
[8:15 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ధర్మపరమైన నిషేధాలు – 39
39- అల్లాహ్ ఆయతులతో వేళాకోళం చేస్తున్నవారితో నీవు కూర్చోకు. వారిని ఆ పని నుండి నివారించే ఉద్దేశ్యం ఉంటే కూర్చోవచ్చు.
అల్లాహ్ ఆదేశం ఇలా ఉంది:
[وَقَدْ نَزَّلَ عَلَيْكُمْ فِي الكِتَابِ أَنْ إِذَا سَمِعْتُمْ آَيَاتِ اللهِ يُكْفَرُ بِهَا وَيُسْتَهْزَأُ بِهَا فَلَا تَقْعُدُوا مَعَهُمْ حَتَّى يَخُوضُوا فِي حَدِيثٍ غَيْرِهِ إِنَّكُمْ إِذًا مِثْلُهُمْ إِنَّ اللهَ جَامِعُ المُنَافِقِينَ وَالكَافِرِينَ فِي جَهَنَّمَ جَمِيعًا] {النساء:140}
అల్లాహ్ ఈ గ్రంథంలో మీకు ఇదివరకే ఈ ఉత్తరువు ఇచ్చి ఉన్నాడు: అల్లాహ్ ఆయతులకు వ్యతిరేకంగా తిరస్కారవచనాలు వాగటాన్ని, వాటిని పరిహసించటాన్ని మీరు విన్నట్లైయితే, అలా చేసేవారు (ఆ సంభాషణ వదలి) వేరే మాట ప్రారంభించనంత వరకు మీరు వారితో కలసి కూర్చోకండి. ఇప్పుడు మీరు గనక అలా చేస్తే మీరూ వారి లాంటి వారే. అల్లాహ్ కపటులనూ, అవిశ్వాసులనూ నరకంలో ఒకచోట పోగుచెయ్యబోతున్నాడనే విషయం నిశ్చయమని తెలుసుకోండి[. (నిసా 4: 140).
పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు క్రింద వినవచ్చు:
ధర్మపరమైన నిషేధాలు
https://teluguislam.net/?p=1705