చాడు:

يَـٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱعْبُدُوا۟ رَبَّكُمُ ٱلَّذِى خَلَقَكُمْ وَٱلَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ

ఓ మానవులారా! మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువు (అల్లాహ్) నే ఆరాధించండి, తద్వారా మీరు భక్తిపరులు కావచ్చు! [అల్ బఖర 2: 21]

ٱلَّذِى جَعَلَ لَكُمُ ٱلْأَرْضَ فِرَٰشًا وَٱلسَّمَآءَ بِنَآءً وَأَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءً فَأَخْرَجَ بِهِۦ مِنَ ٱلثَّمَرَٰتِ رِزْقًا لَّكُمْ ۖ فَلَا تَجْعَلُوا۟ لِلَّهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ

ఆయన (అల్లాహ్) యే మీ కొరకు భూమిని పరుపుగాను మరియు ఆకాశాన్ని కప్పుగాను చేశాడు.  మరియు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా మీకు జీవనోపాధిగా ఫలాలను (పంటలను) ఉత్పత్తి చేశాడు! కావున ఇది తెలుసుకొని కూడా, మీరు ఇతరులను అల్లాహ్ కు సాటిగా నిలబెట్టకండి. [అల్ బఖరా 2: 22]

ఈ సత్యమును బోధించటానికి మరియు దానివైపు పిలవటానికి మరియు దానికి వ్యతిరేకంగా ఉన్నవాటి నుండి హెచ్చరించటానికి అల్లాహ్ ప్రవక్తలను పంపించాడు.  మరియు గ్రంథములను అవతరింపజేశాడు.  అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَلَقَدْ بَعَثْنَا فِى كُلِّ أُمَّةٍ رَّسُولًا أَنِ ٱعْبُدُوا۟ ٱللَّهَ وَٱجْتَنِبُوا۟ ٱلطَّـٰغُوتَ

నిశ్చయంగా మేము ప్రతీ సముదాయంలో ప్రవక్తను ప్రభవింపజేశాము, [ప్రజలారా] కేవలం అల్లాహ్’ను ఆరాధించండి మరియు తాగూత్ (మిథ్యాదైవాలు) కు దూరంగా ఉండండి.  [అన్-నహల్ 16: 36]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَمَآ أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رَّسُولٍ إِلَّا نُوحِىٓ إِلَيْهِ أَنَّهُۥ لَآ إِلَـٰهَ إِلَّآ أَنَا۠ فَٱعْبُدُونِ

మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా: “నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! కావున మీరు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించండి” అని దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చి పంపాము.  [అల్ అంబియా 21: 25]

మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ఇలా చెప్పాడు:

الٓر ۚ كِتَـٰبٌ أُحْكِمَتْ ءَايَـٰتُهُۥ ثُمَّ فُصِّلَتْ مِن لَّدُنْ حَكِيمٍ خَبِيرٍ أَلَّا تَعْبُدُوٓا۟ إِلَّا ٱللَّهَ ۚ إِنَّنِى لَكُم مِّنْهُ نَذِيرٌ وَبَشِيرٌ

అలిఫ్ – లామ్ – రా.  (ఇది) ఒక దివ్యగ్రంథం.  దీని సూక్తులు (ఆయాత్) నిర్దుష్టమైనవి మరియు మహా వివేచనాపరుడు, సర్వం తెలిసినవాడు అయిన (అల్లాహ్) తరఫు నుండి వివరించబడ్డాయి; మీరు అల్లాహ్ ను తప్ప ఇతరులను ఆరాధించకండి.  నిశ్చయంగా నేను, ఆయన (అల్లాహ్) తరఫు నుండి మీకు హెచ్చరిక చేసేవాడిని మరియు శుభవార్తలు ఇచ్చేవాడిని మాత్రమే! [హూద్ 11: 1-2]

ఈ ఆరాధనల యొక్క వాస్తవికత ఏమిటంటే దాసులు ఆరాధించే ఆరాధనలైన దుఆ, భయము, ఆశ, నమాజు, ఉపవాసము, జుబాహ్ చేయటం, మొక్కుబడులు మరియు ఇతర ఆరాధనలు ఏవైతే ఆయనపై వినయంతో, ఆశతో, భయంతో ఆయనంటే పూర్తి ఇష్టంతో, ఆయన ఔన్నత్యం ముందు వంగుతూ చేసేవి ఉన్నవో(అవన్నీ) అల్లాహ్ ఒక్కడికే చేయటం. దివ్యఖుర్ఆన్ ఈ విషయమునే తెలుపుతూ అవతరించబడింది. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

فَٱعْبُدِ ٱللَّهَ مُخْلِصًا لَّهُ ٱلدِّينَ أَلَا لِلَّهِ ٱلدِّينُ ٱلْخَالِصُ

కాబట్టి నీవు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించు ధర్మాన్ని ఆయనకు మాత్రమే ప్రత్యేకిస్తూ వినండి! నిష్కల్మషమైన ఆరాధన మాత్రమే అల్లాహ్ కు చెందుతుంది.  [అజ్ జుమర్ 39: 2-3]

 మరియు పరిశుద్ధుడైన ఆయన వాక్కు:

۞ وَقَضَىٰ رَبُّكَ أَلَّا تَعْبُدُوٓا۟ إِلَّآ إِيَّاهُ

నీ ప్రభువు స్పష్టంగా ఆజ్ఞాపించాడు మీరు ఆయనను తప్ప మరొకరెవరినీ ఆరాధించకండి. [అల్ ఇస్రా 17: 23]

మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ఇలా చెప్పాడు:

فَٱدْعُوا۟ ٱللَّهَ مُخْلِصِينَ لَهُ ٱلدِّينَ وَلَوْ كَرِهَ ٱلْكَـٰفِرُونَ

కావున (ఓ విశ్వాసులారా!) మీరు మీ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయనకే ప్రత్యేకించుకొని, అల్లాహ్ ను మాత్రమే ప్రార్థించండి.  సత్యతిరస్కారులకు ఇది ఎంత అసహ్యకరమైనా! [గాఫిర్ 40: 14]

సహీహైన్ లో మఆజ్ రధియల్లాహు అన్హు ఉల్లేఖనం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

దాసులపై అల్లాహ్ హక్కు ఏమిటంటే వారు ఆయననే ఆరాధించాలి మరియు ఆయనతో పాటు దేనినీ సాటికల్పించకూడదు[2]

ఆయన తన దాసులపై తప్పనిసరి చేసిన, వారిపై విధిగావించిన ఇస్లాం యొక్క ఐదు ప్రత్యక్షమైన మూలస్తంభాలన్నిటిని విశ్వసించటం. 

అల్లాహ్ పై విశ్వాసం చూపటంలో ఇది కూడా ఉన్నది ఆయన తన దాసులపై తప్పనిసరి చేసిన, వారిపై విధిగా వించిన ఇస్లాం యొక్క ఐదు ప్రత్యక్షమైన మూలస్తంభాలన్నిటిని విశ్వసించటం.  అవి లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్ అని సాక్ష్యం పలకటం, నమాజు నెలకొల్పటం, జకాత్ చెల్లించటం, రమజాన్ మాసపు ఉపవాసాలు ఉండటం మరియు స్థోమత కలిగిన వారు బైతుల్లాహ్ హజ్ చేయటం మరియు ఇవేకాక ధర్మంలో వచ్చిన ఇతర విధులు. 

ఈ మూలస్తంభాలలో అతిముఖ్యమైన మరియు గొప్పదైనది – అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్యదైవం లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యం పలకటం. కావున అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్య దైవం లేడని సాక్ష్యం పలకటం ఆరాధన అల్లాహ్ ఒక్కడికే ప్రత్యేకించబడినదని మరియు ఆయన కాకుండా ఇతరులను నిరాకరించబడినదని సూచిస్తుంది.  ఇది లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క అర్థము.  అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్య దైవం ఎవరూ లేరని.  కావున అల్లాహ్ ను వదిలి ఆరాధించబడే మానవులు లేదా దైవదూతలు లేదా జిన్నులు లేదా వేరేవి అన్నీ అసత్య ఆరాధ్యదైవాలు.  వాస్తవ ఆరాధ్య దైవం అల్లాహ్ ఒక్కడే.  అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

ذَٰلِكَ بِأَنَّ ٱللَّهَ هُوَ ٱلْحَقُّ وَأَنَّ مَا يَدْعُونَ مِن دُونِهِۦ هُوَ ٱلْبَـٰطِلُ

ఇదంతా ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ కేవలం ఆయనే సత్యం.  మరియు ఆయనను వదలి వారు ఆరాధించేవన్నీ అసత్యాలు.  [హజ్ 22: 62]

ఇంతకు ముందు ప్రస్తావించబడినది అల్లాహ్ జిన్నులను మరియు మానవులను ఈ గొప్ప ఉద్దేశముతో సృష్టించాడని మరియు వారికి దాని ఆదేశం ఇచ్చాడు.  మరియు దానిని ఇచ్చి తన ప్రవక్తలను పంపించాడు.  మరియు దాని గురించి తన గ్రంథములను అవతరింపజేశాడు.  కావున దీన్ని బాగా యోచన చేసి బాగా అలోచిస్తే మీకు స్పష్టమవుతుంది. పెద్ద అజ్ఞానం వలన చాలా మంది ముస్లింలు ఈ పెద్ద ఉద్దేశము విషయంలో దేనిలో పడిపోయారో చివరికి వారు అల్లాహ్ తోపాటు ఇతరులను ఆరాధించారు. ఆయన ప్రత్యేక హక్కును ఇతరులకు కలిగించారు.  అల్లాహ్ యే సహాయకుడు. 

లోకమును సృష్టించిన వాడు, తన జ్ఞానముతో మరియు తన సామర్ధ్యముతో లోకవాసుల వ్యవహారములలో పర్యాలోచన చేసేవాడు మరియు వాటిని నడిపేవాడు అల్లాహ్ అని విశ్వసించటం. 

పరిశుద్ధుడైన అల్లాహ్ పై విశ్వాసము కనబరచటం లో లోకమును సృష్టించిన వాడు, తన జ్ఞానముతో మరియు తన సామర్ధ్యముతో తాను తలచుకున్న విధంగా లోకవాసుల వ్యవహారములలో పర్యాలోచన చేసేవాడు మరియు వాటిని నడిపేవాడు అల్లాహ్ అని విశ్వసించటం.  మరియు ఆయన ఇహలోకమునకు, పరలోకమునకు యజమాని.  మరియు సర్వలోకాలకు ప్రభువు.  ఆయన తప్ప సృష్టికర్త లేడు.  ఆయన తప్ప ఎవరూ ప్రభువు కారు.  మరియు ఆయన దాసుల ప్రయోజనం కొరకు మరియు వారిని ఇహపరాలలో వారికి ప్రయోజనం, ముక్తి ఉన్న వాటి వైపు పిలవటానికి ప్రవక్తలను పంపించాడు మరియు గ్రంథములను అవతరింపజేశాడు.  మరియు ఆయన పరిశుద్ధుడు వీటన్నిటిలో ఆయనకు ఎవరు సాటి లేరు.  అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

ٱللَّهُ خَـٰلِقُ كُلِّ شَىْءٍ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَىْءٍ وَكِيلٌ

అల్లాహ్ యే ప్రతీ దాని సృష్టికర్త మరియు ఆయనే ప్రతీ దానికి కార్యకర్త.  [జుమర్ 39: 62]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

إِنَّ رَبَّكُمُ ٱللَّهُ ٱلَّذِى خَلَقَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ فِى سِتَّةِ أَيَّامٍ ثُمَّ ٱسْتَوَىٰ عَلَى ٱلْعَرْشِ يُغْشِى ٱلَّيْلَ ٱلنَّهَارَ يَطْلُبُهُۥ حَثِيثًا وَٱلشَّمْسَ وَٱلْقَمَرَ وَٱلنُّجُومَ مُسَخَّرَٰتٍۭ بِأَمْرِهِۦٓ ۗ أَلَا لَهُ ٱلْخَلْقُ وَٱلْأَمْرُ ۗ تَبَارَكَ ٱللَّهُ رَبُّ ٱلْعَـٰلَمِينَ

నిశ్చయంగా, మీ ప్రభువైన అల్లాహ్ యే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించాడు.  ఆ పిదప తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించాడు.  ఆయన రాత్రిని పగటి వెంట ఎడతెగకుండా అనుసరింపజేసి, దానిపై (పగటిపై) కప్పుతూ ఉంటాడు.  మరియు సూర్యచంద్ర, నక్షత్రాలు ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి.  నిశ్చయంగా, సర్వసృష్టి ఆయనదే! మరియు ఆజ్ఞ నడిచేది ఆయనదే.  అల్లాహ్ ఎంతో శుభదాయకుడు, సర్వ లోకాలకు పోషకుడు! [అల్ అఅ్ రాఫ్ 7: 54]

అల్లాహ్ మంచి నామములను మరియు ఆయన ఉన్నత గుణములను వక్రీకరించకుండా, వదలకుండా, వర్ణించకుండా వాటిని ఎవరితోను పోల్చకుండా విశ్వసించటం. 

అల్లాహ్ పై విశ్వాసం చూపటంలో ఇది కూడా ఉంది ఆయన దివ్యగ్రంథంలో వచ్చిన మరియు ఆయన ప్రవక్త నుండి నిరూపించబడిన ఆయన మంచి నామములను మరియు ఆయన ఉన్నత గుణములను ఎటువంటి వక్రీకరణ లేకుండా, అంతరాయం లేకుండా, వర్ణత లేకుండా, వేటితో పోల్చకుండా విశ్వసించటం.  అంతేకాదు అవి ఎలా వచ్చినవో అలాగే ఎటువంటి వర్ణత లేకుండా అవి సూచించే గొప్ప అర్థాలను విశ్వసిస్తూ పలకాలి.  అవి అల్లాహ్ యొక్క గుణాలు.  వాటిని ఆయనకు తగిన విధంగా వాటితో వర్ణించటం తప్పనిసరి.  ఆయన గుణములను ఆయన సృష్టిలోంచి ఎవరితో పోల్చకూడదు.  అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

لَيْسَ كَمِثْلِهِۦ شَىْءٌ ۖ وَهُوَ ٱلسَّمِيعُ ٱلْبَصِيرُ

{ఆయనను పోలినదేదీ లేదు మరియు ఆయన సర్వం వినేవాడూ, సర్వం చూసేవాడూను}.  [షూరా 42: 11]

మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ఇలా చెప్పాడు:

فَلَا تَضۡرِبُواْ لِلَّهِ ٱلۡأَمۡثَالَۚ إِنَّ ٱللَّهَ يَعۡلَمُ وَأَنتُمۡ لَا تَعۡلَمُونَ

కావున అల్లాహ్ కు పోలికలు కల్పించకండి.  నిశ్చయంగా, అల్లాహ్ కు అంతా తెలుసు మరియు మీకేమీ తెలియదు}.  [నహల్ 16: 74]

మరియు ఇది అహ్లె సున్నత్ వల్ జమాఅత్ అయిన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అనుచరులు మరియు తాబిఈన్ ల నమ్మకము.  మరియు దీనిని ఇమామ్ అబుల్ హసన్ అష్అరీ రహిమహుల్లాహ్ తన పుస్తకం “అల్ మఖాలాతు అన్ అస్హాబిల్ హదీస్ వ అహ్లుస్సున్నతి” లో నఖలు చేశారు.  మరియు ఇతర అహ్లె ఇల్మ్ వల్ ఈమాన్ కూడా నఖలు చేశారు. 

ఇమామ్ అల్ అవ్ జయీ రహిమహుల్లాహ్ ఇలా తెలియపరచారు: జహరీ మరియు మక్హూల్ రహిమహుమల్లాహ్ తో అల్లాహ్ యొక్క గుణాల గురించి వచ్చిన ఆయతుల గురించి అడిగితే వారిద్దరు అవి ఎలా వచ్చినవో అలాగే అర్ధం చేసుకోండి అని అన్నారు.  మరియు వలీదిబ్నె ముస్లిమ్ రహిమహుల్లాహ్ ఇలా తెలియపరచారు: ఇమామ్ మాలిక్, ఇమామ్ అవ్ జయీ, ఇమామ్ లైస్ ఇబ్నె సఅద్ మరియు ఇమామ్ సుఫ్యాన్ సౌరీ రహిమహుముల్లాహ్ తో అల్లాహ్ గుణాల గురించి వచ్చిన హదీసుల గురించి అడిగితే వారందరు అవి ఎలా వచ్చినవో వాటిని ఏవిధమైన వర్ణత లేకుండా స్వీకరించండి అని అన్నారు.  ఇమామ్ అవ్ జయీ రహిమహుల్లాహ్ ఇలా పలికారు: మేము మరియు తాబియీన్ లో నుంచి ఒక పెద్ద వర్గం అల్లాహ్ సుబ్హానహు వతఆలా అర్ష్ పై ఉన్నాడని పలికేవారము.  మరియు అల్లాహ్ గుణాల గురించి సున్నత్ లో వచ్చిన దానిని విశ్వసించేవారము.  ఇమామ్ మాలిక్ రహిమహుల్లాహ్ గురువు అయిన రబీఅహ్ బిన్ అబీ అబ్దుర్రహ్మాన్ రహ్మతుల్లాహి అలైహి తో ఇస్తవా గురించి అడిగినప్పుడు ఆయన ఇలా సమాధానమిచ్చారు: ఇస్తివా అన్నది తెలియని విషయం కాదు.  దాని వర్ణత అర్ధం కాని విషయం.  సందేశాలు అల్లాహ్ వద్ద నుంచి వస్తాయి.  సందేశాలను స్పష్టంగా చేరవేయటం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాధ్యత.  మరియు వాటిని నమ్మటం మన బాధ్యత.  మరియు ఇమామ్ మాలిక్ రహిమహుల్లాహ్ తో దాని గురించి అడిగినప్పుడు ఆయన ఇలా సమాధానమిచ్చారు: ఇస్తివా అన్నది తెలిసిన విషయం.  మరియు దాని వర్ణత తెలియని విషయం.  దానిని విశ్వసించటం తప్పనిసరి.  దాని గురించి ప్రశ్నించటం బిద్అత్ అగును.  ఆ తరువాత ప్రశ్నించిన వ్యక్తిని ఉద్దేశించి నేను నిన్ను చెడ్డ వ్యక్తిగా భావిస్తున్నాను అన్నారు.  మరియు అతనిని గెంటివేయమని అని ఆదేశించారు.  అతడు గెంటివేయబడ్డాడు. 

మరియు ఇదే అర్థములో ఉమ్ముల్ మూమినీన్ ఉమ్మె సల్మా రజియల్లాహు అన్హా యొక్క ఉల్లేఖనం కలదు.  మరియు ఇమామ్ అబూ అబ్దుర్రహ్మాన్ బిన్ ముబారక్ రహ్మతుల్లాహి అలైహి ఇలా పలికారు: మన ప్రభువు సుబహానహు వతఆలా తన సృష్టితాల నుంచి వేరుగా తన ఆకాశములపై తన సింహాసనముపై ఉన్నాడని మాకు తెలుసు.  ఈ విభాగంలో ఇమామ్ ల మాటలు చాలా ఉన్నవి.  ఇక్కడ వాటిని తెలియపరచటం అసాధ్యము.  ఎవరైన వీటిలో నుంచి చాలా వాటిని తెలుసుకోదలచితే వారు ఈ విభాగంలో హదీస్ ఉలమాలు వ్రాసిన పుస్తకముల వైపు మరలాలి.  ఉదాహరణకు: అబ్దుల్లాహ్ ఇబ్నె ఇమామ్ అహ్మద్ పుస్తకం ‘అస్సున్నహ్’, ఇమామ్ ముహమ్మద్ ఇబ్నె ఖుజైమా పుస్తకం ‘అత్తౌహీద్’, అబుల్ ఖాసిమ్ అల్ లాల్కాయీ అత్తబరి పుస్తకం ‘అస్సున్నహ్’, అబూబకర్ ఇబ్నె అబీ ఆసిమ్ యొక్క పుస్తకం ‘అస్సున్నహ్’, మరియు హమాత్ వాసులకు షేకుల్ ఇస్లామ్ ఇబ్నె తైమియ జవాబు మరియు అది చాలా ప్రయోజనాలు కల గొప్ప జవాబు.  అందులో ఆయన రహిమహుల్లాహ్ అహ్లు-స్-సున్నహ్ విశ్వాసమును స్పష్టపరచారు మరియు ఆయన అందులో వారి చాలా మాటలను మరియు అహ్లు-స్-సున్నహ్ పలికిన మాటలను సత్యపరచే మరియు విభేదించే వారి మాటలను అసత్యపరచే ధార్మిక, బౌద్ధిక ఆధారాలను తెలియపరచారు.  మరియు ఇలాగే తద్మురియ పేరు గల ఆయన పత్రికలో ఆయన అహ్లు-స్-సున్నహ్ ల విశ్వాసమును ఖుర్ఆన్, హదీసుల, బౌద్ధిక ఆధారాలతో తెలియపరచారు.  మరియు వాటిని విభేదించేవారిని ఎలా ఖండించారంటే ఒక జ్ఞానవంతుడు మంచి ఉద్దేశముతో, సత్యమును తెలుసుకునే కోరికతో అందులో చూస్తే సత్యము స్పష్టమవుతుంది మరియు అసత్యము నాశనమవుతుంది.  అల్లాహ్ నామముల, గుణాల విభాగంలో అహ్లు-స్-సున్నహ్ విశ్వసించేవాటిని విభేదించే ప్రతి ఒక్కడు ఖచ్చితంగా తాను నిరూపించే, ఖండించే ప్రతీ వాటిలో స్పష్టమైన వైరుధ్యంతో ఖుర్ఆన్, హదీసుల మరియు బౌద్ధిక ఆధారాలను విభేదిస్తాడు. 

ఇక అహ్లు-స్-సున్నత్ వల్ జమాఅత్ అల్లాహ్ తన గ్రంధంలో తన స్వయం కొరకు నిరూపించుకున్న వాటిని మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సున్నత్ లో ఆయన (అల్లాహ్) కొరకు నిరూపించిన వాటిని ఎటువంటి పోలిక లేకుండా అల్లాహ్ కొరకు నిరూపించేవారు మరియు ఆయన సుబ్హానహు వతఆలాను ఆయన సృష్టి పోలిక నుండి ఆయన గుణగుణాలు లేవని చెప్పటం నుండి ముక్తిని కలిగిస్తూ పరిశుద్ధపరిచేవారు.  వారు వైరుధ్యము నుండి భద్రంగా ఉండి సాఫల్యం చెందుతారు మరియు వారు వాటి ఆధారములపై అమలు చేస్తారు.  అల్లాహ్ తన ప్రవక్తలకు ఇచ్చి పంపించిన సత్యమును అదిమిపెట్టుకుని అందులో శ్రమించే వారికి ఇది అల్లాహ్ సంప్రదాయము అతనికి సత్యము కొరకు భాగ్యమును కలిగించటం మరియు దాని ఆధారములను వారి ముందు స్పష్టపరుస్తాడు.  అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

بَلْ نَقْذِفُ بِٱلْحَقِّ عَلَى ٱلْبَـٰطِلِ فَيَدْمَغُهُۥ فَإِذَا هُوَ زَاهِقٌ

అలా కాదు! మేము సత్యాన్ని అసత్యంపై విసురుతాము అది దాని తలను పగుల గొడుతుంది, అప్పుడు అది (అసత్యం) నశించి పోతుంది.  [అంబియా 24: 18]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَلَا يَأْتُونَكَ بِمَثَلٍ إِلَّا جِئْنَـٰكَ بِٱلْحَقِّ وَأَحْسَنَ تَفْسِيرًا

మరియు వారు నీ వద్దకు (నిన్ను వ్యతిరేకించటానికి) ఎలాంటి ఉపమానాన్ని తెచ్చినా! మేము నీకు దానికి సరైన జవాబు మరియు ఉత్తమమైన వ్యాఖ్యానం ఇవ్వకుండా ఉండము.  [ఫుర్ఖాన్ 25: 33]

మరియు హాఫిజ్ ఇబ్నె కసీర్ రహిమహుల్లాహ్ తన ప్రసిద్ధ తఫ్సీర్ లో తన మాటలలో అల్లాహ్ యొక్క ఈ వాక్కును గురించి

إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَى عَلَى الْعَرْشِ

(నిస్సందేహంగా అల్లాహ్యే మీ ప్రభువు.  ఆయన ఆకాశా లను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు.  ఆ తరువాత సింహాసనంపై (అర్ష్ పై) ఆసీనుడయ్యాడు) [అఅ్ రాఫ్ 7: 54]

ఈ విభాగంలో చాలా మంచి మాటను ప్రస్తావించారు.  దానిని ఇక్కడ దాని ప్రయోజనం కొరకు ప్రస్తావించటం మంచిది.  ఆయన రహిమహుల్లాహ్ ఇలా పలికారు: ఈ విషయంలో ప్రజల కొరకు ఉలమాల చాలా వ్యాసాలు కలవు.  వాటి వివరణ ఇక్కడ మేము చేయలేము.  మేము మాత్రం ఈ విషయంలో సలఫె సాలిహీన్ యొక్క మార్గము పై నడుస్తాము.  ఇమామ్ మాలిక్, ఇమామ్ అవ్జాయీ, ఇమామ్ సౌరీ, ఇమామ్ లైస్ ఇబ్నె సఅద్, ఇమామ్ షాఫియీ, ఇమామ్ అహ్మద్, ఇమామ్ ఇస్హాఖ్ ఇబ్నె రాహవైహ్ తదితరులు ముస్లిముల పూర్వ, నవీన ఇమాములు రహిమహుముల్లాహ్.  వారి మార్గం ఏమిటంటే ఈ గుణాలను ఎలా వచ్చినవో అలా ఎటువంటి వర్ణత లేకుండా, ఎటువంటి పోలిక లేకుండా, ఎటువంటి అంతరాయం లేకుండా స్వీకరించాలి.  పోల్చే వారి మనసుల్లో అల్లాహ్ గురించి దాని తిరస్కారం కనబడుతుంది.  ఎందుకంటే అల్లాహ్ తన సృష్టిరాసుల్లోంచి దేనిని పోలి ఉండడు మరియు ఆయనను పోలినది ఏదీ లేదు.  ఆయన వినేవాడు మరియు చూసేవాడు.  విషయం అయిమ్మాలు చెప్పినట్లే ఉన్నది, వారిలో నుంచి ఇమామ్ బుఖారీ గురువైన నయీమ్ బిన్ హమ్మాద్ అల్ ఖుజాయీ ఇలా పలికారు: అల్లాహ్ ను ఆయన సృష్టితో పోల్చిన వాడు కాఫిర్ అయిపోతాడు మరియు అల్లాహ్ తన స్వయం కొరకు తెలిపిన గుణాలను తిరస్కరించినవాడు కాఫిర్ అయిపోతాడు.  అల్లాహ్ తన కొరకు తెలిపిన మరియు ప్రవక్త తెలిపిన గుణాలకు ఇతరులతో పోలిక లేదు మరియు ఎవరైతే స్పష్టమైన ఆయతులలో మరియు సహీహ్ హదీసులలో వచ్చిన వాటిని అల్లాహ్ కు తగిన విధంగా అల్లాహ్ కొరకు నిరూపించి మరియు లోపములను అల్లాహ్ నుండి తిరస్కరిస్తాడో అతడు సన్మార్గములో నడిచాడు. 

దైవదూతల పట్ల విశ్వాసం

ఇక దైవదూతలపై విశ్వాసం : వారిపై విశ్వాసం సంక్షిప్తంగా, వివరంగా ఉన్నది.  కావున ఒక ముస్లిం అల్లాహ్ కు దైవదూతలు ఉన్నారని, ఆయన వారిని తన విధేయత కొరకు సృష్టించాడని విశ్వసిస్తాడు మరియు ఆయన వారిని గౌరవనీయులైన దాసులుగా వర్ణించాడు, వారు ఆయన మాటను జవదాటరు మరియు వారు ఆయన ఆజ్ఞలనే పాటిస్తూ ఉంటారు. 

يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يَشْفَعُونَ إِلَّا لِمَنِ ٱرْتَضَىٰ وَهُم مِّنْ خَشْيَتِهِۦ مُشْفِقُونَ

ఆయనకు, వారికి ప్రత్యక్షంగా (ముందు) ఉన్నదీ, వెనుక ఉన్నదీ అంతా తెలుసు.  వారు ఆయన సమ్మతించిన వారికి తప్ప ఇతరుల కొరకు సిఫారసు చేయలేరు.  వారు ఆయన భీతి వలన భయకంపితులై ఉంటారు.  [అంబియా 21:  28]

మరియు వారిలో చాలా రకాల వారు కలరు.  వారిలో నుంచి అర్ష్ ను మోసే బాధ్యత ఇవ్వబడినవారు ఉన్నారు మరియు వారిలో నుంచి స్వర్గమునకు, నరకమునకు సంరక్షక భటులు కలరు మరియు వారిలో నుంచి దాసుల కర్మలను నమోదు చేసే బాధ్యత వహించేవారు ఉన్నారు మరియు మేము అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త, పేర్లు తెలిపిన వారిపై సవివరంగా విశ్వసిస్తాము ఉదాహరణకు జిబ్రయీల్, మీకాయీల్, నరకము యొక్క రక్షకభటుడు మాలిక్ మరియు బాకా ఊదే బాధ్యత ఇవ్వబడిన ఇస్రాఫీల్.  వారి ప్రస్తావన సహీహ్ హదీసులలో వచ్చినది.  సహీహ్ హదీస్ లో ఆయిషా రజిఅల్లాహు అన్హా ఉల్లేఖనం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

దైవదూతలు జ్యోతి( నూర్) నుండి సృష్టింపబడ్డారు మరియు జిన్నాతులు మండే అగ్ని నుండి సృష్టింపబడ్డారు మరియు ఆదమ్ మీకు వర్ణించిన దాని నుండి సృష్టింపబడ్డారు.  [3]దీనిని ముస్లిం తన సహీహ్ లో ఉల్లేఖించారు.

దైవగ్రంధాల పట్ల విశ్వాసం

ఇదేవిధంగా దైవగ్రంధాలను విశ్వసించడం.  నిశ్చయంగా అల్లాహ్ తఆలా తన ప్రవక్తల పై, సందేశహరులపై సత్యాన్ని, ధర్మాన్ని వివరించడానికి, దాని ప్రచారానికై పుస్తకాలను అవతరింపచేశాడు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

لَقَدْ أَرْسَلْنَا رُسُلَنَا بِٱلْبَيِّنَـٰتِ وَأَنزَلْنَا مَعَهُمُ ٱلْكِتَـٰبَ وَٱلْمِيزَانَ لِيَقُومَ ٱلنَّاسُ بِٱلْقِسْطِ

వాస్తవానికి, మేము మా సందేశహరులను స్పష్టమైన సూచనలనిచ్చి పంపాము మరియు వారితో పాటు గ్రంధాన్ని అవతరింపజేశాము మరియు మానవులు న్యాయశీలురుగా మెలగటానికి త్రాసును కూడా పంపాము.[అల్ హదీద్ 57: 25]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

كَانَ ٱلنَّاسُ أُمَّةً وَٰحِدَةً فَبَعَثَ ٱللَّهُ ٱلنَّبِيِّـۧنَ مُبَشِّرِينَ وَمُنذِرِينَ وَأَنزَلَ مَعَهُمُ ٱلْكِتَـٰبَ بِٱلْحَقِّ لِيَحْكُمَ بَيْنَ ٱلنَّاسِ فِيمَا ٱخْتَلَفُوا۟ فِيهِ

మానవులంతా ఒకే సమాజంగా ఉండేవారు.  అల్లాహ్ ప్రవక్తలను శుభవార్తనిచ్చే వారుగా, భయపెట్టే వారుగా చేసి పంపాడు.  ప్రజల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలపై తీర్పు చేయటానికిగాను వారివెంట (అనగా ప్రవక్తల వెంట) సత్య బద్ధమైన గ్రంధాలను పంపాడు. [బఖర 2 :  213]

మరియు మేము అల్లాహ్ పేర్లు తెలిపిన గ్రంధాలను సవివరంగా విశ్వసిస్తాము.  ఉదాహరణకు తౌరాత్, ఇంజీల్, జబూర్ మరియు ఖుర్ఆన్.  ఖుర్ఆన్ వాటిలో ఉన్నతమైనది మరియు అంతిమమైనది మరియు అది వాటిపై పర్యవేక్షకునిగా ఉన్నది మరియు అది వాటిని దృవీకరిస్తుంది, దానిని అనుసరించటం పూర్తి ఉమ్మత్ పై తప్పనిసరి.  ఖుర్ఆన్ మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వచ్చిన సహీహ్ హదీసులకు అనుగుణంగా తీర్పులివ్వటం తప్పనిసరి, ఎందుకంటే అల్లాహ్ తఆలా తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మానవులు, జిన్నాతులందరి వద్దకు ప్రవక్తగా పంపించాడు మరియు ఖుర్ఆన్ ను దాని ద్వారా ఆయన తీర్పులివ్వటం కొరకు ఆయనపై అవతరింపజేశాడు మరియు దానిని హృదయములలో కల వాటిని నయం చేసేదిగా మరియు ప్రతీ వస్తువును విశదపరచేదిగా మరియు విశ్వాసపరుల కొరకు మార్గదర్శకంగా, కారుణ్యంగా చేశాడు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

وَهَـٰذَا كِتَـٰبٌ أَنزَلْنَـٰهُ مُبَارَكٌ فَٱتَّبِعُوهُ وَٱتَّقُوا۟ لَعَلَّكُمْ تُرْحَمُونَ

మరియు ఇదే విధంగా శుభప్రదమైన ఈ గ్రంధాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింపజేశాము.  కావున దీనిని అనుసరించి, భయభక్తులు కలిగి ఉంటే, మీరు కరుణింపబడవచ్చు! [అన్ ఆమ్ 6: 155]

అల్లాహ్ సెలవిచ్చాడు:

وَنَزَّلْنَا عَلَيْكَ ٱلْكِتَـٰبَ تِبْيَـٰنًا لِّكُلِّ شَىْءٍ وَهُدًى وَرَحْمَةً وَبُشْرَىٰ لِلْمُسْلِمِينَ

మేము నీపై ఈ గ్రంధాన్ని అవతరింపజేశాము.  అందులో ప్రతీ విషయం విశదీకరించబడింది.  ముస్లింలకు అది మార్గదర్శకం, కారుణ్యం, శుభవార్త.  [అన్ నహ్ల్ 16:89]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

قُلْ يَـٰٓأَيُّهَا ٱلنَّاسُ إِنِّى رَسُولُ ٱللَّهِ إِلَيْكُمْ جَمِيعًا ٱلَّذِى لَهُۥ مُلْكُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۖ لَآ إِلَـٰهَ إِلَّا هُوَ يُحْىِۦ وَيُمِيتُ ۖ فَـَٔامِنُوا۟ بِٱللَّهِ وَرَسُولِهِ ٱلنَّبِىِّ ٱلْأُمِّىِّ ٱلَّذِى يُؤْمِنُ بِٱللَّهِ وَكَلِمَـٰتِهِۦ وَٱتَّبِعُوهُ لَعَلَّكُمْ تَهْتَدُونَ

(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: “మానవులారా! నిశ్చయంగా నేను మీ అందరి వైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను.  భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం ఆయనదే.  ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు; ఆయనే జీవన్మరణాలను ఇచ్చేవాడు.  కావున అల్లాహ్ ను మరియు సందశహరుడు నిరక్షరాస్యుడైన ఆయన ప్రవక్తను విశ్వసించండి.  అతను అల్లాహ్ ను మరియు ఆయన సందేశాలను విశ్వసిస్తాడు.  అతనినే అనుసరించండి, అప్పుడే మీరు మార్గదర్శకత్వం పొందుతారు!” {అల్ ఆరాఫ్: 158}

ఈ అర్ధంలో చాలా ఆయతులు కలవు. 

దైవ సందేశహరుల పట్ల విశ్వాసం

మరియు ఇదేవిధంగా దైవప్రవక్తలను సంక్షిప్తంగా, సవివరంగా విశ్వసించటం తప్పనిసరి.  కావున అల్లాహ్ తన దాసుల వద్దకు ప్రవక్తలను పంపించాడని మేము విశ్వసిస్తాము.  వారిలో నుండి శుభవార్తనిచ్చేవారు, హెచ్చరించేవారు, సత్యం వైపు పిలిచేవారు ఉన్నారు.  వారి పిలుపును స్వీకరించేవాడు ఆనందముతో సాఫల్యం చెందాడు మరియు వారిని విభేదించినవాడు దౌర్భాగ్యముతో, అపనిందతో మరలుతాడు.  వారిలో అంతిములు, ఉన్నతులు మన ప్రవక్త ముహమ్మద్ ఇబ్నె అబ్దుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

وَلَقَدْ بَعَثْنَا فِى كُلِّ أُمَّةٍ رَّسُولًا أَنِ ٱعْبُدُوا۟ ٱللَّهَ وَٱجْتَنِبُوا۟ ٱلطَّـٰغُوتَ

{నిశ్చయంగా మేము ప్రతీ సముదాయంలో ప్రవక్తను ప్రభవింపచేసాము, [ప్రజలారా] కేవలం అల్లాహ్’ను ఆరాధించండి మరియు తాగూత్ (మిథ్యాదైవాలు) కు దూరంగా ఉండండి}.  [అన్-నహల్ 16:36]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

رُّسُلًا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى ٱللَّهِ حُجَّةٌۢ بَعْدَ ٱلرُّسُلِ

(మేము) ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చేవారిగా మరియు హెచ్చరికలు చేసే వారిగా పంపాము.  ప్రవక్తల (ఆగమనం) తరువాత, అల్లాహ్ కు ప్రతికూలంగా వాదించటానికి, ప్రజలకు ఏ సాకూ మిగల కూడదని! (మేము ఇలా చేసాము).  [నిసా 4:165]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

مَّا كَانَ مُحَمَّدٌ أَبَآ أَحَدٍ مِّن رِّجَالِكُمْ وَلَـٰكِن رَّسُولَ ٱللَّهِ وَخَاتَمَ ٱلنَّبِيِّـۧنَ

{(ఓ మానవులారా!) ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు.  కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో అంతిమవాడు.  {అల్ అహ్’జాబ్ :40 }

మరియు అల్లాహ్ ఎవరి పేర్లు ప్రస్తావించాడో లేదా ఎవరి పేర్లు దైవప్రవక్త నుండి నిరూపితమైనాయో వారిని మేము సవివరంగా విశ్వసిస్తాము. ఉదాహరణకు నూహ్, హూద్, సాలిహ్, ఇబ్రాహీమ్ మరియు తదితరులు.  వారిపై మరియు మన ప్రవక్త పై శుభాలు, శాంతి కురియుగాక. 

పరలోకం పట్ల విశ్వాసం

మరణాంతరం సంభవించే వాటి గురించి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియపరచినవి ఉదాహరణకు సమాధి పరీక్ష, దాని యాతన, దాని అనుగ్రహాలు మరియు ప్రళయ దినమున సంభవించే భయాందోళనలు, కఠిన పరిస్థితులు మరియు సిరాత్ వంతిన, త్రాసు, లెక్క తీసుకోబడటం, ప్రతిఫలం ప్రసాదించబడటం మరియు ప్రజల మధ్య కర్మల పత్రాల పంపిణీ, కొందరు తమ కర్మల పత్రమును కుడిచేతులో తీసుకోవటం, కొందరు తమ కర్మల పత్రమును ఎడమ చేతిలో లేదా వీపు వెనుక నుండి తీసుకోవడం.  మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ప్రసాదించబడే హౌజె కౌసర్ ను విశ్వసించటం మరియు స్వర్గమును, నరకమును విశ్వసించటం మరియు విశ్వాసపరులు తమ ప్రభువును దర్శించుకోవటం, ఆయనతో సంభాషించటం మరియు దివ్యఖుర్ఆన్ లో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం సహీహ్ హదీసులలో వచ్చిన తదితర వాటిని విశ్వసించటం ఇందులోనే వస్తాయి.  వీటన్నిటిని విశ్వసించటం అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టపరచిన విధంగా నమ్మటం తప్పనిసరి. 

విధి వ్రాత పట్ల విశ్వాసం

విధి వ్రాతను విశ్వసించటం అన్నది ఈ నాలుగు విషయములను విశ్వసించటం (పై ఆధారపడి ఉన్నది) తప్పనిసరి :

వాటిలో మొదటిది : జరిగినది మరియు జరగబోయేది అల్లాహ్ సుబ్హానహు వతఆలా కు తెలుసు మరియు ఆయన దాసుల స్థితిగతులు ఆయనకు తెలుసు మరియు వారి ఆహారోపాధి, వారి వయస్సు, వారి కర్మలు మరియు వారి తదితర విషయములు ఆయనకు తెలుసు.  ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.  అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు :

أَنَّ ٱللَّهَ بِكُلِّ شَىْءٍ عَلِيمٌ

 నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు.  [బఖరా 2: 231]

మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ఇలా చెప్పాడు:

لِتَعْلَمُوٓا۟ أَنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ وَأَنَّ ٱللَّهَ قَدْ أَحَاطَ بِكُلِّ شَىْءٍ عِلْمًۢا

అల్లాహ్ అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడని, ఇంకా అల్లాహ్ తన జ్ఞానంతో అన్నింటినీ పరివేష్ఠించి ఉన్నాడని మీరు తెలుసుకోవటానికి.  [తలాఖ్ 65 :12]

రెండవ విషయం : అల్లాహ్ తాను నిర్ణయించిన వాటన్నింటిని వ్రాసి ఉంచటం.  అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు :

قَدْ عَلِمْنَا مَا تَنقُصُ ٱلْأَرْضُ مِنْهُمْ ۖ وَعِندَنَا كِتَـٰبٌ حَفِيظٌۢ

భూమి వారిలో (ఎందరిని) ఏ మేరకు హరిస్తుందో మాకు బాగా తెలుసు మరియు మా దగ్గర అంతా ఒక సురక్షితమైన గ్రంధంలో (వ్రాయబడి) ఉంది.  [ఖాఫ్ : 4]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَكُلَّ شَىْءٍ أَحْصَيْنَـٰهُ فِىٓ إِمَامٍ مُّبِينٍ

{ మేము ప్రతీ విషయాన్ని స్పష్టమైన ఒక గ్రంధంలో నమోదుచేసి పెట్టాము} [యాసీన్ 36: 12]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

أَلَمْ تَعْلَمْ أَنَّ ٱللَّهَ يَعْلَمُ مَا فِى ٱلسَّمَآءِ وَٱلْأَرْضِ ۗ إِنَّ ذَٰلِكَ فِى كِتَـٰبٍ ۚ إِنَّ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٌ

ఏమీ? నీకు తెలియదా? ఆకాశంలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసని! నిశ్చయంగా, ఇదంతా ఒక గ్రంధంలో (వ్రాయబడి) ఉంది.  నిశ్చయంగా ఇదంతా అల్లాహ్ కు చాలా సులభమైనది.  [హజ్ 22: 70]

మూడవ విషయం : అల్లాహ్ ఇచ్ఛ జరిగి తీరుతుంది.  ఆయన తలచినది అవుతుంది మరియు ఆయన తలచనిది అవ్వదు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

إِنَّ ٱللَّهَ يَفْعَلُ مَا يَشَآءُ

నిశ్చయంగా అల్లాహ్ తాను తలచినది చేసి తీరుతాడు.  [హజ్జ్ 22: 18]

మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ఇలా చెప్పాడు:

إِنَّمَآ أَمْرُهُۥٓ إِذَآ أَرَادَ شَيْـًٔا أَن يَقُولَ لَهُۥ كُن فَيَكُونُ

నిశ్చయంగా, ఆయన విధానమేమిటంటే! ఆయన ఏదైనా చేయదలచు కున్నప్పుడు దానితో: “అయిపో!” అని అంటాడు, అంతే! అది అయిపోతుంది.  [యాసీన్ 36: 82]

అల్లాహ్ సెలవిచ్చాడు:

وَمَا تَشَآءُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ ۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلِيمًا حَكِيمًا

మరియు అల్లాహ్ కోరకపోతే, మీరు కోరేదీ (జరగదు)! నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేకవంతుడు.  [ఇన్సాన్ 76: 30]

నాల్గవ విషయం : ఉనికిలో ఉన్నవాటన్నింటిని అల్లాహ్ సృష్టించాడు.  ఆయన తప్ప వేరే సృష్టికర్త లేడు మరియు ఆయన తప్ప వేరే ప్రభువు లేడు. 

అల్లాహ్ సుబహానహు వతఆలా ఇలా సెలవిచ్చాడు :

ٱللَّهُ خَـٰلِقُ كُلِّ شَىْءٍ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَىْءٍ وَكِيلٌ

అల్లాహ్ యే ప్రతి దాని సృష్టికర్త మరియు ఆయనే ప్రతి దానికి సంరక్షకుడు. [జుమర్39: 62]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

يَـٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱذْكُرُوا۟ نِعْمَتَ ٱللَّهِ عَلَيْكُمْ ۚ هَلْ مِنْ خَـٰلِقٍ غَيْرُ ٱللَّهِ يَرْزُقُكُم مِّنَ ٱلسَّمَآءِ وَٱلْأَرْضِ ۚ لَآ إِلَـٰهَ إِلَّا هُوَ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ

ఓ మానవులారా! అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి! ఏమీ? భూమ్యాకాశాల నుండి మీకు జీవనోపాధి సమకూర్చే సృష్టికర్త అల్లాహ్ తప్ప మరొకడు ఉన్నాడా? ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు! అయితే మీరు ఎందుకు మోసగింప (సత్యం నుండి మరలింప) బడుతున్నారు? [ఫాతిర్:3]

విధివ్రాతను విశ్వసించటం అన్నది అహ్లె సున్నత్ వల్ జమాఅత్ వద్ద ఈ నాలుగు విషయములను విశ్వసించటం.  దీనికి భిన్నంగా అహ్లె బిద్అ వీటిలో నుంచి కొన్నింటిని తిరస్కరించారు.

విశ్వాసం అన్నది పలకటం మరియు ఆచరించటంఅది విధేయత చూపటం వలన అధికమగును మరియు అవిధేయత చూపటం వలన తరుగును.

అల్లాహ్ పై విశ్వాసం అన్నది పలకటం మరియు ఆచరించటం అని విశ్వసించటం, అది విధేయత చూపటం వలన అధికమగును మరియు అవిధేయత చూపటం వలన తరుగును అని విశ్వసించటం మరియు షిర్క్, అవిశ్వాసం కాకుండా వేరే పాపకార్యముల్లోంచి దేనికైన పాల్పడిన ముస్లిముల్లోంచి ఎవరినీ కాఫిర్ అని నిందించటం సమ్మతం కాదు.  ఉదాహరణకు వ్యభిచారము, దొంగతనం, వడ్డీ సొమ్ము తినటం, మత్తు పానీయాలు సేవించటం, తల్లిదండ్రుల పట్ల అవిధేయతకు పాల్పడటం ఇంకా ఇతర పెద్ద పాపములు వాటిని సమ్మతం అని భావించనంత వరకు. 

అల్లాహ్ వాక్కు :

إِنَّ ٱللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِۦ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَآءُ

నిశ్చయంగా అల్లాహ్ తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని క్షమించడు.  ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు.  [నిసా 4: 48]

ముతవాతిర్ హదీసులలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఇది నిరూపితమైనది అల్లాహ్ ఎవరి హృదయంలోనైనా ఆవగింజంత విశ్వాసమున్నా అతనిని నరకం నుండి వెలికి తీస్తాడు. 

అల్లాహ్ కొరకు ప్రేమించటం, అల్లాహ్ కొరకు ద్వేషించటం, అల్లాహ్ కొరకు స్నేహం చేయటం, అల్లాహ్ కొరకు శతృత్వం చేయటం

మరియు అల్లాహ్ పై విశ్వాసం చూపటంలో నుంచి : అల్లాహ్ కొరకు ప్రేమించటం, అల్లాహ్ కొరకు ద్వేషించటం, అల్లాహ్ కొరకు స్నేహం చేయటం, అల్లాహ్ కొరకు శతృత్వం చేయటం.  కావున విశ్వాసపరుడు విశ్వాసపరులని ప్రేమిస్తాడు మరియు వారితో స్నేహం చేస్తాడు మరియు అవిశ్వాసపరులను ద్వేషిస్తాడు మరియు వారితో శతృత్వం చేస్తాడు.  ఈ ఉమ్మత్ లో నుండి విశ్వాసపరుల మొదటి పంక్తిలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు ఉన్నారు.  కావున అహ్లు – స్ – సున్నత్ వల్ జమాఅత్ వారిని ప్రేమిస్తారు మరియు వారితో స్నేహం చేస్తారు మరియు వారు దైవ ప్రవక్తల తరువాత ప్రజల్లోకెల్ల ఉత్తములని విశ్వసిస్తారు.  దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాట: శతాబ్దాలలో ఉత్తమమైనది నా శతాబ్దము ఆ తరువాత వారి తరువాత వారు ఆ తరువాత వారి తరువాత వారు.  [4]దాని ప్రామాణికమవటమును అంగీకరించబడింది.  మరియు వారిలో అబూబకర్ సిద్దీఖ్ ఉత్తమమైన వారని ఆ తరువాత ఉమర్ ఫారూఖ్ అవి ఆ తరువాత ఉస్మాన్ జున్నూరైన్ అని ఆ తరువాత అలియ్యుల్ ముర్తజా అని – రజియల్లాహు అన్హుమ్ అజ్మయీన్ – వారి తరువాత అషరె ముబష్షిర (శుభవార్త ఇవ్వబడిన పది మంది సహచరులు) అని ఆ తరువాత మిగిలిన సహచరులు రజియల్లాహు అన్హుమ్ అజ్మయీన్ అని విశ్వసిస్తారు మరియు సహచరుల మధ్య వచ్చిన వ్యతిరేకతల విషయంలో వారు మౌనం వహించారు మరియు వారు ఈ విషయంలో శోధన (ఇజ్తిహాద్) చేసేవారు అని విశ్వసిస్తారు.  తన శోధనను సరిగా చేసిన వారు రెండింతలు పుణ్యం పొందుతారు.  శోధనను తప్పు చేసిన వారు ఒకింత పుణ్యం పొందుతారు.  మరియు వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి వారిలో నుంచి విశ్వాసపరులైన వారిని ప్రేమిస్తారు మరియు వారితో స్నేహం చేస్తారు మరియు విశ్వాసపరుల మాతృలైన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణులతో స్నేహం ఉంచుతారు మరియు వారందరితో సంతృప్తిగా ఉంటారు మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులను ద్వేషించి వారిని దూషించే, అహ్లే బైత్ విషయంలో అతిక్రమించి అల్లాహ్ అవతరింపజేసిన స్థానముల కన్న వారి స్థానములను పెంచే రాఫిజీల పద్ధతి నుండి విసుగు చూపుతారు.  అలాగే అహ్లే బైత్ ను మాటలు లేదా చేతలతో బాధించే నవాసిబుల పద్దతి నుండి వారు విసుగును చూపుతారు. 

మరియు ఈ సంక్షిప్త వ్యాసములో మేము ప్రస్తావించినవన్ని అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇచ్చి పంపించిన నిజమైన విశ్వాసములోకి వస్తాయి.  మరియు అది ఫిర్కె నాజియ అహ్లు – స్ – సున్నత్ వల్ జమాఅత్ యొక్క విశ్వాసము.  వారి విషయంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు :

నా సమాజంలో నుంచి ఒక వర్గము సత్యం పై ఉంటుంది.  అల్లాహ్ సహాయం పొందుతుంది.  వారి తోడు వదిలేవారు వారికి నష్టం కలిగించలేరు.  చివరికి అల్లాహ్ ఆదేశం వస్తుంది.  [5]

ఆయన అలైహిస్సలాతు వస్సలాం ఇలా పలికారు:

యూదులు డబ్బై ఒక వర్గములుగా విడిపోయారు.  మరియు క్రైస్తవులు డబ్బై రెండు వర్గములుగా విడిపోయారు.  మరియు తొందరలోనే ఈ సమాజం డబ్బై మూడు వర్గములుగా విడిపోయిద్ది.  ఒక వర్గము తప్ప అన్ని వర్గములు నరకములో ఉంటారు.  అప్పుడు అనుచరులు అది ఏది ? ఓ ప్రవక్త అని ప్రశ్నించారు.  ఆయన సమాధానమిస్తూ అది ఎవరైతే నేను మరియు నా సహచరులు ఉన్న మార్గం పై ఉంటారో వారు.  [6]

మరియు అది ఎలాంటి విశ్వాసం అంటే దానిని అదిమి పట్టుకోవటం మరియు దానిపై స్థిరంగా ఉండటం మరియు దానిని విభేదించే వాటి నుండి భయపడటం తప్పనిసరి. 

విశ్వాసం నుండి మరలిపోయి దానికి వ్యతిరేకంగా నడిచేవారి ప్రస్తావన వారి రకాలు. 

ఇక ఈ విశ్వాసము నుండి మరలిపోయి దానికి వ్యతిరేకమైన మార్గముపై నడిచేవారి చాలా రకాలు కలవు.  అయితే వారిలో నుంచి విగ్రహాలను, శిల్పాలను, దూతలను, ఔలియాలను, జిన్నులను, వృక్షాలను, రాళ్ళను మరియు తదితరవాటిని పూజించేవారు ఉన్నారు.  వీరందరు దైవప్రవక్తల పిలుపును స్వీకరించలేదు.  కాని వారిని విభేదించారు మరియు వ్యతిరేకించారు.  ఏ విధంగానైతే ఖురైష్ జాతివారు మరియు అరబ్ లోని తదితర తెగలు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల వ్యవహరించారో అలా.  మరియు వారు తమ ఆరాధ్యదైవాలతో అవసరాలను తీర్చమని, వ్యాధిగ్రస్తులకు నయం చేయటమును, శతృవులకు వ్యతిరేకంగా సహాయం చేయమని అర్ధించేవారు.  మరియు వారి పేరుపై వధించేవారు.  మరియు వారి కొరకు మొక్కుకునేవారు.  ఎప్పుడైతే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దాని నుండి ఆపి, అల్లాహ్ ఒక్కడి కొరకు ఆరాధనను ప్రత్యేకించమని వారిని ఆదేశించారో వారికి ఈ మాటలు ఆశ్చర్యకేతులను చేశాయి. 

మరియు వారు ఆయనను తిరస్కరించి ఇలా పలికారు :

أَجَعَلَ ٱلْـَٔالِهَةَ إِلَـٰهًا وَٰحِدًا ۖ إِنَّ هَـٰذَا لَشَىْءٌ عُجَابٌ

 “ఏమీ ? ఇతను (ఈ ప్రవక్త) దైవాలందరినీ, ఒకే ఆరాధ్యదైవంగా చేశాడా ? నిశ్చయంగా ఇది ఎంతో విచిత్రమైన విషయం!”.  [సాద్ : 5]

దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ వైపు ఆహ్వానిస్తూనే ఉన్నారు.  మరియు వారిని షిర్క్ నుండి వారిస్తూనే ఉన్నారు.  మరియు తాను ఆహ్వానిస్తున్న దాని వాస్తవికతను వారికి విస్తరించి చెప్పేవారు.  చివరికి అల్లాహ్ వారిలో నుండి సన్మార్గం చూపవలసిన వారికి సన్మార్గం చూపాడు.  ఆ తరువాత అల్లాహ్ ధర్మంలో తండోపతండాలుగా వారు ప్రవేశించారు.  దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరుల, తాబియీన్ ల నిరంతర ఆహ్వానము మరియు కృషి తరువాత అల్లాహ్ ధర్మం ఇతర ధర్మాలన్నింటిపై ఆధిక్యతను పొందినది.  ఆ తరువాత పరిస్థితులు మారిపోయినవి.  మరియు అజ్ఞానము అల్లాహ్ సృష్టిపై ఆధిక్యతను పొందినది.  చివరికి చాలా మంది అజ్ఞాన ధర్మం వైపునకు మరలిపోయారు.  వారు దైవ ప్రవక్తల విషయంలో, ఔలియాల విషయంలో, వారిని అర్ధించే విషయంలో, వారితో సహాయం కొరకు మొరపెట్టుకునే విషయంలో మరియు తదితర షిర్క్ రకాలలో అతిక్రమించారు మరియు వారు లా యిలాహ ఇల్లల్లాహ్ అర్ధమును అరబ్ కాఫిర్ లు గుర్తించినట్లు గుర్తించలేదు.  ఫల్లాహుల్ ముస్తఆన్. 

అజ్ఞానం యొక్క ఆధిక్యత మరియు దైవదౌత్య యుగమునకు దూరం అవ్వడం వల్ల ఈ బహుదైవారాధన ప్రజలలో మన ఈ కాలం వరకు వ్యాపిస్తూనే ఉన్నది. 

వారిలో నుండి చివరివారి సందేహమే ముందువారి సందేహము.  కొన్ని అవిశ్వాస నమ్మకాల ప్రస్తావన:

ఈ చివరి వారందరి సందేహమే మొదటి వారి సందేహము.  వారి మాటలలోనే : వీరందరు అల్లాహ్ వద్ద మా కొరకు సిఫారసు చేసేవారు మేము వారిని కేవలం మాకు అల్లాహ్ సాన్నధ్యమును కలిగిస్తారని ఆరాధించేవారము.  అల్లాహ్ వారి ఈ సందేహమును అసత్యపరిచాడు.  మరియు ఎవరైతే అల్లాహ్ ను వదిలి ఇతరులను ఆరాధిస్తాడో అతడు షిర్క్ చేశాడు.  మరియు అవిశ్వాసమునకు పాల్పడ్డాడని స్పష్టపరచాడు.  అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

وَيَعْبُدُونَ مِن دُونِ ٱللَّهِ مَا لَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ وَيَقُولُونَ هَـٰٓؤُلَآءِ شُفَعَـٰٓؤُنَا عِندَ ٱللَّهِ

మరియు వారు అల్లాహ్ ను వదిలి తమకు నష్టాన్ని గానీ, లాభాన్ని గానీ చేకూర్చలేని వాటిని ఆరాధిస్తున్నారు.  ఇంకా అల్లాహ్ సమక్షంలో ఇవి మాకు సిఫారసు చేస్తాయి అని చెబుతున్నారు.  [యూనుస్ 10: 18]

అల్లాహ్ తన ఈ మాట ద్వారా వారిని ఖండించాడు. 

قُلْ أَتُنَبِّـُٔونَ ٱللَّهَ بِمَا لَا يَعْلَمُ فِى ٱلسَّمَـٰوَٰتِ وَلَا فِى ٱلْأَرْضِ ۚ سُبْحَـٰنَهُۥ وَتَعَـٰلَىٰ عَمَّا يُشْرِكُونَ

ఏమిటీ ఆకాశాలలో గానీ, భూమిలో గానీ అల్లాహ్ కు తెలియని దాని గురించి మీరు ఆయనకు తెలియజేస్తున్నారా ?.  వారు కల్పించే భాగస్వామ్యాల నుంచి ఆయన పవిత్రుడు, ఉన్నతుడు అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.  [యూనుస్ 10: 18]

ఈ ఆయతులో అల్లాహ్ తనను వదిలి దైవప్రవక్తలను, ఔలియాలను ఆరాధించటం పెద్ద షిర్కు అని స్పష్టపరచాడు.  ఒక వేళ దానికి పాల్పడేవాడు దానికి వేరే పేరు ఇచ్చినా సరే. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

وَٱلَّذِينَ ٱتَّخَذُوا۟ مِن دُونِهِۦٓ أَوْلِيَآءَ مَا نَعْبُدُهُمْ إِلَّا لِيُقَرِّبُونَآ إِلَى ٱللَّهِ زُلْفَىٰٓ

ఎవరైతే అల్లాహ్ ను కాకుండా ఇతరులను సంరక్షకులుగా ఆశ్రయించారో వారు “ఈ పెద్దలు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చటంలో తోడ్పడతారని భావించి మాత్రమే మేము వీళ్ళను ఆరాధిస్తున్నాము” అని అంటారు.  [జుమర్ 39:3]

అల్లాహ్ తన ఈ మాట ద్వారా వారిని ఖండించాడు. 

إِنَّ ٱللَّهَ يَحْكُمُ بَيْنَهُمْ فِى مَا هُمْ فِيهِ يَخْتَلِفُونَ ۗ إِنَّ ٱللَّهَ لَا يَهْدِى مَنْ هُوَ كَـٰذِبٌ كَفَّارٌ

ఏ విషయం గురించి వారు భేదాభిప్రాయానికి లోనై ఉన్నారో దానికి సంబంధించిన (అసలు) తీర్పు అల్లాహ్ (స్వయంగా) చేస్తాడు.  అబద్దాలకోరులకు, కృతఘ్నలకు అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోను సన్మార్గం చూపడు.  [జుమర్ 39:3]

అల్లాహ్ ను వదిలి వారిని వేడుకోవటం, భయపడటం, ఆశ పెట్టుకోవటం మరియు అటువంటి వేరే వాటి ద్వారా వారి ఆరాధన చేయటం అల్లాహ్ తో పాటు కుఫ్ర్ చేయటమని అల్లాహ్ వీటి ద్వారా స్పష్టపరచాడు.  మరియు వారి ఆరాధ్యదైవాలు వారిని అల్లాహ్ కు దగ్గర చేస్తారనే వారి భావనను ఆయన అసత్యపరచాడు. 

సరైన విశ్వాసమునకు వ్యతిరేకమైన మరియు దైవప్రవక్తలు సల్లల్లాహు అలైహిముస్సలాం తీసుకుని వచ్చిన దానికి వ్యతిరేకమైన కుఫ్రియ విశ్వాసములలోంచి దేనినైతే ఈ కాలములో మార్క్స్, లెనీన్ అనుచరులలోంచి మరియు నాస్తికత్వం, అవిశ్వాసం వైపు పిలిచే తదితరులలోంచి నాస్తికులు విశ్వసిస్తున్నారో అది.  దానికి సోషలిజం లేదా కమ్యూనిజం లేదా బఅ్ సియా లేదా తదితర పేర్లు పెట్టినా సరే.  దేవుడు లేడు మరియు జీవితం భౌతికమైనది అన్నది ఈ నాస్తికులందరి సిద్ధాంతములలోంచిది.  ప్రళయదినమును తిరస్కరించటం, స్వర్గమును, నరకమును తిరస్కరించటం మరియు ధర్మాలన్నింటిని తిరస్కరించటం వారి సిద్ధాంతములలోంచివే.  వారి పుస్తకములలో చూసి వారు దేనిపై ఉన్నారో దానిని చదివినవాడు దానిని ఖచ్చితంగా తెలుసుకుంటాడు.  ఈ విశ్వాసం పరలోక ధర్మాలన్నిటికి వ్యతిరేకంగా ఉండటంలో మరియు వాటి ప్రజలను ఇహపరాలలో చెడ్డ పరిణామాలకు దారితీయటంలో ఎటువంటి సందేహం లేదు. 

సత్యమునకు వ్యతిరేకమైన విశ్వాసములలోంచి దేనినైతే కొంతమంది సూఫీలు మరియు బాతినీ విశ్వాసము కలవారు కొంతమంది ఔలియాలను కల్పించుకుని వారిని అల్లాహ్ కు కార్యనిర్వహణలో సాటి కల్పించి విశ్వసించేవారు.  మరియు విశ్వ వ్యవహారములలో వారు కార్యనిర్వహణ చేస్తారని విశ్వసించేవారు.  మరియు తమ ఆరాధ్యదైవాలకు కల్పించుకున్న పేర్లైన అఖ్తాబ్, అవ్తాద్, అగ్వాస్ తదితర పేర్లను పెట్టేవారు.  ఇది అల్లాహ్ రుబూబియత్ లో అతి చెడ్డదైన షిర్కు.  మరియు ఇది అరబ్ అజ్ఞానుల షిర్క్ కన్న చెడ్డదైనది.  ఎందుకంటే అరబ్ లో ఉండే కాఫిర్లు రుబూబియత్ లో సాటి కల్పించేవారు కాదు.  వారు అల్లాహ్ అరాధనలో సాటి కల్పించేవారు.  మరియు వారి సాటి కల్పించటం అన్నది కలిమిలో ఉండేది.  ఇక క్లిష్ట పరిస్థితులలో వారు చిత్తశుద్ధితో అల్లాహ్ ను ఆరాధించేవారు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

فَإِذَا رَكِبُوا۟ فِى ٱلْفُلْكِ دَعَوُا۟ ٱللَّهَ مُخْلِصِينَ لَهُ ٱلدِّينَ فَلَمَّا نَجَّىٰهُمْ إِلَى ٱلْبَرِّ إِذَا هُمْ يُشْرِكُونَ

వారు నావలోకి ఎక్కినప్పుడు తమ భక్తిని కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించుకొని ఆయననే ప్రార్ధించేవారు; కాని ఆయన వారిని రక్షించి నేల మీదకు తీసుకు రాగానే ఆయనకు సాటి కల్పించేవారు.  [అన్కబూత్ 29: 65]

వారు రుబూబియత్ ను ఆయన ఒక్కడి కొరకు అంగీకరించేవారు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَهُمْ لَيَقُولُنَّ ٱللَّهُ

మరియు నీవు: “మిమ్మల్ని ఎవరు సృష్టించారు?” అని వారితో అడిగినప్పుడు, వారు నిశ్చయంగా: “అల్లాహ్!” అని అంటారు.  [జుఖ్రఫ్ 43: 87]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

قُلْ مَن يَرْزُقُكُم مِّنَ ٱلسَّمَآءِ وَٱلْأَرْضِ أَمَّن يَمْلِكُ ٱلسَّمْعَ وَٱلْأَبْصَـٰرَ وَمَن يُخْرِجُ ٱلْحَىَّ مِنَ ٱلْمَيِّتِ وَيُخْرِجُ ٱلْمَيِّتَ مِنَ ٱلْحَىِّ وَمَن يُدَبِّرُ ٱلْأَمْرَ ۚ فَسَيَقُولُونَ ٱللَّهُ ۚ فَقُلْ أَفَلَا تَتَّقُونَ

వారిని అడుగు: “ఆకాశం నుండి మరియు భూమి నుండి, మీకు జీవనోపాధిని ఇచ్చేవాడు ఎవడు? వినేశక్తీ, చూసేశక్తీ ఎవడి ఆధీనంలో ఉన్నాయి? మరియు ప్రాణం లేని దాని నుండి ప్రాణమున్న దానిని మరియు ప్రాణమున్న దాని నుండి ప్రాణం లేని దానిని తీసేవాడు ఎవడు? మరియు ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నవాడు ఎవడు?” వారు: “అల్లాహ్!” అని తప్పకుండా అంటారు.  అప్పుడను: “అయితే మీరు దైవభీతి కలిగి ఉండరా?”.  (యూనుస్ 10:31)

ఈ అర్ధంలో చాలా ఆయతులు కలవు. 

మునుపటి ముష్రికుల కన్న తదుపరి ముష్రికులు అధికం చేసి జోడించినవి

ఇక మునుపటి ముష్రికుల కన్న తదుపరి ముష్రికులు రెండు విధాలుగా అధికం చేసి జోడించారు.  ఒకటి : రుబూబియత్ విషయంలో వారిలో కొందరి షిర్క్ చేయటం.  రెండు : కలిమిలో లేమిలో వారి షిర్క్ చేయటం.  ఏవిధంగానైతే వారితో కలిసి, వారి పరిస్థితులను అన్వేషించి, మిసర్ (ఈజిప్ట్) లోని హుస్సేన్, బదవీ మరియు ఇతరుల సమాధి వద్ద మరియు అదన్ లోని అల్ ఈద్రోస్ సమాధి వద్ద, యమన్ లోని అల్ హాదీ, షామ్ (సిరియ) లోని ఇబ్నె అరబీ, ఇరాఖ్ లోని షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరియు ఇతర ప్రసిద్ధి చెందిన సమాధుల విషయంలో చాలా మంది ప్రజలు అతిక్రమించి వారికి అల్లాహ్ యొక్క చాలా హక్కులను సమర్పించి ఏమి చేస్తున్నారో చూసిన వాడు దానిని తెలుసుకుంటాడు.  వారిని దాని నుండి ఆపేవారు మరియు అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన కన్న మునుపటి ప్రవక్తలు అలైహిముస్సలాంకు ఇచ్చి పంపించిన తౌహీద్ ను వారికి స్పష్టపరచేవారు చాలా తక్కువ మంది ఉన్నారు .  ఇన్నా లిల్లాహి వఇన్నా ఇలైహి రాజిఊన్.  మరియు మేము అల్లాహ్ వారికి వారి బుద్ధిని తిరిగి ఇవ్వాలని మరియు వారి మధ్య సన్మార్గం వైపు పిలిచేవారిని అధికం చేయాలని మరియు ముస్లిముల నాయకులకు, వారి పండితులకు ఈ షిర్కు కు , దాని కారకాలకు వ్యతిరేకంగా పోరాడటానికి భాగ్యమును కలిగించమని అల్లాహ్ ను వేడుకుంటున్నాము.  నిశ్చయంగా ఆయన వినేవాడు, దగ్గర ఉండేవాడు. 

పేర్లు మరియు గుణగణాల (అస్మా వ సిఫాత్) విభాగంలో సరైన విశ్వాసమునకు వ్యతిరేకమైన విశ్వాసములలోంచి బిద్అతీలైన జహమీయ మరియు మూతజిల మరియు అల్లాహ్ గుణాలను నిరాకరించటంలో మరియు ఆయనను పరిపూర్ణ గుణాల నుండి ఖాళీగా భావించటంలో వారి మార్గములో నడిచే వారి విశ్వాసములు మరియు వారు అల్లాహ్ ను నిరాశ్రయులు, నిర్జీవులు మరియు అసాధ్యమైనవారి గుణాలతో వర్ణించారు.  అల్లాహ్ వారి మాటల నుండి ఉన్నతుడు.  అల్లాహ్ యొక్క కొన్ని గుణాలను తిరస్కరించి కొన్నింటిని నిరూపించిన వారు అషాయిర లాంటి వారు ఇందులో ఉన్నారు.  ఏ విషయము నుండి బయట పడటానికి వారు అల్లాహ్ యొక్క కొన్ని గుణాలను తిరస్కరించి వాటి ఆధారాల విషయంలో అసత్యవాదము చేశారో వారు కొన్ని గుణాలను అంగీకరించటం వలన అదే నిరూపితమవుతుంది.  కావున వారు విన్న, బౌద్దిక ఆధారాలను విబేధించారు మరియు ఈ విషయంలో వారు స్పష్టంగా విరుద్ధంగా ఉన్నారు.  ఇక అహ్లె సున్నత్ వల్ జమాఅత్ వారు అల్లాహ్ కొరకు ఆ పేర్లను, గుణాలను నిరూపించారు ఏ పేర్లు, గుణాలనైతే పరిపూర్ణ పద్ధతిలో అల్లాహ్ తన స్వయం కొరకు నిరూపించాడో లేదా ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కొరకు నిరూపించారో.  మరియు వారు తమ సృష్టికర్తను సృష్టితో పోల్చటం నుండి పరిశుద్ధతను కొనియాడుతారు ఎంతంటే వారితో సమానంగా పోల్చే సందేహం లేకుండా మరియు వారు వాటి ఆధారముల ప్రకారంగా ఆచరిస్తారు.  వాటిలో మార్పుచేర్పులు చేయరు.  మరియు అంతరాయం కలిగించరు.  మరియు వారు ఇతరులకు సంభవించిన వైరుద్ధ్యం నుండి భద్రంగా ఉన్నారు.  దీని వివరణ ఇంతకు ముందే ప్రస్తావించబడినది.  మరియు ఇది ఇహపరాల్లో ముక్తికి, సుఖవంతమైన జీవితానికి మార్గము.  మరియు అది ఈ సమాజము యొక్క పూర్వికులు, ఇమామ్ లు నడిచినటువంటి సరళమైన మార్గం.  వారిలోని మొదటి వారికి దేని ద్వారానైతే సంస్కరణ జరిగినదో దానితో మాత్రమే వారి చివరి వారి సంస్కరణ జరుగును.  అది గ్రంధమును, సున్నత్ ను అనుసరించటం మరియు వాటికి విరుద్ధమైన వాటిని వదిలివేయటం. 

అల్లాహ్ ఒక్కడి ఆరాధన చేయటం తప్పనిసరి అవటం. మరియు అల్లాహ్ శతృవులకు వ్యతిరేకంగా సహాయమునకు కారకాల ప్రకటన

బాధ్యత కల మానవునిపై అత్యంత ముఖ్యమైన విధి మరియు అతనిపై ఉన్న గొప్ప అనివార్య కార్యం ఏమటంటే అది అతని ప్రభువు, భూమ్యాకాశముల, అర్షె అజీమ్ యొక్క ప్రభువు ఆరాధన చేయటం.  ఆయన తన గ్రంధంలో ఇలా సెలవిచ్చాడు :

إِنَّ رَبَّكُمُ ٱللَّهُ ٱلَّذِى خَلَقَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ فِى سِتَّةِ أَيَّامٍ ثُمَّ ٱسْتَوَىٰ عَلَى ٱلْعَرْشِ يُغْشِى ٱلَّيْلَ ٱلنَّهَارَ يَطْلُبُهُۥ حَثِيثًا وَٱلشَّمْسَ وَٱلْقَمَرَ وَٱلنُّجُومَ مُسَخَّرَٰتٍۭ بِأَمْرِهِۦٓ ۗ أَلَا لَهُ ٱلْخَلْقُ وَٱلْأَمْرُ ۗ تَبَارَكَ ٱللَّهُ رَبُّ ٱلْعَـٰلَمِينَ

నిశ్చయంగా, మీ ప్రభువైన అల్లాహ్ యే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించాడు.  ఆ పిదప తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్ఠించాడు.  ఆయన రాత్రిని పగటి వెంట ఎడతెగకుండా అనుసరింపజేసి, దానిపై (పగటిపై) కప్పుతూ ఉంటాడు మరియు సూర్యచంద్ర, నక్షత్రాలు ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి.  నిశ్చయంగా, సర్వసృష్టి ఆయనదే! మరియు ఆజ్ఞ నడిచేది ఆయనదే.  అల్లాహ్ ఎంతో శుభదాయకుడు, సర్వ లోకాలకు పోషకుడు! [అల్ అఅ్ రాఫ్ : 54]

మరియు అల్లాహ్ సుబహానహు వతఆలా వేరే చోట తాను మానవులను, జిన్నులను తన ఆరాధన కొరకు సృష్టించాడని తెలియపరచాడు. 

అల్లాహ్ అజ్జ వజల్ల ఇలా సెలవిచ్చాడు :

وَمَا خَلَقْتُ ٱلْجِنَّ وَٱلْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ

మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించింది, కేవలం నన్ను ఆరాధించటానికే! [జారియాత్ :56]

మానవులను, జిన్నులను అల్లాహ్ ఏ ఆరాధన కొరకు సృష్టించాడో అది ఆరాధన రకములైన నమాజు, ఉపవాసములు, జకాత్, హజ్, రకూ, సజ్దాలు, ప్రదక్షిణలు, వధించటం, మొక్కుబడులు, భయపడటం, ఆశపెట్టుకోవటం, సహాయం కొరకు మొర పెట్టుకోవటం, సహాయం అర్ధించటం, శరణు వేడుకోవటం మరియు ప్రార్ధనల అన్ని రకముల ద్వారా అల్లాహ్ ఏకత్వమును చాటటం మరియు అల్లాహ్ గ్రంధము మరియు దైవ ప్రవక్త హదీసులలో ఆదేశించబడిన వాటికి విధేయత చూపటం మరియు వారించబడిన వాటి నుండి దూరంగా ఉండటం ఇందులోనే వస్తాయి.  మరియు అల్లాహ్ మానవులను, జిన్నులందరిని ఈ ఆరాధన చేయటం గురించే ఆదేశించాడు.  మరియు ఈ ఆరాధనను వివరించటానికి, దాని వైపు పిలవటానికి మరియు దానిని అల్లాహ్ కొరకు ప్రత్యేకం చేయటమును నేర్పించటానికి అల్లాహ్ ప్రవక్తలందరిని పంపించాడు.  మరియు గ్రంధములను అవతరింపజేశాడు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

يَـٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱعْبُدُوا۟ رَبَّكُمُ ٱلَّذِى خَلَقَكُمْ وَٱلَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ

ఓ మానవులారా! మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువు (అల్లాహ్) నే ఆరాధించండి, తద్వారా మీరు భక్తిపరులు కావచ్చు! [అల్ బఖర 2:21]

మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ఇలా చెప్పాడు:

وَقَضَىٰ رَبُّكَ أَلَّا تَعْبُدُوٓا۟ إِلَّآ إِيَّاهُ وَبِٱلْوَٰلِدَيْنِ إِحْسَـٰنًا

నీ ప్రభువు స్పష్టంగా ఆజ్ఞాపించాడు మీరు ఆయనను తప్ప మరొకరెవరిని ఆరాధించకూడదు.  మరియు తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా వ్యవహరించాలి.  [అల్ ఇస్రా 17:23]

ఈ ఆయతులో ఖజా అంటే అర్ధం ఆదేశించాడు, తాకీదు చేశాడు(అని). 

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَمَآ أُمِرُوٓا۟ إِلَّا لِيَعْبُدُوا۟ ٱللَّهَ مُخْلِصِينَ لَهُ ٱلدِّينَ حُنَفَآءَ وَيُقِيمُوا۟ ٱلصَّلَوٰةَ وَيُؤْتُوا۟ ٱلزَّكَوٰةَ ۚ وَذَٰلِكَ دِينُ ٱلْقَيِّمَةِ

మరియు వారికిచ్చిన ఆదేశం: “వారు అల్లాహ్ నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్ర చిత్తంతో తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజ్ ను స్థాపించాలని మరియు జకాత్ ఇవ్వాలని.  ఇదే సరైన ధర్మము”.  [అల్ బయ్యిన 98: 5]

అల్లాహ్ గ్రంధంలో ఈ అర్ధంలో చాలా ఆయతులు ఉన్నవి. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

مَّآ أَفَآءَ ٱللَّهُ عَلَىٰ رَسُولِهِۦ مِنْ أَهْلِ ٱلْقُرَىٰ فَلِلَّهِ وَلِلرَّسُولِ وَلِذِى ٱلْقُرْبَىٰ وَٱلْيَتَـٰمَىٰ وَٱلْمَسَـٰكِينِ وَٱبْنِ ٱلسَّبِيلِ كَىْ لَا يَكُونَ دُولَةًۢ بَيْنَ ٱلْأَغْنِيَآءِ مِنكُمْ ۚ وَمَآ ءَاتَىٰكُمُ ٱلرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَىٰكُمْ عَنْهُ فَٱنتَهُوا۟ ۚ وَٱتَّقُوا۟ ٱللَّهَ ۖ إِنَّ ٱللَّهَ شَدِيدُ ٱلْعِقَابِ

దైవప్రవక్త మీకు ఇచ్చిన దాన్ని మీరు పుచ్చుకోండి.  ఆయన మిమ్మల్ని వారించిన దాన్ని వదిలివేయండి.  అల్లాహ్ కు భయపడుతూ ఉండండి.  నిశ్చయంగా అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడు.  [అల్ హష్ర్ :7]

అల్లాహ్ సెలవిచ్చాడు:

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓا۟ أَطِيعُوا۟ ٱللَّهَ وَأَطِيعُوا۟ ٱلرَّسُولَ وَأُو۟لِى ٱلْأَمْرِ مِنكُمْ ۖ فَإِن تَنَـٰزَعْتُمْ فِى شَىْءٍ فَرُدُّوهُ إِلَى ٱللَّهِ وَٱلرَّسُولِ إِن كُنتُمْ تُؤْمِنُونَ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ ۚ ذَٰلِكَ خَيْرٌ وَأَحْسَنُ تَأْوِيلًا

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు విధేయులై ఉండండి మరియు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి మరియు మీలో అధికారం అప్పగించబడిన వారికి కూడా! మీ మధ్య ఏ విషయంలోనైనా అభిప్రాయ భేదం కలిగితే – మీరు అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించే వారే అయితే – ఆ విషయాన్ని అల్లాహ్ మరియు ప్రవక్త వైపుకు మరల్చండి.  ఇదే సరైన పద్ధతి మరియు ఫలితాన్ని బట్టి కూడా ఉత్తమమైనది.  [నిసా 4: 59]

మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ఇలా చెప్పాడు:

مَّن يُطِعِ ٱلرَّسُولَ فَقَدْ أَطَاعَ ٱللَّهَ

దైవప్రవక్తను అనుసరించినవాడు అల్లాహ్ ను అనుసరించాడు.  [నిసా 4 : 80]

అల్లాహ్ సెలవిచ్చాడు:

وَلَقَدْ بَعَثْنَا فِى كُلِّ أُمَّةٍ رَّسُولًا أَنِ ٱعْبُدُوا۟ ٱللَّهَ وَٱجْتَنِبُوا۟ ٱلطَّـٰغُوتَ

{నిశ్చయంగా మేము ప్రతీ సముదాయంలో ప్రవక్తను ప్రభవింపచేసాము, [ప్రజలారా ] కేవలం అల్లాహ్’ను ఆరాధించండి మరియు తాగూత్(మిథ్యాదైవాలు) కు దూరంగా ఉండండి}.  [అన్-నహల్ 16:36]

అల్లాహ్ సెలవిచ్చాడు:

وَمَآ أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رَّسُولٍ إِلَّا نُوحِىٓ إِلَيْهِ أَنَّهُۥ لَآ إِلَـٰهَ إِلَّآ أَنَا۠ فَٱعْبُدُونِ

మరియు మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా: “నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! కావున మీరు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించండి” అని దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చిపంపాము.  [అల్ అంబియా :25]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

الٓر ۚ كِتَـٰبٌ أُحْكِمَتْ ءَايَـٰتُهُۥ ثُمَّ فُصِّلَتْ مِن لَّدُنْ حَكِيمٍ خَبِيرٍ أَلَّا تَعْبُدُوٓا۟ إِلَّا ٱللَّهَ ۚ إِنَّنِى لَكُم مِّنْهُ نَذِيرٌ وَبَشِيرٌ

అలిఫ్ – లామ్ – రా.  (ఇది) ఒక దివ్యగ్రంధం.  దీని సూక్తులు (ఆయాత్) నిర్దుష్టమైనవి మరియు మహా వివేచనాపరుడు, సర్వం తెలిసినవాడు అయిన (అల్లాహ్) తరుపు నుండి వివరించబడ్డాయి; మీరు అల్లాహ్ ను తప్ప ఇతరులను ఆరాధించ కూడదని (ఓ ముహమ్మద్) ఇలా అను: “నిశ్చయంగా నేను, ఆయన (అల్లాహ్) తరుపు నుండి మీకు హెచ్చరిక చేసేవాడిని మరియు శుభవార్తలు ఇచ్చేవాడిని మాత్రమే! [హూద్ : 1-2]

ఈ ధీటైన ఆయతులు మరియు వాటి అర్ధంలో వచ్చిన అల్లాహ్ గ్రంధములోని ప్రతీది అల్లాహ్ ఒక్కడి కొరకే ఆరాధనను ప్రత్యేకించటం తప్పనిసరి అవటంపై మరియు అది ధర్మం యొక్క మూలం, మిల్లత్ యొక్క ఆధారం అవటం పై సూచిస్తున్నాయి.  అలాగే అవి జిన్నులను మరియు మానవులను సృష్టించడం, దైవప్రవక్తలను పంపడం మరియు గ్రంధములను అవతరింపజేయటంలో వివేకమని సూచిస్తున్నాయి.  ఈ విషయంలో జాగ్రత్తవహించటం మరియు దాన్ని అర్ధం చేసుకోవటం, ఇస్లాంతో అనుబంధం ఉన్నవారు దైవప్రవక్తల, పుణ్యాత్ముల విషయంలో అతిక్రమించటం మరియు వారి సమాధులపై నిర్మాణములు ఏర్పరచుకోవటం మరియు వాటిపై మస్జిదులను, గోపురములను నిర్మించటం, వారితో అర్ధించటం, వారి నుండి సహాయమును కోరడం, వారిని ఆశ్రయించడం, అవసరాలను తీర్చమని, ఆపదలను తొలగించమని, రోగులను నయం చేయమని, శతృవులకు వ్యతిరేకంగా సహాయం చేయమని వారిని అడగటం లాంటి తదితర పెద్ద షిర్కులలో పడిపోవటం లాంటి వాటి నుండి జాగ్రత్తపడటం బాధ్యత వహించే వారందరిపై తప్పనిసరి.  దైవ గ్రంధంలో సూచించబడిన వాటికి అనుగుణంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రామాణిక హదీసులు వచ్చినవి. సహీహైన్ లో మఆజ్ రధియల్లాహు అన్హు ఉల్లేఖనం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనతో ఇలా పలికారు :

దాసులపై అల్లాహ్ హక్కు ఏమి ఉన్నదో మరియు అల్లాహ్ పై దాసుల హక్కు ఏమి ఉన్నదో మీకు తెలుసా ?.  అప్పుడు మఆజ్ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు బాగా తెలుసు అని సమాధానమిచ్చారుఅప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధానమిస్తూ అల్లాహ్ హక్కు దాసులపై వారు ఆయనను ఆరాధించాలి మరియు ఆయనతో పాటు దేనినీ సాటి కల్పించకూడదు మరియు అల్లాహ్ పై దాసుల హక్కు ఆయనతో పాటు దేనినీ సాటి కల్పించని వారిని శిక్షించకుండా ఉండటం అని తెలిపారు.  [7]హదీసు.

సహీహ్ బుఖారీలో అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రరధియల్లాహు అన్హు ఉల్లేఖనం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు

అల్లాహ్ కొరకు సాటి ఉన్నారని పిలిచే స్థితిలో మరణించినవాడు నరకంలో ప్రవేశిస్తాడు[8]

సహీహ్ ముస్లింలో జాబిర్ రధియల్లాహు అన్హుఉల్లేఖనం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు :

{షిర్క్ చేయకుండా}ఇతరులను అల్లాహ్ కు సరిసమానంగా సాటి కల్పించకుండా ఆయనను కలిసే వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు, అల్లాహ్ కు ఇతరులను సాటి కల్పించి మరెవరైతే ఆయన్ను కలుస్తాడో నరకం లో ప్రవేశిస్తాడు.  [9]

మరియు ఈ అర్ధంలో చాలా హదీసులు ఉన్నవి.

మరియు ఈ విషయం అత్యంత ముఖ్యమైన, గొప్ప విషయం.  మరియు అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తౌహీద్ వైపు పిలుపుతో మరియు షిర్క్ నుండి వారింపుతో పంపించాడు.  అప్పుడు ఆయన అల్లాహ్ తనకు ఇచ్చి పంపించిన ప్రచారమును పరిపూర్ణంగా నెలకొల్పారు.  మరియు ఆయన అల్లాహ్ మార్గంలో తీవ్రంగా బాధించబడ్డారు.  వాటన్నింటిపై ఆయన సహనం చూపారు.  మరియు ఆయనతో పాటు ఆయన సహచరులు రజియల్లాహు అన్హుమ్ కూడా సందేశ ప్రచారం విషయంలో సహనం చూపారు.  చివరికి అల్లాహ్ అరబ్ ద్వీపకల్పం నుండి విగ్రహాలన్నింటిని దూరం చేశాడు.  మరియు ప్రజలు అల్లాహ్ ధర్మంలో తండోపతండాలుగా ప్రవేశించారు.  మరియు కాబా చుట్టూ, దాని లోపల ఉన్న విగ్రహాలు విరగ్గొట్టబడ్డాయి.  మరియు లాత్, ఉజ్జా, మనాత్ విగ్రహాలు శిధిలం చేయబడ్డాయి.  అరబ్ ప్రాంతంలో ఉన్న తెగలలో ఉన్న విగ్రహాలన్ని విరగ్గొట్టబడ్డాయి మరియు వారి వద్ద ఉన్న విగ్రహాలన్ని నాశనం చేయబడ్డాయి.  మరియు అల్లాహ్ వాక్కు ఉన్నత శిఖరాలకు చేరుకుంది.  అరబ్ ప్రాంతంలో ఇస్లాం ఆధిక్యతను చూపింది.  ఆ పిదప ముస్లిములు అరబ్ ప్రాంతమునకు వెలుపల సందేశప్రచారము మరియు ధర్మయుద్ధం ద్వారా శ్రద్ధ చూపారు.  అల్లాహ్ వారి ద్వారా దాసులలో నుంచి ఎవరికైతే సౌజన్యము ముందడుగు వేసిందో వారికి సన్మార్గం చూపాడు.  మరియు అల్లాహ్ వారి ద్వారా ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో సత్యాన్ని మరియు న్యాయమును వ్యాపింపచేశాడు.  మరియు దానితో వారు సన్మార్గమునకు ఇమాములుగా, సత్యానికి నాయకులుగా మరియు న్యాయ, సంస్కరణ ప్రచారకులుగా అయిపోయారు.  మరియు తాబియీన్ లు, తబే తాబియీన్ లు వారి మార్గంలో నడిచారు.  సన్మార్గము యొక్క ఇమాములు, సత్య ప్రచారకులు అల్లాహ్ ధర్మమును వ్యాపింపజేసేవారు.  మరియు వారు ప్రజలను అల్లాహ్ తౌహీద్ వైపు పిలిచేవారు.  మరియు అల్లాహ్ మార్గములో తమ ప్రాణముల ద్వారా తమ సంపదల ద్వారా జిహాద్ చేసేవారు.  వారు అల్లాహ్ మార్గంలో నిందించేవారి నిందలతో భయపడేవారు కాదు.  కాబట్టి అల్లాహ్ వారికి మద్దతు ఇచ్చాడు మరియు వారికి సహాయం చేశాడు.  మరియు వారికి వారి శతృవులపై ఆధిక్యతను ప్రసాదించాడు.  మరియు ఆయన వారికి చేసిన వాగ్దానమును పూర్తి చేశాడు ఆయన యొక్క ఈ మాటలో :

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓا۟ إِن تَنصُرُوا۟ ٱللَّهَ يَنصُرْكُمْ وَيُثَبِّتْ أَقْدَامَكُمْ

ఓ విశ్వాసులారా! ఒకవేళ మీరు అల్లాహ్ కు (ఆయన మార్గంలో) సహాయపడితే, ఆయన మీకు సహాయం చేస్తాడు మరియు మీ పాదాలను స్థిరపరుస్తాడు.  [ముహమ్మద్ 47 : 7]

మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ఇలా చెప్పాడు:

وَلَيَنصُرَنَّ ٱللَّهُ مَن يَنصُرُهُۥٓ ۗ إِنَّ ٱللَّهَ لَقَوِىٌّ عَزِيزٌ ٱلَّذِينَ إِن مَّكَّنَّـٰهُمْ فِى ٱلْأَرْضِ أَقَامُوا۟ ٱلصَّلَوٰةَ وَءَاتَوُا۟ ٱلزَّكَوٰةَ وَأَمَرُوا۟ بِٱلْمَعْرُوفِ وَنَهَوْا۟ عَنِ ٱلْمُنكَرِ ۗ وَلِلَّهِ عَـٰقِبَةُ ٱلْأُمُورِ

మరియు అల్లాహ్ కు సహాయపడేందుకు సమాయత్తం అయిన వారికి అల్లాహ్ తప్పకుండా సహాయపడతాడు.  నిశ్చయంగా అల్లాహ్ మహాబలుడు మరియు సర్వాధిక్యుడు.  వారే! ఒకవేళ మేము వారికి భూమిపై అధికారాన్ని ప్రసాదిస్తే, వారు నమాజ్ స్థాపిస్తారు, విధిదానం (జకాత్) ఇస్తారు మరియు ధర్మమును (మంచిని) ఆదేశిస్తారు మరియు అధర్మము (చెడు) నుండి నిషేధిస్తారు.  సకల వ్యవహారాల అంతిమ నిర్ణయం అల్లాహ్ చేతిలోనే ఉంది.  [హజ్ 22 : 40-41]

ఆ తరువాత ప్రజలు మారిపోయారు.  వారు విభేదించుకుని విడిపోయారు.  జిహాద్ విషయంలో అశ్రద్ధ చూపారు మరియు సుఖముకు, మనోవాంఛల అనుసరణకు ప్రాధాన్యతను ఇచ్చారు మరియు వారిలో చెడు ప్రభలినది.  కాని అల్లాహ్ ఎవరినైతే రక్షించాడో వారు తప్ప.  అప్పుడు అల్లాహ్ వారి పరిస్థితిని మార్చివేశాడు.  వారిపై వారి కర్మలకు ప్రతిఫలంగా వారి శతృవులకు ఆధిక్యతను కలిగించాడు.  మరియు అల్లాహ్ దాసులను హింసించేవాడు కాడు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

ذَٰلِكَ بِأَنَّ ٱللَّهَ لَمْ يَكُ مُغَيِّرًا نِّعْمَةً أَنْعَمَهَا عَلَىٰ قَوْمٍ حَتَّىٰ يُغَيِّرُوا۟ مَا بِأَنفُسِهِمْ

ఇది ఎందుకంటే! వాస్తవానికి, ఒక జాతి వారు, తమ నడవడికను తాము మార్చుకోనంత వరకు, అల్లాహ్ వారికి ప్రసాదించిన తన అనుగ్రహాన్ని మార్చడు.  [అన్ఫాల్ 8: 53]

ముస్లిములందరిపై ప్రభుత్వ, ప్రజా స్థాయిలో కర్తవ్యం ఉన్నది అదేమిటంటే అల్లాహ్ సుబహానహు వతఆలా వైపు మరలటం మరియు ఆరాధనను ఆయన ఒక్కరి కొరకు ప్రత్యేకించటం మరియు తమ ద్వారా జరిగిన నిర్లక్ష్యం మరియు తమ పాపముల నుండి పశ్చాత్తాపముతో ఆయన వైపు మరలటం.  మరియు అల్లాహ్ విధి గావించినవాటిని నిర్వర్తించటంలో త్వరపడటం మరియు ఆయన వారిపై నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండటం మరియు దాని గురించి పరస్పరం తాకీదు చేసుకుని దాని గురించి సహకరించుకోవటం. 

వీటిలో ముఖ్యమైనది ధర్మబద్ధమైన హద్దులను ఏర్పాటు చేయడం మరియు ప్రతీ విషయంలో ప్రజల మధ్య ధర్మబద్ధంగా తీర్పులివ్వడం మరియు దాని వైపు ప్రయత్నించడం మరియు అల్లాహ్ ధర్మశాస్త్రానికి విరుద్ధమైన కల్పించుకున్న నియమాలను విడనాడటం, తీర్పు కోసం వాటి వైపు ప్రయత్నించకుండా ఉండటం మరియు ముస్లిములందరిపై ధర్మ తీర్పును తప్పనిసరి చేయటం మరియు ధర్మం యొక్క సరైన భోదనలతో ప్రజలకు పరిచయం చేయడం మరియు వారిలో ఇస్లామీయ చైతన్యాన్ని సృష్టించడం మరియు సత్యం ప్రకారం ఉండటం, దానిపై సహనం చూపమని మరియు మంచి గురించి ఆదేశించమని చెడు నుండి వారించమని ఒకరినొకరు కోరటం మరియు పాలకులను దానిపై ప్రోత్సహించటం పండితులపై తప్పనిసరి.  అలాగే సోషలిజం, బఅసిజమ్, జాతిపక్షపాతం మరియు ఇతర ధర్మానికి విరుద్ధమైన వినాశనకరమైన అలోచనలను నిర్మూలించటానికి ప్రయత్నాలు చేయడం చాలా ముఖ్యం.  మరియు దీని ద్వారా అల్లాహ్ ముస్లిముల దుస్థితిని సంస్కరిస్తాడు మరియు వారు కోల్పోయిన సామగ్రిని వాపసు చేస్తాడు మరియు వారి గత వైభవాన్ని తిరిగి తీసుకునివస్తాడు మరియు వారి శతృవులకు విరుద్ధంగా వారికి సహాయం చేస్తాడు మరియు భూమిలో వారికి నివాసమును కల్పిస్తాడు.  అల్లాహ్ చెప్పినట్లుగా ఈ విధంగా చెప్పేవారిలో ఆయన అత్యంత నిజమైనవాడు :

وَكَانَ حَقًّا عَلَيْنَا نَصْرُ ٱلْمُؤْمِنِينَ

మరియు విశ్వాసపరులకు సహాయం చేయటం మా బాధ్యత.  [రూమ్ 30: 47]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَعَدَ ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُوا۟ مِنكُمْ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ لَيَسْتَخْلِفَنَّهُمْ فِى ٱلْأَرْضِ كَمَا ٱسْتَخْلَفَ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ وَلَيُمَكِّنَنَّ لَهُمْ دِينَهُمُ ٱلَّذِى ٱرْتَضَىٰ لَهُمْ وَلَيُبَدِّلَنَّهُم مِّنۢ بَعْدِ خَوْفِهِمْ أَمْنًا ۚ يَعْبُدُونَنِى لَا يُشْرِكُونَ بِى شَيْـًٔا ۚ وَمَن كَفَرَ بَعْدَ ذَٰلِكَ فَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْفَـٰسِقُونَ

మరియు మీలో విశ్వసించి సత్కార్యాలు చేసేవారితో: వారికి పూర్వం వారిని భూమికి ఉత్తరాధికారులుగా చేసినట్లు, వారిని కూడా ఉత్తరాధికారులుగా చేస్తానని; మరియు వారి కొరకు తాను సమ్మతించిన ధర్మాన్ని (ఇస్లాంను) స్థిరపరుస్తానని; మరియు వారి పూర్వపు భయస్థితిని వారి కొరకు శాంతిస్థితిగా మార్చుతానని, అల్లాహ్ వాగ్దానం చేశాడు.  వారు నన్నే (అల్లాహ్ నే) ఆరాధిస్తారు మరియు నాకు ఎవరినీ సాటిగా (భాగస్వాములుగా) కల్పించరు మరియు దీని తరువాత కూడా ఎవరైనా సత్యతిరస్కారానికి పాల్పడితే అలాంటి వారు, వారే అవిధేయులు.  [నూర్ 24 : 55]

అల్లాహ్ సెలవిచ్చాడు:

إِنَّا لَنَنصُرُ رُسُلَنَا وَٱلَّذِينَ ءَامَنُوا۟ فِى ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا وَيَوْمَ يَقُومُ ٱلْأَشْهَـٰدُ

నిశ్చయంగా, మేము మా ప్రవక్తలకు మరియు విశ్వసించిన వారికి ఇహలోక జీవితంలో మరియు సాక్షులు నిలబడే రోజున కూడా సహాయము నొసంగుతాము.  [గాఫిర్ 40 : 51]

يَوْمَ لَا يَنفَعُ ٱلظَّـٰلِمِينَ مَعْذِرَتُهُمْ ۖ وَلَهُمُ ٱللَّعْنَةُ وَلَهُمْ سُوٓءُ ٱلدَّارِ

ఆ రోజు దుర్మార్గులకు వారి సాకులు ఏ మాత్రం ఉపయోగకరం కావు.  వారికి (అల్లాహ్) శాపం (బహిష్కారం) ఉంటుంది మరియు వారికి అతి దుర్భరమైన నిలయం ఉంటుంది.  [గాఫిర్ 40: 52]

మరియు అల్లాహ్ తో ప్రార్ధన ఏమనగా ఆయన ముస్లిముల పాలకులను, సాధారణ ప్రజలను సంస్కరించుగాక మరియు వారికి ధర్మ అవగాహన కల్పించుగాక మరియు వారి కలిమాను తఖ్వా పై సమీకరించుగాక మరియు వారందరిని తన ఋజుమార్గం వైపు మార్గదర్శకం చేయుగాక మరియు వారి ద్వారా సత్యమునకు విజయమును కలిగించుగాక, అసత్యమునకు వారి ద్వారా పరాభవం కలిగించుగాక మరియు వారందరికి పుణ్యకార్యముల్లో, దైవభీతి కార్యముల్లో పరస్పర సహాయము చేసుకునే, సత్యము గురించి పరస్పరం బోధించుకుని దానిపై సహనం చూపే భాగ్యమును కలిగించుగాక.  దీనిని ఆయన నెరవేర్చేవాడును మరియు దాని సామర్ధ్యం ఆయనకు కలదు. 

మరియు అల్లాహ్ తన దాసుడు, తన ప్రవక్త, ప్రజలలో ఉత్తముడు మన ప్రవక్త, మన ఇమామ్, మన నాయకుడు అబ్దుల్లాహ్ కుమారుడు ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై, ఆయన మార్గమును అనుసరించినవారి పై శుభాలను శాంతిని కురిపించుగాక (ఆమీన్).

 అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వబరకాతుహ్.


[1] ముస్లిం అల్ ఈమాన్ (8), తిర్మిజీ అల్ ఈమాన్ (2610), నసాయీ అల్ ఈమాను వ షరాయిహీ (4990), అబూదావుద్ అస్సున్న (4695), ఇబ్నె మాజ అల్ ముఖద్దిమ (63), అహ్మద్ (1/27). 

[2] బుఖారీ అల్ జిహాద్ వస్సైర్ (2701), ముస్లిం అల్ ఈమాన్ (30), తిర్మిజీ అల్ ఈమాన్ (2643), ఇబ్నె మాజ అజ్జుహద్ (4296), అహ్మద్ (5/238). 

[3] ముస్లిం అజ్జుహదు వర్రఖాయిఖు (2996), అహ్మద్ (6/153). 

[4] బుఖారీ అష్షహాదాత్ (2509), ముస్లిం ఫజాయిలుస్సహాబ (2533), తిర్మిజీ అల్ మనాఖిబ్ (3859), ఇబ్నె మాజ అల్ అహ్కామ్ (2362), అహ్మద్ (1/434). 

[5] ముస్లిమ్ అల్ ఇమారతు (1920), తిర్మిజీ అల్ ఫితన్ (2229), అబూదావుద్ అల్ ఫితన్ వల్ మలాహిమ్ (4252), ఇబ్నె మాజ అల్ ఫితన్ (3952), అహ్మద్ (5/279). 

[6] ఇబ్నె మాజ అల్ ఫితన్ (3992). 

[7] బుఖారీ అల్ ఇస్తీజాన్ (5912), ముస్లిం అల్ ఈమాన్ (30), తిర్మిజీ అల్ ఈమాన్ (2643), ఇబ్నె మాజ అజ్జుహద్ (4296), అహ్మద్ (5/238). 

[8] బుఖారీ తఫ్సీరుల్ ఖుర్ఆన్ (4227), ముస్లిం అల్ ఈమాన్ (92), అహ్మద్ (1/374). 

[9] బుఖారీ అల్ ఇల్మ్ (129), ముస్లిం అల్ ఈమాన్ (32), అహ్మద్ (3/157). 

%d bloggers like this: