చెడు కలలు వస్తే ఏమి చెయ్యాలి? [ఆడియో]

బిస్మిల్లాహ్

[6:08 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.


చెడు కల వచ్చినప్పుడు ఏం చెయ్యాలి?

  • అప్పడి దాక పడుకున్న దానికి భిన్నంగా అంటే కుడి వైపు ఉంటే ఎడమ వైపు, ఎడమ వైపు ఉంటే కుడి వైపుకు మరలి నిద్రపోవాలి.
  • ఎడమవైపు మూడు సార్లు ఉమ్మాలి.
  • షైతాన్ మరియు చెడు కలల నుండి అల్లాహ్ శరణు కోరుకోవాలి.
  • ఈ చెడు కల గురుంచి ఇతరులకు చెప్పకూడదు.

దుఆలు 

bad-dreams-1 చెడు కలలు

[హిస్నుల్ ముస్లిం, సంకలనం: షేఖ్‌ సయీద్‌  అల్‌ ఖహ్తాని , అనువాదం: జఫరుల్లాహ్‌ ఖాన్‌ నద్వీ]


bad-dreams-2 చెడు కలలు

ఖుర్’ఆన్ ఘనత – Greatness of Al-Qur’an [ఆడియో]

Greatness of Al-Qur’an (ఖురాన్  ఘనత) – వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

Greatness of Al-Qur’an (ఖురాన్  ఘనత)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఖుర్ఆన్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1MMOwL9fds2bCGoEbYxk1J

శ్రమకోర్చి ఖుర్ఆన్ పఠించే వ్యక్తి ఘనత

461. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:-

“ఖుర్ఆన్ కంఠపాఠి గౌరవనీయులైన దైవదూత లాంటివాడు. అతను (ప్రళయదినాన) వారితోనే ఉంటాడు. ఖుర్ఆన్ పఠించడం తనకు ఎంతో ప్రయాసతో కూడిన పని అయినప్పటికీ, దాన్ని పఠించి కంఠస్తం చేసే వ్యక్తి రెట్టింపు పుణ్యఫలానికి అర్హుడవుతాడు.”

[సహీహ్ బుఖారీ : 65 వ ప్రకరణం – అత్తఫ్సీర్ ఖుర్ఆన్, 80 వ అధ్యాయం – ‘అబస’ సూరా]

మధురమైన, సువాసన కలిగిన నారింజపండులా ఉండండి

460. హజ్రత్ అబూ మూసా అష్ అరీ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:-

ఖుర్ఆన్ పఠించే వ్యక్తి (విశ్వాసి) రుచిలోనూ, సువాసనలోనూ మేలు జాతికి చెందిన నారింజపండు లాంటివాడు. ఖుర్ఆన్ పఠించని విశ్వాసి (మోమిన్) రుచి ఉన్నా సువాసన లేని ఖర్జూర పండు లాంటివాడు. ఖుర్ఆన్ పఠించే కపట విశ్వాసి పరిమళం ఉన్న చేదుఫలం లాంటివాడు. ఖుర్ఆన్ పఠించని కపట విశ్వాసి సువాసన లేని చేదుగా ఉండే అడవి దోసకాయ లాంటివాడు.

[సహీహ్ బుఖారీ : 70 వ ప్రకరణం – అల్ అత్ అము – 30 వ అధ్యాయం – జిక్రిత్తామ్]

ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం – 37 వ అధ్యాయం – ఖుర్ఆన్ క్రమం తప్పకుండా పఠించే వ్యక్తి ఘనత. 
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1

ఇతరములు:

తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యాలు [ఆడియో సిరీస్]

[27 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ

చిన్న ఆడియో క్లిప్పులు:

యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0-RlVWf-h75RCvE0mqveai

ఆడియో mp3:

  1. తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యాలు 【1 వ భాగం】[3 నిముషాలు]
  2. తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యాలు 【2 వ భాగం】 [3 నిముషాలు]
  3. తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యాలు 【3 వ భాగం】 [2 నిముషాలు]
  4. తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యాలు 【4 వ భాగం】 [3 నిముషాలు]
  5. తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యాలు 【5 వ భాగం】[8 నిముషాలు]

ఇతరములు :

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్]

ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ఆధారంగా ఈ ఆడియో సిరీస్  లో మరణానంతర జీవితం గురించి చక్కగా వివరించబడింది.

మరణం నుండి మొదలుకొని సమాధి, దాని వరాలు, శిక్షలు, దాని నుండి లేపబడటం, అల్లాహ్ ముందు మహ్-షర్ మైదానం లో హాజరవడం, త్రాసులో తూకం చేయబడుట, కర్మపత్రాలు తీసుకోవడం, నరకంపై ఉన్న వంతెన దాటడం, ప్రవక్త సిఫారసు, స్వర్గం నరకం వివరాలు ఇంకా అనేక విషయాలు మొత్తం 91 భాగాల్లో తెలుపడ్డాయి. మీరు స్వయంగా వీటిని శ్రద్ధగా విని, తెలుసుకొని ఇతరులకు తెలియజేసి రెట్టింపు పుణ్యాలు పొందండి.

[91 భాగాలు] [దాదాపు 30+ గంటలు]

వక్త :- ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ 

యూట్యూబ్ – ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3hWrEGNnzcmMZV3PtDByJH

క్రింది పోస్టులు చదవండి. ప్రతి భాగానికి టెక్స్ట్ కూడా జత చేయబడింది:

ఆడియో 91 భాగాలు  ఈ క్రింద ఇవ్వబడిన లింకులు మీద క్లిక్ చేసి వినవచ్ఛు / డౌన్లోడ్ చేసుకోవచ్చు :

[01][02][03][04][05][06][07][08][09][10][11][12][13][14][15][16][17][18][19][20][21][22][23][24][25][26][27][28][29][30][31][32][33][34][35][36][37][38][39][40][41][42][43][44][45][46][47][48][49][50][51][52][53][54][55][56][57][58][59][60][61][62][63][64][65][66][67][68][69][70][71][72][73][74][75][76][77][78][79][80][81][82][83][84][85][86][87][87][89][90][91 చివరి భాగం ]

https://archive.org/details/life-after-death-teluguislam.net

మొత్తం భాగాలు ఒక్క సారిగా డౌన్లోడ్ చేసుకోవాలంటే క్రింద లింకు క్లిక్ చెయ్యండి:

ఇతరములు :

  1. మరణానంతర జీవితం [పుస్తకం]
  2. పరలోకం – Belief in the Hereafter – The Cooperative office for call and guidance, Riyadh, Saudi Arabia

ఉదయం, సాయంత్రం, పడుకొనే ముందు చదివే గొప్ప దుఆ (ఆడియో)

మూడు సమయాల్లో ఒక చిన్న దుఆ కానీ భావం గొప్పది

allaahumma fatir as-samaavati-2-telugu

ఆడియో వినండి :

వక్త :- ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ

హజ్ ప్రాముఖ్యత & దాని పుణ్యానికి సమానమైన సత్కార్యాలు [ఆడియో]

hajj-kabah telugu

ఆడియో వినండి : (1:10:29)

వక్త :- ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ

అరఫా రోజు ఘనత హజ్ చేసే వారికే పరిమితమా? [ఆడియో]

అరఫా రోజు ఘనత హజ్ చేసే వారికే పరిమితమా? – ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ

1251. హజ్రత్ అబూ ఖతాదా (రధి అల్లాహు అన్హు) కధనం :

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అరఫా నాటి ఉపవాసం గురించి విచారించటం జరిగింది. అందుకాయన సమాధానమిస్తూ,

“అది క్రితం యేడు మరియు వచ్చేయేటి పాపాలన్నిటినీ (minor sins – చిన్న పాపాలు) తుడిచి పెట్టేస్తుంది” అని వివరించారు.

[సహీహ్ ముస్లిం లోని ఉపవాసాల ప్రకరణం]

ముఖ్యాంశాలు:-

జుల్ హిజ్జా మాసపు తొమ్మిదో తేదీని ‘అరఫా రోజు’ అని పిలుస్తారు. ఆ రోజు హజ్ యాత్రికులందరూ అరఫాత్ మైదానంలో ఆగుతారు. కనుక ఆ రోజును ‘అరఫాత్ రోజు’ గా వ్యవహరిస్తారు. ఆ విధంగా అరఫాత్ మైదానంలో ఆగటమనేది హజ్ విధులన్నిటిలోనూ అత్యంత ప్రధానమైనది. దాన్ని నిర్వర్తించకపోతే హజ్జే నెరవేరదు. హజ్ యాత్రికులు ఆ రోజున ప్రార్ధనలు, సంకీర్తనల్లో నిమగ్నులై ఉంటారు. ఆనాడు వారికి అదే గొప్ప ఆరాధనగా పరిగణించబడుతుంది. కనుక వారు ఆరోజు ఉపవాసం పాటించటం అభిలషణీయం కాదు. కాని హజ్ యాత్రలో పాల్గొనని వారికి మాత్రం ఆరోజు ఉపవాసం పాటిస్తే గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. ఆ ఒక్క ఉపవాసం రెండేళ్ళ పాపాలను తుడిచిపెట్టేస్తుంది.

227 వ అధ్యాయం – అరఫా రోజు మరియు ముహర్రమ్ మాసపు తొమ్మిదో తేదీల్లో పాటించబడే ఉపవాసాల ఘనత. హదీసు కిరణాలు (రియాజుస్సాలిహీన్) – సంకలనం : ఇమామ్ నవవీ (రహ్మతుల్లా అలై)


హజ్జతుల్ విదా (ఆఖరి హజ్) లోని అరఫా రోజు శుక్రవారం వచ్చింది. ఆ రోజు ఖుర్ఆన్ లోని ఈ ఆయతు (వచనం) అవతరించింది: “ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి  ఆమోదించాను.” (ఖుర్ఆన్, సూరా మాయిదా 5:3)

అల్లాహ్ ధర్మాన్ని పూర్తిగావించాడు. ఇప్పుడు ఇందులో ఎలాంటి మార్పుచేర్పులకు తావులేదు. అందువల్లే అల్లాహ్ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంతో ప్రవక్తల పరంపరను అపివేశాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం చిట్ట చివరి ప్రవక్త. అల్లాహ్ ఇస్లాం ధర్మాన్ని ఆమోదించాడు, అనగా అల్లాహ్ కు ఇస్లాం తప్ప వేరే ఏ ఇతర ధర్మం సమ్మతం కాదు.


ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దిల్ హజ్జ్ మాసపు 9వ రోజున (అరఫా రోజు) ఉపవాసం ఉండేవారు. హునైదహ్ ఇబ్నె ఖాలిద్ తన భార్య ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కొందరు భార్యలు ఇలా పలికినారని ఉల్లేఖించెను:

”ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 9వ దిల్ హజ్జ్ దినమున, అషూరహ్ దినమున, ప్రతి నెల మూడు దినములలో మరియు ప్రతి నెల మొదటి రెండు సోమవారాలు మరియు గురువారాలు ఉపవాసం ఉండేవారు.”

(అన్నిసాయి హదీథ్ గ్రంథం, 4/205 మరియు అహూ దావూద్ హదీథ్ గ్రంథం; సహీహ్ అబి దావుద్ గ్రంథంలో, 2/462 దీనిని సహీహ్ హదీథ్ గా షేఖ్ అల్ బానీ వర్గీకరించెను.)


అరఫా రోజు చేసే ప్రార్ధన (దుఆ, తస్బీహ్)

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: అరఫా రోజున చేసే దుఆ అన్నిటికంటే ఉత్తమమైనది. అరఫా రోజున నేను మరియు ఇతర ప్రవక్తలు పలికిన ఉత్తమ పదాలు:

“లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్.” 

“కేవలం ఒక్కడైన అల్లాహ్ తప్ప ఆరాధ్యానికి అర్హులు ఎవ్వరూ లేరు. అతనికి సహవర్తులూ ఎవ్వరు లేరు. రాజ్యాధినేత ఆయనే, స్తోత్రములన్నీఆయన కొరకే. అయన అన్నీ చేయగలడు.”

(సహీహ్ అత్ తిర్మిజి vol 3:184, సిల్సిలతుల్అహాదీస్ అస్ సహీహ 4/6)


ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పై దరూద్ కు సంభందించిన హదీసులు [ఆడియో]

[4 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

33:56 إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا

నిశ్చయంగా అల్లాహ్‌, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి. (33:56)


పూర్తి దరూద్ షరీఫ్:

“అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్”


చిన్న దరూద్ షరీఫ్ : అల్లాహుమ్మ సల్లి వ సల్లిమ్ వ బారిక్ అలా ముహమ్మద్


అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:

“మీ ఇళ్ళను సమాధులు చేయకండి మరియు నా సమాధిని పండగ లేదా జాతర ప్రదేశం చేయకండి. నాపై దరూద్ పంపండి; మీరు ఎక్కడ ఉన్ననూ మీ దరూద్ నాకు చేరుతుంది.” 

[సునన్ అబూ దావూద్ : 2042; అల్ అల్బానీ దీన్ని ధృవీకరించారు.]


అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:

“నాపై దరూద్ ఎక్కువగా పంపండి, అల్లాహ్ నా సమాధి వద్ద ఒక దూతను నియమిస్తాడు. నా ఉమ్మత్ లోని వారు ఎవరైనా నాపై దరూద్ పంపినప్పుడు, ఆ దైవదూత నాతో ఇలా అంటారు: ‘ఓ ముహమ్మద్! ఫలానా వ్యక్తి మీపై, ఫలానా సమయంలో దరూద్ పంపాడు.”’ 

[అల్ దైలమీ – షేక్ అల్ అల్బానీ గారు అల్ సహీహా 1530 లో దీన్ని ‘హసన్ లీ ఘైరిహి’ అని అన్నారు]


అబ్దుల్లా ఇబ్న్ మసూద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:

“అల్లాహ్ నియమించిన దైవదూతలు భూమి మీద తిరిగుతుంటారు. వారు నా ఉమ్మత్ వారు నాపై పంపిన సలాం (దరూద్)ను నాకు చేరవేస్తారు.” 

[సునన్ అన్ నసాయి 1282, దీన్నీ అల్ అల్బానీ గారు సహీహ్ అని ధృవీకరించారు]


అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:

“నా పేరు విని కూడా నాపై దరూద్ (దుఆ) పంపని వాడి ముక్కు మట్టిలో కొట్టుకుపోగాక.” 

[సునన్ అత్ తిర్మిజి (3545), షేక్ అల్ అల్బాని గారు దీన్ని ‘హసన్ సహీ’ అన్నారు] 


అలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:

“అతని సమక్షంలో నా పేరు ఉచ్చరించబడిననూ, నాపై దరూద్ పంపని వాడు అందరిలోకెల్లా అత్యంత పిసినారి.” 

[సునన్ అత్ తిర్మిజి (3546), షేక్ అల్ అల్బానీ గారు దీన్ని ‘సహీహ్’ అని ధృవీకరించారు]


అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ అల్ ఆస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:

“ముఅజ్జిన్ (అజాన్ ఇచ్చేవాడు) పలికింది వినగానే దాన్ని పునరావృతం చేయండి, ఆ తరువాత నాపై దరూద్ పంపండి, నాపై దరూద్ పంపిన వారికి అల్లాహ్ తరఫున పది శుభాలు లభిస్తాయి; అల్లాహ్ తో నాకోసం వసీలా కోరండి, ఇది స్వర్గంలోని ఒక హోదా, ఇది అల్లాహ్ దాసుల్లో ఒకరికి మాత్రమే లభిస్తుంది, అది నేనే కావాలని నా ఆశ. నాకు వసీలా దొరకాలని కోరేవారికి నేను సిఫారసు చేస్తాను.” 

[సహీహ్ ముస్లిం 384]


జుమా ఘనత మరియు దాని సాంప్రదాయ మర్యాదలు [ఆడియో]

[5 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

వుజూ విధానం (బుక్ & ఆడియో, టెక్స్ట్)

wudhu-steps

[ఇక్కడ చదవండి] [ఇక్కడ బుక్ డౌన్లోడ్ చేసుకోండి[ఆడియో వినండి
వక్త :- ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ

ఈ ఆడియో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన విధానంలో ‘వుదూ’ (శుద్ధి) ఎలా చేసుకోవాలో వివరిస్తుంది. మొదటగా, ఆదేశించబడిన రీతిలో వుదూ మరియు నమాజు చేయడం వల్ల కలిగే గొప్ప ఫలితాన్ని, అంటే పూర్వ పాపాలు మన్నించబడతాయని హదీసుల ద్వారా తెలియజేశారు. వుదూ చేయడానికి గల ముఖ్య గమనికలైన సంకల్పం (నియ్యత్), వరుస క్రమం, నీటి ఆదా మరియు ఒక అవయవం ఆరకముందే మరొకటి కడగడం (కంటిన్యూటీ) గురించి వివరించారు. అనంతరం బిస్మిల్లాహ్ తో మొదలుపెట్టి కాళ్లు కడగడం వరకు వుదూ యొక్క పూర్తి పద్ధతిని స్టెప్-బై-స్టెప్ గా విపులకరించారు. చివరగా, వుదూ తర్వాత చదవాల్సిన దుఆ మరియు దాని వల్ల స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరుచుకుంటాయనే శుభవార్తను తెలియజేశారు.

السلام عليكم ورحمة الله وبركاته، حامدا ومصليا أما بعد
[అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు, హామిదన్ వ ముసల్లియన్ అమ్మ బాద్]

వుదూ విధానం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా వుదూ చేశారో, అలాగే వుదూ చేయడం తప్పనిసరి. ప్రవక్త ఆదేశం:

مَنْ تَوَضَّأَ كَمَا أُمِرَ وَصَلَّى كَمَا أُمِرَ غُفِرَ لَهُ مَا قَدَّمَ مِنْ عَمَلٍ
[మన్ తవద్దఅ కమా ఉమిర వసల్ల కమా ఉమిర, ఘుఫిర లహు మా ఖద్దమ మిన్ అమల్]

ఎవరు ఆదేశించబడిన రీతిలో వుదూ చేసి, ఎవరు ఆదేశించబడిన రీతిలో నమాజు చేస్తారో, అతని పూర్వ చిన్న పాపాలు మన్నించబడతాయి. (సునన్ నసాయి: 144, ఇబ్నె మాజా: 1396).

మరో ఉల్లేఖనంలో ఉంది:

مَنْ تَوَضَّأَ نَحْوَ وُضُوئِي هَذَا
[మన్ తవద్దఅ నహ్వ వుదూఈ హాజా]
ఎవరు నా ఈ పద్ధతిలో వుదూ చేస్తారో (సహీహ్ బుఖారీ: 159).

  1. వుదూ నియ్యత్ అంటే సంకల్పం నోటితో పలకకుండా మనసులోనే చేయాలి. ఒక పని చేయుటకు మనసులో నిర్ణయించుకోవడమే నియ్యత్.
  2. రెండవ గమనిక: వుదూ క్రమంగా చేయాలి, క్రమం తప్పకూడదు.
  3. మూడవ గమనిక: వుదూ చేయునప్పుడు సాధ్యమైనంత వరకు నీళ్లు దుబారా అంటే వృధా ఖర్చు కాకుండా జాగ్రత్త పడాలి.
  4. నాలుగవ గమనిక: వుదూ చేయునప్పుడు ఒక అవయవం కడిగిన తర్వాత మరో అవయవం కడగడంలో ఆలస్యం చేయకూడదు.

వుదూ పద్ధతి ఇలా ఉంది:

ప్రారంభంలో “బిస్మిల్లాహ్” అనాలి.

తర్వాత రెండు అరచేతులను మణికట్ల వరకు మూడు సార్లు కడగాలి (ఫిగర్స్ చూడండి).

మూడు సార్లు నోట్లో నీళ్లు తీసుకొని పుక్కిలించి, ముక్కులో నీళ్లు ఎక్కించి శుభ్రం చేసుకోవాలి.

ఆ తర్వాత మూడు సార్లు ముఖం కడగాలి. అడ్డంలో కుడి చెవి నుండి ఎడమ చెవి వరకు, నిలువులో నుదుటి మొదటి భాగం నుండి గడ్డం కింది వరకు. ఇక దట్టమైన గడ్డం గలవారు తమ గడ్డంలో ఖిలాల్ చేయాలి. అయితే గడ్డాన్ని షేవ్ చేయడం గాని, కట్ చేయడం గాని ప్రవక్త విధానానికి వ్యతిరేకం.

ఆ తర్వాత రెండు చేతులు మూడేసి సార్లు కడగాలి. వేలు మొదటి భాగము నుండి మోచేతుల వరకు. ముందు కుడి చెయ్యి తర్వాత ఎడమ చెయ్యి.

ఆ తర్వాత ఒకసారి తల మసాహ్ చేయాలి. అంటే రెండు చేతులను తడి చేసి తల మొదటి భాగము నుండి వెనక మెడ వరకు తీసుకెళ్లి, మళ్లీ వెనక నుండి మొదటి వరకు తలను స్పర్శిస్తూ తీసుకురావాలి.

ఒకసారి రెండు చెవుల మసాహ్ చేయాలి. అంటే రెండు చూపుడు వేళ్లతో చెవి లోపలి భాగాన్ని, బొటన వేలితో పై భాగాన్ని స్పర్శించాలి.

ఆ తర్వాత రెండు కాళ్లు వేళ్ల నుండి చీలమండల వరకు మూడేసి సార్లు కడగాలి. ముందు కుడి కాలు తర్వాత ఎడమ కాలు.

చివరిలో ఈ దుఆ చదవాలి:

أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ
[అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు]

వుదూ చేసిన తర్వాత ఎవరైతే ఈ దుఆ చదువుతారో వారి కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి. అల్లాహు అక్బర్! ఎంత గొప్ప అదృష్టం అండి. ఈ దుఆ ప్రస్తావన సహీహ్ ముస్లిం షరీఫ్ లో వచ్చి ఉంది (హదీథ్ నెంబర్: 234).

ఈ పూర్తి వుదూ విధానం ఏదైతే మీరు విన్నారో సహీహ్ బుఖారీ (హదీథ్ నెంబర్: 159) మరియు అబూ దావూద్ (హదీథ్ నెంబర్: 108) లో ఉన్నది.

అల్లాహ్ యే ప్రవక్త పద్ధతిలోనే మనందరికీ వుదూ చేసే అటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక.

وآخِرُ دَعْوانا أَنِ الْحَمْدُ لِلَّهِ، وَالسَّلامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكاتُهُ.
[వ ఆఖిరు దావానా అనిల్ హం దులిల్లాహి, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు]