
[7:36 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
రెండవ ప్రశ్న సిలబస్ : సమాధుల పూజ
ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు (Muharramat) పుస్తకం నుండి:
సమాధులను పూజించడం, మరణించి సమాధుల్లో ఉన్న వలీలు (పుణ్యపురుషులు) అవసరాలను తీరుస్తారని, కష్టాలను తొలిగిస్తారని నమ్మడం మరియు అల్లాహ్ ఆధీనంలోనే ఉన్నదాని సహాయం వారితో కోరడం, వారితో మొరపెట్టుకోవడం లాంటివి పెద్ద షిర్క్ లో లెక్కించ బడతాయి.
అల్లాహ్ ఆదేశం చదవండి:
وَقَضَى رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ
మీ ప్రభువు తనను తప్ప ఇతరులను మీరు ఆరాధింపకూడదని ఆదేశించాడు [. (బనీఇస్రాఈల్ 17: 23).
అదే విధంగా చనిపోయిన ప్రవక్తలతో, పుణ్యాత్ములతో ఇంకెవరితోనైనా వారి సిఫారసు పొందుటకు, తమ కష్టాలు దూరమగుటకు వారితో దుఆ చేయడం కూడా షిర్క్. చదవండి అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:
أَمَّنْ يُجِيبُ المُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ وَيَجْعَلُكُمْ خُلَفَاءَ الأَرْضِ أَإلَهٌ مَعَ اللهِ
బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు అతని మొరలను ఆలకించి అతని బాధను తొలగించేవాడు ఎవడు? భూమిపై మిమ్మల్ని ప్రతినిధులుగా చేసినవాడు ఎవడు? అల్లాహ్ తో పాటు (ఈ పనులు చేసే) మరొక దేవుడు కూడ ఎవడైనా ఉన్నాడా? (నమ్ల్ 27: 62).
కొందరు కూర్చున్నా, నిలబడినా, జారిపడినా తమ పీర్, ముర్షిదుల నామములను స్మరించుటయే తమ అలవాటుగా చేసుకుంటారు. ఎప్పుడు ఏదైనా క్లిష్టస్థితిలో, కష్టంలో, ఆపదలో చిక్కుకున్నప్పుడు ఒకడు యా ముహమ్మద్ అని, మరొకడు యా అలీ అని, ఇంకొకడు యా హుసైన్ అని, మరి కొందరు యా బదవీ, యా జీలానీ, యా షాజులీ, యా రిఫాఈ, యా ఈద్ రూస్, యా సయ్యద జైనబ్, యా ఇబ్ను ఉల్వాన్ అని, యా గౌస్ అల్ మదద్ అని, యా ముఈనుద్దీన్ చిష్తీ అని, యా గరీబ్ నవాజ్ అని, నానా రకాలుగా పలుకుతారు. కాని అల్లాహ్ ఆదేశం ఏమిటని గమనించరు:
إِنَّ الَّذِينَ تَدْعُونَ مِنْ دُونِ اللهِ عِبَادٌ أَمْثَالُكُمْ فَادْعُوهُمْ فَلْيَسْتَجِيبُوا لَكُمْ إِنْ كُنْتُمْ صَادِقِينَ
అల్లాహ్ ను వదలి మీరు వేడుకుంటున్న వారు మీ మాదిరిగానే కేవలం దాసులు. మీరు వారిని ప్రార్థించి చూడండి. మీకు వారి పట్ల ఉన్న భావాలు నిజమే అయితే మీ ప్రార్థనలకు వారు సమాధానం ఇవ్వాలి (అఅ’రాఫ్ 7: 194).
కొందరు సమాధి పూజారులు సమాధుల ప్రదక్షిణం చేస్తారు. వాటి మూలమూలలను చుంబిస్తారు. చేతులు వాటికి తాకించి తమ శరీరంపై పూసుకుంటారు. వాటి గడపను చుంబిస్తారు. దాని మట్టిని తీసుకొని తమ ముఖాలకు రుద్దుకుంటారు. వాటిని చూసినప్పుడు సాష్టాంగ పడతారు (సజ్దా చేస్తారు). తమ అవసరాలను కోరతూ రోగాల నుండి స్వస్థత పొందుటకు, సంతానం కావాలని, అవసరం తీరాలని వాటి ఎదుట భయభీతితో, వినయవినమ్రతలతో నిలబడతారు. ఒక్కోసారి సమాధిలో ఉన్నవారిని ఉద్దేశించి ఇలా పిలుస్తారు కూడా: యా సయ్యిదీ! ఓ మేరే బాబా! నేను చాలా దూరం నుండి మీ సమక్షంలో హాజరయ్యాను, నాకు ఏమీ ప్రసాదించక వెనక్కు త్రిప్పి పంపుతూ అవమాన పరచకు.
కాని అల్లాహ్ ఆదేశం ఏముందో గమనించారా?
وَمَنْ أَضَلُّ مِمَّنْ يَدْعُو مِنْ دُونِ اللهِ مَنْ لَا يَسْتَجِيبُ لَهُ إِلَى يَوْمِ القِيَامَةِ وَهُمْ عَنْ دُعَائِهِمْ غَافِلُونَ
అల్లాహ్ ను వదలి ప్రళయం వరకు తమ ప్రార్థనలను విని సమాధాన మివ్వలేనటువంటి వారిని ప్రార్థించే వారికంటే, ఎక్కువ మార్గభ్రష్టులెవరు? మరియు వారు వీరి (ప్రార్థించేవారి) ప్రార్థనలను ఎరుగకుండా ఉన్నారు (అహ్ఖాఫ్ 46: 5).
ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు:
مَنْ مَاتَ وَهْوَ يَدْعُو مِنْ دُونِ الله نِدًّا دَخَلَ النَّارَ
“ఎవరు అల్లాహ్ ను కాదని ఇతరులను ప్రార్థిస్తూ/దుఆ చేస్తూ చనిపోతాడో అతను నరకంలో ప్రవేశిస్తాడు”. (బుఖారి 4497).
కొందరు సమాధుల వద్ద తమ తల గొరిగించుకుంటారు. ‘సమాధుల హజ్ చేసే విధానం’ అన్న పేరుగల పుస్తకాలు కొందరి వద్ద లభిస్తాయి. విశ్వవ్యవస్థ నిర్వహణ శక్తి మరియు లాభనష్టాలు చేకూర్చే శక్తి వలీలకు ఉన్నదని కొందరు నమ్ముతారు. కాని అల్లాహ్ యొక్క ఈ ఆదేశం పట్ల వారు ఎలా అంధులైపోయారో గమనించండి:
وَإِنْ يَمْسَسْكَ اللهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ وَإِنْ يُرِدْكَ بِخَيْرٍ فَلَا رَادَّ لِفَضْلِهِ
ఒకవేళ అల్లాహ్ నిన్ను ఏదైనా ఆపదకు గురి చేస్తే స్వయంగా ఆయన తప్ప ఆ ఆపదను తొలగించేవారు ఎవరూ లేరు. ఇంకా ఆయన గనక నీ విషయంలో మేలు చేయాలని సంకల్పిస్తే ఆయన అనుగ్రాహన్ని మల్లించే వాడు కూడా ఎవడూ లేడు (యూనుస్ 10: 107).
ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (7:33 నిముషాలు)
(2) సమాధుల చుట్టూ ప్రదక్షిణలు చెయ్యడం , అక్కడ బలి ఇవ్వడం ఎలాంటి కార్యం?
A) ధర్మ సమ్మతం
B) చిన్న పాపం
C) ఘోర పాపం (షిర్క్)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz
ఇంకా క్రింది పోస్టులు చదవండి:
- ఉరుసులు, దర్గాల వాస్తవికత
- సమాధుల, దర్గాల వద్ద జంతుబలి ఇవ్వటం, కానుకలు సమర్పించుకోవటం, శ్రద్ధాంజలి ఘటించటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్
- షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరియు గ్యారవీ గురించిన వాస్తవాలు [వీడియో]
- అల్లాహ్ యేతరుల కొరకు జిబహ్ (జంతు బలిదానం) చేయుట షిర్క్ అక్బర్ – ఇమామ్ అస్-సాదీ
- షిర్క్ (బహుదైవారాధన) దేనినంటారు? దాని నష్టాలు ఎలా ఉంటాయి? [వీడియో]
- ప్రవక్త వారి సంఘంలో కొందరు “ఔసాన్” (విగ్రహాలను) పూజిస్తారు – ఇమామ్ అస్-సాదీ
- కొన్నిస్థలాల, చిహ్నాల, మృతుల నుండి శుభం (బరకత్) పొందటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్
- చెట్లు, రాళ్ళతో శుభం (తబర్రుక్ ) కోరుట ముష్రిక్కుల పని – ఇమాం అస్-సాదీ
- అల్లాహ్ యేతరులతో “దుఆ” చేయుట, లేక సహాయం కొరకు “మొర” పెట్టుకొనుట షిర్క్ – ఇమామ్ అస్-సాదీ
- ప్రవక్త సమాధికి సంభందించిన దురాచారాలు [వీడియో]
- మృతులు (చనిపోయిన వారు) వింటారా? [ఆడియో]
- నెల్లూరు రొట్టెల పండగ
You must be logged in to post a comment.