
[5:38 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ధర్మపరమైన నిషేధాలు – 38
38- పరిహాసమాడకు. ఖుర్ఆన్, ప్రవక్త, ధర్మం మరియు ధర్మ-విషయాలతో పరిహాసమాడకు, ఎగతాళి చేయకు, హీనపరచకు [1]. అది (వేరే దురుద్దేశం లేకుండా) కేవలం నవ్వు పుట్టించుటకైనా సరే. ధర్మవిద్యతో లేదా ధార్మిక విద్యార్థులతో పరిహాసమాడుట [2]. మంచిని ఆదేశించి, చెడును నివారించే వారితో పరిహాసమాడుట. గడ్డం, మిస్వాక్ మరియు తదితర ధర్మవిషయాలతో పరిహాసమాడుట అల్లాహ్ తో కుఫ్ర్ చేసినట్లగును.
అల్లాహ్ ఆదేశం:
[وَلَئِنْ سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ قُلْ أَبِاللهِ وَآَيَاتِهِ وَرَسُولِهِ كُنْتُمْ تَسْتَهْزِئُونَ ، لَا تَعْتَذِرُوا قَدْ كَفَرْتُمْ بَعْدَ إِيمَانِكُمْ]. {التوبة 65، 66}.
మీరు చెప్పుకుంటూ ఉన్న విషయం ఏమిటి? అని ఒకవేళ వారిని అడిగితే, మేము సరదాగా వేళాకోళంగా మాట్లాడుకుంటున్నాము అని తక్షణం బదులు చెబుతారు. వారితో ఇలా అనుః మీ వేళాకోళం, అల్లాహ్ తోనా ఆయన ఆయతులతోనా, ఆయన ప్రవక్తతోనా? ఇక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వా-సానికి పాల్పడ్డారు[. (తౌబా 9: 65,66).
[1] పరిహాసమాడుతూ తిరస్కరించుట, విడనాడి తిరస్కరించుటకంటే మరీ చెడ్డది. ఉదాః నమాజు వదిలే వ్యక్తి, లేదా విగ్రహానికి సాష్టాంగ- పడే వ్యక్తి కేవలం తిరస్కారానికి గురవుతాడు. కాని పరిహసించే వ్యక్తి తిరస్కారంతో పాటు పరిహాసానికి గురవుతాడు.
[2] ధర్మవేత్తలతో, ధర్మంపై నడిచేవారితో మరియు ధర్మం వైపునకు పిలిచేవారితో పరిహాసమాడేవారు రెండు రకాల భ్రష్టత్వానికి గురి అవుతారు.
1- అతని ఉద్దేశ్యంలో నేరుగా ధర్మాన్ని, రుజువైన ప్రవక్త సంప్రదాయాల్ని; ఉదాః గడ్డం ఉంచడం, లుంగీ, లాగు చీలమండలానికి పైకి ధరించడం లాంటివి ఉంటే ఇది కుఫ్ర్ (సత్యతిరస్కారం) అవుతుంది. అంతే గాకుండా ఒక ముస్లిం సోదరుడ్ని హీనపరచడం అన్నది అతను (హీనపరిచేవాడు) చెడు అన్నదానికి నిదర్శనం.
2- అతడు వారి ధార్మిక జీవన శైలిని గాకుండా వారిని, వారి కొన్ని చేష్టల్ని ఉద్దేశించి పరిహసిస్తే పాపాత్ముడవుతాడు కాని కాఫిర్ కాడు.
పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు క్రింద వినవచ్చు:
ధర్మపరమైన నిషేధాలు
https://teluguislam.net/?p=1705
You must be logged in to post a comment.